Jagtial
-
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
కార్యక్రమాలు విస్తృతపరచాలి షీటీమ్ పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృత పర్చాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలతో మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారు. షీటీమ్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు బాగున్నాయి. – మారు సత్తమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు, జగిత్యాల బస్టాండ్, పాఠశాలలు, కళాశాలలు వద్ద మహిళలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలు, కళాశాలల వద్ద షీటీమ్ ఫోన్ నంబర్లు తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు నిర్భయంగా ముందుకు రావాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. – అశోక్‌కుమార్, ఎస్పీ -
అంధకారంలో బల్దియాలు
జగిత్యాల మున్సిపాలిటీ వార్డులు : 48వీధి దీపాలు : 10,200కోరుట్ల మున్సిపాలిటీ వార్డులు : 32వీధి దీపాలు : 8,966మెట్పల్లి మున్సిపాలిటీ వార్డులు : 26వీధి దీపాలు 5,184ధర్మపురి మున్సిపాలిటీ వార్డులు :15వీధి దీపాలు: 1,525రాయికల్ మున్సిపాలిటీ వార్డులు : 12వీధి దీపాలు : 1,754 ● ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాల నుంచి విద్యానగర్‌కు వెళ్లే రహదారి. ఇక్కడ స్ట్రీట్‌లైట్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. రాత్రిపూట చైన్‌స్నాచింగ్, కుక్కల బెడద అధికంగా ఉంది.●ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్. ఇక్కడ స్ట్రీట్‌లైట్లు అసలే లేవు. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు చిమ్మచీకటి ఉంటుంది. రాత్రివేళ మహిళలు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
లైట్లు బిగించాలి
జిల్లాకేంద్రంలోని మినీస్టేడియం ముందు గేట్ వద్ద, వెనుకవైపు కాలేజీ సమీపంలో స్తంభాలు ఏర్పాటు చేసి స్ట్రీట్‌లైట్స్ బిగించాలి. ఆ వైపు చిమ్మచీకటిగా ఉంటోంది. లైట్లు లేక ఉదయం, సాయత్రం వాకర్స్, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. లైట్లు లేక మలవిసర్జన చేస్తున్నారు. – మచ్చ శంకర్, జగిత్యాల రాత్రిపూట భయంభయంగా రాయికల్‌లోని 3వ వార్డు ఇందిరానగర్‌లో విద్యుత్ స్తంభాలకు వీధిదీపాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఇందిరానగర్ నుంచి మెయిన్ రోడ్ వరకు విద్యుత్ స్తంభాలు లేక రాత్రిపూట కాలనీలోకి రావాలంటేనే భయాందోళనగా ఉంది. – రాజేశ్, రాయికల్వీధిలైట్లు ఏర్పాటు చేయాలి కోరుట్లలోని కల్లూరు రోడ్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. ము న్సిపల్ అధికారులు అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తున్నా అవి తొందరగానే చెడిపోతున్నాయి. అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. – లవంగ సాగర్, కోరుట్ల ● -
కనులపండువగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
రాయికల్: మండలంలోని ఇటిక్యాల గ్రామంలోగల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయ అర్చకులు జగన్మోహనార్యులు, కల్యాణచార్యులు ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. స్వామివారికి తులాభారం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, సురకంటి నాగిరెడ్డి, సామల్ల వేణు, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, రఘునాథాచార్యులు, కనపర్తి శ్రీనివాస్, ఉట్నూరి గంగాధర్ పాల్గొన్నారు. -
ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయండి
● మొక్కజొన్న, కందులు కొనాల్సిందే ● ఎమ్మెల్సీ జీవన్రెడ్డిజగిత్యాలటౌన్: భవన నిర్మాణదారులకు ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జిల్లాలో అక్రమ ఇసుక డంపులను అరికట్టడంలో కలెక్టర్ చొరవను అభినందించిన ఆయన.. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కజొన్నలకు గతేడాది క్వింటాల్‌కు రూ.2500 ఉండగా.. ఇప్పుడు రూ.రెండువేలకు పడిపోయిందని, మొక్కజొన్నలు, కందులు కొనాలని సీఎంకు లేఖ రాశానన్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. నాయకులు బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, మహ్మద్ భారి, సురేందర్, రఘువీర్‌గౌడ్, మహేందర్ తదితరులు ఉన్నారు. -
షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ హామీ నిలబెట్టుకోవాలి
మెట్పల్లి: అధికారంలోకి రాగానే ముత్యంపేటలోని చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చిట్నేని రఘు అన్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేశారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ అర్వింద్ కృషితోనే పసుపు బోర్డు ఏర్పాటైందని, పసుపు రైతుల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్, నాయకులు దొనికెల నవీన్, సుంకేట విజయ్, బొడ్ల ఆనంద్, గౌతమ్ తదితరులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేయడం తగదు మెట్పల్లిలో బీజేపీ నాయకుల ధర్నా -
వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
జగిత్యాలఅగ్రికల్చర్: వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియానాయక్ అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి విద్యుత్ అధికారి వారికి నిర్దేశించిన హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటూ రోజువారి విద్యుత్ లోడ్‌ను సమీక్షించాలన్నారు. పంటలు పూర్తయ్యేవరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. జిల్లాలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియానాయక్ -
మహిళల భద్రతకు షీటీంలు
● ఆకతాయిల ఆగడాలకు చెక్ ● ఫిర్యాదుల స్వీకరణకు సాంకేతిక పరిజ్ఞానం ● వేధింపులపై ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలుజగిత్యాలక్రైం: జిల్లాలోని కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్‌లు ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా షీటీం బృందాలు ప్రత్యేకంగా జనసంచారం ఉన్నచోట మఫ్టీలో తిరుగుతూ.. పోకిరీలను పట్టుకుంటున్నాయి. జగిత్యాల, మెట్పల్లి సబ్ డివిజన్ల పరిధిలో షీటీం పోలీసులు ఆ శాఖ పనితీరుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగ డాలను వీడియో రికార్డ్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. జగిత్యాల, మెట్పల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 20 మండలాల్లో షీ టీం బృందాలు పనిచేస్తున్నాయి. టీమ్‌లో ఎన్ఏ స్థాయి అధికారి, కానిస్టే బుల్ ఉంటారు. అవగాహన సదస్సులు ఆకతాయిలు వేదిస్తే వెంటనే షీటీంకు సమాచారం అందించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నారు. చీటింగ్‌పై పోలీసు శాఖ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటి వరకు 140 చోట్ల సదస్సులు నిర్వహించారు. వేధింపులకు గురిచేసే ఆకతాయిలు ఎక్కువగా సంచరించే 185 అడ్డాలను గుర్తించారు. ఇప్పటివరకు 40 ఫిర్యాదులు రాగా.. 5 కేసులు నమోదు చేశారు. 18 మందిపై ఈ–పెట్టి కేసులు నమోదు చేశారు. 22 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా షీటీం 120 పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే డయల్ 100 లేదా 87126 – 70783వాట్సప్ నంబర్లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. -
‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు
● నేడు కలెక్టర్‌తో ముఖాముఖి ● ఈనెల 15 నుంచి ఫోన్‌ఇన్ ● నిమిషం నిబంధన లేదు ● వసతులన్నీ ఏర్పాటుచేశాం ● అరగంట ముందు వస్తే ప్రశాంతం ● సాక్షి ఇంటర్వ్యూలో డీఈవో రాముజగిత్యాల: ‘పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక చొ రవ తీసుకుని జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలి పేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పిల్లలకు కలెక్టర్ లేఖల ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలిపా రు. ఇందులో భాగంగానే ఈనెల 12న (బుధవా రం) విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. విద్యార్థులు వారివారి పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకుంటే ప్రశాంతంగా పరీక్షలు రాయవచ్చు. వేసవికాలం కావడంతో విద్యార్థులకు సెంటర్లలో అన్ని వసతులు ఏర్పాటు చేశాం..’ అన్నారు డీఈవో రాము. ఈనెల 21 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో డీఈవో రాముతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. సాక్షి: జిల్లాకేంద్రంగా ఏర్పడిన మూడేళ్లు ఎస్సెస్సీ ఫలితాల్లో హ్యాట్రిక్ సాధించింది. తర్వాత నుంచి అట్టడుగు స్థానంలోనే ఉంటోంది. ఈసారి ప్రథమస్థానం సాధించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? డీఈవో: పదో తరగతి ఫలితాలపై కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయులు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రం ఏర్పడిన మూడేళ్ల పాటు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే. ఈ సారి కూడా అలాంటి ఫలితాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: విద్యార్థులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? డీఈవో: కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశాం. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ కలెక్టర్ స్వయంగా లేఖలు పంపించారు. విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా కష్టపడుతున్నాం. ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. సాక్షి : విద్యార్థుల సందేహాలను ఎలా తీర్చుతున్నారు..? డీఈవో: ఈనెల 15నుంచి ఫోన్‌ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక నిపుణుడిని నియమించాం. పరీక్షలు పూర్తయ్యేంత వరకు ఫోన్ ఇన్‌లో సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ ఫోన్‌ఇన్ నంబరు అందిస్తాం. ఈసారి జిల్లాలో మొత్తం 67 సెంటర్లు ఏర్పాటు చేశాం. అందులో అన్ని మౌలిక వసతులు కల్పించాం. సాక్షి: ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు? డీఈవో: జిల్లాలో మొత్తం 11,855 మంది పరీక్ష రాయబోతున్నారు. ఇందులో 5878 బాలురు, 5,977 మంది బాలికలు ఉన్నారు. ప్రైవేటు విద్యార్థులు 285 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేషన్ సిబ్బంది, ఫ్లయింగ్‌స్క్వాడ్, పోలీసు సిబ్బందికి సెల్‌ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. సాక్షి: సిబ్బందిని ఎంత మందిని నియమించారు..? డీఈవో: చీఫ్ సూపరింటెండెంట్లు 67, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 67, అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 4, ఫ్లయింగ్‌స్క్వాడ్స్ 4, కస్టోడియన్స్ 22, ఇన్విజ్లేటర్లు 827 మందిని నియమించాం. విద్యార్థులు ఎండనుంచి తప్పించుకునేందుకు తాగునీటి వసతి కల్పిస్తున్నాం. ప్రతి గదిలో ఫ్యాన్, ఫర్నిచర్ ఏర్పాటు చేశాం. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. ఈ సారి నిమిషం నిబంధన అమలులో లేదు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ప్రశాంతంగా విద్యార్థులు పరీక్ష రాసుకునే అవకాశం ఉంటుంది. సాక్షి: ఫీజు చెల్లించని విద్యార్థులకు కొన్ని పాఠశాలలు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని తెల్సింది..? డీఈవో: అలాంటివారు మాకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. హాల్‌టికెట్ ఇవ్వకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. BE.TELA NGA NA.GOV.I N ద్వారా హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
అద్భుతమైన ఇంజనీరింగ్ శైలి..
కోరుట్ల: పెద్ద పెద్ద రాతి స్తంభాలు.. వాటిపై శిలాఫలకాలతో శ్లాబ్ వంటి నిర్మాణాలు. అక్కడక్కడ చిన్నచిన్న విశ్రాంతి గదులు. దుస్తులు మార్చుకునేందుకు అనువైన నిర్మాణాలు. మూడు అంతస్తుల నిర్మాణం. భూమిపై కనిపించేది కేవలం ఒక అంతస్తు మాత్రమే.. మిగిలిన రెండు అంతస్తుల నిర్మాణం భూగర్భంలోకి వెళ్లిపోయింది. క్రీ.శ. 957–1184 మధ్య కాలం నాటి శిల్పుల ఇంజనీరింగ్ శైలికి నిదర్శనంగా నిలిచిన అద్భుతమైన నిర్మాణం జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. జైన చాళుక్యుల కాలంలో.. క్రీ.శ. 1042–1068 వరకు వేములవాడ రాజధానిగా పరిపాలన సాగించిన జైన చాళుక్యుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మించినట్లు సమాచారం. 7–10వ శతాబ్ది వరకు పరిపాలన సాగించిన కల్యాణి చాళు క్యులు, రాష్ట్రకూటుల హయాంలోనూ ఈ మెట్ల బావి (Stepwell) ఆ కాలం నాటి రాజవంశీయుల స్నానాలకు, విశ్రాంతి తీసుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి వినియోగించారని చెబుతారు. ఈ మెట్ల బావిలోని రాతి స్తంభాలపై చెక్కిన తీరు అమోఘం. రాతి స్తంభాల కింది భాగంలో భూగర్భమార్గంలో రాజకోటను చేరుకోవడానికి సొరంగం వంటి మెట్ల నిర్మా ణం ఉన్నట్లుగా ప్రచారంలో ఉంది. రాజవంశీయుల కాలంలో నిషిద్ధ ప్రాంతంగా ఉన్న ఈ మెట్ల బావి ప్రస్తుతం కోరుట్ల (Korutla) మున్సిపల్ అధీనంలో ఉంది. ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ కోరుట్లలోని మెట్ల బావిలో స్నానాలకు వచ్చే రాజవంశీయులకు దుస్తులు మార్చుకోవడానికి అనువుగా మెట్లబావి రెండవ అంతస్తులో చిన్నచిన్న గదులుండటం గమనార్హం. వీటితో పాటు విశ్రాంతి తీసుకోవడానికి మెట్ల బావి చుట్టూ రాతి స్తంభాల మీద నిలబెట్టిన శిలాఫలకాలతో పెద్ద వసారా ఉంది. మెట్ల బావి (stair well) చుట్టూ దీపాలు వెలిగించడానికి అవసరమైన చిన్నపాటి గూళ్లు ఉన్నాయి. మెట్లబావిపై భాగంలో ఉన్న మెట్లకు వెంబడి ఎడమ వైపు ఉన్న ఓ రాతిపై శిలాశాసనం (Epigraphy) ఉంది. ఈ శిలాశాసనం సంపూర్ణంగా చదవడానికి వీలు కానట్లుగా సమాచారం. ఈ మధ్య కాలంలో దెబ్బతిన్న కోరుట్ల మెట్లబావిని మున్సిపల్ ఆధ్వర్యంలో బాగు చేయించి కొత్త సొబగులద్దారు. దీంతో ఈ మెట్లబావికి ఇండి గ్లోబల్ నెట్వర్క్ నుంచి 2022–23 సంవత్సరంలో ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్ దక్కింది. చదవండి: వెండితెరపై మానుకోట -
అంబేడ్కర్‌ను అవమానించడం సరికాదు
సారంగాపూర్: అంబేడ్కర్‌ను అవమానించడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాగునూర్‌లో సోమవారం పర్యటించారు. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. నిందితులకు శిక్షిపడేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. ఆయన వెంట జగిత్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కల్లెపల్లి దుర్గయ్య, నక్క జీవన్, మాజీ ఎంపీపీ ధర రమేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోండ్ర రాంచంద్రారెడ్డి, దళిత, అంబేద్కర్ సంఘాల నాయకులు పూడూరి శోభన్, మాలెపు సుధాకర్, ప్రశాంత, తదితరులు ఉన్నారు. -
ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు
● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ ● పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు కల్యాణం కమనీయంమల్లాపూర్: మండలంలోని రాఘవపేటలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని అర్చకులు మాధవాచార్యులు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సరోజన దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహిళలు సాముహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నత్తి లావణ్య, నాయకులు పాల్గొన్నారు. 7బాధితులకు సత్వర న్యాయం చేయాలిజగిత్యాలక్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల కు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వి విధ ప్రాంతాలకు చెందిన 14 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చే రువ చేయడమే లక్ష్యంగా ప్రజాసమస్యలను ప రిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే క్షయవ్యాధి నిర్మూలనకథలాపూర్: క్షయవ్యాధిని నిర్మూలించడమే లక్ష్యమని, ఇందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని ఊట్పల్లి, రాజారాంతండాల్లో సోమవారం పర్యటించారు. స్థానిక అధికారులతో పంచాయతీ కార్యాలయాల్లో సమావేశమయ్యారు. క్షయవ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు పంచాయతీ అధికారులు సహకరించాలన్నారు. ఈ రెండు గ్రామాల్లో క్షయవ్యాధిగ్రస్తులు లేకపోవడం విశేషమన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు ఇమ్రాన్, శ్రీధర్, ల్యాబ్ టెక్నీషియన్ చిన్నరాజం, కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రూప్–1 ఫలితాల్లో రాయికల్ యువకుడి ప్రతిభరాయికల్: పట్టణానికి చెందిన సురతాని అరవింద్‌రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 421 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. సురతాని మల్లారెడ్డి, భాగ్యలక్ష్మీ కుమారుడు అరవింద్‌రెడ్డి కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో ఇంటర్, ఢిల్లీలో బీఏ, ఎంఏ ఎకానమిక్స్ పూర్తి చేశాడు. యూజీసీ నెట్లో అర్హత సాధించి గ్రూప్–1 మొదటి ప్రయత్నంలోనే 421 మార్కులు సాధించాడు. అరవింద్‌రెడ్డిని పలువురు అభినందించారు. జగిత్యాలటౌన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై 50 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అనంతరం ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు బీఎస్ లత, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు పులి మధుసూదన్‌గౌడ్, జివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కోతుల బెడద నుంచి కాపాడండి గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి. అన్ని పంటలకు నష్టం చేస్తున్నాయి. ఆరుతడి పంటలు, పండ్లు, కూరగాయల పంటలను తినడమే కాకుండా నాశనం చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి ఆహారం, వస్తువులను ధ్వంసం చేస్తున్నాయి. – మేడిపల్లి మండలం, కొండాపూర్ గ్రామస్తులు ఒకే వ్యక్తి.. రెండు చోట్ల విధులు రాయికల్ మార్కెట్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కొయ్యడ శ్రీనివాస్ అదే మండలం కుమ్మరిపల్లిలో రేషన్ షాపు కూడా నిర్వహిస్తున్నాడు. ఏకకాలంలో రెండు విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై ఈ ఏడాది జనవరి 27న ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేశాను. ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. 25 ఏళ్లుగా రెండుచోట్ల విధులు నిర్వర్తిస్తూ ప్రభు త్వ సొమ్మును అక్రమంగా పొందుతున్న శ్రీని వాస్‌పై చర్యలు తీసుకోవాలి. కడకుంట్ల రమేష్శ్మశాన వాటిక, ప్రభుత్వ స్థలం కాపాడాలి జిల్లాకేంద్రంలోని ధరూర్‌క్యాంపు సర్వేనంబర్ 363, 364లోగల ఎస్సారెస్పీ స్థలాన్ని కొందరు ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. అదే స్థలాన్ని ఆనుకుని ఉన్న శ్మశాన వాటికను కూడా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ విషయమై ఎస్సారెస్పీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – జగిత్యాల తొమ్మిదోవార్డు ప్రజలు డబ్బుల్ ఇళ్లను పంపిణీ చేయండి జగిత్యాల అర్బన్ మండలం నూకపల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన 3500 ఇళ్లలో 800 ఇళ్లను ఇంకా లబ్ధిదారులకు అప్పగించలేదు. ఆ ఇళ్ల వద్ద పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి అర్హులైన పేదలకు పంపిణీ చేయండి. – భారత్ సురక్షా సమితి ప్రతినిధులుసోలార్ప్లాంట్ ఆలోచనలో ఉన్నాం ప్రభుత్వం బస్సులివ్వడం ఊహించలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, చెల్లించడమే తెలిసిన మాకు ఇది మంచి అవకాశం. నెలనెలా ఆర్టీసీ చెల్లించే డబ్బులతో సొలార్ ప్లాంట్లు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే స్థలాలు పరిశీలిస్తున్నాం. సమాఖ్యను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్, సెర్ఫ్ సీఈవో దివ్యదేవరాజన్లకు ధన్యవాదాలు. – హరిణి, ఉదయలక్ష్మి సమాఖ్య, చిగురుమామిడిప్రభుత్వానికి రుణపడి ఉంటాం మా సమాఖ్యకు బస్సు రావడం సంతోషకరం. మా మీద నమ్మకంతో బస్సు కేటాయించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. నెలానెలా బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతో కొత్త వ్యాపారాలు మొదలు పెడుతాం. మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళతాం. సరిత, శ్రీచైతన్య మండల సమాఖ్య, ధర్మపురిరోడ్డు నిర్మించండి వెల్గటూర్ మండలం జగదేవుపేట నుంచి చెర్లపల్లి, వెల్గటూర్ వెళ్లే దారి గుంతలమయంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, ఫైరింజన్, స్కూల్ బస్సులు కూడా వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామానికి రోడ్డు నిర్మించండి. – వెల్గటూర్ మండలం, జగదేవుపేట గ్రామస్తులు నర్సింగాపూర్‌లో భూకబ్జా జగిత్యాల జిల్లా రూరల్ మండలం నర్సింగాపూర్ శివారు సర్వే నంబర్ 437లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడండి. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుకబట్టీలను సీజ్ చేయండి. – సిరికొండ శ్రీనివాస్ ఆర్థికాభివృద్ధికి వినియోగిస్తాం ప్రభుత్వం మా సంఘానికి కేటాయించిన ఆర్టీసీ బస్సు ద్వారా వచ్చే రూ.77 వేల ఆదాయాన్ని సంఘ సభ్యుల ఆర్థికాభివృద్ధికి ఉపయోగిస్తాం. ఆదాయ మార్గాలను అన్వేషించి, కొత్త వ్యాపారం కోసం త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సంఘ సభ్యులంతా సమావేశమై సమష్టిగా చర్చిస్తాం. – గుర్రాల మహేశ్వరి, అధ్యక్షురాలు, రుద్రమ మండల సమాఖ్య, ముత్తారంబస్సు రావడం సంతోషంగా ఉంది మా మండల సమాఖ్యకు బస్సు రావడం సంతోషంగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొదటి బస్సు మాకే ఇచ్చారు. మండల సమాఖ్య సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్‌లో బస్సు నిర్వహణ ఖర్చుల విషయం, మాకు వచ్చే ఆదాయం చర్చించి ఏం చేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకుంటాం. మా సంఘంపై నమ్మకంతో బస్సును అందించినందుకు ధన్యవాదాలు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బస్సును అందించి బాసటగా నిలిచారు. – పంచెరుపుల విజయ, అభ్యుదయ మహిళా సంఘం అధ్యక్షురాలు, జయవరం -
‘బోర్డు’ వచ్చినా పెరగని ధర
నేటి మహాధర్నాను విజయవంతం చేయాలిజగిత్యాలఅగ్రికల్చర్: వాణిజ్య పంటలైన మిర్చి.. పత్తి వంటి పంటలకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. కానీ.. పసుపు ధరలు మాత్రం కొన్నేళ్లుగా పాతాళంలోనే ఉంటున్నాయి. పదేళ్లలో కేవలం గతేడాది ఒక్కసారి మురిపించినప్పటికీ.. ఈ ఏ డాది మళ్లీ చతికిలపడింది. చర్మసౌందర్య సాధనా ల్లో.. రంగుల పరిశ్రమల్లో.. ఔషధతయారీలో, ఆహార పరిశ్రమల్లో విరివిగా వాడే పసుపునకు దేశీ యంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటుంది. అయితే ఆ మేరకు ఎగుమతులు లేకపోవడంతో పసుపు పండించిన రైతులకు అనుకున్న స్థాయిలో ధర రావడం లేదు. పసుపు బోర్డు వచ్చినా రైతుల పోరాటాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా రైతులు పసుపునకు గిట్టుబాటు ధర కోసం మంగళవారం మెట్పల్లిలో ఆందోళనకు పిలుపునిచ్చారు. జగిత్యాల, నిజామాబాద్లదే అగ్రస్థానం పసుపు పంట సాగు, ఉత్పత్తిలో జగిత్యాలతోపాటు నిజామాబాద్దే అగ్రస్థానం. రాష్ట్రం మొత్తంగా 1.10 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు 60 వేల ఎకరాల్లో సాగవుతోంది. జిల్లా రైతులు పసుపు పంటను ఇంటిపంటగా భావిస్తుంటారు. ధర ఉన్నా.. లేకున్నా సాగు చేస్తున్నారు. పసుపు 9నెలల పంట కావడంతో ఈ పంటకు వచ్చే ఆదాయంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో బరువైన నేలలు ఉండడం.. అవి పసుపు పంటకు అనుకూలంగా కావడంతో డ్రిప్, సేంద్రియ ఎరువులు వాడుతూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. పసుపు రంగు, నాణ్యత బాగానే ఉన్నప్పటికీ.. ఇక్కడి రైతులు పండించిన పసుపులో కుర్కుమిన్ శాతం తక్కువగా ఉందనే ఒక అపవాదు ఉంది. ఈసారి దిగుబడి అంతంతే.. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉండటంతో పసుపు పంట దెబ్బతింది. ముఖ్యంగా ఎక్కువరోజులపాటు పంటలో నీరు నిల్వ ఉండటంతో పసుపు పంట మొక్కలు చనిపోయాయి. దుంపకుళ్లు రోగం వచ్చి దిగుబడి తగ్గింది. ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనుకుంటే కనీసం 15 నుంచి 20 క్వింటాళ్లు కూడా రాలేదు. ఒక్కో రైతు ఎకరాకు లారీ పశువుల లేదా కోళ్ల ఎరువుకు రూ.30వేల వరకు ఖర్చు పెట్టారు. కలుపుతీత, ఎరువులకు మరో రూ.30 వేలు, పంట తవ్వకం, కొమ్ములు విరవడం, ఉడకబెట్టేందుకు ఇంకో రూ.40వేలు.. ఇలా దాదాపు ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చు పెట్టినా ఆ స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో ధరలు అంతంతే.. గతేడాది పసుపు పంట క్వింటాల్‌కు రూ.17వేల నుంచి రూ.18వేలు పలికింది. దీంతో ఈ ఏడాది జిల్లాలో మరో 10వేల ఎకరాల సాగు పెరిగింది. పండించిన పసుపును రైతులు నిజామాబాద్, వరంగల్ మార్కెట్లతోపాటు తమిళనాడులోని ఇరోడ్, సేలం, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు తీసుకెళ్తుంటారు. అక్కడ ధర క్వింటాల్‌కు కేవలం రూ.8వేల నుంచి రూ.10 వేలు, మండ పసుపునకు రూ.7వేల నుంచి రూ.8వేలు మాత్రమే పలుకుతోంది. ఫలితంగా పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతల పోరుబాట నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పడినప్పటికీ రైతుల పోరాటాలు మాత్రం ఆగడం లేదు. పసుపు పంటకు క్వింటాల్‌కు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పసుపు పండించే గ్రామాల్లో వారం రోజులుగా పర్యటించి ఈనెల 11న మెట్పల్లిలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నారు. గతేడాది క్వింటాల్‌కు రూ.17వేల నుంచి రూ.18వేలు ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.8వేల నుంచి రూ.10వేలు పెట్టుబడులు కూడా నష్టపోతున్న అన్నదాతలు గిట్టుబాటు ధర కోసం ఆందోళనకు రైతుల కార్యాచరణ నేడు మెట్పల్లిలో ధర్నాకు రైతు ఐక్య వేదిక పిలుపు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి: పసుపు పంటకు మద్దతు ధరను ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లను సోమవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటకు వ్యాపారులు చెల్లిస్తున్న ధరపై ఆరా తీశారు. పసుపునకు గిట్టుబాటు ధర అందక రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చే సీజన్లో పసుపు రైతులు కోటీశ్వరులు అవుతారని మాట్లాడిన నాయకులు.. ఇప్పుడు అందుతున్న ధరలపై రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. బోర్డు పేరుతో కేంద్రం రూ.15వేల మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పసుపు రైతులను మోసం చేస్తున్నాయన్నారు. మెట్పల్లిలో పసుపు రైతులు తలపెట్టిన మహాధర్నా విజయవంతం చేయాలని కోరారు. మూడెకరాల్లో సాగు చేశాను మూడెకరాల్లో పసుపు పంట వేశాను. గతేడాది రేటు మంచిగా ఉండే. ఈ ఏడాది అదనంగా మరో ఎకరం ఎక్కువగా వేశాను. దిగుబడి అనుకున్న స్థాయిలోనే వచ్చింది. మార్కెట్ ధర పెరిగిన పెట్టుబడికి ఏ మాత్రమూ గిట్టుబాటు కావడం లేదు. గతేడాదితో పోల్చితే రూ.లక్ష వరకు నష్టం వస్తోంది. – ఏలేటి మహేశ్ రెడ్డి, కొత్తధాంరాజ్‌పల్లి, మల్లాపూర్ క్వింటాల్‌కు రూ.15వేలు చెల్లించాలి పసుపు క్వింటాల్‌కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని కొన్నేళ్లుగా పోరాడుతున్నాం. ధర రానప్పుడు బోర్డు ఏర్పడినా.. ఏం ఉపయోగం లేదు. కష్టానికి తగిన ఫలితం వస్తేనే రానున్న రోజుల్లో సాగు చేస్తారు. రేటు పెరుగుతుందనే ఆశతోనే పసుపును సాగు చేస్తున్నాం. – న్యావనంది లింబారెడ్డి, మల్లాపూర్ -
మహిళలు..
మనీరాణులు!● మండల మహిళా సమాఖ్యలకు 47 బస్సులు ● బస్సుల కొనుగోలుకు రూ.14.10 కోట్లు మంజూరు ● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా జగిత్యాలకే 15 వాహనాలు ● ఏడేళ్లపాటు సమాఖ్యలకు ప్రతీనెల రూ.77వేలు చెల్లించనున్న ఆర్టీసీ ● ఈ ఆదాయంతో సోలార్ ప్లాంట్లు, ఇతర ప్రత్యామ్నాయ వ్యాపారాలు ● ప్రభుత్వ నిర్ణయంతో ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్న మహిళలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్‌లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాత సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందాయి. ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలవరకు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది. -
గిట్టుబాటు ధర కోసం పోరుబాట
● చలో మెట్‌పల్లికి పిలుపునిచ్చిన రైతు ఐక్య వేదిక ● ఈనెల 11న మార్కెట్ యార్డు ఎదుట ఆందోళనకోరుట్లరూరల్: పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఆందోళన చేపట్టనున్నారు. మెట్పల్లి మార్కెట్ యార్డు ముందు ధర్నా చేపట్టి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈనెల 11న శ్రీచలో మెట్పల్లిశ్రీ పేరుతో ఆందోళనకు రైతులు పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకుడు, రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో పసుపు కల్లాల వద్ద రైతులను కలిసి మద్దతు కోరారు. కేంద్రప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ మద్దతు ధర కల్పించటం లేదని, ధర తక్కువగా ఉండడంతో పంట పండించిన రైతులకు నష్టాలే మిగులుతున్నాయ ని వివరిస్తున్నారు. గతేడాదితో పోల్చితే పసుపు పంటకు ఈ సారి తక్కువ ధర ఉండటం రైతుల ను ఆందోళన కలిగిస్తోంది. పసుపు బోర్డు ఏర్పా టు సమయంలో సంబరాలు జరుపుకున్న రైతులు.. మద్దతు ధర కల్పించకపోవటంతో పోరుబాటకు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్ హయాంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ద్వారా పసుపు పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేశారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పసుపు పంటకు ఆశించిన ధర లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహ న్ రెడ్డి కూడా ఈ పథకం ద్వారా ప్రభుత్వమే కొ నుగోళ్లు చేపట్టారని రైతు నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే పథకాన్ని వర్తింపజే సి రాష్ట్రంలో పసుపు క్వింటాల్‌కు కనీసం రూ.15 వేలు చె ల్లిస్తూ.. ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పలువురు రైతు సంఘ నాయకులు కోరుట్ల మండలంలోని వెంకటాపూర్, చిన్నమెట్పల్లి, జోగిన్‌పల్లి గ్రామాల్లో పసుపు రైతులను కలిసి మద్దతు కోరారు. మెట్పల్లిలో ని ర్వహించే ధర్నాకు తరలిరావాలని పిలుపుని చ్చా రు. కార్యక్రమంలో వెంకటాపూర్ మాజీ స ర్పంచ్ తోట లింగారెడ్డి, దాగె వెంకటేష్, దాగె గంగాదర్, మహేష్, లక్ష్మారెడ్డి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
కమనీయం శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
సారంగాపూర్:మండలంలోని దుబ్బరాజన్న ఆలయం ఆవరణలో శ్రీవేంకటేశ్వరస్వామి, అలివేలుమంగ, పద్మావతిదేవి కల్యాణాన్ని ఆలయ అర్చకులు ఆదివారం కనులపండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు మంగళవాయిద్యాల మధ్య శోభాయాత్ర చేపట్టారు. పెంబట్ల, కోనాపూర్, పోచంపేట గ్రామాల నుంచి మహిళలు 108 కలశాలను కల్యాణం కోసం తీసుకొచ్చారు. ఆలయ ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకరయ్య, విండో చైర్మన్ గుర్నాథం మల్లారెడ్డి, నాయకులు కోండ్ర రాంచంద్రారెడ్డి, తోడేటి శేఖర్‌గౌడ్, వాసం శ్రీనివాస్, పంగ కిష్టయ్య, తోడేటి గోపాల్‌కిషన్, కాలగిరి బాపురెడ్డి, కొంగరి లింగరెడ్డి, బొక్కల సునిత, భక్తులు పాల్గొన్నారు. -
ఆగని అవినీతి దందా
● ఏసీబీకి చిక్కుతున్న లంచావతారులు ● పట్టుబడుతున్నా కనిపించని మార్పు ● మున్సిపాలిటీల్లో అభివృద్ధికి ఆటంకం ● తాజాగా పట్టుబడిన ధర్మపురి కమిషనర్ ● ఇన్చార్జి కమిషనర్లతోనే నెట్టుకొస్తున్న బల్దియాలుజగిత్యాల: జిల్లాలోని మున్సిపాలిటీల్లో అధికారుల అవినీతికి అంతులేకుండా పోతోంది. ప్రతిపనికీ లంచం డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఫలితంగా బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తూ అవినీతి అధికారులను పట్టిస్తున్నారు. అయినా లంచావతారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. తాజాగా జిల్లాలోని ధర్మపురి మున్సిపల్ కమిషన్ శ్రీనివాస్ ఓ ఉద్యోగికి వేతనం చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కాడు. ఒప్పంద కార్మికులకు సంబంధించి వేతనాల చెల్లింపునకు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు వల పన్ని శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. అదేరోజు కోరుట్ల కమిషనర్ తిరుపతిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల మున్సిపల్ సిబ్బంది చేపట్టిన సర్వే వేతనాలు చెల్లించకపోవడం.. పన్ను వసూళ్లలో వెనుకబడి ఉండటంతో అతడిపై వేటు వేశారు. ఇలా ప్రతి మున్సిపాలిటీలో ఏదో సంఘటన చోటుచేసుకుంటోంది. కమిషనర్లు ఏదో కేసులో ఇరుక్కోవడం, ఇక్కడి నుంచి బదిలీ లేదా సస్పెండ్ కావడం, ఏసీబీ వలలో చిక్కడంతో ఇన్చార్జిలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. అవినీతి ఆగేదెన్నడో.. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా శానిటేషన్, రెవెన్యూ విభాగాలతోపాటు టౌన్‌ప్లానింగ్ శాఖలో అమ్యమ్యాలు ఇస్తేనే పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల టౌన్‌ప్లానింగ్ విభాగంలో పనిచేసిన టీపీవో గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆ ఘటనలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి హస్తం ఉండటంతో ఇద్దరూ సస్పెన్షన్ అయ్యారు. టౌన్‌ప్లానింగ్‌లో అత్యధికంగా అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇంటి అనుమతులకు ఎక్కువగా అమ్యామ్యాలు ముడితేనే ఇస్తున్నారని ఆరోపణలు ఉండగా.. శానిటేషన్ విభాగంలో పారిశుధ్య కార్మికులకు సంబంధించిన పరికరాల కొనుగోలులో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ విభాగంలో ముటేషన్లు చేపట్టడానికి ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతున్నట్లు అన్ని మున్సిపాలిటీల్లో ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. -
జగిత్యాల
న్యూస్‌రీల్7పోచమ్మతల్లికి బోనాలుమల్లాపూర్: మండలంలోని కొత్తదాంరాజుపల్లిలో శ్రీరేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మతల్లికి బోనాలు సమర్పించారు. మాజీ ఎంపీపీలు కాటిపెల్లి సరోజన, బద్దం విజయ, మాజీ సర్పంచులు బద్దం సరిత, గజ్జి గంగారెడ్డి, ఉత్కం హన్మాంతుగౌడ్, మాజీ ఎంపీటీసీ మెండు గంగారెడ్డి, గౌడ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025 -
వన్యప్రాణుల దాహం తీర్చేలా
● అడవుల్లో 140 సాసర్‌పిట్స్ ఏర్పాటు ● మూడు సోలార్ బోర్ల నిర్మాణం ● అడవినుంచి బయటకు రాకుండా..జగిత్యాలక్రైం: అడవుల్లోని వన్యప్రాణులు వేసవిలో నీటి కోసం తపిస్తున్నాయి. ఈ క్రమంలో అటవీప్రాంతం నుంచి బయటకు వస్తుండటంతో కుక్కలు, వేటగాళ్ల బారిన పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదవశాత్తు బావుల్లో పడి మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వాటికి అడవుల్లోనే నిత్యం నీటిని అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలోని ఐదు రేంజ్‌ల పరిధిలో 53 వేల హెక్టార్లలో అటవీ విస్తరించి ఉంది. ఈ అడవుల్లో ఉండే వన్యప్రాణులు వేసవికాలంలో నీటికోసం బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. 140 సాసర్‌పిట్స్ నిర్మాణం జిల్లావ్యాప్తంగా గతంలో ఉన్నవాటితోపాటు నీటి నిలవ పెంచేందుకు మొత్తం 140 సాసర్‌పిట్స్, సర్కులేషన్ ట్యాంకుల నిర్మించారు. ట్యాంకర్ల ద్వారా అక్కడున్న నీటి వసతి ద్వారా సాసర్‌పిట్స్ నింపుతున్నారు. నీటి నిల్వ పెంచుతున్న చెక్‌డ్యామ్‌లు జిల్లాలోని అడవుల్లో భూగర్భజలాలు పెంచేందుకు ఇప్పటికే 47 చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. వీటితోపాటు 112 నీటి కుంటలున్నాయి. వర్షం నీరు వృథాగా పోకుండా అడ్డుకట్ట వేసి చెక్‌డ్యామ్‌లు, నీటి కుంటల్లో నీరు నిల్వ చేస్తున్నారు. ఆ నీటిని వన్యప్రాణులు తాగుతూ దాహార్తి తీర్చుకుంటున్నాయి. మరోవైపు అడవుల్లో భూగర్భజలాలు కూడా పైకి వస్తున్నాయి. ఫలితంగా చెట్లు కూడా విస్తారంగా పెరిగేందుకు దోహదపడుతున్నాయి. మూడు సోలార్ బోర్లు అటవీప్రాంతంలో మూడు సోలార్ బోర్లు ఏర్పాటు చేశారు. అందులో లభించే నీటి ఆధారంగా ప్రస్తుతం మరికొన్ని బోర్లు వేసేందుకు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు సోలార్ బోర్లు ఏర్పాటు చేశారు. వీటికి సోలార్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు.. అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులకు వేసవి దృష్ట్యా నీటి వసతులు కల్పించాం. వన్యప్రాణులు బయటకు రావడంతో ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా నీటి వసతి కల్పించి వాటి దాహార్తి తీర్చేలా చర్యలు చేపట్టాం. – రవిప్రసాద్, జిల్లా అటవీశాఖ అధికారి -
లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం
జగిత్యాలజోన్: లోక్‌అదాలత్‌ల ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. నీలిమ అన్నారు. జిల్లాకోర్టులో శనివారం మెగా లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కక్షలతో సాధించేది ఏమీ లేదని, మానసిక ప్రశాంతతతో జీవించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నేరమయ జీవితానికి అలవాటు పడవద్దని, కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ.. కేసులతో విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జగిత్యాలరూరల్ మండలంలో చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదం కేసులో నష్టపరిహారంగా ఇన్సూరెన్సు సంస్థ నుంచి రూ.9లక్షల పరిహారాన్ని ఇప్పించారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురిలోని కోర్టుల్లో మొత్తంగా 1624 కేసులు పరిష్కరించారు. జిల్లా కేంద్రంలో ఐదు లోక్‌అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో జడ్జి నీలిమ, మొదటి అదనపు కోర్టులో జడ్జి నారాయణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి శ్రీనిజ, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జి జితేందర్, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జి వినీల్ కుమార్ కేసులను పరిష్కరించారు. బార్ అసోసియేషన్ జగిత్యాల అధ్యక్షుడు డబ్బు లక్ష్మారెడ్డి, లీగల్ ఎయిడ్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విజయ్‌కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ జిల్లావ్యాప్తంగా 1,624 కేసులు పరిష్కారం రూ.1.42 కోట్ల విలువైన పరిహారం అందజేత -
మహిళలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలి
మెట్పల్లి: మహిళలు తమకు ఎదురవుతున్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాలని మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు అన్నారు. పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మేజిస్ట్రేట్ మాట్లాడారు. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అదే సమయంలో వారిపై ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టాలున్నాయని, వాటిపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు మహిళా న్యాయవాదులను సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ తదితరులున్నారు. మహిళలు హక్కులను వినియోగించుకోవాలి ● అదనపు కలెక్టర్ లత జగిత్యాల: మహిళలు తమ హక్కులను సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఆమె మున్సిపల్ ఉద్యోగులు సన్మానించారు. ప్రతి మహిళ రాణి రుద్రమదేవి, సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవా లన్నారు. ప్రతి ఒక్కటి చేయగలుగుతామనే నమ్మకంతో ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి ధర్మపురి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీచర్స్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామిని శనివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్రెడ్డి, ఏంఈవో సీతామహాలక్ష్మి, రాష్ట్ర నాయకులు గజభీంకార్ గోవర్దన్, జిల్లా, మండలి బాఽ ద్యులు, నాయకులు దినేష్ తదితరులున్నారు. పది నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం జగిత్యాల: జిల్లాకేంద్రంలో ఈనెల 10వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ సంస్కృతం సబ్జెక్ట్‌కు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుందని ఇంటర్ నోడల్ అధికారి నారాయణ తెలిపారు. ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందని, సంస్కృతం అధ్యాపకులు ఈనెల 10న ఉదయం 10 గంటలకు అపాయింట్మెంట్ ఆర్డర్‌తో రావాలని, అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్ రిపోర్ట్ చేయాలని తెలిపారు. మూల్యాంకణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని పేర్కొన్నారు. పసుపు రైతు మహాధర్నాను విజయవంతం చేయాలికోరుట్ల రూరల్/ఇబ్రహీంపట్నం: పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న మెట్పల్లి మార్కెట్ యార్డు వద్ద నిర్వహించే పసుపు రైతుల మహా ధర్నా విజయవంతం చేయాలని రైతు ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కోరట్ల మండలంలోని ఐలాపూర్, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రైతు ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ పసుపు క్వింటాలుకు రూ. 15000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల రమేశ్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, తెలంగాణా జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి, పిడుగు సందయ్య పాల్గొన్నారు. -
మహిళా సాధికారికతోనే సమాజ అభివృద్ధి
జగిత్యాలక్రైం: మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో మహిళలను సన్మానించారు. విధి నిర్వహణలో రాణించిన మహిళా పోలీస్ సిబ్బందికి బహుమతులు ప్రదానం చేశారు. మహిళల్లో సంకల్పశక్తి ఎక్కువని, అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని తెలిపారు. పోలీసు శాఖలో పలు విభాగాల్లో మహిళా అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారని వివరించారు. గృహ హింస, వైవాహిక వివాదాల్లో బాధిత మహిళలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు రఘుచందర్, రాములు, మహిళా ఎస్సైలు గీత, సుప్రియ, రిజర్వ్ సీఐలు కిరణ్ కుమార్, వేణు, సీఐలు ఆరిఫ్ అలీఖాన్, జిల్లా పరిధిలోని వివిధ విభాగాల మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డ్స్ పాల్గొన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం -
‘మై ఆటో సేఫ్’కు శ్రీకారం
కోరుట్ల: మహిళల భద్రతే లక్ష్యంగా మైఆటో సేఫ్ స్కానర్లు ప్రవేశపెట్టినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. కోరుట్ల జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ఆటో డ్రైవర్లకు భద్రత, మైఆటో సేఫ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీసులకు సామాజికంగా అదనపు బాధ్యతలు ఉంటాయని, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటోల్లో ప్రయాణించే వారి భద్రతలో భాగంగా ఆటోలకు స్టిక్కర్లు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో నాలుగు వేల ఆటోలు ఉండగా ఇప్పటివరకు 2093 ఆటోలకు మై ఆటో సేఫ్ స్టిక్కర్లు వేశామన్నారు. ఇందుకు సహకరించిన ఆటో యూనియన్లకు ధన్యవాదాలు తెలిపారు. కోరుట్ల ఆర్టీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆటోల రిజిస్ట్రేషన్‌తోపాటు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ తప్పక ఉండాలన్నారు. ఆటో యూనియన్ నాయకులు ఆరీఫ్, రఘునాఽథ్, గణేశ్ మాట్లాడుతూ కోరుట్ల లో ఆటోల్లో ప్రయాణించిన వారికి ఎలాంటి ఇబ్బందులూ లేవన్నారు. మెట్పల్లి డీఎస్పీ రాములు, సీఐ సురేష్‌బాబు, ఎంపీడివో రామకృష్ణ, ఎస్సైలు శ్రీకాంత్, రాంచంద్రం, నవీన్, శ్యాంరాజ్ పాల్గొన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఎస్పీ అశోక్‌కుమార్ ఆటోలకు స్కాన్ స్టిక్కర్లు -
కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు
● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత జగిత్యాలరూరల్: ఎన్నికల సమయంలో మహిళలకు కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చడంలో ఇప్పుడు విఫలమైందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జగిత్యాలరూరల్ మండలం వెల్దుర్తిలో మహిళలతో కలిసి వేడుకలు నిర్వహించారు. బంధాలు, బాధ్యతల కోసం తల్లిగా, గృహిణిగా అన్ని రంగాల్లో మహిళలు అందించే సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. అలాంటి సీ్త్రమూర్తులందరినీ గౌరవించేలా మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చేసిన మోసపూరిత హామీలపై, స్థానిక ఎమ్మెల్యేకు ఓటు వేసి గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మహిళలు చెంపలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. -
సమయం లేదు మిత్రమా..!
జగిత్యాల: బల్దియాల్లో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ వేగం అందుకోలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు సమయం సమీపిస్తున్నా.. ఇంకా కొన్ని బల్దియాల్లో లక్ష్యాన్ని మాత్రం చేరడం లేదు. వాస్తవానికి మున్సిపాలిటీల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలైతే ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్స్ కింద ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. గతేడాది కోరుట్ల మున్సిపాలిటీ 100 శాతం సాధించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో అవార్డు కూడా అందుకుంది. ఎప్పటిలాగే ఇప్పడు కూడా కోరుట్ల బల్దియా 76.45 శాతంతో ముందంజలో ఉంది. అలాగే మెట్పల్లి 73.25శాతం, రాయికల్ 69.73, ధర్మపురి 53.49శాతం వసూలు చేసింది. జిల్లాకేంద్రమైన జగిత్యాలలో మాత్రం కేవలం 52 శాతం వసూలుతో చాలా వెనుకబడిపోయింది. దీంతో స్పెషల్ గ్రాంట్ నిధులు రాక అభివృద్ధి కుంటుపడుతోంది. బకాయిదారులకు రెడ్ నోటీసులు జిల్లాలో చాలారోజులుగా పెండింగ్‌లో ఉన్న బకాయిదారులకు అధికారులు రెడ్‌నోటీసులు జారీ చేస్తున్నారు. మూడుసార్లు నోటీసులు జారీ చేసిన అనంతరం ఆస్తిపన్ను చెల్లించనివారి ఆస్తి జప్తు చేసుకుంటారు. జగిత్యాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు 100 మందికి రెడ్ నోటీసులు జారీ చేశారు. గతంలో బకాయి పడిన వారి ఇంటి ముందు డప్పు చాటింపు చేసి వినూత్న రీతిలో సైతం వసూలు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 32 బృందాలను ఏర్పాటు చేసి వసూలు చేస్తున్నా ఆస్తిపన్ను వసూళ్లలో మాత్రం జగిత్యాల వెనుకబడే ఉంది. అభివృద్ధికి ఆటంకం వందశాతం ఆస్తిపన్ను వసూలైతే ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంది. ఆ నిధుల ద్వారా అభివృద్ధి చేసుకునే పరిస్థితి నెలకొంటుంది. కానీ ప్రజలు ఆస్తిపన్ను చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గతంలో పట్టణ ప్రగతి నిధులు రాగా సుందరీకరణ పనులు, రోడ్లు, ఉద్యానవనాలు అభివృద్ధి చేశారు. అధికారులు స్పందించి పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు సహకరించాలి జిల్లాకేంద్రంలో ఆస్తిపన్ను చెల్లించని 100 మందికి ఇప్పటికే రెడ్‌నోటీసులు జారీ చేశాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు వందశాతం వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు సహకరించాలి. మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలి. ఆస్తిపన్ను కట్టకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. – చిరంజీవి, మున్సిపల్ కమిషనర్జిల్లాలోని బల్దియాల్లో పన్నుల డిమాండ్, బకాయిలు, వసూళ్లు (రూ.లక్షల్లో) మున్సిపాలిటీ డిమాండ్ ఏరియర్స్ మొత్తం వసూలు బ్యాలెన్స్ శాతం జగిత్యాల 737.79 563.82 1301.61 624.66 624.66 52.01కోరుట్ల 446.36 38.68 505.04 388.02 119.55 76.45మెట్పల్లి 359.88 35.79 395.67 288.54 105.37 73.25రాయికల్ 109.35 21.58 130.93 92.19 40.02 69.73ధర్మపురి 96.28 49.98 146.25 72.13 62.72 53.49మొత్తం 1769.66 709.84 2479.50 1517.83 952.32 61.45సకాలంలో పన్నులు చెల్లించాలి కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని, లేకుంటే ఆస్తులు సీజ్ చేస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు భవన సముదాయాలను సందర్శించి యజమానులకు నోటీసులు జారీ చేయించారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం ఆస్తిపన్ను 1355.07 లక్షలు ఉండగా.. ఇప్పటివరకు రూ.699.80 లక్షలు మాత్రమే వసూలు అయిందన్నారు. ఆస్తిపన్ను సకాలంలో చెల్లించకుంటే నోటీసులు జారీ చేసి పురపాలక సంఘం చట్టం 2019 ప్రకారం సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, రెవెన్యూ ఆఫీసర్ కనకయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపాల్ ఉన్నారు. త్వరలో ముగియనున్న ఆర్థిక సంవత్సరం బల్దియాల్లో ముందుకు కదలని పన్ను వసూళ్లు ఇప్పటివరకు 61.45 శాతమే పూర్తి 76.45శాతంతో ముందంజలో కోరుట్ల 52.01 శాతంతో వెనుకబడిన జగిత్యాల -
మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
జగిత్యాల: మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారి సాధికారత కోసం సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్సారెస్పీ క్యాంప్‌లో మహిళాశక్తి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. 90 శాతం రుణమాఫీ చేశామని, మిగిలిన వారికి త్వరలోనే చేస్తామని, ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నామని, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.30 కోట్లు, బీటీరోడ్లకు రూ.35 కోట్లు, రోల్లవాగుకు రూ.15 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ మహిళా సంఘాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో స్వశక్తి సంఘాలు 15,150 ఉన్నాయని, వాటికి సున్నా వడ్డీ కింద బ్యాంక్ లింకేజీ రూ.20లక్షల చొప్పున ఇస్తామని వెల్లడించారు. జిల్లాలో 15 మహిళా సంఘాలకు 15 బస్సులు అందిస్తున్నామన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్, అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరణ్, మాజీ చైర్పర్సన్ జ్యోతి పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం సారంగాపూర్: సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి విప్ క్షీరాభిషేకం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించడం సరికాదన్నారు. అంబేడ్కర్ తన రాజ్యాంగంతోనే అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. విగ్రహాలకు నష్టం చేయాలన్న ఆలోచన ప్రజల్లో రాకుండా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. ప్రజల్లో భేదాభిప్రాయాలు ఉంటే పోలీసులు సహాయంతో పరిష్కరించుకోవాలిగానీ.. ఇలా విగ్రహాన్ని అవమానించడం సరికాదన్నారు. మాజీ ఎంపీపీలు ధర రమేశ్, మసర్తి రమేశ్, గుడిసె జితేందర్, మాజీ కౌన్సిలర్లు కల్లెపల్లి దుర్గయ్య, నక్క జీవన్, కోండ్ర రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖాయమని విప్ లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడని, తనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ సీఎంతో మాట్లాడామని, జీవన్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరామని తెలిపారు. ఈనెల పదో తేదీన ప్రకటన వస్తుందని వెల్లడించారు. సాధికారత కోసం పలు సంక్షేమ పథకాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ -
ఎములాడ రాజన్న సేవలో..
వేములవాడ: దైవకార్యంలో మేము సైతం అంటూ మహిళలు ముందుకు సాగుతున్నారు. సొంత ఖర్చులతో వేములవాడకు చేరుకుని హుండీ లెక్కింపులో, భక్తుల సేవలో తరిస్తున్నారు. ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు సొంత ఖర్చులతో రాజన్న సన్నిధికి చేరుకుని సేవలందిస్తున్నారు. ఇందులో ప్రధానంగా శ్రీలలితా సేవా ట్రస్టు, శివరామకృష్ణ భజన మండలి, శ్రీరాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు దశాబ్దానికిపైగా రాజన్న సేవలో తరిస్తున్నారు. ప్రతీసారి జరిగే హుండీ లెక్కింపుతో పాటు అన్ని పర్వదినాలు, రద్దీ రోజుల్లోనూ వీరు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి వందల సంఖ్యలో సేవా సమితి సభ్యులు వస్తుంటారు. గురువారం నాటి హుండీ కౌంటింగ్‌లో సుమారు 550మంది మహిళలు పాల్గొన్నారు. ‘మహిళలు ఆలయంలో అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. వారి సేవలకు కృతజ్ఞతగా మధ్యాహ్న భోజనం, రెండు లడ్డూలు, స్వామి వారి దర్శనం కల్పిస్తున్నాం’. అని ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. -
వాతావరణ మార్పులతో అనారోగ్యం
జగిత్యాల: వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో టాస్క్‌ఫోర్స్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎండలు ముదిరి వాతావరణంలో మార్పుల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలన్నారు. వడదెబ్బకు గురికాకుండా చూడాలన్నారు. ఉపాధిహామీ కూలీలకు నీటి సదుపాయం కల్పించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, సమియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 27న బార్ అసోసియేషన్లకు ఎన్నికలుజగిత్యాలజోన్: ఉమ్మడి జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్లకు మార్చి 27న ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నర్సింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సర్క్యులర్ కాపీని అన్ని బార్ అసోసియేషన్లకు పంపించారు. మార్చి 15న న్యాయవాదుల ఓటర్ లిస్ట్ ప్రకటించాలని, 17నుంచి 20వరకు నామినేషన్లు, 21న నామినేషన్ల పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటన, 27న బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఎన్నికలను ఉదయం 10 గంటల నుంచి 4.30గంటల వరకు నిర్వహించాలని, తదనంతరం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి, ఫలితాలు ప్రకటించాలని సూచించారు. ఏప్రిల్ 1న కొత్త కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వృద్ధురాలు అదృశ్యం కథలాపూర్: కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన గుగ్గిల్ల గంగు(70) అదృశ్యమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గంగు తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. గురువారం ఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాకపోవడంతో ఆమె బంధువులు పలువురిని వాకాబు చేశారు. గంగు అదృశ్యమైనట్లు ఆమె బంధువు గుగ్గిల్ల రాజారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. -
నేడు మహిళా సమాఖ్యలకు బస్సులు
గోదావరినదిలో గుర్తుతెలియని శవంధర్మపురి: మండలంలోని రాయపట్నం వద్ద ఉన్న గోదావరినదిలో శుక్రవారం గుర్తు తె లియని వ్యక్తి శవం తేలిందని ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు. వయస్సు 35నుంచి 40ఏళ్లు ఉంటుందని, ప్రమాదవశాత్తు పడిపోయా డా..? ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? అనే కోణా ల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహం గుర్తుపట్టలేనిస్థితిలో ఉండగా జగిత్యాల మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ కోరుట్ల: పట్టణంలోని గాంధీరోడ్డు కాముడి పెంటవద్ద తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. మైలారపు అంజయ్య తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి వారంక్రితం హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి ఇంటికి వెళ్లాడు. గురువారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా ఇంట్లోని రెండు బీరువాల తాళాలు పగుల గొట్టి అందులోని 3తులాల బంగారం, రూ.50వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. ఘటనా స్థలాన్ని శుక్రవారం ఎస్సై రాంచంద్రం గౌడ్ పరిశీలించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.సాక్షిప్రతినిధి,కరీంనగర్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి. మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు కేటాయించడం ద్వారా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 మండలమహిళా సమాఖ్యలను ఎంపికచేశారు. ఈ జాబితాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐదు మండల మహిళా సమాఖ్యలకు అవకాశం దక్కడం గమనార్హం. శనివారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీ్త్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమాఖ్యలకు బస్సులు కేటాయించనున్నారు. ఎన్ఆర్ఎల్ఎం సాయంతో.. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈ పథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లెవెలుగు) బస్సులు కొంటారు. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరుమీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. వీటి నిర్వహణ ఆర్టీసీ చూసుకుంటుంది. నెలనెలా రూ. 77,220 చొప్పున ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఎంపికై న సంఘాలివే.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో పెద్దపల్లి జిల్లాల్లో 9, రాజన్న సిరిసిల్లకు 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. ఇందులో శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీచైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాతా సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు మంత్రుల చేతులమీదుగా కొత్త బస్సులు అందుకోనున్నాయి. -
యువ శాస్త్రవేత్తలకు ఆహ్వానం
జగిత్యాల: ఇస్రో ఆధ్వర్యంలో విద్యార్థులను యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో యువ విజ్ఞాన్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో 9వ తరగతి విద్యార్థులు అర్హులు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 26 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను ఏప్రిల్ 7న విడుదల చేస్తారు. వారికి మే 19 నుంచి 30వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్ఏసీ అహ్మదాబాద్, ఐఐఆర్ఎస్ డెహ్రాడూన్, ఎస్డీఎస్సీ శ్రీహరికోట, వీఎస్ఎస్సీ తిరువనంతపురం, యూఆర్ఎస్ బెంగళూరు, ఎన్ఈఎస్ఏసీ షిల్లాంగ్, ఎన్ఆర్ఎస్ఈ హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపికై న విద్యార్థులు అంతరిక్ష కేంద్రాల్లోని శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చలు, రాకెట్ ప్రయోగాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈవో రాము సూచించారు. -
అక్కాచెల్లెల్లు.. సర్కారు నౌకర్లు
జ్యోతినగర్: ఆడ పిల్లలను అధైర్య పడలేదు. కొడుకుల కన్నా ఎక్కువగా చదివించారు. ప్రయోజకులను చేశారు. ఆ తల్లిదండ్రుల కష్టాన్ని ఆ ఆడబిడ్డలు విస్మరించలేదు. కష్టపడి చదివారు. అందరూ ప్రయోజకులు అయ్యారు. సర్కారు కొలువులు కొట్టారు. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న సింగరేణి మాజీ ఉద్యోగి మల్లేపల్లి పోచం– లక్ష్మీ దంపతులకు నలుగురు కూతుర్లు శ్రీమతి, తులసీ, శైలజ, జ్యోతి. పెద్ద కూతురు మల్లెపల్లి శ్రీమతి కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. రెండో కూతురు మల్లెపల్లి తులసీదేవి స్కూల్ అసిస్టెంట్ రామగుండంలో విధులు నిర్వహిస్తున్నారు. మూడో కూతురు మల్లేపల్లి శైలజ అంతర్గాం మండల పరిషత్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగో కూతురు మల్లుపల్లి జ్యోతి బ్యాంకు మేనేజర్‌గా కొనసాగుతున్నారు. -
ఇన్‌స్ట్రాగామ్ అశ్విని
విద్యానగర్(కరీంనగర్): ఠాకూర్ అశ్విని అలియస్ ఆశాది కరీంనగర్‌లోని భగత్‌నగర్. నగరంలోని డైలీ మార్కెట్, వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఫుట్‌పాత్‌పై సీజనల్ వ్యాపారం చేస్తుంది. మట్టికుండలు, దీపాల ప్రమిదలు, రంగుల ముగ్గులు, పచ్చడి జాడీలు, దీపాల వత్తులు అమ్ముతుంది. రెండేళ్ల కిత్రం వ్యాపార అభివృద్ధి కోసం తొలిసారిగా ఆమె అమ్మే వస్తువుల గురించి రీల్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయగా వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దీంతో మరిన్ని రీల్స్ చేసి పోస్ట్ చేసింది. వాటికి కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా స్పందన రావడంతో సినిమా పాటలు, జానపద గేయాలు, భక్తి, రోమాంటిక్, ప్రేమ, ఎడబాటు తదితర అంశాలపై రీల్స్ చేయడం మొదలు పెట్టగా వాటికి కూడా లక్షల్లో వ్యూస్ రావడం, ఆరో తరగతి వరకే చదివిన ఆశాకు భర్త, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం తోడవడంతో రీల్స్‌పై మక్కువ పెంచుకుంది. రెండేళ్లలో 600 వరకు రీల్స్ చేసింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నా రీల్స్ చూసిన డైరెక్టర్లు చాలా మంది వారి సినిమాల్లో అడిగారు. కీ రోల్ పాత్రలు వస్తే తప్పకుండా చిన్న, పెద్ద సినిమాల్లో చేస్తాను’ అని ఠాకూర్ అశ్విని వెల్లడించింది. సిరిసిల్లక్రైం: మహిళలు, విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారులు పోలీస్ అక్క పేరిట జిల్లాలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్‌ను కేటాయించారు. 2024 డిసెంబర్లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలను మమేకం చేస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వేధింపులకు గురైతే బాధితులు ఇంట్లో మనిషి మాదిరిగా పోలీస్ అక్కకు చెప్పుకునేలా విధివిధానాలు ఖరారు చేశారు. పోలీస్ అక్క కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 220 అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన పోలీసులు నాలుగు ఫిర్యాదులు స్వీకరించారు. అందులో మూడు ఈ–పెట్టి కేసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారిక గణంకాలు ఉన్నాయి.బాధితులకు అండగా ‘పోలీస్ అక్క’ -
అంబేడ్కర్‌కు అవమానం
● ఖండించిన దళిత సంఘాలు సారంగాపూర్: సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి చెప్పుల దండ వేశారు. విషయం తెలుసుకున్న నాగునూర్, రంగపేట, లచ్చక్కపేట గ్రామాల ప్రజలు, దళిత సంఘాల నాయకులు శుక్రవారం వేకువజామున అక్కడికి చేరుకుని చెప్పుల దండ తొలగించి, విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై లోతైన విచారణ జరపాలని పోలీసులను కోరారు. డీఎస్పీ రఘుచందర్, ఇన్చార్జి సీఐ రవికుమార్, ఎస్బీ సీఐ అరీఫ్అలీఖాన్, సారంగాపూర్ ఎస్సై దత్తాద్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత గ్రామంలో పర్యటించారు. నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశా రు. నాయకులు తేలు రాజు, అనంతుల గంగారెడ్డి, సాగి సత్యంరావు ఉన్నారు. -
పురుషులకు దీటుగా..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీకి చెందిన పింగిళి కృష్ణారెడ్డి–స్వర్ణలత దంపతులకు ఇద్దరు కూతుర్లు. కృష్ణారెడ్డి జేఎన్టీయూ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్. ఆడపిల్లలనే భావనలేకుండా తన కూతుళ్లను పురుషులు దీటుగా చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దారు. పెద్ద కూతు రు స్మిగ్ధ స్థానికంగా 10వ తరగతి, ఇంటర్, హైదరాబాద్‌లో బీటెక్(మెకానికల్) పూర్తి చేసింది. అమెరికాలో ఎమ్మెస్సీ చేసి ప్రస్తుతం హెచ్1బీ వీసా మీద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్న కూతురు స్నిగ్ధ స్థానికంగా పది, ఇంటర్, ఫామ్ డీ పూర్తి చేసి డాక్టర్ పట్టా పొందింది. అమెరికాలో ఎమ్మెస్సీ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. -
వనిత.. అన్నింటా ఘనత
ఊరిపై మమకారం.. సేవకు శ్రీకారంచిన్న హోటల్.. పెద్ద బాధ్యత రామగిరి(మంథని): ఊరిపై మమకారంతో సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు రేండ్ల శారద. మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన శారద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అదే గ్రామానికి చెందిన రేండ్ల కుమార్స్వామితో వివాహం జరిగింది. మహిళల నిరుద్యోగ సమస్య, ఆర్థిక ఇబ్బందులను చూసి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని భర్త సహకారంతో ఆర్ఎస్కే ఆపన్న హస్తం ఏర్పాటు చేశారు. దాని ద్వారా గ్రామంలోని మహిళలకు ఉచితంగా పరికరాలు అందించారు. మహిళలకు కుట్లు–అల్లికలు, బ్యూటిషియన్, కుట్టు మిషన్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. న్యాక్ సంస్థ ద్వారా సొంత ఖర్చులతో సర్టిఫికెట్స్‌ను అందించారు. ఒక్కో విడతలో సుమారు 40 మందికి మూడు నెలల పాటు శిక్షణ అందిస్తున్నారు. ‘ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్‌లు పూర్తి చేశాం. ప్రస్తుతం ఐదో బ్యాచ్ కొనసాగుతుంది. నా భర్త సహకారంతో సేవ చేయడం తృప్తిగా ఉంది’.. అని శారద వెల్లడించారు. మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం ఆత్మనగర్‌కు చెందిన బట్టు సుశీల చిన్న హోటల్ నడిపిస్తూ తన కుమారుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దింది. సుశీల, భర్త గంగరాజు గ్రామంలో హోటల్ నడిపించేవారు. 16 ఏళ్ల క్రితం గంగరాజు గుండెపోటుతో మృతిచెందాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అతడు చనిపోయిన సమయంలో పిల్లలంతా చిన్నవారే. అప్పటి నుంచి సుశీల నలుగురు పిల్లల బాధ్యతను మోసింది. ప్రస్తుతం పెద్దకుమారుడు సుమన్ ఆర్మీలో పనిచేస్తుండగా, చిన్న కొడుకు రంజిత్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు కూతుళ్ల వివాహం చేసింది. -
కారు ప్రమాద ఘటనలో మహిళ మృతి
● కూతురికి గాయాలు ● కారు నడిపిన పెళ్లి కొడుకుపై ఫిర్యాదుశంకరపట్నం: పెళ్లి బరాత్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన బాకారపు ఉమ(35) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై రవి తెలిపారు. మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభాకర్ కూతురు నవ్య వివాహం మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో గురువారం జరిగింది. రాత్రి పెళ్లి బరాత్ జరుగుతుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చెందిన కారు డ్రైవర్ శ్రవణ్ కారు దిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. బరాత్‌లో కొందరు డ్యాన్స్ చేస్తుండగా పెళ్లికొడుకు అశోక్ కారు నడిపాడు. ఒక్కసారిగా బాకారపు ఉమ, ఆమె కూతురు నిఖితతోపాటు మరి కొందరిని కారు ఢీకొనడంతో గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఉమ, నిఖితను హుజూరాబాద్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఉమ పరిస్థిఽతి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మార్గమధ్యంలో మృతిచెందింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి పెళ్లి కొడుకు జినుక అశోక్ కారణమంటూ ఉమ భర్త పర్శరాములు కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హుజురాబాద్ రూరల్ సీఐ వెంకటి, ఎస్సై రవి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
అన్ని రంగాల్లో ముందున్నారు
పెద్దపల్లిరూరల్: సమాజంలో వేగంగా వస్తున్న మార్పులకు తగ్గట్టు సాంకేతిక రంగంలోనూ ప్రతిభ, నైపుణ్యాలతో ముందుంటున్నారు. వాస్తవానికి పురుషులకంటే మహిళల్లోనే మానసిక స్థైర్యం ఎక్కువ. పాతికేళ్ల పాటు పుట్టింట్లో ఉండి, పెళ్లి తర్వాత మెట్టినింట్లో తనకు అంతగా పరిచయం లేనివారి నడుమ ధైర్యంగా జీవించగలుగుతుంది. చదువులో రాణిస్తున్న మహిళలకు న్యాయవ్యవస్థలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆర్థికావసరాలు పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో పెళ్లి అయిన కొన్నాళ్లకే విడాకుల వరకు వస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లకు లోనై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నాం. – కె.స్వప్నరాణి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, పెద్దపల్లి -
అమ్మ ప్రోత్సాహంతో సహన ఐఏఎస్
సప్తగిరికాలనీ(కరీంనగర్): సివిల్స్ కొట్టాలన్న కూతురు లక్ష్యానికి వెన్నంటే నిలిచింది ఆ తల్లి.. ఒకసారి ఫెయిలైనా.. రెండోసారి సాధించకున్నా.. సరే అమ్మా అధైర్యపడకూ అంటూ వెన్ను తట్టింది. నువ్వు సాధించగలవు అంటూ ప్రోత్సహించింది. నాలుగోసారి ప్రయత్నంలో ఆ కూతురు ఐఏఎస్ సాధించగా.. ఆ సక్సెస్‌లో తన తల్లి కీలకమంటోందా కూతురు. కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కొలనుపాక సహన 2023 బ్యాచ్ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై ంది. తన తల్లి గీత ఇచ్చిన స్ఫూర్తే ఇందుకు కారణమని చెబుతోంది. సహన హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఏడాదిపాటు ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంది. తరువాత స్థానికంగానే సివిల్స్‌కు సన్నద్ధమైంది. నాలుగో ప్రయత్నంలో తన లక్ష్యాన్ని సాధించింది. 739వ ర్యాంకు సాధించి ప్రస్తుతం శిక్షణలో ఉంది.తల్లి గీతతో కూతురు సహన -
ఆ నలుగురు.. ‘సిరి’ వెలుగులు
సిరిసిల్ల: సిరిసిల్ల కార్మికవాడల్లో ఏ గడప తట్టినా.. కష్టాలు, కన్నీళ్లు. 2008లో వరుస ఆత్మహత్యలతో కార్మికక్షేత్రం తల్లడిల్లింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ సందీప్‌కుమార్ సుల్తానియా సిరిసిల్లలో ఉండే విధంగా ఆదేశించారు. ఆత్మహత్యలు ఆగాలని స్పష్టం చేశారు. ఆర్డీవో ఆఫీస్ లోనే మకాం వేసిన కలెక్టర్ ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించారు. పేదరికం, పనిఒత్తిడి, మానసికవేదన, అప్పులేనని నిర్ధారించారు. వారిలో ధైర్యం నింపేందుకు ఓ నలుగురు మహిళలను నియమించారు. వారు క్షేత్రస్థాయిలో ఇల్లిల్లు తిరుగుతూ బాధల్లో ఉన్న కార్మికులకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ఆ నలుగురే రాపెల్లి లత, బూర శ్రీమతి, వేముల అన్నపూర్ణ, కొండ ఉమ. వీరిని చేనేత జౌళిశాఖ ద్వారా నియమించారు. నిత్యం కార్మికవాడల్లో తిరుగుతూ కౌన్సెలింగ్ నిర్వహించారు. 16 ఏళ్లుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేసేవారికి ఆ నలుగురు అండగా నిలిచారు. కార్మికవాడలైన బీ.వై.నగర్, సుందరయ్యనగర్, తారకరామనగర్, ఇందిరానగర్, పద్మనగర్, గణేష్‌నగర్, నెహ్రూనగర్, శాంతినగర్, ప్రగతినగర్‌లోని కార్మికుల ఇళ్లకు వెళ్తూ వారి కష్టసుఖాలు తెలుసుకోవడవం, కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు చేయడం వీరివిధి. సైకాలజిస్ట్ పున్నంచందర్‌తో కలిసి మనోవిసాకాన్ని కలిగించేందుకు అనేక సదస్సులు నిర్వహించారు. అర్హులైన నేతకార్మికులకు అంత్యోదయ కార్డులు, పెన్షన్లు, రేషన్ కార్డులు, నేతన్నలకు బీమా పథకాలను ఇప్పించడం, వైద్యం చేయించడం వంటి సామాజిక సేవలో ఆ నలుగురు ముందుకు సాగుతున్నారు. -
క్రీడల్లో చిరుత.. చికిత
కరీంనగర్‌స్పోర్ట్స్: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన టి.చికిత విలువిద్య(ఆర్చరీ)లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తోంది. చిన్న వయస్సులోనే వరల్డ్‌కప్‌లో పాల్గొంటూ పతకాల పంట పండిస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌లోని సోనీపట్‌లో శిక్షణ పొందుతోంది.చికిత తండ్రి శ్రీనివాస్‌రావు రైతు. తల్లి శ్రీలత గృహిణి. మార్చి తొలివారంలో బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో కాంస్యం సాధించింది. ఏప్రిల్‌లో ఫ్లోరిడాలో జరగనున్న వరల్డ్‌కప్ స్టేజ్–1, మేలో చైనాలో జరిగే వరల్డ్‌కప్ స్టేజ్– 2 పోటీలకు సిద్ధమవుతోంది. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధిస్తానని చెబుతోంది. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్రమబద్ధీకరించాలి
జగిత్యాల: ప్రతీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తును క్రమబద్ధీకరించాలని, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు ఎల్ఆర్ఎస్పై ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, మండలాల వారీగా ఎన్ని ఉన్నాయో గుర్తించి, పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 31 చివరి రోజు కావడంతో ఎక్కువ దరఖాస్తులు చేపట్టాలని తెలిపారు. లే అవుట్ క్రమబద్ధీకరణ అనేది ప్రభుత్వం సామాన్య ప్రజలకు భారం తగ్గించాలన్న ఉద్దేశంతో రాయితీ సైతం ఇవ్వడం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కాల్‌సెంటర్లు సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనపు కలెక్టర్ లత, డీపీవో మధుసూదన్, టౌన్‌ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెలివరీలు చేయాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వందశాతం డెలివరీలు చేయించేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జన ఔషధ దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు ప్రసవాలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాన్ కమ్యునికేబుల్ డిసేజెస్ ఉన్న వారిని మార్చి నెలాఖరు వరకు గుర్తించి వైద్యం అందించాలన్నారు. ఈ కార్య క్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, వైద్యులు జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.● కలెక్టర్ సత్యప్రసాద్ -
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలన
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఈనెల 10నుంచి నిర్వహించే బ్రహ్మోవాల ఏర్పాట్లను శుక్రవారం ఎస్పీ అశోక్‌కుమార్ పరిశీలించారు. భక్తుల క్యూలైన్లు, బ్రహ్మపుష్కరిణి, బ్రాహ్మణ సంఘం పక్కనున్న శ్రీమఠం వద్ద కల్యాణమహోత్సవ వేదిక పనులు, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈవో శ్రీనివాస్, డీఎస్పీ రఘుచందర్, సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్సైలు ఉదయ్‌కుమార్, ఉమాసాగర్ పాల్గొన్నారు. విప్‌కు ఆహ్వానం ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల కు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు దేవస్థానం తరఫున ఈవో శ్రీనివాస్ ఆహ్వాన పత్రి కను అందజేశారు. వేద పండితులు బొజ్జ రమేశ్‌శర్మ, నంబి శ్రీనివాసచారి, నేరెళ్ల శ్రీనివాసచారి పాల్గొన్నారు. కాగా.. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన కల్యాణ మహోత్సవం శ్రీమఠం వద్ద నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వేదపండితులు స్థలశుద్ధి, పుణ్య:వచనం నిర్వహించారు. -
చెప్పలేను
26బొగ్గుగనిలో సీ్త్ర శక్తిగోదావరిఖని(రామగుండం): సింగరేణికి సీ్త్ర శక్తి తోడైంది. ఇప్పటివరకు పురుష రంగానికే పరిమతమైన సింగరేణి మైనింగ్‌లో మహిళలు అడుగీడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతో మహిళలకు సింగరేణి ఉపాధి అవకాశాలను మరింత పెంచింది. కేవలం కార్యాలయాల్లోనే కాకుండా భూగర్భ గనుల్లో పనిచేసే ఇంజినీర్లు, అండర్ మేనేజర్లుగా పెద్ద సంఖ్యలో మహిళలు చేరారు. ప్రస్తుతం సంస్థలో 201 మంది అధికారిణులుగా 1,794 మంది మహిళా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా రెండు గనులు ఏర్పాటు చేయాలని యాజమాన్యం భావిస్తోంది. సంస్థలో తొలి మహిళా రెస్క్యూ బ్రిగేడియర్‌గా కొత్తగూడెం పీవీకే–5గనికి చెందిన అండర్‌మేనేజర్ అంబటి మౌనిక ఎంపికై ంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ జీఎంగా సింగరేణి చరిత్రలోనే తొలిసారి మహిళా అధికారి కవితనాయుడు సమర్థవంతంగా రాణిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లీష్మెంట్– సీఎస్సార్ జీఎంగా తొలిసారి మరో మహిళా నికోలస్ బెనడిక్ట్, సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించే కంపెనీ సెక్రటరీగా సునీతాదేవి, న్యాయ విభాగం బాధ్యతలను డిప్యూటీ జీఎం హోదాలో శిరీషరెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా డాక్టర్ సుజాత విధులు నిర్వర్తిస్తున్నారు. -
వనిత..
అన్నింటా ఘనత‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి ● ఉమెన్స్‌డే కథనాలను పరిశీలించి ఫైనల్ చేసిన ఏఎస్పీ ● కథనాల పరిశీలన.. ఎంపికపై పలు సూచనలు ● పత్రిక సిబ్బంది కృషి అభినందనీయమన్న ఐపీఎస్ఆడపిల్ల పుట్టిందంటే భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడపిల్లను మహాలక్ష్మిగా కొలుస్తున్నారు. ఊర్లో.. అమ్మాయి పుడితే లక్ష్మీ వచ్చిందంటున్నారు. ఆమె ఒక తల్లి.. కూతురు.. సోదరి.. భార్య.. వీటన్నింటికీ మించి పోరాట యోధురాలు. ఆమె పుట్టుక ఆనందం. ఆమె ఓపికకు వందనం. ఆమె లేనిదే జననం లేదు. ఆమె లేనిదే జీవితం లేదు.. ఈ ప్రపంచానికి మనుగడే లేదు. అన్నింటా ఆమే.. అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. చదువులో అగ్రస్థానంలో నిలుస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఆవకాయ పెట్టడం నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా నారీ శక్తి కనిపిస్తోంది. కుటుంబానికి తోడుగా నిలుస్తూ.. కష్టాల్లో ఉన్న బతుకుబండిని లాగుతోంది. ఆమె ఆకాశంలో సగం కాదు.. ఇప్పుడు ఆమే ఆకాశం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనాలు.పత్రికా సిబ్బంది శ్రమ తెలిసిందిఅంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా గెస్ట్ ఎడిటర్‌గా కరీంనగర్ సాక్షి యూనిట్ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉంది. మనం ఉదయం చదివే దినపత్రికల కోసం 24 గంటలపాటు ఎన్నివ్యవస్థలు పనిచేస్తాయన్న విషయం ఈ రోజు ప్రత్యక్షంగా చూసే వీలుకలిగింది. వార్తల ఎడిటింగ్, ప్రాధాన్యం, పేజీనేషన్, ప్రాసెసింగ్, ప్రింటింగ్ తదితర అంశాలపై సిబ్బంది పడుతున్న శ్రమ వెలకట్టలేనిది. ఈరోజు స్వయంగా వార్తలను ఎంపిక చేయడం, ఎడిటింగ్ చేయడం ప్రత్యేక అనుభూతి కలిగించింది. ఈ అవకాశం ఇచ్చిన సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు. మరోసారి సాక్షి పాఠకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – శేషాద్రినిరెడ్డి, ఏఎస్పీ, వేములవాడ -
మహిళలు ఉన్నతస్థాయికి ఎదగాలి
జగిత్యాలజోన్: మహిళలు ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సూచించారు. జగిత్యాల కోర్టులో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. ఉద్యోగాలకే పరిమితం కాకుండా వ్యాపారాలు చేస్తూ పారిశ్రామిక రంగంలోకి పెద్దఎత్తున రావాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ, జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి ప్రసాద్, మొదటి రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లు జితేందర్, వినీల్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డబ్బు లక్ష్మారెడ్డి, భూమి రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ -
ఉంది 02
లేదు 91ఉమ్మడి జిల్లాలోని పలువురు మహిళలు ఇంటా, బయట, ఆఫీసుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా.. సుమారు 100 మంది వెల్లడించిన అభిప్రాయాలు ఇలా..1మీ ఇంట్లో ఆడ–మగ వివక్ష ఉందా?07చెప్పలేను 2అవును 04పనిచేస్తున్న కళాశాల, పని ప్రదేశంలో వివక్ష ఎదుర్కొంటున్నారా?లేదు 7818చెప్పలేను3బస్టాప్ 33మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం?కళాశాల/ ఆఫీసు 08సెల్ఫోన్లో వచ్చే మెసేజ్‌లు59●4తెలియని వారు 14మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు?తెలిసిన వారే 275అవును 27ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో ఉద్యోగరీత్యా మహిళగా ఇబ్బందులు తలెత్తుతున్నాయా?లేదు 47 -
స్నేక్.. షేక్
కరీంనగర్‌రూరల్: సాధారణంగా మహిళలు బల్లి కనిపిస్తేనే అమ్మో అంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ మహిళ ఎలాంటి భయం లేకుండా పాములు పట్టడమే వృత్తిగా ఎంచుకుంది. కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లిలోని చంద్రపురికాలనీకి చెందిన షేక్ సయిదా భర్త ఖాజామియా 15ఏళ్లక్రితం డెంగీతో చనిపోయాడు. కుటుంబపోషణ కోసం పాములు పడుతోంది. చిన్నప్పుడు తండ్రి సయ్యద్‌బాబా వద్ద నేర్చుకున్న పాములను పట్టడమే వృత్తిగా మార్చుకుంది. తమ ప్రాంతంలో పాము వచ్చిందని ఎవరైనా ఫోన్‌చేస్తే రాత్రి పగలు లేకుండా అక్కడికి చేరుకుంటోంది. పాములు పట్టినందుకు వారు ఇచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. పట్టుకున్న పాములను అటవీ శాఖ అధికారులకు అప్పగించడం, లేదా అటవీప్రాంతంలో విడిచిపెట్టడం చేస్తోంది. సయిదా ప్రస్తుతం అద్దెఇంట్లో ఉంటోంది. పాముకాటుకు గురైతే తన కుటుంబ పరిస్థితి ఏంటని ఆవేదనవ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఆదుకునేందుకు సాయం చేయాలని కోరుతోంది. -
ఆడబిడ్డకు అండగా ‘మా ఊరి మహాలక్ష్మి’
గంగాధర(చొప్పదండి): కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలు. పెళ్లికెదిగిన ఆడబిడ్డ భారమవుతుందని తల్లిదండ్రుల ఆవేదనలు. ఊరంతా చందాలు వేసుకొని ఓ ఆడబిడ్డ పెళ్ల్లి చేసిన సంఘటన.. ఓ యువకుడిని ఆలోచింపజేశాయి. మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు కు పునాది వేశాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయిపల్లికి చెందిన రేండ్ల శ్రీనివాస్–పద్మ దంపతులు తమ గ్రామంలోని ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు ఏడేళ్ల క్రితం మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. గ్రామంలో జన్మించిన ప్రతీ ఆడ బిడ్డ పేరుమీద ఫౌండేషన్ తరఫున రూ.5,116, తల్లిదండ్రుల నుంచి రూ.5,000 సేకరించి సుకన్య సమృద్ధి యోజనలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటివరకు 54 మంది ఆడపిల్లల పేరిట డిపాజిట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తండ్రిని కోల్పోయిన కుటుంబాలకు దాతల సహకారంతో ఆర్థికంగా అండగా నిలుస్తున్నా రు. ఏడాదిగా ఆడపిల్లల పెళ్లికి కానుకలు అందిస్తున్నారు. -
ఫాస్ట్‌బౌలర్.. శ్రీవల్లి
ఇల్లంతకుంట/కరీంనగర్ స్పోర్ట్స్ : చిన్ననాటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకొని జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటుతోంది కట్ట శ్రీవల్లిరెడ్డి. ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన కట్ట లక్ష్మారెడ్డి– ఉమ దంపతుల చిన్న కూతురు శ్రీవల్లిరెడ్డి మూడో తరగతి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. కూతురు ఇష్టం మేరకు లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో ప్రత్యేక కోచింగ్ ఇప్పించగా, పాస్ట్ బౌలింగ్‌లో మెలకువలు నేర్చుకుంది. 2019లో మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి పాఠశాల క్రీడా ఫెడరేషన్ క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. 2022లో పూణెలో నిర్వహించిన అండర్– 19 బాలికల క్రికెట్ పోటీల్లో హెచ్‌సీఏ తరఫున పాల్గొంది. ఈ జనవరిలో త్రివేండ్రంలో నిర్వహించిన బీసీసీఐ ఉమెన్స్ అండర్–19 వన్డే ట్రోఫీలో, 2024 డిసెంబర్లో అహ్మదాబాద్‌లో నిర్వహించిన సీనియర్ ఉమెన్ వన్డే టోర్నీలో హైదరాబాద్ తరఫున ప్రాతినిఽథ్యం వహించింది. కాగా.. శ్రీవల్లి కోసం తన తండ్రి ఊరు వదిలి కరీంనగర్, హైదరాబాద్‌లో ఉంటున్నారు. -
● టీబీ ముక్త్ పంచాయతీలుగా మానాల, గొర్రెగుండం ● డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎన్.శ్రీనివాస్
మల్యాల: టీబీ రహిత జిల్లా లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎన్.శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మానాల, గొర్రెగుండం గ్రామాలను గురువారం సందర్శించారు. ఆరోగ్య ఉప కేంద్రాల్లోని రికార్డులను పరిశీలించారు. 102 శాతం పరీక్షలు నిర్వహించగా.. ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో మానాల, గొర్రెగూడెం గ్రామాలను టీబీ ముక్త్ పంచాయతీలుగా నామినేట్ చేశామని తెలిపారు. టీబీ లక్షణాలు కనపడితే.. వెంటనే పరీక్షలు చేసుకోవాలని, ఆరోగ్య సిబ్బంది టీబీ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించాలని సూచించారు. టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీ అనూష, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారానికి చక్కని వేదిక
● కోర్టులపై భారాన్ని తగ్గిస్తున్న లోక్ అదాలత్‌లు ● గతేడాది 10,660 కేసులకు పరిష్కారం ● ఈనెల 8న జిల్లావ్యాప్తంగా మెగా లోక్‌అదాలత్ న్యాయవాదుల సహకారం లోక్ అదాలత్లకు న్యాయవాదులం సహకరిస్తున్నాం. జనాభాకు అనుగుణంగా కోర్టుల సంఖ్య, జడ్జిల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే త్వరగా కేసులు పరిష్కారమై బాధితులకు ఊరట లభిస్తుంది. – డబ్బు లక్ష్మారెడ్డి, బార్ అసోసియేషన్ జగిత్యాల అధ్యక్షుడు లోక్‌అదాలత్‌తో సత్వర న్యాయం లోక్‌అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుంది. డబ్బుతో పాటు ఖర్చు ఆదా అవుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. ఇప్పటికే కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య అధికంగా ఉండగా.. రోజురోజుకూ కొత్త కేసులు వస్తున్నాయి. – కటుకం చంద్రమోహన్, జిల్లా లీగల్ ఎయిడ్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ జగిత్యాలజోన్: ‘ఓడిన వాడు కోర్టులో ఏడిస్తే.. గెలిచిన వాడు ఇంటికెళ్లి ఏడ్చాడు’ అనే సామెతను కోర్టు కేసులు ఎదుర్కొన్నవారు చెబుతుంటారు. ‘పదిమంది నిందితులు తప్పించుకున్నా ఫరవాలేదుగానీ అమాయకుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షపడకూడదు’.. అనే మౌలిక సూత్రాలపై న్యాయవ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఫలితంగా కేసుల విచారణలో జాప్యం ఏర్పడుతోంది. ఈ క్రమంలో కక్షిదారులకు సత్వర న్యాయం దక్కడం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే ఏడాదిలో నాలుగైదు మెగా లోక్‌అదాలత్‌లు నిర్వహించి.. వీలైనన్ని కేసులు పరిష్కరించేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు చొరవ చూపుతున్నారు. ఈనెల 8న జిల్లాకేంద్రంలోని ఏడు కోర్టులు, మెట్‌పల్లిలోని రెండు కోర్టులు, కోరుట్ల, ధర్మపురి కోర్టుల పరిధిలో లోక్‌అదాలత్ నిర్వహించి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కృషి చేస్తోంది. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. న్యాయవాదులు, జిల్లాపోలీసులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. గతేడాది 10,660 కేసులు పరిష్కారం జిల్లాలోని అన్ని కోర్టుల్లో 2024లో 10,660 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించారు. ఇందులో చేసిన తప్పు ఒప్పుకోగా.. కోర్టు జరిమానా వేసినవి 943, రాజీ కుదిరినవి 1,683, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేని వంటి ఈ–పెట్టి కేసులు 1,153, డ్రంకెన్‌డ్రైవ్ కేసులు 6,881 ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన క్రిమినల్ కేసుల్లో 545 రాజీకి అనుకూలంగా ఉన్నాయి. ఇందులో 495 వరకు రాజీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019 నుంచి 2025 వరకు 3,299 డ్రంకెన్‌డ్రైవ్ కేసులు, ఈ–పెట్టి కేసులు 2018 నుంచి 2025 వరకు 1287 పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని కూడా పరిష్కరించాలని చూస్తున్నారు. వీలైనన్నీ క్రిమినల్, సివిల్, మోటార్ వాహనాల కేసులు పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తున్నారు. సరిపడా లేని కోర్టులు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కోర్టుల ఏర్పాటు లేదు. చిన్న విషయంపై కోర్టుకెళ్తే పరిష్కారమయ్యే వరకు ఏళ్లు పడుతోంది. దేశంలో సగటున 50లక్షల మందికి ఒక జడ్జి ఉన్నట్లు చెబుతుంటారు. క్రిమినల్ కేసు పరిష్కారం కావాలంటే రెండు, మూడేళ్లు.. సివిల్ కేసు పరిష్కారం కావాలంటే నాలుగైదేళ్లు పడుతోది. ఇలా ఇప్పటికే వేలాది కేసులు పెండింగ్‌లో ఉంటుండగా.. ప్రతిరోజు కొత్త కేసులు వచ్చి చేరుతుండటంతో వాటి సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. క్రిమినల్ కేసులో దాదాపు 15 నుంచి 20 మంది వరకు సాక్షులను విచారించి తీర్పులు చెప్పడం జడ్జిలకు కష్టసాధ్యంగా మారింది. లోక్ అదాలత్లకు అధిక ప్రాధాన్యం కోర్టుల్లో కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో.. సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాల మేరకు లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇందులో రాజీ చేసుకోదగ్గ అన్ని రకాల కేసులను పరిష్కరిస్తున్నారు. కేసులతో సాధించేదేమీలేదని ఇరువర్గాలకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. లోక్‌అదాలత్ తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. ఒక్కసారి లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్న తర్వాత మళ్లీ ఎక్కడకు వెళ్లినా చెల్లదు. ఎలాంటి ఫీజులూ వసూలు చేయరు. లోక్ అదాలత్ విషయాలపై కక్షిదారులకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో న్యాయసేవా అధికార సంస్థ ద్వారా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోలీసులతోపాటు న్యాయవాదులతో నెలకోమారు జడ్జిలు సమావేశాలు ఏర్పాటు చేసి, అధిక కేసులు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరుతున్నారు. -
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్
కోరుట్ల: ఇంటింటి సర్వే నిర్వహించిన ఎన్యుమరేట్లకు వేతనాలు ఇవ్వడంలో జాప్యం.. విధుల్లో నిర్లక్ష్యం.. తోటి ఉద్యోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం వెరసి కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కోరుట్ల బల్దియాలో రెండునెలల క్రితం చేపట్టిన ఇంటింటి సర్వేలో 156 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. రాయికల్‌లో పనిచేసిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల వేతనాలు కోరుట్ల మున్సిపాల్టీకి, ఇక్కడ పనిచేసిన వారి వేతనాలు అక్కడికి బదిలీ అయినట్లు సమాచారం. దీంతో కొంతమంది ఎన్యుమరేటర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే విధుల్లోనూ నిర్లక్ష్యం వహించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. టీపీవో సెలవుపై వెళ్లిన విషయం చర్చనీయాంశంగా మారింది. శానిటేషన్ విధుల్లోనూ నిర్లక్ష్యంపై కొందరు ఉద్యోగులు జువ్వాడి నర్సింగరావుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో కమిషనర్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంజగిత్యాల: జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 6,387 మంది విద్యార్థులకు 6,259 మంది హాజరయ్యారు. కోరుట్లలో ఇద్దరు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆశాల ఆందోళనజగిత్యాలటౌన్: ఆశావర్కర్‌పై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని శిక్షించాలని ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆశావర్కర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ పోలీసుల వైఖరి నిందితుడిని రక్షించేలా ఉందన్నారు. ఈనెల 27న దుబ్బరాజన్న జాతర విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఆమెను బెదిరించి దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఘటన జరిగి తొమ్మది రోజులు గడుస్తున్నా పోలీసుల నుంచి స్పందన లేదన్నారు. నిందితుడిని అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాల్సి ఉన్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కలెక్టర్ స్పందించకపోవడం దారుణమన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, సీఐటీయూ నాయకులు తిరుపతినాయక్, ఇందూరి సులోచన పాల్గొన్నారు. పసుపు బోర్డుతో ఒరిగిందేమీలేదుమల్లాపూర్ : పసుపు పంటకు మద్దతు ధర రూ.20వేలు ప్రకటించాలని రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారం మండలకేంద్రంతోపాటు కొత్తదాంరాజుపల్లి, చిట్టాపూర్ గ్రామాల్లో రైతులను కలిసి ప్రధాన కూడళ్ల వద్ద నిరసన తెలిపారు. పసుపు మద్దతు ధర కోసం ఈనెల 11న చేపట్టనున్న ‘చలో మెట్పల్లి మహార్యాలీ’ని విజయవంతం చేయాలన్నారు. పసుపు రైతుల సమస్యలు పరిష్కరించాలని అనేక ఆందోళనలు నిర్వహించామని, స్పందించిన కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, నిధులు కేటాయించకపోవడంతో కార్యకలాపాలు కొనసాగడం లేదని పేర్కొన్నారు. ఎకరాన రూ.2లక్షల పెట్టుబడి పెట్టి పసుపు పండిస్తే ధర రూ.8వేల నుంచి రూ.11 వేలలోపే ఉందని, గతేడాది రూ.16వేలు పలికిందని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసినా మద్దతు ధర లభించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రూ.4వేల బోనస్ ప్రకటించాలని కోరారు. రైతులు నష్టపోకుండా ఉండాలంటే కనీసం రూ.20వేల మద్దతు ధర ఇవ్వాలని కోరారు. రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేశ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు డబ్బా రమేశ్‌రెడ్డి, కాటిపెల్లి గంగారెడ్డి, తురక శ్రీధర్‌రెడ్డి, బందేలా మల్లయ్య, కొమ్ముల సంతోష్‌రెడ్డి, కాటిపెల్లి ఆదిరెడ్డి, మామిడి రాజశేఖర్‌రెడ్డి, కాటిపెల్లి ఆదిరెడ్డి, కాసారపు భూమారెడ్డి, కల్లెం మహిపాల్‌రెడ్డి, పాల్గొన్నారు. -
● బీసీల్లో అన్యమతస్తులను చేర్చొద్దు ● చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలి ● జిల్లాకేంద్రంలో బీజేపీ నాయకుల ఆందోళన
జగిత్యాలటౌన్: ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. ప్రభుత్వ రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. బీసీల కుల రిజర్వేష న్లో అన్యమతస్తులను చేర్చడంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. ముత్యంపేటలోని షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు వేసిన కమిటీ కాలయాపనగా మారిందన్నారు. ఫ్యాక్టరీ భూములను ఇతర అవసరాలకు వినియోగించొద్దని సూచించారు. కేంద్రం మంజూరు చేసిన నవోదయ విద్యాలయం ఏర్పాటును బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు నలువాల తిరుపతి, కస్తూరి సత్యం, రెంటం జగదీశ్, ఆముద రాజు, జుంబర్తి దివాకర్, చెన్నాడి మధురిమ, ఓరుగంటి చంద్రశేఖర్ పాల్గొన్నారు. కోరుట్లలో నాయకుల ఆందోళన కోరుట్ల: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలంటూ కోరుట్లలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. బీజే పీ రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు, నిజామాబాద్ కో–కన్వీనర్ గుంటుక సదాశివ్, పట్టణ అధ్యక్షుడు బింగి వెంకటేశ్, జిల్లా అధికార ప్రతినిధి వడ్డెపల్లి శ్రీనివాస్, ఎలేటి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
పసుపు ధర ఎలా ఉంది..?
● మార్కెట్ యార్డును సందర్శించిన కలెక్టర్ మెట్పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లను గురువారం కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పసుపులో రకాలు..? దిగుబడి ఎంత వచ్చింది..? ఏ రకానికి ఎంత ధర పలుకుతోంది..? ఆ ధరలతో లాభమా? నష్టమా?.. అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కొనుగోలు చేసిన తర్వాత పసుపును ఎక్కడికి ఎగుమతి చేస్తారని అధికారులను అడిగారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు తరలిస్తారని వారు వివరించారు. పసుపును ఉడకబెట్టడానికి రైతులకు అవసరమైన పరికరాలు లేక నేరుగా యార్డుకు తీసుకొస్తుండడంతో తక్కువ ధర పలుకుతోందని తెలిపారు. దీనికి ఆయన గిట్టుబాటు ధర అందించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అనంతరం కార్యాలయంలో ఆన్లైన్ విధానంలో కొనుగోళ్ల తీరును తెలుసుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, సింగిల్ విండో చైర్మన్ కొమిరెడ్డి తిరుపతిరెడ్డి ఉన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి పట్టణంలో ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన దరఖాస్తుల ను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మున్సిపల్ కార్యాలయాన్ని గురువా రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్తి పన్ను వ సూళ్లపై ఆరా తీసి గడువులోగా వంద శాతం వసూలు చేయాలని కమిషనర్ మోహన్‌కు సూచించారు. ‘పది’ ఫలితాల్లో ప్రతిభ కనబరచాలి జగిత్యాల: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్లో జయీభవ.. విజయీభవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రశాంతమైన వాతావరణంలో.. ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలన్నారు. డీఈవో రాము, ఆర్డీవో మదుసూధన్ తదితరులు ఉన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ ధరూర్ క్యాంపులోగల ఈవీఎంల గోదాంను కలెక్టర్ తనిఖీ చేశారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులతో కలిసి ప్రతినెలా సందర్శిస్తున్నట్లు వివరించారు. అదనపు కలెక్టర్ లత ఉన్నారు. మహిళలకు సమానహక్కులు మహిళలకు ప్రభుత్వం సమానహక్కులు, చట్టాలు కల్పిస్తోందని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ముందస్తు మహిళాదినోత్సవాన్ని నిర్వహించారు. లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులకు గురైతే 181 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. వైద్యం, న్యాయం, పోలీస్ కౌన్సిలింగ్ అన్ని రకాల సహాయాలు పొందవచ్చన్నారు. -
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్వామివారం బ్రహ్మోత్సవాలు ఈనెల 10 నుంచి 21 వరకు నిర్వహించనున్న విషయం తెల్సిందే. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన స్వామివారి కల్యాణానికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు నాలుగు లక్షల మంది భక్తులు రానున్నట్లు ఆలయ అఽధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా ఆలయంలోని శేషప్ప కళావేదికపై స్వామి వారల కల్యాణం నిర్వహిస్తుంటారు. అయితే లక్షలాది మంది భక్తులకు ఆ స్థలం సరిపోవడం లే దు. దీంతో బ్రాహ్మణ సంఘం పక్కనున్న యాగశాల స్థలంలో ఈ సారి కల్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సదరు స్థలాన్ని గురువారం అధికారులు, వేదపండితులతో కలిసి అడ్లూరి పరిశీలించారు. భక్తులకు సరిపడా టాయిలెట్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, నీడ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. కల్యాణం నిర్వహించే స్థలంచుట్టూ కంచె వేయాలన్నారు. అంతకముందు విప్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు నేరెల్ల శ్రీనివాసాచారి, శ్రీనివాసాచారి, నాయకులు దినేష్, వేముల రాజు తదితరులున్నారు. -
హస్త వైఫల్యం!
● ఎమ్మెల్సీ ఓటమిపై కాంగ్రెస్‌లో మొదలైన అంతర్మథనం ● చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాలలో ప్రతికూలం ● పెద్దపల్లి జిల్లాలోనే హస్తం పార్టీకి మెజారిటీ ● కరీంనగర్లో అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీల్లో వరుస ఓటమి ● కొంపముంచిన చెల్లని ఓట్లు, సమన్వయ లోపాలు ● పార్టీలో లోపాలపై ముఖ్యమంత్రికి త్వరలో నివేదిక ● నాటి సీఎం తరహాలోనే నేటి సీఎం వ్యాఖ్యలు చేటు చేశాయా?ఎక్కడెక్కడ బలహీనం అంటే? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతను ఎంపిక చేయడం లోకల్ పలువురు నాయకులకు నచ్చలేదు. కీలకమైన కరీంనగర్ నుంచి మరో నాయకుడు ఎదగడం తమ పార్టీలోనే ముగ్గురు ముఖ్యనేతలకు ఇష్టం లేదని ఓటమి అనంతరం నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. గెలవగానే ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారంతో కొందరు ముఖ్యనాయకులు పార్టీ ఎన్ని కల ప్రచారంలో అంటీ ముట్టనట్టుగా వ్యహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే, ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, జగి త్యాల, ధర్మపురి, మానకొండూర్‌లో తక్కువ ఓట్లు వచ్చాయని సాక్షాత్తూ నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అదే సమయంలో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చేందుకు నరేందర్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్– మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమి కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపునకే దారి తీస్తోంది. పార్టీలో సమన్వయ లోపాలు, అనైక్యత, పరస్పర సహకారం కొరవడటం తదితర వైఫల్యాలు ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. 2023లో అసెంబ్లీ, 2024లో పార్లమెంటు, 2025లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఇలా ఏడాదిన్నర కాలంలో కరీంనగర్లో కాంగ్రెస్ వరుసగా ఓడింది. కానీ, ఈసారి ఓటమిపై పార్టీలో ప్రత్యేకమైన చర్చ నడుస్తోంది. వాస్తవానికి 15 జిల్లాలు, 42 నియోజకవర్గాలలోని గ్రాడ్యుయేట్ల కోసం ఎన్నిక జరిగినా.. ప్రచారం, నామినేషన్, రాజకీయం అంతా కరీంనగర్ కేంద్రంగానే జరిగింది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఎం, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించడం, సిట్టింగ్ సీట్లో ఓటమిపై మునుపెన్నడూ లేని చర్చ నడుస్తోంది. చెల్లని ఓట్లు, సమన్వయ లోపాలు వాస్తవానికి నరేందర్‌రెడ్డికి తన ప్రత్యర్థి అంజిరెడ్డి(బీజేపీ)కన్నా కేవలం 5,106వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. అదే సమయంలో 28,686 ఓట్లు చెల్లనివి వచ్చాయి. ఈ ఓట్లలో దాదాపు 16వేల ఓట్లు నరేందర్‌రెడ్డికే పడడం దురదృష్టకరం. అందులోనూ ఆరువేలకుపైగా ఓట్లు కేవలం అంకె ముందు సున్నా వేయడం వల్ల చెల్లకుండా పోవడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. అదే సమయంలో బీజేపీ జిల్లా, మండలం, గ్రామం, బూత్లెవల్వరకు పోల్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా నిర్వహించింది. ప్రతీ 25మందికి ఒక ఇన్చార్జిని నియమించి, ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో క్యాడర్ సఫలీకృతమయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం, ఆధిపత్య పోరు, పోల్ మేనేజ్మెంట్ వైఫల్యాల కారణంగా ఓటరును ప్రసన్నం చేసుకోవడంలో దెబ్బతిన్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఎస్పీ అభ్యర్థికి ఓట్లు వేయించడం కూడా తమకు ప్రతికూలంగా మారిందని నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తుండటం గమనార్హం. నాడు కేసీఆర్.. నేడు రేవంత్కరీంనగర్ ఉద్యమాలకు, భావోద్వేగాలకు నిలయమైన జిల్లా. ఈ ప్రాంత ఓటర్లు విలక్షణ తీర్పునివ్వడంలో పరిపాటి. 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల్లో తిరుగులేని విజయాన్ని అందుకుని మంచి జోరు మీదున్న బీఆర్ఎస్కు మొదటి ఎదురుదెబ్బ కరీంనగర్‌లోనే తగిలింది. 2019 గ్రాడ్యుయేట్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించి బీఆర్ఎస్కే కాదు.. రాష్ట్ర రాజకీయాలకే కరీంనగర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇటీవల నరేందర్‌రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో సీఎం రేవంత్ ఈ ఎమ్మెల్సీ గెలవకపోయినా.. తమకు వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించడం ఆ వెంటనే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడం చర్చనీయాంశంగా మారాయి. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ బీజేపీని ఉద్దేశించి.. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అన్న మాట వాడటం.. ఆ పార్టీ పరాజయంలో కీలకంగా పనిచేసిన విషయాన్ని కరీంనగర్ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. -
భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
ధర్మపురి: త్వరలో జరిగే ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో బుధవారం సమీక్షించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈనెల 10 నుంచి 22 వరకు నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించే పుష్కరఘాట్లను పరిశీలించారు. గోదావరి తీరంలో లైట్లు, చలువ పందిల్లు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదులు, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో నిత్యం శానిటేషన్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ ప్రతిపాదించిన శ్రీమట్టంలో నాలుగెకరాల ఖాళీ స్థలంలో స్వామివారి కల్యాణానికి దేవాదాయ శాఖ అనుమతి తీసుకోవాలని, వేదికకు కావల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. గతేడాది సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈసారి 10శాతం మంది భక్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, వారందరికీ సరిపడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలించి వాటిపై సమీక్షించారు. ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, మున్సిపల్ ఇరిగేషన్ అధికారి నారాయణ, ఆర్‌డబ్లూఎస్ ఈఈ, డిప్యూటీ తహసీల్దార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ నృసింహుని బ్రహ్మోత్సవాలపై సమీక్ష -
ఏసీబీకి పట్టుబడిన కోరుట్ల ఎస్సై–3
కోరుట్ల: పేకాటలో దొరికిన సెల్‌ఫోన్ వాపస్ ఇవ్వడానికి రూ.5వేలు డిమాండ్ చేసి వసూలు చేసిన క్ర మంలో జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్సై–3 రూపావ త్ శంకర్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు.. గత నెల 21న కోరుట్ల మండలం జోగన్‌పల్లి శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని స్పెషల్‌పార్టీ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20వేలు స్వాధీనం చేసుకుని వారికి సంబంధించిన వాహనాలు, సెల్పోన్లు కోరుట్ల ఠాణాలో అప్పగించారు. ఎస్సై శంకర్ కేసు నమోదు చేశారు. అనంతరం పేకాటరాయుళ్లకు వాహనాలు, సెల్ఫోన్లు ఇచ్చే క్రమంలో డబ్బులు డిమాండ్ చేయగా వారిలో కొందరు డబ్బులు ఇచ్చి సెల్ఫోన్లు, వాహనాలు తీసుకెళ్లారు. రాయికల్ మండలం ఉప్పుమడిగెకు చెందిన బండారి శ్రీనివాస్ మాత్రం తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పి స్థానిక కాంగ్రెస్ నాయకుడితో ఫోన్ చేయించుకున్నాడు. తరువాత ఎస్సై శంకర్ ఫోన్ వాపస్ ఇచ్చినప్పటికీ డబ్బులు డిమాండ్ చేయడం ఆపలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఏసీబీనీ ఆశ్రయించాడు. బుధవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్ గేటు ముందు శ్రీనివాస్ రూ.5వేలను ఎస్సై శంకర్‌కు ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎస్సై శంకర్ మరో మూడు నెలల్లో రిటైర్మెంట్ కానున్నారు. పేకాటలో దొరికిన సెల్‌ఫోన్ ఇవ్వడానికి.. రూ.5 వేలు లంచం డిమాండ్ -
ఆశలు సమాధి
ముస్తాబాద్(సిరిసిల్ల): ‘అమ్మ..నాన్న.. మూడు నెలలైతే బీటెక్ పూర్తవుతుంది. ఉద్యోగం వస్తుంది..’ అని చె ప్పిన మాటలు మరువకముందే ఆ కొడుకు వారికి దూరమయ్యాడు. ఒక్కగా నొక్క కొడుకు కేరళలో దుర్మరణం చెందగా.. ముస్తాబాద్‌లో విషాదం అలుముకుంది. కొడుకుపై పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు జలసమాధి అయ్యాయి. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ముత్యాల దేవేందర్, శారద దంపతులకు ముత్యాల సాయిచరణ్(21) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. నలుగురు స్నేహితులతో కలిసి సాయిచరణ్ కేరళలోని అలప్పుజకు ఈనెల 3న వెళ్లారు. అక్కడ సముద్రంలో హౌస్‌బోట్‌లో వెళ్తుండగా సాయిచరణ్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈతకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు దేవేందర్, శారదలు రెండు రోజులుగా కుమారుడు సాయిచరణ్ కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీప బంధువు కాగా, ఆయన దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వ విప్ అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడి సాయిచరణ్ మృతదేహాన్ని రప్పించేలా ఏర్పాట్లు చేశారు. యువకుడి మృతదేహం ఇంటికి చేరగానే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. ‘సాయి లేరా.. బిడ్డా..’ అంటూ ఆ తల్లి రోదనలు అక్కడ ఉన్న వారికి కంటతడి పెట్టించాయి. కేరళలో బీటెక్ విద్యార్థి దుర్మరణం ముస్తాబాద్‌లో విషాదం -
అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య
సారంగాపూర్: అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై దత్తాద్రి కథనం ప్రకారం.. మండలంలోని రంగపేటకు చెందిన లలితకు 15 ఏళ్ల క్రితం తుమ్మల చిరంజీవితో వివాహమైంది. వీరికి కూతురు సంతానం. కొద్దిరోజులుగా లలితను భర్త చిరంజీవి, అత్తామమలు మరియా, కాంతయ్య శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. వారి వేధింపులు భరించలేక ఈనెల ఒకటో తేదీన పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త, అత్తామామలపై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. ఉరేసుకుని మద్యానికి బానిసైన వ్యక్తి ..మల్లాపూర్(కోరుట్ల): ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మొగిలిపేటలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మామిడి పురుషోత్తం (35)కు భార్య శరణ్య, ఇద్దరు కుమారులు వివేక్, ఆదిత్య ఉన్నారు. ఉపాధి కోసం దుబాయికి రెండుసార్లు వెళ్లి వచ్చాడు. ఇందుకు రూ.7లక్షల వరకు అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక.. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లోనే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ పంచాయతీ కార్యదర్శి మృతివెల్గటూర్: చికిత్స పొందుతూ పంచాయతీ కార్యదర్శి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జగదేవుపేట పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎండీ.పాషా శుక్రవారం జగిత్యాలలో బైక్‌పై బైపాస్ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా బైక్‌పై వచ్చిన ముగ్గురు బాలురు ఢీకొట్టారు. గాయపడిన పాషాను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడంతో అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. పాషా మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
ఆలయాల్లో చోరీ చేసిన దొంగ అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని శివాజీనగర్‌లోగల నల్లపోచమ్మ తల్లి ఆలయం, ఉప్పరిపేట ఆలయాల్లో దొంగతనానికి పాల్పడిన దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. బుధవారం పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇటీవల ఉప్పరిపేటతోపాటు నల్లపోచమ్మతల్లి ఆలయంలో దొంగతనాలు జరిగాయి. ఆలయ కమిటీ, స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలోని వాణీనగర్ చౌరస్తాలో పట్టణ సీఐ వేణుగోపాల్ బుధవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో కోరుట్ల పట్టణం అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన విభూది అలియాస్ వూటూరి శేఖర్ బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.50 వేల విలువైన పూజాసామగ్రి, సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎనిమిదేళ్లలో 25 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయన్నారు. అలాగే ఆలయాల దొంగతనాల్లో ప్రమేయం ఉన్న లక్ష్మీ అనే మహిళ దొంగ పరారీలో ఉందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని పట్టుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్‌ను అభినందించారు. బాల నిందితుడి అరెస్ట్ జగిత్యాలలోని నర్సింగ్ కళాశాలలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం దొంగతనానికి పాల్పడిన బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అతడిని జువైనల్ హోంకు తరలించినట్లు పేర్కొన్నారు. మరో మహిళ దొంగ పరార్ రూ.50 వేల విలువైన సామగ్రి స్వాధీనం జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వెల్లడి -
దొంగ అరెస్ట్
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన దొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన మామిండ్ల ఆంజనేయులు అలియాస్ అంజిని ముస్తాబాద్ ఏఎంఆర్ గార్డెన్ వద్ద అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుండగా పట్టుకున్నారు. విచారించగా ముస్తాబాద్, గూడూరు, మద్దికుంటల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రైలు ఢీకొని ఆరు ఎడ్లు మృతికోరుట్ల రూరల్: మండలంలోని చిన్నమెట్పల్లి శివారులోని రైల్వే వంతెన వద్ద బుధవారం రైలు ఢీకొని ఆరు ఎడ్లు మృతిచెందాయి. స్థానికుల కథనం ప్రకారం ఎడ్లు రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొన్నట్లు వివరించారు. రైల్వే అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి ఆత్మహత్యకోరుట్ల: కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్లో నివాసముండే పల్లికొండ రోహిత (22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పల్లికొండ రాజ, లతల కూతురు రోహితకు మానసిక స్థితి సరిగాలేదు. ఆరోగ్యం కూడా సరిగాలేకపోవటంతో మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ బస్టాండ్ వద్ద మంగళవారం రాత్రి ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన టీఆర్‌నగర్‌కు చెందిన మల్యాల శ్రీనివాస్ అలియాస్ శ్రీహరి (32) చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ సార్ మాకొద్దు
● విద్యార్థుల ఆందోళన ● పాఠశాలకు తాళంసుల్తానాబాద్(పెద్దపల్లి): ‘ఆ సార్ మాకొద్దు.. ఆయన తీరుతో చదువు దెబ్బతింటున్నది.. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వారి స్వప్రయోజనాల కోసం మమ్మల్ని ఇబ్బందులను గురిచేసే పరిస్థితి నెలకొంది.. అలాంటి సార్ మాకు వద్దు’ అని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ,గ్రామస్తులు, తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పెద్దపల్లి మండలం నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇందుకు వేదికై ంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. ఉపాధ్యాయుడు ఒకరు విద్యార్థులను క్లాస్ రూమ్‌లో శ్రీజై భీమ్‌శ్రీ అని పలకాలని ఆదేశిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు నిరసనకు దిగారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్య తీసుకునే వరకూ పాఠశాలకు రాబోమని తెల్చి చెప్పారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొద్దిరోజులుగా ఉపాధ్యాయులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం పీఎస్‌లో ఫిర్యాదు చేసుకుంటున్నారని ఆరోపించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. సమస్యకు కారణమైన శంకరయ్య సర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉపాధ్యాయుడు శంకరయ్యను వివరణ కోరగా టీచర్ల మధ్య గొడవలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై రుద్దుతున్నారన్నారు. హెచ్ఎం సహకారంతోనే విద్యార్థులు ధర్నాకు దిగారని ఆరోపించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాగా, ఆందోళన తీవ్రతరం కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి జిల్లా విద్యాధికారికి సమాచారం చేరవేశారు. దీంతో డీఈవో మాధవి, ఎస్సై లక్ష్మణరావు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. సమస్యపై చర్చించి ఆందోళన విరమింపజేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్(45) రోడ్డుప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న మూగవాడైన శ్రీనివాస్.. మంగళవారం రాత్రి గోదావరిఖని – మంథని మధ్య రోడ్డుపై సుందిళ్ల శివారులో నడుచుకుంటూ గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోదావరిఖని నుంచి మంథనికి వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టగా, శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరి కటకం రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యార్థిని మృతికి కారణమైన వ్యక్తికి మూడేళ్ల జైలు
జగిత్యాలజోన్: విద్యార్థినిని ప్రేమించాలని వేధించి.. ఆమె మృతికి కారణమైన వ్యక్తికి మూడేళ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి జి.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్. రామకృష్ణారావు కథనం ప్రకారం.. పెగడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు సంతానం. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె 2022 ఏప్రిల్ ఒకటో తేదీన స్నేహితురాలి వద్ద చదువుకుంటానని చెప్పి వెళ్లిన బాలిక కాసేపటికి ఇంటికి చేరుకుంది. ఇంటి వెనుక వైపు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెదకగా.. తాను పురుగుల మందు తాగానని చెప్పింది. వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయింది. తన కూతురు మరణానికి పెగడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎట్టం రవి కారణమని, స్కూల్‌కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు తన కూతురును ప్రేమించాలని వేధించడంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తండ్రి పెగడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై శ్వేత కేసు నమోదు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు కిరణ్‌కుమార్, డి.శ్రీధర్, కేవీ.సాగర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంతో ఎట్టం రవికి మూడేళ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
సృజనా టెక్‌ఫెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ
కోరుట్ల: పట్టణ శివారులోని పాలిటెక్నిక్‌లో బుధవారం నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాస్థాయి సృజనా టెక్‌ఫెస్ట్‌లో ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ సిరిసిల్ల, కోరుట్ల పాలిటెక్నిక్ మెకానికల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. సిరిసిల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఆటోమెటెడ్ హమర్ మెషన్, కోరుట్ల విద్యార్థులు ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సోలార్ పవర్ హ్యాక్సా ప్రాజెక్టులను ప్రదర్శించారు. టెక్‌ఫెస్ట్‌లో న్యాయ నిర్ణేతలుగా జేఎన్టీయూ మంథని మెకానికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరామకృష్ణ, కోరుట్ల ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్ ఎండీ.సాదిక్ అలీ వ్యవహరించారు. కోరుట్ల విద్యార్థులు తయారు చేసిన ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సోలార్ పవర్ హ్యాక్సా ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. కార్యక్రమంలో సృజన టెక్‌ఫెస్ట్ కో–ఆర్డీనేటర్ వి. కాంతయ్య, ఇన్చార్జి హెచ్ఓడీ సివిల్ ఆఫీస్ సూపరింటెండెంట్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
నేరాల ఛేదనలో జాగిలాల పాత్ర కీలకం
జగిత్యాలక్రైం: నేరాల ఛేదనలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ సత్యప్రసాద్ అ న్నారు. ఎస్పీ కార్యాలయం సమీపంలో పోలీసు జాగిలాల కోసం నిర్మించిన ప్రత్యేక భవనాన్ని ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. నేరాల నిరోధం, విచారణ, భద్రతపరమైన చర్యల్లో జాగిలాలు సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపారు. అధిక సామర్థ్యం, విశ్వనీయత, ప్రత్యేక శిక్షణతో పోలీసులకు సహాయపడుతున్నాయని తెలిపారు. హత్యలు, దోపిడీలు జరిగిన సమయాల్లో నిందితులను పట్టించడం.. సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా నివారించడంలో కృషి చేస్తున్నాయని తెలిపారు. మాదకద్రవ్యాలు, బాంబులు, ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఉపయోగపడుతున్నాయని వివరించారు. ప్రస్తుతం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆరు జాగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణకు ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని తెలిపారు. అనంతరం శిక్షణ సమయంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డాగ్‌ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి మెడల్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు రఘుచందర్, రాములు, సీఐలు కిరణ్‌కుమార్, వేణు, వేణుగోపాల్, ఎస్బీ ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, శ్రీధర్, ఆర్ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
ఆదర్శ దంపతుల స్ఫూర్తిదాయక నిర్ణయం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ఉల్లిగడ్డల బజార్లో హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తున్న కొత్త చంద్రప్రసాద్–వరలక్ష్మి దంపతులు బుధవారం స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు. వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా తమ మరణానంతరం ఇద్దరి నేత్రాలు, అవయవాలు, దేహదానాలు చేస్తామని అంగీకారం ప్రకటించారు. వారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ ముఖ్య సలహాదారు, ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రాజెక్ట్ మాజీ ఆఫీసర్ నూక రమేశ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాసుకు తమ అంగీకారపత్రాలు అందజేశారు. దంపతులకు ప్రతినిధులు అభినందన పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో చంద్రప్రసాద్ తల్లిదండ్రులు కొత్త రాజయ్య–వజ్రమ్మతోపాటు బంధువులు గుండా శంకరయ్య, గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానానికి అంగీకారం -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
● సైబర్‌క్రైమ్ డీఎస్పీ డీవీ.రంగారెడ్డి జగిత్యాలక్రైం: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైం డీఎస్పీ డీవీ.రంగారెడ్డి అన్నారు. బుధవారం సైబర్ నేరాలు, సైబర్ భద్రతపై జాగృక్త దివస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతినెలా మొదటి బుధవారం నలంద డిగ్రీ కళాశాలలో సైబర్ జాగృక్త దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, యువత, ప్రజలకు సైబర్ భద్రతపై, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాను పిల్లలు ఎక్కువగా వాడుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలని సూచించాలన్నారు. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ అవగాహన తప్పనిసరి అన్నారు. మహిళలు హక్కులు, రక్షణకు షీటీం ప్రత్యేకంగా పనిచేస్తుందన్నారు. స్కూళ్లు, కళాశాల, బస్టాండ్లలో అమ్మాయిలను వేధిస్తే షీటీం పోలీస్ హెల్ప్‌లైన్ నంబరు 8712670783కి లేదా 100కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో షీటీం ఇన్చార్జి సీఐ శ్రీనివాస్, సైబర్ క్రైం ఎస్సై దినేశ్ పాల్గొన్నారు. -
అజ్నీ రైలుకు గ్రీన్‌సిగ్నల్
ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట – నాగపూర్(అజ్నీ) మధ్య అజ్నీ ప్యాసింజర్ రైలు గురువారం నుంచి పట్టాలెక్కనుంది. ఈమేరకు రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా సమయంలో రైల్వేశాఖ అజ్నీ రైలును రద్దు చేయడంతో ఏళ్లుగా ప్రయాణికులు, వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంలోపై గతనెలలో ‘సాక్షి’ ‘వినిపించని అజ్నీ’ కూత శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్.. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వీనివైష్ణవి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వినతిపత్రం అందజేసి సమస్య పరిష్కరించాలని వివరించారు. ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే అజ్నీ ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని వారు పట్టుబట్టారు. దీంతో గురువారం నుంచి అజ్జీ ప్యాసింజర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. అజ్నీ మళ్లీ పట్టాలపైకి వస్తుందనే సమాచారంతో కాజీపేట– బల్హార్షా సెక్షన్ల మధ్య ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేటినుంచి పట్టాలెక్కనున్న రైలు ఏళ్ల తర్వాత పునరుద్ధరణకు చర్యలు ఉత్తర్వులు విడుదల చేసిన రైల్వేశాఖ -
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..
సారంగాపూర్: సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండలంలోని బట్టపల్లి గ్రామంలో ఎండిపోతు న్న పంటలను ఆమె బుధవారం పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం రోజురోజుకూ దిగజారిపోతోందని, కాలువ చివరి భూములకు నీరందక బట్టపల్లి, పోతారం గ్రామాల్లో మొక్కజొన్న, వరి పంటలు పశుగ్రాసంగా మారాయని ఆవేదన వ్య క్తం చేశారు. ఎస్సారెస్పీ కాలువలపై అధికారు ల పర్యవేక్షణ కొరవడి చివరి భూములకు నీరుచేరక పంటలు ఎండి రైతులు ఆగమవుతున్నారని తెలి పారు. పలువురు రైతులను ఆమె ఓదార్చారు. బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, మాజీ సర్పంచ్ భూక్య అరుణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించాలి
రాయికల్/ఇబ్రహీంపట్నం: గ్రామీణ నిరుద్యోగ యువత వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు తెలిపారు. పట్టణంలోని చిన్నజీయర్‌స్వామి ట్రస్ట్ భవనంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు బుధవారం సర్టిఫికెట్లు అందించారు. హోంమేడ్ హెల్త్ నర్సింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ తీసుకుని ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. ఇటిక్యాలలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆఫీసర్ మహేశ్, ప్రతిమ ఫౌండేషన్ మార్కెటింగ్ మేనేజర్ కౌశిక్, ఫౌండేషన్ మేనేజర్ గీతారెడ్డి, ట్రస్ట్ ఇన్చార్జి ముత్యపు రాజిరెడ్డి, ప్రతినిధులు రాజిరెడ్డి, రఘుపతి, శ్యామల పాల్గొన్నారు. సోలార్ ప్రాజెక్టులకు చేయూత దేశంలో పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రధాని నరేంద్రమోదీ చేయూతనిస్తున్నారని విద్యాసాగర్‌రావు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా టాటాస్ట్రైవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. సోలార్, బ్యాంకింగ్, ఏసీ, రిఫ్రిజిరేటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోలార్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, మాజీ అధ్యక్షు డు మోరపెల్లి సత్యనారాయణరావు, టాటాస్ట్రైవ్ ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్‌కుమార్, అమ్మక్కపే ట సెంటర్ మేనేజర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. ● మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు -
స్వగ్రామానికి గల్ఫ్ వలసజీవి
చందుర్తి(వేములవాడ): జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లిన వలసజీవి అనారోగ్యం బారిన పడ్డాడు. స్వగ్రామం వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతుండగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో బుధవారం ఇంటికి చేరాడు. చందుర్తి మండలం కట్టలింగంపేటకు చెందిన యువకుడు తీగల గంగరాజు జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని దొరక్క చేతిలో డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలోనే 15 రోజుల క్రితం పక్షవాతం రావడంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక గదిలోనే ఉండిపోయాడు. ఈ విషయాన్ని కట్టలింగంపేట గ్రామస్తులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇండియా ఎంబసీ అధికారులతో మాట్లాడి టికెట్ ఇప్పించడంతోపాటు దుబాయ్‌లో ఉంటున్న చందుర్తి మండలానికి చెందిన మోతె రాములు, కటకం రవి యువకునికి టికెట్, పాసుపోర్టు అందజేసి స్వగ్రామానికి పంపించారు. స్వగ్రామానికి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కమలంలో జోష్.. హస్తంలో నైరాశ్యం!
● పకడ్బందీ ప్లాన్‌తో బీజేపీ సక్సెస్ ● సమన్వయం, సహకారం లేక కాంగ్రెస్ డీలా ● పోల్మేనేజ్మెంట్లో బీఎస్పీ విఫలం ● ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పార్టీల అంతర్మథనంసాక్షిప్రతినిధి,కరీంనగర్: రెండు ఎమ్మెల్సీలను ఎగరేసుకుపోయిన కమలం పార్టీ కేడర్‌లో జోష్ నెలకొంది. అధికారంలో ఉండీ.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని దక్కించుకోకపోయినందుకు కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొంది. కేవలం డబ్బు ప్రభావంతోనే తాము ఓడిపోయామని బీఎస్పీ భావిస్తోంది. మొత్తానికి పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ అనుసరించిన విధానాలే తమను గెలిపించాయని బీజేపీతోపాటు ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్పీలు విఫలమయ్యాయని ఆయా పార్టీల్లో ప్రచారం మొదలైంది. బరిలో లేకున్నా.. అధికార కాంగ్రెస్ ఓటమిపై కారు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ విధానాలు, వైఫల్యాలే వారిని ఓడించాయని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఈ ఫలితాలు కమలంలో జోష్‌ను నింపాయి. ● బీజేపీ ఈ విషయంలో ఆదినుంచీ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగింది. నియోజకవర్గం, మండలం, డివిజన్, గ్రామాల వారీగా పచ్చాస్ ప్రభారీలను నియమించి ప్రతీ 25 మందికి ఒక ఇన్చార్జిని కేటాయించింది. వారు ప్రతీ ఓటరును రోజూ కలవడం, అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పట్టభద్రులు, నిరుద్యోగులు, టీచర్స్ కోసం తాము చేసిన పోరాటాన్ని వివరిస్తూ ఓటర్లకు చేరువయ్యారు. దీనికితోడు కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పూర్తిస్థాయిలో ప్రచారం చేయడం అభ్యర్థులకు బాగా కలిసి వచ్చిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ● కాంగ్రెస్ పార్టీ కేడర్ పూర్తిస్థాయిలో నరేందర్‌రెడ్డికి సహకరించలేదన్న విమర్శలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా నాయకులు ఈ విషయంలో తమ కు సహకరించినట్లుగా మిగిలిన మూడు జిల్లాల నాయకులు సహకరించలేదని నరేందర్‌రెడ్డి వ ర్గం అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. కరీంనగర్ నుంచి నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిస్తే.. కాంగ్రెస్‌లోని ముగ్గురు కీలక నేతలకు పోటీగా ఎదుగుతాడన్న ఆందోళనతో వారెవరూ సహకరించలేదని మండిపడుతున్నారు. దీంతోపాటు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు మద్దతిచ్చారని, బీఆర్ఎస్ పార్టీ కూడా లోపాయికారిగా సహకరించిందని ఆరోపిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ సభలో సీఎం కూడా ఈ సీటు ఓడిపోతే తమకేం నష్టం లేదని వ్యాఖ్యానించడం తమకు చేటు చేసిందంటున్నారు. అంతేకాకుండా చెల్లకుండా పోయిన సుమారు 28 వేల ఓట్లలో దాదాపు 15 వేలకుపైగా ఓట్లు నరేందర్‌రెడ్డివే కావడం తమ కొంపముంచాయని విశ్లేషిస్తున్నారు. -
పట్టభద్రుల సీటూ కమలానిదే!
సాక్షిప్రతినిధి,కరీంనగర్/సాక్షి,పెద్దపల్లి: కరీంనగర్– ఆదిలాబాద్– నిజామాబాద్– మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూ డు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్స్‌తో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖ రారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో అతడినే విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్లతేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించటంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్విరామంగా మూడు షిప్ట్‌ల్లో 800మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లును వడపోసి, కట్టలు కట్టారు. మఽంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ ప్రారంభించి, బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్స్‌ను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్స్‌లో బరిలో ఉన్న 54మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లును మిగిలిన అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ ప్రక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. ముగ్గురికే 92.52శాతం ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటు అయిన ఓట్లల్లో 92.52శాతం (2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగిలిన 53మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కేవలం 16,684 ఓట్లు మాత్రమే సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో సైతం బీజేపీదే హవా.. నిర్ధారిత కోటా ఓట్ల్ల కోసం అభ్యర్థుల ఎలిమి నేషన్ ప్రక్రియను చేపట్టగా బీజేపీ అభ్యర్థి అధి క్యం చూపారు. తొలుత 53మందిని ఎలిమినేషన్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్‌కి 73,644 ఓట్లు, బీఎస్పీకి 63,972 ఓట్లు వచ్చా యి. 53మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్లును ఎవరు సాధించకపోవడంతో మూడోస్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణను ఎలిమినేట్ చేశారు. అతనికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనంతరం బీజేపీ అభ్యర్థికి 98,637 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 93,531ఓట్లు వచ్చా యి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి కన్నా 5,106 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో బీజేపీ అభ్యర్థికి విజయం వరించింది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో కమలం పార్టీకే విజయం దక్కింది. గ్రాడ్యుయేట్లోనూ బీజేపీ హవా అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి మూడురోజులు సాగిన ఎమ్మెల్సీ కౌంటింగ్ ముగ్గురికే 92.52శాతం ఓట్లు -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మల్లాపూర్: గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. ఇళ్లలో నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొ లగించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల నివారణకు డ్రైనేజీల్లో మందు చల్లించాలని ప్రత్యేకాధికారులు, పంచాయతీ, వైద్యసిబ్బందికి సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పీహెచ్సీ మెడికల్ అధికారి వాహిని, సీహెచ్‌వో.రామ్మోహన్, హెచ్‌ఈవో వేణురావు, పీహెచ్ఎన్ ఇందిర, హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి, ఫార్మసిస్ట్ మహేశ్వరి పాల్గొన్నారు. బతికపల్లిలో పురాతన నాణేలు లభ్యంపెగడపల్లి: మండలంలోని బతికపలిలో అతిపురాతనమైన నాణేలు లభ్యమయ్యాయి. గ్రామ శివారులోని పెద్దగుట్టపై ఉపాధిహామీ కూలీలు కాంటూరు కందకాలు తవ్వుతున్నారు. బుధవారం దావుల జమున, మల్యాల శ్యామల కందకాలు తవ్వుతుండగా వెండిని పోలి, ఉర్దూభాషలో రాసిఉన్న 20 పురాతనమైన నాణేలు లభ్యమయ్యాయి. వారు వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ మహేశ్వరి, పంచాయతీ కార్యదర్శి నిఖిల్‌రెడ్డికి సమాచారం అందించారు. వారు అధికారులకు తెలపగా ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై రవికిరణ్, ఆర్ఐ జమున సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నాణేలను జగిత్యాల పురావస్తుశాఖకు అప్పగించనున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. జిల్లా ఉద్యానశాఖ అధికారిగా శ్యాంప్రసాద్జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా ఉద్యానశాఖాధికారిగా జి.శ్యామ్‌ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన దేవప్రసాద్‌ను రాష్ట్ర హార్టికల్చర్ కమిషనరేట్‌కు సరెండర్ చేశారు. దీంతో జిల్లాలో ఉద్యానశాఖ టెక్నికల్ అఫీసర్‌గా పనిచేస్తున్న శ్యామ్‌ప్రసాద్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రులు నిబంధనల ప్రకారం పనిచేయాలిజగిత్యాల: ఆస్పత్రులను నిబంధనల ప్రకారం నడిపించాలని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పీసీపీ ఎన్డీటీ నోడల్ ఆఫీసర్ సూర్యశ్రీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రులను డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశా రు. ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్‌లో నమోదైన డాక్ట ర్లు మాత్రమే సేవలందించాలన్నారు. రికార్డులు, స్కానింగ్ యంత్రాల రికార్డులు మెయింటేన్ చేయాలన్నారు. ప్రతినెలా 5వ తేదీలోపు ఆన్లైన్లో ఫాం–ఎఫ్ నివేదిక అందించాలన్నారు. మాత శిశు సంక్షేమాధికారి జైపాల్‌రెడ్డి, డెకాయి ఆపరేషన్ కమిటీ సభ్యులు సాయిసుధ, లావణ్య, అశ్విని, భూమేశ్వర్ పాల్గొన్నారు. సర్వీస్ నుంచి ఇద్దరు టీచర్ల తొలగింపుజగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఖాజీపుర ఉర్దూమీడియం పాఠశాలలో లాంగ్వేజ్ పండిట్ ఫహీమ్జహాన్ 2022 నవంబర్ 1 ఒకటి నుంచి విధులకు రావడంలేదు. అలాగే ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాల లాంగ్వేజ్ పండిట్ తహసీమ్ సుల్తానా 2022 జూన్ ఒకటి నుంచి విధులకు గైర్హాజరవుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు 260 ప్రకారం వీరిద్దరినీ సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈవో రాము తెలిపారు. -
‘ఇందిరమ్మ ఇళ్ల’ ప్రగతిని నమోదు చేయాలి
సారంగాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని వెంటవెంటనే జియోట్యాగ్ ద్వారా ఫొటోలను క్యాప్చర్ చేస్తే లబ్ధిదారులకు త్వరగా బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుందని జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి అన్నారు. బీర్పూర్ మండలం చిత్రవేణిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. గ్రామంలో 74 ఇళ్లకు 18 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, మరో 12 ఇళ్లు రెండు రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో ఇళ్లను పూర్తి చేయడానికి లబ్ధిదారులకు దగ్గరుండి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అనంతరం బీర్పూర్ పీహెచ్సీ పనులు, బీర్పూర్, సారంగాపూర్ ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించారు. ఆ యన వెంట సారంగాపూర్, బీర్పూర్ ఎంపీడీవోలు గంగాధర్, లచ్చాలు తదితరులు ఉన్నారు. -
పసుపు పంటకు రూ.15వేలు చెల్లించండి
మెట్పల్లి: పసుపు పంట క్వింటాల్‌కు రూ.15వేల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. పలువురు మాట్లాడుతూ గతేడాది క్వింటాల్‌కు రూ.16వేల నుంచి రూ.18వేల ధర దక్కితే.. ఈ ఏడాది రూ.11వేలకు మించి రావడం లేదన్నారు. గిట్టుబాటు ధర అందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్దతు ధర అందించి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందించాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేశ్‌రెడ్డి, పన్నాల తిరుపతిరెడ్డి, మామిడి నారాయణరెడ్డి, మారు మురళీధర్‌రెడ్డి, గురిజెల రాజిరెడ్డి, కొమ్ముల సతీశ్, చిలువేరి తిరుపతి, పాపన్న, నాగేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. -
సకాలంలో పనులు పూర్తిచేయాలి
బుగ్గారం: ఉపాధి పనులను సకాలంలో పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ రఘువరణ్ సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రంలో మంగళవారం తనిఖీలు చేశారు. ఈజీఎస్ ద్వారా చేపడుతున్న వివిధ పనులను అడిగి తెలుసుకున్నారు. మహిళాశక్తి కార్యక్రమాలను పరిశీలించారు. నర్సరీ, పశువుల పాకల ప్రగతిని తెలుసుకున్నారు. కూలీల సంఖ్య పెంచి పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏపీడీ చరణ్‌దాస్, ఏపీఎం మోహన్‌దాస్, సీసీలు జక్క శ్రీనివాస్, సత్యనారాయణ, శ్రీనిధి మేనేజర్ రమాదేవి, ఎంపీడీవో అఫ్జల్‌మియా, ఏపీవో సృజన్ స్థానిక సిబ్బంది ఉన్నారు. -
‘వికసిత్ భారత్’ నోడల్‌గా జిల్లా ఎంపిక
జగిత్యాల: జిల్లాతోపాటు రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ వికసిత్ భారత్ పార్లమెంట్ కార్యక్రమాల నిర్వహణకు జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎంపికై ంది. కేంద్ర, యోజన సర్వీస్ శాఖ దేశవ్యాప్తంగా 300 కళాశాలల్లో 2024–25 సంవత్సరానికి గాను యూత్ పార్లమెంట్ కార్యక్రమాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ మూడు జిల్లాల బాధ్యతలను ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలకు అప్పగించారు. ఆయా జిల్లాల్లోని విద్యార్థులు, యువకులు మైభారత్ పోర్టల్‌లో ఈనెల 9లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నోడల్ జిల్లాస్థాయిలో ఎంపికై న వారిని రాష్ట్రస్థాయికి పంపిస్తారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయి పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆసక్తి గలవారు మైభారత్ పోర్టల్‌లో మెగా ఈవెంట్ క్లిక్ చేసి పేర్లు నమోదు చేసుకుని వికసిత్ భారత్ యువపార్లమెంట్ అంశంపై ఒక నిమిషం వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 75 ఏళ్ల భారత రాజ్యాంగం విధులు, హక్కులు, ప్రగతి అంశంపై ఉపన్యాసం ఉంటుంది. జా తీయస్థాయికి వెళ్లిన వారు ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల్లో భాగంగా ప్రజాస్వామ్యాన్ని సరళీకృతం చేయడం, ప్రగతిని విస్తరించడం, స్థిరత్వాన్ని నిర్ధారించడం’ అంశంపై ప్రసంగించాల్సి ఉంటుంది. వివరాలకు జగిత్యాలలోని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఆడెపు శ్రీనివాస్, కందుకూరి శ్రీనివాస్, జిల్లా యువజన అధికారి రాంబాబును 9490683621, 9177656166 నంబర్లలో సంప్రదించాలని ఎస్కేఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. ఈనెల 9 లోపు ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. -
● కలెక్టర్ సత్యప్రసాద్
కథలాపూర్/ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. కథలాపూర్ మండలం పోసానిపేట, ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్తండాలో ఇళ్ల నిర్మాణాలను మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలని, బేస్మెంట్ లెవెల్లో రూ.లక్ష, గోడ నిర్మాణందశలో రూ.లక్ష, స్లాబ్ దశలో రూ.రెండు లక్షలు, ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష అందిస్తామని వెల్లడించారు. ఎర్రాపూర్, ఎర్రాపూర్తండాలో 42 మందికి ఇళ్లు మంజూరైనా నలుగురు మాత్రమే ముగ్గు పోశారు. మిగిలినవా రు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కలెక్టర్ ప్ర శ్నించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా పెద్దగా నిర్మించుకుంటే సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. డీపీవో మదన్మోహన్, గృహ ని ర్మాణశాఖ జిల్లా అధికారి ప్రసాద్, ఎంపీడీవోలు శంకర్, చంద్రశేఖర్, ఎంపీవో రాజశేఖర్, తహసీ ల్దార్ ప్రసాద్, ఆర్ఐ నాగేశ్ ఉన్నారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు మెట్‌పల్లిరూరల్: యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి మండలం బండలింగాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ గోదాంను మంగళవారం తనిఖీ చేశారు. యూరియా నిల్వలను పరిశీలించారు. ఈ పాస్ ద్వారా మాత్రమే విక్రయాలు చేపట్టాలన్నారు. మెట్పల్లి ఏవో దీపిక, ఎంపీడీవో మహేశ్వర్‌రెడ్డి, ఏఈవో మనోజ్ఞ ఉన్నారు. -
శతశాతం దిశగా
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు ఎంతగానో దోహదపడుతున్నాయి. సందేహాలను ఉపాధ్యాయులు వెంటనే నివృత్తి చేస్తున్నారు. సబ్జెక్టుల వారీగా వివరిస్తూ మాలో ఉన్న భయాన్ని తొలగిస్తున్నారు. – ఎస్.రోహిత్, టెన్త్ విద్యార్థి జిల్లాలో 11,855 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వంద శాతం ఉత్తీర్ణత దిశగా సాగుతున్నాం. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులు వందశాతం పాసయ్యేలా కృషి చేస్తాం. – రాము, డీఈవోసబ్జెక్టులవారీగా దృష్టి -
వడదెబ్బ బారిన పడొద్దు
జగిత్యాల: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ సూచించారు. పెరిగిన ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ శరీరంలో బలహీనపడి వడదెబ్బకు గురవుతారని, రక్తనాళాలు కుచించుకుపోవడంతో కిడ్నీలు, లివర్ వంటి అవయవాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఎండలో తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తుంటారని, ఇంట్లో కూర్చున్నా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వివరించారు. హ్యూమన్ హెల్త్ అధికారి డాక్టర్ అర్చన మాట్లాడుతూ.. శరీర ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్ హీట్‌కు పెరిగితే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలన్నారు. 60ఏళ్లు పైబడిన వృద్ధులు, చిన్నారులు, క్రీడాకారులు ఉపాధి కూలీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలని, వదులుగా ఉండే దుస్తులు ధరించాలని సూచించారు. తడిగుడ్డతో ఒళ్లంతా తుడిచి గాలి తగిలేలా చూడాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు వెళ్లకూడదన్నారు. దుర్గల్యాబ్ సీజ్ జిల్లా కేంద్రంలో అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్‌లను డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. అనుమతి లేని పాతబస్టాండ్ సమీపంలోని దుర్గ ల్యాబ్, జంబిగద్దెలోని కేర్ ల్యాబ్‌ను సీజ్ చేశారు. ఆస్పత్రులన్నీ అనుమతి తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. పంచాయతీ సిబ్బంది వేతనాలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలి జగిత్యాలరూరల్: గ్రామపంచాయతీ సిబ్బంది, కార్మికుల వేతనాలు బ్యాంక్ ఖాతాల్లో జమచేయాలని గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి పులి మల్లేశం అన్నారు. మంగళవారం జిల్లా ఇన్చార్జి డీపీవో మదన్మోహన్కు వినతిపత్రం సమర్పించారు. గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతినెలా గ్రీన్‌ఛానల్ ద్వారా 2025 జనవరి ఒకటి నుంచి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించిన విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీవో ట్రెజరీలో నిలిచిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భద్రతపై దృష్టి సారించాలని కోరారు. బడ్జెట్లో కార్మికుల వేతనాలకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బేర సంతోష్, సాతల్ల రాజేందర్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో -
కమనీయం నృసింహుని కల్యాణం
రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలోగల శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం కనులపండువగా నిర్వహించారు. ఆలయంలోని ఉ త్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం జరిపించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బోగ శ్రావణి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంజగిత్యాలటౌన్: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. వేదపండితులు తిగుళ్ల విషుశర్మ పర్యవేక్షణలో సంగనపట్ల నరేంద్రశర్మగాత్రంతో పా రాయణం ప్రారంభించారు. హనుమాన్ జ యంతి వరకు ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల దాకా పారాయణం కొనసాగుతుందని ఆలయవర్గాలు తెలిపాయి. ఆలయ కమిటీ ప్రతినిధులు బట్టు సుధాకర్, కొత్తపల్లి శ్రీనివాస్, అనంతుల ప్రేంకుమార్, కొత్తపల్లి నాగభూషణం, మానుక సంతోష్, బేతి కృష్ణారెడ్డి, ఎర్ర రంజిత్‌కుమార్, నూనె రాధాకృష్ణ, ముసిపట్ల లక్ష్మీనారాయణ, జైశెట్టి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పపల్లిలో నీటి కష్టాలుకథలాపూర్: మండలంలోని ఇప్పపల్లిలో నీటికష్టాలు ప్రారంభమయ్యాయి. నాలుగో వార్డులో బోరుబావిలో నీరు అడుగంటిపోవడంతో స్థానికులకు సరిపడా నీరు రావడం లేదు. దీంతో మంగళవారం నుంచి పంచాయతీ ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేశారని గ్రామస్తులు పేర్కొన్నారు. లింగ నిర్ధారణ నేరంజగిత్యాల: లింగ నిర్ధారణ నేరమని, ఎవరైనా పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటామని మాతా శిశు సంరక్షణాధికారి జైపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పలు స్కానింగ్ సెంటర్లను మంగళవారం తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్లో ఫారం ఎఫ్ నివేదికను ఆన్లైన్లో నమో దు చేయాలని ఆదేశించారు. ప్రతినెలా 5వ తేదీలోపు ఉండాలన్నారు. ఆయన వెంట డెకా యి ఆపరేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ సాయిసుధ, సఖీ కో–ఆర్డినేటర్ లావణ్య, అశ్విని, భూమేశ్వర్, తరాల శంకర్, రాజేశ్వరి ఉన్నారు. గోదావరిలో షవర్లు ఏర్పాటుధర్మపురి: రానున్న శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మపురి వద్దగల గోదావరిలో భక్తులు స్నానాలు చేసేందుకు షెవర్లు ఏర్పాటు చేశారు. మంగలిగడ్డ పుష్కరఘాట్ల వద్ద నీరు లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు స్నానాలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఆధ్వర్యంలో ఘాట్ల వద్దనే షవర్లను ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. -
వీడని ఉత్కంఠ
తేలని ఫలితంసాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్– ఆదిలాబాద్– మెదక్– నిజా మాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్‌లో బీజీపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధించారు. ఎవరూ నేరుగా కోటా ఓట్లు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆసక్తి నెల కొంది. మొత్తం చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఫలితం తేలనుంది. దీంతో ట్రయాంగిల్‌గా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. త్రిముఖ పోటీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా 56 మంది అభ్యర్థులు పోటీపడినా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు ముగ్గురు సుమారు లక్ష ఓట్లు, బరిలో నిలిచిన 53 మంది కలిపి కేవలం 10వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో మూడోస్థానంలో నిలిచే అభ్యర్థి ఎవరనేదానిపై ఎమ్మెల్సీ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరికీ దక్కని విన్నింగ్ కోటా ఓట్లు పోస్టల్ ఓట్లతో కలిసి మొత్తం 2,52,000 ఓట్లు పోలవగా, అందులో సుమారు 28 వేల ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. చెల్లనిఓట్లు పోగా మిగిలిన 2,24,000 ఓట్లలో సగం ఓట్లు.. అంటే.. 1,12,001 (సుమారు) ఓట్లను విన్నింగ్ కోటా ఓట్లుగా నిర్ధారించారు. పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి నేరుగా కోటా ఓట్లను సాధించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫలితం తేలేందుకు బుధవారం రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ప్రతీ రౌండ్లో బీజేపీకే ఆధిక్యం మొత్తం 21 టేబుళ్ల ద్వారా 12 రౌండల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిపై 36 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండోరౌండ్లో 1,457 ఓట్ల మెజార్టీ, మూడోరౌండ్లో 3,005 ఓట్లు, నాలుగో రౌండ్లో 1,263 ఓట్లు, ఐదోరౌండ్లో 1,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిపై 211 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 45,401 ఓట్లు సాధించి, ప్రత్యర్థులపై 6,931 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. 38,470 ఓట్లతో నరేందర్‌రెడ్డి సెకండ్ ప్లేస్‌లో, 3,1481 ఓట్లతో ప్రసన్నహరికృష్ణ మూడోస్థానంలో నిలిచారు. మందకొడిగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు తోడు పోటాపోటీగా అభ్యర్థులు ఓట్లు సాధిస్తుండటంతో రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ పెరుగుతోంది. రెండోప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ‘గ్రాడ్యుయేట్’ పోటీ త్రిముఖం కోటా ఓట్ల మార్కును చేరుకోని అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియతోనే తేలనున్న ఎమ్మెల్సీ ఫలితం ప్రస్తుతం ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికౌంటింగ్ వివరాలు మొత్తం ఓట్లు(పోస్టల్ ఓట్లతో కలిపి) 2,52,000 చెల్లని ఓట్లు : 28,000(11.01శాతం) చెల్లుబాటైనవి : 2,24,000 విన్నింగ్ కోటా ఓట్లు 1,12,001(సుమారు) బరిలో నిలిచిన అభ్యర్థులు : 56 -
విజయీభవ..
‘పది’లో శతశాతం దిశగా..● విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● ఈనెల 21 నుంచి పరీక్షలు ప్రారంభం ● జిల్లావ్యాప్తంగా 11,855 విద్యార్థులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి7వృద్ధుల సంక్షేమాన్ని విస్మరించొద్దుజగిత్యాలటౌన్: కని.. పెంచిన తల్లిదండ్రుల సంక్షేమాన్ని కొడుకులు విస్మరిస్తే చర్యలు తీసుకుంటామని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ మేరకు అసోసియేషన్‌కు బాధితులు సాతంశెట్టి కనకయ్య, వరమ్మ, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, మల్యాల కొడిమ్యాల మండలాలకు చెందిన పలువురు వృద్ధులు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లాకేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయానికి వారివారి కొడుకులు, కోడళ్లను పిలిపించి కౌన్సెలింగ్ చేపట్టారు. తల్లిదండ్రుల సంక్షేమాన్ని చూసేందుకు సమ్మతించిన వారితో ఒప్పందపత్రం రాయించుకున్నారు. హరి అశోక్‌కుమార్, గౌరిశెట్టి విశ్వనాథం, వెల్ముల ప్రకాశ్‌రావు, విఠల్, బైరి రాధ, విజయలక్ష్మి పాల్గొన్నారు. జగిత్యాల: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 22 వరకు కొనసాగనున్నాయి. జిల్లా ఇంటర్మీడియెట్ అధికారులు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, ఫ్యాన్లు, వైద్య సదుపాయాలు కల్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాల్సి ఉంటుంది. హాల్‌టికెట్లను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 28 కేంద్రాల్లో 14 సెంటర్లను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో.. ఒకటి మోడల్స్కూల్లో.. 13 ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే పరీక్షలు జరుగనున్నాయి. అధికారుల ఏర్పాట్లు పరీక్షల నిర్వహణకు 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 13 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. రెండు ఫ్లయింగ్‌స్క్వాడ్స్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నాయి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నారాయణ సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకావద్దని, భయాందోళన వీడి.. ప్రశ్నపత్రం క్షుణ్ణంగా చదివి జవాబులు రాయాలని సూచించారు. సందేహాలుంటే హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. మొత్తం పరీక్ష కేంద్రాలు 28మొత్తం విద్యార్థులు 14,450ఫస్టియర్ విద్యార్థులు 7,073సెకండియర్ విద్యార్థులు 7,377మంచి గ్రేడ్ సాధిస్తా.. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు నిమిషం నిబంధన లేదు హెల్ప్‌లైన్ నంబరు 94403 81255 -
విద్యుత్ సరఫరా మెరుగైంది
ఎక్కడికక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందుతోంది. గతంలో మాదిరిగా విద్యుత్ పంపిణీలో ఇబ్బందులు ఉండటం లేదు. లో–వోల్టేజి సమస్య ఉన్నట్లు చెప్పగానే.. కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తున్నారు. – నక్కల రవీందర్ రెడ్డి, రైతు, అంతర్గాం నాణ్యమైన విద్యుత్ అందించాలని.. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అవసరమైనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్ నష్టాలను వీలైనంత వరకు తగ్గిస్తున్నాం. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం జిల్లా, డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తున్నాం. – సాలీయానాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ -
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం వివిధ ఇంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్లతో సమీక్షించారు. ఈనెల ఐదోతేదీ నుంచి 25వరకు జరిగే పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో 28 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేశామని, మొబైల్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లను కేంద్రాల్లోకి అనుమతించబోమని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లత, నోడల్ అధికారి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
లోక్‌అదాలత్ వినియోగించుకోండి
ధర్మపురి: స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి శ్యామ్‌ప్రసాద్ తెలిపారు.ఽ ఈ మేరకు న్యాయవాదులతో సోమవారం సమావేశం అయ్యారు. వివిధ సమస్యలపై కోర్టులో నడుస్తున్న చిన్నపాటి కేసులపై కక్షిదారులు రాజీకి రావాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామడుగు రాజేశ్, ప్రధాన కార్యదర్శి బందెల రమేశ్, ట్రెజరర్ జాజాల రమేశ్, న్యాయవాదులు ఇమ్మడి శ్రీనివాస్, రమ్య, రాజు తదితరులున్నారు. డీఏవో రాంచందర్ సస్పెన్షన్జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా వ్యవసాయ అధి కారి రాంచందర్‌ను సస్పెండ్ చేస్తూ.. రాష్ట్ర వ్య వసాయ శాఖ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో వడ్డెపల్లి భాస్కర్‌ను నియమిస్తూ ఉ త్తర్వులు వెలువడ్డాయి. దీంతో భాస్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. భాస్కర్ గతంలో సిరిసిల్ల జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం నిర్మల్ ఏడీఏగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాలకు వచ్చారు. దుబ్బరాజన్న హుండీ ఆదాయం రూ. 22.56 లక్షలుసారంగాపూర్: మండలంలోని దుబ్బరాజన్నకు మహాశివరాత్రి జాతర, బ్రహ్మోత్సవాల ద్వారా వచ్చిన హుండి ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. మొత్తంగా రూ.22,56,619 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. అలాగే 27.27 గ్రాముల బంగారం, 9.340కిలోల మిశ్రమ వెండి వచ్చింది. దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ నాయిని సుప్రియ, డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమౌళి, ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకరయ్య, బొడ్డుపల్లి రాజన్న తదితరులు ఉన్నారు. దుబ్బరాజన్నకు ఏకాదశ పూర్వక రుద్రాభిషేకంసారంగాపూర్: మండలంలోని దుబ్బరాజన్న ఆలయంలో సోమవారం స్వామివారికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే మొదటి సోమవారం ఆలయాన్ని శుద్ధి చేస్తారు. స్వామివారికి అర్చకులు పంచామృతాలు, భస్మం, వివిధ పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, పాలతో గంటన్నర పాటు రుద్రాభిషేకం నిర్వహించారు. -
టీచర్స్‌లో కమలం పాగా
● తొలి ప్రాధాన్యంలోనే గెలిచిన మల్క కొమురయ్య ● కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల వడబోత ● నేటి మధ్యాహ్నానికి మొదలవనున్న లెక్కింపు ● మందకొడి లెక్కింపుపై అభ్యర్థుల మండిపాటు ● ఆర్వో, సిబ్బంది పనితీరుపై ఈసీకి సర్దార్ ఫిర్యాదు ● మల్క కొమురయ్యను అభినందించిన బండి సంజయ్ ● ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమన్న కేంద్ర సహాయ మంత్రిసాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ టీచర్ నియోజవర్గం కమలం వశమైంది. ముందు నుంచి అనుకున్నట్లుగా మల్క కొమురయ్య టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎగరేసుకుపోయారు. తొలిప్రాధాన్యం ఓట్లతోనే కొమురయ్య గెలవడం విశేషం. నల్గొండ టీచర్ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికే వచ్చేసినా.. కరీంనగర్ టీచర్ ఎన్నికల లెక్కింపు సాయంత్రానికి మొదలవడం గమనార్హం. అయినా కేవలం కౌంటింగ్ ప్రారంభించిన రెండు గంటల్లోనే ఫలితం తేలడం గమనార్హం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. కాగా 897 చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి కొమురయ్య చేరుకున్నారు. దీంతో తొలిరౌండ్లోనే బీజేపీ మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలిచినట్లయింది. గతంలో పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి టీచర్ సంఘాలు కాకుండా జాతీయ పార్టీ అయిన బీజేపీ పోటీ చేసి గెలవడం చర్చానీయాంశంగా మారింది. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ వడబోత.. సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వడపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓటర్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో రకరకాల ప్రచారాలు మొదలవడంతో రాత్రి ప్రకటించారు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.5 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం లెక్కింపు మొదలైనా.. తొలి ప్రాధాన్యంలో కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అందులో కోటా ఓట్లు చేరుకునే వరకు ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి. ఆర్వో, సిబ్బందిపై మండిపాటు గ్రాడ్యుయేట్, టీచర్లకు పోటీ పడిన పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), లెక్కింపు సిబ్బందిపై మండిపడ్డారు. లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రానికి నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలితం కొలిక్కి వచ్చినా.. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. కౌంటింగ్ నిర్వహణ సరిగా లేదని, ఓట్లలో జంబ్లింగ్ విధానం పాటించలేదని, బూత్‌ల (పలిమెల బూత్) వివరాల్లో గోప్యత పాటించకుండా బయటికి వెల్లడించారని ఆరోపిస్తూ ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. వీరితోపాటు అభ్యర్థులు విక్రంరెడ్డి, సిలివేరు శ్రీకాంత్ తదితరులు ఆర్వో తీరుపై మండిపడ్డారు. కౌంటింగ్‌లో పారదర్శకత లేదని, వెంటనే ఎన్నికలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీకి పోలైన ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. బండి అభినందనలురాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని కేంద్ర సహాయ మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5,900 ఓట్ల తేడాతో మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారు. ఇటీవల బడ్జెట్లో ఉద్యోగులకు రూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడంపై తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో బీజేపీ కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది. నాడు కేసీఆర్ మూర్ఖత్వపు పాలనకు వ్యతిరేకంగా టీచర్ ఎమ్మెల్సీగా ఏవీఎన్ రెడ్డిని గెలిపించారు. 317 జీవోపై బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలు, లాఠీచార్జ్ గుర్తుంచుకుని ఈనాడు మల్క కొమురయ్యను గెలిపించారు. తపస్ అంటే చిన్న సంస్థ అని హేళన చేసిన వారందరి చెంప చెళ్లుమన్పించేలా తీర్పు ఇచ్చారు’ అని అన్నారు. -
మెడికల్ కళాశాల భవనం పూర్తి చేయండి
‘రాళ్లవాగు’ను పరిశీలించిన ప్రభుత్వ విప్ కోరుట్ల: కోరుట్లలోని సీ.ప్రభాకర్ స్మారక గ్రంథాలయానికి తనవంతుగా పుస్తకాలు అందిస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గ్రంథాలయాన్ని సోమవారం సందర్శించారు. పుస్తకాలను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. గ్రంథాలయంలో పుస్తకాలు చదివి 18 మంది ఉద్యోగాలు సాధించారని నిర్వాహకులు ఎమ్మెల్యేకు తెలిపారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు అందిస్తానని పేర్కొన్నారు. గ్రంథాలయం గౌరవ అధ్యక్షుడు చెన్నా విశ్వనాథం, అధ్యక్షుడు రాస భూమయ్య, ఉపాధ్యక్షుడు సుతారి రాములు, ప్రధాన కార్యదర్శి గొడిక రాజు పాల్గొన్నారు. జగిత్యాల: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. సోమవారం హైదరాబాద్‌లో మెడికల్ కళాశాల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్రంలోనే ఫేజ్–1లో మెడికల్ కళాశాల మంజూరైందని, పనులు కొంతమేర జరిగాయని, బిల్లుల చెల్లింపు ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. కళాశాలలో బాలుర, బాలికల వసతి గృహాల పనులు జాప్యమవుతున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన క్రిటికల్ కేర్యూనిట్కు అవసరమైన సామగ్రిని త్వరితగతిన అందించాలని విజ్ఞప్తి చేశారు. కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట శివారులోగల రాళ్లవాగు ప్రాజెక్టును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం పరిశీలించారు. కుడికాలువను సీసీతో నిర్మిస్తే భూషణరావుపేట, కథలాపూర్, ఊట్‌పెల్లి గ్రామాల పరిధిలోని భూములకు నీరందుతుందని రైతులు విప్‌కు విన్నవించారు. శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు కాయితి నాగరాజు, చెదలు సత్యనారాయణ, స్వామిరెడ్డి, గడ్డం చిన్నారెడ్డి, తలారి మోహన్, అశోక్ పాల్గొన్నారు. గ్రంథాలయానికి పుస్తకాలు సమకూరుస్తా -
విద్యుత్ లోడ్ ‘నియంత్రికలు’
● జిల్లాలో 23,862 ట్రాన్స్ఫార్మర్లు ● ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్న విద్యుత్‌శాఖ ● లోడ్ ఉన్న చోట అదనపు ట్రాన్స్ఫార్మర్ల బిగింపుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వ్యవసాయం, గృహ, పరిశ్రమల అవసరాలకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేసేందుకు విద్యుత్‌శాఖ ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఆ మేరకు విద్యుత్ సరఫరాలో నష్టాన్ని నివారించడం, లోవోల్టోజి సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో అధిక లోడ్‌ను నియంత్రించేందుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 23,862 ట్రాన్స్ఫార్మర్లు జిల్లాలో 23,862 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా.. అవసరమైన చోట మరిన్ని ట్రాన్స్ఫార్మర్లను బిగిస్తున్నారు. జిల్లాలో లోడ్‌ను బట్టి 500 కేవీ, 400 కేవీ, 315కేవీ, 250కేవీ, 200కేవీ, 160కేవీ, 100 కేవీ, 75కేవీ, 63కేవీ, 50కేవీ, 40కేవీ, 25కేవీ, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఎనిమిది విద్యుత్ సబ్ డివిజన్లు ఉండగా.. వాటి పరిధిలో 35 విద్యుత్ సెక్షన్లు ఉన్నాయి. జగిత్యాల టౌన్ సబ్ డివిజన్ పరిధిలో 2,436, జగిత్యాల రూరల్ సబ్ డివిజన్ పరిధిలో 3,313, ధర్మపురి సబ్ డివిజన్ పరిధిలో 3,255, మల్యాల సబ్ డివిజన్ పరిధిలో 2,208, గొల్లపల్లి సబ్ డివిజన్ పరిధిలో 2,030, మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో 1,589, మల్లాపూర్ సబ్ డివిజన్ పరిధిలో 3,268, కోరుట్ల టౌన్ సబ్ డివిజన్ పరిధిలో 1,813, కోరుట్ల రూరల్ సబ్ డివిజన్ పరిధిలో 3,950 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటి ద్వారా 45వేల ఎల్టీ ఫీడర్ల ద్వారా ఇళ్లు, వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా అవుతోంది. రోజుకు 3.5 నుంచి 4 మిలియన్ యూనిట్ల వరకు సరఫరా అవుతోంది. ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ పోయినా.. విద్యుత్ సరఫరా నిలిచినా.. రైతులు ట్రాన్స్ఫార్మర్లపైకి ఎక్కి ప్రయోగాలు చేయవద్దని, విద్యుత్ సిబ్బంది, అధికారులకు సమాచారం ఇవ్వాలని పంచాయతీ బోర్డులపై విద్యుత్ సిబ్బంది సెల్‌ఫోన్ నంబర్లు రాయించారు. కంట్రోల్ రూం నంబర్లను కూడా ప్రదర్శిస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం.. ప్రస్తుతం గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో సరఫరాలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేసి కొత్తగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంతోపాటు.. ఇప్పటికే అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు నియంత్రికలను అమర్చుతున్నారు. వేసవికాలం కావడం.. విద్యుత్‌కు డిమాండ్ పెరగడంతో.. వ్యవసాయానికి ఇచ్చే త్రీఫేజ్ విద్యుత్‌లో ఇబ్బందులు రాకుండా అధిక లోడ్‌ను భరించే ట్రాన్స్ఫార్మర్లను బిగిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ లోడ్‌ను బట్టి విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు గమనించాలని సూచించారు. మల్లన్నస్వామి దయతోనే పథకాలువెల్గటూర్: మల్లికార్జునస్వామి దయతో ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని పైడిపల్లి గ్రామంలో నిర్వహించిన మల్లికార్జుస్వామి శివ పంచాయతన, నవగ్రహ, శ్రీకూర్మ ధ్వజ, శిఖర యంత్ర శిలావిగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, ధర్మపురి నియోజకవర్గ ప్రజలపై స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ గంగుల నగేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్, శివస్వాములు, యాదవ సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేశభద్రతకు ముందుండాలిజగిత్యాలటౌన్: దేశభద్రతకు సమతా సైనికులు ముందుండాలని సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు కాయితి శంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సమతా సైనిక్‌దళ్ శిక్షణతరగతుల కరపత్రాన్ని జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. జాతి, మతం, కులాలకు తావు లేకుండా సామాజిక న్యాయం, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం వారిని చైతన్య పరిచేందుకు.. రాజ్యాంగ రక్షణకు సమతా సైనిక్ దళ్ కృషి చేస్తుందన్నారు. యువత మత్తు బారిన పడకుండా అవగాహన కల్పిస్తూ వారిలో దేశభక్తిని పెంపొందిస్తూ భావిబారత పౌరులుగా తయా రు చేయడమే లక్ష్యమన్నారు. ఈనెల 8, 9 తేదీ ల్లో కోరుట్ల పట్టణంలో నిర్వహించే శిక్షణ శిబి రంలో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పా ల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి మెట్టు దాస్, మాలమహానా డు జిల్లా అధ్యక్షుడు మ్యాదరి శ్రీహరి, డీఎస్ ఎస్ నాయకులు తక్కల దేవయ్య, మద్దెల నారాయణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఖర్బూజ తోటలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జగిత్యాలఅగ్రికల్చర్: ఎప్పుడూ కోర్టులో కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులతో బిజీగా ఉండే జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ ఆదివారం పొలంబాట పట్టారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల–కోనాపూర్‌లో బండారి వెంకటేశ్, విజయ దంపతులు సాగుచేస్తున్న ఖర్బూజ(పుచ్చకాయ) తోటను సందర్శించారు. ఖర్బూజలో పసుపుపచ్చ రకాన్ని చూసి జడ్జి ఆనందం వ్యక్తం చేశారు. రైతు దంపతులతో కలిసి రెండుగంటలపాటు తోటలో తిరుగుతూ.. సాగు విధానాన్ని పరిశీలించారు. విత్తనాలు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు..? మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడిన శ్రీపాదరావుజగిత్యాలటౌన్: రాజకీయ జీవితంలో శ్రీపాదరావు అపారమైన కీర్తి ప్రతిష్టలు గడించారని, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్‌గా ప్రజాస్వామ్య విలువలు కాపాడిన గొప్ప నాయకుడని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, జిల్లా సంక్షేమ అధికారి నరేశ్, సిరిసిల్ల శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వరి పొలాల సందర్శనజగిత్యాలఅగ్రికల్చర్: వరి సాగును సాధారణంగా డిసెంబర్ మొదటివారంలో నార్లు పోసి.. నాటు వేసి, ఏప్రిల్‌లో పంటను కోస్తుంటారు. అయితే కొడిమ్యాల మండలం గౌరాపూర్ రైతులు మాత్రం అక్టోబర్‌లో సాగు ప్రారంభించి, మార్చి మొదటి వారంలో వరి సీజన్‌ను ముగిస్తున్నారు. ఆ మండలంలో నీటి ఎద్దడి ఎక్కువ కావడంతో నీరు అందక పంటలు ఎండుతుంటాయి. ఈ క్రమంలో కొందరు రైతులు ప్రైవేట్ కంపెనీల విత్తనాలను సాగు చేస్తున్నారు. ఆ పంటలను వ్యవసాయ వర్సిటీ మాజీ సలహా మండలి సభ్యుడు పూడూరు రాంరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు సందర్శించారు. పంట తీరును పరిశీలించారు. -
రాయికల్ బల్దియాలో సమస్యల దరువు
● ఏడాదిలో ఐదుగురు కమిషనర్లు బదిలీ ● పేరుకుపోతున్న పారిశుధ్యం ● ఎక్కడిక్కడ నిలుస్తున్న మురుగునీరు ● స్వైరవిహారం చేస్తున్న దోమలు ● నూతన కమిషనర్‌పైనే ఆశలురాయికల్: రాయికల్ పేరుకే మున్సిపాలిటీ. కానీ.. బల్దియా స్థాయిలో వసతులు మాత్రం మచ్చుకై నా కనిపించవు. ఫలితంగా పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చడంతో పట్టణం ప్రగతిపథంలో దూసుకెళ్తుందని, సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఏడాది వ్యవధిలో ఐదుగురు కమిషనర్లు బదిలీ అవుతూ వస్తున్నారు. మరోవైపు పాలకవర్గ పదవీకాలం ముగియడంతో పట్టణ సమస్యలు కమిషనర్‌కు స్వాగతం పలుకుతున్నాయి. సమస్యలివే.. బల్దియాలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ప్రతివార్డులోని కాలనీలు అపరిశుభ్రంగా మారాయి. ఇళ్ల మధ్య నుంచి డ్రైనేజీలు ఉండడంతో మురికి నీరు సక్రమంగా ముందుకు ప్రవహించక దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే బల్దియాలోని శివాలయం వీధి, చెన్నకేశవనాథనగర్కాలనీ జలమయం అవుతున్నాయి. చెత్త సేకరించేందుకు ఉన్న వాహనాలు కూడా మరమ్మతుకు గురయ్యాయి. పారిశుధ్య సిబ్బంది సరిపడా లేకపోవడంతో చెత్త సేకరణ సక్రమంగా సాగడం లేదు. ఇందిరనగర్ కాలనీలో ఏళ్ల తరబడి తాగునీటి ఎద్దడితో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బల్దియాలోని మాదిగకుంట స్థలంలో ఇరువైపులా కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. క్రమంగా మాదిగకుంటను కబ్జా చేస్తున్నారు. బల్దియాలో సమీకృత మార్కెట్ లేకపోవడంతో రోడ్డుపైనే వారసంత నిర్వహిస్తున్నారు. వారసంతలోంచే ద్విచక్ర వాహనాలు, ఇతరత్రా వాహనాలు వెళ్లడంతో వారసంతలోని వర్తక వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాతబస్టాండ్, గాంధీచౌక్, శివాజీచౌక్ వద్ద ప్రయాణీకుల కోసం సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వారు దాహర్తిని తీర్చుకోలేకపోతున్నారు. పాతబస్టాండ్‌లో మూత్రశాలలు లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. బల్దియాలో కేవలం ఒకే ఒక ఓపెన్ జిమ్ ఉండటంతో కొంతమందికే పరిమితమవుతోంది. మరో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరుతున్నారు. ఏడాదిలో ఐదుగురు కమిషనర్లు బదిలీ: గతేడాది ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ దృష్ట్యా బదిలీల్లో అప్పటి ఇన్చార్జి కమిషనర్ ఎంపీడీవో సంతోష్ కుమార్ భీంగల్‌కు.. మెట్పల్లిలో విధులు నిర్వహిస్తున్న జగదీశ్వర్‌గౌడ్‌ను రాయికల్‌కు కమిషనర్‌గా బదిలీ చేశారు. జూలైలో జగదీశ్వర్‌గౌడ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ సమయంలో స్థానిక ఎంపీడీవో చిరంజీవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆగస్టులో జగదీశ్వర్‌గౌడ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి విధుల్లో చేరారు. రెండు నెలల క్రితం జగదీశ్వర్‌ను నిర్మల్ మున్సిపాలిటీకి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఖమర్ అహ్మద్‌ని రాయికల్‌కు బదిలీచేశారు. కానీ ఆయన విధుల్లో చేరలేదు. దాదాపు పది రోజుల అనంతరం రాయికల్ మున్సిపల్లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.వెంకటికి ఇన్చార్జి కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో గతనెల 25న ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ మనోహర్‌ను రాయికల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇలా ఏడాదికాలంలో ఐదు గురు కమిషనర్లు మారడంతో పట్టణంలో పలు ముఖ్యమైన అంశాలపై తగిన పురోగతి లేదని ప్రజలు వాపోతున్నారు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి బల్దియాలో పారిశుధ్యం, వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. వేసవి కాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. పట్టణవాసులకు ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా దృష్టికి తీసుకురావచ్చు. – మనోహర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ -
● గతంలో 39.99 లక్షల పని దినాలు ● వచ్చే సంవత్సరం 37.85 లక్షల రోజులే ● 380 గ్రామపంచాయతీల్లో పనులు ● సదుపాయాల కల్పన.. కూలీలకు ఉపాధి
జగిత్యాల: గ్రామీణప్రాంతాల్లో వలసలు నియంత్రించేందుకు 20ఏళ్ల క్రితం అప్పటి కేంద్రప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటినుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దీనిద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో సమావేశాలు నిర్వహించి ఏటా ప్రణాళిక ప్రకారం పనులు చేపడుతున్నారు. ఈ ఏడాది 2025–26కు కూడా ప్రణాళిక రూపొందించారు. జిల్లావ్యాప్తంగా 37.85 లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని 20 మండలాల్లో రూ.82.3 కోట్ల వ్యయంతో 37.85 లక్షల పనిదినాలు కల్పించనున్నారు. కూలీలకు రోజుకు రూ.300 గిట్టుబాటు అయ్యేలా చూశారు. ప్రతిపాదించిన నిధుల్లో కూలీలు చేసిన పనులకు అధిక వ్యయం అవసరం కాగా మెటిరియల్ కాంపోనెంట్ కింద స్వల్ప నిధుల వ్యయం అయ్యేలా ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామసభలు నిర్వహించి పనులు చేపట్టనున్నారు. జలసంరక్షణకే ప్రాధాన్యత.. వేసవికాలం ఉపాధిహామీ పథకంలో ముఖ్యంగా భూగర్బజలాలు పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిచోటా ఇంకుడు గుంతలు, వాటర్‌షెడ్స్, చెక్‌డ్యామ్స్, పంట కాలువలు, నీటి కుంటలు, చెరువుల్లో పూడికతీత, అడవుల్లో కాంటూర్ కందకాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పొలాలకు అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. తగ్గిన పనిదినాలు గతేడాది జిల్లాలో 39.99 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 35.91 లక్షల రోజులు పని కల్పించారు. ఆర్థిక సంవత్సరానికి మరో నెల గడువు ఉన్నందున ఆ లోపు లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే రానున్న ఆర్థిక సంవత్సరంలో మాత్రం కేవలం 37.85 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించనున్నారు. ఈ సారి కూలీలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ పనిదినాలు తక్కువ కావడంతో అధికారులు ఏ విధంగా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కూలీలకు ఈసారి ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ప్రకటించడం తెలిసిందే. ఇందులో కనీసం నెల రోజుల పాటు ఉపాధి పనులకు వెళ్లిన కూలీలను అర్హులుగా గుర్తించే అవకాశం ఉంది. దీంతో జాబ్‌కార్డు కలిగి ఉండి ఇప్పటి వరకు పనులకు వెళ్లని వారు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో ఈసారి ఉపాధి పనులకు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. కానీ గత సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనిదినాలు తక్కువ చేశారు. పెంచాల్సిన పనిదినాలను అధికారులు తగ్గించడంతో ఈసారి కూలీలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని పనిదినాలు కల్పించాలని డిమాండ్ వస్తోంది. రైతు భరోసా వస్తుందనే ఉద్దేశంతో చాలామంది జాబ్‌కార్డులు ఉన్నవారు ఈసారి ప్రతిఒక్కరూ పనులకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఉపాధి కల్పనతోపాటు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రానుంది. ఉపాధిహామీ కూలీలు ఏడాది 2024–25 2025–26 పనిదినాలు 39.99 లక్షలు 37.85లక్షలు పూర్తయినవి 35.92 లక్షలు జాబ్‌కార్డ్స్ ఉన్నవారు 1,05,713 కూలీలు 1,46,477 మండలాలు : 20 గ్రామపంచాయతీలు : 380 -
గెలుపెవరిదో..
● చెల్లుబాటు ఓట్లలో సగం మెజారిటీ సాధిస్తేనే విజయం ● లేకపోతే అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు ● ప్రతిరౌండ్‌లోనూ ఎగ్జాస్టెడ్, సబ్ పార్సిల్ ఓట్లు కీలకం ● ఎలిమినేటెడ్ అభ్యర్థి తొలి ప్రాధాన్య ఓట్లు తీసివేత ● మిగిలిన సబ్ పార్సిల్ ఓట్లు అభ్యర్థులకు బదిలీ ● విజయంపై స్పష్టత వచ్చేవరకూ కొనసాగనున్న కౌంటింగ్ ● సాయంత్రానికి ‘టీచర్’ ఫలితం.. పట్టభద్రుల ఫలితానికి రెండు రోజులు?సబ్ పార్సిల్ ఓట్లు కీలకంసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్– ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం మొదలు కానుంది. కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాలకు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో ఒక మైక్రోఅబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. ఆదివారం మాక్ కౌంటింగ్‌ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఫార్ములా ఆధారంగా కోటా నిర్ధారణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటయ్యే ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ముందుగా కోటాను నిర్ధారించాల్సి ఉంటుంది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి చెల్లుబాటయ్యే ఓట్ల లెక్క తేలుస్తారు. మొత్తం చెల్లబాటయ్యే ఓట్లలో 50 శాతం లెక్కగడతారు. 50శాతానికంటే ఒక్క ఓటు ఎక్కువగా సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ముందుగా ఓట్లను కట్టలు కడతారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ఒక్కొక్కరికి ఒక డబ్బా కేటాయించి వారు పొందిన ఓట్లను ఆ డబ్బాల్లో వేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కగడతారు. సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. కానీ.. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందుకోసం ఒక ఫార్ములా వాడతారు. అదేంటంటే.. కోటా = మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు డివైడెడ్బై సీట్ల సంఖ్య ప్లస్ వన్ ఓల్ ప్లస్ వన్ అన్న సూత్రం ఆధారంగా ఓట్ల లెక్కింపు చేపడతారు. (ఉదాహరణకు: మొత్తం రెండు వేల ఓట్లు పోలైతే వాటిలో 1800 ఓట్లు చెల్లుబాటు ఐతే 901 ఓట్లు సాధించిన వ్యక్తి విజయం సాధిస్తారు.) తొలుత తొలి ప్రాధాన్యం ఓట్లను అభ్యర్థుల వారీగా పంచుతారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థి 901 ఓట్ల కోటాను చేరుకోకపోతే ఆప్పుడు రెండో రౌండ్‌కు లెక్కింపు ప్రక్రియ వెళ్తుంది. ● రెండో రౌండ్ అంటే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి రౌండ్లో అందరి కంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిని రెండో రౌండ్లో తప్పిస్తారు. ఇక్కడ ఓటింగ్ సరళిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో రెండు రకాలుగా ఓట్లను విభజిస్తారు. ఓటర్లు రెండు రకాలుగా ఓట్లు వేస్తారు. ఒకటి కేవలం తొలి ప్రాధాన్యం ఓట్లు మాత్రమే వేసేవారు. ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యాలు ఇచ్చేవారు. తొలిరౌండ్లో తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తికి తొలి ప్రాధాన్యం మాత్రమే వచ్చిన ఓట్లను ఎగ్జాస్టెడ్ ఓట్లుగా పరిగణించి వాటిని తప్పిస్తారు. మిగిలిన రెండో రౌండ్ ప్రాధాన్యం ఓట్లను (సబ్ పార్సిల్ ఓట్లు) అభ్యర్థులకు పంచుతారు. అలా ఫార్ములా ప్రకారం.. ఏ రౌండ్లో అయితే చెల్లుబాటు అయిన ఓట్లలో ఒక అభ్యర్థికి సగం ఓట్లు వచ్చేంత వరకు రౌండ్లు (ఎలిమినేషన్) ప్రక్రియ సాగుతుంది. అప్పుడే విజేతను ప్రకటిస్తారు. లెక్కింపు గణాంకాలువేదిక: అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పోలైన ఓట్లు : 2,50,106 టీచర్స్‌లో పోలైన ఓట్లు: 24,895 మొత్తం టేబుళ్లు: 35 పట్టభద్రుల టేబుళ్లు : 21 టీచర్ల టేబుళ్లు : 14 లెక్కింపు సిబ్బంది: 800 రిజర్వ్ స్టాఫ్: 20 శాతంఎలా లెక్కిస్తారంటే? కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 3,55,159 మంది ఓటర్లుండగా.. గతనెల 27న జరిగిన ఎన్నికల్లో 2,50,106 మంది (70.42 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీచర్ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓట్లు ఉండగా.. 24,895 మంది (91.90 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తక్కువ ఓట్లు ఉన్న నేపథ్యంలో టీచర్ స్థానం ఫలితం సాయంత్రానికి వెలువడనుంది. అధిక ఓటర్లున్న గ్రాడ్యుయేట్ స్థానం కనీసం రెండు రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో సందర్భంలో మూడో రోజుకు చేరినా ఆశ్చర్యం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.400 మంది పోలీసుల బందోబస్తు కరీంనగర్‌క్రైం: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సోమవారం 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అంబేడ్కర్ స్టేడియంలో జరిగే ఈ ప్రక్రియలో ఒక అడిషనల్ డీసీపీ, ఆరుగురు ఏసీపీలు, 18 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌటింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు అంబేడ్కర్ స్టేడియంలోని గేట్ నంబర్– 1 నుంచి ప్రవేశించి నిర్దేశించబడిన ప్రదేశంలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. గేట్ నంబర్– 4 ద్వారా అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులోకి అనుమతించబడునని పోలీసులు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లుగా వచ్చే వారికి కరీంనగర్ కలెక్టరేట్ గేట్ నంబర్– 2 ద్వారా అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు నిరంతర విద్యుత్ సరఫరా
జగిత్యాలఅగ్రికల్చర్/మల్లాపూర్: ఇంటర్ పరీక్షలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియానాయక్ అన్నారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్‌లో నూతనంగా 11 కేవీ బ్రేకర్‌ను శనివారం ప్రారంభించారు. చాలా సబ్స్టేషన్లలో 11 కేవీ ఫీడర్ బ్రేకర్‌పై రెండు కంటే ఎక్కువ ఫీడర్లు ఉన్నాయని, ఏదైనా ఫీడర్లో అంతరాయం ఏర్పడితే విద్యుత్ ట్రిప్ అవుతోందని, ఈ సమస్యను అధిగమించేందుకు జిల్లావ్యాప్తంగా రూ.4.25కోట్లతో 65 వీసీబీల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 15 బ్రేకర్లు పూర్తయ్యాయని, మిగిలినవి వచ్చేనెల 15లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అనంతరం అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు సిబ్బంది స్థానికంగా ఉండాలన్నారు. సమస్య తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని ప్రజ లకు సూచించారు. మెట్పలిల డీఈ గంగారాం, ఏడీఈ మనోహార్, డీఈ ఎంఆర్టీ రవీందర్, ఏఈ సంతోష్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియా నాయక్ -
ఉపయోగాలు.. జాగ్రత్తలు
● ఈత కొట్టడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడి ఆకలి వేస్తుంది. రక్తపోటు, షుగర్ నియంత్రణలో ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులు, రక్తప్రసరణ, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ● ఆస్తమా ఉన్నవారు, సర్జరీ అయినవారు, చర్మవ్యాధులతో బాధపడుతున్నవారు, అవయవ మార్పిడి చేసుకున్న వారు ఈతకు దూరంగా ఉండాలి. ● కొత్తగా ఈత నేర్చుకునేవారు లోతైన ప్రదేశాలకు వెళ్లకూడదు. ట్యూబ్, బుర్రకాయ, వాటర్ ప్లాస్టిక్క్యాన్లతో పెద్దవారి పర్యవేక్షణలో ఈత నేర్చుకోవాలి. ● ప్రత్యేక శిక్షణ పొందిన స్విమ్మర్ల వద్ద ఈత నేర్చుకోవాలి. బావులు, చెరువులు, కుంటల వద్దకు పిల్లలను ఒంటరిగా పంపొద్దు. 3ఫీట్లలోతు నీటిలో ఈత నేర్పడం ఉత్తమం. పూర్తిగా నేర్చుకున్నాక 8ఫీట్ల లోతులో ఈదొచ్చు. -
ధర్మపురి అభివృద్ధి పనులపై సీఎంకు వినతి
ధర్మపురి: ధర్మపురి అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శనివారం వినతిపత్రం సమర్పించారు. శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గోదావరిలో కలుస్తున్న కలుషిత నీటి ఫిల్టర్ కోసం రూ.17 కోట్లు అవసరమని పేర్కొన్నారు. డిగ్రీ, ఐటీఐ కళాశాల ఏర్పాటు, రానున్న పుష్కరాలకు, పట్టణ ప్రజలకు శాశ్వత మంచినీటి సౌకర్యానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నవోదయ గురుకులం ధర్మపురిలోనే ఉండేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. -
కొలనులో చేపలమవుదాం
● ఈతతో ఆరోగ్యానికి ఊతం ● పలు వ్యాధులకు ఔషధం ● చిన్నారుల్లో పెరుగుతున్న ఆసక్తి ● సమ్మర్‌కు ముందే కొలనుల్లో సందడి ● ఎండలు ముదిరితే.. మరింత రద్దీకరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్ టౌన్: ఈత.. ఆరోగ్యానికి ఊతం. శరీరానికి చక్కటి వ్యాయామం. ఈత నేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు. దీంతో చాలామంది తల్లిదండ్రులు సమ్మర్ వచ్చిందే చాలు తమ పిల్లలను సమీపంలోని కొలనులు, చెరువులు, బావు ల వద్దకు తీసుకెళ్లి ఈత నేర్పిస్తున్నారు. ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ఈత కొలనులు అందుబాటులో ఉంచి శిక్షణ ఇస్తున్నాయి. పలు ప్రభుత్వ మైదానాల్లోని స్విమ్మింగ్పూల్స్లోనూ ఈత నేర్పిస్తున్నారు. సమ్మర్ సమీపిస్తోంది. ఎండలు ముదురుతుండడంతో ఉపశమనం కోసం ఈతకు వెళ్తున్నారు. పలు స్విమ్మిగ్పూల్స్లో ఇప్పుడే సందడి కనిపిస్తుండగా.. మరో పక్షం రోజుల తరువాత అన్ని ప్రాంతాల్లోని కొలనులు ఈత నేర్చుకునేందుకు వచ్చేవారితో నిండిపోనున్నాయి. ఈ సందర్భంగా ఈత.. రకాలు.. ఉపయోగాలు.. జాగ్రత్తతో ప్రత్యేక కథనం.ఉమ్మడి జిల్లాలో స్విమ్మింగ్ పూల్స్జిల్లా ప్రభుత్వ ప్రైవేటు కరీంనగర్ 02 05 జగిత్యాల 01 01 పెద్దపల్లి 02 06 సిరిసిల్ల 01 05 -
అక్కపల్లి రాజన్న హుండీ ఆదాయం రూ.4.40లక్షలు
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీఅక్కపల్లి రాజరాజేశ్వర స్వా మి ఆలయంలో హుండీ లెక్కింపు ను శనివారం చేపట్టారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వా మివారికి మొత్తం రూ.4,40,893 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. హుండీ ద్వారా రూ.1,98,319, కల్యాణం టికెట్ల ద్వారా రూ.1,82,000, ఇతర టికెట్ల ద్వారా రూ. 60,574, విదేశీనోట్లు 11 సమకూరినట్లు తెలిపారు. లెక్కింపులో దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రాజమౌళి, ఆలయ చైర్మన్ సీపతి సత్యనారాయణ, సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్, అర్చకులు తదితరులున్నారు. -
సమస్య ఎక్కడుంది..?
● నీటి సమస్యకు చెక్ ● తనిఖీ చేస్తున్న సర్వే బృందం ● లీకేజీలు, పైప్లైన్లు, బోర్లను గుర్తిస్తున్న అధికారులు ● బల్దియాల్లో కొనసాగుతున్న ప్రక్రియజగిత్యాల: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీల్లో ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేపడుతున్నారు. ఎక్కడ నీటి సమస్యలున్నా వాటిని గుర్తించి పరిష్కరించేలా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో సర్వే బృందం గుర్తిస్తోంది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఎక్కడెక్కడ నీటి సమస్యలున్నాయో గుర్తించేలా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందించిన అనంతరం సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు. బృందంలో మున్సిపల్ కమిషనర్లతోపాటు ఏఈ, వార్డు సిబ్బంది ఉన్నారు. వీరు పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందించాల్సి ఉంటుంది. సమస్యకు చెక్‌పడేనా..? మున్సిపాలిటీల్లో నీటి సమస్యలు అనేకం ఉన్నాయి. గతంలో మిషన్ భగీరథ పైప్లైన్లు ఇంటింటికీ వేశారు. అయితే ప్రధాన పైప్‌లైన్‌కే లీకేజీలు ఉన్నాయి. గల్లీకో లీకేజీ ఏర్పడుతోంది. మిషన్‌భగీరథ రాకముందు వేసిన పైప్లైన్లకూ లీకేజీలు ఉన్నాయి. ఫలింగా మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పెను ప్రమాదంగా మారుతోంది. లీకేజీలతో ప్రజలకు నీటి సరఫరాలో ఇబ్బంది కలగడంతోపాటు, చాలాచోట్ల బోర్లకు హ్యాండ్లు చెడిపోయాయి. వాటికీ మరమ్మతు చేపట్టడం లేదు. జగిత్యాలలో ప్రధాన ఫిల్టర్‌బెడ్ నుంచి నాలుగు ట్యాంక్‌లకు నీటి సరఫరా అవుతుంది. ఫిల్టర్‌బెడ్ నుంచి వచ్చే పైపులకు అనేకచోట్ల లీకేజీలు ఉన్నాయి. వేల లీటర్ల నీరు వృథాగా పోతోంది. మున్సిపల్ ఏర్పడినప్పటి పైప్‌లైన్ కావడంతో అరికట్టలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథతో అస్తవ్యస్తం ఇంటింటికీ నీరు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. పైప్‌లైన్ కోసం ప్రతిచోట తవ్వడం, తవ్విన చోట సక్రమంగా పూడ్చకపోవడం, పాత లైన్ పూర్తిగా పగిలిపోవడం జరిగింది. దీంతో నీరంతా వృథాగా పోతోంది. ప్రతి కాలనీలో రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. కనీసం మిషన్ భగీరథ పైప్‌లైన్ కన్నా మంచినీటి సరఫరా ఇస్తే ఇబ్బందులు ఉండవని పట్టణవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ నీరును పాత పైప్‌లైన్ ద్వారానే అందిస్తున్నారు. అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
మాదిగ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
జగిత్యాలటౌన్: ఎస్సీ వర్గీకరణ పోరులో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాంమాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో అమరుల చిత్రపటాలకు ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు నివాళి అర్పించారు. మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవం, భావి తరాల భవిష్యత్తు కోసం సమానత్వపు పోరులో తమ ప్రాణాలు కోల్పోయినవారి త్యాగాలు, ఉద్యమ స్పూర్తి వెలకట్టలేనివన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జాతి అభ్యున్నతికి శ్రమిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నురుగు శ్రీనివాస్, ఎంఎస్పీ జిల్లా నాయకులు బెజ్జంకి సతీశ్, మోకినపెల్లి సతీశ్, బోనగిరి కిషన్, దుమాల రాజ్‌కుమార్, బిరుదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జనరిక్ ఔషధాలు వినియోగించుకోవాలి
జగిత్యాల: ప్రజలు జనరిక్ ఔషధాలు వినియోగించుకోవాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శనివారం ప్రధానమంత్రి జన ఔషధి పరియోజనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన మందులను తక్కువ ధరలో అందించేందుకు ప్రధానమంత్రి జన ఔషధి ద్వారా జనరిక్ మందులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. డయాబెటిస్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు ఇందులో తక్కువ ధరలకు లభిస్తాయని తెలిపారు. ఏఎంవో సత్యనారాయణ, శ్రీధర్, హెల్త్ ఎడ్యుకేటర్స్ భూమేశ్వర్, శంకర్ పాల్గొన్నారు. గోదాంను సందర్శించిన డీసీవోధర్మపురి: మండలంలోని నేరెల్లలోగల గోదాంను శనివారం జిల్లా సహకార సంఘం అధికారి మనోజ్‌కుమార్ సందర్శించారు. గోదాంలో నిల్వ ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు. రైతులకు యూరియా బస్తాల కొరత లేకుండా చూస్తామని అన్నారు. యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలుంటాయని హెచ్చరించారు. రైతుల పట్టా పాస్ పుస్తకాల ఆధారంగా పారదర్శకంగా పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు రైతు సంఘం అధ్యక్షుడు జాజాల రమేశ్, సీఈవో రాజేష్, ఏఈవో నవ్య, రైతులు తదితరులున్నారు. -
లోక్ అదాలత్‌కు పోలీసుల సహకారం అవసరం
జగిత్యాలజోన్: ఈనెల 8న జరిగే లోక్ అదాలత్‌కు పోలీసులు సహకరించాలని జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ అన్నారు. జిల్లా కోర్టులో న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోక్‌అదాలత్‌పై పోలీసులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్జి నారాయణ మాట్లాడుతూ రాజీకి అనుకూలమైన కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునేలా చూడాలని కోరారు. లోక్‌అదాలత్‌లో క్రిమినల్ కేసులతోపాటు సివిల్ కేసులను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి సుబ్రహ్మణ్యశర్మ మాట్లాడుతూ కేసులను రాజీ చేసుకోవడం ద్వారా కక్షిదారులకు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ రఘుంచందర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలిఇబ్రహీంపట్నం: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాము అన్నారు. మండలంలోని గోధూర్, ఇ బ్రహీంపట్నం మోడల్ స్కూళ్లలో ఏర్పాటు చేసి న పరీక్షకేంద్రాలను శనివారం పరిశీలించారు. కేంద్రాల్లో వసతులు పరిశీలించారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి భయపడకుండా పరీక్షలు రాయాలని సూచించారు. తిమ్మాపూర్ హైస్కూల్లో వసతులు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈవో మధు, ఉపాధ్యాయులు ఉన్నారు. కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి కథలాపూర్: పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఈవో సూచించారు. మండలంలోని గంభీర్పూర్, అంబారిపేట, కథలాపూర్ జెడ్పీ హైస్కూల్, మోడల్ స్కూల్ కేంద్రాలను పరిశీలించారు. సీసీ కెమెరాలను త్వరగా బిగించాలన్నారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాస్, మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ అనిత, ఉపాధ్యాయులు ఉన్నారు. ‘నక్ష’ సన్నాహక సర్వే ప్రారంభంజగిత్యాల: భూమి, భవనాలకు పక్కాగా లెక్క ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం నక్ష కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రంలో సర్వే కూడా చేపట్టారు. అయితే ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. కోడ్ ముగియడంతో శనివారం సన్నాహక సర్వేను ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారులు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని బౌండరీలను గుర్తిస్తున్నారు. మ్యాప్ వచ్చిన అనంతరం పూర్తిస్థాయిలో బౌండరీలు ఏర్పాటు చేసి సర్వే నంబర్లు, భవనాల సమాచారమంతా మున్సిపాలిటీలో అందుబాటులోకి తేనున్నారు. డెప్యూటీ ఇన్స్పెక్టర్ విఠల్ ఆధ్వర్యంలో జగిత్యాల చుట్టుపక్కల బౌండరీలు ఏర్పాటు చేసేందుకు సర్వే చేశారు. ఘనంగా ఎడ్ల బండ్ల పోటీలుధర్మపురి: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని నేరెల్ల సాంబశివ ఆలయం వద్ద శనివారం ఎడ్లబండ్ల పోటీలను నిర్వహించారు. ప్రథమ బహుమతిని దుబ్బటి సాయికుమార్ (సీతారాంపల్లె), రెండో బహుమతి మాదాసు శంకరయ్యకు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కాసారపు బాలాగౌడ్, విమల దంపతులు, బైరి ఎల్ల య్య ఐదు గ్రాముల బంగారం, ద్వితీయ బహుమతిని షేక్ బాషుమియా (తిరుమలాపూర్)కు 10 గ్రాముల వెండిని తీగళ తిరుపతిగౌడ్ బహూకరించారు. ఆలయ కమిటీ చైర్మ న్ కాసారపు రాజాగౌడ్, వైస్ చైర్మన్ జాజాల రమేశ్, రెడ్డవేని సత్యం, శేర్ల రాజేశం, పలిగిరి సత్యం, ఆలయ కమిటీ సభ్యులున్నారు. -
నయనానందం
సారంగాపూర్/మల్లాపూర్: సారంగాపూర్ మండలం దుబ్బరాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన రథోత్సవానికి భక్తజనం తరలివచ్చారు. ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించిన అనంతరం పల్లకిలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి రథం ఆసీనులు చేశారు. స్వామివారి నామస్మరణ మధ్య భక్తులు రథాన్ని ముందుకు లాగుతూ కదిలారు. విచిత్ర వేషధారణలు, కోలాటాలు, శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. గంటన్నరపాటు రథోత్సవం వైభవంగా సాగింది. అలాగే మల్లాపూర్ శ్రీకనక సోమేశ్వరస్వామి జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12గంటలకు రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి ఓం నమఃశివాయా అంటూ రథోత్సవంలో పాల్గొన్నారు. మల్లాపూర్‌లో రథోత్సవంలో పాల్గొన్న భక్తజనంరథోత్సవం సందర్భంగా జనసంద్రమైన దుబ్బరాజన్న సన్నిధి -
‘సీసీ’ నిఘాలో ఇంటర్ పరీక్షలు
● ఈ నెల 5 నుంచి 22 వరకు నిర్వహణ ● జిల్లాలో 28 కేంద్రాలు ఏర్పాటు చేశాం ● విద్యార్థులు ఆందోళన చెందకుండా సకాలంలో హాజరై, రాయాలి ● డీఐఈవో నారాయణజగిత్యాల: ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని డీఐఈవో నారాయణ అన్నారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: ఎంతమంది అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారు? డీఐఈవో: మొత్తం 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 13 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల విధుల్లో ఉంటారు. అలాగే, 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 4 సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించాం. సాక్షి: సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? డీఐఈవో: పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇవి హైదరాబాద్‌లోని హెడ్ ఆఫీసులో గల కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానంగా ఉంటాయి. సాక్షి: విద్యార్థులు సెంటర్‌కు ఏ సమయానికి చేరుకోవాలి? డీఐఈవో: ఉదయం 8.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. అరగంట ముందే సెంటర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. సమయం దాటితే లోపలికి అనుమతించరు. అందుకే విద్యార్థులు సకాలంలో చేరుకోవాలి. సాక్షి: ఎంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు? డీఐఈవో: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్‌లో 6,104 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 969 మొత్తం 7,073, ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 6,395 మంది విద్యారుథలు, ఒకేషనల్‌లో 982 మొత్తం 7,377 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సాక్షి: నిమిషం ఆలస్యం నిబంధన అమలులో ఉంటుందా? డీఐఈవో: నిమిషం ఆలస్యం నిబంధనపై ఇప్పటికై తే ఎలాంటి ఆదేశాలు రాలేదు. కానీ, తప్పకుండా ఉంటుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అన్ని రూట్లలో బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి: ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఐఈవో: ఈ నెల 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. బెంచీలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం. సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు? డీఐఈవో: విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దు. భయపడొద్దు. పరీక్షా కేంద్రంలో ప్రశ్నాపత్రం ఇవ్వగానే ముందు క్షుణ్ణంగా చదవాలి. సమాధానం రాసేటప్పుడు ప్రశ్న నంబర్ తప్పనిసరిగా వేయాలి. హ్యాండ్రైటింగ్ గజిబిజి లేకుండా నీట్‌గా ఉంటే అధిక మార్కులు సాధించవచ్చు. -
సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలి
జగిత్యాల: సైన్స్ అంటేనే పరిశీలన, ప్రయోగాలు అని డీఈవో రాము అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని పలు స్కూళ్లలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 1987 నుంచి జాతీయ సైన్స్ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్‌లో శాస్త్రవేత్తలు కావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరన, క్విజ్, చిత్రలేఖనం, ప్రాజెక్ట్‌ల ప్రదర్శన తదితర వాటిపై పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అలసత్వం ప్రదర్శించొద్దుజగిత్యాల: కొత్తగా ఉపాధ్యాయులుగా నియమితులైన వారు విధుల పట్ల అలసత్వం ప్రదర్శించొద్దని డీఈవో రాము అన్నారు. డీఎస్సీ– 2024 ద్వారా నియామకమైన ఎస్జీటీలకు వీక్లీబజార్ ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. ఆర్పీలు జయంత్, ఉమేశ్, మహేశ్, కుమార్ పాల్గొన్నారసేవలతోనే ఉద్యోగులకు గుర్తింపుకథలాపూర్(వేములవాడ): ప్రజలకు సేవలందిస్తేనే ఉద్యోగులకు గుర్తింపు ఉంటుందని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ అన్నారు. కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్‌ఎన్‌గా పనిచేసిన లూసి ఉద్యోగ విరమణ సభ శుక్రవారం జరిగింది. పీహెచ్ఎన్ సేవలను అధికారులు కొనియాడి జ్ఞాపికలు అందించి శాలువాలతో సన్మానించారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, పీవో శ్రీనివాస్, వైద్యాధికారులు సింధూజ, రజిత, హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్, రాజన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాయికల్ మున్సిపల్ కమిషనర్‌గా మనోహర్గౌడ్రాయికల్(జగిత్యాల): రాయికల్ మున్సిపల్ కమిషనర్‌గా శుక్రవారం మనోహర్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కూలీల సంఖ్య పెంచండిరాయికల్(జగిత్యాల): ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీవో రఘువరణ్ సూచించారు. శుక్రవారం రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలోని ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ గ్రామంలో 50 మంది కూలీలకు తగ్గకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత కార్యదర్శులు, ఫీల్డ్ అసిసెంట్లపై ఉందన్నారు. వేసవికాలం దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో దివ్య, కార్యదర్శి స్వర్ణ, టెక్నికల్ అసిస్టెంట్ వీణరాణి, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్, కారోబార్ ప్రశాంత్ పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల పరిశీలనధర్మపురి/బుగ్గారం: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అధికారి గంగాధర్ అన్నారు. శుక్రవారం ధర్మపురిలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. కేంద్రాల్లో వసతుల గురించి ఎస్సెస్సీ బోర్డుకు నివేదిక అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బుగ్గారం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో సీతాలక్ష్మి, హెచ్ఎం మోహన్‌రెడ్డి, సీఆర్పీ పురుషోత్తం తదితరులు ఉన్నారు. -
ఆర్థిక క్రమశిక్షణే భవిష్యత్‌కు భరోసా
జగిత్యాల: ప్రతి ఒక్కరికి తమ ఆదాయ వ్యయాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన పొదుపే భవిష్యత్‌కు భరోసా అని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్థితిని బట్టి ఆదాయ వ్యయాలు చేయాలని పేర్కొన్నారు. ఎదుటి వారిని చూసి ఆడంబరాలకు పోయి తమ స్థోమతకు మించి ఖర్చు చేస్తున్నారని, దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి సతమతమవుతున్నారని, ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయన్నారు. ప్రతి వ్యక్తి బడ్జెట్ రూపకల్పన చేసుకోవాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంకుమార్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి సంపాదన ముఖ్యమే గానీ ఎలా ఖర్చు చేస్తున్నామన్నదే ప్రధానమన్నారు. పొదుపు చేయడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వరంగ సంస్థలను మాత్రమే ఎంచుకోవాలని, అప్పుడే డబ్బుకు భద్రత, భరోసా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయీమెంట్ అధికారి సత్తవ్వ, బీసీ సంక్షేమాధికారి సునీత, జిల్లా ఎఫ్ఎల్సీ మధుసూదన్, మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు. -
అవకతవకలకు పాల్పడితే చర్యలు
అదనపు కలెక్టర్ బీఎస్ లత జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని పలు ఫర్టిలైజర్ షాపులను శుక్రవారం అదనపు కలెక్టర్ బీఎస్ లత, జిల్లా వ్యవసాయాధికారి రాంచందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని జగిత్యాల సొసైటీ, ధర్మపురి రోడ్‌లోని రైతు బజార్, బుగ్గారం మండలం శెకల్లలోని ఆర్పీవీ ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా నిల్వలను పరిశీలించారు. ధర్మపురి రోడ్‌లోని రైతు బజార్లో ఎఫ్సీవో నిబంధనల మేరకు ఈపాస్ మిషన్ పనిచేయకపోవడంతో సంబంధిత డీలర్ లైసెన్స్‌ను రద్దు చేశారు. అలాగే, రైతు సేవా కేంద్రంలో 46 బస్తాల తేడా రావడంతో సంబంధిత డీలర్ లైసెన్స్‌ను, శెకల్ల గ్రామంలో 90 బస్తాల యూరియా అమ్మినా, ఈపాస్ మిషన్‌లో ఎంటర్ చేయకపోవడంతో డీలర్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఫర్టిలైజర్ డీలర్స్ అవకతవకలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. యూరియాను బ్లాక్ చేయడం, అధిక ధరలకు అమ్మడం, ఈపాస్‌లో నమోదు చేయకపోవడం వంటి చర్యలకు పాల్పడితే డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొన్నారు. కోటాకు మించి యూరియా సరఫరాయాసంగి సీజన్లో జిల్లాకు సరఫరా కావాల్సిన యూరియా కోటా 38 వేల మెట్రిక్ టన్నులు కాగా 38,205 మె.ట యూరియా సరఫరా జరిగిందని జిల్లా వ్యవసాయాధికారి రాంచందర్ అన్నారు. శుక్రవారం డీఏవో ఆధ్వర్యంలో సిబ్బంది జగిత్యాల, ఎండపల్లి మండలాల్లో యూరియా నిల్వలను పరిశీలించారు. జగిత్యాల అర్బన్ ఎఆర్ఎస్కేలో 520 బస్తాలు, ఎండపల్లి మండలం ఉమామహేశ్వర్ ఫర్టిలైజర్ షాపులో 450, రాజరాజేశ్వర్ ఫర్టిలైజర్ షాపులో 450 బస్తాల యూరియా నిల్వ ఉందని, రైతులకు సరపడా అందుబాటులో ఉందని వివరించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి తిరుపతినాయక్ తదితరులు ఉన్నారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత కోసం చర్యలు
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా సంక్షేమశాఖ అధికారి నరేశ్ అన్నారు. మెట్పల్లి మండలం పాటిమీది తండాలో శుక్రవారం జరిగిన అంగన్వాడీ టీచర్ల సెక్టార్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. పోషన్ అభియాణ్ ట్రాకర్ అమలుపై ఆరా తీశారు. యాప్‌లో పొందుపర్చాల్సిన అంశాలు, ఈకేవైసీ విషయంలో ఎందుకు తాత్సారం జరుగుతుందని టీచర్లను అడిగి తెలుసుకున్నారు. దీంతో సాంకేతికంగా సమస్యలు తలెత్తుతున్నాయని టీచర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింతా మెరుగ్గా నిర్వహించాలని సూచించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ షెమీమ్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. -
మందుల కొరతకు చెక్
జగిత్యాల: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు కోరుట్లలో ఏరియా ఆస్పత్రి, ఆయా మండలాల్లో సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, యూపీహెచ్‌సీలు ఉండగా ఇటీవలే పల్లె దవాఖానాలు ఏర్పాటయ్యాయి. అలాగే మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆస్పత్రుల్లో మందుల కొరత ఉండటంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. వైద్యులు పరీక్షలు చేసి చికిత్స చేస్తున్నప్పటికీ మందుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో బాధితులు బయట కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో మెడికల్ షాపుల నిర్వాహకులు గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి. 108 రకాల మందులు ఉండాల్సిందే.. ● ఇటీవల ఏర్పడిన కమిటీ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించింది. జనరల్‌తో పాటు అన్ని ఆస్పత్రుల్లో కచ్చితంగా రోగులకు అవసరమయ్యే 108 రకాల మందులు అందుబాటులో ఉండాల్సిందేనని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు సైతం తీసుకుంటున్నారు. ● ఏటా ప్రభుత్వం మందుల కోసం రూ.కోట్లు కేటాయిస్తున్నా చాలా చోట్ల లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఆస్పత్రుల్లో మందులు లేకుంటే వెంటనే జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్స్‌కు ఇండెంట్ పెట్టాలి. ● కానీ, వైద్యుల నిర్లక్ష్యమో, సిబ్బంది పట్టింపులేనితనమో మందుల సరఫరాలో కొంత జాప్యం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కమిటీ ఏర్పాటు కావడంతో ఇక నుంచి మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ● మందులు సక్రమంగా అందడం లేదని బాధితులు ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేసిన ఘటనలున్నాయి. తనిఖీలతో పాటు మందుల సరఫరా ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను నిత్యం తనిఖీ చేయడంతో పాటు, వాటిలో మందులు ఉన్నాయా లేవా అని గుర్తించనున్నారు. ఒకవేళ అవసరం మేరకు మందులు లేకుంటే సంబంధిత వైద్యులతో వెంటనే ఇండెంట్ పెట్టించి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యేక కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రైవేటులో దోపిడీ.. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో మందులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు జనరిక్ మందులు అంటగడుతూ అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.2 ధర ఉన్న గోలిని రూ.30కి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ మెడికల్ షాపులపై అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల గోలీలు ఉండాల్సిందే ఇటీవల సమావేశంలో నిర్ణయం పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ‘గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ గ్రామానికి చెందిన రమేశ్‌కు ఇటీవల బీపీ పెరగడంతో పాటు జ్వరం వచ్చింది. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో వైద్యులు పరీక్షలు చేసి మందులు రాశారు. కానీ, అక్కడ పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో లేవు. దీంతో బాధితుడు బయట డబ్బులకు కొన్నాడు.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో మందులు లేకపోవడంతో బాధితులు ప్రైవేట్‌గా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మందుల సరఫరాపై నిఘా పెట్టింది. అన్ని రకాల మందులు ఆస్పత్రిలో ఉండాలని ఆదేశాలు రావడంతో జిల్లాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో డీఎంహెచ్‌వోతో పాటు ఇద్దరు వైద్యులు ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు మందుల కొరత ఉంటే వెంటనే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటారు’.జిల్లాలో.. జనరల్ ఆస్పత్రి 1ఏరియా ఆస్పత్రి 1సీహెచ్‌సీలు 3పీహెచ్‌సీలు 17యూపీహెచ్‌సీలు 5బస్తీ దవాఖానాలు 5సబ్‌సెంటర్లు 151పల్లె దవాఖానాలు 71ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉండాల్సిందే. ఆయా ఆస్పత్రుల్లో మందులు ఉన్నాయా లేవా వైద్యులు సరిచూసుకుని మా దృష్టికి తీసుకువస్తే సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రతీ రోగికి మందులు అందాలి. ఎలాంటి జాప్యం జరిగినా చర్యలు తీసుకుంటాం. – ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో -
యూరియా కోసం రైతుల పాట్లు
కోరుట్లరూరల్: మండలంలోని పైడిమడుగు పీఏసీఎస్‌లో రైతులు యూరి యా కోసం పాట్లు పడుతున్నారు. గురువారం పీఎసీఎస్ గోదాంకు యూరి యా చేరుకోగా రైతులు పరుగులు తీశారు. కొందరు క్యూలైన్లో ఉండగా.. చాలామంది తమ చెప్పులు, ఇటుకలు, రాళ్లను లైన్లో పెట్టారు. తమ వంతు ఎప్పుడు వస్తుందోనని పడిగాపులు కాశారు. ఒక్కో ఆధార్‌కార్డుపై ఒక్కటే బస్తా ఇవ్వడంతో యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడ్డారు. డిమాండ్‌కు తగినట్లు యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. కళాశాలకు అఫిలియేషన్ తీసుకొస్తా..● అగ్రికల్చర్ విద్యార్థులకు ఎమ్మెల్యే సంజయ్ భరోసా కోరుట్ల: కోరుట్లలోని బీఎస్సీ అగ్రికల్చర్ మహిళా కళాశాలకు అఫిలియేషన్ తీసుకవచ్చే బాధ్యత తాను తీసుకుంటానని స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని అల్లమయ్య గుట్ట వద్ద గల రెసిడెన్షియల్ కళాశాలను గురువారం సందర్శించారు. విద్యార్థినుల కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు అవసరమైన ఏర్పాట్లు కల్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. కళాశాలలో ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తేవాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట కళాశాల సిబ్బంది, పలువురు నాయకులు ఉన్నారు. -
‘ఇన్స్పైర్’ చేస్తున్నారు
సైన్స్.. జీవితంలో ఒకభాగం.. పొద్దున నిద్రలేచినప్పటి నుంచి వేసే ప్రతీ అడుగులో.. చేసే ప్రతి పనిలో సైన్స్ దాగి ఉంటుంది. సైన్స్ అంటేనే అద్భుతం.. సంచలనాత్మక ఆవిష్కరణలకు నిలయం. మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో స్కూళ్లలో చదివే పిల్లల నుంచి శాస్త్రవేత్తల వరకు నిత్యం ఏదో ఒక అంశంలో ఆవిష్కరణలపై కసరత్తు చేస్తున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది బాల మేథావులు పుట్టుకొస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్‌ఫేర్, ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల నుంచి చాలా మంది రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. 28 ఫిబ్రవరి 1928న భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ.రామన్.. రామన్ ప్రభావాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అతని ఆవిష్కరణకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నేడు సైన్స్‌డే సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు బాలమేథావుల ఆవిష్కరణలపై ప్రత్యేక కథనం. -
షూతో విత్తన సీడింగ్
సప్తగిరికాలనీ(కరీంనగర్)/గంగాధర(చొప్పదండి): పొలంలో విత్తనాలు విత్తడం అంటే అన్నదాతలకు ఎంతో శ్రమతో కూడుకున్న పని. యంత్రాలతో విత్తనాలు విత్తడం ఆర్థికభారంతో కూడుకుంది. దీంతో రైతులకు ఇరువిధాలుగా ఇబ్బందులు ఎదురవుతోందని గ్రహించి, తన మేథస్సుతో సీడ్ విత్తే షూ తయారు చేసింది ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి జెడ్పీస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఎం.రితిక సైన్స్ ఉపాధ్యాయుడు జగదీశ్వర్‌రెడ్డి సహకారంతో రైతుల కోసం సీడ్ విత్తే షూ తయారు చేసింది. 2023–24 సంవత్సరానికి గానూ మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనక్‌లో ప్రదర్శించి, జాతీయస్థాయి ఇన్స్పైర్ మనక్‌కు ఎంపికై ంది. ‘విత్తన షూ వేసుకుని అడుగు పెట్టినపుడు ఒత్తిడి మెషిన్ లివర్‌పై పడుతుంది. లివర్ షూ విత్తనాల చాంబర్ నుంచి విత్తన విడుదలకు స్థలాన్ని ఇస్తుంది. ఇది నాజిల్‌తో జత చేయబడుతుంది. నాజిల్ మట్టిలోకి డ్రిల్ చేస్తుంది. స్ప్రింగ్‌ల శక్తితో విత్తనాన్ని వదులుతుంది. మరో అటాచ్మెంట్ రబ్బరు మట్టి డిస్టర్బర్ విత్తనాన్ని కప్పడానికి రంధ్రం వైపుల నుంచి మట్టిని వదులుతుంది. మొక్కజొన్న, సోయాబిన్, ఆవాలు, పప్పులు, వేరుశనగ పంటలు విత్తడానికి ఇది అనుకూలం. చిన్న, సన్నకారు రైతులకు ఇది సహాయకారిగా ఉంటుంది’ అని రితిక వివరించింది. ●– వివరాలు 8లోu -
కనులపండువగా శివపార్వతుల రథోత్సవం
రాయికల్: రాయికల్ పట్టణంలోని చెన్నకేశవనాథ ఆలయంలో గురువారం శివపార్వతుల రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. అర్చకులు రమేశ్‌శర్మ, సతీశ్‌శర్మ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథంపై శోభాయాత్ర చేపట్టారు. వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మచ్చ శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, కోశాధికారి శ్రీనివాస్, కార్యదర్శి మంతెన మహేందర్, సంయుక్త కార్యదర్శి సంకోజి అశోక్, ప్రచార కార్యదర్శి నిరంజన్‌గౌడ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఓటెత్తిన చైతన్యం
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్‌శాతం పెరిగింది. ఎన్నికల సంఘం చేసిన ప్రచారం, అభ్యర్థులు చేపట్టిన ఓటింగ్ నమోదు పోలింగ్‌శాతం పెరుగుదలకు దోహదం చేసింది. గురువారం నాలుగు పాత జిల్లా(కొత్త 15 జిల్లాలు)లు, 42నియోజకవర్గాల్లోని 773 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానంలో 3,55,159 ఓట్లు ఉండగా.. 70.42శాతం పోలింగ్ నమోదైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉండగా 91.90 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల్లో 11.39శాతం, టీచర్లలో 8.36 శాతం పోలింగ్ మెరుగైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్న 56మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీలో నిలిచిన 15మంది భవితవ్యం ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. బ్యాలెట్ బాక్సులు కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరచగా.. మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో విజయావకాశాలపై ఆన్లైన్ సర్వేలు జోరందుకున్నాయి. ప్రతికూలతతో తగ్గిన ఓటింగ్.. వాస్తవానికి ఈసారి పోలింగ్ ఇంకా పెరగాల్సి ఉన్నా.. పలు ప్రతికూలతల వల్ల అది సాధ్యం కాలేదు. టీచర్లకు ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవు పేరిట రోజు మొత్తం సెలవు ఇచ్చింది. కానీ, విద్యాశాఖ, ప్రైవేటు యాజమాన్యాలు కాలడ్డం పెట్టాయి. ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులకు సగంరోజు, ప్రైవేటు వారికి గంట మాత్రమే అనుమతించారు. వాస్తవానికి టీచర్లు గ్రాడ్యుయేట్, టీచర్ రెండు ఓట్లు వేయాల్సి ఉంటంది. కానీ, సమయాభావం, సెలవు దొరక్కపోవడంతో వారిలో అధికశాతం ఒక్క ఓటుకే పరిమితమయ్యారు. దీనికితోడు ముందు రోజు రాత్రి శివరాత్రి జాగారం కావడం పలువురు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. ఇక హైదరాబాద్, తదితర నగరాలకు వలసవెళ్లిన గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ఇక్కడ ఓటు ఉన్నా.. సెలవు దొరక్క, చార్జీల భారం వల్ల రాలేకపోయారు. ఓటేసిన కలెక్టర్.. 3వ తేదీన లెక్కింపు కరీంనగర్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ముకరంపురలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆమె తన గ్రాడ్యుయేట్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఓటు వేశారు. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కరీంనగర్‌లోని బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేపడుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య లెక్కింపు జరగనుంది. కొత్త 15 జిల్లాల నుంచి గురువారం అర్ధరాత్రి వరకు బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి. పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఆన్లైన్లో ఎగ్జిట్‌పోల్ కోసం అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఫోన్లలో ఐవీఆర్ పద్ధతిలో, నేరుగా, సోషల్‌మీడియా లేదా ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించడం మొదలు పెట్టారు. గ్రాడ్యుయేట్ స్థానంలో పోలింగ్ ఇలా.. ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్‌శాతం 2019 1,95,581 59.03శాతం 2025 3,55,159 70.42శాతంటీచర్ స్థానంలో ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్‌శాతం 2019 23,160 83.54 శాతం 2025 27,088 91.90 శాతం రాయికల్‌లో ఓటేసేందుకు వచ్చిన మహిళలుజగిత్యాల:జిల్లాలో అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సారంగాపూర్ మండలంలో కొన్ని పోలింగ్ బూత్‌లలో లైటింగ్ లేక ఓటర్లు ఇబ్బంది పడ్డారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నంబర్లు లేకపోవడం.. చెప్పేందుకు ఎవరూ లేకపోవడంతో బూత్‌నంబర్, సీరియల్ నంబర్ల కోసం వెతక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సెల్ఫోన్లో చూసుకుందామన్నా లోనికి అనుమతించకపోవడంతో మహిళ పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు కూడా ఏ బూత్ ఎక్కడో చెప్పలేకపోయారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. జిల్లాకేంద్రంలోని పురాణిపేటలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కండువాలు వేసుకుని వస్తున్నారని ఆరోపణలు చేసుకున్నారు. ఎస్సై కిరణ్ సర్దిచెప్పి వారిని పంపించేశారు. ఓటేసిన ప్రముఖులు జగిత్యాల/జగిత్యాలటౌన్:జిల్లా కేంద్రంలోని పురాణిపేట హైస్కూల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిట్టింగ్ సీటును కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందన్నారు. జిల్లా కేంద్రంలో మొదటిసారి కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి ఓల్డ్ హైస్కూల్ కేంద్రంలో ఓటేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్ పురాణిపేట హైస్కూల్లో ఓటేశారు. మెట్పల్లిలో ఓటేసిన ఎమ్మెల్యే సంజయ్ మెట్పల్లి: పట్టణంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండల పరిషత్‌లో ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ పట్టభద్రుల ఓటు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెరిగిన చైతన్యం 2019తో పోలిస్తే మెరుగుపడిన పోలింగ్ 11.39 శాతం పెరిగిన పట్టభద్రులు, 8.36శాతం పెరిగిన టీచర్లు మూడో తేదీన లెక్కింపు, ఏర్పాట్లు ముమ్మరం విజయావకాశాలపై మొదలైన ఆన్లైన్ సర్వేలు -
పొదుపు అలవర్చుకోవాలి
జగిత్యాలరూరల్: ప్రతిఒక్కరూ పొదుపు అలవాటు చేసుకోవాలని జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ రామ్‌కుమార్ అన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా గురువారం జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్‌లో ఆర్బీఐ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆదాయ వ్యయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేటి పొదుపు రేపటి భవిష్యత్తుకు పునాది అన్నారు. ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ కోట మధుసూదన్, ఏపీఎం గంగాధర్, సీసీలు, వీవోఏలు, మహిళ సంఘ సభ్యులు పాల్గొన్నారు. సొసైటీల్లో వ్యవసాయ అధికారి తనిఖీలుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని పలు సొసైటీలు, ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా నిల్వలపై జిల్లా వ్యవసాయ అధికారి రాంచందర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీలకు వచ్చిన యూరియా, సరఫరా రికార్డులు పరిశీలించారు. డీసీఎంఎస్ వెల్దుర్తిలో 450 బస్తాల యూరియా పంపిణీ సాఫీగా జరిగిందని, పీఏసీఎస్ కల్లెడలో 450 బస్తాల యూరియా నిల్వ ఉందని తెలిపారు. యూరియా అవసరాల దృష్ట్యా జిల్లాకు గురువారం 310 టన్నుల యూరియా వచ్చిందన్నారు. శుక్రవారం కూడా జిల్లాకు 540 టన్నుల యూరియా రానుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కుటీర పరిశ్రమలతో ఉపాధి● ఎంజీఐఆర్ఐ ప్రతినిధుల వెల్లడి ● జగన్నాథపూర్‌లో పర్యటనరాయికల్: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు కుటీర పరిశ్రమలతో ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగవచ్చని ఎంజీఐఆర్ఐ ప్రతినిధులు తెలిపారు. గురువారం రాయికల్ మండలం జగన్నాథపూర్లోని మురళీధర గోదాములో గ్రామీణ రసాయన పరిశ్రమలు, ఖాదీవస్త్ర విభాగం, గ్రామీణ ఊర్జా మౌలిక సదుపాయాలు, గ్రామీణ హస్తకళ ఇంజినీరింగ్ వంటి అంశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించారు. వీటి ద్వారా ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు చెన్నమనేని పద్మ, ప్రతినిధులు ప్రశాంత్, సందీప్, జోషి, జయకిశోర్, మహేశ్, మధుకర్, మాజీ సర్పంచులు తురగ రాజిరెడ్డి, కోల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మా సమస్యలు తీర్చాలి
మాకు టాయ్‌లెట్స్ లేవు. కాలేజీలో దోమలు, పాములు, ఎలుకలు తిరుగుతున్నయ్. ఫ్యాక్టల్టీ లేరు. ఒకటి, రెండుసార్లు సిలిండర్లు లేక మేమే కట్టెలు తెచ్చి, వంటకు సాయం చేశాం. బోరు నీళ్లు రాకుంటే మేమే తెచ్చుకుంటున్నం. మా సమస్యలు తీర్చాలి. – మేఘన, విద్యార్థిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా అగ్రికల్చర్ విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీని సందర్శించి, పూర్తిస్థాయిలో వారి సమస్యలు తెలుసుకొని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. ఈ కళాశాలకు అఫిలియేషన్ వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తా. – డాక్టర్ సంజయ్, ఎమ్మెల్యే, కోరుట్ల -
పోలింగ్‌కు వేళాయె
● పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం ● నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 773 పోలింగ్ కేంద్రాలు ● ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ● 12రకాల గుర్తింపు కార్డులతో ఓటేసేందుకు అనుమతి ● వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు– 8లోu ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లో మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్వో పమేలాసత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్స్ కోసం 499, టీచర్స్ కోసం 274, ఉమ్మడిగా 93 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, ఓటరు కార్డుతో సహా 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని తెలిపారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ పోటీలో 15 మంది ఉన్నారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
71 కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు
● పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశాం ● కలెక్టర్ సత్యప్రసాద్జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను బస్సుల్లో పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. పోలింగ్‌కు జిల్లాలో 71(51 పట్టభద్రులు, 20 టీచర్స్) కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు 3,50,280 మంది ఉండగా, 27,088 మంది టీచర్ ఓటర్లు ఉన్నారన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఓటర్లు ఓటరు గుర్తింపు కార్డుతోపాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి, ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 144 సెక్షన్ అమలు.. పోలింగ్ విధులు సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. బుధవారం జగిత్యాల మినీస్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించి, మాట్లాడారు. అధికారులకు ఎన్నికల ప్రక్రియపై శిక్షణ ఇచ్చామని, పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రశాంతమైన వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతోపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్ ఉన్నారు. ఓటుహక్కు వినియోగించుకోండి రాయికల్: పట్టభద్రులు, టీచర్లు గురువారం జరిగే పోలింగ్‌లో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. బుధవారం రాయికల్ పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ ఖయ్యూం, ఎంపీవో సుష్మ పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన కోరుట్ల: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పోలింగ్ బూత్‌ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు. ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ కిషన్, ఎస్సై శ్రీకాంత్ తదితరులున్నారు. -
గుర్తింపు రాలే.. బాధలు తీరలే
కోరుట్ల: ఏడాది క్రితం జగిత్యాల జిల్లాకు ఉమెన్స్ అగ్రికల్చర్ కళాశాల మంజూరైంది. ఎంసెట్ ద్వారా సుమారు 50 మంది విద్యార్థినులు ప్రవేశం పొందారు. జిల్లా కేంద్రంలో సొంత భవనం లేక ఏడాదిపాటు జగిత్యాల సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలతో చదివారు. అక్కడ వసతులు సరిపోకపోవడంతో వారిని కోరుట్లలోని పురాతన ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో పదేళ్ల క్రితం నిర్మించిన భవనంలోకి తరలించారు. ఇక్కడా వసతులు సరిగా లేవు. ప్రస్తుతం ఈ విద్యార్థిను బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ కళాశాలకు హైదరాబాద్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్(అనుంబంధ గుర్తింపు) రాకపోవడం మరో సమస్యగా మారింది. ఫలితంగా విద్యార్థినులు మహాశివరాత్రి పండుగపూట బుధవారం రోడెక్కి, బోరున విలపించాల్సిన దుస్థితి నెలకొంది. దోమలు.. ఎలుకలు.. పాములు ప్రస్తుతం కోరుట్లలో విద్యార్థినుల వసతి కోసం ఏర్పాటు చేసిన భవనం చుట్టూ శిథిలావస్థలో ఉన్న ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలున్నాయి. పెద్ద పెద్ద మర్రిచెట్లు, ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయిన చెత్త, విరిగిపోయిన చెట్ల కొమ్మలు, దోమలు, పాములు, గదుల్లో ఎలుకల సంచారంతో విద్యార్థినులు భయపడుతున్నారు. గతంలో ఒకటి, రెండుసార్లు ఎలుకలు కరిచాయి. కళాశాల ఆవరణలో పాములు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. డైనింగ్ హాల్ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కుళ్లిన ఆహార పదార్ధాల వాసనతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. టాయ్లెట్లలో రెండు మాత్రమే పని చేస్తున్నాయి. వీటినే అందరూ వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాచ్మెన్ లేకపోవడంతో రక్షణ కరువైంది. ఫ్యాకల్టీ ఐదుగురే.. స్థానికంగానే మార్కులు? 2023–24 సంవత్సరంలో అగ్రికల్చర్ కళాశాల ప్రారంభమైంది. రెండేళ్లు గడుస్తున్నా యూనివర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు రాలేదు. మొదటి సంవత్సరం పూర్తయిన విద్యార్థుల సమాధాన పత్రాలను స్థానికంగానే దిద్ది, మార్కులు వేస్తున్నట్లు సమాచారం. మొత్తం ఏడుగురు ఫ్యాకల్టీ అవసరం ఉండగా ఐదుగురే పని చేస్తున్నారు. ల్యాబ్ సౌకర్యం లేకపోవడంతో పొలాస వ్యవసాయ పరిశోధన క్షేత్రానికి వెళ్లొస్తున్నారు. లైబ్రరీలో బుక్స్ లేవు. అనుబంధ గుర్తింపు సకాలంలో రాకపోతే తమ పరిస్థితి ఏంటని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. వసతులు కల్పించి, గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ లేదు కాలేజీ ఆవరణలోకి పాములు గ్యాస్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యిపై వంట ఆవేదనతో రోడ్డెక్కిన కోరుట్ల అగ్రికల్చర్ కళాశాల విద్యార్థినులు కన్నీరు పెట్టుకున్న పలువురు -
చిదానంద రూపం శివోహం
ధర్మపురి/సారంగాపూర్(జగిత్యాల)/వెల్గ టూర్(ధర్మపురి): దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి బుధవారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సూర్యోదయానికి ముందు నుంచే పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. దుబ్బరాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి–అహల్య దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా జడ్జి ఎస్.నారాయణ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియానాయక్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్ హాజరయ్యారు. కోటిలింగాల కోటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్వామివారికి అభిషేకం చేశారు. -
ఎమ్మెల్సీ పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు
జగిత్యాల క్రైం: జిల్లాలో గురువారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపా రు. 233 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది డ్యూటీలో ఉంటారని, విధులు సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. జగిత్యాలలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం ఎన్నికల విధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సిబ్బంది తమకు కేటా యించిన పోలింగ్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లవద్దన్నారు. ఓటర్లతో మర్యాదపూర్వకంగా ఉండాలని చెప్పారు. పోలింగ్ సమయంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగే ఏ చిన్న సంఘటన ఎదురైనా అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఓటర్లను ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిళ్లు పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లనివ్వకూడదని పేర్కొన్నారు. ఓటు వేస్తూ సెల్ఫీలు దిగడం నిషేధమన్నారు. జిల్లాలోని 71 పోలింగ్ కేంద్రాలకు ఎస్కార్ట్‌తో ఎన్నికల సామగ్రి తరలించామన్నారు. 12 రూట్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, ఇద్దరు డీఎస్పీలతో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఆరుగురు సీఐలతో స్ట్రైకింగ్ ఫోర్స్ టీ మ్స్, ఎస్సైలతో 18 పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఏఎస్పీ భీంరావు, డీఎస్పీ రఘుచందర్, సీఐలు ఆరిఫ్ అలీఖాన్, వేణుగోపాల్, రవి, రామ్ నరసింహారెడ్డి, సురేశ్, రవి, ఆర్ఐ వేణు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.● ఎస్పీ అశోక్‌కుమార్ -
‘ఏజెంట్లు, సిబ్బందికి ఫోన్ అనుమతి లేదు’
మల్లాపూర్(కోరుట్ల): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం సజావుగా నిర్వహించాలని మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం మల్లాపూర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. రూట్ అధికారులు, పోలింగ్ సిబ్బందితో మాట్లాడి, సూచనలు చేశారు. ఎన్నికల సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని స్థానిక అధికారులకు సూచించారు. కేంద్రాల్లో ఏజెంట్లకు, సిబ్బందికి ఫోన్ అనుమతి లేదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల వివరాలు ఓటర్లకు తెలిసేలా పోస్టర్లు అతికించాలని చెప్పా రు. ఆయన వెంట తహసీల్దార్ వీర్‌సింగ్, ఇతర అధికారులున్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
జగిత్యాలటౌన్: ఎమ్మెల్సీగా నరేందర్‌రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం గొప్ప నిర్ణయమన్నారు. ఐటీఐ కళాశాల అప్‌గ్రేడ్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. తనను ఆదరించినట్లుగానే నరేందర్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు. నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, ధర రమేశ్, మన్సూర్, నేహాల్, జున్ను రాజేందర్ పాల్గొన్నారు. -
వాటర్బెల్తో ప్రయోజనం
ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్తాం. పీరియడ్ తర్వాత పీరియడ్ జరుగుతుంది. మధ్యలో వాటర్ బెల్ ఉంటే మాకు ప్రయోజనంగా ఉంటుంది. పీరియడ్ తర్వాత మేం మరో పీరియడ్‌లోకి వెళ్లిపోతాం. వాటర్ బెల్ అవకాశం కల్పించాలి. – సాయిసవర్ణిక, విద్యార్థి నీరు తాగడం ముఖ్యం ఎండకాలంలో విద్యార్థులకు నీరు ఎంతో ముఖ్యం. కోవిడ్ సమయంలో వాటర్‌బెల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ దానిని పునరుద్ధరించాలి. మంచినీరు తాగడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు. – బైరం హరికిరణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడుఅమలు తప్పనిసరి చేయాలి విద్యార్థులు గంటకోసారి నీరు తాగేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఎండకాలంలో తగినన్ని నీరు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. కేవలం ఇంటర్వెల్ సమయంలోనే తాగుతున్నారు. – మచ్చ శంకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు రెండు లీటర్లు తీసుకోవాలి విద్యార్థులు ప్రతిరోజూ రెండు లీటర్ల నీరు తీసుకోవాలి. అప్పుడే శరీ రంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. నీరు తాగడం.. మూత్ర విసర్జన చేయడం ముఖ్య మని విద్యార్థుల్లో అవగాహన పెంచాలి. రెండు గంటలకోసారి 250 మి.లీ నీరు తాగడం మంచిది. – ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, ఫిజీషియన్ -
మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు
జగిత్యాలరూరల్/సారంగాపూర్/మల్లాపూర్: మహాశివరాత్రికి జిల్లాలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. జగిత్యాల మండలం పొలాసలోని పౌలస్తేశ్వరస్వామి, సహస్ర లింగాల, పొరండ్లలోని రామలింగేశ్వరస్వామి, జాబితాపూర్‌లోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. కోరిన కొర్కెలు తీర్చే కనకసోమేశ్వరుడు మల్లాపూర్ మండలకేంద్రంలోని సోమేశ్వర కొండపై కొలువైన శ్రీకనకసోమేశ్వరుడు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచారు. ప్రకృతి అందాల మధ్య కొండపై వెలిసిన స్వామివారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఉత్సవాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. దుబ్బరాజన్నకు పటిష్ట పోలీస్ బందోబస్తు సారంగాపూర్ మండలంలోని దుబ్బరాజన్న ఆలయంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎ స్పీ అశోక్ కుమార్ తెలిపారు. దుబ్బరాజన్న స్వామి వారిని దర్శించుకున్న ఆయన పోలీసులు, ఆలయ, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. స్వామివారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ప్రముఖులు దుబ్బరాజన్న స్వామివారిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బా పురెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత దర్శించుకున్నారు. అర్చకులు వారికి ఆశీర్వాదం అందించి, స్వామివారి ప్రసాదాలు బహూకరించారు. శానిటేషన్‌పై నిర్లక్ష్యం వద్దు దుబ్బరాజన్న జాతరలో పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఆర్డీవో, డీపీవో మదన్మోహన్ అన్నారు. దుబ్బరాజన్న జాతర స్థలం, ఆలయ పరిసరాలు, కోనేరును పరిశీలించారు. వివిధ పంచాయతీల నుంచి 100 మంది సిబ్బందిని శానిటేషన్ కోసం నియమించామన్నారు. 14 మంది పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో, ఎంపీవో మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారని పేర్కొన్నారు. -
పొలాలు ఎండిపోతున్నా పట్టదా..?
● 15 నెలలైనా ప్రాజెక్టుకు షట్టర్లు బిగించరా.. ● రైతులు మొత్తుకుంటున్నా కనికరం లేని ప్రభుత్వం ● రోళ్లవాగును పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులుసారంగాపూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలవుతున్నా రోళ్లవాగు ప్రాజెక్టుకు కనీసం షట్టర్లు బిగించలేదని, ఫలితంగా ప్రాజెక్టు కింద పొలాలు ఎండిపోతున్నాయని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావుతో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2017లో కేసీఆర్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని, కేవలం అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉందని, గేట్లు బిగిస్తే బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 15 నెలలుగా కాలయాపన చేయడం ద్వారా పంటలు ఎండిపోతున్నాయన్నారు. దీనిపై కలెక్టర్ సమీక్షించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇటీవల గోదావరిలోకి టీఎంసీ నీటిని విడుదల చేయడం ద్వారా ఎత్తిపోతల పథకం కింద పొలాలకు నీరు అందుతోందని, రానున్న రోజుల్లో నీరు అందకుంటే 50వేల ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. సన్నరకాలకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు కేవలం మూడెకరాలలోపున్న కొంతమందికే రైతుభరోసా జమ అయ్యిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు నిర్ధిష్టమైన ఆలోచన లేదని, దోపిడీ కోసమే సమయం వెచ్చిస్తున్నారని విమర్శించారు. విద్యాసాగర్‌రావు మాట్లాడుతు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని, విమానాలు మాత్రం నడపడం తెలుసుని ఎద్దేవా చేసారు. వారి వెంట జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ, రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
తాగునీటి ఎద్దడి రానీయొద్దు
కోరుట్లరూరల్: వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మండలంలోని పైడిమడుగు గ్రామాన్ని మంగళవారం సందర్శించిన ఆమె గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య పనులపై ఆరా తీశారు. చేతిపంపును పరిశీలించి తాగునీటి సమస్య తెలుసుకున్నారు. పారిశుద్యంపై అలసత్వం తగదని, ఇంటి పన్నులు వందశాతం వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో జివాకర్, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ రామకృష్ణ, కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలతో నైపుణ్యంరాయికల్: వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యం పెంపొందుతుందని జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలను సందర్శించారు. విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల ఆసక్తి కనబర్చడం ద్వారా శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. హెచ్ఎం అభయ్‌రాజ్, ఎంపీవో సుష్మ, ఎంఈవో శ్రీపతి రాఘవులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బొప్పారపు మానస, ఉపాధ్యాయులు బెజ్జంకి హరికృష్ణ, కడకుంట్ల వినోద్‌కుమార్ పాల్గొన్నారు. -
బడిలో మోగని వాటర్ బెల్
● డీహైడ్రేషన్ బారిన విద్యార్థులు ● నీరు తాగక అనారోగ్యంపాలు ● నీటిగంట తప్పనిసరి అంటున్న తల్లిదండ్రులుజగిత్యాల: అసలే పదో తరగతి పరీక్షలు.. మార్కులే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. కానీ.. విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్యార్థులు సరిపడా నీరు తాగకపోవడంతో తలనొప్పి, కడుపునొప్పి, నీరసం బారినపడుతున్నారు. ఇలాంటి ప్రాథమిక లక్షణాలను గుర్తించిన ప్రభుత్వం 2018లో పాఠశాలల్లో ప్రతి గంటకోసారి వాటర్ బెల్ మోగించాలని నిర్ణయించింది. కానీ.. కోవిడ్ తర్వాత దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా వారికి నీరు బాగా తాగించాలని వైద్యులు చెబుతుంటారు. నీరు సరైన మోతాదులో లేకపోతే విద్యార్థులు అనారోగ్యానికి గురై ఏకాగ్రత దెబ్బతిని చదువుపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది నిపుణులు, వైద్యులు శరీరానికి సరిపడా నీరు తాగడం ప్రధానమని పేర్కొంటున్నారు. అందని నీరు ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమాన్ని 2018లో విద్యాశాఖ ప్రారంభించింది. కోవిడ్ తర్వాత మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు. విద్యార్థులు బడి సమయంలో సుమారు 1.5 లీటర్ల నీరు తీసుకుంటే మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. వయస్సును బట్టి 3 నుంచి 4 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ విద్యార్థులు ఉదయం ఇంటి నుంచి వాటర్‌బాటిల్ తీసుకెళ్తున్నా.. లంచ్ సమయంలో తప్ప మరెప్పుడూ తాగడం లేదు. దీంతో వారి శరీరానికి కావాల్సిన నీరు అందక ఇబ్బందికి గురవుతున్నారు. గతంలో ఫస్ట్‌బెల్, సెకెండ్ బెల్, ఇంటర్వెల్ ఇలా ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం అది మర్చిపోయారు. ఇప్పటికై నా దీనిని ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎండకాలం మరింత తీవ్రం ప్రస్తుతం ఎండకాలం నీరు ఎంతో అవసరం. ఒకవేళ నీరు లేకపోతే శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్‌కు లోనవుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్‌కు వెళ్లే సమయంలో వాటర్‌బాటిల్ తీసుకుని ప్రతి గంటకు ఒకసారి తాగాల్సి ఉంటుంది. లేదా పాఠశాలల్లోనే విద్యార్థులకు అవసరమైన తాగునీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నీరు తగ్గితే వ్యాధుల పాలు ఎండకాలంలో శరీరంలోని అన్ని అవయవాలు సమర్థవంతంగా పనిచేయాలంటే మోతాదులో నీ రు తీసుకోవా ల్సిన అవసరం ఉంటుంది. నీరు ఎక్కువగా తీసుకుంటే రక్తం పలచగా మారి రక్తప్రసరన సక్రమంగా జరుగుతుంది. ఒకవేళ నీటి శాతం తగ్గితే మూత్రపిండాల్లో రాళ్లు, విద్యార్థుల్లో ముఖ్యంగా జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్, అసిడిటి, మలబద్ధకం, మూర్చ, కాలేయ, చర్మవ్యాధుల వంటి సమస్యలు వస్తాయి. జిల్లాలోని చాలా పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం ఉంది. అయితే గంటకోసారి నీరు తాగితే మూత్రం వస్తుందన్న కారణంతోనూ విద్యార్థులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొన్ని పాఠశాలల్లో సరిపడా మూత్రశాలలు లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. ఈ క్రమంలో నీరు సరిపడా తాగకపోవడంతో వివిధ వ్యాధులకు గురవుతున్నారు. ఉపాధ్యాయులు వారిలో భయాన్ని పోగొట్టి ప్రతి గంటకోసారి నీరు తాగేలా చూడాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. భయంతో తాగని విద్యార్థులు -
ముగిసిన ఎమ్మెల్సీ ప్రచార పర్వం
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసింది. నిబంధనల మేరకు పోలింగ్‌కు 48 గంటల ముందు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి సైలెంట్ మోడ్ అమలులోకి వచ్చింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు, సంఘాలు ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు, బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఎస్పీ తరఫున బీసీ నేతలు నిర్వహించిన సభల సక్సెస్‌తో ఆయా క్యాడర్ జోష్‌లో ఉంది. ఉమ్మడి కరీంనగర్ కీలకం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలకంగా మారింది. ఉమ్మడి జిల్లా ఓటర్లు ఎటు మొగ్గుతే వాళ్లు విజయం సాధించే అవకాశాలున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 55 వేల 159 ఓట్లు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి లక్షా 60 వేల 260 ఓట్లున్నాయి. అంటే ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు సగం ఓట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ల తీర్పుపైనే అభ్యర్థుల భవిత ఆధారపడి ఉంది. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం 27,088 ఓట్లు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8,135 ఓట్లున్నాయి. ఇక్కడ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గెలుపోటములను నిర్ణయించనుంది. గెలుపుపై ధీమా పట్టభద్రులకు సంబంధించి మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డి పార్టీల బలంపై, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీసీ వాదంపై ఆశలు పెట్టుకున్నారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్‌సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 15 మంది పోటీలో ఉండగా, బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్పీసీ మద్దతుతో వై.అశోక్‌కుమార్, ఎస్టీయూ, సీపీఎస్‌ల నుంచి పోటీలో ఉన్న కూర రఘోత్తంరెడ్డి మధ్య పోటీ నెలకొంది. ప్రచారసభలతో జోష్ గతంలో లేని విధంగా ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తింది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రచార సభలు నిర్వహించి తమకు ఓటెందుకు వేయాలో వివరించే ప్రయత్నం చేశారు. సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య గెలుపు బాధ్యతలను పూర్తిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భుజానికెత్తుకొన్నారు. కామారెడ్డి, ఆదిలాబా ద్ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ ప్రచారపర్వంలో పాల్గొన్నారు. బీసీ వాదంతో బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా బీసీ జేఏసీ రాష్ట్ర నేతలు, బీసీ సంఘాల నేతలు, ఓయూ జేఏసీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. ఆయా సభల విజయవంతంతో క్యాడర్లో జోష్ నెలకొనడంతో పాటు, గెలుపుపై ధీమా పెరిగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పోటాపోటీ సభలు పార్టీల క్యాడర్లో జోష్ గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. -
ఎములాడ దారిలో..
● వైభవంగా రాజన్న జాతర షురూ ● తరలివస్తున్న భక్తులు ● నేడు మహాశివరాత్రి వేడుకలు ● రూ.2.39 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు ● గుడి చెరువులో శివార్చన కార్యక్రమాలు ప్రారంభం ● పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం, విప్ ఆది, టీటీడీ అర్చకులు వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎములాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు తరలివస్తున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నను దర్శించుకుని, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. జాగరణ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసి కేవలం లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రూ.2.39 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో జాగరణ చేసే భక్తులకు గుడి చెరువు వేదిక కానుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పేయిడ్ పాస్‌లను అధికారులు జారీ చేశారు. జాతరకు ఈసారి 4 లక్షల మంది వరకు వివిధ ప్రాంతల నుంచి భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు సైతం స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. నేటి ఉత్సవాల్లో.. వేకువజామున 3.30 నుంచి 4 గంటల వరకు ఆలయ శుద్ధి, మంగళవాయిద్యాలు ఉదయం 4 నుంచి 4.25 వరకు సుప్రభాత సేవ సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివస్వాములకు ప్రత్యేక దర్శనం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మంటపంలో మహాలింగార్చన రాత్రి 11.35 నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ కాలమందు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం -
పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి
రాయికల్: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుంగా అన్ని రకాల వసతులు కల్పించాలని డీఈవో రాము తెలిపారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం, సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థులు కూర్చునేందుకు సరిపడా బెంచీలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఆయన వెంట ఉపాధ్యాయులు గంగాధర్, రాజశేఖర్, సీఎం శర్మ, పద్మ, తరంగిణి, వేణు, రజిత, ప్రశాంత్, రమేశ్, నర్సయ్య పాల్గొన్నారు. పింఛన్ ఇప్పించండి సారుజగిత్యాల: పింఛన్ ఇప్పించాలంటూ ఓ తెలంగాణ ఉద్యమకారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాధనకు ఉద్యమం చేశానని, ప్రత్యేక రాష్ట్రం ప్రకటించేంతవరకూ గుండుతోనే ఉన్నానని, నిరాహార దీక్షలు చేసినా.. కవితలతో ఉద్యమానికి అండదండలు అందించినా ప్రభుత్వం కనీసం పింఛన్ కూడా మంజూరు చేయడంలేదని అంటున్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన తునికి పెద్ద గంగారాం తెలంగాణ ఉద్యమంలో వినూత్న రీతిలో ఉద్యమం చేపట్టారు. తెలంగాణ వచ్చేవరకూ గుండుతోనే ఉంటానని ప్రతినబూనారు. నిత్యం ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి పింఛన్ మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని చెప్పిందని, ఇప్పటివరకు స్పందన లేదని, కనీసం పింఛన్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. -
పంటలను ముంచేసిన వరదకాల్వ బ్యాక్ వాటర్
మెట్‌పల్లిరూరల్: ఎస్సారెస్పీ వరదకాలువ బ్యాక్ వాటర్ మెట్పల్లి మండలం ఆత్మనగర్ పెద్దతండా శివారులోని పొలాలను ముంచేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరదకాల్వకు రెండు రోజుల క్రితం అధికారులు 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీటితో కాలువ నిండుగా ప్రవహిస్తోంది. జగ్గాసాగర్ శివారులోని మాన్పూరు వాగు వద్ద వరదకాల్వ.. ఆత్మకూర్ పెద్దవాగు కలుస్తాయి. వరదకాలువ నుంచి వస్తున్న నీరు పెద్దవాగుపైనుంచి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వరదకాల్వ బ్యాక్ వాటర్ పెద్దవాగు గుండా నల్ల ఒర్రె ద్వారా ఆత్మనగర్ పెద్దతండా శివారులోని పంట పొలాల్లోకి చేరుతున్నాయి. ఈ కారణంగా సుమారు 20 ఎకరాల వరకు వరి పంట నీట మునిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాన్పూర్ వాగు వద్ద గేట్లు ఎత్తి పెద్దవాగు దిగువ ప్రాంతానికి నీటిని వదిలితే పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని రై తులు అంటున్నారు. అధికారులు స్పందించి తమ కు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. అనారోగ్యంతో మాజీ డీఈవో మృతి ధర్మపురి: ఉమ్మడి జిల్లా మాజీ డీఈవో ఇందారపు నర్సింగరావు (95) సోమవారం అర్ధరాత్రి మృతిచెందారు. ధర్మపురికి చెందిన ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయన ధర్మపురిలోని సంస్కృతాంధ్ర కళాశాల, ఉన్నత పాఠశాల పురోగతికి, జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్దనున్న ఓల్డ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తించారు. ఆయనకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. నర్సింగరావు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అడవి పందుల దాడిలో తీవ్రగాయాలు చందుర్తి: అడవిపందుల దాడిలో వేటగాళ్లకు తీవ్రగాయాలయిన ఘటన చందుర్తి శివారులోని బోడగుట్ట ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జోగాపూర్ గ్రామానికి చెందిన సంచార జీవనం సాగించేవారితో అడవి పందుల వేటకు వెళ్లారు. అప్పటికే వారికి పంది చిక్కగా, మరో దానికోసం వేటాడుతుండగా దాడిచేసింది. ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108లో వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం లింగంపేట శివారులోని ఓ గుట్టకు విద్యుత్ షాక్ పెట్టి మూడు పందులను హతమార్చి మాంసాన్ని విక్రయించినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై అటవీశాఖ అధికారి వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
సాంబశివుని సన్నధిలో గీతాహవన యజ్ఞం
బుగ్గారం: మండలకేంద్రంలో కొలువైన శ్రీసాంబశివుని నాగేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గీతాహవన యజ్ఞాన్ని కనులపండువగా నిర్వహించారు. విశ్వశాంతి, పర్యావరణ పరిరక్షణ, లోకకల్యాణార్థం ఆదిలాబాద్ జిల్లా రోటిగూడెంకు చెందిన శ్రీహరిమౌనస్వామిజీ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ మసర్తి రాజిరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమపూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఆలయ అర్చకులు సాత్పడి రంగయ్య, వేద పండితులు శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రి, రామస్వామి, కంచర్ల శివశంకరాచార్యులు, ఆగస్త్య మహారాజ్, ప్రమోద్‌శర్మ, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, శ్రీమద్భగద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
● ఎస్పీ అశోక్‌కుమార్ ● కేంద్రాల పరిశీలనజగిత్యాలక్రైం/మల్లాపూర్: ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద శాంతిభద్రతలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లావ్యాప్తంగా 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉంటుందని, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయన్నారు. ఎవరైనా నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీఐలు నిరంజన్‌రెడ్డి, ఎస్సై రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. -
ముగిసిన అంతర్రాష్ట్ర క్రీడలు
● క్రీడల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ రాజేంద్రనగర్, ఉత్తర తెలంగాణ జట్టు ● విజేతలకు బహుమతులు ప్రదానంజగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న అంతర్రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీలకు వ్యవసాయ వర్సిటీ డీన్ ఆప్ అగ్రికల్చర్ డాక్టర్ కె. ఝాన్సీరాణి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసంతోపాటు స్నేహభావం పెంపొందుతుందన్నారు. వ్యవసాయ కళాశాల అ సోసియేట్ డీన్ డాక్టర్ భారతీ నారాయణ్ భట్ మా ట్లాడుతూ, రాష్ట్రస్థాయి వర్సిటీ క్రీడలకు పొలాస కళాశాల వేదిక కావడం అభినందనీయమన్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ శ్రీలత మా ట్లాడుతూ పోటీల్లో పాల్గొడడం వల్ల క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. వ్యవసాయ వర్సిటీ క్రీడా పరిశీలకులు డాక్టర్ సురేశ్, వర్సి టీ నాన్ టీచింగ్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, జయరాం, కళాశాల స్టూడెంట్ ఆఫైర్ కన్వీనర్ మహేశ్ రెడ్డి, క్రీడా ఇన్చార్జి రత్నాకర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, నాన్ సిబ్బంది పాల్గొన్నారు. ఓవరాల్ చాంపియన్ షిప్ రాజేంద్రనగర్ జట్టు రాష్టస్థాయి క్రీడల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్‌ను రాజేంద్రనగర్ జట్టు కై వసం చేసుకోగా, సాంస్కృతిక విభాగంలో ఓవరాల్ చాంపియన్ షి ప్ను ఉత్తర తెలంగాణ జట్టు కై వసం చేసుకుంది. క్రికెట్లో దక్షిణ తెలంగాణ జట్టు, వాలీబాల్‌లో మధ్య తెలంగాణ జట్టు, బాల్ బ్యాడ్మింటన్‌లో ఉత్తర తెలంగాణ జట్టు, షటిల్ బ్యాడ్మింటన్‌లో రాజేంద్రనగర్ జట్టు, టేబుల్ టెన్నీస్‌లో రాజేంద్రనగర్ జట్టు, చెస్‌లో మధ్య తెలంగాణ జట్టు, కార్యమ్లో మధ్య తెలంగాణ జట్టు విజయం సాధించాయి. వివిధ జోన్లకు చెందిన క్రీడాకారులు బహుమతులు అందుకున్నారు. -
ఈత చెట్లు దగ్ధం
మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ శివారులో ఈత చెట్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గౌడ కులస్తులు మూడేళ్ల క్రితం ఐదు ఎకరాల్లో సుమారు 6 వేల వరకు ఈత చెట్లు నాటారు. వాటిపై ఆధారపడి కొద్దిరోజుల నుంచి కల్లుగీస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి ఈత చెట్లు దగ్ధమవుతున్నట్లు గౌడ కులస్తులకు సమాచారం రావడంతో వారంతా అక్కడికి వెళ్లారు. అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటన ప్రాంతానికి వెళ్లి మంటలు ఆర్పారు. అప్పటికే దాదాపు 500కుపైగా ఈత చెట్లు దగ్ధమైనట్లు గీత కార్మికులు తెలిపారు. ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా..?, కుట్రనా..? అనేది విచారణ చేపట్టాలని గీత కార్మికులు కోరుతున్నారు. -
స్వగ్రామానికి చేరిన యువకుడు
జగిత్యాలక్రైం: మోసపూరిత విదేశీ నియామక సంస్థ చేతుల్లో మోసపోయిన కొడిమ్యాల మండలం చెప్యాలకు చెందిన వలస కార్మికుడు కడకుంట్ల శ్రీకాంత్ పలువురి సహాయంతో మంగళవారం స్వగ్రామం చేరాడు. శ్రీకాంత్‌ను 40 రోజల క్రితం జగిత్యాలకు చెందిన మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ ఎలక్ట్రిషీయన్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి దుబాయ్ పంపించింది. అక్కడికి చేరిన అనంతరం లేబర్ ఉద్యోగంలో చేర్పించారు. ఆ పని చేయబోనని శ్రీకాంత్ అనడంతో పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని 7300 దిరమ్స్ (ఇండియా రూ.2లక్షలు) చెల్లించాలని కంపెనీ యాజమాన్యంతోపాటు, కేరళకు చెందిన ఓ ఏజెంట్ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు టీపీసీసీ ఎన్ఆర్ఐసెల్ కన్వీనర్ షేక్ చాంద్‌పాషాను ఆశ్రయించారు. ఆయన దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. స్పందించిన ఎంబసీ వారు కంపెనీ యాజమాన్యాన్ని మందలించడంతో శ్రీకాంత్‌ను స్వగ్రామానికి పంపించేందుకు నిరాకరించారు. దీంతో ఇండియన్ ఎంబసీ దుబాయ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. లేబర్ కోర్టు విచారణ జరపగా శ్రీకాంత్ కోర్టులో నెగ్గాడు. దీంతో కంపెనీ యాజమాన్యం ఫిర్యాదును కొట్టివేసి అతని పాస్‌పోర్టును శ్రీకాంత్‌కు అప్పగించడంతో మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. -
విద్యార్థి ఆత్మహత్య
కోనరావుపేట: కళాశాల నుంచి వస్తూ అదృశ్యమైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో రైలు కిందపడి మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పొట్ల బాలమల్లు– మంజుల దంపతుల కుమారుడు రాకేశ్ (18)హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వస్తూ సిరిసిల్ల బస్టాండ్‌లోని ధర్మారం గ్రామానికి వెళ్తున్న ఆటోలో బ్యాగు పెట్టాడు. తర్వాత కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాకేశ్ హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో సూసైడ్ నోట్ రాసి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. అమ్మ, నాన్న క్షమించండి. నాకు బతకాలని లేదు. నా చావుకు కారణం ఎవరు కాదు అని సూసైడ్ నోట్లో అంది. పోలీసులు ఫోన్లో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రాకేశ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
భక్తులకు సరిపడా ఏర్పాట్లు
వెల్గటూర్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటిలింగాల కోటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రైవేటు కంపెనీ నిర్మించిన శాశ్వత షెడ్, టాయిలెట్స్‌ను ప్రారంభించారు. బందోబస్తు చేపట్టాలని సీఐ రాంనర్సింహారెడ్డిని ఆదేశించారు. గోదావరిలో గజ ఈతగాళ్లను నియమించామన్నారు. ఈవో కాంతారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోళ్ల తిరుపతి, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ -
భక్తులకు సరిపడా ఏర్పాట్లు
వెల్గటూర్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటిలింగాల కోటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రైవేటు కంపెనీ నిర్మించిన శాశ్వత షెడ్, టాయిలెట్స్‌ను ప్రారంభించారు. బందోబస్తు చేపట్టాలని సీఐ రాంనర్సింహారెడ్డిని ఆదేశించారు. గోదావరిలో గజ ఈతగాళ్లను నియమించామన్నారు. ఈవో కాంతారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోళ్ల తిరుపతి, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ -
యువత ఉపాధి వైపు అడుగులు వేయాలి
మల్యాల: ప్రభుత్వ పథకాలను సద్వినియో గం చేసుకుంటూ యువత స్వయం ఉపాధివైపు అడుగులు వేయాలని డీఆర్డీవో పీడీ రఘువరన్ అన్నారు. మండలంలోని మద్దుట్లలో ఉపాధి హామీ నిధులు ఏర్పాటు చేసిన పశువుల పాకను మంగళవారం పరిశీలించారు. పోతారంలో ఉపాధి హామీ కింద చేపట్టిన కందకం పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. మండలకేంద్రంలో ఉన్నతి పథ కం కింద పుట్టగొడుగుల పెంపకంపై ఆరురోజులు శిక్షణ పొందిన 70 మంది యువతకు సర్టిఫికెట్లు అందించారు. అడిషనల్ డీఆర్డీవో మదన్మోహన్, ఎంపీడీఓ స్వాతి, ఏపీఓ శ్రీనివాస్, ఈసీ మనోజ్, టెక్నికల్ అసిస్టెంట్ జలపతి రెడ్డి, లావణ్య, శిక్షకులు బాలస్వామి, విజయభారతి పాల్గొన్నారు. -
విద్యార్థి ఆత్మహత్య
కోనరావుపేట: కళాశాల నుంచి వస్తూ అదృశ్యమైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో రైలు కిందపడి మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పొట్ల బాలమల్లు– మంజుల దంపతుల కుమారుడు రాకేశ్ (18)హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వస్తూ సిరిసిల్ల బస్టాండ్‌లోని ధర్మారం గ్రామానికి వెళ్తున్న ఆటోలో బ్యాగు పెట్టాడు. తర్వాత కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాకేశ్ హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో సూసైడ్ నోట్ రాసి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. అమ్మ, నాన్న క్షమించండి. నాకు బతకాలని లేదు. నా చావుకు కారణం ఎవరు కాదు అని సూసైడ్ నోట్లో అంది. పోలీసులు ఫోన్లో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రాకేశ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
దర్శిద్దాం.. తరిద్దాం
● నేటి నుంచి వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలు ● మూడు రోజులు ముక్కోటి పండుగ ● 4 లక్షల మంది వస్తారని అంచనా ● రూ.2.39కోట్లతో ఏర్పాట్లు ● 1500 మందితో బందోబస్తు వేములవాడ: హరహర మహాదేవ.. శంభో శంకర.. జై మహాదేవ్.. నామస్మరణతో వేములవాడ పురవీధులు మారుమోగనున్నాయి. పేదల దేవుడిగా పేరొందిన దక్షిణకాశీ వేములవాడలో నేటి నుంచి మూడు రోజులు మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4లక్షల వరకు భక్తులు వస్తారని అధికారుల అంచన. రూ.2.39కోట్లతో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల కోసం శివార్చన వేదికను సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు స్వాగతం పలికేందుకు తోరణాలు, సీసీ కెమెరాల మధ్య భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కోడె మొక్కులు ప్రత్యేకం భక్తుల కోరిన కోర్కెలు నెరవేరితే రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకుంటారు. పాడిపంటలు బాగుండాలని మొక్కుకున్న రైతులు ఆలయానికి నిజకోడెలు సమర్పిస్తుంటారు. కల్యాణకట్టలో రూ.10 టికెట్ తీసుకుని తలనీలాలు సమర్పించుకుంటుంటారు. బద్దిపోచమ్మకు బోనం మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీ. ప్రసాదం రాజన్నను దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, దేవస్థానం దక్షిణ ద్వారం వద్ద, పూర్వపు ఆంధ్రాబ్యాంకులో, భీమేశ్వరాలయం వద్ద ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.20, పులిహోరా ప్యాకెట్ రూ.15 చొప్పున విక్రయిస్తారు. జాతర ప్రత్యేక పూజలు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈనెల 25 నుంచి నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ధర్మదర్శనంతోపాటు రూ.300 వీఐపీ దర్శనం, రూ.50 స్పెషల్ దర్శనాలు, రూ.100 కోడెమొక్కులు, రూ.200 స్పెషల్ కోడెమొక్కులు, రూ.100 శీఘ్రదర్శనం టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఈనెల 25వ దేదీ రాత్రి 7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పి స్తారు. రాత్రి 9.30 గంటలకు నిషిపూజ అనంత రం సర్వదర్శనం కొనసాగుతోంది. 26న ఉద యం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వా మి వారికి పట్టువస్త్రాలు అందజేస్తారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివస్వాములకు, 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు నిర్వహిస్తారు. ఉచిత భోజనం..టిఫిన్..తాగునీరు మూడురోజులపాటు స్థానిక ట్రస్టుల ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి కాంప్లెక్సులో ఉచితంగా భోజ నం, పార్వతీపురంలో స్వామి వారి అన్నదాన సత్రంలో ఉచిత భోజనం, టిఫిన్ వసతి ఉంది. భక్తుల దాహార్తిని తీర్చేందుకు 6 లక్షల నీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఆరు రాజన్న జలప్రసాదాల సెంటర్లను ఏర్పాటు చేశా రు. ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను అందజేయనున్నారు. వేములవాడలో వంద వసతి గదులను అందుబాటులో ఉంచారు. 3.90 లక్షల చదరపు మీటర్లలో చలువపందిళ్లు వేశారు. స్నానానికి 157 షవర్లు ఏర్పాటు చేశారు. ధర్మగుండంలోకి గోదావరి జలాలను పంపింగ్ చేస్తున్నారు. గత ఈతగాళ్లను అందుబాటులో పెట్టారు. భక్తుల కోసం 4 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. అతిథుల రాక.. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌లు మహాశివరాత్రి వేడుకలకు రానున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు రానున్నట్లు సమాచారం.ఇలా చేరుకోవాలి రోడ్డు మార్గంలోనే వేములవాడకు చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 32 కిలోమీటర్లు దూరం రోడ్డుమార్గంలో చేరుకోవాలి. సికింద్రాబాద్ బస్టాండ్ నుంచి ప్రతీ ముప్పై నిమిషాలకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతీ పది నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. స్థానికంగా తిప్పాపూర్ బస్టాండ్ నుంచి గుడి చెరువు వరకు 14 ఉచిత బస్సులు నడిపిస్తున్నారు.దర్శనీయ స్థలాలు వేములవాడ పరిసరాల్లో అనంతకోటి పద్మనాభస్వామి, భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారీశ్వర, వేణుగోపాలస్వామి, నాంపల్లి గుట్టపై లక్ష్మీనర్సింహస్వామి, అగ్రహారం జోడాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి.అత్యవసర సేవల ఫోన్ నంబర్లు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి : 87126 56412 ఈవో వినోద్‌రెడ్డి : 94910 00743 వైద్యాధికారి రజిత : 70975 57119 ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ : 99592 25926 టౌన్ సీఐ వీరప్రసాద్ : 87126 56413అత్యవసర సేవలు ఆలయం ఎదుట పోలీస్ కంట్రోల్‌రూమ్‌ను ఏర్పా టు చేశారు. నిరంతరం పోలీసు గస్తీ బృందాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అందుబాటులో ఉంచారు. ఆలయం ముందున్న అమ్మవారి కాంప్లెక్స్‌లో తాత్కాలిక వైద్యశాల, పార్కింగ్ స్థలాలు, వసతి గదుల వద్ద నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్, 13 మంది నోడల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నియమించారు. వీటితోపాటుగా మొబైల్ అంబులెన్స్, ఫైర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. 1600 మంది పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
శివరాత్రికి ఆలయాలు ముస్తాబు
● రేపు మహాశివరాత్రి ధర్మపురి: మహా శివరాత్రికి శివాలయాలను ముస్తాబు చేశారు. ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి, అక్కపెల్లి శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంతోపాటు మండలంలోని నేరెల్ల సాంబశివ దేవాలయాలను రంగులు, విద్యుత్‌దీపాలతో అలంకరించారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి రాత్రివరకు పంచోపనిషత్తులతో అభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహిస్తారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి లింగోద్భవం ఉంటుంది. అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ సీపతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతోపాటు సాయంత్రం శివ పార్వతుల కల్యాణ వేడుకలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనాల కోసం ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అక్కపెల్లి రాజరాజేశ్వర ఆలయానికి ఉచిత వాహన సౌకర్యం కల్పించారు. -
సదరెం మరింత సులభతరం
జగిత్యాల: సదరెం సే వలు మరింత సులభతరం కానున్నాయని, కేంద్రం 21 రకాల కేటగిరీలను చేర్చిందని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ తెలిపారు. మీసేవ కేంద్రాల్లో వచ్చేనెల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని, స్వయంగా దివ్యాంగులే చేసుకునేలా యూనిక్ డిసబులిటీ ఐడీ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో అప్లై చేసుకోవాలని కోరారు. స్మార్ట్‌గా సదరెం సర్టిఫికెట్ వస్తుందని, ఇంతకుపూర్వం ఏ4 సైజ్‌లో జారీ అయ్యేవని, ఇకపై కార్డు సైజులో వస్తాయని పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించే సదరెం శిబిరానికి హాజరు కావాలని సూచించారు. నేటి నుంచి మద్యం షాపుల బంద్జగిత్యాలక్రైం: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 25న సాయంత్రం నాలుగు గంటల నుంచి 27 సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. మార్కెట్‌యార్డుకు మూడు రోజులు సెలవులుజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల మార్కెట్‌యార్డుకు మూడు రోజుల సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా ఈనెల 26 నుంచి 28 వరకు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. మా ర్చి ఒకటో తేదీ నుంచి యార్డులో యథావిధిగా కొనుగోళ్లు సాగుతాయని వివరించారు. రెండు బైకులు ఢీ: ఇద్దరికి గాయాలుధర్మపురి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని దమ్మన్నపేట, రాజారం గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో రాజారం గ్రామానికి చెందిన జెల్ల సత్తయ్య, దూడ రాజయ్యకు తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిజగిత్యాల క్రైం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లికి చెందిన అత్తినె గంగాధర్(50) సోమవారం పని నిమిత్తం బైక్‌పై జగిత్యాల వచ్చాడు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా నర్సింగాపూర్ శివారులో ధరూర్ నుంచి మోతె వైపు వెళ్తున్న బోలెరో అతివేగంగా వచ్చి, ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగాధర్‌కు బలమైన గాయాలయ్యాయి. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు
జగిత్యాలక్రైం: గొల్లపల్లి మండలంలోని జగదేవ్‌పేటకు చెందిన నూకల భూలక్ష్మి వెల్గటూర్ ఎస్సై పై సోమవారం ఎస్పీ అశోక్‌కుమార్‌కు ఫిర్యా దు చేసింది. జగదేవ్‌పేట శివారులోని తన భూమి లో పంట సాగు చేసుకోగా అదే గ్రామానికి చెందిన కొందరు రాత్రివేళలో వెళ్లి, ధ్వంసం చేశారని తెలిపి ంది. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసినా ఎస్సై కేసు నమోదు చేయకుండా పంట ధ్వంసం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది. వ్యభిచార గృహంపై పోలీసుల దాడిజగిత్యాల క్రైం: వ్యభిచారం నిర్వహిస్తున్న జగిత్యాల భవానీనగర్‌లోని ఓ ఇంటిపై పట్టణ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. వారి వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బులు ఆశచూపి, వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి, వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. అక్కడున్న మహిళలు, విటులను అదుపులోకి తీసుకొని, వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంవేములవాడ అర్బన్: వే ములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ మూ లవాగు బ్రిడ్జి కింద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, బ్లాక్ టీషర్ట్ ధరించాడని పేర్కొన్నారు. గుర్తు పట్టినవారు సీఐ వీరప్రసాద్ 87126 56413, ఎస్సై రమేశ్ 87125 80413 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. టీచర్‌పై పోక్సో కేసు.. అరెస్టుకోనరావుపేట(వేములవాడ): ఓ టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల క్రితం పోలీస్ అక్క కార్యక్రమంలో భాగంగా ఓ మహిళా కానిస్టేబుల్ మహిళా చట్టాలు, షీ టీమ్ విధులపై అవగాహన కల్పించారు. ఆ సమయంలో కొందరు విద్యార్థినులు కనపర్తి బ్రహ్మం అనే టీచర్ కొన్ని రోజులుగా క్లాస్‌రూమ్‌లో తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం సోమవారం అరెస్ట చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. యువకుడి దుర్మరణంచొప్పదండి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై అనూష కథనం ప్రకారం.. చొప్పదండి మండలంలోని రాగంపేటకు చెందిన ఒడ్నాల రమేశ్(28) చొప్పదండిలోని ఓ ఉడిపి హోటల్లో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకొని హోటల్ ఎదుట నిలబడగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బాబాయి ఇరుకుల్ల శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.