Womens cricket
-
ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్
మహిళల ఐపీఎల్లో (WPL) ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ సాధించింది. వరుసగా మూడో సీజన్లో ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూపీఎల్-2025లో టేబుల్ టాపర్‌గా నిలువడం ద్వారా ఈ ఘనత సాధించింది. గత రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరినా ఢిల్లీకి టైటిల్ అందని ద్రాక్షాలానే ఉంది. మెగ్ లాన్నింగ్ సేన ఈసారైనా టైటిల్ నెగ్గుతుందో లేదో చూడాలి. డబ్ల్యూపీల్ ప్రారంభం (2023) నాటి నుంచి అద్భుత విజయాలు సాధిస్తూ వస్తున్న ఢిల్లీ.. ఫైనల్లో మాత్రం ప్రత్యర్ధులకు తలోగ్గుతుంది. 2023 సీజన్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన ఢిల్లీ.. గత సీజన్ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. ఈసారి ఫైనల్లో ఢిల్లీ ప్రత్యర్థి ఎవరో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య రేపు (మార్చి 13) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో ఢిల్లీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.కాగా, ప్రస్తుత సీజన్లో మెగ్ లాన్నింగ్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచి దర్జాగా ఫైనల్‌కు చేరింది. టేబుల్ టాపర్ అయ్యే అవకాశాన్ని ముంబై ఇండియన్స్ తృటిలో కోల్పోయింది. నిన్న (మార్చి 11) జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ముంబై ఆర్సీబీ చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ముంబై సైతం 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. ఆ జట్టు రన్‌రేట్ ఢిల్లీ కంటే కాస్త తక్కువగా ఉంది. ఢిల్లీ 0.396 రన్‌రేట్ కలిగి ఉండగా.. ముంబై 0.192 రన్‌రేట్‌తో గ్రూప్ దశ ముగించింది. నిన్నటి మ్యాచ్‌లో ముంబై ఆర్సీబీ చేతిలో ఓడినప్పటికీ రన్‌రేట్ ఇంకాస్త పెంచుకుని ఉంటే ఫైనల్‌కు చేరేది. అక్కడికి మెరుగైన రన్‌రేట్ సాధించేందుకు ముంబై తీవ్రంగా పోరాడింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 199 పరుగులు చేయగా.. ముంబై పరుగుల వేట 188 పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన మరో జట్టు గుజరాత్ జెయింట్స్. గత రెండు సీజన్లలో అట్టడుగు స్థానంలో నిలిచిన గుజరాత్.. ఈ సీజన్లో అనూహ్య విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ఈ సీజన్లో గుజరాత్ 8లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆదిలో అదిరిపోయే విజయాలు సాధించినప్పటికీ ఆతర్వాత వరుసగా ఐదు ఓటములు ఎదుర్కొని ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. నిన్న ముంబైతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో మంచి స్కోర్ చేసి గెలవడంతో ఆర్సీబీ నాలుగో స్థానాన్నైనా దక్కించుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓడినా లేక నామమాత్రంగా గెలిచినా ఈ సీజన్లో ఆర్సీబీ ఆఖరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఈ సీజన్లో ఆ జట్టు ఎనిమిదింట మూడు విజయాలు సాధించింది. యూపీ వారియర్జ్ విషయానికొస్తే.. ఈ జట్టు గత రెండు సీజన్ల లాగే ఈ సీజన్లోనూ నామమాత్రపు ప్రదర్శనలు చేసి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. యూపీ ఈ సీజన్లో ఆర్సీబీ లాగే 8 మ్యచ్‌ల్లో 3 గెలిచి చివరి స్థానంలో నిలిచింది. యూపీతో పోలిస్తే ఆర్సీబీ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉంది. మార్చి 15న ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఢిల్లీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది. -
గ్రీన్ అద్భుత శతకం.. శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్
న్యూజిలాండ్, శ్రీలంక మహిళా జట్ల మధ్య ఇవాళ (మార్చి 7) వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ శ్రీలంకను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. మిడిలార్డర్ బ్యాటర్ మ్యాడీ గ్రీన్ అద్భుత సెంచరీతో (100) కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్రీన్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. జార్జియా ప్లిమ్మర్ 28, ఇసబెల్లా గేజ్ 19, జెస్ కెర్ 38, పోల్లీ ఇంగ్లిస్ 34 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ సూజీ బేట్స్ 5, ఎమ్మా మెక్లియోడ్ 6, బ్రూక్ హ్యల్లీడే 6 పరుగులకు ఔటయ్యారు. ఈ దశలో జార్జియా ప్లిమ్మర్ కొద్ది సేపు సంయమనంతో బ్యాటింగ్ చేసింది. ప్లిమ్మర్ 54 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేసి ఔటైంది. అనంతరం గ్రీన్.. గేజ్, కెర్, ఇంగ్లిస్ సహకారంతో సెంచరీ పూర్తి చేసుకుంది. గ్రీన్ సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటైంది. శ్రీలంక బౌలర్లలో చమారీ ఆటపట్టు 2 వికెట్లు పడగొట్టగా.. అచిని కులసూరియ, ఇనోషి ప్రియదర్శిని, కవిశ దిల్హరి తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 46.4 ఓవర్లలో 167 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌కు కుప్పకూల్చారు. హన్నా రోవ్ 4, బ్రీ లింగ్, ఏడెన్ కార్సన్ తలో 2, సూజీ బేట్స్ ఓ వికెట్ తీశారు. జెస్ కెర్ వికెట్ తీయకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హర్షిత సమరవిక్రమ (59) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించారు. కవిష దిల్హరి 25, నీలాక్షి డిసిల్వ 20, అనుష్క సంజీవని 13 (నాటౌట్), కుగంధిక కుమారి, కెప్టెన్ ఆటపట్టు తలో 11 పరుగులు చేశారు. మనుడి ననయక్కార, ఇనోషి ప్రియదర్శిని డకౌట్లు కాగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో నేపియర్ వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడో వన్డే నెల్సన్ వేదికగా మార్చి 9న జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. మార్చి 14, 16, 18 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లు క్రైస్ట్‌చర్చ్‌లో జరుగనుండగా.. మూడో టీ20 డునెడిన్‌లో జరుగనుంది. -
ఏప్రిల్, మే నెలల్లో ట్రై సిరీస్ ఆడనున్న భారత్
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శ్రీలంకలో మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో శ్రీలంక సహా భారత్, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ మ్యాచ్‌ల అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు కొలొంబోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్‌లన్నీ డే మ్యాచ్‌లుగా జరుగుతాయి. ఏప్రిల్ 27న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టీమిండియాతో తలపడనుంది. మే 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే మూడు జట్లు ఇదివరకే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఏప్రిల్ 27- భారత్ వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 1- శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికామే 4- భారత్ వర్సెస్ శ్రీలంకమే 6- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 8- సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంకమే 11- ఫైనల్‌కాగా, భారత్ ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో భారత్ జయకేతనం ఎగురవేసింది. గతేడాది చివర్లో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. శ్రీలంక విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్‌లో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ జరుగుతుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. 15 మ్యాచ్‌లు అయిపోయే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో, యూపీ వారియర్జ్ ఐదో స్థానంలో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. -
చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్
డబ్ల్యూపీఎల్-2025లో ఇవాళ (ఫిబ్రవరి 28) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జెస్ జోనాస్సెన్ (4-0-25-3), మిన్నూ మణి (3-0-17-3), శిఖా పాండే (4-1-16-1), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (4-0-21-1) చెలరేగడంతో ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తేలిపోయారు. కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ముంబై ఇన్నింగ్స్‌లో 22 పరుగులే అత్యధికం. హేలీ మాథ్యూస్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తలో 22 పరుగులు చేశారు. నాట్ సీవర్ బ్రంట్ 18, అమేలియా కెర్, అమన్‌జోత్ కౌర్ తలో 17 పరుగులు (నాటౌట్) చేశారు. ఓపెనర్ యస్తికా భాటియా 11 పరుగులు చేసింది. సజీవన్ సజనా 5, జి కమలిని 1, సంస్కృతి గుప్త 3 పరుగులు చేశారు. జింటమణి కలిత డకౌటైంది. ఈ సీజన్లో అద్భుత విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేసింది. బ్యాటర్లెవరూ స్థాయికి తగ్గట్టుగా రాణించలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు మంచి ఆరంభమే లభించినా.. ఆమె పెద్ద స్కోర్ చేయలేకపోయింది. విదేశీ ప్లేయర్లు హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కెర్ రెండంకెల స్కోర్లు చేసినా బంతులు వృధా చేశారు. ఈ మ్యాచ్‌లో ముంబై క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మూడో వికెట్‌కు హర్మన్, బ్రంట్‌ల మధ్య నెలకొల్పబడిన 38 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్‌కు అత్యధికం. ఢిల్లీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు. టిటాస్ సాధు ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది. ఆమె 2 ఓవర్లలో 24 పరుగులిచ్చింది.కాగా, ముంబై ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. ముంబై తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించింది. ముంబైతో పోలిస్తే ఢిల్లీ రన్‌రేట్ బాగా తక్కువగా ఉంది. ముంబై రన్‌రేట్ 0.780గా ఉండగా.. ఢిల్లీ రన్‌రేట్ మైనస్‌లో (-0.223) ఉంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఈ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే చేసింది. ఆర్సీబీ లాగే యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ తలో 5 మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలు సాధించి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
WPL 2025: రాణించిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్
మహిళల ఐపీఎల్లో (WPL-2025) ఇవాళ (ఫిబ్రవరి 25) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఢిల్లీ.. గుజరాత్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఢిల్లీ బౌలర్లు శిఖా పాండే (3-0-18-2), మారిజన్ కాప్ (4-1-17-2), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (4-0-20-2), టిటాస్ సాధు (2-0-15-1), జెస్ జొనాస్సెన్ (3-0-24-1) తలో చేయి వేయడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బ్యాటర్లలో భారతి ఫుల్మలి (29 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కరే చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది. భారతి ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్‌లో ఉండటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో భారతితో పాటు డియాండ్రా డొటిన్ (26), తనూజా కన్వర్ (16), బెత్ మూనీ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హర్లీన్ డియోల్ 5, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 0, కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ 3, కశ్వీ గౌతమ్ 0, సిమ్రన్ షేక్ 5, మేఘనా సింగ్ 0 పరుగులకు ఔటయ్యారు. ప్రియా మిశ్రా ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది.కాగా, ఈ సీజన్లో గుజరాత్ జెయింట్స్ గతం తరహాలోనే పేలవంగా ఆడుతుంది. ఈ సీజన్లో జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గుజరాత్ గత రెండు సీజన్లను ఇదే తరహాలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో ముగించింది. ఈ సీజన్లో గుజరాత్ యూపీ వారియర్జ్‌పై విజయం సాధించి.. ఆర్సీబీ, ముంబై ఇండయన్స్ చేతుల్లో ఓడింది. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టాప్‌లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించింది. ముంబై (0.610), యూపీ (0.167), ఢిల్లీ (-0.826) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు జట్లు కూడా తలో నాలుగు పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. అయితే వీటితో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్‌రేట్ (0.619) అధికంగా ఉంది. -
టీమిండియా వైస్ కెప్టెన్‌కు షాక్
టీమిండియా వైస్ కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధనకు (Smriti Mandhana) హండ్రెడ్ లీగ్ (The Hundred League) ఫ్రాంచైజీ సథరన్ బ్రేవ్ (Southern Brave) షాకిచ్చింది. గత కొంతకాలంగా తమకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంధనను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. గత సీజన్లో మంధన విఫలం కావడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. మంధన గత సీజన్లో 5 మ్యాచ్‌ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే సాధించింది. గత సీజన్లో విఫలమైనా మంధనకు హండ్రెడ్ లీగ్‌లో మంచి రికార్డు ఉంది. 2022, 2023 సీజన్లలో ఆమె మంచి స్ట్రయిక్ రేట్‌తో వరుసగా 211, 238 పరుగులు చేసింది.ఆసక్తికరంగా మంధన ఆర్సీబీ టీమ్ మేట్ అయిన డానీ వ్యాట్‌ను (ఇంగ్లండ్ ఓపెనర్) సథరన్ బ్రేవ్ తొలి రీటెన్షన్గా దక్కించుకుంది. వ్యాట్‌తో పాటు లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మయా బౌచియర్, ఫ్రేయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కార్టీన్ కోల్మన్, రిహన్నా సౌత్బైలను కూడా రీటైన్ చేసుకుంది. రిటెన్షన్ జాబితాను సథరన్ బ్రేవ్ ఇవాళ ప్రకటించింది.మంధన ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో బిజీగా ఉంది. ఈ సీజన్లో ఆమె 4 మ్యాచ్‌ల్లో 122 పరుగులు చేసింది. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. మంధన ఈ సీజన్లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఫలితంగా భారం మొత్తం ఎల్లిస్ పెర్రీపై పడుతుంది. పెర్రీ ఈ సీజన్లో విశేషంగా రాణిస్తుంది. నిన్న యూపీతో జరిగిన మ్యాచ్‌లో పెర్రీ అజేయమైన 90 పరుగులు చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్లో యూపీ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ ఓటమిపాలైంది.డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్, ఢిల్లీపై విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్నట్లు కనిపించింది. అయితే ఆతర్వాతి మ్యాచ్‌ల్లో వరుసగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ చేతుల్లో ఓడింది. అయినా ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ముంబై, యూపీ, ఢిల్లీ, గుజరాత్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 25) జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ, గుజరాత్ తలపడనున్నాయి. -
డబ్ల్యూపీఎల్ చివరి దశ మ్యాచ్‌లకు శ్రీలంక స్టార్ దూరం
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో యూపీ వారియర్స్ జట్టుకు ఆడుతున్న శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ చమరి అటపట్టు చివరి దశ మ్యాచ్‌లకు దూరం కానుంది. మార్చి 4 నుంచి 18 వరకు న్యూజిలాండ్‌తో న్యూజిలాండ్‌లో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టుకు చమరి కెపె్టన్‌గా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 26న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ తర్వాత చమరి యూపీ వారియర్స్ జట్టును వీడి న్యూజిలాండ్‌కు బయలుదేరుతుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన చమరి 28 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీసుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్ మాత్రం డబ్ల్యూపీఎల్ పూర్తి సీజన్ ఆడుతుంది. శ్రీలంకతో జరిగే సిరీస్‌లో అమెలియా కెర్ పోటీపడటం లేదు. -
బంగ్లాదేశ్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
దుబాయ్: ఇన్నాళ్లు పురుష క్రికెటర్లకే పరిమితమైన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ (Match Fixing) జాడ్యం ఇప్పుడు మహిళా క్రికెట్‌కు అంటుకున్నట్లుంది. ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ షోహెలీ అక్తర్‌పై (Shohely Akhter) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఐదేళ్ల నిషేధం విధించింది. దీంతో అవినీతి, ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్‌గా 36 ఏళ్ల షోహెలీ నిలిచింది. 2023లో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ సందర్భంగా బంగ్లాదేశ్, ఆ్రస్టేలియాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆమె ప్రయత్నించింది. నిజానికి 2022లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఆ వరల్డ్‌కప్‌లో లేకపోయినా... టోర్నీ ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్‌ను సంప్రదించి ఫిక్స్ చేయాల్సిందిగా కోరింది. తను చెప్పినట్లు ఆ బంగ్లా క్రికెటర్ హిట్ వికెట్ అయితే 2 మిలియన్ల టాకాలు (బంగ్లా కరెన్సీ) ఇస్తానని ఆశచూపింది. సదరు బంగ్లా క్రికెటర్... షోహెలీ ప్రతిపాదనను తిరస్కరించడంతో పాటు వెంటనే ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన ఏసీయూ షోహెలీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించినట్లు తేల్చింది. ఐసీసీలోని ఐదు ఆర్టికల్స్‌ను ఆమె అతిక్రమించిందని దీంతో నిషేధాన్ని విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
‘మా జట్టు ఆసీస్‌లా మారాలి’
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆ్రస్టేలియా తరహాలో ఎదురులేని జట్టులా భారత బృందం మారాలన్నదే తమ ఆకాంక్ష అని, అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటామని భారత మహిళల అండర్–19 టీమ్ హెడ్ కోచ్ నూషీన్ అల్ ఖదీర్ వ్యాఖ్యానించింది. మలేసియాలో విశ్వవిజేతలుగా నిలిచిన అనంతరం జట్టు సభ్యులు గొంగడి త్రిష, కేసరి ధృతి, ట్రెయినర్ షాలినిలతో కలిసి నూషీన్ మంగళవారం నగరానికి చేరుకుంది. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళలు అండర్–19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ఆమెనే హెడ్ కోచ్‌గా ఉంది. ఆఫ్ స్పిన్నర్‌గా భారత్ తరఫున 85 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లు తీసిన నూషీన్ ఖాతాలో ఇప్పుడు కోచ్ హోదాలో వరుసగా రెండు వరల్డ్ కప్ టైటిల్స్ చేరాయి. ‘మా అమ్మాయిల నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చింది. ఇదంతా సమష్టిగా సాధించిన విజయం. దాదాపు ఎనిమిది నెలల క్రితమే ఈ టోర్నీ కోసం ప్రణాళికలు రూపొందించి ఎంతో కష్టపడ్డాం. దాని ఫలితమే ఇప్పుడు కనిపించింది. మా విజయంలో టీమ్ సహాయక సిబ్బంది పాత్ర కూడా ఎంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు మాత్రమే కాకుండా ట్రెయినర్, ఫిజియో కూడా ఎంతో శ్రమించారు’ అని నూషీన్ పేర్కొంది. తమకు అందించిన బాధ్యతలకు అనుగుణంగా అమ్మాయిలు స్పందించిన తీరును హెడ్ కోచ్ ప్రశంసించింది. ‘పరిస్థితులను బట్టి తమను తాము మార్చుకునే విషయంలో మా అమ్మాయిలు సరైన రీతిలో స్పందించారు. డిమాండ్ ప్రకారం తమ ఆటను మార్చుకున్నారు. చాలా కాలంగా కలిసి ఆడుతుండటం వల్ల ప్లేయర్లందరి మధ్య మంచి బంధం ఏర్పడింది. పైగా తమకు అందించిన బాధ్యతలపై ప్రతీ ప్లేయర్‌కు స్పష్టత ఉండటం కూడా ఎంతో మేలు చేసింది. అందుకే వరల్డ్ కప్‌లో కీలక క్షణాల్లో ఒత్తిడిని అధిగమించి అంత గొప్పగా ఆడగలిగాం’ అని కోచ్ వెల్లడించింది. రెండేళ్ల క్రితం సాధించిన విజయం కూడా ఎంతో ఆనందాన్నిచ్చిందని... అయితే దాంతో పోలిస్తే ఈ టైటిల్ మరింత ప్రత్యేకమని నూషీన్ పేర్కొంది. ‘2023లో సాధించిన విజయంతో పోలిస్తే ఈసారి మేం మరింత నిలకడగా, దూకుడుగా, సంపూర్ణ ఆధిపత్యంతో ఆడాం. మానసికంగా కూడా అమ్మాయిలు ఈసారి దృఢంగా ఉన్నారు. అందుకే ఈ గెలుపుపై మాకు ముందునుంచే అంచనాలు ఉన్నాయి. సెమీస్‌లో ఇంగ్లండ్ రూపంలో మాకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇతర జట్లతో పోలిస్తే ఇంగ్లండ్ గట్టి ప్రత్యర్థి. కానీ అక్కడా మనోళ్లు జోరు కొనసాగించడం జట్టు బలాన్ని చూపించింది. మహిళల క్రికెట్లో వన్డేలు, టి20లు కలిపి ఆ్రస్టేలియా 13 వరల్డ్ కప్‌లు గెలిచింది. మా జట్టు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని, అంతే బలంగా మారాలని కోరుకుంటున్నాం. మా తర్వాతి లక్ష్యం కూడా అదే’ అని ఈ మాజీ స్పిన్నర్ సగర్వంగా చెప్పింది.‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన తెలంగాణ అమ్మాయి త్రిషను కోచ్ ప్రత్యేకంగా అభినందించింది. ‘త్రిష అనుభవాన్ని బట్టి ఆమెను ఓపెనర్‌గా పంపాలని వరల్డ్ కప్‌నకు ముందే నిర్ణయించాం. నిజాయితీగా చెప్పాలంటే ఆమె దూకుడైన బ్యాటింగ్ శైలి మమ్మల్నీ ఆశ్చర్యపర్చింది. త్రిష తన షాట్లను మెరుగుపర్చుకోవడంలో ఎంతో కష్టపడింది’ అని నూషీన్ అభిప్రాయపడింది. వరుసగా రెండు అండర్–19వరల్డ్ కప్ టైటిల్స్ భారత్‌లో మహిళల క్రికెట్‌కు మరింత ఊతం ఇస్తాయని... ఈ స్థాయిలో అమ్మాయిలకు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించి భవిష్యత్తులో వారిని మరింత బలమైన ప్లేయర్లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బోర్డుదేననే నూషీన్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజా వరల్డ్ కప్‌తో కోచ్‌గా నూషీన్ కాంట్రాక్ట్ కూడా ముగిసింది. -
సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌కు అభిమానిగా ఉండటం చాలా కష్టం..!
టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా గ్రాము అదృష్టం కూడా లేని క్రికెట్ జట్టు ఏదైనా ఉందా అంటే అది దక్షిణాఫ్రికా (South Africa) జట్టే అని చెప్పాలి. ఇటీవలికాలంలో ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే ఇది వందకు వంద శాతం నిజం అనిపిస్తుంది. జెండర్‌తో, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆ జట్టు ఇటీవలికాలంలో వరుసగా మెగా టోర్నీల ఫైనల్స్‌లో ఓడుతుంది. రెండేళ్ల వ్యవధిలో సౌతాఫ్రికా పురుషుల, మహిళల జట్లు నాలుగు టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఓడాయి. 2023 మహిళల టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ఫైనల్స్‌లో తొలిసారి ఓడిన సౌతాఫ్రికా... ఆ మరుసటి ఏడాది పురుషులు, మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్ ఓటమి చవిచూసింది. తాజాగా ఆ దేశ మహిళల అండర్-19 జట్టు.. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ (Team India) చేతిలో పరాజయంపాలైంది.టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ జట్లపై సానుభూతి వెల్లువెత్తుతుంది. నెటిజన్లు సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లపై తెగ జాలి చూపుతున్నారు. ఏ జట్టుకైనా అభిమానిగా ఉండవచ్చు కానీ.. వరుస ఫైనల్స్‌లో ఓడుతున్న సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లకు అభిమానిగా ఉండటం మాత్రం చాలా కష్టమని అంటున్నారు. సౌతాఫ్రికా క్రికెట్ జట్లకు గతంలో సెమీఫైనల్ ఫోబియా ఉండేది. ప్రస్తుతం అది పోయి ఫైనల్ ఫోబియా పట్టుకున్నట్లుంది. సౌతాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టు త్వరలో మరో మెగా ఈవెంట్ ఫైనల్స్‌లో (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్‌లో) ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈసారైనా సౌతాఫ్రికా ఫైనల్ ఫోబియాను అధిగమించి టైటిల్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.కాగా, 2023 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సౌతాఫ్రికా.. ఆ మరుసటి ఏడాది జరిగిన పురుషుల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. అదే ఏడాది జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పొట్రిస్ జట్టు.. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన 2025 అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో యంగ్ ఇండియా చేతిలో చావుదెబ్బతింది.ఇదిలా ఉంటే, మలేసియాలో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఇవాళ జరిగిన ఫైనల్లో యంగ్ ఇండియా సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీ ఇనాగురల్ ఎడిషన్‌లోనూ (2023) భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) 3, పరునిక సిసోడియా, ఆయూశి శుక్లా, వైష్ణవి శర్మ తలో 2, షబ్నమ్ షకీల్ ఓ వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మికీ వాన్ వూర్స్ట్ (23) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జెమ్మా బోథా (16), కరాబో మెసో (10), ఫే కౌలింగ్ (15) రెండంకెల స్కోర్లు చేశారు.83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 11.2 ఓవర్లలో (వికెట్ కోల్పోయి) ఆడుతూపాడుతూ విజయం సాధించింది. బంతితో మెరిసిన త్రిష బ్యాటింగ్‌లోనూ చెలరేగి 33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 22 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసింది. ఈ టోర్నీ మొత్తంలో భారత్ అజేయంగా నిలిచింది. టోర్నీ ఆధ్యాంతం బ్యాట్‌తో, బంతితో రాణించిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
Ashes Series 2025: చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్
మహిళల యాషెస్ సిరీస్‌లోని (Women's Ashes Series 2025) ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ యువ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (Annabel Sutherland) చరిత్ర సృష్టించింది. ఎంసీజీలో (MCG) (మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్) సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. గతంలో ఏ మహిళా క్రికెటర్ ఇక్కడ మూడంకెల స్కోర్ చేయలేదు. 1935, జనవరి 18న ఎలిజబెత్ అలెక్సాండ్రా స్నోబాల్ ఎంసీజీలో అజేయమైన 83 పరుగులు చేసింది. మరో ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ (98 నాటౌట్) ఇదే మ్యాచ్‌లో సెంచరీకి చేరువయ్యిందికాగా, మహిళల యాషెస్ సిరీస్‌లో భాగంగా జనవరి 30 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మెల్బోర్న్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అన్నాబెల్ సెంచరీ (258 బంతుల్లో 21 ఫోర్లు, సిక్సర్ సాయంతో 163 పరుగులు) చేసింది. 23 ఏళ్ల అన్నాబెల్‌కు టెస్ట్‌ల్లో ఇది మూడో సెంచరీ. కేవలం ఆరు మ్యాచ్‌లో కెరీర్లోనే అన్నాబెల్ ఈ మూడు సెంచరీలు సాధించింది. ఈ మూడు సెంచరీల్లో ఓ డబుల్ సెంచరీ ఉండటం మరో విశేషం.ఆసీస్‌కు భారీ ఆధిక్యంఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అన్నాబెల్ సెంచరీతో కదంతొక్కగా.. బెత్ మూనీ సెంచరీకి (98 నాటౌట్) చేరువైంది. మూనీకి జతగా తహ్లియా మెక్‌గ్రాత్ (9) క్రీజ్‌లో ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 45, జార్జియా వాల్ 12, కెప్టెన్ అలైసా హీలీ 34, ఆష్లే గార్డ్నర్ 44 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే 252 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, సోఫీ ఎక్లెస్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ర్యానా మెక్‌డొనాల్డ్ గే ఓ వికెట్ దక్కించుకుంది.అంతకుముందు అలానా కింగ్ (23-6-45-4) చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే చాపచుట్టేసింది. కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్ తలో రెండు.. ఆష్లే గార్డ్నర్ ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నాట్ సీవర్ బ్రంట్ (51) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ హీథర్ నైట్ (25), వ్యాట్ హాడ్జ్ (22), సోఫీ డంక్లీ (21), ర్యానా మెక్‌డొనాల్డ్ గే (15 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. టామీ బేమౌంట్ 8, మయా బౌచియర్ 2, ఆమీ జోన్స్ 3, సోఫీ ఎక్లెస్టోన్ 1, లారెన్ ఫైలర్ 8, లారెన్ బెల్ 7 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా, ప్రస్తుతం జరుగుతున్న మహిళల యాషెస్ సిరీస్ మల్టీ ఫార్మాట్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లో తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆస్ట్రేలియా 3-0తోనే ఊడ్చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ పింక్ బాల్‌తో డే అండ్ నైట్ ఫార్మాట్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు (3 వన్డేలు, 3 టీ20లు) గెలిచిన ఆసీస్.. 12-0 తేడాతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఒక్కో పరిమిత ఓవర్ల మ్యాచ్‌కు రెండు పాయింట్లు.. టెస్ట్ మ్యాచ్‌కు 4 పాయింట్లు లభిస్తాయి. -
T20 World Cup 2025: సూపర్ సిక్స్‌లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన శ్రీలంక
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ 2025 (ICC Under 19 Women's T20 World Cup 2025) చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka) ఆస్ట్రేలియాకు (Australia) షాకిచ్చింది. ఈ మెగా టోర్నీలో ఓటమి ఎరుగని ఆసీస్‌కు శ్రీలంక ఓటమి రుచి చూపించింది. మలేసియాలోకి బంగి వేదికగా ఇవాళ (జనవరి 29) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆసీస్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు శ్రీలంక సైతం ఈ టోర్నీలో అద్భుతంగా రాణించినప్పటికీ.. ఆ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. గ్రూప్ దశలో శ్రీలంక.. మలేసియా, వెస్టిండీస్ జట్లపై విజయాలు సాధించినప్పటికీ భారత్ చేతిలో ఘోరంగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆతర్వాత సూపర్-6లో తప్పక గెలుస్తుందనుకున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దైంది. ఈ మ్యాచ్ రద్దు కావడం శ్రీలంక సెమీస్ ఆశలను గల్లంతు చేసింది. తాజాగా శ్రీలంక ఆసీస్‌పై గెలిచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. శ్రీలంక ఉన్న గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఫైనల్ ఫోర్కు చేరాయి. జనవరి 31న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, ఇంగ్లండ్ ఢీకొట్టనుండగా.. అదే రోజు జరిగే రెండ సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్ భారతకాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో సెమీస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ ఎడిషన్‌లో (2023) టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో శ్రీలంక ఆసీస్‌ను 12 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సంజన కవిండి (19), సుముదు నిసంసల (18), కెప్టెన్ మనుడి ననయక్కార (15), హిరుని హన్సిక (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో లిల్లీ బాస్సింగ్వైత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది. హస్రత్ గిల్, టెగాన్ విలియమ్సన్‌లు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి చెరి రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. లంక బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో ఒక్కో పరుగు చేసేందుకు నానా ఇబ్బందులు పడింది. చమోది ప్రబోద, ప్రముది మెత్సర, అసేని తలగుణే తలో రెండు వికెట్లు తీయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. లిమాంస తిలకరత్న ఓ వికెట్ పడగొట్టింది. లంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి కూడా 8 వికెట్ల నష్టానికి 87 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బే (27) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెక్కియోన్ (10), కెప్టెన్ హ్యామిల్టన్ (10), వికెట్ కీపర్ గ్రేస్ లయన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. -
T20 World Cup: త్రిష ఆల్‌రౌండ్ షో.. భారత్ ఖాతాలో వరుసగా ఐదో గెలుపు
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో (ICC Under 19 Women's T20 World Cup 2025) భారత్ (India) వరుసగా ఐదో విజయం సాధించింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 28) జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్, తెలుగమ్మాయి గొంగడి త్రిష (Gongadi Trisha) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాట్‌తో విధ్వంసకర శతకం బాదిన త్రిష.. ఆతర్వాత బంతితోనూ చెలరేగి మూడు వికెట్లు పడగొట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. త్రిష ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న త్రిష.. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.అనంతరం 209 పరుగల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. భారత బౌలర్లు విజృంభించడంతో 14 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఆయూషి శుక్లా 4, వైష్ణవి శర్మ, గొంగడి త్రిష తలో మూడు వికెట్లు తీసి స్కాట్లాండ్ పతనాన్ని శాశించారు. ఆయూషి, వైష్ణవి శర్మ, త్రిష వికెట్లు తీయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. ఆయూషి 3 ఓవర్లలో 8 పరుగులు.. వైష్ణవి శర్మ 2 ఓవర్లలో 5 పరుగులు.. త్రిష 2 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కరు కూడా 12 పరుగులకు మించి చేయలేదు. కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా.. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించింది. గ్రూప్ దశలో వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్లపై ఘన విజయాలు సాధించింది. ఈ మెగా టోర్నీలో భారత్‌తో తలపడిన ఒక్క ప్రత్యర్థి కూడా కనీసం మూడంకెల మార్కును చేరుకోలేకపోయింది. వెస్టిండీస్ 44, మలేసియా 31, శ్రీలంక 58, బంగ్లాదేశ్ 64, తాజాగా స్కాట్లాండ్ 58 పరుగులకు ఆలౌటైంది. -
చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. టీ20 వరల్డ్‌కప్‌లో తొలి శతకం
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో భారత ఓపెనర్ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 28) జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసర శతకం బాదిన త్రిష.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ రికార్డు నెలకొల్పింది. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. HISTORY BY TRISHA 🇮🇳- Trisha becomes the first Player to score a Hundred in Women's U-19 T20I World Cup History 🏆 pic.twitter.com/05mJwdtbMQ— Johns. (@CricCrazyJohns) January 28, 2025ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో త్రిషతో పాటు మరో ఓపెనర్ జి కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) కూడా రాణించింది. వన్‌డౌన్ బ్యాటర్ సనికా ఛల్కే 20 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసింది.19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాలీ క్రికెట్లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. సెమీస్‌లో భారత్గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు, సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించిన భారత్.. స్కాట్లాండ్ మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయాయి..!ఈ టోర్నీలో భారత్‌తో ఇప్పటివరకు తలపడిన ఒక్క జట్టు కూడా కనీసం మూడంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విశేషం. వెస్టిండీస్ (44), మలేషియా (31), శ్రీలంక (58), బంగ్లాదేశ్ (64) జట్లు 70 పరుగుల లోపే తోకముడిచాయి. -
ICC: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్.. తొలి ప్లేయర్‌గా
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్(Amelia Kerr) సరికొత్త చరిత్ర సృష్టించింది. ‘ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్(ICC Women's Cricketer Of The Year)’ అవార్డు గెలుచుకున్న తొలి కివీ ప్లేయర్‌గా నిలిచింది.సౌతాఫ్రికాకు చెందిన లారా వొల్వర్ట్(Laura Wolvaardt), శ్రీలంక స్టార్ చమరి ఆటపట్టు, ఆస్ట్రేలియా క్రికెటర్ అనాబెల్ సదర్లాండ్లను వెనక్కి నెట్టి ‘ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- 2024 అవార్డును సొంతం చేసుకుంది. తద్వారా ప్రతిష్టాత్మక రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని ముద్దాడనుంది.మోస్ట్ డేంజరస్ప్లేయర్కాగా 24 ఏళ్ల అమేలియా కెర్ వరల్డ్‌క్లాస్ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే అమేలియా.. ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాలు కనబరిచే అమేలియా.. ఎన్నో సార్లు ‘వైట్ ఫెర్న్స్’(న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు)ను ఒంటిచేత్తో గెలిపించింది.టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిఇక గతేడాది జరిగిన ఐసీసీ మహిళ టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో కెర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. న్యూజిలాండ్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఆమె.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకుంది. సౌతాఫ్రికాతో ఫైనల్లో కేవలం 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడంతో పాటు.. 43 పరుగులు చేసింది. ఈ టోర్నీలో మొత్తంగా 15 వికెట్లు పడగొట్టింది. ఇక మొత్తంగా 2024లో 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన అమేలియా కెర్.. 387 పరుగులు చేయడంతో పాటు.. 29 వికెట్లు పడగొట్టింది. ఆమె జ్ఞాపకార్థంఅదే విధంగా.. గతేడాది తొమ్మిది వన్డేల్లో కలిపి 264 పరుగులు చేసిన అమేలియా కెర్.. పద్నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక గతేడాదికిగానూ ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్‌గా అవార్డును అమేలియా సొంతం చేసుకంది. కాగా మహిళల క్రికెట్‌కు మార్గదర్శకులుగా నిలిచారు ఇంగ్లండ్ క్రికెటర్ రేచల్ హేహో ఫ్లింట్. ఆమె జ్ఞాపకార్థం 2017 నుంచి ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన వారికి రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అందిస్తున్నారు. 2017 నుంచి భారత క్రికెటర్ స్మృతి మంధాన, ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలిస్సా పెర్రీ రెండేసిసార్లు ఈ ట్రోఫీని అందుకోగా.. ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సీవర్- బ్రంట్ కూడా రెండుసార్లు (2022, 2023)ఈ అవార్డును ముద్దాడింది. ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ స్మృతిగత సంవత్సరం స్మృతి మంధాన అద్భుత ఆటతీరు కనబరిచింది. 2024లో స్మృతి 13 వన్డేలు ఆడి 747 పరుగులు సాధించింది. ఇందులో 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. గతేడాది స్మృతి మొత్తం 95 ఫోర్లు, 6 సిక్స్‌లు కొట్టింది. ఆస్ట్రేలియాతో 4 వన్డేలు ఆడి 151 పరుగులు చేసిన స్మృతి... న్యూజిలాండ్‌పై 105 పరుగులు (3 వన్డేల్లో), దక్షిణాఫ్రికాపై 343 పరుగులు (3 వన్డేల్లో), వెస్టిండీస్‌పై 148 పరుగులు (3 వన్డేల్లో) సాధించింది.ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లపై ఒక్కో శతకం సాధించిన స్మృతి దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు నమోదు చేసింది. ఐసీసీ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గెల్చుకోవడం స్మృతి మంధానకిది రెండోసారి. 2018లోనూ ఆమెకు ఈ పురస్కారం లభించింది. భారత్ నుంచి ఈ అవార్డు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్ కూడా స్మృతినే కావడం విశేషం. చదవండి: T20 WC 2025: భారత్‌తో పాటు సెమీస్ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్ వివరాలు -
T20 World Cup 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-205లో భారత్ మరో విజయం సాధించింది. గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన టీమిండియా సూపర్-6లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (జనవరి 26) జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ సుమయ్యా అక్తెర్ 21 నాటౌట్, జన్నతుల్ మౌకా 14 పరుగులు చేశారు. భారత బౌలర్లందరూ చాలా పొదుపుగా బౌల్ చేశారు. వైష్ణవీ శర్మ 3, షబ్నమ్ షకీల్, విజే జోషిత్, గొంగడి త్రిష తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ గొంగడి త్రిష (31 బంతుల్లో 40; 8 సిక్సర్లు) మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపుకు గట్టి పునాది వేసింది. జి కమలిని 3, సనికా ఛల్కే 11 (నాటౌట్), కెప్టెన్ నికీ ప్రసాద్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అనిస అక్తెర్ శోభా, హబిబా ఇస్లాం పింకీ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ సిక్స్‌లో భారత్ తదుపరి స్కాట్లాండ్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ జనవరి 28న జరుగనుంది. కాగా, సూపర్ సిక్స్‌లో భారత్ గ్రూప్ 1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండిటిలోనూ విజయాలు సాధించింది. గ్రూప్-1లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి.ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. గ్రూప్-2లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, నైజీరియా, యూఎస్ఏ, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో సౌతాఫ్రికా టాపర్‌గా కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, గ్రూప్-1లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ (శ్రీలంక, స్కాట్లాండ్) జరగాల్సి ఉండింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది. -
యాషెస్ సిరీస్‌లో ఆసీస్‌కు మరో విజయం
మహిళల యాషెస్ సిరీస్-2025లో ఆస్ట్రేలియా మరో విజయం సాధించింది. మల్టీ ఫార్మాట్లో జరుగుతున్న ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే కైవసం చేసుకుంది. ఇవాళ (జనవరి 23) జరిగిన రెండో టీ20లో ఆసీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (44), కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్ (48 నాటౌట్), గ్రేస్ హ్యారిస్ (35 నాటౌట్) రాణించారు. జార్జియా వాల్ (5), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (17), ఎల్లిస్ పెర్రీ (2), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (18) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా కెంప్, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఆ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండింది. ఈ దశలో వర్షం ఎడతెరిపిలేకుండా కురువడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 19.1 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ టార్గెట్ 175గా ఉండింది. అయితే ఈ సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి 7 పరుగుల దూరం ఉండింది. ఏ మాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు నిలదొక్కుకున్నారు. డేనియెల్ వ్యాట్ హాడ్జ్ (52), సోఫీ డంక్లీ (32), నాట్ సీవర్ బ్రంట్ (22), కెప్టెన్ హీథర్ నైట్ (43 నాటౌట్) ఇంగ్లండ్‌కు గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. అయితే ఇంగ్లండ్ ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. 5 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి తరుణంలో మ్యాచ్ నిలిచిపోయింది. ఒకవేళ మ్యాచ్ కొనసాగినా ఇంగ్లండ్‌కు గెలుపు అంత ఈజీ కాదు. ఫామ్‌లో ఉన్న హీథర్ నైట్ క్రీజ్‌లో ఉండటంతో ఆ జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకుని ఉండింది.కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కలిగిన మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. రెండో టీ20లో గెలుపుతో ఆసీస్ ఖాతాలో 10 పాయింట్లు (ఒక్కో గెలుపుకు రెండు పాయింట్లు) చేరాయి.ఈ సిరీస్‌లో ఇంకా ఓ టీ20, ఓ టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ గెలిచినా ఇంగ్లండ్ కనీసం సిరీస్‌ను సమం కూడా చేసుకోలేదు. తదుపరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఇంగ్లండ్ ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే ఉంటాయి.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 13 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు అలైసా హీలీ సారధిగా వ్యవహరించనుంది. గాయం కారణంగా హీలీ టీ20 సిరీస్‌లో ఆడలేదు. టెస్ట్ మ్యాచ్ సమయానికంతా హీలీ కోలుకుంటుందని ఆసీస్ మీడియా వెల్లడించింది. అయితే టెస్ట్ మ్యాచ్‌లో హీలీ కేవలం బ్యాటర్‌గానే కొనసాగుతుందని పేర్కొంది. పింక్ బాల్‌తో డే అండ్ నైట్ ఫార్మాట్లో జరిగే టెస్ట్ మ్యాచ్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు మెల్బోర్న్లో జరుగనుంది. దీనికి ముందు జనవరి 25న మూడో టీ20 జరుగనుంది.ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టు..అలైసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డ్నర్, కిమ్ గార్త్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), బెత్ మూనీ (వికెట్‌కీపర్), ఎల్లీస్ పెర్రీ, మెగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్ -
T20 World Cup 2025: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. సూపర్ సిక్స్‌లోకి ఎంట్రీ
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 23) జరిగిన చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష (44 బంతుల్లో 49; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేసింది. త్రిషతో పాటు భారత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నికీ ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), వీజే జోషిత (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జి కమలిని 5, సినిక ఛల్కే 0, భవిక అహిరే 7, ఆయుషి శుక్లా 5, పరునిక సిసోడియా ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. షబ్నమ్ షకీల్ (2), వైష్ణవి శర్మ (1) అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో ప్రముది మెత్సర, లిమాంస తిలకరత్న, అసెని తలగుణే తలో 2 వికెట్లు పడగొట్టగా... రష్మిక సేవండి, చమోది ప్రభోద, కెప్టెన్ మనుడి ననయక్కార తలో వికెట్ దక్కించుకున్నారు.119 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వైష్ణవి శర్మ (4-1-3-1), షబ్నమ్ షకీల్ (4-1-9-2), పరునిక సిసోడియా (4-0-7-2), విజే జోషిత (3-0-17-2), ఆయుషి శుక్లా (4-0-13-1) ధాటికి శ్రీలంక నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైష్ణవి శర్మ సంధించిన బంతులను ఎదుర్కోలేక లంక బ్యాటర్లు నానా అవస్థలు పడ్డారు. లంక ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (రష్మిక (15)) రెండంకెల స్కోర్ చేశారు. మిగతా 10 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కాగా, ఈ టోర్నీలో భారత్.. వెస్టిండీస్, మలేసియా, శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించి సూపర్-6లోకి ప్రవేశించింది. గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, వెస్టిండీస్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మిగతా గ్రూప్‌ల విషయానికొస్తే.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, యూఎస్ఏ, ఐర్లాండ్.. గ్రూప్-సిలో సౌతాఫ్రికా, నైజీరియా, న్యూజిలాండ్.. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
వెస్టిండీస్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. ఒకే ఒక విజయం దూరంలో..!
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్‌కు షాకిచ్చింది. ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన వన్డే మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఏ ఫార్మాట్లో అయినా బంగ్లాదేశ్‌కు విండీస్‌పై ఇదే తొలి గెలుపు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు బంగ్లాదేశ్ ఒకే ఒక మ్యాచ్ దూరంలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నిన్న (జనవరి 21) రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నిగార్ సుల్తానా (68) బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. శోభన మోస్తరి (23), షోర్నా అక్తెర్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేదు. ఫర్జానా హాక్ 18, ముర్షిదా ఖాతూన్ 12, షిర్మన్ అక్తెర్ 11, ఫహిమా ఖాతూన్ 4, రబేయా ఖాన్ 1, నహీదా అక్తెర్ పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో కరిష్మా రామ్హరాక్ 4 వికెట్లు తీయగా.. ఆలియా అలెన్ 3, డియాండ్రా డొట్టిన్, ఫ్రేసర్, అఫీ ఫ్లెచర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 35 ఓవర్లలో 124 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా బౌలర్లు మరుఫా అక్తెర్ (8-0-35-2), నహీదా అక్తెర్ (10-0-31-3), రబేయా ఖాన్ (8-0-19-2), ఫహీమా ఖాతూన్ (5-0-17-2) రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. వీరి ధాటికి పటిష్టమైన విండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో షెర్మైన్ క్యాంప్‌బెల్ (28) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (16), ఆలియా అలెన్ (15), చెర్రీ ఫ్రేసర్ (18 నాటౌట్), కరిష్మ రామ్హరాక్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ ఆధిక్యాన్ని తగ్గించింది. ప్రస్తుతం ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. తొలి వన్డేలో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. సిరీస్‌లో చివరిదైన, నిర్ణయాత్మకమైన మూడో వన్డే జనవరి 24న జరుగనుంది. -
T20 World Cup 2025: టీమిండియా బౌలర్ హ్యాట్రిక్.. 17 బంతుల్లోనే ముగిసిన ఆట
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్ రెండో విజయం సాధించింది. మలేసియాతో ఇవాళ (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మలేసియాను భారత బౌలర్లు 31 పరుగులకే (14.3 ఓవర్లలో) కుప్పకూల్చారు. భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో (4-1-5-5) చెలరేగింది. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా (3.3-1-8-3) మూడు వికెట్లు తీసింది. వీజే జోషిత్ (2-1-5-1) ఓ వికెట్ పడగొట్టింది. HISTORY IN U-19 WORLD CUP 📢Vaishnavi Sharma becomes the first Indian bowler to take the Hat-trick in Women's U-19 WC history. pic.twitter.com/s9ziyvZjpm— Johns. (@CricCrazyJohns) January 21, 2025మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన 11 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధికం. నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు 5 పరుగులు, ఇద్దరు 3 పరుగులు, ఒకరు 2, ఇద్దరు ఒక్క పరుగు చేశారు.అనంతరం అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 17 బంతుల్లోనే ఆట ముగించేసింది. ఓపెనర్లు గొంగడి త్రిష, జి కమలిని కళ్లు మూసి తెరిచే లోగా ఖేల్ ఖతం చేశారు. త్రిష పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి 12 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 27 పరుగులు చేసింది. కమలిని 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో తిరుగులేని రన్‌రేట్‌తో (+9.148) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. గ్రూప్-ఏలో భారత్ సహా శ్రీలంక (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో రెండో స్థానం), వెస్టిండీస్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో మూడో స్థానం), మలేసియా (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో నాలుగో స్థానం) జట్లు ఉన్నాయి.కాగా, భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు చెలరేగి వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలనే ఛేదించింది. గొంగడి త్రిష 4 పరుగులకే ఔటైనా.. కమలిని (16 నాటౌట్), సనికా ఛల్కే (18 నాటౌట్) భారత్‌ను గెలుపు తీరాలు దాటించారు. అంతకుముందు భారత బౌలర్లు పరుణిక సిసోడియా (2.2-0-7-3), ఆయూషి శుక్లా (4-1-6-2), వీజే జోషిత్ (2-0-5-2) విజృంభించడంతో వెస్టిండీస్ 44 పరుగులకే ఆలౌటైంది. -
ఆసీస్‌దే యాషెస్
మహిళల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా తిరిగి సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 20) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్ మరో రెండు టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ మిగిలుండగానే 8-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కలిగిన మల్టీ ఫార్మాట్ యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన తొలి టీ20లోనూ ఆసీస్ విజయం సాధించింది. తద్వారా ఆసీస్ ఖాతాలో 8 పాయింట్లు (ఒక్కో గెలుపుకు రెండు పాయింట్లు) చేరాయి.ఈ సిరీస్‌లో ఇంకా రెండు టీ20లు, ఓ టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ గెలిచినా ఇంగ్లండ్ కనీసం సిరీస్‌ను సమం కూడా చేసుకోలేదు. తదుపరి మ్యాచ్‌లన్నీ గెలిస్తే ఇంగ్లండ్ ఖాతాలో 6 పాయింట్లు మాత్రమే ఉంటాయి.తొలి టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (51 బంతుల్లో 75; 11 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటింది. మరో ఓపెనర్ జార్జియా వాల్ (21), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (25), కెప్టెన్ తహిల మెక్‌గ్రాత్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ (7), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (3) తక్కుక స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. గ్రేస్ హ్యారిస్ 8 బంతుల్లో 14, జార్జియా వేర్హమ్ 10 బంతుల్లో 11 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా కెంప్, చార్లీ డీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16 ఓవర్లలో 141 పరుగులకే టపా కట్టేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సోఫీ డంక్లీ (59) ఒక్కరే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు డకౌట్లయ్యారు. నాట్ సీవర్ బ్రంట్ (20), కెప్టెన్ హీథర్ నైట్ (18), ఆమీ జోన్స్ (12), సోఫీ ఎక్లెస్టోన్ (13), ఫ్రేయా కెంప్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో జార్జియా వేర్హమ్ 3 వికెట్లు పడగొట్టగా.. అలానా కింగ్ 2, మెగాన్ షట్, కిమ్ గార్త్, సదర్‌ల్యాండ్, తహిల మెక్‌గ్రాత్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్‌కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ఆలైస్సా హీలీ దూరమైంది. గాయం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌లో ఆడలేదు. హీలీ స్థానంలో తహిల మెక్‌గ్రాత్ ఆసీస్‌కు సారథ్యం వహించింది. హీలీ తదుపరి సిరీస్‌లో కొనసాగడం కూడా అనుమానమే అని తెలుస్తుంది. ఈ సిరీస్‌లో రెండో టీ20 జనవరి 23న కాన్బెర్రాలో జరుగనుంది. అనంతరం జనవరి 25న మూడో టీ20 అడిలైడ్‌లో.. ఏకైక టెస్ట్ మ్యాచ్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు మెల్బోర్న్లో జరుగనున్నాయి. -
10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్‌కప్-2025లో సంచలనం
అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికా జట్టు 10 అంటే 10 బంతుల్లోనే మ్యాచ్ ముగించేసింది. ఇన్నింగ్స్ బ్రేక్‌కు వెళ్లొచ్చేలోగా ఖేల్ ఖతమైంది. గ్రూప్ ‘సి’లో భాగంగా సమోవా జట్టుతో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సమోవా 9.1 ఓవర్లలో 16 పరుగులకే కుప్పకూలింది.సమోవా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. నాలుగు ఒకట్లు (1), రెండు మూడులు (3 పరుగులు) నమోదయ్యాయి. ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 6 పరుగులే సమోవా తరఫున అత్యధిక స్కోర్‌గా ఉంది. సమోవా బ్యాటర్లు చేసిన పరుగులకంటే సఫారీ బౌలర్లు తీసిన వికెట్లే అంకెల్లో టాప్‌గా ఉన్నాయి. ఎన్‌తబిసెంగ్ నిని 3, ఫే కొలింగ్, కేలా రేనెకె, శేషిని నాయుడు తలో 2 వికెట్లు తీశారు.అనంతరం దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఇద్దరే... పలువురు ప్రేక్షకులు బ్రేక్‌కు వెళ్లొచ్చే లోగా 10 బంతుల్లో 17 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. ఓపెనర్లు సిమోన్ లారెన్స్ (6 నాటౌట్), జెమ్మా బోతా (6 నాటౌట్) 1.4 ఓవర్లలోనే మ్యాచ్‌నే ముగించారు. పెను సంచలనంనిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. న్యూజిలాండ్‌పై నైజీరియా 2 పరుగుల తేడాతో గెలుపొందింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది. -
పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం.. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన పసికూన
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-2025లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. ఇవాళ (జనవరి 20) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో నైజీరియా న్యూజిలాండ్‌పై 2 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. నైజీరియా తరఫున కెప్టెన్ లక్కీ పెటీ (22 బంతుల్లో 18; ఫోర్, సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ లిల్లియన్ ఉడే (25 బంతుల్లో 19; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో నంబర్ బ్యాటర్ ఒమోసిగో ఎగువాకున్ (4 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించింది. నైజీరియా ఇన్నింగ్స్ మొత్తంలో 4 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి. న్యూజిలాండ్ తరఫున బౌలింగ్ చేసిన ఆరుగురిలో ఐదుగురు తలో వికెట్ తీశారు.అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పసికూన నైజీరియా విజయవంతంగా కాపాడుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయినా, ఆతర్వాత నిలదొక్కుకున్నట్లు కనిపించింది. ఆ జట్టుకు చెందిన ముగ్గరు మిడిలార్డర్ బ్యాటర్లు రెండంకెల స్కోర్లు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ముగ్గురు ఔట్ కావడంతో న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. నైజీరియా బౌలర్ లిల్లియన్ ఉడే అద్భుతంగా బౌల్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో నైజీరియా సంచలన విజయం నమోదు చేసింది. బ్యాట్‌తో రాణించిన నైజీరియా కెప్టెన్ బంతితోనూ పర్వాలేదనిపించింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఆమెకే దక్కింది. ఈ గెలుపుతో నైజీరియా గ్రూప్-సి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ గ్రూప్‌లో నైజీరియాతో పాటు న్యూజిలాండ్, సౌతాఫ్రికా, సమోవా జట్లు ఉన్నాయి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ నిన్ననే బోణీ కొట్టింది. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం భారత బ్యాటర్లు 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
అజేయ శతకంతో కదంతొక్కిన కెప్టెన్.. తొలి వన్డేలో బంగ్లాపై విండీస్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి. వన్డే సిరీస్‌లో భాగంగా నిన్న (జనవరి 19) సెయింట్ కిట్స్‌లో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ పర్యాటక బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి తమ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో షర్మిన్ అక్తర్ (42), ముర్షిదా ఖాతూన్ (40), శోభన మోస్తరీ (35), షోమా అక్తర్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఫర్జానా హక్ (10), కెప్టెన్ నిగర్ సుల్తానా (14), రబెయా ఖాన్ (1), నహిదా అక్తర్ (9), సుల్తానా ఖాతూన్ (2) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో డియాండ్రా డొట్టిన్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఆలియా అలెన్, హేలీ మాథ్యూస్ తలో రెండు, అఫీ ఫ్లెచర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ 31.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ అజేయ సెంచరీతో (93 బంతుల్లో 104 నాటౌట్; 16 ఫోర్లు) విండీస్‌ను విజయతీరాలకు చేర్చింది. క్యియానా జోసఫ్ (79 బంతుల్లో 70; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించింది. మాథ్యూస్, జోసఫ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 163 పరుగులు జోడించారు. వన్‌డౌన్‌లో వచ్చిన షెర్మైన్ క్యాంప్‌బెల్ 14 పరుగులతో అజేయంగా నిలిచింది. క్వియానా జోసఫ్ వికెట్ రిబేయా ఖాన్‌కు దక్కింది. ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మథ్య రెండో వన్డే జనవరి 21న జరుగనుంది. -
టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన భారత్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్-2025లో భారత్ బోణీ కొట్టింది. కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు 44 పరుగులకే (13.2 ఓవర్లలో) కుప్పకూల్చారు. పరుణిక సిసోడియా మూడు, ఆయుశి శుక్లా, జోషిత్ వీజే తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముగ్గురు విండీస్ బ్యాటర్లు రనౌటయ్యారు. విండీస్ ఇన్నింగ్స్‌లో అసాబి ఖలందర్ (12), కేనిక కస్సార్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏకంగా ఐదుగురు విండీస్ బ్యాటర్లు డకౌటయ్యారు.45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష 4 పరుగులు చేసి ఔట్ కాగా.. జి కమలిని (16), సనికా ఛల్కే (18) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్ క్లాక్స్టన్కు త్రిష వికెట్ దక్కింది. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్.. శ్రీలంక, మలేసియా, వెస్టిండీస్‌తో కలిసి గ్రూప్-ఏలో పోటీ పడుతుంది.గ్రూప్-ఏలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ జరిగింది. మలేసియాపై శ్రీలంక 139 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో దహామి సనేత్మ (55) అర్ద సెంచరీతో రాణించింది. 163 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 23 పరుగులకే ఆలౌటైంది. మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. లంక బౌలర్లలో చమోది ప్రబోద (4-2-5-3) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసింది. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
టి20 ప్రపంచకప్‌లో నేడు (జనవరి 19) భారత్, వెస్టిండీస్ మ్యాచ్
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు శుభారంభం చేశాయి. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌కు తొలి రోజు వర్షం ఆటంకం కలిగించింది. శనివారం మొత్తం 6 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా... అందులో మూడింట మాత్రమే ఫలితం వచ్చింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో స్కాట్లండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 15.1 ఓవర్లలో 48 పరుగులకే ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేమీ బ్రే 1 పరుగే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎలెనార్ లరోసా 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం ఆ్రస్టేలియా 6.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి గెలిచింది.గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 5 వికెట్ల తేడాతో నేపాల్‌పై నెగ్గింది. మొదట నేపాల్ 18.2 ఓవర్లలో 52 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో బంగ్లాదేశ్ 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది.గ్రూప్ ‘సి’లో భాగంగా దక్షిణాఫ్రికా 22 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా... మొదట దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 11 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులకు పరిమితమైంది.పాకిస్తాన్, అమెరికా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘బి’ మ్యాచ్... నైజీరియా, సమోవా మధ్య జరగాల్సిన గ్రూప్ ‘సి’ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా... ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ ఫలితం తేలలేదు.మన అమ్మాయిలకు తొలి పరీక్ష డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్–19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్... గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ తొలి పోరులో ఆదివారం వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 2023లో తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలవగా... ఇప్పుడు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టులో గొంగడి త్రిష, షబ్నమ్ షకీల్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు. ఈ ఇద్దరూ రెండేళ్ల క్రితం జరిగిన అండర్–19 వరల్డ్‌కప్‌లోనూ భాగస్వాములు కావడం భారత జట్టుకు కలిసిరానుంది. సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. మరోవైపు టి20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా గుర్తింపు ఉన్న వెస్టిండీస్ అమ్మాయిలు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనుకుంటున్నారు. -
ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్-2025లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (జనవరి 17) జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ ఆష్లే గార్డ్నర్ (102 బంతుల్లో 102; 8 ఫోర్లు, సిక్స్) కెరీర్లో తొలి శతకంతో కదంతొక్కగా.. బెత్ మూనీ (64 బంతుల్లో 50; 4 ఫోర్లు), తహిళ మెక్‌గ్రాత్ (45 బంతుల్లో 55; 8 ఫోర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (12 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 15, అలైసా హీలీ 15, ఎల్లిస్ పెర్రీ 2, అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 10, అలానా కింగ్ 9, కిమ్ గార్త్ 1 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, నాట్ సీవర్ బ్రంట్, చార్లీ డీన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. లారెన్ ఫైలర్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.309 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 222 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ అలానా కింగ్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. మెగాన్ షట్ మూడు, జార్జియా వేర్హమ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ట్యామీ బేమౌంట్ (54), నాట్ సీవర్ బ్రంట్ (61) అర్ద సెంచరీలతో రాణించగా.. డాన్ వ్యాట్ హాడ్జ్ (35), ఆమీ జోన్స్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హీథర్ నైట్ 14, చార్లీ డీన్ 12, సోఫీ ఎక్లెస్టోన్ 2, లారెన్ బెల్ 6 (నాటౌట్) పరుగులు చేయగా.. మయా బౌచియర్, అలైస్ క్యాప్సీ, లారెన్ ఫైలర్ డకౌట్ అయ్యారు.కాగా, ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. మల్టీ ఫార్మాట్లో జరుగుతున్న ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో ఆస్ట్రేలియా ఖాతాలో ఆరు పాయింట్లు (ఒక్కో వన్డేకు రెండు పాయింట్లు) ఉన్నాయి. ఆసీస్ మరో రెండు పాయింట్లు సాధిస్తే యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మూడు టీ20లతో పాటు ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా గెలవాల్సి ఉంటుంది. -
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు జరిమానా
రాజ్‌కోట్: భారత పర్యటనలో ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుపై జరిమానా పడింది. భారత మహిళల జట్టుతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఐర్లాండ్ జట్టు మందకొడిగా బౌలింగ్ చేసింది. దీంతో జట్టు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. రెండు ఓవర్లు ఆలస్యం కావడంతో మ్యాచ్ రిఫరీ జి.ఎస్.లక్షి... ఐర్లాండ్ కెప్టెన్ గాబీ లూయిస్ వివరణ అనంతరం జరిమానా ఖరారు చేసింది. ‘అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం, కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్‌కు 5 శాతం చొప్పున మొత్తం పదిశాతం మ్యాచ్ ఫీజులో కోత విధించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు వన్డేల సిరీస్‌ను స్మృతి మంధాన నేతృత్వంలోని భారత జట్టు 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరి పోరులో అయితే అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 435/5 భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మంధాన, ప్రతీకలిద్దరు శతకాలతో కదంతొక్కారు. ఐర్లాండ్‌ను భారత బౌలర్లు 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూల్చడంతో టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. -
మహిళల ఐపీఎల్ షెడ్యూల్ విడుదల
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 14వ తేదీన మొదలవుతుంది. వడోదరా (కొటాంబి స్టేడియం), బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం), ముంబై (బ్రబోర్న్ స్టేడియం), లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం) నగరాల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. బరోడా వేదికగా ఫిబ్రవరి 14న జరిగే తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. మార్చి 15న ముంబైలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. గుజరాత్, బెంగళూరు జట్లతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. తదుపరి డబ్ల్యూపీఎల్ గడిచిన రెండు సీజన్ల (2023, 2024) తరహాలో రెండు వేదికలపై కాకుండా నాలుగు వేదికల్లో జరుగనుంది. ఓపెనింగ్ లెగ్ మ్యాచ్‌లకు కొటాంబి స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా.. రెండో వారం మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు షిఫ్ట్ అవుతాయి. అనంతరం నాలుగు లీగ్ మ్యాచ్‌లు లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగనుండగా.. ఎలిమినేటర్ (మార్చి 13), ఫైనల్ మ్యాచ్‌లు (మార్చి 15) సహా నాలుగు మ్యాచ్‌లకు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మహిళల ఐపీఎల్-2025 పూర్తి షెడ్యూల్..వడోదర లెగ్:14 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్16 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్ 17 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్19 ఫిబ్రవరి 2025 యుపి వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్బెంగళూరు లెగ్:21 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ 22 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్ 23 ఫిబ్రవరి 2025 బ్రేక్24 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్ 25 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్26 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్జ్27 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ 28 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్1 మార్చి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ 2 మార్చి 2025 బ్రేక్లక్నో లెగ్:3 మార్చి 2025 యుపి వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్4 మార్చి 2025 బ్రేక్5 మార్చి 2025 బ్రేక్6 మార్చి 2025 యుపి వారియర్జ్ vs ముంబై ఇండియన్స7 మార్చి 2025 గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్8 మార్చి 2025 యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు9 మార్చి 2025 బ్రేక్ముంబై లెగ్:10 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ 11 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు12 మార్చి 2025 బ్రేక్13 మార్చి 2025 ఎలిమినేటర్14 మార్చి 2025 బ్రేక్15 మార్చి 2025 ఫైనల్ -
భారత్ ఖాతాలో అతిపెద్ద వన్డే విజయం
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు(India Women vs Ireland Women)తో మూడో వన్డేలో స్మృతి సేన ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా భారత మహిళా క్రికెట్ వన్డే చరిత్రలో అతి భారీ గెలుపు(Largest Margin Win)ను నమోదు చేసింది. అంతేకాదు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.కాగా ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా భారత్- ఐర్లాండ్ మధ్య మూడు వన్డేలు జరిగాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. ఆమె స్థానంలో స్మృతి మంధాన తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇక శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఐర్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్‌లో 116 పరుగుల తేడాతో ఐరిష్ జట్టును చిత్తు చేసింది.శతకాలతో చెలరేగిన స్మృతి, ప్రతికాఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి.. రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్లు ప్రతికా రావల్(Prathika Rawal 129 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్- 154), స్మృతి మంధాన(80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగగా.. వికెట్ కీపర్ రిచా ఘోష్ అర్ధ శతకం(42 బంతుల్లో 59) రాణించింది.మిగిలిన వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్(15), జెమీమా రోడ్రిగ్స్(4*), దీప్తి శర్మ(11*) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. ఈ నేపథ్యంలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. మెన్స్, వుమెన్స్ వన్డే క్రికెట్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఆది నుంచే ఐర్లాండ్ తడ‘బ్యా’టుఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లలో కెప్టెన్ గాబీ లూయీస్(Gaby Lewis- 1) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కౌల్టర్ రెలీ(0) డకౌట్‌గా వెనుదిరిగింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్(41)తో కలిసి ఓర్లా ప్రెరెండెర్గాస్ట్(36) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.చెలరేగిన భారత బౌలర్లుఅయితే, భారత బౌలర్ల ధాటికి ఈ ఇద్దరు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. సారా, ఓర్లా అవుటైన తర్వాత ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. లారా డెలానీ(10), లీ పాల్(15), అర్లెనె కెలీ(2), అవా కానింగ్(2), జార్జియానా డెంప్సీ(0), అలనా డాల్జెల్(5*), ఫ్రేయా సార్జెంట్(1) త్వరత్వరగా పెవిలియన్ చేరారు. ఫలితంగా ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులు చేసి.. ఆలౌట్ అయింది. దీంతో భారత్ 304 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లతో చెలరేగగా.. తనూజ కన్వార్ రెండు వికెట్లు పడగొట్టింది. మరోవైపు.. టైటస్ సాధు, సయాలీ సట్ఘరే, మిన్ను మణి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సెంచరీతో రాణించిన ప్రతికా రావల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మహిళల వన్డే క్రికెట్లో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలు👉ఐర్లాండ్‌పై రాజ్‌కోట్ వేదికగా 2025లో 304 పరుగుల తేడాతో గెలుపు👉ఐర్లాండ్‌పై పోచెఫ్‌స్ట్రూమ్ వేదికగా 2017లో 249 పరుగుల తేడాతో గెలుపు👉వెస్టిండీస్‌పై వడోదర వేదికగా 2024లో 211 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్‌పై డంబుల్లా వేదికగా 2008లో 207 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్‌పై కరాచీ వేదికగా 2005లో 193 పరుగుల తేడాతో గెలుపు.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
టి20 ప్రపంచకప్.. టీమిండియా ఘన విజయం
కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వార్మప్ మ్యాచ్‌లో భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన ఈ సన్నాహక పోరులో భారత్ ఏకంగా 119 పరుగుల భారీ తేడాతో స్కాట్లాండ్పై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కమలిని (23 బంతుల్లో 32) టాప్‌స్కోరర్ కాగా, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (26), కెప్టెన్ నికీ ప్రసాద్ (25) సనిక చల్కే (17) సహచరులకూ బ్యాటింగ్ ప్రాక్టీస్ అవకాశమిచ్చేందుకు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు.ప్రత్యర్థి బౌలర్లలో అమీ బల్డీ (2/13) కాస్త ప్రభావం చూపింది. 3 ఓవర్లు వేసిన ఆమె 13 పరుగులే ఇచి్చంది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన స్కాట్లాండ్ను భారత బౌలర్లు 18.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌట్ చేశారు. వైజాగ్‌కు చెందిన షబ్నమ్ షకీల్, వైష్ణవి శర్మ, సోనమ్ యాదవ్ తలా 2 వికెట్లు తీశారు.సోమవారం జరిగిన మిగతా వార్మప్ మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా 140 పరుగుల తేడాతో ఆతిథ్య మలేసియాను ఓడించగా, వెస్టిండీస్ 9 పరుగుల తేడాతో నేపాల్‌పై గట్టెక్కింది. అమెరికా జట్టు 13 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌కు షాక్ ఇచి్చంది. బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందగా, ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో సమోవాపై ఘనవిజయం సాధించింది. పాకిస్తాన్ 11 పరుగులతో నైజీరియాను ఓడించింది.ప్రధాన టోర్నీ ఈనెల 18 నుంచి జరుగుతుంది. అయితే భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం వెస్టిండీస్‌తో ఆడుతుంది. రెండేళ్ల క్రితం 2023లో దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నిర్వహించిన మహిళల అండర్–19 మెగా ఈవెంట్లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను కంగుతినిపించింది. -
Ashes Series 2025: రెండో వన్డే కూడా ఆసీస్‌దే
మహిళల యాషెస్ వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మెల్బోర్న్ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44.3 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఎల్లిస్ పెర్రీ (60) అర్ద సెంచరీతో రాణించింది. లిచ్‌ఫీల్డ్ (29), అలైసా హీలీ (29), బెత్ మూనీ (12), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆష్లే గార్డ్నర్ 2, తహిళ మెక్‌గ్రాత్ 1, కిమ్ గార్త్ 9 పరుగులు చేశారు. మెగాన్ షట్ డకౌట్ కాగా.. డార్సీ బ్రౌన్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలఓ సోఫీ ఎక్లెస్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టగా.. అలైస్ క్యాప్సీ 3, లారెన్ బెల్ 2, లారెన్ ఫైల్ ఓ వికెట్ దక్కించుకున్నారు.181 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కూడా తడబడింది. ఆ జట్టు 48.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి 159 పరుగులకే ఆలౌటైంది. ఆమీ జోన్స్ (103 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) టెస్ట్ మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించే ప్రయత్నం చేసింది. నాట్ సీవర్ బ్రంట్ 35, కెప్టెన్ హీథర్ నైట్ 18, మయా బౌచియర్ 17, టామీ బేమౌంట్ 3, డానియెల్ వ్యాట్ హాడ్జ్ 0, అలైస్ క్యాప్సీ 14, చార్లోట్ డీన్ 3, సోఫీ ఎక్లెస్టోన్ 0, లారెన్ ఫైలర్ 7, లారెన్ బెల్ 1 పరుగు చేశారు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్ మూడు, మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి వన్డే కూడా ఆసీస్సే గెలిచింది. నామమాత్రపు మూడో వన్డే జనవరి 17న జరుగనుంది. -
వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. సంచలనం సృష్టించిన ముంబై బ్యాటర్
బెంగళూరులోని ఆలుర్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న అండర్-19 మహిళల వన్డే కప్‌లో 14 ఏళ్ల ముంబై అమ్మాయి ట్రిపుల్ సెంచరీ సాధించింది. మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో ఐరా జాదవ్ 157 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 220.38 స్ట్రయిక్‌రేట్‌తో 346 పరుగులు (నాటౌట్) చేసింది. భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లో అయినా ఇదే అత్యధిక స్కోర్. ఇరా జాదవ్ వైట్ బాల్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయురాలు.మహిళల అండర్-19 లెవెల్లో ఐరా జదావ్‌కు ముందు నలుగురు డబుల్ సెంచరీలు సాధించారు. ప్రస్తుత టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన 224 నాటౌట్, రాఘ్వి బిస్త్ 219 నాటౌట్, జెమీమా రోడ్రిగెజ్ 202 నాటౌట్, సనికా ఛాల్కే 200 పరుగులు చేశారు. ఛాల్కే త్వరలో జరుగనున్న మహిళల అండర్-19 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించనుంది. రాఘ్వి బిస్ట్ విషయానికొస్తే.. ఈ అమ్మాయి ఇటీవలే భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసింది.ఐరా ట్రిపుల్.. ముంబై రికార్డు స్కోర్మ్యాచ్ విషయానికొస్తే.. ఐరా జాదవ్ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కడంతో మేఘాలయాపై ముంబై కనీవినీ ఎరుగని స్కోర్ చేసింది. ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 563 పరుగులు చేసింది. అండర్-19 మహిళల వన్డే కప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ముంబై తరఫున ఇదే అత్యధిక స్కోర్. మేఘాలయాతో మ్యాచ్‌లో ఐరాతో పాటు మరో ప్లేయర్ మూడంకెల స్కోర్ చేసింది. హర్లీ గాలా 79 బంతుల్లో 116 పరుగులు సాధించింది.ఐపీఎల్ వేలంలో ఎవరూ పట్టించుకోలేదు..!హిట్టర్‌గా పేరున్న ఐరా జాదవ్‌ను మహిళల ఐపీఎల్-2025 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 10 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో ఐరా మెగా వేలంలో పాల్గొంది. -
టీమిండియా బ్యాటర్ల వీరవిహారం.. వన్డేల్లో అత్యధిక స్కోర్
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో తమ అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఐర్లాండ్‌తో ఇవాళ (జనవరి 12) జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. వన్డేల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్. గతంలో భారత అత్యధిక స్కోర్ 358/2గా ఉండింది. 2017లో ఇదే ఐర్లాండ్‌పై భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. గతేడాది డిసెంబర్లో భారత్ విండీస్‌పై కూడా ఇదే స్కోర్ (358/5) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ జరిగిన రెండో వన్డేలో భారత్ అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. తొలి ముగ్గురు బ్యాటర్లు స్మృతి మంధన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ప్రతిక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, సిక్సర్), హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్, అర్లీన్ కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్జీనా డెంప్సే ఓ వికెట్ దక్కించకుంది.వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోర్లు..370/5 ఐర్లాండ్‌పై (2025)358/2 ఐర్లాండ్‌పై (2017)358/5 వెస్టిండీస్‌పై (2024)333/5 ఇంగ్లండ్‌పై (2022)325/3 సౌతాఫ్రికాపై (2024)317/8 వెస్టిండీస్‌పై (2022)314/9 వెస్టిండీస్‌పై (2024)302/3 సౌతాఫ్రికాపై (2018)కాగా, ఐర్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లెవిన్ (92) ఆ జట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసింది. లియా పాల్ (59) అర్ద సెంచరీతో రాణించింది.భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, టిటాస్ సాధు, సయాలీ సత్గరే, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో భారత్ 34.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ప్రతిక రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్) అర్ద సెంచరీతో సత్తా చాటారు. స్మృతి మంధన (41) ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్ ఏమీ మగూర్ 3 వికెట్లు పడగొట్టింది. -
యాషెస్ సిరీస్‌లో బోణీ కొట్టిన ఆసీస్
మహిళల యాషెస్ సిరీస్-2025లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఇవాళ (జనవరి 12) జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆష్లే గార్డ్నర్ ఆల్‌రౌండ్ షోతో (3/19, 42 నాటౌట్) అదరగొట్టి ఆసీస్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆష్లే గార్డ్నర్ మూడు, కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అలానా కింగ్ తలో రెండు, డార్సీ బ్రౌన్ ఓ వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హీథర్ నైట్ (39), వ్యాట్ హాడ్జ్ (38), ఆమీ జోన్స్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టామీ బేమౌంట్ (13), నాట్ సీవర్ బ్రంట్ (19), సోఫీ ఎక్లెస్టోన్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. మయా బౌచియర్ 9, అలైస్ క్యాప్సీ 4, చార్లీ డీన్ 1, లారెన్ బెల్ 1, లారెన్ ఫైలర్ 8 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 38.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అలైసా హీలీ (70) ఆసీస్ గెలుపుకు పునాది వేయగా.. ఆష్లే గార్డ్నర్ (44 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 4, ఎల్లిస్ పెర్రీ 14, బెత్ మూనీ 28, అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 10, తహిళ మెక్‌గ్రాత్ 2, అలానా కింగ్ 11 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్ తలో రెండు, లారెన్ బెల్, చార్లెట్ డీన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మెల్బోర్న్ వేదికగా జనవరి 14న జరుగనుంది. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్‌లన్నీ జరుగనున్నాయి. -
ప్రతీక, తేజల్ గెలిపించగా...
రాజ్‌కోట్: భారత మహిళల క్రికెట్ జట్టులో ఇటీవలే కొత్తగా వచ్చిన ఇద్దరు యువ బ్యాటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సత్తా చాటారు. వన్డే కెరీర్లో కేవలం నాలుగో మ్యాచ్ ఆడుతున్న ప్రతీక రావల్, తేజస్ హసబ్నిస్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి ఆటకు సీనియర్ స్మృతి మంధాన తోడవటంతో ఐర్లాండ్ మహిళలతో జరిగిన తొలి వన్డే భారత్ ఖాతాలో చేరింది. జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేయగా... భారత్ 34.3 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు సాధించి గెలిచింది. సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా, రెండో వన్డే ఆదివారం జరుగుతుంది. రాణించిన గాబీ, లియా... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక ఐర్లాండ్ ఇబ్బంది పడింది. 29 పరుగుల వ్యవధిలో జట్టు తొలి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో కెప్టెన్ గాబీ లూయిస్ (129 బంతుల్లో 92; 15 ఫోర్లు), లియా పాల్ (73 బంతుల్లో 59; 7 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. 25 ఓవర్ల పాటు పట్టుదలగా క్రీజ్‌లో నిలబడిన ఈ జోడీ ఐదో వికెట్‌కు 117 పరుగులు జోడించింది. ఈ క్రమంలో గాబీ 75 బంతుల్లో, లియా 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కండరాల నొప్పితో బాధపడుతూ ఆడిన గాబీ త్రుటిలో తన తొలి సెంచరీని చేజార్చుకుంది. భారత్ పేలవ ఫీల్డింగ్ కూడా ఐర్లాండ్‌కు కలిసొచ్చిoది.మన ఫీల్డర్లు నాలుగు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. ఇందులో ఒకటి గాబీ క్యాచ్, మరో రెండు లియా క్యాచ్‌లు కాగా...చివర్లో ఎర్లీన్ కెల్లీ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) క్యాచ్ కూడా వదిలేయడంతో ఐర్లాండ్ 50 ఓవర్లు ఆడగలిగింది. భారీ భాగస్వామ్యం... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రతీక రావల్ (96 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ స్మృతి మంధాన (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) కలిసి వేగంగా ఛేదనను ప్రారంభించారు. వీరిద్దరు 10.1 ఓవర్లలోనే 70 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 20; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (6 బంతుల్లో 9; 2 ఫోర్లు) వెనుదిరిగారు. ఇలాంటి స్థితిలో ప్రతీకకు తేజల్ (46 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు) జత కలిసింది. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ జట్టును వేగంగా గెలుపు దిశగా తీసుకుపోయారు. 70 బంతుల్లో ప్రతీక, 43 బంతుల్లో తేజల్ హాఫ్ సెంచరీలు పూర్తయ్యాయి. భారత్ విజయం కోసం మరో 21 పరుగులు కావాల్సి ఉండగా, ప్రతీక 75 పరుగుల వద్ద ఉంది. ఈ దశలో మాగ్వైర్ బౌలింగ్‌లో 2 ఫోర్లు, సిక్స్‌తో 89కి చేరిన ఆమె మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగింది. తేజల్తో కలిసి రిచా ఘోష్ (8 నాటౌట్) ఆట ముగించింది. ఈ మ్యాచ్‌తో సయాలీ సత్ఘరే భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 152వ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా ఫోర్బ్స్ (సి) దీప్తి (బి) సాధు 9; గాబీ లూయిస్ (సి అండ్ బి) దీప్తి 92; యునా రేమండ్ (రనౌట్) 5; ప్రెండర్‌గాస్ట్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ప్రియ 9; డెలానీ (బి) ప్రియా మిశ్రా 0; లియా పాల్ (రనౌట్) 59; క్రిస్టినా కూల్టర్ (నాటౌట్) 15; ఎర్లీన్ కెల్లీ (ఎల్బీ) (బి) సయాలీ 28; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–27, 2–34, 3–56, 4–56, 5–173, 6–194, 7–230. బౌలింగ్: టిటాస్ సాధు 9–1–48–1, సయాలీ సత్ఘరే 10–2–43–1, సైమా ఠాకూర్ 10–0–30–0, ప్రియా మిశ్రా 9–1–56–2, దీప్తి శర్మ 10–1–41–1, ప్రతీక రావల్ 2–0–14–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) సార్జంట్ 41; ప్రతీక రావల్ (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) మాగ్వైర్ 89; హర్లీన్ డియోల్ (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) మాగ్వైర్ 20; జెమీమా (స్టంప్డ్) కూల్టర్ (బి) మాగ్వైర్ 9; తేజల్ (నాటౌట్) 53; రిచా ఘోష్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (34.3 ఓవర్లలో 4 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–70, 2–101, 3–116, 4–232. బౌలింగ్: ఒర్లా ప్రెండర్‌గాస్ట్ 4.4–0–28–0, జార్జినా డెంప్సీ 5.3–0– 50–0, ఎర్లీన్ కెల్లీ 6–0–29–0, ఫ్రేయా సార్జంట్ 8–0–38–1, ఎయిమీ మాగ్వైర్ 8–1–57–3, లౌరా డెలానీ 2.2–0–36–0. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. భారత బౌలర్ల ధాటికి 38.5 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఆరు వికెట్లతో విజృంభించగా.. రేణుకా ఠాకూర్ నాలుగు వికెట్లు నేలకూల్చింది.నిప్పులు చెరిగిన రేణుకాఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా పేసర్ రేణుకా సింగ్ నిప్పులు చెరిగింది. తొలి బంతికే ఓపెనర్ క్వియానా జోసఫ్‌ను ఔట్ చేసిన రేణుకా.. అదే ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్, కెప్టెన్ హేలీ మాథ్యూస్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. అనంతరం రేణుకా ఐదో ఓవర్లో మరో వికెట్ పడగొట్టింది. ఈసారి ఆమె స్టార్ ప్లేయర్ డియాండ్రా డొట్టిన్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో వెస్టిండీస్ 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.దీప్తి శర్మ మాయాజాలంవిండీస్ పతనానికి రేణుకా సింగ్ పునాది వేయగా.. ఆతర్వాత పనిని దీప్తి శర్మ పూర్తి చేసింది. దీప్తి ఏ దశలోనూ విండీస్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. మధ్యలో షెమెయిన్ క్యాంప్‌బెల్ (46), చిన్నెల్ హెన్రీ (61) నిలకడగా ఆడినప్పటికీ.. ఈ ఇద్దరిని దీప్తి స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపింది. విండీస్ ఇన్నింగ్స్‌లో క్యాంప్‌బెల్, హెన్రీతో పాటు ఆలియా అలెన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.సిరీస్ సొంతంమూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌ను భారత్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ భారీ తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఈ రెండు వన్డేల్లో భారత్ భారీ స్కోర్లు నమోదు చేసింది. వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌ను సైతం భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్.. తొలి వన్డేలో విండీస్ ఘోర పరాజయం
వడోదరా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 211 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.సెంచరీ చేజార్చుకున్న మంధనఓపెనర్ స్మృతి మంధన (91) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (40), హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగెజ్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ స్పిన్నర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. హేలీ మాథ్యూస్ 2, డియోండ్రా డొట్టిన్ ఓ వికెట్ పడగొట్టింది.నిప్పులు చెరిగిన రేణుకా సింగ్.. తొలి ఐదు వికెట్ల ఘనత315 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. రేణుకా సింగ్ (10-1-29-5) ధాటికి 26.2 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. రేణుకా సింగ్‌కు కెరీర్లో ఇది తొలి ఐదు వికెట్ల ఘనత. భారత్ బౌలర్లలో రేణుకా సింగ్‌తో పాటు టైటాస్ సాధు (7-2-24-1), ప్రియా మిశ్రా (4.2-0-22-2), దీప్తి శర్మ (3-0-19-1) కూడా రాణించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో క్యాంప్‌బెల్ (21), అఫీ ఫ్లెచర్ (24 నాటౌట్), ఆలియా ఎలెన్ (13), కరిష్మా (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.తొలి వన్డేలో గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే డిసెంబర్ 24న వడోదరా వేదికగానే జరుగనుంది. -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మంధన.. టీమిండియా భారీ స్కోర్
వడోదరా వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (డిసెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన (91) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (40), హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగెజ్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో భారత టెయిలెండర్లు తడబడ్డారు. లేకపోతే టీమిండియా ఇంకా భారీ స్కోర్ చేసుండేది. విండీస్ స్పిన్నర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. హేలీ మాథ్యూస్ 2, డియోండ్రా డొట్టిన్ ఓ వికెట్ పడగొట్టింది. కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. ప్రస్తుతం వన్డే సిరీస్ సాగుతుంది. డిసెంబర్ 24, 27 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. -
యర్రంపల్లి నుంచి దిల్లీకి, ఎవరీ శ్రీచరణి?
‘అనుకోలేదని ఆగవు కొన్ని!’ నిజమే... ఇంటర్ వరకు తాను క్రికెట్లోకి అడుగు పెడతానని శ్రీచరణి అనుకోలేదు. ఖోఖో, లాంగ్‌జంప్‌లలో అండర్–14 విభాగంలో రాష్ట్రస్థాయిలో పతకాలు గెలుచుకున్న శ్రీచరణి ఇంటర్ చదివే రోజుల్లో క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టింది. ఆటలో తనను తాను మెరుగుపరుచుకుంటూ ఆల్‌రౌండర్ అనిపించుకుంది. తాజా విషయానికి వస్తే... మహిళల ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించిన మినీ వేలంలో శ్రీచరణిని ఎంపిక చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ‘దిల్లీ క్యాపిటల్స్’ రూ.55 లక్షలతో శ్రీచరణిని ఎంపిక చేసుకుంది.కడప జిల్లా యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి అందరిలాగే ఎంతోమంది స్టార్ క్రికెటర్ల అద్భుతాలు చూస్తూ, వింటూ వస్తోంది. ఇప్పుడు ఆమె ఒక అద్భుతంగా, మోడల్‌గా నిలిచింది. ‘శ్రీచరణి మా ఊరు అమ్మాయే’ అని గ్రామస్థులు గర్వంగా చెప్పుకునేలా చేసింది.యర్రంపల్లి గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె శ్రీచరణి. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్. ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివింది శ్రీచరణి. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని లేపాక్షి జూనియర్ కళాశాలలో పూర్తిచేసింది. ప్రస్తుతం వీరపునాయునిపల్లెలోని వీఆర్ఎస్ డిగ్రీ కళా శాలలో బీఎస్సీ, కంప్యూటర్స్చదువుతూ మరోవైపు క్రికెట్లో రాణిస్తోంది.2017–18లో క్రికెట్లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇక వెనక్కి తిరిగిచూసే అవసరం రాలేదు. అదేఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. 2020లో సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. జిల్లాకు చెందిన శిక్షకులు ఖాజామైనుద్దీన్, మధుసూదన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెలకువలు నేర్చుకుంది. మెరుగైన శిక్షణ కోసం కడపకు చెందిన మాజీ రంజీ క్రీడాకారుడు ఎం. సురేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘సురేష్ క్రికెట్ అకాడమీ’లో శిక్షణ పొందుతూ ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రస్తుతం కోల్‌కతాలో నిర్వహిస్తున్న బీసీసీఐ మహిళల సీనియర్ క్రికెట్ మ్యాచ్‌లలో ఆంధ్రా జట్టుకు ఆడుతుంది.పెద్ద పట్టణాల్లో ఉండే అమ్మాయిలు మాత్రమే క్రికెట్లో రాణిస్తారని, జాతీయస్థాయిలో ఆడతారనే అపోహను బ్రేక్ చేసింది. ‘నీ ఇష్టానికి కష్టం తోడైతే... అదే విజయం’ అంటున్న శ్రీ చరణి ఎంతోమంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తోంది. – నాగరాజు, కడప ఫోటోలు: వల్లెపు శ్రీనివాసులుఆ నమ్మకం ఉందిచిన్నప్పటి నుంచి నాకు ఆటలంటే ఎంతో ఇష్టం. అమ్మానాన్నలు ఎంతో ్రపోత్సహించేవారు. అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న నేను క్రికెట్‌పై ఆసక్తి చూపినప్పుడు అమ్మానాన్నలు మొదట సందేహించారు. అయితే మామ కిశోర్ కుమార్ మాత్రం ్రపోత్సహించేవారు. నేను క్రికెట్లో కూడా రాణిస్తుండడంతో అమ్మానాన్నలకు నాపై నమ్మకం వచ్చి సంతోషంగా ఉన్నారు. మనలో పట్టుదల ఉంటే ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి దారి చూపుతాయి. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు నాకు సర్వస్వం అయింది. రానున్న కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానన్న నమ్మకం ఉంది. – శ్రీచరణిసత్తా చాటేలా...2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. గత ఏడాది నిర్వహించిన బీసీసీఐ సీనియర్ అంతర్ రాష్ట్ర మహిళల క్రికెట్ మ్యాచ్‌లలో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించి కర్నాటక జట్టుపై 7 వికెట్లు, అండర్–23 మ్యాచ్‌లలో రాజస్థాన్ జట్టుపై 5 వికెట్లు తీసి ఉత్తమ ప్రదర్శన కనబరిచింది.లెఫ్ట్ఆర్మ్ బౌలర్‌గా, లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్ ఉమన్‌గా నిలకడగా రాణిస్తుండటంతో ఇటీవల నిర్వహించిన ఉమెన్ టీ–20 పోటీల్లో ఆంధ్రాజట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. తన బౌలింగ్ తీరుతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. గత నెలలో ముంబై ఇండియన్స్ జట్టు ఎంపికలకు వెళ్లిన సమయంలో శ్రీచరణి ఆటలోని నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు దిల్లీ క్యాపిటల్స్‌కు రూ.55లక్షలతో ఎంపిక చేసుకున్నారు. -
మంధన మెరుపు అర్ద శతకం.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధన 41 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ రిచా ఘోష్ 17 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. దీప్తి శర్మ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగెజ్ (15 బంతుల్లో 13; 2 ఫోర్లు) రెండంకెల స్కోర్లు చేశారు. మంధన క్రీజ్‌లో ఉండగా భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. మధ్యలో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. భారత ఇన్నింగ్స్‌లో ఉమా ఛెత్రి 4, రాఘ్వి బిస్త్ 5, సంజీవన్ సజనా 2, రాధా యాదవ్ 7, సైమా ఠాకోర్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. టిటాస్ సాధు 1, రేణుకా ఠాకూర్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, చిన్నెల్ హెన్రీ, డియాండ్రా డొట్టిన్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీ కాగా, స్మృతి మంధన టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. స్మృతి మంధన తొలి మ్యాచ్‌లో కూడా అర్ద సెంచరీతో (54) మెరిసింది. -
IND VS WI 1st T20: చెలరేగిపోయిన జెమీమా.. రాణించిన మంధన
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. స్మృతి మంధన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెజ్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఉమా ఛెత్రి 24, రిచా ఘోష్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (13), సంజీవన్ సజనా (1) అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో కరిష్మ రామ్హరాక్ రెండు వికెట్లు పడగొట్టగా.. డియాండ్రా డొట్టిన్ ఓ వికెట్ దక్కించుకుంది.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు డిసెంబర్ 15, 17, 19 తేదీల్లో జరుగనుండగా.. వన్డేలు 22, 24, 27 తేదీల్లో జరుగనున్నాయి. టీ20 మ్యాచ్‌లన్నీ నవీ ముంబైలో జరుగనుండగా.. మూడు వన్డే మ్యాచ్‌లకు వడోదర వేదిక కానుంది.ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్ మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో, మూడో వన్డేలో 83 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
ఇంగ్లండ్ బ్యాటర్ల రికార్డు.. ఒకరేమో అరంగేట్రంలోనే సెంచరీ, మరొకరు ఫాస్టెస్ట్ సెంచరీ
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు చేసి రికార్డులు సృష్టించారు. ఈ మ్యాచ్‌లో మయా బౌచియర్ (126), నాట్ సీవర్ బ్రంట్ (128) మూడంకెల మార్కును అందుకున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 395 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ట్యామీ బేమౌంట్ 21, హీథర్ నైట్ 20, డేనియెల్ వ్యాట్ హాడ్జ్ 12, ఆమీ జోన్స్ 39, చార్లోట్ డీన్ 8, సోఫీ ఎక్లెస్టోన్ 21, ర్యానా మెక్ డోనాల్డ్ గే 2 పరుగులు చేసి ఔట్ కాగా.. లారెన్ ఫైలర్ (0), లారెన్ బెల్ (0) అజేయంగా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అయాండా హ్లుబి 2, తుమీ సెఖుఖునే, మారిజన్ కాప్ తలో వికెట్ దక్కించుకున్నారు.అరంగేట్రంలోనే సెంచరీమయా బౌచియర్ అరంగేట్రంలోనే సెంచరీ చేసి రికార్డుల్లోకెక్కింది. అరంగేట్రంలో సెంచరీ చేసిన 14వ మహిళా క్రికెటర్‌గా బౌచియర్ రికార్డు సృష్టించింది. బౌచియర్ తన సెంచరీ మార్కును కేవలం 124 బంతుల్లో అందుకుంది. తద్వారా మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పింది.ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాట్ సీవర్మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ చేసిన ఘనత నాట్ సీవర్ బ్రంట్ దక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్రంట్ ఈ ఫీట్‌ను సాధించింది. బ్రంట్ కేవలం 96 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మహిళల క్రికెట్లో ఎవ్వరూ 100లోపు బంతుల్లో టెస్ట్ సెంచరీ పూర్తి చేయలేదు. మహిళల క్రికెట్లో టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీల్లో నాలుగు దక్షిణాఫ్రికాపైనే నమోదు కావడం విశేషం.మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీలు..నాట్ సీవర్ బ్రంట్-96 బంతుల్లో సౌతాఫ్రికాపైచమానీ సెనెవిరతన-106 బంతుల్లో పాకిస్తాన్పైషఫాలీ వర్మ-113 బంతుల్లో సౌతాఫ్రికాపైస్మృతి మంధన-122 బంతుల్లో సౌతాఫ్రికాపైమయా బౌచియర్-124 బంతుల్లో సౌతాఫ్రికాపై -
IND VS AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా వైస్ కెప్టెన్
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో నాలుగు వన్డే సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు మంధనతో పాటు బెలిండ క్లార్క్ (1997), మెగ్ లాన్నింగ్ (2016), ఆమీ సాటర్త్‌వైట్ (2016), సోఫీ డివైన్ (2018), సిద్రా అమీన్ (2022), నాట్ సీవర్ బ్రంట్ (2023), లారా వోల్వార్డ్ట్ (2024) పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా ఓ క్యాలెండర్ ఇయర్లో తలో మూడు వన్డే సెంచరీలు చేశారు.తాజాగా మంధన తన తోటి వారందరినీ అధిగమించి ఈ ఏడాది నాలుగో వన్డే సెంచరీ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో మంధన ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది మంధన సౌతాఫ్రికాపై రెండు (117, 136), న్యూజిలాండ్ (100), ఆస్ట్రేలియాపై (105) తలో సెంచరీ చేసింది. మంధన ఈ ఏడాది చేసిన సెంచరీల్లో మూడు స్వదేశంలో సాధించినవి కాగా.. ఒకటి ఆస్ట్రేలియాలో చేసింది.ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో మంధన 109 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 105 పరుగులు చేసింది. ఈ సెంచరీ మంధనకు వన్డేల్లో తొమ్మిదవది. ఆసీస్‌తో మ్యాచ్‌లో మంధన సెంచరీతో కదంతొక్కినా టీమిండియా ఓటమిపాలైంది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. మంధన ఔట్ కాగానే చకచకా వికెట్లు కోల్పోయింది. 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 215 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్ 0-3 తేడాతో కోల్పోయింది. -
మంధన సూపర్ సెంచరీ వృధా.. మూడో వన్డేలోనూ టీమిండియా పరాజయం
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (110) మెరుపు సెంచరీతో సత్తా చాటగా.. ఆష్లే గార్డ్నర్ (50), తహిళ మెక్‌గ్రాత్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (10-2-26-4) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ (4) సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమైంది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 45.1 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. స్మృతి మంధన (105) సూపర్ సెంచరీతో అదరగొట్టినప్పటికీ.. ఆమెకు మరో ఎండ్ నుంచి ఎవరూ సహకరించలేదు. మంధన ఔటైన అనంతరం భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మంధనతో పాటు హర్లీన్ డియోల్ (39) కాసేపు క్రీజ్‌లో గడిపింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్‌లో మంధన, హర్లీన్‌తో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (12), జెమీమా రోడ్రిగెజ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ (10-1-30-5) టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టింది. అలానా కింగ్, మెగాన్ షట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ఓ వికెట్ దక్కించుకుంది. -
హ్యాట్రిక్ తీసిన ఇంగ్లండ్ బౌలర్
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 8) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్ హ్యాట్రిక్ వికెట్లు తీసింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో డీన్ ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ తీసిన మూడో మహిళా క్రికెటర్‌గా డీన్ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా (పురుషుల క్రికెట్‌తో పాటు) ఈ ఘనత సాధించిన ఏడో ఇంగ్లండ్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో డీన్ ఇన్నింగ్స్ 17, 19 ఓవర్లలో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ చివరి బంతికి మారిజన్ కాప్ వికెట్ తీసిన డీన్.. ఆతర్వాత 19వ ఓవర్ మొదటి రెండు బంతులకు నదినే డి క్లెర్క్, సినాలో జఫ్టా వికెట్లు తీసింది.ఇంగ్లండ్ తరఫున హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్లు..కరోల్ హాడ్జస్ 1993లో డెన్మార్క్ మహిళల జట్టుపైక్లేర్ కాన్నర్ 1999లో భారత మహిళా జట్టుపైజేమ్స్ అండర్సన్ 2003లో పాకిస్తాన్ పురుషుల జట్టుపైస్టీవ్ హార్మిసన్ 2004లో భారత పురుషుల జట్టుపైఆండ్రూ ఫ్లింటాఫ్ 2009లో వెస్టిండీస్ పురుషుల జట్టుపైస్టీవెన్ ఫిన్ 2015లో ఆస్ట్రేలియా పురుషుల జట్టుపైచార్లీ డీన్ 2024లో సౌతాఫ్రికా మహిళల జట్టుపైమ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 31.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. చార్లీ డీన్ (4/45), సోఫీ ఎక్లెస్టోన్ (3/27), లారెన్ ఫైలర్ (3/32) రెచ్చిపోవడంతో సౌతాఫ్రికా జట్టు అనూహ్యంగా కుప్పకూలింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో క్లో టైరాన్ (45), లారా వోల్వార్డ్ట్ (35), డెర్క్సన్ (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 24 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామీ బేమౌంట్ (34), బౌచియర్ (33), డేనియల్ హాడ్జ్ (25 నాటౌట్), నాట్ సీవర్ బ్రంట్ (20) ఇంగ్లండ్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. సౌతాఫ్రికా బౌలర్లలో డెర్క్సన్ 2, డి క్లెర్క్, మారిజన్ కాప్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. నిర్ణయాత్మక మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది. -
తొలి వన్డేలో టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (డిసెంబర్ 5) తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా భారత్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మెగాన్ షట్ (6.2-1-19-5) దెబ్బకు 34.2 ఓవర్లలోనే 100 పరుగులకే ఆలౌటైంది. కిమ్ గార్త్, ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అలానా కింగ్ తలో వికెట్ తీశారు. భారత ఇన్నింగ్స్‌లో జెమీమా రోడ్రిగెజ్ (23) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హర్లీన్ డియోల్ (19), హర్మన్‌ప్రీత్ కౌర్ (17), రిచా ఘోష్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. ప్రియా పూనియా (3), స్మృతి మంధన (8), దీప్తి శర్మ (1), సైమా ఠాకోర్ (4), టిటాస్ సాధు (2), ప్రియా మిశ్రా (0) విఫలమయ్యారు.101 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (35), జార్జియా వాల్ (46 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు కేవలం 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (5 వికెట్లు కోల్పోయి). ఆసీస్‌ను మధ్యలో రేణుకా సింగ్ (2-0-45-3), ప్రియా మిశ్రా (2-0-11-2) భయపెట్టారు. అయితే తహిళ మెక్‌గ్రాత్ (4 నాటౌట్) సాయంతో జార్జియా వాల్ ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఎల్లిస్ పెర్రీ (1), బెత్ మూనీ (1), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (6), ఆష్లే గార్డ్నర్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 8న జరుగనుంది. -
ఆసీస్ పర్యటన.. టీమిండియా వికెట్‌కీపర్‌కు గాయం
భారత్, ఆస్ట్రేలియా (మహిళల క్రికెట్) జట్ల మధ్య డిసెంబర్ 5 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు.ఈ జట్టుకు ఎంపికైన యువ వికెట్‌కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా బిగ్‌బాష్ లీగ్ ఆడుతూ (మెల్బోర్న్ స్టార్స్) గాయపడింది. యస్తికా మణికట్టు గాయానికి గురైంది. దీంతో యస్తికాను ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.యస్తికా స్థానాన్ని 22 ఏళ్ల ఉమా ఛెత్రీ భర్తీ చేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఛెత్రీ ఈ ఏడాది జులైలోనే టీమిండియా అరంగేట్రం చేసింది. భారత్ తరఫున ఈ చిన్నది నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఛెత్రీ వన్డేల్లో అరంగేట్రం చేయాల్సి ఉంది.కాగా, ఆసీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టులో స్టార్ ప్లేయర్ షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. పేలవ ఫామ్ కారణంగా సెలెక్టర్లు షఫాలీ వర్మపై వేటు వేశారు. ఈ సిరీస్‌లో శ్రేయాంక పాటిల్, దయాలన్ హేమలత, సయాలీ సథ్గరే కూడా ఆడటం లేదు.ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు..హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, సైమా ఠాకోర్, ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్)సిరీస్ షెడ్యూల్..డిసెంబర్ 5- తొలి వన్డే (బ్రిస్బేన్)డిసెంబర్ 8- రెండో వన్డే (బ్రిస్బేన్)డిసెంబర్ 11- మూడో వన్డే (పెర్త్) -
బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన
మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన నమోదైంది. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (నవంబర్ 11) జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. రెనెగేడ్స్ 17.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. గతంలో కూడా ఈ రికార్డు రెనెగేడ్స్ పేరిటే ఉండేది. 2019-20 సీజన్లో బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో రెనెగేడ్స్ 184 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో అత్యధిక లక్ష్య ఛేదనలు..186- మెల్బోర్న్ రెనెగేడ్స్184- మెల్బోర్న్ రెనెగేడ్స్180- పెర్త్ స్కార్చర్స్179- సిడ్నీ సిక్సర్స్ (2020-21)179- సిడ్నీ సిక్సర్స్ (2024-25)కాగా, హేలీ మాథ్యూస్ (54 బంతుల్లో 85 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), డియాండ్రా డొట్టిన్ (18 బంతుల్లో 46 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అజేయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్దేశించిన 186 పరుగుల భారీ లక్ష్యాన్ని మెల్బోర్న్ రెనెగేడ్స్ సునాయాసంగా ఊదేసింది. మాథ్యూస్, డొట్టిన్ రెండో వికెట్‌కు కేవలం 33 బంతుల్లో 85 పరుగులు జోడించి రెనెగేడ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో రెనెగేడ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.అడిలైడ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ తహిల మెక్‌గ్రాత్ (49), స్మృతి మంధన (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. లారా వోల్వార్డ్ట్ (27), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (24) పర్వాలేదనిపించారు. రెనెగేడ్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఇల్లింగ్‌వర్త్, అలైస్ క్యాప్సీ, డియాండ్రా డొట్టిన్, సారా తలో వికెట్ దక్కించుకున్నారు.రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో హేలీ మాథ్యూస్, డొట్టిన్తో పాటు కోట్నీ వెబ్ (37 రిటైర్డ్ హర్ట్) కూడా రాణించింది. అలైస్ క్యాప్సీ ఒక్కరే తక్కువ స్కోర్‌కు (4) నిష్క్రమించారు. క్యాప్సీ వికెట్ డార్సీ బ్రౌన్కు దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం పాయింట్ల పట్టికలో సీడ్నీ థండర్ టాప్‌లో ఉండగా..మెల్బోర్న్ రెనెగేడ్స్ రెండో స్థానంలో నిలిచింది. -
న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టీమిండియా ఓటమి
అహ్మదాబాద్ వేదికగా భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. సూజీ బేట్స్ (58), కెప్టెన్ సోఫీ డివైన్ (79) అర్ద సెంచరీలతో రాణించగా.. జార్జియా ప్లిమ్మర్ (41), మ్యాడీ గ్రీన్ (42) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ రెండు, ప్రియా మిశ్రా, సైమా ఠాకోర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 47.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లు లియా తహుహు, సోఫీ డివైన్ తలో మూడు వికెట్లు.. ఏడెన్ కార్సన్, జెస్ కెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్‌లో రాధా యాదవ్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. షెఫాలీ వర్మ 11, స్మృతి మంధన 0, యస్తికా భాటియా 12, హర్మన్‌ప్రీత్ కౌర్ 24, జెమీమా రోడ్రిగెజ్ 17, తేజల్ హసబ్నిస్ 15, దీప్తి శర్మ 15, అరుంధతి రెడ్డి 2, సైమా ఠాకోర్ 29 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపుతో 1-1తో సిరీస్ సమం అయ్యింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది. -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న టీమిండియా ప్లేయర్.. వీడియో
మహిళల క్రికెట్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 27) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఓ సెన్సేషన్ క్యాచ్ నమోదైంది. టీమిండియా ప్లేయర్ రాధా యాదవ్ నమ్మశక్యం కాని రీతిలో ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టింది. ప్రియా మిశ్రా బౌలింగ్‌లో బ్రూక్ హ్యాలీడే ఆడిన షాట్‌ను రాధా యాదవ్ పక్షిలా గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. నెటిజన్లు ఈ క్యాచ్‌ను గతంలో యువరాజ్ సింగ్ పట్టిన ఓ సెన్సేషన్ క్యాచ్‌తో పోలుస్తున్నారు.RADHA YADAV WITH A STUNNER. 🤯pic.twitter.com/CuvFs7nAc3— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2024కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 41 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 191/4గా ఉంది. సుజీ బేట్స్ (58), జార్జియా ప్లిమ్మర్ (41), లారెన్ డౌన్ (3), బ్రూక్ హ్యాలీడే (8) ఔట్ కాగా.. సోఫీ డివైన్ (60), మ్యాడీ గ్రీన్ (19) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, ప్రియా మిశ్రా, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: ఎల్లిస్ పెర్రీ ఊచకోత.. సిడ్నీ సిక్సర్స్ బోణీ విజయం -
ఎల్లిస్ పెర్రీ ఊచకోత.. సిడ్నీ సిక్సర్స్ బోణీ విజయం
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జార్జియా వేర్హమ్ (61) అర్ద సెంచరీతో రాణించగా.. కోట్నీ వెబ్ (43) పర్వాలేదనిపించింది. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో ఎమ్మా డి బ్రోగ్ (19), డియాండ్రా డొట్టిన్ (15), సోఫి మోలినెక్స్ (17), నయోమి స్టేలెన్బర్గ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. సిడ్నీ బౌలర్లలో సోఫి ఎక్లెస్టోన్, ఎల్లిస్ పెర్రీ, కోట్నీ సిప్పెల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కయోమీ బ్రే ఓ వికెట్ దక్కించుకుంది.Carnage from Perry 👏pic.twitter.com/pCpCm1Ayjq— CricTracker (@Cricketracker) October 27, 2024అనంతరం 179 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ.. కెప్టెన్ ఎల్లిస్ పెర్రీ (38 బంతుల్లో 81; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊచకోత కోయడంతో 19 ఓవర్లలోనే (7 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. సిడ్నీ ఇన్నింగ్స్‌లో హోలీ ఆర్మిటేజ్ (30), సారా బ్రైస్ (36 నాటౌట్) ఓ మోసర్తు స్కోర్లు చేశారు. రెనెగేడ్స్ బౌలర్లలో జార్జియా వేర్హమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అలైస్ క్యాప్సీ రెండు.. లిన్సే స్మిత్, సోఫీ మోలినెక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుత బిగ్‌బాష్ లీగ్ ఎడిషన్‌లో సిడ్నీకు ఇది తొలి విజయం. ఇవాళ ఉదయం జరిగిన లీగ్ ఓపెనర్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్పై బ్రిస్బేన్ హీట్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్‌లో భాగంగా ఇవాళ మరో మ్యాచ్ కూడా జరుగనుంది. పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ స్టార్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
W T20 WC: కథ మళ్లీ మొదటికి...
‘నా దృష్టిలో టి20ల్లో ఇదే భారత అత్యుత్తమ జట్టు. 15 మందిలో 12 మందికి ప్రపంచ కప్ ఆడిన అనుభవం ఉంది. అందరికీ తమ బాధ్యతలు బాగా తెలుసు. వారి సత్తాపై నాకు బాగా నమ్మకముంది’... వరల్డ్ కప్ కోసం బయల్దేరే ముందు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ తుది ఫలితం చూస్తే మాత్రం అందరికీ నిరాశ కలిగింది. ప్లేయర్‌గా 9వ ప్రయత్నంలో కూడా వరల్డ్ కప్ ట్రోఫీ లేకుండానే హర్మన్ ముగించింది. వరుసగా గత మూడు టి20 వరల్డ్ కప్‌లలో సెమీస్, ఫైనల్, సెమీస్... ఇదీ మన ప్రదర్శన. టీమ్ బలాబలాలు, ఫామ్, ర్యాంక్‌ను బట్టి చూసుకుంటే మన జట్టు మహిళల క్రికెట్లో కచ్చితంగా టాప్–4లో ఉంటుంది. కాబట్టి మరో చర్చకు తావు లేకుండా కనీసం సెమీఫైనల్ అయినా చేరుతుందని అందరూ అంచనా వేశారు. తర్వాతి రెండు నాకౌట్ మ్యాచ్‌ల సంగతేమో కానీ... సెమీస్ గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదుగత రెండు సీజన్లుగా పూర్తి స్థాయిలో సాగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాణించి అవకాశం దక్కించుకున్న యువ ప్లేయర్లు జట్టును మరింత పటిష్టంగా మార్చారు. ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్‌లో జట్టు ప్రదర్శన ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆటగాళ్లలో దూకుడు, ఆత్మవిశ్వాసమే కనిపించలేదు. పైగా యూఏఈలో వాతావరణం, పిచ్‌లు భారత్‌కు అనుకూలం అంటూ జరిగిన ప్రచారంతో హర్మన్ బృందం ఫేవరెట్‌గా మారింది. కొన్ని రోజుల క్రితమే ఆసియా కప్ ఫైనల్లో భారత్ అనూహ్యంగా శ్రీలంక చేతిలో ఓడింది. అయితే ఆ మ్యాచ్ ఒక ‘అరుదైన పరాజయం’గానే అంతా భావించారు. ఎందుకంటే ఫైనల్‌కు ముందు ఆ టోర్నీలో మన జట్టు అద్భుతంగా ఆడింది. కాబట్టి దాని ప్రభావం వరల్డ్ కప్‌పై ఉండకపోవచ్చు అని కూడా అంతా భావించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి ఆస్ట్రేలియా తర్వాత రెండో జట్టుగా భారత్ సెమీస్ చేరే అవకాశం కనిపించింది. అయితే తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగులతో చిత్తుగా ఓడటంతోనే అంతా తలకిందులైంది. ఆసీస్ ముందు తలవంచిసెమీస్లో స్థానం కోసం మనతో పోటీ పడే జట్టుపై గెలవకపోవడమే చివరకు దెబ్బ తీసింది. ఆ తర్వాత పాక్‌పై 106 పరుగుల లక్ష్యాన్ని అందుకునేందుకు కూడా 18.5 ఓవర్లు తీసుకోవడం మన బలహీన ఆటను గుర్తు చేసింది. ఆపై శ్రీలంకను 82 పరుగులతో చిత్తు చేసినా... ఆసీస్ ముందు తలవంచాల్సి వచ్చింది. నాలుగో వికెట్‌కు హర్మన్, దీప్తి 55 బంతుల్లోనే 63 పరుగులు జోడించి గెలుపు దిశగా సాగుతున్న మ్యాచ్‌లో కూడా చివరకు మన జట్టు తలవంచింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో హర్మన్ స్ట్రైక్ రొటేట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ టోర్నీలో ఓవరాల్‌గా లంకపై మినహా మన ఆటతీరు అతి సాధారణంగా కనిపించింది.హర్మన్ ఒక్కతే రెండు అర్ధసెంచరీలు చేయగా... టాప్–5లో మిగతా నలుగురు పూర్తిగా విఫలమయ్యారు. స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కూడా మూడు కీలక మ్యాచ్‌లలో కనీస ప్రదర్శన ఇవ్వలేదు. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్‌తో పోలిస్తే మన బౌలింగ్ మెరుగ్గా అనిపించింది. అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ చెరో 7 వికెట్లతో ఆకట్టుకోగా... ఆశా శోభన రాణించింది. అయితే సమష్టి వైఫల్యం కివీస్, ఆసీస్‌తో మ్యాచ్‌లలో దెబ్బ తీసింది. సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ఫిట్నెస్ క్యాంప్, స్కిల్ క్యాంప్‌లు చాలా బాగా జరిగాయని కోచ్ అమోల్ మజుందార్ చెప్పాడు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధ బవరే కూడా జట్టుతో ఉంది. కానీ తాజా ఫలితం చూస్తే అతను మెరుగుపర్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేది స్పష్టం. –సాక్షి క్రీడా విభాగం -
ఇండియా-న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ విడుదల
మహిళల క్రికెట్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ ఇవాళ (అక్టోబర్ 14) ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ అక్టోబర్ 24, 27, 29 తేదీల్లో నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్) వేదికగా జరుగనుంది. మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐసీసీ వుమెన్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగనుంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఈ సిరీస్ చాలా కీలకం కానుంది. మరి కొద్ది నెలల్లో న్యూజిలాండ్ వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.ఇదిలా ఉంటే, భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌లో కీలక దశ గుండా సాగుతోంది. మెగా టోర్నీలో భారత్ సెమీస్‌కు చేరాలంటే ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ గెలవాల్సి ఉంది. ఇది అంత ఆషామాషీ విషయం కానప్పటికీ అసాధ్యమైతే కాదు. ఈ మ్యాచ్‌లో సానుకూల ఫలితంపై భారత్ గంపెడాశలు పెట్టుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పాక్‌పై విజయం సాధిస్తే భారత్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. నిన్న జరిగిన కీలక సమరంలో భారత్ ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల స్వల్ప తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గనక భారత్ గెలిచి ఉంటే న్యూజిలాండ్-పాక్ మ్యాచ్‌తో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరి ఉండేది. చదవండి: Ranji Trophy 2024: డిఫెండింగ్ ఛాంపియన్స్‌కు షాక్ -
T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్ 8) జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. బెత్ మూనీ (40), ఎల్లిస్ పెర్రీ (30), అలైసా హీలీ (26) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. బ్రూక్ హ్యలీడే, రోస్‌మేరీ మెయిర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. మెగాన్ షట్, సదర్‌ల్యాండ్ తలో మూడు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టారు. సోఫీ మోలినెక్స్ రెండు, జార్జియా వేర్హమ్, తహిళ మెక్‌గ్రాత్ తలో వికెట్ పడగొట్టారు. కివీస్ ఇన్నింగ్స్‌లో జార్జియా ప్లిమ్మర్ (29), సుజీ బేట్స్ (20), లియా తహుహు (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో ఆసీస్ గ్రూప్-ఏలో (పాయింట్ల పట్టిక) అగ్రస్థానానికి చేరింది. పాక్, న్యూజిలాండ్, భారత్, శ్రీలంక ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: జో రూట్ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా -
వరుసగా విఫలమవుతున్నా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్న హర్మన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఐసీసీ తాజాగా విడుదల చేసి టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. హర్మన్ ఇటీవలికాలంలో తరుచూ విఫలమవుతున్నా నాలుగు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకుంది. హర్మన్ శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమతో కలిసి సంయుక్తంగా 12వ స్థానాన్ని షేర్ చేసుకుంది. ఈ ఇద్దరి ఖాతాలో 610 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.హర్మన్ తాజాగా పాక్‌తో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో 29 పరుగులతో అజేయంగా నిలిచింది. దీనికి ముందు ఆమె న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ కెప్టెన్‌గానూ విఫలమైంది. భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మిగతా భారత క్రికెటర్ల విషయానికొస్తే.. స్మృతి మంధన ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోగా.. జెమీమా రోడ్రిగెజ్ రెండు స్థానాలు కోల్పోయి 20వ స్థానానికి చేరింది. బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోగా.. రేణుకా సింగ్ ఐదో స్థానాన్ని కాపాడుకుంది. మరో ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 29వ స్థానానికి చేరుకుంది.ఓవరాల్‌గా చూస్తే.. బ్యాటింగ్‌లో బెత్ మూనీ, తహిళ మెక్‌గ్రాత్, లారా వోల్వార్డ్ట్ టాప్-3లో కొనసాగుతుండగా.. బౌలింగ్‌లో సోఫీ ఎక్లెస్టోన్, సదియా ఇక్బాల్, సారా గ్లెన్ టాప్-3లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, ఆష్లే గార్డ్నర్, మేలీ కెర్ టాప్-3లో ఉన్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ రేపు (అక్టోబర్ 9) జరుగబోయే మ్యాచ్‌లో శ్రీలంకతో పోటీపడనుంది. సెమీస్ రేసులో ముందుండాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో గెలిచినా టీమిండియా సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు. భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. తదుపరి భారత్ పాకిస్తాన్‌పై గెలిచినా నెట్ రన్‌రేట్ ఇంకా మైనస్‌లోనే ఉంది. మొత్తంగా భారత్ సెమీస్‌కు చేరాలంటే తదుపరి గ్రూప్ మ్యాచ్‌లన్నీ గెలవాల్సి ఉంటుంది. చదవండి: నవంబర్ 17 నుంచి దిగ్గజాల క్రికెట్ లీగ్.. టీమిండియా కెప్టెన్‌గా సచిన్ -
లంక బౌలర్ల విజృంభణ.. 116 పరుగులకే కుప్పకూలిన పాక్
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. లంక బౌలర్లు మూకుమ్మడిగా రాణించిన పాక్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లంక బౌలర్ల ధాటికి 116 పరుగులకు ఆలౌటైంది. సుగంధిక కుమారి, ఉదేషిక ప్రభోదని, చమారీ ఆటపట్టు తలో మూడు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. కవిష దిల్హరి ఓ వికెట్ తీసింది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఫాతిమా సనా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. నిదా దార్ (23), మునీబా అలీ (11), సిద్రా అమిన్ (12), ఒమైమా సొహైల్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. గుల్ ఫెరోజా (2), తుబా హసన్ (5), అలియా రియాజ్ (0), డయానా బేగ్ (2), సదియా ఇక్బాల్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.చదవండి: బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..! -
T20 World Cup 2024: బోణి కొట్టిన బంగ్లాదేశ్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన మెగా టోర్నీ ఓపెనర్‌లో బంగ్లా మహిళల జట్టు స్కాట్లాండ్పై 16 పరుగుల తేడాతో గెలుపొందింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన శోభన మోస్తరీ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శాంతి రాణి (29), ముర్షిదా ఖాతూన్ (12), నిగార్ సుల్తానా (18), ఫాతిమా ఖాతూన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. తాజ్ నెహర్ 0, షోర్నా అక్తెర్ 5, రీతూ మోనీ 5 పరుగులు చేయగా.. రబేయా ఖాన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది. స్కాట్లాండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైస్, ఒలివియా బెల్, కేథరీన్ ఫ్రేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 120 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రీతూ మోనీ 2, రబేయా ఖాన్, మరుఫా అక్తెర్, నహిదా అక్తెర్, ఫాహిమా ఖాతూన్ తలో వికెట్ తీసి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో సారా బ్రైస్ (49 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేథరీన్ బ్రైస్ (11), ఐల్సా లిస్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ గ్రూప్-బిలో అగ్రస్థానానికి చేరుకుంది. మెగా టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. షార్జా వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
టీ20 వరల్డ్‌కప్.. కామెంటేటర్ల జాబితా విడుదల
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. మెగా టోర్నీ కోసం వ్యాఖ్యాతల ప్యానెల్‌ను ఐసీసీ ఇవాళ (అక్టోబర్ 2) విడుదల చేసింది. కామెంటేటర్ల జాబితాలో వరల్డ్‌కప్ విన్నర్లు మెల్ జోన్స్, లిసా స్థాలేకర్, స్టేసీ ఆన్ కింగ్, లిడియా గ్రీన్వే, కార్లోస్ బ్రాత్‌వైట్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కేటీ మార్టిన్, డబ్ల్యూవీ రామన్, సనా మిర్ వరల్డ్‌కప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్‌లకు కామెంటేటర్ల ప్యానెల్లో చోటు దక్కింది. అంజుమ్, మిథాలీ మెగా టోర్నీ మొత్తానికి ఎక్స్పర్ట్స్ ఇన్సైట్స్ అందిస్తారు. వ్యాఖ్యాతల ప్యానెల్లో వెటరన్లు ఇయాన్ బిషప్, కస్ నాయుడు, నాసిర్ హుసేన్, నతాలీ జెర్మనోస్, అలీసన్ మిచెల్, ఎంపుమలెలో ఎంబాగ్వా, లారా మెక్గోల్డ్రిక్ కూడా ఉన్నారు.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న ఆడుతుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. గ్రూప్-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. చదవండి: Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్ -
టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్ అఫీషియల్స్ పేర్ల ప్రకటన
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 మ్యాచ్ అఫీషియల్స్ పేర్లను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 24) ప్రకటించింది. ఈ జాబితాలో పది మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రిఫరీలు ఉన్నారు.మ్యాచ్ రిఫరీలు: షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిచెల్ పెరీరాఅంపైర్లు: లారెన్ అజెన్‌బాగ్, కిమ్ కాటన్, సారా దంబనేవానా, అన్నా హారిస్, నిమాలి పెరెరా, క్లైర్ పోలోసాక్, వృందా రతి, స్యూ రెడ్‌ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, జాక్విలిన్ విలియమ్స్కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్ 3 నుంచి షార్జా, దుబాయ్ వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ మొత్తం 18 రోజుల పాటు సాగనుంది. ఇందులో 23 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అక్టోబర్ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీ పడతాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక పోటీపడనుండగా.. గ్రూప్-బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో (అక్టోబర్ 3) టోర్నీ మొదలు కానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న (న్యూజిలాండ్) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్ వేదికగా జరుగనుంది.చదవండి: డేవిడ్ మలాన్ విధ్వంసం.. 25 బంతుల్లోనే..! -
టీ20 వరల్డ్‌కప్ కోసం శ్రీలంక జట్టు ప్రకటన
మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల శ్రీలంక క్రికెట్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 20) ప్రకటించారు. ఈ జట్టుకు చమారీ ఆటపట్టును కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 38 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ ఇనోకా రణవీర వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకుంది. యువ ఓపెనర్ విష్మి గుణరత్నే, మిడిలార్డర్ బ్యాటర్లు కవిషా దిల్హరి, హర్షిత సమరవిక్రమ జట్టులో చోటు నిలబెట్టుకున్నారు.కాగా, టీ20 వరల్డ్‌కప్-2024 కోసం ఇప్పటివరకు తొమ్మిది దేశాలు (భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక) తమతమ జట్లను ప్రకటించాయి. స్కాట్లాండ్ ఒక్కటి జట్టును ప్రకటించాల్సి ఉంది. ప్రపంచకప్ గ్రూప్-ఏలో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పోటీపడనున్నాయి. గ్రూప్-బిలో స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. వరల్డ్‌కప్ మ్యాచ్‌లు అక్టోబర్ 3 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తలపడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న (న్యూజిలాండ్‌తో) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 6న జరునుంది. షార్జా, దుబాయ్ వేదికలుగా టీ20 వరల్డ్‌కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 20న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.టీ20 ప్రపంచ కప్ 2024 కోసం శ్రీలంక జట్టు: చమారీ ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, హాసిని పెరీరా, అనుష్క సంజీవని, సచినీ నిసంసాలా, ఉదేశిక ప్రబోధనీ, ఇనోషి ఫెర్నాండో, అచిని కులసూర్య, ఇనోకా రణవీర, శశిని గింహని, అమా కాంచన, సుగందిక కుమారి [ట్రావెలింగ్ రిజర్వ్: కౌశిని నుత్యాంగన]చదవండి: భారత బౌలర్ల విజృంభణ.. 149 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ -
ఐసీసీ చారిత్రత్మక నిర్ణయం.. రూ.66 కోట్ల ప్రైజ్‌మనీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చారిత్రత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్‌మనీని ఐసీసీ అందజేయనుంది. వచ్చే నెల యూఏఈ వేదికగా జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024తో ఈ నిర్ణయాన్ని ఐసీసీ అమలు చేయనుంది. దీంతో టోర్నమెంట్ మొత్తం ప్రైజ్‌మనీ 7.958 మిలియన్ డాలర్లకు ( భారత కరెన్సీలో రూ.66 కోట్లు). గత టోర్నీలతో పోలిస్తే ఇది 225 శాతం అధికం కావడం విశేషం. వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టు రూ.19 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుంది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ.9 కోట్ల నగదు బహుమతి దక్కించుకోనుంది."ఐసీసీ టోర్నీల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన ప్రైజ్ మనీ ఇవ్వనున్నాం. మహిళల టీ20 ప్రపంచకప్-2024లో ఈ చారిత్రత్మక నిర్ణయాన్ని అమలు చేయనున్నాం. క్రీడా చరిత్రలో ఇదొక మైలు రాయిగా నిలిచిపోతుంది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాము. క్రీడల్లో లింగ వివక్ష లేకుండా చేసేందుకు మరో అడుగు ముందుకు వేశాము. సమాన ప్రైజ్‌మనీ అందిస్తున్న క్రీడగా క్రికెట్ నిలిచిందని" ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా మహిళల టీ20 ప్రపంచ కప్ అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. -
సొంతగడ్డపై పాక్‌కు చుక్కెదురు..!
స్వదేశంలో సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ మహిళా జట్టుకు చుక్కెదురైంది. ముల్తాన్ వేదికగా నిన్న (సెప్టెంబర్ 16) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తజ్మిన్ బ్రిట్స్ (56 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. సూన్ లస్ 27, క్లో ట్రైయాన్ 15 నాటౌట్, మారిజన్ కాప్ 14. లారా వోల్వార్డ్ట్ 11 పరుగులు చేశారు. పాక్ బౌలరల్లో సదియా ఇక్బాల్ 3, నిదా దార్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ 47 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమికి బీజాన్ని వేసుకుంది. అలియా రియాజ్ (52 నాటౌట్), కెప్టెన్ ఫాతిమా సనా (37 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడినప్పటికీ పాక్‌కు ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో మారిజన్ కాప్, తుమి సెఖూఖునే తలో 2, శేషని నాయుడు ఓ వికెట్ పడగొట్టి పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ బ్యాటర్లలో గుల్ ఫెరోజా 0, మునీబా అలీ 6, సిద్రా అమీన్ 4, నిదా దార్ 16, సదాఫ్ షమాస్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. తొలి టీ20లో గెలుపుతో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో వెళ్లింది. రెండో టీ20 సెప్టెంబర్ 18న ముల్తాన్ వేదికగా జరుగనుంది.చదవండి: ‘ఈసారి అతడిని కెప్టెన్ చేయకపోతే పాక్ జట్టుకు అధోగతే’ -
ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం
మహిళల టీ20 క్రికెట్లో పసికూన ఐర్లాండ్ పటిష్టమైన ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాకిచ్చింది. నిన్న (సెప్టెంబర్ 15) జరిగిన ఉత్కంఠ పోరులో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఓర్లా ప్రెండర్‌గాస్ట్ ఆల్‌రౌండ్ షోతో (2/31, 51 బంతుల్లో 80; 13 ఫోర్లు) అదరగొట్టి ఐర్లాండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఆఖరి ఓవర్లో ఐర్లాండ్ గెలుపుకు ఏడు పరుగులు అవసరం కాగా.. మ్యాడీ విలియర్స్ (ఇంగ్లండ్ బౌలర్) వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి భయపెట్టింది. అయినా ఐర్లాండ్ ఐదో బంతికి రెండు పరుగులు రాబట్టి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. టీ20ల్లో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్‌కు ఇది తొలి విజయం. ఈ గెలుపుతో ఐర్లాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.The celebrations by Irish women after beating England women for the first time ever in a T20i. ❤️pic.twitter.com/H6pdzWzLuL— Mufaddal Vohra (@mufaddal_vohra) September 16, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బేమౌంట్ (40), స్కోల్ఫీల్డ్ (34), బ్రైయోనీ స్మిత్ (28), జార్జియా ఆడమ్స్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ప్రెండర్‌గాస్ట్, ఆర్లీన్ కెల్లీ, ఆమీ మాగ్యూర్ తలో రెండు వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. మరో బంతి మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రెండర్‌గాస్ట్ (80).. గ్యాబీ లెవిస్ (38), లియా పాల్ (27 నాటౌట్) సహకారంతో ఐర్లాండ్‌ను గెలిపించింది. చివరి ఓవర్లో కాసేపు నాటకీయ పరిణామాలు (ఐర్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది) చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా ఐర్లాండ్‌నే విజయం వరించింది. ఐర్లాండ్ దీనికి ముందు జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఓ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఐర్లాండ్ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.చదవండి: ఇంగ్లండ్, ఆ్రస్టేలియా మధ్య చివరి టి20 రద్దు -
టీ20 వరల్డ్‌కప్.. వారికి టికెట్లు 'ఫ్రీ'
యూఏఈ వేదికగా జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 టికెట్ల రేట్ల వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 11) వెల్లడించింది. టికెట్ల ప్రారంభ ధరను కేవలం ఐదు దిర్హామ్‌లు (సుమారు రూ. 100)గా నిర్ణయించింది. యువతలో క్రీడను ప్రోత్సహించేందుకు 18 ఏళ్లలోపు వారికి టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ల ధరల ప్రకటన సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై టీ20 వరల్డ్‌కప్ యొక్క లేజర్ షోను ప్రదర్శించబడింది.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్టు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. 18 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో జట్టు మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి.గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్ పోటీపడతాయి. ఈ టోర్నీలో 20 లీగ్ మ్యాచ్‌లు దుబాయ్, షార్జా వేదికగా జరుగుతాయి. అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్ షార్జాలో జరుగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న దుబాయ్‌లో జరుగనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ (న్యూజిలాండ్) ఆడనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 6న దుబాయ్‌లో జరుగనుంది.చదవండి: టీ20 వరల్డ్‌కప్ కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. -
ఐర్లాండ్‌పై ఇంగ్లండ్ భారీ విజయం
మహిళల ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 9) జరిగిన వన్డే మ్యాచ్‌లో (రెండో వన్డే) ఇంగ్లండ్ 275 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. టామీ బేమౌంట్ (150 నాటౌట్) భారీ శతకంతో సత్తా చాటింది. బేమౌంట్‌కు ఫ్రేయా కెంప్ (65) సహకారం అందించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లీనా కెల్లీ, ఫ్రేయా సర్జంట్ చెరో రెండు.. అలీస్ టెక్టార్, జేన్ మగూర్, ఏమీ మగూర్ తలో వికెట్ పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. 16.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఐర్లాండ్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు (ఉనా రేమండ్ (22)) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్, లారెన్ ఫైలర్ తలో మూడు.. ఫ్రేయా కెంప్, జార్జియా డేవిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డే సెప్టెంబర్ 11న జరుగనుంది. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. -
Women's T20 World Cup 2024: ఇదిగో మన బలగం..!
సాక్షి క్రీడా విభాగం: గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మెగా టోర్నీల్లో మంచి ఆరంభాలు లభించినా... చివరి దశకు వచ్చేసరికి ఒత్తిడిని తట్టుకోలేక రిక్తహస్తాలతో వెనుదిరుగుతోంది. ఆ అడ్డంకిని అధిగమించి ముందడుగు వేసి ప్రపంచ చాంపియన్‌గా అవతరించేందుకు మన మహిళల జట్టుకు మరో అవకాశం వచ్చింది. అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్న ఈ జట్టులో అనుభవానికి, యువతరానికి సమాన ప్రాధాన్యత కల్పించారు. పురుషుల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... ఇటీవల టి20 ప్రపంచకప్ సాధించగా... ఇప్పుడదే బాటలో మహిళల జట్టు కూడా జగజ్జేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మెగా టోర్నీకి ఎంపిక చేసిన మన ప్లేయర్ల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే... అంతర్జాతీయ టి20ల్లో 173 మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందరికంటే సీనియర్ కాగా.. వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన 141 మ్యాచ్‌ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. వీరిద్దరి తర్వాత స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 117 మ్యాచ్‌లు ఆడగా.. జెమీమా రోడ్రిగ్స్ 100 మ్యాచ్‌లు ఆడింది. ఇక అండర్-19 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించిన విధ్వంసక ఓపెనర్ షఫాలీ వర్మతో పాటు వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా కీలకం కానున్నారు. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ప్రపంచకప్‌లో... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకతో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీ పడనుంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో హర్మన్ బృందం తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడుతుంది. జట్టులో స్పిన్నర్లకు కొదవ లేకున్నా... పేస్ ఆల్‌రౌండర్ల లోటు కనిపిస్తోంది. శ్రేయంక పాటిల్, యస్తికా భాటియాను ఎంపిక చేసినా... గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటేనే వీరిద్దరు జట్టుతో కలిసి యూఏఈ బయలుదేరుతారు. ఇక ట్రావెల్ రిజర్వ్‌లుగా తనూజ కన్వర్, ఉమా ఛెత్రీ, సైమా ఠాకూర్ ఎంపికయ్యారు. ----హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్)మ్యాచ్‌లు 173పరుగులు 3426అత్యధిక స్కోరు 103సగటు 28.08సెంచరీలు 1అర్ధ సెంచరీలు 12వికెట్లు 32---స్మృతి మంధాన (వైస్ కెప్టెన్)మ్యాచ్‌లు 141పరుగులు 3493అత్యధిక స్కోరు 87సగటు 28.86అర్ధ సెంచరీలు 26---షఫాలీ వర్మమ్యాచ్లు 81పరుగులు 1948అత్యధిక స్కోరు 81సగటు 25.63అర్ధ సెంచరీలు 10---యస్తికా భాటియామ్యాచ్లు 19పరుగులు 214అత్యధిక స్కోరు 36సగటు 16.46---దీప్తి శర్మమ్యాచ్లు 117పరుగులు 1020అత్యధిక స్కోరు 64సగటు 23.72అర్ధ సెంచరీలు 2వికెట్లు 131---జెమీమా రోడ్రిగ్స్మ్యాచ్లు 100పరుగులు 2074అత్యధిక స్కోరు 76సగటు 30.50అర్ధ సెంచరీలు 11---రిచా ఘోష్మ్యాచ్లు 55పరుగులు 860అత్యధిక స్కోరు 64*సగటు 28.66అర్ధ సెంచరీలు 1---పూజ వస్త్రకర్మ్యాచ్లు 70వికెట్లు 57అత్యుత్తమ ప్రదర్శన 4/13సగటు 21.24ఎకానమీ 6.36---అరుంధతి రెడ్డిమ్యాచ్లు 29వికెట్లు 21అత్యుత్తమ ప్రదర్శన 2/19సగటు 34.66ఎకానమీ 7.92---రేణుక సింగ్మ్యాచ్లు 47వికెట్లు 50అత్యుత్తమ ప్రదర్శన 5/15సగటు 22.02ఎకానమీ 6.40---హేమలతమ్యాచ్లు 23పరుగులు 276అత్యధిక స్కోరు 47సగటు 16.23వికెట్లు 9---ఆశా శోభనమ్యాచ్లు 3వికెట్లు 4ఉత్తమ ప్రదర్శన 2/18సగటు 20.50ఎకానమీ 7.45---రాధ యాదవ్మ్యాచ్లు 80వికెట్లు 90ఉత్తమ ప్రదర్శన 4/23సగటు 19.62ఎకానమీ 6.55---శ్రేయాంక పాటిల్మ్యాచ్లు 12వికెట్లు 16ఉత్తమ ప్రదర్శన 3/19సగటు 18.75ఎకానమీ 7.14---సజన సజీవన్మ్యాచ్లు 9పరుగులు 30అత్యధిక స్కోరు 11సగటు 10.00 -
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఇవాళ (ఆగస్ట్ 27) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంపిక కాగా.. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధన వ్యవహరించనుంది. వికెట్‌కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. ఫిట్నెస్ ప్రామాణికంగా వారి ఎంపిక జరుగనుంది. ఈ జట్టుతో పాటు భారత సెలెక్టర్లు ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్‌లు, ఇద్దరు నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లను కూడా ఎంపిక చేశారు. ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఉమా ఛెత్రి (వికెట్‌కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్.. నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా రాఘవి బిస్త్, ప్రియా మిశ్రా ఎంపికయ్యారు.టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్)*, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్*, సంజన సజీవన్ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా ఛెత్రీ (వికెట్‌కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రాఘవి బిస్త్, ప్రియా మిశ్రాకాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ అక్టోబర్ 4న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అనంతరం దుబాయ్ వేదికగానే అక్టోబర్ 6న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. అక్టోబర్ 9న శ్రీలంకతో, 13న ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది. -
సూపర్ ఓవర్లో నైట్‌రైడర్స్ విజయం
మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఇరు జట్లు 128 పరుగులకు పరిమితం కాగా.. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన అమెజాన్ వారియర్స్ ఆరు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి ఐదు పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఫలితంగా నైట్‌రైడర్స్ విజయబావుటా ఎగురవేసింది.వివరాల్లోకి వెళితే.. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్-4లో ఇవాళ గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. డియెండ్రా డొట్టిన్ (53) అర్దసెంచరీతో రాణించగా.. హర్షిత మాధవి (18), శిఖా పాండే (25), నైట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. వారియర్స్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, ఎరిన్ బర్న్స్, రామ్హరాక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. క్లో టైరాన్ ఓ వికెట్ దక్కించుకుంది.129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్స్.. ఆది నుంచి నిదానంగా ఆడి విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి నైట్‌రైడర్స్ చేసినన్ని పరుగులే చేసింది. ఎరిన్ బర్న్స్ (61) అర్ద సెంచరీతో రాణించగా.. షెమెయిన్ క్యాంప్‌బెల్ (25), లారెన్ హిల్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో జైదా జేమ్స్, గ్లాస్గో, సమారా రామ్‌నాథ్ తలో వికెట్ పడగొట్టారు. -
టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
యూఏఈ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలైసా హీలీ ఎంపిక కాగా.. వైస్ కెప్టెన్‌గా తహిల మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది. సీనియర్ స్పిన్నర్ జెస్ జొనాస్సెన్ను పక్కన పెట్టిన ఆసీస్ సెలెక్టర్లు.. పేస్ బౌలర్ తైలా వ్లేమింక్కు చోటు కల్పించారు. ఈసారి ప్రపంచకప్ బరిలో ఆసీస్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. సీనియర్లంతా అంతా జట్టుకు అందుబాటులో ఉన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఈసారి కూడా టైటిల్ సాధించి, వరుసగా నాలుగు టీ20 వరల్డ్‌కప్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతుంది.టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు..అలైసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హ్యారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహిళ మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లిస్ పెర్రీ, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్, తైలా వ్లేమింక్కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉండగా.. గ్రూప్-బిలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. -
ఆస్ట్రేలియా 212 ఆలౌట్.. ఇండియా 184
ఆఫ్ స్పిన్నర్ మిన్ను మణి, లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా మాయాజాలానికి ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బ్యాటర్లు నిలబడలేకపోయారు. భారత ‘ఎ’ మహిళల జట్టుతో గురువారం మొదలైన ఏకైక అనధికారిక టెస్టులో ఆ్రస్టేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 65.5 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిన్ను మణి 54 పరుగులిచ్చి 5 వికెట్లు... ప్రియా మిశ్రా 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ ఎడంచేతి వాటం స్పిన్నర్ మన్నత్ కశ్యప్ దక్కించుకుంది. ఆసీస్ ‘ఎ’ జట్టులో ఓపెనర్ జార్జియా వోల్ (71; 12 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మైట్లాన్ బ్రౌన్ (30; 2 ఫోర్లు), గ్రేస్ పార్సన్స్ (35; 3 ఫోర్లు) రాణించారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఆసీస్ కంటే ఘోరంగా 184 పరుగులకే చాపచుట్టేసింది. భారత ఇన్నింగ్స్‌లో శ్వేత సెహ్రావత్ (40; 3 ఫోర్లు), తేజల్ హసాబ్నిస్ (32; 2 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేట్ పీటర్సన్ ఐదు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఆసీస్-ఏ 28 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
Hundred League: దీప్తి శర్మ సిక్సర్.. వైరలవుతున్న వీడియో
మహిళల హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్ ఫైనల్లో వెల్ష్ ఫైర్‌పై లండన్ స్పిరిట్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని లండన్ స్పిరిట్ 98వ బంతికి ఛేదించి విజేతగా నిలిచింది. 98వ బంతికి ముందు లండన్ విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం కాగా.. దీప్తి శర్మ సిక్సర్ బాది మ్యాచ్‌ను గెలిపించింది. దీప్తి సిక్సర్ కొట్టేప్పుడు లండన్ డగౌట్లో కనిపించి ఆసక్తికర దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. దీప్తి సిక్సర్ కొట్టే సమయంలో సహచరుల ముఖాల్లో కనిపించిన హావభావాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.The reaction of London Spirit dugout when Deepti Sharma smashed the six. 😄👌pic.twitter.com/x1uKDjSSes— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్‌లో జెస్ జోనాసెన్ (54), బేమౌంట్ (21), హేలీ మాథ్యూస్ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లండన్ బౌలర్లలో ఈవా గ్రే, సారా గ్లెన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. టారా నోరిస్, దీప్తి శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్.. జార్జియా (34), హీథర్ నైట్ (24), డేనియెలా గిబ్సన్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 98 బంతుల్లో విజయతీరాలకు చేరింది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫ్రేయా డేవిస్, జార్జియా డేవిస్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
శ్రీలంకకు వరుస షాక్‌లు
మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టుకు వరుస షాక్‌లు తగలుతున్నాయి. ఆ జట్టు తమకంటే చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో వరుస మ్యాచ్‌ల్లో ఓటమిపాలవుతుంది. తొలుత టీ20 సిరీస్‌ను సమం చేసుకుని బయటపడ్డ శ్రీలంక.. తాజాగా వన్డే సిరీస్‌ను ఐర్లాండ్‌కు కోల్పోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో వన్డేలో శ్రీలంకపై ఐర్లాండ్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆమీ హంటర్ (66), లేయా పాల్ (81), రెబెకా స్టోకెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, అచిని కులసూరియ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. చమారి ఆటపట్టు ఓ వికెట్ దక్కించుకుంది.అనంతరం 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను హర్షిత సమరవిక్రమ (105) సెంచరీతో గెలిపించే ప్రయత్నం చేసింది. లంక ఇన్నింగ్స్‌లో హర్షితతో పాటు కవిష దిల్హరి (53) కూడా రాణించింది. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఐర్లాండ్ బౌలర్లలో కెల్లీ 3, జేన్ 2, ఓర్లా, ఆమీ, ఫ్రేయా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఐర్లాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడు వన్డే ఆగస్ట్ 20న జరుగనుంది. -
దీప్తి సిక్సర్... లండన్ విన్నర్
లండన్: ‘హండ్రెడ్’ మహిళల క్రికెట్ టోర్నీకి అద్భుత ముగింపు లభించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో 2021లో హండ్రెడ్ టోర్నీ (ఇన్నింగ్స్‌కు 100 బంతులు) మొదలైంది. విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో హీతెర్ నైట్ సారథ్యంలోని లండన్ స్పిరిట్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో టామీ బీమోంట్ నాయకత్వంలోని వెల్ష్ ఫైర్ జట్టును ఓడించింది. లండన్ స్పిరిట్ జట్టుకు టైటిల్ దక్కడంలో భారత క్రికెటర్ దీప్తి శర్మ (16 బంతుల్లో 16 నాటౌట్; 1 సిక్స్) కీలకపాత్ర పోషించింది. లండన్ జట్టు విజయానికి చివరి 5 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. వెల్ష్ ఫైర్ జట్టు బౌలర్, విండీస్ ఆల్‌రౌండర్ హీలీ మాథ్యూస్ చివరి ఐదు బంతులు వేయడానికి వచ్చింది. తొలి బంతికి దీప్తి... రెండో బంతికి చార్లీ డీన్ చెరో సింగిల్ తీశారు. దాంతో లండన్ విజయ సమీకరణం 3 బంతుల్లో 4 పరుగులుగా మారింది. ఈ దశలో హీలీ వేసిన మూడో బంతిని దీప్తి శర్మ సిక్సర్‌గా మలిచి లండన్ విజయాన్ని ఖరారు చేసింది. రెండు బంతులు మిగిలి ఉండగా లండన్ స్పిరిట్ చాంపియన్‌గా అవతరించింది. అంతకుముందు వెల్ష్ ఫైర్ జట్టు 100 బంతుల్లో 8 వికెట్లకు 115 పరుగులు సాధించింది. జెస్ జొనాసెన్ (41 బంతుల్లో 54; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా... టామీ బీమోంట్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు), హీలీ మాథ్యూస్ (26 బంతుల్లో 22; 3 ఫోర్లు) రాణించారు. లండన్ స్పిరిట్ బౌలర్లలో ఇవా గ్రే, సారా గ్లెన్ రెండు వికెట్ల చొప్పున తీయగా... దీప్తి శర్మ, తారా నోరిస్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం లండన్ స్పిరిట్ జట్టు 98 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. జార్జియా రెడ్మెన్ (32 బంతుల్లో 34; 3 ఫోర్లు), హీతెర్ నైట్ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు), డానియెలా గిబ్సన్ (9 బంతుల్లో 22; 5 ఫోర్లు) దూకుడుగా ఆడారు. వెల్ష్ ఫైర్ జట్టు బౌలర్లలో షబ్నిమ్ మూడు వికెట్లు పడగొట్టింది. గత ఏడాది విజేతగా నిలిచిన సదరన్ బ్రేవ్జట్టులో భారత జట్టు వైస్ కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన సభ్యురాలిగా ఉండటం విశేషం. -
అండర్ 19 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల
మలేషియాలో జరగబోయే మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 18) ప్రకటించింది. ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 2న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. నాలుగు జట్లు ఓ గ్రూప్‌గా విభజించబడి పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.Here's the schedule for the ICC U19 Women's T20 World Cup 2025, which will take place in Malaysia.🏆𝐆𝐫𝐨𝐮𝐩 𝐀: India, West Indies, Sri Lanka, Malaysia𝐆𝐫𝐨𝐮𝐩 𝐁: England, Pakistan, Ireland, USA𝐆𝐫𝐨𝐮𝐩 𝐂: New Zealand, South Africa, Africa Qualifier, Samoa𝐆𝐫𝐨𝐮𝐩… pic.twitter.com/8Z690tEO3K— CricTracker (@Cricketracker) August 18, 2024భారత్ గ్రూప్-ఏలో వెస్టిండీస్, శ్రీలంక మలేషియాలతో పోటీపడనుంది. గ్రూప్-బిలో ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్, సమోవా దేశాలు పోటీపడనున్నాయి. గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫయర్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. భారత్.. జనవరి 19న వెస్టిండీస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
చెలరేగిన మెక్‌గ్రాత్.. టీమిండియాను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత మహిళల 'ఏ' జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది. ఇవాళ (ఆగస్ట్ 11) జరిగిన మూడో టీ20లో ఆసీస్ ఏ టీమ్ భారత ఏ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో కిరణ్ ప్రభు (38), మిన్నూ మణి (22), శ్వేత సెహ్రావత్ (15), ప్రియా పూనియా (11), సంజీవన్ సజనా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. శుభ సతీశ్ (0), తనుజా కన్వర్ (7), మేఘన సింగ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో బ్రౌన్, గ్రేస్ పార్సన్స్ నికోలా హ్యాంకాక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తైలా వ్లామ్నిక్, చార్లీ నాట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.చెలరేగిన తహ్లియా మెక్‌గ్రాత్121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. తహ్లియా మెక్‌గ్రాత్ (22 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో 13.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్‌గ్రాత్‌తో పాటు తహ్లియా విల్సన్ (39) కూడా రాణించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కేటీ మ్యాక్ 10, చార్లీ నాట్ 19 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మన్నత్ కశ్యప్, షబ్నమ్ షకీల్, మణి మిన్నూ తలో వికెట్ తీశారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20ల్లోనూ ఆతిథ్య ఆస్ట్రేలియానే విజయం సాధించింది. -
టీమిండియాకు షాకిచ్చిన శ్రీలంక.. ఆసియా కప్ ఫైనల్లో జయకేతనం
ఆసియా కప్ 2024 ఫైనల్లో శ్రీలంక టీమిండియాకు షాకిచ్చింది. ఇవాళ (జులై 28) జరిగిన ఫైనల్లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. చమారీ అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హర్షిత సమరవిక్రమ (51 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కవిష దిల్హరి (16 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) చెలరేగడంతో మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే (2 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. భారత బౌలర్లలో దీప్తి శర్మకు ఏకైక వికెట్ లభించింది. ఈ టోర్నీలో ఆది నుంచి ఆజేయంగా నిలిచిన భారత్ చివరి మెట్టుపై బోల్తా పడింది. -
Asia Cup Final: రాణించిన స్మృతి.. చెలరేగిన జెమీమా, రిచా ఘోష్
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడారు. షఫాలీ వర్మ (16), ఉమా చత్రీ (9), హర్మన్‌ప్రీత్ కౌర్ (11) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. పూజా వస్త్రాకర్ 5, రాధా యాదవ్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు. తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్‌కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
Asia Cup Final: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్లు ఇవే..!
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో ఇవాళ (జులై 28) భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఓ మార్పు చేయగా.. భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. లంక జట్టులో అచిని కులసూర్య స్థానంలో సచిని నిసంసల తుది జట్టులోకి వచ్చింది. కాగా, సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌పై, శ్రీలంక.. పాకిస్తాన్‌పై విజయాలు సాధించి ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్‌కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
సెమీస్‌కు క్వాలిఫై అయిన శ్రీలంక, బంగ్లాదేశ్.. భారత ప్రత్యర్థి ఎవరంటే..?
మహిళల ఆసియా కప్ 2024లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-బిలో భాగంగా నిన్న (జులై 24) జరిగిన మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ మలేసియాపై.. శ్రీలంక థాయ్‌లాండ్‌పై ఘన విజయాలు సాధించాయి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో మలేసియాపై బంగ్లాదేశ్ 114 పరుగల తేడాతో.. రాత్రి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘన విజయాలు నమోదు చేశాయి. ఈ గెలుపులతో గ్రూప్-బి టాపర్లు అయిన శ్రీలంక, బంగ్లాదేశ్ సెమీస్‌కు క్వాలిఫై అయ్యాయి. మలేసియా, థాయ్‌లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మరోవైపు గ్రూప్-ఏ సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, పాకిస్తాన్ సెమీస్‌కు అర్హత సాధించాయి. రేపు జరుగబోయే తొలి సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌ను.. పాకిస్తాన్ శ్రీలంకను ఢీకొంటాయి. రేపు మధ్యాహ్నం భారత్ మ్యాచ్, రాత్రి పాకిస్తాన్ మ్యాచ్ జరుగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచే జట్ల మధ్య జులై 28న అంతిమ సమరం జరుగుతుంది.బంగ్లా-మలేసియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేయగా..ఛేదనలో చేతులెత్తేసిన మలేసియా 20 ఓవర్లలో 77 పరుగులకు పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ థాయ్‌లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా.. పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. -
Asia Cup 2024: టీమిండియా హ్యాట్రిక్ విజయం.. సెమీస్‌కు అర్హత
మహిళల ఆసియా కప్ 2024 ఎడిషన్‌లో టీమిండియా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న (జులై 23) పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (81), దయాలన్ హేమలత (47) రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగెజ్ (28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడంది. నేపాల్ బౌలర్లలో సీతా రనా మగర్ 2 వికెట్లు పడగొట్టగా.. కబిత జోషి ఓ వికెట్ దక్కించుకుంది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మ (4-0-13-3), రేణుకా సింగ్ (4-1-15-1), తనూజా కన్వర్ (4-1-12-0), అరుంధతి రెడ్డి (4-0-28-2), రాధా యాదవ్ (3-0-12-2) నేపాల్‌ను ముప్పుతిప్పలు నెట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. 18 పరుగులు చేసిన సీతా టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంతో ముగించింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ యూఏఈపై ఘన విజయం సాధించి, గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఏ జట్టు ఇప్పటివరకు అధికారికంగా సెమీస్‌కు క్వాలిఫై కాలేదు. రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక గ్రూప్ టాపర్‌గా ఉండగా.. థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేసియా వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ సెమీస్‌లో పోటీపడనుంది. పాక్.. గ్రూప్-బి టాపర్‌ను సెమీస్‌లో ఢీకొట్టనుంది. భారత్ సెమీఫైనల్ మ్యాచ్ జులై 26న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ సెమీస్ మ్యాచ్ అదే రోజు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. -
నేడు (జులై 23) టీమిండియాతో నేపాల్ 'ఢీ'
మహిళల ఆసియా కప్ 2024లో ఇవాళ (జులై 23) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ పోటీపడనుండగా.. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో నేపాల్ టీమిండియాను ఢీకొంటుంది.వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ప్రస్తుత ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. పసికూన నేపాల్‌తో ఇవాళ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి, గ్రూప్-ఏ నుంచి టాపర్‌గా ఉంది. నేటి మ్యాచ్‌లో భారత్ నేపాల్‌పై గెలుస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.గ్రూప్-ఏ నుంచి ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ తలపడనున్నాయి. యూఏఈ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్ భారత్ చేతిలో ఓడి యూఏఈపై గెలిచి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ గ్రూప్ నుంచి మూడో స్థానంలో ఉన్న నేపాల్.. యూఏఈపై విజయం సాధించినప్పటికీ ఆ జట్టు రన్‌రేట్ చాలా తక్కువగా ఉంది. ఒకవేళ నేపాల్ భారత్‌పై గెలిచినా సెమీస్‌కు అర్హత సాధించలేదు. గ్రూప్-ఏ నుంచి భారత్, పాక్ సెమీస్‌కు చేరడం దాదాపుగా ఖరారైనట్లే.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో శ్రీలంక టాపర్‌గా కొనసాగుతుంది. శ్రీలంక ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ చెరో మ్యాచ్‌లో విజయం సాధించి రెండు,మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన మలేసియా చివరి స్థానంలో నిలిచింది. -
Asia Cup 2024: బంగ్లా బౌలర్ల విజృంభణ.. తొలి విజయం నమోదు
మహిళల ఆసియా కప్ 2024లో బంగ్లాదేశ్ తొలి విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్‌తో నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఓటమి అనంతరం బంగ్లాదేశ్‌కు లభించిన తొలి విజయం ఇది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.బంగ్లా బౌలర్ల విజృంభణటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్.. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. రబేయా ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టగా.. రీతూ మోనీ, సబికున్ నహార్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. థాయ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బూచాథమ్ (40), లవోమీ (17), రోస్నన్ కనో (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ (50) అర్ద సెంచరీతో రాణించగా.. దిలార అక్తెర్ 17, ఇష్మా తంజిమ్ 16 పరుగులు చేశారు. థాయ్ బౌలర్లలో పుత్తావాంగ్, ఫన్నిట మాయా తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లా తమ తదుపరి మ్యాచ్‌లో మలేషియాతో తలపడనుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. శ్రీలంక చేతుల్లో ఓడింది. ప్రస్తుతం గ్రూప్-బి పాయింట్ల పట్టికలో శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా వరుస స్థానాల్లో ఉన్నాయి. గ్రూప్-ఏ విషయానికొస్తే.. భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుండగా.. పాకిస్తాన్, నేపాల్, యూఏఈ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా ఇవాళ (జులై 23) రాత్రి జరుగబోయే మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. -
Asia Cup 2024: పసికూనపై పాక్ ప్రతాపం
మహిళల ఆసియా కప్‌లో పాకిస్తాన్ తొలి విజయం సాధించింది. నేపాల్‌తో నిన్న (జులై 21) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. పసికూన నేపాల్‌పై విరుచుకుపడింది. నేపాల్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని పాక్ 11.5 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా గ్రూప్-ఏలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మైదానంలో పాదరసంలా కదిలారు. పాక్ ఆటగాళ్లు ముగ్గురు నేపాల్ బ్యాటర్లను రనౌట్ చేశారు. సైదా ఇక్బాల్ 2, ఫాతిమా సనా ఓ వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో కబిత జోషి (31 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సీతా రనా మగర్ 26, పూజా మహతో 25, కబిత కన్వర్ 13 పరుగులు చేశారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా (35 బంతుల్లో 57; 10 ఫోర్లు), మునీబా అలీ (34 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) నేపాల్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు. ఇవాళ (జులై 22) శ్రీలంక, మలేసియా.. బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత్.. తమ తదుపరి మ్యాచ్‌లో (జులై 23) నేపాల్‌తో తలపనుంది. -
రిచా ఘోష్ ఊచకోత.. టీమిండియా ఖాతాలో మరో విజయం
మహిళల ఆసియా కప్ 2024లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. యూఏఈతో ఇవాళ (జులై 21) జరిగిన మ్యాచ్‌లో భారత్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. యూఏఈ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.రిచా ఘోష్ ఊచకోత.. హర్మన్ మెరుపు హాఫ్ సెంచరీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. హర్మన్‌ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగి చివరి ఐదు బంతులను బౌండరీలుగా మలిచింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మన్, రిచాతో పాటు షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) కూడా రెచ్చిపోగా.. స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూఏఈ బౌలర్లలో కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు.మూకుమ్మడిగా దాడి చేసిన టీమిండియా బౌలర్లు202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 123 పరుగులకే పరిమితమైంది. దీప్తి శర్మ 2, రేణుక సింగ్, తనుజా కన్వర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.తిరుగులేని భారత్ఈ టోర్నీలో గ్రూప్-ఏలో పాకిస్తాన్, నేపాల్, యూఏఈలతో పోటీపడుతున్న భారత్.. వరుసగా రెండు విజయాలతో గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుంది. నేపాల్, పాక్ చెరో మ్యాచ్‌లో ఓడిపోయి రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన యూఏఈ ఆఖరి స్థానంలో నిలిచింది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో థాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా పోటీపడుతున్నాయి. థాయ్‌లాండ్, శ్రీలంక ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో గెలిచి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్, మలేషియా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
Asia Cup 2024: టీమిండియా భారీ స్కోర్.. పొట్టి ఫార్మాట్లో తొలిసారి..!
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా యూఏఈతో ఇవాళ (జులై 21) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్), షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రిచా ఘోష్ చివరి ఐదు బంతులను బౌండరీలుగా తరలించింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత బ్యాటర్ల ధాటికి యూఏఈ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. -
మంచి మనసు చాటుకున్న స్మృతి మంధాన.. వీడియో
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన గొప్ప మనసు చాటుకుంది. తన చిన్నారి అభిమానిని సంతోష పెట్టేందుకు బహుమతినిచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వుమెన్స్ ఆసియా టీ20 కప్ ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లిన విషయం తెలిసిందే.శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలి మ్యాచ్‌లోనే గెలుపు నమోదు చేసింది.పాక్‌ను చిత్తు చేసిన భారత్‌పాకిస్తాన్ విధించిన 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ(29 బంతుల్లో 40), స్మృతి మంధాన (31 బంతుల్లో 45) రాణించారు.ఇక పాక్‌ను 108 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత స్పిన్ బౌలర్ దీప్తి శర్మ(3/20)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.స్పెషల్ ఫ్యాన్ఇదిలా ఉంటే.. డంబుల్లా వేదికగా జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను చూసేందుకు ఓ ‘ప్రత్యేకమైన’ చిన్నారి స్టేడియానికి వచ్చింది. ఆమె పేరు ఆదీషా హెరాత్.ఆదీషాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాగే భారత క్రికెటర్ స్మృతి మంధాన అంటే మరీ ఇష్టం. అందుకే తన అభిమాన ప్లేయర్‌ను కలుసుకునేందుకు ఆదీషా తల్లి సాయంతో మ్యాచ్ వేదిక వద్దకు వచ్చింది.స్పెషల్ ఏబుల్డ్ చైల్డ్ అయినా ఆదీషాను తన తల్లి వీల్‌చైర్‌లో తీసుకువచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన ఆదీషా దగ్గరికి వెళ్లి పలకరించింది. అంతేకాదు తనకు మొబైల్ ఫోన్‌ను బహుమతిగా అందించింది.సంతోషంగా ఉందిఈ విషయంపై స్పందించిన ఆదీషా తల్లి మాట్లాడుతూ.. ‘‘అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. మ్యాచ్ కచ్చితంగా చూడాలంటూ నా కూతురు పట్టుబట్టింది. భారత జట్టు క్రికెటర్ మంధానను కలిశాం.ఆమె నా కూతురికి ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. తనలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి బహుమతి మేము అస్సలు ఊహించలేదు. నిజంగా ఈ విషయంలో నా కూతురు అదృష్టవంతురాలే’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భారత్ తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో తలపడనుంది.చదవండి: IND Vs SL: సెంచరీలు చేసినా పట్టించుకోరా?.. నాకైతే అర్థం కావడం లేదుAdeesha Herath's love for cricket brought her to the stadium, despite all the challenges. The highlight of her day? A surprise encounter with her favorite cricketer, Smriti Mandhana, who handed her a mobile phone as a token of appreciation 🥺𝐌𝐨𝐦𝐞𝐧𝐭𝐬 𝐥𝐢𝐤𝐞 𝐭𝐡𝐞𝐬𝐞… pic.twitter.com/iqgL2RNE9v— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 20, 2024 -
Asia Cup 2024: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
మహిళల ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. రేణుకా శర్మ (4-0-14-2), దీప్తి శర్మ (4-0-20-3), పూజా వస్త్రాకర్ (4-0-31-2), శ్రేయాంక పాటిల్ (3.2-0-14-2) ధాటికి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అమీన్ (25), తుబా హసన్ (22), ఫాతిమా సనా (22), మునీబా అలీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. గుల్ ఫేరోజా (5), అలియా రియాజ్ (6), నిదా దార్ (8), జావిద్ (0), అరూబ్ షా (2), నశ్రా సంధు (0), సదియా ఇక్బాల్ (0) నిరాశపరిచారు. అనంతరం ఛేదనకు దిగిన భారత్.. 14.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధన 45, దయాలన్ హేమలత 14 పరుగులు చేసి ఔట్ కాగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (5), జెమీమా రోడ్రిగెజ్ (3) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. ఈ మ్యాచ్ జులై 21న జరుగనుంది. కాగా, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో యూఏఈపై నేపాల్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ విజయం నేపాల్‌ను ఆసియా కప్‌లో మొదటిది. -
Asia Cup 2024: భారత బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (జులై 19) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో పాక్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రేణుకా శర్మ (4-0-14-2), దీప్తి శర్మ (4-0-20-3), పూజా వస్త్రాకర్ (4-0-31-2), శ్రేయాంక పాటిల్ (3.2-0-14-2) ధాటికి పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అమీన్ (25), తుబా హసన్ (22), ఫాతిమా సనా (22), మునీబా అలీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. గుల్ ఫేరోజా (5), అలియా రియాజ్ (6), నిదా దార్ (8), జావిద్ (0), అరూబ్ షా (2), నశ్రా సంధు (0), సదియా ఇక్బాల్ (0) నిరాశపరిచారు. తుది జట్లు..భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్పాకిస్తాన్: సిద్రా అమీన్, గుల్ ఫిరోజా, మునీబా అలీ(వికెట్‌కీపర్), నిదా దార్(కెప్టెన్), అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఫాతిమా సనా, తుబా హసన్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా -
Asia Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే
మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీ శ్రీలంకలోని డంబుల్లా వేదికగా ఇవాళ (జులై 19) ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై నేపాల్ విజయం సాధించింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లు..భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్పాకిస్తాన్: సిద్రా అమీన్, గుల్ ఫిరోజా, మునీబా అలీ(వికెట్‌కీపర్), నిదా దార్(కెప్టెన్), అలియా రియాజ్, ఇరామ్ జావేద్, ఫాతిమా సనా, తుబా హసన్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా -
చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెట్ టీమ్
నేపాల్ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. డంబుల్లా (శ్రీలంక) వేదికగా యూఏఈతో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్ 2012, 2016 ఎడిషన్లలో ఆసియా కప్‌లో పాల్గొన్నప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. టోర్నీ చరిత్రలో తొలి విజయం సాధించడంతో నేపాల్ ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. విన్నింగ్ రన్ కొట్టగానే నేపాల్ ఆటగాళ్లంతా మైదానంలో చేరి సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.HISTORY CREATED BY NEPAL....!!!- Nepal won their first ever match in Women's Asia Cup history. 🫡 pic.twitter.com/V8CwPaybqe— Johns. (@CricCrazyJohns) July 19, 2024కాగా, మహిళల ఆసియా కప్ 2024 టోర్నీ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో యూఏఈ, నేపాల్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేయగా.. నేపాల్ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.సత్తా చాటిన ఇందు బర్మాటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. నేపాల్ కెప్టెన్ ఇందు బర్మా (4-0-19-3) సత్తా చాటడంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. నేపాల్ బౌలర్లు తలో చేయి వేయడంతో యూఏఈ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. షబ్నమ్ రాయ్, కబిత జోషి, క్రితిక తలో వికెట్ పడగొట్టారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో ఇషా రోహిత్ ఓఝా (10), సమైరా ధర్నిధర్కా (13), కవిష ఎగోడగే (22), ఖుషి శర్మ (36) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.చెలరేగిన సంజనా116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. ఓపెనర్ సంజనా ఖడ్కా (45 బంతుల్లో 72 నాటౌటగ్; 11 ఫోర్లు) చెలరేగడంతో సునాయాసంగా విజయం సాధించింది. యూఏఈ బౌలర్లలో కవిష 3 వికెట్లతో సత్తా చాటినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. -
న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్
స్వదేశంలో న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ మహిళా టీమ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (జులై 3) జరిగిన నామమాత్రపు చివరి వన్డేలో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అమేలియా కెర్ (57), కెప్టెన్ సోఫీ డివైన్ (43) రాణించారు. లారెన్ బెల్ ఐదు వికెట్లతో చెలరేగి న్యూజిలాండ్‌ను దెబ్బకొట్టింది. కేట్ క్రాస్ రెండు వికెట్లు పడగొట్టింది.అనంతరం 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నాట్ సీవర్ బ్రంట్ (76), ఆమీ జోన్స్ (50) విజృంభించడంతో 38.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. ఆఖర్లో అలైస్ క్యాప్సీ (35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కివీస్ బౌలర్లలో హన్న రోవ్ 2, మోలీ పెన్ఫోల్డ్, అమేలియా కెర్, బ్రూక్ హ్యలీడే తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు కూడా ఇంగ్లండే గెలిచింది. ఇరు జట్ల మధ్య జులై 6 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. జులై 6, 9, 11, 13, 17 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
ఎనిమిది వికెట్లతో చెలరేగిన టీమిండియా బౌలర్
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ స్నేహ్ రాణా అదరగొట్టింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రాణా ఏకంగా 8 వికెట్లు (25.3-4-77-8) పడగొట్టింది. మహిళల క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో ఇవి మూడో అత్యుత్తమ గణాంకాలు. రాణాకు ముందు మహిళల టెస్ట్ క్రికెట్లో ఆష్లే గార్డ్నర్ (8/66), నీతూ డేవిడ్ (8/53) ఎనిమిది వికెట్ల ఘనత సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. షఫాలీ వర్మ డబుల్ సెంచరీతో (205), స్మృతి మంధన (149) సెంచరీతొ చెలరేగారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా.. స్నేహ్ రాణా ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్ ఆడుతుంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో మారిజన్ కాప్ (74), సూన్ లుస్ (65) మాత్రమే రాణించారు. ఫాలో ఆన్ ఆడుతూ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. సూన్ లుస్ (109) సెంచరీతో చెలరేగగా.. లారా వొల్వార్డ్ట్ 93 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 105 పరుగులు వెనుకపడి ఉంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ నమోదు
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృస్టించింది. టెస్ట్ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్వదేశంలో సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఈ రికార్డును సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసింది. ఓవరాల్‌గా మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా 600 స్కోర్ దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ చేసిన 431 పరుగులు టెస్ట్‌ల్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు చేసిన అత్యధిక స్కోర్‌గా ఉండింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 టీమ్ స్కోర్లు..భారత్- 603/6ఆస్ట్రేలియా- 575/9ఆస్ట్రేలియా- 569/6ఆస్ట్రేలియా- 525న్యూజిలాండ్- 517/8కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శతకాల మోత మోగించి పరుగుల వరద పారించారు. ఓపెనర్ షపాలీ వర్మ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (194 బంతుల్లో 205) నమోదు చేయగా... మరో ఓపెనర్ స్మృతి మంధన (149) టెస్ట్‌ల్లో తన రెండో సెంచరీ సాధించింది. మంధన, షఫాలీతో పాటు జెమీమా రోడ్రిగెజ్ (55), హర్మన్‌ప్రీత్ (69), రిచా ఘోష్ అర్ద సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 603 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది.భారత ఇన్నింగ్స్‌లో మరిన్ని హైలైట్స్..2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్‌పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది.292 తొలి వికెట్‌కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్‌లు విండీస్‌పై తొలి వికెట్‌కు 241 పరుగులు జతచేశారు. -
ODI Series: స్వదేశంలో శ్రీలంకకు చుక్కెదురు.. విండీస్ చేతిలో పరాభవం
సొంత దేశంలో శ్రీలంక మహిళల క్రికెట్ జట్టుకు చుక్కెదురైంది. ద్వీప దేశం.. మరో ద్వీప దేశమైన వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్.. 2-1 తేడాతో శ్రీలంకను ఓడించింది. హంబనతోట వేదికగా జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20 వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. చమారీ ఆటపట్టు (38), హర్షిత మాధవి (28), కవిష దిల్హరి (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో ఆలియా అలెన్, అఫీ ఫ్లెచర్ తలో 2 వికెట్లు.. చినెల్ హెన్రీ, రమ్హరాక్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హేలీ (49), క్యాంప్‌బెల్ (41 నాటౌట్), స్టెఫానీ టేలర్ (33) విండీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. లంక బౌలర్లలో కావ్య కవింది 2, సుగందిక కుమారి, కవిష దిల్హరి తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ శ్రీలంక నెగ్గగా.. విండీస్ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌ను శ్రీలంక 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో కోసం వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించింది. -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. టీమిండియా ఓపెనర్ల సెంచరీలు
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికా వుమన్స్ టీమ్‌తో ఇవాళ (జూన్ 28) మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు స్మృతి మంధన (149), షఫాలీ వర్మ (165) సెంచరీల మోత మోగించారు. స్మృతి. షఫాలీ సెంచరీలతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 60 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. స్మృతి, శుభ సతీష్ (15) ఔట్ కాగా.. షఫాలీ, జెమీమా రోడ్రిగెజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో డి క్లెర్క్, డెల్మి టక్కర్ తలో వికెట్ పడగొట్టారు.భీకర ఫామ్‌లో స్మృతి..సౌతాఫ్రికాతో సిరీస్‌లలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరివీర భయంకర ఫామ్‌లో ఉంది. వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు, ఓ 90 ప్లస్ స్కోర్ చేసిన మంధన.. తాజాగా టెస్ట్‌ల్లో సెంచరీ చేసింది. మంధనకు టెస్ట్‌ల్లో ఇది రెండో సెంచరీ. స్మృతితో పాటు సెంచరీ చేసిన షఫాలీ వర్మకు టెస్ట్‌ల్లో ఇది తొలి సెంచరీ.మ్యాచ్ హైలైట్స్..టెస్ట్‌ల్లో స్మృతి మంధనకు రెండో సెంచరీ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా)టెస్ట్‌ల్లో షఫాలీ వర్మకు తొలి సెంచరీప్రస్తుత భారత మహిళల క్రికెటర్లలో స్మృతి మంధనవే అత్యధిక సెంచరీలు (2)మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (స్మృతి, షఫాలీ-292 పరుగులు)భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున అత్యధిక భాగస్వామ్యం (స్మృతి, షఫాలీ-292 పరుగులు) -
పదేళ్ల తర్వాత టెస్టు సమరం
చెన్నై: దశాబ్ద కాలం తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్లు టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి. నేటి నుంచి జరిగే ఏకైక టెస్టులో సఫారీ టీమ్‌ను సొంతగడ్డపై భారత్ ఎదుర్కోనుంది. దక్షిణాఫ్రికాపై 3–0తో వన్డే సిరీస్ గెలిచిన భారత్ జోరు మీదుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత్ నుంచి కనీసం ఐదుగురు కొత్త ప్లేయర్లు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఉమా చెత్రి, ప్రియా పూనియా, సైకా ఇషాక్, అరుంధతి రెడ్డి, షబ్నమ్ షకీల్ తమ తొలి టెస్టు బరిలోకి దిగవచ్చని అంచనా.వన్డేలు, టి20లతో పోలిస్తే భారత మహిళల జట్టు చాలా తక్కువ సంఖ్యలో టెస్టులు ఆడుతోంది. రెండేళ్ల విరామం తర్వాత గత ఏడాది డిసెంబర్లో భారత్ టెస్టు ఆడింది. వరుసగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలతో పోటీ పడిన మన టీమ్ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జట్టు మళ్లీ బరిలోకి దిగలేదు. దక్షిణాఫ్రికాతో ఆఖరిసారిగా 2014లో మైసూరు టెస్టులో తలపడిన జట్టు 34 పరుగులతో గెలుపొందింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. బౌలింగ్‌కు సంబంధించి పూజ వస్త్రకర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా ప్రభావం చూపించగలరు. చెపాక్ మైదానంలో సాధారణంగా స్పిన్‌ను బాగా అనుకూలిస్తుంది కాబట్టి భారత్ కోణంలో ఇది సానుకూలాంశం. మరోవైపు గత రెండేళ్లలో దక్షిణాఫ్రికా కూడా ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడింది. కెపె్టన్ లారా వాల్వార్ట్, స్యూన్ లూస్, డెల్మీ టకర్, తజ్మీన్ బ్రిట్స్, అనెక్ బాష్లపై జట్టు ఆధారపడుతోంది. పిచ్ అనుకూలిస్తే స్పిన్నర్ ఎంలాబా భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలదు. -
సత్తా చాటిన ఫ్లెచర్.. రెండో టీ20లో విండీస్ గెలుపు
మహిళల క్రికెట్లో భాగంగా హంబన్‌తోట వేదికగా శ్రీలంకతో ఇవాళ (జూన్ 26) జరిగిన టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలు కావడంతో లంక ఇన్నింగ్స్‌ను అక్కడే ముగించారు. లంక బ్యాటర్లలో విష్మి గౌతమ్ (24), చమారీ ఆటపట్టు (26), హర్షిత మాధవి (14), కవిష దిల్హరి (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. ఇమేష దులాని (6), హసిని పెరీరా (3 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ నాలుగు వికెట్లతో చెలరేగింది.వర్షం కారణంగా లంక ఇన్నింగ్స్ అర్దంతరంగా ముగియడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన విండీస్ విజయ లక్ష్యాన్ని 15 ఓవర్లలో 99 పరుగులుగా నిర్దారించారు. 99 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 14.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మాథ్యూస్ (29), స్టెఫానీ టేలర్ (28 నాటౌట్), షెమెయిన్ క్యాంప్‌బెల్ (16), ఆలియా అలెన్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. క్వియాన జోసఫ్ (6), చెడీన్ నేషన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. లంక బౌలర్లలో చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి, సిచిని నిసంసలా తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఈ మ్యాచ్‌లో గెలవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జూన్ 28న ఇదే వేదికగా జరుగనుంది. -
హ్యాట్రిక్ సెంచరీలు మిస్ అయిన టీమిండియా వైస్ కెప్టెన్.. అయినా రికార్డే..!
స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. బెంగళూరు వేదికగా ఇవాళ (జూన్ 23) జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా.. భారత్ 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. Smriti Mandhana smashed 3rd consecutive fifty plus score. 💯pic.twitter.com/mjYpYckhy6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024హ్యాట్రిక్ సెంచరీలు మిస్ఈ మ్యాచ్‌లో 90 పరుగుల వద్ద ఔటైన భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధన హ్యాట్రిక్ సెంచరీలు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఈ సిరీస్ మొత్తంలో (3 మ్యాచ్‌ల్లో) 343 పరుగులు (117. 136, 90) చేసిన స్మృతి.. మహిళల మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. స్మృతి ఈ మ్యాచ్‌లో కూడా సెంచరీ చేసుంటే, హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి ఆసియా మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కేది.మ్యాచ్ విషయానికొస్తే.. కెప్టెన్ లారా వొల్వార్డ్ట్ (61) అర్దసెంచరీతో రాణించడంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ ఓ మోస్తరు స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో తంజిమ్ బ్రిట్స్ (38), డి క్లెర్క్ (26), డి రిడ్డర్ (26 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. దీప్తి శర్మ (10-0-27-2) దక్షిణాఫ్రికాను కట్టడి చేయగా.. అరుంధతి రెడ్డి 2, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు.నామమాత్రపు లక్ష్య ఛేదనలో భారత్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో మంధనతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (42) రాణించగా.. షఫాలీ వర్మ (25), ప్రియా పూనియా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా, తుమి సెకుఖునే, మ్లాబా తలో వికెట్ పడగొట్టారు. -
చరిత్రపుటల్లోకెక్కిన ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్
మహిళల క్రికెట్లో భాగంగా నిన్న (జూన్ 19) జరిగిన భారత్-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ చరిత్రపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో తొలుత భారత బ్యాటర్లు స్మృతి మంధన (136), హర్మన్‌ప్రీత్ కౌర్ (103 నాటౌట్) శతక్కొట్టగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా ప్లేయర్లు లారా వాల్వార్డ్ట్ (135 నాటౌట్), మారిజన్ కాప్ (114) సెంచరీలతో విరుచుకుపడ్డారు.మ్యాచ్ విషయానికొస్తే.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. లారా వోల్వార్డ్ట్, మారిజన్ కాప్ సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. సౌతాఫ్రికా గెలుపుకు చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. పూజా వస్త్రాకర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 కీలక వికెట్లు తీసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఫలితంగా భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల స్కోర్ చేయగా.. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 321 పరుగులకు పరిమితమైంది. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే జూన్ 23న జరుగనుంది. -
అటు హర్మన్...ఇటు స్మృతి
బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ సమరంలో రికార్డులు హోరెత్తాయి. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారి హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరకు భారత్‌దే పైచేయి అయింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 4 పరుగుల స్వల్ప తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్డేల్లో భారత్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు. కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు సెంచరీ సాధించగా, స్మృతి మంధాన (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా రెండో వన్డేలోనూ శతకంతో చెలరేగింది.అనంతరం సఫారీ టీమ్ చివరి వరకు పోరాడి ఓడింది. 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 321 పరుగులు సాధించింది. కెపె్టన్ లారా వోల్వార్ట్ (135 బంతుల్లో 135 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), మరిజాన్ కాప్ (94 బంతుల్లో 114; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. పూజ వస్త్రకర్ వేసిన ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 11 పరుగులు అవసరం కాగా, తొలి 2 బంతుల్లో 5 పరుగులు వచ్చాయి. అయితే తర్వాతి 2 బంతులకు 2 వికెట్లు పడ్డాయి. ఆఖరి 2 బంతుల్లో 1 బై మాత్రమే వచ్చింది. సిరీస్‌ను 2–0తో భారత్ సొంతం చేసుకోగా, మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. 4 మహిళల వన్డేలో నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. 646 ఇరు జట్లు కలిపి చేసిన పరుగులు. ఇది రెండో అత్యధికం. గతంలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌లో 678 పరుగులు నమోదయ్యాయి 7 వన్డేల్లో ఏడో సెంచరీ సాధించిన స్మృతి...భారత్ తరఫున మిథాలీ రాజ్ (7)ని సమం చేసింది. హైదరాబాద్‌కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసింది. భారత్ తరఫున ఆమె ఇప్పటికే 26 టి20లు ఆడింది. -
ఉత్కంఠ సమరంలో టీమిండియా గెలుపు.. పోరాడి ఓడిన సౌతాఫ్రికా
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ వన్డే సిరీస్‌ను భారత మహిళా క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా ఇవాళ (జూన్ 19) జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చివరి బంతి వరకు పోరాడి ఓడింది. లారా వోల్వార్డ్ట్, మారిజన్ కాప్ సెంచరీలతో సత్తా చాటినప్పటికీ సౌతాఫ్రికాను గెలిపించుకోలేకపోయారు.పూజా వస్త్రాకర్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి సఫారీల విజయాన్ని అడ్డుకుంది. ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా గెలుపుకు 11 పరుగులు అవసరం కాగా.. వస్త్రాకర్ 2 కీలక వికెట్లు తీసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చింది.అంతకుముందు భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల స్కోర్ చేసింది. కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ (103 నాటౌట్), వైస్ కెప్టెన్ స్మృతి మంధన (136) సెంచరీలతో కదంతొక్కారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సౌతాఫ్రికా.. లారా వోల్వార్డ్ట్ (135 నాటౌట్), మారిజన్ కాప్ (114) శతక్కొట్టినప్పటికీ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో మెరిసిన మంధన ఓ వికెట్ కూడా పడగొట్టింది.భారత బౌలర్లలో దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ తలో 2 వికెట్లు, అరుంధతి రెడ్డి, మంధన చెరో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే జూన్ 23న జరుగనుంది. -
సుడిగాలి శతకంతో విరుచుకుపడిన టీమిండియా సారధి
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో (మహిళలు) టీమిండియా బ్యాటర్లు పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్) సాధించిన మంధన.. ఇవాళ (జూన్ 19) జరుగుతున్న రెండో వన్డేలోనూ శతక్కొట్టింది (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు).సుడిగాలి శతకంతో విరుచుకుపడిన హర్మన్ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ మంధన మెరుపు శతకంతో విరుచుకుపడితే.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సుడిగాలి సెంచరీతో (88 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించింది. కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్‌లో మంధన, హర్మన్ సెంచరీలతో విజృంభించగా.. షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24), రిచా ఘోష్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లాస్ ఓ వికెట్ పడగొట్టారు.CAPTAIN HARMANPREET KAUR COMPLETED HUNDRED WITH 4,6,4 🥶 pic.twitter.com/y26g5HRhDK— Johns. (@CricCrazyJohns) June 19, 2024చివరి ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్49వ ఓవర్ 2వ బంతి ఎదుర్కొనే సమయానికి 85 బంతుల్లో 88 పరుగులు చేసిన హర్మన్ ఆ తర్వాత మూడు బంతులను వరుసగా 4, 6, 4 బాది సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో హర్మన్‌కు ఇది 6వ సెంచరీ. టీమిండియా తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్ మూడో స్థానంలో నిలిచింది. ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన మంధన భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మిథాలీ రాజ్ రికార్డును (7) సమం చేసింది. -
వరుసగా రెండో మ్యాచ్‌లో శతక్కొట్టిన మంధన.. మిథాలీ రాజ్ రికార్డు సమం
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించి, పలు రికార్డులు బద్దలు కొట్టింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మంధన తొలి రెండు వన్డేల్లో శతక్కొట్టి, అరుదైన రికార్డులు నెలకొల్పింది.బెంగళూరు వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్) సాధించిన మంధన.. తాజాగా అదే బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ మెరుపు సెంచరీతో (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిసింది.SMRITI MANDHANA - THE QUEEN. 👑 pic.twitter.com/jsadqWhYlr— Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2024మంధన మెరుపు శతకంతో విజృంభించడంతో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. మంధనతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (87 నాటౌట్) కూడా చెలరేగి ఆడుతుండటంతో 48 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 3 వికెట్ల నష్టానికి 302గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో మంధన, షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24) ఔట్ కాగా.. హర్మన్‌కు జతగా రిచా ఘెష్ (18) క్రీజ్‌లో ఉంది.తొలి భారత క్రికెటర్‌గా రికార్డువరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేయడంతో మంధన ఖాతాలో పలు రికార్డులు చేరాయి. మహిళల వన్డే క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా మంధన రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మంధన మరో రికార్డును సమం చేసింది. భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. మిథాలీ, మంధన ఇద్దరు వన్డేల్లో 7 సెంచరీలు చేశారు. మంధన 7 వన్డే సెంచరీలను కేవలం 84 ఇన్నింగ్స్‌ల్లో చేస్తే.. మిథాలీ రాజ్‌కు 7 సెంచరీలు సాధించేందుకు 211 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. -
టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్
హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్, తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి టీమిండియాలోకి అరంగేట్రం చేసింది. మహిళల ఐసీసీ వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్ 19) జరుగుతున్న మ్యాచ్‌తో అరుంధతి వన్డే ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చింది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరుంధతికి క్యాప్ అందించి టీమ్‌లోకి ఆహ్వానించింది. 2018లోనే టీ20 ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన 26 ఏళ్ల అరుంధతి.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంది. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్, రైట్ హాండ్ బ్యాటర్ అయిన అరుంధతి.. తన చివరి టీ20 మ్యాచ్‌ను 2021లో ఆడింది. టీ20ల్లో 26 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అరుంధతి 18 వికెట్లు తీసి, 73 పరుగులు చేసింది. 𝒀𝒐𝒖 𝒂𝒍𝒘𝒂𝒚𝒔 𝒉𝒂𝒗𝒆 𝒂 𝒍𝒐𝒕 𝒎𝒐𝒓𝒆 𝒕𝒊𝒎𝒆 𝒕𝒉𝒂𝒏 𝒚𝒐𝒖 𝒕𝒉𝒊𝒏𝒌. Arundhati Reddy last played an international game in 2021. Now she is back 'stronger and calmer' for a 2.0 to gleam like first frost, an ODI debut for 🇮🇳. pic.twitter.com/7IWhw3GpfQ— The Bridge (@the_bridge_in) June 19, 2024కాగా, మూడు వన్డేలు, ఒక టెస్ట్, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో తొలుత వన్డే సిరీస్ ప్రారంభమైంది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 143 పరుగుల భారీ తేడాతో గెలిచింది.బెంగళూరు వేదికగా ఇవాళ జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 17 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. 20 పరుగులు చేసి షఫాలీ వర్మ ఔట్ కాగా.. స్మృతి మంధన (19), దయాలన్ హేమలత (7) క్రీజ్‌లో ఉన్నారు. షఫాలీ వర్మ వికెట్ మ్లాబాకు దక్కింది.తుది జట్లు..భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రాధ యాదవ్, అశా శోభనదక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ (కెప్టెన్), తజ్మిన్, అన్నెకే, సునే లూస్, మరిజన్నే, నాడిన్ డిక్లెర్క్, షాంగసె, మెయికే డిరిడ్డర్, మసాబట క్లాస్, మ్లాబా, అయబొంగ. -
రెండో వన్డేలోనూ విండీస్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. సిరీస్ కైవసం
మహిళల ఐసీసీ వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక మరో మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న వెస్టిండీస్ మహిళల జట్టు ఇవాళ (జూన్ 18) రెండో వన్డే ఆడింది. ఈ మ్యాచ్‌లో అతిథ్య శ్రీలంక.. పర్యాటక జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా శ్రీలంకనే విజయం సాధించింది.గాలే వేదికగా జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్...లంక బౌలర్ల ధాటికి 31 ఓవర్లలోనే 92 పరుగులకే చాపచుట్టేసింది. కవిష దిల్హరి (6-0-20-4), చమారీ ఆటపట్టు (2-0-8-0), అచిని కులసూరియా (7-1-6-2), సుగందిక కుమారీ (6-0-16-1) విండీస్ పతనాన్ని శాశించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో రషాదా విలియమ్స్ (24), చెడీన్ నేషన్ (12), ఆలియా అలెన్ (16), అఫీ ఫ్లెచర్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్ విష్మి గుణరత్నే (50) అర్దసెంచరీతో రాణించడంతో 21.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక ఇన్నింగ్స్‌లో విష్మితో పాటు కవిష దిల్హరి (28) రాణించింది. విండీస్ బౌలర్లలో కరిష్మ రామ్హరాక్ 2, షమీలియా కానెల్, ఆలియ అలెన్, జైదా జేమ్స్ తలో వికెట్ పడగొట్టారు.ఈ సిరీస్‌లో జరగాల్సిన చివరి వన్డే జూన్ 21 ఇదే వేదికగా జరుగనుంది. వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. జూన్ 24, 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
టీమిండియా వైస్ కెప్టెన్ అరుదైన ఘనత.. ఏకైక ఆసియా క్రికెటర్‌గా రికార్డు
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-5లో చోటు దక్కించుకున్న ఏకైక ఆసియా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మంధన మూడు (వన్డేల్లో), ఐదు (టీ20ల్లో) స్థానాల్లో నిలిచింది.రెండు రోజుల కిందట (జూన్ 16) సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో శతక్కొట్టడంతో (117) మంధన వన్డే ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. టీ20ల విషయానికొస్తే.. మంధన గత వారంలో ఉన్న ఐదో స్థానాన్ని పదిలంగా కాపాడుకుంది.ఆసియా జట్ల నుంచి వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంక కెప్టెన్ చమారీ ఆటపట్టు రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆమె ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ మంధన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (11వ స్థానం), దీప్తి శర్మ (20) టాప్-20లో ఉన్నారు. టీ20ల్లో మంధన తర్వాత హర్మన్‌ప్రీత్ (13), షఫాలీ వర్మ (15), జెమీమా రోడ్రిగెజ్ (19) టాప్-20లో ఉన్నారు.ఇదిలా ఉంటే, మహిళల జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా వన్డేల్లో ఐదు, టీ20ల్లో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండు ఫార్మాట్లలో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. -
INDW Vs SAW Photos: దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్‌లో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్పిన్నర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డుకెక్కింది. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో 3 వికెట్లు పడగొట్టిన ఎక్లెస్టోన్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.సోఫీ కేవలం 63 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మార్క్‌ను అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ క్యాథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ పేరిట ఉండేంది. ఆమె 64 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో క్యాథరిన్ ఆల్‌టైమ్ రికార్డును ఎక్లెస్టోన్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై 178 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 29.1 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. -
సౌతాఫ్రికాతో సిరీస్‌ల కోసం భారత జట్టు ప్రకటన
వచ్చే నెల (జూన్) 13 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే మల్టీ ఫార్మాట్ల సిరీస్‌ల కోసం భారత మహిళా క్రికెట్ జట్టును నిన్న (మే 30) ప్రకటించారు. భారత పర్యటనలో సౌతాఫ్రికా ఓ వన్డే వార్మప్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు, ఏకైక టెస్ట్, మూడు టీ20లు ఆడనుంది.మూడు ఫార్మాట్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ టీమిండియా సారధిగా ఎంపిక కాగా.. అన్ని ఫార్మాట్లలో స్మృతి మంధన హర్మన్‌కు డిప్యూటీగా వ్యవహరించనుంది. జెమీమా రోడ్రిగెజ్, పూజా వస్త్రాకర్లను మూడు ఫార్మాట్లలో జట్టుకు ఎంపికైనప్పటికీ.. ఫిట్నెస్ పరీక్ష నెగ్గితేనే వారికి తుది జట్టులో అవకాశం ఉంటుంది.భారత పర్యటనలో సౌతాఫ్రికన్లు తొలుత బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవెన్‌తో వన్డే వార్మప్ మ్యాచ్ ఆడతారు. ఈ మ్యాచ్ జూన్ 13న బెంగళూరు వేదికగా జరుగనుంది. అనంతరం సౌతాఫ్రికా-భారత్‌లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి. జూన్ 16న తొలి వన్డే, 19న రెండవది, 23న మూడో వన్డే జరుగుతుంది. మూడు మ్యాచ్‌లకు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదిక కానుంది.వన్డే సిరీస్ అనంతరం భారత్-సౌతాఫ్రికాలు ఏకైక టెస్ట్‌లో తలపడతాయి. చెన్నై వేదికగా జూన్ 28 నుంచి జులై 1 ఈ మ్యాచ్ జరుగనుంది. దీని తర్వాత ఇరు జట్లు టీ20 సిరీస్‌లో తలపడతాయి. జులై 5, 7, 9 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. టీ0 సిరీస్ మొత్తానికి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది.వన్డే సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), ఉమా చెత్రి (వికెట్‌కీపర్), దయాళన్ హేమలత, రాధా యాదవ్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ప్రియా పునియాఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), ఉమా చెత్రి (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ *, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియాటీ20 సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, ఉమా చెత్రి (వికెట్‌కీపర్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), జెమిమా రోడ్రిగ్స్ *, సజన సజీవన్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, ఆశా శోభన, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డిస్టాండ్బై: సైకా ఇషాక్ -
ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన ఇంగ్లండ్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన పాక్
3 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కనీసం ఒక్క విజయం కూడా సాధించకుండానే రిక్త హస్తాలతో ఇంటిబాట పట్టింది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన పాక్.. నిన్న జరిగిన మూడో వన్డేతో వన్డే సిరీస్‌ను సైతం 0-2 తేడాతో కోల్పోయింది.మూడో వన్డేలో ఇంగ్లండ్ 178 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 29.1 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసి ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించింది.తొలుత బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో (124 నాటౌట్) చెలరేగిన బ్రంట్.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ రాణించి 2 వికెట్లు తీసింది. బ్రంట్‌తో పాటు బౌచియర్ (34), డేనియెల్ వ్యాట్ (44), అలైస్ క్యాప్సీ (39 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో హనీ 2, డయానా బేగ్, నిదా దార్, ఫాతిమా సనా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఇంగ్లండ్ బౌలర్లు తలో చేయి వేయడంతో పాక్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. సోఫీ ఎక్లెస్టోన్ 3, బ్రంట్, లారెన్ బెల్ చెరో 2, కేట్ క్రాస్, చార్లెట్ డీన్ తలో వికెట్ పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో మునీబా అలీ (47), అలియా రియాజ్ (36), సిద్రా అమీన్ (10), అయేషా జాఫర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఛాంపియన్‌గా శ్రీలంక
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్-2024 పోటీల్లో శ్రీలంక జట్టు విజేతగా అవతరించింది. అబుదాబీలో నిన్న (మే 7) జరిగిన ఫైనల్లో లంక జట్టు స్కాట్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక కెప్టెన్ చమారీ ఆటపట్టు మెరుపు శతకంతో (63 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక చమారీ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో చమారీ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. నీలాక్షి డిసిల్వ 26 నాటౌట్, కవిశ దిల్హరి 15, విశ్మి గుణరత్నే 9, హర్షిత మాధవి 8, హాసిని పెరెరా 0 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో రేచల్ స్లేటర్ 2, ప్రయనాజ్, కేథరీన్ ఫ్రేజర్, అబ్తహా మక్సూద్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉదేషిక ప్రబోధని 3 వికెట్లతో చెలరేగగా.. ఇనోశి ప్రియ, సుగందిక కుమారి, కవిశ దిల్హరి తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో ప్రియనాజ్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యాయి. మహిళల పొట్టి ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. -
వరుసగా నాలుగో టీ20లో టీమిండియా జయకేతనం
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. నిన్న (మే 6) జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 56 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (39), స్మృతి మంధన (22), హేమలత (22), రిచా ఘోష్ (24) రాణించడంతో 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్ అనంతరం మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 125 పరుగులుగా నిర్దారించారు. ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన బంగ్లాదేశ్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా వరుసగా నాలుగో మ్యాచ్‌లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లు దీప్తి శర్మ (3-0-13-2), ఆశా శోభన (3-0-18-2), రాధా యాదవ్ (3-1-12-1), పూజా వస్త్రాకర్ (3-0-15-1) బంగ్లా బ్యాటర్లను వణికించారు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో దిలారా అక్తెర్ (21) టాప్ స్కోరర్‌గా నిలిచింది.నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ మే 9న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఈ సిరీస్ విజయం మాంచి బూస్టప్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-ఏలో.. స్కాట్లాండ్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో కలిసి గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్ రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది. -
ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
స్కాట్లాండ్ మహిళల క్రికెట్ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. నిన్న (మే 5) జరిగిన క్వాలిఫయర్ సెమీస్‌లో స్కాట్లాండ్ ఐర్లాండ్‌ను ఓడించి ప్రపంచకప్ బెర్త్ ఖరారు చేసుకుంది. 2015 నుంచి వరల్డ్‌కప్ బెర్త్ కోసం తపిస్తున్న స్కాట్లాండ్ ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) అనుకున్నది సాధించింది. మరో సెమీస్‌లో యూఏఈని ఓడించిన శ్రీలంక కూడా స్కాట్లాండ్తో పాటు వరల్డ్‌కప్ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ రెండు జట్లు క్వాలిఫయర్ పోటీల నుంచి ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. A special, special group 💜 pic.twitter.com/8BfoqsptAV— Cricket Scotland (@CricketScotland) May 5, 2024 టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-ఏలో.. స్కాట్లాండ్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో కలిసి గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.Flower of Scotland: World Cup Qualification Edition 🤩🏴 pic.twitter.com/zt8Gsm7gr2— Cricket Scotland (@CricketScotland) May 5, 2024 గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్ రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది.స్కాట్లాండ్-ఐర్లాండ్ మ్యాచ్ (తొలి సెమీస్) విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా.. స్కాట్లండ్ 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేథరీన్ బ్రైస్ ఆల్‌రౌండ్ షోతో (4-0-8-4, 35 నాటౌట్) ఇరగదీసి స్కాట్లాండ్ను ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చింది.రెండో సెమీస్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన యూఏఈ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. మే 7న జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌లో స్కాట్లండ్, శ్రీలంక అమీతుమీ తేల్చుకుంటాయి. -
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. మహిళల టీ20ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా బౌలర్ రొహ్మాలియా రొహ్మాలియా పరుగులేమీ ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో (పురుషులు, మహిళలు) ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు నమోదు కాలేదు.పురుషుల క్రికెట్లో (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు స్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) పేరిట ఉండగా.. మహిళల క్రికెట్లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ క్రికెటర్ ఫ్రెడ్రిక్ ఓవర్డిక్ (4-2-3-7) పేరిట ఉండింది. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బౌలర్ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన దాఖలాలు లేవు. రొహ్మాలియా తన కెరీర్లో రెండో టీ20 మ్యాచ్‌లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. బాలీ బాష్‌గా పిలువబడే టోర్నీలో ఇండోనేషియా, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రొహ్మాలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇండోనేషియా ఇన్నింగ్స్‌లో నందా సకారిని (61) అర్దసెంచరీతో రాణించింది. మంగోలియా బౌలర్లలో ఎంక్జుల్ 4 వికెట్లు పడగొట్టింది. View this post on Instagram A post shared by Persatuan Cricket Indonesia (@cricket_ina) 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. రొహ్మాలియా (3.2-3-0-7) ధాటికి 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల మార్కు తాకలేకపోగా.. ఎక్స్‌ట్రాలు టాప్ స్కోర్ (10) కావడం విశేషం. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్లు అయ్యారు. -
బంగ్లాదేశ్ పర్యటనకు భారత టీ20 జట్టు ప్రకటన
ఏప్రిల్ 28 నుంచి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ పర్యటన కోసం భారత మహిళా క్రికెట్ జట్టును నిన్న (ఏప్రిల్ 15) ప్రకటించారు. ఈ పర్యటనలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల జట్టును భారత సెలెక్టర్లు నిన్న వెల్లడించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధన వ్యవహరించనున్నారు. ఈ సిరీస్‌కు స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగెజ్ దూరంగా ఉండనుండగా.. కేరళ అమ్మాయిలు ఆశా శోభన, సజనా సజీవన్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. శోభన 2024 డబ్ల్యూపీఎల్‌లో ఛాంపియన్ ఆర్సీబీ తరఫున సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలువగా.. సజనా గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటింది. బంగ్లా సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో మిన్ను మణి, మన్నత్ కశ్యప్‌కు చోటు దక్కకపోగా.. డి హేమలత, రాధా యాదవ్ చాలాకాలం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా ఆడబోయే అతి పెద్ద టీ20 సిరీస్ ఇదే కావడంతో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. భారత మహిళా క్రికెట్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దయాళన్ హేమలత, సజన సజీవన్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్), రాధా యాదవ్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ , ఆశా శోభనా, రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు భారత్-బంగ్లాదేశ్ టీ20 సిరీస్ వివరాలు.. ఏప్రిల్ 28- తొలి టీ20 (సిల్హెట్) ఏప్రిల్ 30- రెండో టీ20 (సిల్హెట్) మే 2- మూడో టీ20 (సిల్హెట్) మే 6- నాలుగో టీ20 (సిల్హెట్) మే 9- ఐదో టీ20 (సిల్హెట్) -
టీ20 సిరీస్ కూడా ఆస్ట్రేలియాదే.. మరో క్లీన్ స్వీప్
మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆసీస్ మహిళా టీమ్ ఇంటాబయటా అన్న తేడా లేకుండా, ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా ఆసీస్ ఖాతాలో మరో రెండు సిరీస్‌లు చేరాయి. ఆసీస్.. బంగ్లాదేశ్‌ను వారి సొంత దేశంలో మట్టికరిపించి వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా.. తొలుత వన్డే సిరీస్‌ను, తాజాగా టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో ఊడ్చేసింది. టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) జరిగిన మూడో మ్యాచ్‌లో ఆసీస్ 77 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఇదివరకే సిరీస్ కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండ్ షో చేసి గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. హీలీ (45), మెక్‌గ్రాత్ (44 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో నహీద అక్తర్ 3 వికెట్లతో సత్తా చాటింది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తైలా వ్లేమ్నిక్ (3/12), జార్జియా వేర్హమ్ (2/1), సోఫీ మోలినెక్స్ (1/15) ధాటికి 18.1 ఓవర్లలో78 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో నిగార్ సుల్తాన్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ భారీ విజయాలు సాధించింది. దీనికి ముందు జరిగిన వన్డే సిరీస్‌ను సైతం ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. -
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం.. 33 ఏళ్ల వయసులోనే స్టార్ ఆల్‌రౌండర్ మృతి
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. పపువా న్యూ గినియా మహిళా క్రికెటర్ కయా అరువా 33 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. అరువా మృతికి కారణాలు తెలియరాలేదు. అరువా అకాల మరణాన్ని దృవీకరిస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. 2010లో తొలిసారి పపువా న్యూ గినియా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అరువా.. అనతికాలంలోనే స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, రైట్ హ్యాండ్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన అరువా.. పపువా న్యూ గినియా తరఫున 47 అంతర్జాతీయ టీ20లు ఆడి 341 పరుగులు, 59 వికెట్లు తీసింది. బ్యాట్‌తో పెద్దగా రాణించని అరువా.. బంతితో చెలరేగింది. అరువా తన స్వల్ప కెరీర్లో 3 సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించింది. Sad news out of Papua New Guinea following the passing of women's international all-rounder Kaia Arua.https://t.co/xOCFTLzIHV — ICC (@ICC) April 4, 2024 ఆమె అత్యుత్తమ గణాంకాలు (5/7) తన జట్టు తరఫున రెండో అత్యుత్తమ గణాంకాలుగా నమోదై ఉన్నాయి. అరువా కొంతకాలం పాటు తన జట్టు సారథ్య బాధ్యతలు కూడా చేపట్టింది. అరువాకు కెప్టెన్సీలో వంద శాతం సక్సెస్ రేట్ ఉంది. ఆమె తన జట్టును 29 అంతర్జాతీయ టీ20ల్లో ముందుండి నడిపించి అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సొంతం చేసుకుంది. అరువా తన దేశంలో మహిళల క్రికెట్ అభివృద్దికి ఎంతో కృషి చేసింది. తూర్పు ఆసియా పసిఫిక్ మహిళల క్రికెట్లో అరువాకు తిరుగులేని ఆల్‌రౌండర్‌గా పేరుంది. -
హ్యాట్రిక్‌తో చెలరేగిన బంగ్లాదేశ్ బౌలర్.. కెరీర్లో రెండోది
మహిళల క్రికెట్లో ఇవాళ (ఏప్రిల్ 2) బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు టీ20 మ్యాచ్ ఆడుతున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్ ఫరిహా త్రిస్న హ్యాట్రిక్‌తో చెలరేగింది. త్రిస్నకు టీ20ల్లో ఇది రెండో హ్యాట్రిక్. 2022లో త్రిస్న తన టీ20లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టింది. త్రిస్న దెబ్బకు నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతులకు త్రిస్న.. ఎల్లిస్ పెర్రీ, మోలినెక్స్, బెత్ మూనీలను ఔట్ చేసింది. తన కోటా నాలుగు ఓవర్లు వేసిన త్రిస్న.. 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. HAT-TRICK for Fariha Trisna in T20i against Australia women#BCB #Cricket #BANWvAUSW #LiveCrcket #HomeSeries #T20Iseries #womenscricket pic.twitter.com/I00NUVXNg3 — Bangladesh Cricket (@BCBtigers) April 2, 2024 బంగ్లా బౌలర్లలో త్రిస్నతో పాటు నహీద అక్తర్ (4-0-21-2), ఫహీమా ఖాతూన్ (4-0-34-2) కూడా వికెట్లు పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వేర్హమ్ (57), గ్రేస్ హ్యరీస్ (47) మాత్రమే రాణించారు. ఆఖర్లో పెర్రీ (29) వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేయగా.. తహిల మెక్‌గ్రాత్ (19) రెండంకెల స్కోర్ చేయగలిగింది. మిగతా ప్లేయర్స్ అంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమతమయ్యారు. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 9.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్, మోలినెక్స్ తలో వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్‌ను కష్టాల్లోకి నెట్టారు. ముర్షిదా ఖాతూన్ (8), శోభన మోస్తరీ (5), నిగార్ సుల్తాన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. దిలారా అక్తర్ (27), ఫహీమా ఖాతూన్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 65 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతుంది. -
బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఖాతాలో మరో సిరీస్ చేరింది. ఇటీవలే న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన ఆసీస్.. తాజాగా బంగ్లాదేశ్‌ను సైతం వారి స్వదేశంలో మట్టికరిపించింది. ఐసీసీ వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించింది. తొలి వన్డేలో 118 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. A historic victory for Australian women, they secured a 3-0 win over Bangladesh in their inaugural ODI bilateral series. pic.twitter.com/hvsjzemRWf — CricTracker (@Cricketracker) March 27, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. ఢాకాలో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 26.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. కిమ్ గార్త్, ఆష్లే గార్డ్నర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఎల్లిస్ పెర్రీ, మోలినెక్స్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నిగర్ సుల్తానా (16), షోర్ణా అక్తర్ (10), సుల్తానా ఖాతూన్ (10), మరుఫా అక్తర్ (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అలైసా హీలీ 33, లఫోబ్ లిచఫీల్డ్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. ఎల్లిస్ పెర్రీ 27, బెత్ మూనీ 21 పరుగులతో అజేయంగా నిలిచి ఆసీస్‌ను గెలిపించారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్, రబెయా ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
118 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఢాకా వేదికగా బంగ్లాదేశ్ మహిళా జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల టీమ్ 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 36 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. అలానా కింగ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఆసీస్ గెలుపులో ప్రధానపాత్ర పోషించింది. రాణించిన సదర్‌ల్యాండ్.. విరుచుకుపడిన అలానా 146 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 200 పరుగుల మార్కును కూడా దాటలేదనుకున్న ఆస్ట్రేలియాను సదర్‌ల్యాండ్ (76 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు), అలానా కింగ్ (31 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకున్నారు. ఆఖర్లో అలానా కింగ్ బంగ్లా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. ఫలితంగా ఆసీస్ 200 పరుగుల మార్కును దాటింది. సదర్‌ల్యాండ్, అలానాతో పాటు ఆసీస్ ఇన్నింగ్స్‌లో హీలీ (24), మూనీ (25), గార్డ్నర్ (32), వేర్హమ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్, నహిద అక్తెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తెర్, ఫహీమా ఖాతూన్, షోర్ణా అక్తెర్ తలో వికెట్ పడగొట్టారు. గార్డ్నర్, కింగ్ మాయాజాలం.. కుప్పకూలిన బంగ్లాదేశ్ 214 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. గార్డ్నర్ (5-1-22-3), కిమ్ గార్త్ (7-1-26-2), అలానా కింగ్ (10-3-12-1), మెగాన్ షట్ (6-1-5-1) ధాటికి 95 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో సోభన (17), ముర్షిదా ఖాతూన్ (10), నిగర్ సుల్తాన్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 24న జరుగనుంది. -
16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జవేరియా ఖాన్ 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 35 ఏళ్ల జవేరియా ఖాన్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఇవాళ (మార్చి 21) ప్రకటించింది. జవేరియా 2008-2023 మధ్యలో 116 వన్డేలు, 112 టీ20లు ఆడింది. ఈమె వన్డేల్లో 2 శతకాలు, 15 అర్దశతకాల సాయంతో 2885 పరుగులు.. టీ20ల్లో 10 అర్దశతకాల సాయంతో 2018 పరుగులు చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన జవేరియా.. వన్డేల్లో 17, టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టింది. తన కెరీర్లో ఫీల్డర్‌గానూ చురుకైన పాత్ర పోషించిన జవేరియా వన్డేల్లో 34 క్యాచ్‌లు, 13 రనౌట్లు.. టీ20ల్లో 16 క్యాచ్‌లు, 10 రనౌట్లు చేసింది. 17 వన్డేలు, 16 టీ20ల్లో పాక్ జాతీయ జట్టుకు సారధ్యం వహించిన జవేరియా .. ప్రస్తుత పాక్ కెప్టెన్ బిస్మా మారూఫ్‌కు డిప్యూటీగానూ (వైస్ కెప్టెన్) వ్యవహరించింది. -
సత్తా చాటిన హీథర్ నైట్.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 19) జరిగిన తొలి మ్యాచ్‌లో స్థానిక మహిళా టీమ్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సత్తా చాటిన హీథర్ నైట్.. హీథర్ నైట్ మెరుపు అర్దశతకంతో (39 బంతుల్లో 63; 8 ఫోర్లు,సిక్స్) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. నైట్‌కు జతగా మైయా బౌచియర్ (43 నాటౌట్), డంక్లీ (32) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్, ఫ్రాన్ జోనాస్, లియా తుహుహు తలో వికెట్ పడగొట్టారు. తడబడిన న్యూజిలాండ్.. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. వేగంగా పరుగులు సాధించలేక లక్ష్యానికి 28 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సుజీ బేట్స్ (65) అర్దశతకంతో రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన వారు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. బ్రూక్ హల్లీడే 27 నాటౌట్, జార్జియా ప్లిమ్మర్ 21 పరుగులు చేయగా.. మ్యాడీ గ్రీన్ 8, జెస్ కెర్ 8 నాటౌట్, ఇసబెల్లా గేజ్, మికేలా గ్రేగ్ డకౌట్లయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు పడగొట్టగా.. సారా గ్లెన్ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 మార్చి 22న జరుగనుంది. -
గుజరాత్ జెయింట్స్‌కు ఎదురుదెబ్బ
మహిళల ఐపీఎల్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఆ జట్టు బ్యాటర్ హర్లీన్ డియోల్ మిగితా డబ్యూపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైంది. హర్లీన్ స్థానాన్ని మరో టీమిండియా బ్యాటర్ భారతి ఫుల్మలితో భర్తీ చేస్తున్నట్లు గుజరాత్ మేనేజ్మెంట్ ప్రకటించింది. గాయంతో బాధపడుతూనే ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన హర్లీన్.. వరుసగా 8, 22, 18 స్కోర్లు చేసింది. టీమిండియా తరఫున 10 వన్డేలు, 24 టీ20లు ఆడిన ఈ చంఢీఘడ్ అమ్మాయి.. రెండు ఫార్మాట్లలో కలిపి 3 అర్దసెంచరీల సాయంతో 458 పరుగులు చేసింది. హర్లీన్ స్థానంలో ఎంపికైన భారతి టీమిండియా తరఫున 2 టీ20లు ఆడి 23 పరుగులు చేసింది. దేశవాలీ టోర్నీల్లో విదర్భకు ఆడే భారతి.. మహిళల టీ20 లీగ్‌లో ట్రైల్‌బ్లేజర్స్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత డబ్యూపీఎల్ సీజన్లో గుజరాత్ జెయింట్స్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది. ముంబై, ఆర్సీబీ, యూపీ, ఢిల్లీ జట్ల చేతిలో ఓడిన ఈ జట్టు మార్చి 6న మరోసారి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. గుజరాత్ రేపు జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. -
క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా) సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్ మూడో ఓవర్లో షబ్నిమ్ మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని సంధించింది. ఈ ఓవర్ రెండో బంతిని షబ్నిమ్ 132.1 కిమీ వేగంతో సంధించింది. మహిళల క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లోనైనా ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. షబ్నిమ్ రికార్డును ఆమెనే బ్రేక్ చేసుకుంది. Mumbai Indians fast bowler Shabnim Ismail bowled the Fastest Delivery by a Women's Cricket - 132.1 KMPH 👏 #MIvDC #WPL2024 #DCvMI pic.twitter.com/srOZimZ0HQ — Richard Kettleborough (@RichKettle07) March 5, 2024 2016లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షబ్నిమ్ 128 కిమీ వేగంతో బంతిని సంధించింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు మహిళల క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీగా ఉండింది. 2022 వన్డే వరల్డ్‌కప్‌లో షబ్నిమ్ రెండు సార్లు 127 కిమీ వేగంతో బంతులను సంధించింది. తాజాగా తన పేరిట ఉండిన రికార్డును షబ్నిమ్ తనే బ్రేక్ చేసుకుంది. మహిళల క్రికెట్లో 130 కిమీలకు పైగా వేగంతో నమోదైన బంతి ఇదే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే, షబ్నిమ్ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో చెలరేగినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై 168 పరుగులకే పరిమితమై 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో షబ్నిమ్ 4 ఓవర్లలో 46 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టింది. -
రెచ్చిపోయిన రోడ్రిగెజ్.. విరుచుకుపడిన లాన్నింగ్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తొలుత ఓపెనర్లు షఫాలీ వర్మ (12 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (38 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు షాట్లతో విరుచుకుపడగా.. ఆతర్వాత బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగెజ్ (33 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ ఆవలికి తరలించింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అలైస్ క్యాప్సీ (20 బంతుల్లో 19; 3 ఫోర్లు), మారిజన్ కప్ (12 బంతుల్లో 11; ఫోర్) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. జెస్ జొనాస్సెన్ 5 బంతుల్లో 4 పరుగులతో అజేయంగా నిలిచింది. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, పూజా వస్త్రాకర్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. -
అభిమాని నుంచి పెళ్లి ప్రపోజల్ అందుకున్న ఆర్సీబీ ప్లేయర్
మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 27) మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆర్సీబీ ప్లేయర్, టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి "Will You Marry Me Shreyanka" (నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయాంక) అని రాసి ఉన్న ప్లకార్డ్‌ను ప్రదర్శించాడు. ఆ ప్లకార్డ్‌పై హార్ట్ సింబల్‌తో పాటు అతని పేరు కన్నడలో రాసి ఉంది. ఈ సీన్ లైవ్‌లోకి రాగానే డగౌట్లో ఉన్న ఆర్సీబీ ప్లేయర్లు నవ్వుకున్నారు. క్రీడా ప్రాంగణాల్లో ఇలా జరగడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో క్రీడాకారులు ఇలాంటి ప్రపోజల్స్ అందుకున్నారు. గతంలో మాజీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ అందుకున్న పెళ్లి ప్రపోజల్ బాగా హైలైట్ అయ్యింది. Marriage proposal for Shreyanka Patil and RCB’s players laughing in the dressing room. pic.twitter.com/yoY4e5zfxK — CricketMAN2 (@ImTanujSingh) February 27, 2024 బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల శ్రేయాంక (రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్) ఆర్సీబీతో పాటు కర్ణాటక, టీమిండియా, గయానా అమెజాన్ వారియర్స్‌కు (కరీబియన్ ప్రీమియర్ లీగ్) ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ అమ్మాయి టీమిండియా తరఫున 2 వన్డేలు (4 వికెట్లు), 6 టీ20లు (8 వికెట్లు) ఆడింది. కాగా, గుజరాత్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేయగా.. ఆర్సీబీ కేవలం 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రేణుకా సింగ్ (4-0-14-2), మోలినెక్స్ (4-0-25-3), స్మృతి మంధన (43), సబ్బినేని మేఘన (36 నాటౌట్), ఎల్లిస్ పెర్రీ (23 నాటౌట్) ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు. -
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. తేలిపోయిన గుజరాత్ బ్యాటర్లు
మహిళల ఐపీఎల్ (WPL) 2024 ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. గుజరాత్ జెయింట్స్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. ఆర్సీబీ బౌలర్లు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ (4-0-14-2), సోఫీ మోలినెక్స్ (4-0-25-3), జార్జియా వేర్హమ్ (3-0-20-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీశారు. వికెట్లు తీయలేకపోయినా సోఫీ డివైన్ (4-0-12-0), ఆశా శోభన (3-0-13-0) పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో దయాలన్ హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), స్నేహ్ రాణా (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బెత్ మూనీ (8), లిచ్‌ఫీల్డ్ (5), వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7), కేథరీన్ బ్రైస్ (3) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లుకు ఇది రెండో మ్యాచ్. తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ.. యూపీ వారియర్జ్‌ను ఓడించి బోణీ కొట్టగా.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన గుజరాత్ బోణీ విజయం కోసం ఎదురు చూస్తుంది. ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ, ఆర్సీబీ, గుజరాత్, యూపీ వరస స్థానాల్లో ఉన్నాయి. -
అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహిళల ఐపీఎల్.. సందడి చేసిన షారుక్ ఖాన్
మహిళల ఐపీఎల్ (WPL) 2024 సీజన్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 23) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ టాప్ స్టార్స్ షారుక్ ఖాన్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్ర, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్ సందడి చేశారు. SOUND ON 😍 𝙎𝙝𝙖𝙝 𝙍𝙪𝙠𝙝 𝙆𝙝𝙖𝙣 👑 showcases his aura at the #TATAWPL Opening Ceremony 🤩🤩@iamsrk pic.twitter.com/WLjSmCxVXL — Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024 వీరిలో షారుక్ ఖాన్ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. షారుక్ ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్లతో కలియదిరుగుతూ వారితో స్పెప్పులు వేయించి ఫోటోలకు పోజులిచ్చాడు. Bengaluru erupts with joy to welcome Shahid Kapoor to the #TATAWPL Opening Ceremony 😃🙌@shahidkapoor pic.twitter.com/C2LckHvV2D — Women's Premier League (WPL) (@wplt20) February 23, 2024 మిగతా హీరోలు ఒక్కో ఫ్రాంచైజీ తరఫున ఆడి, పాడారు. కార్తీక్ ఆర్యన్ గుజరాత్ జెయింట్స్‌ను, సిద్ధార్థ్ మల్హోత్రా ఢిల్లీ క్యాపిటల్స్‌ను, టైగర్ ష్రాఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును, వరుణ్ ధావన్ యూపీ వారియర్స్‌ను, షాహిద్ కపూర్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను రిప్రజెంట్ చేశాడు. ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలైస్ క్యాప్సీ (ఇంగ్లండ్) 75 పరుగులు చేసి క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మెగ్ లాన్నింగ్ 31, షఫాలీ వర్మ 1, జెమీమా రోడ్రిగెజ్ 42, మారిజన్ కప్ 16 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ర్, నాట్ సీవర్ బ్రంట్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. షబ్నిమ్ ఇస్మాయిల్ ఓ వికెట్ దక్కించుకుంది. -
ఆసీస్ క్రికెటర్ అద్భుత ప్రదర్శన.. బంతితో రాణించి, బ్యాట్‌తో డబుల్ సెంచరీ
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తొలుత బంతితో రాణించిన (3/19) అన్నాబెల్.. ఆతర్వాత బ్యాట్‌తో విశ్వరూపం ప్రదర్శించింది. ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేవలం 248 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి ఔరా అనిపించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 256 బంతులు ఎదుర్కొన్న అన్నాబెల్ 210 పరుగులు చేసి ఔటైంది. ఆన్నాబెల్.. టెయిలెండర్లు ఆష్లే గార్డ్నర్ (65), కిమ్ గార్త్ (49 నాటౌట్), సోఫీ మోలినెక్స్ (33) సహకారంతో డబుల్ సెంచరీ పూర్తి చేసింది. అంతకుముందు కెప్టెన్ అలైసా హీలీ (99), బెత్ మూనీ (78) కూడా రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 575 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లాస్, టైరాన్ తలో 3 వికెట్లు, డి క్లెర్క్ 2, టక్కర్ ఓ వికెట్ పడగొట్టారు. దీనికి ముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే ఆలౌటైంది. డార్సీ బ్రౌన్ (5/25), అన్నాబెల్ (3/19), తహిళ మెక్‌గ్రాత్ (2/4) సౌతాఫ్రికాను కుప్పకూల్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో సూన్ లస్ (26), పదో నంబర్ ప్లేయర్ క్లాస్ ఝ(10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇది రెండో రోజు మాత్రమే. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం ఆసీస్ 499 పరుగుల ఆధిక్యంలో ఉంది. సౌతాఫ్రికా మహిళా జట్టుకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్. -
ఎట్టకేలకు గెలిచిన సౌతాఫ్రికా.. 17వ ప్రయత్నంలో విజయం
మహిళల క్రికెట్లో తమపై ఆస్ట్రేలియా ఆథిపత్యానికి సౌతాఫ్రికా చెక్ పెట్టింది. వన్డేల్లో వరుసగా 16 మ్యాచ్‌ల్లో విజయం ఎరుగని ప్రొటీస్ జట్టు.. ఎట్టకేలకు 17వ ప్రయత్నంలో (ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 16 వన్డేల్లో ఓ మ్యాచ్ టై కాగా మిగతా మ్యాచ్‌లన్నీ ఆస్ట్రేలియానే గెలిచింది) విజయం సాధించగలిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 80 పరుగుల తేడాతో గెలుపొందింది. 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. మారిజెన్ కప్ (75) అర్ధసెంచరీతో రాణించగా.. అన్నెక్ బోష్ (44), క్లో టైరాన్ (37 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్ తలో రెండు వికెట్లు సాధించగా.. సదర్‌ల్యాండ్, కిమ్ గార్త్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. సఫారీ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 29.3 ఓవరల్లో 149 పరుగులకే చాపచుట్టేసింది. మారిజెన్ కెప్ 3, అయాండా హ్లుబీ, ఎలిజ్ మారి మార్క్స్, డి క్లెర్క్ తలో 2 వికెట్లు, క్లో టైరాన్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో పదో నంబర్ ప్లేయర్ కిమ్ గార్త్ (42 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. గార్త్.. గార్డ్నర్ (35) సాయంతో ఈ ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఆసీస్ మరింత దారుణంగా ఓడేది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆసీస్ గెలువగా.. రెండో దాంట్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 10న సిడ్నీలోనే జరుగనుంది. -
గుజరాత్ జెయింట్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు (రెండవది) ముందు గుజరాత్ జెయింట్స్ కొత్త హెడ్ కోచ్‌ను నియమించుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ క్లింగర్ గుజరాత్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. మాజీ హెడ్ కోచ్ రేచల్ హేన్స్ స్థానాన్ని క్లింగర్ భర్తీ చేస్తాడు. క్లింగర్ ఎంపిక విషయాన్ని గుజరాత్ జెయింట్స్ మేనేజ్మెంట్ ఇవాళ (ఫిబ్రవరి 6) అధికారికంగా ప్రకటించింది. తొలి సీజన్ నుంచి జెయింట్స్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న క్లింగర్ .. మెంటార్ మిథాలీ రాజ్, బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్‌తో ఇదివరకే జాయిన్ అయినట్లు జెయింట్స్ మేనేజ్మెంట్ తెలిపింది. క్లింగర్.. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ అసిస్టెంట్ కోచ్‌గా, అదే సిడ్నీ థండర్స్ రిక్రూటర్‌గా, 2019-2021 వరకు మెల్బోర్న్ రెనెగేడ్స్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు. 43 ఏళ్ల క్లింగర్ 2019లో బిగ్‌బాష్ లీగ్‌కు రిటైర్మెంట్ (ఆటగాడిగా) పలికాడు. నాటికి క్లింగర్ బీబీఎల్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. Coach saheb padharya! 🤩 We are delighted to welcome former Australian cricketer @maxyklinger as our head coach for the upcoming WPL season. 🙌🧡#BringItOn #GujaratGiants #Adani pic.twitter.com/iJjqnSUo9K — Gujarat Giants (@Giant_Cricket) February 6, 2024 ఇదిలా ఉంటే, మహిళల ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో (2023) గుజరాత్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో ఈ జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి లీగ్ నుంచి నిష్క్రమించింది. గత సీజన్ పేలవ ప్రదర్శన కారణంగా మాజీ హెడ్ కోచ్ రేచల్ హేన్స్పై వేటు పడింది. గతేడాది ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ముంబై టీమ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి, తొలి WPL టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 2024 సీజన్ విషయానికొస్తే.. ఈ సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలవుతుంది. ఈ సీజన్లో మ్యాచ్‌లన్నీ బెంగళూరు, న్యూఢిల్లీ వేదికలుగా జరుగనున్నాయి. తొలి మ్యాచ్ గతేడాది ఫైనలిస్ట్‌ల మధ్య బెంగళూరులో జరుగనుంది. గుజారత్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 25న ముంబై ఇండియన్స్‌తో ఆడుతుంది. జెయింట్స్‌లో త్రిష పూజిత, హర్లీన్ డియోల్, వేద కృష్ణమూర్తి, మేఘన సింగ్, మన్నత్ కశ్యప్, స్నేహ్ రాణా లాంటి భారతీయ స్టార్లు ఉన్నారు. -
వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించిన నలుగురు క్రికెటర్లు
వెస్టిండీస్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆఫ్ స్పిన్నర్ అనిసా మొహమ్మద్, మీడియం పేసర్ షకీరా సెల్మన్, కవలలైన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కైసియ నైట్, మిడిలార్డర్ బ్యాటర్ కైషోనా నైట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురు విండీస్ టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లోని (2016) సభ్యులు. అనుభవజ్ఞులైన ఈ నలుగురు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో విండీస్ మహిళల క్రికెట్ జట్టు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఈ నలుగురు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు దృవీకరించింది. WI Women's cricketers Anisa Mohammed, Shakera Selman, Kycia Knight and Kyshona Knight have confirmed their retirement from International cricket. Read More⬇️ https://t.co/bV88ZNxITw — Windies Cricket (@windiescricket) January 18, 2024 35 ఏళ్ల అనిసా మొహమ్మద్ (ఆఫ్ స్పిన్నర్) 2003-22 మధ్యలో విండీస్ తరఫున 141 వన్డేలు, 117 టీ20లు ఆడి 305 వికెట్లు పడగొట్టింది. ఇందులో తొమ్మిది ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. 34 ఏళ్ల షకీరా సెల్మన్ (మీడియం పేసర్) 2008-22 మధ్యలో విండీస్ తరఫున 100 వన్డేలు, 96 టీ20లు ఆడి 133 వికెట్లు తీసి,310 పరుగులు చేసింది. షకీరా వన్డేల్లో ఓసారి ఐదు వికెట్ల ఘనత నమోదు చేసింది. 31 ఏళ్ల కైషోనా నైట్ (లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్) 2013-22 మధ్యలో విండీస్ తరఫున 51 వన్డేలు, 55 టీ20లు ఆడి ఓ హాఫ్ సెంచరీ సాయంతో 1397 పరుగులు చేసి, ఓ వికెట్ తీసింది. 31 ఏళ్ల కైసియ నైట్ (వికెట్‌కీపర్ బ్యాటర్) 2011-22 మధ్యలో 87 వన్డేలు, 70 టీ20లు ఆడి నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 2128 పరుగులు చేసి 78 మందిని ఔట్ చేయడంలో భాగమైంది. -
IND W vs AUS W 3rd T20: సిరీస్ ఎవరిదో?
నవీ ముంబై: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్, ఆ్రస్టేలియా మహిళా జట్లు చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పుడు సిరీస్‌ను గెలుచుకునేందుకు ఫైనల్ లాంటి పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన భారత అమ్మాయిలు ఇప్పుడు టి20 సిరీస్‌ను కోల్పోడానికి సిద్ధంగా లేరు. ఆఖరి పోరులో ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం బరిలోకి దిగుతోంది. తద్వారా కొత్త ఏడాదిలో క్లీన్‌స్వీప్ పరాభవాన్ని మరిచేలా ఈ టి20 సిరీస్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నెగ్గినట్లే ఈ ఆఖరి పోరులోనూ దాన్ని పునరావృతం చేస్తే సిరీస్ కష్టం కానేకాదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమాలు రాణిస్తే తొలి మ్యాచ్‌ను గెలుచుకున్నంత సులభంగా సిరీస్‌నూ గెలుచుకోవచ్చు. గత మ్యాచ్‌లో వీరి వైఫల్యమే జట్టును దెబ్బ తీసింది. దీంతో పాటు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ వరుస వైఫల్యాలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. ఈ నలుగురు కీలకమైన చివరి మ్యాచ్‌లో రాణిస్తే మాత్రం మన మహిళా జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్ నిలకడగా రాణిస్తున్నారు. ఆసీస్‌తో పోల్చుకుంటే భారత ఫీల్డింగ్ సాధారణంగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్కు ఫీల్డింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముంది. మరోవైపు ఏకైక టెస్టు మ్యాచ్ ఓడాక అలీసా హీలీ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు దెబ్బతిన్న పులిలా వన్డేల్లో పంజా విసిరింది. తాజా టి20 సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినా... రెండో మ్యాచ్‌లో బదులు తీర్చుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో భారత గడ్డపై రెండో సిరీస్ విజయంపై కన్నేసింది. -
ఆసీస్‌తో రెండో టీ20.. టీమిండియా ఆల్‌రౌండర్ అరుదైన రికార్డు
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది. పొట్టి ఫార్మాట్లో 1000 పరుగులతో పాటు 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా దీప్తికి ముందు ఈ ఘనతను మరో ముగ్గురు మహిళా క్రికెటర్లు సాధించారు. పాకిస్తాన్‌కు చెందిన నిదా దార్ (1839 పరుగులు, 130 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ పెర్రీ (1750 పరుగులు, 123 వికెట్లు), న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్ (3107 పరుగులు, 113 వికెట్లు) టీ20ల్లో అరుదైన డబుల్‌ను సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ (30) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తితో పాటు రిచా ఘోష్ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో జార్జీయా వేర్హమ్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, కిమ్ గార్త్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్నర్ ఓ వికెట్ దక్కించుకుంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అలైసా హీలీ 26, బెత్ మూనీ 20, తహిల మెక్‌గ్రాత్ 19, ఎల్లిస్ పెర్రీ 34 నాటౌట్, ఆష్లే గార్డ్నర్ 7, లిచ్‌ఫీల్డ్ 18 నాటౌట్ తలో చేయి వేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. బ్యాట్‌తో రాణించిన దీప్తి బంతితోనూ సత్తా చాటింది. 4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్ నెగ్గగా.. ఆసీస్ రెండో టీ20 గెలిచింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ జనవరి 9న జరుగనుంది. -
ఆసీస్‌తో రెండో టీ20.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
నవీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా నామామత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రిచా ఘోష్ (23), స్మృతి మంధన (23), జెమీమా రోడ్రిగెజ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. షెఫాలీ వర్మ (1), హార్మన్‌ప్రీత్ కౌర్ (6), పూజా వస్త్రాకర్ (9), అమన్‌జోత్ కౌర్ (4) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జార్జీయా వేర్హమ్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, కిమ్ గార్త్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లే గార్డ్నర్ ఓ వికెట్ దక్కించుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి టీ20లో విజయం సాధించింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయగా.. ఏకైక టెస్ట్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీకి ఈ మ్యాచ్ 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. -
INDW VS AUSW, 3rd ODI: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్.. సిరీస్ క్లీన్ స్వీప్
వాంఖడే వేదికగా టీమిండియాతో ఇవాళ (జనవరి 2) జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నామమాత్రంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిచ్‌ఫీల్డ్‌కు మరో ఓపెనర్ అలైసా హీలీ (82) కూడా సత్తా చాటింది. ఆఖర్లో ఆష్లే గార్డ్నర్ (30), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (23), అలానా కింగ్ (26 నాటౌట్), జార్జియా వేర్హమ్ (11 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లతో రాణించగా.. అమన్‌జోత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. జార్జియా వేర్హమ్ (3/23), మెగాన్ షట్ (2/23), అలానా కింగ్ (2/21), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (2/9) ధాటికి 32.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో స్మృతి మంధన (29), రిచా ఘోష్ (19), జెమీమా రోడ్రిగెజ్ (25), దీప్తి శర్మ (25 నాటౌట్), పూజా వస్త్రాకర్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, ప్రస్తుత భారత పర్యటనలో ఆసీస్ తదుపరి టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 5, 7, 9 తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ నవీ ముంబై వేదికగా జరుగనున్నాయి. వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్.. ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. -
ఆసీస్‌తో మూడో వన్డే.. టీమిండియా బౌలర్ అరుదైన ఘనత
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఇవాళ (జనవరి 2) జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో కీలకమైన లిచ్‌ఫీల్డ్ వికెట్ తీసిన దీప్తి.. మహిళల వన్డేల్లో 100 వికెట్లు (86వ మ్యాచ్‌లో) తీసిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. గతంలో జులన్ గోస్వామి (255 వికెట్లు), నీతూ డేవిడ్ (97 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు), అల్ ఖదిర్ (78 మ్యాచ్‌ల్లో 100) భారత్ తరఫున వన్డేల్లో 100 వికెట్ల మార్కును తాకారు. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు టీమిండియా మాజీ పేసర్ జులన్ గోస్వామి పేరిట ఉంది. గోస్వామి 204 వన్డేల్లో 255 వికెట్లు తీసి ఈ విభాగంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. వన్డే క్రికెట్లో 200కుపైగా వికెట్లు తీసిన ఏకైక బౌలర్ కూడా గోస్వామినే కావడం విశేషం. ఇదిలా ఉంటే, నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో (ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ ఇదివరకే కైవసం చేసుకుంది) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. లిచ్‌ఫీల్డ్‌కు మరో ఓపెనర్ అలైసా హీలీ (82) కూడా తోడవ్వడంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో ఆష్లే గార్డ్నర్ (30), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (23), అలానా కింగ్ (26 నాటౌట్), జార్జియా వేర్హమ్ (11 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లతో రాణించగా.. అమన్‌జోత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 9 ఓవర్లలో 43 పరుగులు మాత్రమే చేసి ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యస్తికా భాటియా 6, స్మృతి మంధన 29 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ రెండు వికెట్లు మెగాన్ షట్కే దక్కాయి. హర్మన్ప్రీతికౌర్, రిచా ఘోష్ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
టీమిండియాతో మూడో వన్డే.. భారీ స్కోర్ సాధించిన ఆసీస్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ (జనవరి 2) జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. లిచ్‌ఫీల్డ్‌కు మరో ఓపెనర్ అలైసా హీలీ (82) కూడా తోడవ్వడంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో ఆష్లే గార్డ్నర్ (30), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (23), అలానా కింగ్ (26 నాటౌట్), జార్జియా వేర్హమ్ (11 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లతో రాణించగా.. అమన్‌జోత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ వికెట్ పడగొట్టారు. కాగా, తొలి రెండు వన్డేల్లో గెలుపొందిన ఆసీస్ ఇదివరకే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ముందు జరిగిన ఏకైక టెస్ట్‌లో మాత్రం టీమిండియా ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వన్డే సిరీస్ ఆనంతరం జనవరి 5, 7, 9 తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ నవీ ముంబై వేదికగా జరుగనున్నాయి. -
రిచా ఘోష్ వీరోచిత పోరాటం వృధా.. రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా యువ బ్యాటర్ రిచా ఘోష్ వీరోచిత పోరాటం (117 బంతుల్లో 96; 13 ఫోర్లు) వృధా అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. రిచా ఘోష్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో రాణించినప్పటికీ ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తద్వారా భారత్ సిరీస్‌ను సైతం 0-2తో కోల్పోయింది. రిచాకు జెమీమా రోడ్రిగెజ్ (44), స్మృతి మంధన (34) సహకరించినప్పటికీ.. ఆఖర్లో భారత బ్యాటర్లు ఒక్కో పరుగు చేసేందుకు కూడా ఇబ్బంది పడి వికెట్లు సమర్పించుకున్నారు. దీప్తి శర్మ (24 నాటౌట్) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేసింది. భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది (255/8). గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలు కావడంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సదర్‌ల్యాండ్ (3/47), వేర్హమ్ (2/39) టీమిండియాను దెబ్బకొట్టారు. అంతకుముందు దీప్తి శర్మ (10-0-38-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో టీమిండియా.. ఆసీస్‌ను 258 పరుగులకు (8 వికెట్ల నస్టానికి) పరిమితం చేయగలిగింది. దీప్తితో పాటు పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ (63), ఎల్లైస్ పెర్రీ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. తహిళ మెక్‌గ్రాత్ (24), సదర్‌ల్యాండ్ (23), జార్జ్ వేర్హమ్ (22), అలానా కింగ్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇదే సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ఆసీస్‌పై రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దీప్తి శర్మ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆసీస్‌పై వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. -
INDW VS AUSW 2nd ODI: ఆసీస్ వెన్ను విరిచిన దీప్తి శర్మ
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో (మహిళల జట్టు) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేయగా.. దీప్తి శర్మ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ వెన్ను విరిచింది. తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన దీప్తి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది. దీప్తితో పాటు పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో వస్త్రాకర్ 18 పరుగులు సమర్పించుకోవడంతో ఆసీస్ 250 పరుగుల మార్కును దాటగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ (63), ఎల్లైస్ పెర్రీ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. తహిళ మెక్‌గ్రాత్ (24), సదర్‌ల్యాండ్ (23), జార్జ్ వేర్హమ్ (22), అలానా కింగ్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇదే సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ఆసీస్‌పై రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దీప్తి శర్మ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆసీస్‌పై వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. -
ఆసీస్‌తో ఏకైక టెస్ట్.. టీమిండియా డామినేషన్
స్వదేశంలో (ముంబై) ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు భారత మహిళా జట్టు డామినేషన్ నడించింది. తొలుత బౌలింగ్‌లో ఆసీస్‌ను చుక్కలు చూపించిన టీమిండియా బౌలర్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ ప్రతాపం చూపించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్లు పూజా వస్త్రాకర్ (4/53), స్నేహ్ రాణా (3/56), దీప్తి శర్మ (2/45) ధాటికి 77.4 ఓవర్లలో 219 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో తహిల మెక్‌గ్రాత్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. బెత్ మూనీ (40), అలైసా హీలీ (38), కిమ్ గార్త్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 40 పరుగులు చేసి ఔట్ కాగా.. స్మృతి మంధన (43), స్నేహ్ రాణా (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు టీమిండియా ఇంకా 121 పరుగులు వెనుకపడి ఉంది. షఫాలీ వర్మ వికెట్ జెస్ జొనాస్సెన్‌కు దక్కింది. ఆసీస్.. ప్రస్తుత భారత పర్యటనలో ఈ టెస్ట్ అయిపోయాక 3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ 347 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అంతకుముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మాత్రం ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలుచుకుంది. -
36 బంతుల్లోనే శతకం.. 11 సిక్సర్లు, 5 ఫోర్లు
యూరోపియన్ మహిళల టీ10 లీగ్ 2023లో సంచలనం నమోదైంది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ ఐరిస్ జ్విల్లింగ్ 36 బంతుల్లోనే శతక్కొట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో జ్విల్లింగ్ 11 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగుల భారీ స్కోర్ చేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో జ్విల్లింగ్ ఒక్కరే మూడొంతుల పరుగులు చేయడం విశేషం. మహిళల క్రికెట్ టీ10 ఫార్మాట్లో తొలి సెంచరీ చేసిన క్రికెటర్ జ్విల్లింగే కావడం మరో విశేషం. ఈ మ్యాచ్‌లో జ్విల్లింగ్ ధాటికి ఇద్దరు బౌలర్లు ఓవర్‌కు 23 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రియా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి, 100 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నెదర్లాండ్స్ బౌలర్లలో డి లాంజ్, రాబిన్ రిజ్కే, హన్నా తలో 2 వికెట్లు పడగొట్టగా.. కార్లిన్ వాన్ ఓ వికెట్ దక్కించుకుంది. ఆస్ట్రియా ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మల్లిక మహదేవ 30 పరుగులు చేసింది. ఆస్ట్రియా ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లు అయ్యారు. -
చెలరేగిన టీమిండియా బౌలర్.. 136 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
నవీ ముంబై వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత మహిళా జట్టు పట్టు బిగించింది. బ్యాటర్లంతా తలో చేయి వేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. అనంతరం ప్రత్యర్ధిని 138 పరుగులకే ఆలౌట్ చేసి 292 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందింది. దీప్తి శర్మ టెస్ట్‌ల్లో అత్యుత్తమ గణాంకాలు (5.3-4-7-5) నమోదు చేసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించింది. దీప్తికి స్నేహ్ రాణా (2/25), రేణుక సింగ్ (1/32), పూజా వస్త్రాకర్ (1/39) సహకరించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నాట్ సీవర్ బ్రంట్ (59) టాప్ స్కోర్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లంతా కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేకపోయారు. ఆమీ జోన్స్ 12, బేమౌంట్ 10, డంక్లీ 11, హీథర్ నైట్ 11, డేనియెల్ వ్యాట్ 19 పరుగులు చేయగా.. లారెన్ ఫైలర్ 5, కేట్ క్రాస్ ఒకటి, ఎక్లెస్టోన్, చార్లీ డీన్ డకౌట్లయ్యారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 69 పరుగులు చేసి, ఓవరాల్‌గా 361 పరుగుల లీడ్‌ను సాధించింది. స్మృతి మంధన 26 పరుగులు చేసి ఔట్ కాగా.. షఫాలీ వర్మ (32), యస్తిక భాటియా (7) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు శుభ సతీశ్ (69), జెమీమా రోడ్రిగెజ్ (68), యస్తికా భాటియా (66), దీప్తి శర్మ (67), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (49), స్నేహ్ రాణా (30) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. కేట్ క్రాస్, నాట్ సీవర్ బ్రంట్, చార్లెట్ డీన్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్.. తొలి రోజు టీమిండియా బ్యాటర్ల జోరు
స్వదేశంలో (నవీ ముంబై) ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా మహిళా బ్యాటర్ల హవా కొనసాగింది. తొలి రోజు భారత బ్యాటర్లు ప్రత్యర్ధి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోర్ (94 ఓవర్లలో) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (17), షఫాలీ వర్మ (19) నిరాశపర్చినప్పటికీ ఆ తర్వాత బరిలోకి దిగిన బ్యాటర్లందరూ రాణించారు. శుభ సతీశ్ (69), జెమీమా రోడ్రిగెజ్ (68), యస్తికా భాటియా (66), దీప్తి శర్మ (60 నాటౌట్) అర్ధసెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (49), స్నేహ్ రాణా (30) పర్వాలేదనిపించారు. ఆట ముగిసే సమయానికి దీప్తి శర్మకు జతగా పూజా వస్త్రాకర్ (4) క్రీజ్‌లో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు పడగొట్టగా.. కేట్ క్రాస్, నాట్ సీవర్ బ్రంట్, చార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్.. భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు నెగ్గి ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంది. నామమాత్రపు చివరి టీ20లో టీమిండియా గెలిచింది. -
ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి.. ఇంగ్లండ్‌దే టీ20 సిరీస్
ముంబై: భారత మహిళల ‘ఎ’ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఇంగ్లండ్ ‘ఎ’ జట్టు 2–1తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ‘ఎ’ రెండు వికెట్ల తేడాతో భారత్ ‘ఎ’పై గెలిచింది. ముందుగా భారత జట్టు 19.2 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష ఏడు పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఇసీ వాంగ్, క్రిస్టీ, మ్యాడీ, లారెన్ రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం ఇంగ్లండ్ ‘ఎ’ జట్టు 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి నెగ్గింది. ఇసీ వాంగ్ (28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇంగ్లండ్ జట్టును విజయతీరానికి చేర్చింది. ఆంధ్ర అమ్మాయి బి.అనూష ఒక వికెట్ తీసింది. -
కీర్తి సురేష్: కేరళలో మహిళల క్రికెట్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా (ఫోటోలు)
-
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు ఎంపికైన హైదరాబాద్ క్రికెటర్
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్ ‘ఎ’ మహిళల క్రికెట్ జట్టుతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టులో హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషకు చోటు దక్కిందని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. 17 ఏళ్ల త్రిష ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉంది. భారత్ ‘ఎ’–ఇంగ్లండ్ ‘ఎ’ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 29న, డిసెంబర్ 1న, డిసెంబర్ 3న జరుగుతాయి. -
ట్రాన్స్‌జెండర్స్‌కు అర్హత లేదు
అహ్మదాబాద్: అంతర్జాతీయ మహిళల క్రికెట్ సమగ్రతను కాపాడేందుకు, గౌరవం పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట లింగ మార్పిడి చేసుకున్న అబ్బాయిలు పూర్తిగా అమ్మాయిల హోదా పొందినప్పటికీ అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఆడేందుకు అర్హత లభించదని మంగళవారం ఇక్కడ జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది నెలల సంప్రదింపులు, సుదీర్ఘ కసరత్తు తర్వాతే ఈ విధాన నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ సీఈఓ జెఫ్ అలర్డైస్ తెలిపారు. అయితే దేశవాళీ క్రికెట్లో ట్రాన్స్‌జెండర్స్‌ను ఆడించే విషయమై ఆయా సభ్యదేశాలకే నిర్ణయాధికారం కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది సెపె్టంబర్లో అంతర్జాతీయ క్రికెట్లో తొలి ‘ట్రాన్స్‌జెండర్’గా కెనడాకు చెందిన 29 ఏళ్ల డానిల్ మెక్‌గహే గుర్తింపు పొందింది. 2024 టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించేందుకు నిర్వహించిన అమెరికన్ క్వాలిఫయర్ టోర్నీలో ఆమె కెనడా జట్టు తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడి 118 పరుగులు సాధించింది. డానిల్ మెక్‌గహే కెనడా జాతీయ జట్టు తరఫున ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు ఆడినా వాటికి అంతర్జాతీయ హోదా లేదు. డానిల్ ఆ్రస్టేలియాలో పుట్టి మూడేళ్ల క్రితం కెనడాకు వలస వచ్చింది. 2020లో పురుషుడి నుంచి స్త్రీగా మారేందుకు సిద్ధమైన ఆమె 2021లో వైద్యపరంగా పూర్తి స్థాయిలో మహిళగా మారింది. ట్రాన్స్‌జెండర్స్‌కు అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించడంపై తీవ్ర విమర్శలు రావడంతో ఐసీసీ నిబంధనలు మార్చింది. మరోవైపు మ్యాచ్ అధికారులు, అంపైర్లకు ఇకపై లింగబేధం లేకుండా పురుష అంపైర్లతో సమానంగా మహిళా అంపైర్లకు వేతన భత్యాలు ఇస్తారు. -
మెగ్ లానింగ్ గుడ్‌బై
మెల్బోర్న్: మహిళల క్రికెట్‌కే మకుటం లేని మహారాణి మెగ్ లానింగ్. ఆటతో, సారథ్య నైపుణ్యంతో ఆ్రస్టేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఈ విజయవంతమైన సారథి, 13 ఏళ్ల ఫలప్రదమైన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఆ్రస్టేలియా అమ్మాయిల క్రికెట్లో ఎవర్గ్రీన్ ‘మెగాస్టార్’గా కెపె్టన్ లానింగ్‌కు పెట్టింది పేరు. 31 ఏళ్ల వన్నె తగ్గని ఈ క్రికెటర్ తన ప్రతిభా పాటవాలతో ఏకంగా ఏడు ప్రపంచకప్‌లలో భాగమైంది. ఇందులో ఐదు టైటిల్స్ ఆమె కెప్టెన్సీలోనే వచ్చాయి. గతేడాది లానింగ్ సారథ్యంలో ఆసీస్ మహిళల జట్టు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన టి20 ప్రపంచకప్‌లో జట్టును విజేతగా నిలిపాక మళ్లీ ఆమె బరిలోకి దిగలేదు. ఆరోగ్య సమస్యలతో ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటలనకు దూరంగా ఉంది. ఇలా అరంగేట్రం: జన్మతః సింగపూర్ అమ్మాయి అయిన మెగ్... న్యూజిలాండ్‌తో 2010లో జరిగిన టి20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కెరీర్ లో ఆఖరి మ్యాచ్ కూడా ఈ ఫార్మాట్లోనే ఆడింది. అలా సంచలనం: పిన్న వయసు (21 ఏళ్లు)లోనే కెప్టెన్ అయిన ‘ఆసీస్ యంగెస్ట్ క్రికెటర్’. ఒకే ఒక్క వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు (1232) చేసిన కెపె్టన్‌గా ఘనత. టి20ల్లో అత్యధికంగా వంద మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన తొలి కెపె్టన్‌గానూ రికార్డు. మెగ్ లానింగ్ మొత్తం 179 మ్యాచ్‌ల్లో కెపె్టన్‌గా వ్యవహరించగా, ఆమె కెప్టెన్సీలో ఆసీస్ జట్టు 146 మ్యాచ్‌ల్లో గెలిచింది. ‘కప్’ల కహాని: రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (2013, 2022), ఐదు టి20 ప్రపంచకప్ (2012, 2014, 2018, 2020, 2023)లలో విజయవంతమైన కెపె్టన్‌గా, బ్యాటర్‌గా నిరూపించుకుంది. లానింగ్ సారథ్యంలో ఆసీస్ 2022 వన్డే వరల్డ్‌కప్‌లో, 2014, 2018, 2020, 2023 టి20 వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచింది. బ్యాటింగ్‌లో సునామీ: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో కేవలం 45 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ సాధించిన ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు. కెరీర్ ప్రొఫైల్: ఆరు టెస్టులు ఆడి 345 పరుగులు, 103 వన్డేల్లో 4602 పరుగులు సాధించింది. ఇందు లో 15 సెంచరీలు, 21 ఫిఫ్టీలున్నాయి. 132 టి20ల్లో 3405 పరుగులు చేసింది. 2 శతకాలు, 15 అర్ధసెంచరీలున్నాయి. ఓవరాల్‌గా 241 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కలిపి లానింగ్ 8,352 పరుగులు చేసింది.