Peddapalli
-
నాణ్యమైన భోజనం పెట్టాలి
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ గురుకుల పాఠశాల ల్లో చదివే బాల, బాలికలకు నాణ్యమైన భోజ నం అందించాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఆదేశించారు. రంగంపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకులాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. వసతులపై ఆరా తీశారు. డార్మెంటరీ, క్లాస్‌రూం, డైనింగ్‌హాల్, వంటగది, స్టోర్‌రూంలను తనిఖీ చేశారు. నా ణ్యమైన కూరగాయలు, పండ్లు ఇవ్వాలని అ న్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంచి ఫ లితాలు వచ్చేలా ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపాల్ మణిదీప్తి, ఉపాధ్యాయినులు ఉన్నారు. భద్రత, శ్రేయస్సు కీలకం జ్యోతినగర్(రామగుండం): పరిశ్రమ భద్రత, కార్మికులు, ఉద్యోగుల శ్రేయస్సు కీలకమని తె లంగాణ ప్రభుత్వ కరీంనగర్ ఫ్యాక్టరీల డిప్యూ టీ చీఫ్ ఇన్స్పెక్టర్ గంగాధర్‌రెడ్డి అన్నారు. ఎన్టీ పీసీ ప్రాజెక్టు పరిపాలనా భవనంలో మంగళవారం జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టు ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంతతో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీలో విద్యు త్ ఉత్పత్తి భేషుగ్గా ఉందన్నారు. అనంతరం అ ధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. పలు పోటీల్లో విజేత లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించా రు. జనరల్ మేనేజర్లు అలోక్ కుమార్ త్రిపాఠి, అంజనా రంజన్ దాస్, సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ ముకేశ్‌కుమార్, ఉద్యోగ గుర్తింపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ య్య, ప్రధానకార్యదర్శి రాజేశ్వర్, అధికారులు బహేకర్, సుప్రకాశ్ చక్రవర్తి పాల్గొన్నారు. పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలి రామగిరి(మంథని): రైతులు తమ వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన కెపాసిటర్లు అమర్చుకోవాలని ట్రాన్స్‌కో ఎస్ఈ మాధవరావు సూ చించారు. కల్వచర్ల, బుధవారంపేట(రామ య్యపల్లి)లో మంగళవారం పొలంబాట చేపట్టారు. కల్వచర్లలో ఓవర్‌లోడ్ నియంత్రణకు 100 కేవీ సామర్థ్యంగల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. కెపాసిటర్లు బిగిస్తే విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు నియంత్రణలోకి వస్తాయన్నారు. విద్యుత్ మోటార్లపై భారం ప డదని తెలిపారు. మంథని డివిజన్ ఏఈ ప్రభాకర్, ఏడీఈ కనకయ్య, ఏఈ మహేందర్, సబ్ ఇంజినీర్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ జూలపల్లి(పెద్దపల్లి): గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులపై శ్రద్ధవహించాలని జిల్లా పంచా యతీ అధికారి వీరబుచ్చయ్య సూచించారు. వెంకట్రావుపల్లె, కాచాపూర్‌లో చేపట్టిన ప్రత్యే క పారిశుధ్య పనులను మంగళవారం మండల పంచాయతీ అధికారి అనిల్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెగ్రిగేషన్ షెడ్డు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తీరు పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శులు సాగర్‌రావు, రేవతి పాల్గొన్నారు. క్వింటాలు పత్తి రూ.6,866 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.6,866 ధర పలికింది. కనిష్టంగా రూ.5,003గా, సగటు రూ.6,455గా ధర నమోదైందని మార్కెట్ సెక్రటరీ మనోహర్ తెలిపారు. రైతుల నుంచి 525 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
కొత్త గనులతోనే మనుగడ
● ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గోదావరిఖని: కొత్త బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుందని గుర్తింపు కార్మి క సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే–11గనిపై మంగళవారం జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుత గనులు మరో పదేళ్లలో మూతపడతాయని, కొత్త గనుల కోసం సింగరేణి వేలంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిపడ్డ రూ.33 వేల కోట్లను వెంటనే చెల్లించాలని విన్నవించామని ఆయన వెల్లడించారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్మికుల్లో వ్యతిరేకత వచ్చి కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదని అన్నారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోశం, రాజు, మహేశ్, రంగు శ్రీను, ఎస్.వెంకట్‌రెడ్డి, నాయిని శంకర్ పాల్గొన్నారు. -
అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం
గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతాన్ని అన్నిరంగా ల్లో అభివృద్ధి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలో మంగళవారం సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ పనులను ప్రారంభించారు. ప్రధాన కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ, బొందలగడ్డలా మారుతున్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం, సింగరేణి సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆక్రమిత సింగరేణి స్థలాలను స్వాధీనం చేసుకుంటామన్నారు. కూరగాయల మా ర్కెట్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతామని అభయం ఇచ్చారు. వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్, ఆర్జీ –1 జీఎం లలిత్‌కుమార్, నాయకులు మహంకాళిస్వామి, బొంతల రాజేశ్ తదితరులు ఉన్నారు. స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతాం కోల్‌సిటీ(రామగుండం): ఆధునిక యంత్రాలతో పా రిశుధ్య పనులు చేపట్టి రామగుండాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రా జ్‌ఠాకూర్ అన్నారు. రూ.76 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన రెండు బ్యాక్ హో లోడర్ యంత్రాలతోపాటు రూ.4.70 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 8 హ్యాండ్ ఫాగింగ్ యంత్రాలను కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడా రు. అధికారులు రామన్, నాగభూషణం, కుమారస్వామి, నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, ముస్తఫా, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. బాధితురాలికి చేయూత రామగుండం: మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అంతర్గాం మండలం ఆకెనపల్లికి చెంది న నంది లావణ్య వైద్యం కోసం ఎమ్మెల్యే ఠాకూర్ రూ.4 లక్షల ఎల్వోసీ ఇప్పించారు. రామునిగుండా ల కొండపై చేపట్టిన శ్రీఆంజనేయస్వామి విగ్రహం ఎదుట ఎమ్మెల్యే దంపతులు పూజలు చేశారు. 150 అడుగుల ఎత్తుతో చేపట్టిన పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన పనులు పర్యవేక్షించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ -
మహిళలకు నైపుణ్య శిక్షణ
పెద్దపల్లిరూరల్: స్వశక్తి సంఘాల మహిళలు వ్యాపార రంగంలో రాణించేలా అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు వీలుగా వీ హబ్ సహకారంతో జిల్లాలో మహిళా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. వ్యాపారాభివృద్ధిపై కలెక్టరేట్లో మంగళవారం స్వశక్తి మహిళలకు ఆయన అవగాహన కల్పించారు. ఆహార, ఉత్పత్తి, హస్తకళలు, టెక్స్టైల్ లాంటి రంగాల్లో శిక్షణ ఇస్తామని, యువత తమ ఆలోచనలను ఉన్నతంగా ఎంచుకుంటే వీ హబ్ ద్వారా సేవలు అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వీ హబ్ డైరెక్టర్లు జహీద్ అక్తర్ షేక్, ఊహ, డీఆర్డీవో కాళిందిని, ప్రతినిధులు సాయిరాం, లీడ్‌బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్, ప్రిన్సిపాల్ మురళి, ఉష తదితరులు ఉన్నారు. కాగా, కుంగ్‌ఫూ కరాటే జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను కలెక్టర్ శ్రీహర్ష ఈ సందర్భంగా అభినందించారు. తపాలా బీమాను సద్వినియోగం చేసుకోవాలి ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమాయోజన పథకం కింద ఇండియా పోస్ట్ పేమెంట్ బాంకు ద్వారా రూ.436 ప్రీమియం చెల్లించి రూ.2లక్షల బీమా పొందవచ్చని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. పథకం ద్వారా మంజూరైన రూ.2లక్షల చెక్కును కలెక్టర్ బాధితులకు అందజేశారు. రెండేళ్లలో 20మంది బీమా క్లెయిమ్ చేశారని ఆయన తెలిపారు. లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, ఇండియా పోస్ట్పేమెంట్ సీనియర్ మేనేజర్ కొట్టె శ్రీనివాస్, మేనేజర్ మోహన్సాయి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి -
ఉక్కుపాదం
డ్రగ్స్ మాఫియాపైమాట్లాడుతున్న సీపీ అంబర్ కిశోర్ ఝా● కమిషనరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ● సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే వేటు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా గోదావరిఖని: ‘గంజాయి, డ్రగ్స్‌ను కూకటివేళ్లతో పెకిలించి వేస్తాం. ఇందుకోసం కమిషనరేట్ కేంద్రంగా ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తాం. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకునే పోలీసులపై వేటు వేస్తాం. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలతో ప్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం’ అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు.. సాక్షి: నేరాలను ఎలా నియంత్రిస్తారు? సీపీ: బదిలీపై రామగుండం రావడం సంతోషంగా ఉంది. రామగుండం చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేకుండా ముందుకు సాగుతాం. సాక్షి: గంజాయి రవాణా, విక్రయాలను ఎలా అరికడతారు? సీపీ: గంజాయి రవాణా పెరిగినట్లు సమాచారం ఉంది. పాత నేరస్తులపై నిఘా ఉంది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. విక్రయదారులు, తాగేవారిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తాం. సాక్షి: డ్రగ్స్ నివారణకు ప్రత్యేక ప్రణాళిక ఏమైనా ఉందా? సీపీ: గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు 15 మందితో సిటీడ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక ఫోన్ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ నంబరుకు సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. సాక్షి: పాత నేరస్తులు, భూమాఫియాపై..? సీపీ: పాతనేరస్తులు, భూమాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటాం. సెటిల్మెంట్ల విషయంలో జోక్యం చేసుకుంటే పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయి. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తేలేదు. సాక్షి: రోడ్డు ప్రమాదాలను ఎలా నియంత్రిస్తారు? సీపీ: వరంగల్ సీపీగా పనిచేస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకున్న చర్యలతో 20 శాతం ప్రమాదాలు తగ్గాయి. బ్లాక్స్పాట్ల వద్ద దృష్టి సారిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతాం. సాక్షి: పోలీసులకు మీరిచ్చే సూచనలేమిటి? సీపీ: శాంతిభద్రతల పరిరక్షణలో పకడ్బందీగా వ్యవహరించాలి. ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉండాలి. ఉదయం, సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో ఉండి ఫిర్యాదులు స్వీకరించాలి. వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఉంటే సహించేదిలేదు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే వారిపైనా చర్యలు తీసుకుంటాం. సాక్షి: సైబర్నేరాలను ఎలా నియంత్రిస్తారు? సీపీ: సైబర్‌నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. అపరి చితులు, అపరిచిత ఫోన్ నంబర్లకు సమాధానం ఇవ్వవద్దు. బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయొద్దు. సాక్షి: ప్రజల నుంచి ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు? సీపీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇలాంటి వారి వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. మత్తుపదార్థాల విక్రయాలను అరికట్టేందుకు సహకారించాలి. సమస్యల పరిష్కారానికి పోలీసులను ఆశ్రయించాలి. న్యాయం జరగకుంటే నేరుగా నన్ను సంప్రదించాలి. సాక్షి: యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి? సీపీ: గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగ యువతను చేరిదీసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే ఉట్నూర్ ఐటీడీఏ సహకారంతో గతంలో యువతకు శిక్షణ ఇప్పించి అగ్రగామిగా తీర్చి దిద్దాం. ఇక్కడ కూడా యువతకు ఉపాధి శిక్షణ, కాంపిటేటివ్ పరీక్షల్లో తర్ఫీదు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో శిక్షణ ఇస్తాం. ఇంటర్వ్యూలలో నెగ్గేలా తీర్చిదిద్దుతాం. క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం. -
ముగ్గు పోస్తున్నారు..
సాక్షి, పెద్దపల్లి: పేదల దశాబ్దాల సొంతింటి కల సాకారమయ్యేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.. జిల్లావ్యాప్తంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపనలు పేద కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. గతఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పేదల సొంతింటి కల నెరవేర్చుతామని, ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇ స్తామని ప్రకటించారు. అంతేకాదు.. తమ ఎన్నిక ల మేనిఫెస్టోలోనూ చేర్చి ప్రచారం విస్తృత పర్చారు. తొలుత మోడల్ ఇళ్ల నిర్మాణం.. జిల్లాలో తొలుత మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని అధికారులు ఎంపిక చేశారు. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి, ఓదెల మండలంలోని శాన కొండ, కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి, పెద్దపల్లిలోని నిమ్మనపల్లి గ్రామాల్లో మోడల్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణాలకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముగ్గు పోస్తున్నారు. అద్దె కొంపలు.. అనేక అవస్థలు జిల్లాలోని వేలాది పేద కుటుంబాలు ఇంకా అద్దె కొంపల్లోనే అసౌకర్యాల మధ్య కాలం వెళ్లదీస్తున్నా యి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,91,836 ఉండగా, ఇందులో 3,97,585 మంది పురుషులు, 3,94,251 మంది మహిళలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలోని గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు, 13 మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోంచి తమకు ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ ప్రజాప్రజాలన సభలు, ఆన్లైన్, మీసేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి 1,80,564 దరఖాస్తులు అందాయి. భారంగా బతుకులు.. పల్లెల్లోనూ ప్రస్తుతం ఒక బెడ్రూమ్ ఇంటి అద్దె కనీసం రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పలుకుతోంది. అయినా, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వంటగదులు, నీటి సౌకర్యం సరిగా ఉండడంలేదు. మున్సిపాటీల్లో ఇదే ఇంటికి రూ.5వేల నుంచి రూ.7 వేల వరకు అద్దె పలుకుతోంది. ఇక్కడా ఇరుకు గదులు, అసౌకర్యాలు, నీటి వసతి ఉండడంలేదు. ఇక గోదావరిఖనిలో అయితే, సింగిల్ బెడ్రూమ్ అద్దె రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. అపార్ట్మెంట్లలో అయితే ఇంతకు రెట్టింపు పలకడంతో పేదలు, సామాన్యులు ఆ ఇళ్లలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో స్లమ్ ఏరియా ల్లోని అరకొర వసతులు ఉన్నా సర్దుకు పోతున్నారు. కూలీనాలీ పనులు చేసుకునే రోజూవారీ కూలీలు.. నెలకు సంపాదించే ఆదాయంలో అగ్రభాగం ఇంటి అద్దెకే వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. నియోజవర్గానికి 3,500 ఇళ్ల కేటాయింపు.. తొలిదశలో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో కేటాయించే 10,500 ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేద కుటుంబాలు తలదాచుకునేందుకు ఆశ్రయం లభిస్తుందనే గంపెడాశతో ఎదురు చూస్తున్నాయి. జిల్లాకు తొలిదశలో గత జనవరి 26వ తేదీన 1,708 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు 800 ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వానికి 1,80,564 దరఖాస్తులు అందినట్లు అధికారులు వివరిస్తున్నారు. ప్రయోగాత్మక గ్రామాల్లో లబ్ధిదారులు.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యేలు లబ్ధిదారుల్లో ఆశలు రేకెత్తిస్తున్న ప్రారంభోత్సవాలు జిల్లాకు 10,500 ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ఇప్పటివరకు 800 ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ మద్దిర్యాల 59 బంజేరుపల్లి 71 శివపల్లి 08 కోనరావుపేట 140 రొంపికుంట 170 అడవి సోమన్‌పల్లి 180 మచ్చుపేట 20 శానగొండ 200 రామారావుపల్లి 110 నిమ్మనపల్లి 130 రత్నాపూర్ 290 అంకంపల్లి 110 కాట్నపల్లి 120 -
ఖమ్మంపల్లి – భూపాలపల్లి రోడ్డుకు రూ.33.70 కోట్లు
ముత్తారం(మంథని): పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కలిపేందుకు ముత్తారం మండలం ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు డబుల్ రో డ్డు నిర్మాణానికి ప్రభుత్వం మంగళవారం రూ. 33.70కోట్లు మంజూరు చేసింది. గత ప్రభుత్వంలో అటవీశాఖ అనుమతి రాక రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబు చొరవతో జీవో నంబరు 113 ద్వారా నిధులు మంజూరు చే యించారు. ఈ రోడ్డు నిర్మాణంతో మంథని, ఖ మ్మంపల్లి నుంచి భూపాలపల్లికి సుమారు 20 కిలో మీటర్ల వరకు దూర భారం తగ్గుతుంది. ఖమ్మంపల్లి, తాడిచెర్ల వంతెన నిర్మాణం పూర్తయినా.. భూపాలపల్లి వరకు ప్రయాణం చేయడానికి రోడ్డు సౌక ర్యంలేక వావానాదారులు, ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఖమ్మంపల్లి నుంచి తాడిచెర్ల నాగులమ్మ, కాటారం నుంచి వెళ్లేవారు. ప్రస్తుతం ఖమ్మంపల్లి – భూపాలపల్లి మధ్య రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరావడంతో తమ ఇబ్బందులు తొలగుతాయని స్థానికులు సంబురపడుతున్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పెద్దపల్లిరూరల్: పేదల సంక్షేమమే ధ్యేయంగా సీ ఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం పనిచేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అ న్నారు. నియోజకవర్గంలోని 86మంది లబ్ధిదారుల కు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ (రూ.86.60లక్షలు), 471మందికి సీఎంఆర్ఎఫ్ (రూ.కోటి 27 లక్షల) విలువైన చెక్కులను జిలాల కేంద్రంలో మంగళవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నే అభివృద్ధి వైపు అడుగులేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధ చూపారని అన్నారు. ఇళ్లులేని పేదల గురించి గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, జిల్లా గ్రంఽథాల య సంస్థ చైర్మన్ అన్నయ్య, నాయకులు సుమన్‌రెడ్డి, సంపత్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, రాజేందర్, రామ్మూర్తి, శంకర్, సురేందర్ పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు సుల్తానాబాద్(పెద్దపల్లి): త్వరలోనే అన్ని గ్రామాలు, పట్టణాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 38 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.38,04,408 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 6, ఏడో వార్డుల్లో రూ.42 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. తహసీల్దార్ రాంచందర్‌రావు, మున్సిపల్ కమిషనర్ నియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్‌విండో ఇన్చార్జి శ్రీగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణంతో అభివృద్ధి ఓదెల(పెద్దపల్లి): సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అద్దంలా మెరుస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే వి జయరమణారావు అన్నారు. ఓదెల, ఇందుర్తిలో చే పట్టిన సీసీరోడ్లు, డ్రైనేజీల పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నాయకులు ఆళ్ల సుమన్‌రెడ్డి, మూల ప్రేంసాగర్‌రెడ్డి, గోపు నారాయణరెడ్డి, చీకట్ల మొండయ్య, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. వ్యాన్ అసోసియేషన్ ఆఫీసు ప్రారంభం మండల కేంద్రంలోని వ్యాన్ అసోసియేషన్ ఆఫీసు ను ఎమ్మెల్యే విజయరమణరావు ప్రారంభించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
మహిళలు.. మనీరాణులు!
● మండల మహిళా సమాఖ్యలకు 47 బస్సులు ● బస్సుల కొనుగోలుకు రూ.14.10 కోట్లు మంజూరు ● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా జగిత్యాలకే 15 వాహనాలు ● ఏడేళ్లపాటు సమాఖ్యలకు ప్రతీనెల రూ.77వేలు చెల్లించనున్న ఆర్టీసీ ● ఈ ఆదాయంతో సోలార్ ప్లాంట్లు, ఇతర ప్రత్యామ్నాయ వ్యాపారాలు ● ప్రభుత్వ నిర్ణయంతో ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్న మహిళలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్‌లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్య లకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాతా సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందారు. ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలపాటు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది. -
‘ఎనీమియా’ను నియంత్రిస్తాం
● బాధితులకు మాత్రలు, సిరప్ అందిస్తున్నాం ● ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారిసాక్షి: ఎనీమియా బారిన ఎవరు పడతారు? డీఎంహెచ్‌వో: మనిషిలోని అవయవాలను పనిచేయించే ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ అందిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గితే ఎనీమియా బారినపడతారు. అన్ని వయస్సుల వారిలో ఇది కనిపిస్తుంది. సాక్షి: జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది బాధితులను గుర్తించారు?డీఎంహెచ్‌వో: కేంద్ర ప్రభుత్వం ఎనీమియాను పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం మా సిబ్బంది పనిచేస్తున్నారు. జిల్లాలో 1,43,159మంది మహిళలు, 10 నుంచి 19ఏళ్లలోపు వయస్సుగల పిల్లలు 1,56,580 మంది వరకు ఉన్నారు. 6 నుంచి 59 నెలలోపు వయసుగల వారు 95,309 మంది, 5 నుంచి 9 ఏళ్ల వయసు గలవారు 78,290మంది ఉన్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది వరకు ఎనీమియాతో బాధపడుతున్నారని మా సర్వేలో తేలింది. సాక్షి: మందులు అందుబాటులో ఉన్నాయా? డీఎంహెచ్‌వో: గతంలో మందుల కొరత ఉండేది. ఇప్పుడు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. ఎనీమియా ముక్త్భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అవసరాలకు అనుగుణంగా పీహెచ్‌సీల స్థాయిలోనూ మందులు పంపిణీ చేస్తున్నాం. 6నుంచి 59నెలల పిల్లలకు ఏడాదికి రెండు సిరప్ బాటిళ్లు అవసరం. ఇక పాఠశాలల్లో చదివే వారికి వీక్లీ ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్ అందిస్తున్నాం. పెద్దపల్లిరూరల్: ‘మనిషికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు దోహదపడే హిమోగ్లోబిన్ శాతం పడిపోవడమే ఎనీమియా.. దీనిబారిన పడుతున్న వారిని గుర్తించి మందులు, సిరప్ అందిస్తున్నాం.. ఎనిమియా ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’ అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి తెలిపారు. జిల్లాలో 13,935మంది గర్భిణులు, 12,540 మంది పాలిచ్చే తల్లులు ఉన్నారని, వీరిలో 60శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని ఆమె వెల్లడించారు. పిల్లలు, మహిళల్లో ఇది అధికంగా కనిపిస్తోందన్నారు. బాధితులను గుర్తించి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, సిరప్ అందిస్తూ ఎనీమియా నియంత్రణకు పాటుపడుతున్నామన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని అందుబాటులో ఉంచామని అన్నారు. ‘సాక్షి’తో ఇంటర్వ్యూ వివరాలు.. సాక్షి: ఎనీమియా నియంత్రణపై సిబ్బందికి అవగాహన ఉందా?డీఎంహెచ్‌వో: ఎనీమియా ముక్త్భారత్ అమలు తీరు, సాధించాల్సిన లక్ష్యం, అనుసరించాల్సిన పద్ధతులపై ఫార్మసిస్ట్, వైద్య సిబ్బందికి శిక్షణ ఇప్పించాం. బాధితులను గుర్తించి సకాలంలో మందులు అందేలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. వయసును బట్టి మోతాదు మాత్రలు, సిరప్ అందిస్తున్నాం. -
‘ఎనీమియా’ను నియంత్రిస్తాం
● బాధితులకు మాత్రలు, సిరప్ అందిస్తున్నాం ● ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్నకుమారిసాక్షి: ఎనీమియా బారిన ఎవరు పడతారు? డీఎంహెచ్‌వో: మనిషిలోని అవయవాలను పనిచేయించే ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ అందిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గితే ఎనీమియా బారినపడతారు. అన్ని వయస్సుల వారిలో ఇది కనిపిస్తుంది. సాక్షి: జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది బాధితులను గుర్తించారు?డీఎంహెచ్‌వో: కేంద్ర ప్రభుత్వం ఎనీమియాను పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం మా సిబ్బంది పనిచేస్తున్నారు. జిల్లాలో 1,43,159మంది మహిళలు, 10 నుంచి 19ఏళ్లలోపు వయస్సుగల పిల్లలు 1,56,580 మంది వరకు ఉన్నారు. 6 నుంచి 59 నెలలోపు వయసుగల వారు 95,309 మంది, 5 నుంచి 9 ఏళ్ల వయసు గలవారు 78,290మంది ఉన్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది వరకు ఎనీమియాతో బాధపడుతున్నారని మా సర్వేలో తేలింది. సాక్షి: మందులు అందుబాటులో ఉన్నాయా? డీఎంహెచ్‌వో: గతంలో మందుల కొరత ఉండేది. ఇప్పుడు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. ఎనీమియా ముక్త్భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అవసరాలకు అనుగుణంగా పీహెచ్‌సీల స్థాయిలోనూ మందులు పంపిణీ చేస్తున్నాం. 6నుంచి 59నెలల పిల్లలకు ఏడాదికి రెండు సిరప్ బాటిళ్లు అవసరం. ఇక పాఠశాలల్లో చదివే వారికి వీక్లీ ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్ అందిస్తున్నాం. పెద్దపల్లిరూరల్: ‘మనిషికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు దోహదపడే హిమోగ్లోబిన్ శాతం పడిపోవడమే ఎనీమియా.. దీనిబారిన పడుతున్న వారిని గుర్తించి మందులు, సిరప్ అందిస్తున్నాం.. ఎనిమియా ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’ అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి తెలిపారు. జిల్లాలో 13,935మంది గర్భిణులు, 12,540 మంది పాలిచ్చే తల్లులు ఉన్నారని, వీరిలో 60శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని ఆమె వెల్లడించారు. పిల్లలు, మహిళల్లో ఇది అధికంగా కనిపిస్తోందన్నారు. బాధితులను గుర్తించి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, సిరప్ అందిస్తూ ఎనీమియా నియంత్రణకు పాటుపడుతున్నామన్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని అందుబాటులో ఉంచామని అన్నారు. ‘సాక్షి’తో ఇంటర్వ్యూ వివరాలు.. సాక్షి: ఎనీమియా నియంత్రణపై సిబ్బందికి అవగాహన ఉందా?డీఎంహెచ్‌వో: ఎనీమియా ముక్త్భారత్ అమలు తీరు, సాధించాల్సిన లక్ష్యం, అనుసరించాల్సిన పద్ధతులపై ఫార్మసిస్ట్, వైద్య సిబ్బందికి శిక్షణ ఇప్పించాం. బాధితులను గుర్తించి సకాలంలో మందులు అందేలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. వయసును బట్టి మోతాదు మాత్రలు, సిరప్ అందిస్తున్నాం. -
అన్ని రంగాల్లో ముందుండాలి
కోల్‌సిటీ(రామగుండం): ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లతోపాటు రాయితీ రుణాలు సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆకాంక్షించారు. బల్దియా కార్యాలయంలో సోమవారం మెప్మా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించా రు. అరుణశ్రీ మాట్లాడుతూ.. ఈరోజు ఏం సా ధించామో సాయంత్రం అవలోకనం చేసుకోవా లన్నారు. మానసిక ఒత్తిడిని జయించడానికి ఆట లు ఉపకరిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్న వారికి బ హుమతులు అందజేశారు. ఉత్తమ పారిశుధ్య కా ర్మికులను సత్కరించారు. నగరపాలక సంస్థ డి ప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, మెప్మా టీఎంసీ మౌనిక, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఊర్మిళ, శ్వేత, ప్రి యదర్శిని, శమంత, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నూనె లతామోహన్, ప్రతినిధులు వెంగళ పద్మలత, పరిపూర్ణ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ బల్దియాలో మహిళా దినోత్సవం -
బాధ్యతలు స్వీకరణ
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్ సో మవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీసీపీగా పనిచేసిన చేతన హైదరాబాద్‌లోని వుమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ అయిన విషయం విదితమే. దరఖాస్తుల ఆహ్వానం పెద్దపల్లిరూరల్: జిల్లాలో పీఎంఎఫ్ఎంఈ (ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్) పథకం కోసం ఈనెల 12 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్ సోమవారం తెలిపారు. రాష్ట్ర ఆహారశుద్ధి సంస్థ ఆధ్వర్యంలో 35 శాతం రాయితీతో అందించే రుణాల కోసం ఆసక్తి, అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాల కోసం డీఆర్పీ రామకృష్ణ, సెల్ నంబరు 63053 45388లో సంప్రదించాలన్నారు. దరఖా స్తులను కలెక్టరేట్లోని రూం నంబరు 231లో గల జిల్లా పరిశ్రమల కేంద్రంలో అందించాలని కోరారు. -
చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు
● రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా ● బాధ్యతలు స్వీకరించిన పోలీస్ అధికారిగోదావరిఖని: చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పో లీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించా రు. రామగుండం పోలీస్ కమిషనర్‌గా సోమవా రం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంత రం విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. సత్ప్రవర్తన కలిగిన వారికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తామని తెలిపారు. ల్యాండ్ మాఫియా, డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపా దం మోపుతావని, ప్రజల సహకారంతో ముందుకెళ్తామన్నారు. ఠాణాలకు వచ్చే వారి సమస్యలను త్వరిత గతిన పరిష్కరిస్తూ, చట్ట పరిధిలో న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. 2009 ఐపీఎస్ బ్యాచ్.. అంబర్ కిశోర్ ఝా 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. 2011లో తొలిసారి ఉమ్మడి ఆదిలాబాద్ ఏఎస్పీ, 2012 వరంగల్ ఓఎస్డీగా, అదనపు ఎస్పీగా, 2014లో వరంగల్ ఎస్పీగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలిఎస్పీగా పనిచేశారు. 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా, అదే ఏడాది కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. గతేడాది ఫిబ్రవరిలో డీఐజీగా పదోన్నతి లభించింది. రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు వరంగల్ సీపీగా పనిచేశారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన సీపీకి మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, కరుణాకర్ తదితరులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
సీఐఎస్ఎఫ్ సేవలు భేష్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ భద్రతకు సీఐఎస్ఎఫ్ అందిస్తున్న సేవలు భేషుగ్గా ఉన్నా యని రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత ప్రశంసించారు. మల్కాపూర్ రోడ్డులోని సీఐఎస్ఎఫ్ బ్యారక్స్‌లో సోమవారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఆయన భద్రతా దళాల నుంచి గౌరవవందనం స్వీకరించి మా ట్లాడారు. దేశభద్రత, కీలకఆస్తుల రక్షణలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి అమోఘమన్నారు. కార్యక్రమంలో సీనియర్ కమాండెంట్ ముఖేష్‌కుమార్, ఎన్టీపీసీ అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బల్దియాలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభంకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరంలో సోమవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రా రంభమైంది. జోన్‌కు ఒక డివిజన్ చొప్పున రో జూ 12 డివిజన్లలో ఈ కార్యక్రమం నిర్వహి స్తారు. కలెక్టర్, ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు కమిషనర్ (ఎఫ్ఏసీ) అరు ణశ్రీ పర్యవేక్షణలో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. చెత్త కుప్పలను తొలగించడం, మురుగునీటి కాలువల్లో పూడిక తీయడం తదితర పనులు నిర్వహిస్తున్నారు. ఈనెల 14వ తే దీ వరకు పారిశుధ్య పనులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పనులు తనిఖీ చేశారు. జాతీయ పోటీల్లో ప్రతిభ మంథని: పట్టణానికి చెందిన సిటోరియో కరా టే విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలో ని ర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్ర తిభ కనబర్చినట్లు ఇన్స్ట్రక్టర్ కావేటి సమ్మయ్య తెలిపారు. సబ్ జూనియర్ కుమితే విభాగంలో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారన్నారు. బండారి మణికంఠ, ఎం.శివ, బాసాని మనోహర్, అక్షిత బంగారు, మనస్వి, అద్వితి వెండి, సహస్ర, మనోజ్ఞ కాంస్య పతకాలు సాధించిన వారిలో ఉన్నారని వివరించారు. క్వింటాలు పత్తి రూ.6,913 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.6,913 ధర నమోదైందని మార్కెట్ కమిటీ కార్యదర్శి మనోహర్ తెలిపారు. కనిష్ట ధర రూ.5,016, సగటు ధర రూ.6,611గా నమోదైందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 202 మంది రైతుల నుంచి 746 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): చదువులో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎఫ్ఎల్ఎన్ జిల్లా రిసోర్స్ పర్సన్ రవి సూచించారు. ఉపాధ్యాయులు చతుర్విద ప్రక్రియల ద్వారా విద్యాబోదన చేయాలన్నారు. ఊశన్నపల్లె ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, రికార్డులు పరిశీలించారు. వ్యక్తిగత పరిశీలనతోనే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచవచ్చని తెలిపారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సునీత, స్కూల్ హెచ్ఎం సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత, సురేశ్, కుమార్, శ్రీవాణి ఉన్నారు. ‘పట్టు’తో రైతులకు లాభాలు జూలపల్లి(పెద్దపల్లి): పట్టు పురుగుల పెంపకంతో రైతులకు అధిక లాభాలు వస్తాయని పరిశోధన కేంద్రం రీజినల్ సెరికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ వినో ద్‌కుమార్ అన్నారు. జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామ శివారు రైతువేదికలో సోమవారం పట్టురైతు దినోత్సవం నిర్వహించారు. పట్టు పరిశ్రమ అధికారులు పట్టు పురుగుల పెంపకం, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించా రు. జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి రాఘవేంద్ర, అధికారి తిరుపతిరెడ్డి, సూపరింటెండెంట్ దాసు, మండల అధికారి మహేశ్, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. -
● 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు ● జిల్లా విద్యాధికారి మాధవి
టెన్త్ పరీక్షలకు 41 కేంద్రాలు పెద్దపల్లిరూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలకు సుమారు 7వేల మంది విద్యార్థుల కోసం 41 పరీ క్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా వి ద్యాధికారి మాధవి తెలిపారు. కలెక్టరేట్లో సోమ వారం అధికారులు, సూపరింటెండెంట్ ప్రకాశ్ తో కలిసి పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. ఈనె ల 21 నుంచి ఏప్రిల్ 4వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏ ర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్ పరీక్షలకు 91మంది గైర్హాజరు జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండియర్ వార్షిక పరీక్షలకు మొత్తం 91మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. ఇంగ్లిష్ పరీక్షకు 4,801మంది విద్యార్థులకు 4,710మంది హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరు శాతం 98.10శాతంగా ఉందని వివరించారు. -
‘ఎల్ఆర్ఎస్’లో 25 శాతం రాయితీ
● గడువులోగా ఫీజు చెల్లిస్తేనే వర్తింపు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: గడువులోగా ఎల్ఆర్ఎస్ రు సుం చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని, 24 గంటల్లోగా ప్రొసీడింగ్స్ జారీచేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. స్థానిక మున్సిపల్ కా ర్యాలయంలో సోమవారం ఎల్ఆర్ఎస్, లే ఔట్ క్రమబద్ధీకరణపై డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. జిల్లాలో 16వేల స్థలాల క్రమబద్ధీకరణ కోసం యజమానులకు ఫీజు వివరాలు అందించామని అన్నారు. ఇప్పటివరకు 400మంది మాత్రమే స్పందించారని ఆయన పేర్కొన్నారు. సందేహాల నివృత్తి కోసం మున్సిపల్ ఆఫీసులో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. క్రమబద్ధీకరణ పూర్తికాని ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లింక్ చేశామని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తదితరులు ఉన్నారు. అధికారులతోనూ సమావేశం.. అంతకుముందు కలెక్టర్ శ్రీహర్ష కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అధికారుల తో సమావేశమై అక్రమ లేఔట్లపై సమీక్షించారు. లే ఔట్ నిబంధనలు పాటించని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆదేశించారు. ఆర్డీవోలు గంగ య్య, సురేశ్, కమిషనర్లు వెంకటేశ్, మనోహర్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 2డీ ఎకో సేవలు.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా 2డీ ఎకో సేవలు అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. క్లినికల్ కార్డియాలజిస్ట్‌గా నియమితులైన ప్రియాంక కలెక్టర్‌ను కలిశారు. -
చెత్త సేకరణ అస్తవ్యస్తం
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలోని బల్దియాల్లో తడి, పోడి చెత్త సేకరణ లక్ష్యం నెరవేరడం లేదు. చెత్తను రోజూ వేరుచేసి సేకరించాల్సి ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి నుంచి రోజూ సుమారు 180 టన్నుల చెత్త వెలువడుతోంది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలనే లక్ష్యంతో ప్రతీ ఇంటికి ఉచితంగా రెండేసి ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చారు. చెత్త సేకరించే సైకిల్ రిక్షాలు మొదలుకొని ఆటో ట్రాలీల వరకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేలా ఏర్పాట్లు ఉన్నా.. అంతా కలిపి సేకరించడం సాధారణంగా మారింది. ట్రాక్టర్లకు మైకులు పెట్టి తడి, పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలని అధికారులు ప్రచా రం చేస్తున్నా ఆచరణలో అమలు కావడంలేదు. ప్రచారం సరే.. అమలు ఏది? ‘ప్రతిఒక్కరూ ఇంట్లోనే తడి, పొడి చెత్త వేరుచేయండి.. తడి చెత్తతో ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో సేంద్రియ ఎరువు తయారు చేసుకోండి.. పొడి చెత్తను విక్రయించి అదనంగా ఆదాయం పొందండి.. మిగిలిన చెత్తన మాత్రమే ఆటో ట్రాలీలకు ఇవ్వండి’ అని మైకులతో హోరెత్తిస్తున్నారు. తడి, పొడి చెత్తను కలిపివేయడంతో కలిగే నష్టాల గురించి వివరిస్తూ చేసే ప్రచార హోరు, కాగితాల్లో లెక్క లు తప్ప ఆచరణలో ఎక్కడా వేర్వేరుగా సేకరిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. సమయానికి రాక.. రోడ్లపైనే పారబోత చెత్త తరలించే వాహనాలు సమయానికి నివాసాలకు వెళ్లడంలేదు. దీంతో బల్దియాల్లో చెత్తను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. అవగాహన లేకపోవడంతో తడి, పొడి చెత్త విభజన చేయడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో తడి, పొడి చెత్త సేకరణ అమలు కావడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే బల్దియా అధికారులు స్పందిస్తున్నారు. కొన్ని వార్డులు, డివిజన్లలో రెండ్రోజులకోసారి చెత్త తరలించే వాహనం రావడంతో అప్పటివరకు ఇళ్లలోనే నిల్వ ఉంటోంది. చేసేది లేక స్థానికులు కాలనీలో రోడ్ల వెంట పారబోస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణపై ఆయా మున్సిపాలిటీల కమిషనర్లను సంప్రదించగా.. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేలా సిబ్బందికి ఆదేశాలు ఇస్తామన్నారు. ప్రజలకు సైతం అవగాహన కల్పిస్తామని తెలిపారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాల్సి ఉన్నా.. కలిపే సేకరిస్తూ.. డంపింగ్ యార్డుల్లో కాల్చివేస్తూ.. కాగితాల్లోనే వేర్వేరు సేకరణ ప్రక్రియ అవగాహన లోపం, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం బల్దియాల్లో లోపిస్తున్న పారిశుధ్యం ఈచిత్రంలో కాలిపోతున్న చెత్త రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరి నదీతీరంలో ఉన్న డంపింగ్యార్డులోనిది. మొత్తం 50 డివిజన్ల రోజూ 83 వాహనాల్లో సుమారు 118 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి ఆర్ఎఫ్సీఎల్కు చెందిన ఖాళీస్థలాల్లో వేస్తున్నారు. తద్వారా ఇంటివద్దే తడి, పొడి చెత్త వేర్వేరు సేకరణ ప్రక్రియ అమలు కావడం లేదు. ఇలా సేకరించిన తడిపొడి చెత్తను డంప్కార్డులో కుప్పగా పోసి తగలబెడుతున్నారు. ఇవి తడి, పోడి చెత్త సేకరించేందుకు ఏర్పాటు చేసిన త్రిబుల్ డస్ట్బిన్లు. రామగుండం కార్పొరేషన్ పరిధి మార్కండేయకాలనీ తగర వీధిలోనివి. తడి, పొడి, హానికరమైన చెత్తను ఆ డబ్బాల్లో వేయాల్సి ఉంది. అవగాహనలేక స్థానికులు నిర్లక్ష్యంతో మొత్తం చెత్తను డబ్బాల్లో నింపుతున్నారు. సిబ్బంది సైతం చెత్తను డంపింగ్‌యార్డుకు అలాగే తరలిస్తున్నారు. -
పల్లె నాడీ పట్టేందుకు..
● గ్రామాల బాట పట్టిన సిమ్స్ వైద్య విద్యార్థులు ● ఎంబీబీఎస్ స్టూడెంట్లకు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ ● ఒక్కో విద్యార్థికి ఐదు కుటుంబాలు దత్తత ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్ సాక్షి: గ్రామాల్లో మెడికోలు ఏం చేస్తారు? ప్రిన్సిపాల్: వైద్య విద్యార్థులు గ్రామాల్లో దత్తత తీసుకున్న కుటుంబాల వద్దకు షెడ్యూల్ ప్రకారం కేటాయించిన రోజు వెళ్తారు. కుటుంబంలోని వారందరితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారు. వ్యక్తుల వారీగా రికార్డులను తయారు చేస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యసనాలను తెలుసుకుని నమోదు చేస్తారు. ఏమైనా సమస్యలు వెలుగులోకి వస్తే ప్రాథమిక సలహాలు ఇస్తున్నారు. అవసరమైతే జీజీహెచ్ బోధన ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు రెగ్యులర్ చెకప్‌లపై అవగాహన కల్పిస్తారు. గ్రామాల్లో స్థానిక పరిస్థితులు, తరచూ వస్తున్న వ్యాధులను పరిశీలిస్తారు. అన్ని అంశాల్లో వారికి పర్యవేక్షకుడిగా ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూచనల మేరకు వైద్య విద్యార్థులు వ్యవహరిస్తారు. కోల్‌సిటీ(రామగుండం): ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్న వైద్య విద్యార్థులు గ్రామాల బాట పడుతున్నారు. కుటుంబాలను దత్తత తీసుకుని పల్లెవాసుల ఆరోగ్య సమస్యలపై ఆరా తీస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సకాలంలో వైద్యచికిత్స పొందే లా సలహాలు, సూచనలు అందిస్తున్నారు గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్– ప్రభుత్వ) కాలేజీ విద్యార్థులు. దత్తత విధానం, అమలు తీరు, దాని ప్రయోజనాలు, లక్ష్యంపై సిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందుసింగ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు.. -
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
పెద్దపల్లి రూరల్/గోదావరిఖని: జిల్లాలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద, మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తోపాటు పలు పరిశ్రమల్లోనూ మహిళా ఉద్యోగులను అధికారులు సన్మానించారు. వారు చేస్తున్న సేవలు, ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన, పలు ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని ఈ సందర్భంగా అతిథులు సన్మానించారు.సన్మానాలు.. సంబురాలు -
అన్ని రంగాల్లో రాణించాలి
గోదావరిఖనిటౌన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని గోదావరిఖని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక అదనపు జిల్లా న్యాయస్థానంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవనిలో సగంగా ఉన్న మహిళలు.. అవకాశాల్లో సగం అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. సీ్త్ర లేనిదే జననం లేదని, ఎక్కడైతే సీ్త్రలు పూజింపబడతారో అక్కడ భోగభాగ్యాలు విలసిల్లుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీశ్, ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్, ఏజీపీ శంతన్‌కుమార్, సభ్యులు కిషన్‌రావు, సీహెచ్ శైలజ, పాత అశోక్, ఎస్.సంజయ్‌కుమార్, మహిళా ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
అనుమతి లేకుండా మట్టి తరలింపు సరికాదు
రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామ శివారులో డంప్ చేసి, అనుమతులు లేకుండా లక్షల క్యూబిక్ మీటర్ల చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని బీఆర్ఎస్ కార్మిక సంఘం ప్రతినిధి కౌశిక హరి ఆరోపించారు. పార్టీ అనుచరులతో శనివారం మట్టి రవాణా చేసే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. హరి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ నేతృత్వంలోనే టిప్పర్లతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్నారు. దానిని బడా వ్యాపారులకు విక్రయిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని, అయినా మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. మట్టి అక్రమ తరలింపును అధికారులు అడ్డుకోకుంటే తామే అడ్డుకుంటామని కౌశిక హరి హెచ్చరించారు. సీఐటీయూ నేతల నిరసన పెద్దపల్లిరూరల్: సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తాలో శనివారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. జగిత్యాలలో ఆశ వర్కర్‌పై జరిగిన దాడి శోచనీయమన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు జాప్యం చేయడం సరికాదన్నారు. బాధిత మహిళకు ప్రభుత్వం న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జ్యోతి డిమాండ్ చేశారు. నాయకులు రవీందర్, సాగర్, సుశీల, పద్మ, కనకతార, రాజేశ్వరి, భూలక్ష్మి, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి కోరారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డు నుంచి, జెడ్పీటీసీ స్థానం వరకూ పోటీచేసేందుకు నాయకులు సిద్ధం కావాలని ఆయన కోరారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు కందుల శ్రీనివాస్, కడారి అశోక్‌రావు, కొమ్ము తిరుపతి యాదవ్, రాజన్న పటేల్, మహేందర్ యాదవ్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 10న అప్రెంటిషిప్ మేళా రామగుండం: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో నిర్వహించే ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళాకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి శనివారం కోరారు. అప్రెంటిషిప్ మేళాలో తోషిబా, ఎల్అండ్టీ, జాన్సన్ లిఫ్ట్స్, ఇండియా టాటా, ఏరోస్పేస్, వరుణ్ మోటార్స్, ఆదర్శ మోటార్స్, రాణే ఇంజిన్ వాల్వ్స్, ఐటీసీ టెక్నాలజీ తదితర కంపెనీలు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ధ్రువీకరణపత్రాలతో పదో తేదీ ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం
గోదావరిఖనిటౌన్: లోక్ అదాలత్‌లతో సత్వర న్యాయం సాధ్యమని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పగలు, ప్రతీకారాలతో డబ్బు, కాలాన్ని వృథా చేయకుండా ఇరువర్గాలు అంగీకారంతో కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని జడ్జి సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన అవసరం మంథని: మహిళలు హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మూల స్వాతి అన్నారు. పట్టణంలోని కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కేసులు పరిష్కరించారు. అనంతరం పలు అంశాలపై జడ్జి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోద్వితీయ శ్రేణి మెజిస్ట్రేట్ అనురాధ, మంథని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రోఘోత్తంరెడ్డి, న్యాయవాదులు సుభాష్, విజయ్‌కుమార్, శశిభూషణ్ కాచే, భాగ్య, రాచర్ల రాజేందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజీ మార్గమే మేలు పెద్దపల్లిరూరల్: కోర్డుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో రాజీమార్గాన్ని అనుసరించడమే మేలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని సీనియర్ సివిల్‌కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జి మంజులతో కలిసి ఆమె పాల్గొన్నారు. పెద్దపల్లి కోర్టులో 756 కేసులు పరిష్కారమైనట్లు జడ్జి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్, కార్యదర్శి శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ అనిల్, బ్యాంకు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లోక్ అదాలత్‌తో సమన్యాయం సుల్తానాబాద్(పెద్దపల్లి): లోక్ అదాలత్‌లతో ఇరువర్గాలకు సమన్యాయం జరుగుతుందని జూనియర్ సివిల్ జడ్జి గణేశ్ అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జరిగిన కార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. రాజీమార్గం ద్వారా లోక్ అదాలత్‌తో కేసులను పరిష్కరించుకోవచ్చని, తద్వారా, కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. సెకండ్ క్లాస్ స్పెషల్ మెజిస్ట్రేట్ నేరెళ్ల శంకరయ్య, సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడా ల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేశ్, ఏజీపీ దూడం ఆంజనేయులు పాల్గొన్నారు. -
మహిళల చేతికి స్టీరింగ్
ముత్తారం(పెద్దపల్లి): మండల కేంద్రంలోని రుద్రమ మండల సమాఖ్యకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సు కేటాయించింది. మహిళలను కోటేశ్వర్లును చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో 20 ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో మన జిల్లాలోని ముత్తారం మండలానికి ఆర్టీసీ బస్సు కేటాయించారు. శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బస్సును ప్రారంభించారు. ఈ బస్సు నిర్వహణ బాధ్యతలను మండల సమాఖ్య చూసుకుంటుంది. నెలకు రూ.77వేలను ఆర్టీసీ ద్వారా ఎంఎస్‌కు రానున్నాయి. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఏ పద్మ, సిబ్బంది రాజ్యలక్ష్మి, కవిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు గుర్రాల మహేశ్వరి, ప్రతినిధి రత్న అనిత తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో బస్సు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి -
కమిటీల పేరిట కాలయాపన
గోదావరిఖని: కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన సింగరేణి యాజమాన్యం కమిటీల పేరిట కాలయాపన చేయడం సరికాదని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. జీడీకే–2,2ఏ, జీడీకే–5 ఓసీపీ, ఏరియా ఆస్పత్రిలో శనివారం ఆయన పర్యటించారు. ఉద్యోగులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్ట్రక్చరల్ సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం, సింగరేణి మధ్య జరిగిన చర్చల్లో యాజమాన్యం వాదన ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ చెల్లింపు భారం రూ.91కోట్లు సంస్థపైనే పడుతుందని చెప్పడం సరికాదన్నారు. రూ.35వేల కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికే రావాల్సి ఉందన్నారు. ఒక్కపైసా ఆర్థికభారం పడని మారుపేర్ల కార్మికుల పిల్లల ఉద్యోగాలను పెండింగ్ లో పెట్టడం సరికాదన్నారు. గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఐదు జాతీయ కార్మిక సంఘాలతోపాటు గత గుర్తింపు సంఘం చేసుకున్న ఒప్పందాన్ని యాజమాన్యం ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఇదే సమస్యపై గుర్తింపు సంఘంతో మళ్లీ కమిటీ వేయడం ఏమిటని ప్రశ్నించారు. తమ యూనియన్ సుధీర్ఘ పోరాట ఫలితంగా సొంతింటి పథకంపై కోలిండియా కూడా ఒక నిర్ణయానికి వచ్చిందని, సింగరేణిలో మాత్రం జాప్యం చేస్తోందన్నారు. గెలిచిన సంఘం సరైన వైఖరితో లేక పోవడంతోనే కార్మికులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. సమావేశంలో నాయకులు మెండె శ్రీనివాస్, తోట నరహరిరావు, ఆసరి మహేశ్, సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, పి.శ్రీనివాసరావు, దాసరి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి -
అదిరేటి స్టెప్పులు.. ఆకట్టుకున్న నృత్యాలు
కోల్‌సిటీ(రామగుండం): సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) కాలేజీలో ‘కన్వాస్–25’ పేరిట శుక్రవారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవం ఆకట్టుకుంది. డీజే సౌండ్స్‌తో మెడికోలు అదిరేటి స్టెప్పులు వేస్తూ కిర్రాక్ అనిపించారు. విద్యార్థులు సంప్రదాయ, వెస్ట్రన్ కల్చర్‌ను కలగలిపి అదరగొట్టారు. వేడుకల కోసం వారం రోజులపాటు మెడికోలు, ఫ్యాకల్టీలకు క్రీడా పోటీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్(డీఎంఈ) డాక్టర్ ఎ.నరేంద్రకుమార్, హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. వైద్య విద్యార్థులు రోల్ మోడల్‌గా నిలవాలని ఆకాంక్షించారు. సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ప్రిన్సిపాల్ హిమబింద్‌సింగ్, వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, ప్రొఫెసర్లు అరుణ, ఓబులేశ్, అశోక్‌కుమార్, ఎస్సై భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వనిత..
అన్నింటా ఘనత‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి ● ఉమెన్స్‌డే కథనాలను పరిశీలించి ఫైనల్ చేసిన ఏఎస్పీ ● కథనాల పరిశీలన.. ఎంపికపై పలు సూచనలు ● పత్రిక సిబ్బంది కృషి అభినందనీయమన్న ఐపీఎస్ఆడపిల్ల పుట్టిందంటే భయపడే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడపిల్లను మహాలక్ష్మిగా కొలుస్తున్నారు. ఊర్లో.. అమ్మాయి పుడితే లక్ష్మీ వచ్చిందంటున్నారు. ఆమె ఒక తల్లి.. కూతురు.. సోదరి.. భార్య.. వీటన్నింటికీ మించి పోరాట యోధురాలు. ఆమె పుట్టుక ఆనందం. ఆమె ఓపికకు వందనం. ఆమె లేనిదే జననం లేదు. ఆమె లేనిదే జీవితం లేదు.. ఈ ప్రపంచానికి మనుగడే లేదు. అన్నింటా ఆమే.. అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. చదువులో అగ్రస్థానంలో నిలుస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఆవకాయ పెట్టడం నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా నారీ శక్తి కనిపిస్తోంది. కుటుంబానికి తోడుగా నిలుస్తూ.. కష్టాల్లో ఉన్న బతుకుబండిని లాగుతోంది. ఆమె ఆకాశంలో సగం కాదు.. ఇప్పుడు ఆమే ఆకాశం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనాలు.పత్రికా సిబ్బంది శ్రమ తెలిసిందిఅంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా గెస్ట్ ఎడిటర్‌గా కరీంనగర్ సాక్షి యూనిట్ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉంది. మనం ఉదయం చదివే దినపత్రికల కోసం 24 గంటలపాటు ఎన్నివ్యవస్థలు పనిచేస్తాయన్న విషయం ఈ రోజు ప్రత్యక్షంగా చూసే వీలుకలిగింది. వార్తల ఎడిటింగ్, ప్రాధాన్యం, పేజీనేషన్, ప్రాసెసింగ్, ప్రింటింగ్ తదితర అంశాలపై సిబ్బంది పడుతున్న శ్రమ వెలకట్టలేనిది. ఈరోజు స్వయంగా వార్తలను ఎంపిక చేయడం, ఎడిటింగ్ చేయడం ప్రత్యేక అనుభూతి కలిగించింది. ఈ అవకాశం ఇచ్చిన సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు. మరోసారి సాక్షి పాఠకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – శేషాద్రినిరెడ్డి, ఏఎస్పీ, వేములవాడ -
అమ్మ ప్రోత్సాహంతో సహన ఐఏఎస్
సప్తగిరికాలనీ(కరీంనగర్): సివిల్స్ కొట్టాలన్న కూతురు లక్ష్యానికి వెన్నంటే నిలిచింది ఆ తల్లి.. ఒకసారి ఫెయిలైనా.. రెండోసారి సాధించకున్నా.. సరే అమ్మా అధైర్యపడకూ అంటూ వెన్ను తట్టింది. నువ్వు సాధించగలవు అంటూ ప్రోత్సహించింది. నాలుగోసారి ప్రయత్నంలో ఆ కూతురు ఐఏఎస్ సాధించగా.. ఆ సక్సెస్‌లో తన తల్లి కీలకమంటోందా కూతురు. కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కొలనుపాక సహన 2023 బ్యాచ్ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై ంది. తన తల్లి గీత ఇచ్చిన స్ఫూర్తే ఇందుకు కారణమని చెబుతోంది. సహన హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఏడాదిపాటు ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంది. తరువాత స్థానికంగానే సివిల్స్‌కు సన్నద్ధమైంది. నాలుగో ప్రయత్నంలో తన లక్ష్యాన్ని సాధించింది. 739వ ర్యాంకు సాధించి ప్రస్తుతం శిక్షణలో ఉంది.తల్లి గీతతో కూతురు సహన -
ఆడబిడ్డకు అండగా ‘మా ఊరి మహాలక్ష్మి’
గంగాధర(చొప్పదండి): కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలు. పెళ్లికెదిగిన ఆడబిడ్డ భారమవుతుందని తల్లిదండ్రుల ఆవేదనలు. ఊరంతా చందాలు వేసుకొని ఓ ఆడబిడ్డ పెళ్ల్లి చేసిన సంఘటన.. ఓ యువకుడిని ఆలోచింపజేశాయి. మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు కు పునాది వేశాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయిపల్లికి చెందిన రేండ్ల శ్రీనివాస్–పద్మ దంపతులు తమ గ్రామంలోని ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు ఏడేళ్ల క్రితం మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. గ్రామంలో జన్మించిన ప్రతీ ఆడ బిడ్డ పేరుమీద ఫౌండేషన్ తరఫున రూ.5,116, తల్లిదండ్రుల నుంచి రూ.5,000 సేకరించి సుకన్య సమృద్ధి యోజనలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటివరకు 54 మంది ఆడపిల్లల పేరిట డిపాజిట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తండ్రిని కోల్పోయిన కుటుంబాలకు దాతల సహకారంతో ఆర్థికంగా అండగా నిలుస్తున్నా రు. ఏడాదిగా ఆడపిల్లల పెళ్లికి కానుకలు అందిస్తున్నారు. -
ఆ నలుగురు.. ‘సిరి’ వెలుగులు
సిరిసిల్ల: సిరిసిల్ల కార్మికవాడల్లో ఏ గడప తట్టినా.. కష్టాలు, కన్నీళ్లు. 2008లో వరుస ఆత్మహత్యలతో కార్మికక్షేత్రం తల్లడిల్లింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ సందీప్‌కుమార్ సుల్తానియా సిరిసిల్లలో ఉండే విధంగా ఆదేశించారు. ఆత్మహత్యలు ఆగాలని స్పష్టం చేశారు. ఆర్డీవో ఆఫీస్ లోనే మకాం వేసిన కలెక్టర్ ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించారు. పేదరికం, పనిఒత్తిడి, మానసికవేదన, అప్పులేనని నిర్ధారించారు. వారిలో ధైర్యం నింపేందుకు ఓ నలుగురు మహిళలను నియమించారు. వారు క్షేత్రస్థాయిలో ఇల్లిల్లు తిరుగుతూ బాధల్లో ఉన్న కార్మికులకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ఆ నలుగురే రాపెల్లి లత, బూర శ్రీమతి, వేముల అన్నపూర్ణ, కొండ ఉమ. వీరిని చేనేత జౌళిశాఖ ద్వారా నియమించారు. నిత్యం కార్మికవాడల్లో తిరుగుతూ కౌన్సెలింగ్ నిర్వహించారు. 16 ఏళ్లుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేసేవారికి ఆ నలుగురు అండగా నిలిచారు. కార్మికవాడలైన బీ.వై.నగర్, సుందరయ్యనగర్, తారకరామనగర్, ఇందిరానగర్, పద్మనగర్, గణేష్‌నగర్, నెహ్రూనగర్, శాంతినగర్, ప్రగతినగర్‌లోని కార్మికుల ఇళ్లకు వెళ్తూ వారి కష్టసుఖాలు తెలుసుకోవడవం, కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లు చేయడం వీరివిధి. సైకాలజిస్ట్ పున్నంచందర్‌తో కలిసి మనోవిసాకాన్ని కలిగించేందుకు అనేక సదస్సులు నిర్వహించారు. అర్హులైన నేతకార్మికులకు అంత్యోదయ కార్డులు, పెన్షన్లు, రేషన్ కార్డులు, నేతన్నలకు బీమా పథకాలను ఇప్పించడం, వైద్యం చేయించడం వంటి సామాజిక సేవలో ఆ నలుగురు ముందుకు సాగుతున్నారు. -
ఐపీఎస్‌ల బదిలీలు
● రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా ● కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం ● సిరిసిల్ల ఎస్పీగా గిటే మహేశ్సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు ఐపీఎస్‌లను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామగుండం పోలీస్ కమి షనర్‌గా అంబర్ కిశోర్ఝాను నియమించింది. రా మగుండం సీపీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను సీఐడీ ఐజీగా బదిలీచేశారు. కరీంనగర్ సీపీగా గౌస్ ఆలంను నియమించగా, ఇక్కడ పనిచేస్తున్న అభిషేక్ మ హంతిని తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేశారు. సిరిసిల్ల ఎస్పీగా మహేశ్బాబాసాహెబ్ను నియమించారు. ఇక్కడ పనిచేస్తున్న అఖిల్మహాజ న్ను ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న పి.కరుణాకర్‌ను పెద్దపల్లి డీసీపీగా నియమించారు. పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న చేతన హైదరాబాద్‌లోని ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ అయ్యారు. అంబర్ కిశోర్ ఝా.. 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంబర్ కిశోర్ ఝా 2011లో మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ ఏఎస్పీగాను, 2012 వరంగల్ ఓఎస్డీ, అదనపు ఎస్పీగాను పనిచేయడంతో పాటు 2014లో వరంగల్ ఎస్పీగానూ పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు ఆవిర్భావం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం తొలి ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా, ఇదే సంవత్సరంలో కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహించారు. 2013 అక్టోబరులో వరంగల్ కమిషనర్‌గా పనిచేశారు. గౌస్ ఆలం.. 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్ సీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ములుగు ఎస్పీగా పనిచేశారు. అంతకుముందు అక్కడే ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. కాగా.. అంతకుముందు ఏటూరునాగారంలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఈయన బిహార్ రాష్ట్రంలోని గయాకు చెందినవారు. ఐఐటీ ముంబాయ్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. గిటే మహేశ్ 2020 బ్యాచ్‌కు చెందిన గిటే మహేశ్ అహమదా బాద్ వాసి. తల్లిదండ్రులు కౌలు రైతులు. అగ్రికల్చ ర్ గ్రాడ్యుయేట్ అయిన మహేశ్‌ది పేద కుటుంబమైనా కష్టపడి చదివి ఐపీఎస్ సాధించారు. తెలంగా ణకు కేడర్‌కు కేటాయించాక.. కరీంనగర్లో ట్రైనీగా విధులు నిర్వహించారు. చొప్పదండి ఎస్‌హెచ్‌వోగా ఆరునెలలపాటు పనిచేశారు. ఆయన ప్రస్తుతం ములుగు ఓఎస్డీగా ఉన్నారు. ఈయనకు ప్రస్తుతం సిరిసిల్ల ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. -
స్నేక్.. షేక్
కరీంనగర్‌రూరల్: సాధారణంగా మహిళలు బల్లి కనిపిస్తేనే అమ్మో అంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ మహిళ ఎలాంటి భయం లేకుండా పాములు పట్టడమే వృత్తిగా ఎంచుకుంది. కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లిలోని చంద్రపురికాలనీకి చెందిన షేక్ సయిదా భర్త ఖాజామియా 15ఏళ్లక్రితం డెంగీతో చనిపోయాడు. కుటుంబపోషణ కోసం పాములు పడుతోంది. చిన్నప్పుడు తండ్రి సయ్యద్‌బాబా వద్ద నేర్చుకున్న పాములను పట్టడమే వృత్తిగా మార్చుకుంది. తమ ప్రాంతంలో పాము వచ్చిందని ఎవరైనా ఫోన్‌చేస్తే రాత్రి పగలు లేకుండా అక్కడికి చేరుకుంటోంది. పాములు పట్టినందుకు వారు ఇచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. పట్టుకున్న పాములను అటవీ శాఖ అధికారులకు అప్పగించడం, లేదా అటవీప్రాంతంలో విడిచిపెట్టడం చేస్తోంది. సయిదా ప్రస్తుతం అద్దెఇంట్లో ఉంటోంది. పాముకాటుకు గురైతే తన కుటుంబ పరిస్థితి ఏంటని ఆవేదనవ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఆదుకునేందుకు సాయం చేయాలని కోరుతోంది. -
చెప్పలేను
26బొగ్గుగనిలో సీ్త్ర శక్తిగోదావరిఖని(రామగుండం): సింగరేణికి సీ్త్ర శక్తి తోడైంది. ఇప్పటివరకు పురుష రంగానికే పరిమతమైన సింగరేణి మైనింగ్‌లో మహిళలు అడుగీడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతో మహిళలకు సింగరేణి ఉపాధి అవకాశాలను మరింత పెంచింది. కేవలం కార్యాలయాల్లోనే కాకుండా భూగర్భ గనుల్లో పనిచేసే ఇంజినీర్లు, అండర్ మేనేజర్లుగా పెద్ద సంఖ్యలో మహిళలు చేరారు. ప్రస్తుతం సంస్థలో 201 మంది అధికారిణులుగా 1,794 మంది మహిళా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా రెండు గనులు ఏర్పాటు చేయాలని యాజమాన్యం భావిస్తోంది. సంస్థలో తొలి మహిళా రెస్క్యూ బ్రిగేడియర్‌గా కొత్తగూడెం పీవీకే–5గనికి చెందిన అండర్‌మేనేజర్ అంబటి మౌనిక ఎంపికై ంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ జీఎంగా సింగరేణి చరిత్రలోనే తొలిసారి మహిళా అధికారి కవితనాయుడు సమర్థవంతంగా రాణిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లీష్మెంట్– సీఎస్సార్ జీఎంగా తొలిసారి మరో మహిళా నికోలస్ బెనడిక్ట్, సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించే కంపెనీ సెక్రటరీగా సునీతాదేవి, న్యాయ విభాగం బాధ్యతలను డిప్యూటీ జీఎం హోదాలో శిరీషరెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా డాక్టర్ సుజాత విధులు నిర్వర్తిస్తున్నారు. -
క్రీడల్లో చిరుత.. చికిత
కరీంనగర్‌స్పోర్ట్స్: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన టి.చికిత విలువిద్య(ఆర్చరీ)లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తోంది. చిన్న వయస్సులోనే వరల్డ్‌కప్‌లో పాల్గొంటూ పతకాల పంట పండిస్తోంది. ప్రస్తుతం పంజాబ్‌లోని సోనీపట్‌లో శిక్షణ పొందుతోంది.చికిత తండ్రి శ్రీనివాస్‌రావు రైతు. తల్లి శ్రీలత గృహిణి. మార్చి తొలివారంలో బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో కాంస్యం సాధించింది. ఏప్రిల్‌లో ఫ్లోరిడాలో జరగనున్న వరల్డ్‌కప్ స్టేజ్–1, మేలో చైనాలో జరిగే వరల్డ్‌కప్ స్టేజ్– 2 పోటీలకు సిద్ధమవుతోంది. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధిస్తానని చెబుతోంది. -
ఫాస్ట్‌బౌలర్.. శ్రీవల్లి
ఇల్లంతకుంట/కరీంనగర్ స్పోర్ట్స్ : చిన్ననాటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకొని జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటుతోంది కట్ట శ్రీవల్లిరెడ్డి. ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన కట్ట లక్ష్మారెడ్డి– ఉమ దంపతుల చిన్న కూతురు శ్రీవల్లిరెడ్డి మూడో తరగతి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. కూతురు ఇష్టం మేరకు లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో ప్రత్యేక కోచింగ్ ఇప్పించగా, పాస్ట్ బౌలింగ్‌లో మెలకువలు నేర్చుకుంది. 2019లో మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి పాఠశాల క్రీడా ఫెడరేషన్ క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. 2022లో పూణెలో నిర్వహించిన అండర్– 19 బాలికల క్రికెట్ పోటీల్లో హెచ్‌సీఏ తరఫున పాల్గొంది. ఈ జనవరిలో త్రివేండ్రంలో నిర్వహించిన బీసీసీఐ ఉమెన్స్ అండర్–19 వన్డే ట్రోఫీలో, 2024 డిసెంబర్లో అహ్మదాబాద్‌లో నిర్వహించిన సీనియర్ ఉమెన్ వన్డే టోర్నీలో హైదరాబాద్ తరఫున ప్రాతినిఽథ్యం వహించింది. కాగా.. శ్రీవల్లి కోసం తన తండ్రి ఊరు వదిలి కరీంనగర్, హైదరాబాద్‌లో ఉంటున్నారు. -
పురుషులకు దీటుగా..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీకి చెందిన పింగిళి కృష్ణారెడ్డి–స్వర్ణలత దంపతులకు ఇద్దరు కూతుర్లు. కృష్ణారెడ్డి జేఎన్టీయూ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్. ఆడపిల్లలనే భావనలేకుండా తన కూతుళ్లను పురుషులు దీటుగా చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దారు. పెద్ద కూతు రు స్మిగ్ధ స్థానికంగా 10వ తరగతి, ఇంటర్, హైదరాబాద్‌లో బీటెక్(మెకానికల్) పూర్తి చేసింది. అమెరికాలో ఎమ్మెస్సీ చేసి ప్రస్తుతం హెచ్1బీ వీసా మీద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. చిన్న కూతురు స్నిగ్ధ స్థానికంగా పది, ఇంటర్, ఫామ్ డీ పూర్తి చేసి డాక్టర్ పట్టా పొందింది. అమెరికాలో ఎమ్మెస్సీ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. -
ఉంది 02
లేదు 91ఉమ్మడి జిల్లాలోని పలువురు మహిళలు ఇంటా, బయట, ఆఫీసుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా.. సుమారు 100 మంది వెల్లడించిన అభిప్రాయాలు ఇలా..1మీ ఇంట్లో ఆడ–మగ వివక్ష ఉందా?07చెప్పలేను 2అవును 04పనిచేస్తున్న కళాశాల, పని ప్రదేశంలో వివక్ష ఎదుర్కొంటున్నారా?లేదు 7818●3బస్టాప్ 33మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం?కళాశాల/ ఆఫీసు 08సెల్ఫోన్లో వచ్చే మెసేజ్‌లు4తెలియని వారు 14మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు?తెలిసిన వారే 2759చెప్పలేను5అవును 27ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో ఉద్యోగరీత్యా మహిళగా ఇబ్బందులు తలెత్తుతున్నాయా?లేదు 47 -
అన్ని రంగాల్లో ముందున్నారు
పెద్దపల్లిరూరల్: సమాజంలో వేగంగా వస్తున్న మార్పులకు తగ్గట్టు సాంకేతిక రంగంలోనూ ప్రతిభ, నైపుణ్యాలతో ముందుంటున్నారు. వాస్తవానికి పురుషులకంటే మహిళల్లోనే మానసిక స్థైర్యం ఎక్కువ. పాతికేళ్ల పాటు పుట్టింట్లో ఉండి, పెళ్లి తర్వాత మెట్టినింట్లో తనకు అంతగా పరిచయం లేనివారి నడుమ ధైర్యంగా జీవించగలుగుతుంది. చదువులో రాణిస్తున్న మహిళలకు న్యాయవ్యవస్థలో ఉద్యోగాలు కల్పించడంలో ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆర్థికావసరాలు పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో పెళ్లి అయిన కొన్నాళ్లకే విడాకుల వరకు వస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లకు లోనై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చేందుకు యత్నిస్తున్నాం. – కె.స్వప్నరాణి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, పెద్దపల్లి -
వనిత.. అన్నింటా ఘనత
ఊరిపై మమకారం.. సేవకు శ్రీకారంచిన్న హోటల్.. పెద్ద బాధ్యత రామగిరి(మంథని): ఊరిపై మమకారంతో సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు రేండ్ల శారద. మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన శారద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అదే గ్రామానికి చెందిన రేండ్ల కుమార్స్వామితో వివాహం జరిగింది. మహిళల నిరుద్యోగ సమస్య, ఆర్థిక ఇబ్బందులను చూసి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని భర్త సహకారంతో ఆర్ఎస్కే ఆపన్న హస్తం ఏర్పాటు చేశారు. దాని ద్వారా గ్రామంలోని మహిళలకు ఉచితంగా పరికరాలు అందించారు. మహిళలకు కుట్లు–అల్లికలు, బ్యూటిషియన్, కుట్టు మిషన్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. న్యాక్ సంస్థ ద్వారా సొంత ఖర్చులతో సర్టిఫికెట్స్‌ను అందించారు. ఒక్కో విడతలో సుమారు 40 మందికి మూడు నెలల పాటు శిక్షణ అందిస్తున్నారు. ‘ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్‌లు పూర్తి చేశాం. ప్రస్తుతం ఐదో బ్యాచ్ కొనసాగుతుంది. నా భర్త సహకారంతో సేవ చేయడం తృప్తిగా ఉంది’.. అని శారద వెల్లడించారు. మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం ఆత్మనగర్‌కు చెందిన బట్టు సుశీల చిన్న హోటల్ నడిపిస్తూ తన కుమారుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దింది. సుశీల, భర్త గంగరాజు గ్రామంలో హోటల్ నడిపించేవారు. 16 ఏళ్ల క్రితం గంగరాజు గుండెపోటుతో మృతిచెందాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అతడు చనిపోయిన సమయంలో పిల్లలంతా చిన్నవారే. అప్పటి నుంచి సుశీల నలుగురు పిల్లల బాధ్యతను మోసింది. ప్రస్తుతం పెద్దకుమారుడు సుమన్ ఆర్మీలో పనిచేస్తుండగా, చిన్న కొడుకు రంజిత్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు కూతుళ్ల వివాహం చేసింది. -
రామగుండం రైల్వేస్టేషన్లో అన్ని రైళ్ల హాల్టింగ్
రామగుండం/పెద్దపల్లిరూరల్: ఇండస్ట్రియల్ హబ్ రామగుండం రైల్వేస్టేషన్లో అన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తా మని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. రామగుండం రైల్వేస్టేషన్లో చేప ట్టిన అభివృద్ధి పనులు, పెద్దపల్లి రైల్వే వంతెన పనులను ఎంపీ శుక్రవారం పరిశీలించారు. నాలుగేళ్ల క్రితం కరోనా నుంచి రద్దయిన బల్హార్షా –కాజీపేట రైలును పునరుద్ధరించామన్నారు. హైదరాబాద్ నుంచి హ జ్రత్ నిజాముద్దీన్ వెళ్లే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌కు రామగుండంలో హాల్టింగ్ పునరుద్ధరణ, గంగా కావేరి, నవజీవన్, మిలీనియం, తమిళనాడు తదితర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దశల వారీగా హాల్టింగ్ కల్పించేందుకు చ ర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతినిధులు అనుమాస శ్రీనివాస్, గడ్డం మధు, కొంగర శ్రీనివాస్, మహ్మద్ అజీం, సాధిఖ్ పాల్గొన్నారు. -
నేడు మహిళా సమాఖ్యలకు బస్సులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి. మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు కేటాయించడం ద్వారా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 మండల మహిళా సమాఖ్యలను ఎంపికచేశారు. ఈ జాబితాలో ఉమ్మ డి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐదు మండల మహిళా సమాఖ్యలకు అవకాశం దక్కడం గమనార్హం. శని వారం రవాణామంత్రి పొన్నం ప్రభాకర్, సీ్త్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమాఖ్యల కు బస్సులు కేటాయించనున్నారు. ఎన్ఆర్ఎల్ఎం సాయంతో.. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్య లకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈ పథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లెవెలుగు) బస్సులు కొంటారు. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరుమీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. వీటి నిర్వహణ ఆర్టీసీ చూసుకుంటుంది. నెలనెలా రూ. 77,220 చొప్పున ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ యాజమాన్యం చెల్లిస్తుంది. ఎంపికై న సంఘాలివే.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో పెద్దపల్లి జిల్లాల్లో 9, రాజన్న సిరిసిల్లకు 9, కరీంనగర్‌కు 14, జగిత్యాలకు 15 సమాఖ్యలు ఉన్నాయి. ఇందులో శనివారం జగి త్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీచైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాతా సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు మంత్రుల చేతులమీదుగా కొత్త బస్సులు అందుకోనున్నాయి. -
అక్కాచెల్లెల్లు.. సర్కారు నౌకర్లు
జ్యోతినగర్: ఆడ పిల్లలను అధైర్య పడలేదు. కొడుకుల కన్నా ఎక్కువగా చదివించారు. ప్రయోజకులను చేశారు. ఆ తల్లిదండ్రుల కష్టాన్ని ఆ ఆడబిడ్డలు విస్మరించలేదు. కష్టపడి చదివారు. అందరూ ప్రయోజకులు అయ్యారు. సర్కారు కొలువులు కొట్టారు. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న సింగరేణి మాజీ ఉద్యోగి మల్లేపల్లి పోచం– లక్ష్మీ దంపతులకు నలుగురు కూతుర్లు శ్రీమతి, తులసీ, శైలజ, జ్యోతి. పెద్ద కూతురు మల్లెపల్లి శ్రీమతి కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. రెండో కూతురు మల్లెపల్లి తులసీదేవి స్కూల్ అసిస్టెంట్ రామగుండంలో విధులు నిర్వహిస్తున్నారు. మూడో కూతురు మల్లేపల్లి శైలజ అంతర్గాం మండల పరిషత్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగో కూతురు మల్లుపల్లి జ్యోతి బ్యాంకు మేనేజర్‌గా కొనసాగుతున్నారు. -
సఖి కేంద్ర భవనం ప్రారంభించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం ● జిల్లా కేంద్రంలో విస్తృత పర్యటన పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని సఖి కేంద్ర భవనం ప్రారంభించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. నూతనంగా నిర్మించిన సఖి కేంద్ర భవనాన్ని పరిశీలించారు. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల మరమ్మతులపై ఆరా తీశారు. బండారికుంటలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రం, జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షల కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రి, మాతాశిశు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. యూఆర్ఎస్లో వసతులు, ఆహార నాణ్యతను పరిశీలించారు. మానసిక దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వ సాయం గురించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ తీరుపై ఆయన ఆరా తీశారు. పాత భవనం కూల్చివేయండి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవనాన్ని నిర్మించుకునేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న పాత భవనం కూల్చే పనులు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. పాత ఆస్పత్రిలోని ఇన్పే షెంట్లను కొత్తగా నిర్మించిన 42 పడకల ఆస్పత్రికి తరలించాలని సూపరింటెండెంట్ శ్రీధర్‌కు సూచించారు. పేషెంట్లకు అందిస్తున్న ఆహారనాణ్యతను పరిశీలించారు. ఆవరణను శుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో వేణుగోపాల్, ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. 10 నుంచి శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ గ్రామ పంచాయతీల్లో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు పారిశుధ్యం నిర్వహణపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. మైదానాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించకుండా శుభ్రం చేయాలన్నారు. పిచ్చి మొక్కలను తొలగించాలని, డ్రైనేజీలను శుభ్రం చేయాలన్నారు. పల్లెప్రకృతివనం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, నర్సరీ, క్రీడాప్రాంగణాలు శుభ్రం చేయాలని సూచించారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ చేపట్టాలని ఆయన అన్నారు. మాంసాహారం విక్రయించే దుకా ణాల్లో నాణ్యమైన మాంసం అందేలా చూడాలన్నారు. తాగునీటి సరఫరా పైప్‌లైన్ లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వాటర్టాంకుల్లో క్లోరినేషన్ చేసి తాగు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. -
ఎములాడ రాజన్న సేవలో..
వేములవాడ: దైవకార్యంలో మేము సైతం అంటూ మహిళలు ముందుకు సాగుతున్నారు. సొంత ఖర్చులతో వేములవాడకు చేరుకుని హుండీ లెక్కింపులో, భక్తుల సేవలో తరిస్తున్నారు. ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు సొంత ఖర్చులతో రాజన్న సన్నిధికి చేరుకుని సేవలందిస్తున్నారు. ఇందులో ప్రధానంగా శ్రీలలితా సేవా ట్రస్టు, శివరామకృష్ణ భజన మండలి, శ్రీరాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు దశాబ్దానికిపైగా రాజన్న సేవలో తరిస్తున్నారు. ప్రతీసారి జరిగే హుండీ లెక్కింపుతో పాటు అన్ని పర్వదినాలు, రద్దీ రోజుల్లోనూ వీరు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి వందల సంఖ్యలో సేవా సమితి సభ్యులు వస్తుంటారు. గురువారం నాటి హుండీ కౌంటింగ్‌లో సుమారు 550మంది మహిళలు పాల్గొన్నారు. ‘మహిళలు ఆలయంలో అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. వారి సేవలకు కృతజ్ఞతగా మధ్యాహ్న భోజనం, రెండు లడ్డూలు, స్వామి వారి దర్శనం కల్పిస్తున్నాం’. అని ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి పేర్కొన్నారు. -
పెర్క్స్‌పై ఆదాయపు పన్ను మాఫీకి గ్రీన్‌సిగ్నల్
గోదావరిఖని: కోలిండియాలో అమలవుతూ సింగరేణిలో లేనిపెర్క్స్పై ఇన్‌కంట్యాక్స్ మాఫీకి సింగరేణి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం సీఎండీ బ లరాంతో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధా న కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ హై దరాబాద్ స్ట్రక్చరల్ మీటింగ్‌లో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంగీకరించిన డిమాండ్లు.. ● కార్మికులందరికీ వర్తించే పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్ మాఫీకి సింగరేణి అంగీకరిస్తూనే ప్రత్యేక కమిటీ వేశారు. ● సొంతింటి పథకం అమలుకు యాజమాన్యం అంగీకరించింది. దీనిపై విధివిధానాలు రూపొందించడానికి కమిటీ ఏర్పాటు చేశారు. ● హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆస్పత్రి ఏర్పాటుకు యాజమాన్యం అంగీకరించింది. రిటైర్డ్ అయి హైదరాబాదులో ఉన్నవారికి ట్యాబ్లెట్లు సింగరేణి భవన్లో ఇచ్చేందుకు అంగీకరించారు. ● రిటైర్డ్ అయిన కార్మికులు కంపెనీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినప్పటికీ 40శాతం కటింగ్ చేయరు. ● మెన్స్, డిపార్ట్మెంట్లలో కార్మికులకు లాకర్స్, కబోర్డ్స్, ఆఫీస్‌లో ఫ ర్నీచర్స్ మంజూరుకు అంగీకారం. ● సెక్యూరిటీ, హాస్పిటల్స్ సిబ్బంది, ఎలక్ట్రిషన్, ఫిట్టర్స్.. ఇలా అన్ని రకాల మజ్దూర్ల డిసిగ్నేషన్స్ జనరల్ మజ్దూర్ నుంచి జనరల్ అసిస్టెంట్ ట్రైనీగా ఇవ్వనున్నారు. -
ఇన్‌స్ట్రాగామ్ అశ్విని
విద్యానగర్(కరీంనగర్): ఠాకూర్ అశ్విని అలియస్ ఆశాది కరీంనగర్‌లోని భగత్‌నగర్. నగరంలోని డైలీ మార్కెట్, వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఫుట్‌పాత్‌పై సీజనల్ వ్యాపారం చేస్తుంది. మట్టికుండలు, దీపాల ప్రమిదలు, రంగుల ముగ్గులు, పచ్చడి జాడీలు, దీపాల వత్తులు అమ్ముతుంది. రెండేళ్ల కిత్రం వ్యాపార అభివృద్ధి కోసం తొలిసారిగా ఆమె అమ్మే వస్తువుల గురించి రీల్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయగా వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దీంతో మరిన్ని రీల్స్ చేసి పోస్ట్ చేసింది. వాటికి కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా స్పందన రావడంతో సినిమా పాటలు, జానపద గేయాలు, భక్తి, రోమాంటిక్, ప్రేమ, ఎడబాటు తదితర అంశాలపై రీల్స్ చేయడం మొదలు పెట్టగా వాటికి కూడా లక్షల్లో వ్యూస్ రావడం, ఆరో తరగతి వరకే చదివిన ఆశాకు భర్త, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం తోడవడంతో రీల్స్‌పై మక్కువ పెంచుకుంది. రెండేళ్లలో 600 వరకు రీల్స్ చేసింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నా రీల్స్ చూసిన డైరెక్టర్లు చాలా మంది వారి సినిమాల్లో అడిగారు. కీ రోల్ పాత్రలు వస్తే తప్పకుండా చిన్న, పెద్ద సినిమాల్లో చేస్తాను’ అని ఠాకూర్ అశ్విని వెల్లడించింది. సిరిసిల్లక్రైం: మహిళలు, విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారులు పోలీస్ అక్క పేరిట జిల్లాలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్‌ను కేటాయించారు. 2024 డిసెంబర్లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలను మమేకం చేస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వేధింపులకు గురైతే బాధితులు ఇంట్లో మనిషి మాదిరిగా పోలీస్ అక్కకు చెప్పుకునేలా విధివిధానాలు ఖరారు చేశారు. పోలీస్ అక్క కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 220 అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన పోలీసులు నాలుగు ఫిర్యాదులు స్వీకరించారు. అందులో మూడు ఈ–పెట్టి కేసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారిక గణంకాలు ఉన్నాయి.బాధితులకు అండగా ‘పోలీస్ అక్క’ -
ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ కనుమరుగే
పెద్దపల్లిరూరల్: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీకి అధికారం అప్పగించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకు ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శమని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. పట్టణంలోని అమర్‌నగర్ నుంచి జెండా వరకు గురువారం విజయోత్సవర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాషాయజెండా రెపరెపలాడేలా తీర్పునిచ్చిన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కనుమరుగు కాక తప్పదన్నారు. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపూరిత పాలనతో విసిగి వేసారి పోయారన్నారు. దేశంలో మోదీ నీతివంతమైన పాలననే కోరుకుంటున్నారని, రాష్టంలోనూ బీజేపీ కే పట్టం కట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. నాయకులు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, కందుల సంధ్యారాణి, ఠాకూర్ రాంసింగ్, పెంజర్ల రాకేశ్, రమేశ్, గనెబోయిన రాజేందర్, జంగ చక్రధర్‌రెడ్డి, రాజం మహంత, సదానందం, పర్శ సమ్మయ్య, శ్రీనివాసరావు, రమేశ్, నరేశ్, కుమార్, రవి తదితరులున్నారు. -
కనీస వేతనం ఇవ్వాల్సిందే
పెద్దపల్లిరూరల్: కార్మికులకు ప్రతి నెలా కనీసవేతనం రూ.26వేలు చెల్లించాలని, ఈ మేరకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుమారస్వామి, ముత్యంరావు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసవేతనా ల నిర్ణయాన్ని అశాసీ్త్రయంగా చేసిందని ఆరోపించారు. 2024 జనవరి 29న విడుదల చేసిన డ్రాఫ్ట్‌లను సవరించాలని పేర్కొన్నారు. ఐదేళ్లకోసారి కాలవ్యవధి పూర్తయినా సవరించకపోవడం దారుణమన్నారు. దీంతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. యజమాన్యాలకు మేలు చేసేలా పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కనీసవేతనాల సలహా మండలిలో కార్మి కుల సమస్యలపై నిరంతరం పోరాడే సంఘాల కు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయమన్నారు. నాయకులు భిక్షపతి, రామాచారి, సీపెల్లి రవీందర్, అంజయ్య, అరవింద్, శంకర్, లక్ష్మారెడ్డి, బ్రహ్మచారి, మహేందర్, ఖాజా, లక్ష్మీనారా యణ, ఉపేందర్, సాగర్, మల్లేశ్, తిరుపతి, మహేశ్, గట్టయ్య, చందు, తదితరులున్నారు. -
దంతవైద్య దినోత్సవం
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో గురువారం దంతవైద్య దినోత్సవాన్ని నిర్వహించారు. కేక్ కట్ చేసి సిబ్బందిని సత్కరించారు. ఆసుపత్రిలో దంత వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు విజయ్, సుస్మిత, ఆర్ఎంవో, సీనియర్ డాక్టర్లకు అభినందనలు తెలిపారు. నిండు గర్భిణికి శస్త్రచికిత్స కాటారం మండలానికి చెందిన నిండు గర్భిణికి ప్లేట్లెట్స్ కేవలం 74వేలు మాత్రమే ఉన్నట్టు వైద్యులు గుర్తించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. దీంతో ఆమె బంధువులకు కౌన్సెలింగ్ నిర్వహించి కావాల్సిన జాగ్రత్తలతో గురువారం శస్త్రచికిత్స చేసినట్టు పేర్కొన్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన వైద్యబృందాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారని తెలిపారు. 10న అప్రెంటిస్ మేళాపెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో ఈనెల 10న ఏ ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తెలిపారు. మేళాలో తోషిబా, ఎల్అండ్టీ, జాన్సన్ లిఫ్ట్స్ ఇండియా, టాటా ఏరోస్పేస్, వరుణ్‌మోటార్స్, ఆదర్శ మోటార్స్, రాజే ఇంజిన్వాల్వ్, ఐటీసీ టెక్నాలజీస్ తదితర కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు అప్రెంటీస్ వెబ్సైట్లో తగిన ధ్రువపత్రాలతో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. సోమవారం నిర్వహించే మేళాకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 99896 16132, 97031 13881 నంబర్లలో సంప్రదించాలన్నారు. విద్యుత్ మీటర్ సీల్ తొలగిస్తే చర్యలుపెద్దపల్లిరూరల్: విద్యుత్ వినియోగం కోసం ఏర్పాటు చేసుకున్న మీటర్లకు సంబంధిత అధికారులు వేసిన సీల్‌ను తొలగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎండీ బాబా అన్నారు. ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు విద్యుత్ వినియోగదారుల వద్దకు వచ్చి మీటరు తిరగకుండా చేసి విద్యుత్ వాడుకునేలా చేస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. సదరు వ్యక్తులు మీటరుకు అమర్చిన కొన్ని వైర్లను కత్తిరించినట్లు గుర్తించామని వివరించారు. మీటరు వైర్లను కత్తిరించడం, సీల్‌ను తొలగించడాన్ని నేరంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మీటరు తిరగకుండా చేస్తామంటూ వచ్చే అపరిచితులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. కోలిండియాలో మహిళా సంక్షేమ కమిటీగోదావరిఖని(రామగుండం): కోలిండియాలో మహిళా సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కోలిండియాలోని అన్ని సంస్థలకు ఆదేశాలిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సాధికారిత సాధించేందుకు ఈ ఆదేశాలు వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ–7 గ్రేడ్ సీనియర్ ఉన్నతస్థాయి మహిళా ఎగ్జికూటివ్ అధికారిని ఆధ్వర్యంలో మహిళల సమస్యలు పరిష్కరించేందుకు పర్సనల్ విభాగం ద్వారా కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా ఈఉత్తర్వులను సింగరేణిలో వెంటనే అమలు చేయాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. -
సైబర్ వలలో పడొద్దు
పెద్దపల్లిరూరల్: సైబర్ నేరగాళ్ల వలలో పడి నష్టపోవద్దని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైం ఏసీపీ వెంకటరమణ అన్నారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ ఐటీఐలో గురువారం విద్యార్థులకు సైబర్ నేరాలపై (క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయి న్స్, మల్టీలెవల్ మార్కెటింగ్ ఫ్రాడ్స్) ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి అవగాహన కల్పించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులు అంటూ బెది రించి సొమ్ము మాయం చేస్తున్నారని, పోలీసులు డిజిటల్ అరెస్టు చేయరనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. డిజిటల్ అరెస్టు కాల్స్ వస్తే స్పందించాల్సిన పద్ధతులపై వివరించారు. వెంటనే 1930 కు సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్‌పై అవగాహన పెద్దపల్లిలోని వ్యాన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు గురువారం షీటీం బృందం సభ్యులు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. షీటీం ఇన్చార్జి ఎస్సై లావణ్య, సభ్యురాలు స్నేహలత మాట్లాడారు. ఆన్లైన్ మోసాలు, సైబర్‌క్రైం, మహిళలపై వేధింపులు తదితర అంశాలపై వివరించారు. టోల్‌ఫ్రీ 100, 1930తో పాటు 63039 23700 నంబర్‌కు సమాచారం అందించి సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. సభ్యులు మౌనిక, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. సైబర్‌క్రైం ఏసీపీ వెంకటరమణ -
గుట్టలు గుల్ల..
● జోరుగా మట్టిదందా ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ ● ఒకే వే బిల్లుపై మూడునాలుగు ట్రిప్పులు ● ప్రభుత్వ ఆదాయానికి గండిపాలకుర్తి(రామగుండం): పాలకుర్తి మండల పరిధిలోని కన్నాల ఉర్సుగుట్ట, బోడగుట్ట కేంద్రాలుగా మట్టిదందా జోరుగా సాగుతోంది. ఉమ్మడి కన్నాల పరిధిలో అధికారపార్టీకి చెందిన కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు గ్రూపులుగా ఏర్ప డి మట్టిదందా నిర్వహిస్తున్నారు. కన్నాల రెవెన్యూ శివారులోని 399, 372, 493 సర్వేనంబర్లలో మట్టిని తరలించేందుకు ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థల పేరిట అనుమతులు పొంది బహిరంగ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మట్టికి మంచి డిమాండ్ ఉండటంతో దందా నిరాటంకంగా కొనసాగుతోంది. అనుమతుల వరకే అధికారులు.. మట్టి సరఫరా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల్లో పలుకుబడి కలిగిన వారికి అనుమతులు మంజూరు చేస్తున్న మైనింగ్, రెవెన్యూశాఖల అధికారులు.. అనుమతుల అనంతరం వాటి పర్యవేక్షణ విస్మరిస్తున్నారు. కనీసం ఎంత మొత్తంలో మట్టి తరలిస్తున్నారు, కేటాయించిన సర్వే నంబర్లలో మాత్రమే తవ్వకాలు జరుపుతున్నారా అనే విషయాలపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఈ దందా నిర్వాహకులకు ఆడింది ఆట, పాడింది పాటగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యవైఖరితో విలువైన ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. గుట్టలతో పాటు లువైన వృక్ష సంపద ధ్వంసం అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమంగా ఇసుక, మట్టి, మైనింగ్ నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు ఎప్పటికప్పడు ఆదేశాలు జారీ చేస్తున్నా స్థానికంగా మాత్రం అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం విశేషం. ఒక వే బిల్లు.. మూడునాలుగు ట్రిప్పులు.. ● ప్రస్తుతం మార్కెట్లో మట్టికి బాగా డిమాండ్ ఉంది. నూతన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారుల నిర్మాణానికి మట్టి అవసరం. ● దీంతో కన్నాల సమీపంలోని గ్రామాలతో పాటు పెద్దపల్లి, గోదావరిఖని, ఎన్టీపీసీ తదితర పట్టణ ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో ట్రిప్పునకు రూ.5 వేల నుంచి 6వేల వరకు వసూలు చేస్తున్నారు. ● మైనింగ్‌శాఖకు ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రూ.44 చెల్లించాలి. ఈ లెక్కన ఒక్కో లారీకి రూ.800 నుంచి రూ.900 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ● అయితే సదరు నిర్వాహకులు ఒకే వే బిల్లుపై మూడునాలుగు ట్రిప్పులు తరలిస్తున్నారు. కన్నాల శివారు నుంచి గోదావరిఖనికి దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ● కానీ వేబిల్లుపై మాత్రం దూరం 50కిలోమీటర్లుగా, చేరుకునేందుకు కావాల్సిన సమయం 4.30 గంటలుగా ఉంటోంది. ● సాధారణంగా లారీ 25కిలోమీటర్ల దూరాన్ని 20 నుంచి 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈలెక్కన 4.30 గంటల వ్యవధిలో మూడు నుంచి నాలుగు ట్రిప్పుల మట్టిని తరలించే అవకాశాలు ఉన్నాయి. ● రోజుకు దాదాపు 200 పైగా లారీ ట్రిప్పుల మట్టిని తరలిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ● కాగా ఈ విషయమై పాలకుర్తి మండల తహసీల్దార్ జ్యోతిని వివరణ కోరగా.. మండల పరిధిలోని కన్నాల శివారులో ఇద్దరికి, జయ్యారం శివారులో ఒకరికి ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలించేందుకు ఎన్ఓసీ జారీ చేశామని తెలిపారు. అయితే వే బిల్లుల అంశం మైనింగ్‌శాఖ పరిధిలో ఉంటుందని, అలాగే ఒక సంస్థ పేరుమీద అనుమతులు పొంది ఇతర ప్రాంతాలకు మట్టిని తరలించే విషయం కూడా సంబంధిత శాఖనే పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు. కనుమరుగవుతున్న ప్రకృతి సంపద అధికారులు విచ్చలవిడిగా మంజూరు చేస్తున్న అనుమతులతో ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. ఇప్పటికే కన్నాల బోడగుట్టపై విచ్చలవిడిగా మైనింగ్ కొనసాగుతుంది. దీనికి తోడు ప్రస్తుతం మటి్ట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో భవిష్యత్‌లో గుట్ట కనుమరుగుకానుంది. మరోవైపు కన్నాల ఉర్సు గుట్టపై దర్గా ఉంది. ఏటా స్థానిక ముస్లింలు ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం అదే గుట్టకు అధికారులు మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో కొంతమంది ముస్లింలు మొదట్లో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, నిర్వాహకులు అధికారపార్టీకి చెందిన వారు కావడంతో తమ పలుకుబడిని ఉపయోగించి వారిని అడ్డుకున్నారని, ఈనేపథ్యంలో వారు సంబంధిత విషయమై కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. -
హస్త వైఫల్యం!
● ఎమ్మెల్సీ ఓటమిపై కాంగ్రెస్‌లో మొదలైన అంతర్మథనం ● చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాలలో ప్రతికూలం ● పెద్దపల్లి జిల్లాలోనే హస్తం పార్టీకి మెజారిటీ ● కరీంనగర్లో అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీల్లో వరుస ఓటమి ● కొంపముంచిన చెల్లని ఓట్లు, సమన్వయ లోపాలు ● పార్టీలో లోపాలపై ముఖ్యమంత్రికి త్వరలో నివేదిక ● నాటి సీఎం తరహాలోనే నేటి సీఎం వ్యాఖ్యలు చేటు చేశాయా?ఎక్కడెక్కడ బలహీనం అంటే? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతను ఎంపిక చేయడం లోకల్ పలువురు నాయకులకు నచ్చలేదు. కీలకమైన కరీంనగర్ నుంచి మరో నాయకుడు ఎదగడం తమ పార్టీలోనే ముగ్గురు ముఖ్యనేతలకు ఇష్టం లేదని ఓటమి అనంతరం నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. గెలవగానే ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారంతో కొందరు ముఖ్యనాయకులు పార్టీ ఎన్ని కల ప్రచారంలో అంటీ ముట్టనట్టుగా వ్యహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే, ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల కాంగ్రెస్‌కు తక్కువ ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, జగి త్యాల, ధర్మపురి, మానకొండూర్‌లో తక్కువ ఓట్లు వచ్చాయని సాక్షాత్తు నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. అదే సమయంలో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చేందుకు నరేందర్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్– మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమి కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపునకే దారి తీస్తోంది. పార్టీలో సమన్వయ లోపాలు, అనైక్యత, పరస్పర సహకారం కొరవడటం తదితర వైఫల్యాలు ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. 2023లో అసెంబ్లీ, 2024లో పార్లమెంటు, 2025లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఇలా ఏడాదిన్నర కాలంలో కరీంనగర్లో కాంగ్రెస్ వరుసగా ఓడింది. కానీ, ఈసారి ఓటమిపై పార్టీలో ప్రత్యేకమైన చర్చ నడుస్తోంది. వాస్తవానికి 15 జిల్లాలు, 42 నియోజకవర్గాలలోని గ్రాడ్యుయేట్ల కోసం ఎన్నిక జరిగినా.. ప్రచారం, నామినేషన్, రాజకీయం అంతా కరీంనగర్ కేంద్రంగానే జరిగింది. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఎం, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించడం, సిట్టింగ్ సీట్లో ఓటమిపై మునుపెన్నడూ లేని చర్చ నడుస్తోంది. చెల్లని ఓట్లు, సమన్వయ లోపాలు వాస్తవానికి నరేందర్‌రెడ్డికి తన ప్రత్యర్థి అంజిరెడ్డి(బీజేపీ)కన్నా కేవలం 5,106 ఓట్లు తక్కువగా వచ్చాయి. అదే సమయంలో 28,686 ఓట్లు చెల్లనివి వచ్చాయి. ఈ ఓట్లలో దాదాపు 16వేల ఓట్లు నరేందర్‌రెడ్డికే పడడం దురదృష్టకరం. అందులోనూ ఆరువేలకుపైగా ఓట్లు కేవలం అంకె ముందు సున్నా వేయడం వల్ల చెల్లకుండా పోవడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. అదే సమయంలో బీజేపీ జిల్లా, మండలం, గ్రామం, బూత్లెవల్వరకు పోల్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా నిర్వహించింది. ప్రతీ 25మందికి ఒక ఇన్చార్జిని నియమించి, ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో క్యాడర్ సఫలీకృతమయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం, ఆధిపత్య పోరు, పోల్ మేనేజ్మెంట్ వైఫల్యాల కారణంగా ఓటరును ప్రసన్నం చేసుకోవడంలో దెబ్బతిన్నారు. కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు బీఎస్పీ అభ్యర్థికి ఓట్లు వేయించడం కూడా తమకు ప్రతికూలంగా మారిందని నరేందర్‌రెడ్డి వర్గం ఆరోపిస్తుండటం గమనార్హం. నాడు కేసీఆర్.. నేడు రేవంత్ కరీంనగర్ ఉద్యమాలకు, భావోద్వేగాలకు నిలయమైన జిల్లా. ఈ ప్రాంత ఓటర్లు విలక్షణ తీర్పులివ్వడంలో పరిపాటి. అందుకే, 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల్లో తిరుగులేని విజయాన్ని అందుకుని మంచి జోరు మీదున్న బీఆర్ఎస్కు మొదటి ఎదురుదెబ్బ కరీంనగర్‌లోనే తగిలింది. 2019 గ్రాడ్యుయేట్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించి బీఆర్ఎస్కే కాదు.. రాష్ట్ర రాజకీయాలకే కరీంనగర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇటీవల నరేందర్‌రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో సీఎం రేవంత్ ఈ ఎమ్మెల్సీ గెలవకపోయినా.. తమకు వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించడం ఆ వెంటనే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడం చర్చనీయాంశంగా మారాయి. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ బీజేపీని ఉద్దేశించి.. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అన్న మాట వాడటం.. ఆ పార్టీ పరాజయంలో కీలకంగా పనిచేసిన విషయాన్ని కరీంనగర్ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
గోదావరిఖని(రామగుండం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్లో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. పిరమిడ్విత్ గ్లాస్, బాల్ఇన్ బాస్కెట్, లెమన్ ఇన్ స్పూన్, మ్యూజికల్ చెయిర్, సూదిలో దారం, త్రోబాల్, బాంబ్ ఇన్దిసిటి ఆటలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు మహిళ దినోత్సవం రోజున బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమంలో సేవ అధ్యక్షురాలు అనిత, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, సేవా జాయింట్ సెక్రటరీ బీనాసింగ్, సీనియర్ పీవోలు హనుమంతరావు, శ్రావణ్‌కుమార్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సంతోష్‌రెడ్డి, సూపర్వైజర్ రమేశ్, సేవా కోఆర్డినేటర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
కొమురయ్య.. దీవెనలివ్వాలయ్యా..
రామగుండం: ఆరు దశాబ్దాల క్రితం నాటి మాట ఇది.. గోపు వంశీయుడొకరు భవిష్యవాణి చెప్పేవారు. తన మరణాన్ని కూడా ముందుగానే ప్రకటించి కన్ను మూశారు. ఆ రోజు నుంచి ఆయనను దైవంగా గో పు వంశీయులు కొలుస్తూ జాతరను నిర్వహిస్తు న్నారు. గోపు వంశీయులు భక్తి ప్రపత్తులతో కొలిచే ఆ దైవం పేరు గోపు కొమురయ్య. 65 ఏళ్లుగా జాతరపెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామానికి చెందిన గోపు కొమురయ్య మరణానంతరం.. ఆయన పేరిట 65 ఏళ్లుగా (మల్లికార్జున కల్యాణం) గోపు వంశీయులు జాతరను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భవిష్యవాణితోనే బహుళ ప్రాచుర్యంఆరు దశాబ్దాల క్రితం గోపు కొమురయ్య బతికుండగానే భవిష్యవాణి చెప్పారని ఆయన భక్తులు విశ్వసిస్తారు. సమాజంలో జరిగే శుభాలు, దుష్పరిణామాలు ముందుగా గ్రహించేవారని.. పూనకం వచ్చిన సమయంలో.. తన వద్దకు వచ్చే వారికి భవిష్యవాణిని వినిపించేవారంటారు. తన మరణ తేదీని ముందుగా ప్రకటించారని.. తన పేరుతో జాతర నిర్వహించాలని ప్రకటించిన సమయానికే శివైక్యం పొందారని భక్తుల కథనం. దీంతో కొమురయ్య సమాధిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. యాదవ కులబాంధవులు ఆయనను ప్రత్యక్ష దైవంగా కొలుచుకుంటున్నారు. కొమురయ్య సమాధికి గది నిర్మించి ఆలయంగా పూజిస్తున్నారు. దశాబ్దాల తరబడి.. రోజూ ఉదయం క్రమం తప్పకుండా సమాధి వద్ద గోపు వంశీయులు దీపారాధన చేస్తున్నారు. సమాధి వద్ద గోపు వంశీయులు శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం పేరిట జాతర నిర్వహిస్తుండడం ఆనవాయితీ. పొరుగు జిల్లాల నుంచి సైతం అధిక సంఖ్యలో యాదవ కులస్తులు రావడం జాతర ప్రత్యేకత. ఈ క్రమంలో ప్రతీ హోలీ పండుగకు ముందు ఫాల్గుణ మాసం ఆది, సోమవారాల్లో జాతర నిర్వహిస్తుంటారు.జాతరకు సకల ఏర్పాట్లుఅంతర్గాం మండలం ముర్మూర్ శివారులోని ఆయ న సమాధి (ఆలయం) వద్ద ఈనెల 9 నుంచి కార్య నిర్వాహక ప్రతినిధి గోపు అయిలయ్య యాదవ్ నేతృత్వంలో జాతర నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే తొలిరోజు దృష్టి కుంభం, మైల లు తీయడం, రుద్రాభిషేకం, బియ్యం, సుంకు పెద్ద పట్నంతో పాటు ఉదయం 11.45 గంటలకు శ్రీమల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. 10వ తేదీ వేకువజామున 4 గంటలకు అగ్నిగుండ ప్రవేశం అనంతరం ఇప్పలపల్లి భరత్ స్వామి జంగమ మహేశ్వరులచే కొమురన్న జీవిత చరిత్రపై ఒగ్గు కథ ప్రదర్శించనున్నారు. ఈసారి తొలిసారిగా ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించనుండగా, ముగ్గురికి భారీగా ప్రోత్సాహక బహుమ తులు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొ న్నారు. రెండు రోజుల పాటు జాతరకు వచ్చే భక్తుల కు అన్నదానం చేస్తారు.కొమురయ్య ఉన్నట్టే భావిస్తాంగోపు కొమురయ్య జ్ఞాపకార్థం నిర్వహించే జాతరకు ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. 65 ఏళ్లుగా మా వంశీయులు నిష్టతో దీపారాధన చేస్తున్నారు. ఆయన మా మధ్య లేకపోయినా.. జీవించి ఉన్నట్లుగానే భావిస్తున్నాం. – గోపు అయిలయ్యయాదవ్, జాతర కార్యనిర్వాహక ప్రతినిధి -
ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు
జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడ కబ్జా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఐదో డివిజన్ మల్కాపూర్ గ్రామ శివారులోని 56, 57 సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారు. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఇవి యథేచ్ఛగా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి.. సమాచార హక్కు చట్టం ద్వారా 2019లో అక్రమ నిర్మాణాలపై మాజీ కౌన్సిలర్ మామిడాల చంద్రయ్య అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, ఐదో డివిజన్లో ఒక సర్వే నంబరులో 6.24 ఎకరాలు, మరో సర్వే నంబర్లో 3.30 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని రామగుండం తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాచార ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వే నంబర్ 56, సర్వే నంబరు 57లో కొంత భూమి ఆక్రమించిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనిపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం నిర్లక్ష్యం మత్తులో బల్దియా అధికారులు పరుల పాలవుతున్న సర్కారు స్థలాలు -
పులి ఆచూకీ కోసం జల్లెడ
ముత్తారం(మంథని): నాలుగు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి జాడకోసం అటవీశాఖ అధికారులు అడవులను జల్లెడ పడుతున్నారు. అడవిశ్రీరాంపూర్ కోయచెరువు సమీపంలోని గుడ్డెలుచెలుక ప్రాంతంలో ఈనెల 2న పెద్దపులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మరుసటి రోజు అటవీ ప్రాంతంలో వెతికినా పులి జాడ లభించలేదు. ఈనెల 3న మానేరు తీరం నుంచి పారుపల్లి, శాలగుండ్లపల్లి యాతల్ చెరువు ద్వారా సర్వారం కాలువ వెంట మైదంబండ మీదుగా మచ్చుపేట భగుళ్లగుట్టకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఐదేళ్లక్రితం భగుళ్లగుట్టలో ఓ పులి ఆవును చంపిన స్థలాన్ని, ఇతర ప్రాంతంలోనూ అటవీశాఖ అధికారులు బుధవారం పరిశీలన చేశారు. అయినా, ఆనవాళ్లు లభించలేదు. మండలంలో ప్రవేశించిన పులి ఆనువాళ్లు కని పించిన రోజు తర్వాత మరుసటిరోజు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. దీనిని బట్టి చూస్తే పులి ఆచూకీ ఆనవాళ్లు గురువారం కనిపించే అవకాశం ఉందని స్థానికులు చర్చించు కుంటున్నారు. భగుళ్లగుట్ట, రామగిరిఖిలా నుంచి కాల్వశ్రీరాంపూర్ మీదుగా పెద్దపల్లి ప్రాంతం వైపు వెళ్తుందా? లేదా భగుళ్లగుట్ట నుంచి రామ గిరి మండలం గుడిమెట్టు మీదుగా మళ్లీ ముత్తా రం, మంథని మండలంలోని అటవీ ప్రాంతాల్లోకి వెళ్లుందా? అని పలువురు చర్చించుకుంటున్నారు. పశువులకాపరులు, రైతులు, రాత్రి పూట ప్రయాణం చేసే వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు కోరుతున్నారు. భగుళ్ల గుట్ట నుంచి పెద్దపల్లి వైపు వెళ్లే అవకాశం లేదా మళ్లీ ముత్తారం, మంథనికి చేరొచ్చంటున్న స్థానికులు -
ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు
జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడ కబ్జా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఐదో డివిజన్ మల్కాపూర్ గ్రామ శివారులోని 56, 57 సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారు. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఇవి యథేచ్ఛగా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి.. సమాచార హక్కు చట్టం ద్వారా 2019లో అక్రమ నిర్మాణాలపై మాజీ కౌన్సిలర్ మామిడాల చంద్రయ్య అధికారులకు దరఖాస్తు చేశారు. అయితే, ఐదో డివిజన్లో ఒక సర్వే నంబరులో 6.24 ఎకరాలు, మరో సర్వే నంబర్లో 3.30 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని రామగుండం తహసీల్దార్ కార్యాలయం నుంచి సమాచార ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వే నంబర్ 56, సర్వే నంబరు 57లో కొంత భూమి ఆక్రమించిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనిపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం నిర్లక్ష్యం మత్తులో బల్దియా అధికారులు పరుల పాలవుతున్న సర్కారు స్థలాలు -
కమలంలో జోష్.. హస్తంలో నైరాశ్యం!
● పకడ్బందీ ప్లాన్‌తో బీజేపీ సక్సెస్ ● సమన్వయం, సహకారం లేక కాంగ్రెస్ డీలా ● పోల్మేనేజ్మెంట్లో బీఎస్పీ విఫలం ● ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై పార్టీల అంతర్మథనంసాక్షిప్రతినిధి,కరీంనగర్: రెండు ఎమ్మెల్సీలను ఎగరేసుకుపోయిన కమలం పార్టీ కేడర్‌లో జోష్ నెలకొంది. అధికారంలో ఉండీ.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని దక్కించుకోకపోయినందుకు కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొంది. కేవలం డబ్బు ప్రభావంతోనే తాము ఓడిపోయామని బీఎస్పీ భావిస్తోంది. మొత్తానికి పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ అనుసరించిన విధానాలే తమను గెలిపించాయని బీజేపీతోపాటు ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్పీలు విఫలమయ్యాయని ఆయా పార్టీల్లో ప్రచారం మొదలైంది. బరిలో లేకున్నా.. అధికార కాంగ్రెస్ ఓటమిపై కారు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ విధానాలు, వైఫల్యాలే వారిని ఓడించాయని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఈ ఫలితాలు కమలంలో జోష్‌ను నింపాయి. ● బీజేపీ ఈ విషయంలో ఆదినుంచీ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగింది. నియోజకవర్గం, మండలం, డివిజన్, గ్రామాల వారీగా పచ్చాస్ ప్రభారీలను నియమించి ప్రతీ 25 మందికి ఒక ఇన్చార్జిని కేటాయించింది. వారు ప్రతీ ఓటరును రోజూ కలవడం, అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పట్టభద్రులు, నిరుద్యోగులు, టీచర్స్ కోసం తాము చేసిన పోరాటాన్ని వివరిస్తూ ఓటర్లకు చేరువయ్యారు. దీనికితోడు కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పూర్తిస్థాయిలో ప్రచారం చేయడం అభ్యర్థులకు బాగా కలిసి వచ్చిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ● కాంగ్రెస్ పార్టీ కేడర్ పూర్తిస్థాయిలో నరేందర్‌రెడ్డికి సహకరించలేదన్న విమర్శలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా నాయకులు ఈ విషయంలో తమ కు సహకరించినట్లుగా మిగిలిన మూడు జిల్లాల నాయకులు సహకరించలేదని నరేందర్‌రెడ్డి వ ర్గం అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. కరీంనగర్ నుంచి నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిస్తే.. కాంగ్రెస్‌లోని ముగ్గురు కీలక నేతలకు పోటీగా ఎదుగుతాడన్న ఆందోళనతో వారెవరూ సహకరించలేదని మండిపడుతున్నారు. దీంతోపాటు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు మద్దతిచ్చారని, బీఆర్ఎస్ పార్టీ కూడా లోపాయికారిగా సహకరించిందని ఆరోపిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ సభలో సీఎం కూడా ఈ సీటు ఓడిపోతే తమకేం నష్టం లేదని వ్యాఖ్యానించడం తమకు చేటు చేసిందంటున్నారు. అంతేకాకుండా చెల్లకుండా పోయిన సుమారు 28 వేల ఓట్లలో దాదాపు 15 వేలకుపైగా ఓట్లు నరేందర్‌రెడ్డివే కావడం తమ కొంపముంచాయని విశ్లేషిస్తున్నారు. -
రామగుండం ఠాణా తనిఖీ
రామగుండం: పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ బు ధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సంధ్యారాణితో పలు కేసుల వివరాలు, శాంతిభద్రతల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసుస్టేషన్ పరిసరాలు, నిర్వహణ, పోలీసుల పనితీరు, రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్లోనే బిల్లుల చెల్లింపు సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాల ల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి వడ్డించే నిర్వాహకులకు ఇకనుంచి ఆన్లైన్లోనే బిల్లుల చెల్లింపు ప్రక్రియ చేపడతారని మధ్యా హ్న భోజన పథకం రాష్ట్ర అధికారి శశికుమార్ తెలిపారు. ఈమేరకు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్‌ను బుధవారం ఆయన సందర్శించా రు. మధ్యాహ్న భోజనం నెలవారీ బిల్లులను ఆన్లైన్లో చెల్లించేందుకు గల సాధ్యాసాధ్యాలపై తాను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈమేర కు పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథ కం అమలు తీరుపై ఆరా తీశామన్నారు. సకా లంలో బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానం అమలు చేస్తోందని అన్నారు. ప ట్టణంలోని బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశా ల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మ ధ్యా హ్న భోజనం అమలు చేస్తున్న తీరుపై తాను ఆరా తీశానని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎంఈవో రాజయ్య, ఎమ్మార్సీ ఉద్యోగులు రజిత, రమేశ్, డీఈవో కార్యాలయ ఉద్యోగి రాజు, హెచ్ఎంలు శారద, అనిల్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు భద్రతకు అధిక ప్రాధాన్యం జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలో విద్యు త్ ఉత్పత్తితోపాటు ప్రాజెక్టు భద్రతకు ప్రాధా న్యం ఇస్తున్నుట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రాజెక్టులో బుధవా రం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. విక్షిత్ భారత్‌కు భద్రత, శ్రేయస్సు చాలాకీలకమని ఆయన తెలిపారు. విధి నిర్వహణలో భద్రతా చర్యలను పాటిస్తే ప్రమాదాలను నివా రించవచ్చని సూచించారు. అనంతరం ప్రాజె క్టు గేట్ నుంచి సర్వీసు భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వసతులు కల్పించాలిసుల్తానాబాద్(పెద్దపల్లి): మహిళా కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉమెన్ ట్రా కింగ్‌పై ఏపీఎం, సీఏలకు బుధవారం శిక్షణ ఇ చ్చారు. ఆమె మాట్లాడుతూ, మహిళలు, బాలికలను అపహరణ, అక్రమ రవాణా గురించి తెలిస్తే పోలీస్‌స్టేషన్‌తోపాటు డయల్ 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. ఏపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్టీపీసీలో పునుగుపిల్లి జ్యోతినగర్(రామగుండం) : ఎన్టీపీసీ ప్రాంతంలో అరుదైన పునుగుపిల్లి సంచరించింది. బు ధవారం ఉద యం 10.30 గంటల సమయంలో రా మగుండం బీ–పవర్‌హౌ స్ రోడ్డుపై పు నుగుపిల్లి ప్రత్యక్షమైందని స్థానికులు తెలిపా రు. ఇది నక్కను పోలికలు, పులిచారలతో ఉంది. అది కాస్త నీరసంగా కనిపించడంతో స్థాని కులు పట్టుకున్నారు. దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తామని వారు తెలిపారు. -
పట్టభద్రుల సీటూ కమలానిదే!
సాక్షిప్రతినిధి,కరీంనగర్/సాక్షి,పెద్దపల్లి: కరీంనగర్– ఆదిలాబాద్– నిజామాబాద్– మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూ డు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్స్‌తో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వా త కూడా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో అతడినే విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్లతేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించటంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రో జుల పాటు నిర్విరామంగా మూడు షిఫ్ట్‌ల్లో 800 మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ ను చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవా రం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లను వడపోసి, క ట్టలు కట్టారు. మంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ ప్రారంభించి, బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్స్‌ను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్స్‌లో బరిలో ఉన్న 54మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ ప్రక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. ముగ్గురికే 92.52శాతం ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటు అయిన ఓట్లలో 92.52శాతం (2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగిలిన 53మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కేవలం 16,684 ఓట్లు మాత్రమే సాధించారు. ‘రెండోప్రాధాన్యం’లో సైతం బీజేపీదే హవా నిర్ధారిత కోటా ఓట్ల్ల కోసం అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టగా అందులోనూ బీజేపీ అభ్యర్థి అధి క్యం చూపారు. తొలుత 53మందిని ఎలిమినేషన్ చే సి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్‌కి 73,644 ఓట్లు, బీఎ స్పీకి 63,972 ఓట్లు వచ్చాయి. 53మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్ల్లను ఎవరు సాధించకపోవడంతో మూడోస్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణను ఎలిమినేట్ చేశారు. అతనికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రసన్నహరికృష్ణను ఎలిమినేషన్ చేసిన అనంతరం బీజేపీ అభ్యర్థికి 98,637ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 93,531ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి కన్నా 5,106 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో బీజేపీ అభ్యర్థికి విజయం వరించింది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో కమలం పార్టీకే విజయం దక్కింది. గ్రాడ్యుయేట్స్లోనూ బీజేపీ హవా అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి మూడురోజులు సాగిన ఎమ్మెల్సీ కౌంటింగ్ ముగ్గురికే 92.52శాతం ఓట్లు -
ఆలయాల్లో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన దొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన మామిండ్ల ఆంజనేయులు అలియాస్ అంజిని ముస్తాబాద్ ఏఎంఆర్ గార్డెన్ వద్ద అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుండగా పట్టుకున్నారు. విచారించగా ముస్తాబాద్, గూడూరు, మద్దికుంటల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రైలు ఢీకొని ఆరు ఎడ్లు మృతికోరుట్ల రూరల్: మండలంలోని చిన్నమెట్పల్లి శివారులోని రైల్వే వంతెన వద్ద బుధవారం రైలు ఢీకొని ఆరు ఎడ్లు మృతిచెందాయి. స్థానికుల కథనం ప్రకారం ఎడ్లు రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొన్నట్లు వివరించారు. రైల్వే అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి ఆత్మహత్యకోరుట్ల: కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్లో నివాసముండే పల్లికొండ రోహిత (22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పల్లికొండ రాజ, లతల కూతురు రోహితకు మానసిక స్థితి సరిగాలేదు. ఆరోగ్యం కూడా సరిగాలేకపోవటంతో మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ బస్టాండ్ వద్ద మంగళవారం రాత్రి ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన టీఆర్‌నగర్‌కు చెందిన మల్యాల శ్రీనివాస్ అలియాస్ శ్రీహరి (32) చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీకి పట్టుబడిన కోరుట్ల ఎస్సై–3
కోరుట్ల: పేకాటలో దొరికిన సెల్‌ఫోన్ వాపస్ ఇవ్వడానికి రూ.5వేలు డిమాండ్ చేసి వసూలు చేసిన క్ర మంలో జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్సై–3 రూపావ త్ శంకర్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు.. గత నెల 21న కోరుట్ల మండలం జోగన్‌పల్లి శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని స్పెషల్‌పార్టీ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20వేలు స్వాధీనం చేసుకుని వారికి సంబంధించిన వాహనాలు, సెల్పోన్లు కోరుట్ల ఠాణాలో అప్పగించారు. ఎస్సై శంకర్ కేసు నమోదు చేశారు. అనంతరం పేకాటరాయుళ్లకు వాహనాలు, సెల్ఫోన్లు ఇచ్చే క్రమంలో డబ్బులు డిమాండ్ చేయగా వారిలో కొందరు డబ్బులు ఇచ్చి సెల్ఫోన్లు, వాహనాలు తీసుకెళ్లారు. రాయికల్ మండలం ఉప్పుమడిగెకు చెందిన బండారి శ్రీనివాస్ మాత్రం తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పి స్థానిక కాంగ్రెస్ నాయకుడితో ఫోన్ చేయించుకున్నాడు. తరువాత ఎస్సై శంకర్ ఫోన్ వాపస్ ఇచ్చినప్పటికీ డబ్బులు డిమాండ్ చేయడం ఆపలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఏసీబీనీ ఆశ్రయించాడు. బుధవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్ గేటు ముందు శ్రీనివాస్ రూ.5వేలను ఎస్సై శంకర్‌కు ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎస్సై శంకర్ మరో మూడు నెలల్లో రిటైర్మెంట్ కానున్నారు. పేకాటలో దొరికిన సెల్‌ఫోన్ ఇవ్వడానికి.. రూ.5 వేలు లంచం డిమాండ్ -
పరీక్షలు ప్రశాంతం
జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈసారి ఒక్క నిమిషం నిబంధన తొలగించిన విద్యాశాఖ అధికారులు.. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించడంతో గైర్హాజరు బాగా తగ్గింది. మొత్తం 10,530 మంది విద్యార్థుల కోసం జిల్లావ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా అన్నింటా మౌలిక సౌకర్యాలు కల్పించారు. తొలిరోజు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగినట్లు అధికారులు తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
అక్కడే కాల్చేస్తున్నారు..
గ్రామాల రూపురేఖలు మార్చేందుకు పడేసిన వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలని గత ప్రభుత్వం సేంద్రియ ఎరువు తయారీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం పల్లె శివారుల్లో డంపింగ్ యార్డులు నిర్మించింది. ఇంటింటా సేకరించిన తడి, పొడి చెత్తను కంపోస్టు ఎరువుగా తయారుచేసి రైతులకు విక్రయించాలని నిర్ణయించింది. కానీ, అమలులో ఇప్పటికీ సాధ్యం కావడంలేదు. తడి, పొడి చెత్తను వేరు చేయకపోగా పంచాయతీ సిబ్బంది ఎక్కడికక్కడే కాల్చివేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే పెద్దబొంకూర్ డంపింగ్ యార్డు వద్ద చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చివేస్తున్నారు. ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన దృశ్యాలు ఇవి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
కాంగ్రెస్ హయాంలోనే రోడ్ల నిర్మాణం
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఓదెల(పెద్దపల్లి): కాంగ్రెస్ హయాంలోనే సీసీ రోడ్ల నిర్మాణం సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శానగొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, పొత్కపల్లి గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణానికి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. పల్లెల్లోని అన్ని వాడల్లో సీసీ రోడ్లు నిర్మించడంతో అద్దంలా మెరిసిపోతున్నాయన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని భరోసా ఇచ్చారు. తన నియోజకవర్గంలో నాలుగేళ్లలో 14వేల ఇళ్లు మంజూరవుతాయని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పొత్కపల్లి సింగిల్‌విండో చైర్మన్ ఆళ్ల సుమన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అంబాల కొమురయ్య, నాయకులు రెడ్డి రజనీకాంత్, చొక్కారావు, సమ్మిరెడ్డి, తిరుపతి, మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
అజ్నీ రైలుకు గ్రీన్‌సిగ్నల్
ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వేలోని కా జీపేట – బల్హార్షా(అజ్నీ) మధ్య అజ్నీ ప్యాసింజర్ రైలు మళ్లీ పట్టాలపై పరుగులు పెట్టనుంది. పేదల బండిగా ప్రసిద్ధికెక్కిన అజ్నీ ప్యాసింజర్ రైలును కరోనా సమయంలో రైల్వేశాఖ ర ద్దు చేసింది. అప్పట్నుంచి సామాన్య ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణం చేసేందుకు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇదే విషయంపై ‘వినిపించని అజ్నీ కూత’ శీర్షికన ‘సాక్షి’ గత నెల 29వ తేదీన కథనం ప్రచురించింది. దీంతో ప్రజాప్రతి నిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు, వినతిపత్రాలు అందజేశా రు. ఎట్టకేలకు గురువారం నుంచి అజ్నీ రైతులను పునరుద్ధరిస్తున్నామని రైల్వే ఉన్నతాధికారులు ఉత్వర్వులు విడుదల చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. – వివరాలు 8లోu -
ఫిర్యాదు చేసినా పట్టించుకుంటలేరు
మల్కాపూర్ శివారులోని 56, 57 సర్వే నంబర్లలో గల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం జరిగిందని బల్దియా అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా, ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్రమ నిర్మాణానికి విద్యుత్ అధికారులు కరెంటు మీటరు మంజూరు చేయడం శోచనీయం. ప్రభుత్వ స్థలంలో చేట్టిన నిర్మాణాలపై కలెక్టర్ కార్యాలయం, రామగుండం నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశాం. – మామిడాల చంద్రయ్య, మాజీ కౌన్సిలర్ నోటీసులు జారీ చేశాం మల్కాపూర్ గ్రామ శివారులోని ఐదో డివిజన్లో చేపట్టిన నిర్మాణంపై మాకు ఫిర్యాదు అందింది. దీనిపై సంబంధిత నిర్మాణదారుకు నోటీసులు జారీ చేశాం. స్థలానికి సంబంధించిన వివరాల కోసం తహసీల్దార్ కార్యాలయానికి లేఖ రాశాం. వివరాలు అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. – దీపిక, టౌన్ ప్లానింగ్ అధికారి, రామగుండం బల్దియా -
స్వగ్రామానికి గల్ఫ్ వలసజీవి
చందుర్తి(వేములవాడ): జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లిన వలసజీవి అనారోగ్యం బారిన పడ్డాడు. స్వగ్రామం వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతుండగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో బుధవారం ఇంటికి చేరాడు. చందుర్తి మండలం కట్టలింగంపేటకు చెందిన యువకుడు తీగల గంగరాజు జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని దొరక్క చేతిలో డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలోనే 15 రోజుల క్రితం పక్షవాతం రావడంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక గదిలోనే ఉండిపోయాడు. ఈ విషయాన్ని కట్టలింగంపేట గ్రామస్తులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇండియా ఎంబసీ అధికారులతో మాట్లాడి టికెట్ ఇప్పించడంతోపాటు దుబాయ్‌లో ఉంటున్న చందుర్తి మండలానికి చెందిన మోతె రాములు, కటకం రవి యువకునికి టికెట్, పాసుపోర్టు అందజేసి స్వగ్రామానికి పంపించారు. స్వగ్రామానికి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అజ్నీ రైలుకు గ్రీన్‌సిగ్నల్
ఓదెల(పెద్దపల్లి): దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట – నాగపూర్(అజ్నీ) మధ్య అజ్నీ ప్యాసింజర్ రైలు గురువారం నుంచి పట్టాలెక్కనుంది. ఈమేరకు రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా సమయంలో రైల్వేశాఖ అజ్నీ రైలును రద్దు చేయడంతో ఏళ్లుగా ప్రయాణికులు, వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంలోపై గతనెలలో ‘సాక్షి’ ‘వినిపించని అజ్నీ’ కూత శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్.. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వీనివైష్ణవి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వినతిపత్రం అందజేసి సమస్య పరిష్కరించాలని వివరించారు. ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే అజ్నీ ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని వారు పట్టుబట్టారు. దీంతో గురువారం నుంచి అజ్జీ ప్యాసింజర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. అజ్నీ మళ్లీ పట్టాలపైకి వస్తుందనే సమాచారంతో కాజీపేట– బల్హార్షా సెక్షన్ల మధ్య ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేటినుంచి పట్టాలెక్కనున్న రైలు ఏళ్ల తర్వాత పునరుద్ధరణకు చర్యలు ఉత్తర్వులు విడుదల చేసిన రైల్వేశాఖ -
ఆలయాల్లో చోరీ చేసిన దొంగ అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని శివాజీనగర్‌లోగల నల్లపోచమ్మ తల్లి ఆలయం, ఉప్పరిపేట ఆలయాల్లో దొంగతనానికి పాల్పడిన దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. బుధవారం పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇటీవల ఉప్పరిపేటతోపాటు నల్లపోచమ్మతల్లి ఆలయంలో దొంగతనాలు జరిగాయి. ఆలయ కమిటీ, స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలోని వాణీనగర్ చౌరస్తాలో పట్టణ సీఐ వేణుగోపాల్ బుధవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో కోరుట్ల పట్టణం అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన విభూది అలియాస్ వూటూరి శేఖర్ బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.50 వేల విలువైన పూజాసామగ్రి, సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎనిమిదేళ్లలో 25 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయన్నారు. అలాగే ఆలయాల దొంగతనాల్లో ప్రమేయం ఉన్న లక్ష్మీ అనే మహిళ దొంగ పరారీలో ఉందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని పట్టుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్‌ను అభినందించారు. బాల నిందితుడి అరెస్ట్ జగిత్యాలలోని నర్సింగ్ కళాశాలలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం దొంగతనానికి పాల్పడిన బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అతడిని జువైనల్ హోంకు తరలించినట్లు పేర్కొన్నారు. మరో మహిళ దొంగ పరార్ రూ.50 వేల విలువైన సామగ్రి స్వాధీనం జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వెల్లడి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్(45) రోడ్డుప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న మూగవాడైన శ్రీనివాస్.. మంగళవారం రాత్రి గోదావరిఖని – మంథని మధ్య రోడ్డుపై సుందిళ్ల శివారులో నడుచుకుంటూ గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోదావరిఖని నుంచి మంథనికి వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టగా, శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరి కటకం రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య
సారంగాపూర్: అత్తింటివారి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై దత్తాద్రి కథనం ప్రకారం.. మండలంలోని రంగపేటకు చెందిన లలితకు 15 ఏళ్ల క్రితం తుమ్మల చిరంజీవితో వివాహమైంది. వీరికి కూతురు సంతానం. కొద్దిరోజులుగా లలితను భర్త చిరంజీవి, అత్తామమలు మరియా, కాంతయ్య శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. వారి వేధింపులు భరించలేక ఈనెల ఒకటో తేదీన పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త, అత్తామామలపై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. ఉరేసుకుని వ్యక్తి ..మల్లాపూర్: ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మొగిలిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి పురుషోత్తం (35)కు భార్య శరణ్య, ఇద్దరు కుమారులు వివేక్, ఆదిత్య ఉన్నారు. ఉపాధి కోసం దుబాయికి రెండుసార్లు వెళ్లి వచ్చాడు. ఇందుకు రూ.7లక్షల వరకు అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక.. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లోనే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. చికిత్స పొందుతూ పంచాయతీ కార్యదర్శి మృతివెల్గటూర్: చికిత్స పొందుతూ పంచాయతీ కార్యదర్శి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జగదేవుపేట పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎండీ.పాషా శుక్రవారం జగిత్యాలలో బైక్‌పై బైపాస్ రోడ్డు దాటుతుండగా అతి వేగంగా బైక్‌పై వచ్చిన ముగ్గురు బాలురు ఢీకొట్టారు. గాయపడిన పాషాను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడంతో అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. పాషా మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
విద్యార్థిని మృతికి కారణమైన వ్యక్తికి మూడేళ్ల జైలు
జగిత్యాలజోన్: విద్యార్థినిని ప్రేమించాలని వేధించి.. ఆమె మృతికి కారణమైన వ్యక్తికి మూడేళ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి జి.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్. రామకృష్ణారావు కథనం ప్రకారం.. పెగడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు సంతానం. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె 2022 ఏప్రిల్ ఒకటో తేదీన స్నేహితురాలి వద్ద చదువుకుంటానని చెప్పి వెళ్లిన బాలిక కాసేపటికి ఇంటికి చేరుకుంది. ఇంటి వెనుక వైపు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాల్లో వెదకగా.. తాను పురుగుల మందు తాగానని చెప్పింది. వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయింది. తన కూతురు మరణానికి పెగడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎట్టం రవి కారణమని, స్కూల్‌కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు తన కూతురును ప్రేమించాలని వేధించడంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తండ్రి పెగడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్సై శ్వేత కేసు నమోదు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు కిరణ్‌కుమార్, డి.శ్రీధర్, కేవీ.సాగర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంతో ఎట్టం రవికి మూడేళ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
ధర్మపురి: త్వరలో జరిగే ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో బుధవారం సమీక్షించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈనెల 10 నుంచి 22 వరకు నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించే పుష్కరఘాట్లను పరిశీలించారు. గోదావరి తీరంలో లైట్లు, చలువ పందిల్లు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదులు, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో నిత్యం శానిటేషన్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ ప్రతిపాదించిన శ్రీమట్టంలో నాలుగెకరాల ఖాళీ స్థలంలో స్వామివారి కల్యాణానికి దేవాదాయ శాఖ అనుమతి తీసుకోవాలని, వేదికకు కావల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. గతేడాది సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈసారి 10శాతం మంది భక్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, వారందరికీ సరిపడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలించి వాటిపై సమీక్షించారు. ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, మున్సిపల్ ఇరిగేషన్ అధికారి నారాయణ, ఆర్‌డబ్లూఎస్ ఈఈ, డిప్యూటీ తహసీల్దార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ నృసింహుని బ్రహ్మోత్సవాలపై సమీక్ష -
ఆశలు సమాధి
ముస్తాబాద్(సిరిసిల్ల): ‘అమ్మ..నాన్న.. మూడు నెలలైతే బీటెక్ పూర్తవుతుంది. ఉద్యోగం వస్తుంది..’ అని చె ప్పిన మాటలు మరువకముందే ఆ కొడుకు వారికి దూరమయ్యాడు. ఒక్కగా నొక్క కొడుకు కేరళలో దుర్మరణం చెందగా.. ముస్తాబాద్‌లో విషాదం అలుముకుంది. కొడుకుపై పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు జలసమాధి అయ్యాయి. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ముత్యాల దేవేందర్, శారద దంపతులకు ముత్యాల సాయిచరణ్(21) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. నలుగురు స్నేహితులతో కలిసి సాయిచరణ్ కేరళలోని అలప్పుజకు ఈనెల 3న వెళ్లారు. అక్కడ సముద్రంలో హౌస్‌బోట్‌లో వెళ్తుండగా సాయిచరణ్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈతకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు దేవేందర్, శారదలు రెండు రోజులుగా కుమారుడు సాయిచరణ్ కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీప బంధువు కాగా, ఆయన దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వ విప్ అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడి సాయిచరణ్ మృతదేహాన్ని రప్పించేలా ఏర్పాట్లు చేశారు. యువకుడి మృతదేహం ఇంటికి చేరగానే తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. ‘సాయి లేరా.. బిడ్డా..’ అంటూ ఆ తల్లి రోదనలు అక్కడ ఉన్న వారికి కంటతడి పెట్టించాయి. కేరళలో బీటెక్ విద్యార్థి దుర్మరణం ముస్తాబాద్‌లో విషాదం -
ఆ సర్ మాకొద్దు
● విద్యార్థుల ఆందోళన ● పాఠశాలకు తాళంసుల్తానాబాద్(పెద్దపల్లి): ‘ఆ సర్ మాకొద్దు.. ఆయన తీరుతో చదువు దెబ్బతింటున్నది.. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వారి స్వప్రయోజనాల కోసం మమ్మల్ని ఇబ్బందులను గురిచేసే పరిస్థితి నెలకొంది.. అలాంటి సార్ మాకు వద్దు’ అని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ,గ్రామస్తులు, తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పెద్దపల్లి మండలం నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇందుకు వేదికై ంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. ఉపాధ్యాయుడు ఒకరు విద్యార్థులను క్లాస్ రూమ్‌లో శ్రీజై భీమ్‌శ్రీ అని పలకాలని ఆదేశిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు నిరసనకు దిగారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్య తీసుకునే వరకూ పాఠశాలకు రాబోమని తెల్చి చెప్పారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొద్దిరోజులుగా ఉపాధ్యాయులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం పీఎస్‌లో ఫిర్యాదు చేసుకుంటున్నారని ఆరోపించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. సమస్యకు కారణమైన శంకరయ్య సర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉపాధ్యాయుడు శంకరయ్యను వివరణ కోరగా టీచర్ల మధ్య గొడవలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై రుద్దుతున్నారన్నారు. హెచ్ఎం సహకారంతోనే విద్యార్థులు ధర్నాకు దిగారని ఆరోపించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాగా, ఆందోళన తీవ్రతరం కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి జిల్లా విద్యాధికారికి సమాచారం చేరవేశారు. దీంతో డీఈవో మాధవి, ఎస్సై లక్ష్మణరావు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. సమస్యపై చర్చించి ఆందోళన విరమింపజేశారు. -
ఆదర్శ దంపతుల స్ఫూర్తిదాయక నిర్ణయం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ఉల్లిగడ్డల బజార్లో హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తున్న కొత్త చంద్రప్రసాద్–వరలక్ష్మి దంపతులు బుధవారం స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు. వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా తమ మరణానంతరం ఇద్దరి నేత్రాలు, అవయవాలు, దేహదానాలు చేస్తామని అంగీకారం ప్రకటించారు. వారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ ముఖ్య సలహాదారు, ఎస్ఎంఎస్ ప్లాంట్ ప్రాజెక్ట్ మాజీ ఆఫీసర్ నూక రమేశ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వాసుకు తమ అంగీకారపత్రాలు అందజేశారు. దంపతులకు ప్రతినిధులు అభినందన పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో చంద్రప్రసాద్ తల్లిదండ్రులు కొత్త రాజయ్య–వజ్రమ్మతోపాటు బంధువులు గుండా శంకరయ్య, గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానానికి అంగీకారం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్(45) రోడ్డుప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న మూగవాడైన శ్రీనివాస్.. మంగళవారం రాత్రి గోదావరిఖని – మంథని మధ్య రోడ్డుపై సుందిళ్ల శివారులో నడుచుకుంటూ గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోదావరిఖని నుంచి మంథనికి వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టగా, శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరి కటకం రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉపాధి పనులు కల్పించాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): ఉపాధిహామీ కూలీలకు కొలతల ప్రకారం పని కల్పించాల ని, రోజూ వేతనం రూ.300 గిట్టుబాటయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందినీదేవి అన్నారు. సుద్దాల గ్రా మాన్ని మంగళవారం ఆమె సందర్శించి ఈజీ ఎస్ పనులు, నర్సరీలను పరిశీలించారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఏపీవో మల్లేశ్వరి, జేఈ రాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి సాగర్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి జ్యోతినగర్(రామగుండం): పర్యావరణ పరిరక్షణతోనే భావితరాలకు మనుగడ ఉంటుందని ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. జాతీయ భ ద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాజె క్టు సర్వీసు భవనంలో మంగళవారం ఆయన సురక్ష జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఉ ద్యోగులు భద్రత ప్రవర్తనా నియమావళి పా టించాలని సూచించారు. అనంతరం తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో భద్రత ప్రతిజ్ఞ చేశా రు. క్యాంటీన్ వరకు ర్యాలీ, తెలంగాణ సర్వీస్ భవనంలో సమావేశం నిర్వహించారు. జనరల్ మేనేజర్లు అలోక్ కుమార్ త్రిపాఠి, అంజనా రంజన్ దాస్, సింఘారాయ్, సీఐఎస్ఎఫ్ డి ప్యూటీ కమాండెంట్ శాస్త్రి పాల్గొన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్ సిద్ధం పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో మహిళా పో లీస్‌స్టేషన్ ఏర్పాటు కోసం పోలీసు ఉన్నతాధికారులు భవనం సిద్ధం చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలోని ఓ భవనాన్ని ఠాణా కోసం ఎంపిక చేశారు. విధు ల నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు చేశా రు. పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి పోలీసుస్టేషన్ సిద్ధంగా ఉంది. దరఖాస్తుల ఆహ్వానం పెద్దపల్లిరూరల్: ఉచిత కుట్టు మిషన్ల కోసం మైనారిటీలు ఈనెల 6 (గురువారం)లోగా జి ల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ద రఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి అధికారి రంగారెడ్డి కోరారు. తెల్లరేషన్‌కార్డు, మైనార్టీ కార్పొరేషన్, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ట్రె యినింగ్ ఇనిస్టిట్యూట్ ద్వారా తీసుకున్న టైలరింగ్ సర్టిఫికెట్లు, ఐదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ దరఖాస్తుతో జతపర్చాలన్నారు. వితంతువులు, అనాథలు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బకాయిలు చెల్లించాలిపెద్దపల్లిరూరల్: పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, ఇక నుంచి ప్రతినెలా గ్రీన్‌చానల్ ద్వారానే చెల్లించా లని సీఐటీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీ పెల్లి రవీందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉ ద్యోగుల తరహాలో ప్రతినెలా 2025 జనవరి 1 నుంచి గ్రీన్‌చానల్ ద్వారా వేతనాలను చెల్లిస్తా మని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. వేసవిలో ఒకపూట పనివిధానం అమలు చేయాలని ఆయన కోరారు. నాయకులు ఖాజా, లచ్చయ్య, శ్రీనివాస్, రాజయ్య, లక్ష్మణ్, నరేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ ఆకస్మిక తనిఖీ రామగిరి(మంథని): పన్నూర్ కేజీబీవీని డీఈ వో మాధవి మంగళవారం తనిఖీ చేశారు. వంటగది, డైనింగ్‌హాల్, తరగతి గదులను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడాడి భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. -
నీతివంతమైన పాలనకే ప్రజల పట్టం
పెద్దపల్లిరూరల్: దేశ ప్రధాని నరేంద్రమోదీ నీతివంతమైన పాలనకే మండలి ఎన్నికల్లోనూ ఓటర్లు పట్టం కట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెండా కూడలి వద్ద మంగళవారం బాణా సంచాకాల్చి, మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగేందుకే రాజకీయ పార్టీలు సాహసించలేకపోయాయని సంజీవరెడ్డి అన్నారు. తమ పార్టీ అఽభ్యర్థిగా బరిలో నిలిచిన మల్క కొమురయ్య తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించడం బీజేపీకి ఉన్న ఆదరణను తేటతెల్లం చేసిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు చిలారపు పర్వతాలు, పెంజర్ల రాకేశ్, వేల్పుల రమేశ్, పల్లె సదానందం, రాజగోపాల్, పోల్సాని సంపత్‌రావు, పర్శ సమ్మయ్య, జంగ చక్రధర్‌రెడ్డి, ఉప్పు కిరణ్, రవి, ఓదెలు, క్రాంతి, రాజవీరు, ఈర్ల శంకర్, శివంగారి సతీశ్, బెజ్జంకి దిలీప్, సతీశ్, పిట్ట వినయ్, ఎర్రోళ్ల శ్రీకాంత్, సందీప్ పాల్గొన్నారు. సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డితోపాటు నాయకులు కూకట్ల నాగరాజు, కందుల శ్రీనివాస్, కడారీ అశోక్ రావు, కొమ్ము తిరుపతి యాదవ్, నాగుల మల్యాల తిరుపతి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరిఖని: స్థానిక ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ రామగుండం నియోజవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి, నాయకులు మచ్చ విశ్వాస్, గుండబోయిన భూమయ్య, కోడూరు రమేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి -
విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు..
కోనరావుపేట(వేములవాడ): ఓ వ్యక్తి ఇంటిపై దాడికి పాల్పడటంతోపాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం రామన్నపల్లి(బావుసాయిపేట)కి చెందిన బత్తుల మల్లయ్య గత జనవరి 19న బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. అతని భార్య రేణవ్వ ఫిబ్రవరి 20న నాంపల్లిలో ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి మృతికి అదే గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య కారణమంటూ బత్తుల ఎల్లయ్య, అంజయ్య, కొమురయ్య, చిన్న భీమయ్య, రాజయ్యతోపాటు మరికొందరు రేణవ్వ మృతదేహాన్ని నాంపల్లి నుంచి రామన్నపల్లికి తీసుకొచ్చారు. అంజయ్య ఇంటి ఎదుట ఆందోళన చేపట్టి, ఆ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. కోనరావుపేట పోలీసులు ఆపేందుకు ప్రయత్నిస్తే వారి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో ఫిబ్రవరి 22న వారిపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఆ ఐదుగురినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో 12 మందిపై కేసు ముస్తాబాద్(సిరిసిల్ల): విద్యుదాఘాతంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తరలిస్తుంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించినవారిపై కేసు నమోదు చేసినట్లు ముస్తాబాద్ ఎస్సై గణేశ్ మంగళవారం తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వల్లపు దేవరాజు వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోలీసులు అంబులెన్స్‌లో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా రోడ్డుపై ఆందోళన చేసిన 12 మందిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
కోల్‌సిటీ(రామగుండం): స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని పీసీ, పీఎన్డీటీ(ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్) స్టేట్ మానిటరింగ్ కమిటీ స భ్యురాలు సూర్యశ్రీరావు, డీఎంహెచ్‌వో అన్న ప్రస న్న కుమారి హెచ్చరించారు. జిల్లాలోని గోదావరిఖని, ధర్మారంలోని స్కానింగ్ సెంటర్లను డీఎంహెచ్‌వో అన్న ప్రసన్న కుమారితో కలిసి పీసీ, పీఎన్డీటీ స్టేట్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు మంగళవా రం ఆకస్మింగా తనిఖీలు చేశారు. గోదావరిఖనిలో లోటస్ స్కానింగ్ సెంటర్‌తోపాటు విజయ ఫెర్టిలి టీ, ధర్మారంలోని శ్రీసూర్య ఆదిత్య నర్సింగ్ హోంలోని స్నానింగ్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ధర్మారంలో రికార్డుల నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్య క్తం చేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడంతోపాటు చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చేసే ఆస్పత్రుల నిర్వాహకు లు లింగ నిర్ధారణ చేసినా, చట్ట విరుద్ధంగా గర్భస్రావాలు చేసినా జరిమానా విధించడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. -
రెండు నెలల్లో 22 కేసుల విచారణ
సిరిసిల్ల కల్చరల్: నేరాలు చేసి, తప్పించుకోవడం సాధ్యం కాదని, చట్ట పరిధిలో శిక్షలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు నెలల్లో 22 కేసుల విచారణ జరిగి, నేరస్తులకు శిక్షలు పడ్డాయన్నారు. ఈ విషయంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లక్ష్మీప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మణ్, సందీప్, సతీశ్, విక్రాంత్, ఆయా స్టేషన్ల పోలీసులను అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. నేరస్తులకు శిక్ష పడితే సమాజంలో నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నేర నిర్ధారణలో సాంకేతికత వినియోగాన్ని పెంచాలని, అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు కచ్చితంగా జోడించాలని చెప్పారు. వేములవాడ పట్టణ పరిధిలో గంజాయికి సంబంధించిన కేసులో నేరస్తులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఎంఎస్ శ్రవణ్‌యాదవ్, రవీంద్రనాయుడు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. నేరస్తులకు శిక్షలు రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ -
వారియర్స్‌లా ఆలోచించాలి
జ్యోతినగర్(రామగుండం): ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు వారియర్స్‌లా ఆలోచించి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణురాలు కె.అనిత సూచించారు. అన్ని తెలిసిన ప్రశ్నలు వచ్చాయని, సమయం సరిపోలేదని, అందుకే రాయలేక పోయామని కొందరు అలాగే వదిలేస్తారని పేర్కొన్నారు. ఇలా వర్రీ కాకుండా ప్రశాంతంగా ఆలోచించి పరీక్షలు రాస్తే సత్ఫలితాలు వస్తాయని ఆమె వివరించారు. ఆమె చేసిన సూచనలు కొన్ని.. ● గంట ముందుగానే పరీక్ష హాల్‌కు చేరుకోవాలి. అనవసర చర్చలకు ఆస్కారం ఇవ్వొద్దు. ● ప్రశ్నాపత్రం తీసుకున్నాక వెంటనే రాయకుండా ఒకటికి రెండుసార్లు ప్రశ్నలు చదవాలి. ● కేటాయించిన మార్కులు, ముందుగా రాసే ప్రశ్నలు, వాటికి కేటాయించే సమయం ఎంచుకోవాలి. ● సులభమైన ప్రశ్నకు ముందుగా జవాబు రాయండి. ● అవసరమైన చోట హెడ్డింగ్, కామాలు, పుల్‌స్టాప్‌లు, డయాగ్రమ్‌లు ఉండేలా చూసుకోవాలి. ● జవాబుపత్రంపై హ్యాండ్ రైటింగ్ నీట్‌గా ఉండాలి. ● ప్రతీ నిమిషం విలువైనది కాబట్టి.. బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా జవాబురాయండి. కొంచెం సమయం తీసుకునే వాటికి తర్వాత ప్రయారిటీ ఇవ్వండి. ● కఠినమైన ప్రశ్నలకు దిగులు చెందకుండా..సులభమైన ప్రశ్నలను తొలుత ప్రారంభించి జవాబులు రాయండి. ● ఐదు నిమిషాల ముందు కాషన్ బెల్ రింగ్ అవుతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా రాసిన అన్ని ప్రశ్నలకు సరైన ప్రశ్న నంబర్ వేశామో లేదా చెక్ చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాస్తే విజయం మీ సొంతం అవుతుంది. -
‘మంత్రి సమాధానం చెప్పాలి’
మంథని: చెక్‌డ్యాంలతో అనేక ప్రయోజనాలు ఉంటాయనే ఆలోచనతో నిర్మిస్తే మంథని ఎమ్మెల్యే, రా ష్ట్రమంత్రి వాటిపై రాద్ధాంతం చేశారని మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధు విమర్శించారు. చెక్‌డ్యాంలు వేస్టు అని అసెంబ్లీలో ఆయన ప్రస్తావించడం శోచనీయమన్నారు. అడవిసోమన్‌పల్లి వద్ద మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాంను మంగళవారం మధు సందర్శించా రు. చేపలు పడుతున్న మత్స్యకారులను కలిసి ఉపా ధి గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధు మాట్లాడుతూ అప్పటిముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచనతో అడవిసోమన్‌పల్లి గ్రామంలోని మానేరుపై చెక్‌డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ల ప్రయోజనాలకే దానిని నిర్మించారని, సైంటిఫిక్‌గా నిర్మించలేద ని మంత్రి రకరకాలుగా మాట్లాడారని దుయ్యబట్టారు. చెక్‌డ్యాంతో భూగర్భజలాలు వృద్ధి చెందాయని, మత్స్య సంపదతో అనేక కుటుంబాలు ఉ పాధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. అడవి సోమన్పల్లితోపాటు ఇతర గ్రామాలకు చెందిన మ త్స్యకారులు ఇక్కడ చేపలు పట్టుకుని జీవనోపాధి పొందుతున్నారని ఆయన అన్నారు. దీనిపై మంత్రి ఏమని సమాధానం చెప్తారని మధు ప్రశ్నించారు. -
వీడని ఉత్కంఠ
తేలని ఫలితంసాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్– ఆదిలాబాద్– మెదక్– నిజా మాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్‌లో బీజీపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధించారు. ఎవరూ నేరుగా కోటా ఓట్లు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆసక్తి నెల కొంది. మొత్తం చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఫలితం తేలనుంది. దీంతో ట్రయాంగిల్‌గా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. త్రిముఖ పోటీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా 56 మంది అభ్యర్థులు పోటీపడినా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వచ్చాయి. 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు ముగ్గురు సుమారు లక్ష ఓట్లు, బరిలో నిలిచిన 53 మంది కలిపి కేవలం 10వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో మూడోస్థానంలో నిలిచే అభ్యర్థి ఎవరనేదానిపై ఎమ్మెల్సీ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరికీ దక్కని విన్నింగ్ కోటా ఓట్లు పోస్టల్ ఓట్లతో కలిసి మొత్తం 2,52,100 ఓట్లు పోలవగా, అందులో సుమారు 28 వేల ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. చెల్లనిఓట్లు పోగా మిగిలిన 2,24,000 ఓట్లలో సగం ఓట్లు.. అంటే.. 1,12,001 (సుమారు) ఓట్లను విన్నింగ్ కోటా ఓట్లుగా నిర్ధారించారు. పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి నేరుగా కోటా ఓట్లను సాధించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫలితం తేలేందుకు బుధవారం రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ప్రతీ రౌండ్లో బీజేపీకే ఆధిక్యం మొత్తం 21 టేబుళ్ల ద్వారా 12 రౌండల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిపై 36 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండోరౌండ్లో 1,457 ఓట్ల మెజార్టీ, మూడోరౌండ్లో 3,005 ఓట్లు, నాలుగో రౌండ్లో 1,263 ఓట్లు, ఐదోరౌండ్లో 1,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిపై 211 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 45,401 ఓట్లు సాధించి, ప్రత్యర్థులపై 6,931 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. 38,470 ఓట్లతో నరేందర్‌రెడ్డి సెకండ్ ప్లేస్‌లో, 3,1481 ఓట్లతో ప్రసన్నహరికృష్ణ మూడోస్థానంలో నిలిచారు. మందకొడిగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు తోడు పోటాపోటీగా అభ్యర్థులు ఓట్లు సాధిస్తుండటంతో రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ పెరుగుతోంది. రెండోప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ‘గ్రాడ్యుయేట్’ పోటీ త్రిముఖం కోటా ఓట్ల మార్కును చేరుకోని అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియతోనే తేలనున్న ఎమ్మెల్సీ ఫలితం ప్రస్తుతం ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికౌంటింగ్ వివరాలు మొత్తం ఓట్లు(పోస్టల్ ఓట్లతో కలిపి) 2,52,100 చెల్లని ఓట్లు : 28,000(11.01శాతం) చెల్లుబాటైనవి : 2,24,000 విన్నింగ్ కోటా ఓట్లు 1,12,001(సుమారు) బరిలో నిలిచిన అభ్యర్థులు : 56 -
ప్రజాసమస్యలు పరిష్కరించాలి
గోదావరిఖని: ప్రజాపాలనలో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్ ఠాకూరర్ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారుల కు సూచించారు. పాలకుర్తి గ్రామానికి చెందిన రవి తన తండ్రి కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడని, అదే ఉద్యోగం తనకు ఇప్పించాలని ఎమ్మెల్యే కు మొరపెట్టుకున్నాడు. కేశోరాం సిమెంట్ ఫ్యాక్ట రీ మేనేజర్‌కు ఫోన్‌చేసి మాట్లాడిన ఎమ్మెల్యే.. ఉద్యోగం ఇప్పించాలని సూచించారు. దీంతో మే నేజర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కన్నాల గ్రామానికి చెందిన పలువురు నిరుద్యోగులు తమకు ఉపాధి చూపించాలని కోరగా స్థానిక మెడికల్ కళాశాలలతో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తేలేదు అభివృద్ధి విషయంలో రాజీపడబోమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. లక్ష్మీనగర్ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మేదర్‌బస్తీ, ఉల్లిగడ్డ బజార్, అబ్దుల్‌కలాం విగ్రహం, కల్యాణ్‌నగర్, లక్ష్మీనగర్, వెంకటేశ్వర సైకిల్ స్టోర్స్ వరకు చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, రోడ్డు పనులు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఆయన వెంట నాయకులు మహంకాళి స్వామి, ముస్తాఫా, బొంతల రాజేశ్ తదితరులు ఉన్నారు. -
మాతాశిశు కేంద్రంలో ఆధునిక లాండ్రీ సేవలు
● అందుబాటులోకి యంత్రాలు పెద్దపల్లిరూరల్: స్థానిక మాతా, శిశు ఆస్పత్రిలో మెకనైజ్డ్ లాండ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా ఆస్పత్రితోపాటు మాతా, శిశు కేంద్రంలో లాండ్రీ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు వీలుగా మెకనైజ్డ్ లాండ్రీ యంత్రం కోసం మూడు నెలల క్రితం అధికారులు ప్రతిపాదించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇందుకు సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించారు. రూ.13 లక్షలతో ఏర్పాటు.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మైకనైజ్డ్ లాండ్రీ ఏర్పా టు కోసం అభివృద్ధి ప్రత్యేక నిధుల నుంచి కలెక్ట ర్ కోయ శ్రీహర్ష రూ.13 లక్షలు కేటాయించారు. ఇందులో రూ.8 లక్షలు మెకనైజ్డ్ యంత్రం కోసం వెచ్చించగా.. మిగిలిన నిధులతో షెడ్డు నిర్మించిన ట్లు సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. పేషెంట్లకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఆస్పత్రిని అన్ని విధాలా ఆధునికీకరిస్తున్నట్లు ఆ యన పేర్కొన్నారు. కలెక్టర్ శ్రీహర్ష ప్రత్యేక చొర వతో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులు మెరుగయ్యాయని, అన్నిరకాల వైద్యసేవలను స్థానికంగా అందిస్తున్నామని ఆయన వివరించారు. లాండ్రీ మిషన్‌ను ఎమ్మెల్యే విజయరమణారావు చేతు ల మీదుగా త్వరలో ప్రారంభించి సేవలను అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కొత్తపల్లి(కరీంనగర్): అంతర్రాష్ట్ర దొంగతనాలకు పాల్పడే ముఠాలోని సభ్యుడిని కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ట్రైనీ ఐపీఎస్ వసుంధర యాదవ్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా తండా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోర్ గ్రామానికి చెందిన ప్రదీప్(30) మరో 8 మంది ముఠాగా ఏర్పడ్డారు. ఏడాదికాలంగా కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ట్రావెల్స్ బస్సుల ద్వారా నిజామాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కరీంనగర్‌కు చేరుకుని, కాలినడకన ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కీ నిర్వహిస్తుంటారు. దొంగతనానికి పాల్పడాలని నిర్ణయించుకున్న సమీప ప్రాంతంలో మాటువేసి, అర్ధరాత్రి తర్వాత తాళం వేసిఉన్న ఇళ్లను గుర్తించి, తాళాలను పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతారు. ఈ చోరీలపై నిఘాపెట్టిన కరీంనగర్ రూరల్ ఏసీపీ, సీసీస్, కొత్తపల్లి పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ వెళ్లి ఈ నెల 3న ముఠాలోని ప్రధాన నిందితుడు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగలగుంటపల్లి, గుంటూరుపల్లి, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్, చింతకుంటలో నాలుగు దొంగతనాలకు పాల్పడ్డారని వసుంధర వెల్లడించారు. నిందితుడి నుంచి ద్విచక్రవాహనం స్వాధీ నం చేసుకున్నారు. ఎస్సై సాంబమూర్తి, కానిస్టేబు ళ్లు షరీఫ్, శ్రీనాథ్, ఖదీర్‌ను కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం నగ్రాలేలను ట్రైనీ ఐపీఎస్ అధికారి వసుంధర యాదవ్ అభినందించారు. రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. -
10,530 మంది.. 23 కేంద్రాలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 10,530 మంది ఇంటర్ విద్యార్థులు ఉండగా, వారికోసం 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించారు. మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఈసారి విద్యార్థుల హాల్టిక్కెట్లపైనే పరీక్ష కేంద్రాన్ని తెలుసుకునేందుకు వీలుగా ‘క్యూఆర్’ కోడ్ ముద్రించారు. పరీక్ష ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. నిర్దేశిత గడువ ముగిశాక ఐదు నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అత్యవసర సేవల కోసం వైద్య సిబ్బందిని నియమించారు. పరీక్షల సమయంలో ఆర్టీసీ బస్సులు నడిపేలా అధికారులకు ఆదేశాలు జారీచేశాచ్చారు. విద్యుత్, మున్సిపల్, పోస్టల్ అధికారులు తమ వంతు విధులను నిర్వర్తిస్తూ పరీక్షలు సాఫీగా సాగేలా చూడాలని ఉన్నతాధికారులు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. 10,530 మంది విద్యార్థులు.. జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 10,530 మంది ఉండగా, ఫస్టియర్‌లో 4,894 మంది (జనరల్ 3,826, వొకేషనల్ 1,068 మంది)విద్యార్థులు ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో 5,636 మంది(ఇందులో 4,550 మంది జనరల్, 1,086 మంది వొకేషనల్) విద్యార్థులు ఉన్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 14 ప్రభుత్వ జూనియర్ కాలేజీలతోపాటు 07 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, ఓ మైనార్టీ, సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలు ఉన్నట్లు ఇంటర్ విద్య బోర్డు అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్‌తోపాటు యాప్.. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రం చిరునామా చూపేలా ఈసారి హాల్‌టికెట్లపైనే క్యూఆర్ కోడ్ ముద్రించారు. దీంతోపాటు లొకేటర్ యాప్‌ను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు సులువుగా పరీక్ష కేంద్రాన్ని చేరుకునేందుకు ఇవి ఎంతో దోహదపడతాయని చెబుతున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో నిషేధాజ్ఞలు.. పరీక్ష కేంద్రాలకు సమీపంలో 144 సెక్షన్‌తోపాటు నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా ఉండకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జిరాక్స్ సెంటర్లను మూసిఉంచేలా ఆదేశాలు జారీచేశారు. సీసీ కెమెరాలు.. స్క్వాడ్‌తో నిఘా ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఇప్పటికే బిగించారు. అలాగే మాస్ కాపీయింగ్ నియంత్రణకు సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలో సీనియర్ లెక్చరర్, డెప్యూటీ తహసీల్దార్, ఏఎస్సైలు ప్రతినిధులుగా ఉంటారు. వసతుల కల్పన.. ఎండతీవ్రత పెరగడంతో పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి వసతి కల్పించారు. వైద్యసిబ్బందిని(ఎఎన్ఎం, ఆశ వర్కర్, సూపర్వైజర్) అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా సమాచారం పరీక్షల నిర్వహణ ఈనెల 5 నుంచి 25 వరకు మొత్తం విద్యార్థుల సంఖ్య 10,530ఇందులో జనరల్ విద్యార్థులు 8,376వొకేషనల్ విద్యార్థులు 2,154ఇన్విజిలేటర్లు 250 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 1 పరీక్ష కేంద్రాలు 23 ఏర్పాట్లు పూర్తి ఇంటర్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. పరీక్షలు సజావుగా సాగేందుకు అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగేలా చర్యలు తీసుకున్నాం. పరీక్ష సమయం దాటిన ఐదు నిమిషాల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించేలా ఆదేశాలు అందాయి. – కల్పన, జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిఘా నేత్రాల మధ్య పరీక్షల నిర్వహణ ఈసారి విద్యార్థుల హాల్‌టికెట్లపైనే క్యూర్ కోడ్ ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెద్దపల్లిరూరల్: గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడని ఎస్సై లక్ష్మ ణ్‌రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఈ నెల 1న పెద్దపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో అచేతనంగా పడివున్న గుర్తు తెలియని వ్యక్తిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మృతుడు నీలిరంగు ఫుల్ టీషర్ట్, ఆకుపచ్చ లుంగీ ధరించాడని తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్లు పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 87126 56506, 87126 56507 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఎస్సై సూచించారు. టిప్పర్ ఢీకొని ఒకరి దుర్మరణంఇల్లంతకుంట(మానకొండూర్): ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ కథనం ప్రకారం.. ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామానికి చెందిన నక్క శంకరయ్య(49) మంగళవారం ఉదయం సిద్దిపేట జిల్లా మైలారం గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో అనంతారం సమీపంలో అన్నపూర్ణ ప్రాజెక్టు కెనాల్ వద్ద టిప్పర్ ఢీకొట్టింది. రోడ్డుపై పడిన శంకరయ్య పైనుంచి టిప్పర్ టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం ముద్దలు ముద్దలుగా రోడ్డంతా పడింది. పోలీసులు పారలతో కుప్పగా చేసి, సంచిలో నింపి, ఆస్పతికి తరలించారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు భయంతో వణికిపోయారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. యువకుడి ఆత్మహత్యమానకొండూర్: లక్ష్మీపూర్ కు చెందిన కొమ్మగల్ల పవన్‌కల్యాణ్(22) ఆత్మహత్య చే సుకున్నట్లు సీఐ లక్ష్మీనారా యణ తెలిపారు. పవన్‌కల్యాణ్ సోమవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి ఇంటి ఎదుట రేకుల షెడ్డులో నిద్రించాడు. 11 గంటల సమయంలో చలి వేస్తోందని, ఇంట్లో పడుకుంటానని చెప్పి వెళ్లాడు. 1.20 గంటలకు ఇంట్లో నుంచి శబ్ధం వినిపించడంతో తల్లిదండ్రులు నిద్ర లేచారు. లోపలికి వెళ్లి చూడగా కుమారుడు పవన్‌కల్యాణ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని, కనిపించాడు. కాగా, మూడు రోజులుగా తమ కొడుకు జ్వరంతో బాధ పడుతున్నాడని, గ్రా మంలోనే చికిత్స పొందినా తగ్గలేదన్నారు. దీంతో మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు ఏజెంట్ల అరెస్టు ఖలీల్‌వాడి(నిజామాబాద్): విదేశాల్లో ఉద్యోగా లు ఇప్పిస్తామంటూ నిజామాబాద్ జిల్లా యువకులను మోసం చేసిన ముగ్గురు ఏజెంట్లను అ రెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రై మ్ ఏసీపీ వెంకటేశ్వర్రావు మంగళవారం తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన అలకుంట సంపత్, జగిత్యాల జిల్లాకు చెందిన దండుగుల చిరంజీవి, మిట్టపల్లి నర్సారెడ్డిలు థాయిలాండ్, లావోస్ దేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జిల్లాకు చెందిన బాధితుల నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశా రు. వీరిని లావోస్ దేశంలో బంధించి సైబర్ నే రాలు చేయించారు. చివరికి ఇద్దరు బాధితులు భారతీయ రాయబార కార్యాలయం సహాయంతో స్వదేశానికి తిరిగి వచ్చి ఏజెంట్లపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏజెంట్లను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరిని సారంగాపూర్ జిల్లా జైలుకు తరలించారు. -
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన ట్రాక్టర్ యజమాని శివరాత్రి నర్సింలు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాక్టర్‌ను మంగళవారం రాజన్నపేట శివారులో అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి, ఠాణాకు తరలించారు. ట్రాక్టర్ యజమాని నర్సింలు, డ్రైవర్ ఆలకుంట రాజులను అరెస్టు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బైక్‌లు ఢీకొని ఒకరి దుర్మరణం
ధర్మపురి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని తీగలధర్మారంలో మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. తుమ్మెనాలకు చెందిన అప్పాల మల్లయ్య (56) దొంతాపూర్‌లో ఉంటున్న తన బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లాడు. రాత్రి తిరుగు పయనం అయ్యాడు. దోనూర్, తీగలధర్మారం మధ్య ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొనడంతో మల్లయ్యకు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ఉన్న దోనూర్ గ్రామానికి చెందిన కస్తూరి లక్ష్మణ్‌కు తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించినట్లు బంధువుల ద్వారా తెల్సింది. మల్లయ్యకు భార్య, కొడుకు మహేష్, కూతురు లత ఉన్నారు. కొడుకు హైదరాబాద్‌లో గ్రేహౌండ్స్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మల్లయ్య స్థానికంగా ఉంటూ వ్యవసాయం చేస్తుంటాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి జగిత్యాల క్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ బస్టాండ్ వద్ద.. కరీంనగర్–జగిత్యాల ప్రధా న రహదారిపై ట్రాలీఆటోను మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొనగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జగి త్యాల శివారు టీఆర్‌నగర్‌కు చెందిన కడారి గంగాఽ దర్ (55), అతని బంధువు శ్రీహరి అలియాస్ శ్రీని వాస్‌తో కలిసి ట్రాలీ ఆటోలో టీఆర్‌నగర్ వెళ్తున్నా రు. కరీంనగర్ నుంచి మెట్పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ట్రాలీఆటోను ఢీకొంది. ఈ ఘటనలో గంగాధర్ అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీహరికి తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై సధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎమ్మెల్సీ గెలుపులో ‘బండి’ మార్క్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్–మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మల్క కొమురయ్య గెలుపు రాజకీయ, ఉపాధ్యాయవర్గాల్లో చర్చకు దారితీసింది. వాస్తవానికి బీజేపీ అనుబంధ సంఘమైన తెలంగాణ ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్రంలో ఇతర యూనియన్లతో పోలిస్తే బలమైన ఉపాధ్యాయ సంఘం కాదు. పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ వంటివి బలమైన ఉపాధ్యాయ సంఘాలుగా ప్రసిద్ధి చెందాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా సంఘాల అభ్యర్థులే గెలవడం గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. అందుకే, కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి బలమైన పార్టీలు కూడా పోటీకి దూరంగా ఉంటూ వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిని నిలిపి, గెలిపించడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ఆయన మార్క్ ప్రచారం, రాజకీయ ఎత్తుగడలు పనిచేసినట్లుగా పార్టీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బలమైన ఉపాధ్యాయ సంఘాలను, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థిని ఢీకొట్టి కొమురయ్యను గెలిపించడంలో బండి మరోసారి సక్సెస్ అయ్యారని మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బైకు ర్యాలీలతో సంబరాలు జరుపుకున్నారు. ప్రభారీ మీటింగ్‌లతో.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి సంజయ్ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ప్రచారం కొనసాగించారు. ముఖ్యంగా 25 మంది ఓటర్లకు ఒక ప్రభారీ (ఇన్చార్జి)ని నియమించడం ప్రభావవంతంగా పనిచేసిందని పార్టీవర్గాలు అంటున్నాయి. వీటితోపాటు జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పచ్చీస్ ప్రభారీల సమావేశం నిర్వహించడం, ఆ సమావేశాలకు స్వయంగా తానే వెళ్లి వారికి మార్గదర్శనం చేశారు. దేశవ్యాప్తంగా మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, ఉద్యోగులకు రూ.12 లక్షల దాకా ఐటీ మినహాయింపు ఇచ్చిన విషయాన్ని పదేపదే టీచర్లలోకి తీసుకెళ్లాలని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల తీరుతో తెలంగాణలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతీ సమావేశంలోను వివరిస్తూ టీచర్ల పక్షాన చేసిన బీజేపీ చేసిన పోరాటాలను వివరించారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను, కార్యకర్తలు లాఠీదెబ్బలు రక్తం చిందిస్తూ జైలుకు వెళ్లిన ఘటనలను గుర్తు చేస్తూ, భవిష్యత్తులోనూ టీచర్లకు, నిరుద్యోగులకు అండగా ఉండి పోరాటాలు చేస్తామని ఇచ్చిన హామీలు పనిచేశాయని పార్టీ పెద్దలు అభిప్రాయ పడుతున్నారు. ఇవన్నీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య గెలుపునకు కీలకంగా నిలిచాయని, అదే విధంగా పట్టభద్రుల్లో అంజిరెడ్డికి భారీగా ఓట్లు పోలయ్యేలా చేసిందంటున్నారు. ఇదే ఊపుతో పట్టభద్రుల స్థానం కూడా కై వసం చేసుకుంటామని బీజేపీవర్గాలు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. మల్క కొమురయ్య విజయంలో సంజయ్‌ది కీలకపాత్ర ఫలించిన పచ్చీస్ ప్రభారీ సమావేశాలు, ప్రచారం ఎమ్మెల్సీగా కొమురయ్యది చారిత్రక విజయం కరీంనగర్‌టౌన్: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందని, తమ అభ్యర్థి మల్కా కొమురయ్యది చారిత్రక విజయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీకి అండగా నిలిచిన ఉపాధ్యాయులకు, రేయింబవళ్లు కష్టపడిన కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయం నుంచి కోర్టు చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొమురయ్య విజయంలో తపస్ ప్రధాన భూమిక పోషించిందన్నారు. అభ్యర్థిని నిలబెట్టలేని కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీజేపీని ఓడగొట్టడానికి అనేక కుట్రలు చేశాయని ఆరోపించారు. 317 జీవోకు వ్యతిరేకంగా ఆనాడు కరీంనగర్లో కొట్లాడిన బీజేపీ కార్యకర్తలను టీచర్లు మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుందని భావించిన కేసీఆర్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే వీరికి పడుతుందని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా బీజేపీ అభ్యర్థే గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీజేపీ సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘అనంతగిరి’.. పరిహారమేది?
● ప్రాజెక్టు నిర్వాసితులకు అందని ప్యాకేజీ డబ్బులు ● కోర్టుకు వెళ్లినవారికి ఇళ్ల స్థలాలు కేటాయించలే ● పునరావాస కాలనీలో అరకొర వసతులు ● ఇబ్బంది పడుతున్న బాధితులు ఇల్లంతకుంట(మానకొండూర్): అనంతగిరి ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన వారికి ఏళ్లుగా న్యాయం జరగడం లేదు. అంతేకాకుండా, నిర్వాసిత కాలనీలోనూ అరకొర సౌకర్యాలే కల్పించారు. ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో 3.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మించారు. ప్రాజెక్టులో అనంతగిరి పూర్తిస్థాయిలో, సిరికొండ పాక్షికంగా, సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి, చెలకలవానిపల్లి పాక్షికంగా మునిగిపోయాయి. వీరందరికీ ఇప్పటికీ చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. అసౌకర్యాల మధ్యే.. అనంతగిరికి చెందిన 854 ఇళ్లు పూర్తిస్థాయిలో ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామస్తుల కోసం ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేశారు. కానీ, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి, మురికినీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మించలేదు. గదుల్లో విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ లేవు. అంగన్వాడీ కేంద్రం, సబ్ హెల్త్ సెంటర్ భవనాలు పిల్లర్లకే పరిమితమయ్యాయి. కాలనీలో ప్రధాన రోడ్డు తప్పితే మిగతా రోడ్ల నిర్మాణం అంతంతే. కాలనీలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు. 103 మందికి అందని స్థలాలు భూ సర్వే చేసిన 2017 సంవత్సరం వరకు 18 ఏళ్లు నిండినవారికి కుటుంబ ప్యాకేజీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. అయితే, ఇళ్లు ఖాళీ చేసిన 2020 సంవత్సరం వరకు దీన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. ఇళ్లు, భూముల లెక్క కట్టడంలో అసమానతలు ఉన్నాయని, గ్రామంలోని 103 మంది కోర్టుకు వెళ్లారు. ఇళ్లు ఖాళీ చేసే సమయంలో వీరి ఇంటి స్థలం కేటాయించలేదు. దీంతో వీరి కోసం ప్రత్యేకంగా 103 కోర్టు గదులు నిర్మించారు. వీటిల్లో ప్రస్తుతం కొందరే ఉంటున్నారు. -
నేరం చేస్తే.. తప్పించుకోలేరు
● కేసుల్లో పక్కా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు ● జగిత్యాల జిల్లాలో వరుస తీర్పులు ● జైలుకు వెళ్తున్న నేరస్తులు జగిత్యాల క్రైం: నేరం చేసినవారు ప్రస్తుతం తప్పించుకునే పరిస్థితి లేదు. నమోదైన కేసుల్లో పక్కా ఆధారాలు సేకరించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. దీంతో జగిత్యాల జిల్లాలో నేరాలు చేసినవారికి న్యాయస్థానంలో వరుసగా శిక్షలు పడుతున్నాయి. నేరం చిన్నదైనా.. పెద్దదైనా శిక్ష అనుభవించాల్సిందే. ఇతర దేశాలకు పారిపోదామనుకుంటే పొరపాటే. ప్రపంచంలో ఎక్కడున్నా పోలీసులు పట్టుకొస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని, పౌరులు బాధ్యతగా ఉండాలని ఇటీవలి పలు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. పరిస్థితి మారిపోయింది.. గతంలో నేరం జరిగితే దాన్ని చూసినవాళ్లు వచ్చి, కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వచ్చేది. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. సంఘటనలపై కేసులు నమోదైతే నిందితుల ఫోన్ లొకేషన్, సదరు ఏరియాల్లో సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్, డాగ్‌స్క్వాడ్ వంటి వాటిని వినియోగిస్తూ సరైన సాక్ష్యాలు సేకరించి, చార్జిషీట్లో పొందుపరుస్తుండటంతో కేసులకు బలం చేకూరి, నేరస్తులకు తగిన శిక్ష పడుతోంది. ఉన్నతాధికారుల దిశానిర్దేశం.. నేరం జరిగిన వెంటనే ఎస్ఐఆర్ నమోదు, చార్జిషీట్ దాఖలు, పక్కాగా సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టి, నేరాన్ని నిరూపిస్తే 100 శాతం శిక్ష పడుతుందని పోలీసులు చెబుతున్నారు. కేసుల నమోదు, విచారణలో నాణ్యత పాటించాలని, సాంకేతికతను వినియోగించాలని పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాల్లో దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అవి పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తప్పు చేస్తే శిక్ష తప్పదు తప్పు చేసినవారికి తప్పకుండా శిక్ష పడుతుంది. నేరాన్ని పరిగణలోకి తీసుకొని, దాని కి తగినట్లుగా న్యాయస్థానం శిక్ష వేస్తుంది. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బ ందిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇటీవలి కాలంలో పలు కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడ్డాయి. – అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ, జగిత్యాల శిక్ష పడిన నేరస్తుల వివరాలు శిక్ష 2022 2023 2024 2025 జీవితకాలం 2 14 10 1 5–10 ఏళ్లు 2 2 11 2 3–5 ఏళ్లు 3 6 3 3 1–3 ఏళ్లు 9 20 12 1 ఏడాదిలోపు 44 13 26 0 మొత్తం 60 55 62 7 -
ఏడేళ్ల నిరీక్షణ ఫలించేనా?
గోదావరిఖని: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి(Singareni) బొగ్గు గనుల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. వాటి పరిష్కారం కోసం మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన స్ట్రక్చరల్ సమావేశం 15 నెలలు గడిచినా జాడ లేకుండా పోయింది. గతేడాది నవంబర్ 28న డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశాన్ని సింగరేణి యాజమాన్యం నిర్వహించింది.విధానాల నిర్ణయాలకు సంబంధించిన అంశాలు కావడంతో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి సమావేశంలోనే తేల్చుకోవాలని డైరెక్టర్లు చేతులెత్తేశారు. అప్పటి నుంచి అనేక కారణాలతో సీఎండీ స్థాయి సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈనెల 5న స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పేరిట వాయిదా..గత ఫిబ్రవరి 5న సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహిస్తామని యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నేతలకు సమాచారం ఇచ్చింది. అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వాయిదా వేసింది. గతంలో కూడా జనవరి 27న నిర్వహిస్తామని చెప్పినా.. వాయిదా పడింది.ఈసారైనా మోక్షం లభించేనా?సంస్థ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈసారైనా మోక్షం లభించేనా? అని ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా జీతభత్యాలపై ఆదాయపన్ను మాఫీ, సొంతింటి పథకం, మారుపేర్ల కార్మికులకు ఉద్యోగాలు తదితర సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు. వాటి పరిష్కారం కోసం యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను నిర్వహించింది. 2023 డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించగా.. గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీయూసీ గెలుపొందాయి.ఎట్టకేలకు 2024 సెప్టెంబర్ 9న ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం అందజేశారు. అక్టోబర్‌లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులకు యాజమాన్యం శిక్షణ తరగతులు నిర్వహించింది. యాజమాన్యం, కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు సాగాలనే తదితర అంశాలపై శిక్షణ తరగతుల్లో వివరించారు. ఆరేళ్ల తర్వాత తొలి సమావేశం..సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గుర్తింపు యూని యన్‌గా రెండోసారి గెలిచిన తర్వాత ఒకటి రెండు సమావేశాలు జరిగాయి. 2018 నుంచి ఇప్పటి వరకు స్ట్రక్చరల్ సమావేశాలు లేకుండా పోయాయి.ఏఐటీయూసీ గుర్తింపు యూనియన్‌గా గెలిచిన తర్వాత స్ట్రక్చ రల్ సమావేశం నిర్వహించాలని యాజమా న్యంతో పట్టుబట్టింది. దీంతో ఏడాది ఆల స్యంగానైనా సంస్థ డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశాన్ని గతేడాది నవంబర్‌లో నిర్వ హించింది. కానీ అందులో సమస్యల పరి ష్కారానికి మోక్షం లభించలేదు. ⇒ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గతేడాది డిసెంబర్ 23న జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు సీఎండీ స్థాయిలో స్ట్రక్చరల్ సమావేశం జరగలేదు⇒ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్య లకు ఇప్పటికీ మోక్షం లభించలేదు⇒ ప్రధానంగా మారుపేర్ల బాధితులు, విజి లెన్స్ కేసులతో చాలామందికి ఉద్యోగా లు రాక కార్యాలయాల చుట్టూ తిరు గుతున్నారు. ⇒ డైరెక్టర్ల స్థాయి స్ట్రక్చరల్ సమావేశం గతేడాది నవంబర్ 28న జరిగింది.⇒ ప్రధాన సమస్యలన్నీ సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశంలోనే తేల్చుకోవాల ని డైరెక్టర్లు చేతులెత్తేశారు.⇒ ఇప్పటివరకు మళ్లీ సమావేశం లేదు.⇒ స్ట్రక్చరల్ సమావేశం కోసం సుమారు 42 వేల మంది కార్మికుల నిరీక్షణప్రధాన డిమాండ్లు ఇవే..⇒ కోల్–ఇండియా మాదిరిగా జీత భత్యాలపై ఆదాయ పన్ను మాఫీ చేయాలి⇒ మారుపేర్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలి. ⇒ విజిలెన్స్ పేరిట పెండింగ్‌లో ఉన్న కార్మికుల పిల్లలకు వన్‌టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలివ్వాలి. ⇒ సంస్థ వ్యాప్తంగా సుమారు 500 మంది మారుపేర్ల కార్మికులున్నారు. ⇒ గైర్హాజరు పేరుతో తొలగించిన కార్మికులను కూడా వన్‌టైం సెటిల్మెంట్ కింద విధుల్లోకి తీసుకోవాలి ⇒ కోల్ ఇండియాలో లేని సింగరేణిలో ఉన్న 14 రకాల అలవెన్స్‌లు పెంచాలి ⇒ కార్మికుల పదోన్నతి విధానం అమలు చేయాలి⇒ ట్రేడ్స్మెన్లకు గనిలో పనిచేసే పరిధి నిర్ధారించాలి.⇒ కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలి ⇒ గనులపై కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్ సౌకర్యం కల్పించాలి⇒ వైద్య సౌకర్యం మెరుగుపరచి కార్పొరేట్‌స్థాయి సౌకర్యాలు కల్పించాలి⇒ కొత్త గనులు ఏర్పాటు చేసి నూతన ఉద్యోగాలు కల్పించాలి⇒ కొన్ని శతాబ్దాలపాటు సంస్థ భవిష్యత్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి ⇒సీఎస్ఆర్ నిధులు ప్రభావిత, నిర్వాసిత గ్రామాల్లోనే వినియోగించాలి. -
బల్దియా వాహనాల్లో కదలిక
● పరిశీలనకు ఢిల్లీ నుంచి వచ్చిన ఇంజినీర్ ● మరమ్మతు అంచనాకు క్షేత్రస్థాయిలో తనిఖీలుకోల్సిటీ(రామగుండం): రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నాలుగేళ్లుగా మూలన పడేసిన పారిశుధ్య వాహనాలకు ఎట్టకేలకు ‘సాక్షి’ కథనంతో కదిలిక వచ్చింది. ‘బల్దియాకు నిర్లక్ష్యపు తుప్పు’ శీర్షికన గతనెల 7న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ స్పందించి.. వాహనాలపై ఆరా తీశారు. వెంటనే మరమ్మతు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇవి పనిచేయకపోవడానికి కారణాలు? మరమ్మతు సమస్యలు ఉన్నవి, అవసరమైన విడిభాగాలు.. తదితర వివరాలు తెలుసుకోవడానికి ఢిల్లీ నుంచి వచ్చిన ఇంజినీర్ అమీర్, వరంగల్‌కు చెందిన మరో ఇంజినీర్ రాజు క్షేత్రస్థాయిలో వాహనాలను తనిఖీ చేశారు. బల్దియా కార్యాలయం ఆవరణలో మూలన పడేసిన వాహనాలతోపాటు గౌతమినగర్‌లోని డీఆర్సీ కేంద్రంలోని ట్రక్ మౌంటెడ్ గార్బేజ్ కంపాక్టర్, జెట్టింగ్ మిషన్, స్వీపింగ్ మిషన్, పోర్టేబుల్ స్టాటిక్ కంపాక్టర్, హుక్ లోడర్ తదితర ఆధునిక యంత్రాలు, వాహనాలను పరిశీలించారు. మరమ్మతు కు కావాల్సిన సామగ్రి కోసం వివరాలను నమో దు చేసుకున్నారు. ఢిల్లీ వారికి చెందిన ప్రైవేట్ కంపెనీ ఇంజినీర్లతో చర్చించి అంచనాలను రూపొందించి, మున్సిపల్ కమిషనర్‌కు త్వరలోనే సమర్పిస్తామని ఇంజినీర్ తెలిపారు. -
ఇక నేరుగా చెల్లింపు
మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపులో ఆలస్యమవుతోంది. ఆన్లైన్ ద్వారా ఇకనుంచి నేరు చెల్లించేందుకు గల అవకాశాలను పరిశీలించాలి. తొలుత పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మండలాల్లో చెల్లింపులు చేపట్టాలి. వాటి ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తాం. – యోగితారాణా, విద్యాశాఖ కార్యదర్శి పొరపాట్లకు తావుండొద్దు మధ్యాహ్న భోజన వర్కర్లకు సకాలంలో బిల్లులను ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం సంతోషకరం. అయితే ఆన్లైన్లో వివరాలను నమోదు చేసే సమయంలో పొరపాట్లు జరిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పొరపాట్లకు ఆస్కారం లేకుండా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్వేర్ తయారు చేయాలి. – పూసాల రమేశ్, మధ్యాహ్న భోజన వర్కర్ల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
ఎన్టీపీసీ సీజీఎంకు పదోన్నతి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు చీఫ్ జనర ల్ మేనేజర్(సీజీఎం) చంద న్‌కుమార్ సామంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా పదోన్నతి పొందారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎన్టీపీసీ కార్పొరేటర్ సెంటర్(హెచ్ఆర్) డైరెక్టర్ అనిల్ కుమార్ జాడ్లి ఉత్తర్వులు విడు దల చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన చందన్‌కుమార్ సామంత రామగుండం ప్రాజెక్టులోనే కొనసాగనున్నారు. ఆయనను అధికారులు, ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులతోపాటు ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా అభినందించారు. -
మహిళలకు ఆటల పోటీలు
గోదావరిఖని: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వివిధ పోటీలు నిర్వహిస్తామని ఆర్జీ–1 సేవా అధ్యక్షురాలు అనిత తెలిపారు. స్థానిక జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, సేవా సమితి ట్రెయినర్లతో ఆమె సో మవారం సమావేశమయ్యారు. ఈనెల 6న స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్‌లోని గోదావరికళా ప్రాంగణంలో మహిళలకు ఆటలు, ఇతర పోటీలు నిర్వహిస్తామన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్సీవోఏ క్లబ్లో అత్యత్తుమ సేవలు అందించిన మహిళలను సన్మానిస్తామని అన్నారు. పర్సనల్ డీజీఎం కిరణ్‌బాబు, సీనియర్ పీవో హన్మంతరావు, సేవా జాయింట్ సెక్రటరీ బీనాసింగ్, కో ఆర్డినేటర్లు తిరుపతి, రవికుమార్పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అసమర్థతతో ఎండుతున్న పంటలు
● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ధర్మారం(ధర్మపురి): కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే నీళ్లు అందక వరి పొలాలు ఎండుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, విప్ లక్ష్మణ్‌కుమార్‌కు చిత్తశుద్ధి ఉంటే మూడు మండలాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందించే లింక్ కాల్వ పనులను వెంటనే పూర్తిచేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నందిమేడారంలోని నందిరిజర్వాయర్కు అనుబంధంగా చేపట్టిన లింక్ కాలువ పనులను ఈశ్వర్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్ గ్రామాల్లోని ఆయకట్టు సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.13 కోట్లు వెచ్చించి నంది రిజర్వాయర్ నుంచి 2.5 కి.మీ. పొడవున లింక్కాల్వ నిర్మాణం చేపట్టామని, 90శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని మాజీమంత్రి వివరించారు. మిగతా పనులు పూర్తిచేసి సాగునీరందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పంటలు ఎండిపోతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. నాయకులు ముత్యాల బలరాంరెడ్డి, రాసూరి శ్రీధర్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పుస్కూరి జితేందర్‌రావు, మిట్ట తిరుపతి, చొప్పరి చంద్రయ్య, ఎండీ రఫీ, ఆవుల శ్రీనివాస్, కొత్త మోహన్, పాక వెంకటేశం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
7న శ్రామిక మహిళల ర్యాలీ
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళా శ్రామికుల సంఖ్య పెరుగుతు న్నా కనీస వేతనాలు అందడం లేదని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ జ్యోతి అన్నా రు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాల యంలో నాయకురాలు నాగమణి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఈనెల 8న మహిళా దినోత్సవాన్ని పోరాట దినంగా జరపాలని సీఐటీయూ నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా 7న జి ల్లా కేంద్రంలో శ్రామిక మహిళలతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, మహిళా సాధికారి త సాధనలో పాలకులు విఫలమయ్యారని వి మర్శించారు. ప్రతినిధులు వనజారాణి, రామ లక్ష్మి, భాగ్య, సులోచన, సుశీల, స్వరూప, భా గ్యలక్ష్మి, ముత్యంరావు, రవీందర్ పాల్గొన్నారు. చింతకాయలు కిలో రూ.200 సుల్తానాబాద్‌రూరల్(పెద్దప ల్లి): పచ్చడికి వినియోగించే పచ్చిచింతకా యలు కిలో రూ.200 వరకు ధర పలుకుతోంది. ఏటా కిలో రూ.30– రూ. 50 మధ్య పలికే పచ్చిచింతకాయ ధర ఈ సారి ఇంత అధికంగా ధర పలకడం ఇదే తొలి సారి. ఈ ఏడాది ఆదినుంచీ కిలో రూ.100కు పైగానే ధర పలుకుతూ వచ్చి.. సోమవారం ఏకంగా రూ.200 వరకు చేరింది. చింతకాయ నిల్వ ప చ్చడి పెట్టుకునేందుకు వినియోగదారుల నుంచి డిమాండ్ రావడంతోనే ధర పెరుగుతూ వస్తోందని వ్యాపారులు వివరిస్తున్నారు. క్వింటాల్ పత్తి రూ.6,628 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,628 ధర పలికింది. కనిష్టంగా రూ.5,009, సగటు ధర రూ.6,323గా నమోౖదైందని మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప తెలిపారు. మొత్తం 590 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆమె వివరించారు. ‘మోసం చేసిన బీఆర్ఎస్’సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): ప్రజలను మ భ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇళ్లు ఇవ్వకుండా మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు వి మర్శించారు. కాట్నపల్లిలో సోమవారం ఆయ న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. డ బుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా ఇల్లు ఇ వ్వకుండా అన్యాయం చేసిందని ఆరోపించా రు. మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని అన్నారు. నాయకులు అన్నయ్యగౌడ్, ప్రకాశ్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్, మహేందర్, దామో దర్, సంతోష్‌రావు, ఆనందరావు, శ్రీనివాస్, బిరుదు కృష్ణ, అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్కు రాయితీకోల్సిటీ(రామగుండం): స్థలాల క్రమబద్ధీకర ణ కోసం దరఖాస్తు చేసుకున్న వారు చెల్లించాల్సిన రుసుం మొత్తంలో 25 శాతం రాయితీ క ల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు జీవోఎంస్ నంబరు 28 ఎంఏ –యూడీ తేదీ: 20.02.2025 ద్వారా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష, బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ కోరారు. వివరాలకు బల్దియా లోని హెల్ప్‌డెస్క్‌లో స్వయంగా లేదా ఫోన్ నంబర్లు 63029 73409, 91823 09215, 93981 30997లో సంప్రదించాలని వారు కోరారు. -
ఆన్లైన్లోనే బిల్లుల చెల్లింపు
● ‘మధ్యాహ్న’ కార్మికులకు ప్రయోజనం ● పైలెట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎంపిక ● ఒక్కో జిల్లాలోని ఒక్కో మండలంలో అమలుకు కార్యాచరణపెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వర్కర్లకు సకాలంలో నిధులు అందేలా ఆన్లైన్లోనే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని ఆదేశించింది. ఆ మండలాల్లో ఈ ప్రక్రియ అమలు చేయాలని విద్యాశాఖ కార్యద ర్శి యోగితారాణా ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డితో కలిసి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ఆదేశాలు జారీచేయడంతో కలెక్టర్ కో య శ్రీహర్ష, డీఈవో మాధవి అప్రమత్తమయ్యారు. సకాలంలో బిల్లులు అందించేందుకే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సర్కారు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. దీని నిర్వహణ బాధ్యతలను చేపట్టిన కార్మికులు బిల్లులు సకాలంలో అందక అవస్థలు పడుతున్నారు. అంతేకాదు.. నిధులు వస్తాయో, లేదోనని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బిల్లులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని ఇబ్బందుల్లేకుండా అందించవచ్చని వారు వివరించినట్లు తెలిసింది. దీంతో ఆయా జిల్లాల్లో ఒక్కో మండలంలో ఆన్లైన్ చెల్లింపులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
టీచర్స్‌లో కమలం పాగా
● తొలి ప్రాధాన్యంలోనే గెలిచిన మల్క కొమురయ్య ● కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ ఓటర్ల వడబోత ● నేటి మధ్యాహ్నానికి మొదలవనున్న లెక్కింపు ● మందకొడి లెక్కింపుపై అభ్యర్థుల మండిపాటు ● ఆర్వో, సిబ్బంది పనితీరుపై ఈసీకి సర్దార్ ఫిర్యాదు ● మల్క కొమురయ్యను అభినందించిన బండి సంజయ్ ● ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమన్న కేంద్ర సహాయ మంత్రిసాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ టీచర్ నియోజవర్గం కమలం వశమైంది. ముందు నుంచి అనుకున్నట్లుగా మల్క కొమురయ్య టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎగరేసుకుపోయారు. తొలిప్రాధాన్యం ఓట్లతోనే కొమురయ్య గెలవడం విశేషం. నల్గొండ టీచర్ ఎన్నికల ఫలితాలు సాయంత్రానికే వచ్చేసినా.. కరీంనగర్ టీచర్ ఎన్నికల లెక్కింపు సాయంత్రానికి మొదలవడం గమనార్హం. అయినా కేవలం కౌంటింగ్ ప్రారంభించిన రెండు గంటల్లోనే ఫలితం తేలడం గమనార్హం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. కాగా 897 చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి కొమురయ్య చేరుకున్నారు. దీంతో తొలిరౌండ్లోనే బీజేపీ మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలిచినట్లయింది. గతంలో పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి టీచర్ సంఘాలు కాకుండా జాతీయ పార్టీ అయిన బీజేపీ పోటీ చేసి గెలవడం చర్చానీయాంశంగా మారింది. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ వడబోత.. సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వడపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓటర్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో రకరకాల ప్రచారాలు మొదలవడంతో రాత్రి ప్రకటించారు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.5 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం లెక్కింపు మొదలైనా.. తొలి ప్రాధాన్యంలో కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అందులో కోటా ఓట్లు చేరుకునే వరకు ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి. ఆర్వో, సిబ్బందిపై మండిపాటు గ్రాడ్యుయేట్, టీచర్లకు పోటీ పడిన పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), లెక్కింపు సిబ్బందిపై మండిపడ్డారు. లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రానికి నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలితం కొలిక్కి వచ్చినా.. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. కౌంటింగ్ నిర్వహణ సరిగా లేదని, ఓట్లలో జంబ్లింగ్ విధానం పాటించలేదని, బూత్‌ల (పలిమెల బూత్) వివరాల్లో గోప్యత పాటించకుండా బయటికి వెల్లడించారని ఆరోపిస్తూ ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. వీరితోపాటు అభ్యర్థులు విక్రంరెడ్డి, సిలివేరు శ్రీకాంత్ తదితరులు ఆర్వో తీరుపై మండిపడ్డారు. కౌంటింగ్‌లో పారదర్శకత లేదని, వెంటనే ఎన్నికలు రద్దు చేయాలని నినాదాలు చేశారు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీకి పోలైన ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. బండి అభినందనలురాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని కేంద్ర సహాయ మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5,900 ఓట్ల తేడాతో మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారు. ఇటీవల బడ్జెట్లో ఉద్యోగులకు రూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడంపై తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో బీజేపీ కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది. నాడు కేసీఆర్ మూర్ఖత్వపు పాలనకు వ్యతిరేకంగా టీచర్ ఎమ్మెల్సీగా ఏవీఎన్ రెడ్డిని గెలిపించారు. 317 జీవోపై బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలు, లాఠీచార్జ్ గుర్తుంచుకుని ఈనాడు మల్క కొమురయ్యను గెలిపించారు. తపస్ అంటే చిన్న సంస్థ అని హేళన చేసిన వారందరి చెంప చెళ్లుమన్పించేలా తీర్పు ఇచ్చారు’ అని అన్నారు. -
అటవీ సంపద కోసమే ఆపరేషన్ కగార్
గోదావరిఖని: అడవుల్లో సంపదను బహుళజాతి సంస్థలకు అమ్ముకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని రాష్ట్ర పౌర హక్కుల సంఘం కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ జర్నలిస్టు, డిఫెన్స్‌ఫోర్స్ నాయకుడు రాజేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మధ్య భారత దేశంలోని దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులు, ఆదివాసీలను హతమారుస్తున్నారన్నారు. ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఆ తర్వాత అక్క డ ఉన్న అపారమైన ఖనిజ సంపదను బహుళజా తి సంస్థలకు అమ్ముకోవడానికి చూస్తోందని ఆరోపించారు. రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న మాట్లాడు తూ దేశ సంపద మొత్తం 500 మంది చేతుల్లో ఉందని, పాలకులు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ సంపదని కొల్లగొడుతున్నారన్నారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు అందరికీ వర్తింపచేయాలని, కనీస సదుపాయాలైన కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఉపాధి అందించాలని కోరారు. ఆదివాసీలపై దాడులు ఆపి, పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల నెపంతో చంపేసిన ఆదివాసీ కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని, ఈవిషయంపై సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ జరిపించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజన్న, దుర్గం నరేశ్, నారా వినోద్, బొడ్డుపల్లి రవి, లక్ష్మణ్, ఏలేశ్వరం వెంకటేశ్, వెలుతురు సదానందం పాల్గొన్నారు. ● పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు -
శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి
● మంత్రి శ్రీధర్‌బాబు ● ఘనంగా మాజీ స్పీకర్ జయంతి మంథని/పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్/రామరి: మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి చేస్తా మని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శ్రీపాదరావు జయంతి సందర్భంగా మంథని శ్రీపాద చౌరస్తా, రామగిరి మండలం రామయ్యపల్లిలోని శ్రీపాదరావు విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళి అర్పించా రు. అనంతరం మంత్రి మాట్లాడారు. పేద, బడు గు, బలహీ న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు శ్రీపాదరావు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఐలి ప్రసాద్, కొత్త శ్రీనివాస్, శశి భూషణ్ కాచే, వొడ్నాల శ్రీనివాస్, పెండ్రు రమ, మంథని సత్యం, శంకర్ తదితరులు ఉన్నారు. పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్లో అసెంబ్లీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ కోయ హర్ష, అదనపు కలెక్టర్ వేణు తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను సూపరింటెండెంట్ బండి ప్రకాశ్ చదివి వినిపించారు. జిల్లా క్రీడల శాఖ అధికారి సురేశ్, డీఈవో మాధవి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీపాదరావు చిత్రపటానికి ఎమ్మె ల్యే విజయరమణారావు పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, డి.దామోదర్‌రావు, శ్రీగిరి శ్రీనివాస్, సాయిరి మహేందర్, వేగోళం అబ్బయ్యగౌడ్, చిలుక సతీశ్ పాల్గొన్నారు. గోదావరిఖని: రామగుండం సీపీ శ్రీనివాస్ కమిషనరేట్‌లో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమా ల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ .రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఆర్ ఐలు వామనమూర్తి, శ్రీనివాస్, సంపత్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఏఐటీయూసీని విమర్శించే అర్హత లేదు’
గోదావరిఖని: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించవద్దన్న యూనియన్లకు తమను విమర్శించే అర్హత లేదని ఏఐటీయూసీ అ ధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్య దర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. స్థానిక భా స్కర్రావుభవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన కా ర్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికుల పెండింగ్ సమస్యలపై ఈనెల 5న జరిగే సీ ఎండీ స్థాయి సమావేశంలో చర్చిస్తామన్నారు. అ లవెన్సులపై ఆదాయపు పన్ను యాజమాన్యమే చెల్లించాలని, సొంతింటి పథకం అమలు చేయాలని, మారుపేర్లు, విజిలెన్స్ బాధితుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యాజమా న్యం పంచన చేరి, కార్మికులకు ద్రోహం చేస్తున్న కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. గతేడాది నవంబర్ 28న కొత్తగూడెంలో డైరెక్టర్(పా) స్థాయి స మావేశంలో కార్మికుల పెండింగ్ సమస్యలపై అ వగాహన కుదిరిందని, వాటిపై ఉత్తర్వులు రావాల్సిన ఉందని తెలిపారు. నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, ముస్కె సమ్మయ్య, కవ్వంపల్లి స్వామి, రంగు శ్రీనివాస్, గౌస్, ప్రసాద్ పాల్గొన్నారు. -
ఉత్పత్తి చేయాల్సింది 12 మిలియన్ టన్నులు
● ఫిబ్రవరి వరకు ఉత్పత్తి చేసింది 60 మిలియన్ టన్నులు ● నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన వైపు సింగరేణి పరుగులు గోదావరిఖని: సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి సాధించడానికి మిగిలింది సుమారు నెలరోజులే ఉంది. ఇప్పటివరకు 60 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీసింది. ఇంకా 12 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రధానంగా ఓసీపీల్లో ఉత్పత్తిపైనే ప్రత్యేక దృష్టి సారించింది. లాభాల బాటలో కొనసాగుతున్న ఓసీపీల్లో ఉత్పత్తి పెరిగితే సంస్థకు మరిన్ని లాభాలు వస్తాయని సింగరేణి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తిపై యాజమాన్యం దృష్టి కేంద్రీకరించింది. లక్ష్య సాధనకు సానుకూలమే.. ఈసారి వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించలేకపోయింది. ఈ మార్చితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఇంకా సుమారు నెలరోజుల సమయం ఉండడంతో ఉత్పత్తికి అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయని యాజమాన్యం భావిస్తోంది. ఈలోగా వందశాతం బొగ్గు ఉత్పత్తి చేయాలని పేర్కొంటోంది. ఇదే సమయంలో రక్షణ చర్యలు పటిష్టంగా అమలు చేస్తోంది. ఏరియాల వారీగా సమీక్ష.. సింగరేణిలోని 11 ఏరియాల అధికారులతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ చర్యలపై యాజమాన్యం తరచూ సమీక్షిస్తోంది. టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లు, డైరెక్టర్ల ఆకస్మిక తనిఖీలతో ఉత్పత్తిలో వేగం పెంచింది. సీఎండీ బలరాం కూడా గనులపై పర్యటించి ఉత్పత్తి పెంపుపై ఉద్యోగులు, కార్మి కులకు దిశానిర్దేశం చేశారు. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు తక్కువ ధరకే బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆయన సూచించారు. ఆయన పర్యటన తర్వాత కొన్ని గనుల్లో ఉత్పత్తి ఆశాజనకంగా సాగుతోందని ఏరియాల అధికారులు చెబుతున్నారు. ఒకరోజ ప్రొడక్షన్ డే.. బొగ్గు ఉత్పత్తి బాగా వచ్చే ఓసీపీల్లో వారంలో ఒకరోజు ప్రొడక్షన్ డేగా ప్రకటించారు. ప్రొడక్షన్ డే రోజులో 22 గంటలపాటు యంత్రాలు పనిచేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈక్రమంలో డ్యూటీలోని ఉద్యోగులకు అల్పాహారం, భోజనం కూడా అంది స్తూ యాజమాన్యం పోత్సహిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి వివరాలుసింగరేణిలోని మొత్తం ఓసీపీలు 17 భూగర్భ గనుల సంఖ్య 22 నిర్దేశిత లక్ష్యం(మిలియన్ టన్నుల్లో) 72ఫిబ్రవరి వరకు(మిలియన్ టన్నుల్లో) 64.31 ఫిబ్రవరి వరకు సాధించింది(మిలియన్ టన్నుల్లో) 60 నమోదు చేసిన బొగ్గు ఉత్పత్తి శాతం 93ఫిబ్రవరి వరకు సాధించిన బొగ్గు ఉత్పత్తి (ఏరియాల వారీగా లక్షల టన్నుల్లో..) ఏరియా లక్ష్యం సాధించింది శాతం ఆర్జీ–1 44.92 42.21 94 ఆర్జీ–2 87.80 82.94 94 ఆర్జీ–3 56.42 55.57 98 ఏపీఏ 3.91 3.94 101 భూపాలపల్లి 43.20 31.87 74 కొత్తగూడెం 131.84 126.64 96 ఇల్లెందు 35.85 39.41 110 మణుగూరు 115.92 112.14 97 బెల్లంపల్లి 33.80 32.07 95 మందమర్రి 32.06 24.53 77 శ్రీరాంపూర్ 57.45 49.57 86 రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యం ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సిందే. ఇదేసమయంలో పూర్తిగా రక్షణ చర్యలు తీసుకోవాలి. పోటీ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు తక్కువ వ్యయంతో బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. భారీయంత్రాల పనిగంటలు పెంచితే ఇది సాధ్యమే. భూగర్భగనుల్లోనూ ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు ఉత్పాదకత పెంచాలి. – బలరాం, సీఎండీ, సింగరేణి -
వైభవంగా నాగవెల్లి పట్నం
జూలపల్లి(పెద్దపల్లి): స్థానిక శ్రీరావుల మల్లికా ర్జునస్వామి పట్నాలు, బోనాల ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఒగ్గు పూజారులు నాగవెల్లి పట్నం వేశారు. యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలుత మహిళలు గ్రామంలో బోనాలతో ఊరేగింపు నిర్వహించా రు. పట్నంపై నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. సాయంత్రం ఆగ్నిగుండాల్లో నడిచి భక్తిని చాటుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నాయకులు సురేశ్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, రఘువీర్‌సింగ్, దారబోయిన నర్సింహయాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. క్యూఆర్ కోడ్‌తో ఇంటర్ పరీక్ష కేంద్రాల గుర్తింపు జ్యోతినగర్(రామగుండం): ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసే వి ద్యార్థులకు హాల్‌టికెట్‌పై ఉన్న క్యూర్ కోడ్ అండగా ఉంది. ఈ నెల 5వ తేదీన ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరయ్యే విద్యా ర్థుల హాల్‌టికెట్‌పై ఉన్న క్యూర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సంబంధిత పరీక్ష కేంద్రం వివరాలు గూగుల్ మ్యాప్‌లో కనిపిస్తాయి. విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంటర్ బోర్డు ప్రథమంగా క్యూర్ కో డ్తో కూడిన స్మార్ట్హాల్ టికెట్లను ప్రవేశపెట్టింది. దీనిద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం జరుగనుంది. హాల్‌టికెట్‌పై ఉన్న కోడ్‌ను స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామాతోపాటు లొకేషన్ దృశ్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా తెలిసిపోతుంది. చాలామంది విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాల వివరాలను స్కాన్ చేసి చూస్తున్నారు. 5న స్ట్రక్చరల్ సమావేశం గోదావరిఖని: సింగరేణి సంస్థలో నెలకొన్న సమస్యలపై హైదరాబాద్ సింగరేణి భవన్లో ఈనెల 5న స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించనున్నారు. సంస్థ సీఎండీ బలరాం అధ్య క్షతన, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ తో సమస్యలపై చర్చించనున్నారు. వాస్తవంగా గతనెల 5న స్ట్రక్చరల్ సమావేశం తేదీ ఖరారైనా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో వాయిదా పడింది. కోడ్ ముగియడంతో నెలరోజు తర్వాత గు ర్తింపు యూనియన్‌తో సమావేశం తేదీ ఖరారైంది. ప్రధాన సమస్యలతో కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్న కార్మికుల్లో ఈసమావేశం ఆశలు రేకెత్తిస్తోంది.మారుపేర్ల సమస్య, విజిలెన్స్‌తో ఆగిపోయిన డిపెండెంట్ ఉద్యోగులుఈ సమావేశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే పె ర్క్స్పై ఇన్‌కంట్యాక్స్ మాఫీ, డిసిగ్నేషన్ల మా ర్పు, కార్మికుల ప్రమోషన్ పాలసీ అమలు చే యడం, సొంతింటి కల నెరవేర్చడంతోపాటు అనేక సమస్యలను ఈ సమావేశంంలో చర్చించనున్నారు. గుర్తింపు యూనియన్‌గా గెలిచి 15 నెలల తర్వాత తొలిసారిగా నిర్వహించే సీఎండీ స్థాయి సమావేశంపై సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. నియామకం యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ జి ల్లా కార్యదర్శింగా సాంబా రి రాజేశ్‌ను నియమించా రు. ఈమేరకు యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. బీసా సామాజికి వర్గానికి చెందిన రాజేశ్ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. మల్లన్న సన్నిధిలో భక్తుల రద్దీఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి స న్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ నెల కొంది. ఉ త్తర తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలుత కోనేరులో స్నానాలు ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఖండేలరాయు డు, నందీశ్వరుడు, శ్రీసీతారామచంద్రస్వామి ని దర్శనం చేసుకున్నారు. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నావు వేయించి, బోనాలతో నైవేద్యం సమర్పించారు. జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
గెలుపెవరిదో..
● లేకపోతే అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు ● ప్రతిరౌండ్‌లోనూ ఎగ్జాస్టెడ్, సబ్ పార్సిల్ ఓట్లు కీలకం ● ఎలిమినేటెడ్ అభ్యర్థి తొలి ప్రాధాన్య ఓట్లు తీసివేత ● మిగిలిన సబ్ పార్సిల్ ఓట్లు అభ్యర్థులకు బదిలీ ● విజయంపై స్పష్టత వచ్చేవరకూ కొనసాగనున్న కౌంటింగ్ ● సాయంత్రానికి ‘టీచర్’ ఫలితం.. పట్టభద్రుల ఫలితానికి రెండు రోజులు?సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్– ఆది లాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం మొదలు కానుంది. కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రాడ్యుయేట్స్, టీచ ర్స్ నియోజకవర్గాలకు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగిస్తారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించా రు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో ఒక మైక్రోఅబ్జర్వర్, ఒ క సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరి యంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లె క్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని విని యోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సి బ్బందిని నియమించారు. ఆదివారం మాక్ కౌంటింగ్‌ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియ ను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఫార్ములా ఆధారంగా కోటా నిర్ధారణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటయ్యే ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ముందుగా కోటాను నిర్ధారించాల్సి ఉంటుంది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి చెల్లుబాటయ్యే ఓట్ల లెక్క తేలుస్తారు. మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లలో 50 శాతం లెక్కగడతారు. 50శాతానికంటే ఒక్క ఓటు ఎక్కువగా సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ముందుగా ఓట్లను కట్టలు కడతారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ఒక్కొక్కరికి ఒక డబ్బా కేటాయించి వారు పొందిన ఓట్లను ఆ డబ్బాల్లో వేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కగడతారు. సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. కానీ.. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందుకోసం ఒక ఫార్ములా వాడతారు. అదేంటంటే.. కోటా = మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు డివైడెడ్బై సీట్ల సంఖ్య ప్లస్ వన్ ఓల్ ప్లస్ వన్ అన్న సూత్రం ఆధారంగా ఓట్ల లెక్కింపు చేపడతారు. (ఉదాహరణకు: మొత్తం రెండు వేల ఓట్లు పోలైతే వాటిలో 1800 ఓట్లు చెల్లుబాటు ఐతే 901 ఓట్లు సాధించిన వ్యక్తి విజయం సాధిస్తారు.) తొలుత తొలి ప్రాధాన్యం ఓట్లను అభ్యర్థుల వారీగా పంచుతారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థి 901 ఓట్ల కోటాను చేరుకోకపోతే ఆప్పుడు రెండో రౌండ్‌కు లెక్కింపు ప్రక్రియ వెళ్తుంది. ● రెండో రౌండ్ అంటే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి రౌండ్లో అందరి కంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిని రెండో రౌండ్లో తప్పిస్తారు. ఇక్కడ ఓటింగ్ సరళిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో రెండు రకాలుగా ఓట్లను విభజిస్తారు. ఓటర్లు రెండు రకాలుగా ఓట్లు వేస్తారు. ఒకటి కేవలం తొలి ప్రాధాన్యం ఓట్లు మాత్రమే వేసేవారు. ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యాలు ఇచ్చేవారు. తొలిరౌండ్లో తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తికి తొలి ప్రాధాన్యం మాత్రమే వచ్చిన ఓట్లను ఎగ్జాస్టెడ్ ఓట్లుగా పరిగణించి వాటిని తప్పిస్తారు. మిగిలిన రెండో రౌండ్ ప్రాధాన్యం ఓట్లను (సబ్ పార్సిల్ ఓట్లు) అభ్యర్థులకు పంచుతారు. అలా ఫార్ములా ప్రకారం.. ఏ రౌండ్లో అయితే చెల్లుబాటు అయిన ఓట్లలో ఒక అభ్యర్థికి సగం ఓట్లు వచ్చేంత వరకు రౌండ్లు (ఎలిమినేషన్) ప్రక్రియ సాగుతుంది. అప్పుడే విజేతను ప్రకటిస్తారు. అవగాహన కల్పిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతిలెక్కింపు గణాంకాలువేదిక: అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పోలైన ఓట్లు : 2,50,106 టీచర్స్‌లో పోలైన ఓట్లు: 24,895 మొత్తం టేబుళ్లు: 35 పట్టభద్రుల టేబుళ్లు : 21 టీచర్ల టేబుళ్లు : 14 లెక్కింపు సిబ్బంది: 800 రిజర్వ్ స్టాఫ్: 20 శాతంఎలా లెక్కిస్తారంటే? కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 3,55,159 మంది ఓటర్లుండగా.. గతనెల 27న జరిగిన ఎన్నికల్లో 2,50,106 మంది (70.42 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీచర్ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓట్లు ఉండగా.. 24,895 మంది (91.90 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తక్కువ ఓట్లు ఉన్న నేపథ్యంలో టీచర్ స్థానం ఫలితం సాయంత్రానికి వెలువడనుంది. అధిక ఓటర్లున్న గ్రాడ్యుయేట్ స్థానం కనీసం రెండు రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో సందర్భంలో మూడో రోజుకు చేరినా ఆశ్చర్యం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.400 మంది పోలీసుల బందోబస్తు కరీంనగర్‌క్రైం: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సోమవారం 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అంబేడ్కర్ స్టేడియంలో జరిగే ఈ ప్రక్రియలో ఒక అడిషనల్ డీసీపీ, ఆరుగురు ఏసీపీలు, 18 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎ స్సైలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొననున్నా రు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌటింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు స్టేడియంలోని గేట్ నంబర్– 1 నుంచి ప్రవేశించి నిర్దేశించబడిన ప్రదేశంలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. గేట్ నంబర్– 4 ద్వారా అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులోకి అనుమతించబడునని పోలీసులు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లుగా వచ్చే వారికి కరీంనగర్ కలెక్టరేట్ గేట్ నంబర్– 2 ద్వారా అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. -
ప్రశాంతంగా ఉండండి
● మంచిగా ఆలోచన చేయండి ● సాఫీగా పరీక్షలు రాయండి ● అద్భుత ఫలితాలు వస్తాయి ● సమస్యలకు టోల్‌ఫ్రీ నంబరు 14416 ● ‘సాక్షి’తో ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన సాక్షి: ఈసారి కూడా కఠిన నిబంధనలు ఉంటాయా?నోడల్ అధికారి: ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు ఉంటాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరు. సాక్షి: విద్యార్థుల్లో ఎగ్జామ్ ఫీవర్ పోగొట్టేందుకు తీసుకున్న చర్యలు ఏమిటి? నోడల్ అధికారి: విద్యార్థులకు చదువుతో పాటే పరీక్షల నిర్వహణ తీరుపై అవగాహన కల్పించాం. పరీక్ష అనగానే భయపడాల్సిన పనిలేదని సులువుగా అర్థమయ్యేలా అధ్యాపకులు వివరించారు. ఇందుకోసం 100రోజుల యాక్షన్‌ప్లాన్ చేపట్టాం. సాక్షి: మంచి ఫలితాలు సాధిస్తారా? నోడల్ అధికారి: ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య ప్రణాళిక, పరీక్ష విధానంపై అవగాహన కల్పించాం. కాలేజీల్లో ప్రత్యేక తరగతులతోపాటు ఇంటివద్ద చదివేలా తల్లిదండ్రులు, విద్యార్థులకు వేకప్కాల్స్తో (ఉదయం 5నుంచి ఉద యం 6గంటల మధ్య) అలర్ట్ చేశాం. ప్రశ్నాపత్రాలను వివిరిస్తూ సమాధానాలు రాసే పద్ధతులపై అధ్యాపకులు అవగాహన కల్పించారు. సాక్షి: విద్యార్థుల్లో శారీరక, మానసిక సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్చలేమిటి? నోడల్ అధికారి: పరీక్షా సమయంలో విద్యార్థులు మానసికంగా దృఢత్వం కలిగి ఉండేలా కౌన్సెలర్లు అవగాహన కల్పించారు. బాలికలకు మహిళా కౌన్సెలర్, బాలురకు పురుష కౌన్సెలర్ సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇంకా ఏమై నా సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 14416 కు కాల్చేసి సలహాలు, సూచనలు పొందొచ్చు. పెద్దపల్లిరూరల్: ‘పరీక్షలు అంటేనే విద్యార్థుల్లో ఏదో తెలియని భయం ఉంటుంది. ఆందోళన పడతారు.. అలాంటి భయాన్ని, ఆందోళనను పోగొట్టేందుకు వంద రోజుల కార్యాచరణ అమలు చేశాం.. పరీక్షలకు చిన్నారులను ఎలా సిద్ధం చేయాలనే దానిపై వేకప్ కాల్స్‌తో అధ్యాపకులు తరచూ తల్లిదండ్రులకు అవగాహ న కల్పించారు.. వారి ద్వారా విద్యార్థుల్లో మానసిక, శారీరక స్థైర్యం పెంపొందింది. ఇందుకోసం ఓ మహిళా, పురుష అధ్యాపకులను కౌన్సెలర్లుగా నియమించాం. సమస్యలు పరిష్కరించాం.. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చాం’ అని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 14416కు కాల్చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు.. సాక్షి: తల్లిదండ్రులకు ఇచ్చిన సూచనలు ఏమిటి? నోడల్ అధికారి: ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల తల్లిదండ్రులతో తరచూ పేరెంట్స్ కమిటీ సమావేశాలు కూడా నిర్వహించాం. ఇంటివద్ద పిల్లల వ్యవహారశైలిని గమనించి చదువుపై శ్రద్ధ చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. ఏకాగ్రతతో చదివితే మంచిఫలితాలు సాధించడం సులువుగా ఉంటుందని చెప్పాం. -
కాపర్‌వైర్ చోరీ ముఠా అరెస్ట్
రామగుండం: రైతుల పంట పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి తీగను దొంగిలించే ముఠాను అంతర్గాం పోలీసులు చాకచక్యంగా పట్టుకొని రాగి తీగను స్వాధీనం చేసుకున్నారు. అంతర్గాం ఎస్సై బోయ వెంకటస్వామి తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని పలు గ్రామాల్లో కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేస్తున్న విషయమై టీఎస్పీడీసీఎల్ ఏఈ ఆశ శంకర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిఘా పెట్టి శనివారం బ్రాహ్మణపల్లి ఎక్స్‌రోడ్ సమీపంలో ఆటోలో వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో అనుమానితులను గుర్తించి విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. ఇందులో ఇప్పటికే 14 కేసుల్లో నిందితులుగా ఉన్న ముఠాగా గుర్తించారు. కాగా ఫిబ్రవరి 23న ఈ కేసులో ఏ1గా ఉన్న సిరిగిరి అంజన్న (వెల్గటూర్–కోటిలింగాల), ఏ5గా ఉన్న వారణాసి వంశీలను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా మిగతా సభ్యులు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో శనివారం మిగతా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఇందులో చింతల చంద్రమౌళి అలియాస్ బుజ్జి (వెల్గటూర్– కప్పట్రావుపేట), వారణాసి లక్ష్మణ్ అలియాస్ అద్రాసి లక్ష్మణ్ (మంచిర్యాల ఎన్టీఆర్ కాలనీ), చింతల శ్రీనివాస్ అలియాస్ చితారి శ్రీను (మంచిర్యాల ఎన్టీఆర్ కాలనీ) ముఠాగా ఏర్పడి మంథని, ఎన్టీపీసీ, బసంత్‌నగర్, వెల్గటూర్, గొల్లపల్లి, ధర్మపురి తదితర పోలీస్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి రాగి తీగను దొంగిలించగా, ఇప్పటికే 14 కేసులు నమోదైనట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆలస్యంగా నడిచిన భాగ్యనగర్ రైలు
ఓదెల(పెద్దపల్లి): సికింద్రాబాద్ నుంచి సిర్పూర్కాగజ్నగర్ వెళ్లే భాగ్యనగర్ రైలు శనివారం చాలా ఆలస్యంగా నడిచింది. ఓదెలకు రాత్రి 6.50 గంటలకు రావాల్సిన రైలు.. సుమారు రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొత్కపల్లి, ఓదెల, కొలనూరు రైల్వేస్టేషన్లలో రైలు దిగి సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్ వైపు వెళ్లాల్సిన ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు లభించక రాత్రంతా నిరీక్షించారు. రైలు ఆలస్యానికి గల కారణాలను రైల్వే అధికారులు వెల్లడించడం లేదు. యూరియా ఉత్పత్తి వేగవంతం ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో యూరియా ఉత్పత్తి వేగవంతమైంది. ఈమేరకు ఫిబ్రవరి 2025లో 1,03,912.38 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశామని కంపెనీ సీజీఎం ఉదయ్ రాజహంస శనివారం తెలిపారు. కర్మాగారంలో ఉత్పత్తి చేసిన యూరియాను 8 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామన్నారు. ఆర్ఎఫ్సీఎల్ యూరియాలో అధిక శాతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఉత్పత్తి చేసిన యూరియాలో తెలంగాణకు 58,063.32 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 29,545.11 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 10,685.79 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 5,618.16 మెట్రిక్ టన్నుల సరఫరా చేశామని ఆయన వివరించారు. అత్తింటి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య వేములవాడ: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత శనివారం వేములవాడ పట్టణ శివారులోని వ్యవసాయిబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపిన వివరాలు.. వేములవాడ రూరల్ మండలం అచ్చనపల్లికి చెందిన కొక్కుల దేవరాజు కూతురు పల్లవిని పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మ్యాన శివుడికిచ్చి 2021లో పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని పల్లవిని భర్త, అత్త విజయ, ఆడబిడ్డ లావణ్య, ఆడబిడ్డ భర్త రఘు వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక పల్లవి వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి దేవరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
‘ముందస్తు అడ్మిషన్లు చేస్తే ప్రత్యక్ష దాడులే’
సప్తగిరికాలనీ(కరీంనగర్): రాష్ట్రంలో ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న విద్యాసంస్థలపై ప్రత్యక్ష దాడులు తప్పవని, అధికారుల వత్తాసు వల్లే విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో మాట్లాడారు. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలపై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా స్కాలర్షిప్స్, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.7,650 వేల కోట్లు ఇంకా విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థులు అనేక ఆర్థికపరమైన అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, నాయకులు సందీప్‌రెడ్డి, వినయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
మల్కాపూర్‌లో వ్యక్తి బలవన్మరణం
బోయినపల్లి(చొప్పదండి): చిట్టీ డబ్బులు కట్టేదెలా అనే మనస్థాపంతో మండలంలోని మల్కాపూర్‌కు చెందిన పబ్బల్ల కొమురయ్య(55) శనివారం బలవన్మరణానికి పాల్పడ్డట్లు ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు. కొమురయ్య మూడు నెలల క్రితం కులసంఘంలో రూ.30వేలు తీసుకున్నాడు. రెండు నెలలుగా డబ్బులు చెల్లించడం లేదు. ఈనెల 1న కులం చిట్టీ ఉండడంతో డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక మనస్థాపంతో శనివారం ఉదయం విద్యుత్ ఫోల్‌కు ఉరేసుకుని మృతిచెందాడు. ఈమేరకు మృతుడి కొడుకు శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. చెరువులో పడి వృద్ధుడు మృతికొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి పట్టణానికి చెందిన రాపల్లి రాజయ్య (88) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం.. కొత్తపల్లిలోని పోస్టాపీస్ సమీపంలో నివాసముండే రాజయ్య శుక్రవారం బహిర్భూమికి చెరువు సమీపంలోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడు. రాత్రి అయినా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు సమీపంలో వెతకడంతో పాటు అక్కడున్న సీసీ కెమెరాల్లో పరిశీలించారు. చెరువు వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. చెరువు వద్ద మృతుడి చెప్పులు, లుంగీ ఉండటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చెరువులో మత్స్యకారులతో గాలింపు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి..జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందిన ఘటన శనివారం జమ్మికుంటలో జరిగింది. టౌన్ సీఐ రవి తెలిపిన వివరాలు.. మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన ఐలవేని ప్రశాంత్(28) సొంత ట్రాక్టర్‌పై పని నిమిత్తం జమ్మికుంటకు వస్తున్న క్రమంలో మున్సిపల్ పరిధి ధర్మారం సమీపంలో ట్రాక్టర్ టైర్ పేలిపోయి కెనాల్ కాల్వలో బోల్తాపడింది. ట్రాక్టర్‌పై ఉన్న ప్రశాంత్ తీవ్రగాయాలతో మృతి చెందాడు. మృతుడికి భార్య రమ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గురుకుల విద్యార్థి అదృశ్యం సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్సీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి మైస శివరాం అదృశ్యమయ్యాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. గోదావరిఖనికి చెందిన శివరాం గురుకుల పాఠశాల హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం క్లాస్‌కు హాజరైన విద్యార్థి ఇంటర్వెల్ తర్వాత కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకి దొరకలేదు. బ్యాగు తీసుకొని వెళ్లిపోగా విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు కూడా ఇంటికి రాలేదని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ కృష్ణమాచార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జెన్కో ఆధ్వర్యంలోనే విద్యుత్ ప్లాంట్
రామగుండం: జెన్కో ఆధ్వర్యంలోనే 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలంగాణ ఎలక్ట్రిసిటి ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర అధ్యక్షుడు వేమునూరి వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక జెన్కో అతిథి గృహంలో యూనియన్ రీజినల్ నూతన కార్యవర్గాన్ని శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మి క సంఘాల జేఏసీ పోరాట ఫలితమే జెన్కోకు కొత్త విద్యుత్ ప్రాజెక్టు దక్కిందన్నారు. అనంతరం రామగుండం థర్మల్ స్టేషన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎండీ సలీం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సయ్యద్ ఆరీఫ్, రీజినల్ కార్యదర్శిగా ముక్కెర శ్రీనివాస్, అదనపు కార్యదర్శిగా ఆడెపు శ్రీనివాస్‌ను నియమించారు. యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంగెం సుధీర్, జెన్కో అధ్యక్షుడు కోటేశ్వరరావు, అదనపు కార్యదర్శి కుశలవరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రమేశ్, బిచ్చా తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతతోనే ఆరోగ్యం
కోల్‌సిటీ(రామగుండం): మార్చి ఆరంభంలోనే భానుడు సెగలు కక్కుతున్నాడు.. పగటిపూట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత పెరిగి జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత పెరిగి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణశాఖ ప్రకటించింది. ఏప్రిల్, మేలో గరిష్టంగా 44 నుంచి 46 సెల్సియస్ డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కన్నా 2 సెల్సియస్ డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉందని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ జనరల్ ఫిజీషియన్(ఎండీ) డాక్టర్ స్వప్నలత వెల్లడించారు. ఎండల తీవ్రత, వడదెబ్బ లక్షణాలు, నివారణ మార్గాలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘సాక్షి’: వడదెబ్బకు గురైతే ఏం చేయాలి? డాక్టర్: వడదెబ్బకు గురైన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. నీడకు తరలించాలి. చల్లని నీటిలో తడిపిన బట్టతో ఒళ్లంతా తుడవాలి. ఫ్యాన్, కూలర్, ఏసీ గాలి ఉంటే పెట్టాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగించాలి. ప్రథమ చికిత్స తర్వాత సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలి. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇస్తే సిబ్బంది కూడా ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలిస్తారు. ‘సాక్షి’: తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? డాక్టర్: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇంట్లో ఉన్నా, బ యటకు వెళ్లినా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు పూర్తిచేసుకోవాలి. ఎండలో బయటకు వెళ్తే విధిగా గొడుగులు, తలకు టోపీ, కూలింగ్ గ్లాస్, చేతిరుమాలు ధరించాలి. విధిగా వాటర్ బాటిల్ వెంట ఉంచుకోవాలి. తెల్లని దుస్తులు, లైట్కలర్ కాటన్ దుస్తులు ధరించడం మంచిది. వేసవి పూర్తయ్యే వరకూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.● ఈసారి ఎండల తీవ్రత అధికం జాగ్రత్తలు పాటిస్తేనే మేలు ‘సాక్షి’తో జీజీహెచ్ ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ ఫిజీషియన్ స్వప్నలత సాక్షి: వడదెబ్బకు ఎలా గురవుతారు?డాక్టర్: భరించలేని ఉష్ణతాపం, సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు మించి వాతావరం వేడెక్కడం. ఎండలు ఎక్కువైనప్పుడు, తీవ్ర వడగాల్పులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రమాదకరమైనది. మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పని చేయకపోవడంతో వడదెబ్బకు గురవుతారు. వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారన్ హీట్స్ కన్నా ఎక్కువ ఉంటే వడదెబ్బకు గురైనట్లు భావించాలి. తద్వారా వ్యక్తి చాలా బహీనమవుతారు.‘సాక్షి’: వడదెబ్బ లక్షణాలు..?డాక్టర్: తీత్రమైన తలనొప్పి, తల తిప్పడం, నాడీ వేగంగా కొట్టుకోవడం, నాలుక తడి ఆరిపోయి ఎండిపోవడం, శరీరంలో కనీస నీటి శాతం తగ్గిపోవడంతో పేషెంట్ అపస్మారక స్థితికి చేరుకుంటారు.‘సాక్షి’: ఉపశమనం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్: బయటికి వెళ్లి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో పెట్టిన వాటర్, శీతలపానీయాలు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. జ్యూస్, మజ్జిగ, నిమ్మరసం తయారు చేసుకుని తాగాలి. ఇంట్లో తయారు చేసుకున్న సీజనల్ పండ్ల రసాలు తీసుకోవాలి. కొబ్బరినీరు తాగాలి. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు పూర్తిగా నిషేధించాలి. మద్యం తాగడాన్ని మానేయాలి. తరచూ నీటిని తాగుతూ ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. -
నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీలకం
గోదావరిఖని(రామగుండం): నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీలకమని రామగుండం పోలీస్‌కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. రామగుండం కమిషనరేట్‌కు శనివారం మూడు జాగిలాలు వచ్చినట్లు తెలిపారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ, నార్కోటిక్, ఎక్స్‌ప్లోజివ్ గుర్తింపులో పోలీస్ జాగిలాలు ఎంతో సహకరిస్తున్నాయన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్‌కి చెందిన మూడు జాగిలాలు శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తిచేసుకొని వచ్చాయన్నారు. అందులో గంజాయి, మత్తు పదార్థాల గుర్తింపులో నార్కోటిక్ డాగ్ (జెస్సీ), ఎక్స్‌ప్లోజివ్స్ గుర్తింపులో స్నైపర్ డాగ్ (రైడర్), పలురకాల నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ట్రాకర్డాగ్ వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సంపత్, పీసీ హరిశ్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ -
కొలనులో చేపలమవుదాం
● ఈతతో ఆరోగ్యానికి ఊతం ● పలు వ్యాధులకు ఔషధం ● చిన్నారుల్లో పెరుగుతున్న ఆసక్తి ● సమ్మర్‌కు ముందే కొలనుల్లో సందడి ● ఎండలు ముదిరితే.. మరింత రద్దీకరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్ టౌన్: ఈత.. ఆరోగ్యానికి ఊతం. శరీరానికి చక్కటి వ్యాయామం. ఈత నేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు. దీంతో చాలామంది తల్లిదండ్రులు సమ్మర్ వచ్చిందే చాలు తమ పిల్లలను సమీపంలోని కొలనులు, చెరువులు, బావు ల వద్దకు తీసుకెళ్లి ఈత నేర్పిస్తున్నారు. ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ఈత కొలనులు అందుబాటులో ఉంచి శిక్షణ ఇస్తున్నాయి. పలు ప్రభుత్వ మైదానాల్లోని స్విమ్మింగ్పూల్స్లోనూ ఈత నేర్పిస్తున్నారు. సమ్మర్ సమీపిస్తోంది. ఎండలు ముదురుతుండడంతో ఉపశమనం కోసం ఈతకు వెళ్తున్నారు. పలు స్విమ్మిగ్పూల్స్లో ఇప్పుడే సందడి కనిపిస్తుండగా.. మరో పక్షం రోజుల తరువాత అన్ని ప్రాంతాల్లోని కొలనులు ఈత నేర్చుకునేందుకు వచ్చేవారితో నిండిపోనున్నాయి. ఈ సందర్భంగా ఈత.. రకాలు.. ఉపయోగాలు.. జాగ్రత్తతో ప్రత్యేక కథనం.ఉమ్మడి జిల్లాలో స్విమ్మింగ్ పూల్స్జిల్లా ప్రభుత్వ ప్రైవేటు కరీంనగర్ 02 05 జగిత్యాల 01 01 పెద్దపల్లి 02 06 సిరిసిల్ల 01 05 -
ఉపయోగాలు.. జాగ్రత్తలు
● ఈత కొట్టడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడి ఆకలి వేస్తుంది. రక్తపోటు, షుగర్ నియంత్రణలో ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులు, రక్తప్రసరణ, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ● ఆస్తమా ఉన్నవారు, సర్జరీ అయినవారు, చర్మవ్యాధులతో బాధపడుతున్నవారు, అవయవ మార్పిడి చేసుకున్న వారు ఈతకు దూరంగా ఉండాలి. ● కొత్తగా ఈత నేర్చుకునేవారు లోతైన ప్రదేశాలకు వెళ్లకూడదు. ట్యూబ్, బుర్రకాయ, వాటర్ ప్లాస్టిక్క్యాన్లతో పెద్దవారి పర్యవేక్షణలో ఈత నేర్చుకోవాలి. ● ప్రత్యేక శిక్షణ పొందిన స్విమ్మర్ల వద్ద ఈత నేర్చుకోవాలి. బావులు, చెరువులు, కుంటల వద్దకు పిల్లలను ఒంటరిగా పంపొద్దు. 3ఫీట్లలోతు నీటిలో ఈత నేర్పడం ఉత్తమం. పూర్తిగా నేర్చుకున్నాక 8ఫీట్ల లోతులో ఈదొచ్చు. -
రంజాన్.. జీవనమార్గం
సిరిసిల్లకల్చరల్/కరీంనగర్‌కల్చరల్: స్వీయ సంస్కారం.. ప్రాణికోటిపై సానుభూతి.. ప్రకృతిపై పవిత్రభావన.. తోటి మనుషులపై సోదరభావన.. ఇవీ రంజాన్ మాసం నేర్పే లక్షణాలు. ఈ ఉత్తమ లక్షణాలను ఆపాదించుకొని ప్రాపంచిక జీవనమార్గం ఏర్పరచుకునేందుకు ముస్లింలు కఠిన ఉపవాసదీక్షలు స్వీకరిస్తారు. ఆకాశంలో కనిపించే నెలవంకే సాక్ష్యంగా రంజాన్ మాసాన్ని ఆరంభిస్తారు. ఆదివారం నుంచి ఆరంభమయ్యే ఉపవాస దీక్షలు ఈనెల రోజులు ఆచరిస్తారు. ప్రతీది ప్రత్యేకం ఈ మాసంలో ఉదయం సహరీలు, సాయంత్రం ఇఫ్తార్ విందులతో దీక్ష విరమణ సాగుతోంది. దానధర్మాలతో నిరుపేదలను ఆదుకోవడం, ఫిత్రా దానాలు ఆచరించడం ప్రత్యేకతలు. క్రమశిక్షణ, దాతృత్వ భావన, ధార్మిక చింతన వంటి సుగుణాలను రంజాన్ నెల అందిస్తోంది. రోజాగా పిల్చుకునే ఉపవాసాలు ప్రతీ సాయంత్రం ఇఫ్తార్‌తో ముగుస్తాయి. తక్కువ సంభాషణ.. సత్యమే మాట్లాడడం ఉపవాస దీక్షలో కీలకమైనవి. రుతుక్రమం ఉన్న వారు, పసి పిల్లలు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, వయోవృద్ధులు, గర్భిణులు, ప్రయాణాల్లో ఉన్నవారు ఉపవాస దీక్షకు మినహాయింపు. జకాత్ దానం చేయడం.. ధర్మం ఆచరించడమే జకాత్. సంపన్నులు పేదలు పండుగ జరుపుకునేందుకు తోచినంత ఆర్థికసాయం చేయాలి. అల్లాహ్ అనుగ్రహానికి వారిని కూడా పాత్రులను చేయాలనే ఉద్దేశంతో ప్రతీ ధనికముస్లిం వారి ఆదాయం లోంచి కనీసం 30 శాతం ధనాన్ని నిరుపేదల అభ్యున్నతికి వినియోగించాలనేది ఫర్జ్(నియమం). ప్రవక్త నియమాన్ని అనుసరించి పేదలను ఆదుకునే దానధర్మాలను ఆచరించడం ఈ మాసం ప్రత్యేకత. షబ్ ఏ ఖద్ర్ ముస్లింల మతగ్రంథం ఖురాన్ ఈనెలలోనే ఆవిర్భవించిందని చెబుతుంటారు. రంజాన్ మాసాంతంలో వచ్చే చివరి శుక్రవారం ఖురాన్‌ను దైవదూత మహ్మద్ ప్రవక్త ద్వారా మానవాళికి అందించాడని పేర్కొంటారు. ఈ కారణంగానే షబ్ ఏ ఖద్ర్ రోజున ప్రార్థన మందిరాల్లో జాగరణలు, ఖురాన్ పఠనం చేస్తారు. తరాహ్వీ నమాజ్‌లతో మసీదులు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతాయి. అత్యంత పవిత్రమైన రాత్రిగా పరిగణించే షబ్ ఏ ఖద్ర్ ముస్లింలకు ఆరాధనీయమైంది. స్వీయసంస్కారం.. ప్రాణికోటిపై సానుభూతి తోటి వారిపై సోదరభావన పవిత్రభావాల విడిది.. దానధర్మాల మాసం నేటి నుంచి కఠిన ఉపవాసదీక్షలు -
ఆశలు.. అడియాసలు..!
● జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ఎప్పుడు? ● మామునూర్లో గ్రీన్‌సిగ్నల్‌తో జిల్లావాసుల్లో జోరందుకున్న చర్చ ● అందుబాటులో అంతర్గాం టెక్స్టైల్ మిల్లు ఖాళీ భూములు ● రాష్ట్ర, దేశ రాజధానులతో రోడ్లు, రైల్వే మార్గాల కనెక్టివిటీ ● సానుకూలాంశాలు పరిశీలించాలంటున్న జిల్లావాసులు రామగుండం: టీటీఎస్ అంతర్గాం టెక్స్టైల్శాఖకు చెందిన వందలాది ఎకరాల భూముల్లో డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు స్థాపించేందుకు సుమారు మూడు నెలల క్రితం జరిగిన పార్లమెంటరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సాంకేతికపరమైన సమస్యలు ఉండడంతో ప్రత్యామ్నాయంగా అంతర్గాం టెక్స్టైల్ భూములను ఎంచుకున్నారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని కేంద్రప్రభుత్వం నిర్ణయించడంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అందుకు సానుకూలంగా స్పందించింది. దీంతో అంతర్గాం పేరు దేశ వ్యాప్తంగా అప్పట్లో మార్మోగింది. ప్రభుత్వానికి నివేదిక అందజేసినా.. టెక్స్టైల్ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను సత్వరమే అందజేయాలని అంతర్గాం తహసీల్దార్, పెద్దపల్లి ఆర్డీవోలను కలెక్టర్ కోయ శ్రీహర్ష అప్పట్లోనే ఆదేశించారు. దీంతో వారంలోపే క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టిన అధికారులు.. నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అప్పటి నుంచి నేటివరకు ఆ భూములపై కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. రెండు రోజుల క్రితంఉమ్మడి వరంగల్ జిల్లాలోని మామునూర్లో డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ, మన జిల్లాలోని అంతర్గాంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో జిల్లావాసులు నిరాశకు గురవుతున్నారు. రెండు ప్రాంతాల్లో ప్రతిపాదనలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 150 కి.మీ. దూరంలో మరో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉంది. అయితే, మామునూర్ విషయంలో పౌర విమానయాన సంస్థ ఈ నిబంధన సడలించిందని, అందుకే అక్కడ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఇలాంటి నిబంధనలు ఏమీలేవని, అందుకే ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సానుకూల అంశాలే ఉంటాయని కొందరు అధికారులు వివరిస్తున్నారు. మామునూర్ విషయంలో 150 కి.మీ. నిబంధన సడలింపులో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా 1930లో అప్పటి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎయిర్‌పోర్టును ప్రారంభించారని, ఆ తర్వాత 1981 వరకు మామునూర్ కేంద్రంగా వివిధ వర్గాల వారు విమాన సేవలను వినియోగించుకున్నారని అంటున్నారు. అప్పటి పరిశ్రమల అవసరాల కోసం వరంగల్ జిల్లా కేంద్ర బిందువుగా ఉండడంతో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు మార్గం సుగమమైందని వారు వివరిస్తున్నారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు అంతేనా? అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 150 కి.మీ. దూరంలో మరో విమానాశ్రయం ఏర్పాటు చేయ కూడదనే పౌర విమానయాన నిబంధన అంతర్గాం విషయంలో వర్తించే అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 220 కి.మీ.లకుపైగా దూరంగానే అంతర్గాం ఉంటుంది. దీంతో ఆ నిబంధన అమలు చేసినా విమానాశ్రయం ఏర్పాటుకు అడ్డురాదంటున్నారు. దీంతోనే జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. మామునూరుకూ 150 కి.మీ.లకుపైగా దూరంలో.. మామునూరులో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టుకు పెద్దపల్లి జిల్లా అంతర్గాం/బసంత్‌నగర్‌లో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టుకు మధ్య సుమారు 150 కి.మీ.లకు పైగానే దూరం ఉంటుంది. రామగుండం పరిశ్రమల స్థాపనకు నిలయంగా ఉంది. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. రాష్ట్ర రాజధానిని అనుసంధానిస్తూ రాజీవ్ రహదారి ఉంది. దేశరాజధానితో రైలు మార్గం కనెక్టివిటీ కూడా ఉంది. దీంతో జిల్లాలో ఎయిర్‌పోర్టుకు అన్నీ అనుకూలాంశా లు ఉన్నాయని, తద్వారా ఎయి ర్పోర్టు ఏర్పాటును వేగవంతంగా పరిశీలించాలని జి ల్లావాసులు కోరుతున్నారు. స్పష్టత రాలేదు అంతర్గాం టెక్స్టైల్ భూముల వివరాలపై నివేదిక ఇవ్వాలని రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో సర్వేచేసి పూర్తివివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అక్కడి నుంచి ఇప్పటివరకు మాకు ఎలాంటి సమాధానం రాలేదు. భూముల్లో పరిశ్రమల స్థాపనకు సర్కారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. భూ వివరాలు సమర్పించడం వరకే మా బాధ్యత ఉంటుంది. మిగతా అంశాల్లో మా ప్రమేయం ఏమీ ఉండదు. – గంగయ్య, ఆర్డీవో, పెద్దపల్లి -
సీఐపై లోకాయుక్తలో ఫిర్యాదు
చిట్‌ఫండ్ దివాలా.. ఏజెంట్ ఆత్మహత్యసిరిసిల్లటౌన్: తనపై అక్రమ కేసు బనాయించినందుకు గాను సిరిసిల్ల టౌన్ సీఐపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు ఏఐఎఫ్టీయూ న్యూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం పేర్కొన్నారు. శనివారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో మాట్లాడారు. స్థానిక శాంతినగర్‌లోని సర్వే నంబర్ 40లో ఓపెన్ ప్లాట్‌కు సంబంధించి సమస్యపై తా ను ఫిర్యాదు చేసేందుకు వెళ్తే టౌన్ సీఐ పట్టించుకో లేదన్నారు. పైగా పట్టణానికి చెందిన వారు తనపై దుర్భాషలాడుతూ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు పెట్టి స్టేషన్లోనే 36 గంటలు బంధించినట్లు వెల్లడించారు. కేవలం కాంగ్రెస్ నాయకులు అనే భావంతో వారు చెప్పిన విధంగా తనపై అక్రమ కేసులు బనా యించారని, తనకు జ రిగిన అన్యాయంపై లోకా యుక్తకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. సమావేశంలో తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకుడు ఎల్లన్న గర్దాస్ శ్రీనివాస్, పాండు, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన చింతల రాజయ్య (39) అనే అక్షర చిట్‌ఫండ్ ఏజెంట్ శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. మల్కాపూర్ గ్రామానికి చెందిన రాజయ్య 15ఏళ్లుగా అక్షరచిట్ఫండ్తో పాటు ఎల్ఐసీ ఏజెంట్‌గా కొనసాగుతున్నాడు. అక్షర చిట్‌ఫండ్ ఏజెంట్‌గా వ్యవహరించిన సమయంలో పలువురివద్ద చిట్టీలు వేయించడంతో పాటు ఎఫ్డీలు చేయించాడు. ఇటీవల అక్షర చిట్‌ఫండ్ యాజమాన్యం చేతులెత్తేయడంతో డబ్బుల కోసం బాధితులంతా రాజయ్యపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన ఇంటికి వెళ్లి డబ్బుల కోసం నిలదీశారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాజయ్య మనస్తాపానికి గురై శనివారం వేకువజామున ఇంటి వెనకాలున్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లావణ్య, ఇద్దరు కుమారులున్నారు. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీకి కలిసొచ్చిన ‘మహా’ జాతర
● సిరిసిల్ల, వేములవాడ డిపోలకు రూ.27.21 లక్షలు.. ● గతేడాది కంటే ఈసారి పెరిగిన ఆదాయం వేములవాడఅర్బన్: ఆర్టీసీకి మహాశివరాత్రి జాతర కలిసొచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో జరిగిన ఉత్సవాలకు వేములవాడ, సిరిసిల్ల డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 25,26,27 తేదీల్లో 24 గంటలు రాజన్న భక్తులను బస్సులు వారి ఇంటికి చేరవేశాయి. మూడు రోజులపాటు ఆర్టీసీ సిబ్బంది తమకు కేటాయించిన డిపోల్లో పర్యవేక్షణ చేస్తూ ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు నడిపించి ఇబ్బంది కలగకుండా చూశారు. కాగా ఈసారి వేములవాడ, సిరిసిల్ల డిపోలకు రూ.27,21,000 ఆదాయం సమాకూరింది. గతేడాది రూ.22,80,000 సమాకూరగా, ఈసారి రూ.4,41,000 ఆదాయం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మూడురోజులు.. 24 గంటలు గత నెల 25,26,27వ తేదీల్లో వేములవాడ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు 24 గంటలు నడిచాయి. ఇక్కడి నుంచి జగిత్యాల, సికింద్రాబాద్, కరీంనగర్, సిరిసిల్లకు 26 బస్సులు నడిచాయి. మూడురోజుల ఆదాయం రూ.20,60,000 సమకూరింది. మూడు రోజుల పాటు బస్సులు 455 ట్రిప్పులు, 31 వేల కిలో మీటర్లు తిరిగి 27 వేల మంది ప్రయాణికులను చేరవేశాయి. గతేడాది మహాశివరాత్రికి రూ.19,11,000 ఆదాయం సమాకూరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అప్పటి కంటే ప్రస్తుతం రూ.1,49,000 ఎక్కువ ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల డిపోకు.. మహాశివరాత్రి జాతరకు సిరిసిల్ల డిపో నుంచి 26 బస్సులు వేములవాడ– సిరిసిల్ల, వేములవాడ– వరంగల్‌కు నడిచాయి. మూడురోజుల ఆదాయం రూ.6,61,000 సమకూరింది. మూడు రోజుల పాటు 165 ట్రిప్పులు, 9,023 కిలో మీటర్లు నడిపి 14,269 మంది ప్రయాణికులను చేరవేశాయి. గతేడాది రూ.3,69,000 ఆదాయం సమకూరగా, ఈసారి రూ.2,92,000 ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. సిబ్బంది కృషితో.. వేములవాడలో జరిగిన మహాశివరాత్రి జాతరకు వేములవాడ, సిరిసిల్ల డిపోల్లోని ఉద్యోగుల సమష్టి కృషితో ఆర్టీసీకి ఆదాయం సమాకూరింది. ఆర్టీసీ సిబ్బంది మూడురోజుల పాటు రాత్రిపగలు కష్టపడి ప్రయాణికులను సరక్షితంగా చేరవేశారు. ఆర్టీసీని ఆదరించి బస్సుల్లో ప్రయాణం చేసిన ప్రయాణికులకు ధన్యవాదాలు. – శ్రీనివాస్, డిపో మేనేజర్, వేములవాడ -
సమాజ సేవ చేయాలి
జ్యోతినగర్(రామగుండం): విద్యార్థులు సమా జ సేవలో ముందుండాలని గోదావరిఖని అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు సూచించారు. ఎ న్టీపీసీ మిలీనియం హాల్లో సచ్దేవ స్కూల్ ఆ ఫ్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యా య విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడారు. వి ద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మొబైల్ వినియోగాన్ని తగ్గించా లన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసించాలని తెలిపారు. ఏసీపీ రమేశ్, ఏజీపీ శంతన్‌కుమార్, ప్రతినిధులు తౌటం సతీశ్‌కుమా ర్, గుడికందుల భూమయ్య, కాదాసి శేఖర్, లోక్‌అదాలత్ సభ్యులు, ప్రిన్సిపాల్ జ్ఞాన్‌చంద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తమ రైతుకు అవార్డు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కిష్టంపేటకు చెందిన కొప్పుల సత్యనారాయణకు ఉత్తమ రైతు అవార్డును డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, కృషి విజ్ఞాన కేంద్రం, జహీరాబాద్‌లో అందజేశారు. 850 రకాల వరి వంగడాలను అభివృద్ధ్ది చేసి రై తులకు అందించినందుకు డైరెక్టర్ జనరల్ త్రి లోచన మహాపాత్ర అవార్డు అందించారు.పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిజ్యోతినగర్(రామగుండం): పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లో గ్రూప్–4 ద్వారా నియామకమైన వార్డు అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంట్ అధికారులకు శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టర్ ఈ కార్యక్ర మానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ ము న్సిపల్ చట్టంపై వార్డు అధికారులు, గ్రూప్–4 ఉద్యోగులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండా లని సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు. 9న పద్మశాలీ మహాసభపాలకుర్తి(రామగుండం): హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈనెల 9వ తేదీన ని ర్వహించే 17వ అఖిల భారత పద్మశాలీ మహాసభను విజయవంతం చేయాలని పద్మశాలీ సంఘం రాష్ట్ర కన్వీనర్ దాసరి ఉష కోరారు. స్థానిక పద్మశాలీ సంఘ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభ ప్రచా ర పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఐక్యత చాటిచెప్పేందుకు చేపట్టిన మహాసభను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్య క్రమంలో నాయకులు బూర్ల నారాయణ, కన్నం వెంకటేశ్, అరుకాల సతీశ్, చిలగాని రాజేశం, శంకర్, ఓడ్నాల రాజు, ఆడెపు లక్ష్మణ్, వీజీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పాటలు పాడి.. స్టెప్పులేసి..
అప్పన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు, రామగుండంలోని ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) ప్రభుత్వ పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ స్టెప్పులు వేశారు. ఆటాపాటలతో సందడి చేశారు. ప్రతీ విద్యార్థి జీవితంలో పదో తరగతి ఓ జ్ఞాపకమని, కల్మషం లేనిస్నేహానికి ఇది నిదర్శనమని ఉపాధ్యాయులు, అతిథులు అన్నారు. రామగుండం పాఠశాల హెచ్ఎం అజ్మీరా శారద మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ హంగులు సంతరించుకుంటున్నాయన్నారు. – రామగుండం/సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
‘టాస్క్’ శిక్షణకు రిజిస్ట్రేషన్లు షురూ
పెద్దపల్లిరూరల్: టాస్క్ ద్వారా శిక్షణ పొందేందుకు ఆసక్తి గలవారు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామన్నారు. వెబ్ అప్లికేషన్లు, జావా ప్రోగ్రామింగ్, పైతాన్ ప్రోగ్రామింగ్, సీ ప్రోగ్రాం, సీ ప్లస్ ప్రోగ్రామింగ్, టాటా ప్లస్ ప్రోగ్రామింగ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ప్రజంటేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, టాలీ, జీఎస్టీ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంసీఏ, పాలిటెక్నిక్ చదువుతున్న లేదా పూర్తి చేసినవారు శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఈ సెంటర్లోనే బహుళజాతి సంస్థల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. ఇటీవల యాక్సిక్బ్యాంకు నిర్వహించిన జాబ్‌మేళాలో ఇక్కడి టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన విద్యార్థులు భవాని, రసజ్ఞ, హేమంత్‌కు రూ.24లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కాయని మేనేజర్ గంగాప్రసాద్ తెలిపారు. 15లోగా బ్యాంకు లింకేజీ పూర్తికావాలి.. జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటివరకు 90శాతం మేర రుణాలు పంపిణీ పూర్తిచేశామని, మిగతా 10శాతం లింకేజీని ఈనెల 15వ తేదీ వరకు పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సీ్త్రనిధి రుణాల రికవరీ 72 శాతం నుంచి 80శాతానికి పెంచడంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం కింద గ్రౌండింగ్ చేసిన యూనిట్లు లాభదాయకంగా నడిచేలా సహాయ, సహకారాలు అందజేయాలన్నారు. పెట్రోల్ బంకు, గ్యాస్ ఏజెన్సీ, డెయిరీ లాంటి యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీ హబ్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు వీలుగా మహిళలను సన్నద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించాలన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొన్నారు. డీఆర్డీవో కాళిందిని, అడిషనల్ డీఆర్డీవో రవికుమార్ తదితరులు ఉన్నారు. గడువులోగా పనులు పూర్తి పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆరోగ్య ఉపకేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్ల మరమ్మతులను సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. ఆయా పనులకు అవసరమైన నిధులను కేటాయించామని పేర్కొన్నారు. పనులు ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ కింద మంజూరు చేసిన సిమెంట్‌రోడ్డు పనులు ఈనెల 15లోగా పూర్తి చేసి బిల్లులు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఈఈ గిరీశ్‌బాబు, సీపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
సమస్యలు పరిష్కరిస్తాం
యైటింక్లయిన్‌కాలనీ(పెద్దపల్లి): సింగరేణి బొగ్గుగని కార్మికుల సమస్యలను పరిష్కరించిన ఘనత టీబీజీకేఎస్‌కే దక్కిందని ఆ యూనియన్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. యూనియఏ ఆర్జీ–2 వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ యూనియన్లకు చెందిన నాయకులు టీబీజీకేస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి రాజిరెడ్డి కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లా డారు. 70కిపైగా కార్మిక హక్కులు సాధించడంతోపాటు కోల్ ఇండియాలో లేనివిధంగా 18 అదనపు హక్కులను సాధించినట్లు పేర్కొన్నారు. నాయకు లు ప్రభాకర్‌రెడ్డి, చంద్రయ్య, సురేందర్, రవితేజ, వెంకటేశ్, శ్రీనివాస్, రమేశ్, తిరుపతి, రామ్‌చరణ్, లేనిన్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్ వార్షికోత్సవం పెద్దపల్లిరూరల్: అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్ వార్షికోత్సవం శనివారం నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం శుక్రవారం తెలిపారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా విద్యాధికారి మాధవితోపాటు విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. -
విధుల్లో సాటి.. క్రీడల్లో మేటి
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ ప రిధిలోని పలువురు పోలీసు క్రీడాకారులు రాష్ట్రస్థా యి పోలీస్ మీట్లో సత్తాచాటి రాష్ట్రం తరఫున జా తీయస్థాయి పోలీస్మీట్కి అర్హత సాధించారు. తీరక లేకుండా విధులు నిర్వర్తిస్తూనే క్రీడల్లో ప్రతిభ చా టుతున్నారు. రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా పోటీలు క రీంనగర్ జిల్లా కేంద్రంలో జనవరి–28 నుంచి ఫి బ్రవరి ఒకటో తేదీ వరకు జరిగాయి. రామగుండం కమిషనరేట్ పోలీసులు ఇందులో సత్తా చాటారు. ఏఆర్ ఏసీపీ సి.ప్రతాప్ ఆధ్వర్యంలో క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటారు. మార్చి 7 నుంచి జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈసారి కాళేశ్వరం జోన్లో అత్యధిక మెడల్స్ సాధించి ముందంజలో నిలిచారు. మొత్తం 48 మెడల్స్ రాగా గోల్డ్‌మెడల్స్–11, సిల్వర్ మెడల్స్–15, బ్రాంజ్ మెడల్స్–21, ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన పోలీసు క్రీడాకారులను పలువురు అభినందించారు. క్రీడా పోటీల్లో పోలీసుల ప్రతిభ జాతీయస్థాయికి ఎంపిక -
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
గోదావరిఖని: ఆర్ఎఫ్సీఎల్లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు నెలకంటి రాముతో కలిసి కార్మికుల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను యాజమా న్యం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఢిల్లీలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రమకు తగిన వేతనాలు అందజేయాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని యా జమాన్యాన్ని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకా రం రావాల్సిన అలవెన్స్‌లు చెల్లించాలని, ఈఎస్ ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మికులపై పనిభారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయ న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టబోయిన రాజ్‌కుమార్, కందుల సతీశ్, శంకర్, మల్లేశ్, రమేశ్‌రెడ్డి, ఎరుకల అంజి, దాత శ్రీనివాస్, దూస రాజేశ్, జనగామ శ్రీనాథ్, కుమార్, శ్రీనివాస్, తరుణ్ పాల్గొన్నారు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తాం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ -
దర్జీల బతుకు దుర్భరం
పెద్దపల్లిరూరల్: ఆధునిక పోకడలతో దర్జీల బతుకులు దుర్భరంగా మారాయని, పట్టెడన్నం కోసం పడరానిపాట్లు పడాల్సిన వస్తోందని మేరు సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కీర్తి రాజయ్య మేరు ఆవేదన వ్యక్తం చేశారు. టైలర్స్డే సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెడీమేడ్ దుస్తులు మార్కెట్లోకి రావడంతో దర్జీలకు కుట్టేపని కరువైందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో దర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. రాయితీ రుణాలిచ్చి ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యుడు శంకరయ్యను శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు మొలు గూరి అశోక్, రమేశ్, కీర్తి నవీన్, లింగయ్య, జితేందర్, నర్సింగం, రాపర్తి రమేశ్, శ్రీనివాస్, రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బూడిద టిప్పర్ల అడ్డగింత రామగుండం: మల్యాలపల్లి గ్రామ శివారులోని ఎన్టీపీసీ డ్యాంకు వెళ్లే రహదారిపై ద్విచక్రవాహనదారులు శుక్రవారం వేకువజామున బూడిద టిప్పర్లను అడ్డుకున్నారు. ఎల్కలపల్లి శివారులోని బూడిద చెరువు నిండిపోవడంతో టిప్పర్ల ద్వారా డ్యాంకు వెళ్లే రోడ్డు నుంచి రాజీవ్ రహదారికి టిప్పర్ల ద్వారా బూడిద తరలిస్తున్నారు. అయితే, డ్యాంలో సోలార్ ప్లేట్ల పర్యవేక్షణ చేసే సుమారు 120 మంది కార్మికులతోపాటు ఇటీవల నూతన ప్లాంట్‌లో విధులు నిర్వహించే 300 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. బూడిద లోడుతో వందలాది టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండంతొ బూడిద లేచి పడుతోందని, దీంతో తాము ప్రమాదాలకు గురవుతున్నామని కార్మికులు ఆరోపించారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రమాదకరంగా గ్రిల్స్ కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చే ప్రధాన ముఖద్వారం గేటు ఎదుట ఏర్పాటు చేసిన పాత్వే గ్రిల్స్ ప్రమాదకరంగా మారాయి. గ్రిల్స్‌కు అమర్చిన పైపులు విరిగిపోవడంతో వాటి మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చింది. దీనిని గమనించకుండా పైపులపై నుంచి నడుకుంటూ వెళ్లేవారు ఆ సందుల్లో పడి కాళ్లు విరిగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి గతంలో కూడా చాలామంది బాధితులు గ్రిల్స్ మధ్య కాళ్లు ఇరుక్కుని కాళ్లు విరగొట్టుకున్నారు. పోలీసులు, స్థానికులు శ్రమించి గ్యాస్ కట్టర్‌తో పైప్‌లను కట్‌చేసి బాధితులను రక్షించిన సంఘటనలు ఉన్నాయి. నిత్యం ఇదే గ్రిల్స్ పైనుంచి రాకపోకలు సాగిస్తున్న అధికారులు.. నివారణ చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. ఇప్పటికై నా మరో ప్రమాదం చోటుచేసుకోకముందే స్పందించాల్సిన అవసరం ఉంది. అందరూ హిందీ నేర్చుకోవాలి జ్యోతినగర్(రామగుండం): అందరూ హిందీ నేర్చుకోవాలని ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ చందన్ కుమార్ సావంత కోరారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో హిందీ దివస్ సందర్భంగా ఇటీవల పలు పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలకు శుక్రవారం ప్రాజెక్టు పరిపాలనా భవనంలో సీజీఎం ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఎన్టీపీసీ టీటీఎస్ జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు పెర్కారి శ్రీధర్‌రావుకు ప్రథమ బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సీజీఎం మాట్లాడుతూ, ఉద్యోగులు, సిబ్బంది హిందీ భాష నేర్చుకోవడం ద్వారా విధి నిర్వహణలో సమన్వయం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం(హెచ్ఆర్) బిజయ్‌కుమార్ సిగ్దర్తోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు టీచర్లకు దరఖాస్తులు
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిన టీచర్లు, కోచ్(గేమ్స్, మ్యూజిక్, డ్యాన్స్) నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శోభన్‌బాబు శుక్ర వారం తెలిపారు. అర్హత, ఆసక్తి గలఅభ్యర్థులు ఈనెల 4, 5వ తేదీల్లో కేంద్రీయ విద్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. ఉదయం 8.30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, అభ్యర్థులు విద్యార్హతల ధ్రువీకరణపత్రాలతోపాటు ఒక పాస్‌పోర్టు సైజ్ ఫొటో వెంట తీసు కుని రావాలని సూచించారు. వివరాలకు విద్యాలయ వెబ్సైట్ (ramagundamntpc.kvs. ac.in)లో సంప్రదించాలని ఆయన కోరారు. -
వివాహాల నమోదు అంతంతే..
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వివాహాల నమోదు ప్రక్రియ అంతంత మాత్రంగానే సాగుతోంది. వివాహాల రిరస్ట్రేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. పల్లెవాసులు అటువైపు పెద్దగా మొగ్గుచూపడం లేదు. అధికారులు సరైన అవగాహన కల్పంచకపోవడమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఇదేసమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంల్లో అత్యధికంగా వివాహాలు నమోదు కావడం గమనార్హం. బాల్య వివాహాలకు ఆడ్డుకట్ట వేసేందుకు.. గ్రామాల్లో బాల్య వివాహాలకు ఆడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2002లో వివాహ నమోదు చట్టంలో జీవో నంబరు 193 ప్రకారం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వివాహ నమోదు బాధ్యతను పంచాయతీ కార్య దర్శులకు అప్పగిస్తూ ఉత్వర్వులు జారీచేసింది. అంతేగాకుండా ఈ చట్టం నిబంధనల ప్రకారం యువతికి 18 ఏళ్లు, యువకుడికి 21ఏళ్ల వయసు నిండి తర్వాతే వివాహం చేయాలి. పెళ్లికి ముందు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పేర్లు నమోదు చేయాలి. దీంతో బాల్య వివాహాలను ముందస్తుగానే అధికారులు అడ్డుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల్లో 54.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 650 సుల్తానాబాద్ మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే, 2024 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు దాదాపు 13 నెలల్లో 54 వివాహాలు నమోదు అయ్యాయి. సుల్తానాబాద్‌లో ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. దీని పరిధిలో సుల్తానాబాద్, జూలపల్లి, ధర్మారం, ఎలిగేడు మండలాలు వస్తాయి. ఈ మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో కలిపి ఇప్పటివరకు 650 వివాహాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎక్కువ సంఖ్యలో వివాహాల రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. ఉచితంగా నమోదు చేసే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండడం విస్మయం కలిగిస్తోంది. అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే అధికంగా నమోదు గ్రామపంచాయతీల్లో ఉచితమైనా మొగ్గుచూపని వైనంఉచితంగా నమోదు గ్రామపంచాయతీ కార్యాలయల్లో నిర్ణీత సమయంలో వివాహాలు నమోదు చేసుకుంటే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం. గ్రామీణ దంపతులు ఎక్కడకు వెళ్లాకుండా గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనే ఉచితంగా వివాహాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోండి. – సమ్మిరెడ్డి, ఎంపీవో, సుల్తానాబాద్ -
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సజావుగా నిర్వహించాలి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థుల కోసం జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పరీక్ష సమయాల్లో విద్యార్థులకోసం ఆర్టీసీ బస్సులు నడిపించాలని ఆదేశించారు. ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన, అధికారులు పాల్గొన్నారు. సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు ఇంటర్ విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పరీక్ష సమయానికి ఒకగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు సజావుగా సాగేందుకు వైద్య, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, పురపాలక, తపాలా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25 మంది పర్యవేక్షకులు, 25 మంది అదనపు పర్యవేక్షకులు, ఒక ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్‌తోపాటు 400 మంది ఇన్విజిలేటర్లను నియమించా రు. జిల్లావ్యాప్తంగా మొత్తం 10,985 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రశ్నాపత్రాలను తెరిచే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు బిగిస్తున్నామని పేర్కొన్నారు. సెంటర్ లొకేటర్ యాప్.. గతంలో పరీక్ష కేంద్రాల చిరునామా తెలుసుకోవ డం విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సారి వాటిగుర్తింపు కోసం లొకేటర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు ఇక సులువుగా పరీక్ష కేంద్రాలను గుర్తించేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు. హాల్‌టికెట్ల జారీలో ప్రై వేట్ కళాశాలలు పెట్టే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెబ్సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇంటర్ విద్యార్థులు 10,985 మంది.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో మొత్తం 10,985 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. ఇందులో మొదటి సంవత్సరంలో 5,844 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,141 మంది ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించేందుకు 400 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు పూర్తికావడంతో ఇక వార్షిక పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం.. గురుకుల, మోడల్ స్కూల్, మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలలకు పరీక్ష కేంద్రాలు దూరం ఉంటే సంబంధితవిద్యార్థులు సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రానికి ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా అప్ అండ్ డౌన్ చేరవేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. 144 సెక్షన్ అమలు.. జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు చేరగా.. వాటిని సమీప పోలీస్స్టేషన్లలో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో బుక్‌స్టాల్స్, జిరాక్స్ సెంటర్లను మూసివేస్తామని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అందుబాటులో వైద్య సిబ్బంది.. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. ఇందుకోసం ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, సూపర్వైజర్లకు విధులు కేటాయించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుతారు. అవసరమైన మందులు కూడా నిల్వచేస్తారు. 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు మొత్తం విద్యార్థులు 10,985 మంది కేటాయించిన పరీక్ష కేంద్రాలు 23 290 మంది ఇన్విజిలేటర్ల నియామకం ఫిర్యాదు చేస్తే చర్యలు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షలకు అనుమతించరు. హాల్‌టికెట్ల జారీ విషయంలో ఇబ్బందులకు గురిచేసే కళాశాలపై ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – కల్పన, జిల్లా ఇంటర్ విద్య నోడల్ ఆఫీసర్ -
బోనస్ పడలే..
జిల్లాలో సన్నరకం ధాన్యం సేకరణ వివరాలు కొనుగోలు చేసిన ధాన్యం(మెట్రిక్ టన్నుల్లో) 2,29,443.96 విక్రయించిన రైతుల సంఖ్య : 37,752 చెల్లించాల్సిన బోనస్ మొత్తం (రూ.కోట్లలో) 114.72 రైతుల ఖాతాల్లో జమైన సొమ్ము(రూ.కోట్లలో) 106.71 బోనస్ అందని రైతుల సంఖ్య: 3,142 జమకావాల్సిన సొమ్ము(రూ.కోట్లలో): 8.01 సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతోపాటు అదనంగా రూ.500 బోనస్ వర్తింపజేస్తామనే ప్రకటన అప్పట్లో రైతుల్లో అనేక ఆశలు రేకెత్తించింది. ఇచ్చిన హామీ అమలులో భాగంగా గత వానాకాలం సీజన్లోనే సన్నవడ్లకు బోనస్ ఇస్తామని వెల్లడించింది. తన హామీ మేరకు వానాకాలం సీజన్లో సన్నవడ్లు క్వింటాలు కు రూ.2,320 మద్దతు ధరతోపాటు, రూ. 500 బోనస్ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో చాలామంది రైతులు సన్నరకం వడ్లు సాగు చేసేందుకే మొగ్గుచూపారు. అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి సన్నవడ్లు పండించారు. ఆ తర్వాత బహిరంగ మార్కెట్లో సన్నవడ్లకు డిమాండ్ అధికంగా ఉన్నా.. తమకు బోనస్ లభిస్తుందనే ఆశతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే సన్నరకం వడ్లు విక్రయించారు. కానీ, సన్నరకం ధాన్యం విక్రయించిన నెలలు గడుస్తున్నా తమ బ్యాంకు ఖాతాల్లో బోనస్ డబ్బులు జమకాలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బోనస్ డబ్బులు చేతికి అందితే యాసంగి పంటల సాగు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని, ఇది తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని ఆశపడుతున్నారు. అంతేకాదు.. బోనస్ డబ్బుల కోసం ప్రతీ రోజు బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. మరికొందరు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదోనని సరిచూసుకుంటున్నారు. కష్టమైనా సన్నవడ్లే సాగు చేశారు.. జిల్లాలో గత వానాకాలంలో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దొడ్డురకం కన్నా.. సన్నరకం వడ్లు సాగు చేయడానికి కష్టాలు ఎక్కువే. సహజంగా దొడ్డురకం పంట కాలం 135 రోజుల వరకు ఉంటే, సన్నవడ్లు 165 రోజుల వరకు ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఫలితంగా నెలరోజుల పాటు రైతులు అదనంగా శ్రమించాల్సి వస్తోంది. పెట్టుబడి సైతం సాధారణ రకాలతో పోల్చి చూస్తే సుమారు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అధికమవుతోంది. చీడపీడలు సోకే ప్రమాదం కూడా ఎక్కువే ఉన్నా.. ఆ మేరకు రావాల్సిన దిగుబడి.. తక్కువగా రావడం రైతులను ఇబ్బందులకు గురిచేసే అంశమేనని పేర్కొంటున్నారు. అయినా, వ్యయప్రయాసాలకు ఓర్చి సన్నాలు సాగు చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. కానీ, సుమారు రెండున్నర నెలలు గడిచినా బోనస్ డబ్బులు పడక చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిషయమైన సివిల్ సప్లయి డీఎం శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా.. రైతుల వివరాల జాబితాను ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయని ఆయన వెల్లడించారు. డిసెంబర్లో అమ్మిన గత డిసెంబర్లో మా గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో సన్నవడ్లను విక్రయించా. 112 బస్తాల ధాన్యం అమ్మిన. వాటికి సంబంధించిన మద్దతు ధర డబ్బులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. కానీ, క్వింటాలుకు ఇస్తానన్న రూ.500 బోనస్ డబ్బులు ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలో పడలేదు. బోనస్ దాదాపు రూ.22,500 జమకావాల్సి ఉంది. – దారవేణి శ్రీనివాస్, రైతు, పాలకుర్తివ్యాపారులకు విక్రయించలే మా ఊరిలోని కొనుగోలు కేంద్రంలో రెండు నెలల క్రితం జైశ్రీరామ్ సన్నవడ్లు విక్రయించిన. బోనస్ పైసలు క్వింటాలుకు రూ.500 ఇస్తున్నారని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మిన. బయట మార్కెట్లో క్వింటాలుకు రూ.2,800 చొప్పున ధర చెల్లిస్తామని వ్యాపారులు చెప్పినా నేను అమ్మలేదు. తీరా చూస్తే సన్నవడ్లకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ పడలేదు. – దాడి సదయ్య, రైతు దొంగతుర్తి -
ఓటెత్తిన చైతన్యం
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025పెద్దపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో బారులుతీరిన ఓటర్లుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్‌శాతం పెరిగింది. ఎన్నికల సంఘం చేసిన ప్రచారం, అభ్యర్థులు చేపట్టిన ఓటింగ్ నమోదు పోలింగ్‌శాతం పెరుగుదలకు దోహదం చేసింది. గురువారం నాలుగు పాత జిల్లా(కొత్త 15 జిల్లాలు)లు, 42నియోజకవర్గాల్లోని 773 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానంలో 3,55,159 ఓట్లు ఉండగా.. 70.42శాతం పోలింగ్ నమోదైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉండగా 91.90 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల్లో 11.39శాతం, టీచర్లలో 8.36 శాతం పోలింగ్ మెరుగైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్న 56మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీలో నిలిచిన 15మంది భవితవ్యం ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. బ్యాలెట్ బాక్సులు కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరచగా.. మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో విజయావకాశాలపై ఆన్లైన్ సర్వేలు జోరందుకున్నాయి. ప్రతికూలతతో తగ్గిన ఓటింగ్.. వాస్తవానికి ఈసారి పోలింగ్ ఇంకా పెరగాల్సి ఉన్నా.. పలు ప్రతికూలతల వల్ల అది సాధ్యం కాలేదు. టీచర్లకు ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవు పేరిట రోజు మొత్తం సెలవు ఇచ్చింది. కానీ, విద్యాశాఖ, ప్రైవేటు యాజమాన్యాలు కాలడ్డం పెట్టాయి. ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులకు సగంరోజు, ప్రైవేటు వారికి గంట మాత్రమే అనుమతించారు. వాస్తవానికి టీచర్లు గ్రాడ్యుయేట్, టీచర్ రెండు ఓట్లు వేయాల్సి ఉంటంది. కానీ, సమయాభావం, సెలవు దొరక్కపోవడంతో వారిలో అధికశాతం ఒక్క ఓటుకే పరిమితమయ్యారు. దీనికితోడు ముందు రోజు రాత్రి శివరాత్రి జాగారం కావడం పలువురు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. ఇక హైదరాబాద్, తదితర నగరాలకు వలసవెళ్లిన గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ఇక్కడ ఓటు ఉన్నా.. సెలవు దొరక్క, చార్జీల భారం వల్ల రాలేకపోయారు. ఓటేసిన కలెక్టర్.. 3వ తేదీన లెక్కింపు కరీంనగర్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ముకరంపురలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆమె తన గ్రాడ్యుయేట్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఓటు వేశారు. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కరీంనగర్‌లోని బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేపడుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య లెక్కింపు జరగనుంది. కొత్త 15 జిల్లాల నుంచి గురువారం అర్ధరాత్రి వరకు బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి. పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఆన్లైన్లో ఎగ్జిట్‌పోల్ కోసం అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఫోన్లలో ఐవీఆర్ పద్ధతిలో, నేరుగా, సోషల్‌మీడియా లేదా ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించడం మొదలు పెట్టారు. గ్రాడ్యుయేట్స్ స్థానంలో పోలింగ్ ఇలా.. ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్‌శాతం 2019 1,95,581 59.03శాతం 2025 3,55,159 70.42శాతంటీచర్స్ స్థానంలో ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్‌శాతం 2019 23,160 83.54 శాతం 2025 27,088 91.90 శాతం సజావుగా ఎన్నికలు● కలెక్టర్ కోయ శ్రీహర్షపెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్: పెద్దపల్లిలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 31వేల మంది పట్టభద్రుల ఓటర్ల కోసం 36 పోలింగ్‌కేంద్రాలు, 1100 మంది ఉపాధ్యాయుల కోసం 14 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్‌లోని రిసెప్షన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను తరలిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సజావుగా మొదలైందని ఉపాధ్యాయ ఎన్నికల పరిశీలకుడు మహేశ్దత్త ఎక్కా అన్నారు. పెద్దపల్లిలోని జూనియర్ కాలేజీ ఆవరణలోని కేంద్రాలను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలెక్టరేట్లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామన్నారు. అలాగే కలెక్టర్, ఉపాధ్యాయ ఎన్నికల పరిశీలకుడు సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తహసీల్దార్ రామచందర్‌రావు, ఏసీపీ కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి● రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ గోదావరిఖని(రామగుండం): పటిష్ట బందోబస్తు మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. రెండు జిల్లాల్లోని 108 కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్నారు. కేంద్రాలను సందర్శించి ఎన్నికలు జరుగుతున్న తీరును పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది మొత్తం 560 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఏలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. సీపీ వెంట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ రమేశ్, గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఆర్ఐ సంపత్, రామగుండం ఎస్ఐ సంధ్యరాణి తదితరులున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెరిగిన చైతన్యం 2019తో పోలిస్తే మెరుగుపడిన పోలింగ్ 11.39 శాతం పెరిగిన పట్టభద్రులు, 8.36శాతం పెరిగిన టీచర్లు మూడో తేదీన లెక్కింపు, ఏర్పాట్లు ముమ్మరం విజయావకాశాలపై మొదలైన ఆన్లైన్ సర్వేలు -
‘ఇన్స్పైర్’ చేస్తున్నారు
సైన్స్.. జీవితంలో ఒకభాగం.. పొద్దున నిద్రలేచినప్పటి నుంచి వేసే ప్రతీ అడుగులో.. చేసే ప్రతి పనిలో సైన్స్ దాగి ఉంటుంది. సైన్స్ అంటేనే అద్భుతం.. సంచలనాత్మక ఆవిష్కరణలకు నిలయం. మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో స్కూళ్లలో చదివే పిల్లల నుంచి శాస్త్రవేత్తల వరకు నిత్యం ఏదో ఒక అంశంలో ఆవిష్కరణలపై కసరత్తు చేస్తున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది బాల మేథావులు పుట్టుకొస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్‌ఫేర్, ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల నుంచి చాలా మంది రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. 28 ఫిబ్రవరి 1928న భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ.రామన్.. రామన్ ప్రభావాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అతని ఆవిష్కరణకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నేడు సైన్స్‌డే సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు బాలమేథావుల ఆవిష్కరణలపై ప్రత్యేక కథనం. -
షూతో విత్తన సీడింగ్
సప్తగిరికాలనీ(కరీంనగర్)/గంగాధర(చొప్పదండి): పొలంలో విత్తనాలు విత్తడం అంటే అన్నదాతలకు ఎంతో శ్రమతో కూడుకున్న పని. యంత్రాలతో విత్తనాలు విత్తడం ఆర్థికభారంతో కూడుకుంది. దీంతో రైతులకు ఇరువిధాలుగా ఇబ్బందులు ఎదురవుతోందని గ్రహించి, తన మేథస్సుతో సీడ్ విత్తే షూ తయారు చేసింది ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి జెడ్పీస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఎం.రితిక సైన్స్ ఉపాధ్యాయుడు జగదీశ్వర్‌రెడ్డి సహకారంతో రైతుల కోసం సీడ్ విత్తే షూ తయారు చేసింది. 2023–24 సంవత్సరానికి గానూ మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనక్‌లో ప్రదర్శించి, జాతీయస్థాయి ఇన్స్పైర్ మనక్‌కు ఎంపికై ంది. ‘విత్తన షూ వేసుకుని అడుగు పెట్టినపుడు ఒత్తిడి మెషిన్ లివర్‌పై పడుతుంది. లివర్ షూ విత్తనాల చాంబర్ నుంచి విత్తన విడుదలకు స్థలాన్ని ఇస్తుంది. ఇది నాజిల్‌తో జత చేయబడుతుంది. నాజిల్ మట్టిలోకి డ్రిల్ చేస్తుంది. స్ప్రింగ్‌ల శక్తితో విత్తనాన్ని వదులుతుంది. మరో అటాచ్మెంట్ రబ్బరు మట్టి డిస్టర్బర్ విత్తనాన్ని కప్పడానికి రంధ్రం వైపుల నుంచి మట్టిని వదులుతుంది. మొక్కజొన్న, సోయాబిన్, ఆవాలు, పప్పులు, వేరుశనగ పంటలు విత్తడానికి ఇది అనుకూలం. చిన్న, సన్నకారు రైతులకు ఇది సహాయకారిగా ఉంటుంది’ అని రితిక వివరించింది. ●– వివరాలు 8లోu -
ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలిచారు
● ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లిరూరల్/సుల్తానాబాద్/ఎలిగేడు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తారన్న ధీమాను ఎమ్మెల్యే విజయరమణారావు వ్యక్తం చేశారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన అంతమైందని, దేశంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. అలాగే సుల్తానాబాద్, ఎలిగేడు మండలకేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళి పరిశీలించారు. గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినపాల ప్రకాష్‌రావు, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ఓసీపీ–3లో కాంట్రాక్టు మస్టర్ల కుంభకోణం?
గోదావరిఖని(రామగుండం): సింగరేణి ఓసీపీ–3లో కాంట్రాక్టు మస్టర్ల కుంభకోణంపై విజిలెన్స్ అధికారులు కూపీ లాగుతున్నారు. ప్రాజెక్టులోని బేస్‌వర్క్‌షాప్‌లో క్లీనింగ్ కోసం కాంట్రాక్టు పద్ధతిన కార్మికులను వినియోగిస్తారు. వీరి ప్రతిరోజు మస్టర్ల విషయంలో గోల్మాల్ జరిగినట్లుగా తెలుస్తోంది. కాంట్రాక్టు కార్మికుల మస్టర్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని విజిలెన్స్‌కు ఫిర్యాదు వెళ్లడంతో నిఘా పెట్టింది. ఈక్రమంలో ఇప్పటికే విజిలెన్స్ అధికారులు వచ్చి విచారణ జరిపి వెళ్లినట్లు తెలుస్తోంది. ఓసీపీ–3 బేస్‌వర్క్‌షాప్‌లో అసలు కాంట్రాక్టు కార్మికులు ఎంత మంది పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఎంత మందిని వినియోగిస్తున్నారు. పనిచేయని మిగతా కార్మికులు ఎంత మంది అనే అంశాలపై కూపీలాగినట్లు తెలుస్తోంది. ఈమేరకు కార్పొరేట్ విజిలెన్స్ జీఎంకు నివేదిక అందజేసినట్లు సమాచారం. అయితే దీనిపై వాస్తవాలను తెలియజేయాలని కోరుతూ ఆర్జీ–2 యాజమాన్యానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి 19మంది కాంట్రాక్టు కార్మికులు, ఒకరు సూపర్వైజర్ బేస్‌వర్క్‌షాప్‌లో పనిచేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే వీరిలో 15మంది హాజరైతే 20మంది వచ్చినట్లుగా చెప్పి కాంట్రాక్టర్ తప్పుడు లెక్కలు చూపినట్లు తెలిసింది. అయితే దీనిలో కొంత మంది సంస్థ ఉద్యోగులు కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రూ.50 లక్షల మేర కుంభకోణం? కాంట్రాక్టు వర్కర్ల కుంభకోణం గడిచిన ఐదు నుంచి పదేళ్లుగా కొనసాగుతున్నట్లుగా అనుకుంటున్నారు. ఇదే జరిగితే ప్రతి రోజు ఐదు మస్టర్లు అదనంగా వేసుకుంటే ఈలెక్కన సుమారు రూ.50లక్షల మేర సంస్థకు నష్టం జరగనుంది. ఈవిషయంలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారులు ఓసీపీ–3లో పర్యటించి పూర్తిస్థాయిలో వివరాలు తీసుకెళ్లినట్లుగా కార్మికులు చెబుతున్నారు. అయితే ఏరియా స్థాయిలో కూడా నివేదిక తెప్పించుకునేందుకు విజిలెన్స్ జీఎం, ఆర్జీ–2 యాజమాన్యానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఈక్రమంలో విచారణ కూడా ప్రారంభం అయినట్లుగా సమాచారం. కాగా, ఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ జరుగుతుండగా, అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. కూపీలాగుతున్న అధికారులు రూ.50లక్షల వరకు చేతులు మారాయనే ఆరోపణ పూర్తిస్థాయి విచారణకు విజిలెన్స్ ఆదేశం -
కార్మిక కుటుంబాలకు ఎల్లంపల్లి నీరు
● ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ గోదావరిఖని(రామగుండం): తాగునీటి సరఫరాలో ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలో సింగరేణి కార్మిక కుటుంబాలకు ఎల్లంపల్లి నీరందిస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాగూర్ పేర్కొన్నారు. గురువారం గోదావరినదిలో వాటర్పాండ్ పనులను ప్రారంభించి మాట్లాడారు. గోదావరినదిలో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయిన క్రమంలో కార్మిక వాడలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకంటున్నామన్నారు. నదిలో ఫిల్టర్‌బెడ్ వద్ద ప్రత్యేక ట్రెంచ్ ద్వారా వాటర్పాండ్ ఏర్పాటు చేస్తున్నామని, పనులు పూర్తయిన తర్వాత నీటిని విడుదల చేయిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు ట్రెంచ్ ద్వారా ఇన్‌టెక్‌వెల్ వద్దకు నీటిని మళ్లించే పనులు ప్రారంభమయ్యాయి. ఒకసారి పాండ్ నిండితే కార్మిక వాడలకు నెలరోజుల పాటు నీటి సరఫరాకు ఇబ్బంది ఉండబోదని తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, సివిల్ అధికారులు వరప్రసాద్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల నిరసనకు మాజీ ఎమ్మెల్యే మద్దతుగోదావరిఖనిటౌన్(రామగుండం): న్యాయవాది నామ్తాబాద్ కిరణ్‌జీ పట్ల దురుసుగా ప్రవర్తించిన వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డిని చట్ట పరంగా శిక్షించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రెండోరోజు గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకుడు కౌశికహరి న్యాయవాదులకు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. న్యాయవాదిపై సీఐ దురుసు ప్రవర్తన సరికాదన్నారు. వెంటనే సీఐ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న సీఐ గతంలోనూ, ఇప్పుడు వివాదాస్పదుడు అవుతున్నాడని ఆరోపించారు. ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదికి బహిరంగ క్షమాపణ చెపాల్పలని లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని న్యాయవాదులు హెచ్చరించారు. న్యాయవాదులు మురళీధర్‌యాదవ్, రాకం వేణు, ముచ్చకుర్తి కుమార్ పాల్గొన్నారు. బల్దియాకు రెండు బాబ్‌క్యాట్ వాహనాలుకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలోని శానిటేషన్ విభాగానికి రూ.76లక్షల వ్యయంతో కొత్తగా రెండు అధునాతన హైడ్రాకిల్ వ్యవస్థ కలిగిన బాబ్‌క్యాట్ అనే భారీ వాహనాలను ఉన్నతాధికారులు కొనుగోలు చేశారు. ఈ రెండు వాహనాలు గురువారం బల్దియా కార్యాలయానికి చేరుకున్నాయి. వీటిని తవ్వకాలు, కందకాలు తీయడం తదితర పనుల కోసం ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. -
పరీక్షల్లో మళ్లీ ఫెయిలవుతానేమోనని..
కోరుట్ల రూరల్: మండలంలోని చిన్నమెట్పల్లికి చెందిన మోత్కూరి సంజయ్(19) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మోత్కూరి వెంకటేశం–లత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. చిన్న కొడుకు సంజయ్ కల్లూర్ మోడల్ స్కూల్లో ఇంటర్ చదివాడు. గతేడాది జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలయ్యాడు. అప్పటినుంచి మనోవేదనకు గురవుతున్నాడు. అయితే, ఈసారి కూడా ఫెయిలవుతానేమోనని భయపడ్డాడు. బుధవారం శివరాత్రి కావడంతో తల్లిదండ్రులు గుడికి బయలుదేరారు. వారికి తాను తర్వాత వస్తానని చెప్పి, ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి తండ్రి వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
అధికార యంత్రాంగం అప్రమత్తం
● దోమల నియంత్రణకు ఫాగింగ్ ● ఖాళీ ప్లాట్లలో మురుగునీరు తొలగిస్తాం ● ‘సాక్షి, ఇంటర్వ్యూలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్పెద్దపల్లిరూరల్: శీతాకాలం ముగుస్తోంది. వేసవి ఆరంభమవుతోంది. వాతావరణం మారుతోంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసంతో పట్టణవాసులు జలుబు, జ్వరం, ఇతరత్రా సీజనల్ వ్యాధులకు గురవుతున్నారు. ప్రజలు వ్యాధులకు గురవకుండా తమ అధికార యంత్రాంగం అప్రమత్తమైందని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ వెల్లడించారు. ప్రత్యేకంగా పారిశుధ్యం మరింత మెరుగుపర్చుతున్నామన్నారు. రోడ్లకు ఇరువైపులా మురుగునీటి కాలువలు నిర్మించే పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయిస్తున్నామని చెప్పారు. ఖాళీగాఉన్న ప్లాట్లలో నీరు నిల్వ ఉండకుండా యజమానులకు నోటీసులు జారీచేశామన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సాక్షి: వీధుల్లో పారిశుధ్యం లోపిస్తోంది? కమిషనర్: కొత్త కాలనీల్లో ఈ సమస్య కొద్దిగా ఉంది. ఆయా ప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్లకు ఇరువైపులా డ్రెయినేజీలు నిర్మిస్తున్నాం. పారిశుధ్య సమస్యను పరిష్కరిస్తున్నాం. సాక్షి: దోమలను ఎలా నియంత్రిస్తారు? కమిషనర్: దోమలు వృద్ధి చెందకుండా క్రమం తప్పకుండా అన్ని వీధుల్లో ఫాగింగ్ చేయిస్తున్నాం. డ్రెయినేజీల్లో ఆయిల్‌బాల్స్ వేయిస్తున్నాం. వార్డు ఆఫీసర్లు, సిబ్బంది కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సాక్షి: మురుగుకాలువల్లో చెత్తాచెదారం వేయడాన్ని నియంత్రించారా? కమిషనర్: ఇళ్ల నుంచి వెలువడే తడి, పొడి చెత్తను వేర్వేరుగా డబ్బాల్లో ఉంచి ఇంటికి వచ్చే సిబ్బందికి అందించాలని ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రజలు కూడా చెత్తను వేర్వేరుగా అందించి సిబ్బందికి సహకరించాలి. సాక్షి: పారిశుధ్యం మెరుగుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? కమిషనర్: రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పారిశుధ్యం మెరుగుపర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. వార్డుల వారీగా వాహనాలను ఏర్పాటు చేసి మా సిబ్బందిని ఇళ్లకు పంపిస్తున్నాం. ఇంటింటా చెత్త సేకరిస్తున్నాం. మురుగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి: ఖాళీ ప్లాట్లలో మురుగునీరు చేరి దోమలు వృద్ధి చెందుతున్నాయి? కమిషనర్: ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు పెరగడం, సమీప ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు అందులో చేరకుండా చూడాలని గతంలో ప్లాట్ల య జమానులకు నోటీసులిచ్చాం. మళ్లీ వాటిపై దృష్టి సారిస్తాం. అవసరమైన చర్యలు తీసుకుంటాం. -
● పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం ● నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 773 పోలింగ్ కేంద్రాలు ● గ్రాడ్యుయేట్స్ 499, టీచర్స్ 274, ఉమ్మడిగా 93 పోలింగ్ కేంద్రాలు ● ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ● పట్టభద్రుల బరిలో 56మంది, ఉపాధ్యాయప
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రా డ్యుయేట్, టీచర్స్ నియోజవర్గాల ఎన్నికలకు స ర్వం సిద్ధమైంది. మొత్తం 15 జిల్లాలు 42నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న ఈ ఎన్నికలకు కలెక్టర్ పమేలా సత్పతి రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. బుధవారం ఉదయమే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రితో సిబ్బంది, పోలీసులు వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరారు. నోటిఫికేషన్ విడుదలైన నాటినుంచి హోరాహోరీ ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు బుధవారం పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారించా రు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజా మాబాద్‌లో మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్వో పమేలాసత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్స్ కోసం 499, టీచర్స్ కోసం 274, ఉమ్మడిగా 93 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. అత్యధిక ఓటర్లతో కరీంనగర్ జిల్లా 103 పోలింగ్ కేంద్రాలు కలిగి ఉంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, ఓటరు కార్డుతో సహా 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని తెలిపారు. ఈ పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ పోటీలో 15 మంది ఉన్నారు. కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి ఎమ్మెల్సీ ఎన్నికలో విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, పేపర్లు ఇతర సామగ్రితో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అదనపు ప్రిసైడింగ్ ఆఫీసర్, మరో ఉద్యోగితో పాటు భద్రతకు పోలీసులను కేటాయించారు. వీరంతా గురువారం ఉదయం 6.30గంటలకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 7గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్‌పోలింగ్ నిర్వహిస్తారు. ప్రతీ కేంద్రం వద్ద వెబ్‌కాస్టింగ్‌తో పాటు సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. పోలింగ్‌కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటున్నందున కేంద్రానికి 100మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదని పోలీసులు సూచించారు. పోలింగ్ అనంతరం సిబ్బంది బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి కరీంనగర్‌లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంకు తరలిస్తారు. మొత్తం 15జిల్లాల్లోని 271మండలాల నుంచి బ్యాలెట్ బాక్సులు శుక్రవారం ఉదయంలోపు ఇక్కడికి చేరనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 56మంది.. 3,55,159ఓట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణతో కలిపి మొత్తం 56మంది పోటీ పడుతున్నారు. 3,55,159మంది ఓటర్లు 499పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా 1,60,260మంది పట్టభద్రులు, 200పోలింగ్ కేంద్రాల్లో ఓటేయనున్నారు. టీచర్స్ బరిలో 15మంది.. 27,088 ఓటర్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్పీసీ మద్దతుతో వై.ఆశోక్‌కుమార్, ఎస్టీ యూ, సీపీఎస్‌ల నుంచి కూర రఘోత్తంరెడ్డిలతో కలిపి 15మంది ఉన్నారు. 274 పోలింగ్ కేంద్రాల్లో 27,088మంది ఓటు వేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్లో 8,135 మంది 65పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఓటు ఇలా వేయాలి.. ● ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్లో ఎన్నికల సంఘం సరఫరా చేసిన వాయిలెట్ స్కెచ్‌పెన్ ద్వారా మాత్రమే ఓటు వేయాలి. ● ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా 1, 2, 3, 4 ప్రాధాన్య క్రమంలో మాత్రమే అంకెల రూపంలో ఓటేయాలి. ● మొదటి ప్రాధాన్య ఓటుగా 1వ అంకెను అభ్యర్థికి ఎదురుగా ఉన్న స్థలంలో మాత్రమే మార్కు చేయాలి. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా, బ్యాలెట్ పేపర్లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా 1, 2, 3 వంటి అంకెల రూపంలో మాత్రమే ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఇలా చేయకూడదు... ● బ్యాలెట్ పేపర్లో ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓటు 1వ సంఖ్య ఇవ్వకూడదు. ● బ్యాలెట్ పేపర్‌పై సంతకం చేయడం, ఇనిషియల్ వేయడం, పేరు, అక్షరాలు వంటివి రాయకూడదు. ● బ్యాలెట్ పేపర్‌పై 1, 2, 3, 4, 5 సంఖ్యల రూపంలో మాత్రమే ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. పదాల రూపంలో, వన్, టూ, త్రీ అని రాయకూడదు. ● బ్యాలెట్ పేపర్‌పై రైట్ మార్క్ టిక్ చేయడం లేదా ఇంటూ మార్కు పెట్టడం వంటివి చేయకూడదు. ● ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్యాలు ఇవ్వకూడదు. ఉదాహరణకు ఒకే అభ్యర్థికి 1, 2 సంఖ్యలు వేయకూడదు. ● బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థికి కేటాయించిన స్థలంలో గాక ఇతర ప్రాంతాల్లో 1, 2, 3 అంకెలు వేయకూడదు. పెద్దపల్లిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని సరిచూసుకుంటున్న ఎన్నికల సిబ్బందిమొత్తం పోలింగ్ కేంద్రాలు 773 పట్టభద్రుల కేంద్రాలు: 499 టీచర్స్ కేంద్రాలు: 274ఉమ్మడి కేంద్రాలు 93మైక్రో అబ్జర్వర్లు: 394 జోనల్ అధికారులు: 335ప్రిసైడింగ్ అధికారులు: 864అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు: 2606మొత్తం పోలింగ్ సిబ్బంది: 4,199పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 56మంది ఓటర్లు 3,55,159టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో 15మంది ఓటర్లు 27,088 -
పొరపాట్లు లేకుండా పోలింగ్
● పకడ్బందీగా విధులు నిర్వహించాలి ● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎ మ్మెల్సీ ఎన్నికలను పొరపాట్లు తలెత్తకుండా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించా రు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సామగ్రిని అధికారులు, సిబ్బందికి అందించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అధికారులు, సిబ్బంది ని బంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. జిల్లాలో దాదాపు 31 వేల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారని, వారు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు 36 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం 1,100 మంది ఉపాధ్యాయులు ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, వారికోసం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని చల్లనినీరు, టెంట్ లాంటి సౌకర్యాలు కల్పించామని అన్నారు. ఓటర్లు గురువారం జరిగే ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ వేణు, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, డీఏవో ఆదిరెడ్డి, ఆర్టీవో రంగారావు తదితరులు ఉన్నారు. -
పదండి.. ఓటేద్దాం
● సరైన నాయకుడిని ఎన్నుకుందాం ● సిద్ధమంటున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు ● నేటి ఎమ్మెల్సీ ఎన్నికలకు రెడీసప్తగిరికాలనీ(కరీంనగర్): సమాజంలో మార్పు తీసుకొచ్చే సత్తా యువతకే ఉంటుంది. యువతను సన్మార్గంలో నడిపించే శక్తి ఉపాధ్యాయులకు ఉంటుంది. యువత, ఉపాధ్యాయులు కలిసి ఓటుహక్కు అనే బ్రహ్మాస్త్రాన్ని సక్రమంగా వినియోగించుకుంటే.. ఒక నికార్సయిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. పెద్దల సభలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తే గొంతును కూర్చోబెట్టే సమయం వచ్చింది. ఈ నెల 27న(నేడు) కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీకి 3.5లక్షలకు పైగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సుమారు 27వేల మందికి పైగా ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ఓటరుగా నమోదు చేసుకోవడమే కాదు.. నేడు జరిగే ఓటింగ్‌లో పాల్గొని.. ప్రలోభాలకు లొంగకుండా మంచి అభ్యర్థులను ఎన్నుకునేందుకు సమాయత్తం కావాలి. ఈ క్రమంలో పదండి ఓటేద్దాం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటుదాం అంటున్నారు.. పలువురు పట్టభద్రులు.. ప్రయివేటు ఉపాధ్యాయులు.!! -
సీపీఆర్ చేసి భక్తుడి ప్రాణాలు కాపాడిన ఎస్సై
ఓదెల(పెద్దపల్లి): హఠాత్తుగా గుండెపోటుకు గురైన భక్తుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఎస్సై రమేశ్. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన భక్తుడు ఒరుసు శ్రీనివాస్ మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఓదెల శ్రీమల్లికార్జునస్వామి దర్శనం కోసం తరలివచ్చాడు. స్వామివారి దర్శనం చేసుకుంటుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పొత్కపల్లి ఎస్సై దికొండ రమేశ్ వెంటనే సీపీఆర్ చేశారు. దీతో భక్తుడు స్పృహలోకి రావడంతో ఓ వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పండుగపూట తమ కుమారుడు ఆపదకు గురైతే.. ఎస్సై దేవుడిలా ప్రాణాలు కాపాడారని శ్రీనివాస్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సైని పలువురు భక్తులు, స్థానికులు అభినందించారు. -
తొలిసారి వేస్తున్నా
నేను ప్రైవేటు ఉపాధ్యాయుడిని. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి ఓటేయబోతున్నా. చాలా సంతోషంగా ఉంది. రోజు చాలా వాయిస్‌కాల్స్ వచ్చాయి. అభ్యర్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిస్కరించే వారికే నా ఓటు. ప్రతీ ఒక్కరు ఓటును వినియోగించుకోవాలి. – నవక్రాంత్రెడ్డి గోడు విన్న వారికే తొలిసారి ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఓటుహక్కు కల్పించింది. మా గోడు చెప్పుకునే అవకాశం దక్కింది. ఇన్ని సంవత్సరాలు మమ్ముల్ని ఎవరూ పట్టించుకోలేదు. చాలీచాలనీ జీతాలతో నానా తంటాలు పడుతున్న మాకు దారి చూపించే వారికే నా ఓటు. – వి.తిరుపతిరావు అవగాహన ఉన్నవారికి ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. బరిలో ఉన్న అభ్యర్థి ఎవరైనా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వారికి ఓటేయ్యాలి. నిత్యం అందుబాటులో ఉంటూ.. సమస్యలు పరిష్కరించేవారిని ఎన్నుకోవాలి. ప్రజలతో మమేకమైనవారికే నా ఓటు. – డి. శ్రీనివాస్ సమస్యలపై స్పందించే వారికే సమస్యలపై స్పందించి, పరిష్కరించే వారికే నా ఓటు. గెలిచిన అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి. ఓటును నోటుతో కొనాలన్నది నేటి రాజకీయం. మన ఓటు వజ్రాయుధం లాంటిది. నోటుకు ఆశపడకుండా ఓటు వేసే విధంగా సిద్ధం కండి. – అనూప్ కుమార్ -
‘కరువుకు కేరాఫ్ కాంగ్రెస్’
గోదావరిఖని: కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ నిలిచిందని రామగుండం మాజీ ఎమ్మె ల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. నీళ్లులేక ఎండిపోయిన గోదావరి నదిని బుధవా రం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలన లో గోదావరినది నిండుకుండలా ఉండేదన్నా రు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక వెలవెలబోతోంని అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు గోదావరిలో స్నానం ఆ చరించడం అనవాయితీ అని, ఇప్పుడు నీరు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. నాయకులు వెంకన్న, కోడి రామకృష్ణ, ఆవునూరి వెంకటేశ్, రామరాజు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల తనిఖీ కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ బుధవా రం రాత్రి తనిఖీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. భోజన సదుపాయాలు, లైటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా తగిన భద్ర తా ఏర్పాట్లు చేయాలని ఎస్సై వెంకటేశ్‌ను ఆదేశించారు. పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్, పెద్దపల్లి సీఐలు సుబ్బా రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ఎస్సై వెంకటేశ్, ఏఎస్సై నీలిమ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సుకు ఎంపిక పెద్దపల్లిరూరల్: రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సుకు జి ల్లా సైన్స్ అధికారి రవినందన్‌రావు ఎంపికయ్యారని డీఈవో మాధవి తె లిపారు. కన్నాల ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడైన రవినందన్‌రావు.. శుక్రవారం ఎన్సీఈఆర్టీ నిర్వహించే సదస్సులో అవార్డు అందుకోనున్నారనిపేర్కొన్నారు. ‘సైన్స్ ఇన్ అవర్వరల్డ్’ ప్రధాన ఇతివృత్తంతో సదస్సు నిర్వహిస్తున్నారన్నా రు. విజ్ఞానశాస్త్ర విద్యలో ప్రమాణాలు పెంచేందుకు శాసీ్త్రయ మార్గాలు ఉపఅంశంలో రవినందన్‌రావు తన పరిశోధనాపత్రం సమర్పిస్తారని వివరించారు. రెండేళ్లపాటు నిర్వహించిన సంచార ప్రయోగశాల ద్వారా కృత్యాధార బోధనలోని పలు అంశాల ఆధారంగా ఈపత్రం రూపొందించారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నత పాఠశాలల నుంచి రవినందన్‌రావు ఈ సదస్సుకు ఒక్కరే ఎంపికయ్యారని వివరించారు. డీఈవోతోపాటు సమన్వయకర్తలు పీఎం షేక్, మల్లేశ్, కవిత, కమలాకర్‌రావు ఆయనను అభినందించారు.