Khammam
-
కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రస్తుత సమాజంలోనే కొనసాగుతున్న కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌లో నిర్వహించనున్న ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాల్లో అందరూ భాగస్వాములు కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ నేటికీ వివిధ రూపాల్లో కులవివక్ష కొనసాగుతుండగా, పలు పట్టణాల్లో ఇంకా దళితులకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదని తెలిపారు. వీటిని పారద్రోలేందుకు చట్టాలు, జీఓలు ఉన్నా పాలకవర్గాలు అమలు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యాన ఏప్రిల్‌ను మహనీయుల మాసంగా ప్రకటించి పూలే, అంబేద్కర్ జన జాతరలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ప్రసాద్, నందిపాటి మనోహర్, నాయకులు మాచర్ల భారతి, బండి రమేష్, బొట్ల సాగర్, కొమ్ము శ్రీను, నకిరేకంటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు -
ఏప్రిల్ నెలాఖరు వరకు నీళ్లు ఇవ్వాల్సిందే...
కొణిజర్ల: కొణిజర్ల మండలం పెద్దగోపతి, చిన్నమునగాల, కాచారం గ్రామాల్లో పంటలను జల వనరుల శాఖ అఽధికారులు మంగళవారం పరిశీలించారు. ఎస్ఈ వాసంతి, ఈఈ బాబూరావు, డీఈ గౌతమి శిల్ప, ఏఈ నవీన్ పంటలు పరిశీలించగా పలువురు రైతులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపల్లె మేజర్ కింద తమ పంటలు ఎండిపోతుంటే నీళ్లు ఇవ్వకుండా, దిగువ మండలాలకు తరలించేడమేమిటని నిలదీశారు. అంతేకాక అధికారులు వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఎస్ఈ వాసంతి స్పందిస్తూ ఎన్నెస్పీ నుంచి బోనకల్ బ్రాంచ్ కాల్వకు విడుదల చేసే నీటిని తగ్గించారని, ఆ దామాషా ప్రకారమే మేజర్లకు నీరు విడుదల చేస్తున్నామని బదులిచ్చారు. అయినా సాయంత్రం నుంచి ఐదు రోజుల పాటు నిరంతరాయంగా నీరు విడుదల చేస్తామని చెప్పగా, కనీసం ఇప్పుడు వారం పాటు ఇవ్వాలని, ఏప్రిల్ 15 వరకు కాకుండా నెలాఖరు వరకు విడుదల చేస్తేనే పంటలు చేతికి వస్తాయని రైతులు పేర్కొన్నారు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎస్ఈ తెలిపారు. ఎన్నెస్పీ ఆయకట్టు రైతుల డిమాండ్ -
కమ్యూనిస్టు యోధుడు, పోరాట సారథి రవన్న
ఖమ్మంమయూరిసెంటర్: విప్లవ కమ్యూనిస్టు యోధుడు, ప్రతిఘటన పోరాట సారధి రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) అని, ఆయన ఆశయాల సాధన కోసం అందరూ ఉద్యమించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఏపీ, తెలంగాణ అధికార ప్రతినిధులు పి.ప్రసాద్, సాధినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎన్డీ ఆధ్వర్యాన రవన్న తొమ్మిది వర్ధంతి సభ సందర్భంగా మంగళవారం ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించాక భక్తరామదాసు కళాక్షేత్రంలో సమావేశమయ్యారు. తొలుత ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించాక నాయకులు మాట్లాడారు. విద్యార్థిగా ఉన్నప్పుడే విప్లవోద్యమానికి ఆకర్షితుడైన ఆయన ప్రతిఘటన పోరాట పంథా అమలు చేశాడని తెలిపారు. రవన్న ఆయన ఆశయ సాధనకు ఉద్యమిస్తూనే పాలకుల విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు ఆవునూరి మధు, వి.కోటేశ్వరరావు, ఎం.శ్రీనివాస్, గౌని ఐలయ్య, బండార ఐలయ్య, ఝాన్సీ, మంగ, అరుణోదయ నాగన్న, డేవిడ్ కుమార్, రాజేంద్రప్రసాద్, కోలా లక్ష్మీనారాయణ, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సభలో పీపీ, సాధినేని -
హామీలన్నీ నెరవేరుస్తున్నాం..
ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నాం. రుణమాఫీ పూర్తిచేసి రైతుభరోసా ఇస్తుండగా సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఈ బడ్జెట్లోనూ ఉమ్మడి జిల్లాలో కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. – పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రిజిల్లా సస్యశ్యామలమే లక్ష్యం ‘సీతారామ’ ప్రాజెక్టు పూర్తితో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం. ఖమ్మంలో అమృత్ పథకం కింద రూ.249 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నా. నగరం మొత్తం యూజీడీ కోసం రూ.1,500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించా. – తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిసైలో బంకర్ సమస్యను ప్రస్తావిస్తా.. అంబేద్కర్‌నగర్, బీసీ కాలనీవాసులు సైలో బంకర్‌తో పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీలో ప్రస్తావిస్తా. సీతారామ ప్రాజెక్టు కాల్వల భూసేకరణకు నిధులు కోరతా. గంగదేవిపాడు, తాళ్లపెంట రైతులకు పాస్‌పుస్తకాలు, చెక్‌డ్యామ్‌లకు నిధులు కేటాయించాలని విన్నవిస్తా. – డాక్టర్ మట్టా రాగమయి, ఎమ్మెల్యే, సత్తుపల్లి కళాశాలలు రావాలి.. నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ, పీజీ కళాశాలలు మంజూరు చేయాలని నివేదిస్తా. కొణిజర్ల, కారేపల్లి మండలాల్లో సాగర్ కాల్వలపై లిఫ్ట్‌ల నిర్మాణం ఆవశ్యకతను కూడా ప్రస్తావిస్తా. పర్యాటక కేంద్రంగా వైరా రిజర్వాయర్ అభివృద్ధి నిధులు కోరతాను. – మాలోత్ రాందాస్‌నాయక్, ఎమ్మెల్యే, వైరా -
రెండు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో అంకమ్మ తల్లి, అక్కమ్మ పేరంటాల శ్రీరామలింగయ్య స్వామి తిరునాళ్ల సందర్భంగా మంగళవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల స్థాయి న్యూ జూనియర్స్ ఎడ్ల పూటీ పందేలు నిర్వహించారు. ఈ పోటీల్లో వరుసగా ఐదు బహుమతులను ఏపీలోని గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు(రూ.30వేలు), బాపట్ల జిల్లా చిన్నగంజాంకు చెందిన ముంగర విజయలక్ష్మి(రూ.25ఏలు), కృష్ణా జిల్లా కొత్తపాలెంకు చెందిన ముత్తి నాని(రూ.20వేలు), బాపట్ల జిల్లా పెద్దపూడికి చెందిన ఆళ్ల హరికృష్ణ(రూ.17వేలు), బాపట్ల జిల్లా జజిరకి చెదిన యలమందల గోపాలకృష్ణ(రూ.15వేలు)కు చెందిన ఎడ్లు గెలుచుకున్నాయి. కాగా, సీనియర్స్ ఎడ్ల పూటీ పందేలు బుధవారం నిర్వహించనున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ పూజారి వేమిరెడ్డి వెంకటరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గాయపడిన కానిస్టేబుల్‌కు పరామర్శ ఖమ్మంక్రైం: సత్తుపల్లిలో పారిపోతున్న దొంగను పట్టుకునే క్రమాన కత్తి పోట్లకు గురై ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మల్లెల నరేష్‌ను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన ఆయన, కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఎకై ్సజ్ ఉద్యోగులకు రివార్డులుఖమ్మంక్రైం: గంజాయి రవాణా, అమ్మకం కేసుల్లో నిందితుల అరెస్ట్, శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టిన ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎకై ్సజ్ ఉద్యోగులు రివార్డులు అందుకున్నారు. వీరిని హైదరాబాద్‌లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఖమ్మం, కొత్తగూడెం ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు నాగేందర్‌రెడ్డి, జానయ్య, మణుగూరు, భద్రాచలం సీఐలు రాజిరెడ్డి, రహీమున్నీసాబేగంతో పాటు రాజు, సర్వేశ్వరరావు, రవికుమార్, కానిస్టేబుళ్లు మారేశ్వరావు, నాగేశ్వరరావు, పగిడిపర్తి గోపి రివార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి తిరుమలాయపాలెం: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్.. బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఏనెకుంటతండాకు చెందిన సుమన్‌నాయక్(30) మోటార్ సైకిల్‌పై కాకరవాయి వెళ్లి ఇంటికి వస్తుండగా కూలీలను దించేందుకు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమన్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య సునీత, 45 రోజుల కుమారుడు ఉన్నాడు. కూలీ పనులతో జీవనం సాగించే ఆయన మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోగా, సుమన్ మృతదేహం వద్ద సునీత రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. బల్లేపల్లి వద్ద ఒకరు... ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని బల్లేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రఘునాథపాలెంకు చెందిన రేవూరి సాయిప్రసాద్(35) గత నెల 26న ఖమ్మంలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈఘటనలో గాయపడిన ఆయనకు ఖమ్మం చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా మృతి చెందాడు. ఈమేరకు సాయిప్రసాద్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. యువతిపై అత్యాచారం చింతకాని: మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి సమీప గ్రామానికి చెందిన ఒక యువతిపై అత్యాచారం చేశాడు. ఈనెల 7వ తేదీన యువతిని బలవంతంగా బయటకు తీసుకెళ్లిన ఆయన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు. -
తొలిసారి తుంటి కీలు మార్పిడి శస్త్రచికిత్స
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి చరిత్రలోనే తొలిసారి తుంటి కీలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. కారేపల్లి మండలం ఎర్రబోడు మాణిక్యారానికి చెందిన గడిబోయిన వెంకటేశ్వర్లు చాన్నాళ్లుగా తుంటి నొప్పితో ఇబ్బంది పడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో సంప్రదిస్తే కీలు మార్పిడికి రూ.3 లక్షలు అవుతుందని చెప్పారు. నలుగురు కుమార్తెల తండ్రి అయిన ఆయన అంత వెచ్చించలేక, హైదరాబాద్ వెళ్లలేక ఖమ్మం పెద్దాస్పత్రిలో సంప్రదించాడు. దీంతో వైద్యులు ఆయన ‘ఎవాస్క్యూలర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమొరల్ హెడ్’తో బాధపడుతుండగా రెండు తుంటి కీళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తించారు. ఈమేరకు తుంటి కీలు మార్చి ‘అన్ సిమెంటెడ్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్’ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ప్రొఫెసర్లు ఎల్.కిరణ్‌కుమార్, హనుమాన్సింగ్, అసిస్టెంట్ ప్రొఫె సర్లు వినయ్‌కుమార్, మదన్‌సింగ్, అనస్తీషియన్ రవి, అసోసియేట్ ప్రొఫెసర్ యుగంధర్ ఆధ్వర్యాన ఆపరేషన్ చేయగా వెంకటేశ్వర్లు రెండో రోజునే వాకర్ సాయంతో నడక ప్రారంభించాడు. మరో పది రోజుల్లో ఇంకో తుంటి కీలు మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నామని వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.6లక్షల వ్యయమయ్యే ఈ చికిత్స ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందింది. వైద్యులను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త కిరణ్‌కుమార్, ఆర్ఎంఓ రాంబాబు, వినాయక్ రాథోడ్ అభినందించారు.విజయవంతంగా పూర్తిచేసిన పెద్దాస్పత్రి వైద్యులు -
మహిళలు స్వయంశక్తితో ఎదగాలి
వైరారూరల్: మహిళలు అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్వయంశక్తితో ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఆయన మంగళవారం వైరా మండలం పుణ్యపురం పర్యటన ముగించుకుని నుంచి ఖమ్మం వెళ్తుండగా కేజీ సిరిపురంలో గ్రామ మహిళా సమాఖ్య సమావేశం జరుగుతోందని తెలిసి హాజరయ్యారు. గ్రామ పరిస్థితి, తాగునీటి సరఫరా, పాఠశాల నిర్వహణ, వైద్యులు, గ్రామ కార్యదర్శి పనితీరు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సామాజిక స్వావలంబన సాధిస్తే వారి కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈమేరకు ఇందిరా మహిళా శక్తి ద్వారా సీ్త్ర టీ స్టాళ్లు, మిల్క్ పార్లర్ తదితర యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ఏ వ్యాపారం ఎంచుకున్నా శిక్షణ ఇప్పించాక ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఆ తర్వాత కూడా అధికారులు తోడుగా నిలుస్తారని కలెక్టర్ తెలిపారు. ఈసమావేశంలో అడిషనల్ డీఆర్డీఓ నూరొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
ఏసీబీకి చిక్కిన ఎకై ్సజ్ ఉద్యోగి
ఖమ్మంక్రైం: ఉద్యోగ విరమణ సమయం సమీపించినా తీరు మార్చుకోలేని ఎకై ్సజ్ ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం బస్ డిపో రోడ్డులో సాయికృష్ణ బార్ నిర్వహించిన శ్రీనివాస్ ఆరేళ్ల క్రితం మూసివేశాడు. మళ్లీ తెరవాలని నిర్ణయించుకున్న ఆయన ఏడాది లైసెన్స్ ఫీజు చెల్లించగా ఎకై ్సజ్ శాఖ అధికారులు అనుమతించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో బార్ లైసెన్స్‌కు జిరాక్స్ కాపీ కావాలని న్యాయవాది చెప్పడంతో శ్రీనివాస్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లానాయక్‌ను సంప్రదించాడు. ఇందుకోసం రూ.2వేలు డిమాండ్ చేయగా ఆర్థిక సమస్యలతో అంత ఇచ్చుకోలేనని చెప్పాడు. అయితే, లైసెన్స్ శ్రీనివాస్ తల్లి పేరిట ఉన్నందున ఆమెనే తీసుకురావాలని సూచించాడు. కానీ వృద్ధురాలైన ఆమె రాలేదని చెప్పినా ససేమిరా అనడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారి సూచన మేరకు రూ.1,500 ఇస్తానని శ్రీనివాస్ చెప్పగా సోమ్లానాయక్ అంగీకరించాడు. ఈమేరకు నగదుతో శ్రీనివాస్‌ను పంపించి మాటువేసిన ఏసీబీ అధికారులు డబ్బు తీసుకుంటుండగా సోమ్లాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోన్నారు. కాగా, ఏసీబీ దాడి జరిగిన సమయాన ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి సహా పలువురు అధికారులు ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను హైదరాబాద్‌లో రివార్డులు అందుకుంటుండడం గమనార్హం. 2012లో ఇదే ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి పట్టుబడిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు.లైసెన్స్ కాపీ జిరాక్స్ ఇచ్చేందుకు రూ.2వేలు డిమాండ్ -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత
తమిళనాడు జైలులో పరిచయంతో కలిసి దోపిడీలు ● వైరాలో దోచుకున్నాక కర్ణాటకలోనూ చోరీ ● రూ.37 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం వైరా: వివిధ నేరాలకు పాల్పడిన వారు తమిళనాడు జైలులో శిక్ష అనుభవించారు. అయితే, బెయిల్‌పై బయటకు వచ్చాక సైతం వారి స్నేహం కొనసాగింది. జల్సాల కోసం ఒకరు.. చేసిన అప్పులు తీర్చేందుకు మరొకరు చోరీలకు పాల్పడే వారు పాత అలవాట్లు మానుకోలేక మళ్లీ దొంగతనాలనే ఎంచుకున్నారు. అడ్డొస్తే ప్రాణాలు సైతం తీసేందుకు వెనకడుగు వేయని నైజం కలిగిన వారు నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఈమేరకు వైరాలో వృద్ధురాలు ఒంటరిగా ఉండడాన్నిగమనించి వారి ఇంట్లో గతనెల 12న చోరీ చేసిన ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వీరి వివరాలను మంగళవారం వైరాలో పోలీసు కమిషనర్ సునీల్‌దత్.. ఏసీపీ ఎం.ఏ.రెహమాన్‌తో కలిసి వెల్లడించారు. అందరినీ కలిపింది జైలు... ఏపీలోని పల్నాడు జిల్లా పోరేటిపాడుకు చెందిన రాయపాటి వెంకయ్య అలియాస్ దొంగల వెంకన్న, అదేజిల్లా దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన షేక్ నాగుల్‌మీరా, తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా మాణిక్యంపాలెంకు చెందిన ముత్తు అలియాస్ ముత్తురాజ్, వీరప్పన్ సత్రకు చెందిన విజయ్ అలియాస్ విజయ్‌కుమార్‌కు తమిళనాడులోని జైలులో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వివిధ నేరాలపై వెళ్లిన క్రమాన ఏర్పడిన పరిచయాన్ని బయటకు వచ్చాక కొనసాగించారు. ఈక్రమంలో ముఠాగా ఏర్పడిన వారు అధికారుల పేరిట తనిఖీలకు వెళ్లి దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే గతనెల 12న వైరాలోని సుందరయ్య నగరలో వృద్ధురాలు శీలం వెంకట్రావమ్మ ఒంటరిగా ఉందని గుర్తించారు. దీంతో నలుగురు కారులో వచ్చి పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఓ వ్యక్తికి ధరంచి వెంకట్రామ్మ ఇంటిలోకి వెళ్లి ఆమె కొడుకు గంజాయి అమ్ముతున్నాడని, ఇంట్లో సోదాలు చేయాలని చెబుతూ లోనకు ప్రవేశించారు. ఆపై వృద్ధురాలిని బంధించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారు వాడిన కారు, వచ్చివెళ్లిన రహదారులపై సీసీ పుటేజీల సాయంతో తెలంగాణ, ఏపీలో గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే నలుగురు మరోమారు కారులో వస్తుండగా వైరా మండలం దాచాపురం సమీపాన తనిఖీల్లో పోలీసులకు మంగళవారం పట్టుబడ్డారు. అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది.నాలుగు రాష్ట్రాల్లో కేసులు ఈ కేసులో పట్టుబడిన రాయపాటి వెంకన్నపై తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో కలిపి 30 కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. మరో నిందితుడు షేక్ నాగులు మీరాపై ఏపీ, కర్ణాటకలో 10 కేసులు ఉండగా, ముత్తుపై తమిళనాడు, కర్ణాటకలో 11, విజయ్‌పై తమిళనాడులో నాలుగు కేసులు ఉన్నాయని చెప్పారు. ఇందులో హత్య కేసులు కూడా ఉండడం గమనార్హం. కాగా, వైరాలో దోపిడీ అనంతరం ఫిబ్రవరి 16న విజయవాడలో కారు కిరాయి తీసుకుని 22వ తేదీన కర్ణాటక చేరుకున్నారు. అక్కడ వెంకన్న, నాగుల్‌మీరా, ముత్తు ఓ ఇంటికి వెళ్లి పౌర సరఫరాల శాఖ ఉద్యోగులుగా చెబుతూ కత్తులతో బెదిరించి 120 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. కాగా, వైరాతో పాటు కర్ణాటక చోరీ చేసిన ఆభరణాలు కలిపి రూ.37లక్షల విలువైన ఆభరణాలే కాక రెండు కార్లు, వేట కొడవళ్లు, గడ్డపార వంటి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు. కాగా, కేసు విచారణకు వైరా ఏసీపీ రహమాన్ ఆధ్వర్యాన సీఐ నునావత్ సాగర్ నేతృత్వంలో నాలుగు బృందాలను ఏర్పాటుచేశారు. ఈమేరకు నిందితులను అరెస్ట్ చేయడమేకాక చోరీ సొత్తు రికవరీచేసిన సీఐ సాగర్, వైరా తల్లాడ, కొణిజర్ల ఎస్సైలు భాగ్యరాజ్, కొండలరావు, సూరజ్, ట్రెయినీ ఎస్ఐలు పవన్, వెంకటేష్‌తో పాటు పలువురు కానిస్టేబుళ్లకు సీపీ రివార్డులు అందజేశారు. -
ఔను.. వీరు విజేతలు !
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసిన గ్రూప్ – 1, 2 ఫలితాల్లో జిల్లా వాసులు పలువురు సత్తా చాటారు. కష్టపడి చదివిన వీరు మెరుగైన మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి అభినందనలు అందుకుంటున్నారు. ఇందులో కొందరు ఇప్పటికే ఇతర ఉద్యోగాలు చేస్తూనే గ్రూప్స్‌కు సిద్ధం కాగా, ఇంకొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ సిద్ధమయ్యారు.● గ్రూప్–1, 2లో సత్తాచాటిన జిల్లా వాసులు ● ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న కొందరు..●కల్లూరు మండలం నుంచి ఇద్దరు కల్లూరురూరల్: గ్రూప్–1 ఫలితాల్లో కల్లూరు మండలం నుంచి ఇద్దరు యువకులు మంచి మార్కులు సాధించారు. మండలంలోని ఎర్రబోయినపల్లికి చెందిన దొడ్డాపునేని సందీప్ గ్రేప్–1 ఫలితాల్లో 506 మార్కులు సాధించాడు. ఆయన ప్రస్తుతం భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఎస్సైగా పనిచేస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సర్వేశ్వరరావు – పద్మ దంపతుల కుమారుడైన సందీప్ ఏన్కూరు రెసిడెన్షియల్ స్కూల్, హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ తర్వాత బీటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఎస్సై పోస్టుతో పాటు గతంలో గ్రూప్–4, రైల్వే శాఖలో ఉద్యోగం, పంచాయతీ కార్యదర్శి, అటవీ శాఖతో పాటు ప్రస్తుతం గ్రూప్–1 ఉద్యోగం కలిపి ఆయన ఆరు ఉద్యోగాలకు ఎంపికవడం విశేషం. ఇక చిన్నకోరుకొండికి చెందిన కుమ్మరి పంకజ్ గతంలోనే గురుకుల డిగ్రీ లెక్చరర్, జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులతో పాటు గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం గ్రూప్–1 పరీక్షలో 404 మార్కులు సాధించాడు. ఆయన తల్లిదండ్రులు కుమ్మరి ప్రభాకర్‌రావు, కృష్ణప్రియ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు.●గ్రూప్–2లో స్టేట్ ర్యాంక్.. కామేపల్లి: గ్రూప్–2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేయగా కామేపల్లి మండలం గోవింద్రాలబంజరకు చెందిన గంగారపు సత్యనారాయణ–జ్యోతిర్మయి దంపతుల చిన్న కుమారుడు రత్నేశ్వరనాయుడు రాష్ట్రస్థాయిలో 197వ ర్యాంకు సాధించాడు. అలాగే, జోనల్లో 27వ ర్యాంకు వచ్చింది. ఆయనకు గ్రూప్–1లోనూ 467 మార్కులు సాధించడం విశేషం. ప్రసుత్తం రత్నేశ్వరనాయుడు ఖమ్మం కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా సివిల్స్ సాధనే తమ కుమారుడి లక్ష్యమని సత్యనారాయణ తెలిపారు.●ఇది నాలుగో ఉద్యోగం.. తల్లాడ: తల్లాడ మండలం మల్లవరానికి చెందిన దుగ్గిదేవర వెంకటేశ్వరరావు గ్రూప్–2లో 387 మార్కులతో రాష్ట్రంలో 148వ ర్యాంకు, జోన్లో 20వ ర్యాంక్ సాధించాడు. సన్నకారు వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన బీకామ్ పూర్తి చేశాక 2018లో తొలిసారిగా ఏపీలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాదించాడు. 2019లో తెలంగాణలో అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ఉద్యోగం, 2020లో విద్యుత్ శాఖలో జేఏఓగా ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం జేఏఓగా విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి మెరుగైన ర్యాంకు సాధించాడు. తండ్రి చిన్నతనంలోనే మృతి చెందినా పట్టుదలతో చదివి తన ప్రతిభతో ఉద్యోగాలు సాధిస్తున్న ఆయన పలువురి అభినందనలు అందుకున్నాడు. కాగా, వెంకటేశ్వరరావు పదో తరగతి వరకు బాలభారతి విద్యాలయం, ఇంటర్ కేఎస్ఎం కళాశాల, డిగ్రీ ఖమ్మం డీఆర్ఎస్ కళాశాలలో చదివాడు. -
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు
భద్రాచలం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. కిన్నెరసానిలోని బాలురు, కాచనపల్లిలోని బాలికల స్పోర్ట్స్ స్కూళ్లతో పాటు హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ఐదో తరగతికి ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు డివిజన్ స్థాయిలో ఈనెల 16 నుంచి 18వరకు, జిల్లాస్థాయిలో 26 నుంచి 28వ తేదీ వరకు పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 9 – 11 ఏళ్ల వయస్సు కలిగిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు అర్హులని వెల్లడించారు. భద్రాద్రి జిల్లా విద్యార్థులు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో, ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉసిరికాయలపల్లిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగే డివిజన్ స్థాయి పోటీలకు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. అపై జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు తుది ఎంపిక పోటీలు నిర్వహించి ప్రవేశాలకు అర్హులను ఎంపిక చేస్తామని పీఓ తెలిపారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగగా, 19,835మంది విద్యార్థుల్లో 19,104మంది హాజరు కాగా 731మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. డీఈసీ, హెచ్పీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు తాను 46 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామని వెల్లడించారు. 14 నుంచి ఖమ్మం మార్కెట్‌కు సెలవులు ఖమ్మంవ్యవసాయం: హోలీ, వారాంతం నేపథ్యాన ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈనెల 14న శుక్రవారం హోలీ, 15న శనివారం వారాంతపు సెలవు, 16న ఆదివారం సాధారణ సెలవు ఉంటాయని, 17న సోమవారం మార్కెట్లో కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులతో పాటు వ్యాపారులు, కార్మికులు గమనించాలని కోరారు. ఏజెన్సీ నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్లో క్లీనింగ్ కాంట్రాక్టు దక్కించుకుని కార్మికుల వేతనాల్లో కోత విధిస్తున్న మహబూబాబాద్‌కు చెందిన సాయినాథ్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యులకు అధికా రులు మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న అంశంపై ‘సాక్షి’లో మంగళవారం ‘కార్మికుల కష్టం కాజేస్తున్నారు’ శీర్షికన కథనంప్రచురితమైంది. దీంతో ఏజెన్సీకి నోటీస్ జారీ చేసినట్లు కలెక్టరేట్ ఏఓ అరుణ తెలిపారు. ఈ నోటీసుకు అందే వివరణ ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గృహ నిర్మాణ పనుల పరిశీలన మధిర: మండలంలోని చిలుకూరును ఇందిరమ్మ ఇళ్లకు పైలట్ గ్రామంగా ఎంపిక చేయగా 37మంది లబ్ధిదారులు నిర్మాణాలను మొదలుపెట్టారు. ఈమేరకు పనులను మంగళవారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నమూనా, ఇప్పటివరకు అయిన వ్యయం తెలుసుకున్నారు. దశల వారీగా బిల్లులు మంజూరు కానున్నందున, నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఎం శ్రీనివాసరావు, గ్రామకార్యదర్శి మరీదు కొండలరావు, నాయకులు నిడమానూరు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆశల పల్లకిలో..
పెండింగ్ పనులకు నిధులు, కొత్త పథకాల అమలు, వీటి కోసం అర్హుల ఎదురుచూపులు... ఇలా ఉమ్మడి జిల్లా ప్రజలు బుధవారం నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్లో తమ కలలు సాకారం అవుతాయా.. అని ఎదురుచూస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో పనులకు కావాలి ్సన నిధులపై నివేదికలతో హైదరాబాద్ పయనమయ్యారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఉమ్మడి జిల్లాకు ఈ సారి బడ్జెట్లో నిధుల కేటాయింపు దండిగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంరూ.19వేల కోట్లలో ఎంత? ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా నిలిచే సీతారామ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.19,324 కోట్లకు ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఎంత మేర నిధులు ఈ బడ్జెట్లో కేటాయిస్తారో తేలాల్సి ఉంది. భారీగా నిధులు వస్తేనే ప్రాజెక్టు పనులు మరింత వేగవంతమయ్యే అవకాశముంది. ఇప్పటివరకు భద్రాద్రి జిల్లాలో ప్రధాన కాల్వ 104 కి.మీ. మేర పూర్తికాగా. భూసేకరణ, అటవీ అనుమతుల జాప్యంతో వైరా, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గాల్లో పనులు పెండింగ్ ఉన్నాయి. పర్యాటకంపై మరింత దృష్టి గత బడ్జెట్లో జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న కనకగిరి గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి పేర్కొనగా.. ఎకో టూరిజం పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యాన ఇక్కడ పర్యాటక ప్రాంతాలకు మహర్దశ వస్తుందని భావిస్తున్నారు. తద్వారా నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం, భద్రాచలం, ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వరాలయం తదితర పుణ్యక్షేత్రాలు కూడా నూతన శోభను సంతరించుకునే అవకాశముంది. రేషన్ కార్డులు, ఇళ్ల కోసం కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రజాపాలన సభల్లో ఖమ్మం జిల్లాలో 37,152 కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి 26న కొందరితో జాబితా విడుదల చేసినా మిగతా కార్డుల జారీపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే, మండలానికి ఒక్కో గ్రామంలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. దీంతో తమకు ఎప్పుడు అందుతాయని మిగతా గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. సమస్యల జాబితా చాంతాడంత ●గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జీపీలకు నిధులు కేటాయిస్తే మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. ఉమ్మడి జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం, ఖమ్మంలో యూనివర్సిటీ, నియోజ కవర్గాల్లో కళాశాలల ఏర్పాటు, ప్రాజెక్టులు తదితర సమస్యలకూ ఈ సమావేశాల్లో పరిష్కారం చూపుతారని భావిస్తున్నారు. ఇక కొత్త మండలాల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు. ●ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తే మురుగునీటి సమస్య పరిష్కారమై పారిశు ద్ధ్యం మెరుగుపడుతుంది. ఖమ్మంలో యూజీడీ నిర్మాణానికి రూ.1,200 కోట్ల కేటాయింపుపై ఈ బడ్జెట్లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ●సత్తుపల్లి మండలం కిష్టారం సమీపాన సింగరేణి గనుల నుంచి బొగ్గులోడింగ్ ఏర్పాటు చేసిన సైలో బంకర్‌తో అంబేద్కర్ నగర్, బీసీ కాలనీ ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. బంకర్‌ను తొలగించాలని దీక్షలు చేపట్టిన నేపథ్యాన సమస్య త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. ●నాగార్జునసాగర్ కెనాల్‌కు మధిర, ఎర్రుపాలెం మండలాల పరిధిలోని భూములు ఆయకట్టుకు చివరలో ఉన్నాయి. దీంతో సాగునీరు అందని కారణంగా దీన్ని జోన్–3 నుంచి జోన్–2లోకి మార్చేందుకు రూ.800 కోట్లతో వైరా, కట్టలేరు నదులపై ఆనకట్టలు నిర్మించి ఎత్తిపోతల ద్వారా ఈ రెండు మండలాలకు సాగునీరు అందించాలనే ప్రతిపాదన ఉంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మధిర నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు. అలాగే, మధిరలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ●ఖమ్మంరూరల్ మండలం ఎం.వీ.పాలెం కేంద్రంగా కొత్త మండలం చేయాలన్న డిమాండ్ ఉంది. కూసుమంచి మండలం పాలేరుకు ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల మంజూరైనా ఏర్పాటు కాలేదు. అలాగే బీచురాజుపల్లి వద్ద ఆకేరుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు ఒడ్డున రిటైనింగ్ వాల్ నిర్మాణంలో పట్టాభూమి కోల్పోతున్న వారు మార్కెట్ ధర ప్రకారం పరిహారం డిమాండ్ చేస్తున్నారు.రాష్ట్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా వాసుల్లో ఆసక్తి సీతారామ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యతపై అంచనా పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తారని భావన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఇతర పథకాలకు ఎదురుచూపులు భారీగా నిధులు సాధిస్తామంటున్న ఎమ్మెల్యేలు -
ఖమ్మం అంతటా యూజీడీ!
● రూ.1,200 కోట్లతో 900 కి.మీ. నెట్‌వర్క్‌కు ప్రతిపాదనలు ● అమృత్–2.0 కింద రూ.249 కోట్లతో తొలిదఫా నిర్మాణం ● నేడు 9.5 కి.మీ. పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి తుమ్మల ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంలో నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఓపెన్ డ్రెయినేజీలతో పారిశుద్ధ్య లోపం ఎదురవుతుండగా సగానికి పైగా కార్మికులను డ్రెయినేజీలను శుభ్రం చేయడానికే కేటాయించాల్సి వస్తోంది. దీంతో అధికారులు, పాలకులు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ) నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను ప్రభుత్వానికి సమర్పించారు. నగరంలో 900 కి.మీ. మేర యూజీడీ నిర్మాణానికి రూ.1,200 కోట్లు అవసరమని అందులో పొందుపర్చారు. ఎక్కడా మురుగు కనిపించకుండా.. ఖమ్మం నగరమంతా యూడీజీ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. ఇది కార్యరూపం దాలిస్తే ఇళ్ల నుంచి మురుగునీరు, వ్యర్థాలు యూజీడీలోకి చేరేలా కనెక్షన్ ఇస్తారు. ఆపై మురుగునీటి శుద్ధీకరణ కోసం ఏడు ఏస్టీపీ(సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లు నిర్మిస్తారు. తద్వారా నగరంలోని 60 డివిజన్ల పరిధిలో ఎక్కడా ఓపెన్ డ్రెయినేజీ ఉండదని చెబుతున్నారు. కాగా, ఎస్టీపీల్లో శుద్ధి చేశాక ఆ నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించడంతో పాటు మిగిలితే మున్నేటిలోకి వదలనున్నారు. నేడు శంకుస్థాపన మహానగరాలకు దీటుగా విస్తరిస్తున్న ఖమ్మంలో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాటే పారిశుద్ధ్య సమస్య పెరుగుతుండగా అమృత్–2.0 ద్వారా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ)ని నిర్మాణానికి ఏర్పాట్లుచేశారు. తొలిదశలో రూ.249 కోట్ల నిధులతో 9.6 కి.మీ. మేర నిర్మించే యూజీడీ పనులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం శంకుస్థాపన చేస్తారు. యూజీడీతో పాటు రెండు ఎస్టీపీల నిర్మాణానికి సైతం ఆయన శంకుస్థాపన చేయనుండగా, పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఖానాపురం ఊర చెరువు నుండి ధంసలాపురం వరకు.. యూజీడీ నిర్మాణం ఖానాపురం ఊర చెరువు వద్ద మొదలవుతుంది. ఊర చెరువులో మురుగునీరు కలవకుండా కనెక్టింగ్ పాయింట్ ఏర్పాటుచేస్తారు. అక్కడ నుండి బైపాస్ రోడ్డు, లకారం చెరువు–మినీ లకారం చెరువుల మధ్య నుండి ధంసలాపురం చెరువు మీదుగా మున్నేరు వరకు నిర్మిస్తారు. ఇందులోకి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు రెండు ఎస్టీపీలు నిర్మించనున్నారు. ధంసలాపురం చెరువు వద్ద 44 ఎంఎల్డీల సామర్థ్యంతో, పుట్టకోట చెరువు వద్ద 9.5 ఎంఎల్డీ సామర్థ్యంతో వీటి నిర్మాణం చేపడుతారు. యూజీడీతో పాటు ఈ రెండు ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే నగరంలో మురుగు సమస్య చాలావరకు పరిష్కారమవుతుంది. ఇక గోళ్లపాడు చానల్ ఆధునికీకరణలో భాగంగా నిర్మించిన యూజీడీకి సంబంధించి శ్రీనివాసనగర్ ప్రాంతంలో ఎస్టీపీ పూర్తయితే మురుగునీరు మున్నేరులో కలవకుండా అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. నీటి కలుషితం కావొద్దనే.. ప్రస్తుతం నగరంలో గృహాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నుండి వస్తున్న మురుగు నీరు నేరుగా చెరువులు, మున్నేరులో కలిసి అందులోని నీరు కలుషితమవుతోంది. తద్వారా భవిష్యత్‌లో భూగర్భ జలాలు కలుషితతమయ్యే ప్రమాదముంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అధికారులు ఖమ్మంలో యూజీడీ నిర్మాణానికి సిద్ధమయ్యారు. చెరువులు, మున్నేరులో మురుగు నీరు కలవకుండా అడ్డుకునేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును పూర్తిచేసి దశల వారీగా మిగతా చోట్ల కూడ నిర్మిస్తే భవిష్యత్‌లో నగరవాసులకు ఓపెన్ డ్రెయినేజీ ఎక్కడ కానరాదని చెబుతున్నారు. -
ఒక్క ఎకరం కూడా ఎండిపోవద్దు..
● సమన్వయంతో చివరి ఆయకట్టుకు సైతం సాగునీరు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డినేలకొండపల్లి: నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా కార్యాచరణ సిద్ధంచేశామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశాక ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కబెడుతూనే ఒక్కో హామీ అమలుచేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని పలు చోట్ల రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్న నేపథ్యాన ఎక్కడా ఇబ్బంది ఎదురుకాకుండా సాగునీటి సరఫరాకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సన్న రకం ధాన్యం అమ్మిన రైతులందరికీ వారంలోగా బోనస్ జమ చేస్తామని, ఈ నెలాఖరులోపు రైతు భరోసా నిధులు అందిస్తామని తెలిపారు. ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మార్కెట్, సొసైటీ చైర్మన్లు వెన్నపూసల సీతారాములు, బాలాజీ, నాయకులు శాఖమూరి రమేష్, భద్రయ్య, గుండా బ్రహ్మం, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వైరాకు కోటా కంటే ఎక్కువ ఇళ్లు వైరా: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుండగా, వైరాలో గిరిజనులు అధికంగా ఉన్నందున ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్ వినతితో మరిన్ని ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైరాలోని క్యాంపు కార్యాలయంలో ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, గుమ్మా రోశయ్య, గోసు మధు, సీతారాములు, నర్సిరెడ్డి, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రిటైనింగ్ వాల్ పనుల్లో వేగం పెంచాలి ఖమ్మంఅర్బన్: మున్నేటికి ఇరువైపులా రూ.690కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్స్ పనుల్లో వేగం పెంచాలని, ఇందుకు అవసరమైన భూసేకరణపై దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి జలవనరులు, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షించారు. నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇచ్చేలా నివేదిక సమర్పిస్తే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అంతేకాక ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలకు వచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో జలవనరుల శాఖ ఎస్ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీఓ నర్సింహారావు, జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈలు ఉదయ్‌ప్రతాప్, రమేష్‌రెడ్డి, మన్మధరావు పాల్గొన్నారు. -
●మండుటెండల్లో బంతిపూల సోయగం
ఓ పక్క ఎండ మండిపోతుండగా సాగునీరు అందక వరి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అయితే, పెద్దసంఖ్యలో ముహూర్తాలు ఉండడంతో శుభకార్యాలు జరుగుతాయని.. తద్వారా బంతిపూలకు డిమాండ్ ఉంటుందని గ్రహించిన కొణిజర్లతో పాటు పల్లిపాడుకు చెందిన పలువురు రైతులు గత నెలలో బంతి సాగు చేశారు. ప్రస్తుతం తోటలు విరబూయగా పెళ్లిళ్లకు కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఉగాది, శ్రీరామనవమి నాటికి ఇంకాస్త ధర పెరిగితే లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు. – కొణిజర్ల -
దరఖాస్తు చేసుకుంటే స్థలాల రిజిస్ట్రేషన్
● రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలి ● ఎల్ఆర్ఎస్ అవగాహన సదస్సులో డీఆర్ రవీందర్ ఖమ్మంమయూరిసెంటర్: 2020 ఏడాదికి ముందు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి నుంచి నిర్ణీత రుసుము కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్(డీఆర్) ఎం.రవీందర్ తెలిపారు. ఖమ్మంలోని జెడ్పీ సమావేశ మందిరం, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో సోమవారం రియల్ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్ల నిర్వాహకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ను రిజిస్ట్రేషన్ శాఖకు ఇటీవల ప్రభుత్వం లింక్ చేసిందని తెలిపారు. వెంచర్లలో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ పూర్తయి, మిగిలిన వాటికి ఎల్ఆర్ఎస్లో దరఖాస్తు చేసి ఉంటే ఫీజులు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. ఈమేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయడమే కాక ఫీజు చెల్లించి, అండర్ టేకింగ్ ఇస్తే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అంతేకాక 2020 ఆగస్టు 26కు ముందు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోలేకపోయినా వారి స్థలా లకు అన్నీ సక్రమంగా ఉంటే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించొచ్చని తెలిపారు. తద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించారు. కాగా, కేఎంసీలో జరిగిన సమావేశంలో కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల కోసం కార్యాలయంలో ఎనిమిదింటితో పాటు పన్నుల వసూళ్ల కేంద్రాల్లోనూ హెల్ప్‌డెస్క్‌లు ఏర్పా టు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తం చేసిన అనుమానాలను అధికారులు నివృత్తి చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట, సబ్ రిజిస్ట్రార్ టి.సంపత్‌కుమార్, జాయింట్ రిజిస్ట్రార్ ఎస్.రమా కిషోర్‌రెడ్డి, కేఎంసీ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వసుంధర తదితరులు పాల్గొన్నారు. -
వైరల్ ఫీవర్‌తో వ్యక్తి మృతి
పెనుబల్లి: మండలంలోని యడ్లబంజర్ గ్రామానికి చెందిన రైతు బన్నే శ్రీనివాసరావు (35) వైరల్ ఫీవర్ బారిన పడి మృతి చెందాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనను ఆదివారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింగా వైరల్ ఫీవర్‌గా నిర్ధారించి చికిత్స చేస్తుండగానే సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి నేలకొండపల్లి: రోడ్డుప్రమాదంలో గాయపడిన మండలంలోని ఆరెగూడెంకు చెందిన కొమ్మినేని జగ్గయ్య(86) చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేలకొండపల్లి శివారులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయనను హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే సోమవారం మృతి చెందాడు. జగ్గయ్యకు భార్య, ఇరువురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ఆయన మృతదేహం వద్ద మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములుతో పాటు శాఖమూరి రమేష్, వడ్డె జగన్, మార్తి సైదయ్య, కె.భాస్కర్‌రావు తదితరులు నివాళులర్పించారు. స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకుడు మృతి ఖమ్మంరూరల్: మండలంలోని బారుగూడెం పరిధి శ్రీ సిటీకి చెందిన పిట్టల మనీష్(31) ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శ్రీసిటీకి చెందిన పిట్టల సుధాకర్ – నిర్మల పెద్ద కుమారుడు మనీష్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఆళ్లగడ్డలో తన స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు ఆయన వెళ్లాడు. ఈక్రమంలోనే మరికొందరు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ఆళ్లగడ్డ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మనీష్ మృతి చెందాడు. కాగా, ఆయనకు గత ఏడాది వివాహం జరగగా భార్యాభర్తలిద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. మనీష్ తండ్రి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, మృతదేహం మంగళవారం స్వగృహానికి చేరుకుంటుందనే సమాచారం అందగా, మనీష్ మృతి చెందినట్లు తెలియడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆటో బోల్తా, 14 మంది కూలీలకు గాయాలు సత్తుపల్లిటౌన్: కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోలాపడడంతో 14 మందికి గాయాలయ్యాయి. కాకర్లపల్లికి చెందిన 14 మంది ఉపాధి హామీ కూలీలు సోమవారం ఉదయం సత్తుపల్లి తామర చెరువుమీదుగా కాకర్లపల్లి శివారులోని ఉపాధి పనులకు బయలుదేరారు. తామరచెరువు అలుగు వద్ద ఆటో కట్టపైకి వెళ్లే సమయాన అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో గాయపడిన కూలీలను 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, తీవ్రగాయాలైన కె.పుల్లమ్మను ఖమ్మం తీసుకెళ్లారు. క్షతగాత్రులకు ఎంపీడీఓ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పరామార్శించారు. పసికందు విక్రయ కేసులో ముగ్గురికి జైలుశిక్షకొత్తగూడెంటౌన్: రెండు రోజుల మగ శిశువును విక్రయించిన కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలుశిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం జిల్లా రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు ఇలా.. 2016లొ కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన నందబాల బాల వరలక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులు తమ రెండో కుమారుడు, రెండు రోజుల మగ శిశువును సిరిసిల్లకు చెందిన గాజుల రవీందర్‌కు విక్రయించారు. రూ. 80 వేలకు ఒప్పందం చేసుకోగా, అడ్వాన్స్ రూ.50 వేలు ఇచ్చి రవీందర్ పసికందును తీసుకెళ్లాడు. విషయం తెలియడంతో అప్పటి ఐసీడీఎస్ సూపర్వైజర్ పయ్యావుల రమాదేవి కొత్తగూడెం త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. తొమ్మిది మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి ముగ్గురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.విశ్వశాంతి వాదించగా, సీఐ శివప్రసాద్, నోడల్ ఆఫీసర్ జి. ప్రవీణ్‌కుమార్, సిబ్బంది అబ్దుల్ ఘని, బి.శోభన్ సహకరించారు. -
సామాజిక బాధ్యత అవసరమే..
● నగరాల అభివృద్ధిలో కీలకంగా సీఎస్ఆర్ ఫండ్ ● పలుచోట్ల ఈ నిధులతోనే పనులు ● ఖమ్మంలోనూ సంస్థలు ముందుకొస్తే ఫలితం ఖమ్మంమయూరిసెంటర్: సామాజిక బాధ్యత కలిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలు అందించే ఆర్థిక తోడ్పాటు నగరాభివృద్ధికి అండగా నిలవనుంది. సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) ఫండ్‌తో ఇప్పటికే పలు నగరాల్లో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ఆర్థికంగా బలపడి ఆదాయ పన్ను చెల్లించే వారు సీఎస్ఆర్ ద్వారా సహకారం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని పూణే వంటి నగరాల్లో అభివృద్ధి తెలియచేస్తోంది. ఇటీవల పూణే నగరంలో కేఎంసీ బృందం పర్యటించిన సమయాన అక్కడి వ్యాపారులు, సంస్థలు, ఆదాయపన్ను చెల్లింపుదారులు పూణే మున్సిపల్ కార్పొరేషన్‌కు సీఎస్ఆర్ ద్వారా భారీగా విరాళాలు అందిస్తున్నట్లు గుర్తించారు. ఈ నిధులతో అక్కడి కార్పొరేషన్ అధికారులు ఒక ఆస్పత్రిని నిర్మించడం విశేషం. అంతేకాక నగరంలోని పలు కూడళ్ల సుందరీకరణ, నిర్వహణ పనులు చేస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ నిధులకు తోడుగా... అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, నగరాల్లో ప్రజల సామాజిక బాధ్యత, భాగస్వామ్యం కీలకంగా నిలుస్తోంది. ఖమ్మంలో ప్రస్తుతం ప్రజలు చెల్లించే పన్నులతో పాటు ప్రభుత్వం మంజూరు చేసే నిధులతోనే అభివృద్ధి పనులను చేపడుతున్నారు. వీటికి తోడు సామాజిక బాధ్యత కలిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, కార్పొరేట్ ఆస్పత్రులు, పాఠశాలల బాధ్యులు సీఎస్ఆర్ ఫండ్ అందజేస్తే మరికొన్ని పనులు వేగంగా చేపట్టేందుకు వీలవుతుంది. పూణే స్టడీ టూర్లో కేఎంసీ కార్పొరేటర్లు, అధికారులు సీఎస్ఆర్ ద్వారా అందుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నారు. దీంతో ఖమ్మంలోనూ వ్యాపార, వాణిజ్య సంస్థలే కాక కార్పొరేట్ సంస్థలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలు మొదలుపెట్టారు. తద్వారా కేఎంసీకి నిధులు సమకూరి అభివృద్ధికి మెరుగైన అవకాశాలు ఏర్పడడమే కాక ఆయా సంస్థలకు ఆదాయపన్నులో రాయితీ లభించనుంది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు సీఎస్ఆర్ ద్వారా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధులు సమకూరితే ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడం వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా అంగన్వాడీ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, గ్రంథాలయాలు, కమ్యూనిటీ టాయిలెట్లు, పార్క్‌ల అభివృద్ధి, యానిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్, వాల్ పెయింటింగ్స్ కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం కేఎంసీకి వస్తున్న ఆదాయ పన్ను, ప్రభుత్వం మంజూరు చేసే వివిధ రకాల నిధులు ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, చిన్నచిన్న అభివృద్ధి కార్యక్రమాలకే సరిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో నిధులు లేక పనులు ఆగిపోయిన సందర్భాలు ఎదురయ్యాయి. వీటన్నింటిని అధిగమించాలంటే దేశంలోని పలు మహానగర పాలక సంస్థలకు అందుతున్న విధంగానే ఖమ్మం నగరానికి సీఎస్ఆర్ ఫండ్ వస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది. అనేక అవకాశాలు ఖమ్మం నగరానికి చెందిన పలువురు వ్యాపారులు సామాజిక బాధ్యతలు నిర్వర్తించడంలో ముందు వరుసలో నిలుస్తున్నారు. మున్నేటి వరద వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వీరు స్పందించి ఇటు కలెక్టర్, అటు సీఎం రిలీఫ్ ఫండ్‌కు నిధులు సమకూరుస్తున్నారు. ఇతర పట్టణాలు, నగరాలతో పోలిస్తే ఖమ్మంలో సామాజికంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం, అవసర సమయాన నిధులను అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారిని ఒప్పించి కేఎంసీకి సీఎస్ఆర్ ఫండ్ సేకరించగలిగితే వారికి యూటీ(యుటిలైజేషన్ సర్టిఫికెట్) అందుతుంది. తద్వారా ఆదాయ పన్నులో మినహాయింపు లభించనుంది. ఆపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి, సుందరీకరణకు కీలకంగా నిలుస్తారు. ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రులు, పాఠశాలలు, బంగారు ఆభరణాల షోరూంలు, షాపింగ్‌మాల్స్ ఉన్నందున వీటి ద్వారా నిధులు రాబట్టవచ్చనే భావనకు వచ్చిన ప్రజాప్రతినిధులు ఆ దిశగా త్వరలోనే కార్యాచరణ మొదలుపెట్టే అవకాశముందని తెలుస్తోంది. -
కార్మికుల కష్టం కాజేస్తున్నారు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిబంధనల ప్రకారం కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాల్లో కాంట్రాక్టర్ కోత విధిస్తున్నాడు. ఇదేమిటని అడిగితే విధుల నుంచి తొలగిస్తాడనే భయంతో పనిచేయాల్సి వస్తోందని కలెక్టరేట్లో క్లీనింగ్ సెక్షన్ కార్మికులు చెబుతున్నారు. ‘ఎంత వేతనం వస్తుంది’ అని కలెక్టర్ అడిగినా నోరు విప్పలేని పరిస్థితి ఎదుర్కొంటున్న వారి సమస్యలపై సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో భారత కార్మిక సంఘాల కేంద్రం(టీయూసీఐ) నాయకులు ఆవుల అశోక్, పుల్లయ్య, కె.శ్రీను కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వేతనాల్లో కోత.. అడిగితే బెదిరింపులు కలెక్టరేట్లో క్లీనింగ్ కోసం ఏటా టెండర్లు పిలిచి తక్కువ కోట్ చేసిన వారికి అప్పగిస్తున్నారు. ఈ ఏడాది మహబూబాబాద్‌కు చెందిన సాయినాథ్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ దక్కగా 20 మంది వరకు సూపర్వైజర్లు, వర్కర్లు పనిచేస్తున్నారు. సూపర్వైజర్కు రూ.19,500, వర్కర్‌కు రూ.15,600 వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించాలి. కానీ వర్కర్‌కు రూ.7వేలు, సూపర్వైజర్కు రూ.14వేలే ఇస్తుండడంతో ఒక్కొక్కరు రూ.5వేల మేర ప్రతీనెలా నష్టపోతున్నారు. ప్రతిరోజు ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాల్సి ఉండగా మంత్రుల సమీక్షలు, ఇతర సమావేశాలు ఉన్నప్పుడు అదనంగా పనిచేస్తున్నా లాభం ఉండడం లేదని చెబుతున్నారు. అంతేకాక తమకు రావాల్సినంత చెల్లించాలని కాంట్రాక్టర్‌ను అడిగితే పనిలో నుంచి తీసే స్తానని బెదిరిస్తున్నాడని వాపోయారు. ఈమేరకు ప్రజావాణిలో టీయూసీఐ నాయకులు ఆవుల అశోక్, పుల్లయ్య, కె.శ్రీను తదితరులు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేసి గత మార్చి నుంచి ఇప్పటి వరకు వర్కర్లకు రావాల్సిన వేతనాలు ఇప్పించాలని కోరారు. ఈ విషయమై ఏఓ అరుణను వివరణ కోరగా మంగళవారం విచారణకు హాజరు కావాలని ఔట్సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యులను సమాచారం ఇచ్చామని, విచారణలో తేలే అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కలెక్టరేట్లో క్లీనింగ్ ఏజెన్సీ బాధ్యులపై ఫిర్యాదు -
పారదర్శకంగా సేవలు అందించాలి
ఖమ్మంసహకారనగర్: నీతి, నిజాయితీతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని టీటీడీసీలో రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ అంశాలపై ఏర్పాటుచేసిన రెండు రోజుల శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతిరోజు చేయాల్సిన విధులు, బాధ్యతలను పక్కాగా నిర్వర్తించేలా శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలు, వివిధ పనుల కోసం జారీచేసే మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. భూచట్టాలపై పట్టు సాధించి దరఖాస్తులను పరిష్కరించాలని, భూలావాదేవీల పరిష్కారంలో అవకతవకలకు పాల్పడొద్దని సూచించారు. అంతేకాక కుటుంబం, విధులను సమాంతరంగా నిర్వర్తిస్తే ఇబ్బందులు ఉండవని కలెక్టర్ తెలిపారు. అనంతరం రిటైర్డ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సురేశ్ పొద్దర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు టి.కరుణాకర్‌రెడ్డి, అధికారులు పలు అంశాలపై అవగాహన కల్పించారు.జూనియర్ అసిస్టెంట్లకు శిక్షణలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈవీఎం గోదాం తనిఖీ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల గోదాంను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సోమవారం తనిఖీ చేశారు. నియోజకవర్గాల వారీగా బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు భద్రపరిచిన గదుల్లో పరిశీలించి భద్రతపై సూచనల చేశారు. ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ స్వామి, డీటీ అన్సారీ, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రాథమిక దశలో గుర్తిస్తే కళ్లకు రక్షణ
ఖమ్మంవైద్యవిభాగం: తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా తొలి దశలోనే గుర్తిస్తే గ్లకోమా బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్ తెలిపారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా సోమవారం ఆస్పత్రిలో ప్రత్యేక కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ తెలియకుండానే కంటి చూపును దెబ్బతీసే గ్లకోమాపై అవగాహన అవసరమని చెప్పారు. కంటి వైద్య నిపుణులు రామూనాయక్ మాట్లాడుతూ వెలుతురు చుట్టూ రంగుల వలయాలు కనిపించడం, కంటినొప్పి, దృష్టి కోల్పోవడం వంటి లక్షణాలే కాక కళ్లకు దెబ్బ తగిలినవారు, స్టెరాయిడ్ వాడేవారు, మధుమేహం, రక్తపోటు బాధితులు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్‌కుమార్, కంటి విభాగం వైద్యులు ఆయేషాబేగం, సీనియర్ రెసిడెంట్లు రాజశేఖర్, ఆస్మా, శ్రావణి, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లు వీణ, నరేష్, పాల్గొన్నారు. -
నీరు వృథా చేయకుండా వాడుకోండి
బోనకల్: వారబందీ విధానంలో విడుదలవుతున్న సాగర్ జలాలను వృథా చేయకుండా పంటలకు ఉపయోగించుకోవాలని జల వనరుల శాఖ ఎస్ఈ వాసంతి రైతులను కోరారు. బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో చివరి ఆయకట్టుకు నీరందించే ఆళ్లపాడు మైనర్‌ను సోమవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆళ్లపాడు రైతులు వారబందీ విదానంలో కాకుండా పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరారు. దీంతో స్పందించిన ఆమె ఆళ్లపాడు మైనర్‌కు ఎక్కువ మొత్తంగా నీరు విడుదల చేయాలని ఉద్యోగులను ఆదేశించారు. అలాగే, తహసీల్దార్ పున్నంచందర్ ఆధ్వర్యాన కాల్వపై అడ్డంకులను తొలగించగా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, జేఈ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.జల వనరుల శాఖ ఎస్ఈ వాసంతి -
రైల్వే బోర్డు చైర్మన్‌తో ఎంపీ వద్దిరాజు భేటీ
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో ఆయనతో భేటీ అయిన ఎంపీ ఇక్కడ రైల్వే సమస్యలను ప్రస్తావించారు. పలు స్టేషన్ల ఆధునికీకరణ, ప్లాట్‌ఫాంల విస్తరణ, కోవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, ఇంకొన్ని స్టేషన్లలో హాల్టింగ్, కొత్త రైళ్ల మంజూరుపై చర్చించారు. ఈమేరకు సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారని ఎంపీ రవిచంద్ర తెలిపారు. ఆయిల్‌పామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయండి ఖమ్మంవన్‌టౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు విస్తృతంగా ఉన్నందున కేంద్రప్రభుత్వం ఆధ్వర్యాన ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా సోమవారం ఆయన మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుండగా, ప్రస్తుతం 91,200హెక్టార్లలో ఉన్న సాగును ఏటా 40వేల హెక్టార్ల మేర విస్తరించాలనే లక్ష్యం ఉందని తెలిపారు. సుస్థిర వ్యవసాయానికి మద్దతు ఇస్తూనే నూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈనేపథ్యాన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ ఆధ్వర్యాన ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఎంపీ వెల్లడించారు. లైబ్రరీ భ వనానికి రూ.2 కోట్లు ఖమ్మంగాంధీచౌక్: జిల్లా కేంద్ర గ్రంథాలయ అదనపు భవన నిర్మాణానికి సోమవారం రూ, 2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్‌కు ఆనుకుని ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అదనపు నిర్మాణాలకు రూ.2.80 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించగా ఖమ్మం ఎమ్మెల్యే అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.80లక్షలు కేటా యించారు. మిగతా రూ.2 కోట్లను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మంజూరు చేసింది. కాగా, జిల్లా లైబ్రరీ పాత పురాతన భవనం శిథిలమై 2024 జనవరి 13న కూలిపోయింది. కూలిన భవనం పక్కన మరో భవనం ఉన్నా పూర్తిస్థాయిలో సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పరిపాలనా విభాగాన్ని ఖమ్మం పాత మున్సిపాలిటీ భవనంలోకి మార్చారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో నూతన భవనాలు నిర్మించనుండగా ఇక్కట్లు తీరనున్నాయి. ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఓ పక్క కొనసాగుతుండగానే ఇప్పటికే పూర్తయిన పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనం మొదలుపెట్టా రు. ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ జూని యర్ కళాశాలలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం ఏర్పాటుచేయగా వివిధ జిల్లాల నుంచి 20వేలకు పైగా సంస్కృతం జవాబుపత్రాలను పంపించారు. తొలిజు 24మంది అధ్యాపకులతో పాటు ఇద్దరు చీఫ్ ఎగ్జామినర్లు, ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జామినర్లు విధులు నిర్వర్తించారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 15జవాబుపత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. 398 మంది గైర్హాజరు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని డీఐ ఈఓ రవిబాబు తెలిపారు. మొత్తం 17,078 మంది విద్యార్థుల్లో 398మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతీ గదిలో గోడ గడియారాలు ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రచారం ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంబంధిత ప్రమాదాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ల వారీగా ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని పేర్కొన్నారు. రైతులు, వినియోగదారుల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు సొంతంగా మరమ్మతు చేయకుండా సిబ్బందికి సమాచారం ఇస్తే వెంటనే పరిష్కరిస్తామంటూ వివరిస్తామని వెల్లడించారు. -
ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందిస్తున్న ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒకసారి అందిన దరఖాస్తు రెండో సారి రాకుండా పరిష్కరించాలని, అలా సాధ్యం కాకపోతే కారణాలను వివరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్ఓ పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ●ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లికి చెందిన పెందుర్తి కృష్ణవేణి కుమారుడు శ్యాంప్రసాద్ మృతి చెందిన నాలుగేళ్లకు ఆమె కూడా కన్నుమూసింది. దీంతో శ్యాంప్రసాద్ కుటుంబీకులు తప్పుడు ధ్రువపత్రాల ఆధారంగా ఐదెకరాల భూమిని బదలాయించుకున్నారని కృష్ణవేణి కుమార్తెలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ●సింగరేణి మండలానికి చెందిన సయ్యద్ చాంద్ పాషా సర్వే నంబర్ 161లోని పట్టా భూమిలో 1981 నుంచి ఇల్లు కట్టుకుని ఉంటున్నందున స్థలాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు. ●జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని, చివరి ఆయకట్టుకు నీరందేలా ఎన్నెస్పీ నీటిని ఏప్రిల్ చివరి వరకు విడుదల చేయాలని, సన్నధాన్యం అమ్మిన రైతులందరికీ బోనస్ జమ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు బండి కృష్ణారెడ్డి, మందనపు రామారావు, మల్లెంపాటి రమేష్, పగడవరపు శ్రీనివాస్, తాళ్లూరి శ్రీనివాస్ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణఇద్దరం దివ్యాంగులమే... దివ్యాంగులమైన మా ఇద్దరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే మొదటి జాబితాలో పేరు రాలేదు. ప్రత్యేక చొరవ తీసుకుని మాకు ఇల్లు మంజూరు చేయించాలి. – నాగమణి – నాగేశ్వరరావు, చిన్నగోపతికుమారుడే ఇబ్బంది పెడుతున్నాడు బ్యాంక్ రుణం తీర్చేందుకు ఇంటి స్థలాన్ని విక్రయించాలని యత్నిస్తే పెద్ద కుమారుడు అడ్డుకుంటున్నాడు. స్థానికంగా అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేదు. నా సమస్యపై కలెక్టర్ సారే స్పందించాలి. – దంతాల భూదెమ్మ, రేపల్లెవాడ -
మారితే.. మనం ఎటు?!
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో జరిగిన పునర్విభజనతో నియోజకవర్గాల రూపురేఖలు, రిజర్వేషన్లు మారిపోయాయి. కొన్ని స్థానాలు జనరల్ నుంచి రిజర్వ్‌లోకి, రిజర్వ్డ్గా ఉన్న స్థానాలు కొన్ని జనరల్‌కు మారాయి. అలాగే, తొమ్మిదిగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పదికి చేరింది. ఇక వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి పునర్విభజన చేపట్టేలా కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే, 2026 తర్వాత జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చట్ట సవరణ చేయగా.. ఇప్పడు ఈ ప్రక్రియపై ఎందుకు కసరత్తు జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంరెండుగా ఖమ్మం.. ఈసారి చేపట్టనున్న డీలిమిటేషన్ విధి విధానాలు ఇప్పటివరకై తే బయటకు రాలేదు. ఒక్కో నియోజకవర్గానికి ఎంత మంది జనాభాను పరిగణనలోకి తీసుకుంటారో తేలాల్సి ఉంది. అయితే, డీ లిమిటేషన్ చేపడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి జిల్లాలో 2001 జనాభా లెక్కలతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. గత పునర్విభజన సమయాన కొత్తగా అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుత జనాభాను పరిశీలిస్తే ఈసారి పునర్విభజనలో ఒక్క నియోజకవర్గమైనా పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం జనాభా పరంగా రెట్టింపు అయినందున ఈ నియోజకవర్గం రెండుగా ఏర్పడే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది.ఇప్పుడే ఎందుకు? పెరుగుతున్న జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంటారు. తద్వారా నియోజకవర్గాల సంఖ్య పెరగడమే కాక సరిహద్దులు మారుతుంటాయి. ఇందుకోసం తొలిసారిగా 1963లో డీ లిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నియోజకవర్గాల సరిహద్దులు, రిజర్వేషన్లు నిర్ణయిస్తుంది. చివరిసారి 2008లో 2001 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టారు. ఆ సమయంలోనే 84వ చట్ట సవరణ ద్వారా 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా మరోమారు పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యాన ఇప్పుడు పునర్విభజనకు సిద్ధం కావడాన్ని కొన్ని పార్టీలు తప్పుపడుతున్నాయి. మారిన రిజర్వేషన్లు.. 2008లో చేపట్టిన డీలిమిటేషన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల పరిధి, రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. తద్వారా కొందరు నేతలకు ఇబ్బంది ఎదురుకాగా, మరికొందరికి కలిసొచ్చింది. అప్పటి వరకు తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా అశ్వారావుపేట ఏర్పాటైంది. ఇందులో అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు చేరాయి. రాష్ట్ర విభజన తర్వాత కుక్కునూరు, వేలేరుపాడు ఏపీలోకి వెళ్లగా.. ఇక్కడ కొత్తగా అన్నపురెడ్డిపల్లి మండలం చేరింది. ఇక బూర్గంపాడు నియోజకవర్గం రద్దయి ఆ స్థానంలో పినపాక చేరింది. అంతేకాక జనరల్ నియోజకవర్గమైన సుజాతనగర్ రద్దు కాగా.. ఆ స్థానంలో ఎస్టీ రిజర్వ్డ్గా వైరా నియోజకవర్గం ఏర్పడింది. అలాగే సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలు జనరల్ నుంచి ఎస్సీ రిజర్వ్‌కు, ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న పాలేరు జనరల్ కేటగిరీలోకి వచ్చింది. ఈ క్రమంలో జనరల్ కేటగిరీలో కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు మాత్రమే మిగిలాయి. ఏం చేద్దాం.. ఎలా వెళ్దాం నియోజకవర్గాల పునర్విభజన చర్చ మొదలవడంపై రాజకీయ పార్టీల నాయకులు దృష్టి సారించారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే తమకు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న మండలాలు ఇతర నియోజకవర్గంలో కలిసే అవకాశం ఉందా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అయితే నియోజకవర్గానికి ఎంత జనాభా ఉండాలనే అంశంపై స్పష్టత రాకపోవడంతో ఇంకొందరు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను మూడు జనరల్‌గా ఉన్నాయి. ఈసారి పునర్విభజనపై పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో రిజర్వ్ స్థానాలు తగ్గుతాయా, పెరుగుతాయా.. రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయా, స్థానాల సంఖ్య పెరుగుతుందా అన్న అంశంపై అయోమయం నెలకొంది. కాగా, గత పునర్విభజన సమయాన కీలక నేతలు కొందరు సిట్టింగ్ స్థానాలు వదిలి ఇతరచోట్ల నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. సుజాతనగర్ నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరుకు వెళ్లగా, పాలేరులో పోటీ చేసి పలుమార్లు గెలిచిన సంభాని చంద్రశేఖర్, ఒకసారి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లికి, సత్తుపల్లి నుంచి తుమ్మల నాగేశ్వరరావు సైతం తమ కార్యక్షేత్రాన్ని మార్చా రు. ఈసారీ ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయా అన్న అనుమానాలు నేతల్లో వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పునర్విభజనపై పార్టీల్లో చర్చ చివరిగా 2008లో స్థానాల పునర్విభజన అప్పుడు తొమ్మిది నుంచి 10కి పెరిగిన అసెంబ్లీ సీట్లు రిజర్వేషన్లలోనూ మార్పులు ఈసారి పెంపు, రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ -
సెర్ప్‌లో మెప్మా విలీనం
● ఒకే గొడుగు కిందకు మహిళా సంఘాల నిర్వహణ ● మహిళల అభివృద్ధే లక్ష్యంగా కీలక నిర్ణయాలు ఖమ్మంమయూరిసెంటర్: మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ లక్ష్యమంటూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల అమలులో స్థానం కల్పిస్తోంది. ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రూపొందించిన పాలసీ – 2025లో భాగంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలకు, మెప్మా ద్వారా పట్టణ ప్రాంత మహిళలకు బ్యాంకుల ద్వారా లింకేజీ రుణాలు ఇప్పించి ఆర్టీసీకి అద్దె బస్సుల కొనుగోలు, క్యాంటీన్ల ఏర్పాటు వంటి అవకాశాలతో అధికారులు తోడ్పాటు అందిస్తున్నారు. అయితే, ఇటు డీఆర్డీఏ, అటు మెప్మా అమలు చేస్తున్న పథకాలు ఒకే విధంగా ఉండగా.. వాటి లక్ష్యాలు కూడా ఒకటే. ఈ లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవడం, పర్యవేక్షణ సులువు చేసేలా రెండు శాఖలను ఒకే గొడుకు కిందకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యాన జిల్లాలో డీఆర్డీఏ, మెప్మాను విలీనం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా పరిధిలోని మహిళా సంఘాలు, సభ్యుల వివరాలను సేకరించారు.వివరాలు ఇలా... డీఆర్డీఏ మెప్మా సమాఖ్యలు 1,018 05 స్వయం సహాయక సంఘాలు 25,076 5,706 మొత్తం సభ్యులు 2,68,627 55,916 -
రామదాసు మందిరాన్ని సందర్శించిన జిల్లా జడ్జి
నేలకొండపల్లి : నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఆదివారం కుటుంబసమేతంగా సందర్శించారు. తొలుత మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామదాసు వాడిన బావిని పరిశీలించారు. ఆడిటోరియంలో రామదాసు చరిత్రకు సంబంఽధించిన చిత్రా పటాలను చూసి, ఆయన చరిత్ర గురించి అర్చకులు సౌమిత్రి రమేష్కుమారా చార్యులను అడిగి తెలుసుకున్నారు. అనంత రం శ్రీ ఉత్తరేశ్వరస్వామి, శ్రీ వైద్యనాథస్వామి ఆలయాలను సందర్శించారు. ఆ తర్వాత బౌద్ధక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సౌర విద్యుత్ సర్వే పూర్తి చేయాలిమంత్రి భట్టి ఆదేశం ఖమ్మంవ్యవసాయం : జిల్లాలో నిర్దేశించిన సౌర విద్యుత్ గ్రామాల్లో సర్వే త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ ఎస్ఈగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇనుగుర్తి శ్రీనివాసా చారి ఆదివారం హైదరాబాద్‌లో భట్టిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. నిర్ణయించిన గ్రామాల్లో సోలార్ సర్వే పూర్తి చేసి టెండర్లు పిలవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే మంజూరు చేసిన 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. రామయ్యకు పుష్పార్చనభద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడి పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 338 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.11,410, 250 మంది బోటింగ్ చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.11,970 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
‘తాయిలం’ అందేనా ?
● ప్రతి ఏటా రామాలయంపైనే ఉత్సవాల భారం ● నిర్వహణ ఖర్చులకు హుండీ ఆదాయమే మార్గం ● ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులుభద్రాచలం: భద్రగిరి రామయ్యకు సర్కారు తాయిలం అందడం లేదు. ప్రతీ ఏడాది ఉత్సవాల సమయంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నా నిరుత్సాహమే మిగులుతోంది. దేవస్థానంలో జరిగే ప్రధాన ఉత్సవాల నిర్వహణ వ్యయం తలకు మించిన భారం అవుతుండడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. చివరికి భక్తులు సమర్పించే హుండీ ఆదాయమే దిక్కుగా మారడంతో ఆ నిధులనే ఉత్సవాల నిర్వహణకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఆలయ అభివృద్ది కుంటుపడుతోందని ఇటు భక్తులు, అటు అధికారులు ఆవేదన చెందుతున్నారు. నవమి వ్యయం రూ.2 కోట్లకు పైగానే.. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాల్లో ముక్కోటి, శ్రీరామనవమి ముఖ్యమైనవి. వీటితో పాటు భక్తరామదాసు జయంతి ఉత్సవాలనూ ఘనంగా నిర్వహిస్తారు. అయితే వీటిలో ముక్కోటి సందర్భంగా తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం, శ్రీరామనవమి వేడుకలకు భక్తులు భారీగా హాజరవుతుంటారు. ఆ సమయాల్లో విధులు నిర్వహించే సిబ్బంది సైతం వందల సంఖ్యలో ఉంటారు. కాగా, ఈ ఉత్సవాల నిర్వహణకు అధిక మొత్తంలో ఖర్చవుతుంది. వస్తువుల ధరలు, వివిధ విభాగాల కార్మికుల జీతభత్యాలు పెరుగుతుండగా ఏటేటా నిర్వహణ వ్యయం సైతం పెరుగుతోంది. గతంలో రూ. కోటి – కోటిన్నర మధ్యలో ఖర్చు కాగా, ఈ ఏడాది రూ.రెండు కోట్లకు పైగానే అవసరమని అధికారులు అంటున్నారు. వీటిలో ఉత్సవ నిర్వహణ పనులకు రూ.కోటిన్నర, క్రతువు నిర్వహణ, తలంబ్రాలు, పట్టువస్త్రాలు, ఇతర ఖర్చులకు మరో కోటి వరకు ఖర్చవుతుందని అనధికారికంగా చెబుతున్నారు. ముక్కోటికి సైతం రూ.కోటిన్నర వరకు వ్యయం అవుతున్నట్లు అంచనా. ఖర్చులకు కానుకలే దిక్కు.. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి అందే సాయం మాత్రం రూ.15వేలు మాత్రమే. అది కూడా పేపర్లపై లెక్కలు చూపడం మాత్రమే. అంతకుమించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది లేదు. నవమి వేడుకలకు సాయం అందించాలని అటు అధికారులు, ఇటు భక్తులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఫలితం లేదు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు అందించే స్థాయిలో కాకున్నా భక్తుల మనోభావాలను గౌరవించి ఉత్సవాల నిర్వహణకు ఎంతో కొంత అందించాలని పలువురు కోరుతున్నారు. కాగా హుండీల ద్వారా భక్తులు సమర్పించే కానుకలనే ఉత్సవాల నిర్వహణకు వెచ్చిస్తున్నారు. గతం కంటే ఆదాయం పెరిగినా ఆలయ అఽభివృద్ధికి, భక్తులకు మరింతగా వసతుల కల్పనకు వెచ్చించాల్సిన నిధులను ఉత్సవాల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. భద్రాచలంలో భక్తులకు వసతి కష్టాలు నిత్యం ఎదురవుతుంటాయి. ఆలయానికి వచ్చే ఆదాయంతో రంగనాయకుల గుట్ట మీద, కింద దేవస్థానం భూముల్లో డార్మెటరీ, 100 గదుల వసతి గృహాలను నిర్మిస్తే ఈ సమస్య తీరే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ సర్కారైనా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దేవస్థానంలో ఉత్సవాల నిర్వహణకు ఒక్క పైసా విదల్చలేదు. ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామన్న హామీని సైతం విస్మరించింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారైనా నిధులు ఇవ్వకపోతుందా అని భక్తులు కోటి ఆశలు పెట్టుకున్నారు. గతేడాది శ్రీరామనవమి ఉత్సవాలకు నిధులు కేటాయిస్తుందని భావించినా విడుదల చేయలేదు. ఈ ఏడాదైనా రామయ్యపై కరుణ చూపేనా అని భక్తులు, అధికారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఎన్నికల కోడ్ కారణంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఈ ఏడాది హాజరు కావడంతో పాటు ఆలయ అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఆశిస్తున్నారు.తక్షణమే సాయం అందించాలి భక్తుల ఆదాయం భక్తులకే చెందాలి. ఉత్సవాల నిర్వహణ పేరుతో పక్కదారి పట్టించడం సరైంది కాదు. హుండీ ఆదాయాన్ని భక్తుల వసతుల కల్పనకు కేటాయించాలి. ఆలయంలో జరిగే ఉత్సవాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి. వీటికి అయ్యే ప్రతీ పైసా ప్రభుత్వమే భరించాలి. – బూసిరెడ్డి శంకర్ రెడ్డి, భద్రాద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు -
అభివృద్ధిలో ముందుంచుతాం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకుపోతోందని, ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతామని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధిపై ఆదివారం ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు రేణుకాచౌదరి, పోరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాంరెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో తాగు, సాగునీరు, విద్యుత్ సరఫరా వంటి అంశాలను కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలబెట్టేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై విస్తృతంగా చర్చించామన్నారు. జిల్లాలో అత్యవసర అభివృద్ధి పనులకు మినరల్ ఫండ్, జిల్లా అభివృద్ధి నిధులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిధులను వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. హ్యామ్ రోడ్ల మంజూరులో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేస్తామని అన్నారు. సమావేశంలో పినపాక, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. అత్యవసర పనులకు మినరల్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఫండ్ వినియోగించుకోండి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, ఎంపీలు, ఎమ్మెల్యేలు -
మిర్చికి ఆశించిన ధర లేక సందిగ్ధంలో రైతులు
ఆశించిన ధర రాకపోవడంతో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసినా ఆశించిన దిగుబడి రాక.. వచ్చిన పంటకూ సరైన ధర దక్కక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ధర లేకపోవడంతో ఎక్కువ మంది నిల్వ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ కోల్డ్ స్టోరేజీ వద్ద చూసినా మిర్చి బస్తాలతో వచ్చిన వాహనాలు బారులుదీరి కనిపిస్తున్నాయి. – ఖమ్మంవ్యవసాయం● నిల్వ చేయడానికే ఎక్కువ మంది మొగ్గు.. వ్యాపారులదీ అదే దారి ● విదేశీ ఆర్డర్లతో ధర పెరుగుతుందని ఆశలు ● నిండిపోతున్న కోల్డ్ స్టోరేజీలు కోల్డ్ స్టోరేజీల బాట.. మిర్చికి ప్రస్తుతం ఆశించిన ధర లేకపోగా.. మున్ముందు గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో రైతులు నిల్వకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 2,17,360 మెట్రిక్ టన్నుల మిర్చి నిల్వచేసే సామర్థ్యం కలిగిన 48 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే ధర ఆశాజనకంగా లేదని రైతులు పంట నిల్వ చేస్తుండగా, వ్యాపారులు భవిష్యత్‌పై అంచనాలతో నిల్వ పెడుతున్నారు. జిల్లాకు తోడు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల రైతులు కూడా ఖమ్మం బాట పడుతుండడంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజీలన్నీ నిండిపోతున్నాయని తెలుస్తోంది.ఏడాదిలో ఎంత తేడా.. గతేడాది సీజన్లో క్వింటా మిర్చికి రూ.20 వేల నుంచి రూ.23వేల వరకు ధర పలకగా.. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గత సంవత్సరం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికి 2024 అక్టోబర్‌లో రూ.19 వేలు, నవంబర్‌లో రూ.18వేల ధర పలకగా.. ఈ ఏడాది సాగు చేసిన మిర్చికి రూ.17వేల వరకు ధర పలికింది. అయితే ఆ తర్వాత ధర పతనం అవుతుండగా తొలి కోతలు కావడంతో మైలకాయకు ధర తక్కువ ఉండడం సహజమేనని భావించారు. కానీ రోజురోజుకూ ధర మరింత పతనం కాసాగింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికీ ధర పడిపోయింది. డిసెంబర్లో నిల్వ మిర్చి క్వింటా ధర రూ.16 వేలకు, కొత్త మిర్చి ధర రూ.15,500కు, జనవరిలో నిల్వ మిర్చి ధర రూ.14,500కు, కొత్త మిర్చి ధర రూ.15 వేలకు పడిపోయింది. ఇక ఫిబ్రవరిలో రెండో కోతగా నాణ్యమైన మిర్చి వచ్చినా ధరలో పురోగతి లేకవడంతో రైతులకు ఆవేదనే మిగిలింది. ఫిబ్రవరిలో గరిష్టంగా రూ.14వేలు, మోడల్ ధర రూ.13,500గా పలికింది. అన్ సీజన్‌పై ఆశలు ఈ ప్రాంతంలో పండించే ‘తేజా’ రకం మిర్చికి చైనా సహా పలు దేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి ఆర్డర్ల ఆధారంగా ఎగుమతిదారులు కొనుగోలు చేయడంతో గత ఏడాది మంచి ధర పలికింది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేక ధరలో పురోగతి లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన అన్ సీజన్లో గతేడాది మాదిరిగానే రూ.20 వేలు – రూ.23 వేల ధర వస్తుందనే ఆశతో అటు రైతులకు తోడు ఇటు వ్యాపారులు సైతం మిర్చి పంటను నిల్వ చేస్తున్నారు.పెట్టుబడులు కూడా రావని... జనవరిలో 50 బస్తాల మిర్చి క్వింటాకు రూ.13,200 చొప్పున విక్రయించా. రెండో కోత పంటకు ధర పెరుగుతుందనుకున్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు అమ్మితే పెట్టుబడి కూడా దక్కదని 42 బస్తాలు నిల్వ చేస్తున్నా. – బానోత్ మట్టా, గోవింద్రాల, కామేపల్లి మండలంజూన్ తర్వాత ఆలోచిస్తా... ప్రస్తుత ధర పెట్టుబడులను పూడ్చే స్థితిలో లేదు. గత ఏడాది మిర్చి రూ. 20 వేలకు విక్రయిస్తే ఈసారి రూ.14 వేలే వచ్చింది. జూన్, జూలై తరువాత ధర పెరుగుతుందనే ఆశ ఉంది. అప్పటివరకు చూసి అమ్ముతా. – చిరసవాడ రాజు, ఎదుళ్లచెరువు, తిరుమలాయపాలెం మండలం -
మనువాదం ప్రజలను పీడిస్తోంది
● ప్రజా పోరాటాల్లో పెద్దన్న రవన్న ● వర్ధంతి సభలో వీపీవీ నేత పట్నాయక్ ఖమ్మంమయూరిసెంటర్ : దేశంలో మనువాదం, మార్కెట్ భావజాలం అనే కవల పిల్లలు ప్రజలను పీడిస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా ప్రజలు సమరశీల పోరాటాలు నిర్వహించాలని విద్యా పరిరక్షణ వేదిక జాతీయ నాయకులు రమేష్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్ )మాస్‌లైన్–రవన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రాయల సుభాస్ చంద్రబోస్ (రవన్న) 9వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. దేశ సంపదను లూటీ చేసేలా కార్పొరేట్ శక్తులకు పాలకులు సేవ చేస్తున్నారని అన్నారు. పేదలను మరింత బలహీనంగా మారుస్తూ సోమరిపోతులుగా చూస్తున్నారని విమర్శించారు. నిత్యావసరాల ధరలు మండుతున్నాయని, కోట్లాది కుటుంబాలు పేదరికంలో కూరుకుపోతుంటే కార్పొరేట్ వర్గాల వారు శత కోటీశ్వరులుగా మారుతున్నారని అన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం విద్యుత్, సాగు, తాగునీరు, సేవా రంగం, సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకవర్గాలపై ఉందన్నారు. ప్రముఖ సంపాదకులు సతీష్ చందర్ మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాలను పెట్టుబడిదారీ వ్యవస్థ నియంత్రిస్తోందన్నారు. మనువాద చాందస భావాలకు వ్యతిరేకంగా సమష్టిగా ఉద్యమించాలని కోరారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు కేజీ రామచందర్ మాట్లాడుతూ రవన్న అతివాద, అవకాశవాదాలకు వ్యతిరేకంగా అంతర్గత పోరాటం చేసి విప్లవోద్యమాన్ని సరైన దిశలో నడిపారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, నాయకులు కెచ్చల రంగయ్య, గుర్రం అచ్చయ్య, కె.రమ, గోకినపల్లి వెంకటేశ్వర్లు, చండ్ర అరుణ, ముద్ద భిక్షం, పుసులూరి నరేందర్, చిన్న చంద్రన్న, హన్మేశ్, ఎస్ఎల్ పద్మ, ఆవుల వెంకటేశ్వర్లు, సి.వై.పుల్లయ్య జి.రామయ్య, మనోహర్ రాజు, కల్పన, ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
మేడూరు పుణ్యక్షేత్రానికి పాదయాత్ర
మధిర: పట్టణంలోని బంజారాకాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీపద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి కలయిక వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మేడూరు పుణ్యక్షేత్రానికి పాదయాత్ర చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరులో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి వెళ్తున్న పాదయాత్రను స్థానిక బంజారాకాలనీ వద్ద కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు ఇరుకుళ్ల బాలకోటేశ్వరరావు ప్రారంభించారు. మేడూరు ఆలయంలో తొలుత వాకర్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకుల కోరిక మేరకు ఉగాది పండుగ రోజున పులిహోర ప్రసాదం కోసం 50 కేజీల బియ్యం వితరణ చేశారు. కార్యక్రమంలో మైలవరపు వీరభద్రరావు, డోకుపర్తి సత్యంబాబు, లక్ష్మీనారాయణ, బోణాల నాగేశ్వరరావు, వంగూరి గోపి, శ్రీనివాసరావు, నాళ్ల నారాయణరావు, చిట్యాల శేషు, నాగుబండి వంశీ, మధు, రవి, చల్లా సత్యనారాయణ, కృష్ణయ్య తదితరులు ఉన్నారు. సన్మానం...రిటైర్డ్ ప్రిన్సిపాల్‌కు.. ఖమ్మం సహకారనగర్: నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్విర్తించి పదవీ విరమణ పొందిన కేఎస్ రామారావు సన్మానసభను నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ‘మనలోని మనిషి’పేరుతో శనివారం నిర్వహించారు. ఇంటర్ విద్య జేఏసీ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తదితరులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రిన్సిపాల్‌గా, లెక్చరర్, ప్రిన్సిపాల్స్ సంఘం జిల్లా, రాష్ట్ర, జేఏసీ బాధ్యుడిగా విశేష సేవలందించారని ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. అనంతరం కేఎస్ రామారావు దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ రవికుమార్, జేఏసీ నాయకులు కళింగ కృష్ణకుమార్, బలరాం జాదవ్, రవీందర్‌రెడ్డి, ఈ.శ్రీనివాసరెడ్డి, అంజన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కవయిత్రి యువశ్రీకి అవార్డు ఖమ్మంఅర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక ‘ఆమెకు వందనం’అనే కార్యక్రమంలో భాగంగా శనివారం వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలకు విజయవాడలో నారీరత్న అవార్డులను అందించింది. అందులో భాగంగా నగరంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని యువశ్రీ బీరకు సైతం అవార్డు అందించారు. ఆమెను తోటి ఉపాధ్యాయులు అభినందించారు. కారు ఢీకొని వ్యక్తి మృతి ఖమ్మంరూరల్: మండలంలోని బారుగూడెం శ్రీసిటీ సమీపంలో కారు ఢీకొని ఇటుక బట్టి కార్మికుడు శుక్రు కంద (50) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, కలవాడి జిల్లా, దోమర్గూడ మండలం, కమ్మండ గ్రామానికి చెందిన కంద కుటుంబంతో మండలంలోని బారుగూడెం వద్ద గల ఇటుక బట్టీలో మూడు నెలలుగా పని చేస్తున్నాడు. ఆదివారం సరుకులు తీసుకురావడానికి శ్రీసిటీ వద్ద గల కిరాణా దుకాణానికి వెళ్లి వస్తుండగా వరంగల్ వైపు నుంచివస్తున్న కారు కందను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కుందను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి... కల్లూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామానికి చెందిన ఎక్కిరాల సురేశ్ (40) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి 10 గంటల సమయంలో సురేశ్ తన పల్సర్ బైక్‌పై కల్లూరు మండలం బత్తులపల్లి వచ్చి తిరిగి వెళ్తున్నాడు. కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి సోదరుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కిష్టారంలో అనారోగ్యంతో వ్యక్తి మృతి
సత్తుపల్లి: సింగరేణి సైలోబంకర్ కాలుష్యం ప్రాణాలు హరిస్తోందంటూ నెల రోజులుగా కిష్టారం గ్రామస్తులు ఓ వైపు ఆందోళనలు చేస్తుండగా.. ఆదివారం కిష్టారం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. కాలనీకి చెందిన రామాల బుచ్చిబాబు (39) కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శనివారం రాత్రి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య రాణి, ఇద్దరు కుమార్తెలున్నారు. కేవలం సింగరేణి సైలో బంకర్ విడుదల చేసే కాలుష్యంతోనే గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని కిష్టారం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని సింగరేణి ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో చోరీల నిందితులు వైరా: వైరా పోలీసుల అదుపులో అంతరాష్ట్ర చోరీల ముఠా సభ్యులు ఉన్నట్లు సమాచారం. వైరాలో గతనెల 12వ తేదీన లీలాసుందరయ్యనగర్‌లో వృద్ధురాలు శీలం వెంకట్రావమ్మ ఇంట్లోకి సర్వే పేరుతో వచ్చి వివరాలు సేకరించినట్లు నటించి కాళ్లు, చేతులు కట్టి బీరువాలో ఉన్న 18 తులాల బంగారం చోరీ చేశారు. సీపీ సునీల్‌దత్ ఆదేశాల మేరకు వైరా ఏసీపీ ఎంఏ రెహమాన్ ఆధ్వర్యంలో సీఐ నునావత్ సాగర్ నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. వారు ఖమ్మం, సూర్యాపేట జిల్లా, ఏపీ ప్రాంతాల్లో సీసీ పుటేజీలను పరిశీలించారు. నలుగురు వ్యక్తులు, కారు ఫొటోలను విడుదల చేశారు. తర్వాత ఏపీలోని గుంటూరు జిల్లాలో గాలించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇద్దరు తమిళనాడుకు చెందిన వారిగా మరో ఇద్దరు ఏపీకి చెందిన వారీగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. వారిపై ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో హత్య, దోపిడీ, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. పేకాటస్థావరంపై దాడి ఖమ్మంఅర్బన్: నగరంలోని ఎన్నెస్పీ కాల్వ కట్ట శ్రీలక్ష్మినగర్ సమీపంలోని ఖాళీస్థలంలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.17,090 నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ భానుప్రకాష్ తెలిపారు. టైలర్‌పై దాడి రఘునాథపాలెం: మండలంలోని కోయచలకలో బెల్ట్‌షాపు పక్కన టైలరింగ్ చేస్తున్న అయోధ్యపై మద్యం మత్తులో ఆరెంపుల వీరబాబు దాడి చేసి గాయపరిచాడు. ఆదివారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.సైలోబంకరే కారణ మని కుటుంబసభ్యుల ఆరోపణ -
సేంద్రియ పంటలతో ఆరోగ్యం
ఖమ్మంవ్యవసాయం: సేద్రియ పంటలే ఆరోగ్య కరమని మూలం సంత నిర్వాహకులు గ్రామీణ భారతి, సంయుక్త కిసాన్ మోర్చ ప్రతినిధులు నల్లమల వెంకటేశ్వరరావు, కుతుంబాక మాధవి, అనమోలు రాంరెడ్డి, చెరుకూరి రామారావు, రెట్టచర్ల నాగేశ్వరరావు, కోసూరి ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీ సమీకృత మార్కెట్లో మూలం సంత నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేయగా నిర్వాహకులు మాట్లాడారు. కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆర్యోగాన్నిచ్చే పంటలు పండిస్తున్నా వారికి ఆదరణ దక్కటం లేదని తెలిపారు. ఆయా పంటలు పండించే వారికి మార్కెటింగ్ సౌకర్యం లేకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా సేంద్రియ పంటల విక్రయానికి రాష్ట్రంలో మూలం సంతల ఏర్పాటు జరుగుతోందని, జిల్లాలో మూలం సంతపై ప్రత్యేక దృష్టిని సారించామని చెప్పారు. ప్రస్తుతం 23 స్టాళ్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌కు మందుగా సేంద్రియ పద్ధతిలో పసుపు పండిస్తూ, పంపిణీ చేస్తూ ప్రాచుర్యం పొందుతున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామ రైతు గంటా దామోదర్‌రెడ్డిని సంత నిర్వాహకులు సత్కరించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు తనను సంప్రదించవచ్చని(99083 84915) దామోదర్‌రెడ్డి సూచించారు. -
రామయ్యను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
● పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు ● కొత్తగూడెం కోర్టులో వెయిటింగ్ హాల్ ప్రారంభం భద్రాచలంఅర్బన్/పాల్వంచరూరల్/కొత్తగూడెంటౌన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ఆదివారం దర్శించుకున్నారు. ఆమెకు ఈఓ రమాదేవి స్వాగతం పలకగా వైదిక పెద్దలు ఆశీర్వచనం అందజేశారు. ప్రధాన ఆలయంతో పాటు ఆంజనేయస్వామి, లక్ష్మీతయారమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం జస్టిస్ నందా భద్రాచలం జ్యుడీషియల్ కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించి రాముల వారి ప్రతిమ అందజేశారు. అనంతరం జస్టిస్ నందా పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఈఓ రజనీకుమారి జడ్జికి అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కొత్తగూడెం కోర్టులో.. కొత్తగూడెం కోర్టులో నిర్మించిన వెయిటింగ్ హాల్‌ను న్యాయమూర్తి సూరేపల్లి నందా ఆదివారం ప్రారంభించారు. ఆమెకు జిల్లా జడ్జి పాటిల్ వసంత్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నందా మాట్లాడుతూ.. న్యాయ సేవలను అందుబాటులోకి తేవడంలో, లీగల్ ఆవేర్నేస్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషిస్తున్నారని అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సాయిశ్రీ, మణుగూరు, దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జీలు కె. సూరిరెడ్డి, బి.భవానీ, ఎస్పీ రోహిత్‌రాజు, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, భద్రాచలం, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట దేవదానం, లక్కినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘జనరిక్’ ఆదరణ అంతంతే..
● అవగాహన లేక వినియోగించని ప్రజలు ● బ్రాండెడ్ మందులే రాస్తున్న వైద్యులు ● చుక్కలనంటే దరలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ● జనరిక్‌లో కొనుగోలు ఎంతో మేలు ఖమ్మంవైద్యవిభాగం: ఔషధ దుకాణాల్లో మందుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఏ చిన్న మందు గోలి తీసుకున్నా ధరలు మాత్రం భారీగా ఉంటున్నాయి. బ్రాండెడ్ మందుల పేరుతో రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. హోల్‌సెల్‌లో వారికి తక్కువ ధర పలికినా అమ్మే సమయంలో మాత్రం వాటి ధర మూడింతలకు పైగా వేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. అయితే తక్కువ ధరలకు లభించే జనరిక్ మందులు అందుబాటులో ఉన్నా వాటిపై ప్రజల్లో ఆదరణ మాత్రం నామమాత్రంగా ఉంటోంది. ప్రజలకు వాటిపై అవగాహన లేకపోవటంతో ఎక్కువగా బ్రాడెండ్ మందులనే వాడుతున్నారు. అయితే, మందుల దుకాణాల్లో ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. పేద వాడిపై ఔషధ ధరల భారం తగ్గించే జనరిక్ మందుల వినియోగంపై జనం ఆసక్తి చూపించటం లేదు. అవగాహన లేకపోవటం, వైద్యులు బ్రాండెడ్ మందులే రాస్తుండటంతో భారమైనా పెద్ద కంపెనీల మందులే కొనుగోలు చేస్తుండటంతో రోగుల జేబులకు చిల్లులు తప్పట్లేదు. వైద్యులు జనరిక్ పేరు మాత్రమే ప్రిస్కిప్షన్‌లో రాయాలన్న నిబంధన ఉన్నా అమలు కాక జనానికి వారు సూచించిన మందులే కొనాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. జిల్లాలో 15 దుకాణాలే.. జీవన శైలిలో మార్పు కారణంగా దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీర్ఘకాలం ఔషధాలు వినియోగించాల్సి రావడంతో పేదలు, మధ్యతరగతి రోగులు భారం భరించలేకపోతున్నారు. జనరిక్ ఔషధాలతో ఆర్ధిక భారం తగ్గించుకునే అవకాశం ఉన్నా అవగాహన ఉండటం లేదు. మరోవైపు జనరిక్ మందుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన వైద్యులే జనరిక్ మందుల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో ప్రజల్లో ఉన్న అపోహలు తొలగటం లేదు. దీనికి తోడు జిల్లాలో జనరిక్ ఔషధ దుకాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం 15 మాత్రమే ఉండటం, అవి కూడా జిల్లా కేంద్రంలో ఉండటం మూలంగా ప్రజలకు వాటిపై అవగాహన ఉండట్లేదు. నాణ్యమైన జనరిక్ ఔషధాలు పేదలకు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతీ జిల్లా కేంద్రంలో ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అది ఏర్పాటు చేయగా పెద్దగా ఆదరణ లభించట్లేదని నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు జనరిక్ కేంద్రాలపై అవగాహన లేక చాలా మంది ప్రజలు బ్రాండెడ్ మందుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2002 కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ నిబంధన ప్రకారం ప్రతీ వైద్యుడు సాధ్యమైనంత మేరకు జనరిక్ పేర్లతో మందులను సూచించాలి. కానీ, ఈ ఆదేశాల అమలుపై పర్యవేక్షణ లేదు. బ్రాండెడ్ మందులు రాయటం నేరమేమీ కాకపోవటంతో వైద్యులు పట్టించుకోవటం లేదు. ఫార్మా కంపెనీలు తమ మందులను వైద్యుల ద్వారా ప్రచారం చేస్తాయి. దీని కోసం వారికి ప్రత్యేక బహుమతులు అందిస్తాయి. అయితే జనరిక్ మందులను ప్రోత్సహిస్తే మాత్రం వైద్యులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఫార్మా రంగంలో కఠినమైన పోటీ కారణంగా బ్రాండెడ్ కంపెనీలు మార్కెటింగ్‌పై చాలా ఖర్చు చేస్తుంటాయి. తమ బ్రాండ్ ఔషధాలను సూచించినందుకు వైద్యులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటాయి. దీంతో వారు జనరిక్ మందులు రాయడానికి ఆసక్తి చూపడం లేదు. వైద్యుల ప్రిస్కిప్షన్ ప్రకారం ఔషధాలు కొనుగోలు చేసే రోగులు బ్రాండెండ్కే అలవాటు పడుతున్నారు. దీనికి తోడు వైద్యులు సూచించిన దుకాణాలు, వారి ఆస్పత్రుల్లోనే మందులు కొనుగోలు చేయాల్సి రావడంతో అక్కడ ఉండే బ్రాండెండ్ ఔషధాలే దిక్కవుతున్నాయి. దీంతో జనరిక్ వైపు వెళ్లే వారు తక్కువ అవుతున్నారు.ప్రజల్లో అవగాహన రావాలి జనరిక్ మందులే వాడాలనే నిబంధన ఏమీ లేదు. ప్రజలు వాటి వైపు మొగ్గు చూపిస్తే మాత్రం వారి ఆర్థిక భారం తప్పుతుంది. అది వారు వెళ్లే వైద్యుడిపైనే ఆధారపడి ఉంటుంది. జనరిక్ ఔషధాలపై ప్రజల్లో మరింత అవగాహన రావాల్సి ఉంది. సాధారణ మందుల దుకాణంతో పాటు జనరిక్ మందుల దుకాణ లైసెన్స్ పొందేందుకు ఒకే నిబంధనలు ఉంటాయి. ఉత్పత్తి చేసిన కంపెనీ నుంచి నేరుగా ఔషధ దుకాణాలకు చేరవేస్తారు కాబట్టి ఖర్చులు తగ్గటం వల్లనే జనరిక్ ఔషధాల ధరలు తక్కువగా ఉంటాయి. బ్రాండెడ్ కంపెనీలు మార్కెటింగ్‌కు అధికంగా వెచ్చిస్తాయి కాబట్టి ధరలు అధికంగా ఉంటాయి. ప్రిస్కిప్షన్‌లో జనరిక్ మందులను వైద్యులు సూచిస్తే వినియోగం గణనీయంగా పెరుగుతుంది. – అనిల్‌కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఖమ్మం -
దద్దరిల్లుతున్న బాంబుల మోత
ఖమ్మంరూరల్: మండలంలోని ఆరెంపుల శివారు ఇరవై ఎకరాల భూమిలో కొందరు అనుమతి లేకుండా పేలుళ్లకు పాల్పడుతున్నారు. జనావాసాల నడుమ.. రాత్రింబవళ్లు బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో బండలను పేలుస్తుండగా రాళ్లు ఎగిరి పడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బండరాళ్లను పేల్చడానికి తోడు భూమిని చదును చేసేందుకు ఇప్పటికే వందకు పైగా తాటిచెట్లను నేలమట్టం చేయగా తాము జీవనాధారం కోల్పోతున్నామని గీతకార్మికులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, ఎకై ్సజ్ అధికారులు అటువైపు కన్నెతి కూడా చూడకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమంగా బ్లాస్టింగ్ చేసి, తాటిచెట్లను నరికి వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంపై రూరల్ సీఐ రాజును వివరణ కోరగా.. బ్లాస్టింగ్‌కు సంబంధించి ఎవరూ అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎవరైనా బ్లాస్టింగ్‌కు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆరెంపుల వాసుల ఆందోళన.. -
రైల్వే లైన్ పనులు త్వరగా ప్రారంభించండి
కేంద్ర రైల్వే మంత్రికి మంత్రి తుమ్మల లేఖ సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాండురంగాపురం – మల్కాన్‌గిరి రైల్వేలైన్ మంజూరు చేయడంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే మార్గాన్ని తొలిదశలోనే సారపాక వరకు త్వరగా పూర్తిచేస్తే భక్తులు రైలులో చేరుకుని, అక్కడి నుంచి ఇతర వాహనాల్లో భద్రాచలానికి చేరుకునే వీలుంటుందని మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తద్వారా భద్రాచలానికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఇదే సమయాన సత్తుపల్లి – కొవ్వూరు, పెనుబల్లి(ఖమ్మం) – కొండపల్లి(అమరావతి) వరకు కొత్త రైల్వేలైన్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ఆ లేఖలో తుమ్మల కోరారు. జమలాపురంలో ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించా రు. స్వామి మూలవిరాట్‌తో ఆలయ ఆవరణ లో ని స్వామివారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేయగా, పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణం, పల్లకీసేవ జరిపించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.ఈనెల 27న బార్ అసోసియేషన్ ఎన్నికలు ఖమ్మం లీగల్: తెలంగాణ బార్ కౌన్సిల్ ఆదేశానుసారం ఈనెల 27న ఖమ్మం బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి చింతనిప్పు వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15న తుది ఓటర్ల జాబితా ప్రకటన ఉంటుందని, 17 నుంచి 20 వరకు నామినేషన్ దాఖలు, పరిశీలన చేపట్టాక అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఆపై ఉపసంహరణకు అవకాశం ఇచ్చి 27న ఎన్నికల నిర్వహణ, అదే రోజు ఫలితాల వెల్లడి ఉంటుందని తెలిపారు. గురుకుల అధ్యాపకురాలికి డాక్టరేట్ కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల గణిత అధ్యాపకురాలు జి.శంకరజ్యోతికి డాక్టరేట్ లభించింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్ రెగ్యులర్ డోమినేషన్ ఇన్ లిటాక్ట్ గ్రాఫ్స్’ అంశంపై ఆమె సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ఓయూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన శంకరజ్యోతి ప్రస్తుతం తనికెళ్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.రజిత, వైస్ ప్రిన్సిపాల్ బి.రాజేశ్వరి, అధ్యాపకులు అభినందించారు. వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులను అభినందించిన ఎంపీ ఖమ్మంవన్‌టౌన్: నేషనల్ వీల్‌చైర్ క్రికెట్ టోర్నీ లో ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులను ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం అభినందించారు. జిల్లాకు చెందిన ఎస్.కే.సమీరుద్దీ న్, బండి రాము, సురేష్, రమావత్ కోటేశ్వర్, మహ్మద్ సమీ జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఈ సందర్భంగా వారిని ఎంపీ ఖమ్మంలో సన్మానించగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారా యణ, పాపానాయక్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో గళం విప్పుతా.. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ పనులకు నిధులు కేటాయించేలా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎంపీల సమావేశం జరగగా ఆయన మాట్లాడారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు, పాలేరు నియోజకవర్గం మీదుగా వెళ్లే రైల్వేలైన్ అలైన్మెంట్ మార్పు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు. -
విజేతల స్ఫూర్తితో రాణించాలి
ఖమ్మంమయూరిసెంటర్: వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతూ కష్టపడే వారు రాణించడం సులువవుతుందని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సుమలత తెలిపారు. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ ఆధ్వర్యాన ఖమ్మం కొత్త బస్టాండ్‌లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంవీఐ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో కాలు మోపడమే కాక విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. ఆర్ఎం సరిరామ్ మాట్లాడుతూ ఇంటి నుంచి మార్పు మొదలైతేనే సమాజంలో కూడా సాధ్యమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రీజియన్ పరిధిలో అత్యుత్తమ పనితీరు కనపరచిన మహిళా సూపర్వైజర్లు, కండక్టర్లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్(ఆపరేషన్) జీ.ఎన్.పవిత్ర, ఖమ్మం డిపో మేనేజర్ దినేష్‌కుమార్, పర్సనల్ ఆఫీసర్ బాలస్వామి, మెడికల్ ఆఫీసర్ సాయిసుష్మ, అసిస్టెంట్ మేనేజర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాజీతోనే మానసిక ప్రశాంతత
● ఇరుపక్షాల గెలుపు లోక్ అదాలత్‌తోనే సాధ్యం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ఖమ్మం లీగల్: లోక్ అదాలత్‌లో ఇరుపక్షాలకు రాజీ పడడం ద్వారా కక్షిదారులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని, తద్వారా ఇద్దరూ గెలిచినట్లవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇరువర్గాల కక్షిదారులు రాజీ పడితే ఆర్థిక ప్రయోజనాలతో పాటు సమయం వృథా జరగదని, కేసులు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. ఇక్కడ జారీ చేసే అవార్డు సుప్రీంకోర్టు అవార్డుతో సమానమని పేర్కొన్నారు. అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి మాట్లాడుతూ కేసుల తక్షణ పరిష్కారం లోక్ అదాలత్‌తోనే సాధ్యమవుతుందని, ఇక్కడ తీర్పుపై అప్పీల్‌కు అవకాశం లేదని చెప్పారు. కాగా, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి కే.వీ.చంద్రశేఖరరావు అధ్యక్షత వహించగా మోటార్ ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు రూ.14 లక్షల పరిహారం జారీ చేశారు. అలాగే, రాజీపడిన భార్యాభర్తలు కలిసి జీవించడానికి నిర్ణయించుకోగా వారికి పూల మొక్క అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయాధికారులు ఎం.అర్చనాకుమారి, దేవినేని రాంప్రసాద్‌రావు, ఎం.కల్పన, వి.శివరంజని, కాసురగడ్డ దీప, బిక్కం రజని, ఏపూరి బిందుప్రియ, వి.మాధవి, బి.నాగలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొన్నారు. 19,345 కేసుల పరిష్కారం జిల్లా కోర్టుతో పాటు జిల్లాలోని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా మొత్తం 19,345 కేసులు పరిష్కారమయ్యాయి. గతంలో నిర్వహించిన లోక్ అదాలత్‌ల మాదిరిగానే ముందు నుంచి విస్తృత ప్రచారం చేయడంతో అత్యధిక కేసులు పరిష్కారమయ్యాయని భావిస్తున్నారు. కాగా, మోటార్ వాహన ప్రమాద బీమా కింద 62 కేసుల్లో రూ.2,71,77,000 పరిహారం చెల్లింపునకు బీమా కంపెనీలు అంగీకరించాయి. ●ఖమ్మంక్రైం: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెద్దసంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ సిబ్బందిని కమిషనర్ సునీల్‌దత్ అభినందించారు. పకడ్బందీ ప్రణాళికతో రాజీ పడదగిన కేసులను గుర్తించడమేకాక కక్షిదారులను ఒప్పించడంలో ఏఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది కృషి చేయడంతో మెరుగైన ఫలితం వచ్చిందని శనివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. పరిష్కారమైన కేసుల వివరాలు క్రిమినల్ కేసులు 643 సివిల్, భూతగాదా కేసులు 51 మోటార్ యాక్సిడెంట్ కేసులు 62 ట్రాఫిక్ చలానా కేసులు 16,169 ప్రీ లిటిగేషన్ కేసులు 18 డ్రంక్ అండ్ డ్రైవ్, స్మాల్ కాజ్ కేసులు 2,318 కుటుంబ తగాదా కేసులు 06 సైబర్ నేరాల కేసులు 18 ఇతర కేసులు 60 -
సాగుకు ఢోకా లేకుండా...
ఖమ్మంఅర్బన్: ఈ ఏడాది రబీలో జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పంటలకు నష్టం జరగకుండా సాగర్ కాల్వలతో పాటు ఇతర ప్రాజెక్టుల ద్వారా నీరందించేలా జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సాగర్ ఆయకట్టు కింద 2.54 లక్షల ఎకరాలకు తోడు చెరువులు, భక్తరామదాసు, ఇతర ఎత్తిపోతల పథకాల కింద మొత్తంగా నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. జిల్లాలో అత్యధిక ఆయకట్టు సాగర్ జలాలతోనే సాగవుతోంది. దీంతో పంటలకే కాక తాగునీటి అవసరాలకు 28 టీఎంసీలు కేటాయించారు. రబీ పంటలకు వారబందీ విధానంలో నీరు విడుదల చేస్తుండగా ఇప్పటికే ఏడు తడుల్లో ఐదో తడి కొనసాగుతోంది. ఈమేరకు సుమారు 17 టీఎంసీల మేర వాడకం పూర్తయిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రెండు భాగాలుగా విభజన సాగర్ నీటి పంపిణీ కోసం జిల్లా ఆయకట్టును రెండు భాగాలుగా చేశారు. ఏన్కూరు ఎగువ వరకు ఏడు రోజులు ఆన్, దిగువకు ఎనిమిది రోజులు ఆన్ విధానంలో సాధ్యమైనంత మేర ఆయకట్టుకు నీరు అందేలా విడుదల చేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం కూడా పంటలకు నీటి ఎద్దడి రానివ్వొద్దని, ఎక్కడా వృథా కాకుండా సరఫరా చేయాలని చెబుతోంది. ఈ నెలాఖరు వరకు శ్రమిస్తే చాలావరకు పంటలు చేతికందే అవకాశముండడంతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొన్నిచోట్ల చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళనలు చేస్తుండడంతో అధికారులు అప్రమత్తమై వారబందీ విధానంలో ఇబ్బంది తలెత్తకుండా నీటి సరఫరా చేస్తున్నారు. సాగు పూర్తయ్యాక తాగునీరు ఏప్రిల్ రెండో వారం వరకు సాగు అవసరాలకు నీరు విడుదల చేయనున్నారు. ఆతర్వాత లంకాసాగర్, వైరా, పాలేరు రిజర్వాయర్లతోపాటు చిన్న, మధ్య తరహా చెరువులను సైతం నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నీరు వేసవిలో తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తారు. ఈమేరకు గత మంగళవారం జిల్లాలో పర్యటించిన జలవనరుల శాఖ ఇన్చార్జ్ సీఈ రమేష్‌బాబు నీటి సరఫరా తీరు, ఆయకట్టులో సాగుపై ఇంజనీర్లతో సమీక్షించారు. చివరి ఆయకట్టు వరకు నీరు సరఫరా చేయడమేకాక వృథాను అరికట్టడంపైనా దృష్టి సారించాలని సూచించారు. సాగర్ ప్రధాన కాల్వ ద్వారా ఇన్‌ఫ్లో ఆరు వేల క్యూసెక్కులు వచ్చినప్పుడు తొమ్మిది రోజులు ఆన్, ఏడు రోజులు ఆఫ్ విధానం అమలుచేశారు. అయితే, సాగర్ నీరు జిల్లాకు చేరే సరికి 3 – 4 వేల క్యూసెక్కుల మధ్యకు తగ్గుతుండడంతో ఆన్ – ఆఫ్ విధానంలో మార్పులు చేసి జిల్లా ఆయకట్టును రెండు భాగాలుగా విభజించి నీరు అందిస్తున్నారు. సాగర్ జలాల సరఫరాలో ఇక్కట్లు రాకుండా పర్యవేక్షణ వచ్చే నెల రెండో వారం వరకు విడుదల ఆతర్వాత తాగునీటి అవసరాలకు వినియోగంనిరంతరం పర్యవేక్షిస్తున్నాం.. జిల్లాలోని చివరి ఆయకట్టుకు వరకు సాధ్యమైనంత మేర నీటి ఎద్దడి ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మా శాఖ ఇంజనీర్లు నిత్యం పర్యవేక్షిస్తూ వారబందీ విధానంలో నీరు వృథా కాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం ఐదో తడి కొనసాగుతుండగా.. మొత్తంగా ఏడు తడుల్లో నీరు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాం. – రమేష్‌బాబు ఇన్చార్జ్ సీఈ, జలవనరుల శాఖ -
ఆధునిక విధానాలతో లాభసాటిగా సాగు
వైరా: రైతులు సాగులో ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించొచ్చని వైరా కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ వి.చైతన్య తెలిపారు. వైరాలోని ఠాగూర్ విద్యాలయంలో శనివారం నిర్వహించిన మహిళా రైతు సదస్సులో ఆమె ముఖ్యఅతిఽథిగా మాట్లాడారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోకపోతే నష్టపోయే ప్రమాదముంటుందన్నారు. కాగా, సాగులో మహిళల శ్రమ అనిర్వచనీయమని కొనియాడారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో మహిళలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ సదస్సులో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబుతో పాటు బొంతు సమత, శీలం ఫకీరమ్మ, నర్వనేని పద్మావతి, చింతనిప్పు సులోచన, గాలి అరుణ, దొడ్డపనేని జ్యోతి, కిలారు లక్ష్మి, చింతనిప్పు చలపతిరావు, శ్రీనివాసరావు, మధు, సాంబశివరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.క్లుప్తంగా -
పవిత్రమాసం.. రంజాన్
● ఖమ్మంమయూరిసెంటర్: రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని, ముస్లింలు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం గట్టయ్యసెంటర్‌లోని మజీద్ ఈ హాలీమా ఖాతున్లో శనివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజద్దీన్తో పాటు బచ్చు విజయ్‌కుమార్, షంషుద్దీన్, మస్జిద్ కమిటీ బాధ్యులు ఎం.డీ.సాబీర్‌పాషా, ఎం.డీ.మన్నాన్, ఎం.డీ.రజాక్, ఎం.డీ.ఖాజా, జునయీమ్, ఆసిఫ్, జవాద్, అబ్దుల్ గఫార్, ఖాజా మెనుద్దీన్, అబ్బాస్, ముజాహిద్, తోసిఫ్, ఫిరోజ్, మున్నా, చోటు, చంటి తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం బీఆర్ఎస్ కృషి.. మహిళా సాధికారత కోసం బీఆర్ఎస్ కృషి చేస్తూ వారికి సముచిత గౌరవం కల్పించామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన కేక్ కట్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ చైర్మన్ భారతీరాణిని సన్మానించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో పాటు కొల్లు పద్మ, బచ్చు విజయ్‌కుమార్, షకీనా, సుజాతరెడ్డి, ఉబ్బలపల్లి నిరోష, ఊర్మిళ, ఝాన్సీ, మాధవి, శైలజ పాల్గొన్నారు. ● ఖమ్మం అర్బన్: ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మానవత్వం చాటుకున్నారు. పువ్వాడ ఖానాపురం వెళ్తుండగా ఖమ్మం – ఇల్లెందు రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఆయనను ఆస్పత్రికి పంపించడమే కాక వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించేలా సూచనలు చేశారు. -
ఉత్తమ ఫలితాలు సాధిస్తే ప్రోత్సాహకాలు
నేలకొండపల్లి: ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించే విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తానని మెదక్ ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలి పారు. ఆయన స్వగ్రామమైన మండలంలోని రామచంద్రాపురానికి శనివారం వచ్చారు. ఇంటర్లో 982 మార్కులు సాధించిన కేశా నవ్యకు గ్రామస్తులు రూ.1.40 లక్షల బహుమతి ప్రకటించగా ఆయన అందజేసి మాట్లాడారు. రానున్న పరీక్షల్లో ప్రతిభ చూపే విద్యార్థులకు రూ.10 వేల నగదు బహుమతులు అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.వెంకటేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, ఎల్.వెంకట్రాంరెడ్డి, ఎస్.వెంకటేశ్వర్లు, డి.వీరారెడ్డి, డి.గోవిందరెడ్డి, పి.లక్ష్మీనారాయణ, ఏడుకొండలు, బైరం దినేష్ కుమార్, కేశా సత్యనారాయణ, మధారమ్మ, ఉపేందర్, విక్రమ్ పాల్గొన్నారు.సాగునీటి విషయంలో ఇరువర్గాల ఘర్షణవైరారూరల్: మండలంలోని ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి తరలింపు లో లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వెంగళ కృష్ణ, ఆయకట్టు రైతు ఎనిక కోటేశ్వరరావు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గత నెల 22న రైతు కోటేశ్వరరావు పథకం పరిధిలో లేని మరో ఐదెకరాలకు సాగునీరు పెట్టుకున్నాడని చైర్మన్ కృష్ణ నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో అదేరోజు కృష్ణ వైరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత శనివారం లిఫ్ట్ పరిధిలో రైతులు చెల్లించాల్సిన డబ్బు తీసుకురావాలని పుణ్యపురానికి చెందిన గద్దె వసంతరావును పంపించి, కృష్ణ సైతం వెళ్తుండగా కోటేశ్వరరావు, రాధిక అడ్డుకుని కులం పేరుతో దూషించి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయాన రాధిక సైతం తన భర్తను కృష్ణ కొట్టాడని ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంటి స్థల విషయమై... కారేపల్లి: ఇంటి స్థల విషయమై కారేపల్లిలో శనివారం ఇరుపక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్వే నంబర్ 163లో రెండు గుంటల ఇంటి స్థలం వాంకుడోతు హీరామణి పేరుతో రిజిస్ట్రేషన్ కాగా, సర్వే నెంబర్ 172లో పది గుంటల ఇంటి స్థలం రమాదేవి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. అయితే, రెండు గుంటల ఇంటి స్థలం తమదంటే తమదని ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఈక్రమంలో ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు చేరుకుని సర్దిచెప్పారు. ఏదైనా సమస్య ఉంటే న్యాయపరంగా పరిష్కరించుకోవాలే తప్ప ఘర్షణలకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరో నెలలో పెళ్లికి సిద్ధమవుతుండగా ఘటన కారేపల్లి: మండలంలోని సూర్యతండా గ్రామానికి చెందిన యువకుడు మహబూబా బాద్ జిల్లా బయ్యారం మండలం మిర్యాలపెంట సమీపాన శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యతండాకు చెంది న బానోతు కళ్యాణ్ (26), అజ్మీరా విజయ్ ద్విచక్రవాహనంపై శుక్రవారం గంగారం మండలం ఒట్టయిగూడెంలో తన స్నేహితుడి పెళ్లికి వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నారు. ఈక్రమాన మిర్యాలపెంట వద్ద బైక్ అదుపు తప్పి వాహనం నడుపుతున్న కల్యాణ్‌కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విజయ్ స్వల్పగాయంతో బయటపడ్డాడు. దీంతో స్థాని కులు వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే కళ్యాణ్ మృతి చెందా డు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని సూర్యతండాకు శనివారం తీసుకొచ్చారు. కాగా, కళ్యాణ్‌కు రెండు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. హోలీ పండుగ తర్వాత ముహూర్తం పెట్టుకోవాలని భావిస్తుండగానే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
అతిథులకు ఆహ్వానం..
భద్రాచలం: ఏజెన్సీ అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు, రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్వానం పలికేందుకు భద్రాచలంలో గిరిజన మ్యూజియం సిద్ధమవుతోంది. చిన్నారులను ఆటపాటలతో అలరించనుంది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు వీక్షకులకు తెలిసేలా రూపుదిద్దుకుంటోంది. భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ పర్యవేక్షణలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. శరవేగంగా పనులు.. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియంలో ఆదివాసీల దుస్తులు, పనిముట్లు, వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా మ్యూజియం ప్రాంగణంలో ‘గిరిజన పల్లె’తరహాలో వెదురు, మట్టి నిర్మాణాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చిన్నారుల ఆట పాటలకు బొమ్మలతో పార్క్, ఓపెన్ జిమ్ సిద్ధం చేశారు. చిన్నారులు పెడల్ బోటింగ్ చేసేందుకు పాండ్ రూపొందించారు. యువత, పెద్దలకు బీచ్ తరహాలో ‘ఇసుక వాలీబాల్’, బాక్స్ క్రికెట్, షెటిల్ కోర్టులను సిద్ధం చేస్తున్నారు. వీటి పనులు శరవేగంగా సాగుతుండగా, గిరిజన వంటకాలతో స్టాల్స్, గిరిజన ఉత్పత్తులు, వస్తువుల స్టాల్స్‌ను సైతం రెడీ చేస్తున్నారు. శ్రీరామనవమిలోగా అందుబాటులోకి.. ముక్కోటి నాటికి గిరిజన పల్లె పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కానీ కలెక్టర్, పీఓ సూచనల మేరకు ఎంటర్టైన్మెంట్ కల్పించేలా మరికొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెడల్ బోటింగ్, ఓపెన్ జిమ్, పార్క్‌లను సిద్ధం చేశారు. వచ్చే నెల 6న శ్రీరామనవమి జరగనున్న నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ లోపు అన్ని పనులు పూర్తి చేయాలని పీఓ ఆదేశాలు జారీ చేశారు. ఈసారి శ్రీరామనవమికి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆధ్యాత్మికతతోపాటు ఆట పాటలతో వినోదం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భద్రాచలంలో ఆధ్యాత్మికతతోపాటు వినోదం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్న గిరిజన మ్యూజియం ఆవరణ ఐటీడీఏ ప్రాంగణంలో పార్క్, ఓపెన్ జిమ్ పూర్తి ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, పీఓ -
న్యాయం చేయాలని మృతదేహంతో ఆందోళన
ఏన్కూరు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. ఏన్కూరు మండలం టీఎల్పేటకు ఇందిరానగర్ కాలనీకి చెందిన పసుపులేటి కృష్ణ శుక్రవారం రాత్రి కాలనీ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం శనివారం మధ్యాహ్నం మృతదేహం ఏన్కూరు సెంటర్‌కు చేరుకోగా బంధువులు, గ్రామస్తులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎస్ఐ షేక్ రఫీ సిబ్బందితో చేరుకుని నచ్చచెప్పినా వినలేదు. గంటకు పైగా ఆందోళన చేపట్టడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈక్రమాన పోలీసులు – ఆందోళనకారులకు తోపులాట జరగగా, చివరకు వారిని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
పోలీసు లాంఛనాలతో డీఎస్పీ అంత్యక్రియలు
రఘునాథపాలెం: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ డీఎస్పీ బానోత్ జవహర్లాల్ మృతి చెందగా, స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం ఈర్లపుడిలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తదితరులు జహహర్‌లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించి ఆయన సోదరుడు, మాజీ మదన్‌లాల్, కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం కమాండెంట్ బి.శివప్రసాద్, అడిషనల్, అసిస్టెంట్ కమాండెంట్లు ఏ.అంజయ్య, ఎస్.కే.రషీద్, ఆర్ఎస్ఐ ఏ.నవీన్, రఘునాథపాలెం సీఐ ఎస్.కే.ఉస్మాన్ షరీఫ్, ప్రొబెషనరీ ఎస్సై తేజేశ్వర్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పోలీసు లాంఛనాలతో వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు వీరూనాయక్, బచ్చు విజయ్‌కుమార్, గొల్లపూడి హరికృష్ణ, మానుకొండ రాధాకిషోర్, బాషా, శెట్టి రంగారావు, బానోతు బద్రునాయక్, భూక్యా ఉపేంద్రబాయి, స్పందన, జ్యోతి, బోడ వీరన్ననాయక్ తదితరులు కూడా నివాళులర్పించారు. కాగా, జవహర్లాల్ మృతిపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో దిగ్భా్ంతి వ్యక్తం చేశారు.నివాళులర్పించిన మంత్రి తుమ్మల, మాజీ మంత్రి పువ్వాడ -
పంటలు ఎండిపోకుండా సాగునీరు
● ప్రభుత్వ కార్యక్రమాలు పటిష్టంగా అమలుచేయాలి ● కలెక్టర్, అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటికూసుమంచి: ప్రభుత్వ కార్యక్రమాలను పటిష్టంగా అమలుచేసే బాధ్యత అధికారులదేనని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్షి, షాదీముబారక్ లబ్ధిదారులకు శుక్రవారం చెక్కులు పంపిణీ చేసిన మంత్రి, మహిళా మత్స్యకారులు చేపలు విక్రయించేందుకు సబ్సిడీపై మంజూరైన సంచార వాహనాలను అందజేశారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఎండలు ముదురుతున్నందున పంటలు ఎండిపోకుండా సాగునీరు సరఫరా చేయాలని, సాగర్ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ తాగు, సాగునీటికి ఇబ్బందులు రానివ్వొద్దని సూచించారు. అలాగే, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి భూసేకరణ, పరిహారంపై సూచనలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్ రహదారికి అవసరమైన భూమి సేకరించాలని, నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. ఆర్డీఓ నర్సింహారావు, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఎస్ఈలు హేమలత, మంగళంపూడి వెంకటేశ్వర్లు, ఈఈలు అనన్య, యుగంధర్, పుష్పలత, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని జుజుల్‌రావుపేటలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 9న ప్రతిష్ఠాపన పూజలు జరగనుండగా మంత్రి పొంగులేటి పూజలు చేశారు. అనంతరం తురకగూడెం, కేశ్వాపురంల్లో సీసీ రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ●ఖమ్మంరూరల్/ఖమ్మం వన్‌టౌన్/ఖమ్మం వ్యవసాయం: ఇందిరమ్మ ఇళ్లను మండలంలోని ఆరెంపులకు పైలట్ ప్రాజెక్టుగా కేటాయించగా, విడతల వారీగా అర్హులందరికీ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూరల్ మండలం ఆరెంపుల, బారుగూడెం, ఏదులాపురంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. కాగా, మంత్రిని రియల్ ఎస్టేట్ అసోసియేషన్, బిల్డర్స్ అసోసియేషన్ బాధ్యులు కలిసి ఎల్ఆర్ఎస్ ఫీజుపై రాయితీ ఇచ్చినందుకు కృతజ్ఙతలు తెలిపారు. పాత జీపీల్లోని లే ఔట్ల ప్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టించుకోవాలని కోరారు. ఆతర్వాత రెడ్డిపల్లికి చెందిన సీపీఐ నాయకుడు లింగా వెంకటనారాయణ తల్లి మల్లమ్మ మృతి చెందగా మంత్రి నివాళులర్పించారు. ఇటీవల మృతి చెందిన డిప్యూటీ సీఎం పీఓ తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి పరామర్శించారు. కాగా, విద్యుత్ ఎస్ఈగా కొద్దిరోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసాచారి మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిశారు. -
జయహో.. జన ర ుుత్రి
●మహిళల రక్షణ, అభివృద్ధే ధ్యేయంగా.. ●కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటూ, ప్రజలతో మమేకం. మధిర : రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని నిరంతరం ప్రజల్లో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారు. నిరంతరం శ్రమిస్తూ, ప్రజలతో మమేకమవుతూ ముదుకు సాగుతున్నారు. మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయూల్లో నిత్యం బిజీగా ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయు రాజకీయూల్లో సైతం బిజీగా ఉంటున్నారు. మల్లు నందిని నియోజకవర్గంలో కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, నాయకులకు కొండంత అండగా ఉంటున్నారు. మండలాల్లో పార్టీ నాయుకులను సమన్వయుం చేస్తూ అన్ని వర్గాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా తన భర్త హోదాను దుర్వినియోగం చేయుకుండా, అధికారిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా ఆమె తనదైన శైలిలో రాణిస్తున్నారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, ఆప్యాయంగా చేరదీస్తూ మల్లు నందిని చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆప్యాయుతగా అమ్మ అంటూ పిలిస్తే, నేనున్నానంటూ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. అమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ, వికలాంగులకు ట్రై సైకిళ్ళు ఉచితంగా పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ప్రమాద ఘటనలో గాయపడినా, మృతి చెందిన వారి కుటుబాలను పరామర్శిస్తూ వారికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యాలకు ఫోన్ చేస్తూ వైద్య బిల్లులు తగ్గించేలా కషి చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు, నాయుకులు, కార్యకర్తలు ఆమెను తలైవిగా పిలుస్తూ ఫ్లెక్సీలు కడుతూ నందినమ్మకు మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో అమ్మ ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
చైతన్యంతోనే చెత్త సమస్యకు చెక్
● పుణే మహానగరంలో పక్కాగా అమలవుతున్న విధానం ● అధ్యయనం చేసిన కేఎంసీ బృందంఖమ్మంమయూరిసెంటర్: పట్టణాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడడానికి యంత్రాంగం కృషికి తోడు ప్రజల చైతన్యమే కీలకంగా నిలుస్తోంది. ఈ విషయాన్ని పుణే మహా నగరవాసులు రుజువు చేశారు. ఖమ్మం నగర పాలక సంస్థ బృందం అక్కడ పర్యటిస్తుండగా శుక్రవారం పలు ప్రాంతాల్లో చెత్త సేకరణ, నిర్వహణను పరిశీలించారు. ప్రజలే నేరుగా.. చాలాచోట్ల తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని సూచిస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ పుణేలో మాత్రం కార్మికులు తోపుడు రిక్షాలతో వస్తుండగా... ప్రజలే నేరుగా తడి, పొడి వ్యర్థాలు వేరుగా వేస్తుండడాన్ని కేఎంసీ బృందం గుర్తించింది. ఈ విధానం కేఎంసీలోనూ అమలుచేస్తే మంచి ఫలితాలు వస్తాయనే భావనకు వచ్చారు. ఫంక్షన్ హాళ్లలో బయోగ్యాస్ ఉత్పత్తి పుణేలోని ఫంక్షన్ హాళ్లలో మిగిలే ఆహార వ్యర్థాలను చెత్త సేకరణ వాహనాలకు ఇవ్వకుండా సొంతంగా బయోగ్యాస్ తయారు చేస్తున్నారు. చిన్నప్లాంట్ ఏర్పాటు చేసి మిగిలే ఆహార, కూరగాయల వ్యర్థాలను వేస్తుండడంతో కుళ్లిపోయి గ్యాస్ తయారవుతోంది. ఆతర్వాత మిగిలే వ్యర్థాలు మట్టిగా మారడంతో మొక్కలకు వినియోగిస్తున్నారు. దీంతో నగర పాలక సంస్థపై చెత్త సేకరణ భారం తగ్గింది. ఒక్కో యూనిట్‌కు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చించాల్సి ఉండగా, ఇదే విధానం ఖమ్మంలోనూ అమలుకు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. కాగా, కేఎంసీ ఏఓ శివలింగం, టీపీఎస్ నరేష్కుమార్, జూనియర్ అసిస్టెంట్లు హాసిని, సుజిత, కమ్యూనిటీ కోఆర్డినేటర్ ద్రౌపది, ఇతర సిబ్బంది పీఎంసీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, కార్మికులకు డ్రస్, గ్లౌజులు, బూట్ల పంపిణీ, ఉద్యోగుల సంక్షేమ నిధి వివరాలు సేకరించారు. అయితే, కేఎంసీలో మాదిరి ఈ–ఆఫీస్ అక్కడ లేకపోవడం, ఆన్లైన్ అకౌంట్ విధానంలోనూ పీఎంసీ కొంత వెనుకబడిందని గుర్తించారు. పుణెలో ఖమ్మం మేయర్ పి.నీరజ నేతృత్వాన కార్పొరేటర్లు, అధికారుల బృందం చేపట్టిన రెండు రోజుల అధ్యయనం శుక్రవారంతో ముగిసింది. -
గనిలో ‘నారీ’మణులు
భూగర్భంలో సాహస విధులు ● సింగరేణిలో సర్దార్, ఓవర్‌మెన్ పర్యవేక్షణ బాధ్యతలు ● ఏటా సంస్థలో పెరుగుతున్న మహిళా ఉద్యోగులుసింగరేణి(కొత్తగూడెం): గతంలో వంటింటికే పరిమి తమైన మహిళలు నేడు ఉద్యోగ నిర్వహణలోనూ రాణిస్తున్నారు. అయితే, కొన్నాళ్ల పాటు కార్యాలయాలకే పరిమితమయ్యే ఉద్యోగాలను మాత్రమే ఎంచుకోగా ఇప్పుడు ఈ స్థితినీ దాటేశారు. క్లిష్టమైన పరిస్థితులు, సంక్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించడానికీ అతివలు వెనుకాడడం లేదు. అందులో భాగంగానే సింగరేణిలోని భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి, పర్యవేక్షణ బాధ్యతలను నిస్సంకోచంగా, విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. పురుషులు సైతం భయంభయంగా పనిచేసే రెస్య్కూ విధులనూ మహిళలు ఎంచుకుంటుండడం విశేషం. మైనింగ్ ఆఫీసర్లుగా మహిళలు.. సింగరేణి సంస్థలో సుమారు 56 విభాగాలు విధులు నిర్వర్తిస్తేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుంది. వీటన్నింటిలోనూ గతంలో పురుషులే ఉండేవారు. అయితే, సంస్థ ఇటీవల నియామకాల్లో మహిళలకు అన్ని విభాగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం.. డిపెండెంట్ ఉద్యోగాల కల్పనలోనూ సానుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు సంస్థ వ్యాప్తంగా 2వేల మంది వరకు మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో కొందరు ఎగ్జిక్యూటివ్(అధికారుల) హోదాలో ఎలక్ట్రికల్, మైనింగ్, సివిల్, ఎకౌంట్స్, ఎస్టేట్స్, పర్సనల్ విభాగాల్లో ఉండగా.. ఉత్పత్తికి సంబంధించి మరో 16 విభాగాల్లోనూ మహిళామణులు విధులు నిర్వహిస్తున్నారు. కాగా, సింగరేణిలో మైనింగ్ ఆఫీసర్ విధులు క్లిష్టంగా ఉంటాయి. గనుల్లో బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేయడం, గనుల్లో వెలువడే గ్యాస్‌ను గుర్తించడమే కాక మైనింగ్ విభా గంలో సర్దార్, ఓవర్మెన్లకు విధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇలాంటి విధులను మహిళలు అలవోకగా నిర్వర్తిస్తూ భేష్ అనిపించుకుంటున్నారు.‘ఆమె’ రాణిస్తోంది.. మరికొన్ని కథనాలు 9లో -
అడుగు ముందుకే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘అమ్మే నా తొలి గురువు. ఆమె పెద్దగా చదువుకోలేదు. కానీ నన్ను ముందుకు నడిపించింది. ఎక్కడ పడిపోతే.. అక్కడి నుంచే నీ కొత్త ప్రయాణం మొదలుపెట్టమని చెప్పింది. నన్ను జడ్జిగా చూడాలన్న ఆమె కోరికను నెరవేర్చగలిగాను. మహిళలు తమ లక్ష్యాలను చేరుకోవడానికి దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలి.’ అని జిల్లా ఒకటో అదనపు న్యాయమూర్తి కె.ఉమాదేవి పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ యూనిట్ కార్యాలయంలో ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పేజీ లే ఔట్, మహిళా దినోత్సవ ప్రత్యేక కథనాలపై చర్చించి సూచనలు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఉమాదేవి తన ప్రస్థానం, మహిళా సాధికారతపై వెల్లడించిన వివరాలు ఆమె మాటల్లోనే.. ● దృఢ సంకల్పంతో సాగితేనే విజయం ● నన్ను జడ్జిగా చూడాలన్నదే మా అమ్మ కల ● జిల్లా అదనపు న్యాయమూర్తి ఉమాదేవి మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా విధులు నిరాశకు తావివ్వొద్దు.. మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా.. అందులో వంద శాతం కృషి చేయాలి. ఏ పనైనా ఇష్టంతో చేయాలి. లక్ష్యాలను చేరుకోవడానికి దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలే తప్ప ఎక్కడో ఏదో జరిగిందని కుంగిపోవద్దు. మనకు మన లక్ష్యమే కనపడాలి. మంచి, చెడును సమానంగా స్వీకరించగలిగే స్థితప్రజ్ఞత సాధించాలి. మహిళలు ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఇక చాలు నా జీవితం అయిపోయిందనే భావనను మనసులోంచి తీసేయాలి. అప్పుడే అనుకున్న దాని కన్నా మంచి స్థితిలో ఉంటాం. చిన్నతనం నుంచే మహిళలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ముఖ్యం. వారి లక్ష్యాలకు అండగా ఉండాలి. ఎవరేం అనుకుంటారోనని ఆలోచించొద్దు.. మహిళల్లో ఎక్కువ మంది వాళ్లేం అనుకుంటారో.. వీళ్లేం అనుకుంటారో అని ఆలోచిస్తుంటారు. అలా కాకుండా మనమేం అనుకుంటున్నామో అదే ముఖ్యం. నలుగురు ఏమనుకుంటారో అనే భావన తీసేస్తేనే జీవితంలో ఎదగగలుగుతాం. అప్పుడే ఎంత కఠినమైన పనైనా చేయగలం. జీవితంలో ఏదీ సులువు కాదనే విషయాన్ని అంగీకరించాలి.అమ్మే నా మొదటి గురువు.. మేము నలుగురు ఆడపిల్లలం. నాన్న ఫిజికల్ డైరెక్టర్. ఆయన అందరినీ లెక్చరర్లుగా చేయాలనుకున్నారు. కానీ నన్ను జడ్జిగా చూడాలన్నది అమ్మ కోరిక. నా మొదటి గురువు ఆమే. ఏం చేయాలి.. ఎలా వెళ్లాలి.. ఎక్కడైతే పడిపోతామో అక్కడే లేచి నిలబడమని చెప్పేది.. అంత సపోర్ట్ ఉండడంతో ఆమె కల నెరవేర్చగలిగాను. -
నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
ఖమ్మంవన్‌టౌన్: పెండింగ్ ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తూ చెల్లింపులు సైతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ దీక్షారైనా ఆదేశించారు. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో శుక్రవారం సమావేశమైన ఆమె పలు అంశాలపై సమీ క్షించారు. పెండింగ్ బిల్లులను సోమవారం సాయంత్రంలోగా చెల్లించాలని, ఉపాధి పథకం చెల్లింపులు సైతం పూర్తిచేయాలని తెలిపారు. అంతేకాక గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, వెనుకబడిన గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఎరువు తయారీ, నర్సరీల్లో షేడ్నెట్ల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇందిరమ్మ లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాల సభ్యులైతే రుణాల మంజూరు, ఉపాధి పథకంలో పనుల కల్పనపై దృష్టి సారించాని సీఈఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్ఓడీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, డీఎల్పీఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.అధికారులతో సమీక్షలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా -
●మనల్ని మనం నమ్మాలి..
● చిన్న ఓటమికే కుంగిపోవద్దు ● కుటుంబ న్యాయస్థానం జడ్జి అర్చనాకుమారిఓటమితోనే లోపాలు తెలుస్తాయి.. ప్రతీ మహిళ అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. ఎప్పుడైనా ఓటమి ఎదురైతే కుంగిపోవద్దు. ఓటమితోనే మనలోని లోపాలను గుర్తించగలుగుతాం. తప్పిదం మన వల్ల జరిగిందా.. సహజంగా జరిగిందా అనే విషయాలపై దృష్టి పెట్టాలి. అప్పుడే కొత్త పాఠాలు నేర్చుకోగలుగుతాం. లక్ష్యాలను నిర్దేశించుకోవడమే కాక అందుకు తగ్గట్టుగా కృషి చేయాలి. మహిళలు జీవితంలో ఎదగాలన్నా.. రాణించాలన్నా ముందు యాక్సెప్టెన్సీ, ఆ తర్వాత ప్రణాళిక చాలా ముఖ్యం. రేపటి గురించి ఆలోచన వద్దు.. రేపు ఏం జరుగుతుందో అనే ఆలోచన మనసులోంచి తీసేయాలి. వాస్తవంగా ఏం చేస్తున్నామో ముఖ్యమని గుర్తించి ప్రతీ మహిళ వాస్తవంలో జీవించాలి. పోల్చుకోవడం తప్పేం కాకున్నా విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలి. ఎవరి నుంచి అయినా చెడు ప్రభావం పడుతున్నా.. వారిని చూసి అలాంటివి చేయకూడదనేది నేర్చుకోవాలి. మాట సాయంతో, ఇతరత్రా సాయం చేసే వారిని చూసి అలా ఉండాలనే ఆలోచనలు మనకు రావాలి. విజ్ఞానాన్ని పంచే వారితో మాట్లాడుతుండాలి.నేను ఎదగాలని కోరుకుంది వారే... నాకు ఇన్స్పిరేషన్ అంటే మా అమ్మ, అత్తతో పాటు మా అమ్మమ్మ, నానమ్మను గుర్తు చేసుకుంటాం. వారు చదువుకున్న దాఖలాలు లేవు. అయినా మంచి విషయాలు చెబుతుండేవారు. ఎప్పుడూ నేను పెద్ద స్థాయికి రావాలని కలలు కన్నారు. నేను కొన్నిసార్లు అవుతుందో.. లేదో.. అని అనుకున్నప్పుడు నాకు తోడుగా నిలిచారు. మనకు కష్టం వచ్చిన సమయంలో ఎవరో ఒకరు మన పక్కన ఉంటారు. దానిని మనం గుర్తించాలి.‘మహిళలు తమని తాము గుర్తించాలి. తమను తాముగా అంగీకరించగలగాలి. చిన్న ఓటమి ఎదురైనా కుంగిపోకుండా ముందుకు వెళ్లాలి. రేపు ఏం జరుగుతుందని కాకుండా.. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి.. నేను ఈ స్థాయికి రావడంలో అమ్మమ్మ, నానమ్మతో పాటు అమ్మ, అత్త పాత్ర ఎంతో ఉంది.’ అని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం.అర్చనాకుమారి పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అదనపు న్యాయమూర్తి ఉమాదేవితో కలిసి ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించిన ఆమె వెల్లడించిన అంశాలు అర్చనాకుమారి మాటల్లోనే... -
నేడు జాతీయ లోక్‌అదాలత్
ఖమ్మంలీగల్: ఖమ్మం న్యాయసేవా సదన్‌లో శనివారం జాతీయ స్థాయి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖరరావు తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కేసుల పరిష్కా రం కోసం తొమ్మిది బెంచ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. రీజియన్‌లో మహిళా సంఘాలకు ఏడు బస్సులు ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ అద్దెకు తీసుకునే బస్సులను మహిళా సంఘాల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు తొలిదశలో కొన్ని బస్సులను మహిళా దినోత్సవమైన శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఎంపిక చేసిన రీజి యన్లలో ఖమ్మం కూడా ఉండగా ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోలకు రెండు చొప్పున, ఇల్లెందుకు ఒక బస్సు కేటాయించారు. ప్రభుత్వ గ్యారంటీతో మహిళా సంఘాలకు లింకేజీ రుణాలు మంజూరు చేసి, ఈ రుణాలతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన కేటాయిస్తారు. ఇంటర్ పరీక్షకు 570మంది గైర్హాజరు ఖమ్మం సహకారనగర్/ఏన్కూరు: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం రెండో పరీక్ష శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని 72కేంద్రాల్లో పరీక్ష జరగగా, 18,220మంది విద్యార్థులకు గాను 570మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. కాగా, ఏన్కూరులో రెండు పరీక్షా కేంద్రాలను డీఐఈఓ తనిఖీ చేశారు. కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అధికారులు సింహాచలం, శ్రీనివాసరెడ్డి, సుందరం పాల్గొన్నారు. కాలేజీ భవన నిర్మాణానికి రూ.5.50 కోట్లు కూసుమంచి: కూసుమంచికి ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు కాగా రెవెన్యూ అకాడమీ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈమేరకు భవన నిర్మాణానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో నిధులు మంజూరయ్యాయి. భవన నిర్మాణానికి రూ.5కోట్లు, ల్యాబ్ పరికరాలు, కంప్యూటర్ల కొనుగోలుకు మరో రూ.50లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీఎన్జీవోస్ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ ఖమ్మం సహకారనగర్: ‘తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్’ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల అధికారి అవధానుల శ్రీనివాస్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 3,424 మంది ఓటర్లు ఉండగా, ఈనెల 10, 11, 12వ తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే, 13న స్క్రూటినీ, 15వ తేదీన నామినేషన్ల విత్ డ్రా పూర్తయ్యాక 21వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఏడుగురు సభ్యులను ఎన్నికయ్యాక వీరి నుంచి అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఇతర పదవులకు ఎన్నుకుంటారు. -
ఇంట్లో ఓకే.. బయటే భయం !
సమాజంలో అందరూ సమానేమనే భావన నానాటికీ పెరుగుతోంది. పురుషులతో సమానంగా కుటుంబ పోషణలో పాలు పంచుకుంటున్న మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తుండడం ఇందుకు కారణమవుతోంది. కానీ అతివలపై వివక్ష మాత్రం కొన్నిచోట్ల కొనసాగుతూనే ఉంది. అయితే ఇళ్లలో తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఆ పరిస్థితి ఎదురుకాకున్నా... పని ప్రదేశాలు, విద్యాసంస్థలు, బస్టాండ్ల వంటి చోట మాత్రం ఈ సమస్య తప్పడం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో 100 మంది మహిళలను సర్వే చేయగా ఈ విషయం వెల్లడైంది. ‘సాక్షి’ అడిగిన ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి. – ఖమ్మంమయూరిసెంటర్/కొత్తగూడెంఅర్బన్మహిళలపై కొనసాగుతున్న వివక్ష ● ఇంకా కనిపిస్తున్న ఆడామగ తేడా -
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
ఖమ్మం లీగల్: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందు వరుసలో నిలవాలని అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి అన్నారు. ఖమ్మంలోని టీటీడీసీలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యాన మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం న్యాయవాదులకు ‘మహిళా సమస్యలు – చట్టాలు’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఉమాదేవి మాట్లాడుతూ ఇంటికి, సమాజానికి వెలుగునిస్తున్న మహిళలు ప్రస్తుతం పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. ఇదే ఒరవడి కొనసాగిస్తూ మరింత ముందుకు సాగాలని సూచించారు. ఈకార్యక్రమంలో న్యాయమూర్తులు అపర్ణ, అర్చనకుమారి రాంప్రసాద్, మురళీమోహన్, ప్రభాకర్, చంద్రశేఖరరావు, కల్పన, శివరంజని దీప, రజిని, బిందుప్రియ, మాధవి, శాంతిలత, కార్తీక్‌తో పాటు విద్యుల్లత, ఐలూ బాధ్యులు కొల్లి సత్యనారాయణ, ఎం. శ్రీనివాస్, వై.శ్రీనివాస్, నాగేశ్వరరావు నవీన్, శ్రీలక్ష్మి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
●ఇక కొత్త వేదికపై కల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలో ఏటా బ్రహ్మోత్సవాల సమయాన శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణంతో పాటు శ్రీరామనవమికి సీతారాముల కల్యాణం ఇక నుంచి కొత్త వేదికపై జరగనున్నాయి. ఆలయ ప్రాంగణంలో గ్రామానికి చెందిన కేఎన్ఆర్ గ్రానైట్స్ అధినేత తుళ్లూరు కోటేశ్వరరావు–నిర్మల రూ.5కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ వకుళామాత స్టేడియంను శుక్రవారం ప్రారంభించనున్నారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఏటా జరిగే సీతారాముల కల్యాణం తరహాలో జమలాపురంలోనూ వేంకటేశ్వరస్వామి కల్యాణం, సీతారాముల కల్యాణం నిర్వహించాలనే ఆలోచనతో స్టేడియం నిర్మించారు. 2019లో హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి శంకుస్థాపన చేయగా ఇటీవలే పూర్తయింది. మూడు రోజులుగా అర్చకులు, వేద పండితుల సమక్షాన దాత కోటేశ్వరరావు దంపతులు యాగం నిర్వహిస్తున్నారు. కాగా, శుక్రవారం జరిగే స్టేడియం ప్రారంభోత్సవంలో వేలాది భక్తులు పాల్గొననున్న నేపథ్యాన ఏర్పాట్లు చేశారు.జమలాపురంలో సిద్ధమైన శ్రీ వకుళామాత స్టేడియం -
సీఎస్‌సీలతో విస్తృత సేవలు
ఖమ్మంసహకారనగర్: కామన్ సర్వీస్ సెంటర్ల(సీఎస్సీ) ద్వారా ప్రజలకు విస్తృత సేవలు అందుతున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ తెలిపారు. సెంటర్ల నిర్వాహకులకు కలెక్టరేట్లో గురువారం ఏర్పాటుచేసిన వర్క్‌షాప్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం, డిజిటల్ సేవలు మెరుగుపరచడానికి సెంటర్లు ఉపయోగపడతాయని చెప్పారు. దేశంలోని పది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమం అమలు చేస్తుండగా ఖమ్మం జిల్లా కూడా ఉందని తెలిపారు. ఇప్పటికే 589 జీపీల్లో 434సెంటర్లు ఏర్పాటుచేయగా, మిగిలిన చోట్ల ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలతో ఏర్పాటుకు ప్రణాళిక ఉందన్నారు. అనంతరం డీఆర్డీఓ సన్యాసయ్య, ఎస్పీవీ అండ్ హెడ్ జీ2సీ బాధ్యులు డాక్టర్ విఘ్నేష్ స్వర్ణమోహన్ మాట్లాడగా పలు సెంటర్ల నిర్వాహకులను సన్మానించారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎస్బీఐ ఆర్ఎం లింగస్వామి, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, సునీల్‌రెడ్డి, సుహాసిని పాల్గొన్నారు. -
అన్ని ప్రాంతాలకూ మెరుగైన రహదారులు
ముదిగొండ: నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకూ మెరుగైన రవాణా సదుపాయం ఉండేలా రహదారులు విస్తరిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ముదిగొండ నుంచి వల్ల భి వరకు రెండు లేన్లు ఉన్న 5కి.మీ. రహదారిని రూ.28కోట్ల వ్యయంతో నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. ఈ పనులకు భట్టి గురువారం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో వచ్చిన ఆయనకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్ స్వాగతం పలికారు. అనంతరం ముదిగొండ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన భట్టి రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశాక మాట్లాడారు. ఆతర్వాత ఖబరస్తాన్ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముస్లింలు భట్టికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్అండ్బీ ఎస్ఈ హేమలత, ఈఈ యుగంధర్, ఆర్డీఓ నర్సింహారావు, సొసైటీ డైరెక్టర్ వనం ప్రదీప్తచక్రవర్తితో పాటు కాంగ్రెస్ నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కొమ్మినేని రమేష్‌బాబు, మందరపు నాగేశ్వరరావు, వల్లూరి భద్రారెడ్డి, పసుపులేటి దేవేంద్రం, తాటికొండ రమేష్, గుడిపూడి ఝాన్సీరాణి, పందిరి అంజయ్య పాల్గొన్నారు.రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం -
100శాతం పన్నుల వసూళ్లపై దృష్టి
బోనకల్: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ఈనెల 20 నాటికి 100 శాతం ఇంటి పన్నులు పూర్తిచేయడమే కాక షాపుల యజమానులతో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత ఆదేశించారు. బోనకల్ మండల పరిషత్ కార్యాలయంలో చింతకాని, బోనకల్ మండలాల కార్యదర్శులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రత నేపథ్యాన అన్ని జీపీల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేయడంతో పాటు నీటి కొరత ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని తెలిపారు. ఎంపీడీఓ రమాదేవి, ఎంపీఓ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
పుణే.. నమూనా
● అక్కడ ఎస్టీపీలతో సమర్థంగా మురుగునీటి నిర్వహణ ● యూజీడీలతో మెరుగుపడిన పారిశుద్ధ్యం ● అధ్యయనం చేస్తున్న కేఎంసీ బృందం ఖమ్మంమయూరిసెంటర్: నగరాలు, పట్టణాల అభివృద్ధితో పాటే పారిశుద్ధ్య సమస్య సైతం పెరుగుతుంటుంది. విస్తరిస్తున్న కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, వీధుల్లోని ఖాళీ స్థలాలు, లోతట్టు ప్రాంతాల్లోకి మురుగు చేరుతుండడం.. డ్రెయినేజీలు ఉన్న చోట మురుగు వెళ్లి నదులు, చెరువుల్లోకి చేరి కలుషితం కావడం సాధారణంగా మారింది. ఈనేపథ్యాన ఎస్టీపీ(మురుగు నీరు శుద్ధీకరణ ప్లాంట్)లు ఏర్పాటుచేస్తే జల వనరులు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. ఈక్రమాన దేశంలోనే పారిశుద్ధ్య నిర్వహణలో మేటిగా నిలుస్తున్న పుణే మహానగరంలో మురుగు నీటి శుద్ధీకరణకు పెద్దసంఖ్యలో ఎస్టీపీలు ఏర్పాటుచేశారు. అక్కడ రోజుకు 500 ఎంఎల్డీ మురుగు నీటిని శుద్ధి చేసే 10 ప్లాంట్లు నిర్వహణలో ఉండగా, మరో 11 సిద్ధమవుతున్నాయి. వీటి ద్వారా పుణే మధ్యలో ప్రవహించే మూలముత్త నదిలో కలిసే మురుగు నీటిని శుద్ధి చేస్తున్నారు. ఈమేరకు పుణేలో మురుగునీటి నిర్వహణ, ఇతర అంశాలపై అధ్యయానికి వెళ్లిన ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు వీటిని పరిశీలిస్తున్నారు. యూజీడీలు, ఎస్టీపీల మీదుగా నదిలోకి.. కేఎంసీ కార్పొరేటర్లు, అధికారుల బృందం గురువారం పుణేలోని మూలముత్త నదిని పరిశీలించారు. మూల, ముత్త నదుల సంగమంగా ఏర్పడిన ఈ నది నగరం మీదుగా ప్రవహిస్తోంది. అయితే, డ్రెయినేజీల ద్వారా మురుగునీరు ఇందులోకి చేరుతుండడంతో ప్రజలు, పర్యావరణ వేత్తల ఆందోళనతో మహానగర పాలక సంస్థ ఆధ్వర్యాన ఎస్టీపీలను ఏర్పాటు చేశారు. తద్వారా మురుగునీరు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(యూజీడీ)ల్లోకి చేరి ఆపై ఎస్టీపీల ద్వారా శుద్ధి అయ్యాక నదిలో కలుస్తోంది. ఇలాంటి విధానాన్నే ఖమ్మంలోనూ అమలుచేయాలనే భావనకు కేఎంసీ పాలకవర్గం, అధికారులు వచ్చారు. ప్రస్తుతం ఖమ్మం శ్రీనివాసనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్టీపీని పూర్తి చేస్తే కొంత మేర మురుగు నీరు మున్నేరులో కలవకుండా అడ్డుకట్ట పడుతుందని.. ఆపై కొత్తగా మంజూరైన మరో నాలుగు ప్లాంట్లను ప్రధాన చెరువుల వద్ద ఏర్పాటు చేస్తే నగరంలోని మురుగునీటి శుద్ధి జరుగుతుందనే భావనకు వచ్చారు. అంతేకాక ఖమ్మం నగరమంతా యూజీడీ నిర్మిస్తేనే మురుగునీరు శుద్ధికి వీలవుతుందనే చర్చ కూడా జరిగింది. అతిపెద్ద ఎస్టీపీ పుణే నగరంలో 500 ఎంఎల్డీ మురుగు నీటిని శుద్ది చేసేందుకు 10 ఎస్టీపీలు నిర్మించారు. ఇందులో అతి పెద్దదైన డాక్టర్ నాయుడు మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను రూ.40 కోట్ల వ్యయంతో పది ఎకరాల్లో నిర్మించారు. ఈ ప్లాంట్ రోజుకు 115 మినియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తుండడం విశేషం. తొలి రోజుంతా పరిశీలన, సమావేశాలు కేఎంసీ బృందం తమ పర్యటనలో తొలిరోజైన గురువారం పుణేలోని మూలముత్త నదితో పాటు ఎస్టీపీలను పరిశీలించారు. అనంతరం అక్కడి మహానగర పాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించగా కౌన్సిల్ హాల్ అసెంబ్లీ హాల్‌ను తలపించేలా ఉండడంతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పుణే మహానగర పాలకసంస్థ అడిషనల్ కమిషనర్ పృధ్వీరాజ్, అధికారులతో ఖమ్మం మేయర్ నీరజ, కార్పొరేటర్లు, అధికారులు సమావేశం కాగా, అక్కడ పారి శుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రెవెన్యూ, పరి పాలన తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈక్రమంలో మేయర్ నీరజ, అసిస్టెంట్ కమిషనర్ షఫీ ఉల్లా అహ్మద్, కార్పొరేటర్లు పలుఅంశాలు తెలుసుకున్నారు. ఈఈ కృష్ణాలాల్, ఏఓ శివలింగం, టీపీఎస్ సంతోష్, ఏఈలు తేజ్, యాకూబ్ వలీ పాల్గొన్నారు.కీలకంగా మూలముత్త నది కేఎంసీ బృందం పర్యటనలో మూలముత్త నది కీలకంగా నిలిచింది. ఈ నది పుణే నగరంలో 44 కి.మీ. మేర ప్రవహిస్తోంది. నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.4,700 కోట్లు కేటాయించింది. దీనికి తోడు అక్కడి నగర పాలక సంస్థ ఆధ్వర్యాన ఇరువైపులా 5 కి.మీ. అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కరకట్ట వెంట మొక్కలు నాటడం, కట్టపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల ఏర్పాటు, ప్రతీ 300 మీటర్లకు ఒక ఘాట్ నిర్మాణం జరుగుతుండగా.. ఖమ్మంలో మున్నేరునూ ఇదే తరహాలో అభివృద్ధి చేస్తే నగరం మరింత ఆకర్షణీయంగా మారుతుందనే ఆలోచనకు కేఎంసీ బృందం వచ్చింది. -
మరో రోజు రండి..
జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీలో జాప్యం ● 748 షాపులకు గాను 90 షాపులకే సరఫరా ● ఇతర జిల్లాల్ల్లో ప్రయత్నించినా నిల్వలు లేవని సమాధానం ● ఖరీఫ్‌లో సేకరించిన దొడ్డు బియ్యం పంపిణీపై దృష్టిసాక్షిప్రతినిధి, ఖమ్మం: ఈనెల మొదటి వారం పూర్తికావొస్తున్నా జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా బియ్యం సరఫరా నత్తనడకన సాగుతోంది. ప్రతినెలా 1నుంచి 15వ తేదీ లోపు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసేవారు. కానీ రెండు, మూడు నెలల నుంచి సరఫరాలో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. ఈనెల కూడా షాప్‌లకు పూర్తిస్థాయిలో బియ్యం చేరకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలో బియ్యం నిల్వలు అడుగంటగా, ఇతర జిల్లాల నుంచీ అదే సమాధానం రావడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీంతో వానాకాలంలో కొనుగోలు చేసి మర ఆడించిన ధాన్యాన్ని రేషన్ దుకాణాలకు పంపిణీ చేస్తుండగా అన్ని షాపులకు చేరేవరకు ఇంకా సమయం పట్టనుంది. 748 షాపుల ద్వారా పంపిణీ జిల్లాలో మొత్తం 4,11,566 రేషన్ కార్డులు ఉండగా, 748 షాప్‌ల ద్వారా 11,29,030 మంది లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీనెలా 6,343 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రతినెలా ఒకటో తేదీ కల్లా షాపులకు బియ్యం చేరవేస్తే డీలర్లు 1నుంచి 15వ తేదీవరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఇతర జిల్లాల్లోనూ లభ్యత లేక.. జిల్లాలో బియ్యం నిల్వలు సరిపడా లేకపోవడంతో ప్రభుత్వం ఇతర జిల్లాల నుంచి సరఫరా చేస్తోంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి ఇక్కడి గోదాంలకు 24నుంచి 30 తేదీలోపు చేరిస్తే.. ఆపై షాపులకు పంపించి లబ్ధిదారులకు ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం సూర్యాపేట, నల్లగొండ తదితర జిల్లాల అధికారులు సైతం తమ వద్ద బియ్యం ని ల్వలు లేవని సమాధానం ఇవ్వడంతో ఇక్కడ సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. వానాకాలం బియ్యమే.. ఇతర జిల్లాల్లోనూ బియ్యం లేనందున స్థానికంగానే ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది వానాకాలంలో రైతులు 90 శాతం సన్న ధాన్యం, 10 శాతం దొడ్డు ధాన్యం సాగు చేయగా.. పౌర సరఫరా సంస్థ ద్వారా సేకరించారు. ఇందులో దొడ్డు ధాన్యాన్ని మర ఆడించి రేషన్ దుకాణాలకు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. అయితే, ఇప్పటివరకు జిల్లాలోని 748రేషన్ షాప్‌లకు గాను 90దుకాణాలకే చేరాయి. ఆయా దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేస్తుండగా, మిగతా షాపులకు వెళ్లిన లబ్ధిదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.వారం రోజుల్లో సరఫరా చేస్తాం.. జిల్లాలోని అన్ని రేషన్ షాప్‌లకు వారంలోగా బియ్యం సరఫరా చేస్తాం. సూర్యాపేట, నల్లగొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ప్రయత్నించినా అక్కడ కూడా నిల్వలు లేవనే సమాధానం వచ్చింది. దీంతో జిల్లాలోనే వానాకాలం సేకరించిన ధాన్యాన్ని మర ఆడించి ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నందున త్వరలోనే అన్ని షాపులకు బియ్యం చేరవేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చూస్తాం.– శ్రీలత, మేనేజర్, జిల్లా పౌరసరఫరాల సంస్థప్రతీనెలా సమస్యే రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరాలో ఇటీవల కొద్దినెలలుగా సమస్యలు ఎదురవుతున్నాయి. పోర్టబులిటీ విధానంలో ఎక్కడ కార్డు ఉన్నా.. ఇతర ప్రాంతాల్లోనూ బియ్యం తీసుకునే వెసులుబాటు ఉండడంతో జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీ కేంద్రాల్లో బియ్యం నిల్వ లు త్వరగా అడుగంటుతున్నాయి. ఇలా పోర్టబులిటీ ద్వారా ఇచ్చిన బియ్యం వివరాలను డీలర్లు 7, 8వ తేదీకల్లా జిల్లా పౌరసరఫరాల అధికారులకు సమర్పిస్తే గోదాంల నుంచి అదనంగా కోటా విడుదల చేస్తారు. అయితే, డీలర్లకు కావాల్సిన బియ్యమే కాక అదనపు కోటా కూడా రాకపోవడంతో షాపుల వద్ద బియ్యం స్టాక్ లేవని, ఫలానా తేదీన రావొచ్చని బోర్డులు ఏర్పాటుచేస్తుండడంతో లబ్ధిదారులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. జిల్లాలోని గోదాంల్లో బియ్యం నిల్వలు నిండుకోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తుండగా.. గత నెల 25 వరకు, అంతకు ముందు నెల 30వ తేదీ వరకు బియ్యం సరఫరా కొనసాగించారు.సన్నబియ్యం ఎప్పుడు ? రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది ఉగాది నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే ఈనెల కూడా దొడ్డు బియ్యమే ఇస్తుండగా, సన్న బియ్యం పంపిణీ చేసేదెప్పుడో స్పష్టత రావడం లేదు. ఉగాది పండుగ నుంచైనా రేషన్ దుకాణాలు, వసతి గృహాలకు సన్న బియ్యం పంపిణీ ఉంటుందా, లేదా అన్న సందిగ్ధత నెలకొంది. -
పంటల వైవిధ్యీకరణపై ఏఈఓలకు శిక్షణ
వైరా: పంటల సాగులో అనుసరించాల్సిన వినూత్న విధానాలపై వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో గురువారం జిల్లాలోని ఏఈఓలకు శిక్షణ ఇచ్చారు. అఖిల భారత సమన్వయ పరిశోధనా సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విఽశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యాన సమగ్ర వ్యవసాయ పద్ధతుల విభాగం, మధిర వ్యవసాయ పరిశోధనా సంస్థ, వైరా కేవీకే నేతృత్వంలో శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ వ్యవసాయ పరిఽశోధనా సంస్థఽ ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. గోవర్దన్, డాక్టర్ సీహెచ్.ప్రగతికుమారి మాట్లాడుతూ గత ఏడాది చింతకాని మండలంలో పలువు రు రైతులు యాసంగిలో జిరో టిల్లేట్ విధానంలో వరికి బదులు మొక్కజొన్న, పెసర, మినుము సాగు చేసి అధిక దిగుబడులు సాధించారని తెలిపారు. వరి తర్వాత దుక్కి దున్నకుండా మొక్కజొన్న సాగు చేసే విధానంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం మరో శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీదేవి యాసంగిలో వరికి బదులు పప్పుధాన్యాల సాగుతో కలిగే లాభాలను వివరించారు. వైరా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కెరవికుమార్, శాస్త్రవేత్తలు డాక్టర్ జె.రవీందర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ ఫణిశ్రీ, డాక్టర్ టి.భరత్, డాక్టర్ నాగస్వాతి, డాక్టర్ జి.వినయ్, సాయిబాబా పాల్గొన్నారు. -
కృష్ణమ్మ ఒడిలోకి గోదావరి
● ఎన్నెస్పీ కెనాల్లో కలిసిన గోదావరి జలాలు ● లింక్ కెనాల్‌కు భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో పరిహారం ● అటు జలం, ఇటు పరిహారంతో రైతుల్లో ఆనందంఏన్కూరు: ఏన్నో ఏళ్లుగా రైతులు, సామాన్య ప్రజానీకం ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. మూడు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేయగా ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మీదుగా జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపానికి బుధవారం రాత్రి 9.30 గంటలకు చేరుకున్నాయి. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏన్కూర్ లింక్ కెనాల్లోకి గోదావరి జలాలు విడుదల చేయగా, 8.6 కి.మీ. పొడవైన కెనాల్లో ప్రవహించిన గోదావరి నీరు గురువారం తెల్లవారుజాము కల్లా ఏన్కూరులోని ఎన్నెస్పీ కెనాల్ 52 కి.మీ. రెగ్యులేటర్ వద్దకు చేరడంతో కృష్ణా – గోదావరి సంగమం ఆవిష్కృతమైంది. సాగుకు సమస్య లేనట్లే... నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కోసం జిల్లాలో కెనాళ్లు నిర్మించగా లక్షల ఎకరాల్లో ఆయకట్టు సాగువుతోంది. అయితే, కృష్ణా పరీవాహకంలో వర్షాలు కురవని సమయంలో సాగర్‌లో నీటి లభ్యత లేక సాగుకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యాన సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదల చేసే నీటిని ఎన్నెస్పీ కాల్వల్లోకి మళ్లించాలనే ఆలోచనతో జూలూరుపాడు మండలం వినోభానగర్ వరకు పూర్తయిన ప్రధాన కాల్వ నుంచి ఏన్కూరులోని ఎన్సెస్పీ కెనాల్ వరకు 8.6 కి.మీ. లింక్ కెనాల్‌ను రూ.96కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ కాల్వ నిర్మాణం పూర్తికావడంతో గోదావరి జలాలను విడుదల చేయగా ఎన్పెస్పీ కెనాల్లోకి చేరాయి. ఆపై ఎస్కేప్ లాక్‌ల ద్వారా వైరా రిజర్వాయర్‌కు మళ్లిస్తున్నారు. దీంతో సాగర్ ఆయకట్టు, సాగర్ జలాలపై ఆధారపడిన వైరా రిజర్వాయర్ కింద ఆయకట్టుతో పాటు సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో సైతం పంటల సాగుకు ఢోకా ఉండదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 194 మందికి పరిహారం సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ నిర్మాణానికి రైతుల నుంచి 139.6 ఎకరాల భూమి సేకరించారు. ఈమేరకు 205 మంది రైతులకు ఎకరాకు రూ.14లక్షల పరిహారం చెల్లిస్తామని తొలుత ప్రకటించారు. ఇందుకు రైతులు ససేమిరా అన్నప్పటికీ పనులు పూర్తిచేశారు. అయితే, కాల్వ పనులను పరిశీలనకు పలుమార్లు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభానికి ముందే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి నీటి విడుదలకు కొద్ది గంటల ముందు ఎకరాకు రూ.21లక్షల పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం 194 మంది రైతుల ఖాతాల్లో పరిహారం జమ కాగా, మిగతా వారికి ఒకటి, రెండు రోజుల్లో అందుతాయని అధికారులు తెలిపారు.చాలా ఆనందంగా ఉంది. చాన్నాళ్లుగా పరిహారం కోసం ఎదురుచూశాం. తొలుత ఎకరానికి రూ.14లక్షలే ఇస్తామన్నారు. మా పోరాట ఫలితంగా రూ.21లక్షల చొప్పున జమ చేశారు. కాల్వ నిర్మాణానికి మా భూమి 28 గుంటలు కోల్పోయాం. ఈ భూమికి పరిహారం అందడమే కాక నీరు విడుదల చేయడం సంతోషంగా ఉంది. – భూక్యా కిషన్, రైతు హిమాం నగర్ -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం మొదలయ్యాయి. ఈ పరీక్షకు 17,262 మందికి గాను 16,855 మంది విద్యార్థులు హాజరుకాగా, 407 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని 42 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ బృందాలు తనిఖీ చేశాయని డీఐఈఓ రవిబాబు వెల్లడించారు. చేనేత, టెక్స్టైల్స్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు ఖమ్మంగాంధీచౌక్: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిస్టూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)కి మూడేళ్ల కాలపరిమితితో చేనేత, టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్సు మంజూరైందని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు ఎం.విజయలక్ష్మి తెలిపారు. ఈ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 1నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే 23 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలైతే 25ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్న వారు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో ఏప్రిల్ మొదటి వారంలోగా దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 90300 79242 నంబర్లో సంప్రదించాలని సూచించారు. యథావిధిగానే రైళ్ల రాకపోకలు ఖమ్మం రాపర్తినగర్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడో లైన్ నిర్మాణం జరుగుతుండగా శుక్రవారం నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నామని, ఇంకొన్ని దారి మళ్లిస్తామని అధికారులు ఇటీవల ప్రకటించారు. కానీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ, శుక్రవారం నుంచి అన్ని రైళ్లు యథావిధిగానే నడుస్తాయని గురువారం మరో ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈమేరకు ప్రయాణికులు గమనించాలని ఖమ్మం కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎం.డీ.జాఫర్ కోరారు. శ్రీరామనవమి లోగా రహదారి మరమ్మతులు ఖమ్మంవన్‌టౌన్: ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్ నుండి కరుణగిరి వరకు రోడ్డు, డివైడర్లు దెబ్బతిన్నందున శ్రీరామనవమి లోగా మరమ్మతులు పూర్తిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి పెద్దసంఖ్యలో భక్తులు రానున్నందున ఆలోగా మరమ్మతులు చేపట్టడమే కాక నిర్మాణం పూర్తయిన డివైడర్లు, సర్కిళ్లలో మొక్కలు నాటి పెయిటింగ్ వేయించాలని సూచించారు. ఇప్పటికే కూడళ్ల ఆధునికీకరణపై హైదరాబాద్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి కృష్ణ పరిశీలించినందున ఇతర పనులు పూర్తయ్యేలా ఖమ్మం కలెక్టర్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకోవాలని మంత్రి తెలిపారు. మూడు బీసీ హాస్టళ్ల భవనాలకు నిధులు ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో శిథిలావస్థ కు చేరిన బీసీ సంక్షేమ వసతిగృహాల భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలకు అనుమతి మంజూరైంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదనలతో ఖమ్మంలో మూడు బీసీ వెల్ఫేర్ హాస్టల్ భవనాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక్కో భవనానికి రూ.3 కోట్ల చొప్పున రూ.9 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో రఘునాథపాలెం మండలం వి.వెంకటాయ పాలెంలో బీసీ బాలుర హాస్టల్, ఖమ్మం ముస్తఫానగర్‌లోని బీసీ బాలుర హాస్టల్–1, జహీర్పురలోని బీసీ బాలుర హాస్టల్–2కు అన్ని హంగులతో నూతన భవనాలు నిర్మించనున్నారు. ఎడమ కాల్వకు నీటి విడుదల నిలిపివేత కూసుమంచి: పాలేరు రిజర్వాయర్ నుండి ఎడ మ కాల్వకు గురువారం సాయంత్రం నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. రిజర్వాయర్ నీటిమట్టాన్ని పెంచేందుకు గాను రెండు రోజుల పాటు సరఫరా ఉండదని తెలిపారు. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం 16 అడుగులు ఉండగా, సాగర్ నుండి 5,738 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎడమ కాల్వకు 3,546 క్యూసెక్కులు, పాలేరు కాల్వకు 230 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ప్రాజెక్టుకు 135 క్యూసెక్కులు, భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి మరో 275 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తు తం ఎడమ కాల్వకు సరఫరా నిలిపివేయగా, రిజర్వాయర్ నీటిమట్టం 20 అడుగులకు చేరాక తిరిగి విడుదలచేస్తామని అధికారులు తెలిపారు. -
విద్యుత్ అధికారుల పొలం బాట
మధిర: రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యాన పొలం బాట నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఇల్లూరు, దేశినేనిపాలెంలోగురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి పాల్గొని మాట్లాడారు. రైతులు పొలాల్లోని మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని, తద్వారా నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు. అలాగే, సమస్య ఎదురైతే సొంతంగా మరమ్మతు చేయకుండా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా, ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించాన తొలిసారి మధిరకు వచ్చిన శ్రీనివాసాచారికి ఏడీఈ ఎం.అనురాధ ఆధ్వర్యాన స్వాగతం పలకగా, వైరా ఏడీఈ పి.కిరణ్‌కుమార్, ఏఈలు ఎస్.అనిల్‌కుమార్, మైథిలి, ఉద్యోగులు రాజేశ్వరి, వినయ్, రఘు, చెరుపల్లి శ్రీధర్, మాధవరెడ్డి, రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, రైతులు దుగ్గినేని వెంకటరామయ్య, దామా శేషగిరి తదితరులు ఎస్ఈ సన్మానించారు. -
కాటమయ్య కిట్‌తో తప్పిన ప్రాణాపాయం
బోనకల్: ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఇటీవల గీతకార్మికులకు అందజేసిన కాటమయ్య కిట్‌తో ఓ గీత కార్మికుడి ప్రాణాలు దక్కాయి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు చెందిన పెద్ద గోవిందు రోజుమాదిరిగానే గురువారం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కాడు. కల్లు తీసుకుని ఆయన కిందకు దిగుతుండగా కాలు జారి పట్టు విడిపోగా, కాటమయ్య సేప్టీ కిట్ ధరించి ఉండడంతో అలాగే చెట్టుపై వేలాడసాగాడు. ఈ విషయాన్ని గమనించిన సమీప ప్రాంత రైతులు చేరుకుని ట్రాక్టర్ ట్రాలీపై పైకి లేపి అందులో నిచ్చెన వేసి ఆయన వద్దకు వెళ్లి తాడు అందించారు. ఆతర్వాత అందరూ కలిసి పెద్ద గోవిందును సురక్షితంగా కిందకు దించడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. -
అందరి కృషితోనే విజయం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం – వరంగల్ – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరఫున బరిలోకి దిగిన పింగళి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించడం హర్షణీయమని సంఘం జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఆర్టీయూ బాధ్యుల అలుపెరగని కృషితో ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. త్వరలోనే ఖమ్మంలో శ్రీపాల్‌రెడ్డి అభినందన సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం మాజీ అధ్యక్షుడు మోత్కూరి మధుతో పాటు వెంకటనర్సయ్య, కొండలరావు, లక్ష్మణరావు, శ్రీనివాస్, రవీంద్ర, గుడిపుడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పరుపుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
● విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు ● రూ.30 లక్షల మేర ఆస్తినష్టం తల్లాడ: తల్లాడలోని ఓ పరుపుల ఫ్యాక్టరీలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. మల్లారం రోడ్డులో ఉన్న ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా సుమారు రూ.30 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తల్లాడలో ఐదేళ్ల క్రితం పస్తం రంగారావు, ఆయన కుమారుడు పస్తం మద్దిరామయ్య పేరిట పరుపుల ఫ్యాక్టరీ ఏర్పాటుచేశాడు. ఇక్కడ తయారుచేసే పరుపులను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తుంటారు. కాగా, ఫ్యాక్టరీలో గురువారం విద్యుత్ షార్ట్ సర్యూట్ జరిగినట్లు తెలుస్తుండగా మొదలైన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. పరుపులు, పరుపుల తయారీకీ కావాల్సిన సామగ్రికి మంటలు అంటుకునే స్వభావం ఉండడంతో మంటలు ఎగిసిపడగా తయారుచేసిన పరుపులు, ముడి సరుకు, మిషనరీ, వ్యాన్ కాలిపోయాయి. కాగా, మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు బేంబెలెత్తిపోయారు. వైరా అగ్ని మాపక కేంద్రం నుంచి వచ్చిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే రూ.30లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని యజమాని మద్ది రామయ్య తెలిపారు. కాగా, తల్లాడ పోలీసులు చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. -
క్షుద్రపూజలు చేశారని ప్రచారం
నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలోకెల్లా అతి పెద్దదైన నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రంలో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం క్షుద్రపూజలు చేశారనే ప్రచారం జరిగింది. క్షేత్రం సమీపాన ఎర్రటి రంగుతో కూడిన కొబ్బరికాయ ఉండడంతో ఎవరైనా ఆకతాయిలు ఈ పనిచేశారా లేక... దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలకు సిద్ధమయ్యారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై పురావస్తు శాఖ డీడీ రాములునాయక్ ను వివరణ కోరగా... క్షుద్రపూజలు జరిగే అవకాశమే లేదని, ఎవరైనా అలా చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్రం వద్ద వాచ్‌మెన్‌ను మరింత అప్రమతంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
‘ఆపదమిత్ర’ వలంటీర్లకు శిక్షణ
ఖమ్మంఅర్బన్: వరదలు, అగ్నిప్రమాదాలు తదితర విపత్తుల సమయాన సాయం చేసేందుకు గాను ఎంపిక చేసిన ఆపదమిత్ర వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో గురువారం ఏర్పాటుచేసిన శిక్షణలో డీఆర్డీఓ సన్యాసయ్య మాట్లాడుతూ విపత్తుల సమయాన ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు అండగా నిలచేలా ‘ఆపదమిత్ర’ల పేరిట వలంటీర్లను ఎంపిక చేశామని తెలిపారు. వీరికి అటవీ, పొలీస్, ఫిషరీష్ తదితర శాఖల ఆధ్వార్యన శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. పశుసంవర్థశాఖ జేడీ వెంకటనారాయణ, జిల్లా ప్రణాళికాధికారి శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
రఘునాథపాలెం: మండలంలోని రజబ్అలీ నగర్‌కు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని(17) ఆత్మహత్యకు పాల్పడింది. ఈనెల 5వ తేదీ బుధవారం ఆమెను పక్క ఇంట్లో ఉండే రామి అనే మహిళ తీసుకెళ్లి తన కొడుకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా స్థానికులు పలువురికి చెప్పింది. దీంతో బాలిక మనస్తాపంతో బుధవారం రాత్రి కలుపు మందు తాగగా, కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తుండగా గురువారం మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. కాగా, సదరు విద్యార్థిని గురువారం మొదలైన వార్షిక పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరగడం గమనార్హం. ఉరి వేసుకుని... నేలకొండపల్లి: మండలంలోని రాజేశ్వరపురానికి చెందిన సీ.హెచ్.వీరబాబు (35) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనారోగ్య కారణాలతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కూసుమంచి: మండలంలోని గట్టుసింగారం పెట్రోల్ బంక్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బూరెడుగుట్ట తండాకు చెందిన మూడ్ లక్ష్మణ్(35) తన ద్విచక్ర వాహనంపై కూసుమంచి నుండి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమాన గట్టుసింగారం నుండి కూసుమంచి వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఆయనను ఢీకొట్టగా తలకు తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరు గాయపడగా 108లో ఖమ్మం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నం సత్తుపల్లిరూరల్: భార్యాభర్తల మధ్య గొడవతో మనస్థాపానికి గురైన వ్యక్తి బ్లేడ్‌తో చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని కిష్టారానికి చెందిన పాలకుర్తి నాగరాజుకు గ్రామానికే చెందిన సౌమ్యను పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, దంపతుల మధ్య గొడవతో సౌమ్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మద్యానికి బానిసైన నాగరాజుకు ఆర్థిక ఇబ్బందులు తోడవడం, భార్య రావ డం లేదనే మనస్థాపానికి గురై మద్యం మత్తులో గురువారం మధ్యాహ్నం రెండు చేతులపై బ్లేడ్‌తో కోసుకున్నాడు. దీంతో రక్తస్రావం అవుతుండగా 108లో సత్తుపల్లికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. పశుసంవర్థక శాఖ జేడీపై కేసు నమోదు ఖమ్మంక్రైం: అపార్ట్మెంట్ నిర్మించి ఇస్తామని నమ్మించి మోసం చేసిన పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. డీడీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ కొనసాగుతున్నట్లు తెలుస్తుండగా, ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ప్రాంతంలో సర్వే నంబర్ 546లోని నాలుగు ఎకరాల భూమిలో హ్యాపీ హోం అపార్టుమెంట్ 24 నెలల్లో నిర్మించి ఇస్తామని 2021లో ఆయన పలువురితో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈమేరకు వారి నుంచి ప్లాట్లకు డబ్బు కూడా తీసుకున్నాడు. అయితే, గడువులోగా నిర్మాణం పూర్తికాకపోవడంతో ఖమ్మంరూరల్ మండలం ఏదులాపురానికి చెందిన మారుపాక వెంకటాచారి ఇచ్చిన ఫిర్యాదుతో డీడీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.35 లక్షలకు ఐపీ దాఖలు ఖమ్మం లీగల్: ఖమ్మంకు చెందిన కిరాణ వ్యాపారి మేడబోయిన వేణు రూ.35.20లక్షలకు దివాళా పిటిషన్(ఐపీ) దాఖలు చేశాడు. వ్యాపార అభివృద్ధి చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ 22 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాది ద్వారా ఖమ్మం సివిల్ జడ్జి కోర్టులో గురువారం ఐపీ దాఖలు చేశాడు. -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు కూసుమంచి మండలం జుజ్జుల్‌రావుపేటలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం ప్రాణ ప్రతిష్ఠా ఉత్సవాల్లో మంత్రి పాల్గొంటారు. ఆతర్వాత క్యాంపు కార్యాలయంలో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారు. అనంతరం కూసుమంచి మండలం తురకగూడెం, కేశవాపురం, గోపాల్రావుపేట, ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల, ఏదులాపురం మున్సిపాలిటీ బారుగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఆడపిల్లలపై వివక్షత చూపించొద్దు.. సత్తుపల్లి: గర్భిణులకు లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమే కాక ఆడపిల్లల వివక్షత చూపించడం సరికాదని జిల్లా మహిళా సాధికారిత కోఆర్డినేటర్ ఎస్.డీ.సమ్రీన్ తెలిపారు. సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని సిమాంక్ సెంటర్లో గురువారం బేటీ బచావో.. బేటీ బడావో.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆడపిల్లలకు జన్మనిచ్చిన బాలింతలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం లింగనిర్ధారణ నిషేధ చట్టంపై అవగాహన కల్పించిన ఆమె ప్రతిజ్ఞ చేయించారు. డీహెచ్ఈడబ్ల్యూ జెండర్ స్పెషలిస్ట్ పి.ప్రమీల, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, ఉద్యోగులు కె.సతీష్, ఎన్.శారద, వెంకటరావమ్మ, సుజాత, లక్ష్మి పాల్గొన్నారు. ఈనెల 12న పాత పార్సిళ్ల వేలం ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త బస్టాండ్‌లోని కార్గో సెంటర్ నుంచి నిర్ణీత కాలవ్యవధి దాటినా ఎవరూ తీసుకెళ్లని పార్సిళ్లను ఈనెల 12న వేలం వేయనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల లాజిస్టిక్ మేనేజర్ వి.రామారావు తెలిపారు. కొత్త బస్టాండ్ ఆవరణలో ఈనెల 12న ఉదయం 11గంటలకు వేలం మొదలవుతుందని పేర్కొన్నారు. ముందస్తు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేనందున, ఎవరైనా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ అందించండి ఖమ్మంసహకారనగర్: విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ అందించే అదృష్టం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఈ జేఏసీ వైస్ చైర్మన్ దేవరకొండ సైదులు సూచించారు. డీఎస్సీ–2024 లో ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి ఖమ్మం నయాబజార్ ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇస్తుండగా గురువారం ఆయన మాట్లాడారు. ఉద్యోగు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విధానాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ఎస్టీఎఫ్ కృషి చేస్తోందని తెలిపారు. ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండు యాదగిరి, షేక్ మన్సూర్‌తో పాటు బిల్లా సురేష్, పాశం శ్రీనివాసరావు, జల్ల రవి తదితరులు పాల్గొన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి కల్లూరురూరల్: క్షయవ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా క్షయ వ్యాధి నోడల్ అధికారి డాక్టర్ జి.రామారావు తెలిపారు. కల్లూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నవ్యకాంత్ ఆధ్వర్యాన కల్లూరు మండలం పేరువంచలో గురువారం నిర్వహించిన అవగా హన సదస్సులో పలువురికి పరీక్షలు చేశాక ఆయన మాట్లాడారు. క్షయవ్యాధి గాలిద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికై నా వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలని కోరారు. ఉద్యోగులు వై.సురేష్, సంజీవ్‌కుమార్, పద్మ, కామేశ్వరి, కవెంకట నరసమ్మ, ప్రభావతి, మీనా, సునీత పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ఈ ఫలితాలు
ఖమ్మం మామిళ్లగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని సిర్పూర్కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంగా గురువారం ఖమ్మంలో బీజేపీ నాయకుడు సన్నె ఉదయ్‌ప్రతాప్ నివాసం వద్ద సంబురాలు నిర్వహించారు. బాణసంచా పేల్చ డంతో పాటు స్వీట్లు పంపిణీ చేశాక హరీశ్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యువతకు ఉద్యోగాలు లేక, రైతుకు గిట్టుబాటు ధరలు దక్కకకపోగా ఆరు హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేదని ఆరోపించారు. అలాగే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్తే కాంగ్రెస్ మరిన్ని అప్పులు చేస్తోందని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ గమనించిన గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు బీజేపీ అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. అనంతరం బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ మాట్లాడగా నాయకులు దేవకి వాసుదేవరావు, డాక్టర్ శీలం పాపారావు, డాక్టర్ గొంగూర వెంకటేశ్వర్లు, నకిరికంటి వీరభద్రం, మంద సరస్వతి, నున్నా రవికుమార్, పొట్లపల్లి నాగేశ్వరరావు, కొణతం లక్ష్మీనారాయణ, శాసనాల సాయికుమార్, బాషా, సాయి, ప్రభాకర్, మహేందర్ సింగ్, మేకల నాగేందర్, సాగర్, కె.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముల్క కొమురయ్య, అంజిరెడ్డి విజయం సాధించడంపై ఆ పార్టీ నాయకుడు తాండ్ర వినోద్‌రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు -
దివ్యాంగులకు ‘శాశ్వత’ పరిష్కారం
● ఇక నుంచి యూడీఐడీ స్మార్ట్ కార్డులు జారీ ● అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక పోర్టల్ ● కార్డుతో దివ్యాంగులకు మరింత ప్రయోజనం ● ఉమ్మడి జిల్లాలో 55,718 మంది దివ్యాంగులు చుంచుపల్లి: దివ్యాంగులకు జారీ చేసే సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. వాటి స్థానంలో ఇక నుంచి యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ కార్డు (యూడీఐడీ) ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చి దివ్యాంగులు నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటకే ఇవి పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉండగా, ఈ నెల నుంచి మన రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తున్నారు. గతంలో ఈ స్మార్ట్ కార్డులను పలు చోట్ల దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఇటీవల సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ ఈ యూడీఐడీ నంబర్‌ను కేటాయించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్డుల కోసం ప్రభుత్వం ఇచ్చిన సంబంధిత వెబ్సైట్లో దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేవలం ఏడు కేటగిరీల్లో మాత్రమే సదరం సర్టిఫికెట్లు ఇస్తుండగా, ఈ యూడీఐడీ కార్డుల అమలుతో ఇక నుంచి 21 కేటగిరీలకు అవకాశం కల్పించారు. దివ్యాంగులకు బస్సు, రైళ్ల ప్రయాణాల్లో అందించే రాయితీలు అలాగే విద్య, వైద్యం, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తదితర వాటిని ఈ గుర్తింపు కార్డు ద్వారా పరిగణనలోకి తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్ ద్వారా దివ్యాంగులకు రూ.4,016ను ప్రతినెలా అందిస్తున్నారు. అలాగే వారు ఎవరిపై ఆధారపడకుండా ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధి కోసం వివిధ రకాల రాయితీ రుణాలు సైతం అందిస్తున్నారు. మరోవైపు దివ్యాంగులకు సంక్షేమ శాఖ ద్వారా పలు రకాల ఉపకరణాలను అందిస్తున్నారు. యూడీఐడీ కార్డు ఇలా పొందాలి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 55,718 మంది శాశ్వత వైకల్యం కలిగినవారు ఉన్నారు. అంగవైకల్య శాతం ధ్రువీకరణ కోసం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న సదరం ధ్రువపత్రాలు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే పనిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వీటిని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో వీటికి బదులు యూడీఐడీ కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. http://www.swavlambancard.gov.in పోర్టల్‌లోకి వెళ్లి యూడీఐడీ కార్డు కోసం సమగ్ర వివరాలు పొందుపర్చాలి. ● పాస్‌పోర్టు సైజ్ ఫొటో, సంతకం, ఆధార్ కార్డు తదితర వివరాలు అప్లోడ్ చేయాలి. ● మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని సదరం శిబిరానికి హాజరుకావాల్సి ఉంటుంది. ● సదరం శిబిరానికి హాజరయ్యేలా అందు బాటులోని కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. ● తద్వారా ఏరోజు శిబిరం నిర్వహిస్తారో దరఖాస్తుదారుడి ఫోన్‌కు సందేశం వస్తుంది. ● ఆ రోజున వెళ్తే అక్కడి వైద్యులు పరీక్షించి వైకల్యం శాతాన్ని నిర్ధారించి పోర్టల్‌లో నమోదు చేస్తారు. ● ఇప్పటికే సదరం ధ్రువపత్రాలు కలిగిన వారికి కూడా స్మార్ట్ కార్డులను ఇదే తరహాలో జారీ చేస్తారు. ● వివరాలను సరిచూసి వైద్యులు నిర్ధారించిన అనంతరం స్మార్ట్ కార్డు మంజూరు చేస్తారు. డిజిటల్ సంతకాలతో కూడిన స్మార్ట్ కార్డులో ఐడీ నంబర్, దివ్యాంగుడి పేరు, వైకల్య రకం, శాతం తదితర వివరాలు ఉంటాయి. వీటిని నేరుగా దివ్యాంగుల ఇంటి చిరునామాకు పంపుతారు. ● స్మార్ట్ కార్డులతో రైలు, బస్సు టికెట్లపై రాయితీలు పొందవచ్చు. పింఛన్లు, సంక్షేమ పథకాలు, రాయి తీ రుణాలు అందుకునే వెసులుబాటు ఉంది. ● దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ● కార్డును శాశ్వతంగా వినియోగించుకునే వీలుంటుంది.ఉమ్మడి జిల్లా వివరాలు ఇలా.. భద్రాద్రి ఖమ్మం సదరం శిబిరాలకు హాజరైనది 31,906 62,390 టెంపరరీ వైకల్యం కలిగినవారు 3,882 7,853 శాశ్వత వైకల్యం కలిగినవారు 19,280 36,438 అనర్హులుగా తేల్చినది 8,744 18,099 మరింత ప్రయోజనం ప్రభుత్వం దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల స్థానంలో యూడీఐడీ కార్డులను అమల్లోకి తెచ్చింది. వీటిపై దివ్యాంగులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో అర్హులందరికీ స్మార్ట్ కార్డు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇది అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటవుతుంది. దివ్యాంగులకు దీనివల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. – విద్యాచందన, డీఆర్డీఓ, భద్రాద్రి కొత్తగూడెం -
కృష్ణమ్మను చేరిన గోదారి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలకఘట్టం సాకారమైంది. ప్రాజెక్టులోని మూడు పంపుహౌస్‌ల నుంచి 100 కి.మీ. మేర ప్రయాణించిన గోదావరి జలాలు బుధవారం రాత్రి ఏన్కూరు మండలం అక్కినాపురం తండా 52వ కి.మీ. వద్ద ఎన్ఎస్పీ (నాగార్జునసాగర్ ప్రాజెక్టు) కాల్వకు చేరాయి. ఈ సందర్భంగా జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించి.. పుష్పాభిషేకం చేశారు. సాగర్ ఆయకట్టు స్థిరీకరణ: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందించేందుకు ప్రభుత్వం ఏన్కూరు లింక్ కెనాల్(రాజీవ్ కెనాల్) నిర్మాణం చేపట్టింది. 8.6 కి.మీ. పొడవైన ఈ కెనాల్‌కు రూ.97 కోట్లు కేటాయించారు. గత ఏడాది మే నెలలో ప్రారంభమైన పనులు పూర్తికావడంతో జూలూరుపాడు, ఏన్కూరు మండలాల్లో 7,500 ఎకరాలు, వైరా ప్రాజెక్టు కింద 17 వేల ఎకరాల ఆయకట్టుతో పాటు సత్తుపల్లి, మధిర నియోజకవర్గంలోని మిగతా ఆయకట్టుకు కూడా సీతారామ పనులు పూర్తికాగానే నీరు అందనుంది. 104 కి.మీ. మేర కాల్వల తవ్వకం సీతారామ ప్రాజెక్టులో భాగంగా 104 కి.మీ. మేర కాల్వల త వ్వకం పూర్తయ్యింది. జూలూరుపాడు మండలం వరకు ప్రాజె క్టు పూర్తికాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంతమేరకు పెండింగ్‌లో ఉంది. సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద, కూసుమంచి మండలం పాలేరు వద్ద టన్నెల్ నిర్మాణాలు కొన సాగుతున్నాయి. మరికొన్ని చోట్ల భూసేకరణ సమస్యలతో జాప్యం జరుగుతోంది. పాలేరు వరకు ప్రధాన కాల్వ నిర్మా ణం పూర్తి కావడానికి సమయం పట్టనుండగా ఏన్కూరు వద్ద ఎన్నెస్పీ కాల్వకు గోదావరి జలాలు చేర్చేలా రాజీవ్ లింక్ కెనా ల్ నిర్మాణం చేపట్టారు. దీంతో వైరా, సత్తుపల్లి, మధిర నియో జకవర్గాలకు తొలుత గోదావరి జలాలు అందుతున్నాయి. 1,500 క్యూసెక్కుల నీరు విడుదల తొలిదశలో ఒక పంపుహౌస్‌లో ఒక మోటార్ నడిపించడం ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గంటకు మూడు కిలోమీటర్లు చొప్పున ప్రవహించిన నీరు జూలూరుపాడు మండలం వినోబానగర్ వద్ద రాజీవ్ లింక్ కెనాల్‌కు బుధవారం చేరింది. ఇక్కడ నుంచి పరవళ్లు తొక్కుతూ 8.6 కి.మీ. ప్రవహించి ఏన్కూరు మండలం అక్కినాపురం తండా వద్ద ఎన్నెస్పీ కాల్వలో బుధవారం రాత్రి కలిశాయి. ఆపై 12 కి.మీ. ప్రయాణించి 38వ కి.మీ. వద్ద యూటీ నుంచి వైరా రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరుతాయి. మధిర, సత్తుపల్లి మండలాలకు కూడా నీరు చేరుతుంది. -
నెలాఖరులోగా పనులు పూర్తి చేయండి
ఖమ్మం సహకారనగర్: పీఎంశ్రీ, అమ్మ ఆదర్శ పాఠశాల్లో అభివృద్ధి నెలాఖరులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లోని బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆమె మాట్లాడుతూ పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలల్లో పనులకు రూ.1,04,65,783 విడుదల చేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల్లో కమిటీలు ప్రతిపాదించిన పనులు పూర్తికాగానే బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు. డీఈఓ సోమశేఖరశర్మ, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ కె.రవికుమార్, జీసీడీఓ తులసి పాల్గొన్నారు. ఇంటి నిర్మాణం మొదలుపెట్టాలి బోనకల్: మండలంలోని గార్లపాడులో అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి స్థలాలను పరిశీలించా రు. త్వరగా పనులు మొదలుపెడితే బిల్లులు వస్తాయని అవగాహన కల్పించారు. ఆరత్వాత గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకంపై ఆరా తీశారు. ఎంపీడీఓ రమాదేవి, ఎంపీఓ శాస్త్రి, ఏపీఓ కృష్ణకుమారి పాల్గొన్నారు. -
పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించొద్దు
నేలకొండపల్లి: జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా పంచాయతీ అఽధికారి(డీపీఓ) పి.ఆశాలత హెచ్చరించారు. నేలకొండపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నేలకొండపల్లి, కూసుమంచి మండలాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా డీపీఓ మాట్లాడుతూ జిల్లాలో రూ.2 కోట్ల పన్ను డిమాండ్‌కు గాను 62 శాతం వరకు వసూలయ్యాయని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు వివిధ సర్వేల్లో నిమగ్నమైనా గత ఏడాది కంటే ఎక్కువగా వసూలు చేశారని, ఈనెలాఖరుకు నూరు శాతం వసూలు చేయాలని సూచించారు. అలాగే, తాగునీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని డీపీఓ తెలిపారు. కాగా, ప్రతీ పంచాయతీలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించిన డీపీఓ.. నేలకొండపల్లిలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈసమావేశంలో డీఎల్పీఓ రాంబాబు, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓలు సీ.హెచ్.శివ, రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
నెలాఖరులోగా పనులు పూర్తి చేయండి
ఖమ్మం సహకారనగర్: పీఎంశ్రీ, అమ్మ ఆదర్శ పాఠశాల్లో అభివృద్ధి నెలాఖరులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్లోని బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆమె మాట్లాడుతూ పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలల్లో పనులకు రూ.1,04,65,783 విడుదల చేశామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల్లో కమిటీలు ప్రతిపాదించిన పనులు పూర్తికాగానే బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు. డీఈఓ సోమశేఖరశర్మ, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ కె.రవికుమార్, జీసీడీఓ తులసి పాల్గొన్నారు. ఇంటి నిర్మాణం మొదలుపెట్టాలి బోనకల్: మండలంలోని గార్లపాడులో అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి స్థలాలను పరిశీలించా రు. త్వరగా పనులు మొదలుపెడితే బిల్లులు వస్తాయని అవగాహన కల్పించారు. ఆరత్వాత గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకంపై ఆరా తీశారు. ఎంపీడీఓ రమాదేవి, ఎంపీఓ శాస్త్రి, ఏపీఓ కృష్ణకుమారి పాల్గొన్నారు. -
సస్యశ్యామలం
ఇకపై ఉమ్మడి జిల్లాజూలూరుపాడు: సీతారామ ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ కాల్వ నుంచి రాజీవ్ కెనాల్లోకి గోదావరి జలాలను ఆయన బుధవారం రాత్రి 9 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు పూజలు చేసి చీర, సారె సమర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన సమావేశంలో తుమ్మల మాట్లాడారు. రూ.100 కోట్లు మంజూరు చేయించా.. గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా మూడు పంప్ హౌస్‌లను నిర్మించినా నిరుపయోగంగా ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. సీతా రామ ప్రాజెక్ట్ డిజైన్‌లో ఏన్కూర్ రాజీవ్ లింక్ కెనాల్ లేకున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలం వచ్చినప్పుడు ఒప్పించి రూ.100 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు. ఈ కాల్వ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, వారిని ఒప్పించిన రెండు జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులతో చకచకా పూర్తయిందని తెలిపారు. కాగా, తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజలు, రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేశానని వివరించారు. సీతమ్మ సాగర్ నిర్మాణం పూర్తయితే 36 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చని, గోదావరి – కృష్ణా జలాల అనుసంధానంతో సాగర్ ఆయకట్టులో 1.80 లక్షల ఎకరాలను స్థిరీకరించవచ్చని వెల్లడించారు. కాగా, సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ కింద నాలుగో పంప్ హౌస్‌ను అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈమేరకు కెనాల్‌కు భూమలు ఇచ్చిన రైతులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, జితేష్ వి.పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్‌నాయక్, డాక్టర్ మట్టా రాగమయి, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బొర్రా రాజశేఖర్, లేళ్ల వెంకటరెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు, రాధాకిషోర్, మాలోత్ మంగీలాల్ నాయక్, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, తహసీల్దార్ స్వాతి బిందు, ఇరిగేషన్ అధికారులు శ్రీనివాసరెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. 100 కి.మీ. ప్రయాణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం వద్ద గోదావరి నదిపై కాటన్ నిర్మించిన ఆనకట్ట నుంచి నీరు ఎత్తిపోసేలా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. ఈ పథకంలో భాగంగా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు, ములకలపల్లి మండలంలోని వీ.కే.రామవరం, కమలాపురంలలో పంప్‌హౌస్‌లు నిర్మించి మోటార్లు అమర్చారు. అలాగే, ఇప్పటివరకు 100 కి.మీ. మేర కాల్వల తవ్వకం పూర్తయింది. పంప్‌హౌస్‌ల్లో మోటార్లను మూడు రోజులుగా నడిపిస్తుండగా గోదావరి జలాలు బుధవారం సాయంత్రం వరకు జూలూరుపాడు మండలం నల్లబండబోడు వద్దకు చేరాయి. ఈసందర్భంగా పెద్దసంఖ్యలో హాజరైన గ్రామస్తులతో కలిసి వైరా ఎమ్మెల్యే రాందాస్ గోదావరి జలాలకు పూజలు చేశారు. అక్కడి నుంచి సీతారామ మెయిన్ కెనాల్ ద్వారా వినోభానగర్ వద్దకు రాత్రికల్లా జలాలు చేరుకున్నాయి. ఆపై కొత్తగా నిర్మించిన రాజీవ్ కెనాల్లోకి నీటిని మంత్రి తుమ్మల విడుదల చేశారు. అనంతరం ఏన్కూరు మండలం అక్కినాపురం తండా 52వ కి.మీ. వద్ద ఎన్నెస్పీ(నాగార్జునసాగర్ ప్రాజెక్టు) కాల్వలోకి బుధవారం అర్ధరాత్రి దాటాక చేరాయి. లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎన్నెస్పీ ఆయకట్టుకు అందించేలా ఏన్కూరు లింక్ కెనాల్(రాజీవ్ కెనాల్) నిర్మాణం చేపట్టారు. తద్వారా జూలూరుపాడు, ఏన్కూరు మండలాల్లో 7,500 ఎకరాలు, వైరా రిజర్వాయర్‌తో పాటు సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో 1.20 లక్షల ఎన్నెస్పీ ఆయకట్టు గోదావరి జలాలతో స్థిరీకరణ జరగనుంది. ‘సీతారామ’ ద్వారా ఎన్నెస్పీ ఆయకట్టుకు గోదావరి జలాలు మెయిన్ కెనాల్ నుంచి రాజీవ్ లింక్ కెనాల్లోకి విడుదల పూజలు చేసి మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎనిమిది గంటల పాటు ఎత్తిపోత అశ్వాపురం: అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్ట్ ఫేస్ –1 పంప్‌హౌస్ నుంచి మూడో రోజైన బుధవారం కూడా గోదావరి జలాలను ఎత్తిపోశారు. పంప్‌హౌస్‌లోని ఒక మోటార్ ద్వారా ఎనిమిది గంటల పాటు 86.4 ఎంసీఎఫ్‌టీ నీటిని దిగువకు విడుదల చేశారు. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి మూడు పంప్‌హౌస్‌ల ద్వారా ఏన్కూరు లింక్ కెనాల్‌కు, అక్కడి నుంచి ఎన్నెస్పీ కెనాల్‌కు గోదావరి జలాలు చేరుతున్నాయి. -
మండుతున్న ఎండలు
● 35డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు ఖమ్మంవ్యవసాయం: మహాశివరాత్రి తర్వాత జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. నెల మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయిలో నమోదవుతున్నాయి. గతనెల 28 వరకు జిల్లాలో గరిష్టంగా 36 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈనెల 5కల్లా 39 డిగ్రీలకు పెరిగింది. దీంతో మధ్యాహ్నం వేళ బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, మార్కెట్, ఇతర ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు ఎండ తీవ్రతతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కాగా, ఖమ్మం ప్రకాశ్‌నగర్‌లో బుధవారం అత్యధికంగా 39.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆతర్వాత ఖానాపురం, సత్తుపల్లి, ముదిగొండ మండలం పమ్మిలో 39.1, బాణాపురంలో 39 సెల్సియస్ డిగ్రీలుగా నమోదవగా, అతి తక్కువగా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 32.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. -
పోలీసు కుటుంబాలకు ఉచిత కంటి పరీక్షలు
ఖమ్మంక్రైం: ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు కుటుంబాల కోసం బుధవారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. వాసన్ ఐ కేర్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ శిబిరాన్ని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ప్రారంభించి మాట్లాడారు. ఈ శిబిరంలో 200మందికి పరీక్షలు చేయగా, సమస్యలు ఉన్నవారికి రాయితీపై శస్త్ర చికిత్సతో పాటు కంటి అద్దాల పంపిణీ ఉంటుందని తెలిపారు. ఏఆర్ ఏసీపీలు నర్సయ్య, సుశీల్‌సింగ్, వైద్యబృందం శివరామ్, రాజేష్, ఇతేందర్, అప్సర్, సాయికృష్ణ పాల్గొన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్లకు 139 దరఖాస్తులు ఖమ్మంవ్యవసాయం: బీడు, బంజర భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తున్నారు. భూముల్లో ప్లాంట్లు ఏర్పాటుచేయడం ద్వారా ఆదాయం పొందేలా రైతులను కేంద్రప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పీఎం కుసుమ్ పథకం కింద 500కిలోవాట్లు మొదలు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశముండగా, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీజీఈఆర్సీ) నిర్ణయించిన టారిఫ్‌తో డిస్కంలు కొనుగోలు చేస్తాయి. ఈ పథకం కోసం దరఖాస్తు గడువును 10వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యాన బుధవారం వరకు 139 దరఖాస్తులు అందాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 38, ఖమ్మం జిల్లా నుంచి 101దరఖాస్తులు ఆన్లైన్లో అందాయని రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్‌కుమార్ తెలిపారు. కూడళ్ల ఆధునికీకరణకు అడుగులు ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కూడళ్ల అభివృద్ధికి యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనతో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, హైదరాబాద్ నుంచి ఐఎఫ్ఎస్ అధికారి కృష్ణ బుధవారం కూడళ్లను పరిశీలించి అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ప్లాంటేషన్‌తోపాటు క్లాక్‌టవర్ ఏర్పాటు, భారీ విద్యుత్ లైట్ల ఏర్పాటుకు చర్చించారు. ఈమేరకు త్వరలోనే నగర సుందరీకరణ, కూడళ్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిసింది. -
కేవీకేలో శాసీ్త్రయ సలహా సంఘం సమావేశం
వైరా: వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం శాసీ్త్రయ సలహా సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే ఆధ్వర్యాన గత ఏడాది కాలంగా చేపట్టిన కార్యక్రమాలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థఽ మధ్య తెలంగాణ మండలి సహాయ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ ఉమారెడ్డి, హైదరాబాద్ అటారీ జోన్–10 ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏఆర్.రెడ్డి హైదరాబాద్ పీజీటీఏయూ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయలక్ష్మి, డీఏఈ ధనసరి పుల్లయ్య, జిల్లా ఉద్యాన శాఖాఽధికారి మధుసూదన్ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. మండల పశు వైద్యాధికారి రాకేష్, ఏడీఏలు విజయచంద్ర, కె.వెంకటేశ్వరరావు, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్, శాస్త్రవేత్త విచైతన్య తదితరులు పాల్గొన్నారు. -
మీరు మా అతిథులు!
ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్లో ప్రతీ సోమవారం జరిగే గ్రీవెన్స్ డేతో పాటు ఇతర రోజుల్లో వచ్చే దివ్యాంగులను తాము అతిథులుగా భావిస్తామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన బుధవారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 40రోజుల క్రితం ప్రజావాణిలో వచ్చిన అభ్యర్థన మేరకు జిల్లా అధికారులతో చర్చించి ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. రానున్న మూడు నెలల్లో ప్రతీ దివ్యాంగుడికి యూడీఐడీ కార్డు అందేలా చూస్తామని, అప్పటివరకు సదరం సర్టిఫికెట్ నంబర్ ఆధారంగా టోకెన్లు ఇస్తామని చెప్పారు. కాగా, దివ్యాంగుల సంక్షేమానికి అన్ని చర్యలు చేపడుతూ వారికి ఏ సమస్యా రాకుండా చూస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు 300మందికి... అన్నంతో పాటు పప్పు, సాంబారు, కాకరకాయ ఫ్రై, టమాటా కూర, క్యాలిఫ్లవర్ చట్నీతో తొలిరోజు భోజనాన్ని సమకూర్చారు. ఈ మెనూ ప్రతిరోజు మారుతుందని నిర్వాహకులు తెలిపారు. తొలిరోజు 300కిపైగా దివ్యాంగులు భోజనం చేయగా, కలెక్టర్ చొరవను పలువురు అభినందించారు. దివ్యాంగులకు ఏ సమస్య రానివ్వం కలెక్టరేట్లో ఉచిత భోజనాన్ని ప్రారంభించిన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ప్రతీ తహసీల్‌లో హెల్ప్‌డెస్క్ దివ్యాంగులు గౌరవప్రదమైన జీవనం గడిపేలా ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందిస్తామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం యూనిక్ డిజెబిలిటీ ఐడెంటిటీ కార్డు(యూడీఐడీ) పొందే విధానంపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు నిర్మిస్తుండగా, ప్రతీ తహసీల్‌లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకంలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీజ, డీఆర్వో ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీడబ్ల్యూఓ కె.రాంగోపాల్‌రెడ్డి, డీఈఓ సోమశేఖరశర్మ తదితరులు పాల్గొన్నారు.ఇంట్లో భోజనంలా ఉంది... కలెక్టరేట్లో మాకు ఉచిత భోజనం సమకూర్చడం బాగుంది. ఉచితమైనా నాణ్యమైన భోజనం సమకూర్చడంతో ఇంట్లో తిన్నామనే సంతృప్తి కలిగింది. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చొరవతో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తుండడం ఆనందంగా ఉంది. – కొత్తూరి వెంకటాచారి, నేలకొండపల్లి -
మంటలు ఆర్పేది ఎలా?
ఖమ్మంక్రైం: జిల్లాలో అగ్నిమాపక శాఖను కీలకమైన ఫైర్‌మెన్‌ల కొరత వేధిస్తోంది. గత నెలాఖరు నుంచే ఎండ తీవ్రత మొదలుకాగా ఈనెలలో మరింత పెరిగింది. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండ గరిష్టస్థాయిలో నమోదయ్యే అవకాశమున్నందున ఇదే స్థాయిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశముంది. దీంతో సిబ్బంది కొరత కారణంగా శాఖ ఉద్యోగులు కలవరపడుతున్నారు. జిల్లాలో ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి, కూసుమంచిల్లో ఫైర్ స్టేషన్లు ఉండగా నేలకొండపల్లిలో ఔట్ పోస్ట్ కొనసాగుతోంది. ఐదు స్టేషన్లకు ముగ్గురే ఆఫీసర్లు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఘటనాస్థలికి వెళ్లి మంటలు ఆర్చడంలో ఫైర్మెన్లే ముఖ్యపాత్ర పోషిస్తారు. ఏ స్థాయిలో మంటలు ఉన్నా మంటలు ఆర్పడంలో శిక్షణ తీసుకుని ఉండడంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగుతారు. అలాంటి ఫైర్ మెన్ల కొరత జిల్లా అగ్నిమాపక శాఖను వేధిస్తోంది. జిలాల్లో ఐదు స్టేషన్లకు ముగ్గురు ఫైర్ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో కీలకమైన ఖమ్మం స్టేషన్‌కు ఫైర్ అధికారి లేకపోవడంతో మధిర ఫైర్ అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. కూసుమంచి ఫైర్ అధికారి ఇటీవల సస్పెండ్ కాగా ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఇక లీడింగ్ ఫైర్మెన్లు 10మంది, డ్రైవర్లు 16, ఫైర్మెన్లు 32, హోంగార్డులు 21మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా 16 ఫైర్మెన్లు, ఒక డ్రైవర్ కమ్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రమాదాల్లో అగ్రగామి జిల్లాలో గడ్డివాములు కాలిపోయినట్లు మరెక్కడా జరగవని.. రాష్ట్రంలోనే ఈ ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు త్వరగా మంటలు వ్యాపిస్తాయి. మంటలు అంటుకున్న గడ్డివాముతో పాటు సమీపంలోని వాములు, గుడిసెలు తగలబడే ప్రమాదముంది. ఈనేపథ్యాన సుశిక్షితులైన సిబ్బంది వీలైనంత త్వరగా చేరుకుని మంటలు ఆర్పితేనే నష్టతీవ్రత తగ్గడానికి ఆస్కారముంటుంది. ఇంకో యూనిట్ లేదా స్టేషన్ జిల్లాలోని ఖమ్మం రూరల్ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఖమ్మం నుంచే వాహనంతో సిబ్బంది వెళ్లాల్సి వస్తుంది. అయితే, ఒకేసారి రెండు చోట్ల ప్రమాదాలు జరిగితే చేసేదేం ఉండడం లేదు. దీంతో ఖమ్మంలో ప్రస్తుత ఉన్న యూనిట్‌కు అదనంగా కొత్త మంజూరు చేయాలని లేదంటే రూరల్ ప్రాంతంలో మరో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. సింగిల్ యూనిట్‌గా ఉన్న ఖమ్మం ఫైర్ స్టేషన్‌కు డబుల్ యూనిట్ మంజూరైతే సిబ్బంది పెరగడంతో పాటు ఇద్దరు ఫైర్ ఆఫీసర్లు ఉంటారు. అలాగే, అదనపు ఫైర్ ఇంజన్ వస్తుంది. ఇది సాధ్యం కాని పక్షంలో ఖమ్మం రూరల్ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుచేయాలని ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్‌ల కొరత ఎండలతో పాటే పెరుగుతున్న అగ్నిప్రమాదాలు డబుల్ యూనిట్ లేదా రూరల్‌లో కొత్త కేంద్రానికి ప్రతిపాదన అగ్నిప్రమాదాల సమాచారం ఇవ్వాల్సిన నంబర్లు స్టేషన్ నంబర్ ఫైర్ అధికారి ఖమ్మం 87126 99280 87126 99281 వైరా 87126 99288 87126 99288 కూసుమంచి 87126 99286 87126 99287 మధిర 87126 99284 87126 99285 సత్తుపల్లి 87126 99282 87126 99283 నేలకొండపల్లి 87126 99290 87126 99291 డీఎఫ్ఓ 87126 99147 కంట్రోల్ రూమ్ 87126 99444, 87126 99464, 99499 91101 ట్రోల్ ఫ్రీ నంబర్ 101ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి... ఖమ్మం అగ్నిమాపక కేంద్రాన్ని డబుల్ యూనిట్‌గా అప్గ్రేడ చేయడం లేదా ఖమ్మం రూరల్ ప్రాంతంలో మరో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ ప్రతిపాదనలకు ఉన్నతాధికారులకు పంపించనుండగా, అనుమతి లభించగానే ఇతర ఏర్పాట్లు జరుగుతాయి. డబుల్ యూనిట్ మంజూరైతే వ్యవసాయ మార్కెట్లో అగ్నిమాపక కేంద్రం ప్రత్యేకంగా ఉంటుంది. – బి.అజయ్‌కుమార్, జిల్లా అగ్నిమాపకశాఖాధికారి -
పూణె వెళ్లిన కేఎంసీ కార్పొరేటర్లు, అధికారులు
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలోనే స్మార్ట్ శానిటేషన్ సిటీగా పేరున్న పూణెలో అధ్యయనం కోసం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, అధికారులు మేయర్ పునుకొల్లు నీరజ ఆధ్వర్యాన బుధవారం వెళ్లారు. కేఎంసీ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరగా, అక్కడి నుంచి విమానంలో వెళ్లి సాయంత్రానికి పూణె చేరుకున్నారు. ఈసందర్భంగా పూణెలో వ్యర్థాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి తది తర అంశాలపై అధ్యయనం చేసి అధికారులతో చర్చి స్తారు. ఖమ్మంలోనూ అక్కడి మాదిరిగా నిర్వహణకు ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు.పారిశుద్ధ్య నిర్వహణపై అధ్యయనం -
ఈనెల 10న ఇంటర్వ్యూలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ విడుదల చేసిన మొదటి ఎక్స్టర్నల్ నోటిపికేషన్‌కు సంబంధించి టెక్నికల్ పరీక్షలు గతేడాది జూన్‌లో నిర్వహించిన విషయం విదితమే. ఆ పరీక్షలో మెరిట్ సాధించిన కొంతమంది జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వగా మిగిలిన మరో 36 మందికి ఈనెల 10వ తేదీన కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. సంబంధిత అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందించామని పేర్కొంది.క్షయరహిత సమాజ నిర్మాణమే లక్ష్యం బోనకల్: జిల్లాకు క్షయరహితంగా రూపుదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు తెలిపారు. మండల కేంద్రంలోని శాంతి నిలయంలో మానసిక దివ్యాంగులకు క్షయ వ్యాధి పరీక్షలను బుధవారం ఆయన తన సొంత ఖర్చులతో నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లడుతూ వారానికి మించి దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, సాయంత్రం జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటూ పరీక్ష చేయించుకోవాలని, క్షయగా నిర్ధారణ అయితే ఉచిత చికిత్స అందుతుందని తెలిపారు. పీహెచ్సీ వైద్యాధికారి స్రవంతి, ఉద్యోగులు యాకూబ్, విజయ్‌కుమార్, సందీప్, శివ, విజయ, దుర్గ, శాంతినిలయానికి చెందిన ఆల్పీ తదితరులు పాల్గొన్నారు.రోడ్డుప్రమాదంలో బాలుడు మృతి ఖమ్మంక్రైం: ఖమ్మం ఎఫ్‌సీఐ బైపాస్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌కు చెందిన నంగనూరి సిద్దు(17) ఇంటర్ ఫెయిల్ కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆయన ఖమ్మంలో ఉండే స్నేహితుడు సంతోష్‌ను కలిసేందుకు బుధవారం వచ్చాడు. ద్విచక్రవాహనంపై సంతోష్, మరో స్నేహితుడితో కలిసి సిద్దు వెళ్తుండగా బైపాస్ వద్ద డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన సిద్దు అక్కడిక్కడే మృతి చెందగా, మిగతా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలికి ఖమ్మం త్రీటౌన్ పోలీసులు చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సెంట్రింగ్ కార్మికుడు ఆత్మహత్య ఖమ్మంఅర్బన్: ఖమ్మం రామన్నపేటకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు షేక్ ఖాజామియా(38) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన ఆయన పనికి వెళ్లడంలేదు. మంగళవారం రాత్రి భార్యను డబ్బులు అడిగితే లేవని చెప్పడంతో ఆమె వంట గదిలో ఉన్నప్పుడు మరో గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై ఖాజామియా భార్య ఫర్జానా ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. రూ.60.70 లక్షలకు మిర్చి వ్యాపారి ఐపీ ఖమ్మం లీగల్: ఖమ్మం నగరంలోని గాంధీనగర్‌కు చెందిన మిర్చి వ్యాపారి బోగా శ్రీనివాసరావు రూ.60.70 లక్షలకు బుధవారం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటీషన్(ఐపీ) దాఖలు చేశాడు. ఖమ్మం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు చేపట్టే ఆయన పలువురి అప్పులు చేయగా, తీర్చలేని పరిస్థితి ఎదురైందని 18మందిని ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాది ద్వారా కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేశాడు. రూ.24.10 లక్షలకు.. ఖమ్మం శ్రీనివాస నగర్‌కు చెందిన అయ్యప్ప హాస్టల్ యజమాని కొండపల్లి లత రూ.24.10 లక్షలకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేశారు. వ్యాపార అభివృద్ధి చేసిన అప్పులు తీర్చలేకపోతున్నానని పేర్కొంటూ, 12 మందిని పిటీషన్లో ప్రతివాదులుగా చేర్చారు. రూ.75 లక్షలకు తండ్రీకుమార్తె... ఖమ్మం లీగల్: ఖమ్మం పాండురంగాపురం కాలనీకి చెందిన తండ్రీకుమార్తెలు షేక్ సైదులు, షేక్ రేష్మ రూ.75 లక్షలకు దివాలా పిటిషన్ దాఖలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగిన వీరు చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందని పేర్కొంటూ నలుగురినీ ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాది ద్వారా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో బుధవారం ఐపీ దాఖలు చేశారు.బెదిరించిన ఘటనలో ఐదుగురిపై కేసు కొణిజర్ల: దూషించడమే కాక చంపుతానని బెదిరిస్తున్నారంటూ గ్రీన్‌ల్యాండ్ డెవలపర్స్ పార్టనర్ ముళ్ల కిషోర్ ఫిర్యాదుతో ఇండోఖతార్ ప్రాజెక్ట్ ఎండీ ఎం.గిరితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జి.సూరజ్ తెలిపారు. 2018లో గ్రీన్లాండ్ డెవలపర్స్ నుంచి ఇండోఖతార్ డెవలపర్స్‌కు విల్లాల నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకోగా ఆతర్వాత రద్దవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి పోలీసుల వద్దకు కేసు చేరింది. ఈక్రమాన గతనెల 25న ఇండోఖతార్ ఎండీ గిరి, సిబ్బంది యాకూబ్‌రెడ్డి, యాకూబ్ పాషా, జేపీ, రాంబాబు తనను దూషించి, పాటు చంపుతామని బెదిరించారని కిషోర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
రైతులకు సేవలందించేందుకే ‘పొలం బాట’
రఘునాథపాలెం: రైతులకు సాగులో ఇబ్బందులు ఎదురుకాకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు తమ శాఖ ఉద్యోగులు ‘పొలం బాట’ క్షేత్రాలను సందర్శిస్తున్నారని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి తెలిపారు. రఘునాథపాలం మండలం రాములు తండా, మంచుకొండల్లో బవ్ధవారం నిర్వహించనిపొలంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు సర్కిల్ పరిధిలో 309 కార్యక్రమాలు జరగగా, 476 వంగిన స్తంభాలు, 590 లూజ్ లైన్లను సరిచేసి, 115 ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచామని, అవసరమైన చోట 747 స్తంభాలు ఏర్పాటుచేశామని తెలిపారు. అలాగే, మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని, ఆటో స్టార్టర్లు తొలగించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్సీ సూచించారు. డీఈ రామారావు, ఏడీ సంజయ్‌కుమార్, ఏఈ సతీష్ తదితరులు పాల్గొన్నారు. లింక్ లైన్ ప్రారంభం కామేపల్లి: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎదురుకాకుండా చర్యలు చేసడుతున్నామని ఎస్ఈ శ్రీనివాసచారి తెలిపారు. ముచ్చర్ల సబ్‌స్టేషన్ నుంచి కామేపల్లి సబ్ స్టేషన్‌కు ఏర్పాటుచేసిన ప్రత్యేక లింక్ లైన్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. డీఈలు రామారావు, హీరాలాల్, వై.వీ.ఆనంద్‌కుమార్,కల్యాణ చక్రవర్తి, ఏఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
121 డిగ్రీ కళాశాలల ఫలితాలు నిలిపివేత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను మంగళవారం రాత్రి విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలో 304ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల డిగ్రీ కళాశాలలు ఉండగా, ఇందులో 121 ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు వివిధ రకాల ఫీజులు బకాయి పడ్డారు. దీంతో ఆయా కాలేజీల ఫలితాలను యూనివర్సిటీ అధికారులు నిలిపివేశారు. డిగ్రీ మొద టి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యే సమయాన్ని ఫీజు చెల్లించాల్సి ఉన్నా కళాశాలల యాజమాన్యాల బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిని కలిసి సమయం కోరారు. దీంతో 15 – 20 రోజుల గడువు ఇచ్చినా చెల్లించకపోగా జవాబుపత్రాల మూల్యాంకనం సమయంలో నోటీసులు పంపారు. దీంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు చెల్లించినా ఇంకా 121 కళాశాలల బాధ్యులు స్పందించలేదు. ఈమేరకు ఆయా కళాశాలల్లో విద్యార్థుల ఫలితాలను వెల్లడించలేదు. ఈమేరకు విద్యార్థులు ఆందోళనకు గురవుతుండగా, యాజమాన్యాల బాధ్యులు బుధవారం రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిస్తే ఆయన వీసీ దృష్టికి తీసుకెళ్తానని బదులిచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ వివరణ కోరగా ఫీజులు చెల్లిస్తేనే ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
ఆర్టీసీ రాజధాని బస్సు బోల్తా
కొణిజర్ల: ఆర్టీసీ రాజధాని బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి బుధవారం తెల్లవారుజామున బస్సు వెళ్తుండగా కొణిజర్ల మండలం తనికెళ్ల బ్రౌన్స్ కళాశాల వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని తప్పించే క్రమంలో డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు పక్కకు ఒరిగి పల్టీ కొట్టడంతో పాటు రోడ్డు పక్కనే చెట్టుకు తట్టుకుని ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమయాన బస్సులో డ్రైవర్‌తో పాటు 12 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో తల్లాడ మండలం అన్నారుగూడెంకు చెందిన బీరెల్లి రాణి, పెనుబల్లి మండలం భువనపాలెంకు చెందిన దంపతులు వై.సత్యనారాయణ, సత్యవతికి గాయాలు కాగా ఖమ్మం తరలించారు. ఆర్టీసీ అధికారులు చేరుకుని క్రేన్ సాయంతో బస్సును తీయించగా, కొణిజర్ల ఎస్ఐ సూరజ్ కేసు నమోదు చేశారు. కాగా, బస్సు ప్రమాదంపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరాలు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఫోన్లో ఆదేశించారు.ముగ్గురు ప్రయాణికులకు గాయాలు -
ప్రజారోగ్య కార్యకర్త ఆత్మహత్యాయత్నం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరపాలక సంస్థకు చెందిన ప్రజారోగ్య కార్యకర్త బుధవారం కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. కేఎంసీలోని పలువురు సిబ్బంది విభాగాలు మారుస్తూ కమిషనర్ అభిషేక్ అగస్త్య నెల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కొందరు రెగ్యులర్, ఔట్సోర్సింగ్ సిబ్బందితో పాటు రెగ్యులర్ ఉద్యోగి అయిన ప్రజారోగ్య కార్యకర్త మాధవి సైతం నూతన విభాగంలో రిపోర్టు చేయలేదు. దీంతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశాక, వారం క్రితం సస్పెండ్ చేశారు. ఈమేరకు మాధవి బుధవారం కమిషనర్‌ను కలిసేందుకు రాగా ఆయన అటవీశాఖ ఉన్నతాదికారులతో సమావేశంలో ఉన్నారు. దీంతో లోపలికి వెళ్లేందుకు సిబ్బంది నిరాకరించగా తన వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలను మింగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం బంధువులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా మాధవి బంధువులు మాట్లాడుతూ కొందరు ఉద్యోగులు కక్షపూరితంగా ఆమెను సస్పెండ్ చేయించారని, షోకాజ్ నోటీస్‌కు సమాధానం ఇచ్చినా పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. ఈ విషయమై కమిషనర్ అభిషేక్ అగస్త్యను షోకాజ్ నోటీస్‌కు స్పందించకపోవడం, కేటాయించిన విభాగంలో విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే, విధుల్లో చేరని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించామని, బదిలీ ఉద్యోగులను రిలీవ్ చేయని అధికారులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కేఎంసీ కమిషనర్ చాంబర్ ఎదుట ఘటన -
పలు రైళ్ల రద్దు.. ఇంకొన్ని మళ్లింపు
ఖమ్మం రాపర్తినగర్: కాజీపేట–విజయవాడ మార్గంలో నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్ పనులు చురుగ్గా జరుగుతున్నారు. ఈనేపథ్యాన పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు ఇంకొన్నింటిని దారి మళ్లించినట్లు ఖమ్మం రైల్వే అధికారి కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎం.డీ.జాఫర్ తెలిపారు.రద్దయిన రైళ్ల ఇవే... రైలు నంబర్ పేరు / మార్గం రద్దయిన తేదీలు67767 డోర్నకల్ – విజయవాడ (పుష్పుల్) 67768 విజయవాడ – డోర్నకల్ 67215 విజయవాడ – భద్రాచలం రోడ్ 67215 భద్రాచలం రోడ్ – విజయవాడ 12705 గుంటూరు–సికింద్రాబాద్ (ఇంటర్సిటీ) 12706 సికింద్రాబాద్ – గుంటూరు (ఇంటర్సిటీ) 12713 విజయవాడ – సికింద్రాబాద్ (శాతవాహన) 12714 సికింద్రాబాద్ – విజయవాడ (శాతవాహన) 12701 గుంటూరు – సికింద్రాబాద్ (గోల్కొండ) 12702 సికింద్రాబాద్ – గుంటూరు (గోల్కొండ) 07481 తిరుపతి – సికింద్రాబాద్ (స్పెషల్) ఈనెల 9న 07482 సికింద్రాబాద్ – తిరుపతి (స్పెషల్) ఈనెల 10న 22645 ఇండోర్ – కొచివిల్ ఈనెల 10న 22646 కొచివిల్ – ఇండోర్ ఈనెల 8న 22647 కోర్బా – కొచివిల్ ఈనెల 12న 22648 కోచివిల్ – కోర్బా ఈనెల 10న 12511 గోరఖ్‌పూర్ – కోచివిల్ (రప్తీసాగర్) ఈనెల 6, 7, 9 12512 కోచివిల్ – గోరఖ్‌పూర్ (రప్తీసాగర్) ఈనెల 9, 11, 12 04717 హిస్పార్–తిరుపతి (స్పెషల్) ఈనెల 8న 07418 తిరుపతి–హిస్సార్ (స్పెషల్) ఈనెల 10నఈనెల 7నుంచి 13వ తేదీ వరకుదారి మళ్లించిచేవి... 20805, 20806 విశాఖ – ఢిల్లీ, ఢిల్లీ – విశాఖకు రైళ్లను 11, 12వ తేదీల్లో దారి మళ్లిస్తారు. అలాగే, 20803, 20804 విశాఖ – గాంధీధమ్, గాంధీధమ్ – విశాకు వెళ్లే రైళ్లను 6, 9వ తేదీల్లో, శాలిమార్ – హైదరాబాద్, హైదరాబాద్ – శాలిమర్ ఎక్స్‌ప్రెస్(ఈస్ట్‌కోస్ట్)ను 11, 12, 13వ తేదీల్లో, భవనేశ్వర్ – ముంబై, ముంబై – భువనేశ్వర్ (కోణార్క్) ఎక్స్‌ప్రెస్‌ను 11, 12వ తేదీల్లో, సాయినగర్ – కాకినాడ రైలును 11, 12 తేదీల్లో దారి మళ్లించారు. -
నేడు పొద్దుటూరు, బోనకల్ మార్గంలో ప్రత్యేక బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: బోనకల్ మండలం పొద్దుటూరులో గురువారం బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుండగా ప్రత్యేక బస్సును నడిపిస్తున్నట్లు ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్ పి.దినేష్‌కుమార్ తెలిపారు. ఖమ్మం నుండి కొణిజర్ల, పొద్దుటూరు మీదుగా బోనకల్ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఖమ్మం పాత బస్టాండ్ గురువారం ఉదయం 9–30, మధ్యాహ్నం 12–30, సాయంత్రం 03–30, 6–30 గంటలకు బస్సులు బయలుదేరతాయని, బోనకల్ నుండి ఖమ్మంకు ఉదయం 8, 11, మధ్యాహ్నం 2, రాత్రి 8 గంటలకు బస్సులు ఉంటాయని తెలిపారు. -
అందుబాటులోకి డీసీసీబీ క్యూఆర్ కోడ్ సేవలు
ఖమ్మంవ్యవసాయం: ఖాతాదారులు, వినియోగదారుల సౌకర్యార్థం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సేవలను మంగళవారం ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. బ్యాంకు ప్రణాళిక, అభివృద్ధి విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ విభాగం ద్వారా సదుపాయాల కల్ప న, అవసరమైన సేవలను ప్రవేశపెడతామని.. ఇందులో భాగంగానే క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహించేలా అమలుచేస్తున్న ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలకవర్గ సభ్యులు, సీఈఓ ఎన్.వెంకట ఆదిత్య, అధికారులు పాల్గొన్నారు. -
ఉల్లంఘనులు
జిల్లాలో ఖనిజాల లీజ్‌ల వివరాలు ఖనిజం లీజ్‌ల భూమి విస్తీర్ణం సంఖ్య (హెక్టార్లలో) బ్లాక్ గ్రానైట్ 141 293.474 స్టోన్, మెటల్ 51 103.08 డోలమైట్ 03 31.507 గ్రావెల్ 03 6.830 బైరటీస్ 02 7.972 క్వార్ట్ ్జ 01 5.837 కోరండమ్ 01 2.00సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘జిల్లాలో మైనింగ్ అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. లీజ్‌దారులు నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతున్నారు. లీజ్‌కు మించి ఎక్కువ తవ్వకాలు చేపడుతూ లెక్కల్లో తక్కువగా నమోదు చేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. జిల్లాలో 450.07 హెక్టార్ల ప్రభుత్వ, పట్టా భూముల్లో 202మంది వ్యక్తులు, సంస్థల మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతుండగా.. అనుమతులకు మించి అక్రమంగా, ఇష్టారీతిన తవ్వి తరలిస్తున్నారు’ అని ఇటీవల ఖమ్మంకు చెందిన ఎన్.రాము హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే, జిల్లాలోని పలు చోట్ల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నా మైనింగ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. 450.07 హెక్టార్లలో లీజు జిల్లాలో 450.07 హెక్టార్ల ప్రభుత్వ, పట్టా భూముల్లో ఖనిజాల తవ్వకానికి 202 మంది వ్యక్తులు, సంస్థలకు అనుమతులు ఉన్నాయి. జిల్లాలోని 21 మండలాల పరిధిలో స్టోన్, మెటల్, గ్రావెల్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, బైరటీస్, డోలమైట్, క్వార్ట్జ్, కోరండమ్ తదితర ఖనిజాల మైనింగ్ జరుగుతోంది. ప్రధానంగా స్టోన్, మెటల్ 51 లీజ్‌లు, బ్లాక్ గ్రానైట్‌కు సంబంధించి 141 లీజ్‌లు ఉన్నాయి. అయితే, అనుమతి ఆధారంగా నిర్ణీత విస్తీర్ణంలోనే ఖనిజాలను వెలికితీయాల్సి ఉండగా పలువురు లీజ్‌దారులు నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిర్ణీత స్థలానికి చుట్టుపక్కల సైతం తవ్వకాలు చేపట్టడం, ప్రభుత్వానికి మాత్రం తక్కువ లెక్కలు చూపిస్తుండగా ఖజానాకు చేరాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇక పర్యావరణం విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిల్లో సదరు వ్యక్తి పేర్కొన్నాడు. అధికారుల పర్యవేక్షణ ఏదీ? మైనింగ్ కార్యకలాపాలను గనులు, భూగర్భశాఖ సహాయ సంచాలకులు, పర్యావరణ అనుమతులను కొత్తగూడెం కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారులు పర్యవేక్షించాలి. అయితే వీరు విధుల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని పిల్లో ప్రస్తావించారు. కొందరు గనులు, భూగర్భశాఖ అధికారులు.. తమ బంధువులు, మిత్రుల పేరుతో అనుమతులు తీసుకుని అక్రమ మైనింగ్‌లో భాగస్వాములుగా మారుతున్నట్లు పిల్లో పేర్కొన్నాడు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తమ శాఖ ఉద్యోగులే కావడంతో బుట్టదాఖలు చేస్తున్నారని సదరు వ్యక్తి హైకోర్టుకు వివరించాడు.మైనింగ్‌లో నిర్వాహకుల ఇష్టారాజ్యం ఎక్కువ విస్తీర్ణంలో తవ్వుతూ తక్కువగా నమోదు ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి హైకోర్టులో పిల్ దాఖలుతో అధికారులకు నోటీసులుసమాధానం ఇవ్వండి.. జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఖమ్మంకు చెందిన ఎన్.రాము గత ఏడాది అక్టోబర్‌లో హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని కోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. అక్రమ మైనింగ్‌తోపాటు స్టోన్క్రషర్ల అక్రమ నిర్వహణ, పర్యావరణ విధ్వంసం కొనసాగుతోందని లేఖలో పేర్కొనగా సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, పీసీసీఎఫ్, కలెక్టర్, సీపీ, సంబంధిత శాఖ అధికారులు నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.అన్నీ సక్రమంగానే ఉన్నాయి.. జిల్లాలో అన్ని క్వారీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో పరిశీలించాకే అనుమతులు ఇస్తున్నాం. అనుమతుల ఆధారంగా తవ్వకాలు కొనసాగుతున్నాయే తప్ప ఎక్కడా ఉల్లంఘనలు జరగలేదు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కౌంటర్ ఫైల్ దాఖలు చేస్తాం. – సాయినాథ్, ఏడీ, మైనింగ్ -
చివరి ఆయకట్టు వరకు సాగర్ నీరు
బోనకల్: బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో చివరి ఆయకట్టు భూములకు సైతం సాగర్ జలాలు అందేలా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బోనకల్ తహసీల్‌లో మంగళవారం ఆయన ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. బీబీసీ పరిధిలోని చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. వారబందీ విధానమే ఇందుకు కారణమని వారు చెబుతున్నందున, ఈ దఫా విడుదల చేసే సాగర్ జలాలను వృథా కాకుండా చివరి భూములకూ అందేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే, ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. తహసీల్దార్ పున్నంచందర్, ఎంపీడీఓ రమాదేవి, ఏఓ వినయ్‌కుమార్, ఇరిగేషన్ ఏఈ రాజేష్, ఆర్ఐ లక్ష్మణ్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు ఖమ్మం సహకారనగర్: ఈనెల 21న మొదలుకానున్న ఎస్సెస్సీ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.,శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణతో కలిసి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతర అంశాలపై సూచనలు చేశారు. డీఈఓ సోమశేఖరశర్మ, డీసీఈబీ కార్యదర్శి నారాయణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి -
ఇక సాఫీగా పరిష్కారం
● అమల్లోకి ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీ ● ఫీజు చెల్లించాలని దరఖాస్తుదారులకు మెసేజ్ ● జిల్లాలో 99,745 దరఖాస్తులు ఖమ్మంమయూరిసెంటర్: ఎల్ఆర్ఎస్(లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుల పరిష్కారం ఇకపై సాఫీగా, వేగంగా జరగనుంది. ప్రభుత్వం గత నెల 19న ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించినా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో జిల్లాలో అమలు కాలేదు. ప్రస్తుతం ఎన్నికల ఫలితం వెలువడడంతో జిల్లాలోనూ రాయితీ అమలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో సోమవారం రాత్రి నుంచే ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారు 25శాతం రాయితీతో ఫీజు చెల్లించాలని మెస్సేజ్‌లు వస్తున్నాయి. వెబ్సైట్లో దరఖాస్తు నంబర్ ఆధారంగా పరిశీలిస్తే ఎంత ఫీజు చెల్లించాలో చూపిస్తుండడంతో మంగళవారం ఉదయమే పలువురు కేఎంసీతో పాటు ఇతర మున్సిపల్ కార్యాలయాలకు చేరుకుని ఆరా తీయడం కనిపించింది. భారీగా దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ కోసం ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల్లో 51,425 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 8,851 అనుమతి పొందగా.. 339 దరఖాస్తులను తిరస్కరించారు. గతంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నవి 53 ఉండగా, సరైన డాక్యుమెంట్లు లేక 2,035 దరఖాస్తులు పెండింగ్ పెట్టారు. అలాగే, నిషేధిత సర్వేనంబర్ల జాబితాలో 5,946 ప్లాట్లకు సంబంధించి దరఖాస్తులు అందాయని గుర్తించారు. కాగా, దరఖాస్తుల పరిశీలన మూడు దశల్లో చేపడుతుండగా ఎల్–1 దశలో 33,302, ఎల్–2లో 259, ఎల్–3 దశకు 51 చేరాయి. మొత్తంగా ఫీజు చెల్లించడం కోసం 8,916 దరఖాస్తులకు అనుమతి ఇవ్వగా 1,151 దరఖాస్తులకే యజమానులు ఫీజు చెల్లించారు. ఇంకా 7,765 దరఖాస్తులకు ఫీజు పెండింగ్ ఉంది. వాటిని పక్కకు పెట్టి.. ఎల్ఆర్ఎస్ కోసం కేఎంసీ తర్వాత అత్యధిక దరఖాస్తులు ‘సుడా’ పరిధిలో అందాయి. అయితే, ఎల్–1 దశలో పరిశీలన అధికారులకు భారంగా మారగా, ప్రభుత్వం ఫీజు రాయితీ ఈనెల 31వ తేదీ వరకే వర్తిస్తుందని చెప్పడంతో ఆలోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి కాదని తెలుస్తోంది. దీంతో నిషేధిత, ప్రభుత్వ, ఇరిగేషన్ స్థలాల్లో ఉన్న లేఔట్లు, స్థలాలను పక్కన పెట్టి అన్నీ సక్రమంగా ఉన్న ప్రైవేటు స్థలాలకు 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేలా అవకాశం కల్పించనున్నారు. కాగా, ఫీజు చెల్లించిన దరఖాస్తుల్లోనూ ఏమైనా సమస్యలు గుర్తిస్తే వాటిని తిరస్కరించే అవకాశముందని అధికారులు ముందుగానే చెబుతున్నారు. ఒకవేళ అలా జరిగితే ప్రాసెస్ ఫీజు మినహా మిగిలిన మొత్తం చెల్లిస్తామని వివరిస్తున్నారు.మరింత అ‘ధనం’..దరఖాస్తుదారులకే సమాచారం.. ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం ప్రకటించిన రాయితీ అమల్లోకి వచ్చింది. ఈ విషయంలో దరఖాస్తుదారులకు నేరుగా మెసేజ్ వెళ్తోంది. అలా అందిన వారు ఫీజు చెల్లిస్తే దరఖాస్తులు పరిశీలించి రెండు, మూడు రోజుల్లో రెగ్యులరైజ్ ప్రొసీడింగ్స్ జారీ చేస్తాం. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీఎల్ఆర్ఎస్ కోసం అందిన దరఖాస్తులు మున్సిపాలిటీ దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు ఫీజు చెల్లించినవి అనుమతి పొందినవి ఖమ్మం కార్పొరేషన్ 39,945 3,735 939 మధిర 4,276 1,488 97 సత్తుపల్లి 3,688 2,391 62 వైరా 3,516 1,237 48 సుడా 34,393 07 04 గ్రామపంచాయతీలు 13,927 58 01మొత్తం 99,745 8,916 1,151 ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం మెసేజ్ పంపిస్తోంది. ఫీజు చెల్లించాక వివరాలను అధికారులకు అందజేస్తే స్థలాలను పరిశీలించి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నారు. దీంతో దరఖాస్తుదారులు మంగళవారం కేఎంసీ, సుడా, ఇతర మున్సిపాలిటీలకు క్యూ కట్టారు. అసలు ఫీజు, రాయితీ పోగా ఎంత కట్టాలని ఆరా తీస్తుండగా.. కొందరు రాయితీ తీసేస్తే ఇంకా ఫీజు పెరుగుతోందని మొర పెట్టుకోవడం కనిపించింది. ఆన్లైన్లో లేకున్నా అదనంగా రూ.10 వేలు చెల్లించాల్సి వస్తున్న అంశాన్ని ఉన్నతాధికారులు స్థానిక అధికారులు నివేదించినట్లు తెలిసింది. ప్రభుత్వం ఖాళీ స్థల ట్యాక్స్‌ను కూడా ఫీజులో పొందుపర్చడంతో ఇలా జరిగిందని సమాచారం. -
మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా రాష్ట్రప్రభుత్వం వివిధ పథకాల్లో స్థానం కల్పిస్తోంది. ఇప్పటికే ఇందిరా మహిళ శక్తి పేరుతో క్యాంటీన్లు మంజూరు చేస్తుండగా, తాజాగా ఆర్టీసీ అద్దెకు తీసుకునే బస్సులను మహిళా సంఘాల నుంచే సమకూర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 600 బస్సులను ఈ విధానంలో సేకరించాలనేది లక్ష్యం కాగా, మొదటి దశలో 150 బస్సులను మహిళా సమాఖ్యలకు రుణాల మంజూరు ద్వారా కొనుగోలు చేయిస్తారు. ఈక్రమాన రుణాలు మంజూరు చేసే బ్యాంకులకు ప్రభుత్వమే పూచీకత్తు ఇస్తుంది. కాగా, మొదటి దశలో కొనుగోలు చేసే 150బస్సుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మహిళా సమాఖ్యలకు సైతం స్థానం దక్కనుంది. సుమారు 30 – 35 బస్సులను ఇక్కడి మహిళా సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగిస్తారు. ఆపై ఆర్టీసీ ఒక్కో బస్సుకు రూ.77,220 చొప్పున అద్దె చెల్లిస్తుంది. ఇందులో కొంత మేర రుణవాయిదాలు చెల్లిస్తూ మిగతా నగదును సమాఖ్య సభ్యులుగా వాటాలు తీసుకుంటారు. కాగా, ఈనెల 8న మహిఽళా దినోత్సవం రోజునే 50బస్సులను ప్రభుత్వం ప్రారంభించనుండగా, జిల్లాలో మహిళా సమాఖ్యలను ఎంపిక చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మొదటి దశలోనే ఉమ్మడి జిల్లాకు స్థానం -
సీతారామ కాల్వల్లో ‘గోదావరి’ పరవళ్లు
అశ్వాపురం/ములకలపల్లి: సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువల్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతున్నాయి. రెండు పంప్‌హౌస్‌ల్లోనూ రెండో రోజు కూడా మోటార్లు ఆన్ చేయడంతో భారీగా దిగువకు తరలుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని పంప్ హౌస్ –1 నుంచి ములకలపల్లి మండలం వీకే రామవరం శివారులోని పంప్‌హౌస్–2కు చేరుకున్నాయి. దీంతో ఇక్కడ మంగళవారం డిశ్చార్జి పాయింట్ వద్ద నీటిని ఎత్తిపోశారు. దీంతో 35 మిలియన్ క్యూబిక్ ఫీట్ల(ఎంసీఎఫ్‌టీ) నీళ్లు కమలాపురం పంప్‌హౌస్–3కి వదిలినట్లు ఐబీ డీఈ మోతీలాత్ తెలిపారు. మంగళవారం ఒక్కరోజే ఐదున్నర గంటలపాటు మోటార్లు నడిపించి, 30 ఎంపీఎఫ్‌టీల నీటికి దిగువకు మళ్లించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాగా, అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్ ఫేస్–1 పంప్‌హౌస్ ద్వారా సోమవారం ఎనిమిది గంటలు, మంగళవారం ఎనిమిది గంటల పాటు గోదావరి జలాలు దిగువకు ఎత్తిపోశారు. గంటకు 5.4 ఎంసీఎఫ్‌టీ చొప్పున 86.4 ఎంసీఎఫ్‌టీ నీరు దిగువకు ఎత్తిపోశారు. బీజీకొత్తూరు, పూసుగూ డెం, కమలాపురం పంప్‌హౌస్‌ల ద్వారా 100.22 కిలోమీటర్ల వద్ద ఏన్కూరు లింక్ కెనాల్ మీదుగా 8.60 కిలోమీటర్లు ప్రవహించనుండగా, నాగార్జున సాగర్ కెనాల్‌కు తరలించనున్నారు. రైతుల్లో ఆనందం.. చండ్రుగొండ : రైతుల ఏళ్ల నాటి కల మంగళవారం సాకారమైంది. ట్రయల్‌రన్‌లో భాగంగా సీతారామ కాల్వలోకి నీరు వదలగా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలకు గోదావరి జలాలు రావడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తిపోత నేడు రాజీవ్ కెనాల్‌కు నీరు విడుదల చేయనున్న మంత్రి తుమ్మల ఆపై ఎన్నెస్పీ కెనాల్లోకి గోదావరి జలాలునేడు రాజీవ్ లింక్ కెనాల్ ట్రయల్ రన్.. జూలూరుపాడు: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి ఎన్నెస్పీ కెనాల్లోకి గోదా వరి జలాలు చేరనున్నాయి. ఈ మేరకు సీతారామ మెయిన్ కెనాల్ నుంచి ఏన్కూ రు ఎన్నెస్పీ కెనాల్లోకి గోదావరి జలాలను చేర్చే రాజీవ్ లింక్ కెనాల్ వద్ద బుధవారం ట్రయల్‌రన్ జరగనుంది. అశ్వాపురం మండలంలోని పంప్‌హౌస్ నుంచి వంద కి.మీ. దూరాన వినోభానగర్ మెయిన్ కెనాల్ ద్వారా ఏన్కూరు ఎన్నెస్పీ కెనాల్లోకి నీటి తరలింపునకు ఈ కాల్వ నిర్మించారు. ఈమేరకు బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ కెనాల్ వద్ద గోదావరి జలాలు విడుదల చేసి పూజలు నిర్వహిస్తారు. -
‘వనజీవి’ని కలిసిన బీట్ ఆఫీసర్లు
ఖమ్మంరూరల్: మండలంలోని రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యను రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ 35వ బ్యాచ్‌కు చెందిన 40మంది ఫారెస్ట్ ట్రైనింగ్ బీట్ ఆఫీసర్లు మంగళవారం కలిశారు. ఈసందర్భంగా విత్తనాల సేకరణ, మొక్కలు నాటడం, పరిరక్షణపై తన అనుభవాలను రామయ్య వివరించారు. మొక్కలు నాటడమే కాక అడవులను నరికివేయకుండా అడ్డుకోవడాన్ని అందరూ బాధ్యతగా భావించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అటవీ అకాడమీ కోర్సు డైరెక్టర్ గంగారెడ్డి, కూసుమంచి రేంజ్ ఆఫీసర్ పి.శ్రీనివాసరావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కే.వీ.రామారావుతో పాటు ఉద్యోగులు కొండల్రావు, పి.డానియేల్, వెంకటేశ్వర్లు, నర్సింహారావు, మధు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షికలు బుధవారం మొదలుకానుండగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో సమావేశమయ్యారు. బుధవారం నుంచి 25వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 72కేంద్రాలు ఏర్పాటుచేయగా, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17,783, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,877మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ఉదయం 8గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్‌ను 99489 04023 నంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు. అనంతరం డీఐఈఓ పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. సౌర విద్యుత్ ప్లాంట్లకు దరఖాస్తు గడువు పెంపు ఖమ్మంవ్యవసాయం: రైతులు తమ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగించారు. పీఎం కుసుమ్ పథకం కింద వ్యవసాయ యోగ్యం కాని బీడు, బంజర భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులతో పాటు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, వివిధ సంస్థలకు సైతం అవకాశం కల్పించారు. అయితే, దరఖాస్తు గడువు 2వ తేదీతో ముగియగా ఉమ్మడి జిల్లాలో 75 మంది ముందుకొచ్చారు. ఈనేపథ్యాన గడువు పెంచగా, ఆసక్తి ఉన్న రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పి.అజయ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సాగర్ జలాలను సద్వినియోగం చేసుకోండి చింతకాని/ఎర్రుపాలెం: సాగర్ జలాలను రైతులు సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. చింతకాని రైతువేదికలో మంగళవారం రైతులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ వారబందీ విధానంలో నీరు విడుదల చేస్తుండగా చివరి ఆయకట్టుకు సైతం చేరేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇదేసమయాన రైతులు కూడా సహకరించాలని కోరారు. అనంతరం డీఏఓ పుల్లయ్య ఎర్రుపాలెం మండలం మామునూరులో వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఎక్కడైనా పంట వడలినట్లు అనిపిస్తే రెండు శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలని తెలిపారు. మధిర ఏడీఏ విజయ్‌చంద్ర, ఏఓ మానస, ఇరిగేషన్ డీఈ సాంబశివరావు, ఏఈఓలు రాము, తేజ, ఆయేషా, కల్యాణి, జి.గోపి, బండి శ్రీకాంత్ పాల్గొన్నారు. -
వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి
వైరారూరల్: వడగాలులు వీస్తున్నందున ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో మంగళవారం ఆమె ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యాన పనివేళల్లో మార్పులు చేయాలని ఆధికారులను ఆదేశించారు. పని ప్రదేశాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల్లో అందుతున్న సేవలపై ఆమె కూలీలకు అవగాహన కల్పించారు. ఏపీఓ అనురాధ, ఉద్యోగులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణకు ప్రణాళిక ఖమ్మం సహకారనగర్: నైపుణ్య శిక్షణ అమలుకు ప్రణాళిక రూపొందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆమె స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్(సంకల్ప్) ద్వారా కళాశాలల్లో నైపుణ్య శిక్షణపై సమీక్షించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ ఇప్పిస్తే తక్షణ ఉపాధి లభిస్తుందన్నారు. జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఎండాకాలం సెలవులు రాగానే నెల పాటు శిక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, కార్పొరేట్ షాపింగ్ మాల్స్‌లో అమ్మకానికి కూరగాయలు, పూల పెంపకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి, వివిధ శాఖల అధికారులు కె.సత్యనారాయణ, జ్యోతి, నవీన్‌బాబు, పురంధర్, వి.విజేత, సీతారాం తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ -
గర్భిణులకు ఆరోగ్యంపై అవగాహన
ఖమ్మంవైద్యవిభాగం: గ్రామస్థాయిలో గర్భిణులు ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఏఎన్ఎంలపై ఉందని డీఎంహెచఓ కళావతిబాయి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ‘ఆర్మన్’ సంస్థ సహకారంతో ‘అమ్మ కోసం’ పేరిట ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ గర్భధారణ మొదలు ప్రసవం వరకు మహిళలు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తే మాతృమరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్ఓ సైదులు, ఆర్మన్ ఆర్గనైజేషన్‌కు చెందిన డాక్టర్ అఖిల పలు అంశాలను వివరించగా టీఓటీలు డాక్టర్ స్రవంతి, డాక్టర్ చందన, డీపీహెచ్ఎన్ఓ ఎస్.శేషుపద్మ, డీసీఎం ఎన్.రఘురాం, డీపీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త బస్టాండ్ ఫుడ్‌కోర్టులో ఇడ్లీల్లో పురుగులు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త బస్టాండ్‌లోని ఫుడ్ కోర్టులో టిఫిన్ చేసేందుకు వచ్చిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం మధ్యాహ్నం దేవేందర్ ఫుడ్‌కోర్టుకు వెళ్లి సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. ఆయన ఇడ్లీ తింటుండగా అందులో పురుగు రావడంతో ఇదేమిటని ప్రశ్నించినా నిర్వాహకుల నుంచి స్పందన లేక జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆర్.కిరణ్‌కుమార్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, కొత్త బస్టాండ్‌లోని హోటల్ నిర్వాహకులు పరిశుభ్రత పాటించడం లేదని బస్టాండ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ విషయమై ఫుడ్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా ఓ వ్యక్తి ఫోన్లో ఫిర్యాదు చేశాడని, అందుబాటులో లేనందున త్వరలోనే తనిఖీ చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో ‘ఎఫ్ఆర్ఎస్’ హాజరు
కల్లూరురూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల హాజును ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) ద్వారా నమోదు చేయాలని జిల్లా సంక్షేమాధికారి కీసర రాంగోపాల్‌రెడ్డి తెలిపారు. ఐసీడీఎస్ సీడీపీఓ నిర్మలజ్యోతి ఆధ్వర్యాన కల్లూరు సూపర్వైజర్లకు మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రాలకు వచ్చే ఏడు నెలల నుంచి మూడేళ్ల చిన్నారుల హాజరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈవిషయమై అంగన్వాడీ టీచర్లందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. కాగా, సూపర్వైజర్ వెంకటమ్మకు గ్రేడ్–1 సూపర్వైజర్గా పదోన్నతి పత్రాలను డీడబ్ల్యూఓ అందజేశారు. ఏసీడీపీఓలు రత్తమ్మ, మెహరున్నీసాబేగం, నవ్య, ఉద్యోగులు శివరామకృష్ణ, సంధ్యారాణి, సుజాత, భవాని, వెంకటమ్మ, మల్లేశ్వరి, రాజ్యలక్ష్మి, సత్యవతి, రోజా, రత్నకుమారి, అనురాధ, హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
అధ్యాపకురాలికి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ అధ్యాపకురాలు కె.విజయలక్ష్మికి డాక్టరేట్ లభించింది. కై కలూరులోని వైవీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ కె.పంకజ్ కుమార్ పర్యవేక్షణలో ఆమె ‘ఎక్స్ పేట్రియట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఝంపాల హరీస్ ఫిక్షన్ – ఏ క్రిటికల్ స్టడీ’ అంశంపై పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంధం సమర్పించగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈసందర్భంగా విజయలక్ష్మిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా, వైస్ ప్రిన్సిపాళ్లు ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, డాక్టర్ బానోత్‌రెడ్డి, అధ్యాపకులు ఏ.నర్సమ్మ, రాంబాబు, బంగారి, కె.రవికుమార్ తదిరులు అభినందించారు. రేపు జాబ్ మేళా ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్లో ఈనెల 6న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిలా ఉపాధి కల్పన శాఖా ధికారి ఎన్.మాధవి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన వైఎస్‌కే ఇన్ఫోటెక్, జీజే సొల్యూషన్స్ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలకు ఆయా సంస్థల బాధ్యులు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈమేరకు 18–30 ఏళ్ల వయస్సు కలిగి ఎస్సెస్సీ మొదలు డిగ్రీ అర్హత ఉన్న వారు హాజరుకావొచ్చని తెలిపారు. పీఎం ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంవన్‌టౌన్: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా శిక్షణ కోసం ఆసక్తి, అర్హతలు ఉన్న వారు ఈనెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల అధికారి టి.సీతారాం సూచించారు. ఇంటర్న్‌షిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు 12నెలల వ్యవధిలో కనీసం ఆరు నెలలు ఉద్యోగ శిక్షణ ఉంటుందని, నెలవారీ రూ.5వేల భత్యం అందుతుందని తెలిపారు. 21 – 24 ఏళ్ల వయస్సు కలిగి, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా, గత ఏడాది వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు ఉన్న వారు అర్హులని వెల్లడించారు. ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు pmintership. mca.gov.in ద్వారా గరిష్టంగా ఐదు ఇంటర్న్‌షిప్ ట్రేడ్లను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 1800116090 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు. వకుళామాత స్టేడియంలో యాగం ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన శ్రీవకుళామాత స్టేడియంను ఈనెల 7వ తేదీన ప్రారంభించనున్నారు. గ్రామానికి చెందిన తుళ్లూరు కోటేశ్వరరావు–నిర్మల దంపతుల ఆర్థిక చేయూతతో నిర్మించిన ఈ స్టేడియం ప్రారంభోత్సవంలో భాగంగా మంగళవారం దాత దంపతులతో అర్చకులు యాగం జరిపించారు. గణపతి పూజ, పుణ్యావాచనం, రక్షాబంధనం, భూశుద్ధి, అఖండ దీపారాధన, మండపస్థాపన కార్యక్రమాలు జరగగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కట్లేరు ప్రాజెక్టులోకి సాగర్ జలాలు ఎర్రుపాలెం: మండలంలోని కట్లేరు ప్రాజెక్టు ఆయకట్టులో పంటలకు ఇబ్బంది ఎదురుకాకుండా మంగళవారం సాగర్ జలాలను విడుదల చేశారు. పంటలకు నీరందక ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు పెనుబల్లి మండలం కొండ్రుపాడు ఎస్కేప్(88 కి.మీ.) వద్ద ఎన్ఎస్పీ మెయిన్ కెనాల్ నుంచి సాగర్ జలాలను కట్లేరుకు విడుదల చేశారు. ఈసందర్భంగా మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు తదితరులు కట్లేరును పరిశీలించారు. -
దగా చేస్తే ఉపేక్షించేది లేదు
● గిట్టుబాటు ధరతో మిర్చి కొనుగోలు చేసేలా పర్యవేక్షణ ● ఖమ్మం మార్కెట్లో పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తనిఖీ ఖమ్మంవ్యవసాయం: మిర్చి తీసుకొచ్చే రైతులను ధర విషయంలో ఎవరు దగా చేయాలని ప్రయత్నించినా చర్యలు తప్పవని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. మిర్చి ధర పతనమవుతున్న నేపథ్యాన కలెక్టర్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యతను పరిశీలించిన ఆయన ధరలపై ఆరా తీయగా పలువురు రైతులు తక్కువగా చెల్లిస్తున్నారని, జెండాపాటతో పొంతన ఉండడం లేదని వాపోయారు. దీంతో పంట నాణ్యతగా ఉన్నా ధర ఎందుకు తక్కువగా చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి ధరలో న్యాయం జరిగేఽలా చూస్తామని రైతులకు భరోసా కల్పించిన కలెక్టర్.. కొనుగోళ్లలో వేగం, నగదు చెల్లింపులు, మద్దతు ధరపై పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం, ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏఐ ద్వారా సులభంగా బోధన ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంతో విద్యార్థులకు సులభతరంగా బోధన చేయొచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత బోధనను పరిశీలించిన ఆయన విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాక మాట్లాడారు. జిల్లాలోని ఏడు పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలుచేస్తున్నామని, విద్యార్థులు తెలుగు, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడడం, గణితంపై పట్టు సాధించేలా చూడడమే లక్ష్యమన్నారు. విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి కె.రవికుమార్, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి, జీసీడీఓ తులసి, హెచ్ఎం బుర్రి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ మరింత నమ్మకం పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ వివిధ విభాగాల్లో పరిశీలించి చికిత్స కోసం వచ్చిన వారితో సేవలపై ఆరా తీశారు. అనంతరం నూతన భవనాల నిర్మాణ పనులు, దివ్యాంగులచే నిర్వహిస్తున్న పెయిడ్ పార్కింగ్, మహిళా శక్తి క్యాంటీన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే వారితో వైద్యులు, సిబ్బంది మర్యాదగా ప్రవర్తించడమే కాక మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
సేవాలాల్ గద్దెల తొలగింపుపై ఆందోళన
కారేపల్లి: బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ గద్దెలను తొలగించడంపై గిరిజనులు కారేపల్లిలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇటీవల కారేపల్లి సర్వే నంబర్ 38లోని ప్రభుత్వ స్థలంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించగా, గద్దెలు నిర్మించారు. అయితే, ఇక్కడ 17 గుంటల భూమిని గతంలోనే కారేపల్లి బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి కేటాయించి బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇంతలోనే గద్దెలు నిర్మించినట్లు తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ అధికారులు నిర్మాణ బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక, సోమవారం గద్దెలు, దేవతల రాళ్లను తీయించారు. ఈ విషయం తెలియంతో బుధవారం వివిధ గ్రామాల బంజారాలు, వివిధ సంఘాల నాయకులు కారేపల్లిలో ఆందోళన చేపట్టారు. బస్టాండ్ సెంటర్లో గంట పాటు రాస్తారోకో చేయగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, కారేపల్లి, కామేపల్లి ఎస్ఐలు ఎన్.రాజారాం, సాయికుమార్ చేరుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. చివరకు దేవతల రాళ్లు, జెండాలు ఏర్పాటుచేయడంతో ఆందోళన విరమించారు. -
‘ప్రభుత్వ చొరవ లేకే మిర్చి ధర పతనం’
ఖమ్మంమయూరిసెంటర్: మిర్చి ఎగుమతులకు ప్రభుత్వం చొరవ చూపకపోవడం, గతేడాది పండించిన పంట నిల్వ ఉండడంతో ధర గణనీయంగా పడిపోయిందని వ్యవసాయ శాస్త్రవేత్త బలేజిపల్లి శరత్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా మహాసభల సందర్భంగా మంగళవారం ‘మిర్చి ధర పతనం– పరిష్కార మార్గాలు’ అంశంపై జిల్లా పరిషత్ హాల్లో సదస్సు ఏర్పాటుచేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్ అధ్యక్షతన జరిగిన సదస్సులో శరత్‌బాబు మాట్లాడుతూ దేశంలో పండించిన వివిధ రకాల మిర్చిని ఇతర దేశాలు దిగుమతి చేసుకునేవని.. ఈ ఏడాది అక్కడి పరిస్థితులు, అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ధరల పతనానికి కారణమయ్యాయని తెలిపారు. ప్రధాని మోదీ ట్రంప్‌తో సమావేశమైనప్పుడు ఎగుమతుల విషయంపై చొరవ తీసుకుంటే ఫలితం ఉండేదని చెప్పారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మిర్చి బోర్డు ఏర్పాటు చేసి నాఫెడ్ ద్వారా క్వింటాకు రూ.25వేల చొప్పున కొనుగోలు చేయాలని, తద్వారా రైతులకు న్యాయం జరుగుతుందంటూ తీర్మానం చేశారు. సదస్సులో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతితో పాటు వివిధ సంఘాల నాయకులు కొండపర్తి గోవిందరావు, నల్లమల వెంకటేశ్వరరావు, పోతినేని సుదర్శన్‌రావు, గుర్రం అచ్చయ్య, దండి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బాలికల కళాశాలకు రూ.లక్ష విరాళం
సత్తుపల్లిటౌన్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ మట్టా దయానంద్ సూచించారు. సత్తుపల్లి ప్రభుత్వ బాలికల కళాశాలకు ఏటా రూ.లక్ష చొప్పున ఇచ్చే ఆర్థిక సాయంలో భాగంగా మంగళవారం ఆయన రూ.లక్ష అందజేశారు. ఇప్పటివరకు రూ.3 లక్షలు అందజేసిన నేపథ్యాన అభివృద్ధితో పాటు విద్యార్థుల ప్రోత్సాహకానికి వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం యువసేవా సమితి ఆధ్వర్యాన విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, రాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
వెంకట్‌రెడ్డి ఆశయాలను సాధిస్తాం
కామేపల్లి: మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. కామేపల్లిలోని కొత్తలింగాల క్రాస్‌లోని వెంకట్‌రెడ్డి విగ్రహం వద్ద ఆయన 9వ వర్ధంతి సందర్భంగా మంగళవారం వారు నివాళులర్పించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని బడుగు, బలహీన వర్గాలకు వెంకటరెడ్డి అండగా నిలిచి, వారి అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. ఇదే సమయాన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ కార్యకర్తలను కాపాడుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు రాంరెడ్డి కృష్ణారెడ్డి, శ్రీచరణ్‌రెడ్డి, జగన్నాథరెడ్డి, మానుకొండ రాధాకిషోర్, గింజల నరసింహారెడ్డి, దమ్మలపాటి సత్యనారాయణ, మద్దినేని రమేశ్‌బాబు, నర్సింహారావు, ధనియాకుల హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు వ్యాన్ దగ్ధం
ఏన్కూరు: ఏసీలు, రిఫ్రిజిరేటర్లను తీసుకెళ్తున్న వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. ఖమ్మంకు చెందిన రమేష్ తన మినీ వ్యాన్‌లో 9ఏసీలు, 12 రిఫ్రిజిరేటర్లను మంగళవారం కొత్తగూడెం తీసుకెళ్తున్నాడు. ఏన్కూరు మండలం కోనాయపాలెం సమీపాన ఒక్కసారిగా వ్యాన్‌కు మంటలు చెలరేగడంతో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. ఈమేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపుచేశారు. కాగా, ఏసీలు, ఫ్రిజ్‌లకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు పేలడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. -
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
ధర, దిగుబడి ఇచ్చే వంగడాలపై దృష్టి
ఖమ్మంవ్యవసాయం: అధిక దిగుబడితో పాటు మార్కెట్లో మంచి ధర లభించే వంగడాల రూపకల్పనపై దృష్టి సారించామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి తెలిపారు. చైర్మన్, అధికారుల బృందం జిల్లాలోని పలుప్రాంతాల్లో సాగవుతున్న పెసర తదితర పంటలను పరిశీలించారు. ఆతర్వాత ఖమ్మంలోని సంస్థ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది వానాకాలం సీజన్‌కు విత్తనాల లభ్యతపై ఆరాతీసిన చైర్మన్ మాట్లాడుతూ ప్రాంతాల వారీగా నేల రకాల ఆధారంగా విత్తనాలు సరఫరా చేస్తామని తెలిపారు. అధిక దిగుబడి, ధర దక్కేలా వంగడాలను రైతులకు సమకూరుస్తామని చెప్పారు. తొలుత రఘునాథపాలెం మండలం గణేశ్వరం శివారులో ఉన్న పెసర చేలను చైర్మన్ అన్వేష్‌రెడ్డి, అధికారులు పరిశీలించారు. ఈ బృందంలో విత్తనాభివృద్ధి సంస్థ ప్రొడక్షన్, మార్కెటింగ్ మేనేజర్లు సంధ్యారాణి, రాజీవ్‌కుమార్, ఉమ్మడి జిల్లా రీజినల్ మేనేజర్ బిక్షం, విత్తన అధికారి తేజశ్రీ తదితరులు ఉన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి -
25న పోస్టల్ పెన్షన్ అదాలత్
ఖమ్మంగాంధీచౌక్: హైదరాబాద్ రీజియన్ స్థాయిలో ఈనెల 25న పోస్టల్ పెన్షన్ అదాలత్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి తెలిపారు. పెన్షన్ సంబంధిత అంశాలపై ఫిర్యాదులు ఉన్న వారు ‘అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయం, హైదరాబాద్ రీజియన్, హైదరాబాద్–1, తెలంగాణ సర్కిల్ డాక్ సదన్, 5వ ఫ్లోర్, ఆబిడ్స్, హైదరాబాద్’ చిరునామాకు చేరేలా ఈనెల 20వ తేదీ లోగా పంపించాలని తెలిపారు. కవర్‌పై ‘పోస్టల్ పెన్షన్ అదాలత్ ఆఫ్ హైదరాబాద్ రీజియన్’ అని రాయాలని తెలిపారు. ఆయా ఫిర్యాదులపై ఈనెల 25న ఉదయం 11:30 గంటలకు మొదలయ్యే పెన్షన్ అదాలత్‌తో meet.google.com/ytf& ptji& wwf లింక్ ద్వారా పాల్గొనవచ్చని వెల్లడించారు. -
●బౌద్ధక్షేత్రం సందర్శన
నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలో కెల్లా పెద్దదైన నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రాన్ని బౌద్ధ భిక్షువులైన సద్ధా రక్కితా, బిక్షు ప్రజ్ఞానంద మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మహాబోధి, మహావిహార నిర్వహణను పూర్తిగా బౌద్ధ బిక్షువులతో కూడిన కమిటీకి అప్పగించాలని కోరారు. కాగా, క్షేత్రంలో బ్రాహ్మణ పూజారులతో జరిగే పూజాక్రతువులు నిషేదించాలనే అభ్యర్ధనలు వస్తున్నాయని తెలిపారు. ఈమేరకు ప్రాచీన కట్టడాలను పరిరక్షించి ఆధ్మాతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడమే కాక స్థానిక ఉపాకులను నిర్వహణలో భాగస్వామ్యులుగా చేయాలని కోరారు. బౌద్ధ ఉపాసకులు వంగూరి ఆనందరావు, వెంకట్, ఈదయ్య, వెంకన్న, కె.వెంకటేశ్వర్లు, తోళ్ల సురేష్ పాల్గొన్నారు. -
వివిధ కేసుల్లో పాత నేరస్తుల అరెస్ట్
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రంతులకు గురిచేస్తున్న రౌడీ షీటర్ ముద్దగుల నవీన్‌తో పాటు పాత నేరస్తుడు మంజుల విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం టూటౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. ఖమ్మంలోని ఎన్నెస్పీ కాలనీలో ఎస్సై రామారావు ఆధ్వర్యాన పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి వీరిద్దరు పారిపోయే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా ద్వారకనగర్ వాసులైన పాత నేరస్తులు నవీన్, విజయ్‌కుమార్‌గా తేలిందని తెలిపారు. పలు నేరాల్లో నిందితులు గత నెల 9న ఎన్నెస్పీ కాలనీలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని బెదిరించిన వీరిద్దరు రూ.30వేలు లాక్కుని పారిపోయారు. అలాగే, కవిరాజ్‌నగర్‌లో గత నెల 14న అర్ధరాత్రి బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కళ్లల్లో కారం చల్లి బ్యాగ్ లాక్కోవడానికి యత్నించగా సదరు వ్యక్తి ప్రతిఘటించడంతో పారిపోయారు. కాగా, నవీన్ ఖమ్మంలో కొన్నేళ్లుగా గొడవలు, సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, రెండు హత్యాయత్నం కేసులతో పాటు ఇతర కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడని సీఐ తెలిపారు. నవీన్‌పై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉందని పేర్కొన్నారు. మరో నిందితుడు విజయ్‌కుమార్‌పై 2021లో ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు నమోదు కాగా, వీరి నుంచి స్కూటీ స్వాధీనం చేసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. ముగ్గురు విద్యార్థినులకు ఫుడ్‌ఫాయిజన్ ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూని యర్ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు మంగళవారం ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు విద్యార్థినులకు వాంతులు, విరోచనాలు కావటంతో కళాశాల బాధ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కాగా, ఆదివారం బయటకు వెళ్లిన విద్యార్థినులు హోటల్లో తిన్న కారణంగా వాంతులు, విరోచనాలు అయినట్లు కళాశాల బాధ్యులు వెల్లడించారు. మహిళ మెడలో గొలుసు చోరీ ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఇందిరానగర్ జంక్షన్‌లోని వీఆర్కే సిల్క్ వెనక వీధిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగి నున్నా లత తన ద్విచక్ర వాహనంపై సోమవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా రాధాకృష్ణనగర్ రోడ్డు –1లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలో గొలుసు లాగారు. ఈక్రమాన గొలుసు తెగిపోగా సుమారు 3గ్రాముల మేర దుండగుల చేతికి చిక్కింది. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ట్రాక్‌పైకి వచ్చిన ట్రాక్టర్ సీజ్ చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం రైల్వేగేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌పైకి రావడంతో ముదిగొండ మండలం గంధసిరి వాసికి సంబంధించి ఇసుక ట్రాక్టర్‌ను మంగళవారం సీజ్ చేసినట్లు జీఆర్పీ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం చైన్నె నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ పందిళ్లపల్లి స్టేషన్ సమీపానికి వస్తుండగా రామకృష్ణాపురం గేట్‌పైకి ట్రాక్టర్ డ్రైవర్ చేరుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన లోకో పైలట్ వేగాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. ఈమేరకు లోకో పైలట్ ఫిర్యాదుతో ట్రాక్టర్‌ను సీజ్ చేసి యజమాని, డ్రైవర్‌కు నోటీసులు ఇచ్చినట్లు సీఐ తెలిపారు. -
దివ్యాంగులకు ఉచిత భోజనం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడమే కాక వారి ఆకలి తీర్చేలా ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పాలనలో తనకంటూ ప్రత్యేకతను చూపుతున్న ఆయన.. ప్రజా సమస్యల పరిష్కారంలో వినూత్న పంథా అనుసరిస్తున్నారు. ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణితోపాటు వివిధ పనుల కోసం జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు కలెక్టరేట్‌కు వస్తుంటారు. అయితే వీరు ఆకలితో వెళ్లొద్దనే భావనతో కలెక్టరేట్ క్యాంటీన్లో ఉచితంగా మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ పథకం ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.కడుపు నిండా తినేలా..: ఉచిత భోజనం అంటే అన్నం, ఒక కూర కాకుండా.. పూర్తి మెనూతో అమలయ్యేలా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్నం, ఆకుకూర పప్పు, రోటిపచ్చడి, రెండు కూరలు, సాంబార్ లేదా రసం, పెరుగుతో దివ్యాంగులకు భోజనాన్ని సమకూరుస్తారు. కలెక్టరేట్లోని కార్యాలయాలకు ఇందుకోసం కూపన్లు ఇస్తారు. ఆయా శాఖలకు 40% వైకల్యంతో ఉన్న దివ్యాంగులు వస్తే కూపన్లు అందజేయనున్నారు. ప్రతీరోజు జారీ చేసిన కూపన్ల వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి, ఒక్కో భోజనానికి రూ. 80 చొప్పున క్యాంటీన్ నిర్వాహకులకు నెలకోమారు చెల్లిస్తారు. దివ్యాంగులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నామనే విషయాన్ని కలెక్టరేట్లోని ప్రవేశ మార్గాల్లో బోర్డులు ఏర్పాటు చేయించనున్నారు.‘సదరం’నంబర్ ఆధారంగా..దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ నంబర్ ఆధారంగా కూపన్ జారీ చేస్తారు. ఈ కూపన్‌తో కలెక్టరేట్ క్యాంటీన్లో ఉచితంగా భోజనం చేయొచ్చు. ఇందుకోసం క్యాంటీన్ బాధ్యులకు రూ.80 చొప్పున చెల్లిస్తాం. దివ్యాంగుల నుంచి వచ్చిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. బుధవారం నుంచి ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. – ముజమ్మిల్‌ఖాన్, కలెక్టర్, ఖమ్మం -
శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రం ఆదాయం రూ.7.62 లక్షలు
కల్లూరు: మహాశివరాత్రి జాతర సందర్భంగా కల్లూరులోని శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రంలో భక్తులు సమర్పించిన కానుకలతో పాటు ఇతరత్రా రూపాల్లో రూ.7,62,597 ఆదాయం నమోదైందని ఆలయ మేనేజర్ ఎస్వీడీ.ప్రసాద్ తెలిపారు. హుండీల్లో కానుకలను సోమవారం లెక్కించగా రూ.1,81,470గా నమోదైందని వెల్లడించారు. అలాగే, వేలం పాటల ద్వారా రూ.2,93,300, దర్శనం, అభిషేకం టికెట్ల అమ్మకంతో రూ.1.30,727, జాయింట్ వీల్ నిర్వాహకుల నుంచి రూ.లక్ష, షాపుల అద్దె ద్వారా రూ.32,600, పార్కింగ్ నుంచి రూ.24,500 కలిపి మొత్తం రూ.7,62,597 ఆదాయం వచ్చిందని తెలిపారు. హుండీ లెక్కింపులో దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ ఇ.వెంకటేశ్వర్లు, అర్చకులు సురేష్‌శర్మ, ఆలయ చైర్మన్ మాడిశెట్టి వెంకటేష్‌తో పాటు అబ్బూరి యుగంధర్, పెద్దబోయిన శివకృష్ణ, పెద్దబోయిన నరసింహారావు, కిష్టంశెట్టి ఏడుకొండలు, కిష్టంశెట్టి నర్సింహారావు, సాయిని రవి, పెద్దబోయిన విజయ్‌కుమార్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. 13న పండితాపురం సంత వేలం పాట కామేపల్లి: రాష్ట్రంలోనే పేరున్న కామేపల్లి మండలంలోని కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధి శ్రీకృష్ణప్రసాద్ పశువుల సంత నిర్వహణకు ఈనెల 13న వేలం నిర్వహించనున్నట్లు గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ రవీందర్ తెలిపారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టే ఈ వేలం సంత ఆవరణలో జరుగుతుందని వెల్లడిచారు. జీపీ పరిధిలోని ఎస్టీలు మాత్రమే పాల్గొనేందుకు అర్హులని, ధరావత్ సొమ్ము రూ.30 లక్షలు, సాల్వెన్సీ కింద రూ.5లక్షలు చెల్లించి పాల్గొనాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఖమ్మం సహకారనగర్: 2024–డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకుని బోధన మెరుగుపర్చుకోవాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ సూచించారు. ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో ఎస్జీటీలకు ఇస్తున్న శిక్షణను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రతీ సబ్జెక్టులో కనీస అభ్యసన సామర్థ్యాలు పెరిగేలా బోధన జరగాలని, తద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మ కం పెరుగుతుందని చెప్పారు. తొలుత ఎన్నెస్సీ కాలనీలో ఎఫ్ఎల్ఎన్ తీరు, డైట్ కళాశాలలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. విద్యాశాఖ ఏఎంఓ రవికుమార్, డీఈఓ సోమశేఖరశర్మ, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1,345 ఫిర్యాదుల్లో 1,018 పరిష్కారం ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసాచారి ఖమ్మంవ్యవసాయం: ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి విద్యుత్ ఉద్యోగులు ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి సూచించారు. ప్రజావాణిలో అందుతున్న ఫిర్యాదులు, పరిష్కారంపై ఆయన వివరాలు వెల్లడించారు. గత ఏడాది జూన్ 17న ప్రతీ సోమవారం సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహిస్తూ బిల్లులు, మీటర్ల సమస్యలు, సరఫరాలో హెచ్చతగ్గులు తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 1,345 ఫిర్యాదులు అందగా, ఇందులో 1,018 సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు. కాగా, ఉద్యోగులు ఎప్పటికప్పుడు సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని, ఇందుకోసం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్ఈ సూచించారు. కలెక్టర్‌ను కలిసిన ఎస్ఈ ఖమ్మం ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన శ్రీని వాసాచారి సోమవారం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు మొక్క అందజేయగా, పలు అంశాలపై మాట్లాడారు. -
ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీపై ప్రచారం
ఖమ్మంమయూరిసెంటర్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచడమే కాకుండా ప్రభుత్వం 25 శాతం ఫీజు రాయితీ ఇస్తుందనే అంశంపై విస్తృత ప్రచారం చేయాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు. కేఎంసీ టౌన్‌ప్లానింగ్, సుడా అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ప్రణాళికాయుతంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టాలని, చెరువులు, కుంటలు, నదుల ఎఫ్టీఎల్ పరిధి, ప్రభుత్వ భూముల్లో లేని ప్లాట్ల దరఖాస్తులకు సత్వరమే ఫీజు చెల్లించేలా అనుమతులు జారీ చేయాలని తెలిపారు. ఇకపై రోజుకు 15 మంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేలా పర్యవేక్షిస్తూ, వారికి రెండు రోజుల్లో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో సుడా డీసీపీ రాజ్‌కుమార్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ వసుంధర, టీపీఎస్‌లు పాల్గొన్నారు. అనంతరం ఆస్తి పన్ను వసూళ్లపై కేఎంసీ రెవెన్యూ అధికారులతో సమీక్షించిన కమిషనర్ ఈనెల 31 లోపు వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. కాగా, కేఎంసీ గ్రీవెన్స్‌లో అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. -
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు..
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించి ప్రాధాన్యతాక్రమంలో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే(ప్రజావాణి)లో ఆయన పలువురి నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని, ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియచేయాలని సూచించారు. సత్తుపల్లి మండలం చెరుకుపల్లికి చెందిన తాటి రాములు సర్వే నంబర్ 113లో తన భూమిని గిరిజనేతరులు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. అలాగే, ఖమ్మం ప్రకాశ్‌నగర్‌కు చెందిన సీ.హెచ్.విజయ్‌కుమార్ తనకు వ్యాపార నిమిత్తం రుణం మంజూరు చేయించడమే కాక మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం ఇప్పించాలని, కల్లూరుకు చెందిన ఎన్.సుజాత దివ్యాంగుల కోటాలో ఇరిగేషన్ కార్యాలయంలో స్వీపర్ పోస్ట్ ఇప్పించాలని కోరారు. ఇలా పలువురు వివిధ సమస్యలపై విన్నవించగా పరిష్కారంపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. తొలుత ప్రజావాణి దరఖాస్తుల నమోదు సెక్షన్‌కు వెళ్లి వివరాలు ఆరా తీశారు. అలాగే, చేయూత పెన్షన్ సహాయక కేంద్రాన్ని కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈకార్యక్రమాల్లో డీఆర్వో ఏ.పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నాలుగేళ్లుగా తిరుగుతున్నా... ఖమ్మం దివ్యాంగుల కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నా కుమారుడు వినయ్‌కుమార్ అనారోగ్యం కారణంగా నేను ఏ పనికి వెళ్లలేకపోతున్నా. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నందున డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలి. ఈ విషయంలో నాలుగేళ్లుగా తిరుగుతున్నందున స్పందించాలి. – బత్తుల ధనలక్ష్మి, రమణగుట్ట, ఖమ్మంఎవరూ పట్టించుకోవడం లేదు.. నామవరం రెవెన్యూ పరిధిలో ఏడెకరాల భూమిని బంధువులు ఆక్రమించుకున్నారు. పదిహేనేళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తహసీల్, ఆర్డీఓ కార్యాలయాల్లోనే కాక కలెక్టరేట్లోనూ ఫిర్యాదు చేశా. ఽభూమి నా పేరిట లేక నా కుటుంబీకులు సైతం పట్టించుకోవడం లేదు. – చిలక సైదులు, నామవరం, చింతకాని మండలం గ్రీవెన్స్ డేలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్పంటలకు నీటి సరఫరాపై దృష్టి యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలకు నీరందించేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆమె యాసంగి పంటలకు నీటి సరఫరా, గురుకులాల్లో తనిఖీలు, ప్లాస్టిక్ నిషేధంపై సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రానున్న పది రోజులు అప్రమత్తంగా ఉంటూ చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూడాలని, ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకం ఎదురుకాకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ కలెక్టరేట్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలతో సీ్త్ర శక్తి టీ స్టాళ్లలో ప్లాస్టిక్ నిషేధించామని తెలిపారు. అలాగే, పంటలకు నీటి సరఫరా, విద్యుత్ అంతరాయాలు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈసమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ఈలు వాసంతి, ఎం.వెంకటేశ్వర్లు, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాసాచారి, డీఏఓ పుల్ల య్య, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ ప్లాంట్లు
నాలుగు గ్రామాల్లో ● రెండు జిల్లాల్లో రెండేసి గ్రామాల ఎంపిక ● మహిళా సంఘాల ద్వారా ఒక మెగావాట్ చొప్పున ప్లాంట్లు ● మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న శంకుస్థాపనఖమ్మంవ్యవసాయం: ప్రధాన మంత్రి కుసుమ్ పథకం కింద ఉమ్మడి జిల్లాలోని నాలుగు గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుండగా, వ్యక్తిగతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి సబ్సిడీలు అందిస్తోంది. అలాగే, బంజరు, బీడు భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశమిస్తున్నారు. ఇదే సమయాన మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారి ఆధ్వర్యాన ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో నాలుగు పైలట్ ప్రాజెక్టుగా మహిళా సంఘాల ఆధ్వర్యాన ఉమ్మడి జిల్లాలో నాలుగు ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈమేరకు ఖమ్మం జిల్లాలోని మధిర మండలం మడుపల్లి, కల్లూరు మండలం చిన్నకోరుకొండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి, మణుగూరు మండలం ఉడతనేనిగుంపు గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్లు ఏర్పాటుచేశారు. ఇందుకోసం నాలుగెకరాల చొప్పున భూమి, నిర్మాణానికి రూ.3.50 కోట్ల నిధులు అవసరమని గుర్తించారు. ఇప్పటికే స్థలాలు ఖరారైనందున నివేదికలను రెడ్కో సంస్థ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. 8న శంకుస్థాపన రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ఆధ్వర్యాన ఏర్పాటుచేసే సౌర విద్యుత్ ప్లాంట్లకు మహిళా దినోత్సవమైన ఈనెల 8న శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనుండగా, గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే అవకాశముంది. ఈ వారంలోనే శంకుస్థాపన మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఏర్పాట్లు చేశాం. ఉమ్మడి జిల్లాలో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నాలుగు ప్లాంట్లు తొలిదశలో ఏర్పాటుకానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాం. ఈ వారంలో శంకుస్థాపన జరిగే అవకాశముంది. – పోలిశెట్టి అజయ్‌కుమార్, రెడ్కో మేనేజర్ -
సర్వం సన్నద్ధం
ఖమ్మంసహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం మొదలుకానున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయగా ఎక్కడి నుంచైనా అధికారులు పర్యవేక్షించేందుకు వీలు కలగనుంది. అటు హైదరాబాద్, ఇటు జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసీ సీసీ కెమెరాల పుటేజీని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. పరీక్ష కేంద్రం సామర్థ్యం ఆధారంగా ఐదు నుంచి పది వరకు సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. గంట ముందు నుంచే అనుమతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లాలో 72కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 35 ప్రైవేట్ కళాశాలలు, ఒక ప్రైవేటు పాఠశాల, రెండు ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు 34 ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 36,660మంది పరీక్షలు రాయనున్నారు. కాగా, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17,783 మందిలో జనరల్ 15,579మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,204మంది ఉన్నారు. ఇక ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,877మందిలో 16,632మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,245మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా విద్యార్థులను 8గంటల నుంచే అనుమతిస్తామని తెలిపారు. పకడ్బందీగా జరిగేలా.. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైపవర్ కమిటీ(హెచ్సీపీ), జిల్లాఎగ్జామినేషన్ కమిటీ(డీఈసీ)లతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. పరీక్షల నిర్వహణకు నియమించిన 835మంది ఇన్విజిలేటర్లలో 300మంది అధ్యాపకులు, 535మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లాలో 36,600మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానుండగా 72 కేంద్రాలు ఏర్పాటుచేశాం. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. హాల్ టికెట్ నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించగా, దానిపై సెంటర్ చిరునామా తెలుసుకునేలా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఒకరోజు ముందుగానే కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకుని నిర్ణీత సమయానికి కంటే ముందుగానే చేరుకుని పరీక్ష ప్రశాంతంగా రాయాలి. – కె.రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కేంద్రాన్ని గుర్తించేలా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్సెంటర్ సులువుగా తెలిసేలా... విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు జారీ చేయగా ఇంకా అందని వారు నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు tgbie. cgg. gov. in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ తీసుకోవచ్చని అధికారులు సూచించారు. అంతేకాక సెంటర్ సులువుగా తెలిసేలా హాల్‌టికెట్‌పై సెంటర్ చిరునామాతో కూడా క్యూఆర్ కోడ్‌ను తొలిసారిగా ముద్రించారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సెంటర్ చిరునామా గూగుల్ మ్యాప్ వస్తుందని అధికారులు తెలిపారు.జిల్లాలో పరీక్షల వివరాలు... చీఫ్ సూపరింటెండెంట్లు 72మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 72మంది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 03సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 05పరీక్షా కేంద్రాలు 72విద్యార్థులు 36,660 -
ఆవిష్కరణలతోనే ముందడుగు
ఖమ్మం సహకారనగర్: కొత్త ఆవిష్కరణలతోనే సైన్స్ రంగంలో అభివృద్ధి సాధ్యమవుతుందని.. ఈవిషయంలో శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ అకాడమీ సైన్సెస్ అధ్యక్షుడు, సీసీఎండీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్.మోహన్‌రావు తెలిపారు. ఖమ్మంలోని కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన సైన్స్ డే సమావేశంలో ఆయన మాట్లాడారు. దైనందిన జీవితంలో సైన్స్‌కు ప్రాముఖ్యత పెరిగిందని.. ఎందరో శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలతో మానవాళికి మేలు చేశారని తెలిపారు. తెలంగాణ అకాడమీ సైన్సెస్ వరంగల్ జోన్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, ఎన్ఆర్ఆర్ మహబూబాబాద్ జిల్లా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వి.సాంబశివరావు మాట్లాడగా వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఎం.నిరంజన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వీ.రమణా రావు, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్.ఆంజనేయులు, ఐక్యూఎస్ కోఆర్డినేటర్ అజయ్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య ఎర్రుపాలెం: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన కోగంటి సాయిరాం(29) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై సాయిరాం తల్లి రమాదేవి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.వెంకటేశ్ తెలిపారు. -
ఇంకా జాడ లేని చారి..
● పరారీలోనే లింగ నిర్ధారణ పరీక్షల కేసులో ప్రధాన నిందితుడు ● రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలుచింతకాని: వాహనంలో తిరుగుతూ అనుమతి లేకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాలో కీలక నిందిడుతైన ఖమ్మం బల్లేపల్లికి చెందిన చారి జాడ ఇంకా తెలియరాలేదు. కారులో తిరుగుతూ గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా సభ్యులు ఇద్దరు చింతకాని మండలం కొదుమూరులో ఇటీవల పట్టుబడ్డారు. వీరి నుంచి వాహనం, స్కానింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకోగా కీలక నిందితుడైన చారి ఆచూకీ కోసం పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఆయన పట్టుబడితే ముఠాకు సహకరించిన వారెవరనే అంశంలో కీలక విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. ఇద్దరు ఆర్ఎంపీలు.. ఒక అసిస్టెంట్ బల్లేపల్లికి చెందిన చారి గతంలో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పీఆర్ఓగా పనిచేసి, ఆతర్వాత గ్రామీణ వైద్యుడిగా కొంతకాలం పనిచేశాడు. ఈక్రమంలోనే చింతకాని మండలం కొదుమూరుకు చెందిన ఆర్ఎం రాచబంటి మనోజ్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు రోగులను తీసుకెళ్లే క్రమాన అక్కడ స్కానింగ్ అసిస్టెంట్, ఖమ్మం అల్లీపురానికి చెందిన కాత్యాయిని పరిచయం కావడంతో ముగ్గురు త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో సెకండ్ హ్యాండ్ కారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఆపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలు గ్రామాలకు వెళ్లి మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి రూ.10వేల నుంచి రూ.15వేలు వసూలు చేసేవారు. గర్భంలో ఉన్నది ఆడా, మగా అని నిర్ధారించడంతో ఆడశిశువు వద్దనుకుంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భస్రావం చేయించి కమీషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే వీరి కదలికలపై నిఘా వేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత గురువారం మనోజ్ స్వగ్రామమైన కొదుమూరులో ముగ్గురికి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయాన మనోజ్, కాత్యాయినిని అదుపులోకి తీసుకోవడంతో స్కానింగ్ యంత్రం, కారును సీజ్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడైన చారి మాత్రం ఇప్పటివరకు పట్టుబడకపోగా, రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఎస్సై నాగుల్‌మీరాను వివరణ కోరగా పరారీలో ఉన్న చారి ఆచూకీని కనుగొనేందుకు రెండు బృందాలచే గాలింపు చేపడుతున్నామని తెలిపారు. ఆయన పట్టుబడితే పూర్తి వివరాలు బయటపడతాయని పేర్కొన్నారు. -
డబుల్ దందా..
పెరుగుతున్న నకిలీ డాక్యుమెంట్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు ● ధనార్జనే ధ్యేయంగా పలువురు రియల్టర్ల అడ్డదారులు ● రిజిస్ట్రేషన్ల శాఖలో వంత పాడుతున్న కొందరు అధికారులు ● ఫలితంగా భూయజమానుల్లో ఆందోళనజిల్లాలోని పలుచోట్ల ఇళ్ల స్థలాలు, విల్లాలు, ఇళ్ల డబుల్ రిజిస్ట్రేషన్ల దందా ఇటీవల పెరిగింది. కొందరు రియల్టర్లు అక్రమార్జనకు అలవాటు పడి ఈ బాట పడుతున్నారు. కొణిజర్ల మండలం ఇండోఖతార్లో డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగుచూడగా వైరా సబ్ రిజిస్ట్రార్‌తో పాటు తొమ్మిది మందిపై కేసు నమోదైంది. తాజాగా తప్పుడు డాక్యుమెంట్లు, డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ముగ్గురిపై ఆదివారం ఖానాపురం హవేలీ పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరు రియల్టర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుండగా, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పలువురు వీరి వలలో చిక్కుకుని కేసుల పాలవుతున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంకార్యాలయాల్లో ఎలా? స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కొందరు మాయగాళ్ల వలలో చిక్కుకుని భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. అన్ని పత్రాలను పరిశీలించాకే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెబుతున్నా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలతో సస్పెన్షన్‌కు గురవుతున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్లపై పూర్తి అవగాహన ఉన్నా ప్రలోభాలకు లొంగుతున్నారనే చర్చ జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్లో వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకేరోజు 64 ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగగా, విచారణ అనంతరం వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కొణిజర్లతోపాటు అమ్మపాలెం, లింగగూడెంలో డిసెంబర్ 28న గ్రీన్ ల్యాండ్ డెవలపర్స్ యజమానులు ఒకేరోజు 64 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించారు. వీటిలో గతంలోనే కొందరు కొనుగోలు చేసిన 80, 108, 134, 135 నంబర్ విల్లాలను సైతం ఈ సమయాన ఇతర పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుతో విచారణ చేపట్టగా అక్రమంగా జరిగాయని నిర్ధారించారు. దీంతో వైరా సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు, తొమ్మిది మందిపై కేసు నమోదైంది. డబుల్ మాయ రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయానికి ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయా, లేదా అని పరిశీలిస్తున్నారు. అయితే, గతంలో ఆ భూమికి రిజిస్ట్రేషన్ జరిగిందా అన్న అంశాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న కేటుగాళ్లకు ఒకే భూమిని రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేయించడం సులువవుతోంది. వివాదాస్పద భూములకు ఇలా రెండేసి రిజిస్ట్రేషన్లు చేయిస్తుండడం.. ఇటీవల ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండడంతో భూయజమానులు కలవరానికి గురవుతున్నారు. ఇదే వ్యాపారంగా.. జిల్లాలో కొందరు డబుల్ రిజిస్ట్రేషన్లతోపాటు తప్పుడు డాక్యుమెంట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. భూములు లేకపోయినా తప్పుడు, డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేయడం పరిపాటిగా మారింది. భూముల క్రయవిక్రయాలు తగ్గిన నేపథ్యాన రియల్టర్లు అక్రమార్జనకు అలవాటు పడ్డారనే ప్రచారం జరుగుతోంది. ఖరీదైన భూములకు డాక్యుమెంట్లు సృష్టించి, వీటి ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్లు సమాచారం. అంతేకాక డాక్యుమెంట్ల ఆధారంగా రుణాలు ఇప్పిస్తూ కమీషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇలాగే వ్యవహరించిన మధురానగర్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు షేక్ బడేసాహెబ్, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన కొత్తపల్లి వెంకటేశ్వర్లు, తిప్పర్తి అశోక్‌కుమార్‌పై ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుకాగా.. పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. నాలుగు సార్లు రిజిస్ట్రేషన్ ఖమ్మం నగర అభివృద్ధితో శివారులోని మధురానగర్‌లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అయితే ఇక్కడ భూమి లేకున్నా ఒకే సర్వే నంబర్‌పై నాలుగు సార్లు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. తప్పుడు డాక్యుమెంట్లతో ఈ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో అక్రమార్కుల బండారం బయటపడింది. అయితే, ఈ విషయాన్ని రిజిస్ట్రేషన్ సమయాన అధికారులు ఎందుకు గుర్తించలేకపోతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ తెలిసినా అధికారులు అక్రమార్కులకు వంత పాడుతున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తుండడంతో త్వరలోనే సూత్రధారులెవరో తేలే అవకాశముంది. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్‌రెడ్డి
● రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం ● సిట్టింగ్ ఎమ్మెల్సీపై 5,521 ఓట్ల మెజారిటీ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఖమ్మం – వరంగల్ – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. అయితే నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేకపోవడంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. దీంతో శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించగా గెలుపు ఖరారైంది. ఉదయం 7గంటల నుంచి కౌంటింగ్.. ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7గంటలకు ప్రక్రియ మొదలుకాగా, ఉదయం 11 గంటల వరకు బండిల్స్ కట్టాక లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 24,135 ఓట్లు పోల్ కాగా 494 ఓట్లు చెల్లలేదు. ఇక 23,641 ఓట్లు చెల్లుబాటు కాగా, ఇందులో సగానికి మించి ఒక్క ఓటు కలిపి 11,821గా గెలుపు కోటా ఓటును నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డి అత్యధికంగా 6,035 ఓట్లు రావడం, గెలుపు కోటాకు సరిపోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు. చివరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. కాగా, లెక్కింపులో ఒక్కో రౌండ్ పూర్తవుతుండగా ఉత్కంఠ నెలకొంది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా.. ద్వితీయ స్థానంలో ఉన్న నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తర్వాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. అయినా కోటా రాకపోయినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా.. మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ బలపర్చిన అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటి వరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థుల నుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కింపు చేపట్టారు. ఈమేరకు 15వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి ఒక్కసారే 781 ఓట్లు పెరిగి 6,916కి చేరాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. మిగతా వారికి కూడా ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగింది. ఇక 16వ రౌండ్లో పులి సరోత్తంరెడ్డి, 17వ రౌండ్లో పూల రవీందర్, 18వ రౌండ్లో హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేట్ చేశారు. అప్పటికి శ్రీపాల్‌రెడ్డి ఓట్లు 11,099కు, నర్సిరెడ్డి ఓట్లు 8,448కు చేరాయి. దీంతో నర్సిరెడ్డిని సైతం ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్డ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈమేరకు 2,870 ఓట్లు కలిపి శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించడంతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు.పీఆర్టీయూ నేతల సంబురాలు.. ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించగా సోమవారం రాత్రి ఖమ్మంలోని పీఆర్టీయూ కార్యాలయంలో నాయకులు సంబురాలు జరుపుకున్నారు. నాయకులు కట్టా శేఖర్‌రావు, కూరాకుల సైదయ్య, గుత్తా శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, రాయల నర్సింహరావు, పుసులూరి శ్రీనివాసరావు, షఫీ, వెంకన్న, వీరయ్య చౌదరి, నరేందర్, తాళ్లూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్‌పైకి ట్రాక్టర్.. ‘దురంతో’కు తప్పిన ముప్పు
చింతకాని: చైన్నె నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్ అప్రమత్తతతో ముప్పు తప్పింది. రైలు సోమవారం మధ్యాహ్నం విజయవాడ దాటాక ఖమ్మం మార్గంలో వెళ్తుండగా చింతకాని మండలం రామకృష్ణాపురం రైల్వే గేట్ వద్ద ట్రాక్‌పైకి ట్రాక్టర్ వచ్చింది. ఈ మార్గంలో మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతుండగా గేట్ వేయలేదు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ వచ్చినట్లు తెలుస్తుండగా, గమనించిన లోకో పైలట్ బ్రేకులు వేసి వేగాన్ని నియంత్రించాడు. ఈమేరకు గేటు వద్దకు రైలు వచ్చేసరికి ట్రాక్‌పై ఉన్న ట్రాక్టర్ ముందుకు వెళ్లిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై లోకో పైలట్ ఖమ్మం జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన దర్యాప్తు చేపట్టారు. -
హీటర్ ఆన్ చేస్తుండగా షాక్‌తో వ్యక్తి మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని వెంకటగిరి పరిధి ఇందిరమ్మ కాలనీ ఫేజ్–2కు చెందిన బండారి వెంకటేశ్వర్లు(54) విద్యుదాఘాతంతో సోమవారం మృతి చెందాడు. ఆయన ఉదయం ఇంట్లో వాటర్ హీటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కన్నుమూశాడు. ఆ సమయాన ఇంట్లో ఎవరూ లేకపోగా, ఖమ్మం వెళ్లిన వారు వచ్చేసరికి కిచెన్ రూంలో విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకటేశ్వర్లు కుమారుడు వినయ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. గుండెపోటుతో జమలాపురం ఆలయ అర్చకుడు... ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ అర్చకులు ఉప్పల సుదర్శన్శాస్త్రి(59) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. నిత్యపూజల్లో కీలకంగా వ్యవహరించే ఆయన మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. ఈమేరకు సుదర్శన్శాస్త్రి మృతదేహం వద్ద ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఆలయ చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సీనియర్ అసిస్టెంట్ విజయకుమారి తదితరులు నివాళులర్పించారు. రోడ్డు ప్రమాదంలో కూలీ... పెనుబల్లి: మండలంలోని ఎడ్ల బంజర్‌లో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రోజువారీ కూలీ ఇమ్మడి భాస్కర్(55) మృతి చెందాడు. రహదారిపై నడిచి వెళ్తున్న ఆయన రోడ్డు దాటుతుండగా కొత్తగూడెం నుండి వీఎం బంజర వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన భాస్కర్‌ను స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనాస్థలికి వీఎం బంజర పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి సత్తుపల్లిటౌన్: ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన బేతిని సత్యం(55) ఈనెల 1వ తేదీన తన ఇంటి ఆవరణలోని చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. దీంతో ఆయన వెన్నుపూస, చేతికి బలమైన గాయాలయ్యాయి. ఈమేరకు స్థానికంగా చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. -
మిర్చిబోర్డు ఏర్పాటు చేయాల్సిందే..
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రంలోనే అత్యధికంగా మిర్చి క్రయవిక్రయాలు జరిగే ఖమ్మంలో మిర్చిబోర్డు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.25వేల చొప్పున ధర చెల్లించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. పెట్టుబడులు పెరిగి, తెగుళ్లతో దిగుబడి తగ్గి రైతులు ఆందోళన చెందుతుండగా, వ్యాపారులు ధరలు తగ్గిస్తుండడంతో మరింత నష్టం ఎదురవుతోందని చెప్పారు. ఈమేరకు సోమవారం సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ పార్టీలు, అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించగా నాయకులు మాట్లాడారు. గతేడాది క్వింటాకు రూ.20వేల ధర పలకగా, ఇప్పుడు రూ.12 వేల నుంచి రూ.13వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో అత్యధికంగా మిర్చి సాగవుతుండడమే కాక క్రయవిక్రయాలు ఇక్కడే ఎక్కువగా జరుగుతున్నందున మిర్చిబోర్డు ఏర్పాటుచేసి, ప్రభుత్వ సంస్థల ద్వారా క్వింటా రూ.25వేల చొప్పున కొనుగోలు చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, బానోత్ చంద్రావతి, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్‌రావు, దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, అడపా రామకోటయ్య, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, ఆవుల వెంకటేశ్వర్లు, పగడాల నాగరాజు, పుచ్చకాయల సుధాకర్, బాగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ధర్నా అనంతరం నాయకులు కలెక్టర్‌ను కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని ఐదుగురిని మాత్రం అనుమతించారు.అఖిలపక్షం ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట ఆందోళన -
ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో రజతం
ఖమ్మం స్పోర్ట్స్: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఉషూ టోర్నీలో ఖమ్మంకు చెందిన పి.పవిత్రాచారి రజత పతకం గెలుచుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీయూలో చదువుతున్న ఆమె చండీఘర్ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఉషూ పోటీల్లో నాన్‌దావో ఈవెంట్లో ఫైనల్స్‌కు చేరింది. ఆతర్వాత హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో పవిత్రాచారికి ద్వితీయస్థానం దక్కించుకుంది. తెలంగాణ నుంచి పతకం దక్కించుకున్న క్రీడాకారిణి ఒక్కరే కావడం విశేషం. ఈసందర్భంగా ఆమెను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీవైఎస్ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి సోమవారం అభినందించారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించాలి.. కొణిజర్ల: విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రఽతిభను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని జీవశాస్త్ర విభాగం రాష్ట్ర రిసోర్స్ పర్సన్ పెసర ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడంలో భాగంగా బయాలజీ ఉపాధ్యాయులకు సోమవారం కొణిజర్ల సమీపంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓరి యంటేషన్ నిర్వహించారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పా ఠశాలల బయాలజీ ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ సమావేశంలో ఖమ్మం, వైరా సహాయ సంక్షేమ అధికారులు సత్యవతి, జహీరుద్దీన్‌తో కలిసి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి శ్రద్ధ కనబరిస్తే అందరి తో పాటే మంచి మార్కులు సాధించే అవకాశముంటుందని తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో న్యాయమూర్తి కూసుమంచి: మధిర అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి టి.కార్తీక్‌రెడ్డి సోమవారం కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. శిక్షణలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఆయన ‘పంచాయతీరాజ్ శాఖ, సాధారణ పరిపాలన’ అంశంపై ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డితో చర్చించారు. కాగా, మంగళ, బుధవారాల్లో ఆయన ఖమ్మం రూరల్ తహసీల్‌తో పాటు ఖమ్మం ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలను సందర్శించనున్నారు. 9న రవన్న వర్ధంతి సభ ఖమ్మంమయూరిసెంటర్: ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయనే నినాదంతో, మైదాన ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి కృషి చేసిన రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తెలిపారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 9న రవన్న తొమ్మిదో వర్ధంతి సభ నిర్వహిస్తున్నామని, రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సభలో రవన్న సాగించిన ఉద్యమాలపై సెమినార్ ఉంటుందన్నారు. ఈమేరకు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రవన్న మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుర్రం అచ్చయ్య, కార్యదర్శి పుసులూరి నరేందర్ మాట్లాడగా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, సీ.వై.పుల్లయ్య, ఆవుల అశోక్, ఏ.వెంకన్న, బందెల వెంకయ్య, మలీదు నాగేశ్వరరావు టి.ఝాన్సీ, కె.శ్రీనివాస్, ఎన్ ఆజాద్ పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో.. ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యాన ప్రతిఘటన పోరాట యోధుడు రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) వర్ధంతిని ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు, గౌని ఐలయ్య తెలిపారు. ఖమ్మంలో సోమవారం వారు మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజన ప్రజానీకం సమస్యలపై పోరాడిన వ్యక్తి రవన్న అని పేర్కొన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే ఆయన వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరారు. పార్టీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, నాయకులు బండారి ఐలయ్య, అరుణోదయ నాగన్న, డేవిడ్ కుమార్ పాల్గొన్నారు. రూ.2.48 కోట్లకు ఐపీ ఖమ్మం లీగల్: ఖమ్మంకు చెందిన కొదుమూరు శ్రీనివాసరావు రూ. 2,48,80,000కు సీనియర్ సివిల్‌జడ్జి కోర్టులో సోమవారం దివాళా పిటిషన్(ఐపీ) దాఖలు చేశాడు. బియ్యం వ్యాపారం చేసిన ఆయన పలువురి వద్ద అప్పులు చేశాడు. ప్రస్తుతం అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ 64మందిని ప్రతివాదులుగా చేరుస్తూ న్యాయవాదులు కోనా చంద్రశేఖర్‌గుప్తా, పి.శరణ్య, పి.సాయికిరణ్ ద్వారా కోర్టులో దివాళా పిటీషన్ దాఖలు చేశాడు. -
సాగర్ ఆయకట్టుకు ‘సీతారామ’ నీరు
ప్రాజెక్టుతో రెండు జిల్లాలు సస్యశ్యామలం ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఅశ్వాపురం/ములకలపల్లి: నాగార్జునసాగర్ ఆయకట్టులో పంటలు ఎండిపోకుండా గోదావరిలో ఉన్న కొద్దిపాటి జలాలను సీతారామ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టతో పాటు బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ ఫేస్ –1 పంప్‌హౌస్, ములకలపల్లి మండలంలోని వీ.కే.రామవరం, కమలాపురంలోని పంప్‌హౌస్‌లను సోమవారం మంత్రి పరిశీలించి మాట్లాడారు. గోదావరిలో ఉన్న కొద్దిపాటి జలాలను సాగర్ ఆయకట్టు పరిరక్షణకు కేటాయిస్తున్నామని చెప్పారు. అశ్వాపురం, ములకలపల్లి మండలాల్లోని పంప్‌హౌస్‌ల ద్వారా 100 కి.మీ. మేర గోదావరి జలాలు ప్రవహించి రాజీవ్ కెనాల్ నుంచి సాగర్ కెనాల్‌కు మంగళవారం సాయంత్రానికి చేరతాయని తెలిపారు. తద్వారా సాగర్ చివరి ఆయకట్టు ఎంబీసీ మధిర బ్రాంచ్ కెనాల్, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు మండలాల చివరి ఆయకట్టుకు సాగర్ జలాలు పూర్తి స్థాయిలో అందుతాయన్నారు. ఈకార్యక్రమాల్లో పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నీటి పారుదల ఎస్ఈలు శ్రీనివాసరెడ్డి, రవికుమార్, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, ఏఈ రమేష్‌తో పాటు నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, తుక్కాని మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దిగువకు గోదావరి జలాలు ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్‌హౌస్– 3 నుంచి గోదావరి జలాలు దిగువకు తరలాయి. ఇక్కడ మోటార్ ద్వారా నీటిని ఎత్తిపోయగా, గ్రావిటీ ద్వారా ఏన్కూరు లింక్ కెనాల్‌కు వెళ్లాయి. సోమవారం రాత్రి 8గంటల సమయాన నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. మంగళవారం సాయంత్రంలోగా గోదావరి జలాలను సాగర్ కాల్వలో కలుపుతామని మంత్రి తుమ్మల ప్రకటించిన నేపథ్యాన అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. -
మార్కెట్‌కు లక్ష బస్తాల మిర్చి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు సోమవారం భారీగా మిర్చి తీసుకొచ్చారు. మహాశివరాత్రి, అమావాస్య, వారాంతపు సెలవుల అనంతరం మార్కెట్లో క్రయవిక్రయాలు మొదలుకాగా దాదాపు లక్ష బస్తాల మిర్చి విక్రయానికి వచ్చింది. ఉమ్మడి జిల్లాతో పాటు వరంగల్, నల్ల గొండ, కరీంనగర్, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా రైతులు మిర్చి తీసుకొచ్చారు. గతనెల 24 సోమవారం 1.20 లక్షల మిర్చి బస్తాల రాగా, సోమవారం కూడా లక్ష బస్తాల మేర తీసుకురావడంతో మార్కెట్లోని యార్డులు, షెడ్లు నిండిపోయాయి. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
సత్తుపల్లిరూరల్: సింగరేణి గనుల నుంచి బొగ్గు తరలింపునకు సత్తుపల్లి మండలంలో ఏర్పాటుచేసిన సైలోబంకర్ ద్వారా వెలువడే కాలుష్యంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు చలమల విఠల్ అన్నారు. సైలో బంకర్‌ను తొలగించాలని కిష్టారం అంబేద్కర్‌నగర్, బీసీ కాలనీ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 22వ రోజుకు చేరగా వారు మాట్లాడారు. బంకర్ తొలగించే వరకు దీక్షలు ఆపొద్దని, బాదితులకు తాము అండగా నిలుస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే, ఎంపీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాజిరి శ్రీనివాస్, గుడిమెట్ల బాబు తదితరులు పాల్గొన్నారు. నేడు 600 మందితో పాదయాత్ర సైలోబంకర్ను తొలగించాలనే డిమాండ్‌తో 22వ రోజులుగా దీక్షలు చేపడుతున్నా యాజమాన్యం స్పందించకపోవడంతో బాధితులు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మంగళవారం 600 మంది కిష్టారం నుంచి సత్తుపల్లి వరకు కాలినడకన వెళ్లి అక్కడ తహసీల్‌లో వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. సైలో బంకర్ బాధితుల దీక్షలో నాయకులు -
కాపర్ వైర్ చోరీ
వేంసూరు: మండలంలోని చౌడవరంలో ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసిన దుండగులు రూ.8వేల విలువైన కాపర్ వైరు ఎత్తుకెళ్లారు. గ్రామంలోని అల్లు లక్ష్మీ నరసింహరెడ్డి ఆయిల్‌పామ్ తోటలో ఈ ఘటన జరిగింది. ఈమేరకు విద్యుత్ శాఖ ఏఈ అంకురావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వరిగడ్డి వామి దగ్ధం ముదిగొండ: మండలంలోని సువర్ణాపురంలో మాజీ జెడ్పీటీసీ పసుపులేటి దేవేంద్రంకు చెందిన వరిగడ్డి వామికి సోమవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పేశారు. అయితే, అప్పటికే రూ.70వేల విలువైన 500 దిండ్లు కాలిపోయాయని దేవేంద్రం వాపోయారు. -
శరవేగంగా గ్రీన్‌ఫీల్డ్ హైవే
దేవరపల్లి: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మీస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో ఈ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎక్కడా గ్రామాలను తాకకుండా పచ్చని పంట పొలాల మధ్య నుంచి దీనిని నిర్మీస్తున్నారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు రవాణా సదుపాయం మెరుగుపడడంతో పాటు సమయం, దూరం ఆదా అవుతాయి. 162 కిలోమీటర్ల పొడవు... రూ.2,200 కోట్ల వ్యయం తెలంగాణలోని ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకూ రూ.2,200 కోట్లతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సుమారు 162 కిలోమీటర్ల పొడవున ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మీస్తోంది. ఇది పూర్తయితే దేవరపల్లి – ఖమ్మం మధ్య సుమారు 70 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. దీని నిర్మాణానికి 2022 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ హైవే నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా అధిక వర్షాలు, తుపానుల కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. ఆంధ్రాలో హైవే సాగుతుందిలా.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి సమీపంలోని రేచర్ల నుంచి ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి టి.నర్సాపురం, వేపుగుంట, గుర్వాయగూడెం, బొర్రంపాలెం, జంగారెడ్డిగూడెం వద్ద మద్ది ఆంజనేయస్వామి ఆలయం సమీపాన ఎర్రకాలువ మీదుగా కొయ్యలగూడెం మండలం రాజవరం, యర్రంపేట, దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం,గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల మీదుగా దేవరపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిని కలుస్తుంది. జంగారెడ్డిగూడెం వద్ద పుట్లగట్లగూడెం–గుర్వాయగూడెం వద్ద జంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి 83 ఎకరాలు సేకరించారు. ఖమ్మం–దేవరపల్లి మధ్య 8 టోల్‌ప్లాజాలు, 51 మైనర్, 9 మేజర్ బ్రిడ్జిలు నిర్మీస్తున్నారు. ఉమ్మడి ‘పశ్చిమ’లో 72 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను హైదరాబాద్‌కు చెందిన డెకెం సంస్థ చేపట్టింది. తెలంగాణలో ఖమ్మం నుంచి రేచర్ల వరకూ ఒకే ప్యాకేజీగా పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 72 కిలోమీటర్ల పొడవును మూడు ప్యాకేజీల్లో ఈ పనులు జరుగుతున్నాయి. సేకరించిన భూములకు రైతులందరికీ పరిహారం అందించారు. భూసేకరణకు అడ్డంకులు గ్రీన్‌ఫీల్డ్ హైవేకి అవసరమైన భూసేకరణకు కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వద్ద బ్రేక్ పడింది. ఆ గ్రామానికి చెందిన రైతు కోర్టుకు వెళ్లడంతో మూడెకరాల భూసేకరణ నిలిచిపోయింది. న్యాయస్థానం తీర్పు రిజర్వులో పెట్టి దాదాపు ఏడాది కావస్తోంది. తీర్పు కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.రూ.2 కోట్లకు ఎకరం ధరఇప్పటికే రెండు హైవేలు ఉండటం, మరో హైవే వస్తుండటంతో దేవరపల్లి ప్రాంతంలో ఇప్పటికే భూముల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. ఎకరం రూ.2 కోట్లు పైగా పలుకుతోంది. మూడు జాతీయ రహదారులు అందుబాటులోకి రావడంతో మెట్ట ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. పంట ఉత్పత్తులను దూర ప్రాంతాల్లోని మార్కెట్లకు రవాణా చేయడం ద్వారా రైతులు గిట్టుబాటు ధర పొందే అవకాశం కలుగుతుంది.ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి రైతులు హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా నిమ్మ, అరటి, కోకో, జీడిగింజల వంటి పంట ఉత్పత్తులు వస్తుంటాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీని నిర్మాణ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకూ సాధారణ జంక్షన్‌గా ఉన్న దేవరపల్లి ఇప్పుడు మూడు జాతీయ రహదారుల జంక్షన్‌గా కొత్త రూపు సంతరించుకుంటోంది. కోల్‌కతా– చెన్నై 16వ నంబర్ జాతీయ రహదారి దేవరపల్లి మీదుగానే సాగుతోంది. అలాగే, దేవరపల్లి – ఖమ్మం జిల్లా తల్లాడ మధ్య ఇప్పటికే 316డి హైవే ఉంది.ఇప్పుడు కొత్తగా దేవరపల్లి – ఖమ్మం మధ్య కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మీస్తున్నారు. ఇది 16వ నంబర్ జాతీయ రహదారిని దేవరపల్లి వద్ద గోపాలపురం రోడ్డులోని డైమండ్ జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో మూడు హైవేలు కలుస్తూండటంతో వాటిని విభజిస్తూ నూతన టెక్నాలజీతో అవుటర్ రింగ్ రోడ్డు (డ్రమ్‌ఫుట్) నిర్మీస్తున్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి ప్రభుత్వం సుమారు 1,100 ఎకరాలు సేకరించింది. 85 శాతం పూర్తి ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ రేచర్ల నుంచి గుర్వాయగూడెం వరకూ 85 శాతం, అక్కడి నుంచి దేవరపల్లి వరకూ 65 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెనలు, కల్వర్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. దేవరపల్లి వద్ద డ్రమ్‌ఫుట్ నిర్మాణం జరుగుతోంది. మొత్తంగా 85 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే జూన్ నాటికి ఈ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. – సురేంద్రనాథ్, పీడీ, నేషనల్ హైవేస్, రాజమహేంద్రవరం -
సమాజ సేవలో ముందుండాలి
ఖమ్మంమయూరిసెంటర్ : సమాజ సేవలో కమ్మ మహాజన సంఘం సభ్యులు ముందుండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సంఘం నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం ఖమ్మంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. జాతి ఔన్నత్యాన్ని పెంపొదించేలా కమిటీ నడవడిక ఉండాలన్నారు. పెద్దలు చూపిన మార్గంలో పయనించాలని సూచించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గొట్టిపాటి సత్యవాణి మాట్లాడుతూ కమ్మవారు అనేక రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. సంఘన్ని రాజకీయ చట్రంలో బిగించకుండా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఐక్యంగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లు రఘు, చావా రాము, ఉపాధ్యక్షులు కర్ణాటి రమాదేవి, జాయింట్ సెక్రటరీ వజ్జా శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్లూరి నిర్మల, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, కోలేటి నవీన్, మేదరమెట్ల స్వరూపారాణి, నల్లమల ఆనంద్, నంబూరి సత్యనారాయణ ప్రసాద్, పోతినేని భూమేశ్వర్, తుమ్మలపల్లి నాగేశ్వరావు, తాళ్లూరి మురళీకృష్ణ, బండి రవికుమార్ పాల్గొన్నారు. కమ్మ మహాజన సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారంలో మంత్రి తుమ్మల -
కోడిపందేల స్ధావరంపై దాడి
సత్తుపల్లి టౌన్ : సత్తుపల్లి మండలం రామానగరంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. రెండు కోడి పుంజులు, ఏడు ద్విచక్ర వాహనాలు, రూ.1,640 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐఈడీ నిర్వీర్యం దుమ్ముగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధి దుంపమార్క గ్రామం అటవీప్రాంతంలో మా వోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును భద్రతా బలగాలు ఆదివారం గుర్తించాయి. రైగుట్టహిల్ అడవుల్లో బలగాలు కూంబింగ్ చేపడుతున్న క్రమంలో ఐదు కేజీల ఐఈడీ బాంబును గుర్తించి నిర్వీర్యం చేశాయి. -
రెచ్చిపోతున్న గంజాయి స్మగ్లర్లు
భద్రాచలం: భద్రాచలంలో రోజురోజుకూ గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు వాహనంతో డాష్ ఇచ్చి పరారైన సంఘటన ఆదివారం జరిగింది. భద్రాచలం చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిరంతరం గస్తీ, చెకింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్ల వారుజామున మూడు గంటలకు ఓ ద్విచక్రవాహనంపై అతివేగంతో ఇద్దరు యువకులు వెళ్తున్నారు. గమనించిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగానందాచారి వారిని ఆపేందుకు ప్రయత్నించారు. వారు ఆపకుండా కానిస్టేబుల్‌ను ఢీకొట్టి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది కానిస్టేబుల్‌ను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చేయి విరిగినట్లుగా వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్సకు ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. కాగా పది రోజుల క్రితం ఇదే చెక్‌పోస్టు వద్ద ఇదే తరహాలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ఓ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టి పరారైన విషయం విదితమే. -
రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి
ఇద్దరికి గాయాలు దుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీ నగరం గ్రామంలోని శ్రీ దాసాంజనేయ ఆలయ పూజారి ఆరుట్ల రాజగోపాలాచార్యులు (50)మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎటపాక మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మర్మం ఏడుకొండలు బైక్‌పై తన భార్యతో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో లక్ష్మీనగరం శివారులో రోడ్డు దాటుతున్న అర్చకుడిని బైక్‌తో ఢీ కొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలు కాగా, 108 ద్వారా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి పూజారి మృతి చెందాడు. ఏడు కొండలు పరిస్థితి విషమంగా ఉండగా, అతని భార్య ఒక కన్ను కోల్పోయింది. వీరు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ అశోక్ సందర్శించి వివరాలు సేకరించారు. -
కరుణించని దేవాదాయశాఖ
అమ్మవారి కటాక్షం ఉన్నా.. ● పెద్దమ్మతల్లి ఆలయం వద్ద కొరవడిన సౌకర్యాలు ● రోజూ వేలాది మంది వస్తున్నా బాత్రూంలు పదే.. ● ప్రతిపాదించి రెండేళ్లయినా అమలుకు నోచుకుని మాస్టర్‌ప్లాన్ ● ఆదాయం ఉన్నా భక్తులకు వసతులు కల్పించని ఎండోమెంట్ శాఖపాల్వంచరూరల్: కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మతల్లి ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. పాల్వంచ మండలం కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైఉన్న శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) గుడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. రోజూ వేలాది మంది అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. గురు, ఆదివారాల్లో రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. పరిసర గ్రామాల, పట్టణాల ప్రజలు ఏ పనులు ప్రారంభించాలన్నా తొలుత అమ్మవారిని దర్శించుకుంటారు. జిల్లాలో భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయం తర్వాత దేవాదాయ శాఖకు ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది. టికెట్లు, కొబ్బరిచిప్పలు, అద్దెలు, తలనీలాలు, హుండీ ద్వారా ఏటా రూ.3.5 కోట్ల ఆదాయం వస్తున్నట్లు ఎండోమెంట్ అఽధికార లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల ఆలయ ప్రాంగణంలో నూతనంగా శివాలయం కూడా నిర్మించారు. దీంతో భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయ ప్రాంగణంలో మౌలిక సౌకర్యాలు లేవు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కట్లు తప్పడంలేదు. తాగునీరు కూడా లేదు.. ఆదాయం మెండుగా, భక్తుల రద్దీ అధికంగా ఉన్నా దేవాదాయ శాఖ, పాలకవర్గం వసతి సౌకర్యాలు కల్పించడంలేదు. ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు స్నానాలు చేసేందుకు గతంలో నిర్మించిన ఆరు బాత్ రూమ్‌లను కూల్చివేశారు. గుడికి ఎదురుగా ప్రధాన రహదారి దాటి వెళ్తే మరికొన్ని బాత్రూమ్లు ఉన్నాయి. అవి భక్తుల సంఖ్యకు తగినన్ని లేకపోవడంతోపాటు నిర్వహణ అధ్వానంగా మారింది. దీంతో స్నానాలగదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. అమ్మవారి దర్శనం కోసం ఒకే క్యూలైన్ ఉండగా, ఇబ్బంది తప్పడంలేదు. గతంలో ఆలయం ఎదురుగా ఉన్న చెట్ల కింద నైవేద్యం వండుకుని అమ్మవారికి సమర్పించేవారు. ఆ చెట్లు కూడా తొలగించడంతో నీడ కరువైంది. అక్కడ కొత్త భనవం నిర్మించడంతో వంటలు వండుకునే పరిస్థితి లేకుండాపోయింది. పాలకవర్గం లేక ఏడాది ఏడాది కాలంగా ఆలయానికి పాలకవర్గం లేదు. నూతన పాలకవర్గ నియామకంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. నోటిఫికేషన్ జారీ చేసినా నియామక ప్రక్రియ మాత్రం ముందుకు సాగడంలేదు. దీంతో ఈఓ పర్యవేక్షణలో ఆలయంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో గత ఈఓ శ్రీనివాసరావు ఆలయాన్ని లోపలకు జరిపి పునర్నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటివరకు మోక్షం లేదు. ఆలయ అభివృద్ధిపై, సౌకర్యాల కల్పనపై దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులు ఏం కోరుతున్నారంటే.. ఆలయంలో తాగునీటి సమస్య పరిష్కరించాలి. ప్రస్తుతం ఒకే క్యూలైన్ ఉన్నందున, అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేయాలి. భక్తుల సంఖ్య తగినట్లు మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలి. పాల్వంచ, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ సర్వీసులు నడిపించాలి. అన్ని డిపోల, అన్ని రకాల సర్వీసులు ఆలయం వద్ద నిలిపేలా చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక సత్రాలు, గదులు నిర్మించాలి. పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. భద్రాచలంలో మాదిరిగా నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలి. -
పురుగుమందు తాగి..
ఖమ్మంరూరల్: మండలంలోని ముత్తగూడెం గ్రామానికి చెందిన బండారి నాగరాజు(40) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు కొంతకాలంగా కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం కనిపించలేదు. దీంతో మనో వేదనకు గురైన నాగరాజు శనివారం చేనుకు వెళ్లి అక్కడే గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఉపేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. కుటుంబ కలహాలతో ఆర్ఎంపీ.. పెనుబల్లి: మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు పద్దం నర్సింహారావు(31) కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంలో కొంతకాలంగా కలహాలు తీవ్రం కావడంతో నర్సింహారావు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శనివారం రామచంద్ర బంజర గ్రామ శివారు నాయకుల గూడెం రోడ్డు వద్ద గడ్డిమందు తాగి పడుకున్నాడు. అటుగా వెళ్లేవారు చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. నర్సింహారావు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నలుగురిపై కేసు నమోదు
చింతకాని : గతనెల 28న ఓ మద్యం దుకాణం ఎదుట జరిగిన ఘర్షణ విషయంలో మండల పరిధిలోని నాగులవంచకు చెందిన తిరపయ్య, శ్రీను, వీరనాగులు, ముదిగొండ మండలం అమ్మపేటకు చెందిన ఉప్పిడి రాంబాబుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగులవంచలో మద్యం దుకాణం వద్ద తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ అలీపై పై నలుగురు దాడి చేయగా అలీ కాలు విరిగింది. ఈ ఘటనపై బాధితుడి భార్య నస్రీన్ ఫిర్యాదు మేరకు ఎస్సై నాగుల్‌మీరా కేసు నమోదు చేశారు. మోసం చేస్తున్న ముఠాపై...ఖమ్మం అర్బన్ : భూములు లేకపోయినా తప్పుడు రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా పై కేసు నమోదు చేసినట్లు ఖానాపురం హవేలీ (ఖమ్మం అర్బన్) సీఐ భానుప్రకాశ్ తెలిపారు. నగరంలో ఇటీవల భూ క్రయవిక్రయాలు తగ్గడంతో అక్రమార్జనకు అలవాటు పడిన మాయగాళ్లు ఖరీదైన భూములకు డాక్యుమెంట్లు సృష్టిస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారి, మధురానగర్‌కు చెందిన షేక్.బడే సాహెబ్, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన కొత్తపల్లి వేంకటేశ్వర్లు, తిప్పర్తి అశోక్ కుమార్ (ఆర్ఐ)పై కేసు నమోదు చేసి వీరి నుంచి మరిన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సాగర్ కాల్వలో వ్యక్తి గల్లంతుకల్లూరు/కల్లూరురూరల్: మండలంలోని పెద్దకోరుకొండి గ్రా మానికి చెందిన గూడూరు శ్రీమన్నారాయణరెడ్డి(35) సా గర్ కాల్వలో గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. శ్రీమన్నారా యణరెడ్డి కొంతకాలంగా కల్లూరులో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం డబుల్ బెడ్రూమ్ల ఎదురుగా ఉన్న సాగర్ కాల్వలో స్నానం చేసేందుకు వెళ్లాడు.ఈ క్రమంలో జారి నీళ్లలో పడిపోయాడు. ఆ సమయంలో కాల్వలో నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో కొట్టుకుపోతుండగా చూసిన వారు గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు కాల్వలోకి దిగి ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కాల్వ గట్టుపై అతడి దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యమయ్యాయి. శ్రీమన్నారాయణరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యులు కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుక్కను తప్పించబోయి ఆటో పల్టీనేలకొండపల్లి : కుక్కను తప్పించబోయి ఆటో పల్టీ కొట్టిన ఘటన మండలంలోని కొత్తకొత్తూరులో ఆదివారం చోటుచేసుకుంది. బైరవునిపల్లికి చెందిన ఆటో ఖమ్మం వెళ్తుండగా కొత్తకొత్తూరులో కుక్క అడ్డువచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో ఆటోపల్టీ కొట్టడంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో మాత్రం బాగా దెబ్బతిన్నది. -
వైద్యం కోసం వెళితే..
మధిర: వైద్యం కోసం ఇంటికి తాళం వేసి ఆస్పత్రికి వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగిన ఘటన మహదేవపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామారావు వైద్య చికిత్స కోసం కుటుంబసభ్యులతో కలిసి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడే కొద్ది రోజులు ఉండి తిరిగి ఆదివారం ఇంటికి చేరుకున్నారు. ఈలోగా గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. రూ.30 వేల విలువైన నగలు చోరీకి గురయ్యాయని బాధితుడు మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు. చోటేబాబాకు గౌరవ డాక్టరేట్ఖమ్మం మామిళ్లగూడెం : ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ మైనారిటీ విభాగం నాయకుడు షేక్ చోటేబాబా చేసిన సామాజిక సేవలను గుర్తించిన యూరోపియన్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆదివారం ఢిల్లీలో యూరోపియన్, అమెరికన్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఆయా రంగాల్లో సేవ చేసిన వారిని గుర్తించగా అందులో చోటేబాబాకు స్థానం దక్కడం విశేషం. చిన్నారి చికిత్సకు ఆర్థిక సాయంసూపర్బజార్(కొత్తగూడెం): ఇటీవల ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నాలుగేళ్ల చిన్నారి పాసి కృతిక చికిత్స నిమిత్తం రామవరం ఏరియా హనుమాన్ జిమ్, బ్లడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రూ.20 వేల ఆర్థికసాయం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్‌పాషా చేతుల మీదుగా చిన్నారి తండ్రి, ఆటో డ్రైవర్ కల్యాణ్ పాసికి నగదు అందజేశారు. చిన్నారి పూర్తిస్థాయి చికిత్స కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. జిమ్ ఫౌండేషన్ సభ్యులు దాసు, సుధాకర్, లడ్డు, రాజేష్, సురేష్, దిలీప్, వసంత్, గుత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలుచర్ల: సరిహద్దు గ్రామాల్లో ఆదివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చర్లలో ఆదివారం జరిగిన వారపు సంతకు సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని అటవీ ప్రాంత గ్రామాల ఆదివాసీలు సరుకులు కొనుగోలు కోసం వస్తుంటారు. వారి మాటున మావోయిస్టులు, మిలీషియా సభ్యులు, కొరియర్లు రావచ్చనే అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చర్లకు వచ్చే ప్రధాన రహదారులు తాలిపేరు ప్రాజెక్టు, లెనిన్‌కాలనీ, కలివేరు క్రాస్‌రోడ్, దానవాయిపేట ప్రాంతాల్లో సివిల్, స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. వచ్చి పోయే వారిని నిశితంగా పరిశీలించారు. పులువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి విడిచిపెట్టారు. అలరించిన లఘుచిత్రాల ప్రదర్శనఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన లఘుచిత్రాల ప్రదర్శనలు అలరించాయి. దాశరధి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో రెండేళ్లుగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ లఘు చిత్రాలు ప్రదర్శిస్తుండగా ఆదివారం ఖమ్మంలో ఏర్పాటుచేశారు. సమాజ చైతన్యం కోసం రూపొందించిన చంద్రుడు, అంతరం, సాగరవాసి, శుభసంకల్పం, వాట్సాప్ స్టేటస్, జన్మనిచ్చిన తల్లికి, వలస గోస వంటి లఘుచిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిలిం సొసైటీ అధ్యక్షుడు ఎస్.వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. అభ్యుదయ భావాలను విస్తరించేందుకే ఇలాంటి చిత్రాలను ప్రదర్శిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఫిలిం సొసైటీ కార్యదర్శి బీడీఎల్ సత్యనారాయణ, మల్లం రమేష్, నెల నెలా వెన్నెల నిర్వాహకులు పాల్గొన్నారు. -
ఓసీలో కాలిపోతున్న బొగ్గు
మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఓపెన్‌కాస్టులో బొగ్గు రాశులు తగలబడుతున్నాయి. ఎంతో కష్టపడి తీసిన, విలువైన బొగ్గు కళ్ల ముందే కాలిపోతోందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో స్టాక్ యార్డ్ వద్ద ఉంచిన బొగ్గు కాలి దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. అధికారులు మంటలను నిరోధించే చర్యలు తీసుకోకపోవడంతో పొగతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కార్మికుల శ్రమ, యంత్రాలను వినియోగించి వెలికితీసిన బొగ్గు మండిపోవడంతో సింగరేణి సంస్థకు సైతం నష్టం వాటిల్లుతోంది. సింగరేణి యాజమాన్యం ప్రణాళిక రూపొందించి వార్షిక లక్ష్య సాధనకు ప్రయత్నిస్తుండగా మణుగూరు ఓసీ అధికారుల తీరుతో ఆ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి బొగ్గు రాశులను తరచూ నీటి ద్వారా తడుపుతూ మంటలను నిరోధించాలని, కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. అధికారుల ప్రణాళిక లోపంతో సంస్థకు నష్టం -
రిటైర్డ్ ఎస్సై ఆత్మహత్య
బూడిదగడ్డ ఏరియాలో మరొకరు.. కొత్తగూడెంఅర్బన్: పట్టణంలోని బూడిదగడ్డ ఏరియాలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. బూడిదగడ్డ ఏరియాకు చెందిన పుట్టా రంజిత్(30) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కుటుంబ సభ్యులు వచ్చాక ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కొత్తగూడెంఅర్బన్: రిటైర్డ్ ఎస్ఐ ఒకరు ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి కథనం ప్రకారం.. కొత్తగూడెం త్రీటౌన్‌లో పని చేసిన ఎస్ఐ ఖాజా మొహినుద్దీన్ (65) గతేడాది ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఎదురుగడ్డ గ్రామంలో కుటుంబంతో నివాసముంటున్నాడు. ఇటీవల తన భార్య అనారోగ్యంగా ఉండటం, పిల్లలు ఇంకా సెటిల్ కాకపోవడంతో మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్ర మంలో ఆదివారం ఇంట్లోనే చీరతో ఉరేసుకుని మృతి చెండు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ శ్రీనివాసరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మద్యం మత్తులో వికృత చేష్టలు
పాల్వంచ: మూడు రోజుల క్రితం ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్ భార్య స్నానం చేస్తుండగా అదే అపార్ట్మెంట్లో ఉండే కేటీపీఎస్ ఉద్యోగి ఫొటోలు తీశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని కొమ్ముగూడెంలోని ఓ అపార్ట్మెంట్లో దివ్యాంగుడైన వ్యక్తి వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. భార్య, కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లోనే ఓ గదిలో నివాసముంటున్నాడు. కాగా అతని భార్య బాత్రూంలో స్నానం చేస్తుండగా అపార్ట్మెంట్లో నివాసం ఉండే కేటీపీఎస్ ఉద్యోగి మద్యం తాగి వచ్చి వెంటిలెటర్ నుంచి సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు. దీంతో గుర్తించిన మహిళ ఆందోళనకు గురై ప్రశ్నించడంతో గొడవ జరిగింది. బయటకు వెళ్లిన భర్త, కుమారుడు ఇంటికి వచ్చాక సదరు కేటీపీఎస్ ఉద్యోగిని ప్రశ్నించగా.. వారిపైనే తిరిగి దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు, కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాగా ఫొటోలు తీసిన వ్యక్తి గతంలో సైతం అదే తరహాలో వ్యవహరించినట్లు సమాచారం. దివ్యాంగుడి కంటే ముందు అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్‌మన్ భార్యపట్ల కూడా అదే తీరులో వ్యవహరించినట్లు, అపార్ట్మెంట్లో ఉండే వారితో గొడవలు పడిన సంఘటనలు ఉన్నట్లు తెలుస్తోంది. కేటీపీఎస్‌లో మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా వ్యవహరించి సస్పెన్షన్‌కు గురయ్యాడని సమాచారం. ఈ విషయమై ఎస్ఐ రాఘవయ్యను వివరణ కోరగా... ఫిర్యాదు వచ్చిందని, అనంతరం వారు మళ్లీ మాట్లాడుకుంటామని వెళ్లిపోయారని తెలిపారు. మహిళ స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసిన కేటీపీఎస్ ఉద్యోగి? -
రండి.. రారండి!
ఖమ్మం సహకారనగర్: కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు ఏటా విద్యాసంస్థల బాధ్యులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా చెప్పొచ్చు. ‘మా పాఠశాలలో చేరండి.. మా కళాశాలలో చేరండి’ అంటూ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సైతం తమ కళాశాలలో చేరాలంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లి విస్తృత ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఏకై క కళాశాల.. జిల్లా కేంద్రంలో మహిళా విభాగంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటే ఉంది. ఇక్కడ వివిధ శాఖలకు చెందిన హాస్టళ్లు ఉండడంతో ఇతర ప్రాంతాల విద్యార్థినులు సైతం హాస్టళ్లలో ఉంటూ కళాశాలలో చదివేందుకు ఆస్కారముంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు ఖమ్మం సమీపాన ఉండడం కలిసొచ్చే అవకాశంగా చెబుతున్నారు. ప్రత్యేక శ్రద్ధ.. ఉత్తమ ఫలితాలు ఈ కళాశాలలో విద్యార్థినులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దీంతో ఏటా విద్యార్థినులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ లభించడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే భావనతో ఇక్కడ చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లే కాక వివిధ పోటీ పరీక్షలు, యువజనోత్సవాల్లో అధ్యాపకుల సహకారంతో సత్తా చాటుతున్నారు. ముందస్తు ప్రచారం వచ్చే విద్యాసంవత్సరం కళాశాలలో ప్రవేశాల సంఖ్య మరింత పెరిగేలా ప్రభుత్వ ఆదేశాలతో అధ్యాపకులు ముందస్తు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఖమ్మం నగరంతో పాటు సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లోని ప్రభుత్వ, అనుబంధ జూనియర్ కాలేజీలకు వెళ్లి తమ కళాశాలలో ఉన్న వసతులు, ఫలితాలను వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రైవేట్ కళాశాలలకు దీటుగా కలర్ బ్రోచర్లు ముద్రించడం విశేషం. ఇలా రకరకాల కారణాలతో వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థినుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల ప్రచారం సౌకర్యాలు, ఫలితాలను వివరిస్తూ ప్రవేశాలకు ఆహ్వానం ‘న్యాక్ ఏ’ గ్రేడ్ ఉండడంతో విద్యార్థినులు సైతం ఆసక్తిగత కొన్నేళ్లుగా కళాశాలలో ప్రవేశాలు సంవత్సరం ఎంపీసీ బీజెడ్సీ బీఏ బీకాం మొత్తం 2022–23 30 57 86 71 244 2023–24 13 65 80 72 230 2024–25 24 52 84 74 234వచ్చే ఏడాది అటానమస్ హోదా 1965లో స్థాపించిన ఈ కళాశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. నెట్, సెట్, డాక్టరేట్ అర్హతలు కలిగిన అధ్యాపకులు బోధిస్తున్నారు. 2025 – 26 విద్యాసంవత్సరం నుంచి అటానమస్ హోదా లభించనుంది. ఇప్పటికే న్యాక్–ఏ ఉన్నందున విద్యార్థినులు చేరేందుకు ముందుకు రావాలి. – జి.పద్మావతి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల