Jangaon
-
పసిపాప దొరికింది..
జనగామ: కుటుంబంలో ఒక్కరిగా నమ్మించి పది నెలల పాపను ఎత్తుకెళ్లిన నిందితులు జనగామ పోలీసులకు పట్టుబడ్డారు. పదిహేను రోజుల తర్వా త బిడ్డను చూసిన తల్లి.. ఒడిలోకి తీసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ మేరకు మంగళవా రం జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ పండేరి చేతన్ నితిన్.. సీఐ దామోదర్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్ల డించారు. జనగామ జిల్లా కేంద్రం కళ్లెం రోడ్డులో పీఎల్జీ కన్వెన్షన్ నిర్మాణ పనుల కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి రాంజుల్ రజాక్ కుటుంబంతో పాటు మరి కొంత మంది కూలీలు వచ్చారు. అక్కడే నివాసం ఏర్పరుచుకుని పనులు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా అల్లీపురం కొత్తగూడెంకు చెందిన పతంగి సురేశ్, ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నియోజకవర్గం కోనూరుకు చెందిన తన రెండో భార్య తిరుపతమ్మ విజయవాడలో భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ సమయంలో వీరికి విజయవాడకు చెందిన చంద్రమ్మ పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల పాటు అక్కడే కూలీ పనులు చేసుకుంటూ లక్షలు సంపాదించాలనే దురాశతో పిల్లల కిడ్నాప్‌నకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో చంద్రమ్మ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన గరిక ముక్కు విజయలక్ష్మిని రంగంలోకి దింపింది. అనంతరం సురేశ్, తిరుపతమ్మ దంపతులు విజయవాడ నుంచి వరంగల్‌కు లేబర్ అడ్డాకు చేరుకున్నారు. అక్కడ జనగామకు చెందిన మేసీ్త్ర అజయ్‌తో పరిచయం ఏర్పరుచుకుని కళ్లెం రోడ్డులోని పీఎల్జీ కన్వెన్షన్‌లో పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికుల గుడారం పక్కనే వీరు నివాసమున్నారు. ఈ క్రమంలో రాంజుల్ రజాక్ పది నెలల పాప(బిడ్డ) శివానీని వారు సొంత బిడ్డలా చూసుకున్నారు. దీంతో రాంజుల్ కుటుంబం సైతం వారిని నమ్మారు. పథకం ప్రకారమే.. గత నెల 25వ తేదీన పథకం ప్రకారం మేస్త్రీ అజయ్ బైక్‌పై మార్కెట్‌కు వెళ్తున్నామని చెప్పి పాప శివానీని ఎత్తుకెళ్లారు. వారు ఎంతకూ రాకపోవడంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీపీ పండేరి చేతన్ నితిన్ పర్యవేక్షణలో సీఐ దామోర్‌రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు ఆధ్వర్యంలో సీసీ ఫుటేజీ పరిశీలనతోపాటు గాలింపు ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్–హైదరాబాద్ హైవే పెంబర్తి క్రాస్ వద్ద తనిఖీ చేసే క్రమంలో బైక్‌పై వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నారు. దీంతో పాప శివానీ తీసుకుని ముగ్గురు నిందితులు సురేశ్, తిరుపతమ్మ, గరికముక్కు విజయలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. చంద్రమ్మ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల చెంతకు.. పెంబర్తి క్రాస్ వద్ద పట్టుబడిన నిందితులు ముగ్గురి అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన ఏసీపీ పండేరి చేతన్ నితిన్ -
జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి
స్టేషన్‌ఘన్‌పూర్: బహుజన పోరాట వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరును జిల్లాకు పెట్టాలని తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని తాటికొండ గ్రామంలో బహుజన ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21న కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ఒక్కరోజు దీక్షకు బహుజనులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సానాది రాజు, బహుజన సంఘం అధ్యక్షుడు అక్కనపెల్లి వెంకటయ్య, ఉబ్బని భిక్షపతి, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి ఐలోని సుధాకర్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. 19 కిలోల ఎండుగంజాయి పట్టివేత నర్మెట: మండలంలోని హన్మంతాపురం–బొమ్మకూరు క్రాస్ రోడ్డు వద్ద 19 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ ముసుగు అబ్బయ్య, ఎస్సై నగేష్ తమ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బొమ్మకూర్ క్రాస్ రోడ్డు వద్ద బ్యాగ్‌తో ఉన్న అనుమానిత వ్యక్తిని తనిఖీ చేయగా రూ. 10 లక్షల విలువ చేసే 19 కిలోల ఎండుగంజాయి పట్టుబడింది. జార్ఖండ్ రాష్ట్రం కొడెర్మా జిల్లా జుంరి తేలాయియాకు చెందిన ఎండీ మోక్తార్ వర్శి ఒరిస్సా రాష్ట్రంలో కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రైన్లో పోలీసులు తారస పడటంతో జనగామ స్టేషన్లో దిగి ఆటోలో హన్మంతాపురం చేరుకున్నాడు. అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నీరులేక ఎండుతున్న పంటలు బచ్చన్నపేట: మండలంలోని పలు గ్రామాల్లో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. మంగళవారం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని తమ్మడపల్లి, చిన్నరామన్చర్ల గ్రామాల్లో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో అన్నదాతలు వరి పంటను రైతులు సాగు చేశారని వీటికి ప్రధాన జీవనాధారం బోరు బావులేనన్నారు. వెంటనే గోదావరి జలాలతో చెరువులు, కుంటలను నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉడుగుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, నాయకులు మైపాల్, నవీన్, రైతులు పాల్గొన్నారు. జనగామ రూరల్: పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు లద్దునూరి మహేశ్ యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని ఓబుల్‌కేశవపూర్, పెద్దరామన్‌చర్ల గ్రామాల్లో నీరందక ఎండిన పంటలను పార్టీ బృందంతో కలిసి క్షేత్ర స్థాయిలో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉడుగుల రమేష్, మార్క ఉపేందర్, దేవరాయి ఎల్లయ్య, సిరికొండ విజయ్ భాస్కర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి
జనగామ: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల తీరును మంగళవారం ప ర్యవేక్షించారు. పరీక్షకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, మెడికల్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబి రంలో మందులను తనిఖీ చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని, జవాబు పత్రాలను వెంటనే పోలీసు బందోబస్తు మధ్య నిర్దేఽశిత ప్రాంతాలకు తరలించా లని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
జనగామ: ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం అందిస్తున్న 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. మంగళవారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఏసీ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్ తదితరులు ఉన్నారు. బచ్చన్నపేటలో.. బచ్చన్నపేట: రాయితీని వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పలువురు లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఎల్ఆర్ఎస కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారి జాబితా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శుల వద్ద ఉంటుందని, ఈ నెల 31లోపు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి, జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, ఎంపీడీఓ వెంకట మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి నర్సింహచారి, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ -
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
కొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షల్లో రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు. – సాక్షి నెట్వర్క్ న్యూస్‌రీల్ -
పులకించిన కొండపర్తి
సభకు హాజరైన మహిళలు,ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఆయన కూడా ఆదివాసీలత మేమకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీల నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతోపాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్‌ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్‌దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కొండపర్తిని దత్తత తీసుకోవడం గొప్ప విషయం: మంత్రి సీతక్క దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆ గ్రామాన్ని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అనుసంధానం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అందించడం ద్వారా మహిళలు వ్యాపారవేతలుగా ఎదగాలన్నారు. 40 కంపెనీలు దిశ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని వంద పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి: దాన కిశోర్, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి కొండపర్తిని అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్ధాలనే లక్ష్యంతోనే గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఆదాయం చేకూరేలా ఐకమత్యంతో ముందుకుసాగాలని సూచించారు. మిర్చి, పసుపు, మసాలా యూనిట్లకు మార్కెటింగ్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం భారీ పోలీసు భద్రత నడుమ సాగిన పర్యటనఅమ్మవార్లకు మొక్కుల చెల్లింపు కొండపర్తికి వచ్చిన గవర్నర్ మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్ల మొక్కుగా సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, రిజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రావుల సునిత, మేడారం ఈఓ రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు. -
లక్ష్యం చేరారు..!
కష్టపడ్డారు..గ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ ● పలువురికి మెరుగైన ర్యాంకులు ● ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులుభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో పనిచేశారు. ఆ సంవత్సరంలోనే గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. అదేశాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా ప దోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవై పు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్లో జరి గిన గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్‌ను గ్రామస్తులు అభినందించారు. ముల్కలపల్లి యువకుడు ఉపేందర్..డోర్నకల్: గ్రూప్–2 ఫలి తాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విదులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్‌ను గ్రామస్తులు అభినందించారు.కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లోని కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా ప్రణీత్‌కు స్థానిక పద్మశాలి సంఘం నాయకులతోపాటు మిత్రులు అభినందనలు తెలిపారు. ప్రణీత్ ప్రతిభ.. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు జనగామ రూరల్: జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల హాస్టల్ వర్కర్స్కు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మెడికల్, ఎంసీహెచ్ ఆస్పత్రి కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. తక్షణమే వేతనాలు చెల్లించకుంటే సీఎం పర్యటనలో ఆందోళన చేస్తామన్నారు. ఈ సమావేశంలో రామ్‌దయాకర్, ఏనుగుల రఘు, జి.అజయ్ స్వామి, రూతు భారతి, ప్రశాంత్, గోపాలకృష్ణ, స్వప్న, కవిత, రజిత, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
రాణించిన రైతు బిడ్డ
రేగొండ: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మూలగుండ్ల భాగ్యమ్మ, సాంబరెడ్డి కుమారుడు ఉపేందర్ రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభావంతుడు. గ్రూప్–2 ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంకు సాధించాడు. ఉపేందర్ ప్రస్తుతం పలిమెల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ పంచాయతీ కార్యదర్శిగా నాలుగేళ్లపాటు సేవలందించాడు. ప్రస్తుతం గ్రూప్–2లో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులతోపాటు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
సమస్యను పరిష్కరించాలి..
కార్మికలకు వేతనాలు చెల్లించి హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఐదు హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో మహిళా విద్యార్థులు ఉంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హాస్టళ్లలో ఉండలేం. – విహారిక, మెడికోనీటి సమస్య ఎదుర్కొంటున్నాం.. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లకు బోర్ వెల్ ద్వారా నీరునింపే పని కార్మికులు చేస్తుంటారు. వారు సమ్మెకు వెళ్లడంతో నీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. – ఇంద్రతేజ ● -
కంపు కంపు!
విధులు బహిష్కరించిన కేఎంసీ హాస్టళ్ల కార్మికులుఎంజీఎం : ప్రభుత్వ నిర్లక్ష్యం.. వేతనాల కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనతో కాకతీయ మెడికల్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న మెడికల్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత కీర్తి ప్రతిష్టలు పొందిన కేఎంసీ అధ్యాపకుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో కనీసం మౌలిక వసతులు కల్పించడంలో సైతం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వైద్యవిద్యపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మెడికల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో పనిచేసే కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు విధులు బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. 80 మందికి పైగా కార్మికులు ఆందోళన బాట పట్టడంతో హాస్టళ్లలో శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా మారిది. ఇబ్బందులు పడుతున్న 1,250 మంది విద్యార్థులు -
బాధ్యతగా పనిచేయాలి: సీపీ
స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 16న స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లపై బాధ్యతగా పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం శివునిపల్లి పాలకుర్తి రోడ్డులో నిర్వహించే సీఎం బహిరంగ సభాస్థలంతో పాటు పార్కింగ్ స్థలాలు, హెలిప్యాడ్ ప్రాంతాన్ని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్ పోలీసు అధికారులతో మాట్లాడారు. సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకో వాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అనంతరం రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌ను సీపీ సందర్శించారు. నమోదైన కేసులు, దర్యాప్తు వివరాలు, రికార్డుల గదులను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరరణ లో మొక్కల పెంపకం, పచ్చదనాన్ని చూసి పోలీసులను అభినందించారు. సీపీ వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మ, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐలు జి.వేణు, ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సైలు నరేష్, వినయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. సభాస్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ శివునిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగసభ నిర్వహించనున్న స్థలాన్ని ఆర్డీఓ డీఎస్ వెంకన్న సోమవారం పరిశీలించారు. స్థలం చదును తదితర పనుల గురించి ఆర్అండ్బీ అఽధికారుల కు సూచనలు చేశారు. -
సాగునీటి సరఫరాలో అప్రమత్తంగా ఉండండి
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలు చేతికందే వరకు సాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అధికారులతో సోమవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను కలిసి పంటలు ఎండుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను వివరించారు. అనంతరం సాగు నీటి నిర్వహణ, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. అధికారులకు పలు సూచనలు చేశారు. నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పంటలకు సాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద అత్యధికంగా వరి సాగవుతోందని, ఎగువ భాగాన రైతులు ఎక్కువ మోటార్లు పెడుతున్నారని, చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని, సాగు నీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. పంట చేతికందే వరకు చివరి ఆయకట్టుకు నీరందాలి కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం మంత్రులు ఉత్తమ్, పొంగులేటిలతో ఎమ్మెల్యేల భేటి -
కోర్కెలు తీర్చే కల్పవల్లి..
కాజీపేట రూరల్: కాజీపేట ఫాతిమానగర్‌లోని ఫాతిమామాత ప్రజల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. చరిత్రకలిగిన ఫాతిమామాత దేవా లయం కేథడ్రల్ చర్చి ప్రాంగణం ఓరుగల్లు మేత్రాసనంలో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతి ఏటా మూడు రోజులపాటు నిర్వహించే ఫాతిమామాత మహోత్సవానికి వివిధ జిల్లాల నుంచి విశ్వాసులు, అన్ని వర్గాల ప్రజలు తరలివస్తుంటారు. ఈ ఏడాది ఓరుగల్లు పీఠంలో 2025 సాధారణ జూబిలీ సంవత్సరంలో బిషప్ డాక్టర్ ఉడుములబాల ఆశీర్వాద వేళలో మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు బిషప్ సెక్రటరీ ఫాదర్ గంగారపు అనుకిరణ్ సోమవారం తెలి పారు. కాజీపేట మెయిన్రోడ్లో చర్చి ఎంట్రెన్స్ వద్ద నిర్మించిన మహాతోరణం ఆశీర్వాద ద్వారం, ప్రాంగణంలో జపమాల బృందావనం (రోజరి గార్డెన్)ను బిషప్ ఉడుముల బాల ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని కేథడ్రల్ చర్చి, ఫాతిమామాత గుహను ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవాలకు 12 జిల్లాల నుంచి 10 వేల మంది భక్తులు రానున్నట్లు తెలిపారు. మూడు రోజుల కార్యక్రమాలు.. కేథడ్రల్ చర్చిలో ఈ నెల 11వ తేదీన మంగళవారం మహాపూజ్య డాక్టర్ ఉడుములబాల దివ్యబలిపూజ సమర్పణ, దంపతులకు సన్మానం, 12వ తేదీ బుధవారం ఫాదర్ తాటికొండ జోసెఫ్, డి.జోసెఫ్ ఆధ్వర్యంలో స్వస్థత ప్రార్థనలు, దివ్యబలిపూజ, కర్కూల్ పీఠం పూజ్య ఏరువ జోజిరెడ్డిచే పూజ ప్రార్థనలు. సాయంత్రం ఫాతిమామాత స్వరూపంతో ఊరేగింపు, ఫాతిమా మాత ప్రధాన ద్వారం, రోజరి గార్డెన్ ప్రారంభం, కొవ్వత్తులతో దివ్వప్రసాద ప్రదక్షిణ ది వ్యప్రసాద ఆశీర్వాదం. 13వ తేదీన గురువారం బెంగళూర్ అగ్రపీఠం మెన్సిగ్నోర్ సి.ప్రాన్సీస్ ఆంగ్లంలో దివ్యబలిపూజ కార్యక్రమం చేయనున్నారు. ఓరుగల్లు పీఠకాపరి అండ్ విశాఖ అగ్రపీఠకాపరి ఉడుములబాల సమష్టి కృతజ్ఞత సమర్పణ. సాయంత్రం 5:30 గంటలకు మూడో పూజ, గురుశ్రీ ఆశీ ర్వాదం, ఎస్.జె దివ్యపూజ పతాక అవరోహణతో పాతిమామాత ఉత్సవాల ముగింపు. పోస్టర్ ఆవిష్కరణ కాజీపేట: మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఫాతిమామాత ఉత్సవాలను విజ యవంతం చేయాలని బిషప్ ఉడుముల బాల కోరారు. ఈమేరకు కాజీపేట మీడియా పాయింట్ ఆవరణలో స్థానిక కెథడ్రల్ చర్చి విచారణ గురువు ఫాదర్ కాసు మర్రెడ్డి ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. అనుకిరణ్, బొక్క దయాసాగర్, తాటికొండ జోసఫ్, సురేష్, నవీన్ ఫాదర్ సురేందర్, తదితరులు పాల్గొన్నారు. ఫాతిమామాత మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ముఖ్య అతిథిగా ఓరుగల్లు పీఠకాపరి ఉడుములబాల నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం -
తెలంగాణకు పట్టిన గ్రహణం సీఎం
జనగామ: తెలంగాణలో ప్రస్తుతం వచ్చిన కరువు.. కాలం తెచ్చింది కాదు.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెచ్చినదే అని, తెలంగాణకు పట్టిన గ్రహణం సీఎం అని.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవా రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి చేపల పులుసు తింటే.. బాబును ప్రజాభవన్‌కు పిలిచి అడుగులకు మడుగులు ఒత్తింది రేవంత్‌రెడ్డి కాదా.. అని ప్రశ్నించారు. కృష్ణా నదిలో రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబునాయుడు నీళ్లు దోచుకుపోతుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు. సీఎం, మంత్రికి బాబును ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేదని, యాసంగి సీజన్ పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలన చేతకాక ప్రకృతి, ప్రతిపక్షాలపై నిందలు వేసి రేవంత్‌రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఎండల తీవ్రతతో పంటలు ఎండిపోతుంటే కేసీఆర్, హరీశ్‌రావు సంతోషపడుతున్నారని సీఎం అనడం ఆయన రాజకీయ దివాలాకోరు తనానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎండలు లేవా.. ఆనాడు ఒక్క ఎకరం ఎందుకు ఎండలేదు.. ఈ రోజు సాగు నీటి కష్టాలు ఎందుకు వచ్చాయో కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాదుల ఓఅండ్ఎం కాంట్రాక్టర్‌కు రూ.7వేల కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో 33 రోజులపాటు దేవాదుల పంపు మోటార్లను ఆన్ చేయలేదని, రేవంత్ రెడ్డి చేసిన తప్పును ప్రకృతి మీద మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. గోదావరిలో ప్రవాహం ప్రారంభం కాగానే మోటార్లు ఆన్‌చేసి రిజర్వాయర్లు, చెరువులు నింపితే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే లక్ష ఎకరాలు ఎండిపోయాయని, మహబూబ్‌నగర్, నల్గొండలో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా కృష్ణానది జలాలను దోచుకోవడమే కారణమన్నారు. దేవాదుల ఫేజ్–3 మోటార్లను వెంటనే ఆన్‌చేస్తే అదనపు నీటిని తెచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వానాకాలం సీజన్లో కొనుగోలు చేసిన సన్నధాన్యానికి అందించే బోనస్ రూ.400 కోట్ల మేర పెండింగ్‌లో ఉందని తెలిపారు. ప్రస్తుతం నష్టపోయిన ప్రతీ ఎకరాకు ప్రభుత్వం రూ.20 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూముల క్లియరెన్స్, గ్రేటర్ కమ్యూనిటీలకు అనుమతుల కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 20 శాతం కమీషన్లు దండుకుంటుందని ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో శాసన మండలి బీఆర్ఎస్ శాసన సభాపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్, పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులు మేకల కలిగంరాజు, తాళ్ల సురేష్‌రెడ్డి, సంపత్, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మసిఉర్ రెహమాన్, సమ్మద్, అనిత, స్వరూప, సుధ, నాగరాజు, యాదగిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాబుకు గురుదక్షిణతోనే.. ఎడారిగా రాష్ట్రం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు -
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
కొండపర్తికి నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ● ములుగు జిల్లా కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న గవర్నర్ ● అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం సమ్మక్క–సారలమ్మ దర్శనం ● గిరిజన గ్రామాల్లో అభివృద్ధిపై సమీక్షించనున్న జిష్ణుదేవ్ సాక్షిప్రతినిధి, వరంగల్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ నుంచి బయల్దేరనున్న గవర్నర్.. దత్త త గ్రామం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి రోడ్డు మార్గాన చేరుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్‌లో భోజన విరామం తర్వాత హైదరాబాద్‌కు బయల్దేరుతారు. కాగా గవర్నర్ పర్యటన సందర్భంగా సోమవారం ము లుగు కలెక్టరేట్లో ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, ఎస్పీ శబరీష్, అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ దివాకర.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ● ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దత్తత గ్రామమైన కొండపర్తికి రోడ్డు మార్గాన బయలుదేరుతారు ● ఉదయం 11 గంటలకు కొండపర్తి గ్రామానికి చేరుకుంటారు ● 11 నుంచి 12.30 గంటల వరకు గవర్నర్ చేతుల మీదుగా వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, స్థానిక ఆదివాసీలతో గవర్నర్ మాటామంతి. ● మధ్యాహ్నం 12.30 గంటలకు కొండపర్తి నుంచి మేడారంలోని సమ్మక్క సారలమ్మ గుడికి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ● 12.45 నుంచి 1 గంట వరకు అమ్మవార్ల దర్శనాలు, మొక్కులు చెల్లించనున్నారు. ● 1 నుంచి 2 గంటల వరకు మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్‌లో భోజన విరామం. ● 2 గంటలకు ఐటీడీఏ గెస్ట్ హౌజ్ నుంచి తిరిగి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం. ● సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకోనున్న గవర్నర్ఎస్ఎస్తాడ్వాయి: తన దత్తత గ్రామమైన మండలంలోని కొండపర్తికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నేడు (మంగళవారం) రానున్నారు. ఈనేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. కొండపర్తిలో ట్రైబల్వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీహాల్, పాఠశాల భవనానికి మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం, అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి చేశారు. అంతేకాకుండా నిర్మించిన బహుళ ఉపయోగ భవనంలో కారంపొడి మిల్లు, మహిళలకు కుట్టు మిషన్లను సిద్ధం చేశారు. గవర్నర్ అభివృద్ధి పనులను ప్రారంభించి బిర్సాముండా, కొమురంభీం విగ్రహాలను మంత్రి సీతక్కతో కలిసి ఆవిష్కరించనున్నారు. కొండపర్తిలో అధికారులు గవర్నర్ రాక నేపథ్యంలో జిల్లా అధికారులు కొండపర్తి బాట పట్టారు. ఆయా శాఖల వారీగా ఏర్పాట్లు చేశారు. గర్నవర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడేందుకు వేదిక సిద్ధం చేస్తున్నారు. గ్రామంలోని రోడ్లు శుభ్రం చేసి సైడ్ బర్మ్‌కు మట్టి పోశారు. కొండపర్తిలో ప్రత్యేక హెల్త్ క్యాంపు ఏర్పాటుకు డీఎంహెచ్ఓ గోపాల్‌రావు గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు. ట్రైబల్ వెల్పేర్ ఈఈ వీరభద్రం దగ్గరుండి ఏర్పాట్లు చేయించారు. స్థానిక ఎంపీడీఓ సుమనవాణి, ఎంపీఓ శ్రీధర్‌రావు పరిశుభ్రత ఏర్పాట్లను సిబ్బందితో చేయించారు. ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం కలెక్టర్ దివాకర ఏర్పాట్లను పరిశీలించారు. పీహెచ్సీలో అత్యవసర గది ఏర్పాటు గవర్నర్ కొండపర్తికి వస్తున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం తాడ్వాయి పీహెచ్సీలో అత్యవసర గదిని సిద్ధం చేశారు. ఈ గదిలో రెండు పడుక మంచాలు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు. డీఎంహెచ్ఓ గోపాల్‌రావు గదిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రణధీర్, వైద్యాధికారి అడెపు చిరంజీవి, సిబ్బంది ఉన్నారు.రోడ్డు నిర్మించాలి కొండపర్తి స్టేజీ నుంచి గ్రామం వరకు రోడ్డును బాగు చేయాలి. గతంలో బీటీ రోడ్డు పనులను మొ దలు పెట్టగా అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి. – చింత కౌసల్య, కొండపర్తిఆర్థికాభివృద్ధికి భరోసానివ్వాలి.. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం సంతోషంగా ఉంది. మహిళ కోసం కుట్టు మిషన్లు, కారంపొడి మిల్లు నెలకొల్పారు. మహిళలకు డైరీ ఫాంలు, ఫౌల్ట్రీఫాంలు నెలకొల్పితే కుటుంబాలకు ఆర్థికభరోసా ఉంటుంది. – రజిత, కొండపర్తిగవర్నర్ టూర్ షెడ్యూల్ ఇలా..గవర్నర్ దత్తత శుభపరిణామం అటవీ ప్రాంతంలో ఉన్న కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకోవడం సుభపరిణామం. సాగునీటి కోసం బోర్లు నిర్మిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేసుకునే ఆలోచనలో ఉన్నాం. – అరెం లచ్చుపటేల్, మేడారం జాతర చైర్మన్ -
గ్రూప్–1లో మెరిసిన గిరిజన ఆణిముత్యం
గార్ల: గిరిజన రైతు కుటుంబంలో పుట్టి గ్రూప్–1లో 900 మార్కులకు 454 మార్కులు సాధించాడు గిరిజన ఆణిముత్యం గంగావత్ పవన్‌కల్యాణ్. మానుకోట జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురం గ్రామానికి చెందిన గంగావత్ లక్ష్మణ్, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు గంగావత్ పవన్‌కల్యాణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1 నుంచి ఇంటర్ వరకు చదివాడు. 10వ తరగతిలో 10/10 జీపీఏ సాధించడమే కాకుండా ఇంటర్లో ఎంఈసీ గ్రూప్‌లో పబ్లిక్ స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కళాశాలలో డిగ్రీలో సీటు సాధించి బీఏ ఎకనామిక్స్ పూర్తిచేశాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే గ్రూప్–1 పరీక్ష రాసిన పవన్‌కల్యాన్ ఉత్తమ ఫలితం సాధించాడు. ఎస్టీ విభాగంలో కాకుండా ఓపెన్ కోటాలోనే డిప్యూటీ కలెక్టర్ పోస్టు వస్తుందని పవన్‌కల్యాణ్ ధీమా వ్యక్తం చేశాడు. పవన్‌కల్యాణ్‌ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు. జశ్వంత్రాజ్ప్రతిభ మహబూబాబాద్ అర్బన్: సోమవారం విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో మానుకోట జిల్లా కేంద్రంలోని సంఘాల రవికుమార్ ప్రసన్న దంపతుల కుమారుడు సంఘాల జశ్వంత్‌రాజ్ 900 మార్కులకు 465 మార్కులు సాధించాడు. గ్రూప్ వన్‌లో అత్యధికంగా మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెన్త్ స్పాట్ విధుల రెమ్యునరేషన్ చెల్లించండి ● డీఈఓకు టీఆర్టీఎఫ్ వినతి విద్యారణ్యపురి: గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం హనుమకొండలో టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యంకణంలో విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు నేటికీ రెమ్యునరేషన్ చెల్లించలేదు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బాసిరి రాజిబాపురావు, జనరల్ సెక్రటరీ గుగులోతు శ్రీనివాస్‌నాయక్‌లు సోమవారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెమ్యునరేషన్‌తోపాటు టీఏ, డీఏలు చెల్లించలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈఏడాది ఏప్రిల్‌లో కూడా టెన్త్ విద్యార్థుల పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనం ఉంటుందని కానీ, గత ఏడాదికి సంబంధించిన రెమ్యునరేషనే ఇవ్వకపోవడం దారుణమన్నారు. వెంటనే రెమ్యునరేషన్ చెల్లించాలని లేదంటే ఈఏడాది నిర్వహించబోయే స్పాట్ వాల్యూయేషన్‌ను ఉపాధ్యాయులు బహిష్కరించాల్సి వస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. క్రీడల్లోనూ పిల్లలను ప్రోత్సహించాలి వరంగల్ స్పోర్ట్స్: పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని సీనియర్ సివిల్ జడ్జి క్షేమదేశ్పాండే తల్లిదండ్రులకు సూచించారు. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ బస్టాండ్ సమీపంలోని శ్రీహర్ష కన్వెన్షన్హాల్లో సోమవారం నిర్వహించిన ఓపెన్ టు ఆల్ ఉమ్మడి జిల్లా స్థాయి చదరంగ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి క్షేమదేశ్పాండే, విశిష్ట అతిథిగా కన్వెన్షన్‌హాల్ డైరెక్టర్ వేణు హాజరై విజేతలకు బహుమతులను అందజేసి, మా ట్లాడారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 80 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఓపెన్ టు ఆల్ విజేతగా అల్లాడి శ్రీవాత్సవ్ నిలవగా వరుస స్థానాల్లో రిత్విక్ గండు, షేక్ రియాజ్, స్వాతి దేవరపల్లి, ఎం.దీక్షిత్ నిలిచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్లు, తదితరులు పాల్గొన్నారు. -
తల్లిని హత్యచేసిన తనయుడి అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీఐ రమేశ్ ఎల్కతుర్తి: కన్నతల్లిని గొడ్డలితో నరికి హత్య చేసిన తనయుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశా రు. దీనికి సంబంధించి మండల కేంద్రంలో సీఐ పులి రమేశ్ తన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం అజయ్ తనకు రావాల్సిన భూమి వాటాను తల్లి చదిరం రేవతి(45) పంచివ్వ డం లేదన్న కోపంతో ఈనెల 7న గొడ్డలితో నరికి హత్య చేశాడు. దీంతో మృతురాలి చిన్న కుమారుడు చదిరం విజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలో మండలంలోని కోతులనడుమ గ్రామ సమీపంలో సోమవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తారసపడిన అజయ్‌ని అరెస్టు చేసి, విచారింగా.. నేరం అంగీకరిండంతో రిమాండ్‌కు తరలించిన ట్లు సీఐ వెల్లడించారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్, మల్లే శం, గణేశ్, భాస్కర్‌రెడ్డి, నిరంజన్ పాల్గొన్నారు. -
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuతోడబుట్టిన వారే కష్టపెడుతున్నరు.. జనగామ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన గంట శ్రీలతకు పెళ్లి సమయంలో 50 గజాల స్థలాన్ని పుట్టింటి వారు కట్నం కింద ఇచ్చారు. ఏడు సంవత్సరాల క్రితం భర్త యోగానందు చనిపోవడంతో శ్రీలత ప్రైవేట్ స్కూల్లో పని చేస్తూ తన కూతురును పోషించుకుంటున్నది. ఓ బ్యాంకులో రుణం తీసుకుని ఉన్న కొద్ది స్థలంలో ఇల్లు కట్టుకున్నది. రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇంటి స్థలం ఇచ్చేయాలంటూ సోదరులు ఇబ్బందులకు గురి చేస్తుండడంతో ఆ అభాగ్యురాలు కలెక్టరేట్ మెట్లెక్కింది. ఇదిలా ఉండగా.. పెద్ద దిక్కు లేకపోవడంతో తల్లిదండ్రులు సైతం శ్రీలత వద్దే ఉంటూ ధైర్యం చెబుతున్నారు. కూతురు కష్టాలు చూడలేక ఆ దంపతులు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వేట్రాక్ వద్దకు వెళ్లగా గమనించిన స్థానికులు కాపాడారు. కూతురుకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.పక్క ఫొటోలోని వృద్ధ దంపతులు వెంకటకృష్ణయ్య, బుచ్చమ్మది చిల్పూరు మండలం శ్రీపతిపల్లి. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండో కుమారుడు రంగయ్య ఇల్లరికం వెళ్లగా, మిగతా వారు ఊరిలోనే ఉంటున్నారు. ఆరు నెలల క్రితం ప్రమాదం జరగ్గా వెంకటకృష్ణయ్య కాలు తొలగించారు. అప్పటి నుంచి ఆ దంపతులకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే ముగ్గురు కుమారులు ఉన్న భూమి పంచుకుని తల్లిదండ్రులకు బువ్వ పెట్టకుండా ఇబ్బందుల కు గురిచేస్తుండడంతో ఆ పండుటాకులు న్యాయం కోసం తహసీ ల్దార్, ఆర్డీఓను ఆశ్రయించారు. ‘కొడుకులు అన్నం పెట్టడంలేదు.. ఓ చిన్న గదిలో వండుకుంటున్నాం’ అంటూ ఆ దంపతులు కలెక్టర్‌తో తమ కష్టాలు చెప్పుకుని విలపించారు. ‘ఆర్డీఓకు ఆదేశాలు ఇచ్చా.. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది.. వెళ్లి కలవండి’ అంటూ కలెక్టర్ వారికి భరోసా కల్పించారు. న్యూస్‌రీల్ -
నీరు, గడ్డి లేక గోవుల మృతి
పాలకుర్తి టౌన్: గోశాలలో సరైన తాగునీరు, గడ్డి అందుబాటులో లేక గోవులు మృతి చెందాయని గోసంరక్ష ప్రముఖ్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షుడు భూపాల్, లీగల్ కమిటీ ప్రముఖ్ అడ్వకేట్ అనిత ఠాకూర్ అన్నారు. మండ ల కేంద్రంలోని గోశాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో గోవులు చనిపోతున్న విషయం తెలుసున్న వీరు సోమవారం గోశాలను సందర్శించి వివరాలను సేకరించారు. అర్హులైన రైతులకు గోవులను ఇచ్చేలా చూడలని స్థానిక పోలీస్‌సేష్టన్‌లో ఎస్సై పవన్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. హిందూ పరిరక్షణ సమితి, గోసంరక్షణ జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ ప్రముఖ్ పసునూరి సందీప్, నగేష్, స్వామి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.● గోసంరక్ష ప్రముఖ్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ -
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
● కలెక్టర్ రిజ్వాన్ బాషాజనగామ రూరల్: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారు ఐక్యంగా ఉంటే అద్భుతా లు సృష్టించగలరని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. సోమవారం కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యా న మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. మహిళలు ఇంటా, బయట సమానత్వంతో పాటు జీవితంలో ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఆడ, మగ మధ్య వ్యత్యాసం చూడకూడదని, 80 శాతం మహిళలే జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపార, వృత్తి, ఉపాధి రంగాల్లో మహిళ పాత్ర గణనీయమని, ఆడపిల్లను తల్లితండ్రులు తప్పనిసరి చదివించి వారికి అండగా నిలవాలని సూచించారు. అనంతరం ఐడీఓసీని పరిశుభ్రంగా ఉంచుతున్న మహిళా శానిటేష న్ సిబ్బందిని, మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మి కులను సత్కరించి బహుమతులు అందజేశారు. కేక్ కట్ చేసిన అనంతరం వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు, ఉత్తమ మహిళా ఉద్యోగుల కు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి ఫ్లోరెన్స్, డీపీఓ స్వరూప, డీఆర్డీఓ వసంత, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, జౌళి శాఖ అధికారి చౌడేశ్వరి, జెడ్పీ సీఈఓ మాధురీ కిరణ్చంద్రషా, డిప్యూటీ సీఈఓ సరిత, సీడీపీఓ రమాదేవి, మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ హెచ్.శారద, టీజీఓస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, టీఎన్జీఓస్ ప్రెసిడెంట్ ఖాజా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
కుంటకు గండి.. బోర్లు, బావులు ఖాళీ
పెద్దమడూరు గ్రామంలోని పీర్వావాయుకుంట ఆరు ఎకరాల విస్థీర్ణంలో జలకళతో ఉండేది. మూడేళ్ల క్రితం గండి పడింది. గోదావరి జలాలు, వరద నీళ్లు ఇచ్చినా.. నిమిషాల్లో ఖాళీ అయిపోతున్నాయి. కుంటకింద 20 బోర్లు, ఐదు బావుల పై ఆధారపడి సుమారు 20 మందికి పైగా రైతులు పంటల సాగు చేస్తున్నారు. గండిని పూడ్చాల ని ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి నా ప్రయోజనం లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు, బావులు ఎండిపోయాయి. ‘వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నాం. సమస్య పరిష్కరించాలి’ అని రైతులు కోరారు. – పెండెల దశరథ, రుద్రోజు ఉప్పలయ్య, రైతులు, పెద్దమడూరు(దేవరుప్పుల) -
వైభవంగా ధ్వజారోహణం
చిల్పూరు: శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు ధ్వజారోహణం, గరుడముద్ద కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ శ్రీధర్‌రావు–కిరణ్మయి దంపతులు, ఉద్యోగులు, ధర్మకర్తలు పాల్గొన్నారు. శ్రీతిరుమలనాథస్వామి దేవాలయంలో.. స్టేషన్‌ఘన్‌పూర్: శ్రీతిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక ఆలయంలో సోమవారం ప్రధాన అర్చకులు కలకోట రామానుజచార్యులు, రంగాచార్యులు ఆధ్వర్యాన ధ్వజారోహణం, గరుడ ముద్ద, హోమం, బలిహరణం, దేవతాహ్వానం, భేరీపూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. 26న ఢిల్లీలో ధూం ధాం జనగామ రూరల్: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న ఢిల్లీలో వందలాది మంది కళాకారులచే ‘ధూం ధాం’ నిర్వహిస్తున్నట్లు కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్ అన్నారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని ఓ పంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ‘చలో ఢిల్లీ’ సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ కారణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింద ని, అలాంటి మహనీయుడి ఫొటో నోట్లపై ముద్రించకపోవడం ఆయనను విస్మరించడమే అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పులి శేఖర్, పిడుగు ఆశీర్వాదం, తిప్పరపు ప్రసాద్, తాళ్లపల్లి ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఉత్తమ ఉద్యోగులకు సత్కారం జనగామ: జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్ శాఖలో ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసపత్రాలు అందుకున్న అధికారులు జ్యోతిర్మయి, భువనేశ్వరి, సోనియాను ఎస్ఈ టి.వేణుమాధవ్ సోమవారం సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ గణేష్, ఎస్ఏఓ జయరాజు, టెక్నికల్ ఏడీఈ తదితరులు పాల్గొన్నారు. 88 మంది గైర్హాజరు జనగామ రూరల్: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 88 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్ విద్యాధి కారి కె.జితేందర్‌రెడ్డి తెలిపారు. మొత్తం 4,132 విద్యార్థులకు గాను 4,044 పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. నర్మెట, జనగామ పరీక్ష కేంద్రాలను డీఐఓ, జఫర్‌గఢ్, ఘన్పూర్ సెంటర్లను ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు సందర్శించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లను సోమవా రం మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరికి మంచి ధర రావాలంటే రైతులు ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకురావాల ని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. డైరెక్టర్లు నాగబండి రవీందర్, నామాల శ్రీనివాస్, బన్సీ నాయక్, బొట్ల నర్సింగరావు, అడ్తి అసోసియేష న్ అధ్యక్షుడు ఎం.వెంకన్న పాల్గొన్నారు. -
పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించా రు. సూర్యాపేట జిల్లానుంచి బదిలీపై వచ్చిన ఆయన.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సాయుధ పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. డీసీపీలు, అదనపు డీసీపీలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్‌గా పూర్వ సీపీ అంబర్ కిషోర్ ఝానుంచి బాధ్యతలు స్వీకరించారు. అంబర్ కిషోర్ ఝా.. నూతన సీపీకి పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వందశాతం శాంతి భద్రతలను కాపాడుతామని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగే విధంగా ఇరువై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ప్రధానంగా నేరాల నియంత్రణతోపాటు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తు తం పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు అయిన సైబర్ క్రైం, మత్తు పదార్థాల కట్టడితోపాటు మత్తు పదార్థాలను వినియోగించేవారు, విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. రాబోయే రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులను మరింత బలోపేతం చేస్తామన్నారు. అభినందనలు తెలిపిన వారిలో డీసీపీలు షేక్ సలీ మా, రాజమహేంద్రనాయక్, అంకిత్ కుమార్, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో నూతన సీపీ సన్‌ప్రీత్‌సింగ్ బాధ్యతల స్వీకరణ -
రైతుల గోస పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం
జనగామరూరల్/స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి/బచ్చన్నపేట/జఫర్‌గఢ్/పాలకుర్తి టౌన్/దేవరుప్పుల: ఒకవైపు పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస పట్టించుకోవ డం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నా రు. సోమవారం ఆయన జిల్లాలో పర్యటించారు. వివిధ మండలాల్లో ఎండిన పంటలను, జఫర్‌గఢ్ లో అసంపూర్తిగా ఉన్న దేవాదుల కాల్వలను, పాలకుర్తిలో రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రం, ఘన్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ గండిరామవరం, బొమ్మకూరు, చిటకోడూరు, నవాబ్‌పేట, ఆర్ఎస్సార్ ఘనపూర్, అశ్వరావుపల్లి, కన్నబోయినగూడెం, వెల్దండ రిజ ర్వాయర్లలో ఫిబ్రవరి మొదటి వారంలోనే నీరు అడుగంటి కాల్వల్లో నీరులేక పంటలు ఎండిపోయే దశకు వచ్చాయన్నారు. జిల్లాలో 1లక్ష 66 వేల ఎకరాల్లో రైతులు వరి సాగుచేస్తే ఇప్పటికే 45శాతం సాగునీరు అందక పొలాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలు రాక భూగ ర్భ జలాలు అడుగంటి రైతులు అరిగోస పడుతున్నారని, చెరువులు కుంటలు నింపి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు అప్పులు తెచ్చి వరి వేస్తే ఫలితం లేకుండా పోయిందని, ప్రభుత్వం బాధ్యత వహించి ఎకరాకు రూ.50వేలు పరిహారం ఇవ్వాల ని డిమాండ్ చేశారు. ఈనెల 16న సీఎం రేవంత్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్‌కు వస్తున్నందున ముందే ఎండిన పంటలపై సర్వే నిర్వహించి నష్టపరిహారంపై ప్రకట న చేయాలన్నారు. జాన్‌వెస్లీ వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ.అబ్బాస్, జిల్లా కార్యదర్శి కనకారె డ్డి, రాపర్తి రాజు, ఇరి అహల్య, యాదగిరి, రమేష్, శేఖర్, వెంకటేష్, విజేందర్, ఎల్లయ్య, రవీందర్‌రెడ్డి తదితరులున్నారు. ఇదిలా ఉండగా.. స్టేషన్‌ఘన్‌పూ ర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కటించాలని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఇక్కడి నిరుద్యోగులకోసం పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. ఎండిన పంటలకు పరిహారం చెల్లించాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలి
జనగామ రూరల్: స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా గూగుల్ మీట్ ద్వారా సంబందిత అధికారులను ఆదేశించారు. ఆదివారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి ఎల్ఆర్ఎస్పై ఆర్డీఓలు, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలతో గూగుల్ మీట్లో అవగాహన కల్పించారు. మార్చి 31వ తేదీలోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని, ఇది ప్రతీఒక్కరి బాధ్యతగా తీసుకోవాలన్నారు. రుసుం చెల్లించిన దరఖాస్తును మున్సిపల్ వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీలు పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్, మండల కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు వెంకన్న, గోపిరామ్, జిల్లా పంచాయతీ అధికారిణి స్వరూప, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక శాఖ అధికారి వీరస్వామి, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్పై విస్తృత ప్రచారం చేయాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా -
రంజాన్ ‘స్పెషల్’.. హరీస్
జనగామ: పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ముస్లింటు తెల్ల వారు జాము నుంచి సూర్యాస్తమయం వరకు రోజా(కఠోర ఉపవాస దీక్షలు) ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు సహర్ వేళ ఆహారంతో పాటు బాదం, జీడి పప్పు, పిస్తా, అంజూర్, అక్రూట్, కిస్మిస్ వంటివి తీసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. నోరూరించే హరీస్ రంజాన్ అనగానే హరీస్, హలీం వంటకాలు గుర్తుకు వస్తాయి. వీటిలో పోషక విలువలు అధికంగా ఉండడంతో వీటిని తినేందుకు ఆసక్తి చూపుతారు. ఉపవాస దీక్ష చేసేవారు ఎక్కువగా ఇఫ్తార్ తర్వాత హరీస్, హలీం ఆరగిస్తారు. మాసం, నెయ్యి, గోధుమ, రవ్వతో పాటు 20 రకాల పదార్థాలను హరీస్, హలీం తయారీకి ఉపయోగిస్తారు. జిల్లా కేంద్రంలో 20కిపైగా సెంటర్లు ఏర్పాటు చేశారు. ఖర్జూరం.. ఈద్ ఫలం ఖర్జూరం రంజాన్ ఈద్ ఫలంగా ప్రసిద్ధి. 100 గ్రాముల ఖర్జూరంలో 234 కేలరీల శక్తి, 1.8 గ్రాముల ప్రొటీన్లు, 55.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.5 గ్రాముల కొవ్వు, 7.6 గ్రాముల పీచు పదార్థం, 4 మిల్లీ గ్రాముల సోడియం, 60.9 మిల్లీ గ్రాముల పొటాషియంతో పాటు ఐరన్ విటమిన్ బీ పుష్కలంగా ఉంటాయి. ఇదే మోతాదులో ఎండు ఖర్జూరంలో ఉంటాయి. అంజీరాతో రక్త శుద్ధి అంజీరాలు రక్త శుద్ధి చేసి రక్తహీనతను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో 250 కేలరీల శక్తి, 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 30 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. ఎండు ఫలాల్లో శక్తి అధికం ఎండు ఫలాల్లో(డ్రైఫ్రూట్స్) శక్తి అమోఘంగా ఉంటుంది. దీక్ష విరమించిన తర్వాత ప్రతి ముస్లిం తప్పక తీసుకునే వాటిలో ఇవే ప్రధానం. పిస్తా పప్పులో 559 కేలరీల శక్తి ఉంటుంది. 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 30 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. బాదం పప్పులో శరీరానికి మేలు చేసే కొవ్వు, రెండు శాతం ఐరన్ ఉంటుంది. దీంతో 250 కేలరీల శక్తి లభిస్తుంది. జీడిపప్పులో 550 కేలరీల శక్తి లభిస్తుంది. కిస్మిస్లో 299 కేలరీల శక్తిని అందించడం దీని ప్రత్యేకత. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు కూడా ఇది అందిస్తుంది. తాజా పండ్లతో శక్తి.. ఈ కాలంలో దొరికే తాజా పండ్లు దీక్షలో ఉన్న వారు నీరసించి పోకుండా శక్తిని అందిస్తాయి. ద్రాక్షలో 70 గ్రాముల ఐరన్, అరటిలో 110 మిల్లీ గ్రాముల కార్బోహైడ్రేట్స్, కమలాలు, నిమ్మకాయలు, దానిమ్మలో పొటాషియంతో పాటు అధిక కేలరీల శక్తి ఉంటుంది. పోషక విలువల డ్రైఫ్రూట్స్.. జోరందుకున్న పండ్ల వ్యాపారం జిల్లా కేంద్రంలో 20కి పైగా సెంటర్లు -
చందన సమాఖ్యకు ఆర్టీసీ బస్సు
దేవరుప్పుల: రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆర్థిక స్వాలంబన దిశలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిర మహిళా శక్తి పథకం కింద దేవరుప్పుల చందన మండల సమాఖ్యకు శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు అందించారు. జిల్లాలో ఆయా మండల సమాఖ్యలకు అందించేందుకు మంజూరైన ఏడు బస్సులకుగాను ప్రారంభోత్సవంలో దేవరుప్పుల మండలానికి అరుదైన అవకాశం లభించింది. దీంతో సమాఖ్య మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్ల ఉమ, మునిగొండ శారద, ఏపీఎం వెంకట్‌రెడ్డి, సిబ్బంది మొలుగూరి వెంకన్న తదితరులు హర్షం వ్యక్తం చేశారు. బస్సు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మండల సమాఖ్యకు రూ.30 లక్షలు అందజేయాగా మిగతా ఖర్చులు సమాఖ్య భరించాల్సి ఉంటుంది. బస్సును జనగామ డిపోకు కేటాయించగా ప్రతీ నెల అద్దె రూపంలో రూ.77 వేలు సమాఖ్యకు చెల్లించాల్సి ఉంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా అందించిన ప్రభుత్వం -
అభ్యసన సామర్థ్యంపై సర్వే
జనగామ రూరల్: గత సంవత్సరం 1వ తరగతిలో ప్రవేశించి ఎఫ్ఎల్ఎన్ విధానంలో విద్యనభ్యసిస్తూ ప్రస్తుతం 2వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఎస్సీఆర్టీ ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషన్, లిట్రసీ, న్యూమరసీ) శాంపిల్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు జిల్లా నుంచి ఇద్దరు మాస్టర్ ట్రైనర్లకు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్వే చేపట్టడానికి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్‌గా ఎంపికై న 55 మంది ఛాత్రోపాధ్యాయులకు కూడా జిల్లా కేంద్రంలో రెండు రోజుల శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 50 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈనెల 10, 11, 12 తేదీల్లో సర్వే నిర్వహిస్తారు. 10వ తేదీ తెలుగు, 11వ తేదీ గణితం, 12వ తేదీ ఆంగ్లంలో సర్వే చేపడతారు. వీటితో పాటు హెచ్ఎం, టీచర్ అబ్జర్వ్ ఫామ్‌లు పూర్తి చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 50 పాఠశాలలు ఎంపిక చేయగా ఆయా పాఠశాలల్లోని 2వ తరగతి విద్యార్థుల్లో ర్యాండమ్ పద్ధతిలో 8 మందిని గుర్తించి వారికి మాత్రమే ఈ సర్వే నిర్వహిస్తారు. సర్వే నిర్వాహకులకు తెలుగు, గణితం, ఆంగ్లం టాస్క్ షీట్లను అందించారు. సర్వే సజావుగా నిర్వహించాలి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలోని రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించేందుకు చేపట్టే ఎఫ్ఎల్ఎన్ సర్వే సజావుగా నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా విద్యాశాఖ అన్ని విధాలుగా ఎఫ్‌లకు సహకరిస్తుంది. – బి.శ్రీనివాస్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి 2వ తరగతి విద్యార్థులకు ‘ఎఫ్ఎల్ఎన్’ శాంపిల్ సర్వే మూడు రోజుల పాటు నిర్వహణ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ పూర్తి -
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి నిధులు
జఫర్‌గఢ్: నిరుపేద విద్యార్థులకు అన్ని హంగులతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణాలకు నిధులను మంజూరు చే స్తూ ఆదివారం ఉత్తర్వులను జారీ చేసింది. జఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట శివారులో (కోనాయిచలం రెవెన్యూ గ్రామ పరిఽధిలో) ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో 26 ఎకరాల్లో స్కూల్ నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణ పనులను ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. భవన నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసింది. కొద్ది నెలల క్రితం ఎమ్మెల్యే కడియం శ్రీహ రి, కలెక్టర్ రిజ్వాన్, ఆర్డీఓ వెంకన్న తదితర అధికా రులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన విషయం విధితమే. విద్యా హబ్‌గా జఫర్‌గఢ్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు నాణ్య మైన విద్యను అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రెండో విడతలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని జఫర్‌గఢ్ మండలంలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. భవన నిర్మాణ పనులు పూర్తి అయితే జఫర్‌గఢ్ మండలం విద్యా హబ్ మారనుంది. ఎమ్మెల్యే కడియం హర్షం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. అన్ని హంగులతో విద్యార్థులకు ఒకే చోట నాణ్యమై న విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భ ట్టి విక్రమార్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 16న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన -
‘గ్రావెల్’ మాఫియా
అంతా అనధికారమే! ● కొంత అనుమతి తీసుకుని గుట్టలను కరిగించడమే కాదు.. అసలు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టడం ఉమ్మడి వరంగల్‌లో పరిపాటిగా మారింది. వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొరం, మట్టి దందా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ తవ్వకాల గురించి సమాచారం తెలిసినా అధికారులు ‘మాములు’గా తీసుకుంటున్నారు. ● మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం జంగిలిగొండలోని ప్రభుత్వ భూమిలో గతంలో తవ్వకాలు జరుగుతుండగా అధికారులు అడ్డుకుని హద్దులు ఏర్పాటు చేసినా ఆగడం లేదు. ● ములుగు జిల్లా ములుగు పంచాయతీ శివారు 837 సర్వే నంబర్లోని సుమారు 200 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించగా.. అక్రమార్కులు మట్టి తవ్వకాలు ఆపడం లేదు. ● వరంగల్ నగరానికి సమీపాన ఉన్న ప్రాంతాల్లో వందలాది ట్రాక్టర్ల ద్వారా మొరం తరలిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1500 నుంచి రూ.2500 చొప్పున సుమారు 500 ట్రిప్పుల మొరానికి రూ.7.50 లక్షల నుంచి రూ.12.50 లక్షలు ఆర్జిస్తున్నారు. ● జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ ఎన్నె చెరువు పక్కన 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను రాత్రి పూట పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తవ్వి మట్టిని తరలించారు. చంపక్‌హిల్స్ గుట్టల్లోనూ మట్టిని తోడేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ● వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకులు, వంచనగిరి ప్రాంతంలోని ఎస్సారెస్పీ కాల్వ పక్కన, కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు వాటికి ఇరువైపులా బ్యాంకింగ్ పేరుతో పోసిన కట్టల మొరాన్ని తరలించి సొమ్ము చేసుకున్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్: అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో అనుమతుల పేరిట సహజ వనరుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు అక్రమార్కులు. అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలతో గుట్టలు, ప్రభుత్వ భూముల్లో మొరం(గ్రావెల్) తవ్వేస్తూ కాసులవేట సాగిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టూ ఉన్న దామెర, హసన్‌పర్తి, గీసుకొండ, శాయంపేట, ధర్మసాగర్ తదితర మండలాల్లో గ్రావెల్ మాఫియాకు అడ్డు లేకుండా పోయింది. కొందరు మొరం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి టెంపరరీ పర్మిట్ల(టీపీ)తో పట్టా భూములు, గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వేస్తున్నారు. చాలాచోట్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వ గట్లను తవ్వుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దోపిడీ సాగుతోందిలా.. గ్రావెల్ మాఫియా టీఎస్ఎంఎంసీ రూల్స్ 1966–9(4) ప్రకారం పట్టాభూములు, రైతుల పేరిట రెండు నెలల గడువుతో తాత్కాలిక అనుమతులు పొందుతూ ఇష్టారాజ్యంగా మొరం దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన భూమిలో ఏరియాను బట్టి 8–12 అడుగులలోపు లోతు మాత్రమే తవ్వాల్సి ఉంది. అలా చేస్తే రెండున్నర హెక్టార్లలో సుమారు 7–8 వేల మెట్రిక్ టన్నుల గ్రావెల్ మాత్రమే వస్తుందని మైనింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గ్రావెల్ మాఫియా అందుకు భిన్నంగా 15–30 అడుగుల లోతు వరకు తవ్వి లారీలు, టిప్పర్ల ద్వారా పెద్ద మొత్తంలో మొరం తరలిస్తున్నారు. ఇందుకు సుమారు రెండున్నర హెక్టార్ల కోసం రూ.1.50 లక్షల వరకు రాయల్టీ చెల్లిస్తూ.. రూ.కోట్లల్లో సంపాదిస్తున్నారు. కళ్లెదుటే ఈ అక్రమం జరుగుతున్నా.. ఏ శాఖ కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంచికి చేరిన కోమటిపల్లి గుట్ట దందా.. హసన్‌పర్తి మండలం భీమారం శివారు 340 సర్వే నంబర్లో సుమారు 57 ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్డేడియం ఏర్పాటుకు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా.. ఓవైపు కళాశాలలకు కేటాయించిన సర్కార్ మరోవైపు 340/1 సర్వే నంబర్ పేరిట రెండున్నర హెక్టార్ల(3.260) భూమిని కె.నవీన్‌రావు పేరిట క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి 5 సంవత్సరాల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్‌అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. క్యూబిక్ మీటర్‌కు రూ.30ల చొప్పున 29,90,900 క్యూబిక్ మీటర్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుని గుట్టంతా ఖాళీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రూ.లక్షల ప్రజాధనం పక్కదారి పట్టినా.. ఈ దందాలో తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్టనర్‌గా ఉండటం వల్ల అప్పట్లో పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ●నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మొరం తరలింపులో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా అనుమతులు తీసుకొని మాత్రమే మొరం తవ్వకాలు చేపట్టాలి. – జ్యోతివరలక్ష్మీదేవి, తహసీల్దార్, దామెర యథేచ్ఛగా మొరం తవ్వకాలు అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట కాల్వగట్లు, గుట్టలనూ వదలని అక్రమార్కులు ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు -
‘ఉపాధి’లో వెలుగులు
జనగామ రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో ఇకపై కూలీల సంఖ్య పెరగనుంది. భూమి లేని వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12వేలు అందజేస్తోంది. అయితే లబ్ధిదారుల ఎంపికకు ఉపాధి హామీ పనులనే ప్రామాణికంగా తీసుకోవడంతో ఉపాధి పనులకు మరింత డిమాండ్ పెరుగనుంది. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి పనులకు వెళ్తేనే పథకం వర్తించడంతో జాబ్ కార్డుల అవసరం కానుంది. జాబ్ కార్డులు ఉన్నా పలువురు కూలీ పనులకు వెళ్లలేదు. దీంతో గత జనవరి 26న ప్రకటించిన లబ్ధిదారుల జాబితాలో చాలా మందికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈసారైనా పనులను సద్వినియోగం చేసుకోవాలని కూలీలు భావిస్తున్నారు. ఉపాధి ప్రణాళికలో వచ్చే 2025–26లో ఉపాధి కూలీల సంఖ్య పెరగనుంది. ఉపాధికి మరింత ఆదరణ గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు నివారించాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించి కూలీల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ పథకం ద్వారా పలువురు కూలీలు స్వ గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి 100 రోజుల పాటు పని కల్పించాలనేది ఈ పథకం లక్ష్యం. గ్రామాల్లో ప్రతీఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలల పాటు ఉపాధి పనులు జోరుగా సాగుతుంటాయి. వేసవిలో వ్యవసాయ పనులు అంతగా లేకపోవడంతో కూలీలు ఉపాధి పనులపై ఆసక్తి చూపుతారు. జిల్లాలో 281 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు చేపడుతుండగా ఏటా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా హాజరవుతున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో ఉపాధి హామీ పథకానికి మరింత ఆదరణ లభించనుంది. ‘ఆత్మీయ భరోసా’కు ఎన్ఆర్ఈజీఎస్ లింక్ 20 రోజులు పని చేస్తేనే పథకం వర్తింపు గ్రామాల్లో పెరుగనున్న కూలీల సంఖ్య జిల్లాలో 1.18 లక్షల జాబ్కార్డులుఉపాధి హామీకి ఆదరణ గతంలో కంటే ఈసారి ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 8 వేలకు పైగా పనులకు హాజరవుతున్నారు. ఈనెల చివరి నాటికి ఉపాధి కూలీల సంఖ్య పెరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుతో ఉపాధి హామీ పథకానికి ఆదరణ పెరగనుంది. పని ప్రదేశాల్లో కూలీలకు తగిన వసతులు కల్పిస్తాం. – వసంత, డీఆర్డీఓ -
ఇన్స్పైర్ అవార్డులకు ఎంపిక
స్టేషన్‌ఘన్‌పూర్: భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అందించే ఇన్స్పైర్ అవార్డులు 2024–25 సంవత్సరానికి గాను మండలంలోని తాటికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బురుగు రాజు, నారబోయిన శ్రీమాన్, పూల జశ్వంత్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు అవార్డులకు ఎంపికై న విద్యార్థులను హెచ్ఎం లింగమూర్తి, పీడీ గీరెడ్డి ప్రమోద్‌రెడ్డి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ బేతి మంజుల, గైడ్ టీచర్లు మురళి, అనసూయ, శ్రీనివాస్, రవీందర్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. 12న జిల్లా స్థాయి యవజన ఉత్సవాలుజనగామ రూరల్: ఈనెల 12న నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని జిప్స్ కళాశాలలో జరిగిన సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. పోటీల్లో యంగ్ రైటర్స్, యంగ్ ఆర్టిస్ట్, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, సంస్కృతిక జానపద నృత్యం (గ్రూప్) సైన్స్ ఎగ్జిబిషన్ వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసపత్రం అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని యువజన సంఘాలు, కళాశాల విద్యార్థులు త మ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9502126384, 9505496034 నంబర్లకు సంప్రదించాలని కోరారు. సర్వాయి పాపన్న జిల్లాగా గెజిట్ విడుదల చేయాలిరఘునాథపల్లి: బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లాగా గెజిట్ విడుదల చేయాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని రఘునాథపల్లి, ఖిలాషాపూర్‌లో జరిగిన పాపన్న జనగామ జిల్లా సాధన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బహుజనుల రాజ్యాధికారం కోసం అలుపెర గని పోరాటం చేసిన ఘనత సర్వాయి పాపన్నదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన వాగ్దానం మేరకు వెంటనే జిల్లాకు పాపన్న పేరు పెట్టాలన్నారు. ఈ నెల 21న కలెక్టరేట్ కార్యాలయం వద్ద పాపన్న జిల్లా సాధన కోసం చేపట్టిన ఒక్క రోజుకు దీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్ ముప్పిడి శ్రీధర్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తిని మురహరి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ప చ్చిమడ్ల మానస, కొప్పుల రవీందర్, బండి కు మార్, నూనెముంతల యాకస్వామి, రంగు రాజు, కోళ్ల శ్రీను, తాళ్లపల్లి రాజు, బండమీది వెంకన్న, బాల్నె రాజయ్య, రంగు మురళి, పర్షరాములు, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆత్మస్థైర్యంలో ముందుకు సాగాలి హన్మకొండ కల్చరల్ : మహిళలు అన్ని రంగా ల్లో దూసుకుపోవడానికి ఆత్మస్థైర్యం, పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. ఆదివారం వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పలువురు మహిళలను సన్మానించారు. -
కాజీపేట వరకు వెళ్లే రైళ్లు ఆపాలి
● రైల్వేశాఖ మంత్రికి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి జనగామ: సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు వెళ్లే రైళ్లను జనగామ స్టేషన్లో ఆపడంతోపాటు సమయపాలనలో మార్పు చేయాలని రైల్వే ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, సురే ఖ, ఎంపీ కావ్యతో కలిసి హైదరాబాద్‌లో ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ కిరణ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భువనగిరి, ఆలేరు, జనగామ నుంచి సికింద్రాబాద్ వరకు అప్ అండ్ డౌన్ చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్లను ఆపాలని కోరినట్లు పేర్కొన్నా రు. పద్మావతి ఎక్స్‌ప్రెస్ భువనగిరిలో ఆగదని, మచిలీపట్నం–బీదర్ ఎక్స్‌ప్రెస్ ఈ రూట్ ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ లేదన్నారు. కాకతీయ ఎక్స్‌ప్రెస్ భద్రాచలం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే క్రమంలో ఇంతకు ముందు ఉదయం 7 నుంచి 8 గంటలకు జనగామ మీదుగా భువనగిరికి చేరుకునేదని, ప్రస్తుతం తెల్లవారు జాము 4 గంటలకు సమయం మార్చడం అందరికీ అసౌకర్యంగా ఉందన్నారు. -
ఆస్తి పన్ను వసూలుకు వినూత్న చర్య
జనగామ : మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను వసూలుకు అధికా రులు వినూత్న పద్ధతిని అమలు చేస్తు న్నారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట ఏరియాకు చెందిన ఓ ఇంటి య జమాని ఇంటిపన్ను బకాయి రూ.27వేలు చెల్లించాల్సి ఉంది. వసూలు చేయడానికి శనివారం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మేనేజర్ రాములు, ఆర్ఓ బాబు, ఆర్ఐ ఏలియా, ఇతర అధికారులు మధు, సిబ్బంది ఆ ఇంటి ఎదుట సాయంత్రం 6 గంటలకు బైఠాయించారు. బకాయి చెల్లించే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ అనూహ్య చర్యతో యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. రెండురోజుల సమయం కావాలని అడిగినా అధికారులు ససేమిరా అన్నారు. చేసేది లేక రెండు గంటల తర్వాత రూ.8వేలు చెల్లించి.. మిగతా డబ్బులు వారం రోజుల్లోగా కట్టేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పన్ను ల వసూళ్ల కోసం అధికారులే స్వయంగా ఆందోళనకు దిగడం చర్చ నీయాంశంగా మారింది. యజమాని ఇంటి ఎదుట బైఠాయించిన కమిషనర్, అధికారులు -
నిరంతర విద్యుత్‌కు చర్యలు
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలకు ఆటంకం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ అన్నా రు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావు, టెక్నికల్ డీఈ గణేష్, డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, కమర్షియల్ ఏడీఈతో కలిసి శనివారం ఆస్పత్రిని సందర్శించారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో అత్యవసర సేవలకు 125 కేవీ సామర్థ్యం కలిగిన(సుమారు రూ.10లక్షలు) జనరేటర్, సీటీ స్కాన్ రూంలో ప్రస్తుతం ఉన్న 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో 160 కేవీ అమర్చేందుకు ప్రతిపాదనలు పంపించాలని ప్రిన్సిపాల్‌ను కోరారు. ఇదిలా ఉండగా.. పంట కోతలు ముగియగానే వ్యవసాయ కనెక్షన్లు యుద్ధ ప్రాతిపదికన ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఎస్ఈ చెప్పారు. కొత్త సర్వీసుల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
ఆమోదరీతిలో వివాదాలు పరిష్కారం
హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయసేవా అధికార సంస్థల ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, అతిథిగా న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. – హన్మకొండ అర్బన్● హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ ● హనుమకొండలో జాతీయ లోక్ అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ప్రారంభం ● అక్కడికక్కడే పలు కేసుల పరిష్కారం– వివరాలు 8లోu -
రాజీపడితేనే సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: పంతాలకు పోకుండా కక్షిదారులు రాజీపడితేనే సమస్యలు పరిష్కారం అవుతా యని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్రశర్మ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇరు పక్షాలు రాజీపడే కేసులు ఒప్పందం చేసుకుంటే ఉపయోగకరమని, కాలంతోపాటు డబ్బు వృథా కాదని చెప్పారు. జాతీయ లోక్ అదా లత్‌లో తెలంగాణ రాష్ట్రం ఎక్కువ కేసులు పరిష్కరించి దేశంలో ప్రథమ స్థానంలో ఉందని, ఈసారి కూడా అదే స్థానంలో నిలిచేలా కక్షిదారులకు ఉపయోగపడేలా జిల్లా స్థాయిలో కమ్యూనిటీ మీడియేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. కుటుంబ తగాదాలు, సివిల్ కేసులను తగ్గించడానికి, కేసులు కోర్టుకు రాకుండా మధ్యవర్తుల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. ఆరు బెంచ్‌ల ద్వారా 5,461 కేసులు పరిష్కారంకాగా, రూ.1,03,80,378 వసూలు చేసినట్లు తెలిపారు. ఇందులో సివిల్ కేసులు 135, మోటార్ యాక్సిడెంట్ 14, క్రిమినల్ 4,959, ప్రీలిటిగేషన్ కేసులు 353 ఉన్నాయి. లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు రవీంద్రశర్మతో పా టు సి.విక్రమ్, ఇ.సుచరిత, కుమారి జి.శశి, కుమారి కె.సందీప, డి.వెంకట్రాంనర్సయ్య, అడ్వకేట్లు కె.చంద్రశేఖర్, సీహెచ్.కిరణ్‌కుమార్, ఎన్.సంధ్యారాణి, బి.స్వప్న, జి.రేఖ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ జాతీయ లోక్ అదాలత్‌లో 5,461 కేసుల పరిష్కారం -
కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..
ప్రమాద సమయంలో భార్యతో ప్రవీణ్‌కుమార్ ఆఖరి మాటలు.. హనుమకొండ, రాంనగర్వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. – పర్వతగిరి/సంగెం/నెల్లికుదురు● ఎస్సారెస్పీ కెనాల్లో పడిన కారు.. తండ్రి, ఇద్దరు పిల్లల మృతి ● స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడిన తల్లి ● వరుసగా సెలవులు రావడంతో స్వగ్రామానికి కారులో వెళ్తున్న కుటుంబం ● గుండెనొప్పి రావడంతో కారు స్టీరింగ్ తిప్పలేని పరిస్థితి.. ● నేరుగా కాల్వలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం ● మేచరాజుపల్లిలో విషాదఛాయలు11.40 గంటలకు : వరుసగా సెలవులు రావడంతో హనుమకొండలోని రాంనగర్లో నివాసం ఉంటున్న సోమారపు ప్రవీణ్(28), భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి(5), కుమారుడు ఆర్యవర్ధన్(2)తో కలిసి హుందయ్ ఐక్రాస్ కారులో సొంత గ్రామమైన నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి బయలుదేరారు.12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటపల్లికి చెందిన నవీన్, సందీప్, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు. 1.10 గంటలకు : ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు. 4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్ సీట్లో ప్రవీణ్‌కుమార్, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు. వరంగల్ టు నెక్కొండ రోడ్డు ఎస్సారెస్పీ కాల్వపర్వతగిరి రోడ్డు12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్‌కుమార్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి అధికం కావడం.. స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది. ప్రమాదం జరిగిందిలా.. (ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు) -
వివక్ష తగ్గినా వేధింపులున్నాయి..
కుటుంబాన్ని నడిపిస్తున్న మహిళామణులు104133Aమహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. పనులు చేస్తున్న మహిళలకు కార్యాలయాల్లో వేధింపులు కొంతమేర కొనసాగుతు న్నా.. సెల్ఫోన్లలో కొందరు అసభ్యపదజాలంతో పంపిస్తున్న మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక సతమతమవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న వారిలో తెలిసిన వారితోపాటు తెలియని వారు ఉన్న ట్లు పలువురు మహిళలు చెబుతున్నారు. నాడు వంటింటికే పరిమితమైన మహిళ.. నేడు విద్య, ఉద్యోగం, నచ్చిన రంగంలో ఎదుగుతూ పురుషులతో సమానంగా పనిచేస్తోంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వేధింపులు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ 1) మీ ఇంట్లో ఆడ – మగ వివక్ష ఏమైనా ఉందా..? ఎ) ఉంది బి) లేదు సి) చెప్పలేను73B1702) మీ కాలేజీ – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..? ఎ) లేదు బి) ఉంది సి) చెప్పలేను C7837623) మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం? (ఎ) సెల్ఫోన్లో వచ్చే మెసేజ్‌లతో.. బి) బస్టాప్‌లో సి) కాలేజీ లేదా ఆఫీస్‌లో2001104) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు? ఎ) తెలియని వారు బి) తెలిసిన వారేషాంపిల్స్: 310 (గ్రేటర్వరంగల్ 60మంది, మిగతా ఐదు జిల్లాలు (వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు 50మంది చొప్పున) అన్ని వర్గాల మహిళలను పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాల సేకరణ. వారి సంకల్పం గొప్పది. ఆశయం ఉన్నతమైనది. హేళనలు, అవమానాలేమీ వారు చేసే పనులకు అడ్డంకి కాలేదు. ప్రతికూల పరిస్థితులెదురైనా, పురుషాధిక్య రంగమైనా వారు పట్టు వీడలేదు. అన్ని రంగాల్లోనూ మాదే పై చేయి అంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నతనంలో వివాహమై భర్తను కోల్పోయిన ఒకరు కుటుంబానికి అండగా నిలబడితే.. మరొకరు పేదరికాన్ని పారదోలేందుకు నడుంకట్టారు. ఇంకొకరు విశ్వవేదికపైన జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంకల్ప శక్తులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హోటల్ నడుపుతూ.. పిల్లలను చదివిస్తూ.. చిట్యాల: మండల కేంద్రానికి చెందిన భీమారపు ఓదెలు హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. కట్టెల పొయ్యి కారణంగా అతడి చూపు దెబ్బతిన్నది. భార్య ప్రమీల 20 ఏళ్లుగా హోటల్ నడుపుతూ పిల్ల లను చదివిస్తోంది. గతేడాది పెద్దమ్మాయికి పెళ్లి చేసింది. మిగతా ఇద్దరు పీజీ, ఎంటెక్ చదువుతున్నారు. ఓదెలు కూరగాయలు కట్ చేసి వ్వడం, పిండి కలపడం వంటి పనుల్లో ఆమెకు సాయం చేస్తుంటాడు. తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.● విభిన్న రంగాల్లో రాణిస్తూ ఆదర్శం ● పురుషులకు దీటుగా బాధ్యతలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంసంగెం: వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించింది సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి. ఆమెకు ఆర్నెళ్ల వయసులోనే జ్వరం వచ్చింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. వైకల్యాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని.. నమ్మింది. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో కాంబోడియా దేశంలో ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీలకు మన దేశం తరఫున పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించింది. చీకట్లో ‘వెన్నెల’ సాక్షి, మహబూబాబాద్: దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల మల్లయ్య సుగుణమ్మల కుమార్తె వెన్నెల. పుట్టిన ఎనిమిదేళ్లకే తండ్రి మరణించాడు. ఆతర్వాత వెన్నెలను నర్సింహులపేట మండల కేంద్రంలోని అక్కా, బావ తీగల వెంకన్న, సుజాత చేరదీసి చదివించా రు. పదోతరగతి చదివిన వెన్నెలకు మహబూబా బాద్ మండలం పర్వతగిరికి చెందిన నారమళ్ల సంపత్తో వివాహం జరిపించారు. చిన్నతనంలో నే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. మిర్చి పంట కు తామర పురుగు సోకడంతో కుటుంబం అప్పు ల పాలయ్యింది. అప్పుల బాధతో భర్త సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 19 ఏళ్లకే వెన్నెల వితంతువుగా మారింది. ఆరేళ్ల సాన్విక, మూడేళ్ల తన్వికతో పాటు తల్లి సుగుణమ్మ, అత్త, మామ పోషణ ఆమైపె పడింది. మహబూ బా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. మూగజీవాల నేస్తం.. డాక్టర్ అనిత లింగాలఘణపురం: మండల కేంద్రంలో పశువైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆడెపు అనిత పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన అనిత 2019లో లింగాలఘణపురం పశువైద్యాధికారిగా విధుల్లో చేరారు. పశువైద్యశాల కు వచ్చే మూగ జీవాలకు వైద్యం చేస్తూనే.. వ్యవసాయబావులు దూరంగా ఉండి ఆస్పత్రికి రాలేని పశువుల వద్దకు స్వయంగా ద్విచక్రవాహనంపై వెళ్లి వైద్యం చేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణలో ప్రత్యేకత చాటుకున్నారు. 63 శాతం సక్సెస్ సాధించారు. పశువులు, గొర్రెలకు వ్యాక్సినేషన్‌ను నూటికి నూరు శాతం అమలు చేస్తూ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు నేస్తంగా మారిపోయారు. చేయి చేయి కలిపి.. పేదరికాన్ని తరిమి ఏటూరునాగారం: మండలంలోని శివాపురంలో ట్రైకార్ సాయంతో ఐటీడీఏ ద్వారా పది మంది మహిళలు సమ్మక్క–సారలమ్మ డిటర్జెంట్ సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ట్రైకార్ నుంచి 60 శాతం సబ్సిడీ, బ్యాంకు నుంచి 30 శాతం రుణం తీసుకుని పరిశ్రమ నడుపు తున్నారు. తయారు చేసిన సబ్బులకు ఒక్కోదానికి రూ.10గా ధర నిర్ణయించి గిరిజన సహకార సంఘానికి(జీసీసీ) విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు 4 వేల సబ్బులు తయారు చేస్తున్నారు. ఐదేళ్లుగా కోటిన్నర రూపాయల వ్యాపారం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సబ్బుల తయారీలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కట్టె కోత.. బాధ్యతల మోతకట్టెకోత మిల్లులో మగవారితో సమానంగా పని చేస్తోంది వరంగల్ నగరం నాగేంద్రనగర్‌కు చెందిన ఎండీ రజియా. భర్త అనారోగ్యం కారణంగా కుటుంబ భారం ఆమైపె పడింది. 15 ఏళ్లుగా నగరంలోని జగన్నాథం సామిల్లులో కట్టర్‌గా పనిచేస్తోంది. ముగ్గురు పిల్లల పెళ్లి చేయగా.. కూతురు కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె తల్లివద్దే ఉంటోంది. వీరందరికీ రజియా పని చేస్తేనే భోజనం. సొంతిల్లు ఉంటే కొంత భారం తగ్గుతుందని రజియా అంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ సమాచార వారధిగా పత్రికల సేవలు భేష్‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం వరంగల్ లీగల్ : ప్రజలకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సమాచార వారధిగా వార్తా పత్రిక లు నిలవాలని సాక్షి గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయానికి శుక్రవారం ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వచ్చారు. ముందుగా జడ్జికి సాక్షి ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు వర్ధెల్లి లింగయ్య, గడ్డం రాజిరెడ్డి, లీగల్ రిపోర్టర్ జీవన్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మొదట ఎడిటోరియల్ విభాగానికి చేరుకున్నారు. ఫీల్డ్ నుంచి రిపోర్టర్లు పంపిన కాపీలు డెస్క్‌కు ఎలా చేరుతాయో పరిశీలించారు. ఎడిటోరియల్ విభాగాన్ని పరిశీలించి సబ్ ఎడిటర్లు వార్తలు దిద్దుతున్న తీరును గమనించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కాపీలను చూసి కావాల్సిన అదనపు అంశాలు, సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్‌ను పరిశీలించి పేజీ లేఔట్‌పై తగిన సూచనలిచ్చారు. సర్వే అంశాలు బాగున్నాయని, వాటిని ఎలా నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళలపై తెప్పించిన కథనాలను చూసి తగిన ఫొటోలు ఉన్నాయా.. లేవా? అని సరిచూసుకోవాలని, అక్షరదోషాలు లేకుండా దిద్దాలని సూచించారు. అనంతరం ఐటీ, ఏడీవీటీ, స్కానింగ్, సీటీపీ, ప్రొడక్షన్ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. నూతన టెక్నాలజీతో అన్ని రంగుల్లో పత్రిక వెలువడుతున్న తీరును చూసి బాగుందని కితాబిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలివ్వాలి.. పత్రికలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వాలని మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. న్యాయసంబంధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచురించాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలను జర్నలిజంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఆధారాలతో పరిశోధనాత్మక వార్తలు రాయాలని సూచించారు. మహిళా చైతన్యంలో పత్రికలు కీలకమని పేర్కొన్నారు. సాక్షి గెస్ట్ ఎడిటర్‌గా తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాక్షి సిబ్బంది ఆమెకు శాలువా అందించి సన్మానించారు. మహిళల ‘సౌర’ సాగు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆమెకు అండగా.. పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’టీమ్ – 8లోuకూతుళ్లే మహారాణులు కొందరు ఒక్కరితో సరి.. ‘సాక్షి’ సర్వేలో మహిళల మనోగతం వార్తకు అనుగుణంగా శీర్షికలు ఉండాలి.. కచ్చితమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి.. మహిళా దినోత్సవ కథనాలు బాగున్నాయని కితాబు -
జనగామ కోర్టు పరిధిలోకి మార్చాలి
జనగామ రూరల్: కొడకండ్ల, పాలకుర్తి మండలాల ను జనగామ కోర్టు పరిధిలోకి మార్చాలి.. కోర్టు వద్ద క్యాంటీన్, జిరాక్స్, పార్కింగ్ మేనేజ్మెంట్ వసతులు కల్పించాలని జనగామ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం హైకోర్టు పోర్టు పోలియో జడ్జి జూకంటి అనిల్‌కుమార్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎలగందుల చంద్ర ఋషి, సీనియర్ న్యాయవాదులు ఎ.భిక్షపతి, శ్రీరా మ్ శ్రీనివాస్, పానుగంటి శ్రీనివాస్, హరిప్రసాద్. కె.శ్రీనివాసులు, రవీందర్, శంకర్ పాల్గొన్నారు. -
మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు
జనగామ రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా మహిళా సాధికారక సంస్థ ఆధ్వర్యాన మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఫ్లోరెన్స్ మాట్లాడుతూ.. మ్యూ జికల్ చైర్, టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతల తోపాటు వృత్తి రీత్యా వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈనెల 10న కలెక్టరేట్లో నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా బహుమతులు అందిజేస్తారన్నారు. -
నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యం
జనగామ రూరల్: యువతలో రాజకీయ అవగాహన, నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడంమే ‘వికసిత భారత్’ లక్ష్యమని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. వికసిత భారత్ యూత్ పార్లమెంట్ అనేది భారతదేశంలో యువతకు కల్పించే ఒక ప్రత్యేక కార్యక్రమం అన్నారు. యువత పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని వివిధ సమస్యలపై తమ ఆలోచనలు, అభిప్రాయాలను వెలువరించడానికి, పరిష్కార మార్గాలు చూపడానికి ఒక అద్భుతమైన అవకాశమని చెప్పా రు. యువతీ యువకులంతా వికసిత్ భారత్ యూత్పార్లమెంట్లో ఏదైనా వెబ్ పోర్టల్‌ను ఈనెల 9వ తేదీలోగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి అనగాని శ్రీనివాస్, నవీనారాణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.పోస్టల్ శాఖ పెన్షనర్లకు ప్రత్యేక అదాలత్జనగామ రూరల్: పోస్టల్ శాఖ పెన్షనర్ల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తున్నట్లు హనుమకొండ పోస్టల్ అధికారి హన్మంతు ఒక ప్రకటనలో తెలిపారు. తపాలా శాఖ పరిధిలోని పెన్షనర్ల ఫిర్యాదులపై ఈనెల 25న మధ్యాహ్నం 12 గంటలకు గూగుల్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని, ఫిర్యాదులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్జనగామ రూరల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన శనివారం(నేడు) జిల్లా కోర్టుఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి డి.రవీంద్ర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. సామరస్యంగా పరిష్కరించుకో దగిన, రాజీపడదగిన కేసులను ఇక్కడ పరిష్కరించుకోవాలని సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ ఉంటుందని, కక్షిదారులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. టెన్త్ హాల్‌టికెట్ల విడుదలజనగామ రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు శుక్రవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయని జిల్లా విద్యాధికారి రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్ల విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తక్కవ ధరకే జనరిక్ మందులుబచ్చన్నపేట : పేదల సంక్షేమానికి ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన ‘జన ఔషధి’ కేంద్రాల్లో విక్రయించే జనరిక్ మందులు తక్కువ ధరకే లభిస్తాయి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్‌రావు అన్నారు. ‘జన ఔషధి’ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మండల కేంద్రాల్లోనూ జన ఔషధి సెంటర్లను ఏర్పాటు చేయనున్నారని, వైద్య సిబ్బంది గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించి జనరిక్ మందులు కొనుగోలు చేసేలా చూడాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్‌గౌడ్, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ జిల్లా అధికారి స్వర్ణకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, డాక్టర్లు మానస, ఝాన్సీ, ఎఫ్ఆర్ రమ్య, సీహెచ్ఓ జంగమ్మ, పీహెచ్ఎన్ అన్నాంబిక తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్
సూర్యాపేట ఎస్పీ నుంచి వరంగల్ కమిషనర్‌గా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్.. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన 2012లో ములుగు ఏఎస్పీగా, వరంగల్ రూరల్ ఓఎస్డీగా పనిచేశారు. అనంతరం ఎల్బీ నగర్ డీసీపీగా, జగిత్యాల ఎస్పీగా కూడా విధులు నిర్వర్తించారు. 17 నెలలకే అంబర్ కిషోర్ ఝా బదిలీ 2023 అక్టోబర్ 13న అంబర్ కిషోర్ ఝా వరంగల్ సీపీగా నియమితులయ్యా రు. 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంబర్ కిషోర్ ఝా ఇక్కడ 17నెలలు పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తక్కువ సమయంలోనే ఆయనకు బదిలీ కాగా.. అంతే ప్రాధాన్యత గల మరో కమిషనరే ట్ సీపీగా నియమితులయ్యారు. క్రైం డీసీపీగా జనార్దన్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా బెదరకోట జనార్దన్ నియమితులయ్యారు. ప్రస్తుతం టీజీ ఎన్పీడీసీఎల్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా ఉన్న ఆయన 1989 ఎస్ఐ బ్యాచ్‌కి చెందిన వారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వివిధ పోస్టుల్లో పోలీసు అధికారిగా పనిచేశారు. సుమారు మూడేళ్లుగా ఎన్పీడీసీఎల్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా బదిలీ ● సూర్యాపేట ఎస్పీగా పనిచేస్తున్న సన్‌ప్రీత్ ● డీసీపీ రవీందర్ కూడా ట్రాన్స్ఫర్.. ఆయన స్థానంలో ఐపీఎస్ అంకిత్ ● క్రైం డీసీపీగా బెదరకోట జనార్దన్సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈస్ట్ జోన్ డీసీపీగా అంకిత్‌కుమార్.. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న రవీందర్‌ను సీఐడీకి బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో డీసీపీగా అంకిత్‌కుమార్‌ను నియమించింది. 2020 బ్యాచ్‌కు చెంది న అంకిత్‌కుమార్ గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ట్రైనీ ఐపీఎస్‌గా పనిచేశారు. -
శుభ ముహూర్తాలకు బ్రేక్
జనగామ: జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభమైన శుభ ముహూర్తాలకు బ్రేక్ పడింది. నెలన్నరగా శుభకార్యాలు, వివాహాలు, గృహ ప్రవేశాలతో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం చివరి మూహూర్తం నేపథ్యంలో ఒకేరోజు వందలా ది వివాహాలు జరిగాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే 50 మంది వధూవరులు మూడుముళ్ల బంధం, ఏడడుగులతో ఒక్కటయ్యారు. ఉగాది పండుగ నుంచి తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఆర్టీసీకి కాసుల వర్షం.. శుభ ముహూర్తం చివరి రోజు వివాహాలు వేల సంఖ్యలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు ప్రయాణించే వారితో ఆర్టీసీ జనగామ డిపోకు టికెట్ కలెక్షన్లు పెరిగాయి. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు బస్‌స్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ఒక్కో బస్సులో 80 నుంచి 90 మంది ప్రయాణించారు. సీట్ల కోసం పోటీపడ్డారు. పిల్లలు, వృద్ధులు, మహిళలకు ఇబ్బందులు తప్పలేదు. ఒకేరోజు వందల వివాహాలు ఆర్టీసీకి కలెక్షన్లు ఫుల్ -
ఇన్‌స్పైర్‌కు 64 ప్రాజెక్టులు
జనగామ: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను పెంపొందించేందుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2024–25 సంవత్సరానికి నిర్వహించిన ‘ఇన్ స్పైర్ మనక్’ ప్రాజెక్టుల ప్రదర్శనల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. గత ఏడాది జిల్లా నుంచి 350 ప్రాజెక్టుల వరకు ఆన్లైన్ ద్వారా(నమూనా వీడియో/ప్రాజెక్టు పనితీరును వివరిస్తూ) విద్యార్థులు కేంద్రానికి పంపించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రాజెక్టులను పరిశీలంచి ఇన్స్పైర్ అవార్డులకు ఎంపిక చేసి జాబితా విడుదల చేశారు. ఇందులో జిల్లా నుంచి 64 మంది ఇన్స్పైర్ అవార్డులకు ఎంపికయ్యారు. ఎంపికై న ప్రాజెక్టులను జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా కేంద్రం ఒక్కో ప్రాజెక్టుకు రూ.10వేల చొప్పున విద్యార్థి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. జిల్లా స్థాయి ప్రదర్శన తర్వాత ఉత్తమంగా నిలిచిన వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో మేటిగా ఉన్నవాటిని న్యాయ నిర్ణేతలు జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో విద్యార్థుల ప్రతిభ ఒక్కో ప్రాజెక్టుకు రూ.10వేలు జిల్లా సైన్స్‌ఫెయిర్‌లో ప్రదర్శనకు సిద్ధంసంతోషంగా ఉంది రైతులు పొలాల వద్ద కరెంటు షార్ట్‌సర్క్యూట్‌కు గురికాకుండా యంత్రం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఐడియా ను పాఠశాలలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయగా సైన్స్ టీచర్ జిల్లా ఇన్‌స్పైర్‌కు పంపారు. జిల్లా స్థాయికి ఎంపికవడం సంతోషంగా ఉంది. – గుర్రం అక్షయ, 9వ తరగతి, తిగుడుమూడు ఎగ్జిబిట్లు పంపించాం.. మండలంలోని తిగుడు ఉన్నత పాఠశాల నుంచి ఇన్స్పైర్ మనక్ అవార్డుల కోసం మూడు ఎగ్జిబిట్లు పంపించాం. 2025 జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. అందులో 9వ తరగతికి చెందిన గుర్రం అక్షయ ‘ఫార్మర్స్ లైఫ్ సేవింగ్స్ ఏసీ కరెంట్ డిటెక్టర్’, 8వ తరగతికి చెందిన గడిపెల్లి అక్షిత ‘స్మార్ట్ స్ట్రీట్‌లైట్స్ సిస్టం’, 7వ తరగతికి చెందిన మరో విద్యార్థి ‘మోడ్రన్ బల్క్ కార్ట్’ ఎగ్జిబిట్లు ఉన్నాయి. వీటిని జిల్లా స్థాయిలో ప్రదర్శించాలి. – డి.శ్రవణ్‌కుమార్, ఫిజికల్సైన్స్ టీచర్, జఫర్‌గఢ్ -
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చిల్పూరు: చిల్పూరుగుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి 8.30 గంటలకు తొలక్కం కార్యక్రమంతో ప్రారంభం అయ్యాయి. ఆలయ అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచా ర్యుల వేద మంత్రాల నడుమ చేపట్టిన ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ హాజ రయ్యారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు–కిరణ్మయి, తహసీల్దార్ సరస్వతి, జూనియర్ అసిస్టెంట్ మోహన్, వీరన్న, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ ఎత్తివేత జనగామ: వరంగల్–ఖమ్మం–నల్గొండ ఉమ్మ డి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితా లు వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తి వేసినట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గురువా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో జనవరి 29 నుంచి అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. సాగునీరు విడుదల చేయాలి జనగామ: జనగామ నియోజకవర్గంలో యాసంగి సీజన్లో సాగు చేసిన పంటలను కాపాడేందు కు రిజర్వాయర్ల ద్వారా సాగునీరు విడుదల చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపు రి కిరణ్‌కుమార్‌గౌడ్ కోరారు. ఈ మేరకు గురువారం వారు హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో ఆయకట్టు స్థిరీకరణ, నీటి విడుదల సమయంలో జాప్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవా లని కోరినట్లు వారు పేర్కొన్నారు. పంపింగ్‌లో నిర్లక్ష్యం వద్దు నర్మెట: రిజర్వాయర్లలోని నీరు ఎగువ ప్రాంతాలకు సకాలంలో పంపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలి.. నిర్లక్ష్యం చేయొద్దని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ అన్నారు. మండలంలోని బొమ్మకూర్, గండిరామారం పంప్ హౌస్‌లను ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించా రు. వాటి పరిధిలోని విద్యుత్ సబ్స్టేషన్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. విధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అంబులెన్స్‌ల తనిఖీ జనగామ: జిల్లాలోని 108, 102, 1962 అంబు లెన్స్ వాహనాలను జీవీకే ఈఎంఆర్ఐ హెడ్ సత్యనారాయణ గురువారం ఆకస్మికంగా తని ఖీ చేశారు. అంబులెన్స్‌ల్లో టెక్నాలజీ విని యోగం, మెడికల్ పరికరాల పనితీరు, మందు ల స్టాక్, కాలపరిమితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేలా అంకితభావంతో పని చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వేసవిలో అందించాల్సిన సేవలు, తీసుకోవా ల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో నల్గొండ ఉమ్మడి ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దీన్, జనగామ జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్: మహిళలు చట్టాలను తెలుసు కోవడంతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. ఇంట ర్నేషనల్ ఉమెన్స్ డే ను పురస్కరించుకొని గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన పట్టణంలోని మహాత్మాగాంధీ పూలే ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పనిచేస్తున్న ప్రదేశంలో పదిమందితో కూడిన ఒక కమిటీ ఉండాల ని, అందులో సగం మంది మహిళలు ఉండాల ని చెప్పారు. మహిళలకు ఏదైనా సమస్య వస్తే ఆ కమిటీ ముందు రాతపూర్వకంగా చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిహారం చట్టం–2013 గురించి వివరించారు. అలాగే వరకట్న నిషేధ చట్టం, వివాహ మహిళ తన భర్త ఇంట్లో ఉండే హక్కు గురించి తెలియజేశారు. ముఖ్యంగా ఆడపిల్లలు పోరాడే శక్తి కలిగి ఉండాలని, ఆరోగ్యంపై ప్రత్యే క శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీంద్ర, అధ్యాపకులు లావణ్య, జి.శివప్రసాద్, ఇందిర, శైలజ, ఉషారాణి, మానస తదితరులు పాల్గొన్నారు. -
సెకండియర్ పరీక్షలు ప్రారంభం
జనగామ రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండియర్ పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యా యి. 4,185 మంది విద్యార్థులకు 4,092 మంది (97.8 శాతం) పరీక్ష రాసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. జనరల్ కోర్సుల విద్యార్థులు 3,137 మందికి 3,094 మంది, ఒకేషన ల్ 1,058 మందికిగాను 938 మంది హాజరయ్యార ని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి రోజు 97.8 శాతం హాజరు -
మినీ డెయిరీ యూనిట్లను వినియోగించుకోవాలి
● జిల్లా పశువైద్యాధికారి రాధాకిషన్ స్టేషన్‌ఘన్‌పూర్: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూ రు చేసిన మినీ డెయిరీ యూనిట్లను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధి కారి డాక్టర్ రాధాకిషన్ అన్నారు. మండల పరిధి వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్థానిక పశువైద్యశాలలో మెడికల్ కిట్లను గురువారం పంపి ణీ చేసి మాట్లాడారు. తాటికొండకు 5 యూనిట్లు, మీదికొండ, ఛాగల్లు, పాంనూర్, నమిలిగొండ గ్రా మాలకు ఒక్కో యూనిట్ మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో ఘన్పూర్ ఏడీ డాక్టర్ చక్రధర్, మండల పశువైద్యాధికారి డాక్టర్ మౌనిక పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ ఉంటేనే అనుమతి
జనగామ: ఎల్ఆర్ఎస్ ఉన్న స్థలాలకు మాత్రమే ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభిస్తాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో పురపాలిక ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ విక్రయ దారులకు ఎల్ఆర్ఎస్పై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈనెల 31వ తేదీలోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి 25 శాతం రాయితీ పొందాల ని సూచించారు. జిల్లా నుంచి 62వేల అప్లికేషన్లు రాగా మున్సిపాలిటీ పరిధిలో 16వేలు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు 3వేల దరఖాస్తులు పరిష్కరించామని చెప్పారు. అనధికార వెంచర్లలో కొనుగో లు చేసి, 10 శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారులు మిగతా వాటిని కూడా రిజిస్ట్రేష న్ చేసుకుని ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 25 శాతం రాయితీ పొందాలని సూచించారు. ఎల్ఆర్ఎస్పై సందేహాలను నివృత్తి చేయడానికి మున్సిపాలిటీ, కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని, 9948187334, 8978207205 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫోన్ల ద్వారా ఎల్ఆర్ఎస్ ఎస్ఎంఎస్లు రాకుంటే హెల్ప్‌డెస్క్‌ల ద్వారా సమాచారం పొందవచ్చని, దరఖాస్తు తిరస్కణకు గురైతే ఫీజు లో 10 శాతం మినహాయించి మిగతా సొమ్ము తిరిగి ఇస్తామని వివరించారు. సదస్సులో ఆర్డీఓ గోపీరాం, డీటీసీపీఓ వీరస్వామి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, రవీందర్, సబ్రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. మార్చి 31 వరకు 25 శాతం ఫీజు రాయితీ సదస్సులో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి
జనగామ రూరల్: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ అన్నారు. జనగామ మండల గౌడ సంఘం ఆధ్వర్యాన గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో కల్లుగీత వృత్తి దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలి వెంకన్నతో కలిసి మాట్లాడారు. 350 సంవత్సరాల క్రితమే బడుగు బలహీనుల జీవనస్థితి మెరుగుపడాలని, వారు రాజకీయంగా ఎదగాలని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తపన పడ్డారని పేర్కొన్నారు. జిల్లాకు ‘పాపన్న గౌడ్’ పేరు పెట్టాలనే డిమాండ్‌తో ఈనెల 21న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బహుజన కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నామాల శ్రీనివాస్, పెంబర్తి మాజీ సర్పంచ్ అంబాల ఆంజనేయులు, మెరుగు బాలరాజు, దూడల సిద్ధయ్య, కన్నా పరశురాములు, గడ్డం మనోజ్‌కుమార్, మార్క ఉపేందర్, సిద్ధు, నరేందర్, రఘునా థ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ్ -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
జనగామ రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల16న స్టేషన్ఘనపూర్ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి సంబంధిత అధికారులతో గురువారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి మంజూరైన రూ.816 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. మహిళా సాధికారత దిశగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సౌర విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంక్‌ల శంకుస్థాపనకు కార్యాచరణ రూపొందించా లని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం పర్యటన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఏసీపీ భీంశర్మ, డీఆర్డీఓ వసంత, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, డీపీఓ స్వరూప, హౌసింగ్ పీడీ మాత నాయక్, విద్యుత్ ఎస్ఈ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం సభాస్థలి పరిశీలన రఘునాథపల్లి: సీఎం పర్యటన నేపథ్యంలో మండలంలోని గోవర్ధనగిరి సమీపాన ఏర్పాటు చేయను న్న సభాస్థలిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అధికారులు గురువారం పరిశీలించారు. సభకు ఈ స్థలం అనువుగా ఉంటుందా..? వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి.. పార్కింగ్ తదితర అంశాలపై అధికారులు, నాయకులతో చర్చించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలెక్టరేట్లో సమీక్ష సమావేశం గోవర్ధనగిరి సమీపంలో సభాస్థలి పరిశీలన -
దరఖాస్తు గడువు పొడిగింపు
జనగామ రూరల్: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ 2025–26 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకుల పాఠశాల కళాశాలల్లో 5 నుంచి 8వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని 9346677568, 9441903130, 9912230123 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
బీజేపీ విజయోత్సవ ర్యాలీ
జనగామ రూరల్: బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుపొందిన సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యాన గురువారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ మాట్లాడుతూ.. ఈ విజయం ఘనత ఉపాధ్యాయులు, మేధావులు, ప్రజలకే దక్కుతుందని చెప్పారు. తెలంగాణలో నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ అని ఈ ఎన్నిక ద్వారా రుజువైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పజూరి లక్ష్మీనర్సయ్య, ఉడుగుల రమేశ్, అనిల్, శశిధర్‌రెడ్డి, హరిశ్చంద్ర గుప్తా, దేవర ఎల్ల య్య, పెద్దోజు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
రంజాన్ మాసం పవిత్రమైనది
జనగామ రూరల్: రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. జిల్లా కేంద్రం గిర్నిగడ్డలోని ఏక్ మినార్ మక్కా మసీదులో రంజాన్ సందర్భంగా మహమ్మద్ జమా ల్ షరీఫ్ ఆధ్వర్యాన గురువారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో ఏసీపీ పండారి నితిన్ చేతన్, సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై రాకేష్‌తో కలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. మానవాళికి శాంతిని చేకూర్చే మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరనీయమని అన్నారు. అందరూ కలిసిమెలిసి జీవిస్తూ దేశ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంకుశావలి, తహసీన్, ఖలీల్, అహ్మద్షరీఫ్, కలీమొద్దీన్, ముజ్జు, ఆసీఫ్, మొహియుద్దీన్, ఇర్షాద్, అబ్దుల్ మన్నాన్, సల్మాన్ , ముఫ్తీ మౌలానా అన్సార్ తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ -
ఇంకా నిక్కరేనా..!
జనగామ: నిక్కర్ వేసుకునే స్టేజ్ దాటిపోయింది.. ప్యాంట్ కావాలి.. ప్రభుత్వం పునరాలోచించాలి అంటూ సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులు విన్నవించుకుంటున్నారు. ఈ మేరకు నిక్కర్‌కు బదులు ప్యాంట్ స్టిచ్చింగ్ కోసం క్లాత్ పంపించాలని ఎంఈ ఓలు డీఈఓలకు అర్జీ పెట్టుకుంటున్నారు. సర్కారు స్కూళ్ల విద్యార్థులకు డ్రెస్‌కోడ్ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా రెండు జతల దుస్తులను అంది స్తోంది. ఈసారి డిజైన్‌లో పలు మార్పులు తీసుకువచ్చి.. స్టిచ్చింగ్‌ను సరళీకృతం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కు 2025–26 నూతన విద్యా సంవత్సరంలో ఉచి తంగా పంపిణీ చేసే యూనిఫాంలో పలు మార్పులు తీసుకువస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో ధనిక, పేద తారతమ్యం లేకుండా విద్యార్థులంతా ఒకటే అనే భావన కల్పించడంతో పాటు అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు ఉచి త దుస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏటా 1 నుంచి 10వ తరగతి(కేజీబీవీ, మోడల్ గురుకులా లు, ఇంటర్ సహా) వరకు చదువుకునే పిల్లలకు రెండు జతల దుస్తులు అందిస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 369 ఉండగా 34,053 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండేసి జతల చొప్పున 68 వేల యూనిఫాంలు అవసరం. ఏటా వేసవి సెలవులకు ముందుగానే విద్యార్థుల కొలతలు తీసుకుని దుస్తులు సిద్ధం చేసి పాఠశాలల పునఃప్రారంభం రోజు అందజేయడం ఆనవాయితీ. డీఈఓ రమేశ్ ఆధ్వర్యాన విద్యార్థుల కొలతలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. యూనిఫాం షర్టు భుజాలపై పట్టీలు, ఈజీ కుట్టు ఉండేలా మార్పులు చేశారు. సమగ్ర శిక్ష పర్యవేక్షణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన మహిళా సంఘాలకు స్టిచ్చింగ్ బాధ్యతలు అప్పగించారు. ప్యాంట్ కావాలంటున్న విద్యార్థులు స్కూల్ యూనిఫాం డిజైన్లు విడుదల చేసిన సర్కారు ఆరు.. ఏడు తరగతులకు నిక్కర్లే.. మహిళా సంఘాలకు స్టిచ్చింగ్ బాధ్యతలు జిల్లాకు 68వేల జతలు అవసరంనిక్కర్పై విద్యార్థుల అలక.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం రెండేసి జతల యూనిఫాం అందిస్తోంది. ఇందులో 6, 7 తరగతుల పిల్లలకు నిక్కర్ అందజేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. ఐదవ తరగతి వరకే పిల్లలం.. 6కు అప్‌గ్రేడ్ అవుతున్నా ఇంకా నిక్కరేనా అంటూ పలువురు విద్యార్థులు అలకబూనుతున్నారు. గత ఏడాది కూడా రెండు నిక్కర్ల కోసం ప్రభుత్వం క్లాత్ పంపించగా పలు పాఠశాలల్లో పిల్లల అభిప్రాయాల మేరకు రెండూ కలిపి ఒకే ప్యాంట్ స్టిచ్చింగ్ చేయించారు. ఆ సమయంలో అన్ని మండలాల నుంచి ప్యాంట్ కోసం క్లాత్ పంపించాలని విజ్ఞాపనలు పంపినా.. ఈసారి కూడా నిక్కర్ డిజైన్ నమూనాను విడుదల చేశారు. దీంతో పిల్లల నుంచి వ్యతిరేకత రావడంతో ఎంఈఓలు డీఈఓలకు ప్యాంట్ క్లాత్ కోసం ప్రతిపాదనలు పంపించాలని అర్జీ పెట్టుకుంటున్నారు. -
జిల్లాలో 10,366 మంది పెన్షన్ దారులు
వెబ్సైట్లో దరఖాస్తు..వైకల్యం ఉన్న వ్యక్తులు యూడీఐడీ(పాత సదరం) కోసం ఇక నుంచి www.swavlambancard.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ వెబ్సైట్ నుంచి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ), డాటా ఆపరేటర్ లాగిన్‌కు వెళ్తుంది. అందులో కేటగిరీల వారీగా ఉన్న జాబితాను వేరు చేసి క్యాంపులో వైద్యపరీక్షల కోసం స్లాట్స్ విడుదల చేస్తారు. 21 రకాల వైకల్యాలకు సంబంధించిన వారు ఎవరు ఎప్పుడు రావాలనే దానిపై తేదీలను ప్రకటిస్తారు. ఇందులో పార్ట్ ఏ, బీ రెండు రకాల పరిశీలన ఉంటుంది. పార్ట్ ఏలో లబ్ధిదారుడి వ్యక్తిగత సమాచారం, పార్ట్ బీలో వైకల్యం వివరాలను క్యాంపులో డాక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. ఆయా విభాగాల్లోని స్పెషలిస్టు డాక్టర్ పరిశీలించిన తర్వాత వైకల్యం పర్సంటేజీని డాక్టర్ మెడికల్ బోర్డు, సీఎంఓ లాగిన్‌లో అప్లోడ్ చేస్తారు. అప్పుడు యూడీఐడీ పోర్టల్‌కు వెళ్తుంది. ఇందులో వైకల్యం పర్సంటేజీ వారీగా అందరికీ కార్డు జారీ చేస్తారు. ఆన్లైన్ లాగిన్ సమయంలో పేర్కొన్న అడ్రస్‌కు పోస్టు ద్వారా యూడీఐడీ కార్డు నేరుగా ఇంటికి పంపిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 10,366 మంది దివ్యాంగులు పింఛన్ పొందుతుండగా, మరో వెయ్యి మందికిపైగా ఎదురు చూస్తున్నారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ
స్టేషన్‌ఘన్‌పూర్: శివునిపల్లి మేజర్ గ్రామపంచాయ తీ కార్యదర్శిగా 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 ఫిబ్రవరి 6 వరకు పనిచేసిన శ్రీకాంత్‌పై డీఎల్పీఓ వెంకట్‌రెడ్డి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవా రం విచారణ చేపట్టారు. జీపీ నిధులు రూ.30లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు జీపీ మాజీ కార్యదర్శి చిరంజీవి భార్య ఉమారాణి ఫిర్యాదు మేరకు జీపీ ప్రత్యేక అధికారి పాపయ్య, ఎంపీఓ నర్సింగరావు సమక్షంలో ఫిర్యాదుదారుతోపాటు కార్యదర్శి శ్రీకాంత్‌ను విచారించారు. జీపీ ఆదాయ, వ్యయాల వివరాలను పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు రావడంతో ఫిర్యాదుదారులు మాత్రమే రావాలని అధికారులు పేర్కొనగా.. ఉమారాణితో ఏసీబీకి పట్టుబడిన ఆమె భర్త శివునిపల్లి మాజీ కార్యదర్శి చిరంజీవి ఎలా వచ్చారని ప్రశ్నించారు. దీంతో వారు విచారణలో చెప్పాల్సిన అంశాలను లిఖితపూర్వకంగా డీఎల్పీఓకు అందజేసి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా శివునిపల్లి జీపీ కార్యదర్శి గా 2022 జనవరి 12 నుంచి 2023 మార్చి 2 వరకు పనిచేసిన కుర్ర చిరంజీవి అవినీతిపై విచారణ చేపట్టాలని బూర్ల శంకర్, చిగురు విజయ్, గుర్రం దేవ య్య, గుర్రం రాజు, ఎం.కిషోర్‌కుమార్ తదితరులు డీఎల్పీఓకు వినతిపత్రం అందజేశారు. -
మరింత మెరుగైన సౌకర్యాలు..
దివ్యాంగులకు 21 రకాల వైకల్యాల పరిశీలన, యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు సెర్ప్ ప్రధాన కార్యనిర్వహణాధికారి దివ్య దేవరాజన్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఆస్పత్రి భవనం మొదటి, రెండవ అంతస్తుల్లో సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు అంధత్వం, తక్కువ దృష్టి, కుష్టువ్యాధి, వినికి లోపం, లోకో మోటార్(ఓహెచ్), మెంటల్ రిటార్డేషన్, మానసిక వైకల్యం కేటగిరీలకు సంబంధించి సదరం సర్టిఫికెట్లు అందిస్తున్నారు. వీటికి మరో 14 రకాల సేవలను కేంద్ర ప్రభుత్వం కలిపింది. అంధత్వం, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్టర్, సెరిబ్రల్ పాల్సీ, దీర్ఘకాలిక న్యూరోలాజికల్, మరుగుజ్జు, హిమోఫిలియా, మల్టిపుల్ స్ల్కెరోసిన్, కండరాల బలహీనత, పార్కిన్సన్, సికిల్‌సెల్, నిర్ధిష్ట లర్నింగ్ వైకల్యం, స్పెసిఫిక్ లర్నింగ్ డిజబులిటీ, స్పీచ్ అండ్ ల్యాంగ్వేజ్ డిజబులిటీ, తలసేమియా, యాసిడ్ బాధితులు బహుళ వైకల్యం పరీక్షలకు అవసరమైన పరికరాలు, వైద్యుల నియామకం చేపట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అవసరమైన ఎస్టిమేషన్ తయారు చేయాలని ఏఈ మహిపాల్ ను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట డీపీఎం వినిత, సహాయకులు రమేష్ తదితరులు ఉన్నారు. -
నిబంధనల మేరకే ఫీజు
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించిన రాయితీతో కూడిన ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియలో నిబంధనల మేరకే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. నిషేధిత జాబితా లో లేని, సర్వే నంబర్లకు సంబంధించిన ప్లాట్లను క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు. ఎల్ఆర్ఎస్కు చేసుకున్న దరఖాస్తులను ఏదైనా కారణం చేత తిరస్కరిస్తే.. పునఃపరిశీలనకు అవకా శం ఉంటుందన్నారు. ఫీజులో 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని, చివరి గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్పై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందు కు గురువారం(నేడు) ఉదయం 11 గంటలకు పురపాలక కార్యాలయంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సందేహాల నివృత్తికి కలెక్టరేట్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, 9948187334 నంబర్‌తో పాటు జనగామ పురపాలక సహాయ కేంద్రం 8978207205 నంబర్లో సంప్రదించాలని సూచించారు. విక్రయ దస్తావేజులతో క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో వేగం పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. కటాఫ్ తేదీ(2020 ఆగస్టు 26) నాటికి లే అవుట్ పరిధిలో పదిశాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. మిగతా ప్లాట్లకు విక్రయదస్తావేజుతో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. 10 శాతం ప్రాసెసింగ్ ఫీజు మినహాయించి మిగతా డబ్బులు తిరిగి ఇస్తారని వివరించారు. విద్యార్థులకు రెండు జతల దుస్తులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా చెప్పారు. బుధవా రం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యాన అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి ఆయా శాఖల అధికారులు, ఏపీఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల అనంతరం విద్యా సంస్థలు పునః ప్రారంభమయ్యేలోపు ఒక్కో విద్యార్థికి రెండు జత ల దుస్తులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సిద్ధం చేసి స్కూళ్ల పునఃప్రారంభం రోజే అందజేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, ఎస్సీ, బీసీ సంక్షేమ అధికారులు విక్రమ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం సందర్శించారు. భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాలు, అగ్నిమాపక చర్యలను పరిశీలించారు. వీవీ ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ల నిర్వహణ లో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.భాస్కర్, విజయభాస్కర్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఎల్ఆర్ఎస్కు 25 శాతం రాయితీ ఈనెల 31వ తేదీ వరకు గడువు నేడు జనగామ మున్సిపాలిటీలో అవగాహన సదస్సు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి జనగామ రూరల్: పరీక్షల సమయం సమీస్తున్న నేపథ్యంలో టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్లో బుధవారం మండల విద్యాధికారులు, హెచ్ఎంలు, వివిధ సంస్థ ల యాజమాన్యాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్జెక్ట్‌ల వారీగా వెనుక బడిన విద్యార్థుల జాబితా సిద్ధం చేసి ఉత్తీర్ణత సాధించేందుకు చేపట్టవలసిన అంశాలపై వివరించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పూర్తిచేసిన పనులకు నిధులు చెల్లిస్తామని చెప్పారు. సమావేశంలో డీఈఓ రమేశ్, అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ప్లానింగ్ సెక్టోరల్ అధికారి తోట రాజు తదితరులు పాల్గొన్నారు. -
16న స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 16న స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించనున్నారు.. రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయంలో బుధవారం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ముఖ్యమంత్రి ఘన్పూర్ మున్సిపాలిటీతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్‌కు మంజూరైన వంద పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ డివిజనల్ కాంప్లెక్స్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కళాశాల, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి నవాబుపేట కెనా ల్కు సీసీ లైనింగ్, పీఆర్ రోడ్లు, విద్యుత్ సబ్స్టేషన్లు, డీఈ ఆఫీస్, బంజారా భవన్ తదితర పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు.. పనిలేని, పసలేని వారితో తన సమయం వృథా చేసుకోను.. అభివృద్ధే తన ధ్యేయమని కడియం అన్నారు. 50వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు సీహెచ్.నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్నగుప్తా, కొలిపాక సతీష్, దుంపల పద్మారెడ్డి, నీరటి ప్రభాకర్, మంతెన ఇంద్రారెడ్డి, బూర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడి -
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuచిల్పూరు : తెలంగాణలో రెండో తిరుపతిగా పేరుగాంచిన చిల్పూరు శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేటి(గురువా రం) నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనెల 14వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, అర్చకులు రవీందర్‌శర్మ పేర్కొన్నారు. గురువా రం ఉదయం 6 గంటల కు అధ్యయనోత్సవం(తొళక్కము)తో మొదల య్యే ఉత్సవాలు.. 11వ తేదీన ఎదుర్కోళ్లు, 12వ తేదీన స్వామివారి కల్యాణం, 13వ తేదీన స్వామివారి రథోత్సవం, 14న చక్రస్నానంతో వేడుకలు ముగియనున్నాయి. చిల్పూరుగుట్టలో నిర్వహించే బ్రహ్మోత్సవాల కు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇలా చేరుకోవ చ్చు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిలో చిన్నపెండ్యాల స్టేజీ వద్ద ఆర్చి నుంచి రావాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి 30, కాజీపేట నుంచి 20, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి 10, చిన్నపెండ్యాల ఆర్చిగేటు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యక్షేత్రం ఉంది. హన్మకొండ నుంచి తరిగొప్పులకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు పలు ప్రైవేట్ వాహనా లు నిత్యం అందుబాటులో ఉంటాయి. భక్తులు గుట్టవద్ద బస చేయాలనుకుంటే ఆలయానికి సంబంధించిన సత్రాలే కాకుండా ప్రైవేట్ గదులు అందుబాటులో ఉంటాయి. కనుల పండువగా వేడుకలు నేటి నుంచి ప్రారంభమయ్యే స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలను ధర్మకర్తలు, దాతలు, ఆలయ కమిటీ, భక్తులతో కలిసి కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపా కటాక్షాలు పొందాలి. – పొట్లపల్లి శ్రీధర్‌రావు, ఆలయ చైర్మన్భక్తులకు సౌకర్యాలు భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయ కమిటీ, దాతలు, దేవాదాయ శాఖ ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నాం. – లక్ష్మీప్రసన్న, ఆలయ ఈఓ●న్యూస్రీల్చిల్పూరుగుట్టకు ఇలా చేరుకోవచ్చు.. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
● మొదటిరోజు 95.46 శాతం హాజరు ● 10 నిమిషాల ఆలస్యంతో వెనుదిరిగిన విద్యార్థి ● మరో విద్యార్థిని సెంటర్‌కు చేర్చిన సీఐ జనగామ రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్టియర్ పరీక్షకు 4,481 మంది విద్యార్థులకు 4,278 (95.46 శాతం) మంది హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి జితేంతర్‌రెడ్డి తెలిపారు. పరీక్ష సరళిని పరిశీలించిన కలెక్టర్ పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని ప్రభుత్వ బాలి కల జూనియర్ కళాశాల సెంటర్‌ను కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల పనితీరు, స్క్రైబ్ విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తాగునీరు, మెడికల్ సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించా రు. ఎలక్ట్రానిక్ గడియారాలు, మొబైల్ ఫోన్లు వంటి ఉపకరణాలను అనుమతించకూడదని చెప్పారు. కలెక్టర్ వెంట డీఐఈఓ తదితరులు ఉన్నారు.ఒక సెంటర్‌కు బదులు మరో సెంటర్‌కు.. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాల కు చెందిన విద్యార్థిని స్టేషన్‌రోడ్డులోని కోఎడ్యుకేషన్ జూని యర్ కళాశాల పరీక్ష కేంద్రానికి 20 నిమిషాల ముందు చేరుకుంది. అక్కడ తన హాల్‌టికెట్ నంబర్ లేకపోవడంతో తిరిగి స్టేషన్‌రోడ్డులోని బాలిక కళాశాలకు చేరుకుంది. అప్పటికే సమయం మించి పోవడంతో అధికారులు లోనికి అనుమతించలేదు. అలా గే ఒక పరీక్ష కేంద్రానికి బదులు మరో పరీక్ష కేంద్రానికి చేరుకున్న ఓ విద్యార్థిని సమయం మించిపోకుండా సీఐ దామోదర్‌రెడ్డి పోలీస్ వాహనంలో పరీక్ష రాయనున్న సెంటర్‌కు తీసుకెళ్లారు. మరో విద్యార్థిని సునీత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షి యల్ కళాశాల పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా.. పొరపాటున ప్రెస్టెన్ కళాశాలకు చేరుకుంది. విషయం గ్రహించిన సీఐ తన వాహనంలో సకాలంలో ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో విద్యార్థి బి.అజయ్ పొరపాటున పల్లగుట్ట క్రాస్ సమీప సోషల్ వెల్ఫేర్ స్కూల్ సెంటర్ చేరుకున్నాడు. నోటీసు బోర్డుపై హాల్ టికెట్ నంబర్ కనిపించక పోవడంతో ఆందోళనకు గురయ్యా డు. అక్కడ ఉన్నవారు హాల్‌టికెట్ పరిశీలించి సెంటర్ ఇది కాదని చెప్పారు. పరీక్షకు ఐదు నిమిషాలే ఉండటంతో గమనించిన సీఐ జి.వేణు తన పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో పరీక్ష రాయాల్సిన నమిలిగొండ శివారు మోడల్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. -
సదరం సర్టిఫికెట్ల స్థానంలో యూడీఐడీ కార్డు
● 7 నుంచి 21కి పెరిగిన వైకల్య సేవలు ● జిల్లా జనరల్ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు చర్యలు జనగామ: కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రస్తుతం అందిస్తున్న సదరం సర్టిఫికెట్ స్థానంలో యూడీఐడీ(యూనిక్ డిజబులిటీ ఐడీ) కార్డు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఏడు కేటగిరీల్లో సదరం సర్టిఫికెట్లు అందిస్తుండగా.. ఇక నుంచి 21 కేటగిరీలకు సంబంధించి యూడీఐడీ కార్డులు ఇవ్వనుంది. ఈ సేవలను ఈనెల 1వ తేదీ నుంచి అమలుకు శ్రీకారం చుట్టింది. వైకల్య పరీక్షల నిర్వహణకు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావుతో పాటు ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఏఈ మహిపాల్, వివిధ విభాగాల హెచ్ఓడీలు, డాక్టర్లతో కలిసి అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. -
‘జీడికల్’ ఆదాయం రూ.2.48లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయ పరిధిలో ఉన్న 72.2 ఎకరాల దేవస్థాన భూమి, ఆలేరు మండలంలోని కొల్లూరులో ఉన్న 1.27 ఎకరాలకు మంగళవారం కౌలుకు వేలం నిర్వహించగా రూ.2.48,500లు వచ్చినట్లు ఈఓ వంశీ తెలిపారు. జీడికల్‌లోని భూమిని యాదాద్రి జిల్లాకు చెందిన సూదగాని జయరాములు 3 ఏళ్లకు గాను రూ.2,45,000లకు, కొల్లూరులోని 1.27 ఎకరాలకు అదే గ్రామానికి చెందిన తెడ్డు భిక్షపతి 3 ఏళ్లకు రూ.3,500లకు వేలం పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఉప్పలమ్మ దేవాస్థానం ఈఓ కె.రాములు, స్థానిక దేవాలయ సిబ్బంది భరత్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
● డీఎంహెచ్ఓ మల్లికార్జున్ నర్మెట: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్ అన్నారు. ఆశ డే సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది ని బద్ధతతో విధులు నిర్వర్తించాలని సూపర్వైజర్లు, ఏ ఎన్ఎంలు, ఆశలు క్షేత్రస్థాయిలో పర్యటించి పేదవారికి పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చూడాలన్నా రు. ఈ సందర్భంగా పల్లె దవాఖాన సామగ్రిని ఎంఎల్హెచ్విలకు అందజేశారు. టీబీ సూటం సాంప్సి ల్స్, కుస్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్యాధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి భాస్కర్, మండల వెద్యాధికారులు సీహెచ్ ఉదయ్ కిరణ్, ప్రసన్న కృష్ణ, సూపర్‌వైర్లు పద్మావతి, భాగ్య, నల్లగంతల శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశలు, సిబ్బంది పాల్గొన్నారు. -
గూగుల్ షీట్లో నల్లా పన్ను వివరాలు
జనగామ: నల్లా పన్ను బిల్లుల చెల్లింపులపై అధికార యంత్రాంగం కదిలింది. ‘ఆఫ్‌లైన్ మాయ–నల్లా బిల్లులు చెల్లించినా... ఆన్లైన్లో బకాయి చూపిస్తున్న వైనం’ అనే శీర్షికన ఈ నెల 3న సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పందించారు. ఆఫ్‌లైన్‌లో నల్లా పన్నులు తీసుకున్నా.. ఆన్లైన్లో బకాయి ఉన్నట్టు చూపించడంపై కమిషనర్‌ను వివరణ కోరినట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు 2016 నుంచి పట్టణంలో నల్లా కలెక్షన్లు ఎన్ని... ఏటా డిమాండ్ ఎంత... అనధికారిక ట్యాప్‌లు ఎన్ని అనే దానిపై లెక్కలు తీస్తున్నారు. కరోనా సమయంలో లెక్క తెలియని రశీదు బుక్స్ మాయమైన సంఘటన పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం ప్రజలకు తెలిసిందే. ఆ బుక్స్‌కు సంబంధించి ఇప్పటి వరకు లెక్కాపత్రం లేదు. 200పైగా రశీదు బుక్స్.. ప్రస్తుతం సీడీఎంఏ నుంచి ఆన్‌లైన్‌కు అప్రూవల్ లేకపోవడంతో 10 ఏళ్ల నాటి సుమారు 200 పైగా రశీదు బుక్స్‌ను ఆఫ్‌లైన్ ద్వారా ఒక్కో వినియోగదారుడి వివరాలను గూగుల్ షీట్లో నమోదు చేస్తున్నారు. ఇందులో మరో 10 బుక్స్ వరకు మిస్ అయినట్లు తెలుస్తుంది. సాక్షిలో వచ్చిన కథనం పట్టణంలో వైరల్ కాగా... ఆఫ్‌లైన్‌లో నల్లా పన్ను చెల్లించిన వినియోగదారులు... పాత రశీదులను వెతుకులాడే పనిలో ఉన్నారు. అనధికార కనెక్షన్లు ఎన్ని..? పట్టణంలోని పలు వార్డుల్లో వందలాది అనధికారి నల్లా కనెక్షన్లు ఉన్నట్టు సమాచారం. ఇంటి అనుమతులు, అమ్ముకునే సమయంలో కేవలం ఆస్తిపన్ను తీసుకుని, నల్లా పన్నులు ఉన్నాయా లేదా అని పట్టించుకోలేదు. నల్లా పన్ను బకాయి ఉండగానే... ఇంటిని మరొకరికి అమ్ముకోగా... అతనికి సైతం మరో ట్యాప్ కనెక్షన్ ఇవ్వడంతో ఒకే ఇంటి నంబ ర్‌పై రెండు చూపిస్తున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. అనధికార కనెక్షన్ల బాగోతం బయటకు వస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం పాత రశీదు బుక్స్ వెతుకుతున్న మున్సిపల్ సిబ్బంది -
నేరాలను నియంత్రించాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్బచ్చన్నపేట: జిల్లాలోని పలు గ్రామాల్లో జరుగుతున్న నేరాలను నియంత్రించాలని డీసీపీ రాజ మహేంద్రనాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ట్రాన్స్‌కో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్ఈ టి.వేణుమాదవ్తో కలిసి మాట్లాడారు. పలు గ్రామాల్లో రాత్రి వేళ దుండగులు వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరు ఎత్తుకెళ్తున్నారన్నారు. దాని విలువ కేవలం రూ.60 వేలు ఉంటుందని, అదేస్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్ రావడానికి వారం రోజుల సమయం పడుతుందన్నారు. ఆ సమయంలో అన్నదాతల వరి పొలాలు ఎండిపోతున్నాయని, అందుకే రాత్రి వేళ రైతులు కూడా ఓ కన్ను వేసి ఉంచాలన్నారు. కాపర్ వైర్ చోరీ నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. అనంతరం ఉత్తమ అ ధికారిగా ఎంపికై న జేఎల్ఎం శ్రీరాం పర్శరాములుకు డిపార్ట్మెంట్ తరఫున బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ లక్ష్మి నారాయణరెడ్డి, విజయ్‌కుమార్, ఏడీఈ వేణుగో పాల్, ఏఎస్సీ నితిన్ చేతన్, సీఐ అబ్బయ్య, ఎస్సై హమీద్, ఏఈ రాజ్‌కుమార్, రాజవర్ధన్‌రెడ్డి, అజయ్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి జనగామ రూరల్: ఈ నెల 8న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రవీందర్‌శర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించుకునేందుకు జాతీ య లోక్ అదాలత్ చక్కని వేదిక అన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
విజయోస్తు!
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం 17 కేంద్రాలు కేటాయించగా 9 సెంటర్లు జనగామ, 8 కేంద్రాలు ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉండగా ఉదయం 8.30 వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌తో పాటు లఘు ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారని ఫి ర్యాదు మేరకు ఈ సారి వాయిస్ రికార్డుతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం 8,945 మంది విద్యార్థులు హాజరు కానుండగా మొదటి సంవత్సరం 4,251 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,694 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాలు ఇవే.. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కోడ్యుకేషన్ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల, ఆర్ఆర్ఎం డిగ్రీ కళాశాల, ఏబీవీ జూనియర్ కళాశాల, ఏ,బీ, ప్రెస్టెన్ జూనియర్ కళాశాల, స్టేషన్ ఘన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల, మోడల్ స్కూల్, నర్మెట, దేవరుప్పుల, కొడకండ్ల, జఫర్‌గఢ్, పాలకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలులో ఉంటుంది. ఐదు నిమిషాలు ఆలస్యం అయినా.. గతంలో ఇంటర్ పరీక్షలకు నిమిషం నిబంధన ఉండేది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు ఈ నిబంధనను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ఉంటే మరో 5 నిమిషాలు సడలింపు ఇచ్చారు. ఆ తర్వాత వస్తే అనుమతించరు. విద్యార్థులు అర గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమం. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు హాజరుకానున్న 8,945 మందివిద్యార్థులు నిమిషం నిబంధన ఎత్తివేత ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి ప్రముఖ సైకాలజిస్ట్ వాసునాయక్ప్రశాంత వాతావరణంలో రాయాలి – వాసునాయక్, ప్రముఖ సైకాలజిస్ట్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలను ఒత్తిడితో కాకుండా ప్రశాంత వాతావరణంలో రాయాలి. నేటి నుంచి వార్షిక పరీక్షల సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి. పరీక్షలకు ముందు చదివిన దాన్ని రివిజన్ చేయాలి. కొత్త సిలబస్‌ని చదవకూడదు. పరీక్షల సమయంలో చదివే ముందు ఇష్టం ఉన్న సబ్జెక్ట్‌తో ప్రారంభించాలి. పరీక్షల సమయంలో బయటి ఆహారం తీసుకోకుండా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పరీక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత 15 నిమిషాల ముందు ఎవరితో మాట్లాడ కూడదు. పరీక్ష పేపర్ తీసుకున్న తర్వాత నవ్వుతూ చదవడం ప్రారంభించాలి. అలాగే రాసే ముందు డీప్ బ్రీత్ తీసుకోవాలి. పేపర్ చదివిన తర్వాత బాగా నచ్చిన, వచ్చిన సమాధానం రాయాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. భయపడకుండా ఉల్లాసంగా పరీక్షలు రాస్తే తప్పకుండా విజయం పొందుతారు.అన్ని ఏర్పాట్లు పూర్తి..నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సెంటర్ వద్ద తాగునీరు, టెంట్, మరుగుదొడ్లు, తదితర ఏర్పాట్లు చేశాం. అందరి సహకారంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం. జితేందర్‌రెడ్డి, ఇంటర్ విద్యాధికారి -
టెన్త్‌లో మొదటిస్థానంలో నిలవాలి
పాలకుర్తి టౌన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలోనే మొదటిస్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్లో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య అధ్యక్షతన టెన్త్ విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన విజయోస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల పాఠశాలల నుంచి సుమారు 668 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థి జీవితంలో పదో తరగతి ఒక ప్రధాన ఘట్టమన్నారు. క్రమశిక్షణ, సమయ పాలన పాటిస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధిచాలన్నారు. అన్ని సబ్జెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఇష్టం, ఉత్సాహంతో చదవితే ఓటమన్నది ఉండదన్నారు. సరైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యసాధనకు నిరంతరం శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాడిశెట్టి రమేశ్, జిల్లా మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, జిల్లా పరీక్షల విభాగాధికారి చంద్రబాను, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఆవుల రాములు, ఆర్ఐ రాకేష్, నరసింహమూర్తి, వాసుదేవరెడ్డి, శ్యామూల్ ఆనంద్, వెంకటేశ్వర్లు, శోభారాణి, రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజాజ్వాన్ బాషా అన్నారు. మండల కేంద్రలంలోని 33/11కేవీ విద్యుత్ సబ్సేష్టన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ సేష్టన్ నిర్వహణ తీరును ఫ్యూజ్ కనెక్షన్, విద్యుత్ డిమాండ్ తదితరల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ రాకేశ్, సబ్ ఇంజనీర్ రాకేశ్, సిబ్బంది పాల్గొన్నారు. ‘నీట్’ పరీక్ష కేంద్రాల పరిశీలన జనగామ రూరల్: మే 4వ తేదీన జరగనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ 2025) నిర్వహణకు పరీక్ష కేంద్రాల ఎంపికకు మంగళవారం జిల్లా కేంద్రంలోని గీతాంజలి పబ్లిక్ పాఠశాల, సెయింట్ మేరీస్ పాఠశాల, క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలను డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా నుంచి 850 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఇబ్బంది లేకుండా పరీక్ష రాసేందుకు వీలుగా బెంచీలు, కుర్చీలు, తాగునీరు, మూత్రశాలలు, సీసీ కెమెరాల పనితీరు, తరగతి గదులు, లైటింగ్, ఫ్యాన్లు, భద్రత దృష్ట్యా ప్రహరీ, విద్యుత్ సరఫరా, తదితరాల సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేశ్, జీసీడీఓ గౌసియా బేగం, నీట్ జిల్లా కో–ఆర్డినేటర్ శిల్పా, సీఐ ప్రభాకర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి జీవితంలో ‘పది’ ప్రధాన ఘట్టం కలెక్టర్ రిజ్వాన్ బాషా -
మున్సిపల్లో ఆడిట్ షురూ
జనగామ: జనగామ మున్సిపల్లో 2023–24 వార్షిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్ మంగళవారం ప్రారంభమైంది. జిల్లా సహాయక ఆడిటింగ్ అధికారి రెహమాన్‌ఖాన్, సీనియర్ ఆడిటర్లు నవీద్ ఫారుఖీ, జి.అనిల్ కుమార్ నేతృత్వంలో ఆడిటింగ్ చేయనున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇంటి అనుమతులు, పన్నుల రూపంలో వచ్చిన జనరల్ ఫండ్.. ఖర్చులకు సంబంధించి ఆడిటింగ్ చేయనున్నారు. ఏడాది రాబడి, ఖర్చుల వివరాలను అధికారులు ఆడిట్ బృందానికి అప్పగించారు. నెలరోజుల లోపు ఆడిట్ పూర్తి కానుంది. జాతీయస్థాయిలో ప్రతిభ చిల్పూరు: మండలంలోని పల్లగుట్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వేల్పుల కార్తీక్ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి అన్నెపు కుమార్, హెచ్ఎం కేతిడి నరసింహారెడ్డి, పీడీ దేవ్సింగ్లు తెలిపారు. ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నాలుగవ సౌత్‌జోన్ జాతీయ స్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాఽధించినట్లు తెలిపారు. మంగళవారం పాఠశాల ఆవరణలో కార్తీక్‌ను చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, చిర్ర నాగరాజు, శ్యాంసుందర్, కుంచాల సంపత్‌రాజు తదితరులు అభినందించారు. జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలి జనగామ: రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్లకు ఇచ్చే పే స్కేల్ ఇవ్వాలని కోరుతూ జనగామ మున్సిపల్లో విధులు నిర్వర్తిస్తున్న వార్డు ఆఫీసర్లు మంగళవారం సీఎస్, పే రివిజన్ కమిషన్‌కు రిజిస్టర్ పోస్టు ద్వారా వినతిని పంపించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జీఓ 109 ద్వారా గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించి, జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో 1,862 మందిని ఆయా శాఖల వారీగా భర్తీ చేయగా, జనగామ మున్సిపల్లో 13 మంది వార్డు ఆఫీసర్లు, ఇద్దరు జూనియర్ అకౌంట్ ఆఫీసర్లుగా బాధ్యతలు చేపట్టారన్నారు. వారికి జూనియర్ అసిస్టెంట్ కేడర్‌కు ఇచ్చే పేస్కేల్ రూ.24,280 వేతనం కాకుండా రికార్డు అసిస్టెంట్‌కు ఇస్తున్న రూ. 22,240 ఇస్తున్నారన్నారు. వార్డు ఆఫీసర్లుగా పని చేస్తున్న ప్రతీఒక్కరికి జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. శరవేగంగా లిఫ్ట్ పనులు వారంరోజుల్లో అందుబాటులోకి.. జనగామ: జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో లిఫ్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి, రెండవ అంతస్తుల వరకు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. రెండు అంతస్తుల్లో ఉన్న జనరల్ వార్డులతో పాటు డయాలసిస్, ఎక్స్‌రే, ఏఆర్టీ, బ్లడ్ బ్యాంకు, ఆపరేషన్ థియేటర్, ఇతర సేవలకు సంబంధించి పేషెంట్లకు సౌకర్యంగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా పనులు చేస్తున్నారు. లిఫ్ట్ అందుబాటులోకి వస్తే పేషెంట్లకు ఇబ్బందులు తప్పనున్నాయి. పోలీస్ జాగిలాల పాత్ర కీలకం వరంగల్ క్రైం: నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. జాగిలాలకు మెరుగైన వసతిని ఏర్పాటు చేయాల్సిందిగా సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్‌కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ పాల్గొన్నారు. -
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
● కంపుకొడుతున్న కాలనీలు● కమిషనర్ ఉన్నారా.. ప్రజల అనుమానాలు● అధ్వానంగా మారిన ప్రత్యేక పాలన● పర్యవేక్షణ కరువుజనగామ: కంపుకొడుతున్న కాలనీలు.. రోడ్లపైనే చెత్త డంపింగ్‌లు... మురికి నీటితో నిండిన డ్రెయినేజీ లు.. దోమల స్వైర విహారం... ప్రమాదకరంగా నా లాలు... ఇది జనగామ మున్సిపల్ పరిస్థితి. కమిషనర్ ఉన్నాడా లేడా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు వార్డు ప్రజలు. జనవరి 27వ తేదీన మున్సి పల్ పాలకమండలి పదవీ కాలం ముగిసిన తర్వా త ప్రత్యేక పాలన కొనసాగుతుంది. గాడితప్పిన పరిపాలన, అధ్వానంగా మారిన శానిటేషన్ నిర్వహణపై ‘సాక్షి’ మంగళవారం వార్డుల వారీగా చేపట్టిన విజిట్‌లో పలు విషయాలు వెలుగుచూశాయి. జనగామ పట్టణంలో 30 వార్డులు ఉన్నాయి. సిద్ధిపేట, హనుమకొండ, సూర్యాపేట, హైదరా బాద్ ప్రధాన రహదారులకు జంక్షన్‌గా...19.31 స్వ్కేర్ కిలో మీటర్ల పరిధిలో జనగామ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 57 వేల మంది ఉండగా, ప్రస్తుతం 85వేలకు పెరిగినట్టు అంచనా. రోజువారీగా 12 టన్నుల చెత్త సేకరిస్తుండగా, చెత్త సేకరణకు 7 ట్రాక్టర్లు, 10 ఆటోల ద్వారా కార్మికులు పని చేస్తున్నారు. శానిటేషన్‌పై స్పెషల్ ఆ ఫీసర్ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
‘నీట్–2025’ కేంద్రాలను గుర్తించండి
● సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)–2025 నిర్వహణకు జిల్లాలో పరీక్ష కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించా రు. మే 4న జరిగే ‘నీట్’ పరీక్ష నిర్వహణ, సెంటర్ల ఎంపిక, కనీస సౌకర్యాల కల్పనపై సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయ న మాట్లాడారు. నీట్ పరీక్షకు జిల్లాలో నాలుగు సెంటర్లు అవసరమని, 20 గదుల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలలను గుర్తించా లని చెప్పారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనువుగా ఉండే ఫర్నిచర్, వెంటిలేషన్, తాగునీరు, సీసీ టీవీల పర్యవేక్షణ, దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండే వాటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, కలెక్టరేట్ ఏఓ మన్సూరీ, డీఈఓ రమేశ్ పాల్గొన్నారు. -
31 వరకు ఎల్ఆర్ఎస్ రాయితీ
జనగామ: పట్టణ ప్రజలు ఎల్ఆర్ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం పురపాలికలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ లోగా తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకు న్న యజమానులకు 25 శాతం రాయితీ సదుపా యం ఉందన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం రూ.వెయ్యి చెల్లించి 2020 సంవత్సరంలో రిజిస్టర్ చేసుకున్న ప్లాట్ల యజమానులు లే అవుట్లలోని వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పారు. అనుమతి లేని లేఅవుట్లలో 10 శాతం రిజిస్ట్రేషన్ చేసుకుని, మిగిలి న వాటిని కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్ట్రేషన్ చేసుకునే సమయంలో ఎల్ఆర్ఎస్ రుసుము సైతం చెల్లించి పర్మనెంట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 25 శాతం రాయితీ పొందిన ఎం.సిద్ధులుకు ప్రొసీడింగ్ కాపీ అందజేశా రు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ జె.ప్రశాంతి తదితరులు ఉన్నారు. సద్వినియోగం చేసుకోండి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ పాలకుర్తి టౌన్: బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. సోమవా రం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన.. రికార్డులు, రిస్పెషన్, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి విధులకు సంబంధించి సూ చనలు చేశారు. గ్రామాలు, కాలనీల్లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాల కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, ఎస్సై దూలం పవన్‌కుమార్, లింగారెడ్డి పాల్గొన్నారు. -
స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
● డీఎంహెచ్ఓ మల్లికార్జున్‌రావు జనగామ: స్కానింగ్ సెంటర్లలో నియమ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు తెలిపారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ డి.రవీందర్‌గౌడ్, ఆర్టీఓ కార్యాలయ డీఏఓ ఆండాలు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గౌసియాబేగంతో కలిసి సోమవారం పట్టణంలోని సత్య స్కానింగ్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో రిజిస్టర్ మెయింటనెన్స్ చేపట్టాలని, రేడియాల జీ, గైనకాలజిస్టులు మాత్రమే స్కానింగ్ తీయాలని చెప్పారు. ఫారం–ఎఫ్‌లో స్కానింగ్ చేయించుకున్న వారి వివరాలు, భర్త పేరు, పిల్లల సంఖ్య, ఫోన్ నంబర్‌తో పాటు డాక్టర్ పేరు నోట్ చేసుకుని ప్రతి నెలా 5వ తేదీ లోపు డీఎంహెచ్ఓ కార్యాలయానికి పంపించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బంది మారిన సమయంలో నమోదు చేసుకోవా లని సూచించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు ఉంటాయని, ప్రజలకు అవగాహన కల్పించేలా తెలుగు, ఆంగ్ల భాషలో బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. స్కానింగ్ చేసే డాక్టర్ సర్టిఫికె ట్ కాలపరిమితి ముగియకుండా జాగ్రత్తలు తీసుకో వాలని ఆదేశించారు. -
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేవు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. చివరికి శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందిఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటాగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోలవగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డికి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిలను ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత శ్రీపాల్‌రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగిలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటివరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులనుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్‌రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్‌రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్ 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 1,348 ఓట్లు పెరిగి, 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. ● హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు.న్యూస్రీల్ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి గెలుపు రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ 19మంది బరిలో ఉన్నా ఐదుగురి మధ్యనే సాగిన పోటీ అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ -
పంట పొలాలకు నీరందించాలి
జనగామ రూరల్: యాసింగిలో సాగు చేసిన వరి పంట పొలాలకు నీరు లేక ఎండుతున్నాయి.. తక్షణ మే నీరందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జనగామ మండలంలోని వడ్లకొండ, గానుగుపహాడ్ గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించారు. పదెకరాల్లో సాగు చేసిన వరి ఎండిపోయి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు గుత్తి రాములు–మల్లమ్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదెకరాల పంట అక్కరకు రాకుండా పోయిందని మరో రైతు నిమ్మల భాస్కర్ ఎండి న కొయ్యలను చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏటా రెండు సీజన్లలో ఒక్కరోజు కూడా పంటలు ఎండి పోలేదని, కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పొలాలకు నీరందించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించా రు. ఎమ్మెల్యే వెంట యాదగిరిగౌడ్, శంకర్‌నాయక్, నీల యాదగిరి, శ్రీనివాస్, భాస్కర్, మసిఉర్ రెహమాన్, సందీప్ తదితరులున్నారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులు
జనగామ రూరల్: చేనేత టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవా లని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు పి.చౌడేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఈ కోర్సుకు సంబంధించి 60 సీట్లు కేటాయించారని, పదో తరగతిలో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు ఓఎస్డీ హిమజాకుమార్ను 9030079242 మొబైల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
జనగామ రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షల కోసం అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 8,945 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనుండగా.. ఇందులో ఫస్టియర్ 4,251 మంది, సెకండియర్ 4,694 మంది ఉన్నారు. 17 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. పర్యవేక్షణకు సెంటర్‌కు ఒకరి చొప్పున పర్యవేక్షణ, అదనపు పర్యవేక్షణ అధికారులను నియమించారు. ఒక్కో ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్‌తో పాటు 300 వరకు ఇన్విజిలేటర్లకు విధులు కేటాయించారు. ప్రశ్నపత్రాలను తెరిచే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సెంటర్ లొకేటర్ యాప్.. గతంలో పరీక్ష కేంద్రాల చిరునామా తెలుసుకోవడానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈసారి లొకేటర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా విద్యార్థులు సులువుగా పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు. హాల్‌టికెట్ల జారీలో ప్రయివేట్ కళాశాలలు పెట్టే ఇబ్బందుల నేపథ్యంలో వెబ్సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. పరీక్ష పత్రాలు ఇప్పటికే జిల్లా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. వాటిని ఎస్కార్ట్, సీసీ కెమెరాల పర్యవేక్షణలో సెంట ర్లకు తరలించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. పరీక్షల సమయంలో సమీప బుక్‌స్టాళ్లు, జిరాక్స్ సెంటర్లను మూసివేస్తామని అధికా రులు వెల్లడించారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం గురుకుల, మోడల్ స్కూల్, మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలకు పరీక్ష కేంద్రాలు దూరం ఉంటే.. సంబంధిత విద్యార్థులను సెంటర్లకు ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా అప్ అండ్ డౌన్ చేరవేసే వెసులుబాటు ను ప్రభుత్వం కల్పించింది. అందుబాటులో వైద్య సిబ్బంది.. ఎగ్జామ్ సెంటర్ల వద్ద వైద్య సేవలను అందుబాటులో ఉంచడానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సూపర్ వైజర్లకు విధులు కేటాయించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచడంతోపాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలి ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి. ఇందుకు వైద్య, పోలీ సులు, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, పురపాలక, తపాలా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. తాగునీరు, అంతరాయం లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పించాలి. పరీక్షల సమయాల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడిపించాలి. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించ డానికి ఏర్పాట్లు చేస్తున్నాం. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. హాల్‌టికెట్ల జారీ విషయంలో విద్యార్థుల ను ఇబ్బందులకు గురిచేసే కళాశాలపై ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – రమేశ్, డీఈఓ రేపటి నుంచి 25వ తేదీ వరకు.. హాజరుకానున్న 8,945 మంది విద్యార్థులు జిల్లాలో మొత్తం 17 పరీక్ష కేంద్రాలు సెంటర్ల గుర్తింపునకు లొకేటర్ యాప్.. పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ప్రశ్నపత్రాలు -
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuనల్లా బిల్లులు చెల్లించినా.. ఆన్లైన్లో బకాయి చూపిస్తున్న వైనం రోజువారీగా వసూలు చేసిన డబ్బులు ఏవీ? ● ఆందోళనలో వినియోగదారులుజనగామ: జనగామ మున్సిపల్ పరిపాలన గాడి తప్పింది. కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ (సీడీఎం) ఆదేశాలు కూడా పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంటే... ఇక్కడ మాత్రం ఆఫ్‌లైన్ అంటున్నారు. నల్లా బిల్లులు చెల్లిస్తున్నా... ఆన్లైన్లో బకాయి చూపిస్తుండడంతో పట్టణ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పారదర్శకత లేని ఆఫ్‌లైన్ విధానంతో నల్లా బిల్లుల వసూళ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుంటే.. అధికారులు మాత్రం ఆవేమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జనగామ పట్టణంలోని 30 వార్డుల పరిధిలో 13,636 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ట్యాప్ కలెక్షన్ల ద్వారా ఏటా రూ.1.66 కోట్లు పన్నుల రూపంలో రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.19 లక్షల మేర వసూళ్లు చేశారు. ఆన్లైన్లో బిల్లుల చెల్లింపుకు సంబంధించి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం ఆఫ్‌లైన్ ద్వారా రశీదు ఇస్తూ పన్ను తీసుకుంటున్నారు. గతంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబీ రికార్డుల మాయం, డబుల్ బిల్లులు, నాసిరకం పనులకు చెల్లింపులు ఇలా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. గత మూడేళ్ల కాలం నాటి ఆడిట్ పూర్తి చేసి రెండేళ్లు గడిచి పోతున్నా, అందులో వెలుగు చూసిన అక్రమాలను బయట పెట్టడం లేదు. ఆన్లైన్ పద్ధతిలో చేసిన పనులకే దిక్కులేని పరిస్థితిలో ఆఫ్‌లైన్‌లో నల్లా బిల్లులు వసూళ్లు చేస్తే పారదర్శకత ఎక్కడా అంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఆన్లైన్ చేస్తున్నాం.. నల్లా పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రస్తుతం ఆఫ్‌లైన్ పద్ధతిలో వ సూళ్లు చేస్తుండగా, త్వరలోనే ఆన్‌లైన్‌కు అనుసంధానం చేస్తాం. ఆఫ్‌లైన్ ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. బకాయిలు చెల్లించిన వారు ఆనన్‌లైన్‌లో డ్యూ చూపించినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పని లేదు. – వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్వార్డులు: 30 నల్లా కనెక్షన్లు: 13,636 నల్లా పన్ను చెల్లించేందుకు ఐదు రూపాయల బిళ్లలు తీసుకొచ్చిన వినియోగదారుడు వేణురావాల్సిన బకాయి : రూ.1.66 కోట్లు ఇప్పటి వరకు వసూలైంది : రూ.19 లక్షలు న్యూస్రీల్పన్ను చెల్లించినా..వినియోగదారులు ఆఫ్‌లైన్ ద్వారా నల్లా పన్ను చెల్లించినా ఆన్లైన్లో బకాయి ఉండడంతో అధికా రులను నిలదీస్తున్నారు. రశీదులు తీసుకువస్తే... ఆన్లైన్లో బకాయి నుంచి చెల్లించినట్టుగా మారుస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ఒకవేళ నల్లా పన్నుకు సంబంధించిన రశీదు పోగొట్టుకుంటే బాధ్యత ఎవరిదని నిలదీస్తున్నా.. పురపాలిక నుంచి ఎటువంటి జవాబు రావడంలేదు. రోజువారీగా నల్లా పన్నులు వసూ ళ్లు... బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ఎంత.. అనే లెక్కలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆస్తిపన్ను, ఇంటి అనుమతులు ఇలా ప్రతీ పని ఆన్లైన్ ద్వారా కొనసాగుతుంటే.. ఒక్క నల్లా పన్నులు మాత్రం ఆఫ్‌లైన్‌లో ఎందుకు తీసుకుంటున్నారేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. గ్రెయిన్ మార్కెట్ కు చెందిన పి.వేణు గతంలో నల్లా పన్ను రూ.6వేలు చెల్లించగా, ఇంకా రూ.3,600 బకాయి ఉన్నాడు. కా నీ ఆన్లైన్లో రూ.9,600 బకాయి ఉన్నట్లు చూపించడంతో ఆయన మున్సిపల్‌కు వెళ్లి సంబంధిత అఽ దికారులను ప్రశ్నించారు. సరి చేస్తామంటూ తప్పించు కునే ప్రయత్నం చేశారు. బకాయి ఉన్న రూ. 3,600 ఐదు, పది రూపాయల బిళ్ల్లలు ఇవ్వగా, అ ధికారులు ససేమిరా అన్నారు. కాయిన్స్ తీసుకో వడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో వాటిని తీసుకుని రశీదు ఇ చ్చా రు. ఆఫ్‌లైన్ రశీదులు పోగొట్టుకుని, ఆన్లైన్లో వందశాతం నల్లా పన్ను ఉందని చూపించే బాధితులు చాలా మంది ఉన్నారని, వారికి ఏం సమాధానం చెబుతారని గట్టిగా ప్రశ్నించడంతో అలాంటిది ఏమీ ఉండదని దాటవేసే ప్రయత్నం చేశారు. -
ఎత్తిపోతలు.. ఎప్పటికో!
దేవాదుల మూడో దశకు భూసేకరణే అసలు సమస్యవసంతోత్సవానికి వీడ్కోలునిట్ వరంగల్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన వసంతోత్సవం ‘స్ప్రింగ్‌స్ప్రీ–25’ వేడుకలు ఆదివారం ముగిసాయి. చివరిరోజు పోలరాయిడ్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, క్యూ ఫ్యాక్టర్, థింక్ డ్రాప్ రివీల్, పిక్చర్ పజిల్, సోలో ఐడల్, నుక్కడ్ నాటక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాత్రి సింగర్ నిఖిల్ డిసౌజా పాటలకు విద్యార్థులు స్టెప్పులేసి కేరింతలు కొట్టారు. – కాజీపేట అర్బన్ 8లో ‘దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం’. ● ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ప్రాజెక్టు ● కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రుల పర్యటన ● హామీలు, ఆదేశాలు.. అయినా పూర్తికాని భూసేకరణ ● రూ.6వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు.. పెరిగిన అంచనా వ్యయంభూసేకరణే సమస్య.. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రైతులు ఎక్కువ పరిహారం డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి అడ్డంకిగా మారాయి. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం విపరీతంగా పెరుగుతోంది. మొత్తం 33,224 ఎకరాలకు 30,268 ఎకరాలు సేకరించగా.. జనగామ నియోజకవర్గంలో 945 ఎకరాలు, పాలకుర్తిలో 826, గజ్వేల్‌లో 230, నర్సంపేటలో 131, వర్ధన్నపేటలో 168 ఎకరాలు.. ఇలా 2,957 ఎకరాల సేకరణ జరగాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయం 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. మూడు దశల్లో 16 ప్యాకేజీల్లో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.14,188 కోట్లు ఖర్చయినట్లు అధికారులు వెల్లడించారు. 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత భూసేకరణతో పాటు ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరోసారి అంచనాలు పెంచి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. అయితే ఈమేరకు అధికారులు రూ.17,500 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. పరిశీలనలో ఉన్న ట్లు సమాచారం. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచడం.. లేదంటే రైతులను ఒప్పించడం.. ఏదో ఒకటి జరిగితేనే భూసేకరణ ముందుకు సాగి.. ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. సాక్షిప్రతినిధి, వరంగల్: ...ఏడాదిలో 300 రోజులు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని తొమ్మిది జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు నీరందించే జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం.. ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ఉంది. మూడో దశలో భూసేకరణ చేపట్టని కారణంగా సుమారు ఆరేళ్లుగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు 91 శాతం వరకు పూర్తయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతుండగా.. కీలకమైన 9 శాతం పనులు పూర్తి చేయడానికి భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఉన్నతాధికారులు 2024 ఆగస్టులో ప్రాజెక్టును పరిశీలించారు. సమీక్ష నిర్వహించి వెంటనే భూసేకరణ చేపట్టి పూర్తి చేస్తామని ప్రకటించినా.. ఆదిశగా అడుగులు పడలేదు. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2004లో శ్రీకారం చుట్టింది. తొమ్మిది జిల్లాల్లో సుమారు 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఎక్సర్సైజ్ మూడోదశను దాటించలేకపోతున్నది. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతోపాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధి 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 3,16,634 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 2,40,088 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వివరాలు లిఫ్టు చేయాల్సిన నీరు : 60.00 టీఎంసీలు వ్యవసాయానికి నీరు : 56.71 టీఎంసీలు తాగునీటి వినియోగం : 2.97 టీఎంసీలు పారిశ్రామిక నీటి సరఫరా : 0.32 టీఎంసీలు ఇందుకు అవసరమైన విద్యుత్ : 495.55 మెగావాట్లు స్థిరీకరించిన ఆయకట్టు : 5,56,722 ఎకరాలు సాగులోకి వచ్చిన ఆయకట్టు : 3,16,634 ఎకరాలు 2005–06లో ప్రాజెక్టు అంచనా వ్యయం : రూ.6016 కోట్లు 2008–09లో సవరించిన అంచనా వ్యయం : రూ.9427.73 కోట్లు 2016–17లో సవరించిన వ్యయం : రూ.13445.44 కోట్లు సవరించిన వ్యయ ప్రతిపాదనలు : రూ.14729.98 కోట్లు అయిన మొత్తం ఖర్చు : రూ.14,188 కోట్లు ప్రతిపాదనల్లో తాజా అంచనా వ్యయం : రూ.17,500 కోట్లు ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి..దేవాదుల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. ఇరవయ్యేళ్లవుతున్నా అసంపూర్తి ప్రాజెక్టుగానే ఉంటున్నది. అలాగే రెండువేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే నక్కలతూముకు కాల్వలు నిర్మించి నీటిని సరఫరా చేయాలి. – బొడ్డు ప్రతాప్, రైతు, ధర్మసాగర్● 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలివి. భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది..ప్రభుత్వ మార్గదర్శకాలు, కలెక్టర్ ఆదేశాల మేరకు భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. జనగామ జిల్లాలో 200 మంది రైతులకు టోకెన్లు ఇచ్చాం. మిగతా ప్రాంతాలు, గ్రామాల్లోనూ మాట్లాడుతున్నాం. 2026 మార్చి నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా రైతులను సంప్రదించి భూసేకరణ చేస్తున్నారు. – సుధాకర్, ఎస్ఈ, దేవాదుల ప్రాజెక్ట్ -
రంజాన్ ఉపవాస దీక్షలు షురూ
జనగామ: పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై జాతీయత, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తాయి. క్రమశిక్షణ, దాతృత్వం, థార్మిక చింతన కలయికే రంజాన్ మాసంగా చెప్పుకుంటారు. ఖురాన్ అవతరించిన పవిత్రమైన నెలగా భావించి, ముస్లింలు ఉదయం ఉపవాస దీక్షలతో మజీద్‌లో ప్రార్థనలు చేసి, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకుంటారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో పండుగ వాతా వరణం నెలకొంది. పట్టణంలో అనేక చోట్ల హలీం సెంటర్లను ఏర్పాటు చేయగా, రాత్రి రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాలన్నీ రద్దీగా మారిపోతున్నాయి. ప్రార్థనలు ఇలా.. పవిత్ర రంజాన్ మాసంలో మజీదులో ఇమామ్, మౌజన్ల ఆధ్వర్యంలో రోజుకు ఐదు సార్లు, శుక్రవారం జరిగే ప్రత్యేక ఇఫ్తార్ ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇందులో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో అల్లాహ్‌ను స్మరిస్తూ భక్తిని చాటుకుంటారు. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో ఆచరించాల్సిన నియమం ‘ఉపవాస వ్రతం’. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘రోజా’ అంటారు. రంజాన్ మాసంలో మరో విశేషం దానధర్మాలు చేయడం నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తుంది. రంజాన్ మాసంలో ‘జకాత్’ ఆచరించాలని ఖురాన్ బోధిస్తుంది. తాము సంపాదించిన ఆస్తిలో కొంతభాగం పేదలకు దానం చేయడాన్ని జకాత్ అంటారు. పేద ముస్లింలు అందరితో కలిసి పండుగ జరుపుకోవడానికి జకాత్ ఉపయోగపడుతుంది. జకాత్‌తో పాటు ‘ఫిత్రా’ దానం రంజాన్ నెలలో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. రంజాన్ నెల అంతా పవిత్రమైన కార్యక్రమాలతో ముగుస్తూనే.. షవ్వాల్ నెల వంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తేనే, ముస్లింలు ఉప వాస వ్రతాన్ని విరమించి, మరుసటి రోజు రంజాన్ పండుగను జరుపుకుంటారు. షవ్యాల్ నెల మొదటి రోజున జరుపుకునే పండుగను ఈదుల్ ఫితర్ అంటారు. మజీదుల ద్వారా ఆజాన్, ఉపవాస దీక్షల సైరన్ భక్తిని చాటుతున్న ముస్లింలు పండ్లు, డ్రైఫూట్స్‌కు పెరుగుతున్న గిరాకీ -
ఎండిన పంటలకు పరిహారం చెల్లించాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి బచ్చన్నపేట: భూగర్భ జలాలు అడుగంటడంతో సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు పరిహా రం చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ. 50 వేల పరిహా రాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంచు విజేందర్, బెల్లంకొండ వెంకటేష్, కనకాచారి, సిద్దయ్య, జగన్, బాలరాజు, గందమల్ల కిష్టయ్య, శ్రీనివాస్, మిన్నాలపురం ఎల్ల య్య, రామగళ్ల అశోక్, అన్నెబోయిన శ్రీనివాస్, పలువురు రైతులు పాల్గొన్నారు. పాలకుర్తిలో.. పాలకుర్తి టౌన్: ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని శేవ్వ సోమయ్యకు చెందిన పంట పొ లాలను సీపీఎం బృందం సందర్శించి పరిశీలించారు. ఇప్పటికై న ప్రభుత్వం దేవాదుల నీరు అందించి రైతుల పంట పొలాలు ఎండిపోకుండా చూ డాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్, ఇర్రి అహల్య, సోమన్న, సారయ్య, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో.. జఫర్‌గఢ్: బోరు బావుల్లో నీరు అడుగంటిపోయి ఎండిన పంటలకు వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని తమ్మడపల్లి (జి) గ్రామంలో ప్రజా సంఘాల నాయకులు, బాధిత రైతులతో కలిసి ఎండిన వరి పొలాలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాసంగిలో రైతులు శ్రమతో పాటు వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే, ఒక్కసారిగా బోరు బావుల్లో నీరు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఇప్పటికే కొంత మంది రైతులకు సంబంధించిన వరి పొలాలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గోదావరి జలాల ద్వారా చెరువులు, కుంటలు నింపి పంటలకు సాగునీరు అందించాలన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం, సంబంధిత అధికారులు సాధమైన మేర పంటలకు సాగునీరందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నక్క యాకయ్య, ఎండీ షబానా, వేల్పుల చిన్న రాములు, పెద్ద రాములు, వేల్పుల రవి, గంగరాజు, నాగరాజు, వడ్లకొండ సుధాకర్, రాజు, చంద్రు, నర్సయ్య, శంషోద్దిన్, రాజు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
భూతగాదాల్లో తలదూర్చొద్దు
● పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వరంగల్ క్రైం: భూతగాదాల్లో తలదూర్చొదని పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా పోలీసులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా శని వారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న చైన్ స్నాచింగ్ కేసులను త్వరగా పరిష్కరించి నేరస్తులను పట్టుకోవాలని చెప్పారు. బెయిల్‌పై బయటకు వచ్చి వాయిదాలకు రాని నేరస్తులను కనిపెట్టి వారిని కోర్టులో హాజరు పరిచాలన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులు సరైన సమయంలో సెంటర్లు చేరేలా ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూ డాలన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ల వారీగా స మీక్షించిన సీపీ.. ఆస్తి, ఫోక్సో, మిస్పింగ్, గంజా యి, రోడ్డు ప్రమాద కేసుల స్థితిగతులపై తెలుసుకున్నారు. డీసీపీ షేక్ సలీమా, రవీందర్, రాజమహేందర్‌నాయక్, ఏఎస్పీ చైతన్, మనన్భట్తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
అగ్నిమాపక యంత్రాలపై అవగాహన
జనగామ రూరల్: అగ్నిమాపక యంత్రాలపై సిబ్బంది అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో అగ్నిమాపక యంత్రాల వినియోగంపై కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అగ్నిమాపక యంత్రాలపై పూర్తి స్థాయిలో అవగాహన పొందాలని, వాటి పనితీరును తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు ఏ.కె.మన్సూరి, సిబ్బంది పాల్గొన్నారు. 5న మెగా జాబ్‌మేళా జనగామ రూరల్:పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. నర్సయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్లో ప్లేస్మెంట్ సెల్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న ఉదయం 10 గంటలకు మెగా జాబ్‌మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన, చదువుచున్న విద్యార్థులు కూడా పాల్గొనవచ్చన్నారు. -
పంచ సూత్రాలతో ‘విజయోస్తు’
జనగామ రూరల్: టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం విజయోస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విధితమే. ఇందులో భాగంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా పంచ సూత్రాలతో విజయోస్తు లేఖను తానే స్వయంగా లిఖించి విద్యార్థులకు అందజేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచలోని జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించి టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇష్టంతో కష్టపడి చదివితే విజయం సాధించవచ్చన్నారు. అనంతరం కలెక్టర్ స్వయంగా లిఖించిన (ప్రణాళికాబద్ధంగా చదవడం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, గత ప్రశ్న పత్రాలను సాధన చేయడం, మానసిక ఒత్తిడిని అధిగమించడం, మంచి ప్రతిభా నైపుణ్యాలను అలవర్చుకోవడం) పంచ సూత్రాల లేఖను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేశ్, జీసీడీఓ గౌసియా బేగం, ఏఎంఓ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ టి. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌లతో కలిసి చీఫ్ సూపరింటెండెంట్, అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 17 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,251 మంది, రెండో సంవత్సరంలో 4,694 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ గూగుల్ మీట్ డీఐఈఓ జితేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. టెన్త్ విద్యార్థులకు అందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా -
వైభవంగా అగ్నిగుండాలు
పాలకుర్తి టౌన్: ప్రముఖ శైవక్షేత్రం పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మాత్సవాలు శనివారం అగ్నిగుండాలు, మహాఅన్నపూజ, పూర్ణహుతితో ముగింది. చివరి రోజు ఆలయంలోని మెట్ల ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు నేతృత్వంలో తెల్లవారుజామున 4.30 గంటలకు స్వామివార్లను పల్లకిలో వాహనకారులు, భక్తులు నిప్పులపై నడిచి భక్తిపారవశ్యానికిలోనయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున శివనామస్మరణ చేస్తూ అగ్నిగుండంలో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం జరిగిన పూర్ణహుతి, స్వామివారికి 21 కేజీల పెరుగన్నంతో మహాఅన్నపూజ నిర్వహించారు. అగ్నిగుండం వద్ద ఎలాంటి సంఘటలను జరగకుండా సీఐ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు పవన్‌కుమార్, లింగారెడ్డి, యాకుబ్ హైస్సేన్లు బందోబస్తు నిర్వహించారు. అయితే అగ్నిగుండాల కార్యక్రమం ముగిసిన తర్వాత పాలకుర్తికి చెందిన చిలుకమారి స్వరూప, గిగ్గిల్ల మంజుల అగ్నిగుండం నుంచి నడిచి వెళ్తుండగా అదుపుతప్పి కింపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగంజం నాగరాజు, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వరాలయంలో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు -
మద్యం తాగి వాహనం నడపొద్దు
● డీసీపీ రాజమహేంద్రనాయక్ జనగామ: మద్యం తాగి వాహనం నడపొద్దని డీసీపీ రాజమహేంద్రనాయక్ తెలిపారు. జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో ఎస్సైలు రాజన్‌బాబు, భరత్, చెన్నకేశవులుతో కలిసి శనివారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేప ట్టారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. వెస్ట్‌జోన్ పరిధిలో నిరంతరాయంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తెలిపారు. వాహనదారులకు అన్ని పత్రాలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉన్నారు. నీటి ఎద్దడి లేకుండా చూడాలి నర్మెట: మండల కేంద్రంలో దుర్గామాత ఉత్సవాల సందర్భంగా నీటి ఎద్దడి లేకుండా చూడాలని డీపీఓ నాగపురి స్వరూపరాణి అన్నారు. శనివారం జీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడుతూ వాటర్ ట్యాంక్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. వందశాతం పన్నులు వసూలు చేసి ట్రెజరీలో జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరవింద్‌చౌదరి, పంచాయతీ కార్యదర్శి కందకట్ల శ్రీధర్, కారోబార్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన హెచ్.హర్షిణి, సీహెచ్ అక్షయ, పి.వర్షజి, స్వాతిక, భవాని, బి.ఇందు అనే విద్యార్థినులు షూటింగ్ బాల్ పోటీల్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఎన్. వరలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఎన్.అనిత తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో కూడా మరింత ప్రతిభ కనబర్చాలని కోరారు. ఈ మేరకు విద్యార్థినులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తెలిపారు. కళ్లెం సొసైటీలో విచారణ లింగాలఘణపురం: మండలంలోని కళ్లెం పీఏసీఎస్‌లో శనివారం సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టార్ కోర్నేలియస్ విచారణ చేపట్టారు. నెలరోజుల క్రితం సొసైటీలోని 11 మంది డైరెక్టర్లు ధాన్యం కొనుగోలు వివరాలు, ఏడాదిగా సమావేశం నిర్వహించకపోవడం, సొసైటీ లాభనష్టాలు, రైతుల రుణమాఫీ వివరాలను సభ్యులకు సమాచారం ఇవ్వడం లేదని డీసీఓ, జాయింట్ కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఈ దీంతో శనివారం అసిస్టెంట్ రిజిస్టార్ విచారణ చేపట్టారు. డైరెక్టర్లతో పాటు రైతులు కూడా హాజరు కాగా సొసైటీకి సంబంధించి మినిట్స్ బుక్, ఇతర రిజిస్టర్లు ఇవ్వాలని సీఈఓ మల్లేశంను కోరగా రికార్డులన్నీ తన వద్ద లేదని, చైర్మన్ ఇంట్లో ఉన్నాయని చెప్పడంతో ఎలాంటి విచారణ చేపట్టకుండానే వెళ్లిపోయారు. ఈ నివేదికనే అందజేస్తామని వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ విజయ్‌భాస్కర్, డైరెక్టర్లు ఏలె నర్సింహ్ములు అలియాస్ మూర్తి, మబ్బు రమేష్, బండ కుమార్, చాపల మల్లయ్య, నర్ర ప్రతాప్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
జల గండం
జనగామ: డేంజర్ జోన్లో భూగర్భ జలాలు.. ఏడు వందల ఫీట్ల లోతుకు బోరు వేసినా కానరాని గంగమ్మ.. భూమిని పీల్చి పిప్పి చేస్తున్నా... పావు ఎకరం తడవని దయనీయ పరిస్థితి నడుమ జిల్లా యాసంగి సీజన్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. సీజన్‌కు ముందుగానే రిజర్వాయర్ల ద్వారా సాగునీటిని చెరువులు, కుంటలకు తరలించడంలో జాప్యం చేయడంతో మూడు దశాబ్ధాల క్రితం చూసిన కరువు మళ్లీ కనిపిస్తోంది. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 37 ఫీజో మీటర్లు ఉండగా, 11 ప్రాంతాల్లో 9.16 మీటర్ల లోతు నుంచి 16.25 మీటర్ల తోలుకు భూగర్భజలాలు పడిపోయాయంటే ఎంతటి కరువు ఛాయలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగయ్యాయి. జిల్లాలో 575 చెరువుల్లో 25 శాతం నీరు లేని పరిస్థితి నెలకొంది. 50శాతం లోపు 149, 75 శాతం లోపు 45 చెరువుల్లో నీరు ఉండగా, సుమారు వందకు పైగా చెరువులు, కుంటలు నెర్రలు బారిపోతున్నాయి. 8.01 మీటర్ల లోతులో.. జిల్లాలో 10 నుంచి 16 మీటర్ల లోతుకు భూగర్భ జ లాలు పడిపోయాయి. ఒక రకంగా జిల్లా డేంజర్ జోన్లో పడిపోయినట్టే. 10 మీటర్ల లోతు వరకు పడిపోతే భూగర్భ జలాల వనరుల శాఖ హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంటుంది. గత నెల జనవరి మాసంలో జిల్లాలో యావరేజ్‌గా 7.26 మీటర్ల లో తులో ఉన్న జలాలు.. ఫిబ్రవరి మాసం వచ్చే సరికి 8.01కి జారి పోయాయి. బచ్చన్నపేట ఫీజో మీటర్ పరిధిలో 9.16 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోగా, పడమటి కేశ్వాపూర్, పోచన్నపేటలో 8.13–8.15 మీటర్ల లోతుకు జారిపోయాయి. ఘన్పూర్ మండలం ఛాగల్‌లో 11.57, జనగామ సిద్ధెంకి ఏరియాలో 15.66, కొడకండ్ల ఏరియాలో 10.21, రఘునాథపల్లి మేకలగట్టులో 16.25, పాలకుర్తి హెడ్ క్వాటర్ ప్రాంతంలో 9.91, వల్మిడిలో 10.52, రఘునాథపల్లి మండలంలో 10.5, తరిగొప్పుల హెడ్ క్వాటర్లో 9.2, అక్కరాజుపల్లిలో 12.18, జ ఫర్‌గఢ్ కూనూరు ఏరియాలో 14.75 మీటర్లలో తుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ప్రమాద స్థాయికి చేరిన భూగర్భజలాలు 11 ప్రాంతాల్లో 9.16 నుంచి 16.25 మీటర్ల లోతుకు ఎండుతున్న పంటలు... నెర్రలు బారుతున్న నేలలు గోదావరి జలాల తరలింపులో జాప్యం రోడ్డెక్కుతున్న అన్నదాతలు కష్టాల బాటలో యాసంగి సీజన్ జిల్లాలో 1.72లక్షల ఎకరాల్లో పంటల సాగుకౌలుకు తీసుకున్నా..4 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేసిన. అప్పులు తెచ్చి రూ.1.50 ల క్షల పెట్టుబడి పెట్టిన. ఒక్కసారిగా భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు అడుగంటాయి. మొదటి మడికి సైతం సాగునీరు అందలేదు. దీంతో ఉన్న పంట మొత్తంగా ఎండిపోయింది. – మానేపెల్లి లక్ష్మణ్, రైతు, లక్ష్మాపూర్, బచ్చన్నపేట బోర్లు ఆగుతూ పోస్తున్నాయి.. యాసంగి సీజన్‌కు ముందు సాగునీరు బాగానే ఉండ టంతో 4 ఎకరాల్లో వరి సాగు చేసిన. రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. పంట పొట్టదశకు చేరుకునే సమయంలో రెండు బోర్లు ఆగుతూ పోస్తుండడంతో ఒక వైపు తడి కాగా.. మరో వైపు ఎండిపోతుంది. – బండారి రాములు, రైతు, బచ్చన్నపేట -
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuపక్క ఫొటోలో కనిపిస్తున్న యువ రైతు జఫర్‌గఢ్ మండలం తమ్మడపల్లి(జి)కి చెందిన బత్తిని ప్రకాశ్. యాసంగి సీజన్లో బోరు బావి కింద ఆధారపడి మూడు ఎకరాల్లో వరి అర ఎకరంలో మొక్కజొన్న సాగు చేశారు. పంటల సాగు కోసం రూ.79వేల పెట్టుబడి పెట్టాడు. భూగర్భ జలాలు అడుగంటి, ఉన్న ఒక్కబోరు ఒట్టి పోవడంతో పొట్టదశకు వచ్చిన పంట ఎండిపోయింది. దీంతో మూడు ఎకరాల పంటను పశువులకు మేతగా వదిలేశాడు. పెట్టుబడులు కూడా రాని దయనీయస్థితిలో ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ● -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని తెలంగాణ గృహనిర్మాణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతమ్ గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై హైదరాబాద్ నుంచి అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, అధికారులతో సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులతో మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ వీసీలో హౌసింగ్ పీడీ మాతృనాయక్, డీఈలు భజరంగ్ లాల్, సాయిరాం రెడ్డి, ఎంపీడీఓ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించని డీఈఓపై చర్య తీసుకోవాలి జనగామ రూరల్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించని జిల్లా విద్యాశాఖాధికారిపై చర్య తీసుకోవాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం డీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెడ్పీఎస్ఎస్ వెంకిర్యాల హెచ్ఎం రిటైర్డ్ అయి ఐదు నెలలు గడుస్తున్నా.. పెన్షన్ ప్రతిపాదనలు పంపించకుండా మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. అనంతరం పలు సమస్యలతో కూడి వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు షరీఫ్, యాదయ్య, చొక్కయ్య, దూడయ్య, శ్రీనివాసచారి, నాగేందర్, ఆంజనేయులు, శివరాం, శ్రీనివాసులు, అరుణో దయ కుమారి, రాములు, శంకరయ్య, కమలాకర్ రెడ్డి, శ్రీనివాస్, సూర్య ప్రకాష్, సురేష్ బాబు, నా గార్జున రావు తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు యూడీఐడీ కేటాయించాలి
జనగామ రూరల్: ప్రతీ దివ్యాంగుడికి యూడీఐడీ నంబర్‌ను కేటాయించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ సదరం సర్టిఫికెట్ల నుంచి యూనిక్ డిసేబులిటీ ఐడీ, సౌర విద్యుత్ ప్లాంట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ వైద్యులచే ధృవీకరించిన వైకల్య శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్‌ను యూడీఐడీ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. దివ్యాంగులకు సంబంధించి ఇతర వివరాలు సంపూర్ణంగా నమోదు చేయాలన్నారు. నూతనంగా యూడీఐడీ కార్డుల కోసం మీసేవా కేంద్రాలే, సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి జిల్లా గ్రా మీణాభివృద్ధి శాఖ అధికారి ద్వారా యూడీఐడీ కేటాయించడం జరుగుతుందన్నారు. నేటి నుంచి యూడీఐడి జారీ చేయడం జరుగుతుందని, వీటి ద్వారానే పెన్షన్, ఇతర సౌకర్యాలు పొందాల్సి ఉంటుందన్నారు. అలాగే పీఎం కుసుం పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాల్లో స్థలాలను గుర్తించాలని, అక్కడ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే విధంగా డీపీఆర్‌లను తయారు చేయాలని సూచించారు. ఈ వీసీలో డీఆర్డీఓ వసంత, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ నేటి నుంచి సదరం సర్టిఫికెట్ విధానానికి స్వస్తి -
సాగునీరు విడుదల చేయాలని రాస్తారోకో..
జనగామ రూరల్: బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా నీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని శుక్రవారం వడ్లకొండ రైతులు జనగామ–హుస్నాబాద్ రహదారి వడ్లకొండ రోడ్డుపై రాస్తారో కో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండిన వరితో నిరసన తెలిపారు. ఆరుగాలం కష్టపడి వరి సాగు చేస్తే పంట చేతికందే సమయానికి చెరువులు, కాల్వల్లో చుక్క నీరు లేదని వాపోయారు. ధర్నా విషయం తెలు సుకున్న సీఐ దామోదర్‌రెడ్డి చేరుకుని రైతులకు డీఈతో ఫోన్ మాట్లాడించారు. రెండు రోజుల్లో నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. రైతులు హరీశ్, నామాల భాస్కర్, జగన్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎండిన వరితో రైతన్నల నిరసన -
ముగిసిన కులగణన
● 1,77,191 కుటుంబాల్లో సర్వే పూర్తి ● ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి ● టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషాజనగామ: జిల్లాలో ఈనెల 16న చేపట్టిన కులగణన(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) రెండో విడత ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. మొదటి విడతలో గణన పూర్తి కాని కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన స్టేట్ కాల్‌సెంటర్‌కు 41, ప్రజాపాలన కేంద్రాల్లో 28 కుటుంబాల వారు తమ వివరాలను నమో దు చేసుకున్నారు. మొత్తం 1,77,191 కుటుంబాల గణన పూర్తయింది. జిల్లాలో రెండో విడత కుల గణ న సర్వే వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా డాటా ఎంట్రీ ప్రక్రియపై సమీక్షించారు. ఎంపీడీఓ కార్యాలయం, ప్రజాపాలన సేవా కేంద్రాలు, టోల్ ఫ్రీ నంబర్, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో తప్పులు లేకుండా చూడాలని చెప్పారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎల్1, ఎల్2, ఎల్3 జాబితాకు సంబంధించి మార్పులు, చేర్పులకు తప్పనిసరిగా కారణాలు చూపించాలని పేర్కొన్నా రు. అనర్హులను జాబితాలో చేరిస్తే సదరు పంచాయ తీ కార్యదర్శులపై కఠిన చర్యలు తప్పవన్నారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ మాతృనాయక్ పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి జనగామ రూరల్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఇంటర్ పరీక్షలు, ఎల్ఆర్ఎస్పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ పండరి చేతన్‌నితిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు. రేపటి నుంచి ప్రశ్నపత్రాలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి పోలీస్ స్టేషన్లకు బందోబస్తు మధ్య పంపించాలన్నారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్– 2020 కింద 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, 2024 సెప్టెంబర్‌లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొన్ని దరఖాస్తుల క్రమబద్ధీకరణ మాత్రమే జరిగిందన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందని వివరించారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీసీలో డీఐఈఓ జితేందర్‌రెడ్డి, ఆర్డీఓలు గోపీరాం, వెంక న్న, డీపీఓ స్వరూప, విద్యుత్ ఎస్ఈ వేణుమాధవ్, ఆరోగ్య శాఖ పీఓ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు. -
కొచ్చిన్ ఎయిర్పోర్ట్ తరహాలో..
కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధ్యయనం చేసి అక్కడి మాదిరిగా ఇక్కడ వసతులు కల్పించేలా చూడాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అక్కడి ప్రత్యేకత ఏమిటనే చర్చ వచ్చింది. ‘కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ (సీఐఏఎల్) పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో నెడుంబస్సెరీ ప్రాంతంలో 1213 ఎకరాల్లో నిర్మించారు. 1999 మే 25న అందుబాటులోకి వచ్చింది. ఏ ప్రాంతం నుంచైనా చేరుకునేలా 56 రేడియల్ రోడ్లను నిర్మించారు. సమీప పర్యాటక ప్రాంతాలైన పథనంతిట్ట, ఎర్నాకులం, కొట్టాయం, అలిప్పి నుంచి నేరుగా చేరుకులా ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారులను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్మించిన తొలి ఎయిర్పోర్ట్ ఇది. 32 దేశాలకు చెందిన 10 వేల మంది ఎన్ఆర్ఐలు ఈ విమానాశ్రయ నిర్మాణానికి నిధులు ఇచ్చారు. కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం 31 అంతర్జాతీయ, 22 దేశీయ గమ్యస్థానాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నా యి. పూర్తిగా సోలార్ విద్యుత్‌తో నడిచే విమానాశ్రయాల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది. తొలుత దేశీయ విమానాల రాకకు టెర్మినల్స్‌ను నిర్మించారు. అనంతరం దశల వారీగా విస్తరణ చేశారు. ప్రస్తుతం మూడు టెర్మినళ్లు ఉన్నాయి. ఒకటి దేశీయ, రెండోది అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సేవలు అందిస్తోంది. మరో దానిలో కార్గో సేవలను నిర్వహిస్తున్నారు. 2023–24లో 1.08 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల రాకపోకల పరంగా దేశంలోనే ఎనిమిదో స్థానంలో ఉందని పౌర విమానాయన శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. -
ఆరు నెలలుగా అందని వేతనం
జనగామ : మూగ జీవాలకు ప్రాణం పోస్తూ ఆపద సమయంలో భరోసా కల్పిస్తున్న 1962 సంచార పశువైద్యశాల(అంబులెన్స్) సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందక దుర్భర జీవితాలు గడుపుతున్నారు. దీనికితోడు ప్రాజెక్టు ఎత్తి వేస్తారనే ప్రచారంతో వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో 1962 అంబులెన్స్‌లు మూడు ఉన్నాయి. ఒక్కో సంచార వైద్యశాలలో డాక్టర్, వైద్య సహాయకులు, పైలట్, హెల్పర్ మొత్తం నలుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి నెలా 300 నుంచి 400ల పశువులకు చికిత్స చేస్తున్నారు. రోజువారీగా 20 వరకు ఫోన్‌కాల్స్ వస్తాయి. ఇందులో ఒక్కటి లేదా రెండు పశువులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తారు. నెలంతా కష్టపడితే వచ్చే వేతనంతో కుటుంబం గడిచే పరిస్థితి. ఆరు నెలలుగా వేతనం రాక ఉద్యోగులు అప్పులు చేస్తున్నారు. ఒక్క ఇంక్రిమెంట్ లేకుండా ఏడున్నరేళ్లుగా అంబులెన్స్‌పై పని చేస్తున్న తమపై ప్రభుత్వం కురణ చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెటర్నరీ కార్యాలయం వద్ద నిరసన పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ సంచార పశువైద్యశాల ఉద్యోగులు, సిబ్బంది జిల్లా పశుసంవర్థక శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. డాక్టర్లు విజయ్‌కుమార్, శరత్, అపూర్వ సూర్య తేజ, సహాయకులు అఖిల్, సురేందర్, భాస్కర్, పైలట్లు గుంటుపల్లి రమేశ్‌బాబు, చిక్కుడు భరత్, హెల్ప్ర్లు నీలం లక్ష్మణ్, ధరావత్ సోములు తదితరులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఏడేళ్లుగా అడ్రస్ లేని ఇంక్రిమెంట్లు దుర్భర జీవనం గడుపుతున్న సంచార పశువైద్యశాల సిబ్బంది -
బాల సదనాన్ని సందర్శించిన జడ్జి విక్రమ్
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనాన్ని సీనియర్ సివిల్ జడ్జ్ సి.విక్రమ్ శుక్రవారం సందర్శించారు. బాలసదన్ హోమ్‌లో వసతులు ఎలా ఉన్నాయి.. ఏ విధమైన సమస్యలు ఉన్నాయని బాలికలను అడిగి తెలుసుకున్నారు. భోజన వసతులు, రక్షణ, భద్రత చర్యలను పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉంటే కాగితంపై రాసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని ఈ సందర్భంగా బాలికలకు సూచించారు. కార్యక్రమంలో బాలసదన్ సిబ్బంది స్రవంతి, నివేదిత తదితరులు పాల్గొన్నారు. హస్తకళల్లో రాష్ట్ర స్థాయి అవార్డులు స్టేషన్‌ఘన్‌పూర్: గోల్కొండ హస్తకళా కార్పొరేష న్ సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బాబిన్ లేస్, క్రాస్ స్టిచ్ విభాగాల్లో అవార్డులు వచ్చాయని పంచకళా హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత జీడి ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఘన్‌పూర్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మా ట్లాడుతూ హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో ఘన్‌పూర్‌కు చెందిన నీరటి మేరీ, చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన ఎడ్ల సుజాత ప్రతిభ కనబర్చారని, వారికి రాష్ట్ర వ్యవసాయ, టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులమీదుగా అవార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదవాలి బచ్చన్నపేట : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్ అన్నారు. శుక్రవారం కస్తూ ర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందన్నా రు. విద్యార్థులకు వడ్డించే భోజనం, వసతుల గురించి ఆరా తీశారు. అలాగే వంటగది, సామగ్రి, పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి నర్సింహచారి, ఎస్ఓ గీతా, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
2022లో ‘ఉడాన్’కు ఎంపిక
మామునూరు ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ రంగాలు అభివృద్ధి చెందనున్నాయి. సమీప పర్యాటక ప్రాంతాలైన భద్రాచలం, రామప్ప, లక్నవరం, మేడారానికి సందర్శకులు పెరుగుతారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టైర్ 2 పట్టణాల్లోనూ ఐటీ విస్తరణలో భాగంగా ఎయిర్పోర్ట్ కీలకంగా మారనుంది. అలాగే, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని ‘కై టెక్స్’ మాదిరి గానే మరిన్ని అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ముందుకు వస్తే పెట్టుబడులు పెరిగి ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశముంది. వేలాది మందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి.చిన్న నగరాలను రాష్ట్ర, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం 2016లో ఉడాన్ (ఉడో దేశ్ కీ ఆమ్ నాగరిక్) పథకం తీసుకొచ్చింది. దీని కింద మామునూరు విమానాశ్రయాన్ని 2022 సెప్టెంబర్‌లో ఎంపిక చేసింది. వరంగల్ శివారులోని మామునూరులో నిజాం కాలంలో ఎయిర్‌స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. దశాబ్దాలుగా వినియోగం లేకపోవడంతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత ఎయిర్‌స్ట్రిప్‌కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆధీనంలో ఉంది. ఈ రన్ వే విస్తరణ కోసం అదనంగా అవసరమయ్యే 253 ఎకరాల భూసేకరణ జరగాలంటే ప్రజాప్రతినిధులతో పాటు రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలి. -
‘అపార్’ ఆలస్యం
జనగామ రూరల్: ప్రతి విద్యార్థికి శాశ్వత గుర్తింపు నంబర్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘అపార్’(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ ఎకౌంట్ రిజిస్ట్రీ) నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఆధార్ కార్డులో తప్పలతో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు 12 అంకెలతో కూడిన ‘అపార్’ గుర్తింపు కార్డు జారీ చేయాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించిన కేంద్రం.. రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు విద్యాసంస్థల నిర్వాహకులు ఆధార్ కార్డు ప్రకారం విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఆధార్ వివరాల్లో తప్పులను సరిచేసుకునేందుకు విద్యార్థులు ఆధార్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ జాప్యం అవుతుండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో 658 పాఠశాలలు, 76,263 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటి వరకు 48,356(63.41శాతం) మంది వివరాల నమోదు పూర్తయింది. అత్యధికంగా నర్మెట మండలంలో 70.53 శాతం, అత్యల్పంగా బచ్చన్నపేట మండలంలో 59.59 శాతం పూర్తి చేశారు. ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల వివరాలు, ఆధార్ కార్డులోని వివరాలు ఒకేలా ఉంటేనే ‘అపార్’ నంబర్ వస్తుంది. లేదంటే వెబ్సైట్లో సమోదు కావడం లేదు. పేరు పూర్తిగా లేకపోవడం.. పుట్టిన తేదీల్లో తేడా ఉండడంతో ఆధార్‌లో వివరాలను సరిచేసుకునేందుకు విద్యార్థులు మీసేవా కేంద్రాల బాటపడుతున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే అక్కడ సరిచేస్తున్నారు. దీంతో రద్దీ పెరిగి పడికాపులు తప్పడంలేదు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.. ‘అపార్’ కార్డుకు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమ తి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని ధ్రువీకరణ పత్రాలను డిజిటల్ లాకర్లో భద్రపర్చుకోవచ్చు. పాఠశాల మారినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వివిధ విద్యాసంస్థల్లో చేరికలు, మార్పులు, ఉద్యోగ సమయంలోనూ ‘అపార్’ ఐడీ ఆధారంగా సమాచారం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితో వివరాలు నమోదు చేస్తున్నారు. నమోదు వేగవంతానికి చర్యలు ఆధార్ కార్డుల్లో విద్యార్థుల వివరాలు సక్రమంగా లేకపోవడంతో వాటిని సరిచేసుకునేందుకే అధిక సమయం పడుతోంది. దీంతో ‘అపార్’ వివరాల నమో దు ప్రక్రియ ఆలస్యం అవుతున్నది. జిల్లా వ్యాప్తంగా నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – రమేశ్, డీఈఓ మండలాల వారీగా విద్యార్థుల నమోదు ఇలా.. మండలం పాఠశాలలు విద్యార్థులు పెండింగ్ శాతం బచ్చన్నపేట 52 4,971 2,009 59.59 చిల్పూర్ 42 2,866 893 68.84 దేవరుప్పుల 60 4,553 1,424 68.72 స్టేషన్‌ఘన్‌పూర్ 58 10,665 3,986 62.63 జనగామ 111 24,924 9,724 60.99 కొడకండ్ల 41 3,569 1,191 66.63 లింగాలఘణపురం 38 3,448 1,017 70.50 నర్మెట 40 3,827 1,128 70.53 పాలకుర్తి 81 7,795 3,109 60.12 రఘునాథపల్లి 69 4,630 1,486 67.90 తరిగొప్పుల 24 1,192 424 64.43 జఫర్‌గఢ్ 42 3,823 1,516 60.35 మొత్తం 658 76,263 27,907 63.41 జిల్లాలో నమోదు 63.41 శాతమే.. ఆధార్ కార్డుల్లో తప్పులతో అడ్డంకులు పేర్లు, పుట్టిన తేదీల్లో తేడాలు మార్పు చేర్పుల కారణంగా నమోదులో తీవ్ర జాప్యం మొత్తం 76,263 మంది విద్యార్థులు 48,356 మంది వివరాల నమోదు -
పైపు పగులగొట్టి.. నీటి తరలింపు
రఘునాథపల్లి: స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్‌కు వెళ్లే కెనాల్లో లెవల్ పైపు పగులగొట్టడంతో కంచనపల్లి పైపు నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో కంచనపల్లిలో సాగు చేసిన వరి, ఇతర పంటలకు నీరు అందక ఎండుతున్నాయి. బోయినిగూడెం వద్ద పాలకుర్తి వైపు వెళ్లే కాల్వకు సాగునీరు వెళ్లేందుకు షెట్టర్ లేక పోవడంతో అధికారులు తాత్కాలికంగా లెవల్పైపు ఏర్పా టు చేశారు. కెనాల్‌కు సాగు నీరు అంతంత మాత్రంగానే వస్తుండటంతో గుర్తుతెలియని వ్యక్తులు లెవల్పైపు పగులగొట్టి పాలకుర్తి వైపు నీరు వెళ్లేలా చేశా రు. అధికారులు స్పందించి కంచనపల్లి వైపు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ వినయ్‌బాబు ను వివరణ కోరగా లెవల్ పైపు పగులగొట్టిన సమాచారం లేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కంచనపల్లి వైపు ఎండుతున్న పంటలు -
ఆర్టీసీకి ‘మహా’ కలెక్షన్లు●
● జనగామ డిపో పరిధిలో రూ.16.50 లక్షల ఆదాయం ● ఉద్యోగులను అభినందించిన మేనేజర్ స్వాతి జనగామ: మహా శివరాత్రి పర్వదినం, కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర నేపథ్యంలో ఆర్డీసీ జనగామ డిపోకు టికెట్ కలెక్షన్లు దండిగా వచ్చాయి. డిపో మేనేజర్ ఎస్.స్వాతి ఆధ్వర్యాన ఫిబ్రవరి 25 నుంచి 28వ తేదీ వరకు కొమురవెల్లికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించారు. జనగామ బస్టాండ్ నుంచి 60 బస్సులు.. 518 ట్రిప్పులు.. 23,310 కిలోమీ టర్ల మేర ప్రయాణించి 16,959 మంది భక్తులను సురక్షితంగా తరలించారు. టికెట్ కలెక్షన్ల ద్వారా రూ.16.50 లక్షల ఆదాయం సమకూరింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ స్వాతి మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడిపించడంలో సంస్థ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని పేర్కొ న్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెయింటనెన్స్ విభాగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఆమె అభినందించారు. -
వైభవంగా వసంతోత్సవం
పాలకుర్తి టౌన్: మహా శిరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి వసంతోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం శివపార్వతులు, లక్ష్మీనర్సింహస్వామిలను ఊయలలో ఆశీనులను చేసి డోలారోహణం చేపట్టారు. ఆలయ ఆవరణంలో ఊరేగింపు తర్వాత సదన్యం, పుష్పయాగం, పల్లకీ సేవ చేసి తరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మోహన్‌బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి అనిల్‌కుమార్, నాగరాజు, సునిల్, సంతోష్, శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలి : కలెక్టర్
జనగామ రూరల్: తాగు, సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం కలెక్టరేట్లో నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నీరు వృథా కాకుండా కాల్వ లను సందర్శించి అవసరమైన చర్యలు చేపట్టా లన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నీటి సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఎస్ఈ సుధీర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఈఈ వినయ్‌బాబు, ప్రవీణ్, మంగీలాల్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. రేపు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లోని శ్రీ రామాంజనేయ కమిషన్ వ్యాపారి కందుకూరి రామాంజనేయులు రెండు రోజుల క్రితం మృతి చెందగా.. మార్చి ఒకటో తేదీన మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ గురువారం తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కాగా మృతుడి కుటుంబాన్ని చైర్మన్‌తోపాటు కార్యదర్శి నరేంద్ర, అడ్తి ప్రతినిధి మాశెట్టి వెంకన్న, ట్రేడర్లు, వ్యాపారులు, హమాలీ ప్రతినిధులు పరామర్శించారు. ఔషధ కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు జనగామ: పట్టణ పరిధి స్వర్ణ కళామందిర్ రోడ్డులోని పాండు మెడికల్ ఏజెన్సీలో అభ్యంతరకర ప్రకటనలతో ఉన్న డ్రగ్స్‌ను సీజ్ చేసి, సదరు కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వరంగల్ ఔషధ నియంత్రణ సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. గురువారం జిల్లా ఔషధ తనిఖీ అధికారి ఏలె బాలకృష్ణతో కలిసి ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇండోర్‌కు చెందిన ఓ కంపెనీ డ్రగ్స్‌పై నిబంధనలు ఉల్లంఘిస్తూ అభ్యంతరకర ప్రకటనలు ఉన్నాయని, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా సీజ్ చేసి జనగామ కోర్టుకు అప్పగించిన ట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్లు శాసీ్త్రయంగా కేటాయించాలి జనగామ రూరల్: ఎస్సీ వర్గీకరణలో రిజర్వేష న్లను శాసీ్త్రయంగా కేటాయించాలని ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ అన్నారు. జనగామ పట్టణంలో గురువారం జిల్లా అధ్యక్షుడు పైసా రాజశేఖర్ ఆధ్వర్యాన నిర్వహించిన ఎమ్మార్పీఎస్, అనుబంధ విభా గాల ఉద్యమ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదిక లోపభూయిష్టంగా ఉందని, వివిధ కులాలను గ్రూప్‌లలో చేర్చే అంశంలో, రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో నిర్ధిష్టమైన ప్రామాణిక సూత్రాలను పాటించలేదన్నారు. గ్రూప్–1లో ఉన్న మన్నె, పంబాల కులాలను గ్రూప్–3లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పోరులో అమరులైన మాదిగల త్యాగాలు వెలకట్టలేనివని, మార్చి 1న సంస్మరణ దినోత్సవాన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తాళ్లపల్లి కుమార్, రవీందర్, జెరిపోతుల సుధాకర్, బిర్రు నాగేష్, బొట్ల మహేష్, రవి, ఎల్లస్వామి పాల్గొన్నారు. -
బహుమతుల ప్రదానం
హన్మకొండ కల్చరల్: హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం సహృదయ సంస్థ ఆధ్వర్యంలో నాలుగురోజులుగా నిర్వహించిన తెలుగు భాష ఆహ్వాన నాటక పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బుధవారం రాత్రి 11 గంటలకు సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షత న జరిగిన ముగింపు కార్యక్రమం జరిగింది. గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చిగురు మేఘం’ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. అలాగే కొలకలూరుకు చెందిన శ్రీసాయి ఆర్ట్స్ వారు ప్రదర్శంచిన ‘జనరల్ బోగీలు’ నాటకాన్ని ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేశారు. -
వసూళ్లకు 30 టీంలు
జనగామ: జనగామ మున్సిపాలి టీలో దీర్ఘకాలికంగా బకాయి ఉన్న ఇంటి, నల్లా పన్నుల వసూళ్లలో మరింత వేగం పెంచేందుకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా స్వయంగా రంగంలోకి దిగారు. ‘పన్నుల వసూళ్లలో పూర్’.. ‘రెడ్ నోటీసులు రెడీ’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు కలెక్ట ర్ స్పందించారు. గురువారం కమిషనర్ వెంకటేశ్వర్లతో కలిసి వ్యాపార, వాణిజ్య సంస్థల యజమాను ల వద్దకు వెళ్లి పెండింగ్ ఆస్తిపన్ను చెల్లించాలని కోరగా.. వారు తక్షణమే స్పందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పన్నులు సకాలంలో చెల్లించి పట్టణా భివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు 95 శాతానికి చేరుకోగా.. మున్సిపల్ పరిధిలో పాతవి, కొత్తవి కలుపుకుని ఆస్తి పన్ను రూ.5.71కోట్లు ఉండగా.. రూ.2.32 కోట్లు(40.63 శాతం) వసూలు చేశారు. పురపాలికలో నూరు శాతం పనుల వసూలు లక్ష్యంతో 30 మంది వార్డు ఆఫీసర్లు, సూపర్వైజర్లతో యాక్షన్ టీంలను రంగంలోకి దింపినట్లు కలెక్టర్ వివరించారు. ఇంటి పన్నులు ఆరు నెలలకోసారి, ఫైనల్‌గా ఏడాది లోపు చెల్లించాలని సూచించారు. వారం రోజుల్లో చెల్లించకుంటే.. ఏళ్ల తరబడి పన్ను బకాయి ఉన్నవారి జాబితా ప్రకారం రెడ్ నోటీసు జారీ చేసి వారం రోజుల్లోపు చెల్లించని పక్షంలో ఆస్తులను సైతం జప్తు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం పన్ను చెల్లింపుల్లో క్లియర్‌గా ఉండాలని, సిటిజన్ రెస్పాన్స్ తప్పనిసరి అని పేర్కొన్నారు. భవనాలు విక్రయించాలన్నా.. కొనుగోలు చేయాలన్నా.. ప్రభుత్వం పథకాలు పొందాలన్నా ఇంటి, నల్లా పన్నులు క్లియరెన్స్ రశీ దు ఉండాలని స్పష్టం చేశారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లు రెవెన్యూ సిబ్బందితో కలిసి మొండి బకాయి దారులకు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుత బకాయి దారులకు రెడ్ నోటీసులు ఇవ్వొద్దని పలువురు వ్యాపారులు కమి షనర్‌ను కోరారు. రెవెన్యూ సిబ్బంది మధు, నర్స య్య, కృష్ణవాసు, బాబురావు పాల్గొన్నారు.పన్ను బకాయిల వసూలు ముమ్మరం రంగంలోకి కలెక్టర్ రిజ్వాన్ బాషా రెడ్ నోటీసులు జారీ.. పట్టణంలో యాక్షన్ బృందాలు చెల్లించకుంటే ఆస్తుల జప్తు కూడా..! ‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన -
పోలింగ్ @ 94.31 %
జనగామ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తంగా 92.95 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే జనగామ జిల్లాలో ఎన్నికలను కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా పర్యవేక్షించారు. 1,002 మంది ఓటర్లకు గాను 945 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నారు. పోలింగ్ తరిగొప్పుల, జఫర్‌గఢ్‌లో నూరు శాతం కాగా.. అత్యల్పంగా బచ్చన్నపేటలో 87.14 శాతం నమోదైంది. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీసీపీ రాజమహేంద్రనాయక్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు చేపట్టారు. జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్ ఏరియా ప్రభుత్వ బాలికల జూని యర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 511 ఓట్లు ఉండడంతో టీఎస్‌యూటీఎఫ్, పీఆర్టీయూ, తపస్, బీసీటీఏ, టీపీటీఎఫ్ నాయకులతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్, మాజీ అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, రాష్ట్ర నాయకులు కేవీఎల్ఎన్.రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశా ల పోలింగ్ స్టేషన్‌తో పాటు లింగాలఘణపురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సెంటర్లో పోలింగ్ సరళిని కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న ఆధ్వర్యాన తహసీల్దార్లు, ఇతర ఉన్నతాధికారులు పోలింగ్ తీరును గమనించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్కార్ట్ల సహాయంతో ఓటింగ్ బాక్స్‌లను నల్లగొండకు తలరించారు. ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు..ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో రెండు చోట్ల వందశాతం.. బచ్చన్నపేటలో అత్యల్పం ఓటింగ్‌కు దూరంగా 57 మంది కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ జిల్లా ఓటర్లు పోలైనవి శాతం జనగామ 1,002 945 94.31 హనుమకొండ 5,215 4,780 91.66 వరంగల్ 2,352 2,214 94.13 మహబూబాబాద్ 1,663 1,571 94.47 భూపాలపల్లి 329 308 93.62 ములుగు 628 583 92.83– మరిన్ని ఫొటోలు 9లోu -
అగ్ని గుండాలు
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025బచ్చన్నపేట : కొడవటూరు స్వయంభూ సిద్ధేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొ ని గురువారం ఉదయం అగ్ని గుండాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, ఈఓ చిందం వంశీ, ప్రధాన పూజారి ఓం నమఃశివాయ ఆధ్వర్యాన ఉదయం అర్చకులు భద్రకా ళి మాతకు శాంతి పూజల అనంతరం అగ్ని గుండం పూజా కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన పూజారి ఓం నమఃశివా య తొలుత అగ్ని గుండ ప్రవేశం చేయగా శివ సత్తులు, భక్తులు అనుకరించారు. అగ్ని గుండాల వద్ద తోపులాట జరగకుండా నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే.హమద్ ఆధ్వర్యా న బందోబస్తు చేపట్టా రు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం అయిన గెలుపు ఆశీర్వాదంలో నూతనంగా వేద మంత్రాలు, విన్యాసాలు నేర్చుకున్నవారు తమ గురువు ల ముందు ప్రదర్శించారు. అలాగే ఉత్సవాల విజయవంతానికి సహకరించిన వారిని సత్కరించారు. కార్యక్రమంలో అర్చకులు సదాశివుడు, మహాశివుడు, సంగమేశ్వర్, సిబ్బంది నూకల లక్ష్మీకాంత్‌రెడ్డి, గంగం భానుప్రకాష్ రెడ్డి, బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వసంతోత్సవానికి వేళాయె..
నేటి నుంచి నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ–25’ ● మార్చి 2 వరకు నిర్వహణ● దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్ ● హాజరుకానున్న పలు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ● ప్రారంభించనున్న హాస్యనటుడు బ్రహ్మానందం కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతీ ఏడాది విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులపాటు వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ–25) నిర్వహించనున్నారు. నేటి(శుక్రవారం) నుంచి మార్చి 1, 2 తేదీల్లో నిర్వహించే కల్చరల్ ఫెస్ట్‌కు అన్ని ఏర్పా ట్లు చేశారు. నాటి ఆర్ఈసీ నేటి నిట్‌లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న నిట్‌లో వివిధ దేశాల సంస్కృతీ సంప్రదాయలను పరస్ప రం పంచుకునేందుకు 1978లో ప్రారంభమైన వసంతోత్సవం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్గా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారు. తొలిరోజు: తొలిరోజు శుక్రవారం సాయంత్రం అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో హాస్యనటుడు, గిన్నిస్ వరల్ రికార్డు గ్రహీత, పద్మశ్రీ బ్రహ్మానందం, విద్యార్థుల చిట్‌చాట్. రెండో రోజు: శనివారం ప్రోషోలో భాగంగా ఇండియన్ రాక్‌బ్యాండ్ వార్డెక్స్ ఫ్యూజన్ మ్యూజిక్‌తో అలరించనున్నారు. డైరెక్టర్ కట్స్‌లో సినీ డైరెక్టర్లతో చిట్‌చాట్. అల్యూర్లో భాగంగా ఫ్యాషన్ షో, నుక్కడ్ నాటక్ ప్రదర్శన. మూడో రోజు: ముగింపులో భాగంగా ఆదివారం పాపులర్ సింగర్ అమిత్ త్రివేది హిందీ, ఇంగ్లిష్ సంగీత విభావరి. నిపుణులతో బైక్‌స్టంట్స్. ఈసారి థీం లేదు: స్ప్రింగ్ స్ప్రీ వేడుకలను ప్రతి ఏడాది ప్రత్యేక థీంతో నిర్వహించేవారు. 2022లో సృష్టిగా, 2023లో కళాధ్వనిగా, 2024లో రాసంగేన్ థీం(ఇతివృత్తం) తో నిర్వహించారు. ఈసారి అదేపేరుతో స్ప్రింగ్ స్ప్రీ–25ను నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. -
రథోత్సవం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి డి.రవీంద్రశర్మ దంపతులు, ఏసీపీ అంబటి నర్స య్య, ఈఓ సల్వాది మోహన్‌బాబు, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై వపన్ రథోత్సవాన్ని ప్రారంభించారు. కోలాట కళాకారుల ప్రదర్శన, భక్తి గీతాల ఆలాపనతో పురవీధుల గుండా సాగిన రథోత్సవానికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. గుట్ట నుంచి గుడివాడ చౌరస్తా, గ్రామ పంచాయతీ, హనుమాన్ టెంపుల్, రాజీవ్ చౌర స్తా మీదుగా నిర్వహించిన రథోత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. అర్చకులు డీవీఆర్. శర్మ, అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జడ్జి దంపతులు స్వామివారికి అభిషే కం నిర్వహించారు. జాతరలో జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాల, సేష్టన్ఘన్పూర్ విద్యాజ్యోతి డిగ్రీ కళాశాలల ఎన్సీసీ విద్యార్థులు భక్తులకు సేవలందించారు. -
రోడ్డెక్కిన అన్నదాత
జనగామ రూరల్: యాసంగి సిజన్లో సాగు చేసిన వరి పంటకు నీరు లేక ఎండి పోతుండడంతో కడు పు మండిన అన్నదాతలు రోడ్డెక్కారు. గోదావరి జలాలు విడుదల చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలంలోని పెద్దపహా డ్, గోపిరాజుపల్లి, గానుగుపహాడ్, ఎర్రకుంటతండా, వడ్లకొండ గ్రామాలకు చెందిన రైతులు గురువారం జిల్లా నీటి పారుదల శాఖతోపాటు కలెక్టర్ కార్యాలయాల వద్ద ఎండిన వరితో ఆందోళనకు దిగారు. మండల పరిధి 21 గ్రామాల్లో యాసంగి వరి 20వేల ఎకరాల్లో సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్ల నుంచి చుక్క నీరు రావడంలేదు. 300 ఫీట్ల లోతుకు బోరు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చేతి కొచ్చే దశలో పంట ఎండిపోయో పరిస్థితి నెలకొనడంతో రైతులు రోడ్డెక్కారు. గండిరామారం నుంచి పంపింగ్ చేసి బొమ్మకూరు రిజర్వాయర్ కాల్వల ద్వారా నీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాల ని రైతులు కోరారు. సకాలంలో నీరు రాకపోతే పంట పొలాలను పశువులకు మేతగా వదలాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో నీరు వదులుతాం.. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఈఈ మంగీలాల్ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో నీళ్లు వదులుతామ ని చెప్పారు. సీఐ దామోదర్ ధర్నా వద్ద చేరుకుని రైతులను శాంతింప జేశారు. ఈ నిరసనలో ఆయా గ్రామాల రైతులు, మాజీ సర్పంచ్‌లు శానబోయిన శ్రీనివాస్, బొల్లం శారద, ఎడమ అయిలయ్య, కొర్ర శంకర్, కూకట్ల సిద్దిరాజు, కూకట్ల సత్తయ్య, మాలోతు రాజు, తులసీరాం, జయరాం, లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు. ఎండిన వరితో నిరసన గోదావరి జలాలు విడుదల చేయాలని ఇరిగేషన్, కలెక్టరేట్ వద్ద ఆందోళన మంత్రులు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గోదావరి జలాలతో గతంలో జిల్లా సస్యశామలం అయింది.. వరి పంట పుష్కలంగా సాగు చేశారు.. నేడు పంట ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతులు ఎమ్మెల్యేను ఆయన నివాసం వద్ద కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. పెట్టుబడులకు అప్పులు చేసి.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చివరి దశలో నీరు లేక ఎండిపోతోందని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాను మంత్రులు పట్టించుకోవడం లేదని, అసలు గండిరామారం నుంచి పంపింగ్ చేయడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా నేడు పంటలకు ఈ పరిస్థితి వచ్చిందని, తక్షణమే కాల్వల ద్వారా నీరందించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
రెడ్ నోటీసులు రెడీ!
జనగామ: జనగామ పురపాలికలో వందశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా అధికార యంత్రాంగం దృష్టి సారింది. ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే ఆస్తి జప్తు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నారు. శ్రీబకాయిలు ఫుల్.. వసూళ్లు పూర్శ్రీ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఏసీ), పురపాలిక స్పెషల్ ఆఫీసర్ పింకేష్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు, పన్నులు వసూళ్లు చేసే ఉద్యోగులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వందశాతం పన్నులు వసూళ్లు లక్ష్యంగా గత నెల కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి దిశా నిర్ధేశం చేసినా..ఆశించిన మేర టార్గెట్ ఎందుకు చేరుకోలేక పోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇంటింటి సర్వే నేపధ్యంలో కాస్త వెనకబడి పోయామని ఉద్యోగులు వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. మార్చి 31 వరకు వందశాతం పన్నులు వసూళ్లు కావాల్సిందేనని ఆదేశించారు. మొండిబకాయిదారుల జాబితా సిద్ధం చేసి, అవసరమైతే వారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నోటీసు అందించిన రెండు, మూడు రోజుల్లో స్పందన కనిపించకపోతే ఆస్తులను జప్తు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు జప్తు వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు వ చ్చినట్లు తెలుస్తుంది. 10 నుంచి 30 వేల వరకు రెడ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఏసీ సమీక్ష పూర్తవగానే ఉద్యోగులు పన్నుల వసూళ్లకు వార్డుల పర్యటన బాట పట్టారు. రోజువారీగా వసూళ్లకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో అందించాలని కమిషనర్‌ను ఏసీ ఆదేశించారు. మొండిబకాయిదారులకు ఇవ్వనున్న అధికారులు ఆస్తి జప్తులకు వాహనాలు సిద్ధం! పన్నుల వసూళ్లలో జాప్యంపై కలెక్టర్ ఆరా పురపాలికలో ఏసీ సమీక్ష -
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ రూరల్: పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్హాల్లో డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి టెన్త్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పది పరీక్షలకు 41 సెంటర్లలో 6,238 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒకరు చొప్పున 41 సిట్టింగ్ స్క్వాడ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులను నియమించామన్నారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు సందేహాల నివృత్తికి 9000293231, 99 89544981 కంట్రోల్ రూం నంబర్‌ను అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్, ఏసీజీఈ రవి కుమార్, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ రామరాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగకు ఏర్పాట్లు చేపట్టాలి రంజాన్‌కు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ మాసం నిర్వహణ, ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈద్గాల వద్ద తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. మతపెద్దలు సూచించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ హుస్సేన్ పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు జనగామ: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి కలెక్టర్ మత్తు పదార్థాల నియంత్రణపై విద్య, వ్యవసాయ, ఎకై ్సజ్, పోలీసు, వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో ప్రతీ శుక్రవారం నిర్వహిస్తున్న బ్యాగ్ డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డీఏఓ రామారావు నాయక్, డీఈఓ రమేష్, కలెక్టరేట్ ఏఓ మన్సూరి, అధికారులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి ప్రభుత్వ చేయూతతో మహిళలు ఆర్థిక పురోగతి సా ధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. జనగామ మున్సిపల్ కార్యాలయం పక్కన ఇందిరా మహిళా శక్తి పథకంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. జిల్లాలో 41 సెంటర్లు, 6,238 మంది విద్యార్థులు సందేహాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి
● డీఐఈఓ జితేందర్‌రెడ్డి జనగామ రూరల్: విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో పాటు ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలని డీఐఈఓ జితేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటు చేసి సమావేశానికి డీఐఈఓ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మంచి క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. రాబో యో వార్షిక పరీక్షలకు సబ్జెక్టుల వారీగా ప్రణాళికను ఏర్పాటు చేసుకొని, ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రా యాలన్నారు. సబ్జెక్టులో సమస్యలు ఉంటే పరిష్క రించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పావని, అధ్యాపకులు వస్కుల శ్రీనివాస్, మరిపెల్ల రవిప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి, కాపర్తి శ్రీనివాస్, మహమ్మద్ ముక్తాదిర్, షహనాజ్ తారనం, సబిహా బేగం, తిరుమలేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
2020లోనే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాం..
2020 అక్టోబర్ మాసంలో 10 ప్లాట్లకు సంబంధించి రూ.వెయ్యి చొప్పున మీ సేవా ద్వారా ఫీజు చెల్లించాం. డాక్యుమెంట్లు తీసుకు రావాలని ఆరు నెలల క్రితం మున్సిపల్ నుంచి ఫోన్ చేశారు. రెగ్యులర్‌గా పని చేసే టీపీఓ లేకపోవడం, సిబ్బంది కొరత కారణంగా ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపల్‌కు వచ్చినా, పని జరిగే పరిస్థితి లేదు. ప్లాట్‌కు సంబంధించి సమస్య ఉంటే, వాటిని వదిలేసి అన్నీ కరెక్టుగా ఉన్న వాటికి క్లియరెన్స్ ఇవ్వాలని కోరినా.. పని జరగలేదు. – గుజ్జుల శ్రీనివాస్, గీతానగర్, జనగామఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌కు సిద్ధంగా ఉన్నాం.. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా. 2020లో మూడు ప్లాట్లకు సంబంధించి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించా. తన ప్లాట్లతో మున్సిపల్‌కు రూ.3లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుంది. ప్లాట్ వద్దకు వచ్చి చూసుకోవాలని గతంలో అధికారులను కోరాం. ఇప్పటికై నా ఎల్ఆర్ఎస్ కంప్లీట్ చేసి, క్లియరెన్స్ ఇప్పించాలి. – శెట్టిపల్లి నరసింహారెడ్డి, జ్యోతినగర్, జనగామ -
శివ పూజకు వేళాయె..
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లునేడు మహాశివరాత్రి పర్వదినం ● వేలాదిగా తరలిరానున్న భక్తులు ● జిల్లా వ్యాప్తంగా ముస్తాబైన ఆలయాలు జనగామ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాలన్నీ విద్యుత్ దీపాల వెలుతురులో కాంతులీనుతున్నాయి. శివ, దేవేరి పార్వతి వివాహం కూడా ఇదే రోజున జరగనుంది. జిల్లాలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. కలెక్టర్ పర్యవేక్షణ.. ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా నేతృత్వంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు శ్రమిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుకుండా ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ పర్యవేక్షణలో ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయాల ప్రాంగణంలో పరిశుభ్రత పాటించే విధంగా డీపీఓ నాగపురి స్వ రూప ఆధ్వర్యంలో డీఎల్పీఓ, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వేలాదిగా తరలిరానున్న భక్తులు జిల్లాలోని శివాలయాలు నేడు శివనామ స్మరణలతో మారుమోగనున్నాయి. మహాశివరాత్రి ని పురస్కరించుకుని పాలకుర్తి శ్రీ సోమేశ్వరస్వామి, బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధులగుట్ట, పట్టణంలోని పాతబీటు బజారు శ్రీ రామలింగేశ్వరస్వామి, జనగామ మండలం చీటకోడూరు శ్రీ పంచకోసు రామలింగేశ్వరాలయాలతో పాటు పలు ఆలయాలకు వేలా ది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలు గకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. – 8లోu -
ఎల్ఆర్ఎస్
ఎట్టకేలకు సాక్షిప్రతినిధి, వరంగల్/జనగామ: అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. తక్షణమే అమలు చేసేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కుడా వైస్ చైర్మన్లతో పాటు మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఉన్నతాధికారులకు మార్గదర్శకాల ఉత్తర్వులు కూడా అందాయి. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మార్చి నాటికి దాదాపుగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలని సూచించారు. దరఖాస్తుల క్రమబద్ధీకరణకు అంతా సిద్ధం.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మొదటగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వివిధ నిబంధనల ప్రకారం ఆన్లైన్లోనే వడపోసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయా? దరఖాస్తుదారుడు పూర్తిస్థాయిలో పత్రాలు సమర్పించాడా? లేదా? అన్న అంశాలను పరిశీలిస్తారు. ఉమ్మడి జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 9 మున్సిపాలిటీలు, వివిధ గ్రామాలనుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందించారు. దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తూ.. ఆ ప్లాటు, స్థలం వద్దకు రమ్మని జీపీఎస్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలాలు, చెరువులు, కుంటలు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు వంటివి పరిశీలించి అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తామని చెబుతున్నారు. చివరగా మరోసారి వాటిపై ఉత్తర ప్రత్యుత్తరాలు, పత్రాల పరిశీలన చేసినా అభ్యంతరాలు అలాగే ఉంటే వాటిని తిరస్కరించి సమాచారం ఇస్తామంటున్నారు. అర్హత ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి కావాల్సిన పత్రాలతోపాటు ఫీజు చెల్లించేలా నోటీసు జారీ చేసి.. దరఖాస్తులు సరైనవి అయితే క్రమబద్ధీకరించి ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అందరికీ సమాచారం అందేలా ఏర్పాట్లు... ఉమ్మడి వరంగల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహా 9 మున్సిపాలిటీలు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ కార్యక్రమం 2020 అక్టోబర్ 31 వరకు కొనసాగగా, రూ.1000 ఫీజును ఆన్లైన్లో చెల్లించి వివరాలను నమోదు చేసుకున్నారు. మొత్తంగా 1,58,097 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 10,840 దరఖాస్తులు పరిశీలించిన అధికారులు అప్పట్లోనే కొన్ని క్రమబద్ధీకరణ చేయగా.. 1,47,257 వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రక్రియకు బ్రేక్ పడగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అధికార యంత్రాంగం మళ్లీ ఎల్ఆర్ఎస్ అమలుకు కదిలింది. ఈసారైనా నిబంధనల ప్రకారం చకచకా క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. 10,840వివిధ స్థాయిల్లో పెండింగ్ 1,47,257మొత్తం దరఖాస్తులు: 1,58,097 కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు జిల్లా మున్సిపాలిటీ మొత్తం ఆమోదం వివిధ స్థాయిల్లో గ్రేటర్వరంగల్ కార్పొరేషన్ 1,00,989 2,756 98,233 హనుమకొండ పరకాల 3,194 06 31,88 వరంగల్ నర్సంపేట 5,219 411 4,808 వర్ధన్నపేట 524 10 514 మహబూబాబాద్ మహబూబాబాద్ 12,201 566 11,635 డోర్నకల్ 872 241 631 మరిపెడ 2,629 63 2,566 తొర్రూరు 10,299 606 9,693 జేఎస్ భూపాలపల్లి భూపాలపల్లి 3,795 1214 2,581 జనగామ జనగామ 18,375 4,967 13,408 -
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జనగామ: జిల్లాలో కోతల్లోని కరెంటు సరఫరా అందించేందుకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కలెక్టర్ సందర్శించారు. సబ్ స్టేషన్ నుంచి సరఫరా అయ్యే వ్యవసాయం పంపు సెట్లతో పాటు వివిధ కాలనీలకు సరఫరా చేసే విభాగాలను పరిశీలించారు. విద్యుత్తు సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు రికార్డుల్లో వివరాలను నమోదు చేసి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. విద్యుత్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజలకు అందుబాటులో ఉండి, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కలెక్టర్ వెంట ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, టెక్నీకల్ డీఈ గణేష్, ఏడీఈ జనగామ ఆపరేషన్ వేణుగోపాల్, పట్టణ ఏఈ–2 పి.చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా -
బుధవారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోuపాలకుర్తి సోమేశ్వర ఆలయంలో ధ్వజారోహణం నిర్వహిస్తున్న అర్చకులు పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. గుట్టపై మహామండపంలో గణపతి పుజా, పుణ్యాహవచనం, పంచగవ్యం, అంకురార్పణ, రుత్విక్వరుణ, ధ్వజారోహణం, వేదస్వస్తి, త్రిశూలపూజ, స్వామివారికి అభిషేకాలు, అఖండ దీపారాధన అర్చకులు నిర్వహించారు. ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, ఎస్సై దూలం వపన్‌కుమార్, సూపరింటెండెంట్ వెంకటయ్య, అర్చకులు అనిల్‌కుమార్, నాగరాజు, భక్తులు పాల్గొన్నారు.న్యూస్రీల్సోమేశ్వరాలయంలో ధ్వజారోహణం -
కేసుల పరిష్కారానికి సహకరించాలి
● జనగామ సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్ : జిల్లాలో అపరిష్కృత పెండింగ్ కేసుల పరిష్కారానికి అనుబంధ యంత్రాగం సహకరించాలని జనగామ సీనియర్ సివిల్ జడ్జి ఇ.విక్రమ్ అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జడ్జి విక్రమ్ మాట్లాడారు. మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా పాటుపడాలన్నారు. రాజీ పడతగిన క్రిమినల్, సివిల్ కేసుల్లో న్యాయవాదులతో పాటు కక్షిదారులు సామరస్యంగా సెటిల్ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎనగందుల చంద్రఋషి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దబాయితండా పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
కొడకండ్ల : మండల పరిధి పెద్దబాయితండా జీపీ కార్యదర్శి కె.సోమేశ్వర్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధులపై నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారిపై మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్, స్థానిక గిరిజనులు ఈనెల 14న జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశం మేరకు డీపీఓ స్వరూప విచారణ చేపట్టగా జీపీ రికార్డులు అప్డేట్ లేకపోవడం.. నిబంధనల మేరకు సమావేశాలు, గ్రామసభలు నిర్వహించకపోవడం.. కొన్ని రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడం.. రశీదు బుక్‌లో మొత్తం రూ.3,73,633 వసూలు చేసి రూ.1,82,900 మాత్రమే జమచేసి మిగతా మొత్తం చేతి నిల్వగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఖర్చుల నిమిత్తం తీర్మానాలు, రికార్డులు లేకుండా చెక్కుల ద్వారా చెల్లించారనే ఆరోపణలపై డీపీఓ పరిశీలించారు. బండారి నాగరాజు అనే వ్యక్తి అకౌంట్‌కు గ్రామ పంచాయతీకి చెందిన వివిధ ఖాతాల నుంచి రూ.11,93,388 జమ చేయడం, ఇందిరమ్మ ఇళ్ల సర్వే అస్సెస్మెంట్కు ఆన్లైన్ కాకుండా ఒక్కొక్కరి వద్ద రూ.3,500 చొప్పున మొత్తం రూ.1,43,500 వసూలు చేసినట్లు రశీదుల ద్వారా గుర్తించి నివేదిక ను కలెక్టర్‌కు అందజేశారు. ఈ మేరకు కార్యదర్శిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ఆ సమయంలో ప్రత్యేక అధికారి గా వ్యవహరించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భవానీకి క్రమశిక్షణ లోపంపై హెచ్చరిక నోటీస్ ఇచ్చారు. అధికారికి కూడా నోటీస్ జారీ -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
జనగామ రూరల్: మహిళలు అభివృద్ధి సాధించా లి.. ఇందుకు వారికి అవసరమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత మహిళా సాధికారతపై ఈనెల 24 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టరేట్లో ఆయన విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు చేపట్టే ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, మహిళా దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీధర్, డీఆర్డీఓ వసంత తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
పాలకుర్తి టౌన్: పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం(నేడు) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టామని ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. మార్చి ఒకటో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, 26న స్వామివారి కల్యాణం, 27న రథోత్సవం, బండ్లు తిరుగుట, 28న డోలారోహణం, వసంతో త్సవం, మార్చి ఒకటిన అగ్నిగుండాలతో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు. మెట్ల మార్గం నుంచి మాత్రమే అనుమతి మహా శివరాత్రి రోజు మెట్లమార్గం నుంచి మాత్రమే అభిషేకం, ధర్మ దర్శనానికి అనుమతి ఉంటుంది.. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఘట్‌రోడ్డు మార్గం ద్వారా కిందికి వచ్చేలా ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు ఆరు ఆటోల ద్వారా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. స్వామి వారి కల్యాణం టికెట్ రూ.2016, అభిషేకం రూ.500(సామగ్రితో), వీఐపీ దర్శనం టికెట్ రూ. 1,000 చెల్లించి కౌంటర్లో టికెట్ పొందా లని సూచించారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను సోమవారం ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ గట్ల మహేందర్‌రెడ్డి పరిశీలించారు.శివరాత్రికి ముస్తాబైన ఆలయాలు9లోu -
పోలింగ్ విధులపై అవగాహన ఉండాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ: పోలింగ్ విధులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈనెల 27న జరిగే వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ విధానంపై సంబంధిత అధికారులకు నిర్వహించిన రెండో విడత శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. జిల్లాలోని 12 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరా లను ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం(నేడు) ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో ఎన్నిక ల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని, అధికారులు, సిబ్బంది సకాలంలో చేరుకోవాలని చెప్పారు. ఓటర్లు ఓటు వేయడానికి వచ్చిన సమయంలో వెంట తెచ్చుకున్న గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డు చివరి 4 అంకెలను సంబంధిత ఫార్మెట్లో నమోదు చేయాలన్నారు. దివ్యాంగ ఓటర్లకు సంబంధించి 18 ఏళ్లు నిండిన వారిని సహాయకులుగా అనుమతించా లని, కుడి చేతి చూపుడు వేలికి సిరా వేసి, సంబంధి త ధ్రువీకరణ తీసుకోవాలన్నారు. ఎన్నికలు ప్రారంభమైన సమయం నుంచి ప్రతీ రెండు గంటలకు ఒకసారి నమోదైన ఓటింగ్ వివరాలను పైఅధికారులకు తెలియజేయాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సామగ్రిని జాగ్రత్తగా నిర్దేశిత ప్రదేశాలకు చేర్చాలని చెప్పారు. ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఏఓ మన్సూరీ పాల్గొన్నారు. ఎరువులు అధిక ధరలకు విక్రయించొద్దు●జనగామ: ఫర్టిలైజర్స్ దుకాణాదారులు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ రిజ్వాన్ బాషా హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని కావేరి, సాయిరాం ఫర్టిలైజర్స్, జేకేఎస్ అగ్రిమాల్ను డీఏఓ రామారావుతో కలిసి తనిఖీ చేశారు. ఎరువుల దిగుమతి, కొనుగోలు వివరాల రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులతో పాటు రశీదు ఇవ్వాలని, రికార్డు ల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. నకిలీ ల జోలికి వెళ్ల వద్దని, నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని సూచించారు. అనంతరం ఎరువుల నిల్వ గోదాంలను సందర్శించి యూరియా, ఇతర స్టాక్.. రిజిస్టర్లలో వివరాలను పరిశీలించారు. సాయిరాం ఫెర్టిలైజర్స్ షాపులో ధరల డిస్ప్లే బోర్డు లేకపోవడంతో యజమానిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిమానా విధించా లని డీఏఓను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులతో అధిక ధరల గురించి ఆరా తీశారు. -
‘సేవ్ బర్డ్స్’ చాలెంజ్‌కు అనూహ్య స్పందన
జనగామ: వేసవిలో పక్షుల దాహార్తి, ఆకలి తీర్చేందుకు అమ్మ ఫౌండేషన్ ఇచ్చిన చాలెంజ్‌కు మానవతా వాదులు స్పందించారు. ‘సేవ్ బర్డ్స్’ శీర్షికన ఈనెల 24న సాక్షిలో ప్రచురితమైన కథనం సోషల్ మీడియాలో ప్రముఖంగా నిలిచింది. అమ్మ ఫౌండేషన్ ముఖ్య సలహాదారు వంగ భీమ్రాజ్ హైదరా బాద్ బోయినిపల్లిలోని తన ఇంటిపై గింజలు, గిన్నెలో తాగునీరు పోసి చాలెంజ్ స్వీకరించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన కొండా చక్రపాణి, హనుమకొండకు చెందిన వేణుగోపాల్, యాదాద్రి, జనగామకు చెందిన పలువురు పక్షుల ప్రాణాలను కాపాడడంలో తమవంతు పాత్ర ఉంటుందని అమ్మ ఫౌండేషన్‌కు లేఖ రాస్తూ.. ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలి పారు. పక్షుల రక్షణలో భాగస్వామ్యులు కావాలని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతెన మణి కోరారు. -
ఎమ్మెల్సీ రేసులో ఎవరెవరు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో వెలువడిన ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుల ఎన్నికల నగారా మోగింది. మార్చి 3న నోటిఫికేషన్, 20న పోలింగ్ ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆ ఎన్నికలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఐదు స్థానాలకు జరిగే ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్న శాసనసభ్యుల సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ తిరిగి ఒక్కస్థానం లభించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత ఈ ఐదుగురిలో మళ్లీ ఎవరికి చాన్స్ ఇస్తారు? ఉమ్మడి వరంగల్‌కు చెందిన సత్యవతి రాథోడ్ మళ్లీ అవకాశం ఉంటుందా? మరో సీనియర్‌కు అవకాశం కల్పిస్తారా? అన్న చర్చ ఆ పార్టీలో మొదలైంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు నాలుగు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ రేసులో ఉండి.. అధిష్టానం హామీతో సీటు త్యాగం చేసిన ఆ పార్టీ సీనియర్లు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ కోటాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు? ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా చూస్తే ఈసారి కాంగ్రెస్– 4 స్థానాలు, బీఆర్ఎస్–1 స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తరఫున ఎన్నికై న మీర్జా రియాజుల్ హసన్, ఎగ్గే మల్లేశం, మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ల పదవీ కాలం మార్చి 29తో ముగియనుండగా.. సోమవారం ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఒక్కస్థానంపై బీఆర్ఎస్లో తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఉమ్మడి వరంగల్‌కు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు మళ్లీ ఎమ్మెల్సీ దక్కుతుందా? అన్న చర్చ జరుగుతున్నప్పటికీ... ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కూడా కొనసాగిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన దయాకర్‌రావు పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులతో సన్నిహితంగా ఉండటంతోపాటు పలు సందర్భాల్లో పార్టీ కార్యకలాపాల నిర్వహించడం ద్వారా తన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌కు ఎమ్మెల్సీ ఇవ్వదలచుకుంటే ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఐదు స్థానాల నుంచి ఒకే స్థానంతో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడటంతో పార్టీ అధినేత కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. కాంగి‘రేసు’లో పలువురు.. సోమవారంనుంచే మొదలైన పైరవీలు.. వరంగల్ ఉమ్మడి జిల్లానుంచి ఎమ్మెల్సీలతోపాటు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల కోసం పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే పోటీ పడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని వారికి ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల సందర్భంగా పలువురికి టీపీసీసీ భరోసా ఇచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, బెల్ల య్యనాయక్, ఐత ప్రకాష్‌రెడ్డి తదితరులకు.. కుడా చైర్మన్‌గా ఇనుగాల వెంకట్రాం రెడ్డిలకు అధిష్టానం అవకాశం కల్పించింది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ రేసునుంచి తప్పుకోవడంతో పాటు సీనియర్లుగా ఉన్న పలువురు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. సోమవారంనుంచే కొందరు ఆశావహులు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్, మంత్రుల, ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు మొదలెట్టారు. ఉమ్మడి వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర తదితరులు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా పదవుల పొందిన వారిలో ముగ్గురు కూడా ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలి సింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ పదవి ఉమ్మడి వరంగల్‌కు దక్కుతుందా? ఒకవేళ ఇస్తే ఎవరికి? అనే అంశాలు తేలనున్నాయన్న చర్చ జరుగుతోంది. -
మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
‘పన్ను కట్టు.. గిఫ్ట్ పట్టు’ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాఇంటి, నల్లా పన్ను వసూళ్లలో వందశాతం లక్ష్యం మార్చి 31 వరకు చేరుకున్న ఐదుగురు ఉద్యోగులు, సిబ్బందికి ఏప్రిల్ 1వ తేదీన ఉత్తమ అవార్డుతో పాటు నగదు బహుమతి అందిస్తామని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. అలాగే పన్ను చెల్లింపులో ముందు వరుసలో ఉన్న యజమానుల రశీదులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి మార్చి 8న బహుమతులు ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. యూరియా కొరత లేదు●నర్మెట: ప్రస్తుతం సాటు చేసిన పంటలకు యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ అన్నారు. స్థానిక ఫర్టిలైజర్ షాపులను సోమవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. వంద మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అవసరమైన రైతులు కొనుగోలు చేయవచ్చని చెప్పారు. అధికారి వెంట ఏఓ మనోహిత్ విక్రమ్‌రావు తదితరులు ఉన్నారు. 48 గంటలు వైన్స్ బంద్జనగామ: ఖమ్మం–వరంగల్–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం(నేడు) సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు 48 గంటల పాటు జిల్లాలో మద్యం దుకాణాలు మూసి వేస్తున్నారు. దీంతో బీర్లు, లిక్కర్ సేల్ ఒక్కసారిగా పెరిగింది. బెల్ట్ దుకాణాదారులు రోజువారీ కంటే అదనపు స్టాక్ సమకూర్చుకుంటున్నారు. ఆక్రమించుకున్న భూమి దళితులకు ఇప్పించాలిపాలకుర్తి టౌన్: మండల పరిధి మంచిప్పుల గ్రామంలో దళితుల భూములను ఆక్రమించుకున్నవారి నుంచి తిరిగి ఇప్పించాలని సాధిక్ ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది సాధిక్ అలీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిష న్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో ఆయనకు వినతి పత్రం అందజేశారు. దళితుల భూముల్లో గత ప్రభుత్వం అక్రమంగా డబుల్ బెడ్రూంలు నిర్మించిందని, వాటిలో బాధితులు తల దా చుకుంటే.. ఆ ఇళ్లకు కరెంటు, తాగునీరు ఇవ్వకుండా పోలీసులు వేధిస్తున్నారని సాధిక్ అలీ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చైర్మన్ మంచుప్పుల గ్రామాన్ని సందర్శించాలని కోరారు. ఆయన వెంట దళిత బహుజన ప్రంట్ రాష్ట్ర సభ్యులు శంకర్, తదితరులున్నారు. హస్తకళలతో స్వయం ఉపాధిస్టేషన్ఘన్పూర్: హస్తకళలను నేర్చుకోవడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందాలని ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టి.శ్రీనివాస్‌రావు అన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కమిషనర్, ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యాన హస్తకళల శిక్షణ తీసుకున్న మహిళలకు స్థానిక ఎస్ కన్వెన్షన్ హాల్లో సోమవారం ‘బాబిన్ లేస్ క్రాస్ స్టిచ్’పై ఒక్కరోజు సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. హస్తకళల అభివృద్ధికి ఏపీసీసీ ద్వారా ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నామని, ఆసక్తి ఉన్న మహిళలకు హ్యాండీక్రాఫ్ట్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. బాబిన్ లేస్ కళ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలతో పాటు వెబ్సైట్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మహిళలు వినూత్న డిజైన్లతో ఆకట్టుకుంటూ మార్కెటింగ్ రంగంలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జాతీయ సలహాదారుడు హెచ్‌కే.చారి, పీడీ సుధీర్‌కుమార్, ఖాజామొయీనొద్దీన్, విజయసాగర్‌రెడ్డి, శ్రీధర్, హస్తకళా కారులు జీడి ప్రసాద్, నీరటి శోభ, ఎడ్ల సులోచన, విమల, నిర్మల, తేరీజ, యాదమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పాలన అస్తవ్యస్తం ● మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం ● సీడీఎంఏ మందలించినా మార్పు లేదు ● తరుముకొస్తున్న మార్చి 31 డెడ్‌లైన్ ● రంగంలోకి దిగిన కలెక్టర్ రిజ్వాన్ బాషా ● ‘పన్ను కట్టు.. గిఫ్ట్ పట్టు’ ● ఉద్యోగులు, యజమానులకు నజరానాజనగామ: పురపాలిక అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుతాల నుంచి వచ్చే నిధులతో పాటు ఆస్తి, నల్లా పన్నులు ఎంతో కీలకం. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం కారణంగా మున్సిపల్ పాలన అస్తవ్యస్తంగా తయారైంది. వార్డుల్లో ప్రజలకు కనీస మౌలిక వసతి సౌకర్యాలపై దృష్టి పెట్టాల్సిన అధి కారులు.. వాటిని విస్మరించారు. పురపాలికకు రావలసిన పన్నుల వసూలుపైనా పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు. సీడీఎంఏ అధికారులు మొట్టికాయలు వేసినా.. కలెక్టర్ హెచ్చరించినా ఫలితం కనిపించడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల ఐదురోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు పన్ను డిమాండ్‌లో 40 శాతం కూడా వసూలు కాలేదు. దీంతో కలెక్టర్ రిజ్వాన్ బాషా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనగామ మున్సిపల్ పరిధిలో గృహాలు, వాణిజ్య సంస్థలు 15,414 అసెస్మెంట్లు ఉన్నాయి. ఆస్తి పన్ను డిమాండ్ రూ.5.71కోట్ల మేర ఉంది. ఇప్పటి వరకు రూ.2.27కోట్లు(39.80శాతం) మాత్రమే వసూలు చేశారు. రూ.3,43,89,000 రావాల్సి ఉంది. పురపాలిక 30 వార్డుల పరిధిలో 13,696 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఏటా పన్ను డిమాండ్ రూ.1.66 లక్షలు ఉంటుంది. ఇప్పటి వరకు రూ.18.22లక్షలు(10.95) మాత్రమే వసూలైంది. రూ.1.48కోట్ల మేర బకాయి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. పదేళ్లు.. 11 మంది కమిషనర్లు పురపాలన అస్తవ్యస్తంగా మారడానికి ముఖ్యంగా కమిషన్లు కుదురుగా లేకపోవడం కారణంగా చెప్పవచ్చు. 2014 నుంచి ఇప్పటి వరకు 10 మంది కమిషనర్లు బదిలీ అయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారు.. ఏసీబీ ట్రాప్‌లో చిక్కిన వారు.. రెగ్యులర్ అధికారులు ఇందులో ఉన్నారు. 2014 నుంచి 2016 వరకు కమిషనర్ సత్యనారాయణ, 2016–17 కె.బలరాం, 2017–18 ఈశ్వరయ్య, 2018లో ఒక నెల పాటు అప్పటి డీఈ కె.రవికిరణ్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. 2018–20 నోముల రవీందర్, 2020–21 సమ్మయ్య, 2021లో రెండు నెలలు డీఈ చంద్రమౌళికి ఇన్చార్జ్ బాధ్యతలు, 2021–22 వరకు నర్సింహ పని చేశారు. 2022 నుంచి 7 నెలల పాటు రవీందర్‌యాదవ్ పనిచేయగా, 2022–23 వరకు రజిత బాధ్యతలు నిర్వర్తించి ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ తర్వాత ప్రస్తుత కమిషర్ ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే కోటా కింద పెద్దలసభకు వెళ్లేదెవరు..? ● ఉమ్మడి వరంగల్‌లో జోరుగా ఊహాగానాలు ● సత్యవతి రాథోడ్‌కు మళ్లీ చాన్స్ దక్కేనా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు? ● కాంగ్రెస్ పార్టీ కోటాలో పెరుగుతున్న ఆశావహులు ● తెరమీదకు అసెంబ్లీ ఎన్నికల హామీలు.. పావులు కదుపుతున్న సీనియర్లున్యూస్రీల్సర్కారు శాఖలపై దృష్టేది..?వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పురపాలికకు ఆస్తి పన్ను రూ.1.09కోట్ల మేర రావాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి పన్ను వసూలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యా రు. సామాన్య ప్రజలు ఏడాది పన్ను పెండింగ్ ఉంటే.. ఇంటి వద్దకు వెళ్లి హడావుడి చేసే సిబ్బంది.. సర్కారు కార్యాలయాలు ఏళ్ల తరబడి చెల్లించకున్నా ఎందుకు మినహాయింపు ఇస్తున్నారనే ప్రశ్నను ప్రజలు లేవనెత్తుతున్నారు. తహసీల్ కార్యాలయం రూ.17.38 లక్షలు(1997–98 నుంచి), జిల్లా ఆస్పత్రి(రూ.3.39లక్షలు(1996–97 నుంచి), ఆర్అండ్బీ అతిథి గృహం రూ.5.12 లక్షలు(2005–06 నుంచి), పంచాయతీ రాజ్ రూ.8.47 లక్షలు(2006–07 నుంచి), ఎంపీడీఓ, జెడ్పీ రూ.10.24 లక్షలు(2013–14 నుంచి), పీడబ్ల్యూడీ ఐబీ రూ.1.49 లక్షలు (2000–01 నుంచి), వ్యవసాయ మార్కెట్ రూ.6.79 కోట్లు(2022–23 నుంచి), గోదాంలు రూ.12,230 (2024–25 నుంచి), వీవర్స్ కాలనీ లోని హ్యాండ్లూ, టెక్స్టైల్స్ కార్యాలయం రూ.54,788 (2023–24 నుంచి), కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు రూ.4.98లక్షలు (1995–96 నుంచి), హౌసింగ్ బోర్డు రూ.2.88లక్షలు(2002–03 నుంచి), ఆర్డీఓ కార్యాలయం రూ.8.75లక్షలు(2009–10నుంచి), గిర్నిగడ్డ గోదాం రూ.4.53 లక్షలు (2015–16 నుంచి), పోస్టాఫీస్ రూ.5.84లక్షలు (2004–05 నుంచి), బీఎస్ఎన్ఎల్ రూ.8.84లక్షలు (2019–20 నుంచి), ఆర్టీసీ రూ.3.22లక్షలు (2024–25 నుంచి), అటవీ శాఖ రూ.7.39 లక్షలు (2002–03 నుంచి), ఐసీడీఎస్ రూ.1.09లక్షలు (2017–18 నుంచి), సోషల్ వెల్ఫేర్ రూ.48,156 (2023–24).. ఇలా మరికొన్ని శాఖల నుంచి పురపాలికకు ఆస్తి పన్ను బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయి. -
బాబోయ్ వానర సైన్యం
జనగామ మండలం యశ్వంతాపూర్‌లో వానరసైన్యం దడ పుట్టిస్తున్నాయి. వందలాది కోతులు కలిసికట్టుగా కాలనీలన్నీ చుట్టేస్తూ ఎవరినీ కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా గుమ్మం ముందే తిష్ట వేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తూ.. పెంకుటిళ్లను గుల్ల చేస్తున్నాయి. రోడ్డుపై వెళ్లే వారిపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్ధులను బయటకు పంపించాలంటే వణికిపోతున్నారు. తల్లిదండ్రులు దగ్గరుండి తమ పిల్లలను బడికి పంపిస్తున్నారు. కోతుల నుంచి కాపాడాలంటూ ప్రజలు వేడుకుంటున్నారు. – జనగామ -
నీళ్లు లేవనడం కాంగ్రెస్ చేతగాని తనం
ఖిలా వరంగల్: రెండు పంటలకు నీళ్లు ఇవ్వాల్సిందిపోయి ‘వరి సాగు చేయొద్దు.. నీళ్లు లేవని చెప్పడంకాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారంవరంగల్ బొల్లికుంట ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యాన ఉపాధ్యాయ ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లుంటే అప్పనంగా నాడు కేసీఆర్, నేడు రేవంత్‌రెడ్డి ఏపీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. కాశేశ్వరం ప్రాజెక్ట్‌ను 50 శాతం కేసీఆర్ నాశనం చేస్తే.. మిగిలిన 50శాతం కాంగ్రెస్ నాశనం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే నీళ్లు లేక 7లక్షల ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోయిందని, యూరియా పుష్కలంగా ఉన్నా పంపిణీ చేసేందుకు ఈ ప్రభుత్వానికి చేత కావటం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో ఆసరా, రైతు భరోసా, రుణమాఫీ అరకొరగానే ఇ చ్చారు.. నేటికీ 2లక్షల ఉద్యోగాల భర్తీ లేదు.. టీచర్ల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి.. విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెన్ఫిట్స్ ఇవ్వలేక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచే యోచనలో ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని తెలిసి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తున్నారని, రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. ఉపాధ్యాయులు చైతన్యవంతులై బీజేపీ బలపర్చిన అభ్యర్ధి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, సత్యపాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, కీర్తిరెడ్డి, విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, తిరుపతిరెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ -
ఆధ్యాత్మికం.. ఆహ్లాదం
సొరంగమార్గాలు..కొండపైనుంచి అదే మండలంలోని కొన్నె గుట్టకు 20 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం, గర్భాలయంలోకి వెళ్లేందుకు గుహలు ఉన్నాయి. రుషులు ఈ సొరంగ మార్గం గుండా వచ్చి స్వయం సిద్ధేశ్వరుడికి పూజలు చేసే వారని ప్రచారంలో ఉంది. కొండ ఉత్తర భాగంలో వంద మీటర్ల దూరం పాక్కుంటూ వెళ్తే విభూతి శివలింగం దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని మంచినీళ్లబావి నీరు సేవిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వందల ఎకరాల్లో ఉన్న గుట్టచుట్టూ అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి.‘ఓంకారనాథాల ప్రతిధ్వని.. భక్తిభావం.. రుషులు నడయాడిన కొండ.. సొరంగ మార్గాలు.. ఏడాది పొడవునా గుండంలో నీళ్లు.. చింతాకు పరిమాణంలో పెరిగే స్వయంభూ శివలింగం’ ఇన్ని ప్రత్యేకతలున్న శైవ క్షేత్రం సిద్ధులగుట్ట బచ్చన్నపేట మండలం కొడవటూరులో ఉంది. సిద్ధుడు అనే మహారుషి కంటికి కనిపించిన పుట్టిలింగమే నేడు స్వయంభూ శైవక్షేత్రాల్లో ఒక్కటిగా వెలుగొందుతోంది. జనగామ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధులకొండపై సిద్ధేశ్వరుడు సుమారు 600 ఏళ్లుగా భక్తుల పూజలందుకుంటున్నాడు. మహిమాన్వితమైన శివలింగం ఏటా చింతాకు పరిమాణంలో పెరుగుతున్నది. కాకాతీయ రాజు తనకు ఇష్టమైన సిద్ధేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారని చరిత్ర చెబుతున్నది. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ గుట్ట ప్రత్యేకత. కొండపై పాలగుండం, కప్పు గుండం, సూర్యకిరణాలు సోకని గుండం ఇలా మొత్తం ఏడు గుండాలు ఉన్నాయి. ఈ గుండాలలో ఏడాది పొడవునా నీరు ఉండడం స్వామి మహిమకు నిదర్శనం. – జనగామ● సిద్ధులగుట్టపై ఓంకారనాథ ప్రతిధ్వని ● కొలువైన స్వయంభూ శివలింగం ● ఈ నెల 26న మహాశివరాత్రికి ఆలయాలు ముస్తాబుప్రత్యేక బస్సులు.. ప్రైవేట్ వాహనాలుజనగామతో పాటు వివిధ డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు, బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి 24 గంటల పాటు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. అలాగే గుట్టపై దత్తాత్రేయ, సరస్వతీ, సాయిబాబా, శ్రీ వాసవీ కన్య కాపరమేశ్వరి, హనుమాన్ ఆలయాలు, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి నిత్యాన్నదాన సత్రం ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సిద్ధులగుట్టకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండగా ఇందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెంబర్తి గుట్టపై నల్లరాతి శివలింగం.. కాకతీయరాజు పరిపాలనలో జనగామలో ప్రతిష్ఠించిన పాతబీటు బజారు శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. 1530 సంవత్సర కాలంలో కాకతీయ సామ్రాజ్యంలో వరుసగా మూడేళ్ల పాటు కరువు సంభవించి ప్రజలు అతలాకుతలమయ్యారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు కాకతీయరాజు 111 శివలింగాలను ప్రతిష్ఠిస్తానని ముక్కంటీశ్వరున్ని వేడుకున్నారు. రాజు విన్నపాన్ని కై లాస వాసుడు కరుణించడంతో కాకతీయ సామ్రాజ్యంలో శివలింగాలను ప్రతిష్ఠించి రాజు మొక్కులు తీర్చుకున్నాడు. అందులో భాగంగానే జనగామ మండలం పెంబర్తి కొండపై చెక్కిన శివలింగాన్ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర (మహదేవ) దేవాలయంలో ప్రతిష్ఠించారు. 2015లో ఆలయ పునప్రతిష్ఠాపన సమయంలో నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, పోలీస్, పురావస్తుశాఖ అధికారుల ఆధ్వర్యంలో శివలింగాన్ని బయటకు తీశారు. శివలింగం ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు, బరువు ఎంత అనే దానిపై పురావస్తుశాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. పెంబర్తి కొండపై చెక్కిన నల్లరాతి శివలింగం బరువు 42 వందల కిలోల బరువుగా లెక్కించారని భక్తులు చెబుతుంటారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సోమేశ్వర ఆలయం ముస్తాబుపాలకుర్తి టౌన్: మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ముస్తాబు అయింది. ఆదివారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో ఆలయం ఆకట్టుకుంది. ఈనెల 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
జోరుగా బెట్టింగ్
జనగామ: దాయాదుల పోరుతో మరోసారి బెట్టింగ్‌లకు తెరలేపింది. చాంపియన్ ట్రోఫీ–2025లో భాగంగా దుబాయ్‌లో ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలో భారత్ వరెస్స్ పాకిస్తాన్ తలపడ్డాయి. మ్యాచ్ ప్రారంభానికి టాస్ వేసిన సమయం నుంచి రాత్రి మ్యాచ్ ముగిసే వరకు ఆన్లైన్ వేదికగా జోరుగా బెట్టింగ్ జరిగినట్లు ప్రచారం జరిగింది. బెట్టింగ్ ముఠా రంగంలోకి దిగి జిల్లా కేంద్రం, ఆయా మండలాల పరిధిలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా క్రికెట్ అభిమానుల నుంచి బెట్టింగ్‌లో పాల్గొనే విధంగా ఎర వేసినట్లు చర్చ జరిగింది. మొదటగా టాస్ ఎవరు గెలుస్తారనే దానిపై రూ.5వందల నుంచి రూ.5వేల వరకు బె ట్టింగ్ చేయగా.. గెలుపొందిన వారికి డబుల్ ధమాకా ఆఫర్ ప్రకటించినట్లు మాట్లాడుకోవడం కనిపించింది. మొదటి ఓవర్ నుంచి చివరి 50వ ఓవర్ వ రకు బెట్టింగ్ జరుగగా, పాకిస్తాన్ వికెట్లు కుప్పకూలి పోతున్న సమయంలో బాల్ బాల్‌కు పోటీ పెరిగిన ట్లు సమాచారం. బెట్టింగ్‌ను నగదు రూపంలో కా కుండా, యాప్‌ల ద్వారా నడిపించినట్లు తెలుస్తుంది. కొంతమంది మాత్రం రూ.5 నుంచి రూ.10 ల క్షల వరకు బెట్టింగ్ ద్వారా సంపాదించుకున్నారనే మాటలు వినిపించాయి. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ తతంగంలో సూత్ర, పాత్రదారులు ఎవరనే దానిపై పలువురు అభిమానులు బహిరంగంగానే ముచ్చటించుకున్నారు. ఇదిలా ఉండగా ఇండి యా బ్యాటింగ్ దిగగానే..వందశాతం గెలుస్తుందని భారీగా బెట్టింగ్ కాయగా... చివరి వరకు ఇదే తంతు కొనసాగిందని సమాచారం. దీనిపై నిఘా వర్గాలు ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం చాంపియన్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబా య్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని స్వాగతిస్తూ జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డతో పాటు ఆయా కాలనీలు, మండలాల్లో క్రికెట్ అభిమానులు బాణాసంచా పే ల్చి, జాతీయ జెండాలతో జై భారత్ అంటూ నినదించారు. విరాట్ కొహ్లీ సెంచరీతో ఇండియా గె లుపొందిన తర్వాత.. అభిమానులంతా ఎంజాయ్ చేస్తూ దావత్‌లు చేసుకున్నారు. ఫోర్, సిక్స్‌కు ఓ రేటు.. వికెట్‌కు మరో రేటు అంతా ఆన్లైన్లోనే.. భారత్ గెలుపుతో సంబురాలు -
ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్
జనగామ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఆచార వ్యవహారాలు, ఆహార నియమాలు, సంస్కృతీ సంప్రదాయాలు పరస్పరం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం అమలు చేస్తోంది. తెలంగాణలో 3 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు హర్యానా(హర్యాన్వీ) భాష.. అలాగే హరియాణాలో తెలంగాణ భాష, సంప్రదాయాలు, తదితర విషయాలను నేర్పిస్తున్నారు. నవోదయ గురుకులాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యాలయాల్లో చదువుకునే పిల్లలు పదోతరగతి లోపు ఒక సంవత్సరం ఎంపిక చేసిన రాష్ట్రంలో చదువుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు వారిలో అవగాహన పెంపొందించేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక నిధుల కేటాయింపు జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 508 ఉండగా, 40వేల మంది పిల్లల వరకు చదువుకుంటున్నారు. ప్రత్యేక భాష నేర్పించడానికి ‘పీఎం శ్రీ’ పథకం కింద ఎంపికై న 15 పాఠశాలలకు రూ.10వేలు, మిగతా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.వెయ్యి చొప్పున కేంద్రం గ్రాంట్ విడుదల చేసింది. ప్రత్యేక రోజులు, రెగ్యులర్ బోధన తరగతులకు ఆటంకం కలుగకుండా అనుభవం కలిగిన హిందీ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో హర్యానా భాషా నేర్పించాల్సి ఉంటుంది. అక్కడి రాష్ట్రంలోని విభిన్న వంటకాలు, సంగీతం, నృత్యం, హస్తకళలు, క్రీడలు, సాహిత్యం, పండుగలు, చిత్రలేఖనం, కవితలు, జానపద పాటల, అక్షరమాలలు, స్వాతంత్య్ర సమరయోధులు, భౌగోళిక పరిస్థితులు, రాష్ట్ర ప్రాధాన్యత అంశాలు, పంటలు, చారిత్రక పరిస్థితులు, సామెతలు తెలిసేలా పి ల్లలకు హరియాణా రాష్ట్ర భాషలోని 100 వాక్యాలను నేర్పించాలి. అలాగే ఆ రాష్ట్ర భాషలో ప్రదర్శించే సినిమాలను సైతం చూపించాలి. పిల్లలు నేర్చున్న విషయాలపై తెలుసుకునేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. సంస్కృతీ సంప్రదాయాలు, భాష నేర్పేందుకు క్లబ్‌లు ఏర్పాటు చేసి.. కన్వీనర్‌గా(హెచ్ఎం) కోకన్వీనర్‌గా(హిందీ టీచర్), ప్రతీ తరగతి నుంచి సభ్యులు(ఐదుగురు విద్యార్థులు) పర్యవేక్షిస్తారు. తెలంగాణలో హర్యానా భాషా, ఆ రాష్ట్రంలో తెలుగు బోధన ప్రాథమిక స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు సంస్కృతీ సంప్రదాయాలు పరస్పరం తెలిసేలా ప్రత్యేక కార్యాచరణ -
ఉచిత వైద్యసేవలు అభినందనీయం
రఘునాథపల్లి: పేదలకు ఉపయోగపడే విధంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద వినూత్న ఆర్థోపెడిక్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదలకు ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్న ఆస్పత్రి డైరెక్టర్లు మల్లారెడ్డి, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ గోపిచంద్‌లను శాలువాతో సత్కరించి అభినందించారు. సుమారు 205 మంది వైద్యపరీక్షలు చేయించుకోగా వారికి ఉచితంగా మందులు అందజేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు -
నేడు పీఎం కిసాన్ పెట్టుబడి సాయం
జనగామ: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నేడు (సోమవారం) రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. ఇందు కు సంబంధించి భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా, రైతుల ఖాతాలకు నేరుగా సొమ్ము వచ్చి చేరుతుంది. జిల్లాలో సుమారు 53వేల మంది రైతులు పీఎం కిసాన్‌కు అర్హత పొందారు. 19వ విడతలో ఒక్కో రైతుకు రూ.2వేల చొప్పున రూ.10.60కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా కాకుండా, కేంద్రం సపరేట్గా ఏడాదికి మూడు సార్లు రూ.2వేల చొప్పున రూ.6వేల పెట్టుబడి సాయం వస్తుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో వరిసాగు సమయంలో యూరియా, కలుపు తీత, ఇతర పనులకు పెట్టుబడి సాయం అవసరపడుతుంది. జిల్లాలో లబ్ధిపొందనున్న 53వేల మంది రైతులునేడు జమవుతాయి.. కేంద్రం అందిస్తోన్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం 19వ విడత నేడు రైతుల ఖాతాల్లో జమ కానుంది. జిల్లాలో ఈ పథకం కింద 53 వేల మంది రైతులు ఉన్నారు. ఏడాదికి రూ.6 వేల చొప్పున సాయం అందుతుంది. – రామారావు, జిల్లా వ్యవసాయాధికారి -
సేవ్ బర్డ్స్
ఇంటిపై పాత్రలో తాగునీరు, గింజలను ఏర్పాటు చేసిన మణి● పక్షుల దాహార్తిని తీర్చేందుకు సెల్ఫీ విత్ వాటర్ ఫర్ చాలెంజ్జనగామ: వేసవిలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు అమ్మ ఫౌండేషన్ వినూత్న రీతిలో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సేవ్ బర్డ్స్–సెల్ఫీ విత్ వాటర్’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణి చాలెంజ్‌ను స్వీకరిస్తూ, ముఖ్య సలహాదారులు వంగ భీమ్‌రాజ్‌కు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతీ ఇంటిపై మట్టి పాత్ర లేదా గిన్నెలో నీరు పోసి, ఆహార గింజలను అందించి పక్షుల దాహార్తి, ప్రాణాలను కాపాడేందుకు ప్రతీ ఒక్కరు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీఒక్కరు పక్షుల ప్రాణాలు కాపాడేందుకు అమ్మ ఫౌండేషన్ చేపట్టిన యజ్ఞంలో భాగస్వామ్యులుగా చేరి మనలోని మానవత్వాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. -
ఆలిండియా సదస్సును జయప్రదం చేయండి
దేవరుప్పుల: ఈ నెల 28న తలపెట్టిన చలో ఢిల్లీ స దస్సును జయప్రదం చేయాలని సీపీఐ (ఎం,ఎల్) మాస్ లైన్ ఆలిండియా కమిటీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గడ్డం సదానందం ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బీజేపీ సర్కారులో ప్రజల మధ్య విద్వేషాలు, కుల, మతాలను ప్రేరేపిస్తూ ఆర్ఎస్ఎస్ పరివార్ శక్తులు, మోదీ ప్రభుత్వం లౌకికవాదంపై దాడులు చేస్తుందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు వామపక్షభావజాల శక్తులు ఏకం కావాలన్నారు. -
కొత్త టీచర్లకు శిక్షణ
ఈనెల 28 నుంచి షురూ.. ● ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు● రూ.లక్ష బడ్జెట్ విడుదల●● జిల్లాలో 196 మంది ఉపాధ్యాయులు జనగామ: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు ఇటీవల కొత్తగా విధుల్లో చేరిన టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకు సంబంధించి టీఏ, డీఏల కోసం జిల్లాకు రూ.1,37,950 నిధులు కేటాయించింది. ఈ నెల 28వ తేదీ నుంచి మూడు కేటగిరీల్లో 196 మంది టీచర్లకు శిక్షణ అందించేందుకు విధి విధానాలను విద్యాశాఖ అధికారులకు పంపించగా, 8 మంది డీఆర్పీ (ట్రైనర్లు)లకు హైదరాబాద్‌లో శిక్షణ అందించారు. ఈ నెల 28, మార్చి 1, 3 తేదీల్లో 115 మంది ఎస్జీటీలు (జనగామ జిల్లా కేంద్రంలో), 3, 4, 5 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, ఫిజికల్ సైన్స్ (హైదరాబాద్‌లో) 6, 7, 8 తేదీల్లో ఎస్ఏ హిందీ, తెలుగు గణితం, బయోలజీ, సోషల్, పీఈటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ మొత్తంగా 81 మందికి తరగతి గదిలో విద్యార్థులకు ఎలా బోధించాలనే దానిపై ఒక్కో బ్యాచ్‌కు 40 నుంచి 45 మంది చొప్పున విభజించి అవగాహన కల్పించనున్నారు. శిక్షణ జరిగే సమయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి సెలవులు ఇవ్వరాదని రాష్ట్ర విద్యాశాఖ డీఈఓలను ఆదేశించింది. -
నవ్వులు విరియాలంటే..
ఆదివారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ఆమె ఆరోగ్యవంతురాలైతే.. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమే. కుటుంబం సక్రమంగా నడవడానికి ఆమే ప్రధాన కారణం. అలాంటి ఇల్లాలికి వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలి. వారాంతంలో భార్య చేసే ఇంటి పనుల్లో ఓ చెయ్యి వేస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమెకూ విశ్రాంతి దొరుకుతుంది. ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. -
– హన్మకొండ కల్చరల్
ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. ‘ప్రతీ క్షణం నీకోసం నువ్వు.. వారానికి ఒక్కరోజు నీ ఇల్లాలికి ఇవ్వు’ అన్నట్లు ఆదివారం ‘ఇల్లాలి’కి ఇంటి పనుల్లో సాయమందించాల్సిన అవసరం ఉంది. గంపెడు బాధ్యతలతో ఇంటి బండిని నడిపే ఆమెకు వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలంటున్నారు.. ఆదివారం ఇంటి, వంట పనుల్లో పాలు పంచుకుంటే అనుబంధం మరింత పెరిగే అవకాశమూ ఉంది. ఏమి చేయొచ్చంటే.. ● ఇంట్లోని దుమ్ము దులపడం, వాక్యూమింగ్ చేయడం, నేలలను తుడవడం, బాత్రూం శుభ్రపరచడం, వంటగది శుభ్రపరచడం (పాత్రలు, కౌంటర్‌టాప్‌లు), కూరగాయలు కోయడం, భోజనం తయారీ, దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఆరాక మడతబెట్టడం, అవసరమైనప్పుడు ఇసీ్త్ర చేయడం. పిల్లల సంరక్షణలో ఇలా.. ● ఆ రోజు పిల్లలకు కూడా సెలవుదినం కావడం వల్ల స్నానం చేయించి దుస్తులు ధరింపజేయాలి. ● హోంవర్క్‌లో సహాయం చేయడం, ఆ రోజు పాఠశాలలో ఏదైనా కార్యక్రమం ఉన్నా హాజరు కావడం. ● ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడం, పచ్చిక కోయడం, తోటపని చేయడం.●ఆదివారం ప్రత్యేకమైన వంటలు చేస్తారు... నా భర్త ఉద్యోగరీత్యా ఉదయమే వెళ్తారు. ఆదివారం సెలవు కావడంతో నాకు సహాయంగా ఉంటారు. కూరగాయలు తరగడం, బట్టలు ఉతికితే ఆరేయడం, వంటగదిని శుభ్రం చేయడం వంటి పనులు చేస్తారు. మా బాబుకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేసి స్వయంగా వడ్డిస్తారు. – సీత స్వప్న, పోచమ్మకుంట, హనుమకొండ ఒక్క రోజు విశ్రాంతి ఇస్తే ఆనందమే భర్త తన కష్టాలను మోస్తున్నాడని, తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడని నమ్మకం ఏర్పడుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితులు, సంఘటనలతో ఇవి తలెత్తుతుంటాయి. వంట చేయడం, దుస్తులు ఉతికి ఆరబెట్టడం వంటి కొన్ని పనులు కలిసి చేయడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయే అవకాశం ఉంది. ఇంటిపని మహిళలకే పరిమితమనే భావన నెలకొంది. కానీ, భార్యాభర్తలు ఇంటిపనులు పంచుకోవడం వల్ల దాంపత్యంలో సామరస్యం పెరుగుతుంది. పనులను షేర్ చేసుకున్నప్పుడు త్వరగా పూర్తవుతాయి. మిగిలిన సమయంలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవచ్చు. అప్పుడు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం ప్రారంభిస్తారు. కలిగే ప్రయోజనాలుఇల్లాలిపై ప్రేమను చూపడంలో అతను ఇంటిపనుల్లో చేసే సహాయం కీలకం. ప్రతి పనిని భారంగా తీసుకోకుండా చేస్తున్నప్పుడు భర్త తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో, పట్టించుకున్నాడో భార్య అర్థం చేసుకుంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు దోహద పడుతుంది. -
విద్యార్థులను ఆకర్షించేలా..
పాఠ్య పుస్తకాలను సంపూర్ణంగా ఎలా ఉపయోగించుకో వాలనే దానిపై కొత్త టీచర్లకు సవివరంగా అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులను ఆకర్షించే విధంగా తరగతి గదిని ఎలా తీర్చిదిద్దాలి, విద్యా సామర్థ్యాలు, అభ్యసనా ఫలితాలకు సంబంధించి పిల్లలను ఎలా డెవలప్ చేయాలనే దానిపై డీఆర్పీలు బోధనా రూపంలో శిక్షణ ఇస్తారు. బోధన, వార్షిక ప్రణాళిక తయారీ, ఎఫ్ఏ–1, ఎస్ఏ పరీక్షల నిర్వహణ, పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు బోధించే క్రమంలో యాక్టివిటీస్‌ను రూపొందించుకునే విధానం తదితర అంశాలను నేర్పించనున్నారు. అలాగే ఆన్లైన్లో ఉ న్న అంశాలను ఉపయోగించుకుని విద్యార్థులకు బోధించే మెటీరియల్‌ను ఎలా తయారు చేసుకోవాలనే దానిపై ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు. ఎఫ్ఎల్ఎన్, లిప్తో పాటు పాఠశాల వి ద్యాశాఖ యాప్ విధి విధానాలు, యూడైస్ల ను పవర్ ప్రజెంటేషన ద్వారా చూపిస్తారు. టీఎల్ఎం తయారీ, మూల్యాంకణ పద్ధతులు, విద్యాశాఖ నిర్వహించే తదితర కార్యక్రమాలపై శిక్షణలో సవివరంగా వివరిస్తారు.● -
అదనపు కలెక్టర్‌కు మంత్రి పరామర్శ
రఘునాథపల్లి: మాతృమూర్తిని కోల్పోయిన ములుగు అదనపు కలెక్టర్ చీమలపాటి మహేందర్‌జీ కుటుంబాన్ని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి దనసరి సీతక్క పరామర్శించారు. మహేందర్‌జీ తల్లి రాధాబాయి(80) ఈ నెల 14న మృతి చెందారు. సమాచారం అందుకున్న మంత్రి శనివారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని మహేందర్‌జీ నివాసానికి వెళ్లి అతని తల్లి రాధాబాయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ తండ్రి మాజీ సర్పంచ్ మల్లాజీని, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతిని తెలిపారు. మంత్రి వెంట పీఏసీఎస్ చైర్మన్ చీమలపాటి రవీందర్‌జీ, జక్కుల వేణుమాదవ్, మినుముల యాదవరెడ్డి, బుస్సారి బాను, వెంకట్‌రెడ్డి, వీరేందర్, శ్రీను ఉన్నారు. అయితే అదనపు కలెక్టర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్కకు అక్కడి స్థానిక పార్టీ నాయకులు రాకపోవడంతో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎవరూ లేరా? అని ఆరాతీసింది. గణితంలో పానగంటి శారదకు డాక్టరేట్ జనగామ: జిల్లా కేంద్రానికి చెందిన పానగంటి శారదకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఆమె గణితంలో ‘క్రైటీరియా ఫర్ ఓసిలేషన్ ఆఫ్ డిలే డిఫరెన్సల్ ఈక్వేషన్’ అనే అంశంపై ప్రొఫెసర్ వి.ధర్మయ్య పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. 2017–18 సంవత్సరంలో పీహెచ్డీ అడ్మిషన్ పొందిన శారద ప్రస్తుత నెలలో ఫైనల్ వైవా విజయవంతంగా పూర్తి చేయగా వర్సిటీ డాక్టరేట్ పట్టా అందజేసింది. భర్త ఉపేందర్ ప్రోత్సాహంతోనే డాక్టరేట్ సాధించగలిగానని శారద తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నికజనగామ: మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ జిల్లా కమిటీని శనివారం పట్టణంలో జరిగిన సమావేశంలో కరాటే, కుంగ్‌ఫూ, టైక్వాండో సీనియర్ మాస్టర్లు ఎండీ సలీం పాషా, పెసరు సారయ్య ల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జి ల్లా అధ్యక్షుడిగా విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీకి చెందిన మాస్టర్ ఓరుగంటి సంతోష్ కు మార్, ప్రధాన కార్యదర్శిగా మాస్టర్ ఎండీ అ బ్బాస్, కోశాధికారిగా మాస్టర్ ప్రణయ్‌లను ఎ న్నుకున్నారు. జిల్లా అస్మో చైర్మన్‌గా మాస్టర్ ఎండీ.సలీం పాషా, అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా మాస్టర్ పెసరు సారయ్య, ఉపాధ్యక్షులుగా వంగ శ్రీనివాస్, బి.బాలుకుమార్, బెజరమైన శ్రీని వాస్‌లను ఎన్నుకున్నారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. -
రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ స్టేషన్‌ఘన్‌పూర్: గ్రామ పంచాయతీ (జీపీ)ల రికార్డుల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా వ్యవహరించాలని, పన్నుల వసూళ్లు, ఖర్చులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. మండలంలోని నమిలిగొండ గ్రామంలో అదనపు కలెక్టర్ శనివారం పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి అందులో ఉన్న రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు రూ.60వేలు రావడంపై ఆరా తీశారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న పాంఫౌండ్ పనులను, ఉపాధి పనులు, నర్సరీని, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. అలాగే నమిలిగొండలో స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా మంజూరై నిర్మాణం చేపట్టిన మరుగుదొడ్లను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈనెల 28లోపు నిబంధనలకు లోబడి మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవాలన్నారు. నిర్మాణం పూర్తయిన వారు మరుగుదొడ్డి ఫొటో, బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, ఈజీఎస్ జాబ్‌కార్డు జిరాక్స్‌లతో వివరాలను కార్యదర్శికి అందించాలన్నారు. ఆయన వెంట ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ చంద్రశేఖర్, ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ కరుణాకర్, ఎంపీడీఓ విజయశ్రీ, ఎంపీఓ నర్సింహారావు, ఏపీఓ ప్రేమయ్య, పంచాయతీ కార్యదర్శులు జేసుమణి, సునీల్, టీఏ సుజాత, కారోబార్ రాంచందర్, ఎఫ్ఏ అమీనా తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో జనగామ డీసీపీ రాజహేంద్రనాయక్తో కలిసి పాల్గొన్నారు. భక్తులకు తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలని, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం లడ్డూ, ప్రసాదాలను పరీక్షించాలని చెప్పారు. భక్తులకు నాణ్యతతో కూడిన అభిషేకం సామగ్రి సరఫరా చేయాలని ఆదేశించారు. ఆంజనేయులు అనే బినామీ దారుడు పూజా సామగ్రి విక్రయిస్తున్నాడని, అతను గతంలో దేవస్థానానికి టెండర్ డబ్బులు ఎగ్గొట్టినట్లు సమావేశం దృష్టికి తీసుకురావడంతో బకాయి చెల్లించకుంటే ఆస్తులు జప్తుచేయాలని అదనపు కలెక్టర్ ఈఓను ఆదేశించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ జాతరలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. నాలుగు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పా టు చేశామన్నారు. డీపీఓ స్వరూప మాట్లాడుతూ 120 మంది గ్రామ పంచాయతీ సిబ్బందితో జాతరలో పారిశుద్ధ్య పనులు చేయిస్తామని, జాతరలో ని రంతరం విద్యుత్ సరఫరాకు 260 కేవీ జనరేటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్, మహేందర్‌రెడ్డి, సంధ్యారాణి, రాంబాబు, రామలింగాచారి, మోహన్‌బాబు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించాలి సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ -
భాగస్వామికి విశ్రాంతినివ్వాలి..
నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే భార్యకు వారాంతపు సెలవు దినంలో విశ్రాంతినివ్వాలి. ఇలా చేయడం వల్ల జీవితభాగస్వామి మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. వారాంతపు సెలవు దినంలో ఇంటిపని, గార్డెనింగ్, ఇంటి శుభ్రతలో నిమగ్నమవుతుంటాను. నేనే స్వయంగా పిల్లలకు ఇష్టమైన, ఆరోగ్యకరమైన వంటలు చేసి వడ్డిస్తాను. పిల్లలకు అవసరమైన వస్తువులు కొనిస్తాను. సంతోషంగా గడుపుతాను. – డాక్టర్ బీఆర్ శరవణభవ, ప్రొఫెసర్, హెడ్ ఫార్మ్ డీ, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హనుమకొండ -
హామీలను అమలు చేయాలి
● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు జనగామ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం పట్టణంలోని గబ్బెట్ట గోపాల్‌రెడ్డి భవన్లో కావటి యాదగిరి అధ్యక్షతన జరిగిన జిల్లా సమితి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల విషయం ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న రీతిలో అమలవుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ హామీల అమలు ఇలానే కొనసాగిస్తే పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు ఆది సాయన్న, ఆకుల శ్రీనివాస్, నాయకులు చొప్పరి సోమయ్య, రావుల సదానందం, చామకుర యాకూబ్, జువారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బంజారాల అభివృద్ధికి కృషి
జనగామ రూరల్: ప్రతి తండాలో తాగునీటి వసతి కల్పించడంతోపాటు బంజారాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయ న మాట్లాడారు. తన వంతు సహకారంగా బంజా రా భవనానికి భూమి, అలాగే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి సేవాలాల్ మహరాజ్ విగ్రహం ఇప్పిస్తానని చెప్పా రు. డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మా ట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బంజారా భవనం నిర్మాణానికి సహకరించటం లేదని, బంజారాల ఓట్లతో గెలిచిన నాయకులు గిరి జనుల సమస్యలు పట్టించుకోవడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు చౌరస్తా నుంచి లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యాలతో ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అజ్మీరా స్వామినాయక్, సేవాలాల్ జయంతి స్పెషల్ ఆఫీసర్ రూపరాణి, మాజీ కౌన్సిలర్ అనిత, జిల్లా వైద్యులు బాలాజీనాయక్, శంకర్‌నాయక్, కొర్ర కాలురామ్నాయక్, ధర్మ భిక్షం, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంకోటి, బానోతు రవి, గోవర్ధన్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
బచ్చన్నపేట : కొడవటూర్లోని స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ నల్లొగొండ సహాయ కమిషనర్ భాస్కర్‌రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణం ఉంటుందని చెప్పారు. కల్యాణానికి వచ్చే వేలాది మంది భక్తుల కు వసతుల కల్పనలో లోటు లేకుండా చూడాలన్నా రు. కట్టుదిట్టమైన భద్రత, వైద్య సేవలు అందుబా టులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, కార్యనిర్వహణాధికారి చిందం వంశీ, ప్రధాన పూజారి ఓం నమఃశివాయ, డైరెక్టర్ నిమ్మ కర్ణాకర్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. పాలకుర్తిలో ఏర్పాట్ల పరిశీలన పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం దేవాలయ ధర్మాదాయ శాఖ నల్లొగొండ సహాయ కమిషన్ కె.భాస్కర్ పరిశీలించారు. ఆలయంలో భక్తుల కోసం క్యూలైన్, చలువ పందిళ్లు ఏర్పాటు చేయగా.. సందర్శించారు. లడ్డూ తయారీని పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, సూపరింటెండెట్ కొత్తపల్లి వెంటకయ్య, సిబ్బంది పాల్గొన్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ భాస్కర్‌రావు -
విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా చర్యలు
జనగామ: వినియోగదారుల డిమాండ్ కు తగ్గట్టుగా మరింత నాన్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ టి.వేణుమాధవ్ అన్నా రు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జనగా మ సర్కిల్ పరిధిలో ప్రస్తుత నెల 12వ తేదీ రోజున గరిష్ట విద్యుత్ డిమాండ్ 5.75 మిలియన్ యూని ట్లు నమోదు కాగా.. రాబోయే మూడు నెలల్లోనూ గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. గత మూడు నెలల నుంచే వేసవి కాలం ముందస్తు కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని, ఆ మేరకు కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పా రు. ముందు ఎక్కడెక్కడ అదనపు లోడ్ పెరుగుతుందో నిర్ధారించుకుని కొత్తగా 32 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని, అలాగే 45 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచి, 33/11 కేవీ సబ్స్టేషన్లలో నూతనంగా 5 పవర్ ట్రాన్స్ఫార్మర్లను బిగించినట్లు వివరించారు. అత్యవసర సమయంలో ప్రత్యామ్నాయ లైన్(ఇంటర్ లింకు) ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి కొత్తగా రెండు ఇంటర్ లింకింగ్ లైన్లు ఏర్పా టు చేశామని తెలిపారు. మెరుగైన, కోతలు లేని విద్యుత్ సరఫరా కోసం కొత్త ఫీడర్లను సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ 1912 విద్యుత్ వినియోగదారులకు 24 గంటల పాటు సేవలందిస్తున్నామని, సమస్యలు ఉత్పన్నమైతే టోల్‌ఫ్రీ నంబర్ 1912కు పోన్ చేయాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు పెయిల్యూర్, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, లోవోల్టేజీ, బ్రేక్ డౌన్స్, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, తీగలు, విద్యుత్ బిల్లుల్లో తేడాలు, పేరు మార్పు, మీటర్లలో సాంకేతిక సమస్య, సర్వీసు రద్దు తదితరాలకు టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందుకున్న వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. -
ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జనగామ రూరల్ : రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ పి.శ్రీనివా సరావు ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి మొత్తం 1,851 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఈనెల 23న ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు జిల్లా పరిధిలో తొమ్మిది సెంటర్లు కేటాయించామని తెలిపారు. నిర్దేశిత సమయానికి గంట ముందే సెంటర్లోకి అనుమతిస్తారని, ప్రతీ విద్యార్థి హాల్ టికెట్, పరీక్ష ప్యాడ్, బ్లూ, బ్లాక్ పెన్ తప్పనిసరి వెంట తెచ్చుకోవాలని సూచించారు. జిల్లా కోఆర్డినేటర్ పి.శ్రీనివాసరావు