Mahabubabad
-
రాజశేఖర్‌రెడ్డికి 8వ ర్యాంకు
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2 లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించారు. చిమ్ముల అరుణ– మల్లారెడ్డి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతు రు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. కుమారుడు చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మా ర్కులు సాఽధించి రాష్ట్ర 8వ ర్యాంక్ సాధించారు. గ తంలో రాజశేఖర్‌రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి పదవులకు కూడా ఎంపికయ్యారు. ఉన్నతమైన లక్ష్యంతో కష్టపడి చదివి రాష్ట్ర ర్యాంకుసాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పులకించిన కొండపర్తి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఆయన కూడా ఆదివాసీలతో మేమకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీల నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతో పాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్‌ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్‌దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క, కలెక్టర్ దివాక ర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కొండపర్తిని దత్తత తీసుకోవడం గొప్ప విషయం: మంత్రి సీతక్క దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయమని మంత్రి సీతక్క అన్నారు. ఆ గ్రామాన్ని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అనుసంధానం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అందించడం ద్వారా మహిళలు వ్యాపారవేతలుగా ఎదగాలన్నారు. 40 కంపెనీలు దిశ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని వంద పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి : దాన కిశోర్, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి కొండపర్తిని అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఆదాయం చేకూరేలా ఐకమత్యంతో ముందుకుసాగాలని సూచించారు. మిర్చి, పసుపు, మసాలా యూనిట్లకు మార్కెటింగ్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా సౌకర్యం కల్పిస్తామన్నారు. అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు కొండపర్తికి వచ్చిన గవర్నర్ మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్ల మొక్కుగా సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, రిజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రావుల సునీత, మేడారం ఈఓ రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు. ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం భారీ పోలీసు భద్రత నడుమ సాగిన పర్యటన -
కిక్కిరిసిన రైల్వేస్టేషన్
డోర్నకల్: డోర్నకల్ రైల్వేస్టేషన్ మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. 2వేల మందికి పైగా మహారాష్ట్రకు చెందిన కూలీలు తరలిరావడంతో రైల్వేస్టేషన్ జనసంద్రమైంది. మూడు నెలల క్రితం మిరప తోటల్లో కాయకోత పనులకు మహా రాష్ట్ర నుంచి వేలాదిగా కూలీలు తరలివచ్చారు. రైళ్ల ద్వారా డోర్నకల్ స్టేషన్‌కు చేరుకుని ఇక్కడి నుంచి మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, కృష్ణా జిల్లాలకు తరలివెళ్లారు. కాయకోత పనులు పూర్తి కావడంతో కొద్ది రోజుల నుంచి కూలీలు డోర్నకల్ మీదుగా మహా రాష్ట్రకు తిరిగి వెళ్తున్నారు. పది రోజులుగా సింగరేణి రైలులో ప్రతీరోజు 500 నుంచి 1000మందికి పైగా తరలివెళ్తున్నారు. మంగళవారం 2వేల మందికి పై గా కూలీలు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. కాగా సింగరేణి రైలులో కొత్తగూడెం, కారెపల్లి స్టేషన్లలో అధిక సంఖ్యలో కూలీలు ఎక్కడంతో డోర్నకల్‌కు చేరుకునే సమయనికే రైలు కాలు పెట్టలేనంత రద్దీగా మారింది. డోర్నకల్‌లో కూలీలు రైలు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఘర్షణ పడి కొట్టుకున్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది రైలును కొద్దిసేపు నిలిపి కూలీలను ఎక్కించే ప్రయత్నం చేశారు. సగం మందికి పైగా రైలు ఎక్కలేకపోవడంతో తర్వాత వచ్చిన శాతవాహన, గోల్కొండ రైళ్లలో పంపించారు. మహారాష్ట్రకు కూలీల తిరుగుప్రయాణం -
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuకొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షల్లో రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు. – సాక్షి నెట్వర్క్ప్రణీత్ ప్రతిభ.. కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా గ్రూప్–1 పరీక్షలోనూ 380 మార్కులు సాధించారు.గ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ ● పలువురికి మెరుగైన ర్యాంకులు ● ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం ● హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులుముల్కలపల్లి యువకుడు ఉపేందర్.. డోర్నకల్: గ్రూప్–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విదులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్‌ను గ్రామస్తులు అభినందించారు. మెరిసిన సంధ్య.. మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని డోలి వెంకటేశ్వర్లు–పద్మ దంపతుల కుమార్తె డోలి సంధ్య గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 205 ర్యాంకు సాధించారు. 600 మార్కులకు 382.4 మార్కులు వచ్చాయి. అత్యధిక మార్కులు సాధించడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు. ఉద్యోగం చేస్తూ.. భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో పనిచేశారు. అదే సంవత్సరంలోనే గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. గిరిజన ఆణిముత్యం శ్రీకాంత్ గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్ గ్రూప్–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్ వైస్ ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్ తెలిపారు. గతంలో గ్రూప్–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్‌ను మాజీ సర్పంచ్ అరుణమంగీలాల్‌నాయక్, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్‌రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు. న్యూస్‌రీల్ -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ జెడ్పీహెచ్‌ఎస్‌ను ఎమ్మెల్సీగా గెలిచిన అనంతరం మొదటిసారి మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పీఆర్టీయూ ఉపాధ్యాయులకు కంకరబోడ్ పాఠశాల పవిత్రమైందని, చామల యాదగిరి ఇదే పాఠశాలలో పీఆర్టీయూ సంఘాన్ని స్థాపించారన్నారు. 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ వర్తింపు, పెండింగ్ బకాయిల విడుదల, కేజీవీబీ, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తింపు, మ్యూచువల్ బదిలీలు, గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డిని ఉపాధ్యాయులు సన్మానించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, ప్రధాన కార్యదర్శి మిర్యాల సతీశ్‌రెడ్డి, పాఠశాల హెచ్ఎం కోట్యానాయక్ తదితరులు ఉన్నారు. -
అనంతాద్రీశుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతాద్రి శ్రీజగన్నాథ వేంకటేశ్వరస్వామి ఆలయ 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతులు, ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఆధ్వర్యంలో శ్రీవిశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షా బంధనం, మృత్సంగ్రహణం, ఋత్విక్ కరణం, అంకురారోహణం, వైనతేయ ఆదివాస హోమం, నివేదన, తీర్థ ప్రసాద గోష్టి పూజలు నిర్వహించారు. నాయిని ప్రభాకర్ రెడ్డి, కాళీనాథ్, శ్రీనివాస్ అచార్యులు, అనిరుద్ధ ఆచార్యులు, విశ్వం తదితరులు పాల్గొన్నారు. నేడు విశ్వక్సేన యజ్ఞం... బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయని నిర్వాహకులు తెలిపారు. సేవా కాలం, వేద విన్నపం, తీర్థ ప్రసాద గోష్టి అనంతరం ద్వారాతోరణ, ధ్వజ కుంభారాధన, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, మూర్తి కుంభారాధన, మూలమంత్ర హవనం పూజలు జరుగుతాయన్నారు. శ్రీవిశ్వక్సేన యజ్ఞం నిర్వహించి ధ్వజారోహణం ద్వారా గరుడ ప్రసాదం భక్తులకు అందజేస్తారని, సంతానార్థులు ఆలయానికి వచ్చి గరుడ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందాలని వారు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని, ద్వారా తోరణ, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, నిత్యాహవనం, నిత్య పూర్ణాహుతి, దేవతాహ్వానం, నివేదన, బలిహరణ, వేద విన్నపం, తీర్థప్రసాదం పంపిణీ ఉంటుందన్నారు. -
బైక్‌ను ఢీకొన్న కారు..
నల్లబెల్లి: జాతీయ రహదారిపై ఓ కారు అతివేగం, అజాగ్రత్తగా వస్తూ వెనుక నుంచి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం నల్లబెల్లి మండలం బజ్జుతండా బస్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. మండలంలోని నారక్కపేటకు చెందిన మాడుగుల రజిత, శ్రీను దంపతుల కుమారుడు అజయ్(22) డిగ్రీ వరకు చదువుకున్నాడు. నర్సంపేటలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణలో తల్లిదండ్రులకు ఆసరా అవుతున్నాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు జన్ను అజయ్‌తో కలిసి తన ద్విచక్రవాహనంపై నారక్కపేట, లచ్చిరెడ్డి కుంట మీదుగా నల్లబెల్లికి వెళ్లే క్రమంలో బజ్జుతండా బస్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. ఈ క్రమంలో హనుమకొండ సుబేదారికి చెందిన కాసోజు శ్రీనివాస్ కారులో నర్సంపేట నుంచి నల్ల బెల్లి వైపునకు అతివేగంగా వస్తూ వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అజయ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. జన్ను అజయ్‌కి తీవ్రంగా, కారు డ్రైవర్ శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై గోవర్ధన్ సిబ్బంది కలిసితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. అజయ్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. అజయ్ మృతితో నారక్కపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. కాగా, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, తదితరులు పాల్గొన్నారు. పాఠశాల బస్సును ఢీకొని ఏటూరునాగారంలో మరొకరు.. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని సినిమా థియేటర్ ప్రదేశంలోని యూ టర్న్ వద్ద స్కూల్ బస్సును ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఏఎస్సై సుబ్బారావు కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఎస్వీవీ పాఠశాలకు చెందిన ఏపీ 36 టీఏ 7266 గల పాఠశాల బస్సు డ్రైవర్ యూటర్న్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన శెట్టి నరేశ్(38) బస్సు వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. బైక్ అదుపు తప్పి స్కూల్ బస్సును ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో 108లో ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య అమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. యువకుడి దుర్మరణం, మరొకరికి గాయాలు బజ్జుతండా బస్ స్టేజీ వద్ద ఘటన -
జీనోమ్ ప్రాజెక్టుతో వ్యాధుల గుర్తింపు
కేయూ క్యాంపస్ : జీనోమ్ ప్రాజెక్టు మానవుడి వ్యాధులకు కారణమైన జన్యువులను గుర్తించొచ్చని 2010లోనే వెల్లడైందని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ అనిమల్ బయోటెక్నాలజీ, ఇమ్యూనాలజీ ఫర్ డిసిస్ ప్రివెన్షన్స్ అండ్ మేనేజ్మెంట్’ అనే అంశంపై మంగళవారం ఆ విభాగం సెమినార్‌హాల్‌లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ సదస్సుకు భారతదేశం నుంచి పరిశోధకులు, అకడమిషియన్లు పాల్గొని జంతు శాస్త్రాల పరిశోధన పురోగమనంపై చర్చించడాన్ని కొనియాడారు. అనంతరం బయో ఫార్మా డైరెక్టర్ గీతా శర్మ ‘డ్రగ్ డిస్కవరీ’ అనే అంశంపై మాట్లాడుతూ ఒక మాలిక్యుల్ డ్రగ్‌గా మార్కెట్లోకి రావడానికి తక్కువలో తక్కువ 10 సంవత్సరాలు పడుతుందన్నారు.అంతేకాకుండా 10 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. కానీ బయో ఇన్ఫర్మాటిక్స్ అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఖర్చు, సమయం రెండూ కలిసి రావడం పరిశోధన రంగంలో జరిగిన పురోగతిగా భావించొచ్చని తెలిపారు. ఈ జాతీయ సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ వై. వెంకయ్య మాట్లాడుతూ ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో వందకు పైగా రీసెర్చ్ స్కాలర్స్, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు తమ పరిశోధన పత్రాలు సమర్పించబోతున్నారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షురాలిగా జూవాలజీ విభాగ అధిపతి జి. షమిత, విశిష్ట అతిథిలుగా సైన్స్ డీన్ జి. హన్మంతు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఈసం ఈసం నారాయణ, ప్రొఫెసర్ ఇస్తారి పాల్గొన్నారు. వీసీ, ఇతర అతిథులు జాతీయ సెమినార్‌కు వచ్చిన పరిశోధన పత్రాల సావనీర్‌ను ఆవిష్కరించారు. సదస్సు ఈనెల 12న ముగియనున్నది. కేయూలో జాతీయ సదస్సులో వీసీ ప్రతాప్ రెడ్డి -
ఫీజుల కోసం ఫలితాల నిలిపివేత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అకడమిక్ డీన్‌కు ఇంకా 84 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో యూనివర్సిటీ పరిధిలోని ఆయా కాలేజీల విద్యార్థుల ఫలితాలు వెల్లడించడం లేదు. ఫలితంగా ఆయా విద్యార్థులు తాము ఉత్తీర్ణ సాధించామా?లేదా? ఏమైనా సబ్జెక్టుల్లో తప్పామనే అంశం తెలియక లబోదిబోమంటున్నారు. 53,728 మంది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ బీఎస్సీ, బీసీఏ బి ఓకేషనల్ కోర్సులకు సంబంఽధించి మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు ఈనెల 4న విడుదల చేసిన విషయం విధితమే. అయితే యూనివర్సిటీలోని డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించకపోవడతో తొలుత 121 కళాశాలల ఫలితాలు నిలిపివేశారు. వారంలో కొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజులు చెల్లించాయి. దీంతో వాటి ఫలితాలు విడుదల చేశారు. కేయూ పరిధిలో 304 (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల కళాశాలలు ఉండగా) అందులో మంగళవారం వరకు 84 ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు వివిధ రకాల ఫీజులు చెల్లించలేదు. దీంతో ఆయా కళాశాల విద్యార్థుల ఫలితాల నిలిపివేత కొనసాగుతోంది. రీవాల్యుయేషన్ గడువు కూడా.. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు ఇచ్చాక 10 నుంచి 15 రోజులపాటు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటికే ఫలితాలు విడుదల చేసిన కాలేజీల విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఫలితాలు విడుదల కాని విద్యార్థులు రీవాల్యుయేషన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వారంలో ఈ గడువు కూడా ముగియబోతుంది. దీంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొని ఉంది. డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్.. డిగ్రీ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇటీవలే పరీక్షల విభాగం అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. ఆయా సెమిస్టర్ల పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫీజులు కూడా ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులు చెల్లించాల్సింటుంది. అయితే 1,3,5 ఫలితాల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు కూడా ఆయా సెమిస్టర్ల పరీక్షల ఫీజులు చెల్లించాల్సింటుంది. ఇంకా చెల్లించని 84 కళాశాలలు 53,728మంది విద్యార్థుల నిరీక్షణ ముగుస్తున్న రీవాల్యుయేషన్ గడువు మరోవైపు డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల ఫీజు కూడా.. -
వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ప్రోత్సహించాలి
● రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్ మామునూరు: వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్ అన్నారు. ఈమేరకు మంగళవారం ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ రాజన్న ఆధ్వర్యంలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు మేకలు, పవర్ వీడర్స్ పంపిణీ చేసి మాట్లాడారు. వేసవిలో పశువుల మేత నిమిత్తం పాతర గడ్డి తయారీ విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విస్తరణ అధికారి కిషన్ కుమార్, అటారీ ప్రతినిధి ఎఆర్. రెడ్డి, ఉమారెడ్డి, దిలీప్‌కుమార్, బాలాజీ, బ్యాంకు మేనేజర్ రాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి, ఉద్యానశాఖ అధికారి సంగీత లక్ష్మి, డాక్టర్ అమ్రేశ్వరి, శాస్త్రవేత్తలు అరుణ్, సౌమ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. మిర్చి రైతులకు అండగా ఉంటాం●● మార్కెటింగ్ శాఖ జేడీ ఉప్పల శ్రీనివాస్ మహబూబాబాద్ రూరల్ : మిర్చి క్రయవిక్రయాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, వారికి అండగా ఉండి కొనుగోళ్లు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటా మని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వరంగల్ సంయుక్త సంచాలకుడు ఉప్పల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లను తనిఖీ చేశారు. రెండు, మూడు రోజుల నుంచి మిర్చి అధికంగా రావడం, మార్కెట్ యార్డులో రైతుల సమస్యలపై వారితో మాట్లాడి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ సకాలంలో కొనుగోళ్లు జరిపించి రైతులు ఇబ్బందులుపడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు మిర్చి కొనుగోళ్ల అంశాలపై పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, కార్యదర్శి షంషీర్, సూపర్వైజర్ రమేశ్ పాల్గొన్నారు. -
గ్రూప్–1 ర్యాంకర్ తేజస్వినికి సన్మానం
శాయంపేట : మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి హేమలత దంపతుల కూతురు తేజస్విని రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్–1లో ఫలితాల్లో 532.5 మార్కులు సాధించింది. దీంతో తేజస్వినిని గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ మంగళవారం సన్మానించారు. కాగా, తేజస్విని రెడ్డి 2019లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో మండల పంచాయతీ అధికారి పోస్టు సాధించింది. మొదటి పోస్టింగ్ నేలకొండపల్లి, రెండో పోస్టింగ్ టేకుమట్ల, ప్రస్తుతం రేగొండలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తూనే గ్రూప్–1కు సొంతంగా సన్నద్ధమైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్–1లో 532.5 మార్కులు సాధించానని, డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఎంపిక చేసుకుంటానని తేజస్విని రెడ్డి తెలిపారు. నూతన ఆలోచనలతో ముందుకు సాగాలి ● లీడ్ బిడ్ మేనేజ్మెంట్ జీఎం శివభాస్కర్ హసన్‌పర్తి : ప్రతీ విద్యార్థి నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని లీడ్ బిడ్ మేనేజ్మెంట్, ఆర్పీఎల్ జీఎం, ఇండియా సర్వీసెస్ జీఎం శివ భాస్కర్ నేతి అన్నారు. హసన్‌పర్తి మండలం అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షిక మేనేజ్మెంట్ ఫెస్ట్ ‘వ్యూహ–2025’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి శివభాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) కొత్త మార్గాలు తెరుస్తోందన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను మెరుగు పరచడానికి ఇలాంటి వేదికలు దోహదపడుతాయన్నారు. విద్యార్థులు టెక్నాలజీ మేనేజ్మెంట్ వైపు దృష్టి సారించాలన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పుకనుగుణంగా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. తొలుత ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం సమన్వయకర్త డాక్టర్ సుమన్, వివిధ విభాగాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. 61 మహిళా శక్తి అద్దె బస్సులుహన్మకొండ: ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు 61 మహిళా శక్తి అద్దె బస్సులు కేటాయించారని ఆర్టీసీ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ బస్సులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ఇందిరా మహిళ శక్తి మిషన్–25ను సీఎం ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు అందిస్తున్నట్లు తెలిపారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్నతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ 14వ తేదీ వరకు సీఎం పర్యటనకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సభకు వచ్చే రూట్లు, వాహనాల పార్కింగ్ స్థలాలను గుర్తించడంతో పాటు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్‌బాషా మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఏసీపీ భీంశర్మ, డీఆర్డీఓ వసంత, డీఏంహెచ్ఓ మల్లికార్జున్‌రావు, డీపీఓ స్వరూప, గృహనిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, అధికారులు పాల్గొన్నారు. సీఎం సభాస్థలి పరిశీలన స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని శివునిపల్లిలో ఈనెల 16న నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన సభాస్థలాన్ని అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం వద్ద చేపడుతున్న పనులను పరిశీలించారు. సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు శ్రీకాంత్, సతీష్ ఉన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి పనుల్లో వేగం పెంచండి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలెక్టరేట్లో సమీక్ష -
అన్నను చంపిన తమ్ముడికి జీవిత ఖైదు
కాటారం: భూమి విషయంలో అన్నను చంపిన తమ్ముడికి జీవితఖైదు శిక్షతో పాటు రూ.పదివేల జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు మంగళవారం తీర్పు వెలువరించారు. ఎస్సై మ్యాక అభినవ్ కథనం ప్రకారం.. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన మృతుడు మారుపాక నాగరాజు, నిందితుడు మారుపాక అశోక్ అన్నదమ్ములు. స్వగ్రామంలో ఇంటి స్థలం ఉండగా నాగరాజు, అశోక్, వారి తల్లి శంకరమ్మ సమానంగా పంచుకున్నారు. నాగరాజు తనకు వాటాగా వచ్చిన స్థలంలో ఇళ్లు నిర్మించుకోగా అశోక్ మద్యానికి బానిసై తన వాటా భూమిని అమ్ముకున్నాడు. అన్న ఇంట్లో సైతం తనకు వాటా వస్తుందని పలుమార్లు నాగరాజు కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేయడంతో వారు గ్రామం వదిలి వేరే చోట నివసిస్తున్నారు. ఈ క్రమంలో 2019, మే 10న ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి నాగరాజు గ్రామానికి రాగా అశోక్ అతడితో గొడవపడి బీరు సీసాతో గొంతులో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతుడి భార్య సరిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు అశోక్‌పై హత్య కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ శివప్రసాద్ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత వచ్చిన సీఐ హథీరామ్ కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. మంగళవారం కేసు తుది విచారణ జరిగింది. కోర్ట్లైజన్ ఆఫీసర్, ఏఎస్సై గాండ్ల వెంకన్న ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుళ్లు రమేశ్, వినోద్.. సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో ప్రధాన న్యాయమూర్తి.. నిందితుడు అశోక్‌కు జీవితఖైదు జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్‌తో పాటు అప్పటి దర్యాప్తు అధికారులను ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించారు. తీర్పు వెలువరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు -
వరంగల్ డీసీసీబీని నంబర్ వన్‌గా నిలపాలి
● టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అన్ని డీసీసీబీల్లోకెల్ల నంబర్ వన్‌గా నిలపాలని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. అధికారులు శ్రద్ధగా పని చేసి బ్యాంకు అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్‌ల వారీగా ప్రగతిని సమీక్షించారు. అనంతరం చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ నాబార్డు సమీక్షలో వరంగల్ డీసీసీబీ ‘ఏ’ ర్యాంకు అవార్డు సాధించేలా బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రుణమాఫీ లబ్ధి పొందిన రైతులకు త్వరిగతిన కొత్త పంట రుణాలు అందించాలన్నారు. ఐఆర్ఏసీ నామ్స్ మేరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు మొండి బకాయిలు రాబట్టి నిరర్థక ఆస్తులు 2 శాతానికి తగ్గించాలని ఆదేశించారు. టర్నోవర్ రూ.2500 కోట్లకు చేరుకునేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, జనరల్ మేనేజర్ ఉషా, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయ కుమారి పాల్గొన్నారు. -
రూ. 10 లక్షల విలువైన గంజాయి పట్టివేత
బయ్యారం: మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద మంగళవారం పోలీసులు రూ. 10 లక్షల విలు వైన 20 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. బస్టాండ్ సెంటర్లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ స మయంలో అటువైపు సూట్ కేసుతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారి వద్ద ఉన్న సూట్‌కేసు తెరచి చూడగా అందులో రూ. 10 లక్షల విలువైన 20 కిలోల ఎండు గంజాయి లభించింది. వెంటనే అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించి ఒడిశాలోని పత్రాపూర్కు చెందిన సంతోశ్‌నాయక్, అర్జున్దాస్గా గుర్తించారు. ఎస్సై తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. -
అశ్విని(నాగరాణి) వెడ్స్ రాకేశ్..
అశ్విని బీఎస్సీ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందడంతో ట్రస్ట్‌లో ఆశ్రయం పొందింది. ప్రస్తుతం అశ్వినితో రాకేశ్‌కు వివాహం చేస్తున్నారు. కాగా, ఇద్దరు యువతుల పెళ్లిళ్లలకు దాతలు రాంశేషు, చంద్ర, బొమ్మనేని రమాదేవి, ఎన్.మహేశ్‌రావు–లక్ష్మి, దుగ్యాల పాపారావు, ఎం.చంద్రశేఖర్–రాజ్యలక్ష్మి, వి.గీత–సుధాకర్‌రావు, మురార్అలీ–నషీమ్బర్వాని, సైఫా సురేశ్, సిటిజన్ క్లబ్, మిత్రుల సహకారంతో వివాహాలు చేస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు వినోదమోహన్రావు తెలిపారు.● -
అనంతాద్రికి బ్రహ్మోత్సవ శోభ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతాద్రి శ్రీజగన్నాథ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతులు, ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. ఈమేరకు మొదటగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం పటిస్తారు. అనంతరం అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 12న ఉదయం 9.30 గంటలకు గరుడ ప్రసాదం పంపిణీ, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, దేవతాహ్వాన పూజలు, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు. 13న ఉదయం 9.30 గంటలకు 25 కలశాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం, 14న ఉదయం 9.30 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం, అదేరోజు సాయంత్రం ఎదుర్కోలు నిర్వహించనున్నారు. 15న ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కల్యాణం జరగనుండగా.. అదేరోజు సాయంత్రం తెప్పోత్సవం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 16న ఉదయం 9.30 మహాపూర్ణాహుతి, చక్ర తీర్థోత్సవం, శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, పవళింపు సేవ, మహాదాశీర్వచనం పూజలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 16వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు -
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
● ‘ఈ ఫొటోలోని వృద్ధుడు బయ్యారం మండలం కొత్తపేట తండాకు చెందిన గుగులోతు బాల్య. తనకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. వారిని పెద్ద చదువులు చదివించాడు. దీంతో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కూతురుకు వివాహం జరిపించి అత్తారింటికి పంపించాడు. తనకున్న 12 ఎకరాల భూమిలో తలా మూడు ఎకరాల చొప్పున ముగ్గురు కుమారులకు పంచాడు. బాల్య, తన భార్య హచ్చీ పేరున ఉన్న మూడు ఎకరాలను కూడా రాయించుకున్నారు. ఇప్పుడు కుమారులు, కోడళ్లు మాట్లాడడం లేదు. తల్లిదండ్రుల పోషణను పట్టించుకోవడం లేదు. బాల్య ఈవిషయంపై ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే కలెక్టర్‌కు రాశారు. కాగా సారూ నా కుమారులను పిలిపించి మాకు అండగా ఉండేలా చూడాలని బాల్య ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరాడు.’ -
తల్లిని హత్యచేసిన తనయుడి అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీఐ రమేశ్ ఎల్కతుర్తి: కన్నతల్లిని గొడ్డలితో నరికి హత్య చేసిన తనయుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశా రు. దీనికి సంబంధించి మండల కేంద్రంలో సీఐ పులి రమేశ్ తన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం అజయ్ తనకు రావాల్సిన భూమి వాటాను తల్లి చదిరం రేవతి(45) పంచివ్వ డం లేదన్న కోపంతో ఈనెల 7న గొడ్డలితో నరికి హత్య చేశాడు. దీంతో మృతురాలి చిన్న కుమారుడు చదిరం విజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలో మండలంలోని కోతులనడుమ గ్రామ సమీపంలో సోమవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తారసపడిన అజయ్‌ని అరెస్టు చేసి, విచారింగా.. నేరం అంగీకరిండంతో రిమాండ్‌కు తరలించిన ట్లు సీఐ వెల్లడించారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్, మల్లే శం, గణేశ్, భాస్కర్‌రెడ్డి, నిరంజన్ పాల్గొన్నారు. -
సాగునీటి సరఫరాలో అప్రమత్తంగా ఉండండి
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలు చేతికందే వరకు సాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అధికారులతో సోమవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను కలిసి పంటలు ఎండుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను వివరించారు. అనంతరం సాగు నీటి నిర్వహణ, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. అధికారులకు పలు సూచనలు చేశారు. నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పంటలకు సాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద అత్యధికంగా వరి సాగవుతోందని, ఎగువ భాగాన రైతులు ఎక్కువ మోటార్లు పెడుతున్నారని, చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని, సాగు నీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. పంట చేతికందే వరకు చివరి ఆయకట్టుకు నీరందాలి కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం మంత్రులు ఉత్తమ్, పొంగులేటిలతో ఎమ్మెల్యేల భేటి -
జోరుగా మిర్చి కొనుగోళ్లు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం 3,044 క్వింటాళ్ల (7,597 బస్తాలు) మిర్చి కొనుగోళ్లు జరిగినట్లు ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. 6,958 బస్తాల తేజ రకం మిర్చి, 639 బస్తాల తాలు రకం మిర్చి అమ్మకాలు జరిగినట్లు చెప్పారు. తేజ రకం క్వింటా గరిష్ట ధర రూ. 13,850, కనిష్ట ధర రూ.10,200 పలుకగా.. తాలు రకం మిర్చి క్వింటా గరిష్ట ధర రూ.6,350, కనిష్ట ధర రూ.4,820 పలికిందని పేర్కొన్నారు. మార్కెట్లో మిగిలిన మిర్చిని మంగళ, బుధవారాల్లో వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారని ఆయన తెలిపారు. కాగా బుధ, గురువారం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు మిర్చిని తీసుకురావొద్దని కోరారు. 14, 15, 16 తేదీల్లో మార్కెట్ బంద్... ఈనెల 14న హోలీ పండుగ, 15న శనివారం, 16న ఆదివారం వారాంతపు సెలవుల సందర్భంగా వ్యవసాయ మార్కెట్ బంద్ ఉంటుందని తెలిపారు. కాగా బుధవారం నుంచి ఆదివారం వరకు ఐదు రోజులపాటు మిర్చిని మార్కెట్ యార్డులోకి అనుమతించరని, రైతులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు. బుధ, గురువారా ల్లో మిర్చి కాకుండా మిగతా సరుకులను మార్కెట్ యార్డులోకి అనుమతి ఇస్తారని పేర్కొన్నారు. 11వేల బస్తాల రాక..కేసముద్రం: జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఈ సీజన్లో ఎన్నడూలేనంతగా 11వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. వ్యాపారులు ఆలస్యంగా టెండర్లు వేయగా, మధ్యాహ్నం 2 గంటలకు విన్నర్ జాబితా విడుదలైంది. సాయంత్రం వరకు 7వేల మిర్చి బస్తాలు కాంటాలు పెట్టారు. మిగిలిన 4వేల మిర్చి బస్తాల వద్ద రైతులు రాత్రంతా పడిగాపులు పడుతూ ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్రావుతో కలిసి మిర్చి యార్డును సందర్శించారు. కాగా తేజరకం మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.13,599, కనిష్ట ధర రూ.10,010 పలుకగా, తాలురకం మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ. 6,511, కనిష్ట ధర రూ.4,009 పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. -
సమీపిస్తున్న గడువు..
మహబూబాబాబాద్: పన్నుల వసూళ్లలో జిల్లాలోని మున్సిపాలిటీలు వెనుకబడి ఉన్నాయి. వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. అంతంత మాత్రంగానే వసూళ్లు చేశారు. నేటి వరకు 65శాతం కూడా ఇంటి పన్నులు వసూళ్లు కాలేదు. సరిపడా సిబ్బంది ఉన్నా.. అలసత్వం వహిస్తున్నారని ఉన్నాతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా పన్నుల వసూళ్లకు మరో 20 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు.. జిల్లాలో మానుకోట, తొర్రూరు, డోర్నకల్, మరిపె డ మున్సిపాలిటీలు ఉండగా ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. మానుకోట మున్సిపాలిటీలో 36వార్డులు ఉండగా68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు, 25,000 పైగా గృహాలు ఉన్నాయి. అలాగే తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు, 19,100మంది జనాభా ఉండగా.. మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులు, 17, 875 మంది జనాభా, డోర్నకల్‌లో 15 వార్డులు 14,425 మంది జనాభా ఉంది. కాగా మానుకోట మున్సిపాలిటీలో 11మంది బి ల్ కలెక్టర్లు, 22 మంది వార్డు ఆ ఫీసర్లు,ముగ్గురు ఎన్ఎంఆర్ (నామినల్ మస్టర్ రూల్)తో ఇంటి పన్నులు, నల్లా పన్నులు ,ట్రేడ్ లైసెన్స్ ఫీజులు,ఇతర ప న్నులు వసూళ్లు చేస్తున్నారు. మి గిలిన మున్సిపాలిటీల్లో కూ డా బిల్కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు వసూలు చేస్తున్నారు. 65శాతం దాటని వసూళ్లు.. 2024 –25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మానుకోట, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఇంటి పన్నుల వసూళ్లు 65 శాతం కూడా దాటలేదు. వసూళ్లను వేగవంతం చేసి వందశాతం పూర్తి చేయాలని మున్సిపల్ సీడీఎంఏ శ్రీదేవి పలు మార్లు కమిషనర్లతో వీసీ నిర్వహించి ఆదేశించినా పురోగతి అంతంత మాత్రమే ఉంది. మరీ దారుణం.. మున్సిపాలిటీల్లో ఇంటి పన్నుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే.. నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్, ఇతర పన్నుల విషయంలో వెనకబడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడింది. దీనికి తోడు పన్నులు కూడా అంతంతమాత్రంగానే వసూళ్లు అవుతున్నాయి. ఈ పన్నుల ద్వారా వచ్చిన జనరల్ ఫండ్‌ను సిబ్బంది వేతనాలు, డీజిల్, రిపేర్లు, ఇతర అభివృద్ధి పనులకు వినియో గిస్తున్నారు. గడువులోగా పూర్తి చేస్తాం.. మానుకోట మున్సిపాలిటీలో 65శాతం ఇంటి పన్నుల వసూళ్లు పూర్తి అయ్యింది. గడువులోగా వందశాతం వసూళ్లు చేస్తాం. సిబ్బంది ప్రతీరోజు ఇంటింటికీ తిరిగి పన్నుల వసూలు చేస్తున్నారు. ప్రజలు పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. – నోముల రవీందర్, మానుకోట మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లలో జాప్యం 65శాతం దాటని ఇంటి పన్ను వసూళ్లు మిగిలింది 20 రోజులు మాత్రమే.. వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఆదేశం నాలుగు మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను వసూళ్ల వివరాలు మున్సిపాలిటీ డిమాండ్ వసూలైంది శాతం మానుకోట రూ.5.28 కోట్లు రూ. 3.40 కోట్లు 65 తొర్రూరు రూ.3.22 కోట్లు రూ. 2 కోట్లు 62 డోర్నకల్ రూ.1.26 కోట్లు రూ. 71.86 కోట్లు 59 మరిపెడ రూ.1.60 కోట్లు రూ. 95 లక్షలు 58 -
అనంతాద్రికి బ్రహ్మోత్సవ శోభ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతాద్రి శ్రీజగన్నాథ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతులు, ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. ఈమేరకు మొదటగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం పటిస్తారు. అనంతరం అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 12న ఉదయం 9.30 గంటలకు గరుడ ప్రసాదం పంపిణీ, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, దేవతాహ్వాన పూజలు, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు. 13న ఉదయం 9.30 గంటలకు 25 కలశాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం, 14న ఉదయం 9.30 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం, అదేరోజు సాయంత్రం ఎదుర్కోలు నిర్వహించనున్నారు. 15న ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కల్యాణం జరగనుండగా.. అదేరోజు సాయంత్రం తెప్పోత్సవం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 16న ఉదయం 9.30 మహాపూర్ణాహుతి, చక్ర తీర్థోత్సవం, శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, పవళింపు సేవ, మహాదాశీర్వచనం పూజలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 16వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు -
నీటి సమస్య ఎదుర్కొంటున్నాం..
ఓవర్‌హెడ్ ట్యాంక్‌లకు బోర్ వెల్ ద్వారా నీరునింపే పని కార్మికులు చేస్తుంటారు. వారు సమ్మెకు వెళ్లడంతో నీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. – ఇంద్రతేజ సమస్యను పరిష్కరించాలి.. కార్మికలకు వేతనాలు చెల్లించి హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఐదు హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో మహిళా విద్యార్థులు ఉంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హాస్టళ్లలో ఉండలేం. – విహారిక, మెడికో● -
కలెక్టర్ సారూ.. కనికరించండి
సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్: ‘మాకు నిలువ నీడలేదు.. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. మీరైనా కరుణించి ఇళ్లు మంజూరు చేయండి. మా తాతలకాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమి ధరణిలో తప్పు జరిగి వేరే వారి పేరున పడింది. ఆ పేరు మార్పిడి చేసి మా భూమి మాకు కేటాయించండి. మా ముగ్గురు కుమారులు ప్రయోజకులే.. కానీ నాకు, ముసలమ్మకు అన్నం పెట్టేవారు లేరు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా లాభం లేకపోయింది. మీరు సమయం ఇచ్చి నా బిడ్డలను పిలిపించి వృద్ధాప్యంలో ఉన్న మాకు అన్నం పెట్టించండి’ అని ఇలా ఎవరి సమస్యలను వారు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు చెప్పుకున్నారు. దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి ● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి వినతులను స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినతులు వెంటనే పరిష్కరించాలని, లేని యెడల కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. వినతులపై నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజావాణిలో 84 వినతులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన... తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లింగారెడ్డి, నర్సింహారెడ్డి, సావిత్రమ్మ మాట్లాడుతూ.. తమకు వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముత్తిలింగయ్య, కృష్ణమూర్తి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సమాచారం లేక తక్కువగా దరఖాస్తులు.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేశారు. అయితే సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి ఉందని తెలియక దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చాయి. కేవలం 84మాత్రమే వచ్చాయి. ప్రజావాణి ఉందని సమాచారం ఉంటే దరఖాస్తుల సంఖ్య పెరిగేది.రైతుభరోసా మంజూరు చేయాలి మూడు సంవత్సరాలుగా రైతుభరోసా(రైతుబంధు) రావడం లేదు. తహసీల్దార్, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగినా స్పందించలేదు. కలెక్టర్ స్పందించి పత్రాలను పరిశీలించి రైతుభరోసా మంజూరు చేయాలి. – ఎన్ సోమేశ్వర్, తొర్రూరు పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలి నాకు మూడు ఎకరాల భూమి ఉంది. నేటికీ పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదు. పట్టా భూమి అయినా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. వెంటనే పాస్‌పుస్తకం అందజేయాలి. – బి.కిషన్, తానంచర్ల గ్రామ శివారు రెడ్యాతండా, మరిపెడ మూడు వారాల తర్వాత ప్రజావాణి నిర్వహణ జిల్లా నలుమూలల నుంచి వచ్చి వినతుల అందజేత నెలల తరబడి తిరుగుతున్నా సమస్యలకు దొరకని పరిష్కారం పరిష్కరించాలని అర్జీదారుల వేడుకోలు -
కోర్కెలు తీర్చే కల్పవల్లి..
కాజీపేట రూరల్: కాజీపేట ఫాతిమానగర్‌లోని ఫాతిమామాత ప్రజల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. చరిత్రకలిగిన ఫాతిమామాత దేవా లయం కేథడ్రల్ చర్చి ప్రాంగణం ఓరుగల్లు మేత్రాసనంలో ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రతి ఏటా మూడు రోజులపాటు నిర్వహించే ఫాతిమామాత మహోత్సవానికి వివిధ జిల్లాల నుంచి విశ్వాసులు, అన్ని వర్గాల ప్రజలు తరలివస్తుంటారు. ఈ ఏడాది ఓరుగల్లు పీఠంలో 2025 సాధారణ జూబిలీ సంవత్సరంలో బిషప్ డాక్టర్ ఉడుములబాల ఆశీర్వాద వేళలో మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు బిషప్ సెక్రటరీ ఫాదర్ గంగారపు అనుకిరణ్ సోమవారం తెలి పారు. కాజీపేట మెయిన్రోడ్లో చర్చి ఎంట్రెన్స్ వద్ద నిర్మించిన మహాతోరణం ఆశీర్వాద ద్వారం, ప్రాంగణంలో జపమాల బృందావనం (రోజరి గార్డెన్)ను బిషప్ ఉడుముల బాల ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని కేథడ్రల్ చర్చి, ఫాతిమామాత గుహను ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవాలకు 12 జిల్లాల నుంచి 10 వేల మంది భక్తులు రానున్నట్లు తెలిపారు. మూడు రోజుల కార్యక్రమాలు.. కేథడ్రల్ చర్చిలో ఈ నెల 11వ తేదీన మంగళవారం మహాపూజ్య డాక్టర్ ఉడుములబాల దివ్యబలిపూజ సమర్పణ, దంపతులకు సన్మానం, 12వ తేదీ బుధవారం ఫాదర్ తాటికొండ జోసెఫ్, డి.జోసెఫ్ ఆధ్వర్యంలో స్వస్థత ప్రార్థనలు, దివ్యబలిపూజ, కర్కూల్ పీఠం పూజ్య ఏరువ జోజిరెడ్డిచే పూజ ప్రార్థనలు. సాయంత్రం ఫాతిమామాత స్వరూపంతో ఊరేగింపు, ఫాతిమా మాత ప్రధాన ద్వారం, రోజరి గార్డెన్ ప్రారంభం, కొవ్వత్తులతో దివ్వప్రసాద ప్రదక్షిణ ది వ్యప్రసాద ఆశీర్వాదం. 13వ తేదీన గురువారం బెంగళూర్ అగ్రపీఠం మెన్సిగ్నోర్ సి.ప్రాన్సీస్ ఆంగ్లంలో దివ్యబలిపూజ కార్యక్రమం చేయనున్నారు. ఓరుగల్లు పీఠకాపరి అండ్ విశాఖ అగ్రపీఠకాపరి ఉడుములబాల సమష్టి కృతజ్ఞత సమర్పణ. సాయంత్రం 5:30 గంటలకు మూడో పూజ, గురుశ్రీ ఆశీ ర్వాదం, ఎస్.జె దివ్యపూజ పతాక అవరోహణతో పాతిమామాత ఉత్సవాల ముగింపు. పోస్టర్ ఆవిష్కరణ కాజీపేట: మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఫాతిమామాత ఉత్సవాలను విజ యవంతం చేయాలని బిషప్ ఉడుముల బాల కోరారు. ఈమేరకు కాజీపేట మీడియా పాయింట్ ఆవరణలో స్థానిక కెథడ్రల్ చర్చి విచారణ గురువు ఫాదర్ కాసు మర్రెడ్డి ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. అనుకిరణ్, బొక్క దయాసాగర్, తాటికొండ జోసఫ్, సురేష్, నవీన్ ఫాదర్ సురేందర్, తదితరులు పాల్గొన్నారు. ఫాతిమామాత మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ముఖ్య అతిథిగా ఓరుగల్లు పీఠకాపరి ఉడుములబాల నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం -
కంపు కంపు!
విధులు బహిష్కరించిన కేఎంసీ హాస్టళ్ల కార్మికులుఎంజీఎం : ప్రభుత్వ నిర్లక్ష్యం.. వేతనాల కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనతో కాకతీయ మెడికల్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న మెడికల్ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత కీర్తి ప్రతిష్టలు పొందిన కేఎంసీ అధ్యాపకుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో కనీసం మౌలిక వసతులు కల్పించడంలో సైతం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వైద్యవిద్యపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మెడికల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో పనిచేసే కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు విధులు బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. 80 మందికి పైగా కార్మికులు ఆందోళన బాట పట్టడంతో హాస్టళ్లలో శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా మారిది. ఇబ్బందులు పడుతున్న 1,250 మంది విద్యార్థులు -
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
కొండపర్తికి నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ● ములుగు జిల్లా కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న గవర్నర్ ● అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం సమ్మక్క–సారలమ్మ దర్శనం ● గిరిజన గ్రామాల్లో అభివృద్ధిపై సమీక్షించనున్న జిష్ణుదేవ్ సాక్షిప్రతినిధి, వరంగల్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ నుంచి బయల్దేరనున్న గవర్నర్.. దత్త త గ్రామం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి రోడ్డు మార్గాన చేరుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్‌లో భోజన విరామం తర్వాత హైదరాబాద్‌కు బయల్దేరుతారు. కాగా గవర్నర్ పర్యటన సందర్భంగా సోమవారం ము లుగు కలెక్టరేట్లో ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, ఎస్పీ శబరీష్, అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ దివాకర.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ● ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దత్తత గ్రామమైన కొండపర్తికి రోడ్డు మార్గాన బయలుదేరుతారు ● ఉదయం 11 గంటలకు కొండపర్తి గ్రామానికి చేరుకుంటారు ● 11 నుంచి 12.30 గంటల వరకు గవర్నర్ చేతుల మీదుగా వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, స్థానిక ఆదివాసీలతో గవర్నర్ మాటామంతి. ● మధ్యాహ్నం 12.30 గంటలకు కొండపర్తి నుంచి మేడారంలోని సమ్మక్క సారలమ్మ గుడికి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ● 12.45 నుంచి 1 గంట వరకు అమ్మవార్ల దర్శనాలు, మొక్కులు చెల్లించనున్నారు. ● 1 నుంచి 2 గంటల వరకు మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌజ్‌లో భోజన విరామం. ● 2 గంటలకు ఐటీడీఏ గెస్ట్ హౌజ్ నుంచి తిరిగి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం. ● సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకోనున్న గవర్నర్ఎస్ఎస్తాడ్వాయి: తన దత్తత గ్రామమైన మండలంలోని కొండపర్తికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నేడు (మంగళవారం) రానున్నారు. ఈనేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. కొండపర్తిలో ట్రైబల్వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీహాల్, పాఠశాల భవనానికి మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం, అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి చేశారు. అంతేకాకుండా నిర్మించిన బహుళ ఉపయోగ భవనంలో కారంపొడి మిల్లు, మహిళలకు కుట్టు మిషన్లను సిద్ధం చేశారు. గవర్నర్ అభివృద్ధి పనులను ప్రారంభించి బిర్సాముండా, కొమురంభీం విగ్రహాలను మంత్రి సీతక్కతో కలిసి ఆవిష్కరించనున్నారు. కొండపర్తిలో అధికారులు గవర్నర్ రాక నేపథ్యంలో జిల్లా అధికారులు కొండపర్తి బాట పట్టారు. ఆయా శాఖల వారీగా ఏర్పాట్లు చేశారు. గర్నవర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడేందుకు వేదిక సిద్ధం చేస్తున్నారు. గ్రామంలోని రోడ్లు శుభ్రం చేసి సైడ్ బర్మ్‌కు మట్టి పోశారు. కొండపర్తిలో ప్రత్యేక హెల్త్ క్యాంపు ఏర్పాటుకు డీఎంహెచ్ఓ గోపాల్‌రావు గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు. ట్రైబల్ వెల్పేర్ ఈఈ వీరభద్రం దగ్గరుండి ఏర్పాట్లు చేయించారు. స్థానిక ఎంపీడీఓ సుమనవాణి, ఎంపీఓ శ్రీధర్‌రావు పరిశుభ్రత ఏర్పాట్లను సిబ్బందితో చేయించారు. ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం కలెక్టర్ దివాకర ఏర్పాట్లను పరిశీలించారు. పీహెచ్సీలో అత్యవసర గది ఏర్పాటు గవర్నర్ కొండపర్తికి వస్తున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం తాడ్వాయి పీహెచ్సీలో అత్యవసర గదిని సిద్ధం చేశారు. ఈ గదిలో రెండు పడుక మంచాలు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు. డీఎంహెచ్ఓ గోపాల్‌రావు గదిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రణధీర్, వైద్యాధికారి అడెపు చిరంజీవి, సిబ్బంది ఉన్నారు.రోడ్డు నిర్మించాలి కొండపర్తి స్టేజీ నుంచి గ్రామం వరకు రోడ్డును బాగు చేయాలి. గతంలో బీటీ రోడ్డు పనులను మొ దలు పెట్టగా అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి. – చింత కౌసల్య, కొండపర్తిఆర్థికాభివృద్ధికి భరోసానివ్వాలి.. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం సంతోషంగా ఉంది. మహిళ కోసం కుట్టు మిషన్లు, కారంపొడి మిల్లు నెలకొల్పారు. మహిళలకు డైరీ ఫాంలు, ఫౌల్ట్రీఫాంలు నెలకొల్పితే కుటుంబాలకు ఆర్థికభరోసా ఉంటుంది. – రజిత, కొండపర్తిగవర్నర్ టూర్ షెడ్యూల్ ఇలా..గవర్నర్ దత్తత శుభపరిణామం అటవీ ప్రాంతంలో ఉన్న కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకోవడం సుభపరిణామం. సాగునీటి కోసం బోర్లు నిర్మిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేసుకునే ఆలోచనలో ఉన్నాం. – అరెం లచ్చుపటేల్, మేడారం జాతర చైర్మన్ -
గ్రూప్–1లో మెరిసిన గిరిజన ఆణిముత్యం
గార్ల: గిరిజన రైతు కుటుంబంలో పుట్టి గ్రూప్–1లో 900 మార్కులకు 454 మార్కులు సాధించాడు గిరిజన ఆణిముత్యం గంగావత్ పవన్‌కల్యాణ్. మానుకోట జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురం గ్రామానికి చెందిన గంగావత్ లక్ష్మణ్, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు గంగావత్ పవన్‌కల్యాణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1 నుంచి ఇంటర్ వరకు చదివాడు. 10వ తరగతిలో 10/10 జీపీఏ సాధించడమే కాకుండా ఇంటర్లో ఎంఈసీ గ్రూప్‌లో పబ్లిక్ స్కూల్లో టాపర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కళాశాలలో డిగ్రీలో సీటు సాధించి బీఏ ఎకనామిక్స్ పూర్తిచేశాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే గ్రూప్–1 పరీక్ష రాసిన పవన్‌కల్యాన్ ఉత్తమ ఫలితం సాధించాడు. ఎస్టీ విభాగంలో కాకుండా ఓపెన్ కోటాలోనే డిప్యూటీ కలెక్టర్ పోస్టు వస్తుందని పవన్‌కల్యాణ్ ధీమా వ్యక్తం చేశాడు. పవన్‌కల్యాణ్‌ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు. జశ్వంత్రాజ్ప్రతిభ మహబూబాబాద్ అర్బన్: సోమవారం విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో మానుకోట జిల్లా కేంద్రంలోని సంఘాల రవికుమార్ ప్రసన్న దంపతుల కుమారుడు సంఘాల జశ్వంత్‌రాజ్ 900 మార్కులకు 465 మార్కులు సాధించాడు. గ్రూప్ వన్‌లో అత్యధికంగా మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టెన్త్ స్పాట్ విధుల రెమ్యునరేషన్ చెల్లించండి ● డీఈఓకు టీఆర్టీఎఫ్ వినతి విద్యారణ్యపురి: గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం హనుమకొండలో టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యంకణంలో విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు నేటికీ రెమ్యునరేషన్ చెల్లించలేదు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బాసిరి రాజిబాపురావు, జనరల్ సెక్రటరీ గుగులోతు శ్రీనివాస్‌నాయక్‌లు సోమవారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెమ్యునరేషన్‌తోపాటు టీఏ, డీఏలు చెల్లించలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈఏడాది ఏప్రిల్‌లో కూడా టెన్త్ విద్యార్థుల పరీక్షల జవాబు పత్రాల మూల్యంకనం ఉంటుందని కానీ, గత ఏడాదికి సంబంధించిన రెమ్యునరేషనే ఇవ్వకపోవడం దారుణమన్నారు. వెంటనే రెమ్యునరేషన్ చెల్లించాలని లేదంటే ఈఏడాది నిర్వహించబోయే స్పాట్ వాల్యూయేషన్‌ను ఉపాధ్యాయులు బహిష్కరించాల్సి వస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. క్రీడల్లోనూ పిల్లలను ప్రోత్సహించాలి వరంగల్ స్పోర్ట్స్: పిల్లలను చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని సీనియర్ సివిల్ జడ్జి క్షేమదేశ్పాండే తల్లిదండ్రులకు సూచించారు. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ బస్టాండ్ సమీపంలోని శ్రీహర్ష కన్వెన్షన్హాల్లో సోమవారం నిర్వహించిన ఓపెన్ టు ఆల్ ఉమ్మడి జిల్లా స్థాయి చదరంగ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి క్షేమదేశ్పాండే, విశిష్ట అతిథిగా కన్వెన్షన్‌హాల్ డైరెక్టర్ వేణు హాజరై విజేతలకు బహుమతులను అందజేసి, మా ట్లాడారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి 80 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఓపెన్ టు ఆల్ విజేతగా అల్లాడి శ్రీవాత్సవ్ నిలవగా వరుస స్థానాల్లో రిత్విక్ గండు, షేక్ రియాజ్, స్వాతి దేవరపల్లి, ఎం.దీక్షిత్ నిలిచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్లు, తదితరులు పాల్గొన్నారు. -
లక్ష మందితో రజతోత్సవ సభ
సాక్షిప్రతినిధి, వరంగల్ : పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా వరంగల్‌లో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఓరుగల్లుకు.. బీఆర్ఎస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని, వరంగల్ వేదికగా గతంలో 15 లక్షల మందితో మహా గర్జన నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల నిర్వహణ కోసం సోమవారం సాయంత్రం వరంగల్ నగర శివారులోని ఉనికిచర్ల, భట్టుపల్లి ప్రాంతాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో కలిసి హరీశ్‌రావు సభాస్థల పరిశీలన చేశారు. అనంతరం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించే సభకు రెండుచోట్లా స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేళ్ల పరిపాలనకు నిదర్శనంగా రజతోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సామాజిక, చారిత్రక అవసరాలకోసం ఉద్యమం సామాజిక, చారిత్రక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేపట్టి ప్రత్యేక తెలంగాణ సాధించినట్లు హరీశ్‌రావు అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రారంభించిన పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని, రైతుబంధు పథకం పీఎం కిసాన్‌గా, మిషన్ భగీరథ పథకాన్ని హర్ ఘర్ ఘర్కి జల్ అని అమలు చేస్తున్నారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఒక్క ఉచిత బస్సు తప్ప, ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని అన్నారు. ప్రజలంతా కేసీఆర్ ను చూడాలని, తన మాట వినాలని కోరుకుంటున్నారని, అందుకే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హరీశ్ స్పష్టం చేశారు. ప్రజలకు పనిచేసేది ఎవరో, చెయ్యని వారు ఎవరో, పాలు ఏందో, నీళ్లు ఏందో, గట్టోడు ఎవరో, వట్టోడు ఎవరో తెలిసిందని, వారు గమనిస్తూ ఉన్నారని అన్నారు. మిలియన్ మార్చ్ రోజు వరంగల్‌లో ఉండటం అదృష్టం.. ‘మిలియన్ మార్చ్‌కు సోమవారంతో 14 ఏళ్లు పూర్తి.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్ జరిగిన రోజున పోరాటాల ఖిల్లా వరంగల్‌లో ఉండటం.. మీతో గడపడం అదృష్టం’ అంటూ హరీశ్‌రావు నాటి సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, శంకర్ నాయక్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కన్నూరు సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. ఉనికిచర్ల.. భట్టుపల్లిలో చూశాం.. మరోసారి స్థల పరిశీలన ఓరుగల్లుతో బీఆర్ఎస్కు విడదీయరాని బంధం.. పోరాటాలకు పురుడుపోసిన గడ్డమీదే ఏప్రిల్ 27న ఆవిర్భావ వేడుకలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు వెల్లడి -
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల వరకు..
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా అనగానే మొదట గుర్తుకువచ్చేది క్రీడలు.. అంతేనా.. విద్య, ఉద్యమాలు, పోరాటాల్లో.. పాటల రచయితలు, సంగీత దర్శకులు, ఫొటోగ్రాఫర్లు, కళాకారులుగా.. ఇలా ఎందరో సత్తా చాటుతున్నారు. మిర్చి, పసుపు, పత్తి పంటల్లో రాణిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, పోలీస్, జవాన్, నేవీ తదితర అనేక రంగాల్లో వెలుగుతున్నారు. మానుకోట (Manukota) ముద్దుబిడ్డలుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. జిల్లా నుంచి సినీరంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న కళాకారులు కోకొల్లలు. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. పాటలు పాడుతూ ఎదుగుతున్నారు. చిన్న సినిమాలకు తొలుత సంగీతం అందించి ప్రస్తుతం పెద్దపెద్ద హీరోల సినిమాలకు పనిచేస్తున్నారు. వీడియో, కెమెరామెన్, సినిమా ఫొటోగ్రఫీ, అసోసియేట్ డైరెక్టర్ వరకు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దాశరథి నుంచి.. మానుకోట జిల్లా నుంచి మొదట సినిమారంగంలో చిన్నగూడూరుకు చెందిన దాశరథి కృష్ణమాచార్యులు ప్రవేశించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అని తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అందించిన కవి ఆయన. తెలుగు సినిమాలకు గేయ రచయితగా రాణించారు. ‘కన్నె వయసు’సినిమాలో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో..’ పాట రాశారు. తోట రాముడు సినిమాలో ‘ఓ బంగరు రంగుల చిలకా పలకవే..’అనే పాట కూడా రాశారు. మానుకోట జిల్లా (Manukota District) కేంద్రం గుమ్ముడూరుకు చెందిన గోడిశాల జయరాజు సినీగేయ రచయిత, కవి. ప్రకృతిపై కథలు, గేయాలు రాశారు. అవి తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందాయి. జయరాజు మొదట ‘అడవిలో అన్న’ సినిమాలో ‘వందనాలమ్మ’ పాట రాశారు. ‘దండోరా’ సినిమాలో ‘కొండల్లో కోయిల పాటలు పాడాలి’ అనే పాట రాశారు. కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన జె.కె.భారవి (సుదర్శన భట్టాచార్య) తెలుగు సినీ రచయితగా, దర్శకుడు, పాటల రచయితగా పేరొందారు. కన్నడ సినీరంగంలోనూ పేరు తెచ్చుకున్నారు. అన్నమయ్య, లవ్‌స్టోరీ, శ్రీమంజునాథ, శ్రీరామదాసు, పాండురంగడు, శక్తి, ఓం నమో వేంకటేశాయ, చిటికెల పందిరి, జగద్గురు ఆదిశంకర తదితర సినిమాల్లో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పని చేశారు. ఆత్రేయ ప్రియశిష్య పురస్కారం అందుకున్నారు. మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సంగీత దర్శకుడు చక్రధర్ రచయితగా, గాయకుడిగా, నటుడిగా రాణించారు. మొదట ‘పండు వెన్నెల’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. చిరునవ్వుతో, ఇడియట్, శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, దేశముదురు, నేనింతే, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తదితర 85 చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి నంది అవార్డు అందుకున్నారు. బయ్యారం మండల గౌరారం గ్రామానికి చెందిన బొబ్బిలి సురేశ్ (Bobbili Suresh) సినీరంగంలో రాణిస్తున్నారు. నీదీ నాదీ ఒకే కథ, జార్జ్‌రెడ్డి, తోలుబొమ్మలాట, తిప్పర మీసం, గువ్వా గోరింక, విరాటపర్వం, చిల్బ్రో, టెన్త్‌క్లాస్ డైరీస్, మళ్లీ పెళ్లి తదితర సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. చదవండి: రాజమౌళి- మహేశ్ సినిమా.. ఒక్క లీక్ ఎంతపని చేసింది జిల్లా కేంద్రానికి చెందిన కందుకూరి అనిల్‌కుమార్ మొదట ప్రైవేట్ ఆల్బమ్ పాటలకు నృత్య దర్శకునిగా పని చేశారు. తరువాత పీపుల్స్‌వార్, పోలీస్ వెంకటరామయ్య, దండకారణ్యం సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన గిద్దె రాంనర్సయ్య.. తెలంగాణ ఉద్యమంలో పలు గీతాలు ఆలపించారు. ఉద్యమంలో ఎంతో మందిని తన పాటలతో ఉత్తేజ పరిచారు.కంబాలపల్లి గ్రామానికి చెందిన గుర్రాల ఉదయ్ (Gurrala Uday) జేఎన్టీయూలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేశారు. మొదట షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ‘స్వేచ్ఛ’సినిమాతో సినీరంగంలోకి డైరెక్టర్‌గా అడుగుపెట్టారు. ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. జంగిలిగొండ గ్రామానికి చెందిన రాజమౌళి (Rajamouli) బుల్లితెర షోల్లో నటించారు. భోళాశంకర్, ధమాక, బంగారు బుల్లోడు, అనుభవించు రాజా, చోర్ బజార్, సిల్లి ఫెలోస్ తదితర సినిమాల్లోనూ నటించారు.తెలంగాణ యాసపై సినిమాలు చేస్తా నాకు మొదట సినిమాల్లో అవకాశం కల్పించింది ఆర్.నారాయణమూర్తి. ప్రకృతితో.. నాకూ ఉన్న అనుబంధాన్ని నా పాటల్లో వివరించా. భవిష్యత్‌లో సినిమాల్లో రచనలు చేసే అవకాశం వస్తే వదులుకోను. నా ప్రతిభను మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా గుర్తించి అవార్డు అందజేశారు. తెలంగాణ యాస, భాషపై మరిన్ని సినిమాలు చేస్తాను. – గొడిశాల జయరాజ్, సినీ రచయిత ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో ప్రవేశం మొదట ‘స్వేచ్ఛ’షార్ట్ ఫిలింతో సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. చిన్న చిన్న సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను. నేను రూపొందించిన ‘మేల్’సినిమా.. బెస్ట్ ఫిలిం స్క్రీన్‌ప్లే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డుకు నామినేట్ అయింది. – గుర్రాల ఉదయ్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ అవార్డు లక్ష్యం సినీరంగంలో మొదటి సినిమాతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. భవిష్యత్‌లో పెద్ద పెద్ద హీరోలకు మంచి సంగీతం అందించి గుర్తింపు తెచ్చుకుని ఆస్కార్ అవార్డు అందుకోవాలన్నది నా కోరిక. ఇప్పటి వరకు నాకు చేయూతనిచ్చిన దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. – సురేష్ బొబ్బిలి, సంగీత దర్శకుడు కొత్తవారికి అవకాశమిస్తా టీవీ షోలు, సినీరంగంలో ఎంతో కష్టపడ్డాను. సినీ ప్రేక్షకులు, జిల్లా ప్రజల ఆశీస్సులతో ఇంతటి వాడినయ్యాను. నటనలో నైపుణ్యం ఉన్న వారికి కచ్చితంగా అవకాశం కల్పిస్తాను. పేద ప్రజలకు నా వంతుగా సేవ చేస్తున్నాను. – రాజమౌళి, జబర్దస్త్ నటుడు -
బెయిల్‌పై వచ్చి.. శవమై తేలి
● బావిలో పడి వృద్ధుడి మృతి డోర్నకల్ : ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన ఓ వృద్ధుడు హత్యాయత్నం కేసులో ఇటీవల బెయిల్ వచ్చి.. బావిలో శవమై తేలాడు. ఎస్సై గడ్డం ఉమ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన కై కొండ సత్యం (69) టైలర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడిన అతను ఆదివారం కాలనీ సమీపంలో బావిలో శవమై కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, డోర్నకల్ పోలీస్ స్టేషన్లో సత్యంపై హత్యాయత్నం కేసు నమోదు కాగా రెండు నెలల పాటు జైలులో ఉండి బెయిల్‌పై కొద్దిరోజుల క్రితం విడుదలయ్యాడు. -
అప్రెంటిస్‌తో ఉద్యోగం ఈజీ..
ఐటీఐ వంటి సాంకేతిక విద్యతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతున్నారు. ఐటీఐలోని ఆయా విభాగాలకు అనుగుణంగా విద్యార్థులు పూర్తి చేసే అప్రెంటిస్‌తో ఉద్యోగ అన్వేషణకు తమ మార్గాన్ని మరింత సులభం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఏటా ఐటీఐ పూర్తి చేసిన వారంతా వివిధ కంపెనీల్లో అప్రెంటిస్ శిక్షణ పొందుతూ తమ కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాజీపేట: ఐటీఐ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్ చేస్తే ఏ కంపెనీలోనైనా ఉద్యోగం తేలిగ్గా సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 32 ట్రేడుల్లో శిక్షణ పూర్తి చేసుకున్నవారు అప్రెంటిస్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం www.apprenticeship.gov.in వెబ్సైట్లో అభ్యర్థి పేరును నమోదు చేసుకుంటే సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అప్రెంటిస్ ఇచ్చే కంపెనీల పేర్ల జాబితా మెయిల్‌కు వస్తుంది. పదో తరగతి ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, ఐటీఐ ట్రేడ్ ధ్రువీకరణ పత్రం జిరాక్స్ పత్రాలను స్కానింగ్ చే యాల్సి ఉంటుంది. అభ్యర్థి ట్రేడ్‌ను బట్టి అతడు ఏ కంపెనీకి అర్హుడో తేలికగా తెలిసిపోతుంది. కంపె నీలు కూడా అప్రెంటిస్ ఇచ్చేందుకు అదే వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకుంటాయి. కంపెనీ పేరు, జీఎస్టీ నంబర్, ఈపీఎఫ్ నంబర్, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ వంటివి వెబ్సైట్లో పేర్కొనడం ద్వారా ఆయా కంపెనీలు అప్రెంటిస్ ఇచ్చేందుకు అర్హత పొందుతాయి. ఐటీఐ రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన వారికి ఏడాదిపాటు.. ఏడాది ట్రేడ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులైతే రెండేళ్ల అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది. 3వేల మందికిపైగా పేర్ల నమోదు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో చదివి ఉత్తీర్ణులైన సుమారు 3వేల మందికిపైగా అభ్యర్థులు అప్రెంటిస్ కోసం పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో అర్హులకు వివిధ కంపెనీలు తమ అవసరాల మేరకు కాల్ లెటర్లు పంపుతున్నాయి. అప్రెంటిస్ అవ్వగానే చాలా కంపెనీలు ఉద్యోగావకాశాలు సైతం కల్పిస్తున్నాయి. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీం 2016 నేవ్స్ (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీం) కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. ఇందులో కొంత మొత్తాన్ని అప్రెంటిస్ చేసే అభ్యర్థులకు రీయింబర్స్మెంట్ కింద కంపెనీలకు అందజేస్తాయి. అభ్యర్థికి నెలకు రూ.8,500 స్టయిఫండ్‌గా లభిస్తుంది. దేశంలో అప్రెంటిస్ శిక్షణ నిమిత్తం అన్ని రాష్ట్రాలకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.4వేల కోట్లు కేటాయించింది. 50 లక్షల మంది అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోనుంది. ఇదంతా 2026 నాటికి పూర్తవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏయే కంపెనీలు.. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, బెల్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, ఆర్టీసీ, జెన్కో, సింగరేణితోపాటు అనేక సంస్థలు అప్రెంటిస్ శిక్షణ ఇచ్చే జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలు జిల్లాలతో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రైవేట్ కంపెనీలు కూడా అప్రెంటిస్ శిక్షణ ఇస్తూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అయితే వరంగల్, కరీంనగర్ రీజియన్లలో ఉన్న ఆర్టీసీ డిపోలతోపాటు రైల్వే పలు జోన్లలో ఏడాదికి 25వేల మందికిపైగా అభ్యర్థులు అప్రెంటిస్ నిమిత్తం శిక్షణ పొందుతున్నారు. నిరుద్యోగ యువతకు అదనపు అర్హత అప్రెంటిస్‌తో పెరుగుతున్న ఉపాధి అవకాశాలు అవకాశాలు మెరుగుపడ్డాయిఉపాధికి ఐటీఐలు ఎంతగానో దోహదపడతాయి. గతంతో పోల్చితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అప్రెంటిస్ అవకాశాలు దొరుకుతున్నాయి. ప్రతీ మూడు నెలలకోసారి ఐటీఐ కేంద్రాల్లో అప్రెంటిస్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం. – వెంకటేశ్వర్ రావు, ప్రిన్సిపాల్, కాజీపేట ఐటీఐ -
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క గోవిందరావుపేట: నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలో రూ.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మో డల్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ములు గు జిల్లాలో మొదటిసారి గోవిందరావుపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. నిరుపేదలు మోడల్ హౌస్‌ను పరిశీలించి తక్కువ ధర, నాణ్యతతో తమ ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభించుకున్నామన్నారు. ప్రతీ దశలో ఇంటి నిర్మాణ పురోగతి వి వరాలు ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రేపు కొండపర్తికి గవర్నర్ రాక
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కొండపర్తికి రేపు(మంగళవారం) రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నట్లు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండపర్తి గిరిజన గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రామంలో పలు రకాల అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు గవర్నర్ కొండపర్తి రానున్నట్లు వెల్లడించారు. వరంగల్ మీదుగా హోలీకి ప్రత్యేక రైళ్లు కాజీపేట రూరల్ : హోలీ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. ఈ నెల 10వ తేదీన నిజాముద్దీన్ నుంచి బయలుదేరే నిజాముద్దీన్–తిరువనంతపురం నార్త్ (06074) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు వరంగల్‌కు చేరుతుంది. ఈ నెల 14వ తేదీన తిరువనంతపురం నార్త్ నుంచి బయలుదేరే తిరువనంతపురం నార్త్–నిజాముద్దీన్ (06073) ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు మరుసటి రోజు చేరుతుంది. ఈ నెల 17వ తేదీన నిజాముద్దీన్–తిరువనంతపురం నార్త్ (06074) ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు వరంగల్‌కు చేరుతుంది. ఈ రైళ్లకు కొల్లం, కాయంకులం, చెంగనూర్, తిరువల్ల, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, అలువ, త్రిసూర్, పాలఘడ్, పండనూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలర్పెట్టయ్, పట్పడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, విజయవాడ, వరంగల్, బల్హార్షా, నాగ్‌పూర్, రాణి కమలాపథ్, బినా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మతుహుర స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు అధికారులు తెలిపారు. సాగునీటి కోసం రైతుల ఘర్షణ ● ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్‌కు అడ్డుగా రాళ్లు చిన్నగూడూరు: పంటల సాగుకు ఎస్సారెస్పీ జలాల కోసం మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్నగూడూరు మండలాల రైతులు శనివారం రాత్రి ఘర్షణ పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ నుంచి చిన్నగూడూరు మండలం విస్సంపల్లి పంట పొలాలకు నీరు రాకుండా మరిపెడ మండలం బాల్యతండా, లక్ష్మాతండా రైతులు రాళ్లు అడ్డుపెట్టారు. దీంతో విస్సంపల్లి రైతులు శనివారం రాత్రి కెనాల్ వద్దకు చేరుకుని తమ గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని రాళ్లు తీసే ప్రయత్నం చేయగా రెండు ప్రాంతాల రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. మెయిన్ కెనాల్‌ను తాము సుమారు రూ.30 వేలు వెచ్చించి బాగు చేయిస్తే నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని విస్సంపల్లి, తుమ్మల చెరువుతండాల రైతులు వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. -
అట్టహాసంగా కొడవటంచ జాతర
రేగొండ: భక్తుల కొంగుబంగారం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అభిషేకంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. అనంతరం స్వామి వారిని సూర్యవాహన సేవలో మాడ వీధుల గుండా ఊరేగించారు. సాయంత్రం స్వస్తివాచనం అనంతరం శేషవాహనసేవ, అంకురారోహనం కార్యక్రమాలు కొనసాగాయి. జాతర మొదటి రోజు కావడంతో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, బ్రహ్మోత్సవాలు ఈ నెల 9నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఈఓ మహేశ్, ఆలయ కమిటీ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, సిబ్బంది శ్రావణ్, రవీందర్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. భక్తుల కోసం సకల సౌకర్యాలు.. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్, ఆరోగ్య, ఆర్డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. తరలివచ్చిన భక్తులు -
బోరుమన్న మేచరాజుపల్లి..
కళ్లెదుటే భర్త, ఇద్దరు పిల్లల అంత్యక్రియలు జరుగుతుంటే తల్లడిల్లిన తల్లి నెల్లికుదురు: తన కళ్లెదుటే కుటుంబం మొత్తం నీటిలో పడి మృత్యుఒడికి చేరి అంత్యక్రియలకు వెళ్తుంటే ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. భర్త, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఇక తనకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిళ్లేలా రోదించింది. తన ముద్దుల చిన్న కొడుకు, మనమడు, మనుమరాలు ఇక లేరని తెలిసి.. వారి మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే వృద్ధ దంపతులు బోరున విలపించారు. తాము ఇక ఎవరి కోసం బతకాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలోని ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో మృతి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్, తన పిల్లలు చైత్ర, ఆర్యవర్ధన్ అంత్యక్రియలు ఆదివారం వారి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ‘నాకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకు నేనే తలకొరివి పెట్టాల్సిన దుస్థితిని తీసుకొచ్చావా దేవుడా’ అంటూ మృతుడి తండ్రి సారంగపాణి రోదనలు మిన్నంటాయి. అంతిమ యాత్రలో చివరగా ముగ్గురికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు గ్రామం మొత్తం కదిలొచ్చింది. ప్రవీణ్‌కుమార్‌తో చదువుకున్న అతడి స్నేహితులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కడసారి చూపుకోసం మేచరాజుపల్లికి తరలిచ్చారు. కేరళ నుంచి యుగేంధర్, హైదరాబాద్ నుంచి బెల్లు శ్రీను, నాళ్లం హరికిషన్ ప్రసాద్ తదితరులు వచ్చారు. అంతిమయాత్రలో ముగ్గురిని ఒకేసారి శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే గ్రామం మొత్తం బోరుమంది. తండ్రి, పిల్లల మృతదేహాలకు పలువురు నాయకులు పూలమాల ఝవేసి నివాళులర్పించారు. కడసారి చూపుకోసం కదిలొచ్చిన గ్రామస్తులు ముగ్గురికి తలకొరివి పెట్టిన మృతుడి తండ్రి సారంగపాణి -
ప్రాణం తీసిన పల్లిగింజ
గూడూరు : పల్లిగింజ తిన్న చిన్నారికి అదే యమపాశమైంది.. గొంతులో గింజ ఇరుక్కుని శ్వాస ఆడక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండెల వీరన్న–కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు అక్షయ్ (18 నెలలు) ఉన్నాడు. గురువారం ఇంటి ఎదుట పల్లీలు ఆరబెట్టగా ఆడుకుంటున్న అక్షయ్ గింజ తిన్నాడు. దీంతో గింజ గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. చిన్నారి మృతదేహంమీద పడి తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయ బిడ్డా అంటూ బోరున విలపించారు. గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి -
మామిడి కాయలకు కవర్లు..
చెన్నారావుపేట: మామిడి రైతులు సరైన యాజ మాన్య చర్యలు చేపట్టినా పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు, పురుగులు, తెగుళ్లు ఆశించడంతో నాణ్యత తగ్గి దిగుబడులు పడిపోతున్నాయి. కాయ ఎదిగే దశలో పురుగులు, తెగుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ చీడపీడల నివారణకు పూత ప్రారంభమైనప్పటి నుంచి కాయకోత వరకు దాదాపు 12 నుంచి 16 సార్లు పురుగు మందు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో పెట్టుబడి భారీగా పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎక్కువ సార్లు అధిక గాఢత కలిగిన పురుగుమందులు పిచికారీ చేయడం వల్ల పురుగు మందుల అవశేషాలు పండ్లలో ఉండి వాటిని తిన్న వారికి కేన్సర్ వంటి రోగాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పురుగు మందుల వాడకం తగ్గించి.. నాణ్యమైన పంట చేతికి రావడానికి, అధిక ఆదాయం పొందడానికి కాయలు ఎదిగే దశలో కవర్లు తొడగాలని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. కవర్లు తొడగడం వల్ల లాభాలు.. ● కాయ ఎదిగే దశలో కవర్లు తొడగడం వల్ల ఆ దశలో ఆశించే పురుగులు, తెగుళ్ల నుంచి రక్షణ పొందొచ్చు. ముఖ్యంగా పండు.. ఈగ బారిన పడకుండా కాయలను కాపాడొచ్చు. అదే విధంగా అకాల వర్షాలతో వ్యాపించే మసి తెగులు, బ్యాక్టీరియా, మచ్చ తెగులు, పక్షి కన్ను వంటి తెగుళ్లను కూడా ఎలాంటి శిలీంద్రనాశినులు కొట్టకుండా సమర్థవంతంగా అరికట్టొచ్చు. ● కవర్లు తొడిగిన మామిడి కాయలు మంచి రంగు సంతరించుకుని ఎలాంటి మచ్చలు లేకుండా చూడడానికి ఆకర్షణీయంగా కనిపించి కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. కవర్లు తొడిగితే పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. రైతుకు ఖర్చు తగ్గుతుంది. పురుగు మందులు కొట్టడం తగ్గడంతో హానికర పురుగు మందుల అవశేషాలు పండులో ఉండవు. దీంతో పండు తిన్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ● కవర్లు తొడగడం వల్ల పక్షుల నుంచి కలిగే నష్టాన్ని నివారించొచ్చు. కాయపెరిగే దశలో వచ్చే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు లేదా అకాల వర్షాలతో కలిగే నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టొచ్చు. కవర్లు తొడగడం వల్ల కాయలపై సొనతో ఏర్పడే మచ్చలను నివారించొచ్చు. కవర్లు తొడిగిన కాయలు త్వరగా పక్వానికి వస్తాయి. అధిక బరువు పెరగడం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. కాయలో ఉండే చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కోసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మార్కెట్లో అధిక ధర వస్తుంది. రైతుకు ఎక్కువ ఆదాయం లభిస్తుంది. కవర్లు ఎప్పుడు తొడగాలి? ఎలా తొడగాలి? కవర్లు ఏ దశలో తొడగాలనే అంశం చాలా ముఖ్యం. మరీ లేత దశ అంటే పిందె దశ లేదా గోళీ కాయ సైజులో తొడగొద్దు. అలా తొడిగితే కాయ కాడ లేతగా ఉండడం వల్ల కవర్ బరువు తట్టుకోలేక విరుతుంది. ఒకవేళ మరీ ఆలస్యంగా తొడిగితే అప్పటికే అన్ని రకాల పురుగులు, తెగుళ్లు ఆశించడంతో ఆశించిన మేర నాణ్యమైన పండ్లను పొందలేం. అందుకే కాయ సుమారు 100 గ్రాములు బరువు ఉన్నప్పుడు కవర్లు తొడగాలి. అంటే పూత నుంచి సుమారు 55 నుంచి 60 రోజుల తర్వాత తొడగాలి. కవర్లు తొడిగిన 65–75 రోజులకు కాయ పక్వానికి వస్తుంది. అప్పుడు కవర్లును తొలగించి కాయలను కోసుకోవాలి. ● మామిడి కాయలు అన్ని ఒకే దశలో ఉండవు. కవర్లపై మనం తొడిగిన తేదీలను రాసుకోవడం లేదా నంబర్లు వేసుకుంటే ముందు ఏది తొడిగామో, తొడిగిన తర్వాత ఎన్ని రోజులు అయిందో సులభంగా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం కాయలు కోసుకోవాలి. పేపర్‌తో తయారు చేసిన కవర్లు మాత్రమే ఉపయోగించుకోవాలి. పాలిథిన్ కవర్లు వాడకూడదు. పేపర్ కవర్లు ఉపయోగిస్తే లోపల గాలి బయటకు, బయట గాలి లోపలికి వెళ్లే అవకాశం ఉండి కాయ నాణ్యంగా ఉంటుంది. ● కాయకు కవర్ తొడిగేటప్పుడు కవర్ అడుగుకు కాయ తగలకుండా కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కాయ పెరుగుతున్నప్పుడు కవర్ పగిలిపోకుండా ఉంటుంది. కవర్లు వర్షం పడుతున్నప్పుడు లేదా మంచు పడే సమయాల్లో తొడగొద్దు. ఎండ ఉన్న రోజు లేదా అలాంటి సమయాల్లో తొడగాలి. ● కవర్లు తొడిగేటప్పుడు పురుగులు, తెగుళ్లు సోకని కాయలను ఎంపిక చేసుకోవాలి. కవర్ తొడిగిన తర్వాత అమర్చిన వైరుతో కాడకు జాగ్రత్తగా ఎలాంటి ఖాళీ లేకుండా తొడగాలి. ఖాళీ ఉంటే పురుగులు, శిలీంద్రాలు ఈ ఖాళీ ద్వారా ప్రవేశిస్తాయి. ఒకవేళ వర్షం పడితే నీరు కూడా కాడ ద్వారా లోపలికి ప్రవేశించి కాయ పాడైపోతుంది.ఈగ నుంచి పండుకు రక్షణ.. నాణ్యత పెంపు చీడలు, తెగుళ్లు, అధిక గాలుల నుంచి రక్షణ ఎగుమతులకు అనువైన నాణ్యత.. పురుగు మందుల అవశేషాలు తక్కువ సబ్సిడీపై కవర్ల పంపిణీకవర్లకు సబ్సిడీ మొదట వరంగల్ జిల్లాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మామిడిలో ప్రస్తుతం కవర్లు తొడిగి , నాణ్యమైన కాయలు అందించడానికి ఉద్యానశాఖ కవర్లకు 50 శాతం రాయితీ ఇస్తోంది. హెక్టార్‌కు(2.5 ఎకరాలు) 10, 000 కవర్లు 50 శాతం రాయితీ సదుపాయం ఉంది. ఒక రైతుకు 2 హెక్టార్లు( 5 ఎకరాలు) వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆసక్తి, ఇష్టం ఉన్న నర్సంపేట పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం రైతులు.. ఉద్యాన శాఖ అధికారులు ఎ. జ్యోతి(8977714061), వరంగల్ పరిధిలోని గీసుగొండ, సంగెం, వరంగల్ రైతులు.. ఎన్. తిరుపతి (8977714060), వర్ధన్నపేట పరిధిలోని రాయపర్తి, వర్ధన్నపేట రైతులు..ఎన్ అరుణ(8977714062), నెక్కొండ పరిధిలోని పర్వతగిరి, చెన్నారావుపేట, నెక్కొండ రైతులు.. బి. తరుణ్ (8977714053)ను సంప్రదించి వివరాలు అందించి కవర్లు తీసుకోవాలి. సంగీత లక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు వివరాలు జిల్లా రైతులు ఎకరాలు వరంగల్ 2,053 6,727 హనుమకొండ 2,434 6,075 జనగామ 2,883 8,886 మహబూబాబాద్ 2,245 14,052 జయశంకర్ భూపాలపల్లి 906 1,566 ములుగు 153 454 మొత్తం 10,674 37,760 ఆదాయ వివరాలు / ఎకరాకు.. ఎకరానికి కవర్లు వాడకుండా 4.0 టన్నుల దిగుబడి వస్తుంది. ధర టన్నుకు రూ. 25,000 ఉంటుంది. ఇలా రూ. లక్ష ఆదాయం వస్తుంది. కవర్లు తొడిగితే.. ఎకరానికి 4.25 టన్నులు దిగుబడి వస్తుంది. టన్నుకు ధర రూ. 50 వేలు ఉంటుంది. ఇలా రూ. 2,12, 500 ఆదాయం వస్తుంది. -
కిడ్నాప్ కేసులో ఇద్దరి అరెస్ట్
కాటారం : మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన బాలికను కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మండల కేంద్రంలోని పీఎస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు, ఎస్సై మ్యాక అభినవ్ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం గ్రామానికి చెందిన పొల్ల వేణు.. బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. రెండ్రోజుల క్రితం సదరు బాలికను పెళ్లి చేసుకుందామని మాయమాటలు చెప్పి వేణుతో పాటు మరో యువకుడు పొన్న దిశాంత్ అలియాస్ నాగరాజు కారులో కాటారం వచ్చి ఆమెను ఎక్కించుకుని వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించి హైవేపై గల పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. తొర్రూరు పోలీసుల సాయంతో కిడ్నాప్‌నకు గురైన బాలికతో పాటు నిందితులను గుర్తించినట్లు సీఐ, ఎస్సై తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కాటారం పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగా నేరం ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కారు, సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు వివరించారు. కేసును చేధించిన సీఐ, ఎస్సైతో పాటు ఐటీకోర్ కానిస్టేబుల్ వేణు, స్వామిగౌడ్, జంపన్న, లక్ష్మీరాజ్, లవన్, తిరుపతి, రజనీని డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి అభినందించారు. -
ఆర్చ్‌ను ఢీకొన్న టిప్పర్
●డ్రైవర్ దుర్మరణం..ఎల్కుర్తిలో ఘటన ధర్మసాగర్: ఓ టిప్పర్.. వెంచర్ ఆర్చ్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని ఎల్కుర్తి శివారు ఓ వెంచర్ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన చేపూరి అనిల్ (36) టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎల్కుర్తి శివారులో హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి వెంచర్ చేస్తున్నాడు. వెంచర్ ముందుభాగంలో ఆర్చ్ నిర్మాణం చేశాడు. వెంచర్లో టిప్పర్లతో మొరం పోస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అనిల్ టిప్పర్‌లో మొరం లోడ్ చేసుకుని వెంచర్లో అన్లోడ్ చేశాడు. అనంతరం డబ్బా దించకుండానే వస్తున్న క్రమంలో ఆర్చ్ పిల్లర్‌ను ఢీకొంది. దీంతో ఆర్చ్ కూలి టిప్పర్ ముందు భాగంలో పడడంతో అనిల్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జానీపాషా తెలిపారు. -
మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి
మహబూబాబాద్ రూరల్: మూడు రోజుల బంద్ అనంతరం సోమవారం నుంచి కొనుగోళ్లు జరగనుండగా.. మానుకోట వ్యవసాయ మార్కెట్ మిర్చి బస్తాలతో ఆదివారం కళకళలాడుతూ కనిపించింది. రైతులు తెల్లవారుజామున 3గంటల నుంచే మార్కెట్‌కు వాహనాల్లో మిర్చి బస్తాలను తీసుకురావడం మొదలుపెట్టారు. రైతులు తాము తీసుకువచ్చిన మిర్చి బస్తాలను మార్కెట్ ఆవరణలోని ఎనిమిది షెడ్లలో దిగుమతి చేసుకున్నారు. అయితే షెడ్లలో స్థలం సరిపోకపోవడంతో ఆరుబయట సీసీపై కూడా మిర్చి బస్తాలను దించారు. భారీగా మిర్చి రావడంతో మార్కెట్ సిబ్బంది టోకెన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. టోకెన్లకు డబ్బులు ఇవ్వొద్దు.. వ్యవసాయ మార్కెట్ యార్డులో టోకెన్లు ఇచ్చే సమయంలో రైతులు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ షంషీర్ తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ ప్రధాన ద్వారం వద్ద, మార్కెట్ యార్డు ఆవరణలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మార్కెట్ యార్డులో దానధర్మాల పేరిట ఎవరికీ గింజలు ఇవ్వకూడదని రైతులకు సూచించారు. -
అర్ధశతాబ్దపు ఆనందహేళ
బయ్యారం: అర్ధశతాబ్దం తర్వాత కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి మధుర స్మృతులను నెరమువేసుకున్నారు. చిన్న పిల్లల్లా ఎగిరి గంతేశారు. బయార్యరం బాలుర ఉన్నత పాఠశాలలో 1971–72వ సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. వారందరికీ ఆరుపదుల వయసు దాటినప్పటికీ.. చిన్న పిల్లల్లా మారి ఎగిరి గంతేశారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి గురువులు వెంకట్‌రెడ్డి, నారాయణరావు, మోహనాచారితో పాటు పాఠశాల ప్రస్తుత హెచ్ఎం దేవేంద్రాచారిని సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సాంబశివరావు, ఆర్.వి.ప్రసాదరావు, ఉమామహేశ్వరరావు, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సుధారాణి, సరోజిని, అమృత, రాంబాబు, రామారావు, సర్వోత్తమరెడ్డి, బాబురావు, వెంకటేశ్వర్లు, భిక్షం తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ జలాలు పారుతాయని..
పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యవసాయబావి మహబూబాబాద్ మండలంలోని రేగడితండాకు చెందిన బాదావత్ చంద్రు నాయక్ది. తనకున్న ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. తన వ్యవసాయ బావిలో నీరు ఉండాలంటే ఎస్సారెస్పీ కాల్వలు పారాలి. కానీ ఈ ఏడాది కాల్వ ల్లో ఆశించిన స్థాయిలోనీరు రాలేదు. దీంతో బావి అడుగంటింది. నీరు లేక మొక్కజొన్న కూడా ఎండిపోతుంది. ఈ పరిస్థితిలో బావిని లోతు తవ్విస్తే లాభం ఉంటుందేమో అని ఆశగా బావి తవ్వించాడు. పంటల పెట్టుబడికి రూ. 2లక్షలు కాగా బావి పూడికకు రూ. 50వేలు దాటినా.. నీళ్లు రాలేదు. రూ. 30వేలు పెట్టి బోరు వేయించినా చుక్క నీరు రాలేదు. దీంతో చేతికొచ్చే పంటను పశువులతో మేపాల్సి వస్తోందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
‘గ్రావెల్’ మాఫియా
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో అనుమతుల పేరిట సహజ వనరుల్ని అడ్డంగా దోచుకుంటున్నారు అక్రమార్కులు. అర్ధరాత్రి సమయంలో భారీ యంత్రాలతో గుట్టలు, ప్రభుత్వ భూముల్లో మొరం(గ్రావెల్) తవ్వేస్తూ కాసులవేట సాగిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టూ ఉన్న దామెర, హసన్‌పర్తి, గీసుకొండ, శాయంపేట, ధర్మసాగర్ తదితర మండలాల్లో గ్రావెల్ మాఫియాకు అడ్డు లేకుండా పోయింది. కొందరు మొరం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి టెంపరరీ పర్మిట్ల(టీపీ)తో పట్టా భూములు, గుట్టలు, ప్రభుత్వ భూముల నుంచి మొరం తవ్వేస్తున్నారు. చాలాచోట్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వ గట్లను తవ్వుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దోపిడీ సాగుతోందిలా.. గ్రావెల్ మాఫియా టీఎస్ఎంఎంసీ రూల్స్ 1966–9(4) ప్రకారం పట్టాభూములు, రైతుల పేరిట రెండు నెలల గడువుతో తాత్కాలిక అనుమతులు పొందుతూ ఇష్టారాజ్యంగా మొరం దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి పొందిన భూమిలో ఏరియాను బట్టి 8–12 అడుగులలోపు లోతు మాత్రమే తవ్వాల్సి ఉంది. అలా చేస్తే రెండున్నర హెక్టార్లలో సుమారు 7–8 వేల మెట్రిక్ టన్నుల గ్రావెల్ మాత్రమే వస్తుందని మైనింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే గ్రావెల్ మాఫియా అందుకు భిన్నంగా 15–30 అడుగుల లోతు వరకు తవ్వి లారీలు, టిప్పర్ల ద్వారా అధిక మొత్తంలో మొరం తరలిస్తున్నారు. ఇందుకు సుమారు రెండున్నర హెక్టార్ల కోసం రూ.1.50 లక్షల వరకు రాయల్టీ చెల్లిస్తూ.. రూ.కోట్లల్లో సంపాదిస్తున్నారు. కళ్లెదుటే ఈ అక్రమ వ్యాపారం జరుగుతున్నా.. ఏ శాఖ కూడా ఆపే ప్రయత్నం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంచికి చేరిన కోమటిపల్లి గుట్ట దందా.. హసన్‌పర్తి మండలం భీమారం శివారు 340 సర్వే నంబర్లో సుమారు 57 ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న భూమిని గతంలో కొంత గిరిజన గురుకుల కళాశాల, హోటల్ మేనేజ్మెట్ కళాశాల, ఇంటర్నేషనల్ స్డేడియం ఏర్పాటుకు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందులో గిరిజన కశాశాలతో పాటు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ఐదెకరాల చొప్పున స్థలం కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా.. ఓవైపు కళాశాలలకు కేటాయించిన సర్కార్ మరోవైపు 340/1 సర్వే నంబర్ పేరిట రెండున్నర హెక్టార్ల(3.260) భూమిని కె.నవీన్‌రావు పేరిట క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి 5 సంవత్సరాల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్‌అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. క్యూబిక్ మీటర్‌కు రూ.30చొప్పున 29,90,900 క్యూబిక్ మీటర్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుని గుట్టంతా ఖాళీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రూ.లక్షల ప్రజాధనం పక్కదారి పట్టినా.. ఈ దందాలో తెరవెనుక ఓ ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్ట్నర్గా ఉండటం వల్ల అప్పట్లో పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అంతా అనధికారమే! కొంత అనుమతి తీసుకుని గుట్టలను కరిగించడమే కాదు.. అసలు అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టడం ఉమ్మడి వరంగల్‌లో పరిపాటిగా మారింది. వరంగల్, జనగామ, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొరం, మట్టి దందా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ తవ్వకాల గురించి సమాచారం తెలిసినా అధికారులు ‘మాములు’గా తీసుకుంటున్నారు. ● మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం జంగిలిగొండలోని ప్రభుత్వ భూమిలో గతంలో తవ్వకాలు జరుగుతుండగా అధికారులు అడ్డుకుని హద్దులు ఏర్పాటు చేసినా ఆగడం లేదు. ● ములుగు జిల్లా ములుగు పంచాయతీ శివారు 837 సర్వే నంబర్లోని సుమారు 200 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించగా.. అక్రమార్కులు మట్టి తవ్వకాలు ఆపడం లేదు. ● వరంగల్ నగరానికి సమీపాన ఉన్న ప్రాంతాల్లో వందలాది ట్రాక్టర్ల ద్వారా మొరం తరలిస్తున్నారు. ఇక్కడ ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1500 నుంచి రూ.2500 చొప్పున సుమారు 500 ట్రిప్పుల మొరానికి రూ.7.50 లక్షల నుంచి రూ.12.50 లక్షలు ఆర్జిస్తున్నారు. ● జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ ఎన్నె చెరువు పక్కన 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను రాత్రి పూట పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తవ్వి మట్టిని తరలించారు. చంపక్‌హిల్స్ గుట్టల్లోనూ మట్టిని తోడేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ● వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకులు, వంచనగిరి ప్రాంతంలోని ఎస్సారెస్పీ కాల్వ పక్కన, కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు వాటికి ఇరువైపులా బ్యాంకింగ్ పేరుతో పోసిన కట్టల మొరాన్ని తరలించి సొమ్ము చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు మొరం తరలింపులో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా అనుమతులు తీసుకొని మాత్రమే మొరం తవ్వకాలు చేపట్టాలి. – జ్యోతివలక్ష్మీదేవి, తహసీల్దార్, దామెర యథేచ్ఛగా మొరం తవ్వకాలు అనుమతి ఒకచోట, తవ్వకాలు మరోచోట కాల్వగట్లు, గుట్టలనూ వదలని అక్రమార్కులు ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు -
వ్యవసాయ బావిలో నీళ్లు లేక..
పక్క ఫొటోలో ఎండిన వరి పంటను చూపుతున్న రైతు సీరోలు మండల కేంద్రానికి చెందిన వంగాల వెంకన్న. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు వస్తుందని ఆశ పడిన రైతుకు నిరాశ ఎదురైంది. వ్యవసాయ బావిలో నీళ్లు సరిగా లేక, ఎస్సారెస్పీ నీళ్లు రాకపోవడంతో రెండు ఎకరాల పంట ఎండిపోయింది. సుమారు రూ.50వేలు నష్టం వాటిల్లింది. ఎస్సారెస్పీ నీళ్లు వస్తాయని ఆశతో నాలుగు ఎకరాల్లో నాటు వేశామని.. ప్రస్తుతం పంటను పశువులను మేపడం మినహా చేసేదేమీ లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
వట్టివాగు పారుతుందని..
ఈ ఫొటోలో మీరు చూస్తున్న రైతు కేసముద్రం మండలం వెంకటగిరి శివారు తండాకు చెందిన భూక్య శ్రీను. పక్కనే ఉన్న వట్టివాగుపై ఆధారపడి పంటలను సాగు చేస్తుంటాడు. గత ఏడాది మాదిరిగా, ఈ యాసంగిలో తనకున్న ఐదెకరాల్లో వరి, ఎకరంలో బొబ్బెర, పచ్చజొన్న పంటలను సాగు చేశాడు. ఈ క్రమంలో వట్టి వాగులో చుక్క నీరు లేక పోవడంతో, గత ఏడాది మాదిరిగానే ఎస్సారెస్పీ జలాలను విడుదల చేస్తారని ఆశపడ్డాడు. కానీ పంట సాగు చేసి రెండు నెలలు కావొచ్చినా నీళ్లు విడుదల కాలేదు. దీంతో కళ్లెదుటే వరి, బొబ్బెర, పచ్చజొన్న ఎండిపోయి నేల బీటలు వారింది. మొత్తంగా సాగుకు పెట్టిన పెట్టుబడులతో పాటు, కష్టం వృథా కావడంతో ఆ రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. -
రూ.1.60లక్షల పెట్టుబడితో పాటు శ్రమ వృథా..
పైన ఫొటోలో వరి పంటలో పశువులను మేపుతున్న రైతు పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన కాలేరు వీరభద్రస్వామి. తనకున్న మూడు ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. ఎకరాకు రూ. 25వేల చొప్పున పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాలకు రూ.లక్ష ఖర్చు పెట్టాడు. ఎకరా మొక్కజొన్నకు సైతం రూ. 20 వేల చొప్పున రూ. 60 వేలు పెట్టుబడి పెట్టాడు.. సాగు చేస్తున్న సమయంలో పుష్కలంగా నీళ్లు ఉండటంతో పంటలు వేశాడు. ప్రస్తుతం పెరుగుతున్న ఎండల తీవ్రతతో బోరు ఎండిపోయి నీటి లభ్యత తగ్గింది. దీంతో ఎండిపోయిన వరిని పశువులతో మేపుతున్నాడు. పంటచేతికి వస్తే అప్పులు తీర్చుతామని ఆశపడితే.. పంటపోగా పెట్టుబడి రూ.1.60లక్షలు అదనంగా అప్పు అయ్యిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ఎండిన వాగులు, చెరువులు
సాక్షి, మహబూబాబాద్: ప్రకృతి సహకరిస్తేనే రైతు పండించిన పంటలు చేతికొస్తాయి. కాగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా.. అతివృష్టితో జిల్లాలోని చెక్ డ్యామ్‌లు, చెరువులు, కుంటలు తెగిపోయాయి. దీంతో మండు వేసవిలో నిండు కుండల్లా ఉండాల్సిన వాగులు, ఏర్లు ఎడారిని తలపిస్తున్నాయి. దీని మూలంగా భూగర్భ జలాలు అడుగంటాయి. బోరు మోటార్లు ఆగిఆగి పోస్తున్నాయి. దీంతో యాసంగి పంటలకు సాగునీరు దినదినగండంగా మారుతోంది. వరుస తడులు పెట్టినా మడి పారక నెర్రెలు బారాయి. దీంతో రైతులు పంటలను పశువులను మేపుతున్నారు. అప్పులు ఎలా తీర్చాలని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.యాసంగి సాగు ఇలా..ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది యాసంగిలో మొత్తం 2,09,898 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో వరి 1,37,485 ఎకరాలు, మొక్కజొన్న 45,714ఎకరాలు, పెసర 1,995, జొన్న 680 ఎకరాలతో పాటు బొబ్బెర్లు, శనిగ, పొద్దుతిరుగుడు మొదలైన పంటలు 24,022 ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో ప్రధానంగా వరిపంట పొట్టదశకు రాగా మొక్కజొన్న గింజపోసే దశకు వచ్చింది. ఈ రెండు పంటలకు ఇప్పుడు సమృద్ధిగా నీరు కావాల్సి ఉండగా.. పలుచోట్ల నీరులేక ఎండిపోవడం, మరి కొన్నిచోట్ల వారానికోమారు నీటితడి పెట్టే పరిస్థితి వచ్చింది. -
మహిళా బిల్లుతో బీసీలకు ప్రయోజనం లేదు
హన్మకొండ : కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తుందని, ఈ బిల్లుతో మెజార్టీగా ఉన్న బీసీ మహిళలకు ఎలాంటి ప్రయోజనం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివా రం హనుమకొండ కనకదుర్గ కాలనీలో బీసీ సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. సీ్త్ర లేనిదే సృష్టి లేదని.. అన్ని రంగాల్లో సీ్త్రలు ముందు వరుసలో ఉన్నారన్నారు. 78 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో 95 మంది మహిళలు చట్టసభల్లో అడుగుపెడితే ఇందులో 54 మంది అగ్రకుల మహిళలని, 16 మంది ఎస్సీలు, 13 మంది ఎస్టీలు, నలుగురు మైనార్టీ మహిళలు ఉన్నారని, అయితే నేటి వరకు రాష్ట్రంలో 8 మంది మాత్రమే బీసీ మహిళలు ఎమ్మెల్యేలు అయ్యారని వివరించారు. 5 శాతం కూడా లేని అగ్రవర్ణ మహిళలు 54 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికై తే అరవై శాతం ఉన్న బీసీలు ఎనిమిది మంది మాత్రమేనా అంటూ ప్రశ్నించారు. మహిళా సాధికారత సాధించాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళ సబ్ కోట పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణి మంజరి మాట్లాడుతూ.. మహిళలంతా సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. బీసీ మహిళా సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షురాలు మాదం పద్మజాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవి కృష్ణ, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నాయిని నీలిమా, కార్పొరేటర్ గుజ్జుల వసంత, బీసీ సంక్షేమ సంఘం నాయకులు తమ్మల శోభారాణి, మాడిశెట్టి అరుంధతి, సమత, సంధ్య, తార, పూజిత, మానస, ప్రమోద, కాసగాని అశోక్, అరేగంటి నాగరాజు, చిర్ర సుమన్, పంజాల జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. సబ్ కోటాతోనే న్యాయం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ -
కార్మిక శాఖలో కలకలం..
ట్రేడ్ యూనియన్ల ఫిర్యాదుతో .. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు అందాల్సిన క్లైయిమ్స్‌లో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ప్రధాన ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. కార్మిక శాఖలో అవినీతి అధికారుల తీరుపై ఆధారాలతో సహా ఏడాది క్రితం పలు కార్మిక సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. యూనియన్ అందించిన ఆధారాలతో సహా మరికొన్నింటిని సేకరించి కఠిన చర్యలు తీసుకోవాలని కొంతకాలం వేచిఉన్న సర్కారు.. సుమారు రెండు నెలల క్రితం ప్రత్యేక అధికారులతో కూడిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులను రంగంలోకి దింపినట్లు సమాచారం.హన్మకొండ చౌరస్తా : కార్మిక శాఖలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కలకలం రేపుతోంది. రెండు నెలలుగా విజిలెన్స్ అధికారులు నిర్విరామంగా విచారణ కొనసాగిస్తుండడం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. సుధీర్ఘ విచారణ బయటకు తెలియకుండా అత్యంత రహస్యంగా, పకడ్బందీగా చేపట్టడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గల లబ్ధిదారులను అధికారులు నేరుగా కలిసి విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, కార్మిక శాఖ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విజిలెన్స్ దాడులు, విచారణ చేపట్టడం ఇదే మొదటిసారని ఆయా శాఖ సీనియర్ అధికారులు చెబుతున్నారు. 5వేల మంది లబ్ధిదారుల విచారణ.. 2020 (కరోనా సమయం) నుంచి 2024 వరకు వివిధ కేటగిరీల్లో ప్రాథమికంగా దాదాపు 5వేల మంది లబ్ధిదారులు అందుకున్న క్లైయిమ్స్పై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక శాఖ.. గుర్తింపు కార్డు కలిగిన నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తుంది. అందులో సాధారణంగా మృతి చెందితే రూ.1,30,000, పని ప్రదేశంలో మృతి చెందితే రూ.6లక్షలు, అంగవైకల్యం పొందితే పర్సంటేజీని బట్టి రూ.20 వేల నుంచి పైచిలుకు, కార్మికుల పిల్లల వివాహ కానుక రూ.30వేలు, ప్రసవానికి రూ.30వేలు, కార్మికుడి దహన సంస్కారాలకు రూ.15 వేలు అందిస్తుంది. కాగా, లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు ప్రధాన ఫిర్యాదులు ఉన్నాయి. క్లైయిమ్స్ జమ చేయడంలో ఎవరి వాటా ఎంత? ఎలా పంచుకున్నారనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.5 వేల మంది కై ్లమ్స్ లబ్ధిదారుల జాబితాపై విజిలెన్స్ విచారణ రిటైర్డ్, బదిలీ అధికారులను ఎంకై ్వరీ చేసిన అధికారులు ట్రేడ్ యూనియన్ల ఫిర్యాదుతో రంగంలోకి.. -
సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్: ఈనెల 31లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి 25 శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ఎల్ఆర్ఎస్ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎల్ఆర్ఎస్పై కమిషనర్లు, సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. లే అవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాలన్నారు. ప్రతీ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే కార్యాలయం వెళ్లి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి, సబ్ రి జిస్టార్ రవీంద్రబాబు, టీపీఓ సాయిరాం, డీపీఓ హరిప్రసాద్, మానుకోట, తొర్రూర్ కమిషనర్లు నో ముల రవీందర్, శాంతికుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ -
పరిష్కారం
హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ఆమోదరీతిలో వివాదాలు హన్మకొండ అర్బన్ : ‘ప్రస్తుతం ప్రారంభిస్తున్న ‘సామాజిక మధ్యవర్తిత్వ’ కేంద్రంలో ఉండే కులపెద్దలు న్యాయపరమైన శిక్షణ పొందిన వారై ఉంటారు.. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలకు పరస్పర ఆమోద రీతిలో వివాదాలు పరిష్కరించే అవకాశం ఉంటుంది’ అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ అన్నారు. శనివారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల ఆధ్వర్యంలో జాతీయ లోక్‌అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ సుజోయ్‌పాల్ మాట్లాడుతూ నేడు ప్రారంభించిన సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో అమలు చేయడం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లో సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఆ ఫలితాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు, పెద్దలుగా ఉండేందుకు ఆసక్తి గల వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందులో సేవలు అందించేవారు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలన్నారు. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. సామాజిక మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గం.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వ కేంద్రాలు ఉత్తమ సేవలు అందిస్తే రానున్న రోజుల్లో పెండింగ్ కేసుల పరిష్కారంతోపాటు కొత్త కేసులు నమోదు లేని వ్యవస్థను చూస్తామన్నారు. దేశంలో కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. మధ్యప్రదేశ్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మొదట నిజామాబాద్, కామారెడ్డిలో ప్రారంభించామన్నారు. అక్కడ సత్ఫలితాలు వస్తుండడంతో ప్రతి జిల్లాకు విస్తరించేలా ఈ కార్యక్రమం చేపట్టడం శుభపరిణామమన్నారు. సామాజిక మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్ కేసులు వేగంగా పరిష్కారం కావడంతోపాటు కొత్త కేసులు నమోదు కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయవ్యహారాల న్యాయమూర్తి జస్టిస్ మౌసుమీభట్టాచార్య వర్చువల్‌గా మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వం ద్వారా రానున్న రోజుల్లో పెండింగ్ కేసులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్. పంచాక్షరి మాట్లాడుతూ వలంటీర్లకు ముందు శిక్షణ ఇవ్వడం వల్ల వారు చట్టంపై అవగాహన ఉండి ఆ మేరకు సమస్య పరిష్కారాని కృషి చేస్తారన్నారు. కేసుల పరిష్కారం విషయంలో ఇరు పక్షాల వివరాలు గోప్యంగా ఉంచాలన్నారు. కేసు వివరాల నమోదులో ఎక్కడా ఎవరి వల్ల కేసు పరిష్కారమైంది.. ఎవరి వల్ల పరిష్కారం కాకుండా ఆగిందనే అంశం నమోదు చేయొద్దని సూచించారు. తుది ఫలితం మాత్రమే నమోదు చేయాలన్నారు. సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమ సభ్యులు బూర విద్యాసాగర్, శంతన్‌రామరాజు, యాదగిరి గౌడ్, భిక్షపతి యాదవ్ సందేహాలను న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ నివృతి చేశారు. వివిధ జిల్లాల కలెక్టర్లు మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వ కేంద్రాల మనుగడకోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. వివిధ జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలు మాట్లాడుతూ సామాజిక మధ్యవర్తిత్వ కేంద్రాలతో పోలీస్ స్టేషన్లకు వచ్చే సివిల్ కేసులు చాలా వరకు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా ఇతర కేసులపై పోలీసులు దృష్టిసారించొచ్చన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్. రమేశ్‌బాబు, సభ్య కార్యదర్శులు సీహెచ్. పంచాక్షరి, హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, డాక్టర్ దివాకర, రిజ్వాన్‌బాషా, అద్వైత్‌కుమార్, రాహుల్‌శర్మ, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా, కమిషనర్ అశ్వినితానాజీ వాఖడే, ఇతర అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనస్పర్థల కారణంగా విడిపోయిన జంటకు కౌన్సెలింగ్ నిర్వహించి ఒకటి చేశారు. అదే విధంగా రోడ్డు ప్రమాద కేసును పరిష్కరించి బాధితురాలికి రూ.18 లక్షలు చెక్కు అందజేశారు. పెండింగ్ కేసులు లేని వ్యవస్థను చూడగలం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ న్యాయసేవాధికార సంస్థల ఆధ్వర్యంలో జాతీయ లోక్‌అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ప్రారంభం -
పగలు, ప్రతీకారాలతో అనర్థాలు
మహబూబాబాద్ రూరల్: పగలు, ప్రతీకారాలతో అనర్థాలు చోటుచేసుకుంటాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సురేశ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి సురేష్ మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఆవేశంలో తప్పులు చేసినా రాజీపడేందుకు లోక్ అదాలత్ ఒక సదవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కీసర పద్మాకర్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది తోర్నాల నగేష్ కుమార్, డేగల సత్యనారాయణ, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. 1,183 కేసులు పరిష్కారం జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా 1,183 కేసులు పరిష్కారం జరిగాయి. 13 మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించగా బాధితులకు రూ.58.95 లక్షలు పరిహారం, ఒక సివిల్ కేసును పరిష్కరించగా రూ.1.50 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. 107 సీసీఐపీసీ కేసులు పరిష్కరించి రూ.51,100 జరిమానా విధించగా 15 బీఎస్ఎన్ఎల్ కేసులు పరిష్కరించి రూ.14,300 బాధితుల నుంచి రికవరీ చేశారు. 24 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి సురేశ్ జాతీయ లోక్ అదాలత్‌లో 1,183 కేసులు పరిష్కారం -
పనికి వెళ్తూ ప్రమాదంలోకి..
ఏటూరునాగారం: మిర్చి ఏరడానికి వెళ్లి వస్తున్న కూలీల వాహనం బోల్తా పడి 9 మందికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... ఛత్తీస్‌గఢ్ కు చెందిన 16మంది వలస కూలీలు మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఈక్రమంలో శనివారం ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన ఒక రైతు చేనులో మిర్చి ఏరేందుకు వెళ్లారు. సాయంత్రం పనిముగిసిన అనంతరం పంట యజమాని స్వయంగా టాటా ఏస్ వాహనంలో కూలీలను ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. ఈ రాంనగర్– కమలాపురం మధ్యలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన కూలీలను హుటాహుటిన ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. గాయపడిన, పేగులు బయటకు వెళ్లిన క్షతగాత్రులకు వైద్యులు, సిబ్బంది చికిత్స చేశారు. గాయపడిన వారిలో మైనర్లు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్పూర్ జిల్లాకు చెందిన వారు మిర్చితోట కూలీ పనులకు వచ్చిన వారిలో మైనర్లు కూడా ఉండడం గమనార్హం. మైనర్లు కూడా ఈ ఘటనలో గాయపడడం బాధాకరం. అలాగే, తీవ్ర గాయాలైన వారిలో పోడియం మున్న, మూచకి గగ్గు, మూచకి లక్కు, కోవ్వాసి శాంతి, పాయం లక్ష్మి ఉన్నారు. అనేకమార్లు హెచ్చరించినా.. ప్రమాదవిషయాన్ని తెలుసుకున్న ఎస్సై తాజొద్దీన్ సామాజిక ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కూలీలను గూడ్స్ వాహనాల్లో తీసుకెళ్లొద్దని రైతులు, కూలీలకు, కూలీల ముఠా మేసీ్త్రలను హెచ్చరించినా.. మారడంలేదన్నారు. మూడేళ్ల క్రితం ఓ ప్రమాదంలో నలుగురు మరణించారు. మైనర్లను కూలీలుగా పెట్టుకోవద్దన్నారు.కూలీల వాహనం బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు నలుగురి పరిస్థితి విషమం -
ప్రపంచదేశాలతో పోటీపడేందుకు సిద్ధం కావాలి
● నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మారెడ్డి మహబూబాబాద్ అర్బన్: సృజనాత్మక ఆవిష్కరణలో విద్యార్థులు ప్రపంచ దేశాలతో పోటీ ప డేందుకు సిద్ధం కావాలని వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి సమయపాలన పాటించి చదివితే లక్ష్యాలను సాధించవచ్చన్నారు. అనంతరం వివిధ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసపత్రాలు, మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పా ల్ బి.లక్ష్మణ్‌నాయక్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీని వాసులు, అధ్యాపకులు అహ్మద్, వినోద్, హాతి రామ్, అన్నపూర్ణ, ప్రభావతి, ఉపేందర్, నాగరాజు, ఉదయ్, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీరాంసాగర్ నీటిని విడుదల చేయాలని ధర్నా గార్ల: గార్ల సమీపంలోని పాకాల ఏటికి శ్రీరాంసాగర్ నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని కోరుతూ శనివారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పాకాల ఏటి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. వేసవికాలం ప్రారంభంలోనే పాకాల ఏరు నీళ్లులేక ఎండిపోతుందని, ఈ ప్రాంతంలో వరిపంట సాగు చేసిన పంటలకు నీళ్లులేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మరో వారం రోజుల్లో పాకాల ఏటికి నీళ్లు రాకపోతే ఈ ఏటి పరీవాహక ప్రాంతంలో సాగుచేసిన సుమారు 200 ఎకరాల వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ధర్నాలో పార్టీ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, పోతుల నర్సింహరావు, జి.వీరన్న, జి.శంకర్, రమేష్, సురేష్, వెంకన్న, జితేందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యంతోనే ప్రగతి● జిల్లా వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ డోర్నకల్: మహిళల భాగస్వామ్యంతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలు అన్ని పాత్రల్లో సమర్థవంతంగా సేవలందిస్తున్నారన్నారు. వైద్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఎంతోమంది మహిళలు రోగులకు సేవ చేస్తూ మథర్ థెరిసాను గుర్తు చేస్తున్నారని తెలిపారు. మహిళలు ధైర్యంగా ముందడుగేస్తూ అభివృద్ధిపథంలో పయనించాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళా అధికారులు, సిబ్బంది కేక్ కట్ చేయగా డాక్టర్ మురళీధర్ మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సాధ్విజ, సీఐ బి.రాజేష్, ఎస్సైలు గడ్డం ఉమ, బి.మౌనిక వైద్యురాలు డాక్టర్ సాధ్విజ, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా ఇన్నోవేషన్ సమిట్–25 ప్రారంభం కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని ఇన్నోవేషన్ గ్యారేజీలో శనివారం రెండు రోజుల స్టూడెంట్ ఇన్నోవేషన్ సమిట్–25ను నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసాచార్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, పరిశ్రమల నిపుణులు, సాంకేతిక అభిరుచిగల వారిని ఒకే వేదికపై చేర్చి నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు ఇన్నోవేషన్ సమ్మిట్–25ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు
మహబూబాబాద్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ కార్యాలయాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రేగ్యులేషన్ స్కీం) రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కా రణంగా రిజిస్ట్రేషన్లు ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. ప్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ 2020 సాఫ్ట్వేర్, ఇతర ప్రక్రియ పూర్తి కాగా ఫీజు చెల్లింపు అంతా మున్సిపాలిటీలో ఇచ్చిన విధివిధానాలే ఉన్నాయి. జిల్లాలో 26,001 దరఖాస్తులు 2020 ఆగస్టు 26లోపు లేఅవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎల్ఆర్ఎస్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇందులో రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు రావడంతో దరఖాస్తుదారులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మానుకోట, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్ మున్సిపాలిటీలు ఉండగా ఇటీవల కేసముద్రం కూడా మున్సిపాలిటీ అయింది. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 26,001 దరఖాస్తులు రాగా 8,264 ఆమోదించగా 84 తిరస్కరణకు గురి కాగా మిగిలినవి ప్రాసెస్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 8,264 దరఖాస్తుదారుల్లో కూడా 389 మంది మొత్తం ఫీజు చెల్లించి అనుమతి తీసుకోగా 7,875 మంది ఫీజు పెండింగ్‌లో ఉన్నాయి. 25 శాతం రాయితీతో.. ప్రభుత్వం త్వరగా ఎల్ఆర్ఎస్ తీసుకోవాలని దరఖాస్తుదారుల కోసం ఈనెల 31వ తేదీలోపు ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తేదీ ప్రకారం ఉన్న విలువలో 14శాతం ఫీజు చెల్లించాల్సి ఉంది.మున్సిపాలిటీల్లో కేవలం దరఖాస్తు చే సుకున్న వారికిమాత్రమే ఈ అవకాశం కల్పించింది. ఫీజు చెల్లించకపోయినా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు మాత్రం మున్సిపాలిటీ వెబ్సైట్లోనే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. గతంలో ఎల్ఆర్ఎస్ ఫీజు రూ.1000 చెల్లించినా.. చెల్లించకపోయినా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వే నంబర్, ఇతర అన్ని వివరాలతో రిజిస్ట్రేషన్ చేస్తారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు.. మానుకోట జిల్లా కేంద్రం కేంద్రంలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయంలో ఈనెల 10 (సోమవారం) నుంచి ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లపై సమాచారాన్ని పూర్తి వివరాలు తెలియచేసేందుకు ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పా ట్లు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఎల్ఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి సారించారు. ము న్సిపల్ కమిషనర్లతో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. రేపటి నుంచి అందుబాటులోకి సేవలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఈ నెల 31 వరకు 25శాతం రాయితీతో అవకాశం -
ప్రాణం తీసిన చేపలవేట
నెల్లికుదురు: నీటి కుంట మృత్యు కుహరంగా మారింది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఒకే తండాకు చెందిన ఇద్దరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. కుటుంబ పెద్దను కోల్పోయి ఒక కుటుంబం.. చేతికి అందివచ్చిన కుమారుడు విగత జీవిగా మారడంతో మరో కుటుంబం దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పెద్దతండాకు చెందిన బాదావత్ శేఖర్ (21) హనుమకొండలోని ఓప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. సెమిస్టర్ పరీక్షలు ముగిశాయని ఇంటికొచ్చాడు. తండాలో పక్కపక్కనే ఇళ్లు ఉండడంతో భూక్య రాములు(45)తో కలిసి మేచరాజుపల్లి శివారులోని కుమ్మరికుంటలో చేపలు పట్టేందుకు శుక్రవారం మధ్యాహ్నం వెళ్లారు. రాత్రయినా ఇంటికి రాలేదు. దీంతో ఇరు కుటుంబాలు కలిసి వెతకగా.. కుమ్మరి కుంట వద్ద వారి చెప్పులు, బట్టలు కనిపించాయి. తండావాసులకు సమాచారం ఇచ్చి వెతకగా.. నీటి కుంటలో విగతజీవులై కనిపించారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కుంటలో పడినట్లు, ఈత రానందున చనిపోయినట్లు తండావాసులు చెబుతున్నారు. శేఖర్, రాములు మృతితో తండాలో విషాదం అలుముకుంది. తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ రాములు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటికి పెద్ద చనిపోవడంతో రాములు కుటుంబం రోడ్డున పడింది. ఆసరాగా నిలుస్తాడనుకున్న శేఖర్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ రైతు, యువకుడి మృతి ఇటీవల అదుపు తప్పి కారుబోల్తా.. ఆరుగురికి గాయాలుప్రమాద కుంట! రోడ్డుకు ఆనుకుని కుమ్మరి కుంట ఉంది. ఇందులో 15 రోజుల క్రితం కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. కుంట ప్రమాదకరంగా మారిందని, తగు రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..
ప్రమాద సమయంలో భార్యతో ప్రవీణ్‌కుమార్ ఆఖరి మాటలు.. హనుమకొండ, రాంనగర్వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. – పర్వతగిరి/సంగెం/నెల్లికుదురు● ఎస్సారెస్పీ కెనాల్లో పడిన కారు.. తండ్రి, ఇద్దరు పిల్లల మృతి ● స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడిన తల్లి ● వరుసగా సెలవులు రావడంతో స్వగ్రామానికి కారులో వెళ్తున్న కుటుంబం ● గుండెనొప్పి రావడంతో కారు స్టీరింగ్ తిప్పలేని పరిస్థితి.. ● నేరుగా కాల్వలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం ● మేచరాజుపల్లిలో విషాదఛాయలు11.40 గంటలకు : వరుసగా సెలవులు రావడంతో హనుమకొండలోని రాంనగర్లో నివాసం ఉంటున్న సోమారపు ప్రవీణ్(28), భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి(5), కుమారుడు ఆర్యవర్ధన్(2)తో కలిసి హుందయ్ ఐక్రాస్ కారులో సొంత గ్రామమైన నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి బయలుదేరారు.12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటపల్లికి చెందిన నవీన్, సందీప్, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు. 1.10 గంటలకు : ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు. 4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్ సీట్లో ప్రవీణ్‌కుమార్, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు. వరంగల్ టు నెక్కొండ రోడ్డు ఎస్సారెస్పీ కాల్వపర్వతగిరి రోడ్డు12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్‌కుమార్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి అధికం కావడం.. స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది. ప్రమాదం జరిగిందిలా.. (ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు) -
ఆమోద రీతిలో వివాదాలు పరిష్కారం
హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయసేవా అధికార సంస్థల ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, అతిథిగా న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ ● హనుమకొండలో జాతీయ లోక్ అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ప్రారంభం ● అక్కడికక్కడే పలు కేసుల పరిష్కారం– హన్మకొండ అర్బన్– వివరాలు 8లోu -
అసమానతలపై ధిక్కారం మహేందర్ కవిత్వం..
కేయూ క్యాంపస్: సామాజిక అసమానతలపై ధిక్కారం మహేందర్ కవిత్వం అని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కాశీం అన్నారు. ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్ రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ శనివారం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్‌హాల్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా కాశీం మాట్లాడారు. మహేందర్ కవిత్వం మనిషి కేంద్రమై సాగుతూ కులమతాల నిచ్చెనమెట్ల వ్యవస్థను ప్రశ్నించిందన్నారు. ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ మనిషిని సంస్కరించే దిశగా మహేందర్ కవిత్వం కొనసాగిందన్నారు. కవి, విమర్శకుడు పుప్పాల శ్రీరామ్ మాట్లాడుతూ.. సంపుటిలోని కవితలు పాఠకుల్ని తప్పకుండా కదిలిస్తాయన్నారు. ఈసభలో తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు, కవి పొట్లపెల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరశంకరం, ఆచార్యులు బన్న అయిలయ్య, కవి రచయిత్రి నెల్లుట్ల రమాదేవి మాట్లాడారు. ఈ పుస్తకాన్ని గురిజాల శశికళ తిరుపతిరెడ్డికి కవి మహేందర్ అంకితం ఇచ్చారు. గ ట్టు రాధిక, కార్తీకరాజు, ఫణిమాధ వి, తగుళ్ల గోపా ల్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఎస్సారెస్పీ కాల్వలో పడి ఒకరి గల్లంతు ఎల్కతుర్తి: ఓ యువకుడు బహిర్భూమికని వెళ్లి ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కాల్వలో పడి గల్లంతయ్యాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారులో శనివారం చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి, గ్రామస్తులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మ హ్మద్ చొటేమియాకు నలుగురు సంతానం. కాగా, మూడో కుమారుడు మహ్మద్ సలీంపాషా(24) బ హిర్భూమికని గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాల్వ కట్టకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడి గల్లంతయ్యాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి చొటేమియా ఎస్సారెస్పీ కాల్వ వద్దకు వెళ్లి చూడగా తన కుమారుడి చెప్పులు, నెక్కర్(లాగు) ఉండడాన్ని గమనించారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసి, యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. -
బాధిత మహిళలకు భరోసా ‘సఖి’ కేంద్రాలు..
మహబూబాబాద్ సఖి సెంటర్ ద్వారా ఏడాదిలో అందించిన సేవల వివరాలు సఖి కేంద్రంలో నమోదైన కేసుల సంఖ్య : 284 పరిష్కరించిన కేసులు : 197 పెండింగ్ కేసులు : 87 సఖి కేంద్రంలో అందించిన సేవలు : సైకో సోషల్ కౌన్సిలింగ్ : 630 లీగల్ కౌన్సెలింగ్ : 425 డీఐఆర్ ఫైలింగ్: 11 అవగాహన కార్యక్రమాలు : 93 పాల్గొన్న సభ్యుల సంఖ్య : 19,659 181 మహిళా హెల్ప్‌లైన్ ద్వారా వచ్చిన 82 కాల్స్‌కు 25 కేసులు నమోదు చేశారు. 284 కేసుల్లో 123 మందికి (పిల్లలతో) షెల్టర్ ఇచ్చారు.వరంగల్ సఖి సెంటర్ ద్వారా అందించిన సేవల వివరాలు కౌన్సెలింగ్ నిర్వహించిన కేసులు : 1292 ఫ్రీ లీగల్ ఎయిడ్/ లీగల్ కౌన్సెలింగ్ అందించిన కేసులు: 527 పోలీసు సాయం అందించిన కేసులు : 426 వైద్య సాయం అందించిన కేసులు: 566 వసతి కల్పించిన కేసులు : 402 అత్యవసర సమయాల్లో రెస్క్యూ చేసిన కేసులు : 75 సర్వైవర్ కిట్స్ ఇచ్చిన కేసులు : 60 ఇప్పటి వరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు: 856 పాల్గొన్న సభ్యులు: 51,365 సాక్షి, వరంగల్/ సాక్షి, మహబూబాబాద్ : సఖి కేంద్రాలు బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయి. వేధింపులు, గృహ హింస నుంచి మహిళలు, బాలికలకు రక్షణ కల్పించడానికి ఈ కేంద్రాలు సాయపడుతున్నాయి. బాధిత మహిళకు తక్షణ వైద్యం, న్యాయ, ఆర్థిక సాయం అందిస్తున్నాయి. కాగా, 181 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించడం ద్వారా బాధిత మహిళలకు సాయం అందనుంది. కాగా, వరంగల్ సఖి సెంటర్ 2019 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 1295 కేసులు వస్తే 945 పరిష్కరించారు. 200 కేసులు మూసివేశారు. 21కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 109 కేసులు కోర్టులో నమోదయ్యాయి. అలాగే, మహిళా హెల్ప్ లైన్ ద్వారా 725 కేసులు నమోదయ్యాయి. -
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం..
● వ్యక్తి అరెస్ట్ ● వివరాలు వెల్ల డించిన ఏసీపీ దేవేందర్రెడ్డివరంగల్ క్రైం: ప్రభుత్వ ఉద్యోగాలు, నిట్ లాంటి కళాశాలలో సీ టు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి రూ. లక్షల్లో డబ్బుతో పాటు బంగారు ఆభరణాలు దండుకున్న వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.5.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.68 లక్షల నగదుతో పాటు మూడు సెల్ఫోన్లు, ఐడీఎఫ్సీ డెబిట్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు హనుమకొండ పీఎస్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వె ల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, వీరపునాయుడిపల్లి మండలం, ఇందుకూరు కొత్తపల్లికి చెందిన కొమ్మ వివేకానంద రెడ్డి అలియాస్ కిశోర్‌రెడ్డి కొంత కాలం ప్రైవేట్ టీచర్‌గా పనిచేశాడు. ఈ సమయంలో సహ ఉద్యోగుల వద్ద అవసరానికి డ బ్బులు, బంగారం తీసుకుని ఇవ్వకుండా మోసం చేశాడు. ఈ ఘటనలో రెండు నెలలు జైలు జీవితం గడిపాడు. అనంతరం తన మకాం హనుమకొండకు మార్చాడు. ఇక్కడ మరోపేరుతో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూనే తనకు వరంగల్ నిట్‌లో పరిచయస్తులు ఉన్నారని, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళా టీచర్‌ను నమ్మించి ఆమెవద్ద రూ.8 లక్షలతో పాటు ఆమె కొడుకుకు నిట్‌లో సీటు ఇప్పిస్తానని 60గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అలాగే, మరో ముగ్గురు బాధితుల నుంచి ఇదే తరహలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్ప డ్డాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం తాను ఉంటున్న కిరాయి ఇంటి నుంచి సామగ్రి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచా రించగా నేరం అంగీకరించాడు. దీంతో అరెస్ట్ చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
మేం ఇద్దరం.. మాకు ఒక్కరు!
మహబూబాబాద్ అర్బన్: మేం ఇద్దరం. మాకు ఒక్క ఆడపిల్ల చాలు.. అంటున్నారు మానుకోట జిల్లా కేంద్రంలోని పాత బజార్‌కు చెందిన షేక్ మహబూబ్‌పాషా–షేక్ రిజ్వానా దంపతులు. 2014లో వారికి సమీర జన్మించింది. ఆ చిన్నారిని ధైర్యవంతురాలిగా పెంచాలని నిర్ణయించుకున్నారు. కరాటే, కబడ్డీ, రన్నింగ్, స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు. ఆ పాపలోనే తన తల్లిని చూసుకుంటున్నట్లు రిజ్వానా చెబుతున్నారు. మాకు అబ్బాయి పుట్టలేదని బాధపడకుండా పాపను మగపిల్లలతో సమానంగా పెంచుతామంటున్నారు షేక్ మహబూబ్‌పాషా– షేక్ రిజ్వానా దంపతులు. -
మహిళల ‘సౌర’ సాగు..
హన్మకొండ : మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ దిశగా వివిధ కార్యక్రమాల్లో మహిళలను భాగస్వాములను చేస్తోంది. ఈ క్రమంలో మహిళలతో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాల్లో ప్రభుత్వ భూములు గుర్తించింది. ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 గ్రామాలను ఎంపిక చేసింది. ప్రభుత్వ స్థల లభ్యతను బట్టి హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు గ్రామాల చొప్పున మహబూబాబాద్ జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసింది. మహబూబాబాద్ జిల్లాలో ఒకే ప్రాంతంలో 8 ఎకరాల స్థలం అందుబాటులో ఉండడంతో ఒకే గ్రామాన్ని ఎంపిక చేసింది. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి నాలుగు ఎకరాల స్థలం అవసరం. ప్రతీ గ్రామంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎంపిక చేసిన రెండు గ్రామైఖ్య సంఘాలకు 0.5 మెగావాట్ల చొప్పున సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. రెండు గ్రామైఖ్య సంఘాలకు ఒక మెగావాట్ చొప్పున ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక చర్యలు.. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది. ప్రధానంగా రైతులను సౌర విద్యుత్ ఉత్పత్తి వైపు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ ( పీఎం కుసుం) పథకం తీసుకొచ్చింది. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. రైతులతో పాటు మహిళా స్వయం, రైతు ఉత్పత్తి, సహకార, నీటి వినియోగదారుల సంఘాలు, పంచాయతీలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా పథకం రూపొందించాయి. ప్రభుత్వ, దేవాలయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి. యుద్ధప్రాతిపదికన ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ.. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం విధించుకోగా ఇందులో వెయ్యి మెగావాట్లు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ యుద్ధప్రాతిపదికన చేపట్టి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయా లేదో అని అధికారులు పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 95 స్థలాల్లో 964 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించారు. ఇందులో 53 స్థలాలు సోలార్ ప్లాంట్ ఏర్పాటునకు అనువుగా ఉన్నట్లు తేల్చారు. హనుమకొండ జిల్లాలో 38 స్థలాల్లో 15 స్థలాలు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. వరంగల్ జిల్లాలో 13 స్థలాల్లో 6, ములుగు జిల్లాలో 12 స్థలాల్లో 11, మహబూబాబాద్ జిల్లాలో 4 స్థలాల్లో 4, జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 13 స్థలాల్లో 8, జనగామ జిల్లాలో 15 స్థలాల్లో 9 స్థలాలు అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్క మెగావాట్ ప్లాంట్‌కు రూ.3 కోట్ల వ్యయం.. ఒక్క మెగావాట్ ప్లాంట్‌కు రూ.3 కోట్ల వ్యయం కానుంది. ఇందులో స్వయం సహాయక సంఘాలు 10 శాతం కింద రూ.30 లక్షలు భరిస్తే, బ్యాంకు 90 శాతం రుణం కింద రూ.2.70 కోట్లు అందిస్తుంది. ప్లాంట్ ద్వారా ఏడాదికి 1.66 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రోజుకు దాదాపు 4,500 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. యూనిట్‌కు డిస్కంలు రూ.3.13 చొప్పున చెల్లిస్తాయి. నెలకు ఉత్పత్తి అయిన విద్యుత్‌ను బట్టి ప్రతీ నెల డిస్కం చెల్లింపులు చేస్తుంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 25 సంవత్సరాల పాటు ఆదాయం పొందొచ్చు. నేడు ముఖ్యమంత్రితో ప్రారంభం.. ప్రభుత్వం మహిళా సంఘాలతో ముందుగా జిల్లాకు రెండు గ్రామాల్లో 2 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామాలను ఎంపిక చేశా రు. జనగామ జిల్లాలో అశ్వరావుపల్లి, వావిలాల, హనుమకొండ జిల్లాలో సూరారం, ఆత్మకూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భజనపల్లి, మహాముత్తారం, ములుగు జిల్లాలో పత్తిపల్లి, జగ్గన్నపేట, వరంగల్ జిల్లాలో వంచనగిరి, మురిపిరాల, మహబూబాబాద్ జిల్లాలో అబ్బాయిపాలెం గ్రామాలను ఎంపిక చేశారు. శనివారం జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మహిళలతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా హనుమకొండ జిల్లాకు 2 మెగావాట్ల ఉత్పత్తి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల ఉత్పత్తి ఆరు జిల్లాల్లో 11 గ్రామాల ఎంపిక ప్రభుత్వ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు నేడు (మహిళా దినోత్సవం రోజు) సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన -
మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తున్న పోలీసులు
వరంగల్ క్రైం: కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న అలజడులు.. పనిచోట వేధింపులు.. కళాశాలలు, పాఠశాలల దగ్గర పోకిరీల ర్యాగింగ్.. ఇలా ఏ ఘటన జరిగినా బాధిత మహిళలు, బాలికలకు పోలీసులు భద్రత, భరోసా కల్పిస్తున్నారు. ఆపద సమయంలో మేం అండగా ఉన్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. మహిళ, బాలికల రక్షణకు పోలీస్ స్టేషన్లతో పాటు ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్లు, ‘షీ’టీమ్స్ విభాగం, భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల రక్షణకు అండగా నిలుస్తున్న పలు విభాగాల సేవలు అతివలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మహిళలు, బాలికల రక్షణకు పోలీసులు, ‘షీ’ టీమ్స్ తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. మఫ్టీలో ‘షీ’ టీమ్స్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ‘షీ’ టీమ్స్ విభాగం అధికారులు పోకిరీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిర్దేశించిన హాట్స్పాట్ల వద్ద ‘షీ’ టీమ్స్ పోలీసులు మఫ్టీలో ఉండి అకతాయిల ఆట కట్టిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, షాపింగ్ మాల్స్, కళాశాలలు, పాఠశాలల వద్ద మఫ్టీలో ఉంటూ ఎవరైనా ఆకాయిలు.. మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తే వారిని పట్టుకుంటున్నారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి శృతి మించితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. బాధితులకు సాయం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా బాలికలు, మహిళలు లైంగికదాడికి గురైతే వారిని వెంటనే భరోసా కేంద్రానికి తరలిస్తున్నారు. ఈ కేంద్రంలో ఏఎన్ఎం సేవలతో పాటు లీగల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగే వరకూ భరోసా కేంద్రం అధికారులు అండగా నిలుస్తున్నారు. బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ వాతావరణం కనిపించకుండా, బాధితులు భయపడకుండా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నారు. మహిళలపై ఆగని దాడులు.. పోలీసులు మహిళా రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్న వారిపై దాడులు మాత్రం అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. గతేడాది వరకట్న మరణాలు 10 జరగగా 39 మంది వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంవత్సరం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మహిళలపై వే ధింపులకు పాల్పడిన నేపథ్యంలో గత సంవత్సరం 626, ఈ ఏడాది 91 కేసులు నమోదయ్యాయి. గతేడాది లైంగికదాడి కేసులు 146 కాగా , ఈ ఏడాది ఇప్పటి వరకు 22 జరిగాయి. మహిళా పీఎస్‌లో కేసు తీవ్రతను బట్టి కౌన్సెలింగ్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హనుమకొండ జిల్లాకు ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్ (అర్బన్) రంగంపేటలో ఉండగా, వరంగల్, జనగామ జిల్లాలకు ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్ సుబేదారిలో ఉంది. దంపతులు, కుటుంబాల కలహాలు, వివాహేతర సంబంధాలు, వరకట్న కేసులు, దాడులు.. ఇలా అనేక అంశాలలో ఫిర్యాదులు స్వీకరించి వాటి తీవ్రతను బట్టి మొదటి కౌన్సెలింగ్ నిర్వహించి ఆ తరువాత కేసులు నమోదు చేస్తున్నారు. బాధిత మహిళలకు కావాల్సిన అనేక రకాల విషయాలపై కౌన్సెలింగ్ నిర్వహించి అండగా నిలుస్తున్నారు. ఫోన్ చేస్తే చాలు.. పట్టేస్తాం మహిళలు, బాలికలు తమను పోకిరీలు ఇబ్బందులకు గురిచేసినా, ఫోన్లకు అసభ్యకర ఫొటోలు పంపినా, బ్లాక్ మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడినా ఫోన్ చేస్తే చాలు.. పోకిరీలను పట్టుకుని వారి ఆట కట్టిస్తాం. మహిళలు, బాలికలు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దు. కుటుంబీకులతో చెప్పుకోలేని విషయలను కూడా మా దగ్గర చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా అండగా ఉండి రక్షిస్తాం. ఇబ్బందులు తలెత్తుతే నేరుగా 8712 685142 నంబర్‌కు ఫోన్ చేయండి. –కొడురి సుజాత, ఇన్స్పెక్టర్ ‘షీ’ టీమ్స్ పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’ టీమ్‌లు బాధిత మహిళలకు ‘భరోసా’ కేంద్రం.. అతివలకు మహిళా పోలీసు స్టేషన్లు కొండంత అండ -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మహబూబాబాద్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సీ్త్ర, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ మహిళలు విద్యా, ఉపాధి రంగాల్లో రాణించాలన్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వాలంబన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె. వీరబ్రహ్మచారి, డీడబ్ల్యూఓ దనమ్మ, డీఎంహెచ్ఓ మురళీధర్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ డాక్టర్ నాగవాణి పాల్గొన్నారు. రాయితీపై విస్తృత ప్రచారం చేయాలి మహబూబాబాద్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఈనెల 31లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే ఫీజు 25 శాతం రాయితీ విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ బుద్ద ప్రకాష్ జ్యోతి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, టీపీఓ సాయిరాం, డీపీఓ హరిప్రసాద్, మానుకోట, తొర్రూర్ కమిషనర్లు నోముల రవీందర్, శాంతి కుమార్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ -
వివక్ష తగ్గినా వేధింపులున్నాయి..
కుటుంబాన్ని నడిపిస్తున్న మహిళామణులు104133మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. పనులు చేస్తున్న మహిళలకు కార్యాలయాల్లో వేధింపులు కొంతమేర కొనసాగుతు న్నా.. సెల్ఫోన్లలో కొందరు అసభ్యపదజాలంతో పంపిస్తున్న మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక సతమతమవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న వారిలో తెలిసిన వారితోపాటు తెలియని వారు ఉన్న ట్లు పలువురు మహిళలు చెబుతున్నారు. నాడు వంటింటికే పరిమితమైన మహిళ.. నేడు విద్య, ఉద్యోగం, నచ్చిన రంగంలో ఎదుగుతూ పురుషులతో సమానంగా పనిచేస్తోంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వేధింపులు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ 1) మీ ఇంట్లో ఆడ – మగ వివక్ష ఏమైనా ఉందా..? ఎ) ఉంది బి) లేదు సి) చెప్పలేను73BA1702) మీ కాలేజీ – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..? ఎ) లేదు బి) ఉంది సి) చెప్పలేను C7837623) మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం? (ఎ) సెల్ఫోన్లో వచ్చే మెసేజ్‌లతో.. బి) బస్టాప్‌లో సి) కాలేజీ లేదా ఆఫీస్‌లో2001104) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు? ఎ) తెలియని వారు బి) తెలిసిన వారేషాంపిల్స్: 310 (గ్రేటర్వరంగల్ 60మంది, మిగతా ఐదు జిల్లాలు (వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు 50మంది చొప్పున) అన్ని వర్గాల మహిళలను పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాల సేకరణ. వారి సంకల్పం గొప్పది. ఆశయం ఉన్నతమైనది. హేళనలు, అవమానాలేమీ వారు చేసే పనులకు అడ్డంకి కాలేదు. ప్రతికూల పరిస్థితులెదురైనా, పురుషాధిక్య రంగమైనా వారు పట్టు వీడలేదు. అన్ని రంగాల్లోనూ మాదే పై చేయి అంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నతనంలో వివాహమై భర్తను కోల్పోయిన ఒకరు కుటుంబానికి అండగా నిలబడితే.. మరొకరు పేదరికాన్ని పారదోలేందుకు నడుంకట్టారు. ఇంకొకరు విశ్వవేదికపైన జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంకల్ప శక్తులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హోటల్ నడుపుతూ.. పిల్లలను చదివిస్తూ.. చిట్యాల: మండల కేంద్రానికి చెందిన భీమారపు ఓదెలు హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. కట్టెల పొయ్యి కారణంగా అతడి చూపు దెబ్బతిన్నది. భార్య ప్రమీల 20 ఏళ్లుగా హోటల్ నడుపుతూ పిల్ల లను చదివిస్తోంది. గతేడాది పెద్దమ్మాయికి పెళ్లి చేసింది. మిగతా ఇద్దరు పీజీ, ఎంటెక్ చదువుతున్నారు. ఓదెలు కూరగాయలు కట్ చేసి వ్వడం, పిండి కలపడం వంటి పనుల్లో ఆమెకు సాయం చేస్తుంటాడు. తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.● విభిన్న రంగాల్లో రాణిస్తూ ఆదర్శం ● పురుషులకు దీటుగా బాధ్యతలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంసంగెం: వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించింది సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి. ఆమెకు ఆర్నెళ్ల వయసులోనే జ్వరం వచ్చింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. వైకల్యాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని.. నమ్మింది. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో కాంబోడియా దేశంలో ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీలకు మన దేశం తరఫున పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించింది. చీకట్లో ‘వెన్నెల’ సాక్షి, మహబూబాబాద్: దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల మల్లయ్య సుగుణమ్మల కుమార్తె వెన్నెల. పుట్టిన ఎనిమిదేళ్లకే తండ్రి మరణించాడు. ఆతర్వాత వెన్నెలను నర్సింహులపేట మండల కేంద్రంలోని అక్కా, బావ తీగల వెంకన్న, సుజాత చేరదీసి చదివించా రు. పదోతరగతి చదివిన వెన్నెలకు మహబూబా బాద్ మండలం పర్వతగిరికి చెందిన నారమళ్ల సంపత్తో వివాహం జరిపించారు. చిన్నతనంలో నే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. మిర్చి పంట కు తామర పురుగు సోకడంతో కుటుంబం అప్పు ల పాలయ్యింది. అప్పుల బాధతో భర్త సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 19 ఏళ్లకే వెన్నెల వితంతువుగా మారింది. ఆరేళ్ల సాన్విక, మూడేళ్ల తన్వికతో పాటు తల్లి సుగుణమ్మ, అత్త, మామ పోషణ ఆమైపె పడింది. మహబూ బా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. మూగజీవాల నేస్తం.. డాక్టర్ అనిత లింగాలఘణపురం: మండల కేంద్రంలో పశువైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆడెపు అనిత పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన అనిత 2019లో లింగాలఘణపురం పశువైద్యాధికారిగా విధుల్లో చేరారు. పశువైద్యశాల కు వచ్చే మూగ జీవాలకు వైద్యం చేస్తూనే.. వ్యవసాయబావులు దూరంగా ఉండి ఆస్పత్రికి రాలేని పశువుల వద్దకు స్వయంగా ద్విచక్రవాహనంపై వెళ్లి వైద్యం చేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణలో ప్రత్యేకత చాటుకున్నారు. 63 శాతం సక్సెస్ సాధించారు. పశువులు, గొర్రెలకు వ్యాక్సినేషన్‌ను నూటికి నూరు శాతం అమలు చేస్తూ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు నేస్తంగా మారిపోయారు. చేయి చేయి కలిపి.. పేదరికాన్ని తరిమి ఏటూరునాగారం: మండలంలోని శివాపురంలో ట్రైకార్ సాయంతో ఐటీడీఏ ద్వారా పది మంది మహిళలు సమ్మక్క–సారలమ్మ డిటర్జెంట్ సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ట్రైకార్ నుంచి 60 శాతం సబ్సిడీ, బ్యాంకు నుంచి 30 శాతం రుణం తీసుకుని పరిశ్రమ నడుపు తున్నారు. తయారు చేసిన సబ్బులకు ఒక్కోదానికి రూ.10గా ధర నిర్ణయించి గిరిజన సహకార సంఘానికి(జీసీసీ) విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు 4 వేల సబ్బులు తయారు చేస్తున్నారు. ఐదేళ్లుగా కోటిన్నర రూపాయల వ్యాపారం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సబ్బుల తయారీలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కట్టె కోత.. బాధ్యతల మోతకట్టెకోత మిల్లులో మగవారితో సమానంగా పని చేస్తోంది వరంగల్ నగరం నాగేంద్రనగర్‌కు చెందిన ఎండీ రజియా. భర్త అనారోగ్యం కారణంగా కుటుంబ భారం ఆమైపె పడింది. 15 ఏళ్లుగా నగరంలోని జగన్నాథం సామిల్లులో కట్టర్‌గా పనిచేస్తోంది. ముగ్గురు పిల్లల పెళ్లి చేయగా.. కూతురు కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె తల్లివద్దే ఉంటోంది. వీరందరికీ రజియా పని చేస్తేనే భోజనం. సొంతిల్లు ఉంటే కొంత భారం తగ్గుతుందని రజియా అంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ సమాచార వారధిగా పత్రికల సేవలు భేష్‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం వరంగల్ లీగల్ : ప్రజలకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సమాచార వారధిగా వార్తా పత్రిక లు నిలవాలని సాక్షి గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయానికి శుక్రవారం ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వచ్చారు. ముందుగా జడ్జికి సాక్షి ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు వర్ధెల్లి లింగయ్య, గడ్డం రాజిరెడ్డి, లీగల్ రిపోర్టర్ జీవన్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మొదట ఎడిటోరియల్ విభాగానికి చేరుకున్నారు. ఫీల్డ్ నుంచి రిపోర్టర్లు పంపిన కాపీలు డెస్క్‌కు ఎలా చేరుతాయో పరిశీలించారు. ఎడిటోరియల్ విభాగాన్ని పరిశీలించి సబ్ ఎడిటర్లు వార్తలు దిద్దుతున్న తీరును గమనించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కాపీలను చూసి కావాల్సిన అదనపు అంశాలు, సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్‌ను పరిశీలించి పేజీ లేఔట్‌పై తగిన సూచనలిచ్చారు. సర్వే అంశాలు బాగున్నాయని, వాటిని ఎలా నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళలపై తెప్పించిన కథనాలను చూసి తగిన ఫొటోలు ఉన్నాయా.. లేవా? అని సరిచూసుకోవాలని, అక్షరదోషాలు లేకుండా దిద్దాలని సూచించారు. అనంతరం ఐటీ, ఏడీవీటీ, స్కానింగ్, సీటీపీ, ప్రొడక్షన్ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. నూతన టెక్నాలజీతో అన్ని రంగుల్లో పత్రిక వెలువడుతున్న తీరును చూసి బాగుందని కితాబిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలివ్వాలి.. పత్రికలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వాలని మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. న్యాయసంబంధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచురించాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలను జర్నలిజంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఆధారాలతో పరిశోధనాత్మక వార్తలు రాయాలని సూచించారు. మహిళా చైతన్యంలో పత్రికలు కీలకమని పేర్కొన్నారు. సాక్షి గెస్ట్ ఎడిటర్‌గా తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాక్షి సిబ్బంది ఆమెకు శాలువా అందించి సన్మానించారు. మహిళల ‘సౌర’ సాగు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆమెకు అండగా.. పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’టీమ్ – 8లోuకూతుళ్లే మహారాణులు కొందరు ఒక్కరితో సరి.. ‘సాక్షి’ సర్వేలో మహిళల మనోగతం వార్తకు అనుగుణంగా శీర్షికలు ఉండాలి.. కచ్చితమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి.. మహిళా దినోత్సవ కథనాలు బాగున్నాయని కితాబు -
రాజీ మార్గమే రాజమార్గం
ఇరుపక్షాలు గెలిచినట్టే.. లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకోవడం వల్ల ఇరుపక్షాలు గెలిచినట్లే. లోక్ అదాలత్‌లో కేసులను రాజీ చేసుకుని ప్రశాంతమైన జీవితం గడపాలి. క్షణికావేశంలో జరిగిన ఘర్షణలు కేసుల నమోదుల కారణంగా కక్షిదారులు కోర్టు చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అలా కాకుండా ఒక మంచి ఆలోచనకు వచ్చి లోక్ అదాలత్‌ను వేదికగా చేసుకుని రాజీ కుదుర్చుకుని శాంతియుత వాతావరణంలో జీవించాలి. – డి.రవీంద్రశర్మ, ఇన్చార్జ్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిమహబూబాబాద్ రూరల్: సత్వర న్యాయం, సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న లోక్ అదాలత్ వేదికగా కక్షిదారులు రాజీకి వచ్చి కేసులను తొలగించుకుని ప్రశాంతంగా జీవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోరుతుంది. కేసుల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ఇన్చార్జ్ జిల్లా జడ్జి రవీంద్రశర్మ, కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సురేష్ ఆధ్వర్యంలో జడ్జీలు, న్యాయవాదులు, న్యాయ సంస్థలు, ఎకై ్సజ్, సివిల్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించిన సమయంలో రాజీ పడదగిన సివిల్, మోటారువా హన ప్రమాదాలు, క్రిమినల్, వివాహ కుటుంబ కేసులు, బ్యాంకు చెక్కు బౌన్స్ కేసులు, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఎకై ్సజ్, విద్యుత్ చోరీ (దొంగతనాలు), ట్రాఫిక్, ఈ చలాన్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టుల్లో తెలియజేసి రాజీ కుదుర్చుకుని కుటుంబసభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సూచిస్తున్నారు. 9,439 కేసుల పరిష్కారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 2024 సంవత్సరంలో 4 పర్యాయాలు నిర్వహించిన లోక్ అదాలత్‌లో 9,439 కేసులు పరిష్కారం అయ్యాయి. మార్చి 16న 3,323 కేసులు. జూన్ 8న 1,088 కేసులు, సెప్టెంబర్ 28న 1,777 కేసులు డిసెంబర్ 14న 3,251 కేసులు పరిష్కారం జరిగాయి. నేడు జాతీయ లోక్ అదాలత్ జిల్లా కోర్టు భవనాల సముదాయ ప్రాంగణంలో నేడు (శనివారం) ఉదయం పది గంటలకు జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమవుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, ఇన్చార్జ్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్రశర్మ, సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి సి.సురేష్ పేర్కొన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులో తెలియజేసి రాజీ కుదుర్చుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్ -
రేపు ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ బస్టాండ్ సమీపం సెంట్రల్ కాంప్లెక్స్‌లోని శ్రీహర్ష కన్వెన్షన్హాల్లో పోటీలు జరగనున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన వారికి నగదు పురస్కారంతోపాటు ప్రశంసపత్రాలు, పతకాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు నమోదు , ఇతర వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పోస్టర్ ఆవిష్కరణ
మహబూబాబాద్ రూరల్: తెలంగాణ పోలీస్ కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ సంబంధించిన పోస్టర్‌ను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వెబ్సైట్ ద్వారా సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లలో పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారన్నారు. సైనిక్ స్కూల్ తరహాలో దేశానికి ఒక రోల్ మోడల్లా పిల్లలను తీర్చిదిద్దేలా ఈ స్కూల్ ఉంటుందన్నారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించడం, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించడం స్కూల్ ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, ఆర్ఐలు సోములు, భాస్కర్, ఐటీ సెల్ ఎస్సై అరుణ్ కుమార్, శ్రీధర్, రవి పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్ మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్‌ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ తెలంగాణ మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద వంగర పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలో హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్ ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మద్యం సేవించారనే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సదరు ఘటనపై విచారణ జరిపి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌పై రిపోర్ట్ పంపగా వారిని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. మెరుగైన ఫలితాలు సాధించాలి●కురవి/నెల్లికుదురు: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కురవి, నెల్లికుదురు మండలాల్లోని పలు పాఠశాలల్లో జరుగుతున్న టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలో ఆన్సర్ బుక్లెట్ గురించి వివరించారు. ఓఎంఆర్ షీట్ డిస్ప్లే వినియోగం తీరును వివరించారు. లోటుపాట్లను సరిదిద్దుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఇష్టపడి చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పాఠశాలలో లోకాస్ట్, నోకాస్ట్ యూరినల్ యూనిట్లు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, హెచ్ఎం ఎ.రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి తొర్రూరు: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ గుండాల మురళీ ధర్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని పలు ప్రై వేట్ ఆస్పత్రులను శుక్రవారం వైద్యాధికారులు తనిఖీ చేశారు. అనుమతులు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతీ ఆస్పత్రిలో ఫీజుల వివరాలు, వై ద్యుల పేర్లు బోర్డుపై ప్రదర్శించాలన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులనే డ్యూటీ డాక్టర్లను నియమించుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు రాష్ట్ర వి ద్యా మండలిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వై ద్యం చేయడానికి అనుమతించాలన్నారు. -
కూతుళ్లే మహారాణులు
జఫర్‌గఢ్: కూనూర్ గ్రామానికి చెందిన ఈగ కృష్ణమూర్తి–శోభ దంపతులకు రమ్యకృష్ణ, సౌమ్యకృష్ణ ఇద్దరు కుమార్తెలు. కృష్ణమూర్తి ఇంటి ముందు చిన్న టీ కొట్టుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తెల ప్రాథమిక విద్య స్టేషన్‌ఘన్‌పూర్‌లో, ఇంటర్ హనుమకొండలోని ప్రైవేట్ కళాశాలలో చదివించాడు. పెద్దకూతురు రమ్యకృష్ణ హైదరాబాద్ వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు సౌమ్యకృష్ణ కూడా హైదరాబాద్ ఎంజీఐటీ కళాశాలలో బీటెక్, జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తి చేసింది. ఈమె నాలుగు నెలల క్రితం నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. చిన్న తనం నుంచి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసిన అక్కాచెల్లెల్లు పట్టుదలతో చదివి కన్నవారి కష్టాలు దూరం చేశారు. పిల్ల లు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులయ్యారని, ఆడపిల్లలైనా మగ పిల్లలు లేని లోటు తీర్చారంటూ ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కూతుళ్లతో తల్లిదండ్రులు తిరుపతి,సరితటేకుమట్ల: కూతుళ్లయితే ఏంటి వారిని ఝాన్సీరాణి మాదిరి తీర్చిదిద్దడమే మా బాధ్యత అంటున్నారు టేకుమట్ల మండలంలోని పెద్దంపల్లికి చెందిన శాస్త్రాల తిరుపతి–సరిత దంపతులు. వారి ఇద్దరు కుమార్తెలు వర్థినిసేన తొమ్మిదో తరగతి చదువుతుండగా.. ధైర్యసేన రెండో తరగతి చదువుతోంది. వర్థినిసేనకు కరాటే, కర్రసాము, క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ అండర్–14 కరాటే విభాగంలో తెలంగాణ నుంచి వర్థినిసేన పాల్గొంది. చిన్న కూతురు ధైర్యసేనకు సైతం పలు రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. కూతురంటేనే ఇష్టం ఖానాపురం: తమకు కూతురంటేనే ఇష్టం అంటున్నారు ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పేరాల హరీశ్‌రావు–కల్పన దంపతులు. పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వీరికి కుమార్తె అంజనారావు పుట్టగానే ఆమైపె ఇష్టంతో ఇక పిల్లలు వద్దనుకున్నారు. ఆమెను ఐపీఎస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని చదివిస్తున్నారు, ఐదేళ్ల ప్రాయం నుంచే కరాటేలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎన్ని ఆటంకాలెదురైనా కుమార్తెను ఐపీఎస్‌గా చూడాలన్నదే తమ కోరిక అని వారు చెబుతున్నారు. కొందరు ఒక్కరితోనే సరి.. మరికొందరికి ఇద్దరు కూతుళ్లు వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న పేరెంట్స్ మగపిల్లలు లేని లోటు తీరుస్తున్నారంటున్న తల్లిదండ్రులు -
మహిళా దినోత్సవానికి 12 ఆర్టీసీ బస్సులు
హన్మకొండ: హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమానికి మహిళలను తరలించేందుకు వరంగల్ రీజియన్‌లో 12 బస్సులు కే టాయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలకు రెండేసి బస్సుల్లో మహిళలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అద్దె బస్సులను మహిళలకు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో ఎన్ని బస్సులు కేటాయిస్తారనే దానిపై స్పష్టత కరువైంది. దీనిపై ఆర్టీసీ అధికా రులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు తమకు స్పష్టమైన ఆదేశాలు అందలేదని తెలిపారు. వరంగల్ రీజియన్‌కు మహిళా సంఘాలకు 40 నుంచి 50 బ స్సులు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. మహిళా దినోత్సవం రోజున జిల్లాకు 2 మెగావాట్ల చొప్పున సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయితే మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత లేదు. రాష్ట్రవ్యాప్తంగా 150 బస్సులు మహిళా సంఘాలకు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వరంగల్ రీజియన్‌కు ఎన్ని ఇస్తారనేది నేడు(శనివారం) స్పష్టం కానుంది. వాజ్‌పేయి జ్ఞాపకాలతో డాక్యుమెంటరీ హన్మకొండ: మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి జీవిత చరిత్ర, ఆయనతో ప లువురు వ్యక్తులకు సన్నిహిత సంబంధాల జ్ఞాపకాలతో డాక్యుమెంటరీ రూ పొందించనున్నట్లు అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ అజ్మీరా సీతారాంనాయక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హనుమకొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ‘అటల్ జీ యాది (స్మృతి)లో నేను’ అనే ఈ కార్యక్రమాన్ని బీజేపీ జా తీయ నాయకత్వం తీసుకుందన్నారు. వాజ్‌పేయితో సన్నిహితంగా ఉన్న వారు ఉమ్మడి వరంగల్‌లో ఎందరో ఉన్నారని, వారంత తమ వద్ద ఉన్న జ్ఞాపకాలను తన వాట్సాప్ నంబర్లు 9849235055, 9550735675కు గాని ఎఎస్ఆర్నాయక్9 ఎట్దీ రేట్ జీమెయిల్ డాట్ కామ్‌కు పంపాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వర్‌రావు, ధర్మారావు, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోశ్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు పద్మ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ పాల్గొన్నారు. -
ఖండాంతరాలు దాటిన ప్రేమ
● ఒక్కటైన కొలంబియా యువతి, కేసముద్రం యువకుడు కేసముద్రం : కొలంబియా యువతి, కేసముద్రం యువకుడు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్‌కి చెందిన సాయిచైతన్య ఆస్ట్రేలియాలో ఓ కంపెనీలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొలంబియా దేశానికి చెందిన రియా అదే కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించారు. వారి అంగీకారంతో గురువారం కేసముద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. -
ఆర్టీఏపై విజిలెన్స్ నిఘా
ఖిలా వరంగల్ : వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు అందించే సేవలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా వేశారు. అధికారుల పనితీరు, వాహనదారులకు అందించే సేవలపై రహస్యంగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ రవాణాశాఖ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీరో కౌంటర్ల వద్ద అందజేస్తున్న సేవలు, వాహన ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ విధానం, ఆన్లైన్ డ్రైవింగ్ పరీక్షలను స్వయంగా పరిశీలించారు. అనంతరం జీరో కౌంటర్లలో సోదాలు చేసిన అధికారులు ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్ బాబును కలిసి సేవలకు సంబంధించిన కొన్ని పత్రాలను అడిగి తీసుకున్నారు. దళారుల కార్యాలయాల్లో ఏమైనా వాహనదారులకు చెందిన ఫైల్స్ ఉన్నాయా.. అనే దానిపై ఆరా తీశారు. అధికారుల పనితీరు, రవాణాశాఖ అందజేస్తున్న సేవలపై ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.● తరచూగా ఆకస్మిక పరిశీలన, తనిఖీలు -
డ్రైవర్ నిర్లక్ష్యం..ట్రాలీ బోల్తా
చెన్నారావుపేట : డ్రైవర్ నిర్లక్ష్యంతో ట్రాలీ వాహనం బోల్తాపడిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురం శివారులో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జీడిగడ్డ తండాకు చెందిన 37 మంది వ్యవసాయ కూలీలను ఇటుకాలపల్లి శివారు ఇప్పల్ తండాకు చెందిన ధరావత్ మైబూ మిర్చి ఏరేందుకు కూలీలను తీసుకు రమ్మని జీడిగడ్డ తండాకు చెందిన భూక్య సమ్మికి చెప్పాడు. బానోత్ సుక్యతో పాటు 37 మందిని కూలీలను తీసుకోని గూడ్స్ వాహనంలో గురువారం ఉదయం ఇప్పల్ తండాకు బయలుదేరారు. గార్లగడ్డ తండాకు చెందిన ట్రాలీ డ్రైవర్ అజ్మీరా సంతోష్ వాహనాన్ని అతివేగంగా నడపడంతో పాటు ఎక్కువ మంది ఉండడం వల్ల కోనాపురం శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న 37 మంది కూలీలు కింద పడ్డారు. అందులో కొందరికి తీవ్రగాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోతరాజు రాజు, పున్నం నర్సయ్య వెంటనే 108తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజేష్‌రెడ్డిలు చేరుకుని క్షతగాత్రులను నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో బానోత్ సుక్య (55) మృతిచెందాడు. బానోత్ ఈర్య, ఆంగోత్ జమ్లి, నూనావత్ అంబాలి, బానోత్ బుజ్జి, సంపుతోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎంజీఎంకు తరలించారు. మృతుడి కుమారుడి మోహన్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్‌రెడ్డి తెలిపారు. తప్పిన పెను ప్రమాదం.. వాహనం బోల్తా పడిన ప్రదేశంలో పెద్ద బండరాయి ఉంది. ఒకవేళ వాహనం బండరాయి పై పడి ఉంటే మరికొందరు మృత్యువాత పడేవారని స్థానికులు చెబుతున్నారు. వాహనంలో 37మంది కూలీలు ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం కోనాపురం శివారులో ఘటనబతికి బయట పడ్డా..నర్సంపేట మండలం ఇప్పల్‌తండాకు చెందిన రైతు పంపిన వాహనంలోనే మిర్చి ఏరడానికి వెళ్లాను. వాహనం స్పీడ్‌గా వెళ్తుంది. ఒక్కసారి కోనాపురం శివారులో బోల్తా పడింది. కొద్దిసేపు ఏం జరిగిందో అర్థం కాలే. చాలా మందికి దెబ్బలు తగిలాయి. నాకు స్వల్పంగా గాయాలయ్యాయి.ఆ ప్రమాదం చూస్తే చనిపోయాననుకున్నా. దేవుడు మరో జన్మనిచ్చాడు. – బానోత్ అరుణ, ట్రాలీలో ఉన్న కూలీ కళ్ల ముందే బోల్తా పడింది..కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడిన సమీపంలోనే నా వ్యవసాయ భూమి ఉంది. పంటకు నీళ్లు పెట్టి బయటికి వచ్చాను. చూస్తుండగానే అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. వెంటనే అక్కడికి వెళ్లి వాహనంలో ఉన్న వారి సాయంతో అందరిని బయటికి తీశాం. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. – పున్నం నర్సయ్య, ప్రత్యక్ష సాక్షి -
పెళ్లి వద్దని ఆత్మహత్యాయత్నం
● మానుకోట ఎస్సై సమాచారంతో కాపాడిన కాజీపేట జీఆర్పీ అధికారులు ● తండ్రికి విద్యార్థిని అప్పగింత కాజీపేట రూరల్ : పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఓ విద్యార్థిని కాజీపేట జంక్షన్ రైల్వే యార్డులో గురువారం తెల్లవారు జామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అదుపులోకి తీసుకోని ఆమె తండ్రికి అప్పగించిన సంఘటన కాజీపేటలో జరిగింది. జీఆర్పీ కానిస్టేబుల్ ఆర్.కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్ జిల్లాకు చెందిన నందిని హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఇంటికి వచ్చిన నందినికి పెళ్లి చేస్తానని చెప్పడంతో తల్లి కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నందిని బుధవారం ఇంటి నుంచి వచ్చి కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అదే రోజు రాత్రి నందిని కాజీపేటలో ప్రయాణికుడి సెల్‌ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నానని, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అప్రమత్తమై తండ్రి మహబూబాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సమాచారంతో కాజీపేట జీఆర్పీ పోలీసులు రైల్వే యార్డు ఆర్ఆర్ఐ సమీపంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నందినిని గుర్తించి అదుపులోకి తీసుకోని జీఆర్పీ స్టేషన్‌కు తరలించారు. తండ్రిని పిలిపించి జీఆర్పీ అధికారుల ఆదేశాలనుసారం నందినిని తండ్రి అప్పగించినట్లు ఆయన తెలిపారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు, జరిమానా మడికొండ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన మీరాల రాజు 2017, జూలై 22న సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటి ఎస్సై మధుప్రసాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, విచారణలో భాగంగా గురువారం కానిస్టేబుల్ వి.రాజేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాడు. ప్రాసిక్యూషన్ తరఫున ఎస్.దుర్గబాయ్ వాదించగా నిందితుడిపై నేరం రుజువైంది. దీంతో హనుమకొండ మొదటి అదనపు న్యాయమూర్తి చింతాడ శ్రావణ స్వాతి నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6,000ల జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపారు. -
శరవేగంగా భూ సర్వే
ఖిలా వరంగల్ : మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. భూ సర్వేకు రైతుల సైతం సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్ల నిధుల విడుదల చేసింది. కలెక్టర్ ఆదేశాలతో గురువారం తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో నక్కలపల్లి, గాడిపల్లి గ్రామ శివారులో శరవేగంగా భూ సేకరణకు సర్వే చేపట్టారు. రైతుల సహకారంతో తొలిరోజు 170 ఎకరాల భూ సర్వే చేసి హద్దులు గుర్తించారు. అనంతరం భూ నిర్వాసితుల నుంచి వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతుల సహకారంతో తొలిరోజు నక్కలపల్లి–47, గాడిపల్లి శివారు పరిధిలో 123, మొత్తం 170 ఎకరాలు సర్వే చేశామని తెలిపారు. మిగిలిన 8 3 ఎకరాల భూమి మరో మూడ్రోజుల్లో పూర్తి చేసి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు త హసీల్దార్ తెలిపారు. అనంతరం సర్వేకు సహకరించిన రైతులకు తహసీల్దార్ నాగేశ్వర్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్వేలో ఆర్ఐ ఆనంద్‌కుమార్, సర్వేయర్ రజిత, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ● సర్వేకు రైతుల సుముఖత ● ఎయిర్ పోర్ట్ రన్‌వేకు 253 ఎకరాల భూమి సేకరణ -
గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒకరిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 10 కిలోల 102 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ పి.సర్వయ్య తెలిపారు. పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సర్వయ్య కేసు వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని గంజాం జిల్లా బడఖరిడకు చెందిన బరున బరడ్ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశాలోని ఒకరివద్ద నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేశాడు. సూరత్‌లో అధిక ధరకు విక్రయించేందుకు విజయవాడ మీదుగా వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేస్తున్నారని తెలుసుకుని మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. తొర్రూరు మీదుగా వరంగల్ వెళ్లేందుకు ఆటో ఎక్కి వెళ్తుండగా శనిగపురం వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఆటోదిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతడిని పట్టుకుని, 10 కిలోల 102 గ్రాముల (రూ.5.05 లక్షల విలువగల) ఎండు గంజాయి, మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని రూరల్ సీఐ సర్వయ్య తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్సై దీపిక, ట్రెయినీ ఎస్సై నరేష్, ఏఎస్సై జాకీర్, సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ అభినందించారు. రూ.1,42లక్షల విలువైన గంజాయి.. నడికూడ : మండలంలోని చర్లపల్లి వద్ద నిషేధిత గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నారు. పరకాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బస్టాండ్ వద్ద స్కూటీపై ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ఆపి తనిఖీ చేయగా 2.840 కేజీల గంజాయి రవాణా చేస్తు పట్టుబడ్డారు. అదుపులో తీసుకొని విచారించగా ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా, చిత్రకొండ నాగులూర్కు చెందిన పప్పల్ బాలయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచకు చెందిన ముదిగొండ ప్రశాంత్ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1,42 లక్షల వరకు ఉంటుందని, నిందితులను అదుపులోకి తీసుకొని, పరకాల పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
కుమారుడిని ఎస్సై అకారణంగా తిట్టాడని..
రాయపర్తి: న్యాయం చేయాలని స్టేషన్‌కు వస్తే ఎస్సై.. తమ కుమారుడిని అకారణంగా తిట్టాడంటూ ఓ తండ్రి వ్యవసాయపొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై శ్రవణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆ రైతు కుటుంబ సభ్యులు వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఎర్రకుంటతండా గ్రామానికి చెందిన భూక్య మల్లునాయక్ తనకున్న మూడున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. తన పక్కనే ఉన్న మరో రైతు సపావత్ ద్వాల్యానాయక్ గతంలో తన భూమిలో బోరు వేయించుకున్నప్పుడు భవిష్యత్‌లో మల్లు బోరు వేసుకున్నా అభ్యంతరం చెప్పనని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. యాసంగి వరిసాగు చేస్తున్న క్రమంలో భూక్యా మల్లునాయక్కు చెందిన వరిపంట ఎండిపోతుండడంతో బోరు వేయించేందుకు బోరుబండిని తీసుకు వచ్చాడు. వేరేచోట వేయించుకోవాలంటూ ద్వాల్యా నాయక్ కుటుంబం బోరుబండిని పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన భూక్య మల్లునాయక్, కుటుంబ సభ్యులతో కలిసి ద్వాల్యా నాయక్‌కు చెందిన బోరు స్టార్టర్‌ను తీసుకు వచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మల్లునాయక్తో వచ్చిన తన కుమారుడిని ఎస్సై ‘ఏం చదువుకున్నవు’ అంటూ ఇష్టమొచ్చిన బూతులు తిడుతూ ‘నువ్వు చస్తే చావు నాకేం సంబంధం’ అనడంతో ఆవేశానికి లోనైన మల్లునాయక్ తన వ్యవసాయ పొలానికి చేరుకొని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మల్లు నాయక్ కుటుంబ సభ్యులు రాయపర్తిలోని పోలీస్ స్టేషన్ ఎదుట వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఎస్సై శ్రవణ్‌కుమార్ తనను అకారణంగా బూతులు తిట్టాడని తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఎస్సైని సస్పెండ్ చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట, జఫర్గడ్ ఎస్సైలు చందర్, రామ్‌చరణ్‌లు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికి వినలేదు. ఎస్సైని సస్పెండ్ చేస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని పట్టుబట్టారు. చీకటిపడే వరకు వారంతా అక్కడే ఉన్నారు. ఎస్సైని సస్పెండ్ చేయాలని నేడు (శుక్రవారం) కూడా ఆందోళన చేస్తామని అక్కడినుంచి వెళ్లిపోయారు. పొలంవద్ద పురుగుల మందుతాగిన తండ్రి వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై కుటుంబ సభ్యుల ధర్నా ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ -
భళా.. ఇత్తడి హస్తకళ
సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లా రంగశాయిపేట ఇత్తడి హస్తకళకు దేశ రాజధానిలో ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. కాకతీయుల కాలం నాటి వెండి నగిషీలు తయారుచేసే పెంబర్తి హస్తకళకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉంటే.. వాటి సరసన రంగశాయిపేట ఇత్తడి హస్తకళ పోటీపడుతోంది. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి నిలయంలో బుధవారం నుంచి జరుగుతున్న దక్షిణ భారత ఎగ్జిబిషన్లో రంగశాయిపేట ఇత్తడి హస్తకళ స్టాల్‌కు చోటు లభించింది. ఓ వైపు సాంస్కృతిక ప్రతిరూపాలను తెలిపే డిజైన్లు, మరోవైపు నేటి కాలానికి తగ్గట్టుగా మోడ్రన్ డిజైన్ విత్ ఎంబోజింగ్ వర్క్ ద్వారా విభిన్న హస్తకళ డిజైన్లు చేస్తుండడంతో వీటికి ప్రత్యేక గుర్తింపు లభించింది. నాబార్డు, డీసీహెచ్ మద్దతుతో వందలాది కుటుంబాలకు ఈ హస్తకళ నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా రంగశాయిపేట ఇత్తడి హస్తకళ బంధం ముందుకెళ్తోంది. ‘రాగి లేదా ఇత్తడి లోహన్ని సన్నని షీట్లుగా కొట్టి, చక్కటి తీగగా కట్ చేస్తాం. చెక్క ఉపరితలంపై గుర్తించబడిన డిజైన్‌ను సుత్తి, ఉలి సాయంతో కోస్తాం. ఇత్తడి లేదా రాగి తీగను డిజైన్‌తో చెక్కబడిన భాగంలోకి సుత్తితో గుచ్చుతాం. ఆ తర్వాత రంపంతో కత్తిరించి డిజైన్‌లో కావల్సిన ప్రదేశాలలో జిగురుతో బిగిస్తాం. అత్యాధునిక పద్ధతులతో వివిధ డిజైన్లతో వస్తువులను తయారు చేస్తున్నాం. ఇంటిరియర్ వర్క్‌లో ఫ్లవర్ వాజెస్, వాల్ ప్యానెల్స్, డోర్ ప్యానెల్స్ చేస్తున్నాం.అలాగే దేవాలయం, దేవుళ్ల ఫొటోలతో కూడా ఎంబోజింగ్ వర్క్‌తో అది కూడా చేతి ద్వారా చేయడంతో ఆయా బొమ్మల ఆకారం స్పష్టంగా కనబడుతుంద’ని రంగశాయిపేట ఇత్తడి హస్తకళ బృంద సభ్యుడు ప్రణయ్ గురువారం ‘సాక్షి’కి వివరించారు. అలాగే వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. రంగశాయిపేట ఇత్తడి హస్తకళలకు రాష్ట్రపతి నిలయంలో జరిగిన అమృత్ మహోత్సవ్ ఎగ్జిబిషన్ లో చోటు దక్కడం జిల్లాకు దక్కిన గుర్తింపు. మరోసారి చేతికళలకు నిలయమని దేశమంతటా తెలిసింది. ఈ హస్త కళాకారులు భవిష్యత్‌లో ఇత్తడితో విభిన్న డిజైన్లు చేసి ఆర్థికాభివృద్ధి చెందడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వచ్చేలా పనిచేయాలని ఆకాంక్షించారు. ● రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక గుర్తింపు ● వరంగల్‌కు దక్కిన గౌరవంపై ప్రశంసలు ● ప్రత్యేక ఆకృతులతో ఆకట్టుకుంటున్న స్టాల్ -
అస్తిత్వానికి ఆయువు పట్టు ఆంగ్ల భాష
● కెన్యా ప్రొఫెసర్ కుప్పు రామ్ ● కేడీసీలో అంతర్జాతీయ సదస్సు విద్యారణ్యపురి: ఆంగ్ల భాష మన అస్తిత్వానికి ఆయువు పట్టువంటిదని విభిన్న భాషా సంస్కృతులను గౌరవించేదిగా ఇంగ్లిష్ విలసిల్లాలని కెన్యా మసింది ములురో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కుప్పు రామ్ అన్నారు. గురువారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో ‘ట్రాన్స్ఫర్మేషన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ మల్టీ డిసిప్లీనరీ కాంటెక్ట్స్ ఇన్‌ది ఎరా’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కెన్యా యూనివర్సిటీ ప్రొఫెసర్ కీలకోపన్యాసం చేశారు. కేడీసీ ప్రిన్సిపాల్ జి.రాజారెడ్డి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంఈ.వేదశరణ్, కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాంభాస్కర్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. -
రాములోరికి ‘గోటి తలంబ్రాలు’
హన్మకొండ కల్చరల్ : రాములోరి కల్యాణం.. కమనీయం.. రమణీయం..చూసిన కనులదే భాగ్యం.. భద్రాద్రిలో జరిగే వేడుకను తిలకించి..తరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. వీరిలో ఓరుగల్లు మహిళలు పరిణయ వేడుకకు తలంబ్రాలను సిద్ధం చేయడానికి వరిగింజలను గోటితో ఒలిచి తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. గోటి తలంబ్రాలు.. శ్రీరామ నవమి రోజు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ప్రత్యేకత ఉంది. వడ్ల గింజలను రోలులో దంచడంగాని లేక మిల్లులో మరపట్టించినవి కావు.. మహిళలు చేతిగోళ్లతో ఒక్కొక్క ధాన్యపు గింజను వలచిన బియ్యం. వీటినే గోటి తలంబ్రాలు అంటారు. ఎంతో పవిత్రంగా.. శ్రీరామనామ స్మరణతో ఎంతో పవిత్రంగా గోటితో తలంబ్రాలు ఒలుస్తారు. ఈ తలంబ్రాల కోసం విత్తనాల వడ్లను ప్రత్యేకంగా సాగు చేస్తారు. శ్రీరాముడి కల్యాణ తంతు జరుగుతున్నప్పుడు తలంబ్రాలతో పాటు సాగుచేయడానికి కావలసిన వడ్లను కూడా స్వామివారి పాదాల వద్ద పెడతారు. ఆ వడ్లనే తిరిగి సాగుచేయడానికి వాడుతారు. వీటిని కొందరు భక్తిభావంతో తమ పొలంలో కొంత భూమిని కేటాయించి సాగు చేస్తుంటారు. ప్రత్యేక ముడుపులుగా చేసి మందులు, ఎరుపులు వేయకుండా, కాళ్లతో తొక్కకుండా, పవిత్రంగా పండిస్తున్నారు. పంటపొలాల్లో కంకులను కూడా కత్తులతో కాకుండా శ్రీరామనామం జపిస్తూ చేతిలో వలుస్తారు. కొరియర్ ద్వారా.. వరి ధాన్యాన్ని తలంబ్రాలుగా ఒలిచేందుకు భద్రాచలం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ప్రతినిధులు కొరియర్ ద్వారా పంపగా వరంగల్ బ్యాంక్‌కాలనీలోని ఏలిషాల సుజాత అందుకున్నారు. ఈ ధాన్యాన్ని కాలనీ మహిళలు నిత్యం నిష్టతో ఉండి భక్తిశ్రద్ధలతో శ్రీరామ కీర్తనలు ఆలపిస్తూ, శ్రీరామ స్మరణ చేస్తూ గోటితో ఒలిచి.. తలంబ్రాలుగా తయారు చేస్తున్నారు. ఈ నెల 8న శనివారం ఒలిచిన తలంబ్రాలను కొరియర్ ద్వారా భద్రాచలం రాములవారికి పంపిస్తారు. సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తున్నామని మహిళలు చెబుతున్నారు. చేతిగోళ్లతో ఒక్కో వరి గింజను ఒలిచి.. నవమి నాటికి అక్షింతల బియ్యం సిద్ధంమా ఇంట్లోనే తలంబ్రాలు చేస్తాం..ఫిబ్రవరి 15న భద్రాచలం నుంచి 2 కిలోల వడ్లను అందుకుని వలిచే కార్యక్రమాన్ని మా ఇంట్లో ప్రారంభించాము. ఈ నెల 8న శనివారం ఒలిచిన బియ్యాన్ని భద్రాచలానికి పంపిస్తాం. శ్రీసీతారాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించుకుని నియమ నిష్టలతో కాలనీ మహిళలతో కలిసి ఒలిచే కార్యక్రమం మా ఇంట్లో తలంబ్రాలుగా తయారు చేయడం సంతోషంగా ఉంది. – ఏలిషాల సుజాత, బ్యాంక్‌కాలనీ, వరంగల్ ఆనందంగా ఉందిశ్రీరామ నామాన్ని స్మరిస్తూ భక్తిభావంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. భగవంతుని సేవ చేయడం వల్ల మాకు మంచి జరుగుతుందనే భావన. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తోటి మహిళలతో స్నేహబంధాలు పెరుగుతాయి. – లావణ్య, బ్యాంక్‌కాలనీ, వరంగల్ధన్యులమయ్యాం..రాముల వారి కల్యాణంలో ముఖ్యమైన ఘట్టం తలంబ్రాలు.. ఈ అక్షింతలను కోటి తలంబ్రాలుగా చెబుతారు. గోటీ తలంబ్రాల కార్యక్రమంలో భాగస్తులైనందుకు ధన్యులమయ్యాం. -
ఎల్ఆర్ఎస్ ఉంటేనే నిర్మాణ అనుమతి
మహబూబాబాద్: ఎల్ఆర్ఎస్ ఉంటేనే గృహ ని ర్మాణ అనుమతి ఇస్తామని మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో పాటు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, మెప్మా ఆర్పీలతో సమావేశం నిర్వహించి ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ 2020 కంటే ముందు లేఅవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసి రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన వారికి ఎల్ఆర్ఎస్ అనుమతి ప్రభుత్వం కల్పించిందన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 12,201 దరఖా స్తులు రాగా దానిలో 1,670 ఆమోదించినట్లు తెలి పారు. ఈనెల 31లోపు ఫీజు చెల్లిస్తే 25శాతం రాయి తీ ఉందని మొత్తం ఫీజు ఒకేసారి చెల్లించాలన్నారు. దరఖాస్తుదారుడి సెల్ నంబర్ రిజిస్ట్రేషన్ దానిపై ఉన్న నంబర్ నమోదు చేయగానే ఓటీపీ రాగానే ఫీ జు చెల్లించాల్సి వస్తుందన్నారు. సిబ్బంది కూడా ఎల్ఆర్ఎస్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించా లన్నారు. ఈ సమావేశంలో టీపీఓ సాయిరాం, టీపీఎస్ ప్రవీణ్, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీందర్ -
విద్యతోనే మహిళా సాధికారత
● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి కేయూ క్యాంపస్: విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అ న్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా ది నోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ రైన వీసీ మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. వివిధ పదవుల నిర్వహణలో నూ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయంలో పరిపాలనా పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. మహిళలు మల్టీటాస్కర్స్ అన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారదను సన్మానించారు. మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బి.రమ, టి.స్వప్న, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మార్కెట్ నిండా ఎర్రబంగారమే
మహబూబాబాద్ రూరల్: మానుకోట వ్యవసాయ మార్కెట్‌కు రోజురోజుకూ మిర్చి గణనీయంగా పెరుగుతుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా రైతులు వాహనాల్లో మిర్చి బస్తాలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. మిర్చి రావడం పెరిగిన క్రమంలో కొనుగోళ్లు ఆలస్యం కావడం, కొంత మొత్తాన్ని ఒకరోజు మరికొంత మొత్తాన్ని మరొకరోజు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోవడంతో ఉన్నంతవరకు గురువారం కొనుగోలు జరిపి మిగిలినవి మరుసటి రోజున కొనుగోళ్లు చేస్తామని వ్యాపారులు ప్రకటించారు. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ, అధికారులు శుక్రవారం వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు బంద్ ఉంటాయని శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో మళ్లీ ఈనెల 10వ తేదీ (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. గురువారం సుమారు 20 వేలకుపైగా మిర్చి బస్తాలురాగా అందులో 17,135 బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేశారు. మిర్చి బస్తాలను తీసుకువచ్చిన వాహనాలు మార్కెట్ ఆవరణలోకి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో వాటిని కోల్డ్ స్టోరేజీల ఎదుట నిలిపి ఉంచారు. మిర్చి బస్తాల వాహనాలు కోల్డ్ స్టోరేజీల ఎదుట బారులు దీరగా రైతులు అక్కడే అమ్ముకుని వెళ్తామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రైతుల రాస్తారోకో వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు ఆపవద్దంటూ గురువారం రాత్రి రైతులు రాస్తారోకో చేశారు. మిర్చి వాహనాలను మార్కెట్లోనికి అనుమతించి క్రయవిక్రయాలు జరపాలని రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ షంషీర్, టౌన్ సీఐ దేవేందర్, ఎస్సై విజయ్‌కుమార్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వాహనాలను అనుమతించి మిర్చి కొనుగోళ్లు జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసముద్రం మార్కెట్లో..కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు గోస పడుతున్నారు. గురువారం అత్యధికంగా 10వేల మిర్చి బస్తాలను రైతులు తీసుకురావడంతో టెండర్లు ఆలస్యమయ్యాయి. రైతులు మిర్చి ఘాటుతో ఇబ్బందులు పడుతూ రాత్రంతా గడపాల్సివచ్చింది. మార్కెట్ అధికారులు, వ్యాపారుల నిర్లక్ష్యంతో ఖరీదులు ఆలస్యమవుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా మార్కెట్‌కు అత్యధికంగా మిర్చి రావడంతో శుక్రవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. శనివారం, ఆదివారం వారాంతపు సెలవు ఉండటంతో సోమవారం తిరిగి మార్కెట్లో క్రయవిక్రయాలు సాగుతాయన్నారు. 17,135 బస్తాల మిర్చి కొనుగోలు నేటి నుంచి మిర్చి మార్కెట్ బంద్ కోల్డ్ స్టోరేజీల ఎదుట బారులుదీరిన వాహనాలు -
ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీయడిట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) సీహెచ్.మదార్‌గౌడ్ తెలిపారు. జనరల్ స్టూడెంట్లు 3,230 మంది విద్యార్థులకు 3,149 మంది హాజరుకాగా 81 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌లో 1,068 మంది విద్యార్థులకు 1,015 మంది విద్యార్థులు హాజరుకాగా 53 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తానికి 4,298 మందికి గాను 4,164 మంది విద్యార్థులు హాజరుకాగా 134 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌లు జరగలేదని, ప్రశాంతంగా తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలిక కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులు వెనుతిరిగాడు. అనంతారం మోడల్ కళాశాలలో డీఐఈఓ మదార్‌గౌడ్, ఫ్లయింగ్ స్వ్కాడ్లు తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు మాల్ ప్రాక్టిస్‌కు పాల్పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మొదటి రోజు 134 మంది గైర్హాజరు -
పార్కులో వసతులు కల్పించాలి
డోర్నకల్: బతుకమ్మ పార్కుకు వచ్చే వారి కోసం వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్‌వత్సవ్ టొప్పో ఆదేశించారు. డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని బతుకమ్మ పార్కును గురువారం అడిషనల్ కలెక్టర్ తనిఖీ చేశారు. పార్కులోని మొక్కలను పరిశీలించి ఎండాకాలం వచ్చినందున మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పార్కులోకి వాకింగ్, జిమ్ కోసం వచ్చే వారికి మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. అనంతరం బంకట్సింగ్తండాలోని ఎంపీపీఎస్ పాఠశాలను తనిఖీ చేయగా ఆ సమయంలో పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు, ఉపాధ్యాయురాలు ఉండటంతో ఆశ్యర్యం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారని ప్రశ్నించగా ఇక్కడి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారని ఉపాధ్యాయురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
నాణ్యమైన భోజనం అందించాలి
గార్ల: ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అభివృద్ధి అధికారి దేశీరామ్నాయక్ ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ను ఆదేశించారు. గురువారం గార్లలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వసతిగృహంలోని బెడ్రూమ్లు, టాయిలెట్స్, బాత్రూమ్లను సందర్శించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట హెచ్ఎం సీహెచ్ జోగయ్య, వార్డెన్ రాధిక, బుచ్చానాయక్, ఉపాధ్యాయులు ఎల్లయ్య, గంగావత్ శ్రీనివాస్, రుక్కి, తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్గార్ల: గార్ల రైల్వేస్టేషన్లో నేటి నుంచి మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదల చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గార్లలో మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదలకు కృషి చేసిన ఎంపీలు పొరిక బలరాంనాయక్, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కోరం కనకయ్యలకు గార్ల మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు షురూమహబూబాబాద్ అర్బన్: పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బా లికల పాఠశాలను విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్‌రెడ్డి గురువారం సందర్శించి విద్యార్థుల పరీక్షల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రీ ఫైనల్ పరీక్షలను బట్టి విద్యార్ధుల సామర్థ్యాలు తెలిసిపోతా య ని, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక నిఘాతో సబ్జెక్ట్‌ల వారీగావిద్యను బోధించాలన్నారు. ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షల్లో జిల్లాను ఆగ్రగామి గా నిలిపేందుకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సైన్స్ అధికారి అప్పారావు, ఏఎంఓ చంద్రశేఖర్ఆజాద్,ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పంటమార్పిడితో అధిక దిగుబడిమహబూబాబాద్ రూరల్: పంట మార్పిడితో అధిక దిగుబడి వస్తుందని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయిల్ పామ్, మల్చింగ్ విధానం, తీగజాతి పద్ధతిలో కూరగాయలు సాగు చేసిన రైతులతో మరి యన్న మాట్లాడారు. ఆయిల్ పామ్ గెలల ధరలు పెరిగాయని, గెలలు ఒక టన్నుకు రూ.20,871 పలుకుతుందన్నారు. ఉద్యాన పంటల సాగు లాభదాయకమని, పంట మా ర్పిడితో అధిక ఆదాయం సమకూరుతుందన్నారు. నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే పండ్ల తోట లు జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫ లం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్, కూరగాయలు, ఆకు కూరలు, తదితర పంటలు సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారులు శాంతి ప్రియదర్శిని, శాంతిప్రియ, మానస,రైతులు మాలోతు రాందాస్, గుగులోతు సుగుణమ్మ, తేజ్య, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ అనిల్, బిందు సేద్య అధికారులు అగస్టిన్, తదితరులు పాల్గొన్నారు. -
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి
నర్సింహులపేట: వరిలో నేరుగా వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ ఽఅధికారి విజయనిర్మల అన్నారు. గురువారం మండలంలోని పెద్దనాగారంలో నేరుగా వెదజల్లే వరి, మొక్కజొన్న, బీరసాగు, వేరుశనగ పంటలను ఆమె సందర్శించి పరిశీలించారు. వెదజల్లే పద్ధతితో కూలీల సమస్యను అధికమించ వచ్చన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా ఫాస్పరస్ సొల్యూబుల్లైజింగ్ బ్యాక్టీరియా, సుడోమోనస్ బ్యాక్టిరీయా పోడిని రాయితీపై రైతులకు పంపిణీ చేశారు. వేరుశనగ పంటలో ఊడలు దిగే సమయానికి జిప్సమ్ వాడటం వలన అధిక దిగుబడులు వస్తాయని డీఏఓ అన్నారు. పంటలపై చీడపీడల నివారణకు తీసుకునే చర్యలను వివరించారు. రైతులకు ఏ సమస్య ఉన్న స్థానిక రైతువేదికలో అగ్రికల్చర్ సిబ్బందిని కలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ వినయ్‌కుమార్, ఏఈఓ బాబు, రైతులు పాల్గొన్నారు. రైతులను మోసగిస్తే కఠిన చర్యలు పెద్దవంగర: రైతులను మోసగిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పర్టిలైజర్ షాపులను స్థానిక వ్యవసాయాధికారి స్వామి నాయక్‌తో కలిసి సందర్శించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విజయ నిర్మల మాట్లాడారు. లైసెన్స్‌లు ఉన్న షాపుల్లోనే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహా వ్యవసాయ సంచాలకులు విజయచంద్ర, ఏఈఓ గడల రాజు, తదితరులు పాల్గొన్నారు. -
దేహదారుఢ్యానికి క్రీడలు అవసరం
మహబూబాబాద్: క్రీడలు మానసికోల్లాసానికి, దే హదారుఢ్యానికి దోహదపడతాయని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధి కారం సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు క్రీడలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం క్రీడల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె. వీరబ్రహ్మచారి, టీజీఓ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌రఫి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ -
భక్తిశ్రద్ధలతో పుష్పోత్సవం
కురవి: భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి భక్తి శ్రద్ధలతో పుష్పోత్సవం (పవళింపు సేవ) కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తులను అదీష్టింప చేసి గణపతి పూజ, గౌరీపూజ, పుణ్యహవచనము నిర్వహించి పుష్పోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలోని పూలతో అలంకరించిన ఊయల వద్దకు మేళతాళాల నడుమ ఉత్సవమూర్తులను తోడ్కోని వెళ్లి పవళింపు సేవను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సర్వయ్య దంపతులు, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి దంపతులు, ఆలయ ధర్మకర్త చిన్నం గణేష్, బాలగాని శ్రీనివాస్, అర్చకులు రెడ్యాల శ్రీనివాస్, పెనుగొండ అనిల్‌కుమార్, దూసకంటి విజయ్, పుణ్యమూర్తి, విజయ్, అభిలాష్, తేజ, బాలకృష్ణ, శ్రీకాంత్, రమేశ్ పాల్గొన్నారు. -
బియ్యం రాలే..!
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం పేదలకు ప్రతీ నెల అందించే రేషన్ బియ్యం ఈనెల ఆలస్యం అవుతుంది. నెల చివర వరకు డీలర్ పాయింట్లకు రావాల్సిన బియ్యం ఇంకా మండల్ లేవల్ స్టాక్ పాయింట్లకే చేరలేదు. ఉగాది నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రజాప్రతినిధులు చెప్పడంతో ఈ సారి సన్న బియ్యం తెచ్చుకుందామని డీలర్ల వద్దకు వెళ్తే సన్న బియ్యం కాదు కదా.. దొడ్డు బియ్యం కూడా రాలేదని డీలర్లు చెప్పడంతో షాపుల వద్దకు వెళ్లిన నిరుపేదలు నిరాశగా వెనుదిరి వస్తున్నారు. బియ్యం రాకపోవడంతో అధిక ధర పెట్టి షాపుల వద్ద నుంచి కొనుగోలు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బియ్యం సరఫరా ఇలా.. దేశంలో ఎవరూ కూడా ఆకలితో చావకూడదని చేసిన ఆహార భద్రతా చట్టం ప్రకారం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ప్రతీ నెల రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇలా జిల్లాలోని 556 రేషన్ షాపుల ద్వారా ప్రతీ 2,26,047 ఆహార భద్రత కార్డుల్లోని 6,76,864 మందికి నెలకు 4,061 టన్నులు, 15,300 మంది అంత్యోదయ కార్డులు ఉన్నవారికి కార్డుకు నెలకు 35 కిలోల చొప్పున 751.480 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే ఈనెల డీలర్లు తీసిని ఆర్ఓల ప్రకారం 3,312 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా చేయాలి. కానీ ఇప్పటి వరకు 151 రేషన్ షాపులకు 895 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. గోదాముల్లో నిండుకున్న దొడ్డు బియ్యం పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మిల్లింగ్ చేయించి జిల్లాలోని మహబూబాబాద్, అనంతారం, కేసముద్రం, నెల్లికుదురు, నెక్కొండ ప్రాంతాల్లో ఉన్న బఫర్ గోదాముల్లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, కొత్తగూడ ప్రాంతాల్లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి నెల చివరలో డీలర్ల వద్దకు సరఫరా చేస్తారు. అయితే గతంలో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకున్న కొన్ని మిల్లులు ఇప్పటి వరకు సీఎంఆర్ పెట్టలేదు. అదేవిధంగా మార్చి నుంచి సన్న బియ్యం సరఫరా చేయాల్సి వస్తుందని దొడ్డు బియ్యం నిల్వ పెట్టుకోలేదు. దీంతో బఫర్ గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉన్న కొద్దిపాటి బియ్యం డీలర్ పాయింట్లకు పంపించి అధికారులు చేతులు దులుపుకున్నారు. వారం రోజుల్లో సరఫరా పూర్తి చేస్తాం జిల్లాలో ఎంఎల్ఎస్ పాయింట్లలోని దొడ్డు బియ్యం కొన్ని రేషన్ షాపులకు సరఫరా చేశాం. మిగిలిన షాపులకు వారం రోజుల్లో సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన దొడ్డురకం ధాన్యం సీఎంఆర్ వేగంగా చేయాలని మిల్లర్లకు చెప్పాం. – వీరబ్రహ్మచారి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వారం రోజులు దాటినా.. జిల్లాలోని 556 డీలర్ షాపులు ఉండగా గోదాముల్లో దొడ్డురకం బియ్యం నిల్వలు తక్కువగా ఉండటంతో వంద షాపులకే బియ్యం సరఫరా చేశారని, వాటికి కూడా పూర్తిగా ఇవ్వలేదని తెలిసింది. దీంతో సగం మందికి రేషన్ ఇచ్చి... సగం మందికి ఇవ్వకపోతే. లబ్ధిదారులతో ఇబ్బంది అవుతుందని స్టాక్ తీసుకెళ్లిన డీలర్లలో కొందరు పంపిణీ చేయడం లేదు. దీంతో ప్రతీ నెల ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం ఈ నెల వారం రోజులు దాటినా పంపిణీ చేయడం లేదు. దొడ్డు బియ్యం లేకుండా నిండుకున్న బఫర్ గోదాములకు, అక్కడి నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి డీలర్ల వద్దకు ఎప్పుడు బియ్యం వస్తాయో.. ఏమో అనే విషయంపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు.నేటికి డీలర్లకు చేరని రేషన్ బియ్యం బఫర్ గోదాముల్లో నిండుకున్న దొడ్డు రకం సన్న బియ్యం పంపిణీపై రాని స్పష్టత ప్రారంభంకాని పంపిణీ రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్న పేదలుజిల్లాలోని రేషన్ కార్డులు : 2,26,047మొత్తం రేషన్ షాపులు: 556నెలవారీగా సరఫరా చేసే రేషన్ బియ్యం: 3,312 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు డీలర్ పాయింట్‌కు వెళ్లిన బియ్యం : 895 మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సిన బియ్యం : 2,417 మెట్రిక్ టన్నులు -
పెళ్లింట తీవ్ర విషాదం..
సాక్షిప్రతినిధి, వరంగల్: బంధువులు, అతిథుల మధ్య అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి జరిపించాడు. పెళ్లింటి నుంచి సొంతింటికి వచ్చి వ్రతం చేసుకుంటున్నారు. అంతలోనే బంధువులతో కళకళలాడుతున్న ఆ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్‌తో పెళ్లి కొడుకు తండ్రి మృతి చెందాడు. ఈ ఘటనతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని సుందరయ్య కాలనీ గ్రామానికి చెందిన అక్కిసెట్టి ఏసుబాబు(48)కి భార్య కుమారి, ఇద్దరు కుమారులు హరికృష్ణ, శివ కృష్ణ ఉన్నారు. పెద్ద కొడుకు హరికృష్ణకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన యువతితో సోమవారం(మార్చి 3) పెళ్లి జరిపించాడు. అనంతరం వధూవరులను తీసుకుని తమ ఇంటికి వచ్చాడు. మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తున్నాడు. అదే సమయంలో తనకు అలసటగా ఉందని, వ్రతంలో కూర్చో లేనని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కొత్త జంటతో పాటు వరుడి తల్లి వ్రతంలో కూర్చున్నారు. ఈ క్రమంలో ఏసుబాబు కాళ్లు, చేతులు లాక్కురావడం చూసిన బంధువులు వెంటనే ఆర్ఎంపీతో పరీక్షించగా బీపీ పెరిగినట్లు తెలిపి వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని చెప్పాడు. దీంతో ఏటూరు నాగారం తీసుకు వెళ్లగా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వరంగల్ తీసుకెళ్లాలని అక్కడి ప్రైవేట్ వైద్యుడు తెలుపగా వెంటనే వరంగల్ ఎంజీఎం తరలించారు. వైద్యం చేస్తుండగా బుధవారం మృతి చెందాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. -
నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారం/వెంకటాపురం(కె): నలుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపా రు. ఈమేరకు బుధవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 3వ తేదీన ఛత్తీస్‌గఢ్ బార్డర్ దాటి వెంకటాపురం(కె) మండలం కొత్తపల్లి వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మావోయిస్టు కొరియర్లు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాడిసె అనిల్, కుర్హామి భామన్, మడవి సుక్కు, సోడి ఇడుమాల్.. పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. అనిల్, భామన్, సుక్కు, ఇడుమాల్.. ఈనెల 2వ తేదీన మావోయిస్టుల వద్ద డబ్బులు తీసుకుని 3వ తేదీన చర్ల ప్రాంతంలో దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ చార్జర్లు, బూట్లు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి మావోయిస్టులకు ఇవ్వడానికి వెళ్లే క్రమంలో 4వ తేదీన విజయపురికాలనీ(కొత్తపల్లి) వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఏజెన్సీ ప్రజలు నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరించొద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. -
నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
రామన్నపేట : అన్నదాతలను మోసం చేస్తూ నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి టాస్‌ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. వీరి నుంచి సుమారు రూ.34 లక్షల విలువైన వివిధ కంపెనీల పేర్లతో ఉన్న నకిలీ పురుగు మందులు, రెండు కార్లు, ఐదు సెల్ఫోన్లు, నకిలీ పురుగు మందు లేబుళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం టాస్క్‌ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో తనిఖీ చేయగా పురుగు మందుల డబ్బాలు కనిపించాయి. కారులో ఉన్న నిందితుల్లో ఒకరైన కర్ణాటకలోని బళ్లారి జిల్లా కురుగోడుకు చెందిన నిందితుడు కాట్రగౌడ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్నట్లు అంగీకరించడంతో మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా మంగళవారం నిందితుడు కాట్రగౌడ భాస్కర్ రెడ్డి సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్ చర్లపల్లి ప్రాంతంలోని గోడౌన్‌పై దాడి చేసి మిగతా నలుగురు నిందితులు హైదరాబాద్ కుషాయిగూకు చెందిన పిల్ల నాగవెంకటరంగారావు, లక్డీకాపూల్‌కు చెందిన ముద్దంగుల ఆదిత్య, దూదిమెట్లకు చెందిన పిట్ల నవీన్, మిర్యాలగూడ ఇందిరమ్మకాలనీకి చెందిన దూదిమెట్ల శ్రీధర్‌ను విచారించారు. డిమాండ్ ఉన్న కంపెనీ పేర్లతో నకిలీ పురుగు, గడ్డి మందులు తయారీ చేసి విక్రయించి రైతులను మోసం చేసున్నట్లు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి బేయర్, టాటా, కోర్టెవాతోపాటు మరో నాలుగు కంపెనీల పేర్లతో ఉన్న నకిలీ పురుగు మందులు, గడ్డి మందులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, టాస్క్ఫోర్, వరంగల్ ఏసీపీలు మధుసూదన్, నందిరాంనాయక్, టాస్క్ఫోర్, మట్టెవా డ ఇన్స్పెక్టర్లు సార్ల రాజు, గోపి, ఎస్సైలు ఓరుగుంటి భానుప్రకాశ్, లచ్చయ్య, సాంబయ్య, ఏఏఓ సల్మాన్ పాషా, కానిస్టేబుళ్లు సురేశ్, సాంబరాజు, సురేందర్, రమేశ్‌ను సీపీ అభినందించారు. రూ.34 లక్షల విలువైన మందులు, రెండు కార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ అంబర్ కిశోర్ ఝా -
ఇస్రో పిలుస్తోంది.. వెళ్దాం రండి
మహబూబాబాద్ అర్బన్ : అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ వివరాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. 23వ తేదీ వరకు గడువు.. విద్యార్థులు మార్చి 23వ తేదీలోగా www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా– 25 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 31న ముగింపు సందర్భంగా కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. 7 కేంద్రాల్లో నిర్వహణ.. ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్(ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్(గుజరాత్), హైదరాబాద్(తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). అన్నీ ఉచితంగానే.. ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భో జన, వసతి సౌకర్యాలు ఇస్రో ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 14 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పే సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్‌కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్తగ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం విద్యార్థులకు కల్పిస్తారు. ఎవరు అర్హులు.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు.తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం యువికా కార్యక్రమానికి 23వ తేదీ వరకు గడువు 7 కేంద్రాల్లో నిర్వహణ ప్రయాణం, వసతి సౌకర్యాలు ఉచితం -
121 డిగ్రీ కళాశాలల ఫలితాలు నిలిపివేత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ బీఎస్సీ, బీసీఏ బీ ఒకేషనల్ కోర్సులకు సంబంఽధించి మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను ఈ నెల 4న రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించకపోవడంతో ఆయా కళాశాలల పరీక్షల ఫలితాలను , యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు నిలిపివేశారు. యూనివర్సిటీ పరిధిలో 304 (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల) కళాశాలలు ఉన్నాయి. అందులో 121 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు వివిధ రకాల ఫీజులు చెల్లించాల్సింటుంది. కానీ, ఫీజులు చెల్లించకపోవడంతో వాటి ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు నిలిపివేశారు. దీంతో విద్యార్థులకు ఫలితాలు తెలియక ఆందోళన చెందుతున్నారు. కొన్ని కాలేజీలకు వచ్చి మరికొన్నింటికి రాకపోవడేమంటని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సమయమిచ్చిన వర్సిటీ అధికారులు కాకతీయ యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్, స్టూడెంట్ రికగ్నిషన్ ఫీజు, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఫీజు కలిపి చెల్లించాల్సింటుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా ఫీజులు కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎక్కువమంది ఉన్న కళాశాలలు రూ.లక్షల్లోనే చెల్లించాల్సింటుంది. డిగ్రీకోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు గత ఏడాది డిసెంబర్లో మొదలయ్యే సమయంలో ఆయా ఫీజులు చెల్లించాల్సిండగా, అప్పట్లో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ల బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిని, అప్పటి రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కలిశారు. తమ కళాశాలలకు ప్రభుత్వం రెండుమూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదని, ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఫీజులు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఇందుకు తొలుత అంగీకరించకపోయినా ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో వీసీ, రిజిస్ట్రార్ అంగీకరించారు. 15 నుంచి 20 రోజుల వరకు సమయం ఇచ్చారు. పరీక్షలు పూర్తయ్యాక కూడా కొద్దిరోజుల క్రితం జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తికావొచ్చినప్పడు యూనివర్సిటీ అకడమిక్ డీన్ ఆయా కళాశాలలకు ఫీజులు చెల్లించాలని నోటీస్‌లు పంపారు. కొన్నికళాశాలల యాజమాన్యాలు చెల్లించగా, 121 ప్రైవేట్ కళాశాలలు బుధవారం వరకు ఫీజులు చెల్లించలేదు. ఫీజులు చెల్లించిన వాటి ఫలితాలు వెబ్సైట్ ఉంచి, చెల్లించని వారివి నిలిపివేశారు. ఫీజులు చెల్లిస్తేనే ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించినట్లు క్లియరెన్స్ వస్తేనే ఫలితాలు వెల్లడిస్తాం. ఫీజులు చెల్లించకపోతే ఫలితాలను వెల్లడించే ప్రసక్తి లేదు. ప్రొఫెసర్ రాజేందర్, పరీక్షల నియంత్రణాధికారి, కేయూఆందోళన చెందుతున్న విద్యార్థులు తమ ఫలితాలు చూసుకునే వీలులేకపోవడంతో ఆయా కళాశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కళాశాలలకు వెళ్లి ఫలితాలు కనిపించడం లేదని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ ప్రైవేట్ కళాశాలల యాజామాన్యాల అసోసియేషన్ బాధ్యులు బుధవారం రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిసి.. ఫలితాలు వెల్లడించాలని విన్నవించారు. తాను వీసీ దృష్టికి తీసుకెళ్లాక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారని సమాచారం. కేయూ డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు నోటీసులకు యాజమాన్యాల నో రెస్పాన్స్ -
డీఎన్ఏ.. వ్యక్తిగత జీవితానికి ఆధారం
కేయూ క్యాంపస్: డీఎన్ఏ.. వ్యక్తిగత జీవితానికి ఆధారమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం కేయూలోని జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘యూసెస్ ఆఫ్ రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీ ఇన్ హెల్త్’ అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్ ప్రారంభ సభలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న మాలిక్యూల్ వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు దేశాల ఆర్థిక వ్యవస్థను కూడా మార్చుతుందన్నారు. వ్యాధుల నివారణ, చికిత్సల్లో అపరిమితమైన ఆవశ్యకత ఉందన్నారు. కోవిడ్–19 సమయంలో డీఎన్ఏ ప్రధాన భూమిక వహించిందన్నారు. రోగనిరోధక వ్యవస్థ , యాంటీబాడీల అభివృద్ధిలో కరోనా సమయంలో వ్యాక్సిన్ల ప్రాధాన్యతను గుర్తుచేశారు. భారతదేశం వ్యాక్సిన్ల హబ్‌గా నిలిచిందన్నారు. పబ్లిక్‌హెల్త్‌లో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తితో వ్యయం తగ్గుతుందన్నారు. ఆ దిశగానే పరిశోధనలు కొనసాగించాలన్నారు. సమావేశంలో జూవాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ జి. షమిత, సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు, ఆచార్యులు మామిడాల ఇస్తారి, వై. వెంకయ్య, ఈసం నారాయణ తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి -
నాణ్యతాప్రమాణాలు లేని పాలు
● టెస్ట్ చెక్‌లో గుర్తించినట్లు వెల్లడి వరంగల్: వరంగల్ పోచమ్మ మైదాన్‌లో హనుమకొండ విజయ డెయిరీలో ‘పాల నాణ్యత’పై బుధవారం టెస్ట్ చెక్ నిర్వహించగా ప్యాకెట్లపై పేర్కొన్న విధంగా ప్రమాణాలు లేవని వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు. వినియోగదారుల మండలి సేకరించిన(19) ప్రైవేట్ డెయిరీల పాల నాణ్యతాపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పాల ప్యాకెట్లపై ము ద్రించిన ప్రకారం వెన్న శాతం, పాలు ఎక్కువ రో జులు నిల్వ ఉండడానికి కలిపే హైడ్రోజన్ పెరాకై ్స డ్, కాస్టిక్ సోడాలకు సంబంధించిన నాణ్యతా పరీ క్షలు నిర్వహించినట్లు తెలిపారు. విజయ డెయిరీ పోలికతో ఉన్న ప్రైవేట్ డెయిరీ పాలలో కాస్టిక్ సోడా కలిపినట్లు తేలిందన్నారు. అలాగే, ఆరు ప్రైవే ట్ డెయిరీలు తమ ప్యాకెట్లపై ముద్రించిన ప్రకా రం వెన్న శాతం పాలలో లేదని నిర్ధారణ అయ్యిందన్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మౌనిక, విజయ డెయిరీ డీడీ శ్రవణ్‌కుమార్, మేనేజర్ ప్రదీప్ ఆధ్వర్యంలో పాల నాణ్యతా పరీక్షలు జరిగాయి. కార్యక్రమంలో మండలి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రావుల రంజిత్ కుమార్, నల్లా రాజేందర్, చిలువేరు ప్రవీణ్, నగర కార్యదర్శి బేతి రాజేశ్ పాల్గొన్నారు. -
ఇస్రో పిలుస్తోంది.. వెళ్దాం రండి
మహబూబాబాద్ అర్బన్ : అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ వివరాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. 23వ తేదీ వరకు గడువు.. విద్యార్థులు మార్చి 23వ తేదీలోగా www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా– 25 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 31న ముగింపు సందర్భంగా కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. 7 కేంద్రాల్లో నిర్వహణ.. ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్(ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్(గుజరాత్), హైదరాబాద్(తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). అన్నీ ఉచితంగానే.. ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భో జన, వసతి సౌకర్యాలు ఇస్రో ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 14 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పే సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్‌కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్తగ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం విద్యార్థులకు కల్పిస్తారు. ఎవరు అర్హులు.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు.తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం యువికా కార్యక్రమానికి 23వ తేదీ వరకు గడువు 7 కేంద్రాల్లో నిర్వహణ ప్రయాణం, వసతి సౌకర్యాలు ఉచితం -
ఆటోను ఓవర్ టేక్ చేయబోయి..
● స్కూటీని ఢీకొన్న బైక్ ● తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి నెక్కొండ: బైక్.. ఆటోను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. ఈఘటన బుధవారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన చిన్నబోయిన సంతు మరొకరితో కలిసి బైక్‌పై నెక్కొండ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న నెక్కొండకు చెందిన మహ్మద్ సాజిద్ (16) స్కూటీపై నెక్కొండకు వస్తున్నాడు. ఈ క్రమంలో నెక్కొండ– అప్పల్రావుపేట ప్రధాన రహదారిపై మండల కేంద్రంలో ఆటోను ఓవర్ టేక్ చేయబోయిన సంతు..ఎదురుగా వస్తున్న సాజిద్ స్కూటీని ఢీకొ న్నాడు. ఈ ఘటనలో సాజిద్, సంతుతోపాటు మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా సాజిద్ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మదార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు. మరియపురంలో బైక్ అదుపు తప్పి విద్యుత్ ఉద్యోగి.. గీసుకొండ: విధులకు వెళ్తున్న ఓ విద్యుత్ ఉద్యోగి బైక్ అదుపు తప్పడంతో మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మరియపురంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన ఓరుగంటి రమేశ్(50) 12 సంవత్సరాల క్రితం గీసుకొండకు వలస వచ్చాడు. గీసుకొండ(కొనాయమాకుల) విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో అన్మ్యాన్డ్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఊకల్ నుంచి ఓ విద్యుత్ వినియోగదారుడు ఫోన్ చేసి తమ గ్రామంలో కరెంట్ లేదని చెప్పాడు. దీంతో బైక్‌పై మరియపురం నుంచి ఊకల్వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముందు ఉన్న సంచిలోని సామగ్రి హ్యాడిల్‌ను తిరగకుండా చేయడంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొంది. దీంతో రమేశ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, రమేశ్ మృతిపై ఏఈ సంపత్‌రెడ్డి, విద్యుత్ సిబ్బంది సంతాపం తెలిపారు. అజ్నీ ప్యాసింజర్ పునరుద్ధరణ.. ● నేటి నుంచి పట్టాలెక్కనున్న రైలు ● కాజీపేట–బల్హార్షా ఎక్స్‌ప్రెస్‌గా మార్పు కాజీపేట రూరల్ : కరోనా సమయంలో రద్దు చేసిన అజ్నీ ప్యాసింజర్‌ను పునరుద్ధరించారు. గురువారం నుంచి యథావిధిగా నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ఈ నెల 6నుంచి కాజీపేట జంక్షన్ నుంచి ప్రతీ రోజు రాత్రి 10.50 గంటలకు బయలుదేరే కాజీపేట–బల్హార్షా (17035) ఎక్స్‌ప్రెస్ ఉదయం 3.50 గంటలకు బల్హార్షాకు చేరుతుంది. అదేవిధంగా బల్హార్షాలో ఈ నెల 7వ తేదీన ఉదయం 3.50 గంటలకు బయలుదేరే బల్హార్షా–కాజీపేట (17036) ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు 8.50 గంటలకు చేరుతుంది. ఈఎక్స్ప్రెస్కు ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, రెచ్నిరోడ్, సిర్పూర్కాగజ్నగర్, వీరూర్, వీర్గం, మణిఘర్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు కాజీపేట రైల్వేస్టేషన్ మేనేజర్ రవీందర్ తెలిపారు. నాటి అజ్నీ ప్యాసింజరే నేటి ఎక్స్‌ప్రెస్‌గా.. గతంలో కాజీపేట–అజ్నీ–కాజీపేట మధ్య ప్రయాణించే ఈ ప్యాసింజర్‌ను కరో నా సమయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు 2023, నవంబర్ 13వ తేదీన ర ద్దు చేశారు. దాదాపు 17 నెలల తర్వాత ప్రయాణికుల డిమాండ్ మేరకు ఈ అజ్నీ ప్యాసింజర్‌ను కాజీపేట–బల్హార్షా–కాజీ పేట మధ్య మెయిల్ డైలీ ఎక్స్‌ప్రెస్‌గా న డిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చాలా కా లం తర్వాత ఈ రైలును ప్రవేశపెట్టడంతో కాజీ పేట నుంచి బల్హార్షా మార్గంలో వెళ్లే ప్రయాణికులు, ఇతర వర్గాల వారికి సౌకర్యంగా ఉంటుంది. కాగా, ఈ రైలును పునరుద్ధరించడంతో ప్ర యాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మా బంగారం ఇవ్వండి..
రాయపర్తి: చోరీకి గురైన బంగారం ఇవ్వండి.. లేదంటే ప్రస్తుతం మార్కెట్లో తులం గోల్డ్‌కు ఉన్న ధర ప్రకారం డబ్బు ఇవ్వాలి.. తరుగు తీసి డబ్బు చెల్లిస్తామంటే తీసుకోబోమని బంగారం బాఽధితులు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐలో ఆందోళన చేపట్టారు. కాగా, 2024 నవంబర్ 18న బ్యాంకులో 497 మందికి సంబంధించిన 19 కిలోల బంగారు ఆభరణాలను చోరీకి గురైన విషయం విధితమే. ఈ ఘటనలో బాధితులకు పరిహారం ఇవ్వడానికి అధికారులు.. బాధితులను బ్యాంకు పిలిపించారు. ‘మీరు బ్యాంకులో దాచుకున్న బంగారం చోరీకి గురైంది.. ఈ కేసు కోర్టులో ఉంది. ప్రస్తుతం తులం బంగారానికి రూ.77,710 అందిస్తాం’ అని చెప్పారు. దీంతో బాధితులు ససేమిరా అన్నారు. ప్రస్తుతం తులం బంగారం రూ. 87వేలు ఉందని, మేం పదితులాలకు తులం బంగారం తరుగు కోల్పోవాలా అంటూ నిలదీశారు. చోరీకి గురైన బంగారం ఇవ్వండి.. లేదా ప్రస్తుతం గోల్డ్‌కు ఉన్న ధర ప్రకారం డబ్బు ఇవ్వాలని, తరుగు తీయొద్దని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీలేకపోవడంతో బ్యాంకు అధికారులు మరో వారం రోజుల తర్వాత రావాలని చెప్పడంతో బాధితులు వెనుదిరిగారు. కాగా, బ్యాంకులో భరోసా ఉంటుందని దాచుకుంటే అధికారుల నిర్లక్ష్యం వల్లే బంగారం చోరీకి గురైందని బాధితులు ఆరోపించారు. బ్యాంకుకు సెక్యూరిటీని నియమించకపోవడంతోనే చోరీ జరిగిందని మండిపడ్డారు. పరిహారం చెల్లించాలని నాలుగు నెలల నుంచి బ్యాంకు చుట్టు ప్రదక్షణలు చేస్తున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తులానికి గ్రాము తీసేస్తే ఎట్లా..తులం బంగారానికి గ్రాము తరుగు తీసేసి డబ్బులు చెల్లిస్తామంటున్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. మూడు తులాల తాడు చేయించుకోవాలంటే ఎంతో ఇబ్బంది. వాళ్లు డబ్బులు కట్టిస్తే ఎదో అప్పుకింద పోతుంది. ఆడపిల్లలకోసం బంగారు ఆభరణాలు చేయించుకున్నం. బ్యాంకుకు ఎంత వడ్డీ అయ్యిందో చెల్లిస్తాం. మా బంగారం మాకు ఇవ్వాలి. –కోల హైమ, మైలారం తరుగు తీసి డబ్బులు కట్టిస్తామంటున్నారు అధికారుల నిర్లక్ష్యంతోనే బ్యాంకులో చోరీ జరిగింది. బంగారం పోయిన రోజు గుర్జకూడా పోకుండా ఇస్తామని బాధితులకు చెప్పిన బ్యాంకు అధికారులు.. ఇప్పుడు బంగారంలో తరుగు తీసి డబ్బులు కట్టిస్తామంటున్నారు. పది తులాల బంగారానికి తులం లాస్ అవుతున్నాం. ఎంత మిత్తి అయ్యిందో అంత చెల్లిస్తం. మా బంగారం మాకు ఇప్పించాలి. –పగిడిపల్లి భీంరెడ్డి, మైలారం ఎస్బీఐలో బాధితుల ఆందోళన చోరీకి గురైన బంగారం ఇవ్వాలని డిమాండ్ లేదా ప్రస్తుతం గోల్డ్‌కు ఉన్న ధర ప్రకారం డబ్బు చెల్లించాలి తరుగు తీసి డబ్బు చెల్లిస్తామంటే తీసుకోబోమని స్పష్టీకరణ గత సంవత్సరం బ్యాంకులో 19 కిలోల పసిడి చోరీ పరిహారం ఇవ్వడానికి ఖాతాదారులను పిలిచిన అధికారులు -
121 డిగ్రీ కళాశాలల ఫలితాలు నిలిపివేత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ బీఎస్సీ, బీసీఏ బీ ఒకేషనల్ కోర్సులకు సంబంఽధించి మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను ఈ నెల 4న రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించకపోవడంతో ఆయా కళాశాలల పరీక్షల ఫలితాలను , యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు నిలిపివేశారు. యూనివర్సిటీ పరిధిలో 304 (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల) కళాశాలలు ఉన్నాయి. అందులో 121 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు వివిధ రకాల ఫీజులు చెల్లించాల్సింటుంది. కానీ, ఫీజులు చెల్లించకపోవడంతో వాటి ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు నిలిపివేశారు. దీంతో విద్యార్థులకు ఫలితాలు తెలియక ఆందోళన చెందుతున్నారు. కొన్ని కాలేజీలకు వచ్చి మరికొన్నింటికి రాకపోవడేమంటని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సమయమిచ్చిన వర్సిటీ అధికారులు కాకతీయ యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్, స్టూడెంట్ రికగ్నిషన్ ఫీజు, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఫీజు కలిపి చెల్లించాల్సింటుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయా ఫీజులు కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎక్కువమంది ఉన్న కళాశాలలు రూ.లక్షల్లోనే చెల్లించాల్సింటుంది. డిగ్రీకోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు గత ఏడాది డిసెంబర్లో మొదలయ్యే సమయంలో ఆయా ఫీజులు చెల్లించాల్సిండగా, అప్పట్లో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ల బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిని, అప్పటి రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కలిశారు. తమ కళాశాలలకు ప్రభుత్వం రెండుమూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదని, ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఫీజులు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఇందుకు తొలుత అంగీకరించకపోయినా ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో వీసీ, రిజిస్ట్రార్ అంగీకరించారు. 15 నుంచి 20 రోజుల వరకు సమయం ఇచ్చారు. పరీక్షలు పూర్తయ్యాక కూడా కొద్దిరోజుల క్రితం జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తికావొచ్చినప్పడు యూనివర్సిటీ అకడమిక్ డీన్ ఆయా కళాశాలలకు ఫీజులు చెల్లించాలని నోటీస్‌లు పంపారు. కొన్నికళాశాలల యాజమాన్యాలు చెల్లించగా, 121 ప్రైవేట్ కళాశాలలు బుధవారం వరకు ఫీజులు చెల్లించలేదు. ఫీజులు చెల్లించిన వాటి ఫలితాలు వెబ్సైట్ ఉంచి, చెల్లించని వారివి నిలిపివేశారు. ఫీజులు చెల్లిస్తేనే ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించినట్లు క్లియరెన్స్ వస్తేనే ఫలితాలు వెల్లడిస్తాం. ఫీజులు చెల్లించకపోతే ఫలితాలను వెల్లడించే ప్రసక్తి లేదు. ప్రొఫెసర్ రాజేందర్, పరీక్షల నియంత్రణాధికారి, కేయూఆందోళన చెందుతున్న విద్యార్థులు తమ ఫలితాలు చూసుకునే వీలులేకపోవడంతో ఆయా కళాశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కళాశాలలకు వెళ్లి ఫలితాలు కనిపించడం లేదని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ ప్రైవేట్ కళాశాలల యాజామాన్యాల అసోసియేషన్ బాధ్యులు బుధవారం రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిసి.. ఫలితాలు వెల్లడించాలని విన్నవించారు. తాను వీసీ దృష్టికి తీసుకెళ్లాక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారని సమాచారం. కేయూ డీన్ అకడమిక్‌కు ఫీజులు చెల్లించని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు నోటీసులకు యాజమాన్యాల నో రెస్పాన్స్ -
నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
రామన్నపేట : అన్నదాతలను మోసం చేస్తూ నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి టాస్‌ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. వీరి నుంచి సుమారు రూ.34 లక్షల విలువైన వివిధ కంపెనీల పేర్లతో ఉన్న నకిలీ పురుగు మందులు, రెండు కార్లు, ఐదు సెల్ఫోన్లు, నకిలీ పురుగు మందు లేబుళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం టాస్క్‌ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో తనిఖీ చేయగా పురుగు మందుల డబ్బాలు కనిపించాయి. కారులో ఉన్న నిందితుల్లో ఒకరైన కర్ణాటకలోని బళ్లారి జిల్లా కురుగోడుకు చెందిన నిందితుడు కాట్రగౌడ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్నట్లు అంగీకరించడంతో మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా మంగళవారం నిందితుడు కాట్రగౌడ భాస్కర్ రెడ్డి సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్ చర్లపల్లి ప్రాంతంలోని గోడౌన్‌పై దాడి చేసి మిగతా నలుగురు నిందితులు హైదరాబాద్ కుషాయిగూకు చెందిన పిల్ల నాగవెంకటరంగారావు, లక్డీకాపూల్‌కు చెందిన ముద్దంగుల ఆదిత్య, దూదిమెట్లకు చెందిన పిట్ల నవీన్, మిర్యాలగూడ ఇందిరమ్మకాలనీకి చెందిన దూదిమెట్ల శ్రీధర్‌ను విచారించారు. డిమాండ్ ఉన్న కంపెనీ పేర్లతో నకిలీ పురుగు, గడ్డి మందులు తయారీ చేసి విక్రయించి రైతులను మోసం చేసున్నట్లు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి బేయర్, టాటా, కోర్టెవాతోపాటు మరో నాలుగు కంపెనీల పేర్లతో ఉన్న నకిలీ పురుగు మందులు, గడ్డి మందులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, టాస్క్ఫోర్, వరంగల్ ఏసీపీలు మధుసూదన్, నందిరాంనాయక్, టాస్క్ఫోర్, మట్టెవా డ ఇన్స్పెక్టర్లు సార్ల రాజు, గోపి, ఎస్సైలు ఓరుగుంటి భానుప్రకాశ్, లచ్చయ్య, సాంబయ్య, ఏఏఓ సల్మాన్ పాషా, కానిస్టేబుళ్లు సురేశ్, సాంబరాజు, సురేందర్, రమేశ్‌ను సీపీ అభినందించారు. రూ.34 లక్షల విలువైన మందులు, రెండు కార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ అంబర్ కిశోర్ ఝా -
పెళ్లింట తీవ్ర విషాదం..
● కొడుకు పెళ్లైన రెండో రోజే బ్రెయిన్ స్ట్రోక్‌తో తండ్రి మృతి ● సుందరయ్య కాలనీ గ్రామంలో ఘటన వాజేడు : బంధువులు, అతిథుల మధ్య అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి జరిపించాడు. పెళ్లింటి నుంచి సొంతింటికి వచ్చి వ్రతం చేసుకుంటున్నారు. అంతలోనే బంధువులతో కళకళలాడుతున్న ఆ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్‌తో పెళ్లి కొడుకు తండ్రి మృతి చెందాడు. ఈ ఘటనతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని సుందరయ్య కాలనీ గ్రామానికి చెందిన అక్కిసెట్టి ఏసుబాబు(48)కి భార్య కుమారి, ఇద్దరు కుమారులు హరికృష్ణ, శివ కృష్ణ ఉన్నారు. పెద్ద కొడుకు హరికృష్ణకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన యువతితో సోమవారం(మార్చి 3) పెళ్లి జరిపించాడు. అనంతరం వధూవరులను తీసుకుని తమ ఇంటికి వచ్చాడు. మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తున్నాడు. అదే సమయంలో తనకు అలసటగా ఉందని, వ్రతంలో కూర్చో లేనని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కొత్త జంటతో పాటు వరుడి తల్లి వ్రతంలో కూర్చున్నారు. ఈ క్రమంలో ఏసుబాబు కాళ్లు, చేతులు లాక్కురావడం చూసిన బంధువులు వెంటనే ఆర్ఎంపీతో పరీక్షించగా బీపీ పెరిగినట్లు తెలిపి వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని చెప్పాడు. దీంతో ఏటూరు నాగారం తీసుకు వెళ్లగా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వరంగల్ తీసుకెళ్లాలని అక్కడి ప్రైవేట్ వైద్యుడు తెలుపగా వెంటనే వరంగల్ ఎంజీఎం తరలించారు. వైద్యం చేస్తుండగా బుధవారం మృతి చెందాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. -
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
వెంకటాపురం(కె): మండలంలోని పాత్రాపురం గ్రామ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆర్టీసీ బస్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి వెంకటాపురం మండల కేంద్రానికి వస్తోంది. ఈ క్రమంలో పాత్రాపురం గ్రామ సమీపంలోకి వచ్చే సమయానికి బస్సు వెనుక చక్రం బోల్టు విరిగి ఊడింది. దీంతో బస్సు రోడ్డు మీద నుంచి పక్కకు వెళ్తుండగా డ్త్రెవర్ చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకొచ్చాడు. దీంతో బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. -
షేర్ హోల్డర్స్‌కు ఫెస్టివల్ లోన్
● హోలీ,ఉగాది, రంజాన్ పండుగలకు రూ. లక్ష మంజూరు కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే రైల్వే ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (ఈసీసీఎస్) లిమిటెడ్.. హోలీ, ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా రైల్వే సీసీఎస్ షేర్ హోల్డర్స్(సభ్యులు)కు రుణాల మంజూరు ప్రకటించిందని కాజీపేట రైల్వే సీసీఎస్ డైరెక్టర్ డి.శ్రీనివాస్ యాదవ్, కోఆప్షన్ డైరెక్టర్ దేవులపల్లి రాఘవేందర్ బుధవారం తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రెసిడెంట్ చిలుకు స్వామి, వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ నేతృత్వంలో సీసీఎస్ సభ్యులకు ఫెస్టివల్ లోన్ ఇచ్చేందుకు బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు. అర్హులైన రైల్వే సీసీఎస్ సభ్యులు ఈ ఫెస్టివల్ లోన్‌కు ఈ నెల 6వ నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫెస్టివల్ లోన్‌గా సీసీఎస్ సభ్యులకు రూ. లక్ష మంజూరు చేయనున్నట్లు వారు తెలిపారు. -
డీఎన్ఏ.. వ్యక్తిగత జీవితానికి ఆధారం
కేయూ క్యాంపస్: డీఎన్ఏ.. వ్యక్తిగత జీవితానికి ఆధారమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం కేయూలోని జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘యూసెస్ ఆఫ్ రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీ ఇన్ హెల్త్’ అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్ ప్రారంభ సభలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్న మాలిక్యూల్ వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు దేశాల ఆర్థిక వ్యవస్థను కూడా మార్చుతుందన్నారు. వ్యాధుల నివారణ, చికిత్సల్లో అపరిమితమైన ఆవశ్యకత ఉందన్నారు. కోవిడ్–19 సమయంలో డీఎన్ఏ ప్రధాన భూమిక వహించిందన్నారు. రోగనిరోధక వ్యవస్థ , యాంటీబాడీల అభివృద్ధిలో కరోనా సమయంలో వ్యాక్సిన్ల ప్రాధాన్యతను గుర్తుచేశారు. భారతదేశం వ్యాక్సిన్ల హబ్‌గా నిలిచిందన్నారు. పబ్లిక్‌హెల్త్‌లో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తితో వ్యయం తగ్గుతుందన్నారు. ఆ దిశగానే పరిశోధనలు కొనసాగించాలన్నారు. సమావేశంలో జూవాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ జి. షమిత, సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు, ఆచార్యులు మామిడాల ఇస్తారి, వై. వెంకయ్య, ఈసం నారాయణ తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి -
ఉద్యోగాల పేరిట మోసం..
మహబూబాబాద్ రూరల్ : కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి పలువురి నిరుద్యోగ యువతీయువకుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతీయువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. తనకున్న పరిచయాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుమారు 25 మంది యువతీయువకుల్లో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులు వసూలు చేశాడు. అనంతరం అతడు ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల ప్రభుత్వ విద్యాసంస్థల్లో జాయిన్ అయ్యేందుకు వెళ్లారు. తీరా అక్కడికెళ్లి ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలను అడిగితే అవి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలని ధ్రువీకరించారు. దీనిపై బాధితులు.. నియామక పత్రాలు అందజేసిన వ్యక్తిని అడగగా అతడు స్పందించలేదు. దీంతో ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలని మహబూబాబాద్ టౌన్ పోలీసులను ఆశ్రయించనున్నట్లు సమాచారం. నిరుద్యోగుల వద్ద నుంచి డబ్బుల వసూళ్లు.. నకిలీ నియామక పత్రాల అందజేత -
కరెంట్‌తో చేపలు పడుతూ మృత్యుఒడికి..
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి ● పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగులో ఘటన మరిపెడ రూరల్: మిత్రులతో కలిసి చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు.. కరెంట్‌తో చేపలు పడుతూ షా క్కు గురై మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగులో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నా యి. పురుషోత్తమాయగూడెం స్టేజీకి చెందిన జర్పుల కోట, అరుణ దంపతుల చిన్న కుమారుడు శశి (20) అదే గ్రామానికి చెందిన మిత్రులతో కలిసి ఆకేరు వాగులో చేపల వేటకు వెళ్లాడు. అక్కడ విద్యుత్‌ను ఉపయోగించి చేపలు పడుతున్న క్రమంలో అదే విద్యుత్ తీగలకు తగిలి షాక్ గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని శశి మృతదేహం మీద పడి గుండలవిసేలా రోదించారు. కష్టపడి పెంచి పెద్ద చేస్తే ఇలా అర్ధాంతరంగా పోయావా కొడుకా అంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. శశి మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. చెరువులో జారిపడి వృద్ధుడు.. స్టేషన్‌ఘన్‌పూర్: చెరువులో జారిపడి ఓ వృద్ధుడి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పాంనూర్‌లో జరిగింది. పోలీ సులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్లె నర్సయ్య(65) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం గ్రామశివారులోని ఊర చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి అందులో జారి పడ్డాడు. కాగా, నర్సయ్య చెరువు వైపునకు వెళ్లడం చూసిన గొర్రెల కాపరులు..అతడు తిరిగి రాకపోవడంతో అనుమానంతో చెరువు వద్దకు వెళ్లి చూశారు. అక్కడ చెప్పులు కనిపించడంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న కుటుంబీకులు గొర్రెల కాపరుల సాయంతో చెరువులో మునిగిన నర్సయ్యను బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి బంధువు రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. -
సృజనాత్మకత పెంపునకు ఫెస్ట్‌లు దోహదం
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్రామన్నపేట: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు ఫెస్ట్‌లు ఎంతో దోహదపడుతాయని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్ ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ అన్నారు. కళాశాల ప్రాంగణంలో జిల్లాస్థాయి ‘సృజనా టెక్‌ఫెస్ట్ (2024 – 25)ను మంగళవారం నిర్వహించారు. టెక్ ఫెస్ట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఎన్ఐటీ ప్రొఫెసర్ ఎ.కుమార్, టీజీఆర్టీసీ హనుమకొండ డిప్యూటీ రీజనల్ మేనేజర్ జి.మాధవరావు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈమేరకు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పరకాలకు మొదటి బహుమతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్‌కు రెండో బహుమతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కాటారంనకు మూడో బహుమతి, కంప్యూటర్ సైన్ ఇంజనీరింగ్ విభాగంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్‌కు మొదటి బహుమతిని అతిథులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభా గాధిపతి, జిల్లా కోఆర్డినేటర్ ఎం.వెంకన్న, కంప్యూటర్ సైన్స్ ఇన్చార్జ్ విభాగాధిపతి, జిల్లా కోఆర్డినేటర్ ఎస్.రవీందర్, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. -
ఉపాధి అవకాశాల మధ్య అగాధం
కేయూ క్యాంపస్ : తెలంగాణలో కొన్ని వర్గాలు పని చేయడానికి విముఖతతో ఇతర రాష్ట్ర కార్మికులు వలస వస్తున్నారని, దీని వల్ల ఉపాధి అవకాశాల మధ్య అగాధం పెరిగిందని సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కేయూ గణిత శాస్త్ర విభాగ సెమినార్ హాల్లో వీసీ కె. ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆచార్య బి. జనార్ధన్ రావు 23వ వార్షిక స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ప్రధాన వక్తగా విచ్చేసి ‘తెలంగాణ ఆఫ్టర్ ఎ డికెడ్ ఎమర్జింగ్ పొలిటికల్ అండ్ సోషల్ సీనారియోస్’ అనే అంశంపై శ్రీనివాస్ ప్రసంగించారు. భవిష్యత్ తెలంగాణకు విలువలతో కూడిన విధాన చట్రం అవసరమన్నారు. గొప్ప తాత్త్విక సిద్ధాంతకర్త ఆచార్య బి. జనార్ధన్ రావు అన్నారు. సమగ్ర అభివృద్ధితో కూడికొని ఉహించిన తెలంగాణ రూపకల్పన చేశారన్నారు. ఆయన ఊహకు అనుగుణంగా అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ గ్రామాలు డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్‌లు వ్యసనాల బారిలో పడి చిక్కుకున్నాయన్నారు. అలాగే, ఉపాధి అవకాశాల మధ్య అగాధం పెరిగిందన్నారు. చిరు వ్యాపారుల్లో ఉత్తరాది వారి ప్రాబల్యం పెరిగిందన్నారు. దీని నివారణకు జోక్యం అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో బియ్యాల జనార్ధన్ రావు మెమోరియల్ ఫౌండేషన్ బాధ్యులు ఈ.రేవతి, కె. మురళీ మనోహర్, నరేంద్ర బాబు, జనార్ధన్ రావు ట్రస్టు కార్యదర్శి టి. బుచ్చిబాబురావు, తదితరులు పాల్గొన్నారు. తొలుత జనార్ధన్‌రావు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్ -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది నవంబర్–డిసెంబర్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ, బీ ఒకేషనల్ కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 70,661మంది విద్యార్థులకు 15,495 మంది ఉత్తీర్ణత (21.93శాతం) సాధించారు. మూడో సెమిస్టర్ పరీక్షల్లో 59,916 మంది పరీక్షలు రాయగా అందులో17,356 మంది విద్యార్థులు ఉత్తీర్ణత (28.97శాతం) సాధించారు. ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 46,828 మంది పరీక్షలకు హాజరుకాగా అందులో 19,074 మంది ఉత్తీర్ణత (40.73శాతం) సాధించారని పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. పూర్తి వివరాలే కేయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం. తిరుమలాదేవి, వెంకటయ్య, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్‌లాల్, చిర్రరాజు, ఆర్ట్స్అండ్ సైన్స్‌కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామా వెంకటేశ్వర్లు, క్యాంపు ఆఫీసర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
10వ తేదీ వరకు అండర్ బ్రిడ్జి మరమ్మతులు
మహబూబాబాద్ రూరల్: రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో జరుగుతున్న పనులు ఈ నెల 10 తేదీ వరకు పూర్తవుతాయని అధికారులు మంగళవారం తెలిపారు. జనవరి 29వ తేదీ సాయంత్రం నుంచి పట్టణంలోని అండర్ బ్రిడ్జిలో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఆసయమంలో నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని అధికారులు ప్రకటించారు. అయితే అండర్ బ్రిడ్జి ప్రాంతంలో స్లాబ్ నిర్మాణ పనులు పూర్తికావచ్చినప్పటికీ దానిపైభాగంలో ట్రాక్ నిర్మా ణం జరగాల్సి ఉందని తెలిపారు. ఫిబ్రవరి 20న మరో 15రోజులపాటు గడువు పొడిగించి మార్చి 6వతేదీ వరకు పూర్తవుతాయని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల ఈనెల 10 తేదీ వరకు పనులు పూర్తిచేసి 11నుంచి అండర్ బ్రిడ్జిలో వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు. -
సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై సందిగ్ధంలో రైతులు
● మందకొడిగా అర్జీలు ● గడువు పెంచుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం ● మరోసారి ఈనెల 10వ తేదీకి పెంపు.. ● ఉమ్మడి వరంగల్ జిల్లాలో 327 మంది దరఖాస్తులుహన్మకొండ : సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా సాధారణ, మధ్య తరగతి రైతులకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలనే ఆసక్తి ఉన్నా.. ఆర్థిక స్థోమత అడ్డువస్తుండడంతో అర్జీలు చేసుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో దరఖాస్తు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గడువు నిర్దేశించినా.. ఆశించిన మేరకు దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం గడువు పెంచుకుంటూ పోతోంది. ముందు ఫిబ్రవరి 22వ తేదీ వరకు చివరి గడువు నిర్ణయించింది. అయినా దరఖాస్తులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో మార్చి 2వ వరకు గడువు పొడిగించింది. అయినా లక్ష్యం మేరకు రైతుల నుంచి స్పందన లేక.. దరఖాస్తులు రాకపోవడంతో మరోసారి ఈ నెల 10 వరకు గడువు పొడిగించింది. -
రైతులు ఖర్చు భరించడం కష్టమే..
రైతులు 30 శాతం ఖర్చు భరించడం కష్టమే. దీనికి తోడు విద్యుత్ లైన్ నిర్మాణం ఖర్చు, ఇతర ఖర్చులు భారీగా అవుతాయి. ఇవన్నీ రైతులు భరించలేరు. నాకు ప్రైవేట్ పవర్ ప్లాంట్‌లో పని చేసిన అనుభవముంది. దీంతో ప్రభుత్వం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుందని తెలుసుకుని దరఖాస్తు చేశా. నాకు 8 ఎకరాల స్థలం ఉంది. మెగావాట్ ప్లాంట్‌కు దరఖాస్తు చేశా. దీని ద్వారా వచ్చే ఆదాయం, బ్యాంకుకు చెల్లించా ల్సిన వాయిదాలు సంతృప్తి కలిగితే మిగతా స్థలంలో ఏర్పాటు చేస్తా. – పి.అంబేడ్కర్, అంబేడ్కర్ నగర్, వర్ధన్నపేటరైతులు క్రమంగా ముందుకు వస్తున్నారు.. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి రైతులు క్రమంగా ముందుకు వస్తున్నారు. రైతుల ఆసక్తిని గమనించి ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇప్పటి వరకు ఆశించిన మేర దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు గడువు పెంచింది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మహేందర్ రెడ్డి, రెడ్కో ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ ● -
సీఏ ఫలితాల్లో సిరిసహస్రకు ఆలిండియా 35వ ర్యాంకు
కమలాపూర్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మంగళవారం విడుదల చేసిన సీఏ ఇంటర్మీడియట్ కోర్సు ఫలితాల్లో హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన చేరాల సిరిసహస్ర ఆలిండియా 35వ ర్యాంకు సాధించింది. చేరాల రాజ్‌కుమార్, సరస్వతి దంపతుల కూతురు సిరిసహస్ర హైదరాబాద్‌లోని చాంప్స్ సీఏ అకాడమీ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ సీఏ ఇంటర్మీడియట్ రెండో సెమ్ చదువుతోంది. గ్రూప్–1 లో 216 మార్కులు, గ్రూప్–2లో 246 మార్కులు సాధించిన సిరిసహస్ర మొత్తం 462 మార్కులతో ఆలిండియా 35వ ర్యాంకు సాధించింది. దీంతో సిరిసహస్రను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు గ్రామస్తులు అభినందించారు. రేపు కాజీపేట మీదుగా వన్‌వే స్పెషల్ ట్రైన్ కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బనారస్–సికింద్రాబాద్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్‌ను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. బనారస్‌లో బుధవారం బయలుదేరే బనారస్–సికింద్రాబాద్ (05082) వన్ వే స్పెషల్ ట్రైన్ మరుసటి రోజు (గురువారం) కాజీపేట జంక్షన్‌కు 20.30 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌ల సౌకర్యంతో గల ఈ ట్రైన్‌కు మార్గమధ్యలో వారణాసి, ప్రయాగ్‌రాజ్ చోకి, సత్న, మయర్, కట్ని, జబల్పూర్, ఇటార్సీ, గోరడోంగ్రి, బెతుల్, నాగ్‌పూర్, సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్హార్షా, సిర్పూర్కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, కాజీపేట రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య ● కుమారుడి మృతితో తల్లి ఆత్మహత్యాయత్నాయత్నం ● ఆస్పత్రికి తరలింపు చిట్యాల: పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ముచినిపర్తిలో చోటు చేసుకుంది. కుమారుడి మరణవార్త విన్న తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూపతి సారయ్య, జయలక్ష్మి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు రమ్యకు ఏపీలోని నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన లక్ష్మయ్యతో వివాహం జరిగింది. వారి కుమారుడు నాని(16) ముచినిపర్తి గ్రామంలో తాతయ్య, అమ్మమ్మ( సారయ్య–జయలక్ష్మి) వద్ద ఉంటూ జూకల్ పాఠశాలలో పదోతరగతి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం పాఠశాలకు వెళ్తానని అమ్మమ్మకు చెప్పి వెళ్లకుండా మధ్యలోనే ఇంటికి వచ్చాడు. కాగా, కూలీ పనులు ముగించుకుని జయలక్ష్మి సాయంత్ర ఇంటికి వచ్చింది. తలుపులు తీయగా రాకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే చుట్టపక్కల వారి సాయంతో తలుపులు తొలగించి చూడగా నాని ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది కనిపించడంతో బోరున విలపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థి మృతి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. నాని మరణవార్త తెలియడతో అతడి తల్లి రమ్య నెల్లూరులోని పడుగుపాడు స్వగృహంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు తెలి సింది. కాగా, నాని మృతిగల కారణాలు తెలియాల్సి ఉంది. -
పర్యాటకులూ..జర జాగ్రత్త
● పాకాల సరస్సు ఒడ్డుపైకి చేరిన మొసలి ● సరస్సులో దిగొద్దని ఎఫ్ఆర్వో సూచన ఖానాపురం: వరంగల్ జిల్లాలో ఏకై క పర్యాటక ప్రాంతం పాకాల. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అటవీ అందాలను వీక్షించిన అనంతరం సరస్సులో జలకలాడుతారు. అయితే ఇప్పటి నుంచి సరస్సులో దిగకుండా ఉండడం శ్రేయస్కరం. ఎందుకంటే మంగళవారం మొసలి.. సరస్సు ఒడ్డుకు చేరుకుని సేదదీరింది. దీంతో పర్యాటకులు సరస్సులో దిగొద్దని ఎఫ్ఆర్వో రవికిరణ్ సూచించారు. -
పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్, మోడల్ స్కూల్ కళాశాలలను మంగళవారం కలెక్టర్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 9,317 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులు కల్పించామని, సీసీ కెమెరాల మధ్య పరీక్షలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, డీఎస్పీ తిరుపతిరావు, డీఈఓ రవీందర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
లైంగికదాడి కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు
కాటారం: బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి నారాయణబాబు మంగళవారం తీర్పు వెలువరించినట్లు మహాముత్తారం ఎస్సై మహేందర్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం కనుకునూరు గ్రామానికి చెందిన అట్టెం మల్లయ్య 2019లో మండలానికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రాము.. మల్లయ్యపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా అప్పటి సీఐ శివప్రసాద్ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత సీఐ హథీరాం మరికొందరు సాక్షులను విచారించగా కాటారం డీఎస్పీగా ఉన్న ప్రస్తుత భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ కోర్టులో చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కొన్ని రోజులుగా కోర్టులో విచారణ కొనసాగగా డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునారావు, ఎస్సై మహేందర్‌కుమార్ ఆధ్వర్యంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా జిల్లా కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విష్ణువర్ధన్‌రావు వాదనలు వినిపించగా నేరం రుజువైంది. దీంతో మల్లయ్యకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నారాయణబాబు తీర్పు వెలువరించారు. కాగా, నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు కోర్టు లైజనింగ్ ఆఫీసర్, ఏఎస్సై వెంకన్న, కోర్టు కానిస్టేబుల్ రమేశ్‌ను ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించారు. -
అదే ప్రాంతం.. అక్కడే ప్రమాదం
ప్రజల ఆందోళన సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ సమీపంలో వరుస ఘటనలు జరిగి యువకులు ప్రాణాలు వదలడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. హసన్‌పర్తి : అదే ప్రాంతం.. అక్కడే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన వడ్డేపల్లి చర్చి–ఉనికిచర్ల ప్రధాన రహదారిలోని సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ వద్ద మంగళవారం జరిగింది. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన తడుగుల రవి(41) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పురుగు మందుల కొనుగోలు నిమిత్తం బైక్‌పై సుబ్బయ్యపల్లికి వచ్చాడు. అనంతరం ఇంటికి ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో మార్గమధ్య సుబ్బయ్యపల్లి సమీపంలోని పంప్లో పెట్రోల్ పోసుకుని ముందుకు సాగాడు. అయితే బైక్ అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొని తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై దేవేందర్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు భార్య ప్రవళిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. అక్కడ ప్రమాదం జరిగితే మృత్యుఒడికే.. వడ్డేపల్లి చర్చి–ఉనికిచర్ల ప్రధాన రహదారిలోని సు బ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ప్రమాదం జరిగితే నేరుగా మృత్యుఒడికి వెళ్లాల్సిందే. ఐదు నెలల్లో ఐదుగురు బైక్ అదుపు తప్పి డివైడర్లకు ఢీకొని అక్కడికక్కడే ప్రాణా లు వదిలారు. సరిగ్గా నెల రోజుల క్రితం ముప్పారం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇదే ప్రాంతంలో బైక్ అదుపు తప్పి మృతి చెందాడు. అలాగే, ధర్మసాగరం మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన మహేశ్ ఇదే ప్రాంతంలో ప్రాణాలు వదిలాడు. మరో ఇద్దరు యువకులు కూడా బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని మృతి చెందారు.బైక్ అదుపు తప్పి వ్యక్తి దుర్మరణం సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంప్ వద్ద ఘటన ఐదు నెలల్లో.. ఐదుగురు మృతి -
90 శాతం రుణ సౌకర్యం కల్పించాలని కోరుతున్న రైతులు
ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు రూ.2.97 కోట్ల ఖర్చు అవుతుంది. ఇందులో రైతులు 30 శాతం భరిస్తే బ్యాంకుల ద్వారా 70 శాతం రుణ సదుపాయం కల్పిస్తారు. 30 శాతం కింద రైతులు దాదాపు రూ.30 లక్షలు భరించాలి. దీనికి అదనంగా 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు విద్యుత్ సరఫరా లైన్ వేసేందుకు కిలో మీటర్‌కు రూ.5 లక్షలు ఖర్చవుతుంది. దీంతో పాటు సబ్‌స్టేషన్‌లో ‘బే’ఎక్స్టెన్షన్కు రూ.6.50 లక్షలు ఖర్చు అవుతుంది. వీటితో పాటు ఒక మెగావాట్ ఉత్పత్తికి దరఖాస్తు చేసుకునేందుకు రుసుం రూ.5 వేలు చెల్లించాలి. దరఖాస్తు రుసుం రూ. 5 వేలు తిరిగి చెల్లించరు. దీంతో సామాన్య, మధ్య తరగతి రైతులు ఈ ఖర్చులు భరించలేక సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ఊగిసలాడుతున్నారు. ఫలితంగా దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అయితే స్వయం సహాయక సంఘాలకు అందించనన్నుట్లు 90 శాతం రుణ సౌకర్యం కల్పిస్తే 10 శాతం భరించడం సులువవుతుందని రైతులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫిబ్రవరి 21 వరకు 98 దరఖాస్తులు రాగా, ఈ నెల 2 వరకు 327 వచ్చాయి. రైతులకు రాయితీ ఇస్తే ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
మరింత ఆలస్యం!
సాక్షి, మహబూబాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే జిల్లాలో ఈ ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. వచ్చిన దరఖాస్తులు, అర్హుల జాబితాను మూడు విభాగాలుగా విభజించి ఇళ్లు మంజూరు చేసేందుకు జిల్లా యంత్రాంగం కుస్తీ పడుతోంది. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ముగ్గులు పోసే కార్యక్రమాల్లో గృహ నిర్మాణశాఖ నిమగ్నమై ఉండగా.. మహబూబా బాద్‌లో మాత్రం తుది జాబితా ఎంపిక పూర్తి కాలేదని తెలుస్తోంది. మూడు భాగాలుగా విభజన.. ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధిలో 1,89,065 దరఖాస్తులు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 28,526 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 2,17,591 దరఖాస్తులు వచ్చాయి. వీటిని మండలాలు, గ్రామాల వారీగా విభజించి టీమ్ సభ్యులు ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ద్వారా ఆధార్ కార్డు, రేషన్ కార్డు నంబర్లు సరిచూసుకుంటూ... సొంత స్థలం ఉందా.. ఇల్లు ఉందా ..ఉంటే ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు.. అద్దె ఇంట్లో ఉంటున్నారా.. మొదలైన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడే ఇంటి యజమాని, ఇల్లు ఫొటో తీసి అప్లోడ్ చేశారు. ఈ మేరకు లబ్ధిదారుల జాబితాను తయారు చేశారు. అయితే ముందుగా విడుదల చేసిన జాబితాలో అర్హుల పేర్లు లేవని పలు గ్రామాల్లో ఆందోళనలు జరిగాయి. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించగా ఒక్క ఇందిరమ్మ ఇళ్ల కోసమే 30,116 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హుల జాబితాను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి జాబితాలో ఇంట స్థలం ఉండి, ఇల్లు లేని వారికి ఇవ్వడం, రెండో జాబితాలో ఇల్లు, స్థలం లేకుండా ఉన్నవారికి, మూడో విడతలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న వారికి కొత్త ఇల్లు మంజూరు చేసేలా విభజించారు. ముగ్గు పోసేందుకు ముహూర్తం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ప్రభుత్వ పెద్దలు చెబుతుండగా..జిల్లాలో మాత్రం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. ప్రతీ మండలంలో ఒక మోడల్ హౌస్ నిర్మాణం చేపట్టేందుకు ముగ్గుపోశారు. పలుచోట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే ముందుగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి నిర్మాణాల కోసం ముగ్గులు పోయాలి. అయితే గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతోంది. మహిళల పేరున ఇల్లు మంజూరు, రేషన్ కార్డు తప్పనిసరి, ఫోన్ నంబర్, బ్యాంకు అకౌంట్ లింక్ కావడం మొదలైన అంశాల్లో తేడాలు ఉండడంతో జాబితా ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇతర జిల్లాల్లో ముగ్గులు పోసి నిర్మాణాలు చేపడుతుండగా ఇక్కడ మాత్రం జాబితా తయారీతోనే కుస్తీ పట్టడంతో ఎప్పుడు జాబితా ప్రకటిస్తారో.. ఎప్పుడు ముగ్గులు పోస్తారో అని నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. త్వరలో ముగ్గులు పోస్తాం.. మండల కేంద్రంలో మోడల్ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. 18 మండలాల్లో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేశాం. ఆయా గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడమే లక్ష్యంగా తుది జాబితా తయారు చేస్తున్నాం. త్వరలో అర్హుల జాబితా ప్రకటనతో పాటు ముహూర్తం చూసి ముగ్గులు పోసే కార్యక్రమం కూడా చేపడుతాం. – కె. రాజయ్య, పీడీ, గృహనిర్మాణ శాఖరెండో జాబితా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఇల్లు, ఇంటి స్థలం లేనివారికి గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రకటించడంతో నిరుపేదలు ఆ జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 5,415 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే ఇందులో ఇప్పటి వరకు 2,773 ఇళ్లు పూర్తికాగా.. 1,798 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించారు. ఇందులో 1,728 కుటుంబాలు ఇళ్లలోకి వెళ్లగా.. నిర్మాణం పూర్తయిన 975 ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయి. బేస్మెంట్, స్లాబ్ లెవల్, ప్లాస్టింగ్ స్టేజీ ఇలా వివిధ దశల్లో 2,642 ఇళ్లు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ ఇళ్లు పూర్తయితేనే రెండో జాబితాలో ఉన్నవారికి కేటాయించే అవకాశం ఉంది. అయితే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించకుండా ఉన్న గ్రామాల్లోని నిరుపేదల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జాప్యం మూడు విడతల్లో కేటాయింపు మండలంలో మోడల్ హౌస్ నిర్మాణం మండలానికో గ్రామం ఎంపిక ముగ్గులు పోసేందుకు ఫిక్స్కాని ముహూర్తం -
వీరభద్రుడి ‘పారువేట’
కురవి: భద్రకాళి సమేత వీరభద్రస్వామి(కల్యాణ వీరభద్రుడు) పారువేట(మృగవేట) కార్యక్రమాన్ని మంగళవారం ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెనుగొండ అనిల్‌కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన శావ అశ్వవాహనంలో స్వామి వారి ఉత్సవమూర్తిని అధిష్టింపజేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం శావను మోస్తూ పరుగులు తీశారు. బాదె నాగయ్య ఇంటి వద్దకు చేరుకున్నాక శావకు గ్రామస్తులు భక్తులు, మహిళలు గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టి బిందెలతో నీటిని ఆరబోశారు. ధర్మకర్త చిన్నం గణేశ్, పూజారి తేజ, ఎర్ర నాగేశ్వరరావు, వద్దుల సురేందర్‌రెడ్డి, అవిరె మోహన్‌రావు, బాదె వీరభద్రంను బజారు పెద్దలు సన్మానించారు. కార్యక్రమంలో నవీన్, రాజు, తొడుసు ఉమేశ్, వీరన్న కొత్త యాకరాజు, చెవుల భరత్ పాల్గొన్నారు. నేరడ ఎడ్ల బండికి స్వాగతం.. వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి రాళ్లు మోసిన కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన రుద్రారపు వంశీయుల మూడు జతల ఎడ్ల బండ్లకు ఆలయ అధికారి రవి, పూజారి రెడ్యాల శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ఎడ్లబండి ప్రదక్షిణలు చేయడంతో బండ్లు తిరిగే కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో రుద్రారపు వంశీయులు పాల్గొన్నారు. -
లైన్మెన్ల సేవలు అభినందనీయం
కురవి: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్మెన్ల సేవలు అభినందనీయమని మహబూబాబాద్ విద్యుత్ శాఖ డీఈఈ విజయ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో లైన్మెన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యుత్తమ సేవలందించిన పలువురు లైన్మెన్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24గంటల పాటు వినియోగదారులకు సేవలందించడంలో లైన్మెన్ల పాత్ర గొప్పదన్నారు. కార్యక్రమంలో ఏడీఈ రమేశ్, ఏఈలు సునీల్, కిరణ్, మహేందర్‌బాబు, సుమన్, శారద పాల్గొన్నారు. క్రీడాకారులకు అభినందనమహబూబాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఫిబ్రవరి 28నుంచి మార్చి 2వ తేదీ వరకు జరిగిన ఐదో రాష్ట్రస్థాయి బేస్‌బాల్ సబ్ జూనియర్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు రన్నర్‌గా నిలిచింది. కాగా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆ జట్టును కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి అభినందించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో బేస్‌బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కల్లూరి ప్రభాకర్, డీవైఎస్ఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వివరాలు నమోదు చేయాలి● డీఎంహెచ్ఓ మురళీధర్ నెహ్రూసెంటర్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల డాటా ఎంట్రీ ఆపరేటర్లు గర్భధారణ ఫలితాలు, నవజాత శిశువులు, పిల్లల టీకాల వివరాలను యూ విన్ పోర్టల్‌లో నమోదు చేయాలని డీఎంహెచ్ఓ జి.మురళీధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. యూ విన్ పోర్టల్‌ను బలోపేతం చేసేందుకు డెలివరీ, శిశువు జనన, టీకాల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెచ్ఈ కేవీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ వడ్డెబోయిన శ్రీనివాస్, డీడీఎం సౌమిత్, డీఈఓ శ్రీనివాస్, ఉమాకర్ పాల్గొన్నారు. ఎండిపోతున్న పంటల పరిశీలనకేసముద్రం: మండలంలోని ఉప్పరపల్లి, అర్పనపల్లి గ్రామాల సమీపంలోని వట్టివాగు పరీవాహకంలో ఎండిపోతున్న వరిపంటలను బీఆర్ఎస్, ఎంసీపీఐయూ పార్టీల నాయకులు మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మంచాల యాకరాజ్యం, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ.. వట్టివాగులో నీళ్లు లేకపోవడంతో చుట్టుపక్కల సాగు చేసిన పంటపొలాలలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, ఎస్సారెస్పీ జలాలతో వట్టివాగును నింపి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎలబోయి న సారయ్య, సంకు శ్రీనివాస్‌రెడ్డి, యాకయ్య, వీరయ్య, బొల్లోజు రామ్మోహనాచారి, భద్ర య్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ రూరల్: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు సిబ్బందితో మంగళవారం దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, బాధ్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. వృత్తి నిర్వహణలో నైపుణ్యాలను పెంచుకోవాలని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, ఇందుకోసం నిత్యం వ్యాయామం, యోగా చేయడం అలవర్చుకోవాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు. నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది వ్యక్తిగత, కుటుంబపరమైన, శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని వివరించారు. టౌన్ డీఎస్పీ తిరుపతిరావు, ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ఐలు అనిల్, భాస్కర్, సోములు, నాగేశ్వరరావు, సాయుధ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల ఏంజిల్స్ హైస్కూల్లో మంగళవారం డీఈఓ, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించా రు. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థుల పాఠశాల స్థాయిలో స్పెషల్ టెస్టులు, గ్రాండ్ టెస్ట్‌ల ఫలితాలను అనాలసిస్ చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక కా ర్యాచరణ ద్వారా అభ్యసన సామర్థ్యాలు పెంచాలని సూచించారు. వార్షిక పరీక్షల సమయంలో 8, 9వ తరగతుల విద్యార్థులతో పదో తరగతి విద్యార్థులకు ఆల్‌ది బెస్ట్ విషెస్ చెప్పించాలన్నారు. నూతన డైట్ మెనూ షెడ్యూల్, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, చిన్నచిన్న మరమ్మతులకు ప్రతి పాదనలు చేయాలన్నారు. డీఈఓ రవీందర్‌రెడ్డి, ఏడీ రాజేశ్వర్, అధికారులు చంద్రశేఖర్ఆజాద్, విజయకుమారి, అప్పారావు, శ్రీరాములు ఉన్నారు. -
నేటినుంచి ఇంటర్ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి(బుధవారం) ప్రారంభమయ్యే పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని డీఐఈఓ సీహెచ్.మదార్ గౌడ్ తెలిపారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా ఎటువంటి సెల్ఫోన్లు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు వాడవొద్దని ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,317 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. కాగా పరీక్షకు 5నిమిషాలు ఆలస్యంగా వచ్చినవారిని కూడా లొనికి అనుమతిస్తామన్నారు. నేటి నుంచి... మార్చి 5నుంచి 22వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఉదయం 8:45 గంటల లోపే విద్యార్థులు పరీక్ష హాల్లో కూర్చోవాలి. పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారుల తెలిపారు. హాజరుకానున్న 9,317మంది విద్యార్థులు.. జిల్లావ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలకు 9,317 మంది విద్యార్థులు హాజరకానున్నారు. ఇంటర్ ప్ర థమ సంవత్సరం విద్యార్థులు 3,196, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,716 మంది, ఒకేషనల్ ఫస్టి యర్ విద్యార్థులు 1,199 మంది, ఒకేషనల్ ద్వితీ య సంవత్సరం విద్యార్థులు 1,206 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. చీఫ్ సూపరింటెండెంట్లు 20మంది,డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 20మంది, ఇన్విజిలేటర్లు 210 మంది విధులు నిర్వహిస్తారు. జిల్లాలో 20 కేంద్రాలు.. జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 5 కేంద్రాలను ప్రైవేట్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల, ప్రభుత్వ బాలుర కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, మోడల్ స్కూల్ కళాశాల, నలంద, వికాస్, శ్రీవివేకానంద కాళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలాల వారీగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఓఎంఆర్ షీట్లో విద్యార్థుల ఫొటో ముద్రించబడి ఉంటుందని, అందుకు విద్యార్థులు ముందుగానే హాజరై ఓఎంఆర్ షీటును పూర్తిచేసి 9గంటలలోపే పరీక్షకు సిద్ధంగా ఉండాలన్నారు. పరిశీలనకు ప్రత్యేక అధికారులు.. పరీక్షల పరిశీలకు సంబంధించిన ప్రత్యేక బృందాలు, అధికారులను ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు చేయగా కలెక్టర్ చైర్మన్‌గా, డీఐఈఓ, సీనియర్ ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉండి పరీక్షల నిర్వహణను పరిశీలిస్తారు. ఎప్పటికప్పుడు కలెక్టర్‌కు సమాచారం అందిస్తారు. జిల్లాలో మూడు సిట్టింగ్ స్క్వాడ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అదే విధంగా పరీక్ష కేంద్రాల్లో చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు హాజరుకానున్న 9,317మంది విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి జిల్లాలో పరీక్షలు రాసే విద్యార్థుల వివరాలు జనరల్ ఫస్టియర్ విద్యార్థులు : 3,196జనరల్ సెకండియర్ : 3,716ఒకేషనల్ ఫస్టియర్ : 1,199ఒకేషనల్ సెకండియర్ : 1,206మొత్తం విద్యార్థులు : 9,317హాల్‌టికెట్లు రాని విద్యార్థులు.. జిల్లాలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే విద్యార్థులు ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్ బీఐ వెబ్సైట్లో పుట్టిన తేదీ, పదో తరగతి హాల్‌టికెట్ నంబరు నమోదు చేసి డౌన్లోడ్ చే సుకోవచ్చు. కాగా ప్రైవేట్ కళాశాలల యాజ మాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.పరీక్ష కేంద్రాలు, అధికారుల వివరాలు పరీక్ష కేంద్రాలు : 20అధికారులు : 50ఇన్విజిలేటర్లు : 210సిట్టింగ్ స్క్వాడ్ : 3ఫ్లయింగ్ స్క్వాడ్ : 1పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు మహబూబాబాద్ రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మంగళవారం తెలిపారు. బుధవారం నుంచి జరగనున్న ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుశాఖ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్ నెట్ సెంటర్లు, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసివేయాలన్నారు. పరీక్ష సెంటర్ల వద్ద నుంచి 200 మీటర్ల దూరం వరకు ప్రజలు గుమిగూడవద్దని పేర్కొన్నారు. -
ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి
గార్ల: రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ ఏకమై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని మానుకోట ఎంపీ బలరాంనాయక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం గార్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నా.. ప్రతిపక్షాలు నిత్యం ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. అబద్ధపు ప్రచారాలను మానుకోవాలని ఆయా పార్టీల నాయకులను హెచ్చరించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్‌సౌకర్యం, వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. అనంతరం గార్ల రైల్వేస్టేషన్లో మణుగూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిలుపుదలను పునరుద్ధరించాలని ఎంపీకి అఖిలపక్ష నాయకులు వినతిపత్రం అందజేశారు. త్వరలో రైల్వే జీఎంతో మాట్లాడి రైలు నిలుపుదలకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దనియాకుల రామారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణగౌడ్, పార్టీ జిల్లా సీనియర్ నాయకులు వెంకట్రామయ్య, ఎస్.వెంకట్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎం.వెంకట్‌లాల్, పృథ్వీరాజ్‌నాయక్, కె.సత్యనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. ఎంపీ బలరాంనాయక్ -
బుల్లెట్, జావా బైక్‌ల ఢీ... ముగ్గురి దుర్మరణం
● జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన భూపాలపల్లి రూరల్: బుల్లెట్, జావా బైక్‌లు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం రాంపూర్ సమీప అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు,గ్రామస్తులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిళి రవీందర్‌రెడ్డి (45), కొమ్మిడి నర్సింహారెడ్డి అలియాస్ లడ్డూ (35) భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివారు పెర్కపల్లి బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి మీనాజీపేటకు బుల్లెట్‌పై వస్తున్నారు. భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన నర్సింగోజు సతీశ్(30) పంబాపూర్నుంచి జావా వాహనంపై కమలాపూర్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చే క్రమంలో రాంపూర్ గ్రామసమీపం.. మూల మలుపు వద్ద అటవీ ప్రాంతంలో రెండు బైక్‌లు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రగాయాలు కావడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం 108 ద్వారా జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆస్పత్రికి తరలించారు. మృతుడు పింగిళి రవీందర్‌రెడ్డికి భార్య, కుమారుడు, కొమ్మిడి నర్సింహారెడ్డికి భార్య, ఉండగా, నర్సింగోజు సతీశ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు. వారం క్రితమే సొంతూరుకు వచ్చిన సతీశ్.. సతీశ్ హైదరాబాద్‌లో కుల వృత్తి వడ్రంగి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులను కలిసేందుకు వారం రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి తన సొంత గ్రామం పంబాపూర్‌కు వచ్చాడు. ముగ్గురి మృతితో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
వేసవి పనులు త్వరగా పూర్తి చేయాలి
హన్మకొండ : వేసవి ప్రణాళికలో భాగంగా మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల (జిల్లాలు) ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్లు, జిల్లాల వారీగా వేసవి ప్రణాళిక, ఇతర అంశాలపై సమీక్షించారు. సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ వేసవి ప్రణాళికలో భాగంగా మిగిలిపోయిన ఇంటర్ లింకింగ్, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి, ఏప్రిల్ పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా జరిగేలా సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ సర్వీస్‌ల మంజూరులో జాప్యం లేకుండా వేగవంతం చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు, సరీసృపాల వల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా మోనోప్లాస్ట్లు పెట్టాలన్నారు. దీని ద్వారా చాలా వరకు అంతరాయాలను నివారించొవచ్చన్నారు. యూనిక్ పోల్ నంబర్ పనులు వేగవంతం చేయాలన్నారు. ఓల్టేజీని మరింత మెరుగుపరచడానికి లైన్లలో కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, వి.తిరుపతి రెడ్డి, సీఈలు తిరుమల్ రావు, రాజు చౌహన్, అశోక్, బీకంసింగ్, వెంకటరమణ, జీఎంలు అన్నపూర్ణ, నాగప్రసాద్, శ్రీనివాస్, సత్యనారాయణ, మల్లికార్జున్, కృష్ణ మోహన్, వేణు బాబు, డీఈ అనిల్‌కుమార్, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
కాంట్రాక్ట్‌లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని వైద్యుడి ఘరానా మోసం
జనగామ : ప్రభుత్వ ఉద్యోగాలు, బిల్డింగ్ కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తానని రూ. రూ.5.56 కోట్ల మేర వసూలు చేసి మోహం చాటేసిన వైద్యుడిని సోమవారం అరెస్ట్ చేసినట్లు జనగామ సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని కేకే ఆస్పత్రి వైద్యుడు అబ్దుల్ రహీం సుల్తాన్.. రాజ టిప్పుసుల్తాన్ వారసుడితో పాటు ట్రస్ట్ చైర్మన్‌గా ప్రచారం చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు తాను టిప్పు సుల్తాన్ వారసుడినని పరిచయం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో జిల్లా కేంద్రానికి చెందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎండి. వసీం అక్తర్‌తో స్నేహం ఏర్పరుచుకున్నాడు. టిప్పు సుల్తాన్ ట్రస్ట్‌కు కర్ణాటక ప్రభుత్వం నుంచి రూ.7 వందల కోట్లు వస్తున్నాయని, ఇందుకు జీఎస్టీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని వసీం అక్తర్‌ను నమ్మించి అతడి వద్ద రూ.1.17 కోట్లు తీసుకున్నాడు. ఇందుకు బహుమానంగా నెలరోజుల్లో జనగామలో తాను నిర్మాణం చేసే మెడికల్ కళాశాల బిల్డింగ్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టును ఇప్పిస్తానని చెప్పడంతో వసీం అక్తర్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చాడు. 2021లో ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మేకల ఆనంద్‌కుమార్ వద్ద రూ.3.75లక్షలు, గాదెపాక రాజ్‌కుమార్ వద్ద రూ. 5.50 లక్షలు, సిద్ధార్థ వద్ద రూ.5.50 లక్షలు తీసుకున్నాడు. కేకే ఆస్పత్రిలో ఉన్న ఎక్స్‌రే మిషన్, 10 బెడ్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇతర మెడికల్ పరికరాలను ఇస్తామని చెప్పి పట్టణానికి చెందిన మారబోయిన పాండు వద్ద 2023లో రూ.5లక్షలు తీసుకున్నాడు. అలాగే, హైదరాబాద్‌కు చెందిన ఎస్వీఎన్ చారి నుంచి రూ.1.70కోట్లు, ఏ.రాజు నుంచి రూ.50లక్షలు, 2014లో కరీంనగర్‌కు చెందిన సీహెచ్ అనిల్ వద్ద రూ.2 కోట్లు తీసుకుని మోసం చేశాడు. మొత్తం రూ.5కోట్ల56లక్షల75వేల మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు ఏసీపీ చేతన్ నితిన్ పండరి పర్యవేక్షణలో సదరు వైద్యుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ దామోదర్ రెడ్డి తెలిపారు. లాటరీ, ఉద్యోగాల పేరిట డబ్బులు అడిగితే ఇచ్చి మోసపోవద్దని సీఐ ప్రజలకు సూచించారు. రూ.5.56 కోట్ల మేర వసూలు వివరాలు వెల్లడించిన సీఐ దామోదర్‌రెడ్డి -
జాతీయ సమగ్రతను పెంపొందించడమే లక్ష్యం
● నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర డైరెక్టర్ అన్షుమాన్ ప్రసాద్‌దాస్ హన్మకొండ: యువతలో జాతీయ సమగ్రతను పెంపొందించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర యువ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర డైరెక్టర్ అన్షుమాన్ ప్రసాద్ దాస్ అన్నారు. సోమవారం హనుమకొడలోని హరిత కాకతీయ హోటల్లో అంతర్ రాష్ట్ర యువ మార్పిడి కార్యక్రమం–కేరళ ముగింపు కార్యక్రమం జరిగింది. అన్షుమాన్ ప్రసాద్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కేరళ రాష్ట్ర యువతకు ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ యువజనుడు సామాజిక సేవా, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. అవినీతి, మూఢ నమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ చితంల అన్వేశ్, నేషనల్ యూత్ అవార్డు గ్రహీతలు మండల పరశురాములు, ఆకులపల్లి మధు, నిట్ ప్రొఫెసర్ కోలా ఆనంద్ కిశోర్ పాల్గొన్నారు. కేయూ పీజీ పరీక్షలు షురూకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రెండు పరీక్ష కేంద్రాల్లో ముగ్గురు కాపీయింగ్ చేస్తూ పట్టుబడగా.. మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. అదేవిధంగా లా మొదటి సెమిస్టర్ పరీక్షల్లో వరంగల్‌లో రెండు పరీక్ష కేంద్రాల్లో కలిపి కాపీయింగ్ చేస్తూ.. స్క్వాడ్‌కు ఆరుగురు పట్టుబడ్డారు. వారిని మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసినట్లు తెలిపారు. -
హోలీ పండుగకు ఆరు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హోలీ పండుగ సందర్భంగా కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ మధ్య అప్ అండ్ డౌన్ మార్గంలో ఆరు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. మార్చి 6,12, 16వ తేదీల్లో చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ (07707) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు 22.45 గంటలకు చేరుతుంది. అదేవిధంగా తిరుగుప్రయాణంలో మార్చి 8,14,18వ తేదీల్లో హజ్రత్‌నిజాముద్దీన్–చర్లపల్లి (07708) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు మరుసటి రోజు 07.30 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, అండ్ జనరల్ కోచ్‌లతో ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లకు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్కాగజ్నగర్, బల్హార్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, రాణి కమలాపతి, బీణా, ఝాన్సీ, ఆగ్రా, పల్వాల్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు శ్రీధర్ తెలిపారు. హ్యాండ్‌బాల్ పోటీలకు కేయూ మహిళా జట్టు కేయూ క్యాంపస్ : తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో కొనసాగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ పోటీలకు కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టు పాల్గొంటుందని కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య సోమవారం తెలిపారు. ఈజట్టులో ఎస్.భాగ్యశ్రీ, బి.శాంత, ఆర్.రేష్మ, బి.రమ్య (యూపీపీఈ కేయూ వరంగల్), బి.కావ్య, ఎం.త్రివేణి (టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ వరంగల్ వెస్ట్), బి. మీనాక్షి, బి.నందిని(టీజీడబ్ల్యూఆర్డీసీ, కొత్తగూడెం), ఎం.కరీనా (టీటీడబ్ల్యూఆర్డీసీ, ఆసిఫాబాద్), ఎస్.నందిని ప్రభుత్వ (ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్, ఖమ్మం), ఎస్.శివాని (యూసీఈటీడబ్ల్యూ, కేయూ), టి.స్నేహ, ఎ.శ్రీలేఖ, టి.నాన్సీ (వీసీపీఈ బొల్లికుంట), కె.సింధూజ (టీటీడబ్ల్యూఆర్డీసీ ఉట్నూరు), సీహెచ్ సునీత (యూసీపీఈ, ఖమ్మం) ఉన్నారు. వీరికి హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల పీడీ కె.మధుకర్ కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ రేసులో సీపీఐ నేతలు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటుపై సీపీఐ నేతలు కన్నేశారు. ఈ ఎన్నికలకు గత నెల 24న షెడ్యూల్, సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలైన రోజే సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతల బృందం టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను హైదరాబాద్ గాంధీభవన్‌లో కలిసింది. నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనుండగా, 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, 20న పోలింగ్, కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే ఎన్నికలు జరిగే ఐదు స్థానాల్లో కాంగ్రెస్‌కు 4, బీఆర్ఎస్కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావు, పల్లా వెంకట్‌రెడ్డి, కలవేని శంకర్, ఎం.బాల నర్సింహ, ఈటీ నర్సింహ తదితరుల బృందం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. రెండు సీట్ల ప్రతిపాదన.. టీపీసీసీ చీఫ్‌ని కలిసిన సీపీఐ బృందం తమ పార్టీకి రెండు ఎమ్మెల్సీ సీట్లను కేటాయించాలని వినతిపత్రం సమర్పించింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఒకటి.. ఐదారు మాసాల్లో ఖాళీ అయ్యే స్థానాల్లో మరొటి ఇవ్వాలని అడిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. రెండు సీట్లలో ఒకటి దక్షిణ తెలంగాణ, మరొటి ఉత్తర తెలంగాణకు ఇవ్వాలన్న ప్రతిపాదన చేసినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా అవకాశం ఉన్నా సీటు వదులుకున్న మునుగోడు.. ఉద్యమాల చరిత్ర కలిగిన చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కని వరంగల్ నియోజకవర్గాల నాయకుల పేర్లను పార్టీ నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. ఎంపీ ఎన్నికల సమయంలో సైతం వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని అడిగిన సీపీఐ.. కాంగ్రెస్ నాయకత్వం సూచన మేరకు పట్టు వీడింది. ఎమ్మెల్సీ స్థానాల్లోనైనా వరంగల్‌కు చోటు ఇవ్వాలని సీపీఐ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ కోసం మొదలైన ప్రయత్నాలు... అలయెన్స్‌లో భాగంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం సీపీఐలో ప్రయత్నాలు ఎవరికీ వారీగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నెల్లికంటి సత్యంతోపాటు సీపీఐ రాష్ట్ర సహాయ కారద్యర్శి, వరంగల్‌కు చెందిన తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావుల పేర్లు పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉన్నాయి. వీరితో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా తనకే అవకాశం ఇవ్వాలని నాయకత్వానికి కోరినట్లు తెలిసింది. ఏఐఎస్ఎఫ్ కార్యకర్త నుంచి ఆలిండియా అధ్యక్షుడిగా.. సీపీఐ ఉమ్మడి వరంగల్‌కు మూడు పర్యాయాలు కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్‌రావు కూడా గట్టిగా పట్టుపడుతున్నారు. కూనంనేని సాంబశివరావు తర్వాత రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కీలక పోస్టులో ఉన్న శ్రీనివాస్‌రావు.. ఉద్యమ ప్రాంతం, వరంగల్‌నుంచి పార్టీ నేతలకు పెద్దగా అవకాశాలు రానందున తనకు చాన్స్ ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. సోమవారం టీపీసీసీ చీఫ్‌ను కలిసిన బృందం... సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులను కలవాలనుకున్నా సీఎం ఢిల్లీకి వెళ్లడంతో కుదరలేదు. మంగళవారం సీఎం, ఇతర మంత్రులను ఓ బృందం కలవనుండగా.. ఢిల్లీలో నేడు జరుగుతున్న సీపీఐ జాతీయ సభల్లో పాల్గొనడంతోపాటు కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు మరో బృందం బయలుదేరింది. ఈ బృందంలో తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావుతోపాటు పలువురు ఉన్నారు. టీపీసీసీ చీఫ్‌ను కలిసిన కమ్యూనిస్టులు.. నేడు సీఎంను కలవనున్న బృందం రెండు విడతల్లో రెండు సీట్ల ప్రతిపాదన పరిశీలనలో వరంగల్, మునుగోడు నాయకులు వరంగల్ నుంచి తక్కల్లపల్లి శ్రీనివాసరావు పేరు -
పదేళ్ల పాలనలో ఏం చేశారు?
హన్మకొండ చౌరస్తా : మామునూరు ఎయిర్ పోర్టుకు అనుమతులు తీసుకురాకుండా పదేళ్ల పాలనలో ఏం చేశారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. వరంగల్‌ను డల్లాస్ చేస్తా, ఆక్సిజన్ పార్కు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వంటి హామీలు ఇచ్చిన కేసీఆర్ పదేళ్ల పాలనలో నగర అభివృద్ధికి తట్టెడు మట్టి పోయలేదని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకునే నాయకులను తరిమికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, ఉద్యోగుల నియామకం, వైద్యపరికరాల కొరతను పట్టించుకోని నాటి బీఆర్ఎస్ సర్కార్, కమీషన్ల కోసం జైలు స్థలం పేపర్లను మహారాష్ట్ర బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.వేల కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. కాజీపేట రైల్వే డివిజన్ హోదా సాధనకు ఈ నెల 9వ తేదీన ఎంపీ కావ్యతో కలిసి ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కోరనున్నామని తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి రూ.6వేల కోట్ల నిధులు మంజూరు చేసిన ఏకై క సీఎం రేవంత్‌రెడ్డి అని వివరించారు. ఎయిర్‌పోర్టు స్థల సేకరణకు రూ.205 కోట్లు మంజూరు చేశారని, స్థల సేకరణలో రైతులను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, అది సరైంది కాదని ఆమె ధ్వజమెత్తారు. అనంతరం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేషన్ ఫ్లోర్ లీడ ర్ తోట వెంకటేశ్వర్లు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీని వాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు వీ సం సురేందర్‌రెడ్డి, పింగిళి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. నగర అభివృద్ధికి తట్టెడు మట్టిపోయలే.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి రైతులను రెచ్చగొట్టడం సరికాదు: ఎంపీ కావ్య -
ఉసురు తీసిన అప్పులు..
అప్పులు, ఆర్థిక బాధలు భరించలేక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పంట, ట్రాక్టర్ కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ మహిళా కౌలు రైతు, ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. దుగ్గొండి: పంట సరిగా పండ క.. పండిన పంటకు గిట్టుబా టు ధర లేక.. తెచ్చిన అప్పు తీర్చలేక ఓ మహిళా కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని మహ్మదాపురంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంధం లక్ష్మి(52), మొగిలి దంపతులు 5 సంవత్సరాలుగా ఇదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. అయితే పంట సరిగా పండక.. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక.. పెట్టుబడి అప్పు రూ.. 5లక్షలకు పెరిగింది. దీంతో అప్పులు ఎలా తీ ర్చాలని దంపతులు నిత్యం మదనపడుతుండేవా రు. దీనికి తోడు మొగిలి గొర్రెలు, బర్రెల వ్యాపారం చేస్తూ నష్టాల పాలయ్యాడు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా వారు వేర్వేరుగా ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరి స్థితి దారుణంగా ఉండడంతో కలత చెందిన లక్ష్మి గత నెల 27న సాయంత్రం పురుగుల మందు తాగింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన మొగిలికి భార్య పడుకుని ఉండి మంచం వద్ద పురుగుల మందు డబ్బా ఉండడంతో వెంటనే ఎంజీఎంకు తీసుకెళ్లాడు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. భర్త మొగిలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ట్రాక్టర్ అప్పు తీర్చలేక ఉయ్యాలవాడలో యువకుడు.. డోర్నకల్: ట్రాక్టర్ కొనుగోలు కోసం చేసిన అప్పు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఉయ్యాలవాడలో చోటుచేసుకుంది. డోర్నకల్ సీఐ బి.రాజేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పోటు సాయి(31) అప్పు చేసి ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో ట్రాక్టర్ అప్పు సకాలంలో చెల్లించలేకపోవడంతోపాటు ఇతర అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురై ఈ నెల 1వ తేదీన గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న సాయిని గుర్తించిన కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. సాయికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సాయిసింధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మహిళా కౌలు రైతు, ట్రాక్టర్ యజమాని బలవన్మరణం శోకసంద్రంలో ఆయా కుటుంబాలు -
తనవాటా భూమి దక్కడం లేదని దామెరలో యువకుడు..
దామెర: తన వాటా భూమి దక్కడంలేదనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించి చి కిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన పున్నం నాగరాజు(36) తన కు వారసత్వంగా రావాల్సిన ఎకరం భూమిని త న సొంత అక్క ఉమారాణితోపాటు చిన్నమ్మ కుమారులు రామకృష్ణ, పూర్ణచందర్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. దీంతో నాగరాజు పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ సమయంలో నాగరాజుకు భూ మి ఇస్తామని ఒప్పుకుని తర్వాత ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు.. జనవరి 24న గడ్డిమందు తాగి అపస్మార క స్థితికి చేరుకున్నాడు. గమనించిన బంధువులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందు తూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. నాగరాజు భార్య మమత ఫిర్యాదు మేరకు ఉమారాణి, రామకృష్ణ, నార్లగిరి పూర్ణచందర్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
చివరి ఆయకట్టుకు సాగునీరందాలి
● వీసీలో సీఎస్ శాంతికుమారి మహబూబాబాద్: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, నీటిపారుదలశాఖ పనితీరుపై జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాబోయే 10 రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగునీటి సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు. ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయానికి విద్యుత్‌సరఫరాలో లోటు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్ల నుంచి విడుదల చేసే నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రెగ్యులర్‌గా తనిఖీ చేయాలి.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. జిల్లాలోని ప్రతీ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. -
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuసాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేవు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. చివరికి శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందిఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటాగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోలవగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డికి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిలను ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత శ్రీపాల్‌రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగిలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటివరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులనుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్‌రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్‌రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్ 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 1,348 ఓట్లు పెరిగి, 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. ● హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు.న్యూస్రీల్ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి గెలుపు రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ 19మంది బరిలో ఉన్నా ఐదుగురి మధ్యనే సాగిన పోటీ అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ -
సైబర్ మోసం..
మహబూబాబాద్ రూరల్: మీ భూమిలో సెల్ టవర్ ఏర్పాటు చేసి ప్రతీనెల అద్దె చెల్లిస్తామని చెప్పి భూ యజమాని నుంచి సైబర్ నేరగాళ్లు రూ.45వేలు కాజేసిన ఘటన మానుకోట జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నా యి.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కొంతకాలం క్రితం కొందరు వ్యక్తులు ఫోన్ చేసి.. తాము సీఎస్టీ నుంచి మాట్లాడుతున్నామని, సెల్ టవర్ ఏర్పాటు చేసుకోవడానికి మీ భూమి లీజ్‌కు ఇవ్వాలని కోరారు. దీంతో సదరు భూ యజమాని ఒప్పుకున్నాడు. ఈమేరకు ప్రతీ నెల లీజ్ కింద రూ.లక్ష చెల్లించడంతో పాటు మొదట రూ.45లక్షలు నగదు రూంపలో ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో డాక్యుమెంట్ అగ్రిమెంట్ కోసం రూ.5వేలు పంపమని చెప్పగా, భూ యజమాని ఆ మొత్తం పంపించాడు. మరోమారు ఎన్ఓసీ కోసం రూ.80 వేలు అడుగగా.. అది నిజం అనుకుని భూ యజమాని రూ.40వేలు బదిలీ చేశాడు. మొత్తంగా రూ.45వేలు తీసుకున్న సదరు వ్యక్తులు.. చాలా రోజుల వరకు కూడా ఒప్పందం మేరకు మొదట రూ.45లక్షలు ఇవ్వకపోగా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాను మోసపోయానని భూ యజమాని గ్రహించాడు. ఇది సైబర్ నేరగాళ్ల పని అని గమనించి సైబర్ క్రైమ్ నంబర్ 1930లో ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబాబాద్ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ వెల్లడించారు. రూ.45వేలు కాజేసిన నేరగాళ్లు -
శిథిలావస్థలో పాఠశాల భవనం
డోర్నకల్: మండలంలోని ఫకీరాతండా ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. మూడు గదులతో కూడిన భవనం స్లాబ్ పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. వర్షాల కురిస్తే తరగతి గదులు జలమయమవుతున్నాయి. కాగా ప్రస్తుతం పాఠశాలలో 28 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు శిథిలావస్థకు చేరుకున్న గదుల్లో కాకుండా ఆరుబయట విద్యనభ్యసిస్తున్నారు. ఇదిలా ఉండగా మూడేళ్ల క్రితం పాఠశాల ఆవరణలో రూ.10లక్షల నిధులతో అదనపు భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. 80శాతం పనులు పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదంటూ పనులను నిలిపివేశాడు. స్లాబ్ పనులు పూర్తి కాగా ప్లాస్టింగ్, ఫ్లోరింగ్, విద్యుత్, ఫ్యాన్లు, టాయిలెట్, నీటి ట్యాంకు, సంప్, తలుపులు, కిటికీలు అమర్చే పనులు పూర్తి చేయాల్సి ఉంది. అధికారులు వెంటనే స్పందించి అదనపు భవన నిర్మాణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. నిర్మాణ దశలోనే నూతన బిల్డింగ్ -
కనుల పండువగా రథోత్సవం
● ఊరేగిన కురవి వీరభద్రుడు ● తరలివచ్చి తిలకించిన భక్తజనంకురవి: మండల కేంద్రంలో భద్రకాళి సమేత వీరభద్రుడిని సోమవారం రాత్రి రథంపై ఊరేగించారు. రంగురంగు పూలతో అలంకరించిన రథంపై స్వామి, అమ్మవారు 8.30గంటలకు గ్రామ సేవకు తరలివెళ్లారు. ఆలయ పూజారులు విజయ్, విజయ్‌కుమార్, అభిలాష్, పుణ్యమూర్తి ఛండీశ్వరుడిని తీసుకొచ్చి అగ్నిహోమం, వాస్తు పూజ చేశారు. చొప్పను మంటలో వెలిగించి రథం చుట్టూ తిప్పి ఊరవతల వదిలేశారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని మంగళవాయిద్యాలు, సన్నాయి మేళాల నడుమ ప్రత్యేక శావలో తీసుకొచ్చి ప్రదక్షిణలు చేసిన అనంతరం రథంపై అధిష్టింపజేశారు. ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ రవీందర్‌రెడ్డి అర్చకుడు విజయ్‌కుమార్ గుమ్మడికాయలు కొట్టారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ టెంకాయ కొట్టి మొక్కుకున్నారు. భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామి వారి రఽథాన్ని ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేశ్, వెంకటేశ్‌గౌడ్, ఉప్పలయ్య, ఆలయ మాజీ చైర్మన్లు సోమిశెట్టి శ్రీనివాస్, మేక దామోదర్‌రెడ్డి, సీఐ సర్వయ్య, ఎస్సై సతీష్, ఏఎస్సై వెంకన్న రథాన్ని లాగారు. హైదరాబాద్‌కు చెందిన భక్తులు రథానికి పూలతో అలంకరణ చేశారు. కాగా రథాన్ని గ్రామ పంచాయతీ వరకు తీసుకెళ్లారు. గ్రామస్తుల పూజల అనంతరం తిరిగి ఆలయం వరకు తీసుకొచ్చారు. -
నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం నిర్మించాలి
మహబూబాబాద్ రూరల్: మానుకోట రైల్వేస్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ రైల్వే అధికారులకు సూచించారు. రైల్వే మూడో లైన్ నిర్మాణ పనుల పర్యవేక్షణలో భాగంగా రైల్వేస్టేషన్ ను ఎమ్మెల్యే సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగో నంబర్ ప్లాట్ ఫాం నిర్మించకుంటే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. వరంగల్ రైల్వేస్టేషన్ తరహాలో పూర్తిస్థాయి ప్లాట్‌ఫాం ఉంటేనే పిల్లలు, వృద్ధులు, గర్భిణులకు ఇబ్బ ందులు ఉండవన్నారు. రోజూ వేలాదిమంది ప్రయాణికులు, లక్షలాది రూపాయల ఆదాయంతో అత్యంత రద్దీగా ఉండే మానుకోట రైల్వేస్టేషన్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాలన్నారు. రెండు నిమి షాలు ఆగే రైలును చివరి సెకన్లలో అయినా ఎక్కే అవకాశం నాలుగో ప్లాట్ ఫాం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. రైలు వస్తే శ్రీనివాస టాకీస్ ఏరియాలో విపరీతమైన రద్దీ ఉంటుందన్నారు. నాలుగో నంబర్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తే సమస్యలన్నీ తీరుతాయని పేర్కొన్నారు. అదనపు ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్ కూడా అవసరమే అన్నారు. కార్యక్రమంలో రైల్వే కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ గంటా శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, కాంగ్రెస్ నాయకులు రామగోని రాజు, శంతన్ రామరాజు, చలమల్ల నారాయణ, నాళ్ల నర్సింహారావు, సిరిపురం వీరన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే మురళీనాయక్ -
ఎస్టీ హాస్టళ్లలో విచారణ
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని హస్తినపురంకాలనీ ఎస్టీ బాలుర హాస్టల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం, వార్డెన్ సమయపాలన పాటించడం లేదని కుల సంఘాల నాయకులు హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వరంగల్ డీడీ సౌజన్య సోమవారం హాస్టల్‌ను సందర్శించి విచారణ చేశారు. అదేవిధంగా పత్తిపాక గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో అటెండర్‌పై పాఠశాల హెచ్ఎం బూటుకాలుతో ఇష్టం వచ్చినట్లు తన్ని కొట్టినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారికి విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడంతో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు వరంగల్ డీడీ సౌజన్య విచారణ చేశారు. ఈ మేరకు డీడీ సౌజన్యను సాక్షి వివరణ కోరగా ఐటీడీఏ, రాష్ట్ర గిరిజన అధికారుల ఆదేశాల మేరకు హాస్టళ్లలో విచారణ చేపట్టామ ని, పలు రికార్డులను పరిశీలించామన్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. హాస్టల్ వార్డెన్‌కు షోకాజు నోటీసులుమహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎస్సీ–ఈ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్‌కు షోకాజు నోటీసులు అందజేసినట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి బి.నర్సింహాస్వామి సోమవారం తెలిపారు. గతనెలలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, వైన్స్ ఎదుట మద్యం సేవించాడని విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదుల మేరకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలి● డీఈఓ రవీందర్‌రెడ్డి మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంచాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల హోలిఏంజిల్స్ హైస్కూల్, మోడల్ స్కూల్లో డీఎస్సీ–2024లో నియామకమైన ఉపాధ్యాయులకు సోమవారం శిక్షణ నిర్వహిచారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే నిరంతరం ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. ఇంగ్లిష్, గణితం, సైన్స్ సబ్జెక్ట్‌లో విద్యార్థులు పట్టుసాధించేలా చూడాలన్నారు. మాతృభాషపై పట్టు పెంచాలని, చదవడం, రాయడం నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ ఆజాద్ చంద్రశేఖర్, డీఆర్పీలు ప్రవీణ్ కుమార్, నాగముని, వీరన్న, శివప్రసాద్, ఓంకార్, యాదగిరి, లక్ష్మీనారాయణ, సారంగం, సీఆర్పీలు రజిని, లింగమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆస్కార్ అవార్డు ఎంపిక మూవీలో జిల్లా వాసి● డ్యూన్ సినిమా మోడలింగ్ టెక్నికల్ డైరెక్టర్‌గా పనిచేసిన సుమంత్‌రెడ్డి కేసముద్రం: హాలీవుడ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో డ్యూన్ సినిమా ఆస్కార్ అవార్డుకు ఆదివారం ఎంపికై ంది. కాగా ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన డీనెగ్ కంపెనీలో మోడలింగ్ టెక్నికల్ డైరెక్టర్‌గా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామానికి చెందిన ఎడ్ల సుమంత్‌రెడ్డి పనిచేశారు. సినిమాలోని ఆరు క్యారెక్టర్లకు డిజైన్ చేసినట్లుగా ఆయన తెలిపారు. డ్యూన్ సినిమాకి సుమంత్‌రెడ్డి పనిచేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎడ్ల సుమంత్‌రెడ్డి జేఎన్టీయూ హైదరాబాద్‌లో బీఎఫ్ఏ చదివారు. ప్రస్తుతం యానిమేషన్ విభాగంలో పనిచేస్తున్నారు. -
విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి
నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విద్యార్థులకు చేపట్టిన కంటి పరీక్షలు పూర్తయ్యాయని ఆర్బీఎస్కే నోడల్ ఆఫీసర్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో పాఠశాలలు, అంగన్వాడీల్లోని విద్యార్థులకు పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఆరోగ్య సమస్యలున్న పిల్లలను జీజీహెచ్‌కు తీసుకువచ్చి వైద్య సేవలు అందిచండం జరుగుతుందన్నారు. 1,000 మంది విద్యార్థులను పరీక్షించామన్నారు. ఇందులో 611 మందికి దూరదృష్టి సమస్య ఉందని, వారికి కంటి అద్దాలు అవసరమన్నారు. కంటి సమస్యలు అధికంగా ఉన్న 53 మందిని వరంగల్, హైదరాబాద్ కంటి ఆస్పత్రులకు రెఫర్ చేసినట్లు తెలిపారు. మిగితా విద్యార్థులకు ఎలాంటి కంటి సమస్యలు లేవని, విద్యార్థులు పౌష్టికాహారం, విటమిన్ ఏ కలిగిన పోషకాలను తీసుకోవడం ద్వారా కంటి సమస్యల నుంచి బయటపడుతారని తెలిపారు. ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ప్రతీ విద్యార్థిని పరీక్షించి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అవసరమైన చికిత్సను అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై గన్‌మెన్ దాడి
వరంగల్ : వరంగల్ బస్టాండ్ సమీపంలో ఆదివా రం సాయంత్రం నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా ఎస్సై గన్‌మెన్ తమపై దాడికి పా ల్పడ్డాడని సంగెం మండలం కృష్ణానగర్‌కు చెందిన గోపతి శ్రీకాంత్, మేకల సాంబరాజు తెలిపారు. వారి కథనం ప్రకారం.. వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం బైక్‌పై వెళ్తుండగా పోలీసులు.. శ్రీకాంత్, మేకల సాంబరాజుకు బీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో సాంబరాజుకు 109 శాతం వచ్చింది. దీనికి సంబంధించిన రశీదును ఇచ్చి కోర్టులో జరిమానా చెల్లించి వాహనం తీసుకెళ్లాలని ట్రాఫిక్ ఎస్సై యాదగిరి సూచించారు. ఈ క్రమంలో పోలీ సులు వాహనాన్ని తీసుకెళ్తున్న సమయంలో శ్రీకాంత్ తన సెల్ఫోన్లో ఫొటో తీశాడు. దీంతో ఎస్సై గన్‌మెన్ వచ్చి దుర్భాషలాడుతూ శ్రీకాంత్ చేయి చేసుకున్నాడు. ఫొటో తీస్తే కొడతారా అని సాంబరాజు ప్రశ్నించడంతో అతడిపై కూడా దాడి చేశాడు. ఇంత జరుగుతున్నా ఎస్సై స్పందించలేదని బాధితులు వాపోయారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుపడితే జరిమానా వేయాలే తప్ప భౌతికదాడికి పాల్ప డడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి సదరు గన్‌మెన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్, సాంబరాజు కోరారు. -
అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
● మానుకోటలో ఘటన మహబూబాబాద్ రూరల్ : అనారోగ్య సమస్యల కారణంగా ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ కథనం ప్రకారం.. జిల్లాలోని కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు గోప్య తండాకు చెందిన మూడ్ లచ్చిరాం (43) మూడేళ్లుగా అనారోగ్య సమస్యలతో మానసికంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి వచ్చి శనివారం మధ్యాహ్న సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలికి చేరుకుని హుటాహుటిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లచ్చిరాం రాత్రి సమయంలో మృతి చెందాడు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ దామోదర్ శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు సీఐ దేవేందర్ ఆదివారం తెలిపారు. -
ఆకట్టుకున్న సాంస్కృతిక ఉత్సవం
● ప్రతిబింబించిన తెలంగాణ, కేరళ రాష్ట్రాల సంస్కృతి హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ, కేరళ రాష్ట్రాల సాంస్కృతిక ఉత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్చేంజ్ ప్రోగ్రాంలు జరుపుతున్నారు. కేరళకు చెందిన కళారూపాలు కొల్కలి, ముటిపాటు, తిరువతిర తదితర సంప్రదాయ జానపద నృత్య ప్రదర్శనలు అలరించాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాల విశిష్టతను తెలియజేస్తూ యువతులు ప్రదర్శనలిచ్చారు. జన్ను భరత్, భాస్కర్ సారథ్యంలో డప్పులతో ప్రదర్శన, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వారి బతుకమ్మ, పింగిళి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల బోనాలు, పోతురాజు, హనుమకొండ వాగ్దేవి కాలేజీ విద్యార్థి అమ్మవారి వేషధారణ, కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వరంగల్ నెహ్రూ యువ కేంద్ర, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయా కార్యక్రమాలు నిర్వహించారు. స్పాన్సర్లుగా కూరపాటి హాస్పిటల్స్, లయన్స్ ఇంటర్నేషనల్ 320 ఎఫ్, అభయ హాస్పిటల్స్, ముక్తి లేజర్ ఫైల్స్ క్లినిక్ వ్యవహరించాయి. కేయూ ప్రొఫెసర్ మల్లారెడ్డి, డాక్టర్ కూరపాటి రమేశ్, డాక్టర్ గౌతమ్, నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేశ్ చింతం, వరంగల్ జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ వసుధ, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొని కళాకారులకు బహుమతులు ప్రశంసపత్రాలు అందజేశారు.