Tamil Nadu
-
కోలాహలం..సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం
వేలూరు: కాట్పాడి సమీపంలోని వళ్లిమలై సుబ్రహ్మణ్యస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని మంగళవారం కోలాహలంగా నిర్వహించారు. వేలూరు జిల్లాలోనే వళ్లిమలై సుబ్రమణ్యస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆలయంలో మాసి మాసం పురష్కరించుకుని ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మహా రథోత్సవం సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. రథోత్సవాన్ని రాష్ట్ర మంత్రి దురై మురుగన్, ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ మహారథోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై రథంపై బొరుగులు, మిర్యాలు చల్లి రథాన్ని లాగుతూ మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని పురష్కరించుకుని వళ్లిమలై ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. ముందుగా ఉదయం ఆలయంలో స్వామి వార్లకు తిరుకల్యాణోత్సవం జరిగింది. ఇందుకోసం ప్రత్యేక అలంకరణలు చేసి రథంలో స్వామివారిని ఆశీనులను చేశారు. -
కనులపండువగా తిరుమలీశ్వరర్ మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: పళ్లిపట్టు సమీపంలో 1,500 సంవత్సరాల చరిత్ర కల్గిన తిరుమలీశ్వరర్ ఆలయ మహాకుంభాభిషేకాన్ని సోమవారం కనులపండువగా నిర్వహించారు. పళ్లిపట్టు సమీపంలోని కొళత్తూరులో కుశస్థలినది తీరంలో 1,500 ఏళ్ల కిందట వశ్రీ కృష్ణదేవరాయులు త్రిపురసుందరి సమేత తిరుమలేశ్వరర్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈక్రమంలో పదేళ్ల కిందట తిరుత్తణికి చెందిన శేషన్, యగ్నప్రియ దంపతులు ఆలయం జీర్ణోద్ధరణ చేపట్టాలని నిర్ణయించారు. గ్రామీణుల సహకారంతో పదేళ్ల నుంచి ఆలయ పునఃనిర్మాణ పనులు జరిగాయి. రాజ, విమాన గోపురం, సన్నధులు, రాళ్ల మండపాలు, ఆలయ రాతి ప్రహరీ గోడలు, రాతి ఽ ధ్వజస్తంభం పనులు చేసి సర్వాంగసుందరంగా ఆలయ నిర్మాణ పనులు పూర్తిచేశారు. దీంతో గురువారం నుంచి సోమవారం వరకు ఐదురోజుల పాటు మహాకుంభాభిషేక వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మహాపూర్ణాహుతి అనంతరం మేళ తాళాల నడుమ పవిత్రపుణ్య తీర్థాలను కలశాలతో తీసుకెళ్లి రాజగోపురం, విమాన గోపురాలకు శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు శివనామస్మరణతో స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తులపై పవిత్ర తీర్థజలాలు వెదజెల్లారు. సాయంత్రం స్వామి వారి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామీణులు మహాకుంభాభిషేకం ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కనుల పండువగా రథోత్సవం
సేలం : విరుదాచలం విరుద్ధగిరీశ్వరర్ ఆలయంలో మంగళవారం నిర్వహించిన రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగి మొక్కులు తూర్చుకున్నారు. వివరాలు.. కడలూరు జిల్లా విరుదాచలంలో సుమారు 1800 సంవత్సరాల పురాతనమైన విరుద్దాంబికై , బాలాంబికై ల సమేత విరుద్దగిరీశ్వర్ స్వామి ఆలయం ఉంది. 5 గోపురాలు, 5 నందిలు, 5 ప్రాకారాలు, 5 తీర్థాలు, 5 రథాలు అంటూ అన్ని ఐదు అంకెతో ప్రత్యేకాంశాలు కలిగిన ఆలయం ఇది. ఏటా లాగేనే ఈ ఏడాది మాస ఉత్సవాలు గత 3వ తేది ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో ముఖ్య ఘట్టమైన రథోత్సవం మంగళవారం ఉదయం 5.50 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వినాయకుడు, సుబ్రమణ్య స్వామి, విరుద్దగిరీశ్వరర్, విరుద్దాంబికై , చండికేశ్వరర్ వంటి పంచమూర్తులకు పాలు, పెరుగు, పన్నీరు, కొబ్బరి నీరు, తేనె, పంచామృతం వంటి పలు ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి, పూజలు నిర్వహించారు. అనంతరం పంచ మూర్తుల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక ఐదు రథాలపై ఊరేగించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి రధాలను పట్టి లాగారు. నాలుగు మాడ వీధులను ఊరేగిన అనంతరం ఐదు రధాలు ఆలయానికి చేరుకున్నాయి. కాగా ఉత్సవాలలో 10వ రోజు బుధవారం మాసి మహా తీర్థవారి, గురువారం తెప్పోత్సవం, 14వ తేది చండికేశ్వరర్ ఉత్సవం, 15వ తేది ధ్వజ అవరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆలయం వద్ద నుంచి బయలుదేరుతున్న పంచ మూర్తుల రధాలు -
నాట్రంబల్లిలో భారీ చోరీ
వేలూరు: నాట్రంబల్లిలో భారీ చోరీ జరిగింది. తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని అగ్రావరం గ్రామంలో ఓంశక్తి నగర్‌కు చెందిన ముత్తు మేకల వ్యాపారి. ఇతని భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ముత్తు సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక ఉన్న తలుపులు, కిటికీ కమ్మీలు తీసి ఇంట్లోకి చొరబడి 40 సవర్ల బంగారు నగలు, వెండి వస్తువులను చోరీ చేశారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన ముత్తు ఇంటి తలుపులు తీసి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వేలి ముద్రలు స్వీకరించారు. అదేవిధంగా వేలూరు పట్టణ నడిబొడ్డున ఉన్న సున్నపు వీధిలో మూడు దుకాణాల్లో చోరీ చోటుచేసుకుంది. -
తిరువళ్లూరులో భారీ వర్షం
తిరువళ్లూరు: పట్టణంలో మంగళవారం పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల నుంచి ఎండల దంచికొడుకున్నాయి. ఉక్కపోత, భారీగా ఎండల తీవ్రత పెరిగిన క్రమంలో మంగళవారం నుంచి జిల్లాలోని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. సాయంత్రం భారీ వర్షం కురవడంతో పట్టణంలోని రోడ్లు జలమయంగా మారాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో సీఎం బహిరంగసభ కోసం పట్టణంలో ఏర్పాటు చేసిన సీఎం, డిప్యూటీ సీఎంల కటౌట్లు కూలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. గత కొద్ది రోజులుగా ఉక్కపోత ఎండతో ఇబ్బంది పడుతున్న జనానికి మంగళవారం కురిసిన భారీ వర్షానికి వాతావరణం చల్లబడి కాస్తా ఊరటనిచ్చింది. -
బృందా థియేటర్ కూల్చివేత పనులు ప్రారంభం
● ఆవేదన వ్యక్తం చేస్తున్న అభిమానులు కొరుక్కుపేట: సూపర్‌స్టార్ రజనీ కాంత్ చేతులమీదుగా 1985 సంవత్సరంలో ప్రారంభమైన బృందా థియేటర్ నాలుగు దశాబ్దాల పాటూ అభిమానులను ఎంతో అలరించింది. కొత్త కొత్త సినిమాలను ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఈ థియేటర్ ఇక కనుమరుగు కానుంది. ఇప్పటికే సినిమాలను ప్రదర్శించడం ఆగిపోయింది. సరిగ్గా నెలరోజులు ముందు చైన్నె అశోక్ పిల్లర్ వద్ద ఉన్న చారిత్రక ఉదయం థియేటర్‌నూ కూల్చి వేశారు. ఈక్రమంలో బృందా థియేటర్ కూల్చివేత పనులు కూడా ప్రారంభం కావడం అభిమానులకు బాధ కలిగిస్తోంది. వివరాలు.. సెల్ఫోన్లు, ఓటీటీలు వచ్చిన తర్వాత, గత కొన్నేళ్లుగా సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీనికి ప్రతిగా తమిళనాడు వ్యాప్తంగా ఐకానిక్ థియేటర్లను కూల్చివేసి వాణిజ్య సముదాయాలు, ప్లాట్లుగా మార్చడంతోపాటూ రాజధాని చైన్నెలో శతాబ్దాల నాటి థియేటర్లు సైతం ప్లాట్లు, వాణిజ్య భవనాలుగా మారుతున్నాయి. ఇప్పటికే చైన్నెలో పాపులర్ అయిన అగస్త్య, కామథేను, కృష్ణ వేణితదితర ఎన్నో థియేటర్లు నేలమట్టమయ్యాయి. కొన్ని థియేటర్లు ముత్యాల తెరలు కోల్పోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ స్థితిలో ఉత్తర చైన్నెకి ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన పెరంబూర్ బృందా థియేటర్ చరిత్ర సోమవారంతో ముగిసింది. ఏప్రిల్ 14, 1985న సూపర్ స్టార్ రజనీ కాంత్ చేతులమీదుగా బృందా థియేటర్ని ప్రారంభించారు. అప్పుడు లోగనాథన్ చెట్టియార్ దాని యజమాని. అతని మరణానంతరం, అతని వారసులు విశ్వనాథన్, చంద్రశేఖర్ దీనిని కొనసాగించారు. ఈ సందర్భంలో బృందా థియేటర్ సోమవారం చివరి ప్రదర్శనను పూర్తి చేసుకుంది. మంగళవారం నుంచి ప్రదర్శనలు నిలిపివేశారు. ఇక నుంచి ఈ థియేటర్‌ను కూల్చివేయనున్నారు. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ స్థలాన్ని కొనుగోలు చేసిందని, త్వరలోనే భవనాన్ని కూల్చివేసి అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్లు చెబుతున్నారు. ఉత్తర చైన్నెలో మొదటి ఎయిర్ కండిషన్డ్ థియేటర్, సుమారు 15 గ్రౌండ్ల విస్తీర్ణంలో ఉన్న థియేటర్‌గా ఇది గుర్తింపు పొందింది. 1,170 మంది కూర్చుని సినిమా చూడొచ్చు. ఉత్తర చైన్నెలో రజనీకాంత్ థియేటర్‌కు అతి పెద్ద థియేటర్‌గా పేరుంది. ససినిమా ఏదైతేనేం ఈ థియేటర్లో ఫస్ట్ షోకే సందడి. రజనీ అభిమానులు ఇష్టపడి సినిమాలు చూసే థియేటర్లలో బృందా థియేటర్ ఒకటి. బాద్షా, మాపిళ్లై, పడయప్పతో సహా పలు చిత్రాలు ఇక్కడ ఎక్కువ కాలం ఆడి రికార్డు సృష్టించాయి. గత 40 ఏళ్లుగా ఈ థియేటర్ ప్రజల ఆనందానికి ప్రతీక. ఎట్టకేలకు సోమవారం డ్రాగన్ సినిమా తెరకెక్కి, అన్ని సన్నివేశాలు పూర్తయ్యాయి.40 ఏళ్లుగా పనిచేస్తున్న మేనేజర్ పన్నీర్ సెల్వం మాట్లాడుతూ.. మా థియేటర్‌కి బృందా థియేటర్ అని పేరు పెట్టినా రజనీ థియేటర్ అని పిలుస్తారని, రజనీ ఈ థియేటర్ని ప్రారంభించారు.. రజనీ సినిమాలన్నీ ఇక్కడ ప్రదర్శితమయ్యాయని.. 40 ఏళ్లుగా ప్రజలకు అందించినందుకు సంతోషంగా ఉందన్నారు. -
వీఐటీ, స్వామినాథన్ ఫౌండేషన్ ఒప్పందం
కొరుక్కుపేట: చైన్నెలోని వీఐటీ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్న్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీఐటీ, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ మధ్య డ్రోన్న్లపై సహకార పరిశోధన, ఇతర పర్యావరణ కాలుష్య అధ్యయనాల కోసం అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇందులో వీఐటీ వ్యవస్థాపకుడు విశ్వనాథన్, ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్ సౌమ్య స్వామినాథన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. సౌమ్యస్వామినాథన్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, రక్షణ కోసం తమిళనాడు గొప్ప చర్యలు తీసుకుంటోందని కొనియాడారు. వీఐటీ చాన్స్‌లర్ మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ధ చెందిన దేశంగా మారాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారని గుర్తు చేశారు. ప్రత్యేక అతిథులుగా శ్రీలంక రక్షణ శాఖ సహాయ కార్యదర్శి సచిని దిసనాయకే, వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం, కెప్టెన్ లక్ష్మీ, వీఐటీ సలహాదారు కల్యాణి, వీఐటీ అసోసియేట్ వైస్ చాన్స్‌లర్ త్యాగరాజన్, వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం హాజరయ్యారు. -
సదరన్ రైల్వేలో విజయవంతంగా మహిళా దినోత్సవం
కొరుక్కుపేట: సదరన్ రైల్వే ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27 నుంచి పక్షం రోజులు పాటూ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారంతో విజయవంతంగా ముగిశాయి. ముగింపు వేడుకలు మంగళవారం ఉదయం సదరన్ రైల్వే ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సదరన్ రైల్వే మహిళా ప్రధాన కార్యాలయ సంస్థ (ఎస్‌ఆర్‌డబ్ల్యూ హెచ్క్యూవో) అధ్యక్షురాలు సోనియాసింగ్ ప్రత్యేక అతిథులుగా ఆ సంస్థ ఉపాధ్యక్షురాలు రేఖ కౌశల్ , సదరన్ రైల్వే ప్రదాన ఆర్థిక సలహాదారు మాలాబికా ఘోష్ హాజరయ్యారు. పక్షం రోజులు పాటూ మహిళా ఉద్యోగులు అనేక ఆకర్షణీయమైన కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అతిథులు మాట్లాడుతూ మహిళా దినోత్సవం అనే భావన 20 వ శతాబ్దం ప్రారంభంలో కార్మికుల ఉద్యమాలు, మెరుగైన పని పరిస్థితులు, ఓటు హక్కులు, సమాన అవకాశాల కోసం డిమాండ్ల నుంచి ఉద్భవించిందని తెలిపారు. శ్రామిక శక్తిలో మహిళల అమూల్యమైన సహకారాన్ని గుర్తిస్తూ భారతీయ రైల్వేలు అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చురుకుగా పాటిస్తోందని తెలిపారు. -
తమిళంలో పేరు బోర్డులు లేకపోతే లైసెన్స్ రద్దు
సాక్షి, చైన్నె: తమిళంలో పేరు బోర్డులు లేకపోతే లైసెన్స్‌లు రద్దు చేయడానికి చైన్నె కార్పొరేషన్ నిర్ణయించింది. చైన్నె, కోవై, తిరునెల్వేలి వంటి ముఖ్య నగరాలలో తమిళంలో పేరు బోర్డులు కచ్చితంగా ఉంచాలని, దాన్ని క్రమంగా పాటించాలని, ఆ విధంగా పాటించని దుకాణాలపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది . చైన్నె నగరంలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు, మాల్స్ తదితర అన్ని రకాల వ్యాపార సంబంధిత కార్యాలయాల నేమ్ బోర్డుల్లో పేర్లు పెద్దవిగా తమిళ అక్షరాలలోను, దానికంటే చిన్న అక్షరాలలో ఆంగ్లం లేదా ఇతర భాషలు ఉండాలన్న ఆదేశాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే దీన్ని వ్యాపారులు పాటించడం లేదు. అయితే తమిళ అక్షరాలు అతి చిన్నవిగాను, ఇంగ్లీషు అక్షరాలు అతి పెద్దవిగాను అనేక నేమ్ బోర్డులు నగరంలో కనిపిస్తుంటాయి. దీనికి సంబంధించి కార్పొరేషన్‌కు ఫిర్యాదులు చేరాయి. చైన్నె కార్పొరేషన్లో 70 వేల దుకాణాలు లైసెన్స్ పొంది నినర్వహిస్తున్నాయి.ుు. వీటిలో ప్యారిస్, సౌకార్‌పేట వంటి ప్రాంతాలలో ఉన్న దుకాణాలలో తమిళ నేమ్ బోర్డులు లేనట్టు సమాచారం. తమిళంలో నేమ్ బోర్డులు పెట్టని దుకాణాలకు వివరణ కోరుతూ నోటీసులు పంపించాలని చైన్నె కార్పొరేషన్ నిర్ణయించింది. ఏడు రోజుల్లోపు బోర్డులను సరి చేయకుంటే వాటి లైసెన్స్‌ను రద్దు చేసే విధంగా నిర్ణయించారు. సంబంధించి కార్పొరేషన్ అధికారుల అధ్యక్షతన సమావేశం నిర్వహించి తమిళంలో పేర్ల బోర్డులు పెట్టే విధంగా దుకాణాలకు నోటీసులు పంపించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చైన్నె కార్పొరేషన్లో ఇందుకుగాను సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో తమిళంలో పేర్ల బోర్డులు లేని దుకాణాలపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కార్పొరేషన్ కార్పొరేటర్లు తమ తమ ప్రాంతాలలో ఉన్న దుకాణాల గురించి సమాచారం తెలపాలని అఽధికారులు సూచించారు. ● చైన్నె కార్పొరేషన్ నిర్ణయం -
వినియోగదారులకు ఏఐ ఆధారిత సేవలు
సాక్షి, చైన్నె: వినియోగదారులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్కెటింగ్, సేవా పరిష్కారాలను మెరుగుపరచడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంపై దృష్టి పెట్టినట్టు పోతీస్ స్వర్ణ మహల్ డైరెక్టర్ అశోక్ పోతీ తెలిపారు. ఈ సహకారం అన్నది సేల్స్‌ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ , సర్వీస్ క్లౌడ్, కామర్స్ క్లౌడ్ ద్వారా వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోతీస్ స్వర్ణ మహల్ డిజిటల్–ఫస్ట్ భవిష్యత్తును పరిగణించిందన్నారు. ఇందులో భాగంగా ఈ– మెయిల్, మెసేజింగ్, వాట్సాప్, వీడియో, చాట్, సోషల్ మీడియా నోటిఫికేషన్లలో కస్టమర్లు పరస్పరం సజావుగా అనుసంధానించే బహుళ–ఛానల్ వ్యూహాన్ని లవలంబించినట్టు వివరించారు. సేల్స్‌ఫోర్స్ ఏఐ –ఆధారిత పరిష్కారాలను సమగ్రపరచడం ద్వారా రిటర్న్–టు–స్టోర్ ప్రచారాలు, రియల్–టైమ్ ప్రమోషన్లు మెరుగు పడుతుదన్నారు. ఆన్లైన్ , ఆఫ్‌లైన్ టచ్పాయింట్లలో స్థిరమైన , సమర్థవంతమైన అనుభవాన్ని నిర్ధారించడానికి, కస్టమర్ సంబంధాలను బలోపేతం చేయడానికి, దక్షిణ భారతదేశం అంతటా వ్యాపార వృద్ధిని నడిపించడానికి ఓమ్నిఛానల్ వ్యూహాన్ని కూడా ప్రారంభించామన్నారు. ఏఐ, ఆటోమేషన్ ద్వారా కార్యాచరణ నైపుణ్యాన్ని మరింతగా పెంచేందుకు వీలుందన్నారు. సేల్స్‌ఫోర్స్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ – కన్స్యూమర్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ మన్కిరణ్ చౌహాన్ మాట్లాడుతూ, డిజిటల్–ఫస్ట్ ప్రపంచంలో వ్యాపారాల అభివృద్ధి , అధునాతనమైన, వ్యక్తిగతీకరించిన కస్టమర్ అనుభవాలను అందించడం తమకు కీలకంగా పేర్కొన్నారు. రిటైల్ అనుభవాలను మార్చడం ఏఐ–ఆధారిత పరిష్కారాల శక్తికి నిదర్శనం అని వివరించారు. సేల్స్‌ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ , సర్వీస్ క్లౌడ్ , కామర్స్ క్లౌడ్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగ దారులకు మరింత చేరువ అయ్యేందుకు మార్గం సులభతరంగా కాకుండా, ఆధునీకరించే విధంగా ఉంటుందన్నారు. -
బట్టీ విధానంతో విద్యార్థులు ఎదగలేరు
తిరువళ్లూరు: విద్యార్థులు బట్టీ పట్టి పరీక్షలు రాస్తే మార్కులు పెరుగుతాయే తప్ప భవిష్యత్తు ఎదుగుదలకు ఉపయోగపడదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఇరయన్బు విద్యార్థులకు సూచించారు. తిరువళ్లూరులో పుస్తక ప్రదర్శన పది రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రదర్శనలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమం జరిగింది. బట్టీ విధానం వల్ల విద్యార్థులకు జరిగే నష్టాన్ని వివరించారు. ఇరయన్బు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాక్టికల్ విధానం వల్లే ప్రయోజనం కలుగుతుందన్నారు. చాలా మంది విద్యార్థులు, విద్యాసంస్థలు మార్కుల కోసం బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పరీక్షకు ముందు రోజు వరకు పుస్తకాలతో కుస్తీ పడొద్దన్న ఆయన, పరీక్షలంటే భయం వద్దన్నారు. అనంతరం ప్రాక్టికల్ విధానం పట్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాన్ని వివరించారు. -
ఏనుగుదాడిలో యువకుడి మృతి
సేలం : నీలగిరి జిల్లాలో గత నెల మొత్తం అధిక మంచు కురిసినందువలన అడవి ప్రాంతంలో ఎండిగిపోయి కనిపిస్తోంది. అడవిలో ఉన్న నీటి ఆవాసాలు కూడా ఎండిపోయి కనిపించాయి. దీంతో అడవి ప్రాంతంలో నుంచి నీళ్లు, ఆహారం కోసం ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయి. ఈ స్థితిలో కున్నూర్ సమీపంలో దట్టమైన అడవి మధ్యలో సెంబక్కరై గ్రామంలో 50కి పైగా గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ క్రమానికి చెందిన ప్రజలు తమ నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయడం కోసం రోజూ కున్నూర్ నగర ప్రాంతానికి వచ్చి వెళుతున్నారు. సేపాక్కం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ (30), అతని స్నేహితుడు రవి ఇద్దరు సోమవారం రాత్రి నగరానికి వచ్చి అత్యవసర వస్తువులు కొనుగోలు చేశారు. అనంతరం వారు గ్రామానికి తిరిగి వెళుతుండగా అటువైపుగా వచ్చిన అడవి ఏనుగు అకస్మాత్తుగా విజయ్ కుమార్‌పై దాడికి పాల్పడింది. దీంతో విజయ్ కుమార్ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న కున్నూర్ అటవీ రేంజర్ రవీంద్రనాధ్ అధ్యక్షతన అటవీ శాఖ వారు ఆ ప్రాంతానికి వెళ్లి విజయ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవపంచనామా నిమిత్తం అంబులెన్స్ ద్వారా కున్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అడవి ఏనుగు దాడి గురించి కున్నూర్ అటవీ శాఖ అధికారులు, మేల్కున్నూర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. రూ. 50 వేలు పరిహారం అందజేత.. అడవి ఏనుగు దాడితో మృతి చెందిన వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కొరడా కె.రామచంద్రన్ మంగళవారం ఆస్పత్రికి వెళ్లి బంధువులకు ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే నష్ట పరిహారాన్ని త్వరగా అందే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది. అదేవిధంగా కున్నూర్ అటవీ శాఖ తరపున మృతి చెందిన యువకుడి కుటుంబానికి తక్షణ నష్టపరిహారంగా రూ. 50,000 అందజేశారు. -
సీఎం రాకకు భారీ ఏర్పాట్లు
తిరువళ్లూరు: రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు డీఎంకే పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం తిరువళ్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రసంగించనున్నారు. ఇందుకోసం డీఎంకే నేతలు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్న కేంఽద్ర ప్రభుత్వం తీరుతో పాటు పార్లమెంట్లో తమిళనాడు ఎంపీలను కించపరిచేలా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ డీఎంకే ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ద్వారా ఽనిరసన వ్యక్తం చేయాలని డీఎంకే అధిష్టానం పిలుపునిచ్చింది. ప్రతి జిల్లాకు ఒక్కో మంత్రిని ఇన్‌చార్జ్‌లుగా నియమించి తమ గళాన్ని గట్టిగా వినిపించాలని సూచించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరులో జరిగే నిరసన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ హాజరుకానున్నారు. ఇందుకోసం భారీ స్టేజీతో పాటు 20 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే రోడ్లకు ఇరువైపులా పార్టీ జెండాలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు సభ ప్రారంభమై పది గంటల వరకు జరిగే అవకాశం వుంది. సభకు భారీగా జనాన్ని సమీకరణ చేయాలని నేతలు నిర్ణయించి కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పార్టీ నేత అన్బగం కలై, మంత్రి నాజర్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, కృష్ణస్వామి, తిరుత్తణి చంద్రన్ మంగళవారం పరిశీలించారు. అయితే మంగళవారం మోస్తరు వర్షం కురవడంతో ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. సభా ప్రాంగణం వద్ద నీరు నిలిచిపోయింది. 40 నిమిషాల పాటు కురిసిన వర్షం తెరిపి ఇవ్వడంతో ఏర్పాట్లను మళ్లీ ప్రారంభించి శరవేగంగా చేస్తున్నారు. -
పూజా హెగ్డే కొత్త ఛాలెంజ్
తమిళసినిమా: స్టార్ హీరోయిన్లకు కెరీర్ పరంగా బ్రేక్ రావచ్చేమో గానీ, పుల్ స్టాప్ మాత్రం పడదు. ఉన్నత స్థాయిలో రాణించిన చాలా మంది కథానాయకిలు అప్ అండ్ డౌన్ చూసిన వారే. అలాంటి పరిస్థితులనే సెకెండ్ ఇన్నింగ్ అంటారు. అయితే అలా కెరీర్ డౌన్ అయినప్పుడు మాత్రం కామెంట్స్ ఎదుర్కోక తప్పదు. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదు. ఇంతకు ముందు తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. అలాంటిది ఈ భామ నటించిన కొన్ని తెలుగు, తమిళం, హిందీ చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో కొత్త అవకాశాలు ముఖం చాటేసాయి. దీంతో పూజాహెగ్డే పని అయిపోయింది. ఇక మూట ముల్లె సర్దుకోవాల్సిందే అనే కామెంట్స్ హల్ చల్ చేశాయి. అయితే తాజాగా పూజ హెగ్డే చేతిలో మూడు నాలుగు చిత్రాలతో బిజీగా ఉండటం విశేషం. దీన్ని ఆమెకు సెకండ్ ఇన్నింగ్ అంటారు లేక చిన్న గ్యాప్ అంటారు గాని పూజా హెగ్డే ను తాజాగా అందుకుంది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమనే అని చెప్పక తప్పదు. ఈమె మార్కెట్ బాగా పడిపోయిన సమయంలో నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 44వ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం వరించింది. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్లోనూ నటించే లక్కీఛాన్స్‌ను పూజా హెగ్డేనే అందుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే నటుడు రాఘవ లారెనన్స్ పూజహెగ్డేకు మరో అవకాశం కల్పించారు. ఈ మూడు చిత్రాల్లో సూర్య జంటగా నటించిన రెట్రో చిత్రం ముందుగా తెరపైకి రానుంది. సక్సెస్ఫుల్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఇందులో నటుడు జయరాం, కరుణాకరన్, జోజు జార్జ్, సుజిత్ శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగులు పూర్తి చేసుకున్న రెట్రో చిత్రం ప్రస్తుతం నిర్మాణానాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రాన్ని కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజా సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో తన పాత్రకు నటి పూజా హెగ్డే డబ్బింగ్ చెప్పుకున్నారన్నది. ఆమె డబ్బింగ్ చెబుతున్న తొలి తమిళ చిత్రం ఇదే అవుతుంది. ఆ విధంగా నటి పూజా హెగ్డే కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయ్యారన్నమాట. -
పేట కాంబో రిపీట్?
తమిళసినిమా: ఒంట్లో హుషారు, మనిషిలో సత్తా ఉంటే వయసుతో పనేముంటుంది. నటుడు రజినీకాంత్ ఇందుకు ఓ ఉదాహరణ. ఏడు పదుల వయసు పైబడినా ఈయన ఇప్పటికీ యువ హీరోలతో పోటీపడే విషయములో తగ్గేదేలే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే వరుసగా చిత్రాలు చేస్తూ యువ నటులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ ఈ చిత్రం షూటింగ్ పూర్తికాకుండానే జైలర్ –2 చిత్రానికి సిద్ధమైపోవడం చూస్తేనే ఆయన స్పీడ్ ఎలా ఉందో తెలుస్తుంది. కాగా ఇటీవల రజనీకాంత్ యువ దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. ఇంతకు ముందు పా. రంజిత్ దర్శకత్వంలో కబాలి, కాలా వంటి సక్సెస్ నక్షత్రాల్లో నటించిన రజనీకాంత్ ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట, నెల్సన్ దర్శకత్వంలో జైలర్ ,అదేవిధంగా జైభీమ్ చిత్రం ఫేమ్ టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయన్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దశరత్వంలో కూలీ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది దీంతో ఏమాత్రం విరామం లేకుండా మరోసారి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రంలో నటించటానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల మధ్య విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కాగా ఈ చిత్రం ప్రారంభ దశలో ఉండగానే రజనీకాంత్ మరో చిత్రానికి పచ్చ జెండా ఊపారన్నది తాజా సమాచారం. ఈయన మరోసారి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో అవుతోంది. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు తెరపైకి వచ్చిన పేట చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని సమాచారం. జైలర్– 2 చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న రెట్రో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన చిత్రం రజినీకాంత్‌తోనే అనే టాక్ వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. -
జననాయగన్లో దళపతి బాయ్స్?
తమిళసినిమా: నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్. హెచ్ వినోద్ కథ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే, మమిత బైజు నాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నటి ప్రియమణి, దర్శకుడు గౌతమ్ మీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శృతిహాసన్ అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సరదాగా జరుగుతోంది. ఇది సమకాలీన రాజకీయ అంశాలతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. లేకపోతే నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఆయన నటిస్తున్న చివరి చిత్రం ఇదే అవుతుందనే ప్రచారం జరుగుతుండటంతో జననాయకన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా చిత్ర ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల మధ్య ఆసక్తిని పెంచేసాయి. దీంతో చిత్రంలోని తొలి పాటను విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా జన నాయకన్ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ నెలలో గాని, వచ్చే ఏడాది పొంగల్ సందర్భంగా గాని విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్, నెల్సన్, దిలీప్ కుమార్, అట్లీ సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ముగ్గురిని దళపతి బాయ్స్ అంటారు. కాగా తాజాగా ఈ దళపతి బాయ్స్ నటుడు విజయ్ చివరి చిత్రం అయినా జననాయకన్లో కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. -
ఇళయరాజకు బ్రహ్మరథం
● 000సాక్షి, చైన్నె: ఆసియాలోనే ఎవరూ సాధించని ఘనతను లండన్ వేదికగా లైవ్ సింఫోనితో సొంతం చేసుకుని చైన్నెలో అడుగు పెట్టిన సంగీతజ్ఞాని ఇళయరాజకు విమానాశ్రయంలో బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, అధికారులు అధికారిక ఆహ్వానం పలికారు. సంగీతజ్ఞాని ఇళయరాజ ఈనెల 8న లండన్‌లో తొలిసారిగా లైవ్ సింఫనీ కచ్చేరి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆసియాలోనే ఎవ్వరూ సాధించని ఈ ఘనతను ఇళయరాజా సొంతం చేసుకోవడంతో ఆయనకు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఉదయాన్నే చైన్నెకు చేరుకున్న సంగీత జ్ఞానికి విమానాశ్రయంలో ఘన స్వాతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ఓ వైపు అధికారిక ఆహ్వానం పలికారు. మరోవైపు బీజేపీ, వీసీకే తదితర పార్టీలు, సంఘాలు, అభిమానులు దూసుకొచ్చి ఇళయరాజను అభినందిస్తూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో ఇళయ రాజమాట్లాడుతూ, మనస్సు పులకించిందన్నారు. తనకు అధికారిక ఆహ్వానంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. సింఫోని లైవ్ మరో 13 దేశాలలో జరగనున్నాయని వివరించారు. అక్టోబరు 6న దుబాయ్‌లో, సెప్టెంబరు 6న ప్యారీస్‌లో ఆ తర్వాత జర్మన్ తదితర దేశాలలో ఈ కార్యక్రమాలు జరగనున్నట్టు పేర్కొన్నారు. ఈ సంగీతం దీంతో ఆగదు అని, ప్రపంచవ్యాప్తంగా మారు మోగుతుందన్నారు. తనకు 82 ఏళ్లు అవుతోందని, ఈ వయస్సులో ఏమిచేస్తాడో అని అనుకోవద్దని, పన్నైపురం నుంచి వచ్చినప్పడు చెప్పులు కూడా లేకుండా వచ్చి తన కాళ్లపై నిలబడ్డానని, ఇప్పుడు కూడా అలాగే నిలబడి ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. యువత అర్థం చేసుకోవాలి.. దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి వారి విభాగాలలో ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఇక, తాను సంగీతకారుడిని అని, సంగీత దేవుడు అని తనను పిలవడం సబబుకాదన్నారు. తాను దేవుడ్ని కాదు.. సాధారణ మనిషిని అని వ్యాఖ్యానించారు. తనను దేవుడు అంటే, ఇళయరాజ స్థానానికి దేవుడిని తీసుకొచ్చేశారే అన్న భావన, వేదన కలుగుతోందన్నారు. త్వరలో తమిళనాడులోనూ సింఫోని జ్వలిస్తుందన్నారు. మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ, తమిళనాడు ఖ్యాతిని ఎలుగెత్తి చాటడమేకాకుండా, సంగీత ప్రపంచంలో ఎవ్వరూ సాధించని ఘనతను ఇళయరాజ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
ఢిల్లీలో తమిళ ఎంపీల నిరసనల హోరు
సాక్షి, చైన్నె: పార్లమెంట్ వేదికగా తమిళ ఎంపీలను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, తమిళనాడుకు విద్యా నిధుల పంపిణీకి డిమాండ్ చేస్తూ మంగళవారం ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం జరిగింది. పార్లమెంట్ ఆవరణలో డీఎంకే ఎంపీ కనిమొళి, ఎండీఎంకే ఎంపీ వైగో, వీసీకే ఎంపీ తిరుమావళవన్ నేతృత్వంలో డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ , వీసీకే తదితర రాష్ట్రానికి చెందిన 39 మందితోపాటూ పుదుచ్చేరి కాంగ్రెస్ ఎంపీ ఈ నిరసనలో పాల్గొన్నారు. తమిళ ఎంపీలను కించపరిచిన ధర్మేంద్ర ప్రదాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఇదిలా ఉండగా ధర్మేంద్ర ప్రదాన్‌కు వ్యతిరేకంగా తమిళనాట నిరసనలు హోరెత్తాయి. ఆయన దిష్టిబొమ్మలను డీఎంకే వర్గాలు దగ్ధం చేశారు. ఈ నిరసనలలో పాల్గొన్న డీఎంకే వర్గాలు 11 వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అకాల వర్షంతో ఆహ్లాదం సాక్షి, చైన్నె: వేసవిలో అకాల వర్షం పలకరించింది. మంగవారం రాష్ట్రంలో పలు జిల్లాలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపం చైన్నె, శివారు జిల్లాలతో పాటూ రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో అధికంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. రెండురోజుల క్రితం తూత్తుకుడి, తెన్కాశి, తిరునల్వేలిలలో వాతావరణం చల్లబడినట్టు పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులలో మంగళవారం ఉదయం నుంచి చైన్నె, శివారులలో తెర పించి తెరపించి చిరుజల్లుల వాన పడింది. కొన్ని సందర్భాలలో అనేక చోట్ల మోస్తారుగా వర్షం పడింది. వర్షం కారణంగా భానుడు తెర మరుగయ్యాడు. వాతావరణం పూర్తిగా మారినట్లయ్యింది. ఇదే పరిస్థితి తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి, కన్యాకుమారిలలో నెలకొంది. అక్కడక్కడ చెదురుముదురుగా వర్షం పడింది. మదురై, విరుదుగనర్, శివగంగైలతో పాటూ డెల్టా జిల్లాలు మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్లలో వర్షం పలకరించింది. ఈ వర్షాలు మరో రెండురోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రైలు బోల్తాకు కుట్ర? – కోవైలో కలకలం సేలం: సేలం రైల్వే డివిజన్ పరిధిలోని కోవై సింగానల్లూర్ రైల్వే స్టేషన్‌కు సోమవారం రాత్రి 10.15 గంటకు సేలం మార్గంలో తిరుపతి – కోవై ఎక్స్‌ప్రెస్ వెళ్లింది. అప్పుడు పక్కన వెళుతున్న కోవై – సేలం రైలు మార్గంలో రైల్వే ట్రాక్‌పై అది పెద్ద కాంక్రీట్ ఉండడాన్ని లోకో పైలెట్ గమనించారు. దిగ్భ్రాంతి చెందిన ఆయన కోవై రైల్వే స్టేషన్ మాస్టర్‌కు, సేలం రైల్వే డివిజన్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే కోవై ఆర్పీఎఫ్ పోలీసులు, కోవై రైల్వే పోలీస్ డీఎస్పీ బాబు ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలో ఉన్న సింగానల్లూర్ రైల్వే గేట్ కీపర్ పట్టాలపై ఉన్న ఆ సిమెంట్ స్లాబ్‌లను తొలగించాడు. ఈ మార్గంలో సోమవారం రాత్రి కోవై నుంచి సేలం మార్గంలో వెళ్లే బెంగళూరూ – చైన్నె ఎక్స్‌ప్రెస్, మేట్టుపాళయం – చైన్నె నీలగిరి ఎక్స్‌ప్రెస్, ఎర్నాకుళం – పాట్నా ఎక్స్‌ప్రెస్, కోవై – చైన్నై చేరన్ ఎక్స్‌ప్రెస్ వంటివి వరుసగా వస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రైలు బోల్తా కొట్టేందుకు పథకం వేసిన విషయం తెలిసింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సేలం రైల్వే డివిజన్ ఆర్పీఎఫ్ సహాయ కమిషనర్ రతీష్ బాబు, డీఎస్పీ బాబు అధ్యక్షతన పోలీసులు తీవ్ర విచారణ చేపట్టారు. సీబీసీఐడీ కార్యాలయంలో ఎడప్పాడి భద్రతాధికారి కొరుక్కుపేట: కొడనాడు హత్య దోపిడి కేసులో జయలలిత, ఎడప్పాడి పళనిస్వామిలకు భద్రతాధికారిగా పనిచేసిన వీర పెరుమాళ్ మంగళవారం కోయంబత్తూరులోని సీబీసీఐడీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వివరాలు.. నీలగిరి జిల్లా కోఠగిరి సమీపంలోని కోడనాథ్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, శశికళకు చెందిన ఎస్టేట్, రెండు బంగ్లాలు ఉన్నాయి. 2017 చివరి నెలలో 11 మంది సభ్యుల ముఠా ప్రవేశించి సెక్యూరిటీ గార్డును హత్య చేసి దోపిడీకి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదైంది. సీబీసీఐడీ పోలీసులు గత వారం రాజన్, అన్నాడీఎంకే ప్రముఖులు శంకర్లను మరోసారి విచారించారు. దీంతో జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న కాంచీపురం రిటైర్డ్ ఏడీఎస్పీ వీరపెరుమాళ్‌ను మంగళవారం హాజరుకావాలని సమన్లు సీబీసీఐడీ కోయంబత్తూరుకు పంపింది. తదనుగుణంగా అతను విచారణకు హాజరయ్యాడు. మంగళవారం ఉదయం 10 గంటలకు సీబీసీఐడీ అధికారులు అతడిని విచారించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వీడియోలో రికార్డయ్యాయి. అలాగే గురువారం (13వ తేదీ) జయలలిత సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన భవానీ నుంచి రిటైర్డ్ ఏడీఎస్పీ పెరుమాల్‌ను స్వయంగా హాజరుకావాలని సమన్లు పంపడం గమనార్హం. -
సమన్వయానికి.. కసరత్తు!
● శశికళ, టీటీవీ, వైద్యలింగం భేటీ సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే వర్గాలను సమన్వయ పరిచే దిశగా కసరత్తులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్, మాజీ సీఎం పన్నీరు శిబిరంలో కీలక నేతగా ఉన్న వైద్యలింగంలు భేటీ అయ్యారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణిస్వామి పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. 2026 ఎన్నికల ద్వారా అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. అలాగే, పార్టీ బలోపేతం దిశగా కసరత్తుల వేగాన్ని పళణిస్వామి పెంచారు. రాష్ట్రంలోని యువతను ఆకర్షించే విధంగా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఈ పరిస్థితులలో అన్నాడీఎంకే నుంచి బహిష్కరించ బడ్డ దివంగత సీఎం జయలలిత నెచ్చెలి , చిన్నమ్మ శశికళ , అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత దినకరన్, మాజీ సీఎం పన్నీరు సెల్వం మళ్లీ అందర్నీ ఏకం చేస్తాం.... సమష్టి సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కొంటామన్న నినాదంతో గత కొంత కాలంగా ముందుకు సాగుతూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో అందర్నీ సమన్వయ పరిచే కసరత్తులు వేగవంతం చేసే విధంగా వ్యూహాలకు వీరు పదును పెట్టినట్టున్నారు. ఇందులో భాగంగా తంజావూరులోని ఒరత్తనాడు వేదికగా ఓ సమావేశం జరిగి ఉండటం మంగళవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఒరత్తనాడులోని వైద్యలింగం నివాసంకు తొలుత దినకరన్, ఆతర్వాత శశికళ రావడం గమనార్హం. వైద్యలింగంకు పరామర్శ అని భావించినా, దీని వెనుక అన్నాడీఎంకే రాజకీయ చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా అన్నాడీఎంకేలో అందర్నీ సమన్వయ పరిచి, సమష్టి వేదికపైకి తీసుకొచ్చే వ్యూహాన్ని రచించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మేరకు త్వరలో మాజీ సీఎం పన్నీరు సెల్వం, శశికళ, దినకరన్‌లు ఒకే వేదిక మీద కనిపించ బోతున్నారు. ఆ తదుపరి అన్నాడీఎంకేలోని కేడర్, నేతలను ఏకం చేసే విధంగా వ్యూహాలకు పదును పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ భేటీ గురించి దినకరన్ పేర్కొంటూ, వైద్యలింగం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది వచ్చారని, ఆయన్ని పరామర్శించినట్టు పేర్కొన్నారు. రాజకీయాలు కూడా మాట్లాడుకున్నామని పేర్కొన్నారు. అలాగే చిన్నమ్మ శశికళను ప్రశ్నించగా దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత మార్గంలో అన్నాడీఎంకేలో అందరూ ఏకం కావాలని, అప్పుడే పార్టీకి బలం , అధికారం తథ్యం అన్నది గుర్తించాలని సూచించారు. 2026 ఎన్నికలలో అందరూ ఒకే వేదిక మీదకు వస్తారన్న నమ్మకం ఉందన్నారు. -
యమకాతగి విజయం సంతృప్తి నిచ్చింది
తమిళసినిమా: నైసాట్ మీడియా వర్క్స్ పతాకంపై శ్రీనివాసరావు జలగం నిర్మించిన చిత్రం యమకాతగి. అరుణ శ్రీ ఎంటర్టైనర్ సంస్థ భాగస్వామ్యంలో రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ రాహుల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. పెప్పిన్ జార్జ్ జయశీలన్ కథ, బాధ్యతలను నిర్వహించిన ఇందులో నటి రూప కడువయుర్ ,నరేంద్ర ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించగా, గీత కై లాసం, రాజు రాజప్పన్, సుభాష్ రామస్వామి, హరిత తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి సుజిత్ సార్ ఛాయాగ్రహణం, జెసిన్ జార్జ్ సంగీతాన్ని అందించారు. కాగా జాతి వివక్షత, గ్రామీణ రాజకీయాలు ఇతివతంగా రూపొందిన ఈ చిత్రం గత ఏడవ తేదీన తెరపైకి వచ్చింది. దీన్ని తమిళనాడులో యశ్వా పిక్చర్స్ సంస్థ విడుదల చేసింది. కాగా చిత్రం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న నేపథ్యంలో యూనిట్ వర్గాలు థాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు పెప్పిన్ జార్జ్ జయశీలన్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాతలకు ఒక్క పేజీ లో రాసిన ఐడియాలు మాత్రమే చెప్పానని వెంటనే వారు బాగుంది కథను డెవలప్ చేయమని చెప్పడం వల్లే ఈ చిత్రం రూపొందడం, విజయం సాధించడం జరిగిందని పేర్కొన్నారు. చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత వెంకట్ రాహుల్ మాట్లాడుతూ తను కథానాయకుడు కావాలి అని 20 ఏళ్ల క్రితం చిత్రపశ్రం లోకి వచ్చానని ఒక చిత్రంలో హీరోగా నటించాలని చెప్పారు. ఆ తర్వాత తగిన అవకాశాలు తాగడంతో తానే ఇతరులకు అవకాశాలు కల్పించాలన్న భావనతో చిత్ర నిర్మాణం సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా చి యమకాతగి చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. ఈ చిత్ర విజయం మరిన్ని చిత్రాలను నిర్మించడానికి దోహదపడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్మాత శ్రీనివాసరావు జలగం మాట్లాడుతూ తమ తొలి ప్రయత్నానికి యూనిట్ సభ్యులందరూ ఎంతగానో సహకరించారని, వారందరికీ విచిత్రాన్ని విజయవంతం చేస్తున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. యమకాతగి చిత్రం విజయం సంతప్తినిచ్చిందని, థియేటర్లు ఫుల్ అవుతున్నాయని అయితే ఈ చిత్రానికి మరింత ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సందర్భంగా వేదికపై యూనిట్ సభ్యులు మహిళ పాత్రికేయుల సమక్షంలో కేక్ కట్ చేసి చిత్ర విజయానందాన్ని పంచుకున్నారు. -
ఫెంగల్ బాధితులను ఆదుకోండి
● డీఎంకే, కాంగ్రెస్ డిమాండ్సాక్షి, చైన్నె : ఫెంగల్ తుపాన్ సృష్టించిన విలయతాండవం మంగళవారం పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ఇంత వరకు బాధితులకు నష్ట పరిహారం చెల్లించని పుదుచ్చేరి పాలకులు, కేంద్రంలోని ఏన్డీఏ పాలకుల తీరును ఖండిస్తూ డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వివరాలు.. పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు సోమవారం లెప్టినెంట్ గవర్నర్ కై లాష్ నాథన్ ప్రసంగంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండవ రోజైన మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. సీఎం రంగస్వామి ప్రసంగించేందుకు సిద్ధం కాగా ప్రధాన ప్రతి పక్ష నేత (డీఎంకే)శివ లేచి ఫెంగల్ తుపాన్ బాధితులకు నష్ట పరిహారం మాటేంటి? అని ప్రశ్నించారు. ఇది సమయం కాదంటూ స్పీకర్ ఎన్బలం సెల్వం వారించారు. అయితే, డీఎంకే సభ్యులందరూ లేచి బాధితులకు నష్ట పరిహారం చెల్లించడంలో విఫలమైన ఈ పాలకుల తీరును ఖండిస్తున్నామని నినాదించారు. డీఎంకే నినాదాలతో కాంగ్రెస్ సభ్యులు సైతం తోడయ్యారు. దీంతో సభలో నినాదాలతో హోరెత్తియి. గందరగోళం నెలకొంది. సభను గాడిలో పెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించినా, డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు ఏమాత్రం తగ్గలేదు. ఫెంగల్ రూపంలో రైతులు తీవ్ర నష్టాలు, కష్టాలను ఎదుర్కొంటున్నా, ఇంత వరకు నష్ట పరిహారం అన్నది ఇవ్వక పోవడాన్ని ఖండిస్తున్నామని, కేంద్రంలోని ఎన్డీఏ పాలకులు ఈ వ్యవహారంలో అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి వెలుపలకు వచ్చేశారు. అనంతరం ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక, సభలో బుధవారం సీఎం రంగస్వామి బడ్జెట్ దాఖలు చేయనున్నారు. 2025–26 సంవత్సరంకు గాను పూర్తిస్థాయి బడ్జెట్దాఖలు కానుంది. 2026 ఎన్నికలకు సిద్ధం అయ్యేవిధంగా ఈ బడ్జెట్లో కీలక ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. -
తిరుక్కురల్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం
తిరువళ్లూరు: మహిళ దినోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన తిరుక్కురల్ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. తిరువళ్లూరు జిల్లా సెండ్రాన్పాల్యం గ్రామంలో కలాం పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో మంగళవారం మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకల సందర్బంగా పాఠశాలలోని విద్యార్థులకు తిరుక్కురల్, డ్రాయింగ్ తదితర పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను ప్రిన్సిపల్ పారాణ, అన్బు ట్రస్టు నిర్వాహకులు నవీన తదితరులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే ఉపాధ్యాయుడు గోకుల్‌రాజ్, కార్తీక్రాజ్కుమార్, భరణీకుమార్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
దళిత విద్యార్థి వేళ్లు నరికేశారు
తిరునల్వేలి: తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఘోరం జరిగింది. పరీక్ష రాయడానికి వెళ్తున్న దేవేంద్రన్ అనే 11వ తరగతి విద్యారి్థపై కొందరు కిరాతకులు దాడి చేసి చేతి వేళ్లు దారుణంగా నరికేశారు. దిన కూలీ అయిన కొడుకైన దేవేంద్రన్ సోమవారం పాళయంకోటలోని పరీక్షా కేంద్రానికి బస్సులో బయలుదేరాడు. మార్గమధ్యంలో క్రాసింగ్ వద్ద ముగ్గురు వ్యక్తులు బస్సును అడ్డగించారు. దేవేంద్రన్‌ను బయటికి లాగి ఎడమ చేతి వేళ్లు నరికేశారు.అడ్డొచ్చిన అతని తండ్రి గణేశ్‌పైనా దాడి చేశారు. అతనికి తల, ఇతర చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు అడ్డుకోవడంతో అగంతకులు పారిపోయారు. తండ్రీకొడుకులను అదే బస్సులో శ్రీవైకుంఠం ప్రభుత్వాస్పత్రికి, తరువాత తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. దాడికి తెగబడ్డ ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబడ్డీ మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారంగానే దాడికి తెగబడ్డారని దేవేంద్రన్ కుటుంబం ఆరోపించింది. -
తండ్రి మృతదేహం సాక్షిగా వివాహం
సాక్షి, చెన్నై: మరికొన్ని గంటల్లో కుమారుడి వివాహం జరగబోనుండగా.. తండ్రి గుండెపోటుతో(Heart attack) కుప్పకూలిపోయాడు. సాధారణంగా అయితే వివాహాన్ని వాయిదా వేస్తుంటారు. అంతటి దుఃఖంలోనూ వరుడి తల్లి స్పందించి.. తన భర్త నిర్ణయాన్ని అమలు చేశారు. ఆయన మృత దేహం సాక్షిగా కుమారుడి వివాహం జరిపించారు. వివరాలు.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పేరుగోపనపల్లికి చెందిన వరదరాజ్ (60) దుస్తుల వ్యాపారం చేస్తుండగా.. అతని భార్య మంజుల గృహిణి. వీరి కుమారుడు మనీశ్‌కు బర్గూరు చెందిన గోవిందరాజులు, శివశంకరిల కుమార్తె కావ్య ప్రియకు సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం రాత్రి వివాహానికి సంబంధించిన వేడుక నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వరుడి తండ్రి వరదరాజ్ హఠాత్తుగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి.. వరద రాజ్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. దీంతో వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు షాక్ గురయ్యారు. వివాహాన్ని వాయిదా వేద్దా మంటూ సలహాలు ఇచ్చారు. కానీ వరుడి తల్లి మంజుల స్పందించి.. పెళ్లి (marriage) కుదరగానే తన భర్త ఎంతో సంతోషించాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన నిర్ణయం ప్రకారం వివాహ తంతు పూర్తి చేస్తే.. తన భర్త ఆత్మకు శాంతి కలుగు తుందన్నారు. దీంతో గ్రామ పెద్దలు, వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు చర్చించుకొని.. వివాహానికి అంగీకారం తెలిపారు. అనంతరం వరదరాజ్ మృతదేహం సాక్షిగా వరుడు మనీశ్ వధువు మెడలో తాళి కట్టాడు. అనంతరం వరదరాజ్ అంత్యక్రియలు నిర్వహించారు.Video Credit To Polimer News -
ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు భర్తను కడతేర్చింది
అన్నానగర్: తన మరో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. వివరాలు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన జనార్థన (22). అదే ప్రాంతానికి చెందిన ఎలన్ మేరీ(21) కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని వీరిద్దరూ నాగై జిల్లాలోని వేలంగన్నికి వచ్చి మాతా గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జిలో ఉంటున్నారు. అయితే ఆదివారం జనార్థన వేలంగన్ని రైల్వే స్టేషన్ సమీపంలో శవమై వెలుగులోకి రావడం కలకలం రేపింది. అయితే జనార్థన, మేరీతో కలిసి ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైలులో తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని పట్టుకుని విచారణ చేశారు. వారు బెంగళూరు శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్య కుమారుడు జీవన్ (19), 15 ఏళ్ల బాలుడు అని తేలింది. జనార్థనను పక్కా ప్లాన్ చేసి కడతేర్చారని తేలింది. ఎలన్‌మేరీ ఓ వైపు జనార్థన ప్రేమిస్తూనే, మరోవైపు జీవన్‌తో కూడా ప్రేమాయణం వెలగబెడుతున్నట్టు వెల్లడైంది. తమకు అడ్డుగా ఉన్న జనార్థనను కడతేర్చాలని ఎలన్ మేరి, జీవన్ వ్యూహం పన్నారు. దీని ప్రకారం వేలంగన్నిలో జనార్థనను వివాహం చేసుకున్న ఎలన్ మేరి, తన ప్రియుడు జీవన్‌తో కలిసి అతడిని హత్య చేసింది. వాస్తవానికి ఆమెకు రెండేళ్ల క్రితమే ధర్మపురిలో వివాహమైంది. ఆ తర్వాత జనార్థనను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత జీవన్‌ను పెళ్లిచేసుకునేందుకు హత్యకు స్కెచ్ వేసింది. ఈ హత్యకు సంబంధించి ఎలన్ మేరి, జీవన్‌తోపాటు 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
కోతిని తుపాకీతో కాల్చి వండి తినేశారు!
సేలం(తమిళనాడు): కోతిని(monkey) నాటు తుపాకీతో కాల్చి వండి తిన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..దిండుగల్ జిల్లా వీరసిన్నంపట్టి ప్రాంతానికి చెందిన రాజారాంకు అదే ప్రాంతంలో మామిడి, కొబ్బరి తో ఉంది. కోతకు వచ్చిన మామిడి కాయలను ఆరగిస్తూ కోతులు నష్టం కలిగించసాగాయి. దీంతో రాజారాం గ్రామానికి చెందిన జయమణికి రూ. 1000 ఇచ్చి కోతుల బెడద లేకుండా చేయాలని కోరారు. దీంతో జయమణి నాటు తుపాకీతో ఒక కోతిని కాల్చి, దాన్ని వండుకుని తిన్నట్టు తేలింది. ఇది తెలుసుకున్న సిరుమలై అటవీ శాఖ పోలీసులు రాజారాం, జయమణిలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
ఖాళీలన్నీ త్వరలో భర్తీ
● పుదుచ్చేరి ఎల్జీ కై లాస్‌నాథన్ సాక్షి, చైన్నె: ప్రభుత్వంలోని వివిధ విభాగాలలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని పుదుచ్చేరి అసెంబ్లీలో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్ నాథన్ ప్రకటించారు. పుదుచ్చేరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇక్కడ బడ్జెట్ సమావేశాలు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసగంతో ప్రారంభించడం ఆనవాయితీ. ఆ దిశగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలలో తన తొలి ప్రసంగాన్ని అందించేందుకు అసెంబ్లీకి కై లాష్‌నాథన్ ఉదయం వచ్చారు. పుదుచ్చేరి ఎల్జీగా బాధ్యతలు స్వీకరించినానంతరం ఆయనకు ప్రసంగించే అవకాశాలు ఇప్పడే వచ్చింది. దీంతో సభకు వచ్చిన ఆయనకు స్పీకర్ ఎన్బళం సెల్వం,సీఎం రంగస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆహ్వానం పలికారు. ప్రతిపక్ష సభ్యులు సైతంగవర్నర్కు సాదర ఆహ్వానం పలికారు. సభలో గవర్నర్ తమిళంలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలలో పుదుచ్చేరి మాత్రమే అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు విజయవతంగా అందిస్తున్నదని వివరించారు. నాలుగు సంవత్సరాలలో 2,444 ఖాళీలను భర్తీ చేసారని, త్వరలో అన్నిఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఏడాది కాలంగా రంగస్వామి ప్రభుత్వం చేసిన ప్రగతి పనులు, పథకాలు, సంక్షేమకార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఎల్జీ తనప్రసంగాన్ని ముగించారు. దీంతో సభను స్పీకర్ ఎన్బలం సెల్వం మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఎల్జీ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. బుధవారం అసెంబ్లీలో 2025–26 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్‌ను సీఎం రంగస్వామి దాఖలు చేశారు. -
ఐఐటీ మద్రాసులో.. గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం
● ప్రతి ప్రోగ్రాంకు రెండు సీట్ల కేటాయింపుసాక్షి, చైన్నె: వివిధ విద్యాపరమైన సబ్జెక్టులు, నైపుణ్యాలలో విద్యార్థులను అంచనా వేసి, జాతీయ, అంతర్జాతీయ ఒలంపియాడ్స్లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం ఐఐటీ మద్రాసు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ప్రవేశాలను ప్రారంభించింది. ‘సైన్స్ ఒలంపియాడ్ ఎక్స్‌లెన్స్‌గా పిలువబడే, ఈ ప్రవేశం 2025–2026 విద్యా సంవత్సరం నుంచి జేఈఈ (అడ్వాన్స్డ్) వ్యవస్థకు వెలుపుల విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్టు ఐఐటీ మద్రాసు సోమవారం ప్రకటించింది. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్లు, ఫైనార్ట్స్, కల్చర్ ఎక్సలెన్స్ మోడ్స్ ద్వారా జరిగే ప్రవేశాల మాదిరిగానే సైన్స్ ఒలంపియాడ్ ఎక్సలెన్స్‌లో ప్రతి ప్రోగాంకు రెండు సూపర్ న్యూమరీ సీట్లు ఉంటాయని, ఇందులో ఒకటి ప్రత్యేకంగా మహిళలకు కేటాయించినట్టు ప్రకటించారు.ఈ ప్రవేశం నిమిత్తం 12వ తరగతి ఉత్తీర్ణత, అర్హత ప్రమాణం, వయస్సులు సంబంధిత సంవత్సరం కోసం జేఈఈ (అడ్వాన్స్డ్) తరహాలో ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ఇది వరకు ఐఐటీ ప్రవేశాల పొంది ఉండేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. జూన్ 3వ తేదీ నుంచి మొదటి బ్యాచ్ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నామని , సమగ్ర వివరాలు htt pr://ufadmirrionr.iitm.ac.in/rcope వెబ్ సైట్లో లభిస్తాయని వివరించారు. ఈసందర్భంగా ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత గొప్పవైన పజిల్స్ అనేవి పాఠ్య పుస్తకాలను గుర్తు పెట్టుకోవడం ద్వారా పరిష్కరించబడలేదన్నారు. అయితే, ఒక్కొక్క భాగాన్ని విడదీయడానికి సాహసం చేసి, భవిష్య తరాల కోసం కొత్త అద్భుతాలను సృష్టించడం ద్వారా పరిష్కరించ బడ్డాయని పేర్కొన్నారు. ఈ కలతో సైన్స్ ఒలంపియాడ్స్‌లో శ్రేష్టతను ప్రదర్శించిన అభ్యర్థుల కోసం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ప్రవేశాలు అందించడం ద్వారా ఐఐటి మద్రాస్ మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమం కోసం దరఖాస్తు చేయవలసిందిగా ఒలంపియాడ్స్‌లో విజయం సాధించిన దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు పిలుపునిస్తున్నామన్నారు కాగా, ఏరో స్పెస్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, డేటా సైన్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్,ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇంజనీరింగ్ డిజైన్, భౌతికశాస్త్రం, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఓషన్ ఇంజినీరింగ్,వైద్య శాస్త్రం, సాంకేతికత, రసాయన శాస్త్రంలలో ప్రతి విభాగంలోనూ రెండు చొప్పున కేటాయించారు. -
ధర్మేంద్రతో ఢీ...!
● నోరు జారిన కేంద్ర మంత్రి ● కనిమొళి అసహనం ● సీఎం ఆగ్రహంసాక్షి, చైన్నె: కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో డీఎంకే ఎంపీలు పార్లమెంట్ వేదికగా సోమవారం ఢీ కొట్టారు. ఈ సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలను తమిళనాడులోని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆయన వ్యాఖ్యలను సీఎం స్టాలిన్ ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. వారణాసిలో గత నెల జరిగిన కాశీ తమిళ సంఘం సమావేశానంతరం మీడియాతో కేంద్ర ఉన్నతవిద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట ఆగ్రహాన్ని రేపిన విషయం తెలిసిందే. బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ డీఎంకే కూటమి పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నాయి. తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ నిధులు అడిగితే, జాతీయ విద్యావిధానం మేరకు త్రిభాషను అమలు చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తారా? అంటూ పార్లమెంట్ వేదికగా డీఎంకే ఎంపీలు కేంద్ర మంత్రిని నిలదీశారు. డీఎంకే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆదివారం తీసుకున్న నిర్ణయంమేరకు కేంద్రంతో ఢీకొట్టే విధంగాపార్లమెంట్ సెకండ్ సెషన్స్ తొలిరోజే డీఎంకే ఎంపీలు దూకుడుగా ముందుకెళ్లారు. సర్వ శిక్ష అభియాన్ నిధులకు బ్రేక్ వేయడాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే ఎంపీ తమిళళచ్చి తంగ పాండియన్ సభలో వ్యాఖ్యల తూటాలను అందుకోగా, కేంద్ర మంత్రి ఏమాత్రం తగ్గకుండా ఎదురు దాడి చేశారు. అయితే డీఎంకే ఎంపీలను ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్య వివాదానికి దారి తీసింది. తమను అనాగరికులతో పోల్చుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి సభలో తీవ్రంగా ఖండించడమే కాకుండా తమ నిరసనను ఆ పార్టీ ఎంపీలు తెలియజేయడంతో సభా వ్యవహారాలు స్తంభించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు ఢిల్లీ వేదికగా జరిగితే, తమ ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకండా డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని అందుకున్నాయి. ఇదేనా నాగరికం అని వ్యాఖ్యల తూటాలు పేల్చాయి. అదే సమయంలో ఢిల్లీ వేదికగా పార్లమెంట్లో మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా, తమిళులలో మాత్రం ఆగ్రహం తగ్గడం లేదు. సీఎం ఫైర్.. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను సీఎం స్టాలిన్‌తో పాటూ డీఎంకే కూటమిపార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమం వేదికగా సీఎం స్టాలిన్ స్పందిస్తూ, తనను తాను రాజుగా భావించి అహంకారంతో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతున్నట్లుందని మండిపడ్డారు. తమిళనాడుకు నిధులు ఇవ్వకుండా మోసం చేయడమే కాకుందా, తమ ఎంపీలతో దురుసుగా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలను పదే పదే అవమానిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ దీనిని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలు చేస్తామని ఏ సమయంలోనూ తాము చెప్పలేదని, ఆదిలోనే తిరస్కరించామన్న విషయాన్ని మంత్రి గుర్తెరగాలని హితవు పలికారు. తప్పుడు సమాచారాలు ఇవ్వడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. తాముప్రజల గురించి ఆలోచిస్తున్నామని, తమ విద్యార్థుల సంక్షేమమే ముఖ్యం అని పేర్కొంటూ, మళ్లీ మళ్లీ అవమానించినా, మోసాలు చేసే ప్రయత్నం చేసినా తమ ఆగ్రహాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యామంత్రి అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ, త్రిభాషా విధానాన్ని సీఎం అంగీకరించినట్టు, సూపర్ సీఎం అడ్డు పడినట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు చేశారని, ఇంతకీ ఆ సూపర్ సీఎం ఎవరో ఆయన స్పష్టం చేయాలని డిమాండ్‌చేశారు. ఇదే అంశాన్ని తమిళనాడులోని డీఎంకే, కూటమి పార్టీల నేతలందరూ నినాదిస్తూ సూపర్ సీఎం ఎవరో అన్నది మంత్రే చెప్పాలని నినాదాలు అందుకున్నారు. అదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ, కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ, ఆ వ్యాఖ్యలను మళ్లీ తెర మీదకు తీసుకు రావడం నాగరికమా.. అని డీఎంకే వర్గాలను, సీఎంను ఉద్దేశించి ప్రశ్నించడం గమనార్హం. -
పురాతన భవనం పునరుద్ధరణ
సాక్షి, చైన్నె: చైన్నెలోని జార్జ్‌టౌన్‌లో రూ. 9.85తో పురాతన భవనాన్ని పునరుద్ధరించారు. ఇందులో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయ సేవలను మళ్లీ ప్రారంభించారు. 160 ఏళ్ల నాటి ఈ పురాతన భవనం జార్జ్‌టౌన్‌లోని రాజాజీ రోడ్డులో ఉంది. ఈ భవనాన్ని 1864లో నిర్మించారు. ఈ నిర్మాణ శైలిలో అద్భుతంగానూ, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంటుది. ఈ పురాతన భవనాన్ని మద్రాస్ టెర్రస్ అని కూడా పిలుస్తారు. 24,908 చదరపు అడుగుల విస్తీర్ణంలో, టేకు కలపతో అప్పట్లో ఈ భవనం తీర్చిదిద్దారు. ఈ భవనం పురాతనత చెక్క చెదరకుండా ప్రస్తుతం తీర్చిద్దారు. ఇక్కడ రిజిష్ట్రేషన్ల సేవల పనరుద్ధరణ కార్యక్రమం సోమవారం జరగ్గా, ఇందులో వాణిజ్య పన్ను రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మూర్తి, హిందూ ధర్మాదాయ శాఖమంత్రి శేఖర్‌బాబు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి కుమార్ జయంత్, రిజిస్ట్రేషన్ల విభాగం హెడ్ దినేష్ పొన్రాజ్, చైన్నె జిల్లా కలెక్టర్ రష్మీ సిద్ధార్థ్ జగ్డే తదితరులు పాల్గొన్నారు. బీజేపీ బహిరంగ సభలు సాక్షి,చైన్నె : త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా డీఎంకే ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా నిరసన సభలకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు భిన్నంగా త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ నేతృత్వంలో బహిరంగ సభలకు ఆ పార్టీ అధ్యక్షుడు అన్నామలై పిలుపు నిచ్చారు. ప్రస్తుతం ఈ విధానానికి మద్దతుగా ఇంటింటా సంతకాల సేకరణను మరింత విస్తృతం చేస్తూ, మద్దతుగా బహిరంగ సభలకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 23న తిరుచ్చి, 25న తిరునల్వేలి, ఏప్రిల్ 5న వేలూరు, 12న కాంచీపురం, 19న సేలం, 26వ తేదీన చైన్నె, మే 3వ తేది మదురై, మే 11న కోయంబత్తూరులలో బహిరంగ సభలను నిర్వహించి త్రిభాషా విధానం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించనున్నారు. అలాగే, ఇక్కడకు తరలి వచ్చి ప్రజల మద్దతును సంకతాల సేకరణ ద్వారా కూడగట్టుకునేందుకు సిద్ధమయ్యారు. మానవ భద్రత లక్ష్యంగా ఒప్పందాలు సాక్షి, చైన్నె : మానవ భద్రతే లక్ష్యంగా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్పెల్‌బీ ఇంటర్నేషనల్ నిర్వహించింది. తమ ప్రచార కార్యక్రమంలో భాగంగా వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్, సైన్స్(డబ్ల్యూఏఏ)తో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో వివరాలను వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అధ్యక్షుడు డాక్టర్ గ్యారీ జాకబ్ ప్రకటించారు. మానవ భద్రతా విద్యను పాఠశాలల్లోకి అనుసంధానించడంలో సహకారం ఓ ప్రధాన అడుగును సూచిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు, మానవ భద్రతా అవగాహనతో భవిష్యత్ నాయకులకు సాధికారత కల్పించడం తమ అవగాహన లక్ష్యంగా పేర్కొన్నారు. మానవ భద్రతా పరిజ్ఞానంతో తమ భాగస్వామ్యం సూత్రాలను నిర్ధారిస్తామన్నారు. మానవ భద్రత భారతదేశం అంతటా వేలాది మంది విద్యార్థులను చేరుకుంటుందని, వారిని సిద్ధం చేస్తుందన్నారు. స్పెల్‌బీ ఇంటర్నేషనల్ మానవ హక్కులను విస్తరించడానికి కట్టుబడి ఉందని, విద్యాలయాలలో ఈవెంట్లు, వెబ్నార్లు, సెమినార్లు, పోటీలు , ప్రచారాలు సర్వేలు, పరిశోధన కార్యక్రమాలు, కళ, వ్యాసాలు , వక్తృత్వ తదితర పోటీలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు వివరించారు. బస్సు ప్రమాదంలో ఐదుగురికి చేరిన మృతుల సంఖ్య తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని కేజీ కండ్రిగలో ప్రభుత్వ టౌన్ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో అమ్మయార్కుప్పంకు చెందిన కార్మికులు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలతో చైన్నెలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన అమ్మయార్‌కుప్పం గ్రామానికి చెందిన జ్యోతి కుమారుడు అరసు(22) సోమవారం మృతి చెందాడు. దీంతో బస్సు ప్రమాద మృతుల సంఖ్య ఐదుకు చేరింది. -
విజయవంతంగా తమిళ న్యాయ సదస్సు
సాక్షి,చైన్నె : చైన్నెలో రెండు రోజుల పాటుగా అంతర్జాతీయ తమిళ న్యాయ సదస్సు –2025 విజయంతంగా జరిగింది. వినాయక మిషన్ లా స్కూల్, గ్లోబల్ తమిళ లా సెంటర్ లు అంతర్జాతీయ తమిళ న్యాయసదస్సును పయనూర్‌లోని క్యాంపస్‌లో నిర్వహించాయి. తమిళ భాష, సంస్కృతి, ప్రపంచీకరణ యుగంలో చట్టపరమైన అంశాల గురించి న్యాయ నిపుణులు, ప్రతినిధులు ఈ సదస్సులో చర్చించారు. తమిళ న్యాయ సంప్రదాయాల పరిణామ పాత్రను చర్చించడానికి విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, నిపుణుల ప్యానెల్ చర్చలు, ముఖ్య ఉపన్యాసాలు, వంటి అనేక అంశాలను ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రెండురోజుల సదస్సులో సాంఘిక సంక్షేమ శాఖమంత్రి గీతా జీవన్, ఆ విద్యా సంస్థ డీన్ డాక్టర్ అనంత్ పద్మనాభన్, మనోన్మణియం సుందరనార్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ కె. చోక్క లింగం, డాక్టర్ అబ్దుల్ కలాం విజన్స్ 2020 అధ్యక్షుడు తిరుచంద్రన్, తమిళనాడు రాష్ట్ర అధికార భాషా కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ ఎం. ముత్తువేల్, ప్రముఖ న్యాయ నిపుణులు మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పి. విల్సన్, మద్రాస్ హైకోర్టుకు రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ ఎస్. విమల తదితరులు హాజరయ్యారు. ముగింపు సమావేశంలో ఉత్తమ ఐదు ఉత్తమ ప్రజెంటర్లను గుర్తించి, సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ చాన్స్‌లర్ డాక్టర్ ఏఎస్ గణేషన్, ఉపాధ్యక్షులు అనురాధ గణేషన్, బోర్డుసభ్యులు సురేష్ శామ్యుల్, అసిస్టెంట్ డీన్ ఫౌమినా, అసిస్టెంట్ ప్రొఫెసర్ శరవణన్ రవి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిపై కత్తులతో దాడి
సేలం : తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలో ఉన్న అరియనాయకిపురానికి చెందిన తంగ గణేష్. ఇతని కుమారుడు దేవేంద్రన్ (17). ఇతను నెల్లైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లడం కోసం ఊరిలో ఉన్న బస్ స్టాండ్ నుంచి బస్సు ఎక్కి శ్రీవైకుంఠంకు బయలుదేరాడు. అరియనాయకిపురం తర్వాత ఊరు రెడ్డియమ్మాల్పురం ప్రాంతంలో బస్సు వెళుతుండగా అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ముగ్గురు బస్సును అడ్డుకుని, బస్సులో ఎక్కారు. ఆ ముఠా బస్సులో ఉన్న దేవేంద్రన్‌ను కిందకు లాగి కత్తులతో తల, చేతులు, కాళ్ల, శరీరంపై నరికారు. తీవ్రంగా గాయపడిన దేవేంద్రన్ రక్తపు మడుగులో కుప్పకూలాడు. సమాచారం అందుకున్న శ్రీవైకుంఠం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలకు పోరాడుతున్న దేవేంద్రన్‌ను చికిత్స నిమిత్తం శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతనికి అక్కడ ప్రాధమిక చికిత్స చేసి, ఉన్నత చికిత్స నిమిత్తం నెల్లై ప్రభుత్వ ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. అక్కడ తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పలు కోణాలలో విచారణ జరుపుతూ, ముగ్గురు ముఠా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
కోతిని తుపాకీతో కాల్చి వండి తినేశారు!
●ఇద్దరు నిందితుల అరెస్ట్ సేలం : కోతిని నాటు తుపాకీతో కాల్చి వండి తిన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..దిండుగల్ జిల్లా వీరసిన్నంపట్టి ప్రాంతానికి చెందిన రాజారాంకు అదే ప్రాంతంలో మామిడి, కొబ్బరి తో ఉంది. కోతకు వచ్చిన మామిడి కాయలను ఆరగిస్తూ కోతులు నష్టం కలిగించసాగాయి. దీంతో రాజారాం గ్రామానికి చెందిన జయమణికి రూ. 1000 ఇచ్చి కోతుల బెడద లేకుండా చేయాలని కోరారు. దీంతో జయమణి నాటు తుపాకీతో ఒక కోతిని కాల్చి, దాన్ని వండుకుని తిన్నట్టు తేలింది. ఇది తెలుసుకున్న సిరుమలై అటవీ శాఖ పోలీసులు రాజారాం, జయమణిలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
అబుదాబి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం
సేలం : చైన్నె విమానాశ్రయం నుంచి సోమవారం వేకువజామున అబుదాబికి వెళ్లాల్సిన ఎత్తియాట్ విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో ఆ విమానం రన్‌వే పైనే నిలిపివేశారు. ఆ విమానంలో 168 మంది ప్రయాణికులతో పాటూ 178 మంది అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్నారు. వివరాలు.. చైన్నె విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ నుంచి సోమవారం వేకువజామున 4 గంటలకు అబుదాబికి వెళ్లే ఎత్తియట్ విమానం బయలుదేరడానికి సిద్ధమైంది. అందులో 168 ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బందితో పాటూ 178 మంది ఉన్నారు. విమానం రన్‌వేపై బయలుదేరింది. ఆ సమయంలో విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఉన్నట్టు పైలెట్ గుర్తించి, అకస్మాత్తుగా రన్‌వే పైనే విమానాన్ని నిలిపివేశాడు. అనంతరం ఆ విమానాన్ని రన్‌వైపై నుంచి పక్కకు తప్పించి సాంకేతిక నిపుణులు వచ్చి లోపాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు. అయితే ఉదయం 6 గంటలు అయినప్పటికీ సరిచేయడం వీలుకాకపోవడంతో ప్రయాణికులను విమానంలో నుంచి కిందకి దిపివేశారు. తర్వాత వారిని చైన్నె నగరంలోని పలు హెటళ్లలో బస చేయించారు. కాగా పైలెట్ గుర్తించడంతో 178 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. రన్ వే పై నిలిపివేత.. 178 మంది ప్రయాణికులు సురక్షితం -
కదిలిన మగ్గాలు
● ఫలితం పొందకనే 20 రోజుల సమ్మె విరమణ తిరుత్తణి: కూలి పెంచాలనే డిమాండ్‌తో మరమగ్గ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెను విరమించారు. సోమవారం నుంచి తిరిగి పనులకు వెళ్లడంతో మరమగ్గాలు వేగం అందుకున్నాయి. తిరుత్తణి సమీపంలోని పలు ప్రాంతాల్లో లక్షకు పైబడిన ప్రజలు దాదాపు 50 వేల మరమగ్గాలతో లుంగీలు ఉత్పత్తి చేసి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమకు ఇస్తున్న కూలీ తక్కువగా ఉందని, దీనిని పెంచాలనే డిమాండ్‌తో గత నెల 17 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా వారితో చర్చించేందుకు మాస్టర్ వీవర్స్ ముందుకు రాకపోవడంతో కార్మికుల కుటుంబాలు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీంతో గత్యంతరం లేక కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. -
ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు భర్తను కడతేర్చిన మహిళ
● వేలంకన్నిలో పెళ్లి చేసుకుని ప్రియుడితో భర్త హత్యకు స్కెచ్ ● నిందితురాలితో సహా ప్రియుడు, మైనర్ బాలుడు అరెస్ట్ అన్నానగర్: తన మరో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. వివరాలు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన జనార్థన (22). అదే ప్రాంతానికి చెందిన ఎలన్ మేరీ(21) కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని వీరిద్దరూ నాగై జిల్లాలోని వేలంగన్నికి వచ్చి మాతా గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జిలో ఉంటున్నారు. అయితే ఆదివారం జనార్థన వేలంగన్ని రైల్వే స్టేషన్ సమీపంలో శవమై వెలుగులోకి రావడం కలకలం రేపింది. అయితే జనార్థన, మేరీతో కలిసి ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైలులో తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని పట్టుకుని విచారణ చేశారు. వారు బెంగళూరు శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్య కుమారుడు జీవన్ (19), 15 ఏళ్ల బాలుడు అని తేలింది. జనార్థనను పక్కా ప్లాన్ చేసి కడతేర్చారని తేలింది. ఎలన్‌మేరీ ఓ వైపు జనార్థన ప్రేమిస్తూనే, మరోవైపు జీవన్‌తో కూడా ప్రేమాయణం వెలగబెడుతున్నట్టు వెల్లడైంది. తమకు అడ్డుగా ఉన్న జనార్థనను కడతేర్చాలని ఎలన్ మేరి, జీవన్ వ్యూహం పన్నారు. దీని ప్రకారం వేలంగన్నిలో జనార్థనను వివాహం చేసుకున్న ఎలన్ మేరి, తన ప్రియుడు జీవన్‌తో కలిసి అతడిని హత్య చేసింది. వాస్తవానికి ఆమెకు రెండేళ్ల క్రితమే ధర్మపురిలో వివాహమైంది. ఆ తర్వాత జనార్థనను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత జీవన్న్ను పెళ్లిచేసుకునేందుకు హత్యకు స్కెచ్ వేసింది. ఈ హత్యకు సంబంధించి ఎలన్ మేరి, జీవన్‌తోపాటు 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
చైన్నె నుంచి తిరుచ్చి, తూత్తుకుడిలకు అదనపు విమానాలు
కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయం నుంచి తిరుచ్చి, తూత్తుకుడిలకు అదనపు విమానాలు నడుపనున్నట్టు విమానాశ్రయ అఽధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి తూత్తుకుడికి ఇప్పటికే 8 విమానాలు నడుస్తున్నాయి. ఈ నెల 30వ తేది నుంచి వీటిని 12కు పెంచనున్నారు. అలాగే తిరుచ్చికి ఈ నెల 22 నుంచి 16 సర్వీసులను పెంచే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఇదలా ఉంచితే తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో సౌకర్యాలు లేకపోవడంతో బస్సుల్లో వారాంతం రోజుల్లో అక్కడికి వెళ్లే ప్రైవేట్ ఓమ్నీ చార్జీలు విమాన చార్జీలతో సమానంగా వసూలు చేస్తున్నారు. దీంతో విమానాల్లో వెళ్లడం బెటరని చైన్నె విమానాశ్రయం నుంచి తిరుచ్చి, మధురై, సేలం, తూత్తుకుడి వెళ్లే విమానాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయని అధికారులు వెల్లడించారు. హౌసింగ్ బోర్డులో ఇల్లు పేరిట మోసం తిరువొత్తియూరు: చైన్నె, సేతుపట్టులో స్లం క్లియరెన్‌న్స్ విభాగంలో ఇల్లు తీసిస్తానని ఒక మహిళ వద్ద రూ 2.2 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె సేతుపట్టు జగన్నాధపురం రెండవ వీధికి చెందిన దేవిక (40 చింతాద్రి పేటలో నివాసముంటున్న సమయంలో వినోద్ కుమార్ అనే అతను పరిచయమయ్యాడు. చైన్నె కార్పొరేషన్లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ద్వారా ఇల్లు తీసిస్తామని సమ్మబలికి, ఆమె నుంచి వినోద్ కుమార్ రూ 2.2 లక్షలు రెండు విడతలుగా తీసుకున్నాడు. అయితే ఏళ్లు గడిచినా ఇల్లు తీసివ్వకపోవడం, నగదు తిరిగి ఇవ్వాలని కోరినా బెదిరింపులకు దిగడంతో బాధితురాలు చింతాద్రిపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వినోద్ కుమార్‌ను ఆదివారం అరెస్టు చేశారు. పెదనాన్నను హత్య కేసులో యువకుడి అరెస్టు సేలం : పెదనాన్నను హత్య చేసిన యువకుడిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. చెంగల్పట్టు జిల్లా చెన్నేరి గ్రామానికి చెందిన పశువుల వ్యాపారి రవి (45). రెండురోజుల క్రితం రవిని తమ్ముడి కుమారుడు కామేష్ (23) కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రవి రక్తపు మడుగులో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆ సమయంలో అడ్డుకున్న రవి స్నేహితుడు నరసిమ్మన్ (70) కూడా కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో కామేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన విచారణలో మత్తుకు అలవాటుపడిన కామేష్ చెన్నేరి అడవి ప్రాంతంలో దాగి ఉన్నట్టు తెలిసింది. ఈక్రమంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వేమన పద్యాలతో ఆకట్టుకున్న చిన్నారులు కొరుక్కుపేట: వేమన పద్యాలతో, సైన్స్ ప్రశ్నావళి పోటీల్లో చిన్నారులు తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చైన్నె తిరువోత్తియూర్‌లో ఉన్న ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్ నిర్వహిస్తున్న శ్రీ రామకృష్ణా ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నారులకు పోటీలను నిర్వహించారు. తెలుగు వెలుగు అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ పోటీల్లో చిన్నారులకు వేమన పద్యాల పోటీ, సైన్స్ ప్రశ్నావళి పోటీలను నిర్వహించగా , చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పద్యాలతో ఆలరించగా , సైన్స్ ప్రశ్నావళిలోనూ ప్రతిభను చాటుకున్నారు . విజేతలకు బహుమతులతోపాటు పాఠశాలోని ప్రతీ విద్యార్థికి కథలు పుస్తకాలు , స్వీట్లు పంచిపెట్టిన అల్లింగం రాజశేఖర్ మాతృభాషావికాసానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోరారు . తెలుగు మాధ్యమంలో చదివించేందుకు తల్లిదండ్రులను కోరారు. తనవంతుగా ప్రతీ స్కూల్లో తెలుగు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు . కార్యక్రమంలోభాగంగా స్కూల్ ఉపాధ్యాయురాలు బి. శ్వేతకు పార్వతీ పరమేశ్వరుని ఫొటోని బహుకరించి సత్కరించారు. ఇందులో ప్రదానోపాధ్యాయురాలు అపర్ణ , విద్యార్థులు పాల్గొన్నారు. -
‘గ్రీవెన్స్‌డే’లో 447 వినతులు
తిరువళ్లూరు: తమ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో 447 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ వెల్లడించారు. సోమవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.ఇంటి పట్టాల కోసం 8, సాంఘిక సంక్షేమ శాఖకు 78, మౌలిక వసతులు కల్పించాలని 50, ఉపాధి కల్పించాలని 127 వినతులతో సహా మొత్తం 447 వినతులు వచ్చాయి. వీటిని సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో రాజ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, తిరువళ్లూరు జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్న మహిళలు
కొరుక్కుపేట: మహిళలు అన్ని రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్నారని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రిటైర్డ్ జనరల్ మేనేజర్ రేణుకా మోహన్ రావు అన్నారు. సీ్త్రలకు అపారమైన శక్తి ఉందని, ధైర్యంగా అడుగులు వేస్తే విజయపథంలో దూసుకుపోతారని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ ఉమెన్స్ అసోసియేషన్ మద్రాసు ( యూడబ్ల్యూఏఎం) ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా సోమవారం జరుపుకున్నారు. దీనికి చైన్నె టి.నగర్‌లోని ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రదాన కార్యాలయం వేదికై ంది. అసోసియేషన్ అధ్యక్షురాలు వైజయంతి భాష్యకార్లు సభకు స్వాగతం పలికి అసోసియేషన్ తరపున విద్యార్థులకు అందిస్తున్న సేవలను సభకు వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రేణుకా మోహన్ రావు ప్రసంగంలో సీ్త్రలకు అపారమైన శక్తి ఉందని దానిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం నుంచి అవ్వయార్ అవార్డు పొందిన అసోసియేషన్ సీనియర్ సభ్యురాలు యశోద షణ్ముగసుందరం., అలాగే సీనియర్ ఛాంపియన్న్షిప్లో వివిధ పతకాలు గెలుచుకున్నందుకు సంఘ కార్యదర్శి రుక్మిణికి అభినందనలు తెలిపి గౌరవించారు. అలాగే పరిశోధన చేస్తున్న ఐదుగురు విద్యార్థులకు రూ.25,000 విలువైన మొత్తాన్ని స్కాలర్‌షిప్‌లుగా అందజేశారు.ఇంకా వివిధ నగర కళాశాలలకు చెందిన పేద విద్యార్థులు 20 మందికి రూ. 10,000 వార్షిక స్కాలర్షిప్లను అసోసియేషన్ అధ్యక్షురాలు వైజయంతి భాష్యకర్లు పంపిణీ చేశారు. -
భగవన్నామస్మరణతోనే ఈశ్వరానుగ్రహం
కొరుక్కుపేట:చైన్నెలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మూడు రోజుల ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఆదివారం రాత్రి ముగిశాయి. శర్వాణి సంగీత సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో టి.నగర్ వెంకటనారాయణ రోడ్డులోని శృంగేరి భారతీ విద్యాశ్రమం ఆడిటోరియం ప్రవచనాలకు వేదికై ంది. ‘విష్ణు సహస్రనామ సారవైభవం’ అనే అంశం తన ప్రవచనాలతో షణ్ముఖవర్మ ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించారు. చివరి రోజు ఆదివారం శివ పదం పేరుతో నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరిలో ప్రముఖ గాయకులు నిహాల్, వెంకట నాగరాజన్ గానానికి సుదర్శనం (వయోలిన్), ఎస్. విజేంద్రన్ (మృదంగం), కల్యాణ కుమార్ (కీబోర్డు) వాయిద్య సహకారం అందించారు. అనంతరం ప్రవచన కార్యక్రమం సాగింది. తొలుత సామ వేదం షణ్ముఖశర్మ దంపతులను నిర్వాహకులతోపాటు పీవీఆర్ కృష్ణారావు , ఊరా ఆంజనేయులు, ఊరా లక్ష్మీనరసింహారావు, ఊరా శ్రీమన్నారాయణ, చైన్నె కస్టమ్స్, జీఎస్టీ కమిషనర్ కేఎస్ఎస్వీ ప్రసాద్, సంగీత విద్వన్మణి డాక్టర్ తాడేపల్లి లోకనాధశర్మ సహా పలువురు తెలుగు ప్రముఖులు సత్కరించి ఆశీస్సులు అందుకున్నారు . కర్మకొద్దీ వచ్చేవి మనుషుల జన్మలని, భగవన్నామ స్మరణతో మానవాళి పయనిస్తేనే ఈశ్వరుని అనుగ్రహం పొందుతారన్నారు. పెద్దసంఖ్యలో హాజరైన భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. -
తుపాకీ లైసెన్సులు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి
తిరువళ్లూరు: జీవనోపాధి కోసం సంచార కులాలకు చెందిన వ్యక్తులకు నాటు తుపాకీ లైసెన్సులను మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ఉదయం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సబ్‌డివిజన్ పరిధిలో సుమారు రెండువేల సంచార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరు ఆంధ్ర, తెలంగాణా, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వెళ్లి చేపలు, రొయ్యల చెరువుల వద్ద కాపలా ఉంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. చెరువుల వద్దకు కాకులు వస్తే వాటిని తరమడానికి నాటు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి చెదరగొట్టేవారు. ఈ క్రమంలో గత ఏడాది జిల్లా వ్యాప్తంగా నాటు తుపాకులను ఎన్నికల సమయంలో అధికారులు స్వాధీనం చేసుకుని తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వాటిని తమకు తిరిగి ఇవ్వడంతో పాటు లైసెన్సులు ఇస్తే ఎప్పటిలాగే తాము పనులు చేసుకుంటామని కలెక్టర్ ప్రతాప్‌కు విజ్ఞప్తి చేశారు.ర్ లైసెన్సు ఇచ్చే వ్యవహరంపై తక్షణం విచారణ చేయాలని తిరుత్తణి ఆర్డీఓను కలెక్టర్ అదేశించారు. -
బ్రేకప్‌కు కారణం ఇదేనా?
అక్యూస్ట్ చిత్ర షూటింగ్ పూర్తి తమిళసినిమా: తారల ప్రేమ, బ్రేకప్‌ల వంటి వ్యవహారాలకు సినిమారంగంలో సౌండ్ ఎక్కువ. అయితే ఇందులో తప్పెవరిది అని చెప్పడం అంత సులభం కాదు. నిప్పు లేనిదే పొగ రాదు అన్న సామెత ఉన్నా, ఇక్కడ పొగ రాకున్నా నిప్పు రాజేస్తారు. ఇకపోతే నటీనటులు తమ ప్రేమ వ్యవహారాన్ని కొంత కాలం గుట్టుగా ఉంచుకున్నా, ఏదో సందర్బంగా దాన్ని ఒక్కసారిగా బ్లాస్ట్ చేస్తారు. అలాంటి సంఘటనలు సక్సెస్ అయితే బాగానే ఉంటుంది. విఫలం అయితేనే చర్చ అవుతుంది. ఇప్పుడు నటి తమన్నా పరిస్థితి ఇలాంటిదే. నిజం చెప్పాలంటే పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందిన తమన్నా గ్లామరస్ పాత్రల్లో మాత్రం హద్దులను చెరిపేస్తారు. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే. అయితే ప్రేమ వ్యవహారాలకు చాలా కాలం దూరంగానే ఉంటూ వచ్చారు. అలాంటిది రెండేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో పడ్డారు.ఈ విషాయన్ని చాలా గుంభనంగానే ఉంచారు. అయితే నిజం చాలా కాలం దాచబడదు అన్నట్లుగా ఒక వేడుకలో పాల్గొన్న తమన్నా, విజయ్ వర్మలు బహిరంగంగా సుంభనాలు పెట్టుకున్నారు. అలా నెటిజన్లకు చిక్కడంతో తమ ప్రేమ విషయాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పక తప్పులేదు. అవును మేం ప్రేమలో పడ్డాం అని ఇద్దరూ ప్రకటనలు ఇచ్చారు. అంతే కాదు ఆ తరువాత ఈ ప్రేమ జంట మరింతగా సన్నిహితంగా మెలగసాగారు. పెళ్లి చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇలా రెండేళ్లు సాగిన తరువాత ఇప్పుడు సడన్‌గా నటి తమన్నా ప్రియుడితో బ్రేకప్ అంటూ ప్రచారం రచ్చ రచ్చగా మారింది. వీరి బ్రేకప్ వ్యవహారాన్ని వారి సన్నిహిత వర్గాలు దృవపరిచారు కూడా. అయితే నటి తమన్నా, నటుడు విజయ్‌వర్మల ప్రేమ ముగియడానికి కారణం ఏమిటన్న దాని గురించి అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. హిందీ నటుడు విజయ్‌వర్మ ప్రేమపై నమ్మకం పెంచుకున్న తమన్నా ఆయనతో కలిసి ఏడడుగులు వేసి జీవితంలో సెటిల్ అవ్వాలని భావించారట. దీంతో ఆ విషయంపై ఆమె ప్రియుడు విజయ్‌వర్మతో పలు మార్లు మాట్లాడినట్లు, అయితే అందుకు నటుడు విజయ్‌వర్మ సిద్ధంగా లేకపోవడమే వీరి బ్రేకప్‌కు కారణం అని సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఇటు తమన్నా గానీ, అటు నటుడు విజయ్‌వర్మ గానీ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. తమిళసినిమా: జసన్ స్టూడియోస్, సచిన్ సినిమాస్ సంస్థలతో కలిసి శ్రీ దయాకరన్ సినీ ప్రొడక్షన్స్, ఏఐవై స్టూడియోస్ సంస్థల అధినేతలు ఏఎల్.ఉదయ, దయ.ఎన్.పన్నీర్‌సెల్వం, ఎం.తంగవేల్ కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం అక్యూస్ట్. నటుడు ఉదయ, అజ్మల్, యోగిబాబు, దర్శకుడు ప్రభుసాలమన్, నిర్మాత టీ.శివ,ప్రభాకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇందులో కన్నడ నటి జాన్విక నాయకిగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ప్రభు శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ప్రణాళిక ప్రకారం చిత్ర షూటింగ్‌ను జనవరి 2వ తేదీన చైన్నెలోని ఆల్బర్ట్ ధియేటర్లో ప్రారంభించి ఏకధాటిగా 54 రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. సేలం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను సేలంలోని మోడరన్ థియేటర్ వద్ద నిర్వహించిన షూటింగ్‌తో పూర్తి చేసినట్లు చెప్పారు. ఇది నటుడు ఉదయ కేరీర్‌లోనే భారీ బడ్జెట్ కథా చిత్రంగా నిలిచిపోతుందన్నారు. నరేన్ బాలకుమారన్ సంగీతాన్ని అందించిన ఇందులో మూడు ఐటమ్ సాంగ్స్ చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ చిత్రంలోని ఒక పాటను సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్ కుమార్ పాడటం విశేషం అని పేర్కొన్నారు. నిందుతులందరూ నేరస్తులు కాదనీ, అలా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎలా దాదాలుగా మారుతున్నారనే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం అక్యూస్ట్ అని చెప్పారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయన్నారు. ప్రస్తుతం నిర్మానాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయనీ దర్శకుడు తెలిపారు. అక్యూస్ట్ చిత్ర యూనిట్ -
అన్ని డ్యామ్‌లలో కాలువ మరమ్మతులు
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డ్యామ్‌లలోని కాలువల పూడిక తీత పనులతో పాటూ మరమ్మతు పనులు చేయనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని మోర్థాన డ్యామ్‌లో రూ.2.50 కోట్ల వ్యయంతో కుడి, ఎడమల కాలువల్లో పూడిక తీత పనులకు కలెక్టర్ సుబ్బలక్ష్మి అద్యక్షతన సోమవారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోర్ధాన డ్యామ్ నుంచి గుడియాత్తం, కేవీకుప్పం వరకు సుమారు 31,850 మీటర్ల వరకు పూడిక తీత పనులు చేసేందుకు ప్రస్తుతం అనుమతి పొందడం జరిగిందన్నారు. వీటి ద్వారా గుడియాత్తం, కేవీ కుప్పం, లత్తేరి వంటి ప్రాంతాల్లోని రైతులు పంటలు పండించుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వంలోనే రైతులు పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసూం తాము పలు పథకాలను ప్రవేశ పెడుతున్నామని వాటి ద్వారా ప్రజలు అభివృద్ది చెందాలన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నందకుమార్, అములు, యూనియన్ చైర్మన్ రవిచంద్రన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పీఎంకే మాదిరి బడ్జెట్ విడుదల
సాక్షి, చైన్నె: పీఎంకే నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక మాదిరి బడ్జెట్‌ను సోమవారం విడుదల చేశారు. దిండివనంలోని పార్టీ కార్యాలయంలో ఈ బడ్జెట్‌ను ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు ప్రకటించారు. 2025–26లో తమిళనాడు ఆదాయ వసూళ్లు రూ.5,43,442 కోట్లుగా పేర్కొన్నారు. ఇది గత సంవత్సరం ఆదాయం కంటే రూ.1,91,602 కోట్లు ఎక్కువ అని వివరించారు. ఖనిజ వనరుల సమర్ధవంతమైన నిర్వహణ ద్వారా రూ .2,02,010 కోట్ల పన్నుయేతర ఆదాయాన్ని సాధించాలన్న ప్రణాళిక పెరుగుదలకు కారణంగా పద్దులు చూపించారు. తమిళనాడులో 1.20 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా, గత 4 సంవత్సరాలలో 70,000 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించబడ్డాయని పేర్కొన్నారు. వీరిలో 37,026 మందికి మాత్రమే శాశ్వత ఉద్యోగాలు ఇవ్వగా , 33,655 మందికి తాత్కాలిక , కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. తమిళనాడులోని ప్రభుత్వ విభాగాల్లో 6.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ, వీటి భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా ప్రణాళిక , వైద్య సేవలు, విద్యా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, మాన వనరుల పెంపులక్ష్యంగా 6వ తరగతి నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కులాల వారీగా జనాభా లెక్కలు నిర్వహించడానికి రూ . 400 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొంటూ, జూలై 2025 నుంచి తమిళనాడులో కులాల వారీగా జనాభా గణన ప్రారంభించాలన్నారు. వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదిక ఆధారంగావ వన్నియర్లకు రిజర్వేషన్ కల్పన, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను మాదిరి బడ్జెట్లో వివరించారు.. తమిళనాడులోని స్టేట్‌బోర్డు పాఠశాలల్లో 10వ తరగతి వరకు తమిళాన్ని తప్పనిసరి బోధనా మాధ్యమంగా మార్చడానికి ఒక చట్టం అమలు చేయడం, తమిళంలో నేమ్ బోర్డులు లేని దుకాణాలకు రూ . 10,000 జరిమానా విధించడం, వ్యాపార లైసెన్స్‌లు రద్దు చేయడం, పిల్లలకు పేర్లు పెట్టడంకోసం ప్రత్యేక తమిళ పేర్ల జాబితాను విడుదల చేయడం,ప్రభుత్వ ఉద్యోగాలు తమిళ మాధ్యమంలో చదివిన వారికి మాత్రమే ప్రాధాన్యత, తమిళ మాధ్యమంలో చదువుకున్న వారికి ఉన్నత విద్యలో 30 శాతం రిజర్వేషన్లు అమలు వంటి సూచనలు చేశారు. ఏప్రిల్ 1 నుంచి పాత పెన్షన్ పథకం అమలు, ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత , తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం వంటి 73 అంశాలతో పలు సూచనలు,సలహాలు, ఆర్థిక సంబంధిత నివేదికలు, పథకాలను ఈ మాదిరి బడ్జెట్లో పేర్కొన్నారు. -
ఘనంగా వావ్ వండర్ ఉమెన్ అవార్డులు
సాక్షి, చైన్నె: జియో ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వావ్ వండర్ ఉమెన్ అవార్డ్స్ – 2025 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన 13 మంది మహిళా ప్రముఖులను వావ్ వండర్ అవార్డులతో సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం జియో ఇండియా ఫౌండేషన్ నేతృత్వంలో జరిగిన ఈ అవార్డు కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా శారద రమణి, యాస్మీన్ జవహర్ అలీ, ఐపీఎస్ డాక్టర్ ఎం.సి. సారంగన్ , నటి ఇనియాలు హజరయ్యారు. ఈ అవార్డులను అభిరామి మెగా మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నల్లమై రామనాథన్, హైకోర్టు న్యాయవాది సితార అరంగన్, పాప్ సింగర్ షాలిని సింగ్ బాలాజీ, కర్ణాటిక్ గాయని అక్షయ, రేడియో జాకీ ఆర్జే మిరుదుల ఇంకా మల్లికా చౌదరి, జి శ్రీవిద్య, మహాలక్ష్మీ అశ్విన్, విష్ణుప్రియా హెచ్ భట్ తదితరుల అందుకున్నారు. కార్యక్రమంలో జియోఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ప్రియా జెమీమా, జియో ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన గిరిజన మహిళల కోసం టైలరింగ్ మెషీన్లను విరాళంగా అందజేశారు. -
కేంద్రమంత్రి దిష్టిబొమ్మ దహనం
తిరువళ్లూరు: తమిళనాడుకు చెందిన ఎంపీలను కించపరిచేలా పార్లమెంట్లో కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో సోమవారం రైతు బజారు వద్ద దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి నగర కార్యదర్శి రవిచంద్రన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కన్వీనర్ తిరుత్తణి చంద్రన్, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ హాజరై ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని హక్కుల కోసం తాము పోరాటం చేస్తే తమ ఎంపీలను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే తాము హిందీకి వ్యతిరేకంగా పోరాటం చేశామన్న, తమ హక్కులకు భంగం కలిగితే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
టీవీకే ఆధ్వర్యంలో ధర్నా
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న లైగింక వేధింపులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ తమిళగ వెట్రికళగం ఆధ్వంర్యంలో తిరువళ్లూరు మెడికల్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి పార్టీ జిల్లా కన్వీనర్ కుట్టి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కుట్టి మాట్లాడుతూ విద్యార్ధినులపై లైంగిక దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోడం దారుణమన్నారు. అన్నావర్సిటీలో విద్యార్ధినిపై అత్యాచారం జరిగితే నిందితులను కాపాడడానికి మంత్రులే రంగంలోకి దిగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. -
గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో వరుణన్
తమిళసినిమా: ప్రముఖ ఫైనాన్సియర్, నిర్మాత అన్భు చెళియన్ సహకారంతో యాకై ్క ఫిలింస్, వాన్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించిన చిత్రం వరుణన్. నటుడు రాధారవి, చరణ్‌రాజ్, జయప్రకాశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో దుష్యంత్, శంకర్‌నాగ్, నటి గాబ్రియల్లా, హరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. నటి మహేశ్వరి, జీవా రవి, అర్జునాకీర్తీవాసన్, హైడీకార్తీ, ప్రియదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా జయవేల్ మురుగన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బోబో షఫీ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక టీనర్లోని పీటీ త్యాగరాయర్ కళైయరంగంలో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత జీఎన్.అన్భు చెళియన్, నిటుడు రాధారవి, సంగీతదర్శకుల ద్వయం సబేష్ మురళి, నటుడు కృష్ణ తదితర సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత, ఫైనాన్సియర్ అన్భుచెళియన్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన యువకులు కలిసి రూపొందించిన చిత్రం వరుణన్ అని చెప్పారు. చిత్ర దర్శక,నిర్మాతలు తన వద్దకు వచ్చి కథ వినిపించి, సపోర్ట్ చేయాలని కోరారన్నారు. వారి తపనను చూసి, కథ కూడా కొత్తగా ఉండడంతో తాను సపోర్ట్ చేశాననీ, చిత్రం బాగా వచ్చిందని చెప్పారు. కాగా కథానాయకులలో ఒకరైన దుష్యంత్ నటుడు జయప్రకాశ్ వారసుడు అన్నది గమనార్హం. దీంతో నటుడు జయప్రకాశ్ మాట్లాడుతూ ఈ చిత్ర టీమ్ తన వద్దకు వచ్చి చిత్రం చేస్తామని చెప్పడంతో ఎందుకు అంతా బాగానే సాగుతుందిగా అని చెప్పాన్నారు. అయితే చిత్రం చేస్తామని కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో సరేనని చెప్పానన్నారు. ఈ చిత్రానికి అన్భు చెళియన్ సపోర్ట్ చేయడం సంతోషకరం అన్నారు. నీరు ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్ర కథ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగుతుందన్నారు. చిత్రంలో పాటలు చాలా బాగా వచ్చాయనీ, ఇది చిన్న చిత్రం కాదనీ ఆయన పేర్కొన్నారు. -
లోక్‌అదాలత్‌లో 4,351 కేసుల పరిష్కారం
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా లోక్‌అదాలత్‌లో 4,351 కేసుల్లో రూ.19.18 కోట్లకు పరిష్కారం చూపినట్టు తిరువళ్లూరు జిల్లా న్యాయమూర్తి జూలియట్ పుష్ప తెలిపారు. జిల్లాలోని పూందమల్లి, పొన్నేరి, తిరుత్తణి, అంబత్తూరు, తిరువొత్తియూరు, పళ్లిపట్టు, ఊత్తుకోట, గుమ్మిడిపూండి, మాధవరం, తిరువళ్లూరు ప్రాంతాల్లోని కోర్టుల్లో మెగా లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ అదాలత్‌లో కుటుంబ కేసులు, మోటారు వాహన ప్రఽమాదాలు, చెక్‌బౌన్స్‌తో పాటు పలు కేసులను విచారణకు స్వీకరించారు. కేసుల విచారణ కోసం మొత్తం 25 బెంచ్‌లను ఏర్పాటు చేశారు. తిరువళ్లూరులో మెగా లోక్ అదాలత్‌ను జిల్లా న్యాయమూర్తి జూలియట్పుష్ప, సరస్వతి, రమేష్, దీనదయాళన్, సతీష్‌కుమార్, ప్రియ న్యాయమూర్తులు కేసులను విచారించారు. మొత్తం 7,436 కేసులను విచారణకు స్వీకరించగా వీటిలో 4,183 కేసులను పరిష్కరించి రూ.17.49 కోట్లకు పరిష్కారం చూపారు. దీంతో పాటు పెండింగ్‌లో లేని మరో 168 కేసులను సైతం విచారించి 1.68 కోట్లకు పరిష్కారం చూపారు. -
మందుబాబులను పట్టించే హెల్మెట్
– కోవై విద్యార్థినుల సాధన సేలం: మద్యం మత్తులో వాహనం నడిపే వారి వలన ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో మద్యం తాగే వారు మాత్రమే కాకుండా ఇతరులు కూడా బాధింపబడుతున్నారు. ఈ కారణంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. మద్యం తాగిన వారిని గుర్తించడం కోసం పోలీసులు చిన్న రకం యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. సంబంధితుల నోట్లో దాన్ని పెట్టి ఊద మంటున్నారు. మద్యం తాగి ఉండే ఆ యంత్రం కనిపెట్టేస్తుంది. ఈ పనిచేయడానికి పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. వీరి పని సులభతరం చేయడం కోసం కోవైకి చెందిన కళాశాల విద్యార్థినులు అత్యాధునిక హెల్మెట్‌ను రూపొందించారు. ఈ హెల్మెట్ మద్యం తాగి బైక్ నడిపేవారిని కనిపెట్టేస్తుంది. సెన్సార్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ హెల్మెట్, బైక్ జత చేర్చి ఇది ఉపయోగించబడుతుంది. మద్యం తాగి ఉన్నట్టయితే వాహనాన్ని నడపలేని విధంగా ఈ హెల్మెట్‌ను రూపొందించినట్టు విద్యార్థినులు తెలిపారు. -
హక్కుల కోసం సంఘటితం కావాలి
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ, భవన నిర్మాణరంగంలో వున్న అసంఘటిత కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని తమిళనాడు వ్యవసాయ కార్మికుల పార్టీ అధ్యక్షుడు పొన్‌కుమార్ పిలుపునిచ్చారు. తమిళనాడు వ్యవసాయ కార్మికుల పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం పట్టణంలోని ప్రయివేటు కల్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్‌కుమార్ హాజరై పార్టీలోని సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డుల్లో సభ్యులుగా వున్న వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించాలని, బోర్డులో ఇటీవల కఠినతరం చేసిన నియమాలను వెంటనే సవరించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పలు తీర్మానాలు చేసి వాటిని ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిస్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని తీర్మానం చేశారు. -
రూ.74 కోట్లతో 114 ఆలయ రథాల నిర్మాణం
● మంత్రి శేఖర్‌బాబు వెల్లడి కొరుక్కుపేట: డీఎంకే బాధ్యతలు చేపట్టిన తరువాత రూ.74 కోట్లు వ్యయంతో 114 కొత్త ఆలయ రథాలను నిర్మించామని రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖామంత్రి శేఖర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం అంబత్తూరు పాడీలోని తిరువల్లీశ్వరర్, కై లాసనాథర్ దేవాలయాలల్లో నూతన రథం నిర్మాణం, పునరుద్ధరణ పనులను రూ. 3 కోట్ల 49 లక్షల రూపాయలతో చేపడుతున్నారు. ఈ పనుల ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఇందులో హిందూ ధార్మిక శాఖ మంత్రి శేఖర్‌బాబు పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబత్తూరు ఎమ్మెల్యే జోసెఫ్ శామ్యూల్, హిందూ ధర్మాదాయ శాఖ కమిషనర్ పీఎనన్ శ్రీధర్, జాయింట్ కమిషనర్ ముల్లై, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, అంపత్తూరు జోనల్ కమిటీ చైర్మనన్ పీకే మూర్తి, తిరువళ్లేశ్వరర్ ఆలయ ధర్మకర్త కమిటీ చైర్మన్ వనవిల్ విజయ్, ప్రాంతీయ కార్యదర్శి ఎండీ ఆర్.నాగరాజ్, బోర్డు సభ్యులు డీఎస్పీ రాజగోపాల్, డా.పూర్ణిమ. నాగవల్లి ప్రభాకరన్, ఉమా సంతానం, కార్యనిర్వహణాధికారులు కుమరన్, శశికుమార్, భక్తులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి శేఖర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ.. హిందూ ధార్మిక సంక్షేమ శాఖ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమలుకు అనేక పనులకు డిఎంకే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని తెలిపారు. డీఎంకే పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూ. 74 కోట్లతో 114 రథాలను కొత్తగా నిర్మించామని.. మరమ్మతుల కోసం రూ.16 కోట్లతో 64 రథాలు చేపట్టి పనులు పూర్తి చేస్తున్నట్టు వెల్లడించారు. అంతా రాజకీయమే! –మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కొరుక్కుపేట: తమిళనాడులో హిందీ కచ్చితమని చెప్పలేదని, ఇదంతా రాజకీయ అలజడి మాత్రమేనని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడులో తమిళ భాష విషయానికి వస్తే కొత్త జాతీయ విద్యా విధానం తమిళ మాధ్యమం నేర్చుకోవాలనే నొక్కి చెబుతోందన్నారు. తమిళనాడులో చాలా చోట్ల తమిళంలో విద్య కనుమరుగవుతోందని, దీనికి స్వస్తి పలకాలంటే కొత్త జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలి అన్నారు. త్రిభాషా సూత్రం విషయానికి వస్తే, మీరు మూడవ భాషగా ఏ భాషనైనా నేర్చుకోవచ్చు. కొత్త జాతీయ విద్యా విధానంలో ఏ భాషనూ విధించలేదని గ్రహించాలి అని, తమిళనాడుకు సంబంధించినంత వరకు అంతా రాజకీయం మాత్రమే అని, హిందీని ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పలేదని పేర్కొన్నారు. కొత్త జాతీయ విద్యా విధానం తమిళనాడుకు మాత్రమే రావడం లేదు. అన్ని రాష్ట్రాలకు చెందింది. బిహార్ ప్రజలు తమిళం నేర్చుకోవాలనుకుంటే కచ్చితంగా తమిళం నేర్చుకుంటారు. కానీ తమిళం వారిపై రుద్దరు. హిందీని విధించకూడదని చెప్పినట్లే, ఇతర రాష్ట్రాల ప్రజలపై తమిళాన్ని రుద్దలేం. కొత్త జాతీయ విద్యా విధానంలో ఏ భాష ఎవరిపైనా రుద్దకూడదు అన్నదే ప్రధానంగా ఉందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. యువత డ్రగ్స్‌కు అలవాటు పడడమే ఇందుకు ప్రధాన కారణం. తమిళనాడు ప్రభుత్వం గంజాయిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే లైంగికదాడుల సమస్యలను అరికట్టవచ్చన్నారు. బస్సును ఢీకొన్న కారు – రైతు దుర్మరణం సేలం : గోపి సమీపంలో పోలవక్కాలిపాళయంకు చెందిన రైతు గోవిందరాజ్ (60). ఇతను తన మామ ముత్తుస్వామిని సెంబుత్తాం పాళయంకు కారులో తీసుకువెళ్లి వదిలిపెట్టి ఆదివారం సాయంత్రం అదే కారులో తిరుగు ప్రయాణమయ్యారు. దాసంపాళయం అనే ప్రాంతంలో వస్తుండగా రోడ్డు పక్కన ఒక ప్రైవేటు కళాశాల బస్సు నిలపబడి ఉంది. అకస్మాత్తుగా ఆ బస్సును వెనుక వైపుగా గోవిందరాజ్ కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గోవిందరాజ్ కారు శిథిలాలలో చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న గోపి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న కారును బయటకు తీసి చూడగా కారులో శరీరం నుజ్జునుజ్జయిన స్థితిలో గోవిందరాజ్ మృతి చెంది కనిపించాడు. తర్వాత గోవిందరాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపంచనామా నిమిత్తం గోపి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
ఉగాది పోటీలకు అనూహ్య స్పందన
– పద్యాలతో, ఉపన్యాసాలతో ఆకట్టుకున్న చిన్నారులు కొరుక్కుపేట: సర్ త్యాగరాయ కళాపరిషత్ , ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఉగాది సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు చిన్నారులు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు. ఎల్కేజీ నుంచి 9 తరగతి వరకు మూడు విభాగాలుగా పోతన పద్యముల నుంచి పద్యపోటీలు నిర్వహించారు. అలాగే ఉగాది విశిష్టత అనే అంశంపై ఎల్కేజీ నుంచి 6 వ తరగతి వరకు విద్యార్థులకు రెండు విభాగాలుగా ఉపన్యాస పోటీలు, అలాగే ఏడో తరగతి నుంచి 9 వ తరగతి వరకు విద్యార్థులకు సర్ పిట్టి త్యాగరాయ శెట్టి గురించి ఉపన్యాస పోటీ, ఎల్కేజీ నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు మూడు విభాగాలుగా చిత్రలేఖనం పోటీలను నిర్వహించగా , చిన్నారులు ఆయా పోటీల్లో తమదైన ప్రతిభను చాటుకుని అబ్బుర పరిచారు. చైన్నె పాతచాకలి పేటలోని నమశ్శివాయ వీధిలోని శ్రీ కన్నికలమ్మ దేవాలయం ప్రాంగణం వేదికగా జరిగిన ఈ పోటీలు జె. హరికృష్ణ, డి. మాధవయ్య, ఎస్. హనుమంత రావు, ఎంఆర్ సుబ్రమణ్యం పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు. ఈనెల 14వ తేదీన పాత చాకలిపే టలోని ఏకాంబర శెట్టి వీధిలోని సుబ్బారావు కల్యా ణ మండపం వేదికగా ముగ్గుల పోటీలను నిర్వహించనున్నట్టు కార్యవర్గ సభ్యులు వెల్లడించారు. -
ఆరోగ్యకర భవిష్యత్తు కోసం ఎస్ఆర్సీఎం
● ఎస్ఏఐ అడుగులుసాక్షి, చైన్నె: ఆరోగ్యకర భవిష్యత్తు కోసం ఫిట్‌నెస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించడానికి సమష్టిగా ముందుకు సాగేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), శ్రీ రామ్ చంద్ర మిషన్ (ఎస్ఆర్సీఎం)లు నిర్ణయించాయి. తెలంగాణ మాజీ గవర్నర్ , పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షతన జరిగిన శ్రీఆమెశ్రీ బలం– ఆరోగ్యకర భవిష్యత్తు అన్న అంశంపై జరిగిన కార్యక్రమంలో నిర్ణయం తీసుకున్నారు. చైన్నెలో ని మనపక్కంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యం , ఫిట్నెస్ను ప్రోత్సహించడానికి సమిష్టి నిబద్ధతను తెలియజేస్తూ సంయుక్తంగా ముందుకు సాగేందుకు తీర్మానించా రు. ఈ సందర్భంగా వెల్నెస్ బై హార్ట్‌ఫుల్ నెస్ సీఎండీ డాక్టర్ వర్మ మాట్లాడుతూ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేయడం చాలా ఆనందం ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొనేవారికి మానసిక ఆరోగ్యం, ధ్యాన కార్యక్రమాలను నిర్వహించడానికి సర్టిఫైడ్, అనుభవజ్ఞులైన శిక్షకుల సేవలను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. తద్వారా వారి ఫిట్నెస్ ఇండియా ఉమెన్స్ వీక్ వేడుకలకు దోహదకరంగా ఉంటుందన్నారు. మహిళల ఆరోగ్యం సంరక్షణ అంశాలలో పెట్టుబడి పెట్టడానికి సమిష్టి నిబద్ధత , ప్రాముఖ్యత గురించి డాక్టర్ వర్మ వివరించారు. సీ్త్ర శక్తిని పెంచే కొన్ని సరళమైన , శక్తివంతమైన ఆయుర్వేద పద్ధతులను గుర్తుచేశారు. మహిళల ఆరోగ్యం అంటే కేవలం అనారోగ్యాలను ఎదుర్కోవడం మాత్రమే కాదన్నారు. మహిళలు మనుగడ సాగించడానికి మాత్రమే కాకుండా, వద్ధి చెందడానికి జీవితాంతం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే అని పేర్కొన్నారు. -
ఘనంగా మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం అశేష భక్తజనం నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పళ్లిపట్టు సమీపం మేళపూడిలోని కుశస్థలినది తీరంలో వెయ్యేళ్ల చరిత్ర నిండిన రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం కాలక్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ ప్రకారంలో ముళ్ల పొదలు ఆక్రమించి దీప పూజలు నోచుకోని పరిస్థితులు తలెత్తాయి. దీంతో గ్రామీణులు ముందుకొచ్చి ఆలయ పరిశుభ్రం చేసి ఒంటికాల పూజలు చేపట్టారు. గ్రామీణులతో పాటు భక్తుల విరాళాలతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు, స్వామివారి వాహనాలకు మరమ్మతులు చేపట్టారు. గోపురంతో పాటూ సన్నిధులు నూతనంగా నిర్మించి అందంగా ఆలయం తీర్చిదిద్దారు. దీంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటూ మహాకుంభాభిషేకం వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుదీపాలతో ముస్తాబు చేసి ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి భటాచార్య బృందం హామ పూజలు చేపట్టారు. ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి అనంతరం మేళ తాళాలతో అశేష భక్తజనం నడుమ పవిత్ర పుణ్యతీర్ధాల కలచాలు బయల్దేరి గోపుర కలశానికి మహాకుంభాభిషేకం చేపట్టారు. ఉదయం 11 గంటలకు రుక్మణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. మధ్యాహ్నం భక్తులందరికీ అన్నదానం చేశారు. సాయంత్రం స్వామివారు శేషవాహన సేవలో గ్రామీ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆలయ నిర్వాహకులు నటరాజన్ ఆధ్వర్యంలో గ్రామీణులు మహాకుంభాభిషేక ఏర్పాట్లు చేశారు. -
నేటి నుంచి పుదుచ్చేరి అసెంబ్లీ
– 12న బడ్జెట్ దాఖలు సాక్షి, చైన్నె: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 12వ తేదీన అసెంబ్లీలో సీఎం రంగస్వామిబడ్జెట్ దాఖలు చేయనున్నారు. పుదుచ్చేరిలో గవర్నర్ ప్రసంగం,బడ్జెట్ దాఖలు సమావేశం ఒకేసారి నిర్వహించడం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ దిశగా ఈఏడాదిలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ దాఖలు నిమిత్తం సోమవారం సభ ప్రారంభంకానుంది. తొలిరోజున లెఫ్టినెంట్ గవర్నర్ కై లాస్ నాథన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం తదుపరి రోజు ధన్యవాదుల తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈనెల 12వ తేదీన సభలో సీఎం రంగస్వామి బడ్జెట్ దాఖలు చేయనున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా దాఖలు కాబోతున్న తుది పూర్తిస్థాయి బడ్జెట్‌గా ఇది నిలువనుంది. దీంతో బడ్జెట్లో పొందుపరచాల్సిన అంశాలపై ఇప్పటికే సీఎం రంగస్వామిసమగ్ర పరిశీలన జరిపి ఉన్నారు. కొత్త వాగ్దానాలు,ప్రకటనలు బడ్జెట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్ ప్రసంగంలో కొన్ని అంశాలనుసూచన ప్రాయంగావెల్లడించేఅవకాశాలు ఉన్నాయి. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినానంతరం తొలిసారిగా అసెంబ్లీలో ఎల్జీ కై లాస్‌నాథన్ ప్రసంగించబోతున్నారు. అదే సమయంలో ఇప్పటికే ప్రభుత్వ మిత్ర పక్షం బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు, వారి మద్దతు స్వతంత్ర ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ ఎన్బలం సెల్వం మీద గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. గత సమావేశాలలో ఆయనపై ఏకంగా అవిశ్వాస తీర్మానం నోటీసును వీరు ఇచ్చారు. దీనిని తిరస్కరించిన సీఎం రంగస్వామి విశ్వాస పరీక్ష ద్వారా స్పీకర్‌ను గెలిపించుకున్నారు. ఈ వివాదం తాజా సమావేశాలలో సైతం కొనసాగే అవకాశాలుఉన్నాయి. ప్రభుత్వంలోనే వివాదాలు, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, అనేక వాగ్దానాలు అమలుకు నోచుకోకుండా చేస్తూ వస్తున్న పుదుచ్చేరి పాలకులకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు తొలిరోజు సభలో నిరసన వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. -
ఉభయ సభల్లో సమరం
లోక్‌సభ, రాజ్యసభలలో డీఎంకే ఎంపీలు సమర భేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. ఇతర రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడగట్టుకునేందుకు నిర్ణయించారు. త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా కేంద్రంతో ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం చైన్నెలో జరిగిన డీఎంకే ఎంపీల భేటీలో పలు తీర్మానాలు చేశారు. ● హక్కుల పరిరక్షణ కోసం గళం ● ఇతర రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడగట్టుకునేందుకు నిర్ణయం ● త్రిభాషా, పునర్విభజనకు వ్యతిరేకంగా గళం ● డీఎంకే ఎంపీల సమావేశంలో తీర్మానం సమావేశంలో స్టాలిన్, టీఆర్‌బాలు, కనిమొళి తదితరులు సాక్షి, చైన్నె : సోమవారం నుంచి లోక్‌సభ సెషన్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో డీఎంకే ఎంపీలు వ్యవహరించిన అంశాల గురించి సుదీర్ఘ చర్చ ఆదివారం జరిగింది. తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలోని మురసోలి మారన్ సమావేశ మందిరంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. కొన్ని గంటల పాటూ జరిగిన ఈ భేటీకి ఎంపీలు టీఆర్‌బాలు, కనిమొళి, రాజ, దయానిధి మారన్, తిరుచ్చి శివ, జగద్రక్షకన్, తమిళచ్చి తంగ పాండియన్, ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్,తదితరులు హాజరయ్యారు. లోక్‌సభ, రాజ్యసభలలో ఎంపీలు ప్రస్తావించాల్సిన అంశాలు, ప్రధానంగా తెర మీదకు తీసుకు రావాల్సిన ప్రశ్నలు, కేంద్రంతో ఢీకొట్టే విధంగా ముందుకు సాగే రీతిలో అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. తమిళనాడు హక్కులను పరిరక్షించే విధంగా పార్లమెంట్ వ్యవహారాలను స్తంభింపజేయడానికి వ్యూహరచన చేశారు. ఇందుకోసం ఇండియా కూటమి ఎంపీలతో పాటూ దక్షిణ భారతదేశంలోని ఎంపీల మద్దతును కూడగట్టుకునే దిశగా నిర్ణయించారు. ఒక్కో ఎంపి వ్యవహరించాల్సిన అంశాలతో పాటూ సభలోనే ప్రతి ఒక్కరూ ఉండే విధంగా, రాష్ట్ర హక్కులపై నిరంతర పోరాటాలు ఢిల్లీ వేదికగా సాగించేదిశగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం డీఎంకే కార్యాలయం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానాలుగా ప్రకటించాయి. మద్దతుతో.. పునర్విభజన కారణంగా సీట్లు కోల్పోయే ఇతర రాష్ట్రాలతో కూడా ఐక్యంగా ఉండి, వారి మద్దతును కూడగట్టుని కలిసి పోరాడే విధంగా తీర్మానం చేశారు. డీలిమిటేషన్ పరిణామాలు తమిళనాడు చట్టబద్ధమైన హక్కులను ప్రభావితం చేస్తాయని, అందుకే జనాభా నియంత్రణ కారణంగా లోక్‌సభ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉన్న 7 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లోని రాజకీయ పార్టీలను ఏకం చేసి పోరాట రంగంలోకి తీసుకురావడానికి కూటమి పార్టీల పార్లమెంటేరియన్లతో కలిసి తాము బాధ్యత తీసుకుంటామని డీఎంకే పార్లమెంటేరియన్లు స్పష్టం చేశారు. తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని విధంగా, డీలిమిటేషన్ అంశంలో న్యాయం కోసం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రికి మద్దతు గా, హక్కులను కాపాడే ధార్మిక ప్రయత్నంలో ఏమాత్రం తగ్గకుండా ముందుకెళ్తామని ఎంపీలు ప్రతిజ్ఞ చేశారు. నియోజకవర్గ పునర్విభజనలో రాష్ట్ర హక్కులను కాపాడటానికి తాము ఇతర పార్లమెంట్ సభ్యులతో కలిసి అడుగుల వేస్తామని, సోమ వారం నుంచి జరిగే పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల రెండవ సెషన్స్ల ఢిల్లీ వేదికగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని, మిత్రపక్ష సభ్యులు, ఇండియా అలయన్స్ సభ్యులు, అందరు ఎంపీలను ఒకచోట చేర్చడమే కాకుండా, రాష్ట్రాల హక్కులను కాపాడటానికి, పునర్విభజన ప్రభావిత రాష్ట్రాల సీట్ల సంఖ్య, నిష్పత్తిని కాపాడటానికి ఏమాత్రం తగ్గబోమని తీర్మానం చేశారు. పోరాటం ఆగదు: సీఎం అంతకు ముందు ఈ సమావేశంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, డీఎంకే అఖిల పక్షం భేటీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోందని, ప్రస్తుతం అందరి దృష్టి డీఎంకే కార్యాచరణ వైపుగా మరలి ఉన్నట్టు వ్యాఖ్యానించారు. పునర్విజన ప్రభావానికి గురి అయ్యే ఏడు రాష్ట్రాలలోని 29 పార్టీల నేతలకు, సీఎం, మాజీ సీఎంలకు తాను లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక్కోరాష్ట్రానికి డీఎంకే తరపున ఒక ఎంపీ, ఒక మంత్రి వెళ్లి పునర్విభజన ప్రక్రియ వల్ల జరగబోయే నష్టాలను ఆయా పార్టీల నేతలను కలిసి వివరించే విధంగా కార్యాచరణ సిద్ధచేశామన్నారు. ఇది ప్రారంభం మాత్రమే అంటూ, హక్కుల సాధనలో పూర్తిగా విజయంసాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్రం చేస్తున్న కుట్రలు, రచిస్తున్న వ్యూహాలన్ని తిప్పి కొట్టి తీరుతామని ఇందుకోసం ఎంపీలందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. తీర్మానాలు ఇవే.. ఉదయం 10.30 గంటల నుంచి కొన్ని గంటల పాటుగా జరిగిన డీఎంకే పార్లమెంటరీ సభ్యుల సమావేశంలో ఆమోదించినట్టుగా పేర్కొంటూ తీర్మానాలు ప్రకటించారు. తమిళనాడు లోక్‌సభ నియోజకవర్గాలను పరిరక్షించుకునే విధంగా పార్లమెంట్, రాజ్యసభలలో తమ గళాన్ని, స్వరాన్ని పెంచేందుకు తీర్మానించారు. తమిళనాడు ప్రయోజనాలను పరిరక్షించడమే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల హక్కుల సంరక్షణ కోసం కూడా గళాన్ని వినిపించనున్నారు. సీఎం స్టాలిన్ మార్గ దర్శకత్వంలో భారత పార్లమెంట్లో తమ గొంతుకను బలంగా వినిపిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడుకు నిధుల పంపిణీలో నిరంతరం వివక్ష చూపుతూ, అనేక రంగాలలో తమిళనాడు సాధించిన పురోగతికి ఆధారమైన ద్విభాషా విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఖండించారు. హిందీని బలవంతంగా రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడును నిరంతరం మోసం చేస్తున్న బీజేపీ పాలకులు, ప్రస్తుతం జనాభా ఆధారిత నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా గందరగోళం సృష్టిస్తున్నట్టు ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రస్తుతం కుట్ర పూరితంగా పార్లమెంటరీ సీట్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో ఉన్నారని మండిపడ్డారు. బీజెపి కుట్రను స్పష్టంగా గ్రహించి, ఈ అంశాన్ని అస్త్రంగా చేపట్టి ఒక్క తమిళనాడే కాదు, దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలను ఏకం చేసే విధంగా ముందుకెళ్తున్న సీఎం స్టాలిన్‌ను అభినందించారు. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ అంశంపై ముఖ్యమంత్రి చేపట్టే అన్ని ప్రయత్నాలకు పూర్తిగా మద్దతు ఇస్తామని ఎంపీలు ప్రకటించారు. అలాగే ఈ అంశాలను పార్లమెంటులో తెర మీదకు తెచ్చి తమిళనాడులో ఒక్క పార్లమెంటరీ సీటు కూడా తగ్గకుండా చూసుకోవడంలో, పార్లమెంటులో తమిళనాడుకు చెందిన సీట్ల నిష్పత్తిని కొనసాగించడంలో విజయం సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. -
వసూళ్లలో 70 శాతం పేద విద్యార్థుల కోసమే..
తమిళసినిమా: ఎవరేమి చెప్పిన సినిమా నిర్మాణం అనేది వ్యాపార దృక్ఫథమే. అయితే ఇందులో కొన్ని పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిన చిత్రాలు కాగా మరికొన్ని మానవతా విలువలను పెంపొందించే కథా చిత్రాలుగా ఉంటాయి. వీటిని సందేశాత్మక జనరంజక కథా చిత్రాలు అని కూడా చెప్పవచ్చు. అలాంటి కథా చిత్రం మనిదమ్. యువర్ బ్యాకర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రానికి బ్రునో దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గత శుక్రవారం థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకుల ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. మంచి కథా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అన్న దానికి ఈ చిత్రం ఒక ఉదాహరణ అని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. తమ చిత్రానికి ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణకు సంతోషంగా ఉందన్నారు. మానవత్వం ప్రధాన అంశంగా పలు ఆలోచింపచేసే సన్నివేశాలతో రూపొందిన చిత్రం మనిదమ్ అని వారు తెలిపారు. కాగా ఈ చిత్ర థియేటర్లో వసూలు చేసిన మొత్తంలో 70 శాతాన్ని చదువుకునే స్థోమత లేక కష్టపడుతున్న పేద విద్యార్థుల కోసం అందించాలని నిర్ణయించినట్లు నిర్మాత కష్ణంరాజు చెప్పారు. -
ఏప్రిల్‌లో తెరపైకి రాజపుత్రన్
తమిళసినిమా: నటుడు ప్రభు, వెట్రి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం రాజపుత్రన్. కణంలో కథనాయకుడిగా నటిస్తున్న కోమల్ కుమార్ ఈ చిత్రం ద్వారా విలన్‌గా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్, మన్సూర్ అలీ ఖాన్, లివింగ్ స్టన్, తంగ దురై, ఇమాన్ అన్నాచ్చి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని గ్రసంత్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎం షఫీ నిర్మిస్తున్నారు. మహాకందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఐస్ నెలఫల్ రాజా సంగీతాన్ని, ఆలీవర్ డేని ఛాయాగ్రహణం అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ చిత్రం షూటింగ్ ను రామనాథపురం పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ఇది 1990 ప్రాంతంలో రామనాథపురం జిల్లాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన కథాచిత్రమని తెలిపారు. చిత్రంలో మనసును ఆకట్టుకునే ప్రేమ సన్నివేశాలతో పాటూ తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని సహజత్వానికి దగ్గరగా రూపొందించినట్లు చెప్పారు. దీనికి వైరముత్తు పాటలను రాయగా ఒక పాటను దర్శకుడు టీ రాజేందర్ పాడడం విశేషం అన్నారు. అన్ని వర్గాలు చూసి ఆనందించే విధంగా రూపొందించినట్లు జనరంజకమైన కథా చిత్రంగా రాజపుత్రన్ ఉంటుందని దర్శకుడు చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
పూందమల్లి – పోరూర్ మధ్య మెట్రో పనులు పూర్తి
సాక్షి, చైన్నె: ఫేజ్ –2లో భాగంగా చైన్నెలో పూందమల్లి – పోరూర్ మధ్య మెట్రో రైలు పనులు ముగించారు. ఎత్తయిన వంతెన మార్గంగా నిర్మాణాలు జరిగాయి. త్వరలో డ్రైవర్ రహిత మెట్రోరైలు ఈ మార్గంలో ట్రయల్ రన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజధాని నగరం చైన్నెలో ఫేజ్ 1 పనులు ముగియడంతో విమానాశ్రయం నుంచి కోయంబేడు మీదుగా సెంట్రల్‌కు, సెయింట్థామస్ మౌంట్ – ఆలందూరు – సెంట్రల్ మీదుగా విమ్కో నగర్‌కు మెట్రో రైలు సేవలు జరుగుతున్నాయి. ఈ సేవలకు అమిత స్పందన రావడంతో ఫేజ్– 2లో మరో మూడు మార్గాలుగా మాదవరం – సిరుచ్చేరి , మాదవరం – షోళింగనల్లూరు, పూందమల్లి – లైట్ హౌస్‌లను ఎంపిక చేసి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ మార్గంలో డ్రైవర్ రహిత మెట్రో రైలు నడిపేందుకు అధికారులు కసరత్తులు చేపట్టారు. ఇందుకోసం తమిళనాడు సరిహద్దులలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలో ఉన్న శ్రీసిటీలో 108 బోగీలతో 36 డ్రైవర్ రహిత మెట్రో రైళ్ల తయారీ పనులు ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఇందులో మూడు బోగీలతోకూడిన రెండు డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు చైన్నె పూందమల్లి వర్క్ షాపుకు చేరాయి. ఇక్కడ 900 కి.మీ దూరం ఏర్పాటు చేసిన ట్రాక్‌పై ట్రయల్ రన్ జరుగుతోంది. ఈ పరిస్థితులలో పూందమల్లి నుంచి పోరూర్ వరకు 9 కి.మీ దూరం మెట్రో పనులు ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. ఎత్తయిన వంతెన మార్గంగా ఈ నిర్మాణాలు జరిగినట్టు, ప్రధానంగా పోరూర్ సమీపంలోని జాతీయ రహదారిని అనుసంధానించే విధంగా ఎత్తయిన రెడీమెడ్ వంతెన ఏర్పాటు చేసినట్టు అధికారులు వివరించారు. ఈ మార్గంలో పనులు ముగిసి నేపత్యంలో త్వరలో డ్రైవర్ రహిత రైలును ట్రయల్ రన్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇదేమార్గంలో పోరూర్ నుంచి వడపళణి వరకు వంతెన మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వడపళణి సమీపంలోని పవర్ హౌస్ నుంచి లైట్ హస్ వరకు రైలు భూగర్భ మార్గంలో పయనించే రీతిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. వడపళణి సమీపంలోని డబుల్ డెక్కర్ వంతెనమార్గంగా నిర్మాణాలు జరుగుతుండడం విశేషం. ఇదే వేగంతో సాగిన పక్షంలో 2026లో ఈమార్గంలో మెట్రో రైలు సేవలకు అవకాశం ఉంది. పూందమల్లి – పోరూర్ మార్గంలో పనులు ముగియడంతో ఇక్కడ పనిచేసిన ఇంజినీర్లు, ఇతర అధికారులను మెట్రో ఉన్నతాధికారి అర్జునన్ సత్కరించారు. -
ఘనంగా పూచ్చెరిదల్ వేడుక
సేలం: దేశంలో ఉన్న శక్తి పీఠాలలో ప్రసిద్ధి చెందిన తిరుచ్చి సమయపురం మారియమ్మన్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో పూచ్చెరిదల్ (పువ్వులతో మొక్కు తీర్చుకోవడం) వేడుక ఆదివారం ప్రారంభమైంది. భక్తులు పువ్వులను ఊరేగింపూ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుచ్చి జిల్లా సమ యపురం మారియమ్మన్ ఆలయంలో పూచ్చెరిదల్ వేడుకలు గణపతి పూజతో ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. అనంతరం వాస్తు శాంతి, అంకురార్పణ పూజలు చేశారు. అమ్మవారికి పలు రకాల పువ్వుల పళ్లేలను ఏనుగుతోపాటు ఊరేగింపుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద నుంచి ప్రారంభమై మేళతాళాల నడుమ ఆలయానికి తీసుకెళ్లారు. తర్వాత అమ్మవారికి పుష్పాలను సమర్పించి విశేష పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పువ్వుల పళ్లేలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. -
రాబర్ చిత్రం ఎంతో అనుభవాన్నిచ్చింది
తమిళసినిమా: సినీ పాత్రికేయురాలు కవిత నిర్మాతగా మారి ఇంప్రెస్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన చిత్రం రాబర్. ఆనంద్ కష్ణన్ కథ, స్క్రీన్ ప్లే అందించి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో మెట్టు సత్య కథానాయకుడిగా నటించారు జోహాన్ శివనేష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. చిత్రాన్ని తమిళనాడులో శ్రీ శక్తి ఫిలిమ్స్ శక్తివేల్ విడుదల చేయనున్నారు. కాగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. ఇందులో సీనియర్ నిర్మాత త్యాగరాజన్, కలైపులి ఎస్ ధాను,కే భాగ్యరాజ్, నటి రంభ, అంబిక తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను విడుదల చేశారు. ముందుగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్ కవిత మాట్లాడుతూ మనిషి కలలు కనాలనీ, వాటిని సాఫల్యం చేసుకోవడానికి కఠినంగా శ్రమించాలని, నిరంతరం పోరాడాలని పేర్కొన్నారు. తాను వెంటనే చిత్రాన్ని నిర్మించలేదని ముందుగా మూడు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించానని చెప్పారు. అందులో ఒకటి తాత అని ,అందులో 700కు పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ హాస్యనటుడు జనకరాజ్ టైటిల్ పాత్రను పోషించినట్లు చెప్పారు.అదేవిధంగా ఎన్నం బోల్ వాళ్కై అనే వీడియో ఆల్బమ్‌ను రూపొందించినట్లు చెప్పారు. దీన్ని సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా తన యు ఒన్ రికార్డ్స్ సంస్థ ద్వారా విడుదల చేశారని చెప్పారు. తన 22 ఏళ్ల పాత్రికేయ జీవితం ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు.నిర్మాత త్యాగరాజన్ వంటి సినీ ప్రముఖుల స్ఫూర్తితోనే తాను నిర్మాతగా మారానని చెప్పారు. తాను నిర్మించిన తొలి చిత్రం రాబర్ అనీ, దీన్ని మహిళా సమస్యలు ఇతి వత్తాన్ని ప్రధాన అంశంగా చేసుకుని రూపొందించినట్లు చెప్పారు. ఇది తనకు ఎంతో అనుభవాన్ని అందించిందని, ఇకపై కూడా మంచి కథ చిత్రాలు చేస్తామని నిర్మాత కవిత పేర్కొన్నారు. -
చైన్నెలో ‘ఇంటర్నేషనల్ హైపర్ టెన్షన్ సదస్సు
సాక్షి, చైన్నె: దేశం మొదటిసారిగా హైపర్ టెన్షన్ కాంగ్రెస్ 2025 సదస్సుకు చైన్నె వేదికై ంది. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ కార్యక్రమం చైన్నె ట్రేడ్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల ఈ కార్యక్రమం ముగింపు ఉత్సవం ఆదివారం జరగనుంది. 40 మంది అంతర్జాతీయ , 250 మంది జాతీయ వక్తలు, 1,700 మందికి పైగా ప్రతినిధులు ఒకే వేదిక పై హాజరయ్యారు. భారతదేశ జనాభాలో 32శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నందున వైద్యులు, నిపుణులు, పరిశోధకులు సహా ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఈ కాంగ్రెస్ సుదీర్ఘ చర్చలు, సమీక్షలు, పరిశోధనా ఫలితాలను అధ్యయనం చేస్తున్నారు. వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహన్ మాట్లాడుతూ అధిక రక్తపోటును నియంత్రించడం, హృదయనాళ భారాన్ని తగ్గించడం అనే థీమ్ అంశంతో ఈ కాంగ్రెస్‌లో విస్తృతమైన చర్చలు, మార్గదర్శకాలు, వివిధ మార్గాల అన్వేషన మీద దృస్టి పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజీవ్ గుప్తా, డాక్టర్ ఎస్. నరసింగన్, డాక్టర్ పాల్ కె వెల్టన్, డాక్టర్ జియా ఫ్రాంకో పరాటి పాల్గొన్నారు. బాలికపై లైంగిక దాడి ●యువకుడికి 20 ఏళ్ల జైలుసేలం : పుదుచ్చేరిలో చిన్నారిని చైన్నెకి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి హత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ఫాస్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. పుదుచ్చేరి కండెక్టర్ తోట్టం ప్రాంతానికి చెందిన కార్తిక్ (30) చైన్నెలో సినిమా ఔట్‌డోర్ యూనిట్లో పని చేస్తున్నాడు. ఇతని పుదుచ్చేరికి చెందిన ప్లస్– 2 చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని ప్రేమ పేరిట చైన్నెకి తీసుకువెళ్లి తాంబరంలో అద్దె ఇంటిలో పెట్టాడు. గత 2022వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ నుంచి 2022వ సంత్సరం నవంబర్ 4వ తేది వరకు 20 రోజుల పాటు ఆమైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు మేరకు ఓదియంసాలై పోలీసులు కిడ్నాప్, పోక్సో వంటి విభాగాల కింద కేసులు నమోదు చేసి కార్తీక్‌ను అరెస్టు చేశారు. పుదుచ్చేరి పోక్సో ఫాస్ట్ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసులో న్యాయమూర్తి సుమతి శుక్రవారం నిందితుడు కార్తీక్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. బాధిత బాలికకు రూ. 4 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. 73 ఏళ్ల హృద్రోగికి టీఏవీఆర్! సాక్షి, చైన్నె: 73 ఏళ్ల గుండెజబ్బు ఉన్న రోగికి ప్రాణాలను రక్షించే టీఏవీఆర్ ప్రక్రియను నిర్వహించారు. స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ గురించి అవగాహన పెంచే దిశగా గణనీయమైన ముందడుగులో భాగంగా కావేరీ హాస్పిటల్‌లోని టీహెచ్వీ థెరపీలోని సీనియర్ కన్సల్టెంట్, కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజారామ్ అనంత రామన్ ట్రానన్స్కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ప్రక్రియను విజయవంతం చేశారు. ఈ మినిమల్లీ ఇన్వాసివ్ టెక్నిక్ తీవ్రమైన అయోర్టిక్ వాల్వ్ స్టెనోసిస్, గుండె, మూత్రపిండాల వైఫల్యంతో సహా బహుళ కోమోర్బిడిటీలతో బాధపడుతున్న 73 ఏళ్ల రోగికి నిర్వహించి, కొత్త జీవితాన్ని అందించారు. రోగికి గతంలో గుండెపోటు వచ్చింది, నిరంతర కాలు వాపు, తీవ్ర అలసట, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు ఉండేవి. ప్రస్తుతం ఈ ప్రక్రియ తర్వాత కేవలం మూడు రోజులకే రోగిని డిశ్చార్జ్ చేశారు. రెండు నెలల్లోనే గుండె , మూత్రపిండాల పనితీరులో మెరుగుదల కనిపించడంతో అందరికీ అవగాహన కల్పించేలా ఈ వివరాలను వెల్లడించామని డాక్టర్ రాజారామ్ అనంతరామన్ తెలిపారు. కావేరీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. న్యూస్‌రీల్ -
దేశ రక్షణకు.. సగర్వంగా..!
ఓటీఏ అధికారులను సత్కరిస్తున్న జాన్సన్ పి. మాథ్యూ పరమ్ సాక్షి, చైన్నె: ఓ సంవత్సర కాలం కఠోర ఆర్మీ శిక్షణను ముగించుకున్న యువ అధికారులు దేశ సేవకు తమను అంకితం చేసుకున్నారు. వీరిలో 24 మంది వీరనారీమణులు ఉన్నారు. ఇక సరిహద్దుల్లో విధుల నిమిత్తం చైన్నె నుంచి యువ అధికారులు శనివారం బయలుదేరి వెళ్లారు. ముందుగా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన పరేడ్‌లో తమ ప్రతిభను చాటుకున్నారు. వివరాలు.. చైన్నెలోని ఆర్మీ అధికారుల శిక్షణ అకాడమీ నుంచి ఏటా 100 మందికి పైగా యువ అధికారులు దేశ సేవకు అంకింతం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 133 మంది ఆఫీసర్ క్యాడెట్లు, 24 ఆఫీసర్ క్యాడెట్లు (మహిళలు) భారత సైన్యం సేవలకు ఎంపికయ్యారు. అలాగే మరో ఐదు స్నేహపూర్వక విదేశీ దేశాల నుండి ఐదుగురు ఫారిన్ ఆఫీసర్ క్యాడెట్లు ఏడుగురు ఫారిన్ ఆఫీసర్ క్యాడెట్లు (మహిళలు) తమ శిక్షణ, కోర్సును ఓటీఏలో విజయవంతంగా పూర్తి చేశారు. అంతర్జాతీయ సరిహద్దులలో స్నేహం, సహకార బంధాలను పెంపొందించేందుకు సిద్ధమయ్యారు. శిక్షణ ముగించి, దేశసేవకు తమను అంకితం చేసుకునే విధంగా శనివారం వీరి పరేడ్ జరిగింది. ఓ సంవత్సర శిక్షణ కాలంలో వీరు నేర్చుకున్న సాహసనాలను ఇందులో ప్రదర్శించారు. సెయింట్ థామస్ మౌంట్లోని ఓటీఏ అకాడమీ ఆవరణలో ఉన్న పరమేశ్వరన్ డ్రిల్ స్క్వైర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో యువ అధికారులు ఆహుతుల్ని మెప్పించారు. పరేడ్ అనంతరం దేశ సేవకు తమను అంకితం చేసుకుంటూ ప్రతిజ్ఞ చేశారు. దేశానికి నిస్వార్థ సేవ అందిస్తామని, విలువలకు కట్టుబడి ముందుకు సాగుతామన్న నినాదాల్ని యువ అధికారులు మార్మోగించారు. మంత్రముగ్ధులను చేసే మార్షల్ ట్యూనన్లకు అనుగుణంగా ఆఫీసర్ క్యాడెట్ల కవాతు ప్రేక్షకులను ఆకట్టుకుంది. శిక్షణ నైపుణ్యంతో థ్రిల్లింగ్ కంబైనడ్ డిస్ప్లే విన్యాసాలను నిర్వహించారు. అకాడమీ హార్స్ రైడింగ్ క్లబ్ క్యాడెట్లు, రైడింగ్ ఇనన్స్ట్రక్టర్లచే ఈక్వెస్ట్రియన్ డిస్ప్లేతో ప్రదర్శన జరిగింది. నైపుణ్యాలను చాటే విధంగా ఉత్కంఠభరితమైన యుక్తులను క్యాడెట్లు ప్రదర్శించారు. వీక్షకులలో ఉత్సాహాన్ని నింపే విధంగా క్యాడెట్లు, ఫిజికల్ ట్రైనింగ్ ఇనన్స్ట్రక్టర్లచే చక్కటి సమన్వయంతో కూడిన ప్రదర్శనలను అందించారు. పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ పి మాథ్యూ పరమ్ విశిష్ట సేవా పతకం, ఉత్తమయుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకాలను సమీక్షించారు. దేశ సేవకు.. శనివారం శిక్షణ ముగించుకుని సర్టిఫికెట్లను అందుకుని దేశ సేవకు పయనం అయ్యే రీతిలో పరేడ్ జరిగింది. శిక్షణలో ఆరి తేరిన వీరంతా యువ అధికారుల హోదాతో భారత సైన్యంలో వివిధ సేవలు అందించేందుకు కదిలారు. శిక్షణ సమయంలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన శిక్షణాధికారులను మాథ్యూ పరమ్ సత్కరించారు. బీఓయూ మన్య ఎం. కుమార్‌కు స్వోర్డ్ ఆఫ్ హానర్, వెండి పతకం, ఏయూఓ ప్రగతి ఠాకూర్‌కు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమి గోల్డె మెడల్, ఏసీఏ సుర్జీత్ యాదవ్‌కు కాంస్య పతకం ప్రదానం చేశారు. అలాగే యువ అధికారులకు నియామక ఉత్తర్వుల పంపిణీకి సంబంధించి ‘స్టార్స్’ గుర్తింపు అందజేశారు. కొత్తగా ఆర్మీ సేవకు ఎంపికై న వారి ఆదర్శవంతమైన విజయాలను ఈ సందర్భంగా మాథ్యూ ప్రశంసించారు, కొత్తగా నియమించబడిన అధికారులు ’దేశానికి నిస్వార్థ సేవ’ అనే కార్డినల్ సైనిక విలువలను, అన్ని ప్రయత్నాలలో శ్రేష్ఠతను స్థిరంగా సాధించాలని పిలుపునిచ్చారు. కాగా కొత్తగా నియమితులైన అధికారులు, తమ ర్యాంకులు, రెజిమెంటల్ దుస్తులు ధరించి, దేశ గౌరవాన్ని కాపాడడానికి ’గౌరవంగా సేవ చేయడానికి’ కట్టుబడి, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోర్టల్స్ నుంచి బయటకు అడుగుపెడుతూ దేశం, భారత రాజ్యాంగం పట్ల విధేయత చూపిస్తూ ప్రమాణం చేశారు. కాగా ఈసారి దేశ సేవకు పయనమైన వారిలో వీర నారీల సంఖ్య అధికంగా ఉండడం విశేషం. వీరిలో కొందరు ఆర్మీలో సేవలు అందించిన వీర మరణం పొందిన వీరుల కుటుంబాలకు చెందిన వారు, వారి సతీమణులు సైతం ఉన్నారు. తమ వారి అడుగు జాడలలో దేశ సేవకు తమను ఈ వీర నారీమణులు అంకితం చేసుకున్నారు. ఆర్మీ సేవకు యువ అధికారులు సరిహద్దులకు పయనం ఓటీఏలో పరేడ్ పెరిగిన వీరనారీల సంఖ్య -
● పళణి స్వామి ధీమా
మహిళల ఆదరణతో అధికారంలోకి వస్తాం! సాక్షి, చైన్నె: మహిళల ఆదరణతో 2026 ఎన్నికలలో అధికారంలోకి వస్తామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళణి స్వామి ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలో రాయపేటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన పళణి స్వామి మహిళా లోకం బ్రహ్మరథం పట్టాయి. పార్టీ మహిళ నేతలు వలర్మతి, గోకుల ఇందిర తదితరుల నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం ఆవరణలో దివంగత నేత అమ్మ జయలలిత విగ్రహానికి పళణిస్వామి అంజలి ఘటించారు. అలాగే దివంగత నేత ఎంజీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. మహిళలందరికీ శుఽభాకాంక్షలు తెలుపుతూ ముందుకు వెళ్లారు. పార్టీ కార్యాలయంలో పేద మహిళలకు కుట్టుమిషన్లు, ఇడ్లీ పాత్రులు, తదితర పలురకాల వస్తువులను అందజేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ కేక్‌ను కట్ చేసి అందరికి పంచి పెట్టారు. ఈ సందర్భంగా పళణి స్వామి మాట్లాడుతూ దివంగత అమ్మ జయలలిత పాలనలో రాష్ట్రంలోని మహిళలు అందరికీ భద్రత రెట్టింపుగా ఉండేదన్నారు. ఆమె అడుగు జాడలలో గత ప్రభుత్వం అదే భద్రతను కొనసాగించిందన్నారు. అయితే ప్రస్తుతం డీఎంకే పాలన మహిళల భద్రతను ప్రశ్నార్థకంచేసిందన్నారు. దేశానికి కళ్లు లాంటి వారైన మహిళకు ఈ రాష్ట్రంలో కనీస భద్రత లేదని, వారిపై అఘాయిత్యాలు పెరిగి పోయాయయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఆర్థిక బలోపేతంతో గతంలో ముందుకు సాగితే, ఇప్పుడు ఆర్థిక కష్టాలు తప్పడం లేదని ధ్వజమెత్తారు. మహిళలు ఈ పాలన మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారి ఆదరణతో రానున్న ఎన్నికలలో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, తమతో పొత్తుకు పార్టీలు తపస్సు చేస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యాంగ్యాస్త్రంగా చేసిన వ్యాఖ్యల గురించి పళణి స్వామిని ప్రశ్నించగా, ఆయన అన్నాడీఎంకే పేరును ప్రస్తావించారా? అనిఎదురు ప్రశ్న వేశారు. ఆయన ఏమి చెప్పారో సమగ్రంగా పరిశీలించాలే గానీ, ఎందుకు అనవసరంగా వివాదాలు, ప్రచారాలు, చర్చలు అంటూ అసహనం వ్యక్తం చేశారు. -
తూత్తుకుడి సముద్రంలో టెన్షన్.. టెన్షన్
సేలం : తూత్తుకుడి నుంచి మాల్ద్వీపానికి చిన్న రకం పడవలో అక్రమంగా తరలించిన రూ. 33 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తూత్తుకుడి నుంచి సముద్ర మార్గంలో శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలకు మత్త పదార్థాలను అక్రమగా తరలించడం అలవాటుగా మారింది. దీనిపై కేంద్ర రెవెన్యూ ఇంటలిజెన్స్ విభాగం అధికారులు నిఘాపెట్టారు. ఈ స్థితిలో గత మార్చి 4వ తేదీ తూత్తుకుడి నుంచి సముద్ర మార్గంలో మాల్దీవులకు మత్తు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నట్టు కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులకు రహస్య సమాచారం అందింది. దీంతో అధికారులు తూత్తుకుడి పాత హార్బర్‌కు వెళ్లి నిఘా చేపట్టారు. అప్పుడు మల్దీవుల వైపుగా నల్ల చలువ రాళ్ల లోడ్‌తో వెళ్లిన పార్జర్ అని పిలువబడే చిన్న రకం ఓడపై అధికారలకు సందేహం ఏర్పడింది. సినీ ఫక్కీలో ఛేజింగ్.. వెంటనే పాత హార్బర్ నుంచి బయలుదేరిన పార్జర్ను అడ్డుకుని నిలిపేవయాలని సముద్ర తీర భద్రతా భలగాలకు కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగ అధికారులు తెలిపారు. ఆ మేరకు నడి సముద్రంలో వెళుతున్న పార్జర్ ఓడను సముద్రతీర భద్రతాధికారులు వెంటాడారు. ఇది గమనించిన అక్రమ రవాణాదారులు ఓడ వేగాన్ని పెంచారు. అయితే కేంద్ర బృందాలు ఛేజింగ్ చేసి ఆ ఓడను అడుకుని నిలిపారు. తర్వాత ఆ ఓడను సముద్రతీర భద్రతా దళం తూత్తుకుడి హార్బర్‌కు తరలించారు. అనంతరం అందులో కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు జరిపిన సోదాలలో 16 పార్సిళ్లలో అత్యంత ఘాటైన మత్తు పదార్థాం హసీష్ అనే గంజాయి నూనె 30 కిలోలు ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ పార్సిళ్లలో ఉన్న 30 కిలోల గంజాయి నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని అంతర్జాతీయ స్థాయిలో దీని విలువ రూ.33 కోట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ గంజాయి నూనెను అక్రమంగా తరలిస్తున్న ఓడలో పని చేస్తున్న తూత్తుకుడి, ఆలంతలైకు చెందిన క్లిప్టన్, మత్తు పదార్థాల రవాణాకు సహకరించిన తెన్కాశి జిల్లాకు చెందిన నవమణి అనే ఇద్దరిని ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం వారి ఇద్దరి ఇళ్లలోను అధికారులు సోదాలు జరిపారు. అధికారులు క్లిప్టన్, నవమణితోపాటూ 11 మందిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ జరుపుతున్నారు. దీంతో తూత్తుకుడి సముద్రంలో శనివారం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓడలో రూ.33 కోట్ల మత్తు పదార్థాలు అక్రమ రవాణా సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి పట్టుకున్న కేంద్ర బలగాలు ఇద్దరు సిబ్బంది, సహా 11 మంది అరెస్టు -
మీకు జోహార్లు!
ఆడాళ్లు.. అవార్డులు.. పింక్ ఆటోలను జెండా ఊపుతున్న సీఎం స్టాలిన్ సామాజిక సంస్కరణ, మహిళా అభివృద్ధి, మత సామరస్యం, భాషా సేవ, కళ, సైనన్స్, సంస్కృతి, జర్నలిజం, పరిపాలన సహా వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏటా అవార్డులను ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. అవార్డు గ్రహీతకు తలా రూ. ఒక లక్ష చెక్కు, రూ. 50 వేలు విలువైన బంగారు పతకం, సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డులకు ఈ ఏడాది మదర్ థెరిసా మహిళా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ యశోద షణ్ముగసుందరంకు 2025 సంవత్సరానికి ఆవైయార్ అవార్డును ముఖ్యమంత్రి ప్రదానం చేశారు, కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్ కు చెందిన కె. సౌమ్యకు రాష్ట్ర బాలికా సంరక్షణ దినోత్సవ అవార్డును అందజేశారు. కాంచీపురం జిల్లా కలెక్టర్ కలై సెల్వి మోహన్ కూడా రాష్ట్ర బాలికా సంరక్షణ దినోత్సవ అవార్డు అందజేశారు. మహిళలు మరియు పిల్లలపై నేరాలను ఎదుర్కోవడానికి మహిళా పోలీసు దర్యాప్తు అధికారులు, డిటెక్టివ్లకు నైపుణ్యాలు పోలీస్ విభాగంలో నిపుణులు, రాష్ట్ర నేర రికార్డుల బ్యూరో తదితర విభాగాలలో సేవలు అందిస్తున్న మహిళా అధికారులకు పతకాలను అందజేశారు. మహిళా పోలీసుల సాహస ప్రదర్శనలు, విద్యార్థుల కళాత్మక ప్రదర్శనలకు సత్కారాలు జరిగాయి. ముందుగా, క్యారమ్ క్రీడాకారిణి కాసిమా, కళాకారిణి, మహిళా హక్కుల ప్రాజెక్టు లబ్ధిదారు జె. ఎలిజబెత్, మహిళల స్వయం సహాయం కమిటీ సభ్యురాలు నిర్మల, విద్యార్థిని భవాని ఉన్నత విద్య స్కాలర్షిప్ను అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మొత్తంగా రూ. 3200కోట్లు విలువగల సహాయకాలను అందజేశారు. అలాగే కాంచీపురం, ఈరోడ్, ధర్మపురి, శివగంగ, తేని, కడలూరు, నాగపట్నం, రాణి పేట,కరూర్‌లలో రూ. 72 కోట్లతో కొత్తగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణానికి తీసుకున్న చర్యలను సీఎం ప్రకటించారు. సాక్షి, చైన్నె : చైన్నె నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ మహిళా సంక్షేమ శాఖ నేతృత్వంలో జరిగింది. ఇందులో మహిళలకు గుర్తింపుకల్పించే విధంగా, సహకారం అందించే రీతిలో కార్యక్రమాలు, అవార్డులు, సత్కారాలు జరిగాయి. ముందుగా మహిళలకు ప్రయాణంలో భద్రత కల్పించే విధంగా చైన్నెలో పింక్ఆటో సేవలకు శ్రీకారం చుట్టారు. మహిళా సంక్షేమ శాఖ నేతృత్వంలో రూ. 2.41 కోట్లతో 50 ఈ ఆటోలను కొనుగోలు చేశారు. కార్మిక సంక్షేమ శాఖ నేతృత్వంలో రూ. లక్ష చొప్పున సబ్సిడీతో 100 పింక్ ఆటోలు, మరో 100 సాధారణ ఆటోలను కొనుగోలు చేశారు. ఇందులో పింక్ ఆటోలు పూర్తిగా మహిళలు, బాలికల రక్షణ లక్ష్యంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 250 ఆటోలను పూర్తిగా మహిళ డ్రైవర్లే నడుపుతారు. ఈ ఆటోలకు సీఎం స్టాలిన్ జెండా ఊపారు. ఈ ఆటోలలో చట్టాలు, సమాచారం హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అనంతరం 1000 మహిళా స్వయం సహాయక సంఘాలకు గుర్తింపు కార్డులను సీఎం అందజేశారు. ఈ గుర్తింపు కార్డు ద్వారా గ్రామీణ, నగర బస్సులలో ప్రయాణించవచ్చు. సహాయ బృందాలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులో 25 కిలోల వరకు డెలివరీ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య భీమా పథకం ప్రయోజనాలు, సహాకార బ్యాంక్‌ల ద్వార వివిధ రునాల పొదడంలో ప్రాధాన్యత, తమిళనాడు ఆది ద్రావిడర్ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నన్నీలం మగళిర్ భూమి ప్రాజెక్టును అమలు చేస్తూ చర్యలు తీసుకున్నారు. అలాగే,విదేశాల్లో ఉన్నత విద్య కోసం మహిళా విద్యార్థులకు విద్యా సహాయం.. మొత్తంగా ఆది ద్రావిడ , గిరిజన సంక్షేమ శాఖ తరపున. ఐదుమందికి రూ. 3.50 కోట్ల విద్యా స్కాలర్షిప్లను ప్రకటించి అందజేశారు. తమిళనాడు నిర్మాణ కార్మికుల సంక్షేమ శాఖ తరపున 40 మంది మహిళా కార్మికులకు తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్మెంట్ బోర్డ్ ద్వారా గృహ కేటాయింపు ఉత్తర్వులను అందజేశారు. నాన్ మోదల్వన్పథకం మేరకు శిక్షణ పొందిన ముత్తు రత్న, జె. నిరంజన, ఎస్ వర్షిణిలకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. అలాగే, ఈ సేవాకేంద్రాలలో మహిళకు 10 శాతం సేవా చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని ప్రకటించారు. సీ్త్రలు లేకుంటే పురుషులు లేరు.. సీఎం స్టాలిన్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, మార్చి ఒకటిన జరిగిన తన పుట్టిన రోజు, మార్చి 8న జరుపుకుంటున్న మహిళా దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ, సీ్త్రలు లేకుంటే పురుషులు లేరని వ్యాఖ్యానించారు. ద్రవిడ ఉద్యమం ప్రాథమిక లక్ష్యం రక్త, లింగ భేదం లేకుండా పూర్తి సామాజిక న్యాయంతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా హక్కులు, స్థానిక సంస్థలో రిజర్వేషన్ల గురించి ఈసందర్భంగా ప్రస్తావించారు. అన్ని రంగాలలో మహిళలను ఉన్నత స్థానంలో నిలబెట్టడమే తన ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల కట్టడి, బాల్య వివాహాలను నిరోధించడం, స్వయం సహాయక బృందాలకు రుణ ప్రోత్సాహం, వర్కింగ్ ఉమెన్స్ కోసం హాస్టళ్ల నిర్మాణాలను వివరించారు. ప్రస్తుతం మహిళలకు భద్రత కల్పించే విధంగా పింక్ఆటో సేవలకు శ్రీకారం చుట్టామని పేర్కొంటూ, ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకంలో నమోదు,సహకార బ్యాంకుల ద్వారా వివిధ రుణాలలో ప్రాధాన్యత , కో ఆప్ టెక్స్, ఆవిన్ ఉత్పత్తుల్లో మహిళ పాత్రను వివరించారు. ద్రవిడ మోడల్ ప్రభుత్వంలో మహిళల కోసం మరిన్ని పథకాల అమలుకు పరిశీలన జరుపుతున్నట్టు తెలిపారు. అన్ని ప్రణాళికలు మహిళల కోసమేనా, అని పురుషులు ప్రశ్నించే విధంగా పథకలను అమలు చేస్తున్నామన్నారు. ప్రేమ, దయ, ధైర్యం, జ్ఞానం ప్రతి సీ్త్రకి అలంకారణలో పేర్కొంటూ జ్ఞానం, ధైర్యం గుర్తింపుగా మారాలని ఆకాంక్షించారు. ప్రతి సీ్త్రలోనూ అమూల్యమైన శక్తి ఉంటుందని, ప్రపంచం మీదే.. విజయాలు కొనసాగిద్దాం...కొనసాగిద్దాం అని ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, ఉదయనిధి స్టాలిన్, మంత్రులు గీతాజీవన్, ఎం. సుబ్రమణియన్, శేఖర్‌బాబు, సీవీ గణేషన్, కయల్వెలి సెల్వరాజ్, మేయర్ ప్రియ, ఎంపీలు తమిళచ్చి తంగపాండియన్, కనిమొళి సోము, కళానిధి వీరాస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకు ముందు మహిళా దినోత్సవం సందర్భంగా కామరాజర్ సాలైలోని అవ్వయార్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన నివాళులు అర్పించారు. ప్రతి సీ్త్రలోనూ అమూల్యమైన శక్తి ప్రపంచం మీదే.. విజయాలు కొనసాగిద్దాం.. మహిళా దినోత్సవ వేడుకలో సీఎం స్టాలిన్ వ్యాఖ్య అబలకు భద్రతగా పింక్ ఆటో సేవలకు శ్రీకారం ఉత్తమ సేవకులకు అవార్డులు, సత్కారం -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘పెరుసు’
కాళిదాస్ – 2 చిత్ర ఫస్ట్ లుక్ విడుదల తమిళసినిమా: నటుడు వైభవ్, సునీల్ రెడ్డి, నటి నిహారిక ప్రధాన పాత్రలు నటించిన ఇందులో చాందిని తమిళరసన్, నటుడు కరుణాకరన్, బాలా సరవణన్, మునీష్ కాంత్, కింగ్ స్లీ ,దిపా శంకర్, ధనలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థ, బవేజా స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఇళంగోరామ్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పెరుసు చిత్రం ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరు, కథారచయిత కార్తీక్ సంతానం మాట్లాడుతూ మంచి లేటెస్ట్ కంటెంట్‌తో కూడిన వైవిధ్య భరిత కథా చిత్రాలనే తాము నిర్మిస్తామని చెప్పారు. ఈ పెరుసు చిత్రం ఈ కోవకే చెందుతుందని చెప్పారు. ఇది ఏ సర్టిఫికెట్ చిత్రమే అయినా ఎలాంటి వల్గారిటీ లేని డార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. దర్శకుడు ఇళంగో రామ్ చాలా జనరంజకంగా తెరకెక్కించానని చెప్పారు. నటుడు వైభవ్ మాట్లాడుతూ ఓ కుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఇతివృత్తంతో సాగే కథా చిత్రం అని చెప్పారు. అది కుటుంబ సభ్యులకు సీరియస్‌గా ఉన్నా ప్రేక్షకులకు జాలీగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఆ సంఘటనను ఆ కుటుంబంలోని అన్నాదమ్ములు ఎలా ఎదుర్కన్నారు అన్నదే పెరుసు చిత్రం అన్నారు. గతంలో వచ్చిన ఆంబావం, మైకెల్ మదన కామరాజ్ వంటి కల్ట్ కామెడి కథా చిత్రాలీ తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆ చిత్రాలతో పోల్చక పోయినా, మంచి కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. నటుడు వైభవ్ కామెడీ యాక్టింగ్ స్టైల్ ప్రత్యేకంగా ఉంటుందని,ఈ చిత్రంలో ఆయన చాలా బాగా నటించారని చెప్పారు. దీనికి అరుణ్ సంగీతాన్ని, సుందర మూర్తి నేపథ్య సంగీతాన్ని, సత్య ఛాయాగ్రహణం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో శక్తి ఫిలిమ్స్ శక్తివేల్ విడుదల చేస్తున్నారు. తమిళసినిమా: నటుడు భరత్ కథానాయకుడిగా నటించిన చిత్రం కాళిదాస్, శ్రీ సెంథిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019 లో విడుదలై కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడంతో పాటూ మంచి ప్రశంశలు అందుకుంది. కాగా తాజాగా దానికి సీక్వెల్‌గా కాళిదాస్– 2 రూపొందుతోంది. ఇందులో భరత్‌తో పాటూ వర్ధమాన నటుడు అజయ్ కార్తీక్ కథానాయకుడిగా నటించారు. నటుడు ప్రకాష్ రాజ్, ఆడుగళం కిశోర్, సురేష్ మీనన్, ఆనంద్ నగర్, భవానీ శ్రీ, అపర్ణది, రాజా రవీందర్, టీఎం.కార్తీక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా పూవే ఉనక్కాగా చిత్రం ఫేమ్ సంగీత ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ అవుతున్నారు. కాగా కాళిదాస్ చిత్రం ఫేమ్ శ్రీ సెంథిల్ నే దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్‌స్టార్ సెంథిల్ తనకు చెందిన స్కై పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటుడు విజయ్ సేతుపతి శనివారం తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసి, యూనిట్ సభ్యులను అభినందించారు..ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు వివరాలను తెలుపుతూ ఇది క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన చిత్రం అని చెప్పారు. షూటింగ్‌ను చైన్నె, కేరళా ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. కాళిదాస్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత దానిని సీక్వెల్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో నటి సంగీత బలమైన కథా పాత్రను పోషించినట్లు చెప్పారు. ఇది ప్రేక్షకులకు మంచి థియేటర్ ఎక్సీఫీరియన్స్ను ఇస్తుందన్నారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, సురేష్ బాలా ఛాయాగ్రహణం అందించారు. -
ఆరోగ్య సంరక్షణకు చైన్నెలో హోమ్ కేర్ సేవలు
సాక్షి, చైన్నె : రోగుల ఆరోగ్య సంరక్షణ, మెరుగైన వైద్యమే లక్ష్యంగా హోమ్ కేర్ సేవలకు గ్లెనిగల్స్ ఆస్పత్రి శనివారం శ్రీకారం చుట్టింది. ఈ కొత్తసేవ మేరకు అత్యవసరం లేదా, వైద్య సంరక్షణ అవశ్యంగా ఉన్న వారికి వైద్యుల బృందాలు ఇళ్ల వద్దకే వెళ్లి సేవలను అందించనున్నాయి. కలైమామణి నటి నళిని శనివారం చైన్నెలో హోమ్‌కేర్ సేవలను ప్రారంభించారు. ఇంటర్నల్ మెడిసిన్ – డయాబెటాలజీ విభాగం హెచ్ఓడీ – సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వి.అశ్విన్ కరుప్పన్ సమక్షంలో గ్లెనీగల్స్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ నాగేశ్వర్రావు కె ఈ సేవ గురించి వివరించారు. ఈ గృహ సంరక్షణ సేవ, ల్యాబ్, రేడియోలాజికల్ పరీక్షలు, వైద్యులు, నర్సులు, ఫిజియో థెరపిస్టులు, వైద్యసంబంధిత పరికరాలు, వినియోగ వస్తువులు, ఇతర ప్రత్యేక అంశాలతో కూడిన వస్తువులు, రోగుల అవసరాలన్నింటినీ ఒకే చోట అందించే విధంగా ఉంటాయన్నారు. శస్త్రచికిత్స అనంతరం సంరక్షణ, దీర్ఘకాలిక వ్యాధి నిర్వహణతో సహా సకాలంలో ప్రభావవంతమైన సంరక్షణను నిర్ధారించడానికి గృహ సంరక్షణ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ఇందుకోసం వైద్యులు, నర్సులు, వైద్య నిపుణుల ప్రత్యేక బృందం సిద్ధంగా ఉంటుందన్నారు. చైన్నెలోని రోగులు, వారి కుటుంబాలు ఈ హోమ్ కేర్ సర్వీసెస్‌ను 044 – 44777000 నంబర్లో సంప్రదించడం ద్వారా పొందవచ్చని సూచించారు. -
సరిహద్దులను అధిగమించిన సంగీతం..!
బాలీవుడ్ స్వరకర్త శేఖర్ రావ్ జియాని సాక్షి, చైన్నె : సంగీత సరిహద్దులను అధిగమించి ఆకర్షిస్తున్నట్టు బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్‌రావ్ జియాని తెలిపారు. గ్లోబల్ స్కూల్స్ గ్రూప్‌తో తన తొలి తమిళ సింగిల్ పయ్యా..పయ్యా ఆడియోను శనివారం చైన్నెలో ఆవిష్కరించారు. గ్లోబల్ స్కూల్స్‌లో సంగీత విద్యార్థి అరతానా సెంథిల్ రాజా స్వరంతో శేఖర్ రావ్ జియాని సంగీత దర్శకతంలో ‘గరుడ మ్యూజిక్ ’ కింద ఈ తమిళ పాటను స్వరపరిచారు. ఈసందర్భంగా శేఖర్ రావ్ జియాని, గాయనీ ఆరాధనతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తమిళ పాటపయ్య..పయ్య గురించి వివరించారు. యువ కళాకారులను గుర్తించడం, ప్రోత్సహించడం, మార్గనిర్దేశం చేయడం, వారి ప్రతిభను ప్రదర్శించడం గరుడ మ్యూజిక్ ప్రధాన లక్ష్యం శేఖర్ పేర్కొన్నారు. యువ గాయని ఆరాధనతో మొదటి తమిళ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందని, సుదీర్ఘ ప్రయాణానికి ఇది నాంది అని పేర్కొన్నారు. రజనీకాంత్ నటించే సినిమాలో పనిచేయాలన్న ఆసక్తితో ఉన్నట్టు పేర్కొన్నారు. తన సంగీత ప్రయాణంలో గణనీయమైన పాత్ర పోషించిన ఇళయరాజాపై ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. సంగీత భాష సరిహద్దులను అధిగమించి అందరినీ ఆకర్షిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్కూల్స్ గ్రూప్, ఇండియా డిప్యూటీ డైరెక్టర్ అవ్ నీష్ సింగ్, గ్లోబల్ స్కూల్స్ పూర్వ విద్యార్థిని, ప్రఖ్యాత చలనచిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీతేనాండల్ ిఫిల్మ్స్ డైరెక్టర్ హేమ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో నాణ్యత లోపిస్తే లైసెన్స్ రద్దు
తిరువళ్లూరు: రోడ్డు నిర్మాణపు పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్ లైసెన్సును రద్దు చేస్తామని కలెక్టర్ ప్రతాప్ హెచ్చరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మీంజూరు షిప్‌యార్డు నుంచి నిత్యం వేలాది వాహానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కంటైనర్ వాహనాలు సిటీలోకి రావడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో ఔటర్ రింగ్ రోడ్డును మీంజూరు షిప్‌యార్డు నుంచి మహాబలిపురం వరకు నిర్మించాలని నిర్ణయించారు. సుమారు 133 కిమీ మేరకు రూ.2,122 కోట్ల వ్యయంతో మూడుదశలో సాగే నిర్మాణపు పనులు, ప్రస్తుతం మీంజూరు నుంచి ఒదికాడు వరకు పూర్తయ్యింది. రెండవదశ పనులు ఒదికాడు నుంచి శ్రీపెరంబదూరు వరకు వేగంగా సాగుతున్నాయి. ఈక్రమంలో మీంజూరు వద్ద 1.8 కిమీ మేరకు జరుగుతున్న ప్లైఓవర్ బ్రిడ్జీ నిర్మాణపు పనులను కలెక్టర్ ప్రతాప్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలన్న కలెక్టర్, సంబంధిత పనులు నాణ్యతగా వుండాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
మూడో ప్రపంచ యుద్ధం ఇతివృత్తంతో ‘రెడ్ ప్లవర్’
తమిళసినిమా: పిరియడ్ కథలతోనే కాదు, ప్యూచర్ కథలతోనూ వైవిధ్యభరిత కథా చిత్రాలు రూపొందుతున్నాయి. అలా 2047లో మూడవ ప్రపంచ యుద్ధం ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం రెడ్ ప్లవర్. శ్రీ కాళికాంబాళ్ పిక్చర్స్ పతాకంపై కే.మాణిక్యం నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. నటుడు విఘ్నేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో నటి మనీషా జాస్నవి నాయకిగా నటిస్తున్నారు. నాజర్, వైజీ. మహేంద్రన్, సురేశ్‌మీనన్, జాన్‌విజయ్, అజయ్ రత్నం, లీలాసామ్సన్, టీఎం.కార్తీక్, గోపీ కన్నదాసన్, తలైవాసల్ విజయ్, మోహన్‌రామ్ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆండ్రూ పాండియన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది సైన్స్‌ఫిక్షన్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. 2047లో మూడవ ప్రపంచ యుద్ధం ఇతి వృత్తంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు అదరపు బలంగా ఉంటాయన్నారు. దేశభక్తి, ఇద్దరు సహోదరుల మధ్య ద్రోహం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో 4 పాటలు ఉంటాయని, చిత్ర ఆడియో హక్కులను సరిగమ సంస్థ పొందినట్లు చెప్పారు. కాగా త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. రెడ్ప్లవర్ చిత్రంలో విఘ్నేశ్, మనీషా జాహ్నవి -
విద్యతో అతివలకు ఆర్థిక భద్రత
వేలూరు: విద్యతో సీ్త్రలకు స్వేచ్ఛ, ఆర్థిక భద్రత లభిస్తుందని, అదే సమయంలో మహిళలు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని వేలూరు జిల్లా కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరులోని నరువి హాస్పిటల్స్‌లో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడంలో మహిళలు ముందున్నప్పటికీ, వారు కూడా తమ కోసం ఆరోగ్యకరమైన రేపటిని చూసుకోవాలన్నారు. మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఈ రోజు మహిళా దినోత్సవం మనందరికీ ప్రత్యేకమైన రోజని, తనకు ఇంట్లోని మహిళలే కుటుంబానికి మూలమని, మనం ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా చివరికి అమ్మ గుర్తుకు వచ్చేది పిల్లల కార్యకలాపాలేనని ఆమె అన్నారు. జీవితంలో రాణించి పైకి వచ్చిన ప్రతి బిడ్డకూ, ప్రతి మనిషికీ ఎల్లప్పుడూ బాధ్యతాయుతమైన తల్లి ఉంటుందన్నారు. ఇతర విషయాలతోపాటు, మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడద, మనల్ని, మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అని ’’నరువి హాస్పిటల్స్ తమ వద్దకు వచ్చిన ప్రజలకు అద్భుతమైన వైద్యం, ఆరోగ్య సంరక్షణను అందించడం అభినందనీయమన్నారు. అధ్యక్ష ప్రసంగంలో డాక్టర్ జీవీ నరువి హాస్పిటల్స్ చైర్మన్ సంపత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజాయితీ గల అధికారి శ్రీమతి సుబ్బులక్ష్మి రావడం సముచితమన్నారు. నరువి ఆస్పత్రులు మహిళా సాధికారత, అభ్యున్నతికి అంకితం చేశాయన్నారు. అంతకుముందు సాయంత్రం నర్సింగ్ మేనేజర్ శ్రీమతి అనంతి స్వాగతం పలికారు. మహిళా సాధికారతపై నియోనాటాలజిస్ట్ డాక్టర్ అశ్వత, డాక్టర్ నర్మధ, డెర్మటాలజిస్ట్ డాక్టర్ సుజాత తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మిని నరువి హాస్పిటల్స్ని నడిపించిన వైస్ చైర్పర్సన్ శ్రీమతి అనిత సంపత్ సన్మానించారు. మానవ వనరుల శాఖ అసోసియేట్ మేనేజర్ శ్రీమతి అరుణ సభకు ధన్యవాదాలు తెలిపారు. -
దద్దరిల్లిన ప్రభుత్వాస్పత్రి
తిరుత్తణి: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబసభ్యుల ఆందోళన, రోదనలతో శనివారం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రి దద్దరిల్లింది. ప్రభుత్వం మంజూరు చేసిన ఎక్స్‌గ్రేషియా స్వీకరించేందుకు మృతుల కుటుంబాల సభ్యులు నిరాకరించి, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఎక్స్‌గ్రేషియా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 30 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు, తీవ్ర గాయాలుపాలైన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేసియాగా ప్రకటించింది. ఈ మొత్తం పంపిణీ చేసేందుకు శనివారం మధ్యాహ్నం మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్ ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుల కుటుంబాల సభ్యులతో చర్చించి, ఎక్స్‌గ్రేషియా పంపిణీకి ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వ సాయం స్వీకరించేందుకు బాధితులు నిరాకరించారు. తమ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వారికి నచ్చజెప్పి బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేశారు. అయితే బాధితుల కుటుంబాల సభ్యులు కొంత సేపటికే తమ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించి, ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆందోళనకారులతో ఆర్డీఓ దీప, డీఎస్పీ కందన్ చర్చలు జరిపారు. అయినా వారు ఆందోళన విరమించక భీష్మించి కూర్చున్నారు. దీంతో తిరుత్తణి ఆస్పత్రి ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో 13 మంది మహిళలసహా 168 మందిని పోలీసులు అరెస్టు చేసి వాహనాల్లో పోలీసుల బస కేంద్రానికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ అరెస్టు ప్రమాదానికి కారణమై, పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ తిరువళ్లూరుకు చెందిన భాస్కరన్ (53) అనే వ్యక్తిని తిరుత్తణి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా పెంచాలని డిమాండ్ ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత 13 మంది మహిళలసహా 168 మంది అరెస్టు -
తెలుగులోగిళ్లలో మహిళా సంబరాలు
కొరుక్కుపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నగరంలోని తెలుగు సంఘాలు, కళాశాలలు, చర్చిల్లో కోలాహలంగా జరుపుకున్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిభ చాటిన మహిళలను ఘనంగా సత్కరించుకున్నారు. కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ది వాటర్బరి సంఘంలో.. ది వాటర్బరి మెమోరియల్ తెలుగు బాప్టిస్టు సంఘం సీ్త్రల సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దిన వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. వాటర్‌బరీ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో జరిగిన ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలోని జాన్‌వెస్లీ అంతర్జాతీయ మినిస్ట్రీకి చెందిన సహోదరి బెస్లీ జాన్ వెస్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఆయా రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. సీ్త్రల సమాజం అధ్యక్షురాలు బిందు పుల్లా , కార్యదర్శి కే.రీతా ప్రభాకర్, కోశాధికారి కె.రాణి, ఉపాధ్యక్షురాలు ఎన్.బి విజయభాస్కర్, సహాయ కార్యదర్శి ఈ.ప్రభావతి నేతృత్వంలో జరిగిన మహిళా దినోత్సవంలో 300 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన 40 మంది మహిళలను గౌరవించారు. ఎస్‌కేపీసీలో.. చైన్నె జార్జిటౌన్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల (ఎస్‌కేపీసీ) 26వ కళాశాల దినోత్సవంతోపాటు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, కన్యాబజార్ కార్యక్రమాలను శనివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిల సాంస్కతిక ప్రదర్శనలు, బహుమతుల పంపిణీ, అతిథులు ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్కేపీ కన్వెన్షన్ హాలు వేదికగా సాగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి, సరస్వతి ఎడ్యుకేషనల్ కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రియదర్శిని రాజ్‌కుమార్ పాల్గొని, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. కన్యా బజార్ ప్రదర్శనలో ఆహారం, దుస్తులు, ఉపకరణాలను అందించే విభిన్న స్టాళ్ల ద్వారా ప్రతిభను చాటుకున్నారు. ప్రిన్సిపల్ ఇన్చార్జ్ డాక్టర్ పీబీ వనిత సారధ్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఇందులో కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్, పూర్వ ప్రిన్సిపల్ డాక్టర్ టి మోహన శ్రీ, ట్రస్టీలు దేసులక్ష్మీనారాయణ, ఎస్ ఎల్ సుదర్శనం, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎంసీటీబీసీలో.. మద్రాసు సెంటినరి తెలుగు బాప్టిస్టు సంఘము (ఎంసీటీబీసీ) సీ్త్రల సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. చైన్నె, వేపేరిలోని మద్రాస్ సెంటెనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హైదరాబాద్‌కు చెందిన దైవ ప్రసంగీకులు సిస్టర్ షేకీనా గ్లోరీ పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. సీ్త్రల సమాజం అధ్యక్షురాలు ఎస్. దానమ్మ, కార్యదర్శి రూతమ్మ, కోశాధికారి ఎం.రాణి, సువార్తికులు కె దీనమ్మ, జె.జయమ్మ కలసి అతిథి సిస్టర్ షేకీనా గ్లోరీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను సంఘ అధ్యక్షులు జి.రామయ్య, కార్యదర్శి పోతల ప్రభుదాసు , కోశాధికారి ఐ.మార్క్ లు పర్యవేక్షించారు. -
మహిళా విద్యకు అధిక నిధులు కేటాయించాలి
వేలూరు: మహిళా విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా చాన్స్‌లర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో మహిళలు ముఖ్య భాగం వహిస్తున్నారన్నారు. మహిళలకు విద్య అందజేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని ఒక మహిళ విద్యావేత్త అయితే కుటుంబమే కాకుండా సమాజం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. దీంతోనే వీఐటీలో మహిళా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వీఐటీలో వైస్ చాన్స్‌లర్, రిజిస్టార్ కూడా మహిళలే కావడం గర్వంగా ఉందన్నారు. ప్రపంచంలోని పది దేశాల్లో మాత్రమే 50 శాతం మంది మహిళలు పార్లమెంట్లో ఉన్నారని మన దేశంలో 14 శాతం మహిళలు మాత్రమే అధికారంలోకి రాగలుగుతున్నారన్నారు. చైన్నె హైకోర్టు న్యాయమూర్తి భవానీ సుబ్బరాయన్ మాట్లాడుతూ ఆడ పిల్లలకు చిన్న వయస్సు నుంచే మంచి చెడులను తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై తెలియజేయగలిగితే కొంత వరకు ఆడ పిల్లలను నేరాల నుంచి కాపాడ వచ్చాన్నారు. 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను వేధించే వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారని వీటిలో కులం, రంగు, ఎత్తు అనే తారతమ్యం ఉండ కూడదన్నారు. ఒకప్పడు మహిళలు సైకిల్ తొక్కడానికి కూడా వీలు ఉండేది కాదని ప్రస్తుతం కల్పనా చావ్లా నుంచి సునీతా విలియమ్స్ వరకు అంతరిక్షంలోకి వెళ్లారన్నారు. సమాజంలో సీ్త్ర, పురుషులు సమానమని ఇద్దరూ కలిసి ఉంటేనే జీవితం సంతోషంగా సాగుతుందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, నిర్వాహక డైరెక్టర్ సంద్యా పెంటారెడ్డి, రిజిస్ట్రార్ జయభారతి, ప్రొ చాన్స్‌లర్ పార్థసారథి మల్లిక్, వైస్ చాన్స్‌లర్ కాంచన పాటూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
విద్యా సామాగ్రి వితరణ
తిరవళ్లూరు: ప్రభుత్వ పాఠశాలకు రూ. 4 లక్షల విలువ చేసే వస్తువులను పీఎంకే యూనియన్ మాజీ కౌన్సెలర్ నేతృత్వంలోని స్థానికులు అందజేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వెంగత్తూరు కండ్రిగలో ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాల ఉంది. పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు సుమారు రెండువందల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ క్రమంలో పాఠశాల వార్షికోత్సవం శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే స్థానిక మాజీ కౌన్సిలర్ పీఎంకే నేత వెంకటేషన్ పాఠశాలకు రెండు లక్షల రూపాయలు విలువ చేసే రెండు ఏసీలు, ఫ్యాన్, కంప్యూటర్, టేబుల్స్, కుర్చీలను వితరణగా ఇచ్చారు. దీంతో పాటూ మరో కంపెనీ లక్ష రూపాయలు విలువ చేసే టీవీని అందజేసింది. మొత్తానికి స్థానికులు ప్రభుత్వ పాఠశాలకు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను అందించారు. అనంతరం 32 మంది ఒకటవ తరగతి విద్యార్దులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇసక్కియమ్మాల్, పీఎంకే రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బాలయోగి, మాజీ సర్పంచ్‌లు సునీతబాలయోగి, మోహనసుందరం, మాజీ జెడ్పీటీసీ దినేష్‌కుమార్, మాజీ యూనియన్ కౌన్సిలర్లు యోగనాథన్, ద్రావిడభక్తన్తో పాటూ పలువురు పాల్గొన్నారు. -
అందరికీ ఆదర్శంగా..
వేలాది మంది విద్యార్థులు చదివే వేల్‌టెక్ వర్సిటీకి మేనేజింగ్ ట్రస్టీగా విధులు నిర్వహిస్తూ సమాజం, సీ్త్రల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రంగరాజన్ మహాలక్ష్మి. ఈమె తిరుపతికి చెందిన డాక్టర్ శకుంతల, రంగరాజన్ దంపతుల కుమార్తె. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి పీహెచ్డీ సైతం పూర్తి చేశారు. డాక్టర్ శకుంతల మరణాంతరం వేల్‌టెక్ వర్సిటీ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా స్వీకరించిన మహాలక్ష్మి, సంస్థను నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేద మహిళలకు ఆర్థికంగా భరోసానిస్తూ ఆందరి వద్ద ప్రశంసలు పొందుతున్నారు. వేల్‌టెక్ వర్సిటీ నిర్వాహణలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ, వ్యవస్థను సమన్వయం చేసుకుంటూ రాణిస్తున్న మహాలక్ష్మి ఆడబిడ్డే కాదు, అందరి బిడ్డగా మన్నలనూ పొందుతున్నారు. – రంగరాజన్ మహాలక్ష్మి -
తెలుగు తరుణిగా..
కాశీ సోమాయజుల రమణి వృత్తి రీత్యా అమ్మకం, ఆదాయపు పన్ను ఫ్రీలాన్స్ కన్సల్టెంట్‌గా చైన్నె, ఢిల్లీ, ముంబైకు చెందిన పలు సంస్థలకు వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం గుంటూరులో పాఠశాల విద్యాభ్యాసం ముగించి, 1970లో చైన్నెకి వచ్చిన రమణి, క్వీన్ మెరిస్ కళాశాల పట్టభద్రురాలు. తెలుగు భాష మీద మక్కువతో కార్యక్రమాల్లో భాగస్వామ్యమై సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతూ తెలుగు విద్యార్థులకు వీలైనంత సహాయం అందిస్తున్నారు. జయశ్రీ స్థాపించిన తెలుగు తరుణీ సంస్థను ఆవిడ తరువాత ప్రస్తుతం అధ్యక్షురాలిగా దిగ్విజయంగా నడిపిస్తున్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు. – రమణి -
కూలిన బతుకులు
వారంతా కూలీ కార్మికులు.. బతుకుదెరువు కోసం బయలుదేరారు. ప్రభుత్వ బస్సు ఎక్కారు. కేజీ కండ్రిగ సమీపంలో వెళుతుండగా ఓ టిప్పర్ మృత్యురూపంలో ముంచుకొచ్చింది. దీంతో వారి బతుకులు అక్కడే తెల్లారిపోయాయి. వారి బంధువుల అర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ● ప్రభుత్వ బస్సును ఢీకొన్న టిప్పర్ ● నలుగురి కూలీలు దుర్మరణం ●30 మందికి గాయాలు తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని రాష్ట్ర రహదారిలో టిప్పర్ అతి వేగంగా వచ్చి ప్రభుత్వ బస్సును ఢీకొన్న సంఘటనలో నలుగురు కూలీ కార్మికులు మృతి చెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేజీ కండ్రిగలో శుక్రవారం శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. తిరుత్తణి ప్రభుత్వ బస్సు డిపోకు చెందిన టౌన్ బస్సు మహాన్‌కాలికాపురం నుంచి తిరుత్తణికి శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరింది. బస్సు డ్రైవర్‌గా బాలాపురం ప్రాంతానికి చెందిన జగన్నాథన్, కండక్టర్‌గా ఆర్కేపేటకు చెందిన శ్రీనివాసన్ విధులు నిర్వహించారు. అమ్మయార్‌కుప్పం గ్రామానికి చెందిన 35 మంది చైన్నెలో వంట పనులు సహాయకులుగా పనులు చేసేందుకు ఆ బస్సులో ప్రయాణించారు. మొత్తం 55 మంది బస్సు బయలుదేరింది. కేజీ.కండ్రిగ బస్టాండ్‌కు సమీపంలో తిరుత్తణి వైపు వెళుతున్న బస్సును తిరుత్తణి నుంచి పళ్లిపట్టు క్వారీకి వెళుతున్న టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సులో ముందు వరుసలో కూర్చుని ఉన్న ప్రయాణికులు టిప్పర్, బస్సు మధ్యలో చిక్కుకున్నారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో అటువైపు వెళుతున్న ప్రయాణికులు, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కాపాడి 108 ఆంబులెన్స్ సాయంతో తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో అమ్మయార్‌కుప్పం గ్రామానికి చెందిన నేత కార్మికులు మురళి(34), మహేష్(35), పాండురంగన్(45), శివానందం(55) మృతిచెందారు. ఇద్దరు చిన్నారులు, మహిళలు సహా 30 మందికి గాయాలయ్యాయి. వీరంతా తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో తీవ్రంగా గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చైన్నె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద బంధువుల రోదనలు ఆస్పత్రి ఆవరణలో మృతుల బంధువులు, కుటుంబసభ్యులతోపాటు గాయపడిన వారి బంధువులు రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రి వద్ద బోరుమని విలపించడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. టిప్పర్ డ్రైవర్ పరారీ ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీ కావడంతో తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరామర్శ తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర మంత్రి నాజర్, జిల్లా కలెక్టర్ ప్రతాప్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. కాగా మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాగా రూ.3లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. -
తమిళంలో పరీక్షలకు చర్యలు తీసుకోండి!
సాక్షి, చైన్నె: వైద్యం, ఇంజినీరింగ్ కోర్సుల్లో పరీక్షలను తమిళంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా సూచించారు. సీఐఎస్ఎఫ్ ఎంపిక పరీక్షలను తమిళంలో నిర్వహించేందుకు తాము చర్యలు తీసుకున్నామన్నారు. సీఐఎస్ఎఫ్ 56వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని తక్కోళంలో జరిగింది. ఇక్కడి సీఐఎస్ఎఫ్ శిక్షణ కేంద్రంలో జరిగిన వేడుకల్లో శిక్షణ పూర్తిచేసుకున్న బృందాల విన్యాసాలు అదరహో అనిపించాయి. ఈ వేడుకకు అమిత్‌షా హాజరయ్యారు. సీఐఎస్ఎఫ్ బృందాల నుంచి పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. విన్యాసాలను తిలకించారు. మహిళా బెటాలియన్ ఈ వేడుకల్లో అమిత్‌షా మాట్లాడుతూ, సీఐఎస్ఎఫ్ కోసం మూడు బెటాలియన్లను దేశ వ్యాప్తంగా ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, ఇందులో ఒక బెటాలియన్ పూర్తిగా మహిళలతో కూడుకున్నదిగా ఉంటుందని ప్రకటించారు. 2027 నాటికి అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను ఆర్థిక, భద్రతా పరంగా మూడో స్థానంలో నిలబెట్టే దిశగా ప్రధాని మోదీ విస్తృత కార్యాచరణతో ముందుకెళ్తున్నారన్నారు. ఇందులో భాగంగా సీఐఎస్ఎఫ్ను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా ఈ విభాగంలో డ్రాగన్ నిఘాకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇటీవల కేంద్రం 14 వేల మందిని ఎంపిక చేసిందని గుర్తుచేశారు. దేశంలో మెట్రో, విమానాశ్రయం, హార్బర్, ఇలా అన్ని చోట్ల సీఐఎస్ఎఫ్ భద్రత నిఘాకు పూర్తి స్థాయిలో నియమించి ఉత్తమ సేవల మీద దృష్టిపెట్టనున్నామని తెలిపారు. సీఐఎస్ఎఫ్ భద్రత ఉత్తమం అని చాటే విధంగా ముందుకెళ్తామన్నారు. ఇది వరకు సీఐఎస్ఎఫ్ ఎంపిక పరీక్ష హిందీ, ఆంగ్లంలో జరిగేదని, ప్రస్తుతం తమిళం, బెంగాళి భాషల్లో నిర్వహణకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇదే దిశలో తమిళనాడు ప్రభుత్వానికి తానో సూచన చేస్తున్నట్టు పేర్కొన్నారు. వైద్యం, ఇంజినీరింగ్ కోర్సులను తమిళంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడు విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ముందుగా సైక్లోథాన్ కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా అమిత్ షా ప్రారంభించారు. ఇందులో ఒకటి గుజరాత్ నుంచి మరొకటి పశ్చిమబెంగాల్ నుంచి కన్యాకుమారి వైపుగా బయలుదేరాయి. రాష్ట్రానికి కేంద్ర మంత్రి సూచన ఘనంగా సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం -
చైన్నె అపార్ట్మెంట్లో హరియాణా వాసి ఆత్మహత్య
తిరువొత్తియూరు: ఢిల్లీకి చెందిన ఓ మహిళ చైన్నె అన్నానగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ప్రీతి (21), ఆమె భర్త వీణై యాదవ్ (32) హరియాణాకు చెందినవారు. వీరిద్దరూ నెల రోజులుగా చైన్నెలోని అన్నానగర్ 6వ వీధిలోని వై–బ్లాక్ ఫ్లాట్ 2వ అంతస్తులో నివసిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి వీణాయాదవ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత అపార్ట్మెంట్ మేనేజర్‌కు ఫోన్ చేసి తన భార్య ఇంట్లో అనారోగ్యంగా ఉంది. ఇంటికి వెళ్లి– చూడుశ్రీ అని చెప్పాడు. వెంటనే మేనేజర్ అక్కడికి వెళ్లి వీణాయాదవ్ ఇంటి తలుపు తట్టాడు. తెరవలేదు. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ప్రీతి ఉరి వేసుకుని వేలాడుతూ ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. అన్నానగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఆమె గదిలో తనిఖీ చేశారు. అందులో ఆమె ఏదైనా లేఖ రాశారా ? సెల్‌ఫోన్‌న్ స్వాధీనం చేసుకుని చివరిగా మాట్లాడిన భర్త గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటన కలకలం సృష్టించింది. ముదుమలై ఫారెస్ట్‌లో పులి మృతి అన్నానగర్: నీలగిరి జిల్లా పందలూరు తాలూకాలోని ముదుమలై టైగర్ రిజర్వ్ పరిధిలోని నేలకొట్టై అటవి రేంజర్ ఎడకోడ్ అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం అటవీశాఖ గస్తీ నిర్వహించింది. అప్పుడు అడవిలో ఒక పులి మృతిచెంది ఉంది. ఇది గమనించిన అటవీశాఖాధికారులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పశు వైద్యులు వచ్చి పులి కళేబరానికి శవపరీక్ష నిర్వహించారు. అటవీశాఖ తెలిపిన వివరాల మేరకు మృతిచెందింది పదేళ్ల మగపులి అని తెలిపారు. అయితే పులి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ముఖ్యౖ మెన శరీర భాగాలను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. -
నో పార్కింగ్!
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో రద్దీతో కూడుకున్న హోటళ్లు వినియోగదారులకు కనీసం పార్కింగ్ సౌకర్యం సైతం కల్పించడంలో విఫలమయ్యాయి. ఇందులో 80 హోటళ్లను గుర్తించిన ట్రాఫిక్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చైన్నె కార్పొరేషన్‌కు సమాచారం పంపించారు. చైన్నె నగరంలో నిర్ణీత చదరపు అడుగుల స్థల ఆధారంగా ఆయా హోటళ్లు, దుకాణాలు, వాటిలో పార్కింగ్ సౌకర్యం తప్పనిసరి. అయితే, అనేక హోటళ్లు కనీసం ద్విచక్ర వాహనాలు ఆపేందుకు కూడా పార్కింగ్ సౌకర్యం కల్పించడం లేదు. వీటి కారణంగా ఆయా మార్గాల్లో ట్రాపిక్ కష్టాలు తప్పడం లేదు. హోటళ్లకు ఎదురుగా ఉన్న రోడ్ల మీద, ఫుట్ పాత్ల మీద వాహనాలు ఆపడం కారణంగా వాహన చోదకులకు కష్టాలు ఎక్కువే. వీటిన్నింటిని ట్రాఫిక్ యంత్రాంగం గుర్తించింది. అయితే, వాహనాలు ఆపే వారికి జరిమానాలు తప్పడం లేదు. హోటళ్లలోకి వెళ్లి వచ్చేలోపు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మరోచోటకు తరలించేస్తున్నారు. నో పార్కింగ్స్, రోడ్లపై వాహనాలు ఆపినందుకు వాహన దారుడికి జరిమానాల వడ్డన తప్పడం లేదు. అదే సమయంలో పార్కింగ్ సౌకర్యం కూడా లేకుండా హోటళ్లను నడుపుతున్న ఆ యాజమాన్యాల భరతం పట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలో రద్దీతో కూడుకున్న ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకోకుండా నడుపుతున్న 80 హోటళ్లను గుర్తించారు. వీటన్నింటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావాలని, సమగ్ర వివరాలతో సమాచారాన్ని శుక్రవారం కార్పొరేషన్‌కు పంపించారు. కార్పొరేషన్ అధికారులు ఏ మేరకు స్పందిస్తారో, ఆయా హోటళ్లకు జరిమానా విధింపుతో పాటు పార్కింగ్ సౌకర్యం కల్పన తప్పనిసరిగా అమలు చేయిస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
కలిసికట్టుగా పనిచేద్దాం!
లోక్‌సభ పునర్విభజన వ్యవహారంలో దక్షిణాది రాష్ట్రాలకు కలగనున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అందరం కలిసికట్టుగా ముందుకెళదామని ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈనెల 22న చైన్నెలో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. సాక్షి, చైన్నె: గత జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకునేందుకు సీఎం స్టాలిన్ దూకుడు పెంచారు. ఇప్పటికే రాష్ట్రంలోని యాభైకు పైగా పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర, దక్షిణాధి రాష్ట్రాల్లోని ఎంపీలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో మరో అడుగుగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలను ఏకం చేసే దిశగా దూకుడు పెంచారు. ఇందులో భాగంగా అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా పిలుపునిస్తూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు శుక్రవారం సీఎం స్టాలిన్ లేఖ రాశారు. లేఖలు.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్మాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలకు స్టాలిన్ లేఖ రాశారు. అలాగే, ఆయా పార్టీలలోని ముఖ్య నేతలకు సైతం ఇదే లేఖలను పంపించారు. ఇందులో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన గురించి కేంద్రం చేస్తున్న కసరత్తులను ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ జరిగిన పక్షంలో లోక్‌సభ స్థానాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అఖిల పక్షం సమావేశంలో రాష్ట్రాల పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతినిథ్యంను కాపాడుకునేందుకు పార్లమెంటులో ప్రస్తుతం ఉన్న ప్రాతినిథ్యం శాతం పరంగా అందరం కలిసి పనిచేసి, నియోజకవర్గాలను రక్షించడానికి పరిష్కారాలను రూపొందించాల్సిన అవశ్యం ఉందని ప్రస్తావించారు. ఇందులో భాగంగా ఈనెల 22న చైన్నెలో జాయింట్ యాక్షన్ కమిటీ ప్రారంభ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవాల్లో బిజీ బిజీ.. ముందుగా సచివాలయం నుంచి పలు కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. చైన్నె మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నేతృత్వంలో 3 ప్రాజెక్టులను ప్రారంభించారు, 10 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రారంభించిన వాటిలో పోరూర్‌లో హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పేరిట 16.63 ఎకరాల విస్తీర్ణంలో వెట్‌ల్యాండ్ గ్రీన్ పార్క్, కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్ కాంప్లెక్స్, శాతాంగాడు, ఇనుము, ఉక్కు మార్కెట్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టు పనుల్లో చైన్నెలోని కాట్టుపాక్కంలోని ఇందిరానగర్, పోరూర్, గణేష్ నగర్ బహుళ–విభాగ కేంద్రాలు, కుత్తంబాక్కంలో ఫుట్‌బాల్ స్టేడియం, కుత్తంబాక్కం సబర్బన్ బస్ టెర్మినల్, సైదాపేట, అమ్మ పార్క్, తాంబరంలో డాక్టర్ అబ్దుల్‌కలాం పార్కు నిర్మాణ పనులు ఉన్నాయి. మంత్రి, సీఎండీఏ చైర్మన్ శేఖర్‌బాబు, సీఎస్ మురుగానందం, అదనపు ప్రధాన కార్యదర్శి కాకర్ల ఉష పాల్గొన్నారు. అలాగే, 500 మందికి ఉపాధి లక్ష్యంగా అమెరికన్ ఈటన్ గ్రూప్ అనుబంధ సంస్థ ఈటన్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, షోళింగనల్లూరులో ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ పనులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. సీఎస్ మురుగానందం, వాణిజ్యశాఖ కార్యదర్శి వి.అరుణ్‌రాయ్. తమిళనాడు కెరీర్ గైడెన్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అలమేలు మంగై, ఈటాన్ చైర్మన్ సైమన్ మాథెసన్, ఈటన్ ఇండియా అధ్యక్షుడు మైరెన్ డ్రైవ్, డైరెక్టర్ ఫిలిప్పోస్ జాకబ్, ప్రాజెక్ట్ లీడర్ హెర్మన్ పెన్నిస్ పాల్గొన్నారు. ఏడు రాష్ట్రాల తాజా, మాజీ సీఎంలకు స్టాలిన్ పిలుపు లోక్‌సభ పునర్విభజనకు వ్యతిరేకంగా మరో అడుగు ప్రారంభోత్సవాల్లో స్టాలిన్ బిజీ సురక్షిత ప్రయాణానికి క్యూఆర్ కోడ్ సురక్షిత ప్రయాణానికి క్యూఆర్ కోడ్ ఆటో రిక్షాలు, అద్దె కార్లలో ప్రయాణించే వారి భద్రత, సురక్షిత ప్రయాణం కోసం గ్రేటర్ చైన్నె మెట్రోపాలిటన్ పోలీసులు క్యూఆర్ కోడ్ సౌకర్యం కల్పించారు. ఆయా వాహన రూట్ మ్యాపింగ్‌తో సాంకేతికత ఆధారిత భద్రతా చర్యలు తీసుకున్నారు. చైన్నె నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు పరిసర జిల్లాల్లోని 89,641 ఆటోరిక్షాలు, ఇతర వాహనాలకు క్యూఆర్ కోడ్ సిద్ధం చేశారు. ఇందులో 78వేల ఆటో రిక్షాలు ఉబర్, ర్యాపిడో, ఓలా వంటి సేవలతో అనుసంధానించబడింది. ఆటోలు, కార్లు, అద్దె వాహనాలలో డ్రైవర్ సీటు వెనుక క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్‌ను తమ స్మార్ట్ఫోన్ల ఆధారంగా స్కాన్‌చేస్తే కంట్రోల్ రూమ్‌కు హెచ్చరికలు వెళ్తాయి. వెంటనే గస్తీ బృందాలు రంగంలోకి దిగి ఆయా వాహనాలను సమీపించి అందులో ఉన్నవారిని రక్షించే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. అదనంగా, ప్రయాణికుల అత్యవసర సేవల కోసం 112 నంబర్‌కు కాల్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. వీటిని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. మంత్రులు పొన్ముడి, శేఖర్‌బాబు, చైన్నె కమిషనర్ అరుణ్, అదనపు కమిషనర్ ఆర్. సుధాకర్ పాల్గొన్నారు. అనంతరం చైన్నె ఐల్యాండ్ గ్రౌండ్లో సీఎండీఏ నేతృత్వంలో రూ.113 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు రెండు అంతస్తులతో నిర్మిస్తున్న అత్యాధునిక సాంకేతిక వసతులతో కూడిన ఎగ్జిబిషన్ పనులను సీఎం పరిశీలించారు. కలిసికట్టుగా ముందుకెళదాం.. చైన్నెలో ఈనెల 5న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను వివరించారు. ప్రధానంగా నియోజకవర్గ పునర్విభజనతో సమస్యకు గురయ్యే రాష్ట్రాల్లోని పార్టీల నుంచి కీలక ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిట్ఙీని ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించామని గుర్తు చేశారు. రాష్ట్రాల పురోగతికి ఆటంకం కలిగించే విధంగా జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. -
రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం
సాక్షి, చైన్నె: రాష్ట్ర శాసనసభలో గత డిసెంబర్లో తమిళనాడులోని ఖనిజాలతో కూడిన భూములపై పన్ను విధింపునకు సంబంధించి బిల్లును రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించారు. ఈ చట్టం లిగ్నైట్, లైమ్‌స్టోన్, మాగ్నసైట్, క్యారియం వంటి 13 రకాల ఖనిజాలను ప్రధాన రకాలైన ఖనిజాలు, నల్లరాయి, కంకర లేదా నేల, రంగు, నలుపు పొట్టు, గులకరాళ్లు, ఇసుక, క్వార్ట్జైట్, బంకమట్టి నేల, రోల్డ్ క్లే నేల, బంకమట్టి, నది ఇసుక వంటి వాటిని వర్గీకరిస్తుంది. పిండి చేసిన రాయి, సున్నపురాయి సహా 17 ఖనిజాలు చిన్న ఖనిజాలుగా వర్గీకరించబడ్డాయి. దీని ప్రకారం ఖనిజాలకు టన్నుకు రూ.40 నుంచి రూ.7వేలు, చిన్న ఖనిజాలకు రూ.40 నుంచి రూ.420 వరకు పన్నుగా నిర్ణయించారు. ఈ సందర్భంలో గవర్నర్ రవి ఈ బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో పాటు తమిళనాడులోని 28 జిల్లాల్లో పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థల్లో వ్యక్తిగత అధికారుల నియామకానికి సంబంధించిన బిల్లుకు కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. ఈ రెండు బిల్లులు ఆమోదం గెజిట్‌లో ప్రచురించారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంకొరుక్కుపేట: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నాయి. ఇందులో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో శనివారం ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి పాల్గొని 77 కేజీల కేక్‌ను కట్ చేయనున్నారు. మాజీ మంత్రి పి.వలర్మతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగనున్నాయి. అలాగే శనివారం ఉదయం 10 గంటలకు చైన్నె మైలాపూర్ సీఐటీ కాలనీలోని 3వ మెయిన్ రోడ్డులోని తమాకా పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్ ప్రసంగించి అన్నదానం చేయనున్నారు. అలాగే పలు స్వచ్ఛంద సంఘాలు మహిళా దినోత్సవం జరుపుకోనున్నారు. న్యూస్‌రీల్ -
పేదల డాక్టర్
నెల్లూరు టౌన్‌కు చెందిన డాక్టర్ శాలిని. విశాఖలో బీహెచ్ఎంఎస్ పూర్తిచేసి వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్రణీత్వర్మతో వివాహం తరువాత తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో స్థిరపడి పెత్తికుప్పంలో డాక్టర్ వర్మ క్లినిక్ పేరిట వైద్యశాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు తక్కువ ఖర్చుతో వైద్యసేవలను అందిస్తూ పేదల డాక్టర్‌గా ముద్రపడ్డారు. దీంతో పాటు ఇప్పటివరకు గత ఆరు సంవత్సరాల కాలంలో 50కి పైగా ఉచిత మెడికల్ క్యాంపులు, గుమ్మిడిపూండి సిప్కాట్లో కార్మికుల కోసం ప్రతినెలా మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచితంగా మందులను అందజేస్తున్నారు. దీంతో పాటు గుమ్మిడిపూండిలోని నిరాశ్రయుల ఆశ్రమంలోని విద్యార్థులకు ప్రతి ఏటా దుస్తులు, మందులు సైతం అందజేస్తున్నారు. డాక్టర్ శాలిని వైద్యురాలే కాదు..మంచి మనసున్న సామాజిక కార్యకర్త కూడా. –డాక్టర్ శాలిని -
పెద్దవారు ఏమైనా మాట్లాడి వెళ్లవచ్చు
వేలూరు: పెద్దవారు ఏమైనా మాట్లాడి వెళ్లవచ్చని, వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రాష్ట్ర సీనియర్ మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని చిత్తూరు బస్టాండ్‌లో ప్రొఫెసర్ అన్బయగన్ ఐదో వర్ధంతిలో పాల్గొని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాట్పాడి నియోజక వర్గంలోని మగిమండలం గ్రామంలో రూ.1.60 కోట్ల వ్యయంతో చెరువు కట్ట మరమ్మతు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి రాష్ట్రంలోని ఆయా భాషలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మంత్రి అమిత్‌షా మాట్లాడటం సరికాదన్నారు. పెద్దవారు ఏదైనా మాట్లాడి వెళ్లవచ్చని తెలిపారు. అనంతరం అమిత్‌షాపై తిరుకురల్లో వచనాలను మాట్లాడి వెళ్లిపోయారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి, పార్లమెంట్ సభ్యులు కదీర్ ఆనంద్, ఎమ్మెల్యే అములు, యూనియన్ చైర్మన్ వేల్ మురుగన్, అధికారులు పాల్గొన్నారు. -
అన్బళగన్‌కు అంజలి
సాక్షి, చైన్నె : డీఎంకే దివంగత ప్రధాన కార్యదర్శి అన్బళగన్ చిత్రపటానికి సీఎం స్టాలిన్‌తో పాటుగా డీఎంకే వర్గాలు నివాళులర్పించాయి. మాజీ మంత్రిగా, డీఎంకేకు కొన్ని దశాబ్దాల పాటుగా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన నేత అన్భలగన్, దివంగత డీఎంకే అధినేత కరుణానిధికి అత్యంత సన్నిహిత మిత్రుడు. అలాంటి నేత అస్తమించి శుక్రవారంతో ఐదేళ్లు అయ్యింది. ఆయన ఐదో వర్ధంతిని పురస్కరించుకుని డీఎంకే నేతృత్వంలో నివాళులర్పించే కార్యక్రమాలు జరిగాయి. వాడవాడలా డీఎంకే కార్యాలయాల్లో ఆ పార్టీ వర్గాలు అన్భలగన్ చిత్రపటాన్ని ఉంచి పుష్పాంజలి ఘటించాయి. చైన్నె తేనాం పేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో అన్భలగన్ వర్ధంతి, నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ హాజరై, అన్బళగన్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, శేఖర్‌బాబు, డీఎంకే వర్గాలు ఆర్ఎస్ భారతి, టీకేఎస్ ఇళంగోవన్ తదతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్భళగన్ను స్మరిస్తూ సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు. దివంగత నేత కరుణానిధికి అత్యంత సన్నిహితుడిగా, తమ లాంటి వారందరికీ మార్గదర్శకుడిగా, విద్యా మంత్రిగా తమిళనాట విద్యాభ్యున్నతికి అన్భళగన్ చేసిన సేవలు మరువలేనివన్నారు. విద్యా పరంగా హక్కులను వదలుకోబోమని, ఇందుకోసం ఎలాంటి పోరాటాలకై నా సిద్ధం అని ప్రకటించారు. -
అనవసర అప్పీలు
● రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 లక్షల జరిమానా ● హైకోర్టు చర్య సాక్షి, చైన్నె: వేప్పిరిలోని ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్న్లో పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హైకోర్టు సింగిల్ జడ్జి విచారించారు. ఇద్దరు పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి అనుమతి ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వంలో అప్పీలు దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూ ర్తులు ఆర్.సుబ్రమణియన్, జి.అరుల్ మురు గన్ తమిళనాడు ప్రైవేట్ కాలేజీల్లో థర్డ్ పార్టీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో జరిగే నియామకాలకు ప్రభుత్వ సాయం అందించాలన్నారు. కానీ పారిశుద్ధ్య కార్మికులతో సహా గ్రూప్ డి పోస్టులకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కళాశాలల్లో పర్మినెంట్ సిబ్బంది అధికంగా ఉండడంతో వాటిని అరికట్టేందుకు 2013లో కాంట్రాక్టు కార్మికులను నియమించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించడంతో ప్రభుత్వం అనవసరంగా ఈ అప్పీల్‌ను దాఖలు చేసిందని, ఈ కేసును కొట్టివేస్తున్నట్టు తెలిపారు. అదే సమయంలో అవసరం లేకుండా అప్పీల్ చేయడంతో రూ.5 లక్షలు జరిమానా విధిస్తూ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎంపీ దయానిధి మారన్ గెలుపు చెల్లుతుంది – మద్రాసు హైకోర్టు తీర్పు సాక్షి, చైన్నె: సెంట్రల్ చైన్నె నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు దయానిధి మారన్ గెలుపు చెల్లుతుందని చైన్నె హైకోర్టు తీర్పునిచ్చింది. గత 2024 లోక్‌సభ ఎన్నికల్లో మధ్య చైన్నె నియోజకవర్గంలో డీఎంకే తరఫున పోటీ చేసిన దయానిధి మారన్ 2. 33 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఆయన గెలిచినట్టు ప్రకటించడం చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన న్యాయవాది ఎమ్మెల్యే రవి చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఎన్నికల ప్రచారం ఏప్రిల్ 17వ తేదీ ముగిసిన స్థితిలో ఏప్రిల్ 19వ తేది ఓటింగ్ రోజు డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్ పత్రికల్లో ఓ ప్రకటన చేసి ప్రచారం చేశారని, అది ప్రజా ప్రతినిధిత్వ చట్టానికి విరుద్ధమని, కనుక ఆయన గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరారు. ఈ కేసు పిటిషన్లో ఆరోపణలను తొలగించాలని కోరుతూ దయానిధి మారన్ తరఫున పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశ్ పిటిషనర్ ఎల్.రవి చేసిన ఆరోపణల ఆధారంగా ఎన్నికల కేసు దర్యాప్తును కొనసాగించడం సబబు కాదని, అందువల్ల దయానిధి మారన్‌కు వ్యతిరేకంగా నమోదైన ఎన్నికల కేసును కొట్టివేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. -
బెదిరింపుల కేసులో ముగ్గురి అరెస్టు
అన్నానగర్: సినీ నేపథ్యగాయని ఇసైవాణిని ఫోన్, సోషల్ మీడియా ద్వారా బెదిరించినందుకు బీజేపీ కార్యనిర్వాహకుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సినీ నేపథ్య గాయని ఇసైవాణి గత సంవత్సరం శ్రీఐ యామ్ సారి అయ్యప్పశ్రీ అనే పాటను పాడారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన వ్యక్తులు గాయనిని సోషల్ మీడియాలో, ఫోన్లో కులం పేరు పెట్టి బెదిరించారు. దీనిపై ఇసైవాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మహిళలపై అఘాయిత్యం సహా 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తిరువణ్ణామలై జిల్లా వందవాసి తాలూకాకు చెందిన బీజేపీ మాజీ నాయకుడు రవిచంద్రన్ (44), పోలీచలూరు భారతీనగర్ ఇందిరాగాంధీ వీధికి చెందిన సతీష్ కుమార్ (64), సేలం జిల్లాకు చెందిన అళగు ప్రగస్పతి (24) ముగ్గురిని అరెస్టు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరిచి శుక్రవారం పుళల్ జైలుకు తరలించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. -
అందరికీ నాణ్యమైన విద్యే లక్ష్యం
– మంత్రి అన్బిల్ మహేశ్ సాక్షి, చైన్నె : అందరికీ నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రైవేటు విద్యా సంస్థలు సహకారించాలని పాఠశాల విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పిలుపు నిచ్చారు. దేశంలో క్యూఎస్ 1– గేజ్‌లో ఏకైక ప్లాటినం ప్లస్ పాఠశాలగా ది ప్యూపుల్ సవీత ఎకో స్కూల్ చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రులు నాజర్, అన్బిల్ మహేశ్ హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక ప్లాటినం ప్లస్ రేటింగ్‌ను ఆ విద్యాసంస్థకు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సవీత విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, చాన్సలర్ డాక్టర్ ఎన్ఎం వీరయ్యన్ మాట్లాడుతూ విద్యా నైపుణ్యం, విద్య పరివర్తనకు అత్యంత శక్తివంతమైన సాధనమని, పిల్లలకు తెలివితేటలు, వ్యక్తిత్వం, సృజనాత్మకతను పెంపొందించే అసాధారణమైన అభ్యాస అనుభవాన్ని అందించడం లక్ష్యంగా నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేశారు. ఇందుకు గుర్తింపుగా ప్లాటి నం ప్లస్ రేటింగ్ కేవలం ఒక విజయం మాత్రమే కాదని, ఇది భారతీయ విద్యకు ఒక మైలురాయి అని పేర్కొన్నారు. మైనారిటీ శాఖ మంత్రి ఎస్ఎం నాజర్, అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యకు విస్తృత మద్దతును ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా పాఠశాలలను ప్రేరేపించి, అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పినందుకు అభినందించారు. క్యూ ఎస్ నిర్వాహకులు రవిన్ నాయర్, ది ప్యీపుల్ డైరెక్టర్ డాక్టర్ సవిత పాల్గొన్నారు. -
విద్యా సంస్థలతో ఐఐటీ ఒప్పందాలు
సేవా తత్వం తండ్రి ఆలూరి రామస్వామి ప్రోత్సాహంతో 40 సంవత్సరాలు హిందీ, తెలుగు భాషకు తన వంతు సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయిని శివకుమారి సేవాతత్వంతో అడుగులు వేస్తున్నారు. అనేక తెలుగు సంఘాలతో కలిసి తెలుగు భాషావ్యాప్తికి సేవలు చేస్తున్నారు. లయన్స్ క్లబ్ ద్వారా 20 సంవత్సరాలుగా సమాజ సేవకు కృషి చేస్తున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అలాగే అంధులకు, మానవతా దృక్పథంతో ఆర్థిక పరంగానూ సహకారం అందిస్తున్నారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పత్ర సమర్పణలు చేశారు. అనేక సంఘాలు ఆమె సేవలను గుర్తించి అవార్డులతో సత్కరించాయి. – శివకుమారి క్లుప్తంగాసాక్షి, చైన్నె: స్వయం ప్లస్ ఉపాధి–కేంద్రీకృత కోర్సులను అందించడానికి పరిశ్రమ–విద్యా సంస్థలతో ఐఐటీ మద్రాస్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సహకారాలు ఉన్నత విద్యా సంస్థలను స్వయం ప్లస్ నుంచి వారి పాఠ్యాంశాల్లోకి అనుసంధానించడానికి వీలు కల్పిస్తాయి, ఇది మూల్యాంకనాలు– ధ్రువీకరణ సహా వాటి అమలుకు కూడా తోడ్పాటు అందించనుంది. ఇండియన్ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ స్వయం ప్లస్‌లో ఉపాధి–కేంద్రీకృత కోర్సులను అందించడానికి పరిశ్రమ, ఇతర ఉన్నత విద్యా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. విద్యార్థులు తమ విద్యాపర పాఠ్యాంశాల్లో భాగంగా ఆయా పరిశ్రమ సంబంధిత కోర్సులను తీసుకునేలా ప్రోత్సహించడానికి ఉన్నత విద్యా సంస్థలు స్వయం ప్లస్‌తో సహకరిస్తాయి. ఈ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల ద్వారా, రాబోయే వారాల్లో స్వయం ప్లస్ కోర్సుల్లో చేరే 2,500 మందికి పైగా అభ్యాసకులను తొలి విడతగా చేర్చనున్నారు. వివిధ సంస్థల నుంచి 10వేల మందికి పైగా విద్యార్థుల నమోదును లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి, ఐఐటి మద్రాస్ డీన్ (ప్లానింగ్) ప్రొఫెసర్ ఆర్.సారథి, ఇతర వాటాదారుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు గత వారం రోజులుగా జరిగాయి. ఒప్పందాల గురించి డీన్ (ప్లానింగ్) ప్రొఫెసర్ ఆర్.సారథి శుక్రవారం మాట్లాడుతూ, ఉన్నత విద్యా సంస్థలు తమ సెమిస్టర్ షెడ్యూల్స్‌లో స్వయం ప్లస్ కోర్సులను పొందుపరచడానికి ప్రోత్సహించడమే ఈ అవగాహన ఒప్పందాల లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కోర్సులు, వాటి మూల్యాంకనాలను పూర్తి చేసిన తర్వాత సంస్థలు ప్రోక్టర్డ్ పరీక్షలను నిర్వహిస్తాయన్నారు. దీంతో విద్యార్థులకు విద్యా క్రెడిట్లను ప్రదానం చేస్తారన్నారు.స్వయం ప్లస్ అనేది విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖచే ప్రారంభించిన ఒక చొరవ అని, దీని అమలుకు ఐఐటీ మద్రాస్ నోడల్ ఏజెన్సీగా నియమించారన్నారు. అధిక నాణ్యత గల అభ్యాస కంటెంట్, కెరీర్ వృద్ధికి అవకాశాలు, అభ్యాసకులు భవిష్యత్తు, సాధికారత, వృత్తిపరమైన అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఈ వేదిక లక్ష్యంగా వివరించారు. ఉన్నత విద్యా సంస్థలతో సహకారాలు స్వయం ప్లస్ కోర్సులను వారి పాఠ్యాంశాల్లో అనుసంధానించడానికి వీలు కల్పిస్తాయన్నారు. స్వయం ప్లస్ కోర్సుల అమలుకు మద్దతు ఇస్తుందన్నారు. సత్యభామ విశ్వవిద్యాలయం, త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, వినాయక మిషన్న్స్లా స్కూల్‌తో ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపారు. -
స్వయంశక్తితో మహిళలు ఎదగాలి
తిరువళ్లూరు: వుహిళలు స్వయంశక్తితో ఎదగడంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని తిరువళ్లూరు జిల్లా చిన్నపిల్లల సంరక్షణ అధికారిణి నిశాంతిని సూచించారు. ఐఆర్సీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈకాడులో మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంస్థ డైరెక్టర్ స్టీఫెన్, నిశాంతిని హాజరై ప్రసంగించారు. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా రాణిస్తున్నారన్నారు. అయితే ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు స్వయంశక్తితో రాణించలేకపోతున్నారని వాపోయారు. మహిళలు పదవుల్లో వున్నా తెర వెనుక పురుషులే ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నపిల్లల సంరక్షణ అధికారి మలర్విళి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రయివేటు శాఖలకు చెందిన ఉద్యోగుల్లో మహిళల వాటా పెరిగిందన్నారు. భవిషత్తులోనూ పెరిగే అవకాశం వుందని ఆమె స్పష్టం చేశారు. అధికారులు, మహిళలు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్‌డేలో డీజీపీ
తిరువొత్తియూరు: మదురై ఆర్మ్డ్ ఫోర్స్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన పోలీస్ గ్రీవెన్స్‌డే లో డీజీపీ శంకర్ జివాల్ పాల్గొని, పోలీసులు, కిందిస్థాయి అధికారుల సమస్యలను విన్నారు. డీజీపీ శంకర్ జివాల్ గురువారం మధురై మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శాంతిభద్రతలు, వివిధ నేరాల నివారణకు సంబంధించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మదురై సాయుధ దళాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన పోలీసు ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో డీజీపీ శంకర్ జివాల్ పాల్గొని పోలీసులు, వారి కుటుంబసభ్యుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అదే ఆవరణలో మొక్కలు నాటారు. ప్లస్ ఒన్ విద్యార్థిని ఆత్మహత్య అన్నానగర్: ప్రభుత్వ పరీక్షలు జరుగుతుండగా పాఠశాల హాస్టల్ మూడో అంతస్తు నుంచి దూకి ప్లస్–1 విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా మీంజూర్ ప్రాంతానికి చెందిన మాలిక్ కుమార్తె రబియా బేగం (16) వండలూరు జూ ఎదురుగా ఉన్న క్రెసెంట్ మెట్రిక్ స్కూల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. ప్రస్తుతం ప్లస్–1 పబ్లిక్ పరీక్ష రాస్తోంది. ఈ స్థితిలో గురువారం మధ్యాహ్నం రబియాబేగం పాఠశాల హాస్టల్ మూడో అంతస్తు నుంచి అకస్మాత్తుగా కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్కూల్ యాజమాన్యం వెంటనే రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అనంతరం అక్కడి నుంచి తదుపరి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్‌పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కీళంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి, పబ్లిక్ పరీక్షల భయంతో విద్యార్థిని నేలపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా? లేక మరేదైనా కారణమా? వారు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న అరుదైన పక్షులు మృతి కొరుక్కుపేట: విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన ఆరు అరుదైన విదేశీ పక్షులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేశారు. తనిఖీల్లో థాయిల్యాండ్ నుంచి టూరిస్టుగా చైన్నెకి వచ్చిన ప్రయాణికుడి వద్ద అరుదైన విదేశీ బ్లాక్ కాలర్డ్ స్టెర్వింగ్ జాతికి చెందిన ఆరు పక్షులను అక్రమంగా తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పక్షులు అపస్మారక స్థితిలో ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని బిసెంట్‌నగర్‌లోని యూనియన్ ఫారెస్ట్రీ కన్జర్వేషన్ క్రైమ్ బ్రాంచ్‌కు సమాచారం అందించారు. ఆరు పక్షులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ చైనా, తైవాన్, మలేషియా, సింగపూర్ దేశాలకు చెందిన అరుదైన పక్షులుగా గుర్తించారు. నిప్పంటించుకున్న మహిళా ఉద్యోగి అన్నానగర్: తేనంపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పారిశుద్ధ్య కార్మికురాలు నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది. చైన్నె తేనాంపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో స్వీపర్‌గా పనిచేస్తున్న సుమతి (37) కార్యాలయంలోనే పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. అక్కడున్న వారు ఆమెని రక్షించి కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పని నుంచి తొలగించినందుకే మహిళ నిప్పు అంటించుకునట్లు పోలీసులు జరిపిన విచారణలో తేలింది. ఈ ఘటన పై పోలీసులు ప్రైవేటు అటవీశాఖ అధికారులను విచారిస్తున్నారు. మహిళపై లైంగికదాడి అన్నానగర్: వివాహం చేసుకుంటానని నమ్మించి, ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడడంతోపాటు ఆమె నుంచి నగలు, నగదు, ల్యాప్‌టాప్ తీసుకుని ఉడాయించాడు. ఈ ఘటనపై చైన్నెలోని అన్నానగర్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువతి అన్నానగర్ ఆల్ మహిళా పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 2022లో ఓ మహిళ మ్యాట్రిమోనియల్ ద్వారా వివాహం చేసుకోవడానికి వరుడి కోసం వెతికింది. అప్పుడు, ఒక యువకుడు ఆమెను సెల్ఫోన్బర్లో సంప్రదించాడు. ‘మిమ్మల్ని వివాహం చేసుకుంటాను.. ఒంటరిగా చూడవచ్చ?’ అని అడిగాడు. వెంటనే అందుకు ఆమె అంగీకరించింది. ఆ యువకుడి మాటలను నమ్మి క్లోజ్‌గా ఉంటూ వచ్చింది. అనంతరం కోయంబేడు ప్రాంతంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. అందుకు ఆమె నిరాకరించి పెళ్లికి ముందు ఇలా చేయకు అని చెప్పింది. అందుకు ఆ యువకుడు ‘నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను’ అని ఆశ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వ్యాపారం చేయబోతున్నానని రూ.10 లక్షల నగదు, 9 సవర్ల నగలు, ల్యాప్‌టాప్ ఆమె వద్ద తీసుకున్నాడు. ఆ తర్వాత హఠాత్తుగా పెళ్లికి నిరాకరించాడు. ‘మనమిద్దరం సన్నిహితంగా ఉన్న అసభ్యకర వీడియోను వెబ్సైట్లో ప్రచురిస్తాను’ అని బెదిరించాడు. తనని మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొంది. పోలీసులు ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండోరోజు కొనసాగిన ఈడీ సోదాలు
● త్రిభాషా వ్యవహారాన్ని రూటు మార్చేందుకే... ● ఉదయనిధి స్టాలిన్ సాక్షి, చైన్నె: రాష్ట్రంలో పని చేస్తున్న ఐదు మద్యం ఉత్పత్తి సంస్థల్లో రెండో రోజైన శుక్రవారం కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. టాస్మాక్ కార్యాలయంలో ఈ సోదాలు కొనసాగుతుండడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం సంస్థ టాస్మాక్ సంస్థకు చైన్నె థౌజండ్ లైట్స్, టీ నగర్, పాండిబజార్, విల్లుపురం, కోవై వంటి ఐదు మద్యం తయారీ సంస్థల నుంచి అధికంగా మద్యం కొనుగోలు జరిగి ఉన్నాయి. అలాగే ఈ సంస్థ నుంచి కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, గోవా రాష్ట్రాలకు కూడా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. గత అన్నాడీఎంకే హయాంలో ఈ 5 మద్యం కంపెనీలు కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు తెలిసింది. ఆ మేరకు గత ఆదాయ పన్ను శాఖ అధికారులు 2019లో ఆరోపణలు ఎదుర్కొన్న ఏఏజే, కాల్స్ మద్యం కంపెనీలపై దాడులు నిర్వహించగా, మద్యం విక్రయాల ద్వారా రూ.450 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు తేలింది. దీనికి సంబంధించి ఆదాయపన్ను శాఖ అధికారులు అందించిన సమాచారం మేరకు ఎనన్‌ఫోర్స్‌మెంట్ శాఖ అధికారులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. టాస్మాక్‌కు మద్యం విక్రయించేందుకు అత్యధికంగా డబ్బును అక్రమంగా మద్యం తయారీ కంపెనీలకు తరలించినట్లు సమాచారం. ఈ 5 మద్యం కంపెనీలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగడం ఆ శాఖల్లో కలకలం రేపింది. త్రిభాషా వ్యవహారాన్ని రూటు మార్చేందుకే... – ఉదయనిధి స్టాలిన్ రాష్ట్రాభివృద్ధి పథకాల గురించి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఒక్కొక్క జిల్లాకో పరిశీలన జరుపుతూ వస్తున్నారు. ఆ మేరకు తిరువారూరులో గురువారం పరిశీలన జరిపిన ఉదయనిధి రాత్రి సన్నధి వీధిలో బస చేశారు. ఈ క్రమంలో శుక్రవారం రెండో రోజు పర్యటనలో భాగంగా ఉదయం 9.30 గంటలకు తిరువారూర్‌లో జరిగిన అన్ని ప్రభుత్వ శాఖల పరిశీలన సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ త్రిభాషా విధానం వ్యవహారం, రాష్ట్రానికి నిధుల విడుదల వ్యహారాలను రూటు మార్చేందుకే ప్రస్తుతం రాష్ట్రంలో ఈడీ సోదాల డ్రామా అని ఉదయనిధి వ్యాఖ్యానించారు. -
శివ సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేలూరు: పట్టణంలోని బేరిపేటలో ఉన్న శివ సుబ్రమణ్యస్వామి ఆలయంలో 35వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ముందుగా వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణ చేసి దీపారధన పూజలు నిర్వహించారు. విశ్వకర్మ స్నేహితుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయని, స్వామివారు వివిధ వాహనాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో విశ్వకర్మ స్నేహితుల సంఘం అధ్యక్షులు తోజోమూర్తి, ఉపాధ్యక్షులు పన్నీర్‌సెల్వం, కార్యదర్శి జనార్దనన్, కార్యాలయ కార్యదర్శి సోమ స్కందన్, ఆలయ ధర్మకర్తలు దురైస్వామి, మార్గబందు, సత్యనారాయణన్ భక్తులు పాల్గొన్నారు. -
ఆకాశ కోకిల
ఆకాశ కోకిల అనే ఈ పేరు వినగానే అందరి మదిలో మెదిలేది 40 సంవత్సరాలు తన కమనీయ కంఠంతో, చలాకీతనంతో శ్రోతలను ఉర్రూతలూగించిన ఆకాశవాణి చైన్నె కేంద్రం విశ్రాంత ఉద్యోగిని బిట్రా గజగౌరి. తను మూడో తరగతి చదువుకునే రోజుల్లోనే ఆకాశవాణి చైన్నె కేంద్రం నిర్వహించే ఆటవిడుపు పిల్లల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజగౌరి కాలక్రమేణా రేడియో అక్కయ్యగా పిల్లల కార్యక్రమం నిర్వహించే స్థాయికి ఎదిగారు. వృత్తిపై శ్రద్ధ, అంకిత భావం శ్రోతలతో పరస్పర అవగాహన ఆమెను వ్యాఖ్యాత స్థాయికి తీసుకెళ్లింది. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో నాటకాలు నిర్వహించారు. గొప్పగొప్ప నటీనటులతో కలిసి నటించారు. స్వయంగా ఆమె చలన చిత్ర ప్రముఖులను శ్రోతలకు పరిచయం చేశారు. ప్రముఖులు రాసిన కథలను తన గళంతో చదివి అటు శ్రోతలకేకాక, కథలు రాసిన రచయితలను సైతం ఆకట్టుకున్నారు. ఆమె సమర్పించిన మధురం మధురం ఈ సమయం నేటికీ శ్రోతల మనస్సులో మెదులుతూనే ఉంది. – గజగౌరి -
ఒక్కో మెట్టు ఎదిగి..
సీ్త్ర లేకుంటే పురుషుడు లేడు. ఉమెన్‌లో మెన్ ఉన్నాడు. కానీ మెన్లో ఉమెన్ లేదు. ఆకాశం పురుషుడైతే సీ్త్ర ప్రకృతి. సీ్త్ర లేక సృష్టే లేదని వ్యాఖ్యానించే ఐకాస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ శోభారాజా మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక్కో మెట్టు ఎదిగారు. ఆదిలో ప్రపంచ జ్ఞానం లేని ఆమె భవిష్యత్తు ఒంటరి పోరాటంలో ఒక పక్క పిల్లలను చదివిస్తూనే, మరో పక్క పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే తపనతో తన కెరీర్‌పై దృష్టి పెట్టి ముందడుగు వేశారు. ఇన్వెస్ట్మెంట్, కన్స్ట్రక్షన్ వర్క్స్ రంగంపై దృష్టి పెట్టారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ చివరకు కుమార్తె, కుమారులను గొప్ప ప్రయోజకులుగా చేశారు. ఒక్కో మెట్టుగా ఎదిగి ఐకాస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. –శోభారాజా -
నేరుగా ఓటీటీలోకి టెస్ట్
తమిళసినిమా: నయనతార చిత్రం వస్తుందంటే సినీ పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ కచ్చితంగా అటెన్సన్ ఉంటుంది. తాజాగా ఈమె నటించిన టెస్ట్ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధం అవుతోంది. అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటి నయనతార. ఈమె చేతిలో ప్రస్తుతం టాక్సిక్, రాకాయి, డియర్ స్టూడెంట్, మూక్కుత్తి అమ్మన్ 2, మన్నాగట్టి చిత్రాలు ఉన్నాయి. వాటిలో టెస్ట్ ఒకటి. వైనాట్ స్టూడియోస్ ప్రొడక్షన్ పతాకంపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ కలిసి నిర్మించారు. కాగా ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత శశికాంత్ దర్శకుడిగా అవతారమెత్తి తెరకెక్కించిన తొలి చిత్రం ఇది. ఇందులో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది క్రికెట్ క్రీడ నేపథ్యంలో రూపొందిన చిత్రం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి శక్తిశ్రీ గోపాలన్ సంగీతాన్ని అందించారు. నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 4న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కాగా ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న నయనతార నటించిన 4వ చిత్రం ఇది. ఇంతకుముందు మూక్కుత్తి అమ్మన్, నెట్రిక్కన్, ఓ–2 చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదల అయ్యాయన్నది గమనార్హం. -
ఫీల్‌గుడ్‌గా 3బీహెచ్‌కే
తమిళసినిమా: సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 3 బీహెచ్‌కే. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 8 తోట్టాక్కళ్ చిత్రం ఫేమ్ శ్రీగణేశ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటుడు శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు, మీథా రఘునాఽథ్, చైత్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అమృత్ రామ్‌నాఽథ్ సంగీతాన్ని, దినేశ్ కృష్ణన్. పీ, జిత్తన్ స్టానీస్లాస్ ద్వయం చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీని గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ ఇది ఫీల్ గుడ్ చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర టైటిల్ ప్రకటించగానే ప్రేక్షకుల మధ్య మంచి అంచనాలు ఏర్పడ్డాయన్నారు. మనసును ఆకట్టుకునే సంతృప్తికరమైన కథను చిత్రంగా నిర్యించడం సంతోషంగా ఉందన్నారు. అలాంటి అనుభవాన్ని కలిగించిన యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు అన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ, చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. 3 బీహెచ్‌కే చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకాన్ని నిర్మాత వ్యక్తం చేశారు. సిద్ధార్థ్‌తో 3 బీహెచ్‌కే చిత్ర యూనిట్ -
No Headline
తమిళసినిమా: ఇంతకుముందు కథానాయకలు ప్రతి నాయకలుగా నటించానికి భయపడేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. పాత్ర బాగుంటే అది ఎలాంటిదైనా నటించడానికి సై అంటున్నారు. తాజాగా నటి వసుంధర అయితే తాను ప్రతినాయకి పాత్రలను చేయడానికి రెడీ అని బహిరంగంగానే ప్రకటించారు. అదీ మోడ్రన్ విలనిజంతో కూడిన పాత్రలు చేయడానికి ప్రాముఖ్యతనిస్తానని అంటున్నారు. దివంగత దర్శకుడు ఎస్పీ జననాథన్ తెరకెక్కించిన పేరాణ్మై చిత్రంలో ఐదుగురు యువ హీరోయిన్లలో ఒకరిగా పరిచయమైన నటి వసుంధర. అలా తొలి చిత్రంతోనే కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న ఈ భామ ఆ తరువాత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించారు. అంతేకాదు పలు ప్రతినాయకి షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ నటించి శభాష్ అనిపించుకున్నారు. అయినా సెలెక్టివ్ పాత్రల్లోనే నటించడం వల్ల ఇంకా తన పయనాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ నటిస్తున్న వసుంధర గత ఏడాది శివ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు. దర్శకుడు శివ బక్రీద్ చిత్రంలో తన నటన చూసి ఆయన తనను కంగువ చిత్రంలో నటించడానికి పిలిచినట్లు చెప్పడంతో ఆడిషన్‌కు వెళ్లానని చెప్పారన్నారు. ప్రస్తుతం తెలుగులో ఒక చిత్రంలో నటిస్తున్నట్లు, అదీ ప్రతినాయకి షేడ్స్ కలిగిన పాత్రనేనని చెప్పారు. అదేవిధంగా తమిళంలో ఐశ్వర్యరాజేశ్ కథానాయకిగా నటిస్తున్న చిత్రంలో మోడ్రన్ విలనిజంతో కూడిన పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. తాను శక్తివంతమైన మోడరన్ విలనిజంతో కూడిన పాత్రల్లో నటించడానికే ప్రాముఖ్యతనిస్తానని వసుంధర పేర్కొన్నారు. కాగా తెలుగుతో మంచి కథా చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, అందుకే ఇకపై తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మోడ్రన్ విలనిజానికి ప్రాముఖ్యతనిస్తా! -
హామీలు నెరవేర్చలేకే అఖిల పక్షం
– జీకే వాసన్ వేలూరు: ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు నెరవేర్చలేక డీఎంకే అఖిలపక్ష సమావేశం నిర్వహించిందని తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు జీకే వాసన్ తెలిపారు. తిరుపత్తూరు జిల్లా ఆంబూరులో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ 2026వ సంవత్సరంలో డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా వచ్చే పార్టీతో కూటమి పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అనంతరం సమావేశంలో వివిధ తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, సారా ఏరులై పారుతోందన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించడంతో ప్రజలు ఈ ప్రభుత్వంపై విసిగి పోయారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయలేదని పలు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పథకాలను అమలు చేయలేకనే డీఎంకే పార్టీ అఖిలపక్ష పార్టీ సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతారన్నారు. -
క్లుప్తంగా
బీజేపీ సంతకాల సేకరణకు మద్దతు –అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్ తిరువళ్లూరు: త్రిభాషా అమలుకు మద్దతు కోరుతూ బీజేపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలపడంతో పాటు సంతకం చేసిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే, యూనియన్ కార్యదర్శి కేఎస్ విజయకుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని అమలుకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ ఆధ్వర్యంలో తిరువళ్లూరు జిల్లా మంజాకారణి వద్ద సంతకాల సేకరణ చేశారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే, అన్నాడీఎంకే నేత విజయకుమార్ పాల్గొని సంతకాలు చేశారు. ఈ విషయం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. బీజేపీ, అన్నాడీఎంకే లోపాయికారి ఒప్పందం కారణంగా అన్నాడిఎంకే నేతలు సంతకాల సేకరణకు మద్దతు ఇస్తున్నారని డీఎంకే నేతలు ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఈ వ్యవహరం అన్నాడీఎంకే అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో విజయకుమార్‌ను యూనియన్ కార్యదర్శితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ అరెస్టు తిరువళ్లూరు: ఇంటి పన్ను తక్కువగా మదింపు చేయడానికి లంచం తీసుకుంటూ మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన విశ్రాంతి పొందిన ఉద్యోగి మాయాండి. ఇతడి కోడలు తమిళ్‌సెల్వి తిరునిండ్రవూర్ తిరువెంగడం నగర్లో ఇంటిని నిర్మించుకున్నారు. ఇటీవల ఇల్లు నిర్మాణం పూ ర్తయిన క్రమంలో ఇంటి పన్ను చెల్లింపునకు మున్సిపాలిటీ అధికారులను ఆశ్రయించాడు. ఈ సమయంలో బిల్ కలెక్టర్ షణ్ముగం ఇంటిని పూర్తిగా పరిశీలించిన తరువాతే మొత్తాన్ని నిర్ణయిస్తామని చెప్పడంతో ఇందుకోసం తమిళ్‌సెల్వి వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఇంటిని కొలత వేసిన తరువాత బిల్ కలెక్టర్ షణ్ముగం ఇంటి యజమానులతో పన్నును తక్కువగా మదింపు చేయడానికి రూ.15 వేలు లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మొదట శుక్రవారం ఉదయం బిల్ కలెక్టర్ షణ్ముగం రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అనంతరం అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 15 కిలోల గంజాయి పట్టివేత – ఒకరి అరెస్టు తిరువళ్లూరు: ఆంధ్రా నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించడానికి యత్నించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపంలోని చెన్నీర్‌కుప్పం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో పట్టుబడిన వ్యక్తి పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రశాంత్బిశ్వాస్(32)గా గుర్తించారు. ఇతడు ఆంధ్రా నుంచి గంజాయిని తీసుకొచ్చి యువతే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. ఇతడి నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అతన్ని అరెస్ట్ చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ తిరువొత్తియూరు: న్యాయవాది హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. రామనాథపురం జిల్లా ముద్దుగులత్తూరు తాలూకా విక్రవాండిపురంలోని వల్లరసు గ్రామానికి చెందిన ఇరులాండి కుమారుడు ఉత్తరకుమార్ (35) న్యాయవాది. గురువారం రాత్రి ఉత్తరకుమార్ ఇంటి నుంచి సోదరి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో హెల్మెట్లు ధరించి బైక్‌లో వచ్చిన ముగ్గురు వ్యక్తుల కత్తులతో దాడి చేసి ఉత్తరకుమార్ను హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్య కేసుకు సంబంధించి రామనాథపురంలో పరమక్కుడి వైగై నగర్‌కు చెందిన దీనదయాళన్, అబ్దుల్ కలాం, కిరణ్ అనే ముగ్గురిని గురువారం రాత్రి పరమక్కుడినగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
–మృతదేహాన్ని కాలువలో పడేసిన రైతు అరెస్ట్ అన్నానగర్: కడలూరు జిల్లా పిన్నలూరు మురట్టువైకల్ వద్ద శుక్రవారం ఉదయం పిన్నలూరు గ్రామానికి చెందిన బాలకృష్ణన్ కుమారుడు బాబు (29) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ మేరకు మరుదూరు పోలీసులు విచారణ చేశారు. విచారణలో పోలీసుల వివరాలు మేరకు.. మంజక్కోల్లై గ్రామానికి చెందిన సెల్వరాజ్ (62) రైతు. తన వ్యవసాయ భూమిలో ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నాడు. ఇటీవల ఆయన ఇంట్లో ఇత్తడి వస్తువులు, సామి దీపం వస్తువులను దుండగులు అపహరించారు. దీంతో చోరీలు జరగకుండా ఇంటి చుట్టూ ఉన్న పొలంలో విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకున్నాడు. విషయం తెలియని బాబు తన స్నేహితులు ప్రవీణ్, సెల్వకాంతి, సెల్వగణపతితో కలిసి గురువారం రాత్రి సెల్వరాజ్ ఇంటికి దొంగతనానికి వెళ్లారు. విద్యుత్ కంచైపె నుంచి దూకేందుకు యత్నిస్తున్న సమయంలో బాబుకు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో షాక్‌కు గురైన ముగ్గురు స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. మరుసటి రోజు ఉదయం సెల్వరాజ్ విద్యుత్ కంచెలో చిక్కుకున్న బాబు మృతదేహాన్ని చూశాడు. దీంతో దిగ్భ్రాంతి చెంది బాబు మృతదేహాన్ని సమీపంలోని మురట్టువైకల్లోని కాలువలో పడేసి ఇంటికి వెళ్లినట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి అక్రమంగా విద్యుత్ కంచె వేసిన సెల్వరాజ్‌తో పాటు అతని ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన ప్రవీణ్, సెల్వకాంతి, సెల్వగణపతిలను అరెస్ట్ చేశారు. -
సంతకాలు సేకరిస్తే చర్యలు
– మంత్రి అన్బిల్ మహేష్ తిరువళ్లూరు: త్రిభాషా విద్యావిధానానికి మద్దతుగా బీజేపీ నేతలు విద్యార్థుల చేత బలవంతపు సంతకాల సేకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్‌మహేష్ హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన నాల్గవ పుస్తకాల ప్రదర్శనను మంత్రులు అన్బిల్‌మహేష్, నాజర్, కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పుస్తకాల విక్రయాలను మంత్రి అన్బిల్ మహేష్ లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఒక మంచి పుస్తకంతో స్నేహం ద్వారా వంద చెడు అలవాట్లకు దూరంగా వుండొచ్చన్నారు. తిరువళ్లూరులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో 109 స్టాల్స్‌లో లక్షకు పైగా పుస్తకాలను విక్రయానికి వుంచామని, ప్రతిఒక్కరు పుస్తకాన్ని కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి అన్బిల్‌మహేష్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.200 వందల కోట్లు తీసుకుని త్రిభాషా విధానం, నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే రాష్ట్రంలోని ప్రజలను రెండు వందల సంవత్సరాలు వెనక్కినెట్టినట్టు అవుతుందన్నారు. రాష్ట్రంలో హిందీని అనుమతించడం ద్వారా తమ మాతృభాషపై తీవ్ర ప్రభావం చూపి రాబోయే రోజుల్లో తమిళంను కనుమరుగు చేయాలన్నదే బీజేపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు. డీఎంకే ఉన్నంత వరకు తమిళ భాషను మరింత పరిరక్షించుకోవడంతో పాటు హిందీని తమ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటామన్నారు. పాఠశాల ముందు నిలబడి బడి పిల్లల వద్ద త్రిభాషా విధానానికి మద్దతుగా సంతకాలు చేయాలని బలవంతం చేయడం సరికాదన్నారు. విద్యార్థుల వద్ద బలవంతపు సంతకాల సేకరణ జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పరీక్షలకు మందు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేశామని, దీంతో విద్యార్థులకు పరీక్షలంటే భయం పోవాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఇటీవల తిరువళ్లూరులో ప్లస్‌టూ విద్యార్థిని ఆత్మాహుతి వ్యవహారంపై నిగ్గు తేల్చడానికి కలెక్టర్ ప్రత్యేక కమిటీని నియమించారని తెలిపారు. కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, కృష్ణస్వామి, చంద్రన్, టీజే గోవిందరాజన్, దురైచంద్రశేఖర్, సుదర్శనం, ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, డీఆర్వో రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
21న తెరపైకి ఎన్నై చుడుమ్ పణి
తమిళసినిమా: యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్నై చుడుమ్ పణి. నటరాజ్ సుందర్రాజ్ హీరోగా నటించిన ఇందులో ఉపాసన ఆర్సీ హీరోయిన్గా నటించారు. దర్శకుడు కే.భాగ్యరాజ్, చిత్రా లక్ష్మణన్, మనోబాలా, తలైవాసల్ విజయ్, ముత్తుకాళై, సింగంపులి, కూల్ సురేష్, సుందర్రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కామ్సేవ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఎస్ఎన్ఎస్ పిక్చర్స్ పతాకంపై హేమలత సుందర్రాజ్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ చిత్రం షూటింగ్‌ను చైన్నె, పొల్లాచ్చి, మరైయూర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. భారీ వ్యయంతో రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. చిత్రానికి నృత్య దర్శకత్వం వహించిన డాన్స్‌మాస్టర్ శాండీమాస్టర్ ఒక ప్రత్యక పాటలో నటించడం విశేషం అన్నారు. అలాగే ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారన్నారు. ఎన్నై చుడుమ్ పణి చిత్రం పలు ఆసక్తికరమైన అంశాలతో జనరంజకంగా ఉంటుందని, తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని నిర్మాత పేర్కొన్నారు. కాగా దీనికి అరుళ్‌దేవ్ సంగీతం, వెంకటేశ్ చాయాగ్రహణం అందించారు. -
ఏడుగురు రాష్ట్ర సీఎంలకు స్టాలిన్ లేఖ
చెన్నై: కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు ఎంకే స్టాలిన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది సమాఖ్య వాదంపై స్పష్టమైన దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పరిపాలనను శిక్షించడమేనని స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై స్పష్టమైన విముఖత వ్యక్తం చేస్తున్న స్టాలిన్.. ఏడుగురు సీఎంలకు లేఖలు రాశారు. దాంతో పాటు మాజీ సీఎంలకు ఆయన లేఖలు పంపినట్లు స్టాలిన్ పేర్కొన్నారు.ఈ అంశంపై తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ ఎక్స్’ వేదికగా మండిపడ్డారు స్టాలిన్. ‘ ఇది దేశ సమాఖ్యవాదంపై దాడి. రాష్ట్రాలను శిక్షించేందుకే ఈ కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనాభా నియంత్రణ, సుపరిపాలనపై పార్లమెంట్ లో మన గొంతు వినిపించుకుండా చేయడమే వారి లక్ష్యం. దీనికి మేం పూర్తిగా వ్యతిరేకం. ఇంత ఎంతమాత్ర సమ్మతం కాదు’ అని స్టాలిన్ పేర్కొన్నారు.ఈ డీలిమిటేషన్ అంశంపై మాట్లాడేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీలకు లేఖలు రాసినట్లు స్టాలిన్ తెలిపారు. The Union Govt's plan for #Delimitation is a blatant assault on federalism, punishing States that ensured population control & good governance by stripping away our rightful voice in Parliament. We will not allow this democratic injustice!I have written to Hon'ble Chief… pic.twitter.com/1PQ1c5sU2V— M.K.Stalin (@mkstalin) March 7, 2025 -
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఐదుగురు మృతి
తిరుత్తణి: తమిళనాడులోని తిరుత్తణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
LKG విద్యార్థి Phd హోల్డర్‌కు ఉపన్యాసం ఇచ్చినట్టుంది: కేంద్రంపై స్టాలిన్ సెటైర్లు
సాక్షి, చెన్నై: తమిళనాడులో హిందీ(Hindi) భాష విషయమై రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్((MK Stalin), కేంద్రమంత్రుల మధ్య విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలకు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటరిచ్చారు. తమిళ భాషకు కేంద్రం తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. తమిళం విషయంలో స్టాలిన్ రాజకీయం సరికాదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు(Tamil Nadu)లోని రాణిపేటలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సీఐఎస్ఎఫ్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో ఉన్నత విద్య కోసం తమిళ భాషలోనే సిలబస్ తీసుకొస్తాం. వీలైనంత త్వరగా చర్యలు చేపడతాం. తమిళ భాష అభివృద్ధి, సంస్కృతికి కట్టుబడి ఉన్నాం. దేశంలో ప్రాంతీయ భాషలు అన్నింటినీ గౌరవిస్తాం. ఇప్పటివరకు సీఏపీఎఫ్(CAPF) నియామకంలో మాతృభాషకు స్థానం లేదు. ఈ నేపథ్యంలో యువతకు నష్టం జరుగుతోందని ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అన్ని భాషలతో పాటు తమిళంలో కూడా సీఏపీఎఫ్ పరీక్షలు నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సీఎం స్టాలిన్ మానుకోవాలి’ అని కామెంట్స్ చేశారు.#WATCH | Arakkonam, Tamil Nadu: Union Home Minister Amit Shah says, "... Till now, there was no place for mother tongue in the CAPF recruitment... PM Narendra Modi decided that our youth will now be able to write their CAPF exam in all languages in the eight list, including… pic.twitter.com/Q8pXv1IzZ4— ANI (@ANI) March 7, 2025అంతకుముందు, కేంద్రంపై సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఆయన విమర్శలు చేశారు. స్టాలిన్ ట్విట్టర్ వేదికగా..‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పటికీ గెలవని యుద్ధం మొదలుపెట్టారు. చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా.. గాలి రాకుండా మాత్రం ఉండదు కదా!. అలాగే.. భాష విషయంలో ఆయన మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అందుకే ఆయనకు వరుసగా లేఖలు రాస్తున్నాం. ఎన్ఈపీని తిరస్కరిస్తున్న తమిళనాడు.. ఇప్పటికే విద్యావిధానంలో అనేక లక్ష్యాలను సాధించింది.త్రిభాష విషయంలో.. ఎల్కేజీ విద్యార్థి పీహెచ్డీ హోల్డర్‌కి ఉపన్యాసం ఇచ్చినట్లు ఉంది ఆయన తీరు. మేం ఢిల్లీ ఆదేశాలను తీసుకోం. త్రిభాషా విధానంపై బీజేపీ సర్కారు చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన అజెండాగా చేసుకొని బరిలో దిగాలని సవాల్ విసురుతున్నా. పథకాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లను పెట్టారు. దేశంలో అధికంగా ఉన్న హిందీయేతర ప్రజలను ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది’ అని స్టాలిన్ చెప్పుకొచ్చారు. 🎯 "The tree may prefer calm, but the wind will not subside." It was the Union Education Minister who provoked us to write this series of letters when we were simply doing our job. He forgot his place and dared to threaten an entire state to accept #HindiImposition, and now he… pic.twitter.com/pePfCnk8BS— M.K.Stalin (@mkstalin) March 7, 2025 -
రెండో పాట
వీర ధీర శూరన్ చిత్రం నుంచి తమిళసినిమా: చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న 62వ చిత్రం వీర ధీర శూరన్. నటి దుషార విజయన్ నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్జే సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై హెచ్ఆర్ రియా శింబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సేతుపతి, చిత్తా చిత్రాల ఫేమ్ అరుణ్ కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్స్ కథా చిత్రంగా రూపొందుతోంది. విక్రమ్ కాళీ అనే గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న వీర ధీర శూరన్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అదేవిధంగా ఇంతకుముందు చిత్రంలోని కల్లూరుమ్ కార్తీ ౠన్ మేల్ అనే పల్లవితో సాగే పాటలు విడుదల చేశారు. దీనికి విశేష ఆదరణ లభించింది. పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న వీర ధీర శూరన్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా తాజాగా ఆది అడి ఆది అనే పల్లవితో సాగి రెండవ పాటను చిత్ర వర్గాలు గురువారం విడుదల చేయనున్నారు. ఫైవ్ స్టార్ పిక్చర్స్ సెంథిల్ పొందడం విశేషం. చిత్రం సమ్మర్ స్పెషల్ విడుదలకు ముస్తాబవుతోంది. వీర ధీర శూరన్ చిత్రంలో విక్రమ్, దుషారా విజయన్ -
గ్లాకోమా రోగులకు ఉచిత సేవ
సాక్షి, చైన్నె : ప్రపంచ గ్లాకోమా వారోత్సవాన్ని పురస్కరించుకుని ఆ వ్యాధితో బాధ పడుతున్న రోగులకు ఉచిత కన్సల్టెన్సీ సేవలను నిర్వహించనున్నామని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ చైన్నెలోని వారికి మార్చి 31 వరకు గ్లాకోమా స్క్రీనింగ్ ఉచితంగా నిర్వహించబడుతుందన్నారు. రోగులు 9594903774 నంబర్‌ను సంప్రదించడం ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. ఒక ఆశాజనక చికిత్సా పద్ధతి మినిమల్లీ ఇన్వేసివ్ గ్లాకోమా సర్జరీ అని, ఇది కీలకమైన ప్రమాద కారకమైన ఇంట్రాకోక్యులర్ ప్రెజర్ తగ్గిస్తుందన్నారు. ప్రపంచ గ్ల్లాకోమా వారోత్సవాన్ని మార్చి 9–15 వరకు పాటిస్తారని పేర్కొంటూ, ఈ వ్యాధితో బాధపడుతున్న రోగులకు మందులు, లేజర్ చికిత్స , శస్త్రచికిత్స జోక్యాలతో సహా అధునాతన చికిత్సా ఎంపికలపై సలహాలు, సూచలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్లాకోమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే ప్రమాద కారకాలలో కుటుంబ చరిత్ర, అధిక కంటి లోపలి ఒత్తిడి, 40 ఏళ్లు పైబడిన వయస్సు, మధుమేహం కంటి గాయాల పరిస్థితులు కలిగిఉన్న వారిలోనే ఉంటాయన్నారు. ముందస్తుగా గుర్తించడం ద్వారా తప్పకుండా సమగ్ర కంటి పరీక్షలు అవసరం అని పేర్కొంటూ చికిత్స ఎంపికలలో సమస్యను తగ్గించడానికి కంటి చుక్కలు, లేజర్ చికిత్స, శస్త్రచికిత్స, కనిష్ట ఇన్వాసివ్ గ్లాకోమా సర్జరీ లు ఉపయోగకరకం అని వివరించారు. -
నా పేరే నాకు చిరునామా
తమిళసినిమా: కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్ గా పిలువబడుతున్న నటి నయనతార. అంతేకాకుండా అత్యధిక పారితోషికం పొందుతున్న దక్షిణాది కథానాయకి ఈ భామనే. తొలి రోజుల్లో అవకాశాల కోసం కాళ్లకు బలపాలు కట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగిన ఈమె ఇప్పుడు పాన్ ఇండియా కథానాయకిగా వెలిగిపోతున్నారు. అంతేకాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న నయనతార వాణిజ్య ప్రకటనల ద్వారాను సంపాదిస్తున్నారు. ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. లేడీస్ సూపర్ స్టార్ పట్టంతో ఎంజాయ్ చేస్తున్న ఈ భామ ఉన్నట్టుండి ఇప్పుడు ఆ పట్టమే తనకు వద్దు అంటున్నారు. దీని గురించి ఆమె మంగళవారం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో ‘‘నేను ఒక నటిగా పయనిస్తున్న ఈ మార్గంలో సంతోషం, సక్సెస్ అన్నిటికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా జీవితం ఎప్పటికీ తెరిచిన పుస్తకంగానే ఉంది. మీ ప్రేమాభిమానాలు దానికి అందాన్ని చేకూర్చాయి. నా విజయాలకు భుజం తట్టిన మీరు, కష్టకాలంలోనూ నన్ను నిలబెట్టారు. అభిమానంతో లేడీ సూపర్ స్టార్ అనే పట్టాన్ని కట్టబెట్టారు. మీ అమితాభిమానంతో అందించిన ఈ పట్టంకు రుణపడి ఉంటాను. అయితే ఇకపై లేడీ సూపర్ స్టార్‌గా కాకుండా నన్ను నయనతార అనే పిలవాలని వినమ్రంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా పేరే నాకు అత్యంత సన్నిహితం. చిరునామా అది నన్ను మాత్రమే సూచిస్తుంది. ఒక నటిగానే కాకుండా వ్యక్తిగతంగానూ పట్టం, బిరుదులు గౌరవించదగినవే. అయితే కొన్ని సమయాల్లో అవి మనల్ని మనం చేసే పని నుంచి, కళా వృత్తి నుంచి, ముఖ్యంగా అభిమానుల నుంచి విడదీస్తాయి. మనం అందరం వ్యక్తం చేసుకునే ప్రియమైన భాష మనల్ని ఎల్లలు దాటి కలిపింది. భవిష్యత్తు నన్ను ఎలాంటి పరిణామాలకు గురిచేసిన మీ ఆదర అభిమానాలు ఎప్పటికీ మారవు అని తెలిసి వచ్చినందుకు ఆనందంగా ఉంది. అదేవిధంగా మీ అందరిని సంతోష పరచడానికి నా కఠిన శ్రమ కొనసాగుతుంది. సినిమాలే మనల్ని ఒకటిగా చేసింది. దాన్ని మనం అంతా కలిసి వేడుకల జరుపుకుందాం.. అని నయనతార పేర్కొన్నారు. -
ఏమి రైటింగ్ ఫెంటాస్టిక్
తమిళసినిమా: ఏమి రైటింగ్. ఫెంటాస్టిక్. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్. ఇటీవల మంచి కంటెంట్‌తో కూడిన చిన్న చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి చిత్రాల్లో డ్రాగన్ ఒకటి. నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఓ మై కడవులే చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు అశ్వద్ మారిముత్తును అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాగా మంచి చిత్రాలను, ప్రతిభావంతులైన కళాకారులను ప్రశంసించడంలో ముందుండే నటుడు రజనీకాంత్ ఇటీవల డ్రాగన్ చిత్రాన్ని చూసి,వెంటనే ఆ చిత్రం దర్శకుడు అశ్వద్ మారిముత్తును తన ఇంటికి ఆహ్వానించి ఎంతగానో ప్రశంసించారు. ఏమి రైటింగ్ ఫెంటాస్టిక్ అంటూ డ్రాగన్ చిత్ర కథ గురించి అభినందించారు. ఈ విషయాన్ని దర్శకుడు అశ్వద్ మారిముత్తు తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ రజనీకాంత్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అందులో ‘‘మంచి చిత్రాన్ని చేయాలి. దాన్ని రజనీకాంత్ చూసి ప్రశంశించాలి. ఇంటికి పిలిపించి అభినందించాలి. మా చిత్రం గురించి మాట్లాడాలి అని కష్టపడి పనిచేసే ఎందరో సహాయం దర్శకులు కలలు కంటారు. అలాంటి నా కల ఇప్పుడు నెరవేరింది ‘‘ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు, రజనీకాంత్‌తో ఈయన దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఘనంగా ఓంకాళియమ్మన్ ఆలయ మాసి ఉత్సవాలు
● పవిత్ర జలాలలో అమ్మవారికి అభిషేకం పవిత్ర జలాలలో ఊరేగింపుగా వస్తున్న భక్తులు సేలం : తిరుచెంగోడ్‌లోని చిన్న ఓంకలియమ్మన్ ఆలయంలో మాసి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్‌లో ప్రసిద్ధ చిన్న ఓంకాళియమ్మన్ మాసి అగ్నిగుండ మహోత్సవం ఫిబ్రవరి 28న పూల వెలిగింపుతో ప్రారంభమైంది. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 25,000 మందికి పైగా భక్తులు గుండం ఆలయానికి దిగుతారని అంచనా. ఉత్సవాలలో భాగంగా అగ్నిగుండం దిగబోతున్న వేలాది మంది భక్తులు తిరుచెంగోడు పర్వతం దిగువన ఉన్న చెరువు నుంచి పుణ్య జలాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. రాత్రిపూట అమ్మవారిని ఆవాహన చేయడం, శక్తి కరగం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలలో ఏడవ రోజు, శుక్రవారం, కూత్తు దీప పూజ, అగ్ని కరగం, అలఘు పూజ వంటివి జరుగుతాయి, తరువాత నాలుగు రథ వీధుల గుండా ఊరేగింపు, తరువాత అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, మహా దీపారాధన జరుగుతుంది. 9వ తేదీ ఆదివారం నాడు 108వ శంఖాభిషేకం, 11వ తేదీ మంగళవారం మహాగుండం ఉత్సవం జరుగుతాయి. దీని తరువాత, పొంగల్ పండుగ తెల్లవారుజామున జరగనుంది. ఈ ఉత్సవం 15వ తేదీ శనివారం అమ్మవారి ఊరేగింపు, పెరుగు అన్నం నైవేద్యం, పసుపు స్నానంతో ముగుస్తుంది. -
క్లుప్తంగా
రోడ్లపై తిరిగే ఆవులను బంధించడానికి రూ.కోటి వ్యయంతో కొట్టం అన్నానగర్: తాంబరంలో రోడ్డుపై తిరుగుతున్న ఆవులను అడ్డుకునేందుకు రూ.కోటితో గొట్టం నిర్మిస్తామని బడ్జెట్లో తెలియజేశారు. తాంబరం కార్పొరేషనన్ సమావేశం మేయర్ వసంతకుమారి కమలకన్ననన్ అధ్యక్షతన డిప్యూటీ మేయర్ కామరాజ్, కమిషనర్ బాలచందర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఫైనానన్స్ కమిటీ చైర్మన్ రమణి ఆదిమూల్ 2025, 26 సంవత్సరాలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మేయర్ వసంతకుమారి బడ్జెట్‌ను స్వీకరించారు. రోడ్డుపై తిరుగుతున్న ఆవులను ఉంచడానికి రూ. కోటితో గొట్టం ఏర్పరచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ బడ్జెట్ సమర్పణలో 71 ముఖ్యమైన అంశాలు పొందుపరిచారు. ఈ సమావేశంలో మండల కమిటీ అధ్యక్షులు డి.కామరాజ్, ఎస్.ఇంద్రన్, వి. కరుణానిధి, జయప్రదీప్ చంద్రన్, ప్రతిపక్షనేత వర్సైలెయూర్ శంకర్, 70వ వార్డు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు. వృద్ధురాలి మృతి అన్నానగర్: చైన్నె సమీపంలోని బీసెంట్‌నగర్‌లోని అరండేల్ బీచ్ రోడ్ అపార్ట్మెంట్కి చెందిన త్రిలోక సుందరి (79) రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఈమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ఈ స్థితిలో మానసిక వ్యాధికి గురైన త్రిలోకసుందరి కనిపించకుండా పోయింది. తదనంతరం అతని కుమారుడు ఆనంద్ కన్నన్ తన తల్లి కోసం చాలా చోట్ల వెతికాడు. కానీ ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ స్థితిలో త్రిలోక సుందరి అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని వాటర్ ట్యాంక్‌లో శవమై కనిపించినట్లు గురువారం సమాచారం అందింది. ఆ తర్వాత తిరువాన్మియూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో వాటర్ ట్యాంక్‌లో పడి ఉన్న త్రిలోక సుందరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె నీటి తొట్టిలో ఎలా పడిపోయింది. ఎవరైనా తోసేసారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. హత్యకేసులో దంపతుల అరెస్టు సేలం : కన్యాకుమారి జిల్లా అగస్తీశ్వరం సమీపంలోని కరుంకుళత్తాన్విలై ప్రాంతానికి చెందిన పరమేష్ (37). మాజీ ఓడ సిబ్బంది అయిన ఇతనికి, పక్క ఇంటికి చెందిన గణపతి (45) భార్య ఝాన్సీతో గొడవలు ఉన్నాయి. బుధవారం రాత్రి పరమేష్ వద్ద ఝాన్సీ, గణపతి గొడవపడ్డారు. తర్వాత కత్తితో పరమేష్‌ను నరికారు. తీవ్రంగా గాయపడిన పరమేష్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఝాన్సీ, గణపతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరమేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఆస్తిపరుడైన పరమేష్‌కు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉంటూ మద్యం సేవిస్తూ వచ్చారు. ఈ స్థితిలో ఝాన్సీతో పరిచయం ఏర్పడడంతో వారి మధ్య డబ్బు లావాదేవీలు ఏర్పడినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఇటీవల కొన్ని రోజులుగా పరమేష్‌తో ఝాన్సీ మాట్లాడడం మానివేయడంతో అతను మద్యం తాగి వచ్చి అప్పుడప్పుడు గొడవ పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఝాన్సీ, భర్త గణపతితో కలిసి పరమేష్‌ను హత్య చేశారు. ఆ సమయంలౌఓ పరమేష్ ముఖంపై కారం కొట్టి నరికి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నవ వధువు గొంతుకోసి హత్య ● భర్త కోసం పోలీసులు గాలింపు సేలం : మన్నార్‌కుడి సమీపంలో పరుత్తికోట్టైకు చెందిన తమిళరసన్ – రేవతి దంపతుల కుమార్తె భువనేశ్వరి (20). ఈమెకు ఒరత్తనాడు కీళవన్నిపట్టు అంబలకారన్ వీధికి చెందిన శబరి (23)తో గత ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా భువనేశ్వరి, శబరి కాపురముంటున్న ఇంటిలో నుంచి కేకలు వినిపించాయి. ఇరుగుపొరుగు వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరగా భువనేశ్వరి గొంతుకోసిన స్థితిలో రక్తపు మడుగులో పడి ప్రాణాలకు పోరాడుతూ కనిపించింది. జనం రావడం చూసిన శబరి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తంజావురు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స ఫలించక భువనేశ్వరి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి, పరారైన శబరి కోసం గాలిస్తున్నారు. స్పృహ తప్పిన లొకోపైలెట్ మృతి సేలం : అస్సాం రాష్ట్రం దిబ్రూకర్ నుంచి నాగర్‌కోవిల్‌కు వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ఈ రైలు ఇంజన్ డ్రైవర్, సహాయక డ్రైవర్లను మార్చారు. సహాయక డ్రైవర్‌గా కేరళకు చెందిన ప్రతీప్ (45) రైలులో ఎక్కాడు. నాగర్‌కోయిల్ నుంచి బయలుదేరిన రైలు కన్యాకుమారికి బుధవారం అర్థరాత్రి 12.15 గంటలకు చేరుకుంది. తర్వాత కన్యాకుమారి నుంచి బయలుదేరిన రైలు 1.10 గంటలకు నాగర్‌కోవిల్ రైల్వే స్టేషన్‌కు వచ్చి చేరింది. రైలు నిలిపిన తర్వాత డ్రైవర్ ప్రతీప్ రైలు నుంచి కిందికి దిగాడు. అప్పుడు అకస్మాత్తుగా ప్రతీప్ స్ఫృహతప్పి కింద పడిపోయాడు. రైల్వే పోలీసులు ప్రతీప్‌ను హుటాహుటిన ఆచారిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రతీప్ మృతి చెందినట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
నంగనల్లూరులో హజ్ హౌస్
సాక్షి, చైన్నె: చైన్నెలోని నంగనల్లూరులో రూ. 65 కోట్లతో తమిళనాడు హజ్‌హౌస్ నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను సీఎం స్టాలిన్ జారీ చేశారు. ప్రభుత్వ నేతృత్వంలో హజ్‌యాత్రకు ఏటా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం నలమూలల నుంచి ఎంపికై న ముస్లింలు ఈ యాత్ర నిమిత్తం చైన్నెకు తరలి రావడం జరుగుతోంది. వీరందరికీ అన్ని రకాల వసతులతో హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం నిర్ణయించారు. దీంతో తమిళనాడు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, సభ్యుడు పి. అబ్దుల్ సమద్ సభ్యులు ఫాతిమా అహ్మద్, ఎం. డేవిడ్బీ, మిస్టర్. మౌలానా గులాం ముహమ్మద్ మెహదీ ఖాన్, ఎ. ముహమ్మద్ అష్రఫ్, ఎ. అఫ్జల్, కున్రంకుడి ఆర్.ఎం. అనిఫా, జిల్లా ఖాజీలు . సలావుద్దీన్ ముహమ్మద్ అయూబ్, ఎం. సయ్యద్ మసూద్, ముహమ్మద్ అబ్దుల్ ఖాదిర్, ఫజులుల్ హక్. అబ్దుల్ ఖాదిర్, కె. అబ్దుల్ కరీం, కె.ఎం. ముహమ్మద్ అష్రఫ్ అలీ, అక్బర్ అలీలు సీఎం స్టాలిన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, మైనారిటీ విద్యా సంస్థలు స్టేటస్ సర్టిఫికెట్లు పొందడంతో ఇస్లామిక్ విద్యా సంస్థల నిర్వాహకులు – డా. అజార్ షరీఫ్ (మియాసి) కళాశాల), హాజీ డాక్టర్ ఎ.కె. ఖాజా నజీముద్దీన్ (జమాల్ ముహమ్మద్ మియాసి కళాశాల), తౌఫిక్ అహ్మద్ ( ఖాతీజా ఆర్ట్స్ అండ్ అండ్ సైన్సెస్ కళాశాల), డాక్టర్ సలీం (అలీం మహమ్మద్ సలీహ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్), హఫీజ్ వావు సర్ అహ్మద్ ఇషాక్ అజారి, (వావు వాజిహా మహిళల కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్), డాక్టర్. ఎ. యాహ్యా నయీమ్, (మదర్ ఎడ్యుకేషన్ గ్రూప్),. అజ్మల్ ఖాన్ హౌత్, (ఐఎల్ఎం పబ్లిక్ స్కూల్) తదితరులు సీఎం స్టాలిన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ మంత్రి ఎస్.ఎం. నాజర్, ఎమ్మెల్యే జవహిరుల్లా, మైనారిటీ వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. ఎస్. విజయరాజ్ కుమార్, తమిళనాడు రాష్ట్ర హజ్ కమిటీ ఎం.ఎ. సిద్ధిక్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి. కలైయరసి పాల్గొన్నారు. ఇలా ఉండగా స్టాలిన్ డీఎంకే కేడర్‌కు మీలో ఒకడిని అంటూ మరో లేఖను అందించారు. గత వారం రోజులుగా త్రిభాషా విధానంకు వ్యతిరేకంగా ఆయన కేడర్‌కు లేఖలు రాస్తూ వస్తుండడం తెలిసిందే. తాజాగా రాసిన లేఖలో రూపాయి నోటుపై ఉన్న భాషలను జాతీయ అధికార భాషగా ప్రకటించడంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని చూపుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తేనెతుట్టెలో వేలుపెడితే ఎంత ప్రమాదకరమో తమిళనాడు జోలికి వస్తే అదే స్థాయిలో పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. -
ఓం కాళి జై కాళీ
విమల్ పవర్ ఫుల్ పాత్రలో తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు విమల్. ఇటీవల సార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు తెచ్చుకున్న ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం ఓం కాళీ జై కాళీ. నటి బీమా విశ్వాస్, ఆర్ఎస్.శివాజీ, జీఎం కుమార్, కుమరవేల్, గంజాకరుప్పు, ప్రేమ, భవానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా కులశేఖర పట్టణంలో జరిగిన దసరా ఉత్సవాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటుడు విమల్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, కాళీ అవతారమెత్తిన ఆయన నటన చిత్ర కథకు మరింత బలాన్ని చేకూర్చారని యూనిట్ వర్గాలు తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్,పైగా, ప్రతీకారం, సంస్కృతి ప్రధాన అంశాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాండం, కాళీ నటన, కథా, కథనం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్ర టీజర్‌ను జియో హాట్‌స్టార్ ఇటీవలే విడుదల చేసిందని చెప్పారు. దీనికి కార్తీక్ రాజా సంగీతాన్ని, రాము సెల్లప్పా, కమరవేల్ కథనాన్ని, రాము సెల్లప్ప సంభాషణలు అందించారు. కాగా ఈ చిత్రం నేరుగా త్వరలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. -
కొత్త కేసులు నమోదు చేయొద్దు!
● ఉదయనిధి సనాతనం వ్యవహారంలో సుప్రీం కోర్టు సాక్షి, చైన్నె : సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయవద్దు అని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఇందులో పోలీసు కేసుల విచారణకు బ్రేక్ వేస్తూ స్టే ఉత్తర్వులను పొడిగిస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు ఇవ్వడం ఉదయ నిధికి ఊరట కలిగినట్లయ్యి్ంది. 2023లో క్రీడల మంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం రచ్చకెక్కింది. దీనిని తీవ్రంగా పరిగణించిన హిందూ సంఘాలు, పార్టీలు ఆయనపై రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటక, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలలో అనేక కేసులు నమోదు పై దృష్టి పెట్టాయి. పోలీసుల ద్వారా కొన్ని కేసులు, కోర్టుల ద్వారా మరికొన్ని కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులన్నింటినీ ఒకే గొడుగు నీడలోకి తెస్తూ విచారణను మద్రాసు హైకోర్టుకు లేదా కర్ణాటకకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఉదయనిధి స్టాలిన్ అభ్యర్థించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణ గురువారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్‌కుమార్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఉదయనిధి తరపున సీనియర్ న్యాయవాదులు విల్సన్, అభిషేక్ మను సింఘ్వీ హాజరయ్యారు. పనిగట్టుకుని బిహార్ తదితర రాష్ట్రాలలో ప్రస్తుతం కూడా కేసులను నమోదు చేస్తున్నారని, కేవలం విచారణ జాప్యం చేయడం, ఉదయనిధిని అక్కడకు ఇక్కడకు విచారణ పేరిట తిప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాదించారు. ఈ కేసులన్నీ ఒకే గొడుగున చేరుస్తూ మద్రాసు హైకోర్టుకు లేదా కర్ణాటకకు బదిలీ చేయాలని కోరారు. వాదన అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ కొత్తగా కేసుల నమోదుకు బ్రేక్ వేశారు. సనాతన ధర్మం వ్యవహారంలో ఉదయ నిధిపై కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయవద్దు అని ఆదేశించారు. గత కేసుల విషయంలో ఎలాంటిచర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ ఇచ్చిన స్టేను కొనసాగిస్తున్నామని ప్రకటిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 21వ తేదీకి వాయిదా వేశారు. -
ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన
తమిళనాడులోని పాఠశాలలోని విద్యార్థులకు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ట్రైనింగ్ పార్కు 6వ వార్షికోత్సవ అవగాహన కార్యక్రమానికి గురువారం చైన్నెలో శ్రీకారం చుట్టింది. చైన్నెలో లక్షల మందికి అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ఐఎఎస్ అధికారి వి. శివకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ ఆర్ విజయలక్ష్మిలు ప్రారంభించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పరమ పదం ఆటను తలపించే మ్యాట్ ద్వారా ట్రాఫిక్ అవగాహన మీద దృష్టి పెట్టారు. – సాక్షి, చైన్నె -
దారి దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె నార్త్ కోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజాజీ రోడ్డులో మహేష్ (30) వద్ద సెల్‌ఫోన్ అపహరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి 2023లో నవీన్, విశ్వతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. అదేవిధంగా గత సంవత్సరం జనవరిలో మూర్ వీధి, ఎర్రబాలు చెట్టి వీధి కూడలి దగ్గర నడుచుకుంటూ వస్తున్న సాహుల్ హమీద్‌కు కత్తిని చూపించి సెల్‌ఫోన్ అపహరించిన అజిత్ కుమార్ అనే వ్యక్తితో పాటూ ఇద్దరు వ్యక్తులను పోలీసులు 2024లో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ 2 క్రిమినల్ కేసులకు సంబంధించి జార్జ్టౌనన్ లోని 7వ జిల్లా క్రిమినల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కోర్టు బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన విశ్వ, నవీన్, అజిత్ కుమార్ కోర్టు విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్నారు. దీంతో కొద్ది రోజుల క్రితం ఈ ముగ్గురిని కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు. దీని ప్రకారం పరారీలో ఉన్న చైన్నె నార్త్ కోస్ట్ పోలీస్ స్టేషన్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని స్పెషల్ పోలీస్ ఫోర్స్ బుధవారం సాయంత్రం విశ్వ, నవీన్ (19), అజిత్ కుమార్‌ను అరెస్టు చేశారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
దేశానికే గర్వకారణం
తమిళ సినిమా: సంగీత జ్ఞాని ఇళయరాజా శనివారం లండన్‌లో లైవ్ సింఫోనీ నిర్వహించనున్నడం తెలిసింది. అందుకు గురువారం ఉదయం ఆయన చైన్నె నుంచి ఎమిరేట్స్ విమానం ద్వారా లండన్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన చైన్నె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ సింఫోనీ సంగీతాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైన రాయల్ లండన్ సంగీత బృందం పనిచేస్తుందని చెప్పారు. సంగీతప్రియులు అలరించే విధంగా దీన్ని రూపొందించబోతున్నట్లు చెప్పారు. ఈ సింఫోనీ రూపకల్పన కార్యక్రమం లండన్‌లో 8వ తేదీన జరగనున్నట్లు తెలిపారు. అక్కడి ప్రేక్షకులకు ఈ కార్యక్రమం అద్భుతమైన సంగీత విందుగా ఉండబోతుందన్నారు. ఇంక్రీడబుల్ ఇండియా మాదిరిగా ఇంక్రీడబుల్ ఇళయరాజా అనేది తనకు అత్యంత గౌరవంగా భావిస్తున్నానని, అదేవిధంగా ఇది దేశానికే గర్వ కారణం అవుతుందని అన్నారు. మన గౌరవాన్ని లండన్‌లో చాటబోతున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. త్వరలో లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ ● మంత్రి కోవి చెళియన్ వెల్లడి కొరుక్కుపేట: తమిళనాడులో ఖాళీగా ఉన్న అధ్యాపకులు, ఆచార్యుల పోస్టులను ఈ నెలాఖరులోగా, జూన్‌లోగా భర్తీ చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి సర్ కోవి చెలియన్ తెలిపారు. గురువారం ఉదయం ఈరోడ్‌లోని ప్రభుత్వ కళాశాలగా మార్చనున్న చిక్కయ్య నాయకర్ కళాశాలలో మంత్రులు కోవీ చెళియాన్, ముత్తుస్వామి వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చెళియన్ మాట్లాడుతూ పెరియార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్పై కోర్టులోనూ, పోలీసులలోనూ ఆరోపణ ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు .మార్చి నెలాఖరు నాటికి వెయ్యి మంది అధ్యాపకులు, జూన్ నాటికి 4 వేల మంది ఆచార్యుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఉపాధ్యాయ ఎంపిక బోర్డు ఈ నెల 6, 7, 8 తేదీల్లో సెట్ పరీక్షను నిర్వహించనుంది. అందుకోసం హాల్‌టికెట్‌ను అందించామని ఖాళీ పోస్టుల భర్తీకి మరోసారి సెట్ పరీక్షను సెప్టెంబర్ – అక్టోబర్‌లో నిర్వహిస్తామన్నారు. ఈరోడ్‌లో కరుణానిధి పేరుతో యూనివర్సిటీని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. యూజీసీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్టాలిన్ శాసనసభలో తీర్మానం చేశారని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. 10వ తేదీ నుంచి 4వ మార్గంలో రైలు సర్వీసు ప్రారంభం కొరుక్కుపేట: చైన్నె బీచ్ –ఎగ్మోర్ రైలు మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండూ నడుస్తున్నాయి. అందులో అదనపు రైలు మార్గం లేకపోవడంతో యథాతథ స్థితి నెలకొంది. ఎగ్మూరు నుంచి చైన్నె బీచ్ వరకు 4వ రహదారిని నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రయాణికుల డిమాండ్ చేశారు. రైల్వే బోర్డు తన రూ. 274.20 కోట్లతో 4వ మార్గం నిర్మాణం ఆగస్టు 2023 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం పనుల్లో 100 శాతం పూర్తికాగా, చైన్నె బీచ్ –ఎగ్మూర్ మార్గంలోని 4వ రూట్లో 20 హైస్పీడ్ రైళ్లను నడుపుతూ గురువారం పరీక్ష నిర్వహించారు. దక్షిణ రైల్వేకు చెందిన చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ సోమస్ కుమార్ ద్వారా మార్గాన్ని సర్వే చేసిన తర్వాత హై–స్పీడ్ రైలు పరీక్ష జరిగింది. ఈనెల 10వ తేదీ నుంచి 4వ మార్గంలో రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నిర్వహణ పనుల కారణంగా ఎలక్ట్రిక్ రైలు సేవలను మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు రద్దు చేశారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తరపున 12న ఉచిత వివాహాలు – అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్న మంత్రి కొరుక్కుపేట: డీఎంకే చైన్నె తూర్పు జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 12న ప్రభుత్వం తరపున ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నట్టు చైన్నె తూర్పు జిల్లా డీఎంకే కార్యదర్శి, మంత్రి పి.కె. శేఖర్‌బాబు తెలిపారు. దీనికి అర్హులైన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ ఆదేశాలమేరకు పేదల ఈ ఉచిత వివాహాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సందర్భంగా ఈనెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు చైన్నె తూర్పు జిల్లాలో వివాహాన్ని ఉచితంగా, వేడుకగా నిర్వహించనున్నామన్నారు ఈ వేడుక ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ నాయకత్వంలో జరుగుతుందని తెలిపారు. వివాహం చేసుకొనే వారి వయస్సు, ఆధార్‌కార్డు , కుటుంబ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఓటర్ కార్డు వంటి పేర్లు, చిరునామాతో హార్బర్ అసెంబ్లీ కార్యాలయం, నెం. 22. నార్త్ డివిజన్ రోడ్, రాజా అన్నా కొండ గుడి ఎదురుగా , పాత తిరువళ్లువర్ బస్టాండ్ సమీపంలో నమోదు చేసుకోవాలని అభ్యర్థించారు. మరిన్ని వివరాలకు 98401 15857, 72992 64999, 90944 80356, 95516 40914 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు . -
మిత్రుడిని చూసేందుకు వెళ్లి..
సాక్షి,చైన్నె : చైన్నెలోని కళాశాలలో చదువుకుంటున్న మిత్రుడిని చూసేందుకు వచ్చిన వారు ప్రమాదం బారిన పడ్డారు. బుధవారం అర్థరాత్రి చైన్నె శివారులో కారు – లారీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మిత్రులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు నెల్లూరుకు చెందిన ధనుష్‌రెడ్డి(21) చైన్నె శివారులోని ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నెల్లూరులోని ఓ కళాశాలలో చదువుకుంటున్న ఽమిత్రులు శ్రేయాష్(21), మరో ఇద్దరు విద్యార్థినులు ధనుష్రెడ్డిని చూసేందుకు కారులో చైన్నెకు వచ్చారు. బుధవారం రాత్రి ధనుష్రెడ్డిని కలిశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఐదుగురితో పాటూ ధనుష్ కళాశాల మిత్రుడు జయంత్‌తో కలిసి కారులో చైన్నె వైపుగా బయలుదేరారు. మార్గంమధ్యలోని ఊరపాక్కం దాటగానే కిలాంబాక్కం సబర్బన్ బస్ టెర్మినల్‌కు కూత వేటు దూరంలో ముందుగా వెళ్తున్న లారీ హఠాత్తుగా ఆగినట్టు సమాచారం. దీంతో వెనుక వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనా స్థలంలో ధనుష్‌రెడ్డి, శ్రేయాష్ మరణించారు. గాయపడ్డ ఇద్దరు విద్యార్థినులు, జయంత్‌ను చికిత్స నిమిత్తం పొత్తేరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మిత్రులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు జీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం సాయంత్రం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రమాదం.. ఈ ప్రమాదం అర్ధరాత్రి వేళ జరగ్గా ఇదే ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉదయాన్నే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కాటాన్ కొళత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలోని నాలుగో వీఽధికి చెందిన కన్నియప్పన్ (48) కార్పంటైర్. ప్రైవేటు కళాశాలలో చదువుతున్న కుమార్తె మౌనిషాను తన మోటార్ సైకిల్‌పై దిగబెట్టేందుకు వెళ్లాడు. ఊరపాక్కం వైపుగా వేగంగా దూసుకొచ్చిన మోటారు సైకిల్ ఢీ కొనడంతో తండ్రి,కుమార్తె కింద పడ్డారు. ఈ ఘటనలో కన్నియప్పన్ ఘటనా స్థలంలోనే మరణించాడు. మౌనిషాకు పొత్తేరిలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నెల్లూరు విద్యార్థుల మృతి మరో ముగ్గురికి గాయాలు -
సంతకాల సేకరణకు అడ్డుకట్ట
సాక్షి, చైన్నె: త్రిభాషా విధానానికి మద్దతుగా సంతకాల సేకరణలో నిమగ్నమైన బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా సంతకాల సేకరణ చేయకూడదని స్పష్టం చేస్తూ అరెస్టు చేశారు. వివరాలు.. తమిళనాడు ప్రభుత్వంతో పాటూ మెజారిటీ శాతం పార్టీలు త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. హిందీని తమ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తోంది. డీఎంకేతో పాటూ కూటమి పార్టీలు ఆందోళనలు సైతం కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితులలో బీజేపీ నేతృత్వంలో రాష్ట్రంలో త్రి భాషా విధానానికి మద్దతుగా సంతకాల సేకరణకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఇంటింటా సంతకాల సేకరణతో త్రిభాషను తమిళనాట ఆదరించే వాళ్లు అధికంగా ఉన్నారని చాటే విధంగా, కేంద్రానికి మద్దతుగా రాష్ట్రపతిని కలిసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం నుంచి ఇంటింటా సంతకాల సేకరణ అంటూ ఆయా ప్రాంతాలలో బీజేపీ వర్గాలు కార్యక్రమాలు చేపట్టాయి. ఇందులో భాగంగా విరుగంబాక్కం పరిధిలోని ఎంజీఆర్ నగర్ మార్కెట్ పరిసరాలలో సంతకాల సేకరణకు బీజేపీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌తో పాటూ పలువురు మహిళా నేతలు సైతం హాజరయ్యారు. వీరంతా ఎంజీఆర్ నగర్ మార్కెట్ వద్ద సంతకాల సేకరణకు సిద్ధమయ్యారు. అయితే, అనుమతి లేకుండా సంతకాల సేకరణ చేయరాదని పోలీసులు ఆదేశించారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం తప్పలేదు. సంతకాల సేకరణను పోలీసులు అడ్డుకోవడంతో నిరసన కారులు రాస్తారోకోకు దిగారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు. మహిళా పోలీసుల ద్వారా తమిళి సైను చుట్టుముట్టారు. బలవంతంగా తమిళి సై సౌందరరాజన్‌తో పాటుగా నాయకులను అరెస్టు చేశారు. ఆ తర్వాత విడుదల చేశారు. ● తమిళిసై సహా నేతల అరెస్టు -
వెంటాడుతున్న ఈడీ
● సెంథిల్, జగత్‌పై గురి ● పలు చోట్ల సోదాలు సాక్షి, చైన్నె : మంత్రి సెంథిల్ బాలాజీ, ఎంపీ జగద్రక్షకన్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెంటాడుతోంది. గురువారం వీరికి సంబంధించిన అనేక చోట్ల సోదాలు జరిగాయి. కొన్ని చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. సెంథిల్ బాలాజీని ఇది వరకు ఈడీ టార్గెట్ చేయడం, అరెస్టు చేయడం తెలిసిందే. కొన్ని నెలలు జైలులో ఉన్న ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్నారు. అదే సమయంలో బెయిల్ రద్దు లక్ష్యంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈడీ వర్గాలు, మంత్రిని వదిలి పెట్టడం లేదు. గురువారం సెంథిల్‌బాలాజీ సన్నిహితులైన కరూర్‌లోని రాయనూరు కొగుమెస్ యజమాని మణి, కరూర్‌లోని బోదై నగర్లో ఉన్న శక్తిమెస్ యజమాని కార్తీక్, ప్రభుత్వం కాంట్రాక్టర్, మంత్రి సన్నిహితుడు శంకర్‌ను ఈడీ గురి పెట్టింది. వీరి ముగ్గురి నివాసాలలో పొద్దు పోయే వరకు విస్తృతంగా సోదాలు జరిగాయి. ఈ సోదాలన్నీ తుపాకీ నీడలో జరగడం గమనార్హం. అలాగే డీఎంకే సీనియర్ ఎంపీ జగద్రక్షకన్‌ను తరచూ ఈడీ టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన లిక్కర్ ఫ్యాక్టరీతో పాటూ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే చైన్నె ఎగ్మూర్‌లోని టాస్మాక్ మద్యం ( మార్కెటింగ్ శాఖ) కార్యాలయంలోనూ విస్తృతంగా సోదాలలో ఈడీ వర్గాలు నిమగ్నమయ్యాయి. -
రైతుల భవిష్యత్ లక్ష్యంగా ఆవిష్కరణలు
సాక్షి, చైన్నె: రైతుల భవిష్యత్తును నిర్మించడానికి కట్టుబడి కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టామని ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ తెలిపారు. ట్రాక్టర్ల ఎగుమతి, అమ్మకాలలో రికార్డులు, కొత్త ఆవిష్కరణల గురించి గురువారం స్థానికంగా ఆయన ప్రకటించారు. ట్రాక్టర్ ఎగుమతి బ్రాండ్ సోనాలికా ట్రాక్టర్స్ ఫిబ్రవరి 2025లో మొత్తం 10,493 ట్రాక్టర్ల అమ్మకాలను జరిపినట్టు వివరించారు. అత్యుత్తమ ఉత్పత్తి , సేవలను అందించడంలో దాని బలమైన ప్రధాన విలువలను ఉపయోగించుకుంటూ 1,13,279 ట్రాక్టర్లతో తన అత్యధిక దేశీయ వైటీడీ ఫిబ్రవరి –2025 అమ్మకాలను చేరుకున్నట్టు ఫ్రకటించారు. రైతులు నిజంగా అజేయమైన ఫలితాలను, సంవృద్ధిగా విజయాన్ని సాధిస్తున్నారన్నారు. అధిక పంట దిగుబడిని పెంచడానికి తమ అధునాతన వ్యవసాయ సాంకేతికతలను మరింత మెరుగు పరుస్తున్నామన్నారు. అన్ని వాటాదారులకు సమగ్ర వృద్ధితో పాటుగా ప్రధాన విలువలతో ఆవిష్కరణలు, రైతుల భవిష్యత్తును నిర్మించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. -
తిరుత్తణి మార్కెట్‌కు కామరాజర్ పేరు పెట్టాలని వినతి
తిరుత్తణి : తిరుత్తణి మార్కెట్‌కు కామరాజన్ పేరు పట్టాలని కాంగ్రెస్ శ్రేణులు మున్సిపాలిటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. తిరుత్తణి మపోసీ రోడ్డులో 50 ఏళ్లుగా వున్న మార్కెట్ దుస్థితికి చేరుకోవడంతో కొత్త దుకాణాల సముదాయం నిర్మాణంకు రూ. 3 కోట్లు కేటాయించారు. మార్కెట్ కట్టడ నిర్మాణపు పనులు 90 శాతం పూర్తి కావడంతో త్వరలో ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. కొత్త మార్కెట్ సముదాయ భవనానికి కరుణానిధి శతజయంతి కట్టడంగా పేరు పెట్టాలని మున్సిపాలిటీ పాలకవర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 50 ఏళ్ల చరిత్ర నిండిన తిరుత్తణి కామరాజర్ మార్కెట్ పేరు మార్చి కొత్త పేరు పెట్టేందుకు నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు త్యాగరాజన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు గురువారం కమిషనర్ బాసుబ్రహ్మణ్యంను కలుసుకుని వినతిపత్రం అందజేశారు. నూతన మార్కెట్‌కు కామరాజర్ పేరు పెట్టాలని వారు కోరారు. -
● ప్రదానం చేసిన సీఎం స్టాలిన్ ● నంగనల్లూరులో హజ్ హౌస్
రెవెన్యూ అధికారులకు కొత్త వాహనాలు సచివాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రెవిన్యూ శాఖ అధికారుల ఉపయోగం కోసం వాహనాలను పంపిణీ చేశారు. రూ. 4.58 కోట్లతో కొనుగోలు చేసిన 51 వాహనాలకు సీఎం స్టాలిన్ జెండా ఊపారు. ఆయా అధికారులకు తాళాలను అందజేశారు. 2021లో అధికారం చేపట్టినప్పటినప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ అధికారుల ఉపయోగానికి రూ. 16 కోట్ల 46 లక్షల 57 వేలతో 150 కొత్త వాహనాలను కొనుగోలు చేసి అందించారు. తాజాగా కొనుగోలు చేసిన 51 వాహనాలు బొలెరో వాహనాలే. నలుగురు అదనపు డిప్యూటీ కలెక్టర్లకు, 47 తాలుకాలలోని అధికారుల ఉపయోగానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో, అటవీ మంత్రి డాక్టర్ కె.పొన్ముడి, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్, ప్రధాన కార్యదర్శి మురుగానందం, రెవిన్యూ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం. సాయికుమార్, అదనపు ముఖ్య కార్యదర్శి, పి. అముధ, ప్రత్యేక కార్యదర్శి . గణేష్, , అదనపు కమిషనర్ డాక్టర్ ఎస్. నటరాజన్ పాల్గొన్నారు. సాక్షి, చైన్నె: తమిళాభివృద్ధి, సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టు, కళాకారులకు అవార్డులను ఏటా ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరానికి గాను కలైంజ్ఞర్ పేనా అవార్డును సీనియర్ జర్నలిస్టులు నక్కిరన్ గోపాల్, సుకితా సారంగరాజ్ను ఎంపిక చేశారు. వీరికి సీఎం స్టాలిన్ ఈ అవార్డులను, నగదు ప్రోత్సహం అందజేశారు. అలాగే రూ.5 లక్షల ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రంను సీఎం స్టాలిన్ అందజేసి సత్కరించారు. నక్కీరన్ అనే పరిశోధనాత్మక పత్రికను ప్రారంభించి నక్కీరన్ గోపాల్‌గా పేరు సంపాదించుకున్నందుకు ఈ అవార్డును అందజేశారు. అలాగే వివిధ టీవీ కార్యక్రమాలలో సీ్త్రతత్వం గురించి 18 సంవత్సరాలకు పైగా ప్రశంగాలను ఇస్తూ వస్తున్న సుకితా సారంగరాజ్ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళ అభివృద్ధి ,సమాచార శాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, తమిళాభివృద్ధి శాఖ కార్యదర్శి రాజారామన్, సమాచార డైరెక్టర్ వైద్యనాథన్ పాల్గొన్నారు.రిజిస్టేషన్ కార్యాలయాలు.. రిజిస్ట్రేషన్ శాఖ తరపున తిరువళ్లూరులో కొత్తగా రిజిస్ట్రేషన్ జిల్లాను సృష్టించారు. ఇందుకు సంబంధించిన సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రూ. 22.36 కోట్లతో 12 కొత్త సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం జరిగింది. ప్రజలకు అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలను విస్తృతం చేసే విధంగా 2024–2025 సంవత్సరానికి వాణిజ్య పన్ను రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయం మేరకు తిరువళ్లూరు రెవిన్యూ జిల్లాలోని జాయింట్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని గ్రామాలను విభజించి 2వ జాయింట్ రిజిస్ట్రార్ కార్యాలయంను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తంజావూరు జిల్లా – ఒరతనాడు, తిరువారూర్ జిల్లా – తిరుతురైపూండి , వలంగైమాన్, మధురై జిల్లా – తిరుమంగళం, కాంచీపురం జిల్లా – శ్రీపెరంబుదూర్, తిరుపూర్ జిల్లా – తారపురం, తూత్తుకుడి జిల్లా – ఎట్టియాపురం, సాత్తాంకుళం, శ్రీవైకుంఠం, విరుదునగర్ జిల్లా – రాజపాలయం, పుదుక్కోట్టై జిల్లా – విరాలిమలై, కరూర్ జిల్లా – కులితలైలలో రూ. 22.36 కోట్లతో నిర్మించిన 12 కొత్త సబ్ రిజిస్టార్ కార్యాలయాలను సీఎం వీడియో కాన్ఫరన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రిమూర్తి, వాణిజ్య పన్నుల శాఖ అదనపు కార్యదర్శి కుమార్ జయంత్, రిజిస్ట్రేషన్ విభాగం హెడ్ దినేష్ పొన్రాజ్ లు పాల్గొన్నారు. ఆరుగురికి కలైచెమ్మల్ అవార్డులు సాంప్రదాయ చిత్రలేఖనం, ఆధునిక శైలి చిత్రలేఖనం, శిల్పకళలో ప్రతిభావంతులైన ఆరుగురికి సీఎం స్టాలిన్ చేతుల మీదుగా కళలు, సాంస్కృతిక శాఖ తరపున కలై చెమ్మల్ అవార్డులను అందజేశారు. 2024–2025 సంవత్సరానికి ’కలైచెమ్మల్’ అవార్డుతో పాటూ రాగి పతకం, లక్ష రూపాయల నగదు బహుమతి అందజేశారు. సాంప్రదాయ చిత్రలేఖన విభాగంలో ఎ. మణివేలు, సాంప్రదాయ శిల్ప విభాగంలో వి. బాలచందర్, కన్నియప్పన్, ఆధునిక చిత్రకారుడు కె. మురళీధరన్ , ఆధునిక శిల్ప విభాగంలో ఎ. సెల్వరాజ్ ,ఎన్. రాఘవన్‌లు ఈ అవార్డులను అందుకున్నారు. -
ఆమ్నీ బస్సు బోల్తా
● ఇద్దరు దుర్మరణం ● 20 మందికి గాయాలు సేలం: ఈరోడ్ సమీపంలోని కోయంబత్తూరు– సేలం జాతీయ రహదారిలో ఆమ్నీబస్సు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌లో వెళుతున్న ఇద్దరు దుర్మరణం చెందారు. బస్సులోని 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఒక ప్రైవేటు ఆమ్నీ బస్సు 25 మందికి పైగా ప్రయాణికులతో కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు గురువారం ప్రయాణిస్తోంది. ఈ బస్సు ఈరోడ్ జిల్లా పెరుందురైలోని విజయమంగళం టోల్గేట్ సమీపంలో కోయంబత్తూరు – సేలం రహదారిపై ప్రయాణిస్తుండగా ద్విచక్ర వాహనం రోడ్డు దాటడానికి ప్రయత్నించి బస్సును ఢీకొంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాకొట్టింది. ఈప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుర్మరణం చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పెరుందురైలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పెరుందురై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
● ఐడీసీ సెంటర్
డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా వెర్షన్–1 బెంగళూరు ఇండియా సంస్థ స్థానికంగా తన ఐడీసీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.డిజిటల్ పరివర్తన, పరిష్కారాలను మరింతగా ఖాతాదారులకు చేరువ చేసే విధంగా ఏర్పాటు కేసిన ఈ సెంటర్‌ను గురువారం నాస్కామ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ శ్రీనివాసన్, ఎంటర్ ప్రైజ్ ఐర్లాండ్ అండ్ సౌత్ ఆసియా డైరెక్టర్ రాస్ కుర్రాన్, ఐడీసీ నార్త్ అమెరికన్ ఆపరేషన్స్ ఎండీ గణేష్ కల్యాణరామన్ ప్రారంభించారు. – సాక్షి, చైన్నె చైన్నెలో రూ.456 కోట్లతో రోడ్ల మరమ్మతులు తిరువొత్తియూరు: చైన్నెలో పలు రోడ్లు గుంతలమయమయ్యాయి. దీని గురించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం రోడ్లు మరమ్మతులు పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు 2025–2026 ఆర్థిక సంవత్సరంలో రూ.456 కోట్లతో చైన్నె కార్పోరేషన్ పరిధిలో రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభం కానున్నాయి. ఇలా 570 కి.మీ. పొడవైన 3,505 రోడ్లను మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ రోడ్డు పనులకు తమిళనాడు అర్బన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద 150 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖ తరఫున 60 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. నేడు సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సాక్షి, చైన్నె: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) 56వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం జరగనున్నది. ఈ కార్యక్రమం నిమిత్తం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా రాష్ట్రానికి చేరుకున్నారు. అరక్కోణం సమీపంలోని వైమానిక దళం కేంద్రానికి గురువారం రాత్రి సమయంలో చేరుకున్న అమిత్ షా రోడ్డు మార్గంలో తక్కోళం వెళ్లారు. అక్కడ రాత్రి బస చేశారు. శుక్రవార ఉదయాన్నే అక్కడ జరిగే సీఎస్‌ఎస్‌ఎఫ్ పరేడ్, వ్యవస్థానక దినోత్సవ వేడుకలలో పాల్గొననున్నారు. అలాగే సురక్షిత్ తత్, సమృద్ధి భారత్ (సురక్షిత తీరాలు, సంపన్న భారతదేశం) అనే నినాదంతో భారతదేశంలోని మొత్తం 6,553 కిలోమీటర్ల ప్రధాన భూభాగ తీరప్రాంతంలో సాగనున్న సైక్లో థాన్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వృద్ధురాలికి 15 కత్తిపోట్లు ● ఇంజినీర్ అరెస్టు సేలం: మైలాడుదురై టెలికామ్ నగర్ 2వ క్రాస్ వీధికి చెందిన సేతుమాథవన్ (62). ఇతని భార్య నిర్మల (60). వీరి ఎదురింటిలో నివసిస్తున్న రాజేంద్రన్ కుమారుడు ప్రేమ్ (24). ఇంజినీరింగ్ పట్టభద్రుడు. ఇతని కుటుంబానికి నిర్మలా కుటుంబంతో తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఈ స్థితిలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్మల బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన స్థితిలో ఇంటిముందు ప్రేమ్‌తో గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన ప్రేమ్ కత్తితో నిర్మలను 15 పోట్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడి నిర్మల కుప్పకూలింది. స్థానికిలు ఆమెను తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మైలాడుదురై పోలీసులు ప్రేమ్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. రోడ్డు విస్తరణకు అనుమతి కొరుక్కుపేట: చైన్నెలోని నుంగంబాక్కం, అన్నానగర్ ప్రాంతాలను కలిపే నెల్సన్ మాణిక్యం రోడ్డులో గత కొనేళ్లుగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనాలుదారులతోపాటు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో నెల్సన్ మాణిక్యం రోడ్డును విస్తరించాలని చైన్నె కార్పొరేషన్ నిర్ణయించింది. దీనికి కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. భూమిని సేకరించి రోడ్డును వెడల్పు చేయనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందని కార్పొరేషన్ అఽధికారులు వెల్లడించారు. మహిళల కోసం 8 మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన పాత కక్షలు
●కాంట్రాక్టర్ హత్య సేలం: ముదుకుళత్తూర్ తాలూకా విక్రపాండియపురం వలసై గ్రామానికి చెందిన ఇరులాండి. ఇతని కుమారుడు ఉత్తిరకుమార్ (35). ఇతను కాంట్రాక్టర్. ఇంకా పెళ్లి కాలేదు. ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం చైన్నెలో జరిగిన హత్య కేసులో జైలుకు వెళ్లిన ఇతను ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ స్థితిలో బుధవారం రాత్రి పరమకుడి అగ్నిమాపక కేంద్రం సమీపంలో ఉన్న అతని స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు యువకులు బైకుల్లో హెల్మెట్లు ధరించి కత్తులతో ఉత్తిర కుమార్‌పై దాడి చేశారు. దాడిలో ఉత్తిర కుమార్ మృతిచెందాడు. పరమకుడి పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. -
మహిళా పోలీసులకు సీమంతం
అన్నానగర్: చైన్నెలోని అరుంబాక్కం పోలీస్స్టేషన్న్లోని క్రైమ్ బ్రాంచ్‌లో శరణ్య మహిళా పోలీసు అధికారిణి. అదేవిధంగా యోగమ్మాళ్ చూలైమేడు పోలీస్‌స్టేషన్‌న్‌లో శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ గర్భిణులు. ప్రసవం కోసం సెలవు పెట్టి తమ ఇళ్లకు వెళ్లనున్నారు. గురువారం అరుంబాక్కం పోలీస్‌స్టేషన్‌న్‌లో వీరిద్దరికి సహచర పోలీసులు సీమంతం చేశారు. అన్నానగర్ డిప్యూటీ కమిషనర్ స్నేహ ప్రియ ఇద్దరు గర్భిణులకు కంకణాలు వేసి గంధం పూశారు. అనంతరం పోలీసులు గంధం పూసి ఇద్దరికీ గాజులు వేశారు. -
అన్నాడీఎంకే త్వరలోనే వికసిస్తుంది
–తిరువణ్ణామలైలో శశికళ వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో వీకే శశికళ (చిన్నమ్మ) స్వామి దర్శనార్థం బుధవారం సాయంత్రం వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ శివాచార్యులు ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పించి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం చుట్టూ ఉన్న గిరివలయం రోడ్డులో కారులో తిరిగి వచ్చి అష్టలింగాలను ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం త్వరలోనే వికసించక తప్పదన్నారు. విడిపోయిన వారందరూ త్వరలోనే ఒకటిగా చేరతారన్నారు. అందరినీ కలిసికట్టుగా చేర్చేందుకు తాను పాటు పడుతున్నానని తెలిపారు. 2026వ అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమన్నారు. డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు ఇప్పటికే విరక్తి చెందారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్నాడీఎంకే ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. పార్లమెంట్ నియోజక వర్గాల విస్తరణపై డీఎంకే ఏర్పాటు చేసిన అఖిలపక్ష పార్టీ సమావేశం ఒక సంచలనం సృష్టించేందుకే తప్ప ఇంక ఎందుకూ పనికి రాదన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో 2013 సంవత్సరం తర్వాత ఇంతవరకు కాళీలను భర్తీ చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులు భర్తీ చేయకుండానే ఉందన్నారు. ఈ పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ కాలంలో తమిళనాడు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు విక్రయించారని, ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం విద్యుత్‌ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తోందన్నారు. సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ద్వారా రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. -
మోసం కేసులో వ్యక్తి అరెస్ట్
అన్నానగర్: చైన్నె సమీపం నెమిలిచ్చేరి క్రోంపేట డాక్టర్ అంబేడ్కర్ వీధికి చెందిన కార్తీక్ (41). ఇతను చైన్నెలోని జబర్గావ్పేటలో నివాసముంటున్న మధుహరికృష్ణారెడ్డి కుండ్రత్తూరు పక్కనే ఉన్న విరుగంపాక్కం గ్రామంలో అతని అన్నదమ్ములు మూర్తి, రేవతి దంపతులకు చెందిన 3.37 ఎకరాల భూమి ఉంది. భూమిపై రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ కాలేదు. తగిన మొత్తం చెల్లించి ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ప్లాట్లుగా విభజించి విక్రయించుకోవచ్చని కార్తీక్‌ను నమ్మించారు. నమ్మిన కార్తీక్ ఆ ప్లాట్లకు మొత్తం రూ.22 కోట్ల 75 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత ఆ స్థలాన్ని కార్తీక్ కు ఇవ్వకుండా మరో వ్యక్తికి అద్దెకు ఇచ్చి మోసానికి పాల్పడ్డారని తెలిసింది. కార్తీక్ ఫిర్యాదు మేరకు ఆవడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి మధుహరి కృష్ణారెడ్డిని గురువారం అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నియోజకవర్గాన్ని కుటుంబంగా భావించాలి
వేలూరు: నియోజకవర్గాన్ని వారి కుటుంబంగా భావించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. కాట్పాడిలోని ఓ ప్రయివేటు కళ్యాణ మండపంలో శిశు సంక్షేమ శాఖ, అంగన్వాడీ కార్యకర్తలతో కాట్పాడి బ్లాక్‌లోని గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమం కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి కుటుంబసమేతంగా పాల్గొని గర్భిణులకు వరుస తాంబూలాలను అందజేసి ప్రసంగించారు. కాట్పాడి నియోజకవర్గాన్ని తాను ఒక కుటుంబంగా భావించి సేవ చేయడంతోనే తనకు తన నియోజకవర్గ ప్రజలు గత 50 సంవత్సరాలుగా గెలిపిస్తున్నారన్నారు. గర్భిణులు మంచి పౌష్టికాహారాన్ని తీసుకొని సమాజానికి మంచి ఆరోగ్యకరమైన చిన్నారికి జన్మనియ్యాలన్నారు. గర్భిణులకు తరచూ వైద్య పరీక్షలు చేసేందుకు ఇప్పటికే ఆయా ప్రాంతంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీ కదీర్ ఆనంద్, ఆయన సతీమణి సంగీత, మంత్రి దురైమురుగన్, సతీమణి శాంతకుమారి, ఎమ్మెల్యే అములు, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, జోన్ చైర్మన్ పుష్పలత, యూనియన్ చైర్మన్ వేల్మురుగన్ పాల్గొన్నారు. తిరువళ్లూరులో సామూహిక సీమంతాలు తిరువళ్లూరు: తిరువళ్లూరు నియోజకవర్గంలోని 252 మంది గర్భిణులకు సాంఘిక సంక్షేమశాఖ ఆద్వర్యంలో గురువారం ఉదయం పట్టణంలోని ప్రయివేటు కల్యాణ మండపంలో సామూహిక శీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా గర్బణి మహిళలకు సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తిరువళ్లూరు నియోజకవర్గంలోని పూండి, కడంబత్తూరు, తిరువళ్లూరు మున్సిపాలిటీ, తిరువేళాంగాడు ప్రాంతాలకు చెందిన 252 మంది గర్బణులకు సామూహిక సీమంతాలను నిర్వహించారు. ప్రాజెక్టు డైరెక్టర్ లలిత మాట్లాడుతూ గర్బణి మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరారు. శిశువు ఆరోగ్యంగా జన్మించడం, సంవత్సరం వరకు శిశువుకు తల్లిపాలు పట్టడం మంచిదన్నారు. -
కేంద్ర విధులకు ఐపీఎస్ సుధాకర్
సాక్షి, చైన్నె : చైన్నె ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న ఆర్ సుధాకర్ఐపీఎస్ కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు గురువారం సంకేతాలు వెలువడ్డాయి. ఆయన మాధక ద్రవ్యాల నియంత్ర విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాడు బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న సుధాకర్ ఇక్కడే పలు చోట్ల పనిచేశారు. అవగాహన కారక్రమాలలో గానీయండి, విధుల పరంగా గానీయండి చక్కటి ప్రతిభతో ముందుకెళ్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్లబోతున్నారు. కాగా, ఇటీవల కాలంగా తమిళనాడుకు చెందిన పలువురు ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్తుండడం గమనార్హం. -
మహిళా పోలీసులకు సీమంతం
అన్నానగర్: చైన్నెలోని అరుంబాక్కం పోలీస్స్టేషన్న్లోని క్రైమ్ బ్రాంచ్‌లో శరణ్య మహిళా పోలీసు అధికారిణి. అదేవిధంగా యోగమ్మాళ్ చూలైమేడు పోలీస్‌స్టేషన్‌న్‌లో శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ గర్భిణులు. ప్రసవం కోసం సెలవు పెట్టి తమ ఇళ్లకు వెళ్లనున్నారు. గురువారం అరుంబాక్కం పోలీస్‌స్టేషన్‌న్‌లో వీరిద్దరికి సహచర పోలీసులు సీమంతం చేశారు. అన్నానగర్ డిప్యూటీ కమిషనర్ స్నేహ ప్రియ ఇద్దరు గర్భిణులకు కంకణాలు వేసి గంధం పూశారు. అనంతరం పోలీసులు గంధం పూసి ఇద్దరికీ గాజులు వేశారు. -
● ఐడీసీ సెంటర్
డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా వెర్షన్–1 బెంగళూరు ఇండియా సంస్థ స్థానికంగా తన ఐడీసీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.డిజిటల్ పరివర్తన, పరిష్కారాలను మరింతగా ఖాతాదారులకు చేరువ చేసే విధంగా ఏర్పాటు కేసిన ఈ సెంటర్‌ను గురువారం నాస్కామ్ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ శ్రీనివాసన్, ఎంటర్ ప్రైజ్ ఐర్లాండ్ అండ్ సౌత్ ఆసియా డైరెక్టర్ రాస్ కుర్రాన్, ఐడీసీ నార్త్ అమెరికన్ ఆపరేషన్స్ ఎండీ గణేష్ కల్యాణరామన్ ప్రారంభించారు. – సాక్షి, చైన్నె చైన్నెలో రూ.456 కోట్లతో రోడ్ల మరమ్మతులు తిరువొత్తియూరు: చైన్నెలో పలు రోడ్లు గుంతలమయమయ్యాయి. దీని గురించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం రోడ్లు మరమ్మతులు పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు 2025–2026 ఆర్థిక సంవత్సరంలో రూ.456 కోట్లతో చైన్నె కార్పోరేషన్ పరిధిలో రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభం కానున్నాయి. ఇలా 570 కి.మీ. పొడవైన 3,505 రోడ్లను మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ రోడ్డు పనులకు తమిళనాడు అర్బన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద 150 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖ తరఫున 60 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. నేడు సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సాక్షి, చైన్నె: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) 56వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం జరగనున్నది. ఈ కార్యక్రమం నిమిత్తం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా రాష్ట్రానికి చేరుకున్నారు. అరక్కోణం సమీపంలోని వైమానిక దళం కేంద్రానికి గురువారం రాత్రి సమయంలో చేరుకున్న అమిత్ షా రోడ్డు మార్గంలో తక్కోళం వెళ్లారు. అక్కడ రాత్రి బస చేశారు. శుక్రవార ఉదయాన్నే అక్కడ జరిగే సీఎస్‌ఎస్‌ఎఫ్ పరేడ్, వ్యవస్థానక దినోత్సవ వేడుకలలో పాల్గొననున్నారు. అలాగే సురక్షిత్ తత్, సమృద్ధి భారత్ (సురక్షిత తీరాలు, సంపన్న భారతదేశం) అనే నినాదంతో భారతదేశంలోని మొత్తం 6,553 కిలోమీటర్ల ప్రధాన భూభాగ తీరప్రాంతంలో సాగనున్న సైక్లో థాన్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వృద్ధురాలికి 15 కత్తిపోట్లు ● ఇంజినీర్ అరెస్టు సేలం: మైలాడుదురై టెలికామ్ నగర్ 2వ క్రాస్ వీధికి చెందిన సేతుమాథవన్ (62). ఇతని భార్య నిర్మల (60). వీరి ఎదురింటిలో నివసిస్తున్న రాజేంద్రన్ కుమారుడు ప్రేమ్ (24). ఇంజినీరింగ్ పట్టభద్రుడు. ఇతని కుటుంబానికి నిర్మలా కుటుంబంతో తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఈ స్థితిలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్మల బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన స్థితిలో ఇంటిముందు ప్రేమ్‌తో గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన ప్రేమ్ కత్తితో నిర్మలను 15 పోట్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడి నిర్మల కుప్పకూలింది. స్థానికిలు ఆమెను తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మైలాడుదురై పోలీసులు ప్రేమ్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. రోడ్డు విస్తరణకు అనుమతి కొరుక్కుపేట: చైన్నెలోని నుంగంబాక్కం, అన్నానగర్ ప్రాంతాలను కలిపే నెల్సన్ మాణిక్యం రోడ్డులో గత కొనేళ్లుగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనాలుదారులతోపాటు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో నెల్సన్ మాణిక్యం రోడ్డును విస్తరించాలని చైన్నె కార్పొరేషన్ నిర్ణయించింది. దీనికి కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. భూమిని సేకరించి రోడ్డును వెడల్పు చేయనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందని కార్పొరేషన్ అఽధికారులు వెల్లడించారు. మహిళల కోసం 8 మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
కేంద్ర విధులకు ఐపీఎస్ సుధాకర్
సాక్షి, చైన్నె : చైన్నె ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న ఆర్ సుధాకర్ఐపీఎస్ కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు గురువారం సంకేతాలు వెలువడ్డాయి. ఆయన మాధక ద్రవ్యాల నియంత్ర విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాడు బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న సుధాకర్ ఇక్కడే పలు చోట్ల పనిచేశారు. అవగాహన కారక్రమాలలో గానీయండి, విధుల పరంగా గానీయండి చక్కటి ప్రతిభతో ముందుకెళ్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్లబోతున్నారు. కాగా, ఇటీవల కాలంగా తమిళనాడుకు చెందిన పలువురు ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్తుండడం గమనార్హం. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
సేలం: తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి సమీపంలోని ఎట్టయపురం, మేలనంబిపురం తూర్పు వీధికి చెందిన వ్యక్తి పూవన్. మాజీ ఉపాధ్యాయుడైన ఇతని భార్య సీతాలక్ష్మి (75). వీరి కమార్తె రామజయంతి (45). ఈమె గత కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి తల్లి సీతాలక్ష్మితో ఉంటోంది. ఈ స్థితిలో గతవారం దేవాలయానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తల్లి, కూతురు హత్యకు గురయ్యారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సీతాలక్ష్మి, రామజయంతి ధరించిన 13 సవర్ల బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. దోపిడీ దొంగలు నగల కోసం వీరిని చంపినట్టు పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై ఇద్దరిని అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఈక్రమంలో ప్రధాన నిందితుడిని పట్టుకోవడం కోసం 9 ప్రత్యేక బృందాలుగా పోలీసులు గాలిస్తూ వచ్చారు. అడవిలో దాక్కొని ఉన్న ప్రధాన నిందితుడు మునీశ్వరన్ను గురువారం ఉదయం తూత్తుకుడి మదురై జాతీయ రహదారిపై కీల్ ఈరల్ ప్రాంతం సమీపంలో పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నం చేశారు. మునీశ్వరన్ కత్తిలో పోలీసులపై దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు తుపాకీతో కాల్చడంతో మునీశ్వరన్ ఎడమ చేయికి గాయమైంది. తర్వాత పోలీసులు మునీశ్వరన్ను అరెస్టు చేసి, తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సమయంలో గాయపడిన ఏఎస్ఐ ముత్తురాజ్ సహా పోలీసులు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం
తిరువళ్లూరు: రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతున్న క్రమంలో తిరువళ్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం–2ను స్థానిక ఎమ్మేల్యే వీజీ రాజేంద్రన్ గురువారం ఉదయం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. తిరువళ్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో నిత్యం వందలాది మంది భూ రిజిస్ట్రేషన్లు, వివాహం, సేల్డీల్, ఈసీ ప్రక్రియ సాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇద్దరు సబ్రిజిస్ట్రార్లు మాత్రమే విధులు నిర్వహిస్తుండడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిత్యం ఆలస్యంగా నడుస్తోంది. దీంతో పాటు తిరువళ్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో గ్రామాల సంఖ్య ఎక్కువగా వుండడంతో అదనంగా మరో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం–2ను ఏర్పాటు చేశారు. కార్యాలయాన్ని ఎమ్మేల్యే వీజీ రాజేంద్రన్ ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. కొత్త రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో వేపంబట్టు, పెరుమాల్పట్టు, పుట్లూరు, సెవ్వాపేట, కీళానూర్, మాగరల్, పేరత్తూరు, పులియూర్, శిరుకడల్, పాక్కం, నత్తంబేడు, వెళ్లియూర్, తొయూరు, తొట్టికలై, తండలం సహా 36 గ్రామాలకు చెందిన రిజిస్ట్రేషన్లు ఇకపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం–2 నుంచి నిర్వహిస్తారు. -
ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన
తమిళనాడులోని పాఠశాలలోని విద్యార్థులకు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ట్రైనింగ్ పార్కు 6వ వార్షికోత్సవ అవగాహన కార్యక్రమానికి గురువారం చైన్నెలో శ్రీకారం చుట్టింది. చైన్నెలో లక్షల మందికి అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ఐఎఎస్ అధికారి వి. శివకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ ఆర్ విజయలక్ష్మిలు ప్రారంభించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పరమ పదం ఆటను తలపించే మ్యాట్ ద్వారా ట్రాఫిక్ అవగాహన మీద దృష్టి పెట్టారు. – సాక్షి, చైన్నె -
మోసం కేసులో వ్యక్తి అరెస్ట్
అన్నానగర్: చైన్నె సమీపం నెమిలిచ్చేరి క్రోంపేట డాక్టర్ అంబేడ్కర్ వీధికి చెందిన కార్తీక్ (41). ఇతను చైన్నెలోని జబర్గావ్పేటలో నివాసముంటున్న మధుహరికృష్ణారెడ్డి కుండ్రత్తూరు పక్కనే ఉన్న విరుగంపాక్కం గ్రామంలో అతని అన్నదమ్ములు మూర్తి, రేవతి దంపతులకు చెందిన 3.37 ఎకరాల భూమి ఉంది. భూమిపై రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ కాలేదు. తగిన మొత్తం చెల్లించి ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ప్లాట్లుగా విభజించి విక్రయించుకోవచ్చని కార్తీక్‌ను నమ్మించారు. నమ్మిన కార్తీక్ ఆ ప్లాట్లకు మొత్తం రూ.22 కోట్ల 75 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత ఆ స్థలాన్ని కార్తీక్ కు ఇవ్వకుండా మరో వ్యక్తికి అద్దెకు ఇచ్చి మోసానికి పాల్పడ్డారని తెలిసింది. కార్తీక్ ఫిర్యాదు మేరకు ఆవడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి మధుహరి కృష్ణారెడ్డిని గురువారం అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ ఘటనలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నరసింహమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. 1వ పట్టణ సీఐ గోపి, క్రైమ్ పార్టీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టారన్నారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. తమిళనాడు మేలుమలైకి చెందిన మీనా(29), తిరుచ్చి జిల్లా సమయపురానికి చెందిన పొన్నుమణి అక్కచెల్లెళ్లు. వీరు సంతల్లో, బస్సుల్లో జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో హ్యాండ్‌బ్యాగులు, పర్సులు దొంగలిస్తుంటారని తెలిపారు. వీరిపై తమిళనాడులో ఆరు కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. జైలు నుంచి బయలకు రాగా లాయరు ఖర్చు నిమిత్తం దొంగతనం చేసేందుకు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలను ఎంచుకున్నట్టు తెలిపారు. రథోత్సవం రోజున భక్తులతో కలిసిపోయి తోపులాట జరిగినపుడు మహిళల మెడలో బంగారు గొలుసులను అపహరించినట్టు వెల్లడించారు. వీరు పట్టణంలోని నెహ్రూవీధిలోని సుదర్శన్ ల్యాబ్, తేరువీధిలోని కోమల రెసిడెన్సీ, నగరివీధిలోని వినాయకస్వామి ఆలయం, సునీల్ నగల దుకాణం ముందు, తేరువీధిలోని నంది హోటల్, పెండ్లి మండపం వద్ద మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను అప్పహరించినట్టు తెలిపారు. వీరిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. కేసును ఛేదించిన వారిని ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించినట్టు పేర్కొన్నారు. సీఐ గోపి పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన పాత కక్షలు
●కాంట్రాక్టర్ హత్య సేలం: ముదుకుళత్తూర్ తాలూకా విక్రపాండియపురం వలసై గ్రామానికి చెందిన ఇరులాండి. ఇతని కుమారుడు ఉత్తిరకుమార్ (35). ఇతను కాంట్రాక్టర్. ఇంకా పెళ్లి కాలేదు. ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం చైన్నెలో జరిగిన హత్య కేసులో జైలుకు వెళ్లిన ఇతను ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ స్థితిలో బుధవారం రాత్రి పరమకుడి అగ్నిమాపక కేంద్రం సమీపంలో ఉన్న అతని స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు యువకులు బైకుల్లో హెల్మెట్లు ధరించి కత్తులతో ఉత్తిర కుమార్‌పై దాడి చేశారు. దాడిలో ఉత్తిర కుమార్ మృతిచెందాడు. పరమకుడి పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. -
అన్నాడీఎంకే త్వరలోనే వికసిస్తుంది
–తిరువణ్ణామలైలో శశికళ వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో వీకే శశికళ (చిన్నమ్మ) స్వామి దర్శనార్థం బుధవారం సాయంత్రం వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ శివాచార్యులు ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పించి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం చుట్టూ ఉన్న గిరివలయం రోడ్డులో కారులో తిరిగి వచ్చి అష్టలింగాలను ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం త్వరలోనే వికసించక తప్పదన్నారు. విడిపోయిన వారందరూ త్వరలోనే ఒకటిగా చేరతారన్నారు. అందరినీ కలిసికట్టుగా చేర్చేందుకు తాను పాటు పడుతున్నానని తెలిపారు. 2026వ అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమన్నారు. డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు ఇప్పటికే విరక్తి చెందారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్నాడీఎంకే ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. పార్లమెంట్ నియోజక వర్గాల విస్తరణపై డీఎంకే ఏర్పాటు చేసిన అఖిలపక్ష పార్టీ సమావేశం ఒక సంచలనం సృష్టించేందుకే తప్ప ఇంక ఎందుకూ పనికి రాదన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో 2013 సంవత్సరం తర్వాత ఇంతవరకు కాళీలను భర్తీ చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న నర్సుల పోస్టులు భర్తీ చేయకుండానే ఉందన్నారు. ఈ పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ కాలంలో తమిళనాడు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు విక్రయించారని, ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం విద్యుత్‌ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తోందన్నారు. సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ద్వారా రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. -
ట్రేడ్ సెంటర్లో ఆటోమేషన్ ఎక్స్పో సౌత్–2025
కొరుక్కుపేట: చైన్నె ట్రేడ్ సెంటర్ వేదికగా ఐఈడీ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూడు రోజుల ఆటోమేషన్ ఎక్స్పో సౌత్ – 2025 గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గౌరవ అతథిగా తమిళనాడు ఎంఎస్ఎంఈ విభాగం – ఈఎంఈఏ గ్లోబల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెల్యూషన్స్ జనరల్ మేనేజర్ మ్యాథీసన్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఐఈడీ కమ్యూనికేషన్స్ లిమిటెడ వ్యవస్థాపకులు, ఎండీ డాక్టర్ ఎం. ఆరోగ్యస్వామి దాదాపు 300 ఎగ్జిబీటర్లు పాల్గొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ తదితర అత్యాధునిక ఉత్పత్తులతో స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా, 20,000 మందికిపైగా విజిటర్లు పాల్గొన్నారు. ఈఎక్స్ పో ఈనెల 8వ తేదీతో ముగుస్తుందని నిర్వాహకుల వెల్లడించారు. -
పట్రపెరంబదూరులోని సొరంగం పరిశీలన
తిరువళ్లూరు: పట్రపెరంబదూరు గ్రామంలోని మురుగన్ ఆలయం వద్ద ఇటీవల బయటపడ్డ సొరంగం మార్గంలోకి అధికారులు దిగి పరిశోధనలు నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా పట్రపెరంబదూరు గ్రామంలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వుంది. ఆలయానికి సమీపంలో ఇటీవల తిరుపతి–చైన్నె జాతీయ రఽహదారి నిర్మాణ పనుల కోసం తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో 9వ శతాబ్దం నాటి విగ్రహాలు, ఆలయానికి సమీపంలో సొరంగం బయటపడింది. పట్రపెరంబదూరు నుంచి తిరువేళాంగాడు వరకు 12 కిమీ మేరకు సొరంగ మార్గం వుందని, ఈ మార్గంలో భారీగా ఆభరణాలు కూడా వుండొచ్చని గ్రామస్తులు పురావస్తుశాఖ అధికారులకు వివరించారు. ఇందులో భాగంగా పది రోజుల పాటు అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. సొరంగంలోకి అగ్నిమాపక శాఖకు చెందిన ముగ్గురు, పురావస్తుశాఖ జిల్లా అధికారి లోకనాథన్, రెవెన్యూ అధికారి ఒకరు సొరంగ మార్గంలో దిగి పరిశీలించారు. మొదటి దశలో చేపట్టిన పరిశోధనలో సొరంగమార్గంలో రెండు గదులు వున్నట్టు గుర్తించారు. మరింత లోతైన పరిశోధనలను త్వరలోనే నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. -
క్లుప్తంగా
యువకుడి దారుణ హత్య అన్నానగర్: యువకుడి తలపై బండరాయి వేసి దుండగులు హత్య చేశారు. చైన్నె తండయారుపేట ఇలయముదలి రోడ్డు పక్కన సిమెంట్ పైపులు పేర్చారు. గురువారం ఉదయం చుట్టుపక్కల నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆ ప్రాంత వాసులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తండయార్‌పేట, కొరుక్కుపేట పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సిమెంట్ పైపు వెనుక మట్టి, ఇటుకలతో సహా కోసిన వ్యర్థాల సంచులను పేర్చారు. వాటిని తీయగా, కింద రక్తంతో తడిసిన బ్యాగ్ ఉంది. బ్యాగ్‌ని బయటకు తీయగా 35 ఏళ్ల వ్యక్తి మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అతని తల నుజ్జునుజ్జయింది. శరీరం కూడా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. అతని నోటికి గుడ్డ కట్టి ఉంది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో హత్య జరిగి 2 రోజులు అయి ఉండొచ్చని పోలీసులు నిర్ధారించారు. టీ–షర్ట్, ప్యాంటు ధరించిన యువకుడి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రుణాలను సద్వినియోగం చేసుకోండి వేలూరు: నిరుపేదలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా అభివృద్ధి చెందాలని ప్రధాన ఆర్థికాభివృద్ధి సలహాదారులు కనికాబసర్జీ అన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ వృత్తులపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారికి యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో రుణ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని అయితే సరైన పద్ధతిలో ఉపయోగించుకొని అభివృద్ది చెందాల్సిన బాధ్యత నిరుద్యోగులపై ఉందన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న రుణాలను ప్రతి నెలా బ్యాంకులకు సరైన మార్గంలో చెల్లించి మరిన్ని రుణాలు పొందేలా చూడాలన్నారు. యూనియన్ బ్యాంకు చైన్నె రీజినల్ మేనేజర్ అన్నాదురై, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సురేష్, అసిస్టెంట్ అధికారి గోమతి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి పుస్తక ప్రదర్శన ● పది రోజులపాటు ఎగ్జిబిషన్ ● వేల్‌టెక్ వర్సిటీలో అవగాహన కార్యక్రమం తిరువళ్లూరు: పట్టణంలో నేటి నుంచి జరగనున్న పుస్తక ప్రదర్శనపై వేల్‌టెక్ వర్సిటీకి చెందిన నాలుగు వేల మంది విద్యార్థులతో నిర్వహించిన బుక్ ఫేర్–తిరువళ్లూరు నమూనా అందరిని ఆకట్టుకుంది. తిరువళ్లూరులో నేటి నుంచి మార్చి 17 వరకు పుస్తక ప్రదర్శన పది రోజుల పాటు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈక్రమంలో పుస్తక ప్రదర్శనపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఆవడి వేల్‌టెక్ వర్సిటీలో నాలుగు వేల మంది విద్యార్థులతో బుక్ ఫేర్– తిరువళ్లూరు నమూనాను నిర్వహించారు. నమూనాపై విద్యార్థులు నిలబడి ఇచ్చిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్ బుక్ఫేర్పై అవగాహన కల్పించే విధంగా భారీ బెలూన్లను ఎగరవేశారు. ఆవడి కమిషనర్ కందస్వామి, మేయర్ ఉదయకుమార్, వర్సిటీ ట్రస్టీ రంగరాజన్, వీసీ రజత్గుప్తా, శివరామన్, రిజిస్ట్రార్ కన్నన్ పాల్గొన్నారు. లారీని ఢీకొన్న కారు ముగ్గురికి తీవ్ర గాయాలు వేలూరు: లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బెంగుళూరుకు చెందిన మార్య ఇతని తండ్రి జేమ్స్‌తో పాటు మరొకరు గురువారం ఉదయం కారులో చైన్నెకి బయలు దేరారు. కారు చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిలో వెళుతుండగా కారు వేలూరు సమీపంలోని సేన్‌బాక్కం వద్ద వెళుతుండగా అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న జేమ్స్, మౌర్యతో పాటు మరొకరికి తీవ్ర గాయామైంది. వీటిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలిసి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముదిరిన భాషా వివాదం.. తమిళిసై అరెస్ట్
చెన్నై: తమిళనాడులో త్రిభాషా వివాదం ముదిరింది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ చేపట్టింది. ఈ క్రమంలోబీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసైని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, రాష్ట్రంలో త్రి భాష విధానానికి మద్దతుగా ఇంటింటా సంతకాల సేకరణకు బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.. అలాగే డీఎంకే అఖిల పక్షాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నిర్దేశించిన విధంగా రాష్ట్రంలోని మూడు భాషల విధానానికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు.నిన్నటి (బుధవారం) నుంచి త్రిభాషా విధానానికి మద్దతుగా తమిళనాడులో ఇంటింటికి సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన, ఈ – సంతకాల సేకరణ కార్యక్రమాలు బీజేపీ చేపట్టింది. కాగా, డీఎంకే నేతృత్వంలో బుధవారం జరిగిన అఖిల పక్షం భేటీని కూడా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి విధానాలు, దుష్ప్రవర్తన, శాంతిభద్రతల వైఫల్యాల గురించి చర్చించిన కోర్‌కమిటీ.. రానున్న రోజులలో తమిళ ప్రజల సంక్షేమార్థం, డీఎంకే ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా కార్యక్రమాలకు నిర్ణయించారు. -
దురభిమానం ఎలా ఉంటుందంటే.. విమర్శలకు స్టాలిన్ కౌంటర్
చెన్నై: కేంద్ర నూతన జాతీయ విద్యావిధానాన్ని(National Educational Policy) వ్యతిరేకిస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాము కోరుకునేది భాషా సమానత్వం మాత్రమేనని.. అంత మాత్రానికే తమను విమర్శించడం తగదని అన్నారాయన. ఈ క్రమంలో.. డీఎంకే ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు ఆయన ఓ కొటేషన్‌తో కౌంటర్ ఇచ్చారు. మేం కోరుకునేది భాషా సమానత్వం. తమిళనాడులో తమిళం భాషకు ప్రాధాన్యం కల్పించమని అడుగుతున్నాం. అంతమాత్రానికే దురభిమానం, పక్షపాతం అనే ముద్రలు మాపై వేస్తున్నారు. మీరు ప్రత్యేక హక్కులకు అలవాటుపడటంతో మేం కోరుకునే సమానత్వం కూడా అణచివేతలా కనిపిస్తుంది(కొటేషన్‌ను పోస్ట్ చేశారు). దురభిమానం ఎలా ఉంటుందంటే.. తమిళులు అర్థం చేసుకోలేని భాషలో మూడు నేర చట్టాలకు పేర్లు పెట్టడంలా ఉంటుంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఎన్ఈపీని నిరాకరించినందుకు విద్యకు వెచ్చించాల్సిన నిధులను ఆపేయడం దాని కిందికే వస్తుంది. .. గాడ్సే భావజాలాన్ని కీర్తించే వ్యక్తులు.. చైనా దురాక్రమణ, కార్గిల్ యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిపిన యుద్ధాల్లో అత్యధిక నిధులు అందించిన డీఎంకే, ఆ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వానికి ఉన్న దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు అంటూ కేంద్రంలోని బీజేపీకి పరోక్షంగా చురకలంటించారాయన. 👉🏾 "When you are accustomed to privilege, equality feels like oppression." I am reminded of this famous quote when some entitled bigots brand us chauvinists and anti-nationals for the 'crime' of demanding Tamil’s rightful place in Tamil Nadu.👉🏾 The very people who glorify… pic.twitter.com/MOzmUSEyia— M.K.Stalin (@mkstalin) March 6, 2025ఇదిలా ఉంటే.. జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. హిందీని బలవంతంగా హిందీయేత ప్రాంతాలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మండిపడుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని స్టాలిన్ ప్రభుత్వం కేంద్రంపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను, డీఎంకే ప్రభుత్వ ప్రచారాలను కేంద్రం తోసిపుచ్చుతూ వస్తోంది.