Adilabad
-
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4, 5వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వర్డ్ పవర్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూపీసీ)రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో స్పెల్లింగ్, రీడింగ్, అర్థం రౌండ్ల అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు. 4వ తరగతి నుండి ఆడే విజయ్‌కుమార్ (నిర్మల్), యశ్వంత్ (ఆసిఫాబాద్), రాజేశ్ (ఆసిఫాబాద్), కోట్నాక్ కళ్యాణ్ (ఆసిఫాబాద్), కుర్సెంగ వినోద్ (ఆసిఫాబాద్) విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 5వ తరగతి నుండి కృష్ణ ధృవ (ఆసిఫాబాద్), తొడసం వైష్ణవి(ఆదిలాబాద్), మడావి వరలక్ష్మి (ఆదిలాబాద్), రాథోడ్ బాలాజీ(నిర్మల్), లక్ష్మణ్‌చౌదరి (నిర్మల్), కిరణ్ రాథోడ్ (ఆసిఫాబాద్) జిల్లాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. విజేతలకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏసీఎంవో జగన్, విభా ఫౌండేషన్ సీనియర్ ప్రొగ్రాం మేనేజర్ వీరనారాయణ పాల్గొన్నారు. -
భారీగా టేకు చెట్లు నరికివేత
ఇచ్చోడ: సిరిచెల్మ అటవీ ప్రాంతంలోని ఫకీర్‌పేట్ బీట్‌లో టేకు చెట్లు స్మగ్లర్ల చేతిలో నరికివేతకు గురవుతున్నాయి. టేకుచెట్లను నరికి సైజులుగా మార్చి బైక్‌లపై తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మాన్కపూర్ వద్ద చెక్‌పోస్టు ఉన్నప్పటికీ కలప తరలించుకుపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిరిచెల్మలో టైగర్‌జోన్ అటవీ అధికారి క్యాంపు కార్యాలయం, ఫకీర్‌పేట్ వద్ద బెస్ క్యాంపులు ఉన్నాయి. వీటికి సమీపంలోనే టేకుచెట్లు నరికివేతకు గురికావడం అటవీశాఖ పనితీరుకు అద్దం పడుతోంది. దీనిపై టైగర్‌జోన్ ఎఫ్ఆర్వో నాగవత్ స్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా టేకు చెట్లు నరికినట్లు తమదృష్టికి వచ్చిందని, చెట్లు నరికిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది. గురువారం: 5:10బుధవారం: 6:21ఇంటింటా డ్రమ్ములతో కూడిన ఈ చిత్రం పట్టణంలోని సర్వేనంబర్ 170 కాలనీలోనిది. ఈ కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులు చేపడుతుండటంతో పైపులైన్ పగిలి నీటి సరఫరా నిలిచింది. దీంతో కాలనీకి ట్యాంకర్ నీరే దిక్కయింది. నిత్యం రెండు ట్యాంకర్లతో 18 ట్రిప్పుల్లో సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని స్థానికులు డ్రమ్ముల్లో నిలువ చేసుకుంటున్నారు. -
‘స్థానిక’ ఎన్నికలపై దృష్టి సారించండి
కై లాస్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీత క్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో మంత్రి హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. రానున్న స్థాని క సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన కా ర్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. అన్ని నియోజవర్గాల్లో పార్టీని పటిష్టం చే యాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్ద కు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ పంచా యతీ, మండల, జిల్లా పరిషత్, మున్సి పల్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూ చించారు. ఇందులో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, ప్రేమ్ సాగర్‌రావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలా చారి, మాజీ ఎంపీ సోయం బాపూరావ్, పార్టీ నేతలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, సత్తు మల్లేశ్, ఆత్రం సుగుణ, శ్రీహరిరావు, గజేందర్, శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
● రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఈఈ ● బిల్లుల మంజూరు కోసం రూ.లక్ష డిమాండ్ ఆదిలాబాద్‌రూరల్: ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. ఆదిలాబాద్‌లోని ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నాంవార్ శంకర్ కాంట్రాక్టర్ నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. టీజీఐడీసీ డిప్యూటీ ఈఈ శంకర్ ఇటీవల కాంట్రాక్టర్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కేఆర్కే కాలనీ సమీపంలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల పనుల కాంట్రాక్ట్‌ను కరుణాకర్‌రావు దక్కించుకున్నాడు. రూ.14.36 కోట్లతో జిల్లా కేంద్రానికి చెందిన సబ్ కాంట్రాక్టర్ నారాయణరెడ్డి తీసుకుని పనులు చేపడుతున్నాడు. విడతల వారీగా పూర్తయిన పనులకు సంబంధించి రూ.2 కోట్లు విడుదలయ్యాయి. మంజూరైన ఈ బిల్లులను డీఈఈ శంకర్ మరో భవన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌కు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. విష యం తెలుసుకున్న నారాయణరెడ్డి మంగళవారం డిప్యూటీ ఈఈని కార్యాలయంలో కలిశాడు. తాను చేసిన పనులకు గాను మంజూరైన డబ్బులు విడుదల చేయాలని కోరాడు. 0.5 శాతం ఇవ్వాలని సదరు అధికారి సూచించాడు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఆ సమయ ంలోనే అధికారి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. తాను నిర్మాణం చేపడుతున్న భవనం దగ్గరికి రావాలని పేర్కొన్నాడు. మంగళవారం రూ.50వేలు, మిగతా రూ. 50వేలు బుధవారం ఇవ్వాలని కాంట్రాక్టర్‌తో సదరు అధికారి ఒప్పందం కుదుర్చుకున్నాడు. బిల్లులు విడుదలైన ప్రతీసారి కమీషన్ ఇవ్వాలని పేర్కొన్నాడు. మధ్యాహ్నం సదరు అధికారి నిర్మాణం చేపడుతున్న భవనం దగ్గరికి రాగా కాంట్రాక్టర్ ఆయనకు రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ అధికారిని కరీంనగర్‌కు తరలించారు. బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐలు కిరణ్‌రెడ్డి, స్వామి ఉన్నారు. -
‘సైబర్’ కుట్ర భగ్నం
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ నేరాలకు పాల్పడాలనే భా రీ కుట్రను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు భగ్నం చే శారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను టూటౌన్, సై బర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మొ బైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ద్విచక్ర వాహనాలు, మొబైల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒకరు పరారీలో ఉండగా, ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్పీ అఖిల్ మ హాజన్ మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హె డ్క్వార్టర్లోని సమావేశ మందిరంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రంలోని కాతిహర్ జిల్లా హతియదిర గ్రామానికి చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి దేశ వ్యాప్తంగా సై బర్ నేరాలకు పాల్పడడానికి కుట్ర పన్నినట్లు తెలి పారు. ఇందులో ఏ–1గా ఉన్న తబారక్ మిగతా ఐదు గురిని బైక్‌లపై తెలంగాణ రాష్ట్రానికి పంపించాడు. వారు పాత మొబైళ్లు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తామంటూ పట్టణాలు, పల్లెల్లో తిరిగారు. పా త మొబైళ్లు సిమ్‌కార్డు, బ్యాటరీలను సేకరించారు. వాటిద్వారా వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు బ్యాంక్ అధికారులంటూ ఫోన్ చేసి సైబర్ బారిన పడే వి ధంగా కుట్ర పన్నారు. వారి కుట్రను ఆదిలాబాద్ పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులు మహ్మద్ మెరాజుల్, మహెబూబ్ ఆలం, మహ్మద్ జమాల్, ఎండీ ఉజీర్, అబ్దుల్లాను అరెస్టు చేయగా ఏ–1 నిందితుడు తబారక్ పరారీలో ఉన్న ట్లు తెలిపారు. అరెస్టయిన వారి వద్ద నుంచి 2,125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు ద్విచక్ర వాహనాలతో పాటు వారు వినియోగించే మొబైల్ ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలను స్వాఽ దీనం చేసుకుని టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుట్ర భగ్నం చేసిన సై బర్ డీఎస్పీ హసీబుల్లా, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌ను ఎస్పీ అభినందించారు. ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపై కేసు పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు 2,125 పాత మొబైళ్లు, 107 సిమ్ కార్డులు, 600 మొబైల్ బ్యాటరీలు, 5 వాహనాలు సీజ్ వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ -
గ్రూప్–2లో మెరిసిన మనోళ్లు
టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు సత్తా చాటారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారుసైతం పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరంతా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు.250 ర్యాంక్ సాధించిన అశోక్‌కుమార్● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ర్యాంకులు191 ర్యాంకు సాయిరాం కౌటాల: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని తలోడి గ్రామానికి చెందిన మండల రాజేశంగౌడ్–తారక్క దంపతుల కుమారుడు సాయిరాంగౌడ్ గ్రూప్–2లో 383 మార్కులతో రాష్ట్రస్థాయిలో 191 ర్యాంకు సాధించాడు. సాయిరాం ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్–4లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్‌గా సెలెక్ట్ కావడంతో పాటు గ్రూప్–1 మెయిన్స్‌లో 436 మార్కులు సాధించాడు. 97వ ర్యాంక్ లెక్కల శ్రావణ్ మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన లెక్కల లింగయ్య, కళావతి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్ సాధించాడు. 2019లోనే జిల్లాస్థాయిలో మొదటి ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంక్‌తో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించిన శ్రావణ్ సంతృప్తి లేకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గతేడాది గ్రూప్–4లో జిల్లాస్థాయిలో 11వ ర్యాంక్ సాధించి బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో 394 మార్కులతో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–1లోనూ 404 మార్కులు సాధించాడు. మెరిసిన ‘బజార్హత్నూర్’ యువకులు బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన బిట్లింగు లక్ష్మణ్, సరస్వతి దంపతుల కుమారుడు ఉదయ్‌కుమార్ 404 మార్కులతో రాష్ట్రస్థాయిలో 51వర్యాంకు సాధించాడు. ఉదయ్ ప్రస్తుతం ఆదిలాబాద్ ట్రెజరీలో జూనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మండలంలోని కొలారి గ్రామానికి చెందిన బుద్దేవార్ రాధ, నర్శింహులు దంపతుల కుమారుడు బుద్దేవార్ ముఖేష్ గ్రూప్–2 ఫలితాల్లో 418 మార్కులతో రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. 2019లో పంచాయతీ కార్యదర్శి, 2021లో నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ అశోక్ కుమార్ గ్రూప్–2లో ఫలితాల్లో 380 మార్కులతో రాష్ట్రస్థాయిలో 250వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం జైనథ్ మండలం సుందరగిరి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 399 మార్కులు సాధించాడు. సోదరుడు శ్రీకాంత్ అందించిన సహకారంతో గ్రూప్–1, 2 పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించినట్లు అశోక్ కుమార్ పేర్కొటున్నాడు.337వ ర్యాంకు సాధించిన వెంకటేశ్ నస్పూర్: మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన పోలంపల్లి వెంకటేశ్ గ్రూప్–2 ఫలితాల్లో 375 మార్కులతో రాష్ట్రస్థాయిలో 337వ ర్యాంకు సాధించాడు. 2014లో నిర్వహించిన వీఆర్వో పరీక్షలలో ఉమ్మడి జిల్లా టాపర్‌గా నిలిచాడు. కొంతకాలం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం లక్సెట్టిపేట మోడల్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 19వ ర్యాంక్ శివకృష్ణ ఆసిఫాబాద్‌అర్బన్/ఆసిఫాబాద్‌రూరల్: కుమురంభీం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్ సత్యనారాయణ, వాణిశ్రీ దంపతుల కుమారుడు శివకృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు, జోన్‌స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. సత్యనారాయణ స్థానిక సరస్వతి శిశుమందిర్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా శివకృష్ణ అదే పాఠశాలలో చదివి ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించాడు. గతేడాది ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆడిట్ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సత్తా చాటిన యువకులు నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన యువకులు గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటారు. చీర్ల లక్ష్మయ్య–రమక్క దంపతుల కుమారుడు సురేష్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు సాధించగా మండల మురళిగౌడ్, ఉష దంపతుల కుమారుడు సుమంత్ 172వ ర్యాంకు సాధించాడు. సురేష్‌రెడ్డి ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే గ్రూపు–2లో ర్యాంకు సాధించాడు. సుమంత్ ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.188వ ర్యాంకు సాయికృష్ణ సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామానికి చెందిన బట్టు నర్సన్న–సురేఖ దంపతుల కుమారుడు సాయికృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో 188వ ర్యాంకు సాధించి తన సత్తా చాటుకున్నాడు. నర్సన్న స్థానికంగా బిజినెస్ చేస్తుండగా సురేఖ దేగాం ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్విర్తిస్తున్నారు. చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి ఉన్న సాయికృష్ణ ఇంటర్ హైదరబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో, ఢిల్లీలో బీటెక్ పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2లో విజయం సాధించాడు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతోనే విజయం సాధించానని పేర్కొన్నాడు. గ్రూప్–1 ఫలితాల్లో సత్తా నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎర్రవోతు శ్యామల, ముత్తన్న దంపతుల కుమారుడు సాయి ప్రణయ్ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 557 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచాడు. సాయి ప్రణయ్ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో, 8 నుంచి 10 వరకు హైదరాబాద్‌లోని గురుకులంలో, ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజీలో, బీటెక్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేశాడు. గతేడాది నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యాడు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించాడు.గోలేటివాసికి 229వ ర్యాంకు రెబ్బెన: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని గుడ్లబోరికి చెందిన కామ్రే రావూజీ, లహనుబాయి దంపతుల కుమారుడు భాస్కర్ రాష్ట్ర స్థాయిలో 229వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా స్టోర్స్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు గ్రూప్–2 కోసం సంసిద్ధమయ్యాడు. ఆన్లైన్లో కోచింగ్, సొంత ప్రిపరేషన్‌తో గ్రూప్–2 ఫలితాల్లో 381.065 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 229 ర్యాంకు సాధించాడు. కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని భాస్కర్ అంటున్నాడు. భాస్కర్శ్రావణ్కుమార్ -
అమ్మా.. నీ తప్పుకు నన్ను చంపేశావా?
‘అమ్మా.. ఇంకో మూడు నెలలైతే లోకం చూసేవాడిని కదమ్మా.. ఎందుకమ్మ ఇంత పనిచేశావు. నీ కడుపులో నన్ము మోయలేకపోయావా.. ఆరు నెలలుగా నీ కడుపులో హాయిగా పెరుగుతున్నా.. నీవు మింగిన మాత్రలకు నాకు ఊపిరి ఆడడం లేదమ్మా.. లోకం చూపించి అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది.. తెల ్లవారేసరికే నా ఊపిరి తీశావేంటమ్మా.. నీవు చేసిన తప్పుకు నన్ను బలి ఇచ్చావా..’ గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ వాగులో పడేసిన పిండానికి మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించేదేమో. క్షణికావేశంలో చేసిన తప్పుకు గర్భం దాల్చిన ఓ యువతి.. బయటి ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల గర్భంలోనే పిండాన్ని చంపేశారు. ఈ హృదయ విదారక సంఘటన గురుజ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం ఉదయం గ్రామ శివారులోని వాగు ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృత శిశువు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానికులు అందించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఇద్దరు యువకులతోపాటు ఆర్ఎంపీని అదుపులోని తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి.. ఆరు నెలల గర్భాన్ని తీయించుకునేందుకు ఆర్ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి గ్రామంలో తిరిగిన సదరు ఆర్ఎంపీ ప్రాణాపాయమని తెలిసినా.. ఆరు నెలల గర్భాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ఇలా వాగులో పడేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు పూర్తి కానందున పూర్తి వివరాలు బుధవారం అందిస్తామని సీఐ భీమేష్ తెలిపారు. మృత శిశువును పరీక్షించిన వైద్యులు మగ శిశువుగా నిర్ధారించారు. పిండం వయస్సు సుమారు 6 నెలలు దాటి ఉండవచ్చని సమాచారం. గురుజలో ఆరు నెలల పిండం కడుపులోనే చంపి.. వాగులో పడేసి.. విచారణ జరుపుతున్న పోలీసులు... -
వైద్యురాలు శృతికి సన్మానం
మంచిర్యాలటౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పు రస్కరించుకొని మంగళవారం పట్టణంలోని వైశ్యభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన మహిళలను మంచిర్యాల వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన బర్త్రూట్ ఆస్పత్రి వైద్యురాలు శృతి గోలిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవీ వనిత క్లబ్ అధ్యక్షురాలు మల్యాల సంగీత, సెక్రటరి కే.గాయత్రి, కోశాధికారి గుండా సునీత, పలువురు మహిళలు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతిభైంసారూరల్: మండలంలోని కోతల్గాం గ్రామానికి చెందిన రైతు పోలబోయిన భోజన్న(62) విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతి చెందినట్లు సీఐ నైలు తెలిపారు. గ్రామానికి చెందిన భోజన్న అడవి జంతువుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు విద్యుత్ తీగలు అమర్చాడు. ఎప్పటిలాగే మంగళవారం రైతు తన పంటపొలంలోకి వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ఐదుగురు జూదరుల అరెస్టుఆదిలాబాద్టౌన్(జైనథ్): భోరజ్ మండలంలోని గిమ్మ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపారు. గండ్రత్ సతీష్, అయిండ్ల కిరణ్ కుమార్, కందుల సాయికృష్ణ, జి సతీష్, ఎన్ రాకేష్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 52 పేక ముక్కలు, రూ. 43,290 నగదును సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్ అనే మరో వ్యక్తి పరారయ్యాడన్నారు. -
బీ కేర్..‘సెల్’!
ఆదిలాబాద్‌టౌన్: చెడిపోయిన ఫోనే కదా.. ఇంట్లో నిరుపయోగంగా ఉండడం కంటే స్క్రాప్‌లో విక్రయిస్తే ఎంతోకొంత డబ్బులు వస్తాయి.. లేదా ఇంట్లో పనికొచ్చే గిన్నెలు, ప్లాస్టిక్ డబ్బాలతో ఏదైనా ఉపయోగం ఉంటుందని జనం అనుకుంటుంటారు. అయితే ఆ పాత ఫోన్లే కొంప ముంచుతున్నాయి. వాటిని విక్రయించిన వారికి సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపుతున్నారు. ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర నేరాలకు పాల్పడినప్పుడు ఫోన్ విక్రయించిన వారు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తీరా మోసపోయామని తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. పల్లెల్లో చిక్కు వెంట్రుకలకు గిన్నెలు, డబ్బాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహా వ్యాపారానికి బిహార్‌కు చెందిన ఓ ముఠా తెరలేపింది. గ్రామాల్లో మోటార్‌సైకిల్‌పై డబ్బాలు కట్టుకొని పాత సెల్ఫోన్లు కొంటాం.. అంటూ తిరుగుతున్నారు. విషయం తెలియని అమాయకులు వారికి ఎంతో కొంతకు విక్రయిస్తున్నారు. లేదా వస్తువులు తీసుకొని ఇచ్చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిపైన అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. జిల్లాలో బిహార్ ముఠా ఏకంగా 2వేలకు పైగా పాత సెల్ఫోన్లను కొనుగోలు చేసి ఆ రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధంగా ఉండగా, జిల్లా పోలీసులు పసిగట్టి వారి గుట్టురట్టు చేశారు. సైబర్ కేటుగాళ్ల ప్లాన్ ఇలా.. ● బిహార్‌కు చెందిన ముఠా ద్విచక్ర వాహనాలపై పల్లె, పట్టణాల్లో తిరుగుతూ చెడిపోయిన సెల్ఫోన్లతో పాటు పనిచేసే వాటిని తీసుకుని ప్లాస్టిక్ డబ్బాలు, గిన్నెలు అందజేస్తారు. ఇలా సేకరించిన వాటిని ఢిల్లీకి చెందిన డీలర్లకు ఒక్కోటి రూ.100 చొప్పున విక్రయిస్తారు. వారు వాటిని కాంబోడియా, ఫిలిప్పైన్స్, లాంగోస్, సౌత్ఈస్ట్ ఏసియా దేశాలకు తరలించి సైబర్ నేరాలకు పాల్పడే వారికి విక్రయిస్తారు. అక్కడ వాటికి రిపేర్లు చేసి అందులో ఐఎంఈ నంబర్‌తో సెల్‌ఫోన్ వినియోగదారు సమాచారం సేకరిస్తారు. మరోవైపు మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని ఆయా దేశాలకు చెందిన సైబర్‌మోసగాళ్లు వల విసురుతారు. ఇక్కడి నుంచి సింగాపూర్‌కు తీసుకెళ్లి వారి వీసాను లాక్కుంటారు. తిరిగి వెళ్లకుండా ఇబ్బందులకు గురిచేస్తారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంతమంది సైబర్ మోసగాళ్లు చెప్పే పనులకు బలవుతుంటారు. ఆయా భాషల్లో నైపుణ్యం సాధించేలా వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బ్యా ంకు ఉద్యోగులు, పోలీసు అధికారులుగా, పార్ట్‌టైమ్ జాబ్ కల్పిస్తామని వారితో ఫోన్లు చేయిస్తారు. లింకులు, ఓటీపీల ద్వారా బ్యాంకులో ఉన్న డబ్బును కాజేస్తారు. అమాయకులతో పాటు అన్ని తెలిసిన వారు సైతం వీరి వలలో పడుతున్నారు. రూ.లక్షల్లో మోసపోతున్నారు. ఇటీవల పెరుగుతున్న కేసులు.. జిల్లాలో రోజురోజుకు సైబర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అమాయకులు వారి ఉచ్చులోపడి నష్టపోతున్నారు. గతేడాది దాదాపు 200 వరకు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 86 కేసులున్నాయి. బాధితుల నుంచి సైబర్ మోసగాళ్లు రూ.1 కోటి 50లక్షల వరకు దోచుకున్నారు. అయితే కొన్ని డబ్బులను బ్యాంకుల్లో సైబర్ పోలీసులు ఫ్రీజింగ్ చేశారు. గతేడాది మూడు లోక్ అదాలత్‌లలో రూ.17లక్షల 60వేలను బాధితులకు అందజేశారు. ఈ ఏడాది 15 కేసుల వరకు నమోదయ్యాయి. రూ.5లక్షల వరకు సైబర్ మోసగాళ్ల చేతిలో నష్టపోయారు. ఖాతా మాయమే.. బ్యాంకు ఖాతా మనదే అయినప్పటికీ మనం విక్రయించే ఫోన్లు, ఇతర వివరాలు తెలుపడంతో అందులో ఉన్న డబ్బులను మనకు తెలియకుండగానే కాజేస్తున్నారు. ఫోన్లను హ్యాక్ చేసి ఓటీపీలు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా బాధితులు నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. మన మెయిల్, ఫేస్‌బుక్‌లను హ్యాక్ చేసి సందేశాలను పంపుతూ కొల్లగొడుతున్నారు. ఇటీవలే క్రెడిట్ కార్డు లిమిట్ పెంచాలా అని, మీ పిల్లలు మత్తు పదార్థాల కేసుల్లో ఇరుక్కుపోయారని, పోలీసులమని బెదిరింపులకు పాల్పడుతూ మోసగాళ్లు బాధితుల ఖాతాల్లో నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. పాత మొబైల్స్ ఇస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త మరమ్మతులు చేసి వాటి ద్వారానే సైబర్ మోసాలు లబోదిబోమంటున్న బాధితులు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు‘పాత ఫోన్లకు.. ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తాం’ అంటూ వీధుల్లో తిరిగే వారికి పాడైపోయిన మీ సెల్ఫోన్లు ఇస్తున్నారా.. ఒక్క క్షణం ఆలోచించండి.. లేకుంటే మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. అందులోని డేటాతో కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో తాజాగా ఈ ముఠా గుట్టు రట్టయింది. అప్రమత్తంగా ఉండాలి సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొందరు గ్రామాలకు వచ్చి పాత సెల్ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. పని చేయని మొబైల్స్‌ను ఎవరికీ విక్రయించొద్దు. ఎవరికై న ఫోన్లు విక్రయించినా, కొనుగోలు చేసినా తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. కొంత మంది అమాయకులతో పాటు అన్ని తెలిసిన వారు కూడా నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఒకవేళ డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే టోల్‌ఫ్రీ నం.1930కు సమాచారం అందించాలి. www. cybercrime. comలో ఫిర్యాదు చేయాలి. – అఖిల్ మహాజన్, ఎస్పీ -
మహిళల సంక్షేమానికి పెద్దపీట
● కలెక్టర్ రాజర్షిషాఆదిలాబాద్టౌన్: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మ హిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళల ఆరోగ్యంపై వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆడ పిల్లల చదువును ప్రోత్సహించాలన్నారు. పని ప్రదేశాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. మహిళలు ఆర్థిక స్వా లంబన దిశగా ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అన్నిరంగాల్లో మహిళలు ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడైతే సీ్త్రలు గౌరవించబడతారో అక్కడ సమాజం సంతో షంగా ఉంటుందన్నారు. అనంతరం పలు స్వచ్ఛంద సంస్థలు, జిల్లా అధికారులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ మిల్కా, డీఈవో ప్రణీత, టీబీ నివారణ అధికారి డాక్టర్ సుమలత, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ యశోద, సఖీ కేంద్రం నిర్వాహకురాలు సరస్వతి, నాగమణి, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి’
ఆదిలాబాద్‌టౌన్: సీసీఐ ఫ్యాక్టరీ, ఎయిర్పో ర్టు విషయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, చేతకాకపోతే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఐ పరిశ్రమను తుక్కు కింద అమ్మేయడానికి టెండర్లు ప్రకటించిన విషయాన్ని బయట పెట్టడంతో దానిపై వారిద్దరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఎయిర్‌పోర్టు విషయంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు నిజమైతే తన స్వగ్రామమైన జాతర్లలోని శివాలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించమన్నారు. తాను ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అభివృద్ధి చేశానే తప్ప మోసపూరిత మాటలు చెప్పలేదని గుర్తు చేశారు. పరిశ్రమల విషయంలో యు వతతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతున్నారన్నా రు. అబద్దాలతో కాలయాపన చేసే బదులు రాజీనామా చేయడం ఉత్తమమని హితబోధ చేశారు. 11 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో అధి కారంలో ఉన్నా సీసీఐ పరిశ్రమను పునః ప్రారంభించకపోవడం వారి అసమర్థతే కారణమన్నారు. వాటి సాధన కోసం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నా రు. ఇందులో నాయకులు నారాయణ, అజ య్, ప్రహ్లాద్, రాజు, భూమన్న తదితరులు పాల్గొన్నారు. -
● బల్దియా పరిధిలో ‘భగీరథ’ లీకేజీలు ● నిత్యం 8ఎంఎల్డీల వరకు నీరు వృథా ● మూడు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా ● స్పందించకుంటే నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం
ఇక్కడ కనిపిస్తున్నవి పట్టణంలోని ఆర్టీవో కార్యాలయ సమీపంలో గల మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ దృశ్యాలు. ఫలితంగా నీరంతా ఇలా రోడ్డుపై వృథాగా పోతోంది. ఈ ఒక్క చోటే కాదు.. జిల్లా కేంద్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.●ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం ఇప్పటికై తే పట్టణంలో నీటి సమస్య అంతగా లేదు. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఏప్రిల్ 15 నాటికి లాండసాంగ్వీ పంప్‌హౌస్‌లో సమస్య తలెత్తే అవకాశముంది. దీనిని అధిగమించేందుకు ట్యాంకర్లను పెంచేలా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశాం. లీకేజీలను అరికట్టేందుకు దృష్టి సారిస్తున్నాం. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని తగు చర్యలు తీసుకుంటాం. – పేరిరాజు, మున్సిపల్ ఇంజినీర్ కై లాస్‌నగర్: గ్రేడ్–1 స్థాయి కలిగిన ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ పైపులైన్, వాల్వ్‌ల లీకేజీల కారణంగా నిత్యం వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. సకాలంలో గుర్తించకపోవడం, మరమ్మతు పనుల్లో జాప్యం అవుతుండడంతో పలు కాలనీలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా మార్చిలోనే నీటి గోస మొదలైంది. ప్రస్తుతం పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. ఎండల తీవ్రత పెరిగే కొద్ది భూగర్భజలాల మట్టం తగ్గి నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. బల్దియా అధికారులు మేల్కొని ప్రత్యేక దృష్టి సారించకుంటే ఈ వేసవిలో పట్టణవాసులకు నీటి తిప్పలు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పలుచోట్ల ట్యాంకర్ల ద్వారా.. బల్దియా పరిధిలో కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ కేఆర్కే కాలనీ, భగత్‌సింగ్‌నగర్, ఖర్షీద్నగర్ వంటి కాలనీల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు. దీంతో ఆయా చోట్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. బల్దియాకు సంబంధించి ఆరు ట్యాంకర్లు ఉండగా మరో మూడింటిని అద్దె ప్రాతిపాదికన తీసుకున్నారు. ప్రస్తుతం 170 సర్వేనంబర్ కాలనీలో నీటి సమస్య తీవ్రమైంది. అక్కడ సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులు చేపడుతుండటంతో భగీరథ పైపులైన్ పగిలిపోయింది. దీంతో ఆ కాలనీలకు ట్యాంకర్లే దిక్కయ్యాయి. ఒక్కో ట్యాంకర్ రోజుకు తొమ్మిది ట్రిప్పుల చొప్పున సరఫరా చేస్తున్నాయి. మిగతా కాలనీల్లోనూ సమస్య తలెత్తితే మరిన్ని ట్యాంకర్లను అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. రోజు విడిచి రోజు సరఫరా ఆదిలాబాద్ పట్టణానికి రోజుకు 31.90 ఎంఎల్డీల నీరు అవసరం. ప్రస్తుతం 24ఎంఎల్డీల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. ఇందులో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం మాటేగాం సమీపంలోని ఫిల్టర్‌బెడ్ నుంచి రోజుకు 18ఎంఎల్డీల నీరు మిషన్ భగీరథ ద్వారా అందుతోంది. అయితే కొన్ని కాలనీల కు కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వీ పంప్‌హౌస్ నుంచి 6ఎంఎల్డీలు సరఫరా అవుతుండగా ఇక్కడి నుంచి 17 వార్డులకు నీటిని అందిస్తున్నారు. ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మావల చెరువు నుంచి 1.5 ఎంఎల్డీల నీరు ఫిల్టర్‌బెడ్‌కు అందుతుంది. ఇక్కడి నుంచి ఏడు వార్డులకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పట్టణంలోని 24 వార్డులకు నిత్యం నీటిని సరఫరా చేస్తుండగా మరో 25 వార్డులకు మాత్రం రోజు విడిచి రోజు అందిస్తున్నారు. -
హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్ఆదిలాబాద్: ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. 100 రోజుల్లోనే అన్నింటిని అమలు చేస్తామని శాసనసభలో ప్రకటించిన ప్రభుత్వం వాటికి నిధుల కేటాయింపులో సైతం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు. బుధవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో హామీల అమలు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసింది ఏమీ లేదని విమర్శించారు. విమానాశ్రయం విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన ఎన్ఓసీ ఇవ్వడానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. మరోవైపు సీసీఐ విషయంలో సైతం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, జిల్లా కేంద్రంలో రైల్వే వంతెనల విషయంలో తాను ప్రజాప్రతినిధిగా లేకపోయినా ఎంతగానో కృషి చేశానన్నారు. ఇవన్నీ మర్చిపోయి వ్యక్తిగతంగా విమర్శలకు దిగడం సబబు కాదన్నారు. తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. ఆయన వెంట నాయకులు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, జోగు రవి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాడీబిల్డింగ్ ఓవరాల్ చాంపియన్ వెంకటేశ్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాడీబిల్డంగ్ ఓవరాల్ చాంపియన్‌గా మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాలకు చెందిన మాసు వెంకటేశ్ నిలిచాడు. సీసీసీలో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బాడీ బిల్డింగ్ జూనియర్, సీనియర్, మాస్టర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. మాసు వెంకటేశ్ అన్ని కేజీల విభాగాల్లో మంచిర్యాల జిల్లా చాంపియన్‌గా నిలిచాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చాంపియన్ ఆఫ్ ద చాంపియన్ పోటీల్లోనూ విజేతగా నిలిచాడు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నేరడిగొండ: మండలంలోని బోరిగాం బస్టాండ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన బొడిగే గణేశ్ (26) ఆదివారం రాత్రి నిర్మల్‌లో ఉంటున్న ఆయన భార్య వద్దకు బైక్‌పై వెళ్తున్నాడు. గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలో మృతిచెందాడు. మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. గోడ మీదపడి కూలీ.. రెబ్బెన: మండలంలోని నవేగాంలో కూలీపై గోడపడి మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నవేగాం గ్రామానికి చెందిన కొద్దెన లస్మయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. గ్రామానికి చెందిన బొల్లు తిరుపతి ఇంటి పనుల కోసం సోమవారం లస్మయ్యను కూలీని పిలిచారు. పని నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా లస్మయ్యపై గోడ కూలి పడటంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి అన్న రాజయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు కుంటలో పడి ఒకరు.. ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రంలోని బోయవాడకాలనీకి చెందిన పిండి విజయ్ (36) ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. ఎస్సై మనోహర్ కథనం ప్రకారం.. విజయ్ ఇంటి అవసరం నిమిత్తం కట్టెలు ఏరేందుకు మండలంలోని కామాయిపేట అటవీ ప్రాంతానికి ఆదివారం వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో దాహం వేయగా గ్రామ సమీపంలోని కుంటలో నీరు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. ఆదివారం రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం కుంట వద్ద చెప్పులు చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారమివ్వడంతో స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పదంగా యువకుడు.. ఆదిలాబాద్‌రూరల్: మావల శివారు ప్రాంతంలో గల ఎర్రకుంటలో ఒకరు అనుమానాస్పదంగా మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మావల గ్రామానికి చెందిన షేక్ ఫర్వేజ్ అదే గ్రామంలోని పెట్రోల్ పంపులో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి రాలేదు. కుటుంబ సభ్యులు రాత్రి వరకు గాలించిన ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం ఎర్రకుంట ప్రాంతం వైపు వెళ్లిన మావలకు చెందిన సతీశ్.. మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కుమారుడి మృతిపై అనుమానం ఉందని తల్లి రెహనా ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అథ్లెటిక్స్‌లో మెరిశారు..
● ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ● పతకాలతో సత్తాచాటుతూ.. ● అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వారందరిది నిరుపేద కుటుంబ నేపథ్యం. అయినప్పటికీ భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలని చదువును కొనసాగిస్తూనే క్రీడారంగాన్ని ఎంచుకున్నారు. అథ్లెటిక్స్‌లో నిరంతరం సాధన చేసి ప్రతిభ కనబరుస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ పోటీలకు దేశం తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత నెల 18, 19వ తేదీల్లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో 11వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లోనూ ప్రతిభ కనబర్చారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులపై ప్రత్యేక కథనం. – ఆదిలాబాద్శిక్షకుల ప్రోత్సాహంతోనే.. బేల మండలం సిర్సన్నకు చెందిన ఎస్కే ఫిరోజ్– షరీఫా దంపతుల కుమార్తె ముస్కాన్. అథ్లెటిక్స్ పోటీల్లో విజేతగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో డీ.పెడ్ కోర్సు చేస్తున్న ఆమె హ్యామర్‌త్రో ఈవెంట్లో మూడు పతకాలు సాధించింది. హైదరాబాద్, హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణం, రజతం, ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో కాంస్య పతకాలతో మెరిసింది. శిక్షకులు రేణుక, వీజీఎస్ రాకేశ్ ప్రోత్సాహంతో రాగలిగింది. జాతీయ అథ్లెటిక్స్ శిక్షకురాలిగా ఎదగాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. – ముస్కాన్ అంతర్జాతీయ స్థాయిలో మెరిశాడు ఇచ్చోడ మండలం దేవుల్ నాయక్ తండాకు చెందిన రమేశ్ రాథోడ్–లక్ష్మీబాయి దంపతులకు కుమారుడు రాథోడ్ వంశీ. గతేడాది జూలైలో నేపాల్‌లో జరిగిన టార్గెట్ బాల్‌పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో భారత్ రెండో స్థానంలో నిలువగా, వెండి పతకం నిలబెట్టుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో హామర్ త్రో ఈవెంట్లో రెండుసార్లు రజత పతకాలు సాధించగా, ఓసారి కాంస్య పతకంతో విజేతగా నిలిచాడు. కాకతీయ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ స్థాయి పోటీల్లో బ్యాడ్మింటన్ క్రీడలో ప్రాతినిధ్యం వహించి రాణించాడు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా కావడమే లక్ష్యంగా ప్రతీరోజు నాలుగు గంటలు మైదానంలో శ్రమిస్తున్నాడు. – వంశీ గ్రూప్–1 ఆఫీసర్ కావడమే లక్ష్యం.. ఆదిలాబాద్‌కు చెందిన ప్రవీణ్–గీత దంపతుల కుమారుడు డి.చంద్రసిద్ధార్థ.. ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఐదో తరగతి నుంచే ఆటలపై మక్కువ పెంచుకుని, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణిస్తున్నాడు. అథ్లెటిక్స్‌లో రేస్‌వాక్ ఈవెంట్లో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం గెలుపొందాడు. 2022లో జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఉత్తీర్ణత సాధించాడు. సైనికుడిగా విధులు నిర్వర్తిస్తూనే, తన చిన్ననాటి కల అయిన గ్రూప్–1 ఆఫీసర్ కావడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు. – డి.చంద్రసిద్ధార్థ ఎన్ఐఎస్ శిక్షకుడినవుతా బజార్హత్నూర్ మండలం మంజారం తండాకు చెందిన గురుదయాల్ సింగ్–శారదబాయి దంపతుల కుమారుడు అజాడే అనిల్. ఆదిలా బాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. ఈయన అథ్లెటిక్స్‌లో హేమర్ త్రో, స్టీపుల్ చేజ్, ట్రిపుల్ జంప్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తున్నాడు. 2019 పూణెలో జరిగిన స్విమ్మింగ్ జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. ఇటీవల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఒక వెండి, కాంస్య పతకాలు కై వసం చేసుకున్నాడు. అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలవడమే కాకుండా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కోచ్‌గా వ్యవహరించడమే తన లక్ష్యమని, ఇందుకోసం శిక్షకులు వీజీఎస్ రాకేశ్, వీజీఎస్ జోల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నా. – అజాడే అనిల్ -
అన్నిరంగాల్లో మహిళల పాత్ర కీలకం
ఉట్నూర్‌రూరల్: అన్నిరంగాల్లో మహిళల పాత్ర కీలకమని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు..ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారని తెలిపారు. అనంతరం మహిళా ఉద్యోగులకు లంచ్ బాక్స్‌లు అందజేశారు. నారీశక్తి పురస్కారాల ప్రదానంనిర్మల్ఖిల్లా: అన్నిరంగాల్లో మహిళలు రాణించడం శుభ పరిణామమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో సోమవారం ‘పాటే మా ప్రాణం’సంగీత ఆకాడమీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ’నారీశక్తి పురస్కారాలు ప్రదానం చేశారు. డాక్టర్లు రజిని, చంద్రిక, న్యాయవాది నివేదిత, సుగుణ, ఎస్సై రోహిణి, ఎఫ్ఆర్వో శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి రాణి, కేజీబీవీ ఎస్ఓ లతాదేవి, విజయలక్ష్మి, స్వాతి, లక్ష్మి, శ్రీలత, రాజ్యలక్ష్మి పురస్కార గ్రహీతలు ఉన్నారు. అనంతరం వారిని సన్మానించారు. కార్యక్రమంలో కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ ముత్యంరెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, ప్రముఖవైద్యులు యు.కృష్ణంరాజు, సంగీత అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ నవ్య, కార్యదర్శి శ్రీకాంత్ సభ్యులు వాణిశ్రీ, కవిత, మమత, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు గంటల సాధన
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం అష్ట గ్రామానికి చెందిన రాజశేఖర్–సుగుణ దంపతుల కుమార్తె బి.స్వాతి. అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తోంది. ఇప్పటివరకు స్టీపుల్ చేజ్, జావెలిన్ త్రో ఈవెంట్లలో రెండు పతకాలతో మెరిసింది. ఇప్పటివరకు ఒక రజతం, ఒక కాంస్య పతకంతో సత్తా చాటింది. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం నాలుగు గంటలు సాధన చేస్తున్నానని చెబుతోంది. మరిన్ని క్రీడా ఈవెంట్లలో సత్తా చాటడానికి, నిరంతరం క్రీడా నైపుణ్యాలు అలవర్చుకుంటానని తెలుపుతోంది. – స్వాతి -
వ్యాయామ ఉపాధ్యాయురాలవుతాను
నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన చిన్నయ్య–చిన్నక్క దంపతుల కుమార్తె సీహెచ్. వసంత. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటుతోంది. పోటీల్లోని ట్రిపుల్ జంప్, హ్యామర్ త్రో ఈవెంట్లలో ఇప్పటివరకు 8 పతకాలు సాధించింది. యూనివర్సిటీ లెవల్లో హ్యామర్ త్రో ఈవెంట్లో కాంస్య పతకంతో సత్తా చాటింది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బీకాం చదువుతున్న ఆమె వ్యాయామ ఉపాధ్యాయురాలిగా కెరియర్ ఎంచుకుంటా అంటోంది. – సీహెచ్. వసంత -
శాశ్వత నిద్రలోకి..
● ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మృతి ● ఇచ్చోడలో ఘటన ఇచ్చోడ/బోథ్/నార్నూర్/ఉట్నూర్‌రూరల్: ఏమైందో ఏమో కాని నిద్రలోనే ఆ విద్యార్థి తిరిగి రాని లోకాలకు చేరింది. ఈ ఘటన ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బజార్హత్నూర్ మండలం మొర్కండి గ్రామానికి చెందిన చిక్రం లాలిత్య (14) పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. ఆదివారం రాత్రి భోజనం అనంతరం తోటి విద్యార్థులతో కలిసి మొదటి అంతస్తులో నిద్రకు ఉపక్రమించింది. సోమవారం ఉదయం 6 గంటలకు విద్యార్థులంతా నిద్రలేచారు. ఆమె మాత్రం పడుకుని ఉండగా స్నేహితులు వచ్చి లేపేందుకు యత్నించగా స్పందించలేదు. నోటి నుంచి తెల్లటి నురుగు ఉండగా వెంటనే వసతి గృహ సిబ్బందికి తెలిపారు. హెచ్ఎం కాత్లె ఉత్తం దాస్ అక్కడికి చేరుకుని విద్యార్థినిని పరిశీలించి మృతిచెందినట్లుగా గుర్తించాడు. వెంటనే పోలీసులతోపాటు విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గత ఆదివారమే తమ బిడ్డను కలిసివెళ్లినట్లు వారు విలపిస్తూ పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భీమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు యత్నించగా విద్యార్థిని తండ్రి రాజేశ్వర్ తమ బంధువులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అడ్డుకున్నాడు. పక్కనే పరీక్షలకు సిద్ధమవుతున్న ఇంటర్ విద్యార్థులకు ఇబ్బందులు కలగచేయవద్దని సూచించి రాజేశ్వర్‌ను అక్కడి నుంచి మృతదేహం వెంట బోథ్‌కు తరలించారు. పంచనామా అనంతరం మృతదేహన్ని వారికి అప్పగించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల కోసం రూ.10 వేలు కుటుంబానికి అందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే బాలిక మృతిచెందిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. కాగా, విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ అన్నెల లక్ష్మణ్, విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట, ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టాయి. ధర్మసమాజ్ పార్టీ, సీపీఐ నాయకులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఈ విషయమై నాయకులు ఐటీడీఏ డీడీ వివరణ కోరగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. మృతిపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖష్బుగుప్తాకు ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం నగేశ్ వినతిపత్రం అందించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగమే లక్ష్యం
నిర్మల్ జిల్లా చిట్యాలకు చెందిన రాజు–సరోజ దంపతుల కుమార్తె దివిటి అరుణ. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (ఎంపీసీఎస్) సెకండియర్ చదువుతోంది. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో హ్యమర్ త్రో, డిస్కస్ త్రో ఈవెంట్లలో మొత్తం ఐదు పతకాలు సాధించింది. హ్యమర్ త్రోలో రెండు రజతం, 2 కాంస్య, డిస్కస్ త్రోలో కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధిస్తానని ధీమాగా చెబుతోంది. – అరుణ -
గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ
తాంసి: గ్రూప్–1 ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఇందులో పలువురుయువకులు ప్రతిభ కనబర్చారు. కొందరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. పరీక్ష రాసి ఉత్తమ మార్కులు సాధించారు. తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్‌కు చెందిన సురుకుంటి సచిన్.. 454.5 మార్కులు సాధించాడు. ఈయన వార్డు ఆఫీసర్‌గా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. భీంపూర్ మండలం కరంజి(టి) గ్రామానికి చెందిన ఎల్టి కార్తీక్‌రెడ్డి..443 మార్కులు సాధించాడు. బోథ్ మండలం ధనోర గ్రామానికి చెందిన నల్ల లావణ్యరెడ్డి..తాంసి మండలం హస్నాపూర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాయగా 441.5 మార్కులు సాధించింది. తాంసికి చెందిన జానకొండ అశోక్ పంచాయతీ కార్యదర్శిగా జైనథ్ మండలం సుందరగిరిలో విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–1 పరీక్ష రాశాడు. 398.50 మార్కులు సాధించాడు. -
కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ రూరల్ మండలం నిషాన్ఘాట్లోని సర్వేనంబర్ 38లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ, కాలనీలో ఎనిమిదేళ్లుగా నిరుపేదలు అంధకారంలో ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్ర జాప్రతినిధులు పట్టించుకోకపోవడం విచా రకరమన్నారు. కలెక్టర్ చొరవ చూపి కాలనీ లో విద్యుత్ సౌకర్యంతో పాటు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు క ల్పించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో పార్టీ నాయకులు గంగారెడ్డి, దేవిదాస్, కేశవ్, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
ఆదిలాబాద్‌టౌన్: వైకల్యం గల పిల్లలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని డీఈవో ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డైట్ కళాశాలలో అలింకో, విద్యశాఖ ద్వారా దివ్యాంగులకు సోమవారం ఉపకరణాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 123 మంది చిన్నారులకు సీపీ చైర్, కృత్రిమ అవయవాలు, ఎలక్ట్రిక్ ట్రైసైకిల్, వినికిడి యంత్రాలు, రోలేటర్ తదితర పరికరాలను అందించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ,దివ్యాంగులు సకలాంగులతో సమానంగా పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చి దిద్దాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు సుజాత్ ఖాన్, శ్రీకాంత్‌గౌడ్, ఎంఈవోలు సోమయ్య, శ్రీనివాస్,హెచ్ఎంలు లచ్చిరాం, లక్ష్మణ్, డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
● నిర్వాహకులు, అధికారులకు కల్పతరువులా ‘ఔట్సోర్సింగ్’ ● కొత్త ఎంప్యానల్మెంట్ను మరిచిన యంత్రాంగం ● ఐదేళ్లుగా పాత వాటికే వర్క్ఆర్డర్ల రెన్యూవల్ ● కొత్త పోస్టులు మంజూరైనా వాటికే అప్పగింత!
ఔట్సోర్సింగ్ ఏజెన్సీల వివరాలు.. ఎంప్యానల్మెంట్ గుర్తించిన సంవత్సరం : 2019–20 ఎంప్యానల్మెంట్లో ఉన్న ఏజెన్సీలు : 17 యాక్టీవ్‌గా ఉన్న ఏజెన్సీలు : 09 వివిధ శాఖల్లో ఔట్సోర్సింగ్ పోస్టులు : (సుమారు) 1250సాక్షి,ఆదిలాబాద్: ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు.. ఇటు నిర్వాహకులకు, అటు అధికారులకు ఎనీ టైమ్ మనీలా మారిపోయాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వాటిని ఆ శాఖలు వదులుకోవడం లేదు. ఐదేళ్లుగా వాటికే వర్క్ ఆర్డర్లు ఇస్తూ రెన్యూవల్ చేస్తున్నారు. కొత్త పోస్టులు మంజూరైనా వాటికే పంచేస్తున్నారు. సాధారణంగా ఏటా లేనిపక్షంలో రెండేళ్లకోసారి ఏజెన్సీల మార్పు చేపట్టాలి. ఇందుకోసం కొత్త ఎంప్యానల్మెంట్ రూపొందించాలి. అయితే ఈ ప్రక్రియకు ఐదేళ్లుగా బ్రేక్ పడడం గమనార్హం. ఐదేళ్ల క్రితం ఏర్పాటైనవే.. ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ సర్వీసులను ఏజెన్సీలు చేపడతాయి. ఆ ఏజెన్సీలకు వీటి నియామక ప్రక్రియ అప్పగించేందుకు ముందుగా అవి ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందాలి. దాన్నే ఎంప్యానల్మెంట్ అంటారు. 2019–20 సంవత్సరంలో దీనికి సంబంధించి టెండర్లు నిర్వహించి ఏజెన్సీలను గుర్తించారు. ఆ తర్వాత ఏటా వాటి గడువు పొడగిస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఐదేళ్లవుతుంది. ఔట్సోర్సింగ్ కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్‌కు ఈ టెండర్ల నిర్వహణకు సంబంధించి విచక్షణ అధికారాలు ఉంటాయి. జిల్లాలో ఎంప్యానల్మెంట్ నుంచి మొదలుకొని వర్క్ ఆర్డర్.. ఇలా ప్రతీ అంశంలో గతంలో అక్రమాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఎంప్యానల్మెంట్ రద్దు చేసి కొత్తగా టెండర్లు చేపట్టి దీన్ని గాడిలో పెట్టేందుకు ఏవైన చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సిందే. అడ్డూ అదుపులేని ఏజెన్సీల అక్రమాలు.. గతంలో బీసీ సంక్షేమ శాఖలో అక్షర ఏజెన్సీకి సంబంధించి అక్రమం వెలుగు చూసింది. ఇందులో కింది స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగులైన కుక్, వాచ్మెన్, తదితర ఉద్యోగులకు సంబంధించి ఈ ఏజెన్సీ నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా, అటు వారికి సంబంధించి పీఎఫ్ కట్టకుండా ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల బిల్లులను డ్రా చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని అప్పట్లో శ్రీసాక్షిశ్రీ వెలుగులోకి తెచ్చింది. అయితే విస్తుపోవాల్సిన అంశం ఏమిటంటే.. ఆ అక్షర ఏజెన్సీ అసలు ఎంప్యానల్మెంట్ జాబితాలోనే లేదు. ఇకపోతే ఇటీవల రిమ్స్‌లోనూ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల విషయంలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పాత ఏజెన్సీల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అప్పట్లో ఎంప్యానల్మెంట్లో 17 ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను గుర్తించారు. వాటికి మాత్రమే వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. మధ్యలో వీటి సంఖ్య 20కి పెరిగినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటయ్యే వరకు పాత వాటిలో ముందుగా గుర్తించిన ఏజెన్సీలను మినహాయిస్తే మిగతా వాటిని చేర్చేందుకు ఆస్కారం ఉండదు. అయితే జిల్లాలో గతంలో ఉపాధికల్పన శాఖ అధికారులుగా చేసిన వారు పలు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. ఇలా అదనంగా ఏజెన్సీలు ఎలా పుట్టుకొచ్చాయన్నది జిల్లా ఔట్సోర్సింగ్ కమిటీకి తెలిసే జరిగిందా.. తెలియక జరిగిందా.. అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఏసీబీ దాడుల్లో ఉపాధికల్పన శాఖ అధికారులు పట్టుబడ్డారు. ఓ ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇచ్చే విషయంలో రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. అప్పటినుంచే జిల్లాలో ఉన్న ఎంప్యానల్మెంట్, వివిధ ప్రభుత్వ శాఖల్లో అస్తవ్యస్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్వహణ తీరును కమిటీ గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏళ్లుగా ఉన్న ఈ ఎంప్యానల్మెంట్ను రద్దు చేసి కొత్తది ఏర్పాటు చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కల్పనలో అర్హులైన నిరుద్యోగులకు ఆసరగా నిలవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటుకు చర్యలు.. కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. విధివిధానాలు రూపొందిస్తున్నాం. పాత దాని గడువు ఈ మార్చి 31తో ముగిసిపోతుంది. సాధారణంగా ఎంప్యానల్మెంట్ గడువు కొన్ని జిల్లాల్లో ఏడాది, మరికొన్ని జిల్లాలో రెండేళ్ల పాటు ఉంటుంది. జిల్లాలో కొన్నేళ్లుగా పాత ఎంప్యానల్మెంటే కొనసాగుతుంది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రక్రియ చేపడతాం. –మిల్కా, ఉపాధికల్పనశాఖ ఇన్చార్జి అధికారి -
వేధింపులా..‘181’కు కాల్ చేయండి
కైలాస్‌నగర్: వేధింపులకు గురయ్యే మహిళలు హెల్ప్‌లైన్ 181కు కాల్ చేసి లేదా www. shebox. nic. in వెబ్సైట్ ద్వారా లేదా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక పరిష్కార చట్టం–2013పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. ఈ చట్టంపై ప్రతీ మహిళ అవగాహన కలిగి ఉండాలన్నారు. వేధింపులను నియంత్రించడంలో భాగంగా ఫిర్యాదు చేసేందుకు ప్రతీ కార్యాలయంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చట్టం ఆవశ్యకతను తెలిపే పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఫ్రీడం పార్కులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్యతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ఆర్డీవో వినోద్ కుమార్, ట్రెయినీ కలెక్టన్ అభిగ్యాన్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్‌కు హాజరైన కలెక్టర్.. రంజాన్ మాసంలో ముస్లింలు నియమనిష్ఠలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరిస్తారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎస్వో వాజిద్ అలీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో కలెక్టర్ పా ల్గొని మాట్లాడారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, డీఎల్పీవో ఫణింద్రరావు, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణపై ఫోకస్
● ట్రాఫిక్ సమస్యలు, శాంతిభద్రతలపై నిఘా ● సంఘవిద్రోహ శక్తుల కట్టడికి చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో నేరాల అదుపు, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపా దం మోపుతానని జిల్లా నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీగా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. సాక్షి: సర్, గుడ్‌మార్నింగ్.. వెల్కం ఆదిలాబా ద్. మీ నేపథ్యం, ఐపీఎస్ శిక్షణ.. ఇప్పటివర కు ఏయేప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు? ఎస్పీ: స్వస్థలం వచ్చి కశ్మీర్. పాఠశాల విద్య అక్కడే సాగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ని జేఎన్టీయూలో పట్టభద్రుడిని అయ్యా ను. అమ్మ ఊర్మిళ గృహిణి. నాన్న రాకేశ్ వ్యా పారి. భార్య దివ్యాన్షి డాక్టర్. నాది 2017 ఐపీఎస్ బ్యాచ్. మొదటగా సిద్దిపేటలో శిక్షణ పూర్తి చేశాను. తర్వాత మంచిర్యాల ఏసీపీ, డీసీపీగా పెద్దపల్లి, రామగుండం డీసీపీగా, సిరిసిల్ల ఎస్పీగా పనిచేశాను. సాక్షి:జిల్లాలో మాదకద్రవ్యాలు, పేకాట నిర్మూ లనకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? ఎస్పీ: మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రత్యే క చర్యలు చేపడతాం. అసాంఘిక కార్యకలా పాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు. యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండా లి.విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తే స మాచారం అందించాలి. క్రైమ్ రేట్‌ను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. గుట్కా, మట్కా, పేకాటపై దృష్టి సారిస్తాం. సాక్షి: మీ ప్రాధాన్యత అంశాలు..? ఎస్పీ: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్ర త్యేక చర్యలు తీసుకుంటాం. నేరాలను అదుపులో ఉంచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తాం. అసాంఘిక కార్యకలాపాల కు తావు లేకుండా చూస్తాం. సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘాతో పాటు సంఘ విద్రోహ శక్తుల కట్టడికి కృషి చేస్తాం. రౌడీ షీటర్లపై నిఘాతో పాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపడతాం. సాక్షి: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎలాంటి చర్యలు చేపడతారు..? ఎస్పీ: విషయం నా దృష్టికి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు, అధికారులతో సమావేశం నిర్వహించి ప్రత్యేక చర్యలు చేపడతాం. అంతేకా కుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం.తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారి స్తాం. బ్లాక్స్పాట్లను గుర్తించి అవసరమైన చర్యలు చేపడతాం. సాక్షి: మహిళల భద్రత కోసం ఎలా ముందుకెళ్తారు..? ఎస్పీ: మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. షీటీంల ద్వారా మహిళలు, యు వతులు, విద్యార్థినులకు అవగాహన కల్పి స్తాం. అవసరమైతే అదనంగా బృందాలను ఏర్పాటు చేస్తాం. పోకిరీలు వేధిస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. నేరాల నియంత్రణకు పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేస్తాం. సాక్షి: జిల్లా కేంద్రంలో పలుచోట్ల సీసీ కెమెరా లు పనిచేయట్లేదు. దొంగతనాలు, ప్రమాదా లు జరిగిన సమయంలో గుర్తించలేని పరిస్థి తి ఉంది. ఎలాంటి చర్యలు చేపడతారు? ఎస్పీ: జిల్లాకేంద్రంలోని అన్ని చౌక్లు, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు పనిచేసేలా చూస్తాం. అవసరమైన వాటికి మరమ్మతులు చేయిస్తాం. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహద పడతాయి. ప్రజలు, వ్యాపారులు వీటి ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలి. సంఘటనలు జరిగినప్పుడు పోలీసు దర్యాప్తు సులువు అవ్వడంతో పాటు ఫుటేజీ ఆధారంగా ఉంటుంది. సాక్షి: మావోయిస్టుల కదలికలపై ఎలాంటి దృష్టి సారిస్తారు..? ఎస్పీ: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం అంతగా లేదు. అయినప్పటికీ వారి కదలికలపై చర్యలు చేపడతాం.అమాయక గిరిజన యు వత అటువైపు ఆకర్షితులు కాకుండా అవగా హన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడడంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం.బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ..నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయనకు పోలీసులు గౌ రవ వందనం చేశారు. ఇక్కడ ఎస్పీగా పనిచేసి కరీంనగర్ సీపీగా బదిలీపై వెళ్తున్న గౌస్ ఆలం నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయమన్నారు. ఇందులో అదనపు ఎస్పీ సురేంద్రరావు, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్‌రెడ్డి,నాగేందర్,హసీబుల్లా తదితరులున్నారు. -
పూలే దంపతులను భారతరత్నతో గౌరవించాలి
● మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే ఆదిలాబాద్‌రూరల్: సావిత్రిబాయి పూలే, మహాత్మ జ్యోతిబా పూలే దంపతులకు భారతరత్న ప్రకటించి గౌరవించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతిని జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మహిళా విద్య కోసం జ్యోతిరావు పూలే దంపతులు చేసిన కృషిని కొనియాడారు. ప్రభుత్వం వారి సేవలను గుర్తించి భారతరత్నతో గౌరవించాలన్నారు. ఇందులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న, కోశాధికారి సతీశ్ గురుణులే, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్‌రావు డోలే, మాలీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు అనిల్, శ్రీను ఆచారి, హరీశ్, భాస్కర్ నందిని, తదితరులున్నారు. -
‘స్పాట్’ రెమ్యూనరేషన్ చెల్లించాలి
ఆదిలాబాద్‌టౌన్: 2024లో నిర్వహించిన ఎస్సెస్సీ స్పాట్ వాల్యుయేషన్‌కు సంబంధించిన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) జిల్లా అధ్యక్షుడు రామగిరి శివకుమార్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో జిల్లా వి ద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రెమ్యూనరేషన్ చెల్లించని పక్షంలో ఈ సారి స్పాట్ విధులు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇందులో సంఘం ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి ఉన్నారు. -
‘మోడల్’ స్కూల్ టీచర్లపై వేటు
బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కు చెందిన ముగ్గురు టీచర్లపై వేటు పడింది. కాంట్రాక్ట్ ఒకేషనల్ ఉపాధ్యాయుడు అజయ్, అవర్లీ బెస్డ్ టీచర్లు జ్ఞానేశ్వర్, ఉమేష్ విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఫొటోలు వైరల్ కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో వారిని సర్వీస్ నుంచి తొలగిస్తూ శని వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఈ మోడల్ స్కూల్ విద్యార్థులను విజ్ఞాన యా త్రకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థినులతో ఈ ముగ్గురు ఉపాధ్యాయులు అనుచితంగా ప్రవర్తించినట్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విద్యార్థి సంఘాల నాయకులు డీఈవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ రాజర్షిషా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. విచారణ చేపట్టిన జిల్లా విద్యాశాఖాధికారి బాధ్యులైన ముగ్గురు ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.‘సీఎం ప్రజావాణి’ సద్వినియోగం చేసుకోండికై లాస్‌నగర్: సీఎం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం సిరికొండ, ఇచ్చోడ మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఆయా మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నిబంధనలు తూచ్..
● అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణ ● ప్రభుత్వానికి పన్ను చెల్లించని నిర్వాహకులు ● కార్మికులకు కరువైన వసతులు ● అయినా పట్టించుకోని అధికారులుఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఇటుక బట్టీల దందా జోరుగా సాగుతోంది. నిర్వాహకులు నిబంధనలు పాటించకున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటుక బట్టీ వ్యాపారం చేసే ముందు గ్రామపంచాయతీ, ఇండస్ట్రీయల్, మైనింగ్, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. అయితే జిల్లాలో ఏ వ్యాపారి కూడా ఈ అనుమతులు తీసుకోకుండా దందా నిర్వహిస్తుండడం గమనార్హం. వీరంతా రూ. లక్షల్లో ఆదాయం గడిస్తున్నా సర్కారుకు రూపాయి పన్ను చెల్లించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఇందులో పనిచేసే కార్మికులకు సైతం కనీస సౌకర్యాలు అందని పరిస్థితి. వారి పిల్లల బాల్యం సైతం బట్టిల్లోనే మగ్గుతోంది. చిరుప్రాయంలోనే ఆ పసి మొగ్గలు బాల కార్మికులుగా మారుతున్న దుస్థితి. కార్మికులకు సౌకర్యాలు కరువు జిల్లా వ్యాప్తంగా దాదాపు వందకు పైగా ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయి. అయితే నిర్వాహకులు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. మావల మండల కేంద్రం, బట్టిసావర్గాం, ఆదిలాబాద్ మండలంలోని యాపల్‌గూడ, అంకోలి, తంతోలి, బంగారుగూడ, తలమడుగు మండలంలోని కజ్జర్ల, ఉండం, తాంసి, భీంపూర్, ఇంద్రవెల్లి తదితర మండలాల్లో ఈ బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో పనిచేసేందుకు కార్మికులను జిల్లాతో పాటు మహా రాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి నిర్వాహకులు తీసుకొస్తున్నారు. ఊరికి దూరంగా, అటవీ ప్రాంతాలు, పంట పొలాల్లో బట్టీలను నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కార్మికులకు కనీస సౌకర్యాలు ఉండవు. చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి వేళలో విషకీటకాల బారిన పడిన ఘటనలు సైతం ఉన్నాయి. బట్టీల్లోనే బాల్యం.. వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికుల పిల్ల లు సైతం ఇటుక బట్టీల్లోనే పనులు చేస్తున్నారు. ని బంధనల ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలోపు వారు ఎ లాంటి పనులు చేయడానికి వీల్లేదు. అయితే ఏ బట్టీ వద్ద చూసినా బాలకార్మికులు దర్శనమిస్తుండడం గమనార్హం. బడిలో గడపాల్సిన బాల్యం బట్టీల్లో మగ్గుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. నోటీసులు జారీ చేస్తాం..నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు చేపడతాం. వ్యాపారులు సంబంధిత గ్రామపంచాయతీ, ఇండస్ట్రీయల్ అనుమతి పొందిన తర్వాత మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక సర్టిఫికెట్ జారీ చేస్తాం. పంచాయతీ శాఖ అధికారుల నుంచి ఏయే జీపీల్లో ఇటుక బట్టీలు ఉన్నాయో వివరాలు సేకరిస్తాం. – రవీందర్, మైనింగ్ ఏడీ, ఆదిలాబాద్ -
జిల్లాను ఎప్పటికీ మరిచిపోలేను
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లాను ఎప్పటికీ మరిచిపోలేనని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. కరీంనగర్ సీపీగా బదిలీపై వెళ్తున్న ఆయనకు జిల్లా పోలీ సు అధికారులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. గజమాలతో సత్కరించారు. ప్రత్యేకంగా అలంకరించిన జీపులో ఉన్న ఎస్పీ కుటుంబీకులపై పూల వర్షం కురిపించారు. అనంతరం పోలీస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హెడ్‌క్వార్టర్స్ వరకు తాడుతో లాగి తమ అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాను, ఇక్కడి సిబ్బందిని విడిచి వెళ్లడం బాధాకరమన్నారు. 14 నెలల పాటు చేసిన సేవలు, పోలీసులతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు జీవన్‌రెడ్డి, శ్రీనివాస్, నాగేందర్, హసీబుల్లా, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బదిలీ వీడ్కోలు సందర్భంగా ఎస్పీ గౌస్ ఆలం పూల వర్షం కురిపించిన పోలీస్ అధికారులు -
రాజీమార్గం రాజమార్గం
ఆదిలాబాద్‌టౌన్: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుని కక్షిదారులు ప్రశాంతమైన జీవనం గడపాలని జిల్లా మొదటి అదనపు జడ్జి శివరాం ప్రసాద్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీ కుదుర్చుకున్న పలు కేసులను పరిష్కరించి క్షకిదారులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, కక్షిదారులు ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దనే ఉద్దేశంతోనే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో రాజీపడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాల సమ్మతితో పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులపై ఎలాంటి భయం, ఒత్తిడి పెట్టబోమన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం కూడా ఉండదన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీపడే కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, జడ్జిలు ప్రమీళజైన్, కలిందే తులసి, దుర్గారాణి, హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా న్యాయమూర్తులకు సన్మానం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో మహిళా న్యాయమూర్తులను ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని, ప్రతి ఒక్కరూ వారికి సముచిత గౌరవం ఇవ్వాలని జడ్జి శివరాం ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, ఉద్యోగులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ● జడ్జి శివరాం ప్రసాద్ -
బదిలీపై వెళ్తున్న ఎస్పీకి సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: కరీంనగర్ సీపీగా బదిలీ పై వెళ్తున్న ఎస్పీ గౌస్ ఆలంను సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు శనివా రం మర్యాదపూర్వకంగా కలిశా రు. అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్పీని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా ప్ర జల సహకారం తనకు పూర్తిగా లభించిందని పేర్కొన్నారు. ఇందులో సమితి ప్రతి నిధులు సూ ర్యకాంత్, రవీందర్, సుభాష్, నర్సింలు, కిషన్‌రావు తదితరులున్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో... యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించారు. ఇందులో నాగరాజు రాకేశ్, ఫిరోజ్, జితేందర్, రవీందర్ తదితరులున్నారు. -
ఈఎస్ఐ ధీమా!
● ఆదిలాబాద్, మంచిర్యాలలో కొత్తగా డిస్పెన్సరీలు ● అందుబాటులోకి వైద్యం ● కార్మిక కుటుంబాలకు ఉచితంగా సేవలు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కుటుంబా లకు వైద్యం చేరువ చేసేందుకు ఈఎస్ఐ(కార్మి క రాజ్య బీమా సంస్థ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో రెండు డిస్పెన్సరీల ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తుండగా ఇందులో ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మల్ పట్టణం శాంతినగర్‌లో, మంచిర్యాల పట్టణం ఏసీసీ కాలనీలో ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఈఎస్ఐ ఆసుపత్రి ఉంది. నిర్మల్‌లో బీడీ కార్మికులకు ప్రత్యేకంగా మరొకటి ఉంది. ఉమ్మడి జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు, మట్టి, స్పిన్నింగ్, పేపర్ మిల్లు తదితర కార్మిక వర్గాలు ఎక్కువగా ఉన్న చోట్ల ఈఎస్ఐ ఆధ్వర్యంలో కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటయ్యాయి. ఈ డిస్పెన్సరీ, ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఖాళీలతో అరకొర వైద్యమే అందుతోంది. అంతేగాక సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే అసౌకర్యాల మధ్య సేవలందిస్తున్నాయి. ఇటీవల మంచిర్యాల కలెక్టరేట్ సమీపంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్మాణం కోసం భూమి కేటాయించారు. కొత్తగా ఆదిలాబాద్ పట్టణం, మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ఆవరణలో కొత్త డిస్పెన్సరీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో సేవలు మెరుగవుతాయనే ఆశలు నెలకొన్నాయి. ఈఎస్ఐ కార్డు ఉంటే.. ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు చాలీచాలని జీతాలతో తమ కుటుంబాల వైద్య ఖర్చులకే రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది. నెలకు రూ.21వేల లోపు వేతనం పొందుతున్న ప్రతీ కార్మికుడు లేదా ఉద్యోగి ఈఎస్ఐకి అర్హులు. దివ్యాంగ ఉద్యోగులైతే రూ.25వేల వరకు అవకాశం ఉంది. ఈఎస్ఐ కార్డుతో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకుని సిఫారసుతో హైదరా బాద్‌తోపాటు దేశంలో ఎక్కడైనా ఈఎస్ఐ పెద్ద ఆసుపత్రిల్లో ఖరీదైన వైద్యం సైతం ఉచితంగా పొందవచ్చు. అలాగే ఈఎస్ఐ చెల్లిస్తున్న కార్మి కులకు పని ప్రదేశాల్లో గాయపడిన, ఇతర ప్రమాదం ఏదైనా జరిగితే వేతనంతో కూడిన సెలవు, వైద్య ఖర్చులు పొందే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది ఈఎస్ఐని ఉపయోగించుకోవడం లేదు. ఇక కొన్ని సంస్థలు తమ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు కనీసం ఈఎస్ఐ కూడా చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులు తప్పనిసరిగా ప్రతీ నెలా ఈఎస్ఐ చెల్లించేలా చూసుకోవాల్సి న అవసరం ఉంది. అవగాహన లేక సేవలకు దూరం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఆయా రంగా ల్లో పని చేస్తున్నారు. ప్రైవేటు విద్య, వైద్యారో గ్య సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్ సిబ్బంది, రవాణా, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, హోటల్స్, రెస్టారెంట్స్, సినిమా థియేటర్లు, తదితర చోట్ల కనీ సం పది మంది పని చేసే చోట ఆయా యాజ మాన్యాలు ఈఎస్ఐ పరిధిలోకి రావాల్సి ఉంది. అయితే చాలా చోట్ల అమలు కావడం లేదు. దీంతో అనేక మంది కార్మికులు తమ కష్టార్జ్జితం వైద్యానికే వెచ్చించాల్సి వస్తోంది. అయితే చాలామంది ఈ సేవలు పూర్తి స్థాయిలో విని యోగించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో కార్మికులకు విస్తృతంగా ప్రచారం కల్పించి అర్హులు సేవలు పొందేలా చూడాల్సిన అవసరం ఉంది. -
290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జైనథ్ పోలీసులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. బోరజ్ మండల కేంద్రం జాతీయ రహదారి–44పై బస్టాండ్ వద్ద ఓ లారీని తనిఖీ చేయగా అందులో 290 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని బాలగట్కు తరలిస్తున్నట్లు జైనథ్ సీఐ డి.సాయినాథ్ తెలిపారు. పట్టుకున్న బియ్యం విలువ సుమారు రూ.16 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. సంఘటన స్థలానికి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి చేరుకుని వివరాలను అడిగి తెలుకున్నారు. అక్రమంగా బియ్యం, ఇసుక రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. లారీడ్రైవర్ తాహిర్‌ను అదుపులో తీసుకుని, ఆయనతోపాటు లారీ యజమాని ఎండీ.నజీమ్, బియ్యం సరఫరా చేస్తున్న నిందితులు నాగనాథ్, షఫీలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. జైనథ్ ఎస్సై పురుషోత్తం, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
● కరీంనగర్ సీపీగా స్థానచలనం ● నూతన ఎస్పీగా అఖిల్ మహాజన్
ఎస్పీ గౌస్ ఆలం బదిలీఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా అఖిల్ మహజన్ జిల్లాకు బదిలీపై రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేస్తున్న గౌస్ ఆలం 2024 జనవరి 4న జిల్లాకు వచ్చారు. ఈయన గతంలో ములుగు ఎస్పీగా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. జిల్లాలో 14 నెలల పాటు విధులు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించిన క్రమంలో ఎన్నికల సంఘం నుంచి ప్రశంసలు పొందారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యా ల నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. పేదలకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చూశారు. పక్కనున్న మహారాష్ట్ర నుంచి దేశీదారు సరఫరా కాకుండా చర్యలు చేపట్టారు. ఈయన పనిచేసినకాలంలో 1200 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. అలాగే మట్కా, గుట్కా నిర్మూలనకు చర్యలు తీసుకున్నా రు. ఏజెన్సీప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించారు. జైనూర్ ఘటన నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా గతనెల 6న ఎస్పీ వివాహం జరిగింది. జిల్లాలో పనిచేసిన కాలంలో మంచి గుర్తింపు పొందారు. జిల్లాకు అఖిల్ మహాజన్ రాక.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీపై రానున్నా రు. 2017 బ్యాచ్‌కు చెందిన ఈయన ఇదివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మంచిర్యాల డీసీపీగా పనిచేశారు. అఖిల్ మహాజన్ జమ్మూ కశ్మీ ర్కు చెందినవారు. హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) నుంచి పట్టభద్రులయ్యారు. కాగా ఈయన సిద్దిపేటలో శిక్షణ పొందగా, మంచిర్యాలలో ఏసీపీగా, తర్వాత రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లిలలో డీసీపీగా పనిచేశారు. -
ఆమె లేకపోతే సృష్టి లేదు
ఆదిలాబాద్: మహిళ తన జీవితంలో కుటుంబం నుంచి మొదలుకొని సమాజం వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. ఆడపిల్ల పుట్టుకనే కాదనుకుంటున్న ప్రస్తుత సొసైటీలో వారి ఉనికిని వారే చాటుకుంటూ, ఆడపిల్లల భాగస్వామ్యం సమాజానికి ఎంత అవసరమో అనే విషయాన్ని చాటి చెబుతున్నారు. మహిళలను చిన్నచూపు చూస్తున్న వ్యవస్థలో ఆమె లేకపోతే సృష్టి లేదనే విషయాన్ని మరిచిపోతుండడం శోచనీయం. నవమాసాలు కడుపులో పిండాన్ని మోసి, ఒక జీవానికి ప్రాణం పోస్తున్న అమ్మతనం ప్రతీ సీ్త్రలో ఉంటుంది. సమాజ పురోగతిలో వారి పాత్ర ఎనలేనిది. అటువంటి అతివను గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిది. – కళ్లెం జీవిత వెంకట్‌రెడ్డి, గైనకాలజిస్ట్, ఆదిలాబాద్ -
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అతివలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. పురుషులకు సమానంగా సత్తా చాటుతున్నారు. క్రీడా, విద్య, స్వయం ఉపాధి, తదితర రంగాల్లో ప్రతిభ కనబర్చి శెభాశ్ అనిపించుకుంటున్నారు ఉమ్మడి జిల్లాలోని పలువురు నారీమణులు. కొందరు పలువురికి ఉపాధి చూపుతున్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. చెన్నూర్‌రూరల్: గతంలో సర్పంచ్‌గా పని చేసింది. ఆ పదవీ కాలం పూర్తి కాగానే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది. మండలంలోని అంగ్రాజ్పల్లికి చెందిన చెవ్వ సువర్ణ. తాండూరు మండలం తంగళ్లపల్లికి చెందిన ఈమెకు చెన్నూర్ మండలం అంగ్రాజ్పల్లికి చెందిన చెవ్వ శ్రీనివాస్‌తో 2003లో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. అప్పటికే బీఎస్సీ ఫస్టియర్ చదివింది. మూడేళ్లలో పూర్తి చేయాల్సిన డిగ్రీ.. పిల్లల ఆలపాలన చూసుకుంటూ ఐదేళ్లు పట్టింది. 2010లో ఎంఎస్సీ, 2012లో బీఈడీ పూర్తి చేసింది. 2013లో సర్పంచ్‌కు బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో గ్రామస్తుల కోరిక మేరకు స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందింది. ఐదేళ్లవరకు ప్రజలకు సేవలందించింది. 2019లో చెన్నూర్‌లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో గణిత టీచర్‌గా ఎంపికై విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. భర్త ప్రోత్సాహంతో సాధ్యమైందని అంటోంది. స్విట్జర్లాండ్‌లో సాఫ్ట్వేర్ జాబ్ కోటపల్లి: మా స్వగ్రామం కోటపల్లి. మే ము నలుగురు అక్కాచెల్లెళ్లు. తల్లిదండ్రులు బాగా చదివించారు. అందరూ వివిధ రంగాల్లో స్థిరపడ్డాం. తాను స్విట్టర్లాండ్‌లో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యో గం చేస్తున్నా. ఏటా రెండు నెలలు అమ్మానాన్నలను స్విట్టర్లాండ్కు తీసుకెళ్తున్నా. – లక్ష్మీప్రసన్నతల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే.. ఖానాపూర్: మా తల్లిదండ్రులు రవి–లావణ్య. మేము చిన్న వయస్సులో ఉన్నప్పటి నుంచి వడ్రంగి వృత్తి చేస్తూ కష్టపడి చదివించారు. మేం ఇద్దరు కూతుళ్లు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఉద్యోగా లు సాధించారు. ఒకరు ఎస్జీటీ టీచర్‌గా పెంబి మండలం నాగాపూర్‌లో, మ రొ కరు నిర్మల్ మున్సిపాల్టీలో వార్డు ఆఫీసర్‌గా పనిచేస్తోంది. – రక్షిత–మాధురి ఒక్క బిడ్డ చాలనుకున్నం నిర్మల్: ‘ఆడబిడ్డయితే ఏంటి.. తను వారసురాలే కదా. తనకు ఉత్తమ చదువును, ఉన్నత జీవితాన్ని ఇవ్వాలనుకున్నాం. అందుకే మాకు ఒక్కబిడ్డనే చాలనుకున్నాం..’అంటున్నారు నిర్మల్ జిల్లాకేంద్రంలోని ఆదర్శనగర్‌కు చెందిన తిరుపతి సుస్మిత, ప్రమోద్‌రావు దంపతులు. ఎవరెన్ని ఒత్తిళ్లు పెట్టినావారు అనుకున్నట్లుగానే ఒక్కబిడ్డకే జన్మనిచ్చారు. తన ఆకాంక్షలకు తగ్గట్లుగానే చదివించారు. తల్లిదండ్రుల ఆశయాలను ఆకళింపు చేసుకున్న ఆ బిడ్డ శరదితన్వి తనకంటూ గుర్తింపును తెచ్చుకుంటోంది. స్థానిక దీక్ష జూనియర్ కళాశాల కరస్పాండెంట్‌గా చేస్తున్న ప్రమోద్‌రావు ముందు నుంచి కొంత సామాజిక స్పృహతో ఆలోచిస్తుంటారు. శరదితన్వి ప్రస్తుతం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఆక్సెంచర్లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా చేస్తోంది. తండ్రిలాగే సామాజికస్పృహతో తన స్థాయిలో సేవలందిస్తోంది. స్వ‘శక్తి’తో ముందుకు.. ఆదిలాబాద్: ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న మహిళ ప్రైవేట్ ఉద్యోగానికి మొగ్గు చూపింది జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి కాలనీకి చెందిన ముదిగొండ కల్పన. ఇంటర్ తర్వాత వివాహం కాగా, అటు కుటుంబ బాధ్యతలు మోస్తూనే 2007లో డిగ్రీ పూర్తి చేసింది. భర్త ప్రోత్సాహంతో 2010లో జిరాక్స్, ఆన్లైన్ సెంటర్, బుక్‌స్టాల్ ప్రారంభించింది. టైలరింగ్ చేస్తోంది. ఇటీవల బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ తీసుకుంటుంది. ఓ వైపు ఇంటిని చక్కదిద్దుతూనే బుక్‌సెంటర్ నడుపుతోంది. కుమారుడు, కుమార్తెలను చదివించి ప్రయోజకులుగా చేయాలనే తనవంతుగా శ్రమిస్తోంది.ఆడబిడ్డపై ఆలోచన మారాలి నిర్మల్:‘ఆడబిడ్డయినా.. మగబిడ్డయినా ఒకటే. ఒ కప్పుడు మగపిల్లాడుంటే చాలు అనుకునేది. కా నీ.. ఈరోజుల్లో ఎవరైనా మంచి చదువు, ఉ ద్యో గం ఉంటేనే విలువ. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీ ల నుంచి మొదలు పెళ్లి సంబంధాల దాకా ఆడ, మగ అనే తేడాలు చూడటం లేదు. వారి చదువు, హోదా, సంస్కారాన్ని గుర్తిస్తున్నారు. అందుకే మాకు ఒక్క ఆడబిడ్డనే అని ఏరోజూ ఆలోచించలేదు..’అని చెబుతున్నారు నిర్మల్‌కు చెందిన వైద్యదంపతులు చిటికేశి రంజిత, సంతోష్‌రాజ్. తమ బిడ్డ ఇషితారాజ్ ఎంత చదివితే అంత చదివిస్తామంటున్నారు. ప్రస్తుతం తాను ఎంబీబీఎస్ చదువుతోంది. అమ్మ గైనకాలజిస్ట్, నాన్న పీడియాట్రిక్ వైద్యుడు.వీరిద్దరూ బిడ్డకు గైడ్ చేస్తున్నామే తప్పా .. ఇది చదువు, అది చేయు అని చెప్పడం లేదంటున్నారు. అన్నిరంగాల్లో సీ్త్ర, పురుషులు సమానంగా పనిచేస్తున్నారని, ఇకపై ఆడ,మగ అనే ఆలోచనను మానుకోవాల్సిందేనని అంటున్నారు.చిన్నచూపు పోవాలి ఆసిఫాబాద్‌అర్బన్: మా స్వగ్రామం మంచిర్యాల. నాన్న ఓ సంస్థలో చిరుద్యోగి. ఇద్దరం ఆడపిల్లలం అయినా ఎవరిపైనా ఆధారపడొద్దని ఉన్నత చదువులు చదివించారు. నేను ప్రస్తుతం ఆసిఫాబాద్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్(ఏటీవో)గా పనిచేస్తుండగా, మా చెల్లెలు ప్రభుత్వ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. నాకు ముగ్గురు, మా చెల్లికి ఇద్దరు ఆడపిల్లలే. వారిని అన్నిరంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతాం. చదువుతోనే భవిష్యత్తు బాగుంటుంది. ప్రతీ మహిళా చట్టాలపై అవగాహన ఉండాలి. సమాజంలో మహిళలనే చిన్నచూపు పోవాలి.– భానుమతి గోమాస, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్వైద్య వృత్తిని వదిలి.. ప్రజాసేవకు కదిలి బోథ్: ఎంబీబీఎస్ పూర్తి చేసి.. వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవకు కదిలారు బోథ్‌కు చెందిన డాక్టర్ సంధ్యారాణి. జెడ్పీటీసీగా గెలుపొంది మహిళా శక్తిని నిరూపించారు. బోథ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించా రు. జెడ్పీ సమావేశాల్లో తనగొంతు విని పించారు. ఆమె వైద్యురాలు కావడంతో బోథ్ ఆసుపత్రిని అభివృద్ధి పర్చే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి రూ.10 కోట్ల నిధులు తేవడంలో కృషిచేశారు. మాజీ జెడ్పీటీసీగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది. – డా.సంధ్యారాణి, మాజీ జెడ్పీటీసీ, బోథ్ఇతరులపై ఆధారపడకుండా.. ఆసిఫాబాద్‌అర్బన్: ఇతరులపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడాలని నిర్ణయించుకున్నా. ఇంటి వద్దే 20 ఏళ్ల క్రితమే టిఫిన్స్ సెంటర్ ప్రారంభించా. ప్రస్తుతం ఇంటి వద్ద 15 మంది ఉపాధి కల్పిస్తూ.. వ్యాపారం విజయవంతంగా కొనసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరా క్యాంటీన్‌ను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రారంభించాం. అక్కడ కూడా మరో ఐదుగురు ఉపాధి పొందుతున్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలి. – మార స్వరూప, మహిళా సమాఖ్య సంఘం సభ్యురాలు, ఆసిఫాబాద్ ●తేడా ఉండొద్దు ఆసిఫాబాద్‌రూరల్: మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా సమాజంలో అందరం ఒక్కటే అనే భావన రావాలి. కొంతమంది తల్లిదండ్రులు కుమార్తె కంటే కుమారుడినే ఎక్కువ ఇష్టపడుతారు. అలా సంతానాన్ని సమానంగా చూడాలి. వారి నిర్ణయాలకు విలువ ఇవ్వాలి. – శ్రీదేవి, బీజెడ్సీ సెకండియర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆసిఫాబాద్ కఠిన చట్టాలు రావాలి ఆసిఫాబాద్‌రూరల్: మహిళలకు కొన్నిచోట్ల రక్షణ లేకుండా పోయింది. యువతులు, మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయాయి. తప్పుచేసిన వారికి కఠిన శిక్షలు లేకపోవడంతో రెచ్చిపోతున్నారు. సమాజంలో మహిళల రక్షణకు కఠిన చట్టాలు రావాలి. – అశ్విని, ఎంపీసీఎస్ ఫైనలియర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆసిఫాబాద్ మహిళలకు అవకాశాలు పెరిగాయి భైంసాటౌన్: నేటి కాలంలో మహిళలకు అవకాశాలు పెరిగాయి. ఏ రంగంలోనైనా వివక్ష ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది. పెరుగుతున్న ఖర్చులకు ఇంట్లో భార్యాభర్తలిద్దరూ పనిచేస్తేనే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. రాజకీయాల్లో మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి. – సిరం సుష్మారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షురాలు, భైంసా -
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్‌లోని డిగ్రీ కళాశాలలో శుక్రవారం మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అథితిగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా హాజరై విద్యార్థినులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శతాబ్దాలుగా సంస్కృతి, సంప్రదాయాలు మహిళలను ఆరాదిస్తూ గౌరవిస్తున్నాయని పేర్కొన్నారు. పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. చదువును డిగ్రీతో ఆపేయకుండా కొనసాగించాలన్నారు. భవిష్యత్తులో వారియర్లుగా దైర్య సాహసాలు ప్రదర్శించాలన్నారు. గతంలో త్యాగాలు చేసిన మహిళలకు శిరస్సు వంచి సమస్కరిస్తున్నానని పీవో పేర్కొన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ అభినవ్, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
హెచ్ఎం ఆలస్యంగా వస్తున్నారని..
● ఆయన వాహనాన్ని అడ్డుకున్న విద్యార్థులు ● ధన్నూర్(బి) జెడ్పీ సెకండరీ పాఠశాలలో ఘటన బోథ్: పాఠశాలకు హెచ్ఎం తరచూ ఆలస్యంగా వస్తున్నారని, హాల్‌టికెట్లు ఇవ్వమని భయపెడుతున్నారని విద్యార్థులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. మండలంలోని ధన్నూర్(బి) జెడ్పీ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెచ్ఎం రాజు చోప్డే వాహనాన్ని పాఠశాల గేటు వద్ద శుక్రవారం ఉదయం అడ్డుకున్నారు. పదో తరగతి గది బయట విద్యార్థులు భైఠాయించారు. హెచ్ఎం ప్రతీరోజు పాఠశాలకు ఆలస్యంగా రావడం సరికాదన్నారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలన్నారు. కాగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి తరచూ పాఠశాలకు వస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఆ వ్యక్తి పాఠశాలకు మద్యం తాగి వచ్చి హంగామా చేయడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఉండటంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వారితో మాట్లాడారు. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మహమూద్, ఎంపీడీవో రమేశ్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. -
● ఇళ్లలో స్వేచ్ఛ లభిస్తోంది.. ● బయట అనుమానపు చూపులే ● తెలియని వారితోనే సమస్యలు ● మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సర్వే
మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలటౌన్/చెన్నూర్/నిర్మల్/వాంకిడి/బోథ్/ఆసిఫాబాద్‌రూరల్: మహిళలు, యువతులు, విద్యార్థినులు అవకాశాల ను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాల్లో రాణిస్తున్నా రు. పురుషులకు దీటుగా పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ స మాజంలో అక్కడక్కడ మహిళలపై చిన్నచూపు ఉండడం వల్ల అనేక అవకాశాలకు దూరమవుతున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులు, ఆధిపత్య ధోరణులు మహిళలకు ప్రతిబంధకంగా మారుతున్నా యి. ఎక్కడ.. ఎవరితో వివక్షకు గురవుతున్నారనే అంశాలపై ‘సాక్షి’ మంచిర్యాలలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థినులు, యువతులు, మ హిళలు 350మంది నుంచి సర్వే ద్వారా వివరాలు సేకరించింది. తెలియని వారు, ఆకతాయిలతో ఇక్కట్లు పడుతున్నట్లు తేల్చిచెప్పారు. బస్టాప్‌ల్లో అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వె ల్లడైంది. ఇళ్లలో ఆడ, మగ అనే వివక్ష లేదని, అభిప్రాయాలకు గౌరవం లభిస్తోందని స్పష్టమైంది. -
బస్టాప్‌ల్లో ఇబ్బందే..!
చెప్పలేను 59ఉంది 87మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశంలేదు 204సెల్ఫోన్లో వచ్చే మెస్సేజ్‌లతో 72మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరుమీ కాలేజీ, పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..తెలియని వారు 204తెలిసిన వారే.. 146బస్టాప్‌లో 204కాలేజీ లేదా ఆఫీసులో 74 -
ఆ ఆడపడుచుల కొత్త ఆనవాయితీ
ఇచ్చోడ: ఆ ఊరి అమ్మాయి వివాహానికి గ్రామంలోని అన్ని కుటుంబాలకు చెందిన పెళ్లయిన ఆడపడుచులు కానుకలు సమర్పించడం ఆనవాయి తీ. ఇందులో భాగంగా స్టీల్, ఇత్తడి సామగ్రి అందించేవారు. అయితే వీటితో ఎక్కువగా ఉపయో గం ఉండడం లేదు. అలాగే పెళ్లి ఖర్చులు కూడా పెరిగిన నేపథ్యంలో ఆ వధువు తల్లిదండ్రులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్న ఆ ఆడపడుచులు కానుకలకు బదులు నగదు అందజేయాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని కుల పెద్దలకు వివరించగా వారు సైతం ఒప్పుకున్నారు. దీంతో నూతన ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు నేరడిగొండ మండలం తర్నం పంచాయతీ పరిధి అనుబంధ గ్రామమైన మంగల్మోట్కు చెందిన ఆడపడుచులు. గ్రామంలో ఈ నెల 3న పెందూర్ వసంత వివాహం జరిగింది. గ్రామానికి చెందిన పెళ్లయిన ఆడపడుచులంతా కలిసి సుమారు 60 మంది వరకు రూ.12వేల నగదు జమ చేసి అందజేశారు. వీరు తీసుకున్న నిర్ణయంపై ఆదివాసీ పెద్దలు హర్షం వ్యక్తం చేశా రు. సంప్రదాయాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. -
పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అప్పగింత
ఇచ్చోడ: మండల కేంద్రంలోని ఎస్బీఐ సిరిచెల్మ ఎక్స్‌రోడ్డు బ్రాంచిలో బంగారు ఆభరణాలు పో గొట్టుకున్న వ్యక్తికి మేనేజర్ సునీల్ మనోహర్ శుక్రవారం అప్పగించారు. వి వరాలు ఇలా ఉన్నాయి.. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన అనిల్ మండల కేంద్రంలో ముత్తుట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన తులం బంగారాన్ని డబ్బులు కట్టి విడిపించుకున్నాడు. అక్కడి నుంచి మరో పనిమీద సిరిచెల్మ ఎక్స్‌రోడ్డులో ఎస్బీఐ బ్రాంచికి వె ళ్లాడు. చెక్కు రాస్తుండగా క వరులో ఉన్న బంగారం నగలు కౌంటర్ వద్ద మరిచి బయట కు వెళ్లిపోయాడు. కౌ ంటర్ వద్ద కేశవపట్నానికి కలీం గ మనించి బ్రాంచి మేనేజర్‌కు అందించాడు. బంగారు నగలు పోగొట్టుకున్న సదరు వ్యక్తి మేనేజర్‌ను సంప్రదించాడు. బంగారం నగలను అప్పగించారు. -
‘పువ్వు’ను ఉపాధిగా మలిచి
ఆమె అడుగు ప్రగతి బాటన పడింది. సంఘటితమై ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతోంది. ప్రకృతి నీడన స్వశక్తితో ఎదుగుతున్న వారు కొందరైతే.. సామాజిక బాధ్యతగా అండగా నిలుస్తున్న వారు ఇంకొందరు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఏజెన్సీకే పరిమితమైన ఆదివాసీ మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ● ఉట్నూర్, ఖైర్డాట్వాలో ఇప్ప లడ్డూ తయారీ కేంద్రాలుఖైర్డాట్వాలో.. నార్నూర్: మండలంలోని ఖైర్డాట్వా గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలు 12మంది ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. మండల సమాఖ్య సహకారంతో రూ.3.50 లక్షలు రుణం తీసుకుని గ్రామంలోనే ఇప్పపువ్వు లడ్డూ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫిబ్రవరి 4న కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రస్తుతం నెలకు 60వేల లడ్డూలను తయారు చేస్తున్నారు. వీటిని స్వయంగా వీరే మార్కెటింగ్ చేస్తున్నారు. నార్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ తదితర ప్రాంతాల్లో ఉన్న బేకరీలు, స్వీట్ హౌస్‌ల్లో రూ.300 నుంచి రూ.350 కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఇవి రక్తహీనత నివారణకు దోహదపడుతుండడంతో ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నా రు. అన్ని ఖర్చులు పోనూ గత నెలలో రూ.40వేల వరకు ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతఇంద్రవెల్లి: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. మండలకేంద్రంలోని ఇంద్రా యి మహిళా సమాఖ్య కార్యాలయంలో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ బిస్కెట్ తయారీ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందన్నా రు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని మహిళలు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. ఇందులో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీ ఆర్డీవో రాథోడ్ రవీందర్, రాష్ట్ర మహిళా కమి షన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి, ఇంద్రవెల్లి ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, తహసీ ల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భాస్కర్, ఏపీఎం రామారావ్ తదితరులున్నారు.ఖైర్డాట్వా గ్రామంలో లడ్డ్డూ తయారు చేస్తున్న ఆదివాసీ గిరిజన మహిళలుఉపాధి మార్గం దొరికింది.. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలని మేమంతా ఓ గ్రూపుగా ఏర్పడ్డాం. ఇప్పపువ్వు లడ్డూ తయారీని ఎంచుకున్నాం. ఐటీడీఏ సహకారంతో సామగ్రి కొనుగోలు చేసి యూనిట్ ప్రారంభించాం. ఇందులో పోషకవిలువలు ఎక్కువగా ఉండడంతో అధికారులు వీటిని గుర్తించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, చిన్నారులతో పాటు వసతిగృహ విద్యార్థులకు అందిస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.15వేల నుంచి రూ.20 వేలకు మిగులుతున్నాయి. – కుమ్రబాయి, ఆదివాసీ భీంబాయి సంఘం అధ్యక్షురాలు ఆదాయం పెరుగుతుంది గ్రామానికి చెందిన 12 మంది మహిళలం కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడ్డాం. మండల సమాఖ్య ద్వారా రూ.3.50 లక్షలు రుణం తీసుకున్నాం. ఇప్పపువ్వు లడ్డూల తయారీకి శ్రీకారం చుట్టాం. నెల రోజుల్లోనే 60వేల లడ్డూలు తయారు చేశాం. మార్కెటింగ్ కూడా మేమే చేసుకుంటున్నాం. అన్ని ఖర్చులు పోనూ ప్రస్తుతం నెలకు రూ.40వేల వరకు ఆదాయం వస్తుంది. మున్ముందు మరింత పెరగనుంది. – ఆత్రం కౌసల్యబాయి, గ్రూప్ అధ్యక్షురాలు, ఖైర్డాట్వా వారంతా అడవి తల్లి ఒడిలో సేదతీరే గిరిజనులు. సంఘంగా ఏర్పడి ప్రభుత్వ చేయూతతో ముందడుగు వేశారు. ప్రకృతి ప్రసాదించే ఇప్పపువ్వునే ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. వారే ఉట్నూర్, నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వాకు చెందిన ఆదివాసీ మహిళలు. ఉట్నూర్‌రూరల్: ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీ మహిళలు సంఘటితమై స్వశక్తితో ఎదగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉట్నూర్‌కు చెందిన 12 మంది భీంబాయి సంఘంగా ఏర్పడ్డారు. నాటి కాలంలో ఆదివాసీ లు రక్తహీనత నివారణకు ప్రకృతి ప్రసాదించిన ఇప్పపువ్వుతో చేసిన లడ్డూలను తినేవారని గుర్తించి వాటి తయారీకి పూనుకున్నారు. విషయాన్ని ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లడ్డూల తయారీతో కలిగే ప్రయోజనాలను గుర్తించిన అప్పటి కలెక్టర్ దివ్యా దేవరాజన్, పీవో ప్రత్యేక చొరవ చూపారు. వీటిని గర్భిణులు, పిల్లలకు అందించాలనే ఆలోచనతో ముందుకెళ్లారు. ఐటీడీఏ సహకారంతో రూ.14 లక్షలతో 2019లో తయారీ యూనిట్ ప్రారంభించారు. అప్పటి నుంచి లడ్డూలు తయారు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు ఈ సంఘం సభ్యులు. ఆర్డర్ ప్రకా రం జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు సరఫరా చేస్తూ ఉపాధి పొందుతున్నారు. -
పల్లె నుంచి ఢిల్లీ వరకు.. సుశీల
బోథ్: మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామమైన బాబెరకు చెందిన ఆత్రం సుశీల గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేసుకునేలా గ్రామస్తులను ప్రోత్సహించారు. ప్రతీ ఇంట్లో మొక్కలు నాటించే ప్రయత్నం చేశారు. అలాగే ఆదివాసీ గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈమె సేవలకు గుర్తింపుగా 2020లో అప్పటి గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా స్వచ్ఛ అవార్డు అందుకున్నారు. అలాగే 2022లో ఢిల్లీలో నిర్వహించిన ఆదివాసీల వర్క్‌షాప్‌నకు హాజరయ్యారు. మారుమూల గ్రామంలో పుట్టిన ఆదివాసీ మహిళ ఇలా ఉన్నతస్థాయికి ఎదిగారు. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. -
అక్రమంగా ఇంటినంబర్లిస్తే కఠిన చర్యలు
● బల్దియా సమీక్షలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కై లాస్‌నగర్: మున్సిపల్ పరిధిలో అక్రమంగా ఇంటినంబర్లు జారీ చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. ము న్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సి పల్ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్, శానిటేషన్, మెప్మా, టౌన్‌ప్లానింగ్ విభాగాల వారీగా సమీక్షించిన ఆయన అందులోని అక్రమాలను ప్రస్తావిస్తూ అధికారుల తీ రుపై మండిపడ్డారు. అక్రమంగా ఇంటి నంబర్లు జా రీ చేయడంతోనే కబ్జాదారులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని, అడ్డుకుంటే కోర్టుకు వెళ్లి రూ.కోట్ల విలు వైన భూములు బల్దియాకు దక్కకుండా చేస్తున్నారన్నారు. బాధ్యులైన వారిని సస్పెండ్ చేయించేదాకా వదలమని హెచ్చరించారు. పట్టణంలో ఆక్రమణల ను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబ ర్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అ లాగే ఇంటి అనుమతుల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా సకాలంలో జారీ చేయాలన్నా రు. బయోమైనింగ్ కాంట్రాక్టర్‌కు ఎలాంటి పర్యవేక్షణ లేకుండా రూ.1.5కోట్లు ఎలా చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లీచింగ్ పౌడర్, డీజిల్ బిల్లుల్లో అనేక అక్రమాలు జరిగినట్లుగా తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని, అయితే ఈ సమావేశంలో వాటిని ప్రస్తావించడం లేదన్నారు. ఇప్పటికై నా సదరు అధి కారులు తమ వైఖరి మార్చుకోవాలన్నారు. నిధుల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేదని మండిపడ్డా రు. వార్డు ప్రత్యేకాధికారులు, ఇంజినీరింగ్ అధికా రులు సంయుక్తంగా ప్రతీ వార్డులో క్షేత్రస్థాయిలో జియోట్యాగింగ్ ద్వారా నీటి ఎద్దడిని పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక అందజేయాలన్నారు.షెల్టర్ హోంల నిర్వహణ పేరిట అక్రమంగా బిల్లులు తీసుకుంటున్నారని మెప్మా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, ఈఈ పెరిరాజు, డీఈలు తిరుపతి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
మరిన్ని ఎస్‌హెచ్‌జీలు
కై లాస్‌నగర్: తెల్లరేషన్ కార్డు కలిగి 18 ఏళ్లు నిండిన వివాహితులందరినీ స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) సభ్యులుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కొత్తగా 115 సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి గత నెల 24వ తేదీన ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా కసరత్తు చేపట్టిన మెప్మా సిబ్బంది స్వయం సహా యక సంఘాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన శ్రమిస్తున్నారు. వార్డుస్థాయిలోని మహిళలతో ప్రత్యేక సమావేఽశాలు నిర్వహిస్తూ ఎస్‌హెచ్‌జీల్లో చేరితే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఇప్పటివరకు కొత్తగా 69 సంఘాలు ఏర్పాటు చేయించారు. ఈ నెలాఖరునాటికి లక్ష్యాన్ని చేరుకునేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నుంచి మ హిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తోంది. స్వ యం సహాయాక సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి ద్వారా రుణాలు అందజేస్తూ వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు వివిధ రకాల 13 అంశాల్లో వారు స్వయం ఉపాధిని పొందడంతో పాటు ఆర్థికంగా ముందుకు సాగేలా ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద రూ.20 లక్షల నుంచి రూ.5కోట్ల వరకు రుణాలు ఇస్తూ వ్యాపారంలోనూ ముందుకు సాగేలా ప్రోత్సహిస్తోంది. ఇంతలా ప్రోత్సాహం అందిస్తున్నా ఇప్పటికీ అనేక మంది మహిళలు సంఘాల్లో లేనట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ ప్రయోజనాలకు దూరంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించాలని భావించి వారినీ ఎస్‌హెచ్‌జీల్లో సభ్యులుగా చేర్చాలని సంకల్పించింది. ఆ దిశగా మెప్మా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. కొత్త సంఘాల లక్ష్యం 115 ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని తెల్ల రేషన్‌కార్డులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్తగా 115 ఎస్‌హెచ్‌జీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. 18 ఏళ్లు దాటిన, పెళ్లి చేసుకుని కొత్తగా మెట్టినింటికి వచ్చిన మహిళలను సంఘంలో నమోదు చేయించాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన మెప్మా సిబ్బంది లక్ష్యాన్ని సాధించేదిశగా ముందుకు సాగుతున్నారు. ప్రతీ సీవో పరిధిలోని రిసోర్స్పర్సన్లు తమమ వార్డుల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల కు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం.. కల్పి స్తున్న రాయితీలు, భీమా సౌకర్యం తదితర ప్ర యోజనాలను వారికి వివరిస్తూ సంఘంలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే జిల్లాలో కొత్తగా 69 సంఘాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సంఘంలో 10 మంది మహిళలను సభ్యులుగా నమోదు చేయిస్తున్నారు. ఇలా 690 మంది మహిళలను కొత్తగా సంఘాల్లో సభ్యులుగా చే ర్పించారు. ఇంకా 46 సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా లక్ష్యాన్ని సాధించేలా ముందుకు సాగుతున్నారు. సంఘాల్లో చేరిన మహిళల ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్నారు. పొదుపు చేయడం రుణాలు పొందే విధానంపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే కలిగే ప్రయోజనాల గురించి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఏర్పాటుకు ఆదేశించిన ప్రభుత్వం ఆదిలాబాద్ బల్దియా లక్ష్యం.. 115 ఇప్పటికే 69 సంఘాల ఏర్పాటు లక్ష్యసాధన దిశగా మెప్మా సిబ్బంది ఈ నెలాఖరు వరకే గడువు విధింపు ఆదిలాబాద్‌లోని వార్డులు : 49 తెల్ల రేషన్‌కార్డులు : 29,346 ప్రస్తుత ఎస్‌హెచ్‌జీలు : 2,567 సంఘాల్లోని సభ్యులు : 26,042 గడువులోపు లక్ష్యం సాధిస్తాం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలందరినీ సంఘాల్లోకి తీసుకురావాలని, తద్వారా కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపాలిటీకి లక్ష్యాన్ని నిర్దేశించింది. సీవోలు తమ పరిధిలోని రిసోర్స్ పర్సన్లతో వార్డుల వారీగా మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంఘాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఆరు నెలలు సక్రమంగా పొదుపు చేసే సంఘాలు రూ.5లక్షల రుణం పొందవచ్చు. రుణ మొత్తాన్ని సకాలంలో చెల్లిస్తే రూ.10లక్షల వరకూ రుణం ఇస్తారు. ఈ అవకాఽశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. మార్చి నెలాఖరునాటికి లక్ష్యాన్ని సాధిస్తాం. – శ్రీనివాస్, మెప్మా డీఎంసీ, ఆదిలాబాద్ -
అభివృద్ధికి నిధులు కేటాయించండి
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుఉట్నూర్రూరల్: అభివృద్ధి పనులకు నిధులు కేటా యించాలని తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి శరత్‌కు ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గురువారం ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని నూతన ఐటీడీఏ భవన నిర్మాణానికి రూ.15 కోట్లు, నూతన స్టడీ సర్కిల్ నిర్మాణానికి రూ.2 కోట్లు, రాజ్‌గోండు సేవా సమితి గుస్సాడీ గుట్ట వద్ద నూతన భవన నిర్మాణానికి రూ.కోటి, ఉట్నూర్ నుంచి కొమ్ముగూడ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. -
‘మా భూములు మాకివ్వాలి’
ఆదిలాబాద్: సీసీఐ కోసం సేకరించిన భూములను తిరిగి తమకు అప్పగించాలని సీసీఐ భూనిర్వాసితుల సంఘం నాయకుడు అరవింద్ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన గురువారం సంఘం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీసీఐ పరిశ్రమ ఏర్పాటు సమయంలో స్థానిక రైతుల నుంచి 779 ఎకరాల సాగు భూమిని నాటి కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు పరిహారమిచ్చి సేకరించిందని ఆరోపించారు. పరిశ్రమలో వందేళ్ల దాకా రైతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమను 1998లో మూసివేయడంతో భూములు కో ల్పోవడమే కాకుండా ఉద్యోగాలనూ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. 30 ఏళ్లుగా ఈ పరిశ్రమ ప్రారంభం కోసం పాలకులు ఎన్నికల్లో హామీ ఇస్తూ పూర్తిగా విస్మరిస్తున్నారని విమర్శించారు. ఈ పరిశ్రమను స్క్రాప్ కింద అమ్ముకోవడానికి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం అనుమతితో టెండర్ ప్రక్రియ కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఇంతవరకు పరిశ్రమ పునరుద్ధరణ జరుగుతుందని ఎంతో ఆశతో ఉన్నామని, ప్రస్తుతం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆశలు సన్నగిల్లాయని పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమ పునరుద్ధరణకు ప్రయత్నించాలని, లేని పక్షంలో తీసుకున్న పరిహారం సొమ్ము తిరిగి ఇస్తామని, తమ భూములు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజన్న, ఈశ్వర్ దాస్, రామ్‌రెడ్డి, కృష్ణ, విఠల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాలు నియంత్రించాలి
కైలాస్‌నగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల ని యంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం అధి కారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడా రు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ రంబుల్ స్టెప్స్, సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ లేజర్ గన్ ఏర్పాటు చేయాలని సూచించారు. సాయంత్రం డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు జీవన్‌రెడ్డి, శ్రీనివాస్, ఆర్డీవో వినోద్‌కుమార్, ఆర్అండ్బీ, ఎకై ్సజ్ అధికారులు పాల్గొన్నారు. -
‘నీట్’ నిర్వహణకు కేంద్రాలు గుర్తించాలి
● కలెక్టర్ రాజర్షి షా ఆదేశం ● కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష కై లాస్‌నగర్: మే 4వ తేదీన నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహణకు జిల్లాలో పరీక్షాకేంద్రాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీట్ నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నీట్ అర్హత పరీక్ష కోసం జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్కూళ్లు, ఆర్మీ స్కూ ళ్లు, ఇంజినీరింగ్ కళాశాలలు, సీబీఎస్ఈ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలను సందర్శించి అందులో మౌలిక వసతులు కల్పించాలని, ఆ తర్వాతే నివేదిక అందించాలని సూచించారు. పరీక్షాకేంద్రాల ఎంపికకు నిబంధనల ప్రకారం అందులో ఉండాల్సిన మౌలిక వసతులపై ఆరా తీశారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బెంచీలు, కుర్చీలు, తాగునీరు, మూత్రశాలలు, సీసీ కెమెరాల పనితీరు, తరగతి గదులు, లైటింగ్, ఫ్యాన్లు, విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాలు పర్యవేక్షించాలని సూచించారు. వీటిపై అధికారులందించే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతీ గదిలో 24 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్డీవో వినోద్‌కుమార్, జిల్లా విద్యాధికారి ప్రణిత, కళాశాలల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
కైలాస్‌నగర్: ఈ నెల 21నుంచి ఏప్రిల్ 4వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహించనున్న పరీక్షలకు జిల్లాలో రెగ్యులర్ వి ద్యార్థులు 10,051, ప్రైవేట్‌గా 55 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. వీరి కోసం 52 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీస్ బందోబస్తు ఏర్పా టు చేస్తామని చెప్పారు. కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. పరీక్ష సమయాల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా బస్సులు నడపాలని ఆర్టీసీకి సూచించారు. కేంద్రాలను తనిఖీ చే సేందుకు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు ప్ర త్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో మహిళా కానిస్టేబుల్ ఉండేలా చూసుకోవాలని, అ ధికారులంతా సమన్వయంతో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. డీఈవో ప్ర ణిత, సీఎస్‌లు, డిపార్ట్మెంట్ అధికారులున్నారు. -
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
బజార్హత్నూర్: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్ర శాంతత లభిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి మండలంలోని గిర్నూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయ విగ్రహ ప్రతి ష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జా దవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఆలయాల అ భివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మాజీ సర్పంచ్ కృష్ణ, నాయకులు రాజారాం, భూమయ్య, సకేశ్, మారుతి, నాన రమణ, అల్కె గణేశ్, నాన రమణ, పోరెడ్డి శ్రీనివాస్, కొత్త శంకర్ పాల్గొన్నారు. -
ఉపాధిహామీ కూలీలందరికీ పనులు కల్పించాలి
తలమడుగు: దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఉ పాధి కూలీకి పని కల్పించాలని డీఆర్డీవో ర వీందర్ రాథోడ్ సూచించారు. గురువారం మండలంలోని సుంకిడి, కుచులాపూర్ గ్రా మాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. పనుల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. పనులకు వస్తున్న కూలీల వివరాలు ప్రతీరోజు రెండుసార్లు ఫొటో తీసుకుని వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకం వేగవంతం చేయాలని, వేసవిలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. ఎంపీడీవో చంద్రశేఖర్, ఏపీవో మేఘమాల, ఈసీ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. -
జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించాలి
కై లాస్‌నగర్: మాదక ద్రవ్యాలు, గంజాయిని జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మాదక ద్రవ్యాల నిర్మూలనపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి, అందులో పోలీస్, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు ప్రతీ వారం గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. ఎవరైనా గంజాయి లేదా మాదకద్రవ్యాల బారిన పడితే స్థానిక డీఅడిక్షన్ సెంటర్లలో చేర్పించి బాగు చేయాలని సూచించారు. ఎస్పీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, పోలీస్, వైద్యారోగ్య, ట్రాన్స్‌పోర్టు, ఎకై ్సజ్ శాఖల అధికారులు, మెడికల్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
జిల్లాకు ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం
ఆదిలాబాద్: జిల్లాకు ఎయిర్ పోర్ట్ తప్పకుండా తీసుకువస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి మాట్లాడారు. ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు అవగాహన రాహిత్యంతో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న జోగు రామన్న జిల్లా ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏర్పాటు కోసం 2014లో తాను ఎంపీగా ఉన్న సమయంలో కృషి చేశానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగానే ఎయిర్ పోర్ట్ అకాడమీ పెండింగ్‌లో ఉందన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్‌కు సంబంధించి 2011లోనే సర్వే జరిగిందన్నారు. ఇదే రైల్వే లైనుకు ఆర్మూర్–ఆదిలాబాద్ వయా నిర్మల్ కు జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇద్దరు మంత్రులను కలిసినా పట్టించుకోలేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు వేద వ్యాస్, రఘుపతి, లాలా మున్నా, నగేష్, కృష్ణ, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● ఎంపీ గోడం నగేష్ -
విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి
సిరికొండ: విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. తుమ్మల్‌పాడ్ గ్రామానికి చెందిన ఇంగోలే నాగోరావ్, కుసుంబాయి దంపతుల రెండో కుమారుడు ఇంగోలే విలాస్ (24)బుధవారం ఇంటి మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ వైరుకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఇచ్చోడ ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. మృతుడు ఆరునెలల క్రితమే దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు. గోండుగూడలో ఒకరు..కడెం: మండలంలోని చిట్యాల్ గోండుగూడకు చెందిన పందిరి జలపతి (56) గోదావరి నదిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలపతి ఈనెల 4న స్నానం చేయడానికి గోదావరినదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుని భార్య సీతాబాయి ఫిర్యాదు మేరకు బుధవా రం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వగ్రామం చేరిన మృతదేహంలక్సెట్టిపేట: గత నెల 27న ఓమన్‌లో మృతి చెందిన వలస కూలీ మృతదేహం బుధవారం స్వగ్రామం చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హన్మంతుపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల కొమురయ్య(48) ఉపాధి నిమిత్తం రెండేళ్లక్రితం ఓమన్ దేశానికి వెళ్లి అక్కడ భవన నిర్మాణ రంగంలో కూలీగా పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తులో పనిచేస్తుండగా అదుపుతప్పి కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించా రు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వృద్ధుడు ఆత్మహత్యదండేపల్లి: గడ్డిమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసినొద్దీన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని వెల్గనూర్‌కు చెందిన అక్కల మల్లేశం (79) కొన్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు కుమారులను కోల్పోయాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందడంతో ఈనెల 4న గడ్డిమందు తాగి వాంతులు చేసుకోవడంతో గమనించిన స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు రెఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుని కుమార్తె రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. అధికారి ఇంట్లో చోరీకి విఫలయత్నంభైంసాటౌన్: పట్టణంలోని సాయికాటన్ ఏరియాలో ఉంటున్న ఆర్అండ్బీ డీఈఈ సునీల్ ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి వి ఫలయత్నం చేశారు. సాయికాటన్‌లోని ఓ ఇంట్లో అ ద్దెకు ఉంటున్న భైంసా ఆర్అండ్బీ డీఈఈ సునీల్ మంగళవారం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బుధవా రం ఇంటి తాళం తెరిచి ఉండడం గమనించిన స్థా నికుల సమాచారంతో అతను వచ్చి పరిశీలించగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు లేవని చెప్పారు. అడవి పందుల దాడిలో ఇద్దరికి గాయాలుపెంబి: మండలంలోని సిక్కిగూడ గ్రామానికి చెందిన సిడాం లక్ష్మణ్, సిడాం తుకారాం మంగళవారం రాత్రి షెట్పల్లి సమీపంలో ఉన్న చేనుకు కాపలాగా వెళ్తుండగా ఒక్కసారిగా అడవి పందులు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ కృష్ణ, పైలెట్ అజర్ ప్రథమ చికిత్స అందించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘తుమ్మల’కు కవిసంధ్య పురస్కారం
నిర్మల్‌ఖిల్లా: ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కవిసంధ్య సాహితీ సంస్థ, నారాయణరావు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కవితా పోటీలలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తుమ్మల దేవరావుకు కవిసంధ్య పురస్కారం దక్కింది. అతను రచించిన ‘వరి గొలకులు’ కవిత కన్సోలేషన్ బహుమతికి ఎంపికై నట్లు కవిసంధ్య సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈట శిఖామణి, దాట్ల దేవదానం రాజు తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లో అవార్డు అందుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధంనర్సాపూర్(జి): మండలంలోని బూరుగుపల్లి (జి) గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ ఇల్లు బుధవారం షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. దినేష్ తన ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఇంట్లోని సామగ్రితో పాటు రూ.2 లక్షల 50 వేల నగదు, ఐదు గ్రాముల బంగారం కాలిపోయిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ సుమలత , పంచాయతీ కార్యదర్శి శివకుమార్ సందర్శించి పంచనామా నిర్వహించారు. తిమ్మాపూర్‌లో 800 కోళ్లు మృతిభైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్‌లో పునేంధర్కు చెందిన ఫామ్‌లో బుధవారం 800 కోళ్లు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారి విఠల్ కోళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కోళ్లు తాగే నీటిలో విషం కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ల్యాబ్ నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత కోళ్ల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పునేంధర్ వాపోయాడు. గంజాయి సేవిస్తున్న పలువురి అరెస్టుచెన్నూర్: మండలంలోని కిష్టంపేట శివారులో గంజాయి సేవిస్తున్న పలువురిని అరెస్టు చేసినట్లు సీఐ రవీందర్ తెలిపారు. పోలీసు స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిష్టంపేట జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న పదిమంది యువకులను పట్టుకుని విచారించగా గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో ఒకరు మైనర్కాగా మరొకరు పరారయ్యారన్నారు. సమావేశంలో ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
● టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా సమష్టిగా ముందుకు సాగాలని టీపీసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షా సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, రేఖానాయక్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, పా ర్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులకు ఆమె స్పష్టమైన దిశానిర్దేశం చేశా రు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేలా ఐక్యంగా పనిచేయాలన్నారు. ఎలాంటి విభేదాలకు తావులేకుండా పార్టీ పటిష్టత, స్థానిక సంస్థలన్నింటిలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. -
121 ప్రైవేటు డిగ్రీ కళాశాలల పరీక్ష ఫలితాలు నిలిపివేత
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను ఈ నెల 4న రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ డీన్ అకాడమిక్‌కు ఫీజులు చెల్లించని 121 ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఫలితాలను నిలిపి వేశారు. ఇప్పటికే ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. అప్పట్లో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిని, అప్పటి రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కలిశారు. ప్రభుత్వం మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వడం లేదని, కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. 15 నుంచి 20 రోజుల వరకు సమయం ఇచ్చారు. పరీక్షలు పూర్తయ్యాక యూనివర్సిటీ అకాడమిక్ డీన్ ఆయా కళాశాలలకు ఫీజులు చెల్లించాలని నోటీస్‌లు పంపారు. బుధవారం వరకు 121 ప్రైవేటు కళాశాలలు ఫీజులు చెల్లించలేదు. ఫీజులు చెల్లించిన కళాశాలల ఫలితాలు వెబ్సైట్లో ఉంచి చెల్లించని వారివి నిలిపివేశారు. తమ ఫలితాలు చూసుకునే వీలులేకపోవడంతో ఆయా కళాశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు చెల్లించినట్లు క్లియరెన్స్ వస్తేనే ఫలితాలు వెల్లడిస్తామని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ స్పష్టం చేశారు. -
విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలి
● ఆర్జీయూకేటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ బాసర: విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలని బాసర ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బుధవారం స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్, స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్యపడితే అపజయాలు ఆహ్వానిస్తాయని, ధైర్యంగా ముందుకెళ్తే విజయ సోపానం అవుతుందన్నారు. ఎస్ఈఐఎఫ్ ఫౌండర్ శామ్యూల్‌రెడ్డి, డైరెక్టర్ జ్యోతిర్మయి విద్యార్థులకు తమ సలహాలు అందించారు. సినీ నటుడు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతూ ప్రేరణ కల్పించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి
బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో నీటమునిగి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని బీదరిల్లి గ్రామానికి చెందిన డోన్ గాలే మారుతి (34) కుటుంబ సభ్యులతో కలసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌తో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం బాసర గోదావరినదికి వచ్చారు. స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండడంతో నీటమునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..తాండూర్: ఈ నెల 2న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. అచ్చులాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పెరుగు రాజయ్య (57) ఐబీ నుంచి నయారా పెట్రోల్‌బంక్ వద్దకు బైక్‌పై వెళ్తుండగా రేచినీ గ్రామానికి చెందిన భీంరావు ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టాడు. ఘటనలో రాజయ్యకు తీవ్ర గాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మే రకు భీంరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి మహిళ..సోన్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గాంధీనగర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (54) మంగళవారం సరస్వతీ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లింది. చేపలు పట్టే క్రమంలో ఒడ్డు మీద నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయింది. బుధవారం పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ హైమద్ మోహినుద్దీన్ తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు..నెన్నెల: గత నెల 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలి పారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి చెందిన తోకల రాజేశం (34) అత్తగారి ఊరైన నెన్నెల మండలం మైలారంలో ఉంటున్నాడు. ఫిబ్రవరి 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరుడు తోకల సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇంటర్ పరీక్షలు షురూ
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్టియర్ పరీక్షలు షురూ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి నిమిషం ని బంధనను సడలించి 5 నిమిషాల వరకు పెంచారు. అయితే విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి పరీక్ష కావడంతో తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద సందడి కనిపించింది. విద్యార్థులను అధి కారులు పూర్తిగా తనిఖీ చేసి లోనికి అనుమతించా రు. ఆయా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిరోజున నిర్వహించిన లాంగ్వేజ్ పరీక్షకు 9,814 మందికి గాను 9,154 మంది హాజరైనట్లు డీఐఈవో జాదవ్ గణేశ్‌కుమార్ తెలిపారు. కలెక్టర్ రాజర్షిషా ప్రభుత్వ బాలికల జూ నియర్ కళాశాలతో పాటు పలు కేంద్రాలను పరిశీ లించారు. అలాగే సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. -
మహారాష్ట్రలో ట్రాలీ బోల్తా..
● గుడిహత్నూర్ వాసులకు గాయాలు గుడిహత్నూర్: మహారాష్ట్రలో ట్రాలీ వాహనం బోల్తా పడిన ఘటనలో మండలానికి చెందిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని గురుజ గ్రామానికి చెందిన జాదవ్ రాజు మంగళవారం 16 మంది బంధుమిత్రులతో కలిసి దైవ దర్శనానికి మహారాష్ట్రంలోని చంద్రపూర్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం కోర్పణ గ్రామ సమీపంలో బోల్తా కొట్టింది. దీంతో రాజుతో పాటు అతని తల్లి సీతాబాయి, మరో యువకుడు గెడం జగదీష్, నాందేడ్‌కు చెందిన మహిళ, రాజు మేన కోడలుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా రిమ్స్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సీతాబాయిని హైదరాబాద్‌కు, అత్త, మేనకోడలిని నాందేడ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. గెడం జగదీష్‌తో పాటు పలువురు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని కోర్పణ పోలీసులు తెలిపారు. -
‘సాక్షి’ చొరవ అభినందనీయం
సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జిల్లా వాసులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే ఎయిర్ కనెక్టివిటి పెరిగి నాగ్‌పూర్, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. వాణిజ్యపరంగాను ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు పడతాయి. తెలంగాణ ఉద్యమం టీఎన్జీవోస్ భవనం నుంచే ప్రొఫెసర్ జయశంకర్ సార్ నాడు ప్రారంభించారు. ‘సాక్షి’ కూడా ఎయిర్‌పోర్టు సాధనకు ఇక్కడే బీజం వేయడం శుభసూచికం. పత్రిక సామాజిక చొరవ అభినందనీయం. – కోల కిరణ్ కుమార్, డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ -
మలేషియా జైలులో కడెం వాసులు
కడెం: మండలంలోని లింగాపూర్‌కు చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురిజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, దస్తురాబాద్ మండలంలోని మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ ఉపాధి నిమిత్తం గతేడాది మలేషియాకు వెళ్లారు. కొన్ని కారణాల వలన జైలులో ఉన్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ కలిసి విడుదల చేయించాలని వేడుకున్నారు. మలేషియా వెళ్లి ఉన్నతాధికారులను సంప్రదించాడు. అక్రమ ఆయుధ చట్టం కింద జైలులో ఉన్నారని తెలుసుకుని బాధితులను పరామర్శించాడు. విడుదల చేసేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించాడు. -
అడహక్ కమిటీ ఏర్పాటు..
ఆదిలాబాద్‌లో విమానాశ్రయ సాధన కోసం సామాజిక బాధ్యతగా ‘సాక్షి’ చొరవచూపింది. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో బుధవారం నిర్వహించిన చర్చా వేదికకు విశేష స్పందన లభించింది. మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద, యువజన, విద్యార్థి సంఘాలతో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు భారీగా తరలివచ్చారు. తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారు. జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా ఐక్యంగా ఉద్యమిస్తే తప్పకుండా సాధ్యమవుతుందన్నారు. దశాబ్దాల కల సాకారం కావాలంటే ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. కేంద్రంపై వారి ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. అడహక్ కమిటీ ద్వారా ఐక్య పోరాటాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, బీఆర్ఎస్, కాంగ్రె స్, వామపక్షాలు, కుల, విద్యార్థి సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, వృకోధర్, అల్లూరి భూమన్న, దేవిదాస్ దేశ్‌పాండే, కిష్టయ్య, బుట్టి శివ, దాసరి రమేశ్, రూపేష్ రెడ్డి, రత్నం రమేశ్, కుంటాల రాములు, ఎస్.అరుణ్ కుమార్, లంకా రాఘవులు, అశోక్, రవీంద్ర, కందుల రవీందర్, ఆశన్న, దయానంద్‌రెడ్డి, కె.నర్సింలు, రాజు, అన్నదానం జగదీశ్వర్, ప్రమోద్ కుమార్ ఖత్రి, సతీష్, ధమ్మపాల్, ఆసిఫ్, ఎన్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. విమానాశ్రయ సాధన కోసం ఉద్యమించేలా ప్రత్యేకంగా అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ వర్గాలతో కూడిన ప్రతినిధులను ఇందులో భాగస్వాములుగా చేర్చారు. కన్వీనర్‌గా సంద అశోక్, కోకన్వీనర్లుగా విజ్జగిరి నారాయణ, బండి దత్తాత్రి, కె.లక్ష్మారెడ్డి, ముడుపు ప్రభాకర్‌రెడ్డి, మల్లేశ్, సభ్యులుగా సోగల సుదర్శన్, పూసం ఆనంద్‌రావు, దాసరి రమేశ్, సిర్ర దేవేందర్, నిమ్మల ప్రశాంత్, నిమ్మల నరేందర్, బండారి సతీశ్, బి.శివకుమార్, వాగ్మారే ప్రశాంత్, బొజ్జ ఆశన్న, ఎంఏ హఖ్, పి.కిష్టయ్య, దేవిదాస్ దేశ్‌పాండే యమితులయ్యారు. -
పక్షుల లెక్క తేలింది
● జన్నారం డివిజన్లో 201 రకాలు గుర్తింపు ● అటవీశాఖ, వరల్డ్‌వైడ్ లైఫ్ఫండ్ ఆధ్వర్యంలో సర్వే జన్నారం(ఖానాపూర్): పక్షుల గమనానికి పరిధిలు లేవు. అవి ఖండాలు దాటి ప్రయాణిస్తూ పర్యావరణంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణంలో జరిగే పెను మార్పుల వల్ల కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస వెళ్తుంటాయి. ఇలాంటి పక్షులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్షులు ఎంతో జీవవైవిద్యం ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పక్షుల వివరాలను తెలుసుకునేందుకు అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ ఏడాది జనవరి 24 నుంచి 26 వరకు జంతుగణన మాదిరి కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్లో పక్షుల గణన చేశారు. 28 మంది సభ్యులు ఏడు బృందాలుగా ఏర్పడి డివిజన్లోని 40 అటవీ బీట్లలో సర్వే చేశారు. డివిజన్లో సంచరిస్తున్న పక్షుల వివరాలను సేకరించారు. వీటితో పాటుగా అంతరించిపోయే దశలో ఎన్నిరకాల పక్షులు ఉన్నాయి? ఏఏ కేటగిరీలో ఏ పక్షులున్నాయో సర్వేలో తేలినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 201 రకాల పక్షులు జన్నారం అటవీ డివిజన్లో నిర్వహించిన సర్వేలో 201 రకాల పక్షులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖ, వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో పక్షులపై సమగ్ర పరిశీలన చేశారు. 11 రకాల పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయని, 57 రకాల పక్షులు కేవలం అటవీ, ప్లాంటేషన్ ఏరియాలో సంచరిస్తున్నాయని, మన పరిసరాల్లో తిరిగే పక్షులు 18, కీటకాలు తినే పక్షులు 99 రకాలు, కేవలం పండ్లను మాత్రమే తినే పక్షులు 16 రకాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. పక్షులపై అవగాహన ప్రస్తుత రోజుల్లో పక్షుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థి దశ నుంచే దీనిని ఒక హాబీగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో పక్షులు, వాటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అటవీశాఖ నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే సైన్స్ టీచర్లను అడవుల్లోకి తీసుకెళ్లి బర్డ్‌వాక్ కార్యక్రమం చేపట్టనున్నారు. వీటితో పాటుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థ ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలు పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించనున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. పక్షుల సంరక్షణపై, పక్షులు అంతరిస్తే కలిగే నష్టాలు, జీవ వైవిద్యంలో పక్షుల పాత్ర, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రతీ ఆర్నెల్లకోసారి.. ప్రతీ ఆర్నెల్లకోసారి పక్షులపై అవగాహన కల్పించే యోచన చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పక్షుల రకాలను గుర్తించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వలంటీర్లగా నియమించాలని యోచిస్తున్నాం. అర్హులైన స్థానికులను నేచర్ గైడ్లుగా నియమిస్తాం. – శివ్‌ఆశిష్‌సింగ్, జిల్లా అటవీశాఖ అధికారి, మంచిర్యాల -
ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ వేగవంతం చేయాలి
కైలాస్‌నగర్: జిల్లాలో 17 గ్రామాల్లో ఎంపిక చే సిన 2,148 ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత శాఖ అధి కారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, మిగిలిన అన్ని గ్రామాల్లోని ఇళ్లకు సంబంధించిన పరిశీలన ప్రక్రియ ఈనెల 7లోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే 15 మంది అమరవీరుల కుటుంబాలకు ముత్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివాస స్థలాలను వారి అభిప్రాయం మేరకు కేటాయించామన్నారు. ఆ నివాస స్థలాల అభివృద్ధి పను ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. అలాగే నీటి ఎద్దడి ఉన్న ఏడు క్రిటికల్ మండలాలైన ఆదిలాబాద్ రూర ల్, బజార్హత్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్, సిరికొండ, ఉట్నూర్‌లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ బసవేశ్వర్, ఎంిపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. తాపీమేసీ్త్రలకు కిట్ల పంపిణీ అంతకు ముందు నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ద్వారా తాపీమేసీ్త్రలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అంది స్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించా రు. వారికి నిర్మాణ సామగ్రితో కూడిన కిట్లను పంపిణీ చేశారు. -
‘రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే’
ఆదిలాబాద్: రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నా రు. అదిలాబాద్– కరీంనగర్–నిజామాబాద్– మెద క్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడంతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్యాయాన్ని బీజేపీ ప్రశ్నించిందని, ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు గుర్తించి పట్టం కట్టారన్నారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, ఓటర్లలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందులో నాయకులు జ్యోతి రెడ్డి, నగేష్, జోగు రవి, రఘుపతి, లాలామున్నా, ప్రవీణ్, కృష్ణ యాద వ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టభద్రుల సీటూ కమలానిదే!
● గ్రాడ్యుయేట్లోనూ బీజేపీ హవా ● అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి ● మూడు రోజులు సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ● ముగ్గురికే 92.52 శాతం ఓట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి:కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చి న్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్లతో బీజేపీ గెలుపు ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూ డా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో ఆయననే విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరా హోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించడంతో శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జర గ్గా, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్విరామంగా మూడు షిఫ్టు ల్లో 800మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు పక్రియ చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లను వడపోసి, కట్టలు కట్టారు. మంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు చేపట్టి బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్లను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్లలో బరిలో ఉన్న 54 మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రా ధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ పక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. ముగ్గురికే 92.52 శాతం ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటైన ఓట్లలో 92.52శాతం(2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగతా 53మంది స్వతంత్ర అభ్యర్థులు 16,684 ఓట్లు మాత్రమే సాధించారు. రెండోప్రాధాన్యత ఓట్లలో సైతం బీజేపీదే హవా నిర్ధారిత కోటా ఓట్లు కోసం అభ్యర్థుల ఎలిమినేషన్ పక్రియను చేపట్టగా అందులో సైతం బీజేపీ అభ్యర్థి అధిక్యం చూపారు. తొలుత 53మందిని ఎలిమినేషన్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్‌కి 73,644 ఓట్లు, బీఎస్పీకి 63,972 ఓట్లు వచ్చాయి. 53మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్లను ఎవరు సాధించకపోవడంతో మూడోస్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణను ఎలిమినేట్ చేశారు. అతనికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రసన్నహరికృష్ణను ఎలిమినేషన్ చేసిన అనంతరం బీజేపీ అభ్యర్థికి 98,637ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 93,531ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి కన్నా 5,106 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో కమలం పార్టీకే విజయం దక్కింది. -
ఆకాంక్ష చాటేలా.. ప్రజల గొంతుకగా నిలిచేలా
● ‘సాక్షి’ ఆధ్వర్యంలో నేడు చర్చా వేదిక అడవుల జిల్లా ఆకాంక్షను ఈ ప్రాంతవాసుల గొంతుక గా వినిపించేందుకు ‘సాక్షి’ నడుం బిగించింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న విమానాశ్రయ ఏర్పాటు అంశం ఆచరణలోకి రావాల్సిందే అని బలంగా కాంక్షిస్తోంది. కొత్త ఎయిర్‌పోర్టుల విషయంలో తెలంగాణలోని పలు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయం విదితమే. మామునూరులో నిధులు సైతం మంజూరు కాగా.. కొత్తగూడెంలోనూ కదలిక మొదలైంది. పొరుగున ఉన్న నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి ప్రస్తావన కూడా వచ్చేసింది. అయితే ‘మేమేం పాపం చేశాం.. మా కెందుకు మంజూరు చేయరు..’ అంటూ జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన వనరులు అందుబాటులో ఉన్నా ఎందుకు ఈ చిన్నచూపు అంటూ మౌనంగా నిట్టూరుస్తున్నారు. ఈ క్రమంలో ‘సాక్షి’ సామాజిక బాధ్యతగా ముందడుగు వేసింది. ‘ఆదిలాబాద్ విమానాశ్రయ సాధన’ పేరిట ప్రత్యేక చర్చా వేదికకు శ్రీకారం చుట్టింది. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసేలా ఆహ్వానం పలుకుతోంది. అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చాలని ఆకాంక్షిస్తోంది. మీ భావాలకు అక్షర రూపం కల్పించి పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు సదా మీ వెంటే అంటూ ‘సాక్షి’ విన్నవిస్తోంది. – కైలాస్నగర్స్థలం : టీఎన్జీవోస్ భవన్, ఆదిలాబాద్ సమయం : ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంట వరకు -
నాణ్యమైన విద్యుత్ అందించేలా పనిచేయాలి
ఆదిలాబాద్‌టౌన్: వినియోగదారులకు నా ణ్యమైన విద్యుత్ అందించడంలో క్షేత్రస్థా యి ఉద్యోగుల పాత్ర కీలకమని ట్రాన్స్‌కో సీఈ జేఆర్.చౌహాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్హాల్లో మంగళవారం లైన్మెన్ దినోత్సవం నిర్వహించారు. జూనియర్ లైన్మెన్, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్లు, ఫోర్‌మెన్‌ను ఆయన శాలు వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చోడలో.. ఇచ్చోడ: మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఈ జేఆర్ చౌహాన్ హాజరయ్యారు. ఇందులో డీఈలు హరికృష్ణ, ఎడ్డ న్న, ఏడీఏ లక్ష్మణ్, ఏఈలు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
● ఎలిమినేషన్ ప్రక్రియతోనే ఖరారు కానున్న ఎమ్మెల్సీ విజేత ● ప్రస్తుతం ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి
సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడికరీంనగర్– ఆదిలాబాద్– మె దక్– నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలి తం ఉత్కంఠ రేపుతుంది. మంగళవారం అర్ధరాత్రి వర కు జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధించారు. ఏ ఒక్క అభ్యర్థి నేరుగా కోటా ఓట్లు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్ల తో విజేత తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఫలితం తేలనుంది. ట్రయాంగిల్ పోరు సర్వత్రా ఆసక్తి రేపుతుంది. త్రిముఖ పోటీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా 56మంది అభ్యర్థులు పోటీ పడినా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎీస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వచ్చా యి. 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు ముగ్గురు సుమారు లక్ష ఓట్లు, బరిలో నిలిచిన 53 మంది కలిపి కేవలం 10వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో మూడోస్థానంలో నిలిచే అభ్యర్థి ఎవరనే దానిపై ఎమ్మెల్సీ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరికీ దక్కని విన్నింగ్ కోటా ఓట్లు పోస్టల్ ఓట్లతో కలిసి మొత్తం 2,52,100 ఓట్లు పోలవగా, అందులో సుమారు 28వేల ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. మిగిలిన 2,24,000 ఓట్లలో సగం ఓట్లు.. అంటే..1,12,001 (సుమారు) ఓట్లను విన్నింగ్ కోటా ఓట్లుగా నిర్ధారించారు. పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి నేరుగా కోటా ఓట్లను సాధించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో తక్కు వ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫలితం తేలేందుకు బుధవారం రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ప్రతీ రౌండ్లో బీజేపీకే ఆధిక్యం మొత్తం 21 టేబుళ్ల ద్వారా 12 రౌండల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిపై 36 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండోరౌండ్లో 1,457 ఓట్ల మెజార్టీ, మూడోరౌండ్లో 3,005 ఓట్లు, నాలుగో రౌండ్లో 1,263 ఓట్లు, ఐదోరౌండ్లో 1,381 ఓట్ల మెజార్టీ వ చ్చింది. 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిపై 211 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వర కు 45,401 ఓట్లు సాధించి, ప్రత్యర్థులపై 6,931 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. 38,470 ఓట్లతో నరేందర్‌రెడ్డి సెకండ్ ప్లేస్‌లో, 3,1481 ఓట్లతో ప్రసన్నహరికృష్ణ మూడోస్థానంలో నిలిచారు. మందకొడిగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు తోడు పోటాపోటీగా అభ్యర్థులు ఓట్లు సాధిస్తుండటంతో రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ పెరుగుతోంది. రెండోప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందికౌంటింగ్ వివరాలు: మొత్తం ఓట్లు(పోస్టల్‌తో కలిపి) 2,52,100 చెల్లని ఓట్లు : 28,000(11.01శాతం) చెల్లుబాటైనవి : 2,24,000 విన్నింగ్ కోటా ఓట్లు : 1,12,001(సుమారు) బరిలో నిలిచిన అభ్యర్థులు : 56 -
దివ్యాంగులను నామినేట్ చేయాలి
ఆదిలాబాద్: స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ను నామినేట్ చేయాలని దివ్యాంగుల హ క్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు మె స్రం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ నగర్లో వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేషనల్ డిసేబుల్డ్ స్టడీస్ రిపోర్ట్ ప్ర కారం రాష్ట్రంలో 43.02 లక్షల మంది ది వ్యాంగులు ఉన్నారన్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో ఇద్దరు దివ్యాంగులను నా మినేట్ చేస్తే ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో వేదిక కార్యదర్శి ఆరిఫా, ఉపాధ్యక్షుడు ఆశన్న, పోచన్న రేణు క తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
ఆదిలాబాద్‌రూరల్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రగతిశీల భవన, ఇతర కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యంరెడ్డికి పలు డిమాండ్లతో కూడి వినతి పత్రం అందజేశారు. ఇందులో భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్, నారాయణ, తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ నర్సింగ్, దేవిదాస్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు సుభాష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తౌఫీక్, అజీమ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో జోష్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ యం కమలనాథుల్లో జోష్ నింపింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని కై వసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎమ్మెల్సీ పోరులో నువ్వా నేనా అన్నట్లు తలపడగా.. బీజేపీ బలపర్చిన అభ్యర్థి మల్క కొమురయ్యకే టీచర్లు పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి గా నాలుగు ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుని మరోసారి సత్తా చాటింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల మద్దతుతో ఓ సీటులో విజయం సాధించింది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఎమ్మెల్సీ సైతం ఆ పార్టీ ఖాతాలో చేరింది. ఉమ్మడి జిల్లాలో గత రెండేళ్లుగా బీజేపీ అనుకూల పవనాలే వీస్తున్నాయి. దీంతో భవిష్యత్‌లో తమ పార్టీ బలపడుతుందనే సంకేతాలు వస్తున్నాయని కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా పార్టీ పుంజుకోవడంపై ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేయాలనుకున్న పార్టీ సీనియర్లకు ఊరట కలుగుతోంది. మరోవైపు తాజా ఎన్నికలతో యువత, టీచర్లు, విద్యావంతులు బీజేపీ వైపు ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. కలిసొచ్చిన ఆత్మీయ సమ్మేళనాలు శాసనమండలి ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదటి నుంచి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టభద్రులు, టీచర్ల స్థానానికి బరిలో దింపి స్థానిక నాయకులపైనే భారం వేసింది. కార్పొరేట్ వ్యక్తులుగా ప్రచారం జరిగినా మల్క కొమురయ్య, పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డికి సానుకూలత పెరిగింది. పట్టణాలు, నియోజకవర్గాల్లో ఓటర్లను అధిక సంఖ్యలో రప్పించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం గెలుపునకు దోహదం చేశాయి. ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించి ప్రచా రం చేపట్టారు. వచ్చే స్థానిక సంస్థల్లోనూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్ని కల్లోనూ సత్తా చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామాలు, బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. పట్టణాలకే పరిమితమైన ఓటు బ్యాంకును గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాషా య పార్టీ బలపడేందుకు సరైన సమయం వచ్చింద ని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన పార్టీ ఇక గ్రామ స్థాయిలోనూ విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో నాయకులకు ఊరట పట్టభద్రుల స్థానంలోనూ గెలుస్తామనే ధీమా ఉమ్మడి జిల్లా పార్టీ కేడర్‌లో ఉత్సాహం మరో సీటుపై ఉత్కంఠ మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గత రెండు రోజులుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు, ఓట్లు ఎక్కువగా ఉండడంతో లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి మంగళవారం సాయంత్రం వరకు ముందంజలో ఉన్నారు. ఏ అభ్యర్థి గెలుస్తారనేది బుధవారం స్పష్టత రానుంది. ఓట్ల లెక్కింపులో ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల తొలగింపు ప్రక్రియ మొదలైతే తుది విజేత ఎవరనేది తేలాల్సి ఉంది. బీజేపీ శ్రేణులు తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాలో ఉన్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేయొద్దు బేల: ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేయవద్దని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ అన్నారు. మండలకేంద్రంలోని పలు ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, స్థాయికి మించి వైద్యం చేయవద్దన్నారు. నిబంధనలు అతి క్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రెండు రక్త పరీక్ష ల్యాబ్‌లను సీజ్ చేశారు. ఆయన వెంట నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం జిల్లా అధికారి వంశీకృష్ణ, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
పకడ్బందీ బందోబస్తు..
ఆదిలాబాద్‌టౌన్: ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పడ్డ విద్యార్థులు ఇక పరీక్షలకు హాజరుకానున్నారు. నేటి నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు షురూ కానున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికా రులు పేర్కొంటున్నారు. ఆందోళన వీడి పరీక్ష రా యాలని సూచిస్తున్నారు. బుధవారం ప్రథమ సంవత్సరం, గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 25 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదివరకు నిమిషం ఆలస్యం నిబంధన ఉండగా, కొంతమంది విద్యార్థులు సమయానికి కేంద్రానికి చేరుకోకపోవడంతో పరీక్షలకు దూరమయ్యారు. దీంతో ఇంటర్మీడియెట్ బోర్డు ఈసారి 5 నిమిషాల వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత కేంద్రంలోనికి విద్యార్థులను అనుమతించరు. 31 కేంద్రాలు ఏర్పాటు.. ఇంటర్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 13 ప్రభు త్వ జూనియర్ కళాశాలలు,ఐదు సాంఘిక సంక్షేమ, రెండు ట్రైబల్ వెల్ఫేర్, తొమ్మిది ప్రైవేట్ జూనియర్ కళాశాలలు,ఒక మోడల్ స్కూల్,ఒక మైనార్టీ స్కూ ల్ ఉన్నాయి. పరీక్షలకు 18,880 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 8,093 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,013,సెకండియర్ జనరల్‌విద్యార్థులు8,754 మంది, ఒకేషనల్ విద్యార్థులు1,020మంది ఉన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి.. పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈవో జాదవ్ గణేశ్ తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి కింద కూర్చోకుండా ఫర్నిచర్ సమకూర్చినట్లుగా పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 31 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 31 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, ముగ్గురు కస్టోడియన్లు, రెండు సిట్టింగ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి నేటి నుంచి ఇంటర్ పరీక్షలు జిల్లాలో 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు హాజరుకానున్న 18,880 మంది విద్యార్థులుజిల్లాలో.. మొత్తం పరీక్ష కేంద్రాలు : 31 ప్రథమ సంవత్సరం విద్యార్థులు : 9,106 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 9,774 స్క్వాడ్లు : 4( సిట్టింగ్ 2, ఫ్లయింగ్ 2) హెల్ప్‌డెస్క్ నంబర్లు : 08732– 297115, 9848781808ఇంటర్మీడియెట్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు నిర్వహించనున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం ప్రకటనలో తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆయా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టంలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వీలైనంత త్వరగా సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలు బాగా రాయాలని శుభాకాంక్షలు తెలిపారు. కై లాస్‌నగర్: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో మంగళవారం ఆయ న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవా లని సూచించారు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరా యం కలగకుండా చూడాలని ఆ శాఖ అధికారుల ను ఆదేశించారు. సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరేలా చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అలాగే కాపీయింగ్‌కు ఆస్కా రం లేకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని వారికి అల్ ది బెస్ట్ తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, డీఐఈవో గణేశ్, డీఈవో ప్రణీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల్లో సాంకేతిక ప రిజ్ఞానం పెంపొందించాలని డీఈవో ప్రణీ త అన్నారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ, అటల్ ఇన్నోవేషన్ పథకం కింద ప్రభుత్వం 19 పాఠశాలలకు ల్యాప్‌టాప్‌లు అందజేసినట్లు తెలిపారు. అలాగే ఐసీటీ పీఎంశ్రీ పథకం కింద 24 పాఠశాలలు ఎంపిక కాగా, పైలెట్ ప్రాజెక్ట్ కింద 13 పాఠశాలల కు ట్యాబ్‌లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నా రు. వీటిని అకాడమిక్ పాఠ్యంశాల కోసం ఉపయోగించాలని సూచించారు. ఇందులో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, సెక్టోరియల్ అధికారులు సుజాత్‌ఖాన్, నారాయణ, భాస్కర్, ఆయా పాఠశాలల ప్రధానో పాధ్యాయులు పాల్గొన్నారు. -
మేడం మీనాక్షి.. ఏం చెబుతారో
● కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ ● నేడు పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ సమావేశం ● గాంధీభవన్‌లో రాష్ట్ర ఇన్చార్జి ఆధ్వర్యంలో.. ● పార్టీ పరిస్థితిపై ఇప్పటికే నివేదిక ● తదనుగుణంగా ముందుకెళ్తారనే చర్చ సాక్షి,ఆదిలాబాద్: మేడం మీనాక్షి.. ఇప్పుడు కాంగ్రెస్ సామాన్య కార్యకర్తల నోటిలో నానుతున్న పేరు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. తాజాగా ఆమె గాంధీ భవన్లో మాట్లాడుతూ.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లు జెండా మోసిన కార్యకర్తలకు పూర్తి న్యాయం చేయడమే తన ధర్మమని ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో గాంధీ భవన్లో బుధవారం ఆమె సమావేశం కానున్నారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశాలు కూడా ఇదే రోజు ఉండడంతో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలు, ముఖ్య నేతలు ఇందులో పాల్గొననుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఇటీవల మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆమె దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా జిల్లా స్థాయిలో అనేక నామినేటెడ్ పదవులు, జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉండగా, రాష్ట్ర ఇన్చార్జి నిశితంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలపై దృష్టి సారించడంతో కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ముఖ్యమైన, ద్వితీయశ్రేణి నేతలు, నాయకులు కూడా హస్తం పార్టీలో చేరారు. దీంతో క్షేత్రస్థాయిలో పాత, కొత్త నాయకుల మధ్య కొంత వైరం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ మాటలు ప్రధానంగా పాత నాయకుల్లో ఉత్తేజం కలిగిస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న నిరుత్సాహం వారిలో కనిపిస్తుండగా, రాష్ట్ర ఇన్చార్జి ఈ పరిస్థితులను పూర్తిస్థాయిలో చక్కదిద్ది తమకు న్యాయం చేస్తారన్న ఆశాభావం వారిలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి పార్టీ పరిస్థితులపై ఆమె సొంత సర్వే ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. దాని ఆధారంగానే పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు చెబుతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం చేసేందుకు రాష్ట్ర ఇన్చార్జి ఉమ్మడి జిల్లా నేతలతో ఎలాంటి సూచనలు చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లుగా పోటీ చేయాలని పలువురు ఆసక్తి కనబర్చుతున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి హస్తం పార్టీలకు రావడంతో క్షేత్రస్థాయిలో పాత నాయకులు ఉన్నచోట వారికి కొత్త నాయకులతో టికెట్ పరంగా పోటీ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోసిన తమకు న్యాయం చేయాలని పాత నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా కొత్త నాయకులు రావడంతో పార్టీలో తమ ప్రభావం పూర్తిగా తగ్గిందన్న అభద్రతాభావం కూడా వారిలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఉద్దీపన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. మొత్తంగా నేడు జరిగే పార్లమెంట్ స్థాయి నియోజకవర్గ సమావేశంలో రాష్ట్ర ఇన్చార్జి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది చూడాల్సిందే.కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ -
‘సీసీఐపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలి’●
ఆదిలాబాద్‌టౌన్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)పై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు వారి వైఖరి స్పష్టం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2016 నుంచి సీసీఐ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని ప్రగల్బాలు పలికిన బీజేపీ నాయకులు ప్రస్తుతం సీసీఐని స్క్రాప్ కింద విక్రయించేందుకు టెండర్లు పిలిచారని తెలి పారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐని తుక్కు కింద విక్రయించే విషయం వీరికి తెలియదా అ ని ప్రశ్నించారు. సీసీఐ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ పరిశ్రమలకు రాయితీ ఇస్తామని, లేక రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తుందని కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. రూ.43 కోట్లతో స్క్రాప్ కింద అమ్మేందుకు మార్చి 6 వరకు టెండర్లు పిలిచారని అన్నారు. సమావేశంలో నారా యణ, సాజిదొద్దిన్, రాజు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ నిర్మాణాలపై అపోహలు వద్దు
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ వ్యయంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా హౌసింగ్ పీడీ బసవేశ్వర్ అన్నారు. రూ.5లక్షల వ్యయంతో నాణ్యతతో కూడిన ఇంటిని నిర్మించుకోవచ్చని సూచించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఎంపిక చేసిన 14మండలాల్లోని 35 మంది తాపీమేసీ్త్రలకు స్థానిక జిల్లా పరిషత్‌లోని పంచాయతీ వనరుల కేంద్రంలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 మండలాల్లోని 17 గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్లైయాష్ బ్రిక్స్, సిమెంట్ ఇటుకలతో నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వారికి శిక్షణ మెటీరియల్‌తో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. ఐదు రోజుల శిక్షణలో భాగంగా ఉచిత భోజనంతో పాటు రోజుకు రూ.300 చొప్పున ఉపకారవేతనం అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, హౌసింగ్ ఏఈ నసీర్, న్యాక్ ఏడీ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని ఆదుకోండి
మేమంతా ఏళ్లుగా కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాం. గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్కు చెందిన ఓ గిరిజన రైతు వ్యవసాయ పొలాన్ని చదును చేయడంలో భాగంగా చేలో ఉన్న బండరాళ్లను తొలగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. సదరు రైతు అనుమతితోనే వాటిని తొలగించి లారీలో లోడ్ చేస్తుండగా రెవెన్యూ అధికారులు వచ్చి వాహనాన్ని సీజ్ చేశారు. మైనింగ్ అధికారులకు అప్పగించారు. బండరాళ్లను కొడితే తప్ప ఉపాధి పొందలేని పరిస్థితి మాది. బండరాళ్లతో ఉన్న లారీని విడిపించి మమ్మల్ని ఆదుకోవాలి. – ఒడ్డెర కులస్తులు, పిట్టలవాడ, ఆదిలాబాద్ నాకు ఇచ్చోడ ఎస్బీఐలో ఖాతా ఉంది. పంట సాగు కోసం ఆ బ్యాంకు నుంచి రూ.1,50,696లను రుణంగా తీసుకున్నాను. అయితే నా బ్యాంకు ఖాతా నంబర్‌కు నా భార్య ఆధార్ నంబర్‌ను కూడా ఆఫీసర్లు మ్యాపింగ్ చేశారు. ఇలా ఒకే బ్యాంకు ఖాతాకు రెండు ఆధార్‌నంబర్లు మ్యాపింగ్ కావడంతో నాకు రావాల్సిన రుణమాఫీ అందలేదు. బ్యాంకు అధికారులు చేసిన తప్పిదంతో నష్టపోయిన నాకు న్యాయం చేయాలని కోరుతున్నా. – అందెరి చంద్రకాంత్, జున్ని, ఇచ్చోడ రుణమాఫీ కాలేదు -
గోడు వినండి.. గోస తీర్చండి
● ‘ప్రజావాణి’కి 64 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ కై లాస్‌నగర్: తమ గోడు ఆలకించి సమస్యలు పరి ష్కరించాలని పలువురు బాధితులు గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారి నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ శ్యామలాదేవి స్వీకరించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికా రులకు అందజేస్తూ పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. మున్సిపల్, పంచాయతీ, విద్య, వైద్యం, ఇరిగేషన్, రెవెన్యు తదితర శాఖలకు సంబంధించి ఈ వారం మొత్తం 64 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన.. -
పార్టీ కోసం కష్టపడే వారికే ‘నామినేటెడ్’
కై లాస్‌నగర్: కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు తప్పకుండా గుర్తింపునిచ్చి, తగిన గౌరవం కల్పిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ కా ర్యాలయాన్ని మంత్రి సోమవారం సందర్శించారు. ఆమెకు పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారికి నామి నేటెడ్ పదవులిచ్చి గౌరవిస్తామన్నారు. మరికొందరికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అవకాశం కల్పిస్తామన్నారు. పదవులిస్తేనే పనిచేస్తామనడం సరికాద ని, పనిచేసిన వారికే పదవులందుతాయని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల్లోనూ పార్టీ విజ యానికి కృషి చేయాలన్నారు. ఇందులో పార్లమెంట్ ఇన్చార్జి సుగుణ, తదితరులు పాల్గొన్నారు. ● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క -
‘టీచర్’లో కమలం పాగా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం కమలం వశమైంది. ముందు నుంచీ అనుకున్నట్లుగా మల్క కొమురయ్య ఆ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. తొలిప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం విశేషం. ఓట్ల లెక్కింపు సోమవారం సాయంత్రానికి ప్రారంభం కాగా.. రెండు గంటల్లోనే ఫలితం తేలడం గమనార్హం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. కాగా 897 చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చా యి. గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి కొమురయ్య చేరుకున్నారు. దీంతో తొలిరౌండ్లోనే బీజేపీ మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలిచినట్లయింది. గతంలో పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి టీచర్ సంఘాలు కాకుండా జాతీయ పార్టీ బీజేపీ పోటీ చేసి గెలవడం చర్చనీయాంశంగా మారింది. బండి అభినందనలు రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5,900 ఓట్ల తేడాతో మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారు..’ అని అన్నారు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ వడబోత.. సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వడపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓటర్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో రకరకాల ప్రచారాలు మొదలవడంతో రాత్రి ప్రకటించారు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మి గిలిన 1.50 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం లెక్కింపు మొదలైనా.. తొలి ప్రాధాన్యంలో కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అందులో కోటా ఓట్లు చేరుకునే వరకు ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి. ఆర్వో, సిబ్బందిపై మండిపాటు గ్రాడ్యుయేట్, టీచర్లకు పోటీ పడిన పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో), లెక్కింపు సిబ్బందిపై మండిపడ్డారు. లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రానికి నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలితం కొలిక్కి వచ్చినా.. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. టీచర్స్ ఎమ్మెల్సీకి పోలైన ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆరో పణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవా రం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. తొలి ప్రాధాన్యతతోనే గెలిచిన మల్క కొమురయ్య కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల వడబోత నేటి మధ్యాహ్నానికి మొదలవనున్న లెక్కింపు మందకొడి లెక్కింపుపై అభ్యర్థుల మండిపాటు మల్క కొమురయ్యను అభినందించిన బండి సంజయ్ ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమన్న కేంద్ర సహాయ మంత్రి -
ఎకై ్సజ్ సీఐ విజేందర్కు నగదు పురస్కారం
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ రేండ్ల విజేందర్‌ను నగదు పురస్కారం వరించింది. దేశీదారు కట్టడితో పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. ఈమేరకు హైదరా బాద్‌లోని ఎకై ్సజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ శాఖ రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, జాయింట్ కమిషనర్ ఖురేషీ చేతుల మీదుగా ఆయన రూ.12వేల నగదు పురస్కారం అందుకున్నారు. పలువురు అధికారులు, ఉద్యోగులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
ప్రభుత్వస్థలాన్ని పరిరక్షించాలి
ఆదిలాబాద్ పట్టణం వార్డునంబర్ 23 తాటిగూడలో గల ఓల్డ్ ప్రగతి స్కూల్ సమీపంలో గల నాలాను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారు. అధికారికంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా దారుల్ఉలుమ్ మదర్సా పనులను రాత్రికిరాత్రి ప్రారంభించారు. ఆ పనులు నిలిపివేసి స్థలాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలి. – హిందూవాహిని నాయకులు, ఆదిలాబాద్ 2024 డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. అర్హత లేని ఒకరిని మరాఠీ మీడియం ఎస్జీటీగా నియమించారు. అలాగే మరో అభ్యర్థిని స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో కుచులాపూర్ ప్రాథమిక పాఠశాలకు పోస్టింగ్ ఇచ్చి పక్షం తర్వాత విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. మరాఠీ మీడియంలో ఒకరు ఎస్జీటీకి ఎంపిక కాగా ఆ అభ్యర్థి సర్టిఫికెట్లపై మరొకరు ఫిర్యాదు చేయడంతో ఆ పోస్టింగ్‌ను అబయాన్స్లో పెట్టారు. వీటిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి. – శ్రీకాంత్, టీఎస్‌యూటీఎఫ్, జిల్లా అధ్యక్షుడు మేమంతా దళితబస్తీ కింద గత ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్నాం. మా భూముల్లో బోరుబావులు వేసేందుకు అధికారులు మంజూరు చేశారు. ఎస్సీ కార్పొరేషన్, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే కూడా నిర్వహించారు. ఏడాది దాటినా ఇంకా బోరుబావులు మాత్రం తవ్వడం లేదు. వాటిని వేసి విద్యుత్ సౌకర్యం కల్పించినట్లయితే రెండో పంట కూడా సాగు చేసుకునేందుకు అవకాశముంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకుని మాకు మేలు చేయాలని కోరుతున్నాం. – దళితబస్తీ లబ్ధిదారులు, పిప్పల్‌కోఠి, భీంపూర్ -
ఐసీడీఎస్ పీడీకి అస్వస్థత
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్ర జావాణి కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సబిత ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా చె మటలు పట్టి నోటిమాట రాకపోవడంతో అధికా రులు, ఉద్యోగులంతా ఆందోళనకు గురయ్యా రు. అక్కడే ఉన్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కా ఆమెను పరామర్శించి కుటుంబీకులతో మాట్లాడగా రోజువారి మాత్రలు వేసుకోకపోవడంతో అలా జరిగి ఉంటుందని వివరించారు. అప్పటికే ఆమె తేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ సూచనతో ఆమెను విశ్రాంతి కోసం ఇంటికి పంపించారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరికై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవ ని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజుతో కలిసి ఫ్లెక్సీ షాపు యజమానులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాన కూడళ్లలో ఇష్టానుసారం ఫ్లెక్సీల ఏర్పాటుతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇందులో సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్, ఫణిదర్ పాల్గొన్నారు. -
‘భూసార’ంతో అధిక దిగుబడి
● ఏటా వేసవిలో మట్టి నమూనా పరీక్షలు ● అవగాహన లేమితో దృష్టి సారించని రైతులు ● వినియోగించుకోవాలంటున్న వ్యవసాయ అధికారులు బోథ్: వ్యవసాయ పొలాలు ఏ రకమైన పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి.. భూమిలోని పోషకాల స్థాయి.. ఎలాంటి ఎరువులు ఏ సందర్భాల్లో ఉపయోగించాలనే విషయాలపై రైతులకు అవగాహన కలగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. సరైన సమయంలో వర్షాలు పడకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు తోడవడంతో అన్నదాతలు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో భూసార పరీక్షలు నిర్వహించి వాతావరణ పరిస్థితులకు తగిన పంటలు సాగుచేస్తే ఆశించిన దిగుబడులు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలామంది రైతులు ఈ పరీక్షలు చేయించడం లేదు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో.. అదిలాబాద్ జిల్లాలో 101 క్లస్టర్లు ఉన్నాయి. వాటి పరిధిలో దాదాపు 5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో సుమారు రెండు లక్షల మంది వరకు రైతులు ఉన్నారు. ఏటా వర్షాకాలం, యాసంగిలో పత్తి, సోయా, పెసర, మినుము, జొన్న, మొక్క జొన్న, శెనగ, కంది తదితర పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఎరువులు ఎంత మోతాదులో వాడాలి.. భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉందో తెలియకపోవడంతో సాగులో పెట్టుబడి పెరిగి ఆశించిన దిగుబడి రాని పరిస్థితి. ఫలితంగా అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. అవగాహన లేమితో వెనుకంజ.. రైతులు పంటల సాగులో విరివిగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో సాగు వ్యయం పెరగడంతో పాటు భూమిలో పోషక విలువలు తగ్గుతున్నాయి. నేల స్వభావం తెలియక అవసరానికి మించి క్రిమి సంహారక మందులు వినియోగిస్తున్నారు. భూసార పరీక్షల ప్రాధాన్యంపై సదస్సులు, సమావేశాల్లో వ్యవసాయ శాఖ పదేపదే చెబుతున్నా రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. మరోవైపు భూసార పరీక్షల ఫలితాలను సైతం అధికారులు సమయానికి అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితాల ఆధారంగా.. భూసార పరీక్షలు చేయించుకుని వాటి ఫలితాలను అనుసరించి పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లోని ఉదజని, లవణ సూచిక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ల లభ్యతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అవసరమైన మోతాదులో ఎరువులు వినియోగించవచ్చు. వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను ఆశ్రయించి వారు సూచించిన వంగడాలను ఉపయోగిస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. రైతులు వినియోగించుకోవాలి రైతులు తమ భూమికి సంబంధించిన భూసార పరీక్షలు ఏటా చేయించుకోవాలి. దీంతో భూసారం తెలుస్తుంది. అవసరమైన పోషకాలు అందించి దిగుబడి పెంచుకోవచ్చు. ఏప్రిల్,మే నెలలో ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం ఆయా క్లస్టర్లలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులను లేదా నేరుగా వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలి. ఇవి పూర్తిగా ఉచితం. వారం రోజుల్లో రిపోర్టు అందేలా చర్యలు చేపడుతున్నాం. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలి. – శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయధికారి -
నిమిషం నిబంధన సడలించాలి
ఆదిలాబాద్‌రూరల్: త్వరలో ప్రారంభం కా నున్న ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన సడలించాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ విజ్ఞప్తి చే శారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో తెలంగాణ మాదిగ జేఏసీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 5 నుంచి నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షల్లో నిమిషం నిబంధన సడలించాలని సీఎం రేవంత్‌రెడ్డి, ఉన్నత విద్యాశా ఖ అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. గతేడాది ఈ నిబంధనతో కొంతమంది దూరప్రాంతాలకు చెందిన విద్యార్థులు సకాలంలో కేంద్రానికి చేరుకోలేకపోయారన్నారు. పరీక్ష రాయలేని క్రమంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయన్నారు. ఈ విషయమై పునరాలోచించి కనీ సం15 నిమిషాల వరకు అనుమతి ఇవ్వాలన్నారు. సమావేశంలో ఆదివాసీ కొలాం సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొడ ప సోనేరావు, లహుజీ శక్తి సేన జిల్లా అధ్యక్షుడు గొడకేమధుకర్, నాయకులు సంజయ్ తదితరులున్నారు. -
లెక్కింపు గణాంకాలు
● ‘ప్రాధాన్యత’ దక్కేదెవరికో.. ● నేడు ‘ఎమ్మెల్సీ’ ఓట్ల లెక్కింపు ● కరీంనగర్లో కౌంటింగ్ ● ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ ● విజయంపై ప్రధాన పార్టీల ధీమా కై లాస్‌నగర్: శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికాసేపట్లో షురూ కానుంది. కరీంనగ ర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గెలుపెవరిదో అనే దానిపై అందరి దృష్టి కేంద్రీ కృతమై ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్యనే ఉంటుందని తెలుస్తోంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితం తొలుత వెల్లడి కానుండగా.. పట్టభద్రుల కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశముంది. ఆ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది పోటీ ప డ్డారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి వూ ట్కూరి నరేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన ప్రసన్న హరి కృష్ణ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. స్వతంత్రుల్లో గట్టి పోటీనిచ్చే వారు లేకపోవడంతో పట్టభద్రులు ప్రధాన పార్టీల అభ్యర్థులకే మద్దతునిచ్చినట్లుగా పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తమదే ఆధిక్యత ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నా రు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో బరిలో లేకున్నా బీఎస్పీ నుంచి పోటీ చేసిన హరికృష్ణకు అంతర్గతంగా మద్దతునిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో తొలి ప్రాధాన్యత ఎవరికి దక్కనుందో అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయా పార్టీలతో పాటు ఓటర్లు సైతం తమ మద్దతుదారుల గెలు పునకున్న అవకాశాలు బేరీజు వేసుకుంటున్నారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలు తుందా లేక రెండో ప్రాధాన్యత అవసరం ఉంటుందా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తొలి ఫలితం టీచర్స్ ఎమ్మెల్సీదే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో బీజేపీ తరఫున మల్క కొ మురయ్య బరిలో నిలువగా, ఉపాధ్యాయ సంఘాల్లో ప్రధానమైన పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్, టీఎస్‌యూటీఎఫ్ పక్షాన అశోక్‌కుమార్ బరిలో నిలిచారు. ఇతర అభ్యర్థులు వివిధ సంఘాల మద్దతుతో బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యనే ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే పీఆర్టీయూ మద్దతుదారులే విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లోనూ అదే ఫలి తం పునరావృతం అవుతుందా.. లేక రాజకీయంగా ఉత్సాహంగా ఉన్న బీజేపీ అభ్యర్థి విజయం సాధి స్తాడా.. లేదంటే అశోక్ కుమార్ గెలుస్తాడా అనే దానిపైనా ప్రధాన చర్చ సాగుతోంది. ప్రధాన పార్టీ ల అభ్యర్థుల కంటే ఈ ఎన్నికను ఆయా ఉపాధ్యా య సంఘాలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. ఉపాధ్యాయ ఓట ర్లను కలుస్తూ మద్దతు కోరడంతో పాటు విందులు సైతం ఏర్పాటు చేశాయి. పోలింగ్ సరళిసాగిన తీరు పై ఆయా సంఘాలు తమ అభ్యర్థి గెలుపుపై పక్కా లెక్కలు వేసుకుంటున్నాయి. పట్టభద్రులతో పోల్చి తే ఓటర్లు తక్కువగా ఉన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఫలిత మే ముందుగా వచ్చే అవకాశముంది. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెల్లడవుతుందా లేక రెండో ప్రాధాన్యత ఓట్లు అనివార్యం కానున్నాయా అనేది మరికాసేపట్లో తేలనుంది. మొత్తానికి అటు పట్టభద్రులు, ఇటు టీచర్స్ ఫలితంపై అన్నివర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వేదిక: అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్ మొత్తం టేబుళ్లు: 35 పట్టభద్రుల టేబుళ్లు : 21 టీచర్ల టేబుళ్లు : 14 లెక్కింపు సిబ్బంది: 800 రిజర్వ్ స్టాఫ్: 20 శాతంనియోజకవర్గం బరిలో నిలిచిన అభ్యర్థులు మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం పట్టభద్రుల 56 3,55,109 2,50,328 70.48 ఉపాధ్యాయుల 15 27,088 24,968 92.17సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్– ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయే ట్, టీచర్ స్థానాలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం మొదలు కానుంది. కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాలకు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 35 టేబు ళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నా రు. వీరిలో ఒక మైక్రోఅబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని విని యోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. ఆదివారం మాక్ కౌంటింగ్‌ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. -
అధికారికంగా శ్రీపాదరావు జయంతి●
కై లాస్‌నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం అధికారికంగా నిర్వహించారు. స్థానిక జెడ్పీ సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ పాద రావు చిత్రపటానికి కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శ్రీపాదరావు జీవితం నేటితరానికి ఆదర్శనీయమని కొని యాడారు. స్పీకర్‌గా అసెంబ్లీని నడిపించిన తీరు మరువలేనిది వెల్లడించారు. కార్యక్రమంలో డీవైఎస్వో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు రాథోడ్ పంచపూల, శైలజ తదితరులు పాలొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
మహిళా సంఘాలకు ‘సౌరశక్తి’
● జిల్లాలో రెండు యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు ● నాలుగు గ్రామ సమాఖ్యల ఎంపిక ● స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కై లాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లో(ఎస్‌హెచ్‌జీ)ని మహిళలు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కుసుమ్ పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. 33కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో సోలార్ (సౌరశక్తి) ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ ఉ త్పత్తి పెంచడంతో పాటు వారి అభ్యున్నతికి అండగా నిలవాలని నిర్ణయించింది. జిల్లాలో పది యూనిట్ల లక్ష్యం కాగా తొలి విడతగా రెండు ఏ ర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేపట్టింది. వాటికి సంబంధించిన డీపీఆ ర్ సిద్ధమవుతోంది. అంతర్జాతీయ మహిళా ది నోత్సవం సందర్భంగా పనులు ప్రారంభించా లని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రెండు ప్లాంట్లు ఇలా.. జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన రెండు సోలార్ప్లాంట్లను ఇంద్రవెల్లి, తలమడుగులో ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు ఆసక్తి, ఉత్సాహంగా పనిచేసే ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్, పిట్టబొంగరంతో పాటు తలమడుగు మండలంలోని కజ్జర్ల, దేవాపూర్ ఎస్‌హెచ్‌జీలను ఎంపిక చేశారు. ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు దస్నాపూర్‌లోని సర్వేనంబర్ 255లో గల నాలుగు ఎకరాల స్థలాన్ని గుర్తించారు. తలమడుగు మండలానికి సంబంధించి కజ్జర్ల శివారు సర్వేనంబర్ 141లోని ఎనిమిది ఎకరాల స్థలాన్ని గుర్తించారు. రెవెన్యూ, డీఆర్డీఏ, విద్యుత్, రెడ్కో, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేపట్టి ఎంపిక చేశారు. ఈ రెండు స్థలాలను ఆ గ్రామ సమాఖ్యలకు కేటాయిస్తూ ప్రత్యేక ఐడీ(రిజిస్ట్రేషన్) నంబర్లను కేటాయించారు. అలాగే ప్లాంట్ నుంచి సమీపంలోని సబ్‌స్టేషన్ వరకు ప్రత్యేకంగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సబ్‌స్టేషన్‌కు మళ్లించి రైతులకు అందజేయనున్నారు. 25ఏళ్ల పాటు ప్రాజెక్ట్ నిర్వహణను ఆయా సంఘాలే పర్యవేక్షించాల్సి ఉంటుంది. తద్వారా ఏటా ఆయా సంఘాలకు రూ.లక్షల్లో ఆదాయం సమకూరి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడనుంది. ప్రభుత్వానిదే ప్రత్యేక చేయూత ఒక్కో ప్లాంట్‌ను రూ.3కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం 30శాతం సబ్సిడీ అందజేయనుంది. బ్యాంకు రుణాల ద్వారా ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్లకు లబ్ధిదారు వాటాగా రూ.70లక్షలను ఆ సమాఖ్య సంఘాలు తొలుత చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆదిలాబాద్ జిల్లా పేదరికంతో పాటు వెనుకబడినది కావడంతో ప్రభుత్వం ప్రత్యేక చేయూత అందించాలని నిర్ణయించింది. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సీఐఎఫ్) నుంచి ప్రభుత్వమే ఆయా సంఘాలకు రుణ ప్రతిపాదికన వాటిని అందజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను సిద్ధం చేస్తున్నారు. అది పూర్తయ్యాక అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 8న పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ డీపీఆర్ సిద్ధం కానట్లైతే ప్రారంభంలో జాప్యమయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక భారం తగ్గించేలా... జిల్లాలో ప్రాజెక్టులు, కాలువలు అంతగా లేకపోవడంతో వ్యవసాయ ఆధారితంగానే పంటల సాగు జరుగుతుంది. ఇందుకు యాసంగిలో సాగు చేసే రైతులు విద్యుత్ ఆధారిత బోరు మోటార్ల ద్వారా పంటలకు నీటినందిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటికి విద్యుత్ సరఫరా ఉచితంగా అందజేస్తుంది. ఇందుకుగాను ప్రభుత్వంపై ప్రతినెల రూ.కోట్లలో ఆర్థిక భారం పడుతుంది. దీన్ని అధిగమించడంతో పాటు మహిళలకు ఆర్థిక చేయూతనందించేలా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తోంది. ఇందులో ఉత్పత్తి అయ్యే యూనిట్‌కు రూ.3.13పైసల చొప్పున ప్రభుత్వమే తిరిగి కొనుగోలు చేస్తోంది. దీంతో విద్యుత్ ఖర్చు తక్కువై ప్రభుత్వానికి ఆర్థికభారం తగ్గనుండటంతో పాటు మహిళలకు ఉపాధి లభించనుంది. తొలివిడతలో రెండు ఏర్పాటు జిల్లాలో పది సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలివిడతగా రెండు ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న గ్రామ సమాఖ్యల గుర్తింపుతో పాటు వాటి ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కూడా ఎంపిక చేశాం. అయితే ప్రభుత్వం నుంచి వాటి ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ అందాల్సి ఉంది. అది వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుంగా పనులు ప్రారంభిస్తాం. ఇది మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడనుంది.– రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
కోచింగ్.. ఇక భారమే!
● స్విమ్మింగ్‌పూల్ నిర్వహణ ప్రైవేట్‌కు.. ● టెండర్ ద్వారా అప్పగించేందుకు రంగం సిద్ధం ● ఇకపై వారు నిర్ణయించేదే ఫీజు ● స్విమ్మర్లపై పడనున్న ఆర్థిక భారంత్వరలో టెండర్ నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే స్విమ్మింగ్‌పూల్ నిర్వహణకు సంబంధించి టెండర్ నిర్వహణ ఉంటుంది. ఓపెన్ యాక్షన్ పద్ధతిలో సాగే ఈ టెండర్లో ఏడాదికి రూ.10.89లక్షలు అంచనా వ్యయం రూపొందించడం జరిగింది. రూ.2లక్షల ఈఎండీ చెల్లించి టెండర్లో పాల్గొనాలి. పూర్తి విధి విధానాలను త్వరలో ప్రకటిస్తాం. – తిరుపతి, డీఈ, మున్సిపాలిటీ అనుభవజ్ఞులతో కోచింగ్ ఇచ్చేలా చూస్తాం ప్రైవేట్ వ్యక్తులకు స్విమ్మింగ్‌పూల్ నిర్వహణను అప్పగిస్తున్నా అనుభవజ్ఞులైన స్విమ్మింగ్ కోచ్‌ల ద్వారా శిక్షణ ఇచ్చేలా చూస్తాం. ఇవీ టెండర్ నిబంధనలో ఉన్నాయో లేవో తెలియవు. అయితే మున్సిపాలిటీ నుంచి టెండర్లు నిర్వహించి సక్సెస్‌పుల్ బిడ్డర్ ఎవరనేది మాకు తెలియపరుస్తారు. హైజనిక్ పద్ధతిలో ఈత కొలను నిర్వహణను చేసేలా చూస్తాం. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో సాక్షి, ఆదిలాబాద్: వేసవి వచ్చిందంటే జిల్లా కేంద్రంలోని స్టేడియంలో గల స్విమ్మింగ్‌పూల్ సందడిగా మారుతోంది. సెలవుల్లో చిన్నారులు ఈత నేర్చుకోవాలనే కుతూహలంతో ఉంటారు. పెద్దలు సైతం వేసవి తాపం నుంచి సేదతీరేందుకు స్విమ్మింగ్ వైపు ఆసక్తి కనబరుస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో స్విమ్మింగ్‌పూల్ నిర్వహణ ఉంటే ఫీజులు అదుపులో ఉండేవి. అయితే ఇకపై ఆ పరిస్థితి మారనుంది. అధికారికంగా టెండర్ ద్వారా ఈ స్విమ్మింగ్‌పూల్ నిర్వహణను కాంట్రాక్టర్ చేతిలో పెట్టనున్నారు. దానికి రంగం సిద్ధమైంది. ఆ కాంట్రాక్టర్ ఇష్టారీతిన ఫీజులు నిర్దేశించే అవకాశముంది. దీంతో స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకునే అనేక మంది చిన్నారులకు ఇది ప్రతిబంధకంగా మారే పరిస్థితి లేకపోలేదు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నాలుగు దశాబ్దాలుగా స్విమ్మింగ్‌పూల్ ని ర్వహణ కొనసాగుతుంది. మొదట్లో కోచ్‌ను నియమించి చిన్నారులకు శిక్షణ ఇచ్చేవారు. ఏటా వేసవి వచ్చిందంటే సెలవుల్లో వందలాది చిన్నారులు కోచింగ్ కోసం బారులు తీరేవారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో పలువురు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ కనబరిచారు. జిల్లాకు వన్నె తెచ్చారు. ఇదంతా ఒకప్పటి మాట. గడిచిన దశాబ్దన్నరగా ఈ స్విమ్మింగ్ పూల్ పూర్తిగా నిరాదరణకు గురవుతోంది. సరైన కోచ్‌లను నియమించకపోవడం, దాని నిర్వహణను అంతగా పట్టించుకోకపోవడంతో చిన్నారులు కోచింగ్లా కాకుండా ఏదో వేసవిలో ఆట విడుపుగా మాత్రమే ఇక్కడ స్విమ్మింగ్ పరిమితంగా మారింది. అంతే కాకుండా ఈత మంచి ఎక్సర్సైజ్గా భావించి పలు వురు యువకులు, పెద్ద వయ స్సు వారు ఇందులో స్విమ్మింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒకలెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా వ్యవహారం మారుతోంది. టెండర్ ద్వారా ఈ స్విమ్మింగ్‌పూల్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించనుండటంతో ఇకపై నామమాత్రపు ఫీజులు ఉండవు. అలాగే దీని ద్వారా ఆదాయం ఆశించే కాంట్రాక్టర్ కోచ్‌లను నియమించి శిక్షణ ఇస్తాడనుకోవడం పొరపాటే అవుతోంది. మొత్తంగా ఆదిలాబాద్ స్విమ్మింగ్‌పూల్ కల తప్పిపోనుంది. టెండర్‌కు రంగం సిద్ధం ఈ స్విమ్మింగ్‌పూల్‌ను రెండేళ్ల క్రితం ఇందులో శిక్షణ ఇచ్చే ఓ ప్రైవేట్ కోచ్‌కు లీజుకు ఇచ్చారు. అప్పుడు టెండర్ విధానంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. అయితే ఆ ప్రైవేట్ వ్యక్తి స్విమ్మింగ్ కోచ్ కావడంతో అంతగా విమర్శలు రాలేదు. అంతే కాకుండా గతం నుంచి చిన్నారులకు కొనసాగుతు న్న శిక్షణను కొనసాగించడంతో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. అప్పట్లో ఏడాదికి రూ.9.90లక్షలు చెల్లించేలా ఈ కోచ్‌కు స్విమ్మింగ్‌పూల్ నిర్వహణను అప్పగించారు. అయితే తాజాగా దీని నిర్వహణను తొలిసారి అధికారికంగా టెండర్ నిర్వహించి ప్రైవేట్ వ్యక్తులకు ఏడాది పాటు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపెన్ టెండర్ విధానంలో ఏడాదికి రూ.10.89లక్షలు దీని అంచనా వ్యయంగా రూపొందించారు. అంత కంటే అధికంగా కోట్ చేసిన వారికి నిర్వహణను అప్పగిస్తామన్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్ చేస్తుండగా ఈ బాధ్యతను మున్సిపాలిటీకి అప్పగించారు. ప్రమాణాలే లేవు ఓపెన్ టెండర్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధమైనప్పటికీ ఈ పద్ధతిలో ఏమైన ప్రమాణాలు, నిబంధనలు పెట్టారా అంటే అలాంటివి లేనేలేవు. ఎవరు ఎక్కువ ధర కోట్ చేస్తే ఆ కాంట్రాక్టర్‌కు నిర్వహణను అప్పగించనున్నారు. తద్వారా ఇది పూర్తిగా వ్యాపార ధోరణిగా మార్చేస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఒకప్పుడు కలెక్టర్‌గా కొనసాగిన వారు ఇక్కడ స్విమ్మింగ్ శిక్షణకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు. ఫలితాలు కూడా తదనుగుణంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కలెక్టర్ ఈ విషయంలో దృష్టి సారించాలనే అభిప్రాయం పలువురు నుంచి వ్యక్తమవుతుంది. -
ఆదిలాబాద్ కా అమితాబ్.. ఎంత పొడుగున్నాడ్రా బాబూ!
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ కా అమితాబ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బడిలో చదివే విద్యార్థుల ఎత్తు సాధారణంగా 5 అడుగుల వరకు ఉంటుంది. కానీ ఒక విద్యార్థి ఏకంగా 6.8 అడుగుల ఎత్తుతో ఆకర్షణగా నిలిచాడు. ఆదిలాబాద్ పట్టణం (Adilabad Town) బొక్కల్‌గూడకు చెందిన వన్నెల సుజాత, వినోద్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు హేమంత్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల (Govt School) నంబర్–2లో పదో తరగతి చదువుతున్నాడు.ఈ విద్యార్థి తాత నందు 6.5 అడుగుల ఎత్తు, తల్లి సైతం అంతే ఎత్తులో ఉంటారు. హేమంత్ చెల్లి పదో తరగతి చదువుతోంది. హేమంత్ (Hemanth) 7వ తరగతిలో 5 అడుగుల ఎత్తులో ఉండగా, 8వ తరగతిలో 6 అడుగులు, 9వ తరగతిలో 6.5, ప్రస్తుతం పదో తరగతిలో 6.8 అడుగుల ఎత్తుకు పెరిగాడు. దీంతో స్నేహితులతోపాటు ఇంటి చుట్టుపక్కల వారు, బంధువులు హేమంత్‌ను జూనియర్ అమితాబ్‌గా పిలుస్తున్నారు. చివరి బెంచీలో కూర్చుంటా..అందరికంటే పొడవుగా ఉండటంతో తరగతి గదిలో చివరి బెంచీలో కూర్చుంటాను. ఆటోలో కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. శుభకార్యాలకు వెళ్లినప్పుడు నాతో బంధువులు, మిత్రులు సెల్ఫీలు దిగుతున్నారు. – హేమంత్ఈఏపీ సెట్‌కు తొలిరోజు 5,010 దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్‌కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారం మొదలైంది. తొలి రోజు 5,010 దరఖాస్తులు వచ్చినట్టు సెట్ కోకన్వీనర్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ కె.విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి 3,116, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ విభాగానికి 1,891, రెండు విభాగాలకు రాసే వారి 3 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. ఓయూలో ముగిసిన పీహెచ్డీ దరఖాస్తుల స్వీకరణ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్–2025 దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. కేవలం 456 సీట్లకు 9000 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.2000 అపరాధ రుసముతో ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల సంఖ్యను పెంచి.. నెలరోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించాలని తెలంగాణ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జి.విజయ్ నాయక్ శనివారం పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగా రెడ్డికి వినతి పత్రం అందజేశారు. చదవండి: ఊరు, ఇల్లు వదిలి.. అక్కడ అందరిదీ అదే పరిస్థితికాగా, ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి 65 ఏళ్లకు పెరిగినా.. పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచేందుకు ఓయూ అధికారులు సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసినా పీహెచ్డీ సీట్ల పెంపుపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
లెక్కింపు పెద్ద కథే..!
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 3న కరీంనగర్లో నిర్వహించనున్నారు. ఫలితం తేలేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఆదివారం : 6:18సోమవారం : 5:17ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20258లోu ● డీఎస్సీ 2024 నియామకాల్లో భాగంగా బేల మండలంలో ఎస్జీటీ మరాఠీ మీడియంలో ఓ అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారు. సదరు అభ్యర్థి తెలుగు మీడియంలో పదో తరగతి, ఇంటర్, తర్వాత డీఎడ్ పూర్తి చేశాడు. మళ్లీ ఓపెన్ స్కూల్ విధానం మరాఠీ మీడియంలో టెన్త్, ఇంటర్ చదివాడు. నిబంధనల ప్రకారం మళ్లీ డీఎడ్ చేస్తేనే పోస్టింగ్ కల్పించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆ అభ్యర్థికి పోస్టింగ్ కల్పించారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులకు ఫిర్యాదు అందగా తమ కారణంగానే తప్పిదం జరిగిందని అనుకున్నారు. ఈ విషయమై డీఎస్‌ఈకి లేఖ రాశారు. సదరు అభ్యర్థికి వేతనం చెల్లించవద్దని సంబంధిత మండల అధికారికి మౌఖికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సదరు అభ్యర్థి నాలుగు నెలల నుంచి వేతనం చెల్లించడం లేదని అధికారులకు వినతిపత్రం సమర్పించగా.. ఇప్పటికీ ఎటూ తేల్చలేదు. ● ఉట్నూర్‌కు చెందిన ఓ అభ్యర్థి ఉర్దూ మీడియం ఎస్జీటీ పోస్టుకు ఎంపికయ్యారు. పదో తరగతి, ఇంటర్, డీఎడ్ తెలుగు మీడియంలో సదరు అభ్యర్థి చదివారు. ఆ తర్వాత డిగ్రీలో ఓ సబ్జెక్టు ఉర్దూలో చదివారు. అయితే ఈ అభ్యర్థికి అర్హత లేదని విద్యాశాఖ పోస్టింగ్ కల్పించలేదు. సర్టిఫికెట్లు పరిశీలించిన అధికారి ఆమెను అనర్హురాలిగా చూపించారు. ఈ విషయమై డీఎస్‌ఈకి లేఖ రాశారు. అయితే మరాఠీ మీడియం అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వగా, ఉర్దూ మీడియం అభ్యర్థికి పోస్టింగ్ కల్పించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ● ఎస్జీటీ మరాఠీ మీడియంలో ఓ అభ్యర్థి పోస్టుకు ఎంపికయ్యారు. ఇదే విభాగంలో ఓ అభ్యర్థి ఆయన సర్టిఫికెట్లు సరిగా లేవని ఫిర్యాదు చేయడంతో ఆ అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వకుండా అభియన్స్‌లో పెట్టారు. అక్టోబర్ 16న ఈ ప్రక్రియ జరగగా, ఇంతవరకు విచారణ పూర్తి కావడం లేదు. మొదట ఓ ఎంఈవోను విచారణ అధికారిగా నియమించగా, అంతా సరిగానే ఉన్నాయని నివేదిక సమర్పించారు. ఆ తర్వాత ఓ పీజీ హెచ్ఎంను విచారణ అధికారిగా నియమించగా ఆయన మహారాష్ట్రకు వెళ్లి విచారణ చేపట్టారు. అక్కడి ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి మహారాష్ట్రలో చదివినట్లు ద్రువీకరించారు. వారి నుంచి పత్రాన్ని తీసుకొచ్చి అధికారులకు సమర్పించారు. మళ్లీ ఓ హెచ్ఎంను విచారణ అధికారిగా నియమించగా, విచారణ చేపట్టేందుకు నిరాకరించారు. దీంతో మరో హెచ్ఎంను విచారణకు నియమించారు. దాదాపు ఐదు నెలల నుంచి ఈ తంతు ముందుకు సాగడం లేదు. ● మరో అభ్యర్థి ఫిజికల్ సైన్స్, ఎస్ఏ తెలుగుకు ఎంపిక కాగా, ఆయన ఇష్టమున్న సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ కోరుకున్నప్పటికీ ఆయనకు ఆ పోస్టింగ్ ఇవ్వకుండా భయభ్రాంతులకు గురిచేసి తెలుగు సబ్జెక్టును కట్టబెట్టారు. స్పెషల్ డీఎడ్ అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఆయన వారం పాటు విధులు నిర్వహించిన అనంతరం రోస్టర్‌లో తప్పిదం జరిగిందని మళ్లీ ఆయనను తప్పించి మరో అభ్యర్థికి పోస్టింగ్ కల్పించారు. ఇలా డీఎస్సీలో అనేక పొరపాట్లు, తప్పిదాలు కొన్ని కావాలనే చేసినట్లు అభ్యర్థులు విమర్శి స్తున్నారు. అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఐఈవోగా జాదవ్ గణేశ్కుమార్ఆదిలాబాద్టౌన్: జిల్లా ఇంటర్మీడియెట్ (ఎఫ్ఏసీ) అధికారిగా జాదవ్ గణేశ్‌కుమార్‌ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కృష్ణ ఆదిత్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు డీఐఈవోగా పనిచేసిన రవీంద్రకుమార్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో జాదవ్ గణేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. న్యూస్‌రీల్ -
జిల్లా కోర్టులో డిస్పెన్సరీ
● ప్రారంభించిన హైకోర్టు జడ్జి ఆదిలాబాద్‌టౌన్: కోర్టుకు వచ్చే నేరస్తులతో పాటు కక్షిదారులు, సిబ్బందికి ఆరోగ్య సమస్యలు తలెత్తిన సమయంలో డిస్పెన్సరీ దోహదపడుతుందని హైకోర్టు జడ్జి రేణుక యార అన్నారు. జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన డిస్పెన్సరిని శనివారం ప్రారంభించారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్క నాటారు. ముందుగా పెన్‌గంగ గెస్ట్‌హౌజ్‌లో జిల్లా జడ్జి ప్రభాకర రావు, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం తదితరులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. డిస్పెన్సరీలో అందుబాటులో ఉండే వైద్య సేవల వివరాలను కలెక్టర్ జడ్జికి వివరించారు. అనంతరం జడ్జిలు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జి ని ఘనంగా సన్మానించారు. వారి సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో జడ్జిల పోస్టు ఖాళీల భర్తీకి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రభాకరరావు, జడ్జిలు శివరాం ప్రసాద్, ప్రమీళ జైన్, దుర్గారాణి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, పీపీలు, న్యాయవాదులు పాల్గొన్నారు. సంక్షేమ ఫలాలు సద్వినియోగం చేసుకోవాలిఆదిలాబాద్టౌన్: కార్మికశాఖ ద్వారా అందే సంక్షేమ ఫలాలను భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు గాజెంగుల రాజు అన్నారు. ఈనెల 11న జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాసభను జయప్రదం చేయాలని జిల్లా కేంద్రంలో శనివారం ప్రచారం నిర్వహించారు. -
కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): శనగ విక్రయాల కోసం వచ్చే రైతులకు మార్కెట్ యార్డులో మద్దతు ధర లభిస్తుందని ఏడీఏ అష్రఫ్ అలీ అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో నాఫెడ్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన శనగ పంట కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు యార్డుకు వచ్చేటప్పుడు పట్టా పాసు బుక్‌తో పాటు ఆధార్ జిరాక్స్‌లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అలాగే పంట నమోదు వివరాలు ఆన్లైన్లో మరో సారి పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. తేమ 14 శాతం మించకుండా చూసుకోవా లన్నారు. కనీస మద్దతు ధర 5,650 ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో పీఏసీఎస్ బ్యాంక్ మేనేజర్ జితేందర్‌రెడ్డి, సహకార సంఘం సీఈవో గంగన్న, రైతులు పాల్గొన్నారు. -
పెనవేసుకున్న అనుబంధం!
● సలీం కోలుకోవాలని యాగం ● హనుమాన్ ఆలయంలో శ్యాంపూర్వాసుల పూజలు ఉట్నూర్‌రూరల్: ఎప్పుడో ఆ ఊరిలో విధులు నిర్వర్తించిన ఆ వ్యక్తి ఆ గ్రామస్తుల సుఖ దుఃఖాల్లో మ మేకమయ్యాడు. మూడు దశాబ్దాల క్రితం అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లినా.. ఆ ఊరి వారిని మా త్రం మరువలేదు. ఆ గ్రామస్తులు కూడా అతడితో ఉన్న అనుబంధాన్ని కొనసాగించారు. సీన్ కట్ చేస్తే.. ముస్లిం వర్గానికి చెందిన ఆ వ్యక్తి ప్రస్తుతం అనారోగ్యం బారిన పడడంతో ఆ ఊరంతా కలిసి అతడు కోలుకోవాలని యాగం నిర్వహించారు. ఈ ఘటన ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో చోటు చే సుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్‌సలీం 30 ఏళ్ల క్రితం ఉట్నూర్,ఇంద్రవెల్లి మండలాల్లోని పోలీసుస్టేషన్లలో హోంగార్డుగా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో గ్రామస్తులతో మమేకమయ్యాడు. కుటుంబ సభ్యుడిలా అందరితో ఆత్మీయంగా వ్యవహరించాడు. 30 ఏళ్ల క్రితం ఇక్కడ విధులు మానేసిన సలీం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండిపోయాడు. గ్రామస్తులతో ఉన్న పరిచయాల కారణంగా ఇక్కడి నుంచి అనారోగ్య సమస్యతో వెళ్లిన వారంతా ఆయన్నే సంప్రదించేవారు.ఆయన కూడా వారి సమస్య తీరే వరకు దగ్గరుండి అన్నీ చూసుకునేవాడు.అయితే సలీం ఇటీవల అనారోగ్యం బారిన పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆయ న ఆరోగ్యం కుదుటపడాలని స్థానిక హనుమాన్ ఆ లయంలో శనివారం పూజలు చేసి యాగం నిర్వహించారు. కులమతాలకతీంగా పెనవేసుకున్న అ నుబంధాన్ని చాటేలా ఆ ఊరి వారంతా చేపట్టిన ఈ కార్యం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో గ్రా మస్తులు వెంకట్, బాలాజీ తదితరులుపాల్గొన్నారు. -
● అర్హులైన అభ్యర్థులకు అన్యాయం ● మరాఠీ మీడియంలో ఓ అనర్హుడికి పోస్టింగ్ ● ఉర్దూ మీడియంలో అర్హత లేదంటూ ఒకరిని రిజెక్ట్ .. ● మరో అభ్యర్థి విషయంలో విచారణ పేరిట జాప్యం ● విద్యాశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు
ఆదిలాబాద్‌టౌన్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటు న్నా విద్యాశాఖ తీరులో మార్పు రావడం లేదు. ఆ శాఖలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెరిట్ సాధించినా పలువురికి అన్యాయం జరుగుతుందనే ఆరోపణలున్నాయి. అనర్హులుగా ఉన్నప్పటికీ కొందరికి పోస్టింగ్ కల్పించడంపై ‘మామూలు’గా వ్యవహరించారనే ఆరోపణలు లేకపోలేదు. అధికారులు, ఉద్యోగుల తప్పిదమో, లేక కావాలనే ఇలా చేశారో.. అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పకడ్బందీగా చేపట్టాల్సిన అధికారులు నామ్‌కే వాస్తే జరిపి చేతులు దులుపుకున్నారు. దీంతో తుది జాబితాలో అనర్హులకు చోటు దక్కిందని చెబుతున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళితే మిన్నకుండిపోతున్నారు. చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదివరకు జిల్లాలో పనిచేసిన ఉన్నతాధికారి అండదండలు ఉండడంతో తాము ఏమి చేసినా చెల్లుతుందనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు చిన్నపాటి పొరపాట్లు చేస్తే సస్పెండ్ వేటువేసే అధికారులు డీఎస్సీ 2024 నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నా నోరు మెదపకపోవడం వెనుక ఆంతర్యమేమిటో తెలియడం లేదు. విచారణ జరిపించి అర్హులైన వారికి పోస్టింగ్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇష్టారీతిన కౌన్సెలింగ్.. డీఎస్సీ కౌన్సెలింగ్ ఇష్టారీతిన చేపట్టారని పలువురు అభ్యర్థులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను చేపట్టింది. విద్యాశాఖ అధికారులు, ఉద్యోగుల అక్రమాలతో అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. వీటిని సరిదిద్దేందుకు మరికొన్ని తప్పిదాలు చేయడం వారికి పరిపాటిగా మారింది. ఇన్ని తప్పిదాలు జరిగినప్పటికీ సదరు ఉద్యోగులు సర్టిఫికెట్లను పరిశీలించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో తెలియరావడం లేదు. తప్పిదాలను సవరించి అర్హులైన వారికి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కౌన్సెలింగ్‌లో అక్రమాలు జరిగాయని ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆందోళన (ఫైల్)సమగ్ర విచారణ చేపట్టాలి డీఎస్సీ 2024లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలి. సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు, నియామకాలు చేపట్టిన ఉద్యోగులు, అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారికి పోస్టింగ్ ఇవ్వాలి. నిరుద్యోగులకు న్యాయం చేయాలి. లేనట్లయితే ఆందోళనలు చేపడతాం. – శ్రీకాంత్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డీఎస్‌ఈకి లేఖ రాశాం బేలకు చెందిన ఎస్జీటీ విషయంలో ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆయనకు సంబంధించిన విషయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు లేఖ రాశాం. అలాగే ఉర్దూ మీడియం ఎస్జీటీ అభ్యర్థికి సంబంధించి కూడా డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు. – ప్రణీత, డీఈవో -
మూడు రోజుల్లో ప్రతిపాదనలు అందించాలి
● కలెక్టర్ రాజర్షి షాకై లాస్‌నగర్: నీతి అయోగ్ కింద ఎంపికై న నార్నూర్ బ్లాక్‌కు డెల్టా ర్యాంకింగ్ నిధులు విడుదలైనట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆ బ్లాక్ పరిధిలో చేపట్టే విద్య, అంగన్వాడీ, సమాజ అభివృద్ధి కార్యక్రమాల పనులకు సంబంధించిన ప్రతిపాదనలు మూడు రోజుల్లోగా అందజేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్వో ప్లాంట్, ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు స్థలాలను సేకరించాలన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు, ప్లే మెటీరియల్, న్యూట్రిషన్ గార్డెన్, డిజిటల్ క్లాస్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు చర్చించి వివరాలతో ప్రతిపాదనలను అందించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ యువరాజ్ , ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్, ఐసీడీఎస్ పీడీ సబిత, ట్రెబల్ వెల్ఫేర్ డీడీ వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది గ్రామాల్లో 4జీ మొబైల్ టవర్ల నిర్మాణంబీఎస్ఎన్ఎల్ సేవల విస్తరణలో భాగంగా జిల్లాలోని తొమ్మిది గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో 4జీ మొబైల్ టవర్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో శని వారం సమీక్ష నిర్వహించారు. అసోదబుర్కి, గణేశ్‌పూర్, గేర్జాయి, మాన్కాపూర్, కేశవగూడ, డెడ్రా, నాగా పూర్, సావ్రి, యాపల్‌గూడ గ్రామాల్లో టవర్ల నిర్మాణానికి అవసరమైన 200 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ కనెక్షన్ అందించే దిశగానూ చర్యలు చేపట్టాలన్నారు. ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు అవసరమైన అనుమతులు పొందేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ పనుల సమన్వయం కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీనీ కలెక్టర్ అభిగ్యాన్ తదితరులున్నారు. -
బోథ్‌లో ఉద్రిక్తత
● యువతిని తల్లిదండ్రులకు అప్పజెప్పాలంటూ ఆందోళన ● పోలీస్‌స్టేషన్ ఎదుట బీజేపీ, హిందూ సంఘాల ధర్నా బోథ్: ఓ వర్గానికి చెందిన యువకుడు ప్రేమ పేరి ట తీసుకెళ్లిన యువతిని తిరిగి తల్లిదండ్రులకు అ ప్పగించాలంటూ బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం, హిందూవాహని నాయకుడు మహేందర్‌తో పాటు సుమా రు 300 మంది యువకులు స్టేషన్ ఎదుట భైఠాయించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బోథ్‌కు చెందిన ఓ యువతి మిస్సింగ్ కావడంతో కుటుంబీకులు ఫిబ్రవరి 26న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోపోలీసులు విచారణ చేపట్టి యువతి జాడ తెలుసుకున్నారు. గతనెల 28న బోథ్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సదరు యు వతి మండల కేంద్రానికి చెందిన ఓ వర్గానికి చెందిన యువకుడితో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అంద డంతో బీజేపీ, హిందూ సంఘాల నాయకులు సాయంత్రం స్టేషన్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బ్రహ్మానంద్ మాట్లాడుతూ, పో లీసులు సదరు యువతిని గత నెల 28న రాత్రి ఆది లాబాద్‌లోని సఖీ కేంద్రానికి పంపుతామని చెప్పి పంపలేదన్నారు. వెంటనే ఆమెను వారి తల్లి దండ్రులకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. భారీగా యువకులు తరలిరావడంతో స్టేషన్ ఎదు ట ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. సమాచారం అందుకున్న ఉట్నూర్ డీఎస్పీ నా గేందర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు. స్థానిక ఎస్సై ప్రవీణ్‌కుమార్ సాయంత్రం సదరు యువతిని బోథ్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ విలేకరులతో మాట్లాడారు. యువతిని తల్లిదండ్రులకు అప్పజెప్పామని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వ్యవహరించాలన్నారు. అలాగే సదరు యువకుడు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వయస్సు మార్పిడి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై విచారణ చేపడతామన్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వరరావు ఉన్నారు. -
ఆధ్యాత్మికతతో శాంతియుత జీవనం
బజార్హత్నూర్: ఆధ్యాత్మికత పెంపొందిస్తే శాంతియుత జీవనం అలవడుతుందని స్థానిక ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని జాతర్ల గ్రామంలో గల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈనెల 3న ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామంలో నవజ్యోతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఇందులో వెంకన్న యాదవ్, గణేశ్, రాజేశ్వర్, ఈశ్వర్, రవి, చందన్, కష్ణారావు, గంగారాం, రమణ, శంకర్, తదితరులున్నారు -
నీటి తిప్పలు
● పగిలిన ప్రధాన పైపులైన్ ● 17 కాలనీలకు నిలిచిన నీటి సరఫరా కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని 17 కాలనీలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. పట్టణ శివారు లాండసాంగ్వి పంప్‌హౌస్ నుంచి మున్సిపల్ పరి ధిలోని పలు కాలనీలకు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ తిర్పెల్లి సమీపంలో పగిలిపోయింది. దీంతో నీటి సరఫరాకు బ్రేక్ పడింది. ఫలితంగా తిర్పెల్లి, మహాలక్ష్మివాడ, భాగ్యగనర్, తాటిగూడ, క్రాంతినగర్, చిల్కూరి లక్ష్మినగర్, సుందరయ్యనగర్, గాంధీనగర్, బ్రాహ్మణవాడ, ఖిల్లా తదితర 17 కాలనీలకు మూడు రోజులుగా నీటి సరఫరా కావడం లేదు. ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్యాంకర్ల ద్వారా బల్దియా అధికారులు నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. పైగా ట్యాంకర్ కోసం పనులన్నీ వదులుకుని ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు. కాగా ఈ విషయమై మున్సిపల్ డీఈ తిరుపతిని సంప్రదించగా.. మరమ్ముతులకు సంబంధించిన సామగ్రి అందుబాటులో లేకపోవడంతో మంచిర్యాల నుంచి తెప్పిస్తున్నామని పేర్కొన్నారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో రవీంద్రకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఐఈవో కార్యాలయంలో సీఎస్, డీవోలతో సమావేశమై మాట్లాడారు. ఈనెల 5నుంచి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 31 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫస్టియర్ పరీక్షలకు 9,108 మంది విద్యార్థులు, సెకండియర్ పరీక్షలకు 9,774 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. రెండు సిట్టింగ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్షాకేంద్రాల్లో అన్ని వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఓటీపీ ద్వారా హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ప్రిన్సిపాల్లు, గణేశ్‌జాదవ్, భగవాండ్లు, సూర్యప్రకాశ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. వీసీ ద్వారా సీఎస్ సమీక్ష కై లాస్‌నగర్: ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్పై సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ నెల 5నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. నిబంధనల గురించి వివరించి తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. వీసీలో సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, ఆర్డీవో వినోద్ కుమార్, విద్యుత్, ప్రిన్సిపాల్, డీఎల్పీవో, డీఎంహెచ్‌వో, కలెక్టరేట్ ఏవో తదితరులు పాల్గొన్నారు. -
సమీకరణాలు మారినట్టే..
● కాంగ్రెస్‌లో పదవుల పందేరం ● తుది దశకు చేరిన వ్యవహారం ● పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రాకతో మార్పులు జరిగే అవకాశం!సాక్షి, ఆదిలాబాద్: డీసీసీ అధ్యక్ష పదవికి నాయకుడి ఎంపిక తుది దశకు వచ్చింది. కొద్ది రోజుల్లోనే డీసీసీ పీఠం ఎవరిదనేది తేలిపోనుంది. ఈ దశలో సమీకరణాలు మారనున్నట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుడి నియామకం ఇక ఆగిపోయినట్టే. మళ్లీ పూర్తిస్థాయి పరిశీలన తర్వాత కొత్త అధ్యక్షుడు ఎవరనేది తేలనుందని పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న దీపాదాస్ మున్షిని ఇటీవల అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఆ పార్టీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్‌ను నియమించడం, ఆమె శుక్రవారం రాష్ట్రానికి చేరుకోవడంతో జిల్లా పార్టీలోనూ ఆమె ప్రభావంపై జోరుగా చర్చ సాగుతోంది. పరిశీలన తర్వాతే నిర్ణయం! ప్రధానంగా కీలక డీసీసీ అధ్యక్షుడి నియామకంలోనే ఈ చర్చ సాగుతోంది. గత ఇన్చార్జి హయాంలో దాదాపు ఈ అంశం కొలిక్కి వచ్చిందని, ఇక నిర్ణయం వెలవడడమే తరువాయి అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో కొత్త ఇన్చార్జి బాధ్యతలో కుదుట పడిన తర్వాత కొద్దిరోజులకు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు. అంతే కాకుండా ఇప్పటివరకు అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని అనుకున్న వారికి ఇప్పుడు అదే నిర్ణయం వెలువడుతుందని అనుకో వడం పొరపాటేనని అందరూ అనుకుంటున్నారు. గాంధీ కుటుంబానికి వీరవిధేయురాలిగా ఉన్న మీనాక్షి నటరాజన్ పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని, ఈ నేపథ్యంలో ఇప్పటివరకు తమకే దక్కుతుందని అనుకున్నవారికి నిర్ణయం అంత సుళువుగా ఉండక పోవచ్చని పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ.. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో డీసీసీ అధ్యక్షుడి భూమిక కీలకమవుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో డీసీసీ అధ్యక్షుడి హోదా కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మీనాక్షి నటరాజన్ జిల్లాలో పర్యటించి పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అప్పుడున్న నాయకులతో ఆమెకు పరిచయాలున్నాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరుగుబాటు చేశారనే కారణం, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం లాంటి కారణాలతో కొందరు ముఖ్య నాయకులను పార్టీ నుంచి తొలగించారు. తాజాగా ఈ అంశాల్లోనూ పార్టీలో చర్చ మొదలైంది. ఉమ్మడి జిల్లాలో ఓ కీలక నేత పాత నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే విషయంలో సంప్రదింపులు జరుపుతున్నారనే చర్చ పార్టీలో మొదలైంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి సేవలు కూడా ఉపయోగించుకోవడం ద్వారా పార్టీ గెలుపు కోసం పాటుపడాలనే ఉద్దేశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా కొత్త ఇన్చార్జి రాకతో పార్టీలో ఎలాంటి వ్యవహారాలు చోటుచేసుకుంటాయోనని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం
ఆదిలాబాద్‌రూరల్: మావల మండలం బట్టిసావర్గాం శివారులోని కుమురం భీం కాలనీలో ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేశ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం, విత్తన శుద్ధి చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, మధుయాష్కిగౌడ్‌ను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. అధి కసంఖ్యలో హాజరై అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వెట్టి మనోజ్, గోడం రేణుక, ఉయిక ఇందిరాబాయి, సోయం లలిత, కుమ్ర శాంతాబాయి, ఆత్రం గణపతి, తొడసం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఎస్సైకి సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: భీంపూర్ ఎస్సైగా విధులు నిర్వహించి రిటైర్డయిన మహ్మద్ కలీమ్‌ను శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గౌస్ ఆలం సన్మానించారు. అనంత రం పోలీస్ వాహనంలో అతడిని సాగనంపా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కలీ మ్ ఎలాంటి రిమార్క్ లేకుండా సర్వీస్ పూర్తి చేయడం అభినందనీయమని కొనియాడారు. 1983లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సైగా ప్రమోషన్లు పొంది 41 ఏళ్ల తొమ్మిది నెలలపాటు సేవలందించారని పేర్కొన్నారు. ప్రభుత్వం కలీమ్‌ను సేవ, ఉత్తమ సేవా పతకాలతో గౌరవించిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, జైనథ్ సీఐ సాయినాథ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ గుణవంతురావ్, సీసీ శ్రీనివాస్, సిబ్బంది కవిత జైస్వాల్, సత్యనారాయణ, అనసూయ, కలీమ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి
కై లాస్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను తక్షణమే అమలు చేయాలని ఎంసీపీఐ (యు) జిల్లా కార్యదర్శి కుంటాల రాములు డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ రూరల్, అర్బన్, మావల మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుకు అవసరమైన ప్రత్యేక నిధులు ఈ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. వంద కోట్ల ఆస్తులు కలిగిన ప్రతీ ఒక్కరి నుంచి ప్రజాసంక్షేమ ట్యాక్స్ వసూలు చేయాలని కోరారు. విద్య, వైద్యం, మహిళ, యువజన సంక్షేమ రంగాలకు 40శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఏళ్లుగా జీవిస్తున్న పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ఆరు నెలల్లో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో పార్టీ నాయకులు దేవేందర్, గణేశ్, నరేందర్, సుజాత, రేణుక, లింగన్న, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు. -
పనులు పరిశీలించిన కలెక్టర్
నార్నూర్: మండలంలోని గిరిజన గ్రామాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహకారంతో బీఏఐఎఫ్ సంస్థ గిరిజన గ్రామాల్లో చేపట్టిన పనులను క లెక్టర్ రాజర్షిషా శుక్రవారం పరిశీలించారు. తా డిహత్నూర్ జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గది, గ్రంథాలయాన్ని ప్రారంభించారు. గ్రామ శివారులో నాటిన మొక్కల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హెచ్డీఎఫ్ సీ బ్యాంక్, బీఏఐఎఫ్ సంస్థ సహకారంతో ప లు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గిరిజన రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఏజెన్సీలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించా ల్సిన అవసరముందని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్‌తో సమన్వయం చేసుకుని ముందుకెళ్తే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమాల్లో హెచ్డీఎఫ్సీ రీజినల్ మేనేజర్ వెంకటేశ్ చల్లావార్, జోనల్ హెడ్ కర్ణాకర్‌రెడ్డి, సీఎస్ఆర్ టీం ఆసియా సాహిద్, రాష్ట్ర ప్రతినిధి హేమంత్, తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో జవహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి అవకాశాలు కల్పించాలి
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉట్నూర్‌రూరల్: షెడ్యూల్ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ పాలసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కోరారు. ఖానా పూర్ నియోజకవర్గంలోని షెడ్యూల్ ప్రాంతాల్లోగల ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ శాఖమంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబును కోరినట్లు తెలి పారు. ఆదిలాబాద్ జిల్లా అంత్యత వెనుకబడిన ప్రాంతమని ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలు పూర్తి షెడ్యూల్ ప్రాంతాలని, అనేక మంది చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారని వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ కుటీర, చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగాలివ్వాలన్నారు. తోటి, కొలాం తెగల ఆదివాసీలు వెదురుతో అనేక రకాల పనిముట్లు తయారు చేస్తారన్నారు. ఫారెస్ట్ ద్వారా కొంత వెసులుబాటు కల్పించి, వారికి ఉపాధి మార్గాలను చూ పెట్టాలన్నారు. ఐటీడీఏ ద్వారా నెలకొల్పిన కుటీర, చిన్న తరహా పరిశ్రమలు ఉపయోగంలో లేవని, ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలపై మహిళల అనాసక్తి
● జిల్లాలో ఓటరు నమోదు అంతంతే ● పోలింగ్‌లో పాల్గొన్నది సగం మందే కై లాస్‌నగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. చాలా మంది మహిళలు ఓటరుగా నమోదు చేసుకునేందుకే ముందుకు రాలేదు. ఓటుహక్కు పొందిన వారిలోనూ సగం మంది వినియోగించుకోలేదు. గురువారం జరిగిన టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల అధిపత్యం ఉండగా, విద్యావంతులైన మహిళలు ఎమ్మెల్సీలను ఎన్నుకునే ప్రక్రియను పట్టించుకోలేనట్లు తెలుస్తోంది. పట్టభద్రుల నుంచి టీచర్స్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా టీచర్స్ ఓటరుగా 498 మంది మహిళా టీచర్లు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 443 మంది మాత్రమే ఓటేశారు. 55 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. జిల్లాలో ఎంతో మంది డిగ్రీ ఉత్తీర్ణులైన యువతులు, మహిళలు ఉండగా ఓటరు నమోదుపై అంతగా ఆసక్తి చూపలేదు. 4,612 మంది మాత్రమే ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఇందులో 2,913 మంది మాత్రమే ఓటు వేయగా, 1,699 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇందుకు మహాశివరాత్రి మరుసటి రోజే పోలింగ్ ఉండడం కొంత కారణమై ఉండొచ్చు. కానీ.. అన్ని రంగాల్లో ముందుండే అతివలు, ఇందులో విద్యావంతులైన వారు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమైంది. -
● పోలింగ్ నమోదుపై పార్టీల ఆరా ● శ్రేణులతో కేంద్రాల వారీగా విశ్లేషణ ● గెలుపుపై ఎవరి అంచనాలు వారివే ● ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ ● 3నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం
పోలింగ్‌శాతం నమోదు ఇలా..● టీచర్స్ ఓటర్ల కోసం జిల్లాలో 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 92.78 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుష ఓటర్లు 94.52 శాతం మంది, మహిళా ఓటర్లు 88.96 మంది ఓటు వేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ 90 శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా బేల, గుడిహత్నూర్ పోలింగ్ కేంద్రాల్లో ఏకంగా వందశాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బజార్హత్నూర్లో 97.96శాతం, ఇంద్రవెల్లిలో 96.88, నేరడిగొండలో 96.23, మావలలో 94.96 శాతం నమోదైంది. ఏజెన్సీ మండలాలైన ఇచ్చోడలో 94.87 శాతం పోలింగ్ నమోదు కాగా, సిరికొండలో 90శాతం మంది ఓటు వేశారు. ● పట్టభద్రులు ఓటింగ్‌పై ఆసక్తి కనబర్చారు. ఈసారి భారీ సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఓటు వినియోగంలోనూ అదే చైతన్యాన్ని ప్రదర్శించారు. జిల్లా వ్యాప్తంగా వీరి కోసం 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 69.61 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుష ఓటర్లు 72.49శాతం మంది ఓటు వినియోగించుకోగా, మహిళలు 63.16 శాతం మంది ఓటేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ 60కి పైగానే పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ రూరల్ మండలంలో 80.26 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, సిరికొండలో 79.38శాతం పోలింగ్ నమోదైంది. గాదిగూడలో 78.85శాతం నమోదు కాగా, 15 పోలింగ్ కేంద్రాల్లోనూ 70కి పైగానే పోలింగ్ నమోదైంది. కై లాస్‌నగర్: మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆది లాబాద్ నియోజకవర్గ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఈనెల 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా తుది ఫలితం వెల్లడయ్యేందుకు రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశముంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగింది. దీనిపై ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఆరా తీస్తున్నాయి. పోలింగ్ శాతం ఎక్కడ ఎక్కువగా నమోదైంది.. ఎక్కడ తగ్గింది.. ఇది వారికి ఎంతవరకు లాభిస్తుందనే దానిపై ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులతో విశ్లేశిస్తున్నారు. 2019 ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం భారీగా పెరగడంతో ఓటర్ల తొలి ప్రాధాన్యత తమకే దక్కిందని.. దీంతో గెలుపు ఖామయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు విద్యావంతుల తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. పార్టీల విశ్లేషణ ఇలా.. శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసినవారంతా విద్యావంతులే. అలాంటి వారి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు అన్ని విధాలా ప్రయత్నించారు. కొందరు నేరుగా ఓటర్లతో సమావేశాలు నిర్వహించి తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. మరికొంత మంది సోషల్ మీడియా, పార్టీల ద్వారా ప్రచారం చేయించారు. వారితో పాటు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని ముందుకు సా గారు. సాధారణ ఎన్నికలను తలపించేలా ఆయా పార్టీల ఆధ్వర్యంలో ప్రచారాన్ని వేడెక్కించారు. మందు, విందు ఏర్పాటు చేయడంతో పాటు ఓటు కు నోట్లు కూడా భారీగానే మొట్టజెప్పినట్లు తెలు స్తోంది. దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదు కావడంతో ఆయా పార్టీల నాయకులంతా ప్రస్తుతం కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన పోలింగ్‌శాతం, ఓటర్ల వివరాలను ఆయా పార్టీల నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా పార్టీ శ్రేణులతో సమీక్షిస్తూ తమకు ఏ మేరకు కలిసి వస్తుందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఆయా పార్టీలకు పట్టున్నట్లుగా భావించే పోలింగ్ కేంద్రాల్లో నమోదైన పోలింగ్ శాతం తమకే లాభిస్తుందని ఇరు పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతం అత్యధికంగా నమోదైన కేంద్రంలోని పరిస్థితి, అత్యల్పంగా నమోదైన పోలింగ్ శాతాన్ని తెలుసుకుని తమ పార్టీల అభ్యర్థులకు వచ్చే ఓట్లను లెక్కించుకుంటున్నారు. కేంద్రాలవారీగా తమకే కలిసివచ్చే అవకాశముందని భావి స్తున్నారు. ఇలా రాజకీయ పార్టీలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, బ్యాలెట్ బాక్స్‌లో తమ ఓట్లను నిక్షప్తిం చేసిన ఓటర్లు మాత్రం ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెరిగిన పోలింగ్ శాతంలో తొలి ప్రాధాన్యతను దక్కించుకునేదెవరనేది.. మరో మూడు రోజుల్లో వెల్లడయ్యే అవకాశముంది. త్వరలో నిర్వహించనున్న సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ప్రభావం చూపనున్నందున ప్రస్తుతం అన్నివర్గాల ప్రజలు ఈ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.కేటగిరి మొత్తం ఓట్లు పోలైనవి పురుషులు మహిళలు శాతం పట్టభద్రులు 14,935 10,396 7,483 2,913 69.61టీచర్స్ 1,593 1,478 1,035 443 92.78 -
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
చీమకుర్తి రూరల్: పెద్దలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మండలంలోని బండ్లమూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అఫ్సర్ సూచించారు. శుక్రవారం మండలంలోని గాడిపర్తివారిపాలెం సచివాలయం పరిధిలో గల రంగసాయిపురం విలేజ్ హెల్త్ క్లినిక్‌లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. 40 సంవత్సరాల తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని, ప్రతిఒక్కరూ జాగ్రత్త వహించి విలేజ్ హెల్త్ క్లినిక్‌లో చూపించుకోవాలని సూచించారు. అనంతరం విలేజ్ హెల్త్ క్లినిక్‌లో 59 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులకు బీపీ, షుగర్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. మంచానికే పరిమితమైన రోగుల ఇళ్ల వద్దకెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని ఉచితంగా మందులు అందజేసి సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఆశా వర్కర్లు, హెల్త్ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శికి సన్మానం సంతనూతలపాడు: మండలంలోని గురువారెడ్డిపాలెం పంచాయతీ కార్యదర్శి జెట్టి శ్రీనివాసరెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా వారి దంపతులను ఎంపీడీవో డి.సురేష్‌బాబు, ఎంపీపీ బుడంగుంట విజయ, జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, పంచాయతీ కార్యదర్శుల సంఘ మండల అధ్యక్షుడు ఎన్.ప్రతాప్ కుమార్ తదితరులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. సంతనూతలపాడు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి సేవలను కొనియాడారు. -
పరామర్శించిన చుండూరి
వైఎస్సార్ సీపీ డివిజన్ ఇన్చార్జిని ఒంగోలు వన్‌టౌన్: వైఎస్సార్ సీపీ ఒంగోలు 13వ డివిజన్ ఇన్చార్జి ఎం.సూర్యరాజేష్ను ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు శుక్రవారం పరామర్శించారు. రాజేష్ తల్లి ప్రమీల అనారోగ్యంతో ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు. శుక్రవారం కబాడిపాలెంలోని సీఈ సొసైటీ కమ్యూనిటీ హాలులో ఆదరణ స్తుతి కూడిక నిర్వహించగా, చుండూరితో పాటు పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కార్పొరేటర్లు గంగవరపు ప్రవీణ్, మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్, కోఆప్షన్ సభ్యులు శ్యామ్‌సాగర్, 9వ డివిజన్ ఇన్చార్జి పూర్ణచంద్రరెడ్డి, 10వ డివిజన్ ఇన్చార్జి శ్రీనివాసరావు, 16వ డివిజన్ ఇన్చార్జి భాస్కర్, 33వ డివిజన్ ఇన్చార్జి జేమ్స్, 36వ డివిజన్ ఇన్చార్జి మధుసూదన్‌రెడ్డి, 47వ డివిజన్ ఇన్చార్జి చావలి శ్రీను, 49వ డివిజన్ ఇన్చార్జి సుబ్బారావు, దళిత సంఘాల నాయకుడు చప్పిడి వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. బాణసంచా తయారీ కేంద్రం తనిఖీమద్దిపాడు: మద్దిపాడులోని బాణసంచా తయారీ కేంద్రాన్ని శుక్రవారం ఉదయం ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న పరిశీలించారు. మందుగుండు సామగ్రి తయారు చేయడానికి ఉపయోగించే ముడిసరుకు గురించి, ఆ ముడిసరుకు కలిపే సమయంలో పేలుడు సంభవించకుండా తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తయారీదారులను ఆరా తీశారు. తయారైన బాణసంచా నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన గోడౌన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాణసంచా తయారీదారులు లైసెన్స్ రెన్యువల్ చేయించేందుకు అర్జీ ఇచ్చిన నేపథ్యంలో తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆర్డీవో.. రీ సర్వే జరుగుతున్న విధానంపై చర్చించారు. రైతుల సమక్షంలోనే రీ సర్వే నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు లేకుండా సర్వే నిర్వహించరాదని సూచించారు. ప్రతిఒక్కరికీ విడివిడిగా ఎల్పీఎం నంబర్లు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుజన్‌కుమార్, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, ఆర్ఐ రమణయ్య, వీఆర్వో సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలి ● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్‌రాజును ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం తన చాంబర్లో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రిటైర్మెంట్ అనేది కేవలం ఉద్యోగానికే అని, జీవితానికి కాదని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి విజయవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప విషయమన్నారు. కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్‌బాబు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఏఆర్ ఎస్ఐ తిరుపతిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సబ్సిడీపై చాప్‌కట్టర్ అందించిన జేడీ
మద్దిపాడు: పశువుల మేత కత్తిరించే చాప్ కట్టర్‌ను జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్ బేబీరాణి మద్దిపాడులో శుక్రవారం ఉదయం పశుపోషకురాలికి సబ్సిడీపై అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేత కోసే యంత్రాన్ని 40 శాతం సబ్సిడీతో ఇస్తున్నామని తెలిపారు. 33 వేల రూపాయల విలువైన ఈ యంత్రాన్ని 40 శాతం సబ్సిడీపై లబ్ధిదారులకు రూ.20 వేలకే అందించినట్లు చెప్పారు. పశుపోషకులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, నాలుగు నుంచి ఎనిమిది నెలల వయసు గల ఆడ దూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. పశుపోషకులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని పశువులు వ్యాధిబారిన పడకుండా కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏడీ సుగణ్యరావు, పశు వైద్యుడు అనిల్, పశుసంవర్థకశాఖ సిబ్బంది పాల్గొన్నారు. పీజీ కోర్సులపై విద్యార్థులకు అవగాహన సదస్సు ఒంగోలు సిటీ: డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే అంశంపై విద్యార్థులకు స్థానిక ఆంధ్రకేసరి యూనివర్శిటీ డీఓఏ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో శ్రీస్టూడెంట్ కెరీర్ గైడెన్స్ ఆన్ పీజీ కోర్సెస్ ఏకేయూశ్రీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఏకేయూ డీఓఏ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సోమశేఖర, ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్‌రావు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి, కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి డాక్టర్ బి.పద్మజ, ఆక్వాకల్చర్ విభాగం సహాయ ఆచార్యుడు డాక్టర్ బి.సురేష్, తదితరులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. రౌడీషీటర్లు బైండోవర్ చీమకుర్తి: మండలంలోని రౌడీషీటర్లను తహసీల్దార్ వద్ద శుక్రవారం బైండోవర్ చేయించినట్లు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. మండలంలో మొత్తం 25 మంది రౌడీషీటర్లు ఉండగా, వారిలో ప్రస్తుతం 15 మందిని తహసీల్దార్ వద్ద రూ.2 లక్షల పూచికత్తుతో హాజరుపరిచి బైండోవర్ చేయించినట్లు తెలిపారు. మిగిలిన వారిని రానున్న రెండు రోజుల్లో బైండోవర్ చేయిస్తామన్నారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి బైండోవర్ చేసే కార్యక్రమంలో భాగంగానే వారిని హాజరుపరిచామన్నారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని, గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ఉండాలని సూచించారు. -
మోసపూరిత బడ్జెట్
ఒంగోలు సిటీ: ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్ అంటూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ బాబు వంచన, మోసం గ్యారంటీ అనే రీతిలో బడ్జెట్ ఉందన్నారు. కేవలం అంకెల గారడీ, గ్రాఫిక్స్‌తో కూడుకున్నదే తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి, ఎన్నికల హామీల గురించి ప్రస్తావించకపోవడంతో చంద్రబాబు మోసం మరోసారి బట్టబయలైందన్నారు. మహిళలని మోసం చేశారు : వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ సంతనూతలపాడు: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని కూటమి నేతలు ఇచ్చిన హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని, ఇక దాల్చబోదని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టంగా తెలిసిపోతోందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ విమర్శించారు. పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బస్సు హామీని అమలు చేశాయని, మన రాష్ట్రంలో ఈ బడ్జెట్లో అయినా ప్రవేశపెడతారేమో అని ఎదురుచూసిన మహిళలకు ఆశాభంగం తప్పలేదని అన్నారు. చంద్రబాబు మహిళలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్: చుండూరి రంగారావు, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక బడ్జెట్. 4.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టుకు నామమాత్రంగా నిధులను కేటాయించడం, మిర్చి క్వింటాలు ధర గుంటూరు మిర్చి యార్డులో రూ.13 నుంచి రూ.14 వేలు ఉండగా ప్రభుత్వం మద్దతు ధర కేవలం రూ.11,781 ప్రకటించడం, ధరల స్థిరీకరణకు కేవలం రూ.300 కోట్లు కేటాయించడం దీనికి నిదర్శనం. ప్రజలకు మేలు చేయడం చేతకాక మీడియా ముందు ఏడవడం సిగ్గుచేటు. ఆర్ఆర్ ప్యాకేజీకి రూ.116 కోట్లేనా: చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి రాష్ట్ర అధికార ప్రతినిధి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ఆర్ ప్యాకేజికి రూ.1000 కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ.116 కోట్ల మాత్రమే విదిల్చడం దారుణం. దీంతో నిర్వాసితులకు ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఎంత మాత్రం మంచిదికాదు. అలాగే సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పక్కప పెట్టేసి ప్రజా సంక్షేమాన్ని దెబ్బ తీశారు. నిరుపేదలను దగా చేశారు.● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి -
భక్తిశ్రద్ధలతో నాలుగు దేవుళ్ల గ్రామోత్సవం
మడనూరు (కొత్తపట్నం): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గంగాపర్వతవర్థని సమేత రామలింగేశ్వరస్వామి, కన్నేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత శుక్రవారం పగలంతా నాలుగుదేవుళ్ల గ్రామోత్సవాన్ని కన్నుల పండువలా నిర్వహించారు. మూడోరోజు సాయంత్రం రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలు నగరం, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. గ్రామోత్సవం సందర్భంగా రామలింగేశ్వరస్వామి, కన్నేశ్వరస్వామి, జ్యాలామఖి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం చుట్టూ మేళతాళాలతో స్వామివారిని తిప్పుకుంటూ వాహనాలపై చేర్చి అలంకరించారు. నరనంది వాహనంపై రామలింగేశ్వరస్వామివారిని, రావణబ్రహ్మ వాహనంపై కన్నేశ్వరస్వామివారిని, ఏనుగు వాహనంపై జ్వాలాముఖి అమ్మవారిని అలంకరించారు. రామలింగేశ్వరస్వామి ఆలయం ముందు కోనేరు పక్కన ఉంచారు. ఈతముక్కల గ్రామంలో ముస్తాబు చేసిన గరుడ వాహనంపై అలంకరించిన అనంత కోదండరామస్వామిని మేళతాళాలతో ఊరేగించుకుంటూ భారీగా బాణసంచా పేల్చుకుంటూ రామలింగేశ్వరస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. రామలింగేశ్వరస్వామి ఆలయంలో నాలుగు దేవుళ్లకు పూజలు చేశారు. అలంకరించిన నాలుగు దేవుళ్ల ముందు టెంకాయలు కొట్టి ఆలయం దగ్గర్లో ఉన్న రథం ఆవరణలో నాలుగు దేవుళ్లను వరుస క్రమంలో ఉంచారు. నాలుగు దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసి భారీగా మందు చెట్లు పేల్చారు. భక్తులు భారీగా పాల్గొని తిలకించారు. వరుస క్రమంలో ముందుగా రామలింగేశ్వరస్వామి, పక్కన శ్రీకోదండరామస్వామి, కన్నేశ్వరస్వామి, చివరిగా జ్వాలాముఖి అమ్మవార్లను ఒకరి వెంట మరొకరిని ఉంచి గ్రామోత్సవరం నిర్వహించారు. నాలుగు దేవుళ్లను చూడటానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మేళతాళాలతో ఊరేగింపుగా రామలింగేశ్వరస్వామి ఆలయం నుంచి మడనూరు బస్టాండ్ సెంటర్ మీదుగా ఈతముక్కల బస్టాండ్ సెంటర్, ఈతముక్కల వీధుల్లో ఊరేగించి సాయంత్రానికి రామలింగేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ప్రతి ఇంటి ముందు భక్తులు టెంకాయలు కొట్టి హారతులిచ్చారు. గ్రామోత్సవం అనంతరం సాయంత్రానికి ఈతముక్కల రామలింగేశ్వరస్వామి ఆలయానికి నాలుగు దేవుళ్లు చేరుకున్నారు. ఆలయ ఆధ్వర్యంలో పాటకచేరి, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎండోమెంట్ ఈవో సుబ్రహ్మణ్యం పర్యవేక్షించగా, ఎస్సై సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
శంకరా...హరహరా
మడనూరు (కొత్తపట్నం): హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ వేలాది మంది భక్తులతో మడనూరు రామలింగేశ్వరుని రథోత్సవం కనుల పండుగగా సాగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గొవ రోజు శుక్రవారం భక్తిశ్రద్ధలతో, మహా వైభవంగా రథోత్సవం నిర్వహించారు. మడనూరులో నిర్వహించిన రథోత్సవంలో భక్తులు పోటెత్తారు. ఒంగోలు నగరం, కొత్తపట్నం మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో జనసంద్రంగా మారింది. పురోహితులు రథాన్ని ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగింది. రథోత్సవాన్ని కార్యనిర్వహణాధికారి సుబ్రహ్మణ్యం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా రథం వద్ద వంశపారంపర్య ఆగమకర్త కొంపల్లి వీరభద్రరావు, వారి కుటుంబీకులు బుచ్చేశ్వరరావు, సతీమణి నాగలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేసిన గంగా పర్వతి వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి, కన్నేశ్వరస్వామి, జ్వాలాముఖి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేసి మేళతాళాలతో రథంపై చేర్చారు. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌రావు ఆలయంలో పూజలు చేసుకుని రథం ప్రాంగణానికి చేరుకున్నారు. ఈవో సుబ్రహ్మణ్యం కాపులు, గ్రామ పెద్దలు రథం ముందు టెంకాయలు కొట్టి పూజలు చేశారు. అప్పటికే సిద్ధం చేసిన రథానికి కట్టిన తాడును పట్టుకుని హరోం హరహర మహాదేవ శంభోశంకర అంటూ రథాన్ని ముందుకు లాగి ప్రారంభించారు. రథం లాగడానికి యువకులు, మహిళలు, భక్తులు పోటీ పడ్డారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఈతముక్కల నుంచి మడనూరు రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డంతా జనంతో నిండింది. రథం వెళుతున్న సమయంలో ఇంటిలో నుంచి బయటకు వచ్చి రథం చక్రాల కింద గుమ్మడి కాయలు, పళ్లు పెట్టి స్వామివారిని దర్శించుకుని కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రథం మడనూరు రామలింగేశ్వరస్వామి ఆలయం నుంచి బయలుదేరి ఈతముక్కల గ్రామానికి చేరుకుంది. శనివారం మళ్లీ మడనూరు గ్రామానికి చేరుతుంది. భారీగా పోలీసు బందోబస్తు: రథోత్సవం సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ మేడా శ్రీనివాసరావు, ఎస్సై సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచే రోడ్డు ఇరువైపులా బల్లలు, షాపులను పక్కకు పెట్టించారు. మడనూరు గ్రామం నుంచి ఈతముక్కల గ్రామం వరకు అడ్డంగా ఉన్న వాటిని తొలగించారు. వారం రోజుల ముందు సీఐ, ఎస్సై రూట్ మ్యాప్‌ను పరిశీలించి మలుపుల దగ్గర జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. పుర వీధుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాలు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. రథం తిరిగే ప్రాంతంలో కాకుండా ఆలయం ప్రాంగణంలో ద్విచక్ర వాహనాలు, కార్లు అన్నీ పెట్టుకోవడానికి పార్కింగ్ ఏర్పాటు చేశారు. రథం తిరిగే రోడ్డుకు రాకుండా వేరే మార్గంలో వాహనాలను మళ్లించారు. సీఐలు 2, ఎస్సైలు 4, హెచ్‌సీలు 3, స్పెషల్ పార్టీవారు 20, కానిస్టేబుల్ 28, హోంగార్డులు 10 మందితో శాంతిభద్రతలు పర్యవేక్షించారు. ఎమ్మెల్యే దామచర్ల ఆలస్యంతో భక్తులకు అసౌకర్యం... ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆలస్యంగా రావడంతో చీకటి పడిన తర్వాత రథోత్సవాన్ని ప్రారంభించారు. దానికితోడు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రథోత్సవం చీకట్లో జరిగి భక్తులకు సరిగ్గా కనిపించక అసౌకర్యానికి గురయ్యారు. రథం లాగే భక్తులు కూడా చీకట్లో అతికష్టంమీద లాగి ఈతముక్కల గ్రామానికి చేర్చారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా చీకట్లో రథోత్సవం జరగలేదని, ఎమ్మెల్యే ఆలస్యంగా రావడం వలనే ఇలా జరిగిందంటూ పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్నుల పండువగా రామలింగేశ్వరుని రథోత్సవం భక్తులతో కిక్కిరిసిన మడనూరు, ఈతముక్కల జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు -
హలో మాల.. ఛలో ఒంగోలును జయప్రదం చేయండి
చీమకుర్తి: మాలమహాసభ ఆధ్వర్యంలో ఒంగోలులోని బండారు రామారావు, చీమకుర్తి నాగేశ్వరరావు కళాప్రాంగణంలో మార్చి 16వ తేదీ నిర్వహించనున్న హలో మాల.. ఛలో ఒంగోలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం చీమకుర్తి అంబేడ్కర్‌నగర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు, మాలమహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండేల కృష్ణ, మాల మహాసభ నాయకులు చావాబత్తిన బ్రహ్మయ్య, వేమా బాలకోటి, మట్టిగుంట రామాంజనేయులు, స్థానికులు పాల్గొన్నారు. ఘనంగా టైలర్స్ డే నాగులుప్పలపాడు: టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో శుక్రవారం టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుట్టుమిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే, టైలర్స్ డే సృష్టికర్త కేఎం స్వామి చిత్రపటాలకు నివాళులర్పించారు. టైలర్స్ డే జెండా ఆవిష్కరించారు. అసోసియేషన్ నాయకులు అమరా నాగేశ్వరరావు, వల్లూరి వెంకట్రావు, రాచపూడి నరసింహరావు, శాలివాహన సంఘ రాష్ట్ర మాజీ డైరెక్టర్ పేరాల చెన్నకేశవులు, టైలర్లు పాల్గొన్నారు. చీమకుర్తిలో... చీమకుర్తి: చీమకుర్తిలో శుక్రవారం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ టైలర్స్ డేని ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద జెండా ఆవిష్కరించారు. కుట్టుమిషన్ సృష్టికర్త హోవే చిత్రపటానికి నివాళులర్పించారు. పీడిత కులాలకు అండగా వెంకట సుబ్బయ్యఒంగోలు టౌన్: విప్లవ కమ్యూనిస్టుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రముఖ న్యాయవాది మెట్ల వెంకట సుబ్బయ్య దళిత పీడిత కులాలు చేపట్టిన ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడి ఆదర్శవంత జీవితం గడిపారని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ అన్నారు. శుక్రవారం స్థానిక దేవుడు చెరువు సమీపంలోని ఆదర్శ న్యాయ సహాయ కేంద్రంలో మెట్ల వెంకట సుబ్బయ్య 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య కుమారుడు, న్యాయమూర్తి మెట్ల కృష్ణమోహన్, ప్రజా సంఘాల నాయకులు, దళిత హక్కుల సంఘాల నాయకులు, మాజీ జెడ్పీ చైర్మన్ కాటం అరుణమ్మ, చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ పద్మావతి, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి కె.అరుణ, చావలి చైతన్య, సూర్యకుమారి, బీసీ సంఘాల సమన్వయ సమితి జిల్లా కార్యదర్శి బొట్ల సుబ్బారావు, గాండ్ల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత వెంకట సుబ్బయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. -
మోసపూరిత బడ్జెట్
ఒంగోలు సిటీ: ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్ అంటూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ బాబు వంచన, మోసం గ్యారంటీ అనే రీతిలో బడ్జెట్ ఉందన్నారు. కేవలం అంకెల గారడీ, గ్రాఫిక్స్‌తో కూడుకున్నదే తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి, ఎన్నికల హామీల గురించి ప్రస్తావించకపోవడంతో చంద్రబాబు మోసం మరోసారి బట్టబయలైందన్నారు. మహిళలని మోసం చేశారు : వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ సంతనూతలపాడు: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని కూటమి నేతలు ఇచ్చిన హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని, ఇక దాల్చబోదని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టంగా తెలిసిపోతోందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ విమర్శించారు. పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బస్సు హామీని అమలు చేశాయని, మన రాష్ట్రంలో ఈ బడ్జెట్లో అయినా ప్రవేశపెడతారేమో అని ఎదురుచూసిన మహిళలకు ఆశాభంగం తప్పలేదని అన్నారు. చంద్రబాబు మహిళలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. ఇది రైతు వ్యతిరేక బడ్జెట్: చుండూరి రంగారావు, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక బడ్జెట్. 4.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టుకు నామమాత్రంగా నిధులను కేటాయించడం, మిర్చి క్వింటాలు ధర గుంటూరు మిర్చి యార్డులో రూ.13 నుంచి రూ.14 వేలు ఉండగా ప్రభుత్వం మద్దతు ధర కేవలం రూ.11,781 ప్రకటించడం, ధరల స్థిరీకరణకు కేవలం రూ.300 కోట్లు కేటాయించడం దీనికి నిదర్శనం. ప్రజలకు మేలు చేయడం చేతకాక మీడియా ముందు ఏడవడం సిగ్గుచేటు. ఆర్ఆర్ ప్యాకేజీకి రూ.116 కోట్లేనా: చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి రాష్ట్ర అధికార ప్రతినిధి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్ఆర్ ప్యాకేజికి రూ.1000 కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ.116 కోట్ల మాత్రమే విదిల్చడం దారుణం. దీంతో నిర్వాసితులకు ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఎంత మాత్రం మంచిదికాదు. అలాగే సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పక్కప పెట్టేసి ప్రజా సంక్షేమాన్ని దెబ్బ తీశారు. నిరుపేదలను దగా చేశారు.● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి -
ఘనంగా తవనం చెంచయ్య వర్ధంతి
సంతనూతలపాడు: మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య వర్ధంతిని స్థానిక పీర్లమాన్యంలో సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మాబు, నాయకుడు షేక్ కాలేషా, జిల్లా కమిటీ సభ్యుడు బంకా సుబ్బారావు, మండల కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి, శాఖ కార్యదర్శి కోడూరి రామకృష్ణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. హెచ్ఎం ఉద్యోగ విరమణ సందర్భంగా సత్కారం సంతనూతలపాడు: స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం చుంచు రామాంజనేయులు ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా సన్మానించారు. సంతనూతలపాడు సర్పంచ్ దర్శి నాగమణి, మండవ మురళీకృష్ణ, మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు, ఉపాధ్యాయురాలు టి.విద్యాశ్రీ, ఒంగోలు డిప్యూటీ డీఈవో ఏ చంద్రమౌలేశ్వర్, ఎంఈఓ డి.వెంకారెడ్డి, సంతనూతలపాడు హైస్కూల్ హెచ్ఎం ఎం.ప్రమోద, ట్రస్ట్ అడ్వైజర్ మండవ సుబ్బారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ మద్దిపాడు: మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మద్దిపాడు పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. మండల పరిధిలోని గుండ్లాపల్లి పారిశ్రామికవాడ సమీపంలో ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్సై శివరామయ్య అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. అనంతరం ట్రాక్టర్లను మద్దిపాడు స్టేషన్‌కు తరలించారు. తదుపరి చర్యల నిమిత్తం ట్రాక్టర్ల డ్రైవర్లను తహసీల్దార్ సుజన్‌కుమార్ ముందు హాజరుపరిచారు. -
సబ్సిడీపై చాప్‌కట్టర్ అందించిన జేడీ
మద్దిపాడు: పశువుల మేత కత్తిరించే చాప్ కట్టర్‌ను జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్ బేబీరాణి మద్దిపాడులో శుక్రవారం ఉదయం పశుపోషకురాలికి సబ్సిడీపై అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేత కోసే యంత్రాన్ని 40 శాతం సబ్సిడీతో ఇస్తున్నామని తెలిపారు. 33 వేల రూపాయల విలువైన ఈ యంత్రాన్ని 40 శాతం సబ్సిడీపై లబ్ధిదారులకు రూ.20 వేలకే అందించినట్లు చెప్పారు. పశుపోషకులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, నాలుగు నుంచి ఎనిమిది నెలల వయసు గల ఆడ దూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. పశుపోషకులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని పశువులు వ్యాధిబారిన పడకుండా కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏడీ సుగణ్యరావు, పశు వైద్యుడు అనిల్, పశుసంవర్థకశాఖ సిబ్బంది పాల్గొన్నారు. పీజీ కోర్సులపై విద్యార్థులకు అవగాహన సదస్సు ఒంగోలు సిటీ: డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే అంశంపై విద్యార్థులకు స్థానిక ఆంధ్రకేసరి యూనివర్శిటీ డీఓఏ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో శ్రీస్టూడెంట్ కెరీర్ గైడెన్స్ ఆన్ పీజీ కోర్సెస్ ఏకేయూశ్రీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఏకేయూ డీఓఏ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సోమశేఖర, ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్‌రావు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి, కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి డాక్టర్ బి.పద్మజ, ఆక్వాకల్చర్ విభాగం సహాయ ఆచార్యుడు డాక్టర్ బి.సురేష్, తదితరులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. రౌడీషీటర్లు బైండోవర్ చీమకుర్తి: మండలంలోని రౌడీషీటర్లను తహసీల్దార్ వద్ద శుక్రవారం బైండోవర్ చేయించినట్లు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. మండలంలో మొత్తం 25 మంది రౌడీషీటర్లు ఉండగా, వారిలో ప్రస్తుతం 15 మందిని తహసీల్దార్ వద్ద రూ.2 లక్షల పూచికత్తుతో హాజరుపరిచి బైండోవర్ చేయించినట్లు తెలిపారు. మిగిలిన వారిని రానున్న రెండు రోజుల్లో బైండోవర్ చేయిస్తామన్నారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి బైండోవర్ చేసే కార్యక్రమంలో భాగంగానే వారిని హాజరుపరిచామన్నారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని, గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ఉండాలని సూచించారు. -
5, 6 తేదీల్లో జాబ్‌మేళా
ఒంగోలు వన్‌టౌన్: ఈనెల 5, 6వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నాస్కామ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రైమ్ కెరీర్ ఫెయిర్ జాబ్‌మేళాను గీతం యూనివర్శిటీ, విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జే రవితేజ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, డిప్లమో, బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ, యువకులను ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి 40కి పైగా బహుళ జాతీయ ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 3వ తేదీలోపు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఇతర పూర్తి వివరాలకు ప్లేస్మెంట్ అధికారి ఎస్కె బాషాను 8125215216 అనే నంబరుపై సంప్రదించాలని కోరారు. -
పరామర్శించిన చుండూరి
వైఎస్సార్ సీపీ డివిజన్ ఇన్చార్జిని ఒంగోలు వన్‌టౌన్: వైఎస్సార్ సీపీ ఒంగోలు 13వ డివిజన్ ఇన్చార్జి ఎం.సూర్యరాజేష్ను ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు శుక్రవారం పరామర్శించారు. రాజేష్ తల్లి ప్రమీల అనారోగ్యంతో ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు. శుక్రవారం కబాడిపాలెంలోని సీఈ సొసైటీ కమ్యూనిటీ హాలులో ఆదరణ స్తుతి కూడిక నిర్వహించగా, చుండూరితో పాటు పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కార్పొరేటర్లు గంగవరపు ప్రవీణ్, మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్, కోఆప్షన్ సభ్యులు శ్యామ్‌సాగర్, 9వ డివిజన్ ఇన్చార్జి పూర్ణచంద్రరెడ్డి, 10వ డివిజన్ ఇన్చార్జి శ్రీనివాసరావు, 16వ డివిజన్ ఇన్చార్జి భాస్కర్, 33వ డివిజన్ ఇన్చార్జి జేమ్స్, 36వ డివిజన్ ఇన్చార్జి మధుసూదన్‌రెడ్డి, 47వ డివిజన్ ఇన్చార్జి చావలి శ్రీను, 49వ డివిజన్ ఇన్చార్జి సుబ్బారావు, దళిత సంఘాల నాయకుడు చప్పిడి వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. బాణసంచా తయారీ కేంద్రం తనిఖీమద్దిపాడు: మద్దిపాడులోని బాణసంచా తయారీ కేంద్రాన్ని శుక్రవారం ఉదయం ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న పరిశీలించారు. మందుగుండు సామగ్రి తయారు చేయడానికి ఉపయోగించే ముడిసరుకు గురించి, ఆ ముడిసరుకు కలిపే సమయంలో పేలుడు సంభవించకుండా తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తయారీదారులను ఆరా తీశారు. తయారైన బాణసంచా నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన గోడౌన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాణసంచా తయారీదారులు లైసెన్స్ రెన్యువల్ చేయించేందుకు అర్జీ ఇచ్చిన నేపథ్యంలో తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆర్డీవో.. రీ సర్వే జరుగుతున్న విధానంపై చర్చించారు. రైతుల సమక్షంలోనే రీ సర్వే నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు లేకుండా సర్వే నిర్వహించరాదని సూచించారు. ప్రతిఒక్కరికీ విడివిడిగా ఎల్పీఎం నంబర్లు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుజన్‌కుమార్, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, ఆర్ఐ రమణయ్య, వీఆర్వో సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడపాలి ● ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలు టౌన్: సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్‌రాజును ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం తన చాంబర్లో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రిటైర్మెంట్ అనేది కేవలం ఉద్యోగానికే అని, జీవితానికి కాదని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి విజయవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప విషయమన్నారు. కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్‌బాబు, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, ఏఆర్ ఎస్ఐ తిరుపతిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
‘సర్కారు’ విద్యార్థులకు ట్యాబ్‌లు
జిల్లా పాఠశాలలు ట్యాబ్‌లు ఆదిలాబాద్ 13 325ఆసిఫాబాద్ 10 250 మంచిర్యాల 16 400నిర్మల్ 15 375మంచిర్యాలఅర్బన్: సర్కారు బడి విద్యార్థులకు ట్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక విద్య అమల్లో భాగంగా చర్యలు వేగవంతం చేశాయి. ఇప్పటికే పీఎంశ్రీలో ఎంపిక చేసిన పాఠశాలలకు మొదటి విడతలో కంప్యూటర్లు, యూపీఎస్, ఇన్వర్టర్లు మంజూరు చేయగా విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చేందుకు కసరత్తు పూర్తయింది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్‌ల ద్వారా బోధన చేయనున్నారు. ఉపాధ్యాయులు బోర్డుపై బోధించే అంశాలను నేరుగా చూసేలా అవకాశం కల్పించనున్నారు. ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్‌లను త్వరలోనే సరఫరా చేయనున్నారు. సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాంసంగ్ ఏ7 లైట్(ఎస్ఎం–టీ225) ట్యాబ్‌లు మంజూరు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పీఎంశ్రీ కింద ఎంపికై న ఒక్కో పాఠశాలకు 25 చొప్ప్పున 1350 ట్యాబ్‌లు మొదటి విడతలో మంజూరయ్యాయి. త్వరగా ట్యాబ్‌లను విద్యార్థులకు అందించి పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు, అనుమానాలను నివృత్తి చేసేలా బోధన చేయనున్నారు. -
విధుల్లో నిర్లక్ష్యంపై కొరడా
● వైద్యాధికారితో పాటు సిబ్బందికి షోకాజ్ ● ఇంద్రవెల్లి పీహెచ్సీ తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా ఇంద్రవెల్లి: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్యసిబ్బందిని కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆయన తనిఖీ చేశారు. హాజరు పట్టికలను పరిశీలించారు. వైద్యాధికారి శ్రీకాంత్‌తో పాటు సీహెచ్‌వో సందీప్, పీహెచ్ఎన్ జ్యోతి, సూపర్వైజర్ సురేశ్, ఎంఎల్‌హెచ్‌పీ పూజ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. వెంటనే వారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ను ఆదేశించారు. అదనపు ఏజెన్సీ వైద్యాధికారి మనోహర్‌తో ఫోన్లో మాట్లాడి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అలాగే మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని మందుల నిల్వగది, పలు ఇతర గదులను పరిశీలించారు. సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని డాక్టర్ పూజితను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది తదితరులున్నారు. -
అత్యధికం.. అత్యల్పం
కైలాస్‌నగర్: ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను పరిశీలిస్తే అత్యధికంగా 429 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. అత్యల్పంగా 13 మంది ఓటు వేశారు. ● ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 480 మంది ఓటర్లున్నారు. వీరిలో 286 మంది పురుషులు, 194 మంది మహిళలు ఉన్నారు. ఇందులో ఓటు వేసిన వారిని పరిశీలిస్తే పురుషులు 269 మంది, మహిళలు 160 మంది ఉన్నారు. ● ఇక అత్యల్పంగా భీంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కేంద్రంలో నమోదైంది. ఇక్కడ 13 మంది పురుషులు, ఇద్దరు మహిళలు మొత్తం 15 మంది ఓటర్లున్నారు. వీరిలో 11 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలో.. ● అత్యధికంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల కేంద్రంలో నమోదైంది. ఈ కేంద్రంలో 585 మంది పురుషులు, 370 మ ంది మహిళలు కలిపి మొత్తం 955 మంది ఓ టర్లున్నారు. వీరిలో 432 మంది పురుషులు, 239 మంది మహిళలు మొత్తం 671 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ● అత్యల్పంగా చూస్తే సిరికొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కేంద్రంలో నమోదైంది. ఇక్కడ మొత్తం 97 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 81, మహిళలు 16 మంది ఉన్నారు. మొత్తంగా 77 మంది ఓటు హక్కు వినియోగించుకోగా వీరిలో పురుషులు 67 మంది, మహిళలు 10 మంది ఉన్నారు. -
‘పోలీసుల తీరు సరికాదు’
ఆదిలాబాద్: పోలింగ్ సమయంలో బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన పోలీసుల తీరు సరికాదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు తమ బాధ్యతను నిష్పక్షపాతంగా నిర్వర్తించాల్సింది పోయి, అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గోదావరిఖని, నస్పూర్, మంచిర్యాల పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు ఇష్టారీతిన వ్యవహరించారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని జీర్ణించుకోలేని కాంగ్రెస్ కార్యకర్తలు నస్పూర్‌లో పోలీసుల సాయంతో బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేయించి స్టేషన్ తరలించారని ఆరోపించారు. అలాగే గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి న్యాయమూర్తులతో దురుసుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలతో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుస్తున్నారనే విషయాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కేంద్రాల్లో అలజడి సృష్టించే ప్రయత్నం చేసిందన్నారు. ఓటర్లకు సైతం డబ్బులు పంచారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనను గమనించిన మేధావి వర్గమైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ సమస్యలు పరిష్కారం కావాలంటే శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకగా బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ఉండాలని భావిస్తున్నారన్నారు. సమావేశంలో నాయకులు విజయ్, నగేష్, లాలా మున్నా, రఘుపతి, వేదవ్యాస్, దినేష్ మటోలియా, రాజన్న, శివ తదితరులు పాల్గొన్నారు. -
గణితం..
గణితం అంటే విద్యార్థులు భయపడుతారు. ప్రణాళిక ప్రకారం చదివితే గణితంలో సులువుగా మార్కులు సాధించవచ్చని నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు జె.శ్రీనివాస్ పేర్కొన్నారు. వాస్తవ సంఖ్యలు: సంయుక్త సంఖ్యలను ప్రధాన కారణాంకల లబ్దంగా రాయడం, యూక్లిడ్ భాగాహార న్యాయం ఆధారంగా గాసాభా కనుగొనడం, ధన బేసి, సరిసంఖ్య రూపం, కరణీయ సంఖ్య అని చూపడం, సంవర్గమనం, లాఘరిథమ్స్ సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. సమితిలు: శూన్య, వియుక్త సమితి నిర్వచనాలు, సమితి నిర్మాణ, జాబితా రూపం రాయడం, వీటికి ఉదాహరణలు సమితి సమ్మేళనం, చేదనము సమస్యలను సాధించడం, వెన్ చిత్రాలను గీయడం ప్రాక్టీస్ చేయాలి. బహుపదులు: బహుపది శూన్య విలువలు కనుగొనడం, గ్రాఫ్ నుంచి శూన్యాలను చెప్పడం, వర్గ, ఘన బహుపదుల శూన్యాలు కనుగొనాలి. వర్గ సమీకరణాలు: విచక్షిని కనుగొని మూలాల స్వభావం చెప్పడం, ఆల్ఫా, బీటాలు మూలాలుగా గల వర్గ సమీకరణం రాయడం, రాత సమస్యలకు వర్గ సమీకరణం రాసి గ్రాఫ్ ద్వారా శూన్యాలు కనుగొనాలి. చర రాశుల్లో రేఖీయ సమీకరణాలు: సంగతా, అసంగతా, పరస్పర ఆధారిత సమీకరణాలు ఎలా అవుతాయి, వీటిని కనుగొనడం, సమీకరణాలను చరరాశిని తొలగించడం, ప్రతిక్షేపన పద్ధతి, గ్రాఫ్ పద్ధతుల ద్వారా సాధించాలి. సరూప త్రిభుజాలు: ప్రాథమిక అనుపాత సిద్ధాంతానికి అనువర్తన సమస్యలు, సరూప త్రిభుజాలు నిర్మాణాలు గీయడం. శ్రేడులు: అంక,గుణ శ్రేడుల్లో మొదటి పదం, సామాన్య భేదం, నిష్పత్తులను కనుగొనడం, అంక శ్రేడీలో N వ పదం, N పదాల మొత్తం సంబంధించి సమస్యలు సాధించాలి. సాంఖ్యక శాస్త్రం: ముడి దత్తాంశం ఇచ్చి సగటు, మధ్యగతం, భాహులకాం కనుగొనడం, సగటు, మధ్యగతం, బాహులకం సూత్రం రాసి అందులో పదాలను వివరించాలి. వర్గీకత దత్తాంశానికి సగ టు, మధ్యాగతం, బాహులకం కనుగొనాలి. ఓజీవ్ వక్రాలను గీయడం వంటి వాటిపై సాధన చేయాలి. -
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
దిలావర్పూర్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని మాడేగాం అనుబంధ గ్రామమైన కదిలికి చెందిన ధానూర్ పాపన్న (34) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు చేసేవాడు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి పాపాన్న.. ఆలయానికి వెళ్తాడని కుటుంబ సభ్యులు భావించారు. వెళ్లకుండా ఇంటి ఎదుట చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం భార్య గంగాసాగర, కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు 10 సంవత్సరాల లోపు కుమారులు ఉన్నారు. చేపల వేటకు వెళ్లి జాలరి మృతిదిలావర్పూర్: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని జాలరి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సముందర్‌పల్లి అనుబంధ గ్రామమైన కాండ్లికి చెందిన కొత్తూరు భోజన్న (59) గురువారం ఉదయం గ్రామానికి ఆనుకుని ఉన్న ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ వద్ద చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో వల చుట్టుకుని మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని దిలావర్ఫూర్ ఎస్సై సందీప్ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. బోథ్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ఎల్.ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం.. సొనాల మండల కేంద్రానికి చెందిన బొంపాల పోశెట్టి చేనులో పనినిమత్తం బుధవారం అదే గ్రామానికి చెందిన షేక్ ఇసాక్ వెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం పోశెట్టి బైక్‌పై ఇసాక్‌తో సొనాల గ్రామానికి వస్తున్నారు. సాయంత్రం టివిటి క్రాస్‌రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ వేగంగా ఢీకొట్టింది. పోశెట్టి వెనకాల కూర్చున్న ఇసాక్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య షాహినాజ్ బేగం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్, డీజేల బహిష్కరణఉట్నూర్రూరల్: ప్రస్తుత రోజుల్లో ప్రీ వెడ్డింగ్, హల్దీ, డీజేల, లైటింగ్ ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుని భావితరాలకు అందించాలనే ఆలోచనతో ఉట్నూర్ మండలం శ్యాంనాయక్‌తండాలో పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు. శివరాత్రి పురస్కరించుకుని గురువారం గ్రామ ఆలయ ప్రాంగణంలో తండావాసులు ప్రీ వెడ్డింగ్ షూటింగ్, డీజేలు బహిష్కరించారు. గ్రామంలో ఎలాంటి ప్రీవెడ్డింగ్ షూటింగ్, హల్దీ, డీజేలు పెట్టవద్దని ప్రతిజ్ఞ చేశారు. అనాథ శవానికి అంత్యక్రియలు●బెల్లంపల్లి: బెల్లంపల్లిలో అనాథ శవానికి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. టూటౌన్ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. పల్లపు రాజు (44) బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాలో గత కొంతకాలం నుంచి రోడ్డుపై పడేసిన చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ కవర్లు ఏరుకుని జీవనం సాగిస్తూ రోడ్డుపై నిద్రిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం రామకృష్ణ థియేటర్ ముందు రోడ్డుపై రాజు అకస్మికంగా పడిపోయాడు. గమనించిన మహిళ 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన టూటౌన్ కానిస్టేబుల్ రాజీవ్ రతన్, హోంగార్డు సంపత్ ఘటనాస్థలికి చేరుకుని రాజును పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. -
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో 69శాతం ఓటేసిన పట్టభద్రులు ● 92 శాతం దాటిన ఉపాధ్యాయుల ఓటింగ్ ● ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ● భద్రత నడుమ కరీంనగర్‌కు బ్యాలెట్ బాక్స్‌లు
బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో క్యూలో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ నగేశ్ ఓటు హక్కు వినియోగించున్న పట్టభద్రులు ఓటు వేసి సిరా గుర్తు చూపుతున్న కోడలు, అత్త, మామకైలాస్నగర్: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయంనుంచే ఉపాధ్యాయ ఓటర్లు ఉత్సాహాంగా కేంద్రాలకు తరలివచ్చారు. పట్టభద్ర ఓటర్లు మాత్రం కాస్త నెమ్మదించడంతో ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. జిల్లాలోని మెజార్టీ కేంద్రాల్లో నిర్ణీత సమయానికే పోలింగ్ ముగియగా ఒకటి, రెండు కేంద్రాల్లో కొంత ఆలస్యమైంది. నిర్దేశిత సమయానికి కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలు గా ఎన్నికల సిబ్బంది వారిని కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. పోలింగ్ సరళిపై ఆరా తీశారు. ప్రధాన పార్టీల నాయకులు సైతం ఆయా కేంద్రాలను సందర్శిస్తూ పార్టీశ్రేణుల ద్వారా వివరాలడిగి తెలుసుకున్నారు. ఓటెత్తిన టీచర్లు.. నెమ్మదించిన పట్టభద్రులు పోలింగ్ ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉపాధ్యాయులు ఎక్కువ ఆసక్తి చూపారు. ఉదయం నుంచే జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రారంభం నుంచి చివరి వరకు జోరుగా నమోదైంది. ఇక పట్టభద్ర ఓటర్లు కేంద్రాలకు కొంత ఆలస్యంగా చేరుకున్నారు. ఉదయం పది గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. తొలి రెండు గంటల వరకు 7.84శాతం మాత్రమే నమోదుకావడం గమనార్హం. ఓటర్లు పలు కేంద్రాలకు పోలింగ్ ముగిసే సమయంలో రావడంతో ఎన్నికల అధికారులు వారికి ప్రత్యేక నంబర్లు జారీ చేసి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కేంద్రాల వద్ద పార్టీల సందడి జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల సందడి కనిపించింది. కేంద్రాలకు సమీపంలో ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసుకుని ఆయా పార్టీల నాయకులు కూర్చున్నారు. ఓటర్లకు పోల్చీటీలు అందించడంతో పాటు జాబితాలోని వారి సీరియల్ నంబర్లను తెలియజేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ సరస్వతినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చిన పట్టభద్రులు భీంపూర్ పట్టభద్రులు.. ఓటేశారుపటిష్ట బందోబస్తుజిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, ఎస్పీ వేర్వేరుగా పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు ఇంద్రవెల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. సిబ్బందికి పలు సూ చనలు చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని డైట్ కళా శాల, ఉట్నూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ తీరుపై ఆరా తీశారు. కరీంనగర్‌కు తరలిన బ్యాలెట్ బాక్స్‌లు పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్స్‌లకు ఎన్నికల అధికారులు సీల్ వేశారు. రూట్ల వారీగా వాటిని ప్రత్యేక వాహనాల్లో భారీ భద్రత నడుమ కరీంనగర్‌కు తరలించారు. అక్కడి అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి రిసెప్షన్ సెంటర్లో అప్పగించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్కడే కొనసాగనుంది. అప్పటి వరకు వాటిని పోలీస్ భద్రత నడుమ స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చనున్నారు. జిల్లాకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లను రీసివ్ చేసుకుని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచేందుకు గాను రెవెన్యూ సిబ్బందిని ఉదయమే ప్రత్యేక వాహనాల్లో కరీంనగర్‌కు తరలించారు. వాటిని భద్రపర్చిన అనంతరం అక్కడి అధికారులకు అప్పగించనున్నారు.తాంసి: భీంపూర్‌లో ఉదయం 8 గంటలకు పో లింగ్ ప్రారంభమైనా 10 గంటల వరకూ పట్టభద్రుల ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేదు. స్థానిక రహదారి నిర్మాణ విషయంలో తామంతా ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ‘మండల పట్టభద్రుల రోడ్డు సాధన సమితి ఫోరం’ పేరిట ఇదివరకే జిల్లా కేంద్రంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటల వరకు కూడా వారు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో కొంత సందిగ్ధం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకోవాలని జైనథ్ సీఐ సాయినాథ్, భీంపూర్ ఎస్సై కలీం వారికి నచ్చ జెప్పారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు పాల్గొనమని వారు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షిషా సామాజిక మాధ్యమాల ద్వారా ఓటింగ్‌లో పాల్గొనాలని వీడియో పంపారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫోరం సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా 244 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా 184 మంది ఓటేశారు. ఆదిలాబాద్‌టౌన్: మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలీసు యంత్రాంగం పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియను ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల, సరస్వతినగర్‌లోని జెడ్పీఎస్ఎస్ (బాలికలు), ట్రైబల్ వెల్ఫేర్ (బాలుర)జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతో పాటు గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌లోని పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 400 మంది సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. 20 లొకేషన్లలోని 39 కేంద్రాల్లో ప్రత్యేకంగా ఎనిమిది రూట్లను ఏర్పాటు చేశారు. అలాగే అదనపు ఎస్పీ సురేందర్ రావు, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు సీఐలు, ఎస్సైలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలుపర్చారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బందోబస్తు కొనసాగింది. -
కాయిన్ కొడితే..కప్ పడాల్సిందే
● క్యారమ్స్‌లో రాణిస్తున్న సింగరేణి క్రీడాకారుడు ● కోలిండియా పోటీల్లో గోల్డ్‌మెడల్స్ శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తిలోనే కాదు ఆటల్లో తమకు తామే సాటి అంటున్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 6 గనికి చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు రేణికుంట్ల సృజన్‌రావు క్యారమ్స్‌లో జాతీయస్థాయి పోటీల్లో రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. బోర్డుపై కూర్చొని కాయిన్స్ కొడితే కప్ తన ఖాతాలో పడాల్సిందే అంటున్నాడు. తనదైన ఆట తీరుతో పలు బహుమతులు సాధించాడు. ఈయన 2020లో కారుణ్య కింద సింగరేణిలో ఉద్యోగంలో చేరారు. సింగరేణిలో రాకముందే ఆయనకు ఈ ఆటపై పట్టుంది. హైస్కూల్ లెవల్ నుంచే క్యారమ్స్‌పై పట్టు సాధించాడు. ఇంటర్, డిగ్రీలో తన ఆటకు మరింత పదును పెట్టాడు. కళాశాల స్థాయిలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాడు. నిజామాబాద్‌లోని భీంగల్, హైదరాబద్‌లోని ఖైరతాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి పలు బహుమతులు అందుకున్నాడు. జాతీయస్థాయిలో పోటీల్లో.. జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఆలిండియా పబ్లిక్ సెక్టార్ కంపెనీల పోటీల్లో ప్రతిభ కనబర్చి పలు బహుమతులు సాధించాడు. 2024 మార్చిలో ముంబయిలో జరిగిన ఈ పోటీల్లో సెమీస్ వరకు వెళ్లాడు. అదే ఏడాది మధ్యప్రదేశ్‌లోని సింగరోలిలో జరిగిన కోలిండియా పోటీల్లో సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2025 జనవరిలో జార్జండ్లోని రాంచీలో జరిగిన కోలిండియా పోటీల్లో సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఈ పోటీల్లో సింగరేణి జట్టు టీం ఛాంపియన్ సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రోత్సహిస్తే శిక్షణ ఇస్తాను కంపెనీ మరింత ప్రోత్సాహిస్తే నేను మెరుగ్గా ఆడటమే కాకుండా మరింత మందికి శిక్షణ ఇచ్చి క్రీడాకారులను తయారు చే స్తాను. కంపెనీ క్లబ్లో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అధికారులు దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే ఉద్యోగులతో పాటు వారి పిల్లలకు ఆట నేర్పించాలని ఉంది. ఈ ఆటలో మహిళలు తక్కువగా ఉన్నారు. పోటీ లేనందున వారు నేర్చుకుంటే సులువుగా రాణించగలుగుతారు. జాతీయ స్థాయిలో పాల్గొంటే చాలు బ్యాంకుల్లో తదితర సంస్థల్లో పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నారు. – సృజన్‌రావు -
● నామ్‌కే వాస్తేగా సర్వే ● విద్యాశాఖవి కాకిలెక్కలే ! ● పిల్లల్ని బడిలో చేర్పించడంలో విఫలం
ఆదిలాబాద్‌టౌన్: కార్ఖానాలు, ఇటుక బట్టీల్లో బాల్యం బంధీ అవుతోంది. అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు రోడ్లపైన, చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, లాడ్జీల్లో పనిచేసే వారు కొందరైతే.. భిక్షాటనతో పొట్టపోసుకునే వారు మరికొందరు. విద్యాహక్కు చట్టం, కార్మికశాఖ అటు వైపు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో బాల కార్మికులకు విముక్తి కలగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వీరి బతుకులు మాత్రం మారని పరిస్థితి. ఏటా డిసెంబర్, జనవరిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబయట పిల్లల సర్వే చేపడతారు. గతేడాది డిసెంబర్లో సర్వే నిర్వహించాల్సి ఉండగా, సీఆర్పీలు సమ్మెలో ఉండడంతో ఆలస్యమైంది. అనంతరం కేవలం పది రోజులు మాత్రమే నామ్‌కే వాస్తే సర్వే చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా మరో కారణమే ఆరోపణలున్నాయి. ఫలితంగా సర్కారు లక్ష్యం నెరవేరని పరిస్థితి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో బడిబయట పిల్లల సర్వే గతేడాది డిసెంబర్ నుంచి జనవరి 26 వరకు జరగాల్సి ఉంది. అయితే సీఆర్పీలు డిసెంబర్ 8 నుంచి జనవరి 7వరకు సమ్మెలో ఉన్నారు. జనవరి 10 నుంచి 26 వరకు సర్వే నిర్వహించారు. జిల్లాలో 58 మంది సీఆర్పీలు ఉన్నారు. ఒక్కో సీఆర్పీకి 15 నుంచి 20 గ్రామాలు కేటాయించారు. అయితే కొంతమంది గత లెక్కలనే తక్కువ ఎక్కువ చేసి ప్రబంధ పోర్టల్‌లో నమోదు చేసినట్లు సమాచారం. వారు ఇచ్చిన లెక్కల ప్రకారం జిల్లాలో 6–14ఏళ్ల లోపు వారు 369 మంది ఉండగా, 15–19 ఏళ్లలోపు వారు 58 మంది ఉన్నట్లు చెబుతున్నారు. గతేడాదికి సంబంధించి 6–14 ఏళ్లలోపు వారు 563 ఉండగా, 15–19 ఏళ్లలోపు వారు 121 ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో అత్యధికంగా ఆదిలాబాద్‌అర్బన్, ఉట్నూర్, బోథ్‌లో 42 మంది చొప్పున, ఆదిలాబాద్‌రూరల్‌లో 40, నేరడిగొండలో 34, భీంపూర్‌లో 36, గాదిగూడ, గుడిహత్నూర్‌లో 22 మంది చొప్పున, బజార్హత్నూర్, బజార్హత్నూర్లో 17మంది చొప్పున, ఇంద్రవెల్లిలో 10, సిరికొండలో 8, నార్నూర్‌లో 7, అత్యల్పంగా మావలలో ముగ్గు రు ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. జిల్లాలో దాదాపు 500 మందికి పైగా 6–14 ఏళ్లలోపు వారు ఉన్నట్లు తె లుస్తోంది. జిల్లా కేంద్రంలోనే దాదాపు వంద మంది వరకు ఉన్నట్లు సమాచారం. బస్టాండ్, రైల్వే స్టేషన్, ముఖ్య కూడళ్లలో పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. సర్వే నిర్వహిస్తున్న సీఆర్పీలు (ఫైల్)పకడ్బందీగా నిర్వహించాం.. బడి బయట పిల్లల సర్వేను సీఆర్టీల ద్వారా నిర్వహించాం. జిల్లాలో 6–14 ఏళ్ల లోపు పిల్లలు 369 మంది ఉన్నట్లు గుర్తించాం. వచ్చే విద్యా సంవత్సరంలో వీరందరినీ బడిలో చేర్పిస్తాం. అలాగే 15 నుంచి 19 సంవత్సరాల వారు 58 మంది ఉన్నారు. వీరిని ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదివించేలా చర్యలు చేపడతాం. – ప్రణీత, డీఈవోనెరవేరని లక్ష్యం.. విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్లలో పు పిల్లలు బడిబయట ఉండకూడదు. ఉచిత ని ర్బంధ విద్య అమలు చేయాలి. అయితే సర్కారు లక్ష్యం నెరవేరడం లేదని తెలుస్తోంది. బడిబయ ట పిల్లల్ని బడిలో చేర్పించిన అధికారులు ఆ త ర్వాత పాఠశాలకు వస్తున్నారో.. లేదో.. పర్యవేక్షించడం లేదు. దీంతో బడిలో చేరిన పిల్లలు తిరి గి బయటకు వెళ్లిపోతున్నారు. ఏడాదికేడాది బడిబయట పిల్లల సర్వే ఒక్కో రకంగా ఉంటోంది. ఏడాదికి రెండు సార్లు పోలీసు, బాలల సంరక్షణ ఆధ్వర్యంలో స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడ పనిచేస్తు న్న వారిని విముక్తి కలిపించి బడిలో చేర్పిస్తున్నప్పటికీ వారు చదువు కొనసాగించలేకపోతున్నా రు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు బడికి రాకపోయినప్పటికి హాజరు పట్టికలో వారు పేర్లు అలాగే ఉంటున్నాయి. ఉపాధ్యాయ పోస్టులు సర్దుబాటు చేస్తారనే ఉద్దేశంతో ఖాకీ లెక్కలు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బడిబయట ఉన్న పిల్లల్ని గుర్తించిన వారిని పూర్తిస్థాయిలో బడిలో చేర్పిస్తే బాల్యం బంగారు భవిష్యత్తుగా మారనుంది. -
జీవశాస్త్రం
జీవశాస్త్రంలో పాఠాలను అర్థం చేసుకుని చదవాలని నిర్మల్ జిల్లా పార్పెల్లి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గంగ సురేష్ తెలిపారు. ● పోషణ అనే పాఠ్యాంశంలో ఆకుల్లో పిండి పదార్థాలు కలవని నిరూపించే ప్రయోగం, కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాకై ్సడ్ అవశ్యకత, హైడ్రిల్లా, నల్ల కాగితం ప్రయోగం, విటమిన్లు తెలిపే పట్టిక, జీర్ణ వ్యవస్థను సూచించే ఫ్లో చార్ట్, హరిత రేణువు, అమీబా–పోషణ పటం భాగాలు, స్వయం పోషణ– పరపోషణ, కాంతి చర్య–నిష్కాంతి చర్య మధ్య గల భేదాలు చదవాలి. ● శ్వాసక్రియలో ఈస్ట్‌తో అవాయు శ్వాసక్రియ ప్రయోగం, కార్బన్‌డయాకై ్సడ్ ఉష్ణోగ్రత విడుదలయ్యే ప్రయోగం, వాయుగోని పటం–భాగాలు, మైటో కాండ్రియా పటం వంటివి చదవాలి. ● ప్రసరణలో పేరు పీడనం ప్రయోగం వ్యాసరూప ప్రశ్న వేసే అవకాశం ఉంది. హృదయం అంతర్నిర్మాణం–పటం భాగాలు ఏకవలయ– ద్వివలయ రక్తప్రసరణ వ్యవస్థ బేధాలు తెలపడంలో ధమనులు–సిరలు, సిస్టోల్–డయస్టోల్, దారువు–పోషక కణజాలం మధ్య గల భేదాలు గుర్తించి అవగాహన చేసుకోవాలి. ● విసర్జన అనే పాఠ్యాంశంలో నెఫ్రాన్ నిర్మాణం వ్యాసరూప ప్రశ్నగా అడిగే అవకాశం ఉంది. ఇతర జీవుల్లో విసర్జన అవయవాలు– అల్కలైడ్ మొక్క పేరు– ఉపయోగాలు పట్టిక, మానవ మూత్రపిండం అడ్డుకోత పటం–భాగాలు బేధాల, విసర్జన– స్రావం మధ్య గల భేదాలు చూసుకోవాలి. ● వనపర్తి వడ్డిచెర్లలోని నీటి వనరుల పరిస్థితి గురించి సమాచార పట్టికలు, కొత్తపల్లిలో నీటి యాజమాన్యంపై ప్రశ్నలు ఉంటాయి. అలాగే అడవుల సంరక్షణపై సమాధానాలు రాయాలి. ● హార్మోన్ల పేర్లు, వాటి ప్రభావం, ఫైటో హార్మోన్లు–ఉపయోగాలు, సమాచార పట్టిక, మానవ మెదడు పటం–భాగాలు తదతర వాటిపై అవగాహన చేసుకోవాలి. ● ప్రత్యుత్పత్తి పాఠ్యాంశంలో మానవ శుక్రకణం పటం–భాగాలు, సీ్త్ర, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు పటం–భాగాలు, పుష్పము పటం– భాగాలు, అండం నిర్మాణం పటం, భాగాలు, భేదాలను చదవాలి. ● ఆమ్లం పత్ర ప్రయోగం సమాచార పట్టికలు, బోలాస్–కై మ్, మాస్టిఫికేషన్–రూమినేషన్ మధ్య గల భేదాలు, అంత్ర చూశకం పటం–భాగాలు చూసుకోవాలి. ● అనువంశికత–పరిణామంలో డార్విన్ సిద్ధాంతం, లామార్కు వాదం, లింగ నిర్ధారణ, ఏక సంకరీకరణ, ద్విసంకరీకరణ వివరణ భేదాలను తెలుసుకోవాలి. ● ఆహారపు గొలుసులు, ఆహారపు, జాలకం జైవిక వృద్ధి కరణ, శక్తి పిరమిడ్ సంఖ్య, పిరమిడ్, విషపూరిత పదార్థాల వాడకం వల్ల జరిగే ప్రభావం ఏంటో చదవాలి. -
చెక్‌బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలు
మంచిర్యాలక్రైం: చెక్‌బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది సాధారణ జైలుశిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.నిరోష గురువారం తీర్పునిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సీసీసీ నస్పూర్‌కు చెందిన వొంటెల సత్యనారాయణరెడ్డి వద్ద 2017లో కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన మ్యాకల సత్యనారాయణరెడ్డి రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సమయంలో చెక్కులు ఇచ్చాడు. ఒప్పంద ప్రకారం తీసుకున్న అప్పు చెల్లించే గడువు తీరింది. ఆ తర్వాత బ్యాంకులో చెక్కులు డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి. 2019లో కోర్టులో చెక్‌బౌన్స్ కేసు వేశాడు. విచారణలో భాగంగా సాక్ష్యాదారాలు పరిశీలించి నేరం రుజువు కావడంతో మ్యాకల సత్యనారాయణరెడ్డికి ఏడాది సాధారణ జైలుశిక్షతోపాటు తీసుకున్న అప్పు రూ.8 లక్షలు చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. దాడి కేసులో ఒకరికి జరిమానా మంచిర్యాలక్రైం: పాత మంచిర్యాలకు చెందిన ఈద శ్రీనివాస్‌పై దాడి చేసిన కేసులో రావుల రాజ్‌కుమార్‌కు రూ.10వేలు జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.నిరోష గురువారం తీర్పునిచ్చింది. సీఐ ప్రమోద్‌రావ్ కథనం ప్రకారం..శ్రీనివాస్‌కు చెందిన బ్యాంకు అటాచ్డ్ ఉన్న బజాజ్ ఫైనాన్స్‌లో రాజ్‌కుమార్‌కు నెల వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు రూ.30 వేల వాషింగ్ మిషన్ ఇప్పించాడు. వాయిదాలు సకాలంలో చెల్లించలేదు. 2021 జూన్ 19న డబ్బులు చెల్లించాలని అడిగినందుకు శ్రీనివాస్‌పై దాడి చేసి గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదుతో రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షాదారాలు పరిశీలించి తర్వాత నేరం రుజువుకావడంతో రాజ్‌కుమార్‌కు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. -
సూర్యాపూర్‌లో అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు
కుంటాల: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని సూర్యాపూర్‌లో గురువారం అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించారు. నిజామాబాద్, కరీంనగర్‌తోపాటు కర్ణాటక మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది మల్లయోధులు పాల్గొన్నారు. అంతకుముందు సూర్యాపూర్ రాజరాజేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ పూజలు చేశారు. అనంతరం కుస్తీ పోటీలను వీక్షించారు. పోటీల్లో గెలుపొందిన విజేతకు రూ.6100 నగదు, వెండి కడియం బహూకరించి సన్మానించారు. రెండో విజేతకు రూ.3 వేల నగదు అందజేసి సత్కరించారు. ఎస్సై సీహెచ్ భాస్కరాచారి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు వెంగల్రావు, రాజరాజేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
భౌతిక, రసాయన శాస్త్రం..
భౌతిక, రసాయన శాస్త్రంలో మంచి మార్కులు సాధించాలంటే పాఠాలను అర్థం చేసుకోవాలని లక్ష్మణచాంద ప్రభుత్వ ఉన్నత పాఠశాల భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు సురేష్‌బాబు తెలిపారు. ● పుటాకార దర్పణాల, కుంభకారా దర్పణాల కిరణ చిత్రాలు బాగా సాధన చేయాలి. ● తుల్య రసాయన సమీకరణాలకు సంబంధించిన సమస్యలు ప్రాక్టీస్ చేయాలి. ● ఆమ్లా, క్షారాలా పీహెచ్ విలువలు గుర్తుంచుకోవాలి. ● దీర్ఘ దృష్టి, హ్రస్వ దృష్టి గురించి వేసే ప్రశ్నలపై సమాధానాలు రాయాలి. ● 20 మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం తెలిసి ఉండాలి. ● పౌలీ వర్జన నియమం, ఆఫ్ బౌ నియమం, హుండ్ నియమం చదువుకోవాలి. ● ఆధునిక అవర్తన పట్టిక ధర్మాలు ప్రతిసారి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ● లోహ శాస్త్రంలో ఖనిజాలు, దాతువులు వాటి ఫార్ములాలు తెలిసి ఉండాలి. ● కర్బన రసాయన శాస్త్రంలో అల్కేన్, అల్కీ న్, ఆల్కైన్ల మధ్య భేదాలు తెలిసి ఉండా లి. నామీకరణ సూత్రాలు చదువుకోవాలి. -
క్లుప్తంగా
చెరువులో యువకుడి మృతదేహం లభ్యంఆదిలాబాద్టౌన్: జిల్లాకేంద్రంలోని ఖానా పూర్ చెరువులో యువకుడి మృతదేహం లభ్యమైనట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..పట్ట ణంలోని ఖానాపూర్‌కు చెందిన పిట్ల సాయికుమార్ (29) ఈనెల 22న ఇంటి నుంచి బ యటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆయన కుటుంబీకులు 25న అదృశ్యమైనట్లు ఫిర్యా దు చేశారు. గురువారం ఖానాపూర్ చెరువులో మృతదేహం నీటిపై తేలి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ముగ్గురిపై రౌడీషీట్ ఓపెన్ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని క్రాంతినగర్ కు చెందిన రవితేజను హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న గోల్డెన్ కార్తీక్, ప్రణీ త్, సాయికిరణ్‌లపై రౌడీషీట్ ఓపెన్ చేసిన ట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలి పారు. ఈముగ్గురు నిందితులతో సంబంధాలు ఉండి అల్లర్లకు పాల్పడిన ఆరుగురిని ఆది లాబాద్ అర్బన్ తహసీల్దార్ ఎదుట గురువారం బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. ఆటోబోల్తా: ఒకరికి గాయాలుముధోల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ముధోల్–భైంసా ప్రధాన రహదారిపై గురువారం ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకా నయాగావ్ గ్రామానికి చెందిన నాగేష్ తన ఆటోలో పని నిమిత్తం భైంసాకు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులు గమనించి 108లో భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. నాగేష్ మద్యం మత్తులో ఉండడంతో ప్రమాదం చోటుచేసుకుంది. పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్ పరిధి తిమ్మాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 11 మందిని ఆరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ముత్యాల ప్రదీప్ ఇంట్లో పేకాటాడుతున్నారన్న సమాచారంతో బుధవారం రాత్రి దాడి చేసి 11 మందిని అదుపులో తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.38,290 నగదు, నాలుగు బైక్‌లు, ఒక కారు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
సాంఘిక శాస్త్రం..
సమకాలీన అంశాలపై పట్టు, విశ్లేషణాత్మక ధోరణి ఉంటే సాంఘిక శాస్త్రంలో విజయం తథ్యమని నిర్మల్ జిల్లా గుండంపెల్లి ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సిలారి మధు అంటున్నాడు. ● బట్టీ పద్ధతిని వదిలేసి పాఠాలను అర్థం చేసుకోవాలి. ● దేశంలోని నదులు, పీఠభూములు, ఎత్తైన శిఖరాలు, పర్వత శ్రేణులు, తీర ప్రాంతాలు, ప్రధాన నగరాలు, ప్రపంచీకరణ, పట్టణీకరణ పర్యావరణ, భూగర్భ జల సమస్యలు తదితర అంశాలపై అవగాహన చేసుకోవాలి. ● గ్రాఫ్‌లు పట్టికలు, పై చార్ట్‌లు విశ్లేషణాత్మక ధోరణిలో రాయాలి. ● ప్రపంచ పటంలో మిత్ర రాజ్య కూటమి దేశాలు, అక్షరాజ్య కూటమి దేశాలు, నినాదాలు, కరపత్రం తదితర వాటి గురించి తెలుసుకోవాలి. ● ప్రతీ సిలబస్‌లో ముఖ్యమైన పాయింట్లను అండర్లైన్ చేసుకుని చదవాలి. బిట్ పేపర్లో వచ్చే 20 మార్కులను సులభంగా సాధించవచ్చు. ● ప్రశ్నప్రత్రంలో ముందుగా ప్రశ్నల సరళిని అవగతం చేసుకోవాలి. -
క్రీడల అభివృద్ధికి కృషి
బజార్హత్నూర్: జిల్లాలో క్రీడల అభివృద్ధికి, మినీ స్టేడియాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ గో డం నగేశ్ తెలిపారు. మండలంలోని తన సొంత గ్రామం జాతర్లలో నవజ్యోతి యూత్ క్ల బ్ ఆధ్వర్యంలో శివరా త్రి సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, షటీల్ అంతర్రాష్ట్ర క్రీడా పోటీలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2014–19 ఎంపీగా ఉన్న సమయంలో జాతర్ల గ్రామంలో మినీ స్టేడియం, మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేశానని, రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల క్రీడా పోటీలు నిర్వహించి గ్రామానికి పేరు తీసుకువచ్చానని తెలిపారు. మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌కు అదనంగా మరో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నామన్నారు. నవజ్యోతి యూత్ క్లబ్ గత 48 ఏళ్లుగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్యాక్స్ చైర్మన్ వెంకన్నయాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీలు శంకర్, రాజు, గణేశ్, రమణ, సుఖ్‌దేవ్, రాములు, ఈశ్వర్, రవి పాల్గొన్నారు. -
బెల్ట్‌షాప్ నిర్వాహకుడిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బెల్ట్‌షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ డి.సాయినాథ్ తెలిపారు. భోరజ్ మండలంలోని కౌట గ్రామంలో వాగ్డే మోహన్ కిరాణా దుకాణంలో బెల్ట్‌షాప్ నిర్వహిస్తున్నాడని అందిన సమాచారంతో గురువారం ఏఎస్సై సిరాజ్ ఖాన్, సిబ్బంది దాడులు నిర్వహించారు. అతని వద్ద నుంచి 8 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. వీటి విలువ రూ.5,500 ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం అమ్ముతున్న ఆయనపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై.. నస్పూర్: ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తీగల్ పహడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ వద్ద గురువారం సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్ విధులు నిర్వహిస్తున్నాడు. కమలాకర్‌రావు, మరికొందరు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, నిర్దేశించిన హద్దును దాటి ఎస్సైతో వాగ్వాదానికి అతని విధులకు ఆటంకం కలిగించారు. ఎస్సై ఫిర్యాదుతో కమలాకర్‌రావు, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ తెలిపారు. -
గోదావరి నదికి హారతి
బాసర: మహాశివరాత్రి సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో సనాతన వేదభారతి పీఠం, వ్యవస్థాపకుడు శ్రీ వేద విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో గురువారం వేకువజామున గోదావరి నదికి హారతి ఇచ్చారు. గంగమ్మ తల్లి, శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివచ్యారు. అనంతరం వారికి వేద భారతి పీఠం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాపహరేశ్వర ఆలయంలో.. బాసరలోని శ్రీ పాపహరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. శివరాత్రిరోజు ఉపవాసం ఉండి భిక్షను స్వీకరించారు. అర్చకుడు నాగేష్ అప్పా తదితరులు ఉన్నారు. -
చెట్టూ... నీ చరిత్ర చెప్పూ..
సాక్షి, ఆదిలాబాద్: దేశంలో ఇప్పుడు ప్రతి పౌరుడికీ ఓ గుర్తింపు ఉంది. అదే ఆధార్.. అలాంటి ఓ గుర్తింపే ప్రతి చెట్టుకు ఉంటే..? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామానికి వెళితే.. ఇలాంటి ప్రత్యేక గుర్తింపు ఉన్న చెట్లు అడుగడుగునా కనిపిస్తాయి. దుకాణాల్లో కనిపించే క్యూఆర్ కోడ్ స్కానర్ల మాదిరే ఈ గ్రామ పరిధిలోని ప్రతి చెట్టుకూ స్కానర్లు కనిపిస్తాయి. వాటిని స్కాన్ చేస్తే ఆ చెట్టు వివరాలన్నీ మనకు ఫోన్లో దర్శనమిస్తాయి.చెట్టు గుర్తింపు నంబర్, అది ఏ రకం, మొక్క నాటిన తేదీ, సంవత్సరం, దాని వయస్సుతో పాటు అది వాతావరణం నుంచి ఎంత కార్బన్డయాక్సైడ్ తీసుకున్నదనే సకల వివరాలు కనిపిస్తాయి. దేశంలో చెట్లకు ప్రత్యేక గుర్తింపు నంబర్లు వేసిన తొలి గ్రామంగా ముఖరా (కే) రికార్డు సృష్టించింది. చెట్ల డేటాబేస్‌ను క్రోడీకరించేందుకు ‘డిజిటల్ ట్రీ ఆధార్’కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ప్రారంభించారు. గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఓ చెట్టుకు స్కానర్‌ను అమర్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గ్రామంలోని ప్రతి చెట్టును జియోట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ కేటాయించారు. ఆది నుంచి ప్రత్యేకమే.. ఆరేళ్ల క్రితమే ఏర్పడిన ముఖరా (కె) గ్రామపంచాయతీ ఆది నుంచీ ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామ తొలి సర్పంచ్‌గా గాడ్గే మీనాక్షిని ఆ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలోని చెత్త నుంచి వర్మీకంపోస్టును తయారు చేసి విక్రయించగా వచ్చిన రూ.5 లక్షలతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో వీధి దీపాలకు, ప్రభుత్వ భవనాలకు విద్యుత్ బిల్లు జీరోగా మారింది.బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడం ద్వారా ఓడీఎఫ్ ప్లస్‌లో స్థానం దక్కించుకుంది. గ్రామంలో సామూహిక మరుగుదొడ్లు కూడా నిర్మించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల ద్వారా గ్రామంలో 1,05,624 మొక్కలను ఐదేళ్లలో నాటారు. ప్రస్తుతం ఆ చెట్లు, మొక్కలకు జియోట్యాగింగ్, క్యూఆర్ కోడ్ స్కానర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రామానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శక్తికరణ్ పురస్కార్, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, స్వచ్ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డు, గ్రామ ఊర్జాస్వరాజ్ విశిష్ట పంచాయతీ పురస్కార్, డిజిటల్ క్యాష్‌లెస్ విలేజ్ అవార్డులు లభించాయి. నాటిన ప్రతీ మొక్క బతకాలన్నదే మా తపన మనం ఎన్ని మొక్కలు నాటాం? ఎన్ని బతికాయి? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే విషయాలు తెలుసుకునేందుకే జియోట్యాగింగ్, క్యూఆర్ కోడ్ స్కానర్ బిగించే కార్యక్రమం చేపట్టాం. మొక్క ఎండిపోతే తిరిగి అక్కడే మరో మొక్క నాటేందుకు జియోట్యాగింగ్ ఉపయోగపడుతుంది. – గాడ్గే మీనాక్షి, మాజీ సర్పంచ్, ముఖరా (కె) -
ఏఐ వార్తలు @ గిరిజన టీచర్
ఆదిలాబాద్ టౌన్: ఆదివాసీ పేద కుటుంబంలో జన్మించి అభ్యున్నతి వైపు పయనిస్తున్నాడు గిరిజన ఉపాధ్యాయుడు తొడసం కైలాస్. అంతరించిపోతున్న గోండి, కొలామి భాషల పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా యాంకర్‌ను సృష్టించి గోండి భాషలో వార్తలు చదివిస్తున్నాడు. గోండి, కొలామి, తెలుగు, హిందీ, ఆంగ్లం, లంబాడా భాషల్లో వందలాది పాటలు రాసి ఔరా అనిపించాడు. ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం వాఘాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన కైలాస్ సేవల గురించి ఇటీవల మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రస్తావించి ప్రశంసించటం గమనార్హం.మట్టిలోని మాణిక్యంకైలాస్ 1 నుంచి 10వ తరగతి వరకు వాఘాపూర్ సర్కారు బడిలో చదివాడు. ఉట్నూర్‌లోని లాల్‌టేక్డి రెసిడెన్షియల్లో ఇంటర్, ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాడు. 2000 సంవత్సరంలో అన్ట్రెయిన్డ్ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువు సాధించాడు. ఈయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు పిల్లలు గంగోత్రి, సృజన్‌రామ్ ఉన్నారు. గాదిగూడ మండలంలోని డొంగర్‌గావ్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేసి, ప్రస్తుతం ఇంద్రవెల్లి మండలం గౌరపూర్‌లో స్కూల్ అసిస్టెంట్ (సాంఘిక శాస్త్రం)గా విధులు నిర్వహిస్తున్నాడు. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ పాఠాలు బోధిస్తున్నాడు. కరోనా సమయంలో గిరిజనులను అప్రమత్తం చేసేందుకు గోండి భాషలో కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేశాడు. గోండి భాషలోకి మహాభారతంఆదివాసీలకు మహాభారత గ్రంథాన్ని అందించాలనే ఉద్దేశంతో తెలుగు లిపి ద్వారా గోండి భాషలోకి ఆ గ్రంథాన్ని కైలాస్ అనువదించాడు. ‘సుంగల్తూర్పో (ఇలవేల్పు), తొడసం బండు (ఇంటి దేవత), నైతం మారుబాయి (అమ్మమ్మ), తొడసం నేలేంజ్ (తమ్ముని కూతురు)’పేరిట ఏఐ యాంకర్‌తో వార్తలు చదివించేవాడు. సంగీతం అంటే ఆయనకు మక్కువ. దీంతో కొలామి భాషలో వందకు పైగా పాటలు రచించి, వాటిని సైతం ఏఐ యాంకర్‌తో పాడించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.గిరిజనులను చైతన్యపర్చాలని..గిరిజనులను చదువు వైపు మళ్లించడంతోపాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను చేపడుతున్నా. జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సాంకేతికతపై ఉన్న మక్కువతో ఏఐ యాంకర్ ద్వారా గోండి, కొలామి ఇతర భాషల్లో వార్తలు చదివించడం, పాటలు పాడించడం చేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నన్ను అభినందించడం సంతోషంగా ఉంది. – తొడసం కైలాస్, ఉపాధ్యాయుడు