Jayashankar
-
ప్రణీత్ ప్రతిభ..
కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లోని కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు. -
ఆవుదూడపై పులి పంజా..
కాటారం: కొన్ని రోజులుగా జాడ లేకుండా పోయిన పెద్దపులి ఒక్కసారిగా తన పంజా విసిరింది. కాటారం మండలంలోని జాదారావుపేట గ్రామపంచాయతీ పరిధిలో రఘుపల్లి అటవీ ప్రాంతానికి సమీపంలోని చెరువు కట్ట వద్ద మంగళవారం ఆరేళ్ల ఆవుదూడను పులి చంపేసింది. అటు వైపుగా వెళ్లిన ఓ మేకల కాపరి మృతి చెందిన ఆవుదూడను గమనించి స్థానికులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లగా పులి ఆవుదూడపై దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. పులి దూడ గొంతు వద్ద గాయం చేసి రక్తం తాగి వదిలేసి వెళ్లినట్లు అఽధికారులు తెలిపారు. పులి ఇదే ప్రాంతంలో సంచరిస్తుందని పులి మూగజీవాలపై దాడిచేసి మొదటగా రక్తం తాగుతుందని.. మరుసటి రోజు చంపిన జీవిని తినడానికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. పులి ఆవుదూడను చంపిన విషయం తెలియడంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో పులి ఎటు నుంచి వస్తుందో తెలియక అయోమయంతో జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి జాడ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రజలు, రైతులు, కాపర్లు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని కాటారం రేంజ్ రేంజర్ స్వాతి హెచ్చరించారు. అడవుల్లో ఉచ్చులు అమర్చవద్దని, పులికి హాని చేసేలా వ్యవహరించవద్దని చెప్పారు. పులికి సంబంధించిన ఆనవాళ్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని రేంజర్ కోరారు. -
పులకించిన కొండపర్తి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఆయన కూడా ఆదివాసీలతో మమేకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీలు నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతోపాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్‌ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్‌దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు కొండపర్తికి వచ్చిన గవర్నర్ మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్ల మొక్కుగా సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రావుల సునిత, మేడారం ఈఓ రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు. కొండపర్తిని దత్తత తీసుకోవడం గొప్ప విషయం: మంత్రి సీతక్క దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆ గ్రామాన్ని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అనుసంధానం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అందించడం ద్వారా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. 40 కంపెనీలు దిశ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని వంద పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి: దాన కిశోర్, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి కొండపర్తిని అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్ధాలనేదే లక్ష్యమని గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఆదాయం చేకూరేలా ఐకమత్యంతో ముందుకుసాగాలని సూచించారు. మిర్చి, పసుపు, మసాలా యూనిట్లకు మార్కెటింగ్ పరంగా రాష్ట్రవ్యాప్తంగా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం భారీ పోలీసు భద్రత నడుమ సాగిన పర్యటన -
కష్టపడ్డారు..
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025గ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ– 8లోuముల్కలపల్లి యువకుడు ఉపేందర్.. డోర్నకల్: గ్రూప్–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్‌ను గ్రామస్తులు అభినందించారు. ● పలువురికి మెరుగైన ర్యాంకులు ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు● ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం కొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షలు రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు. – సాక్షి నెట్వర్క్భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో పనిచేశారు. ఆ సంవత్సరంలోనే గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. అదే శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్లో జరిగిన గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. మూడు శ్రీకాంత్‌ను సన్మానిస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులుగూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్ గ్రూప్–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్ వైస్ ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్ తెలిపారు. గతంలో గ్రూప్–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్‌ను మాజీ సర్పంచ్ అరుణమంగీలాల్‌నాయక్, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్‌రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు. న్యూస్రీల్కాసింపల్లి వాసి -
క్రీడల్లో గెలుపోటములు సహజం
భూపాలపల్లి రూరల్: క్రీడలు మానసికంగా, శారీరకంగా ఉపయోగపడతాయని, క్రీడలలో గెలుపోటములు సహజమని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మహిళలకు క్యారంతో పాటు వివిధ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇన్చార్జ్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి మల్లీశ్వరి హాజరై క్రీడలను పర్యవేక్షించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రఘు, మహదేవ్పూర్ సీడీపీఓ రాధిక, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.నేడు సరస్వతీ పుష్కరాలపై సమీక్ష కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగు సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో ఽబుధవారం హైదరాబాద్ దేవాదాయశాఖ కార్యాలయంలో ఆశా ఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌తో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళేశ్వరం దేవస్థానం అధికారులు, అర్చకులతో పాటు జిల్లాస్థాయి అధికారులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. రెండు రోజుల కిందట 12న బుధవారం కాళేశ్వరంలో సమీక్ష జరుగునుందని అధికారుల ద్వారా తెలిసింది. రూ.25కోట్ల నిధులు రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసి పరిపాలన అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. పనులు కొన్ని ప్రారంభం కాగా, పనుల పురోగతిపై సమీక్షలో చర్చించనున్నారు. కనులవిందుగా కల్యాణ మహోత్సవం కాటారం: మండలంలోని ఒడిపిలవంచలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శ్రీ భూనీళ సహిత వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కనులవిందుగా సాగింది. పురోహితులు మాడుగుల నాగరాజుశర్మ స్వామి వారి కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛరణల నడుమ వైభవోపేతంగా నిర్వహించారు. గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు కల్యాణ తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు కల్యాణాన్ని వీక్షించి తరించారు. ఈ కార్యక్రమంలో నరివెద్ది సత్యనారాయణ, రఘువరణ్, గ్రామస్తులు పాల్గొన్నారు. గంజాయి పట్టివేత కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ సమీపంలోగంజాయితో తిరుగుతున్న మండలకేంద్రానికి చెందిన షేక్ లుక్మాన్ను పోలీసులు పట్టుకొని రిమాండుకు తరలించారు. మహదేవపూర్ ఎస్సై పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం పోలీసులు డిగ్రీకాలేజీ సమీపంలో పెట్రోలింగ్ చేస్తుండగా లుక్మాన్ నంబర్ ప్లేటు లేని నల్లని స్పెండర్ బైక్‌పై వస్తుండగా అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో బైక్ ట్యాంక్ కవర్లో నల్లని సంచిలో ఎండిన గంజాయి లభించింది. గంజాయి 625గ్రాములు వరకు ఉంటుంది. బైక్, గంజాయిని స్వాదీనం చేసుకొని అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు బానిస కావొద్దన్నారు. మంచిగా చదువుకోవాలని చెప్పారు. చెడు వ్యసనాలు, మత్తుకు అలవాటుపడితే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
రాజశేఖర్‌రెడ్డికి 8వ ర్యాంక్
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. చిమ్ముల అరుణ– మల్లారెడ్డి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. కుమారుడు చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాఽధించి రాష్ట్ర 8వ ర్యాంక్ సాధించాడు. గతంలో రాజశేఖర్‌రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి పదవులకు కూడా ఎంపికయ్యాడు. ఉన్నతమైన లక్ష్యంతో కష్టపడి చదివి రాష్ట్ర ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సమర్థవంతంగా పనిచేయండి
భూపాలపల్లి: పోలీస్ వ్యవస్థను ప్రజలు గౌరవించేలా సేవలు అందించేందుకు సమర్థవంతంగా పనిచేయడానికి కృషిచేయాలని ఎస్పీ కిరణ్‌ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 22మంది ఫిర్యాదుదారుల పిటిషన్లను ఎస్పీ స్వీకరించి ఆయా పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సామాన్య ప్రజలకు పోలీసులు అండగా ఉండాలన్నారు. స్నేహభావంతో మెలుగుతూ వారి ఫిర్యాదులను స్వీకరించి సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, సంఘవ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు తెలపాలని ఆయన పేర్కొన్నారు.ఎస్పీ కిరణ్‌ఖరే -
50 నిమిషాల్లోనే..
తూతూమంత్రంగా ప్రజావాణి● 19 దరఖాస్తుల స్వీకరణ ● గ్రీవెన్స్ అనంతరం మరో 26..భూపాలపల్లి అర్బన్: సుమారు రెండు నెలల అనంతరం సోమవారం జరిగిన ప్రజావాణిని అధికారులు కేవలం 50 నిమిషాల్లోపే పూర్తిచేశారు. బాధితులు తమ సమస్యలను విన్నవించేందుకు పది గంటలకే కలెక్టరేట్‌కు రాగా అధికారులు మాత్రం నెమ్మదిగా చేరుకున్నారు. 10:30గంటల వరకు నలుగురు అధికారులు మాత్రమే వచ్చారు. 11 గంటల వరకు అధికారులందరూ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటల నుంచి 11:50 గంటల వరకు ఫిర్యాదులను అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ స్వీకరించారు. అనంతరం ప్రజావాణి ముగించగా జిల్లా అధికారులు వారివారి కార్యాలయాలకు తిరిగి వెళ్లారు. అనంతరం కూడా మరో 25 మంది దరఖాస్తులు రాగా కొన్ని అదనపు కలెక్టర్ స్వీకరించారు. మరికొందరు ఇన్వార్డ్లో ఫిర్యాదులను అందజేశారు.ఫిర్యాదుదారుడితో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ కల్యాణలక్ష్మి రావడం లేదు.. మా అత్తమామలు చంద్రగిరి లక్ష్మి–మల్లయ్య గతేడాది కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి డబ్బులు రావడం లేదు. ఇప్పటికి మూడు సార్లు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో దరకాస్తు పెట్టినం. అయినప్పటికీ డబ్బులు రావడం లేదు. – బీరెల్లి మణికుమార్, వజినపల్లి, మహాముత్తారం సర్వే చేశారు.. బోర్లు వేయడం లేదు.. పోలారం గ్రామశివారులో దళిత కుటుంబాలకు చెందిన 20మంది రైతులం దాదాపు 50 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాం. ఈ భూమిలో పీఎం అజయ్ పథకం ద్వారా 10 బోర్లు వేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాం. ఎస్పీ కార్పొరేషన్, భూగర్భ జలశాఖ వారు సర్వే చేశారు. కానీ బోర్లు మాత్రం వేయడం లేదు. అధికారులు కలెక్టర్ స్పందించి బోర్లు వేయించాలి. – సల్లూరి శంకర్, పోలారం, మహాముత్తారం ట్రాక్టర్ ఉందని.. ఇల్లు రాదన్నారు.. గతేడాది ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. గతంలో అధికారులు సర్వే చేస్తున్న సమయంలో నాకు ట్రాక్టర్ లేకున్నా.. ఉన్నట్లు నమోదు చేసుకున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు వచ్చిన అధికారులు ట్రాక్టర్ ఉంది కాబట్టి ఇళ్లు రాదన్నారు. – ఆకుదారి నరేందర్, భూపాలపల్లి ఆస్తులున్నాయని పింఛన్ ఇయ్యట్లే.. 2021 సంవత్సరంలో వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. పింఛన్ మంజూరైందని ఏడాది తర్వాత గ్రామకార్యదర్శి ఫోన్‌చేసి చెప్పాడు. ఆ తర్వాత నెల పింఛన్ తీసుకునేందుకు వెళ్తే పేరును తొలగించారు. కారణం అడిగితే నీకు ఆస్తులు ఉన్నాయని అందుకే తొలగించామని చెప్పారు. నాకు ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు. – సుద్దాల సదవలి, మహబూబ్‌పల్లి, మహాముత్తారం● -
లీకేజీ సమస్యకు పరిష్కారం
పలిమెల: సర్వాయిపేటలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘తాగునీటి తండ్లాట’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు గ్రామంలో పగిలిన పైప్‌లైన్ వద్ద మరమ్మతులు చేపట్టారు. నీటి పంపిణీని పునరుద్ధరించినట్లు మిషన్ భగీరథ ఏఈ సాయిరాం తెలిపారు. ఇంటి చుట్టూ ఉచ్చుతీగలు కాటారం: మండలంలోని గూడూరులో ఓ ఇంటి చుట్ట్టూ వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఉచ్చు తీగలను పలువురు గుర్తు తెలియని దుండగులు అమర్చిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సదాశివ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి రాత్రి వచ్చి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసే సరికి ఇంటి ముందు ఉచ్చు తీగ అమర్చి సమీపంలోని విద్యుత్ స్తంభానికి తీగలను తగిలించి ఉంది. ఆ స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై–2 శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎవరైనా హత్యాయత్నానికి ప్రయత్నించారా, లేక గ్రామ శివారులో ఉండటంతో వన్యప్రాణుల వేట కోసం ఉచ్చుతీగ బిగించి ఉంటారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. విద్యుత్ అధికారుల పొలంబాట రేగొండ: విద్యుత్ అధికారులు రైతులకు సహాయకారులుగా ఉండాలని ఎస్ఈ మల్సూర్ నాయక్ అన్నారు. మండలంలోని రామన్నగూడెం తండాలో సోమవారం నిర్వహించిన పొలంబాట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ట్రాన్స్‌ఫార్మర్‌పైన ఉన్న లూస్ లైన్లను సరి చేసి పోల్‌కు పోల్ తగలకుండా స్పేసర్స్ బిగించుట వలన ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రైతులు తడి చేతులతో స్టార్టర్ బాక్స్‌లు ముట్టుకోవద్దని సూచించారు. ఐరన్ స్టార్టర్ బాక్స్‌లకు బదులుగా ప్లాస్టిక్ స్టార్టర్స్‌ను వినియోగించాలన్నారు. విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేయవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ నాగరాజు, ఏఈ రాజు, ఏఎల్ఎమ్ రాహుల్, విజయ్‌కుమార్, రైతులు దేవేందర్, శ్యామరావు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రామప్ప ఒగరుకాల్వకు బుంగ వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప సరస్సు ప్రధాన కాల్వ ఒగరుకాల్వకు అదివారం రాత్రి బుంగపడింది. ప్రధాన తూము సమీపంలోనే బుంగపడి పక్కనే ఉన్న పంటపొలాల్లోకి నీరంతా చేరడంతో కొంతమేర మునిగిపోయాయి. సమాచారం తెలుసుకున్న నీటి పారుదల శాఖ ఈఈ నారాయణ, డీఈ రవీందర్‌రెడ్డి, ఏఈ జయంతిలు బుంగ పడిన ప్రదేశాన్ని సోమవారం పరిశీలించారు. ఈ క్రమంలో ఒగరుకాల్వకు నీటి సరఫరాను నిలిపివేశారు. తొందరలోనే బుంగ పడిన ప్రదేశానికి మరమ్మతులు చేపట్టి కాల్వ ద్వారా ఆయకట్టు పంట పొలా లకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. -
ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు
భూపాలపల్లి అర్బన్: 2020 సంవత్సరానికి ముందు ఏర్పాటుచేసి నాన్లేఅవుట్కు దరఖాస్తు చేసుకొని ఉన్న ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ రేగళ్ల రాము తెలిపారు. ఎల్ఆర్ఎస్పై సోమవారం ఎస్ఆర్ఓ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్ రాము టౌన్‌ప్లానింగ్ అధికారి సునిల్‌తో కలిసి రియల్టర్లు, ఏజెంట్లు, దస్తావేజుల లేఖరులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2020 సంవత్సరంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 31వ తేదీ వరకు రూ.25శాతం ఫీజు రాయితీ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేయనివారు సేల్ డీడీ సమయంలో ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ చార్జీలు ఎస్ఆర్ఓ కార్యాలయంలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
రాష్ట్రస్థాయికి జంతుశాస్త్ర పరిశోధన ప్రాజెక్ట్ ఎంపిక
ములుగు: ఇంపాక్ట్ ఆఫ్ సాయిల్ ఆర్థోపోర్డ్స్ ఇన్ చిల్లీ క్రాప్ ఇన్ జాకారం విలేజ్ ఆఫ్ ములుగు డిస్ట్రిక్ అంశంపై చేసిన పరిశోధన రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా ఖైరతాబాద్‌లో ప్రదర్శించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం తెలిపారు. జిజ్ఞాస స్టూడెంట్ స్టడీస్ ప్రాజెక్టు పోటీలలో జంతుశాస్త్ర విద్యార్థుల ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పరిశోధక విద్యార్థులు పాలెం పునీత, పల్లెపు శృతి, బైరి కావ్య, సయ్యదబీబీ, రబియాలను ప్రిన్సిపాల్ అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలయ్య, అకాడమీ కో ఆర్డినేటర్ భాస్కర్, న్యాక్ కో ఆర్డినేటర్ కవిత, అధ్యాపకురాలు సరిత, నాగమణి, శిరీష, రాధిక పాల్గొన్నారు. -
ఓసీలో బ్లాస్టింగ్లతో ఇళ్లు ధ్వంసం
గణపురం: మండలంలోని ఓసీ–3 ప్రాజెక్టులో నిత్యం పేలుస్తున్న బాంబులతో తమ ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు తీవ్రంగా దుమ్ము ధూళి బయటకు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నామని పరుశరాంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓసీ–3 ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం నుంచే ఆందోళనకు దిగారు. ఓసీ–3 ఓపెన్ కాస్టు గనిలో రోజు బొగ్గు తవ్వకాలకు ఉపయోగిస్తున్న భారీ బాంబులతో తమ ఇండ్లు పగుళ్లు పట్టడంతో పాటు గని నుంచి పెద్దఎత్తున దుమ్ము ఇండ్లలోకి చేరుకుంటుందని ఆరోపించారు. సింగరేణి అధికారులు వెంటనే తమ గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తుల ఆందోళనతో పెద్దఎత్తున గనిలోకి వెళ్లి వచ్చే బొగ్గు లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు, పోలీసులు ఆందోళన వద్దకు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ తమకు ఖచ్చితమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించమని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వద్దకు వచ్చి తమకు లిఖిత పూర్వకంగా రాసిస్తే సీఎండీ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఆందోళనకు దిగిన సమీప గ్రామాల ప్రజలు సీఎండీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని జీఎం హామీ -
భూ సేకరణపై గ్రామసభ
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గారెపల్లిలో నిర్మించనున్న పైప్‌లైన్ కోసం భూ సేకరణపై సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం గారెపల్లిలో సేకరించనున్న 4.38 గుంటల భూమికి సంబంధించిన రైతుల వివరాలు గ్రామసభలో చదివి వినిపించారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఎక్కువ భూమి కోల్పోతున్నప్పటికీ అధికారులు రికార్డుల్లో తక్కువ భూమి నమోదు చేశారని కాటారం సబ్ కలెక్టర్, భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మయాంక్‌సింగ్ దృష్టికి నిర్వాసిత రైతులు తీసుకొచ్చారు. గతంలో నిర్ణయించిన భూమి కంటే ఎక్కువగా ఎందుకు సేకరించాల్సి వస్తుందని, గతంలో భూమి కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని అధికారులను నిలదీశారు. గతంలో సర్వే చేసిన దానికంటే రీఅలైన్మెంట్ ఎక్కువ ఎందుకు చేయాల్సి వస్తుందని ప్రశ్నించారు. నష్టపరిహారంతో పాటు ఉపాధి కల్పించాలని రైతులు కోరారు. నిర్వాసిత రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని సబ్ కలెక్టర్ రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ వెంకన్న, భూ సేకరణ విభాగం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
బ్యాటరీ సైకిల్ కావాలి.. ఈ ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు పూల్యాల చంద్రలింగం. మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామం. షుగర్ వ్యాధితో మూడేళ్ల క్రితం ఎడమ కాలును తొలగించారు. అతనికి సదరం సర్టిఫికెట్ వచ్చినప్పటికీ దివ్యాంగుల పింఛన్ రాకుండా రూ.2వేల వృద్ధాప్య పింఛన్ మాత్రమే వస్తుంది. తనకు బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాటరీ సైకిల్ ఇస్తే కూరగాయల వ్యాపారం చేసుకుంటానని వేడుకున్నాడు. పని చేయకపోవడంతో భర్యాభర్తలం బతకడం ఇబ్బందికరంగా మారిందని అధికారులకు మొరపెట్టుకున్నాడు. -
సైక్లింగ్ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
ములుగు: ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సైక్లింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. కోచ్ శ్రీరాంనాయక్ ఆధ్వర్యంలో 24మంది పోటీలలో పాల్గొనగా అండర్–14 విభాగంలో క్రీడాకరులు ఐశు సిల్వర్, బ్రాంజ్, దివ్య బ్రాంజ్, నవీన్ సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. అండర్–16 విభాగంలో సాయి చరణ్ గోల్డ్, వర్షిణి రెండు సిల్వర్ మెడల్స్, అండర్–18 విభాగంలో కుశ్వంత్ రెండు గోల్డ్ మెడల్స్, చక్రవర్తి రెండు గోల్డ్ మెడల్స్ సాధించగా జిల్లాకు మొత్తంగా 12 మెడల్స్ వచ్చాయి. ఈ మేరకు సోమవారం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, డీవైఎస్ఓ తుల రవీందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి ఎలగందుల మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురవెళ్లి హరినాథ్‌లు క్రీడాకారులతో పాటు కోచ్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాకు మంచి పేరు తీసుకరావడం శుభపరిణామం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం క్రీడాకారులకు సైకిళ్లను అందిస్తానని వివరించారు. -
‘గ్రావెల్’ మాఫియా
హనుమకొండ జిల్లా దామెర మండలంలో యంత్రాలతో యఽథేచ్ఛగా మొరం తవ్వకాలు, తరలింపుసాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారులు, రాజకీయ నాయకుల అండదండతో అనుమతుల పేరిట సహజ వనరుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు అక్రమార్కులు. అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలతో గుట్టలు, ప్రభుత్వ భూముల్లో మొరం(గ్రావెల్) తవ్వేస్తూ కాసులవేట సాగిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టూ ఉన్న దామెర, హసన్‌పర్తి, గీసుకొండ, శాయంపేట, ధర్మసాగర్ తదితర మండలాల్లో గ్రావెల్ మాఫియాకు అడ్డు లేకుండా పోయింది. కొందరు మొరం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి టెంపరరీ పర్మిట్ల(టీపీ)తో పట్టా భూములు, గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వేస్తున్నారు. చాలాచోట్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వ గట్లను తవ్వుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దోపిడీ సాగుతోందిలా.. గ్రావెల్ మాఫియా టీఎస్ఎంఎంసీ రూల్స్ 1966–9(4) ప్రకారం పట్టాభూములు, రైతుల పేరిట రెండు నెలల గడువుతో తాత్కాలిక అనుమతులు పొందుతూ ఇష్టారాజ్యంగా మొరం దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన భూమిలో ఏరియాను బట్టి 8–12 అడుగులలోపు లోతు మాత్రమే తవ్వాల్సి ఉంది. అలా చేస్తే రెండున్నర హెక్టార్లలో సుమారు 7–8 వేల మెట్రిక్ టన్నుల గ్రావెల్ మాత్రమే వస్తుందని మైనింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గ్రావెల్ మాఫియా అందుకు భిన్నంగా 15–30 అడుగుల లోతు వరకు తవ్వి లారీలు, టిప్పర్ల ద్వారా పెద్ద మొత్తంలో మొరం తరలిస్తున్నారు. ఇందుకు సుమారు రెండున్నర హెక్టార్ల కోసం రూ.1.50 లక్షల వరకు రాయల్టీ చెల్లిస్తూ.. రూ.కోట్లల్లో సంపాదిస్తున్నారు. కళ్లెదుటే ఈ అక్రమం జరుగుతున్నా.. ఏ శాఖ కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంచికి చేరిన కోమటిపల్లి గుట్ట దందా.. హసన్‌పర్తి మండలం భీమారం శివారు 340 సర్వే నంబర్లో సుమారు 57 ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్డేడియం ఏర్పాటుకు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా.. ఓవైపు కళాశాలలకు కేటాయించిన సర్కార్ మరోవైపు 340/1 సర్వే నంబర్ పేరిట రెండున్నర హెక్టార్ల(3.260) భూమిని కె.నవీన్‌రావు పేరిట క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి 5 సంవత్సరాల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్‌అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. క్యూబిక్ మీటర్‌కు రూ.30ల చొప్పున 29,90,900 క్యూబిక్ మీటర్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుని గుట్టంతా ఖాళీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రూ.లక్షల ప్రజాధనం పక్కదారి పట్టినా.. ఈ దందాలో తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్టనర్‌గా ఉండటం వల్ల అప్పట్లో పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మొరం తరలింపులో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా అనుమతులు తీసుకొని మాత్రమే మొరం తవ్వకాలు చేపట్టాలి. – జ్యోతివరలక్ష్మీదేవి, తహసీల్దార్, దామెర అంతా అనధికారమే! కొంత అనుమతి తీసుకుని గుట్టలను కరిగించడమే కాదు.. అసలు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టడం ఉమ్మడి వరంగల్‌లో పరిపాటిగా మారింది. వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొరం, మట్టి దందా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ తవ్వకాల గురించి సమాచారం తెలిసినా అధికారులు ‘మాములు’గా తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం జంగిలిగొండలోని ప్రభుత్వ భూమిలో గతంలో తవ్వకాలు జరుగుతుండగా అధికారులు అడ్డుకుని హద్దులు ఏర్పాటు చేసినా ఆగడం లేదు. ములుగు జిల్లా ములుగు పంచాయతీ శివారు 837 సర్వే నంబర్లోని సుమారు 200 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించగా.. అక్రమార్కులు మట్టి తవ్వకాలు ఆపడం లేదు. వరంగల్ నగరానికి సమీపాన ఉన్న ప్రాంతాల్లో వందలాది ట్రాక్టర్ల ద్వారా మొరం తరలిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1500 నుంచి రూ.2500 చొప్పున సుమారు 500 ట్రిప్పుల మొరానికి రూ.7.50 లక్షల నుంచి రూ.12.50 లక్షలు ఆర్జిస్తున్నారు. జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ ఎన్నె చెరువు పక్కన 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను రాత్రి పూట పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తవ్వి మట్టిని తరలించారు. చంపక్‌హిల్స్ గుట్టల్లోనూ మట్టిని తోడేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకులు, వంచనగిరి ప్రాంతంలోని ఎస్సారెస్పీ కాల్వ పక్కన, కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు వాటికి ఇరువైపులా బ్యాంకింగ్ పేరుతో పోసిన కట్టల మొరాన్ని తరలించి సొమ్ము చేసుకున్నారు. యథేచ్ఛగా మొరం తవ్వకాలు అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట కాల్వగట్లు, గుట్టలనూ వదలని అక్రమార్కులు ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు -
ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాలు..
● కాటారం మండలం ధన్వాడ సమీపంలోని మీనాక్షి జిన్నింగ్ మిల్లులో నిప్పుంటుకొని సుమారు రూ.కోటి విలువ చేసే పత్తి దగ్ధమైంది. ● గుమ్మాళ్లపల్లిలో వంట గ్యాస్ పేలి ఇల్లు దగ్ధమైంది. సుమారు రూ.6 లక్షల మేర నష్టం జరిగింది. ● కాటారం మండలం చల్లపల్లి సమీపంలోని రుద్ర జిన్నింగ్ మిల్లులో పత్తికి నిప్పుంటుకొని సుమారు రూ.15 లక్షల మేర నష్టం చోటుచేసుకుంది. ● మల్హర్ మండలం నాచారంలో జామాయిల్ తోటకు నిప్పు అంటుకోవడంతో దగ్ధమైంది. ● భూపాలపల్లి మండలం దూదేకులపల్లిలో రైతు పొలంలో ఆరబోసిన మిర్చికి నిప్పు అంటుకుని సుమారు రూ.3.50 లక్షల మేర నష్టం జరిగింది. ● చిట్యాల మండలం గిద్దెముత్తారంలో అయిల్‌పాం తోటకు నిప్పుంటుకొని కాలిపోయింది.కాటారం: అసలే అటవీ గ్రామాలతో కూడిన జిల్లా.. నిత్యం ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదం.. లక్షలాది రూపాయల ఆస్తినష్టం.. జిల్లావ్యాప్తంగా ఒకే ఒక్క ఫైర్‌స్టేషన్ ఉండటంతో అగ్నిమాపక సేవలు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు జిల్లాకేంద్రం నుంచి ఫైర్ ఇంజన్ చేరుకునే లోపు ఆస్తులన్నీ బుగ్గిపాలవుతున్నాయి. జిల్లా ఏర్పడి ఏళ్లు దాటుతున్నా మరో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు అడుగులు ముందుకు పడటం లేదు. ఇటీవల కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహదేవపూర్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినప్పటికీ ఇంకా అటు ఆ దిశగా చర్యలు ప్రారంభం కాలేదు. ప్రతి ఏటా అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఒకేకేంద్రం నుంచి అగ్నిమాపక సేవలు సకాలంలో అందక బాధితులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వేసవికాలం సమీపిస్తుండటంతో అగ్నిప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చిన్న గది.. అరకొరగా సిబ్బంది.. జిల్లాకేంద్రంలో ఉన్న ఫైర్‌స్టేషన్‌కు సొంత భవనం లేక మున్సిపల్ కార్యాలయంలోని ఓ చిన్న భవనంలో కొనసాగుతుంది. జిల్లా అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత సైతం నెలకొంది. అరకొర సిబ్బందితో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందిపైనే పనిభారం అధికమవుతుంది. జిల్లా అగ్నిమాపక శాఖలో అధికారులు, సిబ్బంది కలిసి సుమారు 16మంది వరకు ఉండాల్సి ఉండగా 12మంది మాత్రమే కొనసాగుతున్నారు. డ్రైవర్ ఆపరేటర్లు ముగ్గురు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే పర్మనెంట్‌గా ఉన్నారు. ఫైర్మన్లు పదిమంది ఉండాల్సి ఉండగా ఆరుగురు విధులు నిర్వర్తిసున్నారు.ఒక్కటే కేంద్రం.. జిల్లావ్యాప్తంగా ఒకే ఒక్క ఫైర్‌స్టేషన్, ఒక ఫైరింజన్ మాత్రమే ఉండటం జిల్లావాసులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది. జిల్లా పరిధిలో 12మండలాలు ఉండగా 241 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మంథని నియోజకవర్గం పరిధిలోని కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం, పలిమెల మండలాలు, భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి, రేగొండ, కొత్తపల్లిగోరి, గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలు జిల్లాలో ఉన్నాయి. ప్రతి మండలం జిల్లా నుంచి 50–70 కిలో మీటర్ల వ్యవధి దూరంలో ఉన్నాయి. ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగిన జిల్లాకేంద్రంలోని ఫైర్స్టేషన్లో ఉన్న ఒక్క ఫైరింజన్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అక్కడి వరకు ఫైరింజన్ సకాలంలో చేరుకోలేకపోతుంది. దీంతో అప్పటికే ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. 30కిలోమీటర్లకు ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలనే నిబంధనలు ఉన్నా జిల్లాకేంద్రంలో తప్ప మరెక్కడా అగ్నిమాపక కేంద్రం లేకపోవడం అగ్నిప్రమాదాలు చోటు చేసుకొన్నప్పుడు ప్రజలకు మరింత నష్టం చేకూరుస్తుంది.సమయానికి స్పందిస్తున్నాం.. జిల్లాలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు సమాచారం అందిన వెంటనే సమయానికి స్పందిస్తున్నాం. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తగు సూచనలు చేస్తున్నాం. ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు 87126 99209 నెంబర్‌కు సమాచారం అందించండి. – అడువాల శ్రీనివాస్, ఫైర్ ఆఫీసర్, భూపాలపల్లి -
ముడుపులు చెల్లిస్తేనే..!
భూపాలపల్లి అర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఓ అధికారి ఉద్యోగుల నుంచి ప్రతి నెల అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు జిల్లావ్యాప్తంగా బహిరంగంగానే చర్చ జరుగుతోంది. కార్యాలయంలో పైసలు తడపనిదే ఫైళ్లు కదలడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నమ్మకం ఉన్న ఉద్యోగుల నుంచి తానే డబ్బులు తీసుకోవడంతో పాటు కొంతమంది నుంచి తనకు దగ్గరి మిత్రులకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్, నగదు చెల్లింపులు జరిగేలా చూసుకుంటున్నాడు. కొర్రీలతో ఇబ్బందులు.. జిల్లా సమగ్ర శిక్ష అభియాన్‌లో కేజీబీవీ బిల్లులు, సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాలు, పాఠశాల అభివృద్ధి పనుల బిల్లులు, ఇతర అలవెన్స్‌లకు సంబంధించిన ఫైలు మొత్తం సంబంధిత అధికారి వద్దకు వెళ్తున్నాయి. సంబంధిత అధికారి ఆమోదం పొందిన తరువాత డబ్బుల మంజూరు నిమిత్తం రాష్ట్ర ఫైనాన్స్ అధికారి వద్దకు వెళ్తుంది. అక్కడి నుంచి బిల్లు పాసవుతుంది. అన్ని రకాల బిల్లులు, ఇతర పత్రాలు జతపరిచినప్పటికీ ఇంకా కొన్ని తక్కువగా ఉన్నాయని ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం. జిల్లాలో ముడుపులు చెల్లించని ఫైళ్లను రాష్ట్ర ఫైనాన్స్ అధికారి కార్యాలయంలో మాట్లాడి బిల్లులు ఆపిస్తున్నట్లు సమాచారం. కొంతమందికి రావాల్సిన అలవెన్స్‌లను మూడు నాలుగు నెలలు పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. సాయంత్రం 5 తర్వాతే పనులు జిల్లాకు ఇన్చార్జ్ అఽధికారిగా పనిచేస్తున్న సదరు అధికారి వరంగల్‌లో భూపాలపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కార్యాలయానికి వారానికి రెండు రోజులు మాత్రమే హాజరవుతున్నారు. జిల్లాలో కేజీబీవీల నుంచి ఎస్ఓ, అకౌంటెంట్‌లో ఇతర అధికారులు సంబంధిత బిల్లులు అందించేందుకు డీఈఓ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. సదరు అధికారి వచ్చిన రోజు మాత్రమే బిల్లులు తీసుకురావాల్సి ఉంటుంది. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, ఇతర అధికారులు ఇంటికి వెళ్లిన తరువాతే తన పనులను ప్రారంభిస్తాడు. సాయంత్రం 4, 5 గంటల తరువాత కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. రాత్రి 8 నుంచి 9గంటల వరకు ఉద్యోగినులు సైతం పనుల కోసం వేచిఉంటున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏసీబీ అధికారుల నిఘా.. సంబంధిత అధికారి మామూళ్ల వేధింపులను తట్టుకోలేక పలువురు బాధితులు నెల రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డీఈఓ కార్యాలయంలో అధికారులపై ఏసీబీ నిఘా పెట్టినట్లు తెలిసింది. ముందస్తు సమాచారం తెలుసుకున్న అధికారి తృటిలో తప్పించుకున్నట్లు బాధితులు తెలిపారు. లంచం ఇవ్వొద్దు.. డీఈఓ కార్యాలయంలో బిల్లులు, ఇతర పనుల నిమి త్తం ఎవరికి కూడా లంచం ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే సమాచారం ఇవ్వా లి. కార్యాలయ అధికారులు, సిబ్బందిని ఇప్పటికే పలుమారు ఆదేశించాం. సరైన పత్రాలు అందించి అధికారులకు సహకరించాలి. మామూళ్లు వసూలు చేస్తే సహించేంది లేదు. – రాజేందర్, ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారిడీఈఓ కార్యాలయంలో ఓ అధికారి వసూళ్ల పర్వం కేజీబీవీల నుంచి నెలవారీ మామూళ్లు.. ఇబ్బంది పడుతున్న ఉద్యోగులుబిల్లులను బట్టి పర్సంటేజీ.. ఉద్యోగుల బిల్లుల చెల్లింపు కోసం సంబంధిత అధికారికి ప్రతి నెలా మామూళ్లు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులను బట్టి పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పాఠశాలల అభివృద్ధి సివిల్ పనులకు సంబంఽధించిన బిల్లుల చెల్లింపులకు ఇటీవల డబ్బులు డిమాండ్ చేయడంతో పలువురు కాంట్రాక్టర్లు, నాయకులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
పట్టుదలతో ఏదైనా సాధ్యమే
● అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల భూపాలపల్లి అర్బన్: మహిళలు ఇంట్లో అందరికీ అన్ని పనులు చేస్తున్నారని.. తన కోసం పట్టుదలతో చేస్తే ఏదైనా సాధ్యమేనని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో శనివారం ఏరియాలోని ఇల్లంద్క్లబ్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కూర్కోకుండా ఏదో ఒకటి సాధించే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రయత్న లోపం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేస్తే అదే వారిని వారి లక్ష్యం వైపు నడిపిస్తుందని తెలిపారు. సాధించిన విజయంలో తల్లిదండ్రులు లేదా భర్త ప్రోత్సాహం ఉంటుందన్నారు. సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో అండర్ గ్రౌండ్లో పనిచేయాలని మహిళా ఉద్యోగులు సంస్థలో చేరుతున్నారని వారిని అభినందించారు. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు మరింత ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్‌రెడ్డి, ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, సీఎంఓఏఐ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్, శేషరత్నం, అధికారులు మారుతి, క్రాంతికుమార్, శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్, సేవా సభ్యులు పాల్గొన్నారు. -
1052 కేసులు పరిష్కారం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1052 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నారాయణబాబు మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకోవడం వలన కేసుల్లో ఇరుక్కొని నష్టాల పాలవుతారని అన్నారు. ప్రజలు ద్వేష భావాలను తగ్గించుకొని రాజీమార్గాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. రాజీమార్గమే రాజా మార్గం అని మనసులో నాటుకోవాలన్నారు. దాంతో విలువైన సమయం, డబ్బు దుర్వినియోగం కాదని తెలి పారు. చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకొని పంతాలకు పోయి కేసుల్లో ఇరికితే పొలీస్ స్టేషన్లు, కోర్టులకు ఎక్కితే నష్టమన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ జడ్జిలు జయరాంరెడ్డి, రామచంద్రరావు, అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌కుమార్, ఉపాధ్యక్షుడు విడ్ణువర్దన్రావు, ప్రధాన కార్యదర్శి బల్ల మహేందర్, న్యాయవాదులు పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూం కాలనీని పరిశీలించిన కమిషనర్ భూపాలపల్లి అర్బన్: వేశాలపల్లి సమీపంలోని డబుల్బెడ్రూం కాలనీని శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ప్రతి రోజు శానిటేషన్ పనులు చేయిస్తానని, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తిచేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ మానస, సానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు. మహదేవపూర్‌కు ఫైర్‌స్టేషన్ మంజూరు కాళేశ్వరం: జిల్లాలో మరో ఫైర్‌స్టేషన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాటారం సబ్ డివిజన్ పరిధిలో మరో ఫైర్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో మహదేవపూర్ మండలకేంద్రంలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఫైర్‌స్టేషన్ ఏర్పాటుతో 18మంది సిబ్బందిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఫైర్‌స్టేషన్ ప్రారంభం ఎప్పుడు జరుగుతుందో అని వేచిచూడాలి. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలి భూపాలపల్లి అర్బన్: ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు ఈ నెల 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి రూ.25శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2020 సంవత్సరంలో ఖాళీస్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారు ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దీంతో భవన నిర్మాణ అనుమతులు సులభంగా వస్తాయన్నారు. సూచనలు, సలహాల కోసం 94935 52349 ఫోన్‌నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. స్థల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాలు, 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా టూరిజంశాఖ ఆధ్వర్యంలో టెంట్‌సిటీ నిర్మాణం కోసం తాత్కాలికంగా ఆరు ఎకరాల గుడిమాన్యం స్థలాన్ని అధికారులు శనివారం పరిశీలించారు. ఆ స్థలంలో మిర్చిపంట ఉండడంతో వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టం అంచనా వేశారు. టెంట్‌సిటీకి స్థలాన్ని కేటాయించగా.. త్వరలో టెంట్‌సిటీ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందులో 30కిపైగా ఏసీ, నాన్ఏసీ గదుల మాదిరి టెంట్‌సిటీ నిర్మాణం చేపట్టనున్నారు. వారివెంట ఈఓ మహేష్, సూపరింటెంటెండ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, నాగరాజు ఉన్నారు. -
కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..
ప్రమాద సమయంలో భార్యతో ప్రవీణ్‌కుమార్ ఆఖరి మాటలు.. హనుమకొండ, రాంనగర్వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. – పర్వతగిరి/సంగెం/నెల్లికుదురు● ఎస్సారెస్పీ కెనాల్లో పడిన కారు.. తండ్రి, ఇద్దరు పిల్లల మృతి ● స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడిన తల్లి ● వరుసగా సెలవులు రావడంతో స్వగ్రామానికి కారులో వెళ్తున్న కుటుంబం ● గుండెనొప్పి రావడంతో కారు స్టీరింగ్ తిప్పలేని పరిస్థితి.. ● నేరుగా కాల్వలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం ● మేచరాజుపల్లిలో విషాదఛాయలు11.40 గంటలకు : వరుసగా సెలవులు రావడంతో హనుమకొండలోని రాంనగర్లో నివాసం ఉంటున్న సోమారపు ప్రవీణ్(28), భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి(5), కుమారుడు ఆర్యవర్ధన్(2)తో కలిసి హుందయ్ ఐక్రాస్ కారులో సొంత గ్రామమైన నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి బయలుదేరారు.12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటపల్లికి చెందిన నవీన్, సందీప్, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు. 1.10 గంటలకు : ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు. 4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్ సీట్లో ప్రవీణ్‌కుమార్, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు. వరంగల్ టు నెక్కొండ రోడ్డు ఎస్సారెస్పీ కాల్వపర్వతగిరి రోడ్డు12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్‌కుమార్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి అధికం కావడం.. స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది. ప్రమాదం జరిగిందిలా.. (ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు) -
నేడు నీటి సరఫరా నిలిపివేత
భూపాలపల్లి అర్బన్: మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతుల నేపథ్యంలో నేడు(శనివారం) మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పైపులైన్ మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వీఐపీ ఘాటు నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్ల యజమానులు ఇష్టారాజ్యంగా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణాపై మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాళేశ్వరం గోదావరి నుంచి రెండు ట్రాక్టర్లతో ఇసుకను రవాణా చేసిన ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచిన విషయం విదితమే. ఇసుక అక్రమ రవాణా విషయమై డిప్యూటీ తహసీల్దార్ కృష్ణను ఫోన్లో సంప్రదించగా అనుమతులు లేవని సీజ్ చేసి కేసు పెడుతామని హెచ్చరించారు. అర్చక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ఖాళీగా ఉన్న ఐదు అర్చక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసినట్లు ఈఓ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఇదే ఐదు అర్చక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, వయోపరిమితి విషయమై ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సదరు నోటిఫికేషన్ రద్దు చేస్తూ తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఈఓ తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 5గంటల లోపు కాళేశ్వరం దేవస్థానం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అవగాహన కల్పించాలి భూపాలపల్లి అర్బన్: జనరిక్ మందులు వాడటం వలన ప్రజలకు నష్టం ఉండదని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జన ఔషధ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని తన కార్యాలయంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. 50నుంచి 60శాతం తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు జనరిక్ షాపుల్లో మందులు కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని ఉమాదేవి, ఫార్మసిస్టులు, సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత చిట్యాల/రేగొండ: చిట్యాల, రేగొండ మండలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కన్నం కుమారస్వామి ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నట్లు సెకండ్ ఎస్సై ఈశ్వరయ్య తెలిపారు. కుమారస్వామిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రేగొండ మండలంలో.. రేగొండ మండలంలో అక్రమంగా 60 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ షాఖాన్ తెలిపారు. శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన పుట్ట జలంధర్, కొత్తపల్లిగోరి మండలం చిన్నకోడేపాక గ్రామానికి చెందిన కక్కెర్ల సదానందం, చిట్యాల మండలం జూకల్ గ్రామానికి మొలూగురి గణేష్ రెండు వాహనాలలో 65 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వేగవంతంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ
భూపాలపల్లి: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేసే అంశంపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్లో మున్సిపల్, పంచాయతీ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత ఇంటి స్థలాలు, లే అవుట్లు క్రమబద్ధీకరణకు జిల్లావ్యాప్తంగా 8,312 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుదారుడికి క్రమబద్ధీకరణ సమాచారం ఇవ్వాలని, సోమవారం మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో దరఖాస్తుదారులతో సమావేశం నిర్వహించి క్రమబద్ధీకరణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరులోగా ఫీజు చెల్లింపులో 25శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అన్ని మండలాల ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి.. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్లో మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించుట, వేసవిలో మొక్కల సంరక్షణ చర్యలు తదితర అంశాలపై మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి వ్యర్ధాల సేకరణ జరగాలని ఆదేశించారు. వ్యర్ధాలు ఆరుబయట వేస్తే జరిమానాలు విధించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చికెన్, చేపలు, మాంసం విక్రయించే వ్యాపారులు, నిత్యావసర సరుకులు విక్రయించే వ్యాపారులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు చేయొద్దని నోటీసులు జారీ చేయాలని సూచించారు. వేసవి నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అన్ని మండలాల ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
సవాళ్లను అధిగమిస్తేనే సాధికారత
భూపాలపల్లి: ఆధునిక సమాజంలో మహిళలు సాధికారత సాధించాలంటే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో రాణించిన మహిళా పోలీసులు, భరోసా, సఖి సిబ్బందిని ఎస్పీ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల్లో సంకల్ప శక్తి ఎక్కువగా ఉందని, వారు ఏదైనా సాధించగలరని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ సమాన హక్కులు ఉన్నాయని, మహిళా అధికారులందరూ తమ పూర్తి శక్తితో పని చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ విధులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్, రైటర్ వంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, డీపీఓ ఫర్హాన తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే -
వివక్ష తగ్గినా వేధింపులున్నాయి..
కుటుంబాన్ని నడిపిస్తున్న మహిళామణులు104133Aమహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. పనులు చేస్తున్న మహిళలకు కార్యాలయాల్లో వేధింపులు కొంతమేర కొనసాగుతు న్నా.. సెల్ఫోన్లలో కొందరు అసభ్యపదజాలంతో పంపిస్తున్న మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక సతమతమవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న వారిలో తెలిసిన వారితోపాటు తెలియని వారు ఉన్న ట్లు పలువురు మహిళలు చెబుతున్నారు. నాడు వంటింటికే పరిమితమైన మహిళ.. నేడు విద్య, ఉద్యోగం, నచ్చిన రంగంలో ఎదుగుతూ పురుషులతో సమానంగా పనిచేస్తోంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వేధింపులు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ 2) మీ కాలేజీ – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..? ఎ) లేదు బి) ఉంది సి) చెప్పలేను 73170C623) మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం? (ఎ) సెల్ఫోన్లో వచ్చే మెసేజ్‌లతో.. బి) బస్టాప్‌లో సి) కాలేజీ లేదా ఆఫీస్‌లో1) మీ ఇంట్లో ఆడ – మగ వివక్ష ఏమైనా ఉందా..? ఎ) ఉంది బి) లేదు సి) చెప్పలేను2001107837B4) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు? ఎ) తెలియని వారు బి) తెలిసిన వారేషాంపిల్స్: 310 (గ్రేటర్వరంగల్ 60మంది, మిగతా ఐదు జిల్లాలు (వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు 50మంది చొప్పున) అన్ని వర్గాల మహిళలను పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాల సేకరణ. వారి సంకల్పం గొప్పది. ఆశయం ఉన్నతమైనది. హేళనలు, అవమానాలేమీ వారు చేసే పనులకు అడ్డంకి కాలేదు. ప్రతికూల పరిస్థితులెదురైనా, పురుషాధిక్య రంగమైనా వారు పట్టు వీడలేదు. అన్ని రంగాల్లోనూ మాదే పై చేయి అంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నతనంలో వివాహమై భర్తను కోల్పోయిన ఒకరు కుటుంబానికి అండగా నిలబడితే.. మరొకరు పేదరికాన్ని పారదోలేందుకు నడుంకట్టారు. ఇంకొకరు విశ్వవేదికపైన జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంకల్ప శక్తులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హోటల్ నడుపుతూ.. పిల్లలను చదివిస్తూ.. చిట్యాల: మండల కేంద్రానికి చెందిన భీమారపు ఓదెలు హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. కట్టెల పొయ్యి కారణంగా అతడి చూపు దెబ్బతిన్నది. భార్య ప్రమీల 20 ఏళ్లుగా హోటల్ నడుపుతూ పిల్ల లను చదివిస్తోంది. గతేడాది పెద్దమ్మాయికి పెళ్లి చేసింది. మిగతా ఇద్దరు పీజీ, ఎంటెక్ చదువుతున్నారు. ఓదెలు కూరగాయలు కట్ చేసి వ్వడం, పిండి కలపడం వంటి పనుల్లో ఆమెకు సాయం చేస్తుంటాడు. తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.● విభిన్న రంగాల్లో రాణిస్తూ ఆదర్శం ● పురుషులకు దీటుగా బాధ్యతలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంసంగెం: వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించింది సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి. ఆమెకు ఆర్నెళ్ల వయసులోనే జ్వరం వచ్చింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. వైకల్యాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని.. నమ్మింది. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో కాంబోడియా దేశంలో ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీలకు మన దేశం తరఫున పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించింది. చీకట్లో ‘వెన్నెల’ సాక్షి, మహబూబాబాద్: దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల మల్లయ్య సుగుణమ్మల కుమార్తె వెన్నెల. పుట్టిన ఎనిమిదేళ్లకే తండ్రి మరణించాడు. ఆతర్వాత వెన్నెలను నర్సింహులపేట మండల కేంద్రంలోని అక్కా, బావ తీగల వెంకన్న, సుజాత చేరదీసి చదివించా రు. పదోతరగతి చదివిన వెన్నెలకు మహబూబా బాద్ మండలం పర్వతగిరికి చెందిన నారమళ్ల సంపత్తో వివాహం జరిపించారు. చిన్నతనంలో నే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. మిర్చి పంట కు తామర పురుగు సోకడంతో కుటుంబం అప్పు ల పాలయ్యింది. అప్పుల బాధతో భర్త సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 19 ఏళ్లకే వెన్నెల వితంతువుగా మారింది. ఆరేళ్ల సాన్విక, మూడేళ్ల తన్వికతో పాటు తల్లి సుగుణమ్మ, అత్త, మామ పోషణ ఆమైపె పడింది. మహబూ బా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. మూగజీవాల నేస్తం.. డాక్టర్ అనిత లింగాలఘణపురం: మండల కేంద్రంలో పశువైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆడెపు అనిత పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన అనిత 2019లో లింగాలఘణపురం పశువైద్యాధికారిగా విధుల్లో చేరారు. పశువైద్యశాల కు వచ్చే మూగ జీవాలకు వైద్యం చేస్తూనే.. వ్యవసాయబావులు దూరంగా ఉండి ఆస్పత్రికి రాలేని పశువుల వద్దకు స్వయంగా ద్విచక్రవాహనంపై వెళ్లి వైద్యం చేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణలో ప్రత్యేకత చాటుకున్నారు. 63 శాతం సక్సెస్ సాధించారు. పశువులు, గొర్రెలకు వ్యాక్సినేషన్‌ను నూటికి నూరు శాతం అమలు చేస్తూ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు నేస్తంగా మారిపోయారు. చేయి చేయి కలిపి.. పేదరికాన్ని తరిమి ఏటూరునాగారం: మండలంలోని శివాపురంలో ట్రైకార్ సాయంతో ఐటీడీఏ ద్వారా పది మంది మహిళలు సమ్మక్క–సారలమ్మ డిటర్జెంట్ సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ట్రైకార్ నుంచి 60 శాతం సబ్సిడీ, బ్యాంకు నుంచి 30 శాతం రుణం తీసుకుని పరిశ్రమ నడుపు తున్నారు. తయారు చేసిన సబ్బులకు ఒక్కోదానికి రూ.10గా ధర నిర్ణయించి గిరిజన సహకార సంఘానికి(జీసీసీ) విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు 4 వేల సబ్బులు తయారు చేస్తున్నారు. ఐదేళ్లుగా కోటిన్నర రూపాయల వ్యాపారం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సబ్బుల తయారీలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కట్టె కోత.. బాధ్యతల మోతకట్టెకోత మిల్లులో మగవారితో సమానంగా పని చేస్తోంది వరంగల్ నగరం నాగేంద్రనగర్‌కు చెందిన ఎండీ రజియా. భర్త అనారోగ్యం కారణంగా కుటుంబ భారం ఆమైపె పడింది. 15 ఏళ్లుగా నగరంలోని జగన్నాథం సామిల్లులో కట్టర్‌గా పనిచేస్తోంది. ముగ్గురు పిల్లల పెళ్లి చేయగా.. కూతురు కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె తల్లివద్దే ఉంటోంది. వీరందరికీ రజియా పని చేస్తేనే భోజనం. సొంతిల్లు ఉంటే కొంత భారం తగ్గుతుందని రజియా అంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ సమాచార వారధిగా పత్రికల సేవలు భేష్‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం వరంగల్ లీగల్ : ప్రజలకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సమాచార వారధిగా వార్తా పత్రిక లు నిలవాలని సాక్షి గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయానికి శుక్రవారం ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వచ్చారు. ముందుగా జడ్జికి సాక్షి ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు వర్ధెల్లి లింగయ్య, గడ్డం రాజిరెడ్డి, లీగల్ రిపోర్టర్ జీవన్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మొదట ఎడిటోరియల్ విభాగానికి చేరుకున్నారు. ఫీల్డ్ నుంచి రిపోర్టర్లు పంపిన కాపీలు డెస్క్‌కు ఎలా చేరుతాయో పరిశీలించారు. ఎడిటోరియల్ విభాగాన్ని పరిశీలించి సబ్ ఎడిటర్లు వార్తలు దిద్దుతున్న తీరును గమనించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కాపీలను చూసి కావాల్సిన అదనపు అంశాలు, సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్‌ను పరిశీలించి పేజీ లేఔట్‌పై తగిన సూచనలిచ్చారు. సర్వే అంశాలు బాగున్నాయని, వాటిని ఎలా నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళలపై తెప్పించిన కథనాలను చూసి తగిన ఫొటోలు ఉన్నాయా.. లేవా? అని సరిచూసుకోవాలని, అక్షరదోషాలు లేకుండా దిద్దాలని సూచించారు. అనంతరం ఐటీ, ఏడీవీటీ, స్కానింగ్, సీటీపీ, ప్రొడక్షన్ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. నూతన టెక్నాలజీతో అన్ని రంగుల్లో పత్రిక వెలువడుతున్న తీరును చూసి బాగుందని కితాబిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలివ్వాలి.. పత్రికలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వాలని మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. న్యాయసంబంధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచురించాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలను జర్నలిజంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఆధారాలతో పరిశోధనాత్మక వార్తలు రాయాలని సూచించారు. మహిళా చైతన్యంలో పత్రికలు కీలకమని పేర్కొన్నారు. సాక్షి గెస్ట్ ఎడిటర్‌గా తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాక్షి సిబ్బంది ఆమెకు శాలువా అందించి సన్మానించారు. మహిళల ‘సౌర’ సాగు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆమెకు అండగా.. పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’టీమ్ – 8లోuకూతుళ్లే మహారాణులు కొందరు ఒక్కరితో సరి.. ‘సాక్షి’ సర్వేలో మహిళల మనోగతం వార్తకు అనుగుణంగా శీర్షికలు ఉండాలి.. కచ్చితమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి.. మహిళా దినోత్సవ కథనాలు బాగున్నాయని కితాబు -
25శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్
భూపాలపల్లి: ఈ నెల 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపులో 25శాతం రాయితీ అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టర్ తన కార్యాలయంలో గురువారం మున్సిపల్, పట్టణ ప్రణాళిక, పంచాయతీ అధికారులతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో మున్సిపల్ అధికారులు, పంచాయతీల పరిధిలో పంచాయతీ అధికారులు సమన్వయంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 31వ లోపు ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు చెల్లించే మార్కెటింగ్ ఫీజు చెల్లిస్తే దరఖాస్తుదారులకు 25శాతం రాయితీ అవకాశం కల్పించినట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పట్టణ ప్రణాళిక అధికారి సునీల్, పంచాయతీ కార్యాలయ ఏఓ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. పరీక్ష కేంద్రం తనిఖీ భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను గురువారం కలెక్టర్ రాహుల్‌శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, తేజస్విని జూనియర్ కళాశాలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. విద్యార్థుల హాజరు శాతంపై చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలన్నారు. లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. నిశిత పరిశీలనతో విద్యార్థులను అనుమతించాలని స్పష్టంచేశారు. వైద్య సేవల కేంద్రాన్ని పరిశీలించి మందులను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో భూపాలపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. తనిఖీచేసిన డీఈసీ కాళేశ్వరం: మహదేవపూర్ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షాకేంద్రాన్ని డీఈసీ భూక్యా వెంకన్న తనిఖీ చేశారు. పరీక్షలకు జనరల్ విభాగంలో 108, ఒకేషనల్‌లో 34మందికి గాను ముగ్గురు విద్యార్థులు గైర్హాజరు అయ్యారని పరీక్షల అధికారి ప్రసాద్ తెలిపారు. -
హైకోర్టును ఆశ్రయించిన హరిబాబు..?
భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణానికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కోర్టుకు వెళ్లిన భూపాలపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి ఫిబ్రవరి 19న రాత్రి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చూపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన ఏ9గా ఉన్న పుల్ల నరేష్‌ను సైతం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించారు. ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్‌చైర్మెన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు, ఏ10గా ఉన్న పుల్ల సురేష్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న హరిబాబు ఇటీవల హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నట్లు సమాచారం. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 10న వాదనలు జరుగనున్నట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా కేసు నమోదు -
పులికాదు.. అడవి పిల్లి
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలోని శివార్లలోని పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు వదంతులు వచ్చాయని, అది అడవి పిల్లి (వైల్డ్ క్యాట్) అని చెల్పూర్ ఇన్చార్జ్ రేంజ్ అధికారి నరేష్ తెలిపారు. కొత్తపల్లిగోరి శివారు పంచరాయిలో ఉన్న పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీంతో అటవీ అధికారులు గురువారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. పంట పొలాలు, బొక్కి చెరువు సమీపంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రాంతంలో లభించిన పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఆ పాదముద్రలు అడవి పిల్లివని నిర్ధారించారు. వన్యప్రాణులు కనబడితే తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్, ఎఫ్ఎస్ఓ గౌతమి పాల్గొన్నారు. -
భక్తులకు మెరుగైన వైద్యసేవలు
రేగొండ: కొడవటంచ జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన వైద్యం అందేలా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ అన్నారు. ఈనెల 9నుంచి ప్రారంభమయ్యే కోటంచ జాతర సందర్భంగా గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతర సమయంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అత్యవసర వైద్యం కోసం జాతరలో రెండు ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మాస్కులు సరిపడా అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందులు ముందుగానే సమకూర్చుకోవాలన్నారు. జాతీయ సాంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వారికి చికిత్స అందించి, ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి హిమబిందు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
ఇసుక తరలింపు నిలిపివేత
ఏటూరునాగారం: మండల కేంద్రానికి సమీపాన గల సంఘంపాయ, గోదావరి శివారులో కొనసాగుతున్న ఇసుక క్వారీ ప్రారంభమైన నాలుగు రోజులకే నిలిచిపోయింది. క్వారీ నిర్వాహకులు ఇసుకను తరలించడానికి నెల రోజుల నుంచి రోడ్లను వేశారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తరలింపునకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రెవెన్యూ అటవీ మైనింగ్ శాఖలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వేబిల్లులలో ఉన్న క్వాంటిటీ కంటే ఎక్కువ ఇసుకను తరలిస్తున్న లారీలను సీజ్ చేయాలని ఆదేశాలలో పేర్కొంది. క్వారీ నుంచి వచ్చిన ఓవర్ లోడ్ లారీలను గమనించి సీజ్ చేయాలని లేదా ఎంత ఎక్కువ ఇసుక లారీలో ఉందో దానికి తగ్గ ఫైన్ ట్రెజరీకి చెల్లించే విధంగా విధానాన్ని రూపకల్పన చేసింది. నూతన విధానం అమలయ్యాక ఆయా క్వారీల నుంచి వస్తున్న లారీలను పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు ఓవర్ లోడ్ లారీలను నిలిపివేస్తూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఈ నెల 1న ఏటూరునాగారం ఇసుక క్వారీ ప్రారంభమైంది. రెండు రోజులు క్వారీ ఆన్లైన్ డీడీలు తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ మూడు రోజుల నుంచి క్వారీకి సంబంధించిన వేబిల్లుల నిర్వహణ ఆన్లైన్ నుంచి తొలగిపోయింది. అయితే ఈ మూడు రోజులుగా వారి యాజమాన్యం పాత వేబిల్లుల ప్రకారం కొనసాగించింది. రెండు రోజుల క్రితం ఏటూరునాగారం క్వారీ నుంచి వెళ్తున్న లారీలను రెవెన్యూ పోలీస్‌శాఖ అధికారులు గమనించి అధిక లోడ్‌తో వెళ్తున్నాయని ఒక లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటవీశాఖ అధికారులు జోక్యం చేసుకొని క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందంటూ ఇసుక తరలింపు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచి క్వారీలో ఇసుక తరలింపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇసుక క్వారీ ఫారెస్ట్ ఏరియా పరిధిలో ఉందంటూ అటవీశాఖ ఆదేశాలు -
సమర్థంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
భూపాలపల్లి రూరల్: అధికారులు సమన్వయంతో పనిచేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో యాసంగి (రబీ) 2024–25 కాలానికి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు.ఽ ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పంట కోత, గున్నీలు, పరికరాల లభ్యత టార్పాలిన్లు, కేలిబర్స్, పాడీ క్లీనర్లు సిద్ధంచేయాలని సూచించారు. రవాణా సౌకర్యాల వంటి కీలక అంశాలపై చర్చించారు. రైతులకు గిట్టుబాటు ధర అందించే విధానాలు, పంట కోత అనంతరం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే చర్యలపై సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డీఎం రాములు, డీఆర్డీఓ నరేష్, డీసీఓ వాలియా నాయక్, తూనికలు కొలతల అధికారి శ్రీలత వ్యవసాయ, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ -
పెద్దపులికి అపాయం..
ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తుర్‌పల్లికి వచ్చిన పెద్దపులి ఆవాసం కోసం మహదేవపూర్, పలిమెల మండలాల్లో కలియతిరుగుతుంది. రోజుకో చోట సంచరిస్తుంది. ఆవాసం కోసం వస్తే మాత్రం ఉచ్చులకు పడితే పులి మరణించే అవకాశం ఉందని పలువురు జంతుప్రేమికులు పేర్కొంటున్నారు. రక్షించే బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉంది. ఈ అడవుల్లో పులులను వేటాడే వేటగాళ్లు ఏమైనా ఉచ్చులు పెడితే పులికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తగ్గిన నిఘా.. ఎన్ని కౌన్సెలింగ్‌లు చేసినా వేటగాళ్లు వేటాడటం, తినడం మారడం లేదు. వేసవి కావడంతో అడవులు పలచపడి నీటికోసం కుంటలు, వాగుల వద్దకు అడవి జంతువులు వస్తుండడంతో ఉచ్చులు పెడుతున్నట్లు తెలిసింది. కాపలా ఉండే అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అటవీశాఖ ప్రత్యేక నిఘా విభాగాలు రాత్రి వేళల్లో గస్తీలు నిర్వహించడం లేదు. పెట్రోలింగ్ టీంలు, ప్లయింగ్స్క్వాగ్ విభాగాల సోదాలు కూడా తగ్గాయని తెలుస్తోంది. వేటాడితే జైలుకే.. ఉచ్చులు పెట్టినా, వేటాడిన జైలుకు పంపుతాం. అనుమాసం ఉన్న ప్రాంతంలో మా బృందాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్‌ను తీవ్రం చేశాం. ఉచ్చులు బిగించకుండా అడవి మార్గంలో విద్యుత్ లైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. పులి తిరిగే ప్రాంతాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాం. ప్రమాదం లేదు. – నవీన్‌రెడ్డి, డీఎఫ్ఓ● -
విద్యార్థినికి అభినందనలు
భూపాలపల్లి అర్బన్: ఇన్స్పైర్ అవార్డు సాధించిన జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థిని మాచర్ల ఆశ్రితను పాఠశాల యాజమాన్యం గురువారం అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మారుతి మాట్లాడుతూ.. గత నెలలో కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, సైన్స్ టెక్నాలజీ విభాగంలో నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డులో పాఠశాల విద్యార్థిని ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించినట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో ఆశ్రితకు పూలగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జాన్సీరాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రవాణాలో జాగ్రత్తలు పాటించాలి భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. ఈ మేరకు జిల్లాలోని కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూళ్ల స్పెషల్ అధికారులు, ప్రిన్సిపాళ్లతో గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు రవాణా చేసే సందర్భాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా ఒక ఉపాధ్యాయురాలు లేదా ఉపాధ్యాయుడిని ఎస్కార్ట్‌గా విద్యార్థులతో పంపాలని, దూర ప్రాంతం ఉన్న పాఠశాలలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఆహార విషయాలలో శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులందరూ పరీక్షకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, ఆర్టీసీ, మైనారిటీ, సోషల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. ఆన్లైన్ ఫైలింగ్‌పై అవగాహన అవసరం భూపాలపల్లి అర్బన్: కేసుల ఆన్లైన్ ఫైలింగ్ నమోదుపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు తెలిపారు. జిల్లా కోర్టులో గురువారం న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యమన్నారు. కేసుల ఈ ఫైలింగ్ విధానం తెలిసినప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడైన కేసులు వేసుకునే వీలుంటుందని తెలిపారు. విలువైన సమయం, డబ్బులు పొదుపు అవుతాయని, ప్రయాణ భారం తగ్గుతుందని తెలిపారు. రిసోర్స్ పర్సన్లు అఖిల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి, ఏఓ అనితావని, న్యాయవాదులు పాల్గొన్నారు. మహదేవపూర్‌లో గంజాయి స్వాధీనం కాళేశ్వరం: మండలకేంద్రంలోని ఒకరి వద్ద పోలీసులు నిషేఽధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం మండలకేంద్రంలో సోదాలు చేయగా ఒకరి నుంచి 350–400 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సీఐ రాంచందర్‌రావును ఫోన్లో సంప్రదించగా పూర్తి వివరాలు త్వరలో తెలుపుతామని పేర్కొన్నారు. -
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuకాళేశ్వరం: జిల్లా అడవుల్లో ఉచ్చులతో వేటగాళ్ల అడవి జంతువుల వేట మళ్లీ ప్రారంభమైంది. భూపాలపల్లి, మహదేవపూర్, పలిమెల, టేకుమట్ల, మహాముత్తారం, మల్హర్ అటవీప్రాంతాల్లో ఎక్కువగా వేట జరుగుతుందని సమాచారం. దీనికి తోడు కొన్ని రోజులుగా కాటారం సబ్‌డివిజన్ పరిధి మహదేవపూర్, కాటారం, పలిమెల మండలాల్లో పెద్దపులి సంచారం పెరిగింది. దీంతో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులకు పెద్దపులి చిక్కితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జిల్లా అడవిలో ఉచ్చులు ● నిర్వీర్యం చేయని అధికారులు ● కాటారం సబ్డిజన్లో పాగా వేసిన పెద్దపులి ● పట్టించుకోని అటవీశాఖ అధికారులుమాంసానికి డిమాండ్ కాటారం సబ్‌డివిజన్ అడవుల్లో వేటాడిన దుప్పులు, కుందేలు, అడవి పందులు, ఏదు, కొండగొర్లు, అడవిపక్షులను ఉచ్చులు, కత్తులతో హతమార్చి మాంసాన్ని పట్టణాలకు, తమ బంధువులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్లో అడవి మాంసం విలువ కిలోకు రూ.600లకు పైగా పలుకుతుండడంతో కొనుగోలు చేసేందుకు మాంసం ప్రియులు ఇష్టపడుతున్నారు. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు నిత్యం ఆర్టీసీతో పాటు ఇతర ప్రైవేట్ వాహనాల్లో తరలిపోతున్నట్లు సమాచారం. ఉచ్చులతో బలి.. అడవుల్లో వేట షరా మామూలుగానే జరుగుతుంది. నిత్యం వేటగాళ్లు వేట కోసం విద్యుత్ తీగలకు ఉచ్చులు తయారు చేసి వేస్తున్నారు. దానికి మూగజీవాలతో పాటు జిల్లాలో మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. గతేడాది 2023 నవంబర్‌లో కాటారం–మహదేవపూర్ అటవీప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న యువ పోలీసు కానిస్టేబుల్ విద్యుత్ ఉచ్చుకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరిలో మల్హర్ మండలం శాత్రాజ్పల్లి వద్ద వేటగాళ్ల ఉచ్చులు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వారంలో కుదురుపల్లి వాగు, మహదేవపూర్ అయ్యప్ప ఆలయం సమీపంలో ఉచ్చులను స్థానికులు గుర్తించారు. నిత్యం అడవి జీవరాశుల కోసం వేటగాళ్లు రాత్రులంతా గస్తీ నిర్వహిస్తూ యథేచ్ఛగా వేటాడుతున్నారు. మండల కేంద్రాలకు కూతవేటు దూరంలో ఉచ్చులు అమర్చి వన్యప్రాణుల ప్రాణాలు తీస్తున్నారు. అధికారులు ఉచ్చులను నిర్వీర్యం చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.న్యూస్‌రీల్ -
విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకోవాలి
ఏటూరునాగారం: విద్యార్థులు మేధాశక్తి పెంపొందించుకోవాలని హనుమకొండ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో రెండు రోజులు జాతీయస్థాయిలో వర్క్‌షాప్ నిర్వహించారు. రెండోరోజు గురువారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ సెమినార్‌కి ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ‘ఆన్ ఇంటరాక్షన్ విత్ కెరియర్ గైడెన్స్ సెల్’, ‘కోఆర్డినేషన్ కాంపౌండ్స్’ అనే అంశాల మీద విద్యార్థినులకు అవగాహన కల్పించారు. చదువుతో పాటు సమాజంపై విజ్ఞానం పెంచుకోవాలన్నారు. అనంతరం జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ వెబ్ నాట్కి గెస్ట్‌గా సంగారెడ్డి డిగ్రీ కళాశాల డాక్టర్ సుప్రభాపాండ మాట్లాడారు. ‘ఇన్బార్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం’ అనే అంశం పైన చర్చించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, రీజినల్ కోఆర్డినేటర్ హరిసింగ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజు పాల్గొన్నారు. -
సింగరేణి బకాయిలను చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికులతో మాట్లాడారు. 2024 డిసెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణి ఆర్థికంగా దెబ్బతిన్నట్లు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.25వేల కోట్ల బకాయిలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు కొనుగోలు చేసిన డబ్బులను కూడా ఇవ్వడం లేదన్నారు. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని మోసపూరిత హామీలతో కార్మికులను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ నెల 8వ తేదీన ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో సింగరేణి స్థితిగతులపై జనరల్‌బాడీ సమావేశం నిర్వహించి భవిష్యత్ పోరాటాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచీ నాయకులు సుజేందర్, మల్లేష్, రాజు, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
11శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలి
భూపాలపల్లి రూరల్: ఎస్సీ వర్గీకరణలో మాదిగ ఉపకులాలకు 11 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం డప్పుచప్పుళ్లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో 11 శాతం రిజర్వేషన్లు ఆమోదింప చేయాలని, మాదిగ, మాదిగ ఉపకులాలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. లేదనంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా, మండలాల నాయకులు దోర్నాల రాజేందర్ మాదిగ, అంతడుపుల సురేష్, దోర్నాల సారయ్య, నేర్పాటి అశోక్, మంద తిరుపతి, మడిపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు. దొంగనోట్ల కలకలం! రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో దొంగనోట్ల కలకలం రేపుతోంది. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో మహిళా సంఘంలోని ఓ గ్రూపునకు చెందిన మహిళ నెలవారి కీస్తీలు డిపాజిట్ చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో నగదును క్యాషియర్ లెక్కిస్తుండగా అందులో ఓ 500 రూపాయల నోటు దొంగ నోటుగా గుర్తించారు. దీంతో సంఘ సభ్యులు ఎవరు ఇచ్చారనేది స్పష్టత రాకపోవడంతో మండలంలో దొంగ నోట్ల హవాసాగుతుందని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
లెప్రసీ మళ్లొస్తున్నది
భూపాలపల్లి అర్బన్: అనారోగ్య సమస్యలతో పాటు.. అంగవైకల్యానికి ప్రధానంగా కుష్ఠు వ్యాధి కారణమవుతోంది. పూర్వీకులు ఈ వ్యాధి పూర్వజన్మ పాప ఫలితమని, వంశపారపర్యంగా వస్తుందని, నయం కాదని అనుకునేవారు. కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో వ్యాధి తీవ్రత తగ్గి వ్యాధిగ్రస్తులు తగ్గుతూ వస్తున్నారు. అంతరించి పోతుందనుకుంటున్న తరుణంలో మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో గత నెలలో వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి సర్వేలో మళ్లీ ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 62 మంది ఉండగా ఉమ్మడి జిల్లాలో 243 మంది బాధితులు ఉన్నారు. తీవ్రత పెరగకముందే అనుమానితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించేలా వ్యాధి నియంత్రణలో ప్రత్యేక దృష్టి సారిస్తేనే వ్యాధి నియంత్రణ ఉండే అవకాశం ఉంది. వ్యాధి సోకేదిలా.. కుష్ఠు వ్యాధి మైక్రో బాక్టీరియం లెప్రే అనే బాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా చర్మానికి, నరాలకు సోకుతుంది. ఇది సాధారణంగా ఒకరకమైన అంటు వ్యాధి కారకం. కుష్టు వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా దగ్గరలో ఉన్న వారికి సోకే అవకాశం ఉంది. శరీరంలోని ఏ భాగంలోనైనా ఒకటి లేదా ఎక్కువ చిన్నవి లేదా పెద్ద మచ్చలు పాలిపోయిన రాగి లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఆ మచ్చలపై స్పర్శ, జ్ఞానం లేనప్పుడు, నొప్పి తెలియనప్పుడు మచ్చలపై చెమట పట్టదు. శరీరంపైన ఉన్న వెంట్రుకలు కూడా రాలి పోతాయి, చర్మంపై అక్కడక్కడా బుడిపెలు ఏర్పడతాయి. చెవి తమ్మెలు, ముఖం, చేతులు కాళ్లపై బుడిపెలు ఏర్పడతాయి. కాళ్లు, చేతులు, పాదాల్లో నిస్సత్తువ ఏర్పడి అంగవైకల్యానికి దారితీస్తాయి. పాదాల్లో గాయాలు ఏర్పడుతాయి. వ్యాధి సోకిన వారు కనురెప్ప పూర్తిగా మూయలేరు. రెండు రకాలుగా చికిత్స కుష్ఠు వ్యాధి సోకిన వ్యక్తికి ఒకటి నుంచి ఐదు మచ్చలు ఉంటే వారిని పాసీ బ్యాసిల్లరీ (పీబీ)గా గుర్తిస్తారు. వారికి ఆరు నెలలు వరకు ఖచ్చితంగా చికిత్స ఉంటుంది. కనీసం 9 నెలల్లో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐదు కంటే ఎక్కువ మచ్చలు. ఉంటే వారిని మల్టీ బ్యాసిల్లరీ (ఎంబీ)గా గుర్తిస్తారు. అలాంటి వారికి 12 నెలలు చికిత్స ఉంటుంది. కనీసం 15 నెలల్లో కోర్సును పూర్తి చేయాలి. బహుళ ఔషధ చికిత్సతో కుష్ఠు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. దాదాపు రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వరకు ఖర్చయ్యే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తారు. 6 నెలలు నుంచి 12 నెలల వరకు చికిత్స తీసుకుంటే కుష్ఠు వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. సకాలంలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తిస్తే అంగవైకల్యం సంభవించకుండా చూడవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులకు రెండు జతల మైక్రో సెల్యులార్ రబ్బర్ పాదరక్షకులు ఉచితంగా అందిస్తున్నారు. కొందరికీ ఆసరా పింఛన్ పథకంలో కూడా అవకాశం కల్పించారు.రోజురోజుకూ పెరుగుతున్న కేసులు జిల్లాలో 62 మంది వ్యాధిగ్రస్తులు ఆందోళన అవసరం లేదు: డీఎంహెచ్ఓ మధుసూదన్అందుబాటులో వైద్యం, మందులు.. వ్యక్తిలో తెల్లని, గోధుమ రంగులో ఎలాంటి స్పర్శలేని మచ్చలు ఉంటే కుష్ఠుగా నిర్ధారించే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనుమానితులు ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వెళ్తే అక్కడ స్క్రీనింగ్ చేసి అవసరమైన వైద్యం అందిస్తారు. వ్యాధిని బట్టి 6 నుంచి 12 నెలల చికిత్స ఉంటుంది. అన్ని రకాల వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
సైన్స్‌పై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: సైన్స్‌పై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కాకతీయ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ రమారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో సైన్స్ వర్క్‌షాపును బుధవారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం విద్యార్థులకు అవసరం అన్నారు. కంప్యూటర్, సైన్స్‌పై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో పాటు అధ్యాపకులు బోధించిన ప్రతీ విషయాన్ని ఏకాగ్రతతో ఒంట పట్టించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన విద్యాసంస్థల సమన్వకర్త శ్రీనివాస్‌రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, అధ్యాపకులు నవీన్, వెంకటయ్య, జ్యోతి, జీవవేణి, గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణిలతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. -
భక్తులకు అసౌకర్యం కలగొద్దు
రేగొండ: కోటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కొడవటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కోటంచ బ్రహ్మోత్సవాల కోసం చేస్తున్న ఏర్పాట్లను అధికా రులతో కలిసి పరిశీలించారు. జాతరలో భద్రత ఏర్పాట్లు, మంచినీటి సదుపాయాలు, పార్కింగ్, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అధికారులు, నిర్వాహకులు కలిసి సమన్వయంతో పని చేసి భక్తులకు ఉత్తమ సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కా ర్యక్రమంలో ఈఓ మహేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఏఎస్పీ బోనాల కిషన్, జి ల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆర్‌డబ్ల్యూస్ ఈఈ నిర్మల, విద్యుత్ డీఈ పాపిరెడ్డి, తహసీల్దార్ శ్వేత, మండల ప్రత్యేకాధికారి సునీల్ కుమార్, ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, ధర్మకర్త శ్రీధర్, ఆ లయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్‌శర్మ -
ఇంటర్ పరీక్షలు షురూ..
భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. బుధవారం మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,901 మంది విద్యార్థులకు గాను 1,802 మంది విద్యార్థులు హాజరు కాగా 99 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తేజస్విని గాంఽధీ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి వెంకన్న తనిఖీ చేశారు. అలాగే కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి పరిశీలించారు. -
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్, సీ సెంటర్ క స్టోడియన్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరీక్షలకు హాజర య్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని సూచించా రు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు జిల్లాలో 20 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని 3,449 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి మందల రవీందర్‌రెడ్డి, జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి చిట్యాల: విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అదనపు కలెక్టర్ ఎల్. విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలను ఆమె సందర్శించారు. భోజనం రుచిగా ఉంటుందా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వంట గదిని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు చదువులో రాణించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
కుదురుపల్లి వద్ద లారీలు, ఆర్టీసీ బస్సులుకాళేశ్వరం: ఇసుక లారీలు రోడ్డుపై రెండు వరుసల్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం మహదేవపూర్ మండలం కుదురుపల్లి టు మహదేవపూర్ మార్గమధ్యలో లారీలతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. కాటారం టు కాళేశ్వరం, కాళేశ్వరం టు వరంగల్ వైపు వెళ్లే వాహనాలు, ఆర్టీసీ బస్సులు జాతీయ రహదారి 353 (సీ)పై లారీలు ట్రాఫిక్‌లో ఇరుక్కుని రెండు గంటల పాటు ప్రయాణికులు తంటాలు పడ్డారు. కుదురుపల్లి నుంచి మహదేవపూర్ సమీపంలోని సర్సరీ వరకు లారీలు జామ్ కావడంతో ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. సంబంధిత అధికారులు అటువైపు చూడకపోవడంతో వారికివారే ఇబ్బందులు పడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసుకున్నారు. ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు లారీలు నిలిపేందుకు పార్కింగ్ స్థఽలాలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డుపైనే యథేచ్ఛగా నిలిపివేస్తున్నారు. దీంతో నిత్యం ఇసుక లోడు, ఖాళీ లారీలు రోడ్డుకు రెండు వరుసలతో వెళుతుండడంతో ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణికులు, వాహనచోదకుల ఇబ్బందులు -
జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం
కాటారం: కాటారం మండలం చల్లపల్లి సమీపంలోని రుద్ర జిన్నింగ్ మిల్లులో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లు నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తి జిన్నింగ్ ప్రక్రియలో భాగంగా మిషన్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మెరుగులు రాలి పక్కనే ఉన్న డస్ట్‌లో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి మిషన్‌లోని బెల్టులతో పాటు సమీపంలోని పత్తి బేల్స్, పత్తికి మంటలు అంటుకున్నాయి. గమనించిన సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా.. అదుపులోకి రాలేదు. భూపాలపల్లి, మంథని నుంచి ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో వంద క్వింటాళ్ల పత్తి, మూడు పత్తి బేల్స్, యంత్రాలు దగ్ధమయ్యాయని, సుమారు రూ.15లక్షల మేర నష్టం వాటిల్లినట్లు నివ్వాహకులు పేర్కొన్నారు.రూ.15లక్షల మేర నష్టం -
రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందించినట్లు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పెరుమాండ్ల తిరుపతి, యాంసాని సంతోష్‌లు తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఇతర జిల్లాలకు సీఎంఆర్ రైస్‌ను పంపలేమని, బీజీ 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంతకంటే ఎక్కువగా ఇవ్వలేమన్నారు. స్పందించిన మంత్రి సీతక్క, సివిల్ సప్లయీస్ కమిషనర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం భూపాలపల్లి రూరల్: నేడు (గురువారం) 11 కేవీ జంగేడు టౌన్‌లోని ఫీడర్పై చెట్ల కొమ్మలు తీయుట, మరమ్మతు పనుల దృష్యా జంగేడు, ఫకీర్గడ్డ, వేశాలపల్లి, భాస్కర్‌గడ్డ, డబుల్ బెడ్ రూం ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని భూపాలపల్లి పట్టణ ఏఈ విశ్వాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. మహిళలకు క్రీడాపోటీలుభూపాలపల్లి అర్బన్: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో బుధవారం లేడీస్ క్లబ్ మహిళలకు క్రీడాపోటీలను నిర్వహించా రు. ఇల్లంద్ క్లబ్లో త్రో బాల్, బాంబ్ ఇన్ సి టీ, బాల్ పాసింగ్ నిర్వహించారు. క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి ఏరియా సేవా అధ్యక్షురా లు సునీతరాజేశ్వర్‌రెడ్డి, క్లబ్ కార్యదర్శి రమణివెంకటరామిరెడ్డి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంవరంగల్: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో మూడు సంవత్సరాల చేనేత, టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు రాఘవరావు ఒక ప్రకటనలో కోరారు. 60 సీట్లు ఉన్న కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణులై, జూలై 1 నాటికి బీసీ, ఓసీలు 23, ఎస్సీ, ఎస్టీలు 25 ఏళ్లు ఉండాలన్నారు. వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాద్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు ఓఎస్డీ హిమజాకుమార్ 90300 79242 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. మానేరులో తాత్కాలిక రోడ్డు తొలగింపు● ఇబ్బందులు పడుతున్న వాహనదారులు టేకుమట్ల: మండలంలోని కలికోట శివారు, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ శివారు మానేరులో ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టి రోడ్డును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. గతంలో మానేరులో నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డుకు కొంత సేవా రుసుం వసూలు చేస్తూ రవాణా సౌకర్యాన్ని కల్పించారు. కొంతమంది స్వలాభం కోసం టోల్ నిర్వాహకులను నగదును డిమాండ్ చేయడం, టోల్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ ప్రచారం చేసి అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ నెల 1న పోలీసుల సమక్షంలో టోల్ ఎత్తివేశారు. అప్పటి నుంచి రాకపోకలు ఉచితంగా వినియోగించుకున్నారు. తాజాగా రోడ్డును తొలగించడంతో పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, భూపాలపల్లి నుంచి పెద్దపల్లి, మంచిర్యాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మానేరులో తాత్కాలిక రోడ్డు ప్రతీఒక్కరికి అవసరమని, రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు. -
పులి కదలికలపై డీఎఫ్ఓ ఆరా
కాటారం: కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి కదలికలపై బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి ఆరా తీశారు. కాటారం మండలం గుండ్రాత్‌పల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలోని వాగులు, అడవి దారుల వెంట పులి పాదముద్రలను డీఎఫ్ఓ పరిశీలించారు. పులి గుండ్రాత్‌పల్లి మీదుగా అన్నారం, పల్గుల అటవీ ప్రాంతం నుంచి గోదావరి దాటి చెన్నూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పూర్తి స్థాయి నిర్ధారణకు డీఎఫ్ఓ అటవీ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చినట్లు సమాచారం. డీఎఫ్ఓ వెంట కాటారం రేంజర్ స్వాతి, సెక్షన్, బీట్ అధికారులు ఉన్నారు. కొత్తపల్లిగోరిలో పులి సంచారం? రేగొండ: కొత్తపల్లిగోరి మండలకేంద్రంలో పులి సంచారం కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం పల్లెబోయిన రమేశ్ అనే రైతుకు చెందిన పొలం గట్టు మీదుగా బొక్కి చెరువు వైపు వెళ్తుండగా ఓ మహిళ వీడియో తీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఘటనపై చెల్పూర్ ఇన్చార్జ్ రేంజ్ ఆఫీసర్ నరేష్‌ను వివరణ కోరగా.. కొత్తపల్లిగోరిలో పులి సంచరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. నిజానిర్ధారణ కోసం నేడు పాదముద్రలు సేకరిస్తామన్నారు. -
కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంబాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు సోనియా ప్రశంసించారు. 42 సంవత్సరాల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయం అన్న సోనియా గాంధీ.. త్రివేణి సంగమం జలాలకి ఎంతో ప్రత్యేకత ఉందని ప్రస్తావించారు.తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు సోనియా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకి కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి స్థల విశిష్టతను, ప్రశస్థను తెలియజేసినందుకు కొండా సురేఖను సోనియా గాంధీ అభినందించారు. -
ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
రేగొండ: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని చిన్నకొడెపాక గ్రామంలో ప్రతిష్ఠించిన రేణుకా ఎల్లమ్మ తల్లి, కంఠమహేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల కొంగుబంగారంగా రేణుక ఎల్లమ్మ నిలిచిందన్నారు. గ్రామాభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, నాయకులు పున్నం రవి, సూదనబోయిన ఓంప్రకాశ్, సురేందర్‌రెడ్డి, ఓమాజీ, మెండయ్య, తిరుపతి పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
యాజమాన్యం దృష్టికి కార్మికుల సమస్యలు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్ ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నాడని యూనియన్ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య తెలిపారు. మంగళవారం ఏరియాలోని వర్క్‌షాపులలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు సొంతింటి పథకం వెంటనే అమలు చేయాలని, మారు పేర్లను సవరించాలని, క్యాడర్లకు సంబంధించిన క్యాడర్ స్కీం అమలు చేయాలని, ప్లేడేలను గతంలో మాదిరిగా అమలు చేసి ఎన్–1 రద్దు చేయాలని సీఎండీని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్, రాజిరెడ్డి, బాబు మియా, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీ స్థల పరిశీలన భూపాలపల్లి అర్బన్: గడ్డిగానిపల్లి, కొండంపల్లి గ్రామాల ఆర్అండ్ఆర్ కాలనీ భూ సేకరణ పనులను మంగళవారం ఆర్డీఓ రవి సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. గడ్డిగానిపల్లి, కొండంపల్లి భూసేకరణ పనులను త్వరగా పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలను అన్ని వసతులతో సిద్ధం చేయాలని సింగరేణి అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి, ఓసీ–2 ప్రాజెక్ట్ అధికారి వెంకటరామిరెడ్డి, సివిల్ డీజీఎం రవికుమార్, అధికారులు అరుణ్‌ప్రసాద్, కార్తీక్ పాల్గొన్నారు. వైద్య సిబ్బంది పాత్ర గొప్పది కాటారం: వైద్యసేవలు ప్రజలకు చేరవేయడంలో వైద్యసిబ్బంది పాత్ర చాలా గొప్పదని వైద్యశాఖ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఉమాదేవి అన్నారు. జన్ఔషధి వారోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉత్తమ విధులు నిర్వర్తిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ స్టాఫ్ నర్స్ అభినయను సన్మానించారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ ఏఎన్ఎం, వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మౌనిక, డాక్టర్ హారిక, డాక్టర్ వందన, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ గీతా, డాక్టర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. టెక్నాలజీపై అవగాహన మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ అత్యాధునిక పరికరాల టెక్నాలజీపై ఉమ్మడి జిల్లా 108 ప్రోగాం మేనేజర్ పాటి శివకుమార్ అవగాహన కల్పించారు. తాడిచర్ల ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, సిబ్బందితో మంగళవారం వైద్యాధికారి వినయ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. 108, 102 సర్వీస్‌లు, నియో నటల్ సేవలు ఎఫ్హెచ్ఎస్ (పార్థివ వాహనం) సర్వీస్ ఉపయోగించుకోవాలని అవేర్నెస్ డెమో ప్రోగ్రాం ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్, పీహెచ్సీ తాడిచర్ల హెల్త్ అసిస్టెంట్ నాగరాజు, ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు, 108 సిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహేష్, పైలట్ సంపత్ పాల్గొన్నారు. -
దళారులను ఏకం చేసి రేగొండలో సమావేశం..
కొన్నేళ్లుగా జిల్లాలోని రేషన్ బియ్యాన్ని పలువురు దళారులు మహారాష్ట్రలోని సిరొంచలోని ఓ రైస్‌మిల్లుకు అక్రమంగా తరలించేవారు. అక్కడి రైస్‌మిల్ యజమాని రెండు నెలలుగా ఈ దందాను మానుకున్నాడు. దీంతో జిల్లాకు చెందిన ఓ రైస్‌మిల్ యజమాని తెరపైకి వచ్చి రేషన్ బియ్యాన్ని పలు రైస్‌మిల్లులకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గతంలో పని చేసిన దళారులను ఏకం చేశాడు. దందా మానేయాల్సిన అవసరం లేదని, తానే బియ్యాన్ని కొనుగోలు చేస్తానని హామీ ఇచ్చాడు. దీంతో మండలాల వారీగా ఉన్న దళారులంతా ఏకమై 20రోజుల క్రితం రేగొండలో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అందరం కలిసి సదరు రైస్‌మిల్ యజమాని చెప్పిన మిల్లులకే బియ్యాన్ని సరఫరా చేయాలని, ఒక మండలం వారు మరో మండలంలోకి వచ్చి కొనుగోలు చేయరాదని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారంతా రేషన్‌కార్డుదారులు, రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి సదరు రైస్‌మిల్ యజమాని చెప్పిన రైస్‌మిల్‌కు అర్ధరాత్రి వేళల్లో వివిధ వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం. -
నాలుగేళ్లు సాగుచేస్తే రూ.40వేల ఆదాయం
ఏటూరునాగారం: కంకవనాలను సాగు చేసి నాలుగేళ్లపాటు సంరక్షిస్తే రైతులకు సంవత్సరానికి రూ.40వేలు ఆదాయం వస్తుందని సెర్ప్ సీసీ నర్సింహారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శివాపురం గ్రామంలో జగదాంబ గ్రామైక్య సంఘానికి ఆయన కంకవనాల పంట సాగుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆమోదితమైన ఓ కంపెనీ ద్వారా 15 గుంటలు పట్టా భూమి ఉన్న మహిళా రైతుకు 60 కంక మొక్కలను ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఆ తర్వాత ప్రతిరోజూ మొక్కకు నీరుపట్టి సంరక్షించినందుకు రూ.15 నాలుగేళ్లపాటు అందిస్తారని చెప్పారు. నాలుగు ఏళ్ల వరకు పంటను కాపాడితే మొక్కలు ఇచ్చిన కంపెనీ వారు కర్రను తీసుకెళ్లి రూ.40వేలు ఇస్తారని తెలిపారు. ఇలా పంట దిగుబడి వచ్చినన్ని రోజులు కొనుగోలు చేస్తారని వివరించారు. రైతుకు ఉపాధి హామీ కార్డు ఉంటే మొక్కల సంరక్షణ, నాటడం, మట్టి పనులు చేసినందుకు కూలి డబ్బులు కూడా వస్తాయని తెలిపారు. గ్రామంలోని మహిళలు, రైతులు కంకవనం(వెదురు) పంటపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో వీఓఏ ప్రశాంతి, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ఎట్టి రమ, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. సెర్ప్ సీసీ నర్సింహారావు కంకవనం సాగుపై అవగాహన -
కొడవటంచ జాతరకు ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: కొడవటంచ లక్ష్మినరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య, ఆర్టీసీ, ఆర్డబ్ల్యూఎస్, సింగరేణి, ఆర్అండ్బీ, సమాచార, దేవాదాయ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక విధుల నిర్వహణకు గ్రామ సిబ్బందిని డిప్యూట్ చేసి, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పనులు చేపట్టాలని ఆదేశించారు. దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయడంతో పాటు పూలతో అందంగా ముస్తాబు చేయాలన్నారు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల సౌకర్యార్ధం గ్రామంలోని అన్ని రహదారుల్లో వీధి లైట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు వైపు, పార్కింగ్ స్థలాలు, భక్తులు ఉండే జాతర స్థలాలలో తాత్కాలిక లైట్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు వచ్చే కొడవటంచ బైపాస్, రేపాక, కొడవటంచ రోడ్, గుడెపల్లి–కొడవటంచదారులలో అడ్డంగా ఉన్న ముళ్లపొదలు తొలగించి, మొరం పోసి గుంతలు పూడ్చే పనులు పూర్తి చేయాలన్నారు. జాతర రోజులలో మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేయాలని, నీళ్ల ట్యాంకుల దగ్గర ఇంకుడుగుంతలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మహిళల సౌకర్యార్ధం స్నాన ఘట్టాలు వద్ద బట్టలు మార్చుకొనే గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని అనుసరించి తగు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్ధం 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని, భూపాలపల్లి డిపోతో పాటు ఇతర జిల్లాల నుంచి నిరంతరం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్డీఓ రవి, డీఎస్పీ సంపత్ రావు, ఈఓ మహేష్, తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో సమీక్ష -
సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి
వెంకటాపురం(ఎం): విద్యుత్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్–2 సీఈ రాజ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం లైన్మెన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని వెల్తుర్లపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి సిబ్బంది సేవలను గుర్తిస్తూ వారిని శాలువా లతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్ చౌహాన్ మాట్లాడుతూ.. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరాను వినియోగదారులకు అందించాలన్నారు. వినియోగదారుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించాలని చెప్పారు. సమ్మర్ యాక్షన్‌లో భాగంగా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బందికి పలు సూచనలు అందించారు. అనంతరం వెల్తుర్లపల్లి సబ్‌స్టేషన్‌లో ఫెయిల్ అయిన పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్ను అమర్చారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఈ సదానందం, ములుగు ఏడీఈ ఆపరేషన్ వేణుగోపాల్, ఏడీఈ కన్స్ట్రక్షన్స్ సందీప్ పటేల్, ఏఈలు రమేశ్, బెనర్జీ, సబ్ ఇంజనీర్ సాంబరాజు పాల్గొన్నారు.రాజ్ చౌహాన్ -
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuమండలాల దళారులతో ములాఖత్ ● వివిధ శాఖల అధికారులతో సెటిల్మెంట్ ● రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి గోడౌన్‌కు తరలింపు ● అంతా ఆయన కనుసన్నల్లోనే జరగాలని హుకుం రీసైక్లింగ్ చేసి గోడౌన్‌కు తరలింపు.. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు అప్పగిస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్(ఎస్‌డబ్ల్యూసీ) గోడౌన్లకు పంపించాల్సి ఉంటుంది. జిల్లాకు చెందిన పలువురు రైస్‌మిల్లర్లు గోల్మాల్ చేసి రైతుల ధాన్యానికి బదులుగా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి హనుమకొండలోని గోడౌన్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కలర్ టెస్ట్‌లో పీడీఎస్ బియ్యాన్ని గుర్తు పట్టే అవకాశం ఉంటుంది. దీంతో అక్కడి అధికారులకు డబ్బులు ఎరగా చూపి 290 క్వింటాళ్లకు (ఏసీకే) రూ.15వేలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఇప్పటివరకు వచ్చిన బియ్యం మొత్తాన్ని ఎంఎల్ఎస్ గోడౌన్ పాయింట్లకు పంపినట్లు సమాచారం.జిల్లాకు చెందిన ఓ రైస్‌మిల్ యజమాని రెండు నెలలుగా పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేపిస్తూ డాన్‌గా ఎదిగాడు. పుష్ప సినిమాలో మాదిరిగా మండలాల వారీగా ఉన్న దళారులతో ములాఖత్ అయి అధికారులతో సెటిల్మెంట్లు చేసుకొని పేదల బియ్యాన్ని యథేచ్ఛగా రైస్‌మిల్లులకు సరఫరా చేయిస్తున్నాడు. – భూపాలపల్లిన్యూస్రీల్ -
పరిహారం అందేనా?
గోవిందరావుపేట: చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) 5వ బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 10 ఏండ్లు గడిచినా నేటికీ పరిహారం అందలేదు. తెలంగాణ ప్రభుత్వం బెటాలియన్ నిర్మాణానికి 105 ఎకరాలు లాక్కొని పరిహారం కూడా చెల్లించకుండా సుమారు 60 మంది కుటుంబాలను రోడ్డున పడేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులు సుమారు ఐదు సంవత్సరాలపాటు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేశారు. బెటాలియన్ గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు సైతం కొనసాగించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా పోరాటం చేసిన పలువురు రైతులపై పోలీసు కేసులు నమోదు కావడంతో జైలుకు సైతం వెళ్లారు. నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆత్మహత్యాయత్నం.. బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రభుత్వం, నాయకులను కోరినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. చివరకు చల్వాయి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మహిళా రైతులు సైతం ఉండడం గమనార్హం. దీంతో అప్పటి అధికారులు, పోలీసులు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో రైతులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. లబ్ధికోసమే రాజకీయ నాయకుల మద్దతు ? భూ నిర్వాసితులు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలకు పలువురు రాజకీయ నాయకులు మద్ధతు ప్రకటించినా.. అది కేవలం వారి రాజకీయ లబ్ధికోసమేనని రైతులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు నిజంగా తమ కోసం పోరాడితే ఎప్పుడో న్యాయం జరిగేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రధాన పార్టీలోని నాయకులు సీతక్క, ప్రొఫెసర్ కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వంటి వారు.. రైతులకు పరిహారం వచ్చేవరకు అండగా ఉంటామని చెప్పి మాయమాటలతో పబ్బం గడిపారని, కేసుల పాలై కోర్టు చుట్టూ తిరుగుతున్నా.. ప్రస్తుతం పట్టించుకునేవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం కోల్పోయిన చిలుకమ్మ వారసత్వంగా వచ్చిన భూమిని నమ్ముకుని 60 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ నలుగురు పిల్లలకి పెళ్లి చేసి వారి పిల్లలతో గడిపే సమయంలో భూమిని ప్రభుత్వం తీసుకుందని తెలిసి గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది.హామీ ఇచ్చి మోసం చేశారు.. మా తాతల నాటినుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఉన్న పలంగా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ బెటాలియన్ నిర్మాణం చేపడుతున్నాం.. అని భూమిని లాక్కొని, మా మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపారు. ఉద్యోగం కల్పిస్తాం.. భూమికి బదులు భూమిస్తాం.. అని మోసం చేశారు. ఇప్పటికై నా భూములు కోల్పోయిన రైతులకు హామీ మేరకు పరిహారం ఇవ్వాలి. రైతులపై ఉన్న కేసులను ఎత్తేయాలి. – జంపాల అనిల్, భూ నిర్వాసితుడు కేసు కోర్టులో ఉంది చల్వాయి బెటాలియన్ కింద భూములు కోల్పోయిన రైతుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. కోర్టు ఉత్తర్వుల మేరకు మేము ముందుకు వెళ్తాం. – సృజన్ కుమార్, తహసీల్దార్, గోవిందరావుపేట ●ఆందోళనలో టీజీఎస్పీ 5వ బెటాలియన్ భూనిర్వాసితులు చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ పదేళ్లు గడిచినా తప్పని ఎదురుచూపు -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: నేటి(బుధవారం) నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో సమస్యలకు తావులేకుండా చూడాలన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు సౌకర్యాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, నోడల్ అధికారి వెంకన్న పాల్గొన్నారు.పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ -
అధికారులను చూసుకుంటున్నా..
పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న సదరు డాన్ మండలాల వారీగా ఉన్న దళారులతో ప్రతీరోజు మాట్లాడుతూ.. ‘అధికారులందరినీ చూసుకుంటున్నా.. మీకేం ఇబ్బంది లేదు. లోకల్ పోలీసులు, నిఘా విభాగం, సివిల్ సప్లయీస్, రెవెన్యూ అధికారులందరికీ నెలవారి మామూళ్లు ఇస్తున్నా..’ అని బాహాటంగానే చెప్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను చెప్పిన చోటకే బియ్యాన్ని పంపాలని, ఇంకెక్కడ అమ్మకూడదని హుకుం జారీ చేసినట్లు సమాచారం. దళారుల వద్ద కేజీ బియ్యం రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్న సదరు డాన్ సుమారు రూ.30 చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం. – 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలివి..దేవాదుల మూడో దశకు భూసేకరణే అసలు సమస్య●● ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ప్రాజెక్టు ● కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రుల పర్యటన ● హామీలు, ఆదేశాలు.. అయినా పూర్తికాని భూసేకరణ ● రూ.6వేల కోట్ల నుంచి రూ.17,500కోట్లు.. ● పెరిగిన అంచనా వ్యయం -
నస్తూర్‌పల్లి అడవిలోకి పులి
కాటారం: మండలంలోని ప్రతాపగిరి పులివాగు సమీపంలో పాదముద్రల ఆధారంగా నస్తూర్‌పల్లి అడవి ప్రాంతంలోకి పులి తిరిగి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం మహదేవపూర్ మండలం ఏన్కపల్లి నుంచి ప్రతాపగిరి గొంతెమ్మగుట్ట సమీపంలోకి పులి వచ్చిందనే సమాచారంతో కాటారం డిప్యూటీ రేంజర్ సురేందర్‌నాయక్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పులివాగు వద్ద పులి పాదముద్రలు(ప్లగ్మార్క్స్) గుర్తించి నిర్ధారించారు. ఆదివారం అటవీశాఖ అధికారులు, సిబ్బంది మళ్లీ గాలింపు చర్యలు మొదలుపెట్టగా.. మర్రివాగు వైపుగా పులి వచ్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలో పూర్తిగా ఆకురాలి ఉండటంతో పులి అడుగులు గుర్తించలేకపోయామని పులి నస్తూర్‌పల్లి అడవిలోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పులి జాడ తెలియక అటవీశాఖ అధికారులు అయోమయానికి గురవుతుండగా.. ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. పులి గాలింపు చర్యల్లో కాటారం డిప్యూటీ రేంజర్‌తో పాటు యామన్‌పల్లి డిప్యూటీ రేంజర్ శ్రీనివాస్, ఎఫ్‌బీఓలు మోయినోద్దిన్, మోనకౌసర్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడికి సాయం
కాళేశ్వరం: తమ ఉపాధ్యాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు రూ.లక్షన్నర ఆర్థికసాయం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 2003–2009 వరకు శ్రీసరస్వతి హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసిన కాళేశ్వరం గ్రామానికి చెందిన మానెం శ్రీనివాస్ అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని అప్పటి ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రూ.లక్షన్నర ఆర్థికసాయం కాళేశ్వరం వచ్చి ఆదివారం అందజేశారు. ఉపాధ్యాయులు అయ్యంగార్ తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, విద్యార్థులు శ్రీధర్, కళావతి, మల్లేశ్వరి, సంతోష్, విజయ్, నరేందర్, శ్రీకాంత్ ఉన్నారు. -
రైస్ మిల్లులకే..!
భూపాలపల్లి: పేదల బియ్యం పక్కదారి పడుతుంది. రాష్ట్రంలో దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని కొందరు దళారులు రెండు నెలల క్రితం వరకు మహారాష్ట్రకు అక్రమంగా తరలించగా.. ఇప్పుడు ఏకంగా జిల్లాలోని రైస్‌మిల్లులకే పంపిస్తున్నారు. మిల్లర్లు అవే బియ్యాన్ని బస్తాలు మార్చి సీఎంఆర్ కింద సివిల్ సప్లై గోదాంలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దళారులకు ఒకరిద్దరు సివిల్ సప్లయీస్ అధికారులు అండగా నిలుస్తుండటంతో ఈ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. కేజీకి రూ.10నుంచి రూ.12కు కొనుగోలు.. జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 1,23,659 తెల్ల రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతీ నెల ఒక్కో వ్యక్తికి ఆరు కేజీల చొప్పున రేషన్ డీలర్ల ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తుంది. కొందరు దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మండలానికో దళారి ఉండగా, వారు బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. కూలీలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాల నుంచి బియ్యాన్ని కేజీకి రూ.10 నుంచి రూ.12 చొప్పున కొనుగోలు చేసి కమిషన్ పద్ధతిన దళారికి విక్రయిస్తున్నారు. అంతేకాక దళారులు నేరుగా రేషన్ డీలర్లతో డీల్ కుదుర్చుకొని కేజీకి రూ.10 చొప్పున భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం వరకు ఈ దళారులు రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రలోని ఓ రైస్‌మిల్లుకు తరలించగా, అక్కడ ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో ఇప్పుడు జిల్లాలోని రైస్‌మిల్లులకే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మిల్లులో భారీగా పట్టివేత... రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం మేరకు జిల్లా సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు జనవరి 6న రేగొండ మండలం బాగిర్ధిపేట గ్రామంలోని దుర్గా భవాని రైస్‌మిల్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 453 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటన జరిగి రెండు నెలలు కావస్తున్నప్పటికీ దందా మాత్రం ఆగడం లేదు. పలువురు రైస్ మిల్లర్లు అదే పనిగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ రీ సైక్లింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు జిల్లావ్యాప్తంగా వినిపిస్తున్నాయి. సమాచారం లేదు.. పీడీఎస్ బియ్యం మిల్లులకు తరలిస్తున్నట్లు ఇప్పటి వరకు ఫిర్యాదులు ఏమీ రాలేదు. మాకు సమాచారం కూడా లేదు. జిల్లాలోని రైస్ మిల్లులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తాం. – శ్రీనాథ్, డీసీఎస్ఓఅర్ధరాత్రి మిల్లులకు రవాణా.. కూలీలు సేకరించిన, రేషన్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని దళారుల నుంచి జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు కేజీకి రూ. 26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి, తెల్లవారుజామున టాటా ఏసీ ట్రాలీ, డీసీఎం వ్యాన్లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి తిరిగి సివిల్ సప్లై గోడౌన్లకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్లై శాఖలోని ఒకరిద్దరు అధికారులే ఈ దందాను ముందుండి నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ దందా రెండు నెలల క్రితం వరకు మహారాష్ట్రకు.. బస్తాలు మార్చి సివిల్ సప్లయీస్ గోదాంలకు తరలింపు సహకరిస్తున్న సివిల్ సప్లయీస్ అధికారులు..? -
విద్యార్థులతో పనులపై కలెక్టర్ సీరియస్
● ఇద్దరిపై చర్యలు కాటారం: మండలంలోని గంగారం మోడల్ స్కూల్లో విద్యార్థులతో పనులు చేయించిన ఘటనపై కలెక్టర్ రాహుల్ శర్మ సీరియస్ అయ్యారు. ఫిబ్రవరి 28న మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని పదో తరగతి విద్యార్థులు ఎత్తడం వివాదాస్పదంగా మారింది. మార్చి 1న పలు పత్రికల్లో ప్రచురితం కావడంతో కలెక్టర్ దృష్టికి వెళ్లింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ నాగరాజు విచారణ జరిపి నివేదిక అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మనోహర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఔట్సోర్సింగ్ విధానంలో పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్ కేక్యానాయక్ను విధుల నుంచి తొలగిస్తూ డీఈఓ రాజేందర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆర్చరీ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కాటారం: మండలకేంద్రానికి చెందిన రామిళ్ల రాజశేఖర్ కుమార్తె రామిళ్ల అనయ ఆర్చరీ విభాగంలో రాణిస్తుంది. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని కొల్లూర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అనయ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 17న గుంటూరులో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో అనయ పాల్గొననుంది. ఈ కార్యక్రమంలో మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రామారావు, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పవన్ కళ్యాణ్ పాల్గొని మెడల్ అందజేశారు. జాతీయ స్థాయికి ఎంపికై న అనయను కోచ్ శ్రీనివాస్, అభిషేక్ అభినందించారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి భూపాలపల్లి అర్బన్: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్‌శర్మ హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దుద్దిళ్ల శ్రీపాదరావు ప్రజా సేవకు అంకితమై ప్రజాస్వామ్య పరిపరక్షణకు విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రఘు, డీఎల్పీఓ వీరభద్రయ్య, గృహ నిర్మాణ శాఖ అధికారి రాయలింగు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాటారం: కాటారం–మంథని ప్రధాన రహదారిపై కాటారం శివారులో జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రమేశ్ కాటారం వచ్చి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కాటారం శివారు పెట్రోల్ పంప్ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనాన్ని మళ్లించే క్రమంలో ఎదురుగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొని కిందపడి తల, చేతులకు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు. రమేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఇబ్బందులు లేకుండా ‘రంజాన్’ ఏర్పాట్లు
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: రంజాన్ మాసంలో ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. నేటి(ఆదివారం) నుంచి ప్రారంభమైన రంజాన్ మాసం ఏర్పాట్లుపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలన్నారు. ప్రత్యేక ప్రార్థనా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్ మండలాల్లో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రార్థనా మందిరాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఉండాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా రంజాన్ పండుగను ప్రజలందరూ జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శైలజ, డీఎస్పీ సంపత్‌రావు, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్‌నాయక్, డీపీఓ నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. యూడీఐడీపై అవగాహన కల్పించాలి.. దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంపై అవగాహన కల్పించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ సూచించారు. శనివారం యూడీఐడీ, సోలార్ విద్యుత్ ఏర్పాటుకు మహిళా సంఘాలు డీపీఆర్ అందజేసే అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మ జిల్లా అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారులు యూడీఐడీ పోర్టల్ ద్వారా స్లాట్‌బుక్ చేసుకునేందుకు మీసేవా కేంద్రాల నిర్వాహకులు, డీఆర్డీఏ, సంక్షేమ శాఖల సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్ క్యాంప్‌లో దివ్యాంగులకు సర్టిఫికెట్ జారీ చేయుటకు కావాల్సిన సామగ్రి, టెక్నీషియన్స్, వైద్యుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఆర్డీఓ నరేష్ పాల్గొన్నారు. -
ట్రెజరీలో పైసా వసూల్..?
● ప్రైవేట్ వ్యక్తి ఫోన్‌కు డిజిటల్ చెల్లింపు కాళేశ్వరం: భూపాలపల్లి, కాటారం సబ్‌డివిజన్‌లో ప్రభుత్వ ఉద్యోగులు డీడీఓల ద్వారా ప్రతి నెల ట్రెజరీకి వేతన బిల్లులు సమర్పిస్తున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో ఐటీ రిటర్న్‌లు, పన్ను మినహాయింపు బిల్లులు వేతన బిల్లులతో జత చేయాల్సి ఉంది. దీంతో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం అక్రమమార్గంలో బిల్లులు చెల్లించడంతో వాటిని అదునుగా తీసుకున్న ట్రెజరీశాఖ ఉద్యోగులు పైసా వసూల్‌కు తెరలేపారని సమాచారం. కాటారం, భూపాలపల్లిలో ట్రెజరీ ఉద్యోగులు అందినకాడికి తప్పులు ఎత్తిచూపి డబ్బులు లాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మొత్తం 28 ప్రభుత్వ పాఠశాలల్లోని స్కూల్కాంప్లెక్సులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు నాలుగువేల మంది వరకు ఉన్నారు. ఇందులో ప్రతీ స్కూల్ కాంప్లెక్సుకు రూ.20వేల నుంచి 30వేల వరకు ఐటీ రిటర్న్‌లు, పన్ను మినహాయింపుల కోసం డబ్బులు చేతులు మారాయని తెలిసింది. వీరిపైన ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంతో భూపాలపల్లి, కాటారం డివిజన్లలో పైసావసూల్ అంతా నగదు రూపంలో కాకుండా డిజిటల్ చెల్లింపుల ద్వారా యథేచ్ఛగా సాగినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల తప్పులు కూడా ఉండడంతో ట్రెజరీ ఉద్యోగులపై ఫిర్యాదు చేయడానికి జంకుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహరంతో ట్రెజరీ శాఖ ఉద్యోగులు పదిరోజుల్లో రూ.లక్షల్లో అక్రమమార్గంలో సంపాదించారని కోడై కూస్తుంది. డిజిటల్ చెల్లింపులకు ఓ ప్రైవేట్ వ్యక్తిని కూడా ఏర్పాటు చేసుకొని వారి ఫోన్‌కు డబ్బులు పంపితేనే ఫైల్ కదులుతుందని ఓ ప్రభుత్వ ఉద్యోగి వాపోయారు. వీరిపై అధికారులు అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు బాధిత ఉద్యోగులు కోరుతున్నారు. -
రామప్పను దర్శించిన కేరళీయులు
వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప ఆలయాన్ని కేరళకు చెందిన 27 మంది శనివారం సందర్శించారు. అంతర్రాష్ట్ర యువజన సమ్మేళన కార్యక్రమంలో భాగంగా కేరళకు చెందిన యువకులు రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను టూరిజం గైడ్ విజయ్‌కుమార్ వివరించారు. గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సును సందర్శించి వేలాడే వంతెన, ప్రకృతి అందాలను తిలకించినట్లు నెహ్రూ యువకేంద్రం సూపరింటెండెంట్ బానోత్ దేవీలాల్ తెలిపారు. కార్యక్రమంలో భాను, సురేశ్, భిక్షపతి పాల్గొన్నారు. రామప్పను సందర్శించిన విదేశీయుడు.. రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన మార్క్ మెక్ లహ్ సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. నందీశ్వరుడి అందాలను సెల్ఫోన్లో బంధించుకున్నారు. రామప్పను సందర్శించిన పర్యాటకులు అమెరికన్‌తో ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. -
ఆన్లైన్ మోసాలపై అవగాహన
భూపాలపల్లి అర్బన్: ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల నివారణపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కోర్టులో శనివారం న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి బ్యాంక్ అధికారులు జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన కల్పించారు. అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నారాయణబాబు ప్రారంభించారు. బ్యాంక్ అధికారులు, రిస్సోర్స్ పర్సన్స్ సాయిచరణ్,, రాకేష్, అనిల్, శ్రీకాంత్ ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలపై వివరించారు. నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్లో కేసులను ఎలా ఫైల్ చేయాలి, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల పట్ల తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. డిజిటల్ లిటరసీ అనేది చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ జడ్జిలు జయరాంరెడ్డి, రామచంద్రరావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఉదయాన్నే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలలో హేమాచల క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంతంలోని చింతామని జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. సంతాన ప్రాప్తికి వచ్చిన దంపతులకు ఆలయ పూజారులు నాభిచందన ప్రసాదం అందజేశారు. -
85శాతం బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో ఫిబ్రవరి మాసంలో 85శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏరియాకు గడిచిన మాసంలో 4.55లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 3.90లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 85శాతంలో నిలిచినట్లు తెలిపారు. వెలికితీసి బొగ్గులో 3.27లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు చెప్పారు. మార్చి మాసానికి 6.39లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గైర్హాజరు శాతాన్ని తగ్గించి ఉత్పత్తి పెంచే విధంగా కార్మికులు కృషి చేయాలని సూచించారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంజూర్‌నగర్‌లోని ఇల్లంద క్లబ్‌హౌజ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
డిజిటల్ క్రాప్ సర్వే
పకడ్బందీగా పంటల లెక్క..జిల్లా వివరాలు..సర్వే ఇలా.. సర్వే నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది. ఏఈఓలు పంటల సాగు విస్తీర్ణం, పంట రకం అంశాలను అందులో నమోదు చేస్తున్నారు. సర్వే నంబర్ ఎంట్రీ చేయగానే ఆ పరిధిలో ఉన్న రైతుల వివరాలు కనిపిస్తాయి. కావాల్సిన రైతు పేరు ఎంచుకోగానే వారి పేరిట ఉన్న భూమి వివరాలు దర్శనమిస్తాయి. అందులో రైతు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడో నమోదు చేయాలి. సాగు ఫొటోను అప్లోడ్ చేయాలి. ఒక వేళ సాగులో లేని భూమి ఉంటే వాటిని నాన్క్రాప్ కింద నమోదు చేయాల్సి ఉంటుంది. ● క్షేత్రస్థాయిలో వివరాలు నమోదుచేస్తున్న ఏఈఓలు ● పంటకాలం వరకు గడువు ● నివేదిక ఆధారంగా పంట దిగుబడి కొనుగోళ్లుమండలాలు 12డిజిటల్ క్రాప్ సర్వే చేయాల్సిన భూమి 88,000ఎకరాలువ్యవసాయ శాఖ సబ్ డివిజన్లు – 2 (భూపాలపల్లి, మహదేవపూర్)కాటారం: డిజిటల్ క్రాప్ సర్వేతో పంటల లెక్క ఇక పక్కాగా ఉండనుంది. ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది, ఏఈఓలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆయా పంటల సాగు వివరాలు పక్కాగా తేలనున్నాయి. వీటి ఆధారంగా రైతుల పంట దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పంటకాలం పూర్తయ్యే వరకు సర్వే ముగించాల్సి ఉంటుంది.సర్వే పూర్తయింది 33,000ఎకరాలు వ్యవసాయశాఖ క్లస్టర్లు 45రైతులు 1,33,412ఏఈఓలు 45 మందిజిల్లాలో సాగు భూమి 2,43,112ఎకరాలుప్రతి సర్వే నంబర్‌కు వెళ్లాల్సిందే.. వ్యవసాయ శాఖ సమకూర్చిన ట్యాబ్స్‌తో ఏఈఓలు సర్వే చేస్తున్నారు. తమ వద్ద ఉన్న ట్యాబ్‌లలో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ యాప్‌లోనే క్లస్టర్ పరిధిలోని ఏయే సర్వే నంబర్లలో సర్వే చేయాలనే వివరాలు ఉన్నాయి. ప్రతీ సర్వే నంబర్‌తో పాటు సబ్ సర్వే నంబర్ వద్దకు ఏఈఓలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ సర్వే నంబర్లో 25 మీటర్లకు మించి దూరం ఉంటే వివరాలు చూపించడం లేదు. దీంతో ఏ ఒక్క సర్వే నంబర్ సమాచారం లేకున్నా అప్లోడ్ కాదు. ప్రతీ సర్వే నంబర్ వద్దకు ఏఈఓలు వెళ్తున్నారు. పలుచోట్ల ఇబ్బందులు.. సర్వేలో భాగంగా ఏఈఓలు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఓ పక్క పెరుగుతున్నా ఎండలు ముప్పుతిప్పలు పెడుతుంటే కొన్ని చోట్ల ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం, యాప్ ఓపెన్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల సర్వర్ నెమ్మదించడం, మరికొన్ని చోట్ల రైతుల చేలల్లో లొకేషన్ తప్పుగా చూపించడం, సర్వేనంబర్లు కనిపించకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఏఈఓలు చెబుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏఈఓలు క్రాప్ సర్వేను నిర్వహిస్తున్నారు. పంటల నమోదు ఆధారంగా కొనుగోళ్లు.. సర్వేతో రైతులు సాగుచేసే పంటల వివరాలు పక్కాగా తేలనున్నాయి. తదనుగుణంగా వచ్చే దిగుబడిని రైతులు మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థకు మద్దతు ధరతో విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. డిజిటల్ క్రాప్ సర్వే రైతులకు ఎంతో మేలు చేకూర్చనుంది. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు బీమా పొందడానికి, పంట నష్టం అంచనా వేయడానికి దోహదపడుతుంది. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకువెళ్లి మద్దతు ధర పొందడానికి ఉపయోగపడుతుంది. వానాకాలంలో డిజిటల్ క్రాప్ సర్వే చేయించుకోకపోవడంతో పత్తి అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.రైతులు సహకరించాలి జిల్లావ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏఈఓలు రైతుల చేలు, పంట పొలాల వద్దకు వెళ్లి సాగు వివరాలు అక్కడే నమోదు చేస్తున్నారు. క్రాప్ సర్వే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి, పంటల బీమా, పరిహారం పొందడానికి సహాయపడుతుంది. రైతులు సర్వేకు వచ్చే ఏఈఓలకు సహకరించాలి. – విజయభాస్కర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి● -
18 రోజులుగా ఇక్కడే తిష్ట
కాటారం: పులి నివసించడానికి అనువైన ప్రదేశం కాదు..దట్టమైన అటవీ ప్రాంతం అసలే కాదు.. కానీ ఎక్కడి నుంచో వచ్చిన పెద్దపులి ఇక్కడే 18 రోజులుగా తిష్టవేసింది. ఎటు వెళ్లాలో దారి దొరకకనో లేక స్థిర ఆవాసం కోసం ప్రయత్నిస్తుందో ఏమో కానీ పులి కాటారం, మహదేవపూర్ అడవి ప్రాంతంలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సంచరిస్తుంది. రెండు రోజులకు ఒక చోట ఆనవాళ్లు వదులుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఫిబ్రవరి 10న మహదేవపూర్ రేంజ్ పరిధిలోని కాటారం మండలం నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలో ఓ రైతుకు పులి కనిపించడంతో పులి సంచారం ప్రచారంలోకి వచ్చింది. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలు (ప్లగ్మార్క్స్) గుర్తించి సంచారంపై ఆరా తీశారు. మరుసటి రోజు కాటారం రేంజ్ పరిధిలోని వీరాపూర్ అటవీ ప్రాంతంలో పులి తిరిగినట్లు అధికారులకు ఆనవాళ్లు లభించాయి. అనంతరం మహదేవపూర్ మండలం కుదురుపల్లి, పల్గుల, బీరాసాగర్, గుండ్రాత్‌పల్లి అటవీ ప్రాంతంలో పులి కనిపించినట్లు పలువురు తెలపడంతో అధికారులు పాదముద్రలు గుర్తించి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటుచేసి పులి కదలికలపై నిఘా పెట్టారు. కానీ ఎక్కడ కూడా పులి కెమెరాలకు చిక్కిన దాఖలాలు లేవు. మధ్యలో రెండు, మూడు రోజులు జాడా లేకుండా పోయిన పులి రెండు రోజుల క్రితం మహదేవపూర్ మండలం ఏన్కపల్లిలో దర్శనమిచ్చింది. అక్కడి నుంచి ప్రతాపగిరి అడవుల్లోకి పులి చేరినట్లు శుక్రవారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీశాఖ అధికారులు శనివారం ప్రతాపగిరి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఓ వాగు వద్ద నీరు తాగినట్లు పాదముద్రల ఆనవాళ్లు సేకరించారు. నస్తూర్‌పల్లి అడవి వైపుగా వచ్చినట్లు కొంత దూరం పాదముద్రలు ఉన్నాయని కానీ ఎటు వెళ్లిందనేది మాత్రం స్పష్టత లేదని అటవీశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక్కడిక్కడే.. గతంలో రెండు మార్లు పులి కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతంలో సంచరించినప్పటికీ ఎప్పుడు కూడా మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఉన్న దాఖలాలు లేవు. కానీ 18 రోజులుగా పులి ఇక్కడిక్కడే తచ్చాడుతుండటంతో దారి దొరకక ఎటు వెళ్లలేక ఉండిపోతుందో లేక ఈ అటవీ ప్రాంతంలో శాశ్వత ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి అనువైన స్థలం కోసం చూస్తుందో అంతుచిక్కకుండా పోయింది. ఒకటి రెండుమార్లు పులి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గోదావరి నదిని దాటి చెన్నూరు అటవీ ప్రాంతంలోకి వెళ్లడానికి ప్రయత్నించినట్లు కొన్ని రోజుల క్రితం అటవీశాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. కాటా రం మండలం గుండ్రాత్‌పల్లి సమీపంలోని గోదావరి నది దాటడానికి వచ్చిన పులి కుక్కలు వెంటపడటంతో తిరిగి మహదేవపూర్ అడవిలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అటు నుంచి మళ్లిన పులి కాటారం, మహదేవపూర్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో కలియ తిరుగుతుంది. పులి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఏ వైపుగా వస్తుందో తెలియక అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులికి సంబంధించిన కదలికలను పూర్తి స్థాయిలో కనుక్కోవడం అటవీశాఖ అధికారులకు క్లిష్టతరంగా మారింది. కాటారం, మహదేవపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం దారి దొరకకనా..ఆవాసం కోసమా.. -
ప్రజల వద్దకే తపాలా సేవలు
రేగొండ: ప్రజల వద్దకు పోస్టాఫీస్ సేవల కార్యక్రమంలో భాగంగా పరకాల ఏఎస్పీ అనంత్రామ్ నాయక్ శనివారం కొత్తపల్లిగోరి మండలంలోని రాజక్కపల్లి, చిన్నకోడేపాక, చెన్నాపూర్ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసరా పెన్షన్, ఉపాధిహామీ నగదును లబ్ధిదారులకు అందజేశారు. నిస్సహాయక పెన్షన్‌దారులు కొండెటి సూరమ్మ ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టాఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూ.755లకు రూ.15 లక్షల ప్రమాదబీమా సౌకర్యాన్ని ప్రజలు ఉపఝెగించుకోవాలని అన్నారు. తపాలాశాఖ మినీ ఏటీఎం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట తపాలా సిబ్బంది సంతోష్, కృష్ణ ఉన్నారు. -
ప్రశ్నించినందుకే హత్య చేశారు..
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో జరుగుతున్న అక్రమాలు, న్యాయం కోసం ప్రశ్నిస్తూ, కోర్టులో కేసులు వేయడం వలనే సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్య చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నారాయణ తెలిపారు. పౌర హక్కుల సంఘం నాయకులు శుక్రవారం రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా భూ అక్రమాలు, మాఫియాలపై కేసులు వేస్తే 80మంది వరకు హత్యగావించబడ్డారన్నారు. ఈ హత్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయి ప్రజలు తిరగబడుతారని తెలిపారు.పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు -
ఫోన్‌పేతో బురిడీ..
కాటారం: డిజిటల్ లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు నిత్యం అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కడో ఒక్కచోట కొందరు ప్రజలను, వ్యాపారులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా శుక్రవారం ఓ దుకాణం యజమానిని మోసంచేసి చివరకు దుండగుడు దొరికిపోయారు. బాధిత దుకాణం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలకేంద్రంలోని గారెపల్లిలో ముస్కమల్ల సత్యం ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఓ యువకుడు దుకాణానికి వచ్చి పలు రకాల సామగ్రి కొనుగోలు చేశాడు. అనుమానం రాకుండా సామగ్రికి సంబంధించిన ధరపై దుకాణం యజమానితో బేరాలు సైతం చేశాడు. సదరు వ్యక్తి కొనుగోలు చేసిన సామగ్రికి సంబంధించి రూ.4వేలు అయింది. ఫోన్ పే చేస్తానని చెప్పడంతో దుకాణం యజమాని సత్యం స్కానర్ చూపించాడు. ఫేక్ ఫోన్ పే ద్వారా రూ.4వేలు చెల్లించిన దుండగుడు పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపించి వెళ్లిపోయాడు. కొంత సమయం వరకు కూడా డబ్బులు జమకాకపోవడంతో అనుమానం వచ్చిన దుకాణం యజమాని అకౌంట్ చెక్ చేసుకోగా డబ్బుల చెల్లింపు జరగలేదు. అప్రమత్తమైన యజమాని దుండగుడిని వెంబడించాడు. చివరకు భూపాలపల్లిలో పట్టుకొని ప్రశ్నించగా ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా చెల్లింపు చేసినట్లు ఒప్పుకున్నాడు. దుండగుడిది గొల్లబుద్ధారం సమీపం నర్సింగపురం అని తెలిసింది. మోసానికి పాల్పడిన యువకుడిని పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు దుకాణం యజమాని సత్యం తెలిపారు. -
ఉద్యోగ విరమణ తప్పనిసరి
భూపాలపల్లి రూరల్: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన గుండు నాగభూషణం–పద్మ దంపతులను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. గృహోపకరణాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. పోలీసులంటేనే ఎన్నో రకాల త్యాగాలతో పాటు, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తారన్నారు. సుమారు 40 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాగభూషణం అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చె ప్పారు. ఏదేని సమస్యలు ఉంటే రిటైర్డ్ ఉద్యోగులు తనను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవా లని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఎస్సైలు నగేష్, కిరణ్, శ్రీకాంత్, రత్నం, పోలీసు అధికారుల సంఘం నేత యాదిరెడ్డి పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్‌ఖరే -
పంచాయతీలే ముందంజ
పల్లెల్లో 74.62శాతం ఆస్తిపన్ను వసూలుభూపాలపల్లి: ఆస్తి పన్నుల వసూలులో గ్రామ పంచాయతీలే ముందున్నాయి. జిల్లాలోని ఏకై క భూపాలపల్లి మున్సిపాలిటీ లక్ష్యం చేరుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 30 రోజులు మాత్రమే గడువు ఉండగా పల్లెలు వందశాతానికి చేరువ కానుండగా మున్సిపాలిటీలో మాత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. పల్లెలే బెస్ట్.. జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటి నుంచి రూ. 4కోట్ల 4లక్షల 52వేల 378 ఆస్తి పన్ను రావాల్సి ఉండగా నిన్నటి(శుక్రవారం) వరకు 74.62 శాతం వసూలు అయ్యాయి. మిగిలిన బకాయిలను ఈ నెల చివరిలోపు వసూలు చేసేందుకు పంచాయతీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అత్యధికంగా కాటారం మండలంలో 91.36 శాతం, మొగుళ్లపల్లిలో 81.64 శాతం వసూలు అయ్యాయి. టేకుమట్ల 64.98 శాతం వసూలు చేసి చివరి స్థానంలో నిలిచింది. ఈ నెల చివరిలోపు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 90 శాతానికి పైగా పన్ను వసూలు జరిగే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీ లక్ష్యం చేరేనా..? భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో నివాస, వ్యాపార, నివాస, వ్యాపార భవనాలు 12,223 ఉన్నాయి. వాటి నుంచి రూ. 5.75 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉండగా.. నిన్నటి వరకు 60.84 శాతం రూ.3.50 కోట్లు వసూలు అయ్యాయి. రూ.2.25 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిల వసూలు కోసం మున్సిపాలిటీ అధికారులు నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఐదుగురు అధి కారులను నియమించారు. వీరు భారీ మొత్తంలో పన్ను బకాయి ఉన్న వారి భవనాల వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. అ యినప్పటికీ పన్నులు చెల్లించని పక్షంలో ఆస్తులను సైతం జప్తు చేస్తున్నారు. అయినప్పటికీ వసూలు అంతంత మాత్రంగానే అవుతోంది. మున్సిపాలిటీలో 60.84 శాతమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం అంతంతే మిగిలింది 30 రోజులే -
గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్నుల వివరాలు(రూ.లక్షల్లో)
మండలం డిమాండ్ వసూలు బకాయి భూపాలపల్లి రూ.30,45,525 రూ. 21,31,502 రూ.9,14,023 చిట్యాల రూ.34,68,947 రూ.25,02,159 రూ.9,66,788 గణపురం రూ.83,25,662 రూ.64,00,652 రూ.19,25,010 కాటారం రూ.36,97,673 రూ.33,78,344 రూ.3,19,329 మహదేవపూర్ రూ.48,12,178 రూ. 35,43,923 రూ. 12,68,255 మహాముత్తారం రూ.17,89,060 రూ.12,25,319 రూ.5,63,741 మల్హర్ రూ.28,98,421 రూ.20,11,448 రూ.8,86,973 మొగుళ్లపల్లి రూ.26,03,332 రూ.21,25,452 రూ.4,77,880 పలిమెల రూ.5,65,619 రూ.4,38,868 రూ.1,26,751 రేగొండ, కొత్తపల్లిగోరి రూ.62,47,790 రూ.44,78,331 రూ.17,69,459 టేకుమట్ల రూ.29,98,171 రూ.19,48,074 రూ.10,50,097 మొత్తం రూ. 4,04,52,378 రూ. 3,01,84,072 రూ. 1,02,68,306 -
ఉద్యోగ విరమణ తప్పనిసరి
భూపాలపల్లి రూరల్: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన గుండు నాగభూషణం–పద్మ దంపతులను జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. గృహోపకరణాలను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. పోలీసులంటేనే ఎన్నో రకాల త్యాగాలతో పాటు, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తారన్నారు. సుమారు 40 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాగభూషణం అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చె ప్పారు. ఏదేని సమస్యలు ఉంటే రిటైర్డ్ ఉద్యోగులు తనను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవా లని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఎస్సైలు నగేష్, కిరణ్, శ్రీకాంత్, రత్నం, పోలీసు అధికారుల సంఘం నేత యాదిరెడ్డి పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్‌ఖరే -
కాలనీల్లో పర్యటించిన కమిషనర్
భూపాలపల్లి అర్బన్: పట్టణంలోని పలు కాలనీల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శుక్రవారం పర్యటించారు. రాజీవ్‌నగర్, కారల్మార్క్స్కాలనీల్లో ఇంటింటికీ తిరిగి తాగునీటి సరఫరాను పరిశీలించారు. ప్రతి రోజు నీటి సరఫరా సరిగా వస్తుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా నీటిని వృథా చేయవద్దన్నారు. అనంతరం పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాటర్ సప్లై, ఎలక్ట్రిషన్ స్టాక్ రిజిస్టర్లు, మెటీరియల్స్, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌ను కొనసాగించాలని పట్టణంలో వీధి దీపాల అంతరాయం ఉండకుండా ఎప్పటికప్పుడు మరమ్మతు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ మానస, సిబ్బంది పాల్గొన్నారు. -
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
భూపాలపల్లి: పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఎంఈఓలు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 3,449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. గతేడాది తక్కువ శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ ఏడాది ఖచ్చితంగా వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశం ప్రారంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి రామానుజం చిత్ర పటానికి పూల మాలలు వేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డీపీఆర్ఓ శ్రీనివాస్, పరీక్షల విభాగం ప్రత్యేక అధికారి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. పుష్కర ఏర్పాట్లు వేగిరం చేయాలి.. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల్లపై రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ, విద్యుత్‌శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ 4, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం 7, మిషన్ భగీరథ 15, దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం 28, విద్యుత్ 11 మొత్తం 65 పనులు పూర్తి చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. త్వరలో ఎన్నికల కోడ్ ముగియనున్నందున పనులు సత్వరమే చేపట్టేలా అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పీఎం శ్రీ పనులు పూర్తి చేయాలి.. పీఎం శ్రీ, సర్వ శిక్షా అభియాన్ పనులను మార్చి 20వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులతో నిధులు మంజూరు, చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో డీఈఓ రాజేందర్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేసే అంశాలపై హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రెవెన్యూ, ఇంటర్మీడియట్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, ఆర్టీసీ, వైద్య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 3,720 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పుష్కరాల పనులు వేగవంతం కలెక్టర్ రాహుల్ శర్మ -
విమానం ఎగురుడే..!
మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం పచ్చజెండా ● హెచ్ఐఎల్ ఇచ్చిన ఎన్ఓసీకి ఆమోదం ● రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరిస్తే ముందుకే.. ● 253 ఎకరాలు ఏఏఐకి అప్పగిస్తే పనులు షురూసాక్షి, వరంగల్: వరంగల్ నగరవాసులను దశాబ్దాలుగా ఊరిస్తున్న విమాన ప్రయాణం కొద్ది నెలల్లోనే సాకారం కానుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో 2038 సంవత్సరం వరకు మరో వాణిజ్య విమానాశ్రయం ఉండద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (హెచ్ఐఎల్)కు ఒప్పందం ఉన్నా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరపడంతో నిరంభ్యంతరపత్రం (ఎన్ఓసీ) ఇచ్చింది. దీనికి కేంద్రం కూడా అంగీకారం తెలిపింది. ముఖ్యంగా మామునూరు విమానాశ్రయ నిర్మాణం కోసం 253 ఎకరాల అదనపు భూమిని సేకరించి ఇస్తే ఏఏఐ టెండర్లు పిలిచి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశముంది. ఇప్పటికే ఈ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ దిశగా వరంగల్ రెవెన్యూ అధికారులు కూడా భూసర్వే చేసి పూర్తి వివరాలను కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు ఇచ్చారు. భూ నిర్వాసితులకు భూమికి బదులు భూమి, కాదనుకునేవారికి నష్టపరిహారం ఇవ్వనున్నారు. మరోమారు గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి , మామునూరు రైతులతో చర్చలు జరిపి సాధ్యమైనంత తొందరగా ఈ భూమి ఏఏఐకి అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ తొలి దశను డిసెంబర్‌లోగా పూర్తి చేసి దేశీయ విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కృతనిశ్చయంతో ఉండడంతో మామునూరులో విమానాలు ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది. భూసేకరణ పూర్తయితే 150 నుంచి 186 మంది ప్రయాణించేలా వీలున్న 37.6 మీటర్లు (123 ఫీట్ల) పొడవున్న ఏ 320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. 2022లో ‘ఉడాన్’కు ఎంపిక చిన్న నగరాలను రాష్ట్ర, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం 2016లో ఉడాన్ (ఉడో దేశ్ కీ ఆమ్ నాగరిక్) పథకం తీసుకొచ్చింది. దీని కింద మామునూరు విమానాశ్రయాన్ని 2022 సెప్టెంబర్‌లో ఎంపిక చేసింది. వరంగల్ శివారులోని మామూనూరులో నిజాం కాలంలో ఎయిర్‌స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. దశాబ్దాలుగా వినియోగం లేకపోవడంతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత ఎయిర్‌స్ట్రిప్‌కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆధీనంలో ఉంది. ఈ రన్ వే విస్తరణ కోసం అదనంగా అవసరమయ్యే 253 ఎకరాల భూసేకరణ జరగాలంటే ప్రజాప్రతినిధులతోపాటు రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలి. పర్యాటకం, ఐటీ, పరిశ్రమలకు బూస్ట్.. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ రంగాలు అభివృద్ధి చెందనున్నాయి. సమీపంలోని పర్యాటక ప్రాంతాలైన భద్రాచలం, రామప్ప, లక్నవరం, మేడారానికి మరింతగా సందర్శకులు పెరుగుతారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టైర్ 2 పట్టణాల్లోనూ ఐటీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎయిర్పోర్ట్ కీలకంగా మారనుంది. అలాగే, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కై టెక్స్ మాదిరిగానే మరిన్ని అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ముందుకు వస్తే పెట్టుబడులు పెరిగి ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశముంది. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశముంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ తరహాలో.. కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధ్యయనం చేసి అక్కడి మాదిరిగా ఇక్కడ వసతులు కల్పించేలా చూడాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అక్కడి ప్రత్యేకత ఏమిటో అనే చర్చ వచ్చింది. ‘కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ (సీఐఏఎల్) పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో నెడుంబస్సెరీ ప్రాంతంలో 1213 ఎకరాల్లో నిర్మించారు. 1999 మే 25న అందుబాటులోకి వచ్చింది. ఏ ప్రాంతం నుంచైనా చేరుకునేలా 56 రేడియల్ రోడ్లను నిర్మించారు. సమీప పర్యాటక ప్రాంతాలైన పథనంతిట్ట, ఎర్నాకులం, కొట్టాయం, అలిప్పి నుంచి నేరుగా చేరుకులా ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారులను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్మించిన తొలి ఎయిర్పోర్ట్ ఇది. 32 దేశాలకు చెందిన 10 వేల మంది ఎన్ఆర్ఐలు ఈ విమానాశ్రయ నిర్మాణానికి నిధులు ఇచ్చారు. కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం 31 అంతర్జాతీయ, 22 దేశీయ గమ్యస్థానాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పూర్తిగా సోలార్ విద్యుత్‌తో నడిచే విమానాశ్రయాల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది. తొలుత దేశీయ విమానాల రాకకు టెర్మినల్స్‌ను నిర్మించారు. అనంతరం దశల వారీగా విస్తరణ చేశారు. ప్రస్తుతం మూడు టెర్మినళ్లు ఉన్నాయి. ఒకటి దేశీయ, రెండోది అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సేవలు అందిస్తోంది. మరో దానిలో కార్గో సేవలను నిర్వహిస్తున్నారు. 2023–2024లో 1.08 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల రాకపోకల పరంగా దేశంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది’ అని పౌర విమానాయన శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. -
పంచాయతీలే ముందంజ
పల్లెల్లో 74.62శాతం ఆస్తిపన్ను వసూలుభూపాలపల్లి: ఆస్తి పన్నుల వసూలులో గ్రామ పంచాయతీలే ముందున్నాయి. జిల్లాలోని ఏకై క భూపాలపల్లి మున్సిపాలిటీ లక్ష్యం చేరుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 30 రోజులు మాత్రమే గడువు ఉండగా పల్లెలు వందశాతానికి చేరువ కానుండగా మున్సిపాలిటీలో మాత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. పల్లెలే బెస్ట్.. జిల్లాలోని 12 మండలాల్లో 248 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటి నుంచి రూ. 4కోట్ల 4లక్షల 52వేల 378 ఆస్తి పన్ను రావాల్సి ఉండగా నిన్నటి(శుక్రవారం) వరకు 74.62 శాతం వసూలు అయ్యాయి. మిగిలిన బకాయిలను ఈ నెల చివరిలోపు వసూలు చేసేందుకు పంచాయతీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అత్యధికంగా కాటారం మండలంలో 91.36 శాతం, మొగుళ్లపల్లిలో 81.64 శాతం వసూలు అయ్యాయి. టేకుమట్ల 64.98 శాతం వసూలు చేసి చివరి స్థానంలో నిలిచింది. ఈ నెల చివరిలోపు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 90 శాతానికి పైగా పన్ను వసూలు జరిగే అవకాశాలున్నాయి. మున్సిపాలిటీ లక్ష్యం చేరేనా..? భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో నివాస, వ్యాపార, నివాస, వ్యాపార భవనాలు 12,223 ఉన్నాయి. వాటి నుంచి రూ. 5.75 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉండగా.. నిన్నటి వరకు 60.84 శాతం రూ.3.50 కోట్లు వసూలు అయ్యాయి. రూ.2.25 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిల వసూలు కోసం మున్సిపాలిటీ అధికారులు నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ఐదుగురు అధి కారులను నియమించారు. వీరు భారీ మొత్తంలో పన్ను బకాయి ఉన్న వారి భవనాల వద్దకు వెళ్లి నోటీసులు జారీ చేస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. అ యినప్పటికీ పన్నులు చెల్లించని పక్షంలో ఆస్తులను సైతం జప్తు చేస్తున్నారు. అయినప్పటికీ వసూలు అంతంత మాత్రంగానే అవుతోంది. మున్సిపాలిటీలో 60.84 శాతమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా ఫలితం అంతంతే మిగిలింది 30 రోజులే -
ప్రశ్నించినందుకే హత్య చేశారు..
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో జరుగుతున్న అక్రమాలు, న్యాయం కోసం ప్రశ్నిస్తూ, కోర్టులో కేసులు వేయడం వలనే సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్య చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నారాయణ తెలిపారు. పౌర హక్కుల సంఘం నాయకులు శుక్రవారం రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా భూ అక్రమాలు, మాఫియాలపై కేసులు వేస్తే 80మంది వరకు హత్యగావించబడ్డారన్నారు. ఈ హత్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయి ప్రజలు తిరగబడుతారని తెలిపారు.పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు -
ఫోన్‌పేతో బురిడీ..
కాటారం: డిజిటల్ లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు నిత్యం అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కడో ఒక్కచోట కొందరు ప్రజలను, వ్యాపారులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా శుక్రవారం ఓ దుకాణం యజమానిని మోసంచేసి చివరకు దుండగుడు దొరికిపోయారు. బాధిత దుకాణం యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలకేంద్రంలోని గారెపల్లిలో ముస్కమల్ల సత్యం ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఓ యువకుడు దుకాణానికి వచ్చి పలు రకాల సామగ్రి కొనుగోలు చేశాడు. అనుమానం రాకుండా సామగ్రికి సంబంధించిన ధరపై దుకాణం యజమానితో బేరాలు సైతం చేశాడు. సదరు వ్యక్తి కొనుగోలు చేసిన సామగ్రికి సంబంధించి రూ.4వేలు అయింది. ఫోన్ పే చేస్తానని చెప్పడంతో దుకాణం యజమాని సత్యం స్కానర్ చూపించాడు. ఫేక్ ఫోన్ పే ద్వారా రూ.4వేలు చెల్లించిన దుండగుడు పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపించి వెళ్లిపోయాడు. కొంత సమయం వరకు కూడా డబ్బులు జమకాకపోవడంతో అనుమానం వచ్చిన దుకాణం యజమాని అకౌంట్ చెక్ చేసుకోగా డబ్బుల చెల్లింపు జరగలేదు. అప్రమత్తమైన యజమాని దుండగుడిని వెంబడించాడు. చివరకు భూపాలపల్లిలో పట్టుకొని ప్రశ్నించగా ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా చెల్లింపు చేసినట్లు ఒప్పుకున్నాడు. దుండగుడిది గొల్లబుద్ధారం సమీపం నర్సింగపురం అని తెలిసింది. మోసానికి పాల్పడిన యువకుడిని పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు దుకాణం యజమాని సత్యం తెలిపారు. -
నా భర్త హత్యపై దర్యాప్తు జరిపించాలి
భూపాలపల్లి: ఈ నెల 19న దారుణ హత్యకు గురైన భూపాలపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి భార్య సరళ గురువారం సంచలన ఆరోపణలు చేస్తూ మీడియాకు ఒక వీడియోను విడుదల చేసింది. భూపాలపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట గల రెండు గుంటల భూ వివాదం కారణంగా తన భర్త హత్యకు గురి కాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కోర్టులో కేసు వేసినందుకే హత్యకు గురయ్యాడని పేర్కొంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మున్సిపాలిటీ మాజీ వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు కుట్ర పన్ని హత్య చేయించారని ఆరోపించారు. తన భర్త హత్య కేసును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించాలని ఆమె సీఎం రేవంత్‌రెడ్డిని వేడుకున్నారు. తనకు కూడా ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఇప్పటికై నా హరిబాబును పట్టుకుంటే తన భర్త ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. ఈ హత్యపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కొత్త హరిబాబులపై అనుమానం వ్యక్తం చేస్తూ, ఫిర్యాదు చేస్తానని తెలపగా, వాళ్ల పేర్లు ఎందుకంటూ స్థానిక డీఎస్పీ సంపత్‌రావు.. తనను తప్పుదోవ పట్టించి ఫిర్యాదు రాయించుకున్నారని సరళ విడుదల చేసిన వీడియోలో ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టుకు వెళ్లినందుకే.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హత్యకు కుట్ర పన్నారు నాగవెల్లి రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపణ -
కేజీ కూడా ఎక్కువ లేదట..
తనిఖీలు ముమ్మరం.. కాంటా వద్ద మైనింగ్ ఆర్ఐలు పర్యవేక్షించి తూకంలో నిబంధన ప్రకారం ఎక్కువగా వస్తే వెంటనే తీసేస్తున్నారు. ఎలాంటి అదనపు ఫీజు వసూలు కాకుండా చూస్తున్నారు. తక్కువగా లోడింగ్ చేస్తే అక్కడే నింపుతున్నారు. రెవెన్యూ ఉద్యోగులు తూకంవేసిన లారీ నంబర్, వేబిల్లును పరిశీలిస్తున్నారు. పోలీసులు క్రమపద్ధతిలో లారీలను త్వరత్వరగా తరలిస్తున్నారు. కాంటా వద్ద ఒక ప్రొక్లైయిన్తో తీయడం, నింపడం చేస్తున్నారు. లారీల్లో ఇదివరకు రెండు నుంచి మూడు టన్నుల ఇసుకను నింపి అదనంగా డబ్బులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు లారీల్లో తమ లారీల రిజిస్ట్రేషన్ కార్డుపై ఎంత బరువు ఉంటే అంతే కలుపుకొని కేజీ ఇసుకను కూడా ఎక్కువగా నింపడం లేదని లారీడ్రైవర్లు, యజమానులు చెబుతున్నారు. లారీ కొనుగోలు తరువాత ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇతర పరికరాలతో బాడీమార్చారు. ప్రస్తుతం ఉన్న లారీబరువుల ప్రకారం లారీలో ఇసుకను నింపాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఇలా నింపకపోతే టన్ను, టన్నున్నర వరకు తక్కువగా వస్తుందని వాపోతున్నారు. దీంతో ధరలు పెంచుతున్నారు. ఇలా నిబంధనలు అతిక్రమిస్తే కేసు నమోదు కూడా అవుతున్నట్లు తెలుపుతున్నారు. ఈ విషయమై ప్రాజెక్టు అధికారి రంగారెడ్డిని ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
చెక్‌డ్యామ్‌కు గండి
చిట్యాల/మొగుళ్లపల్లి: చిట్యాల మండలం నవాబుపేట, మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామాల మధ్య చలివాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌కు బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గండికొట్టారు. యాసంగికి ముందు చెక్ డ్యామ్ ఎండిపోయి దర్శనమిచ్చింది. పలుమార్లు సాగునీటి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలిసి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్ల నాగారం చెరువు నుంచి నీటిని విడుదల చేసి వరి పంటలను కాపాడాలని రైతులు విన్నవించారు. దీంతో ఎమ్మెల్యేలు ఇద్దరు స్పందించి వరి పంటల కోసం నీటిని విడుదల చేశారు. నీళ్లు కింది భాగానికి వెళ్లకపోవడంతో రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని ఉద్దేశంతో చెక్ డ్యాంకు గండి కొట్టినట్లు తెలుస్తుంది. చెక్‌డ్యాంను ఇరిగేషన్ డీఈ అమ్రపాలి. ఏఈలు వరుణ్ భాస్కర్ సందర్శించి గండిని పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు.పరిశీలించిన ఐబీ అధికారులు -
ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు
జిల్లా ఓటర్లు పోలైన శాతం ఓట్లుజనగామ 1,002 945 94.31 హనుమకొండ 5,215 4,780 91.66 వరంగల్ 2,352 2,214 94.13 మహబూబాబాద్ 1,663 1,571 94.47 భూపాలపల్లి 329 308 93.62 ములుగు 628 583 92.83 ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తంగా 92.95శాతం పోలింగ్ నమోదైంది. -
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ ఓటింగ్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిర్వహించిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం–వరంగల్–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 93 శాతం, కరీంనగర్–నిజామాబాద్–మెదక్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 92 శాతం, పట్టభద్రుల ఓటింగ్ 76 శాతం జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరిగినట్లు తెలిపారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో 329మంది ఓటర్లకుగాను 308 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 93.62శాతం, నిజామాబాద్–మెదక్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు 2,483 మందికి గాను 1,903మంది ఓటు హక్కు వినియోగించుకోగా 76శాతం నమోదైనట్లు తెలిపారు. నిజామాబాద్–మెదక్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 83మంది ఓటర్లు ఉండగా 77మంది ఓటు హక్కు వినియోగించుకొగా 92 శాతం నమోదైనట్లు తెలిపారు. పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య వరంగల్, కరీంనగర్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు పోలింగ్ సామగ్రి పంపనున్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ భూపాలపల్లి, కాటారం మండలాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పరిశీలించారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్లు శ్రీనివాసులు, నాగరాజు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.– మరిన్ని ఫొటోలు 9లోu -
యాజమాన్యమే పనులు చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని విరమించుకొని సింగరేణి యాజమాన్యమే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. ఏరియాలోని కేటీకే 8వ గని రెండో సీమ్‌ను ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కేటీకే 8వ గని ప్రైవేట్‌పరం చేయడం వల్ల సింగరేణికే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందన్నారు. ిసింగరేణి ఆధ్వర్యంలోనే బొగ్గు వెలికితీయాలని కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ప్రైవేట్‌పరం చేయడం వల్ల డిపెండెంట్ ఉద్యోగాలు రాక కార్మిక పిల్లలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. సింగరేణిలో నూతన గనులు ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఓటు జీఎం కవీంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాతంగి రామచందర్, సుధాకర్‌రెడ్డి, విజేందర్, శ్రీనివాస్, ఆసిఫ్పాష, రవికుమార్, రామచందర్, నూకల చంద్రమౌళి, ఫిట్ సెక్రటరీలు సదయ్య పాల్గొన్నారు. -
కోటగుళ్లలో లింగోద్భవ రుద్రాభిషేకం
గణపురం: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో గురువారం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ లింగోద్భవ రుద్రాభి షేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహాఅన్నపూజ కార్యక్రమాన్ని అర్చకులు గంగాధర్, వినయ్, నాగరాజు, విజయ్‌కుమార్, శంకర్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్‌పై అవగాహన భూపాలపల్లి అర్బన్: మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని వారసంతలో మోబైల్ వ్యాన్‌తో అవగాహన కల్పించారు. జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది సూచించారు. క్షణికావేశాలకు పోయి, పగలు, పంతాలు పెంచుకొని కేసుల్లో ఇరికితే, పోలీస్ స్టేషన్లు కోర్టులకు ఎక్కితే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. విలువైన సమయం, డబ్బు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. మహిళలకు క్రీడాపోటీలు భూపాలపల్లి అర్బన్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు, మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 1న అంబేడ్కర్ స్టేడియం, థౌసండ్ క్వార్టర్స్, మార్చి 3న ఇల్లంద క్లబ్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారికి మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. వసంతోత్సవానికి వేళాయె.. ● నేటి నుంచి నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ–25’ కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతీ ఏడాది విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులపాటు వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ–25) నిర్వహించనున్నారు. నేటి నుంచి(శుక్రవారం)మార్చి 1, 2 తేదీల్లో నిర్వహించే కల్చరల్ ఫెస్ట్‌కు ఏర్పాట్లు చేశారు. నాటి ఆర్ఈసీ నేటి నిట్‌లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న నిట్‌లో వివిధ దేశాల సంస్కృతీసంప్రదాయలను పరస్పరం పంచుకునేందుకు 1978లో ప్రారంభమైన వసంతోత్సవం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్గా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారు. తొలిరోజు: తొలిరోజు శుక్రవారం సాయంత్రం అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో హాస్యనటుడు, గిన్నిస్ వరల్ రికార్డు గ్రహీత, పద్మశ్రీ బ్రహ్మానందం, విద్యార్థుల చిట్‌చాట్. రెండో రోజు: శనివారం ప్రోషోలో భాగంగా ఇండియన్ రాక్‌బ్యాండ్ వార్డెక్స్ ఫ్యూజన్ మ్యూజిక్‌తో అలరించనున్నారు. డైరెక్టర్ కట్స్‌లో సినీ డైరెక్టర్లతో చిట్‌చాట్. అల్యూర్లో భాగంగా ఫ్యాషన్ షో, నుక్కడ్ నాటక్ ప్రదర్శన మూడో రోజు: ముగింపులో భాగంగా ఆదివారం పాపులర్ సింగర్ అమిత్ త్రివేది హిందీ, ఇంగ్లిష్ సంగీత విభావరి. నిపుణులతో బైక్‌స్టంట్స్. ఈసారి థీం లేదు: స్ప్రింగ్ స్ప్రీ వేడుకలను ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో నిర్వహించేవారు. 2022లో సృష్టిగా, 2023లో కళాధ్వనిగా, 2024లో రాసంగేన్ థీం (ఇతివృత్తం) తో నిర్వహించారు. ఈసారి అదేపేరుతో స్ప్రింగ్ స్ప్రీ–25ను నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. -
ఇసుక పిరం
టీజీఎండీసీ ఆన్లైన్లో టన్నుకు రూ.650వరకు కొనుగోలు చేస్తారు. 16 టైర్లు లారీలో 47.500 టన్నులు, 14 టైర్లు లారీలో 42టన్నులు, 12టైర్లు లారీలో 35 టన్నులను (లారీ బరువుతో కలిసి) తరలిస్తారు. వరంగల్ మార్కెట్లో సన్నరకం ఇసుక టన్నుకు రూ.1,600–1,800 వరకు, దొడ్డురకం టన్నుకు రూ.1,400–1,500వరకు, హైదరాబాద్ పట్టణాల్లో రూ.2వేల నుంచి 2,300 వరకు, దొడ్డు రకం టన్నుకు రూ.1,800 వరకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌కు ఇసుక లారీల్లో తరలిపోవాలంటే గతంలో రూ.35వేల నుంచి రూ.40వేల వరకు ఉండేది. ప్రస్తుతం ధరలు పెరగడంతో రూ.50వేల నుంచి 60వేల వరకు ధరలు పెరిగాయి. ఇదివరకు ఒక్కోలారీలో రెండు నుంచి మూడు టన్నులు అదనంగా తరలించేవారు. ఇదివరకు వరంగల్‌లో రూ.1,100–1,200, హైదరాబాద్‌లో రూ.1,500 వరకు ఇసుకను విక్రయించేవారు. నిబంధనలు కఠినమై ఇసుకకు భారీగా డిమాండ్ పెరిగిందని సామాన్యులు ఆందోళన పడుతున్నారు.కాళేశ్వరం: వేసవి కావడంతో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో సన్న ఇసుకకు డిమాండ్ బాగా పెరిగింది. సర్కార్ ఇసుక లోడింగ్ నిబంధనలు కఠినం చేయడంతో ధరలు అమాంతం పెరిగి వినియోగదారుల్లో కలవరం మొదలైంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించి నిబంధనల మేరకు విక్రయాలు జరగాలని సీరియస్‌గా హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. 25రోజులుగా అక్రమాలకు తావులేకుండా మైనింగ్, రెవెన్యూ, పోలీసుశాఖల పర్యవేక్షణలో టీజీఎండీసీ ఆధ్వర్యంలో లోడింగ్ జరుగుతుంది. నిబంధనల మేరకు లోడింగ్ వ్యవహారం జరుగుతుందా లేదా అనే విషయమై పలుమార్లు పోలీసు, విజిలెన్స్, ఇంటిలిజెన్స్, అదనపు కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు క్వారీల బాటపట్టి పరిస్థితిని సమీక్షించారు. 8 క్వారీల్లో లోడింగ్.. మహదేవపూర్ మండలంలో ఇసుక రీచులు 8వరకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మద్దులపల్లి(పలుగుల–7), అన్నారం, పలుగుల–6, పలుగుల–3, పూస్కుపల్లి–1, పూస్కుపల్లి పార్టు–2, బొమ్మాపూర్, ఎలికేశ్వరంలో క్వారీలు టీజీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నిత్యం ఈ క్వారీలకు గతంలో 100కుపైగా లారీలు వచ్చేవి. ప్రస్తుతం లోడింగ్ కఠినం చేయడంతో కొన్ని క్వారీలకే లారీలు ఇసుకకు వస్తున్నారు.అమాంతం పెరిగిపోయిన ధరలు ● టీజీఎండీసీ ఆన్లైన్లో టన్ను ఇసుకకు రూ.650 వరకు.. ● నెల కిందట మార్కెట్లో టన్నుకు రూ.900–1,200 వరకు విక్రయం ● ప్రస్తుతం రూ.1,800–2,300 ● వినియోగదారుల ఆందోళనఎలికేశ్వరం క్వారీ వద్ద ఇసుక లోడింగ్ధరలకు రెక్కలు.. -
మూడు రోజులపాటు వైభవోపేతంగా..
కాళేశ్వరం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా ఉత్సవాలను దేవస్థానం అధికారులు నిర్వహించారు. గురువారం ఉదయం 8గంటలకు గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేకంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటలకు వేదపండితులు ప్రత్యేక పూజలతో యాగశాలలో పూర్ణాహుతి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి నాకబలి, నందివాహన పవళింపు సేవతో కార్యక్రమాలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ దంపతులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీఆదిముక్తీశ్వర–శుభానందల కల్యాణం.. మహదేవపూర్ మండలం కాళేశ్వరం అనుబంధ దేవాలయమైన అడవిలో వెలసిన శ్రీఆదిముక్తీశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి మరుసటి రోజున ఆనావాయితీ ప్రకారం శ్రీఆదిముక్తీశ్వర–శుభానంద కల్యాణం శాస్త్రోక్తంగా వేదపండితులు మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం ఆలయ వేదపండితుల ఆధ్వర్యంలో కల్యాణ తంతును నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ మహేష్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు కామిడి రాంరెడ్డి, మెంగాని మాధవి, మాజీ దేవస్థానం డైరెక్టర్లు అశోక్, శ్యాంసుందర్ దేవుడా భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం ఆదాయం రూ.21లక్షలు మూడు రోజులకు గాను కాళేశ్వరం దేవస్థానానికి వివిధ పూజలు, లడ్డు ప్రసాదాలు, తైబజార్ విక్రయాల ద్వారా రూ.21లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ శనిగెల మహేష్ తెలిపారు. గత సంవత్సరం శివరాత్రి ఆదాయం రూ. 13.98లక్షల వరకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గతం కంటే ఈసారి అధికంగా లక్షన్నర మంది వరకు భక్తులు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి తరలివచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఆదాయం పెరిగినట్లు చెప్పారు. పూర్ణాహుతితో ముగిసిన శివరాత్రి ఉత్సవాలు దేవస్థానానికి రూ.21లక్షల ఆదాయం ఘనంగా ఆదిముక్తీశ్వర–శుభానందల కల్యాణం తరలివచ్చిన భక్తులు -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
వాజేడు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన నాలుగు మండలాల స్థాయి వాలీబాల్ పోటీల్లో విజేతగా పూసూరు టీం నిలిచింది. మండల కేంద్రంలో బుధవారం సాగిన ఫైనల్ పోటీల్లో వాజేడు, పూసూరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చెరొక సెట్టు గెలిచి సమంగా నిలిచినప్పటికీ నిర్ణయాత్మక ఫైనల్ సెట్లో పూసూరు జట్టు విజేతగా నిలించింది. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన పూసూరు జట్టుకు వాజేడు ఎస్సై రాజ్‌కుమార్ రూ. 15,016 నగదు, షీల్డ్, ద్వితీయ స్థానంలో నిలిచిన వాజేడు జట్టుకు నగదు రూ.10,016 నగదు, షీల్డ్‌ను అందజేశారు. తృతీయ స్థానంలో నిలిచిన రాంపురం జట్టుకు రూ.5,016, షీల్డ్, నాల్గో స్థానంలో నిలిచిన దూలాపురం జట్టుకు రూ.3,016 నగదుతో పాటు షీల్డ్ అందించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకర్లపూడి విక్రాంత్, మాజీ సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, వత్సవాయి జగన్నాథరాజు, దాట్ల వాసు, తోలెం చందర్రావు తదితరులు పాల్గొన్నారు. విజేతగా నిలిచిన పూసూరు జట్టు రన్నరప్‌గా వాజేడు -
బెల్టుషాపుల్లో జోరుగా మద్యం అమ్మకాలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రెండు ప్రభుత్వ మద్యం షాపులను ఎకై ్సజ్ అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, శివరాత్రి జాతర నేపద్యంలో రెండు రోజులు బంద్ చేశారు. దీంతో బుధవారం జాతరలో బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. బెల్టు షాపు నిర్వాహకులకు ముందుగానే పెద్దమొత్తంలో మద్యం డంప్ చేసి అమ్మకాలు చేపట్టారు. బెల్టుషాపుల్లో ఒక మద్యం క్వార్టర్‌పై రూ.100లకు విక్రయించి భక్తుల జేబులకు చిల్లు వేశారు. ఇంత జరుగుతున్న ఎకై ్సజ్‌శాఖ అధికారులు గాలి వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వచ్చిన భక్తులు అధిక ధరలకు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారని విమర్శలు నెలకొన్నాయి. -
నేడే పోలింగ్
భూపాలపల్లి అర్బన్: నేడు (గురువారం) జిల్లాలో జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయగా బుధవారం ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. కలెక్టరేట్లో రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోలింగ్ మెటీరియల్‌ను అందించారు. జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, ఓటు హక్కు కలిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. నాలుగు రూట్లుగా విభజించి ప్రతీరూట్కు ఒక లైజన్ అధికారి, రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం స్థానానికి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎ న్నికలకు భూపాలపల్లి, మొగుళ్లపల్లి చిట్యాల, గ ణపురం, టేకుమట్ల, రేగొండ, కొత్తపల్లిగోరి మండల కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ ఎన్నికల్లో 215 మంది ఓటర్లు తమ ఓటు హ క్కును వినియోగించుకోనున్నారు. మెదక్–నిజా మాబాద్– ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాలకు మంథని నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హ ర్, పలిమెల మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 83 మంది, పట్టభద్రుల ఎమ్మెల్సీకి 2,483 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది -
త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు
మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తిశ్వరస్వామి ఆలయానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి సైకత లింగాలతో మొక్కులు చెల్లించారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామివార్లకు గోదావరి జలాలతో అభిషేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడంతో పుర వీధులన్ని భక్తజనంతో నిండిపోయాయి. బుధవారం రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అర్ధరాత్రి లింగోద్భవ పూజకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. భక్తులు జాగరణతో పాటు ఉపవాసదీక్షలను నియమ నిష్టలతో పాటించారు. ఆలయం ఆవరణలో రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేసవి దృష్టిలో పెట్టుకొని భక్తులకు దాతల సాయంతో మినరల్ వాటర్, మజ్జిగ, పండ్లు అందజేశారు. పోలీసుల బందోబస్తు ఎస్పీ కిరణ్‌ఖరే, కాటారం డీఎస్పీ రా మ్మోహన్రెడ్డిల ఆధ్వర్యంలో కాళేశ్వరంలో భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఫిషరీస్, వైద్యారోగ్యశాఖ, ఎన్పీడీసీఎల్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో భక్తులకు సేవలందించారు. పలు రాష్ట్రాల నుంచి సుమారుగా లక్షన్నరకుపైగా మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖుల పూజలు జిల్లా జడ్జి అఖిల, కలెక్టర్ రాహుల్‌శర్మ దంపతులు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌రావు, రామ్మోహన్‌రెడ్డి దంపతులు స్వామి వారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదం అందజేశారు. -
ప్రైవేటీకరణ నిలిపేవరకు పోరాటాలు
భూపాలపల్లి అర్బన్:ఏరియాలో సింగరేణి గనుల ప్రైవేటీకరణను నిలిపేవరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని యూనియన్ బ్రాంచీ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ తెలిపారు. కేటీకే ఓసీ–3 అండర్‌గ్రౌండ్ 2వ సీమ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని గనుల అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా రమేశ్ మాట్లాడుతూ.. గని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దీంతో డిపెండెంట్ ఎంప్లాయీమెంట్ తగ్గిపోవడమే కాకుండా సంస్థ ఆర్థిక నష్టాల్లో కూరుకు పోతుందన్నారు. కొత్తగనుల ఏర్పాటు లేకపోవడంతో సింగరేణి సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, టెక్నీషియన్లు, అధికారులు ఉండి 130 సంవత్సరాల చరిత్ర ఉన్న సంస్థ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి నిర్వీర్యం చేస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సదయ్య, తిరుపతి, కరిముల్లా, శ్రీను, చంద్రమౌళి, జగత్రావు, కృష్ణారెడ్డి, హరీష్, శ్రీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అందని బోనస్
చెల్లింపుల్లో జాప్యం..ఆందోళనలో అన్నదాతలు ● యాసంగి పెట్టుబడులకు అప్పులు చేస్తున్న వైనం ● రైతులకు అందని రూ.24.45 కోట్లుఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు భూపాలపల్లి మండలం గుర్రంపేటకు చెందిన ముక్కెర రమేశ్. నెలరోజుల క్రితం 40 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. క్వింటాకు రూ.2,320 చొప్పున రూ.92,800 బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు ఇప్పటి వరకు జమ కాలేదు. ప్రభుత్వం నుంచి బోనస్ డబ్బులు త్వరగా వస్తాయని కొనుగోలు కేంద్రంలో అమ్మానని, పండించిన పంటకు చేసిన అప్పులు కట్టలేక, మళ్లీ యాసంగి సీజన్‌కు పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయాడు. ఇలా చాలా మంది రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. భూపాలపల్లి రూరల్: మద్దతు ధరతో కలిపి ఇస్తామని బోనస్ రూ.500 ధాన్యం విక్రయించి నెల రోజులు దాటినా ఇంకా కొంతమంది రైతుల ఖాతాల్లో జమకాలేదు. దీంతో యాసంగి పెట్టుబడి కోసం అప్పులు తేవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 182 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1.50 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సన్న రకాలకు రూ.2,320 మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. జిల్లాలో కొనుగోళ్లు పూర్తిగా 81,774 మెట్రిక్ టన్నులు ఽసన్నధాన్యాన్ని సేకరించారు. మొత్తానికి గాను బోనస్‌గా రూ.40.89 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.16.44 కోట్లు చెల్లించారు. రూ. 24.45 కోట్ల మేర రైతులకు చెల్లించాల్సి ఉంది. కొన్ని రోజులుగా అన్నదాతలు బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ లేకపోవడమే కారణమా? సన్నరకాలు విక్రయించిన రైతుల వివరాలను ధా న్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రొక్యూర్మెంట్, మేనేజ్మెంట్ సిస్టంలో నమోదు చేసి, పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ అధికారి లాగిన్‌కు పంపిస్తున్నారు. అనంతరం వాటి ఆధారంగా రైతుల బ్యాంకు ఖాతాలకు సంబంధిత శాఖ బోనస్ జమచేస్తోంది. అయితే ధాన్యం విక్రయించిన వారం రోజుల వ్యవధిలో క్వింటాకు రూ.2,320 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. బోనస్ డబ్బుల జమలో జాప్యం జరుగుతోంది. ఇందుకు సివిల్ సప్లయీస్ శాఖకు లేటుగా రిపోర్టు అందడం.. బోనస్ చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖలో బడ్జెట్ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.ధాన్యం కొనుగోలు వివరాలు -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● కలెక్టర్ రాహుల్ శర్మ భూపాలపల్లి: వేసవిలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంగళవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా ఇన్పుట్, అవుట్‌పుట్, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, ఇతర సాంకేతిక పరంగా ఎదురయ్యే అంశాలలో లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని తెలిపారు. అదనపు ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచడం, లోడ్ మేనేజ్మెంట్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం వంటి చర్యలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్‌నాయక్, అధికారులు పాల్గొన్నారు. ఎరువుల కొరత లేకుండా చూడాలి.. ఎరువుల కొరత రాకుండా రైతులకు సకాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని రాంసాయి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, జంగేడులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, రైతుల అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 1,950 టన్నుల యూరియా డీలర్ల దగ్గర, 650 టన్నులు మార్కెఫెడ్ వద్ద అందుబాటులో ఉందని తెలిపారు. రానున్న వారం రోజుల్లో అదనంగా రెండు వేల టన్నులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏఓ విజయభాస్కర్, భూపాలపల్లి ఏఓ సతీష్ పాల్గొన్నారు. మహిళా ఆర్థిక సాధికారతతోనే దేశాభివృద్ధి.. మహిళా ఆర్థిక సాధికారత ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవ మహిళా సాధికారత పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబంలో ఆర్థిక ప్రగతి కనబడాలంటే అందరూ తప్పనిసరిగా పొదుపును పాటించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి తిరుపతి, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ఎల్ఆర్ఎస్
సాక్షిప్రతినిధి, వరంగల్/భూపాలపల్లి: అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. తక్షణమే అమలు చేసేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కుడా వైస్ చైర్మన్లతో పాటు మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఉన్నతాధికారులకు మార్గదర్శకాల ఉత్తర్వులు అందాయి. సీఎస్ శాంతికుమారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మార్చి నాటికి దాదాపుగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలని సూచించారు. దరఖాస్తుల క్రమబద్ధీకరణకు అంతా సిద్ధం.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మొదటగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వివిధ నిబంధనల ప్రకారం ఆన్లైన్లోనే వడపోసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయా? దరఖాస్తుదారుడు పూర్తిస్థాయిలో పత్రాలు సమర్పించాడా? లేదా? అన్న అంశాలను పరిశీలిస్తారు. ఉమ్మడి జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 9 మున్సిపాలిటీలు, వివిధ గ్రామాలనుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందించారు. దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తూ.. ఆ ప్లాటు, స్థలం వద్దకు రమ్మని జీపీఎస్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలాలు, చెరువులు, కుంటలు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు వంటివి పరిశీలించి అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తామని చెబుతున్నారు. చివరగా మరోసారి వాటిపై ఉత్తర ప్రత్యుత్తరాలు, పత్రాల పరిశీలన చేసినా అభ్యంతరాలు అలాగే ఉంటే వాటిని తిరస్కరించి సమాచారం ఇస్తామంటున్నారు. అర్హత ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి కావాల్సిన పత్రాలతోపాటు ఫీజు చెల్లించేలా నోటీసు జారీ చేసి.. దరఖాస్తులు సరైనవి అయితే క్రమబద్ధీకరించి ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అందరికీ సమాచారం అందేలా ఏర్పాట్లు.. ఉమ్మడి వరంగల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహా 9 మున్సిపాలిటీలు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ కార్యక్రమం 2020 అక్టోబర్ 31 వరకు కొనసాగగా, రూ.1000 ఫీజును ఆన్లైన్లో చెల్లించి వివరాలను నమోదు చేసుకున్నారు. మొత్తంగా 1,58,097 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 10,840 దరఖాస్తులు పరిశీలించిన అధికారులు అప్పట్లోనే కొన్నీ క్రమబద్ధీకరణ చేయగా.. 1,47,257 వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రక్రియకు బ్రేక్ పడగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అధికార యంత్రాంగం మళ్లీ ఎల్ఆర్ఎస్ అమలుకు కదిలింది. ఈసారైనా నిబంధనల ప్రకారం చకచకా క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.. నేను 2019లో పట్టణంలోని మంజూర్‌నగర్‌లో రెండుచోట్ల ప్లాట్లు కొనుగోలు చేశాను. లే అవుట్ లేదని తెలియక కొనుగోలు చేశాను. చేసేదేమీ లేక 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న. సుమారు నాలుగున్నర ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న. ఎట్టకేలకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను అమలులోకి తీసుకువస్తుందని తెలిసింది. ఇంది సంతోషకరమైన వార్త. – మంచోజు దైవాచారి, భూపాలపల్లిఇక చకచకా నాన్ లే అవుట్ భూముల క్రమబద్ధీకరణ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులకు మార్గదర్శకాలు మార్చి వరకు ప్రక్రియ పూర్తి చేసేలా ఆదేశాలు తాజా ఉత్తర్వులతో మళ్లీ కదలిక... ఇప్పటికై నా పూర్తి చేయాలంటున్న దరఖాస్తుదారులుఉమ్మడి జిల్లాలో ఇలా..మొత్తం దరఖాస్తులు 1,58,097 పరిశీలించి ఆమోదించినవి 10,840వివిధ స్థాయిల్లో పెండింగ్ 1,47,257 -
ముగిసిన టీచర్ల ఎమ్మెల్సీ ప్రచారం
సాక్షిప్రతినిధి, వరంగల్/విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రచారానికి తెరపడడంతో ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెరలేపారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లానే కీలకం.. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మొత్తంగా 25,797మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 11,189మంది ఉన్నారు. ఒక్కో ఓటుకు రూ.2వేలు, ఆపైన డబ్బుల పంపిణీకి రంగం చేసుకున్నారన్న చర్చ కూడా ఉపాధ్యాయ వర్గాల్లో నడుస్తోంది. పోటీ ఎక్కువగా ఉండటంతో రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుండడంతో అభ్యర్థులు దీనిపైనా దృష్టి పెట్టారు. మొదటి ఓటు కాకపోయినా రెండో ప్రాధాన్యత ఓటు అయినా తనకు వేయాలని ప్రచారం నిర్వహించారు. విజేత ఎవరన్నది మార్చి 3న తేలనుంది. ఆరుగురు.. అమీతుమీ 19మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ఆరుగురి మధ్యే పోటీ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 2019లో గెలుపొందిన అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి టీఎస్‌యూటీఎఫ్ మద్దతుతో బరిలో నిలిచారు. టీచర్ల, అధ్యాపకుల అనేక సమస్యలను పరిష్కరించానని, మరోసారి గెలిపిస్తే మిగతా సమస్యలను పరిష్కరిస్తానని హామీలు ఇస్తూ ప్రచారం కొనసాగించారు. ● 2013లో పీఆర్టీయూ మద్దతుతో పూల రవీందర్ ఎమ్మెల్సీగా గెలుపొంది 2019 వర కు కొనసాగారు. ఈసారి ఉపాధ్యాయ సంఘా ల జాక్టో, ఎస్టీయూ, బీసీ సంఘాల మద్దతుతో బరిలో నిలిచారు. తాను గతంలో ఎమ్మెల్సీగా అనేక సమస్యలను పరిష్కరించానని, బహుజన బిడ్డను మరోసారి గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కూడా మద్దతు ప్రకటించింది. ● గతంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన పులి సరోత్తంరెడ్డి బీజేపీ మద్దతుతో పోటీలో ఉన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ తదితరులు కూడా సరోత్తంరెడ్డి కోసం ప్రచారం నిర్వహించారు. ఈయనకు టీపీయూఎస్ మద్దతు ప్రకటించింది. ● ఉపాధ్యాయ సంఘాల్లో అధిక సభ్యత్వం కలిగిన పీఆర్టీయూ టీఎస్నుంచి ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి తన మద్దతుదారులతో ఉమ్మడి మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను పరిష్కరించిన ఉపాధ్యాయుల పలు సమస్యలను తెలియజేస్తూ తనకు అవకాశం ఇవ్వాలని ఓట్లను అభ్యర్థించారు. ● మరో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి కూడా తన మద్దతుదారులతో విస్తృతంగా ప్రచారం చేశారు. ● కుడా మాజీ చైర్మన్, ఓ ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత ఎస్.సుందర్‌రాజ్‌యాదవ్ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈసారి ప్రైవేట్ హైస్కూళ్ల టీచర్లు, కళాశాలల అధ్యాపకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఆయన బీసీ సంఘాల మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తూనే పలు ప్రైవేట్ యాజమాన్యాల మద్దతుతో గెలిపించాలని అభ్యర్థించారు. జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్ల వివరాలుఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలు? రేపు పోలింగ్.. ఉత్కంఠ పోరులో విజేత ఎవరో ఆరుగురు అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ మొత్తం ఓటర్లు 11,189పోలింగ్‌కేంద్రాలు 7227న పోలింగ్, 3న లెక్కింపు ఈనెల 27న ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో మొత్తం 72 పోలింగ్సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించనున్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
● ములుగు డీఎంహెచ్ఓ గోపాల్‌రావు ములుగు రూరల్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ములుగు జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాకారం ఆయుష్మాన్ మందిర్‌ను జాతీయ నాణ్యత ప్రమాణాల వర్చువల్ అసెస్మెంట్ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికేషన్ పొందడం వల్ల ఆరోగ్య కేంద్రంలో సదుపాయాలు, ప్రజలకు నాణ్యతతో కూడిన వైద్యం అందుతుందన్నారు. ఆయుష్మాన్ మందిర్‌లో సమన్వయంతో పనిచేస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్‌కుమార్, జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణాధికారి పవన్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, పీహెచ్సీ వైద్యాధికారి ప్రసాద్, వైద్యుడు నాగ అన్వేష్, డెమో సంపత్, ఆరోగ్య కార్యకర్తలు తిరుమల, సుజాత, స్వర్ణలత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
● ఎల్డీఎం జయప్రకాశ్ ఏటూరునాగారం: మహిళలు పొదుపుపై దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎల్డీఎం జయప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిత విభాగం ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ప్రవేశపెట్టిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ఎస్బీఐ బ్యాంక్ వారి సహకారంతో మహిళలకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఈట రేణుక అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎల్డీఎం జయప్రకాశ్ హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థిక క్రమశిక్షణ పాటించినప్పుడు కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. పొదుపు చేయడంలో మెలకువలను పాటించాలన్నారు. మొబైల్ ఫోన్లకు వచ్చే లింక్‌లు, ఇతర విషయాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాతిమా, నవీన్, వెంకటయ్య, జ్యోతి, సంపత్, రమేష్ పాల్గొన్నారు. -
సుద్ద ముక్కలతో శివలింగాలు
కాటారం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ఆర్ట్ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ సూక్ష్మ కళాకృతులను తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రజనీకాంత్ చాక్‌పీస్, పెన్సిల్ గ్రాఫైట్, క్యారెట్, బంగాళదుంపలతో శివలింగాలను తయారు చేసి ఆకట్టుకున్నారు. చాక్ పీస్‌లపై సెంటీమీటర్ ఎత్తు, సెంటీమీటర్ వెడల్పు ఉన్న సూక్ష్మమైన 109 శివలింగాలను రూపొందించారు. గుండు పిన్ను సహాయంతో పది గంటలు శ్రమించి ఈ శివలింగాలను తయారు చేసినట్లు రజనీకాంత్ తెలిపారు. ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే 8వ గనిలో 2వ సీమ్ ప్రైవేటీకరణను యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. ఏరియాలోని కేటీకే 8వ గనిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. నేడు(బుధవారం) అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జీలు, మెమోరాండాలు అందజేసి నిరసన తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటీకరణపై 27న జీఎం కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు కృష్ణారెడ్డి, వెంకటస్వామి, శీనుబాబు, రాజబాబు, మహేందర్, వీరయ్య, శ్రీనివాస్, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగు మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ భూపాలపల్లి డీఎం ఇందు తెలిపారు. మంగళవారం కాళేశ్వరం బస్టాండ్ వద్ద తమ సిబ్బందితో కలిసి బస్సులను పర్యవేక్షించారు. భూపాలపల్లి నుంచి పలు ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. భక్తులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా రెండు రోజుల పాటు రవాణా చేస్తామని తెలిపారు. స్థానికుల దర్శనం ఉదయం 6నుంచి.. బుధవారం ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు స్వామివారి గర్భగుడిలో స్థానికులకు దర్శనానికి అవకాశం కల్పించినట్లు ఈఓ మహేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెరుగైన విద్యుత్ సరఫరా భూపాలపల్లి రూరల్: జిల్లాలో వేసవికాలంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఎస్ఈ మల్చూర్ నాయక్ తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లానింగ్‌లో భాగంగా మంగళవారం భూపాలపల్లి మండలంలోని చెల్పూర్, పెద్దాపూర్ గ్రామాల మధ్య కొత్తగా విద్యుత్ పోల్స్‌తో పాటు కొత్తగా విద్యుత్లైన్లు పొడిగించినట్లు తెలిపారు. ఎస్ఈ వెంట అధికారులు ఏడీఈ, ఏఈ ఉన్నారు. రైతుల ఆందోళన కాళేశ్వరం: ఇసుక లారీలతో ఇబ్బందులు పడుతున్నా టీజీఎండీసీ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఇసుక లారీ రోడ్డు పక్కన నిలుపడంతో బ్రాహ్మణపల్లికి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఎలాంటి నష్టం జరగకపోయినా నిత్యం లారీలు రోడ్డుకు ఒక వైపు నిలిపి ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పంటపొలాలకు వెళ్తున్నామని రైతులు వాపోయారు. ట్రాఫిక్‌ను నియంత్రించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు చేరుకొని నచ్చచెప్పి విరమింపజేశారు. -
కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వివరాలు
జిల్లా మున్సిపాలిటీ మొత్తం ఆమోదం వివిధ స్థాయిల్లో గ్రేటర్వరంగల్ కార్పొరేషన్ 1,00,989 2,756 98,233 హనుమకొండ పరకాల 3,194 06 31,88 వరంగల్ నర్సంపేట 5,219 411 4,808 వర్ధన్నపేట 524 10 514 మహబూబాబాద్ మహబూబాబాద్ 12,201 566 11,635 డోర్నకల్ 872 241 631 మరిపెడ 2,629 63 2,566 తొర్రూరు 10,299 606 9,693 జేఎస్ భూపాలపల్లి భూపాలపల్లి 3,795 1214 2,581 జనగామ జనగామ 18,375 4,967 13,408 -
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు
భూపాలపల్లి: పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో విద్యా, విద్యుత్, వైద్య, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్చి 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం పరీక్ష సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించి కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ రాజేందర్, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, కలెక్టరేట్ ఏఓ ఖాజా మొహినుద్దీన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధికి సహకరించాలి భూపాలపల్లి: ఇంటి యజమానులు తమ ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ కోరారు. రెవెన్యూ సిబ్బంది సోమవారం పట్టణంలోని మంజూర్‌నగర్‌లో ఇంటి పన్నులు వసూలు చేయగా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందశాతం పన్నులు చెల్లించి భూపాలపల్లిని ఆదర్శంగా నిలిపేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూలు 50 శాతం మాత్రమే పూర్తయిందని, వసూలుపై సిబ్బంది దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ టి రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వి.భాస్కర్, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. అధికారులతో సమన్వయ సమావేశంభూపాలపల్లి అర్బన్: మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా జడ్జి నారాయణబాబు మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌లో పెద్దఎత్తున కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే కలిగే లాభాలను ప్రజ లకు తెలియజేయాలన్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, ఆర్టీసీలో పెండింగ్‌లో ఉన్న ప్రీ లిటిగేషన్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జయరాంరెడ్డి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రారావు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ రవీందర్ పాల్గొన్నారు. -
కాళేశ్వరాలయం ముస్తాబు
కాళేశ్వరం: మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మదాయశాఖ అధికారులు శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి వార్ల ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి (మంగళవారం) నుంచి గురువారం వరకు మూడు రోజులు పాటు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రత్యేక పూజలు, శివకల్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలిరానున్నారు. ఉపవాస దీక్షలు, జాగరణ, ఆలయంలో ప్రత్యేక అభిషేక, అర్చన పూజలు నిర్వహించనున్నారు. శ్రీశుభానంద–ముక్తీశ్వరుల కల్యాణం ముత్యాల తలంబ్రాలతో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ప్రధాన ఆలయంతో పాటు ప్రకారాలకు, గోపురాలకు రంగురంగుల విద్యుత్ దీపాలను ఆమర్చారు. దీంతో కాళేశ్వరాలయం జిగేల్మంటుంది. దేవస్ధానం ఏర్పాట్లు.. దేవస్థానం అధికారులు క్యూలైన్లు, తాగునీరు, టెంట్లు, లడ్డు, ప్రసాదాలు తయారు చేస్తున్నారు. ఆలయాన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. శివకల్యాణానికి గతంలో మాదిరి కాకుండా ఉత్తరం వైపున కల్యాణ మండపంలో ఈసారి ప్రథమంగా కల్యాణం నిర్వహిస్తారు. 12 క్వింటాళ్ల లడ్డు.. సుమారుగా 60వేల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈసారి శివరాత్రి రోజున సాయంత్రం త్రివేణి సంగమంలో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ శాఖలు ఇలా.. పంచాయతీశాఖ ఆధ్వర్యంలో గోదావరి వద్ద రోడ్లన్నీ శుభ్రంచేశారు. బ్లీచింగ్ చల్లిస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో పార్కింగ్ స్థలాలు ఏర్పా టు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నీటిసరఫరా చేస్తున్నారు. ప్రధాన, వీఐపీ ఘాటుల వద్ద నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. వీఐపీ, సాధారణ ఘాటు వద్ద సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో గోదావరి, వీఐపీ పుష్కర ఘాటు వద్ద జల్లు స్నానాలకు మూడు పైపులైన్లతో ఏర్పాటు చేశారు. రెండు మహిళలు దుస్తులు మార్చుగదులు ఏర్పాటు చేశారు. 400మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉండనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును పర్యవేక్షిస్తారు. కిక్కిరిసిన భక్తులు కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులు బారులుదీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలైన్లలో కిక్కిరిశారు. అనంతరం స్వామివారి గుర్భగుడిలో పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో జాతర ఏర్పాట్లు చేశాం. సుమారు లక్షవరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. 50వేల నుంచి 60వేల లడ్డు, పులిహోర ప్రసాదం తయారు చేస్తున్నాం. కల్యాణం వీక్షణకు ఎల్ఈడీ తెర, శివరాత్రికి గోదావరి హారతి ఏర్పాటు చేస్తున్నాం. లింగోద్భవపూజ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. – శనిగెల మహేశ్, ఈఓ, కాళేశ్వరం దేవస్థానంశివుని దర్శనంతో ఎంతో ముక్తి మహాశివరాత్రి రోజు గోదావరి స్నానాలు చేసి శివుడిని దర్శించుకుంటే ముక్తిని పొందుతారు. స్వామివారి గర్భగుడిలో అభిషేకంతో పాటు అర్చన పూజలు చేస్తారు. లింగోద్భవపూజ సమయంలో స్పర్శ దర్శనంతో భక్తులు దోషాలు, పాపాలు తొలగి శుభాలు కలుగుతాయి. – పనకంటి ఫణీంద్రశర్మ, ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానంనేటినుంచి మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి రానున్న భక్తులు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం -
పకడ్బందీగా ఎన్నికల విధులు
భూపాలపల్లి: ఈ నెల 27న జరుగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో సోమవారం కాటారం, భూపాలపల్లి డివిజన్ల పీఓ, ఏపీఓలకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ముందురోజే చేరుకుని ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎలక్షన్ సామగ్రిని పరిశీలించుకొని పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. 26వ తేదీ ఉదయం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సామగ్రి అందజేస్తామన్నారు. 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పొరపాట్ల్లకు తావులేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. ఏదేని పొరపాటు జరిగితే ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, భూపాలపల్లి ఆర్డీఓ రవి, పీఓ, ఏపీఓలు పాల్గొన్నారు. పోలింగ్ నేపథ్యంలో సైలెన్స్ పీరియడ్.. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలింగ్ సందర్భంగా 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా ఉండటం, ప్రచారం చేయడం నిషిద్ధమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం, బల్క్ ఎస్ఎంఎస్లు పంపడం కూడా నిషేధమని తెలిపారు. తప్పకుండా ప్రతీ ఒక్కరు ఎన్నికల మార్గదర్శకాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి బహిరంగ సభలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పరిశీలించనుటన్నలు చెప్పారు. 48 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలులో.. కలెక్టర్ రాహుల్ శర్మ -
మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
పెరిగిన సెటిల్మెంట్లు.. జూదం, వ్యభిచారం, సెటిల్మెంట్, గంజాయి వినియోగం, అక్రమ వ్యాపారాలు జిల్లాలో భారీగా పెరిగిపోయాయి. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అక్రమార్కులు వచ్చి ఇక్కడ దందాలు నిర్వహిస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని మారణాయుధాలతో చంపేస్తామంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కత్తులు, తల్వార్లు, ఇతర మారణాయుధాలతో సంచరిస్తూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతుండటం హింసాకాండను తలపిస్తోంది.జిల్లాలో వరుస ఘటనలు భయాందోళనలో ప్రజలు అదుపు తప్పుతున్న శాంతిభద్రతలు -
వాతావరణం
ఎరుపెక్కిన ఏనుమాముల.. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం మిర్చితో ఎరుపెక్కింది. రైతులు భారీ మొత్తంలో మిర్చిని తీసుకొచ్చారు.జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత, ఎండ ఎక్కువగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.– 8లోu● పెద్దపల్లి జిల్లా బోయినిపల్లికి చెందిన సోరుపాక వీరమ్మ ఈ నెల 19న టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి కాలినడకన వస్తున్న క్రమంలో గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి మెడలో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు. మృతురాలిని గోనె సంచిలో కుక్కి వ్యవసాయ బావిలో పడేశారు. ఐదు రోజుల తరువాత బావి వద్ద దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ● జనవరి 26వ తేదీన మండలంలోని కాశీంపల్లి గ్రామంలో కందుల సురేష్‌కు తినే ఆహారంలో విష పదార్థం కలిసి తినిపించి మొహంపై బొంతతో అదిమి మరో వ్యక్తితో కలిసి భార్య హత్య చేసింది. ● కాటారం మండలకేంద్రంలో 2024 డిసెంబర్ 27న ఇప్పలగూడెంకు చెందిన డొంగిరి బుచ్చయ్యను భూవివాదంలో అదే గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు కర్రలతో కొట్టి చంపారు. ● మహదేవపూర్ మండలం చండ్రపల్లిలో 2024 నవంబర్ 27న రాత్రి మంచిర్యాల జిల్లాకు చెందిన ముత్యాల శ్రీకాంత్‌పై బైక్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కత్తులతో పొడిచి దారుణ హత్య చేశారు. ● తండ్రి వద్ద ఉన్న ఆస్తి రాసివ్వడం లేదని జిల్లాకేంద్రంలోని కారల్‌మార్క్స్‌కాలనీలో 2024 ఆగస్టు 12న బొమ్మన లక్ష్మారెడ్డిని భర్తతో కలిసి మరో నలుగురితో కూతురే తండ్రిని హత్య చేయించింది. ● 2024 ఏప్రిల్ 23న వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలానికి చెందిన గుగులోత్ ప్రభాకర్‌ను పర్వతగిరి మండలానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులు పెళ్లి సంబంధం విషయంలో భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం తీసుకొచ్చారు. ఆటోలో తీసుకువచ్చి భూ వివాద కారణంతో రాంపూర్ అడవిలో హత్యచేసి పెట్రోల్ పోసి తగలపెట్టారు. ● 2024 డిసెంబర్ 5వ తేదీన మహదేవపూర్ మండలకేంద్రంలో భూవివాద కారణంతో సుంకె మహేష్‌పై అతని బంధువులే గొడ్డలితో దాడిచేసి తలపై తీవ్రంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ● మహదేవపూర్ మండలం కాశీంపల్లిలో 2024 డిసెంబర్ 4న పెళ్లి బరాత్‌లో పాత కక్షలతో ఇరువర్గాలు గొడవ పడి అనంతరం ఇళ్లపైకి వెళ్లి ఒకరిని ఒకరు చంపుకునే ప్రయత్నం చేశారు. ● 2024 జూలై 20న జిల్లాకేంద్రంలోని గణేష్‌చౌక్‌లో నడిరోడ్డుపై గంజాయి మత్తులో నలుగురు యువకులు రెండు గ్రూపులుగా ఏర్పడి పరస్పర దాడికి పాల్పడగా గాయాలపాలయ్యారు.జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలు కొన్ని.. -
బీఆర్ఎస్ కోటాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు?
ఎమ్మెల్యే కోటా కింద పెద్దలసభకు వెళ్లేదెవరు..? ● ఉమ్మడి వరంగల్‌లో జోరుగా ఊహాగానాలు ● సత్యవతి రాథోడ్‌కు మళ్లీ చాన్స్ దక్కేనా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు? ● కాంగ్రెస్ పార్టీ కోటాలో పెరుగుతున్న ఆశావహలు ● తెరమీదకు అసెంబ్లీ ఎన్నికల హామీలు.. ● పావులు కదుపుతున్న సీనియర్లు సాక్షిప్రతినిధి, వరంగల్: ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో వెలువడిన ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుల ఎన్నికల నగారా మోగింది. మార్చి 3న నోటిఫికేషన్, 20న పోలింగ్ ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆ ఎన్నికలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఐదు స్థానాలకు జరిగే ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్న శాసనసభ్యుల సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ తిరిగి ఒక్కస్థానం లభించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత ఈ ఐదుగురిలో మళ్లీ ఎవరికి చాన్స్ ఇస్తారు? ఉమ్మడి వరంగల్‌కు చెందిన సత్యవతి రాథోడ్ మళ్లీ అవకాశం ఉంటుందా? మరో సీనియర్‌కు అవకాశం కల్పిస్తారా? అన్న చర్చ ఆ పార్టీలో మొదలైంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు నాలుగు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ రేసులో ఉండి.. అధిష్టానం హమీతో సీటు త్యాగం చేసిన ఆ పార్టీ సీనియర్లు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. కాంగి‘రేసు’లో పలువురు... సోమవారం నుంచే మొదలైన పైరవీలు.. వరంగల్ ఉమ్మడి జిల్లానుంచి ఎమ్మెల్సీలతోపాటు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల కోసం పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే పోటీ పడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని వారికి ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల సందర్భంగా పలువురికి టీపీసీసీ భరోసా ఇచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, బెల్ల య్యనాయక్, ఐత ప్రకాశ్‌రెడ్డి తదితరులకు.. కుడా చైర్మన్‌గా ఇనుగాల వెంకట్రామి రెడ్డిలకు అధిష్టానం అవకాశం కల్పించింది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ రేసునుంచి తప్పుకోవడంతో పాటు సీనియర్లుగా ఉన్న పలువురు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. సోమవారంనుంచే కొందరు ఆశావహులు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్, మంత్రుల, ఎమ్మెల్యేల ద్వారా పైరవీలు మొదలెట్టారు. ఉమ్మడి వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర తదితరులు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా పదవుల పొందిన వారిలో ముగ్గురు కూడా ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ పదవి ఉమ్మడి వరంగల్‌కు దక్కుతుందా? ఒకవేళ ఇస్తే ఎవరికి? అనే అంశాలు తేలనున్నాయన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా చూస్తే ఈసారి కాంగ్రెస్– 4 స్థానాలు, బీఆర్ఎస్–1 స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తరఫున ఎన్నికై న మీర్జా రియాజుల్ హసన్, ఎగ్గే మల్లేశం, మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ పదవీ కాలం మార్చి 29తో ముగియనుండగా.. సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఉమ్మడి వరంగల్‌కు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు మళ్లీ ఎమ్మెల్సీ దక్కుతుందా? అన్న చర్చ జరుగుతున్నప్పటికీ... ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కూడా కొనసాగిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన దయాకర్‌రావు పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులతో సన్నిహితంగా ఉండటంతోపాటు పలు సందర్భాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా తన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌కు ఎమ్మెల్సీ ఇవ్వదలుచుకుంటే ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఐదు స్థానాల నుంచి ఒకే స్థానంతో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడటంతో పార్టీ అధినేత కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. -
భక్తులకు శుభవార్త
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.– 8లోuవ్యక్తిగత కక్షలు, భౌతిక దాడులతో జిల్లా అట్టుడుకుతోంది. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్న అల్లరి మూకలు అదునుచూసి గ్యాంగులతో కలిసి ప్రత్యక్షదాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల జిల్లాలో వరుసగా జరుగుతున్న ఘటనలు సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఎవరిపైన ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. తాజాగా ఈనెల 19న రాత్రి జిల్లాకేంద్రంలోని పలువురు ముఠాగా ఏర్పడి సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తిని హతమార్చిన విషయం తెలిసిందే. – భూపాలపల్లి అర్బన్ -
మూడు గంటలుగా బస్సు లేదు..
మంచిర్యాల నుంచి దర్శనానికి వచ్చాను. మూడు గంటల నుంచి ఆర్టీసీ బస్సులు లేవు. వచ్చిన ఒకటి, రెండు బస్సుల్లో కిక్కిరిసి పోతున్నారు. ఆర్టీసీ అఽధికారులు బస్సుల సంఖ్య పెంచాలి. ఓ పాప బస్సు టైరు కింద పడిపోయేది. అక్కడున్న వారు కాపాడారు. బస్సుల కోసం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూపు తప్పలేదు. – లక్ష్మీ, ప్రయాణికురాలు ఒక్కసారిగా రద్దీ పెరిగింది.. కాళేశ్వరాలయానికి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. మధ్యాహ్నం నుంచి విషయం తెలియగానే నాలుగు బస్సులు ఏర్పాటు చేశాం. రాత్రి 7.30గంటల తరువాత రద్దీ తగ్గింది. – ఇందు, ఆర్టీసీ డీఎం, భూపాలపల్లి -
మహాలక్ష్మికి కష్టాలు
కాళేశ్వరం: మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, మహాలక్ష్మి పథకంతో అత్యధికంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కాళేశ్వరం తరలివచ్చారు. తిరుగు ప్రయాణంలో మహిళలతో కాళేశ్వరం బస్టాండ్ ప్రాంగణం అంతా కిక్కిరిసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆర్టీసీ బస్సులు సరిపడా రాక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం బస్సులు లేక పిల్ల పాపలతో, వృద్ధులతో ఇబ్బందులు పడ్డారు.సరిపడా బస్సులు లేక ఇబ్బందులు -
పోడు రైతులపై దాడి అమానుషం
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం ఆజాంనగర్ గ్రామశివారులో పోడు చేసుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారులు మూకుమ్మడిగా దాడి చేయడం అమానుషమని, ఈఘటనను ఖండిస్తున్నట్లు మానవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాదావత్ రాజు అన్నారు. ఆదివారం ఆజాంనగర్లో దాడి జరిగిన ప్రదేశాన్ని మానవహక్కుల బృందం నాయకులు పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలిసుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్కడ సాగు చేసుకుంటున్న కుటుంబాల్లో అందరూ గుంట భూమి లేని దళిత రైతులేనని, వారు గత 35 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నారన్నారు. రెండేళ్లుగా డీఆర్ఓగా పనిచేస్తున్న అధికారిణి సుమారు 30 ఎకరాల పోడు భూమిలో పత్తి సాగు చేయడానికి గత సంవత్సరంలో రూ. 5 లక్షల రూపాయలను తీసుకున్నారని, ఈఏడాది మరో రెండు లక్షల రూపాయలు అడగ్గా, రైతులు ఇవ్వకపోవడంతోనే గత గురువారం అధికారులు, పోలీసులతో వచ్చి దాడికి పా ల్పడ్డారని ఆరోపించారు. అడ్డగించిన రైతులను కిందపడేసి అధికారులు బూట్లతో తన్ని, తొక్కి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టినట్లు పేర్కొన్నారు. దాడి ఎంత మాత్రమూ సహించరానిదని, మానవీయ కోణంలో అత్యంత హేయమైన చర్యగా మానవ హక్కుల వేదిక భావిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలని ఇవ్వాలని.. దాడిలో గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు. బాధిత కుటుంబాలకు తక్షణం రూ.1 లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల వేదిక బృందంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్, సభ్యులు హనుమాన్ ప్రసాద్, కర్ణాటక సమ్మయ్య, చంద్రగిరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.. మానవ హక్కుల వేదిక నాయకులు -
సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలి
ములుగు రూరల్: పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేసి క్వింటాకు రూ.25వేలు ధర చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.అమ్జద్‌పాషా అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కకు ఆయన ఆదివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20వేల ఎకరాల్లో పత్తి పంటసాగు అయిందని తెలిపారు. సీసీఐ రెండు నెలలుగా కొనుగోలు చేసి వారం నుంచి కొనుగోళ్లు చేయడం లేదని తెలిపారు. దీంతో దళారులకు పత్తి అమ్ముకొని రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ ద్వారా వెంటనే కొనుగోళ్లు పునరుద్ధరించి రైతుల వద్ద ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని ఆయన కోరారు. అదే విధంగా జిల్లాలో సాగైన మిర్చిని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి క్వింటాకు రూ.25వేలు చెల్లించాలన్నారు. ములుగు ప్రాంతంలో శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. మంత్రిని కిలిసిన వారిలో రైతుసంఘం నాయకులు బోడ రమేష్, గొంది సాంబయ్య పాల్గొన్నారు. -
నీళ్లు లేవనడం కాంగ్రెస్ చేతగాని తనం
ఖిలా వరంగల్: రెండు పంటలకు నీళ్లు ఇవ్వాల్సిందిపోయి ‘వరి సాగు చేయొద్దు.. నీళ్లు లేవని చెప్పడం’ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన వరంగల్ బొల్లికుంట ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యాన ఉపాధ్యాయ ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లుంటే అప్పనంగా నాడు కేసీఆర్, నేడు రేవంత్‌రెడ్డి ఏపీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును 50 శాతం కేసీఆర్ నాశనం చేస్తే.. మిగిలిన 50 శాతం కాంగ్రెస్ నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే నీళ్లు లేక 7 లక్షల ఎకరాల్లో వేసిన వరి పంట ఎండిపోయిందని, యూరియా పుష్కలంగా ఉన్నా పంపిణీ చేసేందుకు ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని ధ్వజమెత్తారు. ఫీజురీయింబర్స్‌మెంట్ అందక చిన్న చిన్న కాలేజీలు అడుక్కునే పరిస్థితి ఉందని, అప్పులు చేసి విద్యా సంస్థలు నడిపించే దుస్థితి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగనే గాలికొదిలేస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో ఆసరా, రైతు భరోసా, రుణమాఫీ అరకొరగానే ఇచ్చారు.. నేటికీ 2లక్షల ఉద్యోగాల భర్తీ లేదు.. టీచర్ల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నా యి.. విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైందని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెన్ఫిట్స్ ఇవ్వలేక కేసీఆర్ 61 ఏళ్లకు ఉద్యోగ విరమణ పెడితే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచే యోచనలో ఉందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని తెలిసి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తున్నారని, రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. ఉపాధ్యాయులు చైతన్యవంతులై బీజేపీ బలపర్చిన అభ్యర్థి సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రావు పద్మ, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి, నాయకులు శ్రీధర్, సత్యపాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, కీర్తిరెడ్డి, విజయ్‌చందర్‌రెడ్డి, కాళీప్రసాద్, మల్లాడి తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ -
నిండా ముంచిన ‘బాండ్ మక్క’
కన్నాయిగూడెం: మండల పరిధి పలు గ్రామాల్లో బాండ్ మక్కా పేరు చెప్పి పంటసాగు చేయించిన ఓ కంపెనీ ప్రతినిధులు నాసిరకం విత్తనాలు ఇచ్చి రైతులను నిండా ముంచారు. ఈ ఘటన మండలంలో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుల రైతుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మీపురం, గుర్రేవుల, బుట్టాయిగూడెం, చింతగూడెం, కంతనపల్లి గ్రామాల్లో సిజెంటా, హైటెక్ కంపెనీలకు చెందిన బాండ్ మక్కాను ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అందించి 80ఎకరాల్లో సాగు చేయించారు. సాగు సమయంలో ఫిక్స్డ్ రేటుతో పాటు మంచి దిగుబడి వస్తుందని నమ్మించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట ఏపుగా పెరిగింది కానీ కంకులకు గింజలు పోయకుండా బెండు మాత్రమే ఉందంటూ రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో కంపెనీ ప్రతినిధులను రైతులు నిలదీయగా.. కంపెనీ నుంచి పరిహారం ఇప్పిస్తామని చెప్పి సంచుల్లో వాటిని నింపి పెట్టండి తీసుకెళ్తామని నమ్మబలికి ఇక్కడి నుంచి వెళ్లిపోయి తిరిగి రావడం లేదని వాపోయారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆయా కంపెనీల ప్రతినిధులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. పంటచేతికొచ్చినా గింజలు నిల్ నాసిరకం విత్తనాలతో రైతులకు నష్టం -
కోల్‌బెల్ట్‌లో మరింత తీవ్రత..
భూపాలపల్లి అర్బన్: వేసవి ప్రారంభంలోనే జిల్లాలో ఎండలు తీవ్రమయ్యాయి. శీతాకాలం ముగియకముందే 20 రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జనవరి చివరి వరకు రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తీవ్రమైన చలి కనిపించింది. వేసవి ప్రారంభం కావడంతో ముదురుతున్న ఎండలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం జిల్లాలో పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 17.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. గతేడాది వేసవిలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు సమోదయ్యాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. ‘సీజనల్’ సందడి.. వేసవి సీజన్ ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. శీతల పానీయాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కూలర్లు, ఏసీల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇన్నాళ్లు చలి తీవ్రతకు పక్కన పెట్టిన కూలర్లు, ఏసీలకు మరమ్మతులు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి ముందు పందిళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రైతులు వేసవిలో తీసుకునే జాగ్రత్తలు, పండించే పంటలపై దృష్టి సారిస్తున్నారు. అడుగంటిపోతున్న జల వనరులుముదురుతున్న ఎండలతో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. వాగులు, వంకలు, ఒర్రెల్లో నీళ్లు ఆవిరవుతున్నాయి. దీంతో మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. వన్యప్రాణులు నీటి జాడ కోసం అడవులను వదిలి మైదాన ప్రాంతాలకు తరలివస్తున్నాయి. వాగులు, ఒర్రెలపై ఆధారపడి యాసంగిలో పంటలను సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాల్లో పంటలను రక్షించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కూరగాయల ధరలు సైతం మండిపోతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడుతున్నారు. జాగ్రత్తలు పాటించాలి..ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. అత్యవసరమైతే తప్ప ఎండకు బయటకు వెళ్లవద్దు. వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసు కోవాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. – మధుసూదన్, డీఎంహెచ్ఓ ఉక్కపోత భరించలేకపోతున్నాం..ఎండలు విపరీతంగా పెరిగాయి. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భరించలేని ఉక్కపోత ఉంటోంది. ఎండ తీవ్రత కారణంగా కూలర్లు, ఫ్యాన్లు అధికంగా వినియోగించాల్సి వస్తోంది. కరెంట్ బిల్లులు పెరిగిపోతున్నాయి. – టి.రవీందర్, వ్యాపారి, భూపాలపల్లిగొడుగులతో వస్తున్న మెడికల్ కళాశాల విద్యార్థులు భూపాలపల్లి, గణపురం మండలాల్లో సింగరేణి గనులు, కేటీపీపీ ఉండడంతో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఓపెన్కాస్ట్టులు, కేటీపీపీలతో ఈ ప్రాంతాల్లో ఇప్పటి నుంచే పగటి పూట వేడి గాలులు వీస్తున్నాయి. మరో మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్, కేటీపీపీలో పని చేసే కార్మికులు, ఉద్యోగులు వేడి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యాలు ఉక్కపోతకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని, తక్షణమే చర్యలు చేపట్టాలని కార్మికులు, ఉద్యోగులు కోరుతున్నారు. -
పులి సంచరిస్తోందంటూ ప్రచారం
మల్హర్: అనుమానాస్పద స్థితిలో ఆవు మృత్యువాతపడిన ఘటన మండలంలోని కాపురం అటవీ ప్రాతంలోని చెరువు శివారులో చోటు చేసుకుంది. మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన రఘపతి ఆవు గత శనివారం మేతకు వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో రఘుపతి ఆదివారం ఉదయం కాపురం అటవీ ప్రాతంలో గాలించగా.. ఆవు మృతి చెంది కనిపించింది. ఆవుపై ఏదో అటవీ జంతువు దాడి చేసినట్లు గుర్తించి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. తాడిచర్ల ఫారెస్ట్ సెక్షన్ అధికారి లక్ష్మణ్, సిబ్బంది అక్కడికి చేరుకుని ఆవును పరిశీలించారు. ఆవు కళేబరంపై ఉన్న గాయాలను పరిశీలించారు. ఆవుపై పులి దాడి చేసిందా? లేక ఇతర అటవీ జంతువులేమైనా దాడి చేశాయా? అనే కోణంలో చుట్టు పక్కల పాదముద్రలను పరిశీలించారు. ఇప్పటి వరకు పులికి సంబందించిన పాదముద్రల కానీ.. ఇతర అటవీ జంతువు ఆనవాళ్లు కానీ కనిపించలేదని రేంజర్ రాజేశ్వర్‌రావు తెలిపారు. ఆవు మృతి చెందిన సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జంకుతున్న ప్రజలు.. అనుమానాస్పద స్థితిలో ఆవు చనిపోవడంతో కాపురం అటవీ ప్రాతంలో పులి సంచరిస్తోందని గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మహదేవపూర్ మండలం గోదావరి పరీవాహక ప్రాతంలో, కాటారం అడవుల్లో మగపులి సంచరిస్తోంది. పులి అటవీ ప్రాంతాల గుండా కాపురం అటవీ ప్రాతంలోకి వచ్చి ఆవుపై దాడి చేసి చంపిందని గ్రామాల్లో చర్చ నడుస్తోంది. ఈ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కన్వేయర్ మట్టి రోడ్డు మీదుగా తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ పనులకు నిత్యం కార్మికులు, ఉద్యోగులు ప్రయాణం చేస్తున్నారు. అలాగే.. భూపాలపల్లికి వెళ్లడానికి సైతం వాహనదారులు రహదారిని వినియోగిస్తారు. పులి సంచరిస్తోందని ప్రచారం జరగడంతో రహదారిగుండా ప్రయాణించడానికి వాహనదారులు, పొలాల వద్దకు వెళ్లాడానికి రైతులు జంకుతున్నారు. అనుమానాస్పద స్థితిలో ఆవు మృతిఏన్కపల్లి అడవుల్లో పెద్దపులి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం ఏన్కపల్లి, కిష్టారావుపేట అటవీ ప్రాంతంలో ఆదివారం పెద్ద పులి సంచరిస్తోంది. గత కొన్ని రోజులుగా మహాదేవపూర్, కాటారం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మహదేవపూర్ మండలం పలుగుల ప్రాంతంలో ఓ ఎద్దుపై దాడి చేసిన విషయం తెలిసిందే. శనివారం కాటారం మండలం నస్తురుపల్లి అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమైంది. అక్కడి నుంచి ఆదివారం మండలంలోని ఏన్కపల్లి, కిష్టరావుపేట, అటవీ ప్రాంతంలో పులిపాదముద్రలను గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
పరీక్షకు వెళ్తుండగా విద్యార్థికి గాయాలు
రేగొండ: గురుకుల ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్తున్న క్రమంలో ఓ విద్యార్థి కాలు విరిగింది. మహాముత్తారం మండలం రెడ్డిపల్లికి చెందిన రాజేశ్ గురుకులాల ప్రవేశ పరీక్ష రాసేందుకు మండలంలోని లింగాల మహాత్మాజ్యోతిబా పూలే పాఠశాలకు వెళ్లాడు. పరీక్ష సమయానికంటే అరగంట ముందే కేంద్రానికి చేరుకోగా.. అధికారులు విద్యార్థులను లోపలికి పంపించే క్రమంలో విద్యార్థి హాల్‌టికెట్ పరిశీలించారు. చిట్యాల మండలంలోని సోషల్ వెల్ఫేర్ సెంటర్ అని ఉండడంతో.. తొందరగా వెళ్లాలనే క్రమంలో చిట్యాల వెళ్తుండగా.. లింగాల వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయింది. దీంతో విద్యార్థి కాలు విరిగింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుడిని మెరుగైన చికిత్స కోసం భూపాలపల్లిలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు. -
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
భూపాలపల్లి అర్బన్: మహాశివరాత్రిని పురస్కరించుకుని కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు హనుమకొండ, భూపాలపల్లి నుంచి ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. బస్సుల వివరాల కోసం 73828 54256 నంబర్లో సంప్రదించాలని కోరారు. అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి..భూపాలపల్లి అర్బన్: సీఎంపీఎఫ్ అక్రమాలపై బీఎంఎస్ నాయకులు చేసిన అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసునూటి రాజేందర్ డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆసమయంలో సీఎంపీఎఫ్ అక్రమాలు జరిగినట్లు తెలిపారు. అవగా హన లేకుండా యూపీఏ హయంలో అక్రమాలు జరిగాయని బీఎంఎస్ నాయకులు ఆరోపణలు చేయడం తగదన్నారు. కార్మికుల పక్షాన ఐఎన్టీయూసీ నిరంతరం పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సిరంగి రాజయ్య, రమేశ్, రవికిరణ్, కృష్ణ, కుమార్ పాల్గొన్నారు. గొత్తికోయలను మోసం చేసిన అటవీశాఖ అధికారి ఏటూరునాగారం: గొత్తికోయల భూమిని వేరొకరి వద్ద డబ్బులు తీసుకుని వారిపేరు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాకు ఎక్కించి పోడు భూముల సర్వే బీట్ ఆఫీసర్ మోసం చేశారని రాయిబంధం గ్రామ పెద్దలు పథం జోగయ్య, కిశోర్, వడ్కాపురం సారయ్య ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం గ్రామ పెద్దలు, బాధితులు విలేకరులకు వెల్లడించారు. మండలంలోని చిన్నబోయినపల్లి పరిధిలో గల రాయిబంధం గ్రామ శివారులో 25 ఏళ్లుగా కాస్తులో పథం పొజ్జయ్య, మడకం సమ్మయ్య, కత్మా గంగయ్య తమకున్న నాలుగెకరాల భూమిని సాగుచేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో 2023లో పోడు భూముల సర్వే బీట్ ఆఫీసర్ రాజేశ్ పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన గిరిజన మహిళ కబ్బాక నీలమ్మ వద్ద డబ్బులు తీసుకుని గొత్తికోయలకు చెందిన భూమిని ఆమె పేరుపై ఆర్ఓఎఫ్ఆర్ పట్టాకు ఎక్కించారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. ముగిసిన ‘ఇంటర్ నిట్’ టోర్నమెంట్స్కాజీపేట అర్బన్: వరంగల్ నిట్‌లో వాలీబాల్, హ్యాండ్‌బాల్, యోగా క్రీడల ‘ఇంటర్ నిట్’ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణ దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెసర్ శ్రీనివాసాచార్య, హెడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఆక్టివిటీస్ ప్రొఫెసర్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. పంచ పరివర్తనతోనే సమాజ కల్యాణంకేయూ క్యాంపస్: పంచ పరివర్తనతోనే సమాజ కల్యాణం జరగుతుంది.. వ్యక్తి నిర్మాణం ఆధారంగానే వ్యవస్థలో మార్పు వస్తుందని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కాచం రమేశ్ అన్నారు. ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వరంగల్ మహానగరంలోని ఆర్ఎస్ఎస్ 100 శాఖల నుంచి స్వయం సేవకులతో ‘మహానగర సాంఘిక్’ కార్యక్రమం నిర్వహించారు. తొలుత సూర్య నమస్కారాలు, యోగా, వ్యాయామం తర్వాత రమేశ్ మాట్లాడారు. స్వదేశీ, సామరస్యత, పర్యావరణ పరిరక్షణ తదితర విషయాల్లో ప్రతి ఒక్కరిలో మార్పు రావాలన్నారు. -
రాజలింగమూర్తి కేసులో ఏడుగురు అరెస్ట్.. నిందితుల్లో బీఆర్ఎస్ నాయకుడు!
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో సంచలనంగా మారిన భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తాజాగా ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ నేత హరిబాబు కూడా ఉన్నారు. ఆయనే ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలిపారు.భూపాలపల్లి రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించిన వివరాలను తాజాగా ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ..‘రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణం. సంజీవ్, రాజలింగమూర్తి మధ్య భూ వివాదం కొనసాగుతోంది. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారు. కంట్లో కారం కొట్టి కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ హత్యలో నలుగురు వ్యక్తులు నేరుగా పాల్గొన్నారు. మిగతా వాళ్లు వారితో టచ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకుడు హరిబాబు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించాం. ప్లాన్ ప్రకారం వరంగల్‌లోని కాశీబుగ్గలో హత్యకోసం కత్తులు, రాడ్లను దుండగులు కొనుగోలు చేశారు. ఇతర కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రదారులైన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశాం. మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆరు బృందాలతో కలిసి పోలీసులు వారి కోసం గాలింపు చర్యల్లో ఉన్నారు. త్వరగానే పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా.. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ముఖ్య అనుచరుడే కొత్త హరిబాబు. ఈ కేసులో A1 రేణిగుంట్ల సంజీవ్.. హత్యకు ముందు, తర్వాత హరిబాబుతో టచ్‌లో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు.నిందితుల పేర్లు వెల్లడి..A1)రేణికుంట్ల సంజీవ్A2) పింగిలి సీమంత్A3)మోరె కుమార్A4)కొత్తూరి కిరణ్A5) రేణికుంట్ల కొమురయ్యA6) దాసర కృష్ణA7) రేణిగుంట్ల సాంబయ్యపరారీలో ఉన్న వారుA8) కొత్తూరి హరిబాబు A9) పుల్ల నరేష్ A10) పుల్ల సురేష్ -
తాటి కల్లు దివ్యఔషధం
కాటారం: తాటి కల్లు దివ్య ఔషధం అని.. తాటి కల్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. మహాముత్తారం మండలం సింగారానికి శనివారం పుట్ట మధు స్వయంగా తాటి కల్లు తాగడం కోసం వచ్చారు. గ్రామంలోని తాటి వనం వద్ద కూర్చొని తాటికల్లు తాగి గౌడన్నలతో ముచ్చటించారు. పుట్ట మధు వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేశ్, మాజీ జెడ్పీటీసీ మందల రాజిరెడ్డి, నాయకులు జోడు శ్రీనివాస్, మార్క రాముగౌడ్, లింగంపల్లి శ్రీనివాస్‌రావు, రాధారపు స్వామి, రామిళ్ల కిరణ్ ఉన్నారు. -
నవ్వులు విరియాలంటే..
ఆదివారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ఆమె ఆరోగ్యవంతురాలైతే.. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమే. కుటుంబం సక్రమంగా నడవడానికి ఆమే ప్రధాన కారణం. అలాంటి ఇల్లాలికి వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలి. వారాంతంలో భార్య చేసే ఇంటి పనుల్లో ఓ చెయ్యి వేస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమెకూ విశ్రాంతి దొరుకుతుంది. ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. -
వదిలేస్తున్నారు..!
కాటారం: ఓ వైపు సాగునీటి కొరత.. మరోవైపు ముదురుతున్న ఎండలు కూరగాయలు సాగుచేసే రైతుల పాలిట శాపంగా మారాయి. ఒకప్పుడు కూరగాయల సాగుకు నిలయాలుగా నిలిచిన జిల్లాలోని పల్లెలు ప్రస్తుతం సాగుకు దూరమవుతున్నాయి. గత వేసవి కంటే ప్రస్తుతం ఆరంభంలోనే ఎండల తీవ్రత ఉండటంతో పాటు సాగు నీటి వనరులు మెల్లి మెల్లిగా ఎత్తి పోతుండటంతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. బోరుబావులపై ఆధారపడి కూరగాయల సాగు ప్రారంభించిన రైతులు ఎండ తీవ్రతతో బోర్ల నుంచి సాగు నీరు పూర్తి స్థాయిలో అందక మధ్యలోనే తమ పంటలను వదిలేస్తున్నారు. కూరగాయలే జీవనోపాధిగా.. జిల్లాలో కూరగాయల సాగే జీవనోపాధిగా కొనసాగుతున్న గ్రామాలు అనేకం ఉన్నాయి. కాటారం మండలకేంద్రంతో పాటు గంగారం, ఆదివారంపేట, బస్వాపూర్, మల్హర్ మండలం కుంభంపల్లి, కొండంపేట, వలెంకుంట, మహదేవపూర్ మండలకేంద్రంతో పాటు బొమ్మాపూర్, సూరారం, అంబట్పల్లి, కుదురుపల్లి గ్రామాల్లో కూరగాయల సాగు అధికంగా జరుగుతుంది. టేకుమట్ల, మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ గ్రామాల్లో కూరగాయల సాగు జరుగుతుంది. ఆయా గ్రామాల్లో టమాట, మిర్చి, కాకర, బీర, క్యాబేజ్, అలిచంత, సోరకాయ, క్యారెట్, ముల్లంగి, మునగ, బీట్రూట్, దొండ, బెండ, గోబిపువ్వుతో పాటు ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తగ్గిన కూరగాయల సాగు.. వేసవి కాలంలో సాగు నీరు అందక, ఎండల తీవ్రత కారణంగా గ్రామాల్లో కూరగాయల సాగు తగ్గిపోతూ వస్తుంది. విస్తారంగా కూరగాయల సాగు జరిగే కాటారం మండల కేంద్రంతో పాటు గంగారం, మల్హర్ మండలం కొండంపేట, కుంభంపల్లి, చిట్యాల, మహదేవపూర్ మండలాల్లో కూరగాయల సాగు అధికంగా తగ్గిపోయింది. ఉద్యాన శాఖ అధికారుల లెక్కల ప్రకారం భూపాలపల్లి, గణపురం, మహాముత్తారం, పలిమెల మండలంలో ఈ ఏడాది కూరగాయల సాగే లేకుండా పోయింది. సాగు మధ్యలోనే.. వేసవి ఆరంభంలోనే నీటి ఎద్దడి సమస్య ఏర్పడుతుండటంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదు. బోరుబావులను నమ్ముకొని సాగు చేసిన పంటలకు సరైన నీటి తడి అందక మధ్యలోనే పంటను వదిలేస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరల మొక్కలకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నీరు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో నీరు అందకపోతే మొక్కలు వాడిపోయి అతితక్కువ సమయంలో చనిపోతాయి. బోరుబావులను నమ్ముకొని కూరగాయలు సాగు చేసిన రైతులు నీరు సరిగా అందక పంటలు కళ్లముందే ఎండిపోతుంటే ఆవేదన చెందుతున్నారు. సాగునీటికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో పంటలను అర్థాంతరంగా వదిలేస్తున్నారు. ఒకవేళ శ్రమంచి పంటలకు నీరు అందించినప్పటికీ ఆశించిన స్థాయిలో దిగుబడి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో కూరగాయల సాగు వివరాలు.. పుచ్చకాయలు 120ఎకరాలుటమాట 140ఎకరాలుఆకుకూరలు 10 ఎకరాలు కూరగాయల పంటలపై ఎండ ప్రభావం నీరు అందక ఎండిపోతున్న తోటలు ఆశించిన స్థాయిలో రాని దిగుబడి -
పోడు రైతులపై దాడి సరికాదు
భూపాలపల్లి అర్బన్: ఆజాంనగర్లో పోడు రైతులపై అటవీశాఖ అధికారులు దాడి చేయడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆజాంనగర్ శివారులో ఏళ్ల తరబడి పొడు చేసుకుంటున్న వ్యవసాయ భూముల రైతులను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా చితకబాదడం సరైంది కాదన్నారు. ఆడ, మగ తేడా లేకుండా విచక్షణారహితంగా కొట్టి పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా కేసులు నమోదు చేశారని చెప్పారు. పోడు రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సొత్కు ప్రవీణ్‌కుమార్, రాంచందర్, జోసెఫ్, రవికాంత్, రాజేష్, చంద్రయ్య, తిరుపతి, రమేష్ పాల్గొన్నారు. -
అవగాహన కల్పిస్తున్నాం..
కూరగాయలు సాగుచేసే రైతులు వేసవిలో పంటల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నాం. జిల్లాలో కూరగాయల సాగు పెరిగేలా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఉద్యానశాఖ ద్వారా అందుబాటులో ఉన్న పథకాలు, సబ్సిడీలను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేసి కూరగాయల సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాం. – మణి, హార్టికల్చర్ అధికారిణి, మహదేవపూర్ సబ్ డివిజన్ -
భాగస్వామికి విశ్రాంతినివ్వాలి..
నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే భార్యకు వారాంతపు సెలవు దినంలో విశ్రాంతినివ్వాలి. ఇలా చేయడం వల్ల జీవితభాగస్వామి మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. వారాంతపు సెలవు దినంలో ఇంటిపని, గార్డెనింగ్, ఇంటి శుభ్రతలో నిమగ్నమవుతుంటాను. నేనే స్వయంగా పిల్లలకు ఇష్టమైన, ఆరోగ్యకరమైన వంటలు చేసి వడ్డిస్తాను. పిల్లలకు అవసరమైన వస్తువులు కొనిస్తాను. సంతోషంగా గడుపుతాను. – డాక్టర్ బీఆర్ శరవణభవ, ప్రొఫెసర్, హెడ్ ఫార్మ్ డీ, వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హనుమకొండ -
చిరుతల రామాయణం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మద్దులపల్లిలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న చిరుతల రామాయణం శనివారంతో ముగిసింది. పల్లెల్లో పౌరాణిక నాటకాలు, ప్రదర్శనలు అంతరించిపోతున్న తరుణంలో పల్లె వాతావరణంలో రామాయణ ఘట్టంలోని పాత్రలకు తగిన వేషాలను వేసుకొని ప్రదర్శనను గ్రామస్తులు నిర్వహించారు. రామ,లక్ష్మణులు లంకలో దాడిచేసి రావణాసురుడిని హతమార్చి లంకలో ఉన్న సీతను తీసుకొచ్చిన సన్నివేశాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టాభిషేక ఘట్టం నిర్వహించారు. ఈ సన్నివేశాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాలు వారు మద్దులపల్లికి తరలివచ్చారు. -
కాళేశ్వరంలో సీసీ కెమెరాలు
కాళేశ్వరం: ‘వరుస చోరీలతో జనం బెంబేలు, పనిచేయని సీసీ కెమెరాలు’ అని సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. శనివారం ప్రధాన రహదారితో పాటు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలకు మరమ్మతులు చేశారు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్సై తమాషారెడ్డి తెలిపారు. ‘నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలి’ భూపాలపల్లి అర్బన్: బీఎంఎస్ నాయకులపై ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని బీఎంఎస్ పెన్షనర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మండా రమాకాంత్ హెచ్చరించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంపీఎఫ్ నిధుల కుంభకోణంపై సీబీఐ విచారణతో దోషులను గుట్టురట్టు చేస్తామన్నారు. సీబీఐకి నోటీసులు పంపించడంలో బీఎంఎస్ కీలక భూమిక పొషించిందన్నారు. అది కాకుండా జనక్‌ప్రసాద్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో నాయకులు బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్, నాయకులు సుజేందర్, నర్సింగరావు, మల్లేష్, మొగిలి, భాస్కర్, శ్రీనివాస్, సాగర్ పాల్గొన్నారు. పర్యాటకుల సందడి వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్, రాజ్‌కుమార్ పర్యాటకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయ్‌కుమార్ విద్యార్థులకు వివరించారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన విద్యార్థులు ఆలయంలో పలుచోట్ల గ్రూప్ ఫొటోలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. రష్యాకు చెందిన వాల్ రామప్ప ఆలయాన్ని సందర్శించారు. -
26నుంచి ప్రీ లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 26నుంచి మార్చి 7వ తేదీ వరకు జరగనున్న ప్రీ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు చెప్పారు. కక్షిదారులు రాజీమార్గంలో కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు. రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, వాహన ప్రమాద పరిహార కేసులు, చిట్ ఫండ్, వైవాహిక, ఆస్తి తగాద, ట్రాఫిక్ కేసులు పరిష్కరించబడుతాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
– హన్మకొండ కల్చరల్
ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. ‘ప్రతీ క్షణం నీకోసం నువ్వు.. వారానికి ఒక్కరోజు నీ ఇల్లాలికి ఇవ్వు’ అన్నట్లు ఆదివారం ‘ఇల్లాలి’కి ఇంటి పనుల్లో సాయమందించాల్సిన అవసరం ఉంది. గంపెడు బాధ్యతలతో ఇంటి బండిని నడిపే ఆమెకు వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలంటున్నారు.. ఆదివారం ఇంటి, వంట పనుల్లో పాలు పంచుకుంటే అనుబంధం మరింత పెరిగే అవకాశమూ ఉంది. ఆమె ఆరోగ్యవంతురాలైతే.. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమే. కుటుంబం సక్రమంగా నడవడానికి ఆమే ప్రధాన కారణం. అలాంటి ఇల్లాలికి వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలి. వారాంతంలో భార్య చేసే ఇంటి పనుల్లో ఓ చెయ్యి వేస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమెకూ విశ్రాంతి దొరుకుతుంది. ఏమి చేయొచ్చంటే.. ● ఇంట్లోని దుమ్ము దులపడం, వాక్యూమింగ్ చేయడం, నేలలను తుడవడం, – బాత్రూం శుభ్రపరచడం, వంటగది శుభ్రపరచడం (పాత్రలు, కౌంటర్‌టాప్‌లు) – కూరగాయలు కోయడం, భోజనం తయారీ –దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఆరాక మడతబెట్టడం, అవసరమైనప్పుడు ఇసీ్త్ర చేయడం. పిల్లల సంరక్షణలో ఇలా.. ● ఆ రోజు పిల్లలకు కూడా సెలవుదినం కావడం వల్ల స్నానం చేయించి దుస్తులు ధరింపజేయాలి. ● హోంవర్క్‌లో సహాయం చేయడం, ఆ రోజు పాఠశాలలో ఏదైనా కార్యక్రమం ఉన్నా హాజరు కావడం. ● ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడం, పచ్చిక కోయడం, తోటపని చేయడం.●ఆదివారం ప్రత్యేకమైన వంటలు చేస్తారు... నా భర్త ఉద్యోగరీత్యా ఉదయమే వెళ్తారు. ఆదివారం సెలవు కావడంతో నాకు సహాయంగా ఉంటారు. కూరగాయలు తరగడం, బట్టలు ఉతికితే ఆరేయడం, వంటగదిని శుభ్రం చేయడం వంటి పనులు చేస్తారు. మా బాబుకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేసి స్వయంగా వడ్డిస్తారు. – సీత స్వప్న, పోచమ్మకుంట, హనుమకొండ ఒక్క రోజు విశ్రాంతి ఇస్తే ఆనందమే భర్త తన కష్టాలను మోస్తున్నాడని, తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడని నమ్మకం ఏర్పడుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితులు, సంఘటనలతో ఇవి తలెత్తుతుంటాయి. వంట చేయడం, దుస్తులు ఉతికి ఆరబెట్టడం వంటి కొన్ని పనులు కలిసి చేయడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయే అవకాశం ఉంది. ఇంటిపని మహిళలకే పరిమితమనే భావన నెలకొంది. కానీ, భార్యాభర్తలు ఇంటిపనులు పంచుకోవడం వల్ల దాంపత్యంలో సామరస్యం పెరుగుతుంది. పనులను షేర్ చేసుకున్నప్పుడు త్వరగా పూర్తవుతాయి. మిగిలిన సమయంలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవచ్చు. అప్పుడు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం ప్రారంభిస్తారు. కలిగే ప్రయోజనాలుఇల్లాలిపై ప్రేమను చూపడంలో అతను ఇంటిపనుల్లో చేసే సహాయం కీలకం. ప్రతి పనిని భారంగా తీసుకోకుండా చేస్తున్నప్పుడు భర్త తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో, పట్టించుకున్నాడో భార్య అర్థం చేసుకుంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు దోహద పడుతుంది. -
పన్ను చెల్లింపు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వార్షిక ఆదాయంలో ఏడాదికి రూ.5లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. నూతనంగా ఉద్యోగంలో చేరే ఉద్యోగి నెలసరి రూ.31,400 వేతనంతో ప్రారంభం కాగా జిల్లాలో రూ. 1.24లక్షల వేతనం తీసుకునే ఉద్యోగులు సైతం ఉన్నారు. ఇన్సూరెన్స్‌లు, మెడికల్ బిల్లులు, స్కూల్ ఫీజులు, సేవింగ్స్ రశీదులతో పన్ను మినహాయింపు పొందవచ్చు. దానితో పాటు హౌసింగ్ లోన్ రూ.3.50లక్షల వరకు చూపించుకోవచ్చు, పన్ను పరిధి దాటిన వారికి రూ.5లక్షలలోపు 5శాతం, రూ.5లక్షలు దాటితే రూ.20శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వేతనం అఽధికంగా ఉన్న ఉద్యోగికి రూ.50వేల నుంచి రూ.లక్షకుపైగా ఐటీ పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐటీని రూ.12లక్షలకు పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. -
ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులే గడువు ఉంది. ఈనేపథ్యంలో.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో ఉండగా.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన సుదర్శన్‌రెడ్డి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలన్నా రు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్ట మైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిఘా పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. పూర్వ వరంగల్, నల్లగొండ, ఖ మ్మం జిల్లాల్లో 24,905 ఓట్లు ఉండగా.. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 6,509 పురుషులు, 4,288 సీ్త్రలు కలిపి 10,797 మంది ఓటర్లున్నారు. ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పా ట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ నిరంతరాయంగా పని చేసేలా విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడుతున్నారు. అలాగే.. 27న జరిగే పోలింగ్ కోసం ఒక్కరోజు ముందే ఎన్నికల సామగ్రిని తరలించేలా జిల్లా కేంద్రాల్లో డిస్టిబ్య్రూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులపై కూడా కసరత్తు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా, ప్రతీ రెండు గంటల కు పోలింగ్ వివరాలను ప్రకటించేలా ఎన్నికల అధి కారులు, సిబ్బందిని కలెక్టర్లు సంసిద్ధం చేస్తున్నారు. వేడెక్కిన ప్రచారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 23 మంది 50 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి – స్వతంత్ర (యూటీఎఫ్ మద్దతు), గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), శ్రీపాల్‌రెడ్డి పింగిళి – స్వతంత్ర (పీఆర్టీయూ – టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీయూ మద్దతు)తో పాటు స్వతంత్రులుగా సంగంరెడ్డి సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్‌రెడ్డి ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కై లాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఐదు రోజులే గడువుండడంతో అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలిలా.. జిల్లా మండలాలు పోలింగ్ పురుషులు సీ్త్రలు మొత్తం కేంద్రాలుహనుమకొండ 11 15 2884 2214 5098 వరంగల్ 13 13 1381 844 2225 జనగామ 12 12 556 365 921 మహబూబాబాద్ 18 16 1083 535 1618 భూపాలపల్లి 07 07 211 112 323 ములుగు 09 09 394 218 612 మొత్తం 70 72 6,509 4,288 10,797ఏర్పాట్లపై కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్‌రెడ్డి ఆదేశం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉమ్మడి జిల్లాలో 10,797 మంది ఓటర్లు ఈనెల 27న పోలింగ్.. వచ్చే నెల 3న లెక్కింపు ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు -
నువ్వక్కడ.. నేనిక్కడ
● భూపాలపల్లిలో మగపులి.. మంచిర్యాలలో ఆడపులి సంచారం కాళేశ్వరం :మహదేవపూర్ మండలం గోదావరి పరివాహాక ప్రాంతం అడవుల్లో మగపులి సంచారం చేస్తుండగా..గోదావరి అవతలి ఒడ్డుకు మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ పరిసరాల్లో ఆడపులి కలియ తిరుగుతోంది. 12 రోజులుగా కాటారం, మహదేవపూర్ అడవుల్లో తచ్చాడిన పెద్దపులి వచ్చిన దారిగుండానే శుక్రవారం నస్తూర్‌పల్లి అడవి బాటపట్టినట్లు అటవీ శాఖ అధికారులు పాదముద్రలను గుర్తించారు. ఆడపులి మాత్రం మగపులి రాక కోసం దాంపూర్ అడవుల్లోనే మూడ్రోజులుగా తలదాచుకుందని తెలిసింది. గురువారం అక్కడే ఓ గేదెను చంపినట్లు అక్కడి అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఈ రెండు జతకట్టడానికే (మేటింగ్) పన్నెండు రోజులుగా రోజుకో చోట తిరుగుతున్నాయి. 15–20 కిలోమీటర్ల మేర మగపులి జాడను అటవీశాఖ అధికారులు నాలుగు బృందాలతో అన్వేషిస్తున్నారు. అక్కడక్కడా ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసినా చిక్కకుండా, అధికారుల కన్నుల్లో పడకుండా ఏమార్చి తిరుగుతోంది. ఎక్కడా ఎలాంటి దాడులు కూడా చేయకుండా తెలివిగా తప్పించుకుంటోంది. మగ, ఆడపులి జతకట్టే (మేటింగ్) సమయం కావడంతో వాటి వాసన పసిగడుతూ కచ్చితంగా గోదావరి దాటే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు పులులు దరి చేరాలంటే వాటి మధ్య 30 కిలోమీటర్ల దూరమే ఉంది. గోదావరి దాటి కలిసిపోయి పులుల ప్రేమ ఫలిస్తుందా! లేదా మగపులి వచ్చిన దారిన ఇంద్రావతి వైపు మరలిపోయి విఫలం అవుతుందా తెలియాల్సి ఉంది.నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం భూపాలపల్లి రూరల్: నేడు (శనివారం) పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో కొత్త ట్రాన్స్ఫర్మర్ పనులు చేస్తున్నందున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ ఏఈ విశ్వాస్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6 ఇంక్లైన్ రోడ్డు, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు. రేపు గురుకుల ప్రవేశ పరీక్ష భూపాలపల్లి అర్బన్: ఈనెల 23న జిల్లాలో ఉమ్మడి గురుకులాల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల జిల్లా కోఆర్డినేటర్ గోల్కొండ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5నుంచి 8వ తరగతులకు ప్రవేశ పరీక్ష, 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, లింగాల క్రాస్, గాంధీనగర్, కాటారం గురుకుల పాఠశాలలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2,360 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. -
ఐటీ ఎగవేత!
శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025అక్రమార్జనకు అవకాశం.. వేతన స్థిరీకరణ సందర్భంలో, ఇప్పుడు పన్ను మినహాయింపు బిల్లుల సమర్పణకు డీడీఓలకు, ట్రెజరీ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆయా బిల్లుల సమర్పణకు వెళ్లిన డీడీఓల నుంచి ట్రెజరీ ఉద్యోగులు కొర్రీలు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సాకుతో అసలు విషయం తెలిసిన డీడీఓలు సైతం ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి అందినంత దండుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. నకిలీ బిల్లులు.. ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ ప న్ను నుంచి మినహాయింపు పొందే ందుకు అనేక రకాల నకిలీ బిల్లులు సమర్పిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చెల్లించే వారి పిల్లలు ఫీజులకు అదనంగా రెండింతలు పెంచి, ఎల్ఐసీ, ఇతర ఇన్సూరెన్స్ పాలసీలు లేకున్నా నకిలీ రశీదులు పెట్టినట్లు సమాచారం. లోన్లు లేకున్నా తీసుకున్నట్లు రశీదులు పెడుతున్నారని తెలుస్తోంది. -
కలెక్టర్ హాస్టల్ నిద్ర
● విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాహుల్‌శర్మ శుక్రవారం రాత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేసి నిద్రించారు. అంతకుముందు ఆయన భోజనశాల, ఆహార పదార్థాల నిల్వలు, వంటకాలను పరిశీలించారు. సమస్యలను ప్రిన్సిపాల్ శారదను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని సూచించారు. మీకు మీరే పోటీపడాలని చెప్పారు. పరీక్షలు అంటే భయం లేకుండా మానసికంగా సిద్ధం కావాలని సూచించారు. అనంతరం టెన్త్ విద్యార్థుల స్టడీ అవర్‌లో పాల్గొని పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి సునీత, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ హుస్సేన్, ఆర్ఐ సురేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేష్ ఉన్నారు. -
సాగునీరు అందించేందుకు చర్యలు
భూపాలపల్లి: రబీ పంటకు అవసరమైన నీటి సరఫరా కోసం తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ పంటకు రైతులకు ఇబ్బందులు కలగకుండా పంటలకు సమృద్ధిగా సమయానికి సాగు నీరు అందించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నీటి పరిస్థితి, కాలువల ద్వారా నీటి సరఫరా, భూగర్భ జలాల స్థితిగతులు మొదలైన అంశాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటూ పంటలు ఎండిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో గత రబీ సీజన్లో 86వేల ఎకరాల్లో పంట సాగు జరిగిందని, ఈ రబీ సీజన్లో 82 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం నీరందక పంటలు ఎండిపోయిన ప్రాంతాలను, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యాన్మయ ఏర్పాట్లుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే యూరియా కొరత లేకుండా చూడాలని, టాస్క్‌ఫోర్స్ టీంలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తూ స్టాక్ వివరాలు పరిశీలించాలని ఆదేశించారు. ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే పీడీ యాక్టు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఏఓ విజయ్‌భాస్కర్, ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలకు పకడ్భందీ ఏర్పాట్లు ఈ నెల 27న నిర్వహించనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయం నుంచి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పోలింగ్ స్లిప్పుల పంపిణీ 90 శాతం పూర్తయిందన్నారు. శనివారం వరకు మిగిలిన 10శాతం పూర్తి చేస్తామని తెలిపారు. భూపాలపల్లి డివిజన్లో 7, కాటారం డివిజన్లో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 76 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్ శర్మ -
కోడ్ అమలేది..!
తిరుమలగిరి గ్రామ పంచాయతీ పరిధిలో..మండల కేంద్రంలో తొలగించని ఫ్లెక్సీ ముసుగు వేయకుండా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహంవరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి 20 రోజులైనా రేగొండ మండలంలో మాత్రం అమలు కావడం లేదు. మండలకేంద్రంలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించలేదు. ఇందిరా గాంధీ విగ్రహానికి ముసుగు వేయలేదు. తిరుమలగిరి గ్రామపంచాయతీ పరిధిలో శిలాఫలకానికి ముసుగు వేయకుండానే వదిలేశారు. – రేగొండ -
ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎల్వీ సూర్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఏరియాలో పర్యటించారు. అధికారులతో జీఎం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. భూపాలపల్లి ఏరియాలో ఉత్పత్తి శాతం ఆశించిన స్థాయిలో లేదన్నారు. ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్మికుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. రక్షణ నియమాలు పాటిస్తూ సంస్థ పురోగతికి కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సింగరేణి జనరల్ రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు కవీంద్ర, వెంకటరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకటరమణ, భిక్షమయ్య, మారుతి పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
భూపాలపల్లి రూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా కృషిచేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. జిల్లాకేంద్రంలోని సమాఖ్య భవనంలో డీఆర్డీఓ నరేష్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సమాఖ్య సంఘాల సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో రుణాలు అందిస్తుందన్నారు. మహిళా సంఘాలు, మహిళా సభ్యులు అందరూ ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, వీఓలు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి -
తప్పించుకునేందుకు తప్పుడు పత్రాలు
● పెరిగిన వేతనాలతో ఉద్యోగులపై భారీగా ఆదాయ పన్ను భారం భూపాలపల్లి అర్బన్: ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు వేతన జీవులను ఆదాయపన్ను(ఐటీ) కలవరపెడుతోంది. ఈ నెలలో చేతికి ఏమైనా జీతం వస్తుందా? లేక పన్ను చెల్లింపులకు సరిపోతుందా? అని లెక్కలు వేసుకుంటారు. గత పీఆర్సీ అమలుతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. ఫలితంగా ఆఫీసు సబార్డినేటు మొదలుకొని ప్రతి ఉద్యోగి పన్ను పరిధిలోకి వచ్చారు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా నిబంధనలను సాకుగా చూపి పన్ను తప్పించుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ● నకిలీ బిల్లులు సమర్పిస్తున్నట్లు ప్రచారం -
వరుస చోరీలతో జనం బెంబేలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం రాత్రి మళ్లీ చోరీ జరిగింది. కాళేశ్వరం గ్రామానికి చెందిన తాజ్‌బాబా కూల్‌డ్రింక్స్ దుకాణం తాళం పగులగొట్టి రూ.6వేల వరకు నగదు దొంగిలించారు. ఇదే రాత్రి మజీద్‌పల్లిలోని కూరపాటి మహేష్, ముంగి రాజయ్య కిరాణం, ముంగి మహేష్ ఇంటి తాళం పగులగొట్టినా నగదు, వస్తువులు పోలేదని బాధితులు పేర్కొన్నారు. ఈనెల 6న కాళేశ్వరానికి చెందిన ముంగి రాజేష్ ఇంటి తాళం గడ్డపారతో పగులగొట్టి రూ.10వేలు అపహరించారు. అదే రాత్రి చిన్న అడప సమ్మయ్య ఇంటితాళం కూడా పగులగొట్టగా అక్కడ ఎలాంటివీ పోలేదు. వరుసగా ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలు జరుగుతున్నా పోలీసులు దొంగలను గుర్తించడం లేదు. దీంతో జనం తాళం వేసి ఊరికి వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు. రాత్రిపూట భయబ్రాంతులకు గురవుతున్నారు. కాళేశ్వరంలో ప్రధాన రహదారి, పలు వార్డుల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పోలీసులు కూడా చోరీలపై దృష్టిసారించడం లే దు. ఈ విషయమై ఎస్సై తమాషారెడ్డిని సంప్రదించగా ఒక అనుమానితుడిని కనిపెట్టినట్లు తెలి పారు. పట్టుకొని వివరాలు వెల్లడిస్తామన్నారు. పనిచేయని సీసీ కెమెరాలు దృష్టిసారించని పోలీసులు -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది. రాత్రిపూట కాస్త చలిగా ఉంటుంది.పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు ● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి భూపాలపల్లి అర్బన్: ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై గురువారం తన చాంబర్లో ఇంటర్మీడియట్ అధికారి, పోలీస్, ఆర్టీసీ, విద్యుత్, వైద్యఆరోగ్యశాఖ, మున్సిపల్, పోస్టల్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి, రెండో సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రఽథమ సంవత్సరంలో 1,820 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,795 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకటి, సిట్టింగ్ స్క్వాడ్ 2, జిల్లా పరీక్షల కమిటీ ఒకటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ అధికారి వెంకన్న, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్‌నాయక్, ఆర్టీసీ డీఎం ఇందు, డీఎస్పీ నారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. జిల్లాస్థాయి క్రీడాపోటీలు భూపాలపల్లి అర్బన్: ఈ నెల 24, 25వ తేదీల్లో జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించనున్నట్లు నెహ్రు యువకేంద్రం జిల్లా అధికారి చింతల అన్వేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాలీబాల్, రన్నింగ్, షటిల్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 18 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు యువతీ, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వివరాలకు 96408 81670, 76590 71405 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
పోడు రైతులపై ఫారెస్టు అధికారుల దాడులు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం ఆజాంనగర్ అటవీగ్రామంలో పోడు చేస్తున్నారన్న సమాచారంతో గురువారం డీఆర్ఓ ఉషారాణి ఆధ్వర్యంలో ఫారెస్టు అధికారులు, సిబ్బంది రైతుల ను అడ్డుకున్నారు. దీంతో రైతులకు, ఫారెస్టు అధి కారుల మధ్య జరిగిన తోపులాటలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఫారెస్టు అధికారులు రైతులపై దాడులు చేశారని, ఈ దాడుల్లో ఇద్దరికి గాయాలయ్యాయని, లంచం ఇవ్వకుంటే దాడులు చేయించిందని ఆరోపిస్తూ.. అధికారిణిపై గురువారం భూ పాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు రైతులు చేశారు. విధులకు అటంకం కలిగించారని రైతులపై ఫారెస్టు అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.. రైతులు ఏమంటున్నారంటే.. ‘మేము 10 కుటుంబాలకు చెందిన వారము. గత 30ఎళ్లుగా ఆజాంనగర్లో పోడు వ్యవసాయంమీద బతుకుతున్నాం. గతేడాది జూన్ మాసంలో అధికారిణి సాగు అడ్డుకుందని, దీంతో 10 మంది రైతులం కుటుంబానికి రూ. 50వేల చొప్పున రూ. 5లక్షలు లంచం ఇవ్వడంతో పత్తి పంటసాగుకు అనుమతి ఇచ్చింది’ అని రైతులు ఆరోపించారు. ఈ ఏడాది మరో రూ.2లక్షలు కావాలని అడిగిందని, ఇవ్వకపోవడంతో సిబ్బందితో జేసీబీలతో గుంతలు చేయడానికి భూముల మీదకు రావడంతో అడ్డుకున్నామని, అధికారులు, సిబ్బంది ఇస్టానుసారంగా తమపై దాడులు చేసి ముగ్గురిని ఆరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులేమంటున్నారంటే.. రైతుల దాడిలో ఫారెస్టు అధికారుల జీపు అద్దం ధ్వంసమైందని, ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయని, ఆరుగురు రైతులపై ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. లంచం తీసుకున్నట్లు తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, తప్పుడు ఫిర్యాదు చేయించారని అధికారిణి ఉషారాణి తెలిపారు. ముగ్గురు రైతులు పోలీస్‌స్టేషన్‌కు తరలింపు లంచం తీసుకున్నారని అధికారిణిపై పోలీసులకు రైతుల ఫిర్యాదు -
నాణ్యమైన విద్యుత్ సరఫరా
భూపాలపల్లి రూరల్: వేసవి కాలం సమీస్తున్న దృష్ట్యా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం ముందస్తు కార్యచరణ చర్యలు చేపట్టామని ఎస్ఈ మల్చూరు నాయక్ తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం ట్రాన్స్‌ఫర్మర్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా ఎస్ఈ మాట్లాడారు. వేసవిలో ఎటువంటి అంతరాలు లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టంచేశారు. ఎస్ఈ వెంట డీఈ పాపిరెడ్డి, డివిజన్ అధికారులు ఉన్నారు. కలాం స్ఫూర్తి యాత్ర భూపాలపల్లి అర్బన్: మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో నిర్వహిసుత్న్న కలాం స్ఫూర్తి యాత్ర గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి హాజరై మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు అవసరమని తెలిపారు. ఈ సందర్శనలో బృందం సభ్యులు విద్యార్థులతో ఆసక్తికరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు మధులాష్‌బాబు, దిలీప్‌కుమార్, సాయి సుబ్రమణ్యం, రోహిత్ జలగాం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పన్నుల చెల్లింపునకు సహకరించాలి భూపాలపల్లి అర్బన్: ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని 8, 10వ వార్డులో గురువారం కమిషనర్ పర్యటించారు. కాలనీ శానిటేషన్ పనులు పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణ, రోడ్లు శుభ్రం ఉంచటం, డ్రెయినేజీల శుభ్రత గురించి కాలనీవాసులతో మాట్లాడారు. కాలనీల్లో సమస్యలు పేరుకుపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. పన్నులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ దేవేందర్, వార్డు సిబ్బంది పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయంలో ఈ నెల 26నుంచి జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పోలీస్‌శాఖ తరఫున ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ గురువారం పరిశీలించారు. ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు, స్వామివారి కల్యాణం నిర్వహించే ప్రాంతం, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను చూశారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు శాఖ తరఫున పర్యవేక్షణ చేపడతామని వివరించారు. రామప్ప చెరువులో బోటింగ్, స్నానాలకు అనుమతి లేదన్నారు. 26నుంచి 28వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు ఇద్దరు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 12మంది ఎస్సైలతో కలిపి 300మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డీఎస్పీ వెంట సీఐ శంకర్, ఎస్సై జక్కుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి గోవిందరావుపేట: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బాలల పరిరక్షణ విభాగం జిల్లా లీగల్ అధికారి డి.సంజీవ అన్నారు. మండల పరిధిలోని చల్వాయి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం యువతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక న్యాయంతో పాటు చట్టాలపై వివరించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత న్యాయం గురించి అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదువుకుని ఉన్నత స్థానంలోకి చేరుకోవాలన్నారు. -
రైతులపై దాడులు సరికాదు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం ఆజాంనగర్ గ్రామంలో రైతులపై ఫారెస్ట్ అధికారులు చేసిన దాడులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఖండించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 30 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. రైతులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులు తీరు మార్చుకోవాలని సూచించారు. దోషులను శిక్షించాలి.. 15వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యవెనుక దోషులు ఎంతటివారైనా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఈ దాడిపై పోలీసులు సమగ్ర విచారణ చేసి త్వరగా దోషులను గుర్తించి శిక్షపడేలా చూడాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవడానికి అనేకమార్గాలు ఉన్నాయని.. ఇలా హత్యలు చేయడం సమస్యకు పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలన్నారు. విచారణలో పూర్తి వాస్తవాలు బయటకు రాకపోతే ప్రభుత్వం నుంచి సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, అధికార ప్రతినిధి గాజర్ల అశోక్,, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, నాయకులు పిప్పాల రాజేందర్, జోగుల సమ్మయ్య, కప్పల రాజేష్ నాయకులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
మండలాల వారీగా సాగు వివరాలు (ఎకరాల్లో..)
రేగొండ 3,652 మహదేవపూర్ 3,597 టేకుమట్ల 1,103 భూపాలపల్లి2,543 చిట్యాల 2,325 మొత్తం 19,637మొగుళ్లపల్లి 1,804 మల్హర్ 1,516 గణపురం 1,291 కాటారం 45 -
ఆడతోడు కోసం..
ఆడపులి వాసనతో.. పదకొండు రోజులుగా మూడున్నరేళ్ల మగ పెద్దపులి ఆడపులి వాసనను పసిగడుతూ ప్రయాణం చేస్తుందని తెలిసింది. గోదావరి అవుతలి వైపున వేమనపల్లి మండలం నీల్వాయి అడవులకు ఓ ఆడపులి చేరి సంచరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇక్కడి మగపులి ఆడతోడు (మేటింగ్)కోసం అడవి అంతా గస్తీ చేస్తుంది. గోదావరి సరిహాద్దుల వరకు వెళ్లి తిరిగి వస్తుందని అటవీశాఖ అధికారుల ద్వారా తెలిసింది. కొన్ని కిలోమీటర్ల మేర ఉన్న పులులు వాటి వాసనను పసిగట్టి తోడు దరిచేరుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మూత్రం, పేడ వాసనను గుర్తించి దరికి చేరుతాయి. రెండు పులుల తోడు కోసం ఏదైనా గోదావరి దాటి కలిసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఆ దిశగా అధికారులు కూడా అన్వేషణ ప్రారంభించినట్లు తెలిసింది. కాటారం, మహదేవపూర్ మండలాల్లో దాడులు మాత్రం ఎక్కడా చేయలేదని తెలిసింది.కాళేశ్వరం: పదకొండు రోజులుగా అటవీశాఖను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి పలుగుల నుంచి బీరాసాగర్కు ప్రయాణం ప్రారంభించింది. ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తూర్‌పల్లి నుంచి మొదలైన పులి సంచారం వీరాపూర్ గుడూర్, గుండ్రాత్‌పల్లి, కుదురుపల్లి, బీరాసాగర్, అన్నా రం మీదుగా మహదేవపూర్ మండలం మద్దులపల్లి, పలుగుల వరకు కలియ తిరిగింది. గారెకుంట ఒర్రెలో మకాంవేసి గురువారం ఉదయం మళ్లీ పలు గుల మీదుగా అటవీప్రాంతం గుండా కాళేశ్వరం సమీపంలోని గ్రావిటీ కెనాల్ రోడ్డుపై పులి నడచుకుంటూ వెళ్లిన పాదముద్రలు స్థానికులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బీరాసాగర్లో కెమెరాలు.. మహదేవపూర్ రేంజ్ అధికారులు నాలుగు బృందాలతో పాటు ఎనిమల్ ట్రాకింగ్ టీంలతో కలిసి అన్వేషణ ప్రారంభించారు. సాయంత్రం వరకు బీరాసాగర్ అడవిలో పాదముద్రలు లభించారు. దీంతో అక్కడా ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గోదావరితీరం, సమ్మక్క–సారలమ్మ గద్దెలు, నీటికుంటల వద్ద ఆరు కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంద్రావతి టు గోదావరితీరం.. పులుల సంచారం ఇంద్రావతి రిజర్వుఫారెస్టులో ఎక్కువగా ఉంది. ఛత్తీస్‌గఢ్ వైపున మావోయిస్టు ప్రాబల్యం ఉండడంతో పులుల గణన జరుగలేదని తెలిసింది. అక్కడి నుంచి ఇంద్రావతి దాటి గోదావరి తీరం వైపునకు ప్రయాణం చేసినట్లు వాదనలు వినిపిస్తుంది. ఇంద్రావతి వద్ద పలిమెల, మహదేవపూర్ మీదుగా కాటారం నుంచి మళ్లీ బీరాసాగర్ చేరిన పులి అటు వెళ్లడానికి ప్రయత్నించిందా అనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే పెద్దపులిని ప్రత్యక్షంగా చూశారు. ట్రాకింగ్ కెమెరాలకు చిక్కలేదు. దీంతో సంచారం భయంతో ప్రజలు రాత్రిపూట ప్రయాణాలు చేయడం లేదు. ఎఫ్ఎస్ఓ ఆనంద్‌ను సంప్రదించగా బీరాసాగర్కు పులి వచ్చినట్లు పాదముద్రలు సేకరించినట్లు తెలిపారు. అడవి మొత్తం సంచరిస్తుందని, ఒక్క దగ్గర నిలకడగా ఉండడం లేదని తెలిపారు.మంచిర్యాల జిల్లా నీల్వాయికి ఆడ పులి రాక ఆ వాసనతోనే అడవిలో తచ్చాడుతున్న మగపులి పదకొండు రోజులుగా మకాం