Komaram Bheem
-
మహిళల అభ్యున్నతికి చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: మహిళల అభ్యున్నతి, రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లా సీ్త్ర, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు బ్యాంకు లింకేజీ ద్వారా స్వశక్తి మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. గృహ హింస, లైంగిక వేధింపుల బాధితులకు సఖి కేంద్రం ద్వారా సాయం అందిస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బేటీ పడావో.. బేటీ బచావో కార్యక్రమం ద్వారా బాలికల్లో అక్షరాస్యత పెరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో మోటివేషన్ స్పీకర్లను నియమించినట్లు తెలిపారు. భావితరాలకు మహిళలు ఆదర్శంగా నిలవాలని, ఉన్నత లక్ష్యాలు సాధించాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా సూచించారు. అనంతరం ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే కుటుంబం, సమాజం వారిని గుర్తిస్తుందన్నారు. ఆత్మ నూన్యత భావన విడిచి ముందడుగు వేయాలని సూచించారు. భ్రూణ హత్యలు, బాల్యవివాహా లు అరికట్టినప్పుడే సమాజం అభివృద్ధి వైపు పయనిస్తుందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, సీడీపీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
నెలాఖరులోగా పనులు పూర్తిచేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్డీవో దత్తారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయతీ, హౌజింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కా ర్యదర్శులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీ క్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణా ళికతో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వందశాతం ఆస్తిపన్నులు వసూలు చేసేలా అధి కారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. లేఅవుట్ లేని భూముల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్– 2020లో భాగంగా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హత గల వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, జాబ్‌కార్డు కలిగిన వారికి వందరోజుల ఉపాధిహామీ పనులు కల్పించాలన్నారు. వేసవి నేపథ్యంలో ఉదయం, సాయంత్రం పనులు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాకు ఇంటిగ్రేటెడ్ గురుకులం
● ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు ● వాంకిడి మండలం ఇందాని శివారులో స్థలం పరిశీలన ● రూ.200 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆసిఫాబాద్‌రూరల్: పేదరికాన్ని రూపుమాపే ఏకై క ఆయుధం విద్య మాత్రమే.. పేద కుటుంబాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వాంకిడి మండలం ఇందాని సమీపంలో ప్రభు త్వ స్థలాన్ని ఇటీవల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అధికారులు తదితరులు పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థలం గుర్తింపుబడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు 25 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవనాలు నిర్మించనున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులందరూ ఒకే చోట చదువుకునేందుకు వీలుగా వసతులు కల్పించనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసీ జిల్లాలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 25 ఎకరాల స్థలం అందుబాటులో లేకపోవడంతో వాంకిడి మండలం ఇందాని గ్రామ శివారులో 321 సర్వే నంబర్లో 20 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు జిల్లా కేంద్రానికి సమీపంలో నిర్మిస్తే అన్ని మండలాల విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గంలో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుపై స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో పరిస్థితి..జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు కలిపి మొత్తం 1,265 ఉన్నాయి. ఇందులో కళాశాలలు 17, పాఠశాలలు 1,248. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా చోట్ల 1,03,264 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐదు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2,898 మంది విద్యార్థులు, ఏడు గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2,917 మంది, 38 ఆశ్రమ పాఠశాలల్లో 7,065 మంది, 15 కేజీబీవీల్లో 3,917 మంది, ఐదు బీసీ జ్యోతిబా పూలే గురుకులాల్లో 2,215 మంది, మూడు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 1,185 మంది, రెండు మోడల్ స్కూళ్లలో 1,304 మంది, 19 ఎస్సీ, బీసీ పోస్ట్ మెట్రిక్, ప్రీమెట్రిక్ వసతి గృహలు, ఎస్సీ బాలబాలికల వసతి గృహాల్లో 385 మంది, 11 బీసీ వసతి గృహల్లో 789 మంది, 107 ప్రైవేట్ పాఠశాలల్లో 29,779 మంది, 732 ప్రభుత్వ పాఠశాలల్లో 43,110 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండాలి ఆసిఫాబాద్‌కు సమీపంలో చాలా వరకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. జిల్లా కేంద్రం పరిధిలో ఐదు కి.మీ.ల దూరంలో సమీకృత గురుకులం ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. ఆదర్శ డిగ్రీ కళాశాలను బెండారలో ఏర్పాటు చేయడంతో దూరభారంతో విద్యార్థులు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. – తిరుపతి, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
విద్యార్థులకు సమస్యలు రానీయొద్దు
వాంకిడి(ఆసిఫాబాద్): బీసీ, ఎస్సీ వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రానీయొద్దని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సజీవన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ వసతిగృహాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూం, వంటగది, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా మెనూ పాటిస్తూ ప్రతిరోజూ ఆరోగ్యకరమైన భోజనం అందించాలన్నారు. వసతిగృహాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు పూర్తినమ్మకంతో కష్టపడి చదవాలన్నారు. పరీక్షల తీరుపై అవగాహన కల్పించారు. ఆయన వెంట బీసీ హాస్టల్ వార్డెన్ మధుకర్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ తిరుపతి తదితరులు ఉన్నారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండాలక్ష్మణ్ బాపూజీ పేరును నామకరణం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం అంబేడ్కర్ చౌక్ వద్ద పద్మశాలీ సేవా సంఘం సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు మాట్లాడుతూ వాంకిడి మండల కేంద్రానికి చెందిన కొండాలక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులు సైతం లెక్కచేయలేదన్నారు. వాంకిడిలో సేవాసదన్ సంస్థకు చెందిన భూమిలో బాపూజీ స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎమ్మెల్సీ దండె విఠల్ రూ.30లక్షలు కేటాయించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, శ్రీకాంత్, లింగయ్య, పుష్పలత, సునీత, ఇరుకుల మంగ, ప్రణయ్, భద్రయ్య, శ్యాం, శైలేందర్, శ్రీనివాస్, ధర్మయ్య, సత్యనారాయణ, మహేష్, మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగోసె శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
దాహం తీరేదెలా..?
● జిల్లాలో మండుతున్న ఎండలు ● అటవీ ప్రాంతాల్లో నీటి కరువు ● తాగునీటి కోసం మైదాన ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ● పొంచి ఉన్న వేటగాళ్ల ముప్పుపెంచికల్పేట్(సిర్పూర్): మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి. వేడి, పొడి వాతావరణంతో అడవుల్లోని సహజ నీటి వనరులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఫలితంగా అటవీ ప్రాంతాలను ఆవాసంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న వన్యప్రాణులు తాగునీటికి అల్లాడుతున్నాయి. ఎండలు మొదలై 15 నుంచి 20 రోజులవుతున్నా అటవీశాఖ అధికారులు మాత్రం నీటి వసతి కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. దాహానికి తట్టుకోలేక వన్యప్రాణులు నీటి వనరులను వెతుక్కుంటూ అడవులను విడిచి మైదాన ప్రాంతాలకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో అటవీ జంతువులు వేటగాళ్ల ఉచ్చులకు చిక్కుతున్నాయి. అలాగే వీధికుక్కల దాడిలోనూ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. 6,04,172 ఎకరాల్లో అడవులుజిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఫారెస్టు డివిజన్లు ఉన్నాయి. ఆయా డివిజన్లలో 11 రేంజ్‌లు, 79 సెక్షన్లు, 245 బీట్లు, 846 కంపార్టుమెంట్లు ఉన్నా యి. జిల్లావ్యాప్తంగా 6,04,172 ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. పెద్దపులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, జింకలు, మెకాలు, దుప్పులు, నీలు గాయి, కొండగొర్రెలు, అడవి పందులతోపాటు అనేక రకాల అరుదైన జంతువులు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. దట్టమైన అడవుల్లో గడ్డి మైదానా లు, నీటి ఊటలు ఉన్నాయి. నిత్యం నీటితో కళకళలాడే పెన్‌గంగ, ప్రాణహిత నదులు, పెద్దవాగు వ న్యప్రాణుల దాహం తీరుస్తున్నాయి. జిల్లాలోని ము ఖ్యమైన ప్రాంతాల్లో అటవీ జంతువుల దాహం తీ ర్చడానికి అధికారులు 159 సాసర్పిట్లు, 19 సోలా ర్ నీటి కుంటలు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వేసవిలో నీటి వనరులు అడుగంటిపోతాయి. ఈ సమయంలో అధికారులు ఏర్పాటు చేసే నీటికుంటలు, సాసర్ పిట్లే వాటికి ఆధారం. పొంచి ఉన్న ముప్పు..ఎండాకాలంలో అడవి జంతువులకు నీటి సౌకర్యం కల్పించడం, వేటగాళ్ల బారి నుంచి కాపాడటం అఽధికారులకు సవాలుగా మారింది. అడవుల నుంచి దాహంతో మైదాన ప్రాంతాల్లోకి వస్తున్న వన్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉంది. నిరంతరం నీరు లభించే ప్రాంతాలు వేటగాళ్లకు అనుకూలంగా మారాయి. నీటివసతి ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, ఉచ్చులు బిగించి వన్యప్రాణులను వేటాడుతున్నారు. మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్చిలోనే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వేడికి అల్లాడుతున్న వన్యప్రాణులు ఏప్రిల్, మేలో వేటగాళ్ల ఉచ్చులకు బలయ్యే అవకాశం ఉందని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.పెంచికల్పేట్ రేంజ్లో నీరు లేక ఖాళీగా ఉన్న సాసర్పిట్జిల్లా వివరాలుఫారెస్టు సాసర్ సోలార్ రేంజ్‌లు పిట్లు కుంటలు పెంచికల్పేట్ 15 5 బెజ్జూర్ 26 1 కాగజ్‌నగర్ 22 8 సిర్పూర్(టి) 22 2 కర్జెల్లి 29 1 రెబ్బెన 10 2 ఆసిఫాబాద్ 15 0 జోడేఘాట్ 5 0 కెరమెరి 5 0 తిర్యాణి 5 0 గిన్నెధరి 5 0 ఖాళీగా సాసర్పిట్లు..వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ఆయా రేంజ్‌ల పరిధిలో ఏర్పాటు చేసిన నీటికుంటలు, సాసర్పిట్లు, సోలార్ నీటి కుంటలు అలంకారప్రాయంగా కనిపిస్తున్నాయి. సాసర్పిట్లలో ట్యాంకర్ల ద్వారా వారం రోజులకు ఒకసారి నీటితో నింపాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వన్యప్రాణుల కోసం ఉప్పుగడ్డలు మాత్రం నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఏడాదిగా కంపా నిధులు నిలిచిపోవడంతో అడవి జంతువుల దాహార్తి తీర్చడం అటవీశాఖ అధికారులకు భారంగా మారింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం ఎండల తీవ్రతతో అడవిలోని సహజ వనరులు ఎండిపోతున్నాయి. నీటి లభ్యత ఉన్న ప్రదేశాల్లో చెలిమెలు ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నెలాఖరు వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు రాగానే సాసర్పిట్లలో నీటిని నింపే ప్రక్రియ ప్రారంభిస్తాం. వన్యప్రాణులు మైదాన ప్రాంతాల్లోకి వస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. వన్యప్రాణులను వేటాడితే కేసులు నమోదు చేస్తాం. – అనిల్‌కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్ -
వేసవిలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి
రెబ్బెన: వేసవిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాల ని ట్రాన్స్‌కో ఎస్ఈ రాథోడ్ శేషారావు అన్నా రు. మండలంలోని నంబాల సబ్‌స్టేషన్‌లో కొ త్తగా ఏర్పాటు చేసిన బ్రేకర్‌ను మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కొత్త బ్రేకర్‌ను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే సత్వరమే వాటిని పరిష్కరించి విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. డీఈఈ వీరేశం, ఏడీఈ ఫిరోజ్‌ఖాన్, సంతోష్, ఏఈ ఇమ్రాన్, సిబ్బంది రయీస్, సురేశ్, హరీశ్, సత్తయ్య, నసీరుద్దీన్, మధు పాల్గొన్నారు. -
నాణ్యతతో పనులు చేపట్టాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాలో చేపడుతున్న పనుల్లో నాణ్య త పాటించాలని పంచాయతీరాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్ఈ సూర్యప్రకాశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వి విధ మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద పనులు చేపడుతున్న ఏజెన్సీ నిర్వాహకులు, అధికారులకు పంచాయతీరాజ్ ఈఈ ప్రభాక ర్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఈ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో పనులు పూర్తిచేయడంతోపాటు నాణ్యత ప్రమాణాలు పాటించి నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నా రు. రానున్న రోజుల్లో నాణ్యత పరీక్షించిన త ర్వాతే బిల్లుల చెల్లింపులు జరుగుతాయని స్ప ష్టం చేశారు. పనులు పూర్తిచేయడంలో అలసత్వం ప్రదర్శించొద్దని హెచ్చరించారు. సమావేశంలో డీఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల ని డీవైఎఫ్ఐ, టీఏజీఎస్ నాయకులు మంగళవారం కలెక్టరేట్లో ఏవో మధుకర్‌కు వినతిపత్రం అందించారు. నాయకులు కార్తీక్, మాల శ్రీ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజ లకు కనీస వసతులు కూడా లేవన్నారు. ట్రా ఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బంది ప డుతున్నారని, వ్యాపారులు పగటిపూటే భారీ వాహనాలు రోడ్లపై నిలుపుతున్నారని ఆరో పించారు. గోదాంలను కాలనీల్లో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నా రు. పట్టణంలో సులభ్ కాంప్లెక్స్‌లు, పా ర్కింగ్ స్థలాలు, తాగునీటి కోసం చలివేంద్రాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జన్కాపూర్ మైదానానికి ప్రహరీ నిర్మించి, సెక్యూరిటీ పెంచాలన్నారు. నాయకులు శ్రావణి తదితరులు ఉన్నారు. -
డోర్లి–2 ఓసీపీ సందర్శన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో మూసివేసిన డోర్లి– 2 ఓసీపీని మంగళవారం కోల్ కంట్రోల్ అధికారులు సందర్శించారు. నాగ్‌పూర్ కోల్ కంట్రోల్ కార్యాలయ ఓఎస్డీ సందీప్ ఎస్ పరాంజ పేతో పాటు కొత్తగూడెం కోల్ కంట్రోల్ కార్యాలయ ఓఎస్డీ డీవీ సుబ్రమణ్యం ఏరియా అధికారులతో కలిసి మూతపడిన గని, పరిసర ప్రాంతాల్లో సింగరేణి యాజమాన్యం చేపట్టిన పర్యావరణ పనులు, ఓసీపీ వద్ద నాటిన మొక్కలు, ఎదిగిన వృక్షాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న నీటి నిర్వహణ, మృతిక సంరక్షణ చర్యల వివరాల ను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గోలే టి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో ఇన్చార్జి జీఎం నరేందర్ కోల్ కంట్రోల్ అధికారులకు ఏరి యా స్థితిగతుల వివరాలను వెల్లడించారు. కార్యక్రమాల్లో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా సర్వే అధికారి ఆప్సర్ పాషా, డీవైఎఎస్వో శేఖర్, కార్పొరేట్ అదనపు మేనేజర్లు తిరుపతి, బాబ్జీ, డోర్లి– 2 మేనేజర్ మహేశ్, ఎన్విరాన్మెంట్ అధికారి హరీశ్, ఫారెస్టు అధికారి రమణారెడ్డి, ఎస్టేట్ అధికారి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాలు పరిశీలిస్తున్న కోల్ కంట్రోల్ అధికారులు -
పదోన్నతితో మరింత బాధ్యత
ఆసిఫాబాద్‌అర్బన్/కెరమెరి: పదోన్నతితో ఉద్యోగిపై మరింత బాధ్యత పెరుగుతుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. కెరమెరి పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న జాదవ్ ఉల్లాస్ ఎస్సైగా పదోన్నతి పొందగా, సోమవారం జిల్లా కేంద్రంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. 1989లో ఉల్లాస్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందగా 2012లో హెడ్ కానిస్టేబుల్, 2000లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయనను జైనూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా నియమించారు. గతంలో ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, సోన్, నీల్వాయి, కెరమెరి పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎస్పీకి మొక్క అందిస్తున్న ఎస్సై ఉల్లాస్ -
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● కలెక్టరేట్లో ప్రజావాణి ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణిలో ప్రజలు అందించే అర్జీలను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అద నపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన పట్టా భూమికి హద్దులు నిర్ధారించాలని రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన మసాడి రాజేశ్వరి దరఖాస్తు చేసుకుంది. ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టులో చేపలు పెంచడానికి అవకాశం కల్పించా లని తిర్యాణి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలు కోరారు. తన పట్టా భూమిని నిషే ధిత జాబితా నుంచి తొలగించాలని బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన చాపిడి శంకర్ విన్నవించాడు. దివ్యాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని చింతలమానెపల్లి మండలం ఖర్జెల్లికి చెందిన చౌదరి ఓంకార్ వినతిపత్రం సమర్పించాడు. ప్రస్తుతం తాను సాగు చేసుకుంటున్న భూమికి పట్టా మంజూరు చేయాలని బెజ్జూర్ మండలం ముంజంపల్లికి చెందిన నికోడే లచ్చుంబాయి వేడుకుంది. సదరం సర్టిఫికెట్ అందించాలని కౌటాల మండలానికి చెందిన శంకర్ కోరాడు. దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని వాంకిడి మండలానికి చెందిన మురళీ, మహేందర్ దరఖాస్తు చేసుకున్నారు. వాంకిడి మండలం సరండి శివారులోని భూమిని ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని రాజేశ్వర్ విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు నిర్ణీత గడువులోగా న్యాయం చేయాలన్నారు. వేతనం రావడం లేదు చింతలమానెపల్లి మండలం డబ్బా రైతువేదికలో 2021 నుంచి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నా. ప్రారంభంలో మూడు నెలలు సక్రమంగా చెల్లించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు వేతనం రావడం లేదు. – నక్క జగానంద్, చింతలమానెపల్లి -
ఉపాధికి నిబంధనాలు
● కొత్త జాబ్‌కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం ● జాబ్‌కార్డు లేక ఉపాధికి దూరమవుతున్న కూలీలు ● ‘ఆత్మీయ భరోసా’తో గ్రామాల్లో పెరిగిన డిమాండ్రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో కొత్త జాబ్‌కార్డుల మంజూరులో విధించిన నిబంధనలు కొత్త కూలీల పాలిట శాపంగా మారింది. కొన్ని నెలలుగా కొత్తగా కార్డులు జారీని నిలిపివేయడంతో అర్హులకు ఉపాధి దక్కడం లేదు. ఉపాధిహామీ చట్టం ప్రకారం ఆసక్తి చూపే ప్రతీ కూలీకి తప్పనిసరిగా పనులు కల్పించాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు చట్టానికే తూట్లు పొడుస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. వేసవిలో ఉపాధి పనులే దిక్కు..జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రజలంతా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. జనవరి నాటికే వానాకాలం పంటల సీజన్ పూర్తవుతుంది. వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలకు ఉపాధిహామీ పనులే దిక్కుగా మారుతాయి. జనవరి నుంచి జూన్ వరకు కొనసాగే ఉపాధిహామీ పనులు వేసవిలో కూలీలకు బాసటగా నిలుస్తున్నాయి. ఈజీఎస్ కింద కూలీలకు చెల్లించే రోజువారి కూలి సైతం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏటా జిల్లాలో ఉపాధిహామీ పనులు చేసే కూలీల సంఖ్య సైతం పెరుగుతోంది. జిల్లాలో మంజూరైన జాబ్‌కార్డులకు, పనిచేసే కూలీల సంఖ్యకు పొంతన ఉండటం లేదు. అధికారులు జిల్లాలో 1,23,035 జాబ్‌కార్డులను మంజూరు చేయగా, ప్రస్తుతం కేవలం 91,721 జాబ్‌కార్డులు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నాయి. 2,43,969 మంది కూలీలు ఉండగా 1,70,268 మంది మాత్రమే పనులకు వెళ్తున్నారు. పెరిగిన డిమాండ్అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12వేలు ఆర్థికసాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేసి భూమి లేని నిరుపేదలకు ఆర్థికసాయం అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే పేదలను గుర్తించేందుకు ఉపాధిహామీ పథకంలో ఏడాదిలో కనీసం 20 రోజులపాటు పనిచేయాలని నిబంధన విధించారు. జనవరిలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు రూ.6వేల నగదు అందించింది. దీంతో ఉపాధిహామీ పనులు చేసే కూలీలకే ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందనే భావనతో గ్రామీణ ప్రాంత ప్రజలు పనుల కోసం దరఖాస్తులు అందిస్తున్నారు. భూములు ఉన్న రైతులు సైతం కొత్తగా జాబ్‌కార్డుల కోసం ఆసక్తి చూపుతున్నారు. ఈజీఎస్ అధికారులు కొత్త జాబ్‌కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో దరఖాస్తులు స్వీకరించి దగ్గర పెట్టుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే జాబ్‌కార్డులు ఉన్న కూలీలు పూర్తిస్థాయిలో పనులకు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. గతంలో స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను కూడా జాబ్‌కార్డులు ఉన్న వారికి మాత్రమే మంజూరు చేశారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయి బిల్లులు తీసుకున్న వారు జాబ్‌కార్డులను పక్కన పడేశారు. రైతులు సైతం వ్యవసాయ భూముల్లో పనుల కోసం జాబ్‌కార్డులు తీసుకుని పనులు చేయించుకుంటున్నారు. ఆ తర్వాత పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో పనిచేసే కూలీల సంఖ్య తగ్గుతోంది. ఇప్పుడు కొత్త జాబ్‌కార్డుల మంజూరు, మార్పులు చేర్పులపై ఆంక్షలు విధించడంతో కొత్తగా పని చేసేందుకు ఇష్టపడుతున్న కూలీలపై ప్రభావం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు జాబ్‌కార్డులు మంజూరు చేసి పనులు కల్పించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.విచారణ తర్వాతే జారీ ఉపాధిహామీ పనులు చేసేందుకు జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా జారీ చేస్తాం. కానీ ఆత్మీయ భరోసా పథకం వర్తించాలనే కోరికతో జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. అ లాంటి వాటిని విచారణ చేపడతాం. ప్రభుత్వం ఉ పాధిహామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తుండటంతో కొత్త జాబ్‌కార్డు ల కోసం చాలామంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. అర్హత ఉంటేనే కొత్త జాబ్‌కార్డు ఇస్తున్నాం. – దత్తారావు, డీఆర్డీవోనిలిచిన కొత్త కార్డుల జారీవేసవిలో చేసేందుకు పనులు లేక ఉపాధి కోసం ఆరాటపడే కూలీలకు ఉపాధిహామీ వరంలా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్‌కార్డుల మంజూరును తాత్కాలికంగా నిలిపివేయడంతో కొత్తగా పనులు చేసేందుకు ఆసక్తి చూపే కూలీలు ఉపాధి పనులకు దూరమవుతున్నారు. కొత్త జాబ్‌కార్డుల జారీతోపాటు పాత జాబ్‌కార్డులో పేర్ల తొలగింపులు, చేర్పుల ప్రక్రియపై సైతం నిబంధనలు విధించింది. చనిపోయిన కూలీల పేర్ల తొలగింపు ప్రక్రియ సైతం నిలిచిపోవడంతో పనిచేసే కూలీల సంఖ్య తగ్గుతోంది. పెళ్లికి ముందు తల్లిదండ్రులతో కలిసి జీవించి వివాహ అనంతరం వేరు కాపురం ప్రారంభించిన కుమారులకు సైతం కొత్త జాబ్‌కార్డులు రావడం లేదు. పలువురు పనులు చేసేందుకు ముందుకొస్తున్నా అధికారులు వారికి అవకాశం కల్పించలేకపోతున్నారు. చేసేదేమీ లేక కూలీలు ఇతర పనులను వెతుక్కుంటున్నారు. వేసవి ప్రారంభం కావడంతో పనుల కోసం కూలీలు వలస వెళ్లాల్సి వస్తోంది. -
ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని వినతి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని సీపీఎం పార్టీ నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలోని వట్టివాగు, అడ ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టుల్లో నీరున్నా పంటల సాగుకు ఉపయోగపడటం లేదన్నారు. కాలువలకు మరమ్మతులు లేకపోవడం, అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన్న, నాయకులు దినకర్, శ్రీనివాస్, ఆనంద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు 5,046 మంది విద్యార్థులకు 4,917 మంది హాజరుకాగా, 129 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 4,315 మందికి 4,207 మంది, ఒకేషనల్ వి భాగంలో 731 మందికి 710 మంది హాజరయ్యారని డీఐఈవో కళ్యాణి తెలిపారు. ఆసిఫాబాద్, కౌటాల, దహెగాంలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలిజిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, సౌకర్యాల కల్పన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. -
డిగ్రీ విద్యార్థినుల ప్రతిభ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న మహిళా డిగ్రీ గురుకులానికి చెందిన విద్యార్థినులు మౌంటెన్ బైక్ సైక్లింగ్‌లో ఉత్తమ ప్రతిభ చూపినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శారద సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ నెల 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన తొమ్మిదో రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్‌లో కళాశాలకు చెందిన స్నేహ టైం ట్రయల్ 20 కిలోమీటర్లు, మాస్ స్టార్ట్స్ 40 కిలోమీటర్ల విభాగంలో బంగారు పతకం సాధించిందని తెలిపారు. అలాగే వాణిశ్రీ రజత పతకం, ప్రియాంక కాంస్య పతకం, శ్రీదేవి రజత పతకం సాధించారని వెల్లడించారు. విద్యార్థినులు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని పీడీ హారిక ఆకాంక్షించారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): పదో తరగతి విద్యార్థులు వా ర్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏటీడీవో శ్రీనివాస్ అన్నారు. మండలంలో ని జోడేఘాట్, బాబేఝరి, హట్టి ఆశ్రమ పాఠశాలలను సోమవా రం సందర్శించారు. పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలకు పరిశీలించారు. వార్షిక పరీక్షలకు పది రోజులే గడువు ఉన్నందున కష్టపడి చదవాలన్నారు. ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేయాలన్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు మోతీరాం, జంగు, పంచఫుల తదితరులు ఉన్నారు. -
అందవెల్లి వంతెనపై రాకపోకలు షురూ
దహెగాం(సిర్పూర్): కాగజ్‌నగర్ మండలం అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు పనులు పూర్తికావడంతో సోమవారం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. 2021లో భారీ వరదలకు పెద్దవాగు ఉప్పొంగి వంతెన కుంగిన విషయం తెలిసిందే. మరోసారి వరదలు వచ్చి వంతెన మరింత కుంగి ప్రమాదకరంగా మారింది. 2023లో వంతెన కూలడంతో పూ ర్తిగా రాకపోకలు నిలి చిపోయాయి. వాగులో తాత్కాలిక రోడ్డు వేసి రాకపోకలు సాగించా రు. గతేడాది వంతెన మరమ్మతులు పూర్తి కాగా, వర్షాకాలంలో మట్టితో తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు వేసి ప్రయాణాలు పునరుద్ధరించారు. గత నెలలో మళ్లీ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించడంతో మ రోసారి వాగులో నుంచి తాత్కాలిక రోడ్డు వే శారు. అప్రోచ్ రోడ్డు పనులు పూర్తికావడంతో వాహనాల రాకపోకలకు అనుమతించారు. -
దివ్యాంగులకు యూనిక్ డిజేబులిటీ ఐడీ
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రస్తుతం అందిస్తున్న సద రం సర్టిఫికెట్ స్థానంలో దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం యూనిక్ డిజేబులిటీ ఐడీలను అందుబాటులోకి తీసుకువచ్చిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివా రితో కలిసి జిల్లా పరిషత్, జిల్లా సంక్షేమశాఖ, వైద్యారోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమి షనర్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, దివ్యాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులకు అవగా హన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ దివ్యాంగులకు 21 కేటగిరీల్లో యూడీఐడీ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్ ఉన్న వారికి స్పీడ్ పోస్టు ద్వారా కార్డులు పంపిస్తారని పేర్కొన్నారు. దివ్యాంగుల సౌ కర్యార్థం ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామన్నారు. డీఆర్డీవో దత్తారావు, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ అధికారి భాస్కర్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తుజిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ఈవీ ఎం గోదాంను సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. -
ఉద్యోగులకు అభినందన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ ఓసీపీ గడిచిన ఫిబ్రవరిలో అధిక ఉత్పత్తిని సాధించడంతో ఓసీపీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అభినందించారు. సోమవారం కై రిగూడ ఓసీపీని సందర్శించి కై రిగూడ ఓసీపీ 135 శాతం బొగ్గు ఉత్పత్తి సాధనకు కృషి చేసిన ఉద్యోగులను ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో బెల్లంపల్లి ఏరియాకు 37.5లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 21 రోజుల గడువు మిగిలి ఉందని, వందశాతం ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి నరేందర్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు మొ గిళి, ప్రాజెక్టు ఇంజినీర్ వీరన్న, సేఫ్టీ అధికారి నారా యణ, మేనేజర్ శంకర్, డీవైపీఎం వేణు, నాయకులు శేషు, దివాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా క్రీడాకారులకు పతకాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): హర్యానా రాష్ట్రంలోని కర్ణాల్లో జరిగిన 73వ ఆల్ ఇండియా పోలీస్ సెపక్తక్రా చాంపియన్‌షిప్ టీం ఈవెంట్లో రాష్ట్ర జట్టు తరుఫున బరిలో దిగిన జిల్లా క్రీడాకారులు కాంస్య పతకాలు సాధించినట్లు సెపక్తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఈ నెల 7 నుంచి జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ సెపక్తక్రా చాంపియన్‌షిప్‌లో రెబ్బెన మండలానికి చెందిన పోలీస్ క్రీడాకారులు ఆర్.వెంకటేశ్, ఆడే రాజేందర్, పి.గోపి అద్భుత ఆట తీరు ప్రదర్శించారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కాంస్య పతకాలు సాధించిన పోలీ స్ క్రీడాకారులను ఒలింపిక్ అసోసియేషన్ ఉ మ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.తిరుపతి, సెపక్ తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష అభినందించారు. -
నిధులు రాక నిరుపయోగం
ఆసిఫాబాద్‌రూరల్: వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు అందించేందుకు గత ప్రభుత్వం నిర్మించిన రైతువేదికల నిర్వహణ గాడితప్పింది. సర్కారు నుంచి నిధులు విడుదల కాకపోవడంతో వాటి పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో ఇలా..జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, 70 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. రైతులకు సాగులో ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్, తదితర అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించేందుకు 15 మండలాల్లో 70 రైతు వేదికలు నిర్మించారు. ఒక్కో దాని నిర్మాణానికి రూ.22 లక్షలు వెచ్చించారు. ఈ రైతు వేదికల నిర్వహణకు నెలకు కనీసం రూ.8 వేల నుంచి రూ.10 వేలు ఖర్చవుతుంది. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల పాటు సక్రమంగా నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు నిధుల విడుదల నిలిచిపోయింది. అప్పటి నుంచి వాటి నిర్వహణను పట్టించుకునే వారు కరువయ్యాయి. నిర్వహణ ఏఈవోలకు తలకు మించిన భారంగా మారింది. విద్యుత్ బిల్లులు, ఇతర ఖర్చులు వారు సొంతంగా చెల్లించాల్సి వస్తోంది. కొన్నిచోట్ల విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. గ్రామాలకు దూరంగా నిర్మాణంజిల్లాలో 70 రైతువేదికలు ఉన్నాయి. నాలుగు నుంచి ఐదు పంచాయతీలను కలుపుకుని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి క్లస్టర్ ఒక రైతువేదిక నిర్మాణం చే పట్టారు. ఇందులో చాలావరకు గ్రామాలకు దూరంగా ఉండటంతో రైతులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ సర్కారు ప్రతీ మంగళవా రం రైతునేస్తం కార్యక్రమం పేరుతో పంటల సాగు విధానంలో నూతన పద్ధతులు, అధిక దిగుబడి వి ధానాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయాధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మండలానికి ఒకటి చొప్పున 15 రైతువేదికలను ఇందు కోసం వినియోగిస్తున్నారు. మిగిలినవి నిరుపయోగంగా ఉంటున్నాయి. కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో బిల్లులు కూడా అందకపోవడంతో కొన్నిచో ట్ల మరుగుదొడ్లు నిర్మించలేదు. మరికొన్ని చోట్ల అసంపూర్తిగానే ఉన్నాయి. తాగు నీటి సదుపాయం లేదు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం ఎంపిక చేసిన రైతువేదికల్లో ప్రస్తుతం ప్రతీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రైతులను ఆహ్వానిస్తున్నాం. రైతువేదికల స్థితిగతులపై ఉన్నతాధికారులకు నివేదిక అందించాం. నిధులు మంజూరు కాగానే వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి గ్రామాలకు దూరంగా రైతువేదికలు 15 చోట్ల వీడియో కాన్ఫరెన్స్ సేవలు మిగిలినవి అలంకారప్రాయమే.. -
నూతన బొగ్గు బ్లాక్‌లు సింగరేణికి కేటాయించాలి
● డిప్యూటీ సీఎంకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వినతి శ్రీరాంపూర్: సింగరేణికి నూతన గనులను కేటాయించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ నాయకులు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. హైదరాబాద్‌లో భట్టి విక్రమార్క నివాసంలో ఆదివారం కలిశారు. వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ మాట్లాడుతూ.. సింగరేణిలో కొత్త గనులను ఏర్పాటు చేస్తేనే సంస్థకు భవిష్యత్ ఉంటుందన్నారు. సత్తుపల్లి ఓసీపీ 3, ఇల్లెందు ఓసీపీ 3తోపా టు గతంలో అనుమతి ఇచ్చిన తాడిచర్ల గనులను సింగరేణికే కేటాయించాలని కోరారు. వీటిలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పీవీకే ఓసీపీ, కేటీకే ఓసీపీ, ఇల్లెందు ఓసీపీలలో బొగ్గు తీసే పనులను కాంట్రాక్టర్లతో కాకుండా సింగరేణి కార్మికులతో చేపట్టాలని కోరా రు. తమ విన్నపాలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని యూనియన్ నా యకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీయూసీకి చెందిన మిర్యాల రంగయ్య, కె.వీరభద్రయ్య, సారయ్య, వైవీ.రావు, మడ్డి ఎల్ల య్య, షేక్ బాజీసైదా, ఐఎన్టీయూసీ నాయకులు నర్సింహారెడ్డి, త్యాగరాజన్, సమ్మయ్య శంకర్రావు, వికాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గోలేటి భీమన్న జాతర
రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గోలేటి గ్రామ శివారులో గల శ్రీ భీమన్న ఆలయంలో ఆదివారం జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భీమన్న దేవుడిని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కోళ్లు, మేకలు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో వనభోజనాలు చేశారు. సాయంత్రం భీమన్న దేవుడి రథోత్సవం నిర్వహించారు. భీమన్న ఆలయంలో మొదటిసారిగా జాతర మహోత్సవం నిర్వహించగా, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన పులిహోర పంపిణీని ఎస్సై చంద్రశేఖర్ ప్రారంభించారు. -
వైద్యకళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ వైద్యకళాశాలకు స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆచా ర్య కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో ఆదివా రం నిర్వహించిన అఖిల భారత పద్మశాలి సంఘం 17వ మహాసభ వేదికపై ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. కళాశాల ఏర్పాటు నుంచీ జిల్లాకు చెందిన అనేక మంది తెలంగాణవాదులు, అభిమానులు మెడిక ల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు నా మకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఉద్యమకారుడికి గుర్తింపు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మంత్రులు, కలెక్టర్‌తోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకవెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వ వైద్యకళాశాలకు కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు నామకరణం చేస్తామని సీఎం ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అంబులెన్స్‌లో కవలలు జననం
ఆసిఫాబాద్: ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గర్భిణిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన ఎం.హారిక ప్రసవం కోసం ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు, స్కానింగ్ చేసిన అనంతరం గర్భంలో కవలలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టు లేకపోవడంతో 108 అంబులెన్స్‌లో మంచిర్యాలకు రెఫర్ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా రెబ్బెన సమీ పంలో ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఎంటీ టెక్నీషి యన్ హెచ్.వెంకటేశ్, పైలెట్ ఆర్.కార్తీక్ తెలి పారు. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. -
సమాన పనికి సమాన వేతనం అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి డిమాండ్ చేశారు. శనివా రం జిల్లా కేంద్రంలోని బాలికల డిగ్రీ కళాశాలలో ‘ప్రమాదంలో మహిళల హక్కులు– మన కర్తవ్యం’ అనే అంశంపై మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా చైల్డ్ కేర్ లీవ్ రెండేళ్లకు గాను ఇవ్వాలని, కాంట్రాక్ట్ సిస్టంలో పని చేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న వారి కి భారతీయ లేబర్ కోడ్‌కు అనుగుణంగా మి నిమం పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ శారద, అధ్యాపకులు తిరుమల, శారద, సబిత తదితరులు పాల్గొన్నారు. -
● ‘పీఎంశ్రీ’ పాఠశాలలకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● విజ్ఞానయాత్రకు ప్రభుత్వ విద్యార్థులు ● ఒక్కొక్కరికి రూ.500 కేటాయింపు
కెరమెరి(ఆసిఫాబాద్): నిత్యం నాలుగు గోడల మ ధ్య పాఠ్యాంశాల్లో మునిగిపోయే విద్యార్థులు సాధారణంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. వీరికి కొంత ఊరట కలిగించేందుకు ఉపాధ్యాయులు ఏటా విద్యార్థులను సొంత ఖర్చులతో విజ్ఞాన, విహారయాత్రలకు తీసుకెళ్తుంటారు. అయితే సొంత డబ్బులు వెచ్చించే స్తోమత పేదింటి విద్యార్థులకు ఉండదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారు విహారయాత్రకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ (పీఎంశ్రీ) స్కీంను తెచ్చి జిల్లాలో 18 పాఠశాలలను ఇందుకు ఎంపిక చేసింది. ఈ పాఠశాలలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. సర్కారు పాఠశాలల అభివృద్ధికి వివిధ రకాలుగా తోడ్పాటునందిస్తోంది. ఫర్నిచర్, పెయింటింగ్ ఇతర అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. దీంతో పీఎంశ్రీకి ఎంపికై న పాఠశాలలు ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఒక్కో విద్యార్థికి రూ.500 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా పేదకుటుంబాలకు చెందినవారే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి సర్కారు స్కూళ్లలో చదువుకుంటున్నవారే. ఇలాంటి వారికి బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకు గాను విజ్ఞాన, విహారయాత్రల కోసం ఒక్కో విద్యార్థికి రూ.500 విడుదల చేసింది. దీంతో ఆయా పాఠశాలల నిర్వాహకులు విద్యార్థులకు సమీప చరిత్రాత్మక ప్రదేశాలను చూపించేందుకు విహార, విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తున్నారు. ఇటీవల పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలల విద్యార్థులందరినీ అత్యధికంగా కెరమెరి మండలంలోని జోడేఘాట్తోపాటు చంద్రాపూర్‌లోని వి సాపూర్ బొటానికల్ గార్డెన్‌కు తీసుకెళ్తున్నారు. జోడేఘాట్లోని కుమురంభీమ్ మ్యూజియం, కుమురంభీమ్ ప్రతిమ, సమాధి, నృత్యం చేస్తున్న గుస్సాడీలు, ఆదివాసీల ఆభరణాలు, వాయిద్యాలు, వేటకు వాడే పనిముట్లు, ఆదివాసీల దేవతల ప్రతిమలను విద్యార్థులు తిలకించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చంద్రాపూర్‌లోని బొటానికల్ గార్డెన్లో మానవ శరీర నిర్మాణం, మైక్రోస్కోప్, 360 డిగ్రీస్ స్క్రీన్ కలిగిన థియేటర్లో త్రీడి ఎనిమల్ డాక్యుమెంటరీ, రాకెట్, న్యూటన్ నియమాలు, కండర వ్యవస్థ, ప్రపంచపు అతిపెద్ద పుష్పం, గుండె రక్తప్రసరణ, పాకే మొక్కల తీగలు తదితర అంశాల గురించి ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. విద్యార్థుల చేతికి ట్యాబ్లుసాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్లు మంజూరు చేయగా.. జాతీయ విద్యావిధానంలో భాగంగా పిల్ల లను సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు పీఎంశ్రీలో భాగంగా ట్యాబ్‌ల ద్వారా బోధిస్తున్నారు. పీఎంశ్రీకి 14 ఉన్నత పాఠశాలలు ఎంపిక కాగా ఒక్కోదానికి 25 ట్యాబ్‌ల చొప్పున మంజూరయ్యాయి. వీటిని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అందించి పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు వినియోగిస్తున్నారు. జిల్లాలో పీఎంశ్రీకి ఎంపికై న పాఠశాలలుఉన్నత పాఠశాలలు 14ప్రాథమికోన్నత పాఠశాలలు 2ప్రాథమిక పాఠశాలలు 2విద్యార్థుల సంఖ్య 6,475 -
భద్రత కల్పనలో విఫలం
చింతలమానెపల్లి: హిందూ ఆలయాలకు భద్రత క ల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారని బీజే పీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ఆరోపించారు. మండలంలోని డబ్బా గ్రామంలోని సమ్మక్క–సారక్క ఆలయంలో జంపన్న గద్దె మంటల్లో కాలిపోయిన నేపథ్యంలో శనివారం ఆయన ఘటనాస్థలికి చేరుకుని మాట్లాడారు. ఆలయంలో జంపన్న గద్దె వద్ద మంటలు అంటుకుని కాలిపోవడం విచారకరమని తెలిపారు. మండలంలో గతంలో ఖర్జెల్లి ముసలమ్మ గుట్ట శివాలయంలో, మండల కేంద్రంలోని చిలకలయ్య ఆలయంలో పలువురు దుశ్చర్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. భద్రత వైఫల్యాల కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని తెలిపారు. నిందితులను పట్టుకుని కఠినశిక్ష విధించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జంపన్న గద్దె మంటల్లో కాలిపోవడంలో వస్తున్న అనుమానాలను పోలీసులు నివృత్తి చేయాలని కోరారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని డి మాండ్ చేశారు. ఆలయాల భద్రత విషయంపై పో లీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలి పారు. అక్కడికి చేరుకున్న కౌటాల సీఐ రమేశ్, ఎ స్సై నరేశ్ ఆయనతో మాట్లాడుతూ.. సమ్మక్క గద్దె ల వద్ద సెక్యూరిటీ కెమెరా ఏర్పాటు చేశామని తెలి పారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు డోకె రామన్న, కౌటాల అధ్యక్షుడు కుంచాల విజయ్, నాయకుడు ఎల్ములె మల్లయ్య తదితరులున్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా సెషన్ జడ్జి ఎంవీ రమేశ్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కో ర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్, జూ నియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి జిల్లా, జడ్జి సతీ మణితో పాటు మహిళా న్యాయమూర్తులు, సి బ్బందిని శాలువాలతో సన్మానించారు. పూల మొక్క బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే ఏదైనా సాధించవచ్చని, ప్రతీ ఒక్కరికి విద్య ప్రాముఖ్యతను వివరించాలని పేర్కొన్నారు. మహిళా న్యాయవాదులు వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్, గాయత్రి, మధురిమ, స్వప్న, ప్రత్యూష, సురేశ్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
పోచమ్మ ఆలయంలో హోమం
బెజ్జూర్: మండల కేంద్రంలో నూతనంగా ని ర్మించిన పోచమ్మ ఆలయంలో శనివారం హో మం నిర్వహించారు. అంతకుముందు అమ్మవారి విగ్రహాన్ని భాజాభజంత్రీల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది వారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మ ధ్య నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదా నం చేశారు. నాయకులు మనోహర్‌గౌడ్, శ్రీవర్ధన్, చంద్రశేఖర్, భాస్కర్‌రాజు, తిరుపతి, మహేశ్, ఇస్తారి, శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఫీజు రాయితీని వినియోగించుకోవాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● ఎల్ఆర్ఎస్పై అవగాహన ఆసిఫాబాద్: ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కల్పించిన ఫీజు రాయితీని యజమానులు సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూ చించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దరఖాస్తుదారులు, సబ్‌రిజి స్ట్రార్ రైటర్లకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించిందని తెలిపారు. ఈ నెల 31లోపు ఫీజు చె ల్లించినవారికి 25 శాతం రాయితీ ఇవ్వనుందని పే ర్కొన్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలో 3,529 దరఖాస్తులు రా గా, 3,102 దరఖాస్తులను గుర్తించి ఎల్ఆర్ఎస్ చే సుకోవాలని లేఖలు పంపించినట్లు తెలిపారు. 335 గ్రామపంచాయతీల పరిధిలో 4,170 దరఖాస్తులు రాగా, 1,665 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నా రు. ఇప్పటివరకు 32 మంది ఎల్ఆర్ఎస్ కోసం ఫీజు చెల్లించి ప్రొసీడింగులు పొందినట్లు తెలిపారు. గతంలోలాగా కాకుండా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ రు సుం చెల్లిస్తే సంబంధిత అధికారులు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్లాట్లు రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ రుణసౌకర్యం కూడా పొందవచ్చని తెలిపారు. సమస్యలు ని వృత్తి చేసుకునేందుకు గ్రామపంచాయతీ, మున్సి పల్ అధికారులను నేరుగా సంప్రదించాలని పేర్కొన్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ హెల్ప్ డెస్క్‌ను 6300688040, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ హెల్ప్ డెస్క్‌ను 966648821 నంబర్లలో, గ్రామపంచాయతీల్లో కార్యదర్శులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య, టౌన్‌ప్లానింగ్ అధికారి యశ్వంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహిళా సంఘాల అభివృద్ధికి మరో అవకాశం
ఆసిఫాబాద్: మహిళా సంఘాల అభివృద్ధి కో సం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సంఘాల అభివృద్ధి దిశగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం మహిళా సంఘాల అద్దె బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి వెళ్లిన రెండు బస్సులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా దినో త్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళాశక్తి సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ప్రతీ మహిళా సమాఖ్యకు ఒక బస్సు చొప్పున కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా నుంచి 100 మంది మహిళా సంఘాల సభ్యులు రెండు బస్సుల్లో వెళ్లినట్లు పేర్కొన్నారు. -
సమాన పనికి సమాన వేతనం అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి డిమాండ్ చేశారు. శనివా రం జిల్లా కేంద్రంలోని బాలికల డిగ్రీ కళాశాలలో ‘ప్రమాదంలో మహిళల హక్కులు– మన కర్తవ్యం’ అనే అంశంపై మహిళా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా చైల్డ్ కేర్ లీవ్ రెండేళ్లకు గాను ఇవ్వాలని, కాంట్రాక్ట్ సిస్టంలో పని చేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న వారి కి భారతీయ లేబర్ కోడ్‌కు అనుగుణంగా మి నిమం పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ శారద, అధ్యాపకులు తిరుమల, శారద, సబిత తదితరులు పాల్గొన్నారు. -
● పని ప్రదేశంలో వసతులు కరువు ● ఎండలోనే పని చేస్తున్న కూలీలు ● అమలు కాని అదనపు భత్యాలు
గిట్టుబాటు కావడం లేదుగతంలో ఎండకాలం పనులు చేసినప్పుడు వేతనంతో పాటు వేసవి భత్యం అందజేసేవారు. ప్రస్తుతం ఎలాంటి అదనపు భత్యాలు లేకపోవడంతో కూలి గిట్టుబాటు కావడం లేదు. బయట వేరే పనులు దొరకకపోవడంతోనే ఉపాధి పనులకు వెళ్తున్నాం. – రమేశ్, ఉపాధి కూలీ, నవేగూడ, వాంకిడి మండలంమౌలిక వసతులు కల్పించాలిచాలాచోట్ల పని ప్రదేశాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. దీంతో కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. పని ప్రదేశంలో తప్పనిసరిగా టెంట్, తాగునీటి సౌక్యరం కల్పించాలి. సౌక్యరాలు కల్పించకుంటే ఆందోళన చేస్తాం. – నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడుతిర్యాణి: దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభించిన నుంచి గ త మూడేళ్ల దాకా పనుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు. 2022వ ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రానికి సంబంధించిన సాఫ్ట్వేర్ వాడుతున్నారు. కాగా, ఉపాధి కూలీలకు క్షేత్రస్థాయిలో సరైన సౌక్యరాలు కల్పించకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 91,721 యాక్టీవ్ జాబ్ కార్డులుండగా.. 1,70,268 మంది కూలీలు పని చేస్తున్నారు. ఎండలోనే పనులు చేస్తూ.. జిల్లాలో వారంరోజులుగా ఎండలు జోరందుకున్నా యి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో న మోదవుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే భా నుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఉపాధి కూలీలు పని ప్రదేశాల్లో త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జిల్లా అధికారుల ఆదేశాలతో పని ప్రదేశంలో కూలీలు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లతో పాటు తాగునీటి సదుపాయం క ల్పించారు. కూలీలకు గాయాలైనప్పుడు చికిత్స అందించేందుకు ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచారు. కానీ.. ఈ ఏడాది పనులు ప్రారంభమై రెండు వారాలైనా ఇప్పటివరకు చాలా పని ప్రదేశాల్లో కూలీలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో వారు ఎండలోనే పనులు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కూలీలకు పని ప్రదేశంలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ఆయా గ్రామపంచాయతీల పరిధిలో ఒక్కో కూలీకి రూ.2.50 చొప్పున ప్రభుత్వం అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానరాని అదనపు భత్యం పాత సాఫ్ట్‌వేర్‌లో వేసవి భత్యం పేరిట ఫిబ్రవరి నుంచి జూన్ వరకు చేసిన పనికి వచ్చే వేతనంతో పాటుగా 20–35శాతం వరకు ఆదనంగా కలిపి ఇ చ్చేవారు. అంతే కాకుండా పని ప్రదేశం ఊరి నుంచి ఐదు కిలో మీటర్ల కన్నా దూరంగా ఉంటే కిలో మీట రుకు కొంత చొప్పున జమచేయడంతో పాటు పార, గడ్డపార వినియోగించినందుకు కూలీలకు అదనపు భత్యం అందజేసేవారు. గతంలో గడ్డపారలు కూ డా ప్రభుత్వమే కూలీలకు ఉచితంగా సరఫరా చేసే ది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చెల్లింపులు చేపట్ట డం లేదు. దీంతో కూలీలకు వేతనం గిట్టుబాటు కాక ఉపాధి పనులపై అనాసక్తి చూపుతున్నారు.అసౌకర్యాల ‘ఉపాధి’ఈ చిత్రంలో కనిపిస్తున్నది తిర్యాణి మండలం చింతపెల్లి పంచాయతీ పరిధి చెలిమల వాగు వద్ద చేపల కుంటలో పూడిక తీస్తున్న కూలీలు. నిబంధనల ప్రకారం పంచాయతీ అధికారులు పని ప్రదేశంలో టెంట్, తాగునీరు, ఫస్ట్‌ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ.. ఇక్కడ అవేమీ కనిపించలేదు. ఎండలోనే కూలీలు పనులు చేస్తున్నారు. ఇంటి నుంచి తెచ్చుకున్న నీటినే తాగుతున్నారు. ఈ పరిస్థితి ఈ ఒక్కచోటే కాదు.. జిల్లాలోని అత్యధిక పని ప్రదేశాల్లో కనిపిస్తుంది. -
వేతనాలు చెల్లించాలని నిరసన
పెంచికల్పేట్: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ఎల్కపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం పలువురు కా ర్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఎనగందుల తిరుపతి మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌లో బుచ్చక్క, జయ, సుగుణ, పంచా యతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మల్ల క్క, నిర్మలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిచేసిన కాలానికి వెంటనే జీతాలు మంజూరు చేయాలని కోరారు. వీరికి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, బీజేపీ నాయకుడు హరీశ్, కాంగ్రెస్ నాయకుడు రమేశ్ మద్దతు తెలిపారు. -
నల్లనేలలో నారీ శక్తి
● బొగ్గు ఉత్పత్తిలోనూ మహిళల శ్రమ ● పురుషులతో సమంగా అతివలు ● భూగర్భంలోకి దిగుతున్న వైనం ● సింగరేణిలో పెరుగుతున్న ప్రాధాన్యతసాక్షి ప్రతినిధి, మంచిర్యాల/శ్రీరాంపూర్/రెబ్బెన(ఆసిఫాబాద్): బొగ్గు గని అంటే చీకటి గుహ. మగవాళ్లకే పరిమితమైన విధులను మహిళలు సైతం చేసి చూపిస్తామని నిరూపిస్తున్నారు. ‘మీరేం పని చేస్తారు’ అన్న ఎగతాళీ నోళ్లకు ముక్కుతాడు వేస్తూ మహిళలు తలచుకుంటే ఏ పనైనా చేయగలమని నిరూపించారు. కంపెనీలో కారుణ్య ఉద్యోగాల కారణంగా మహిళల సంఖ్య 1995 మందికి చేరింది. గత కొంతకాలంగా భూగర్భంలో కూడా పని చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కంపెనీలో పని చేస్తున్న మహిళలపై కథనం..కోర్టు తీర్పుతో హక్కులు..బ్రిటీష్ కాలంలో పురుషులతోపాటు సమానంగా మహిళలు గనుల్లో పని చేసేవారు. ప్రమాదాలు నిత్యకృత్యంగా జరిగినా, తిండి లేక చావడం కంటే పిడికెడు మెతుకుల కోసం పనులకు వచ్చేవారు. ఎక్కువగా వితంతువులే ఈ పనులకు వెళ్లేవారు. దేశ స్వాతంత్య్రం వచ్చాక మహిళలను గనుల్లో తీసుకోవడం నిలిపివేశారు. ప్రమాదవశాత్తు గనుల్లో కార్మికులు చనిపోతే వారి స్థానంలో భార్యలకు ఉద్యోగం కల్పించే వారు. అది కూడా ఉపరితలంలోనే గుట్కాల షెడ్డులు, కార్యాలయాల్లో అటెండర్లుగా నియమించారు. మహిళలకు కూడా అవకాశాలు కల్పించాలనే ఓ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయి. అన్ని స్థాయిల్లో విధులుకారుణ్య కోటాలో మొదట జనరల్ మజ్దూర్(ఫిమేల్)గా నియమిస్తూ ఆఫీసులు, సివిల్ డిపార్టుమెంట్లలో తేలిక పాటి పనులకు తీసుకునే వారు. వీరి సంఖ్య పెరగడంతో ఓసీపీలు, వర్క్‌షాప్‌లు, స్టోర్స్, సీహెచ్పీలతోపాటు భూగర్భ గనుల్లో కూడా దిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓసీపీల్లో హెమ్ సెక్షన్లో పురుషులతోపాటు వీరు సమానంగా యంత్రాలను మరమ్మతు చేస్తున్నారు. సీనియర్ మహిళా కార్మికులు సెక్యూరిటీ గార్డులుగా ఉన్నారు. జనరల్ మజ్దూర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, సబ్ ఓవర్సీస్ ట్రైనీ, స్టాఫ్‌నర్స్, క్లే పిల్ మజ్దూర్, స్వీపర్ బదిలీ వర్కర్లతోపాటు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అండర్ మేనేజర్లు, లా ఆఫీసర్స్ వంటి 27 హోదాల్లో పని చేస్తున్నారు. అడవుల రక్షణకు కట్టుబడి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అడవుల రక్షణకు కట్టుబడి పనిచేస్తున్నా. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ప్రజలు కూడా సహకరించినప్పుడే విధులు సులభతరం అవుతాయి. నా కుమార్తెను ఐఎఫ్ఎ్స్ చదివేందుకు సన్నద్ధం చేస్తున్నా. – స్వప్న, బీట్ అధికారి, సుర్దాపూర్ నిరంతరం అప్రమత్తం అడవిలో విధులు నిర్వర్తించడం మహిళలకు కష్టమైన పని. అయినా విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉంటాం. చిన్నతనం నుంచి యూనిఫాం విభాగంపై మక్కువ. డిగ్రీ తర్వాత అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేసిన అనంతరం అటవీశాఖ ఉద్యోగంలో చేరా. ప్రస్తుతం ఇన్చార్జి రేంజ్ అధికారిగా పనిచేస్తున్నా. సమాజంలో పురుషులతో సమానంగా పనిచేస్తున్న మహిళలను గుర్తించాలి. – సరోజిని, రేంజ్ అధికారి, గిన్నెధరిఅధికారుల సహకారం అవసరం ఇతర శాఖలతో పోల్చితే అటవీ శాఖలో ఉద్యోగం కత్తిమీద సామే. 24 గంటలపాటు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతాధికారుల సహకారం లేకుండా పనిచేయడం ఇబ్బందిగా మారుతుంది. అటవీశాఖలో మహిళా ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం ఎంతో అవసరం. యూనిఫాం ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. – అనూష, అటవీ సెక్షన్ అధికారి, జైనూర్ ప్రోత్సహిస్తే రాణిస్తారు సమానత్వం చూపెట్టి ప్రోత్సహిస్తే మహిళలు పురుషులకంటే మిన్నగా రాణిస్తారు. ఏ పని అప్పగించినా నిజాయతీగా, అంకితభావంతో పని చేస్తారు. మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. కంపెనీ వారి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఆరు నెలలు మెటర్నిటీ, పిల్లలకు 18ఏళ్లు వచ్చే లోపు 2ఏళ్ల చైల్డ్ కేర్ లీవులు ఉన్నాయి. ఎవరైనా వేధింపులకు గురైతే ఏరియా ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. మహిళల సంరక్షణకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటోంది. – ఎస్.శిరీషారెడ్డి, డీజీఎం(లా ఆఫీసర్), శ్రీరాంపూర్పోరాడి సాధించాం.. బీటెక్‌లో మైనింగ్ కోర్సు అంటే అందరూ భయపెట్టినా పట్టించుకోలేదు. 2017లో కంపెనీ ఎంజీఈటీ నోటిఫికేషన్లో మొదట మెన్ అనే నిబంధన ఉంది. మైనింగ్ కోర్సుకు అవకాశం ఇచ్చి ఉద్యోగానికి వచ్చే సరికి ఎందుకు పనికి రామని ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ రాశాం. ఎమ్మెల్యేలను కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. మా పోరాటం ఫలితంగా గత సంవత్సరం జేఎంఈటీ, ఎంజీటీ పోస్టుల్లో ఉమెన్‌కు అవకాశం కల్పిస్తే ఉద్యోగం సాధించాను. అందరూ సహకరిస్తున్నారు. – పి.లక్ష్మి, ఎంజీటీ (అండర్ మేనేజర్ ), ఆర్కే 7 గని, శ్రీరాంపూర్కన్వేయర్ ఆపరేటర్‌గా.. మాది తిర్యాణి మండలంలోని దేవాయిగూడ గ్రామం. నాలుగు సంవత్సరాల క్రితం పీడీఎఫ్ కింద సింగరేణిలో ఉద్యోగం వచ్చింది. మొదట బదిలీ వర్కర్‌గా, ప్రస్తుతం జనరల్ మజ్దూర్‌గా పని చేస్తున్నా. సీహెచ్‌పీలో ప్రస్తుతం కన్వేయర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాం. గతంలో కన్వేయర్ ఆపరేటర్లుగా కేవలం పురుషులు మాత్రమే పనిచేసేవారు. కానీ ఇప్పుడు కన్వేయర్ ఆపరేటర్లుగా, పంపు ఆపరేటర్లుగా, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ హెల్పర్లుగా, గ్రీసర్ హెల్పర్లుగా అన్ని విధులు నిర్వర్తిస్తున్నాం. – సిడాం అనురాధ, జనరల్ మజ్దూర్, గోలేటి సీహెచ్పీపనిలో తేడా లేదు పని విషయంలో ఆడ మగ అని తేడా ఏమీ లేదు. సంవత్సర కాలంగా క్వాలిటీ విభాగంలో కెమిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నా. గతంలో సింగరేణిలో మహిళా ఉద్యోగులు అతి తక్కువ సంఖ్యలో ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య బాగా పెరిగింది. ఆఫీస్ అటెండెంట్ పనులకే పరిమితం కాకుండా అన్నిరకాల విధులు నిర్వహిస్తూ సత్తా చాటుకుంటున్నారు. – కలవోతు జ్యోతి, జూనియర్ కెమిస్ట్, గోలేటి సీహెచ్పీప్రభుత్వ కొలువు వదిలి.. మాది దేవాయిగూడ గ్రామం. గతంలోనే ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం వస్తే ఐదేళ్లపాటు తిర్యాణి మండలం చోపిడిలో పని చేశా. కై రిగూడ ఓసీపీలో మా భూములు, ఇల్లు ముంపునకు గురికావడంతో 34 జీవో ప్రకారం సింగరేణిలో ఉద్యోగం వచ్చింది. టీచర్ కొలువు వదులుకుని సింగరేణి ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం పంపు ఆపరేటర్‌గా, కన్వేయర్ ఆపరేటర్‌గా పురుషులతో సమానంగా విధులు నిర్వర్తించడం సంతోషంగా ఉంది. – వరలక్ష్మి, జనరల్ మజ్దూర్, గోలేటి సీహెచ్పీసింగరేణిలో మహిళా ఉద్యోగులుభూగర్భంలోనూ విధులుప్రస్తుతం వీలున్న చోట్ల భూగర్భ గనుల్లో మహిళలు పని చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే 7, ఎస్సార్పీ 3 గనుల్లో ఎలక్ట్రీషియన్లు, ఫోర్‌మెన్, జేఎంఈటీ, ఎంజీటీ(మైన్ అండర్ మేనేజర్)లు ఉద్యోగ పరీక్షలు రాసి ఎంపికయ్యారు. మైనింగ్ అధికారులుగా మహిళలు ఆరంగేట్రం చేయడంతో కంపెనీలో కొత్తదనం సంతరించుకుంది. ఎంజీటీగా రెండేళ్ల తర్వాత అండర్ మేనేజర్‌గా, ఓసీపీల్లో ఈపీ ఆపరేటర్లుగా అవకాశం కల్పిస్తున్నారు. -
బస్టాప్‌ల్లో ఇబ్బందే..!
చెప్పలేను 59ఉంది 87మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశంలేదు 204సెల్ఫోన్లో వచ్చే మెస్సేజ్‌లతో 72మీ కాలేజీ, పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..తెలియని వారు 204తెలిసిన వారే.. 146బస్టాప్‌లో 204కాలేజీ లేదా ఆఫీసులో 74 -
● ఇళ్లలో స్వేచ్ఛ లభిస్తోంది.. ● బయట అనుమానపు చూపులే ● తెలియని వారితోనే సమస్యలు ● మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సర్వే
మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలటౌన్/చెన్నూర్/నిర్మల్/వాంకిడి/బోథ్/ఆసిఫాబాద్‌రూరల్: మహిళలు, యువతులు, విద్యార్థినులు అవకాశాల ను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాల్లో రాణిస్తున్నా రు. పురుషులకు దీటుగా పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ స మాజంలో అక్కడక్కడ మహిళలపై చిన్నచూపు ఉండడం వల్ల అనేక అవకాశాలకు దూరమవుతున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులు, ఆధిపత్య ధోరణులు మహిళలకు ప్రతిబంధకంగా మారుతున్నా యి. ఎక్కడ.. ఎవరితో వివక్షకు గురవుతున్నారనే అంశాలపై ‘సాక్షి’ మంచిర్యాలలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థినులు, యువతులు, మ హిళలు 350మంది నుంచి సర్వే ద్వారా వివరాలు సేకరించింది. తెలియని వారు, ఆకతాయిలతో ఇక్కట్లు పడుతున్నట్లు తేల్చిచెప్పారు. బస్టాప్‌ల్లో అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వె ల్లడైంది. ఇళ్లలో ఆడ, మగ అనే వివక్ష లేదని, అభిప్రాయాలకు గౌరవం లభిస్తోందని స్పష్టమైంది. -
‘అన్నిరంగాల్లో అతివలే మేటి’
ఆసిఫాబాద్‌అర్బన్: సమాజంలో నేడు అన్నిరంగాల్లో అతివలే మేటి అని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట ఎస్పీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సిబ్బందితో కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువని, ప్రపంచానికి వెలుగు చూపేది వారేనని కొనియాడారు. పురుషులతో సమానంగా పోటీ పడుతూ విధులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. పోలీసుశాఖలోనూ ఉత్తమ ప్రతిభ చూపుతున్నారన్నారు. మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎ స్పీ కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, ఆర్ఐ అడ్మిన్ పెద్దన్న, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సీఐ రవీందర్, ఎంటీవో ఆర్ఐ అంజన్న, ఎస్సైలు తేజస్విని, సౌమ్య, తిరుమల, శిరీష, భరో సా కేంద్రం, షీటీం, ఐటీకోర్, డీసీఆర్బీ, సఖి కేంద్రం సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. -
ఎండల నుంచి రక్షణకు చర్యలు చేపట్టాలి
ఆసిఫాబాద్: ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లా టాస్క్‌ఫోర్స్ సమన్వయ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి మొదటి వారం నుంచి ఎండ తీవ్రత పెరిగినందున ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించా రు. వ్యవసాయ, ఉపాధిహామీ కూలీలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటలలోపు పనులు ముగించుకోవాలని సూచించారు. పనిప్రదేశాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికుల కోసం తాత్కాలిక బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు నీటితొట్టీలు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో సీతారాం, డీపీవో భిక్షపతి, డీఆర్డీవో దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీవో రాంచందర్, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య పాల్గొన్నారు. -
అన్నీ తానై..
● భర్త మరణంతో నలుగురు పిల్లల భారం మోసి.. ● కౌలు రైతుగా మారి.. ● ఆదర్శంగా తానుబాయి జీవితం కెరమెరి(ఆసిఫాబాద్): నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత అనారోగ్యంతో భర్త చనిపోయాడు. మనస్తాపంతో తానూ ఈ లోకాన్ని విడిచిపోవాలని అనుకుంది. అయితే పిల్ల లు గుర్తుకొచ్చి ఆగిపోయింది. చిన్నారుల పరిస్థితి ఎలా అని ఆలోచించింది. బాధను దిగమింగుకుని కూలీ పనులు చేసుకుంటూ.. కౌలుకు భూమి సాగు చేస్తూ పిల్లల ను ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఆదర్శమూర్తిగా నిలిచింది వాడై తానుబాయి. వ్యవసాయం చేస్తూ..కెరమెరి మండల కేంద్రంలోని గోపాల్‌వాడకు చెందిన తానుబాయి భర్త మల్లేశ్ 2011 ఫిబ్రవరిలో అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటికే వారికి 11 ఏళ్ల నాగమ ణి, ఏడేళ్ల ఆరుణ, ఐదేళ్ల ప్రియాంకతో పాటు నాలుగేళ్ల కుమారుడు విజయ్ ఉ న్నారు. పిల్లల కడుపు నింపేందుకు కూలీ పనులకు వెళ్లడం ప్రారంభించింది. చిన్నారులను బంధువుల ఇళ్లలో ఉంచేది. కూలీ డబ్బులు సరిపోకపోవడంతో భూమిని కౌ లుకు తీసుకుని సాగు చేయడం ప్రారంభించింది. కొడుకును వీపుపై కూర్చొబెట్టుకుని పనులు చేసేది. క్రమంగా జీవితంలో స్థిరపడి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిపించింది. కొడుకును కూడా ప్రయోజకుడిగా మార్చేందుకు శ్రమిస్తోంది. మన భయమే వెనుకబాటుతనానికి కారణమని, ధైర్యంతో ముందుకెళ్తే విజయం సాధించవచ్చని తానుబాయి అంటోంది. -
‘హస్త’వ్యస్తం!
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్‌లో నెలకొన్న విబేధాల దాగుడుమూతల వ్యవహారానికి పూర్తిగా తెరపడ్డట్లయింది. ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఎదుటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిఽధిలోని ముఖ్య నాయకులు పార్టీ స్థితిగతుల గురించి చెబుతూ వాపోయారు. వ్యవహారం ఇలాగే కొనసాగితే పార్టీ పూర్తిగా పట్టు కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు జిల్లా నేత ఇక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం శృతిమించిపోయిందని ఇన్చార్జి ఎదుట నేరుగా ఆ నేత పేరు చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీలో సంచలనం కలిగిస్తోంది. మొత్తంగా పార్టీ పరిస్థితులను చక్కదిద్దాలంటే ఇక్కడ ప్రత్యేక కమిటీలు నియమించాల్సిందేనని రాష్ట్ర ఇన్చార్జి నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆ దిశగా కార్యచరణకు సిద్ధం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. దిద్దుబాటు చర్యలేవి?కాంగ్రెస్‌లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచే నెలకొన్న విబేధాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. పార్టీలో ముఖ్య నాయకులు ఇన్నాళ్లు చెప్పుకోలేని పరిస్థితిలో మౌనం దాల్చగా, కొత్తగా నియమితులైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాక, ఆమె సమావేఽశంలో ఏ విషయాన్నైనా నేరుగా చెప్పండని నాయకులతో పేర్కొనడంతో వారు కూడా ధైర్యం చేసి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఆమె ముందు ఏకరువు పెట్టారు. దీంతో కొన్నాళ్లుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీలో తీవ్రరూపం దాల్చిన పరిస్థితులు రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి వెళ్లాయి. బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఇన్చార్జితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ పరిధి నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రి ఐకే రెడ్డి, వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ దండే విఠల్, నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, శ్రీహరిరావు, ఆడె గజేందర్, సీనియర్ నాయకులు నరేశ్‌జాదవ్, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్‌రెడ్డి, రేఖానాయక్, రాథోడ్ బాపూరావు తదితరులు హాజరయ్యారు. సమన్వయ లేమితోనే.. ఈ దశలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నేతల మధ్య సమన్వయలేమి ఉందని రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి ఇవే కారణమయ్యాయని ఆమె వివరించారు. రాష్ట్ర కేబినెట్‌ను పూర్తిస్థాయిలో విస్తరించిన తర్వాత, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జిగా తాను తప్పుకొంటానని సీతక్క పేర్కొనడం ఈ సమావేశంలో కలకలం సృష్టించింది. ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్‌లో పార్టీ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని, ఈ సమస్యను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)కి సిఫారసు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం వారీగా ఓ త్రీమన్ కమిటీని నియమించి పార్టీని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అంతే కాకుండా జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి డీసీసీ, నామినేట్ పదవుల నియామకంలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పక్క జిల్లా నేత జోక్యంపై గుస్సా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిఽధిలో గత ఎన్నికలకు ముందు నుంచి పక్క జిల్లా నేత జోక్యం చేసుకోవడం, అన్ని వ్యవహారాల్లో కల్పించుకోవడంపై జిల్లా నాయకులు రాష్ట్ర ఇన్చార్జికి ఫిర్యాదు చేశారు. అసలు జిల్లాకు ఆయనకు సంబంధం లేకపోయినా అన్ని వ్యవహారాల్లో ఆయనే జోక్యం చేసుకోవడమేమిటని వారు ఆవేదన వెల్లగక్కారు. ఈ విషయంలో ఒకరిద్దరు నాయకులు ఆ నేత తీరును వివరించినప్పటికీ, మొదట పేరు చెప్పనట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ఇన్చార్జి జోక్యం చేసుకుని నేత పేరు చెప్పాలని నాయకులతో పేర్కొనడంతో వారు ధైర్యం చేసి అందిరి ముందే అతడి పేరు వెల్లడించినట్లు సమాచారం. దీంతో సమావేశంలో కొంతమంది నేతలకు ఈ పరిస్థితి మింగుడుపడని విధంగా మారినట్లు చెప్పుకొంటున్నారు. అంతే కాకుండా జిల్లాతో సంబంధమున్న ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఫోన్ చేసినా లేపడం లేదని కాగజ్‌నగర్‌కు చెందిన ఓ నేత రాష్ట్ర ఇన్చార్జి ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పట్టు పోతోందన్న కాంగ్రెస్ నేతలు పక్క జిల్లా నేత కారణమని ఆరోపణ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఎదుట ఆవేదన సమన్వయం లేదన్న మంత్రి సీతక్క దిద్దుబాటు చర్యలకు ప్రత్యేక కమిటీనేతల మధ్య కుదరని సయోధ్యపార్టీలో పాత నాయకులు తమకు ప్రాధాన్యత దక్కడం లేదని ఓ వైపు వాపోతుండగా.. పార్టీ లోకి వచ్చిన ముఖ్య నేతలు తమకు పార్టీలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందని రాష్ట్ర ఇన్చార్జి ఎదుట ఏకరువు పెట్టినట్లు తెలుస్తోంది. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ తనకు నియోజకవర్గంలో పర్యటనలకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండి, ఆతర్వాత ఇతర పార్టీలోకి వెళ్లిన తాను మళ్లీ మాతృ పార్టీలోకి వచ్చిన తర్వాత గుర్తింపు లభించడం లేదని ఇన్చార్జి ఎదుట వాపోయినట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలదీ ఇదే పరిస్థితి అని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా పార్లమెంట్ పరిధిలో పార్టీ పరంగా ఉన్న పరిస్థితులు రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి వెళ్లడంతో ఇకనైన పార్టీని గాడిలో పెడతారా.. అని కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బాలికలు ఉన్నత లక్ష్యాలు సాధించాలి
ఆసిఫాబాద్‌రూరల్: బాలికలు ఉన్నత లక్ష్యాలు ఎంచుకుని పట్టుదలతో అనుకున్నది సాధించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లోని జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో గురువారం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావో.. బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికలను బతికించుకుని.. వారిని ఉన్నతస్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, శిశు సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద, రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పేదల భూముల్లో అక్రమ దందా!
● నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల్లో క్వారీలు ● ఎన్వోసీ ఇచ్చిన రెవెన్యూ అధికారులు ● నష్టపోతున్న రైతులు కౌటాల(సిర్పూర్): కొందరు వ్యక్తులు ధనదాహంతో పేదల సంపదను కొల్లగొడుతున్నారు. నిరుపేదలు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిన భూముల్లో క్వారీలు నిర్వహిస్తూ దందా సాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధి కారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కౌటాల మండలం ముత్తంపేట గ్రామ శివారులో నాలుగు స్టోన్ క్రషర్లు ఉన్నాయి. వీటికి బండరాళ్లు తవ్వడం కోసం క్వారీలు నడుస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్థానిక ప్రజలు బ్లాస్టింగ్లతో భయంభయంగా గడుపుతున్నారు. క్వారీల యజమానులు పేలుడు పదార్ధాల విషయంలో ఇష్టారీతినా వ్యహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వకుండానే పని కానిస్తున్నారు. బ్లాస్టింగ్ విషయంలో లెక్కాపత్రం లేకుండా పోయింది. గనులశాఖ సైతం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలపై పట్టింపేది..?కౌటాల మండలం ముత్తంపేట సమీపంలో 8 కంకర క్వారీలు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఐదు హెక్టార్లకు మించి విస్తీర్ణంలో ఉంటే రాష్ట్రస్థాయి అధికారులు, అంత కంటే తక్కువగా ఉంటే క్వారీల నిర్వహణకు కలెక్టర్, ఆర్డీవో, కాలుష్య నియంత్రణ మండలి, డీఎఫ్‌వోలతో పాటు మరో 12 మంది అధికారులు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటేనే అనుమతులు జారీ చేస్తారు. సదరు భూములు సాగుకు యోగ్యంగా లేవని, అసైన్డ్ కావని, తహసీల్దార్ ఎన్వోసీ జారీ చేస్తారు. క్వారీలు గ్రామాలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని కాలుష్య నియంత్రణ మండలి ఈసీ ఇచ్చిన తర్వాతే తవ్వకాలు ప్రారంభించాలి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అసైన్డ్ భూముల్లో ఏర్పాటుకౌటాల మండలం చందారం శివారులోని సర్వే నంబర్ 22లో పూర్తిగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులోనే వందల ఎకరాలను పేద ప్రజలకు అసైన్డ్ చేశారు. ప్రస్తుతం ఈ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు కొనసాగుతున్నాయి. ‘క్వారీల ఏర్పాటుకు భూములు ఇస్తే ఎంతోకొంత నగదు వస్తుంది.. లేకుంటే నయాపైసా రాదు’ అంటూ నిర్వాహకులు రైతులను భయపెట్టారు. అధికారులు, పోలీసుల చుట్టూ అన్నదాతలు తిరిగి గత్యంతరం లేక భూములు అప్పగించారు. అప్పటినుంచి నిత్యం తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన అధికార బృందం.. పూర్తి అసైన్డ్ భూముల్లో క్వారీల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారు. కొందరు రెవెన్యూ, గనులశాఖ అధికారులు మామూళ్లకు ఆశపడి అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక్కరే సర్వేయర్ ఉండటంతో క్వారీల తనిఖీలు పూర్తిస్థాయిలో చేపట్టడం లేదు. దీంతో కంకర తరలింపుపై లెక్కాపత్రం లేకుండా పోతోంది. అసైన్డ్ భూముల్లో అక్రమంగా సాగుతున్న ఈ కంకర క్వారీలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేలుళ్ల ధాటికి భారీ బండరాళ్లు పంట చేలలోకి వచ్చి పడుతున్నాయి. సమీపంలో ఉన్న ముత్తంపేట గ్రామంలో ఇళ్లు పగుళ్లు తేలుతున్నాయి. కంకర తరలించే వాహనాలతో సిర్పూర్(టి) మండలంలో రోడ్లు గుంతలమయంగా మారాయి. కొత్తగా వేసిన రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. అసైన్డ్ భూముల్లోనే.. కౌటాల మండలంలోని చందారం శివారులో అసైన్డ్ భూములు ఉన్నాయి. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు ఏర్పాటు చేశారు. పేదరైతుల భూముల్లోని సంపదను కొల్లగొడుతున్నారు. క్రషర్ యజమానులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. – ఆదే వసంత్‌రావు, ముత్తంపేట, కౌటాల ఎన్వోసీ ఇవ్వలేదు నేను విధుల్లో చేరినప్పటి నుంచి ముత్తంపేట సమీపంలో క్వారీల ఏర్పాటుకు ఎలాంటి ఎన్వోసీ ఇవ్వలేదు. క్వారీలు తనిఖీ చేసి.. ఏ భూమిలో ఏర్పాటు చేశారో పరిశీలిస్తాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. – పుష్పలత, తహసీల్దార్, కౌటాల -
నర్సరీల్లో మొక్కలను సంరక్షించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అంకుసాపూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లో ప్రతి మొక్కనూ రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవి నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా నీటిని అందించాలని ఆదేశించారు. ఉపాధిహామీ సిబ్బంది నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. అనంతరం మండలంలోని ఎల్లారంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించారు. ఎండాకాలంలో ఉపాధిహామీ కూలీల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతిఒక్కరికి పని కల్పించాలన్నారు. ఆయన వెంట డీఆర్డీవో దత్తారావు, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
గడువు!
ముంచుకొస్తున్న ● జిల్లాకు ఈజీఎస్ ద్వారా 354 పనులు మంజూరు ● 174 పనులు మాత్రమే గ్రౌండింగ్ ● ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు ● రోడ్లు సకాలంలో పూర్తికాకుంటే నిధులు వెనక్కి..రెబ్బెన మండలం బాలాజీ నగర్లో సీసీరోడ్డు మంజూరైన అంతర్గత రోడ్డు 354 పనులు.. రూ.13 కోట్లుజిల్లాలోని 15 మండలాలకు ప్రభుత్వం రూ.13 కోట్ల ఈజీఎస్ నిధులతో 354 పనులు మంజూరు చేసింది. అన్ని మండలాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధికే ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత క్రమంలో సీసీ రోడ్ల కోసం ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. ప్రభుత్వం ఆ మోద ముద్రవేసింది. గత నెలలోనే సీసీరోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉండగా ఈసారి ఆలస్యంగా మొదలయ్యాయి. 354 పనుల్లో ఇప్పటివరకు కేవలం 174 పనులు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయి. మిగిలిన పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ వా రంలోనే మిగిలిన పనులు ప్రారంభించి, ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మార్చి 31లోగా పూర్తవుతాయా.. లేదా అనేది అనుమానంగా మా రింది. వారంలోగా రోడ్ల నిర్మాణానికి కావా ల్సిన ఇసుక, కంకర, మిషనరీ, కూలీలను సమకూర్చుకోవడం కష్టతరంగా మారనుంది. గడువు దాటిన తర్వాత పూర్తయితే బిల్లులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లాకు మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తారా.. లేక చేతులు ఎత్తేస్తారా అనేది చూడాలి. రెబ్బెన(ఆసిఫాబాద్): గ్రామాల్లో చిన్నపాటి వర్షాలకే చిత్తడిగా మారే రోడ్ల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం నిధులతో సీసీరోడ్లు మంజూరు చేసింది. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ పనులు ఈ నెలాఖ రున పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో పనులు పూర్తికావడంపై అనుమానాలు నెలకొన్నాయి. వాస్తవానికి గత నెలలోనే అన్ని మండలాల్లో ఈ పనులు ప్రారంభించాలి. అని వార్య కారణాలతో ఆలస్యంగా మొదలయ్యాయి. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం పనులు కొనసాగుతుండగా.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇంకా మొదలు పెట్టలేదని తెలుస్తోంది. యుద్ధ ప్రతిపాదికన రోడ్డు నిర్మాణాలు పూర్తిచేసేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మార్చి 31లోగా జిల్లాకు మంజూరైన పనులన్నింటి నీ పూర్తిచేయని పక్షంలో నిధులు వెనక్కి వెళ్లిపోనున్నాయి. గతేడాది కూడా సకాలంలో పనులు ప్రారంభించని కారణంగా ఈజీఎస్ నిధులు వెనక్కివెళ్లిపోయాయి. పర్యవేక్షణతోనే పనుల్లో నాణ్యతఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాకు మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభించి, పూర్తి చేసేందు కు కేవలం 24 రోజుల గడువు మాత్రమే మిగిలింది. తక్కువ సమయంలో హడావుడిగా చేపట్టే పనుల్లో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. గ్రామాల్లో పనులన్నీ ఏకకాలంలో ప్రారంభమైతే ఇంజినీరింగ్ అధి కారుల పర్యవేక్షణ లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. మండలానికి ఒక్క ఏఈఈ మాత్రమే ఉన్నారు. వారు ఒక్కరే అన్ని పనులను పర్యవేక్షించడం సా ధ్యం కాదు. కాంట్రాక్టర్లు సిమెంట్, ఇసుక, కంకర సమపాళ్లలో వాడకుండా నాసిరకమైన పనులు చేప ట్టే అవకాశం ఉంది. రోడ్లు పూర్తయిన కొన్నాళ్లకే బీ టలు వారే ప్రమాదం ఉంది. సీసీరోడ్డు నిర్మాణ ప నులు పూర్తయ్యాక కనీసంగా 15 రోజులపాటు త ప్పనిసరిగా క్యూరింగ్ చేయాలి. కానీ కాంట్రాక్టర్లు ఒకటి, రెండు రోజులే క్యూరింగ్ చేసి చేతులు దు లుపుకొంటున్నారు. కొద్దిరోజులకే రోడ్లు కంకర తేలి దెబ్బతింటున్నాయి. గతంతో పోల్చితే ఈసారి త క్కువ సమయం మాత్రమే ఉండటంతో పనుల్లో నా ణ్యతపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.సకాలంలో పూర్తిచేస్తాం జిల్లాకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి రూ.13 కోట్ల ఈజీఎస్ నిధులతో 354 పనులు మంజూరయ్యాయి. ఇందులో కొన్నిరోడ్లు ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయి. మిగిలిన పనులు కూడా ఈ వారంలోగా ప్రారంభిస్తాం. సకాలంలో పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కాంట్రాక్టర్లు రోడ్ల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్స్, మిషనరీ సమకూర్చుకుంటున్నారు. దీంతో పనులు పూర్తి చేయడం తేలిక అవుతుంది. – ప్రభాకర్, పంచాయతీరాజ్ ఈఈ -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు షురూ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ సెకండియర్ వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ని రెండు నియోజకవర్గాల్లో 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,984 మంది విద్యార్థులకు 4,855 మంది హాజరు కాగా, 129 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 4,248 మందికి 4,148 మంది, ఒకేషనల్ విభాగంలో 736 మందికి 707 మంది పరీక్ష రాశారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని డీఐఈవో కళ్యాణి తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, వాంకిడిలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. -
విద్యుత్ సరఫరాకు ముందస్తు ప్రణాళిక
ఆసిఫాబాద్: వేసవిలో అంతరాయం లేకుండా వి ద్యుత్ సరఫరా చేసేందుకు ముందస్తు ప్రణాళిక సి ద్ధం చేసినట్లు ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజి నీర్ రాథోడ్ శేషారావు తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం మాట్లాడారు. సర్కిల్ పరిధిలో 33/11 కేవీ సబ్స్టేషన్లలో రెండుచోట్ల 3.15 ఎంవీఏ అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నాలుగు చోట్ల 3.15 ఎంవీఏ టీవో, 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మెయింటనెన్స్ సమయంలో ఒక లైన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా వినియోగదారులకు ప్రత్యామ్నాయ లైన్(ఇంటర్‌లింక్ లైన్) ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా ఎనిమిది చోట్ల లింకింగ్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఓవర్‌లోడ్ పెరిగే అవకాశం ఉన్నచోట 36 అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. మరో 8 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచామని పేర్కొన్నారు. బంచ్ ఫీడర్లు ఉన్న చోట ఇప్పటివరకు కొత్తగా 10 వీసీబీలు అమర్చామని తెలిపారు. భారీ వర్షాలకు విద్యు త్ అంతరాయం ఏర్పడితే.. వేగంగా పునరుద్ధరించేందుకు బ్రేక్ డౌన్ టీంలు ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్ఫర్మర్ స్ట్రక్చర్ల వద్ద సరీసృపాలతో షార్ట్ సర్క్యుట్ కాకుండా 474 ప్రాంతాల్లో మోనోపాస్ట్లు ఏర్పాటు చేశామని వివరించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. -
వార్షిక లక్ష్య సాధనకు కృషి చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక లక్ష్య సాధనకు ప్రతిఒక్కరూ కృషి చే యాలని ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి సూచించారు. ఏరియాలోని కై రిగూడ ఓసీపీని గురువారం సందర్శించారు. ఫిబ్రవరిలో కైరిగూడలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన షావల్ ఆపరేటర్, డంపర్ ఆపరేటర్లతోపాటు ఇతర ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ 2024– 25 ఆర్థిక సంవత్సరంలో కైరిగూడ ఓసీపీకి నిర్దేశించిన 37.5లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించేందుకు ఉద్యోగులంతా స మష్టిగా కృషి చేయాలని అన్నారు. ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి శంకర్, ప్రాజె క్టు ఇంజినీరు వీరన్న, సేఫ్టీ అధికారి నారాయణ, డీవైపీఎం వేణు, ఏఐటీయూసీ నాయకులు దివాకర్, ఓదెలు పాల్గొన్నారు. -
క్రీడాపాఠశాలలో ప్రవేశానికి అర్హత పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ప్రవేశానికి బాలబాలికలకు అర్హత పోటీలు నిర్వహించినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలికల క్రీడా పాఠశాలలో ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీలను గురువారం జెండా ఊపి ప్రారంభించారు. డీ టీడీవో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా అర్హత క్రీ డాపోటీలకు 105 మంది బాలికలు, 64 మంది బాలురు హాజరయ్యారని తెలిపారు. తొ మ్మిది అంశాల్లో క్రీడాపోటీలు నిర్వహించామన్నారు. ప్రతిభ చూపిన బాలురులకు ఈ నెల 10న ఉట్నూర్‌లో, ఈ నెల 12న జిల్లా కేంద్రంలో బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, పీడీలు, పీఈటీలు పాల్గొన్నా రు. -
విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి
సిరికొండ: విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. తుమ్మల్‌పాడ్ గ్రామానికి చెందిన ఇంగోలే నాగోరావ్, కుసుంబాయి దంపతుల రెండో కుమారుడు ఇంగోలే విలాస్ (24)బుధవారం ఇంటి మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ వైరుకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఇచ్చోడ ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. మృతుడు ఆరునెలల క్రితమే దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు. గోండుగూడలో ఒకరు..కడెం: మండలంలోని చిట్యాల్ గోండుగూడకు చెందిన పందిరి జలపతి (56) గోదావరి నదిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలపతి ఈనెల 4న స్నానం చేయడానికి గోదావరినదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుని భార్య సీతాబాయి ఫిర్యాదు మేరకు బుధవా రం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వగ్రామం చేరిన మృతదేహంలక్సెట్టిపేట: గత నెల 27న ఓమన్‌లో మృతి చెందిన వలస కూలీ మృతదేహం బుధవారం స్వగ్రామం చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హన్మంతుపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల కొమురయ్య(48) ఉపాధి నిమిత్తం రెండేళ్లక్రితం ఓమన్ దేశానికి వెళ్లి అక్కడ భవన నిర్మాణ రంగంలో కూలీగా పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తులో పనిచేస్తుండగా అదుపుతప్పి కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించా రు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వృద్ధుడు ఆత్మహత్యదండేపల్లి: గడ్డిమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసినొద్దీన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని వెల్గనూర్‌కు చెందిన అక్కల మల్లేశం (79) కొన్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు కుమారులను కోల్పోయాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందడంతో ఈనెల 4న గడ్డిమందు తాగి వాంతులు చేసుకోవడంతో గమనించిన స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు రెఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుని కుమార్తె రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. అధికారి ఇంట్లో చోరీకి విఫలయత్నంభైంసాటౌన్: పట్టణంలోని సాయికాటన్ ఏరియాలో ఉంటున్న ఆర్అండ్బీ డీఈఈ సునీల్ ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి వి ఫలయత్నం చేశారు. సాయికాటన్‌లోని ఓ ఇంట్లో అ ద్దెకు ఉంటున్న భైంసా ఆర్అండ్బీ డీఈఈ సునీల్ మంగళవారం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బుధవా రం ఇంటి తాళం తెరిచి ఉండడం గమనించిన స్థా నికుల సమాచారంతో అతను వచ్చి పరిశీలించగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు లేవని చెప్పారు. అడవి పందుల దాడిలో ఇద్దరికి గాయాలుపెంబి: మండలంలోని సిక్కిగూడ గ్రామానికి చెందిన సిడాం లక్ష్మణ్, సిడాం తుకారాం మంగళవారం రాత్రి షెట్పల్లి సమీపంలో ఉన్న చేనుకు కాపలాగా వెళ్తుండగా ఒక్కసారిగా అడవి పందులు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ కృష్ణ, పైలెట్ అజర్ ప్రథమ చికిత్స అందించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
121ప్రైవేటు డిగ్రీ కళాశాలల పరీక్ష ఫలితాలు నిలిపివేత
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను ఈ నెల 4న రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ డీన్ అకాడమిక్‌కు ఫీజులు చెల్లించని 121 ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఫలితాలను నిలిపి వేశారు. ఇప్పటికే ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. అప్పట్లో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిని, అప్పటి రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కలిశారు. ప్రభుత్వం మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వడం లేదని, కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. 15 నుంచి 20 రోజుల వరకు సమయం ఇచ్చారు. పరీక్షలు పూర్తయ్యాక యూనివర్సిటీ అకాడమిక్ డీన్ ఆయా కళాశాలలకు ఫీజులు చెల్లించాలని నోటీస్‌లు పంపారు. బుధవారం వరకు 121 ప్రైవేటు కళాశాలలు ఫీజులు చెల్లించలేదు. ఫీజులు చెల్లించిన కళాశాలల ఫలితాలు వెబ్సైట్లో ఉంచి చెల్లించని వారివి నిలిపివేశారు. తమ ఫలితాలు చూసుకునే వీలులేకపోవడంతో ఆయా కళాశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు చెల్లించినట్లు క్లియరెన్స్ వస్తేనే ఫలితాలు వెల్లడిస్తామని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ స్పష్టం చేశారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
● టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా సమష్టిగా ముందుకు సాగాలని టీపీసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షా సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, రేఖానాయక్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, పా ర్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులకు ఆమె స్పష్టమైన దిశానిర్దేశం చేశా రు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేలా ఐక్యంగా పనిచేయాలన్నారు. ఎలాంటి విభేదాలకు తావులేకుండా పార్టీ పటిష్టత, స్థానిక సంస్థలన్నింటిలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. -
గంజాయి సేవిస్తున్న ఎనిమిది మంది అరెస్టు
చెన్నూర్: మండలంలోని కిష్టంపేట శివారులో గంజాయి సేవిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సీఐ రవీందర్ తెలిపారు. పోలీసు స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిష్టంపేట జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న పదిమంది యువకులను పట్టుకుని విచారించగా గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో ఒకరు మైనర్కాగా మరొకరు పరారయ్యారన్నారు. సమావేశంలో ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి
బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో నీటమునిగి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని బీదరిల్లి గ్రామానికి చెందిన డోన్ గాలే మారుతి (34) కుటుంబ సభ్యులతో కలసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌తో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం బాసర గోదావరినదికి వచ్చారు. స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండడంతో నీటమునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..తాండూర్: ఈ నెల 2న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. అచ్చులాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పెరుగు రాజయ్య (57) ఐబీ నుంచి నయారా పెట్రోల్‌బంక్ వద్దకు బైక్‌పై వెళ్తుండగా రేచినీ గ్రామానికి చెందిన భీంరావు ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టాడు. ఘటనలో రాజయ్యకు తీవ్ర గాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మే రకు భీంరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు..నెన్నెల: గత నెల 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలి పారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి చెందిన తోకల రాజేశం (34) అత్తగారి ఊరైన నెన్నెల మండలం మైలారంలో ఉంటున్నాడు. ఫిబ్రవరి 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరుడు తోకల సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి మహిళ..సోన్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గాంధీనగర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (54) మంగళవారం సరస్వతీ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లింది. చేపలు పట్టే క్రమంలో ఒడ్డు మీద నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయింది. బుధవారం పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ హైమద్ మోహినుద్దీన్ తెలిపారు. -
ఒకరిపై కేసు
కౌటాల: మండలంలోని వీరవెల్లి గ్రామానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మధుకర్ తెలిపారు. వీరవెల్లి గ్రామానికి చెందిన కేడ్కర్ నాగోరాం ఈ నెల 1న అదే గ్రామానికి చెందిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో తన కోరిక తీర్చకుంటే చంపేస్తానంటూ అక్కడే ఉన్న బకెట్‌తో దాడి చేయడంతో ఆమె ఎడమ కంటిపై గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. ‘తుమ్మల’కు కవిసంధ్య పురస్కారంనిర్మల్ఖిల్లా: ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కవిసంధ్య సాహితీ సంస్థ, నారాయణరావు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కవితా పోటీలలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తుమ్మల దేవరావుకు కవిసంధ్య పురస్కారం దక్కింది. అతను రచించిన ‘వరి గొలకులు’ కవిత కన్సోలేషన్ బహుమతికి ఎంపికై నట్లు కవిసంధ్య సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈట శిఖామణి, దాట్ల దేవదానం రాజు తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లో అవార్డు అందుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధంనర్సాపూర్(జి): మండలంలోని బూరుగుపల్లి (జి) గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ ఇల్లు బుధవారం షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. దినేష్ తన ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఇంట్లోని సామగ్రితో పాటు రూ.2 లక్షల 50 వేల నగదు, ఐదు గ్రాముల బంగారం కాలిపోయిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ సుమలత , పంచాయతీ కార్యదర్శి శివకుమార్ సందర్శించి పంచనామా నిర్వహించారు. తిమ్మాపూర్‌లో 800 కోళ్లు మృతిభైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్‌లో పునేంధర్కు చెందిన ఫామ్‌లో బుధవారం 800 కోళ్లు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారి విఠల్ కోళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కోళ్లు తాగే నీటిలో విషం కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ల్యాబ్ నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత కోళ్ల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పునేంధర్ వాపోయాడు. ముగ్గురిపై వీధికుక్కల దాడిభీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలో బుధవారం వీధి కుక్కలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్న హర్ష అనే బాలుడిపై, కొట్రంగి చంద్రక్క, నాజర్‌పై క కుక్కలు దాడిచేసి గాయపరిచాయి. బాధితులను బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. -
జిల్లాకు ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం
ఆదిలాబాద్: జిల్లాకు ఎయిర్ పోర్ట్ తప్పకుండా తీసుకువస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి మాట్లాడారు. ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు అవగాహన రాహిత్యంతో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న జోగు రామన్న జిల్లా ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏర్పాటు కోసం 2014లో తాను ఎంపీగా ఉన్న సమయంలో కృషి చేశానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగానే ఎయిర్ పోర్ట్ అకాడమీ పెండింగ్‌లో ఉందన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్‌కు సంబంధించి 2011లోనే సర్వే జరిగిందన్నారు. ఇదే రైల్వే లైనుకు ఆర్మూర్–ఆదిలాబాద్ వయా నిర్మల్ కు జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇద్దరు మంత్రులను కలిసినా పట్టించుకోలేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు వేద వ్యాస్, రఘుపతి, లాలా మున్నా, నగేష్, కృష్ణ, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● ఎంపీ గోడం నగేష్ -
● చింతలమానెపల్లి మండలంలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం ● తుదిదశకు పనులు ● త్వరలో విద్యుత్ సరఫరాకు అధికారుల ప్రణాళిక ● నాలుగు మండలాల పరిధిలోని గ్రామాలకు ప్రయోజనం
త్వరలో ప్రారంభిస్తాంరవీంద్రనగర్– 2 సబ్‌స్టేషన్‌ను పూర్తి ఆధునికంగా నిర్మిస్తున్నాం. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా నిర్మాణం చేపడుతున్నాం. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణంతో ఈజ్గాం 132/33 సబ్‌స్టేషన్‌పై లోడ్ తగ్గుతుంది. భవిష్యత్తులో ఈ సబ్‌స్టేషన్‌లో సమస్యలు తలెత్తితే ఈజ్గాం నుంచి కౌటాలకు నేరుగా సరఫరా చేస్తున్నాం. కాగజ్‌నగర్ డివిజన్లోని కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల్లో చాలావరకు విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయి. – శేషారావు, సూపరింటెండెంట్ ఇంజినీర్, జిల్లా విద్యుత్ శాఖచింతలమానెపల్లి(సిర్పూర్): గాలి వీచినా.. వాన ప డినా కరెంట్ నిలిచి పోవాల్సిందే.. మండల కేం ద్రం, గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా తర చూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది.. ఇకపై ఈ కరెంట్ కష్టాలకు చెక్ పడనుంది. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్–2 సమీపంలో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. వచ్చే నెల రోజుల్లో ఈ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభించనున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈజ్గాం సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుండగా, దూరం కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నా యి. సిర్పూర్(టి), చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్ మండలాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నతరహా పరిశ్రమలు, దుకా ణాలు, జిన్నింగ్ మిల్లులు, రైస్‌మిల్లుల యజమానులకు నష్టాలు ఎదురవుతున్నాయి. ఇళ్లలో నీటి సరఫరాకు ఇ బ్బంది పడే పరిస్థితి. కొత్త సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే కరెంట్ కష్టాలు తీరనున్నాయి. అతి పొడవైన విద్యుత్‌లైన్ సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాంలోని 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి గ్రామీణ మండలాలకు విద్యుత్ సరఫరా చే సే లైన్‌ను జిల్లాలోనే అతి పొడవైన లైన్‌గా చెబుతుంటారు. సుమారుగా వంద కిలోమీటర్ల దూరం వరకు ఈ లైన్ ఉంటుంది. 33కేవీ సామర్థ్యం కలిగిన 8 సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. సు మారుగా 300 ఆంప్స్ లోడ్ కలిగిన విద్యుత్‌ను ఈజ్గాం నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ మార్గంలో వి ద్యుత్ లైన్‌కు అటవీప్రాంతంలోని చెట్లు అడ్డంకిగా ఉన్నాయి. పిడుగులు, ఉరుములు, భారీ వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతోనూ తరచూ సమస్యలు వస్తున్నారు. ఎక్కడ సమస్య ఏర్పడినా సరఫరాలో అంతరాయం తలెత్తి విద్యుత్ నిలిచిపోతుంది. పొడవైన ఈ లైన్ వెంబడి తీగలు తెగిపోవడం, ఇన్సులేటర్లు పగిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఉద్యోగులకు సమస్య ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సరఫరా పునరుద్ధరించడం తలకు మించిన భారంగా మారింది. వర్షాకాలంలో రాత్రిపూట అటవీప్రాంతంలో మరమ్మతులు చేయడం క త్తిమీద సాములా తయారైంది. ప్రత్యామ్నాయంగా సబ్‌స్టేషన్ నిర్మాణం విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయానికి కాగజ్‌నగర్ మండలంలోని ఈస్గాం సబ్‌స్టేషన్ నుంచి వందకిలోమీటర్ల దూరం వరకు కరెంట్ సరఫరా చేయడమే ప్రధాన కారణం. ఈ సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. కౌటాల మండలంలో ప్రత్యామ్నాయంగా 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపింది. ఏళ్లుగా ప్రజల నుంచి డిమాండ్ రావడంతో చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్ సమీపంలో 132/33 సబ్‌స్టేషన్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.3.5 కోట్ల నిధులను కేటాయించగా.. కాగజ్‌నగర్ నుంచి టవర్లైన్ మంజూరైంది. కరెంట్ సరఫరాకు అంతరాయం లేకుండా 165 టవర్లు, సబ్‌స్టేషన్.. మొత్తంగా రూ.32 కోట్లతో పనులు చేపట్టారు. 2023 అక్టోబర్‌లో ప్రారంభమైన పనులు ప్రస్తుతం తుదిదశకు చేరుకున్నాయి.భారీ ట్రాన్స్ఫార్మర్లు132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో మొత్తంగా నాలుగు విద్యుత్ సరఫరా ఫీడర్లు ఏర్పాటు చేయనున్నారు. సిర్పూర్(టి), లోనవెల్లి, కౌటాల, గుండాయిపేట్, రవీంద్రనగర్, ఖర్జెల్లి, బెజ్జూర్ మండలంలోని రెబ్బెన సబ్స్టేషన్ల పరిధిలోని సుమారుగా 300 గ్రామాలకు ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు. అలాగే ప్రాణహిత, పెన్‌గంగ నదులపై నిర్మించిన ఐదు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక ఫీడర్పై రెండు సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. ఎనిమిది సబ్స్టేషన్లు, 161 కిలోమీటర్ల విద్యుత్ లైన్లకు సరఫరా చేయడానికి 16 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో లోడ్ పెరిగినా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ సబ్‌స్టేషన్‌ను పర్యవేక్షించేందుకు ఏడీ, ఏఈ స్థాయి అధికారులు, మరో ముగ్గురు సబ్‌స్టేషన్ నిర్వహణ సిబ్బందిని నియమించనున్నారు. -
విద్యుత్ తీగలు అమర్చిన ఇద్దరి అరెస్టు
పెంచికల్పేట్: వన్యప్రాణులను వేటాడటానికి విద్యుత్ తీగలను అమర్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎఫ్ఆర్వో అనిల్ కుమార్ తెలి పారు. కమ్మర్గాం గ్రామానికి చెందిన తలండి వెంకటేశ్, సిడాం అశోక్ వన్యప్రాణులను వేటడానికి పంట చేనులో విద్యుత్ తీగలను అమర్చరానే పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులో తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితులను ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. వారి వెంట ఎఫ్ఎస్వో జగన్మోహన్, ఎఫ్‌బీవో విజయలక్ష్మీ, సిబ్బంది ఉన్నారు. -
అసాంఘిక శక్తులకు సహకరించొద్దు
● ఏఎస్పీ చిత్తరంజన్ ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ అసాంఘిక శక్తులకు సహకరించొద్దని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. సిర్పూర్(యూ) మండలం రుద్దేకాస గ్రామంలో బుధవారం పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతిఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులకు నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైనూర్ సీఐ రమేశ్, సిర్పూర్(యూ) ఎస్సై రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. యువత ఉన్నతస్థాయికి ఎదగాలి కెరమెరి(ఆసిఫాబాద్): యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ.. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండలంలోని మారుమూల టోకెన్మోవాడ్, చాల్‌బాడి, పాటాగూడ, పిట్టగూడ గ్రామాల్లో బుధవారం బైక్‌పై పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దని సూచించారు. గంజాయి సాగు చేయొద్దని, విద్యుత్ తీగలతో వన్యప్రాణులను వేటాడొద్దన్నారు. కార్యక్రమంలో సీఐ సత్యానారాయణ, ఎస్సై గంపుల విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
మహారాష్ట్రలో ట్రాలీ బోల్తా..
● గుడిహత్నూర్ వాసులకు గాయాలు గుడిహత్నూర్: మహారాష్ట్రలో ట్రాలీ వాహనం బోల్తా పడిన ఘటనలో మండలానికి చెందిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని గురుజ గ్రామానికి చెందిన జాదవ్ రాజు మంగళవారం 16 మంది బంధుమిత్రులతో కలిసి దైవ దర్శనానికి మహారాష్ట్రంలోని చంద్రపూర్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం కోర్పణ గ్రామ సమీపంలో బోల్తా కొట్టింది. దీంతో రాజుతో పాటు అతని తల్లి సీతాబాయి, మరో యువకుడు గెడం జగదీష్, నాందేడ్‌కు చెందిన మహిళ, రాజు మేన కోడలుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా రిమ్స్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సీతాబాయిని హైదరాబాద్‌కు, అత్త, మేనకోడలిని నాందేడ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. గెడం జగదీష్‌తో పాటు పలువురు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని కోర్పణ పోలీసులు తెలిపారు. -
మలేషియా జైలులో కడెం వాసులు
కడెం: మండలంలోని లింగాపూర్‌కు చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురిజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, దస్తురాబాద్ మండలంలోని మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ ఉపాధి నిమిత్తం గతేడాది మలేషియాకు వెళ్లారు. కొన్ని కారణాల వలన జైలులో ఉన్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ కలిసి విడుదల చేయించాలని వేడుకున్నారు. మలేషియా వెళ్లి ఉన్నతాధికారులను సంప్రదించాడు. అక్రమ ఆయుధ చట్టం కింద జైలులో ఉన్నారని తెలుసుకుని బాధితులను పరామర్శించాడు. విడుదల చేసేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించాడు. -
దాహం తీర్చండి సారూ..!
చెలిమె నీళ్లే దిక్కుఆసిఫాబాద్అర్బన్: వాంకిడి మండలం పాటగూ డ గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడ గ్రామస్తులు ‘దాహం తీర్చండి సారూ’ అంటూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బుధవారం ఖాళీ బిందెలతో నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ బయటికి రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం గ్రామస్తులు, ప్ర జా సంఘాల నాయకులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 25 కుటుంబాలు, 200 మంది ప్ర జలు నివసిస్తున్నారని తెలిపారు. గ్రామంలోని బోర్ల వద్ద అర్ధరాత్రి నుంచి వేచిచూడాల్సి వ స్తుందన్నారు. ఒక బిందె నిండేందుకు గంటకుపైగా సమయం పడుతోందని తెలిపారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి గ్రామంలో పర్యటించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కలెక్టరేట్లో ఏవో మధుకర్, మిషన్ భగీరథ డీఈ ఇర్ఫాన్‌కు వేర్వేరుగా వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాలశ్రీ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, నాయకులు శ్రావణి, కృష్ణమాచారి, జలపతి, గ్రామ పటేల్ ధర్మూ తదితరులు పాల్గొన్నారు.● కలెక్టరేట్ ఎదుట కొలాంగూడ గ్రామస్తుల ధర్నా -
పట్టభద్రుల సీటూ కమలానిదే!
● గ్రాడ్యుయేట్లోనూ బీజేపీ హవా ● అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి ● మూడు రోజులు సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ● ముగ్గురికే 92.52శాతం ఓట్లుసాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి: కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్లతో బీజేపీ గెలుపు ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో ఆయననే విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించడంతో శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్విరామంగా మూడు షిప్ట్‌ల్లో 800మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు పక్రియ చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లను వడపోసి, కట్టలు కట్టారు. మంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు చేపట్టి బుధవారం ఉదయం 8.30గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్లను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్లలో బరిలో ఉన్న 54మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ పక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. ముగ్గురికే 92.52శాతం ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటైన ఓట్లలో 92.52శాతం(2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగతా 53మంది స్వతంత్ర అభ్యర్థులు 16,684 ఓట్లు మాత్రమే సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ బీజేపీదే హవా నిర్ధారిత కోటా ఓట్ల కోసం అభ్యర్థుల ఎలిమినేషన్ పక్రియను చేపట్టగా అందులో సైతం బీజేపీ అభ్యర్థి అధిక్యం చూపారు. తొలుత 53మందిని ఎలిమినేషన్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్‌కు 73,644 ఓట్లు, బీఎస్పీకి 63,404 ఓట్లు వచ్చాయి. 53మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్లను ఎవరూ సాధించకపోవడంతో మూడో స్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణను ఎలిమినేట్ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో విజయం దక్కింది. -
తొలిరోజు ప్రశాంతం
పరీక్షలు సజావుగా నిర్వహించాలి ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల, తెలంగాణ మోడల్ స్కూల్లోని కేంద్రాలను సందర్శించారు. వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ● ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభంఆసిఫాబాద్రూరల్: జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 5,076 మంది విద్యార్థులకు 4,828 మంది హాజరయ్యారు. 248 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 4,283 మందికి 4,100 మంది, ఒకేషనల్ విభాగంలో 793 మందికి 728 మంది హాజరయ్యారు. తొలిరోజు కావడంతో విద్యార్థులు ఉదయమే కేంద్రాలకు చేరుకున్నారు. 8.30 గంటల నుంచి సెంటర్లలోకి అనుమతించారు. మాస్ కాపీయింగ్ తావులేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీఐఈవో కళ్యాణి తెలిపారు. వాంకిడి, కాగజ్‌నగర్, రెబ్బెనలోని కేంద్రాలను ప్లయింగ్ స్క్వాడ్ సభ్యులు తనిఖీ చేశారు. కేంద్రాలు తనిఖీ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, పీటీజీ బాలుర, బాలికల గురుకులాల్లోని కేంద్రాలను డీఐఈవో కళ్యాణి, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలులో ఉంటుందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, ఆసిఫాబాద్ సీఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: అధికారులు, ప్రజాప్రతినిధుల సమస్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వసతి గృహాల్లో రాత్రిపూట బస చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా జనవరి నుంచి ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా ట్రాన్స్ఫార్మర్లు మార్చడంతో పాటు విద్యుత్ లైన్లు సరి చేస్తున్నామని వివరించారు. ఏడాదిలో ఈ ప్రాంతం గురించి ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలతో మమేకమై అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో సంక్షేమంపై దృష్టి సారిస్తానని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపుఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బుధవారం గుండి రహదారిలోని ఓ ప్రైవేటు భవనంలోకి మార్చినట్లు సబ్ రిజిస్ట్రార్ అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొత్త భవనంలో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. -
పక్షుల లెక్క తేలింది
● జన్నారం డివిజన్లో 201 రకాలు గుర్తింపు ● అటవీశాఖ, వరల్డ్‌వైడ్ లైఫ్ఫండ్ ఆధ్వర్యంలో సర్వే జన్నారం(ఖానాపూర్): పక్షుల గమనానికి పరిధిలు లేవు. అవి ఖండాలు దాటి ప్రయాణిస్తూ పర్యావరణంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణంలో జరిగే పెను మార్పుల వల్ల కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస వెళ్తుంటాయి. ఇలాంటి పక్షులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్షులు ఎంతో జీవవైవిద్యం ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పక్షుల వివరాలను తెలుసుకునేందుకు అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ ఏడాది జనవరి 24 నుంచి 26 వరకు జంతుగణన మాదిరి కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్లో పక్షుల గణన చేశారు. 28 మంది సభ్యులు ఏడు బృందాలుగా ఏర్పడి డివిజన్లోని 40 అటవీ బీట్లలో సర్వే చేశారు. డివిజన్లో సంచరిస్తున్న పక్షుల వివరాలను సేకరించారు. వీటితో పాటుగా అంతరించిపోయే దశలో ఎన్నిరకాల పక్షులు ఉన్నాయి? ఏఏ కేటగిరీలో ఏ పక్షులున్నాయో సర్వేలో తేలినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 201 రకాల పక్షులు జన్నారం అటవీ డివిజన్లో నిర్వహించిన సర్వేలో 201 రకాల పక్షులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖ, వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో పక్షులపై సమగ్ర పరిశీలన చేశారు. 11 రకాల పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయని, 57 రకాల పక్షులు కేవలం అటవీ, ప్లాంటేషన్ ఏరియాలో సంచరిస్తున్నాయని, మన పరిసరాల్లో తిరిగే పక్షులు 18, కీటకాలు తినే పక్షులు 99 రకాలు, కేవలం పండ్లను మాత్రమే తినే పక్షులు 16 రకాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. పక్షులపై అవగాహన ప్రస్తుత రోజుల్లో పక్షుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థి దశ నుంచే దీనిని ఒక హాబీగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో పక్షులు, వాటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అటవీశాఖ నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే సైన్స్ టీచర్లను అడవుల్లోకి తీసుకెళ్లి బర్డ్‌వాక్ కార్యక్రమం చేపట్టనున్నారు. వీటితో పాటుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థ ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలు పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించనున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. పక్షుల సంరక్షణపై, పక్షులు అంతరిస్తే కలిగే నష్టాలు, జీవ వైవిద్యంలో పక్షుల పాత్ర, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రతీ ఆర్నెల్లకోసారి.. ప్రతీ ఆర్నెల్లకోసారి పక్షులపై అవగాహన కల్పించే యోచన చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పక్షుల రకాలను గుర్తించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వలంటీర్లగా నియమించాలని యోచిస్తున్నాం. అర్హులైన స్థానికులను నేచర్ గైడ్లుగా నియమిస్తాం. – శివ్‌ఆశిష్‌సింగ్, జిల్లా అటవీశాఖ అధికారి, మంచిర్యాల -
వీడని ఉత్కంఠ
తేలని ఫలితంసాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్– ఆదిలాబాద్– మెదక్– నిజా మాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠ రేపుతోంది. కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధించారు. ఎవరూ నేరుగా కోటా ఓట్లు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆసక్తి నెలకొంది. మొత్తం చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఫలితం తేలనుంది. దీంతో ట్రయాంగిల్‌గా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. త్రిముఖ పోటీ..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 56 మంది అభ్యర్థులు పోటీపడినా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు ముగ్గురు సుమారు లక్ష ఓట్లు, బరిలో నిలిచిన 53 మంది కలిపి 10వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో మూడోస్థానంలో నిలిచే అభ్యర్థి ఎవరనేదానిపై ఎమ్మెల్సీ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరికీ దక్కని గెలుపు కోటా ఓట్లుపోస్టల్ ఓట్లతో కలిసి మొత్తం 2,52,100 ఓట్లు పోలవగా, అందులో సుమారు 28 వేల ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. చెల్లనిఓట్లు పోగా మిగిలిన 2,24,000 ఓట్లలో సగం ఓట్లు.. అంటే.. 1,12,001 (సుమారు) ఓట్లను విన్నింగ్ కోటా ఓట్లుగా నిర్ధారించారు. పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి నేరుగా కోటా ఓట్లను సాధించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫలితం తేలేందుకు బుధవారం రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ప్రతీ రౌండ్లో బీజేపీకే ఆధిక్యంమొత్తం 21 టేబుళ్ల ద్వారా 12 రౌండల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిపై 36 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండోరౌండ్లో 1,457 ఓట్ల మెజార్టీ, మూడోరౌండ్లో 3,005 ఓట్లు, నాలుగో రౌండ్లో 1,263 ఓట్లు, ఐదోరౌండ్లో 1,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిపై 211 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 45,401 ఓట్లు సాధించి, ప్రత్యర్థులపై 6,931 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. 38,470 ఓట్లతో నరేందర్‌రెడ్డి రెండో స్థానంలో, 3,1481 ఓట్లతో ప్రసన్నహరికృష్ణ మూ డోస్థానంలో నిలిచారు. మందకొడిగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు తోడు పోటాపోటీగా అభ్యర్థులు ఓట్లు సాధిస్తుండటంతో రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ పెరుగుతోంది. రెండోప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ‘గ్య్రాడ్యుయేట్’ పోటీ త్రిముఖం కోటా ఓట్ల మార్కును చేరుకోని అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియతోనే తేలనున్న ఎమ్మెల్సీ ఫలితం ప్రస్తుతం ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కౌంటింగ్ వివరాలు: మొత్తం ఓటు ్ల(పోస్టల్ ఓట్లతో కలిపి) 2,52,100 చెల్లని ఓట్లు : 28,000(11.01శాతం) చెల్లుబాటైనవి : 2,24,000 విన్నింగ్ కోటా ఓట్లు 1,12,001(సుమారు) బరిలో నిలిచిన అభ్యర్థులు : 56 -
‘ఎమ్మెల్సీ ఫలితాలు కాంగ్రెస్‌కు చెంపపెట్టు’
ఆసిఫాబాద్‌అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉన్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన మల్క కొమురయ్య గెలుపొందడంతో మంగళవా రం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద పార్టీ సీ నియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావ్తో కలిసి సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులతోపాటు ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. సీఎం, మంత్రులు పాలన పక్కనబెట్టి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలకు ప్రజలు ఆకర్షితులై బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు, మేధావులు ముందుచూపుతో బీజేపీ బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొము రయ్యను గెలిపించారని తెలిపారు. పట్టభద్రుల ఎ మ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లికార్జున్, నాయకులు మురళి, జయరాజ్, పెంటయ్య, అశోక్, శ్రీకాంత్, సుగుణాకర్, ప్రసాద్‌గౌడ్, వెంకన్న, మధు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
బీజేపీలో జోష్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కమలనాథుల్లో జోష్ నింపింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని కై వసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎమ్మెల్సీ పోరులో నువ్వా.. నేనా.. అన్నట్లు తలపడగా.. బీజేపీ బలపర్చిన అభ్యర్థి మల్క కొమురయ్యకే టీచర్లు పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నాలుగు ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుని మరోసా రి సత్తా చాటింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల మద్దతుతో ఓ సీటులో విజయం సాధించింది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఎమ్మెల్సీ సైతం ఆ పార్టీ ఖాతాలో చేరింది. ఉమ్మడి జిల్లాలో గత రెండేళ్లుగా బీజేపీ అనుకూల పవనాలే వీస్తున్నాయి. దీంతో భవిష్యత్‌లో తమ పార్టీ బలపడుతుందనే సంకేతాలు వస్తున్నాయని కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా పార్టీ పుంజుకోవడంపై ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేయాలనుకున్న పార్టీ సీనియర్లకు ఊరట కలుగుతోంది. మరోవైపు తాజా ఎన్నికలతో యువత, టీచర్లు, విద్యావంతులు బీజేపీ వైపు ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకొంటుండటం గమనార్హం. కలిసొచ్చిన ఆత్మీయ సమ్మేళనాలుఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆది నుంచి విస్తృతంగా ప్రచారం చేసింది. పట్ట భద్రులు, టీచర్ల స్థానానికి అభ్యర్థులను బరిలో దింపి స్థానిక నాయకులపైనే భారం వేసింది. కార్పొరేట్ వ్యక్తులుగా ప్రచారం జరిగినా మల్క కొమురయ్య, పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డికి సానుకూలత పెరిగింది. పట్టణాలు, నియోజకవర్గాల్లో ఓటర్ల ను అధికసంఖ్యలో రప్పించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం గెలుపునకు దోహదం చేశాయి. ముందుగా అభ్యర్థిని ప్రకటించడం కలిసిసొచ్చింది. వచ్చే స్థానిక సంస్థల్లోనూ..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామాలు, బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. పట్టణాలకే పరిమితమైన ఓటు బ్యాంకును గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాషా య పార్టీ బలపడేందుకు సరైన సమయం వచ్చింద ని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన పార్టీ ఇక గ్రామ స్థాయిలోనూ విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఆసిఫాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో పటాకులు కాలుస్తున్న బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ ఫలితాలతో నాయకులకు ఊరట పట్టభద్రుల స్థానంలోనూ గెలుస్తామనే ధీమా ఉమ్మడి జిల్లాలో పార్టీ కేడర్‌లో ఉత్సాహం మరో సీటుపై ఉత్కంఠమరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గత రెండు రోజులుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణ మధ్య పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు, ఓట్లు ఎక్కువగా ఉండడంతో లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి మంగళవారం సాయంత్రం వరకు ముందంజలో ఉన్నారు. ఏ అభ్యర్థి గెలుస్తారనేది బుధవారం స్పష్టత రానుంది. ఓట్ల లెక్కింపులో ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల తొలగింపు ప్రక్రియ మొదలైతే తుది విజేత ఎవరనేది తేలాల్సి ఉంది. బీజేపీ శ్రేణులు మాత్రం తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాలో ఉన్నారు. -
విజయీభవ
ఆసిఫాబాద్‌రూరల్: ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కు జిల్లాలో 19కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,054 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4,756 మంది ఫస్టియర్, 5,287 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కళ్యాణి వెల్లడించారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వబోమ ని తెలిపారు. అన్ని కేంద్రాల్లో బెంచీలు, తాగునీరు, ఫ్యాన్లు, మూత్రశాలలు తదితర వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా ప్రతీ పరీక్షాకేంద్రంలో ఐదు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా..ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ‘నిమిషం’ నిబంధన తొలగించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాలు అంటే ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9గంటల మధ్యలో ఓఎంఆర్ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరికి వారు తమకిచ్చిన పత్రంపై తమ వివరాలే ఉన్నాయా? లేదా? అని సరిచూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు నిర్ధిష్ట సమయానికంటే ముందే పరీక్షాకేంద్రాలకు చేరుకోవడం మంచిది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో..ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు ఈసారి సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నా రు. ఇప్పటికే అన్ని పరీక్షాకేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక స్క్వాడ్స్‌తో కేంద్రాలను తనిఖీ చేయనున్నా రు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రతీ పరీక్షాకేంద్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి ఉంటుంది. పరీక్షల నిర్వహణకు 19 కేంద్రాల్లో 192 మంది ఇన్విజిలేటర్లు, 19 మంది సీఎస్‌లు, 19 మంది డీవోలతోపాటు రెండు సిట్టింగ్ స్క్వాండ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ కూడా పరీక్షాకేంద్రాలను పర్యవేక్షించనున్నారు. ఆయా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రతీ సెంటర్‌కు ఇద్దరు పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. కేంద్రానికి సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను పరీక్ష ముగిసేదాకా మూసి ఉంచాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలోని పరీక్షాకేంద్రాల వివరాలు ప్రాంతం పరీక్షాకేంద్రం పేరు ఆసిఫాబాద్ ప్రభుత్వం జూనియర్ కళాశాల ఆసిఫాబాద్ గిరిజన గురుకుల బాలుర పాఠశాల ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆసిఫాబాద్ గిరిజన బాలికల గురుకుల పాఠశాల వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల కెరమెరి ప్రభుత్వ జూనియర్ కళాశాల రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల కాగజ్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కాగజ్‌నగర్ (గన్నరాం) ఎంజేపీ పాఠశాల కాగజ్‌నగర్ వివేకానంద జూనియర్ కళాశాల కాగజ్‌నగర్ వసుంధర్ జూనియర్ కళాశాల కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాల జైనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బెజ్జూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దహెగాం ప్రభుత్వ జూనియర్ కళాశాల సిర్పూర్(యూ) తెలంగాణ మోడల్ స్కూల్ సిర్పూర్(టి) ప్రభుత్వ జూనియర్ కళాశాల తిర్యాణి ప్రభుత్వ జూనియర్ కళాశాల నేటి నుంచి ఇంటర్ పరీక్షలు షురూ ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఎంట్రీ హాజరు కానున్న 10,054 మంది ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు నిర్భయంగా పరీక్ష రాయాలి ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 19 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతీ కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పించాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకుని నిర్భయంగా పరీక్షలు రాయాలి. – కళ్యాణి, డీఐఈవో పరీక్షాకేంద్రాల వద్ద బందోబస్తుఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షాకేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ ఎస్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌రావ్ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రాల వద్ద పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల సమీప జిరాక్స్, ఇంటర్ నె ట్ సెంటర్లు మూసి ఉంచాలని పేర్కొన్నా రు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
నిరుపేదల కోసమే వైద్యశిబిరాలు
● జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్ ● బెజ్జూర్‌లో హెల్త్‌క్యాంప్ ప్రారంభం బెజ్జూర్: నిరుపేదల కోసమే అటవీశాఖ, సింగరేణి ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అటవీశాఖ క్షే త్ర అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని కాగజ్‌నగర్ డివిజన్ అధికారి సుశాంత్ సు గ్దేవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం డీఎఫ్‌వో మాట్లాడుతూ.. జిల్లాలోని మారుమూల మండలంలో వైద్యశిబిరం నిర్వహణకు సింగరేణి సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నా రు. డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని నిరుపేదల కోసం వైద్యశిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అన్ని రకాల వైద్యనిపుణులతో శిబిరంలో సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం కూడా శిబిరం కొనసాగుతుందని, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. రాబోవు రోజుల్లో నెలకోసారి ఆయా మండలా ల్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా రోగులు భారీసంఖ్యలో వచ్చి శిబిరంలో పరీక్షలు చేయించుకుని మందులు పొందారు. సింగరేణి సంస్థ సూపరింటెండెంట్ మధుకుమార్, వైద్యులు రాధాకృష్ణ, స్టాలిన్, శ్రీదేవి, బెజ్జూ ర్ ఎఫ్ఆర్వో ముసవీర్, సెక్షన్ అధికారులు శ్రావణ్‌కుమార్, మల్లికార్జున్, బీట్ అధికారులున్నారు. -
న్యూస్‌రీల్
ఉత్తమ ఫలితాలు సాధించాలి ఆసిఫాబాద్‌రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ పలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీటీడీవో రమాదేవి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన సబ్జెక్టు టీచర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో 36 ఆశ్రమ పాఠశాలల్లో 1,255 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపా రు. జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా సబ్జెక్టు టీచర్లు కృషి చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సా రించాలని సూచించారు. 100 శాతం ఫలితా లు సాధించే దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకోవా లని తెలిపారు. ఏసీఎంవో ఉద్ధవ్, డీఎస్వో మీనారెడ్డి, ఏటీడీవో చిరంజీవి, ఎస్వో సంతోష్, సాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో పొలం బాట ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించి వ్యవసాయానికి నాణ్యమై న విద్యుత్ అందించేందుకే ‘పొలం బాట’ నిర్వహిస్తున్నట్లు ఆసిఫాబాద్ సర్కిల్ ఎస్ఈ రాథోడ్ శేషారావ్ తెలిపారు. పొలం బాట కార్యక్రమంలో సేవలందించిన అధికారులు, సిబ్బందిని ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్కిల్ పరి ధిలో ఇప్పటివరకు 36 వంగిన స్తంబాలు, 43 లూజ్లైన్లు, 14 మధ్య స్తంభాలు సరి చేసిన ట్లు తెలిపారు. ఆటో స్టార్టర్లు తొలగించాలని రైతులకు సూచిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్య తలెత్తినా 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. డీఎంపై చర్య తీసుకోవాలి ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టీసీ ఆసిఫాబాద్ డిపోలో పని చేస్తున్న కార్మికులను వేధిస్తున్న డీఎం విశ్వనాథ్‌పై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో కార్మికులతో కలిసి టీజీఎస్ ఆర్టీ సీ ఎండీ కార్యాలయంలో ఈడీ మునీశ్వర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ.. కొంత కాలంగా డీ ఎం కార్మికులపై అధిక పనిభారం మోపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించా రు. కార్మికులు పని ఒత్తిడి తట్టుకోలేక అనా రోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. కార్మి కులకు క్యాజువల్ లీవ్‌లు కూడా ఇవ్వడం లేద ని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నుంచి హైదరా బాద్‌కు వెళ్లే సర్వీసులను నడిపితే మూడురోజుల పని దినాలను రెండు రోజులకు కు ధించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించా రు. పని చేయని యంత్రాల ద్వారా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ కార్మికులపై తప్పు డు నివేదికలు ఇచ్చి సస్పెన్షన్, తొలగింపు కుట్రకు పాల్పడుతున్నారని విమర్శించారు. డీఎం, ఆర్ఎం చర్యలపై విచారణ చేపట్టి చ ర్య తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో బస్ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశం కోసం ఎంపిక పోటీలు ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ఐదోతరగతిలో ప్రవేశం కోసం గిరిజన విద్యార్థులకు ఈ నెల 6వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ పీవో కుష్ఫూ గుప్తా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గలవారు నాలుగో తరగతి చదువుతూ 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. 5 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు డీఎస్వో మీనారెడ్డిని 9440010453 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
‘పది’లో పాత విధానమే..!
● వార్షిక పరీక్షలో ‘గ్రేడింగ్’ రద్దు ● మార్కుల విధానం మళ్లీ అమలు ● సవరణలు చేసిన విద్యాశాఖఆసిఫాబాద్అర్బన్: ఈనెల 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్ష ల విధానంలో విద్యాశాఖ పలు మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న గ్రేడింగ్ (జీపీఏ) విధానాన్ని రద్దు చేసింది. పూర్వ పద్ధతిలోనే మార్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అలాగే నాలుగు పేజీల జవాబు పత్రాల స్థానంలో 24పేజీల బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్థులకు సరిపడా బుక్లెట్లు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,421 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. నాలుగు చోట్ల రిసీవింగ్ కేంద్రాలుజిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, జైనూర్, కౌటా లలో రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేంద్రాలకు 24 పేజీలు కలిగిన ఆన్సర్ బుక్లెట్లు చేరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో సీఎస్ పర్యవేక్షణలో రిసీవింగ్ సెంటర్ల నుంచి ప్రశ్నాపత్రాలతో పాటు ఆన్సర్ బుక్లెట్లను పరీక్షాకేంద్రాలకు తరలించనున్నారు. ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్‌తో పాటు ప్రతీ పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్, మెడికల్ సిబ్బంది, సీఎస్ విధులు నిర్వహించనున్నారు. మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే.. రాష్ట్ర విద్యాశాఖ ఈ సంవత్సరం పదోతరగతి పరీ క్షా విధానంలో నూతన మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో మార్కుల విధానాన్ని అమలు చేస్తోంది. జవాబు పత్రాల స్థానంలో 24 పేజీల బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు పరీక్షల నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.ఉదయ్‌బాబు, జిల్లా పరీక్షల సహాయాధికారి జిల్లాకు సంబంధించిన వివరాలుప్రభుత్వ ఉన్నత పాఠశాలలు : 172పదో తరగతి పరీక్షా కేంద్రాలు : 36హాజరు కానున్న విద్యార్థులు : 6,421 -
యాసంగి పంటలకు సాగునీరు అందించాలి
● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆసిఫాబాద్‌అర్బన్: యాసంగిలో ప్రాజెక్టులు, చెరువుల కిందసాగు చేసే పంటలకు సాగు నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సాగునీటి, వ్యవసాయ, విద్యుత్‌శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ద్వారా సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ఈ సీజన్లో ఒక ఎకరం కూడా ఎండిపోవద్దని, వచ్చే 15 రోజులు చాలా కీలకమైన సమయమన్నారు. ప్రాజక్టుల నీటితో చెరువులను నింపాలని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా పర్యవేక్షించాలన్నారు. సాగునీటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. తహసీల్దార్, నీటిపారుదల శా ఖ ఏఈ, మండల వ్యవసాయ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకుని తాగునీరు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలోని ప్రతీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న నూతన మెనూ అమలుపై తనిఖీ నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, డీఏవో శ్రీనివా స్రావ్, విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావ్, నీటిపారుదల శాఖ ఈఈలు ప్రభాకర్, గుణవంత్‌రావ్, డీఆర్డీఏ దత్తారాం పాల్గొన్నారు. -
ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం
● ఆలిండియా భిక్కు సంఘం ప్రధాన కార్యదర్శి భంతే భదంత్ ధమ్మ సారథి వాంకిడి: ప్రపంచ శాంతికి గౌతమ బుద్ధుడు చూపించిన బౌద్ధ మార్గమే శరణ్యమని ఆలిండియా భిక్కు సంఘం ప్రధాన కార్యదర్శి భంతే భదంత్ ధమ్మ సారథి అన్నారు. మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో భారతీయ బౌద్ధ మహాసభ, అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ధమ్మ దీక్ష శ్రామ్నేర్ శిబిర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బౌద్ధ గురువులు భంతే వివేక్, రాహుల్ బోధి, నిబ్బాన్లతో కలిసి బౌద్ధ సూత్రోచ్ఛరణలు ప్రభోదించి దీక్ష స్వీరించేందుకు ముందుకొచ్చిన 30 మందికి కాషాయ దుస్తులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బౌద్ధం అనేది మతం కాదని, ప్రపంచ శాంతికి మార్గం అన్నారు. ప్రజ్ఞా, శీలం, కరుణ అనే అంశాలపైనే మనిషి జీవన శైలి ఆధారపడి ఉంటుందన్నారు. 1956 ఏప్రిల్ 14న అంబేడ్కర్ లక్ష మందితో కలిసి నాగ్‌పూర్ పట్టణంలో బౌద్ధాన్ని స్వీకరించారని, శాంతిని బోధిస్తూ, అస్పృశ్యతకు అవకాశం లేకుండా సమ సమాజ నిర్మాణానికి, మూఢ నమ్మకాలను విడనాడేందుకు బౌద్ధం ఒక సూచికలా ఉపయోగపడుతుందన్నారు. అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బౌద్ధాన్ని ఆచరించాల్సిన అవసరం నేటి ప్రపంచానికి ఎంతైనా ఉందన్నారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, ఉపాధ్యక్షుడు వినేష్ ఉప్రే, మండల అధ్యక్షుడు జైరాం ఉప్రే, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గం సునీల్, నాయకులు విలాస్ ఖోబ్రగడె, రాజేంద్ర ప్రసాద్, హంసరాజ్, రోషన్, విఠల్, విజయ్ ఉప్రే, నాగ్‌సేన్, తదితరులు పాల్గొన్నారు. -
నిషేధిత పత్తి విత్తనాల పట్టివేత
భీమిని: మండలంలోని మల్లిడి ప్రధాన రహదారిపై సోమవారం భీమిని పోలీసులు నిషే ధిత పత్తి విత్తనాలను పట్టుకున్నారు. రూ. 6.85లక్షల విలువైన 2క్వింటాళ్ల 74కిలోలు విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. సోమవా రం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవికుమార్ వివరాలు వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారనే సమాచారం మేరకు మల్లిడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కుమురంభీం జిల్లా దహెగాం మండలం అత్తిని గ్రామం నుంచి భీమిని మండలం వడాల వైపు ద్విచక్ర వాహనంపై తరలి స్తుండగా పట్టుకున్నారు. వారిని విచారణ చే యగా.. వడాల గ్రామంలోని బంధువులకు అమ్మడానికి 50కిలోల గ్లైసిల్ విత్తనాలు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వారు ఇ చ్చిన సమాచారం మేరకు అత్తిని గ్రామంలోని రాజన్న ఇంట్లో 2క్వింటాళ్ల 27 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.85లక్షలు ఉంటుందని, కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం గంగాపూ ర్ గ్రామానికి చెందిన పురుషోత్తం, పోశం, కృష్ణ, దహెగాం మండలం అత్తిని గ్రామానికి చెందిన రాజన్న, గుంటూరుకు చెందిన సురేష్‌లపై కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపా రు. నిషేధిత గ్లైసిల్ విత్తనాలు అక్రమంగా చేరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. పట్టుబడిన పత్తి విత్తనాలను మండల వ్యవసాయాధికారులు నిషేధిత పత్తి విత్తనాలుగా ధ్రువీకరించారు. భీమిని పోలీ సులను ఏసీపీ అభినందించారు. తాండూర్ సీఐ కుమారస్వామి, భీమిని ఎస్సై విజయ్‌కుమార్, ఇన్చార్జి వ్యవసాయాఽధికారి వీరన్న పాల్గొన్నారు. కాగా, ఫిబ్రవరి 25న ‘నిషేధిత విత్తనంపై జాగ్రత్త’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ముందే అధికారులను అప్రమత్తం చేసింది. -
‘టీచర్’లో కమలం పాగా
● తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచిన మల్క కొమురయ్య ● కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓట్ల్ల వడబోత ● నేటి మధ్యాహ్నానికి మొదలవనున్న లెక్కింపు ● మందకొడి లెక్కింపుపై అభ్యర్థుల మండిపాటు ● మల్క కొమురయ్యను అభినందించిన బండి సంజయ్ ● ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమన్న కేంద్ర సహాయ మంత్రిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం కమలం వశమైంది. ముందు నుంచీ అనుకున్నట్లుగా మల్క కొమురయ్య ఆ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. తొలిప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం విశేషం. ఓట్ల లెక్కింపు సోమవారం సాయంత్రానికి ప్రారంభం కాగా.. రెండు గంటల్లోనే ఫలి తం తేలడం గమనార్హం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యా యి. కాగా 897 చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి కొమురయ్య చేరుకున్నారు. దీంతో తొలిరౌండ్లోనే బీజేపీ మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలిచినట్లయింది. గతంలో పీఆర్టీయూ బలపరిచి న కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసా రి టీచర్ సంఘాలు కాకుండా జాతీయ పార్టీ బీజేపీ పోటీ చేసి గెలవడం చర్చనీయాంశంగా మారింది. ‘బండి’ అభినందనలురాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5,900 ఓట్ల తేడాతో మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారు..’ అని అన్నారు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ వడబోత..సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వ డపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటల కు మొదలు పెట్టిన ఓట్ల లెక్కింపు, చెల్లని, చెల్లి న ఓటర్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలా ంటి ప్రకటనా చేయలేదు. దీంతో రకరకాల ప్ర చా రాలు మొదలవడంతో రాత్రి ప్రకటించారు. అ ప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.50 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం లెక్కింపు మొదలైనా.. తొలి ప్రాధాన్యతలో కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అందులో కోటా ఓట్లు చేరుకునే వరకు ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి. ఆర్వో, సిబ్బందిపై మండిపాటుగ్రాడ్యుయేట్, టీచర్లకు పోటీ పడిన పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో), లెక్కింపు సిబ్బందిపై మండిపడ్డారు. లెక్కింపు ప్రక్రి య మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. సాయంత్రానికి నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలి తం కొలిక్కి వచ్చినా.. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఎలాంటి సమాచారం రాకపోవడంపై మండిపడ్డారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చా రు. టీచర్స్ ఎమ్మెల్సీకి పోలైన ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్‌రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, శుక్రవారం 24,968 మంది ఓటేశారని, సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. -
ఉపాధ్యాయుల నిరసన
లింగాపూర్: జీవో 317 రద్దు చేయాలని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. మండలంలోని ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉ పాధ్యాయులు సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరస న తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ వేమనపల్లి మండలం కల్మలపేట ప్రాథమిక పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంతోష్ 317 జీవో కారణంగా బదిలీపై వచ్చాడని, అప్పటినుంచి ఒత్తిడికి లోనవుతున్నాడన్నారు. దీంతో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఉపాధ్యాయులు రాథోడ్ అరుణ, గోవర్ధన్, సాగర్, రజిత, తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కొలువులు..!
● ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు.. ● మార్చి 8న మహిళా దినోత్సవం రోజున నోటిఫికేషన్? ● టీచర్లు 126, ఆయాలు 397, సూపర్వైజర్లు 20, సీడీపీవో 2 ఖాళీలు దహెగాం: గ్రామాల్లో ఆటాపాటలతో చిన్నారులను పాఠశాలకు అలవాటు చేయడం, గర్భిణులు, బా లింతలకు పోషకాహారం అందించడానికి ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉండడంతో సరైన పోషకాహారం అందడంలేదు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సరిగా లేకపోవడం, వెక్కిరిస్తున్న ఖాళీలపై పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయా కేంద్రాల్లో ఖాళీ గా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల ను భర్తీ చేయడానికి మార్చి 8న మహిళా దినో త్సవం రోజున నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. దీంతో ఆయా పోస్టులకు మోక్షం కలుగనుంది. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మెరుగుపడనుంది. జిల్లాలో 973 అంగన్వాడీ కేంద్రాలుజిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో ఐసీడీఎస్ కింద 973 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 40,812 మంది చిన్నారులు, 4,668 మంది గర్భిణులు, 3,502 మంది బాలింతలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తుంటారు. కానీ ఆయా కేంద్రాల్లో ఏళ్లతరబడిగా ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయక పోవడంతో కొన్ని చోట్ల కేంద్రాలు తెరుచుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ పోస్టులు 126, ఆయా పోస్టులు 397 ఖాళీలు ఉండడంతో పౌష్టికాహారం అందని ద్రాక్షగానే మిగిలింది. 126 అంగన్వాడీ టీచర్ పోస్టుల్లో ఏజెన్సీలో 81, నాన్ ఏజెన్సీలో 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల్లో ఏజెన్సీలో 230, నాన్ ఏజెన్సీలో 167 ఖాళీలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే అధికారుల పోస్టులు సైతం భారీగానే ఖాళీ ఉన్నాయి. దీంతో అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడింది. అంతేకాకుండా ఆసిఫాబాద్, వాంకిడి ప్రాజెక్టుల్లో రెండు సీడీపీవో పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ప్రతీ క్లస్టర్లో ఒక సూపర్ వైజర్ ఉండాలని నిబంధన ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా 40 సూపర్ వైజర్ పోస్టులకుగానూ 20 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే వారు కరువయ్యారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించడంతో ఖాళీలకు మోక్షం కలగనుంది. ఖాళీలను స్థానికులతో భర్తీ చేయాలని డిమాండ్ ఉంది. ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయా పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. కార్యకర్తల పోస్టులు 126, ఆయా పోస్టులు 397, సూపర్వైజర్ పోస్టులు 20, సీడీపీవో పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. – భాస్కర్, ఐసీడీఎస్ పీడీజిల్లాలో క్లస్టర్ వారీగా ఖాళీల వివరాలుక్లస్టర్ అంగన్వాడీ ఆయాలు టీచర్లు సిర్పూర్(టి) 9 52 జైనూర్ 38 117 ఆసిఫాబాద్ 30 112 కాగజ్‌నగర్ 9 45 వాంకిడి 40 71 మొత్తం 126 397 -
ఊరించి.. ఉసూరుమనిపించి..!
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పదేళ్లలో దేశంలో పలు జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణలోని భద్రాచలం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేక, ఇతర కారణాలతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ హైవేను రద్దు చేసింది. దీంతో జిల్లాతో పాటు రాష్ట్రంలో పర్యాటకానికి నష్టం జరగడంతోపాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం దూరమైంది. కౌటాల: రహదారులు ప్రగతికి చిహ్నాలు..అందుకే ప్రభుత్వాలు ఏవైనా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తుంటాయి. చక్కటి రోడ్లతో జిల్లాల మధ్య అనుసంధానం జరిగితే పర్యాటక, వాణిజ్య, వ్యాపార లావాదేవీలు వృద్ధి చెంది, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం వస్తుంది. అలాగే ఈ ప్రాంతాల్లో నాణ్యమైన రవాణా వ్యవస్థ ఏర్పడడంతో పాటు ఆదాయం పెరుగుతుంది. కానీ తాజాగా భారీ జాతీయ రహదారి విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా హైవే రద్దయ్యింది. రాష్ట్రంలోని జిల్లాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారి ప్రాజెక్ట్ మంజూరై, కన్సల్టెంట్ సర్వే పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు పెండింగులో పడింది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సరైన పర్యవేక్షణ లేకపోవడంతో దానిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో దాదాపు రూ.8వేల కోట్ల కీలక జాతీయ రహదారి హైవేను కోల్పోయాం. భద్రాచలం టు కౌటాల...తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం తీవ్రంగా ఉండడంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సరైన రోడ్డు రవాణా వ్యవస్థ ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం నుంచి గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కౌటాల మండలం వరకు నాలుగు వరుసల రోడ్డును ప్రతిపాదించారు. గోదావరి మీదుగా వంతెన నిర్మాణంతో ఈ రోడ్డును ఛత్తీస్‌గఢ్‌కు కూడా అనుసంధానించే అవకాశం ఉండడంతో కేంద్రం వెంటనే దీనికి సమ్మతించింది. దాదాపు 400 కిలోమీటర్ల నిడివితో దీనిని జాతీయ రహదారిగా చేపట్టేందుకు అంగీకరించి మంజూరు చేసింది. ఈ మేరకు కన్సల్టెన్సీ సంస్థను కూడా నియమించి సర్వే చేయించింది. కానీ కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల్లో సఖ్యత సన్నగిల్లింది. దీంతో కొన్ని జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన క్రమం తప్పకుండా పర్యవేక్షించే చొరవ కూడా మందగించింది. దీంతో కొంతకాలం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టింది. పర్యాటకానికి ఆటంకం..హైవే రోడ్డుతో ఆయా ప్రాంతాలు పర్యాటకంగా అ భివృద్ధి చెందుతాయి. రోడ్డు సౌకర్యాలు మెరుగుపడడం వల్ల పర్యాటకులు సులువుగా ప్రయాణించగలుగుతారు. అలాగే ప్రధాన రహదారుల వెంబడి ఆ ర్థిక కారిడార్లు, పారిశ్రామిక సమూహాలు ఏర్పడతా యి. భద్రాచలం నుంచి కౌటాల వరకు హైవే నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో పలు విద్యుదుత్పత్తి, సా గునీటి ప్రాజెక్టులను కూడా ఇది జోడిస్తుండేది. గో దావరి తీరంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటకులను బాగా ఆకట్టుకునే ప్రాంతా లున్నాయి. వాటన్నింటిని కలుపుతూ ఈ హైవే కొ నసాగడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటకరంగం ఎంతో అభివృద్ధి చెందేది. కానీ రాష్ట్ర ప్రభుత్వ అధి కారులు అటవీ భూముల సమస్యకు సరైన ప్రత్యామ్నాయం చూపుతూ ఢిల్లీ స్థాయిలో ఫాలోఅప్ చేయకపోవడంతో కేంద్రం ఈ రోడ్డును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి, పర్యాటకానికి, మెరుగైన రవాణా సౌకర్యం చేజారినట్టయింది. దీంతో ప్రభుత్వాల తీరుపై ఆయా ప్రాంతాల ప్రజలు నిరాశ చెందుతున్నారు. భద్రాచలం – కౌటాల హైవే క్యాన్సిల్ తీవ్రవాద ప్రభావిత ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం ఇటీవల రద్దు చేస్తూ ఆదేశాలు.. టూరిజం అభివృద్ధిపై ప్రభావం హైవే రద్దుతో నష్టం మా ప్రాంతంలో సరైన రోడ్డు సౌకర్యంలేక అనేక ఏళ్లుగా తిప్పలు పడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల క్రితం భద్రాచలం నుంచి కౌటాల వరకు హైవే నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కానీ అనివార్య కారణాలతో ఇటీవల రద్దు చేయడంతో ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ హైవే రద్దుపై పునరాలోచన చేయాలి. – మోర్లె పాండురంగ్, కన్నెపల్లి, కౌటాల నిరాశపడుతున్నాం.. భద్రాచలం నుంచి కౌటాల వరకు పెద్ద రోడ్డు వేస్తారని గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పడంతో చాలా సంతోషించాం. పర్యాటకంగా అభివృద్ధి జరుగుతుందని ఆశించాం. ఈ రోడ్డు నిర్మిస్తే మారుమూల ప్రాంతాల నుంచి పెద్దపెద్ద పట్టణాలకు సులువుగా వెళ్లేవాళ్లం. కానీ ప్రభుత్వం ఈ రోడ్డును రద్దు చేసిందని తెలిసి నిరాశ పడుతున్నాం. – సిడాం దౌలత్, వీర్ధండి, కౌటాలఆగిన హైవే..రాష్ట్రంలోని గోదావరి పరీవాహక జాతీయ రహదారి ప్రాజెక్టు పేరిట భద్రాచలం–సారపాక–ఏటూరు నాగారం–కాళేశ్వరం–చెన్నూర్–కౌటాల మీదుగా ఈ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను అనుసంధానిస్తూ సాగాల్సి ఉంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో భద్రచాలం–కౌటాల రోడ్డు నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపిందన్న విమర్శలున్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో అటవీ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మించాల్సి రావడంతో అటవీ భూముల సేకరణ ఇబ్బందిగా మారుతుందని, వన్యప్రాణులకు సమస్యలేర్పడుతాయన్న భావన వ్యక్తమైంది. ఎన్నికలకు ముందు కొన్ని పెండింగ్ ప్రాజెక్టులను సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం వాటిల్లో కొన్నింటిని రద్దు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా భద్రాచలం నుంచి కౌటాల వరకు హైవే జాతీయ రహదారిని ఇటీవల రద్దు చేసింది. ఈ హైవే నిర్మాణంతో ఆయా ప్రాంతాలు అన్ని రంగాల్లో వృద్ధి చెందుతాయని భావించిన ప్రజలకు నిరాశ తప్పలేదు. మరో వైపు కేంద్రం ఈ హైవేను రద్దు చేయడంతో ఆయా ప్రాంతాల్లోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. -
ఆర్టీసీ డీఎంను సస్పెండ్ చేయాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో పనిచేస్తున్న కార్మికులను వేధింపులకు గురిచేస్తున్న డిపో మేనేజర్ విశ్వనాథ్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల హేమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, కార్మిక సంఘం నాయకులు కేఎస్రావ్ సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే సర్వీసులను నడిపితే మూడు రోజుల పని ది నాలుగా ఇస్తుండగా రెండు రోజులకు కుదించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. డ్రంకెన్ డ్రైవ్ పేరుతో పనిచేయని మిషన్‌తో టెస్టులు చేయించి కార్మికులపై తప్పుడు నివేదికలు ఇచ్చి సస్పెండ్ చేయడం, సర్వీస్ నుంచి రిమూవల్ చేయడం వంటి కుట్రలకు పాల్ప డుతున్నారన్నారు. ఆర్ఎంను ట్రాన్స్ఫర్ చేసి మేనేజర్‌ను సస్పెండ్ చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు కేశవరెడ్డి, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. -
సింగరేణి.. ఇక పేపర్ లెస్!
శ్రీరాంపూర్: సింగరేణిలో త్వరలో పేపర్‌లెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగులకు నిరీక్షణ తిప్పలు తప్పనున్నాయి పర్యావరణ పరిరక్షణ, టెక్నాలజీ అందిపుచ్చుకునే చర్యల్లో భాగంగా సింగరేణి అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఫైల్లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ పేరుతో పేపర్ రికార్డుల స్థానంలో కంప్యూటర్ రికార్డులను సిద్ధం చేశారు. ఉద్యోగులకు సంబంధించిన ఇప్పటి వరకు పేపర్ ఫైల్లో ఉన్న రికార్డులన్నీ డిజిటలైజేషన్ అయ్యాయి. ఇక నుంచి ఏ వివరాలు కావాలన్నా కంప్యూటర్లో క్లిక్ చేస్తే సమస్త సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాని ద్వారానే ఉద్యోగి కోరిన విధంగా ఫార్వర్డ్ చేసి సమాచారం అందించడం, పంచుకోవడం చేస్తారు. ఈ మేరకు కార్పొరేట్ నుంచి అన్ని ఏరియాలకు ఆదేశాలు అందాయి. డిజిటలైజేషన్ పూర్తి... పేపర్ లెస్సేవల కోసం ఏళ్లుగా పేపర్లలో నిక్షిప్తమై ఉన్న ఉద్యోగుల పర్సనల్ రికార్డు(ఈపీఆర్)లన్నీ కంప్యూటర్ ప్రోగ్రాం శాప్‌లో అప్లోడ్ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి కావడంతో దానికి అనుగుణంగా సేవలు మొదలు కానున్నాయి. ఉద్యోగి అపాయింట్మెంట్ తేదీ, అతని మస్టర్లు, పొందిన ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఎల్టీసీ, ఎల్ఎల్టీసీ, జీతభత్యాలు, పనిష్మెంట్లు, రివార్డులు ప్రతీది కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. రిటైర్మెంట్కు ముందు అతనికి ఎంత మొత్తం చెల్లింపులు చేయాలో కూడా కంప్యూటర్ క్లిక్ చేసి చెబుతారు. ఈపీఆర్ రికార్డులో ఉన్న ఉద్యోగి కుటుంబ సభ్యులు పేర్లతోపాటు వారి తల్లిదండ్రులు, భార్య పిల్లల ఫొటోలు కూడా స్కానింగ్ చేసి కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. దీనిని డిజిటలైజేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టం(డీఎంఎస్) అని కూడా పిలుస్తారు. దీనితోపాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీస్(హెచ్ఎంఎస్) వివరాలు కూడా శాప్‌లో ఎంట్రీ చేశారు. నిరీక్షణకు తెర..ఇప్పటి వరకు ఉద్యోగి తన వ్యక్తిగత రికార్డులు, వివరాలు కావాలని అధికారులను కోరితే దానిని తీసి ఇవ్వడానికి రెండు, మూడు రోజులు పట్టేది. కుప్పలుగా ఉన్న ఫైల్స్ వెతకడం, వాటిని తీసి ఇవ్వడం ప్రయాసగా ఉండేది. పేపర్ రికార్డులతో కొన్ని సందర్భాల్లో అవకతవకలు కూడా జరిగాయి. ఇప్పుడు ఏమాత్రం జాప్యం లేకుండా క్షణాల్లో ఇవ్వనున్నారు. ఇక నుంచి ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదు. పత్రాల్లో ఉన్నవి కంప్యూటర్లో ఎక్కించే ముందే ఉద్యోగుల నుంచి పూర్తి సమాచారం మరోసారి చెక్ చేసుకుని ఎంట్రీ చేశారు. ఉద్యోగులు కోరిన సవరణలు కూడా చేశారు. వారు ఓకే అన్న తర్వాతే ఆ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేశారు. దీంతో ఇక రికార్డులన్నీ పూర్తి పారదర్శకంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఏరియా ఆసుపత్రుల నుంచి మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను, రోగులను కార్పొరేట్ ఆస్పత్రులకు రెఫర్ చేసే సమయంలో ఉద్యోగి పనిచేసే చోట నుంచి వారి ఫొటోలతో కూడా ఫాంలు తెచ్చి ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పింది. నేరుగా ఏరియా ఆస్పత్రుల నుంచి రెఫర్ చేసే అవకాశం కలిగింది. ఉద్యోగులకు సంబంధించి ఏవైనా డబ్బులు సెటిల్మెంట్ చేసే సమయంలో కార్పొరేట్ అధికారులు నేరుగా కంప్యూటర్లో క్లిక్ చేసి నిర్ణయాలు తీసుకునే వీలు కలిగింది. ఏప్రిల్ 1 నుంచి అమలు సింగరేణిలో పేపర్ లెస్ సేవలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అన్ని ఏరి యాల్లో రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయింది. సమ స్త సమాచారం కంప్యూటర్ తెరపై క్షణాల్లో పొందవచ్చు. దీంతో సేవలు మరింత మెరుగవుతాయి. – ఎం.శ్రీనివాస్, జీఎం, శ్రీరాంపూర్ పూర్తయిన రికార్డుల డిజిటలైజేషన్ ఉద్యోగులకు తప్పనున్న నిరీక్షణ ఏప్రిల్ 1 నుంచి అమలు -
‘వలస వ్యాపారులను కట్టడి చేయాలి’
ఆసిఫాబాద్‌రూరల్: స్థానిక వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్న వలస వ్యాపారులను కట్టడి చేయాలని ఎమ్మార్పీస్ జిల్లా అధికార ప్రతినిధి మహేశ్ డిమాండ్ చేశారు. మండలంలోని అంకుసాపూర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు స్థానిక వ్యాపారులను ఇబ్బందులుకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, యువత కూడా ఉపాధికి దూరమవుతున్నారన్నారు. జిల్లాలోని ఇటుక బట్టీల్లో బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాకు చెందిన కూలీల సంఖ్య పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, పెంటు, రాము, దాము తదితరులు పాల్గొన్నారు. -
బొక్కివాగు ప్రాజెక్టు వివరాలు
● కబ్జాకు గురవుతున్న బొక్కివాగు ప్రాజెక్టు భూములు ● యాసంగిలో యథేచ్ఛగా పంటల సాగు ● ఏటా పెరుగుతున్న ఆక్రమణలు ● అధికారుల పర్యవేక్షణ లోపంతో అన్యాక్రాంతం!సేకరించిన భూమి 334 ఎకరాలు వ్యయం రూ.18కోట్లులక్ష్యం రెండు వేల ఎకరాలకు సాగునీరుఆక్రమణకు గురైన భూమి సుమారు 60 నుంచి 100 ఎకరాలుచెల్లించిన పరిహారం ఎకరాకు రూ.1.50లక్షలుపెంచికల్పేట్(సిర్పూర్): రైతులకు సాగు నీరందించాలనే సంకల్పంతో పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ సమీపంలోని బొక్కివాగుపై 2012లో నిర్మించారు. అధికారుల నిర్లక్ష్యంలో ప్రాజెక్టు లక్ష్యం నీరుగారే ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టు శిఖం భూములను కొంతమంది ఆక్రమించుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు. మరికొందరు శిఖం భూములను సాగు చేయడమే కాక ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు సంబంధించిన సుమారు 60 ఎకరాల వరకు భూమి ఆక్రమణకు గురైంది. అధికారులు పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ప్రాజెక్టు సామర్థ్యం తగ్గడంతో పాటు రూపురేఖలు కనుమరుగయ్యే అవకాశాలు లేకపోలేదు. యాసంగిలో జోరుగా సాగు..వానాకాలం సీజన్లో ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు నీటి మట్టం పెరిగింది. ఆక్రమణదారులు పక్కాగా యాసంగి సీజన్లో ఎక్కువ మొత్తంలో శిఖం భూములను ఆక్రమించుకుని పంటలను సాగు చేయడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు ఎండాకాలంలో శిఖం భూముల్లో ఇష్టారీతిన ట్రాక్టర్‌తో ఎకరాల కొద్ది భూములను చదును చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 నుంచి 100 ఎకరాలు శిఖం భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సర్వేకు వెనుకడుగుప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందింది. గత ప్రభుత్వంలో నిర్వహించిన భూరికార్డుల సమగ్ర సర్వేలో ప్రాజెక్టులో కోల్పోయిన భూములను రికార్డుల నుంచి తొలగించాల్సి ఉంది. అధికారుల తప్పిదంతో ప్రాజెక్టులో భూములను కోల్పోయిన పలువురికి నేటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. కొంతమంది అధికారులు భూఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం..!ప్రాజెక్టు నిర్మాణానికి సేకరించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపంతో ప్రాజెక్టు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టు భూముల్లో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేస్తే శిఖం భూములకు రక్షణ కల్పించవచ్చు. అధికారులు సర్వే నిర్వహించి శిఖం భూములను రక్షించాలని స్థానిక ప్రజలు, రైతులు కోరుతున్నారు.హద్దులు చెరిపి..ప్రాజెక్టు నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన భూముల్లో హద్దులు నిర్ణయించిన సంబంధిత అధికారులు యజమానులకు నగదు అందించారు. అనంతరం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణదారులకు కలిసి వస్తోంది. వర్షాకాలంలో ప్రాజెక్టులో చేరిన నీటిని ముందుగానే తూముల నుంచి వృథాగా వదిలేస్తున్నారు. నీటిమట్టం తగ్గగానే ట్రాక్టర్లతో శిఖం భూములు చదును చేయిస్తూ పంటలు సాగు చేస్తున్నారు. సాగు పేరుతో అక్రమార్కులు ఇష్టారీతిన శిఖం భూములను ఆక్రమించుకుంటున్నారు. ఏటా భూములు స్వాహా అవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.ఆక్రమిస్తే చర్యలు శిఖం భూములను కబ్జా చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రా జెక్టు భూముల్లో సర్వే నిర్వహించి సేకరించిన భూమికి హద్దులు ఏర్పాటు చేస్తాం. ప్రాజెక్టు భూములను ఆక్రమించినా, క్రయవిక్రయాలు జరిపినా కేసులు నమోదు చేస్తాం. ప్రాజెక్టు భూముల రక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలి. – ప్రభాకర్‌రావు, ఈఈ, ఇరిగేషన్ హద్దులు ఏర్పాటు చేయాలి ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో కొంతమంది వ్యక్తులు భూములను చదును చేస్తూ ఆక్రమణలు సాగిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి విలువైన శిఖం భూములు ఆక్రమిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టు భూముల్లో హద్దులు ఏర్పాటు చేయాలి. – పాలె సంతోష్, పెంచికల్పేట్ -
ఆదివాసీలకు అండగా ఉంటాం
తిర్యాణి(ఆసిఫాబాద్): ఆదివాసీ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. తిర్యాణి మండలం గోవెనా పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామాలైన కుర్సిగూడ, లింగిగూడ, నాయకపుగూడలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ యువత ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక శక్తులకు సహకరించొ ద్దని సూచించారు. సమస్యలు పోలీసుల దృష్టికి తీసుకువస్తే.. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యతోనే ఆదివాసీల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చిన్నారులను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించా లని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ బుద్దె స్వామి, ఎస్సై శ్రీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
న్యూస్‌రీల్
4, 5 తేదీల్లో బెజ్జూర్‌లో వైద్యశిబిరం ఆసిఫాబాద్: జిల్లా అటవీశాఖ, సింగరేణి కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5 తేదీ ల్లో బెజ్జూర్ మండల కేంద్రంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మె డిసన్, కీళ్ల వైద్య నిపుణులు, సీ్త్ర వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. స్థానిక గ్రామాల ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు కార్యకర్తల సమావేశం కౌటాల: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. సమావేశానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ వస్తారని, ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని తెలిపారు. మండలంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు సమావేశానికి సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు. -
గెలుపెవరిదో..?
● ‘ప్రాధాన్యత’ దక్కేదెవరికో.. ● నేడు ‘ఎమ్మెల్సీ’ ఓట్ల లెక్కింపు ● కరీంనగర్లో కౌంటింగ్ ● ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ ● విజయంపై ప్రధాన పార్టీల ధీమా కై లాస్‌నగర్: శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికాసేపట్లో షురూ కానుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌కు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గెలుపెవరిదో అనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్యనే ఉంటుందని తెలుస్తోంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితం తొలుత వెల్లడి కానుండగా పట్టభద్రుల కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది పోటీ పడ్డారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి వూట్కూరి నరేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. స్వతంత్రుల్లో గట్టి పోటీనిచ్చే వారు లేకపోవడంతో పట్టభద్రులు ప్రధాన పార్టీల అభ్యర్థులకే మద్దతునిచ్చినట్లుగా పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తమదే ఆధిక్యత ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో బరిలో లేకున్నా బీఎస్పీ నుంచి పోటీ చేసిన హరికృష్ణకు అంతర్గతంగా మద్దతునిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో తొలి ప్రాధాన్యత ఎవరికి దక్కనుందో అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయా పార్టీలతో పాటు ఓటర్లు సైతం తమ మద్దతుదారుల గెలుపునకున్న అవకాశాలు బేరీజు వేసుకుంటున్నారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలుతుందా లేక రెండో ప్రాధాన్యత అవసరం ఉంటుందా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తొలి ఫలితం టీచర్స్ ఎమ్మెల్సీదేటీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో బీజేపీ తరఫున మల్క కొమురయ్య బరిలో నిలువగా, ఉపాధ్యాయ సంఘాల్లో ప్రధానమైన పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్, టీఎస్‌యూటీఎఫ్ పక్షాన అశోక్‌కుమార్ బరిలో నిలిచారు. ఇతర అభ్యర్థులు వివిధ సంఘాల మద్దతుతో బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యనే ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే పీఆర్టీయూ మద్దతుదారులే విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం అవుతుందా.. లేక రాజకీయంగా ఉత్సాహంగా ఉన్న బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తాడా.. లేదంటే అశోక్ కుమార్ గెలుస్తాడా అనే దానిపైనా ప్రధాన చర్చ సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే ఈ ఎన్నికను ఆయా ఉపాధ్యాయ సంఘాలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. ఉపాధ్యాయ ఓటర్లను కలుస్తూ మద్దతు కోరడంతో పాటు విందులు సైతం ఏర్పాటు చేశాయి. పోలింగ్ సరళి సాగిన తీరుపై ఆయా సంఘాలు తమ అభ్యర్థి గెలుపుపై పక్కా లెక్కలు వేసుకుంటున్నాయి. పట్టభద్రులతో పోల్చితే ఓటర్లు తక్కువగా ఉన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితమే ముందుగా వచ్చే అవకాశముంది. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెల్లడవుతుందా లేక రెండో ప్రాధాన్యత ఓట్లు అనివార్యం కానున్నాయా అనేది మరికాసేపట్లో తేలనుంది. మొత్తానికి అటు పట్టభద్రులు, ఇటు టీచర్స్ ఫలితంపై అన్నివర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుండటం ఆసక్తి రేపుతోంది.మొత్తం టేబుళ్లు: 35 పట్టభద్రుల టేబుళ్లు : 21 టీచర్ల టేబుళ్లు : 14 లెక్కింపు సిబ్బంది: 800 రిజర్వ్ స్టాఫ్: 20 శాతంలెక్కింపు గణాంకాలు వేదిక: అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్– ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం మొదలు కానుంది. కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాలకు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో ఒక మైక్రోఅబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. ఆదివారం మాక్ కౌంటింగ్‌ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. -
నిఘా నీడలో పరీక్షలు
● ఈ నెల 5న ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షలు ● హాజరుకానున్న 10,054 మంది విద్యార్థులు ● ‘సాక్షి’తో డీఐఈవో కళ్యాణిఆసిఫాబాద్రూరల్: ‘విద్యార్థి భవిష్యత్తును మలుపుతిప్పే ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అన్నిఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 19 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 10,054 మంది పరీక్షలు హాజరుకానున్నారు. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి..’ అని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కళ్యాణి అన్నారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పరీక్ష ఏర్పాట్ల వివరాలు వెల్లడించారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా కేంద్రం లోపలికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. సాక్షి: ఈ ఏడాది జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు? ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు? డీఐఈవో: ప్రథమ సంవత్సరంలో 4,758 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,296 మంది, మొత్తంగా 10,054 మంది పరీక్షలు రా యనున్నారు. ఇందులో జనరల్ విభాగంలో 8,524 మంది, ఒకేషనల్ విభాగంలో 1,530 మంది ఉన్నారు. వీరి కోసం 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. సాక్షి: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? డీఐఈవో: అన్ని పరీక్ష కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు కోసం లైట్లు, ఫర్నిచర్ సౌకర్యాలు కల్పించాం. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇంటర్నెట్, కంప్యూటర్ ప్రింటర్, గైర్హాజరైన విద్యార్థుల సమాధాన పత్రాల బార్‌కోడ్‌లను స్కానింగ్ చేసి ఎప్పటికప్పుడు బోర్డు వెబ్‌సైట్‌కు సమాచారం పంపించే ఏర్పాటు చేశాం. వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారు. సాక్షి: ఫలితాలపై మీ అంచనా ఏమిటి? విద్యార్థులను పరీక్షల కోసం ఏ మేరకు సంసిద్ధం చేశారు? డీఐఈవో: గతేడాది రాష్ట్రంలోనే జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా ప్రథమస్థానంలో నిలిచేలా విద్యార్థులను సిద్ధం చేశాం. ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. జూనియర్ కళాశాలల్లో అకాడమిక్ మానిటరింగ్ టీం ఆధ్వర్యంలో నిరంతరం విద్యార్థుల మార్కులపై దృష్టి సారిస్తూ ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ప్రశ్నాపత్రాల నమూనాలపై ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇస్తున్నాం. సాక్షి: మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? డీఐఈవో: ప్రతీ పరీక్ష కేంద్రంలో ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వాటిని సెంటర్ నుంచి ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేశాం. కెమెరాల నిఘాలోనే ప్రశ్నపత్రాలు ఓపెన్ చేస్తారు. సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు సైతం నిర్వహించనున్నాం. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. డిపార్టుమెంట్ బృందం, ఫ్లయింగ్‌స్క్వాడ్, జూనియర్ లెక్చరర్లు, రెవెన్యూ, ఏఎస్సై, జిల్లా పరీక్ష కమిటీ, అదనపు కలెక్టర్ నిత్యం తనిఖీలు నిర్వహిస్తారు. కాపీయింగ్‌ను ప్రోత్సహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. సాక్షి: ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతిస్తారా? డీఐఈవో: విద్యార్థులు 30 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. 15 నిమిషాల ముందే జవాబు పత్రం అందస్తారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించనున్నారు. సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి? డీఐఈవో: విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలి. ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలి. -
‘వలస వ్యాపారులను కట్టడి చేయాలి’
ఆసిఫాబాద్‌రూరల్: స్థానిక వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్న వలస వ్యాపారులను కట్టడి చేయాలని ఎమ్మార్పీస్ జిల్లా అధికార ప్రతినిధి మహేశ్ డిమాండ్ చేశారు. మండలంలోని అంకుసాపూర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు స్థానిక వ్యాపారులను ఇబ్బందులుకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, యువత కూడా ఉపాధికి దూరమవుతున్నారన్నారు. జిల్లాలోని ఇటుక బట్టీల్లో బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాకు చెందిన కూలీల సంఖ్య పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, పెంటు, రాము, దాము తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణి.. ఇక పేపర్ లెస్!
శ్రీరాంపూర్: సింగరేణిలో త్వరలో పేపర్‌లెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగులకు నిరీక్షణ తిప్పలు తప్పనున్నాయి పర్యావరణ పరిరక్షణ, టెక్నాలజీ అందిపుచ్చుకునే చర్యల్లో భాగంగా సింగరేణి అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఫైల్లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ పేరుతో పేపర్ రికార్డుల స్థానంలో కంప్యూటర్ రికార్డులను సిద్ధం చేశారు. ఉద్యోగులకు సంబంధించిన ఇప్పటి వరకు పేపర్ ఫైల్లో ఉన్న రికార్డులన్నీ డిజిటలైజేషన్ అయ్యాయి. ఇక నుంచి ఏ వివరాలు కావాలన్నా కంప్యూటర్లో క్లిక్ చేస్తే సమస్త సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాని ద్వారానే ఉద్యోగి కోరిన విధంగా ఫార్వర్డ్ చేసి సమాచారం అందించడం, పంచుకోవడం చేస్తారు. ఈ మేరకు కార్పొరేట్ నుంచి అన్ని ఏరియాలకు ఆదేశాలు అందాయి. డిజిటలైజేషన్ పూర్తి... పేపర్ లెస్సేవల కోసం ఏళ్లుగా పేపర్లలో నిక్షిప్తమై ఉన్న ఉద్యోగుల పర్సనల్ రికార్డు(ఈపీఆర్)లన్నీ కంప్యూటర్ ప్రోగ్రాం శాప్‌లో అప్లోడ్ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి కావడంతో దానికి అనుగుణంగా సేవలు మొదలు కానున్నాయి. ఉద్యోగి అపాయింట్మెంట్ తేదీ, అతని మస్టర్లు, పొందిన ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఎల్టీసీ, ఎల్ఎల్టీసీ, జీతభత్యాలు, పనిష్మెంట్లు, రివార్డులు ప్రతీది కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. రిటైర్మెంట్కు ముందు అతనికి ఎంత మొత్తం చెల్లింపులు చేయాలో కూడా కంప్యూటర్ క్లిక్ చేసి చెబుతారు. ఈపీఆర్ రికార్డులో ఉన్న ఉద్యోగి కుటుంబ సభ్యులు పేర్లతోపాటు వారి తల్లిదండ్రులు, భార్య పిల్లల ఫొటోలు కూడా స్కానింగ్ చేసి కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. దీనిని డిజిటలైజేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టం(డీఎంఎస్) అని కూడా పిలుస్తారు. దీనితోపాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీస్(హెచ్ఎంఎస్) వివరాలు కూడా శాప్‌లో ఎంట్రీ చేశారు. నిరీక్షణకు తెర..ఇప్పటి వరకు ఉద్యోగి తన వ్యక్తిగత రికార్డులు, వివరాలు కావాలని అధికారులను కోరితే దానిని తీసి ఇవ్వడానికి రెండు, మూడు రోజులు పట్టేది. కుప్పలుగా ఉన్న ఫైల్స్ వెతకడం, వాటిని తీసి ఇవ్వడం ప్రయాసగా ఉండేది. పేపర్ రికార్డులతో కొన్ని సందర్భాల్లో అవకతవకలు కూడా జరిగాయి. ఇప్పుడు ఏమాత్రం జాప్యం లేకుండా క్షణాల్లో ఇవ్వనున్నారు. ఇక నుంచి ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదు. పత్రాల్లో ఉన్నవి కంప్యూటర్లో ఎక్కించే ముందే ఉద్యోగుల నుంచి పూర్తి సమాచారం మరోసారి చెక్ చేసుకుని ఎంట్రీ చేశారు. ఉద్యోగులు కోరిన సవరణలు కూడా చేశారు. వారు ఓకే అన్న తర్వాతే ఆ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేశారు. దీంతో ఇక రికార్డులన్నీ పూర్తి పారదర్శకంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఏరియా ఆసుపత్రుల నుంచి మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను, రోగులను కార్పొరేట్ ఆస్పత్రులకు రెఫర్ చేసే సమయంలో ఉద్యోగి పనిచేసే చోట నుంచి వారి ఫొటోలతో కూడా ఫాంలు తెచ్చి ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పింది. నేరుగా ఏరియా ఆస్పత్రుల నుంచి రెఫర్ చేసే అవకాశం కలిగింది. ఉద్యోగులకు సంబంధించి ఏవైనా డబ్బులు సెటిల్మెంట్ చేసే సమయంలో కార్పొరేట్ అధికారులు నేరుగా కంప్యూటర్లో క్లిక్ చేసి నిర్ణయాలు తీసుకునే వీలు కలిగింది. ఏప్రిల్ 1 నుంచి అమలు సింగరేణిలో పేపర్ లెస్ సేవలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అన్ని ఏరి యాల్లో రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయింది. సమ స్త సమాచారం కంప్యూటర్ తెరపై క్షణాల్లో పొందవచ్చు. దీంతో సేవలు మరింత మెరుగవుతాయి. – ఎం.శ్రీనివాస్, జీఎం, శ్రీరాంపూర్ పూర్తయిన రికార్డుల డిజిటలైజేషన్ ఉద్యోగులకు తప్పనున్న నిరీక్షణ ఏప్రిల్ 1 నుంచి అమలు -
నీటి తిప్పలకు చెక్
దహెగాం: మండలంలోని చిన్న ఐనం గ్రామస్తులు గత ఇరవై రోజుల నుంచి తాగునీటికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. శుక్రవారం ‘కావడి పడితేనే తాగునీరు’, శనివారం ‘తాగునీటి కష్టాలు’ శీర్షికన కథనాలు ప్రచురితం కాగా వీటికి పంచాయతీ అధికారులు స్పందించారు. గ్రామ సమీపంలోని ఒర్రెలో వేసిన బోరు బావికి మోటార్ ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్ మండలం అందవెల్లి పెద్దవాగుపై అప్రోచ్‌రోడ్డు పనులు ప్రారంభించడంతో మిషన్ భగీరథ పైప్‌లైన్ తొలగించారు. దీంతో గ్రామాల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై వరుస కథనాలు ప్రచురించగా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎఫెక్ట్ -
బ్యాంకులకు కట్టుదిట్టమైన భద్రత అవసరం
ఆసిఫాబాద్‌అర్బన్: ఇటీవల పలు బ్యాంకుల్లో చోరీలు జరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని బ్యాంకులకు కట్టుదిట్టమైన భద్రత అవసరమని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శనివా రం ఆసిఫాబాద్ సబ్ డివిజన్లోని పలు బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బ్యాంకు లోపల, వెలుపల అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో ఉండే సెక్యూరిటీ అలారం ప్రా ముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏటీఎంలో నగదు నింపే సమయంలో అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ రవీందర్, రమేశ్, సత్యనారాయణ, ఎస్సైలు చంద్రశేఖర్, సాగర్, శ్రీకాంత్ విజయ్, ప్రశాంత్, బ్యాంకు కంట్రోలర్స్, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. -
న్యూస్‌రీల్
మహిళలు, చిన్నారుల రక్షణకు తొలి ప్రాధాన్యత ఆసిఫాబాద్‌అర్బన్: మహిళలు, చిన్నారుల రక్షణే పోలీసుశాఖ తొలి ప్రాధాన్యత అని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షీటీం, భరోసా కేంద్రం బృందాల ద్వారా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు ధైర్యంగా ముందుకొస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో, షీటీం, పోలీసు అధికారుల ద్వా రా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరిలో షీటీం ద్వారా 65 హాట్‌స్పాట్ ప్రదేశాలు గుర్తించామన్నారు. 14 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించామని, రెండు ఫిర్యాదులు స్వీకరించా మని వెల్లడించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పోస్టు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా రెండు షీటీంలు పనిచేస్తున్నాయన్నారు. బాధితులు ఆసిఫాబాద్ డివిజ న్ షీటీం నంబర్ 87126 70564, కాగజ్‌నగర్ షీటీం నంబర్ 87126 70565, డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.జిల్లాలో 30 పోలీసు యాక్టు కొనసాగింపు ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో శాంతిభద్రతలు, ప్రశాంతత పెంపొందించేందుకు ఈ నెల 31 వరకు 30 పోలీసు యాక్టు(1861) కొనసాగిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారి, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించొద్దని సూచించారు. లౌడ్ స్పీకర్లు, డీజేలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మొదటి విడత ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారులు, హౌసింగ్ బోర్డు అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతగా పైలెట్ గ్రామాల్లో ఎంపికై న లబ్ధిదారుల ఇళ్ల బేస్మెంట్ నిర్మాణంపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ పైలెట్ గ్రామాల్లో బేస్మెంట్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణం పూర్తయితే నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఎల్– 1, ఎల్– 2 జాబితాలపై సర్వే పూర్తిచేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. -
ఏరియాలో 114శాతం బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన(ఆసిఫాబాద్): ఫిబ్రవరిలో బెల్లంపల్లి ఏరియా 114 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి వెల్ల డించారు. గోలేటి టౌన్‌షిప్‌లోని కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏ ర్పాటు చేశారు. ఫిబ్రవరిలో ఏరియాకు 3.60 లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఏరియా 4.09 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ఏరియాలో కై రిగూ డ ఓసీపీలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోందని, ఈ ఓసీపీకి ద్వారా 4.09 లక్షల టన్నుల బొగ్గు సాధించామని పేర్కొన్నారు. వార్షిక ఉత్పత్తి సాధనలో ఏరియా 95 శాతంతో ముందుకు సాగుతోందని, ఈ నెలాఖరు నాటికి వందశాతం ఉత్పత్తి సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గోలేటి ఓసీపీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. గోలేటి, మాదారం ఓసీపీలు ఏర్పాటైతే ఏరియా పూర్వవైభవం సంతరించుకుంటుందన్నారు. ఈ సమావేశంలో ఎస్వోటూ జీఎం రాజమల్లు, డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి పాల్గొన్నారు. -
‘భూసారం’ తెలిసేదెలా!
● రైతువేదికల్లో అందుబాటులో లేని కిట్లు ● పరీక్షలు చేసేవారు లేక రైతుల అవస్థలు ● మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగం రెబ్బెన(ఆసిఫాబాద్): సాగు భూముల్లో సారం తెలుసుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. భూములు ఏ తరహా పంటల సాగుకు అనుకూలం, పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయి.. తదితర వివరాలు తెలిస్తే మరింత దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. భూముల రకం, అందులోని సారానికి అనుగుణంగా సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు సైతం తగ్గుతాయి. కానీ ఏళ్లుగా తమ అనుభవంతో మాత్రమే అన్నదాతలు ఎరువులు వాడుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం భూసార పరీక్షలపై శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా సాగు పెట్టుబడులు పెరుగుతున్నాయి. పెరిగిన రసాయన ఎరువుల వాడకంప్రస్తుతం వ్యవసాయంలో రసాయన ఎరువుల వా డకం విపరీతంగా పెరిగింది. మోతాదు మించి ఎరువులు వినియోగిస్తుండటంతో భూసారం దెబ్బతింటోంది. రైతులపై అదనపు ఆర్థికభారం పడుతోంది. ఆశించిన దిగుబడి రాక అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అప్పులు తీర్చే మార్గం తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అధిక దిగుబడి సాధించాలనే ఆశతో వినియోగించే రసాయన ఎరువులు పర్యావరణంపై సైతం ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. భూసార పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహిస్తే రైతులతో పాటు పర్యావరణానికి సైతం మేలు జరగనుంది. ఆసక్తి ఉన్నా..కొంతమంది రైతులు భూసార పరీక్షలు చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆ సౌకర్యం అందుబాటులో లేకపోవటంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. జిల్లాలోని రైతులు సుమారు 4.5లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. గతంలో వ్యవసాయశాఖ అధికారులే దగ్గరుండి రైతులు సాగుచేసే భూముల్లో ఒక పద్ధతిలో తవ్వి మట్టి నమూనాలు సేకరించి వాటికి పరీక్షలు నిర్వహించేవారు. కచ్చితత్వంతో కూడిన ఫలితాలు రైతులకు ఉపయోగకరంగా మారేవి. ఇప్పుడు భూసార పరీక్షలు చేయించుకునే రైతే భూమిలో మట్టి నమూనాలు సేకరించి సంబంధిత వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలి. వారు ఆదిలాబాద్ తీసుకెళ్లి అక్కడ భూసార పరీక్షలు చేయిస్తున్నారు. రైతుల సెల్‌ఫోన్‌కు సందేశం రూపంలో ఫలితాలను పంపిస్తారు. మట్టి నమూనా సేకరణ చేపట్టే పద్ధతిపై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇష్టారీతిన నమూనాలు సేకరిస్తుండటంతో ఫలితాల్లో కచ్చితత్వం లోపిస్తోంది. మట్టి నమూనాలు సేకరించి సంబంధిత అధికారులకు అప్పగించడం వంటి పనులు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. రైతులు కోరితే పరీక్షలు భూసార పరీక్షలు చేయాల ని రైతులు కోరితే తప్పనిసరిగా చేయించి ఫలితాలు రై తులకు తెలియజేస్తాం. అ యితే రైతులు మట్టి నమూనాలు తీసుకువచ్చి ఇస్తే వాటిని ల్యాబ్‌కు పంపిస్తాం. ప్రస్తుతానికి జిల్లాలో భూసార పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ అందుబాటులో లేదు. ఆదిలాబాద్‌లోని ల్యాబ్‌కు నమూనాలు పంపించి పరీక్షలు చేయిస్తున్నాం. – శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి రైతువేదికల్లో నిలిచిన పరీక్షలురాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పంటల సాగుకు కావా ల్సిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందించడంతోపాటు అవగాహన సదస్సులు, సమావేశాల నిర్వహణ కోసం ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతువేదికలు నిర్మించింది. క్లస్టర్ పరిధిలోని రైతుల భూముల్లో సారా న్ని తెలుసుకునేందుకు వీలుగా ప్రతీ రైతువేదిక కు భూసార పరీక్షల కిట్లు పంపిణీ చేసింది. కొన్ని నెలలపాటు భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలు రైతులకు తెలియజేశారు. ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేశారు. భూమిలో పోషకాలను బట్టి తగిన మోతాదులో రసాయనిక ఎరువులు వినియోగించేవారు. అనంతర కాలంలో ప్రభుత్వం రైతువేదికల వద్ద భూసార పరీక్షల నిర్వహణకు అవసరమైన రసాయనాల పంపిణీ నిలిపివేసింది. భూసార పరీక్షలు సైతం నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవటంతో రైతువేదికలకు ఇచ్చి కిట్లు సైతం కనుమరుగైపోయాయి. ప్రస్తుతం భూసార పరీక్షలు అందని ద్రాక్షగా మిగిలిపోయాయి. భూసార పరీక్షలు కీలకమైనా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. -
మా కాలేజీలో చేరండి..!
● ఇంటర్ ప్రవేశాల పెంపునకు కార్యాచరణ ● ప్రచారం చేపట్టిన ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు ● ఇప్పటికే 1,085 మంది విద్యార్థుల గుర్తింపు ● ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై వారికి అవగాహనపదో తరగతి వార్షిక పరీక్షలకు సమయం సమీపిస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు ‘పది’ విద్యార్థులకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఇంటర్ బోర్డు సైతం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు ఉన్నత పాఠశాలల్లో ప్రచారం చేస్తున్నారు. ఉచిత విద్య, సర్కారు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరిస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య పెంపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.కెరమెరి(ఆసిఫాబాద్): వివిధ కారణాలతో ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ప్రభుత్వ అర్హులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్యనందిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నా అవగాహన లోపంతో కొందరు ప్రైవేట్‌కే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అడ్మిషన్ల పెంపుపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు వసతిగృహాల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు. పది వార్షిక పరీక్షల కంటే ముందే ఆయా కళాశాలల అధ్యాపకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. జూనియర్ కళాశాలల ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ‘సర్కారు’లో మెరుగైన వసతులుజిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌లో 4,758 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 5,396 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో చాలా వరకు మెరుగైన వసతులు ఉన్నాయి. ఉన్నత విద్య పూర్తిచేసిన నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో పలు కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. గతంతో పోల్చితే వసతులు, బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెరిగాయి. కళాశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. వార్షిక పరీక్షలపైనే కాకుండా విషయ పరిజ్ఞానంపై దృష్టి సారించి విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రవేశాలు పెంచేందుకే.. రానున్న విద్యా సంవత్సరంలో జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు బో ర్డు అధికారుల ఆదేశాల మే రకు మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో ప్రచారం చేస్తున్నాం. అనేక పాఠశాలల్లోని విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వెయ్యికి పైగా విద్యార్థుల వివరాలు సేకరించాం. గతేడాది కంటే ఈ ఏడాది ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తాం. – సీహెచ్ కళ్యాణి, డీఐఈవో గోయగాం ఉన్నత పాఠశాలలో ప్రచారం చేస్తున్న అధ్యాపకులుప్రవేశాల ప్రచారం కోసం వెళ్లిన అధ్యాపకులు 103 మందిజిల్లా వివరాలుప్రభుత్వ జూనియర్ కళాశాలలు 11ప్రవేశానికి ఆసక్తి చూపిన విద్యార్థులు 1,085ప్రైవేట్ కంటే ముందే..జిల్లాకు చెందిన విద్యార్థులు స్థానిక ప్రైవేట్ కళాశాలతోపాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి పట్టణాల్లో ఇంటర్ పూర్తిచేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యజమాన్యాలు తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ర్యాంకుల ఆశ చూపి రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయి. ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు వేసవి నుంచే ప్రచారం చేస్తూ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ ఉన్నతాధికారుల కూడా 2025– 26 విద్యా సంవత్సరం ప్రవేశాలపై అప్రమత్తమయ్యారు. ప్రతీ కాలేజీలో 25 నుంచి 40 శాతం ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గ్రామాల్లో డ్రాపౌట్స్ లేకుండా కార్యాచరణ సిద్ధం చేశారు. ఉన్నత పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలతో పాటు తల్లిదండ్రుల పేర్లు, వారి మొబైల్ నంబర్లు నమోదు చేసుకుంటున్నారు. ఇలా సేకరించిన వివరాలు, ప్రచారం తీరు, విద్యార్థుల నుంచి వస్తున్న స్పందన, ఇతర వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. -
‘మూడో’ అడుగు
జైపూర్: జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ) విస్తరణకు మరో అడుగు పడింది. ఎట్టకేలకు మూడో యూనిట్(800 మెగావాట్ల) థ ర్మల్ వపర్ ప్లాంటు నిర్మాణానికి మోక్షం కలిగింది. పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ మళ్లీ బీహెచ్ఈఎల్ కంపెనీ కొత్త ప్లాంటు బీటీజీ, బీవోపీ నిర్మాణ పనుల టెండర్లు దక్కించుకుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాకనే ఆలస్యం అన్నట్లుగా ఎస్టీపీపీ అధికార యంత్రాంగం పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తోంది. 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటును విస్తరిస్తూ మూడో యూనిట్ నిర్మాణానికి సంస్థ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2010లో రెండు యూనిట్ల(600+600మెగావాట్లు) థర్మల్ పవర్ ప్లాంటు పనులు ప్రారంభించగా.. 2017లో పూర్తయ్యాయి. రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి నిరంతర విద్యుత్ వెలుగులు పంచుతోంది. రెండో దశలో మూడో యూనిట్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ 2015లోనే పనులకు శంకుస్థాపన చేశారు. డీపీఆర్ తయారు చేసి టెండర్ల దశకు వెళ్లడానికి ఏళ్లు గడువగా.. గత ఏడాది మొదటిసారి వేసిన టెండర్లను రద్దు చేసి ఈ ఏడాది మళ్లీ టెండర్లు పిలిచారు. మళ్లీ అదే బీహెచ్ఈఎల్ కంపెనీ బీటీజీ, బీవోపీ నిర్మాణ పనుల టెండర్లు దక్కించుకుంది. రూ.6,700కోట్ల వ్యయంతో కొత్త ప్లాంటు 800మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటును రెండు యూనిట్లకు ముందు భాగంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగియడంతో ప్లాంటు నిర్మించే స్థలాన్ని అధికారులు చదును చేస్తున్నారు. ఇక ఏ క్షణంలోనైనా సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. సింగరేణికి సిరులు..కొత్త ప్లాంటుతో సింగరేణి సంస్థకు సిరులు కురిపించనుంది. బొగ్గు అధారిత థర్మల్ పవర్ ప్లాంటు కావడంతో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానంగా బొగ్గు, నీరు అవసరం. ఇప్పటికే సింగరేణి సంస్థ అవసరానికి మించి ఇక్కడ భూముల సేకరణ చేపట్టడం, షెట్పల్లి గోదావరి నది నుంచి 1టీఎంసీ నీరు, కోటపల్లి మండలం దేవులవాడ నుంచి 2టీఎంసీల నీరు పైపులైన్ల ద్వారా పవర్‌ప్లాంటుకు తరలిస్తున్నారు. ఇక సంస్థకు చెందిన భూగర్భగనులు, ఓసీపీ ఉండడం, శ్రీరాంపూర్ సీహెచ్‌పీ నుంచి ఎస్టీపీపీ బొగ్గు రవాణాకు శాశ్వతంగా రైల్వేట్రాక్లైన్ నిర్మించి బొగ్గు తరలిస్తున్నారు. రెండు యూనిట్ల నిర్వహణకు బొగ్గు, నీరు తరలించడానికి ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి ఉండడం, కొత్త ప్లాంటు నిర్మిస్తుండడంతో మూడో యూనిట్ నిర్వహణ చేపట్టడం చాలా సులభతరం కావడంతోపాటు భారీగా ఖర్చు కూడా తగ్గనుంది. బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తి రంగంలో దూసుకెళ్తూ దేశ స్థాయిలో సింగరేణి సంస్థ తన చరిత్ర తిరగరాస్తోంది. ఓ పక్కన థర్మల్ పవర్ ప్లాంటు మరో పక్కన సోలార్ ప్లాంట్ల నిర్మాణంతో సింగరేణి విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తోంది. మరో 5వేల మందికి ఉపాధి..కొత్త ప్లాంటు నిర్మాణంతో 5వేల మందికిపైగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలుగనుంది. రెండు యూనిట్లలో ఇప్పటికే స్థానిక భూనిర్వాసితులు సుమారు వెయ్యిమంది ఆయా విభాగాల్లో పని చేస్తుండగా పలు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు 500మందికిపైగా పని చేస్తున్నారు. ఇప్పటికే స్థానికులకు 80శాతం ఉపాధి అవకాశాలు కల్పించడానికి సంస్థ ఉత్తర్వులు ఇవ్వడంతో కొత్త ప్లాంటులో స్థానిక నిరుద్యోగులకు బోలెడు ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. పదేళ్ల నిరీక్షణకు తెర ఎస్టీపీపీలో మరో ప్లాంటు నిర్మాణం రూ.6,700 కోట్ల వ్యయం.. 800 మెగావాట్లు సింగరేణి సిగలో మరో వెలుగుల నగ బీహెచ్‌ఈఎల్‌కే ప్లాంటు నిర్మాణ పనులు -
ప్రతీ ఉద్యోగికి రిటైర్మెంట్ సహజం
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రతీ ఉద్యోగికి రిటైర్మెంట్ సహజమని జిల్లా పౌరసంబంధాలశాఖ అధికారి సంపత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీపీఆర్వో కార్యాలయంలో పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ పొందిన వసంత్‌కుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసంత్‌కుమార్ సదరు విభాగానికి నిబద్ధతతో సేవ చేశారని కొనియాడారు. సర్వీసు మొత్తంలో ఎలాంటి రిమార్కు లేకుండా సేవలందించడం గొప్పతనమన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రమేశ్, పాషా, వెంకటేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుల్‌కు సన్మానంజిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన జగ్గారావ్ దంపతులను జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్రావ్ జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ కరుణాకర్, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు విజయ శంకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు స్వామి, ఎంటీవోఆర్ఐ అంజన్న, డీపీవో ఏవో శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘శ్యాంనాయక్ వ్యాఖ్యలు సరికాదు’
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులు మూకుమ్మడిగా ఖండించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వాంకిడి, తిర్యాణి, రెబ్బెన, కెరమెరి మండలాల అధ్యక్షులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలను నిరుత్సాహపరిచేలా ఉండరాదన్నారు. పార్టీ అధ్యక్షుడితో పాటు నలుగురిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఐదు మండలాల నాయకులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వసంత్‌రావ్ మాట్లాడుతూ శ్యాంనాయక్ కలుపు మొక్కల వంటి కొంతమందిని వెంటేసుకుని పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు. అనీల్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన వారిని క్షమించే ప్రసక్తేలేదన్నారు. కెరమెరి మండల అధ్యక్షుడు కుసుంబరావ్ మాట్లాడుతూ శ్యాంనాయక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు చరణ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, నాయకులు దేవాజీ, గాదెవేణి మల్లేశ్, ఆసిఫ్, దీపక్‌ముండే, రవీందర్, మారుతీపటేల్, చిట్ల నారాయణ, బాబురావ్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రతీ ఉపాధ్యాయుడు బోధనలో మెలకువలు నేర్చుకుని విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల నూతనంగా వచ్చిన 183 మంది కొత్త టీచర్లకు నైపుణ్య శిక్షణ కా ర్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఇంటరాక్టీవ్ ఫ్టాట్ ప్యానల్‌ను, డిజి టల్ కంటెంట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో ప్రా రంభ పరీక్ష, మధ్య, అంత్య పరీక్ష ఫలితాలు నమో దు చేయాలన్నారు. విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు సాధించేలా విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, హెచ్ఎం సుభాష్, రిసోర్స్ పర్సన్ రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సేవలతోనే గుర్తింపుఆసిఫాబాద్రూరల్: ఉద్యోగి తన వృత్తిని అంకితభావంతో నిర్వర్తిస్తేనే సమాజంలో గుర్తింపు పొందుతారని డీఈవో యాదయ్య అన్నారు. ఇటీవల ఇన్చార్జి డీఈవో కార్యాలయ సహాయ సంచాలకులుగా పనిచేసిన గమానియల్ శుక్రవారం జిల్లా కేంద్రంలో మోడల్ స్కూల్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని శాలువాతో సత్కరించారు. ఎస్వో శ్రీనివాస్, ఎంఈవో సుభాష్ పాల్గొన్నారు. -
సరిహద్దులో తేలని పట్టా
● రైతుల గోస పట్టేదెవరికి..? ● ఎడతెగని 12 గ్రామాల వివాదం ● సాగు భూమి పట్టాల కోసం నిరీక్షణ ● 2013 వరకు అందిన పహానీలు ● ఆన్లైన్, ధరణి కల్పించిన చిక్కులు ● 18 వేల ఎకరాల్లో 2 వేల మంది రైతులుకెరమెరి(ఆసిఫాబాద్): తెలంగాణ, మహారాష్ట్ర రా ష్ట్రాల సరిహద్దులోని 12 గ్రామాల్లో రెండు రాష్ట్ర ప్ర భుత్వాల పాలన సాగుతోంది. అయినప్పటికీ ఆయా గ్రామాల రైతులు అసౌకర్యాలతో కొట్టుమి ట్టాడాల్సి వస్తోంది. ఆయా గ్రామాల్లో ఎలాంటి ఆ దాయ వనరులు లేకపోవడంతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకీడుస్తున్నారు. ఎలాంటి పరి శ్రమలు, కుటీర పరిశ్రమలు లేవు. ఉన్న వ్యవసా యం చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అనాదిగా ఆయా భూముల్లో సాగు చేస్తున్నా నేటికీ ఏ ప్రభుత్వం కూడా పట్టాలు అందించలేకపోయింది. ఫలితంగా ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలను అందుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం అటవీ భూముల్లో సాగు చేస్తున్న రైతుల భూములకు పట్టాలిస్తామని ప్రకటించింది. సర్వే కూడా చేయించింది. దీంతో రైతులు పట్టాలపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అధిక మంది రైతులు ఎస్సీ కులానికి చెందిన వారు ఉండడం, 1930కి ముందు నుంచి స్థానికంగా ఉంటూ ఆధారాలు చూపాలి. అప్పటి ఆధారాలు లేకపోవడంతో ఒక్కరికి కూడా పట్టా అందలేదు. 2013 వరకు పహానీలు!ఆ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్న భూమి అధిక భాగంగా అటవీశాఖకు చెందింది. కాగా కొంతభాగం మాత్రమే రెవెన్యూ భూమి అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 1995 నుంచి 2013 వరకు ఆయా గ్రామాలకు చెందిన రైతులకు మ్యాన్యువల్‌గా పహానీలను రెవెన్యూ అధికారులు ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆన్లైన్లో పహనీలు అందుబాటులోకి రావడంతో వీరికి లభించలేదు. దీంతో రైతులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆందోళనలు చేస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఫలింతగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు అందక వ్యాపారుల వద్ద నుంచి వడ్డీలకు డబ్బులు తీసుకొని సాగు చేస్తున్నారు. ఆధారాలు లభించలేదు. 2023లో సంయుక్తంగా అటవీ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్వే చేసినా సరైన ఆధారాలు లభించలేదు. గిరిజనేతర రైతులు 1930కి ముందు నుంచి అటవీ భూముల్లో సాగు చేస్తున్నట్లు, గిరిజనులు 2005 నుంచి సాగు చేస్తున్నట్లు ఆధారాలు చూపించాలి. గిరిజనేతరుల్లో 5శాతం రైతులకు కూడా 70 ఏళ్ల కిందటి ఆధారాలు లభించలేదు. అప్పటి నుంచి ఉన్న వృద్ధుల వాంగ్మూలం, పురాతన బావులు, శ్మశాన వాటికలు, ఆధార్ కార్డులు, ఓటర్ఐడీ కార్డులు, పురాతన కట్టడాలు తదితర 10 ఆధారాలు చూపించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. గిరిజనులకు ఏదోలా అక్కడక్కడ లభిస్తున్నా గిరిజనేతరులకు 70 ఏళ్ల క్రితం నాటి ఆధారాలు లభించ లేదు. 18,374 వేల ఎకరాల్లో 1,878 మంది రైతులుసరిహద్దులోని వివాదాస్పద పరంధోళి, ముకదంగూడ, అంతాపూర్, భోలాపటార్ గ్రామ పంచాయతీల్లో 12 గ్రామాలకు చెందిన 1,878 మంది రైతులు ఉన్నారు. వారంతా సుమారు 18,374 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సాగు చేస్తున్న రైతుల్లో 476 మంది రైతులు గిరిజనులు కాగా.. 1,300 మంది ఎస్సీలు, 102 మంది బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారున్నారు. అనేక ఏళ్ల నుంచి ఆయా గ్రామాల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని తమ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వారందరి ప్రధాన వృత్తి వ్యవసాయమే కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వ్యవసాయమే జీవనాధారం.. సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ వ్యవసాయమే జీవనాధారం. పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రైతులకు అందే సంక్షేమ పథకాలు అందుకోలేక పోతున్నాం, అనేక ప్రభుత్వాలు వస్తున్నా మాదొక్కటే డిమాండ్. అదే సాగు చేస్తున్న భూములకు పట్టాలు కావాలని. ఏ ఒక్క ప్రభుత్వం మా సమస్యను తీర్చలేకపోతోంది. – పతంగే లింబాదాస్, మాజీ సర్పంచ్, ముకదంగూడ బతకడం కష్టమవుతోంది.. అనాదిగా ఉన్న భూములను సాగు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాం. ఏదో ఒక రోజు ప్రభుత్వం పట్టాలు ఇవ్వక పోతుందా అన్న నమ్మకంతో ఉన్నాం. కానీ గత ప్రభుత్వం 70 ఏళ్ల నాటి ఆధారాలు చూపెట్టాలని ఆంక్షలు విధించడంతో ఆశలు నీరుగారాయి. ప్రస్తుత ప్రభుత్వం స్పందించాలి. కనీసం అధికారులు పహనీలైనా ఇవ్వాలి. దీని వల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కాంబ్డె లక్ష్మణ్, రైతు, పరంధోళి -
ప్రతీ ఉద్యోగికి రిటైర్మెంట్ సహజం
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రతీ ఉద్యోగికి రిటైర్మెంట్ సహజమని జిల్లా పౌరసంబంధాలశాఖ అధికారి సంపత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీపీఆర్వో కార్యాలయంలో పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ పొందిన వసంత్‌కుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసంత్‌కుమార్ సదరు విభాగానికి నిబద్ధతతో సేవ చేశారని కొనియాడారు. సర్వీసు మొత్తంలో ఎలాంటి రిమార్కు లేకుండా సేవలందించడం గొప్పతనమన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రమేశ్, పాషా, వెంకటేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుల్‌కు సన్మానంజిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన జగ్గారావ్ దంపతులను జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర్రావ్ జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ కరుణాకర్, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు విజయ శంకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు స్వామి, ఎంటీవోఆర్ఐ అంజన్న, డీపీవో ఏవో శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదాల నివారణకు కృషి చేయాలి
రెబ్బెన: ప్లాంటేషన్‌లో అగ్ని ప్రమాదాల నివా రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్చార్జి మేనేజర్ జి.సురేష్ కుమార్ అన్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ మండల పరిధి లోని గంగాపూర్ ప్లాంటేషన్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదాల నివారణపై అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతం, ప్లాంటేషన్ల మీదుగా వెళ్లే ప్రజలు సిగరేట్, బీడీ, చుట్టలు తాగి నిర్లక్ష్యంగా పడేయడంతో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్లాంటేషన్లు పరిసర ప్రాంతాల వారికి స్వచ్ఛమైన గాలిని అంది స్తూ పర్యావరణానికి ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వాచర్లు వెంకటేష్, గంగయ్య పాల్గొన్నారు. -
విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రతీ ఉపాధ్యాయుడు బోధనలో మెలకువలు నేర్చుకుని విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల నూతనంగా వచ్చిన 183 మంది కొత్త టీచర్లకు నైపుణ్య శిక్షణ కా ర్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఇంటరాక్టీవ్ ఫ్టాట్ ప్యానల్‌ను, డిజి టల్ కంటెంట్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో ప్రా రంభ పరీక్ష, మధ్య, అంత్య పరీక్ష ఫలితాలు నమో దు చేయాలన్నారు. విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు సాధించేలా విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, హెచ్ఎం సుభాష్, రిసోర్స్ పర్సన్ రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సేవలతోనే గుర్తింపుఆసిఫాబాద్రూరల్: ఉద్యోగి తన వృత్తిని అంకితభావంతో నిర్వర్తిస్తేనే సమాజంలో గుర్తింపు పొందుతారని డీఈవో యాదయ్య అన్నారు. ఇటీవల ఇన్చార్జి డీఈవో కార్యాలయ సహాయ సంచాలకులుగా పనిచేసిన గమానియల్ శుక్రవారం జిల్లా కేంద్రంలో మోడల్ స్కూల్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని శాలువాతో సత్కరించారు. ఎస్వో శ్రీనివాస్, ఎంఈవో సుభాష్ పాల్గొన్నారు. -
విద్యాసంస్థలపై చర్యలకు వినతి
ఆసిఫాబాద్‌రూరల్: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ ఇటీవల ఖమ్మంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థలో యోగ నందిని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న విద్యాసంస్థలను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆసంఘం నాయకులు సుశాంత్, అరుణ్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు బర్డ్ ఫెస్టివల్
జన్నారం: మంచిర్యాల కలెక్టరేట్ ఆవరణలో శని, ఆదివారాల్లో కవ్వాల్ బర్డ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జన్నారం రేంజ్ అధికారి సుష్మారావు ఒక ప్రకటనలో తెలిపా రు. కవ్వాల్ టైగర్‌జోన్‌లో కనిపించే వివిధ రకాల పక్షులు, వాటి వివరాలు, జీవ వైవిధ్యంలో వాటి పాత్రపై వివరిస్తారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల ప్రక్షి ప్రేమికులు, పక్షుల అ ధ్యయనం చేసేవారు, ఎన్జీవోలు, జిల్లా అటవీ అధికారులు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు పక్షులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యం, అడవుల ప్రయోజనాలను అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేయాలి
● డీఆర్డీవో దత్తారాం రెబ్బెన: ఉపాధి హామీ సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం కూలీలు పనులు చేయాలని డీఆర్డీవో దత్తారాం అన్నారు. శుక్రవారం మండలంలోని నక్కలగూడ శివారులో ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా చేపట్టిన ఫారంపాండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ కూలీలందరూ రోజుకు రూ.300 కూలి పడేలా పనిచేయాలన్నారు. సిబ్బంది ఇచ్చిన కొలతల ప్రకారం పనిచేస్తే కూలి వస్తుందన్నారు. రోజుకు 4 నుంచి 5 గంటలు పని చేయాలన్నారు. అనంతరం ఇందిరానగర్ నర్సరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో, ఈసీ, టీఏలు, ఎఫ్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
అటవీ భూములను పరిరక్షించాలి
రెబ్బెన: అటవీ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని సింగరేణి అటవీశాఖ సలహాదారుడు మోహన్ పరిగణ్ అన్నారు. శుక్రవారం జిల్లా అటవీశాఖ అధికా రి నీరజ్‌కుమార్‌తో కలిసి బెల్లంపల్లి ఏరియాలో పర్యటించారు. కై రిగూడ ఓసీపీ ఓబీ డంప్‌లను పరిశీలించారు. అటవీశాఖ అనుమతులు పొందిన భూముల్లో చేపట్టిన పనులు, నిర్మాణాలు, ఓబీ డంప్‌యార్డులపై నాటి న మొక్కలు, ఎదిగిన వృక్షాలను పరిశీలించా రు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి నరే ందర్, ఎస్వోటూ జీఎం రాజమల్లు, బీపీఏ ఓసీపీ 2 మేనేజర్ మహేష్‌కుమార్, ఎస్టేట్స్, ఆర్జీ–3 అధికారులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డీఈవో యాదయ్య, అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న ‘పది’ పరీక్షల కోసం జిల్లాలో 36 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6,779 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, వెలుతురు, నిరంతర విద్యుత్ ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ప్రభాకర్, పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలిరాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5 నుంచి జరుగనున్న ఇంటర్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని రా ష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అ న్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లా ల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్ పరీక్షలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఐఈవో కళ్యాణి, విద్యుత్, పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలిఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యతపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్మిక, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, పరిశ్రమలు, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, షెడ్యూల్ కులాల సంక్షే మం, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, సెర్ప్, మెప్మా అధికారులతో నిరుద్యోగ యువత–శిక్షణ–ఉపాధి కల్పన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతుల కు జ్యూట్ బ్యాగుల తయారీ, ఎంబ్రాయిడరీ రంగా ల్లో, యువకులకు భవన నిర్మాణ రంగం, పీవోబీ, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, మార్బుల్, ప్లంబింగ్ వంటి వాటిపై శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ అధికారి దత్తారాం, డీటీడీవో రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలి ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న సిమెంటు పనులను మార్చి నెలాఖరులోగా పూర్తిచేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అ న్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్డీఏ దత్తారాంలతో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో ఉపాధి హామీ పనుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన జీపీ, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం, నర్సరీల నిర్వహణ పనుల్లో కూలీల హాజరు శాతం పెంపుదలపై అధికా రులు దృష్టి సారించాలన్నారు. పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు.● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
‘శ్యాంనాయక్ వ్యాఖ్యలు సరికాదు’
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకులు మూకుమ్మడిగా ఖండించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వాంకిడి, తిర్యాణి, రెబ్బెన, కెరమెరి మండలాల అధ్యక్షులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలను నిరుత్సాహపరిచేలా ఉండరాదన్నారు. పార్టీ అధ్యక్షుడితో పాటు నలుగురిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఐదు మండలాల నాయకులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వసంత్‌రావ్ మాట్లాడుతూ శ్యాంనాయక్ కలుపు మొక్కల వంటి కొంతమందిని వెంటేసుకుని పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు. అనీల్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించిన వారిని క్షమించే ప్రసక్తేలేదన్నారు. కెరమెరి మండల అధ్యక్షుడు కుసుంబరావ్ మాట్లాడుతూ శ్యాంనాయక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు చరణ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, నాయకులు దేవాజీ, గాదెవేణి మల్లేశ్, ఆసిఫ్, దీపక్‌ముండే, రవీందర్, మారుతీపటేల్, చిట్ల నారాయణ, బాబురావ్, తదితరులు పాల్గొన్నారు. -
సెంటర్ చేరడం ఇక ఈజీ!
● ఇంటర్ హాల్‌టికెట్‌పై క్యూఆర్‌కోడ్! ● పరీక్షా కేంద్రం, అడ్రస్, దూరం, ఇతర వివరాలు నిక్షిప్తం ● టోల్ ఫ్రీ, కంట్రోల్ రూం నంబర్లు కూడా... ● విద్యార్థులకు తప్పనున్న ఇబ్బందులు ఆసిఫాబాద్‌అర్బన్: ఇంటర్ చదువుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంటర్ బోర్డు నూతనంగా క్యూఆర్‌కోడ్ విధానాన్ని అమలు చేయనుంది. పరీక్షా కేంద్రం అడ్రస్ తెలియకపోయినా, దారి తప్పినా విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సమస్యలు, సందేహాలను తీర్చేందుకు ఇంటర్ బోర్డు క్యూఆర్ కోడ్‌తో హాల్‌టికెట్లు జారీ చేయనుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే పరీక్షా కేంద్రం, అడ్రస్, విద్యార్థి ఉన్న ప్రాంతం నుంచి సెంటర్ ఎంతదూరంలో ఉంది.. ఎన్ని నిమిషాల్లో చేరుకోగలరో సూచిస్తుంది. తొలిసారి అమలుఇంటర్బోర్డు ఈ విద్యా సంవత్సరంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 22 వరకు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలను మొదటిసారిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించింది. తాజాగా ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల కోసం నూతన విధానాన్ని అమలు చేయనుంది. హాల్‌టికెట్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని విద్యార్థుల సెల్ నంబర్లకు మెసేజ్ పంపించారు. పరీక్షా కేంద్రాల వివరా లు తెలుసుకునేందుకు హాల్‌టికెట్లపై క్యూఆ ర్కోడ్, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు టో ల్ ఫ్రీ, కంట్రోల్ రూం నంబర్లు ఏర్పాటు చేశా రు. నూతన విధానం ద్వారా ఇంటర్ విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండదు. 10,054 మంది విద్యార్థులుజిల్లాలోని 19 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో జనరల్ ఒకేషనల్ కోర్సుల్లో కలిపి మొత్తం 10,054 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్‌లో కలిపి 4,758 మంది ఉండగా ద్వితీయ సంవత్సరంలో 5,296 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా మార్చి 5 నుంచి 22వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.ఇంటర్ వార్షిక పరీక్ష తేదీల వివరాలుప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం 05.03.25 06.03.25 07.03.25 10.03.25 11.03.25 12.03.25 13.03.25 15.03.25 17.03.25 18.03.25 19.03.25 20.03.25 21.03.25 22.03.25 మరిన్ని ఉపయోగాలు..హాల్‌టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే రూట్ మ్యాప్ ఆధారంగా విద్యార్ధులు సులువుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్ బోర్డు గత కొన్నేళ్లుగా హాల్‌టికెట్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. కానీ డౌన్లోడ్ చే సుకునే విధానంపై సరైన అవగాహన లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా రు. ఇకపై ఆ సమస్య ఉండదు. హాల్‌టికెట్ డౌన్లోడ్ అయ్యే తేదీ, హాల్‌టికెట్ నంబర్, విద్యార్థుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో రానున్నాయి. దీంతో విద్యార్థులు సులువుగా హాల్‌టికెట్‌ను పొందే అవకాశం ఏర్పడింది. నూతన విధానం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు వర్తించనుంది. సులువుగా సమాచారం ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంటర్‌బోర్డు తొలిసారిగా క్యూఆర్ కోడ్ విధానంతో హాల్‌టికెట్లు జారీ చేస్తోంది. దీంతోపాటు టోల్ ఫ్రీ, కంట్రోల్ రూం నంబర్లు కూడా ఉండేలా చూస్తోంది. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా కంట్రోల్ రూం నంబర్‌ను సంప్రదించాలి. అంతేకాకుండా పరీక్షా కేంద్రం అడ్రస్ సులువుగా తెలుసుకోవచ్చు. సమయానికి పరీక్షకు హాజరుకావచ్చు. – సీహెచ్ కళ్యాణి, డీఐఈవో -
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి
బెజ్జూర్: సిర్పూర్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ రంగనాయక స్వామి ని కోరినట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంతో పాటు శివాలయం, హనుమాన్ ఆలయం, బ్రహ్మంగారి ఆలయాల్లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, మహాశివుని అనుగ్రహం ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరినట్లు తెలిపాడు. అనంతరం మండల కేంద్రంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట మర్తిడి మాజీ సర్పంచ్ ఉమ్మేర లింగయ్య, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్ -
ప్రశాంతంగా పోలింగ్
ఆసిఫాబాద్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8:00 గంటల నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, పురుషులతో పాటు యువత ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగింది. గడువులోగా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఎన్నికల నిర్వహణకు 19 మంది ప్రిసైడింగ్ అధికారులు, 87 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 17 మంది సూక్ష్మపరిశీలకులను నియమించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను కరీంనగర్‌లోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. 4,970 మంది ఓటుహక్కు వినియోగంజిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4,970 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 6,137 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా 4,546 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 3,278 మంది పురుషులు, 1,268 మంది మహిళలు ఉన్నారు. దీంతో పోలింగ్ సమయం ముగిసేంత వరకు 74.08 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఓటర్లు 470 మంది ఉండగా 424 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 288 మంది పురుషులు, 136 మంది మహిళలు ఉన్నారు. దీంతో 90.21 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితాలపై ఉత్కంఠఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తుండగా లోలోన ఆందోళన కూడా అంతేస్థాయిలో ఉంది. ప్రధాన పార్టీల ఇన్చార్జీలు ఓటింగ్ సరళిపై బేరీజు వేసుకుంటున్నారు. గురువారం సాయంత్రానికి పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి ఫలితాలపైకి మరలింది. జిల్లా అంతటా ఫలితాలపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. గ్రామాలు, పట్టణాల్లో ఎవరు గెలుస్తారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలపై చర్చలు ఊపందుకున్నాయి. ఎన్నికల ఫలితాలపై అభ్యర్థులతో పాటు సంబంధిత పార్టీల నాయకుల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటుహక్కు వినియోగించుకున్న కలెక్టర్జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల పాఠశాలలో బారులు తీరిన ఓటర్లు జిల్లాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం నుంచే పోటెత్తిన ఓటర్లు పట్టభద్రులు 74.08, టీచర్లు 90.21 శాతం నమోదు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ -
బోధనకు పదును..
● కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ ● నేటి నుంచి మూడు రోజులపాటు కార్యక్రమం ● 2024 డీఎస్సీలో నియమితులైన టీచర్లకు అవకాశం ● నూతన అభ్యాసన ప్రక్రియలపై తర్ఫీదు కెరమెరి(ఆసిఫాబాద్): వివిధ అంశాల్లో శిక్షణ పొంది ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించినప్పటికీ విద్యార్థులకు బోధించే విషయంలో నూతన ఉపాధ్యాయులకు శిక్షణ ఎంతో అవసరం ఉంది. దీన్ని గ్రహించిన రాష్ట్ర విద్యాశాఖ 2024లో డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు వివిధ అంశాల్లో రిసోర్స్ పర్సన్ల ద్వారా శిక్షణ ఇప్పించాలని సంకల్పించింది. ప్రభుత్వం అందుబాటులో ఉన్న బోధన మూల్యాంకన పద్ధతులు, సమర్థ బోధనాభ్యాసన సాధనాలపై శిక్షణ అందించేందుకు డీఆర్సీ (జిల్లా రిసోర్స్ పర్సన్లకు) ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని 12 మంది ఆర్పీలు తెలుగు, ఆంగ్లం, గణితం, ఈవీఎస్ సబ్జెక్టుల్లో పూర్తిస్థాయి శిక్షణ కల్పించనున్నారు. ఒక్కో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ విద్యార్థులకు విద్యను బోధించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 188 మంది2024 డీఎస్సీ ద్వారా జిల్లాలోని వివిధ మండలాల్లో 188 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు నియమితులయ్యారు. ప్రస్తుతం వారంతా విధుల్లో ఉన్నారు. అయితే నూతన విద్యావిధానం వల్ల పాఠ్యాంశాల్లో పలు మార్పులు చేశారు. 2024 డీఎస్సీ కంటే ముందు నుంచి ఆయా పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు వివిధ అంశాల్లో నిష్ణాతులై ఉన్నారు. జిల్లా, మండల స్థాయిలో పలుమార్లు బోధనాంశాలపై శిక్షణ తీసుకుని ఉన్నారు. అందుకు నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు కూడా శిక్షణ కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర విద్యాశాఖ భావించింది. ఇందులో భాగంగా ఈ నెల 28న, మార్చి 1, 3 తేదీల్లో జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటలకు ఇవ్వనున్న శిక్షణకు హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సూచించారు. సద్వినియోగం చేసుకోవాలి 2024లో డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయులు నేటి నుంచి అందించే శిక్షణకు తప్పనిరిగా హాజరు కావాలి. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లు బోధనాంశాలపై కల్పించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ నేర్చుకున్న అంశాలను తరగతిగదిలో విద్యార్థులకు బోధించాలి. అన్ని అబ్జెక్టుల్లో విద్యార్థులు ముందుండేలా చేయాలి. – యాదయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి ఆవశ్యకత..విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు పరిపక్వత, బోధన అభ్యాసన ప్రక్రియపై సరైన వ్యూహాలను ఎంచుకోవడం, మూల్యాంకనం మదింపు పద్ధతులు అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులు వాటి ఉపకరణాలు పాఠ్య పుస్తకాల సమర్థవంతైన వినియోగం సమర్థవంతమైన తరగతి గది ప్రకియలు విద్యా ప్రమాణాలు, అభ్యాసన ఫలితాలు వార్షిక, పాఠ్యాంశాల పీరియడ్ ప్రణాళిక నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మదింపు కంటెంట్ ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్ ఐటీసీ ఉపకరణాలను ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్‌ను డిజిటల్ కంటెంట్‌ను సమర్థవంతంగా వినియోగించడం. ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ యూడైస్ యాక్టివిటీస్ అంశాలపై శిక్షణ -
సర్కారు బడి విద్యార్థులకు ట్యాబ్‌లు
జిల్లా పాఠశాలలు ట్యాబ్‌లు మంచిర్యాలఅర్బన్: సర్కారు బడి విద్యార్థులకు ట్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక విద్య అమలులో భా గంగా చర్యలు వేగవంతం చేశాయి. ఇప్పటికే పీఎంశ్రీలో ఎంపిక చేసిన పాఠశాలలకు మొదటి విడతలో కంప్యూటర్లు, యూపీఎస్, ఇన్వర్టర్లు మంజూరు చేయగా విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చేందుకు కసర త్తు పూర్తయింది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంలో భాగంగా విద్యార్థులకు ట్యా బ్ల ద్వారా బోధన చేయనున్నారు. ఉపాధ్యాయులు బోర్డుపై బోధించే అంశాలను నేరుగా చూసేలా అవకాశం కల్పించనున్నారు. ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్‌లను త్వరలోనే సరఫరా చేయనున్నారు. సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాంసంగ్ ఏ7 లైట్(ఎస్ఎం–టీ225) ట్యాబ్‌లు మంజూరు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పీఎంశ్రీ కింద ఎంపికై న ఒక్కో పాఠశాలకు 25 చొప్పున 1,350 ట్యాబ్‌లు మొదటి విడతలో మంజూరయ్యాయి. త్వరగా ట్యాబ్‌లను విద్యార్థులకు అందించి పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు, అనుమానాలను నివృత్తి చేసేలా బోధన చేయనున్నారు.ఆదిలాబాద్ 13 325 కుమురంభీం 10 250 మంచిర్యాల 16 400 నిర్మల్ 15 375 -
మరింత ఉపాధి
● 2025–26 ఆర్థిక సంవత్సరానికి పెరిగిన పని దినాలు ● వ్యవసాయ, మౌలిక సదుపాయాలకు పెద్దపీట తిర్యాణి: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంబంధిత పనులతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుడుతోంది. జాబ్‌కార్డు కలిగి ఉన్న ప్రతీ కుటుంబానికి వందరోజుల పనిదినాలను కల్పించాలనే లక్ష్యంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అధికారులు ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే ప్రణాళికలను పూర్తి చేశారు. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో లక్ష్యానికి మించి పనిదినాలు పూర్తి చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మరింత ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పనిదినాల లక్ష్యాన్ని పెంచారు. 44,33,277 రోజుల పనిదినాలు లక్ష్యం ఉపాధి హామీ పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 38,71,840 పనిదినాలను కల్పించాలని లక్ష్యం ఏర్పాటు చేసుకోగా ఇప్పటికే లక్ష్యానికి మించి పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనుల గుర్తింపు కోసం ఇప్పటికే ఊరూరా ఉపాధిహామి గ్రామసభలు నిర్వహించి పనుల గుర్తింపు చేపట్టారు. కాగా రాబోయే ఆర్థిక సంవత్సరంలో 44,33,277 పనిదినాలను చేపట్టాలని లక్ష్యంగా ఏర్పాటు చేసుకోగా అందుకుగానూ కూలీల చెల్లింపుల కోసం రూ.132.99 కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నట్లు అంచనా వేశారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా వ్యవసాయ సంబంధిత పనులైన కుంటల తవ్వకం, పంట చేలకు వెళ్లేందుకు రోడ్లు వేయడం, గట్టలు పోయడం, కందకాల తవ్వకం, చెరువుల్లో పూడికతీత, చేపల కుంటల తవ్వకంలాంటి పనులతో పాటు రైతులకు అవసరమైన పనులను సైతం నిర్వహించనున్నారు. జిల్లాలో అధికంగా నిరుపేదలు ఉండటంతో ఉపాధి పనులు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం కూలి రెట్లు సరాసరిగా రూ.214 చెల్లిస్తున్నారు. మరింత పెంచితే ఉపాధిహామి కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రణాళికలు సిద్ధంచేశాం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాకు కేటాయించిన నిధులు వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. పని అడిగిన ప్రతీ కూలీకి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఏడాది 44,33,277 పనిదినాలను పూర్తి చేయాలని లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం. – దత్తారాం, డీఆర్డీవో, ఆసిఫాబాద్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనిదినాలు, కూలి చెల్లింపు అంచనా వ్యయంమండలం పనిదినాల కూలీలకు చెల్లింపులు లక్ష్యం (రూ.కోట్లలో) ఆసిఫాబాద్ 3,31,600 9.95 బెజ్జూర్ 4,64,060 13.92 చింతలమానెపల్లి 2,18,134 6.54 దహెగాం 3,81,624 11.44 జైనూర్ 2,84,114 8.52 కాగజ్‌నగర్ 2,90,975 8.72 కెరమెరి 4,24,150 12.74 కౌటల 3,42,800 10.28 లింగాపూర్ 1,65,220 4.95 పెంచికల్పేట్ 1,65,068 4.95 రెబ్బెన 3,41,384 10.24 సిర్పూర్(టి) 2,08,658 6.25 సిర్పూర్(యూ) 2,09,000 6.27 తిర్యాణి 3,25,917 9.77 వాంకిడి 2,80,453 8.41 మొత్తం 44,33,277 132.99 -
పెండింగ్ స్కాలర్ షిప్ విడుదల చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండడంతో పేద విద్యార్థులు చదువులు పూర్తయినా సర్టిఫికెట్లు తీసుకో ని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలన్నా రు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. సుశాంత్, రవికాంత్, సు మిత్, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. -
● జిల్లాలో 17 కేంద్రాలు ఏర్పాటు ● కలెక్టరేట్లో ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తి ● పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది
జెండా ఊపి ఎన్నికల సిబ్బంది వాహనాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్: జిల్లాలో గురువారం జరిగే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో బుధవారం ఉదయం ఎన్నికల సామగ్రిని రిటర్నింగ్ అధికారులు సంబంధిత సిబ్బందికి పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వాహనాలను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం సిబ్బంది సామగ్రిని తీసుకుని పోలీసుల భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జిల్లాలో 6,137 మంది పట్టభద్రులు, 470 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఆసిఫాబాద్ డివిజన్లో 8 కేంద్రాలు, కాగజ్‌నగర్‌లో 9 కేంద్రాలు ఉన్నాయి. పట్టభద్రుల కోసం రెండు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక కేంద్రం ఉండగా, 14 కామన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 19 మంది ప్రిసైడింగ్ అధికా రులు, 87 మంది ఏపీవోలు, 17 మంది సూక్ష్మ పరి శీలకులను నియమించారు. గురువారం ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఓటింగ్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా అదనపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 17 పోలింగ్ కేంద్రాలకు 17 రూట్లలో పోలింగ్ సామగ్రిని పోలీసు బందోబస్తుతో తరలించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికా రులు చర్యలు చేపట్టారు. పోలింగ్ పూర్తయ్యాక సామగ్రి, సిబ్బందిని పంపిణీ కేంద్రాలకు సురక్షితంగా చేరేలా ఏర్పాట్లు చేశారు. మద్యం షాపుల మూసివేత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలను మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మూసివేశారు. జిల్లా కేంద్రంలోని ఐదు మద్యం దుకాణాలతో పాటు జిల్లావ్యాప్తంగా 19 దుకాణాలు పోలింగ్ పూర్తయిన తర్వాతే తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు.పటిష్ట బందోబస్తు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆసిఫాబాద్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్ర శాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లావ్యాప్తంగా 250 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. 15 మంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 210 మంది ఇతర పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముందు జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాల వద్ద 163బీఎన్ఎస్ఎస్ యాక్ట్(144 సెక్షన్) అమల్లో ఉంటుందని తెలిపారు. కేంద్రాలకు వందమీటర్ల దూరం వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుంపుగా తిరగొద్దని, పార్టీ జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ప్రదర్శించొద్దని సూచించారు.ఇవి అవసరంఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు గుర్తింపు కార్డులు అవసరం. ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు, ఇండియన్ పోస్‌పోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు, ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గంలో విద్యాసంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు, విశ్వవిద్యాలయం జారీ చేసిన డిగ్రీ, డి ప్లొమా నిజ ధ్రువపత్రం, సంబంధిత సంస్థలు చేసిన ది వ్యాంగ సర్టిఫికెట్, భారత ప్రభుత్వ సంస్థ సో షల్ జస్టిస్, ఎంపవర్మెంట్ జారీ చేసిన యూని క్ డిజిబులిటీ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని ఉపయోగించి ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. -
సర్వం.. శివోహం
ఆసిఫాబాద్‌అర్బన్: పట్టువస్త్రాలు తీసుకువస్తున్న ఎమ్మెల్యే ఆసిఫాబాద్‌అర్బన్/వాంకిడి/రెబ్బెన: మహాశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివనామ స్మరణతో మార్మోగాయి. జిల్లా కేంద్రంలోని సందీప్‌నగర్ ఆలయంలో శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదట శివకేశవ మందిర్‌లో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు అర్చకులు తిరుపతిచారి పూజలు చేశారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి పట్టువస్త్రాలు కల్యాణ మండపానికి తీసుకువచ్చి సమర్పించారు. వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీ వాగు తీరంలో బుధవారం నిర్వహించిన జాతర జనసంద్రంగా మారింది. వేకువజాము నుంచే భక్తులు శివకేశవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు బందోబస్తు మధ్య అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి భజనతో జాగరణ చేపట్టారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గాదె ప్రవీణ్, సభ్యులతో మాట్లాడి ఆలయం విశిష్టత, చరిత్ర తెలుసుకున్నారు. ఏఎస్పీ చిత్తరంజన్ పూజలు చేశారు. వాంకిడి సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. రెబ్బెన మండలం నంబాలలోని ప్రసన్న పరమేశ్వర ఆలయంతోపాటు దుర్గాపూర్‌లోని శివాలయం, గోలేటి టౌన్‌షిప్‌లోని కోదండ రామాలయ ప్రాంగణంలో గల శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రసన్న పరమేశ్వర ఆలయ జాతరకు భక్తులు పోటెత్తారు. నంబాల, గోలేటిలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం వేదపండితులు కనుల పండువగా జరిపించారు. నంబాల శివాలయంలో సాయంత్రం అశేష భక్తజనం మధ్య శివపార్వతుల ఉత్సవ విగ్రహాలతో రథోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం ఏర్పాటు చేశారు. నంబాలలోని ప్రసన్న పరమేశ్వర ఆలయంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ పూజలు చేశారు. బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి ప్రసన్న పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. రెబ్బెన సీఐ బుద్దె స్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
పకడ్బందీగా పోలింగ్ నిర్వహించాలి
● కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాకౌటాల: ఎమ్మెల్సీ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గురువారం నిర్వహించే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి, రిసెప్షన్ కేంద్రాలకు అప్పగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, ఎన్నికల అధికారులు పి.ప్రేమలత, చౌదరి అంజన్న, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
బెల్లంపల్లి: మద్యానికి బానిసై జల్సాల కోసం అప్పు చేసిన యువకుడు తీర్చేమార్గం లేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెల్లంపల్లి జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వర్ కథనం ప్రకారం.. కాసిపేట మండల కేంద్రానికి చెందిన దుర్గం క్రాంతి (29) జులాయిగా తిరిగేవాడు. అడపాదడపా మంచిర్యాలకు చెందిన ఓ రియల్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ తెలిసిన వారి వద్ద అప్పులు చేసి మద్యం తాగేవాడు. అవివాహితుడైన క్రాంతి నెలక్రితం తల్లి దుర్గం వెంకటమ్మను బతిమిలాడటంతో ఆమె రూ.10 వేలు వేరే వ్యక్తుల వద్ద అప్పు అడిగి ఇచ్చింది. ఆ డబ్బులను తాగుడుకు ఖర్చు చేశాడు. మరోపక్క అప్పు ఇచ్చినవారు అడగడంతో తప్పించుకు తిరుగుతున్నాడు. అప్పు తీర్చేమార్గం లేక క్రాంతి సోమవారం అర్ధరాత్రి సుబ్బారావుపల్లి శివారు వైపు వెళ్లి గుర్తుతెలియని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం మృతదేహానికి పంచనామా అనంతరం పోస్టుమార్గం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
అప్పుల బాధతో ఒకరు..
దస్తురాబాద్: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శంకర్ కథనం ప్రకారం.. మండలంలోని గోడిసీర్యాల గోండుగూడ గ్రామానికి చెందిన నామెల్లిపురుక జగన్(45), రాధ దంపతులు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. ఆయనకున్న ఎకరం భూమిలో పంట సాగు చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం జగన్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పలువురి వద్ద చేసిన అప్పులు చేసి మద్యం తాగేవాడు. అప్పలు తీర్చే మార్గం లేకపోవడంతో మంగళవారం ఇంట్లో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. ఆ సమయంలో భార్య రాధ పక్కింట్లోకి వెళ్లి తిరిగివచ్చింది. అప్పటికే పురుగుల మందు తాగిన జగన్ భార్యతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో నోట్లో నుంచి నురుగులు కక్కడంతో 108 సిబ్బందికి సమాచారం అందించింది. వారు అక్కడికి చేరుకుని ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గమనించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు సైన్యం సిద్ధం
● 250మంది పోలీసులతో బందోబస్తు ● జిల్లాలో 58 పోలింగ్ కేంద్రాలు మంచిర్యాలక్రైం: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 27న జరిగే పోలింగ్‌లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం బందోబస్తుకు సిద్ధమైంది. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పర్యవేక్షణలో 250మంది బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లాలోని 21 ప్రాంతాల్లో 58 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు మంగళవారం సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందని, ఈ నెల 25న సాయంత్రం 4గంటల నుంచి 27న సాయంత్రం 4గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని పేర్కొన్నారు. ముగ్గురు ఏసీపీలు, 12మంది సీఐలు, 21మంది ఎస్సైలు, 212మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించొద్దు నస్పూర్: ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బంది అలసత్వం ప్రదర్శించొద్దని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. గురువారం పోలింగ్ నేపథ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై మంగళవారం ఆయన పట్టణ పరిధిలోని ఏఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన రామటెంకి బానేష్ మంగళవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం..బానేష్ (36) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మొదటి భార్యతో విడాకులయ్యాయి. పదేళ్ల క్రితం పుష్పను రెండో పెళ్లి చేసుకున్నాడు. 2022లో ఆయన గుండెకు స్టంట్లు వేశారు. అప్పటి నుంచి పని చేయకుండా ఇంటి వద్ద ఉంటున్నాడు. గతేడాది అక్టోబర్‌లో పుష్ప ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన వెంకటేశ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో పలుమార్లు గొడవలు జరుగాయి. ఈ క్రమంలో బానేష్ మందలించడంతో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పుష్ప, బానేష్లపై రెబ్బెనలో కేసు నమోదైంది. జైలుకు వెళ్లి వచ్చారు. ఈ కేసు విషయంలో బానేష్ కొంత అప్పుల పాలయ్యాడు. మంగళవారం భార్య డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఇంటికి వచ్చిన ఆమె ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించింది. ఎస్సై ఘటన స్థలానికి చేరుకున్న పరిశీలించారు. బానేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని మేనత్త కోట పోషమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. హైవే పక్కన గుర్తుతెలియని మృతదేహంవాంకిడి: మండలంలోని ఖమాన ఎక్స్‌రోడ్ సమీపంలో నేషనల్ హైవే–363 పక్కన గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. ఖమాన ఎక్స్‌రోడ్ సమీపంలో పొల్యూషన్ చెకింగ్ వాహన నిర్వాహకుడు.. మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఎస్సై ప్రశాంత్‌ను వివరణ కోరగా మృతదేహం గుర్తించలేని స్థితిలో ఉందన్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. మృతిచెందిన వ్యక్తి ఎవరు? ఎన్ని రోజులైంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
భక్తులను కాచే.. ప్రసన్న పరమేశ్వరుడు
రెబ్బెన: మండలంలోని నంబాలలో ప్రసిద్ధి గాంచిన ప్రసన్న పరమేశ్వర ఆలయంలో మూడు రోజులపాటు జాతర మహోత్సవం నిర్వహించనున్నారు. శివపార్వతుల కల్యాణంతోపాటు రథోత్సవం కనుల పండువగా జరగనున్నాయి. స్థల పురాణం ప్రకారం.. 67 ఏళ్ల క్రితం తాండూర్ మండలం కొత్తపల్లెకు చెందిన మైదం లస్మయ్య వంగిపోయిన నడుంతో బాధపడుతుండేవాడు. ఒక రోజు నంబాలకు ఎంతో కష్టపడుతూ వస్తుండగా మార్గమధ్యలో ఒక నాగసర్పం కనిపించింది. అది చూసి భయకంపితుడు కాగా వెంటనే ఆ సర్పం మాయమై ఒక బండరాయిపై సాధువు ప్రత్యక్షమై భయపడొద్దు అంటూ లస్మయ్యకు ధైర్యం చెప్పాడు. సాధువు కళ్లు మూసుకోమని చెప్పడంతో లస్మయ్య కళ్లు మూసుకున్నాడు. అతడి నడుము చుట్టూ నాగ సర్పం చుట్టుకుంది. నీ నడుం బాగైంది చూసుకోమని సాధువుతో పాటు నాగసర్పం.. రెండూ అదృశ్యమయ్యాయి. భక్తుల కోరికలు తీర్చేందుకు ఇ క్కడ అవతరిస్తున్నాని, భక్తిశ్రద్ధలతో పూజించేవారి కోరికలు నెరవేరుస్తానని అతడికి చెప్పారు. వెంటనే లస్మయ్య ఆరోగ్యంతో నంబాలకు వచ్చి విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. ఆనాటి నుంచి ప్రసన్న పరమేశ్వరుడు భక్తులను కంటికి రెప్పలా కాపాడుతాడని స్థానికులు నమ్ముతారు. ఆలయంలో గణపతి, శివలింగం, పార్వతీదేవి, నందాఈశ్వరుడు, నాగేంద్రుడు, సూర్య భగవానుడు, ఆంజనేయస్వామి, నవ గ్రహాలు విగ్రహాలు ఉన్నాయి. -
జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
జైపూర్: వేలాల జాతర ఏర్పాట్లను చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం పరిశీలించారు. గుట్టపై భక్తులకు తాగునీటి వసతి, ఆలయం వద్ద సౌకర్యాలు, గోదావరినదిలో పుణ్యస్నానాలు, గుట్టపైకి కాలినడక మార్గంలో వెళ్లేవారికి తాగునీరు, విశ్రాంతి సౌకర్యాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. రామగుండం సీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ నేతృత్వంలో ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 30 మంది ఎస్సైలు, 35 మంది ఏఎస్సైలతో పాటు 600 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల, చెన్నూర్, గోదావరిఖని ప్రాంతాల నుంచి వేలాలకు 100 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. యంత్రాల పనిగంటలు పెంచాలి శ్రీరాంపూర్: ఓపెన్ కాస్ట్ గనిలో భారీ యంత్రాల పనిగంటలు మరింత పెంచాలని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్) ఎల్వీ.సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన శ్రీరాంపూ ర్ ఓపెన్ కాస్ట్ గని సందర్శించారు. ఓసీపీలోని ఇన్ఫిట్ క్రషర్, సర్ఫేస్ క్రషర్లను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ గని నుంచి ప్రతీరోజు 4రేకుల బొగ్గు రవాణా చేయాలన్నారు. శ్రీరాంపూర్ ఏరియా మొత్తం 7 రేకుల బొగు్గ్ రవాణా కావాల్సి ఉందన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం(సీహెచ్‌పీ) తిరుమల్‌రావు, ఏరియా ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఓసీపీ అధికారి టీ.శ్రీనివాస్, డీజీఎంలు కేశవరావు, రవీందర్, క్వాలిటీ ఇంచార్జి కే.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజినీర్ నాగరాజు పాల్గొన్నారు. మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణతానూరు: మహిళ మెడలో పుస్తెల తాడు అపహరించిన ఘటన మండలంలో బోంద్రట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. బోంద్రట్ గ్రామానికి చెందిన పంచశీల మంగళవారం వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగివస్తుంది. ఈ క్రమంలో ఎదురుగా బైక్‌పై ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో పుస్తెతాడును ఎత్తుకెళ్లి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సాగునీటికోసం రైతుల ఆందోళన
దండేపల్లి: కడెం ఆయకట్టు కింద యాసంగి పంటలకు వారబంధీ పద్ధతిలో అందిస్తున్న సాగునీరు సక్రమంగా అందడంలేదని డిస్ట్రిబ్యూటరీ 24బీ పరిధిలోని మాకులపేట, తాళ్లపేట గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కడెం ప్రధాన కాలువలో దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగికి సాగునీరందిస్తామని అధికారులు చెప్పడంతో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశామని, పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ డీఈ వెంకటేశం, ఏఈఈ శ్రావణ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
పెద్దల సభలో..మనోళ్లు
● ఉమ్మడి జిల్లా నుంచి శాసన మండలికి పలువురి ప్రాతినిధ్యం ● చైర్మన్‌గా ఆదిలాబాద్‌కు చెందిన సయ్యద్ ముకషీర్ షా ● పి.నర్సారెడ్డి, జీవీ సుధాకర్‌రావు, పలువురు ఎమ్మెల్సీగా ● స్థానికసంస్థలు, ఎమ్మెల్యే కోటాలోనే అవకాశాలుసాక్షి,ఆదిలాబాద్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల, టీచర్స్ శాసనమండలి సభ్యుల ఎన్నికల వేడి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇటు పట్టభద్రుల పరంగా, అటు టీచర్స్ పరంగా ఒకరంటే ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. పలువురు పోటీ చేసినప్పటికీ నిరాధారణకు గురయ్యారు. అయితే శాసనమండలి పరంగా ఉమ్మడి జిల్లాలో ఘన చరిత్ర ఉంది. ఆదిలాబాద్‌కు చెందిన సయ్యద్ ముకషీర్షా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలికి 6వ చైర్మన్‌గా వ్యవహరించారు. రెండుసార్లు ఆయన చైర్మన్‌గా ఉండటం గమనార్హం. ఆ సమయంలో మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి, కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్‌రావు సీఎంలుగా ఉన్నారు. మనోళ్లు ముఖ్య పదవుల్లో.. ఉమ్మడి జిల్లా నుంచి శాసనమండలి చైర్మన్‌గా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ ముకషీర్ షా వ్యవహరించిన ఘనత ఉంది. కాంగ్రెస్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఒక్కసారి ఎన్నిక చేయగా, మరోసారి శాసన పరిషత్‌కు నామినేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి 1958లో ఏర్పాటు కాగా, సీఎంగా వ్యవహరించిన ఎన్టీ రామారావు ఈ శాసనమండలి వ్యవస్థను 1985లో రద్దు చేశారు. అప్పుడు మండలి చివరి చైర్మన్‌గా ముకషీర్ షా ఉన్నారు. ఆ తర్వాత 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో మళ్లీ శాసనమండలి పునరుద్ధరించారు. నిర్మల్‌కు చెందిన పి.నర్సారెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఎంపీ అయ్యారు. అప్పట్లో ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. దండేపల్లికి చెందిన జీవీ సుధాకర్‌రావు ఒకసారి ఎమ్మెల్సీగా వ్యవహరించారు. అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. స్థానిక సంస్థల నుంచే.. ఉమ్మడి జిల్లా స్థానికసంస్థల నుంచే జిల్లా ముగ్గురు నేతలకు అవకాశం దక్కింది. అందులో కాంగ్రెస్ నుంచి సయ్యద్ ముకషీర్ షా, ప్రేమ్‌సాగర్‌రావులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరించిన పురాణం సతీశ్ పదవీ కాలం పూర్తయ్యే వరకు పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హస్తం పార్టీలో చేరారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన దండే విఠల్ ఇప్పటికీ పదవిలో కొనసాగుతుండగా ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీలు 1.సయ్యద్ ముకషీర్ షా(మృతిచెందారు). 1979–80, 1981–85 (మండలి చైర్మన్), (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు 2.పి.నర్సారెడ్డి (మృతిచెందారు). మూడుసార్లు ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి, ఆ తర్వాత 1981–85 వరకు ఎమ్మెల్సీగా, ఒకసారి ఎంపీగా వ్యవహరించారు. 3.జీవీ సుధాకర్‌రావు (మృతిచెందారు). 1977 (పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు). 4.మహ్మద్ సుల్తాన్ అహ్మద్ (మృతిచెందారు), 2007–09 (ఎమ్మెల్యే కోటా నుంచి ప్రాతినిధ్యం వహించారు) 5. ప్రేమ్‌సాగర్‌రావు, 2007–13 (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 6. పొగాకు యాదగిరి (మృతిచెందారు). 2007 (ఎమ్మెల్యే కోటా నుంచి ప్రాతినిధ్యం వహించారు) 7. పురాణం సతీశ్, 2015–22 వరకు (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం) 8. దండే విఠల్.. 2022 నుంచి 2028 వరకు కొనసాగనున్నారు. ‘స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం). ఎమ్మెల్యే కోటాలో.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెన్నూర్‌కు చెందిన సుల్తాన్ అహ్మద్‌ను మెనార్టీ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అంతకుముందు 1999లో ఈయన సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో మళ్లీ టికెట్ ఆశించారు. ఆ సమయంలో కోనేరు కోనప్పకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వగా, సుల్తాన్ అహ్మద్‌కు నామినేట్ పదవి విషయంలో భరోసానిచ్చారు. ఈమేరకే అప్పట్లో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. మంచిర్యాలకు చెందిన పొగాకు యాదగిరి న్యాయవాదిగా వ్యవహరించేవారు. ఎన్టీ రామారావు హయాం నుంచి టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వీరిద్దరు మినహా ఎవరు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించలేదు. -
‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపం’
సిర్పూర్(టి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండలంలోని వెంకట్రావ్‌పేట్ సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లును మంగళవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ సీసీఐ కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిన్నింగ్ మిల్లు యాజమాన్యం, సీసీఐ అధికారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మార్చి 15 వరకు సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు నిర్వహించాలని కోరారు. లేనిపక్షంలో రైతులతో కలిసి జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లెండుగురె శ్యాంరావ్, షేక్ చాంద్, రాజు, రాజేశ్, అస్లాం తదితరులు పాల్గొన్నారు. జిన్నింగ్ మిల్లు పరిశీలిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ -
తమ్ముడిని దింపి వస్తానని వెళ్లి..
● కానరాని లోకాలకు సోదరుడు ● రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో మృతి ● ఒకరికి తీవ్రగాయాలు భీమిని: ‘అమ్మా.. తమ్ముడిని దింపి త్వరగా పని చూసుకుని వస్తా’అని చెప్పిన బయటకు వెళ్లిన పది నిమిషాలకే కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. చేతికందిన కొడుకును రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. కన్నెపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని పోలంపల్లి వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..భీమిని మండలంలోని వీగాం గ్రామానికి చెందిన దుర్గం దేవాజీ–శంకరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు దుర్గం రాజేశ్ (29) కొరియర్ సర్వీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు అభిలాష్ బెల్లంపల్లిలో ఇంటర్ చదువుతున్నాడు. కూతురికి వివాహమైంది. ప్రతీరోజు లాగా రాజేష్, సోదరుడు అభిలాష్‌ను బైక్‌పై వీగాం బస్టాండ్‌లో దింపేందుకు వెళ్లాడు. అప్పటికే బస్సు వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు కలిసి టేకులపల్లి క్రాస్‌రోడ్డు వద్దకు బయల్దేరారు. బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన పెట్టెం శ్రవణ్‌కుమార్ తన తండ్రి అంజయ్యతో కలిసి బైక్‌పై కన్నెపల్లి వైపు వేగంగా వస్తున్నాడు. పోలంపల్లి వద్ద రాజేశ్ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేశ్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అభిలాష్ చెయ్యి విరిగి తీవ్రగాయాలపాలయ్యాడు. శ్రవణ్‌కుమార్, అంజయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కన్నెపల్లి ఎస్సై గంగారాం, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయాలైన అభిలాష్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. రాజేశ్ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి దేవాజీ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆగస్త్యకూడం అధిరోహించిన చెన్నూర్ యువకుడు
చెన్నూర్: పట్టణానికి చెందిన యువకుడు మంచాల సూరజ్.. ఆగస్త్యకూడం (శిఖరం) అధిరోహించాడు. మంచాల రాజబాపు– పద్మజ దంపతుల కుమారుడు సూరజ్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన కేరళలోని తిరువనంతపురానికి 60 కి.మీ దూరంలో ఆగస్త్యకూడం(శిఖరం) 50 మీటర్ల ఎత్తును మూడురోజుల్లో ట్రెక్కింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ ట్రెక్కింగ్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. శిఖరానికి ఆగస్త్య మహాముని పేరు పెట్టడంతో ఇది ప్రసిద్ధి చెందిన తీర్థయాత్రగా పేరొంది. యాత్ర చేపట్టేవారికి కేరళ ప్రభుత్వం ఆహార సదుపాయాలు కల్పిస్తోంది. ట్రెక్కింగ్ విజయవంతంగా పూర్తి చేసిన సూరజ్‌ను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, సెక్టార్ మోడల్ అధికారులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ 27న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందన్నారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి రిసెప్షన్ కేంద్రాలకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. బుధవారం సంబంధిత అధికారులు సామగ్రి తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు సహకరించాలిఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీ య పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పోలింగ్ ఏజెంట్లు కేంద్రాలకు హాజరయ్యేలా చూ డాలన్నారు. డ్రా పద్ధతిలో రాజకీయ పార్టీల ప్రతిని ధుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు కేటాయిస్తామని తెలిపారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పాల్గొన్నారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లువాంకిడి: ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఓటర్ల సౌకర్యార్థం తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, మూత్రశాలలు, లైటింగ్, ఫ్యాన్లు తదితర వసతులు కల్పించాలని తహసీల్దార్ రియాజ్ అలీని ఆదేశించారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్, హెచ్ఎం నటరాజ్ ఉన్నారు.● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
‘బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయం’
ఆసిఫాబాద్‌అర్బన్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం ఖాయమని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలో అరిగెల నాగేశ్వర్రావు నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యావంతులు విజ్ఞాతతో ఆలోచించి ఓటు వేయా లని కోరారు. అంజిరెడ్డి, కొమురయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. యువత బీజేపీకి మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, నాయకులు మల్లికార్జున్, విజయ్, పెంటయ్య, గణేశ్, ప్రసాద్‌గౌడ్, శ్రీకాంత్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
నమః శివాయ..!
● నేడు మహాశివరాత్రి ● విద్యుత్ దీపాలతో ఆలయాలు ముస్తాబు ● పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు ● తరలిరానున్న భక్తజనంలయకారుడు.. ముక్కంటి.. కై లాసవాసి.. ఇలా ఏ పేరుతో పిలిచినా భక్తుల కోర్కెలు తీర్చేవాడు బోళా శంకరుడు మహాశివుడు. సృష్టికి మూలమైన పరమేశ్వరుడిని పూజిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. శివపూజకు మహాశివరాత్రిని అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు ఆదిశంకరునికి అభిషేకం చేసి.. పూజించి.. ఉపవాసం చేసి.. జాగరణ చేస్తే శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. ముక్కంటిగా భక్తకోటితో నిరంతరం పూజలందుకుంటున్న అభిషేక ప్రియుడి నామస్మరణతో బుధవారం మహాశివరాత్రి పండుగను జరుపుకోవడానికి భక్తులు సిద్ధమయ్యారు. మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శివాలయాలపై ప్రత్యేక కథనం. -
ప్రశాంత వాతావరణంలో రంజాన్ జరుపుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, విద్యుత్, మిషన్ భగీరథ అధికారులు, ముస్లిం మతపెద్దలు, మసీద్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రార్థన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఇన్చార్జి మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రమాదేవి, డీఆర్డీవో దత్తారావు, విద్యుత్‌శాఖ ఎస్ ఈ శేషారావు, డీఎంహెచ్‌వో సీతారాం, మున్సిపల్ కమిషనర్లు భుజంగరావు, అంజయ్య, తహసీల్దార్ రోహిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల జాగారం
● శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ పోలింగ్ ● పట్టభద్రులు, టీచర్ అభ్యర్థుల ఆరాటం ● ప్రచారం ముగిసి తెరవెనుక మంత్రాంగం సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మెదక్–కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరుకుంది. పోలింగ్‌కు 48గంటల ముందే ప్రచారం నిలిపి వేయాల్సి ఉండడంతో తెరవెనుకఅభ్యర్థుల మంత్రాంగం మొదలైంది. నాలుగు పాత జిల్లాల్లోని మొత్తం 42అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతున్న పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసారి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోటీలో ఉన్న వారందరూ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్ల మొగ్గుపై ఆసక్తి కొనసాగుతోంది. తమ అభ్యర్థుల విజయం కోసం ఆయా పార్టీల రాష్ట్ర అగ్రనాయకత్వం ప్రచారంతో హోరెత్తించింది. గత ఎన్నికల కంటే ఈసారి మరింత దూకుడుగా అభ్యర్థులు తలపడుతున్నారు. ప్రచారంలో ఒకరిని మించి మరొకరు హామీలు ఇస్తూ ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. నేడు శివరాత్రి పండుగ ముగిసి, గురువారం ఉదయం 8నుంచే బ్యాలెట్ పేపర్‌పై ప్రాధాన్యత క్రమాన్ని ఓటర్లు వేయడం మొదలవుతుంది. దీంతో అభ్యర్థులు ఎన్నికల జాగారం చేయాల్సి వస్తోంది. టీచర్ల స్థానానికి హోరాహోరీఉపాధ్యాయ స్థానానికి మొత్తం 15మంది బరిలో ఉండగా, ఇందులో బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉన్న పీఆర్టీయూ ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, టీఎస్‌సీపీఎస్‌ఈ యూనియన్ బలపర్చిన తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డితో సహా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు, 317జీవో, డీఏలు మెడికల్ రీయింబర్స్మెంట్స్ పెండింగ్, పే స్కేల్, పదోన్నతుల సమస్యలే ప్రచారంలో చర్చకు వచ్చాయి. అందరూ హామీలే ఇచ్చినప్పటికీ టీచర్లు ఎవరికి పట్టం కడుతారనే ఆసక్తి నెలకొంది. గతంలో మద్దతు తెలిపిన సంఘ సభ్యులందరూ ఒకే అభ్యర్థికి ఓట్లు వేసిన దాఖలాలు లేవు. చాప కింద నీరులా కొందరు అభ్యర్థులు తెరవెనుక మంత్రాంగం నడిపించి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా ఓటర్లకు తాయిలాలు అందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా విందులు నడుస్తున్నాయి. పట్టభద్రుల ప్రసన్నం కోసంకాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్‌రెడ్డి, బీజేపీ మద్దతుతో అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణతో సహా మొత్తం 56మంది బరిలో ఉన్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక నాయకులు చెమటోడుస్తున్నారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ప్రచారం చేశారు. బీఎస్పీ నుంచి పోటీలో ఉన్న ప్రసన్న హరిక్రిష్ణ బీసీ నినాదంతో ముందుకు వస్తున్నారు. వీరితోపాటు బక్క జడ్సన్ పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే బహిరంగ సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అంతేకాక ఎవరికివారు సామాజిక మాధ్యమాలు, ఫోన్లు, మేసేజ్‌లు, వాట్సాప్‌ల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ నెలకొనడంతో పట్టభద్రులు తమ ప్రాధాన్యతను ఎలా వ్యక్తపరుస్తారనేది ఆసక్తిగా మారింది. పట్టభద్రుల ప్రసన్నం కోసం చివరి అస్త్రంగా నగదు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్థిక అక్షరాస్యతపై మహిళలకు అవగాహన అవసరమని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాజేశ్వర్ జోషి అన్నా రు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో మంగళవారం అవగాహన కల్పించారు. ఆయ న మాట్లాడుతూ ప్రతీ రూపాయి ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని, అప్పుడే కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నా రు. బ్యాంకు మేనేజర్ జీవన్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో అందిస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో డీపీఎం అన్నాజీ, ఏపీఎం సదానందం, బ్యాంకు సిబ్బంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ఆసిఫాబాద్‌అర్బన్: పదో తరగతి వార్షిక ఫలి తాల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన ఐదు వారాంతపు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయని అన్నారు. రానున్న 24 రోజుల్లో షెడ్యూల్ ప్రకారం బోధించాలని సూచించారు. పీఎం శ్రీ పథకంలో భాగంగా కేటాయించిన నిధులు డ్రా చేయాలన్నారు. సమావేశంలో ఏసీజీఈ ఉదయ్‌బాబు, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి వెంకటేశ్వరస్వామి, ఎఫ్ఏవో దేవాజీ, కోఆర్డినేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు జాతీయస్థాయి నెట్‌బాల్ జూనియర్ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్, పీడీ బి.తిరుపతి తెలిపారు. ఎంపికై న వారిని మంగళవారం అభినందించారు. ఆర్.పల్లవి, కె.రోషిణి, ఎం.దీపిక, ఎం. రోహన్, ఎన్.రోహిత్ ఈ నెల 26, 27, 28 తేదీల్లో హర్యానాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇదే పోటీలకు ఎంపికై న జిల్లాకు చెందిన డి.వినత్రయను నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్ అభినందించారు. -
న్యూస్‌రీల్
నాణ్యమైన విద్యుత్ సరఫరా ఆసిఫాబాద్‌అర్బన్: వినియోగదారులకు నా ణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ఎస్ఈ శేషారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగజ్‌నగర్ డివిజనల్లో 132/22 కేవీ కౌటాల సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయిందని, వారంలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలి పారు. టీజీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో రూ.31.19 కోట్లు వెచ్చించి సబ్‌స్టేషన్ నిర్మించామని, 165 టవర్లు, 43.2 కిలోమీటర్ల మేర లైన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. చింతలమానెపల్లి, బెజ్జూర్, కౌటాల, సిర్పూర్(టి) మండలాలకు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. కౌటాల సబ్‌స్టేషన్ నుంచి 104 గ్రామాల ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.జాతర ఏర్పాట్లు పరిశీలన వాంకిడి: మహాశివరాత్రిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని చిక్లీ వాగు తీరంలో నిర్వహించే జాతర ఏర్పాట్లను ఏఎస్పీ చిత్తరంజన్ మంగళవారం పరిశీలించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్ ఉన్నారు. -
కాకతీయుల విజయానికి చిహ్నం
వాంకిడి: మండల కేంద్రంలోని చిక్లీ వాగు వద్ద కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం చరిత్రకు చిహ్నంగా, భక్తుల కొంగుబంగారంలా నిలుస్తోంది. మహాశివరాత్రి పర్వదినాన చిక్లీ వాగు తీరంలో నిర్వహించే జాతరకు ఆలయాన్ని విద్యుత్ వెలుగులతో ముస్తాబు చేశారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడిని పోలి ఉండటంతో శివరాత్రి రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కాకతీయుల చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే కట్టడాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరాఠా రాజులతో జరిగిన యుద్ధంలో రాణి రుద్రమదేవి కొన్నిరోజుల పాటు వీరోచిత పోరాటం సాగించి వారిని మహారాష్ట్ర సరిహద్దులోని వాంకిడి వరకు తరిమికొట్టినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. కాకతీయుల విజయానికి చిహ్నంగా వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీ వాగు ఒడ్డున శివకేశవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆలయం నిర్మాణంలో భారీ రాతి బండలు వినియోగించారు. ఓరుగల్లు నుంచి ఏనుగుల సాయంతో వాటిని ఇక్కడికి తెప్పించి ఆలయ నిర్మాణానికి వాడినట్లు చరిత్రకారులు గుర్తించారు. అందువల్లే ఆలయం వేయి స్తంభాల గుడిని పోలి ఉంటుంది. స్తంభాలు, సీ్త్రల నృత్య భంగిమలు, గుడి ముఖద్వారం వద్ద నంది విగ్రహం, విడివిడిగా ఏర్పాటు చేసిన అనేక విగ్రహాలు ఆకట్టుకుంటాయి. శివ, కేశవులు ఒకేచోట ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. మరో వైపు రేణుక మాత విగ్రహాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. మహాశివరాత్రికి కెరమెరి, కాగజ్‌నగర్, రెబ్బెనతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి భారీగా తరలివస్తారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు, చిక్లీ వాగు తీరంలో రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రంగా భజనలతో జాగరన చేయనున్నారు. -
‘పది’ పరీక్షలకు సన్నద్ధం కావాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్రూరల్: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం పరీక్ష కేంద్రాల పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, విద్యుత్ సౌకర్యం, వైద్యసిబ్బంది, ఇతర వసతులు కల్పించాలన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 36 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేవిధంగా ముఖ్య పర్యవేక్షకులు, శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో సమాధాన పత్రాల సీలింగ్ పూర్తిచేయాలన్నారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, అధికారులు పాల్గొన్నారు. -
ఆర్థిక కార్యకలాపాలపై అవగాహన అవసరం
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్థిక కార్యకలాపాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రాజేశ్వర్‌జోషి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 28 వరకు ఆర్థిక అక్షరాస్యత ఉత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపా రు. మహిళలు గృహ బడ్జెట్, సూక్ష్మ పొదుపు తదిత ర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సెల్ టవర్ల ఏర్పాటుకు సమన్వయంతో కృషి చేయాలిజిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ అందించేందుకు వీలుగా సెల్ టవర్ల ఏర్పాటుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అటవీశాఖ అధికారి సుశాంత్‌తో కలిసి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టవర్ల నిర్మాణంపై రెవెన్యూ, అటవీ, బీఎస్ఎన్ఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్న టవర్ల నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న టవర్ల నిర్మాణ స్థలాలను రెండు రోజుల్లో డీజీపీఎస్ చేసి రెవెన్యూ అధికారులు నివేదించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు, రేంజ్ అధికారులు, బీఎస్ఎన్ఎల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దుఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అధికారులు పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, అదనపు ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్లో ఏర్పాటు చేసే సామగ్రి పంపిణీ కేంద్రానికి ఈ నెల 26న ఉదయం 9 గంటలకే చేరుకోవాలని సూచించారు. సామగ్రి, బ్యాలెట్ పేపర్, బాక్సులను సరిచూసుకోవాలన్నారు. అనంతరం కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటింగ్ కోసం వేర్వేరుగా కంపార్టుమెంట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బాక్సులను సీజ్ చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ పోలింగ్ విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్‌ను పరిశీలించారు. ఆర్డీవో లోకేశ్వరావు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మాస్టర్‌ప్లాన్‌కు నిధులివ్వండి..
– మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేంసాగర్రావుమంచిర్యాలలో మాస్టర్‌ప్లాన్ అమలుకు అనుగుణంగా పనులు మొదలుపెట్టామని, అందుకు రూ.78కోట్లు, గూడెం సత్యనారాయణస్వామి ఆలయ అభివృద్ధికి రూ.12కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. మంచిర్యాలను కార్పొరేషన్‌గా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో నాలుగు ఎకరాల్లో రూ.11 కోట్లతో గ్రీన్క్రిమిటోరియం పద్ధతిలో శ్మశానవాటిక నిర్మిస్తున్నామని, దీనిలో పూర్తిగా సోలార్ పవర్ వాడే విధంగా చర్యలు తీసుకున్నామని, పూర్తి కావొచ్చిందని తెలిపారు. కరకట్ట నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతాశిశు కేంద్రం ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారికి పట్టాలు ఇప్పించాలని, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని, ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. -
జీఎం విజయ భాస్కర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా నూతన జనరల్ మేనేజర్‌గా విజయ భాస్కర్‌రెడ్డి సోమవారం గోలేటిలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఏరియా జీఎంగా పనిచేసిన శ్రీనివాస్ శ్రీరాంపూర్ ఏరియాకు బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో విజయ భాస్కర్‌రెడ్డిని సింగరేణి యాజమాన్యం నియమించింది. గోలేటిలోని కార్యాలయం వద్ద సిబ్బంది నూతన జీఎంను శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, కై రిగూడ పీవో నరేందర్, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
● నస్పూర్‌లోని మైదానంలో ఏర్పాటు ● వేలాదిగా తరలివచ్చిన పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ
నస్పూర్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న మైదానంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంకల్పసభ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి జిల్లా నుంచి వేలాదిగా పట్టభద్రులు హాజరు కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారని అన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం ప్రకటించడంతో ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ సభలో మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కంటోన్మెంట్, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీగణేశ్, గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర కనీస వేతన సవరణ బోర్డు చైర్మన్ జనక్‌ప్రసాద్, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చా ర్జీలు శ్యాంనాయక్, అడె గజేందర్, కంది శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రవళి, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి ఆత్రం సుగుణ, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.సురేఖమ్మ 24గంటలు పని చేస్తున్నరు: సీఎం‘మంచిర్యాల ప్రజలు అదృష్టవంతులు. మీరు ఒక్క ఓటు వేసి ఎమ్మెల్యేను ఎన్నుకుంటే మీకు ఇద్దరు సేవకులు వచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు రోజుకు 16గంటలు పని చేస్తే, డీసీసీ అధ్యక్షురాలిగా సురేఖమ్మ 24గంటలు పని చేస్తున్నారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. -
ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, కార్మి కులు సమన్వయంతో కృషి చేయాలని ఆది లాబాద్ రీజినల్ మేనేజర్ సోలోమన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో సిబ్బందికి వారం రోజులుగా నిర్వహిస్తున్న పవర్ శిక్షణ కార్యక్రమానికి సోమవారం ప్రత్యేక అ తిథిగా హాజరయ్యారు. ఆర్ఎం మాట్లాడు తూ సిబ్బంది శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పాటించాలన్నారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూ చించారు. డిపో పరిధిలో ఖర్చులు తగ్గించడంతోపాటు కేఎంపీఎల్ పెంచాలన్నారు. ప్ర మాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిక్షణలో భాగంగా విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ విశ్వనాథ్, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.