Nalgonda
-
ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్య అరెస్ట్
నల్లగొండ: ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌పురాలో నివాసముంటున్న మహ్మద్ ఖలీల్ నల్లగొండ మండలం చర్లగౌరారం జెడ్పీహెచ్ఎస్లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.అతడికి 2007లో అక్సర్ జహతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఖలీల్ చేస్తున్న అటెండర్ ఉద్యోగం తనకు లేదా పిల్లలకు ఇవ్వాలని అతడిని భార్య అక్సర్ జహ వేధింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24న ఖలీల్ అనారోగ్యంతో ఇంట్లో పడిపోయాడని చుట్టుపక్కల వారిని అక్సర్ జహ నమ్మించి, ఆటోలో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ఖలీల్‌కు ఎటువంటి వైద్యం చేయించకుండానే ఇంటికి తీసుకొచ్చింది. అదే రోజు రాత్రి ఖలీల్ మృతిచెందాడు.మరుసటిరోజు ఖలీల్ తల్లి అహ్మది బేగం తన కుమారుడి మృతికి కోడలే కారణమంటూ నల్లగొండ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో మృతుడి తలపై మారణాయుధాలతో కొట్టడంతో పాటు ముక్కు, నోటిని బలవంతంగా మూయడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి అక్సర్ జహను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించిందని డీఎస్పీ తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
బియ్యం అందక పేదల పస్తులు!
మిర్యాలగూడ : పేదలకు రేషన్ బియ్యం పంపిణీలో ఆలస్యం అవుతోంది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఈ నెల 12వ తేదీ వచ్చినా ఇవ్వడం లేదు. పది రోజులుగా పేదలు రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నా బియ్యం లేవంటూ డీలర్లు సమాధానం చెబుతున్నారు. దీంతో రేషన్ బియ్యంతోనే కడపు నింపుకునే పేదలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. తెరుచుకోని రేషన్ దుకాణాలు బియ్యం లేక చాలా ప్రాంతాల్లో ఇప్పటివరకు రేషన్ దుకాణాలు తెరుచుకోలేదు. గోదాముల నుంచి బియ్యం రేషన్ దుకాణాలకు సరఫరా కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే గోదాముల్లోనే బియ్యం లేనవి.. బియ్యం కొరతకు అధికారులే కారణమని పలువురు పేర్కొంటున్నారు. స్థానికంగా గోదాముల్లో ఉన్న బియ్యం ఇటీవల ఖమ్మం జిల్లాకు తరలించారని.. ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంపిణీ చేసేందుకు బియ్యం లేవని పేర్కొంటున్నారు. దీంతో బియ్యం ఎప్పుడు వస్తాయో తెలియక డీలర్లు, ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 8 బియ్యం నిల్వల గోదాములు.. నల్లగొండ జిల్లాలో 997 రేషన్ దుకాణాలకు 8 బియ్యం గోదాముల నుంచి బియ్యం పంపిణీ జరుగుతుంది. మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దవూర, దేవరకొండ, నకిరేకల్, నిడమనూరు, చండూరు, నాంపల్లి మండలాల్లో మండల్ లెవ్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 6,750 మెట్రిక్ టన్నుల బియ్యం పేదలకు అందిస్తున్నారు. కానీ ఇప్పటివరకు 3వేల మెట్రిక్ టన్నుల బియ్యం కూడా సరఫరా కాలేదు. ఇంకా సగానికి పైగా దుకాణాలకు బియ్యం చేరలేదు. మిర్యాలగూడ గోదాం పరిధిలో మిర్యాలగూడ, వేములపల్లి, మాడ్గులపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, త్రిపురారం మండలాలు ఉన్నాయి. వీటి పరిదిలో 200 రేషన్ దుకాణాలు ఉండగా గతంలో కొన్ని దుకాణాలకు బియ్యం సరఫరా చేశారు. మంగళవారం మూడు లారీల్లో 1,470 క్వింటాళ్ల బియ్యం రాగా.. వాటిని మిర్యాలగూడలో 8, మాడ్గులపల్లి 2 దుకాణాలకు బియ్యం అందించారు. ఇంకా 138 దుకాణాలకు బియ్యం అందాల్సి ఉంది. గడువుకు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండడంతో బియ్యం ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు ఇవ్వాలో తెలియక డీలర్లు ఆందోళన చెందుతున్నారు. బియ్యం పంపిణీ గడువును పెంచితే తప్ప మరో మార్గం లేదని పేర్కొంటున్నారు. బియ్యం కొరత ఉంది ఈనెల రేషన్ షాపుల్లో బియ్యం కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రభుత్వ ఆదేశానుసారం ఇతర జిల్లాల నుంచి బియ్యం తెప్పించి దుకాణాలకు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 50శాతం దుకాణాలకు బియ్యాన్ని అందించాం. మిగిలిన వాటికి కూడా త్వరలోనే అందిస్తాం. బియ్యం కొరత విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వర్రావు, డీఎం సివిల్ సప్లయ్ ఫ 12వ తేదీ వచ్చినా గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు చేరని బియ్యం ఫ షాపుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ -
సాగునీటికి ఇబ్బంది లేదు
నల్లగొండ : జిల్లాలో ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఇబ్బంది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్లగొండలోని పానగల్ సమీపంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఇరిగేషన్, రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగిలో సాగులో ఉన్న పంటలకు సాగునీరు అందడం లేదన్న ప్రచారం వాస్తవం కాదన్నారు. నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ కింద ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఎలాంటి నీటి కొరత లేదన్నారు. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 1.5 టీఎంసీలగాను 0.86 టీఎంసీల నీటిని పంటలకు విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్టు కింద ఉన్న 67,000 ఎకరాలకు వారబందీ పద్ధతిలో పంట కోతకొచ్చే వరకు నీరు ఇస్తామని తెలిపారు. చివరి ఆయకట%్టుకు నీరు అందేలా.. ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. సాగు, తాగునీటి విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చన్నారు. డి–40 కాల్వ పరిశీలన తిప్పర్తి : మండలంలోని యర్రగడ్డలగూడెం సమీపంలో డి–40 వద్ద గల ఎల్–11 కాల్వలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిప్పర్తి మండలంలోని ఎల్–11 కాలువ కింద ఉన్న మామిడాల, సర్వారం, ఇందుగుల, గోరెంకలపల్లి, గ్రామాలకు వారబంధీ ద్వారా నీరు వస్తుందని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, ఉదయ సముద్రం ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏఓ సన్నిరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీఓ జానయ్య, ఇరిగేషన్ అధికారులు శివరాంప్రసాద్, అనుపమ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
పథకాలు అందుతున్నాయా..
పెద్దవూర: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మంగళవారం నాగార్జునసాగర్ నుంచి కారులో హాలియా వైపు వెళ్తుండగా పెద్దవూర మండలంలోని కుంకుడుచెట్టుతండా వద్ద గిరిజన రైతులను చూసి ఆగారు. కారు దిగి వచ్చి రోడ్డు పక్కనే ఉన్న బస్టాప్‌లో కూర్చొని రైతులతో మాట్లాడారు. ఎలా ఉన్నారు.. ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది.. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. అంతా బాగుందని, కానీ.. కుంకుడుచెట్టుతండా ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు సరిగా రావడం లేదని రైతులు చెప్పారు. ఏఎమ్మార్పీ డిస్ట్రిబ్యూటరీ–8, 9 కాలువలకు ఎక్కువ నీటిని విడుదల చేయిస్తానని, సాగర్ నియోజకవర్గంలో ఒక్క ఎకరంలోనూ పంట ఎండిపోనివ్వనని వారికి జానారెడ్డి హామీ ఇచ్చారు. తన దగ్గరికి వచ్చిన గిరిజనులందరిని పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం హాలియాకు వెళ్లిపోయారు. జానారెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు కర్నాటి లింగారెడ్డి, తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, భగవాన్‌నాయక్ తదితరులు ఉన్నారు. బస్టాప్‌లో కూర్చుని రైతులను పలకరించిన మాజీ మంత్రి జానారెడ్డి -
అష్టోత్తర శతఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. 11 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు శ్రీస్వామి అమ్మవార్ల శృంగార డోలోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. అర్చకులు ఆలయంలో ఉదయం శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, ఆలయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 108 కలశాలతో.. ఈ నెల 1న స్వస్తి వాచనంతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం ఆలయ ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలను ఒకే చోటుకు చేర్చి పూజించారు. అంతకు ముందు ముఖ మండపంలో హోమం నిర్వహించి, పూర్ణాహుతి జరిపించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యజ్ఞాచార్యులకు, పారాయణీకులకు, అధికారులకు, సిబ్బందికి సన్మానించారు. నిత్యారాధనల అనంతరం రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి లాలి పాటలు, భక్తి గీతాల సంకీర్తన గావించారు. ఫ యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ముగింపు పలికిన అర్చకులు -
ఆరుగురు సీఐల బదిలీ
నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మల్టీ జోన్–2లో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కె.ఆదిరెడ్డిని నాంపల్లి సీఐగా, నల్లగొండ ట్రాఫిక్ పీఎస్‌లో పనిచేసే రాజును చండూరు సీఐగా, పీసీఆర్ నల్లగొండలో పనిచేసే కె.శివశంకర్‌ను సూర్యాపేట జిల్లా కోదాడ సీఐగా, నాంపల్లి సీఐగా పనిచేస్తున్న అనంతుల నవీన్‌కుమార్‌ను హైదరాబాద్ సిటీ కమిషరేట్‌కు, చండూరు సీఐగా పని చేస్తున్న ఎ.వెంకటయ్యను, కోదాడ టౌన్ సీఐగా పని చేస్తున్న రాములును హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ఏప్రిల్ 11 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 11 నుంచి నిర్వహించనున్నట్లు ఎంజీయూ సీఓఈ డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11న నుంచి డిగ్రీ ఒకటవ సెమిస్టర్, మూడవ సెమిస్టర్ పరీక్షలు ఉంటాయని, 16 నుంచి ఐదవ సెమిస్టర్, 15 నుంచి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంజీయూ పరిధిలోని సీబీఎస్సీ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని వారికి చివరి అవకాశం కల్పిస్తూ.. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల టైం టేబుల్, వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. పెండింగ్ కేసులు క్లీయర్ చేయాలి : ఎస్పీనల్లగొండ : పెండింగ్ కేసులను వెంటవెంటనే క్లీయర్ చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళికాబద్దంగా కృషి చేయాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలని సూచించారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి పెట్రోలింగ్ చేయాలన్నారు. పాత నేరస్తుల కదలికపై నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, డీఎస్పీలు రమేష్, విఠల్‌రెడ్డి, శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, సైదా, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పరువు హత్యలు చేసేవారికి గుణపాఠంచిట్యాల : ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు పరువు హత్యలు చేసే వారికి తగిన గుణపాఠమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు, న్యాయస్థానాల కృషి ఫలితంగానే ప్రణయ్ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష, యావజ్జీవ కారగార శిక్ష పడిందన్నారు. కులాంతర వివాహాలను ప్రజా సంఘాలు, ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఆయన కోరారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, నాయకులు ఐతరాజు నర్సింహ, బొబ్బలి సుధాకర్‌రెడ్డి, ఐతరాజు యాదయ్య, మెట్టు నర్సింహ, పాలమాకుల అర్జున్, శేఖర్ పాల్గొన్నారు. -
సివిల్ రైట్స్‌డే నిర్వహించాలి
నల్లగొండ : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై దాడుల నివారణ, అంటరానితనంపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ప్రతినెలా చివరి వారంలో సివిల్ రైట్స్ డేను నిర్వహించాని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకతి లక్ష్మీనారాయణతో కలిసి.. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వారి భూముల సమస్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులకు తెలిపిన వివరాలను సావధానంగా విని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకోసారి జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. నియామకాలు, ప్రమోషన్ల విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం మున్సిపల్ సిబ్బందిని మున్సిపాలిటీల్లో కాకుండా నాయకుల ఇళ్లలో పని చేయించడం ఏంటని చైర్మన్ వెంకటయ్య నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని కొందరు ఉద్యోగులే తన దృష్టికి తెచ్చారని.. ఈ పద్ధతి మార్చుకోవాలన్నారు. కొందరు అభిమానులు తన ఫ్లెక్సీ పెడితే.. వెంటనే తీసివేయించారట.. ఏమైనా ఎన్నికల కోడ్ ఉందా అని కమిషనర్‌ను ప్రశ్నించారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి వద్దకు దళితులు ఎవరైనా కేసులపై వెళ్తే.. అమర్యాదగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చింద ఇలా చేయడం సరి కాదన్నారు. దీంతో డీఎస్పీ అలాంటి సంఘటనలు జరగలేదని తెలిపారు. స్పందించిన ఎస్పీ శరత్చంద్ర పవార్ డీఎస్పీ ముక్కుసూటిగా మాట్లాడతారని.. చైర్మన్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై భూముల సంబంధించిన కేసుల వివరాలను చైర్మన్‌కు వివరించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల వివరాలను కమిషన్ చైర్మన్‌కు నివేదించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి కోటేశ్వర్రావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజ్‌కుమార్ ఆయా శాఖలు అమలు చేస్తున్న పథకాల అమలు వివరాలను కమిషన్‌కు వివరించారు. సమావేశంలో ఇన్చార్జి డీఆర్ఓ అశోక్‌రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్, ఏఎస్పీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఫ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి ఫ మున్సిపల్ సిబ్బంది చేత ఇళ్లలో పనిచేయించడం సరికాదు ఫ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
జీజీహెచ్‌లో భద్రత ఏదీ!
ఆస్పత్రి ఆవరణలో సీసీ కెమెరాల తొలగింపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిఘా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆస్పత్రి ఆవరణ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం . ఇంతకుముందు ఉన్న కెమెరాలను మెడికల్ కళాశాల వారు తీసుకుపోయారు. –డాక్టర్ అరుణకుమారి, జీజీహెచ్ సూపరింటెండెంట్నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో రోగుల భద్రతకు భరోసా లేకుండా పోయింది. నిత్యం ఔట్ పేషంట్లు 1500 వరకు, ఇన్ పేషంట్లు 500 నుంచి 600 వరకు జీజీహెచ్‌కు వస్తుంటారు. దీనికితోడు జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల నుంచి రిఫర్ చేసిన కేసులు వస్తుంటాయి. ఇంతమంది రోగులు వస్తున్న 800 పడకల ఈ ఆస్పత్రికి భద్రత లేకుండా పోయింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంతోపాటు జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఐసీయూ, ఎమర్జెన్సీ, సర్జరీ, వెల్నెస్ సెంటర్, ఫోరెన్సిక్, పోస్టుమార్టం, తెలంగాణ హబ్ తదితర విభాగాలు జీజీహెచ్‌లో ఉన్నాయి. వీటన్నింటికి తగ్గట్టుగా సరైన సెక్యూరిటీ, అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కేవలం మాతాశిశు ఆరోగ్య కేంద్రంతోపాటు ఇతర వార్డుల్లో మాత్రమే 25 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందుతో ఎన్ని కెమెరాలు పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి. ఆస్పత్రి ఆవరణలో లేని సీసీ కెమెరాలు జిల్లా కేంద్ర ప్రధాన ఆస్పత్రికి నిత్యం వేల సంఖ్యలో రోగులతోపాటు వారి సహాయకులు, వైద్యులు, మెడికల్ కళాశాల విద్యార్థులు, ఇతరులు వస్తుంటారు. ఆస్పత్రిలో భద్రత పర్యవేక్షణలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ప్రధాన గేట్లు, ఇతర పరిసరాలను పర్యవేక్షించడానికి సీసీ కెమెరాల అవసరం చాలా ఉంటుంది. కానీ జీజీహెచ్ అధికారులు వీటిని పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు జీజీహెచ్‌లో మెడికల్ కళాశాల ఉన్నప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆస్పత్రి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మెడికల్ కళాశాల నూతన భవనంలోకి మారిన తరువాత.. ఆస్పత్రి ఆవరణతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న 25 సీసీ కెమెరాలను కళాశాల అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది దీంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రతపై నిఘా లేకుండా పోయింది.ఫ రాత్రి వేళ రెచ్చిపోతున్న దొంగలు ఫ భద్రత లోపం కారణంగానే ఇటీవల బాలుడి కిడ్నాప్ ! ఫ వరుస ఘటనలతో భయాందోళనలో రోగులు సెల్ఫోన్లు, పర్సులు మాయం.. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆస్పత్రిలో రాత్రిపూట దొంగలు రెచ్చిపోతున్నారు. వార్డుల్లో రోగుల సహాయకుల సెల్ఫోన్లు, పర్సులతోపాటు బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాలను దొంగిలించిన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆస్పత్రిలోని టన్నుల కొద్ది పాత ఇనుప సామగ్రి దొంగిలించారు. అదేవిధంగా ఆస్పత్రి ఆవరణలో ఎవరుపడితే వారు రాత్రిపూట నిద్రించడంతోపాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇన్‌పేషంట్ల వరకు మాత్రమే నిఘా ఏర్పాటు చేసి ఆస్పత్రి ఆవరణలో ఉన్న వారిపై ఎలాంటి నిఘా ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నెల 4న బాలుడి కిడ్నాప్ సంఘటన నిఘా లోపం కారణంగానే జరిగిందని పేర్కొనవచ్చు. ఇకనైనా ఆస్పత్రి వర్గాలు స్పందించి జీజీహెచ్‌లో సరైన భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
Amrutha Pranay: ఒకరి ప్రేమ.. మరొకరి అహం..
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఒకరి ప్రేమ.. మరొకరి అహం.. ఆ కుటుంబాలను చెల్లాచదురు చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చేసుకున్న ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఓ ప్రాణాన్ని బలితీసుకోగా, చివరకు ఆ తండ్రే తనకు తానే తనువు చాలించాడు. అదే ప్రణయ్, అమృత వర్షిణి(Amrutha Pranay) ప్రేమ వ్యవహారంలో చివరి మజిలీగా మిగిలింది. మిర్యాలగూడ పట్టణంలో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ప్రేమించుకున్న వారిద్దరు 2018 జనవరి 30న ఒక్కటయ్యారు. కొద్దిరోజులకే ఆమె కడుపులో మరో జీవి ప్రాణం పోసుకుంది. అయినా ఆమె తండ్రి తిరునగరు మారుతీరావు పరువు.. ప్రతిష్ట అంటూ అల్లుడు ప్రణయ్‌ని హత్య చేయించి కూతురు జీవితాన్ని చీకటిమయం చేశారు. చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించుకుని ఎన్నో ఆశలతో ఒక్కటైన ప్రణయ్ అమృతవర్షిణి కలల ప్రపంచం చెదిరిపోయింది. ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతులకు ఈ హత్య తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్యతో ఆ రెండు కుటుంబాలు అగాథంలో పడ్డాయి. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!కడుపుతో ఉన్నా కరుగని మనస్సు..కూతురు గర్భతిగా ఉన్నా ఆ తండ్రి మనస్సు కరుగలేదు. అల్లుడిగా ప్రణయ్‌ని అంగీకరించకపోయినా, పట్టించుకోకుండా వదిలేసినా సరిపోయేది. కానీ పరువు పేరుతో ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావుతోపాటు హత్యలో భాగస్వాములైన ఏడుగురిని అరెస్టు చేశారు. ఆ తరువాత అమృత మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండేళ్లు కాలం గడిచింది. తన భర్త మరణానికి న్యాయం కావాలని, తండ్రికి మరణ శిక్ష పడాలని కన్న కూతురే డిమాండ్ చేయడంతో మారుతీరావు మనోవేదనలో పడ్డారు. 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నాభిన్నమైన కుటుంబాలుప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ తండ్రి బాలస్వామి ఎల్ఐసీ సంస్థలో విధులు నిర్వహిస్తుండగా.. పెద్ద కుమారుడు ప్రణయ్ డిగ్రీ వరకు చదివాడు. చిన్న కుమారుడు ఉక్రేయిన్ చదువుకుంటుండగా, యుద్ధ సమయంలో స్వదేశానికి వచ్చిన అతడు ప్రస్తుతం హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. కాగా, కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ హత్యకు గురికావడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. పెద్దకొడుకు ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు వచ్చిన సమయంలో బాలస్వామి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాకు నా కుమారుడు లేడు, అమృతకు భర్త లేడు, నా మనువడికి తండ్రి లేడు’ అంటూ కన్నీరుమున్నీరవుతూనే.. మారుతీరావు కూడా ఆత్మహత చేసుకోవడం కలిచి వేసిందన్నారు. ప్రణయ్ హత్య తరువాత కొద్ది నెలలు అత్తామామల వద్ద ఉన్న అమృత తన తండ్రి మరణం తరువాత తల్లిదగ్గరరకు వచ్చేసింది. ప్రస్తుతం తన తల్లితో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. తన భర్త హత్య వెనక తన బాబాయి శ్రవణ్‌కుమార్ ప్రమేయం ఉందని అప్పట్లో పోలీసులకు చెప్పడంతో హత్య కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ కుమార్‌కు సైతం యాజ్జీవ కారాగార శిక్ష పడటంతో రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఏది ఏమైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న అమృత, ప్రణయ్‌ల ప్రణయ గాథ విషాదంగా మారి ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. చదవండి: అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు -
ప్రణయ్ హంతకుడికి ఉరి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఐపీసీ సెక్షన్ 302, 129 (బీ), 109 ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ కింద నిందితులకు శిక్షలు ఖరా రు చేస్తూ.. నల్లగొండ రెండో అదనపు జిల్లా జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి రోజా రమణి సోమవారం తీర్పు ఇచ్చారు.ప్రధాన నిందితుడు (ఏ1) తిరునగరు మారుతీరావు నాలుగేళ్ల కింద ఆత్మహత్య చేసుకోగా.. ఏ2గా ఉన్న సుభాష్ కుమార్‌శర్మకు మరణశిక్ష విధించారు. ఏ3గా ఉన్న మహ్మద్ అజ్గర్‌అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్ బారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ నిజాంలకు జీవిత ఖైదు విధించారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురవగా.. సుమారు ఆరున్నరేళ్ల విచారణ తర్వాత నిందితులకు శిక్ష పడింది.కూతురి ప్రేమ వివాహాన్ని తట్టుకోలేక.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన తిరునగరు మారుతీరావు, గిరిజ దంపతులకు అమృత వర్షిణి ఒక్కరే కూతురు. పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతుల కుమారుడు పెరుమాళ్ల ప్రణయ్. ఇద్దరూ మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.ఈ క్రమంలో 2018 జనవరి 30న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసు కున్నారు. అక్కడి నుంచి నేరుగా నల్లగొండ ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తన తండ్రి మారుతీరావు నుంచి రక్షణకల్పించాలని అమృత వర్షిణి పోలీసులను కోరారు. దీని తో పోలీసులు ప్రణయ్, అమృత ఇద్దరి తల్లి దండ్రులను మిర్యాలగూడ డీఎíస్పీ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం అమృత ప్రణయ్‌తో కలసి ముత్తిరెడ్డికుంటలోని ఇంటికి వెళ్లారు.తర్వాత ప్రణయ్ కుటుంబం ఆధ్వర్యంలో వారు వివాహ రిసెప్షన్ చేసుకున్నారు. సుపారీ గ్యాంగ్‌తో హత్య..: కూతురు ప్రేమ వివాహం, పట్టణంలోనే రిసెప్షన్ చేసుకోవడాన్ని చూసి మారుతీరావు తట్టుకోలేకపోయారు. ప్రణయ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. సుపారీ గ్యాంగ్‌కు రూ.కోటి ఇచ్చి ప్రణయ్ హత్యకు ప్లాన్ చేశారు. అప్పటికే అమృత, ప్రణయ్ వివాహమై 8 నెలలు గడిచింది.అమృత 5 నెలల గర్భిణి కూడా. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ తల్లితో కలసి అమృతను మెడికల్ చెకప్ కోసం పట్టణంలోని జ్యోతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి బయటికి వస్తుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న బిహారీ సుపారీ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మ కత్తితో ప్రణయ్‌పై దాడి చేశాడు. అజ్గర్ అలీ, నిజాం అతడికి సాయం చేశారు. ప్రణయ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. 1,200 పేజీలతో చార్జిషిట్.. ప్రణయ్ పరువు హత్య అప్పట్లో జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఆ సమయంలో నల్లగొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు.. ఆస్పత్రిలోని సీసీ పుటేజీ ఆధారంగా మిర్యాలగూడ పోలీ సులు కేసు దర్యాప్తు చేపట్టారు. 4 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. 9 నెలల పాటు దర్యాప్తు చేసి, 78 మంది సాక్షులను ప్రశ్నించి 2019 జూన్ 19న 1,200 పేజీలతో చార్జిషిట్‌ను దాఖలు చేశారు. 8 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లోని గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా జరిగింది. తాజాగా సోమవారం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఏ2 సుభా‹Ùకుమార్ శర్మకు న్యాయమూర్తి ఐపీసీ సెక్షన్ 302, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, సెక్షన్ 27 (3), ఆయుధ నిరోధక చట్టం కింద మరణశిక్ష విధించారు. హత్యలో పాలుపంచుకున్న ఏ3 అజ్గర్ అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్ బారీ, ఏ5 మహ్మద్ అబ్దుల్ కరీం, ఏ6 మారుతీరావు తమ్ముడు తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 మారుతీరావు కారు డ్రైవర్ సముద్రాల శివ, ఏ8 ఆటోడ్రైవర్ ఎంఏ నిజాంలకు ఐపీసీ 302 రెడ్‌విత్ 120 (బీ), 109, ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద జీవిత ఖైదు విధించారు. ఇక రూ.10 వేల నుంచి రూ.15 వేలు జరిమానాలు చెల్లించాలని, లేదంటే 4 నెలలు జైలుశిక్ష అనుభవించాలని జడ్జి తీర్పులో వెల్లడించారు.కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత: ప్రణయ్ హత్య కేసులో సోమవారం తుది తీర్పు వెలువడు తుందని తెలిసిన ప్రజా సంఘాల నాయ కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు వచ్చారు. దీనితో పోలీసులు భారీగా బందో బస్తు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, సిబ్బంది, నిందితుల కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించాక.. నింది తుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంత మయ్యారు. తన తండ్రి ఎలాంటి నేరం చేయలేదని, అయినా శిక్ష పడిందంటూ.. తిరునగరు శ్రవణ్‌కుమార్ కూతురు శ్రుతి బోరున విలపించింది. కాగా.. కోర్టు తీర్పు పరువు హత్యలకు పాల్పడే వారికి చెంప పెట్టు వంటిదని ప్రణయ్ హత్య కేసును వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహ పేర్కొన్నారు.అమృతకు బాసటగా కౌసల్య మిర్యాలగూడ అర్బన్: ప్రణయ్ హత్య ఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేప డంతో.. ఇదే తరహాలో బాధితురాలిగా మారిన తమిళనాడు మహిళ కౌసల్య మిర్యాలగూడకు వచ్చి అమృతకు బాసట గా నిలిచారు. కౌసల్య గతంలో శంకర్ అనే యువకుడిని ప్రేమించి కులాంతర వివా హం చేసుకుంది. ఇది తట్టుకోలేని కౌసల్య తండ్రి.. శంకర్‌ను హత్య చేయించాడు. తన భర్త మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ పోరాటం చేసిన కౌసల్య నిందితులకు శిక్షపడేలా చేసింది.ప్రణయ్ ఘటన విషయం తెలిసి మిర్యాలగూడకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయం, ఆ కేసులో నిందితులకు పడిన శిక్షలను అమృతకు వివరించి ధైర్యం చెప్పింది. తమిళ నాడులోని కేసుకు సంబంధించిన ఫైల్ కాపీని సైతం ఆమె ఇక్కడి పోలీసులకు అందజేసినట్టు సమాచారం.కేరళ ఎంపీ డిమాండ్‌తో..: కేరళకు చెందిన దళిత సోషల్ ముక్తి మంచ్ జాతీయ నాయకుడు, ఎంపీ సోం ప్రసాద్ మిర్యాల గూడకు వచ్చి.. అమృతను పరామర్శించారు. దేశంలో పరువు హత్యలను నివారించడానికి ప్రణయ్ చట్టం తేవాలని ఆయన పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేశారు. దానితో ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. -
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
వేములపల్లి(మాడ్గులపల్లి) : మూసీ ఎడమకాల్వ పరిధిలోని ఆయకట్టులో పంటలు ఎండిపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం మాడ్గులపల్లి మండలంలోని పాములపాడు గ్రామంలో ఎండిపోతున్న వరి పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు కింద మాడ్గులపల్లి, వేములపల్లి, తిప్పర్తి మండలాల రైతులు ఎకరాకు రూ.40 వేలకు పైగా పెట్టుబడులు పెట్టి సాగు చేశారని.. చివరి దశలో పంట ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చివరి భూములకు నీరందించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు స్పందించిన సాగునీటిని అందించాలని, ఇప్పటికే ఎండిపోయిన పొలాలకు ఎకరాకు రూ.20వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డబ్బికార్ మల్లేష్, పాదూరి గోవర్ధని, పాదూరి శశిధర్‌రెడ్డి, రొండి శ్రీనివాస్, పతాని శ్రీను, తంగెళ్ల నాగమణి, అయితగాని విష్ణు, చింతచెర్ల శ్రీను, పిండి వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, అల్గుబెల్లి వెంకట్‌రెడ్డి, గంగయ్యరావు, వెంకట్‌రెడ్డి, పద్మ పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై దరఖాస్తుదారులకు వివరణ ఇవ్వాలని.. పరిష్కారం కాకపోతే.. ఎందుకు కావటం లేదో తెలియజేయాలన్నారు. ప్రజావాణికి జిల్లా అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. భూములకు సంబంధించిన కేసుల పరిష్కారంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఇన్చార్జి డీఆర్ఓ అశోక్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
నేత్రపర్వంగా మహాపూర్ణాహుతి, పుష్పయాగం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. సోమవారం మహాపూర్ణాహుతి, శ్రీచక్రతీర్థం, పుష్పయాగం, దేవతలకు వీడ్కోలు పర్వాలను నేత్రపర్వంగా చేపట్టారు. ఉదయం యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతి వేడుక సందర్భంగా.. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దేవతలను సుగంధద్రవ్యాలతో ఆరాధించి, పట్టు వస్త్రాలతో ఆవాహన చేసి నెయ్యితో అగ్ని భగవానుడికి సమర్పించారు. విశ్వశాంతి కోసం మహా పూర్ణాహుతి వేడుక నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని పూజలు నిర్వహించారు. కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు పాల్గొన్నారు. శ్రీచక్రతీర్థం.. మహావిష్ణువు ఆయుధమైన శ్రీచక్ర ఆళ్వారుడికి మధ్యాహ్నం ఒంటి గంటకు పూజలు చేసిన అనంతరం విష్ణు పుష్కరిణిలో శ్రీచక్రతీర్థం వేడుక వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను.. శ్రీచక్ర ఆళ్వారునికి అలంకరించి ప్రత్యేక పల్లకిపై అధిష్టింపజేసి పూజలు చేశారు. ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తూ విష్ణు పుష్కరిణికి వేంచేసి శ్రీచక్రస్నానం వేడుక పూర్తి చేశారు. దేవతలకు వీడ్కోలు సాయంత్రం ప్రధానాలయంలో నిత్యరాధనల అనంతరం దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, దోపు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మహోత్సవంలో దోఽషములు జరిగితే తొలగించేందుకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం చేపట్టారు. ఇక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన దేవతలను తిరిగి స్వస్థలానికి పంపించే వేడుక దేవతోద్వాసన అని అర్చకులు పేర్కొన్నారు. శ్రీస్వామి వారికి అత్యంత ప్రీతికరమైన వేడుక దోపు మహోత్సవం.వీటిని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఫ తుది ఘట్టానికి చేరిన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు -
నల్లగొండ
ఇఫ్తార్ 6–30 (మంగళవారం సాశ్రీశ్రీ) సహర్ 5–05 (బుధవారం ఉశ్రీశ్రీ)7మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025మార్కెటింగ్ వ్యవస్థాపకుడి అరెస్ట్ నాసిరకం వస్తువులను అమ్మి సొమ్ము చేసుకుంటున్న మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యవస్థాపకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. - 8లోనిరుద్యోగ యువతే టార్గెట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసిన నకిలీ డీఎస్పీని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. - 8లో -
కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ
తీర్పులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీరు భేష్ ప్రణయ్ హత్య అనంతరం తండ్రి బాలస్వామి మిర్యాలగూడ వన్‌టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు కేసు వాదించేందుకు దర్శనం నరసింహను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పబ్లిక్ ప్రోసిక్యూటర్ బలమైన సాక్షాధారాలు సేకరించారు. నిందితుల ఫోన్‌కాల్ డేటా, లోకేషన్, సీసీ టీవి ఫుటేజీలను సేకరించి.. 472 పేజీల లిఖిత పూర్వక రిపోర్టును కోర్టుకు సమర్పించారు.● ఏ2 సుభాష్‌కుమార్‌శర్మకు మరణశిక్ష ● ఏ3 నుంచి ఏ8 వరకు ఆరుగురికి జీవితఖైదు ● తీర్పుకోసం భారీగా తరలివచ్చిన ప్రజాసంఘాల నాయకులు ● కన్నీటి పర్యంతమైన నిందితుల కుటుంబీకులు ● కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తురామగిరి(నల్లగొండ): సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో తుదితీర్పు నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి నల్లగొండ కోర్టు వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ కేసు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు, రెండవ అదనపు జడ్జి ఎన్.రోజారమణి సోమవారం అంతిమ తీర్పు వెల్లడించారు. సెప్టెంబర్ 14, 2018న ప్రణయ్ హత్యకు గురికాగా.. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ విచారణ జరిపి హత్య కేసులో ప్రమేయం ఉన్న 8 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ హత్య కేసులో అన్ని సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. నరసింహ వాదనలతో ఏకీభవించిన నల్లగొండ ఎస్సీ, ఎస్టీ రెండవ అనదపు జడ్జి ఎన్.రోజారమణి ఏ2 సుభాష్‌కుమార్‌శర్మకు ఉరిశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా లేదా 4 నెలల జైలు శిక్ష, మిగిలిన ఆరుగురు ఏ3 అజ్గర్‌అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్‌బారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ.నిజాంకు జీవిత ఖైదు రూ.10 వేల జరిమాన లేదా 4 నెలల జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 నిందితుడు అమృవర్షిణి తండ్రి తిరునగరు మారుతీరావు 2020 మార్చి 8న ఆత్మహత్య చేసుకోగా.. అజ్గర్అలీని అహ్మదాబాద్ సబర్మతి జైలుకు, శుభాష్కుమార్శర్మను చర్లపల్లి జైలుకు తరలించారు. మిగిలిన ఐదుగురు నిందితులకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. ఈ తీర్పుతో ప్రణయ్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారీగా తరలిన వచ్చిన ప్రజా సంఘాలు, ప్రజలు.. ప్రణయ్ హత్య కేసు తీర్పు సోమవారం వెలువడుతుందన్న విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులతో పాటు సామాన్య ప్రజలు నల్లగొండ కోర్టు వద్దకు భారీగా తరలివచ్చారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి తీర్పు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వేచిచూశారు. నిందితుల కుటుంబాల కన్నీటి పర్యంతం.. హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురికి శిక్ష పడింది. దీంతో నిందితుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు ఆవరణలో తిరునగరు శ్రవణ్‌కుమార్ కూతురు శృతి బోరున విలపించింది. తన తండ్రికి ఎలాంటి నేరం చేయలేదని అయినప్పటికీ శిక్ష పడిందంటూ కన్నీరు పెట్టుకుంది. వీరితో పాటు మిగతా నిందితుల కుటుంబ సభ్యులు కూడా కోర్టు వద్ద, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో వారితో మాట్లాడుతూ, అనంతరం వాహనంలో తరలిస్తున్న క్రమంలో కన్నీరు పెట్టుకున్నారు. కోర్టు ప్రాంగంలో పోలీసుల భారీ బందోబస్తు.. ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు నేపథ్యంలో నల్లగొండ కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు లోపలికి ఎవరినీ రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. న్యాయవాదులు, సిబ్బందిని, కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. -
పిల్లల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సూర్యాపేట: పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి ప్రవర్తన, నడవడికను గమనిస్తూ.. తప్పడగులు వేస్తున్నారని తెలిస్తే దండించకుండా ఏది చేడు, ఏది మంచి అనే విషయాన్ని వారు గ్రహించే విధంగా అవగాహన కల్పించాలి. వివిధ రంగాల్లో విజయం సాధించిన వారి గూర్చి పిల్లలకు వివరించాలి. పిల్లలతో స్నేహంగా మెలగాలి, పిల్లల సెల్‌ఫోన్‌ను గమనిస్తూ ఉండాలి. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే అంశాలకు దూరంగా ఉంచాలి. పిల్లలు ఎప్పుడు బిజీగా ఉండే విధంగా చదువుతో పాటు వ్యాయామం, డ్యాన్స్, చిత్రలేఖనం వంటి వాటిని నేర్పించాలి. – బొల్లెద్దు వెంకటరత్నం, న్యాయవాది -
ప్రతీ గురువారం ప్రత్యేక ప్రజావాణి
నల్లగొండ : వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను తెలపడానికి ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నల్లగొండ కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు వారి సమస్యలను గురువారం నిర్వహించే ప్రజావాణిలో తమను కలిసి తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫలితాలు విడుదలనల్లగొండ : 2025 జనవరిలో నిర్వహించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెమోలు www.bse.telangana.gov.in వెబ్సైట్లో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసుకుని మెమోలు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 331 మంది గైర్హాజరునల్లగొండ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంగ్లిష్ పేపర్–2కు సంబంధించి మొత్తం 13,136 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 12,805 మంది హాజరయ్యారు. 331 మంది గైర్హాజరయ్యారు. మూడు లిఫ్టులకు పరిపాలన ఆమోదంనల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో మూడు లిఫుల నిర్మాణానికి రూ.44 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం లభించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రాహుల్ బొజ్జా సోమవారం ఉత్వర్వులు జారీ చేశారు. నల్లగొండ నియోజకవర్గంలోని పొనుగోడు, బక్కతాయికుంట, నర్సింగ్‌బట్ల లిఫ్టుల నిర్మాణం చేపట్టనున్నారు. వైద్య విద్యార్థులకు సామాజిక దృక్పథం బీబీనగర్: వైద్య వృత్తి చాలా ప్రధానమైనదని, వైద్య విద్యార్థులు సామాజిక దృక్పథంతో ఉంటూ రోగల పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిమ్స్‌లోని విద్యార్థులకు చాలా చక్కటి భవిష్యత్త్ ఉందన్నారు. వరల్డ్‌లోనే బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల బెస్ట్‌గా నిలుస్తుందన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయన్నారు. ఐదేళ్లలోనే అబ్బురపరిచే విధంగా భవనాల నిర్మాణాలు జరగడం సంతోషదాయకమని అన్నారు. రోగులతో సాన్నిహిత్యం కలిగి ఉండాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియా మాట్లాడుతూ.. ఎయిమ్స్‌లోని ఔట్‌పేషెంట్ విభాగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11లక్షల మంది వైద్య సేవలు పొందారని, 34రకాల వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం ఎయిమ్స్ పురోగతిపై ముద్రించిన మ్యాగ్జిన్‌ను డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించడంతో పాటు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జలలీమ్, రాహుల్‌నారంగ్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ దరఖాస్తులను సమర్పించాలినల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో 2020–2021 నుంచి 2023–2024 విద్యా సంవత్సరం బీసీ, ఈబీసీ ఉపకార వేతనాలు, పీజు రీయింబర్మెంట్ మంజూరు కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నాజిమ్ అలీ అప్సర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ దరఖాస్తులు అందజేయకపోతే.. ఉపకార వేతనాల మంజూరు విషయంలో సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేయని బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ నెల 31లోగా ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నిరుద్యోగ యువతే టార్గెట్..
సూర్యాపేట టౌన్ : నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసిన నకిలీ డీఎస్పీని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను ఎస్పీ కె. నర్సింహ విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నకిలీ డీఎస్పీ అవతారమెత్తాడు. తాను డీఎస్పీ అని చెప్పుకుంటూ పలువురిని పరిచయం చేసుకొని అమాయకులైన నిరుద్యోగ యువతకు పోలీస్, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ బురిడీ కొట్టించాడు. కోదాడలో ఒక అమ్మాయికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె వద్ద రూ.36లక్షలు వసూలు చేశాడు. అదేవిధంగా ఏపీలోని మార్టూర్‌కు చెందిన వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని, గురజాలకు చెందిన మరో వ్యక్తికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని పరారీలో ఉన్నాడు. కోదాడకు చెందిన అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సూర్యాపేట పట్టణ పోలీసులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీగ్రాండ్ హోటల్ వద్ద శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద రూ.18లక్షల నగదు, కారు, పోలీస్ యూనిఫాం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిపై గతలంలో పలు కేసులు ఉండగా.. 2022లో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చినట్లు ఎస్పీ చెప్పారు. ఈ కేసును ఛేదించిన సూర్యాపేట పట్టణ సీఐ పీవీ రాఘవులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీ రవి, పట్టణ సీఐ పీవీ రాఘవులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టించిన నకిలీ డీఎస్పీ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు -
పిల్లల ప్రవర్తనను గమనించాలి
నల్లగొండ టౌన్: పిల్లల ప్రవర్తనను గమనించాలి. చదువుతో పాటు వారు ఏమి చేస్తున్నారు... ఎక్కడికి వెళుతున్నారు.. ఎలాంటి స్నేహం చేస్తున్నారు అనే దాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి. ఒకవేళ ప్రేమలో పడితే వారి కుటుంబ నేపథ్యం, వారి స్థితిగతులు తెలుసుకోవాలి. అన్ని సక్రమంగా ఉంటే పిల్లల అభిప్రాయాన్ని అంగీకరించాలి. లేకపోతే వారు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి కుటుంబ నేపథ్యమైతే ప్రేమ వివాహాలను అంగీకరించడంలో తప్పులేదు. – పనస కాశయ్యగౌడ్, గుండ్లపల్లి, నల్లగొండ -
ఆరున్నరేళ్లకు.. అంతిమ తీర్పు
పకడ్బందీగా దర్యాప్తు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రణయ్ హత్య కేసును పోలీసు యంత్రాంగం పకడ్బందీగా దర్యాప్తు చేసింది. కేసు విచారణ, పక్కాగా సాక్ష్యాల సేకరణ, వాటి అథెంటికేషన్ విషయంలో అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు బృందాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాయి. తమిళనాడులో శంకరన్ హత్య కేసు తరహాలో ప్రణయ్ హత్య కేసు విచారణ జరిగింది. తమిళనాడులో కులాంతర వివాహం చేసుకున్న శంకరన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. అక్కడ ఆయన హత్యకు గురయ్యాడు. ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తమిళనాడు పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కాగా విచారణ జరిపారు. అందుకే ప్రణయ్ హత్య తరువాత అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు అధికారుల బృందం అక్కడికి వెళ్లి ఆ కేసును కూడా పరిశీలించింది. ప్రణయ్ హత్య కేసులోనూ నిందితులు తప్పించుకోకుండా, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, సాంకేతిక పద్ధతుల్లో వాటిని భద్రపరిచారు. ముఖ్యంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, బ్లడ్ శాంపిల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్ష చేయించారు. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రణయ్ హత్యకు ముందు నిందితులు ఏయే ప్రాంతాల్లో సంచరించారు.. ఎవరెవరు కలుసుకొని ప్లాన్ చేశారు.. అనే వివరాలు సేకరించి అన్ని ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఈ కేసులో ఎలాంటి అవకతవకలకు, అనుమానాలకు తావులేకుండా నేరం రుజువయ్యేలా సేకరించిన అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. తద్వారానే సుభాష్ కుమార్ శర్మకు అప్పట్లో బెయిల్ రాలేదు. కేసు విచారణ తుది తీర్పులో సుభాష్ శర్మకు ఉరి శిక్ష, మిగిలిన వాళ్లకు జీవిత ఖైదు పడిందని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం జరిగిందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రణయ్ హత్య కేసులో 1600 పేజీల్లో చార్జిషీట్ ఫ కేసులో ప్రధాన పాత్రధారి అబ్దుల్‌బారి ఫ కరుడుగట్టిన నేరస్తుడు అజ్గర్ అలీ ఫ ఏ2 సుభాష్‌కుమార్ శర్మకు ఉరి.. మిగతా ఆరుగురికి జీవిత ఖైదురామగిరి(నల్లగొండ) : మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసులో ఆరున్నరేళ్లకు అంతిమ తీర్పు వచ్చింది. ఈ కేసులో మొత్తం 8 మందిని నిందితులుగా చేర్చుతూ పోలీసులు కోర్టులో చార్జిషీటు సమర్పించారు. ఈ కేసులో ఏ1 తిరునగరు మారుతిరావు, ఏ2 సుభాష్‌కుమార్‌శర్మ, ఏ3 మహ్మద్ అజ్గర్‌అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్‌బారి, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ.నిజాం నిందితులుగా ఉన్నారు. అందులో ఏ3 మహ్మద్ అజ్గర్‌అలీకి కరడుగట్టిన నేరచరిత్ర ఉంది. ఈ హత్యలో అజ్గర్‌అలీ, సుభాష్‌కుమార్ శర్మకు ఇద్దరికి పరిచయం ఉన్న వ్యక్తి అబ్దుల్‌బారీ. అబ్దుల్ బారీనే కరడుగట్టిన నేరస్తుడు అజ్గర్ అలీని రంగంలోకి దింపాడు. గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో అజ్గర్ అలీ నిందితుడు. వీరిలో ఏ1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా.. ఏ2 సుభాష్‌కుమార్ శర్మకు కోర్లు ఉరిశిక్ష.. మిగతా ఆరుగురు నిందితులకు జీవితఖైదు విధించింది. 102 మంది సాక్షుల విచారణ ఈ కేసులో మొత్తం చార్జిషీట్‌ను 1600 పేజీల్లో రూపొందించి నల్లగొండ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో సమర్పించారు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ఏ స్థాయిలో ఉంది.. ఎవరెవరు ఏ విధంగా సహకరించారనే అంశాలను 63 పేజీల్లో పొందుపర్చారు. బిహార్‌కు చెందిన కిల్లర్ సుభాష్కుమార్శర్మతో డీల్ కుదిర్చింది ఎవరు..? అతడిని మిర్యాలగూడకు రప్పించి వసతులు సమకూర్చింది ఎవరు..? సుపారీలో ఎవరి వాటా ఎంత..? అతనికి ఏ విధంగా సహకరించారు..? హత్య అనంతరం సుపారీ కిల్లర్ ఎలా పారిపోయాడు..? ఎవరు సహకరించారు..? అనే కోణంలో విచారణ సాగింది. ప్రణయ్ హత్యను ప్రత్యక్ష, పరోక్షంగా చూసిన 102మంది సాక్షులను పోలీసులు విచారించి వారి వాంగ్మూలాన్ని చార్జిషీట్లో రికార్డు చేశారు. దీంతో పాటు ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టుల ఆధారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను సమకూర్చారు. ఇదీ దోషుల పాత్ర.. మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్, అమృతవర్షిణికి 2018 జనవరి30 న ప్రేమ వివాహం జరిగింది. ఈ వివాహాన్ని అమృతవర్షిణి తండ్రి ఏ1 మారుతీరావు జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ప్రణయ్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రణయ్‌ని చంపాలన్న విషయాన్ని తన మిత్రుడు, మిర్యాలగూడ మున్సిపల్ వార్డు కౌన్సిలర్, ఏ5 అయిన అబ్దుల్ కరీంకు చెప్పాడు. వారు ఇద్దరు చర్చించుకొని ఏ4 మహ్మద్ అబ్దుల్‌బారీని మారుతీరావుకు పరిచయం చేశాడు. ప్రణయ్‌ను హత్య చేసేందుకు మారుతీరావుకు మహ్మద్ అబ్దుల్‌బారి మధ్య రూ.కోటి సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్‌గా రూ.15 లక్షలు ఏ5 మహ్మద్ కరీం, మారుతీరావు కారు డ్రైవర్ ఏ7 సముద్రాల శివ ద్వారా అబ్దుల్ బారికి అప్పజెప్పాడు. డబ్బులు తీసుకున్న తర్వాత అబ్దుల్ బారి.. ప్రణయ్‌ను హత్య చేయాలని ఏ3 అజ్గర్‌అలీకి, అంతకు ముందు రాజమండ్రి జైల్లో పరిచయం ఉన్న ఏ2 శుభాష్కుమార్శర్మకు చెప్పాడు. వీరికి ఆటోడ్రైవర్ అయిన ఏ8 ఎంఏ.నిజాం సహకరించాడు. ముగ్గురూ కలిసి ప్రణయ్‌ను హత్య చేసేందుకు పలుమార్లు రెక్కీ నిర్వహించారు. 2018, సెప్టెంబర్ 14 న మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రిలో చెకప్ కోసం ప్రణయ్, అమృతవర్షిణి, ప్రణయ్ తల్లి ప్రేమలత వెళ్లారు. ఇంటి వద్ద నుంచే ప్రణయ్ ప్రయాణించే కారును వారు అనుసరించారు. వారికంటే ముందుగానే సుభాష్‌కుమార్‌శర్మ, అజ్గర్ అలీ టూ వీలర్‌పై, ఆటో డ్రైవర్ ఎంఏ.నిజాం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రిలో చూపించుకుని ప్రణయ్, అమృత, ప్రేమలత తిరిగి వస్తున్న క్రమంలో సుభాష్‌కుమార్‌శర్మ కత్తితో ప్రణయ్‌పై దాడి చేశాడు. హత్య చేసిన తర్వాత సుభాష్‌కుమార్‌శర్మ, అజ్గర్‌అలీ, ఏంఏ నిజాం పారిపోయారు. ఆ తర్వాత ఏ1 మారుతీరావు, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్‌కు.. ఏ7 సముద్రాల శివ సూర్యాపేటలోని బావ ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ఈ హత్యలో ఏ6 శ్రవణ్‌కుమార్ నగదు సమకూర్చాడు. ప్రత్యక్షంగా హత్యకు పాల్పడిన ఏ2 శుభాష్కుమార్శర్మకు మరణశిక్ష విధించగా, మిగిలిన ఆరుగురికి జీవితఖైదు పడింది. -
గ్రూప్–1 ఉద్యోగాలకు ముగ్గురు అర్హత
తిరుమలగిరి(నాగార్జునసాగర్): రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 మెయిన్స్ ప్రొవిజినల్ మార్కులు సోమవారం విడుదల చేయగా.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం బోయగూడెం గ్రామానికి చెందిన మందడి నాగార్జునరెడ్డి, అల్లి కీర్తన ఉద్యోగాలకు అర్హత సాధించారు. మందడి నాగార్జునరెడ్డి 2006 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2011లో అసిస్టెంట్ ట్రైబేల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికై కొద్దికాలం పనిచేసిన తర్వాత అదే ఏడాదిలో విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. నాగార్జునరెడ్డి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తహసీల్దార్‌గా కొనసాగుతూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యి 488 మార్కులతో అర్హత సాధించారు. మొదటి ప్రయత్నంలోనే విజయం..బోయగూడెం గ్రామానికే చెందిన అల్లి నాగమణి, పెద్దిరాజు దంపతుల కుమార్తె అల్లి కీర్తన మొదటి ప్రయత్నంలోనే తన కలను సాకారం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్–4 ఫలితాల్లో ఆమె జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికై ంది. గ్రూప్–1 ఉద్యోగానికి 468.5 మార్కులతో అర్హత సాధించింది. గుండెపురి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న భూక్య సందీప్ 468.5 మార్కులతో గ్రూప్–1కు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి
మునుగోడు: గొర్రెలను మేపేందుకు వెళ్తున్న వృద్ధురాలిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈ ఘటన సోమవారం మునుగోడు మండల కేంద్రం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన చిరగోని బాలమ్మ(58) మునుగోడులో నివాసముంటున్న తన కుమారుడు వద్ద ఉంటూ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తోంది. రోజుమాదిరిగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో గొర్రెలను మేతకు తోలుకుని వెళ్తుండగా.. మునుగోడు మండల కేంద్రం శివారు కమ్మగూడెం సమీపంలోని చొల్లేడు రోడ్డులో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఆమె ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతురాలి కుమారుడు చిరగోని లింగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం రామన్నపేట: అప్పుల బాధతో కౌలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో జరిగింది. సిరిపురం గ్రామానికి మోటె నర్సింహ(50) కొన్నేళ్లుగా గ్రామశివారులో పద్నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలంలో వరితో పాటు పత్తి సాగు చేశాడు. ప్రస్తుత యాసంగిలో వరి సాగు చేశాడు. బోర్లు ఎండిపోవడంతో సగానికి పైగా వరి పొలం ఎండిపోయింది. వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు పెరుగుతుండడంతో కొద్దిరోజులుగా ఆందోళన చెందసాగాడు. సోమవారం ఉదయం స్థానిక శివాలయానికి వెళ్లి పూజలు చేశాడు. అనంతరం పొలం చూడడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పుల ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురై పురుగులమందు తాగాడు. అనంతరం ఇంటికి తిరిగివచ్చి మంచంపై పడుకొని వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారి సహాయంతో 108 వాహనంలో రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నర్సింహ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
పిల్లల కోరిక మన్నించి వివాహాలు చేయాలి
మిర్యాలగూడ: పిల్లలు ప్రేమించుకుంటే తల్లిదండ్రులు వారి కోరికను మన్నించి పెళ్లిళ్లకు అనుమతించాలి. కులం, పరువు ప్రతిష్టలు అనే అహంకారంతో హత్యలకు పాల్పడితే చట్టాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని గుర్తించించాలి. చట్ట ప్రకారం మేజర్లు అయితే పిల్లలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. అంబేద్కర్ స్ఫూర్తితో కులరహిత సమాజం వైపు అడుగులు వేయాలి. పిల్లలు కూడా సినిమా, టీవీల ప్రభావంలో ఆకర్షణలకు లోనై అదే ప్రేమ అనుకొని తల్లిదండ్రులను శత్రువులుగా చూసే వైఖరిని మానుకోవాలి. తల్లిదండ్రులను ఒప్పించి పెద్దలను మెప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయాలి. – కస్తూరి ప్రభాకర్, సామాజికవేత్త, మిర్యాలగూడ -
జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి
నల్లగొండ టౌన్ : తల్లిదండ్రులు పిల్ల ల ప్రేమను ప్రోత్సహించొద్దు. ముందుగా తమ పిల్లలను సక్రమంగా చదువుకుని జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి. ఒకవేళ ప్రేమ వివాహం చేసుకున్నా చంపడం, దాడులు చేయడం, కేసులపాలు కావడం మంచి పద్ధతి కాదు. ప్రతిష్టకు పోయి వారి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. సామరస్యంగా రెండు కుటుంబాలు కలిసి సమస్య పరిష్కరించుకుంటే మంచిది. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వారిని సరైన మార్గంలో పయనించేలా దిశా నిర్దేశం చేయాలి. వారి ప్రవర్తనలో మార్పు వస్తే వెంటనే గమనించి వారు సరైన రీతిలో ఉండేలా తల్లిదండ్రులు సూచనలు చేయాలి. – డాక్టర్ సుబ్బారావు, మానసిక వైద్య నిపుణుడు, నల్లగొండ -
విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని కల్గిఉండేలా తీర్చిదిద్దాలి
సూర్యాపేట: తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యం కలిగి ఉండేలా తీర్చిదిద్దాలి. హైస్కూల్ విద్య నుంచే తమ కుటంబ నేపథ్యం, వారి స్థాయిని పిల్లలకు తెలిసేలా చేయాలి. సమాజంలో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. లక్ష్యం మీదనే ఫోకస్ చేసేలా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేలా చూడాలి. వివిధ రంగాల్లో ప్రావీణ్యం సాధించే వారు ఏవిధంగా సెల్‌ఫోన్, టీవీలకు దూరంగా ఉంటున్నారో వివరించాలి. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. – తల్లమల్ల హుస్సేన్, పూర్వపు ప్రభుత్వ న్యాయవాది, సూర్యాపేట -
అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు
నల్గొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్షలు పడ్డాయి. దీంతో ప్రణయ్ తల్లిదండ్రులు(Pranay Parents) మీడియాతో మాట్లాడుతూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అంతకు ముందు.. కొడుకు సమాధిని ముద్దాడి నివాళులర్పించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అమృత తండ్రి మారుతి రావు బలవన్మరణంతో మృతి చెందగా.. ఇప్పుడు అమృత చిన్నాన్న శ్రవణ్‌కు జీవిత ఖైదు పడింది.ప్రణయ్ హత్య ప్లాన్ అమలులో ఆరుగురు ప్రధాన సూత్రధారులని.. అందులో తన బాబాయ్ శ్రవణ్ కీలకంగా వ్యవహరించారంటూ అమృత అప్పట్లో ఘటన జరిగిన టైంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల ఆధారంగానే దర్యాప్తు జరిపిన పోలీసులు.. శ్రవణ్‌ను ఏ6గా నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ఇవాళ తీర్పులో ఆయనకు జీవిత ఖైదు పడగా.. శ్రవణ్ కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది.ఏ తప్పు చేయకున్నా.. తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్ కూతురు మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్‌కు అమృతే కారణమంటూ ఆరోపించింది కూడా. ఈ క్రమంలో ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని చెబుతూ.. ఆయన్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారామె.సంచలనం సృష్టించిన ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నారు. ఏ1 మారుతి మృతి చెందగా.. హంతకుడు సుభాష్ శర్మకు ఉరి శిక్ష పడింది. అమృత బాబాయ్ శ్రవణ్ సహా మిగతా నిందితులకు జీవిత ఖైదు పడింది. మారుతిరావు నుంచి సుపారీ అందుకున్న అస్ఘర్(ఉగ్రవాది కూడా), సుభాష్ శర్మలు అండర్ ట్రయల్స్‌గా ఉండగా.. మిగతా వాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చారు. పోలీసులు 1600 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. 5 సంవత్సరాల 9 నెలలపాటు విచారణ జరిగింది.ఇదీ చదవండి: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు -
దుర్గమ్మ.. ఈ స్నేహితులపై దయ లేదా..!
నార్కట్‌పల్లి(నల్లగొండ): దైవ దర్శనానికి వెళ్తుండగా నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఓల్డ్ అల్వాలకు చెందిన ఐదుగురు స్నేహితులు ప్రవీణ్, సాయికుమార్ గౌడ్, చిల్లాసాగర్ సాయి సందీప్ గౌడ్, హరీష్, మధుకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి దైవ దర్శనం కోసం ప్రవీణ్ కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత1:30గంటల సమయంలో బయలు దేరారు. ఆదివారం తెల్లవారు జామున 5:30గంటల సమయంలో మార్గమధ్యంలోని నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ శివారులో గల హైదరాబాద్– విజయవాడ జాతీయ ప్రధార రహదారి వద్ద రోడ్డు పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న కుంచ సాయికుమార్ గౌడ్(32), సాయిసందీప్ గౌడ్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్, మధుకర్లకు గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకోవడంతోపాటు, నిలిచి ఉన్న లారీకి వెనుక భాగంలో రెడ్ స్టిక్కర్ కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
ప్రణయ్ కేసులో ఒకరికి ఉరి.. ఆరుగురికి జీవితఖైదు
నల్లగొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది. అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు.👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. 👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. 👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది. 👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు. 👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు. -
తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్వి జోకర్ చేష్టలు
మోత్కూరు: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ జోకర్ చేష్టలు చేస్తున్నారని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఆదివారం మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు బిక్కేరుకు వస్తుండగా ఎమ్మెల్యే సామేల్ పూజలు చేసి తానే తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో మూసీ, బిక్కేరుల నుంచి దోసెడు ఇసుక తియ్యనివ్వనని హామీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచాక.. నేడు వంగమర్తి నుండి వందలాది లారీల్లో ఇసుక తరలింపు జరుగుతున్నా ఎమ్మెల్యే స్పందించడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేయించిన మున్సిపల్ పక్కా భవనం నిర్మాణాన్ని పూర్తి చేయించే శక్తి సామేల్‌కు లేదన్నారు. కేసీఆర్ కల్పించిన రిజర్వేషన్ల వల్లనే ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమలవెంకటేశ్వర్లు చైర్మన్ అయ్యారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డిలను ఎమ్మెల్యే సామేల్ తిడితే సహించేది లేదని హెచ్చరించారు. సింగిల్‌విండో చైర్మన్‌గా తాను, తన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేసి, నేటికీ ఆ అవినీతి ఏంటో ఎమ్మెల్యే సామేల్ నిరూపించలేకపోయారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అబద్దాలు చెబుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీను, ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేషం, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కొణతం యాకూబ్‌రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, నాయకులు దాసరి తిరుమలేష్, రాంపాక నాగయ్య, సామ పద్మారెడ్డి, కొండా సోంమల్లు, కోక భిక్షం, అన్నందాసు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి -
హైవేపై మూడు కార్లు ఢీ
చిట్యాల: మండలంలోని పెద్దకాపర్తి గ్రామ పరిధిలో హైవేపై ఆదివారం వరుసగా వెళ్తున్న మూడు కార్లు అకస్మాత్తుగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వాహనాలు వెళ్తుండగా.. పెద్దకాపర్తి గ్రామ శివారులోని కోళ్ల ఫారాల వద్దకు రాగానే ముందు వెళ్తున్న ఓ వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో ఆ వెనకే ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఆ కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒక మహిళ కాలు విరగగా, మరొకరి తలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. -
ముగ్గురు మనోళ్లే..!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో ఉమ్మడి జిల్లాకు అగ్రస్థానం కాంగ్రెస్ నుంచి ఇద్దరు.. సీపీఐ నుంచి ఒక్కరు ఖరారువిద్యార్థి దశ నుంచే పోరుబాట సీసీఐ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికై న నెల్లకంటి సత్యం చిన్ననాటి నుంచి వామపక్ష భావజాలానికి ఆకర్షితుడై విద్యార్థి దశ నుంచే పోరాట బాట పట్టారు. ఆనాటి భూస్వామ్య, పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. 1985 నుంచి 2000 వరకు ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా.. జిల్లా కార్యదర్శిగా పని చేశారు. 2010 నుంచి 2016 వరకు సీపీఐ మునుగోడు మండల కార్యదర్శిగా ఉన్నారు. 2016 నుంచి సీపీఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి, 2020 నుంచి సీపీఐ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బొమ్మగాని ధర్మభిక్షం అడుగు జాడల్లో పని చేస్తూ సీపీఐ బలోపేతానికి కృషి చేస్తూనే పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అగ్రస్థానం దక్కింది. రాష్ట్రంలో మొత్తం ఐదు స్థానాల ఖాళీ అవుతుండగా.. అందులో మూడు స్థానాలకు నల్లగొండ జిల్లా నుంచే అభ్యర్థులు ఖరారయ్యారు. వీటిలో కాంగ్రెస్‌పార్టీ ఇద్దరికి, సీపీఐ ఒక్కరికి అవకాశం కల్పించింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్ పేర్లను అధిష్టానం ప్రకటించింది. ఇక.. పొత్తులో భాగంగా సీపీఐకి ఒక్క సీటు కేటాయించగా.. ఆ పార్టీ తమ అభ్యర్థిగా నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది. దీంతో ఎమ్మెల్సీ స్థానాల్లో జిల్లాకు పెద్దపీట వేసినట్లయ్యింది. వీరంతా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉండటంతో వీరి గెలుపు లాంఛనమే కానుంది. ఆయా పార్టీలకు విధేయులుగా.. పార్టీ కోసం కష్టపడ్డ సామాన్యులకే అవకాశం దక్కిందని ఆయా పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యమ నేత దయాకర్ తుంగతుర్తి నియోజక వర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. దయాకర్.. జాతీయ మాలమహానాడు వ్యవస్థాపకుడు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో (టీజేఏసీ) అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అనుచరుడిగా ఉంటూనే, కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో దయాకర్.. రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఆయన వెంటే ఉన్నారు. పార్టీ కోసమే పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అయితే ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు కొందరు దయాకర్‌కు టికెట్ విషయంలో సానుకూలత వ్యక్తం చేయకపోవడంతో ఆయనకు టికెట్ దక్కలేదు. చివరకు మందుల సామెల్‌కు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని చెప్పడంతో దయాకర్ మిన్నకుండిపోయారు. ఆ తరువాత గతేడాది జనవరిలోనూ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని దయాకర్ కోరారు. అధిష్టానం కూడా బల్మూరి వెంకట్‌తోపాటు ఆయన పేరును ఖరారు చేసింది. నామినేషన్ కోసం పత్రాలు సిద్ధం చేసుకోమని చెప్పి, ఆ తర్వాత మళ్లీ వద్దంటూ ఫోన్ చేసి షాకిచ్చింది. దయాకర్ స్థానంలో మహేష్‌కుమార్‌గౌడ్ పేరును ప్రకటించింది. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం అప్పుడు తప్పిపోయినా.. ఇప్పుడు అవకాశం లభించింది. ఇటీవల ఆయన మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వారు కూడా లేఖలు ఇచ్చారు. ఫ అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్‌నాయక్ పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఫ సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ఫ గతంలో మిస్ అయినా.. ఎట్టకేలకు పదవి దక్కించుకున్న అద్దంకి ఫ పార్టీనే నమ్ముకున్న శంకర్‌నాయక్‌ను వరించిన ఎమ్మెల్సీ ఫ విధేయుడినే ఎంపిక చేసిన కమ్యూనిస్టు పార్టీ ఫ సామాన్యులకే దక్కిన అవకాశం -
11, 12 తేదీల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన
నల్లగొండ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఈనెల 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యక్షతన సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబునాయక్, కొంకతి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు, భూములకు సంబంధించిన కేసులపై సమీక్షిస్తారని పేర్కొన్నారు. 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కమిషన్ సూర్యాపేట నుంచి నల్లగొండకు చేరుకొని సాయంత్రం 5.30 వరకు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. నల్లగొండ నుంచి బయలుదేరి 6.30కు నాగార్జునసాగర్ వెళ్లి అక్కడే రాత్రి బస చేసి 12న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సాగర్‌లో ఇరిగేషన్, ట్రాన్స్‌కో, జెన్కో అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 1 గంటకు కొండమల్లేపల్లి మండలం పిలియాతండాకు వెళ్లి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ వెళ్తారని తెలిపారు. స్వేరోస్ సభను విజయవంతం చేయాలినల్లగొండ : ఖమ్మంలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న స్వేరోస్ సభను విజయవంతం చేయాలని స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ పాండు కోరారు. సభ పోస్టర్‌ను ఆదివారం నల్లగొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 14 వరకు భీమ్ దీక్ష పవిత్ర మాసంగా జరుపుకుంటామని తెలి పారు. కార్యక్రమంలో కుక్కముడి శ్రీను, రత్నకుమారి, యాదమ్మ, ఎల్లేష్, నాగుల జ్యోతి, వినోద్, చొక్కమ్మ, మర్రి నాగయ్య, మేడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఎయిమ్స్ వార్షికోత్సవం బీబీనగర్ : మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్య కళాశాల 5వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించనున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు, సాయింత్రం 7 గంటలకు వేడుకలకు ప్రారంభం కానున్నాయని, ముఖ్య అతిథిగా పద్మ విభూషణ్, ఏఐజీ ఆస్పత్రి ఫౌండర్, చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు. అడవులు, ఖనిజ సంపదను కాపాడాలి భానుపురి(సూర్యాపేట): అడవులు, ఖనిజ సంపదను కాపాడాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్ నారాయణరావు అన్నారు. వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేటలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఆదివాసుల హక్కులను కాలరాస్తూ పాలిస్తున్నాయన్నారు. అడవుల్లోని ఖనిజ సంపదను దేశీయ, విదేశీయ కార్పొరేట్లకు దోచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, న్యాయవాది తల్లమల్ల హసేన్, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ జిల్లా కన్వీనర్స్ భద్రయ్య పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలుఅర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయ సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. ఆ తర్వాత యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని వీరహనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాదసత్రంలో ఆదిత్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. -
ముగిసిన సాగర్మాత మహోత్సవాలు
నాగార్జునసాగర్ : గత మూడు రోజులుగా జరుగుతున్న సాగర్మాత మహోత్సవాలు ఆదివారం ముగిశాయి. ముగింపు సమిష్టి దివ్యబలిపూజా కార్యక్రమానికి విచ్చేసిన గుంటూరు పీఠాధిపతి చిన్నాబత్తిని భాగ్యయ్యకు భక్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా స్థానిక అంబేద్కర్ సెంటర్‌కు చేరుకున్న పీఠాధిపతులకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి గుడి వద్దకు తీసుకువచ్చారు. ఉదయం 5గంటలకు అత్తలూరు విచారణ గురువులు గురుశ్రీ చాట్ల కస్సార్‌చే దివ్యబలిపూజ, 6గంటలకు కారంపూడి విచారణ గురువులు పెట్ల గురుశ్రీ మర్రి అనిల్ దివ్యబలిపూజ, 7గంటలకు ముట్లూరు విచారణ గురువులు గురుశ్రీ మార్నేని దిలీప్‌చే దివ్యబలిపూజ, 8గంటలకు దాచేపల్లి విచారణ గురువులు గురుశ్రీ ఏరువ బాలశౌర్రెడ్డిచే దివ్యబలిపూజ, ఉదయం 10.30 గంటలకు గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగయ్యచే సమిష్టి దివ్య పూజ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గురవరేణ్యులు గురుశ్రీ పామిశెట్టి తోమస్ బృందంచే గానం, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం, 3గంటలకు కోలాటం, సాయంత్రం 6గంటలకు సాగర్మాత రథోత్సవం నిర్వహించారు. పురవీధుల్లో రఽథోత్సవంసాయంత్రం పురవీధుల్లో సాగర్మాత రథోత్సవాన్ని నిర్వహించారు. సాగర్మాత దేవాలయం, అంబేద్కర్ సెంటర్, పార్క్ సెంటర్ వద్ద పాము, చెట్టు రూపాల్లో తయారు చేసి కాల్చిన బాణా సంచా పలువురిని ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ఫాదర్స్ జోసఫ్బాలసాగర్, ఫాదర్ తంబి, మనోజ్‌కుమార్, ఆలయ పెద్దలు జోషి, జెక్కిరెడ్డి చిన్నపరెడి, ఇన్నారెడ్డి, శౌర్రాజు, మరియదాసు, శౌరిబాబు, బాలస్వామి పాల్గొన్నారు. -
వింత ఆలోచనలు
వికసించని మనసుల్లో..టీనేజ్ బాలికలే ఎక్కువ..సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో పరిచయాలు పెంచుకుంటున్న వారిలో ఎక్కువ మంది టీనేజ్ బాలికలు, మైనార్టీ తీరనివారే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తుందని పలువురు విద్యవేత్తలు అంటున్నారు. ఫేక్ ఐడీలతో మార్ఫింగ్ ఫొటోలతో కొంతమంది టీనేజ్ బాలికలతో పరిచయాలు పెంచుకొని మాయమాటలతో వారిని మోసం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మునగాల బాలికలను మోసం చేసిన వ్యక్తి 40 సంవత్సరాలకు పైబడి వయస్సున్నప్పటికి ఫ్రొఫైల్లో 20 సంవత్సరాల ఫొటో పెట్టి బాలికలను మోసం చేశాడు. కోదాడ: తెలిసీతెలియని వయస్సులో సామాజిక మాధ్యమాల మోజులో పడి యువత పక్కదారి పడుతోంది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లలో ఏర్పడుతున్న పరిచయాలు కొద్దిరోజుల్లోనే ప్రేమలు, పెళ్లిళ్లకు దారితీస్తుండగా, మరికొన్ని చోట్ల బాలికలు మోసపోతున్నారు. ముక్కుమొహం తెలియని వ్యక్తులతో ఏర్పడిన వారం పది రోజుల పరిచయాలతోనే కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి వందల కిలోమీటర్లు వెళ్తున్నారు. ఇష్టానికి వదిలేస్తున్నారా...ఇంట్లో పిల్లలు సెల్‌ఫోన్ వాడుతున్నారని తెలిసినా తల్లితండ్రులు పట్టించుకోకుండా వారి ఇష్టానికి వదిలేస్తుండడంతో అపరిచితులతో పరిచయాలు పెంచుకుంటున్నారని పలువురు అంటున్నారు. సామాజిక మాధ్యమాలలో పిల్లలు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులు నిత్యం గమనించాలని నిపుణులు అంటున్నారు. అన్ని విషయాలను పిల్లల ఇష్టానికి వదిలేస్తుండడంతో పాటు ఎదుటి వ్యక్తి చెప్పే మాయమాటలకు టీనేజ్ పిల్లలు వెంటనే ఆకర్షితులై మోసపోతున్నారని పేర్కొంటున్నారు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సామాజిక మాద్యమాల్లో పెంచుకుంటున్న పరిచయాలు ఎలాంటివి..? వారు ఎవరితో మాట్లాడుతున్నారు..? ఎవరితో చాటింగ్ చేస్తున్నారో కనీసం గమనించడం లేదని, టీనేజ్ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యమే అనర్ధాలకు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు.సామాజిక మాధ్యమాల మోజులో పక్కదారి పడుతున్న టీనేజర్లు చిన్న పరిచయాలతో అతి కొద్దిరోజుల్లోనే ప్రేమకు దారితీస్తున్న వైనం ముక్కుమొహం తెలియని వ్యక్తులతో ఇళ్లు వదిలి వెళ్తున్న అమ్మాయిలు తల్లిదండ్రులు నిత్యం గమనించాలంటున్న పోలీసులుతల్లిదండ్రులు బాధ్యత మరవొద్దు సామాజిక మాధ్యమాలకు పిల్లలను దూరంగా ఉంచేలా తల్లిదండ్రులు చూడాలి. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు ఏం చేస్తున్నారో, ఎవ్వరితో పరిచయాలు పెంచుకుంటున్నారో నిత్యం గమనించాలి. దారి తప్పుతున్నారని గమనిస్తే తగిన విధంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి. సామాజిక మాధ్యమాలతో వచ్చే మంచి చెడులను వారికి వివరించాలి. ప్రతి రోజు పిల్లలకు కొంత సమయం కేటాయించి వారితో మాట్లాడాలి. – మామిళ్ల శ్రీధర్‌రెడ్డి, కోదాడ డీఎస్పీ -
నృసింహుడి రథోత్సవం.. కనుల వైభవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తజనంయాదగిరిగుట్ట: యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దివ్య విమాన రథోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా సాగింది. శనివారం రాత్రి లక్ష్మీదేవిని పరియణమాడిన నృసింహుడు.. మరుసటి రోజు ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీమహావిష్ణువుగా రూపుదాల్చి గరుడవాహనంపై మాడ వీధుల్లో విహరించారు. అనంతరం తూర్పు రాజగోపురం ఎదుట సేవను వేంచేపు చేసి వేదమంత్రాలు, పారాయణాలు పఠిస్తూ ప్రధానార్చకులు అలంకార విశిష్టతను వివరించారు. ఈ వేడుకలో కలెక్టర్ హనుమంతరావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈఓ భాస్కర్‌రావు, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అర్చకులు, పారాయణికులు, రుత్వికులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దివ్య విమాన రథోత్సవం సాయంత్రం ప్రధానాలయంలో నిత్యారాధనలు పూర్తయిన అనంతరం చతుస్థానార్చనలు, మండపారాధనలు, మూలమంత్ర జపములు, ద్వారాతోరణ పూజలు, దివ్య ప్రబంధ పారాయణాలు, మహామంత్ర పుష్పం, పురాణ, ఇతిహాస, విజ్ఞాపన వేడుకలు చేపట్టారు. అనంతరం రథాంగ హోమం, రథబలి, శ్రీస్వామివారి ఉత్సవమూర్తుల అలంకార సేవను ఊరేగించారు. రాత్రి దివ్యవిమాన రథంపై ఆశీనులైన కల్యాణమూర్తులు.. ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజనులను అనుగ్రహించారు. భాజాభజంత్రీలు, భక్తుల జయజయ ధ్వానాలు, నృత్యాలు చేస్తుండగా రథోత్సవం ముందుకు సాగింది. తిరు, మాడ వీధులు నృసింహుడి నామస్మరణతో మార్మోగాయి. నృత్యాలతో సందడి చేశారు. అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ తిరు, మాడ వీధుల్లో విహరించిన కల్యాణమూర్తులు ఉదయం శ్రీమహావిష్ణువు అలంకారంలో నృసింహుడి దర్శనం నేటి కార్యక్రమాలు సోమవారం ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, రాత్రి శ్రీపుష్ప యాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం నిర్వహించనున్నారు. -
తొలితరం కవి రావిరాల బుచ్చయ్య మృతి
చిట్యాల: మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన తొలితరం కవి, రచయిత రావిరాల బుచ్చయ్య(75) అనారోగ్యంతో శనివారం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆయన ఆర్టీసీ సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. గతంలో విరసం ఆవిర్భావ సభ్యుడిగా, ఆ సంఘం నల్లగొండ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన 1964లో ‘సిందు రామవ్వ’ నవలను, 1977లో ‘విముక్తి పథం’ అనే గ్రంథంతో పాటు అనేక కవితలు, కథలు, పలు రచనలు రాశారు. అంతేకాకుండా ఆయన టీవీ ఆర్టిస్టుగా, నాటకకర్తగా ఉన్నారు. ఆయన మృతి పట్ల సృజన సాహితి అధ్యక్ష, కార్యదర్శులు పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, కవులు, రచయితలు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, దర్శనం అంజయ్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, వట్టిమర్తి గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నర్రా లవేందర్‌రెడ్డి, బూరుగు రమేష్ సంతాపం తెలిపారు. ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్యభూదాన్పోచంపల్లి: మున్సిపాలిటీ పరిధిలోని సీతావానిగూడెం గ్రామానికి చెందిన బుగ్గ ప్రవీణ్ (25) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం మృతుడి తల్లిదండ్రులు తమ బంధువుల ఇంట్లో జరిగే ఓ కార్యానికి వెళ్లారు. ప్రవీణ్ ఉదయం పొలంవద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఒంటరికి ఉన్న ప్రవీణ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన అతడి అన్న ప్రభాకర్ ఇంట్లోకి వెళ్లి చూడగా ప్రవీణ్ ఉరివేసుకుని కనిపించాడు. కాగా.. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చేతికంది వచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యాదగిరి క్షేత్రంతో గరిమెళ్లకు అనుబంధంయాదగిరిగుట్ట: టీటీడీ ఆస్థాన సంగీత విధ్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తిరుపతిలోని ఆయన నివాసంలో ఆదివారం మృతి చెందారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఇటీవల పాల్గొని అన్నమయ్య సంకీర్తనలను తన బృందంతో ఆలపించారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఇటీవల యాదగిరి క్షేత్రాన్ని సందర్శించారని పలువురు అధికారులు, సిబ్బంది ఆయనను గుర్తు చేసుకున్నారు. అంతుచిక్కని వ్యాధితో గేదె మృతిభూదాన్పోచంపల్లి: మండలంలోని మామిళ్లగూడెం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో గేదెలు మృత్యువాత పడుతున్నాయి. ఆదివారం పర్సమోని అనసూయకు చెందిన గేదె తలను నేలకు బాదుకుని మృతి చెందింది. అంతేకాక పర్సమోని కమలమ్మ, బొడ్డు ఎల్లమ్మకు చెందిన గెదేలు సైతం వ్యాధిసోకి వింతగా ప్రవర్తిస్తున్నాయని బాధితులు తెలిపారు. గేదెలు తలను నేలకు గట్టిగా గుద్దుకొంటూ వింతగా ప్రవర్తిస్తున్నాయని పేర్కొన్నారు. వారం రోజులుగా గడ్డిమేయడంలేదని, పగలు, రాత్రివేళల్లో నిద్రపోవడంలేదని చెబుతున్నారు. పశువైద్యాఽధికారులను సంప్రదించగా.. వారు మందులు ఇచ్చినా తగ్గడం లేదని వాపోయారు. ఇలా అంతుచిక్కని వ్యాధితో గేదెలు మృతి చెందుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. -
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
భానుపురి (సూర్యాపేట): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్ అనంతుల మధు డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పలువరు తెలంగాణ ఉద్యమకారులు స్థానిక పోస్టాఫీస్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోస్ట్ కార్డ్‌లు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ గౌరవం, స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం ఉద్యమించిన తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం 250గజాల ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన కోరారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమ నాయకులు గట్ల రామశంకర్, బాషిపంగు సునీల్, పడిదల ప్రసాద్, పంతం యాకయ్య, మామిడిశెట్టి అంజయ్య, ధరవాత్ నాగేశ్వరావు, బారి ఖాన్, నారబోయిన్ కిరణ్, కొలికపంగు వాసు, పోరీళ్ల విప్లవ్‌కుమార్, ఓ బాబా, దుబ్బ రమేష్, బొడ్డు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహారం కల్తీకి చెక్!
కల్తీలేని ఆహారం అందించాలి ఉమ్మడి జిల్లాలోని ప్రజలకు కల్తీలేని ఆహార పదార్థాలు అందించేందుకు ఫుడ్ మొబైల్ ల్యాబ్ వాహనం ఎంతో ఉపయోగపడనుంది. వ్యాపారులు నాణ్య మైన, కల్తీలేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలి. – జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ నల్లగొండ టూటౌన్ : దేశంలో సాంకేతిక విప్లవం ఎంత వేగంగా పెరిగిపోతుందో అంతే వేగంగా అన్నింటా కల్తీ కూడా పెరుగుతోంది. ఏ ఆహార పదార్థం అయిన కల్తీ లేనివి దొరకడం గగనమైంది. ఆహార పదార్థాల్లో కల్తీని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టాంది. అందులో భాగంగా కల్తీ ఆహార పదార్థాలను ఇట్టే కనిపెట్టేందుకు రూ.60 లక్షల విలువ చేసే ఫుడ్ మొబైల్ ల్యాబ్ వాహనాన్ని ఉమ్మడి జిల్లాకు మంజూరు చేసింది. దీని ద్వారా కల్తీని వెంటనే నిర్ధారించే అవకాశం ఉంటుంది. ఈ వాహనంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక నుంచి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి నాణ్యతను పరీక్షించిన అనంతరం నివేదికను కలెక్టర్‌కు పంపనున్నారు. కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించడమే ధ్యేయంగా ఫుడ్ మొబైల్ ల్యాబ్ వాహనాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వాహనం ప్రత్యేకతలు.. ● ఫుడ్ మొబైల్ ల్యాబ్ వాహనంలోని ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన పరికరాల ద్వారా ఆహార పదార్థాలను పరీక్షించడంతో వెంటనే వాటి నాణ్యత తెలిసిపోతుంది. ● పెద్ద, పెద్ద హోటళ్లతోపాటు ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగే జాతరలు, పండుగలు, ఉర్సుల్లో ఆహార పదార్థాలను వెంటనే పరీక్షించే వెసులుబాటు ఉంటుంది. ● ఆహార పదార్థాల్లో ఫుడ్ పాయిజన్ అయినా, ఇతర ఏ విధమైన కల్తీ జరిగినా అక్కడ ఉన్న అన్ని ఆహార పదార్థాలను వినియోగించకుండా తక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ● హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ హౌజ్‌లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, తోపుడు బండ్ల మీద పెట్టి వ్యాపారం చేసే వారి వద్ద కూడా తనిఖీలు చేసి నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవచ్చు. ● పాలు, పెరుగు, కూరల్లో వినియోగించే మసాల దినుసులు, కూరగాయలు, అయిల్ తదితర వాటిని పరీక్షించి అక్కడే ఫలితాన్ని చూపిస్తారు. గురుకులాలు, హాస్టళ్లలోనూ తనిఖీలు.. ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురుకులాలు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ అయి పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన విషయం తెలిసిందే. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్ పడనుంది. గురుకులాలు, కాలేజీలు, మోడల్స్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనాన్ని ఈ ఫుడ్ మొబైల్ ల్యాబ్ వాహనంతో వెళ్లి సంబంధిత అధికారులు నాణ్యతపై పరీక్షలు జరిపే అవకాశం ఉంటుంది. ఈ వాహనాన్ని ప్రారంభించిన రోజే నల్లగొండ పట్టణంలోని పద్మనగర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి కల్తీపై ఆరా తీశారు. ఫ ఉమ్మడి జిల్లాకు ఫుడ్ మొబైల్ ల్యాబ్ వాహనం ఫ వెంటనే నాణ్యత పరీక్ష చేసేలా చర్యలు ఫ కల్తీలేని ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యం -
జనశక్తి సీనియర్ నేత కన్నుమూత
నకిరేకల్: నకిరేకల్ పట్టణంలో నివాసం ఉంటున్న సీనియర్ జనశక్తి రాష్ట్ర నాయకుడు చీటూరి సోమయ్య(85) అనారోగ్యంతో శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన స్వగ్రామం జనగాం జిల్లా దేవరుప్పల మండలం ధర్మాపురం. సీపీఐఎంఎల్ జనశక్తి పార్టీలో సోమయ్య క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన మృతదేహనికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అరుణోదయ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్, టీపీసీసీ నేత దైద రవీందర్, బీసీపీ జిల్లా కార్యదర్శి గాజుల సుకన్య, ట్రస్మా రాష్ట్ర నేత కందాల పాపిరెడ్డి, జనశక్తి నేత కోమరయ్య, న్యూడెమోక్రసీ నేతలు ఇందురు సాగర్, అంబటి చిరంజీవి తదితరులున్నారు. -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నాగార్జునసాగర్: గత కొన్నాళ్లుగా ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ టవర్లలోని ఆఆర్యూ(రేడియో రిమోట్ యూనిట్), బీబీయూ(బేస్ బాండ్ యూనిట్)ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నాగార్జునసాగర్ సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం విజయపురి సౌత్‌జోన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ బీసన్న వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి(సాగర్) మండలం జానారెడ్డి కాలనీకి చెందిన జటావత్ మహేష్, జటావత్ నాగేష్, జటావత్ వినోద్‌లు కొంత కాలం నుంచి పెద్దవూర, తిరుమలగిరి(సాగర్),హాలియా మండలాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేట పరిధిలో గల పలు ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ టవర్లలో 5జీ ఇంటర్న్నెట్ సిగ్నల్ కోసం బిగించే ఆఆర్యూ (రేడియో రిమోట్ యూనిట్), బీబీయూ (బేస్ బాండ్ యూనిట్)లను దొంగిలించి వాటిని హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన మాలిక్ అనే వ్యక్తికి విక్రయించేవారు. ఈ దొంగల ముఠాకు గతంలో సెల్‌పోన్ టవర్లలో పనిచేసిన అనుభవం ఉండటంతో సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశ్యంతో ఈ దొంగతనాలకు పాల్పడుతుండేవారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు పర్యవేక్షణలో, సీఐ బీసన్న ఆధ్వర్యంలో పెద్దవూర ఎస్ఐ వీరబాబు తన సిబ్బందితో కలిసి పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామ శివారులోని టోల్గేట్ వద్ద నిందితులను పట్టుకొని అరెస్ట్ చేశారు. నిందితులను విచారించగా మొత్తం ఐదు కేసుల్లో నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురితో పాటు, యూనిట్లను కొనుగోలు చేసి వారికి సహకరించిన మాలిక్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితుల నుంచి ఒక ఆర్ఆర్యూ యూనిట్, రూ. లక్షా యాభై వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసును త్వరితగతిన చేఽధించిన ఎస్ఐ వీరబాబు, సిబ్బందిని సీఐ బీసన్న అభినందించారు. -
దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు
నార్కట్‌పల్లి: దైవ దర్శనానికి వెళ్తుండగా నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఓల్డ్ అల్వాలకు చెందిన ఐదుగురు స్నేహితులు ప్రవీణ్, సాయికుమార్ గౌడ్, చిల్లాసాగర్ సాయి సందీప్ గౌడ్, హరీష్, మధుకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి దైవ దర్శనం కోసం ప్రవీణ్ కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత1:30గంటల సమయంలో బయలు దేరారు. ఆదివారం తెల్లవారు జామున 5:30గంటల సమయంలో మార్గమధ్యంలోని నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామ శివారులో గల హైదరాబాద్– విజయవాడ జాతీయ ప్రధార రహదారి వద్ద రోడ్డు పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారులో ప్రయాణిస్తున్న కుంచ సాయికుమార్ గౌడ్(32), సాయిసందీప్ గౌడ్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. హరీష్, మధుకర్లకు గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకోవడంతోపాటు, నిలిచి ఉన్న లారీకి వెనుక భాగంలో రెడ్ స్టిక్కర్ కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి -
రాజీవ్‌గాంధీ పాలనలో సాంకేతిక విప్లవం
రామన్నపేట : మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్‌గాంధీ పాలనలోనే దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలకడం జరిగిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రామన్నపేటలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాందీ విగ్రహాన్ని ఆదివారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. రాజీవ్‌గాంధీ సాహసోపేతమైన నిర్ణయం వల్ల యువత విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. రాజీవ్‌గాందీ ఆశయసాధనకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, విగ్రహదాత వనం హర్షినీచంద్రశేఖర్ పట్టణకాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరొద్దిన్ నాయకులు గంగుల వెంకటరాజిరెడ్డి, జినుకల ప్రభాకర్, గాదె శోభారాణి, గంగుల క్రిష్ణారెడ్డి, రవిచంద్ర, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి -
రాజీ మార్గంతో కేసులకు శాశ్వత పరిష్కారం
రామగిరి(నల్లగొండ) : రాజీ మార్గంతో కేసులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయలోక్ అదాలత్ నిర్వహించారు. నల్లగొండ కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు లోక్ అదాలత్‌ను ప్రారంభించి కక్షిదారులకు రాజీ పత్రాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా సివిల్ 40, క్రిమినల్ 5,807, వెహికిల్ ఇన్యూరెన్స్ 95, బ్యాంక్ 3, సైబర్ క్రైం 29, ట్రాన్స్‌కో 100, ట్రాఫిక్ చలాన్ 12,879 కేసులను పరిష్కరించారు. ఇందులో ఇన్సూరెన్స్ కేసుల్లో రూ.4,30,82,000 నష్ట పరిహారం ఇప్పించారు. ఇతర కేసుల్లో రూ.2,58,456 రికవరీ చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఆర్ఓబీలు మంజూరు చేయాలి
నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు ఆర్ఓబీ, ఆర్‌యూబీలను మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మంత్రి సీతక్క, భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి రైల్వే మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రైళ్ల రాకపోకల సమయంలో లెవల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు మూసివేయడం వల్ల రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు. నల్లగొండ జిల్లా రాయనిగూడెం వద్ద, నల్లగొండలోని ఎఫ్‌సీఐ గోడౌన్ నుంచి పెద్దబండ నాంరోడ్డు వద్ద, నార్కట్‌పల్లి – మునుగోడు రోడ్డులో, దామరచర్ల – వీర్లపాలెం రోడ్డులో, త్రిపురారం – కుక్కడం రోడ్డులో, యాదాద్రి జిల్లా చౌటుప్పల్ – నాగారం రోడ్డులో, పగిడిపల్లి – భువనగిరి రోడ్డులో, ముత్తిరెడ్డిగూడెంలోని భువనగిరి – రాయగిరి రోడ్డులో, వలిగొండ – రామన్నపేట రోడ్డులోని కిలోమీటర్ 16/8 నుంచి 17/0 వరకు, రామన్నపేట–చిట్యాల జంక్షన్‌లోని కిలోమీటర్ 0/4–6 వద్ద, చిట్యాల మున్సిపాలిటీ కాటన్ రైస్ ఇండస్ట్రీస్ రోడ్డులో.. ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. ఫ రైల్వే శాఖ మంత్రికి కోమటిరెడ్డి వినతి -
మిర్యాలగూడ సబ్ డివిజన్లో సీఐలు బదిలీ
మిర్యాలగూడ అర్బన్, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ రూరల్, టూ టౌన్ సీఐలుగా విధులు నిర్వహిస్తున్న వీరబాబు, నాగార్జునను మల్టీజోన్–2 ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. వారి స్థానంలో రూరల్ సీఐగా పీఎన్డీ ప్రసాద్, టూటౌన్ సీఐగా జి.సత్యనారాయణను నియమించారు. మిర్యాలగూడ వన్‌టౌన్ సీఐ స్థానం గతేడాది కాలంగా ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం మోతీరాంను నియమించినట్లు సమాచారం. రూరల్ ఎస్ఐగా లక్ష్మయ్య మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో చేస్తున్న ఎస్ఐ పిల్లి లోకేష్‌కుమార్‌ను ఐజీ కార్యాలయాని అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన స్థానంలో చౌటుప్పల్‌లో పనిచేస్తున్న లక్ష్మయ్య మిర్యాలగూడ రూరల్ ఎస్ఐగా రానున్నారు. బుచ్చిరెడ్డికి బాలసాహిత్య పురస్కారంకనగల్ : మండలంలోని చిన్నమాధారం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి 2025 సంవత్సరానికి ఉత్తమ బాలసాహిత్య పురస్కారం లభించింది. శనివారం వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో కునిరెడ్డి ఫౌండేషన్, చదువుల సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చంద్రారెడ్డి, డికె. చదువులబాబు, సాహితీవేత్త నరాల రామారెడ్డి మెమోంటో, సన్మాన పత్రం, శాలువతో బుచ్చిరెడ్డిని సన్మానించారు. బుచ్చిరెడ్డి రాసిన బంతిపూలు పుస్తకానికి బాలసాహిత్య పురస్కారం అందజేశారు. బుచ్చిరెడ్డికి పురస్కారం లభించడంపై పాఠశాల జీహెచ్ఎం వల్లంపట్ల పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. జేఎల్ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలి నల్లగొండ : జూనియర్ లెక్చరర్లకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 11న హైదరాబాద్‌లోని నిర్వహించనున్న ధర్నాకు సంబందించి పోస్టర్‌ను శనివారం నల్లగొండలోని గడియారం సెంటర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2022లో వచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించి 2023లో పరీక్షలు నిర్వహించి 2024లో ఫలితాలు విడుదల చేశారని.. 2025 ఫిబ్రవరి 19న కళాశాలలు కేటాయించారని.. కానీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాదికారి ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, రవీందర్, గోవర్ధన్, పందిరి శ్యాంసుందర్, ఎండీ.అబ్దుల్ ఖాదర్, గుండాల భిక్షమయ్య, దాసరి శ్రీరాములు, కే.చంద్రశేఖర్‌రెడ్డి, వి.లింగస్వామి, చిరుమర్తి వెంకటేష్, వి.హనుమంతు, ఎన్.వీరారెడ్డి, ఎండీ.ఫాతిమా బేగం తదితరులు పాల్గొన్నారు. లక్ష సంతకాల సేకరణ ప్రారంభం భువనగిరి టౌన్ : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శనివారం భువనగిరిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పదవుల్లో దివ్యాంగులను నామినేట్ చేయడానికి వీలుగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది దివ్యాంగుల నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే భువనగిరి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, జిల్లా అధ్యక్షుడు సుర్పంగ ప్రకాష్, కోశాధికారి కొత్త లలిత తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీరాజ్‌లో ప్రత్యేక నియామకాలు
నల్లగొండ : పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక నియామకాలు చేపడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల్లో.. సూపర్ న్యూమరరీ పోస్టుల ద్వారా జూనియర్ అసిస్టెంట్లను భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పెద్ద చదువులు చదివి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల్లో చేకుండా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మేలు కలగనుంది. నియామకాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన శనివారం చేపట్టారు. ఎళ్లుగా ఎదురుచూపులు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తారు. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో ఎక్కువ శాతం ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చనిపోయిన వారి పిల్లల్లో కొందరు ఇంజనీరింగ్, పీజీ ఈ పోస్టుల్లో జాయిన్ కాకుండా.. జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీ అయితే వాటిల్లో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా ఏటా ఒకరిద్దరు పదవీవిరమణ పొందితే ఆ స్థాయిలోనే ముందు వరుసలో ఉన్న వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. దీంతో కొందరు పదేళ్లకుపైగానే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారు. ఇక.. కొందరు కుటుంబ పోషణ కోసం ఆఫీస్ సబార్డినేట్ విధుల్లో చేరుతున్నారు. పదోన్నతులు లేకపోవడమే.. ప్రస్తుతం ఆఫీస్ సబార్డినేట్‌గా చేరినా.. పదోన్నతులు వస్తాయనే ఆశ లేదు. 20 ఏళ్లు గడిచిన వారికి కూడా జూనియర్ అసిస్టెంట్ పదోన్నతి లభించక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సబార్డినేట్, నైట్ వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉండటంతో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో జిల్లా పరిషత్ సీఈఓలు, ఇతర అధికారులు, సంఘ నాయకులు కలిసి ప్రభుత్వానికి విన్నవించడంతో.. ప్రభుత్వం సూపర్ న్యూమరరీ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. 59 పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్లు.. జిల్లాలో 59 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సూపర్ న్యూమరరీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం ఆఫీస్ సబార్డినేట్ ఖాళీల్లో సూపర్ న్యూమరరీ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు ఇస్తుంది. ఈ సూపర్ న్యూమరరీ ద్వారా జూనియర్ అసిస్టెంట్లుగా చేరుతున్న వారిని భవిష్యత్‌లో జూనియర్ అసిస్టెంట్ రెగ్యులర్ పోస్టు ఖాళీ అయితే సీనియారిటీ ప్రకారం ఆ పోస్టుల్లోకి మార్చుతారు. ఫ మొదటిసారిగా సూపర్ న్యూమరరీ పోస్టులు ఫ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల్లో.. జూనియర్ అసిస్టెంట్లుగా.. ఫ ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 59 మందికి మేలు -
తాగునీటి సమస్య రావొద్దు
నల్లగొండ : వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా అధికారులు మనసు పెట్టి పనిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్లో సాగు, తాగునీరు, విద్యుత్‌పై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ వేసవిలో తాగు, సాగు నీరు, విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఫిబ్రవరిలో సమావేశం నిర్వహించుకోవాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందన్నారు. ఈ మూడు శాఖలకు చెందిన పైస్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందులో పోలీస్, రెవెన్యూ అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. వేసవిలో ఏర్పడే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్ల వద్ద కొంత నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల వద్ద కూడా నిధులు అందుబాటులో ఉంచేలా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కృష్ణాలో అనుసంధానం చేసే ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. డీఆర్సీ సమావేశాలు నిర్వహించుకునే విషయంలో కూడా అధికా రులు దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై సంబంధిత అదికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లు వీటిపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. కాల్వల నిర్వహణ సరిగాలేదు : గుత్తా శాసనమండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల నిర్వహణ సరిగా లేదన్నారు. ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ చేపట్టాలన్నారు. కాల్వల్లో రైతులు పెద్ద మోటార్లు వేసి నీరును లాగడం వల్ల చివరి భూములకు నీరు అందడం లేదన్నారు. విద్యుత్ కనెక్షన్ల మంజూరులో అధికారులు ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. లో వోల్టేజీ సమస్య పరిష్కరించాలి : మంత్రి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉన్నాయని.. ఎకరం పొలం కూడా ఎండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ లోడ్ పెరిగి లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోందని.. ఆ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. కలెక్టర్లు తాగునీటిపై దృష్టి సారించాలని, ప్రతి పంచాయతీకి రూ.15 వేల వరకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నందులాల్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ హరిలాల్, సీఈ అజయ్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ సీఈ వెంకటేశ్వర్లు, నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్రపవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ పాల్గొన్నారు. ఫ అధికారులు మనసు పెట్టి పనిచేయాలి ఫ నీటి సమస్య తలెత్తితే తక్షణమే పరిష్కరించాలి ఫ అందుకు కలెక్టర్ వద్ద నిధులు ఉంచుతాం ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
నయన మనోహరం.. నృసింహుడి కల్యాణం
ఫ యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణోత్సవం శనివారం రాత్రి వైభవంగా సాగింది. పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలతో పెళ్లికొడుకుగా ముస్తాబైన శ్రీస్వామివారు గజవాహనంపై, నవ వధువుగా శ్రీలక్ష్మీదేవి దివ్య అలంకార శోభితమై ప్రత్యేక పల్లకిలో రాత్రి 8.30 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి 9 గంటలకు ఉత్తర మాడవీఽఽధిలో ఏర్పాటు చేసిన కల్యాణవేదికపైకి చేరుకున్నారు. కల్యాణ వేదికపై శ్రీస్వామి, అమ్మవారిని ఎదురెదురుగా అధిష్టింజేసిన అర్చకులు.. కల్యాణానికి శ్రీకారం చుట్టారు. అర్చకబృందం, వేదపండితులు, పారాయణీకులు వేదమంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా ప్రధానార్చకులు శ్రీస్వామివారికి జంజరాధారణ (యజ్ఞోపవితం)గావించారు. ఆ వెంటనే నృసింహుడు అమ్మవారికి, అమ్మవారు నృసింహుడికి జీలకర్ర బెల్లం పెట్టే తంతు పూర్తి చేశారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, సన్నాయిమేళాలు మోగుతుండగా, భక్తులు జయజయద్వానాల మధ్య మాంగల్యధారణ గావించి ముత్యాల తలంబ్రాల వేడుక నిర్వహించారు. పట్టువస్త్రాల సమర్పణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, టీటీడీ తరఫున, భూదాన్‌పోచంపల్లి తరపున, భక్తుల తరపున తీసుకువచ్చిన పట్టు వస్త్రాలతో అలంకార సేవలో ప్రజాప్రతినిధులు, ఆలయాధికారులు, భక్తులు నడిచారు. ఉదయం శ్రీరాముడిగా దర్శనం శనివారం ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధనలు పూర్తయిన అనంతరం స్వామివారిని శ్రీరాముడిగా అలంకరించి హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, వెంకటచార్యులు పాల్గొన్నారు. -
ఎకరం కూడా ఎండిపోరాదు
నల్లగొండ: నీరందక ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. వేసవిలో సాగు, తాగునీరు సమస్యలు ఉత్పన్నం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై శనివారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కాల్వల కింద పలుచోట్ల నీరు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తెచ్చారు. కాల్వల్లో మోటార్లు వేసి కొందరు రైతులు కిలోమీటర్ల కొద్దీ తీసుకుపోతుండటం వల్ల.. కాల్వ చివరి రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ.. అధికారులు అలాంటి వాటికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.క్షేత్ర స్థాయికి అధికారులు వెళ్తే.. సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. వేసవిలో తాగునీటి తక్షణ సమస్య పరిష్కారానికి.. కలెక్టర్ల వద్ద కొంత నిధులు ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేసే విషయమై.. ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో నిధులు అందుబాటులో ఉంచితే.. ఎక్కడ తాగునీటి సమస్య ఏర్పడినా వెంటనే పరిష్కరించవచ్చని సూచించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాల్వల విస్తరణతో పాటు లైనింగ్ పనులు చేస్తేనే చివరి భూములకు నీరందించగలుగుతామని అభిప్రాయపడ్డారు. -
ఆడపిల్ల పుట్టినా, వివాహమైనా రూ.2,016 నగదు..!
నల్గొండ: దేవరకొండ మండలం మైనంపల్లికి చెందిన కొర్ర రాంసింగ్ – గౌతమి దంపతులు ఆడబిడ్డలంటే ఎంతో మమకారం. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో గతంలో ఆడశిశువు జన్మిస్తే భారంగా భావించిన కొన్ని గిరిజన కుటుంబాల పరిస్థితిని కళ్లారా చూశారు. ఆడపిల్లను భారంగా భావించొద్దని.. ఆడపిల్లను ఇంటికి మహాలక్ష్మిలా భావించాలని ఎందరికో అవగాహన కల్పించారు.చివరికి ఆడపిల్ల పుట్టినా, ఆడపిల్ల వివాహం చేసినా ఆర్థిక సాయం చేయాలని తలిచి గ్రామంలో రామన్న కల్యాణ కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడవుగా 2020లో ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మొదట్లో రూ.1,016తో ప్రారంభించిన రామన్న కల్యాణ కానుకను మరుసటి సంవత్సరం నుంచి రూ.2,016 పెంచారు. ఐదేళ్ల నుంచి గ్రామంలో ఆడబిడ్డల వివాహానికి రూ.2,016, ఆడపిల్ల జన్మిస్తే వారి కుటుంబానికి రూ.2,016 అందిస్తున్నారు. దీంతో ఆ దంపతులను పలువురు అభినందిస్తున్నారు. -
జనరిక్ మందులను వినియోగించాలి
చిట్యాల: ప్రజలు జనరిక్ మందులు వినియోగించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కెట్లో లభించే ఇతర మందులతో పోల్చితే జనరిక్ మందుల ధరలు యాబై నుంచి ఎనబై శాతం వరకు తక్కువ ధరలో లభ్యమవుతాయని, రోగ నివారణలో సైతం మెరుగైన స్థాయిలో పనిచేస్తాయని తెలిపారు. జనరిక్ మందులపై అపోహలు తొలగించుకోవాలని డీఎంహెచ్ఓ సూచించారు. అనంతరం డీటీసీఓ డాక్టర్ కల్యాణ చక్రవర్తి జనరిక్ మందుల వినియోగంపై ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓలు డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ రవి, చిట్యాల పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ వెంకటేశ్వర్లు, సత్య నరేష్, సీహెచ్ఓ నర్సింగరావు, సూపర్వైజర్ వెంకటరమణమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ -
ముగిసిన ఆపదమిత్ర వలంటీర్ల శిక్షణ
నల్లగొండ : జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆపదమిత్ర వలంటీర్లకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. 12 రోజులపాటు నిర్వహించిన శిక్షణలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, జిల్లా ఫైర్, అటవీ, వైద్య, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మత్స్య శాఖ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపాలు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని రక్షించడం, ప్రధమ చికిత్స, వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై ఆపదమిత్ర వలంటీర్లకు అవగాహన కల్పించామని తెలిపారు. శిక్షణలో భాగంగా వలంటీర్లను రెండు గ్రూపులుగా విభజించి నాలుగు గ్రామాల్లో క్షేత్రస్థాయి సందర్శన చేయించామన్నారు. చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించడంపై పానగల్ ఉదయ సముద్రంలో ఫైర్, మత్స్య శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. అనంతరం వలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్ఐర్డీ ఐటీ ప్రాంతీయ శిక్షణ మేనేజర్ పి.వెంకటేశ్వర్లు, డీపీఎం మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
షీటీమ్స్‌తో .. ఆమెకు భరోసా
నల్లగొండ : మహిళా రక్షణకు షీటీమ్స్ అండగా నిలబడుతున్నాయి. మహిళలకు తెలియకుండానే వారికి భద్రత కల్పిస్తున్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాల్లో షీటీమ్ పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహిస్తూ బాలికలు, మహిళలను వేధించేవారి అటకట్టిస్తున్నాయని చెబుతున్నారు నల్లగొండ షీటీమ్ సీఐ కోట కరుణాకర్. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వం జిల్లాలో షీటీమ్‌లను ఏర్పాటు చేసింది. అమ్మాయిలను ఎవరైనా వెంబడించినా, బెదిరించినా, వేధించినా షీటీమ్ పోలీసులకు లేదా 100 నంబర్‌కు కాల్ చేయాలి. వెంటనే పోలీసులు వచ్చి వారిని పట్టుకుంటారు. పోలీసులకు సమాచారం ఇచ్చే వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. అంతేకాదు టీ సేవ్ యాప్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని.. ఆటో ఎక్కిన వెంటనే సదరు మహిళ ఆటోనెంబర్ను ఆ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే యాప్‌లో ఎమర్జెన్సీ బటన్ నొక్కితే ఆ ఏరియా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం వెళ్లి వెంటనే ఆ పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ప్రస్తుతం నల్లగొండ, మిర్యాలగూడలోనే మహిళా పోలీస్స్టేషన్లు ఉన్నాయి. వాటిని కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అమ్మాయిలను వేధించే 103 మందిని షీటీమ్‌లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులు నమోదు చేశాయి. 149 మందిపై వేధింపుల కేసులు నమోదయ్యాయి. 7 కేసులు ఎఫ్ఐఆర్ అయ్యాయి. 88 మందిపై పిట్టీ కేసులు నమోదయ్యాయి. షీటీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులు, మహిళలకు 485 చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించాం. -
నేడు జాతీయ లోక్ అదాలత్
రామగిరి(నల్లగొండ): జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు తెలిపారు. లోక్ అదాలత్‌లో సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు, సైబర్ క్రైమ్ కేసులు, ఇతర సివిల్ దావాలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, ఇన్సూరెన్సు అధికారులు, రెవెన్యూ అధికారులు, బ్యాంకు అధికారులు సహకరిస్తారని తెలిపారు. -
జగన్మోహినిగా వెలిగి.. ఎదుర్కోలుకు కదిలి
స్వామి, అమ్మవారిని ఊరేగింపుగా ఎదుర్కోలు మండపానికి తోడ్కొని వెళ్తున్న అర్చకులు, అధికారులు.. చిత్రంలో పట్టువస్త్రాలతో కలెక్టర్ దంపతులు, ఈఓ యాదగిరిగుట్ట: యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా కొనసాగుతున్నాయి. కల్యాణోత్సవానికి ముందస్తుగా పెళ్లిచూపుల పర్వం జరుపుకున్న శ్రీస్వామివారు శుక్రవారం ఉదయం జగన్మోహిని రూపం దాల్చారు. రాత్రి అశ్వవాహనంపై ఎదరుర్కోలు జరుపుకున్నారు. ఎదుర్కోలు మహోత్సవం సాగిందిలా.. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఎదుర్కోలు మహోత్సవం శుక్రవారం రాత్రి వేదపండితుల మంత్రోచ్ఛరణలతో వీనులవిందుగా సాగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణలతో అలంకరించిన శ్రీస్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని ముత్యాల పల్లకిపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పురాజగోపురం ఎదుట మాడ వీధిలో స్వామి వారిని పశ్చిమ ముఖంగా, అమ్మవారిని తూర్పుముఖంగా అధిష్టింపజేశారు. ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు శ్రీస్వామి, అమ్మవారి తరఫున విడిపోయి పెద్దలుగా వ్యవహరించారు. ఇరువురి గుణగణాలు, ఆదాయం, వ్యయం, కట్నకానులకపై వివరించారు. అనంతరం తిరుకల్యాణ మహోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు. అంతకుముందు ఉదయం శ్రీలక్ష్మీనరసింహుడు జగన్మోహిని అలంకారంలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో నేడు.. లక్ష్మీసమేత నారసింహుడు శనివారం ఉదయం రామాలంకారంలో హనుమంత సేవపై దర్శనమిస్తారు. రాత్రి 8.30 గంటలకు నుంచి గజవాహన సేవపై ఊరేగింపుగా కల్యాణమండపానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం స్వామి, అమ్మవారి తరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. -
ఆటంకం లేకుండా ఇసుక సరఫరా చేయండి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ : జిల్లాలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రతి మండలానికి ఇసుక రీచ్‌లను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత మండల అధికారి జారీ చేసిన అనుమతి పత్రంతో మాత్రమే ఇసుక రవాణా చేయాలన్నారు. నేడు మంత్రుల రాకనల్లగొండ : జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు శనివారం నల్లగొండకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రులు కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ ఉమ్మడి జిల్లా ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖలపై సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. -
వేలంపాటను అడ్డుకుని..
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో మూకుమ్మడిగా మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా బెల్టుషాపులు నడుస్తుండటంతో వృద్ధులు, యువకులు, పేదలు మద్యానికి బానిసై.. సంపాదించిందల్లా మద్యానికి ఖర్చు చేస్తునారు. అంతే కాకుండా గ్రామంలో బెల్టుషాపుల నిర్వహణ కోసం ఇటీవల వేలం పాట నిర్వహించారు. వేలంపాట వద్దని.. గ్రామంలోని కొంతమంది మహిళలు గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎలాంటి బెల్టుషాపులు నిర్వహించొద్దని, మద్యం విక్రయించొద్దని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. అప్పట్లో సారాపై పోరాటం పాముకుంట గ్రామంలో 2010–11 సమయంలో సారా ఏరులైపారేది. కూలినాలి చేసి వచ్చిన డబ్బంతా తాగుడుకే పోయేది. ఆ సమయంలో కుటుంబ పెద్దలను కోల్పోయి చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో గ్రామానికి చెందిన మహిళలు ఏకమై సారా విక్రయ కేంద్రాలపై దాడిచేసి సామగ్రిని గ్రామం నడిబొడ్డున దహనం చేశారు. నా తర్వాత ప్రభుత్వం సారా విక్రయాన్ని నియంత్రించడంతో ఏడాదిపాటు గ్రామంలో సారా, మధ్యం విక్రయాలు జరగలేదు. -
నల్లగొండ
అక్కడ.. ఇక్కడ కాదు.. ఎక్కడైనా వివక్షే!శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025 సమాజంలో సగభాగమైన మహిళలు మాత్రం ఇంటా బయట ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారు. ఆధునిక సమాజంలో కూడా పురాతన పోకడలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సాక్షి’ ఉమ్మడి జిల్లాలోని ఏడు ముఖ్య పట్టణాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెలుగుచూశాయి. 7 పట్టణాల్లో 18 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న 200 మంది మహిళలపై నిర్వహించగా.. ఇప్పటికీ ఇంట్లో ఆడ మగ వివక్షను ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ ఆడ మగ వివక్ష ఇంట్లో కూడా ఉంది ఫ బయట ప్రదేశాలకన్నా ఆఫీస్, కళాశాలల్లోనే ఎక్కువ ఇబ్బంది – సాక్షి, నెట్వర్క్ -
అసమానతలు అంతరించాలి
మహిళా చైతన్యంలో పత్రికల పాత్ర కీలకంకథనాలు పరిశీలిస్తూ.. సూచనలు చేస్తూ.. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక పేజీలు, కథనాలను జడ్జి బి.దీప్తి పరిశీలించారు. మహిళలపై ప్రత్యేకంగా రూపొందించిన కథనాలను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం కోసం మహిళలు పోరాడిన కథనాలను ప్రశంసించారు. పత్రికలు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేలా.. చైతన్యం కలిగించే కథనాలు అందించాలన్నారు. బాధిత మహిళలకు అండగా ఉండాలని సూచించారు. న్యాయ సహాయం అందిస్తాం.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బాధితులకు న్యాయ సహాయం అందిస్తున్నామని జడ్జి దీప్తి తెలిపారు. అందరికీ సమాన న్యాయం దక్కాలనేది తమ సంస్థ లక్ష్యమన్నారు. న్యాయపరంగా వెనుకబడిన వారికి అండగా న్యాయ సేవాధికార సంస్థ చేయూతనిస్తోందని.. ఇప్పటికే అనేక న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చామన్నారు. ఇరువర్గాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించి సత్వర న్యాయం అందేలా సహకరిస్తామన్నారు. న్యాయ సహాయం పొందాలనుకునే వారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాని సూచించారు. బాధిత మహిళలకు అండగా ఉండాలి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.దీప్తివివక్షను రూపుమాపితేనే అద్భుత సమాజం మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా విధులు రామగిరి(నల్లగొండ) : సమాజంలో కొన్నిచోట్ల ఇంకా లింగ వివక్ష కనిపిస్తోందని అది అంతరించాలని నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి పేర్కొన్నారు. మహిళా చైతన్యంలో పత్రికల పాత్ర కీలకమ న్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ యూని ట్ కార్యాలయంలో ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ ప్రత్యేక కథనాలపై చర్చించి పలు సూచనలు చేశారు. సమాన అవకాశాలు ఉండాలి మహిళలు సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడాలని జడ్జి దీప్తి సూచించారు. మహిళా సాధికారత జరిగినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగిపోతాయన్నారు. మహిళలను తక్కువ చేసి చూడకుండా సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో భాగస్వామ్యం కల్పిస్తే వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలగుతారని పేర్కొన్నారు. బాధ్యతల విషయంలో మహిళలను వేరు చేసి చూడొద్దన్నారు. ఉద్యోగం చేసే మహిళలను కొందరు కుటుంబాన్ని, ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావని అడుగుతారని.. అదే ప్రశ్న మగవారిని మాత్రం అడగరని ఇది సరి కాదన్నారు. సమాజంలో వివక్షను రూపుమాపితేనే మహిళలు స్వేచ్ఛాయుత ప్రయాణానికి అడుగులు పడతాయన్నారు. సమాజంలో అంతరాలు రూపుమాపితేనే అద్భుత సమాజం ఆవిష్కృతమవుతుందన్నారు. -
మద్యంపై.. మహిళల సమరం
బెల్టు షాపులు బంద్ చేయించిన అతివలుఎక్కడమ్మా నువ్వు లేనిది.. ఏమిటీ నువ్వు చెయ్యలేనిదీ. మహిళలు ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదు. గ్రామాల్లో మద్యం మహమ్మారికి యువత బానిస కావడం, కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవడంతో ఆ ఊళ్లలో మహిళలు కొంగు నడుముకు చుట్టారు. మద్యం మహమ్మారిని పారదోలాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో నిర్వహించే బెల్టు దుకాణాలపై సమరం సాగించారు. మద్యం అమ్మకాలను అడ్డుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంట మహిళలు. – చిట్యాల, రాజాపేటనెలరోజులుగా మద్యం అమ్మడం లేదు మా గ్రామంలో పదిహేనుకు పైగా బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మేవారు. గ్రామంలోని యువతతో పాటు పెద్దవారు సైతం మద్యానికి బానిసై ఆర్థికంగా.. ఆరోగ్య పరంగా నష్టపోతున్నారు. ఇటీవల మద్యం మత్తులో ఓ యువకుడు మృతిచెందాడు. వెంటనే గ్రామంలో బెల్టు దుకాణాలను అరికట్టాలని మహిళలమంతా కలిసి ర్యాలీ నిర్వహించాం. మద్యం అమ్మితే జరిమానా విధించాలని తీర్మానించాం. నెల రోజులుగా గ్రామంలోని బెల్టు దుకాణాలను తొలగించారు. మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. – బొంగు శ్రీలత, మహిళా సంఘం ప్రధానకార్యదర్శి, ఏపూరు ఫ గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరిపితే జరిమానా విధించాలని నిర్ణయం ఫ ఆదర్శంగా నిలుస్తున్న చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంటచిట్యాల మండలం ఏపూరు గ్రామం జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 1950 మందికిపైగా జనాభా ఉంది. ఈ గ్రామానికి చెందిన పురుషులు ఎక్కువగా డ్రైవర్లుగా, కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో పదిహేనుకుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల బ్రాండ్లకు చెందిన మద్యం లభిస్తుంది. దీంతో ఆ గ్రామంలోని యువకులతో పాటు చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేసే వందలాది మంది కార్మికులు సైతం ఇక్కడ విచ్చలవిడిగా మద్యం సేవిస్తుంటారు. ఆ గ్రామానికి చెందిన పలువురు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొందరు చేసిన పనిచేసిన డబ్బులను మద్యానికి ఖర్చు చేస్తూ కుటుంబాలను పట్టించుకోవటం లేదు. దీంతో ఆ గ్రామ మహిళలంతా ఏకమై మద్యం మహమ్మారిని పారదోలాలని నడుం బిగించారు. బెల్టు దుకాణాలు మూసివేయాలని హెచ్చరిక.. ఏపూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు (20) ఫిబ్రవరి 12న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ యువకుడి మృతికి మద్యం మహమ్మారే కారణమని భావించారు. ఆ యువకుడు మృతి చెందిన రోజే గ్రామంలో మద్యపాన నిషేధానికి నడుం బిగించారు. ఆ గ్రామంలోని మహిళ సంఘం అధ్యక్షురాలు వలిగొండ సునీత, ప్రధానకార్యదర్శి బొంగు శ్రీలత, వీబీకే బండ అనురాధ ఆధ్వర్యంలో మహిళలంతా ఏకమై బెల్టు దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద సమావేశమై నిరసన తెలిపారు. గ్రామంలో బెల్టు దుకాణాల వద్దకు వెళ్లి మద్యం అమ్మొదని హెచ్చరించారు. గ్రామంలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే రూ.లక్ష, మద్యం తాగిన వారికి రూ.20 వేలు జరిమానా.. మద్యం అమ్మినవారి సమాచారం అందిస్తే రూ.10 వేల ప్రోత్సాహకం అందజేస్తామని తీర్మానించారు. ఆ రోజు నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. -
అతివ.. అలుపెరుగక
నేటి సమాజంలోని మహిళలు అన్నిరంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. కుటుంబాల పోషణకు వివిధ వృత్తుల్లో కొందరు, వ్యాపార రంగంలో మరికొందరు దూసుకెళ్తున్నారు. ఇంకొందరు తమ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతుండగా చాలా మంది మహిళలు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలపై ప్రత్యేక కథనాలు. పురుషులతో సమానంగా కష్టపడుతున్న మహిళలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం హుజూర్నగర్: పురుషులకు దీటుగా ఆటో నడపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ శభాష్ అనిపించుకుంటోంది యడ్ల శ్రీదేవి. హుజూర్నగర్ పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన బొల్లెద్దు రాణిమ్మ–సాయిలుది సాధారణ కుటుంబం. సాయిలు ఆటో నడుపుతూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. అతని పెద్ద కూతురు శ్రీదేవికి ఖమ్మంకు చెందిన యడ్ల వీరభద్రంతో పాతికేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కూతురు, కొడుకు ఉండగా కూతురు వివాహం చేసి అత్తవారింటికి పంపారు. ఆ తర్వాత భార్యభర్తలు విడిపోవడంతో శ్రీదేవి తన తల్లిగారి ఊరైన గోవిందాపురం వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. చిన్నతనంలో తన తండ్రి వద్ద ఆటో తోలడం నేర్చుకున్న శ్రీదేవి కుటుంబ పోషణ కోసం తాను కూడా ఆటో నడపాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఒక ఆటో కొనుక్కుని ఆటో డ్రైవర్‌గా మారింది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు హుజూర్నగర్ లోకల్లో ఆటో నడుపుతుంది. చుట్టుపక్కల గ్రామాలకు, పట్టణాలకు కిరాయిలకు కూడా వెళుతోంది. ఆటో డ్రైవర్‌గా రోజుకు సుమారు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తోంది. వచ్చిన కిరాయి డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకుంటూనే తన తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. తన ఒక్కగానొక్క కొడుకు వేణగోపాల్ను ఖమ్మంలో డిగ్రీ చదివిస్తోంది. మహిళలు చిత్తశుద్ధితితో ఏ పని చేసినా విజయం సాధించవచ్చని శ్రీదేవి అంటోంది. -
పర్యావరణ హితం.. రమణి అభిమతం
ఫ బయోడీగ్రేడబుల్ బ్యాగులు తయారు చేస్తున్న మహిళా పారిశ్రామికవేత్త ఫ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో పరిశ్రమతో పలువురికి ఉపాధిచౌటుప్పల్ రూరల్: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా భూమిలో త్వరగా కలిసిపోయే బ్యాగులు తయారు చేయాలనే సంకల్పం ఆమెను పారిశ్రామికవేత్తను చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా సంతమంగుళూరు మండలం మామిళ్లపల్లికి చెందిన శ్రీరామనేని రమణి ఎమ్మెస్సీ వరకు చదివింది. రమణి భర్త డాక్టర్ ప్రసాద్ సౌదీ అరేబియాలోని రియాద్‌లో ప్రభుత్వ వైద్యుడిగా విధులు నిర్వహించడంతో ఆమె కూడా 13 ఏళ్ల పాటు అక్కడే ఉండి భారత్‌కు తిరిగివచ్చారు. ఇక్కడకు వచ్చిన తర్వాత రమణి భర్తకు కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె తన కిడ్నీ దానం చేసింది. ఆ సమయంలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయోడీగ్రేడబుల్ సంచులు తయారు చేయాలనే ఆలోచన రావడంతో ఆమె డీఆర్డీఓ శాస్త్రవేత్తల్ని కలిసింది. డీఆర్డీఓ శాస్త్రవేత్తలు సూచించిన పరిజ్ఞానంతో బయోడీగ్రేడబుల్ సంచులు తయారు చేయడం ప్రారంభించారు. రెండేళ్ల పాటు కుటీర పరిశ్రమగా నిర్వహించిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో రమణి ఇండసీ్ట్రస్ పేరుతో బయోకంపోస్టికా పరిశ్రమను స్థాపించారు. గతేడాది నవంబర్ నుంచి ఇక్కడ నుంచి బయోడీగ్రేడబుల్ సంచులు, గిఫ్ట్ బ్యాగుల తయారీని ప్రారంభించారు. క్యారీ బ్యాగులు, ఎన్వలప్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ షీట్లు, మల్చింగ్ కవర్లు ఈ పరిశ్రమలో తయారు చేస్తున్నారు. వాటిని సౌదీ అరేబియాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ పరిశ్రమలో రెండు షిఫ్ట్‌ల వారీగా 35మందికి ఉపాధి కల్పిస్తున్నారు. -
చేనేతలో ‘ఆమె’ ఘనత
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన చేనేత కళాకారిణి ఎన్నం మాధవి చేనేత రంగంలో అనేక ప్రయోగాలు చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె తన భర్త ఎన్నం శివకుమార్ సహకారంతో కొర(లైట్ గోధుమరంగు), లైట్ పింక్, టర్కిష్ బ్లూ, గ్రే, లైట్ బ్రౌన్ రంగులతో మర్తాస్ ఫుల్ డిజైన్‌తో కూడిన వస్త్రాన్ని ఆవిష్కరించింది. దీంతో గతేడాది జాతీయ చేనేత దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరించింది. ఇటీవల ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో ఆమె తెలంగాణ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. గత నెల ఢిల్లీలోని సూరజ్‌కుండ్ మేళాలో ఆమె పాల్గొని పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ఎగ్జిబిషన్, అదేవిధంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొని చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. పోచంపల్లి పట్టణ కేంద్రంలో శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ యూనిట్‌ను స్థాపించి సిల్క్ దారం నుంచి వస్త్రం తయారీ వరకు అన్నీ ఒకే దగ్గర తయారు చేయిస్తోంది. ఈ పరిశ్రమ ద్వారా 50 మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాక శ్రీరంజ్ వీవ్స్ పేరిట షాపు నిర్వహిస్తూ చేనేత వస్త్రాలను మార్కెటింగ్ కూడా చేస్తోంది. 2023 డిసెంబర్ 20న పోచంపల్లికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీరంజన్ సిల్క్ యూనిట్‌ను సందర్శించారు. అక్కడ తయారైన చేనేత వస్త్రాలను చూసి మాధవిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాధవిని ప్రత్యేకంగా అభినందించారు. ఫ సిల్క్ ఇండసీ్ట్ర యూనిట్ స్థాపించి 50 మందికి ఉపాధి కల్పిస్తున్న పోచంపల్లి వాసి ఎన్నం మాధవి -
ఆమె కోసం ‘విన్నపం’
ఫ మహిళలకు అండగా నిలుస్తున్న గోపాలపురం వాసి లీలావతి ఫ ఆమె పోరాటం ఫలితంగా విద్యార్థినులకు హెల్త్ కిట్లు హుజూర్నగర్ : ఆమె ఆరోతరగతి చదువుతోంది. ఆ సమయంలో వాళ్ల నాన్న సర్పంచ్‌గా పనిచేస్తున్నారు. రోజూ వచ్చిపోయేవారితో ఇల్లంతా సందడిగా ఉండేది. ఊరి ప్రజలు ఇంటికి వచ్చి నాన్నతో సమస్యలు చెప్పుకోవడం వాటిని ఆయన తీర్చడం చూస్తూ ఉండేది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ బాలికకు ఓ ఆలోచన తట్టింది. నాన్నలాగా ప్రజల కోసం తానూ ఏదో ఒకటి చేయాలని తలచింది. ఆ ఆలోచన నుంచి పురుడుపోసుకుందే.. ‘విన్నపం ఒక పోరాటం’ అనే స్వచ్ఛంద సంస్థ. విద్యార్థినులు, మహిళల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దీనిని ఏర్పాటు చేసి ముందుకుసాగుతున్నారు చీకూరి లీలావతి. తొమ్మిదో తరగతిలోనే..హుజూర్నగర్ మండల పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చీకూరి తిరుపతయ్య కూతురు లీలావతి ఎంఏ, బీఈడీ పూర్తి చేసి ప్రస్తుతం ఎంపీఏ (మాస్టర్ ఆఫ్ ఫర్మామింగ్ ఆర్ట్స్) చేస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ‘పోరాటం ఒక విన్నపం’ అనే స్వచ్ఛంద సంస్థను ఆమె ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే గోపాలపురం గ్రామంలో రక్తదాన శిబిరం, వైద్య శిబిరాలు వంటి సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే వారు. ఆ తర్వాత అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపడానికి స్వగ్రామంలో వేసవిలో కరాటేలో శిక్షణ ఇప్పించేవారు. ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కొనేలా తెలియ జెప్పడం, బాల్య వివాహలు నిర్మూలించడం, వారి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేశారు. పదేళ్ల క్రితం.. విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ ఇవాలని సంస్థ తరఫున పదేళ్ల క్రితం సీఎంకు లేఖలు రాశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. దీంతో అప్పటి ప్రభుత్వం హైస్కూల్ విద్యార్థినులకు హెల్త్ కిట్లు ఇవ్వడం ఆరంభించింది. అంతేకాకుండా ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే విద్య లాంటివి సబ్జెక్టుగా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. విన్నపానికి అసెంబ్లీలో చర్చ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఒంటరి మహిళ, వితంతు పింఛన్ పేర్లను తొలగించి వాటి స్థానంలో మహిళల్లో ఆత్మస్థైర్యం ప్రతిబింబించేలా.. మహిళా శక్తి పింఛన్లు అని పేరు మార్చాలని తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. ఆర్గానిక్స్ ప్యాడ్స్ ఇవ్వాలని పోరాటం.. ప్రస్తుతం రేషన్ దుకాణాలు, స్కూళ్లు, బస్టాండ్లలో మహిళలకు ఆర్గానిక్ ప్యాడ్స్ ఉచితంగా అందజేయాలనేది విన్నపం ఒక పోరాటం సంస్థ డిమాండ్ చేస్తోంది. ఆర్గానిక్ ప్యాడ్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమలను ప్రతీ మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని వాటిని మహిళలకు కేటాయించాలని ఆమె కోరుతున్నారు. ఇందుకోసం తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చీకూరి లీలావతి చెబుతున్నారు. -
జాతీయ స్థాయిలో ఊరి పేరు నిలబెట్టింది
ఆత్మకూరు(ఎం): ఉన్నత చదువులు చదివిన ఆ మహిళ మారుమూల గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై ఆ గ్రామ పేరును దేశస్థాయిలో నిలబెట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి 2018 నుంచి 2024 ఫిబ్రవరి వరకు గనగాని మాధవి సర్పంచ్‌గా కొనసాగారు. డిగ్రీ, డీఎడ్ పూర్తిచేసిన మాధవి ఉన్నత చదువులు చదివే అవకాశం ఉన్నప్పటికీ సర్పంచ్‌గా అవకాశం రావడంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఇంటింటికి చెత్త సేకరణతో పాటు గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రతి వీధిలో మొక్కలు నాటే కార్యక్రమం, నిరుపేదలకు ఆర్థికసాయం అందజేయడం వంటి పనులు చేపట్టింది. గనగాని మాధవి చేసిన కృషి ఫలించి 2021లో రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపల్లిని ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక చేసింది. అప్పట్లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ చేతుల మీదుగా మాధవి అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో సావిత్రిబాయి పూలే అవార్డును సైతం 2022లో ఆమె అందుకున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పోతిరెడ్డిపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దడంతో గనగాని మాధవి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన ఉత్తమ సర్పంచ్‌లతో కలిసి హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో పర్యటించారు. గ్రామాభివృద్ధిలో తన భర్త, గ్రామస్తుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ఫ పోతిరెడ్డిపల్లి రూపురేఖలు మార్చిన మాజీ మహిళా సర్పంచ్ -
ఆడపిల్లకు ప్రోత్సాహకాలు
దేవరకొండ : దేవరకొండ మండలం మైనంపల్లికి చెందిన కొర్ర రాంసింగ్ – గౌతమి దంపతులు ఆడబిడ్డలంటే ఎంతో మమకారం. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో గతంలో ఆడశిశువు జన్మిస్తే భారంగా భావించిన కొన్ని గిరిజన కుటుంబాల పరిస్థితిని కళ్లారా చూశారు. ఆడపిల్లను భారంగా భావించొద్దని.. ఆడపిల్లను ఇంటికి మహాలక్ష్మిలా భావించాలని ఎందరికో అవగాహన కల్పించారు. చివరికి ఆడపిల్ల పుట్టినా, ఆడపిల్ల వివాహం చేసినా ఆర్థిక సాయం చేయాలని తలిచి గ్రామంలో రామన్న కల్యాణ కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడవుగా 2020లో ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మొదట్లో రూ.1,016తో ప్రారంభించిన రామన్న కల్యాణ కానుకను మరుసటి సంవత్సరం నుంచి రూ.2,016 పెంచారు. ఐదేళ్ల నుంచి గ్రామంలో ఆడబిడ్డల వివాహానికి రూ.2,016, ఆడపిల్ల జన్మిస్తే వారి కుటుంబానికి రూ.2,016 అందిస్తున్నారు. దీంతో ఆ దంపతులను పలువురు అభినందిస్తున్నారు. ఫ ఆడపిల్ల పుట్టినా, వివాహమైనా రూ.2,016 నగదు అందజేస్తున్న రాంసింగ్ దంపతులు -
వ్యవసాయంలో మేటి..
కట్టంగూర్ : కట్టంగూర్ మండలంలోని బొల్లేపల్లి గ్రామానికి చెందిన బండ సంజాత వ్యవసాయంలో రాణిస్తూ ఔరా అనిపిస్తోంది. 1986లో బండ రమేష్‌రెడ్డితో వివాహమైన నాటి నుంచి సంజాత భర్త సలహాలు సూచనలతో వ్యవసాయం చేస్తోంది. తమకున్న 23 ఎకరాల్లో 8 ఎకరాలు వరి, 15 ఎకరాల్లో మామిడి తోటను సేద్యం చేశారు. వ్యవసాయం క్షేత్రంలో ఆవులతో ఫాం ఏర్పాటు చేశారు. వ్యవసాయ పనుల్లో పురుషులకు దీటుగా అన్నీ తానై చేస్తారు. ట్రాక్టర్ నడుపుతూ పొలం దున్నడం వంటి కష్టమైన పనులను కూడా సులువుగా చేస్తోంది. తాను 10వ తరగతి వరకే చదువుకున్నా.. పిల్లలు ఉన్నత చదువులు చదివించింది. ప్రస్తుతం ఇద్దరు కుమారులు జర్మనీలో ప్రొఫెసర్లు స్థిరపడగా.. ఓ కుమారుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురు కుమారులు స్థిరపడ్డా ఆమె వ్యవసాయాన్ని వీడకుండా పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. -
ఖండాంతరాలు దాటిన ‘కీర్తి’
ఫ ఫుడ్ ప్రాసెసింగ్‌లో రాణిస్తున్న తొండ గ్రామవాసి ఓడపల్లి కీర్తిప్రియ ఫ విదేశాలకు కూరగాయల ఒరుగులు మార్కెటింగ్ చేస్తున్న యువతి తిరుమలగిరి (తుంగతుర్తి): ఉన్నత చదువులు చదివిన ఆ యువతి పెద్ద కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని కాదని సొంత ఊరిలోనే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏర్పాటు చేసింది. స్థానికంగా దొరికే కూరగాయలతో తయారు చేసిన (ఒరుగులు, పొడులు) ఉత్పత్తులను అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేస్తూ యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన ఓడపల్లి కీర్తిప్రియ. తొండ గ్రామానికి చెందిన ఓడపల్లి వెంకన్న, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుర్లు. వీరిలో రెండవ కూతురు కీర్తిప్రియ బిట్స్‌పిలానిలో బీఫార్మసి, ఐఏఎం కోల్‌కతా నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకుంది. పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. సొంతూరుకు వచ్చినప్పుడు పంటలకు గిట్టుబాటు ధర రాక కొన్ని సమయాల్లో ఉత్పత్తులను వృథాగా పడేస్తూ నష్టపోతున్న రైతుల కష్టాలు ఆమెను కదిలించాయి. దీంతో కూరగాయలు పాడైపోకుండా వాటితో ఒరుగులు, పొడులు తయారీ చేసి విక్రయించే వ్యాపారానికి గ్రామం నుంచే శ్రీకారం చుట్టింది. రూ.3 కోట్లతో ఎకరం స్థలంలో గ్రామంలోనే నేచురల్ ఫీల్డ్స్ ఇండస్ట్రీస్ పేరుతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీలో సోలార్ డ్రయ్యర్‌ను ఏర్పాటు చేసి కొందరు మహిళలతో కూరగాయలను ముక్కలుగా కోయించి వాటిని ఎండబెట్టి పొడులుగా మార్చి ప్యాకింగ్ చేసి ఖో(కేఓహెచ్) పేరుతో మార్కెటింగ్ చేస్తోంది. అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి.. రసాయనాల ప్రభావం లేకుండా సేంద్రియ విధానంతో స్థానిక రైతులతో కూరగాయలు, పండ్లను పండించి వాటిని ఇక్కడే ప్రాసెస్ చేసి వ్యాపారం చేస్తోంది. రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, క్యారట్, బీట్ రూట్, ఉల్లిగడ్డ, బెండకాయ, పచ్చి మిర్చి, టమాట, పాలకూర, గోంగూర, మునగ, అరటి పువ్వు, సపోట, మామిడి తదితర పండ్లను ఎండబెట్టి నాణ్యతలో రాజీపడకుండా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను తయారు చేయిస్తోంది. ఈ ఉత్పత్తుల్లో పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఆర్డర్లు పెరిగాయి. మనదేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు అమెరికా, యూరప్ దేశాలకు ఫుడ్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఏడాదికి రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు టర్నోవర్ సాధిస్తోంది. మహిళలకు ఉపాధి.. సొంత గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో 20 మంది మహిళలకు రోజూ ఉపాధి కల్పిస్తోంది కీర్తిప్రియ. వీరు మూడు షిప్టుల్లో పనిచేస్తూ కూరగాయల పొడులు, ఒరుగులను ప్యాకింగ్ చేసి ఎగుమతికి సిద్ధం చేస్తుంటారు. ఏడాది పొడవునా స్థానికంగా ఉపాధి లభిస్తుండడంతో ఎంతో ఆనందంగా పని చేసుకుంటున్నామని మహిళలు అంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కంపెనీ ఏర్పాటు ఉన్నత చదువులు చదివినప్పకీ ఎక్కడో ఉద్యోగం చేయకుండా మా సొంత గ్రామంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏర్పాటు చేసి కొందరి మహిళలకు ఉపాధి కల్పిస్తూ వ్యాపారరంగంలో రాణిస్తువడం చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ కంపెనీని నడిపిస్తున్నాను. – ఓడపల్లి కీర్తిప్రియ -
కల్తీ లేని ఆహారం అందించాలి
నల్లగొండ టూటౌన్: జిల్లా ప్రజలకు కల్తీ లేని ఆహారం అందించేలా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహారంలో కల్తీని గుర్తించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనం ఉపయోగ పడుతుందన్నారు. దీనిద్వారా రహదారుల పక్కన ఉన్న హోటల్స్, చిరు వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాలలో కల్తీ ఉందే లేదో పరీక్షలు చేయవచ్చన్నారు. ఆహార పదార్థాలు అమ్మే వారు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్మోతిర్మయి మాట్లాడుతూ ఈ వాహనం ద్వారా తక్షణ పరీక్షలు నిర్వహించి ఆహార నాణ్యతను నిర్ధారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ పి.స్వాతి, ఇతర అధికారులు శివశంకర్‌రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎంజీ యూనివర్సిటీ సందర్శన నీట్ పరీక్ష నిర్వహణ కోసం గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీని కలెక్టర్ ఇలా త్రిపాఠి..ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి సందర్శించారు. నీట్ పరీక్ష నిర్వహించడానికి యూనివర్సిటీలో సామర్థ్యం, తగిన సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అరుణప్రియ యూనివర్సిటీల ఉన్న సౌకర్యాలను కలెక్టర్‌కు వివరించారు. వారి వెంట నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, ఎంజీయూ అధికారులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఇంటర్ పరీక్షలకు 12,963 మంది హాజరు
నల్లగొండ: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉద యం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన తెలుగు, హిందీ, అరబిక్, సంస్కృతం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 13,295 మంది విద్యార్థులు హాజ రు కావల్సి ఉండగా 12,963 మంది హాజరయ్యారు. 332 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కేంద్రాలను డీఐఈఓ దస్రునాయక్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. కాగా బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు తెలుగు, హిందీ, అరబిక్, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరిగాయి. -
పరీక్షల నిర్వహణలో పొరపాట్లు జరగొద్దు
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి తనిఖీ చేశారు. కళాశాలకు కేటాయించిన విద్యార్థులు, గురువారం పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు రాసే విద్యార్థిని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇంటర్ విద్యాశాఖ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులకు సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఉన్నారు. -
గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనారసింహుడు
సింహ వాహనంపై ఊరేగుతున్న నృసింహుడుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతున్నాయి. ఆలయంలో గురువారం ఉదయం నిత్య పూజలు చేపట్టారు. అనంతరం అలంకార సేవను ఆలయ తిరు మాడ వీధిలో ఊరేగించారు. అదేవిధంగా ఉదయం శ్రీనృసింహస్వామి వారిని గోవర్ధనగిరిధారి అలంకర సేవలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో ఆచార్యులు, రుత్వికులు, పారాయణీకులు ప్రబంధ పారాయణం, మూలమంత్ర జపములు, నిత్యారాధనలు కొనసాగించారు. అనంతరం శ్రీస్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు. వేడుకల్లో ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అధికారులు, పారాయణీకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారిని జగన్మోహిని అలంకార సేవలో ఊరేగిస్తారు. రాత్రికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
కేతేపల్లి: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక్ దృష్టి పెట్టిందని జిల్లా రోడ్డు సేఫ్టీ ప్రత్యేకాధికారి పొలిశెట్టి అంజయ్య అన్నారు. కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో జాతీయ రహదారి వెంట నూతనంగా నిర్మిస్తున్న సర్వీస్ రోడ్డు పనులను గురువారం సాయంత్రం ఆయన చౌదరి సంస్థ, కొర్లపహాడ్ టోల్‌ప్లాజా అధికారులతో కలిసి పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ శరత్చంద్ర పవార్ మిషన్ ఆర్ఆర్ఆర్ (రోడ్డు సేఫ్టీ, రూల్స్, రెస్పాన్స్‌బులిటీ) కార్యక్రమం పేరుతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతున్న 109 గ్రామాలను గుర్తించామన్నారు. ప్రత్యేకించి ఇనుపాములలో సర్వీస్ రోడ్డు లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, నేడు సర్వీస్ నిర్మాణంతో ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎస్పీ అమలు చేస్తున్న ఆర్ఆర్ఆర్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట చౌదరి సంస్థ, కొర్లపహాడ్ టోల్‌ప్లాజా అధికారులు నాగకృష్ణ, వరుణ్‌చౌదరి ఉన్నారు. ఫ జిల్లా రోడ్డు సేఫ్టీ ప్రత్యేకాధికారి అంజయ్య -
‘యంగ్ సైంటిస్ట్’కు దరఖాస్తు చేసుకోండి
నల్లగొండ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న యంగ్ సైంటిస్ట్–2025 (యువ విజ్ఞాన కార్యక్రమం)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ ఏడాది జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతూ ఉండాలని, 8వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 23లోగా దరఖాస్తులు ఆన్లైన్ jigyasa.iirs.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు సెల్ : 9848378845 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
10న అప్రెంటిస్‌షిప్ మేళా
నల్లగొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్ల అభ్యర్థులకు ఈ నెల 10న ఉదయం 10 గంటలకు నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐ (పాత) కళాశాలలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నర్సింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు apprenticeshipindia.gov. inలో వారి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థలో ఉద్యోగాల భర్తీకి సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఖాళీగా ఉన్న టైపిస్ట్/అసిస్టెంట్(2) పోస్టులకు మార్చి 7 నుంచి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు nalgonda.dcourts. gov.in వెబ్సైట్ నందు సంప్రదించాలని కోరారు. 15 నుంచి ఒక్కపూట బడులునల్లగొండ: ఈ నెల 15 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఒక్కపూట నిర్వహించాలని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ఆయా పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని పేర్కొన్నారు. పాఠశాలల చివరి పని రోజైన ఏప్రిల్ 23 వరకు ఒక పూట బడులు కొనసాగించాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి మర్రిగూడ: విద్యార్థులు చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ పి.భిక్షపతిరావు అన్నారు. గురువారం మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సామ్యనాయక్, ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి, ఎంఈఓ బిట్టు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు కళా శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తులునల్గొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరం ఉపకార వేతనాలకు ఈ నెల 15లోగా telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు వారి బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్‌తో సీడింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యాలు ఈ సమాచారం విద్యార్థులకు తెలుపాలని కోరారు. ఙ నేడు ఎస్ఆర్టీఆర్ఐలో జాబ్‌మేళా భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్ఆర్టీఆర్ఐ)లో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీ్త్రలకు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల, కొంగర కలాన్‌లోని ప్రముఖ మొబైల్ కంపెనీల్లో, పురుషులకు ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ప్రముఖ ఏసీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పదో తరగతి, ఆపై చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న సీ్త్ర, పురుషులకు రూ.14,500 నుంచి రూ.16,500 జీతం, ఉచిత బస్సు, భోజన సదుపాయం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ : 994846111, 7540084221 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
మలి సంధ్యలో మనోవేదన!
కడుపున పుట్టిన వారి మనస్సు కఠినమైన వేళ.. ఆదరణకు నోచుకోక తల్లడిల్లుతున్న వృద్ధులు జీవిత చరమాంకంలో దుర్భర జీవితం ఆదుకోవాలంటూ అధికారులకు విన్నపాలు అండగా నిలుస్తున్న అధికార యంత్రాంగం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఇలా అనేక మంది వృద్ధులు తమ జీవితమంతా పిల్లల కోసమే ధారబోశారు.. వారి కడుపు నింపేందుకు తమ కడుపు మాడ్చుకున్నారు. అన్నీ ఒడిదొడుకులు దాటుకొని జీవిత చరమాంకానికి చేరుకున్నారు. కళ్లల్లో పెట్టి చూసుకుంటారనుకున్న కుటుంబ సభ్యులు కాదుపొమ్మంటుండటంతో తల్లడిల్లిపోతున్నారు. పిల్లల ను ప్రయోజకులను చేయాలని రాత్రనక, పగలనక అహర్నిశలు కష్టపడి, పైసకు పది ముడులేసి పిల్లలను పెంచి పెద్ద చేస్తే, ఎదిగిన ఆ బిడ్డలు ఆస్తులను లాగేసుకొని రోడ్డున పడేస్తున్నారు. వారి సంరక్షణను పట్టించుకోవడం లేదు. దాంతో కొందరు రోడ్డుపై గుళ్లు, గోపురాల వద్ద బిక్షాటన చేస్తూ జీవిస్తుండగా కొందరు వృద్ధాశ్రమాల్లో చేరాల్సి వస్తోంది. మరికొందరైతే ఆస్తులు బలవంతంగా రాయించుకుని ఆ తరువాత ఇబ్బందులకు గురి చేస్తుండటంతో ఆ వృద్ధులు అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఆదుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు. ఆదుకునేందుకు నడుంబిగించిన యంత్రాంగం అలాంటి తల్లిదండ్రులను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రులు, వయో వృద్దుల పోషణ, సంక్షేమ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు. వాటికి చైర్మన్లుగా ఆర్డీవోలు ఉండగా, జిల్లా స్థాయిలో చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. బాధితులైన అలాంటి తల్లిదండ్రులు,వృద్ధులకు దీని ద్వారా రక్షణ, మెయిన్‌టెయిన్స్ ఇప్పించే చర్యలు చేపడుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు. దీంతో వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా భూమి మాకు కావాలని ఫిర్యాదు జిల్లాలో 189 మంది వృద్ధులు.. తమ భూమిని తమ పిల్లల పేరున పట్టా చేశామని, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. తమ భూమి తమకు ఇప్పించాలని కలెక్టర్‌కు విన్నవించుకుంటున్నారు. ఇలాంటి కేసులు గత ఏడాది 189 నమోదు కాగా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా కేసులను పరిశీలించి 23 మంది వృద్ధులకు వయో వృద్ధుల రక్షణ చట్టం–2007 కింద తిరిగి వారి పేరున పట్టా చేయించడం జరిగింది. తల్లిదండ్రులను సంపాదించే వస్తువుగా చూస్తున్నారు తల్లిదండ్రులను ప్రస్తుతం కొందరు పిల్లలు సంపాదించే వస్తువుగా చూస్తున్నారు. వారి ఆస్తులను తీసుకుంటున్నారు కానీ వారిని పట్టించుకోవడం లేదు. చివరి దశలో వారికి కన్నీరే మిగిల్చుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మొదట నుంచి సామాజిక బాధ్యత నేర్పించాలి. పెద్దల బాగో గులను పట్టించుకోవడం తెలియజేయాలి. – కృష్ణవేణి, మహిళా సంక్షేమ శాఖ జిల్లా అధికారి పెరుగుతున్న బాధితులు.. పిల్లలు ఆదుకోవడం లేదంటూ అధికారులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గత ఏడాది అలాంటి 487 కేసులు నమోదయ్యాయి. పిల్లలు ఆస్తులు తీసుకుని అన్నం పెట్టడం లేదని వారంతా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. వాటిలో 369 కేసులను అధికారులు పరిష్కరించారు. కొందరు తల్లిదండ్రులు కేసులు పెట్టేందుకు ఇష్టపడక వృద్దాశ్రమాల్లో ఉంటున్నారు. జిల్లాలో 12 వృద్దాశ్రమాలు ఉంటే అందులో మూడు మాత్రమే ఉచితంగా ఉన్నాయి. మిగిలినవాటిల్లో వారి స్థోమతను బట్టి డబ్బులు కట్టాల్సి వస్తోంది. వృద్ధుల కోసం అధికారులు రెస్క్యూ వాహనం ఏర్పాటు చేశారు. పిల్లల ఆదరణకు నోచుకోని వారు 14567 టోల్‌ప్రీ నెంబర్‌కు పోన్ చేస్తే ఆ తల్లిదండ్రులను తీసుకొచ్చి రక్షణ కల్పిస్తున్నారు. -
మండుతున్న భానుడు
ఐదు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఫ మధ్యాహ్నం వేళ గడపదాటని ప్రజలు ఫ నిర్మానుష్యంగా కనిపిస్తున్న ప్రధాన రహదారులు మధ్యాహ్న సమయంలో జనసంచారం లేని నల్లగొండలోని ఎన్జీ కళాశాల చౌరస్తా నల్లగొండ టౌన్: మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 1న గరిష్ట ఉష్ణోగ్రత 34.0, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది. తర్వాత రోజునుంచి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గురువారం చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 36.01 డిగ్రీలు నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 21.6 డిగ్రీలుగా నమోదైంది. ముదురుతున్న ఎండలు ఎండలు ముదురుతుండడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల వరకు వాతావరణం చల్లగా ఉండి 9 గంటల తర్వాత నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పాదచారులు, వాహనదారులు మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. మున్ముందు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత రెండు రోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగినప్పటికి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఉత్తర గాలులు వీస్తున్నాయి. దీనికారణంగా వడగాలులు తగ్గాయి. దీనివల్ల ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఇప్పడే ఇలా ఉంటే.. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత 36.1 డిగ్రీల వరకు ఉంటే మున్ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక, ఏప్రిల్, మే రెండు మాసాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు వేసవిలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అవసరమైతే తప్ప ఉదయం 10 గంటల తర్వాత బయట తిరగవద్దని చెబుతున్నారు. అత్యవసరమైతే గొడుగులు, టోపీలు, కాటన్ దుస్తులు ధరించి బయటకు వెళ్లాలంటున్నారు. ఉష్ణోగ్రతలు ఇలా (డిగ్రీల్లో..) తేది 1 2 3 4 5 6ఉష్ణోగ్రత 34.0 34.5 35 36 36.5 36.1తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేసవిలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారు ఎండలో తిరగొద్దు. శరీరం డీ హైడ్రేషన్ కాకుండా ఎక్కువ నీటిని, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ ద్రావణం తాగాలి. వదులు కాటన్ ధుస్తులు ధరించాలి. ఎండలో తిరిగితే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. వడదెబ్బ బారిన పడితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. – డాక్టర్ ఈశ్వర్, జనరల్ మెడిసిన్, నల్లగొండ -
నల్లగొండ
ఇఫ్తార్ 6–30 (శుక్రవారం సాశ్రీశ్రీ) సహర్ 5–08 (శనివారం ఉశ్రీశ్రీ)అమ్మ భాష తప్పనిసరి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృభాష సబ్జెక్టు (తెలుగు) తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7రూ.2వేల కోట్లకు చేరువలో.. డీసీసీబీ ద్వారా రైతులకు రుణాల పంపిణీ రూ.2వేల కోట్లకు చేరిందని చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025- 8లో -
అమ్మాయే కదా అని వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో పలువురు హనీ ట్రాప్(వలపు వల)లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఏటా వందల మంది హనీ ట్రాప్ బారిన పడుతున్నారు. బ్లాక్‌మెయిలింగ్‌తో డబ్బుల వసూళ్లకు అలవాటుపడిన సైబర్ మోసగాళ్లు అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ చేయిస్తూ బాధితులను బెదిరిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. వీడియో కాల్ రాగానే అనుకోకుండా లిఫ్ట్ చేస్తే, స్క్రీన్ షాట్లు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మంగళవారం రాత్రి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్‌గా ఉన్న అమ్మాయితో వీడియో కాల్ చేయించి నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. ఆయన వెంటనే ఆ వీడియో కాల్ కట్ చేయడంతో అప్పటికే నేరగాళ్లు తీసిన స్క్రీన్‌షాట్‌ను ఎమ్మెల్యేకే పంపించి బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకపోతే పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆ వీడియో పంపిస్తామని బెదిరించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.పరువు పోతుందనే భయంతో..తెలియని ఫోన్ నెంబర్ల నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు అనుకోకుండా లిఫ్ట్ చేసి అనేక మంది తంటాలు పడుతున్నారు. నేరగాళ్లు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, బంధువులు, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించి బాధితుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఈ సంఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేయడం లేదు. ఫిర్యాదు చేస్తే తమ పేరు బయటికి వస్తుందేమోనని, పరువుపోతుందని భయపడి ఫిర్యాదుకు వెనుకాడుతున్నారు. అడిగిన మేరకు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఇలాంటి సంఘటనలు 100 వరకు తమ దృష్టికి వచ్చాయని, అయితే ఫిర్యాదు చేసేందుకు మాత్రం వెనుకాడుతున్నారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. వీడియో ఫోన్ కాల్ రావడంతో అనుకోకుండా లిఫ్ట్ చేసి, అడిగినంత నేరగాళ్లకు ముట్టజెప్పి ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారు ఉన్నారని వెల్లడించారు.అనేక రకాలుగా దోపిడీ..తక్కువ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని ఓవైపు దోచుకుంటున్న సంఘటనలు అనేకం రిపోర్టు అవుతున్నాయి. వాటిపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ పంపించి వాటిని క్లిక్ చేయగానే ఫోన్‌ను హ్యాక్ చేసి, ఖాతాల్లోని డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. వీటికి తోడుగా న్యూడ్‌గా ఉండి వీడియో కాల్స్ చేసి, స్క్రీన్ షాట్లు తీసి, వాటినే బాధితులకు పంపించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి.ప్రజల్లో అవగాహన పెరగాలనే ఫిర్యాదు..సైబర్ నేరాలు, హనీ ట్రాప్, వీడియో కాల్స్ విషయంలో అమాయక ప్రజలు ఇబ్బందుల పాలు కావద్దనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేరస్తుల బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే ఇలాంటి సమస్యలు దూరమవుతాయి.– ఎమ్మెల్యే వీరేశం అప్రమత్తంగా ఉండాలివీడియో కాల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దు. సోషల్ మీడియా అకౌంట్లకు టూ స్టెప్ సెక్యూరిటీ, ప్రొపైల్, అకౌంట్ లాక్ వంటివి పెట్టుకోవాలి. అప్పుడు మీ ఫ్రెండ్స్ లిస్ట్ నేరగాళ్లకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు.–సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ -
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ ప్రభుత్వాసుపత్రి సమీపంలో పట్టపగలే మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాలో బాలుడిని కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ నెల 4న కిడ్నాప్ కాగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.మరో ఘటనలో వైవాహిక జీవితంలో గొడవల కారణంగా మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ ఆచూకీని అర్ధగంటలో కనగల్ పోలీసులు కనిపెట్టారు. నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగజ్యోతి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.జ్యోతి భర్త, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సాయంత్రం కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి పోలీసులను రెండు టీంలుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగజ్యోతి అన్న మొబైల్‌కు కొత్త నంబర్ నుంచి నాగజ్యోతి ఫోన్ చేసి “నేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు, నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నాను’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది.ఈ విషయం ఆమె అన్న వెంటనే కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నంబర్‌ను ట్రేస్ చేసి నాగజ్యోతి హైదరాబాద్‌లో ఉందని నిర్ధారించుకొని హయత్‌నగర్ పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని అరగంటలో కనిపెట్టి ఆమెను క్షేమంగా వారి బంధువులకు హయత్‌నగర్‌లో అప్పగించారు. నాగజ్యోతి బంధువులు కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
10 నుంచి ‘పోరుబాట’
మిర్యాలగూడ అర్బన్: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 10వ తేదీ నుంచి పోరుబాట కార్యక్రమం నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10 తేదీన అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. 15వ తేదీ వరకు అన్ని గ్రామాలు, పట్టణాలలో దోళనలు చేపట్టాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో 24, 25, 26 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని కోరారు. 27న జిల్లా కేంద్రంలో మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతంరెడ్డి, భావండ్ల పాండు, అరుణ, కోడిరెక్క మల్లయ్య, పల్లా భిక్షం, కరిమున్నీషాబేగం, శ్రీను, వెంకన్న, రామారావు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవీపై అవగాహన సదస్సురామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో బుధవారం ఎంజీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో హెచ్ఐవీపై రెడ్‌రిబ్బన్ క్లబ్ పీర్ లీడర్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. లీడర్స్‌కు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి, ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్, రిసోర్స్‌పర్సన్ నరసింహారావు, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్స్ మల్లేశం, సావిత్రి, శివరాణి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కృషినల్లగొండ టౌన్: అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషిచేస్తానని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కేవీ.కృష్ణవేణి అన్నారు. బుధవారం నల్లగొండలోని టీఎన్జీఓ కార్యాలయంలో జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ నామిరెడ్డి నిర్మల, జిల్లా అధ్యక్షురాలు జొన్నలగడ్డ వెంకటరమణ, కార్యదర్శి మజ్జిగపు సునీత, కోశాధికారి పుట్ట సునీత, సీడీపీఓ మమత, అసోసియేషన్ ప్రెసిడెంట్ శశికళ, కుర్షితా బేగం తదితరులు పాల్గొన్నారు. -
గ్లాకోమా పరీక్ష చేయించుకోండి
కనగల్: కంటి వ్యాధుల నిర్ధారణకే కనగల్ మండల కేంద్రంలోని పీహెచ్సీలో గ్లాకోమా(కంట్లో నీటి కాసులు) సెంటర్ ఏర్పాటు చేయించానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం కనగల్‌లోని పీహెచ్సీ నూతన భవనంతోపాటు గ్లాకోమా సెంటర్ మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహీంద్రా యూనివర్శిటీలోని సెంటర్ ఫర్ లైఫ్ సైన్స్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అధ్యయనం చేస్తున్న డాక్టర్ బిపిన్ తనను కలిసి వివరించి ఇక్కడ గ్లాకోమా సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కంటి పరీక్షలకు కావాల్సిన అన్ని పరికరాలను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందించామని, ఇంకేమైనా కావాల్సి ఉంటే అందిస్తామన్నారు. కంటి వ్యాధుల నిర్ధారణకు సంబంధించి జిల్లాలోనే మొదటిసారిగా కనగల్ పీహెచ్సీలో గ్లాకోమా సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 40 ఏళ్లు నిండిన మహిళల్లో కంటిచూపును ప్రభావితం చేసే గ్లాకోమా సమస్య తీవ్రంగా ఉంటుందని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. మరో 30 రోజుల పాటు మండలంలో కంటి పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత జిల్లా మొత్తం చేయాలన్నారు. అవసరమైన వారందరికీ కంటి అద్దాలు కూడా అందిస్తామని తెలిపారు. రోడ్ల అభివృద్ధికి నిధులు కనగల్ నుంచి నాగార్జునసాగర్ హైవే కలిపే విధంగా రూ.15 కోట్లతో రోడ్డుకు టెండర్లు పిలిచామన్నారు. కనగల్ మండలంలోని రోడ్ల అభివృద్ధికి రూ.60 కోట్లు మంజూరు చేశామన్నారు. కనగల్, తిప్పర్తి మండలాలకు జూనియర్ కళాశాలలు మంజూరయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామన్నారు. ఎస్ఎల్బీసీ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ సుపర్ణ, మహేంద్ర, డిప్యూటీ డీఎంహెచ్ఓలు వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, టీజీ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జైపాల్‌రెడ్డి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివశంకర్‌రెడ్డి, కనగల్ పీహెచ్సీ వైద్యాధికారి రామకృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మందడి రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింగ్ సునీత కృష్ణయ్యగౌడ్ పాల్గొన్నారు.ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ కనగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్లాకోమా సెంటర్ ప్రారంభం -
134 మంది కార్యదర్శులకు చార్జి మెమోలు
నల్లగొండ: పంచాయతీ కార్యదర్శులకు సర్వీస్ బ్రేక్ తప్పేలా కనిపించడం లేదు. జిల్లాలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆ శాఖకు చెందిన జిల్లా అధికారి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లారు. గతంలోనే 109 మందికి నోటీసులు జారీ చేసిన పంచాయతీ అధికారి తాజాగా 134 మందికి చార్జి మెమోలు అందజేశారు. అనుమతి లేకుండా నెలల తరబడి.. చార్జి మెమోలు అందుకున్న వారిలో కొందరు మూడు నెలలు, మరికొందరు ఆరు నెలలు, ఇంకొందరు సంవత్సరంన్నర వరకు ఎలాంటి అనుమతి లేకుండా సెలవులపై వెళ్లారు. వారంతా వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వెళ్లారు. తిరిగి విదుల్లో జాయిన్ అయ్యేందుకు రాగా చాలా రోజులు వారిని పెండింగ్‌లో ఉంచారు. అనుమతి లేకుండా వెళ్లినందుకు వారి సెలవుల సర్వీస్ కాలాన్ని కట్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి వారందర్ని గతంలో పనిచేసిన ప్రాంతాల నుంచి 109 మందిని బదిలీ చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శులంతా కలెక్టర్‌ను కలిసి మొర పెట్టుకున్నారు. వీరిని వాస్తవంగా సస్పెండ్ చేయాలి కానీ, మానవతా దృక్పథంతో సెలవు కాలానికి సంబంధించిన సర్వీస్‌ను రద్దు చేసి వేతనాన్ని కట్ చేసేలా ఉత్తర్వులు జారీ చేసి విధుల్లోకి తీసుకున్నారు. అప్పట్లో వారందరికీ నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా చార్జి మెమోలు అందుకున్న వారందరినీ త్వరలో విచారించేదుకు ఆర్డీఓ, ఎంపీడీఓ స్థాయి అధికారులను ఒకరిని నియమించునున్నట్టు తెలిసింది. కార్యదర్శులు నిజంగా ఎలాంటి అనుమతి లేకుండా సెలవులపై నెలల తరబడి వెళ్లారని రుజువైతే వారు విధులకు గైర్హాజరైన కాలానికి సంబంధించి సర్వీస్ వేతనాన్ని కట్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఫ చెప్పకుండా సెలవులపై వెళ్లినందుకు జారీచేసిన డీపీఓ ఫ గతంలోనే 109 మందికి షోకాజ్ నోటీసులు, బదిలీ ఫ గైర్హాజరీల వ్యవహారంపై త్వరలోనే విచారించనున్నట్లు సమాచారం రుజువైతే సెలవు కాలం సర్వీస్ రద్దే.. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైననట్లు విచారణలో తేలితే ఆ కాలానికి సంబంధించి కార్యదర్శులకు సర్వీస్ బ్రేక్ చేస్తాం. దీంతోపాటు వారికి వేతనం కట్ కానుంది. త్వరలోనే విచారణ అధికారిని నియమిస్తాం. – వెంకయ్య, డీపీఓ, నల్లగొండ -
ఆకట్టుకున్న ‘యువ ఉత్సవ్’
రామగిరి(నల్లగొండ): నల్లగొండ నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో విద్యార్థులు, యువతకు సైన్స్మేళా, పెయింటింగ్, వ్యాసరచన, మొబైల్ ఫొటోగ్రఫీ, జానపద నృత్య ప్రదర్శన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మద్దిలేటి ప్రారంభించి మాట్లాడారు. యువతలోని ప్రతిభ వ్యక్తీకరణకు యువ ఉత్సవ్ మంచి వేదిక అని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువజన కేంద్ర జిల్లా అధికారి ప్రవీణ్‌సింగ్, ఎంకే.నాయక్, కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం.సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ జి.అమరావతి, డాక్టర్ కె.శ్రీనివాస్, డాక్టర్ అరవింద, డాక్టర్ కె.సాలయ్య, డాక్టర్ మల్లీశ్వరీ, మామిడి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాలి
కాంగ్రెస్ పాలనలో రైతులకు తప్పని కష్టాలుఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా రైతులు నానా కష్టాలు పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి బుధవారం కేతేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులు సాగుచేసిన పంట పొలాలు కరెంట్, సాగునీరు సక్రమంగా అందక నిలువునా ఎండిపోతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పాడి, పంటలతో సంతోషంగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీడు భూములుగా మార్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తమ పంటలను తామే కాల్చుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 50శాతం మంది రైతులకు కూఆ రూ.2లక్షల రుణమాఫీ అమలు జరగలేదన్నారు. ఎండిపోయిన పొలాలకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నకిరేకల్ ఏఎంసీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బడుగుల శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎ.వెంకన్న, బంటు మహేందర్, కొండ సైదులు, టి.వెంకన్న, జి.సత్యనారాయణగౌడ్, వెంకటేష్, అంజయ్య, మహేష్, పాపయ్య, సైదులు పాల్గొన్నారు. దేవరకొండ, పెద్దవూర: విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం దేవరకొండ మండల పరిధిలోని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, పెద్దవూరలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, గ్రంథాలయాన్ని, పెద్దవూర హాస్టల్లో విద్యార్థులు, సిబ్బంది హాజరు పట్టికలు, వంట గదిని, స్టోర్ రూంలోని సామగ్రిని పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులంతా సమన్వయంతో పనిచేసినప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వాన్ని సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలలో నర్సులను నియమించి సిక్ రూమ్‌లు ఏర్పాటు చేసి అనారోగ్యానికి గురైన విద్యార్థులకు ఎప్పటికప్పుడు ప్రథమ చికిత్స చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. మెనూ అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కలెక్టర్‌తో మాట్లాడి వచ్చే విద్యా సంవత్సరానికి పెద్దవూరలోని బాలుర ఆశ్రమ పాఠశాలను ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు మార్చి, ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను మండల కేంద్రం సెంటర్లో ఉన్న ఆశ్రమ పాఠశాలకు మార్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా చోట్ల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్సీఓ బలరాం, ఏటీడీఓ ఎం.శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ హరిప్రియ, వైస్ ప్రిన్సిపాల్ శ్వేత, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, వార్డెన్లు అహల్యా, కొల్లు బాలకృష్ణ కొర్ర రాంసింగ్, శ్రీనునాయక్ తదితరులు ఉన్నారు. ఫ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి
నల్లగొండ: రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన శ్రీశాంతి కమిట్ఙీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రంజాన్ సందర్భంగా బసీదుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. విలీన గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలని సూచించారు. రంజాన్ రోజు పాలు ఎక్కువగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరగా, డెయిరీ డెవలప్మెంట్కు లేఖ రాస్తామని కలెక్టర్ తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన టోల్ ప్రీ 18004251442 నంబర్‌కు పోన్ చేయాలనిసూచించారు. ఎస్పీ శరత్ చంద్రపవర్ మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని అంతటా పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామన్నారు. పూర్తి బందోబస్తు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ సంస్థల్లోనే నీట్ కేంద్రాల ఏర్పాటు చేయాలి మే 4న నిర్వహించనున్న నీట్ పరీక్షకు ప్రభుత్వ సంస్థల్లోనే సెంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయమై బుధవారం ఆమె కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పట్టణంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను పరిశీలించాలన్నారు. జిల్లా నుంచి సుమారు 2,800 వరకు అభ్యర్థులు నీట్ పరీక్షలు రాసే అవకాశం ఉందన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్చార్జి డీఆర్ఓ అశోక్ రెడ్డి, శాంతి కమిటీ సభ్యులు గోలి మదుసూధన్‌రెడ్డి, ఖాజాగౌస్ మొహిద్దీన్, సలీం, రఫీక్, శౌరయ్య, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు, శాంతి కమిటీ సభ్యులు, నీట్ ప్రవేశ పరీక్ష నోడల్ అధికారి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, జిల్లా డీఐఈఓ దస్రునాయక్, డీఈఓ భిక్షపతి, డీఎస్పీ రమేష్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
బీజేపీపై పోరాటం చేయాలి
రాష్ట్రానికి ప్రఽమాదకరంగా మారబోతున్న బీజేపీపై పోరాడాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరభద్రం అన్నారు. - 8లోఇంటర్ పరీక్షలు ప్రారంభంఫ తొలి రోజు 619 మంది గైర్హాజరు నల్లగొండ: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఫస్టియర్ తెలుగు, హిందీ, అరబిక్, సంస్కృతం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 14,685 మంది పరీక్షలకు హాజరు కావాల్సిఉండగా 14,066 మంది హాజరయ్యారు. 619 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయసంఘటనలు చోటుచేసుకోలేదని డీఐఈఓ దస్రునాయక్ పేర్కొన్నారు. -
‘పెద్దగట్టు’ హుండీ ఆదాయం లెక్కింపు
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి(పెద్దగట్టు) ఆలయ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించారు. పెద్దగట్టు జాతర ఫిభ్రవరి 20వ తేదీన ముగియగా.. ఫిభ్రవరి 21 నుంచి మార్చి 5 వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 13 రోజులకు గాను రూ.5.24 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. భాస్కర్, ఇన్స్పెక్టర్ బి. సుమతి, ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్యయాదవ్, ఈఓ కుశలయ్య, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో వింత జంతువు ప్రత్యక్షంహుజూర్నగర్: హుజూర్‌నగర్‌లో బుధవారం వింత జంతువు ప్రత్యక్షమైంది. పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో నివాసముంటున్న రఫీ ఇంట్లో మామిడి చెట్టుపై నల్లని వింత జంతువు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహారావు వచ్చి ఆ జంతువును పరిశీలించి దానిని సీవీఎట్ క్యాట్‌గా పిలుస్తారని చెప్పారు. ఇది మనుషులకు హాని చేయదని, అడవుల్లోనే రాత్రివేళ ఎక్కువగా సంచరిస్తుందని పేర్కొన్నారు. 200 టేకు చెట్లు దగ్ధంఆత్మకూరు(ఎం): గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో టేకు చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం రాయిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రాయిపల్లి గ్రామానికి చెందిన జెట్ట శ్రీనివాస్ వ్యవసాయ భూమిలో సుమారు 350 టేకు చెట్ల ఉన్నాయి. ఈ టేకు చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 200 చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మోత్కూరు నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. సుమారు రూ.2.50లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు పేర్కొన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
భువనగిరి: మండలంలోని పగిడిపల్లి గ్రామ పరిధిలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పగిడిపల్లి పరిధిలోని పాత కలెక్టరేట్ భవనం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గత వారం రోజులుగా మృతుడు భిక్షాటన చేస్తూ సంచరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, వివరాలు తెలిసిన వారు 8712662472, 8712662733 నంబర్లను సంప్రదించాలని ఎస్ఐ సంతోష్‌కుమార్ సూచించారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య మోత్కూరు: మానసికస్థితి సరిగ్గా లేని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోత్కూరు పట్టణ శివారులో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణ పరిధిలోని అంగడిబజార్‌కు చెందిన బీసు లింగస్వామి(55) మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడికి మానసికస్థితి సరిగ్గా ఉండటంలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన బుధవారం మోత్కూరు పట్టణ శివారులో మోదుగుచెట్టుకు కేబుల్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బీసు సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతినాంపల్లి: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం శివారులో జరిగింది. నాంపల్లి మండల కేంద్రానికి చెందిన పూల రవి(33) మర్రిగూడ మండలం వట్టిపల్లి లో నిమ్మ తోట కౌలుకు తీసుకున్నాడు. బుధవారం రాత్రి తోటలో పని ముగించుకొని తన భార్యతో కలిసి బైక్‌పై నాంపల్లికి వస్తుండగా.. స్వాములవారి లింగోటం శివారులో మూలమలుపు వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు. రవి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం మాల్‌కు తరలించారు. రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండకు తరలించారు. మృతుడికి ఒక కుమారుడు, కుమారై ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంవేములపల్లి: లారీ బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మాడుగులపల్లి మండల కేంద్రం సమీపంలో గల ఐకేపీ కేంద్రం వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామానికి చెందిన వేముల నర్సింహ(36) బైక్‌పై మిర్యాలగూడకు వెళ్తుండగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న తమిళనాడుకు చెందిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహ తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని కార్వాన్కు చెందిన శ్రీవిశ్వాంజనేయ భక్త సమాజం, యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహిళా భజన మండలి, వేల్పుపల్లి శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన మసన చెన్నప్ప ఆధ్వర్యంలో ఉపనిషత్ వైభవంపై ఉపన్యాసం చేశారు. హాలియాకు చెందిన చేబ్రోలు నారాయణదాసు సమక్షంలో సుభద్రా పరిణయం హరికథ గానం చేశారు. స్వరరాగ ఆర్ట్స్ ఆకాడమీ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, మెరుగు రాఘవేంద్రచే తబలా వాయిద్యం చేపట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రముఖ జానపద, సినీ నేపథ్య గాయని తేలు విజయ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమం కొనసాగింది. ఇక పలువులు కళాకారులు కూచిపూడి, భరత నాట్యం, సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. -
సైబర్ నేరాలను ఎదుర్కోవడంపై అవగాహన
నల్లగొండ: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. సైబర్ నేరాలపై నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూంటారని, కొన్నిసార్లు భయభ్రాంతులకు గురిచేస్తూ మన నుంచి డబ్బులు కాజేస్తారని అన్నారు. సైబర్ క్రైంలో డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే సైబర్ 1930కి నంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. సోషల్ మీడియా వాడకం సరైన పద్ధతిలో ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోవద్దన్నారు. ఇంటర్నెట్ అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం మంచిదని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాలు, మోసాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి , నల్లగొండ వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ సైదులు, రియాజ్, మోక్షిత్, ఫారూక్, మెడికల్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ -
వైద్యానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత
కనగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం కనగల్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి మీడియాతో మంత్రి మాట్లాడారు. కనగల్ పీహెచ్సీలో కంటి పరీక్షలు చేసే గ్లూకోమా సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన వారికి గడచిన 15 నెలల్లోనే రూ.1600 కోట్ల ఎల్ఓసీలను అందించామని, పేద ప్రజలు వైద్యం కోసం వస్తే 24 గంటలు ఎల్ఓసీలను అందజేస్తున్నామని అన్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రులకు ఎల్ఓసీ ఇచ్చే బదులుగా ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అన్నిరకాల సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. హైదరాబాదులో 4 టిమ్స్ హాస్పిటళ్లను ఆర్అండ్బీ ద్వారా నిర్మిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.2600 కోట్లతో హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, పాత భవనం అలాగే కొనసాగుతుందని తెలిపారు. వచ్చేవారం దేవరకొండ నియోజకవర్గంలో గ్లూకోమా కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. నల్లగొండ ఆస్పత్రిలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇతర ప్రాంతాలలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న 59 మంది డాక్టర్లను వెనక్కి పిలిపిస్తున్నామన్నారు. పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారానే వైద్య సేవలు అందిస్తామన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. పైలెట్ పద్ధతిన కనగల్ పీహెచ్సీలో గ్లూకోమా సెంటర్‌ను ప్రారంభించామని తెలిపారు. కనగల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గ్లూకోమా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక మోడల్ పీహెచ్‌సీని తీర్చిదిద్దుతామని తెలిపారు. తన ప్రసవం కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగిందని ఆమె పేర్కొన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
బస్సులో పోగొట్టుకున్న పర్సు అప్పగింత
దేవరకొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న పర్సును డ్రైవర్, కండక్టర్ గుర్తించి తిరిగి అతడికి అప్పగించారు. దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హైదరాబాద్ నుంచి దేవరకొండకు వస్తుంది. ఈ బస్సులోని ప్రయాణికుడు ఒకరు పర్సు బస్సులోనే మర్చిపోయి కొండమల్లేపల్లిలో దిగిపోయాడు. బస్సులో పర్సును గుర్తించిన కండక్టర్ బుచ్చిరెడ్డి, డ్రైవర్ భోజ్య దేవరకొండ డిపో అధికారులకు అందజేశారు. పర్సులోని వివరాల ఆధారంగా పర్సు పోగొట్టుకున్న ప్రయాణికుడిని గుర్తించి అతడికి తిరిగి పర్సు అప్పగించారు. ఆ పర్సులో రూ.14,500 నగదు ఉన్నట్లు తెలిపారు. నిజాయితీ చాటుకున్న బస్సు డ్రైవర్, కండక్టర్‌ను ఆరీస్టీ అధికారులు అభినందించారు. -
విత్తనాలు మార్చకుండా అవగాహన కల్పించాలి
త్రిపురారం: వరి విత్తనాలను ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదని, రైతులు తమ పొలంలోనే పండించిన వరి ధాన్యాన్ని విత్తనాలుగా వినియోగించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించాలని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్(ఈఈఐ) ప్రొఫెసర్ డాక్టర్ మధుబాబు అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో శాసీ్త్రయ సలహా మండలి, జిల్లా స్థాయి సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024–25 సంవత్సరంలో శాస్త్రవేత్తలు వ్యసాయంలో రైతులకు అందించిన సలహాలు సూచనలు, అదేవిధంగా 2025–26వ సంవత్సరంలో అందించే సేవలపై శాస్త్రవేత్తలు సమీక్ష చేశారు. కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు గాను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్థిరమైన వరి ఉత్పత్తికి నేరుగా విత్తే పద్ధతి, ప్రకృతి వ్యవసాయం, బేకరీ ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్, కూరగాయల సాగు, కోళ్లు, గొర్రెల పెంపకం, వాటర్ మేనేజ్మెంట్, మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ వంటి వాటిపై శిక్షణ ఇచ్చామన్నారు. చీడపీడల నివారణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించి రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేసినట్లు పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ మధుబాబు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుకు అవసరమయ్యే వాటిపై నూతన ప్రయోగాలు చేయాలన్నారు. అనుభవం ఉన్న రైతుల ద్వారా సమాచారాన్ని సేకరించి ఇతర రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడులు సాధించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుండాలన్నారు. ఈ ఏడాది రైతులకు అందించాల్సిన సేవలపై ముందస్తుగా ప్రణాళిక ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం హెడ్ అనిల్, ఏడీఆర్ సుధాకర్, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ చంద్రశేఖర్, రాములమ్మ, హాహలియా ఏడీఏ రవీందర్, ఉద్యానవన అధికారి మురళి, పలువురు మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ మధుబాబు -
పిల్లలతో కలిసి మహిళ అదృశ్యం
కనగల్: వైవాహిక జీవితంలో గొడవల కారణంగా మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ ఆచూకీని అర్ధగంటలో కనగల్ పోలీసులు కనిపెట్టారు. నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగజ్యోతి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. జ్యోతి భర్త, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సాయంత్రం కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి పోలీసులను రెండు టీంలుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగజ్యోతి అన్న మొబైల్‌కు కొత్త నంబర్ నుంచి నాగజ్యోతి ఫోన్ చేసి శ్రీనేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు, నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నానుశ్రీ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఈ విషయం ఆమె అన్న వెంటనే కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నంబర్‌ను ట్రేస్ చేసి నాగజ్యోతి హైదరాబాద్‌లో ఉందని నిర్ధారించుకొని హయత్‌నగర్ పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని అరగంటలో కనిపెట్టి ఆమెను క్షేమంగా వారి బంధువులకు హయత్‌నగర్‌లో అప్పగించారు. నాగజ్యోతి బంధువులు కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అర్ధగంటలో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు -
ప్రశాంతత కోసం బుద్ధవనాన్ని సందర్శించాలి
నాగార్జునసాగర్: జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ బుద్ధవనాన్ని సందర్శించాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఆర్కే మిశ్రా అన్నారు. నల్లగొండ జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చిన ఆయన బుధవారం నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధుడి పాదాల చెంత పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరిత వనం, ధ్యానవనం, స్థూపవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. మహాస్థూపంలోని అష్టబుద్ధుల వద్ద ధ్యానం చేశారు. అనంతరం నాగార్జునసాగర్ డ్యాంను సందర్శించారు. ఆయనకు బుద్ధవనం చరిత్ర గురించి గైడ్ సత్యనారాయణ వివరించారు. వారి వెంట డీఆర్డీఏ ఏపీడీ శేఖర్‌రెడ్డి, పెద్దవూర మండల తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ దండ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆపద మిత్ర ప్రోగ్రాం శిక్షకులు తదితరులు ఉన్నారు.ఫ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఆర్కే మిశ్రా -
అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో రైతులు పండించిన అన్నిరకాల పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జిల్లా కన్వీనర్లు మల్లు నాగార్జున్‌రెడ్డి, మండారి డేవిడ్ కుమార్, షేక్ నజీర్, నల్లడ మాధవరెడ్డి, నారాబోయిన వెంకట యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాత రుణాలు రద్దుచేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ అమలు చేసి రైతుభరోసా అందించాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించి నూతనకల్, మద్దిరాల, ఆత్మకూరు, చివ్వెంల, మోతె, పెన్ పహాడ్, మునగాల, నడిగూడెం మండలాల రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరికుప్పల వెంకన్న, బొడ్డు శంకర్, దండ వెంకటరెడ్డి, మట్టిపల్లి సైదులు, ములకలపల్లి రాములు, పోటు లక్ష్మయ్య, పల్లె వెంకటరెడ్డి, కరీం, కందాల శంకర్ రెడ్డి, మేకల కనకారావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘సిరిపురం’ పర్సన్ ఇన్చార్జ్గా రామేశ్వరం
రామన్నపేట: మండలంలోని సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్గా అప్పం రామేశ్వరం, పాలకవర్గ సభ్యులకు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు బుధవారం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా చేనేత జౌళిశాఖ ఇన్చార్జ్ సహాయ సంచాలకురాలు పద్మ నియామక పత్రాలు అందజేశారు. సిరిపురం సొసైటీ ఉమ్మడి జిల్లాలోనే బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్ ఉత్పత్తిలో పేరుగాంచింది. జిల్లాలో పదవీకాలం ముగిసిన మిగతా సొసైటీల చైర్మన్లకు పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించగా, 2018లో కొంతమంది ఫిర్యాదు మేరకు సిరిపురం సొసైటీ బాధ్యతలను చేనేత జౌళిశాఖ డెవలప్మెంట్ అధికారికి అప్పగించారు. తాజా ఉత్తర్వుల మేరకు సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్గా అప్పం రామేశ్వరం మరియు పాలకవర్గ సభ్యులు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తర్వులు అందుకున్న వారిలో పర్సన్ ఇన్ర్జ్ అప్పం రామేశ్వరం, ఉపాధ్యక్షురాలు రాపోలు లక్ష్మమ్మ, ప్రధాన కార్యదర్శి జెల్ల లక్ష్మీనారాయణ, కోశాధికారి ఏలె నరసింహ, కార్యవర్గ సభ్యులు రాపోలు రమేష్, గుండు రాజు, రాపోలు పాపయ్య, సంగిశెట్టి వెంకటమ్మ, అప్పం శ్రీను, రాపోలు శ్రవణ్‌కుమార్ ఉన్నారు. -
బీజేపీపై రాజకీయ పోరాటం చేయాలి
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని, సొరంగమార్గం తవ్వేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సొరంగం పనులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మిర్యాలగూడ అర్బన్: రాష్ట్రానికి ప్రమాదకరంగా మారబోతున్న బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాయమాటలతో, మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందాలని బీజేపీ చూస్తోందని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేక పోతోందని విమర్శించారు. భవిష్యత్తులో బీజేపీపై రాజకీయ యుద్ధం జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్తాన్‌లో ఓ చిన్న కేసు విషంలో పోలీసులు అర్ధరాత్రి ఇంట్లో చొరబడి ఆరునెలల చిన్నారి చావుకు కారణం అయ్యారని, ముస్లిం వ్యతిరేకంగా పాలన చేయడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేడం లేదని విమర్శించారు. కేవలం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పైనే ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 50శాతం రిజర్వేషన్ దాటవద్దని సుప్రీంకోర్టు చెపుతున్నా.. పార్లమెంట్లో బీసీ కులగణన ఆమోదం పొందదనే దృష్టితోనే బీసీ కులగణన చేసినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ నాటకమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం, నల్లగొండ జిల్లాల కార్యదర్శులు నూనె నాగేశ్వర్రావు, తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేష్, సయ్యద్ హశం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, ఎండీ సలీం, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, మల్లయ్య, అరుణ, పల్లా భిక్షం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా ఎమ్మెల్యేను టార్గెట్ చేసి నగ్నంగా వీడియో కాల్ చేసి బెదిరింపులకు దిగారు. వీడియో కాల్ సందర్భంగా కొన్ని సెకన్ల పాటు స్క్రీన్ రికార్డు చేసి ఆయనకే వీడియో పంపించారు. అనంతరం, డబ్బులు కావాలని డిమాండ్ చేశారు.వివరాల ప్రకారం.. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. దీంతో, ఆయన కాల్ లిఫ్ట్ చేయడంతో అవతలి వ్యక్తి నగ్నంగా కనిపిస్తూ కాల్ మాట్లాడారు. ఈ క్రమంలో కేటుగాళ్లు ఫోన్ స్క్రీన్ రికార్డు చేశారు. అనంతరం, ఆ వీడియోను ఆయనకే పంపించారు. వీడియో విషయమై బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. కానీ, ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పంపారు.ఈ క్రమంలో సదరు నేతలు, కార్యకర్తలు ఆయనను ఫోన్లు చేయడంతో వీరేశం ఖంగుతిన్నారు. దీంతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రాత్రి అనుచరులతో ఫోన్ మాట్లాడుతుండగా కాల్ రావడంతో లిఫ్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. -
ఎన్జీ కాలేజీలో యూత్ పార్లమెంట్
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కాలేజీలో ఈనెల 12, 13 తేదీల్లో యూత్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. మంగళవారం యూత్‌పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా యువకులు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కల్పిస్తూ ఎన్జీ కాలేజీలో రెండు రోజుల పాటు జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంజీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో కోఆర్డినేటర్ డాక్టర్ పి.మద్దిలేటి మాట్లాడుతూ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు నోడల్ కళాశాలగా ఎన్జీ కాలేజీని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ మూడు జిల్లాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. పాల్గోనే విద్యార్థులు శ్రీవాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టూ యూశ్రీ అనే అంశంపై ఒక్క నిమిషం వీడియో తీసి మై భారత్ పోర్టల్‌లో అప్లోడ్ చేసి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 150 మందిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారని చెప్పారు. పోటీల అనంతరం పది మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ బి.ప్రవీణ్ సింగ్, ప్రోగ్రాం ఆర్గనైజర్ కొండానాయక్, ప్రెస్ కన్వీనర్ శ్రీధర్, ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఎం.వెంకట్‌రెడ్డి, ఎన్.కోటయ్య, ఏ.మల్లేశం, ఎం.సావిత్రి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సెర్ప్‌లో.. మెప్మా విలీనం!
పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు, ప్మా సీఓలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతి సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రభుత్వం చేపట్టే సర్వే చేయాలంటే ఇక నుంచి మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. నల్లగొండ టూటౌన్ : పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్డీఓలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే.. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు జిల్లా కేంద్రంలోని మెప్మా జిల్లా కార్యాలయం ఉద్యోగులు అందరూ సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు. కమిషనర్ల ఆధ్వర్యంలో మెప్మా సిబ్బంది విధులు మున్సిపాలిటీల్లో మహిళలను గ్రూప్‌లుగా ఏర్పాటు చేసే మెప్మా ఉద్యోగులు జిల్లాలో 18 మంది వరకు ఉన్నారు. అదే విధంగా వార్డుల్లో క్షేత్రస్థాయిలో పని చేసే మెప్మా రిసోర్స్ పర్సన్లు 130 మంది వరకు ఉన్నారు. వీరంతా మున్సిపాలిటీ కమిషనర్ల ఆధ్వర్యంలో పని చేస్తున్నారు. వీరు మహిళా సంఘాలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించడంతో పాటు నెల నెలా తిరిగి చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటారు. ఇక.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనిని సెర్ప్ కార్యాలయం కింద పనిచేసే ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు శాఖలను విలీనం చేస్తే మెప్మా ఉద్యోగులు సెర్ప్ కార్యాలయంలో విధులు నిర్వర్తించనున్నారు. ఫ ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం ఫ మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు డీఆర్డీఓ పరిధిలోకి.. -
ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఫ గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి.. ఫ కేంద్రాల్లో అరకొర వసతులు నల్లగొండ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నారు. అయితే ఈ సారి అధికారులు నిమిషం నిబంధన ఎత్తివేశారు. విద్యార్థులు పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కేంద్రంలోకి అనుమతించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణ.. ఇంటర్ పరీక్షల నిర్వహణను సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించనున్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. దీంతో హైదరాబాద్‌లో ఉండే పరీక్షల నిర్వహణ తీరును అధికారులు పర్యవేక్షించనున్నారు. హాల్ టికెట్‌పై ఈసారి క్యూఆర్ కోడ్ ముద్రించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ విద్యార్థి పరీక్ష కేంద్రం చిరునామా తెలుస్తుంది. అరకొర సౌకర్యాలు.. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో అరకొర సౌకర్యాలే ఉన్నాయి. కొన్నిచోట్ల ప్యాన్లు, లైట్లు లేవు. ఎండల తీవ్రత పెరగడంతో విద్యార్థులు ఉక్కపోతతో పరీక్షలు రాయాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి జూనియర్ కాలేజీలో భవనం బాగుంది కానీ.. కొన్ని గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు లేవు. స్విచ్ బోర్డులు కూడా లేవు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇలా.. ఫస్టియర్ 13,992సెకండియర్ 14,730మొత్తం 28,772పరీక్ష కేంద్రాలు 52పరీక్షలు సవ్యంగా నిర్వహించాలి : కలెక్టర్ ఇంటర్మీడియట్ పరీక్షలు సవ్యంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : ఎస్పీ నల్లగొండ : ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. అభ్యర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందు ప్రధాన గేటు వద్ద తనిఖీలు నిర్వహించే సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు. -
నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు కనగల్ చేరుకుంటారు.అక్కడ ఇటీవల నిర్మించిన పీహెచ్సీ, సెంటర్ ఫర్ లైఫ్ సైన్సెస్, మహీంద్రా యూనివర్సిటీల సహకారంతో చేస్తున్న గ్లకోమా పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నల్లగొండ చేరుకుని.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బయల్దేరి వెళతారు. ఇసుక అక్రమంగా తరలించొద్దు ● ఎస్పీ శరత్చంద్ర పవార్ నార్కట్‌పల్లి : ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్చంద్ర పవార్ హెచ్చరించారు. మంగళవారం నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో ఇసుల రీచ్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టు ఏర్పాటు చేశామని.. ప్రతి వాహన వివరాలను సేకరించి నోట్ చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారితోపాటు.. వారికి సహకరించిన వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ నాగరాజు, ఎస్ఐ క్రాంతికుమార్ తదితరులున్నారు. హ్యాండ్లూమ్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులునల్లగొండ టూటౌన్ : హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ ఏడీ ద్వారక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు చేనేత, జౌళి శాఖ కార్యాలయం 9912183164 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. గిరిజన క్రీడా పాఠశాలలో ప్రవేశాలునల్లగొండ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి హైదరాబాద్ బోయిన్పల్లి వాటర్ స్పోర్ట్స్ అకాడమీ, పాఠశాలలో ప్రవేశాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎస్పి.రాజ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన క్రీడా పాఠశాలల్లో 5వ తరగతిలో 40, 6లో 9, 7లో 10, 8లో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గిరిజన విద్యార్థులు.. కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షలలోపు ఉండాలని ప్రతిభ ఆదారంగా 5వ తరగతిలో 20 మంది గిరిజన బాలబాలికలకు ప్రవేశాలు కల్పిస్తారని, ఆగస్టు 31, 2025 నాటికి 9 నుంచి 11 సంవత్సరాలలోపు వయసు ఉండి 4వ తరగతి చదువుతున్న వారు అర్హులని పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఎంపికను ఈ నెల 12న మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహిస్తామని.. వివరాలకు 9966394804 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. డీటీఎఫ్ నూతన జిల్లా కమిటీ ఎన్నికనల్లగొండ : డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా కమిటీని మంగళవారం నల్లగొండలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.వెంకటేశం, ఉపాధ్యక్షులుగా పి.ఏడుకొండలు, ఎం.పుష్పలత, ఎన్.గోపి, ప్రధాన కార్యదర్శిగా పి.వెంకులు, కార్యదర్శులుగా ఎం.నాగయ్య, టి.వెంకటేశ్వర్లు, వై.మోహన్‌రావు, ఇ.జగతి, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం.సోమయ్య, కె.రాహెల్కుమారి, ఇ.అంజయ్య, ఎండీ. ఖుర్షిద్‌మియా ఎన్నికయ్యారు. -
వటపత్రశాయికి వరహాల లాలీ..
ఫ రాత్రి హంస వాహనంపై ఊరేగిన శ్రీస్వామి ఫ నాల్గవ రోజుకు చేరిన యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన మంగళవా రం ఉదయం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు తిరు, మాడ వీధుల్లో వటపత్రశాయి అలంకారసేవలో ఊరేగించారు. వేకువజామున నిత్యారాధనలు చేపట్టిన తరువాత, పారాయణీకులు వేద పారాయ ణం పఠించారు. అనంతరం శ్రీస్వామి వారిని వట పత్రశాయి అలంకరణలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించి ఆలయ తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంఽశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సాయంకాలం వేళ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీనృసింహస్వామి వారిని హంస వాహన సేవలో అలంకరించి ఊరేగించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకారం నుంచి ప్రారంభమైన అలంకార సేవ పడమటి రాజగోపురం నుంచి ఉత్తరం, తూర్పు, దక్షిణ రాజగోపురాల ముందు నుంచి సాగింది. ఆలయంలో నేడు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీస్వామి వారిని బుధవారం ఉదయం శ్రీకృష్ణాలంకారణ (మురళీ కృష్ణుడు) సేవ చేపట్టనున్నారు. సాయంత్రం పొన్నవాహన సేవ నిర్వహించనున్నారు. -
ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలి
కొండమల్లేపల్లి : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకొని.. వాటిని సాధించేందుకు కష్టపడి చదవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. మంగళవారం కొండమల్లేపల్లి ఎస్పీ బాలికల గురుకుల కళాశాల, పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గది, స్టోర్ రూం, కూరగాయలు, బియ్యం నిల్వ ఉంచే స్థలాలను, తరగతి గదులు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంపై ప్రిన్సిపాల్, సిబ్బందిని అభినందించారు. అనంతరం కలెక్టర్ 8వ తరగతి ఏ సెక్షన్‌కు వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, ఇంగ్లిష్, మ్యాథ్స్‌తో పాటు పలు సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. తర్వాత విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ శౌరీలు, ఎంపీడీఓ బాలరాజురెడ్డి తదితరులున్నారు. నీట్ ప్రవేశ పరీక్షకేంద్రాల పరిశీలన నల్లగొండ : మే 4వ తేదీన నిర్వహించనున్న నీట్ ప్రవేశపరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. కేంద్రాల్లో అవసరమైన టేబుళ్లు, వెంటిలేషన్, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలపై ఆరాతీశారు. నల్లగొండలోని ఎస్పీఆర్, నారాయణ, అరబిందో తదితర పాఠశాలలను పరిశీలించాలని ఆర్డీఓను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, నీట్ పరీక్షల లైజనింగ్ ఆఫీసర్ పార్థసారధి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఓటరునాడి పట్టలే..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ– టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందగా, టీఎస్ యూటీఎఫ్ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. సంఘం పోరాట పటిమ తమ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నా.. అనుకూల ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇక పీఆర్టీయూ–టీఎస్ గతంలో కోల్పోయిన తమ స్థానాన్ని ఈసారి దక్కించుకోగలిగింది. ఉపాధ్యాయుల్లో పెద్ద సంఘంగా పేర్కొనే పీఆర్టీయూ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డిని గెలిపించుకొని తమ పాత స్థానాన్ని పదిలం చేసుకోగలిగింది. సొంత నియోజకవర్గం కాకపోయినా ఈ ఎన్నికల్లో బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి గట్టిగా పోరాడి ఓడారు. బీసీ నినాదంతో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన పూల రవీందర్ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయారు. ఇక, బీజేపీ అనుకున్నంత స్థాయిలో తమ బలాన్ని టీచర్లలో పెంచుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో దిగిన పులి సరోత్తంరెడ్డికి ఆశాభంగం తప్పలేదు. ఎక్కడ పొరపాటు జరిగింది.. ఈ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ రెండో స్థానానికి పడిపోవడంపై ఆ యూనియన్ ఆలోచనల్లో పడింది. గెలుస్తామని ధీమాతో ఉన్నా అంచనాలు ఎక్కడ తారుమారయ్యాయి.. ఓటమికి కారణాలేంటనే విశ్లేషణ చేసుకుంటోంది. 2019 ఎన్నికలో గెలుపొందిన తాము ఈసారి ఎందుకు ఓడిపోయామనే చర్చ యూటీఎఫ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. యూనియన్‌కు ఉన్న సంప్రదాయ ఓట్లు అలాగే ఉన్నాయని, అవి తమ అభ్యర్థికే పడ్డాయని, అయితే తటస్థంగా ఉండే టీచర్ల ఓట్లు మాత్రం హర్షవర్దన్‌రెడ్డికి వేశారని అంచనా వేస్తోంది. హర్షవర్ధన్ పోటీలో ఉండటం వల్లే తమకు రావాల్సిన ఓట్లకు గండిపడి, రెండోస్థానానికి పడిపోవాల్సి వచ్చిందని భావిస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో పని చేసిందన్న విశ్లేషణ యూటీఎఫ్ వర్గాల్లో సాగుతోంది. ఇద్దరికి ప్రచారం చేయడమే దెబ్బకొట్టిందా? ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అనుకున్న మేర ప్రభావం చూపలేకపోయారు. బీసీ వాదంతో, బీసీ సంఘాల మద్దతులో బరిలోకి దిగినా, అది పూర్తిగా ఫలించ లేదు. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒకే ఎన్నికలో ఇద్దరు బీసీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పడం మైనస్‌గా మారిందనే చర్చ సాగుతోంది. ఎవరో ఒకరిని గెలిపించాలని కోరితే ఆ ఒక్కరికి ఓట్లు పడేవని, రవీందర్‌తోపాటు సుందర్రాజుకు ఓట్లు వేయాలని సూచించడంతో బీసీ ఓట్లు చీలిపోయాయన్న చర్చ సాగుతోంది. ఫ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఎస్ యూటీఎఫ్ ఫ పాత స్థానాన్ని దక్కించుకున్న పీఆర్టీయూ–టీఎస్ ఫ సొంత నియోజకవర్గం కాకున్నా గట్టి పోటీ ఇచ్చిన హర్షవర్ధన్ రెడ్డి ఫ టీచర్లలో బలాన్ని పెంచుకోలేకపోయిన బీజేపీ గట్టి పోటీ ఇచ్చిన హర్షవర్ధన్‌రెడ్డి.. ఉపాధ్యాయ ఎన్నికల్లో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి టీచర్స్ జేఏసీలోని సంఘాల మద్దతులో బరిలో దిగి చివరి వరకు పోరాడారు. ఓడిపోయినా.. గణనీయమైన ఓట్ల సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్ల పండిట్, పీఈటీ పదోన్నతులు, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇప్పించడం వంటి విధాన నిర్ణయాల్లో హర్షవర్ధన్‌రెడ్డి కీలక ప్రాత పోషించిన అంశం టీచర్లలోకి బలంగానే వెళ్లింది. హర్షవర్ధన్ స్థానికేతరుడనే ప్రత్యర్థుల ప్రచారం కూడా ఆయనకు ప్రతికూలంగా మారింది. అయినప్పటికీ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి, హర్షవర్ధన్ మధ్య వ్యత్యాసం 500లోపు ఓట్లు మాత్రమే ఉండడం గమనార్హం. పూల రవీందర్ ఎలిమినేట్ కావడానికి ముందు 16వ రౌండ్ ముగిసే వరకు నర్సిరెడ్డికి 5,660 ఓట్లు ఉండగా, హర్షవర్ధన్‌రెడ్డికి 5,309, శ్రీపాల్‌రెడ్డికి 7,673 ఓట్లు ఉన్నాయి. నర్సిరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి మధ్య వ్యత్యాసం 351 ఓట్లే. రవీందర్ ఎలిమినేషన్ తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో హర్షవర్ధన్‌రెడ్డి మూడో స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. -
తాగునీటి ఎద్దడి తలెత్తొద్దు
కేతేపల్లి : వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ ఎన్.ప్రేమ్‌కరణ్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కేతేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలు అందని ప్రాంతాలను గుర్తించి, తాగునీరు అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ప్రైవేట్ బోర్లు అద్దెకు తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ పనులకు ప్రతి గ్రామంలో వంద మందికి పైగా కూలీలు హాజరయ్యేలా చూడాలన్నారు. వన నర్సరీలో మొక్కలకు ప్రతి రోజు రెండుసార్లు నీళ్లు అందించటంతో పాటు ఎండ వేడిమి నుండి సంరక్షించేందుకు షేడ్నెట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, ఎంపీఓ నాగలక్ష్మి, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ సాయికుమార్, వాటర్‌గ్రిడ్ ఏఈ అశోక్, ఈజీఎస్ ఏపీఓ సురేందర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
కేంద్రానికి అశాసీ్త్రయ డీపీఆర్ పంపారు
చౌటుప్పల్ : రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రానికి అశాసీ్త్రయంగా పంపించిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ ప్రాంతాలకు చెందిన ట్రిపుల్ఆర్ భూనిర్వాసితులు మంగళవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్‌ను కలిశారు. ఎలాగైనా నిబంధనల ప్రకారం 40కిలోమీటర్ల దూరం నుంచి అలైన్మెంట్ మార్పించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తప్పులతో కూడిన డీపీఆర్‌కు కేంద్రం ఏ విధంగా ఆమోదం తెలుపుతుందని ప్రశ్నించారు. తక్షణమే ఉత్తర భాగంలో శాసీ్త్రయంగా డీపీఆర్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్, భూనిర్వాసితుల ఐక్యవేదిక కన్వీనర్ చింతల దామోదర్‌రెడ్డి, నిర్వాసితులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, మారుపాక రామలింగం, జాల వెంకటేష్, దబ్బేటి రాములు, బోరెం ప్రకాష్‌రెడ్డి, సందగళ్ల మల్లేష్, జాల శ్రీశైలం, నర్సింహ, గుండెబోయిన వేణు, బలికే మధు, నాగవెళ్లి దశరథ, జనార్దన్‌రెడ్డి, సుధాకర్, వల్లూరి బోవయ్య, శ్రీశైలం, జోసెఫ్, బాలమల్లయ్య, కార్తీక్, మల్లేష్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ -
నల్గొండ జిల్లా: 134 మంది పంచాయతీ సెక్రటరీలకు ఛార్జ్ మెమోలు
సాక్షి, నల్గొండ జిల్లా: జిల్లాలో 134 మంది పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం.. ఛార్జ్ మెమోలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా సెలవులు పెట్టిన వారికి ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు. ఒక్కొక్కరు మూడు నుంచి తొమ్మిది నెలల వరకు ఎలాంటి అనుమతి లేకుండా సెలవులు పెట్టారు. కనీస సమాచారం లేకుండా ఇష్టారీతిన వ్యవహరించడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పాటించని పంచాయతీ సెక్రటరీలకు సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ ఇటీవల కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.డిసెంబర్ నెలలో కూడా క్రమశిక్షణ పాటించని పంచాయతీ సెక్రటరీలకు కలెక్టర్ ఛార్జ్ మెమోలు జారీ చేశారు. మరోసారి మెమోలు ఇవ్వడంతో సెక్రటరీలు ఆందోళనలో పడ్డారు. క్షేత్రస్థాయిలో పలువురు పంచాయతీ సెక్రటరీల తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఇటీవలే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సాగర్ నియోజకవర్గంలో కొందరు పంచాయతీ సెక్రటరీలు.. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రమ శిక్షణ పాటించని వారిపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందిస్తున్నారు. -
భరోసా సెంటర్లతో మహిళలకు రక్షణ
నల్లగొండ : భరోసా సెంటర్ల ద్వారా బాధిత మహిళలకు రక్షణ కలుగుతుందని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు అంచించాల్సిన సహాయక చర్యలపై సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మహిళలపై జరిగే నేరాలను నివారించడంలో భరోసా కేంద్రం చేసిన కృషి, ప్రస్తుతం అందిస్తున్న సేవలు, కార్యాచరణ ప్రణాళికలను, బాలల హక్కుల పరిరక్షణ, బాలలపై హింసను అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. బాలలతో సంబంధం కలిగిన కేసులపై దృష్టి సారించాలని ఆదేశించారు. కేసుల విచారణ వేగవంతం చేసి బాధితుల పునరావాసం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. భరోసా సేవలను గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించాలని సంబందిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కులకర్ణి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ చైర్పర్సన్ దీప్తి, మౌనిక, హరికృష్ణ, కృష్ణ, మోహన్‌రావు, హరిత, శ్రీధర్, గణేష్, అంజలి, నళిని, అధికారులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
కేంద్ర పన్నుల డివిజన్ కార్యాలయం ప్రారంభం
నల్లగొండ టౌన్ : నల్లగొండలో కేంద్ర పన్నుల అసిస్టెంట్ కమిషన్ నల్లగొండ డివిజన్ నూతన కార్యాలయాన్ని సోమవారం జాయింట్ కమిషనర్ శ్రీచరణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్లు ప్రవీణ్, విమల్, సోమేజా, సూపరింటెండెంట్లు ఆలె శ్రీనివాస్, కొండ అశోక్, మురళి, విశాల్, హవల్దార్, మరి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. పన్నులు వందశాతం వసూలు చేయాలికట్టంగూర్ : గ్రామాల్లో పన్నులను వందశాతం వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కొండ వెంకయ్య ఆదేశించారు. సోమవారం కట్టంగూర్ మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పన్నుల వసూలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి నెలాఖరుకు వరకు పన్నులు వసూలు పూర్తిచేయాలన్నారు. వేసవిలో నీటి కొరత ఏర్పడితే రైతుల నుంచి బోరుబావులను అద్దెకు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డివిజన్ పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్‌రావు, ఎంపీఓ చింతమళ్ల చలపతి ఉన్నారు. యూజీసీ సదస్సుకు ఆహ్వానండిండి : మండల పరిధిలోని తవక్లాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ముద్దాడ బాల్‌రాజుకు ఈనెల 6, 7వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూర్లో నిర్వహించే యూనిర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సదస్సుకు ఆహ్వానం అందింది. ఎడ్యుకేషనల్ ఫర్ స్పిక్టిన్స్ అండ్ రోల్ ఆఫ్ టీచర్ ఎడ్యూకేటర్స్ ఇన్ ఇండియా అనే అంశంపై నిర్వహించే ఈ సదస్సులో బాల్‌రాజు ప్రసంగించనున్నారు. ఉపాధ్యాయుడిగా, భోధనా విధానాల విశ్లేషకుడిగా, పోటీ పరీక్షల విషయ నిపుణుడిగా సేవలందిస్తున్న బాల్‌రాజు యూజీసీకి హాజరుకావడంపై ఎంఈఓ గోప్యానాయర్, హెచ్ఎం రాజేందర్‌రెడ్డి, వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు. రాయితీ పొంది.. బిల్లు చెల్లించాలిరామగిరి(నల్లగొండ) : బిల్లు బకాయి పడిన బీఎస్ఎస్ఎల్ వినియోగదారులు లోక్ అదాలత్‌లో పాల్గొని రాయితీలను పొంది బిల్లు చెల్లించాలని బీఎస్ఎన్ఎల్ ఉమ్మడి నల్లగొండ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.వెంకటేశం సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని.. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆర్.యుగేందర్ 944100 0146, పులిపాటి ప్రసాద్ 9494443696 ఫోణ నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
శ్రీపాల్‌కే గురువుల పట్టం
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి గెలుపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్‌రెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. అయితే నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేకపోవడంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. దీంతో శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటా ఓటుగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోల్ కాగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు. చివరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత కోటా రాకున్నా శ్రీపాల్‌రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289 , సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటి వరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థుల నుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి కూడా ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్‌రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్‌రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్‌రెడ్డి 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 1348 ఓట్లు పెరిగి, 9021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. . ● హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. ఫ రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం ఫ సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ ఫ ప్రధాన అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ కౌంటింగ్ సాగింది ఇలా..నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రకియ నల్లగొండలోని ఆర్జాలబావి గోదాముల్లో సోమవారం పూర్తయింది. ఉదయం 7 గంటలకు పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్‌కు తీసుకొచ్చారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి 25 చొప్పున బ్యాలెట్ బాక్సులను 8 రౌండ్లలో కౌంటింగ్ హాల్‌కు తీసుకొచ్చారు. 25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ హాల్లో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి 25 బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టారు. ఈ ప్రక్రియ ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత కట్టలన్నింటినీ డ్రమ్ములో వేసి కలిపారు. ఉదయం 11.30 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై.. సాయంత్రం 3 గంటలకు పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కూడా గెలుపు కోటా రాలేదు. సాయంత్రం 4 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రాత్రి 11 గంటలకు నర్సిరెడ్డి ఎలిమినేషన్‌తో పూర్తయింది. రాత్రి 11 గంటలకు శ్రీపాల్‌రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేశారు. -
నృసింహుడికి అలంకార వైభవం
ఉదయం మత్స్యరూపుడై, సాయంత్రం స్వర్ణ శేషవాహనంపై దివ్యదర్శనం యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచనారసింహుడి అలంకార, వాహనా సేవలకు అర్చకులు సోమవారం ఆగమశాస్త్రం ప్రకారం శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఉదయం స్వామివారు మత్య్సవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానాలయంలో నిత్యారాధనలు పూర్తయిన అనంతరం దక్షిణ ప్రాకార మండపంలోని నిత్యకల్యాణ మండపంలో స్వామివారిని అధిష్టింపజేసి పట్టువస్త్రాలు, బంగారు, వజ్రాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ముగ్ధమనోహరంగా అలంకరించారు. పూజలు చేసి, హారతి నివేదించారు. అనంతరం వేదపండితులు, అర్చక బృందం, రుత్వికులు, పారాయణీకుల వేదమంత్రోచ్ఛరణ, మూలమంత్ర జపస్తోత్రాలతో మంగళవాయిద్యాలు మోగుతుండగా, భక్తజనులు గోవిందనామస్మరణ చేస్తుండగా ప్రధానాలయ తిరు, మాఢ వీధుల్లో అలంకార సేవను ఊరేగించారు. ఆలయంలో సాయంత్రం సాయంత్రం నిత్యారాధనలు నిర్వహించిన అనంతరం శ్రీస్వామివారిని స్వర్ణ శేష వాహనంపై ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, సిబ్బంది, పాల్గొన్నారు. ఆలయంలో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీస్వామివారిని వటపత్రశాయిగా అలంకరిస్తారు. సాయంత్రం హంసవాహన సేవపై స్వామివారిని ప్రధానాలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగిస్తారు. -
యూరియా కొరత లేదు
జిల్లా వ్యాప్తంగా అవసరానికి మించి యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదు. రైతులు అవసరానికి మించి రెండింతలు యూరియాను వేస్తున్నారు. దీనివల్ల పంటకు లాభాల కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. రైతులు అవసరం మేరకు యూరియా వాడాలి. – పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ చలి కారణంగా యూరియా ఎక్కువ వాడారు జిల్లాలో ముందస్తుగా వరి నాట్లు పూర్తి కావడంతో వాతావరణంలో చలి తీవ్రత వల్ల వరి పైరు ఎత్తు పెరగలేదు. ఈ పంట కాలంలో అధికంగా యూరియా వేశారు. కొన్ని మండలాల్లో వరి పైరు తక్కువ రోజులకే పూత దశకు చేరుకోవడంతో సాకీయ (వెజిటేటివ్ గ్రోత్) కోసం యూరియా ఎక్కువగా వినియోగించాల్సి వచ్చింది. వరి పూత దశలో యూరియా వాడకం వల్ల పూత రావడం కొద్దిరోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. – డాక్టర్ శ్రీనివాసరావు, పోగ్రాం కోఆర్డినేటర్ కేవీకే కంపాసాగర్ -
తల్లికర్ర తెచ్చిన తంటా!
వరి చేలకు మోతాదుకు మించి యూరియా వాడుతున్న రైతులు 15 వేల మెట్రిక్ టన్నులు అదనంగా వచ్చినా ఇంకా కొరతే.. నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో వరి చేలు పిలకదశలోనే తల్లి పిలక ఈనుతోంది. వాస్తవంగా నాటు వేసిన నెల రోజుల్లోపు తల్లి పిలకతో పాటు ఇతర పిలకలు కలిపి పొట్ట దశకు వచ్చి ఈనాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఈ యాసంగి వింత పరిస్థితి నెలకొంది. యాసంగిలో సాగు చేసిన వరి చేలు ముందుగానే పొట్ట దశకు చేరుకుంటున్నాయి. కేవలం ఆయకట్టు పరిధిలో సాగు చేసిన సన్నాలకే ఈ పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు వరి చేలో తల్లి పిలక ఈనుతున్న దశను నివారించేందుకు యూరియా ను రెండు, మూడు సార్ల వేసుకోవాలని సూచిస్తున్నారు. కానీ రైతులు అంతకు మించి యూరియా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా వినియోగం పెరిగి కొరత ఏర్పడుతోంది. 5,12,679 ఎకరాల్లో వరి సాగు.. ప్రస్తుత యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 5,12,679 ఎకరాల్లో వరి సాగు కాగా సన్నాలు 2.10 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. వాస్తవానికి జిల్లాలో యాసంగి సీజన్‌కు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. కానీ, ఇప్పటికే 85 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు సరఫరా చేసింది. ప్రస్తుతం జిల్లాలో 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా డీలర్లు, వ్యాపారుల వద్ద అందుబాటులో ఉంది. అయినప్పటికీ యూరియా అందడం లేదనే ప్రచారం సాగుతోంది. ఆయకట్టు పరిధిలోని రైతులు అవసరానికి మించి యూరియా వాడడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యవసాయ శాఖ పేర్కొంటోంది. రైతులు అధిక మోతాదుకు మించి వాడటం వల్ల వరి చేలకు నష్టం తప్ప లాభాలు ఉండవని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
నల్లగొండ
ఇఫ్తార్ 6–29 (మంగళవారం సాశ్రీశ్రీ) సహర్ 5–10 (బుధవారం ఉశ్రీశ్రీ)దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా.. దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు, యువతి మృతిచెందారు.7దొంగల బీభత్సం హాలియా పట్టణంలో సోమవారం దుండగులు మూడు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు.మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025- 8లో -
అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతామని వీసీ ఖాజాఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం ఎంజీయూలో 2160 చదరపు మీటర్ల ఇండోర్ స్టేడియం ఫ్లోరింగ్, 400 మీటర్ల ఎనిమిది లేన్ల ట్రాక్‌ను సింథటిక్ ట్రాక్‌గా మార్చేందుకు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూనివర్సిటీలో క్రీడా ప్రాంగణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. అధునాతన సింథటిక్ ట్రాక్‌తో ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, షటిల్, బాస్కెట్ బాల్, కబడ్డీ లాంటి క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈపీఐ ప్రతినిధులు నారాయణ నాయక్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం వరకు క్రీడా ప్రాంగణాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ హరీష్‌కుమార్, ప్రొఫెసర్ ఆకుల రవి, స్పెషల్ ఆఫీసర్ సోమలింగం, మురళి, శ్రీనివాస్‌రెడ్డి, చింత శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓడినా.. విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం
ఫ అలుగుబెల్లి నర్సిరెడ్డి నల్లగొండ: ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఉపాధ్యాయులు రెండోసారి వద్దనుకున్నారు.. కాబట్టి ఓడిపోయాను.. అయినా విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తాను’ అని టీఎస్ యూటీఎఫ్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత కౌంటింగ్ సెంటర్ నుంచి ఆయన బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఓటమి అనేది సహజమని గతంలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు ఇప్పుడు శ్రీపాల్‌రెడ్డికి ఇచ్చారని చెప్పారు. మరోసారి తనకు ఓట్లు వేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో విద్య, వైద్యం వ్యాపారీకరణ కావద్దన్న డిమాండ్‌తో పోరాటం చేస్తానన్నారు. తాను గెలుస్తాననే నమ్మకం ఉన్నప్పటికీ ఓటర్లు శ్రీపాల్‌రెడ్డికి అవకాశం ఇచ్చారని దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. -
‘రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో’
నల్లగొండ జిల్లా : వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీ గా ఉన్న ఆయన.. ఈసారి ఓటమి పాలయ్యారు. నర్సిరెడ్డిపై పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.ఓటమి అనంతరం నర్సిరెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ ఈ ఓటమి నన్ను బాధించటం లేదు. గెలుపు ఓటములు సహజం. ఓటమిని అంగీకరిస్తున్నా. గెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నాను. ఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో. ప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని తెలిపారు.ఇది ఉపాధ్యాయుల విజయంఇక నర్సిరెడ్డిపై విజయం సాధించిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి సైతం అదే కౌంటింగ్ కేంద్ర వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు విలువైనది. . ఉపాధ్యాయుల విజయం మండలి సభ్యుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తా. విద్యారంగాన్ని పటిష్టం చేసేలా అవసరం అయితే ఉద్యమాలు సైతం చేస్తా. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తాను. ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తాను. నా గెలుపు ముందుగా ఊహించిందే’ అని పేర్కొన్నారు పింగళి శ్రీపాల్ రెడ్డి. -
ఘాటు తగ్గిన మిర్చి..!
సౌత్‌జోన్ షూటింగ్ బాల్ పోటీల్లో సబ్ జూనియర్ బాలికల విభాగంలో ప్రథమ బహుమతి అందుకున్న తెలంగాణ జట్టు పెద్దవూర : రెండేళ్లుగా మిర్చి రైతుకు గడ్డు పరిస్థితి నెలకొంది. తెగుళ్లతో దిగుబడి తగ్గడం, ధరలు పడిపోవడం, కూలీల కొరత వెరసి రైతును కష్టాల్లోకి నెట్టివేస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం మిర్చికి రూ.20 వేల నుంచి రూ.28 వేల వరకు అధిక రేటు పలకడంతో రైతులు మిర్చిసాగుకు మొగ్గు చూపారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల ఎకరాల్లో పంట వేశారు. వీటిలో ఆర్మూర్, తేజా, దమ్ము వంటి రకాలను సాగు చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ఆర్మూర్ రకానికి క్వింటా రూ.9 వేలు, తేజా రకానికి రూ.13 వేలు, దమ్ము రకానికి రూ.11 వేలకు కల్లాల వద్దే కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు మార్కెట్లలో కాయల రకం, నాణ్యతను బట్టి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు ధర పలుకుతుంది. అక్కడి తీసుకెళ్లేందుకు రవాణా ఖర్చు, క్వింటాకు 4 శాతం కమీషన్ ఉండటంతో రైతుకు రూ.9 నుంచి రూ.11 వేలు కూడా రావటం లేదు. దీనికి తోడు కూలీ కొరత కూడా వేధిస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వేధిస్తున్న కూలీల కొరత.. ప్రస్తుతం రైతులంతా ఒకేసారి మిర్చీ ఏరుతుండటంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో కూలీలకు అధిక కూలి చెల్లించి ఇతర ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. రోజుకు ఒక్కో కూలీకి రూ.350 నుంచి రూ.400 ఇస్తున్నారు. వాహనాల కోసం రోజుకు రూ.800 నుంచి రూ.1000 చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు మేసీ్త్రకి కమీషన్ చెల్లించాలి. దీంతో క్వింటా మిర్చి ఏరేందుకు కూలీలు, రవాణా ఖర్చులు కలిపి రూ.5 వేలు అవుతోంది. పండించిన పంటలో సగానికి పైగా కూలీలకే పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర పెంచాలని రైతులు కోరుతున్నారు. లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోడమే శరణ్యమని వాపోతున్నారు. ఫ రోజురోజుకూ తగ్గుతున్న ధర ఫ వేధిస్తున్న కూలీల కొరత ఫ పెట్టుబడి కూడా రాదని రైతులు ఆవేదన ఫ కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం కూలీలకే సగడం డబ్బు పోతోంది మేము పండించిన పంటలో సగం డబ్బు కూలీలకే సరిపోతుంది. దీనికితోడు తెగుళ్ల బెడదతో పంటలో పావువంతు తాలుకా యలు అవుతున్నాయి. మద్దతు ధర లేకపోవడంతో మిరప కాయలను హైదరాబాద్‌లో ఏసీలో పెట్టాను. ధర వచ్చాక అమ్ముకుంటా. ఈ ధరకు అమ్మితే అప్పులపాలే. – కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, రైతు, బట్టుగూడెం మార్కెట్ సదుపాయం కల్పించాలి సాగర్, దేవరకొండ నియోజవర్గాల పరిధిలో మిరపకు మార్కెట్ సదుపాయం కల్పించాలి. ఇక్కడ మార్కెట్ లేకపోవడంతో హైదరాబాద్, గుంటూరు వెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది. అక్కడ తెలిసిన వాళ్లు ఎవరూ లేకపోవడంతో బ్రోకర్లను ఆశ్రయిస్తున్నాం. మార్కెట్‌కు నాలుగు శాతం కమీషన్ ఇవ్వడంతో పాటు, బ్రోకర్‌కు కొంత డబ్బు ఇవ్వాల్సి వస్తోంది. రవాణా ఖర్చుతో పాటు కాయలు అమ్ముడుపోక రెండు, మూడు రోజులు అక్కడే ఉండాల్సి వస్తుండటంతో ఖర్చులు పెరిగిపోతున్నాయి. – కర్నాటి మల్లారెడ్డి, రైతు, పెద్దవూరపెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి మిర్చి సాగుకు ఈ సారి పెట్టుబడి పెరిగింది. మిరప నాటే సమయంలో ఎండలు అధికంగా ఉండడంతో.. రెండు, మూడు సార్లు నారు వేయాల్సివచ్చింది. చీడపీడలు, తెగుళ్లు ఉధృతంగా వ్యాపించడం, పంట ఎదుగుదలకు కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందులు, మొక్కలు నాటడం, కలుపు తీయించటం వంటి వాటికి ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. ఈ సారి దిగుబడి ఆశాజనకంగా లేదు. 8 నుంచి 10 క్వింటాళ్లు కూడా పండే పరిస్థితి లేదు. దీనికితోడు పావువంతు తాలుకాయలు అవుతున్నాయి. సకాలంలో వర్షాలు పడకపోవడం, వాతావరణం మార్పులతో తేమ అధికంగా వుండటంతో పంట దిగుబడి తగ్గినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కత్తి కనకాల్‌రెడ్డి. ఈ రైతు ఎకరాకు రూ.18వేల చొప్పున 24 ఎకరాలను కౌలుకు తీసుకుని మిరప సాగు చేశాడు. డ్రిప్, సాగునీటి కోసం అదనంగా ఎకరారే మరో రూ.10 వేల చొప్పున ఖర్చయ్యింది. పంట పెట్టుబడి ఎకరాకు రూ.1.5 లక్షలు అయ్యింది. ప్రస్తుతం మిరప కాయలను ఏరిస్తున్నాడు. కాయలు ఏరడానికి కూలీలు, ఆటో కిరాయి, మేసీ్త్ర మామూలు వంటి వాటికి క్వింటాకు రూ.5 వేలు ఖర్చవుతుంది. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆర్మూర్ రకం క్వింటా రూ.9 నుంచి రూ.10వేలు పలుకుతోంది. దీనిలో ట్రేడర్ల కమీషన్, రవాణా ఖర్చులు, బస్తాలు, హమాలీలకు మొత్తం కలిపి క్వింటాకు మరో రూ.1500 ఖర్చవుతుంది. దీంతో అతనికి క్వింటాకు మిగిలేది రూ.3500 నుంచి రూ.4500 మాత్రమే. దీంతో పెట్టిన పెట్టుబడి దేవుడు ఎరుగు, కనీసం కౌలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నాడు. ఇదీ జిల్లాలో మిరప సాగు చేసిన రైతుల పరిస్థితి. -
నేటి ప్రజావాణి రద్దు
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 3న సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి.. పిర్యాదులు సమర్పించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె పేర్కొన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషిహాలియా : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గిరిజన సంఘం పోరాడుతుదని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర శంకర్‌నాయక్ అన్నారు. ఆదివారం హాలియాలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన ప్రత్యేక హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం టీఆర్‌జీఎస్ సాగర్ నియోజకవర్గ, మండల స్థాయి నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నాయకులు రమావత్ నరేష్ నాయక్, జవహర్ నాయక్, నేనావత్ అశోక్ నాయక్, కొర్ర రాజునాయక్ తదితరులు ఉన్నారు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికమోటకొండూర్ : మండల కేంద్రానికి చెందిన చామల భానుచందర్‌రెడ్డి – అర్చన దంపతుల కూతురు చామల లక్ష్మీఅభయారెడ్డి జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికై ంది. ఆదివారం హైదరాబాద్ కొల్లూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అండర్–10 విభాగంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో లక్ష్మీఅభయారెడ్డి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం కై వసం చేసుకుంది. ఈనెల 22వ తేదీన విజయవాడలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొననుంది. లక్ష్మీఅభయారెడ్డికి రాష్ట్ర ఆర్చరీ అసోషియేషన్ చైర్మన్ టి.రాజు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూర్ బ్రాంచ్ చైర్మన్ ఎండీ పవన్‌కళ్యాణ్, మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రామారావు చేతుల మీదుగా బంగారు పతకం అందజేశారు. లక్ష్మీ అభయారెడ్డికి, కోచ్ వరికుప్పల స్రవంతికి పలువురు అభినందనలు తెలియజేశారు. అందాల పోటీలను వ్యతిరేకించాలి భానుపురి (సూర్యాపేట): తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి కార్పొరేట్ శక్తులు, ప్రభుత్వాలు కలిసి హైదరాబాద్ వేదికగా నిర్వహించ తలపెట్టిన ప్రపంచ అందాల పోటీలను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన సీ్త్ర, పురుషుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం లేకపోవడం దారుణమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో మూఢ విశ్వాసాలు, పితృస్వామిక భావ జాలం బలపడుతుందని తెలిపారు. ఈ సభలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి నరసమ్మ, సహాయ కార్యదర్శి రామలింగమ్మ, సుజాత, జయలక్ష్మి, జయసుధ, లింగమ్మ, సంతోష, ఉపేంద్ర, నాగలక్ష్మి, నవ్య, మహేశ్వరి, శృతి, పావని ఉన్నారు. -
దేవతలకు ఆహ్వానం
ఫ రెండో రోజూ వైభవంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఆదివారం ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు.లోకకల్యాణం, విశ్వశాంతి కోసం ముక్కోటి దేవతలు ఆహుతులుగా సాగే బ్రహ్మోత్సవానికి యాదగిరి క్షేత్రం సిద్ధమైంది. ఆదివారం ఉదయం అగ్నిదేవుడికి ఆరాధన, హవనం, గరుడ ఆళ్వారుడికి ఇష్ట నైవేద్యం, ధ్వజపూజ, రాత్రి దేవతాహ్వాన వేడుకలు నిర్వహించారు. ధ్వజపటం ఊరేగింపు ప్రధానాలయంలో ఆదివారం ఉదయం నిత్యారాధనలు పూర్తయిన అనంతరం ఉత్తరమాడ వీధిలో ఏర్పాటు చేసిన యాగశాలలో యాజ్ఞికులు హోమాధి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వస్త్రంపై తీర్చిదిద్దిన గరుడ ఆళ్వారుడి పటాన్ని ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా ఉత్తరద్వారం నుంచి ప్రధానాలయ ముఖమండపంలోని ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు ధ్వజస్తంభం వద్ద గరుడ ఆళ్వారుడి పటానికి ప్రత్యేక పూజలు చేశారు. రామానుజ కూటము నుంచి భాజాభజంత్రీలు, మేళ తాళాలతో గరుడ ముద్దలు తీసుకుచ్చి మొదటగా స్వయంభూలు, ఉత్సవమూర్తుల వద్ద, ఆ తరువాత గరుడ్మంతుడి వద్ద పూజలు చేశారు. అనంతరం ధ్వజపటానికి హారతినిచ్చి, గరుడ ముద్దలను ధ్వజ స్తంభంపైకి ఎగురవేశారు. భేరీ మోగించి.. సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజ నిర్వహించారు. భేరీ మోగించి ముప్పై మూడు కోట్ల దేవతలను భువికి ఆహ్వానించే వేడుక వైభవంగా చేపట్టారు. ఆలయంలో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి అలంకార సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అలంకార సేవలకు ఆచార్యులు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం మత్స్య అలంకరా, వేద పారాయణం, రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ నిర్వహిస్తారు. -
ఫలితం తేలేది నేడే..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం సాక్షి ప్రతినిది, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం సోమవారం తేలనుంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయింది. రిహార్సల్స్ కూడా నిర్వహించారు. సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. మొత్తం చెల్లిన ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు. 25 టేబుళ్లపై లెక్కింపు.. 3వ తేదీ ఉదయం 7 గంటలకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ హాల్‌కు తీసుకురానున్నారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు.. 25 బ్యాలెట్లను ఒక బండిల్ చొప్పున కట్టలు కట్టి డ్రమ్ములో వేస్తారు. 8 గంటలు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపు కూడా 25 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్‌కు వేయి బ్యాలెట్ పేపర్ల చొప్పున లెక్కించనున్నారు. దీంతో మొదటి రౌండ్లోనే మొత్తం పోలైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. పోలైన ఓట్లు 24,139 నియోజవర్గం పరిధిలో మొత్తం 25,797 ఓట్లు ఉండగా.. అందులో 24,139 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 93.57 శాతం పోలింగ్ నమోదైంది. చెల్లిన ఓట్లలో సగం ఓట్ల కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు. మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలకపోతే ఎలిమినేషన్.. అభ్యర్థులు ఎవరూ మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయం సాధించలేకపోతే.. అప్పుడు ఎన్నికల అధికారులు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటించి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించనున్నారు. పోటీ చేసిన 19 మంది అభ్యర్థుల్లో ఎవరికై తే అతి తక్కువగా ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసారో చూసి ఆ అభ్యర్థులకు కలుపుతారు. అలా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక ఓటును ఎవరు సాధిస్తారో.. అప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే మాత్రం చివరి ఫలితం అర్ధరాత్రి వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫ చెల్లిన ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా.. వారే విజేత ఫ మధ్యాహ్నం వరకు పూర్తి కానున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.. ఫ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలువకపోతే ఎలిమినేషన్.. ఫ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సిబ్బంది కేటాయింపు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 25 టేబుళ్లపై నిర్వహిస్తారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం 150 మంది టేబుళ్లపై కౌంటింగ్ కోసం ఉండగా, 20 శాతం రిజర్వు సిబ్బంది ఉంటారు. మరో 200 మంది కౌంటింగ్ సమయంలో సహకరించనున్నారు. 530 మంది పోలీస్ సిబ్బంది కౌంటింగ్ బందోబస్తులో పాల్గొననున్నారు. -
నంబర్ ప్లేట్లు మారుస్తూ..
కారు నంబర్ ప్లేట్లను మారుస్తూ గంజాయి తరలిస్తున్న ముఠాను చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. - 8లోకౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 530 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపునకు హాజరు అయ్యే అధికారులు సెల్ఫోన్లు, నిషేధిత వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురావొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. -
‘వజ్రతేజ’లో బియ్యం నాణ్యత పరిశీలన
హాలియా : అనుముల మండలం పాలెం గ్రామ సమీపంలోని వజ్రతేజ రైస్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆదివారం ఫిలిప్పిన్స్ దేశ అధికారులతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఫిలిప్పిన్స్ దేశానికి బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ఆ దేశ ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. బియ్యం పరిశీలించిన వారిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా ఫౌరసరఫరాల సంస్థ మేనేజర్ హరీష్, వజ్రతేజ రైస్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చిట్టిపోలు యాదగిరి, హాలియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పేలపూడి బాలకృష్ణ, వజ్రతేజ రైస్ డైరెక్టర్స్ చిట్టిపోలు వెంకటేశ్వర్లు, కుక్కడపు రమేష్, చిట్టిపోలు రంజిత్, కొత్త సుదర్శన్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మేనేజర్ చిత్తనూరి పవన్ కుమార్, అనుముల మండల ఇంచార్జ్ తహసిల్దార్ రఘు, పెద్దవూర డిప్యూటీ తహసిల్దార్ ఎండీ ముక్తార్ తదితరులు ఉన్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తొద్దు చండూరు : వేసవికాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె చండూరు మున్సిపాలిటీలో, గ్రామాల్లో నీటి ఎద్దడిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీల్లో జనాభా ఆధారంగా నిధులు వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు సిబ్బంది చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ మునవర్ అలీ, డీఈ మనోహర, ఏఈ పూజిత తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
హుజూర్నగర్: వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ సూర్యాపేట జిల్లా ప్రత్యేకాధికారి, చీఫ్ ఇంజనీర్ ఏ. కామేష్ అన్నారు. ఆదివారం హుజూర్నగర్ పరిధిలోని అనుములగూడెం సబ్ స్టేషన్, మద్దుమ్నగర్లోని సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన పరిశీలించి విద్యుత్ వినియోగదారులతో మాట్లాడారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. హుజూర్నగర్ డివిజన్లోని ఆయా గ్రామాల్లో ఉన్న వినియోగదారులతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయించాలన్నారు. 24 గంటల్లో ఎప్పుడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అనంతరం మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెంలో కొత్తగా నిర్మిస్తున్న సబ్ స్టేషన్లో కొత్త బ్రేకర్‌తో కస్తూర్బా స్కూల్ ఫీడర్‌ని చార్జ్ చేసి రఘునాథపాలెం ఫీడర్ మీద ఉన్న అధిక లోడును మళ్లించారు. దీంతో బక్కమంతులగూడెం, పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవకాశం కలిగింది. కార్యక్రమంలో విద్యుత్ డీఈ ఎన్. వెంకటకిష్టయ్య, ఏడీఈలు సక్రునాయక్, నాగిరెడ్డి, ఏఈలు రాంప్రసాద్, హరీష్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ శాఖ సూర్యాపేట జిల్లా ప్రత్యేకాధికారి, చీఫ్ ఇంజనీర్ కామేష్ -
బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష
భూదాన్‌పోచంపల్లి: బీజేపీయేతర రాష్ట్రాల పట్ల బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని, ఇది సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న జిల్లా నాయకత్వస్థాయి శిక్షణ తరగతులకు ఆదివారం ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్‌సంస్థలకు మేలు చేసేవిధంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో రూ.47వేల కోట్లు విలువచేసే వాటాను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని అన్నారు. బీమారంగంలో వందశాతం ఎస్బీఐ లను అనుమతిస్తూ దేశీయ బీమా సంస్థలను ప్రమాదంలో పడేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేవని, ఇక దళితులు, గిరిజనులకు బడ్జెట్‌ను పెంచాల్సింది పోయి తగ్గించడం దారుణమని అన్నారు. బీజెపీ పాలిత రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయిస్తూ తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపిందని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నా.. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు నోరు మెదపడంలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ మెతకవైఖరి సరికాదన్నారు. సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు బి. వెంకట్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, రాష్ట్రకమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, భట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గసభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, కృష్ణారెడ్డి, శ్రీనివాసచారి, గూడూరు అంజిరెడ్డి, గడ్డం వెంకటేశం పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలుచివ్వెంల(సూర్యాపేట): అతి వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ స్టేజీ వద్ద ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన జూలకంజి అనిల్‌రెడ్డి(45) కుటుంబం కొద్ది సంవత్సరాల క్రితం సూర్యాపేటకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనిల్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తన మామ ముప్పాని తిరుమల్‌రెడ్డి దురాజ్‌పల్లి గ్రామ శివారులోని పెద్దగట్టు వద్ద పండుగ చేస్తుండగా అనిల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిమ్మాపురం గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన తన స్నేహితుడుని తీసుకొచ్చేందుకు స్కూటీపై సూర్యాపేటకు వెళ్లి, అతడిని ఎక్కించుకుని తిమ్మాపురం వస్తుండగా మార్గమధ్యలో దురాజ్‌పల్లి గ్రామ స్టేజీ వద్ద కుక్క అడ్డురావడంతో కిందపడిపోయారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ అనిల్‌రెడ్డి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతని స్నేహితుడు వినయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పర్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహేశ్వర్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
బునాదిగాని కాలువను ఎందుకు పూర్తి చేయట్లేదు
భువనగిరిటౌన్: సంవత్సరాలు గడిచినా, పాలకులు మారినా బునాదిగాని కాలువను ఎందుకు పూర్తిచేయడం లేదని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ప్రశ్నించారు. రైతు సంఘం భువనగిరి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో బబ్బురి అంజమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పశ్య పద్మ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మూసీ నీళ్లతో రైతులు లక్షలాది ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. భువనగిరి జిల్లా పరిధిలో కూడా బునాదిగాని కాలువ పూర్తికావాలని తెలంగాణ రైతు సంఘంతో పాటు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ పూర్తి చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన మీద హడావిడి చేస్తుంది తప్ప పనులు ప్రారంభించడం లేదని ఆరోపించారు. బునాది గాని కాలువను వెడల్పు చేసి మూసీ నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరి, వలిగొండ, ఆత్మకూరు, మోత్కూరు, అడ్డగూడూరు, తిరుమలగిరి వరకు కాలువ ఉపయోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బునాది గాని కాలువ ద్వారా సరిపడా నీళ్లు వస్తాయని భావించి రైతులు పంటలు వేశారు కానీ నీళ్లు రాక వరి పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. బునాది గాని కాలువను పూర్తి చేయుటకు నిధులు మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, నాయకులు చింతల పెంటయ్య, చొప్పరి సత్తయ్య, ఏనుగు మల్లారెడ్డి, పుల్లూరు పద్మ, ఏదునూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ -
బావులు, బోర్లు వెలవెల.. ఎండుతున్న పంటలు
గుండాల : గుండాల మండలానికి గోదావరి జలాలు అందక రైతులు వేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి. మండలంలో నవాబుపేట రిజర్వాయర్‌తో 32వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతో సాగు నీరు రాక పంటలు ఎండిపోతున్నాయి. సాగు నీరు వస్తుందన్న ఆశతో రైతులు బోర్లు, బావుల కింద 1250 ఎకరాలు వరి సాగు చేశారు. ఎండలకు భూగర్భజలాలు అడుగంటిపోయి బావులు, బోర్లలో నీరు లేక వట్టిపోతున్నాయి. ఇప్పటికే సుమారు 200 ఎకరాలలో వరి ఎండిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో ఏం చేయాలో తోచక రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఉన్న 83 కుంటలు, చెరువులకు గోదావరి జలాలు వస్తే వేసిన పైర్లు పంటలు పండుతాయని ఆశతో ఎదురుచూసిన రైతాంగానికి నిరాశే మిగిలింది. ఇటీవల ప్రభుత్వం గోదావరి జలాలను బిక్కేరు వాగుకు విడుదల చేయడంతో అనంతారం, సుద్దాల, బ్రాహ్మణపల్లి, అంబాల, మోత్కూరు, వంగాల గ్రామాల రైతులకు ఊరట లభించింది. కానీ వెల్మజాల, సీతారాంపురం, మరిపడిగ, మాసాన్‌పల్లి, రామారం, గుండాల, నూనెగూడెం, తుర్కలశాపురం, పెద్దపడిశాల, వస్తాకొండూర్, బండకొత్తపల్లి గ్రామాలకు సాగు నీరు అందక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నవి. దీంతో రైతాంగం సాగు నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మండలంలో బిక్కేరు పరీవాహక ప్రాంతాలలో కళకళలాడుతుంటే మరోపక్క పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతాంగం పంటలను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా పాలకులు నవాబుపేట రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలను మండలానికి అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. నవాబుపేట రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు అందించాలని కోరుతున్న రైతులువాటర్ ట్యాంకర్‌తో నీళ్లు పెడుతున్నా..నాకున్న రెండెకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. ఎండలతో బావి, బోర్లలో నీరు తగ్గడంతో సుమారుగా 3 ఎకరాల పొలం ఎండుతుంది. దీంతో వాటర్ ట్యాంకర్‌కు నెలకు రూ.15వేలు చెల్లించి వ్యవసాయ బావుల వద్ద నీటిని పట్టి రోజుకు ఒక 30 గుంటల వరి పొలాన్ని తడుపుతున్నాను. ప్రభుత్వం గోదావరి జలాలు విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలి. గ్రామానికి చెందిన బోరు వద్ద వాటర్ ట్యాంకర్‌ను నింపుకునేందుకు వెళ్తే కొంతమంది రైతులు గొడవ చేస్తున్నారు. దీంతో పొలం ఎండిపోతున్నది. – తూనం నరేష్, రైతు, పాచిల్ల -
కారు నంబర్ ప్లేట్లు మారుస్తూ..
చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్ : కారు నంబర్ ప్లేట్లు మారుస్తూ గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను ఆదివారం చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగరి డీసీపీ రాజేష్‌చంద్ర వెల్లడించారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్కాలనీలో నివాసముంటున్న నకుల్ కై లాష్ గైక్వాడ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 28న నకుల్ కై లాష్ గైక్వాడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలోని కన్నూరుపాలెం గ్రామానికి వెళ్లాడు. అక్కడ వీరబాబు అనే వ్యక్తి వద్ద 102కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. దానిని రెండు కిలోల చొప్పున 51 ప్యాకెట్లుగా మార్చి తన వెంట తీసుకెళ్లిన కారులో వేసుకుని మహారాష్ట్రకు బయల్దేరాడు. పోలీసులకు పట్టుబడకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన నంబర్ ప్లేట్లను తయారు చేయించి ఏ రాష్ట్రం గుండా వెళ్తే ఆ నంబర్ ప్లేట్ కారుకు అమర్చేవాడు. పక్కా సమాచారం మేరకు పట్టివేత..నకుల్ కై లాష్ గైక్వాడ్ కారులో గంజాయి తరలిస్తున్న విషయాన్ని ఓ వ్యక్తి పోలీసులకు తెలియజేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. శనివారం చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా.. ముందు నంబర్ ప్లేటు లేకుండా వస్తున్న నకుల్ కై లాష్ గైక్వాడ్ కారును ఆపి తనిఖీలు చేయగా అందులో గంజాయిని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని 102 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, రూ.2వేల నగదు, వివిధ రాష్ట్రాలకు చెందిన కారు నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో ముంబైకి చెందిన సేటు అనే వ్యక్తి, నర్సీపట్నం పరిధిలోని కన్నూరుపాలెంకు చెందిన వీరబాబును అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు, సిబ్బందికి డీసీపీ రివార్డులు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్, ఎస్ఐలు భాస్కర్‌రెడ్డి, యాదగిరి, సిబ్బది సత్యనారాయణ, సందీప్, భరద్వాజ్, పాపయ్య తదితరులు ఉన్నారు. గంజాయి తరలిస్తున్న నిందితుడి అరెస్ట్ రిమాండ్‌కు తరలింపు వివరాలు వెల్లడించిన భువనగిరి డీసీసీ రాజేష్‌చంద్ర -
నేటి నుంచి అలంకార, వాహన సేవలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి అలంకార సేవలు, వాహన సేవలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. 7 రోజుల పాటు ఒక్కో అలంకారంలో ఒక్కో సేవపై స్వామివారు ఊరేగనున్నారు. సోమవారం ఉదయం మత్స్యావతార అలంకార సేవ, రాత్రి శేష వాహన సేవ, 4వ తేదీ ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ, 5వ తేదీ ఉదయం శ్రీకృష్ణాలంకార(మురళీకృష్ణుడు) సేవ, రాత్రి పొన్నవాహన సేవ, 6వ తేదీ ఉదయం గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ, 7వ తేదీ ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవలో స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, 8వ తేదీ ఉదయం హనుమంత వాహనంపై శ్రీరామ అలంకార సేవ, రాత్రి గజవాహన సేవలో తిరుకల్యాణ మహోత్సవం, 9వ తేదీ ఉదయం గరుడ వాహనంపై శ్రీమహావిష్ణు అలంకార సేవతో అలంకార సేవలు ముగియనున్నాయి. అదే రోజు రాత్రి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది. బంగారు తాపడం చేసిన వాహనాలపై..యాదగిరీశుడు తొలిసారిగా స్వర్ణ తాపడం చేసిన వాహన సేవలపై ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగనున్నారు. హైదరాబాద్‌కు చెందిన సాయి పావని కన్స్ట్రక్షన్స్ ఇండియా లిమిటెడ్, గార్లపాటి పెద్ద యాదయ్య, రామలింగేశ్వరి కుటుంబ సభ్యులు రూ.12లక్షలతో గరుడ, శేష వాహనాలకు బంగారు తాపడం చేయించారు. అంతేకాకుండా రూ.4లక్షలతో అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు నూతనంగా బర్మా టేకుతో సేవ పీటలను తీర్చిదిద్దారు. వీటి పైనే స్వర్ణ తాపడం చేసిన శేష, గరుడ వాహనంపై స్వామి వారు ఊరేగుతారు.చివరి రెండు రోజులు ఇలా..10వ తేదీన ఉదయం మహా పూర్ణాహుతి, విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థం, సాయంత్రం శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను జరిపిస్తారు. 11వ తేదీ ఉదయం 10గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహించి ఉత్సవాలను ముగిస్తారు. తొలిసారి బంగారు తాపడం చేసిన వాహనాలపై ఊరేగనున్న యాదగిరీశుడు -
ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
మేళ్లచెరువు: మహాశిరాత్రి సందర్భంగా మేళ్లచెరువు మండల కేంద్రంలోని శివాలయం వద్ద నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. మొదటి బహుమతి ఏపీలోని చిత్తూరు జిల్లా జట్టు, రెండో బహుమతి విజయనగరం జిల్లా జట్టు, మూడో బహుమతి కృష్ణా జిల్లా జట్టు, నాల్గో బహుమతి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జట్లు గెలుచుకున్నాయి. విజేతలకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐరా రియాల్టీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి, వీరారెడ్డి, మాజీ ఎంపీపీ పద్మాసైదేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ పద్మాగోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోదాడ ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
కోదాడ: కోదాడ పట్టణ సమీపంలోని ఖానాపురానికి చెందిన ఓ వ్యక్తి పురిటినొప్పులతో బాధపడుతున్న తన భార్యను ఫిబ్రవరి 26 తెల్లవారుజామున కోదాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పట్టించుకోలేదని అతడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేరని, నర్సులు తన భార్యను పరీక్షించి కండీషన్ సీరియస్‌గా ఉందని సూర్యాపేటకు తీసుకెళ్లమని చెప్పారని, అంబులెన్స్ ఉన్నా కూడా ఏర్పాటు చేయలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ దృష్టికి వెళ్లడంతో ఆయన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని శనివారం జిల్లా వైద్యాధికారిని ఆదేశించినట్లు తెలిసింది. ఇదే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ దశరథనాయక్‌ను వివరణ కోరగా.. కోదాడ ఆస్పత్రిలో ముగ్గురు గైనకాలజిస్టులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారని, ఫిబ్రవరి 26న సదరు గర్భిణి ఆస్పత్రికి వచ్చిన సమయంలో ఆ వైద్యురాలు సెలవులో ఉండడంతో సిబ్బంది పరిశీలించి ఉమ్మ నీరు ఎక్కువగా ఉండడంతో సూర్యాపేటకు తీసుకెళ్లాలని సూచించారని పేర్కొన్నారు. సిబ్బంది, వైద్యుల కొరత లేకుండా చూడాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపామని పేర్కొన్నారు. షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశం..? -
ఎంజీయూలో స్టాఫ్ క్వార్టర్స్ ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో స్టాఫ్ కోసం నిర్మించిన క్వార్టర్స్‌ను వైస్ చాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంజీయూ సైతం ఐఐటీ తరహాలో రూపుదాల్చడానికి ఇదొక ముందడుగని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అలువాల రవి, ఆకుల రవి, డా. శ్రీదేవి, కొప్పుల అంజిరెడ్డి, వై. ప్రశాంతి, ఉపేందర్‌రెడ్డి, మద్దిలేటి, ఇంజనీర్ శైలజ, అధ్యాపకులు పాల్గొన్నారు. నల్లబెల్లం, పటిక పట్టివేతమద్దిరాల: బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను ఆదివారం మద్దిరాల మండల కేంద్రంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం మామిండ్లమడవ గ్రామానికి చెందిన షేక్ ఖాదర్, షేక్ మదారు అన్నదమ్ములు. వీరిద్దరు కలిసి 30క్వింటాళ్ల నల్లబెల్లం, 10 కిలోల పటికను బొలేరో వాహనంలో రాజు అనే డ్రైవర్ సహాయంతో ఏపీలోని చిత్తూరు నుంచి మామిండ్లమడవ గ్రామానికి తరలిస్తుండగా మద్దిరాల మండల కేంద్రంలో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నల్లబెల్లం, పటికతో పాటు బొలేరో వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతిఅడ్డగూడూరు : అడ్డగూడూరు మండలం కంచనపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటుందని, ఆమె భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలు మహారాష్ట్రకు చెందిన టీషర్ట్ ధరించి ఉందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి కారమైన గుర్తుతెలియని వాహనం కోసం సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కుక్కల దాడి.. గొర్రెలు మృతితుంగతుర్తి: కుక్కల దాడి చేయడంతో పది గొర్రెలు మృతిచెందాయి. తుంగతుర్తి మండలం మంచతండాకు చెందిన లాకవత్ లాల్‌సింగ్ తన గొర్రెలను రోజుమాదిరిగానే శనివారం సాయంత్రం తన ఇంటి ఎదుట గల దొడ్డిలోకి గొర్రెలను తోలాడు. రాత్రి వేళ దొడ్డిలోకి కుక్కలు చొరబడి గొర్రెలపై దాడి చేయడంతో 10 గొర్రెలు మృతిచెందాయి. గొర్రెల విలువ రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ప్రైవేట్ బస్సులో ప్రసవంచిట్యాల: చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఆదివారం తెల్లవారుజామున కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతుల కారు ట్రావెల్స్ బస్సును కిందకు వెళ్లగా.. ఆ బస్సు దాని ముందున్న కారును, ఆ కారు మరో ట్రావెల్స్ బస్సును ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ నుంచి ఏపీకి గర్భిణి శశికళ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తోంది. ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న బస్సు కొద్దిసేపటి తర్వాత చిట్యాలకు చేరుకుంది. అదే సమయంలో శశికళకు పురిటి నొప్పులు రావటంతో తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ రాలేదు. చిట్యాలలో ట్రాఫిక్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు జలంధర్, శివ బస్సు వద్దకు చేరుకుని శశికళకు ధైర్యం చెబుతుండగా.. ఆమె బస్సులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అక్కడకు అంబులెన్స్ చేరుకోగా.. వైద్య సిబ్బంది పరీక్షించి నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మంత్రి కోమటిరెడ్డి రంజాన్ మాస శుభాకాంక్షలు
నల్లగొండ : రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షలను భక్తిశ్రద్ధలతో పాటిస్తారని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. సమాజానికి మంచి పేరు తేవాలినల్లగొండ : సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు కష్టపడి చదివి సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్లగొండ సమీపంలోని మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడి వారి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించారు. రోమిల్లా థాపర్, ఇందిరాగాంధీ వంటి ఉన్నతమైన వ్యక్తులు, ఆశయాలు కలిగిన వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. జర్నలిజం, క్రోమోజోమ్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం వంటగదిని, డైనింగ్, హాల్ పరిసరాలను పరిశీలించారు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ వాడవద్దని ప్రిన్సిపాల్‌కు సూచించారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ షాహిన్ షేక్, ఉపాధ్యాయులు ఉన్నారు. డీసీఎంఎస్ పర్సన్ ఇన్చార్జిగా అదనపు కలెక్టర్ నల్లగొండ : ఉమ్మడి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పర్సన్ ఇన్చార్జిగా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ నియమితులయ్యారు. శనివారం నల్లగొండలోని డీసీఎంఎస్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ డీసీఎంఎస్ పర్సన్ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా సహకార శాఖ అధికారి పత్యానాయక్, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 20వ తేదీలోగా డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలినల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష ఫీజు ఈనెల 20వ తేదీలోగా చెల్లించాలని ఎంజీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉపేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 అపరాధ రుసుంతో అయితే ఈనెల 22వ తేదీలోగా చెల్లించవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులు గమనించి సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. -
ఫ్రెష్ బైట్స్ ఫ్రూట్ బాక్స్
పండ్ల కోసం మార్కెట్‌కు వెళ్లే పని లేదిక.. సాధారణంగా జనం వారికి అవసరం ఉన్న పండ్లను మాత్రమే కొనుగోలు చేసి తింటుంటారు. ఇక మధ్య తరగతి ప్రజలు ఒకటి, రెండు రకాల పండ్లను మాత్రమే కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు శివాజీనగర్‌లో వెలసిన స్టాల్లో 7 రకాల పదార్థాలతో ఒక ప్యాక్ తయారు చేశారు. అందులో 5 రకాల పండ్లు, ఒక రకం మొలకెత్తిన గింజలు, వెజిటేబుల్ ఉంటాయి. ఈ డబ్బాను రోజూ (ఆదివారం మినహా) ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో (6 నుంచి 8 గంటల వరకు) ఉచితంగా డెలివరీ చేస్తారు. ఇందు కోసం నెలకు రూ.2 వేలు తీసుకుంటున్నారు. తాజా పండ్ల కోసం మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండా వాటిని మన ఇంటి వద్దకే పంపుతూ.. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. ఇంటి వద్దకే.. పోషకాలు పండ్ల ముక్కలు మొలకెత్తిన గింజలు, వెజిటబుల్స్ డోర్ డెలివరీ ఇద్దరు యువకుల వినూత్న బిజినెస్ ప్రజల ఆహారపు అలవాట్లు మారాయి. తాజా పండ్ల ముక్కలు, మొలకెత్తిన చిరుధాన్యాల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అయితే.. వాటిని కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు వెళ్లాలంటే సమయం దొరకదు. ఒకవేళ వెళ్లినా అన్ని ఒకేచోట లభించవు. ఇలాంటి పరిస్థితుల నుంచి అధిగమించేందుకు నల్లగొండ పట్టణంలో ఒక కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇంటి వద్దకే ఆరోగ్యం అనే భావనతో నల్లగొండలోని శివాజీనగర్‌లో ఫ్రెష్ బైట్స్ ఫ్రూట్ బాక్స్ అనే షాపును ప్రారంభించి.. ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నారు. -
ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాం
నల్లగొండ టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై నిరంతరంగా ఉద్యమిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందన్నారు. రైతుల, కార్మికుల, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో సరైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పది సంవత్సరాలుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు నిర్వహించని కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని అభిప్రాయపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 2 నుంచి నెలాఖరు వరకు దశల వారీగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యమిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే చలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, నాగార్జున, డబ్బికార్ మల్లేష్, ప్రభావతి, సయ్యద్ హాశం పాల్గొన్నారు.ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
నల్లగొండ
ఇఫ్తార్ 6–28 (ఆదివారం సాశ్రీశ్రీ) సహర్ 5–11 (సోమవారం ఉశ్రీశ్రీ)ఉత్కంఠగా ఎద్దుల పందేలు మేళ్లచెరువు మండల కేంద్రంలోని శివాలయం వద్ద నిర్వహిస్తున్న ఎద్దుల పందేలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. 7- 8లోఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025స్వర్ణ వర్ణ వెలుగుల్లోకి.. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో స్వర్ణ వర్ణ శోభితంగా మారింది. - 8లో -
షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం
ఆర్డర్లు పెరిగాయి మొన్నటి వరకు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఫ్రెష్ బైట్స్ ఫ్రూట్ బాక్స్ డెలివరీ సౌకర్యం ఉండేది. నల్లగొండలో రెండు నెలల క్రితం ప్రారంభించాం. ప్రస్తుతం పట్టణంలో 60కి పైగా ఆర్డర్లు ఉన్నాయి. ఒక ప్యాక్‌లో అన్ని రకాల పండ్లు, చిరు ధాన్యాలు, కూరగాయలు లభిస్తాయి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వాట్సప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్లు పెరిగితే భవిష్యత్‌లో సాయంత్రం డిన్నర్ సమయంలో కూడా డెలివరీ చేస్తాం. – సిహెచ్.వినోద్, నిర్వాహకుడు -
ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
నల్లగొండ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిఘా నీడలో నిర్వహిస్తాం. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు వాటిని అనుసంధానం చేశాం. అక్కడి నుంచే ఉన్నతాధికారులు పరీక్షల నిర్వహణను పరిశీలిస్తారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచిస్తున్నారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి దస్రూనాయక్. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పరీక్షలు రాయనున్న 28,772 మంది విద్యార్థులు మార్చి 5 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 28,772 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఫస్టియర్ 13,992 మంది, సెకండియర్ 14,730 మంది ఉన్నారు. పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్షలకు సంబంధించి మెటీరియల్‌ను పంపిణీ చేయడంతో పాటు హాల్ టికెట్లను విద్యార్థులకు అందజేశాం. ఈసారి హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించాం. దాన్ని స్కాన్ చేస్తే ఆ పరీక్ష కేంద్రం పూర్తి అడ్రస్ ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. ఎగ్జామినేషన్ కమిటీ నియామకం.. పరీక్షల నిర్వహణకు ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీలో డీఐఈఓతోపాటు దేవరకొండ బాలికల జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.శ్రీదేవి, చింతపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ధనరాజ్, కేపీఎం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎండీ.ఇస్మాయిల్ ఉన్నారు. హైపవర్ కమిటీకి కలెక్టర్, ఎస్పీ, నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ మల్లారెడ్డి, కేపీఎం కాలేజీ జూనియర్ లెక్చరర్ బి.బాలోజి ఉన్నారు. ప్లయింగ్ స్క్యాడ్ బృందంలో పిజిక్స్ లెక్చరర్ ఎం.ధనమ్మ, ఎం.షీబాలు ఉన్నారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. పరీక్ష సమయాని గంట ముందు నుంచే కేంద్రంలోకి అనుమతిస్తాం. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉంటుంది. కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనల మేరకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరేలా ఆర్టీసీ బస్‌లు నడుపుతారు. ఉదయం పరీక్ష కేంద్రానికి పోలీస్స్టేషన్ల నుంచి పేపర్లను ఆయా సెంటర్లకు తరలిస్తాం. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించాం. ఫ ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం ఫ విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు ‘సాక్షి’తో డీఐఈఓ దస్రూనాయక్20 మందికి ఒక ఇన్విజిలేటర్.. 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున మొత్తం 28,772 మంది విద్యార్థులకు 1400 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం. -
రేపే ఎమ్మెల్సీ కౌంటింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ 3వ తేదీన (సోమవారం) జరుగనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను నల్లగొండకు తరలించి ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. 3వ తేదీన ఉదయం వాటికి బయటకు తీసి అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో 25,797 ఓట్లకు గాను 24,139 ఓట్లు (93.57 శాతం) పోల్ అయ్యాయి. 25 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు 25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్వైజర్తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రోఅబ్జర్వర్ ఉంటారు. మొత్తంగా 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది మైక్రోఅబ్జర్వర్లను నియమించారు. మరో 250 మంది సిబ్బందిని స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకురావడానికి, కౌంటింగ్‌లో ఇతర పనులకు వినియోగించేందుకు నియమించారు. 250 మంది పోలీసులు అక్కడ భద్రతలో పాలుపంచుకోనున్నారు. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లు ఓపెన్ లెక్కింపు ప్రక్రియలో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు ఆయా అభ్యర్థులు లేదా వారి తరఫున వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, అబ్జర్వర్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేస్తారు. మొదటి రౌండ్లో 25 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి బాక్సులు ఓపెన్ చేస్తారు. వాటిలో ప్రతి 25 ఓట్లను బండిల్ కట్టి డ్రమ్ములో వేస్తారు. ఆ తర్వాత మళ్లీ స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి మరో 25 పోలింగ్ బూత్‌లకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి ఇస్తారు. అలా ఎనిమిదిసార్లు 200 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెచ్చి బండిల్స్‌గా కడతారు. ఈ ప్రక్రియ అంతా గంటలో పూర్తవుతుంది. చెల్లిన ఓట్లలో సగానికిపైగా వస్తేనే..మొత్తం పోలైన ఓట్లలో ఎన్ని ఓట్లు చెల్లుబాటు అవుతాయో, ఆ చెల్లిన ఓట్లలో సగం ఓట్లకు మించి ఒక ఓటును కలిపి గెలుపు కోటాగా నిర్ణయిస్తారు. మొదటి రౌండ్లో పోలైన ఓట్లలో ఎవరికై తే సగానికి మించి ఒక ఓటు అధికంగా వస్తుందో వారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఒక వేళ మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా గెలుపు కోటా రాకపోతే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 24,139 పోల్ అయ్యాయి. అందులో సగానికి మించి 12,070 ఓట్లు సాధించిన అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుస్తారు. ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడ కోటా ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఎలిమినేషన్.. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థి కూడా గెలువకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. 19 మంది అభ్యర్థుల్లో ఏ అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు వస్తాయో, ఆ అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఏయే అభ్యర్థులకు వేశారో, వాటిని ఆయా అభ్యర్థులకు కలుపుతారు. అప్పటికి కూడా గెలుపుకు కోటా రాకపోతే ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి వేశారో ఆయా అభ్యర్థులకు ఓ ఓట్లను కలుపుతారు. అప్పుడు మళ్లీ కోటా వచ్చిందా రాలేదా చూస్తారు. ఎవరికై నా గెలుపు కోటా వస్తే దాంతో గెలిచినట్లుగా భావిస్తారు. ఒక వేళ కోటా రాకపోతే అదే తరహాలో చివరి అభ్యర్థి వరకు తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ వస్తారు. అలా గెలుపు కోటా వచ్చేంత వరకు లెక్కిస్తుంటారు. కోటా రాకపోయినా ఎవరైతే ఎలిమినేట్ కాకుండా చివరి వరకు ఉంటారో ఆ అభ్యర్థినే విజేతగా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అర్థరాత్రివరకు సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. 25 టేబుళ్లపై ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ఫ మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఫ గెలుపునకు సరిపడా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ షురూ ఫ ఆ తరువాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఫ సోమవారం అర్ధరాత్రి తర్వాత తేలనున్న ఫలితంఓట్ల లెక్కింపునకు సహకరించాలినల్లగొండ : వరంగల్– ఖమ్మం –నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సవ్యంగా జరిగేందుకు సహకరించాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం ఆమె కలెక్టరేట్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏర్పాటు చేయనున్న టేబుళ్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లు, కానీ ఓట్ల గుర్తింపు తదితర అంశాలను వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పోటీ చేసే అభ్యర్థులు, ఏజెంట్లు పాల్గొన్నారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 25 టేబుళ్లలో ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థులు చూసుకునేలా 19 గడీలు కలిగిన ర్యాక్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లకు చూపిసూ్త్ ఆ బ్యాలెట్ పేపర్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసారో ఆ అభ్యర్థికి సంబంధించిన గడిలో ఆ బ్యాలెట్ పేపర్‌ను వేస్తూ వెయ్యి ఓట్లను ఒక్కో టేబుల్‌పై లెక్కిస్తారు. ఒక వేళ ఓటు చెల్లకపోతే దాన్ని ఏజెంట్లందరికి చూపి పక్కన పెడతారు. అలా మొదటి రౌండ్ కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. -
లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవం
విశ్వక్సేనుడికి తొలిపూజ, స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం యాదగిరిగుట్ట : భక్తజనబాంధవుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలకు మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వేదపండితులు శనివారం వైభవంగా శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు ప్రధానాలయంలోని మూలవర్యుల ఆజ్ఞ (అనుమతి)తో పూజలు ప్రారంభించి 10.15కు విశ్వక్సేన ఆరాధన, 10.50గంటలకు స్వస్తివాచన పూజలు చేసి ఉత్సవాలకు తెరలేపారు. విశ్వశాంతి, లోకకల్యాణార్థం నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను పాంచరాత్రాగమ శాస్త్రానుసారం ప్రధానాలయంలో ఈనెల 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. విశ్వక్సేనుడికి తొలిపూజ దేవతల సర్వసేనానాయకుడు విశ్వక్సేనుడికి తొలి పూజతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో దివ్య మనోహరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను గర్భాలయం ఎదుట ప్రత్యేకపీఠంపై అధిష్ఠింపజేశారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగడానికి నిర్దేశించిన మంత్రోచ్ఛరణలతో తొలిపూజా పర్వాలను నిర్వహించారు. ముల్లోకాలకు శుభం కలగాలని వేదమంత్రాలు పఠిస్తూ విశ్వక్సేనుడిని ఆరాధించారు. స్వస్తిపుణ్యాహవాచనం, రక్షాబంధనం విశ్వశాంతిని, లోకకల్యాణం కోసం, ప్రాణికోటి, ఇతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని భగవంతుడిని వేడుకొనుట స్వస్తిపుణ్యాహవాచనం పూజ విశిష్టత. స్వస్తివాచన మంత్ర జలాన్ని గర్భాలయం, ఉప ఆలయాలు, ముఖమండపం, ధ్వజస్తంభానికి, ఆలయ తిరుమాడ వీధులు, ఆలయ పరిసరాల్లో, భక్తులపై సంప్రోక్షణ గావించారు. అనంతరం లోకకల్యాణార్థం సమర్పించబడిన రక్షాబంధనాన్ని స్వీకరించే వేడుక నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్టా బంగారు కవచమూర్తులు, ఉప ఆలయాల్లోని ఆండాళ్ అమ్మవారికి, ఆళ్వారులకు, విశ్వక్సేనుడికి, ముఖడపంలోని ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేశారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు, భక్తులకు రక్షాబంధనం కట్టారు. శాస్త్రోక్తంగా మృత్సంగ్రహణం సాయంత్రం నిత్య పూజల అనంతరం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, ధర్మకర్త నర్సింహమూర్తి, అర్చకులు, యజ్ఞాచార్యులు, పారాయణికులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణ వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజలు ఉంటాయి. -
నృసింహుడికి పోచంపల్లి పట్టువస్త్రాలు
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు బహూకరిస్తుంటారు. అందులో భాగంగానే శనివారం స్థానిక శ్రీమార్కండేశ్వర స్వామి దేవాలయంలో పట్టువస్త్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన, కీర్తనలతో పట్టువస్త్రాలతో ప్రదర్శనగా యాదగిరిగుట్టకు వెళ్లి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(డీఈఓ) భాస్కరశర్మకు రెండు పట్టు చీరలు, పట్టు పంచెలు, రెండు శాలువాలను అందజేశారు. అదేవిధంగా మార్కండేశ్వరస్వామి దేవాలయం ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ మహాజన సంఘం అధ్యక్షుడు సీత చంద్రయ్య, మార్కండేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సీత సత్యనారాయణ, అర్బన్ బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, పద్మశాలీ నాయకులు తడక వెంకటేశం, భారత లవకుమార్, రాపోలు శ్రీను, అంకం మురళి, భోగ నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా.. మహిళా కూలీ మృతి
త్రిపురారం: అదుపుతప్పి ఆటో బోల్తా పడి మహిళా కూలీ మృతిచెందగా.. మరికొంత మంది కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన నిడమనూరు మండలం వేంపాడు గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగింది. నిడమనూరు ఎస్ఐ గోపాల్‌రావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన కూలీలు పత్తి, మిరపకాయలు ఏరడానికి ప్రతిరోజు ఆటోలో హాలియా, పెద్దవూర మండలాలకు వెళ్తున్నారు. శనివారం కూడా ఆటోలో 12మంది కూలీలు వెళ్తుండగా.. నిడమనూరు మండలం వేంపాడు గ్రామ స్టేజీ వద్ద లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్లల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు మేకల రాములమ్మ, అనుముల కృష్ణయ్య, అనుముల సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో మిర్యాలగూడలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మేకల రాములమ్మ(55) మృతిచెందింది. మిగతా కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో పరిమితికి మించి కూలీలు ప్రయాణిస్తుండడంతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. క్షతగాత్రుడు అనుముల కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్‌రావు తెలిపారు. ఫ ఇద్దరికి తీవ్ర గాయాలు -
ఉత్కంఠగా కొనసాగుతున్న ఎద్దుల పందేలు
మేళ్లచెరువు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మేళ్లచెరువు మండల కేంద్రంలోని శివాలయం వద్ద నిర్వహిస్తున్న ఎద్దుల పందేలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన సబ్ జూనియర్ విభాగంలో 14 జతల ఎద్దులు పాల్గొనగా ఏపీలోని ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం మద్దిరాల ముప్పాళ్ల గ్రామానికి చెందిన పుచ్చకాయల శేషాద్రిచౌదరికి చెందిన ఎద్దుల జత మొదటి బహుమతి సాధించాయి. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన ప్రతీక రామకృష్ణకు చెందిన ఎద్దుల జత రెండో బహుమతి, ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామానికి గరికపాటి శ్రీధర్‌రావుకు చెందిన జత మూడో బహుమతి సాధించాయి. జూనియర్ విభాగంలో.. సాయంత్రం నిర్వహించిన జూనియర్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన రోహన్‌బాబు ఎద్దుల జత మొదటి స్థానం, ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ల శివకృష్ణయాదవ్ జత రెండో బహుమతి సాధించాయి. మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, రెండో బహుమతిగా రూ.1,05,000, మూడో బహుమతిగా రూ.95వేలు అందించారు. -
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
హుజూర్నగర్ (చింతలపాలెం): ఏపీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను చింతలపాలెం మండలంలో శనివారం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ఎస్ఐ అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరు వాగు నుంచి చింతలపాలెం మండలం వజినేపల్లికి రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న ఎస్ఐ వజినేపల్లి వద్ద ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఎన్టీఆర్ కృష్ణా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు గుంజ రాము, లింగయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొంగలు బర్డ్ ఫ్లూతో చనిపోలేదు ● ప్రజలు భయాందోళన చెందవద్దు ● త్రిపురారం మండల పశు వైద్యాధికారి నాగేందర్ త్రిపురారం: త్రిపురారం మండల కేంద్రం నుంచి కుక్కడం వెళ్లే హదారిలో కృషి విజ్ఞాన కేంద్రం వద్ద మృతిచెందిన కొంగలు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోలేదని, అవి సాధారణంగా చనిపొయి రోడ్డుపై పడి ఉన్నాయని త్రిపురారం మండల పశు వైద్యాధికారి నాగేందర్ అన్నారు. శుక్రవారం కొంగలు మృత్యువాత అని సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన ఆయన కొంగలు మృతిచెందిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. పెద్ద చెట్లపై కొంగలు ఎక్కువగా ఉండడం వల్ల అవి కొట్లాడుకొని అందులో కొన్ని మాత్రమే చనిపోయాయన్నారు. మిగిలి ఉన్న పక్షులు ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఒకే చోట 50 నుంచి 100 పక్షులు చనిపోతేనే బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు గుర్తించవచ్చని, ప్రస్తుతం మండలంలో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్ సూర్యాపేటటౌన్: గంజాయి విక్రయించడంతో పాటు సేవిస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం సూర్యాపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ విలేకరులకు వెల్లడించారు. శుక్రవారం సూర్యాపేట రూరల్ ఎస్ఐ ఎన్. బాలునాయక్ తన సిబ్బందితో కలిసి సూర్యాపేట మండలం కేసారం వెళ్తుండగా.. గ్రామ శివారులో నలుగురు యవకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో కేసారం గ్రామానికి చెందిన మెంతబోయిన గణేష్, గొర్ల శివారెడ్డి, రామారం గ్రామానికి చెందిన పబ్బు వినయ్ ఉన్నారు. వారిని విచారించగా.. ఒడిషా రాష్ట్రంలోని అంపదర్ గ్రామానికి చెందిన ఆనంద్ నుంచి గంజాయి కిలో రూ.2వేలకు కొనుగోలు చేసి బైక్‌పై సూర్యాపేటకు తీసుకొచ్చి విక్రయిస్తామని, అదేవిధంగా నలుగురం కలిసి కేసారం గ్రామ శివారులోని శ్మశాన వాటికలో గంజాయి తాగుతామని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసారం గ్రామానికి చెందిన మామిడి గోపి, ఒడిషా రాష్ట్రంలోని అంపదర్ గ్రామానికి చెందిన ఆనంద్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్ఐ బాలునాయక్, పెన్‌పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ పాల్గొన్నారు. -
ఆటో బోల్తా.. మహిళా కూలీ మృతి
త్రిపురారం: అదుపుతప్పి ఆటో బోల్తా పడి మహిళా కూలీ మృతిచెందగా.. మరికొంత మంది కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన నిడమనూరు మండలం వేంపాడు గ్రామ స్టేజీ వద్ద శనివారం జరిగింది. నిడమనూరు ఎస్ఐ గోపాల్‌రావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన కూలీలు పత్తి, మిరపకాయలు ఏరడానికి ప్రతిరోజు ఆటోలో హాలియా, పెద్దవూర మండలాలకు వెళ్తున్నారు. శనివారం కూడా ఆటోలో 12మంది కూలీలు వెళ్తుండగా.. నిడమనూరు మండలం వేంపాడు గ్రామ స్టేజీ వద్ద లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్లల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు మేకల రాములమ్మ, అనుముల కృష్ణయ్య, అనుముల సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో మిర్యాలగూడలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మేకల రాములమ్మ(55) మృతిచెందింది. మిగతా కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో పరిమితికి మించి కూలీలు ప్రయాణిస్తుండడంతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. క్షతగాత్రుడు అనుముల కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్‌రావు తెలిపారు. ఫ ఇద్దరికి తీవ్ర గాయాలు -
నృసింహుడికి పోచంపల్లి పట్టువస్త్రాలు
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు బహూకరిస్తుంటారు. అందులో భాగంగానే శనివారం స్థానిక శ్రీమార్కండేశ్వర స్వామి దేవాలయంలో పట్టువస్త్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన, కీర్తనలతో పట్టువస్త్రాలతో ప్రదర్శనగా యాదగిరిగుట్టకు వెళ్లి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(డీఈఓ) భాస్కరశర్మకు రెండు పట్టు చీరలు, పట్టు పంచెలు, రెండు శాలువాలను అందజేశారు. అదేవిధంగా మార్కండేశ్వరస్వామి దేవాలయం ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ మహాజన సంఘం అధ్యక్షుడు సీత చంద్రయ్య, మార్కండేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సీత సత్యనారాయణ, అర్బన్ బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, టై అండ్ డై అసోషియేషన్ అధ్యక్షుడు భారత లవకుమార్, పద్మశాలీ నాయకులు తడక వెంకటేశం, భారత లవకుమార్, రాపోలు శ్రీను, అంకం మురళి, భోగ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.