Nizamabad
-
పసుపు రైతులు అల్లాడుతుంటే.. రేవంత్ సర్కార్ ఏం చేస్తోంది?: కవిత
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ నిలదీశారు. మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. క్వింటాలు పసుపుకు 15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పసుపునకు కనీసం 9 వేలు రాని పరిస్థితి ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమని కవిత ధ్వజమెత్తారు.‘‘ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలి. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పారు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలి’’ అని కవిత డిమాండ చేశారు. -
రోడ్డెక్కిన పసుపు రైతులు
సుభాష్‌నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు కొనడం లేదని రైతులు రోడ్డెక్కారు. ప్రధాన బస్టాండ్ ఎదుట ధర్నాకు దిగారు. సోమవారం శ్రద్ధానంద్ గంజ్‌కు 39 వేల బస్తాల పసుపు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో పసు పు ధర తగ్గడంతో పంట కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. మధ్యాహ్నం కావస్తున్నా వ్యాపారులు ధర కోడ్ చేయడానికి రాకపోవడంతో రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద కు చేరుకున్నారు. పసుపును ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులు, సిబ్బందిని నిలదీయగా, వారి నుంచి సరైన సమాధానం రాలేదు. కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్‌యార్డు నుంచి ర్యా లీగా నగరంలోని ప్రధాన బస్టాండ్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. సుమారు గంటకుపైగా ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ● అంతర్జాతీయ మార్కెట్లో 45 రోజుల క్రితం పసుపు ధర క్వింటాలుకు రూ.15,200 ఉండగా, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ మార్కెట్ కమిటీ క్వింటాలుకు కటాఫ్ ధర రూ.10 వేలుగా నిర్ణయించింది. ఈ మేరకు కొనుగోళ్లు జరిగేవి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో కొన్నిరోజులుగా పసుపు ధర తగ్గుతూ ప్రస్తుతం క్వింటాలుకు రూ.11,500 పలికింది. మార్కెట్ కమిటీ నిర్ణయించిన కటాఫ్ ధర తగ్గించాలని వ్యాపారులు కోరారు. రైతుల సంక్షేమం దృష్ట్యా కటాఫ్ ధర తగ్గించేందుకు మార్కెట్ కమిటీ అంగీకరించలేదు. దీంతో రైతులు తీసుకొచ్చిన పంటకు వ్యాపారులు ధర కోడ్ చేయడానికి ముందుకు రాలేదు. రైతులు ఆందోళన చెంది ధర్నాకు దిగారు. రైతులతో చర్చలు.. ధర్నా విరమించిన అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజా వెంకట రెడ్డి, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ, డీఎంవో గంగు సమక్షంలో వ్యాపారులు, రైతులతో మార్కెట్ కమిటీ కార్యాలయంలో చర్చ లు జరిపారు. అంతర్జాతీయంగా ధర తగ్గిందని కటాఫ్ ధర తగ్గించాలని వ్యాపారులు అధికారుల తో పేర్కొన్నారు. ధర తగ్గిస్తే ఊరుకోబోమని, మద్ద తు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు జోక్యం చేసుకుని కటాఫ్ ధరను పసుపు కాడికి రూ.9,500, గోలకు రూ.8 వేలుగా వ్యాపారులు, రైతుల సమక్షంలో నిర్ణయించారు. అందరూ సమ్మతం తెలపడంతో చర్చలు సఫలమయ్యాయి. అదనపు కలెక్టర్ హామీతో విరమణ ప్రధాన బస్టాండ్ ఎదుట రైతుల ధర్నా విష యం తెలుసుకున్న ఏసీపీ రాజా వెంకట రెడ్డి అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మార్కెట్‌యార్డులో వ్యా పారులు సిండికేట్ అయ్యారని, పసుపు ధర తగ్గిస్తున్నారని, పంటను కొనడం లేదని రైతు లు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ వచ్చి హామీనివ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. ఎండిన పసుపు తేవాలి.. రైతుల సంక్షేమానికి మార్కెటింగ్ శాఖ, ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులు పచ్చి పసుపు తీసుకురావొద్దు. ఎండిన పసుపు తెచ్చి మంచి ధర పొందాలి. కొందరు రైతులు పచ్చి పసుపు తేవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు, వ్యాపారులు, అధికారుల సమక్షంలో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. మంగళవారం నుంచి యథావిధిగా పసుపు క్రయవిక్రయాలు జరుగుతాయి. – ముప్ప గంగారెడ్డి, చైర్మన్ నిజామాబాద్ మార్కెట్లో పంట కొనుగోలు చేయాలని ధర్నా అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గడంతో కొనడానికి ముందుకు రాని వ్యాపారులు నగరంలోని బస్టాండ్ ఎదుట రైతుల ఆందోళనతో ట్రాఫిక్‌కు అంతరాయం.. వ్యాపారులు, రైతులతో అధికారులు జరిపిన చర్చలు సఫలం నేటి నుంచి యథావిధిగా మార్కెట్లో పసుపు కొనుగోళ్లు -
డీపీవోగా శ్రీనివాస్‌రావు బాధ్యతల స్వీకరణ
సుభాష్‌నగర్: జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా శ్రీనివాస్‌రావు సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. గతంలోనే శ్రీనివాస్‌రా వు బదిలీ ఉత్తర్వులు వెలువడినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఇన్చార్జి డీపీవోగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్ నిజామాబాద్ డీఎల్పీవోగా కొనసాగనున్నారు. అలాగే బోధన్ డీఎల్పీవోగా నాగరాజు బాధ్యతలు చేపట్టారు. ఆయన బాన్సువాడ నుంచి బోధన్‌కు బదిలీపై వచ్చారు. 13 నుంచి రైల్వే గేటు మూసివేత నవీపేట: మండలంలోని ధర్మారం(ఏ) రైల్వే గేటును ఈనెల 13 నుంచి మూసివేయనున్న ట్లు రైల్వే ఇంజినీర్ రవి ప్రకాశ్ సోమవారం తెలిపారు. అండర్ బ్రిడ్జి నిర్మా ణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో గేటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నా రు. ప్రయాణికులు సహకరించాలని కోరారు. అల్జాపూర్ శివారులో చిరుత సంచారం నవీపేట: మండలంలోని అల్జాపూర్–యంచ గ్రామాల మధ్య చెరువు కట్టపై సోమవారం చిరుత కనిపించడంతో రెండు గ్రామాల ప్ర జలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులకు చిరుత కనిపించడంతో వెంటనే పారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నిజామాబాద్ బీట్ ఆఫీసర్ సుధీర్, సెక్షన్ ఆఫీసర్ జెహ్రూ చెరువు ప్రాంతంలో పర్యటించి ఆనవాళ్లను సేకరించారు. పాదముద్రలు చిరుతవేనని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సీఐల బదిలీలు ఖలీల్‌వాడి: మల్టీ జోన్–1 పరిధిలో 114 మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీకి అటాచ్గా ఉన్న రవికుమార్‌ను సీసీఎస్ నిజామాబాద్‌కు, జి.వెంకటయ్య పీసీఆర్ కామారెడ్డి నుంచి ఎన్ఐపీ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. కాగా, రెండు, మూడు రోజుల్లో కొత్త సీఐలు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంటర్ పరీక్షలకు 417 మంది గైర్హాజరునిజామాబాద్అర్బన్: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. మొత్తం 16,297 మంది విద్యార్థులకు 15,880 మంది హాజరుకాగా, 417 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. ఇంటర్ బోర్డు ప రీక్షల విభాగం నుంచి విశ్వేశ్వర్ బృందం ప లు సెంటర్లను తనిఖీ చేసి సమీక్షించింది. ధర్మపురి జాతరకు ప్రత్యేక బస్సులు ● మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్మూర్‌టౌన్: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ధర్మపురి జాతరను పురస్కరించుకొని టీజీఎస్ ఆర్టీసీ ఆర్మూర్ డిపో నుంచి ప్రత్యేక బ స్సులను నడుపుతున్నట్లు మేనేజర్ రవీందర్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 15 వరకు ఆ ర్మూర్ నుంచి ధర్మపురికి ప్రత్యేక రవాణా ఏ ర్పాట్లు చేశామన్నారు. మహిళలకు ఉచిత ప్ర యాణమని, పురుషులకు రూ. 220, పిల్లల కు రూ.120 టికెట్ ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
భీమ్‌గల్‌లో మితంగానే ఖర్చులు
మోర్తాడ్(బాల్కొండ): భీమ్‌గల్ మున్సిపాలిటీ లో చెత్త సేకరణకు మూడు ట్రాక్టర్లు, రెండు ట్రా లీ ఆటోలను వినియోగిస్తున్నారు. గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్‌గల్ పట్టణాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అప్‌గ్రేడ్ కాక ముందే చె త్త సేకరణ కోసం రెండు ట్రాక్టర్లను వినియోగించారు. జీపీ నిధులతోనే వీటిని కొనుగోలు చేయ డం గమనార్హం. మున్సిపాలిటీగా మారిన తరువాత మరో ట్రాక్టర్‌తోపాటు మూడు ట్రాలీ ఆటోలను కొనుగోలు చేశారు. ఒక ఆటో రిపేర్ చే యించాల్సి ఉంది. ప్రస్తుతానికి మూడు ట్రాక్టర్లు, రెండు ట్రాలీ ఆటోలతో చెత్త సేకరిస్తున్నారు. 40 మోటార్లు.. మిషన్ భగీరథ నీరు ఇంటింటికి అందక ముందు 40 మోటార్లతో నీటి సరఫరాను కొనసాగించారు. ఇంటింటికి నీరు సరఫరా అవుతుండటంతో కేవలం ఆరు మోటార్లను అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నారు. మరో ఆరు చేతి పంపులు అక్కడక్కడ ఉన్నాయి. వీటిని మున్సిపాలిటీ నిధులతోనే నిర్వహిస్తున్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని మున్సిపాలిటీ అధికారులు భావిస్తున్నారు. -
నెలకు రూ.20లక్షలకు పైగా..
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణకు ఉపయోగించే వాహనాలు, వాటి నిర్వహణ బల్దియాకు భారంగా మారింది. కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజూ 300 మెట్రిక్ టన్నుల చెత్త జమవుతున్నాయి. చేత సేకరణకు మొత్తం 137 వాహనాలు ఉండగా, వాటిలో 68 టాటా ఏస్‌లు, 34 ట్రాక్టర్లు, తొమ్మిది ఐచర్లు, మూడు కంప్రెషర్లు, మరో మూడు స్వీపింగ్ మిషన్లు ఉన్నాయి. మిగతా 20 వాహనాలను స్క్రాప్‌కు పంపించాలని ఆర్టీఏ అధికారులు బల్దియాకు నోటీసులు ఇచ్చారు. పలు కాలనీలకు మున్సిపల్ వాహనాలు వెళ్లకపోవడంతో చెత్త పేరుకుపోతోంది. తలకు మించిన భారం.. పెద్ద వాహనాలు బల్దియాకు 12 పెద్ద వాహనాలు ఉన్నాయి. కోట్లా ది రూపాయలు వెచ్చించి వాటిని కొనుగోలు చేశా రు. వాటి ద్వారా చేసే పనులతో పోలిస్తే డీజిల్ మెయింటెనెన్స్ తడిసిమోపెడవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రూ.లక్షల్లో ఖర్చు గత పాలకవర్గం కమీషన్ల కోసం బల్దియాకు నాసిరకం వాహనాలు కొనుగోలు చేసిందనే చర్చ విస్తృతంగా సాగింది. ఈ అవకాశాన్ని అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వా టి మరమ్మతులు, నిర్వహణ పేరుతో లక్షలాది రూ పాయలు బిల్లులు చేస్తున్నారు. ప్రతినెలా రూ.20లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. వాహనాల కొనుగోలు లేనట్లే.. శానిటేషన్‌కోసం వినియోగించే వాహనాలు తరచూ రిపేర్‌కు వస్తున్నాయి. వెంటనే రిపేర్లు చేయించకుండా జాప్యం చేస్తే చెత్త తరలింపు ఆలస్యమవుతుంది. ఇప్పటికే కొన్ని వాహనాలు మూలనపడ్డాయి. ఇప్పట్లో కొత్త వాహనాల కొనుగోలు లేనట్లే. – సాల్మన్ రాజు, మున్సిపల్ వెహికిల్స్ ఇన్చార్జితరచూ మరమ్మతులు అనుభవం ఉన్న డ్రైవర్లు, మంచి రోడ్లున్నప్పటికీ చెత్త సేకరణ వాహనాలు తరచూ రిపేర్లకు వెళ్తున్నాయి. రిపేర్ల పేరుతో ప్రతినెలా భారీగా బిల్లులు పెడుతున్నారు. వాటిని పరిశీలించకుండానే బిల్లులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాహనాల మరమ్మతుల పేరుతో పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లుతున్నాయని పలువురు ప్రజాప్రతినిధులు, సిబ్బంది వాపోతున్నారు. గత కొన్నేళ్లుగా తతంగం కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. -
చివరాయకట్టు వరకు నీరందించాలి
నిజామాబాద్ అర్బన్: చేతికొచ్చిన పంటలను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో నీటిపారుదల శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూ చించారు. సోమవారం సాయంత్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారితో కలిసి ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మరో 15 రోజుల్లో పంటలు చేతికి రానున్నందున అధికారులు సమన్వయంతో రైతాంగానికి తోడ్పాటునందించాలని సూచించారు. చివ రాయకట్టు వరకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో నిజనిజాలు తెలుసుకోకుండా పంట నష్టంపై జరుగుతున్న ప్రచారం సత్య దూరమన్నారు. వనరులను సద్వినియోగం చేసుకుంటాం జిల్లాలో యాసంగి పంటల పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ప్రధానంగా వరి పంట కోసం చివరి ఆయకట్టు వరకు సాగు నీరందేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేశారని మంత్రుల దృష్టికి తెచ్చారు. 2.38లక్షల ఎకరాలు చెరువులు, కాలువల కింద సాగు చేయడంతో ఎలాంటి ఇబ్బందుల్లేవని తెలిపారు. బోరుబావులపై ఆధారపడి మరో లక్షా 80వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారని, భూగర్భ జలాలు కొంతమేర తగ్గడంతో భీమ్‌గల్, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, డిచ్పల్లి, మోపాల్ మండలాల్లో సుమారు 1100 ఎకరాలకు సాగునీటి కొరత నెలకొందని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీటిని అందించి పంటలు కాపాడుకునేలా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటామని అన్నారు. వీసీలో సీపీ సాయి చైతన్య, అధికారులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలి వీసీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్, తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశం -
మూలకు చేరిన 14 ఆటోలు
బోధన్ టౌన్ : బోధన్ మున్సిపాలిటీ పరిధిలో రెండుమూడు రోజులకోసారి చెత్త సేకరిస్తుండడంతో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మా రింది. మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులు, లక్షలకు పైగా జనాభా ఉంది. పారిశుధ్య విభాగంలో 182 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 38 వార్డులను ఎనిమిది జోన్లుగా విభజించి పను లు నిర్వహిస్తున్నారు. చెత్త సేకరించేందుకు కో ట్లాది రూపాయలు వెచ్చించి 24 ఆటోలు, ఏడు ట్రాక్టర్లు, ఒక స్వీపింగ్ మిషన్‌ను కొనుగోలు చే శారు. 38 వార్డుల్లో నుంచి ప్రతి రోజూ 35 మె ట్రిక్ టన్నుల చెత్త సేకరించాల్సి ఉండగా గడిచి న 4 నెలలుగా 50 శాతం చెత్తను మాత్రమే సేకరిస్తున్నారు. మొత్తం 24 ఆట్లో నుంచి 10 మాత్రమే పనిచేస్తుండగా 14 మూలనపడ్డాయి. స్వీపింగ్ మిషన్ సైతం పని చేయడం లేదు. అదనపు కలెక్టర్ వచ్చినా.. గత 10 రోజుల క్రితం అదనపు జిల్లా కలెక్టర్ అంకిత్ బోధన్ బల్దియాను సందర్శించారు. పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. మున్సిపల్ వాహనాల కండీషన్, మరమ్మతులకు సంబంధించి నివేదిక అందించాలని కమిషనర్‌ను ఆదేశించారు. బోధన్‌లో అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ రెండు, మూడు రోజులకోసారి చెత్త సేకరణ -
వేర్వేరు చోట్ల ముగ్గురి ఆత్మహత్య
బాల్కొండ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక మెండోరా మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన చంద్రగిరి వెంకటేశ్‌గౌడ్(39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్‌గౌడ్ ఆరు నెలల క్రితం దుబాయి నుంచి ఇంటికి వచ్చి గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బతుకుదెరువు కోసం గతంలో మూడుసార్లు దుబాయి వెళ్లగా అక్కడ సరైన పని లభించక తిరిగి వచ్చాడు. దుబాయి వెళ్లినప్పుడల్లా అప్పు చేసి ఏజెంట్లకు డబ్బులు చెల్లించాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఆదివారం వెంకటేశ్‌గౌడ్ భార్య శ్రావణి పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. తాడ్‌బిలోలిలో మరొకరు..రెంజల్(బోధన్): అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన సాకినిగారి పోశెట్టి(55) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. గత నెల 22న ఇంటి నుంచి వెళ్లిన పోశెట్టి కనిపించకపోవడంతో కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేశారు. సోమవారం స్థానిక చెరువులో మృతదేహం కనిపించడంతో జాలర్లతో బయటకు తీయించారు. అక్కడే శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి మృతుడి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సావిత్రిబాయి పూలేకు ఘన నివాళి
నిజామాబాద్ నాగారం: నగరంలోని మాల మహా నాడు జిల్లా కార్యాలయంలో సోమవారం సావిత్రిబాయిపూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పూలే చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్‌కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్, నాయకులు చంద్రశేఖర్, విజయ, ప్రభంజన్, రాజు, సంతోష్, సునీత, లావణ్య, మంజుల, పుష్ప, గంగవ్వ, రమ్య, విమల పాల్గొన్నారు. సిరికొండ: మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో సావిత్రిబాయిపూలే వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి ప్రిన్సిపాల్ నర్సయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పరీక్షలంటే భయం వద్దు
సిరికొండ: విద్యార్థులు పరీక్షల పట్ల భయం పెట్టుకోవద్దని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ కోటగిరి గంగాప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో సోమవారం ఆయన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఒత్తిడిని అధిగమించి పరీక్షలను ఎలా రాయాలి, సమయాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలి, పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలో వివరించారు. హెచ్ఎం గడ్డం రాజేష్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ ఏర్పాటు నిజామాబాద్ రూరల్: రూరల్ మండల పరిధిలోని సారంగాపూర్ సబ్ స్టేషన్లో రూ.10 లక్షల వ్యయంతో నూతన బ్రేకర్‌ను విద్యుత్‌శాఖ అధికారులు అమర్చారు. సోమవారం వారు బ్రేకర్‌ను ప్రారంభించారు. వచ్చే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డివిజన్ పరిధిలో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు నూతనంగా బ్రేకర్‌ను అమర్చినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. డీఈ ఉత్తమ్ జాడే, ఏడీఏ బాలేష్ కుమార్, ఏఈ శ్రీనివాస్, విద్యుత్ అధికారులు సంజీవ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, హరిచంద్, రాంసింగ్, అక్బర్ నావాజుద్దీన్, అప్సర్, గూలాబ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ధర్పల్లి: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎంపీడీవో బాలకృష్ణ సూచించారు. మండలంలోని వాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యత గల వంట సామగ్రిని వాడాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు భోజనంలో కోడిగుడ్లు ఎందుకు పెట్టడం లేదని నిర్వాహకులను ప్రశ్నించారు. బర్డ్‌ఫ్లూ వచ్చినప్పటి నుంచి గుడ్లు ఇవ్వడం లేదని హెచ్ఎం సమాధానం ఇచ్చారు. అనంతరం హొన్నాజీపేట్ గ్రామంలోని నర్సరీ, ఉపాధిహామీ పనులను తనిఖీ చేశారు. వేసవి దృశ్య నర్సరీలోని మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పట్టించాలని సిబ్బందికి సూచించారు. అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలి నిజామాబాద్ నాగారం: ప్రత్యేక తెలంగాణ కోసం చనిపోయిన అమరుల కుటుంబాలకు, జైలుకు వెళ్లిన ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని జేఏసీ కన్వీనర్ గైని గంగారాం అన్నారు. వినాయక్‌నగర్‌లోగల అమరవీరుల స్థూపం వద్ద సోమవారం ఆయన అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఇప్పటివరకు తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబాలకు, జైలుకు వెళ్లిన ఉద్యోగులకు న్యాయం చేయడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైన తెలంగాణ కోసం త్యాగంచేసిన కుటుంబాలకు ఆదుకోవాలని కోరారు. నాయకులు భాస్కర్, మోహన్, రాజారాం, సంతోష్, లక్ష్మన్, సక్కి విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. అనుమతిలేని బడులపై చర్యలు తీసుకోవాలి నిజామాబాద్‌అర్బన్: అనుమతి లేకుండ అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రయివేటు బడులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు నగరంలోని ఓ ప్రయివేటు పాఠశాల ఎదుట సోమవారం వారు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రఘురాం, ఓమయ్య, రంజిత్, అంజలి, తదితరులు ఉన్నారు. -
అక్రమ నియామకాలు రద్దు చేయాలి
తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు అక్రమ పద్ధతుల్లో జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నూతనంగా నోటిఫికేషన్ విడుదల చేసి నియమనిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలన్నారు. ఈమేరకు సోమవారం తెలంగాణ యూనివర్సిటీ వీసీ చాంబర్ ఎదుట పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో ఇచ్చిన గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ నోటీస్ బోర్డు మీద తప్ప పత్రిక ప్రకటన ఇవ్వకుండా గోప్యంగా ఉంచారన్నారు. మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా నియామకాలను చేపట్టాలన్నారు. నాయకులు నరేందర్, కర్క గణేష్, రఘురాం, శివ, చరణ్, రాజు, సంజయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి ఎంపీ అర్వింద్ కృషి
సుభాష్‌నగర్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వడ్డీ మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి న్యాలం రాజు అన్నారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చిన ఎంపీ అర్వింద్ మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేశారని, కేంద్ర కార్యాలయాన్ని కూడా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయించారన్నారు. జిల్లాలో సుదర్శన్‌రెడ్డి శకుని పాత్ర పోషిస్తూ, శనిలా మారారని, ఆయనకు భజన బ్యాచ్ సభ్యులైన కొందరు ఎంపీ అర్వింద్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అర్వింద్‌పై అసత్య ప్రచారాలు చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, రాగి నారాయణ యాదవ్, సుధాకర్ చారి, ఇప్పకాయల కిషోర్, బాల్‌రాజ్, రాంచందర్, తదితరులు పాల్గొన్నారు. -
దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కళ్లద్దాలు అందిస్తాం
మోపాల్(నిజామాబాద్‌రూరల్): జిల్లాలో దృష్టిలోపం ఉన్న విద్యార్థులందరికీ ప్రభుత్వం కంటి అద్దాలను పంపిణీ చేస్తోందని జిల్లా వైద్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) రాజశ్రీ తెలిపారు. మండలంలోని కంజర్ సాంఘిక సంక్షేమ బాలికల విద్యాలయంలో సోమవారం ఆమె విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల విద్యార్థులకు వైద్య సిబ్బంది కంటి పరీక్షలను నిర్వహించిందని, దృష్టిలోపం ఉన్న వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తుందన్నారు. అందులోభాగంగా మొదటి విడతలో 1277 కళ్లద్దాలు జిల్లాకు వచ్చాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఆర్బీఎస్కే బృందాల ద్వారా వాటిని పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి అశోక్, ప్రిన్సిపాల్ విజయ, మేనేజర్ సచిన్, డాక్టర్ మాధవి, సందీప్, కరీం, సంధ్య, నర్సవ్వ, రఘుపతి, నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మోపాల్ మండలం తాడెం గ్రామంలో నిర్మిస్తున్న చెక్‌డ్యామ్ పనులకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. అలాగే మాధవ్‌నగర్ బోర్గం(పి), పాంగ్రా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ, బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఆర్యనగర్‌లోని రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రూరల్ మండల పరిధిలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని, గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సేవకోసం తన వైద్య వృత్తిని సైతం పక్కకు పెట్టినట్లు వివరించారు. నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, ిసీనియర్ నాయకులు సందగిరి భూమారెడ్డి, గడ్కోల భాస్కర్‌రెడ్డి, సూర్యరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు, చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పైస ఎల్లయ్య, సాయారెడ్డి, బోర్గం శ్రీను, చిలుక సాయిలు, గంగాప్రసాద్, రఘు, ఎల్ఐసీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఆలయంలో ఎమ్మెల్యే పూజలు ఇందల్వాయి: మల్లాపూర్‌లో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయ ఉత్సవాల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈసందర్భంగా స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్‌గౌడ్, పీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, నాయకులు సంతోష్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెలే భూపతిరెడ్డి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
ఘనంగా మహిళా దినోత్సవం
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరుకాపు సంఘంలో సోమవారం గంగారాం మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, ఎస్ఈ రవీందర్, నార్త్ తహసీల్దార్ నాగరాజు, సరళ, మహేందర్‌రెడ్డి ఉన్నారు. బాధితుడికి పరామర్శ నిజామాబాద్‌అర్బన్: బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు త్యాగస్వామి ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో సోమవారం అతడిని తెలంగాణ ఉద్యమకారులు కోనేరుసాయికుమార్, ఈర్లశేఖర్, ప్రవీణ్‌లు పరామర్శించారు. -
విద్యుత్‌ను పొదుపుగా వాడాలి
ఎడపల్లి(బోధన్): వేసవిలో డిమాండ్ దృష్ట్యా వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని బోధన్ డీఈ ముక్తార్ కోరారు. మండలంలోని ఠాణాకలాన్ గ్రామంలో సోమవారం విద్యుత్ వినియోగ దారులకు, రైతులకు విద్యుత్ ఆదాపై అవగాహన కల్పించడానికి పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏడీఈ ప్రభాకర్, సిబ్బందితో కలిసి ఆయన గ్రామంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈ కిశోర్ రెడ్డి, సిబ్బంది శంకర్ నాయక్, గంగయ్య, హైమద్ పాష, గజానంద్, అశోక్, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం
నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారిని ప్రోత్సహించేవిధంగా సమానమైన ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కాంగ్రెస్ ఎస్టీసెల్ చైర్మన్ కెతావత్ యాదగిరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడంలో ఏఐసీసీ పెద్దలు సమ న్యాయం చేశారన్నారు. పార్టీలో ముందునుంచి ఉన్నవారు, కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని కష్టనష్టాలను భరించి పార్టీ కోసం పనిచేసినవారికి గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపించారన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కుతాయనేందుకు శంకర్ నాయక్ ఎంపిక నిదర్శనమన్నారు. భవిష్యత్‌లో ఉత్తర తెలంగాణ గిరిజనులకు పార్టీలో ఉన్నత పదవులు కల్పించాలని కోరారు. పార్టీ అగ్రనేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నా మన్నారు. నాయకులు బున్నె రవీందర్ ఉన్నారు. నేడు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ నిజామాబాద్‌రూరల్: రూరల్ నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు మంగళవారం ఉదయం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేయనున్నట్లు కార్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చేతుల మీదుగా చెక్కులను అందించనున్నట్లు వారు తెలిపారు. ‘నవోదయ’పై రాజకీయాలు తగవు నిజామాబాద్ అర్బన్: జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటుపై అధికార కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలు చేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ అన్నారు. నగరంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు వచ్చిన నవోదయ పాఠశాలను కాంగ్రెస్, బీజేపీ సమన్వయంతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రతినిధులు దీపిక, దినేష్, ఆజాద్, చక్రి, రాజు, వీణ ఉన్నారు. బోధన్‌లో 4 దుకాణాలు సీజ్ బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించని నాలుగు దుకాణాలను సోమవారం బల్దియా అధికారులు తాళం వేసి సీజ్ చేశారు. బకాయి ఉన్న దుకాణాల్లో బల్దియా అధికారులు పన్ను వసూలు చేస్తున్నారు. అనిల్ టాకీస్ రోడ్డులో రెండు దుకాణాలతో పాటు మరో రెండు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. -
పన్ను వసూళ్లకు మెప్మా సిబ్బంది
● అదనంగా మరో 40 (హెచ్‌హెచ్‌డీ) మిషన్ల కోసం ప్రతిపాదనలు ● వేగంగా వసూళ్ల కోసం బల్దియా అధికార యంత్రాంగం చర్యలు నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్‌కు రావాల్సిన పన్నుల కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ సంవత్సరం రావాల్సిన పన్నులు, పాత బకాయిలు, జరిమానాలు, నీటి పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టిసారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలివుంది. దీంతో మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. రెవెన్యూ సిబ్బందితోపాటు తాను కూడా రోడ్డుబాట పట్టారు. దుకాణాలు తిరుగుతూ పన్నులు చెల్లించాలని సూచిస్తున్నారు. మొండి బకాయిదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇప్పటివరకు రూ.30 కోట్లు వసూలు.. పన్నుల రూపేనా బల్దియాకు దాదాపు రూ.90 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ. 29.80 కోట్లు వసూలు చేశారు. కేవలం వారం రోజుల్లోనే రూ.4 కోట్ల వరకు వసూలు చేశారు. మరో 10 రోజుల వ్యవధిలో రూ. 15 కోట్ల వరకు పన్నులు వసూలు చేయాలని అధికారులు లక్ష్యం నిర్ధేశించారు. ఆదివారం, రెండో శనివారం, ఇతర సెలవు దినాల్లో సైతం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 80 మంది వరకు సిబ్బంది పన్ను వసూళ్ల విధుల్లో ఉన్నారు. వీరితోపాటు తాజాగా మెప్మా విభాగానికి చెందిన సిబ్బంది సేవలు సైతం వినియోగించనున్నారు. వీరిలో బల్దియాలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్, 8 మంది సీవోలున్నారు. నగరంలో ఆర్పీలు (రిసోర్సు పర్సన్లు) 200 మంది వరకు ఉన్నారు. బిల్ కలెక్టర్లతోపాటు ఆర్పీలు, సీవోల సహాయంతో పన్నులు వసూలుచేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ సూచించారు. ఈమేరకు వారితో ప్రత్యేక సమావేశం సైతం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఆర్పీలు సహకరించాలి బల్దియా పన్నుల వసూళ్ల కోసం మెప్మా సిబ్బంది సహకారం కూడా తీసుకుంటున్నాం. నగరంలోని ఆర్పీలు క్షేత్రస్థాయిలో సహకరించాలి. వారి సహకారంతో పన్నుల వసూళ్లు వేగవంతం అవుతాయి. బల్దియాకు చెల్లించాల్సిన పన్నులను నగరవాసులు వెంటనే చెల్లించాలి. –దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, నిజామాబాద్ అవగాహన కల్పించాలి నిజామాబాద్ బల్దియాలో పన్నుల వసూళ్ల కోసం మెప్మా సిబ్బందిని కమిషనర్ భాగస్వామ్యం చేశా రు. క్షేత్రస్థాయిలో బిల్ కలెక్టర్లకు ఆర్పీలు సహకరించాలి. ఆయా డివిజన్లలో తెలిసినవారికి పన్నులు చెల్లించేలా ఆర్పీలు అవగాహన కల్పించాలి. పన్ను వసూళ్లకు పూర్తి సహకారం అందించాలి. –చిదుర రమేష్, మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ సరిపోని మిషన్లు.. పన్నుల వసూళ్ల కోసం బల్దియా అధికారులు హాండ్ హెల్డు డివైజ్ (హెచ్‌హెచ్‌డీ) మిషన్లను వాడుతున్నారు. ఈ మిషన్లు బిల్లు కలెక్టర్ల ఆధీనంలో ఉంటాయి. బల్దియాలో ఇప్పటివరకు 38 మిషన్లు మాత్రమే ఉన్నాయి. నగరంలో 60 డివిజన్లు ఉండగా, మరో 40 మిషన్ల కోసం కమిషనర్ సీడీఎంఏకు సమాచారం ఇచ్చారు. దాంతో యాక్సిస్ బ్యాంక్‌వారు 40 మిషన్లు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈనేపథ్యంలో మంగళవారం నుంచి పన్ను వసూళ్లు వేగవంతం కానున్నాయి. మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ నేరుగా పన్నుల వసూళ్లలో నేరుగా పాల్గొంటున్నారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి వారి వెంట పన్నుల వసూళ్లకు వెళుతున్నారు. పన్నులు చెల్లించనివారి దుకాణాలు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 15 దుకాణాలు సీజ్‌చేశారు. చెల్లించాల్సిన పన్నులకు సంబంధించిన సొమ్ము బిల్ కలెక్టర్‌కు నేరుగా చెల్లించి రసీదు పొందాలి. బల్దియా కార్యాలయంలో, మీసేవా కేంద్రాల్లో, ఆన్లైన్లో కూడా పన్నులు చెల్లించవచ్చు. -
మనిషి ఆలోచనలో మార్పురావాలి
తెయూ (డిచ్పల్లి): మనిషి జీవితంలో విజయం సాధించాలంటే తన ఆలోచన విధానంలో మార్పురావాలని యూనివర్సిటీ ఆఫ్ టెక్నిక్స్ ప్రొఫెసర్, అకడమిక్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ డాక్టర్ గడ్డం వాణి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో సోమవారంవిద్యార్థుల ఆలోచనలు– అవకాశాలు అనే అంశంపై కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ అధ్యక్షతన విస్తృతోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గడ్డం వాణి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే నిరంతర అధ్యయనం, బహుముఖ విజయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అపజయాలు ఎదురైనప్పుడు అనుభవాలను గుణపాఠాలుగా మార్చుకొని, విజయం కోసం ముందడుగు వేయాలని ఉద్బోధించారు. కార్యక్రమంలో లా కాలేజ్ ప్రిన్సిపల్ ప్రసన్న రాణి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ నాగరాజు, చీఫ్ వార్డెన్ మహేందర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి 95 ఫిర్యాదులు
నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఏసీపీ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్‌లకు వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశాలు -
అంకాపూర్‌లో కడప వ్యవసాయాధికారులు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్సార్ కడప జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం సందర్శించారు. వైఎస్సార్ కడప జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఏ నాగేశ్వర్ రావు, డ్వామా పీడీ బీ ఆదిశేషా రెడ్డి, ఉద్యావన శాఖ జిల్లా అధికారి ఎస్ఎస్వీ సుభాషిణి తదితరులు అంకాపూర్‌లో సాగుచేస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పసుపు ఉడకబెట్టే యంత్రాలు, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, నీటి నిలువ తొట్టెలను పరిశీలించి రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీ ఎంఐపీ పీడీ ఎం వెంకటేశ్వర్ రెడ్డి, డీపీఎం ప్రవీణ్, ఆర్మూర్ ఏడీఏ విజయలక్ష్మి, ఏఈవో అనూష, అంకాపూర్ రైతులు సల్ల అనంత్ రెడ్డి, నారాయణ రెడ్డి, కేకే భాజన్న, జీ భూమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వరంగల్ రైతులు.. పెర్కిట్(ఆర్మూర్): వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం, గిట్ల కనిపర్తితోపాటు శాయంపేట మండలానికి చెందిన రైతులు అంకాపూర్ గ్రామాన్ని సోమవారం సందర్శించారు. రైతు విజ్ఞానయాత్రలో భాగంగా నాబార్డు సహకారంతో శాంతది సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అంకాపూర్‌లో పర్యటించారు. పంటలను పరిశీలించిన బృందం -
ప్రమాదవశాత్తు ఆర్మీ జవాన్ మృతి
సిరికొండ: మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ కాసుల ప్రమోద్ ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నెల 1న హైదరాబాద్‌లోని తన గదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రమోద్‌కు తీవ్రగాయాలయ్యాయి. మొదట సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించగా, మెరుగైన చికిత్స కోసం పుణెలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 8న రాత్రి మృతి చెందాడు. ప్రమోద్ స్వగ్రామం సిరికొండలో సోమవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమోద్ భౌతికకాయానికి ఆర్మీ అధికారులతోపాటు సిరికొండ ఎస్సై ఎల్ రామ్ నివాళులర్పించారు. మృతుడికి తల్లిదండ్రులతోపాటు చెల్లెలు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మాచారెడ్డి: పాల్వంచ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. భవానీపేట తండాకు చెందిన బూక్య సురేశ్, మాలోత్ తేజ పాల్వంచ నుంచి కామారెడ్డి వైపు బైకుపై వెళుతుండగా, వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. ఆటో దొంగ అరెస్ట్ఖలీల్వాడి: జీజీహెచ్‌లో ఆటో చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి సోమవారం తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సుల్తాన్‌పేట్ గ్రామానికి చెందిన అమృత్వార్ మోహన్ తన చిన్నమ్మ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. ఈ నెల 5న రాత్రి 10 గంటలకు తన ఆటోను జీజీహెచ్ పార్కింగ్ ఏరియాలో నిలిపాడు. మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఆటో కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని బోధన్ బస్టాండ్‌లోని వాహనాల తనిఖీ చేస్తుండగా బర్కత్పురాకు చెందిన ఖలీద్ బిన్ మొహమ్మద్‌పై అనుమానంతో విచారించగా చోరీకి పాల్పడినట్లు తేలిందన్నారు. ఆటోను స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. -
రాత్రికి రాత్రే ఇసుక తోడేస్తున్నారు
ఖలీల్‌వాడి: మంజీర పరీవాహకంలో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. రాత్రివేళ పొక్లెయినర్లు, ట్రాక్టర్ లోడర్స్తో ఇసుక తోడేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి రూ. లక్షల్లో గండిపడుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టేవారు మూడు గ్రూపులుగా మారి తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఒక గ్రూపు అధికారులను మచ్చిక చేసుకుంటుండగా, మరో గ్రూపు మంజీరా పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వించి టిప్పర్లలో పంపిస్తారు. మూడో గ్రూపు ఇసుక టిప్పర్లకు ఎస్కార్ట్‌గా మారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్నా పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, ఆర్టీఏ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సామర్థ్యానికి మించి తరలింపు.. పొతంగల్ మండలం కల్లూర్, కొడిచర్ల, పొతంగల్, హంగార్గా, సుంకిని, రెంజల్ మండలంలోని నీలా, కందకుర్తి ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో కొందరు ఇంటిపనుల కోసం ఇసుకను తరలిస్తుండగా, మరికొందరు ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి తరలించిన ఇసుకను డంప్‌లుగా చేసుకుంటున్నారు. అనంతరం అక్కడి నుంచి టిప్పర్లలో సామర్థ్యానికి మించి తీసుకెళ్తున్నారు. రాత్రివేళలో ఇసుక అక్రమదందా కొనసాగుతుందని తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక టిప్పర్లతో ప్రమాదాలు జరిగినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.వే బిల్లులు లేకుండానే..ఇసుక తరలింపునకు సంబంధిత టిప్పర్లు, ట్రాక్టర్ల యజమానులు మీ సేవల్లో దరఖాస్తు చేసుకొని వాటికి చలాన్ కట్టాల్సి ఉంటుంది. అనంతరం జారీ అయిన వే బిల్లుతో ప్రభుత్వం కేటాయించిన రీచ్ నుంచి ఇసుకను తీసుకువెళ్లాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి నిబంధనలు ఉండవు. రాత్రివేళల ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి టిప్పర్లలో నిజామాబాద్, బోధన్ వంటి ప్రాంతాలకు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇలా తరలించిన ఇసుకకు ఎలాంటి వే బిల్లులు ఉండవు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. పొతంగల్, రెంజల్ పరిధిలోని మంజీరా పరీవాహకంలో తవ్వకాలు అక్రమంగా టిప్పర్లలో తరలింపు పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ, ఆర్టీఏ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండిప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి వే బిల్లు లేకుండానే రాత్రివేళ టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. రెవెన్యూ, పోలీసులు, మైనింగ్, ఆర్టీఏ అధికారులకు విన్నవించినా ఫలితం కనిపించడం లేదు. ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే ఇసుక అక్రమ రవాణాను అరికట్టవచ్చు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి రాత్రివేళలల్లో తనిఖీ చేపట్టాలి. – లింగారెడ్డి, నిజామాబాద్ లారీ ఓనర్స్, బిల్డింగ్ మెటీరియల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి -
పంటలకు సాగునీరందించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి సుభాష్‌నగర్: జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, కాలువల కింద ఉన్న పంటలకు తక్షణమే నీరందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు లేఖ రాశారు. సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, మోపాల్, డిచ్పల్లి మండలాల్లో బోరుమోటార్లు ఎత్తిపోయి వరి ఎండిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మెట్ట ప్రాంతాల్లోని రైతులకు ట్యాంకర్ల ద్వారా, కాలువల కింద ఉన్న పంటలకు సాగునీరు అందించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మోసగించిన యువకుడి రిమాండ్దోమకొండ: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కేసులో దోమకొండకు చెందిన యువకుడిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. సదరు యువతిని ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకొని లైంగికదాడికి పాల్పడి వదిలివేసినట్లు పేర్కొన్నారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి యువకుడిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు. బాధితులకు న్యాయం చేయండి నిజామాబాద్‌నాగారం: జిల్లాలో అక్షర ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్‌తో మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కో రుతున్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమ వారం నిర్వహించిన సమావేశంలో బాధితులు మాట్లాడారు. సదరు ఫైనాన్స్ కంపెనీ యాజ మాన్యం రాష్ట్రవ్యాప్తంగా 72 బ్రాంచీలు పెట్టి మూడు వేల మందిని మోసగించి కోట్లాది రూపాయలు వసూలు చేశారన్నారు. జిల్లా బ్రాంచ్‌లో 72మంది బాధితులకు రూ. 2కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ మాక్లూర్: స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో డీఆర్డీవో సాయాగౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి హామీ సామాజిక తనిఖీ నిర్వహించారు. గతేడాది ఉపాధి హామీ పనులు ఏ మేరకు జరిగాయి, ఏఏ పనులు చేశారనే రికార్డులను తనిఖీ చేశారు. కూలీలకు డబ్బులు చెల్లించటంలో ఆలస్యం జరిగిందా జరిగితే ఎందుకు జరిగిందనే వివరాలను ఎఫ్‌ఏలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండల వ్యాప్తంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిగింది. ఇక ముందు చేపట్టే పనులు ఇతర అంశాలపై ఏపీవో ఓంకార్‌కు డీఆర్డీవో సూచనలు చేశారు. ఈ తనిఖీలో ఎంపీడీవో లక్ష్మారెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, సుశీల, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ముషీర్‌నగర్‌లో యువకుడు..
సిరికొండ: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ముషీర్‌నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎల్ రామ్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బట్టు మనోహర్(24) ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసై ఈ నెల 7న పురుగుల మందు సేవించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చి కిత్స పొందుతున్న మనోహర్ ఈ నెల 9న రాత్రి మృతి చెందినట్లు ఎస్సై రావ్‌ు సోమవారం తెలిపా రు. మృతుడి భార్య గౌత మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
ప్రతిపాదిత స్థలాలు ఫైనలయ్యేనా?
ఆర్మూర్: జిల్లాలో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గురుకులాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ పరిశీలించిన స్థలాలు సమీకృత స్కూళ్ల నిర్మాణానికి ఫైనల్ అవుతాయా? అనేది చర్చనీయాంశమైంది. ఒక్కో ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనుండగా, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు రెండు నెలల క్రితం పలు స్థలాలను ప్రతిపాదించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి మంజూరైన స్కూల్‌ను అంకాపూర్ శివారులోని 493/1 సర్వే నంబర్లోని ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి విజ్ఞప్తి చేయగా, కలెక్టర్ ప్రతిపాదనలు పంపారు. మరో రెండింటిని నవీపేట్ మండలం దర్యాపూర్, డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామశివార్లలో నిర్మించాలని కలెక్టర్ ప్రతిపాదనలు పంపారు. అయితే అధికార పార్టీ నాయకులు రెండు చోట్ల వేరే స్థలాలను సూచించడంతో కలెక్టర్ వాటిని సైతం పరిశీలిస్తున్నారు. ఆర్మూర్ పట్టణ శివారులోని పిప్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక ప్రాంతం, బోధన్ మండలం బెలాల్ గ్రామ శివారులోని మధుమలంచ డిగ్రీ కళాశాల స్థలంలో సమీకృత గురుకులాలను నిర్మించాలని అధికార పార్టీ నాయకులు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విద్యార్థులు, తల్లిదండ్రులు సులభంగా పాఠశాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం ఉన్న చోటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కామారెడ్డి ఎస్పీ బాధ్యతల స్వీకరణకామారెడ్డి క్రైం : జిల్లా ఎస్పీగా నియమితులైన రాజేశ్ చంద్ర సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ ఎస్పీగా పని చేసిన సింధు శర్మ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో రాజేశ్ చంద్ర వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆయనను జిల్లాకు చెందిన పలువురు పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సమీకృత గురుకులాలకు నిధులు కేటాయించిన సర్కారు స్థల కేటాయింపు ప్రతిపాదనలు పంపిన కలెక్టర్ రెండు చోట్ల వేరే స్థలాలను సూచిస్తున్న అధికార పార్టీ నేతలు -
మహిళలను గౌరవించాలి
సుభాష్‌నగర్: ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి అన్నా రు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ఉమ్మ డి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ, త్యాగం, సహనం కలిస్తే మహిళ అని కొనియాడారు. అనంతరం మహిళా మేనేజర్లు, సిబ్బందితో కలిసి కేక్ కట్‌చేసి, సీనియర్ మహిళా మేనేజర్లను సన్మానించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, సీఈవో నాగభూషణం వందే, టీసీసీబీఈఏ రాష్ట్ర నాయకురాలు రాధ, నిజామాబాద్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు నాగభూషణం, సందీప్, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి -
మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు నిధులు
● ఒక్కోదానికి రూ.200 కోట్లు.. ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం బోధన్/ నిజామాబాద్ అర్బన్ : జిల్లాకు మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలకు నిధులు కేటాయిస్తూ రా ష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యా ప్తంగా 55 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయగా, అందులో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూర ల్ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రూ. 200 కోట్ల చొప్పున పరిపాలన అనుమ తు లు మంజూరు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. నేడు బాధ్యతలు స్వీకరించనున్న సీపీ ఖలీల్‌వాడి : నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పోతరాజు సాయి చైతన్య సోమవా రం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. హైదరా బాద్ నార్కోటిక్ విభాగంలో ఎస్పీగా విధు లు నిర్వర్తిస్తున్న ఆయనను ప్రభుత్వం నిజామాబాద్ సీపీగా నియమించిన విషయం తెలిసిందే. కాగా, సాయిచైతన్య ఆదివారం నార్కోటిక్ విభాగంలో రిలీవ్ అయినట్లు సమాచారం. నూతన సీపీ బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేసినట్లు తెలిసింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ధర్పల్లి: నీళ్లు లేక వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. ధర్పల్లి, దుబ్బాక గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దినేశ్ మాట్లాడుతూ.. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి నీళ్లు లేక ఎండిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. రూరల్ నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఎమ్మెల్యే భూపతిరెడ్డి పట్టించుకోవడంలేదని విమర్శించారు. మంచిప్ప రిజర్వాయర్ పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరందించాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పంట నష్టపరిహారం కోసం కలెక్టర్‌కు లేఖ రాస్తాన ని అన్నారు. బీజేపీ తరఫున అందుబాటులో ఉంచనున్న నీళ్ల ట్యాంకర్లను రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, నాయకులు గంగాదాస్, కర్క గంగారెడ్డి, మహేశ్, సదానందగౌడ్, అమృనాయక్, నరేశ్‌గౌడ్, రాము, మల్లయ్య, సుమన్, తిరుపతి తదితరులు ఉన్నారు. ‘మీటర్’ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సుభాష్‌నగర్: విద్యుత్ మీటర్లలో రీడింగ్ త క్కువ అయ్యేలా చేస్తామంటూ వస్తున్న వ్య క్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీటీఎస్ సీఐ బి గోవర్ధన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొందరు వ్యక్తు లు తక్కువ కరెంటు బిల్లు వచ్చేలా చేస్తామంటూ డబ్బులు తీసుకొని విద్యుత్ మీటర్‌లోని తీగలను కట్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. మీటర్‌లోని తీగలను కట్ చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తామని, మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ మీ టర్ తిరగకుండా చేస్తామని ఎవరైనా వస్తే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. శ్రీవారికి చక్ర స్నానం ● తెలంగాణ తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు బాన్సువాడ : బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివా రం శ్రీవారికి చక్ర స్నానం చేయించారు. అంతకుముందు వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీ వారి విగ్రహానికి పంచామృతాభిషేకం చేసి, ఆలయంలో ఉన్న పుష్కరిణిలో వేదపండితులు చక్రస్నానం చేయించారు. చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు, నేతలు పోచారం శంభురెడ్డి, పోచారం సు రేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు ఎంపీ అర్వింద్ తెచ్చిన నిధులు ఎన్ని?
నిజామాబాద్ సిటీ: రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన అర్వింద్ జిల్లాకు ఎన్ని నిధులు తెచ్చారని, ఏయే పనులు చేపట్టారో తెలపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆదివారం నుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కేశవేణు మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ మతిభ్రమించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఇష్టారీతిన మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని విమర్శించే స్థాయి అర్వింద్‌కు లేదన్నారు. తాహెర్ మాట్లాడుతూ.. జిల్లాలో నవోదయ ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో జిల్లా విద్యా శాఖ అధికారులు ఆలోచిస్తారన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా కేంద్ర గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే.. నిజామాబాద్ సిటీ: కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి ఎంపీ అరవింద్ అబద్ధపు వాదనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి యత్నిస్తున్నాడని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం మాటలతో పబ్బం గడపడం అర్వింద్‌కు అలవాటే అని అన్నారు. నిజంగా ఎంపీ అర్వింద్‌కు నవోదయ సమస్య పరిష్కారం కావాలంటే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో మాట్లాడితే బాగుండేదన్నారు. జిల్లా అభివృద్ధిలో సుదర్శన్ రెడ్డికి పోటీ ఎవరూ లేరన్నారు -
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
● ఇద్దరికి గాయాలు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని రామారెడ్డి–సదాశివనగర్ రోడ్డు మార్గంలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈఘటనలో కారులోని ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం కారులో రామారెడ్డి నుంచి సదాశివనగర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో వారి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ – కారు ఢీ: ముగ్గురికి గాయాలు రుద్రూర్: మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బోధన్–రుద్రూర్ ప్రధాన రహదారిపై ట్రాక్టర్ – కారు ఢీకొనడంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్షతగాత్రులు రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
47ఏళ్ల తర్వాత కలిసిన మిత్రులు
భిక్కనూరు: చిన్ననాటి మిత్రులందరూ దాదాపు 47ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1977–78 ఎస్సెస్సీ బ్యాచ్ బి సెక్షన్ విద్యార్థులు ఆదివారం భిక్కనూరు మండలంలోని బీటీఎస్ చౌరస్తా వద్ద పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత వారంతా కలుసుకోవడంతో చిన్ననాటి తీపీ గుర్తులను నెమరువేసుకున్నారు. ప్రతి ఏడాది ఇలానే కలుసుకోవాలని, స్నేహితుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని తీర్మానించుకున్నారు. కార్యక్రమంలో ఆనాటి పూర్వ విద్యార్థులు శ్రీధర్, భూమయ్య, సునీల్‌కుమార్, చాట్ల రాజేశ్వర్, పాత బాల్కిషన్, రామలింగం, పార్శి మధుసూధన్, వెంకటరమణ, కస్వ వెంకటేశం, ముప్పారపు రాజేందర్, బీమ్‌రావు, గోజే రాజేందర్, రమేష్, చిట్టిమధు, ఇంద్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు. 38ఏళ్ల తర్వాత.. భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి జెడ్పీహెచ్ఎస్ 1986–87 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. బస్వాపూర్ గ్రామంలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో నాటి విద్యార్థులందరూ హాజరయ్యారు. సుమారు 38ఏళ్ల తర్వాత వారంతా కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. తమతో చదువుకుని స్వర్గస్తులైన నలుగురు స్నేహితుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆనాటి గురువులను కార్యక్రమానికి ఆహ్వానించి, సన్మానించారు. -
నగరంలో క్రికెట్ అభిమానుల సంబురాలు
నిజామాబాద్‌నాగారం: నగరంలో క్రికెట్ అభిమానుల సంబురాలు మిన్నంటాయి. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా– న్యూజిలాండ్ తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈమ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో నగరంలోని పలు కాలనీల్లో క్రికెట్ అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబురాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. జయహో.. భారత్.. అంటు నినాదాలు చేశారు. అలాగే పలువురు అభిమానులు సాక్షితో తమ అభిప్రాయాలను తెలిపారు. టీంఇండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో టపాసులు కాల్చిన యువత -
శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
నిజామాబాద్ రూరల్: వచ్చే నెల లో నిర్వహించే శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ ఇందూరు జిల్లా కార్యదర్శి పరాయితం లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ప్రఖండ స మావేశం నిర్వహించారు. ప్రాంత కార్యదర్శి పరాయితం లక్ష్మీనారాయణ మాట్లాడూతూ.. రాబోయే కార్యక్రమాలు, ఉత్సవాలు, పరిషత్ వర్గ, బజరంగ్ దళ్ శౌర్యా ప్రశిక్షణ వర్గ, దుర్గా వాహిని వర్గ, మాతృశక్తి వర్గాల గురించి చర్చించారు. అంతకు ముందు శ్రీరాముని, భారతమాత చిత్రపటాలకు విశ్వ హిందూ పరిషత్ నా యకులు పూలమాలలు వేశారు. పదాధికారులు, ప్రఖండ అధ్యక్షులు, బజరంగ్ దళ్ సంయోజక్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి ధర్పల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని శాఖ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి అన్నారు. ఆదివారం ధర్పల్లి మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని పరిశీలించారు. గ్రంథాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఇటీవల ధర్పల్లి గ్రంథాలయానికి మౌలిక సదుపాయాల కోసం రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో గ్రంథాలయంలో చేసిన పనులను పరిశీలించారు. గ్రంథాలయంలో వైఫై కనెక్షన్, నాలుగు కంప్యూటర్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని గ్రంథ పాలకుడు కిషన్‌ను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రంథాలయ చైర్మన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు చెలిమెల నర్సయ్య, చిన్నారెడ్డి, గంగారెడ్డి, సుభాష్, సురేందర్ గౌడ్, రాకేశ్ తదితరులు ఉన్నారు. ఎండిన పంటల పరిశీలన ఇందల్వాయి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో ఎండి న వరి పంటలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేశ్ ఆదివారం పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని అన్నారు. నియోజకవర్గంలో చెక్ డ్యాములు, కుంటలను పునర్ నిర్మించాలన్నారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, చిన్నూ, నాయుడు రాజన్న, సక్కీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మోపాల్‌లో వాహనాల తనిఖీ మోపాల్: మండలకేంద్రంలో ఆదివారం ఎస్సై యాదగిరిగౌడ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. అలాగే వాహనదారులకు డ్రంకన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో 3 డ్రంకన్‌డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు పాటించిన వాహనదారులకు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. -
చిరుప్రాయంలోనే ప్రాణాంతక వ్యాధి
వేల్పూర్: చిరుప్రాయంలోనే ప్రాణాంతక వ్యాధికి గురైన ఓ బాలుడు, ఆస్పత్రిలో చికి త్స పొందుతున్నాడు. వైద్య చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు పేర్కొనడంతో తల్లి దండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూ స్తున్నారు. మండలంలోని పచ్చలనడ్కుడ గ్రా మంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నవీన్‌రెడ్డి, మనోజ దంపతులకు కుమారుడు నిఖిలేష్ ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఆరో తరగతి చదువుతుండగా ఇటీవల అనారోగ్యానికి గురికాగా వైద్యపరీక్షలు చేయించారు. అందులో అతడికి అరుదైన బ్లడ్ క్యాన్సర్ సోకినట్లు వైద్యు లు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నా రు. ఇప్పటిదాకా రూ. 14 లక్షలు చికిత్సకు ఖర్చు చే శారు. నిఖిలేష్ పూర్తి కోలు కోవాలంటే చికిత్సకు రూ. 60లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతఖర్చు భరించే స్థోమత తమకు లేదని, దాతలు తోచినంత సహాయం అందించాలని వేడుకుంటున్నారు. 9494719197 నంబరుకు ఫోన్‌పే చేసి, కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని కోరుతున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పచ్చలనడ్కుడకు చెందిన నిఖిలేష్ చికిత్సకు రూ.60లక్షలు ఖర్చవుతుందంటున్న వైద్యులు దాతలు ఆదుకోవాలంటూ బాలుడి తల్లిదండ్రుల వేడుకోలు -
చేపలను గ్రామంలోనే విక్రయించాలి
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని వాజిద్నగర్ గ్రామ చెరువులో గంగపుత్రులు పట్టిన చేపలను గ్రామంలోనే విక్రయించాలని గ్రామస్తులు కోరారు. ఇతర ప్రాంతాలకు తరలించొద్దని చేపల వాహనా న్ని శనివారం స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం వాహనాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దనే నిలిపిఉంచారు. స్థానికంగా చేపలు అమ్ముడుపోవడం లేదని, అందుకే హైదరాబాద్‌కు తీసుకెళ్లి విక్రయిస్తామని గంగపుత్రులు పేర్కొంటున్నారు. సుమారు రూ.6 లక్షల విలువ ఉన్న చేపల వాహనాన్ని రెండు రోజుల నుంచి జీపీ వద్ద పెట్టారని వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకు న్న కొందరి వ్యక్తులపై పొలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. గ్రామంలో కొన్ని చేపలు విక్రయించాలని గంగపుత్రులకు సూచించిన ఒక్క చేప కూడా విక్రయించడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించొద్దు వాజిద్నగర్వాసుల డిమాండ్ చేపల వాహనం అడ్డగింత -
కొత్త వేతనాలు వచ్చేదెప్పుడు?
మోర్తాడ్(బాల్కొండ): మినీ అంగన్వాడీల నుంచి మెయిన్ అంగన్వాడీలుగా గుర్తింపు పొందినా పాతవేతనాలు మంజూరుకావడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడిచినా తమకు కొత్త వేతనాలు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 135 మంది సిబ్బంది.. జిల్లాలో 135 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరిలోనే ఉత్తర్వులను జారీ చేసింది. కానీ ఆర్థికశాఖ ఆమోదం లభించకపోవడంతో అప్‌గ్రేడ్ చేయబడిన అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త వేతనానికి బదులు, పాత వేతనమే అందుతుంది. మినీ అంగన్వాడీలకు మొదట్లో నెలకు రూ.7,500ల చొప్పున వేతనం లభించేది. అప్‌గ్రేడ్ చేయడంతో వారికి ప్రతి నెలా రూ.15వేల వేతనం అందాల్సి ఉంది. అప్‌గ్రేడ్ చేసిన తొలినాళ్లలో రెండు నెలల పాటు కొత్త వేతనం అందించారు. సాంకేతిక కారణాలతో ఆర్థికశాఖ ఆమోదం లభించలేదని ఏప్రిల్ 2024 నుంచి పాత వేతనమే అందిస్తున్నారు. ఏ అంగన్వాడీ కేంద్రంలోనైనా ఒకే విధమైన పని భారం ఉందని ఒక చోట తక్కువ మరో చోట ఎక్కువ అనే తేడా ఏమి లేదని కార్యకర్తలు చెబుతున్నారు. వేతనం విషయంలోనే ప్రభుత్వం దోబూచులాడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నిమార్లు విన్నవించినా.. అప్‌గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త వేతనం చెల్లించాలని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు, ఆర్థిక శాఖకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. తమ శాఖ విధులే కా కుండా ప్రభుత్వం సూచించిన ఎలాంటి పనినైనా ఎంతో బాధ్యతతో చేస్తున్న తమ పట్ల ఎవరూ కనికరం చూపడం లేదని అప్‌గ్రేడ్ చేయబడిన అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మెయిన్ అంగన్వాడీలుగా మినీ అంగన్వాడీ కార్యకర్తల గుర్తింపు 2024లోనే ఉత్తర్వులు జారీ అయినా సిబ్బందికి పాతవేతనాలే మంజూరు ప్రభుత్వం స్పందించాలి.. అప్‌గ్రేడ్ చేయబడిన మినీ అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త వేతనం చెల్లించాలని ఎన్నోమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదు. మహిళా దినోత్సవం సందర్బంగానైనా ప్రభుత్వం స్పందించి, అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్తను అందించేలా చొరవ తీసుకోవాలి. –కై రి దేవగంగు, అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు -
నిజామాబాద్ బస్టాండ్‌లో గంజాయి పట్టివేత
ఖలీల్‌వాడి: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సుమా రు 250 గ్రామలు ఎండు గంజాయిని పట్టుకున్నట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు బృందం బస్టాండ్ వద్దకు వెళ్లగా అ నుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతడి బ్యాగ్‌ను చెక్ చేయగా అందులో 250 గ్రాముల ఎండు గంజాయి ఉందన్నారు. అతడిని వి చారించగా నవీపేట్ మండలం నాళేశ్వర్‌కు చెందిన బీస ప్రవీణ్(29)గా గుర్తించామన్నారు. ప్రస్తుతం అతడు నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎలవాత్ గ్రామంలో ఉంటున్నారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి పట్టివేతలో కీలకపాత్ర పోషించిన ఎస్సై మొగులయ్య, సిబ్బందిని అధికారులు అభినందించారు. -
లయన్స్ కంటి ఆస్పత్రిలో ‘ఆరోగ్య శ్రీ’
బోధన్: బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆస్పత్రి వ్యవస్థాపకులు పోలవరపు బసవేశ్వర్‌రావు, చైర్మన్ నర్సింహారెడ్డితో కలిసి శనివారం ఆరోగ్య శ్రీ సేవలను ప్రారంభించారు. అధునాతన వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన ఐ స్క్రీనింగ్ టెస్ట్ మొబైల్ వ్యాన్‌ను పరిశీలించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగుల కోసం ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ పాతికేళ్లుగా లయన్స్ కంటి ఆస్పత్రి ద్వారా నామమాత్రపు రుసుముతో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు పూర్తిస్థాయిలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు అందుబాటులోకి తెచ్చేందుకు లయన్స్ కంటి ఆస్పత్రికి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపజేసినట్లు పేర్కొన్నారు. తెల్ల రేషన్‌కార్డు కలిగిన వారికి ద్వారా పైసా ఖర్చు లేకుండా కంటి శస్త్రచికిత్సలు చేస్తారని వివరించారు. ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ కంటి ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, తహసీల్దార్ విఠల్, ఏసీపీ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొడాలి కిశోర్, శ్రీనివాస్‌రావు, ఉమేశ్ షిండే తదితరులు పాల్గొన్నారు. సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ -
కుటుంబంలో తల్లిపాత్ర అనిర్వచనీయం
సుభాష్‌నగర్: కుటుంబంలో తల్లి పాత్ర అనిర్వచనీయమని, గృహిణి శ్రేయస్సే గృహం శ్రేయస్సని నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి అన్నారు. జిల్లాలోనే మొట్టమొదటి మహిళా మున్సిపల్ కౌన్సిలర్ మాదాసు నాగమ్మ యాదవ్ స్మారకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరుకాపు సంఘంలో శనివారం నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ సీ్త్ర వైద్య నిపుణురాలు రమాదేవి మాట్లాడుతూ.. సీ్త్ర ఆధారంగానే సమాజం నిర్మాణమవుతుందని, కుటుంబం మంచిచెడులకు ఆధారం ఆ సీ్త్ర నడవడి మాత్రమేనని, అందుకే సీ్త్రలు తమ జీవితాన్ని ఉన్నతమైన మార్గం వైపు నడిపించాలని సూచించారు. తమ పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దిన బీడీ కార్మికులు బెల్లాల్ సావిత్రి, బొబ్బిలి ఒడ్డెమ్మ, మున్సిపల్ కార్మికురాలు లావణ్య, డ్వాక్రా పొదుపు సంఘాల సభ్యురాలు వేముల శోభ, మున్సిపల్ ఆర్పీలు మీన, నిర్మల, నీరజ, సుజాత, ధారాబాయిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ వారే దస్తగిరి, కార్యక్రమ నిర్వాహకుడు మాదాసు స్వామియాదవ్, బీజేపీ నగర మాజీ అధ్యక్షుడు యెండల సుధాకర్, బీడీ కార్మికులు, పొదుపు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుల వీరగాథలను స్ఫూర్తిగా తీసుకోవాలి
తెయూ(డిచ్పల్లి): విద్యార్థులు, యువత మహనీయుల వీరగాథలతో స్ఫూర్తి పొంది నవభారత నిర్మాణం చేయాలని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) కమ్యూనికేషన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ కే రాజారామ్ పిలుపునిచ్చారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎస్ఎం) నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వర్సిటీలో రాణీ అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రాజారామ్ మాట్లాడుతూ... వ్యక్తిగత జీ వితంలోని విషాదాలను అధిగమించి మూడు దశాబ్దాలపాటు మాల్వా రాజ్యంలో అహిల్యాబాయి పరిపాలన కొనసాగించారని తెలిపారు. యుద్ధరంగంలో ఆమె చూపిన తెగువ, పాలన సంస్కరణలు తెచ్చిన విధానం, సామాజిక సమరసత కోసం చేసిన కృషి, కాశీ విశ్వనాథ్, సోమనాథ్ ఆలయాల పునరుద్ధరణలో పోషించిన పాత్రను రాజారామ్ గుర్తు చేశారు. వర్సిటీ పూర్వ విద్యార్థి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వారె దస్తగిరి మాట్లాడుతూ యు వత రాణి అహిల్యాబాయి జీవితగాథ స్ఫూర్తితో గొప్ప పనులు చేయడానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెయూ అధ్యాపకులు వాసం చంద్రశేఖర్, అకడమిక్ కన్సల్టెంట్ నర్స య్య, తెయూ ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇఫ్లూ అసోసియేట్ ప్రొఫెసర్ రాజారామ్ తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
దొంగల ముఠా అరెస్టు
ఖలీల్‌వాడి: ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, సురేకర్ ప్రకాశ్, సయ్యద్ షాదుల్లా, సాయినాథ్ విఠల్‌రావులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. ఈ ముఠా సభ్యులు గతంలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైనట్లు తెలిపారు. ఈ నెల 5న అర్ధరాత్రి నలుగురు ముఠా సభ్యులు నాందేవ్‌వాడలోని సాయి బాలాజీ టాన్స్‌పోర్టు కార్యాలయంలో చొరబడి కౌంటర్లో దాచిన రూ.10.27లక్షలను అపహరించారని పేర్కొన్నారు. ట్రాన్స్‌పోర్టు యజమాని నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చేపట్టామన్నారు. శనివారం ఉదయం బైపాస్ రోడ్లో వాహనాల తనిఖీ చేపడుతుండగా అనుమానంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి పాల్పడినట్లు అంగీకరించారని ఏసీపీ వెల్లడించారు. చోరీ జరిగిన 48 గంటల్లోనే సీసీఎస్ సీఐ సురేశ్, టౌన్ సీఐ శ్రీనివాసరాజు, త్రీటౌన్ ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నట్లు వివరించారు. కాగా, అపహరించిన సొత్తులో నుంచి రూ.10వేలను నిందితులు జల్సాలకు వినియోగించగా, మిగతా రూ.10.17లక్షల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పీడీయాక్టు నమోదు కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. చోరీ కేసు చాకచక్యంగా ఛేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు. రూ.10.17 లక్షల నగదు స్వాధీనం పీడీ యాక్ట్ నమోదుకు సిఫారసు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వెల్లడి -
సుదర్శన్‌రెడ్డి వల్లే నవోదయ రిజెక్టు
సుభాష్‌నగర్: నవోదయకు నిజాంషుగర్స్ ఫ్యాక్టరీకి చెందిన 8 ఎకరాల భూమిని ప్రతిపాదించడంతో రిజెక్ట్ అయ్యిందని, విద్యాలయ ఏర్పాటు ప్రక్రియ ఆరు నెలలు వెనుకబడిందని ఎంపీ అర్వింద్ ధర్మపు రి అన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్ నగరంలోని బీజే పీ కార్యాలయంలో శనివారం ఎంపీ విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బా ల్కొండ నియోజకవర్గాలకు అనువుగా ఉంటుందని కలిగోట్ శివారును నవోదయ విద్యాలయానికి ఎంపిక చేశామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నవోదయకు స్థలాల ను త్వరగా క్లియర్ చేయాలని కోరగా ఆయన అధి కారులకు ఆదేశాలిచ్చారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో నవోదయ ఏర్పాటుకు తమ పార్టీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని ఒప్పిస్తే.. మరో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని సుదర్శన్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించా రు. సుమారు రూ.100 కోట్లతో చేపట్టే నవోదయకు నిజాంషుగర్స్‌కు చెందిన ప్రయివేటు భూమిని ఎలా ప్రతిపాదిస్తారని నిలదీశారు. కాబోయే మంత్రికి ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం సుదర్శన్‌రెడ్డికి లేదన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌ని తెరిపించే ఉద్దేశం సుదర్శన్‌రెడ్డికి లేదా అని అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకునే ఆలోచనలో ఆయన ఉన్నారని, ఇంకా నిజాంషుగర్స్‌ను ఏం తెరిపిస్తారని ఆరోపించారు. దీనిపై రైతు సంఘాలు ఆలోచన చేసి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం కావాలన్నారు. ఇదిలా ఉండగా జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు ఓఎల్ఎస్ సర్వే చేసి పంపిస్తే పనులు ప్రారంభమవుతాయని అర్వింద్ సూచించారు. ఈ సర్వేకు, నవోదయ ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయాలన్నారు. రెండు పెద్ద ప్రాజెక్టులు ఆగిపోతే భూపతిరెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. నవోదయ రిజెక్ట్ విషయమై ఇప్పటికే సీఎంకు లేఖ రాశానని అర్వింద్ ప్రతిని విడుదలచేశారు. ఆర్మూ ర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్, నాయకులు మోహన్‌రెడ్డి, స్రవంతిరెడ్డి, కంచెట్టి గంగాధర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.లక్ష్యంతో ముందుకెళ్తున్నా.. పదేళ్లల్లో పది ఫ్లై ఓవర్లు కట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నానని అర్వింద్ పేర్కొన్నారు. ఈనెలాఖరుకు మామిడిపల్లి, అడవి మామిడిపల్లి ఫ్లై ఓవర్లను ప్రారంభిస్తామని, ఈ ఏడాది ఆఖరు వరకు మాధవనగర్, అర్సపల్లి ఫ్లై ఓవర్ల పనులు పూర్తవుతాయన్నారు. బీజేపీకి రెండు ఎమ్మెల్సీలు దక్కడం కార్యకర్తల విజయమని, స్థానిక ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు గెలుస్తా మన్నారు. జిల్లా కేంద్రంలో ఎంఐ ఎం వర్సెస్ బీజేపీ ఉంటుందన్నారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలు చేస్తే తప్పేందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధామిచ్చారు. ఎన్ఎస్ఎఫ్ భూమి ఎలా ప్రతిపాదిస్తారు ? ఎంపీ అర్వింద్ ధర్మపురి -
వేర్వేరు చోట్ల కరెంటు షాక్‌తో ఇద్దరి మృతి
బోధన్‌టౌన్(బోధన్): బట్టలు ఆరవేసేందుకు వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన బోధన్ పట్టణం రాకాసీపేట్ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాకాసీపేట్‌కు చెందిన సయ్యద్ బాబా(53) శనివారం ఇంటిపై బట్టలు ఆరవేస్తుండగా అక్కడే ఏర్పాటు చేసిన డిష్ బాక్సు నుంచి విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన తండ్రి మృతికి కారణమైన డిష్ యజమానిపై చర్యలు చేపట్టాలని మృతుడి కొడుకు సయ్యద్ అద్నాన్ ఫిర్యాదు చేశాడని సీఐ తెలిపారు. ఈ మేరకు డిష్ యజమాని జయదేవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, సయ్యద్ బాబా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు, స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. కేబుల్ టీవీ డిష్ బాక్సు నుంచి విద్యుత్ సరఫరా అవుతోందని గతంలో చెప్పినా యజమాని పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యంతోనే ప్రాణం పోయిందని పేర్కొన్నారు. కారకులపై చర్యలు తీసుకుంటామని సీఐ సముదాయించడంతో ఆందోళనకారులు శాంతించారు. సీతారాంపల్లిలో మహిళ ..బీబీపేట: ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జాలిగామ రాధిక (28) భర్త రాజనర్సు మూడు నెలల క్రితం టీవీఎస్ చాంప్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. వాహనాన్ని రాత్రి ఇంటి బయట ఉంచడంతో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ను దొంగిలిస్తున్నారు. దీంతో ఆయన వాహనానికి విద్యుత్ వైర్‌ను అమర్చి ఉంచాడు. వైర్‌ను తీయకుండా అలాగే ఉంచగా శనివారం మధ్యాహ్నం అనుకోకుండా రాధిక బండిని ముట్టుకుంది. వెంటనే విద్యుత్ షాక్ తగలడంతో కింద పడగా, చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి తొమ్మిది నెలల పాప ఉంది. మృతురాలి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కారకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకుల ఆందోళన -
రాజీమార్గంలోనే సమస్యల పరిష్కారం
ఖలీల్‌వాడి: భూతగాదాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల సూచించారు. జిల్లా కేంద్రంలోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ పంచాయితీల కేసులు చాలా రోజుల వరకు పెండింగ్‌లో ఉంటున్నాయని, దీంతో ఇరు కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుందన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇరువురికీ సమస్యలు తలెత్తవని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాద కేసుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలతో పరిష్కారానికి ముందుకొస్తే నెల రోజుల్లోనే చెక్కు రూపంలో నగదు వస్తుందని తెలిపారు. 42 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించి వివిధ అకౌంట్లలో నిలిచిన నగదును బాధితులకు అందించినట్లు పేర్కొన్నారు. నెల రోజుల్లో బదిలీ అవుతా.. జిల్లా జడ్జిగా మూడేళ్ల నుంచి పని చేస్తున్నానని, మరో నెల రోజుల్లో బదిలీ అవుతానని, ఈ లోక్ అదాలత్ చివరిదని జడ్జి సునీత కుంచాల అన్నారు. మూడేళ్లలో పోలీసులు, న్యాయవాదులు, వివిధ సంస్థలు, డిపార్ట్మెంట్ల సహకారం మరువలేనిదని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, డీసీపీ బస్వారెడ్డి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి పద్మావతి, బార్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 18,252 కేసుల పరిష్కారం జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 18,252 కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించినట్లు డీఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ శైలజ తెలిపారు. 14 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేయగా, కేసుల పరిష్కారంతో రివార్డు రూపంలో రూ.5.34 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. యాక్సిడెంట్, బ్యాంక్ రుణాలు, ఇన్సూరెన్స్లకు చెందిన 300 కేసుల్లో రాజీ కుదర్చగా, కక్షిదారులకు రూ.73 లక్షల రివార్డు వచ్చినట్లు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన కేసుల కంటే 4,500పైగా ఎక్కువ కేసులు పరిష్కారమైనట్లు డీఎల్ఎస్ఏ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లా జడ్జి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ సునీత కుంచాల లోక్‌అదాలత్‌లో 18,252 కేసుల పరిష్కారం 300 బ్యాంక్ ఇన్సూరెన్స్ కేసుల్లో రూ.73 లక్షల రివార్డు -
మూడేళ్లుగా చోరీలు..
కామారెడ్డి క్రైం: మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠాలో ఉన్న మరికొందరు వ్యక్తులు, చేసిన నేరాలు, సొత్తు రికవరీ అంశాలపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చంద్రశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం పట్టణంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మూడు సంవత్సరాలుగా జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులుగా వెల్లడైంది. నిందితులను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సి పట్టణానికి చెందిన శేఖ్ ఇమ్రాన్ ఇస్మాయిల్, షేక్ వాజీద్గా గుర్తించారు. మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడిన వీరు కామారెడ్డి ప్రాంతంలో దాదాపు 40 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు నేరం అంగీకరించారని సీఐ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ఉస్మాన్, కానిస్టేబుళ్లు రవి, సురేందర్, గణపతి, శ్రావణ్, రాజేందర్, కిషన్‌లను అభినందించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు దాదాపు 40 కేసుల్లో నిందితులు -
అల్ప్రాజోలం పట్టివేత
● ముగ్గురి రిమాండ్ కామారెడ్డి క్రైం: కల్తీకల్లులో కలిపే నిషేధిత మత్తు పదార్థాన్ని సరఫరా చేస్తున్న ముగ్గురిని కామారెడ్డి ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎకై ్సజ్ ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన దాసోజు మధుసూదనచారి, నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లికి చెందిన భూమా విఠల్‌గౌడ్, గుండారం వెంకటి గౌడ్లను శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందును సదాశివనగర్ మండలం భూంపల్లికి చెందిన గడిపల్లి సురేశ్‌గౌడ్ వద్ద కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. కాగా, సురేశ్ గౌడ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
నర్సింగ్ స్కూల్ ఏర్పాటుకు స్థల పరిశీలన
ఎడపల్లి(బోధన్): ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ ఏర్పాటు కోసం మండలంలోని అంబం గేట్ వద్ద ఎన్ఎస్ఎఫ్ స్థలాన్ని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు శనివారం పరిశీలించారు. రోడ్డు, రవాణా వసతి వంటి వాటికి అనువైన వాతావరణం ఉండడాన్ని గమనించిన కలెక్టర్, సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని స్థానిక అధికారులకు సూచించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఈవో అశోక్, తహసీల్దార్ విఠల్, అధికారులు ఉన్నారు. పసుపు రైతులకు నష్టం చేస్తే ఊరుకోబోం మోర్తాడ్(బాల్కొండ): పసుపు ధరల విషయంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం, వ్యాపారులు సిండికేట్‌గా మా రి రైతులకు నష్టం కలిగిస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదన్నారు. మోర్తాడ్ మండలం పాలెంలో శనివారం పర్యటించిన ఆయన.. రైతులతో పసుపు ధరపై చర్చించారు. మార్కెట్ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో ఫోన్లో మా ట్లాడారు. పసుపునకు కటాఫ్ ధరను రూ.9వేల నుంచి రూ.8వేలకు తగ్గించారని, కొమ్ముకు రూ.10వేలు, మండకు రూ.9వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. పసుపు బోర్డు ఏర్పాటు పేరుకే ఉందని, బోర్డు ఏర్పడితే రూ.15వేల మద్దతు ధరను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన కు గురికావొద్దని, అండగా ఉంటామన్నారు. సిఖ్ సొసైటీ సేవలు ప్రశంసనీయం నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ సిఖ్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. తెలంగాణ సిఖ్ సొసైటీ ఉమెన్ డెవలప్మెంట్ హబ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ పక్కన ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించగా, సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) తేజ్‌దీప్ కౌర్ పాల్గొన్నారు. అనంతరం పాములబస్తీలోని గురుద్వారా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనాల్లో వారు పాల్గొన్నారు. తెలంగాణ సిఖ్ సొసైటీ ఉమెన్ డెవలప్మెంట్ హబ్‌కు శంకుస్థాపన చేశారు. గురుద్వారాకు ఆనుకుని రేకుల షెడ్లలో నివాసాలు ఉంటున్న సిక్కు కుటుంబాల ఇళ్లను సందర్శించి వారి జీవన స్థితిగతులను కలెక్టర్ క్షేత్ర స్ధాయిలో పరిశీలించారు. అర్హులైన వారికి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని రిటైర్డ్ డీజీపీ కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సొసైటీ ప్రతినిధులు దర్శన్‌సింగ్, మహేందర్‌సింగ్, దీప్‌సింగ్, నరేందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ చిరుత సంచారం ఎడపల్లి(బోధన్): చిరుతపులి మళ్లీ సంచరిస్తోంది. జాన్కంపేట్ శివారులో రైస్‌మిల్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్ల కోసం గు రువారం తవ్వకాలు చేపట్టారు. అదే సమ యంలో వచ్చిన చిరుత అరగంట వరకు అక్కడే కూర్చుంది. జేసీబీ డ్రైవర్ భయాందోళనతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నెల రోజులుగా చిరుత సంచరిస్తోందని తెలిపినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థాని కులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
ఎడపల్లి (బోధన్): ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామానికి చెందిన సురేశ్(24) శుక్రవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వంశీచందర్‌రెడ్డి శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో సురేశ్ శుక్రవారం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. శనివారం ఉదయం మృతదేహం నీటిపై తేలడంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవితం మీద విరక్తితో.. పిట్లం(జుక్కల్): మండలంలోని బొల్లక్‌పల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో శనివారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజు తెలిపారు. రుద్రూర్ గ్రామానికి చెందిన జిల్లాపురం చిన్న సాయిలు(48) కొంతకాలం నుంచి మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతుండేవాడు. జీవితంపై విరక్తితో బొల్లక్‌పల్లి గ్రామశివారులోని మంజీర బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
‘ఆడిటర్లను విచారణకు పిలవండి’
వేల్పూర్: నిధుల అవకతవకలపై పదేళ్ల నుంచి ఆడిట్ నిర్వహించిన ఆడిటర్లను విచారణకు పిలవాలని శనివారం విచారణకు వచ్చిన అధికారి మురళికి వేల్పూర్ మండలం పడగల్ సొసైటీ మాజీ డైరెక్టర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్ల కిందట సొసైటీలో నిధుల గోల్మాల్ జరిగిందని, దీనిపై సమాధానం చెప్పాలని తమను విచారణకు పిలవడం శోచనీయమన్నారు. ప్రతి సంవత్సరం ఆడిటర్లు నిధుల వినియోగంపై తనిఖీ చేసినప్పుడు అవకతవకలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. వార్షిక ఆడిట్ చేసే ఆడిటర్లు సొసైటీలో జరిగే అవకతవకలపై అప్పుడే చెబితే ప్రశ్నించేవారమన్నారు. తమకు ఆడిట్ వివరాలు చెప్పకుండా ఆమోదింపజేసుకున్నారని విచారణ అధికారికి స్పష్టం చేశారు. తమ పదవీకాలంలో నిధులను తనిఖీ చేసిన ఆడిటర్లు, ఎన్డీసీసీ బ్యాంకు మేనేజర్లను విచారణకు పిలిచి, ఎక్కడ పొరపాటు జరిగిందో వెలికితీయాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో మాజీ డైరెక్టర్లు ఎడ్ల రాజేశ్వర్‌రెడ్డి, బ్యాగరి పుణ్యరాజ్, కొంతం దేవన్న, నేరేళ్ల రాజేశ్వర్‌రెడ్డి, బుట్టి మహిపాల్, ఏనుగు శేఖర్‌రెడ్డి ఉన్నారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా ● ఎంపీ అర్వింద్ నిజామాబాద్ నాగారం: జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ కోసం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవనంలో శనివారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్స్ వెల్ఫేర్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ సంక్షేమం కోసం పాటు పడుతానని అన్నారు. కార్యక్రమంలో కమిటీ నేతలు అజీ జ్, శ్రావణ్‌కుమార్, మల్లేశ్, సాయరెడ్డి, ఎవీ ఎల్ నారాయణ, గంగాధర్, జ్యోతిరాజ్, మో హన్దాస్, జిల్లా అధ్యక్షుడు పీపీ రెడ్డి, కార్యదర్శి షేక్ హుస్సేన్, కామారెడ్డి భిక్షపతి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. చెట్టును ఢీకొన్న కారు మోపాల్: మండలంలోని తాడెం శివారులో శుక్రవారం రాత్రి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన మురళీధర్ మోపాల్ నుంచి నిజామాబాద్ వైపు వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో మురళీధర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
చేపలవేటకు వెళ్లి యువకుడి మృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని మంజీరా నదిలో చేపలవేటకు వెళ్లి చీనూర్ గ్రామానికి చెందిన మహ్మద్ ఉస్మాన్(27) మృతి చెందాడు. ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలోని మంజీరా నదిలో చేపల వేటకు ఉస్మాన్ శుక్రవారం వెళ్లాడు. రాత్రి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోయింది. శనివారం నది ఒడ్డున ఉస్మాన్‌కు సంబంధించిన వస్తువులు కనిపించడంతో కుటుంబసభ్యులు నీటిలో గాలించగా మృతదేహాం లభ్యమైంది. మృతుడి భార్య అమీదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు..నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామానికి చెందిన అచ్చనపల్లి సాయిక్రిష్ణ(21) హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. డబ్బుల విషయంలో తల్లి సాయమ్మ మందలించిందనే కారణంతో సాయిక్రిష్ణ గత నెల 21న ఇంట్లో ఉన్న పురుగులమందు సేవించి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. చికి త్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రథమచికిత్స అనంతరం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు గురువారం సాయిక్రిష్ణను గాంధీ ఆస్పత్రికి తరలించగా సాయంత్రం తుదిశ్వాస విడిచాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. -
లైబ్రరీలోని సాహిత్య సంపద
పుస్తకాలను పరిశీలిస్తున్న ఔత్సాహిక విద్యార్థులు నిజామాబాద్ సిటీ : ఆ ఇంటి నుంచి వచ్చే సాహిత్య పరిమళాల సువాసన ఎన్నో మెదళ్లను కదిలిస్తోంది. తెలుగు పాఠాలు బోధించే పంతులు కవిగా, రచయితగా, గ్రంథకర్తగా రాణిస్తూ సాహిత్య లోకానికి తన సేవలందిస్తున్నారు. ఆయన పేరే డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు. ప్రస్తుతం సిర్పూర్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తన ఇంటి పైఅంతస్తును గ్రంథాలయంగా మార్చారు. 35 ఏళ్ల క్రితం పుస్తకాలు సేకరించడం ప్రారంభించిన ఆయ న 15 వేల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. సాహిత్య దాహార్తిని తీరుస్తున్న లైబ్రరీ తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన సాహితీవేత్తల గ్రంథాలు, కావ్యాలు, పద్య కావ్యాలు, ప్రాచీన సాహిత్యం, శాసనాలు, ఆధునిక సాహిత్యం, కవితలు, కథలు, నవలలు, నాటికలు, బాలల పుస్తకాలు, జీవిత చరిత్రలు వంటి ఎన్నో నాటకాలు, ఎన్నెన్నో పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి. ఈ సాహితీ సంపద భావి పరిశోధకులు, ఔత్సాహిక విద్యార్థులు, రచయితలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ గ్రంథాలయాన్ని ప్రతిరోజూ సాహిత్య అభి మానులు, సాహిత్య పరిశోధకులు, కవులు, కవి త్వం నేర్చుకోవాలనుకునే యువతరం సందర్శించి వారి సాహిత్య దాహార్తిని తీర్చుకుంటున్నారు. తెలుగు పరిశోధకులు తెలంగాణ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ, శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి వచ్చే విద్యార్థులు తమకు కావాల్సిన సాహిత్య సమాచారాన్ని పొందుతున్నారు. నరేశ్‌రావు ఏర్పాటు చేసిన గ్రంథాలయంలోని పుస్తకాల సహకారంతో ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థులు తమ పరిశోధక వ్యాసాలను పూర్తిచేశారు. 35 ఏళ్లుగా.. జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్ కాలనీలో నివాసముండే డాక్టర్ కాసర్ల నరేశ్‌రావు సిర్పూర్ జెడ్పీహెచ్ఎస్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కవితలు, కథలు, వ్యాసరచనల్లో తర్ఫీదునిస్తున్నారు. గుండారం గువ్వలు, సిరిపురం సిరులు వంటి పుస్తకాలు ప్రచురించారు. ఆయన విద్యార్థులు రాసిన కవితలకు జాతీయ బహుమతులు దక్కాయి. 35 ఏళ్ల క్రితం నుంచి పుస్తకాలు సేకరించే పనిలో పడిన నరేశ్‌రావు.. ఇప్పటివరకు దాదాపు 15 వేలకు పైగా పుస్తకాలు సేకరించారు. తెలుగు సాహిత్యంలో విశేషమైన కీర్తిని గడించిన పుస్తకాలు ఆయన లైబ్రరీలో కొలువుదీరి ఉన్నాయి. రాష్ట్ర గ్రంథాలయ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ బాల శ్రీ నివాసమూర్తి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ ఫణీంద్ర, డాక్ట ర్ మేకల రామస్వామి, బోయిన్పల్లి ప్రభాకర్, కవు లు వీపీ చందన్రావు, పంచరెడ్డి లక్ష్మణ్, ఘనపురం దేవేందర్, గంట్యాల ప్రసాద్, డాక్టర్ శారద హ న్మాండ్లు, చింతల శ్రీనివాస్‌గుప్తా గ్రంథాలయాన్ని సందర్శించారు. డాక్టర్ వారె దస్తగిరి, డాక్టర్ శశికు మార్, డాక్టర్ సుంకరి గంగాధర్, డాక్టర్ అన్నం దా స్ జ్యోతి, డాక్టర్ ఎం రామస్వామి, కందకుర్తి ఆనంద్ సిద్దసాయిరెడ్డి తదితరులు తమ పరిశోధనలు పూర్తిచేశారు.ప్రబంధాలు 16వ శతాబ్దంలో వచ్చిన వసుచరిత్ర, మను చరిత్ర, ఆముక్తమాల్యద, శ్రీకాళహస్తీశ్వర మహత్యం, పాండురంగ మహత్యం, రాజశేఖర చరిత, పారిజాతాపహరణం. ఆధునిక సాహిత్యం గురజాడ అప్పారావు తెలుగులో రచించిన మొదటి కథ దిద్దుబాటు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు, చాసోకథలు, విశ్వనాథ సత్యనారాయణ కథలు, అడవి బాపిరాజు కథలు, కేతు విశ్వనాథరెడ్డి, కాళీపట్నం రామారావు కథలు.. ఇంకా ఎన్నో.. పరిశోధన గ్రంథాలు బీఎన్‌రెడ్డికి చెందిన తెలుగులో శాసననాలు, బిరుదరాజు రామరాజు తెలుగు జానపద గేయ సాహిత్యం, సినారె ఆధునిక కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు, డాక్టర్ కొట్టూరు ముత్యం రచించిన శ్రీకాకుళ ఉద్యమంలో తెలుగు సాహిత్య ప్రభావం, నిజామాబాద్ జిల్లా శాస్త్రాలు, బాచన్పల్లి ఒక గుట్టకిందపల్లి వంటివి. జీవిత చరిత్రలు కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్ర మొదలుకొని ఇటీవల వచ్చిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అమరేశ్వర రాజేశ్వర శర్మ, నేను చిందు ఎల్లమ్మను (జిల్లాకు చెందిన చిందు కళాకారిణి). ఆత్మకథలు మళ్లీ మొదలు, గుఱ్ణం జాషువా, దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్య ఆత్మకథలు శ్రీపాద సుబ్రహ్మణ్యం ఆత్మకథ, కాళోజీ ఆత్మకథ ‘ఇది నాగొడవ’, నేను చిందు ఎల్లమ్మను. నవలలు తెలుగులో కందుకూరి వీరేశలింగం రాసిన మొదటి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర మొదలుకొని విశ్వనాథ సత్యనారాయణ నవలలు, గుడిపాటి వెంకటాచలం నవలలు, డాక్టర్ కేశవరెడ్డి నవలలు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రచించిన వేయి పడగలు. కవిత్వం శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలుకొని దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి, గుంటూరు శేషేంద్ర శర్మ (ఆధునిక మహాభారతం), సినారే రచించిన విశ్వంభర, శివారెడ్డి కవిత్వం తదితరాలు. చరిత్ర పుస్తకాలు తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర, సంస్కృత సాహిత్య చరిత్ర, సూర్యరాయాంధ్ర నిఘంటువులు (14 సంపుటాలు), వ్యాకరణశాస్త్ర గ్రంథాలు తదితరాలున్నాయి. జిల్లాకు చెందిన సమగ్ర సాహిత్యం నిజామాబాద్ జిల్లా సంపూర్ణసాహిత్య పుస్తకాలు. ప్రత్యేక సంచికలు (సావనీర్లు) ఇందూరు ఉత్సవాలు, ప్రపంచ తెలుగు మహాసభలు, శతాబ్ది ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాలు, తదితర ప్రత్యేక సంచికలు.ఆ ఇల్లే ఓ గ్రంథాలయం లైబ్రరీ కోసం ఇంటిపై ప్రత్యేక అంతస్తు నిర్మాణం 15 వేలకు పైగా పుస్తకాల సేకరణ సాహిత్యకారులు, పరిశోధక విద్యార్థులకోసం అందుబాటులో.. అక్కడే కూర్చుని చదువుకునేందుకు వసతుల ఏర్పాటు సాహిత్య సేవలో తరిస్తున్న తెలుగు టీచర్ డాక్టర్ కాసర్ల -
కాంగ్రెస్ శ్రేణుల్లో అసహనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రోజురోజుకూ అసహనం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకుని 16 నెలలు పూర్తవుతున్నప్పటికీ తమకు ప్రాధాన్యత దక్కడం లేదని జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు తమకు అన్యాయం జరుగుతోందని గుర్రుగా ఉన్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి అనేక ఇబ్బందులు పడుతూ పార్టీ కోసం పనిచేసినప్పటికీ తమకు తగిన ప్రాధాన్యం దక్కడంలేదని అత్యధికమంది కార్యకర్తలు బహిరంగంగానే అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. పైగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో విచ్చలవిడిగా వ్యవహరించిన వాళ్లను అధికారం వచ్చాక కాంగ్రెస్‌లోకి తీసుకోవడమే కాకుండా, వాళ్లకే ప్రాధాన్యత ఇచ్చి తమకు మాత్రం ఇవ్వడంలేదని అంటున్నారు. అధికారులు సైతం బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తూ తమకు సహకరించడంలేదని ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు కొందరికే నామినేటెడ్ పదవులు ఇచ్చి తమకు ఇవ్వకుండా మానసిక వేదనకు గురిచేస్తున్నారని పార్టీలో ఏళ్లతరబడి పనిచేస్తున్న సీనియర్లు వాపోతున్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచే ముగ్గురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన మరొకరికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల కూడా సీనియర్లు అసహనంగా ఉన్నారు.సీఎం ప్రచారం చేసినా..నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినప్పటికీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. మరోవైపు ఉత్తర తెలంగాణలో రోజురోజుకూ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం గెలుచుకుంది. జిల్లాలో మున్సిపాలిటీలు, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ నాయకత్వం పకడ్బందీగా పావులు కదుపుతోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండుకు రెండు స్థానాలను గెలుపొందిన బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతోంది. ఓటమి భారంతో కాంగ్రెస్‌లో నిరుత్సాహం నెలకొంది. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో నీరుగారుతున్న ఉత్సాహం నామినేటెడ్ పదవులు రాక గుర్రుమంటున్న సీనియర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో మరింత నిస్తేజంఅనవసర జాప్యం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నే గ్రామ పంచాయతీల పదవీ కాలం పూర్తయింది. తరువాత మండల, జిల్లా ప్రజా పరిషత్ పా లకవర్గాల పదవీకాలం, మూడు నెలల క్రితం మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోయింది. అయితే సహకార సంఘాలకు ఆరు నెలల పాటు పదవీకాలం పొడిగించారు. ప్రభు త్వం పట్ల అంతగా వ్యతిరేకత రాకముందే పాలకవర్గాల కాలపరిమితి పూర్తయిన స్థానిక సంస్థల కు ఎన్నికలు నిర్వహిస్తే సానుకూల ఫలితాలు సాధించే అవకాశాలు ఉండేవన్నారు. అనవసర తాత్సారం చేసి వ్యతిరేక పవనాలు వచ్చేవరకు చేశారని, దీంతో ఉత్సాహం నీరుగారిపోతోంద ని పార్టీ శ్రేణులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా బాధ్యతలన్నీ అధికారులకు అప్పగించడంతో తమకు విలువ లే కుండా పోతోందని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు అంటున్నారు. -
తెలుగు/హిందీ/ఇంగ్లిష్
వెండితెరఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్) స్క్రీన్–1 ఛావా(హిందీ)–11.00.4.40,10.30 ఛావా(హిందీ)–1.45, 7.40 స్క్రీన్–2 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (తెలుగు)–1.30, 7.30 నారి(తెలుగు)–4.40 రా.. రాజా(తెలుగు)–10.30 స్క్రీన్–3 జిగేల్(తెలుగు)–11.00 కింగ్స ్టన్(తెలుగు)–1.30, 7.30 రిటర్న్ ఆఫ్ డ్రాగన్(తెలుగు)–4.40, 10.20 పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్) స్క్రీన్–1 ఛావా(తెలుగు)–10.00 కింగ్స ్టన్(తెలుగు)–1.20, 7.40 రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్(తెలుగు)– 4.20, 10.40 స్క్రీన్–2 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (తెలుగు)–10.15 ఛావా(హిందీ)–1.30, 10.50 సివంగి(తెలుగు)–4.50 ఛావా(తెలుగు)–7.30 స్క్రీన్–3 రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్(తెలుగు)–10.25 ఛావా(తెలుగు)–1.35 మిక్కీ–17(ఇంగ్లీష్)–4.55, 7.50 కింగ్స ్టన్(తెలుగు)–10.45 స్క్రీన్ –4 నారి(తెలుగు)–10.35 మిక్కీ–17(ఇంగ్లీష్)–1.10 కోపమా(తెలుగు)–1.30 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (తెలుగు)–4.05, 10.30 రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్(తెలుగు)–7.20 లలితామహల్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు దేవి మజాకా(తెలుగు) నటరాజ్ రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్ విజయ్ ఛావా (తెలుగు) -
అక్క సబ్ కలెక్టర్.. చెల్లి యాంకర్
నిజామాబాద్ సిటీ: తెలిసీ తెలియని వయస్సులోనే తండ్రి వదిలివెళ్లినా తల్లి మాత్రం మొక్కవోని దీక్షతో తనకున్న ఇద్దరు ఆడపిల్లలను చదివించింది. ఉన్నత స్థానాల్లో చూడాలనుకున్న ఆ తల్లి ఆశలను కూతుళ్లు సైతం సాకారం చేశారు. పెద్ద కుమార్తె అరుగుల స్నేహ యూపీఎస్సీ పరీక్షలల్లో విజయం సాధించారు. 2025లో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసుకొన్న ఆమె ప్రస్తుతం బర్గారా జిల్లా పదంపూర్ సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కకు తగ్గ చెల్లి అనిపించుకుంటోంది అరుగుల సుప్రియ. తనకు ఇష్టమైన మ్యూజిక్‌లో డిగ్రీ చేశారు. ఆన్లైన్లో సంగీత పాఠాలు బోధిస్తూ, మరో అభీష్టమైన యాంకరింగ్ చేస్తూ సంపాదిస్తున్నారు. అక్కకు ఆర్థికంగా తోడుగా నిలిచారు. తల్లి ఆశలు నెరవేర్చిన ఇద్దరు అక్కాచెల్లెల్లు నేటి మహిళలకు ఆదర్శనీయం. -
ఎస్సీ వర్గీకరణ బిల్లులో లోపాలను సరిచేయాలి
డిచ్పల్లి: ఎస్సీ వర్గీకరణ బిల్లులో లోపాలు ఉన్నాయని వాటిని సరి చేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్రనాయకుడు గంథమాల నాగభూషణం డిమాండ్ చేశారు. శుక్రవారం డిచ్పల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి డప్పు నర్సయ్య ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లులో లోపాలు సరిచేయాలని డిమాండ్ చేస్తూ మాదిగల ఆత్మగౌరవ డప్పుల ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కిష్టయ్య, యమున, సత్తెక్క, సాయిలు, సురేశ్, పోషన్న, బక్కన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో దొంగల బీభత్సం
రాజంపేట: మండల కేంద్రంలోని తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తుతెలియ ని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇ లా.. రాజంపేటకు చెందిన మాణిక్య రాజమణి ఇంటికి తాళం వేసి బుధవారం ఊరికి వెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం రాజమణి ఇంటి తలుపులు తెరచి ఉండటంతో వారి ఇంటిపక్కనే నివసిస్తున్న కిరణ్ కుమార్ వారికి సమాచారం అందించాడు. వెంటనే రాజమణి ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు ఇంట్లోని మూడున్నర తులాల బంగారు నెక్లెస్‌తో పాటు రూ. 10వేలు నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. నగరంలో ఆటో, బైక్.. ఖలీల్‌వాడి: నగరంలోని వేరువేరు చోట్ల రెండు వాహనాలు చోరీకి గురైనట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని గోదాంరోడ్డులో నిలిపేష్కుమార్ తన యాక్టీవాను ఇంటి ముందు పార్క్ చేయ గా, గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎ త్తుకెళ్లారు. అలాగే జీజీహెచ్‌లో మంగళవారం రాత్రి పార్క్ చేసిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఆటో కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు చోరీ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. పలు ప్రాంతాల్లోని తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు బంగారం, నగదు అపహరణ -
బీజేపీ మండల కార్యవర్గం ఏర్పాటు
సిరికొండ: బీజేపీ మండల నూతన కార్యవర్గాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతకుంట రామస్వామి, జిల్లా నాయకుడు అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసినట్లు మండల అధ్యక్షుడు గుర్రపు సంజీవ్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శులుగా బాపురావు, రాజేందర్, ఉపాధ్యక్షులుగా గంగామురళి, కార్తీక్, దేశ్యనాయక్, సురేశ్, కార్యదర్శులుగా పోతుగంటి సతీశ్, గంగాధర్, జింక రాజేందర్, సుమన్, అధికార ప్రతినిధిగా యెన్నం రంజిత్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా కళ్యాణ్‌గౌడ్, శ్రీనివాస్, గంగాధర్, కాశీరాం, గంగారెడ్డియాదవ్, ప్రేమ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడిగా సండ్ర శంకర్, ప్రధాన కార్యదర్శిగా ఒడ్డెన్న, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడిగా గోవింద్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ప్రభాకర్, యువ మోర్చా మండల అధ్యక్షుడిగా మధు, ప్రధాన కార్యదర్శులుగా విష్ణు, దాసు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా నవీన్, ప్రధాన కార్యదర్శిగా ఒడ్డెం భాస్కర్, ఉపాధ్యక్షులుగా బాలయ్య, రాజేశ్వర్‌ను నియమించినట్లు మండల అధ్యక్షుడు తెలిపారు. -
మహిళలు ఉన్నత స్థాయికి చేరాలి
ఖలీల్‌వాడి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పలువురు వక్తలు అన్నారు. జిల్లా కోర్టులోని సమావేశ హాల్లో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి సునీత కుంచాల హాజరై మాట్లాడారు. మహిళలు ఉన్నత చదువులు చదివి శక్తివంతులై అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి కనకదుర్గ, ఆశా లత, శ్రీనివాస్, పద్మావతి, కుష్బూ ఉపాధ్యాయ, చైతన్య, మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, వసంతరావు, దీపక్, పిల్లి శ్రీకాంత్, కవితారెడ్డి, నీరజ, పరిపూర్ణా రెడ్డి, రజిత, మానస, అపూర్వ, రమ, కల్పన, స్నేహ, అంజలి, న్యాయవాదులు పాల్గొన్నారు. ● మహిళలు స్వయం శక్తితో ముందుకెళ్లాలి నిజామాబాద్‌సిటీ: మహిళలు స్వయం శక్తితో ముందుకెళ్లాలని సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐద్వా కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో మూడ్ శోభన్, బుర్రి ప్రసాద్, ఐద్వా సుజాత, పెద్ది వెంకట్ రాములు, ముక్కూర్ లావణ్, తూట్కూర్ నర్సయ్య, శిర్ప లింగం, డాక్టర్ షాబుద్దీన్, మహిళలు పాల్గొన్నారు. ● జర్నలిజం వృత్తిలో రాణించడం అభినందనీయం నిజామాబాద్‌నాగారం: మహిళలు జర్నలిజంలో రాణించడం అభినందనీయమని డీఎంహెచ్‌వో బద్దం రాజశ్రీ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మహిళ దినోత్సవం కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం మహిళా జర్నలిస్టులను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ ప్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, మహిళా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ● భారతీయ సంప్రదాయాలను గౌరవించాలి ధర్పల్లి: ప్రతి ఒక్కరూ భారతీయ సంప్రదాయాలను గౌరవించాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బంది ప్రిన్సిపాల్‌ను సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శారద, సరిత, నిహారిక సిబ్బంది పాల్గొన్నారు. ● జేసీఐ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిజామాబాద్ నాగారం: జేసీఐ ఇందూరు, జేఏసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని లక్ష్మీనర్సింహనగర్ కాలనీలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేసీఐ అధ్యక్షురాలు పి గౌతమి, జైపాల్ కాలే, లావణ్య, నయన్, యాదేశ్ గౌడ్, సుకన్య, లీల, రమాదేవి, రమ్య, వీణ పాల్గొన్నారు. ● మహిళల ఆరోగ్యంపై అవగాహన నిజామాబాద్ అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో మహిళలు, బాలికల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బండారు ఉషానవీన్ హాజరయ్యారు. మహిళలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి, రంగరత్నం, వెంకటరమణ, నాగజ్యోతి, నరేశ్, సుధాకర్‌రావు, రజిత, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో వక్తలు -
No Headline
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహిళాభ్యున్నతే ధ్యేయంగా ఇందూరులోని కపిల మహిళా సొసైటీ గత 22 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తోంది. ఈ సొసైటీ ద్వారా వేలాదిమంది మహిళలు వివిధ రకాల కోర్సులను నేర్చుకుని స్వయం ఉపాధితో నిలదొక్కుకుంటున్నారు. అయ్యవారు గోపిక అనే మహిళ 1991 నుంచి టైలరింగ్‌లో వేలమంది మహిళలకు శిక్షణ ఇస్తూ, 2003లో కపిల మహిళా సొసైటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ సొసైటీ సౌజన్యంతోపాటు నాబార్డ్, నెహ్రూ యువ కేంద్ర, ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ, స్కిల్ ఇండియాలోని ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఎంఎస్ఎంఈ తదితర పథకాల కింద శిక్షణ ఇస్తున్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగుల తయారీ, హ్యాండీ క్రాఫ్ట్స్, క్రిస్టల్ క్రాప్స్, చేతి కళలు, మగ్గం వర్క్స్, జ్యూట్ బ్యాగులపై పెయింటింగ్(స్క్రీన్ ప్రింటింగ్), పేపర్ బ్యాగులు, గ్లాసుల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, రాఖీల తయారీ, బ్యాంగిల్స్ మేకింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్నవారందరికీ సర్టిఫికెట్టు ఇస్తున్నారు. గోపిక సేవలకు గాను అనేక అవార్డులు వచ్చాయి. 2007, 2017లో గోపికకు ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డులు వచ్చాయి. కాగా చిన్నతరహా రుణాలు, అక్షరాస్యత, మాతాశిశు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తుండడంతో జిల్లాకు వచ్చిన కలెక్టర్లందరూ గోపికను ఆదర్శంగా చూపిస్తున్నారు. -
జన్ ఔషధి కేంద్రాలతో ఎంతో మేలు
● ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నాగారం: జన్ ఔషధి కేంద్రాల ద్వా రా పేదలకు అతి తక్కువ ధరలకు మందులు అందుతుండడంతో వారికి ఎంతో మేలు కలుగుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జన్ ఔషధి దివస్ సందర్భంగా శుక్రవారం నాందేవ్వాడలో ఉన్న జన్ ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. జిల్లా లో మరిన్ని జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటుకు తగిన సహాయం అందిస్తానన్నారు. నాయకులు వడ్డి మోహన్ రెడ్డి, నాగోల్ల లక్ష్మీనారాయణ, ఎర్రం సుధీర్, పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్, కిశోర్, కృష్ణ, బస్సాపూర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు/హిందీ/ఇంగ్లిష్
వెండితెరఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్) స్క్రీన్–1 ఛావా(హిందీ)–11.00.4.40,10.30 ఛావా(హిందీ)–1.45, 7.40 స్క్రీన్–2 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (తెలుగు)–1.30, 7.30 నారి(తెలుగు)–4.40 రా.. రాజా(తెలుగు)–10.30 స్క్రీన్–3 జిగేల్(తెలుగు)–11.00 కింగ్స ్టన్(తెలుగు)–1.30, 7.30 రిటర్న్ ఆఫ్ డ్రాగన్(తెలుగు)–4.40, 10.20 పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్) స్క్రీన్–1 ఛావా(తెలుగు)–10.00 కింగ్స ్టన్(తెలుగు)–1.20, 7.40 రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్(తెలుగు)– 4.20, 10.40 స్క్రీన్–2 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (తెలుగు)–10.15 ఛావా(హిందీ)–1.30, 10.50 సివంగి(తెలుగు)–4.50 ఛావా(తెలుగు)–7.30 స్క్రీన్–3 రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్(తెలుగు)–10.25 ఛావా(తెలుగు)–1.35 మిక్కీ–17(ఇంగ్లీష్)–4.55, 7.50 కింగ్స ్టన్(తెలుగు)–10.45 స్క్రీన్ –4 నారి(తెలుగు)–10.35 మిక్కీ–17(ఇంగ్లీష్)–1.10 కోపమా(తెలుగు)–1.30 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (తెలుగు)–4.05, 10.30 రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్(తెలుగు)–7.20 లలితామహల్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు దేవి మజాకా(తెలుగు) నటరాజ్ రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్ విజయ్ ఛావా (తెలుగు) -
జయహో మహిళ
● అన్ని రంగాల్లోనూ సత్తాచాటుతున్న అతివలు ● రక్షణ కవచాలుగా అనేక చట్టాలు ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం తాను అబల కాదు.. సబల, సాహసి అని నిరూపిస్తున్నది మహిళ. కష్టాలను భరిస్తూ, వేధింపులను ధైర్యంగా ఎదుర్కొంటున్నది. కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. అవసరమైతే కన్నెర్రజేస్తున్నది. పిరికితనం వదిలి పిడికిలి బిగిస్తున్నది. నేలవైపు తలవాల్చి నడవడం కాదు, నింగికి నిచ్చెన వేస్తున్నది. ఆకాశంలో సగమై, అవనిలో అర్ధభాగమై నడుస్తున్నది. పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. జగతిలో తాను లేని చోట లేదని రుజువు చేస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళలు నిత్య జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను, అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. -
విద్యార్థుల వనసందర్శన
నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్కు చెందిన విద్యార్థులు శుక్రవారం మంచిప్ప రిజర్వ్ ఫారెస్టును సందర్శించారు. ఉపాధ్యాయులు, అటవీ అధికారులు విద్యార్థులకు అడవుల ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ లలిత, రాజేశ్వరి, సురేందర్, రాధ, ఉద్యశీల, కిరణ్‌కుమార్, అటవీ శాఖ అధికారులు సాయికుమార్, సురేశ్‌కుమార్, శశిధర్, ప్రవీణ్, సంతోష్, రవి పాల్గొన్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి నిజామాబాద్‌నాగారం: నగరంలోని కంఠేశ్వర్‌లో ఉన్న మాల సంఘ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లయ్య, సభ్యులు అడిషనల్ కలెక్టర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సంఘానికి సంబంధించిన స్థలంలో ఓ వ్యక్తి ఆక్రమించే ప్రయత్నంలో భాగంగా సంఘ సభ్యులపై కేసు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో వినయ్, బట్టి గంగాధర్, దయానంద్, సిర్పూర్ రాజు, శివరాజ్, సల్ల బాలయ్య, బొడ్డు నర్సింగ్ రావు, జనార్దన్, ప్రమోద్, సజన్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా ధర్పల్లి: వినియోగదారులకు నాణ్యమైన విద్యు త్ను సరఫరా చేస్తున్నట్లు డీఈ ఉత్తమ్ జాడే అ న్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్, సబ్ ఇంజినీర్ గౌతమ్ పాల్గొన్నారు. గెస్ట్ లెక్చరర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో రహస్యంగా విడుదల చేసిన అతిథి అధ్యాపకుల ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రఘురాం, అంజలి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తెయూ రిజిస్ట్రార్ ఎం యాదగిరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంజయ్, అజయ్, గౌతమ్, విజయ్, దినేశ్ పాల్గొన్నారు. వర్ధంతి సభ పోస్టర్ల ఆవిష్కరణ సిరికొండ: మండలంలోని గడ్కోల్‌లో సీపీఐఎంఎల్ మాస్‌లైన్ నాయకుడు రాయల సుభాశ్ చంద్రబోస్ వర్ధంతి సభ వాల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ఖమ్మంలో ఈ నెల 9న నిర్వహించే రాయల 9వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేశ్, సాయారెడ్డి, లింబాద్రి, రమేశ్, కిశోర్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంఘం క్యాలెండర్.. నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నూతన క్యాలెండర్‌ను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, నేరేళ్ల శ్రీను, సర్దార్, బీరేందర్ సింగ్, జి చైతన్య కృష్ణ, సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదవాలి నిజామాబాద్ అర్బన్: విద్యార్థులు ప్రాణాళిక బద్ధంగా చదవాలని డీఈవో అశోక్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ గార్డెన్ గార్డెన్లో నిర్వహించిన సెయింట్ జేవియర్ పాఠశాల వార్షికోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నరసింహరావు, లతాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆలిండియా పోలీస్ గేమ్స్‌కు వెంకటేశ్ ఎంపిక జక్రాన్‌పల్లి: మండలంలోని కలిగోట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆలిండియా పోలీస్ గేమ్స్‌కి ఎంపికయ్యారు. త్వరలో హర్యాణాలో నిర్వహించే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో వెంకటేశ్ పాల్గొననున్నారు. వెంకటేశ్ ఏఆర్ కానిస్టేబుల్‌గా నిజామాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అతని ఎంపికపై పాఠశాల పీడీలు యాదగిరి, మధు హర్షం వ్యక్తం చేశారు. -
కుక్కల దాడిలో 10 గొర్రెల మృతి
కమ్మర్పల్లి: మండలంలోని నాగాపూర్ గ్రా మంలో కుక్కలు దాడి చేయడంతో 10 గొర్రె లు మృత్యువాత పడ్డా యి. గ్రామంలోని బాల మల్లేష్‌కు చెందిన గొ ర్లపాకలోకి గురువారం అర్ధరాత్రి కుక్కలు చొరబడి గొర్రెలపై దాడి చేశాయి. ఈ దాడిలో 10 గొర్రెలు మృతి చెందగా, 20 గొర్రెలకు తీవ్ర గ్రాయాలయ్యా యి. శుక్రవారం ఉదయం పాక వద్దకు వెళ్లిన బా లమల్లేష్ మృతిచెందిన గొర్రెలను గమనించి, పంచాయతీ, పశుసంవర్ధకశాఖ అధికారులకు సమాచా రం ఇచ్చారు. సుమారు రూ. 2లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాలమల్లేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బాధితుడు ఆరోపించాడు. జక్రాన్‌పల్లి మండలంలో.. జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామంలో బండారి నాగేష్కు చెందిన 16 గొర్రె, మేకలు కుక్కల దాడిలో మృతి చెందాయి. నాగేష్ కొట్టంలో ఉన్న గొర్రె, మేక పిల్లలపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బాధితుడికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వారు కోరారు. -
బీఎస్ఎన్ఎల్ సేవలు విస్తరించాలి ● ఎంపీ అర్వింద్ ● నగరంలో టెలికాం అడ్వయిజరీ కమిటీ సమావేశం
నిజామాబాద్ రూరల్: గ్రామీణ ప్రాంతాలకు బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తరించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన టెలికాం అడ్వయిజరీ కమిటీ సమావేశానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో ఇతర నెట్వర్క్ కన్నా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా వేగవంతంగా ఉందని అన్నారు. బీఎస్ఎన్ఎల్ను ఉపయోగిస్తున్న గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఇంట్లో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉపయోగించాలంటే 4జీ సేవలను మరింతగా వేగవంతం చేయాలన్నారు. టెలికాం సంస్థలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జీఎం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జీఎం జగ్రాం, టెలికాం ఉద్యోగులు జగన్, రాజ్‌కుమార్, ఆరేపల్లి నర్సయ్య, బద్దం సాయిరెడ్డి, రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి శుక్రవారం ఉచిత ఓపీ
నిజామాబాద్‌నాగారం: పేద రోగులకు ప్రతి శుక్రవారం ఉచిత వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బండారి విజయలక్ష్మి. వైద్యం పరంగా పేదలు పడుతున్న కష్టాని గుర్తించిన ఆమె 2018 నుంచి తన ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా రోగులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులకు, బంధువులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ప్రతి శుక్రవారం 120 నుంచి 150మంది వరకు రోగులు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. -
మహిళలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి..
నిజామాబాద్ నాగారం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు. నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండడమే కాకుండా వారి వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళలందరూ రక్తహీనత, థైరాయిడ్, గుండె జబ్బులు, మధుమేహంతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ కోసం ముందస్తు ఆరోగ్య పరీక్షల్ని చేసుకోవాలి. – రాజశ్రీ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణిహక్కులు, అవకాశాల కోసం పాటుపడదాం సీ్త్ర హక్కులను, అవకాశాలను గుర్తిస్తూ, లింగ అసమానతను తొలగి స్తూ తోటి ఆడవారి అభివృద్ధి కోసం పాటుపడాలి. అడ్డంకులను అధిగమించి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి. అలాగే జిల్లాలో సంతానం లేక బాధపడుతున్నవారికి ఫెర్టిలిటీ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. –అర్చన,ఫెర్టిలిటీ వైద్యురాలు, పినాకిల్ ఆస్పత్రి -
స్థాయిని మించి మాట్లాడొద్దు
సాక్షి నెట్వర్క్: జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న బోధన్, రూరల్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డిలపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సరైందని కాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. స్థాయిని మించి మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో బోధన్, రూరల్ ఎమ్మెల్యేలపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని నాయకులు పేర్కొన్నారు. విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకోగలం నిజామాబాద్ రూరల్: విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకోగలమని షీ టీమ్ ఇన్స్పెక్టర్ స్రవంతి అన్నారు. రూరల్ మండలం జెడ్పీహెచ్ఎస్ మల్లారం పాఠశాలలో షీ టీంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం షీ టీం కు సంబంధించిన స్టిక్కర్లను ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో భూమాగౌడ్, హారతి, శ్రీకాంత్, ఫాతిమా మేరి, గంట్యాల ప్రసాద్, శ్రీనివాస్, అరుంధతి బేగ్, అనిత సాంసన్ పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలి నిజామాబాద్ సిటీ: అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీటీయూ రమేశ్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
No Headline
హోల్‌సేల్ రిటైల్ హోల్‌సేల్ రిటైల్‌టమాట 8 15 బెండకాయ 40 60 బీరకాయ 50 70 దొండకాయ 30 50 బీర్నిసుకాయ 30 50 కాకరకాయ 40 60 వంకాయ 10 20 పాలకూర 20 40 మెంతికూర 30 50 కొత్తిమీర 20 40 పుదీనా 40 80 క్యాప్సికం 40 60 గాజరుగడ్డ 30 50 పచ్చిమిర్చి 25 50 దోసకాయ 30 50 ఆలుగడ్డ 25 50 గోబిగడ్డ 15 30 గోబిపువ్వు 20 40 బీట్రూట్ 25 50 కరివేపాకు 60 110 చామగడ్డ 40 60 గోరుచిక్కుడు 50 70 చిక్కుడుకాయ 40 60 – సుభాష్‌నగర్ కూరగాయల ధ రలు(రూ.) -
యశోదలో నోటి క్యాన్సర్‌కు సర్జరీ
నిజామాబాద్‌నాగారం: హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో జిల్లాకు చెందిన మధుకు నోటి క్యానర్సర్కు సర్జరీ చేసినట్లు స్థానిక ఆస్పత్రి ఆంకాలజిస్టు సీనియర్ సర్జికల్ సోమ శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం నగరంలోని యశోద ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మధు లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారని తగు జాగ్ర త్తలు తీసుకుంటే నయమవుతుందని అన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ నర్సింహారెడ్డి, శ్రీరాం సురేష్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఉద్యోగుల నిరసన నిజామాబాద్‌రూరల్: బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిదినాలు కల్పించాలని కోరు తూ ఎస్బీఐ ఉద్యోగులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎస్బీఐ డీజీఎస్ ఎంవీ రమేశ్, గురునాథ్, ప్రమోద్‌కుమార్, శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు. -
స్కూల్ యూనిఫాం కుట్టేందుకు సిద్ధం కావాలి
నిజామాబాద్‌అర్బన్: వచ్చే విద్యా సంవత్సరానికి స్కూల్ యూనిఫాం కుటేందుకు మహిళా సంఘాలు సిద్ధంగా ఉండాలని డీఆర్డీవో సాయాగౌడ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గతేడాది లాగే ఈ సారి కూడా స్కూల్ యూనిఫాంను మహిళా సంఘాల ద్వారానే కుట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, డీపీఎం సాయిలు, సంధ్యారాణి, ఏపీఎం రాజేందర్, రిసోర్స్ పర్సన్ మాధవి, పద్మ, సుజాత, మంజుల, మాధవి తదితులు పాల్గొన్నారు. -
ఒకే ఈతలో రెండు దూడల జననం
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని ద్రోణవల్లి కృష్ణవేణి శరత్‌బాబు దంపతుల పెంపుడు గేదె శుక్రవారం రెండు దూడలకు జన్మనిచ్చింది. రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని వాటిని పరిశీలించిన పశువైద్య సిబ్బంది తెలిపారు. అబలలదే అందె వేసిన చేయి సిరికొండ: జీవకోటి పరిణామ వికాసంలో అబలలదే అందె వేసిన చేయి అని సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ రావుట్ల నర్సయ్య అన్నారు. సిరికొండ సత్యశోధక్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం విద్యార్థులు ‘హ్యపీ ఉమెన్స్ డే’ ఆంగ్ల అక్షరాల ఆకారంలో కూర్చొని శుభాకాంక్షలు తెలిపారు. -
అయినా వివక్ష !
మీ ఇంట్లో ఆడ–మగ వివక్ష ఏమైనా ఉందా?మీ కాలేజ్, పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా?● ఇంటి నుంచే మొదలు.. ● బస్టాపులు, కాలేజీలు, పని ప్రదేశాల్లో ఇబ్బందులు ● ‘సాక్షి’ సర్వేలో వ్యక్తమైన మనోభిప్రాయాలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నేటి మహిళలు అన్ని రంగాల్లో అద్భుతా లు సాధిస్తున్నారు. గృహిణిగా ఇంటిని చక్కదిద్దుతూనే.. వర్కింగ్ ఉమెన్‌గా పోలీసు, అట వీ శాఖ తదితర చాలెంజింగ్ ఉద్యోగాలతో పాటు విద్య, వైద్య, న్యాయ తదితర వ్యవస్థల్లో తమ ప్రత్యేకత చాటుతున్నారు. అయినా వారి పట్ల వివక్ష ఎదురవుతూనే ఉంది. బేటీ బచావో–బేటీ పఢావో నినాదంతో ప్రభుత్వాలు ముందుకెళుతూ అనేక మహిళా సాధికారత కార్యక్రమాలు, మహిళా చట్టాలను అమలు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో వివక్ష పోలేదని పలువురు మహిళలు చెబుతున్నారు. బస్టాపులు, కాలేజీలు, పని ప్రదేశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం మహిళా దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని వివిధ మండలాల్లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. మెసేజ్‌లతో12బస్టాప్లోకాలేజీ లేదా ఆఫీసులో2315మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికం ఎవరు? -
రెండు బైక్‌లు ఢీ: ఒకరి మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. మండల పరిధిలోని పెద్ద గుజ్జుల్తండాకు చెందిన జరుపుల తుకారాం(40) తన బైక్‌పై గాంధారి నుంచి తండాకు బయలుదేరాడు. గాంధారి మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మద్దెల రవి బైక్‌ను ఢీకొన్నాడు. దీంతో ఇద్దరు కిందపడిపోయారు. తుకారాం అక్కడికక్కడే మృతి చెందగా, రవికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమచారం అందించారు. వారు ఘటన స్థలనికి చేరుకొని క్షతగాత్రున్ని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఒకరు.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి డివైడర్‌ను ఢీకొని మృతిచెందినట్లు స్థానికులు తెలపారు. వివరాలు ఇలా.. గాంధారికి చెందిన ఒడుసుల సాయిలు(38) గురువారం రాత్రి తన బైక్‌పై వెళ్తూ మండల కేంద్రంలో రోడ్డు డివైడర్‌ను ఢీకొని కింద పడిపోయాడు. దీంతో బంధువులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయమై ఎస్సై ఆంజనేయులును సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. బైక్‌ను ఢీకొన్న డీసీఎం: ఒకరికి తీవ్ర గాయాలు రెంజల్(బోధన్): మండలంలోని కళ్యాపూర్ వద్ద శుక్రవారం ఓ బైక్‌ను వెనుకనుంచి వచ్చిన డీసీఎం ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్సై సా యన్న తెలిపిన వివరాలు ఇలా.. రెంజల్లో బీడీ కమీషన్ ఏజెంట్‌గా పని చేస్తున్న సత్యనారాయణ బీడీల గంపను బైక్‌పై పెట్టుకొని నవీపేట్‌లోని కంపెనీకి బయలుదేరాడు. మార్గమధ్యలో కళ్యాపూర్ గ్రామం వద్ద అతడి బైక్‌ను వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గోదావరి నదిలో మహిళ మృతదేహం లభ్యం
రెంజల్(బోధన్): మండలంలోని గోదావరి నదిలో శుక్రవారం ఓ మహిళ మృతదేహం లభించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. నదిలో మహిళ మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని స్థానిక జాలర్లతో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలు బోధన్‌కు చెందిన శంకరమ్మ (62)గా గుర్తించినట్లు తెలిసింది. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని సమాచారం. ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతూ ఒకరి మృతి నిజామాబాద్ రూరల్: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రూరల్ ఎస్సై–2 ఆనంద్ సాగర్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. రూరల్ మండలంలోని కాలూర్ గ్రామానికి చెందిన తాడెం గంగాధర్(44) గత నెల 25న అప్పుల బాధ భరించలేక గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఆత్మహత్యాయత్నం బాన్సువాడ : బాన్సువాడలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ గురువారం ఆత్మహత్యకు యత్నించాడు. సాయంత్రం కృష్ణానగర్ తండా వద్ద కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగా డు. ఈ విషయాన్ని బాన్సువాడలో ఉన్న తన మేనత్తకు ఫోన్ చేసి చెప్పా డు. దీంతో ఆమె అక్కడికి వెళ్లి వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం శ్రీకాంత్ పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం. శ్రీకాంత్ బా న్సువాడ ఆర్డబ్ల్యూఎస్ ఏఈగా 2018 నుంచి పనిచేస్తున్నాడు. 2022లో షాద్‌నగర్‌కు బదిలీ అయినా.. అధికారులు డిప్యుటేషన్‌పై బాన్సువాడలోనే కొనసాగిస్తున్నారు. పని ఒత్తిడికి తోడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేంద్రకుమార్ పరామర్శించారు. మట్కా నిర్వాహకుల అరెస్టు ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్‌లోని జిరాయత్‌నగర్‌లో మట్కా నిర్వహిస్తున్న, ఆడుతున్న పలువురిని అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. మొత్తం ఆరుగురిని పట్టుకొని వారి వద్ద నుంచి రూ.13వేలు, 6ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. పేకాడుతున్న నలుగురు.. సిరికొండ: మండలంలోని మైలారం గ్రామ శివారులో పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఎస్సై రామ్ శుక్రవారం తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.5300 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మహిళ అదృశ్యం ఆర్మూర్‌టౌన్: మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అల్లెపు వెంకవ్వ అనే మహిళ అదృశ్యమైనట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ శుక్రవారం తెలిపారు. ఈనెల 5న వెంకవ్వ భర్తతో కలిసి తన కూతురు గ్రామం జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌కు వెళ్లివస్తుండగా ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద ఆటోలో దిగింది. ఆ తర్వాత కనబడకుండపోయింది. ఎంతవెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. -
మహిళ శక్తి అనంతం
● మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సునీత కుంచాల మాట్లాడారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. పట్టుదలతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి మహిళలోనూ ఓపికతో పాటు శక్తి ఎంతో ఉంటుందన్నారు. శక్తిని సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తే అద్భుత ఫలితాలను సాధించొచ్చన్నారు. వర్కింగ్ ఉమెన్స్ చాలెంజింగ్‌గా ముందుకు వెళ్లాలన్నారు. గృహిణులను ఏమాత్రం తక్కువ చేసి చూడొద్దన్నారు. గృహిణులు చేసే కష్టంతోనే భావి పౌరుల జీవితాలు వికసిస్తున్నాయన్నారు. గృహిణుల కష్టాన్ని పురుషులు తరచూ చేసే ప్రయత్నం చేస్తే విలువ తెలుస్తుందన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉన్నట్లే, ప్రతి మహిళ విజయం వెనుక పురుషుడు ఉంటే సమాజానికి ఎనలేని మేలు కలుగుతుందన్నారు. మహిళలకు తండ్రి, భర్త, కుమారుడు, స్నేహితుడు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ సహకరిస్తే ఏదైనా సాధిస్తారన్నారు.సాక్షి ఎడిషన్ కార్యాలయంలో రిపోర్టర్లు పంపిన వార్తలను పరిశీలిస్తున్న జిల్లా జడ్జి సునీత కుంచాల -
ఆమైపె ఆగని అకృత్యాలు
ఖలీల్‌వాడి: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు అమ లు చేసినా.. ‘ఆమె’పై జరుగుతోన్న అకృత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. బాలికలు, మహిళలపై రో జురోజుకూ అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నా యి. ప్రేమ పేరిట, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి బాలికలను మోసం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అత్యాచారం చేసినట్లు వెలుగుచూడడంతో పోక్సో కేసులుగా నమోదవుతున్నాయి. మరోచోట పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నిందితులను జైలుకు పంపిస్తున్నా మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోన్న విషయం. తల్లిదండ్రుల చేతుల్లోనే బాలికల భద్రత గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే చాక్లెట్లు, మిఠాయిలు, తదితర బహుమతులను సున్నితంగా తిరస్కరించేలా తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలి. ఇంటి పరిసరాలు, పాఠశాలల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నారా? అని అడగాలి. పిల్లలను ఇంటి పక్కవారు, బంధువులతో సినిమాలు, షాపింగ్, పర్యాటక ప్రాంతాలకు పంపించొద్దు. కేసులు 2022 2023 2024అత్యాచారం 62 74 77పోక్సో 80 81 115మహిళలపై నేరం 581 608 593షీటీమ్ 05 01 04సమాచారమివ్వాలి మహిళలు, బాలికలను ఎవరైనా ఇబ్బంది పెడితే కుటుంబీకులకు చెప్పాలి. అయినా వినకపోతే పోలీసులు, డయల్ 100, షీటీమ్స్ల దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. మారువేషంలో నిఘా పెట్టి ఆకతాయిల పనిపడతాం. – స్రవంతి, ఎస్సై, షీటీం, నిజామాబాద్ -
పేదరికాన్ని జయించి వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా..
నిజామాబాద్ సిటీ: పసిప్రాయంలోనే తండ్రి మరణం. నలుగురు తోబుట్టువులు. పూరి గుడిసెనే ఆస్తి. రాళ్లుకొడితేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లే దుర్భర పరిస్థితి. మారుమూల గడ్కోల్ గ్రామం నుంచి జీవితం ప్రారంభించి వర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్య బోధించే స్థాయి వరకు ఎదిగారు డాక్టర్ పిట్ల సరిత. గురుకుల పాఠశాలలో సీటు సంపాదించుకొని పదో తరగతిలో 524 మార్కులు సాధించారు. ఇంటర్లో 92శాతం మార్కులు వచ్చి ఎంసెట్‌లో సీటువచ్చినా ఇంజినీరింగ్ చదివే స్థోమత లేక గిరిరాజ్ కళాశాలలో డిగ్రీలో చేరారు. తెలంగాణ వర్సిటీలో ఎంఏ, ఎమ్మె స్సీ రెండు పీజీలు చేశారు. పీహెచ్డీ చేసి డా క్టర్ సరిత అయ్యారు. చదివిన యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పీడీఎస్‌యూలో ప నిచేసే సమయంలో ఉద్యమసహచరుడు ఎల్ బీ రవిని కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్నారు. మరోపక్క పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, మానవ హక్కుల వేదిక జిల్లా ఉ పాధ్యక్షురాలిగా పేదల గొంతుకై పోరాడుతూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న డాక్టర్ పిట్ల సరిత ఆదర్శప్రాయురాలు. -
సీపీగా పోతరాజు సాయిచైతన్య
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పోతరాజు సాయిచైతన్యను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సాయిచైతన్య బదిలీపై వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీపై నిజామాబాద్ సీపీగా వచ్చిన కల్మేశ్వర్ సింగేనవార్ గతేడాది అక్టోబర్ 23న కేంద్ర సర్వీసులకు వెళ్లారు. అనంతరం కామారెడ్డి ఎస్పీ సింధు శర్మకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో నిజామాబాద్‌కు పూర్తిస్థాయి సీపీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. కాగా, సీపీ సాయిచైతన్య ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. విధి నిర్వహణలో కఠినంగా ఉంటా రనే ముద్ర ఉంది. రెండ్రోజుల్లో సీపీగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఇన్నాళ్లు ఇన్ చార్జి సీపీగా పనిచేసిన సింధుశర్మ బదిలీ అయ్యారు. ఆ మెను ఇంటెలిజెన్స్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో యాదాద్రి భువనగిరి డీసీపీగా పనిచేస్తున్న ఎం.రాజేశ్‌చంద్రను కామారెడ్డి ఎస్పీగా నియమించింది. నేతల ప్రమేయంతోనే లేటుగా.. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడడంతోనే సీపీ నియామకంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలు ఇరువురు పేర్లను ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ వర్గాలలో చర్చకు దారితీసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని సీపీని నియమించినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి డైరెక్ట్ ఐపీఎస్, స్ట్రిక్ట్ ఆఫీసర్ కావాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది. నాలుగు నెలల తర్వాత కొత్వాల్ నియామకం ఇన్చార్జి సీపీ సింధుశర్మ బదిలీ కామారెడ్డి ఎస్పీగా రాజేశ్చంద్ర -
No Headline
నిజామాబాద్ ‘సాక్షి’ ఎడిషన్ కేంద్రంలో శుక్రవారం జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల ‘గెస్ట్ ఎడిటర్’గా వ్యవహరించారు. జిల్లాలోని రిపోర్టర్లు రాసిన కథనాలను, వార్తలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి డెస్క్ బృందానికి ఇచ్చారు. అదేవిధంగా పలు రకాల సూచనలు చేశారు. ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా రావడం చాలా సంతోషం కలిగించిందన్నారు. పాఠకులకు కేవలం రూ.5 లకు ఇచ్చే పత్రికను బయటకు తీసుకొచ్చేందుకు ఎంత కష్టముంటుందో ప్రత్యక్షంగా చూడడం కొత్త అనుభవాన్నిచ్చిందన్నారు. వార్తల సేకరణ మొదలు పత్రిక పాఠకుడికి చేరేవరకు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ అనేకమంది పడుతున్న శ్రమ సాధారణమైనది కాదన్నారు. ఎప్పటికీ మరిచిపోలేని అనుభవాన్ని పొందానన్నారు. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
కరాటే క్వీన్ పల్లవి
బోధన్: ‘చిన్నప్పటి నుంచే కరాటేపై ఆసక్తి. ఇంటర్ తర్వాత పెళ్లయ్యింది. పిల్లలు, ఉద్యోగం, బాధ్యతలు పెరిగాయి. అవేమీ తన సంకల్పానికి అడ్డుకాదని భావించింది. ఎన్ని అవమానాలు, అవహేళనలు ఎదురైనా ఓర్చుకొని కరాటే క్వీన్‌గా ఎదిగారు.’ బోధన్ పట్టణానికి చెందిన మల్లెపూల పల్లవి. కరాటేతోపాటు కర్ర, కత్తిసాము, గుర్రపు స్వారీ, బాక్సింగ్ విద్యల్లో శిక్షణ పొంది పట్టు సాధించింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రతిభ చాటింది. 2022లో మార్షల్ఆర్ట్స్ సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి కరాటే స్పారింగ్(ఫైటింగ్) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. కరాటేలో బ్రౌన్ బెల్ట్స్థాయిలో నిలిచింది. సామాన్య కుటుంబానికి చెందిన వివాహిత అయిన పల్లవి కరాటే మాస్టర్‌గా రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ప్రస్తుతం మహిళలకు వ్యాయామ విద్య, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కళాశాలల్లో విద్యార్థినులకు కరాటే శిక్షణనిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే లైసెన్స్ పొందిన ఏకై క మహిళా కరాటే మాస్టర్‌గా నిలిచింది. ‘ఆపద సమయంలో ఎవరో వచ్చి రక్షిస్తారని ఆశించడం కన్నా ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవడం ఉత్తమం.’ అని చెబుతున్నారు కరాటే టైగర్ మల్లెపూల పల్లవి. -
సవాళ్లు అధిగమించి..
‘వివక్షను అధిగమిస్తూ విజయాలు సాధిస్తున్నారు.. అవహేళనలు, అవమానాలను సంకల్పమనే బాణాలతో ఛేదిస్తున్నారు.. ఇంట్లో బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు.’ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న అతివలపై నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.డొంకేశ్వర్(ఆర్మూర్): మానవాళి మనుగడకు ప్రధానమైన అడవుల సంరక్షణకు ఆడబిడ్డలు ముందుకొస్తున్నారు. పనివేళలతో సంబంధం లేకుండా రాత్రింబవళ్లు సవాల్‌తో కూడుకున్న.. కత్తిమీద సాములాంటి విధులు నిర్వర్తిస్తున్నారు. కష్టమైన సరే అటవీ శాఖలో ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. పురుషులతో సమానంగా క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ అడవులు, వన్యప్రాణుల రక్షణకు పాటు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 మంది మహిళా ఉద్యోగులు ఉండగా, అత్యధికంగా 16 మంది బీట్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లుగా ఇద్దరు, ఎఫ్ఆర్వోగా ఒకరు, సెక్షన్ ఆఫీసర్‌గా ఒకరు విధులు నిర్వరిస్తున్నారు. అడవితల్లి రక్షణలో ఆడబిడ్డలు ప్రకృతితో కలిసి పనిచేస్తున్న మహిళా బీట్ ఆఫీసర్లు -
అన్ని రంగాల్లోనూ ‘ఆమె’
ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వ్యాపారం, క్రీడారంగం, యూనిఫాం ఉద్యోగాల్లో తమ సత్తా చాటుతున్నారు. అలాగే పలువురు స్వయం ఉపాధితో ఆర్థికంగా రాణిస్తూనే మరింత మందికి ఉపాధి కల్పిస్తూ భరోసాను కల్పిస్తున్నారు. సామాజిక సేవలోనూ తమకంటూ గుర్తింపును తెచ్చుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో రాణించిన జిల్లా మహిళల విజయ గాథలు, మనోగతాలు, వారి సలహాలు, సూచనలు ఇలా..మహిళాభ్యున్నతే ధ్యేయంగా ‘కపిల మహిళా సొసైటీ’నిజామాబాద్ సిటీ: ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన మగ్గిడి కళ్యాణి తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. ఆమెకు తల్లితోపాటు ఇద్దరు అక్కలు ఉన్నారు. పేదరికం కారణంగా వారు మూడుపూటల తిండి తినడం కలగానే మిగిలిపోయింది. కానీ, కళ్యాణి ఎలాగైనా తమ పేదరికాన్ని జయించాలని నిర్ణయించుకుంది. అది ప్రభుత్వ ఉద్యోగంతోనే సాధ్యమని నమ్మింది. దీంతో పట్టుదలతో చదివి తొలి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యింది. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకొని హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తోంది. సర్కార్ కొలువు సాధించిన కళ్యాణి పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని జర్నలిస్టు కాలనీకి చెందిన ఉప్పరి సరిత భారతమాత మహిళ సంఘం సభ్యురాలుగా చేరింది. ఇంట్లో చపాతీలు చేసి విక్రయిస్తు చిన్న వ్యాపారం మొదలుపెట్టింది. అలాగే అర్డర్‌పై వంటలు చేయడం ప్రారంభించింది. సంఘంలో పొదుపు నుంచి రూ. 10వేలు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టింది. అలాగే సమాఖ్య నుంచి, బ్యాంకు లీకేజీ నుంచి, సీ్త్రనిధి నుంచి రుణాలు పొంది, ప్రస్తుతం కర్రీపాయింట్ దుకాణాన్ని నిర్వహిస్తోంది. వ్యాపారం బాగా నడవడంతో వివిధ సంఘాల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తుంది. తెలిసిన వంట ద్వారానే ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ కుటుంబంలో తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు.ఇష్టంతో పోలీస్ ఉద్యోగం సాధించిన రాధికరుద్రూర్: నవీపేట్ మండలం నాళేశ్వరం గ్రామానికి చెందిన తోట రాధిక తల్లిదండ్రుల సూచన మేరకు టీచర్ ట్రైనింగ్ (డీఎడ్) పూర్తి చేసింది. కానీ చిన్నప్పటి నుంచి ఆమెకు పోలీస్ ఉద్యోగం అంటే ఎంతో ఆసక్తి. దీంతో ఆమెకు పెళ్లయిన తర్వాత భర్తకు, కుటుంబసభ్యులకు పోలీస్ ఉద్యోగంపై ఉన్న ఆసక్తిని తెలియజేసింది. వారికి ఇద్దరు పిల్లలున్నా, పట్టుదలతో చదివి, హార్డ్ వర్క్ చేయడంతో పోలీస్ ఉద్యోగానికి సెలెక్టయింది. మూడు నెలల క్రితం తొలి పోస్టింగ్ రుద్రూర్ పోలీస్‌స్టేషన్‌లో వచ్చింది. పెళ్లయిన తర్వాత కూడా ప్రతి రంగంలో మహిళలు రాణిస్తారని నిరూపించింది రాధిక. -
నందిపేట మండలంలో..
నందిపేట్ (ఆర్మూర్): మండలంలోని వెల్మల్ గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. వెల్మల్ గ్రామానికి చెందిన కుస్తాపురం శ్రీనివాస్ తన భార్య, తండ్రితో కలిసి శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. ఇంటి వద్ద ఉన్న తల్లి భోజమ్మ తలుపులకు గడియ పెట్టి ఖార్ఖానాకు వెళ్లింది. తిరిగి ఇంటికివచ్చి చూసేసరికి తలుపులు తెరిచిఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు తులాల బంగారు నగలు, వెండి సామగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. ఈమేరకు బాధితుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. -
అతివలకు అండగా మధ్యవర్తిత్వ కేంద్రం
బోధన్‌టౌన్(బోధన్): దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఉచిత న్యాయసేవల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న సామూ హిక మధ్యవర్తిత్వ కేంద్రాలు అతివలకు అండగా నిలుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా బోధన్‌లో సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రాన్ని గత సంవత్సరం ఆగస్టు 28న జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల ప్రారంభించారు. ఆ తర్వాత నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మండల న్యాయసేవాధికార సంస్థ కొంతమంది తటస్థ వ్యక్తులను ఎంపిక చేసి వారికి కేంద్ర నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. బోధన్ మధ్యవర్తిత్వ కేంద్రంలో పద్మాసింగ్, సుజాత, రాజేందర్ సింగ్ సేవలందిస్తున్నారు. ఇక్కడి కేంద్రంలో ఇప్పటి వరకు 61 కేసులు నమోదు కాగా, అందులో 90 శాతానికి పైగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే కావడం గమనార్హం. వరకట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య తగాదాలు, వృద్ధ మహిళల పెన్షన్ కేసులు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్థలు తదితర సమస్యలున్నాయి. మధ్యవర్తిత్వ కేంద్రం ప్రయోజనాలివే.. తగాదా పడే వ్యక్తులు నిష్పక్షపాత, తటస్థ మధ్యవర్తి ద్వారా ఐచ్చికంగా సహకరించుకొని వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఏర్పడింది. ఈ కేంద్రాల్లో సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరిస్తారు. ఉచిత న్యాయ సలహాలు అందిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా సమయం, డబ్బు వృథా కాదు. సమస్య సులభతరంగా పరిష్కారమవుతుంది. దీంతో బాధిత మహిళలు ఎక్కువ సంఖ్యలో ఈ కేంద్రాన్ని ఆశ్రయిస్తూ ప్రయోజనం పొందుతున్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి కృషి ఆధునిక ప్రపంచంలోనూ మహిళలపై వేధింపులు జరగడం బాధాకరం. మహిళలు పోలీస్స్టేషన్ల వర కు వెళ్లే పనిలేకుండా, వారి సమస్యను ఇక్కడే పరిష్కరించేలా ఈ కేంద్రం ముందుకు సాగుతోంది. – పద్మాసింగ్, మధ్యవర్తిత్వ సెంటర్ సభ్యురాలు -
స్ఫూర్తిదాయకం.. తెడ్డు సుమలత
ఆర్మూర్‌టౌన్ : ‘కాళ్లు లేవు ఏం చేయగలదు’ అని వెక్కిరించిన సమాజానికే సేవలందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది ఆర్మూర్‌కు చెందిన తెడ్డు సుమలత. చిన్న వయస్సులోనే పోలియో ప్రభావంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయినా, దాన్ని తన జీవిత ప్రయాణానికి అడ్డుగా చేసుకోలేదు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగి డిగ్రీ (బీఏ) పూర్తిచేసింది. 15 సంవత్సరాలుగా పురపాలక కార్యాలయంలోని ఇన్వార్డ్ విభాగంలో సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. చేతుల సాయంతోనే నడుచుకుంటూ రోజువారీ పనులు చేసుకుంటూ స్వయంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులు ఇటీవల మరణించగా, ప్రస్తుతం సోదరుడి వద్ద ఉంటోంది. ‘ఎవరూ మన సామర్థ్యాన్ని నిర్ణయించలేరు. శారీరక అడ్డంకులు మన లక్ష్యాలను ఆపలేవు. మన సంకల్పమే మార్గం చూపుతుంది’ అని చెబుతోంది తెడ్డు సుమలత. -
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా జడ్జి సునీత కుంచాల ఖలీల్‌వాడి : ఈ నెల 8న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ కోర్టుల్లో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ తగాదాలు, చెక్ బౌన్స్, బ్యాంక్ లీగల్ యాక్షన్ రుణాలు తదితర కేసులు పరిష్కరింపబడతాయని పేర్కొన్నారు. ఇరుపక్షాలు రాజీ ఉన్నప్పుడే రాజీమార్గం సులువు అవుతుందని తెలిపారు. దూర ప్రాంతాల్లో ఉండే వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీ పద్ధతిలో కేసు పరిష్కరిస్తామన్నారు. రోడ్డు ప్ర మాదంలో నష్టపరిహారం కోసం, సైబర్ క్రై మ్ సంబంధిత కేసుల్లో కూడా న్యాయసేవాధికార సంస్థను సంప్రదిస్తే న్యాయం జరిగే లా కృషి చేస్తామని పేర్కొన్నారు. మూడు నెలలకోసారి వచ్చే జాతీయ లోక్ అదాల త్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపా రు. సమావేశంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ జడ్జి పద్మావతి, సిబ్బంది నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యం పెంచుకోవాలి ● డీఆర్డీవో సాయాగౌడ్ నిజామాబాద్‌అర్బన్: స్వయం సహాయక సంఘాల సభ్యులు టైలరింగ్‌లో నైపుణ్యం పెంచుకోవాలని డీఆర్డీవో సాయాగౌడ్ సూ చించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం మండల సమాఖ్యల మా స్టర్ ట్రైనర్ల శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ మహిళలకు టైలరింగ్‌లో బల్క్ కట్టింగ్, ఖాజా, బట న్ కుట్టడంలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో ఏడీఆర్డీవో ర వీందర్, డీపీఎం సాయిలు, ఏపీఎం రాజేంద ర్, శిక్షకులు మాధవి, లత, పద్మ, సుజాత, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025ధర్పల్లిలో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేపీ నాయకులు● విద్యాలయం ఏర్పాటుపై రగడ●● ఎంపీ అర్వింద్ వర్సెస్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ● ఘాటైన విమర్శలు చేసిన ఎంపీ ● బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య వార్ ● పోటాపోటీగా దిష్టిబొమ్మలు దహనం చేసిన ఇరుపార్టీల శ్రేణులున్యూస్రీల్ -
న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెంపొందించేలా..
నేర విచారణలో ప్రతివాదులు లేదా సాక్షులుగా వివిధ కారణాలతో పిల్లలకు న్యాయసేవలు అవసరం కావొచ్చు. భౌతిక, మానసిక హింస, లైంగిక వేధింపులు లేదా ఇతర నేరాలు, హక్కుల ఉల్లంఘనల బాధితులుగా పలు కేసుల్లో పిల్లలు నిలుస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత, వైకల్యంతో సహా సమస్యలపై పలు కేసులు పిల్లల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పిల్లలు విజయవంతంగా వారి కుటుంబాలతోపాటు సమా జంలో పునరావాసం పొందేలా న్యాయసేవాధికార సంస్థ తనవంతు సాయాన్ని అందిస్తోంది. బాలికలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యం పెంచుతోంది. దీంతో న్యాయ వ్యవస్థపై పిల్లల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా కృషి చేస్తుంది. -
బైక్ సైలెన్సర్ల ధ్వంసం
● రోడ్ రోలర్‌తో తొక్కించిన ట్రాఫిక్ పోలీసులు ఖలీల్‌వాడి: నిబంధనలకు విరుద్ధంగా బైక్‌లకు అమర్చిన భారీ శబ్దం చేసే 240 సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా ఏసీపీ మా ట్లాడుతూ రెండు, మూడు నెలల నుంచి వా హన తనిఖీలు చేస్తూ సైలెన్సర్లను తొలగించి వారిపైన చర్యలకు ఆదేశించామన్నారు. ప్రత్యేక సైలెన్సర్లను అమర్చితే మెకానిక్‌లు, వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మొదటిరోజే ఒకరు డిబార్
ధర్మారం(బి)లో ఇంటర్ పరీక్షాకేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్నిజామాబాద్ అర్బన్: ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 16,343 మంది విద్యార్థులకు 15,923 మంది పరీక్షలకు హాజరుకాగా, 420 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఖిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల(బీ) సెంటర్లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకొని మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు చేసిందన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు, హై పవర్ కమిటీ, బల్క్ అధికారి, కస్టోడియన్లతోపాటు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు రవికుమార్ తెలిపారు. పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ డిచ్పల్లి: ధర్మారం(బి) గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు గురువారం తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపల్ మాధవీలత, తహసీల్దార్ ప్రభాకర్ ఉన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 420 మంది గైర్హాజరు -
పిల్లలకు ‘ఫ్రెండ్లీ’ న్యాయసేవలు
● చట్టాలు– హక్కులపై అవగాహన కల్పిస్తోన్న న్యాయసేవాధికార సంస్థ ● సత్ప్రవర్తన పెంపొందించేందుకు కృషి ● పాఠశాలల్లో న్యాయవిజ్ఞాన సదస్సుల నిర్వహణ ● విస్తృతంగా పర్యటిస్తున్న పారా లీగల్ వలంటీర్లుఆర్మూర్: కల్లాకపటం ఎరుగని నిర్మల, సున్నిత మనస్కులు పిల్లలు. లేత వయసులోనే పిల్లలపై పరిసరాలు, పరిస్థితులు ప్రభావం చూపుతాయి. దీంతో కొంతమంది పిల్లలు ‘మాకు అన్నీ తెలుసు’ అంటూ తప్పటడుగులు వేస్తుంటారు. మరికొందరు తమకు ఎదురైన.. ఎదురవుతున్న ఆటంకాలను ఎదుర్కోలేక ఇబ్బందులకు గురవుతుంటారు. విద్యార్థుల్లో మంచి ప్రవర్తన తేవడంతోపాటు అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు తదితర వాటి నుంచి కాపాడుకునేందుకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తోందీ నేషనల్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ. న్యాయవిజ్ఞాన సదస్సులు బడీడు పిల్లలకు స్నేహ పూర్వక న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్‌ను నిజామాబాద్ జిల్లాలో విస్తృతం చేసింది. అందులో భాగంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యద ర్శి, జిల్లా న్యాయమూర్తి పి.పద్మావతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ప్రభుత్వ పాఠ శాలు, స్వచ్ఛంద సేవా సంస్థలను సందర్శిస్తూ న్యా యవిజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నాయి. ఈ బృందాల్లో సీనియర్ న్యాయవాదులతోపాటు రిటైర్డ్ ఉ ద్యోగులతోఏర్పాటు చేసిన పారా లీగల్ వలంటీర్లు సేవలందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వి ద్యార్థుల సమస్యలు తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలతో రూపొందించిన నివేదికను జిల్లా న్యా యమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌కు సమర్పిస్తున్నారు. నివేదికపై న్యాయమూర్తి ఆయా శాఖల ఉన్నతాధికారులకు పలు సలహాలు, సూచనలు ఇస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. గురుకులాలు, భవిత కేంద్రాల్లో.. జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలతోపాటు సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత కేంద్రాలను ప్రత్యేక బృందాలు సందర్శిస్తున్నాయి. బృందాల్లో పారా లీగల్ వలంటీర్లు ఏ.బాబాగౌడ్, సీహెచ్ విద్యాసాగర్ రావుతోపాటు న్యాయవాదులు సంధ్య, రవీందర్, ఉదయ కృష్ణ, ఉమామహేశ్, వినీల, నర్సింహ ఉన్నారు. వీరు ఇప్పటి వరకు నిజామాబాద్ నార్త్, సౌత్, ఆర్మూర్, నవీపేట్ మండల కేంద్రాల్లోని భవిత కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీని సందర్శించి దివ్యాంగ విద్యార్థులకు అందుతున్న సేవలు, వారి హక్కులు, కావాల్సిన అవసరాలపై నివేదిక తయారు చేశారు. ఆర్మూర్, బాల్కొండ, మోర్తాడ్, డిచ్పల్లి మండలాల్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలను సందర్శించి న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. -
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్) : మెనూ ప్రకారం వి ద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, ఆహార ప దార్థాలు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు పా టించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. మెస్ హాల్, వంటగది, పాఠశాల, కళాశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలను గురువారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని కిచెన్, డై నింగ్ హాల్, క్లాస్ రూమ్‌లు, డార్మెటరీ, స్టోర్ రూంలను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగు ణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ప్రిన్సిపల్ మాధవీలత ను అడిగి తెలుసుకున్నారు. వంట నూనె, పాలు, పండ్లు, కోడిగుడ్ల నాణ్యత పరిశీలించిన కలెక్టర్, కా లపరిమితి ముగిసిన వాటిని వినియోగించొద్దని ని ర్వాహకులకు సూచించారు. నాసిరకం బియ్యం, ఇ తర సరుకులు వస్తే మండల అధికారులకు ఫిర్యా దు చేయాలని సూచించారు. త్వరలో జరిగే వార్షిక పరీక్షల కోసం పదో తరగతి విద్యార్థినులకు పున:శ్చరణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పా ఠశాలలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చేందుకు తక్షణ మే పనులు జరిపిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ ఉన్నారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ధర్మారం(బీ) గురుకుల కళాశాల పరిశీలన -
తొలి ప్రాధాన్యం ఆ గ్రామాలకే..
మోర్తాడ్(బాల్కొండ): సొంత జాగా ఉండి ఇంటిని నిర్మించుకునేవారికి ఆర్థికసాయం అందించే విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే తొలి విడతలో పథకం విస్తరణ పరిమితంగానే ఉంది. గణతంత్ర దినోత్సం రోజు ఆరు పథకా ల అమలుకు ‘పైలెట్’ గ్రామాలుగా ఎంపిక చేసిన చోటే ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో నియోజకవర్గానికి ఏడాదిలో 3,500 ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందిస్తామని ప్రభుత్వం అనేకమార్లు వెల్లడించింది. పథకం అమలులోకి వచ్చిన తర్వాత చేసిన ప్రకటనలకు, కార్యాచరణకు పూర్తి వైరుధ్యం కనిపిస్తోంది. జిల్లాలోని 31 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయగా, మొత్తం 2,300 మందిని లబ్ధిదారులుగా గుర్తించి ఇళ్ల నిర్మాణాలకు అధికారులు ముగ్గులు పోయిస్తున్నారు. ఆశతో ఎదురుచూస్తున్న పేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున సాయం అందితే తమ సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో ఎంతోమంది ఉన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియక ముందే ఇళ్ల నిర్మాణం ఆరంభిస్తే వచ్చే ఏడాది మరో విడత ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు అవకాశం ఉంటుంది. ఈసారైనా కల నెరవేరేనా! సొంత స్థలం ఉన్న వారు ఇంటి నిర్మాణం చేసుకునేందుకు ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సా యం అందించే పథకం ఎప్పటి నుంచో కొనసాగు తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని తీసుకొచ్చింది. కొన్నాళ్లకే ఆ పథకానికి ఎగనామం పలికింది. 2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ సర్కార్ గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల చొప్పున సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకమూ ఆచరణలో కార్యరూపం దాల్చలేదు. కనీసం ఇప్పుడైనా ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పథకాన్ని వేగంగా అమలు చేసి పేద, మధ్య తరగతి కుటుంబాల కల సాకారం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం ‘పైలెట్’ గ్రామాల్లోనే ముగ్గు పోయిస్తున్న అధికారులు దశల వారీగా ఇతర గ్రామాల్లో అనుమతులు ఇచ్చే అవకాశంఎంపిక చేసిన గ్రామాల్లోనే మార్కింగ్ చేస్తున్నాం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ చేయిస్తున్నాం. దశల వారీగా ఇతర గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రతి ఇంటి నిర్మాణానికి నాలుగు దశల్లో రూ.5 లక్షల సాయం అందుతుంది. – సత్యనారాయణ, ఏఈ, గృహనిర్మాణ సంస్థ -
నవోదయ పంచాయితీ
బోధన్‌లో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులుజిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటు అంశం బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం రేపింది. ఎంపీ ధర్మపురి అర్వింద్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మధ్య రగడ ప్రారంభం కాగా, ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీగా దిష్టిబొమ్మలను దహనం చేశారు. జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ వద్ద నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ఎంపీ అర్వింద్ 30 ఎకరాల స్థలాన్ని సూచించగా ఢిల్లీ అధికారులు సర్వే చేశారు. అయితే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆచన్‌పల్లి వద్ద నవోదయ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలపై ఎంపీ అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటు విషయమై రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య పంచాయితీ ఏర్పడింది. ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మధ్య నువ్వా నేనా అనేవిధంగా రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో ఎంపీ అర్వింద్ ఘాటైన విమర్శలు చేశారు. వివాదం మరింత ముదిరేలా పరిస్థితి తయారైంది. ఈ క్రమంలో రెండు పార్టీల శ్రేణుల మధ్య దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలకు ఆజ్యం పోసినట్లైంది. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రెండు నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. ఒక విద్యాలయాన్ని కోరుట్లలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన నవోదయ విషయంలో ఇరుపార్టీల మధ్య సరికొత్త పోరుకు బీజం వేసింది. బోధన్, నిజామాబాద్ అర్బన్‌లో కేంద్రీయ విద్యాలయాలు ఉండడంతో నవోదయ విద్యాలయాన్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ వద్ద ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఎంపీ అర్వింద్ భావించారు. ఈ క్రమంలో కలిగోట్ వద్ద 1063 సర్వే నంబర్లో 30 ఎకరాల స్థలాన్ని ఎంపీ సూచించారు. ఢిల్లీ అధికారులు సర్వే సైతం చేశారు. అయితే మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మాత్రం ఆచన్‌పల్లి వద్ద 690 సర్వే నంబర్లోని స్థలంలో నవోదయ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. అయితే ఈ ప్రతిపాదనలను ఢిల్లీ అధికారులు రద్దు చేశారంటూ, అసలు ఈవిధంగా ప్రతిపాదనలు చేయడమేమిటని ఎంపీ అర్వింద్ ఫైర్ అవుతున్నారు.అడ్డుకోవడం సరికాదు : ఎంపీ అర్వింద్సుదర్శన్రెడ్డి మతి తప్పి ప్రవర్తిస్తున్నారని, నవో దయ విద్యాలయం ఏర్పాటు కోసం బోధన్ షుగర్ ఫ్యాక్టరీ భూమిని చూపించి ప్రతిపాదనలు చేయడమేమిటని ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయని, ఈ విషయమై తాను రెండు జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చించినట్లు అర్వింద్ తెలిపారు. జగిత్యాల జిల్లా ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించడంతో కోరుట్లలో ఏర్పాటుకు రంగం సిద్ధమైందన్నారు. నిజామాబాద్ జిల్లాకు మంజూరైన నవోదయను తమ పార్టీ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణను ఒప్పించి జాతీయ రహదారికి దగ్గరలోని జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ వద్ద 30 ఎకరాల్లో ప్రతిపాదించామన్నారు. కానీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాత్రం బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన భూమిలో నవోదయ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మె ల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ముందుకు రాగా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అడ్డుపడడమేమిటని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవోదయ ఏర్పాటుకు 30 ఎకరాలు అవసరం కాగా, షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 8 ఎకరాలను సుదర్శన్‌రెడ్డి ప్రతిపాదించడం అనాలోచితమన్నారు. నవోదయ ఏర్పాటుకు షుగర్ ఫ్యాక్టరీ భూమిని ప్రతిపాదించడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి షుగర్ ఫ్యాక్టరీని తెరిచే ఆలోచన లేదా అని ఎంపీ ప్రశ్నించారు. సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ జిల్లా అభివృద్ధిపై లేదని, 40 ఏళ్లలో ఆయన జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని ఘాటైన విమర్శలు చేశారు. ఇక రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విమానాశ్రయాన్ని తీసుకురాలేకపోయినప్పటికీ, ఇప్పటికే కేంద్రం మంజూరు చేసిన నవోదయను ఏర్పాటు చేసుకోలేరా అన్నారు.వేడెక్కిన రాజకీయంఅర్వింద్ వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య వార్ నెలకొన్నట్లైంది. నవోదయ అడ్డుకుంటున్నారంటూ బీజేపీ శ్రేణులు బుధవారం నిజామాబాద్‌లో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశాయి. దీంతో గురువారం ఎడపల్లిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల మధ్య నవోదయ అంశం రాజకీయంగా వేడి మరింత రగిలించినట్లైంది. -
పసుపు.. ఈసారి పసిడి పంటే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు పండించిన రైతులకు ధర గిట్టుబాటు అవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పసుపు సాగు విస్తీర్ణం పెరిగింది. అతివృష్టి లేకపోవడంతో దుంపకుళ్లు తెగులు (నీరు నిలిస్తే వచ్చే తెగులు) రాలేదు. దీంతో దిగుబడి సైతం గత ఏడాది కంటే ఎక్కువగా వస్తోంది. రాష్ట్రంలో పండించిన పసుపు పంటలో 80 శాతం నిజామాబాద్ మార్కెట్‌కు వస్తుంది. ఇప్పటివరకు ఫింగర్ పసుపు రకానికి అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 13,311 ధర పలికింది. సగటున క్వింటాల్‌కు రూ.11,300 ధర దక్కుతోంది. గోళా పసుపునకు అత్యధికంగా క్వింటాల్‌కు రూ.10 వేలు పలికింది. సగటున క్వింటాల్‌కు రూ.9,900 దక్కుతోంది. ఫింగర్ పసుపునకు కనీస ధర రూ.10 వేలు, గోళా పసుపునకు కనీస ధర రూ.9వేలు తగ్గకుండా నిజామాబాద్ మార్కెట్ కమిటీ చొరవ తీసుకుంది. ప్రస్తుతం 15 నుంచి 20 శాతం తేమ ఉంటోందని, రైతులు తేమ శాతాన్ని 12 శాతానికి పరిమితం చేసుకుంటే మరింత ధర దక్కుతుందని మార్కెట్ కమిటీ చెబుతోంది. తగ్గుతూ వచ్చి.. మళ్లీ పెరుగుదల దిశగా.. నిజామాబాద్ మార్కెట్‌కు ఈసారి ఎక్కువగా పసుపు రానున్నట్టు అధికారులు చెబుతున్నా రు. 2019–20లో 10,78,821 క్వింటాళ్లు, 2020–21లో 8,55,516 క్వింటాళ్లు, 2021 –22లో 8,38,932 క్వింటాళ్లు, 2022–23లో 7,49,072 క్వింటాళ్లు, 2023–24లో 7,23,470 క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్‌కు వచ్చింది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో సీజన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 5,00,985 క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్‌కు వచ్చింది. గత ఏడాది కంటే 1.50 లక్షల క్వింటాళ్లు అధికంగా పసు పు రానుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు మరో 2.25 లక్షల క్వింటాళ్లు, ఏప్రిల్‌లో 85 వేల క్వింటాళ్లు, మే నెలలో మరో 65 వేల క్వింటాళ్లు పసుపు ఇక్కడి మార్కెట్‌కు వస్తుందని అధికారుల అంచనా. మొత్తంగా మరో 3.65 లక్షల క్వింటాళ్లు రానున్నట్టు లెక్కలు వేస్తున్నారు. గత ఏడాది రాష్ట్రంలో సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది దుంపకుళ్లు సోకక పోవడంతో ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 35 వేల ఎకరాల్లో పసుపు సాగు చేయగా ఇందులో 19 వేల ఎకరాలు నిజామాబాద్ జిల్లా రైతులు సాగు చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాలు సాగు చేయగా, ఇందులో నిజామాబాద్ జిల్లా రైతులు 22 వేల ఎకరాలు పసుపు సాగు చేశారు. నిరంతర పర్యవేక్షణ పసుపు రైతులకు మేలు చేసేవిధంగా పసుపు ట్రేడింగ్ విషయమై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. క్వింటాల్‌కు రూ.10 వేల ధర తగ్గకుండా కటాఫ్ పెట్టాం. ఈ–నామ్ ద్వారా ఆన్లైన్ బిడ్డింగ్ విషయమై పక్కాగా వ్యవహరిస్తున్నాం. రైతులు 12 శాతం కంటే ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాలి. తద్వారా ట్రేడర్లు తక్కువ ధరకు కోట్ చేయకుండా చూస్తాం. – ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ -
Avoidable Fatalities నిజామాబాద్‌లో సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ట్రామా కేర్
సేవ్‌లైఫ్ ఫౌండేషన్ (SaveLIFE Foundation ) మెర్సిడెస్-బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంతో, జీరో ఫెటాలిటీ కారిడార్ (Zero Fatality Corridor) కార్యక్రమంలో భాగంగా, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లో ఎమర్జెన్సీ కేర్ సౌకర్యాలను అందిస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) అధునాతన క్రాష్ డేటా విశ్లేషణ, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, మెరుగైన ట్రామా కేర్ మరియు సామర్థ్య నిర్మాణాన్ని ఉపయోగించి అధిక-ప్రమాదకర రహదారులను సురక్షితమైన కారిడార్లుగా మార్చాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గురువారం(మార్చి 6)న నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్‌కి అధునాతన ట్రామా కేర్ పరికరాలను అందించారు. తద్వారా వైద్య సహాయంలో జాప్యాలను తగ్గించడంతోపాటు, రోగులను ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించే లోపు సంభవించే మరణాలను నివారించగల మరణాలను నివారిస్తుందని నిర్వహికులు ఒక ప్రకటనలో తెలిపారు. వాయుమార్గ నిర్వహణ కోసం పునరుజ్జీవన సాధనాలు, శ్వాసకోశ మద్దతు, షాక్ నివారణ, రక్తస్రావం నియంత్రణ, ఫ్రాక్చర్ నిర్వహణకు సంబంధించిన ఆర్థోపెడిక్ సర్జికల్ సాధనాలతో సహా కీలకమైన ట్రామా కేర్‌ను అందిస్తుంది. ఇది రోగులను తదుపరి చికిత్స కోసం అధునాతన వైద్య కేంద్రాలకు తరలించేలోపు రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడతాయి. అత్యవసర వైద్య అందక సంభవించే మరణాలను తగ్గిస్తాయి.ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ, “సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ద్వారా అత్యవసర సంరక్షణ సేవలు, పరికరాలను అప్‌గ్రేడ్ చేయడం మన జిల్లాలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు అన్నారు. తద్వారా బాధితులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, క్లిష్టమైన పరిస్థితుల్లో మనుగడ రేటును మెరుగు పడుతుందన్నారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంలో ప్రత్యేక అత్యవసర సంరక్షణ సేవలు కీలకమైనవని సేవ్‌లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీఈవో పియూష్ తివారీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్ , ఆర్మూర్‌లోని ఏరియా హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమృతం రెడ్డి; భీమ్‌గల్‌లోని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్,సేవ్‌లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీజేపీలో జోష్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భారతీయ జనతా పా ర్టీ నాయకులు, కార్యకర్తల్లో సరికొత్త జోష్ నెలకొంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సంబరాలు చేసుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాత్రం రెండో ప్రాధాన్యత ఓటుతో విజ యం సాధించారు. వరుసగా మూడురోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ఆది నుంచీ అంజిరెడ్డి ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. త్రిముఖ పోరులోనూ అంజిరెడ్డి ఆధిక్యం ఏ రౌండ్లోనూ తగ్గలేదు. అయితే ప్ర తి రౌండ్లోనూ ఆధిక్యత మాత్రం స్వల్పంగానే వ చ్చింది. గెలుపునకు అవసరమైన నిర్ధారిత 50 శాతం ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్ రౌండ్ల ప్రక్రియ తప్పలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ నిర్ధారిత 50 శాతం ఓట్లు ఎవరికీ రాలేదు. 54 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యాక మిగిలిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాక బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి లలో ఎవరికీ నిర్ధారిత ఓట్లు రాకపోవడంతో ఆధిక్యంలో ఉన్న అంజిరెడ్డి గెలుపొందినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. రెండు స్థానాల్లోనూ విజయం లభించడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. ఇందూరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం శాసనసభ, లోక్‌సభ ఎన్నికలతో పాటు తాజాగా ఎమ్మెల్సీ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా తెలిసింది. రోజురోజుకూ పార్టీ ప్రాబల్యం పెరిగింది. జిల్లాలో అతిపెద్ద పార్టీగా ఉంది. ఇదే ఉత్సాహంతో, ప్రజాదరణతో జెడ్పీ పీఠం, అత్యధిక ఎంపీపీ స్థానాలు, పంచాయతీల్లో గెలుస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో స్వీప్ చేస్తాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఇక్కడి నుంచే చరమగీతం పాడి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికారం దక్కించుకుంటాం. ఇక బీఆర్ఎస్కు సైతం ఇక్కడినుంచే చరమగీతం పాడాం. తాజా విజయం బీజేపీ కార్యకర్తలందరిది. కార్యకర్తలు, నాయకులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. – ధర్మపురి అర్వింద్, ఎంపీపటాకులు కాల్చి.. మిఠాయిలు పంచి..సుభాష్‌నగర్: ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించడంతో బుధవారం రాత్రి బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. పటాకులు కాల్చి నృత్యాలు చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని ఎమ్మెల్సీ ఫలితంతో తేలిపోయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్వామియాదవ్, హరీశ్ రెడ్డి, మెట్టు విజయ్, ఇప్పకాయల కిశోర్, శంకర్, విజయకృష్ణ, వినోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల గెలుపుతో శ్రేణుల్లో ఉత్సాహం సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం: ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ జిల్లాలో లోక్‌సభ ఎంపీతో పాటు నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ శాసనసభ స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. తాజాగా పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలనూ బీజేపీ కై వసం చేసుకుంది. ఇదే ఊపులో నిజామాబాద్ జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్‌లు, అత్యధిక పంచాయతీలు, మున్సిపాలిటీలు, నిజామాబాద్ నగరపాలక సంస్థలోనూ పాగా వేస్తామని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుంచి మహిళలు, యువత, ఇతర సాధారణ ఓటర్ల వరకు తమకు తిరుగులేని ఆదరణ ఇస్తున్నట్లు తాజాగా మరోసారి నిరూపితమైందని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లోనూ పాగా వేస్తామంటున్నారు. గత ఎన్నికల్లోనూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను 28 డివిజన్లను బీజేపీ కై వసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి సంపూర్ణ మెజారిటీతో నిజామాబాద్ నగరపాలకంలో పాగా వేస్తామని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఎల్లారెడ్డిపల్లె వాసికి ఆంత్రిక్ సురక్ష సేవా పతక్
ఇందల్వాయి: భారత సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లెకు చెందిన జవాన్ జీఎం నగేశ్‌కు కేంద్రం హోంశాఖ ఆంత్రిక్ సురక్ష సేవా పతక్‌ను అందజేసింది. సశస్త్ర సీమాబల్‌లో జవాన్‌గా కొనసాగుతున్న నగేశ్ నేపాల్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. తన సేవలను గుర్తించి గత సోమవారం కేంద్ర హోంశాఖ ఆంత్రిక్ సురక్ష సేవా పతక్‌ను అందజేసిందని, పతకం అందుకోవడం తనకు గర్వంగా ఉందని నగేశ్ అన్నారు. గంజాయి, అల్ప్రాజోలం దహనం జక్రాన్‌పల్లి: వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయి, అల్ప్రాజోలంను మండలంలోని ప డకల్ గ్రామంలో ఉన్న శ్రీ మెడికేర్ సర్వీసెస్ లో బుధవారం దహనం చేశారు. 23 కేసుల్లో పట్టుబడిన 616 కిలోల 837 గ్రాముల గంజాయి, 3 కిలోల 444 గ్రాముల అల్ప్రాజోలాన్ని ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధుశర్మ, డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. కమిటీ సభ్యులు అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్రా మ్‌రెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలి నిజామాబాద్ అర్బన్: ఎండల తీవ్రత నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజల ను అప్రమత్తం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఎండల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టా ల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సారి వేసవి సీజన్లో సాధారణం కన్నా ఎ క్కువగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంద న్న హెచ్చరిక నేపథ్యంలో ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి తాగునీ రు అందుబాటులో ఉంచాలని, ఆస్పత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉంచాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆరో గ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని, కరపత్రాల ద్వారా వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి కూలీలకు నీడ సౌకర్యం కల్పించాలన్నారు. ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. అలీసాగర్ ఫిల్టర్ బెడ్ పరిశీలన నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్‌కు తాగునీటిని అందించే అలీసాగర్ వాటర్ ఫిల్టర్‌బెడ్‌ను మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. వేసవి కా లం ప్రారంభమైనందున నగరంలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిషనర్ వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజున ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషా పరీక్షలు రాసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. మొత్తం 19,191 మంది విద్యార్థులకు గాను 18,438 మంది హాజరుకాగా, 753 మంది గైర్హాజరయ్యారన్నారు. 57 పరీక్ష కేంద్రాలకు గాను 50 కేంద్రాలను తనతోపాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు, హై పవర్ కమిటీ, బల్క్ అధికారి, కస్టోడియన్లు తనిఖీ చేశారన్నారు. – నిజామాబాద్ అర్బన్ -
నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి
పన్ను వసూళ్లపై.. ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్ధీకరణ రుసుము వసూళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు లోగా పాత బకాయిలతోపాటు వందశాతం పన్ను వసూలు చేయాలన్నారు. పన్ను వసూళ్లలో వెనుకబడిన గ్రామ పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డీఎల్పీవోలను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ఫీజు ఈనెలాఖరు లోగా చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందన్నారు. నిజామాబాద్ అర్బన్: వేసవిలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా, ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్), ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్క్‌ఔట్, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో కంప్లయింట్ బాక్సుల ఏర్పాటు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ అంకిత్‌తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామాల వారీగా నీటి సరఫ రా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, అవసర మైన చోట్ల చేతిపంపులు, బోరు బావులకు మరమ్మ తులు చేయించాలన్నారు. రెండు రోజుల్లో మరమ్మ తులు పూర్తి చేయించాలని ఆదేశించారు. మంచినీటి పథకాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. పరీక్షల సీజన్లో హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టేలా మార్క్‌ఔట్ త్వరితగతిన చేసి ఆన్లైన్లో వివరాలను పొందుపర్చాలని కలెక్టర్ అన్నారు. ఫిర్యాదుల పెట్టెలు.. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఫిర్యాదు పెట్టెలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వీటి ద్వారా అందే ఫిర్యాదులను ప్రతి వారం పరిశీలిస్తూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, విద్యుత్‌శాఖ ఎస్ఈ రవీందర్, జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేంద్రకుమార్, ఈఈలు రాకేశ్, స్వప్న, మున్సిపల్ కమిషనర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్ భగీరథ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి తాగునీటి పథకాలకు నిరంతర విద్యుత్ అందించండి గ్రామాల వారీగా పరిస్థితిని సమీక్షించాలి వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు -
తెయూలో 21 నుంచి ఇంటర్నేషనల్ సెమినార్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈనెల 21 నుంచి 25 వరకు ఇంటర్నేషనల్ సెమి నార్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ మామిడాల ప్రవీణ్ తెలిపారు. వైస్ చాన్స్‌లర్ టీ యాదగిరిరా వు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి బుధవారం సెమినార్‌కు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్సీ, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం, సెల్ఫ్ కేర్ అనే అంశాలపై ఐదు రోజులపాటు అంతర్జా తీయ సదస్సు నిర్వహిస్తామన్నారు. యునైటెడ్ వే హైదరాబాద్ సౌజన్యంతో నిర్వహించనున్న సదస్సులో ‘రిమైనింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండి యా’ అనే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫె సర్లు ప్రసంగిస్తారని తెలిపారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ పావని, డాక్టర్ కాండీసీ, డాక్టర్ షో కి, డాక్టర్ గాబ్రియల్, డాక్టర్ బెన్, డాక్టర్ డోరిస్, శ్రేయ అలెగ్జాండర్లు రిసోర్స్ పర్సన్ గా పాల్గొంటారని కన్వీనర్ ప్రవీణ్ తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం సత్యనారాయణ రెడ్డి, పీఆర్వో డైరె క్టర్ ఏ పున్నయ్య, నాగరాజు, సంపత్, జమీల్ అహ్మ ద్, దత్తహరి తదితరులు పాల్గొన్నారు. పాల్గొననున్న హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు -
పట్టభద్రుల సీటూ కమలానిదే!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సాక్షి,పెద్దపల్లి: నిజామా బాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్స్‌తో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో అతడినే విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్లతేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క మలం పార్టీ విజయం సాధించటంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్విరామంగా మూడు షిప్ట్‌ల్లో 800 మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లును వడపోసి, కట్టలు కట్టారు. అదేరోజు రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ ప్రారంభించి బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్స్‌ను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్స్‌లో బరిలో ఉన్న 54 మందిలో తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారి బ్యాలెట్ పేపర్లోని ద్వితీయ ప్రాధాన్యత ఓట్లును మిగిలిన అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ ప్రక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ బీజేపీదే హవా నిర్ధారిత కోటా ఓట్ల కోసం అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టగా అందులో సైతం బీజేపీ అభ్యర్థి ఆధిక్యం చూపారు. తొలుత 53 మందిని ఎలిమినేషన్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 73,644 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థికి 63,404 ఓట్లు వచ్చాయి. 53 మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్లును ఎవరు సాధించకపోవడంతో మూడోస్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్ చేశారు. అతనికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో కమలం పార్టీకే విజయం దక్కింది.త్రిముఖ పోటీలో..ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటు అయిన ఓట్లల్లో 92.52 శాతం (2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగిలిన 53 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కేవలం 16,684 ఓట్లు మాత్రమే సాధించారు. అధిక ఓట్లతో గెలిచిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మూడురోజులు సాగిన ఎమ్మెల్సీ కౌంటింగ్ ముగ్గురికే 92.52 శాతం ఓట్లు -
అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
సుభాష్‌నగర్: జిల్లా అభివృద్ధికి అడ్డుపడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. జవహర్ నవోదయ విద్యాలయాన్ని అడ్డు కోవడాన్ని నిరసిస్తూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి దిష్టిబొమ్మను బుధవారం నగరంలోని నిఖిల్‌సాయి చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ ఆర్మూర్, బాల్కొండ, నిజామామాబాద్ రూరల్ ని యోజకవర్గాలకు విద్యాపరంగా ప్రయోజనం కలిగే లా జవహర్ నవోదయ విద్యాలయానికి జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ శివారులో భూమి కేటాయించాలని కలెక్టర్‌ను కోరారని తెలిపారు. కానీ, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కలిగోట్‌లో కాకుండా బోధన్ లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 8 ఎకరాల భూమిని ప్రతిపాదించారని పేర్కొన్నారు. ఫ్యాక్టరీకి చెందిన స్థలంలో నవోదయ ఏర్పాటును రిజెక్ట్ చేసిందని గుర్తుచేశారు. రూరల్ నియోజకవర్గానికి మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాన్ని బోధన్‌కు తరలించుకుపోతుంటే స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, గంగోనే గంగాధర్, హరీశ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మెట్టు విజయ్, ఆమంద్ విజయ్ కృష్ణ, ఆకుల శ్రీనివాస్, తారక్ వేణు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం -
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి
పింఛన్ కోసం వెళ్లి వస్తుండగా.. కామారెడ్డి రూరల్: పింఛన్ కోసం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న ఓ మహిళ కారు ఢీకొని మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భూమన్నగారి అంజవ్వ(55) తనకు వచ్చే వితంతు పింఛన్ కోసం పక్కనే ఉన్న సరంపల్లి గ్రామానికి వెళ్లింది. పింఛన్ తీసుకొని సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ తిరిగి చిన్నమల్లారెడ్డికి వస్తుండగా గ్రామ శివారులో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అంజవ్వ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు. ఫిట్స్‌తో యువకుడు..ఇందల్వాయి: పశుగ్రాసం కోసం వెళ్లిన యువకుడు ఫిట్స్ వచ్చి పొలంలోనే పడి మృతి చెందిన ఘటన సిర్నాపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కొబ్బాజి రాకేశ్(23) ఉదయం తన స్నేహితులతో కలిసి పొలానికి వెళ్లాడు. గడ్డికోసే క్రమంలో ఫిట్స్ రావడంతో పొలంలో పడి ఊపిరాడక మృతి చెందాడు. ఆలస్యంగా గమనించిన స్నేహితులు కుటుంబీకులకు సమాచారం అందించారు. గతంలో పెద్ద కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించగా, ప్రస్తుతం రెండో కొడుకు రాకేశ్ ఫిట్స్‌తో మృతి చెందడంతో తల్లిదండ్రులు కొబ్బాజి గంగారం కళావతి శోకసంద్రంలో మునిగారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోజ్ తెలిపారు. హార్వెస్టర్ ఢీకొని వ్యక్తి ..డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం అన్నారం శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జీజీ నడ్కుడకు చెందిన బాద్గుణ చిన్నారెడ్డి (45) ద్విచక్ర వాహనంపై డొంకేశ్వర్ నుంచి సొంతూరికి వెళ్తుండగా అన్నారం శివారులో ఎదురుగా వస్తున్న హార్వెస్టర్ ఢీకొట్టింది. హార్వెస్టర్ కిందకు వెళ్లడంతో చిన్నారెడ్డి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ – జానకంపేట్ రోడ్డులో బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఠాణాకలాన్ గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివాస్ (33) జానకంపేట్ నుంచి ఠాణాకలాన్ వైపు బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఓ మొరం టిప్పర్ శ్రీనివాస్‌ను ఢీకొట్టినట్లు పలువురు అనుమానిస్తున్నారు. మృతుడు జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. చేపల కోసం వెళ్లి వ్యక్తి ..రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన బొర్ర చిన్న సాయిలు (45) చేపల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులోని గూండ్ల వాగు వద్దకు వెళ్లిన సాయిలు.. చేపలకోసం వల వేసి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బురదగుంటలో పడిపోయాడు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతుకుతుండగా బురదగుంటలో సాయిలు మృతదేహం కనిపించింది. బుధవారం ఉదయం భార్య గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో బుధవారం జరిగిన వివిధ ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ, నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు చోట్ల వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఫిట్స్‌తో యువకుడు, బురదగుంటలో పడి మరో వ్యక్తి మరణించారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
ఆర్మూర్‌టౌన్: అర్ధరాత్రి తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. బుధ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆలూర్ మండలం దేగాం, మిర్దాపల్లి గ్రామాల్లోని పలు ఇళ్లలో ఇటీవల చోరీలు జరిగాయి. కేసు దర్యాప్తులో భాగంగా ఆర్మూర్ పాత బస్టాండ్ వద్ద మంగళవారం ఉదయం ప్రధాన నిందితుడైన అలకుంట శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు. నిందితుని నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్టు ఖలీల్‌వాడి: తాగిన మత్తులో కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై యాసిన్ ఆరాఫత్ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని గాజులపేట్‌లో మంగళవారం బోడిగం సంతోష్ అనే వ్యక్తి తాగిన మత్తులో తన బంధువైన లింగంపల్లి మహేశ్‌పై దాడి చేశాడు. బాధితుడి భార్య లింగంపల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 15 రోజుల జ్యుడీషియల్ కస్టడికి పంపినట్లు ఎస్సై తెలిపారు. -
మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలి
● అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ అర్బన్: సమాజానికి పెను సవాలు గా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల ని రోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టు గా కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యంలో అదనపు కలెక్టర్ నేతృత్వంలో బుధవారం జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల మూలాలను అడ్డుకుంటే చాలా వరకు నియంత్రించవచ్చని తెలిపారు. కల్తీ కల్లు తయారీకి వినియోగించే అల్ఫ్రాజోలం నిల్వలపై ఆరా తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ, వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ రావు, అటవీ, వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ తదితరులు పాల్గొన్నారు. -
బయోటెక్నాలజీతో బహుముఖ ప్రయోజనాలు
తెయూ(డిచ్పల్లి): బయోటెక్నాలజీ పరిశోధనలతో వివిధ రంగాల్లో బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు తెలిపారు. ప్రధానంగా వ్యవసాయ రంగంలో నూతన వంగడాల సృష్టి, పారిశ్రామిక రంగంలో అధిక ఉత్పత్తి, వైద్య రంగంలో వ్యాధుల నివారణకు ఈ శాస్త్రం కృషి చేస్తోందన్నారు. తెయూ బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం బయోటెక్నాలజికల్ ప్రయోగాల ప్రదర్శనపై నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో వీసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బయోటెక్నాలజీ.. నూతనంగా ఆవిష్కరించిన ఆధునిక శాస్త్రమన్నారు. కొవిడ్ మహమ్మారిలాంటి ప్రాణాంతక వైరస్‌ను అరికట్టేందుకు భారత్ బయోటెక్నాలజీ సంస్థ వ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడిందని గుర్తుచేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బయోటెక్నాలజీ పరిశోధనలు కీలకమని వివరించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో మనదేశం వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు పోతుందన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇలాంటి వర్క్‌షాప్‌లు దోహదం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సదస్సు కన్వీనర్, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రసన్న శీల, వైస్ ప్రిన్సిపల్ ఎం.సత్యనారాయణెడ్డి, కోకన్వీనర్ కిరణ్మయి, అధ్యాపకులు మహేందర్, జవేరియా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌నకు సుమారు 350మందికి పైగా విద్యార్థులు హాజరై జీవ సాంకేతిక శాస్త్ర ప్రయోగ పద్ధతులను తెలుసుకున్నారు. -
స్త్రీనిధి వసూళ్లకు స్పెషల్ డ్రైవ్
మోర్తాడ్(బాల్కొండ): సీ్త్ర నిధి రుణాల బకాయిల వసూళ్ల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఇతర జిల్లాలతో పోల్చితే బకాయిలు అంతగా లేకపోయినా ఎన్పీఏ (నాన్ ఫెర్ఫార్మింగ్ అస్సెట్స్)లోకి చేరిన ఖాతాల సంఖ్య పెరిగిపోయింది. ఎన్‌పీఏలోకి రుణ ఖాతా లు చేరితే మొండి బకాయిల శాతం పెరిగిపోతుందనే ఉద్దేశంతో వసూళ్లపై దృష్టిసారించారు. ఈ నెల 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు ఎంత వీలైతే అంత ఎన్పీఏ తగ్గించా లని అధికారులు భావిస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాల వసూళ్లకు బ్యాంకర్లు బాధ్యత వహిస్తుండ గా, సీ్త్ర నిధి రుణాల విషయంలో మాత్రం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులపైనే భారం పడింది. జిల్లా వ్యాప్తంగా ఎన్పీఏ ఖాతాల సంఖ్య పెరగడంతో ఐకేపీ ఉద్యోగులు, మహిళా సమాఖ్యల ప్రతినిధులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కాగా, నవీపే ట్ మండలంలో రూ.1,34,61419 బకాయిలు ఉండగా, రూ.1,09,48,326 బకాయిలతో బోధన్ రెండో స్థానంలో నిలిచింది. రూ.13,05,823 బకాయిలతో చందూర్ మండలం చివరిస్థానంలో ఉంది. రుణాల పంపిణీ ఇలా... జిల్లాలో సీ్త్ర నిధి ద్వారా 89,203 మందికి రూ.577,01,14,043 రుణాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు రూ.140,18,59,407 వసూలు కావాల్సి ఉండగా, రూ.125,43,99,055 వసూలయ్యాయి. మిగతా వాటిని కూడా వసూలు చేసి, రుణాల చెల్లింపులను గాడిలో పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. మహిళా దినోత్సవంలోపు వసూలు చేయాలని ఆదేశం ప్రత్యేక బృందాలు ఏర్పాటు ఎన్పీఏ ఉండొద్దని అధికారుల యోచనబకాయిలు ఉండొద్దు సీ్త్ర నిధి రుణాల వసూళ్లను లక్ష్యానికి అనుగుణంగా సాగించాలి. బకాయిలు ఎప్పటికప్పుడు వసూలు చేయడంతో ఎన్పీఏ ఉండదు. కొత్తవారికి సీ్త్ర నిధి రుణాలు మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేశాం. – సాయాగౌడ్, డీఆర్డీవో -
గల్ఫ్ ఏజెంట్ మోసం
బోధన్‌రూరల్: గల్ఫ్ ఏజెంట్ మోసం చేయడంతో బోధన్ మండలం పెగడాపల్లికి చెందిన ఓ యువకుడు షార్జాలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. పెగడపల్లి గ్రామానికి చెందిన గుండారం ప్రభాకర్, భాగ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. గ్రామంలో చాకలి వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరి పెద్ద కొడుకు గుండారం చంద్రశేఖర్‌కు దుబాయి లేదా షార్జాలో క్లీనింగ్ పని ఇప్పిస్తానని నిజామాబాద్‌కు చెందిన కృష్ణ అనే ఏజెంట్ ఎనిమిది నెలల క్రితం సుమారు రూ.90 వేల వరకు తీసుకున్నాడు. తీరా దుబాయికి వెళ్లగా అక్కడ ఏజెంట్ చెప్పినట్లుగా ఉపాధి లభించలేదు. చంద్రశేఖర్‌ను అక్కడి నుంచి షార్జాకు తీసుకెళ్లారు. అక్కడ కూడా సరైన ఉపాధి చూపించలేదు. దీంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న చంద్రశేఖర్ రోజువారీ ఖర్చుల కోసం కుటుంబసభ్యులే పలుమార్లు డబ్బులు పంపించారు. ఈ విషయమై ఏజెంట్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం తమ కొడుకు ఇబ్బందులు పడుతున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. మోసం చేసిన ఏజెంట్ కృష్ణపై చర్యలు తీసుకుని తమ కొడుకును స్వగ్రామాని రప్పించాలని బోధన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై ఎస్సై మచ్చేందర్ రెడ్డిను సంప్రదించగా బాధిత కుటుంబీకులు సమస్యను తమ దృష్టికు తెచ్చారని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. షార్జాలో ఇబ్బందిపడుతున్న యువకుడు కొడుకును స్వగ్రామానికి రప్పించాలని తల్లి వినతి -
కేసు విత్‌డ్రా చేసుకున్న మాజీ ఎమ్మెల్యే
ఖలీల్‌వాడి: ఎన్నికల ప్రచారంలో తన వాహన అద్దాలు పగులగొట్టిన ఇద్దరిపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాజిరెడ్డి గోవర్ధన్ 2014 ఏప్రిల్ 23న నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలమ్మకుంటకు వెళ్లారు. ప్రచారం చేయకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కేతావత్ మోహన్, కేతావత్ యాదగిరి తదితరులు అడ్డుకొని కారు అద్దాలు పగులగొట్టారని బాజిరెడ్డి గోవర్ధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు విత్‌డ్రా కోసం మోహన్, యాదగిరిలు మాజీ ఎమ్మెల్యేను అభ్యర్థించగా బుధవారం నిజామాబాద్ నాల్గో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్(జూనియర్ సివిల్ జడ్జి) వడ్డి హరికుమార్ ఎదుట లోక్ అదాలత్‌కు హాజరయ్యారు. ఈ నెల 8న నిర్వహించనున్న లోక్‌అదాలత్‌లో కేసును కొట్టివేయాలని కోరగా, ముద్దాయిలపై కేసును కొట్టివేస్తూ జడ్జి హరికుమార్ అవార్డును జారీ చేశారు. న్యాయవాదులు అల్గోట్ రవీందర్, ఆశ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి గ్రామానికి చెందిన గుర్రం నాగేశ్ (25) ఆటో నడిపిస్తూ జీవనం సాగించేవాడు. అప్పుల కారణంగా కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇంట్లో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన నాగేశ్ బయటకు వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నట్లు పేర్కొన్నారు. -
రోడ్డుపై కూలిన మర్రిచెట్టు
● ఒకరికి గాయాలు లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మెంగారం గ్రామశివారులో బుధవారం రోడ్డుపై మర్రిచెట్టు కూలడంతో ఒకరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మెంగారం గ్రామానికి చెందిన అన్నం సాయిలు మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు భారీ మర్రిచెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో సాయిలుకు గాయాలుకాగా, వాహనం ధ్వంసమైంది. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని లింగంపేట ఆస్పత్రికి తరలించారు. మర్రి కొమ్మ రోడ్డుపై పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆర్అండ్బీ అధికారులు కొమ్మలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
తెయూ(డిచ్పల్లి): క్రమం తప్పకుండా యోగా చేయడంతో ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతత పొందవచ్చని తెలంగాణ యూనివర్సిటీ ఉమెన్స్ సెల్ డైరెక్టర్ భ్రమరాంభిక తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెయూ వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు ఆదేశాల మేరకు ఉమెన్స్ సెల్ ఆధ్వర్యంలో బుధవారం యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్యరక్ష నేచర్‌క్యూర్ యోగా సెంటర్ థెరపిస్ట్ ఐశ్వర్య వర్సిటీలోని విద్యార్థినులు, అధ్యాపకులతో యోగాసనాలు వేయించారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయాలని సూచించారు. -
మహిళ మృతదేహం లభ్యం
మాక్లూర్: మండలంలోని చిక్లి గ్రామానికి చెందిన సాదుల్ల సుశీల (55) మృతదేహం బుధవారం ధర్మోరా గ్రామం వద్ద గుత్ప ఎత్తిపోతల కాలువలో లభ్యమైంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. సాదుల్ల సుశీల కొన్ని సంవత్స రాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె భర్త సాయ న్న గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందాడు. సుశీలకు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులుండడంతో జీవితంపై విరక్తితో ఈ నెల 2న ఇంట్లో చెప్పకుండా వెళ్లి నందిపేట వద్ద కాలువలో దూకినట్లు తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రవా హం ఎక్కువగా ఉండడంతో కాలువలో కొట్టుకువచ్చి ధర్మో రా వద్ద తేలిందన్నారు. మృతురాలి కుమారుడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అడ్డగోలుగా యూరియా విక్రయాలు!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఎరువుల విక్రయా లు అడ్డగోలుగా జరుగుతున్నాయి. పరిమితికి మించి లెక్క లేకుండా యూరియా బస్తాలు ఇవ్వడంతో పలు చోట్ల కొరత ఏర్పడుతోంది. మార్కెట్లో నెలకొన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని డీలర్లు, సొసైటీల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎరువుల అమ్మకాలపై వ్యవసాయాధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యూరియా బస్తాలు పక్క దారి పడుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం యాసంగి సీజన్లో ఎన్నడూ లేనంతగా యూరియా విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది యాసంగిలో గరిష్టంగా 74 వేల మెట్రిక్ టన్నుల యూరియా అమ్ముడయ్యేది. వ్యవసాయ శాఖ 75 వేల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే 76,840 మె ట్రిక్ టన్నులు అమ్ముడు పోయింది. రైతుల నుంచి ఇంకా డిమాండ్ రావడంతో వ్యవసాయ శాఖ ఎప్ప టికప్పుడు జిల్లాకు యూరియాను తెప్పిస్తోంది. బాల్కొండ, నందిపేట్, డొంకేశ్వర్, నవీపేట్ లాంటి మండలాల్లో డిమాండ్ పెరిగింది. తద్వారా ఈ ప్రాంతాలకు అధికారులు ఎక్కువగా యూరియా నిల్వలను కేటాయిస్తున్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గడంతో రైతులు ఇటీవల నాట్లు వేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో యూరియా అమ్మకాలు పెద్ద మొత్తంలో సాగుతున్నాయి. పరిమితి లేకుండా పంపిణీ చేస్తున్న డీలర్లు, సొసైటీలు ఒక్కొక్కరికి 50 బస్తాలకు మించి ఇస్తున్న వైనం పర్యవేక్షణ చేయని వ్యవసాయాధికారులు తద్వారా పలు చోట్ల ఏర్పడుతున్న ఎరువుల కొరత ధర్పల్లి మండలం గోవింద్‌పల్లిలో ఒక రైతు 55 ఎరువుల బస్తాలు కొనుగోలు చేసినట్లు రికార్డులో నమోదైంది. అలాగే భీమ్‌గల్, కంజర, రెంజల్, సాలూర, మాక్లూర్, పొతంగల్, చీమన్‌పల్లి ప్రాంతాల్లో సైతం కొందరు రైతులు ఒక్కొక్కరు 45 బస్తాలకు పైగా తీసుకెళ్లినట్లు లెక్కలున్నాయి. నిజంగా రైతులే కొనుగోలు చేసి తీసుకెళ్లారా? లేదా వారి పేరుతో డీలర్లు, సొసైటీల బాధ్యులు బస్తాలను పక్కదారి పట్టించారా? అనే సందేహం కలుగుతోంది.పరిమితి లేదు.. యూరియా బస్తాల అమ్మకాలపై పరిమితి పెట్టకపోవడంతో రైతులు అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఒక రైతుకు ఒక సీజన్లో యాబైకి మించి బస్తాలు ఇవ్వడానికి అవకాశం లేదు. రైతుకు ఎన్ని బస్తా లు ఇస్తున్నారనేది ఈ–పాస్ మిషన్‌లో రికార్డు అవుతుంది. కానీ, ఆ వివరాలను అధికారులు పరిశీలించడం లేదు. డీలర్లు, సొసైటీలు వేరే రైతుల పేరుతో యూరియాను అమ్ముతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఎరువుల కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఎరువులన్ని ఎక్కడిపోతున్నాయో కూడా అధికారులు కనీసం ఆరా తీయడం లేదు. అంతా ‘మామూలు’గా తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఎకరం పొలానికి మూడు బస్తాల యూరియా సరిపోనుండగా కొందరు రైతులు ఎనిమిది బస్తాల వరకు వేస్తున్నారు. దీనిపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించడం లేదు. అమ్మకాలను పరిశీలిస్తాం ఈ యాసంగి సీజన్లో అంచనాకు మించి యూ రియా అమ్మకాలు జరిగాయి. రైతులు ఎక్కువ బస్తాలను కొనుగోలు చేసి అవసరానికి మించి వరి లో చల్లుతున్నట్లుగా సమాచారం వచ్చింది. లెక్క లేకుండా యూరియా విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం. జిల్లాలో యూరియా కొరత లేదు. 3వేల మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. – వాజిద్ హుస్సేన్, జిల్లా వ్యవసాయాధికారి -
రైతులకు సాంకేతికతను చేరువ చేయాలి
రుద్రూర్: వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు స మన్వయంతో పని చేస్తూ రైతులకు సాంకేతికతను మరింత చేరువ చేయాలని పొలాస వ్యవసాయ పరి శోధన కేంద్రం ఇన్చార్జి, సహ వ్యవసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీలత అన్నారు. రు ద్రూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన శాసీ్త్రయ సలహా మండలి సమావేశానికి ఆమె హాజరయ్యారు. జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం, కామరెడ్డి జిల్లాలోని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు గత ఏడాది చేపట్టిన పరిశోధన అంశాల మీద, వచ్చే వానకాలం, యాసంగిలో చేపట్టబోయే పరిశోధన అంశాలపై సమీక్ష నిర్వహించి తగు సూ చనలు అందించారు. రుద్రూర్ కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అంజయ్య మాట్లాడుతూ ప్రణాళిక రూపొందించుకుని రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో పని చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వాజీద్ హుస్సేన్ , బెల్లంపల్లి కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శివకృష్ణ, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక జాయింట్ డైరెక్టర్ జగన్నాథ చారి, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, శాసీ్త్రయ సలహా మండలి సభ్యు లు, రైతులు పాల్గొన్నారు. -
తెయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వీసీ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి, కంట్రోలర్ సంపత్‌కుమార్ మంగళవారం విడుదల చేశారు. బీఏలో 28.24 శాతం, బీకాంలో 34.10, బీఎస్సీ లైఫ్‌సైన్స్‌లో 40.38, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ లో 23.89, బీబీఏలో 42.21, బీసీఏలో 9.09శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 19,574మంది విద్యార్థులు హాజరుకాగా , 6,436మంది (32.88శాతం) ఉత్తీర్ణులైనట్లు పేర్కొ న్నారు. మాజీ కంట్రోలర్ ఎం అరుణ, అడిషనల్ కంట్రోలర్లు డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయి, డాక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
మక్కల ధర ఢమాల్
బాల్కొండ: యాసంగిలో సాగు చేసిన మక్కజొన్న పంట ప్రస్తుతం చేతికి వచ్చింది. ఎంచక్కా విక్రయించి లాభాలు ఆర్జించవచ్చనుకున్న రైతులకు ఇ బ్బందులు మొదలయ్యాయి. రోజురోజుకూ మార్కెట్లో మక్కల ధరను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే రైతులకు.. పౌల్ట్రీపై పడిన వైరస్ ప్రభావమంటూ వ్యాపారుల నుంచి సమాధానం వస్తోంది. తగ్గిన డిమాండ్ పౌల్ట్రీఫామ్‌లో కోళ్ల పెంపకానికి వినియోగించే దాణాలో మక్కలను అధికంగా వినియోగిస్తారు. దీంతో వ్యాపారులు ప్రతి సీజన్లో రైతుల నుంచి ఎక్కువ మొత్తంలో మక్కలను కొనుగోలు చేస్తుంటారు. కానీ, కొన్ని నెలలుగా వైరస్ ప్రభావంతో ఫామ్‌లలో వేలాదిగా కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. దీంతో ఫారాల యజమానులు మక్కల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. ఖరీఫ్‌లో మక్కల ధర క్వింటాలుకు రూ.2500 పలికింది. ప్రస్తుతం జొన్నకు ప్రత్యామ్నాయంగా రైతులు మక్కజొన్ను అధికంగా సాగు చేశారు. మొదట క్వింటాలు మక్కలకు రూ.2300 చెల్లించిన వ్యాపారులు, తాజాగా రోజుకో రూ.100 తగ్గిస్తూ క్వింటాలుకు రూ.2100 నుంచి రూ.2200 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కొనుగోళ్లపై ‘కోళ్ల వైరస్’ ప్రభావం రోజురోజుకూ తగ్గుతున్న ధర -
నిధులు కేటాయించారు.. నిర్మాణాలు మరిచారు
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం మోర్తాడ్, కుద్వాన్పూర్, ఆర్మూర్, ఎడపల్లి, బోధన్, శ్రీరాంపూర్, చీమన్‌పల్లి, నిజామాబాద్‌లలో బాలబాలికలకు వేర్వేరుగా మహాత్మా జ్యోతీబా ఫూలే గురుకులాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం నియోజకవర్గానికి బా లుర కోసం ఒకటి, బాలికల కోసం మరో విద్యా సంస్థలను ప్రారంభించింది. ఒక్కో గురుకులంలో 400 నుంచి 500 మంది వరకు పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. సొంత భవనాలను నిర్మించేందుకు 2024–25 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,546 కోట్లు కేటాయించింది. మరికొద్ది రోజుల్లో 2025–26 బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయినప్పటికీ బీసీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. కొన్ని చోట్లే ఇంటర్ విద్య.. పేరుకే అన్ని గురుకులాల్లో ఇంటర్ విద్య అందిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మా త్రం ఒకటి, రెండు చోట్లనే కొనసాగుతున్నాయి. ఇంటర్ విద్యను ఆరంభించిన తర్వాత గదుల కొరతతో కేవలం కంజర కళాశాలలోనే విద్యార్థులకు చదువు చెబుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికై నా సొంత భవనాల కల నెరవేరుతుందని అంతా ఆశించినా.. ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్థల సేకరణ జరగకపోవడంతో కలగానే మిగిలిపోయింది. ఇరుకుగదుల్లోనే.. బీసీ గురుకులాల విద్యార్థులు అనువైన భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదుల్లోనే వందలాది మంది విద్యార్థులకు వసతి, విద్యాబోధన ఇబ్బందిగా మారింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పాఠశాల, కళాశాలలకు సొంత భవనాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అద్దె భవనాల్లోనే బీసీ గురుకులాలు 2024–25 బడ్జెట్లో సొంత భవనాల కోసం నిధుల కేటాయింపు -
తేలని ఫలితం.. వీడని ఉత్కంఠ
సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠను రేపుతోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్‌లో బీజీపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధించారు. ఏ ఒక్క అభ్యర్థి నేరుగా కోటా ఓట్లు చేరుకునే అవకాశాలు కనిపించలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపోటములు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఫలితం తేలనుంది. ట్రయాంగిల్‌గా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. పోటాపోటీ ఓట్లు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీపడినా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణ విస్తృత ప్రచా రం చేశారు. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. 6వ రౌండ్ పూర్త య్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు ముగ్గురు కలిసి సుమారు లక్ష ఓట్లు సాధించగా, బరిలో నిలిచిన 53 మంది అభ్యర్థులందరూ కలిపి కేవలం 10 వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో మూడోస్థానంలో నిలిచే అభ్యర్థి ఎవరనేదానిపై ఎమ్మెల్సీ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతి రౌండ్లో.. మొత్తం 21 టేబుళ్ల ద్వారా 12 రౌండల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిపై 36 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండోరౌండ్లో 1,457 ఓట్ల మెజార్టీ, మూడోరౌండ్లో 3,005 ఓట్లు, నాలుగో రౌండ్లో 1,263 ఓట్లు, ఐదోరౌండ్లో 1,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిపై 211 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 45,401 ఓట్లు సాధించి ప్రత్యర్థులపై 6,931 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. 38,470 ఓట్లతో నరేందర్‌రెడ్డి సెకండ్ ప్లేస్‌లో, 31,481 ఓట్లతో ప్రసన్నహరికృష్ణ మూడోస్థానంలో నిలిచారు. మందకొడిగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు తోడు పోటాపోటీగా అభ్యర్థులు ఓట్లు సాధిస్తుండటంతో రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ పెరిగింది. రెండోప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.కౌంటింగ్ వివరాలు పోటీ త్రిముఖం కోటా ఓట్ల మార్కును చేరుకోని అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియతోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఎవరికీ దక్కని విన్నింగ్ కోటా ఓట్లు పోస్టల్ ఓట్లతో కలిసి మొత్తం 2,52,000 ఓట్లు పోలవగా, అందులో సుమారు 28 వేల ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. చెల్లనిఓట్లు పోగా మిగిలిన 2,24,000 ఓట్లలో సగం ఓట్లు.. అంటే 1,12,001 ఓట్లను విన్నింగ్ కోటా ఓట్లుగా నిర్ధారించారు. పోటీలో ఉన్న ఏ ఒక్క అభ్యర్థి నేరుగా కోటా ఓట్లను సాధించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫలితం తేలేందుకు బుధవారం రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
తాడ్వాయి: పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన బంగారుగల్ల అభిజిత్(24) అనే యువకుడు చిన్న నాటి నుంచి అమ్మమ్మ శాంతవ్వ వద్ద పెరుగుతున్నాడు. పనిచేసుకుంటు బతకాలని అభిజిత్‌ను అమ్మమ్మ బెదిరించడంతో ఈ నెల 1న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గుంటి తండాలో పునాదులు ధ్వంసంమాచారెడ్డి: తాతల నాటి నుంచి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ గిరిజన రైతు అక్కడ ఇంటి నిర్మాణం కోసం తీసిన పునాదులను మంగళవారం అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం గుంటి తండాకు చెందిన లకావత్ లచ్చిరాం కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తూ కుటుంబంతో గుడిసెలో నివాసం ఉంటున్నాడు. గుడిసెను తొలగించి ఇల్లు కట్టుకోవాలని ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్ తెప్పించుకొని పునాదులు తవ్వించాడు. అటవీ శాఖ అధికారులు మంగళవారం పొక్లెయిన్‌తో పునాదులను ధ్వంసం చేశారు. ఈ విషయమై మాచారెడ్డి ఎఫ్ఆర్వో దివ్యను వివరణ కోరగా అటవీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నారన్న సమాచారం మేరకు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా ఇంటి నిర్మాణ పనులు చేపట్టారని, ఉన్నతాధికారుల ఆదేశాలతో అటవీ స్థలంలో నిర్మిస్తున్న ఇంటి పునాదులను ధ్వంసం చేసినట్లు తెలిపారు.కుక్కల దాడిలో 11 గొర్రెలు మృతి మోపాల్: మండలంలోని కులాస్పూర్ తండాలో కుక్కల గుంపు దాడి చేయడంతో చందర్‌కు చెందిన 11 గొర్రెలు మంగళవారం మృతిచెందాయి. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన చందర్ 18 గొర్రెలను ఇంటి ఆవరణలోనే పెంచుతున్నాడు. రోజులాగే పొలానికి నీరు పెట్టేందుకు మధ్యాహ్నం వెళ్లాడు. కుక్కల గుంపు ఒక్కసారిగా గొర్రెలపై దాడి చేయడంతో 11 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల మృతితో సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు చందర్ కోరారు. -
గ్రామీణ ప్రాంతాలపై గంజాయి పడగ
● మత్తులో చిత్తవుతున్న యువత ● రోజురోజుకు విస్తరిస్తున్న విక్రయాలు ● ఆందోళనలో తల్లిదండ్రులు.. డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): గ్రామీణ ప్రాంతా ల్లో రోజురోజుకు గంజాయి విక్రయాలు విస్తరిస్తున్నాయి. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో యువ త గంజాయికి అలవాటు పడుతూ తమ భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలిసి మందలించినా మారకపోగా, గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం ఎదిరించే స్థాయికి చేరుకుంటున్నారు. మత్తుకు అలవాటు పడిన తమ పిల్లలను ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొందరు చేసేది లేక తమ పిల్లలను గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో గంజాయి విక్రయాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. స్కూల్ పిల్లలతోపాటు కాలేజీ పిల్లలు, యువత బానిసలుగా మారుతున్నారు. గంజాయి అలవాటుతో కొందరు పిల్లలు చదువు మానేసి అల్లరిచిల్లరగా తిరుగుతున్నారు. మత్తుకు బానిసవుతు న్న యువత సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గంజాయి కొనుగోలు చేసేందుకు అవసరమైన డ బ్బుల కోసం చిన్న చిన్న చోరీలకూ పాల్పడుతున్నారు. చైన్ స్నాచింగ్‌లకూ వెనుకాడటం లేదు. దాడుల ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం గంజాయి, మత్తుపదార్థాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్య లు చేపడుతున్నాం. స్పెష ల్ డ్రైవ్ ద్వారా వాహ నాలను తనిఖీ చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో రహస్యంగా గంజాయి అమ్మ కాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మండలంలోని మెంట్రాజ్‌పల్లి శివారులో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న గంజాయి ని పట్టుకుని నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించాం. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. అప్పుడే యువత మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించగలుగుతాం. – మల్లేశ్, సీఐ, డిచ్పల్లిఇతర రాష్ట్రాల నుంచి సరఫరా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు, రైలు మార్గం ద్వారా గంజాయిని తీసుకువస్తున్నారు. తర్వాత రహస్య ప్రాంతాల్లోకి తీసుకెళ్లి స్థానిక విక్రేతలకు కిలో రూ.11వేల నుంచి 13వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. స్థానిక వ్యాపారులు వాటిని పొట్లాలుగా మార్చి ఒక్కో పొట్లం రూ.300 నుంచి రూ.500 వరకు యువతకు అమ్ముతున్నారు. ఇందుకోసం మొబైల్ ఫోన్లలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిచ్పల్లి మండల కేంద్రంతోపాటు నడిపల్లి తండా, బీబీపూర్, ఖిల్లా డిచ్పల్లి, ఘన్పూర్ గ్రామాల్లో గంజాయి దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అలాగే ఇందల్వాయి మండల కేంద్రంతోపాటు తిర్మన్‌పల్లి, కొన్ని గిరిజన తండాల్లో గంజాయి విక్రయాలతోపాటు హుక్కా కేంద్రాలు కొనసాగుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
నిజామాబాద్
ఇంటర్ పరీక్షలకు మెనూ ప్రకారం భోజనం.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025– 8లో uనిజామాబాద్ అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షలు బు ధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ఉదయం 9 నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పరీక్ష రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘నిమిషం’ నిబంధన లేకున్నప్పటికీ విద్యార్థులు సమయానికి ఎగ్జామినేషన్ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, చేతి వాచీ లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మొత్తం 57 సెంటర్లలో పరీక్షలు కొనసాగనున్నాయి. సెంటర్లలోని సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి రవికుమార్ సూ చించారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన మొత్తం 36,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ కళాశాల సెంటర్లో హాల్ టికెట్ నంబర్లు వేస్తున్న ఎగ్జామినేషన్ సిబ్బంది న్యూస్రీల్పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేది వీరే.. 57 మంది చీఫ్ సూపరింటెండెంట్లు 57 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎనిమిది మంది సిట్టింగ్ స్క్వాడ్లు ఒక హైవపర్ కమిటీ జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీపరీక్షలు రాయనున్న విద్యార్థులుఅసౌకర్యాల మధ్యే.. నేటి నుంచి ప్రారంభం ‘నిమిషం’ నిబంధన లేదు.. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం పరీక్షలు రాయనున్న విద్యార్థులు 36,222 మంది ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో అసౌకర్యాలు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో వసతులలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ సెంటర్లో 422 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పైకప్పు రేకులు పగిలిపోయాయి. నేరుగా తరగతి గదిలోకి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల బి సెంటర్లో అనేక అసౌకర్యాలు ఉన్నాయి. ఈ కళాశాలలో 310 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఇక్కడ విద్యుత్ అందుబాటులో లేదు. తాత్కాలికంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అందుబాటులో లేవు. మూత్రశాలలు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 408 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఇక్కడ కళాశాలకు ప్రహరీ లేదు. ధర్పల్లిలోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏడు గదులు మాత్రమే అందుబాటులో ఉండగా 550 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇక్కడ ప్రహరీ లేకపోవడంతో బయటి వ్యక్తులు ఎటువైపు నుంచి వస్తారో గుర్తించలేని పరిస్థితి ఉంది. -
ఆర్వోబీ పైనుంచి రాకపోకలు
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పైనుంచి మంగళవారం రాకపోకలు ప్రారంభమయ్యాయి. నాలుగు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి, గోవింద్‌పేట్, మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామాల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ వద్ద చేపట్టిన ఆర్వోబీ పనులు రెండు సంవత్సరాల క్రితం పూర్తికాగా, మామిడిపల్లి వద్ద పనులు నత్తనడకన సాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు సంవత్సరాలుగా వాహనాలను దారి మళ్లించడంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాదారులు గోవింద్‌పేట్ మీదుగా వెళ్లాల్సి వచ్చింది. ఎట్టకేలకు పనులు పూర్తి కావడంతో మామిడిపల్లి మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేని అడ్మిషన్లపై చర్యలు తప్పవు నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపడితే నోటీసులు ఇవ్వకుండానే పాఠశాలలను మూసివేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు అనుమతి లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని, పాఠశాలల అనుమతులు కూడా పొందడం లేదని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మండల విద్యాశాఖ అధికారులు తక్షణమే ఇలాంటి పాఠశాలలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అడ్మిషన్లు తీసుకునే ముందు పాఠశాలల వివరాలను తెలుసుకోవాలన్నారు. ప్రజావాణిని వినియోగించుకోవాలి సుభాష్‌నగర్: విద్యుత్ వినియోగదారులు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆర్ రవీందర్ ఒక ప్రకటనలో కోరారు. వినియోగదారుల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు 2024 జూన్ 17 నుంచి ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణిని అన్ని సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నామన్నారు. వినియోగదారుల విద్యుత్ బిల్లులు, మీటర్ల సమస్యలు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు కేటగిరి మార్పు, పేరు మార్పు, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు తదితర సమస్యలను తీవ్రత ఆధారంగా పరిష్కరించడానికి ప్రజావాణి దోహదపడుతుందని ేతెలిపారు. విద్యుత్ ప్రజావాణికి ఇప్పటివరకు 614 ఫిర్యాదులు అందగా, 469 సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. పోలింగ్ సామగ్రికి నష్టం వాటిల్లొద్దు నిజామాబాద్ అర్బన్: ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లతోపాటు ఇతర పోలింగ్ సామగ్రికి నష్టం వాటిల్లకుండా పూర్తిస్థాయిలో సదుపాయాలున్న గోదాముల్లో భద్రపర్చాలని కలెక్ట ర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అవసరమైతే చెదల నివారణ కోసం పెస్ట్ కంట్రోల్ చేయించాలన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోదామును అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదా ము సీల్‌ను తెరిచారు. ఎన్నికల సామగ్రి భద్రపర్చిన గదులను క్షుణ్ణంగా పరిశీలించా రు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఈఈ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, విజేందర్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. -
రైతు సంక్షేమం కోసం పనిచేస్తా
నిజామాబాద్ రూరల్: రైతు సంక్షేమం కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తానని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు కొండెల సాయి రెడ్డి అన్నారు. మంగళవారం రూరల్ మండలం మారుతీనగర్‌లో భారతీయ కిసాన్ సంఘ్ 46వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎన్సీఎస్ఎఫ్ తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ మాట్లాడుతూ.. రైతు ద్వారానే సమాజంలో పరివర్తన సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికై న జాతీయ అధ్యక్షుడు సాయిరెడ్డిని సంఘ సభ్యులు, రైతులు సన్మానించారు. కార్యక్రమంలో కె నారాయణరెడ్డి, వీరస్వామి, వినయ్ కుమార్, డి వాసుదేవరావు, గడ్డం దశరథ్‌రెడ్డి, అధికారులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాబ్ కార్డుల తొలగింపుపై కూలీల ఆగ్రహం మోపాల్: మోపాల్ మండలంలోని ఎల్లమ్మకుంటలో 81 జాబ్‌కార్డులను, 131 మంది తొలగింపుపై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ లాగిన్ నుంచి ఒకేసారి ఒకే గ్రామం నుంచి ఇంత మొత్తంలో జాబ్‌కార్డుల తొలగింపుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకానున్న నేపథ్యంలో జాబ్‌కార్డులు రద్దు కావడం పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని కూలీలు ఇటీవల కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. గత మే, జూన్ నెలలో పని చేసిన కూలీల జాబ్‌కార్డులు తొలగించడంతో ఆందోళన చెందుతున్నారు. కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్న తమ జాబ్‌కార్డుల తొలగింపునకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే తప్పును సరి చేసి జాబ్‌కార్డులు తిరిగి ఇప్పించాలని కూలీలు కోరుతున్నారు. కాగా ఈ విషయమై ఎంపీడీవో రాములునాయక్‌ను వివరణ కోరగా జాబ్‌కార్డుల జాబితా నుంచి తొలగించిన వారి పేర్లు చేర్చుతామని, కూలీలు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్–2కు 14 రోజుల రిమాండ్ ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రూ.10 లంచం తీసుకుంటూ పట్టుబడిన రిజిస్ట్రార్–2 శ్రీరామరాజు, స్వీపర్ వెంకట్రావుకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిని చర్లపల్లిలోని జైలుకు తరలించారు. అంతేకాకుండా నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీరామరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. ఇందులో పలు డాక్యుమెంట్లు లభించినట్లు సమాచారం. పోలీస్ వాహనం బోల్తా బోధన్‌రూరల్: మండలంలోని బండార్పల్లి శివారులో రూరల్ పీఎస్‌కు చెందిన పోలీస్ వాహనం టైర్ పేలి బోల్తాపడింది. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం బోధన్ మండలం బండార్పల్లికి వెళ్లి వస్తుండగా గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద వాహనం టైర్ పేలింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలో బోల్తాపడింది. వాహనంలో డ్రైవర్ మాత్రమే ఉండటంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. -
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌పై అట్రాసిటీ కేసు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్‌కమిషనరేట్ పరి ధిలోని డిచ్పల్లి సీఐ మల్లేశ్, జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్ మహేందర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ కమిషనర్, జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన రావుట్ల అలియాస్ రాగుట్ల నచ్చన్నకు సర్వే నంబర్ 197/ఆలో ఎకరం భూమి ఉంది. ఈ భూమిలో వడ్డెర కులానికి చెందిన పలువురు దేవుడి ప్రతిమను ఏర్పాటు చేసి షెడ్డు నిర్మాణం చేపట్టారు. నచ్చన్న పని నిమిత్తం భూమి వద్దకు వెళ్లగా అక్కడ షెడ్డు నిర్మించి ఉన్నట్లు గుర్తించి తనకు తెలిసిన వారికి, కులస్తులకు సమాచారం అందించి అక్కడికి వెళ్లారు. షెడ్డు నిర్మాణం ఎలా చేపట్టారని నచ్చన్న తరఫున వారు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నచ్చన్నతోపాటు ఆయన తరఫున వచ్చిన కులస్తులు జక్రాన్‌పల్లి పీఎస్‌కు వెళ్లి ఎస్సై తిరుపతికి ఫిర్యాదు చేశారు. ఎస్సై తిరుపతికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో డిచ్పల్లి సీఐ మల్లేశ్‌కు ఫిర్యాదు చేసి మళ్లీ భూమి వద్దకు వెళ్లారు. భూమిలో పంట వేస్తుండగా జక్రాన్‌పల్లి పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ మహేందర్ అక్కడికి చేరుకుని పనులు నిలిపివేయాలని నచ్చన్నతోపాటు మహిళలు, కులస్తులను హెచ్చరిస్తూ మహిళలను అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును నచ్చన్న ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్ 2న డిచ్పల్లి సీఐ మల్లేశ్‌తోపాటు ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమో దు చేయాలని స్పెషల్ జడ్జి, ఎస్సీ, ఎస్టీ యాక్ట్, డిస్ట్రిక్ట్ అడిషనల్–2 జడ్జి టి శ్రీనివాస్ తీర్పు వెలువరించి ఇన్చార్జి సీపీ సింధుశర్మకు పంపించారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసు కోకపోవడంతో దీనిపై నచ్చన్న ఈ ఏడాది జనవరి 24న హైదరాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, డిచ్పల్లి సీఐ మల్లేశ్, జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతితోపాటు కానిస్టేబుల్ మహేందర్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకువాలని ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిషన్ అట్రాసిటీ కేసు నమోదు చేసి దీనికి సంబంధించిన నివేదిక 30 రోజుల్లో అందించాలని గత నెల 4న కలెక్టర్, సీపీ, జక్రాన్‌పల్లి తహసీల్దార్, జక్రాన్‌పల్లి పీఎస్ ఎస్సై తిరుపతికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ సెక్రెటరీ జీఎస్ పాండాదాస్ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 24న జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను అమలు చేయకపోవడంతో గత నెల 27న బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా, సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి, భూమిలోని షెడ్డును తొలగించి బాధితుడికి అప్పగించాలని హైకోర్టు జస్టిస్ బి విజయసేన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు కేసు నమోదు చేయకపోవడానికి గల కారణాలపై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పోలీస్‌కమిషనర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వులు వచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. భూమిలో ఉన్న దానిని తొలిగించకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేయకుండా స్థానికంగా ఒత్తిడితోనే ఈ భూమి వ్యవహారం వివాదంగా మా రుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మునిపల్లిలోని ఓ భూవివాదంలో డిచ్పల్లి సీఐ, జక్రాన్‌పల్లి ఎస్సై, కానిస్టేబుల్‌పై.. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీపీలు విచారణ జరపాలి ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు జస్టిస్ బి విజయసేన్‌రెడ్డి పోలీసులు పట్టించుకోలేదు నా భూమిలో దేవుడి ప్రతిమ లు పెట్టి షెడ్డు నిర్మించారు. ఈ విషయమై పోలీసులకు ఫి ర్యా దు చేస్తే పట్టించుకోలేదు. దీంతో కోర్టుకు వెళ్లాను. పోలీసుల పై చర్యలు తీసుకోవాలి. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ భూమిని నాకు అందించాలి. – నచ్చన్న, మునిపల్లి, జక్రాన్‌పల్లి -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
బాల్కొండ: విద్యార్థలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవారం మెండోరా మండలం పోచంపాడ్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల కోసం వండిన అన్నంను, కూరలను పరిశీలించారు. స్టాక్ రూంలో నిల్వ ఉంచిన బియ్యం, పప్పుల నాణ్యతను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పోచంపాడ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. మందుల స్టాక్ ను పరిశీలించారు. ఆయన వెంట సాంఘిక సంక్షేమ పాఠశాలల జోనల్ ఇన్చార్జి పూర్ణచందర్, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, వైద్యాధికారి రాకేశ్, ిప్రిన్సిపాల్ గోదావరి తదితరులు ఉన్నారు. -
ముగ్గురు ఏజెంట్ల అరెస్ట్
ఖలీల్‌వాడి: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిజామాబాద్ జిల్లా యువకులను మోసం చేసిన ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్రావు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన అలకుంట సంపత్, జగిత్యాల జిల్లాకు చెందిన దండుగుల చిరంజీవి, మిట్టపల్లి నర్సారెడ్డిలు థాయిలాండ్, లావోస్ దేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జిల్లాకు చెందిన బాధితుల నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. వీరిని లావోస్ దేశంలో బంధించి సైబర్ నేరాలు చేయించారు. చివరికి ఇద్దరు బాధితులు భారతీయ రాయబార కార్యాలయం సహాయంతో స్వదేశానికి తిరిగి వచ్చి ఏజెంట్లపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏజెంట్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల జ్యుడీ షియల్ రిమాండ్ విధించారు. వీరిని సారంగాపూర్ జిల్లా జైలుకు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఎడపల్లి: జానకంపేట శివారులోని అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి (40) మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం లిఫ్ట్ పంప్ హౌస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాలువ నుంచి ఈతగాళ్ల సాయంతో బయటకు తీయించారు. మృతదేమం పూర్తిగా కుళ్లిపోయిందని, ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నారు. లిఫ్ట్ ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. అవమానించాడని స్నేహితుడిపై కత్తితో దాడి ఖలీల్‌వాడి: తనతో పాటు కుమారులను అవమానించడనే కోపంతో ఓ తండ్రి స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన ఘటన నగరంలోని గాజులపేట్‌లో చేసుకుంది. రెండో టౌన్ ఎస్సై యాసిన్ అరాఫత్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. గాజులపేట్‌కు చెందిన మహేశ్, సంతోష్ ఇద్దరు స్నేహితులు. వీరు ఓ చోట మద్యం సేవించి ఇరుకుటుంబాల గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలో సంతోష్ కుమారులకు నత్తి ఉందని మహేశ్ అనడంతో గొడవ జరిగింది. దీంతో సంతోష్ తనను, తన కుమారులను అవమానించాడనే కోపంతో ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి మహేశ్‌పై దాడి చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బైక్ చోరీ ఖలీల్‌వాడి: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద పార్క్ చేసిన బైక్ చోరీకి గురైనట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి మంగళవారం తెలిపారు. నగరంలోని ముస్తాయిపురాకు చెందిన షేక్ అహ్మద్ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు బైక్‌పై వచ్చాడు. బైక్ పార్క్ చేసి ఏటీఎం లోపలికి వెళ్లి వచ్చే సరికి బైక్ చోరీకి గురైందన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేఇ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి పేర్కొన్నారు. -
విద్యుత్ సరఫరాలో సిబ్బంది పాత్ర కీలకం
సుభాష్‌నగర్: విద్యుత్ సరఫరాలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే లైన్మన్లు, ఆర్టిజన్, ఆన్ మ్యాన్, జేఎల్ఎం, ఎల్ఐ, ఎస్ఎల్ఐల పాత్ర కీలకమని డిచ్పల్లి డీఈ ఉత్తమ్ జాడే పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని పవర్‌హౌస్ సమావేశపు హాల్లో లైన్‌మన్ దివస్ సందర్భంగా క్షేత్రస్థాయి సిబ్బంది సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఈ మాట్లాడుతూ.. ఎన్పీడీసీఎల్లో క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది సేవలు అమోఘమని కొనియాడారు. సభాధ్యక్షుడు నిజామాబాద్ రూరల్ ఏడీఈ రెంజర్ల బాలేశ్కుమార్ మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్ లక్ష్య సాధనలో క్షేత్రస్థాయి సబ్బంది పాత్ర కీలకమని, ఎంతో జాగ్రత్తతో పనులు చేపట్టాలని సూచించారు. కార్యర కమంలో ఏఈలు రాజేందర్, శ్రీనివాస్, నాగ శర్వాణి, భాస్కర్, శంకర్ గౌడ్, ప్రవీణ్‌కుమార్, సబ్ ఇంజినీర్ కుమారి దివ్య, భరత్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మన్లు, అసిస్టెంట్ లైన్మన్లు, జూనియర్ లైన్మన్లు, ఆర్టిజన్లు, ఆన్‌మ్యాన్ కార్మికులు పాల్గొన్నారు. -
పరిశోధనలతోనే విప్లవాత్మక మార్పులు
తెయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): యూనివర్సిటీల్లో క్షేత్రస్థాయి పరిశోధనలే సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని తెలంగాణ యూనివర్సిటీ వీసీ టి యాదగిరిరావు పేర్కొన్నారు. తెయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ‘పరిశోధన పత్రాల తయారీ’ అనే అంశంపై నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాప్ కార్యక్రమానికి వీసీ హాజరై మాట్లాడారు. యువత నూతన వినూత్న మార్పుల కనుగుణంగా పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీలు పరిశోధనలకు కేంద్రంగా వర్ధిల్లుతాయన్నారు. రిజిస్ట్రార్ ఎం యాదగిరి మాట్లాడుతూ.. సామాజిక శాస్త్రాలలో సమాజమే ప్రయోగశాలగా భావించి విద్యార్థులు పరిశోధనలు చేయాలన్నారు. ఇలాంటి వర్క్‌షాప్‌లతో ఉత్తమ పరిశోధన పత్రాల తయారీపై అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో మేనేజ్మెంట్ విభాగాధిపతి, వర్క్‌షాప్ కన్వీనర్ ఆంజనేయులు, ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, కై సర్ మహమ్మద్, అపర్ణ, రాజేశ్వరి, వాణి, కిరణ్ రాథోడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
చెరువు ఆక్రమణపై ఏడాదిన్నరగా ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామం, మండలం, డివిజన్ స్థాయిలను దాటి కలెక్టరేట్ వరకు సామాన్యులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నా రు. అయితే కలెక్టరేట్ వరకు సమస్యలను తీసుకొచ్చినప్పటికీ పరిష్కారం దిశగా ఒక్క అడుగూ ముందుకు పడని అర్జీలే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఇంకెక్కడికి వెళ్లాలో తెలియక బాధితులు ఇదే కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇలా తిరుగుతున్నవారిలో పేదలు, నిరక్షరాస్యుల నుంచి విద్యాధికులు సైతం అధికంగా ఉంటున్నారు. కలెక్టరేట్ నుంచి ఆయా విభాగాలకు ఎండార్స్ చేసిన సమస్యల విషయమై యంత్రాంగం ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని, ఈ అంశాలపై సమీక్ష ఉండకపోవడంతో పరిష్కారానికి నోచుకోవడం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దిక్కుతోచక కన్నీరు పెడుతున్నారు. ఇక కలెక్టరేట్లో ప్రజావాణికి వచ్చే సమస్యల్లో సామాజిక అంశాలైన చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలు, ఇతర ప్రజోపయోగ అర్జీలు అనేకసార్లు వస్తున్నప్పటికీ పట్టింపు లేని పరిస్థితి. ప్రజలకు పాలన మరింత చేరువ చేసి సమస్యలను వేగంగా పరిష్కారించేందుకు చిన్న జిల్లాలు, మండలాలు, గ్రామాలు విభజన చేసినప్పటికీ ఫలితం లేదని సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా సోమవారం ‘సాక్షి’ పరిశీలనలో ప్రజావాణికి వచ్చిన అర్జీల్లో కొన్ని.. డిచ్పల్లి మండలం ఘన్‌పూర్‌లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, అక్కడ చదువుతున్న కొందరు విద్యార్థులు తరగతులు జరుగుతున్న సమయంలో గోడ దూకి వచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు ఆహారం నాణ్యత లేకుండా పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెలవులకు ఇళ్లకు వెళ్లి తిరిగి ఒక్కరోజు ఆలస్యంగా వస్తే రూ.500 జరిమానా పేరిట వసూలు చేస్తున్నారని తెలిపారు. కెమిస్ట్రీ లెక్చరర్ సిలబస్‌ను సక్రమంగా బోధించడం లేదని, పైగా అధికంగా సెలవులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇంకా రెండు చాప్టర్లు బోధించలేదని వివరించారు. దీంతో బోర్డు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతామనే భయం నెలకొందన్నారు. తమ సమస్యల విషయమై వాటి పరిష్కారం కోసం తమ పక్షాన మాట్లాడిన ఇంగ్లిష్ లెక్చరర్‌ను ప్రిన్సిపల్ బదిలీ చేయించినట్లు ఫిర్యాదులో వివరించారు. పదేళ్లుగా పింఛన్ కోసం..నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన రొడ్డ మణెమ్మ భర్త 2013లో మరణించాడు. అప్పటినుంచి మణెమ్మ వితంతు పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం ఈమెకు 76 సంవత్సరాలు. వృద్ధాప్య పింఛన్ కోసం కూడా గతంలో దరఖాస్తు చేసుకుంది. అయినా రెండింటిలో ఏ రకమైన పింఛను అందడం లేదు. గత పదేళ్లలో మున్సిపల్, కలెక్టరేట్లో చాలాసార్లు దరఖాస్తు చేస్తూనే ఉంది. ఫలితం మాత్రం లేదు. కుటుంబ సభ్యులు రేషన్‌కార్డులో తన పేరు లేకపోవడంతో యాడ్ చేసేందుకు దరఖాస్తు చేసుకోగా సాంకేతిక సమస్యలున్నట్లు అధికారులు తెలిపినట్లు వాపోయింది. తాజాగా మళ్లీ కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంది. ఈసారి కూడా పరిశీలిస్తామని అధికారులు చెప్పడం గమనార్హం. ఎడపల్లి మండలంలోని మంగళ్పహాడ్ సమీపంలోని 70 ఎకరాల రాయకుంట చెరువును కొందరు ఆక్రమించారని రాజు అనే వ్యక్తి మరోసారి తాజాగా ఫిర్యాదు చేశాడు. ఈ చెరువుతోపాటు గొలుసుకట్టు చెరువుగా ఉన్న కొత్తకుంట చెరువును సైతం ఆక్రమించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గంగపుత్రులకు ఉపాధినిచ్చే ఈ చెరువులను ఆక్రమించిన విషయమై ఏడాదిన్నరగా చాలాసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కబ్జాదారులకు కనీసం నోటీసులు సైతం ఇవ్వలేదని ఫిర్యాదుదారుడు తెలిపాడు. భారీ చెరువు చిన్న కుంట మాదిరిగా చిక్కిపోయిందని వివరించాడు. -
చివరాయకట్టుకు నీరందేలా చర్యలు
నిజామాబాద్ అర్బన్: చివరాఆయకట్టు వరకు సా గు నీరందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరుపై సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు వచ్చే పది రోజులు కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సాగు రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో అవసరం మేర నీరు అందుబాటులో ఉందని, ప్రతి నీటి చుక్కనూ పూర్తిస్థాయి లో వినియోగించుకుంటూ చివరాయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురుకులాలపై.. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీల తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని, పిల్లలకు అందించే ఆహార నాణ్యత పెరిగిందని, కామన్ మెనూ డైట్ పక్కాగా అమలు అవుతోందని సీఎస్ శాంతికుమారి అన్నారు. సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్ నిషేధంలో ప్రజలను భాగస్వామ్యం చేయాల న్నా రు. కలెక్టర్ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. రానున్న 10 రోజులు అప్రమత్తంగా ఉండాలి వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి -
డాక్యుమెంట్‌కో ధర.. వసూళ్లకు దళారి
● కాసులు కురిపిస్తున్న రిజిస్ట్రేషన్లు ● ఇప్పటి వరకు ఏసీబీకి చిక్కిన డీఆర్.. ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లు ఖలీల్‌వాడి: డాక్యుమెంట్‌ను బట్టి ధర.. డబ్బులు వసూలు చేసేందుకు దళారి.. ఇదీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొనసాగుతున్న ట్రెండ్. రిజిస్ట్రేషన్ అంటేనే కాసుల పంట అనే స్థాయికి పరిస్థితి చేరింది. చిన్నచిన్న తప్పులను కప్పిపుచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు ఆస్తుల కొనుగోలు, అమ్మకందారులు ఖర్చుకు వెనుకడుగు వేయడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కాసుల పంట పండుతోంది. ఇళ్లు, ఇంటిస్థలాలకు రిజిస్ట్రేషన్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం తహ సీల్ కార్యాలయాల్లో చేస్తుండగా, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకు డీటీసీపీ అప్రూవల్, నాలా కన్వర్షన్ తప్పనిసరిగా ఉండాలి. వాటికే రిజిస్ట్రేషన్ చేయా ల్సి ఉంటుంది. అలాకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయభూములు కొనుగోలు చేసి వాటిని వెంచర్లుగా మార్చి స్థానిక డాక్యుమెంట్ రైటర్లు లేదా రిజిస్ట్రేషన్ అధికారులతో ఒప్పందం చేసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్ లకు డాక్యుమెంట్‌ను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. పాత ఇళ్లకు జీపీలు, కార్పొరేషన్, మున్సిపాలిటీల నుంచి ఓనర్ షిప్ సర్టిఫికెట్ తీసు కుని చేయించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు బతికి ఉంటే వాటికి సంబంధించిన వివరాలు పెట్టాల్సి ఉంటుంది. లేనిపక్షంలో డెత్ సర్టిఫికెట్‌తోపాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జతచేసి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేనిపక్షంలో ఆ ఇంట్లోని పెద్ద ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సబ్ రిజిస్ట్రార్లు నిర్ణయించిన ప్రకారం డబ్బులు చెల్లిస్తే ఓకే.. లేదంటే కొర్రీలు పెడతారు. వసూళ్లు ఇలా.. సబ్ రిజిస్ట్రార్ వద్దకు వచ్చిన డ్యాకుమెంట్‌ను బట్టి ధరను నిర్ణయిస్తారు. ఆ మొత్తాన్ని డాక్యుమెంట్ రైటర్ ద్వారా లేదా దళారి ద్వారా తీసుకుంటారు. డ్యాకుమెంట్ రైటర్ల వద్ద సబ్ రిజిస్ట్రార్ ప్రతి శనివారం రిజిస్ట్రేషన్లకు సంబంధించి డబ్బులు వసూలు చేసుకుంటారనే ప్రచారం ఉంది. జిల్లాలో ఏసీబీకి చిక్కినవారు.. ఇప్పటి వరకు జిల్లా రిజిస్ట్రార్(డీఆర్)తోపాటు ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి చిక్కారు. 2016లో నిజామాబాద్ రిజిస్ట్రర్ మోహన్ ఏసీబీకి చిక్కగా ఆ తరువాత సబ్రిజిస్ట్రార్లు సతీశ్, శ్రీనాథ్, శ్రీధర్, ఆనంద్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రర్–2 శ్రీరామరాజు ఏసీబీకి చిక్కారు. ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్, స్వీపర్ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యా లయంలోని అర్బన్ సబ్ రిజిస్ట్రార్–2 శ్రీరామరాజు, స్వీపర్ రంగ్‌సింగ్ వెంకట్రావులు లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అయితే లంచం ఇచ్చిన బాధితుడి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం బాధితుడు సోమవారం ఉదయం 11.50 గంటలకు సబ్‌రిజిస్ట్రార్ చెన్నమాధవేణి శ్రీరామరాజు వద్దకు వెళ్లగా నే డాక్యుమెంట్‌ను కౌంటర్లో, లంచం డబ్బులు స్వీపర్ రంగ్‌సింగ్ వెంకట్రావుకు ఇవ్వాలని చెప్పా రు. బాధితుడు డాక్యుమెంట్లను కౌంటర్లో ఇచ్చి అనంతరం స్వీపర్ వెంకట్రావును కలిశారు. బాధితుడిని స్వీపర్ వెంకట్రావు కార్యాలయ అధికారులు భోజనం చేసే గదిలోకి తీసుకువెళ్లి రూ.10 వేలు తీసుకుని జేబులో పెట్టుకొగానే అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్‌రిజిస్ట్రార్–2 శ్రీరామరాజు డబ్బులు డిమాండ్ చేయడంతో కెమికల్ పూసిన రూ.10 వేలు ఇచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. స్వీపర్ వెంకట్రావును పట్టుకున్న అనంతరం విచారణ జరిపి సబ్‌రిజిస్ట్రార్–2 శ్రీరామరాజును అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇద్దరిని హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. కాగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్–2 శ్రీరా మరాజు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీ దాడుల సందర్భంగా కార్యాలయంలో రెండుగంటల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. వెయిటింగ్ హాల్ నుంచే సబ్‌రిజిస్ట్రార్–1 రిజిస్ట్రేషన్లు చేశారు. శ్రీరామరాజు ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి నిజామాబాద్‌కు బదిలీపై వచ్చారు. మొదట్లో డాక్యుమెంట్ రైటర్లతో వివాదం జరిగింది. రిజిస్ట్రే షన్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని గత నవంబర్‌లో డాక్యు మెంట్ రైటర్లు ధర్నా చేశారు. గతంలో రామరాజు నిర్మల్ జిల్లా భైంసాలో పని చేస్తున్న సమయంలో ఇల్లీగల్ డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలు ఆదిలాబాద్‌కు బదిలీ చేసినట్లు తెలిసింది. అక్కడ రామరాజును సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ. 10 వేలు తీసుకుంటుండగా పట్టివేత -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠను కలిగిస్తోంది. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఆలస్యంగా అయినా ఫలితం తేలింది. ఇక కీలకమైన పట్టభద్రుల ఓట్ల లెక్కింపు మాత్రం యంత్రాంగానికి పెద్ద టాస్క్ అవుతోంది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయులు, పట్టభద్రులకు సంబంధించి చెల్లని ఓట్ల సంఖ్య భారీగా ఉండడం గమనార్హం. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఓట్లు మొత్తం 3,55,159 ఉన్నాయి. ఇందులో 2.50 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు మొదలుపెట్టిన రోజైన సోమవారం రాత్రికి 1 లక్ష ఓట్లను చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లుగా విభజన చేశారు. ఇంకా 1.5 లక్షల పోలైన ఓట్లను చెల్లిన, చెల్లని ఓట్లుగా విభజన చేయాల్సి ఉంది. ఇప్పటివరకు విభజన చేసిన 1 లక్ష ఓట్లలో 8 వేలకు పైగా చెల్లని ఓట్లు ఉండడం గమనార్హం. మిగిలిన 1.5 లక్షల ఓట్లలో చెల్లని ఓట్ల సంఖ్య భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 42 శాసనసభ సెగ్మెంట్ల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులు, వాటిలోని బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కట్టడం, విభజన చేసేందుకే చాలా సమయం తీసుకుంటోంది. పైగా అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంది. మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో జంబో బ్యాలెట్ పేపర్ తప్పనిసరి అయింది. పైగా ఓట్లు ప్రాధాన్యత క్రమంలో వేసే పరిస్థితి నేపథ్యంలో ప్రతి బ్యాలెట్ పేపర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. పైగా ప్రాధాన్యత ఓట్లు వేసే క్రమంలో సింగిల్ డిజిట్లో, అభ్యర్థి పేరు పక్కన ఉన్న బాక్సులో మాత్రమే అంకెలు వేయాలి. ఎంతమందికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మధ్యలో ఏదేని అంకె వేయని పక్షంలో సదరు ఓటు చెల్లకుండా పోతుంది. టిక్కు మార్కులు, ముద్రలు తదితరాలు వేసినా ఓటు చెల్లదు. ఈ క్రమంలో ప్రతి బ్యాలెట్ పేపర్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ద్వారా తేల్చాలంటే ఎలిమినేషన్ రౌండ్ లెక్కింపు తప్పనిసరి. దీంతో పూర్తి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం మరో రెండు రోజులు పట్టనున్నట్లు తెలుస్తోంది. మల్క కొమురయ్య గెలుపు సంబురాలు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 27,088 ఉండగా ఇందులో 24వేలకు పైగా ఓట్లు నమోదయ్యాయి. సోమవారం రాత్రి ఫలితం తేలింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. -
పరిష్కారం లేని ప్రజావాణి!
ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి ఫలితం ఇవ్వడం లేదనే అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. ఒక్కో అర్జీదారు పదులసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా వారి సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం ‘ప్రజావాణి’ పనితీరును ఎత్తిచూపుతోంది. వ్యక్తిగత ఫిర్యాదులను పక్కన పెడితే.. సామాజిక అంశాలపై అందుతున్న ఫిర్యాదులూ పరిష్కారానికి నోచుకోవడం లేదు. నిజామాబాద్‌అర్బన్ /ఎడపల్లి(బోధన్): కలెక్ట రేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పోలీసులపైనే ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్ నగరంలోని బడాబజార్‌కు చెందిన హరీశ్ తన ఫిర్యాదులో పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. సీసీఆర్బీ సీఐ సతీశ్, ఐదో టౌన్ ఎస్సై గంగాధర్, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సదానందం, డీసీపీ బస్వారెడ్డి నుంచి తనకు ముప్పు ఉందని, తనపై చైన్‌స్నాచింగ్ అంటూ తప్పుడు కేసు నమోదు చేశారని ఫిర్యా దు చేశాడు. అధికారులు న్యాయం చేయాలని కోరాడు. అదేవిధంగా బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబుపై చర్యలు తీసుకోవాలని రెంజల్ మండలం దూపల్లికి చెందిన బోయ భాగ్య ఫిర్యాదు చేసింది. గతనెల 13న లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో తన పర్సు పోవడంతో పోలీస్ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశానని, అక్కడే ఉన్న సీఐ విజయ్‌బాబు నా మాట వినిపించుకోకుండా లాఠీతో కొట్టాడని పేర్కొంది. దీనిపై ఎడపల్లి పోలీస్ స్టేషన్లో, బోధన్ ఏసీపీ, ఇన్చార్జి సీపీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకు, కోడలు అన్నం పెట్టడం లేదని సావెల్‌కు చెందిన నర్సయ్య ఫిర్యాదు చేశాడు. 12 ఇసాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, భూమి తీసుకున్న తరువాత కూడా తనను పట్టించుకోవడం లేద న్నాడు. కొడుకు, కోడలు పట్టించుకోకపోవడంతో గుడి వద్ద బిచ్చమెత్తుకుంటున్నానని ఫకీరాబాద్‌కు చెందిన గుడ్డి ముత్తెమ్మ తన ఫిర్యాదులో పేర్కొంది. భర్త చనిపోయిన నాటి నుంచి ఒంటరిగా ఉంటున్నానని తెలిపింది. వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురంలో రామాల యం వెనుక చేపట్టిన ఓ ప్రార్థనా మందిరం అక్ర మ నిర్మాణాన్ని అడ్డుకోవాలని హిందూ సంఘా ల ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేశారు. గతంలో హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ మళ్లీ నిర్మా ణం చేపడుతున్నారని పేర్కొన్నారు. నిర్మాణాని కి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేదన్నారు. ప్రజావాణిలో మొత్తం 62 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి అర్జీలను స్వీకరించారు. ● ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా సమస్యలు యథాతథం ● తక్షణ పరిష్కారంపై యంత్రాంగం నిర్లక్ష్యం ● సామాజిక సమస్యల పరిష్కారాన్నీ పట్టించుకోని వైనం పోలీసుల నుంచి ప్రాణహాని ప్రజావాణిలో వెల్లువెత్తిన ఫిర్యాదులు కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదు.. బిచ్చమెత్తుకుంటున్నానని ఓ తల్లి ఆవేదన సమస్యల పరిష్కారానికి ఆదేశించిన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు -
పసుపుబోర్డు కార్యదర్శి బాధ్యతల స్వీకరణ
సుభాష్‌నగర్: జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ నగరంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో చైర్మన్ పల్లె గంగారెడ్డి సమక్షంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో బోర్డు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మానసిక ఒత్తిడికి గురికావొద్దు ● ఇంటర్ విద్యాధికారి రవికుమార్ సూచన నిజామాబాద్ అర్బన్: ఈనెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ ఒక ప్రకటనలో సూచించారు. సెంటర్లలో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఎవరికై నా హాల్ టికెట్ ఇవ్వని పక్షంలో ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావొచ్చని, హాల్ టికెట్ పైన ప్రిన్సిపాల్ సంతకం, కళాశాల ముద్ర అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో పటిష్టమైన బందోబస్తుతోపాటు ప్రతి క్షణం నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని, బయట ఎలాంటి పుకార్లు వ్యాపించినా నమ్మొద్దన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఎయిడ్స్ పరీక్షలకు ‘అంబులెన్స్’ నిజామాబాద్ నాగారం: ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలకు అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో పనిచేసే అంబులెన్స్ సేవలను సోమవారం ఆమె ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ ఎయిడ్స్ అధికంగా ప్రబలడానికి అవకాశం ఉన్న హైరిస్క్ ప్రాంతాల్లో ముందుగా ఈ అంబులెన్స్ సేవలను ప్రణాళికా ప్రకారం నిర్వహిస్తారన్నారు. ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్, ఐఈసీ తదితర వాటిపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అంబులెన్స్‌లో ఒక ల్యాబ్ టెక్నీషియన్, కౌన్సిలర్‌తోపాటు ఏరియా ఎయిడ్స్ విభాగ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ కార్యకర్త ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎం సుధాకర్, సీపీవో మోయిజ్, నవీన్, స్రవంతి, రాజేందర్, నాగరాజు పాల్గొన్నారు. -
మోదీ పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరగదు
సుభాష్‌నగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన లో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగదని, రా ష్ట్రంలోని ప్రాజెక్టులకు కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారన డం సరికాదని ఎంపీ అ ర్వింద్ ధర్మపురి పేర్కొన్నా రు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. సీఎం కార్యాలయ అధికారులను ప్రాజెక్టుల డీపీఆర్‌లతో పంపించాలని, తాను కిషన్‌రెడ్డిని వెంట తీసుకువస్తానని, వెంటనే ఎక్కడ అడ్డుపడ్డారో తేలిపోతుందని సవాల్ విసిరారు. ప్రధాని మోదీకి అన్ని రాష్ట్రాలు సమానమేనని తెలిపారు. మూసీ ప్రక్షాళన డీపీఆర్ తప్పులతడకగా ఉందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి పనికిమాలిన రాజకీయాలు మానుకోవాలని, కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, మహిళలు చీపుర్లు పట్టుకుని కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జాతీయస్థాయి పసుపు బోర్డు ఏర్పాటులో తాను కీలకపాత్ర పోషించానని, రెగ్యులర్‌గా కేంద్రం నుంచి జరిగే అభివృద్ధిని చేయలేమా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి పనికిమాలిన రాజకీయాలు మానుకోవాలి ఎంపీ అర్వింద్ ధర్మపురి -
టీచర్ స్థానంలో కమలం పాగా!
● తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచిన మల్క కొమురయ్య ● కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల విభజనసాక్షిప్రతినిధి,కరీంనగర్: నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ నియోజవర్గం కమలం వశమైంది. తొలిప్రాధాన్యం ఓట్లతోనే మల్క కొమురయ్య టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించారు. నల్గొండ టీచర్ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికే వచ్చేసినా.. కరీంనగర్ టీచర్ ఎన్నికల లెక్కింపు సాయంత్రానికి మొదలవడం గమనార్హం. కౌంటింగ్ ప్రారంభించిన రెండు గంటల్లోనే ఫలితం తేలింది. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. బండి అభినందనలు రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని అన్నారు. ఉదయం 8 నుంచి.. సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వడపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓట్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.5 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. లెక్కింపు ప్ర క్రియ మందకొడిగా సాగడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని పట్టభద్రుల స్థానానికి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. -
క్రైం కార్నర్
ఇనుప చువ్వల కోసం వెళ్లి ఒకరి మృతి నందిపేట్(ఆర్మూర్): ఇనుప చువ్వల కోసం చెరువులోకి దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు. నందిపేట ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన నాగం రవి(52) వృత్తిరీత్యా గోడలకు సున్నాలు వేస్తుంటాడు. ఆదివారం సాయంత్రం నందిపేట బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఊర చెరువులో వినాయక విగ్రహాల ఇనుప చువ్వల కోసం దిగాడు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగం రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ .. ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామ శివారులో శనివారం రాత్రి కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో పూల్‌సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో గాయపడిహైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వరూప(32) సోమవారం మరణించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి ఏడాది జైలు కమ్మర్పల్లి: మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ఓవ్యక్తికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆర్మూర్ కోర్టు ప్రథమశ్రేణి న్యాయమూర్తి నెల్లి సరళరాణి తీర్పు వెలువరించారు. కమ్మర్పల్లి ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని మండల కేంద్రానికి చెందిన తుదిగేన దేవేందర్‌పై 2019లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. విచారణ అనంతరం పోలీసులు నిందితుడిపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ప్రథమశ్రేణి న్యాయమూర్తి నెల్లి సరళరాణి సోమవారం తీర్పు వెలువరించారు. సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించిన కోర్టు కానిస్టేబుల్ రాజును ఎస్సై అనిల్‌రెడ్డి అభినందించారు. -
ఆస్తి కోసం తండ్రిపై దాడి
● చికిత్స పొందుతూ మృతి లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన వల్లకాటి లింగం(48) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 17న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తన తండ్రి లింగంను కొట్టినట్లు కొడుకు శేఖర్ డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని లింగంను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఘటనపై కొడుకు శేఖర్ చెప్పే మాటలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తానే ఆస్తి కోసం తండ్రిని గాయపర్చినట్లు ఒప్పుకున్నాడు. శేఖర్ కొంతకాలం నుంచి తండ్రికి దూరంగా హైదరాబాద్‌లో ఉంటుండగా, లింగం శెట్పల్లిలో నివసిస్తున్నాడు. కొద్దిరోజులుగా శేఖర్ ఆస్తి కోసం తండ్రితో గొడవపడుతున్నట్లు తెలిపారు. 15 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన లింగం సోమవారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. శేఖర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మోపాల్: మండల కేంద్రంలో సోమవారం ని ర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు. మద్యం తాగి బైక్ నడుపుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా ద్విచక్రవాహనాలు నడిపిస్తున్న 23 మందికి జరిమానా విధించినట్లు ఎస్సై తెలి పారు. ఆయన వెంట ఏఎస్సై రమేశ్‌బాబు, హెచ్‌సీ గంగాధర్, కానిస్టేబుళ్లు ఉన్నారు. -
చేనేత సంఘాన్ని సందర్శించిన అధికారులు
రుద్రూర్: మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘాన్ని హ్యాండ్లూవ్్సు అండ్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలత సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సంఘంలో పనిచేస్తున్న కార్మికుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. తెలంగాణ నేతన్న పొదుపు పథకంలో భాగంగా చేనేత, అనుబంధ కార్మికులు వారి వేతనాల నుంచి నెలవారీగా 8శాతం కాంట్రిబ్యూషన్ చేస్తే ప్రభుత్వం రెండింతలు జమ చేస్తుందన్నారు. గతంలో మూడేళ్ల వరకు పొదుపుల వ్యవధి ఉండగా, ప్రభుత్వం రెండేళ్లకు తగ్గించిందని తెలిపారు. కార్యక్రమంలో సీడీఈలు ఎస్. నరేందర్, ఎస్. వేణు, చేనేత సంఘం అధ్యక్షుడు మోత్కురి నారాయణ, సంఘం మేనేజర్ ఈర్వ నాగరాజు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ అడిషనల్ కంట్రోలర్‌గా సంపత్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూని వర్సిటీ అడిషనల్ కంట్రోలర్ (కాన్ఫిడెన్షియల్)గా అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.సంపత్ నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్ టి.యాద గిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి సోమవారం నియామక ఉత్తర్వులను అందజేశారు. గత దశాబ్ద కాలంగా ఎకనామిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సంపత్ సేవలందిస్తున్నారు. తనపై నమ్మకంతో అడిషనల్ కంట్రోలర్‌గా నియమించిన వీసీ, రిజిస్ట్రార్లకు సంపత్ కృతజ్ఞతలు తెలిపారు. రేపు ప్రయోగాల ప్రదర్శన సదస్సు తెయూ(డిచ్పల్లి): జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 5న జీవ సాంకేతిక శాస్త్ర ప్రయోగాల ప్రదర్శన సద స్సు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ ప్రసన్నశీల తెలిపారు. సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి సోమవా రం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రసన్న శీల మాట్లాడుతూ సదస్సుకు తెయూ పరిధి లోని అనుబంధ కళాశాలల విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. జీవ సాంకేతిక శాస్త్ర ప్ర యోగ పద్ధతులు,అందుకు ఉపయోగించే పరికరాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు సదస్సును సద్వినియోగం చేసుకోవాలని వీసీ, రిజిస్ట్రార్లు సూచించారు. కార్యక్రమంలో సదస్సు కోకన్వీనర్ కిరణ్మయి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పంటలు గట్టెక్కేనా?
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. పంటకు అవసరమైన నీటి కోసం ఇప్పటికే మూడు విడతల్లో నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నాలుగో విడత కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు రోజూ 2,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీరు డిస్ట్రిబ్యూటరీల చివరి వరకు అందకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి కోసం అధికారుల నిర్బంధం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. కానీ ప్రధాన కాలువ పరిధిలోని వర్ని, చందూర్, జాకోరా, రుద్రూర్, కోటగిరి, బోధన్ ప్రాంతాల్లోని పొలాలకు నీళ్లు రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎగువన ఉన్న రైతులు ఎక్కువ నీటిని వినియోగించుకుంటుండడంతో ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. కాలువకు నీటి విడుదలను పెంచాలని రైతులు కోరుతున్నారు. కాగా పంటలకు నీరు అందడం లేదంటూ ఇటీవల బోధన్ ప్రాంత రైతులు నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు. అలాగే నీరందక పంటలు ఎండిపోతున్న విషయాన్ని బీ ర్కూర్, వర్ని ప్రాంత రైతులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన పోచారం.. రాత్రి వేళలో కాలువలపై పర్యటించి, పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూ డాలని సూచించారు. డి–26 ఉప కాలువ కింద ఎక్కువ విస్తీర్ణంలో ఆయకట్టు ఉందని, చివరి ఆయకట్ట వరకు నీరు వెళ్లాలంటే కనీసం 3 ఫీట్లు తగ్గకుండా ఉప కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. అలాగే బోధన్ ఎమ్మెల్యే సైతం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నందున చివరి ఆయకట్టు గట్టెక్కేవరకు నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నీరు వృథా కాకుండా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాత్రి వేళ తనిఖీలు ఆయకట్టు ప్రాంత రైతుల ఆందోళనల నేపథ్యంలో జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఎస్ఈ రాజశేఖర్, ఈఈ సోలోమాన్, డిప్యూటీ ఈఈ, ఏఈలు, వర్క్ఇన్స్పెక్టర్లు, లస్కర్లు రాత్రి వేళలో ప్రధాన కాలువను తనిఖీ చేస్తున్నారు. నిజాంసాగర్, మహమ్మద్‌నగర్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, చందూర్, జాకోరా, రుద్రూర్, కోటగిరి, బోధన్ మండలాల్లో ఆయా డివిజన్ల అధికారులు కాలువలను సందర్శించి, నీరు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగవుతున్న వరి నిజాంసాగర్‌నుంచి కొనసాగుతున్న నీటి విడుదల చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతుల ఆందోళన అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్న నేతలు, అధికారులు పంటలు గట్టెక్కిస్తామంటూ భరోసా కల్పించే యత్నం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు విడతల వారీగా నీటి విడుదల కొనసాగుతోంది. అయితే చివరి ఆయకట్టుకు నీరందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు కాలువలను పరిశీలిస్తూ రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూడు విడతల్లో 6 టీఎంసీలు.. ఆయకట్టుకు నీరందించేందుకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. 10 రోజులు ఆన్, ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతోంది. డిసెంబర్ 13 న నీటి విడుదల ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడు విడతల్లో 6 టీఎంసీల నీటిని ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు అందించారు. ప్రస్తుతం నాలుగో విడత నీటి విడుదల కొనసాగుతోంది. నాలుగో విడతలో ఇప్పటివరకు 1.481 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా నీటిని తరలిస్తున్నారు నిజాంసాగర్ ప్రధాన కాలువకు ఒక పక్కన మోటార్లు ఏర్పాటు చేసి అక్రమంగా నీటిని తరలిస్తున్నారు. బాన్సువాడ, వర్ని, జాకోరా, చందూర్, రుద్రూర్ అక్రమంగా నీటిని తోడేస్తున్నారు. సుమారు 20 వేల ఎకరాలకు అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నారు. దీంతో డిస్ట్రిబ్యూటరీల చివరి వరకు నీరందడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం. – శ్రీనివాస్, జిల్లా నీటిపారుదలశాఖ సీఈ -
ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
డీఈవో అశోక్ మోపాల్(నిజామాబాద్‌రూరల్): విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఉద్బోధించారు. నగర శివారులోని బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ అంటే జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంటుందని, 194 మంది విద్యార్థులు పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులు కష్టపడి ప్రణాళిక ప్రకారం చదివితే మంచి గ్రేడ్ సాధించవచ్చని పేర్కొన్నారు. పాఠ్యాంశాల్లో సందేహాలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మోటివేటర్ గంగాప్రసాద్ మాట్లాడుతూ పరీక్షలంటే భయం వీడాలని తెలిపారు. చదివిన అంశాలు ఈజీగా గుర్తు పెట్టుకునేలా సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల నలుగురి ఆత్మహత్య
రెంజల్(బోధన్): రెంజల్ మండలం తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన జంగం నవీన్ (36) జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన నవీన్ గ్రామ సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన రైతులు కుటుంబీకులకు సమాచారం అందించారు. అక్క శోభ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు సంవత్సరాలుగా భార్యకు దూరమైన నవీన్ మద్యానికి బానిస కావడంతో ఆరోగ్యం క్షిణించి మతిస్థిమితం కోల్పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలు..కమ్మర్పల్లి: అనారోగ్యంతో బాధపడుతూ ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన జల్లెండ్ల మల్లు(64) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్యహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మరణించింది. మృతురాలి కొడుకు అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో ఒకరు..లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన సాకలి మెత్కు సాయిలు(45) సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సాయిలు ఇటీవల కూతురు పెళ్లి చేయగా అప్పులు పెరిగిపోయా యి. దీంతో మద్యానికి బానిసైన సాయిలు తన చే ను వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. మృతుడి భార్య యశోద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడు.. కామారెడ్డి క్రైం: రైలు కిందపడి గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. వి వరాలిలా ఉన్నాయి. వేకువజామున 1 గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్ యార్డు వద్ద పట్టాలపై ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం పడి ఉండడాన్ని రైల్వే పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. మృతుడి వయస్సు 25–30ఏళ్ల మధ్య ఉంటుందని, ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడు నలుపు రంగు కార్గో ప్యాంటు, తెలుపు రంగు టీషర్ట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామారెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. -
అంతర్జాతీయస్థాయికి పసుపు ఉత్పత్తులు
జక్రాన్‌పల్లి/కమ్మర్పల్లి: పసుపు ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని జాతీయ పసుపు బోర్డు కార్యద్శరి ఎన్ భవానీశ్రీ అన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని మనోహరాబాద్‌లో పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (జేఎంకేపీఎం)పసుపు పరిశ్రమతోపాటు, కమ్మర్‌పల్లిలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితోపాటు భవానీశ్రీ సందర్శించారు. పరిశోధన కేంద్రంలో సాగైన పసుపు రకాలను పరిశీలించి, వాటి గురించి వివరాలు, నాణ్య త, కుర్కుమిన్, దిగుబడి, వ్యయం తదితర అంశాలతో పాటు ఏయే అంశాలపై పరిశోధన సా గుతోందనే విషయాలను శాస్త్రవేత్త మహేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో పసుపు ధర లభ్యతపై చర్చించారు. జాతీయస్థాయిలో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయని, వాటన్నింటినీ ఇప్పటి వరకు స్పైసెస్ బోర్డు ద్వారా ఎగుమతి చేసుకుంటూ వచ్చామన్నారు. అయితే ప్రస్తుతం పసుపులో ఎంత పొటెన్షియల్ ఉందని, జాతీయ స్థాయిలో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే దానిని పరిశీలిస్తున్నామ న్నారు. పసుపులో పొటెన్షియల్ పెంచుకుని మార్కెటింగ్, బ్రాండింగ్, గ్రేడింగ్ ఎలా చేసుకోవచ్చనే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. పసుపును అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. వారివెంట పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, సంతోష్‌రెడ్డి, నూతికాడి భోజన్న, శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, అనిల్‌కుమార్ ఉన్నారు. -
త్వరలో గల్ఫ్ అమరుల సంస్మరణ సభ
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో మరణించిన వారిని స్మరిస్తూ ప్రత్యేక సభను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసిన నేపథ్యంలో వారితో సహపంక్తి భోజనం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికోసం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ విప్ ఈరవత్రి అనిల్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డిల విజ్ఞప్తి మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలతో సమావేశానికి సీఎం ఆమోదం తెలిపారు. ఈ నెలలోనే ప్రజాభవన్ వేదికగా గల్ఫ్ అమరుల సంస్మరణ సభ నిర్వహించనున్నారు. సీఎం అంగీకరించడం గొప్ప విషయం గల్ఫ్ అమరుల సంస్మరణ సభతోపాటు, ఎక్స్‌గ్రేషి యా అందుకున్న కుటుంబాలతో సహపంక్తి భోజ నాలకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించడం గొప్ప విషయం. గల్ఫ్ కార్మికులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడంతోనే మెజారిటీ ఓట్లు వచ్చాయన్న విషయాన్ని సీఎంకు వివరించాం. – ఈరవత్రి అనిల్, టీజీఎండీసీ చైర్మన్ మృతుల కుటుంబాలతో సహపంక్తి భోజనం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందించిన నేపథ్యంలో కార్యక్రమానికి శ్రీకారం -
బీజేపీ శ్రేణుల సంబరాలు
సుభాష్‌నగర్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ, తపస్ బలపర్చిన అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపుతో బీజేపీ శ్రేణులు జిల్లా కేంద్రంలో సోమవారం సంబరాలు నిర్వహించాయి. జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో నగరంలోని నిఖిల్‌సాయి చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అంతకుముందు పార్టీ కార్యాలయం నుంచి నిఖిల్‌సాయి చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దినేశ్ పటేల్ కులాచారి మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా మోదీ నాయకత్వంపై విశ్వాసంతో ఉపాధ్యాయులు మల్క కొమరయ్యకు ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించి చరిత్ర సృష్టించారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా బీజేపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు కొండా ఆశన్న, పద్మారెడ్డి, గంగోనె గంగాధర్, ఇప్పకాయల కిశోర్, దొంతుల రవి, జగన్, తదితరులు పాల్గొన్నారు.