Karimnagar
-
దివ్య.. పరీక్ష రాస్తే విజయమే
తెలంగాణ పబ్లిక్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్–1, 2 ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సత్తాచాటారు. కొందరు అభ్యర్థులు ఇదివరకు గ్రూప్–4 (Group-4)ఫలితాల్లో ర్యాంకులు సాధించి ఆయా శాఖల్లో ఉద్యోగం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఉత్తమ ర్యాంకులు సాధించడం విశేషం.ధర్మారం(ధర్మపురి): ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ – 2(Group-2) ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన మోటపల్లి దివ్య రాష్ట్రస్థాయిలో 169వ ర్యాంక్ సాధించారు. కాళేశ్వరం జోన్ మహిళా విభాగంలో రెండో ర్యాంక్ సాధించారు. బంగారు ఆభరణాల పనిచేసే మోటపల్లి తిరుపతి–భారతి దంపతుల కూతురు దివ్య(Divya ). బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. 2019లో వీఆర్వోతోపాటు గ్రూప్ – 4 ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్ష రాశారు.తొలుత వీఆర్వో ఉద్యోగానికి ఎంపికయ్యారు. జూలపల్లి మండలంలో పనిచేశారు. గ్రూప్– 4 పరీక్ష ఫలితాలు 2021లో ప్రకటించగా రాష్ట్రస్థాయిలో 47వ ర్యాంక్ సాధించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యారు. 317 జీవో కింద దివ్యను ధర్మారం తహసీల్దార్ కార్యాలయానికి జూనియర్ అసిస్టెంట్‌గా బదిలీ చేశారు. గ్రూప్ – 1 లక్ష్యంగా ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టిన ఆమె.. రెండు నెలల వ్యవధిలోనే గ్రూప్ –2, గ్రూప్ –1 పరీక్షలు నిర్వహించగా రెండింటికి ప్రిపేరయ్యారు. మంగళవారం విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో సత్తా చాటారు. -
ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతా
కరీంనగర్(రామగుండం): తనతో చనువుగా ఉన్న ఆమె ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని, ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతానని, లేదంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బిహార్‌కు చెందిన వలసకూలీ గేదెం అజయ్ భీష్మించుకు కూర్చున్నాడు. మంగళవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కి హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఉదయ్‌కిరణ్, ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు మైక్‌సెట్ ద్వారా యువకుడిని సంప్రదించగా.. కొద్దిరోజులుగా ఆ యువతి తనతో మాట్లాడడం లేదన్నారు. స్పందించిన పోలీసులు యువతిని ఘటనా స్థలానికి తీసుకొచ్చి మైక్‌లో మాట్లాడించగా, అజయ్ టవర్ దిగాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. అజయ్ తనను కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, పోలీసుల అప్రమత్తంగా వ్యవహరించి సదరు యువతిని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి మాట్లాడించడంతో యువకుడి ప్రాణాలు దక్కాయి. -
లే నాన్నా.. అమ్మా, చెల్లి వచ్చాం
సిరిసిల్ల/సిరిసిల్లక్రైం: ‘లే నాన్న.. అమ్మా.. చెల్లి వచ్చాం.. ఒక్కసారి చూడండి నాన్న.. మీరే మా ధైర్యం.. ఇలా వెళ్లి పోతే ఎలా.. మీకు ఎన్ని గాయాలు అయ్యాయి.. నాన్న పడిపోతుంటే.. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు..!! అంటూ.. సిరిసిల్లలో ప్రమాదవ శాత్తు మృతిచెందిన 17వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం(61)(Police Commandant Gangaram) కూతురు డాక్టర్ గౌతమి కన్నీరు కార్చుతూ విలవిలాడిపోయారు. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావునగర్‌లో రమేశ్ ఇంట్లో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అద్దెకు ఉంటారు. చంద్రశేఖర్‌రెడ్డి కూతురు ఇటీవల మరణించారు. అతన్ని ఓదార్చేందుకు వారి ఇంటికి వెళ్లిన తోట గంగారాం తిరిగి వస్తుండగా.. లోపల లిఫ్ట్ లేకుండానే గేటు ఓపెన్ కావడంతో అందులో ప్రమాదశాత్తు పడిపోయాడు. మూడో అంతస్తు నుంచి గంగారాం పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది తాళ్ల సాయంతో గంగారాంను బయటకు తీయగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. లిఫ్ట్ నిర్వహణ లోపమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేటకు చెందిన లిఫ్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.పోలీస్ బెటాలియన్‌లో..సిరిసిల్ల శివారులోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్‌లో కమాండెంట్ మృతదేహాన్ని ఉంచి పలువురు నివాళులు అర్పించారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బెటాలియన్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అంతకు ముందు రాత్రి ఎస్పీ గిటే మహేశ్ బాబా సాహేబ్, ఏఎస్పీ చంద్రయ్య గంగారాం మృతదేహాన్ని పరిశీలించి నివాలి అర్పించారు. గతంలో హైదరాబాద్ సచివాలయం ఛీప్ సెక్యూరిటీ ఆఫీస్(సీఎస్‌వో) గా గంగారాం పని చేశారని, ఆయన మృతిపట్ల సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.తారక రామారావు సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్ పోలీస్ కమాండెంట్ మృతిపై సంతాపం ప్రకటించారు. బెటాలియన్ పోలీస్ సిబ్బంది కన్నీటి నివాళి మధ్య గంగారాం మృతదేహాన్ని స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులంకు తరలించారు. -
బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురి అరెస్ట్
మెట్పల్లి: ఇరిగేషన్ శాఖ మెట్పల్లి డివిజన్లో డీఈఈ లక్కంపల్లి అరుణోదయ్ కుమార్‌ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఎస్సై అనిల్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. రౌడీషీటర్ బత్తుల భరత్, జెట్టి లక్ష్మణ్, రేంజర్ల అజయ్, ఎన్నం రమేశ్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా అక్రమదందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసు పెడతామంటూ బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. గతనెల 12న రేంజర్ల అజయ్ రాజేశ్వర్రావుపేటలోని వరదకాలువ నుంచి అక్రమంగా మొరం తరలిస్తుండగా డీఈఈ తమ వర్క్ ఇన్స్పెక్టర్ లస్మయ్యతో కలిసి అక్కడకు వెళ్లి అడ్డుకున్నాడు. వెంటనే అజయ్ ఈ విషయాన్ని ఫోన్లో రమేశ్‌కు తెలపగా.. అతడు వచ్చి డీఈఈని దూషించడంతోపాటు అట్రాసిటీ కేసు పెట్టిస్తామని బెదిరించాడు. గత్యంతరం లేక డీఈఈ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత భరత్ డీఈఈకి ఫోన్ చేసి అట్రాసిటీ కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అలాగే జెట్టి లక్ష్మణ్ కూడా ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని, లేకుంటే చంపుతామని బెదిరించాడు. దీనికి భయపడిన డీఈఈ భరత్‌కు ఫోన్‌పే ద్వారా రూ.1.10లక్షలు, లక్ష్మణ్‌కు రూ.40వేలు నేరుగా అందించాడు. అయినా వినకుండా మిగతా డబ్బులు కూడా ఇవ్వాలంటూ తరచూ ఫోన్ చేసి బెదిరించసాగారు. వారి వేధింపులు భరించలేక డీఈఈ ఈనెల 6న ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న నలుగురిలో భరత్, లక్ష్మణ్, అజయ్‌ని జిల్లా సరిహద్దు గండి హనుమాన్ ఆలయ సమీపంలో పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.80వేలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రమేశ్ పరారీలో ఉన్నా డు. సర్కిల్ పరిధిలో పంచాయితీలు, సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను బెదిరింపులకు గురి చేయడం మానుకోవాలని, లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. రూ.80వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం -
నేటి నుంచి డోలోత్సవం
వేములవాడ: రాజన్న ఆలయంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు డోలోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు అర్చకుడు చంద్రగిరి శరత్‌శర్మ తెలిపారు. ఈనెల 16 నుంచి ఐదు రోజులపాటు జరిగే శివకల్యాణోత్సవాల సందర్భంగా ఆలయంలో పనులు వేగం పుంజుకున్నాయి. ప్రధానాలయం ముందు యాగశాల సిద్ధం చేస్తున్నారు. ఇన్చార్జి స్థానాచార్యులుగా ఉమేశ్‌శర్మ రాజన్న ఆలయం ఇన్చార్జి స్థానాచార్యులుగా ఉమేశ్శర్మను నియమించినట్లు ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి తెలిపారు. గతనెలలో ఇనచార్జి స్థానాచార్యులుగా కొనసాగిన అప్పాల భీమాశంకరశర్మ రిటైర్డ్ కావడంతో ఏర్పడిన ఖాళీలో ప్రధాన అర్చకులైన ఉమేశ్‌శర్మ నియమించారు. -
కాలువలోపడి వ్యక్తి మృతి
గోదావరిఖని: మల్కాపూర్ గ్రామానికి చెందిన మానాల వెంకటేశ్(47) మంగళవారం ప్రమాదవశాత్తు మురుగునీటికాలువలోపడి మృతి చెందాడని వన్‌టౌన్ ఎస్సై రమేశ్ తెలిపారు. ఉదయం పని కోసం స్కూటీపై వెళ్తూ అదుపుతప్పి కాలువలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉరేసుకొని ఆత్మహత్యమానకొండూర్: మండలంలోని పోచంపల్లికి చెందిన పొలం అంజయ్య (53) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొలం అంజయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి 15 ఏళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి అంజయ్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. కుటుంబ సభ్యులు అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు పలు ఆస్పత్రులు తిరిగి వైద్యం చేయించారు. రెండు నెలలనుంచి మళ్లీ అంజయ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున అంజయ్య ఇంట్లో కనిపించకపోవడంతో కుమారుడు రఘు తండ్రి కోసం వెతకగా ఇంటి ముందు చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.అనారోగ్యంతో ఒకరు.. సైదాపూర్: మండలంలోని ఆకునూర్ శివారు భూషణగట్ల వద్ద బండోజు నర్సింహాచారి(50) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాపూర్ ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామానికి చెందిన బండోజు నర్సింహాచారి అనారోగ్య సమస్యలతో జనవరి 7న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి వెళ్లాడు. చికిత్సకు సుమారు రూ.5లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. అంతడబ్బు ఎక్కడి నుంచి తేవాలని మనస్తాపం చెందాడు. ఆ మర్నాడు రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నర్సింహాచారి కనిపించడం లేదని హుస్నాబాద్ పోలీసులకు ఆయన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. సైదాపూర్ మండలం ఆకునూర్ శివారు భూషణగట్ల వద్ద చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడని సర్వాయిపేట గ్రామానికి చెందిన దేవయ్య మంగళవారం ఇచ్చిన సమాచారంతో కుటుంబసభ్యులు నర్సింహాచారి మృతదేహంగా గుర్తించారు. నర్సింహాచారికి ముగ్గు రు కూతుర్లు ఉన్నారు. చిన్న అల్లుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జ్వరంతో బాలిక మృతిహుజూరాబాద్ : మండలంలోని చెల్పూర్ గ్రామానికి చెందిన బండారి రమ్య (14) తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళవారం మృతిచెందింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... రమ్య గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. 20 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా హన్మకొండలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం రాత్రి తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంగళవారం ఉదయం మృతిచెందింది. రమ్య తండ్రి బండారి పెద్ద రమేశ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. -
నలుగురు బాలికల అదృశ్యం
● తల్లిదండ్రులకు అప్పగించిన వన్‌టౌన్ పోలీసులు కరీంనగర్ క్రైం: నగరానికి చెందిన నలుగురు బాలికలు రెండు రోజుల క్రితం అదృశ్యం అయ్యారు. వారి జాడ గుర్తించిన కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు క్షేమంగా ఇంటికి చేర్చారు. ఈ నెల 09న వన్‌టౌన్ పోలీసులకు నలుగురు బాలికలు అదృశ్యం అయ్యారని ఫిర్యాదు వచ్చింది. దర్యాప్తు చేసిన పోలీసులు గుంటూరులో బాలికలను గుర్తించి కరీంనగర్ తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలికలు తరచూ ఫోన్లు చూస్తుండడంతో మందలించడంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిసిరిసిల్లక్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సుందరయ్యనగర్‌కు చెందిన నాయిని రాజయ్య (59) రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. రాజయ్య సైకిల్‌పై వెల్జిపూర్ వెళ్తుండగా సిరిసిల్ల బ్రిడ్జి వద్ద వెనకనుంచి బైక్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజయ్యను సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రి, అక్కడి నుంచి కరీంనగర్ తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడి చిన్న కొడుకు రమేశ్ ఫిర్యాదు మేరకు కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన శీతల్లి మనోహర్‌ను నిందితుడిగా గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపారు. కుక్కల దాడిలో బాలుడికి గాయాలుశంకరపట్నం: శంకరపట్నం మండలంలో వీధికుక్కల దాడిలో మరో బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. మండలంలోని వంకాయగూడెం గ్రామానికి చెందిన శ్రేయాన్స్(4) ఇంటిఎదుట ఆడుకుంటుండగా వెన్నులో కుక్క కరిచి గాయపర్చింది. తాడికల్‌లో కృత్విక్ను కరిచిన కుక్క వంకాయగూడెం వచ్చి శ్రేయాన్స్‌ను కరిచిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శ్రేయాన్స్‌కు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. గంజాయి విక్రేతల అరెస్ట్కరీంనగర్క్రైం: నగరంలోని హౌజింగ్‌బోర్డుకాలనీలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిట్లు కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసు ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద రూ.3000 విలువైప 1.460 కిలోల గంజాయి చాక్లెట్లు లభించినట్లు వెల్లడించారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహేశ్‌కుమార్ గౌతమ్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మెస్‌చార్జీల పెంపుతోనే పౌష్టికాహారం
● ‘సుడా’ చైర్మన్ నరేందర్‌రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెస్‌చార్జీలు పెంచడంతోనే హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం సాధ్యమైందని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నగరంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. వంటశాలలోని సరుకులు తనిఖీ చేశారు. వంటకాలను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చాలీచాలని మెస్ చార్జీలతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే పరిస్థితి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మెస్‌చార్జీల పెంపుతో ఆ పరిస్థితి పోయిందన్నారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఆయన ప్రిన్సిపల్‌కు సూచించారు. మెనూ అమలు చేస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్, నాయకులు మిరాజ్, కొరివి అరుణ్‌కుమార్, శ్రావణ్‌నాయక్, కుర్ర పోచయ్య, పెద్దిగారి తిరుపతి ఉన్నారు. -
ఆక్యుపంక్చర్‌తో మెరుగైన ఫలితాలు
కరీంనగర్‌క్రైం: ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాల ద్వారా మందుల అవసరం లేకుండానే అనేక రకాల వ్యాధులను అధిగమించి మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ తెలిపారు. సంకల్ప ఆయుర్వేదిక్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ హైదరాబాద్‌వారి సహకారంతో, కరీంనగర్ బార్ అసోసియేషన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఉచిత ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి ప్రతిమ మా ట్లాడుతూ నడుము, మెడనొప్పి, మోకాళ్లనొప్పులు, తలనొప్పి, సయాటికా, మైగ్రైన్, గ్యాస్ట్రిక్ వంటి అనేక సమస్యలకు ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ వైద్య పద్ధతుల ద్వారా సమర్థవంతమైన చికిత్స పొందవచ్చని వివరించారు. ఈ శిబిరంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సహా దాదాపు 400మంది వైద్య సేవలు పొందారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్‌కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి వెంకటేశ్ పాల్గొన్నారు. -
స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు
కరీంనగర్‌టౌన్: జిల్లాకేంద్రంలోని పలు స్కానింగ్, ఫెర్టిలిటీ సెంటర్లను మంగళవారం డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రాల్లో స్కానింగ్ కోసం వచ్చిన అవుట్ పేషెంట్ రిజిష్టర్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, డాక్టర్ల క్వాలిఫికేషన్ వెరిఫికేషన్, గర్భస్థ పూర్వ, లింగ నిర్ధారణ చట్టం అమలు తీరును పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉమాశ్రీ, సనా, డి.లక్ష్మి, కె.రమేశ్, రాజగోపాల్, విజయవాణి పాల్గొన్నారు. పీహెచ్‌సీల్లో డెలివరీలు పెంచాలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో డెలివరీల కోసం వచ్చే విధంగా సదుపాయాలు కల్పించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతీఒక్క చిన్నారికి పూర్తివ్యాధి నిరోధక టీకాలు 100శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈనెల 17నుంచి 30వరకు జరిగే కుష్టువ్యాధి కేసు గుర్తింపు క్యాంపుల్లో అందరూ పాల్గొనేలా చూడాలన్నారు. అతుల్వాసరే, సుదా రాజేంద్ర, ఉమాశ్రీరెడ్డి పాల్గొన్నారు. -
వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి
కరీంనగర్ సిటీ: ప్రతీమహిళ, విద్యార్థులు వారికి సంక్రమించే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి సూచించారు. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హెల్త్‌క్లబ్ ఆధ్వర్యంలో కళాశాలలోని ఆడిటోరియంలో కేన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ ఆంకాలజిస్ట్ అర్చనరెడ్డి హాజరై మహిళలకు ఎక్కువగా వచ్చే కేన్సర్లపై అవగాహన కల్పించారు. రొమ్ము, గర్భాశయ కేన్సర్ మహిళలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించాలన్నారు. హెల్త్‌క్లబ్ కో–ఆర్డినేటర్ నాజియా రహమాన్, ఎన్సీసీ ఇన్చార్జి స్రవంతి పాల్గొన్నారు. వర్క్‌షాప్‌తో మెరుగైన బోధన కరీంనగర్ సిటీ: వర్క్‌షాప్‌తో అయా పాఠ్యంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని, మెరుగైన బోధనకు అవకాశం ఉంటుందని శాతవాహన వీసీ డా.ఉమేశ్‌కుమార్ తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయ సైన్స్‌కళాశాల రసాయనశాస్త్ర విభాగంలో మంగళవారం వర్క్‌షాప్ నిర్వహించారు. డిగ్రీస్థాయిలో రసాయనశాస్త్ర సబ్జెక్టు బోధించే అధ్యాపకులకు ‘రీఇన్ఫో ర్స్ నాలెడ్జ్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రొసీజర్స్ ఇన్ కెమి స్ట్రీ’ అంశంపై అవగాహన కల్పించారు. ప్రిన్సి పాల్ జయంతి ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్స్ పీ.వీరసోమయ్య, కోటేశ్ రసాయనశాస్త్రంలోని మెలకువలను వివరించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జాస్తి రవికుమార్ మాట్లాడుతూ కార్యశాలతో నైపుణ్యలు పెంచుకోవచ్చని తెలిపారు. పురుగు మందుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి తిమ్మాపూర్: జిల్లాలోని పురుగు మందుల విక్రయాల డీలర్లు వారి స్టాక్ వివరాలను వ్యవసాయశాఖ రూపొందించిన యాప్‌లో ఈనెల 15లోగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి సూచించారు. తిమ్మాపూర్‌లోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమానికి డీఏవో హాజరయ్యారు. అనంతరం పురుగు మందుల విక్రయ డీలర్లతో సమావేశం నిర్వహించారు. యాప్‌లో వివరాల నమోదు గురించి అవగాహన కల్పించారు. ఏవోలు సురేందర్, కిరణ్మయి, రమ్యశ్రీ, డీలర్లు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,150 జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,150 పలికింది. మార్కెట్‌కు 19వాహనాల్లో 290క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. మోడల్ ధర రూ.7,100, కనిష్ట ధర రూ.6,700కు వ్యాపారులు కొనుగోలు చేశారు. కార్యదర్శులు పర్యవేక్షించారు. -
లీకేజీ పరేషాన్
● పైపుల్లో నాణ్యత ఉండదు.. నిబంధనలు పట్టవు ● నగరంలో నిత్యం వాటర్ లీకేజీలే ● శాశ్వత చర్యలపై పట్టింపు లేని బల్దియాకరీంనగర్ కార్పొరేషన్: నాసిరకం పైపుల వినియోగం.. నిబంధనలు పా టించకుండా ౖపైపెనే పైపులు వేయడం.. జాయింట్లలోనూ పట్టని జాగ్రత్తలు.. పర్యవేక్షణ మరిచిన అధికారులు.. వెరసి నగరంలో ప్రతీరోజు ఎక్కడో ఒక చోట తప్పనిసరిగా పైప్‌లైన్ లీకేజీలు.. రోడ్లపై వృథాగా నల్లానీళ్లు.. తాగునీటి నాణ్యతపై నగరవాసులు బేజారు..! ఇది నగరపాలకసంస్థ పరిధిలో జరుగుతున్న తాగునీటి సరఫరాకు సంబంధించిన లీకేజీ వ్యవహారం. నగరంలో 60 డివిజన్లు కాస్తా 66 డివిజన్లుగా మారుతున్నా.. నగరపాలకసంస్థ పరిధి కిలో మీటర్ల మేర విస్తరిస్తున్నా.. అధికారుల పర్యవేక్షణలో మార్పు రావడం లేదు. తరచూ పైప్‌లైన్‌న్ లీకేజీలు అవుతున్నా తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారే తప్ప, అందుకు కారణాలపై దృష్టి పెట్టడం లేదు. శాశ్వత పరిష్కారం వైపు కనీస చర్యలు కనిపించడం లేదు. నాసిరకమే ఎక్కువ నగరంలో తాగునీటి సరఫరాకు గతంలో సిమెంట్ పైపులు వాడేవారు. ఆవి త్వరగా పగులుతుండడంతో లీకేజీలు పెరిగేవి. దీంతో హెచ్డీపీఈ (హై డెన్సిటీ పాలిథిన్)పైపులను తీసుకొచ్చారు. ఐఎస్ఐ మార్క్ కలిగిన ఈ హెచ్డీపీఈ పైప్‌లు సంవత్సరాలుగా చెడిపోకుండా ఉండడంతో వీటినే వాడుతున్నారు. నగరంలో పాత సిమెంట్ పైప్‌లైన్ పక్కనపెడితే, కొత్తగా వేస్తున్న హెచ్డీపీఈ పైప్‌లు కూడా పగులుతుండడమే ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. వాటర్ ఫ్రెషర్‌కు అనువైన వైశాల్యంతో హెచ్డీపీఈ పైప్‌లు వేస్తున్నారు. చాలా చోట్ల నాసిరకం పైప్‌లు వేయడం వల్ల, ఏళ్లపాటు మన్నికగా ఉండాల్సిన పైపులు తరచూ పగిలిపోతున్నాయనే ఆరోపణలున్నా యి. దీంతో కొత్తగా పైప్‌లైన్ వేసిన చోట కూడా లీకేజీలు పెరుగుతున్నాయి. లీకేజీలకు మరమ్మతులు చేసే వాటర్ వర్క్స్ సిబ్బంది కూడా, నాసిరకం పైప్‌లు వేసి తమను ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడుతుండడం గమనార్హం. నిబంధనలు పట్టవు హెచ్డీపీఈ పైప్‌లు నాసిరకం వాడుతుండడమే కాకుండా, పైప్‌లు భూమిలో వేసే సమయంలో నిబంధనలు పాటించకపోవడం కూడా సమస్యగా మారింది. నిబంధనల ప్రకారం దాదాపు మూడు ఫీట్ల లోతులో తవ్వి, ఆఫ్ ఇంచ్ ఇసుక, డస్ట్‌లో ఈ పైప్‌లు వేయాల్సి ఉంటుంది. భారీ వాహనాలు పైప్‌లైన్ మీదుగా వెళ్లినప్పుడు దెబ్బతినకుండా ఇసుక, డస్ట్ పనిచేస్తుంది. ఎక్కడా మూడు ఫీట్ల లోతు కనిపించదు. ఇసుక జాడ కూడా ఉండదు. రెండు ఫీట్లలోపు లోతులోనే పైప్‌లు వేస్తుండడంతో, భారీ వాహనాలు వెళ్లే సమయంలో పైప్‌లు పగుళ్లు చూపుతున్నాయి. పైపుల జాయింట్ల వద్ద కప్లింగ్ వేయాలి. కానీ.. వేడి చేసి పైప్‌లను కలుపుతూ వెళ్తుండడంతో కొద్దిరోజుల్లోనే జాయింట్ల వద్ద లీకేజీ మొదలవుతోంది. పర్యవేక్షణ మరిచారు నిబంధనల ప్రకారం పైపులైన్ వేస్తున్నారా, నాణ్యమైన పైపులు వాడుతున్నారా అనేది చూడాల్సిన నగరపాలకసంస్థ అధికారులు పర్యవేక్షణ మరిచారు. నాసిరకం పైప్‌లు, ౖపైపెనే వేయడం కారణంగా తరచూ వాటర్ లీకేజీ అవుతున్నా, ఉన్నతాధికారులు లోతుగా సమస్యపై దృష్టి పెట్టడం లేదు. ఫ్రెషర్‌కు అనుగుణంగా కొత్తగా వేస్తున్న హెచ్డీపీఈ పైప్‌లు కూడా పగిలి లీకేజీలవుతుండడమే ఇందుకు నిదర్శనం. గతంలో వేసిన వాల్వ్‌లు సంవత్సరాల పాటు ఉండగా, ప్రస్తుతం వేసే వాల్వ్‌లు ఆరు నెలల్లో మరమ్మతులకు వస్తున్నాయి. నగరపాలకసంస్థ ఉన్నతాధికారులు లీకేజీల అసలు కారణంపై, పైప్‌ల నాణ్యతపై దృష్టి సారిస్తే తప్ప నగరంలో లీకేజీల ప్రవాహానికి అడ్డుకట్ట పడదు. -
కరీంనగర్ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా గీతారెడ్డి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది రూపిరెడ్డి విశ్వ గీతారెడ్డిని కరీంనగర్ నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్‌గా(న్యాయవాదిగా)నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. సీనియర్ న్యాయవాది అయిన గీతారెడ్డి గతంలో ప్రభుత్వ ప్లీడర్(జీపీ)గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం విద్యుత్‌శాఖకు స్టాండింగ్ కౌన్సిల్‌గా కొనసాగుతున్నారు. ఇకనుంచి మున్సిపల్ పక్షాన కోర్టుల్లో గీతారెడ్డి వాదనలు వినిపించనున్నారు. గీతారెడ్డి నియామకంపై బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునందన్‌రావు, సీనియర్ న్యాయవాదులు సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, ఎడమ శ్రీరంగారెడ్డి, ఉప్పుల అంజనిప్రసాద్, రూపిరెడ్డి దేవేందర్‌రెడ్డి, పలువురు లాయర్లు హర్షం వ్యక్తం చేశారు. -
దేశానికే శక్తి అతివలే..
● శాతవాహన వర్సిటీ వీసీ ఉమేశ్కుమార్కరీంనగర్ సిటీ: మహిళలు దేశానికే శక్తి అని శాతవాహన వర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ అన్నారు. సోమవారం విశ్వవిద్యాలయ ఉమెన్స్ సెల్, జాతీయ సేవా పథకం యూనిట్ల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. వేడుకలను ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జాస్తి రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్‌గెస్ట్‌గా హాజరైన వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఇంట్లో తీసుకునే ప్రతీ నిర్ణయంలో మహిళలకు స్వేచ్ఛ ఇవ్వాలని.. విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థినులు ఆడపిల్లలమంటూ వెనకడుగు వేయొద్దని, ఆడ పులిలా ముందుకు సాగాలని సూచించారు. వర్సిటీ రిజిస్ట్రార్ రవికుమార్ మాట్లాడుతూ.. అన్ని విశ్వవిద్యాలయాల్లో మహిళల సంఖ్య పెరుగుతుందని.. ఇది మంచి పరిణామమన్నారు. ఉమెన్స్ సెల్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ జయంతి, జాతీయ సేవా పథకం సమన్వయకర్త మనోహర్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత మాట్లాడారు. విద్యార్థినులు, మహిళలు తమ హక్కుల కోసం కలసి మెలసి ఉండాలన్నారు. సమాజంలో వేధింపులు తగ్గినప్పడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం బోధన, బోధనేతర మహిళా ఉద్యోగులను వీసీ సన్మానించారు. కార్యక్రమంలో మూడు కళాశాలల జాతీయ సేవాపథకం ప్రొగ్రాం అధికారులు విజయ ప్రకాశ్, డాక్టర్ తిరుపతి, డాక్టర్ విజయకుమార్, మహిళా అధ్యాపకులు డాక్టర్ హుమేరా తస్లీమ్, డాక్టర్ శ్రీవాణి, సావిత్రి, భోదనేతర సిబ్బంది సంధ్య, మమత, రజిత, సుజాత, దయామని, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్‌ను కలిసిన సీపీ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన గౌస్ ఆలం సోమవారం కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.పేదలకు అందుబాటులో జన ఔషధి● జాతీయ ఉత్తమ పీఏసీఎస్ అవార్డు గ్రహీత మల్లారెడ్డిచొప్పదండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ ఉత్తమ పీఏసీఎస్ హైట్రిక్ అవార్డు గ్రహీత వెల్మ మల్లారెడ్డి అన్నారు. చొప్పదండి పీఏసీఎస్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ రోడ్డులో జన ఔషది కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో తొలి జన ఔషధి కేంద్రాన్ని చొప్పదండిలో ప్రారంభించామని, ఈ మందుల దుకాణంలో 70 శాతం తక్కువ ధరలకు మందులు లభిస్తాయని తెలిపారు. చొప్పదండితో పాటు, పరిసర మండలాల ప్రజలు ఈ జన ఔషది కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కేంద్రం నడుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ముద్దం మహేశ్ గౌడ్, సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డి, ఆర్నకొండ పీఏసీఎస్ చైర్మన్ మినుపాల తిరుపతిరావు, నాయకులు చిలుక రవిందర్, సింగిరెడ్డి కృష్ణారెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, గుంటి మల్లయ్య, క్యాతం పురుషోత్తం, ఇప్పనపల్లి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. సమ్మెకు రెడీగా ఉండాలివిద్యానగర్(కరీంనగర్): కార్మికులు సమ్మెకు రెడీగా ఉండాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో సోమవారం జరిగిన రీజియన్ సభలో పలువురు నాయకులు మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతభత్యాలు, పీఆర్సీ ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం వెంటనే చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఇ.వెంకన్న, వైస్ చైర్మన్ ఎం.థామస్‌రెడ్డి, కన్వీనర్ సుద్దాల సురేశ్, కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ ఎంపీ రెడ్డి, వైస్ చైర్మన్ కొమ్మ కొమురయ్య, కన్వీనర్, జె.పుల్లయ్య, కోకన్వీనర్ దొంద రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సెంకడియర్లో 322 మంది గైర్హాజరుకరీంనగర్: ఇంటర్మీడియెట్ సెంకడియర్ పరీక్షలో సోమవారం 322 మంది గైర్హాజరు అయ్యారని డీఐఈవో జగన్మోహన్రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ విభాగంలో 15,381 మందికి గాను 5,059 మంది హాజరైనట్లు డీఐఈవో వివరించారు. క్వింటాల్ పత్తి రూ.7,150జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి ధర రూ.7,150 పలికింది. క్రయవిక్రయాలను ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజాలు పర్యవేక్షించారు. -
చి‘వరి’కి మేకలకు గ్రాసమై..
యాసంగి రైతులకు సాగునీరందడంలేదు. ఫలితంగా పొటపొలాలు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు పొలాలు పశువుల మేతకు వదిలేస్తున్నారు. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన దాది ఐలయ్య వ్యవసాయ బావి ఆధారంగా రెండు ఎకరాల వరి సాగుచేశాడు. భూగర్భ జలాలు అడుగంటి పోయి బావిలో నీరింకిపోయింది. దీంతో పొట్టదశకు వచ్చిన పొలానికి సాగు నీరందించలేక పశువుల మేతకు వదిలేసాడు. మునుముందు మరీ దారుణ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – గంగాధర -
మహిళలు..
మనీరాణులు!● మండల మహిళా సమాఖ్యలకు 47 బస్సులు ● బస్సుల కొనుగోలుకు రూ.14.10 కోట్లు మంజూరు ● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా జగిత్యాలకే 15 వాహనాలు ● ఏడేళ్లపాటు సమాఖ్యలకు ప్రతీనెల రూ.77వేలు చెల్లించనున్న ఆర్టీసీ ● ఈ ఆదాయంతో సోలార్ ప్లాంట్లు, ఇతర ప్రత్యామ్నాయ వ్యాపారాలు ● ప్రభుత్వ నిర్ణయంతో ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్న మహిళలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్‌లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాత సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందాయి. ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలవరకు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది. -
వ్యక్తి దారుణ హత్య
కరీంనగర్‌క్రైం: పట్టణంలోని పోచమ్మవాడలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్‌టౌన్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...నగరంలోని లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న బాలసాని రాము (41), పోచమ్మవాడలో నివాసముంటున్న సంతపురి సంతోష్ స్నేహితులు. రాము లక్ష్మీనగర్‌లో కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. సంతోష్ గతంలో నీటిపారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి సస్పెన్షన్‌కు గురయ్యాడు. శనివారం రాత్రి సంతోష్ రాముకు ఫోన్ చేశాడు. ఇద్దరూ సంతోష్ ఇంటికి వెళ్లారు. రాము భార్య లతశ్రీ రెండ్రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లగా ఆదివారం నుంచి రాముకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. సోమవారం ఇంటికి వచ్చి చూసేసరికి రాము లేకపోవడంతో పోలీసులకు వివరాలు తెలిపింది. ఫోన్ కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. పోచమ్మవాడలోని సంతోష్ ఉండే అద్దె ఇంటికి పోలీసులు వెళ్లిచూడగా రాము రక్తపు మడుగులో మృతిచెంది ఉన్నాడు. రాము బైక్ పైనే సంతోష్ వెళ్లినట్లుగా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లత శ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపారు. ఈ హత్య ఒక్కరే చేశారా.. లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలువురిని వన్‌టౌన్ పోలీసులు విచారించినట్లు తెలిసింది. వీధి కుక్క దాడిలో చిన్నారికి గాయాలు శంకరపట్నం: తాడికల్ గ్రామంలో సోమవారం వీధి కుక్క దాడి లో మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. తాడికల్ సబ్ స్టేషన్లో అసిస్టెంట్ లైన్మెన్గా పని చేస్తున్న కుమార్ విధులకు హాజరయ్యేందుకు సిద్ధమవుతుండగా.. ఆయన కుమారుడు క్రుత్విక్(3) ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. వీధి కుక్క దాడి చేసి ముఖంపై గాయపర్చడంతో బాలుడు కేకలు వేశాడు. తల్లిదండ్రులతోపాటు చుట్టుపక్కలవారు కుక్కను తరిమి కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. -
‘యువికా’తో ఆలోచనలకు మెరుగు
జ్యోతినగర్(రామగుండం): భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)స్కూల్ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం ‘యువ విజ్ఞాన కార్యక్రమ్ (యువిక)– 2025 ద్వారా పిల్లల ఆలోచనలకు మె రుగులు దిద్దితే.. భావితరానికి శాస్త్రవేత్తలుగా మా ర్చుకోవచ్చనే విషయాన్ని గుర్తించిన ఇస్రో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు అంతరిక్ష సాంకేతిక, అంతరిక్ష శాస్త్రం, అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా యంగ్ సైంటిస్ట్ పేరుతో యువ విజ్ఞాన్ కార్యక్రమం(యువికా) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 23వ తేదీలోగా అర్హులైన, ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖా స్తులు స్వీకరిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్త ంగా తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రై వేటు పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు తెలిపారు. వెబ్సైట్: విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు వీలుగా ఆన్లైన్లో (www.irso.gov.in) వైబ్‌సైట్ ప్రారంభించారు. సైట్ ఓపెన్ చేసిన తర్వాత యువికా ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో విద్యార్ధికి సంబంధించిన వివరాలతో దరఖాస్తు పూరించాలి. ● ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం వెయిటేజీ ఇస్తారు. ● జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ● స్పేస్, సైన్స్ క్లబ్లో నమోదై ఉంటే 5 శాతం.. ● ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం.. ● గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 20 శాతం . యువికా ఉద్దేశం ఇదే.. ఇస్రో నిర్వహిస్తున్న యువికాకు ఎంపికై న విద్యార్థులతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు అంతరిక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, డెహ్రడూన్, తిరువనంతపురం, షిల్లాంగ్, బెంగళూరు, హైదరాబాద్, సూళ్లూరిపేట తదితర కేంద్రాల్లో మేలో రెండు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వివిధ రాష్ట్రాల్లోని స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. విద్యార్థులకు ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చా వేదికలు, ప్రయోగశాలల సందర్శన, ముఖ్యులతో సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశమిస్తారు. అంతరిక్ష శాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమ్ – 2025 విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం తొమ్మిదో తరగతి చదువుతున్న వారు అర్హులు దరఖాస్తుల దాఖలుకు గడువు.. ఈనెల 23 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణకు గడువు. ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితాను విడుదల చేస్తారు. మే 18న విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా–2025 కార్యక్రమం నిర్వహణ మే 31న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు బహుమతుల పంపిణీ. ఎంపికై న విద్యార్థులు బస్సులు, రైళ్ల ద్వారా వెళ్తే ప్రయాణ రాయితీ కల్పించడంతో పాటు వసతి, బస ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు చక్కని అవకాశం ఇస్రో నిర్వహిస్తున్న యంగ్ సైంటిస్ట్ కార్యక్రమం విద్యార్థులకు చక్కని వేదిక. విద్యార్థులు తమ ప్రతిభను వెలికితీసుకునేందుకు చక్కని అవకాశం. తల్లిదండ్రులు, సంబంధిత ఉపాధ్యాయులు ఆసక్తి ఉన్న విద్యార్థులతో దరఖాస్తులు చేసే విధంగా ప్రోత్సహించాలి. – రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి -
జీకే ఒలింపియాడ్‌లో ప్రతిభ
కొత్తపల్లి: న్యూఢిల్లీకి చెందిన పోటీ పరీక్షల సంస్థ గ్లోబల్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన పాఠశాల స్థాయి జీకే ఒలింపియాడ్‌లో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఒలింపియాడ్‌లో ఎ.మయాంక్ రెడ్డి (4వ తరగతి), ఎ.మాన్యశ్రీ పటేల్ (5వ), ఎ.అక్షిత నాయక్ (6వ), కె.భువనశ్రీ (6వ), యం.శివెన్ రెడ్డి (7వ), కె.సాయి వర్షిత్ (7వ), యన్.కృష్ణప్రతీక్ (9వ), జి.హెమంత్ జాదవ్ (9వ), కె.విశ్వక్సేన్ (9వ)లు కాంస్య పతకాలు, ప్రశంసాపత్రాలు, ఎస్పీ.కృష్ణచైతన్య (7వ) రజత పతకం, ప్రశంసాపత్రం సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను సోమవారం పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. భవిష్యత్‌లో నిర్వహించబోయే వివిధ స్థాయి పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
42 శాతం రిజర్వేషన్లతో బీసీలు ఎదగాలి
వేములవాడ: 42 శాతం రిజర్వేషన్లతో బీసీలు ఐక్యంగా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంఽధీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసిన సర్వే తర్వాత జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో సీట్లను బలహీనవర్గాలకు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. వేములవాడ రాజన్నను కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పట్టణంలోని మహాలక్ష్మివీధిలో గౌడసంఘం నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పేద విద్యార్థులు చదువుకునేందుకు 55 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేయడం మంచి నిర్ణయమన్నారు. కాంగ్రెస్‌లో బీసీలకు పెద్దపీట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికే నిదర్శనం మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఆర్టీసీ రీజినల్ మేనేజర్లతో సమీక్ష
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ జోన్ పరిఽ దిలోని రీజియన్ మేనేజర్లతో సోమవారం కరీంనగర్ ఆర్టీసీ బస్‌స్టేషన్ ఆవరణలోని సమావేశ మంది రంలో జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్ స మీక్ష నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సరా నికి సంబంధించిన బడ్జెట్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌లలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సుల పనితీరును తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో రీజి నల్ మేనేజర్లు సోలమన్, బి.రాజు, విజయభాను, సరిరాం, డిప్యూటీ రీజియన్ మేనేజర్లు పాల్గొన్నారు. -
బావిలో దూకి విద్యార్థి ఆత్మహత్య
తిమ్మాపూర్: ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్ఎండీ పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని మన్నెంపల్లికి చెందిన సిరికొండ నిఖిల్ రావు(22) హైదరాబాదులో అగ్రికల్చర్ బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురై సోమవారం ఉదయం 11:40 గంటలకు గ్రామానికి చెందిన జాప రవీందర్‌రెడ్డి వ్యవసాయ బావిలో దూకాడు. మృతుడి తండ్రి తిరుపతిరావు ఫిర్యాదుతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు 20మంది సింగరేణి అధికారుల బదిలీ గోదావరిఖని: సింగరేణి వ్యాప్తంగా 20మంది మైనింగ్అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన వారిలో.. రామగుండం రీజియన్‌కు చెందిన అధికారులు నలుగురు ఉన్నారు. వీరిలో మందమర్రి కేకే–5లో పనిచేస్తున్న ప్రవీణ్ వి ఫ్యాటింగ్ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. జీడీకే–1 గనిలో డీవైజీఎంగా పనిచేస్తున్న డి.రమేశ్‌ను మణుగూరు ఏరియా పీకే ఓసీ మేనేజర్‌గా, శ్రీరాంపూర్ డివిజన్ ఎస్ఆర్పీ ఓసీపీ–2లో కాలరీ మేనేజర్‌గా పనిచేస్తున్న బ్రహ్మాజీని ఆర్జీ–1 క్వాలిటీ మేనేజ్మెంట్ అధికారిగా బదిలీ చేశారు. మందమర్రి ఏరియా ఆర్కేపీ ఓసీ కాలరీ మేనేజర్‌గా పనిచేస్తున్న సుధీర్జయవంత్రావును జీడీకే–1గని మేనేజర్‌గా నియమించారు. -
శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు ధర్మపురిలో యజ్ఞాచార్యుల దంపతులను మేళతాళాలతో తీసుకెళ్తున్న దేవస్థానం సిబ్బంది పుట్ట బంగారం వేదిక వద్ద పూజలు నిర్వహిస్తున్న వేదపండితులు ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందుగా ప్రధాన ఆలయమైన శ్రీయోగానందా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం యజ్ఞాచార్యులు కందాలై పురుషోత్తమాచారి దంపతులను ఆలయం పక్షాన మేళతాళాలతో వారి గృహానికెళ్లి స్వాగతం పలికారు. పూలమాలలు, స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి దేవాలయానికి ఆహ్వానించారు. ఘనంగా పుట్ట బంగారం వేడుకలు బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన సోమవారం సాయంత్రం స్థానిక చింతామణి చెరువు కట్ట వద్ద పుట్ట బంగారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి పుట్ట బంగారం వేదిక వద్దకు మేళతాళాలతో తీసుకెళ్లారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు చేసి పుట్టను తవ్వి ఆ మట్టిని ఆలయాని తీసుకొచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నేడు నృసింహుని కల్యాణం ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక బ్రాహ్మణ సంఘం పక్కనున్న శ్రీమఠం స్థలంలో వేడుకను కన్నులపండువగా జరిపించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి సచ్చితానంద సరస్వతిస్వామిజీ హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున కలెక్టర్ పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి సుమారు లక్ష మంది వరకు భక్తులు తరలివస్తారని అంచనా. ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ రఘుచందర్, ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 200 మంది పోలీస్బందోబస్తులో పాల్గొననున్నారు. స్వామివారి కల్యాణం నిమిత్తం దేవస్థానం మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ అక్కెనపెల్లి సునిల్‌కుమార్ దంపతులు సోమవారం ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. -
తూర్పున ఆడ... పశ్చిమాన మగ
మంథని: రెండక్షరాల ప్రేమ మనషులనే కాదు.. మూగజీవావలనూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రేమకోసం ఖడాంతరాలు దాటి ప్రయాణాలు చేసిన వారున్నారు.. ప్రాణాలు లెక్క చేయకుండా ప్రేమను గెలిపించుకున్న వారూ చరిత్రలో నిలిచిపోయారు.. ఆ కోవలో జంతువులు సైతం భాగస్వామిని కలుసుకునేందుకు రాష్ట్రాలు దాటి ప్రయానం చేస్తున్నాయి. రెండు పెద్ద పులుల ప్రేమకథ ఇది. మహారాష్ట్ర నుంచి ఆడపులి.. మహారాష్ట్ర అటవీప్రాంతంలోని ఓ ఆడపులి ప్రేమికుడిని వెతుక్కుంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదావరి నది, మానేరుతీర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా సంచరిస్తోంది. ఇదే సమయంలో పశ్చిమ అడవుల్లోనూ ఓ మగపులి సంచారం ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. సుమారు ఇరవై రోజుల క్రితం మంచిర్యాల జిల్లా చెన్నూరు అడవుల నుంచి ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవులు.. అటునుంచి మంథని అడవులకు మీదుగా ఆడపులి ఉమ్మడి జిల్లాకు చేరుకుంది. పాదముద్రల ఆధారంగా అది ఇక్కడ సంచరిస్తోందని అటవీ అధికారులు నిర్ధారించారు. పశ్చిమాన వేములవాడ సమీపం ఫాజుల్‌నగర్ అటవీప్రాతంలో మగపులి సంచరించినటు్ల్ తెలుస్తోంది. రెండు పులుల పాదముద్రలు 12 సెం.మీ. – 13 సెం.మీ. వరకు, 3–4 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒకదశలో రెండుచోట్ల సంచరిస్తున్న పులి ఒక్కటే అనే అనుమానాలు వ్యక్తమైనా.. ఒకేసమయంలో రెండుచోట్ల పులి సంచరిండంతో వేర్వేరు పులుగా స్పష్టమవుతోంది. జత కలిసేందుకే కి.మీ. కొద్దీ పయనిస్తున్నాయి. వాటిని చూసి అటవీ ప్రాంత జనం జాగరణ చేస్తోంది. కలయిక కోసమా? వేసవిలో తోడు కోసం పులులు అనువైన ప్రాంతాల్లో అన్వేషణ చేయడం సాధారణం. ప్రస్తుతం తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులులు జత కోసమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనువైన ప్రాంతాలు.. అనుకూల ప్రదేశాల్లో, జంతువులు నివాసం ఉంటాయి. తమ భాగస్వామిని కలుసుకునే జంతువుల్లో ఏదో ఒకరకమైన సమాచార వ్యవస్థ ఏర్పడుతుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. మనుషుల్లో లాగా ప్రేమను వ్యక్తపరిచే అవకాశం లేకపోవడంతో సిగ్నల్స్ లేదా.. మరోరకంగా(వాసన) తమతోడును జంతువులు గుర్తుపట్టేలా చేస్తాయి. పులి రోజూ 20 కి.మీ. నుంచి 50 కి.మీ. వరకు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంటున్నారు. భాగస్వామి కోసం ఎక్కువదూరం సైతం వెళ్లే అవకాశమూ ఉందంటున్నారు. ఇలా తూర్పు నుంచి పశ్చిమానికి పయనించే క్రమంలో రెండు పులులు ఎక్కడైనా ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాన ఉన్న పులి సైతం తోడు కోసమే సంచరిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. దట్టమైన అటవీప్రాంతం ఇప్పుడు మైదానంగా మారడంతో వాటి ఉనికి ప్రశ్నార్థకమైంది, దీంతో మనుషులు ఉండే ప్రాంతాలకు వచ్చి ఆవులు, మేకలతోపాటు పలు జంతువులను వేటాడి ఆకలి తీర్చుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి అటవీ ప్రాంతంలో ఓ జంతువుపై దాడిచేసిన పులి.. ఏకంగా గ్రామాల సమీపంలోనే ప్రజలకు కనబడటంతో తీవ్ర భయాందోళకు గురయ్యారు. తనకు జతదొరికే వరకు పులి ఇలాగే సంచరిస్తూ దాడులు చేస్తే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని అటవీ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. తోడుగానా.. విడిగానా? తోడుకోసం పయనిస్తున్న పులులు కలిసే వరకూ సంచరిస్తాయా లేక వచ్చిన దారినే వెళ్తాయా? అనేది తెలియరావడంలేదు. పులులు సంచరించే ప్రాంతా న్ని గుర్తించేందుకు పాదముద్రల ఆధారం అయినా .. ఎంటు నుంచి ఎటు వెళ్లాయనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. సీసీ కెమెరాలు, ట్రాకింగ్ బృందాలు అన్వేషిస్తున్నా అటవీశాఖకు వాటి కదలికలు లభించినట్లు ఎక్కడా వెళ్లడించడం లేదు. జతకలిశాక తోడుగా వెళ్తాయా, విడిగానే తమదారి తాము చూ సుకుంటాయా? అనేది తేలాల్సి ఉంది. వీటిబారినపడకుండా పల్లెవాసులను అటవీ అదికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏదిఏమైనా తోడు కోసం తిరుగుతున్న పులుల ప్రేమకథ ఆసక్తిగా మారింది. పులి.. ప్రేమ తోడు కోసం కిలోమీటర్ల మేర పయనం సిగ్నల్స్ లేదా.. మరో రకంగా గుర్తుపట్టే అవకాశం జత కలుస్తాయా.. వేర్వేరుగానే వెళ్తాయా? అటవీ శాఖ అధికారుల్లో అనేక అనుమానాలు -
కేంద్ర మంత్రుల పోస్టులు.. ఖండించిన కరీంనగర్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ విజయ సంబురాల్లో జరిగిన పరిణామాలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే లాఠీ ఛార్జ్ ఆరోపణలను కరీంనగర్ పోలీసులు ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.కరీంనగర్లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీలు ఝళిపించారని కేంద్ర మంత్రులు పోస్టులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలని పేర్కొంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిని పోస్ట్ చేశారు. అయితే.. విజయ సంబురాల్లో ఎలాంటి లాఠీ ఛార్జ్ జరగలేదని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ కేంద్ర మంత్రుల ట్వీట్స్ ప్రెస్ నోట్ ద్వారా పోలీసులు వివరణ ఇచ్చారు. అవి ఫేక్ వీడియోలంటూ స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించారు. కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా.. భారత జట్టు విజయం సాధించిన సందర్బంగా విజయోత్సవాలను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం, అనుమతి ఇవ్వకపోవడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు.This is how the Congress govt. in Telangana not allowing India’s #ChampionsTrophy2025 win celebrations.Shameful! pic.twitter.com/OxIdrfkn90— G Kishan Reddy (@kishanreddybjp) March 9, 2025బండి సంజయ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కరీంనగర్ పోలీసులు ఏ దేశానికి మద్దతు ఇస్తున్నారు?. భారత విజయాన్ని మనం జరుపుకోలేము.. కానీ, పాకిస్తాన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తారా?. భారత విజయాన్ని జరుపుకోవడం మతపరమైన సమస్యగా ఎలా మారుతుంది?. శాంతిభద్రతల సమస్యలను సృష్టించడానికి ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నారో తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.Can the Home Minister of Telangana Shri Revanth Reddy garu clarify - which country is Karimnagar police supporting?We can’t celebrate India’s win, but a flexi with Pakistan’s name will be removed?How does celebrating India’s victory become a “communal issue”? @TelanganaDGP… https://t.co/4Hpyid5ThM— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 9, 2025 -
అరుదైన ఆవులు.. మేలుజాతి గేదెలు
● శాలరామన్నపల్లెలో అరుదైన ఆవులను సంరక్షిస్తున్న రాజిరెడ్డి సిరిసిల్ల: పాడిపరిశ్రమను వృత్తిగా స్వీకరించి చాలా మంది ఉపాధి పొందుతున్నారు. కానీ, వేములవాడ అర్బన్ మండలం శాలరామన్నపల్లెకు చెందిన సోర్పు రాజిరెడ్డి అరుదైన ఆవులను కొనుగోలు చేసి సంరక్షిస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన కాంగాయాన్ (కాంక్రీవాల్), సాహివాల్, ఒంగోలు గిర్, హర్యానా ఆవుల రకాలను కొనుగోలు చేసి పోషిస్తున్నారు. ఈ మూడు వైరెటీ ఆవులు ఒక్కొక్కటి రోజుకు సగటున పది లీటర్ల పాలు ఇస్తున్నాయి. పాకిస్తాన్ వైరెటీ కాంగాయాన్ను రూ.2లక్షలకు కొనుగోలు చేశారు. ఆధునిక బర్రెల షెడ్డు, ఐదెకరాల్లో గడ్డిజాతుల పెంపకం, గడ్డిని ముక్కలు చేసే ఛాప్కట్టర్ యంత్రం ఇలా ఆధునికంగా బర్రెల, ఆవుల షెడ్డును నిర్వహిస్తున్నారు. రాజిరెడ్డి షెడ్డులో 30 మేలురకమైన బర్రెలు, ఐదు వైరెటీ ఆవులు ఉన్నాయి. వీటి సంరక్షణకు బిహార్‌కు చెందిన రెండు జంటలు పని చేస్తున్నారు. నిత్యం 300 లీటర్ల పాలను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్‌కు సరఫరా చేస్తున్నారు. అరుదైన ఆవులు, మేలురకమైన బర్రెలు, ఆధునిక షెడ్డులో రాజిరెడ్డి పాడిపరిశ్రమను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే మరిన్ని అరుదైన ఆవులను సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజిరెడ్డి తెలిపారు. చేసే పనిపై ఆసక్తి, అభిరుచి ఉంటే.. వైవిధ్యంగా ముందుకు సాగవచ్చని నిరూపిస్తున్నారు. -
భక్తుల సౌకర్యం కోసమే కల్యాణ వేదిక మార్పు
● విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మపురి: భక్తుల సౌకర్యం కోసమే స్వామివారి కల్యాణ వేదిక మార్పు చేస్తున్నామని విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 10 నుంచి 22 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆదివారం మాట్లాడారు. లోక కల్యాణార్థం స్వామివారి కల్యాణ మహోత్సవం ఏటా ఆలయంలోని శేషప్ప కళావేదికపై నిర్వహించడంతో చాలా మంది భక్తులు తిలకించలేకపోయారని తెలిపారు. దీంతో భక్తులు, వేదపండితులు, దేవాదాయశాఖ అనుమతులు, సూచనల మేరకు మార్పు చేయడం జరుగుతుందని, బ్రాహ్మణ సంఘం పక్కనున్న శ్రీమఠం వద్ద సువిశాలమైన స్థలంలో స్వామివారి కల్యాణం జరిపించేందుకు దేవాదాయశాఖ అనుమతులు ఇచ్చారని వివరించారు. నూతన వేదిక వద్ద ఆగమశాస్త్రం ప్రకారం వేదపండితులు స్థల సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారని వెల్లడించారు. ప్రాణం ఉన్నంతవరకు దేవుని విషయంలో ఎలాంటి తప్పు చేయనని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి, బ్రహ్మోత్సవాలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. శ్రీమఠం వేదిక చుట్టూ సొంత ఖర్చులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తానని, రానున్న రోజుల్లో గోదావరి వరదలు రాకుండా కరకట్ట నిర్మాణం కోసం సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్మాణం కోసం కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో నాయకులు ఎస్.దినేశ్, వేములు రాజు, చీపిరిశెట్టి రాజేశ్, సింహరాజు ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
తడారి.. మేతగా మారి..
కరీంనగర్‌రూరల్: సాగునీరందక వరి పొలాలు ఎండిపోతున్నాయి. పొట్టదశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు బావుల్లో పూడిక తీయిస్తుండగా మరికొందరు కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. అయితే ఎలాంటి ఆధారం లేని రైతులు ఎండిపోతున్న పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా విడిచిపెడుతున్నారు. కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో బతుకమ్మ చెరువు కట్టకింద సాగు చేసిన పొలాలన్నీ నీళ్లులేక ఎండిపోతున్నాయి. రైతులు దుర్గం మల్లేశ్‌కు చెందిన 20 గుంటలు, దాడి ఓదెలు 10గుంటల వరిపొలమంతా ఎండిపోవడంతో ఆదివారం గొర్రెల మేతకు విడిచిపెట్టారు. -
కిస్సా కుర్సీకా!
● కాంగ్రెస్‌లో ఏఎంసీ కిరికిరి ● కమిటీ నియమించి రెండు నెలలు ● ఆర్డర్‌కు అడ్డుగా ఆధిపత్యపోరుకరీంనగర్ కార్పొరేషన్: ఆధిపత్యపోరుతో సతమతమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ మార్కెట్ కమిటీ నియామకం మరోసారి చిచ్చుపెట్టింది. రెండు నెలల క్రితమే మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించినప్పటికీ.. నేతల నడుమ నెలకొన్న పోరుతో ఇప్పటివరకు అమలుకు నోచుకోవడం లేదు. కమిటీ నియామకంపై ఎవరి పట్టు వారిదే ఉండడంతో, జిల్లా కేంద్రంలో మరోసారి అంతర్గతపోరు హాట్‌టాపిక్‌గా మారింది. అమలుకు నోచుకోని మార్కెట్ కమిటీ దశాబ్దకాలం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో సహజంగానే నామినేటెడ్ పదవులపై తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు దక్కించుకొనేందుకు నాయకులు తమకున్న మార్గాల ద్వారా ప్రయత్నిస్తూ వస్తున్నారు. కరీంనగర్‌కు సంబంధించి కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి సుడా చైర్మన్ పదవి దక్కగా, మరో సీనియర్ నాయకుడు వైద్యుల అంజన్‌కుమార్ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అంజన్‌కుమార్‌కు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర స్థాయిలో ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని ఆశిస్తున్న సమయంలో, అంజన్‌కుమార్‌ను చైర్మన్‌గా, బొమ్మకల్‌కు చెందిన రాంరెడ్డి వైస్‌చైర్మన్‌గా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌కమిటీ పాలకవర్గం ఏర్పాటైంది. జిల్లాకు చెందిన పలువురు నేతల సూచనతోనే కరీంనగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియమించినట్లు వినికిడి. అయితే మార్కెట్‌కమిటీ పాలకవర్గం ఏర్పడి దాదాపు రెండు నెలలు దాడుతున్నప్పటికీ, ఇప్పటివరకు అది ఆచరణకు నోచుకోవడం లేదు. సంబంధిత వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్ద ఈ ఫైల్ పెండింగ్‌లో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. -
ఎనిమిది క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం వెల్లుల శివారులో ఓ పాడుబడ్డ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. రేషన్ బియ్యం నిల్వ ఉందన్న సమాచారంతో ఎస్సై కిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం దాడులు జరుపగా సుమారు 8 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పజెప్పారు. దాడుల విషయాన్ని గమనించిన బియ్యం నిల్వ చేసిన వ్యక్తి పారిపోయాడని, అతన్ని త్వరలోనే పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు. కాలువలో పడి యువకుడు మృతిమానకొండూర్: మండలంలోని పచ్చునూర్ గ్రామానికి చెందిన గొర్రె నరేశ్ (30) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు.. నరేశ్ సెంట్రింగ్ పనిచేసేవాడు. ఇదే మండలంలోని కొండపల్కల గ్రామంలో అతడి బంధువు చనిపోగా, శనివారం ద్విచక్రవాహనంపై కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో తన వెంట తెచ్చుకున్న తాళంచెవి మరిచి పోయాయని కుటుంబ సభ్యులను ఇంటి వద్ద దించి తిరిగి కొండపల్కల వైపు వెళ్తుండగా, మద్దికుంట శివారులోని కాలువ వద్ద బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొని కాలువలో పడిపోయింది. బండరాయిపై నరేశ్ పడిపోగా, బైక్‌కూడా అతడి మీద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కాలువలో నుంచి తీసి కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో 108 వాహనంలో క్షతగాత్రుడిని ఎక్కించారు. 108 సిబ్బంది అతడిని పరిశీలించి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి వెంటకయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. పూడిక తీస్తుండగా మట్టిపెల్లలు పడి కూలీ.. చందుర్తి(వేములవాడ): మండలంలోని లింగంపేటకు చెందిన గద్దెరాసి రాములు(44) బావిలో పూడికతీస్తున్న క్రమంలో మట్టిపెల్లలు పడి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఇదే మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన రైతు మల్లయ్య వ్యవసాయ బావిలో శనివారం పూడికతీత పనులు చేస్తున్న సమయంలో మట్టిపెల్లలు పడి రాములు తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వేములవాడ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరకు బావి యజమాని మల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్యచిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని సీతా రాంపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు కొండం సంపత్‌రెడ్డి (45) అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. పదినెలల క్రితం సంపత్‌రెడ్డి కొండగట్టు ఆంజనేయస్వామి జాతరకు వెళ్లగా జరిగిన ప్రమాదంలో ప్రమాదవశాత్తు ఎడమచేయి కోల్పోయాడు. అప్పుడు దాదాపు రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు. ఎడమచేయి కోల్పోయినా బతుకుదెరువు కోసం పాన్ డబ్బా పెట్టుకుని జీవనం సాగించాడు. కాగా, ఈ ప్రమాదానికి ముందు రూ.4 లక్షల అప్పు చేసి కూతురు వివాహం చేశాడు. ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేకపోవడం, ఏలాంటి ఆస్తులు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంపత్‌రెడ్డి ఆదివారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. కడుపునొప్పితో వివాహిత..తిమ్మాపూర్(మానకొండూర్): కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ 8వ డివిజన్ పరిధి అల్గునూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్గునూరుకు చెందిన సిల్ల శిరీష(25) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా పరిస్థితి మెరుగుపడలేదు. ఆదివారం నొప్పి ఎక్కువ కావడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త ఆటో డ్రైవర్, ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బాధ్యతలు స్వీకరించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం: కరీంనగర్ నూతన పోలీసు కమిషనర్‌గా గౌస్ ఆలం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన బదిలీలలో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసిన గౌస్ ఆలం కరీంనగర్ సీపీగా నియమించబడ్డారు. ఇప్పటి వరకు సీపీగా పని చేసిన అభిషేక్ మహంతి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌస్ ఆలంకు అభిషేక్ మహంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సీపీ కమిషనరేట్ పరిధిలోని నేరాలు, శాంతి భద్రతల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. నేరాల నియంత్రణపై ప్రధాన దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. రోడ్డు భద్రత, నగర పోలీసింగ్, పౌర ఆధారిత పోలీసింగ్ సేవలు, ప్రజా భద్రత సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అడిషనల్ డీసీపీ ఏ.లక్ష్మీనారాయణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, ట్రైనీ ఐపీఎస్ వసుంధర యాదవ్ పాల్గొన్నారు. -
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. చలువపందిళ్లతో పాటు తాగునీరు తదితర వసతులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు ఎదరుకాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టాలని విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 13 రోజుల పాటు.. ప్రాచీన పుణ్యక్షేత్రంగా వెల్గొందుచున్న ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి 22 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపిస్తారు. 13 రోజుల్లో వారం రోజులు అత్యంత కీలకమైనవి. సదరు రోజుల్లో నిత్యం 50 వేల నుంచి లక్ష వరకు భక్తులు వస్తుంటారని అధికారుల అంచనా వేశారు. సోమవారం పుట్ట బంగారంతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. మంగళవారం సాయంత్రం నిర్వహించే స్వామివారల కల్యాణ వేడుకలకు సుమారు లక్ష వరకు భక్తులు వచ్చే అవకాశముంది. 14,15,16వ తేదీల్లో బ్రహ్మపుష్కరిణి కోనేరులో యోగ, ఉగ్ర, వేంకటేశ్వర్ స్వాముల తెప్పోత్సవం, డోలోత్సవం, 16,17,18వ తేదీల్లో స్వామివారల దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమాలు చేపడతారు. 19న ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం స్వామివారల రథోత్సవం సాయంత్రం నిర్వహిస్తారు. 20,21,22వ తేదీల్లో ఉత్సవమూర్తుల ఏకంతోత్సవాలను వైభవంగా జరిపిస్తారు. వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ● ధర్మపురిలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ● వివిధ డిపోల నుంచి సుమారు 200 బస్సుల వరకు వేస్తున్నామని ఆయా డిపోల మేనేజర్లు తెలిపారు. ● జగిత్యాల డిపో నుంచి 25 బస్సులు, నిర్మల్ డి పో నుంచి 15, ఆర్మూర్ డిపో 100, కరీంనగర్ 10, మంచిర్యాల తదితర డిపోలనుంచి సుమారు 50 బస్సులు నడిపించనున్నారు. ● అలాగే కరీంనగర్ నుంచి రాయపట్నం మీదుగా ధర్మపురికి 67 కిలో మీటర్లు, జగిత్యాల మీదుగా 80 కిలో మీటర్ల దూరం ఉంది. ● నిర్మల్ నుంచి జగిత్యాల మీదుగా 110 కి.మీ. ఆర్మూర్ నుంచి జగిత్యాల మీదుగా 105 కి.మీ, నిజామాబాద్ నుంచి ధర్మపురి 130 కిలోమీటర్ల దూరం ఉంది. ధర్మపురిలో ముస్తాబైన నృసింహుని ఆలయం ఈనెల 22 వరకు వివిధ కార్యక్రమాలు తొలి రోజు పుట్ట బంగారంతో ప్రారంభంఅన్ని ఏర్పాట్లు చేశాం ధర్మపురి లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశాం. నీడ, నీరు, భోజన వసతులు కల్పిస్తున్నాం. ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. – శ్రీనివాస్, ఆలయ ఈవో -
పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
కరీంనగర్ అర్బన్: మహిళా దినోత్సవ సందర్భంగా ఈ నెల 11న టీఎన్జీవో, టీజీవో సంఘాల ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీవో భవన్లో జరగనున్న వేడుకల పోస్టర్‌ను ఆదివారం స్థానిక కళాభారతి ప్రాంగణంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారా యణతో కలిసి కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి మహిళల కోసం ఉదయం 10:30 గంటలకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. కళాభారతిలో జరిగిన అనాథ యువతి మౌనిక(పూజ)– సాయితేజ వివాహానికి టీఎన్జీవో లు, టీజీవోలు, నాలుగో తరగతి ఉద్యోగులు రూ.54వేల సాయం అందించారు. టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో రూ.20వేల విలువ గల ఫర్నిచర్ అందించారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ తరపున రూ.15వేలు, డీడీ మార్కెటింగ్ పద్మావతి రూ.10వేలు అందించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, టీజీవో జిల్లా కార్యదర్శి అడ్ల అరవిందరెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, సర్దార్ హర్మిందర్ సింగ్, మహిళా ఉద్యోగ సంఘ నాయకులు సునీత పాల్గొన్నారు. -
ఫోన్ ఎత్తుకెళ్లి రూ.1.40 లక్షలు ట్రాన్స్ఫర్
తరలివచ్చి.. తరించివేములవాడ: రాజన్నను ఆదివారం 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వరుస సెలవులు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. భక్తుల ద్వారా రూ.35 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే పునర్వసు నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న ఆలయంలోని సీతారామచంద్రస్వామి వారికి ఆలయ అర్చకులు పంచోపనిషత్ ద్వారాభిషేకం చేశారు. పరివార దేవాతార్చనలు, సదస్యం నిర్వహించారు. జమ్మికుంట(హుజూరాబాద్): పరిచయం పెంచుకొని ఫోన్ ఎత్తుకెళ్లి అకౌంట్ నుంచి రూ.ఒక లక్ష 40 వేలు ట్రాన్స్ఫర్ చేసుకొని మోసం చేసిన ఘటన జమ్మికుంటలో జరిగింది. టౌన్ సీఐ రవి తెలిపిన వివరాలు.. మున్సిపల్ పరిధి అబాది జమ్మికుంట గ్రామానికి చెందిన మీర్జాన్ ఇమ్రాన్ బేగ్ పారడైజ్ బిర్యాని సెంటర్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్బాష (ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం) అప్పుడప్పుడు బిర్యాని సెంటర్‌కు వస్తూ పరిచయం చేసుకున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లోవారికి ఫోన్ చేసి ఇస్తానని మీర్జాన్ ఇమ్రాన్ బేగ్ నుంచి మహమ్మద్ ఇమ్రాన్బాష ఫోన్ తీసుకొని పరారయ్యాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ రూ.ఒక లక్షా 40 వేలు అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
శివకల్యాణోత్సవానికి ఏర్పాట్లు
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో ఈనెల 16 నుంచి 20 వరకు ఐదు రోజులపాటు రాజన్న బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రధానాల యం ముందు ప్రత్యేక యాగశాల ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల అనంతరం శివకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందని అర్చకులు చెబుతున్నారు. 12న కామదహనం, మూడు రోజులపాటు డోలోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. 17న (సోమవారం) ఉదయం పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారల కల్యాణం, 19న సాయంత్రం ఉత్సవమూర్తుల రథోత్సవం, 20న అవబృత స్నానం, త్రిశూలయాత్ర, పూర్ణాహుతి, ఏకాదశవరణములతో ఉత్సవాలు సమాప్తమవుతాయని తెలిపారు. విశేషమిది.. రాష్ట్రంలోని మిగతా శైవ క్షేత్రాల్లో ‘కారణాగమము’ అనుసరించి మహాశివరాత్రి పర్విదినం రోజునే కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. కానీ వేములవాడలో మాత్రం శ్రీస్మార్థ వైదికశ్రీ పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి జాతర అనంతరం కామదహనం మరుసటి రోజున పార్వతీరాజరాజేశ్వరుల వివాహం జరుపుకుంటారని ఇక్కడి అర్చకులు తెలిపారు. ఈనెల 16 నుంచి ఐదు రోజులు ఉత్సవాలు -
మక్కకు మద్దతు కరువు
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల జిల్లాలో వరి తర్వాత ప్రధాన పంట మొక్కజొన్న. యాసంగి సీజన్లో ఓ వైపు అడవి పందులు, మరో వైపు రామచిలుకలు, ఇంకో వైపు కోతులతో రాత్రింబవళ్లు కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తుంది. మార్కెట్లో వ్యాపారులు పెట్టే ధరలు చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే, ఏటా మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేపట్టే ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. 35 వేల ఎకరాల్లో సాగు జగిత్యాల జిల్లాలో యాసంగి సీజన్లో 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఈ మేరకు 7–8 లక్షల క్వింటాళ్ల దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. వానాకాలంలో రైతులు ఇబ్బడిముబ్బడిగా వరి సాగు చేసినప్పటికీ తెగుళ్లతో అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలేదు. దీనికి తోడు పంట మార్పిడి చేయాలనే ఉద్దేశంతో చాలా మంది రైతులు వరి స్థానంలో మొక్కజొన్న సాగు చేశారు. దీంతో, మొక్కజొన్న సాగు విస్తీర్ణం జిల్లాలో గతేడాదితో పోల్చితే దాదాపు 15 వేల ఎకరాల వరకు ఎక్కువగా సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈసారి మక్కుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఎకరాకు సగటున 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడులు తీశారు. వానాకాలంలో రూ.2,800.. ఇప్పుడు రూ.2,100 మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,225. అయితే, మొన్నటి వరకు ప్రభుత్వ మద్దతు ధరను మించి క్వింటాల్‌కు రూ.2,800– 3000 వరకు ధర పలికింది. ఇప్పుడు రైతుల చేతుల్లోకి మొక్కజొన్న రాగానే, ధర అమాంతం రూ.2,100–2,200 చేరుకుంది. పూర్తి స్థాయిలో మొక్కజొన్న మార్కెట్‌కు వస్తే వ్యాపారులు రేటు మరింత తగ్గించే అవకాశాలు ఉన్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం, అటు వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు తల పట్టుకుంటున్నారు. వ్యాపారులు చెప్పిందే రేటు మొక్కజొన్నను బిస్కెట్ పరిశ్రమ, కోళ్ల దాణాగా.. పలు రకాలుగా ఉపయోగిస్తుండటంతో డిమాండ్ ఉంది. అయితే, ఇక్కడి కంటే తక్కువ రేటుకే ఇతర రాష్ట్రాల నుంచి వస్తుందంటూ దళారులు రేటు తగ్గిస్తున్నారు. కాగా, ఎకరా మొక్కజొన్న సాగుకు కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేలు పెట్టుబడి పెడుతుంటారు. పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి, రైతుల్లోని అనైక్యతను ఆసరాగా చేసుకుని ఇష్టం వచ్చిన రేటు పెడుతుండటంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. రైతుల నుంచి మక్క కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ సంస్థ రంగంలోకి దిగితే కనీసం వ్యాపారస్తులు ఆ రేటు వరకై నా గ్రామాల్లో కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. మొన్నటి వరకు క్వింటాల్‌కు రూ.2,800 – రూ.3,000 పలికిన ధర ప్రస్తుతం రూ.2,100– రూ.2,200 పలుకుతున్న వైనంప్రభుత్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. మొక్కజొన్న మార్కెట్‌కు వస్తుండగానే రేటును భారీగా తగ్గిస్తున్నారు. ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారస్తులు తక్కువ రేటు పెడుతున్నారు. – మిట్టపెల్లి లచ్చిరెడ్డి, ఇటిక్యాల, రాయికల్ మరింత తక్కువ రేటు.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే వ్యాపారులు మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాలు లేకపోతే వ్యాపారస్తులది ఆడింది ఆట పాడింది పాటగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే అవకాశం ఉంది. – ఎల్లాల శేఖర్‌రెడ్డి, ఇటిక్యాల, రాయికల్ -
లోకో పైలట్ల అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్లో గ్రానైట్ తర లించే లారీ పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. అదే సమయంలో గూడ్స్ రైలు అదే లైన్లో వస్తోంది. ఎంత హారన్ మోగించినా లారీ తీయకపోవడంతో లోకో పైలట్లు ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలు ను నిలిపివేశారు. లారీ డ్రైవర్ వాహనాన్ని స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. లోకో పైలట్లు ఎమర్జెన్సీ బ్రేక్ వేయకపోయి ఉంటే ఐదుగురు ప్రాణాలు ప్రమాదంలో పడేవని లోకో పైలట్ రవి, అసిస్టెంట్ లోకో పైలట్ బేగ్ తెలిపారు. ఈ సంఘటనతో 15నిమిషాలు గూడ్స్‌రైలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. లారీ వివరాలు తెలియాల్సి ఉంది. కరీంనగర్ రైల్వేయార్డ్‌లో గ్రానైట్ లారీలు రూల్స్‌కు విరుద్ధంగా తిరుగుతున్నా.. అధికారులు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు లోకో పైలట్లు తెలిపారు. ఈ విషయాన్ని సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధికారులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. రుణమాఫీ కాలేదు.. రైతుబంధు రాలేదు● ఎమ్మెల్యే సత్యంను నిలదీసిన రైతులు గంగాధర: ఎమ్మెల్యే సారూ.. మాకు రుణమాఫీ కాలేదు. రైతుబంధు రాలేదు.. ఎప్పుడు మాఫీ అవుతుంది. డబ్బులెప్పుడు పడతాయి.. అంటూ రైతులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను నిలదీశారు. గంగాధర మండలంలోని గర్శకుర్తి గ్రామంలో కరీంనగర్ వయా గర్శకుర్తి మీదుగా వేములవాడ వెళ్లడానికి ఆర్టీసీబస్సును ఆదివా రం ప్రారంభించారు. కార్యక్రమం పూర్తయిన తరువాత తిరిగి వెళ్తుండగా.. పలువురు రైతులు ఎమ్మెల్యేను అడ్డుకుని రుణమాఫీ, రైతుబంధు గురించి ప్రశ్నించారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సత్యం రైతులకు సమాధానం ఇచ్చారు. ప్రజావాణి యఽథాతథంకరీంనగర్ అర్బన్: ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేటినుంచి(సోమవారం) యఽథాతథంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కొద్ది వారాల పాటు రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి ఈ నెల 10నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరఫరా నిలిపివేయకుండానే విద్యుత్ మరమ్మతులు కొత్తపల్లి: విద్యుత్ సరఫరా నిలిపివేయకుండానే సబ్స్టేషన్లలో మరమ్మతులు చేపడుతూ వినియోగదారులకు సేవలందిస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంలో భాగంగా విద్యుత్ అధికారులు ఈ పనులు చేపడుతున్నారు. గతంలో విద్యుత్ సబ్స్టేషన్లలో మరమ్మతులు చేపట్టే సమయంలో ఆ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేసేవారు. మారుతున్న కాలంలో సాంకేతికతను జోడిస్తూ ఇతర ఫీడర్ల నుంచి విద్యుత్‌ను సరఫరా చేస్తూ సబ్స్టేషన్లలో మరమ్మతులు చేపడుతున్నారు. ఇదేక్రమంలో ఆదివారం కరీంనగర్ టౌన్–3 సెక్షన్ బ్యాంక్ కాలనీ, టౌన్ 5 సెక్షన్ టవర్ సర్కిల్ విద్యుత్ సబ్స్టేషన్లలో మరమ్మతులు చేపట్టారు. ఈ పనులను టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్‌బాబు, డీఈ జంపాల రాజం, ఏడీఈ టౌన్–1 శ్రీని వాస్‌గౌడ్, ఏఈలు వెంకటరమణయ్య, నజియ జబీన్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. డంప్‌యార్డు తొలగించాలి కొత్తపల్లి: కొత్తపల్లిలోని డంప్‌యార్డును తొలగించాలని బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఆదివారం డంప్‌యార్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ నగర పాలక సంస్థకు చెంది న చెత్తను కొత్తపల్లి డంప్‌యార్డుకు తరలించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చెత్తతో కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కొత్తపల్లి రైల్వే జంక్షన్‌ను అధునాతన హంగులతో నిర్మిస్తుండగా సమీపంలోని డంప్ యార్డు కళావిహీనంగా మారిందన్నారు. వెంటనే డంప్ యార్డును ఎత్తివేయడంతో పాటు చెత్తను కొత్తపల్లికి తరలించవద్దని డిమాండ్ చేశారు.పట్టాలపై ఇరుక్కొని నిలిచిపోయిన లారీ -
● 31వ తేదీతో ముగియనున్న ఆర్థిక సంవత్సరం ● పేరుకుపోయిన బకాయిలు ● డబ్బుల కోసం ఎదురుచూపులు ● కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయుల పడిగాపులు
కరీంనగర్: జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి బిల్లుల మంజూరుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రజాప్రతినిధులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉద్యోగవిరమణ డబ్బులు, గృహావసరాలు, కార్యాలయాల నిర్వహణ బిల్లులు సకాలంలో అందడంలేదని చెబుతున్నారు. ఖజానా ఖాళీఅవడంతో అధికారులు ఇచ్చిన చెక్కులు కాంట్రాక్టర్లకు చెల్లుబాటు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంట్రాక్టర్ల బిల్లులు అనధికార లెక్కల ప్రకారం 3వేల బిల్లులకు సంబంధించి రూ.200 కోట్లకుపైబడి చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. జిల్లా ట్రెజరీ పరిధిలో సుమారు 9వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 12 వేల మందికిపైగా పింఛన్‌దారుల ఖాతాలు ఉన్నాయి. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ట్రెజరీశాఖ లో బిల్లుల చెల్లింపుకు తాకిడి పెరుగుతోంది. పెండింగ్‌లో ఉన్న చెక్కులు క్లియర్ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులు కోరుతున్నారు. నేరుగా ఖాతాల్లోకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎఫ్ఎంఐఎస్) ప్రవేశపెట్టారు. చెక్కుల వివరాల ను ఆన్లైన్లో ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తారు. వీలును బట్టి చెక్కులను పాస్ చేసి నేరుగా ఆర్బీఐకి పంపిస్తారు. ఆ తర్వాత చెక్కులు పాసై... ఖాతాలో నేరుగా డబ్బులు జమవుతాయి. ఆన్లైన్ విధానం కావడంతో చెక్ వేసిన వారికి నిరీక్షణ తప్పడం లేదు. ఎవరిని అడిగే అవకాశముండదు. ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా పంపిన చెక్కులను మళ్లీ సమర్పించేందుకు వీలుండదు. దీంతో సంబంధిత అధికారుల నుంచి కొత్త చెక్కులు తీసుకోవాల్సి వస్తోంది. వేతనాలకే పరిమితం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు తప్ప ఏవీ పాస్ కావడం లేదు. సరెండర్ లీవ్, జీపీఎఫ్, సప్లిమెంటరీ సాలరీస్ లాంటి బెనిఫిట్స్ అందక ఇబ్బందులు ప డుతున్నారు. దరఖాస్తు చేసిన ఉద్యోగులకు అయి దు నెలలైన అలవెన్స్ డబ్బులు అందడం లేదు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలు, డెత్ రిలీఫ్ చెక్కులు పాస్ కావడం లేదు. గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్, ఆర్అండ్ పనుల చెక్కులన్నీ వెనుకకు పంపిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, ఇతర అభివృద్ధి పనుల చెక్కుల కోసం నిరీక్షించడడమే మాజీ సర్పంచ్ల వంతవుతోంది.మంజూరుకు పంపిస్తున్నాం విడతలవారీగా బిల్లుల చెల్లింపులకు కార్యాలయం నుంచి పంపిస్తున్నాం. ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులను ప్రభుత్వానికి వెంట వెంటనే నివేదిస్తున్నాం. ఈ– కుబేర్‌లో పొందుపరిచి ఉన్న సీరియల్ ప్రకారమే బిల్లులు పాసవుతాయి.ఉద్యోగుల బెన్ఫిట్స్కు సంబంధించిన బిల్లులు పెండింగ్ లేకుండా పంపిస్తున్నాం. – నాగరాజు, జిల్లా ట్రెజరీ అధికారి -
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో సంబరాలు జరుపుకుంటున్న క్రికెట్ అభిమానులుమండుటెండల్లోమంచు దుప్పటికరీంనగర్రూరల్/మానకొండూర్: మార్చి రెండోవారం.. ఎండలు ముదిరేకాలంలో పొగమంచు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును వాతావరణంలో ఆకస్మిక మార్పులతో వేసవికాలం కాస్తా రాత్రి నుంచి వేకువజామున వరకు చలికాలంగా మారిపోతోంది. జిల్లావ్యాప్తంగా ఆదివారం వేకువజామున పొగమంచు కమ్మేసింది. కరీంనగర్ రూరల్, మానకొండూర్ మండలంలోని పలు ప్రాంతాలతో పాటు, రాజీవ్‌రహదారి, కరీంనగర్– వరంగల్ రహదారిని ఉదయం 7గంటల నుంచి 8గంటలవరకు మంచుదుప్పటి కమ్మేంది. పొగమంచుతో దారి కన్పించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దుర్శేడ్, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్, మానకొండూర్, చెంజర్ల వద్ద వాహనదారులు లైట్లను వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఇది ఎండాకాలమా, చలి కాలమా అని, ఇలాంటి పొగమంచును వేసవిలో ఏనాడూ చూడలేదని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.న్యూస్‌రీల్ -
అనాథ యువతి పెళ్లికి అన్నీ తామై..
కరీంనగర్: అనాథ యువతి పెళ్లికి పెద్దగా వ్యవహరించి మంచి మనసు చాటుకున్నారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదన్‌కు చెందిన అనాథ యువతి మౌనిక వివాహాన్ని ఆదివారం కళాభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అధికారులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. తల్లిదండ్రులు లేని మౌనికను 2017లో కరీంనగర్ బాలసదనంలో చేర్పించారు. అక్కడి అధికారులు ఆమెకు చదువు చెప్పించడంతోపాటు ఆలనాపాలన చూసుకున్నారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో.. మౌనికకు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. విషయాన్ని యువతి అధికారులకు చెప్పడంతో యువకుని కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారంతా అంగీకరించడంతో మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులు మౌనికకు పెళ్లి నిశ్చయించారు. దగ్గరుండీ పెళ్లి జరిపించిన కలెక్టర్ పమేలా సత్పతి.. వధూవరులకు నూతన వ్రస్తాలు బహూకరించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అతిథులకు భోజనాలు ఏర్పాటు చేయించారు. వివాహానికి జిల్లా జడ్జి, మహిళా సంక్షేమ శాఖ అధికారులు, ఎన్జీవో నాయకులు, వివిధ శాఖల అధికారులందరూ ఆర్థిక సహాయం అందించారు. కాగా మౌనికకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. Officials Became Parents: Grand Wedding of an Orphaned Young Woman was performed Karimnagar @Collector_KNR @PamelaSatpathy Satpathy and Manakondur MLA Kavvampalli Satyanarayana Organized a Wedding at KalabharatiA grand wedding ceremony was held at Kalabharati Auditorium in… pic.twitter.com/UMzBkniH0Z— Jacob Ross (@JacobBhoompag) March 9, 2025 -
రాజస్తాన్‌లో సింగరేణి పాగా
గోదావరిఖని: విద్యుదుత్పత్తి.. వ్యాపార విస్తరణ కోసం సింగరేణి కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ రంగంలో ముందుకు సాగుతోంది. 3,100 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం రాజస్తాన్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఒడిశా రాష్ట్రంలోని నైనీబ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తికి నడుం బిగించింది. తాజాగా రాజస్తాన్‌లో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. సింగరేణి ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్, 245.5 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తోంది. తాజా ఒప్పందంతో మరో 1,600 మెగావాట్ల థర్మల్, 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ (Solar Power) అందుబాటులోకి వస్తుంది.మరో మైలురాయి పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార విస్తరణపై సింగరేణి దృష్టి పెట్టింది. రాజస్తాన్ విద్యుత్ సంస్థతో కలిసి సింగరేణి 74 శాతం, రాజస్తాన్ 26 శాతం పెట్టుబడితో ఒప్పందం చేసుకుంది. లాభాల్లో కూడా ఇవే వాటాలు ఉంటాయి. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో వ్యాపార విస్తరణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అపార బొగ్గు నిల్వలతో థర్మల్ విద్యుత్‌కు కేంద్రంగా నిలిచింది. ఒప్పందం ప్రకారం 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ (Thermal Power) ప్లాంట్ల ఏర్పాటుతోపాటు 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. పెట్టుబడిలో సింగరేణి 74 శాతం, రాజస్తాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ 26 శాతం వాటాను చెల్లించనున్నాయి.రాజస్తాన్ ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన 26 శాతం సొమ్మును సౌర, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన స్థలాలు, మౌలిక సదుపాయాల రూపంలో అందించనుంది. సింగరేణి తన వాటాగా అంగీకరించిన 74 శాతాన్ని ధన రూపంలో చెల్లించనుంది. ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని అన్ని రకాల అనుమతులతో సింగరేణికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కొనుగోలుకు డిస్కంలతో ఒప్పందాలు (పీపీఏ) తదితర అంశాలను రాజస్తాన్ ప్రభుత్వ విద్యుత్ శాఖ ద్వారా చేపట్టేలా అంగీకరించారు.మారిపోనున్న సింగరేణి ముఖచిత్రం సింగరేణి ఇప్పటివరకు కేవలం తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమై తన బొగ్గు ఉత్పత్తి, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లో అడుగుపెట్టి విద్యుదుత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేయగా.. అదే ప్రదేశంలో మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 245.5 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తున్న సింగరేణి.. 2026 నాటికి 450 మెగావాట్లకు పైగా సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి బొగ్గు సంస్థల్లో నెట్ జీరో కంపెనీగా నిలవాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.చదవండి: చేనేత కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్వ్యాపార విస్తరణలో భాగంగా.. ఒడిశా రాష్ట్రంలోని నైనీ వద్ద ఏటా కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఇది మరో 30 రోజుల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనుంది. తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఇదే ప్రాంతంలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.200 ఏళ్ల భవిష్యత్ దిశగా.. సింగరేణి సంస్థకు మరో 200 ఏళ్ల భవిష్యత్ దిశగా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. 2070 నాటి జీరోనెట్ దిశగా ప్రపంచం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నాం. రాబోయే రోజుల్లో బొగ్గు బ్లాకులు, థర్మల్ విద్యుదుత్పత్తి కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కొత్తవ్యాపారాల దిశగా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ముందుకు సాగుతాం.– ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి -
తెల్లారితే పెళ్లి.. అంతలోనే బలవన్మరణం
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): తెల్లారితే వై భవంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోద నలు మిన్నంటాయి. మేళతాళాలతో సందడి నెలకొనాల్సిన పందిట్లో చావు డప్పులతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి కొన్ని గంటల్లోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు అర్ధంతరంగా తనువు చాలించిన విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మెట్పల్లి మండలం వెల్లుల అనుబంధ గ్రామమైన రాంచంద్రంపేట గ్రామానికి చెందిన లక్కినపల్లి లక్ష్మి–లింబాద్రిలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతు ళ్లు. వీరిలో ముగ్గురికి వివాహమైంది. చివరివాడై నా కిరణ్(37) మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి వివా హం చేయాలని నిశ్చయించిన తల్లిదండ్రులు పక్క గ్రామమైన వెల్లులకు చెందిన అమ్మాయితో పెళ్లి ఖరారు చేశారు. ఇటీవల నిశ్చితార్థం జరగ్గా.. పెళ్లి తేదీ ఈనెల 9. శుక్రవారం వధువుతో ఫొటో షూట్‌కు సైతం వెళ్లిన కిరణ్.. మ ధ్యాహ్నం తర్వాత ఇంటికొచ్చాడు. వచి్చ న నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుటుంబ సభ్యులు, ఇంటికొచ్చిన బంధువులతో సైతం బాగానే ఉన్నాడు. పడుకునేందుకు గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ.. శనివారం ఉదయం తెల్లవారుజామున కిరణ్ సోదరికి ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిరణ్ ఆత్మహత్యకు అతడి అనారోగ్య సమస్యలే కారణమని ఆయన తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్య సమస్యల కారణంగా పెళ్లి జరిగాక భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయేమోననే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసినట్లు మెట్పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. -
సార్.. నా బైక్ పల్సర్ 150 సీసీ.. చలాన్ వచ్చింది 220 సీసీకి..
సిరిసిల్లక్రైం: తాను రోడ్డు నిబంధనలు అతిక్రమించకుండానే తన ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో కంగుతిన్నాడు సిరిసిల్లకు చెందిన వ్యక్తి. తన బైక్ నంబర్‌ను మరో వాహనదారుడు తన బండికి వేసుకొని ఇష్టారీతిగా తిరుగుతుండడంతో జరిమానాల మీద జరిమానాలు వచ్చి పడుతుండడంతో అసలు యజమాని లబోదిబోమంటున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన మోబిన్ తన వాహనాన్ని భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. శనివారం తన బైక్ నిబంధనలు అతిక్రమించినట్లు ట్రాఫిక్ చలాన్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి చూడగా తంగళ్లపల్లి మండలం తాడూరు ఎక్స్ రోడ్ వద్ద హెల్మెట్ లేకపోవడంతో చలాన్ విధించినట్లు మెసేజ్ ఉంది. అసలు తాను అక్కడికి వెళ్లలేదని తన వాహనం పల్సర్ 150 సీసీ కాగా.. చలాన్ వచ్చిన వాహనం పల్సర్ 220 సీసీ అని పేర్కొన్నారు. పోకిరీలు కావాలని తన బైక్ నంబర్‌ను వారి వాహనానికి బిగించుకొని జిల్లాలో తిరుగుతున్నారని పేర్కొన్నాడు. ఇలాంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నాడు. -
మూడు ఇసుక ట్రాక్టర్లు, జేసీబీ పట్టివేత
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని మర్లపేట శివారులో జేసీబీతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, జేసీబీని పట్టుకుని 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ శనివారం తెలిపారు. పోలీసులు మర్లపేట ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా విలాసాగర్‌కు చెందిన 8 మంది మర్లపేట పరిసరాల నుంచి మూ డు ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలి స్తున్నారు. దీంతో పోలీసులు ఇసుక ట్రాక్టర్లు, జే సీ బీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా ఇ సుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. 8 మందిపై కేసు -
బొగ్గు లారీ బోల్తా
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): భూపతిపూర్ వద్ద గల రాజీవ్ రహదారిపై శనివారం ఉదయం ప్రమాదవశాస్తు బొగ్గు లారీ బోల్తాపడింది. మంచిర్యాల ఆర్కే– 6 గని నుంచి బొగ్గు లోడ్‌లో హైదారాబాద్‌కు వెళ్తున్న లారీ.. అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహంసారంగాపూర్: మండలంలోని మ్యాడారం శివారు ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకొచ్చిన వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. ఎస్సై దత్తాద్రి కథనం ప్రకారం.. కథలాపూర్ మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన గుగిల్ల గంగు (65) తక్కల్లపల్లి వద్ద ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం మ్యాడారంతండా వరకు కొట్టుకురావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి కథలాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పంచనామా నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ● రూ.40 వేల నగదు ● మూడు గ్రాముల బంగారం అపహరణజగిత్యాలక్రైం: జగిత్యాలలోని గోవిందుపల్లిలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన చీకోటి రాంబ్రహ్మచారి కుటుంబ సభ్యులు శుక్రవారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. దొంగలు ఇంట్లోకి వెళ్లి బీరువా పగులగొట్టి అందులో ఉన్న రూ.40వేలు, మూడు గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై గీత సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వ్యాన్ దగ్ధం తంగళ్లపల్లి:బద్దెనపల్లి–సారంపల్లి టెక్స్టైల్ పార్కులో శనివారం రాత్రి విద్యుదాఘాతంతో డీసీఎం వ్యాన్ దగ్ధమైంది. సారంపల్లి ప్లాట్లలో నివాసముంటున్న రాజు అనే వ్యక్తికి చెందిన డీసీఎంలో వైరింగ్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించడంతో మంటలను అదుపు చేయగా.. అప్పటికే పూర్తిగా దగ్ధమైంది. -
12,508 కేసులు పరిష్కారం
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో రికార్డు నెలకొంది. ఒకే రోజు అత్యధికంగా 12,508 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులు పరస్పర చర్చల ద్వారా రాజీకొచ్చారు. ఆయా కేసుల్లో రూ.1,11,66, 562 విలువైన లావాదేవీలు పరిష్కారానికి నోచుకున్నాయి. ట్రాఫిక్, బ్యాంకింగ్, బీఎస్ఎన్ఎల్ సంబంధించిన కేసులు 9,034 కావడం గమనార్హం. రాజీకొచ్చిన కక్షిదారులను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధికా జైస్వాల్ అభినందించారు. న్యాయమూర్తులు ప్రవీణ్, లక్ష్మణాచారి, సృజన, మేఘన, అదనపు ఎస్పీ చంద్రయ్య, అడ్వకేట్లు భగవాన్, అన్వార్ అలీ, ఆడెపు వేణు. ఆంజనేయులు, వి.మౌళి, సుష్మ, అభిలాశఖ, అరుణ, చింతోజు భాస్కర్ పాల్గొన్నారు.దంపతులను కలిపిన లోక్ అదాలత్ వేములవాడ: పదేళ్ల క్రితం పెళ్లితో ఒక్కటైన దంపతులు ఇద్దరు పిల్లలు పుట్టాక, గొడవలు పెరిగి 2021లో ఠాణా మెట్లెక్కారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామానికి చెందిన వినోద, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన వెంకటికి పదేళ్ల క్రితం వివాహమైంది. 2021లో అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని తన భర్తపై వినోద ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి ఎదుట తాము రాజీకొచ్చామని, కలిసి ఉంటామని ఒప్పుకున్నారు. దీంతో వారిపై ఉన్న కేసును కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. అనంతరం వారిని అభినందించారు. సిరిసిల్ల లోక్ అదాలత్‌లో రికార్డు వేములవాడలో ఒక్కటైన దంపతులు -
ఒకే నంబర్.. రెండు బైక్‌లు
సిరిసిల్లక్రైం: తాను రోడ్డు నిబంధనలు అతిక్రమించకుండానే తన ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో కంగుతిన్నాడు సిరిసిల్లకు చెందిన వ్యక్తి. తన బైక్ నంబర్‌ను మరో వాహనదారుడు తన బండికి వేసుకొని ఇష్టారీతిగా తిరుగుతుండడంతో జరిమానాల మీద జరిమానాలు వచ్చి పడుతుండడంతో అసలు యజమాని లబోదిబోమంటున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన మోబిన్ తన వాహనాన్ని భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. శనివారం తన బైక్ నిబంధనలు అతిక్రమించినట్లు ట్రాఫిక్ చలాన్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి చూడగా తంగళ్లపల్లి మండలం తాడూరు ఎక్స్ రోడ్ వద్ద హెల్మెట్ లేకపోవడంతో చలాన్ విధించినట్లు మెసేజ్ ఉంది. అసలు తాను అక్కడికి వెళ్లలేదని తన వాహనం పల్సర్ 150 సీసీ కాగా.. చలాన్ వచ్చిన వాహనం పల్సర్ 220 సీసీ అని పేర్కొన్నారు. పోకిరీలు కావాలని తన బైక్ నంబర్‌ను వారి వాహనానికి బిగించుకొని జిల్లాలో తిరుగుతున్నారని పేర్కొన్నాడు. ఇలాంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నాడు. ఫేక్ నెంబర్ తో తిరుగుతున్న బైక్ ఫైన్ల మీద ఫైన్లు లబోదిబోమంటున్న అసలు యజమాని -
బిట్టుపల్లి శివారులో పెద్దపులి ప్రత్యక్షం
మంథని: తోడు కోసం సుమారు 20 రోజులుగా అన్వేషిస్తున్న ఆడపులి.. శనివారం పొద్దుపోయిన తర్వాత మంథని మండలం బిట్టుపల్లి శివారులో ప్రధాన రోడ్డు దాటింది. సమీపంలోని పంట పొలం వద్ద ఓ రైతు దానిని చూసి ఆందోళనకు గురయ్యాడు. ఆ తర్వాత విషయాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అడవుల నుంచి మంథని అడవుల్లోకి వచ్చిన పులి.. మూడు రోజుల క్రితం ముత్తారం మండలంలో సంచరించినట్లు అటవీశాఖ అధికారులు అడుగులను గుర్తించారు. అటు తర్వాత జాడ లేకుండా పోయింది. ఆ తర్వాత హఠాత్తుగా మంథని మండలం ఎక్లాస్పూర్– ముత్తారం మండలం ఖమ్మంపల్లి రహదారి దాటి బిట్టుపల్లి వైపు వెళ్లడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. పెద్దపులి సంచారంపై గ్రామ కార్యదర్శి దండారో వేయించడంతో ఇళ్లు విడిచి గ్రామస్తులు రోడ్డుపైకి చేరారు. అటవీ శాఖ అధికారుకు సమచారం అందించంతో అక్కడకు చేరుకొని పులి పాదముద్రలు గుర్తించారు. అంతేగాకుండా జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య చేరుకొని పాదముద్రలను పరిశీలించారు. పులి వచ్చేసింది వేములవాడరూరల్: కొండాపూర్, ఫాజుల్‌నగర్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పులి ఆనవాళ్లను శనివారం గుర్తించారు. వేములవాడరూరల్ మండలం ఫాజుల్‌నగర్‌లో ఉప్పరి నారాయణకు చెందిన గేదైపె రెండు రోజుల క్రితం దాడిచేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఫారెస్టు అధికారులు గేదైపె దాడి చేసింది పులి అని నిర్ధారించారు. కొడిమ్యాల మండలం కొండాపూర్ ఫారెస్ట్ నుంచి ఫాజుల్‌నగర్ అటవీ ప్రాంతానికి వచ్చినట్లు తెలిపారు. ఎఫ్ఆర్వో కలీలొద్దీన్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పులి తిరుగుతోందని రైతులు పొలం పనుల వద్దకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు దాటుతుండగా గమనించిన రైతు పాదముద్రలు గుర్తించిన ఫారెస్టు అధికారులు పరిశీలించిన జిల్లా అధికారి.. ఆందోళనలో ప్రజలు -
అభిషేక ప్రియుడికి ఆది మొక్కులు
వేములవాడ: అభిషేకప్రియుడు వేములవాడ రాజన్నకు భక్తులు ప్రత్యేక మొక్కులు చెల్లించారు. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన 30వేల మంది దర్శించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణవ్రతాలు, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గండదీపంలో నూనె, తలనీలాలు, నిలువెత్తు బెల్లం పంపిణీ చేశారు. అభిషేకాలకు 150కి పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు అధికారులు తెలిపారు. ఆరుద్రనక్షత్రోత్సవం సందర్భంగా స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, సదస్యం నిర్వహించారు. పెరిగిన భక్తుల రద్దీ 150కి పైగా అభిషేకాలు వైభవంగా ఆరుద్ర నక్షత్రోత్సవాలు -
అతివల ఆనందం
ఘనంగా మహిళా దినోత్సవంనగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గిటారు వాయిస్తున్న మహిళకరీంనగర్కల్చరల్/కరీంనగర్‌టౌన్/విద్యానగర్: జిల్లావ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. పలువురు మహిళలను ఘనంగా సత్కరించి, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ రన్నర్స్, సైకిలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3కే రన్ నిర్వహించగా.. జిల్లా జడ్డి ప్రతిమ పాల్గొన్నా రు. కలెక్టరేట్లో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. కేక్‌కట్ చేసి అందరికీ తినిపించారు. పలువురు అధికారులు కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. శ్రీనిధి రుణాల్లో ప్రతిభ చూపిన జమ్మికుంట, హుజూ రాబాద్ పట్టణ సమాఖ్య అధ్యక్షురాళ్లకు సర్టిఫికెట్, మెమొంటో అందించారు. బాలభవన్ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ, నాటక సమాజాల సమాఖ్య, కళా రవళి సోషియో కల్చరల్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో కలెక్టర్ పమేలా సత్పతికి మహిళా శక్తిమాన్ పురస్కారం ప్రదానం చేశారు. రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శోభారాణి, జిల్లా సంక్షేమ అధికారి సబిత, డీఏవో భాగ్యలక్ష్మి, జిల్లా అదనపు వైద్యాధికారి సుజాత పాల్గొన్నారు. సాంస్కతికశాఖ సహకారంతో కరీంనగర్ ఫిలిం సొసైటీ ఏర్పాటు చేసిన మహిళా విశిష్ట పురస్కారాలను రచయిత్రి తంగెళ్ల శ్రీదేవిరెడ్డి, జానపద గాయకురాలు గొట్టె కనుకవ్వ, ప్రముఖ నర్తకి గుత్తా నాగదుర్గలకు ఆర్డీవో మహేశ్వర్ ప్రదానం చేశారు. కపిసొ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, కార్యదర్శి లక్ష్మి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ, ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. ఐఎంఏ హాల్ వద్ద కలెక్టర్ పమేలా సత్పతి జెండాఊపి ర్యాలీసి ప్రారంభించారు. తెలంగాణచౌక్ వద్ద మహిళా వైద్యులు, వైద్య విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. -
కంకర పోశారు.. తారు మరిచారు
గన్నేరువరం: గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు చేపట్టిన డబుల్‌రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని శనివారం గుండ్లపల్లి, గునుకులకొండాపూర్, జంగపల్లి గ్రామస్తులు నిరసన తెలిపారు. గునుకులకొండాపూర్‌లో రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డబుల్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా గునుకులకొండాపూర్–జంగపల్లి మధ్య కంకర పోసి నిర్లక్ష్యంగా వదిలేయడంతో రైతులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. అలాగే గుండ్లపల్లి– గునుకులకొండాపూర్ మధ్య కల్వర్టు నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో ఎమ్మెల్యే మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తాళ్లపల్లి పర్శరాం, గూడెల్లి మల్లేశం, కోతి ఆంజనేయులు, చొక్కల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమాజాభివృద్ధిలో మహిళలు కీలకం
కరీంనగర్‌రూరల్: సమాజం అభివృద్ధి చెందడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు అన్నారు. శనివారం భగత్‌నగర్‌లోని కరీంనగర్‌రూరల్ ఎమ్మార్సీ కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు డీఈవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందన్నారు. వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించారు. పలు రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను సన్మానించారు. ఎంఈవో కె.రవీందర్, ఏసీపీ గంగాధర్, సెక్టోరియల్ అధికారి అశోక్‌రెడ్డి, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ స్నేహలత, డిప్యూటీ మేనేజర్ దీపిక పాల్గొన్నారు. ‘వైరాగ్యం’కు సన్మానం కరీంనగర్‌కల్చరల్: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొనిరెడ్డి ఫౌండేషన్, చదువుల సాహిత్య కళావేదిక వారు కరీంనగర్‌కు చెందిన కవి, రచయిత విమర్శకులు శతాధిక గ్రంథ ప్రచురణకర్త వైరాగ్యం ప్రభాకర్‌కు గౌరవ పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. సుందరాచార్యుల వీధిలో ఉన్న ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జాతీయ పురస్కారాల సభలో కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి దంపతులు, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత చదువుల బాబు వైరాగ్యం ప్రభాకర్‌ను సత్కరించారు. జిల్లాలోని పలువురు కవులు, రచయితలు ప్రభాకర్‌ను అభినందించారు. నిబంధనలకు విరుద్ధ్దంగా టెండర్లు ఓపెన్ కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో సుడా నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించిన టెండర్‌ను నిబంధనలకు విరుద్ధ్దంగా ఓపెన్ చేశారని నగరపాలకసంస్థ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కన్వీనర్ దగ్గు మహేందర్ రాకేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుడా పనుల టెండ ర్ కన్నా ముందు ఎస్డీఎఫ్ పనుల టెండర్లు పి లిచారని, ఎస్డీఎఫ్ కన్నా ముందే సుడా టెండర్లు ఓపెన్చేశారన్నారు. టెండర్లో కాంట్రా క్టర్లు పొందుపరిచిన డాక్యుమెంట్లను సక్రమంగా పరిశీలించలేదన్నారు. నిబంధనలకు విరు ద్ధంగా ఓపెన్‌చేసిన టెండర్లను రద్దు చేయకుంటే విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సిటీలో పవర్‌కట్ ప్రాంతాలు కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందునా ఆదివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11 కే.వీ.గంజ్ ఫీడర్ పరిధిలోని బోయవాడ, గంజ్, సిఖ్వాడీ, మార్కెట్, అన్నపూర్ణ కాంప్లెక్స్, కమాన్, లక్ష్మీనగర్, రాఘవేంద్రనగర్, కమాన్ నుంచి హౌజింగ్‌బోర్డు రోడ్డు ప్రాంతాలతో పాటు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కే.వీ.బ్యాంక్ కాలనీ ఫీడర్ పరిధిలోని ఎస్ఆర్ కళాశాల, తేజ స్కూల్, రెడ్డి హాస్టల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడిఈ పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఖాజీపూర్, బావుపేటలో.. నెలవారి మరమ్మతుల్లో భాగంగా ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు 33/11 కె.వీ.ఖాజీపూర్, సాయినగర్, బావుపేట సబ్స్టేషన్ల పరిధిలోని ఖాజీపూర్, బావుపే ట, ఎలగందుల, గ్రానైట్ పరిశ్రమలున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలికరీంనగర్కల్చరల్: ఆర్థిక సంవత్సరం త్వరలో ముగియనున్నందున ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఎస్టీయూ జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. శనివారం గణాంక భవన్లో ఎస్టీయూ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఆర్.శ్రీనివాస్, కట్టా రవీంద్రచారి మాట్లాడుతూ మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్, జీపీఎఫ్, టీఎస్సీఎల్ఐ తదితరాలకు సంబంధించి వేలకోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. గుండా శ్రీనివాస్, కొట్టె లక్ష్మ ణరావు, వెలిచాల వెంకటస్వామి, ఎనగంటి బాలాజీ, సుద్దాల శోభారాణి పాల్గొన్నారు. -
‘బ్రహ్మోత్సవ’ ఏర్పాట్లు
ముందుకు సాగనిధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుత్‌దీపాల ఏర్పాట్లు మినహా.. ఏ ఒక్క పని కూడా ముందుకు కదలడం లేదు. మరోవైపు ఈనెల 10 నుంచే ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు జాతరలో వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించారు. విప్, కలెక్టర్ కూడా పలుమార్లు సమీక్షించారు. ఇప్పటివరకు బ్రహ్మపుష్కరిణి (కోనేరు)కి రంగులు వేయలేదు. ఆలయం ముందు, వెలుపల గోదావరిలో చలువ పందిళ్లు వేయాల్సి ఉంది. చలివేంద్రాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. ప్రమాదకరంగా సత్యవతి, బ్రహ్మగుండాలు గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న సత్యవతి, బ్రహ్మగుండాలు అతిలోతైనవి కావడంతో ప్రమాదకరంగా మారాయి. భక్తులు స్నానాల కోసం ఎక్కువగా వీటి వద్దకే వెళ్తుంటారు. అక్కడ ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో రేలింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని విప్, కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ దిశగా అధికారులు ప్రయత్నం చేయడం లేదు. ఆలయంలో స్థలం ఇరుకుగా ఉన్నందును స్వామివారి కల్యాణాన్ని మరోచోట నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ.. కల్యాణ వేదిక వద్ద ఇంకా ఎలాంటి పనులూ చేపట్టలేదు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రనలుమూలలతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. వీరందరి కోసం సరిపడా వసతులు కల్పించడంలో అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మందికి ఉచిత అన్నదానం చేసేందుకు రైస్‌మిల్లర్లు, ఆర్యవైశ్యులు, వర్తకసంఘం, ఇతర దాతల సహకారంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సుమారు 400 మందితో బందోబస్తుకు నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలకు రండి ఆలయంలో ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు దేవస్థానం తరఫున ఈవో శ్రీనివాస్ ఆహ్వాన పత్రిక అందించారు. ముందుగా వారికి స్వామివారి శేష వస్త్రం కప్పి ప్రసదాలు అందించారు. కార్యక్రమంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు అలువాలు శ్రీనివాస్, వావిలాల తిరుపతి తదితరులున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తాం బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తాం. గతంలోకంటే ఈసారి మరింత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే స్వామివారి కల్యాణాన్ని నిర్వహించే స్థలాన్ని గుర్తించాం. ఆ స్థలంలో కావాల్సిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. – ప్రభుత్వ విప్ అడ్లూరి గోదావరి నిర్మానుష్యంబ్రహ్మోత్సవాల సందర్భంగా 12 రోజుల పాటు గోదావరి భక్తులతో పోటెత్తుతుంది. ప్రస్తుతం గోదావరిలో నీరు తక్కువగా ఉండడంతో రాళ్లు, రప్పలు, మండుటెండల్లో భక్తులు నడిచివెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో చలువ పందిళ్లు వేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు గోదావరిలో ఎలాంటి ఏర్పాట్లూ చేపట్టలేదు. దీంతో గోదావరి నిర్మానుష్యంగా మారింది. ఒక్క మంగలిగడ్డ వద్ద తడకలతో చలువ పందిరి వేశారు. ఆ పందిళ్లు భక్తులకు ఏమూలకూ సరిపోవని అంటున్నారు. గోదావరి ఎగువ ప్రాంతంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ముఖ్యంగా సీ్త్రలు బట్టలు మార్చుకునేందుకు తడకలతో డ్రెస్సింగ్ రూంలు, షెడ్లు, బాత్రూంలు, తాగునీటి వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. ఈనెల 10 నుంచి 22వరకు కార్యక్రమాలు సమయం సమీపిస్తున్నా పట్టని అధికారులు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం సౌకర్యాలు కల్పించాలంటున్న భక్తులు -
సమగ్ర భూ సర్వేకు కసరత్తు
● సబ్ డివిజన్లు చేసేందుకు సర్వేయర్లకు అధికారం ● అక్కడికక్కడే మ్యాప్ అందజేత ● భూ రికార్డులు సిద్ధం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంచిరిగిన దస్త్రాలకు చెల్లుచీటి కరీంనగర్ అర్బన్: భూ ఆక్రమణదారులు, భూ పంచాయితీల పేరుతో పబ్బం గడుపుకునేవారికి ఇది చేదువార్తే. భూమి గెట్లు జరుపుతూ పక్క రైతుల భూములను కలుపుకోవడం, గతంలో నాటిన హద్దులను జరిపి ఇబ్బందులకు గురిచేసే వితండవాదులకు శుభం కార్డు పడనుంది. హద్దులు, భూ రికార్డుల సమస్య లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. గత ప్రభుత్వంలోనే భూ సర్వేకు అడుగులు పడగా అంతలోనే ఆగిపోయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం భూ సర్వేకు ప్రాధాన్యతనిస్తుండటంతో రైతుల్లో ఆఽశలు రేకెత్తుతున్నాయి. భూ రికార్డులను సిద్ధంగా ఉంచాలన్న ప్రభుత్వం ఆదేఽశం క్రమంలో అధికారులు తదనుగుణ చర్యలు చేపట్టారు. భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు సబ్డివిజన్లు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇదే జరిగితే నిత్యం భూ సమస్యలు, రికార్డుల కొరకు కార్యాలయాల చుట్టు తిరిగే రైతన్నకు ఇక తిప్పలు ఉండవు. భూ సర్వేతో చిక్కులకు చెక్ సాగు భూములతో పాటు నివాస స్థలాలను ప్రతీ ఇంచు కొలువనున్నారు. జిల్లాలో పోలీస్స్టేషన్లు, సర్వే లాండ్ రికార్డుశాఖలకు ఈ దరఖాస్తులే ఎక్కువ. అయితే గతంలో పైలట్ ప్రాజెక్టుగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి భూ సర్వే చేయాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలో భూ భారతి కార్యక్రమం నిర్వహించగా అంతగా సత్ఫలితాలివ్వకపోవడంతో నిలిపివేశారు. తాజాగా హద్దుల గొడవను సమూలంగా నిర్మూలించేందుకు భూ సర్వే చేపట్టనున్నారు. సేత్వార్ లేదా కాస్రా లేదా టీపాన్ వంటి వివరాలను సరిచూస్తూ ప్రస్తుతమున్న సర్వే నంబర్లలో ఏమైనా తప్పుగా నమోదయ్యాయా.. విస్తీర్ణం తప్పుగా ఉందా వంటి వివరాలను కార్యాలయ స్థాయిలోనే గతంలోనే సరిచేశారు. తాజాగా ప్రతీ పట్టాదారు భూమికి సర్వే నంబర్‌ను కేటాయించనున్నారని సమాచారం. అంటే సబ్ డివిజన్ చేయనున్నారు. తొమ్మిది దశాబ్దాల అనంతరం 1910–1930 కాలంలో నిజాం పాలకుల హాయంలో సమగ్ర భూ సర్వే నిర్వహించి రికార్డుల్లో భద్రపరిచారు. అప్పటి నుంచి భూముల సర్వే కానీ రికార్డుల నవీకరణ కానీ జరగలేదు. దీంతో రికార్డులను మాయం చేయడం, హద్దులను తొలగించడం, కబ్జాలకు పాల్పడటం యథేచ్ఛగా సాగుతోంది. అప్పటి గణాంకాల ప్రకారం సాగు భూమి 15,63,025 (6,25,210హెక్టార్లు) ఎకరాలుండగా ప్రస్తుతం 17,55,683 ఎకరాలకు చేరింది. అంటే 2లక్షల ఎకరాల వరకు భూమెక్కడిది. ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి ఇంచుమించు లక్ష ఎకరాలు. మిగతా భూమి ఆక్రమణకు గురైనట్లేనని స్పష్టమవుతోంది. అయితే తాజా ప్రకటనతో ఆక్రమణల గుట్టు భారీగా తేలనుందని అర్థమవుతోంది.డివిజన్ల వారీగా సర్వే వివరాలు డివిజన్ రైతుల సంఖ్య (1బి ప్రకారం) కరీంనగర్ 12,242హుజూరాబాద్ 38,460మానకొండూరు 39,764చొప్పదండి 29,624గతంలో భూ రికార్డుల నవీకరణలో గణాంకాలుసాగు విస్తీర్ణం: 3,33,450 ఎకరాలు వ్యవసాయేతర భూమి: 33,007ఎకరాలు ప్రభుత్వ భూమి: 40,366వక్ఫ్‌భూములు: 517 ఎకరాలు అటవీ భూములు: 1,748 ఎకరాలు ఖాతాల సంఖ్య: 1,92,687మొత్తం సర్వేనంబర్లు: 3,51,545 ఉమ్మడి జిల్లా విస్తీర్ణం 11,82,300 హెక్టార్లు కాగా అందుకు సంబంధించిన 6 లక్షల టీపాన్లలో 4.30లక్షల టీపాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 1.70లక్షల టీపాన్లు చిరిగిపోయాయి. 1910 కాలంలోని టీపాన్లను కాపాడుతూ వచ్చిన భూ కొలతలు, రికార్డులశాఖ కాలక్రమేణ వాటిని తిరగేస్తూ ఉండటంతో చాలావరకు చిరిగిపోయాయి. ఇక కొందరు కాసులకు కక్కుర్తిపడి రికార్డులను మాయం చేశారన్న విమర్శలున్నాయి. టీపాన్లు బస్తాల్లో కట్టిపెడతారు కొలత సమయంలో అవసరమైన సర్వే నంబర్ టీపాన్ తీసుకుంటారు. ఈ క్రమంలో వాటిని తిరగేసే సమయంలో పాతబడి గుర్తించలేనంతగా మారిపోయాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 50 గ్రామాల వరకు టీపాన్లు సరిగా లేవు. దీంతో దరఖాస్తు చేసుకున్న రైతు భూమికి కొలత వేయడం అధికారులకు తలనొప్పిగా మారేది. దీంతో గ్రామాల్లో భూ వివాదాలు పెరుగుతున్నాయి. భూ విలువ రోజురోజుకు పెరుగుతుండటంతో బలవంతులు బలహీనుల భూములను ఆక్రమించుకోవడం సహా పలు రకాల వివాదాలు పెరిగిపోతున్నాయి. -
సునీల్రావుది భజన బ్యాచ్
కరీంనగర్ కార్పొరేషన్: బీజేపీలో మాజీ మేయర్ సునీల్రావుది భజన బ్యాచ్‌గా మారిందని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం నగరంలో మాట్లాడుతూ.. గట్టిగా బీజేపీ కండువా కూ డా వేసుకోని సునీల్‌రావు బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకోవడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌లో సమన్వయం గురించి మాట్లాడడం అవివేకమని, బీజేపీలో సీనియర్ నాయకులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, పి.సుగుణాకర్‌రావులు ఎందుకు కనిపించడం లేదో ఆయన చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి సాంకేతికం మాత్రమేనన్నారు.ఎన్నికల కమిషన్ ఓటర్లకు పూర్తిగా అవగాహన కల్పించినా, 01,02 అనే అంకెలను ఒప్పుకున్నా, ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా పదివేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచేదన్నారు. సీఎం,మంత్రులను విమర్శించి సంజయ్ ప్రాపకం సంపాదించేందుకు సునీల్‌రావు ప్రయత్నిస్తున్నాడన్నారు. కొరివి అరుణ్‌కుమార్, శ్రవణ్‌నాయక్ పాల్గొన్నారు.● సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి -
2,880 కేసులు పరిష్కారం
కరీంనగర్‌క్రైం: రాజీద్వారా కేసులు సత్వరంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌తో మాత్రమే సాధ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్‌లో లోక్‌అదాలత్ ప్రారంభ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. లోక్ అదాలత్‌పై ప్రజల్లో అవగాహన పెరిగి, అపోహలు తగ్గుతున్నాయని, ప్రతీ లోక్ అదాలత్‌లో పెద్దసంఖ్యలో కేసులు పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ విజయానికి సహకరించిన అందరికీ జడ్జి కృతజ్ఞతలు తెలిపారు. ఏసీపీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో పోలీస్ అధికారులు ఎక్కువ సంఖ్యల కేసుల పరిష్కారానికి కృషిచేశారని, ఈ సందర్భంగా వారిని అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పీవీ.రాజ్‌కుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్ సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఇందుకు న్యాయవాదుల పూర్తి సహకారం ఉంటుందన్నారు. జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 2,880 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వెంకటేశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కేసుల పరిష్కారంలో జిల్లా 20వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. న్యాయమూర్తులు సాధన, కుమార్ వివేక్, లక్ష్మీకుమారి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరు రాజిరెడ్డి, ఏపీపీలు వీరస్వామి, రంజిత్, గాయత్రీ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ కేసుల పరిష్కారంలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు 20వ స్థానం -
పొద్దంతా ఎండ.. రాత్రంతా చలి
కరీంనగర్‌రూరల్: వేసవికాలం ప్రారంభమైనప్పటికి కరీంనగర్ జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొంది. గత నాలుగు రోజుల నుంచి పొద్దంతా విపరీతమైన ఎండ కాస్తుండగా రాత్రి చలి వణికిస్తోంది. మొన్నటివరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ప్రస్తుతం రాత్రుల్లో మళ్లీ చలితో గజగజలాడుతున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటలవరకు సూరీడు భగభగ మండుతుండగా రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రుల్లో శీతాకాలాన్ని తలపిస్తోంది. శనివారం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్టం 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్టం, గరిష్ట ఉష్ణోగ్రతల నడుమ 20డిగ్రీల వరకు ఉండటంతో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతాయని అధికారులు పేర్కొంటున్నారు. వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు ఆస్వస్థతకు గురవుతారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
Abhishek Mohanty: పోలీస్ ‘సింగం’ బదిలీ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఒకప్పుడు కరీంనగర్లో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే.. కార్పొరేటర్‌కి రూ.లక్ష, ప్రతీ అనుమతికి ఇంత అంటూ ఫిక్స్డ్ రేట్లు ఉండేవి. ఖాళీజాగా కనిపిస్తే ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జారాయుళ్లు దిగిపోయేవారు. తాము అడిగినంత ఇవ్వకపోతే కడుతున్న ఇండ్లు కూడా బుల్డోజర్లతో కూల్చేసేవారు. అప్పుడు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప.. ఎవరినీ కనీసం అరెస్టు చేయలేకపోయారు. అదే సీపీగా అభిషేక్ మహంతి(Abhishek Mohanty) వచ్చాక సీన్ మారింది. భూదందాలు చేసేవారికి చెమటలు పట్టించారు. భూనేరాల్లో పాలుపంచుకున్న రాజకీయ నేతలు, తహసీల్దార్లు ఎవరినీ వదల్లేదు. నిజాయతీగా, ముక్కుసూటిగా వ్యవహరించే మహంతి ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా.. తలొగ్గకుండా.. తనపని తాను చేసుకుంటూ పోయారు. అందరికీ తన మార్కు కోటింగ్ ఇస్తుండటంతో పలువురు నేతలు అరెస్టు భయానికి ఏకంగా దేశం విడిచి పారిపోయిన వారు ఇంకా అక్కడే తలదాచుకోవడం గమనార్హం. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే సీపీగా ఉంటారన్న అపవాదు కరీంనగర్ పోస్టింగ్‌తో తొలగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చిన ఆయన అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. తప్పులు చేస్తే.. సొంత డిపార్ట్మెంటు వారిని కూడా వదలకుండా డీజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సిఫారసు లెటర్లు లేకుండా రాష్ట్రంలో నిజాయతీ అధికారులకు ఎస్హెచ్వోలుగా పోస్టింగులు ఇచ్చారు. తమ లెటర్లకు పోస్టింగులు ఇవ్వడంలేదని కొందరు ప్రెస్మీట్లు పెట్టినా.. ఆయన తొణకలేదు. అందుకే, ఆయన్ని సహచరులు పోలీస్ సింగంగా పిలుచుకుంటారు.భూదందా అంటే లోపలికే..భూదందాలు చేస్తూ మోసంచేస్తున్నారన్న ఫిర్యాదులు పెద్దఎత్తున రావడంతో డీజీపీ అనుమతితో ఎకానివిుక్స్ అఫెన్సెస్ వింగ్ ఏర్పాటుచేసి భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు. రాజకీయనాయకులు, బడావ్యాపారులు తేడా లేకుండా అన్యాయం జరిగిన వారి పక్షాన నిలిచి కమిషనరేట్ వ్యాప్తంగా సుమారు 250కిపైగా మందిపై కేసులు నమోదు చేసి కటకటాల్లోకి పంపించారు. వివిధ పార్టీల నేతలు చేసిన కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఫిర్యాదులపై ఎకానివిుక్స్ అఫెన్సెస్ వింగ్‌తో లోతుగా దర్యాప్తు చేయించి ఎలాంటి ఒత్తిడిలకు తలొగ్గకుండా అక్రమార్కులను జైలుకు పంపించారు. దీనితర్వాత ఫైనాన్స్ నిర్వాహకులు పెద్దఎత్తున ఖాతాదారుల వద్ద డబ్బులు డిపాజిట్ చేయించుకొని తిరిగి చెల్లించడం లేదని గమనించి ఒక ప్రముఖ చిట్‌ఫండ్‌పై కేసులు నమోదు చేసి నిర్వాహకులను కటాకటాల్లోకి పంపించి వాటికి సంబంధించిన ఆస్తులు ప్రభుత్వం ద్వారా అటాచ్ చేపించారు. వందలాది మంది భూబాధితులు, ఫైనాన్స్‌లతో మోసపోయిన వారికి న్యాయం చేశారు. గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం...కరీంనగర్ సీపీగా అభిషేక్ మహంతి వచ్చిన తర్వాత గంజాయి, సైబర్ నేరాలపై దృష్టి పెట్టారు. గంజాయి కేసుల దర్యాప్తుకోసం నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించి నిందితులను జైలుకు పంపించారు. సైబర్ పోలీస్‌స్టేషన్‌ను పటిష్టం చేసి ప్రతీ స్టేషన్‌కు సైబర్ వారియర్‌ను కేటాయించి వారితో నేరాల కట్టడికి కృషిచేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పించారు. కమిషనరేట్‌లోనూ.. మహంతి ఆధ్వర్యంలో పలుఅభివృద్ధి పనులు జరిగాయి. మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఇటీవల డీజీపీ జితేందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్రస్థాయి పోలీసు క్రీడాఉత్సవాలను కరీంనగర్ వేదిక విజయవంతంగా నిర్వహించారు. కమిషనరేట్‌లో ఫంక్షన్ హాల్ ఆధునీకరణ, పోలీస్ కేఫ్ ఏర్పాటుతోపాటు వివిధ సంక్షేమ పనులు నిర్వహించారు. -
ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం..!
కరీంనగర్ జిల్లా: పెళ్లి బరాత్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన బాకారపు ఉమ (35) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై రవి తెలిపారు. మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభా కర్ కూతురు నవ్య వివాహం మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో గురువారం జరిగింది. రాత్రి పెళ్లి బరాత్ జరుగుతుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చెందిన కారు డ్రైవర్ శ్రవణ్ కారు దిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. బరాత్‌లో కొందరు డ్యాన్స్ చేస్తుండగా పెళ్లికొడుకు అశోక్ కారు నడిపాడు. ఒక్కసారిగా బాకారపు ఉమ, ఆమె కూతురు నిఖితతోపాటు మరి కొందరిని కారు ఢీకొనడంతో గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఉమ, నిఖితను హుజూ రాబాద్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఉమ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి పెళ్లి కొడుకు జినుక అశోక్ కారణమంటూ ఉమ భర్త పర్శరాములు కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి, ఎస్సై రవి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
Karimnagar: ఫుట్‌పాత్‌పై వ్యాపారం.. రీల్స్‌తో క్రేజ్! సినిమాల్లోనూ ఆఫర్లు!
విద్యానగర్(కరీంనగర్): ఠాకూర్ అశ్విని అలియస్ ఆశాది కరీంనగర్‌లోని భగత్‌నగర్. నగరంలోని డైలీ మార్కెట్, వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఫుట్‌పాత్‌పై సీజనల్ వ్యాపారం చేస్తుంది. మట్టికుండలు, దీపాల ప్రమిదలు, రంగుల ముగ్గులు, పచ్చడి జాడీలు, దీపాల వత్తులు అమ్ముతుంది. రెండేళ్ల కిత్రం వ్యాపార అభివృద్ధి కోసం తొలిసారిగా ఆమె అమ్మే వస్తువుల గురించి రీల్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయగా వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దీంతో మరిన్ని రీల్స్ చేసి పోస్ట్ చేసింది. వాటికి కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా స్పందన రావడంతో సినిమా పాటలు, జానపద గేయాలు, భక్తి, రోమాంటిక్, ప్రేమ, ఎడబాటు తదితర అంశాలపై రీల్స్ చేయడం మొదలు పెట్టగా వాటికి కూడా లక్షల్లో వ్యూస్ రావడం, ఆరో తరగతి వరకే చదివిన ఆశాకు భర్త, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం తోడవడంతో రీల్స్‌పై మక్కువ పెంచుకుంది. రెండేళ్లలో 600 వరకు రీల్స్ చేసింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నా రీల్స్ చూసిన డైరెక్టర్లు చాలా మంది వారి సినిమాల్లో అడిగారు. కీ రోల్ పాత్రలు వస్తే తప్పకుండా చిన్న, పెద్ద సినిమాల్లో చేస్తాను’ అని ఠాకూర్ అశ్విని వెల్లడించింది. View this post on Instagram A post shared by Thakur Asha (@ashwini_anu_007) View this post on Instagram A post shared by Thakur Asha (@ashwini_anu_007) -
బస్సులోనే శాశ్వత నిద్రలోకి.!
కరీంనగర్, సాక్షి: చావు ఎవరికి చెప్పి రాదు!. అప్పటిదాకా ఉన్న ఆనంద క్షణాలను.. హఠాన్మరణాలు హరించి వేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నవే. అలాంటిదే కరీంనగర్లో చోటు చేసుకుంది. డ్యూటీకి వెళ్లొస్తానంటూ ఇంట్లో చెప్పి బయల్దేరిన ఆ వ్యక్తి.. ప్రయాణంలోనే గుండె ఆగి ఊరిలో విషాదం నింపాడు. జమ్మికుంట(Jammikunta) నుంచి కరీంనగర్ చేరుకున్న బస్సులో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి అచేతనంగా పడి ఉన్న దృశ్యం కండక్టర్ కంట పడింది. నిద్రపోయాడనుకుని లేపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడని కాస్త ఆలస్యంగా గుర్తించాడు. వీణవంక(Veenkavanka) మండలం రెడ్డిపల్లికి చెందిన ఓదెలు.. కరీంనగర్ ఐసీఐసీఐ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఊరిలో బస్సెక్కి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో కన్నుమూశాడు. కరీంనగర్(Karim Nagar) వెళ్లిన తరువాత గుర్తించిన బస్సు కండక్టర్.. పోలీసులకు సమాచారం అందించాడు. గుండెపోటు(Heart Attack)తోనే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓదెలు హఠాన్మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఐపీఎస్‌ల బదిలీలు
● రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా ● కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం ● సిరిసిల్ల ఎస్పీగా గిటే మహేశ్సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు ఐపీఎస్‌లను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామగుండం పోలీస్ కమిషనర్‌గా అంబర్కిశోర్ఝాను నియమించింది. రామగుండం సీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులును సీఐడీ ఐజీగా బదిలీచేశారు. కరీంనగర్ సీపీగా గౌస్ ఆలంను నియమించగా, ఇక్కడ పనిచేస్తున్న అభిషేక్ మహంతిని తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేశారు. సిరిసిల్ల ఎస్పీగా మహేశ్బాబాసాహెబ్ను నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న అఖిల్మహాజన్ను ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న పెద్దపల్లి డీసీపీగా పి.కరుణాకర్‌ను నియమించారు. పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న చేతన హైదరాబాద్‌లోని ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీఅయ్యారు. అంబర్ కిశోర్ ఝా 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంబర్ కిశోర్ ఝా 2011లో మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ ఏఎస్పీగాను 2012 వరంగల్ ఓఎస్డీ, అదనపు ఎస్పీగా పనిచేయడంతో పాటు 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు ఆవిర్భావం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం తొలి ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా, ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. 2013 అక్టోబరులో వరంగల్ కమిషనర్‌గా పనిచేశారు. గౌస్ ఆలం.. 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్ సీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ములుగు ఎస్పీగా పనిచేశారు. అంతకుముందు అక్కడే ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. కాగా.. అంతకుముందు ఏటూరునాగారంలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఈయన బిహార్ రాష్ట్రంలోని గయాకు చెందినవారు. ఐఐటీ ముంబాయ్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. గిటే మహేశ్ 2020 బ్యాచ్‌కు చెందిన గిటే మహేశ్ అహ్మదాబాద్ వాసి. తల్లిదండ్రులు కౌలు రైతులు. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అయిన మహేశ్‌ది పేద కుటుంబమైనా.. కష్టపడి చదివి.. ఐపీఎస్ సాధించారు. తెలంగాణకు కేడర్‌కు కేటాయించాక.. కరీంనగర్లో ట్రైనీగా విధులు నిర్వహించారు. చొప్పదండి ఎస్ హెచ్వోగా ఆరునెలలపాటు పనిచేశారు. ప్రస్తుతం ములుగు ఓఎస్డీగా ఈయనకు సిరిసిల్ల ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. -
ఆ నలుగురు.. ‘సిరి’ వెలుగులు
సిరిసిల్ల: సిరిసిల్ల కార్మికవాడల్లో ఏ గడప తట్టినా.. కష్టాలు, కన్నీళ్లు. 2008లో వరుస ఆత్మహత్యలతో కార్మికక్షేత్రం తల్లడిల్లింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ సందీప్‌కుమార్ సుల్తానియా సిరిసిల్లలో ఉండే విధంగా ఆదేశించారు. ఆత్మహత్యలు ఆగాలని స్పష్టం చేశారు. ఆర్డీవో ఆఫీస్ లోనే మకాం వేసిన కలెక్టర్ ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించారు. పేదరికం, పనిఒత్తిడి, మానసికవేదన, అప్పులేనని నిర్ధారించారు. వారిలో ధైర్యం నింపేందుకు ఓ నలుగురు మహిళలను నియమించారు. వారు క్షేత్రస్థాయిలో ఇల్లిల్లు తిరుగుతూ బాధల్లో ఉన్న కార్మికులకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ఆ నలుగురే రాపెల్లి లత, బూర శ్రీమతి, వేముల అన్నపూర్ణ, కొండ ఉమ. వీరిని చేనేత జౌళిశాఖ ద్వారా నియమించారు. నిత్యం కార్మికవాడల్లో తిరుగుతూ కౌన్సెలింగ్ నిర్వహించారు. 16 ఏళ్లుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేసేవారికి ఆ నలుగురు అండగా నిలిచారు. కార్మికవాడలైన బీ.వై.నగర్, సుందరయ్యనగర్, తారకరామనగర్, ఇందిరానగర్, పద్మనగర్, గణేష్‌నగర్, నెహ్రూనగర్, శాంతినగర్, ప్రగతినగర్‌లోని కార్మికుల ఇళ్లకు వెళ్తూ వారి కష్టసుఖాలు తెలుసుకోవడవం, కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు చేయడం వీరివిధి. సైకాలజిస్ట్ పున్నంచందర్‌తో కలిసి మనోవిసాకాన్ని కలిగించేందుకు అనేక సదస్సులు నిర్వహించారు. అర్హులైన నేతకార్మికులకు అంత్యోదయ కార్డులు, పెన్షన్లు, రేషన్ కార్డులు, నేతన్నలకు బీమా పథకాలను ఇప్పించడం, వైద్యం చేయించడం వంటి సామాజిక సేవలో ఆ నలుగురు ముందుకు సాగుతున్నారు. -
నేడు మహిళా సమాఖ్యలకు బస్సులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మహిళలను కోటీశ్వరుల ను చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి. మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు కేటాయించడం ద్వా రా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 మండలమహిళా సమాఖ్యలను ఎంపికచేశారు. ఈ జాబితాలో ఉ మ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐదు మండల మహిళా సమాఖ్యలకు అవకాశం దక్కడం గమనా ర్హం. శనివారం రవాణామంత్రి పొన్నం ప్రభాకర్, సీ్త్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమాఖ్యలకు బస్సులు కేటాయించనున్నారు. ఎన్ఆర్ఎల్ఎం సాయంతో.. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యల కు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈ పథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధు ల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లెవెలుగు) బస్సులు కొంటారు. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరుమీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. వీటి నిర్వహణ ఆర్టీసీ చూసుకుంటుంది. నెలనెలా రూ. 77,220 చొప్పున ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఎంపికై న సంఘాలివే.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో పెద్దపల్లి జిల్లాల్లో 9, రాజన్న సిరిసిల్లకు 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. ఇందులో శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీచైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాతా సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు మంత్రుల చేతులమీదుగా కొత్త బస్సులు అందుకోనున్నాయి. -
చెప్పలేను
26బొగ్గుగనిలో సీ్త్ర శక్తిగోదావరిఖని(రామగుండం): సింగరేణికి సీ్త్ర శక్తి తోడైంది. ఇప్పటివరకు పురుష రంగానికే పరిమతమైన సింగరేణి మైనింగ్‌లో మహిళలు అడుగీడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతో మహిళలకు సింగరేణి ఉపాధి అవకాశాలను మరింత పెంచింది. కేవలం కార్యాలయాల్లోనే కాకుండా భూగర్భ గనుల్లో పనిచేసే ఇంజినీర్లు, అండర్ మేనేజర్లుగా పెద్ద సంఖ్యలో మహిళలు చేరారు. ప్రస్తుతం సంస్థలో 201 మంది అధికారిణులుగా 1,794 మంది మహిళా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా రెండు గనులు ఏర్పాటు చేయాలని యాజమాన్యం భావిస్తోంది. సంస్థలో తొలి మహిళా రెస్క్యూ బ్రిగేడియర్‌గా కొత్తగూడెం పీవీకే–5గనికి చెందిన అండర్‌మేనేజర్ అంబటి మౌనిక ఎంపికై ంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ జీఎంగా సింగరేణి చరిత్రలోనే తొలిసారి మహిళా అధికారి కవితనాయుడు సమర్థవంతంగా రాణిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లీష్మెంట్– సీఎస్సార్ జీఎంగా తొలిసారి మరో మహిళా నికోలస్ బెనడిక్ట్, సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించే కంపెనీ సెక్రటరీగా సునీతాదేవి, న్యాయ విభాగం బాధ్యతలను డిప్యూటీ జీఎం హోదాలో శిరీషరెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా డాక్టర్ సుజాత విధులు నిర్వర్తిస్తున్నారు. -
స్నేక్.. షేక్
కరీంనగర్‌రూరల్: సాధారణంగా మహిళలు బల్లి కనిపిస్తేనే అమ్మో అంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ మహిళ ఎలాంటి భయం లేకుండా పాములు పట్టడమే వృత్తిగా ఎంచుకుంది. కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లిలోని చంద్రపురికాలనీకి చెందిన షేక్ సయిదా భర్త ఖాజామియా 15ఏళ్లక్రితం డెంగీతో చనిపోయాడు. కుటుంబపోషణ కోసం పాములు పడుతోంది. చిన్నప్పుడు తండ్రి సయ్యద్‌బాబా వద్ద నేర్చుకున్న పాములను పట్టడమే వృత్తిగా మార్చుకుంది. తమ ప్రాంతంలో పాము వచ్చిందని ఎవరైనా ఫోన్‌చేస్తే రాత్రి పగలు లేకుండా అక్కడికి చేరుకుంటోంది. పాములు పట్టినందుకు వారు ఇచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. పట్టుకున్న పాములను అటవీ శాఖ అధికారులకు అప్పగించడం, లేదా అటవీప్రాంతంలో విడిచిపెట్టడం చేస్తోంది. సయిదా ప్రస్తుతం అద్దెఇంట్లో ఉంటోంది. పాముకాటుకు గురైతే తన కుటుంబ పరిస్థితి ఏంటని ఆవేదనవ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఆదుకునేందుకు సాయం చేయాలని కోరుతోంది. -
అన్ని రంగాల్లో ముందున్నారు
పెద్దపల్లిరూరల్: సమాజంలో వేగంగా వస్తున్న మార్పులకు తగ్గట్టు సాంకేతిక రంగంలోనూ ప్రతిభ, నైపుణ్యాలతో ముందుంటున్నారు. వాస్తవానికి పురుషులకంటే మహిళల్లోనే మానసిక స్థైర్యం ఎక్కువ. పాతికేళ్ల పాటు పుట్టింట్లో ఉండి, పెళ్లి తర్వాత మెట్టినింట్లో తనకు అంతగా పరిచయం లేనివారి నడుమ ధైర్యంగా జీవించగలుగుతుంది. చదువులో రాణిస్తున్న మహిళలకు న్యాయవ్యవస్థలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆర్థికావసరాలు పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో పెళ్లి అయిన కొన్నాళ్లకే విడాకుల వరకు వస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లకు లోనై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నాం. – కె.స్వప్నరాణి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, పెద్దపల్లి -
ఆడబిడ్డకు అండగా ‘మా ఊరి మహాలక్ష్మి’
గంగాధర(చొప్పదండి): కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలు. పెళ్లికెదిగిన ఆడబిడ్డ భారమవుతుందని తల్లిదండ్రుల ఆవేదనలు. ఊరంతా చందాలు వేసుకొని ఓ ఆడబిడ్డ పెళ్ల్లి చేసిన సంఘటన.. ఓ యువకుడిని ఆలోచింపజేశాయి. మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు కు పునాది వేశాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయిపల్లికి చెందిన రేండ్ల శ్రీనివాస్–పద్మ దంపతులు తమ గ్రామంలోని ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు ఏడేళ్ల క్రితం మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. గ్రామంలో జన్మించిన ప్రతీ ఆడ బిడ్డ పేరుమీద ఫౌండేషన్ తరఫున రూ.5,116, తల్లిదండ్రుల నుంచి రూ.5,000 సేకరించి సుకన్య సమృద్ధి యోజనలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటివరకు 54 మంది ఆడపిల్లల పేరిట డిపాజిట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తండ్రిని కోల్పోయిన కుటుంబాలకు దాతల సహకారంతో ఆర్థికంగా అండగా నిలుస్తున్నా రు. ఏడాదిగా ఆడపిల్లల పెళ్లికి కానుకలు అందిస్తున్నారు. -
ఉంది 02
లేదు 91ఉమ్మడి జిల్లాలోని పలువురు మహిళలు ఇంటా, బయట, ఆఫీసుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా.. సుమారు 100 మంది వెల్లడించిన అభిప్రాయాలు ఇలా..1మీ ఇంట్లో ఆడ–మగ వివక్ష ఉందా?చెప్పలేను 072అవును 04పనిచేస్తున్న కళాశాల, పని ప్రదేశంలో వివక్ష ఎదుర్కొంటున్నారా?లేదు 78183బస్టాప్ 33మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం?కళాశాల/ ఆఫీసు 08సెల్ఫోన్లో వచ్చే మెసేజ్‌లు594తెలియని వారు 14మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు?తెలిసిన వారే 27చెప్పలేను●5అవును 27ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో ఉద్యోగరీత్యా మహిళగా ఇబ్బందులు తలెత్తుతున్నాయా?లేదు 47 -
వనిత..
అన్నింటా ఘనత‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి ● ఉమెన్స్‌డే కథనాలను పరిశీలించి ఫైనల్ చేసిన ఏఎస్పీ ● కథనాల పరిశీలన.. ఎంపికపై పలు సూచనలు ● పత్రిక సిబ్బంది కృషి అభినందనీయమన్న ఐపీఎస్ఆడపిల్ల పుట్టిందంటే భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడపిల్లను మహాలక్ష్మిగా కొలుస్తున్నారు. ఊర్లో.. అమ్మాయి పుడితే లక్ష్మీ వచ్చిందంటున్నారు. ఆమె ఒక తల్లి.. కూతురు.. సోదరి.. భార్య.. వీటన్నింటికీ మించి పోరాట యోధురాలు. ఆమె పుట్టుక ఆనందం. ఆమె ఓపికకు వందనం. ఆమె లేనిదే జననం లేదు. ఆమె లేనిదే జీవితం లేదు.. ఈ ప్రపంచానికి మనుగడే లేదు. అన్నింటా ఆమే.. అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. చదువులో అగ్రస్థానంలో నిలుస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఆవకాయ పెట్టడం నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా నారీ శక్తి కనిపిస్తోంది. కుటుంబానికి తోడుగా నిలుస్తూ.. కష్టాల్లో ఉన్న బతుకుబండిని లాగుతోంది. ఆమె ఆకాశంలో సగం కాదు.. ఇప్పుడు ఆమే ఆకాశం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనాలు.పత్రికా సిబ్బంది శ్రమ తెలిసిందిఅంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా గెస్ట్ ఎడిటర్‌గా కరీంనగర్ సాక్షి యూనిట్ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉంది. మనం ఉదయం చదివే దినపత్రికల కోసం 24 గంటలపాటు ఎన్నివ్యవస్థలు పనిచేస్తాయన్న విషయం ఈ రోజు ప్రత్యక్షంగా చూసే వీలుకలిగింది. వార్తల ఎడిటింగ్, ప్రాధాన్యం, పేజీనేషన్, ప్రాసెసింగ్, ప్రింటింగ్ తదితర అంశాలపై సిబ్బంది పడుతున్న శ్రమ వెలకట్టలేనిది. ఈరోజు స్వయంగా వార్తలను ఎంపిక చేయడం, ఎడిటింగ్ చేయడం ప్రత్యేక అనుభూతి కలిగించింది. ఈ అవకాశం ఇచ్చిన సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు. మరోసారి సాక్షి పాఠకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – శేషాద్రినిరెడ్డి, ఏఎస్పీ, వేములవాడ -
ఫాస్ట్‌బౌలర్.. శ్రీవల్లి
ఇల్లంతకుంట/కరీంనగర్ స్పోర్ట్స్ : చిన్ననాటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకొని జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటుతోంది కట్ట శ్రీవల్లిరెడ్డి. ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన కట్ట లక్ష్మారెడ్డి– ఉమ దంపతుల చిన్న కూతురు శ్రీవల్లిరెడ్డి మూడో తరగతి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. కూతురు ఇష్టం మేరకు లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో ప్రత్యేక కోచింగ్ ఇప్పించగా, పాస్ట్ బౌలింగ్‌లో మెలకువలు నేర్చుకుంది. 2019లో మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి పాఠశాల క్రీడా ఫెడరేషన్ క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. 2022లో పూణెలో నిర్వహించిన అండర్– 19 బాలికల క్రికెట్ పోటీల్లో హెచ్‌సీఏ తరఫున పాల్గొంది. ఈ జనవరిలో త్రివేండ్రంలో నిర్వహించిన బీసీసీఐ ఉమెన్స్ అండర్–19 వన్డే ట్రోఫీలో, 2024 డిసెంబర్లో అహ్మదాబాద్‌లో నిర్వహించిన సీనియర్ ఉమెన్ వన్డే టోర్నీలో హైదరాబాద్ తరఫున ప్రాతినిఽథ్యం వహించింది. కాగా.. శ్రీవల్లి కోసం తన తండ్రి ఊరు వదిలి కరీంనగర్, హైదరాబాద్‌లో ఉంటున్నారు. -
పెంచాల్సిన వేతనాలను తగ్గించడమేమిటి?
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. కరోనా మహమ్మారి కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి అందించిన సేవలు మరువలేనివన్నారు. మున్సిపల్ డ్రైవర్లు, వర్క్ఇన్స్పెక్టర్లకు చెల్లిస్తు న్న వేతనాలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. డ్రైవర్లకు సైతం ఇదే విధంగా కోత విధించడం ఎంత వరకు న్యాయమో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
క్రీడల్లో చిరుత.. చికిత
కరీంనగర్‌స్పోర్ట్స్: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన టి.చికిత విలువిద్య(ఆర్చరీ)లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తోంది. చిన్న వయస్సులోనే వరల్డ్‌కప్‌లో పాల్గొంటూ పతకాల పంట పండిస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌లోని సోనీపట్‌లో శిక్షణ పొందుతోంది.చికిత తండ్రి శ్రీనివాస్‌రావు రైతు. తల్లి శ్రీలత గృహిణి. మార్చి తొలివారంలో బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో కాంస్యం సాధించింది. ఏప్రిల్‌లో ఫ్లోరిడాలో జరగనున్న వరల్డ్‌కప్ స్టేజ్–1, మేలో చైనాలో జరిగే వరల్డ్‌కప్ స్టేజ్– 2 పోటీలకు సిద్ధమవుతోంది. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధిస్తానని చెబుతోంది. -
ముగ్గురికి ఉపాధి కల్పిస్తూ..
విద్యానగర్(కరీంనగర్): స్వర్ణకార పనులు ఎక్కువగా మగవారే చేస్తుంటారు. స్వర్ణకార కుటుంబానికి చెందిన గొట్టిముక్కుల ఉమాదేవి కులవృత్తిలో రాణించడంతో పాటు మరో ముగ్గురు మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. కరీంనగర్‌లోని ద్వారకానగర్‌లో పదేళ్లుగా గోల్డ్ కాస్టింగ్, మౌల్డింగ్ పనులు చేస్తుండగా.. బంగారం, వెండి, పంచలోహాలతో వివిధ ఆభరణాలు, విగ్రహాలు కాస్టింగ్ చేయడం ఉమాదేవి ప్రత్యేకత. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఈ సౌకర్యం ఇక్కడే అందుబాటులో ఉండడంతో స్వర్ణకారులు వచ్చి తమకు కావాల్సిన ఆభరణాలు మౌల్డింగ్ చేయిస్తున్నారు. -
అక్కాచెల్లెల్లు.. సర్కారు నౌకర్లు
జ్యోతినగర్: ఆడ పిల్లలను అధైర్య పడలేదు. కొడుకుల కన్నా ఎక్కువగా చదివించారు. ప్రయోజకులను చేశారు. ఆ తల్లిదండ్రుల కష్టాన్ని ఆ ఆడబిడ్డలు విస్మరించలేదు. కష్టపడి చదివారు. అందరూ ప్రయోజకులు అయ్యారు. సర్కారు కొలువులు కొట్టారు. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న సింగరేణి మాజీ ఉద్యోగి మల్లేపల్లి పోచం– లక్ష్మీ దంపతులకు నలుగురు కూతుర్లు శ్రీమతి, తులసీ, శైలజ, జ్యోతి. పెద్ద కూతురు మల్లెపల్లి శ్రీమతి కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. రెండో కూతురు మల్లెపల్లి తులసీదేవి స్కూల్ అసిస్టెంట్ రామగుండంలో విధులు నిర్వహిస్తున్నారు. మూడో కూతురు మల్లేపల్లి శైలజ అంతర్గాం మండల పరిషత్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగో కూతురు మల్లుపల్లి జ్యోతి బ్యాంకు మేనేజర్‌గా కొనసాగుతున్నారు. -
మహిళల సంక్షేమానికే శుక్రవారం సభ
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: మహిళలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు శుక్రవారంసభ నిర్వహిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్‌లోని జగ్జీవన్రావుకాలనీ అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ ఏర్పాటు చే శారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మహిళలతో మాట్లాడారు. మహిళలు తమ భోజనంలో అన్ని పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలన్నారు. గర్భిణులు కాల్షియం, ఐరన్ మాత్రలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాస్పత్రిలో ఉచిత వైద్యసేవలతో పాటు మందులు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. అనంతరం మెడికల్ క్యాంపును పరిశీలించారు. ప్రాథమిక పాఠశాల సందర్శన కిసాన్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ చేస్తామని తెలిపారు. డీడబ్ల్యూవో సబిత, మెప్మా పీడీ వేణుమాధవ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుజాత పాల్గొన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి శంకరపట్నం: పెళ్లి బరాత్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన బాకారపు ఉమ (35) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై రవి తెలిపారు. మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభా కర్ కూతురు నవ్య వివాహం మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన జినుక అశోక్‌తో గురువారం జరిగింది. రాత్రి పెళ్లి బరాత్ జరుగుతుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లకు చెందిన కారు డ్రైవర్ శ్రవణ్ కారు దిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. బరాత్‌లో కొందరు డ్యాన్స్ చేస్తుండగా పెళ్లికొడుకు అశోక్ కారు నడిపాడు. ఒక్కసారిగా బాకారపు ఉమ, ఆమె కూతురు నిఖితతోపాటు మరి కొందరిని కారు ఢీకొనడంతో గాయపడ్డారు. తీవ్రగాయాలైన ఉమ, నిఖితను హుజూ రాబాద్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఉమ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి పెళ్లి కొడుకు జినుక అశోక్ కారణమంటూ ఉమ భర్త పర్శరాములు కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారికి పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి, ఎస్సై రవి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. -
ఎములాడ రాజన్న సేవలో..
వేములవాడ: దైవకార్యంలో మేము సైతం అంటూ మహిళలు ముందుకు సాగుతున్నారు. సొంత ఖర్చులతో వేములవాడకు చేరుకుని హుండీ లెక్కింపులో, భక్తుల సేవలో తరిస్తున్నారు. ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు సొంత ఖర్చులతో రాజన్న సన్నిధికి చేరుకుని సేవలందిస్తున్నారు. ఇందులో ప్రధానంగా శ్రీలలితా సేవా ట్రస్టు, శివరామకృష్ణ భజన మండలి, శ్రీరాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు దశాబ్దానికిపైగా రాజన్న సేవలో తరిస్తున్నారు. ప్రతీసారి జరిగే హుండీ లెక్కింపుతో పాటు అన్ని పర్వదినాలు, రద్దీ రోజుల్లోనూ వీరు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి వందల సంఖ్యలో సేవా సమితి సభ్యులు వస్తుంటారు. గురువారం నాటి హుండీ కౌంటింగ్‌లో సుమారు 550మంది మహిళలు పాల్గొన్నారు. ‘మహిళలు ఆలయంలో అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. వారి సేవలకు కృతజ్ఞతగా మధ్యాహ్న భోజనం, రెండు లడ్డూలు, స్వామి వారి దర్శనం కల్పిస్తున్నాం’. అని ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. -
విద్యుత్ అంతరాయం లేకుండా చూడండి
కొత్తపల్లి(కరీంనగర్): వేసవిలో విద్యుత్ అంతరాయాల్లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులకు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్‌బాబు సూచించారు. కరీంనగర్ విద్యుత్ భవన్లో శుక్రవారం నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 33 కేవీ లింకింగ్ లైన్స్ గురించి సమీక్షించిన ఆయ న.. వాటిలో మిగిలి ఉన్న పనులను త్వరి తగతిన పూర్తి చేయా లని ఆదేశించారు. నగరంలో విద్యుత్ అంతరాయాలు, లోవోల్టేజీ సమస్య లేకుండా కొత్త డీటీఆర్లు ఏర్పాటు చేయా లన్నారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసా య విద్యుత్ సర్వీసులు రిలీజ్ చేయడంతోపాటు అవసరమైనచోట ట్రాన్స్ఫార్మర్లు అమర్చాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తున్నందున విద్యుత్ అంరాయాల్లేకుండా చూసుకోవాలని, ఆసుపత్రులు, ప్రముఖులున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
నకిలీ సర్టిఫికెట్లు సృష్టించిన నలుగురి రిమాండ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నకిలీ సర్టిఫికెట్లు సృష్టించిన నలుగురిని రాజన్నసిరిసిల్ల పోలీసులకు కటకటాల్లోకి నెట్టారు. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై రమాకాంత్ వివరాలు. కరీంనగర్‌కు చెందిన జడ కొమురయ్య ఎల్లారెడ్డిపేట మండలంలోని రా చర్లగొల్లపల్లి పశువైద్యశాలలో లైవ్‌స్టాక్ అధికారిగా పనిచేస్తున్నాడు. లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని మెడికల్ ఇన్వాల్యుడేషన్ కోసం కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కలెక్టర్ వెరిఫికేషన్ చేయించగా, నకిలీపత్రాలు సమర్పించినట్లు తేలింది. మండల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ జంపాల రాహుల్ ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టారు. మెడికల్ ఇన్వాల్యుడేషన్ ద్వారా తన కొడుకుకు ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశ్యంతో జడ కొ మురయ్య కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. తన కు తెలిసిన కరీంనగర్‌కు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ బీరయ్యను సంప్రదించాడు. అతను రూ.3లక్షలు తీసుకొని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మహ్మద్ బాసిద్ హుస్సేన్‌ను పరిచయం చేశాడు. అతని ద్వారా కరీంనగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కొత్తపల్లి రాజేశంను కలిశాడు. రాజేశం తన ల్యాబ్‌లో సన్‌షైన్ హాస్పిటల్‌కు సంబంధించిన ప్రిస్క్రిప్షన్లపై తప్పుడు ధ్రువీకరణపత్రాలు, నకిలీ వైద్యుల స్టాంప్‌లు వేసి, సంతకాలు ఫోర్జరీ చేసి సర్టిఫికెట్లు సృష్టించారు. వీటిని కొమురయ్య దరఖాస్తు చేసుకోగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిన విషయం ని ర్ధారణ అయింది. పోలీసులు వీరిని అరెస్టు చేశారు. -
వనిత.. అన్నింటా ఘనత
ఊరిపై మమకారం.. సేవకు శ్రీకారంచిన్న హోటల్.. పెద్ద బాధ్యత రామగిరి(మంథని): ఊరిపై మమకారంతో సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు రేండ్ల శారద. మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన శారద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అదే గ్రామానికి చెందిన రేండ్ల కుమార్స్వామితో వివాహం జరిగింది. మహిళల నిరుద్యోగ సమస్య, ఆర్థిక ఇబ్బందులను చూసి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని భర్త సహకారంతో ఆర్ఎస్కే ఆపన్న హస్తం ఏర్పాటు చేశారు. దాని ద్వారా గ్రామంలోని మహిళలకు ఉచితంగా పరికరాలు అందించారు. మహిళలకు కుట్లు–అల్లికలు, బ్యూటిషియన్, కుట్టు మిషన్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. న్యాక్ సంస్థ ద్వారా సొంత ఖర్చులతో సర్టిఫికెట్స్‌ను అందించారు. ఒక్కో విడతలో సుమారు 40 మందికి మూడు నెలల పాటు శిక్షణ అందిస్తున్నారు. ‘ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్‌లు పూర్తి చేశాం. ప్రస్తుతం ఐదో బ్యాచ్ కొనసాగుతుంది. నా భర్త సహకారంతో సేవ చేయడం తృప్తిగా ఉంది’.అని శారద వెల్లడించారు. మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం ఆత్మనగర్‌కు చెందిన బట్టు సుశీల చిన్న హోటల్ నడిపిస్తూ తన కుమారుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దింది. సుశీల, భర్త గంగరాజు గ్రామంలో హోటల్ నడిపించేవారు. 16 ఏళ్ల క్రితం గంగరాజు గుండెపోటుతో మృతిచెందాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అతడు చనిపోయిన సమయంలో పిల్లలంతా చిన్నవారే. అప్పటి నుంచి సుశీల నలుగురు పిల్లల బాధ్యతను మోసింది. ప్రస్తుతం పెద్దకుమారుడు సుమన్ ఆర్మీలో పనిచేస్తుండగా, చిన్న కొడుకు రంజిత్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు కూతుళ్ల వివాహం చేసింది. -
కరీంనగర్: పెళ్లి బరాత్‌లో విషాదం
కరీంనగర్: పెళ్లి బరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. పెండ్లి కొడుకు, కూతురు కూర్చున్న కారు బరాత్‌లో డ్యాన్స్ చేసేవారిపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో గురువారం రాత్రి పెళ్లి బరాత్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉదయం మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభాకర్ కూతురు వివాహం జరిగింది. రాత్రి అప్పగింతలు పూర్తయ్యాక గ్రామంలో పెళ్లి ఊరేగింపు జరుగుతుంది. నూతన వధువు, వరుడు కారులో కూర్చోగా బంధువులు సుమార్ 30 మంది వరకు బరాత్‌లో పాల్గొన్నారు. పెళ్లి కుమారుడు, కూతురు ఉన్న కారు డ్రైవర్ ఎక్సలేటర్ తొక్కడంతో బరాత్‌లో కారు ముందు ఉన్న వారిపైనుంచి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఆందోళనకు గురైన డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డవారిని ప్రైవేట్ వాహనాల్లో హుజూరాబాద్, జమ్మికుంట, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని..
కరీంనగర్‌క్రైం: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పకోరని భావించి ఇద్దరూ కలిసి ఉరేసుకుని తనువు చాలించారు. దూరంగా బ్రతకడం ఇష్టం లేక కలిసే పోయారు. కరీంనగర్ త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి వివరాల ప్రకారం.. జిలలాలోని చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన నాంపెల్లి రమ–అంజయ్య దంపతుల రెండోకూతురు అలేఖ్య(21) డిగ్రీ చదివి ఇంటివద్దే ఉంటోంది. ఇదే మండలం చిట్యాలపల్లి గ్రామానికి చెందిన కొండపర్తి సరస్వతి– రవికుమార్‌ల కొడుకు అరుణ్ కుమార్(24) కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో అద్దె ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.ఇద్దరూ బంధువులు కావడంతో దగ్గరయ్యారు. రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇటీవల అమ్మాయికి తన తల్లిదండ్రులు వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు. అయితే అలేఖ్య తాను చదివిన కళాశాలలో సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని ఇంట్లో చెప్పి బుధవారం కరీంనగర్ వచ్చింది. వావిలాలపల్లిలోని అరుణ్‌కుమార్ వద్దకు వెళ్లింది. తమ వివాహానికి పెద్దలు ఒప్పుకోరని అద్దెకుంటున్న ఇంట్లో ఒకే గదిలో వేర్వేరు ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తమ కూతురు ఇంకా ఇంటికి రావడంలేదని తల్లిదండ్రులు ఫోన్ చేయగా అలేఖ్య ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అరుణ్‌కుమార్ ఫోన్ సైతం పనిచేయకపోవడంతో అతను పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లారు. అక్కడా లేకపోవడంతో గురువారం వేకువజామున అరుణ్‌కుమార్ ఉంటున్న అద్దెఇంటికి వెళ్లారు. ఇద్దరూ ఉరేసుకుని చనిపోయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. త్రీటౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలేఖ్య కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి తెలిపారు. -
పెళ్లి బరాత్‌లో అపశ్రుతి
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో గురువారం రాత్రి పెళ్లి బరాత్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉదయం మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ప్రభాకర్ కూతురు వివాహం జరిగింది. రాత్రి అప్పగింతలు పూర్తయ్యాక గ్రామంలో పెళ్లి ఊరేగింపు జరుగుతుంది. నూతన వధువు, వరుడు కారులో కూర్చోగా బంధువులు సుమార్ 30 మంది వరకు బరాత్‌లో పాల్గొన్నారు. పెళ్లి కుమారుడు, కూతురు ఉన్న కారు డ్రైవర్ ఎక్సలేటర్ తొక్కడంతో బరాత్‌లో కారు ముందు ఉన్న వారిపైనుంచి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో మెట్పల్లి గ్రామానికి చెందిన బాకారపు ఉమ(45), మంతపురి సుమలత(38), భాగ్యలక్ష్మి(40), మంతపురి అంజలి (19), మంతపురి అఖిల(23), చిన్న(12)తో పాటు మరో 10 మందికి గాయాలయ్యాయి. ఆందోళనకు గురైన డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డవారిని ప్రైవేట్ వాహనాల్లో హుజూరాబాద్, జమ్మికుంట, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 16 మందిపై దూసుకెళ్లిన పెళ్లి కారు ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రులకు తరలింపు -
గంటపాటు అంబులెన్స్‌లోనే రోగి
జగిత్యాల: జిల్లాకేంద్రానికి చెందిన అశోక్ పక్షవాతం బారిన పడగా అంబులెన్స్‌లో గురువారం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతో గంటపాటు అంబులెన్స్‌లోనే నిరీక్షించాల్సిన వచ్చింది. అశోక్ చిరువ్యాపారి. ఇంటివద్ద ఉన్నట్టుండి కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు 108లో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది ఎంతకూ స్ట్రెచర్ తీసుకురాకపోవడంతో దాదాపు గంటపాటు అంబులెన్స్‌లో ఉండాల్సి వచ్చింది. వైద్యులను కుటుంబ సభ్యులు వేడుకోవడంతో చికిత్స కోసం తీసుకెళ్లారు. పులి జాడ దొరకలే.. ముత్తారం(మంథని): ముత్తారం మండలం మచ్చుపేట భగుళ్లగుట్టలో పెద్దపులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఐదురోజులుగా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్, పారుపల్లి, సర్వారం, మైదంబండ, మచ్చుపేట అటవీ, మానేరు తీరం, చెరువులు, పొలాల వెంబడి పెద్దపులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. గురువారం మచ్చుపేట భగుళ్లగుట్ట అటవీప్రాంతంలో తిరిగిన అధికారులకు ఏలాంటి ఆధారాలు లభించలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిని జల్లెడ పట్టినా పులి జాడ దొరక్క పోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఎండాకాలం కావడంతో పులి భగుళ్లగుట్టలోనే ఉందా లేదా ఇతర ప్రాంతానికి వెళ్లిందా అనే విషయం తెలుసుకోవడం కష్టంగా ఉందని అటవీశాఖ అధికారులు తల పట్టుకుంటున్నారు. కాగా పులి కదలికలు దొరికే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. హత్యకేసులో ముగ్గురి అరెస్ట్జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి టీఆర్‌నగర్‌కు చెందిన షేక్ రఫీ(28) ఈనెల ఒకటిన గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెల్సిందే. రఫీ మృతిపై అనుమానం ఉందని అతని తండ్రి షేక్ రజాక్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. విచారణ చేపట్టిన రూరల్ ఇన్చార్జీ సీఐ నీలం రవి టీఆర్‌నగర్‌కు చెందిన మహ్మద్ రంజానీ అలియాస్ రంజు, షేక్ మహ్మద్, షేక్ షాదప్లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. రూరల్ ఎస్సై సదాకర్ పాల్గొన్నారు. బుగ్గగుట్ట అటవీప్రాంతంలో మంటలు పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ బస్టాండ్ నుంచి ఈసాలతక్కళ్ళపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న బుగ్గగుట్ట అటవీప్రాంతంలో గురువారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు, స్థానిక అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ సెఫ్టీ అధికారులు వాటర్ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లించి మంటలను అదుపుచేశారు. -
నాణ్యమైన విద్యకు కేరాఫ్ ‘కేవీ’
జ్యోతినగర్(రామగుండం): దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు ఒకటో తరగతి నుంచే క్రియేటివ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు బోధన సాగిస్తున్నాయి. వినూత్న బోధన అందిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిషికేషన్ విడుదలైంది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్మీడియెట్ వరకు విద్యను అభ్యసించవచ్చు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు ఫీజుల భారం ఉండదు. మొదట్లో కేవలం ఆర్మీ పిల్లలకు మాత్రమే అవకాశం ఉండేది. తర్వాత ఐదు కేటగిరీలుగా విభజించి ప్రవేశాలు కల్పిస్తున్నారు. దరఖాస్తు విధానం 2025–26 విద్యా సంవత్సరానికిగానూ ఒకటో తరగతి ప్రవేశాలకు ఈనెల 7 నుంచి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 31 నాటికి 6 నుంచి 8 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు అర్హులు. జనన, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. దరఖాస్తులు పరిశీలించి లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లాటరి పద్ధతిలో సీట్ల కేటాయింపు ఉంటుంది. విద్యార్థుల ఎంపికకు సంబంధించి తొలి జాబితా ఈనెల 25న, రెండో జాబితా ఏప్రిల్ 2, మూడో జాబితా అదే నెల 7న ప్రదర్శించి ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రాధాన్యత అంశాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు ద్వితీయ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు తృతీయ, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల చిన్నారులకు నాలుగో ప్రాధాన్యత. విద్యా హక్కు చట్టం(ఆర్టీఐ)కింద 10 సీట్లు ఉంటాయి. ఇందుకు పాఠశాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని వారు మాత్రమే అర్హులు.దరఖాస్తులో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధాన్య అంశాలను తప్పనిసరిగా పాటించాలి. నాలుగు కేటగిరీల్లో దరఖాస్తులు చేసేవారికి ఆయా ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. ఆర్టీ కోటాలో సీటు పొందినప్పటికీ కేటగిరీని తప్పుగా ఎంచుకుంటే సీటు రాదు. సాధారణ ప్రజలు దరఖాస్తు చేసే క్రమంలో ఐదో కేటగిరీని ఎంచుకోవడం ఉత్తమం. ఎంపిక విధానం దరఖాస్తులను ఆన్లైన్లో పరిశీలించి విద్యాలయ సంఘటన్ ఎంపిక జాబితాను విద్యాలయాలకు పంపుతుంది. దీనిని సంబంధిత వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. జాబితాలో ఉన్నవారు మాత్రమే ఒరిజినల్ ధ్రువీకరణ ప్రతాలతో విద్యాలయాల్లో సంప్రదించాలి.ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్ కేవీలో ఒకటో తరగతికి 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశాలకు ప్రక్రియ ప్రారంభం నేటి నుంచి 21 వరకు దరఖాస్తులు -
20 ఏళ్లుగా చోరీలు.. 36 కేసులు
పెద్దపల్లిరూరల్: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నాడు. పల్సర్ బండిపై పల్లెటూళ్లలో తిరుగుతూ తాళం వేసిన, మనుషులు లేని ఇళ్లను ఎంచుకుని పట్టపగలే చోరీలకు పాల్పడ్డ బోరిగం సంపత్‌ను అరెస్టు చేసినట్లు ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, కాల్వశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం రెడ్డిపల్లెకు చెందిన బోరిగం సంపత్ హోటల్లో పనిచేసేవాడు. జల్సాలకు అవసరమైన ఖర్చులకోసం 2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పలు జిల్లాలో 36 కేసులు నమోదు దాదాపు 20 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న సంపత్‌పై ఇప్పటికే 36 కేసులు పలు జిల్లాల్లో నమోదయ్యాయి. గోదావరిఖని, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, మంథని, కొయ్యూరు, రామకృష్ణాపూర్, హసన్‌పర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ ఏరియాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇటీవల కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లిలో మద్దెల శాంతమ్మ ఇంటికి తాళం వేయకుండా పక్కనే ఉన్న ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వచ్చేలోగా సంపత్ ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లాడు. పోలీసులు చేపట్టిన తనిఖీలలో గురువారం పోలీసులకు చిక్కాడు. రూ.15.47లక్షల సొత్తు స్వాధీనం పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన బోరిగం సంపత్ నుంచి రూ.2,25,000 నగదు, 149.34 గ్రాముల బంగారం (రూ.13,22,108 విలువ గలది) స్వాధీనం చేసుకున్నారు. అలాగే ధర్మారం, గోదావరిఖని టూటౌన్, పొత్కపల్లి, హాజీపూర్, కాల్వశ్రీరాంపూర్, జూలపల్లి, సుల్తానాబాద్ మండలాల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు సంపత్ అంగీకరించాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. నిఘా పెంచాం పెద్దపల్లి ప్రాంతంలో చోరీలు, అసాంఘిక కార్యకలా పాలపై నిఘా పెంచామని ఏసీపీ పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతతో పలు ప్రాంతాల్లో హిడెన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రజలు అ ప్రమత్తంగా ఉంటూ అపరిచితులు, గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. చోరీకి పాల్పడిన సంపత్‌ను పట్టుకున్న సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై వెంకటేశ్, ఏఎస్ఐ తిరుపతితో పాటు అశోక్, లక్ష్మణ్, సుమన్, వినుస్తర్, రవీందర్, ప్రభాకర్, రమేశ్, రాజు, రాజ్‌కుమార్, ఫింగర్‌ప్రింట్ బృందం, సీడీఆర్ బృందం సిబ్బందిని ఏసీపీ అభినందించారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఏసీపీ కృష్ణ -
బైక్, వాహనాలను ఢీకొట్టి కారు బోల్తా
శంకరపట్నం(మానకొండూర్): శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో గురువారం మోటార్ సైకిల్, రెండు వాహనాలను ఢీకొట్టి కారు బోల్తా పడింది. హన్మకొండకు చెందిన గుడిపాటి భూపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్లో బంధువుల వివాహానికి హాజరై కరీంనగర్ నుంచి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో వంకాయగూడెం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి రెండు ప్యాసింజర్ వాహనాలను ఢీకొంది. మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రమేశ్ ఆటో నుజ్జునుజ్జు కాగా.. రోడ్డుపై పడ్డాడు. శంషాబాద్ గ్రామానికి చెందిన సతీశ్ మోటార్ సైకిల్‌పై నుంచి ఎగిరిపడ్డాడు. తాడికల్ గ్రామానికి చెందిన రాజమల్లు టాటా ఏసీలో అంబాల్‌పూర్, వంకాయగూడెం పాఠశాలకు చెందిన ముగ్గురు టీచర్లను కరీంనగర్ తీసుకెళ్తుండగా కారు ఢీకొంది. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న భూపాల్‌రెడ్డి, కారులో కూర్చున్న శ్రీనివాస్‌రెడ్డి, రమాదేవి, మానస, సుజాతలకు స్వల్ప గాయాలయ్యాయి. రెండేళ్ల బాలుడు క్షేమంగా ఉన్నా.. ప్రమాదం జరిగిన వెంటనే రోదించాడు. కారులో ఇరుక్కున్నవారిని ప్రయాణికులు, స్థానికులు బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన రమేశ్, సతీశ్‌ను 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మరో 108 వాహనంలో రాజమల్లును హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కేశవపట్నం పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కారు నడుపుతున్న భూపాల్‌రెడ్డి నిద్రలోకి జారినట్లు తెలిసింది. పలువురికి తీవ్ర గాయాలు -
ఆయుర్వేద వైద్యం పేరిట మోసం
సిరిసిల్లక్రైం: ఆయుర్వేద మందులతో రోగాలు న యం చేస్తానంటూ మాయమాటలు చెబుతూ మో సాలకు పాల్పడిన వ్యక్తిని గురువారం రిమాండ్ చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వి వరాలు డీఎస్పీ కథనం ప్రకారం. కర్ణాటక రాష్ట్రం చి క్కబల్లాపూర్ జిల్లా నగిరెగరే గ్రామానికి చెందిన అ జయ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోటర్‌సైకిల్‌పై తిరుగుతూ పక్షవాతం, ఇతర అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్యం చేసి తగ్గిస్తానంటూ రూ.10వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చే శాడు. డబ్బులు తీసుకొని వైద్యం చేయక కాలయాపన చేసేవాడు. అనంతపూర్, మహబూబ్‌నగర్, నా రాయణఖేడ్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో సంచరిస్తూ ఆయుర్వేద వైద్యం పేరుతో మోసం చేసేవాడు. వేములవాడ పరిధి శాత్రాజుపల్లి, ముస్తాబాద్ మండల పరిధిలోని బదనకల్, వెంకట్రావుపల్లి గ్రామాల్లో పలువురి వద్ద డబ్బులు వ సూలు చేశాడు. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన కొడిమోజు లక్ష్మి భర్తకు పక్షవాతం ఉందని తెలుసుకొని గతేడాది నవంబర్‌లో వారి ఇంటికెళ్లి కలిశాడు. మాయమాటలు చెప్పి ఆమె భర్తకు పక్షపాతం నయం చేస్తానని నమ్మించి రూ.20వేలు ఫోన్‌పే చేయించుకున్నాడు. ఇలా పలు గ్రామాల్లో దాదాపు రూ.6లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డాడు. గంభీరావుపేటలో గురువారం తిరుగుతుండగా పోలీసులు పట్టుకొని విచారించగా ఈ విషయాలు వెలుగుచూశాయి. అజయ్ తెలంగాణలో 50 మందికి పైగా మోసం చేశాడని అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్సై శ్రీకాంత్, ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి, పీసీ శ్రీనాథ్‌ను డీఎస్పీ అభినందించారు. ఘరానా మోసగాడి రిమాండ్ -
బావిలోకి దూసుకెళ్లిన బైక్.. యువకుడి దుర్మరణం
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రమాదవశాత్తు బావిలోకి బైక్ దూసుకెళ్లడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం గ్రామానికి చెందిన శీలం రజనీకాంత్(26) తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి గురువారం ఉదయం వెళ్లి, సాయంత్రమైనా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి గాలించారు. ఈక్రమంలో పెద్దలింగాపురం ప్రాఽథమిక పాఠశాల సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయబావిలో బైక్‌తో సహా రజనీకాంత్ పడిపోయి, ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. చుట్టుపక్కల వారి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. సంఘటన స్థలాన్ని ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ పరిశీలించారు. రజనీకాంత్ తల్లి దుర్గవ్వ, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తండ్రి లచ్చయ్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. -
10 కణతిలు తొలగించిన వైద్యులు
కరీంనగర్ టౌన్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ కడుపులో గర్భంతో పాటు గర్భసంచికి పది కణతిలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి గ్రామానికి చెందిన భూసారపు గంగ (36) పెళ్లయిన 17ఏళ్లకు గర్భం దాల్చింది. మొదటి ప్రసవం కోసం కరీంనగర్ మాతా శిశుకేంద్రానికి వచ్చింది. వైద్యులు వెంటనే స్కానింగ్ చేసి గంగ గర్భసంచికి పది కణతులు (ఫైబ్రాడ్స్) ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం అడ్మిట్ చేసుకున్న వైద్యులు బుధవారం శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్సలో మగ శిశువుకు జన్మనిచ్చింది. గర్భసంచికి ఉన్న పది కణతులు తొలగించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. డాక్టర్లు నిఖత్, సంగీత, మనీషా, అనస్తీషియా తిరుపతి బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ గుండా వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనలు అభినందించారు. -
చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. యువకుడు మృతి
మంథని: మంథని మండలం బిట్టుపల్లి గ్రామ మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌కు చెందిన ఒకరు మృతి చెందగా.. హైదరాబాద్‌కు చెందిన మరొకరు గాయపడ్డారు. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన ఆరుగురు యువకులు ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో తమ మిత్రుడి సోదరి వివాహం కోసం వచ్చారు. గురువారం వివాహం అనంతరం ఫంక్షన్ హాల్ నుంచి మూడు ద్విచక్రవాహనాలపై తిరిగి మిత్రుడి ఇంటికి వెళ్లున్నారు. ఈ క్రమంలో మార్గంమధ్యలో మూలమలుపు వద్ద ఓ బైక్ చెట్టుకు ఢీకొనడంతో గుండపాక ఉదయ్(24)అక్కడిక్కడే మృతిచెందాడు. బైక్ ఉన్న మరో యువకుడు పుట్టని గణేశ్‌కు గాయాలయ్యాయి. మృతుడు ఉదయ్ మహబూబాబాద్‌కు చెందిన వ్యక్తికాగా.. హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఎస్సై తెలిపారు. గాయపడిన గణేశ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. -
నాడు కేసీఆర్.. నేడు రేవంత్...
కరీంనగర్ ఉద్యమాలకు, భావోద్వేగాలకు నిలయమైన జిల్లా. ఈ ప్రాంత ఓటర్లు విలక్షణ తీర్పులనివ్వడంలో పరిపాటి. అందుకే, 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల్లో తిరుగులేని విజయాన్ని అందుకుని మంచి జోరు మీదున్న బీఆర్ఎస్కు మొదటి ఎదురుదెబ్బ కరీంనగర్‌లోనే తగిలింది. 2019 గ్రాడ్యుయేట్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించి బీఆర్ఎస్కే కాదు.. రాష్ట్ర రాజకీయాలకే కరీంనగర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇటీవల నరేందర్‌రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో సీఎం రేవంత్ ఈ ఎమ్మెల్సీ గెలవకపోయినా.. తమకు వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించడం ఆ వెంటనే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడం చర్చనీయాంశంగా మారాయి. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ బీజేపీని ఉద్దేశించి.. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అన్న మాట వాడటం.. ఆ పార్టీ పరాజయంలో కీలకంగా పనిచేసిన విషయాన్ని కరీంనగర్ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. -
హస్త వైఫల్యం!
● ఎమ్మెల్సీ ఓటమిపై కాంగ్రెస్‌లో మొదలైన అంతర్మథనం ● చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాలలో ప్రతికూలం ● పెద్దపల్లి జిల్లాలోనే హస్తం పార్టీకి మెజారిటీ ● కరీంనగర్లో అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీల్లో వరుస ఓటమి ● కొంపముంచిన చెల్లని ఓట్లు, సమన్వయ లోపాలు ● పార్టీలో లోపాలపై ముఖ్యమంత్రికి త్వరలో నివేదిక ● నాటి సీఎం తరహాలోనే నేటి సీఎం వ్యాఖ్యలు చేటు చేశాయా?ఎక్కడెక్కడ బలహీనం అంటే? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతను ఎంపిక చేయడం లోకల్ పలువురు నాయకులకు నచ్చలేదు. కీలకమైన కరీంనగర్ నుంచి మరో నాయకుడు ఎదగడం తమ పార్టీలోనే ముగ్గురు ముఖ్యనేతలకు ఇష్టం లేదని ఓటమి అనంతరం నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. గెలవగానే ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారంతో కొందరు ముఖ్యనాయకులు పార్టీ ఎన్ని కల ప్రచారంలో అంటీ ముట్టనట్టుగా వ్యహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే, ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, జగి త్యాల, ధర్మపురి, మానకొండూర్‌లో తక్కువ ఓట్లు వచ్చాయని సాక్షాత్తూ నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అదే సమయంలో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చేందుకు నరేందర్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్– మెదక్– నిజామాబాద్– ఆదిలా బాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమి కాంగ్రెస్ పార్టీ లో భారీ కుదుపునకే దారి తీస్తోంది. పార్టీలో సమన్వయ లోపాలు, అనైక్యత, పరస్పర సహకారం కొరవడటం తదితర వైఫల్యాలు ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. 2023లో అసెంబ్లీ, 2024లో పార్లమెంటు, 2025లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఇలా ఏడాదిన్నర కాలంలో కరీంనగర్లో కాంగ్రెస్ వరుసగా ఓడింది. కానీ, ఈసారి ఓట మిపై పార్టీలో చర్చనడుస్తోంది. వాస్తవానికి 15 జిల్లాలు, 42 నియోజకవర్గాలలోని గ్రాడ్యుయేట్ల కోసం ఎన్నిక జరిగినా.. ప్రచారం, నామినేషన్, రా జకీయం అంతా కరీంనగర్ కేంద్రంగానే జరిగింది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఎం, ఉమ్మ డి జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులతో కలిసి భారీ బహిరంగసభ నిర్వహించడం, సిట్టింగ్ సీట్లో ఓటమిపై మునుపెన్నడూ లేని చర్చ నడుస్తోంది. చెల్లని ఓట్లు, సమన్వయ లోపాలు వాస్తవానికి నరేందర్‌రెడ్డికి తన ప్రత్యర్థి అంజిరెడ్డి(బీజేపీ)కన్నా కేవలం 5,106 ఓట్లు తక్కువగా వచ్చాయి. అదే సమయంలో 28,686 ఓట్లు చెల్లనివి వచ్చాయి. ఈ ఓట్లలో దాదాపు 16వేల ఓట్లు నరేందర్‌రెడ్డికే పడడం దురదృష్టకరం. అందులోనూ ఆరువేలకుపైగా ఓట్లు కేవలం అంకె ముందు సున్నా వేయడం వల్ల చెల్లకుండా పోవడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. అదే సమయంలో బీజేపీ జిల్లా, మండలం, గ్రామం, బూత్లెవల్వరకు పోల్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా నిర్వహించింది. ప్రతీ 25మందికి ఒక ఇన్చార్జిని నియమించి, ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో క్యాడర్ సఫలీకృతమయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం, ఆధిపత్య పోరు, పోల్ మేనేజ్మెంట్ వైఫల్యాల కారణంగా ఓటరును ప్రసన్నం చేసుకోవడంలో దెబ్బతిన్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఎస్పీ అభ్యర్థికి ఓట్లు వేయించడం కూడా తమకు ప్రతికూలంగా మారిందని నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తుండటం గమనార్హం. -
స్కానింగ్ సెంటర్లలో తనిఖీ
కరీంనగర్‌టౌన్: రాష్ట్రస్థాయి ఇన్స్పెక్షన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఫెర్టిలిటీ స్కానింగ్ సెంటర్లలో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమిటీ ఇన్చార్జి డాక్టర్ సూర్యశ్రీ రావు, ఇన్చార్జి డీఎంహెచ్‌వో సుజాత నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్కానింగ్ కేంద్రాలకు వచ్చిన అవుట్ పేషెంట్ రిజిష్టర్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, డాక్టర్ల క్వాలిఫికేషన్ వెరిఫికేషన్, గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం–1994, రూల్స్ 1996 అమలు తీరును పరిశీలించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రతీనెల జరిగే స్కానింగ్ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికా రికి పంపించాలని సూచించారు. వైద్యులు ఉమశ్రీ, సనా జవేరియా, డి.లక్ష్మీ, కె.రమేశ్, రాజగోపాల్ పాల్గొన్నారు. విశిష్ట మహిళా పురస్కారాలకు ఎంపిక కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ ఫిలిం సొసైటీ ఏటా ప్రదానం చేసే కఫిసొ– 2025 విశిష్ట మహిళా పురస్కారానికి ముగ్గురు మహిళలను ఎంపిక చేసినట్లు కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, కార్యదర్శి లక్ష్మీగౌతమ్ తెలిపారు. ప్రఖ్యాత రచయిత్రి తంగేళ్ల శ్రీదేవిరెడ్డి, జానపద గాయని కనుకవ్వ, ప్రసిద్ధ నర్తకి గుత్తా నాగదుర్గకు కఫిసొ విశిష్ట మహిళా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఫిలింభవన్‌లో మార్చి 8న సాయంత్రం 6గంటలకు కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నూతన ఉపాధ్యాయులకు శిక్షణ కరీంనగర్: ఉమ్మడి జిల్లా సాంఘికశాస్త్ర నూతన ఉపాధ్యాయులకు నగరంలోని సప్తగిరికాలనీ ప్రభుత్వ పాఠశాలలో గురువారం వృత్యంతర శిక్షణ ఇచ్చారు. డీఎస్సీ–2024 ద్వారా నియామకమైన సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గల వ్యూహాలు, ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్లపై అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్, పెద్దపల్లి ఏఎంవోలు అశోక్‌రెడ్డి, ఎస్కే.షేక్ పరిశీలించారు. రిసోర్స్ పర్సన్లు పుల్లూరి రవీందర్, రమేశ్, రాజ్‌కుమార్, వినోద్ కుమార్, అంజయ్య, ఆసిఫ్అలీ శిక్షణ ఇచ్చారు. క్వింటాల్ పత్తి రూ.7,050 జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,050 పలికింది. గురువారం మార్కెట్‌కు 11వాహనాల్లో 149 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,000, కనిష్ట ధర రూ.6,600కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను కార్యదర్శులు మల్లేశం, రాజా పర్యవేక్షించారు. రెండోరోజు ఇంటర్లో 357 మంది గైర్హాజరు కరీంనగర్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్–2 పరీక్షకు గురువారం 357 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో జగన్మోహన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ విభాగంలో 14,314 మందికి 282మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 14,032మంది విద్యార్థులు హాజ రయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,325 మందికిగానూ 75మంది గైర్హాజరయ్యారు. 1,250 మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తంగా 15,639 మంది విద్యార్థులకు గాను 357 మంది గైర్హాజరయ్యారు. 15,282 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు డీఐఈవో తెలిపారు. -
అనుమానాల ఎన్‌కౌంటర్‌కు ఇరవై ఏళ్లు
సిరిసిల్ల: నక్సలైట్ల విప్లవ గీతాలు.. పోలీస్ బూట్ల చప్పుళ్లతో ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పల్లెలు నిద్రలేచేవి. నాలుగు దశాబ్దాలపాటు సాగిన సాయుధ పోరాటంలో ఒడిదొడుకులు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలను కలుపుకొని మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్ కమిటీగా ఉండే ది. 2005 నాటికి బలమైన నక్సలైట్ల కారిడార్ ఈ జి ల్లాల పరిధిలో ఉంది. అప్పట్లో ‘అడవిలో అన్నలు’ సమాంతర పాలన సాగించేవారు. అయితే రెండు ద శాబ్దాల క్రితం జరిగిన మానాల ఎన్కౌంటర్ పశ్చిమ డివిజన్లో నక్సలైట్ ఉద్యమాన్ని తూడ్చిపెట్టేసింది. 2005 మార్చి 7వ తేదీన రుద్రంగి మండలం మా నాల శివారులోని జోత్యానాయక్తండా సమీప గు ట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించారు. ఆ ఎన్‌కౌంటర్‌కు 20 ఏళ్లు నిండిన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. గుట్టబోరు రక్తపుటేరు మానాల ఊరు.. పరిసర గిరిజనతండాలు అప్పట్లో నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం పరిధిలో ఉండేది. 2004లో రాష్ట్ర ప్రభుత్వానికి నక్సలైట్లకు జరిగిన చారిత్రాత్మక చర్చల అనంతరం మానాలలో అతిపెద్ద ఎన్కౌంటర్ జరిగింది. అప్పటి కరీంనగర్ జిల్లా పశ్చిమ డివిజన్ కమిటీ మావోయిస్టు కార్యదర్శి గంగుల వెంకటస్వామి అలియాస్ రమేశ్(మొగిలిపేట)తోపాటు పది మంది నక్సల్స్ హతమయ్యారు. మహిళా దళనేత కామిండ్ల శోభ(వట్టిమల్ల)తోపాటు మరో దళనాయకుడు కొమ్ము బాబు అలియాస్ బాబన్న(వట్టిమల్ల), మరో దళనేత రఘు(మూడపల్లి), దళసభ్యులు గట్టు కిషన్‌రెడ్డి ఉరఫ్ శంకర్(పదిర), గోవర్ధన్(వట్టిమల్ల), లావుడ్య రవి ఉరఫ్ శ్రీను, సునీత ఉరఫ్ పద్మ, జ్యోతి ఉరఫ్ స్నేహ, రమేశ్ ఉరఫ్ సుధీర్ మరణించారు. పది మంది మావోయిస్టుల శవాలతో జోత్యానాయక్ తండా గుట్టబోరు రక్తపుటేరుగా మారింది. తప్పించుకున్న కేంద్ర కమిటీ సభ్యుడు మానాల ఎన్‌కౌంటర్‌కు కొన్ని గంటల ముందు అప్పటి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్నతో కరీంనగర్ పశ్చిమ డివిజన్ కమిటీకి అపాయింట్మెంట్ ఉంది. అడవిలో దళంతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఎన్కౌంటర్ ప్రదేశానికి కొద్ది దూరంలోని ఓ పల్లెలో జంపన్న ఆశ్రయం పొందాడు. తెల్లవారితే రమేశ్ దళంతో జంపన్న కలవాల్సి ఉండగానే భారీ ఎన్కౌంటర్ జరగడంతో అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. చిక్కిన వారే కోవర్టుగా మారి మానాల ఎన్కౌంటర్లో ఇద్దరు సాయుధ నక్సలైట్లు భూక్య పద్మ (అడవిపదిర), సుదర్శన్‌రెడ్డి(ఇల్లంతకుంట) సజీవంగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిద్దరూ పోలీసులకు కోవర్టుగా మారి ఎన్‌కౌంటర్‌కు కారణమయ్యారని అప్పట్లో హక్కుల సంఘాలు ఆరోపించాయి. పద్మ జైలు నుంచి విడుదలై సొంతూరు అడవి పదిరలో ఉండగా.. 2006లో మావోయిస్టులు అపహరించుకెళ్లారు. మానాలలో జరిగిన ఎన్కౌంటర్ తీరును పద్మతో చెప్పించి, ఆడియో రికార్డు చేశారు. ఎన్‌కౌంటర్‌కు ముందు మానాల అడవుల్లో ఉన్న దళం రాత్రి తిన్న అన్నంలో మత్తుమందు కలిపినట్లు పద్మ చెప్పినట్లుగా ఆడియో రికార్డు బయటకు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పద్మ కోవర్టుకు మారినట్లు ఆరోపిస్తూ కోనరావుపేట మండలం మరిమడ్ల వద్ద పద్మను హతమార్చారు. అన్నలకు ఉత్తరాలు.. వెలుగుచూసిన నిజాలు ఎన్కౌంటర్ ప్రాంతంలో అందరి దృష్టి అక్కడ పడి ఉన్న ఉత్తరాలపై పడింది. భార్యను ఓ భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని ఎలాగైనా అమ్మాయిని అత్తగారింటికి పంపించాలని, ఇద్దరు పిల్లలు ఉన్నారని వేడుకుంటూ.. ఓ తండ్రి అన్నలకు రాసిన లేఖ ఒకటి. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారని ఓ మహిళ రాసిన ఉత్తరం. భూమి వివాదంలో పంచాయితీ పెద్దలు చెప్పినట్లుగా ఎదుటివాడు వినడం లేదని ఓ ఆసామి రాసిన లేఖ.. ఇలా ఎన్కౌంటర్ ప్రాంతంలో అనేక ఉత్తరాలు.. అన్నలను ప్రజలు వేడుకున్నట్లు కనిపించాయి. పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ ఈ ఎన్‌కౌంటర్‌పై అమరవీరుల బంధుమిత్రుల కమిటీ హైకోర్టును ఆశ్రయించడంతో మృతదేహాలకు ఇద్దరు డాక్టర్లతో పోస్టుమార్టం చేయించాలని, వీడియో తీయించాలని ఆదేశించింది. ఈమేరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శవాలను బంధువులకు అప్పగించారు. శవాలను ఖననం చేయొద్దని, దహనమే చేయాలని పోలీసుల ఆంక్షల మధ్య అత్యక్రియలు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ తర్వాత అమరులపై వచ్చిన పాటలు నక్సలిజం ప్రాబల్య పల్లెల్లో మార్మోగాయి. నక్సలైట్ ఉద్యమానికి ఆనవాళ్లుగా ఇప్పటికీ మానాలలో నిర్మించిన మహిళా అమరవీరుల స్మారక స్తూపం సాక్ష్యంగా నిలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం మానాల ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. పది మంది నక్సల్స్ హతం ప్రభుత్వంతో చర్చల అనంతరం భారీ ఎన్కౌంటర్ త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న అనంతరకాలంలో తుడిచిపెట్టుకుపోయిన ఉద్యమం ఉదయించే సూర్యులు ఉద్యమాల చంద్రులు మానాల మా అమరులు అందుకోండి జోహరులు.. మానాల అడవుల్లో మల్లెలు పూశాయి మంచి మంచి మల్లెలమ్మా.. అవి ఎర్రని మల్లెలమ్మా ఏడేడు దారుల్లో.. ఎర్రని దారుల్లో.. ఎదిరించి పోరాడిరమ్మ.. నేలమ్మ ఒడిలోనే రాలిరమ్మా.. -
పర్యవేక్షణ.. పకడ్బందీ నిర్వహణ
● ఎన్నికల కేంద్రంగా కరీంనగర్ కలెక్టరేట్ ● నాలుగు ఉమ్మడి జిల్లాల పర్యవేక్షణ అంతా ఇక్కడే ● ఎమ్మెల్సీ ఎన్నికల విజయవంతంలో కీలక భూమిక కరీంనగర్ అర్బన్: కలెక్టరేట్.. పరిపాలనకు కేంద్రం. ఎన్నికలొచ్చాయన్నా కలెక్టరేటే కీలకం. ఎన్నికలకు సమాయత్తమవడం నుంచి ఓట్ల లెక్కింపు వరకు కలెక్టరేట్లోని కీలక విభాగాలే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేసింది. నాలుగు ఉమ్మడి జిల్లాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌కు కరీంనగర్ కలెక్టరేట్ కీలకంగా వ్యవహరించింది. ఓటరు చైతన్యం నుంచి ఓటేసే వరకు, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవడం, ఓట్ల లెక్కింపు వరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. ఒక్కో దానికి ఒక్కో నోడల్ అధికారి విధులు నిర్వహించగా అన్ని విభాగాల బాధ్యత కలెక్టరేట్దే. ● మానవ వనరులు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలో 15 జిల్లాలుండగా 41 నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ రోజు ఎవరెవరు ఎక్కడ విధులు నిర్వర్తించాలనేది ఈ విభాగం నిర్ణయించింది. పేస్కేల్‌ను పరిగణనలోకి తీసుకుని వివిధస్థాయిలో అధికారులను నియమించింది. ● శిక్షణ విభాగం: ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులకు స్పష్టమైన అవగాహన కల్పించడమే ఈ విభాగం ప్రధాన విధి. నియమావళి అమలుపై శిక్షణ ఇచ్చారు. ● సామగ్రి పంపిణీ: ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి గుర్తించడం, వాటిని సమకూర్చుకోవడం వంటి వాటికి ఈ విభాగం పని చేసింది. ● రవాణా సౌకర్యం: పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు సామగ్రి రవాణా చేయడమే ఈ విభాగం పని. జిల్లాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, బ్యాలెట్ బాక్స్‌లు, పోలీసులను సకాలంలో చేర్చటం ఈ విభాగం విధి. బ్యాలెట్ బాక్స్‌లను కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలోకి చేర్చడంలోనూ భాగస్వామ్యం. ● బ్యాలెట్ బాక్స్‌ల నిర్వహణ: ఓటింగ్‌లో కీలకమైన బ్యాలెట్ బాక్స్‌లను కేంద్రాలకు చేర్చటం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్ట్రాంగ్ గదుల్లో భద్రపరిచారు. ● ప్రవర్తన నియమావళి: రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియమావళి ఉల్లంఘనలపై దృష్టి పెడుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ● ఫిర్యాదులపై స్పందన: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఈ విభాగం స్పందిస్తుంది. డయల్ 1950, సీ–విజిల్, సువిధ యాప్‌ల వంటి వాటికి అందే ఫిర్యాదులు రికార్డు చేసుకుని పరిష్కరించింది. ● పోస్టల్ బ్యాలెట్: పోలింగ్ సిబ్బందిని గుర్తించి వారంతా ఓటేసేలా ఇది పని చేసింది. ● చైతన్యం: ఓటు హక్కు వినియోగంపై చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ విభాగం పని చేసింది. గతంలో పోలింగ్ తక్కువ నమోదైన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా సఫలీకృతమైంది. ● శాంతి భద్రతల పరిరక్షణ: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందే గుర్తించి వాటిపై నిఘా పెట్టడం, ఆయుధాలు ఉన్న వారి వివరాల సేకరణ, తదితర కార్యకలాపాలను ఈ విభాగం పర్యవేక్షించింది. ● ఐటీ, కంప్యూటరైజేషన్: సాంకేతిక అంశాలపై ఐటీ, కంప్యూటరైజేషన్ విభాగం పని చేసింది. యాప్‌ల పని తీరు, వాటి నిర్వహణను పర్యవేక్షిస్తుంది. సాఫ్ట్వేర్ సమస్యలను పరిష్కరించింది. ● వ్యయ నిర్ధారణ: అభ్యర్ధుల ఖర్చులను లెక్కించటానికి వ్యయ నిర్ధారణ విభాగం పని చేసింది. సభలు, సమావేశాలు, వ్యయాన్ని ఆయా అభ్యర్థుల ఖర్చుల్లో చూపింది. ఖర్చులకు సంబంధించిన వీడియో, సీడీల రూపంలో ఎన్నికల సంఘానికి పంపించింది. ● ప్రసార సాధనాలపై పర్యవేక్షణ: మీడియాలో ప్రసారం, ప్రచురితమయ్యే వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నియమావళికి విరుద్ధంగా ఉన్న వాటిని గుర్తించింది.పట్టభద్రుల ఓటర్లు 3,55,159 ఉపాధ్యాయ ఓటర్లు 27,088మైక్రో అబ్జర్వర్లు 394జోనల్ అధికారులు 335పోలింగ్ అధికారులు 2,606ప్రిసైడింగ్ అధికారులు 864మొత్తం పోలింగ్ కేంద్రాలు 680కామన్ పోలింగ్ స్టేషన్లు (టీచర్స్‌అండ్ గ్రాడ్యుయేట్స్) 93పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు 406ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలు 181 -
● విద్యార్థిని పరామర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: నగరంలోని మంకమ్మతోట ధన్గర్వా డీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కోతి వస్తుందన్న భయంతో మొదటి అంతస్తు నుంచి దూకిన బాలుడిని కలెక్టర్ పమేలా సత్పతి గురువారం పరామర్శించారు. 8వ తరగతి విద్యార్థి రఘువర్ధన్ కొద్దిరోజుల క్రితం పాఠశాలలో కోతి రావడంతో భయంతో మొదటి అంతస్తు నుంచి దూ కాడు. దీంతో అతడి కాలి ఎముకలు విరిగాయి. కొద్దిరోజులు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందాడు. కలెక్టర్ పమేలా సత్పతి బాలుడిపై ప్రత్యేక శ్రద్ధ చూపి కరీంనగర్లో మెరుగైన చికిత్స ఇప్పిస్తున్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘువర్ధన్ను గురువారం పరామర్శించారు. భయం వీడాలని, బాగా చదువుకోవాలని సూచించారు. అవసరమైన పుస్తకా లు తెప్పిస్తానని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో త్వరలో ప్రారంభించనున్న క్రిటికల్ కేర్ విభాగాన్ని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనా ఉన్నారు. కంగ్రాట్స్.. మేడమ్ కరీంనగర్ అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన కలెక్టర్ పమేలా సత్పతిని టీఎన్జీవో, టీజీవోలు కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలిసి ప్రశంసించారు. టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, టీజీవోల జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్ గౌడ్, మహిళా నాయకులు శారద, సబితా, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మీందర్‌సింగ్, సందీప్, కరుణాకర్ పాల్గొన్నారు. -
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షన్ పోటీల్లో ఈ ఏడాది నగరపాలకసంస్థ మెరుగైన ర్యాంక్ సాధించేలా చూడాలని కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అధికా రులకు సూచించారు. గురువారం నగరంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో రిసోర్స్ పార్క్‌ను సందర్శించారు. కొత్తగా డ్రైరిసోర్స్ కలెక్షన్ సెంటర్, వర్మీకంపోస్ట్ తయారీ పిట్స్ నిర్మాణాల కోసం స్థలపరిశీలన చేశారు. నూతన డీఆర్సీ సెంటర్, వర్మీ కంపోస్టు పిట్స్ నిర్మాణాలతో చెత్త నుంచి ఎరువు తయారుచేయడంతో పాటు, పొడిచెత్తను వేరుచేయడం జరుగుతుందన్నారు. పొడిచెత్తను మూడు రకాలుగా వేరుచేయడానికి యంత్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీరోజు రిసోర్స్ పార్క్‌కు వచ్చే తడిచెత్త, పొడిచెత్తను ఇక్కడే వేరుచేసి డంప్‌యార్డ్‌కు చెత్తను తగ్గిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న వర్మీకంపోస్టు పిట్స్‌తో పాటు కొత్తగా పిట్స్‌తో పూర్తిస్థాయిలో వర్మీకంపోస్ట్‌ను తయారు చేస్తామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. తడి, పొడి చెత్త, ఇల్లు, పరిసరాల్లో చెత్తవేస్తే వచ్చే నష్టాలు, తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ సతీశ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ స్వామి, ఐటీసీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీజేపీకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. నువ్వా..నేనా అన్నట్టుగా మూడురోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ముక్కోణపు పోరులో చివరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి అత్యధిక ఓట్లతో విజయం సాధించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి కౌంటింగ్ నిర్విరామంగా కొనసాగింది. ఉదయం 8.30 గంటలకల్లా.. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన 11 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తంవ్యాలి డ్ ఓట్లు 2,23,343 కాగా, అందులో 28,686 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. అధికారులు 1,11,672 ఓట్లను గెలుపు కోటాగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యతలో 7 రౌండ్లు బీజేపీ... 4 రౌండ్లు కాంగ్రెస్‌కు ఆధిక్యం మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కౌంటింగ్ జరిగిన 11 రౌండ్లలో మొదటి నుంచీ బీజేపీ ఆధిక్యం కనబర్చగా, మధ్యలో 6,7,8,9 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి ఆధి క్యం వచ్చింది. చివరి రెండు రౌండ్లలో తిరిగి బీజేపీ మెజారిటీ సాధించింది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ అభ్యర్థికి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్ధికి 60,419 ఓట్లు వచ్చాయి. ఏ అభ్యర్ధికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,11,672 ఓట్లు రాలేదు. గెలుపు కోటాను చేరుకోవడానికి అంజిరెడ్డికి 35,997 ఓట్లు, నరేందర్‌రెడ్డికి 41,107 ఓట్లు, ప్రసన్న హరికృష్ణకు 51,253 ఓట్లు అవసరం అయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డిపై బీజీపీ అభ్యర్థి అంజిరెడ్డి కేవలం 5,110 ఓట్ల అధిక్యం సాధించారు. గెలుపు కోటాకు కావాల్సిన ఓట్లకు ఎవరూ చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల కోసం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను వరుస క్రమంలో ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో 53 మంది ఎలిమినేట్ అయ్యారు. అయినా ఎవరూ కోటా ఓట్లు సాధించలేదు. దీంతో చివరకు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్ చేసి, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి..........ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి .............ఓట్టు వచ్చాయి. అధిక ఓట్లు సాధించిన అంజిరెడ్డి అయితే ఇద్దరూ కోటా ఓట్లను చేరుకునే పరిస్థితి లేకపోవడంతో అధిక ఓట్లతో ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని విజేతగా ప్రకటించాలనుకున్నారు. కానీ, దానిపై కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఇద్దరిలో ఎవరికీ గెలుపు కోటా ఓట్లు రానందున ఫలితాన్ని ప్రకటించొద్దని అవసరమైతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాలని రిటర్నింగ్ ఆఫీసర్‌ను కోరారు. దీంతో అధికారులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. చివరకు మిగిలిన ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్ధిని విజేతగా ప్రకటించాలన్న ఆదేశాల మేరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని బుధవారం అర్ధరాత్రి విజేతగా ప్రకటించారు. దీంతో కౌంటింగ్ హాల్ నుంచి నరేందర్‌రెడ్డి బయటకు వచ్చారు. ఆయన్ను మీడియా చుట్టుముట్టగానే భావోద్వేగానికి గురై.. కన్నీటి పర్యంతమయ్యారు. ఏమీ మాట్లాడలేక పోయారు. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ పెడతామని ఆయన అనుచరులు మీడియాకు చెప్పగా, నరేందర్‌రెడ్డి కారు ఎక్కి అంబేడ్కర్ స్టేడియం నుంచి వెళ్లిపోయారు. చెల్లని ఓట్లు.. సహకరించని పార్టీ ! నరేందర్‌రెడ్డి ఓటమిలో చెల్లని ఓట్లు కీలక పాత్ర పోషించాయి. చిన్న చిన్న పొరబాట్లతో దాదాపు 28వేలకుపైగా గ్రాడ్యుయేట్ ఓట్లు చెల్లకుండా పోయాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 28 వేల చెల్లని ఓట్లలో 15 వేలకుపైగా నరేందర్‌రెడ్డికి వచ్చినవే కావడం గమనార్హం. అందుకే ఓడిన బాధ కంటే కూడా తన ఓట్లు చెల్లకుండా పోయి ఓటమికి దారి తీయడం ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దపల్లి జిల్లా నాయకులు తరహాలో మిగిలిన మూడు జిల్లాల ముఖ్యనేతలు తమకు సహకరించకపోవడం కూడా తమ ఓటమికి మరో కారణమని నరేందర్‌రెడ్డి వర్గం వాపోయింది. కరీంనగర్ ఎన్నికల సభలోనూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఈ సీటు ఓడిపోతే తన ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీలేదని వ్యాఖ్యానించడం కూడా తమకు ప్రతికూలంగా మారిందని ఆయన అనుచరులు గుర్తు చేశారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.ప్రొఫైల్ పేరు: చిన్నమైల్ అంజిరెడ్డి పుట్టినతేదీ: 18–06–1966 రామచంద్రాపురం, సంగారెడ్డి విద్యార్హత: ఎమ్మెస్సీ మ్యాథ్స్ (ఉస్మానియా) సతీమణి: గోదావరి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, సంగారెడ్డి రాజకీయం: 2009 ప్రజారాజ్యం పార్టీతో ఆరంగ్రేట్రం 2014లో సంగారెడ్డి సెగ్మెంట్లో ఇండిపెండెంట్‌గా పరాజయం -
పట్టభద్రుల సీటూ కమలానిదే!
హుజూరాబాద్‌లో సంబరాల్లో బీజేపీ నాయకులుఅంబేడ్కర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతిసాక్షిప్రతినిధి,కరీంనగర్/సాక్షి,పెద్దపల్లి: కరీంనగర్– ఆదిలాబాద్– నిజామాబాద్– మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూ డు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్స్‌తో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖ రారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో అతడినే విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్లతేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించటంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్విరామంగా మూడు షిప్ట్‌ల్లో 800మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లను వడపోసి, కట్టలు కట్టారు. మఽంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ ప్రారంభించి, బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్స్‌ను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్స్‌లో బరిలో ఉన్న 54మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ ప్రక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. ముగ్గురికే 92.52శాతం ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటు అయిన ఓట్లల్లో 92.52శాతం (2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగిలిన 53మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కేవలం 16,684 ఓట్లు మాత్రమే సాధించారు. గ్రాడ్యుయేట్స్లోనూ బీజేపీ హవా అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి మూడురోజులు సాగిన ఎమ్మెల్సీ కౌంటింగ్ ముగ్గురికే 92.52శాతం ఓట్లురెండో ప్రాధాన్యత ఓట్లలో సైతం బీజేపీదే హవా.. నిర్ధారిత కోటా ఓట్ల్ల కోసం అభ్యర్థుల ఎలిమి నేషన్ ప్రక్రియను చేపట్టగా బీజేపీ అభ్యర్థి ఆధి క్యం చూపారు. తొలుత 53మందిని ఎలిమినేషన్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్‌కి 73,644 ఓట్లు, బీఎస్పీకి 63,972 ఓట్లు వచ్చా యి. 53మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్లను ఎవరూ సాధించకపోవడంతో మూడోస్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణను ఎలిమినేట్ చేశారు. అతనికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనంతరం బీజేపీ అభ్యర్థికి 98,637 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 93,531ఓట్లు వచ్చా యి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి కన్నా 5,106 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో బీజేపీ అభ్యర్థికి విజయం వరించింది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో కమలం పార్టీకే విజయం దక్కింది. -
‘గొడవ’తో సంబంధం లేదు
● బల్దియా కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘంకరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థలో ఈఈ యాదగిరి, కాంట్రాక్టర్ నడుమ నెలకొన్న వివాదం కీలక మలుపు తిరిగింది. తనపై కాంట్రాక్టర్ నారాయణ దౌర్జన్యం చేశాడని ఈఈ యాదగిరి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గత నెల 19న ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా ఈఈ యాదగిరి కాంట్రాక్టర్‌ని వేధిస్తున్నాడని, ఆయనపై చర్య తీసుకోవాలంటూ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం బాధ్యులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అయితే యాదగిరిపై ఆరోపణలు సరికాదని కొంతమంది అసోసియేషన్‌ను తప్పుగా వాడుతున్నారంటూ మరికొంతమంది కాంట్రాక్టర్లు తాజాగా ఎదురు తిరగడం హాట్‌టాపిక్‌గా మారింది. గతనెల 19వ తేదీన కాంట్రాక్టర్ నారాయణ తనపై దౌర్జన్యం చేశాడంటూ ఈఈ యాదగిరి వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈఈ యాదగిరి తమను వేధిస్తున్నాడని, కులంపేరుతో బెదిరిస్తున్నాడంటూ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ అసోసియేషన్‌లోని కొందరు కాంట్రాక్టర్లు ఈఈకి సంఘీభావం ప్రకటించడంతో ఈ వ్యవహారం రసకందాయంలో పడింది. కొంతమంది వల్లే అప్రతిష్ట కొంతమంది కాంట్రాక్టర్ల తీరువల్ల అసోసియేషన్ అప్రతిష్ట పాలవుతుందని పలువురు కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్‌కు కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం పేరిట వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టర్, ఈఈకి మధ్య జరిగిన గొడవకు అసోసియేషన్‌కు సంబంధం లేదన్నా రు. కొంతమంది కాంట్రాక్టర్లు అధికారులను బ్లా క్ మెయిల్ చేస్తున్నారని, వినకపోతే ఏసీబీకి పట్టిస్తామంటున్నారని తెలిపారు. ఈ గొడవ గతనెల 19న జరిగితే వారం రోజుల తర్వాత అసోసియేషన్ తరఫున ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గొడవకు సంబంధించి ఈఈ యాదగిరిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తమకు ఏ అధికారితోనూ గొడవలు లేవని వారు తెలిపారు. కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం నాయకులు ప్రశాంత్, సుధాకర్, మల్లారెడ్డి, రవి పాల్గొన్నారు. -
‘వేస్ట్ టు వండర్ పార్క్’ అభివృద్ధికి కార్యాచరణ
● నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్ కార్పొరేషన్: ఢిల్లీ, హైదరాబాద్ మహానగరాల తరహాలో నగరంలోనూ ‘వేస్ట్ టు వండర్ పార్క్’ను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. నగరంలోని అలకాపురి పార్క్, శ్రీనగర్ కాలనీ పార్క్‌ను బుధవారం సందర్శించారు. పాడైపోయిన వస్తువులు వ్యర్థాలతో పార్కును అభివృద్ధి పరిచేందుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఎంపిక చేసిన స్థలంలో వేస్ట్ టు వండర్ పార్కును అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ పార్కులో వ్యర్థాలతో వివిధ రకాల పక్షులు, జంతువుల ఆకృతులను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. బొమ్మకల్ ఫ్లైఓవర్‌కు ఆకర్షణీయమైన బొమ్మలతో రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ డీఈలు వెంకటేశ్వర్లు, ఆయుబ్ ఖాన్, పర్యావరణ ఇంజినీర్ స్వామి, ఏఈ అబ్దుల్ గఫూర్ పాల్గొన్నారు. -
పులి కోసం జల్లెడ
● భగుళ్ల గుట్ట నుంచి పెద్దపల్లి వైపు వెళ్లే అవకాశం ● లేదా మళ్లీ ముత్తారం, మంథనికి చేరొచ్చంటున్న స్థానికులుముత్తారం(మంథని): నాలుగు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి జాడకోసం అటవీశాఖ అధికారులు అడవులను జల్లెడ పడుతున్నారు. అడవిశ్రీరాంపూర్ కోయచెరువు సమీపంలోని గుడ్డెలుచెలుక ప్రాంతంలో ఈనెల 2న పెద్దపులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మరుసటి రోజు అటవీ ప్రాంతంలో వెతికినా పులి జాడ లభించలేదు. ఈనెల 3న మానేరు తీరం నుంచి పారుపల్లి, శాలగుండ్లపల్లి యాతల్ చెరువు ద్వారా సర్వారం కాలువ వెంట మైదంబండ మీదుగా మచ్చుపేట భగుళ్లగుట్టకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఐదేళ్లక్రితం భగుళ్లగుట్టలో ఓ పులి ఆవును చంపిన స్థలాన్ని, ఇతర ప్రాంతంలోనూ అటవీశాఖ అధికారులు బుధవారం పరిశీలన చేశారు. అయినా, ఆనవాళ్లు లభించలేదు. మండలంలో ప్రవేశించిన పులి ఆనువాళ్లు కని పించిన రోజు తర్వాత మరుసటిరోజు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. దీనిని బట్టి చూస్తే పులి ఆచూకీ ఆనవాళ్లు గురువారం కనిపించే అవకాశం ఉందని స్థానికులు చర్చించు కుంటున్నారు. భగుళ్లగుట్ట, రామగిరిఖిలా నుంచి కాల్వశ్రీరాంపూర్ మీదుగా పెద్దపల్లి ప్రాంతం వైపు వెళ్తుందా? లేదా భగుళ్లగుట్ట నుంచి రామగిరి మండలం గుడిమెట్టు మీదుగా మళ్లీ ముత్తా రం, మంథని మండలంలోని అటవీ ప్రాంతాల్లోకి వెళ్లుందా? అని పలువురు చర్చించుకుంటున్నారు. పశువుల కాపరులు, రైతులు, రాత్రి పూట ప్రయాణం చేసే వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు కోరుతున్నారు. -
కమలంలో జోష్.. హస్తంలో నైరాశ్యం!
● పకడ్బందీ ప్లాన్‌తో బీజేపీ సక్సెస్ ● సమన్వయం, సహకారం లేక కాంగ్రెస్ డీలా ● పోల్మేనేజ్మెంట్లో బీఎస్పీ విఫలం ● ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పార్టీల అంతర్మథనంసాక్షిప్రతినిధి,కరీంనగర్: రెండు ఎమ్మెల్సీలను ఎగరేసుకుపోయిన కమలం పార్టీ కేడర్‌లో జోష్ నెలకొంది. అధికారంలో ఉండీ.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని దక్కించుకోకపోయినందుకు కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొంది. కేవలం డబ్బు ప్రభావంతోనే తాము ఓడిపోయామని బీఎస్పీ భావిస్తోంది. మొత్తానికి పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ అనుసరించిన విధానాలే తమను గెలిపించాయని బీజేపీతోపాటు ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్పీలు విఫలమయ్యాయని ఆయా పార్టీల్లో ప్రచారం మొదలైంది. బరిలో లేకున్నా.. అధికార కాంగ్రెస్ ఓటమిపై కారు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ విధానాలు, వైఫల్యాలే వారిని ఓడించాయని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఈ ఫలితాలు కమలంలో జోష్‌ను నింపాయి. ● బీజేపీ ఈ విషయంలో ఆదినుంచీ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగింది. నియోజకవర్గం, మండలం, డివిజన్, గ్రామాల వారీగా పచ్చాస్ ప్రభారీలను నియమించి ప్రతీ 25 మందికి ఒక ఇన్చార్జిని కేటాయించింది. వారు ప్రతీ ఓటరును రోజూ కలవడం, అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పట్టభద్రులు, నిరుద్యోగులు, టీచర్స్ కోసం తాము చేసిన పోరాటాన్ని వివరిస్తూ ఓటర్లకు చేరువయ్యారు. దీనికితోడు కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పూర్తిస్థాయిలో ప్రచారం చేయడం అభ్యర్థులకు బాగా కలిసి వచ్చిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ● కాంగ్రెస్ పార్టీ కేడర్ పూర్తిస్థాయిలో నరేందర్‌రెడ్డికి సహకరించలేదన్న విమర్శలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా నాయకులు ఈ విషయంలో తమకు సహకరించినట్లుగా మిగిలిన మూడు జిల్లాల నాయకులు సహకరించలేదని నరేందర్‌రెడ్డి వర్గం అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నుంచి నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిస్తే.. కాంగ్రెస్‌లోని ముగ్గురు కీలక నేతలకు పోటీగా ఎదుగుతాడన్న ఆందోళనతో వారెవరూ సహకరించలేదని మండిపడుతున్నారు. దీంతోపాటు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు మద్దతిచ్చారని, బీఆర్ఎస్ పార్టీ కూడా లోపాయికారిగా సహకరించిందని ఆరోపిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ సభలో సీఎం కూడా ఈ సీటు ఓడిపోతే తమకేం నష్టం లేదని వ్యాఖ్యానించడం తమకు చేటు చేసిందంటున్నారు. అంతేకాకుండా చెల్లకుండా పోయిన సుమారు 28 వేల ఓట్లలో దాదాపు 15 వేలకుపైగా ఓట్లు నరేందర్‌రెడ్డివే కావడం తమ కొంపముంచాయని విశ్లేషిస్తున్నారు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కరీంనగర్: ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 58 కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందుగానే చేరుకున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిరోజు ఫస్టియర్ జనరల్ విభాగంలో 17,011మందికి గాను 398మంది గైర్హాజరయ్యారు. 16,613 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఒకేషనల్ విభాగంలో 1,646 మందికి గాను 151మంది గైర్హాజరు అయ్యారు. 1,495మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తంగా 18,657మందికి 549మంది గైర్హాజరు అయ్యారు. 18,108మంది పరీక్ష రాశారని డీఐఈవో జగన్మోహన్రెడ్డి తెలిపారు. పరీక్షలను 58మంది డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించినట్లు వెల్లడించారు. -
మాటతోనే తెలుగుభాష వైభవం
కరీంనగర్ సిటీ: ప్రజలు, కవులు నిత్యం తెలుగు మాట్లాడితే మాతృభాష వైభవం కలకాలం వర్థిల్లుతుందని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ తెలిపారు. కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో తెలుగు విభాగం, నెల్లూర్ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్త నిర్వహణలో రెండు రోజుల జాతీయ సదస్సును బుధవారం ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీసీ ఉమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. అందరం తెలుగులో మాట్లాడితేనే తెలుగుభాష కలకాలం వర్థిల్లుతుందన్నారు. ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ.. తొలి తెలుగు కంద పద్యాన్ని గుండెల మీద మోస్తున్న కరీంనగర్ గడ్డమీద ఈ సదస్సు నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. మాడభూషి సంపత్‌కుమార్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నలిమెల భాస్కర్, గండ్ర లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి కరీంనగర్ సిటీ: ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు అపరిచి త కాల్స్‌ను నమ్మవద్దని సైబర్‌క్రైం పోలీసులు సూచించారు. ఉమెన్ ఎంపవర్మెంట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నగరంలోని ఉమెన్స్ కాలేజీలో డిజిటల్ అరెస్ట్ మోసాలపై బుధవారం అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి మాట్లాడుతూ.. డిజిటల్ మోసాల ఉచ్చులో ప్రజలు ఎక్కువగా చిక్కుకుంటున్నారని తెలిపారు. అపరిచితులు చేసే కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సైబర్ క్రైం ఎస్సై జ్యోత్స్న, సిబ్బంది పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కో–ఆర్డినేటర్ బి.రజినీదేవీ, ఎం.కల్పన పాల్గొన్నారు. కీలక సంస్థల్లో నిరంతర విద్యుత్ సరఫరా కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని కీలకమైన సంస్థల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటన్నట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, మాతా శిశు కేంద్రం, కలెక్టరేట్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా పొజిషన్, అంతరాయం లేని విద్యుత్ అందించడానికి అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. ఆస్పత్రిలో ఆటో జనరేటర్ వర్కింగ్ కండిషన్‌ను పరిశీలించి, వినియోగంలోకి తేవాలని సూచించారు. జిల్లాలోని ఆసుపత్రులు, మంచినీటి పథకాలు, మిషన్ భగీరథ, ఫిల్టర్ బెడ్, ఐటీపార్క్ ఫీడర్లను తనిఖీ చేసి, అంతరాయం లేని విద్యుత్ అందించాలని ఆదేశించారు. డీఈ జంపాల రాజం, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఏడీఈ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. నిధులు విడుదల చేయాలి శంకరపట్నం: విదేశీ విద్యను అభ్యసిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్సీస్ నిధులు విడుదల చేయాలని ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. కేశవపట్నంలో బుధవారం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ గిరిజన విద్యార్థులను వారి తల్లిదండ్రులు అప్పుచేసి విదేశీవిద్య అభ్యసించడానికి విదేశాలకు పంపించారని, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రస్తుత సీఎం నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు. కోనేటి రాజు, రాజలింగం, సమ్మయ్య, కుమారస్వామి, తిరుపతి, మల్లేశం పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
ధర్మపురి: త్వరలో జరిగే ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో బుధవారం సమీక్షించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈనెల 10 నుంచి 22 వరకు నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించే పుష్కరఘాట్లను పరిశీలించారు. గోదావరి తీరంలో లైట్లు, చలువ పందిల్లు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదులు, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో నిత్యం శానిటేషన్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ ప్రతిపాదించిన శ్రీమట్టంలో నాలుగెకరాల ఖాళీ స్థలంలో స్వామివారి కల్యాణానికి దేవాదాయ శాఖ అనుమతి తీసుకోవాలని, వేదికకు కావల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. గతేడాది సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈసారి 10శాతం మంది భక్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, వారందరికీ సరిపడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలించి వాటిపై సమీక్షించారు. ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, మున్సిపల్ ఇరిగేషన్ అధికారి నారాయణ, ఆర్‌డబ్లూఎస్ ఈఈ, డిప్యూటీ తహసీల్దార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ నృసింహుని బ్రహ్మోత్సవాలపై సమీక్ష -
ఆ సర్ మాకొద్దు
● విద్యార్థుల ఆందోళన ● పాఠశాలకు తాళంసుల్తానాబాద్(పెద్దపల్లి): ‘ఆ సర్ మాకొద్దు.. ఆయన తీరుతో చదువు దెబ్బతింటున్నది.. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వారి స్వప్రయోజనాల కోసం మమ్మల్ని ఇబ్బందులను గురిచేసే పరిస్థితి నెలకొంది.. అలాంటి సార్ మాకు వద్దు’ అని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ,గ్రామస్తులు, తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పెద్దపల్లి మండలం నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇందుకు వేదికై ంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. ఉపాధ్యాయుడు ఒకరు విద్యార్థులను క్లాస్ రూమ్‌లో శ్రీజై భీమ్‌శ్రీ అని పలకాలని ఆదేశిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు నిరసనకు దిగారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్య తీసుకునే వరకూ పాఠశాలకు రాబోమని తెల్చి చెప్పారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొద్దిరోజులుగా ఉపాధ్యాయులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం పీఎస్‌లో ఫిర్యాదు చేసుకుంటున్నారని ఆరోపించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. సమస్యకు కారణమైన శంకరయ్య సర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉపాధ్యాయుడు శంకరయ్యను వివరణ కోరగా టీచర్ల మధ్య గొడవలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై రుద్దుతున్నారన్నారు. హెచ్ఎం సహకారంతోనే విద్యార్థులు ధర్నాకు దిగారని ఆరోపించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాగా, ఆందోళన తీవ్రతరం కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి జిల్లా విద్యాధికారికి సమాచారం చేరవేశారు. దీంతో డీఈవో మాధవి, ఎస్సై లక్ష్మణరావు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. సమస్యపై చర్చించి ఆందోళన విరమింపజేశారు. -
ఏసీబీకి పట్టుబడిన కోరుట్ల ఎస్సై–3
కోరుట్ల: పేకాటలో దొరికిన సెల్‌ఫోన్ వాపస్ ఇవ్వడానికి రూ.5వేలు డిమాండ్ చేసి వసూలు చేసిన క్ర మంలో జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్సై–3 రూపావ త్ శంకర్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు.. గత నెల 21న కోరుట్ల మండలం జోగన్‌పల్లి శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని స్పెషల్‌పార్టీ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20వేలు స్వాధీనం చేసుకుని వారికి సంబంధించిన వాహనాలు, సెల్పోన్లు కోరుట్ల ఠాణాలో అప్పగించారు. ఎస్సై శంకర్ కేసు నమోదు చేశారు. అనంతరం పేకాటరాయుళ్లకు వాహనాలు, సెల్ఫోన్లు ఇచ్చే క్రమంలో డబ్బులు డిమాండ్ చేయగా వారిలో కొందరు డబ్బులు ఇచ్చి సెల్ఫోన్లు, వాహనాలు తీసుకెళ్లారు. రాయికల్ మండలం ఉప్పుమడిగెకు చెందిన బండారి శ్రీనివాస్ మాత్రం తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పి స్థానిక కాంగ్రెస్ నాయకుడితో ఫోన్ చేయించుకున్నాడు. తరువాత ఎస్సై శంకర్ ఫోన్ వాపస్ ఇచ్చినప్పటికీ డబ్బులు డిమాండ్ చేయడం ఆపలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఏసీబీనీ ఆశ్రయించాడు. బుధవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్ గేటు ముందు శ్రీనివాస్ రూ.5వేలను ఎస్సై శంకర్‌కు ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎస్సై శంకర్ మరో మూడు నెలల్లో రిటైర్మెంట్ కానున్నారు. పేకాటలో దొరికిన సెల్‌ఫోన్ ఇవ్వడానికి.. రూ.5 వేలు లంచం డిమాండ్ -
ఆశలు సమాధి
ముస్తాబాద్(సిరిసిల్ల): ‘అమ్మ..నాన్న.. మూడు నెలలైతే బీటెక్ పూర్తవుతుంది. ఉద్యోగం వస్తుంది..’ అని చె ప్పిన మాటలు మరువకముందే ఆ కొడుకు వారికి దూరమయ్యాడు. ఒక్కగా నొక్క కొడుకు కేరళలో దుర్మరణం చెందగా.. ముస్తాబాద్‌లో విషాదం అలుముకుంది. కొడుకుపై పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు జలసమాధి అయ్యాయి. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ముత్యాల దేవేందర్, శారద దంపతులకు ముత్యాల సాయిచరణ్(21) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. నలుగురు స్నేహితులతో కలిసి సాయిచరణ్ కేరళలోని అలప్పుజకు ఈనెల 3న వెళ్లారు. అక్కడ సముద్రంలో హౌస్‌బోట్‌లో వెళ్తుండగా సాయిచరణ్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈతకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు దేవేందర్, శారదలు రెండు రోజులుగా కుమారుడు సాయిచరణ్ కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీప బంధువు కాగా, ఆయన దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వ విప్ అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడి సాయిచరణ్ మృతదేహాన్ని రప్పించేలా ఏర్పాట్లు చేశారు. యువకుడి మృతదేహం ఇంటికి చేరగానే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. ‘సాయి లేరా.. బిడ్డా..’ అంటూ ఆ తల్లి రోదనలు అక్కడ ఉన్న వారికి కంటతడి పెట్టించాయి. కేరళలో బీటెక్ విద్యార్థి దుర్మరణం ముస్తాబాద్‌లో విషాదం -
అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య
సారంగాపూర్: అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై దత్తాద్రి కథనం ప్రకారం.. మండలంలోని రంగపేటకు చెందిన లలితకు 15 ఏళ్ల క్రితం తుమ్మల చిరంజీవితో వివాహమైంది. వీరికి కూతురు సంతానం. కొద్దిరోజులుగా లలితను భర్త చిరంజీవి, అత్తామమలు మరియా, కాంతయ్య శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. వారి వేధింపులు భరించలేక ఈనెల ఒకటో తేదీన పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త, అత్తామామలపై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. ఉరేసుకుని వ్యక్తి ..మల్లాపూర్: ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మొగిలిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి పురుషోత్తం (35)కు భార్య శరణ్య, ఇద్దరు కుమారులు వివేక్, ఆదిత్య ఉన్నారు. ఉపాధి కోసం దుబాయికి రెండుసార్లు వెళ్లి వచ్చాడు. ఇందుకు రూ.7లక్షల వరకు అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక.. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లోనే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. చికిత్స పొందుతూ పంచాయతీ కార్యదర్శి మృతివెల్గటూర్: చికిత్స పొందుతూ పంచాయతీ కార్యదర్శి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జగదేవుపేట పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎండీ.పాషా శుక్రవారం జగిత్యాలలో బైక్‌పై బైపాస్ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా బైక్‌పై వచ్చిన ముగ్గురు బాలురు ఢీకొట్టారు. గాయపడిన పాషాను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడంతో అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. పాషా మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
ఆలయాల్లో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన దొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన మామిండ్ల ఆంజనేయులు అలియాస్ అంజిని ముస్తాబాద్ ఏఎంఆర్ గార్డెన్ వద్ద అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుండగా పట్టుకున్నారు. విచారించగా ముస్తాబాద్, గూడూరు, మద్దికుంటల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రైలు ఢీకొని ఆరు ఎడ్లు మృతికోరుట్ల రూరల్: మండలంలోని చిన్నమెట్పల్లి శివారులోని రైల్వే వంతెన వద్ద బుధవారం రైలు ఢీకొని ఆరు ఎడ్లు మృతిచెందాయి. స్థానికుల కథనం ప్రకారం ఎడ్లు రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొన్నట్లు వివరించారు. రైల్వే అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి ఆత్మహత్యకోరుట్ల: కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్లో నివాసముండే పల్లికొండ రోహిత (22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పల్లికొండ రాజ, లతల కూతురు రోహితకు మానసిక స్థితి సరిగాలేదు. ఆరోగ్యం కూడా సరిగాలేకపోవటంతో మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ బస్టాండ్ వద్ద మంగళవారం రాత్రి ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన టీఆర్‌నగర్‌కు చెందిన మల్యాల శ్రీనివాస్ అలియాస్ శ్రీహరి (32) చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయాల్లో చోరీ చేసిన దొంగ అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని శివాజీనగర్‌లోగల నల్లపోచమ్మ తల్లి ఆలయం, ఉప్పరిపేట ఆలయాల్లో దొంగతనానికి పాల్పడిన దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. బుధవారం పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇటీవల ఉప్పరిపేటతోపాటు నల్లపోచమ్మతల్లి ఆలయంలో దొంగతనాలు జరిగాయి. ఆలయ కమిటీ, స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలోని వాణీనగర్ చౌరస్తాలో పట్టణ సీఐ వేణుగోపాల్ బుధవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో కోరుట్ల పట్టణం అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన విభూది అలియాస్ వూటూరి శేఖర్ బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.50 వేల విలువైన పూజాసామగ్రి, సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎనిమిదేళ్లలో 25 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయన్నారు. అలాగే ఆలయాల దొంగతనాల్లో ప్రమేయం ఉన్న లక్ష్మీ అనే మహిళ దొంగ పరారీలో ఉందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని పట్టుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్‌ను అభినందించారు. బాల నిందితుడి అరెస్ట్ జగిత్యాలలోని నర్సింగ్ కళాశాలలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం దొంగతనానికి పాల్పడిన బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అతడిని జువైనల్ హోంకు తరలించినట్లు పేర్కొన్నారు. మరో మహిళ దొంగ పరార్ రూ.50 వేల విలువైన సామగ్రి స్వాధీనం జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వెల్లడి -
స్వగ్రామానికి గల్ఫ్ వలసజీవి
చందుర్తి(వేములవాడ): జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లిన వలసజీవి అనారోగ్యం బారిన పడ్డాడు. స్వగ్రామం వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతుండగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో బుధవారం ఇంటికి చేరాడు. చందుర్తి మండలం కట్టలింగంపేటకు చెందిన యువకుడు తీగల గంగరాజు జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని దొరక్క చేతిలో డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలోనే 15 రోజుల క్రితం పక్షవాతం రావడంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక గదిలోనే ఉండిపోయాడు. ఈ విషయాన్ని కట్టలింగంపేట గ్రామస్తులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇండియా ఎంబసీ అధికారులతో మాట్లాడి టికెట్ ఇప్పించడంతోపాటు దుబాయ్‌లో ఉంటున్న చందుర్తి మండలానికి చెందిన మోతె రాములు, కటకం రవి యువకునికి టికెట్, పాసుపోర్టు అందజేసి స్వగ్రామానికి పంపించారు. స్వగ్రామానికి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
విద్యార్థిని మృతికి కారణమైన వ్యక్తికి మూడేళ్ల జైలు
జగిత్యాలజోన్: విద్యార్థినిని ప్రేమించాలని వేధించి.. ఆమె మృతికి కారణమైన వ్యక్తికి మూడేళ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి జి.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్. రామకృష్ణారావు కథనం ప్రకారం.. పెగడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు సంతానం. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె 2022 ఏప్రిల్ ఒకటో తేదీన స్నేహితురాలి వద్ద చదువుకుంటానని చెప్పి వెళ్లిన బాలిక కాసేపటికి ఇంటికి చేరుకుంది. ఇంటి వెనుక వైపు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెదకగా.. తాను పురుగుల మందు తాగానని చెప్పింది. వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయింది. తన కూతురు మరణానికి పెగడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎట్టం రవి కారణమని, స్కూల్‌కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు తన కూతురును ప్రేమించాలని వేధించడంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తండ్రి పెగడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై శ్వేత కేసు నమోదు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు కిరణ్‌కుమార్, డి.శ్రీధర్, కేవీ.సాగర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంతో ఎట్టం రవికి మూడేళ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
ఆదర్శ దంపతుల స్ఫూర్తిదాయక నిర్ణయం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ఉల్లిగడ్డల బజార్లో హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తున్న కొత్త చంద్రప్రసాద్–వరలక్ష్మి దంపతులు బుధవారం స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు. వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా తమ మరణానంతరం ఇద్దరి నేత్రాలు, అవయవాలు, దేహదానాలు చేస్తామని అంగీకారం ప్రకటించారు. వారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ ముఖ్య సలహాదారు, ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రాజెక్ట్ మాజీ ఆఫీసర్ నూక రమేశ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాసుకు తమ అంగీకారపత్రాలు అందజేశారు. దంపతులకు ప్రతినిధులు అభినందన పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో చంద్రప్రసాద్ తల్లిదండ్రులు కొత్త రాజయ్య–వజ్రమ్మతోపాటు బంధువులు గుండా శంకరయ్య, గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానానికి అంగీకారం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్(45) రోడ్డుప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న మూగవాడైన శ్రీనివాస్.. మంగళవారం రాత్రి గోదావరిఖని – మంథని మధ్య రోడ్డుపై సుందిళ్ల శివారులో నడుచుకుంటూ గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోదావరిఖని నుంచి మంథనికి వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టగా, శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరి కటకం రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అజ్నీ రైలుకు గ్రీన్‌సిగ్నల్
ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట – నాగపూర్(అజ్నీ) మధ్య అజ్నీ ప్యాసింజర్ రైలు గురువారం నుంచి పట్టాలెక్కనుంది. ఈమేరకు రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా సమయంలో రైల్వేశాఖ అజ్నీ రైలును రద్దు చేయడంతో ఏళ్లుగా ప్రయాణికులు, వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంలోపై గతనెలలో ‘సాక్షి’ ‘వినిపించని అజ్నీ’ కూత శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్.. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వీనివైష్ణవి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వినతిపత్రం అందజేసి సమస్య పరిష్కరించాలని వివరించారు. ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే అజ్నీ ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని వారు పట్టుబట్టారు. దీంతో గురువారం నుంచి అజ్జీ ప్యాసింజర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. అజ్నీ మళ్లీ పట్టాలపైకి వస్తుందనే సమాచారంతో కాజీపేట– బల్హార్షా సెక్షన్ల మధ్య ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేటినుంచి పట్టాలెక్కనున్న రైలు ఏళ్ల తర్వాత పునరుద్ధరణకు చర్యలు ఉత్తర్వులు విడుదల చేసిన రైల్వేశాఖ -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్
సాక్షి, కరీంనగర్ జిల్లా: కిషన్ రెడ్డి నాయకత్వంలో ఇది నాల్గో విజయం.. సమన్వయంతో పని చేయడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. మోదీ నీతివంతమైన పాలనను ఓటర్లు గుర్తించారన్నారు.ఈవీఎంలను తప్పుబడుతున్న రాహూల్ గాంధీ ఈ బ్యాలెట్ విజయంపై ఇప్పుడు మాట్లాడాలి. ఓటుకు 5 వేలు పంచారు కాంగ్రెస్ వాళ్లు. బీజేపీని ఓడగొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైంది. బీఎస్పీ అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్ట్ చేయడంతోనే ఆయన మూడో స్థానానికి పడిపోయాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కలిసి పన్నిన కుట్రలను ప్రజలు గమనించారు. సొమ్మొక్కడిది సోకొక్కడిదన్నట్టు కేంద్రం నిధులిస్తే ఇక్కడి ప్రభుత్వం తానే గొప్పలు పోతోంది. కాంగ్రెస్ దిగిరావాలి.. మీకు ఐదు ఉమ్మడి జిల్లాల్లో తీర్పునిచ్చారు. మీ ఆరు గ్యారంటీలపై సమాధానం ఏంటో కాంగ్రెస్ ఇప్పటికైనా చెప్పాలి‘‘శాసనమండలిలో గడగడలాడించేందుకు మా ముగ్గురు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌పై బీసీలు వ్యతిరేకత చూపారు. ముస్లింలను కలపడాన్ని బీసీలు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో 5,500 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి కన్నీటి పర్యంతమై వెళ్లిపోయారు. నరేందర్ రెడ్డి రెండో స్థానం, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ హవా కొనసాగింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ ఎమ్మెల్సీని కాంగ్రెస్ కోల్పోయింది. ఎన్నికలు జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు.వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు వచ్చాయి.కాగా, కరీంనగర్-మెదక్-నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచీ ఊహించినట్టుగానే బీజేపీ కైవసం చేసుకుంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 27,088 ఓట్లకుగాను.. 25,041 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాలు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. గెలుపు కోటాగా 12,073 ఓట్లను నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్లోనే బీజేపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. -
ఓటేయలేని పట్టభద్రులు, టీచర్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పేరుకు వారు పీజీలు, పీహెచ్‌డీలు చేసిన పట్టభద్రులు... పది మందికి పాఠాలు చెప్పి భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు. అయితే వారిలో కొందరు ఎమ్మెల్సీ ఓటు కూడా సరిగ్గా వేయలేకపోయారు.కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లకుగాను 2,52,100 ఓట్లు పోలయ్యారు. అందులో సుమారు 28,000 ఓట్లను చెల్లనివిగా పరిగణించారు.ఇందుకోసం ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ కూడా చేశారు. కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీలో 897 ఓట్లు, వరంగల్–ఖమ్మం–నల్లగొంట టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో 499 ఓట్లు చెల్లలేదు. చెల్లని ఓట్ల సంఖ్య భారీగా ఉండటంలో అవి ఎవరి కొంపముంచుతాయోనన్న ఆందోళన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. అవగాహన లేకపోవడం వల్లే.. వాస్తవానికి ఈసారి ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో అధికారులు మంచి ప్రచారమే కల్పించారు. దీనికితోడు అభ్యర్థులు సైతం ఓటు నమోదులో కీలకంగా వ్యవహరించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ పరిధిలో 1.95 లక్షల ఓట్లకు 1.15 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఈసారి అదే సెగ్మెంట్లో 3.55 లక్షల ఓట్లు నమోదు కాగా, 2.52 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెల్లకుండా పోయిన గ్రాడ్యుయేట్ 28 వేలు ఉండటంతో, ఓటు వేసే విషయంలో ముందస్తుగా ఎలాంటి అవగాహన కల్పించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్న విమర్శలున్నాయి. డబ్బులు తీసుకొని ఓట్లు చెల్లకుండా చేసి.. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మొత్తంలో టీచర్ ఓటర్లకు డబ్బులు పంచేవారని వార్తలొచ్చాయి. కొందరు అభ్యర్థులు ఓటును బట్టి.. రూ.5,000, రూ.8,000, రూ.10,000 వరకూ పంచారన్న విమర్శలు ఉన్నాయి. ఇక పట్టభద్రుల విషయానికి వస్తే కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.1,000, మరికొందరు రూ.1,500 చొప్పున పంచినట్టు ప్రచారం జరిగింది. అభ్యర్థులు చదువుకున్న వారని, తమ వైపునకు తిప్పుకునేందుకు డబ్బులు ఇస్తే.. తీరా వేలాది ఓట్లు చెల్లకుండా చేసి తమ డబ్బును నీళ్లలో పోశారని లోలోపల బాధపడుతున్నారు. చెల్లకుండాపోయిన ఓట్లు ఎవరి ఓటమికి దారితీస్తాయోనని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఓటు వేశాక.. ప్రాధాన్య అంకెకు ముందు సున్నా పెట్టడం, లేదా అంకెకు సున్నా చుట్టడం, ఫొటోలు చించడం, తొలి ప్రాధాన్యం ఒకరి కంటే ఎక్కువ మందికి ఇవ్వడం, ఫొటోలకు ముందు టిక్ పెట్టడం, సంతకం చేయడం, ముద్రలు వేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాయడం, వ్యక్తిగత సమస్యలు రాయడం తదితర పొరపాట్ల వల్ల ఓట్లు చెల్లకుండా పోయాయి. మరోవైపు భారీగా ఓట్లు చెల్లకుండా పోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగడం లేదు. వీరి కంటే చదువురాని నిరక్షరాస్యులు నయమంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. కొనసాగుతున్న ‘గ్రాడ్యుయేట్’ కౌంటింగ్» ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు »ఐదు రౌండ్ల వరకు బీజేపీ, ఆరోరౌండ్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం»7,118 ఓట్ల మెజారిటీతో అంజిరెడ్డి ముందంజసాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు మంగళవారం మొదలైంది. ఈ ఎన్నికల్లో అంజిరెడ్డి (బీజేపీ), నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్), ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ)ల మధ్య త్రిముఖపోరు నెలకొంది. బీజేపీ అభ్యర్థి మిగిలిన ఇద్దరి అభ్యర్థుల కంటే స్వల్ప ఆధికత్యను ప్రదర్శిçస్తున్నారు. ఈ సెగ్మెంట్లో మొత్తం 3.55 లక్షల ఓట్లలో..పోస్టల్ బ్యా లెట్‌తో కలిపి 2,52,100 ఓట్లు పోల్ కాగా, అందులో 2,24,000 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. దాదాపు 28వేల ఓట్లు చెల్లలేదు. వాస్తవానికి సోమవారం ఉదయం నుంచి చెల్లని ఓట్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లను వేరు చేసి వడబోసే కార్యక్రమం ప్రారంభమైనా.. అది మంగళవారం మధ్యా హ్నం వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్లు కేటాయించారు. అందులో ప్రతీ టేబుల్‌కు 1,000 చొప్పున ప్రతీ రౌండ్‌కు 21,000 ఓట్లను 12 రౌండ్లలో లెక్కిస్తామని అధికారులు తెలిపారు. మొదటి రౌండ్ : లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలిరౌండ్ ఫలితం మధ్యా హ్నం 2.30 గంటలకు వెలువడింది. బీజేపీ అభ్యర్థి అంజిరె డ్డికి 6,712 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 6,676, బీఎస్పీ అభ్యరి్థకి ప్రసన్న హరికృష్ణకు, 5,867 ఓట్లు సాధించారు. తొలిరౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన సమీప అభ్యర్థి నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్)పై 36 ఓట్ల స్వల్ప మెజారిటీ సాధించారు. రెండో రౌండ్ : ఈ రౌండ్లోనూ బీజేపీ మెజారిటీ కొనసాగింది. అంజిరెడ్డికి 7,979 (రెండు రౌండ్లు కలిపి 14,691), నరేందర్‌రెడ్డికి 6,522 (రెండు రౌండ్లు కలిపి 13,198), ప్రసన్న హరికృష్ణకు 4,927 (రెండురౌండ్లు కలిపి 10,794) ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యరి్థపై 1,457 ఓట్లు ఆధిక్యం ప్రదర్శించి.. మొత్తంగా 1,493 ఓట్లు మెజారిటీ సాధించారు. మూడవ రౌండ్ : మూడో రౌండ్లోనూ బీజేపీ తన హవాను కొనసాగించింది. అంజిరెడ్డి 8,619 ఓట్లు (3రౌండ్లు కలిపి 23,310), నరేందర్‌రెడ్డి 5,614 (3 రౌండ్లు కలిపి 18,812), ప్రసన్న హరికృష్ణ 5,086 (3రౌండ్లు కలిపి 15,880) ఓట్లు సాధించారు. మూడో రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన సమీప అభ్యర్థి నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్)పై 3,005 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించగా, మెజారిటీ 4,498 ఓట్లకు చేరింది. నాలుగో రౌండ్: ఈ రౌండ్లోనూ అంజిరెడ్డి దూకుడు సాగింది. అంజిరెడ్డి 7,807 (4 రౌండ్లు కలిపి (31,117), నరేందర్‌రెడ్డి 6,544 (4 రౌండ్లు కలిపి 25,356), ప్రసన్న హరికృష్ణకు 5,271 (4 రౌండ్లు కలిపి 21,151)ఓట్లు పడ్డాయి. అంజిరెడ్డి తన సమీప అభ్యర్థి నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్)పై 1,263 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించగా, మెజారిటీ 5,761 ఓట్లకు చేరింది. ఐదో రౌండ్: ఈ రౌండ్లోనూ బీజేపీ హవా కొనసాగింది. అంజిరెడ్డి 7,850 (5 రౌండ్లు కలిపి 38,967), నరేందర్‌రెడ్డి– 6,288 (5 రౌండ్లు కలిపి 31,644), ప్రసన్న హరికృష్ణ 5,411 (5 రౌండ్లు కలిపి 26,562)ఓట్లు సాధించారు. కాగా అంజిరెడ్డి నరేందర్రెడ్డిపై 7,323 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఆరోరౌండ్ : ఈ రౌండ్లో కాంగ్రెస్‌కు 205 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అంజిరెడ్డి 6,855 (6 రౌండ్లు కలిపి 45,822), నరేందర్‌రెడ్డి– 7,060 (6 రౌండ్లు కలిపి 38,704), ప్రసన్న హరికృష్ణ 5548 (6 రౌండ్లు కలిపి 32110)ఓట్లు సాధించారు. మొత్తంగా 7,118 ఓట్ల మెజారిటీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నాడు. మొత్తం లెక్కించాల్సిన ఓట్లు 2,24,000 కాగా, ఆరోరౌండ్ వరకు 1,26,000 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. -
రెండు నెలల్లో 22 కేసుల విచారణ
సిరిసిల్ల కల్చరల్: నేరాలు చేసి, తప్పించుకోవడం సాధ్యం కాదని, చట్ట పరిధిలో శిక్షలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు నెలల్లో 22 కేసుల విచారణ జరిగి, నేరస్తులకు శిక్షలు పడ్డాయన్నారు. ఈ విషయంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లక్ష్మీప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మణ్, సందీప్, సతీశ్, విక్రాంత్, ఆయా స్టేషన్ల పోలీసులను అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. నేరస్తులకు శిక్ష పడితే సమాజంలో నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నేర నిర్ధారణలో సాంకేతికత వినియోగాన్ని పెంచాలని, అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు కచ్చితంగా జోడించాలని చెప్పారు. వేములవాడ పట్టణ పరిధిలో గంజాయికి సంబంధించిన కేసులో నేరస్తులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఎంఎస్ శ్రవణ్‌యాదవ్, రవీంద్రనాయుడు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. నేరస్తులకు శిక్షలు రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ -
రెండు బైక్‌లు ఢీకొని ఒకరి దుర్మరణం
ధర్మపురి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని తీగలధర్మారంలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని తుమ్మెనాల గ్రామానికి చెందిన అప్పాల మల్లయ్య (56) దొంతాపూర్‌లో ఉంటున్న తన బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లాడు. రాత్రి తిరుగు పయనం అయ్యాడు. దోనూర్, తీగలధర్మారం మధ్య ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో మల్లయ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ఉన్న దోనూర్ గ్రామానికి చెందిన కస్తూరి లక్ష్మణ్‌కు తీవ్రగాయాలు కాగా అతడిని 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించినట్లు బంధువుల ద్వారా తెల్సింది. మల్లయ్యకు భార్య, కొడుకు మహేష్, కూతురు లత ఉన్నారు. కొడుకు హైదరాబాద్‌లో గ్రేహౌండ్స్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మల్లయ్య స్థానికంగా ఉంటూ వ్యవసాయం చేస్తుంటాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కొత్తపల్లి(కరీంనగర్): అంతర్రాష్ట్ర దొంగతనాలకు పాల్పడే ముఠాలోని సభ్యుడిని కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ట్రైనీ ఐపీఎస్ వసుంధర యాదవ్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా తండా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోర్ గ్రామానికి చెందిన ప్రదీప్(30) మరో 8 మంది ముఠాగా ఏర్పడ్డారు. ఏడాదికాలంగా కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ట్రావెల్స్ బస్సుల ద్వారా నిజామాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కరీంనగర్‌కు చేరుకుని, కాలినడకన ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కీ నిర్వహిస్తుంటారు. దొంగతనానికి పాల్పడాలని నిర్ణయించుకున్న సమీప ప్రాంతంలో మాటువేసి, అర్ధరాత్రి తర్వాత తాళం వేసిఉన్న ఇళ్లను గుర్తించి, తాళాలను పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతారు. ఈ చోరీలపై నిఘాపెట్టిన కరీంనగర్ రూరల్ ఏసీపీ, సీసీస్, కొత్తపల్లి పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ వెళ్లి ఈ నెల 3న ముఠాలోని ప్రధాన నిందితుడు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగలగుంటపల్లి, గుంటూరుపల్లి, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్, చింతకుంటలో నాలుగు దొంగతనాలకు పాల్పడ్డారని వసుంధర వెల్లడించారు. నిందితుడి నుంచి ద్విచక్రవాహనం స్వాధీ నం చేసుకున్నారు. ఎస్సై సాంబమూర్తి, కానిస్టేబు ళ్లు షరీఫ్, శ్రీనాథ్, ఖదీర్‌ను కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం నగ్రాలేలను ట్రైనీ ఐపీఎస్ అధికారి వసుంధర యాదవ్ అభినందించారు. రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెద్దపల్లిరూరల్: గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడని ఎస్సై లక్ష్మ ణ్‌రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఈ నెల 1న పెద్దపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో అచేతనంగా పడివున్న గుర్తు తెలియని వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మృతుడు నీలిరంగు ఫుల్ టీషర్ట్, ఆకుపచ్చ లుంగీ ధరించాడని తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 87126 56506, 87126 56507 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఎస్సై సూచించారు. టిప్పర్ ఢీకొని ఒకరి దుర్మరణంఇల్లంతకుంట(మానకొండూర్): ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ కథనం ప్రకారం.. ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామానికి చెందిన నక్క శంకరయ్య(49) మంగళవారం ఉదయం సిద్దిపేట జిల్లా మైలారం గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో అనంతారం సమీపంలో అన్నపూర్ణ ప్రాజెక్టు కెనాల్ వద్ద టిప్పర్ ఢీకొట్టింది. రోడ్డుపై పడిన శంకరయ్య పైనుంచి టిప్పర్ టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం ముద్దలు ముద్దలుగా రోడ్డంతా పడింది. పోలీసులు పారలతో కుప్పగా చేసి, సంచిలో నింపి, ఆస్పతికి తరలించారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు భయంతో వణికిపోయారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. యువకుడి ఆత్మహత్యమానకొండూర్: మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన కొమ్మగల్ల పవన్‌కల్యాణ్(22) ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. పవన్‌కల్యాణ్ సోమవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ఎదుట రేకుల షెడ్డులో నిద్రించాడు. 11 గంటల సమయంలో చలి వేస్తోందని, ఇంట్లో పడుకుంటానని చెప్పి, వెళ్లాడు. 1.20 గంటలకు ఇంట్లో నుంచి శబ్ధం వినిపించడంతో తల్లిదండ్రులు నిద్ర లేచారు. లోపలికి వెళ్లి చూడగా కుమారుడు పవన్‌కల్యాణ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని, కనిపించాడు. కాగా, మూడు రోజులుగా తమ కొడుకు జ్వరంతో బాధ పడుతున్నాడని, గ్రామంలోనే చికిత్స పొందినా తగ్గలేదన్నారు. దీంతో మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. భార్యను తిట్టాడని వ్యక్తి హత్య● నిందితుడి అరెస్టు సిరిసిల్ల క్రైం: భార్యను తిట్టాడన్న కోపంతో వ్యక్తిని హత్య చేశాడో భర్త. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన రమేశ్, తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన మధుసూదన్ కూలీలుగా పనిచేసే చోట పరిచయమయ్యారు. పలుమార్లు కలిసి మద్యం తాగేవారు. గత నెల 24న మద్యం సేవించారు. ఆ సమయంలో మధుసూదన్ తన భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోందని రమేశ్‌తో చెప్పాడు. దీంతో అతను.. అవును ఆమె మంచికాదంటూ తిట్టాడు. కోపోద్రిక్తుడైన మధుసూదన్ మద్యం మత్తులో ఉన్న రమేశ్‌ను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి, బండరాయితో మోది చంపేశాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని, పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని మధుసూదన్‌గా గుర్తించి, మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
ముగ్గురు ఏజెంట్ల అరెస్టు
ఖలీల్‌వాడి(నిజామాబాద్): విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిజామాబాద్ జిల్లా యువకులను మోసం చేసిన ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్రావు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లాకు చెందిన అలకుంట సంపత్, జగిత్యాల జిల్లాకు చెందిన దండుగుల చిరంజీవి, మిట్టపల్లి నర్సారెడ్డిలు థాయిలాండ్, లావోస్ దేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జిల్లాకు చెందిన బాధితుల నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. వీరిని లావోస్ దేశంలో బంధించి సైబర్ నేరాలు చేయించారు. చివరికి ఇద్దరు బాధితులు భారతీయ రాయబార కార్యాలయం సహాయంతో స్వదేశానికి తిరిగి వచ్చి ఏజెంట్లపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏజెంట్లను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరిని సారంగాపూర్ జిల్లా జైలుకు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిజగిత్యాల క్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ బస్టాండ్ వద్ద.. కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ట్రాలీఆటోను మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొనగా ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల శివారు టీఆర్‌నగర్‌కు చెందిన కడారి గంగాధర్ (55), అతని బంధువు శ్రీహరి అలియాస్ శ్రీనివాస్‌తో కలిసి ట్రాలీ ఆటోలో టీఆర్‌నగర్ వెళ్తున్నారు. కరీంనగర్ నుంచి మెట్పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ట్రాలీఆటోను ఢీకొంది. ఈ ఘటనలో గంగాధర్ అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీహరికి తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై సధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘అనంతగిరి’.. పరిహారమేది?
● ప్రాజెక్టు నిర్వాసితులకు అందని ప్యాకేజీ డబ్బులు ● కోర్టుకు వెళ్లినవారికి ఇళ్ల స్థలాలు కేటాయించలే ● పునరావాస కాలనీలో అరకొర వసతులు ● ఇబ్బంది పడుతున్న బాధితులు ఇల్లంతకుంట(మానకొండూర్): అనంతగిరి ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన వారికి ఏళ్లుగా న్యాయం జరగడం లేదు. అంతేకాకుండా, నిర్వాసిత కాలనీలోనూ అరకొర సౌకర్యాలే కల్పించారు. ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో 3.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మించారు. ప్రాజెక్టులో అనంతగిరి పూర్తిస్థాయిలో, సిరికొండ పాక్షికంగా, సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి, చెలకలవానిపల్లి పాక్షికంగా మునిగిపోయాయి. వీరందరికీ ఇప్పటికీ చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. అసౌకర్యాల మధ్యే.. అనంతగిరికి చెందిన 854 ఇళ్లు పూర్తిస్థాయిలో ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామస్తుల కోసం ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేశారు. కానీ, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి, మురికినీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మించలేదు. గదుల్లో విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ లేవు. అంగన్వాడీ కేంద్రం, సబ్ హెల్త్ సెంటర్ భవనాలు పిల్లర్లకే పరిమితమయ్యాయి. కాలనీలో ప్రధాన రోడ్డు తప్పితే మిగతా రోడ్ల నిర్మాణం అంతంతే. కాలనీలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు. 103 మందికి అందని స్థలాలు భూ సర్వే చేసిన 2017 సంవత్సరం వరకు 18 ఏళ్లు నిండినవారికి కుటుంబ ప్యాకేజీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. అయితే, ఇళ్లు ఖాళీ చేసిన 2020 సంవత్సరం వరకు దీన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. ఇళ్లు, భూముల లెక్క కట్టడంలో అసమానతలు ఉన్నాయని, గ్రామంలోని 103 మంది కోర్టుకు వెళ్లారు. ఇళ్లు ఖాళీ చేసే సమయంలో వీరి ఇంటి స్థలం కేటాయించలేదు. దీంతో వీరి కోసం ప్రత్యేకంగా 103 కోర్టు గదులు నిర్మించారు. వీటిల్లో ప్రస్తుతం కొందరే ఉంటున్నారు. -
నేరం చేస్తే.. తప్పించుకోలేరు
● కేసుల్లో పక్కా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు ● జగిత్యాల జిల్లాలో వరుస తీర్పులు ● జైలుకు వెళ్తున్న నేరస్తులు జగిత్యాల క్రైం: నేరం చేసినవారు ప్రస్తుతం తప్పించుకునే పరిస్థితి లేదు. నమోదైన కేసుల్లో పక్కా ఆధారాలు సేకరించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. దీంతో జగిత్యాల జిల్లాలో నేరాలు చేసినవారికి న్యాయస్థానంలో వరుసగా శిక్షలు పడుతున్నాయి. నేరం చిన్నదైనా.. పెద్దదైనా శిక్ష అనుభవించాల్సిందే. ఇతర దేశాలకు పారిపోదామనుకుంటే పొరపాటే. ప్రపంచంలో ఎక్కడున్నా పోలీసులు పట్టుకొస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని, పౌరులు బాధ్యతగా ఉండాలని ఇటీవలి పలు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. పరిస్థితి మారిపోయింది.. గతంలో నేరం జరిగితే దాన్ని చూసినవాళ్లు వచ్చి, కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వచ్చేది. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. సంఘటనలపై కేసులు నమోదైతే నిందితుల ఫోన్ లొకేషన్, సదరు ఏరియాల్లో సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్, డాగ్‌స్క్వాడ్ వంటి వాటిని వినియోగిస్తూ సరైన సాక్ష్యాలు సేకరించి, చార్జిషీట్లో పొందుపరుస్తుండటంతో కేసులకు బలం చేకూరి, నేరస్తులకు తగిన శిక్ష పడుతోంది. ఉన్నతాధికారుల దిశానిర్దేశం.. నేరం జరిగిన వెంటనే ఎస్ఐఆర్ నమోదు, చార్జిషీట్ దాఖలు, పక్కాగా సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టి, నేరాన్ని నిరూపిస్తే 100 శాతం శిక్ష పడుతుందని పోలీసులు చెబుతున్నారు. కేసుల నమోదు, విచారణలో నాణ్యత పాటించాలని, సాంకేతికతను వినియోగించాలని పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాల్లో దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అవి పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. శిక్ష పడిన నేరస్తుల వివరాలు శిక్ష 2022 2023 2024 2025 జీవితకాలం 2 14 10 1 5–10 ఏళ్లు 2 2 11 2 3–5 ఏళ్లు 3 6 3 3 1–3 ఏళ్లు 9 20 12 1 ఏడాదిలోపు 44 13 26 0 మొత్తం 60 55 62 7తప్పు చేస్తే శిక్ష తప్పదు తప్పు చేసినవారికి తప్పకుండా శిక్ష పడుతుంది. నేరాన్ని పరిగణలోకి తీసుకొని, దాని కి తగినట్లుగా న్యాయస్థానం శిక్ష వేస్తుంది. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బ ందిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇటీవలి కాలంలో పలు కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడ్డాయి. – అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ, జగిత్యాల -
విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు..
కోనరావుపేట(వేములవాడ): ఓ వ్యక్తి ఇంటిపై దాడికి పాల్పడటంతోపాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం రామన్నపల్లి(బావుసాయిపేట)కి చెందిన బత్తుల మల్లయ్య గత జనవరి 19న బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. అతని భార్య రేణవ్వ ఫిబ్రవరి 20న నాంపల్లిలో ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి మృతికి అదే గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య కారణమంటూ బత్తుల ఎల్లయ్య, అంజయ్య, కొమురయ్య, చిన్న భీమయ్య, రాజయ్యతోపాటు మరికొందరు రేణవ్వ మృతదేహాన్ని నాంపల్లి నుంచి రామన్నపల్లికి తీసుకొచ్చారు. అంజయ్య ఇంటి ఎదుట ఆందోళన చేపట్టి, ఆ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కోనరావుపేట పోలీసులు ఆపేందుకు ప్రయత్నిస్తే వారి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో ఫిబ్రవరి 22న వారిపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఆ ఐదుగురినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో 12 మందిపై కేసు ముస్తాబాద్(సిరిసిల్ల): విద్యుదాఘాతంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తరలిస్తుంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించినవారిపై కేసు నమోదు చేసినట్లు ముస్తాబాద్ ఎస్సై గణేశ్ మంగళవారం తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వల్లపు దేవరాజు వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా రోడ్డుపై ఆందోళన చేసిన 12 మందిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ గెలుపులో ‘బండి’ మార్క్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మల్క కొమురయ్య గెలుపు రాజకీయ, ఉపాధ్యాయవర్గాల్లో చర్చకు దారితీసింది. వాస్తవానికి బీజేపీ అనుబంధ సంఘమైన తెలంగాణ ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్రంలో ఇతర యూనియన్లతో పోలిస్తే బలమైన ఉపాధ్యాయ సంఘం కాదు. పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ వంటివి బలమైన ఉపాధ్యాయ సంఘాలుగా ప్రసిద్ధి చెందాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా సంఘాల అభ్యర్థులే గెలవడం గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. అందుకే, కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి బలమైన పార్టీలు కూడా పోటీకి దూరంగా ఉంటూ వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిని నిలిపి, గెలిపించడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ఆయన మార్క్ ప్రచారం, రాజకీయ ఎత్తుగడలు పనిచేసినట్లుగా పార్టీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బలమైన ఉపాధ్యాయ సంఘాలను, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థిని ఢీకొట్టి కొమురయ్యను గెలిపించడంలో బండి మరోసారి సక్సెస్ అయ్యారని మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బైకు ర్యాలీలతో సంబరాలు జరుపుకున్నారు. ప్రభారీ మీటింగ్‌లతో.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి సంజయ్ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ప్రచారం కొనసాగించారు. ముఖ్యంగా 25 మంది ఓటర్లకు ఒక ప్రభారీ (ఇన్చార్జి)ని నియమించడం ప్రభావవంతంగా పనిచేసిందని పార్టీవర్గాలు అంటున్నాయి. వీటితోపాటు జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పచ్చీస్ ప్రభారీల సమావేశం నిర్వహించడం, ఆ సమావేశాలకు స్వయంగా తానే వెళ్లి వారికి మార్గదర్శనం చేశారు. దేశవ్యాప్తంగా మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, ఉద్యోగులకు రూ.12 లక్షల దాకా ఐటీ మినహాయింపు ఇచ్చిన విషయాన్ని పదేపదే టీచర్లలోకి తీసుకెళ్లాలని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల తీరుతో తెలంగాణలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతీ సమావేశంలోను వివరిస్తూ టీచర్ల పక్షాన చేసిన బీజేపీ చేసిన పోరాటాలను వివరించారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను, కార్యకర్తలు లాఠీదెబ్బలు రక్తం చిందిస్తూ జైలుకు వెళ్లిన ఘటనలను గుర్తు చేస్తూ, భవిష్యత్తులోనూ టీచర్లకు, నిరుద్యోగులకు అండగా ఉండి పోరాటాలు చేస్తామని ఇచ్చిన హామీలు పనిచేశాయని పార్టీ పెద్దలు అభిప్రాయ పడుతున్నారు. ఇవన్నీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య గెలుపునకు కీలకంగా నిలిచాయని, అదే విధంగా పట్టభద్రుల్లో అంజిరెడ్డికి భారీగా ఓట్లు పోలయ్యేలా చేసిందంటున్నారు. ఇదే ఊపుతో పట్టభద్రుల స్థానం కూడా కై వసం చేసుకుంటామని బీజేపీవర్గాలు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. మల్క కొమురయ్య విజయంలో సంజయ్‌ది కీలకపాత్ర ఫలించిన పచ్చీస్ ప్రభారీ సమావేశాలు, ప్రచారం ఎమ్మెల్సీగా కొమురయ్యది చారిత్రక విజయం కరీంనగర్‌టౌన్: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందని, తమ అభ్యర్థి మల్కా కొమురయ్యది చారిత్రక విజయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీకి అండగా నిలిచిన ఉపాధ్యాయులకు, రేయింబవళ్లు కష్టపడిన కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం నుంచి కోర్టు చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొమురయ్య విజయంలో తపస్ ప్రధాన భూమిక పోషించిందన్నారు. అభ్యర్థిని నిలబెట్టలేని కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీజేపీని ఓడగొట్టడానికి అనేక కుట్రలు చేశాయని ఆరోపించారు. 317 జీవోకు వ్యతిరేకంగా ఆనాడు కరీంనగర్లో కొట్లాడిన బీజేపీ కార్యకర్తలను టీచర్లు మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుందని భావించిన కేసీఆర్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే వీరికి పడుతుందని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా బీజేపీ అభ్యర్థే గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీజేపీ సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
డివిజన్లు మారుడే!
● ప్రాథమికంగా పూర్తయిన డీలిమిటేషన్ ● ప్రభుత్వానికి నివేదిక అందించిన బల్దియా ● త్వరలో మొదలుకానున్న అధికారిక ప్రక్రియ ● ఆయా డివిజన్ల ఆశావహుల్లో ఉత్కంఠకరీంనగర్ కార్పొరేషన్: నగరంలో డివిజన్లు మళ్లీ మారుతున్నాయి. కొత్తగా ఐదు గ్రామపంచాయతీలు, ఒక మున్సిపాలిటీ నగరపాలకసంస్థలో విలీనం కావడంతో డివిజన్ల పునర్విభజన అనివా ర్యమైంది. 60 నుంచి 66 డివిజన్లుగా పునర్విభజిస్తూ నగరపాలకసంస్థ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రభుత్వ ఆదేశాల అనంతరం అధికారికంగా ప్రక్రియ మొదలుకానుంది. మారిన హద్దులు నగరపాలకసంస్థలో బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్, మల్కాపూర్, చింతకుంట గ్రామపంచాయతీలతో పాటు, కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేయడం తెలిసిందే. నగరంలో 66 డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తూ అధికారులు పునర్విభజన చేశారు. గతంలో మాదిరిగానే మస్కిటోకాయిల్ తరహాలో డివిజన్ల కూర్పు జరిగినట్లు, నగరంలోని అన్ని డివిజన్ల సరిహద్దులు మారినట్లు సమాచారం. అయితే అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు. గోప్యంగా పునర్విభజన గతంలో పునర్విభజన సందర్భంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా ఈ సారి అధికారులు రాజ కీయ జోక్యానికి దూరంగా అత్యంత గోప్యంగా విభజన చేపట్టారు. నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ పర్యవేక్షణలో పట్టణ ప్రణాళి క అధికారులు, పాత బిల్కలెక్టర్లు, రెవెన్యూ అధి కారులు డివిజన్ల హద్దులు నిర్ణయించారు. పాత డివిజన్లు, ఇంటినంబర్లు, ఓట్లను ప్రామాణికంగా డివిజన్లను పునర్విభజించినట్లు తెలిసింది. ఒక్కో డివిజన్‌కు కనీసం ఐదు వేల ఓట్లు ఉండేలా రూపొందించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని సెంట్రల్ గుడ్ గవర్నెన్స్‌లో ఈ డివిజన్ల విభజనను పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదిక అందించారు. డీలిమిటేషన్‌కు సంబంధించి నోటిఫికేషన్, ముసాయిదా, అభ్యంతరాలు తదితర ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. అధికారిక ప్రక్రియ అనంతరమే డివిజన్ల పునర్విభజనకు ఆమోద ముద్ర పడనుంది. ఆశావహుల్లో ఉత్కంఠ డివిజన్ల పునర్విభజన రాజకీయంగా ఉత్కంఠను రేపుతోంది. పాలకవర్గం పదవీకాలం ముగియడం, ఎన్నికలు జరగాల్సి ఉండడంతో ఆయా డివిజన్లలో రాజకీయ హడావుడి ఇప్పటికే ఉంది. అయితే డివిజన్ల హద్దులు మారుతుండడంతో తాము పోటీచేసే అవకాశాలు, గెలుపోటములపై మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. కొత్తగా డివిజన్ల ఏర్పాటు ఆయా కార్పొరేటర్ స్థానాల రిజర్వేషన్లను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో, పునర్విభజన ప్రాధాన్యం సంతరించుకొంది. అధికారిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నా, ఇప్పటికే ప్రాథమికంగా 66 డివిజన్ల జాబితాను రూపొందించడంతో పునర్విభజనకు కీలక అడుగు పడింది. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. సీడీఎంఏ ఆదేశాల మేరకు కమిటీలను నియమిస్తూ నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని రిజర్వాయర్ల వారిగా ఈ కమిటీలు పనిచేస్తాయి. ప్రతీ రిజర్వాయర్‌కు సంబంధిత ఈఈ, డీఈ, ఏఈ, ఇన్చార్జి ఫిట్టర్, లైన్మెన్లతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్ఈ పర్యవేక్షణ చేస్తుంటారు. నగరంలో ఎక్కడైనా తాగునీటి సరఫరాలో సమస్యల తలెత్తితే, ఆ రిజర్వాయర్ పరిధిలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ వెంటనే వెళ్లి ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ కమిటీకి సంబంధిత డివిజన్ వార్డు అధికారి, పారిశుధ్య కార్మికులు సహకరిస్తారు. -
వీడని ఉత్కంఠ
తేలని ఫలితంసాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్– ఆదిలాబాద్– మెదక్– నిజా మాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్‌లో బీజీపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధించారు. ఎవరూ నేరుగా కోటా ఓట్లు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆసక్తి నెల కొంది. మొత్తం చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఫలితం తేలనుంది. దీంతో ట్రయాంగిల్‌గా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. త్రిముఖ పోటీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా 56 మంది అభ్యర్థులు పోటీపడినా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు ముగ్గురు సుమారు లక్ష ఓట్లు, బరిలో నిలిచిన 53 మంది కలిపి కేవలం 10వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో మూడోస్థానంలో నిలిచే అభ్యర్థి ఎవరనేదానిపై ఎమ్మెల్సీ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరికీ దక్కని విన్నింగ్ కోటా ఓట్లు పోస్టల్ ఓట్లతో కలిసి మొత్తం 2,52,100 ఓట్లు పోలవగా, అందులో సుమారు 28 వేల ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. చెల్లనిఓట్లు పోగా మిగిలిన 2,24,000 ఓట్లలో సగం ఓట్లు.. అంటే.. 1,12,001 (సుమారు) ఓట్లను విన్నింగ్ కోటా ఓట్లుగా నిర్ధారించారు. పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి నేరుగా కోటా ఓట్లను సాధించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫలితం తేలేందుకు బుధవారం రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ప్రతీ రౌండ్లో బీజేపీకే ఆధిక్యం మొత్తం 21 టేబుళ్ల ద్వారా 12 రౌండల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిపై 36 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండోరౌండ్లో 1,457 ఓట్ల మెజార్టీ, మూడోరౌండ్లో 3,005 ఓట్లు, నాలుగో రౌండ్లో 1,263 ఓట్లు, ఐదోరౌండ్లో 1,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిపై 211 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 45,401 ఓట్లు సాధించి, ప్రత్యర్థులపై 6,931 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. 38,470 ఓట్లతో నరేందర్‌రెడ్డి సెకండ్ ప్లేస్‌లో, 3,1481 ఓట్లతో ప్రసన్నహరికృష్ణ మూడోస్థానంలో నిలిచారు. మందకొడిగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు తోడు పోటాపోటీగా అభ్యర్థులు ఓట్లు సాధిస్తుండటంతో రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ పెరుగుతోంది. రెండోప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ‘గ్రాడ్యుయేట్’ పోటీ త్రిముఖం కోటా ఓట్ల మార్కును చేరుకోని అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియతోనే తేలనున్న ఎమ్మెల్సీ ఫలితం ప్రస్తుతం ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికౌంటింగ్ వివరాలు మొత్తం ఓట్లు(పోస్టల్ ఓట్లతో కలిపి) : 2,52,100 చెల్లని ఓట్లు : 28,000(11.01శాతం) చెల్లుబాటైనవి : 2,24,000 విన్నింగ్ కోటా ఓట్లు : 1,12,001(సుమారు) బరిలో నిలిచిన అభ్యర్థులు : 56 -
స్ట్రీట్‌లైట్లు వెలగకుంటే ఏం చేస్తున్నారు?
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో స్ట్రీట్‌లైట్లు వెలగకపోతే ఏం చేస్తున్నారంటూ వీధి దీపాల విభాగం అధికారులు, సిబ్బందిపై నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎస్ఎల్ సంస్థ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో వీధి దీపాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చాహత్‌బాజ్‌పేయ్ మాట్లాడుతూ నగరంలో వీధి దీపాల నిర్వహణపై ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. చాలా ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదన్నారు. సిబ్బంది ఏం విధులు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. స్మార్ట్‌సిటీలో భాగంగా ఏర్పాటు చేసిన లైట్లతో పాటు, నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన లైట్లు ప్రతి రోజు వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీరోజు సాయంత్రం ఆయా డివిజన్లలో పర్యటించి, ఎక్కడెక్కడ లైట్లు వెలగడం లేదో గుర్తించి, రీప్లేస్ చేయాలని ఆదేశించారు. సీసీఎంఎస్ బాక్స్‌లు, పోల్నంబర్ల వివరాలు నమోదు చేయాలన్నారు. నగరంలో వెలగని లైట్లపై నివేదిక అందించాలని అన్నారు. ఈఈ యాదగిరి, డీఈ అయూబ్ ఖాన్, ఏఈ గఫూర్ పాల్గొన్నారు. -
35,562 మంది.. 58 కేంద్రాలు
విజయీభవ ● నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ● ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహణ ● ఏర్పాట్లు చేసిన అధికారులు కరీంనగర్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాటు ్లపూరి ్తచేశారు. ఈనెల 5 నుంచి 22 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ 17,799.. ద్వితీయ 17,763.. జిల్లాలో మొత్తం 16 మండలాలు ఉండగా, వాటి పరిధిలో 58 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 35,562 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 17,799, ద్వితీయ సంవత్సరం 17,763 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను తపాలాశాఖ ద్వారా ఇంటర్ బోర్డుకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. పర్యవేక్షణకు బృందాలు ఇంటర్ పరీక్షలను నిరంతరం పర్యవేక్షించేలా నాలుగు సిట్టింగ్ స్క్వాడ్, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను సిద్ధం చేశారు. ప్రతీ కేంద్రానికి ఒకరు చొప్పున 58 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం కేటాయించారు. మారుమూల ప్రాంత విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు పరీక్ష కేంద్రాల వద్దకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఐదు నిమిషాలు అనుమతి ప్రభుత్వ కళాశాలలు 11, మోడల్ కళాశాలలు 2, సోషల్ వెల్ఫేర్ 1, మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు 5, ఎంజేపీ జూనియర్ కళాశాలలు1, ప్రైవేట్ కాలేజీలు 38 మొత్తం 58 సెంటర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులను ఒక గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇస్తారు.ఇలా చేస్తే ఫలితాలు మీవే.. ● పరీక్షలయ్యే వరకు మార్కులపై తల్లిదండ్రులు, హాస్టళ్లలో వార్డెన్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని వ్యక్తిత్వ వికాస నిపుణులు అట్ల శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ● రాత్రి 10.30 గంటల తర్వాత చదవకూడదు. ● వేకువజామున క్లిష్టమైన సబ్జెక్టులు, తేలికై నవి మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో చదవాలి. ● తల్లిదండ్రులు తమ పిల్లలను టీవీలు, సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి. ఇతర పనులేవీ అప్పగించకూడదు. ● పిల్లలకు మాంసాహారం కంటే తేలికగా జీర్ణమయ్యే శాకాహారానికే ప్రాధాన్యమివ్వాలి. ఉదయం పూట నూనె లేని అల్పాహారం ఇవ్వడం మంచిది. ● పరీక్ష రాశాక ఎన్ని మార్కులొస్తాయని అడగకూడదు. అడిగితే దాని ప్రభావం తర్వాత పరీక్షలపై పడుతుంది. ● రోజూ ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. ● నేను బాగా రాయగలను. నాకు భయం లేదు. మంచి మార్కులొస్తాయి.. అని మనసులో అనుకుంటూ సానుకూల దృక్పథంతో ఉండాలి. ● పరీక్షలకు బయల్దేరడానికి గంట ముందుగానే అన్నీ సర్దుకోవాలి. హడావిడిగా వెళ్తే ఆ ప్రభావం పరీక్షపై పడుతుంది. ● తొలుత హాల్‌టికెట్ నంబరు వేయాలి. ప్రశ్నాపత్రం చూశాక వచ్చిన సమాధానాలకు 1,2,3 ప్రాధాన్యం ఇచ్చుకోవాలి. సమయాన్ని అన్నింటికీ పంచుకుని, అఖరులో అన్నీ రాశానో లేదో చూసుకోవాలి.ఇబ్బందులు కలగకుండా చూస్తాం ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షా సమయంలో కేంద్రాల వద్ద144 సెక్షన్ అమలులో ఉంటుంది. విద్యార్థులకు హాల్‌టికెట్లపై ఆందోళన అవసరం లేదు. నేరుగా బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లోకి వెళ్లి లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా సమస్యలుంటే వాటిని మాదృష్టికి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ 0878–2933006 నంబర్ కేటాయించాం. నిర్ణీత గడువు తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించం. – జగన్మోహన్రెడ్డి, డీఐఈవో● -
ఎమ్మెల్సీ గెలుపులో బండి మార్క్
కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మల్క కొమురయ్య గెలుపు రాజకీయ, ఉపాధ్యాయవర్గాల్లో చర్చకు దారితీసింది. బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిని నిలిపి, గెలిపించడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ఆయన మార్క్ ప్రచారం, రాజకీయ ఎత్తుగడలు పనిచేసినట్లుగా పార్టీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొమురయ్యను గెలిపించడంలో బండి మరోసారి సక్సెస్ అయ్యారని మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. –సాక్షిప్రతినిధి,కరీంనగర్ 8లోu -
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
తిమ్మాపూర్:మండలంలోని ఎల్‌ఎండీకాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ 46వ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవా రం శ్రీ ఆండాళ్ పద్మావతి సహిత వేంకటేశ్వరస్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు గోవర్దన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంత్చార్యులు వేడుకను నిర్వహించారు. మృత్యుంజయ మహా దేవాలయం (శివాలయం) నుంచి ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంఘం లక్ష్మణ్‌రావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించారు. ఆలయ కమిటీ చైర్మన్, టీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధా న కార్యదర్శి ఒంటెల రవీందర్‌రెడ్డి, కోశాధికారి పోలు కిషన్, దారం శ్రీనివాస్‌రెడ్డి, గంగారపు రమేశ్, రాగి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, బట్టు కరుణాకర్, డీటీసీ పురుషోత్తం పాల్గొన్నారు. -
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన ట్రాక్టర్ యజమాని శివరాత్రి నర్సింలు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాక్టర్‌ను మంగళవారం రాజన్నపేట శివారులో అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి, ఠాణాకు తరలించారు. ట్రాక్టర్ యజమాని నర్సింలు, డ్రైవర్ ఆలకుంట రాజులను అరెస్టు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మానవ అభివృద్ధి సైన్స్‌తో ముడిపడి ఉంది
కరీంనగర్ సిటీ: మానవ అభివృద్ధి సైన్స్‌తో ముడిపడి ఉందని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ పేర్కొన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో సైన్స్ కళాశాల, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హైదరాబాద్ సహకారంతో నేషనల్ సైన్స్‌డేను ప్రిన్సిపాల్ జయంతి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా వీసీ ఉమేశ్‌కుమార్, రిజిస్ట్రా ర్ జాస్తి రవికుమార్, సంజీవరెడ్డి, దిగంబర్‌రావు, సాయిని కిరణ్ హాజరయ్యారు. ఉమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. నిత్యజీవితంలో సైన్స్ ముఖ్య భూమికగా మారిందన్నారు. నూతన ఆవిష్కరణల కోసం నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సంజీవరెడ్డి మా ట్లాడుతూ సర్ సీవీ.రామన్ జీవిత చరిత్రను వివరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి జ్ఞాపికలు అందజేశారు. రసాయనశాస్త్ర విభాగాధిపతి నమత, సరసీజ, మూర్తి, రాజు, విజయ్‌కుమార్, ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి జోసెఫ్ పాల్గొన్నారు. ఘనంగా లైన్మెన్ దినోత్సవం కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌టౌన్ డివిజన్లోని టౌన్ 5 సెక్షన్ టవర్ సర్కిల్, సప్తగిరికాలనీల్లో మంగళవారం లైన్మెన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యవేక్షక ఇంజినీరు మేక రమేశ్‌బాబు మాట్లాడుతూ సంస్థలో క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్లకు అభినందనలు తెలియజేశారు. నిత్యం నాణ్యమైన, అంతరాయంలేని విద్యుత్ సరఫరా అందించేందుకు, పంపిణీ లైన్లు, ఉపకరణాలను నిర్వహించేందుకు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, అత్యవసర సేవలకు స్పందించేందుకు, బిల్లింగ్, వసూళ్లు చేపట్టేందుకు, వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచేందుకు లైన్మెన్లు చేస్తున్న అంకితభావ సేవ ప్రశంసనీయమన్నారు. డీఈ టెక్నికల్ కే.ఉపేందర్, డీఈ ఆపరేషన్ జే.రాజం, లావణ్య, పంజాల శ్రీనివాస్‌గౌడ్, మల్లయ్య పాల్గొన్నారు. దరఖాస్తులు ఆహ్వానం కరీంనగర్: గిరిజన సంక్షేమశాఖ అర్హత గల గిరి జన విద్యార్థుల నుంచి 2025–26 సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి డి.జనార్దన్ ఒక ప్రకటనలో తెలి పారు. గిరిజన సంక్షేమశాఖ అర్హత గల విద్యార్థులకు వాటర్‌స్పోర్ట్స్ అకాడమీ బోయిన్పల్లి హైదరాబాద్, మోడల్ స్పోర్ట్స్ పాఠశాల జాతర్ల బాలుర(ఆదిలాబాద్, కిన్నెరసాని బాలుర(బీడీ కొత్తగూడెం), ఉట్నూర్ బాలుర(ఆదిలాబాద్), కొత్తగూడ బాలుర(మహబూబాబాద్ జిల్లా), ఆసిఫాబాద్ బాలికలు((కేబీ.ఆసిఫాబాద్ జిల్లా), కాచనపల్లి బాలికలు(బీడీ కొత్తగూడెం) పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని గిరిజన బాలబాలికలు తమ దరఖాస్తులను కరీంనగర్ జిల్లా గిరి జన అభివృద్ధి అధికారి కార్యాలయ పనివేళలలో సమర్పించాలని తెలిపారు. విద్యార్థుల వయస్సు 31 ఆగస్టు 2025 నాటికి 9నుంచి 11 సంవత్సరాల లోపు కలిగి ఉండాలని తెలిపా రు. ఈ ఎంపిక జిల్లాస్థాయి కమిటీ ద్వారా దేహదారుఢ్య పరీక్షల అనంతరం ఎంపిక చేయబడునని పేర్కొన్నారు. జిల్లాలో ఈనెల 12 నుంచి 16 వరకు ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. వివరాలకు 8686451313 నంబర్‌ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. డీజేలపై నిషేధాజ్ఞలుకరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధి లో డీజేల వినియోగంపై నిషేధాజ్ఞలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఒక ప్రకటనలో వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రోన్ల వాడకంపై నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే సంబంధిత ఏసీపీల ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం తనిఖీకరీంనగర్క్రైం: కరీంనగర్‌లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాన్ని ఐజీ బుద్ధప్రకాశ్ జ్యోతి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పలు విభాగాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఐజీ రవీందర్, జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
తెలంగాణ: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటివరకు 2లక్షల 10వేల ఓట్లను విభజించారు. వీటిలో సుమారు 21వేల ఓట్లు చెల్లుబాటు కాలేదని అధికారులు తెలిపారు.కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇంకా 40వేల ఓట్లు విభజన చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేసే అవకాశం ఉంది. -
‘బదులు’ ఉద్యోగులపై బల్దియా కమిటీ
● వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదికకరీంనగర్కార్పొరేషన్: నగరపాలకసంస్థలోని పారిశుధ్య విభాగం ఔట్సోర్సింగ్ బదులు (ఒకరికి బదులు మరొకరు) ఉద్యోగుల వ్యవహారాన్ని తేల్చేందుకు నలుగురు అధికారులతో కమిటీ వేశారు. అనారోగ్యం, తదితర కారణాలతో పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బదులుగా, వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు పనిచేస్తుండడం తెలిసిందే. దీనిపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఇటీవల బదులు ఉద్యోగుల వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. బదులు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, అసలు ఉద్యోగులు పనిచేయకపోవడానికి కారణమేమిటంటూ ఒరిజినల్ ఉద్యోగులను పిలిపించి వారం రోజుల క్రితం ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే 67 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమకు బదులుగా తమ కుటుంబసభ్యులు ఉద్యోగాలు చేస్తారంటూ దరఖాస్తు చేసుకున్నారు. సదరు దరఖాస్తుల నేపథ్యంలో ఉద్యోగులు చెబుతున్న కారణాలు నిజమేనా కాదా అనేది తేల్చడానికి నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ సోమవారం నలుగురు అధికారులతో కమిటీ వేశారు. అనంతరం కమిటీ సభ్యులు డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఏసీపీ బషీర్, సహాయ కమిషనర్ వేణుమాధవ్, సంజీవ్‌తో ఆమె సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మూడు కేటగిరీల వారిగా విభజించి వాస్తవ లెక్క తేల్చాలని సూచించారు. చనిపోయిన ఉద్యోగులు, 61 ఏళ్లు నిండినవారు, పూర్తిస్థాయిలో అనారోగ్యానికి గురైనవారిని మూడు కేటగిరీల వారిగా వివరాలు సేకరించాలన్నారు. ఇదిలా ఉంటే ఔట్సోర్సింగ్ బదులు ఉద్యోగులను తేల్చే పనితో పాటు, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల స్థానంలో పనిచేస్తున్న బదులు ఉద్యోగుల వ్యవహారంపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది. క్వింటాల్ పత్తి రూ.7,050జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,050 పలికింది. సోమవారం మార్కెట్‌కు 15 వాహనాల్లో 158 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకవచ్చారు. క్వింటాల్‌కు మోడల్ ధర రూ.7,000, కనిష్ట ధర రూ.6,700 వ్యాపారులు చెల్లించారు. క్రయవిక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
టీచర్స్‌లో కమలం పాగా!
● తొలి ప్రాధాన్యంలోనే గెలిచిన మల్క కొమురయ్య ● కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ ఓటర్ల వడబోత ● నేటి మధ్యాహ్నానికి మొదలవనున్న లెక్కింపు ● మందకొడి లెక్కింపుపై అభ్యర్థుల మండిపాటు ● ఆర్వో, సిబ్బంది పనితీరుపై ఈసీకి సర్దార్ ఫిర్యాదు ● మల్క కొమురయ్యను అభినందించిన బండి సంజయ్ ● ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమన్న కేంద్ర సహాయ మంత్రిసాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ టీచర్ నియోజవర్గం కమలం వశమైంది. ముందు నుంచి అనుకున్నట్లుగా మల్క కొమురయ్య టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎగరేసుకుపోయారు. తొలిప్రాధాన్యం ఓట్లతోనే కొమురయ్య గెలవడం విశేషం. నల్గొండ టీచర్ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికే వచ్చేసినా.. కరీంనగర్ టీచర్ ఎన్నికల లెక్కింపు సాయంత్రానికి మొదలవడం గమనార్హం. అయినా కేవలం కౌంటింగ్ ప్రారంభించిన రెండు గంటల్లోనే ఫలితం తేలడం గమనార్హం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. కాగా 897 చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి కొమురయ్య చేరుకున్నారు. దీంతో తొలిరౌండ్లోనే బీజేపీ మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలిచినట్లయింది. గతంలో పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి టీచర్ సంఘాలు కాకుండా జాతీయ పార్టీ అయిన బీజేపీ పోటీ చేసి గెలవడం చర్చానీయాంశంగా మారింది. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ వడబోత.. సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వడపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓటర్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో రకరకాల ప్రచారాలు మొదలవడంతో రాత్రి ప్రకటించారు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.5 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం లెక్కింపు మొదలైనా.. తొలి ప్రాధాన్యంలో కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అందులో కోటా ఓట్లు చేరుకునే వరకు ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి. ఆర్వో, సిబ్బందిపై మండిపాటు గ్రాడ్యుయేట్, టీచర్లకు పోటీ పడిన పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), లెక్కింపు సిబ్బందిపై మండిపడ్డారు. లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రానికి నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలితం కొలిక్కి వచ్చినా.. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. కౌంటింగ్ నిర్వహణ సరిగా లేదని, ఓట్లలో జంబ్లింగ్ విధానం పాటించలేదని, బూత్‌ల (పలిమెల బూత్) వివరాల్లో గోప్యత పాటించకుండా బయటికి వెల్లడించారని ఆరోపిస్తూ ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. వీరితోపాటు అభ్యర్థులు విక్రంరెడ్డి, సిలివేరు శ్రీకాంత్ తదితరులు ఆర్వో తీరుపై మండిపడ్డారు. కౌంటింగ్‌లో పారదర్శకత లేదని, వెంటనే ఎన్నికలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీకి పోలైన ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. బండి అభినందనలురాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని కేంద్ర సహాయ మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5,900 ఓట్ల తేడాతో మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారు. ఇటీవల బడ్జెట్లో ఉద్యోగులకు రూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడంపై తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో బీజేపీ కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది. నాడు కేసీఆర్ మూర్ఖత్వపు పాలనకు వ్యతిరేకంగా టీచర్ ఎమ్మెల్సీగా ఏవీఎన్ రెడ్డిని గెలిపించారు. 317 జీవోపై బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలు, లాఠీచార్జ్ గుర్తుంచుకుని ఈనాడు మల్క కొమురయ్యను గెలిపించారు. తపస్ అంటే చిన్న సంస్థ అని హేళన చేసిన వారందరి చెంప చెళ్లుమన్పించేలా తీర్పు ఇచ్చారు’ అని అన్నారు. -
నీళ్లగంట.. ఆరోగ్యమట!
● జిల్లాలో అమలుకాని ‘వాటర్‌బెల్’ కార్యక్రమం ● ఇంటినుంచి నీళ్ల బాటిళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థులు ● చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు ● ముదురుతున్న ఎండలు.. చదువులపై ప్రభావం ● నీళ్లు ఎక్కువగా తాగాలంటున్న వైద్యులు ● ఏర్పాట్లు చేయాలని కోరుతున్న తల్లిదండ్రులుహుజూరాబాద్: నీళ్లగంట.. ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేరళలో అమలవుతోన్న విధానాన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, ఉమ్మడి ఆదిలాబాద్, ఇతర జిల్లాల్లో పక్కాగా అమలు చేస్తున్నారు. రోజులో నాలుగుసార్లు వాటర్ బెల్ (నీళ్లగంట) మోగిస్తూ.. విద్యార్థులు పాఠశాలలో ఉన్న సమయాల్లో కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగేలా కార్యాచరణ రూపొందించారు. కరీంనగర్ జిల్లాలోనూ ఈ విధానం అమలు చేస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నా.. ఎక్కడా కనిపించడం లేదు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో సరిపడా నీళ్లు తాగకుంటే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆలోచన బాగు.. అమలు కష్టతరం రెండేళ్లక్రితం కేరళలో వాటర్‌బెల్ కార్యక్రమం ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు నీళ్లు తాగేలా ప్రణాళిక రచించారు. జిల్లాలోనూ గతేడాది పక్కాగా అమలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూళ్లలోనూ కార్యక్ర మం అమలుకు నోచుకోవడం లేదు. చాలా పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, ఆర్వోప్లాంట్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు లేవు. విద్యార్థులు ఇంటినుంచి వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు. ఒక్క బాటిల్ నీళ్లను రోజంతా తాగుతున్నారు. దీంతో వారి ఆరో గ్యంపై ప్రభావం చూపుతోంది. పీడీయాట్రిక్ యూ రోలిథియాసిస్ సమస్యతో బాధపడుతున్న బడిపిల్లల సంఖ్య కొన్నేళ్లుగా జిల్లాలో పెరుగుతోంది. ఆరోగ్యంపై ప్రభావం.. ఉదయం పాఠశాల ప్రారంభం నుంచి ఒకదాని తర్వాత మరొక తరగతి వెనువెంటనే ఉంటాయి. ఇంటర్వెల్, మధ్యాహ్న భోజన విరామ సమయాల్లో తప్ప నీళ్లు తాగేందుకు విద్యార్థులకు సమయం దొరకడం కష్టం. ఫలితంగా చదువు సంగతేమో గాని వారి ఆరోగ్యం దెబ్బతింటోంది. బాల్యదశలో తీసుకోవాల్సిన రెండు నుంచి మూడు లీటర్ల నీటిని కూడా వారు తాగేందుకు సమయం దొరక్క చిన్నతనంలోనే మూత్ర సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా జిల్లా విద్యాశాఖ గతేడాది వాటర్‌బెల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గత విద్యాసంవత్సరం పక్కాగా అమలు చేయగా.. ఈసారి ఎక్కడా కనిపించని పరిస్థితి. రోజుకు 16 గ్లాసులువేసవికాలం మొదలైంది. ఎండలు ముదురుతున్నాయి. పాఠశాల విద్యార్థులపై ఎండల ప్రభావం ఉంటుంది. శరీరానికి సరిపడినంత నీరు అందకపోతే, చర్మ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో పాటు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు, విద్యావంతులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు రోజుకు 16 గ్లాసులు నీరు తాగితే ఆరోగ్యంతో పాటు, ఉత్సాహంగా ఉంటారని తెలిపారు. జిల్లాలో ఈ వేసవిలోనూ నీళ్లగంట కార్యక్రమం అమలు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు.. విద్యార్థులు పాఠశాలలు సంఖ్య విద్యార్థులు ప్రాథమిక 424 11,900 ప్రాథమికోన్నత 76 2,900 ఉన్నత 149 24,400 -
చర్యలు తప్పవా..?
● పన్ను డబ్బులు స్వాహా చేసిన బిల్కలెక్టర్లు ● నాలుగేళ్ల క్రితం బల్దియాలో ఘటన ● కొనసాగుతున్న శాఖాపరమైన విచారణకరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో నాలుగేళ్ల క్రితం చోటుచేసుకున్న ఆస్తి పన్ను వసూళ్ల స్వాహా పర్వం ఉద్యోగులు, అధికారులను వెంటాడుతోంది. సుమారు రూ.50 లక్షలకు పైగా ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులను సొంతానికి వాడుకున్న ఉదంతంపై తాజాగా శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఈ కుంభకోణంలో పాత్రధారులైన ఇద్దరు బిల్ కలెక్టర్లు మరణించగా, మరో ఇద్దరు ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఒక అధికారి రిటైర్డ్ కాగా, మరో అధికారి ప్రస్తుతం బల్దియాలోనే పనిచేస్తున్నారు. కాగా విచారణ పూర్తి కాగానే సదరు బాధ్యులపై చర్యలు తప్పవనే ప్రచారం ఉంది. జరిగిందేమిటి.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో నలుగురు బిల్ కలెక్టర్లు తాము వసూలు చేసిన ఆస్తి పన్ను డబ్బును సొంతానికి వాడుకున్నారు. సుమారు రూ.50 లక్షలకు పైగా వసూలు చేసిన సొమ్మును నగరపాలకసంస్థలో జమ చేయకుండా, స్వాహా చేయడం సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి కమిషనర్ క్రాంతి నలుగురు బిల్ కలెక్టర్లతో పాటు, పర్యవేక్షణ లోపం కింద అప్పటి ఆర్వో రాములు, అకౌంటెంట్ ఖాదర్‌పై సీసీఏ రూల్స్ ప్రకారం చార్జెస్ఫ్రేమ్ (ఆరోపణల పట్టిక) చేశారు. డబ్బులు స్వాహా చేసినట్లు రుజువు కావడంతో సదరు బిల్ కలెక్టర్ల నుంచి రికవరీకి అధికారులు ఆదేశించారు. అయితే, నలుగురు బిల్ కలెక్టర్లలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరు విధుల్లో ఉన్నారు. చనిపోయిన బిల్‌కలెక్టర్ భార్యకు ఉద్యోగం ఇవ్వడంతో, ఆమె జీతం నుంచి, చనిపోయిన మరో బిల్‌కలెక్టర్‌కు సంబంధించిన పెన్షన్ నుంచి డబ్బులు రికవరీ చేశారు. విధుల్లో ఉన్న బిల్కలెక్టర్లు కూడా డబ్బులు తిరిగి చెల్లించారు. శాఖాపరమైన విచారణ సొంతానికి వాడుకున్న డబ్బులను రికవరీ చేసినప్పటికీ శాఖాపరమైన చర్యలకు బల్దియా సిద్ధమవుతోంది. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సు మన్, జమ్మికుంట కమిషనర్ ఆయాజ్ గత నెల 24న కరీంనగర్ బల్దియాలో కార్యాలయంలో వి చారణ చేపట్టారు. అయితే అప్పటి ఆర్వో రాములు గుండ్ల పోచంపల్లి కమిషనర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అకౌంటెంట్ ఖాదర్ ప్రస్తుతం నగరపాలకసంస్థలో డిప్యూటీ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. వీరిరువురి నుంచి కూడా విచారణ అధికారులు అప్పటి సమాచారాన్ని సేకరించారు. కాగా నాలుగేళ్ల తర్వాత విచారణ మళ్లీ కొనసాగడం, శాఖాపరమైన చర్యలుంటాయనే సంకేతాలు బల్దియాలో కలకలం సృష్టిస్తున్నాయి. -
అన్నావదినపై గొడ్డలితో దాడి
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని ఇప్పపెల్లిలో ఇంటి వివాదం కారణంగా ఓ వ్యక్తి తన అన్నావదినపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. పోలీసు ల కథనం ప్రకారం.. ఇప్పపెల్లికి చెందిన యాగండ్ల పెద్దరాజం, చిన్నరాజం సోదరులు. ఇంటి విషయ మై ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం కూడా గొడవ జరగడంతో చిన్నరాజం కోపోద్రిక్తుడయ్యాడు. క్షణికావేశంలో అన్నపై గొడ్డలితో దాడికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న అతని వదిన లక్ష్మి అడ్డు వెళ్లగా గొడ్డలి ఆమె వీపు భాగంలో రెండుసార్లు తగిలింది. ఈ సంఘటనలో లక్ష్మికి తీవ్ర, పెద్దరాజంకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంటి వివాదమే కారణం -
‘మైనారిటీ గెజిటెడ్ ఆఫీసర్స్’ రాష్ట్ర అధ్యక్షుడిగా రియాజ్ అలీ
కరీంనగర్: తెలంగాణ మైనా రిటీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆసోసియెషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం హైదరాబా ద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, విశ్వేశ్వరయ్య భవన్ సమావేశ మందిరంలో జరిగింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎండీ.రియాజ్ అలీ (నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజి నీర్)ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నీటిపారుదల శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ఎండీ.దస్తగీర్, అదనపు కార్యదర్శిగా ఎంఏ.అక్తర్ ఫారుఖీ, ఉపాధ్యక్షుడిగా ఇస్రాల్ ఉన్ని సా, సహాయ కార్యదర్శిగా రసూల్ ఇర్ఫాన్, కోశాధికారిగా ఎలియట్ రెబిల్సన్, మహిళా కార్యదర్శిగా రేష్మా తబస్సుమ్, కార్యనిర్వాహక సభ్యులుగా షా హిద్ అలీ తబరేజ్, కలీముద్దీన్, ఇలియాస్ అహ్మద్, అయూబ్‌ఖాన్ ఎన్నికయ్యారు. అధ్యక్షుడు రియాజ్ అలీ మాట్లాడుతూ.. మైనారిటీ గెజిటెడ్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. -
తోడు కోసం ఆడపులి అన్వేషణ
మంథని: తోడు కోసం ఆడపులి అన్వేషిస్తోంది. 15 రోజులుగా జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు దాని అడుగులను బట్టి అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కరీంనగర్ తూర్పు, పశ్చిమ అడవులు మూడు దశాబ్దాల క్రితం దట్టంగా ఉండేవి. ఆ సమయంలో పులులతోపాటు ఇతర అటవీ జంతువులు ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత అడవులు అంతరించిపోయి మళ్లీ దట్టంగా మారుతుండటంతో పులి తోడు కోసం వెతుకుతూ వస్తోంది. 2020లో దేవాదుల మీదుగా ఏటూరునాగారం, అజాంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో ఒకటి సంచరించింది. 2022లో హుస్సేనిమియా వాగు సమీపంలో పులి అడుగులు కనిపించాయి. మళ్లీ ఇప్పుడు గోదావరి, మానేరు తీరం వెంట ఆడపులి సంచరిస్తోందని అధికారులు చెబుతున్నారు. చెన్నూర్ అడవుల నుంచి మంథనికి.. ఈ పులి మంచిర్యాల జిల్లా చెన్నూర్ అడవుల నుంచి మంథని అడవుల్లోకి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాని వయసు మూడు నుంచి నాలుగేళ్లు ఉంటుందని, అడుగులు 12 సెంటీమీటర్లు ఉన్నట్లు తెలిపారు. ఆదివారం ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ కోయ చెరువు అటవీ ప్రాంతంలో అడుగులు గుర్తించిన రైతులు ఆందోళనకు గురై, సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. కెమెరాకు చిక్కితే పూర్వాపరాలు.. పులి ప్రతీరోజు రాత్రివేళల్లో 20 నుంచి 40 కి.మీ. ప్రయాణిస్తోందని అఽధికారులు అంటున్నారు. కెమెరాకు చిక్కితే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ద్వారా దాని పూర్వాపరాలు తెలుసుకుంటామంటున్నారు. పులి కోసం నీరు, ఆహార ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తీరం వెంట ట్రాకింగ్ బృందాలు పులి అడుగులను గుర్తించిన అటవీ శాఖ అధికారులు దాని జాడ కోసం రెండు ట్రాకింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. గోదావరి, మానేరు తీరం వెంట ఆనవాళ్లు ఉన్న ప్రాంతంలో ఒకటి ముందు, మరొకటి వెనక అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఆందోళనలో ప్రజలు.. గోదావరి, మానేరు తీరం వెంట పులి అడుగులు కనిపిస్తుడటంతో అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలాల వైపు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. అటవీ ప్రాంతాల జల్లెడ ముత్తారం(మంథని): బేగంపేట అటవీ సెక్షన్ ఆఫీసర్ నర్సయ్య, స్థానిక బీట్ ఆఫీసర్లు అడవిశ్రీరాంపూర్, ఖమ్మంపల్లి అటవీ ప్రాంతాల్లో పులి జాడ కోసం సోమవారం జల్లెడ పట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీ చేశారు. కోయచెరువు గుడ్డెలుచెలుక ప్రాంతంలో పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించినా.. ఆ తర్వాత అది ఎటువైపు వెళ్లిందనే దానిపై స్పష్టత రాలేదని సెక్షన్ ఆఫీసర్ తెలిపారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే పఽశువుల కాపరులు, పొలాల వద్దకు వెళ్లే రైతులు, ప్రయాణాలు చేసే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజుకు 20 నుంచి 40 కి.మీ. ప్రయాణం 15 రోజులుగా గోదావరి, మానేరు తీరం వెంట సంచారం చెన్నూరు అడవుల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్న అధికారులు అటవీ గ్రామాల్లో ఆందోళన -
టీచర్ సస్పెన్షన్
సిరిసిల్ల ఎడ్యుకేషన్: కోనరావుపేట మండలం నిజామాబాద్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పని చేస్తున్న కె.బ్రహ్మంపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుతో అతనిపై పోక్సో కేసు నమోదైందని, ఫిబ్రవరి 24 నుంచి సస్పెన్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లా కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం దగ్ధంమంథని: భట్టుపల్లి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనం సోమవా రం మంటల్లో దగ్ధమైంది. సోమన్పల్లికి చెందిన వాహనదారు.. మంథని నుంచి 20 లీటర్ల పెట్రోల్‌ను బైక్‌పై తీసుకెళ్తున్నాడు. భట్టుపల్లి సమీపంలోకి వెళ్లగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనదారు ఆందోళన చెంది, బైక్‌ను పక్కకు పడవేశాడు. దీంతో పెట్రోల్ మంటల్లో బైక్ కాలిపోయింది. దారి వెంట వెళ్తున్న వాహనదారులు గమనించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే బైక్ కాలిబూడిదైంది. పోగొట్టుకున్న డబ్బులు అప్పగింత ● నిజాయితీ చాటుకున్న గుండి కార్యదర్శి రామడుగు(చొప్పదండి): ఓ వ్యక్తి పోగొట్టుకున్న డబ్బులు దొరికితే తిరిగి అప్పగించి, తన నిజాయితీ చాటుకున్నాడు గుండి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన గంగు ఎల్లయ్య సోమవారం దేవతా విగ్రహాలను కొనుగోలు చేయడానికి రామడుగు వచ్చా డు. నడుస్తూ వెళ్తుంటే అతని వద్ద ఉన్న రూ. 50 వేలు కిందపడిపోయాయి. ఎల్లయ్య చూ సుకోకుండానే ముందుకు వెళ్లిపోయాడు. అదే సమయంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కరీంనగర్ నుంచి గుండి గ్రామానికి వెళ్తున్నాడు. రామడుగు నూతన వంతెన వద్ద రూ.50 వేలు కనిపించాయి. విషయాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చి, ఆ డబ్బులను బాధితుడికి అప్పగించాలని సూ చించారు. దీంతో పోలీసులు గంగు ఎల్ల య్యను గుర్తించి, కరీంనగర్లో అడిషన్ డీసీపీ లక్ష్మీనారాయణ చేతులమీదుగా డబ్బులు అప్పగించారు. చొప్పదండి సీఐ ప్రకాశ్, రామడుగు ఎస్సై శేఖర్ ఉన్నారు.పెళ్లికి వెళ్లొచ్చేసరికి ఆభరణాలు చోరీ కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): గొల్లెం పెట్టిన ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుల వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మ ండలంలోని చిన్నరాతుపల్లికి చెందిన మద్దెల రాజేందర్ కుటుంబసభ్యులు సోమవారం ఇంటికి గొల్లెం పెట్టి, స్థానికంగా జరిగిన పెళ్లికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో చూడగా 9 తు లాల బంగారు, 8 తులాల వెండి ఆభరణా లు కనిపించలేదు. తమ వీధిలో జరిగిన పెళ్లికే వెళ్తున్నాం కదా అని తాళం వేయకుండా వెళ్లామని, చోరీ జరుగుతుందని అనుకోలేదని బాధితులు లబోదిబోమన్నారు. సు ల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై వెంకటేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రూ.1,439.55 కోట్లు
ఇసుక టెండర్ ఖరీదు ● పూడిక పేరిట మానేరు ‘ఇసుక’ మాయం! ● 20 ఏళ్లపాటు తోడుకునేందుకు అనుమతులు ● ఎల్ఎండీ, మధ్యమానేరు జలాశయాల్లో పూడికతీత పేరిట దందా ● నీరుండగానే పూడికతీసే పనులకు పర్మిషన్ ● ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా పేరిట వేగంగా టెండర్లుసిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి నదికి ఉపనదిగా ఉన్న మానేరువాగులో పూడిక పేరిట పెద్ద ఎత్తున ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈమేరకు పూడిక పేరిట రూ.1,439.55 కోట్ల విలువైన ఇసుకను తరలించేందుకు నీటిపారుదలశాఖ టెండర్లు పిలిచింది. 20 ఏళ్ల పాటు కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు డ్యాం(ఎల్ఎండీ), రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయాల్లో నిల్వ ఉన్న నీటిలో నుంచి ఇసుకను, మట్టిని తొలగించే పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈమేరకు ప్రభుత్వ ఖజానాకు రూ.1,439.55 కోట్ల ఆదాయం సమకూరేలా భారీ టెండర్లు పిలిచారు. నీరుండగానే ఇసుక తొలగింపు జిల్లాలోని బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద ఉన్న మధ్యమానేరు జలాశయంలో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు ఉండగా.. కరీంనగర్ ఎల్ఎండీలో 20 టీఎంసీల నీరుంది. ఈ జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేందుకు నీటిని దిగువకు వదులుతున్నారు. నీటినిల్వ, తరలింపు, నీటి వాడకానికి ఆటంకాలు ఎదురుకాకుండా జలాశయాల మధ్యలోకి యంత్రాలను పంపించి పూడిక మట్టిని, ఇసుకను, వ్యర్థాలను బయటకు తీసి వడబోసే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యంత్రాలను వినియోగిస్తారు. మట్టి నుంచి ఇసుకను వేరు వేసి ఇందులో లభించిన ఇసుకను టన్నుకు రూ.406.64 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ టెండరును దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించి ఇసుకను బహిరంగ మార్కెట్లో అమ్ముకునే అవకాశం కల్పించారు. నీరు ఉండగానే పూడిక పేరిట ఇసుకను తొలగించి అమ్ముకునే భారీ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మధ్యమానేరులో 247 లక్షల టన్నుల ఇసుక తొలగింపు నిజానికి మధ్యమానేరు జలాశయాన్ని 2018లో నిర్మించారు. తొలిసారి అప్పుడే నీటిని నిల్వచేశారు. మధ్యమానేరు జలాశయంలో పెద్దగా పూడిక లేదు. ఏడు గ్రామాలు మునిగిపోయి ఉన్నాయి. కానీ ఈ జలాశయంలో 247 లక్షల టన్నుల పూడిక పేరిట ఇసుకను తరలించేందుకు టెండర్లు పిలిచారు. 1985లో నిర్మించిన కరీంనగర్ ఎల్ఎండీలో 131 లక్షల టన్నుల పూడికను తొలగించాలని నిర్ణయించారు. 20 ఏళ్లపాటు పూడిక, మట్టి, వ్యర్థాలను వెలికితీస్తూ.. ఇసుకను తొలగిస్తూ.. అమ్ముకునే అవకాశాన్ని కాంట్రాక్టర్‌కు నీటిపారుదలశాఖ కల్పించింది. పూడిక పేరిట ఇసుకను భారీ ఎత్తున తరలిస్తే ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉంది. 29 జలాశయాల్లో సర్వేలు.. రెండింటిలో పనులు రాష్ట్ర వ్యాప్తంగా 29 జలాశయాల్లో పూడికతీతకు సర్వే చేశారు. తొలివిడతగా ఎల్ఎండీ, మధ్యమానేరు జలాశయాలను ఎంపిక చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో పూడికతీత.. ఇసుక అమ్మకాలు విజయవంతమైతే.. నిర్మల్ జిల్లా కడెంతోపాటు ఎల్లంపల్లి జలాశయంలోనూ పూడికతీతకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ జలాశయాల్లో నాణ్యమైన ఇసుక లభిస్తుందని ఇంజినీరింగ్ నిపుణులు అంచనా వేశారు. ఈమేరకు ఆధునిక విధానంలో నీరు ఉండగానే పూడికమట్టి, మొరం, ఇసుక తొలగించి వేరు చేసి దేనికదే అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇందిరమ్మ ఇళ్లకు.. తాగునీటికి ఇబ్బందులు లేకుండా.. పూడిక మట్టి తొలగింపుతో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని భావిస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీటినిల్వ తగ్గినప్పుడు నీరు రంగుమారిపోతుంది. మిషన్ భగీరథకు నీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టుల్లో నీరు ఉండగానే పూడిక తీయాలని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో భారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండగా.. పేదల ఇంటి నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలనే లక్ష్యంతో ఈ టెండర్లు పిలిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేస్తూ అధికారికంగానే నాణ్యమైన ఇసుకను నిర్మాణాలకు అందించాలని భావిస్తున్నారు. ఈమేరకు నీటిపారుదలశాఖ, గనులశాఖ, టీజీఎండీసీ అధికారులు రెండు జలాశయాల్లో రూ.1,439.55 కోట్ల ఇసుక టెండర్లను పిలిచారు. టెండర్లు దక్కించుకున్న బడా కాంట్రాక్టర్లు పని ప్రారంభిస్తే.. భారీ ఎత్తున ఇసుకను అమ్ముకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రవహించే మానేరు వాగులో బహిరంగ ఇసుక దోపిడీకి రాజకీయ నేతలు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగానే టెండర్లు పిలిచి ఇసుక వ్యాపారంతో సహజవనరుల దోపిడీ సాగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.