Rangareddy
-
పరీక్షల కోసం ప్రైవేటుకు..
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగే దిక్కు ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం మండలం, ఆదిబట్ల మున్సిపాలిటీల పరిధిలో బస్తీ దవాఖాన, పల్లె దవాఖానాల్లో పర్మినెంట్ ఉద్యోగులు లేరు. వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో, సపోర్టింగ్ స్టాఫ్, ఏన్ఎన్ఎం, జీఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్లను ఔట్సోర్సింగ్ విధానంలో నియమించారు. వైద్యులు రాని చోట ఏకంగా స్టాఫ్ నర్సులే దిక్కవుతున్నారు. రక్తం, మూత్ర పరీక్షల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వైద్యం సరిగా అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బడంగ్పేట్లో ఓపీ సేవల్లో వైద్యుడు శేరిగూడ బస్తీ దవాఖానాలో సపోర్టింగ్ స్టాఫ్ సెలవుపై వెళ్లడంతో స్వయంగా మందులు ఇస్తున్న డాక్టర్ -
సొంతూరికి వెళ్లొచ్చే సరికే..
అబ్దుల్లాపూర్‌మెట్: ఇంటి తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు, నగదును అపహరించుకుపోయిన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని కవాడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉదయ్ గార్డెన్ కాలనీలో నీరుడు సతీష్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నాడు. ఆయన సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరులో జరిగే జాతరకు వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోపలి ప్రవేశించినట్లు గుర్తించాడు. బీరువాలో ఉన్న 4 తులాల బంగారం, 80 తులాల వెండి వస్తువులు, నగదు దొంగిలించినట్లు నిర్ధారించుకున్నాడు. దాదాపు రూ.6.5 లక్షల విలువగల సొత్తును తస్కరించారని సతీష్ విలపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి తాళాలు పగులుగొట్టి బంగారం, వెండి ఆభరణాల చోరీ -
వైద్యుల కోసం నిరీక్షణ
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 202510లోuకందుకూరు: కందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడంలేదు. ఉదయం 10 గంటలకు ఆయూష్‌కు చెందిన అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నాడు. బయట కొందరు రోగులు నిరీక్షిస్తున్నారు. వైద్యులు కానీ నర్సులు కానీ ఇతర ఉద్యోగులు కానీ ఎవరూ అందుబాటులో లేరు. పది గంటల తర్వాత ఒక్కొక్కరుగా వచ్చారు. ఉదయం 8.20 గంటల నుంచి.. మా కుమారుడిని కుక్క కరిచింది. కడ్తాల్ నుంచి కందుకూరుకు ఉదయం 8.20 గంటలకు వచ్చాము. 10 గంటలకు కూడా చికిత్స చేయడానికి ఎవరూ లేరు. డాక్టర్ల కోసం ఎదురుచూస్తున్నాం. కందుకూరు పీహెచ్సీ ఎదుట వైద్యుల కోసం నిరీక్షిస్తున్న రోగులు, వారి కుటుంబీకులున్యూస్రీల్– రూప్సింగ్, కడ్తాల్ -
బేజారు
సేవలు అంతంతే.. ● సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది ● అరకొర మందుల పంపిణీ ● పరీక్షలకు విషమ ‘పరీక్షే’.. ● గంటల తరబడి రోగుల నిరీక్షణసర్కారు దవాఖానాల్లో రోగులకు పాట్లు తప్పడం లేదు.. మంగళవారం ఉదయం జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో ‘సాక్షి’ విజిట్ చేసింది.. రోగులకు వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటలకే వైద్యులతోపాటు సిబ్బంది రావాల్సి ఉండగా తీరిగ్గా 10 గంటల తరువాతే వస్తున్నారు.. వైద్యుల కోసం బాధితులు గంటల తరబడి నిరీక్షించడం కనిపించింది.. మరికొన్ని చోట్ల సిబ్బంది కొరత వేధిస్తోంది.. ఇక మందుల కొరత.. టెస్టులు సరేసరి.. 10.30 గంటల తర్వాతయాచారం: మండల కేంద్రంలోని సీహెచ్‌సీ కేంద్రానికి ఉదయం 10.30 గంటల తర్వాత ముగ్గురు వైద్యులు వచ్చారు. అప్పటికే రోగులు వచ్చి వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం వరకు 140 మంది వరకు కాళ్లు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు. వారికి పరీక్షలు నిర్వహించి కావాల్సిన మందులు ఇచ్చి పంపించారు. వైద్య పరీక్షలకు అనుగుణంగా మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యురాలు రాజ్యలక్ష్మి తెలిపారు. -
ఫార్మాసిటీనా.. ఫ్యూచర్ సిటీనా?
యాచారం: ఫార్మాసిటీనా.. ఫ్యూచర్ సిటీనా.. సర్కార్‌కు దేనిపైనా స్పష్టత లేదని, ఫార్మాసిటీని రద్దు చేసినట్లయితే సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ భూ బాధితుల సమస్యలపై మంగళవారం కుర్మిద్ద గ్రామంలో నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిటీ ఏర్పాటు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసిందన్నారు. రైతుల అంగీకారం లేకుండానే నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో 800 మందికి చెందిన 2,200 ఎకరాల పట్టా భూములను ఫార్మా కోసం తీసుకుంటున్నట్లు ప్రకటించి, రాత్రికి రాత్రే ధరణి పోర్టల్‌లో టీఎస్ఐఐసీ అని మార్చారని గుర్తుచేశారు. ఈ విషయమై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ధరణి పోర్టల్‌లో టీఎస్ఐఐసీ పేరు తీసేసి రైతుల పేర్లు నమోదు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు యంత్రాంగం స్పందించడం లేదని మండిపడ్డారు. ఫార్మా భూ బాధితుల విషయాన్ని అసెంబ్లీలో చర్చించి, న్యాయంచేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఇందుకోసం వారం రోజులు గడువు ఇస్తున్నామని, లేదంటే ఈనెల 20న ఫార్మా గ్రామాల నుంచి పాదయాత్ర ప్రారంభించి, 21న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. తర్వాత ఏం జరిగినా సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫార్మాసిటీకి భూములు తీసుకున్నందుకు గాను ఎకరాకు 121 గజాల ప్లాటు బదులు ఎకరాకు 500 గజాల ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాల భూములను సేకరించాలని చూస్తున్న సర్కార్.. వీటిని కోట్లాది రూపాయలకు బడా పారిశ్రామికవేత్తలకు అమ్ముకోవడం ఖాయమన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా.. ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా రైతులకేమీ ఉపయోగం ఉండదని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలేసి నివాళుర్పించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు రాంచందర్, పి.అంజయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.మధుసూదన్‌రెడ్డి, న్యాయవాది అరుణకుమార్, నాయకులు పెద్దయ్య, జగన్, బ్రహ్మయ్య, తావునాయక్, విప్లవ్‌కుమార్, ఆలంపల్లి జంగయ్య తదితరులు పాల్గొన్నారు. తుక్కుగూడ: దేశంలో ఆర్థిక లేని వ్యవస్థ కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆపార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం తుక్కుగూడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సెమినార్ నిర్వహించారు. అంతకు ముందు కార్మికులు, కర్షకులతో కలిసి ఔటర్ రింగు రోడ్డు హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుపేదల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందన్నారు. ఇదే సమయంలో కార్పొరేట్ శక్తుల ఆదాయం వంద రెట్లు పెరిగిందని ఆరోపించారు. దేశంలో జీఎస్టీ వసూలు పేరుతో పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖనిజ సంపదను పూర్తిగా బడా కంపెనీలకు దోచి పెడుతున్నారన్నారు. మతతత్వ బీజేపీపై పోరాడేందుకే తాము కాంగ్రెస్ పార్టీతో జత కట్టామని స్పష్టంచేశారు. దేశంలోని నిరుపేదలు, కార్మికులు, కర్షకుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని వెల్లడించారు. ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులపై దాడులు, హత్యలు జరుగుతునయన్నారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకులు జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, నాయకులు పుస్తకాల నర్సింగ్‌రావు, పానుగంటి పర్వతాలు, యాదిరెడ్డి, దత్తునాయక్, నర్సింహ్మ, యాదయ్య, పార్టీ శ్రేణులు, కార్మికులు, పాల్గొన్నారు. అసమానతలు లేని ఆర్థిక వ్యవస్థ కావాలిసీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఏది ఏర్పాటు చేస్తారో స్పష్టత ఇవ్వాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
సింబయాసిస్‌లో విద్యార్థి మృతి
నందిగామ: అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని మోదళ్ల గూడ శివారు సింబయాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ గోపాల కృష్ణ కథనం ప్రకారం వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్, సంఘంనగర్కు చెందిన శాగనిక్బాసు (21) యూనివర్సిటీ హాస్టల్లో ఉంటూ బీఏ ఎల్ఎల్బీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటల ప్రాంతంలో తన గదిలోని బాత్రూంలోకి వెళ్లి, చాలా సేపైనా బయటకు రాలేదు. దీంతో స్నేహితులు రోహిత్, హర్షిత్ పాండేలు బాత్రూం వెంటిలేటర్ నుంచి చూడగా అపస్మారక స్థితిలో కిందపడిపోయి ఉన్నాడు. దీంతో తలుపును బద్ధలు కొట్టి అతన్ని క్యాంపస్‌లో వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాసు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి పార్థబాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్థానికుల ఆందోళన.. విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థాని కులు మంగళవారం వర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులను యాజమాన్యం పట్టించుకోకపోవడంతో మత్తు పదార్థాలు తీసుకుని బయటకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి మృతిపై అనుమానాలున్నాయన్నారు. ఈ విష యమై వర్సిటీ డైరెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడని ప్రాథమిక సమాచారం అందిందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి విషయాలు తెలుస్తాయని చెప్పారు. యూనివర్సిటీ ఎదుట స్థానికుల ఆందోళన యాజమాన్యం విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఆరోపణ -
సిబ్బంది కొరతతో ఇబ్బంది
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి ప్రాథథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్ సెలవుపై వెళ్లగా ఇన్చార్జి డాక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆస్పత్రిలో సీహెచ్‌ఓతో పాటు ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే విధుల్లో ఉన్నారు. ఒంటి నొప్పులు, బలహీనత, సాధారణ జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. తీవ్ర జ్వరంతో బాధపడే రోగులకు రక్త పరీక్షల కోసం రక్తాన్ని సేకరించి టీహబ్‌కు పంపిస్తున్నారు. రిపోర్టుల కోసం మరుసటి రోజు వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఒక్కరే వైద్యులు ఉండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. -
గ్రూప్ ఫలితాల విడుదల సరికాదు
షాద్‌నగర్: ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు గ్రూప్ పరీక్షల ఫలితాలను నిలుపుదల చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలో నిరాహార దీక్ష చేపట్టారు. రెండో రోజు మంగళవారం దీక్షా శిబిరానికి విచ్చేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండానే ప్రభుత్వం గ్రూప్ ఫలితాలను విడుదల చేయడం సరికాదన్నారు. లోపాలను సవరించకుండా ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం తగదన్నారు. దీంతో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రావణ్, నాగభూషణ్, సురేష్, పాండు, మహేందర్, సుదర్శన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ -
మైసమ్మ సన్నిధిలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు కడ్తాల్ మండల కేంద్రంలో హుస్సేన్‌నాయక్‌కు బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు దోనాదుల మహేశ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో లయన్స్‌క్లబ్ ఆఫ్ ఆమనగల్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాగి అంబలి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కల్యాన్నాయక్, జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు సాయిలాల్‌నాయక్, జిల్లా నాయకులు రాందాస్‌నాయక్, భగీరథ్, శ్రీశైలంగౌడ్, కుమార్, మునేశ్, రెడ్యానాయక్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి ఆమనగల్లు: పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని శంషాబాద్ డీసీపీ రాజేశ్ సూచించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మసలుకోవాలని అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని పోలీసుస్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను, పోలీసుస్టేషన్లో కేసుల రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆమనగల్లు సీఐ ప్రమోద్‌కుమార్, ఎస్ఐలు వెంకటేశ్, సీతారాంరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బాటసింగారంలో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయండి అబ్దుల్లాపూర్ మెట్: మామిడి సీజన్ దృష్ట్యా బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు మంగళవారం రాచకొండ సీపీ జి. సుధీర్‌బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. మామిడి సీజన్ కావడంతో దిగుమతులు భారీగా ఉంటాయని, క్రయ విక్రయాలు, నగదు లావాదేవీలు అధికంగా జరుగుతాయని తెలిపారు. మార్కెట్లో చోరీలు జరిగే ఆస్కారం ఉందన్నారు. అంతే కాకుండా కొంత మంది బ్రోకర్లతో కుమ్మకై మార్కెట్ బయట వ్యాపారం చేస్తూ పండ్లు అక్రమంగా అమ్ముతున్నారని, మార్కెట్ ఆదాయానికి గండి పడుతోందని అన్నారు. ఇలాంటి వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరచారి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్.శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు వన్యాల జైపాల్ రెడ్డి, మెగావత్ గణేశ్ నాయక్, రఘుపతిరెడ్డి, దోమలపల్లి, అంజయ్య, వెంకటేశ్వర్లు, గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
సొంతూరికి వెళ్లొచ్చే సరికే..
అబ్దుల్లాపూర్‌మెట్: ఇంటి తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు, నగదును అపహరించుకుపోయిన సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అంజిరెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని కవాడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉదయ్ గార్డెన్ కాలనీలో నీరుడు సతీష్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నాడు. ఆయన సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరులో జరిగే జాతరకు వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోపలి ప్రవేశించినట్లు గుర్తించాడు. బీరువాలో ఉన్న 4 తులాల బంగారం, 80 తులాల వెండి వస్తువులు, నగదు దొంగిలించినట్లు నిర్ధారించుకున్నాడు. దాదాపు రూ.6.5 లక్షల విలువగల సొత్తును తస్కరించారని సతీష్ విలపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి తాళాలు పగులుగొట్టి బంగారం, వెండి ఆభరణాల చోరీ -
పాత్రికేయులు క్రమశిక్షణతో మెలగాలి
శంకర్పల్లి: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు సైతం క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉందని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ఐజేయూ ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం శంకర్పల్లి మండలం ప్రొద్దటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో టీయూడబ్ల్యూజే జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. ఈ జర్నలిస్ట్ యూనియన్ 1957లో ప్రారంభించారని, ప్రస్తుతం ఎన్ని కొత్త యూనియన్లు వచ్చినా.. పద్ధతి ప్రకారం నడిచేది టీయూడబ్ల్యూజే మాత్రమేనని స్పష్టం చేశారు. నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కల్గిస్తోందని, యూనియన్ల ప్రతిష్టను దిగజార్చుతుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు హామీలు ఇవ్వడం తప్ప.. అమలు చేసింది లేదన్నారు. బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులతో తనకు అనుబంధముందని, ఇదే ధోరణిని మున్ముందు కొనసాగిస్తానని తెలిపారు. అనంతరం వివిధ ప్రతికల్లో 25 ఏళ్లకు పైగా సేవలందించిన పాత్రికేయులందరికీ టీయూడబ్ల్యూజే తరఫున సన్మానించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు సలీం పాషా తదితరులు పాల్గొన్నారు. ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ టీయూడబ్ల్యూజే జిల్లా ద్వితీయ మహాసభలు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా సలీం పాషా టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా శంకర్పల్లి పట్టణానికి చెందిన ఎండీ.సలీం పాషా, ప్రధాన కార్యదర్శిగా మేకల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ద్వితీయ మహాసభల్లో ప్రకటించారు. జర్నలిస్టు నాయకులు సలీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది వరకు అధ్యక్షుడిగా పని చేసిన శ్రీకాంత్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. -
గుడిలో చోరీ..12 గంటల్లో దొంగల పట్టివేత
జీడిమెట్ల: గుడిలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను జీడిమెట్ల పోలీసులు 12 గంటల వ్యవధిలో పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జీడిమెట్ల పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ కె.సురేష్‌కుమార్, ఏసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ మల్లేష్, డీఐ కనకయ్యలతో కలిసి వివరాలను వెల్లడించారు. లంగర్‌హౌజ్, టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఇద్దరు దొంగలు సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గాంధీనగర్‌లోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలోకి ప్రవేశించి..గర్భగుడి తలుపులు తెరిచి పంచలోహ విగ్రహాలు, ఇతర పూజా వస్తువులు ఎత్తుకెళ్లారు. ఉదయం గుడికి వెళ్లిన ఆలయ అధ్యక్షుడు కోనేటి వీరవెంకట సత్యనారాయణ దొంగతనం విషయాన్ని తెలుసుకుని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడిన దృశ్యాలను గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా విడిపోయి...సీసీ కెమరాల పరిశీలనతో పాటు టెక్నికల్‌గా విచారణ జరిపి సాయంత్రం 7 గంటల వరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించి ఇద్దరిని రిమాండుకు తరలించారు. వారి నుండి రూ.95 వేలు విలువచేసే పంచలోహ విగ్రహాలు, వస్తువులు, రాగి సామాన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా గుడిలో చోరీ విషయం తెలిసి స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారికి నచ్చచెప్పి శాంతింపజేశారు. కాగా మంగళవారం ఉదయం గాంధీనగర్‌లో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. హిందూవాహిని ఆధ్వర్యంలో ప్రజలు పెద్దఎత్తున గాంధీనగర్ చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు వెంట వెంటనే అందోళన చేపట్టిన వారిని జీడిమెట్ల స్టేషన్‌కు తరలించి కొంతమందిని ఇళ్లవద్దనే హౌజ్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఉరుకులు పరుగులు పెట్టడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు. -
గ్రూప్ ఫలితాల విడుదల సరికాదు
షాద్‌నగర్: ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు గ్రూప్ పరీక్షల ఫలితాలను నిలుపుదల చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలో నిరాహార దీక్ష చేపట్టారు. రెండో రోజు మంగళవారం దీక్షా శిబిరానికి విచ్చేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండానే ప్రభుత్వం గ్రూప్ ఫలితాలను విడుదల చేయడం సరికాదన్నారు. లోపాలను సవరించకుండా ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం తగదన్నారు. దీంతో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రావణ్, నాగభూషణ్, సురేష్, పాండు, మహేందర్, సుదర్శన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ -
మూసీ!
మల్లన్న సాగర్ టు సాక్షి, సిటీబ్యూరో: మూసీ పునరుజ్జీవానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. కంపుకొట్టే మూసీ నదిని సుందరీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కార్యాచరణ వేగవంతం చేశారు. మూసీ ఆక్రమణలతో పాటు నది శుద్ధి కోసం కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 5 టీఎంసీల నీటిని మూసీ నది శుద్ధి కోసం..15 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని సీఎం నిర్ణయించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ నుంచి ప్రత్యేక పైప్లైన్ల ద్వా రా నీటిని మళ్లించేలా పనులు చేపట్టనున్నారు. గోదావరి నుంచి 5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవం కోసం హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు మళ్లించి, శుద్ధి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గోదావరి–మూసీ అనుంధానం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. రూ.14,100 కోట్ల ఆర్థిక సాయం.. ఒకప్పుడు భాగ్యనగర వాసుల తాగునీటి అవసరాలను తీర్చిన మూసీ నది..కాలక్రమంలో గృహ, పారిశ్రామిక వ్యర్థాల పారబోతతో కలుషితమైపోయింది. మూసీ పునరుజ్జీవం చేపట్టాలంటే ముందుగా నది పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించడంతో పాటు నదిలో పారబోస్తున్న కలుషితాలను అడ్డుకోవడం ప్రధాన లక్ష్యం. ఇప్పటికే తొలగించాల్సిన ఆక్రమణలను మూసీ రిఫర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) అధికారులు గుర్తించారు. త్వరలోనే వాటిని తొలగించి, బాధితులకు పునరావాసం కల్పించనున్నారు. ఈమేరకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం రూ.14,100 కోట్ల ఆర్ధిక సాయాన్ని కోరుతూ రాష్ట్ర సర్కారు కేంద్రానికి లేఖ రాసింది. గోదావరి నుంచి 20 టీఎంసీల నీళ్లు తరలింపు ఇందులో 5 టీఎంసీల నీటితో మూసీ శుద్ధి నదిపై 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణం గాంధీ సరోవర్ లాగే బాపూఘాట్ అభివృద్ధి కేంద్రాన్ని రూ.14,100 కోట్ల ఆర్థిక సాయాన్ని కోరిన సర్కారు గాంధీ సరోవర్ లాగా.. కేదర్నాథ్లోని గాంధీ సరోవర్ లాగా బాపూఘాట్‌ను అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.5 కి.మీ., అలాగే హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 8.5 కి.మీ. మూసీ నదీ సుందరీకరణకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఆయా మార్గంలో రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు. అలాగే మూసీ నదిపై 11 చోట్ల హెరిటేజ్ బ్రిడ్జ్‌లను నిర్మించనున్నారు. రూ.1,000 కోట్ల నిర్మాణ వ్యయాన్ని అంచనా వేశారు. ఇప్పటికే బాపూ ఘాట్ వద్ద మూసీ పునరుజ్జీవం పనులకు డీపీఆర్ రూపొందగా.. ఆమోదం కోసం కేంద్రానికి రాష్ట్ర పభుత్వం పంపించింది. ఈ ఏడాది బాపూఘాట్ వద్ద 90 శాతం పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
గ్రూప్స్‌లో సత్తాచాటిన వినయ్, చంద్రకాంత్
చేవెళ్ల: స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న వినయ్‌కుమార్ గ్రూప్– 1లో 483వ ర్యాంకు, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్రకాంత్ గ్రూప్– 2లో 27వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రకళ, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు వారిని శాలువాలతో సన్మానించారు. చంద్రకాంత్ తీన్మార్.. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనంగా మారిన ప్రస్తుత సమయంలో చంద్రకాంత్ వరుసగా మూడోసారి సర్కారు కొలువును చేజిక్కించుకున్నాడు. శంకర్పల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఒగ్గు విఠలయ్య, వినోద దంపతుల రెండు కుమారుడైన ఈయన పీజీ పూర్తి చేసి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 3వ ర్యాంకు, గ్రూప్– 4లో 27వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా గ్రూప్– 2 ఫలితాల్లోనూ 27వ ర్యాంకుతో ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తన తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పట్టుదలతో బాగా చదివానని చంద్రకాంత్ తెలిపారు. -
ఆ లింక్‌లు ఓపెన్ చేయొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆఫర్ల పేరుతో ఆన్లైన్లో వచ్చే తెలియని లింక్‌లని ఓపెన్ చేసి మోసపోవద్దని భారతీయ రిజర్వు బ్యాంకు అధికారులు ఎ.సావిత్రి, ఎ.రెహమాన్ సూచించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని తులేకలాన్ గ్రామంలో డిజిటల్ లావాదేవిలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజర్వు బ్యాంకు అధికారులు హాజరై మాట్లాడుతూ.. అపరిచిత లింక్‌లు కలిగి ఉన్న ఎస్ఎంఎస్, ఈమెయిల్ని వెంటనే డిలిట్ చేయాలన్నారు. ఆర్థిక వివరాల ధ్రువీకరణ కోరే వెబ్‌సైట్‌ను నిర్ధారించుకోవాలన్నారు. వ్యక్తిగత వివరాలని లేదా బ్యాంకు సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని సూచించారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయడంతో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందన్నారు. డబ్బులు అడిగే అపరిచత వ్యక్తుల కాల్స్, ఈమెయిల్స్లకి సమాధానం ఇవ్వొద్దన్నారు. పెద్ద మొత్తంలో రాబడుల ఆశ చూపేవారి వెబ్‌సైట్స్ యాప్‌ల వివరాలని తనిఖీ చేసుకోవాలన్నారు. క్యూఆర్ కోడ్ ఉపయోగించి చెల్లింపులు చేసే సమయంలో స్క్రీన్‌పై పేరు సరి చూసుకోలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీనియర్ మేనేజర్(ఆపరేషన్స్) మురళికృష్ణ, అధికారులు సుధాకర్, బాలవెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రిజర్వు బ్యాంకు అధికారులు సావిత్రి, రెహమాన్ తులేకలాన్‌లో డిజిటల్ చెల్లింపులపై అవగాహన సదస్సు -
బిల్డర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డ మహిళల అరెస్టు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–22లో నివసించే ప్రముఖ బిల్డర్, జీవీబీఆర్ నిర్మాణ రంగ సంస్థ ఎండీ జీవీ శేఖర్‌రెడ్డి ఇంట్లో భారీగా నగలు, నగదు చోరీ చేసిన ఘటనలో ఐదుగురు మహిళలను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..శేఖర్‌రెడ్డి ఇంట్లో గత రెండు సంవత్సరాల నుంచి హసీనా, వహీదా, అనూష అనే ముగ్గురు యువతులు పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం యజమాని బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ నుంచి రూ.7.50 లక్షల నగదు, రూ.28.50 లక్షల విలువ చేసే నగలు చోరీ చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి అనుమానితులు హసీనా, వహీదా, అనూషలను విచారించారు. వహీదా తాను చోరీ చేసిన ఆభరణాలను తన తల్లి సలీమాకు పంపించింది. అలాగే అనూష రూ.3 లక్షల నగదు తన తల్లి ఆదిలక్ష్మికి పంపించింది. డబ్బుపై ఆశతో హసీనా తనతో పాటు పనిచేస్తున్న వహీదా, అనూషలను రెచ్చగొట్టి ఈ దొంగతనానికి ఉసిగొల్పింది. ముగ్గురూ కలిసి యజమాని కళ్లుగప్పి చేతివాటం ప్రదర్శించారు. నగలు అమ్ముకుని, తలాకొంత పంచుకుని ఏదైనా వ్యాపారం చేస్తే మరింత మెరుగైన జీవితం గడపవచ్చని హసీనా ఈ ఇద్దరికి నూరిపోసింది. డబ్బులతో తమ బతుకులు మార్చుకుందామని, మరింత బాగా బతకవచ్చని భావించిన వహీదా, అనూషలు కూడా ఈ దొంగతనంలో పాలుపంచుకున్నారు. ఈ ఘటనలో హసీనా, వహీదా, అనూషలతో పాటు సలీమా, ఆదిలక్ష్మిలను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి మొత్తం నగలు, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లయిన ఏడు రోజులకే ప్రియుడితో వెళ్లిపోయిన నవవధువు!
మణికొండ, హైదరాబాద్: వివాహం అయిన ఏడు రోజులకే ఓ నవవధువు మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన ఉదంతం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాలీమందిర్ వద్ద మూడు రోజుల క్రితం జరిగింది. అతని చర్యను తను నివసిస్తున్న బస్తీవాసులే వ్యతిరేకించి, అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించిన సంఘటన సోమవారం లంగర్‌హౌస్‌లో కలకలం సృష్టించింది. వివరాలివీ... నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాలీ మందిర్ వద్ద నివసిస్తున్న ఓ యువతి గతంలో లంగర్‌హౌస్‌లో నివసించే అరవింద్ అనే యువకుడిని ప్రేమించింది. తల్లితండ్రులు ఏడు రోజుల క్రితం ఆమెకు అత్తాపూర్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం చేశారు. ప్రియుడితో కొనసాగిన ప్రేమాయణంతో ఆమె మూడు రోజుల క్రితం అతని వెంట వెళ్లిపోయింది. దాంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో తమ కూతురు కనిపించటం లేదని ఫిర్యాదు చేశారు. అది విచారణ కొనసాగుతున్న క్రమంలోనే సోమవారం విషయం లంగర్‌హౌస్‌లోని అతని బస్తీలో తెలిసింది. దాంతో స్థానికులు అతను చేసిన చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. బస్తీలో అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.Hyderabad: కేంద్రంగానే ఉగ్ర చరిత్ర! -
ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలి
షాద్‌నగర్: ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యేంత వరకు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఈ పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. వర్గీకరణకు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మాజీ జస్టిస్ షమీం అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీగా వర్గీకరించడం జరిగిందని అన్నారు. ఇందులో కొన్ని లోపాలున్నాయని, సవరించాలని కోరగా మార్చి 10 వరకు గడువు ఇచ్చినట్టు చెప్పారు. లోపాల సవరణ పూర్తి కాకుండానే ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసిందని పేర్కొన్నారు. దీంతో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు భూషణ్, బొబ్బిలి పాండు, చెన్నగళ్ల శ్రావణ్, శ్రీనివాస్, జాంగారి జంగయ్య, సురేష్, శ్రీను, దశరథ్, ప్రేమ్‌కుమార్, కర్రోళ్ల శివకుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
● కాంగ్రెస్ ఆదివాసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్ షాద్‌నగర్: విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. షాద్‌నగర్ పరిఽధిలోని కొందుర్గులో నిర్మించే సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అప్పుల పాలు చేసినా సీఎం రేవంత్‌రెడ్డి ఒడిదొడుకులు ఎదుర్కొంటూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, నాయకులు ఇబ్రహీం,బస్వం, వెంకట్‌రెడ్డి,హైదర్గోరి,నర్సింలుతదితరులు పాల్గొన్నారు. -
పిల్లల పెంపకంలో వివక్ష వద్దు
ఉస్మానియా యూనివర్సిటీ: ఆడ, మగ తేడా లేకుండా పిల్లలను సమానంగా పెంచాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం జన విజ్ఞాన వేదిక, ఆంధ్రమహిళ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలబాలికలకు చిన్న వయస్సు నుంచే సమాన అవకాశాలు కల్పిస్తే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం నేను ఆడపిల్లను –అందుకే తప్పక చదవాలి అనే శీర్షికతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందిచిన పోస్టర్‌ను సీతక్క ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డా.కరుణాదేవి, జనవిజ్ఞాన వేదిక నాయకులు రాజా, బీఎన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా.వసుంధర రచయిత్రి జూపాక సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
రికవరీ ఫోన్ల అప్పగింత
ధారూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాలు, తండాల్లో పోగొట్టుకున్న సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బాధితులకు తొమ్మిది సెల్ఫోన్లను అప్పగించినట్లు ఎస్ఐ అనిత తెలిపారు. నాలుగు టిప్పర్లు, జేసీబీ సీజ్ కడ్తాల్: నిబంధనలకు విరుద్ధంగా మట్టితరలిస్తుండగా పోలీసులు దాడులు చేపట్టి వాహనాలను సీజ్ చేశారు. ఎస్ఐ వరప్రసాద్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలోని సర్వేనంబర్ 321/1లో ఉన్న ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేసి నాలుగు టిప్పర్లు, ఓ జేసీబీని స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు జేసీబీ, టిప్పర్ డ్రైవర్లతో పాటు ఆయా వాహనాల యజమానులు మునావత్ శ్రీను(గానుగుమార్లతండా), నేనావత్ శ్రీను(పుల్లేరుబోడ్ తండా)పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. కారు, ఆటో ఢీ.. ముగ్గురికి గాయాలు ఇబ్రహీంపట్నం: ఓ కారు, గూడ్స్ ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ నాగరాజు తెలిపిన ప్రకారం.. నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిలో గురునానక్ విద్యాసంస్థల సమీపంలో ఎదురెదురుగా ప్రయాణిస్తున్న ఓ ఆల్టోకారు, టాటాఏస్ గూడ్స్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ఉన్న ఇద్దరు, ఆల్టోకారులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ మహేశ్వర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. వరద కాల్వను పూడుస్తున్న వారిపై చర్యలు తీసుకోండి మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని సురంగల్ పెద్ద చెరువులోకి వచ్చే వరద కాల్వను పూడుస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని సురంగల్‌కు చెందిన గడ్డం వెంకట్‌రెడ్డి తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సురంగల్‌లోని పెద్ద చెరువులోకి కనకమామిడి వైపు నుంచి వరదకాల్వ వస్తుందని.. నజీబ్‌నగర్ రెవెన్యూలోని సర్వే నెంబర్ 73, 74 వద్ద న్యాయవాది వలీ వరదకాల్వను పూర్తిగా పూడ్చివేసి తన పొలంలో కలుపుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకుని కాలువ పూడ్చివేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. కుక్కల దాడిలో జింక మృతి అనంతగిరి: వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరి అడవుల్లో సోమవారం వీధి కుక్కల దాడిలో ఓ జింక(దుప్పి) మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. ఉదయం అడవిలో సంచరిస్తున్న జింక(దుప్పి)పై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. గమనించిన పలువురు వాటిని చెదరగొట్టారు. అనంతరం అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. వారు వచ్చేలోపు జింకమృతి చెందింది. -
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి సంగీత మాట్లాడుతూ.. ప్రజావాణి సమస్యలపై నిర్లక్ష్యం తగదని అన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వారం 62 అర్జీలు అందాయని చెప్పారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 29, ఇతర శాఖలకు సంబంధించి 33 ఉన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, మండల తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్పై రాయితీని సద్వినియోగం చేసుకోండి హుడాకాంప్లెక్స్: ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. సరూర్‌నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ ప్లాట్ రిజిస్ట్రేషన్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఎల్ఆర్ఎస్ ఫీజును చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకుంటే భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతులు సులభంగా వస్తాయని తెలిపారు. దళారులను ఆశ్రయించాల్సిన అవవసరం ఉండదన్నారు. డబ్బికార్ శ్రీనివాస్‌కు అవార్డు ఇబ్రహీంపట్నం: తెలంగాణ ఉద్యమంలో చురుకై న పాత్ర పోషించడమేగాక ఆధ్యాత్మికత, సామాజిక సేవ, విద్యా, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఇబ్రహీంపట్నంకు చెందిన ఆరెకటిక సంఘం జాతీయ నాయకుడు డబ్బికార్ శ్రీనివాస్ చేస్తున్న కృషిని గుర్తించి విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంగారు నంది అవార్డును ప్రదానం చేశారు. నగరంలోని రవీంద్ర భారతిలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, ఫౌండేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా నంది అవార్డును డబ్బికార్ శ్రీనివాస్ అందుకున్నారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని శ్రీనివాస్ తెలిపారు. శిక్షలో శిక్షణలు.. ఉపాధికి బాటలు చంచల్‌గూడ: జైలు శిక్షలో భాగంగా వివిధ అంశాల్లో పొందిన శిక్షణ ఉపాధికి బాటలు వేస్తుందని ఉపాధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్ అన్నారు. చంచల్‌గూడ మహిళా జైలులో ఖైదీలకు స్వయం ఉపాధి పథకం కింద ప్రవేశపెట్టిన టైలరింగ్ కోర్సును సోమ వారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కోర్సు వృత్తి నైపుణ్యం, ఆర్థిక స్వాతంత్య్రం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. జైళ్లను పునరావాస ప్రదేశాలుగా మారుస్తున్నాయన్నారు. సంకల్ప పథకం కింద నాక్ సంస్థల సహకారంతో ఈ కోర్సును అందిస్తున్నట్లు తెలిపారు. -
అంగన్వాడీ టీచర్ మృతి
కేశంపేట: అనారోగ్యంతో ఓ అంగన్వాడీ టీచర్ మృతి చెందింది. ఈ ఘటన అల్వాల అనుబంధ గ్రామం తులవానిగడ్డలో సోమవారం చోటు చేసుకుంది. ఆమె మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎంపీపీ ఎల్గమోని రవీందర్‌యాదవ్, ఐసీడీఎస్ సీడీపీఓ షబనాహుస్సేన్, ఐసీడీఎస్ మాజీ సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్లు విజయలక్ష్మి, శమంతకమణి , పలువురు అంగన్వాడీ టీచర్లు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం అంత్యక్రియలకు ప్రభుత్వం అందించే ఆర్థికసాయం చెక్కును మృతురాలి కుటుంబ సభ్యులకు సీడీపీఓ అందజేశారు. -
మందుబాబులు... మహా ముదుర్లు!
డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు తప్పించుకునే ప్రయత్నాలు● పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు ● ప్రత్యేకంగా కొన్ని వాట్సాప్ గ్రూపులు సైతం ఏర్పాటు ● ప్రాంతాల వారీగా తనిఖీ చేస్తున్న ఏరియాలు గుర్తింపు ● వాటిని లోకేషన్స్‌తో సహా గ్రూపుల్లో పోస్టు చేస్తున్న వైనంసాక్షి, సిటీబ్యూరో: ‘శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు‘ అన్న నానుడిని నగరంలోని మందుబాబులు బాగా ఒంట పట్టించుకున్నట్లున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్ చెప్పడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. వీరికి చిక్కకుండా తప్పించుకోవడానికి ‘నిషా’చరులు అనేక మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవడం ఇటీవల పెరిగిందని పోలీసులు గుర్తించారు. దీనికి చెక్ చెప్పడానికి అవసరమైన మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. 13 ఏళ్ల నుంచి కఠినంగా.. రోడ్డు ప్రమాదాలను సీరియస్‌గా తీసుకున్న ఐక్యరాజ్య సమితిలోని అంతర్భాగమైన డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ రోడ్ సేఫ్టీ పార్ట్నర్ షిప్ (జీఆర్ఎస్పీ) పేరిట అధ్యయనం చేపట్టింది. బ్లూమ్ బర్గ్ యూనివర్సిటీ, జాన్ హాకింగ్ వర్సిటీలతో కలిసి అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న 10 దేశాలను గుర్తిచడంతో పాటు వాటి నివారణకు ఆర్ఎస్–10 పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. ఆయా దేశాల్లో కొన్ని నగరాలను ఎంపిక చేసుకుని ప్రమాదాల నివారణకు అసరమైన ఉపకరణాలు అందించడంతో పాటు సిబ్బందికి కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలు ఇచ్చింది. భారత్ నుంచి హైదరాబాద్‌తో పాటు జలంధర్ ఎంపికయ్యాయి. దీంతో 2011 నవంబర్‌లో సిటీ పోలీసులకు బ్రీత్ అనలైజర్లు 10, డిజిటల్ కెమెరాలు 220, బారికేడ్లు 250, రిఫ్లెక్టివ్ జాకెట్లు 550, ఎల్ఈడీ బేటన్స్ 450 అందాయి. అప్పటి నుంచి డ్రంక్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్స్ మొదలు కావడంతో పాటు ‘నిషా’చరుల్ని కోర్టుకు తరలించడం సాధ్యమైంది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు పడటం మొదలైంది. ‘బ్యాక్’తో మొదలై వాట్సాప్ వరకు.. ఈ స్పెషల్ డ్రైవ్స్‌లో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు‘నిషా’చరులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తొలినాళ్లల్లో ఈ మందుబాబులు రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు ముందు తనిఖీలను గుర్తిస్తే వెంటనే తమ వాహనాన్ని వెనక్కు తిప్పుకుని రాంగ్ రూట్లో, లేదా పక్కన ఉన్న సందుల్లోకి జారుకునేవారు. దీనికి చెక్ చెప్పేందుకు ట్రాఫిక్ పోలీసులు ‘ఫీల్డింగ్ టీమ్స్’ ఏర్పాటు చేశారు. వీరు డ్రైవ్ జరుగుతున్న ప్రాంతానికి కాస్తా ముందు నుంచి కాపుకాసి ఇలా ఉడాయించే వారిని పట్టుకోవడం మొదలెట్టారు. దీంతో మందుబాబులు ఏరియాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ వాటిలో తమతమ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఈ డ్రైవ్స్ జరుగుతున్నాయో పోస్టు చేస్తున్నారు. కొందరు గ్రూపు సభ్యులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో దాదాపు అన్ని ఏరియాల సమాచారం ఆ గ్రూపుల్లోకి వచ్చి, మద్యం తాగి ఉన్న వాళ్లు పోలీసులకు చిక్కకుండా జారుకుంటున్నారు. చెక్ చెప్పేందుకు మార్గాల అన్వేషణ ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ డ్రంక్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకోవడానికి చేస్తున్న స్పెషల్ డ్రైవ్స్ సందర్భంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనచోదకులతో పాటు పోలీసులకు ఎలాంటి ముప్పు ఉండకూడదనే ఉద్దేశంతో రహదారి స్థితిగతులు తదితరాలను పరిశీలించి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏరియాలు ఒక్కో ట్రాఫిక్ ఠాణాలో గరిష్టంగా ఐదే ఉంటున్నాయి. మరోపక్క ఈ డ్రైవ్స్ చేపట్టడానికి బారికేడ్లు, టోవింగ్ వాహనం సహా మరికొన్ని సదుపాయాలు అనివార్యం. దీంతో పోలీసులు ఆకస్మికంగా వేర్వేరు ప్రాంతాల్లో ఈ డ్రైవ్స్ చేపట్టడం సాధ్యం కావట్లేదు. ఇవన్నీ మందుబాబులకు కలిసి వస్తున్నట్లు ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. పోలీసులతో పాటు మద్యం మత్తులో వాహనం నడిపే వారికీ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ‘నిషా’చరులు ఇలాంటి పై ఎత్తులు వేయడం వల్ల స్పెషల్ డ్రైవ్స్ స్ఫూర్తి దెబ్బతింటోందని చెబుతున్న పోలీసులు వీరిని కట్టడి చేయడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
షాద్‌నగర్ రూరల్: పట్టణ శివారు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో సోమవారం పట్టణంలోని తిరుమల మెగా టౌన్షిప్ కాలనీలో రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన ప్రకారం.. తిరుమల మెగాటౌన్‌షిప్ కాలనీలో నివాసముండే రాజేష్, ఝాన్సీ దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు, కనకయ్య దంపతులు ప్రైవేటు ఉద్యోగస్తులు. ఉదయం వారు ఇళ్లకు తాళం వేసి తమతమ విధులకు వెళ్లిపోయారు. గమనించిన దుండగులు రాజేశ్ ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని వస్తువులు చిందరవందర చేశాడు. ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న కనకయ్య ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నింగా శబ్ధంరావడంతో చుట్టుపక్కల ఇళ్లవారు అక్కడకు వెళ్లే వరకే దుండగుడు పరారయ్యాడు. విధుల నుంచి వచ్చిన రాజేశ్ దంపతులు తాళం పగులగొట్టి ఉండడంతో డయల్ 100 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని సీసీ పుటేజీలు పరిశీలించారు. రాజేశ్, కనకయ్య ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడు ఒకడే అని గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది. రెండు ఇళ్లలో చోరీకి విఫలయత్నం -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
ఇబ్రహీంపట్నం రూరల్: శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించుకుని బ్యాంకు లావాదేవీలను కొనసాగించాలని రిజర్వ్ బ్యాంకు అధికారి రెహమాన్ అన్నారు. మార్చి 10 నుంచి 16 వరకు డిజిటల్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని ఎల్మినేడు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పేమెంట్స్‌పై అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రిజ ర్వు బ్యాంకు అధికారులు ఎ.సావిత్రి, ఎ.రెహమాన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీని సురక్షితంగా వినియోగించుకోవాలని సూచించారు. థర్డ్ పార్టీ యాప్‌ల జోలికి పోకుండా నేరుగా బ్యాంకులు సూ చించిన యాప్‌ల సహకారంతోనే లావాదేవిలు కొనసాగించాలని చెప్పారు. ఆర్థిక అక్షరాస్యతపై అందరికి అవగహన అవసరమన్నారు. నగదు రహిత లావాదేవిలు చేసే సమయంలో సైబర్ మోసాల బారీన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు డిజిటల్ పేమెంట్స్‌పై ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీనియర్ బిజినెస్ మేనేజర్ ఎం.మురళీకృష్ణ, కె.సుధాకర్, బ్యాంక్ మేనేజర్ శిరీష్‌చంద్ర, ఎస్.నవీన్‌కుమార్, అనిత, విద్యార్థులు పాల్గొన్నారు. డిజిటల్ లావాదేవీలే సురక్షితం రిజర్వ్ బ్యాంకు అధికారి రెహమాన్ -
రోడ్డు మంజూరుకు నిధులు కేటాయించండి
కేశంపేట: మహేశ్వరం మండల పరిధిలోని పెద్ద గోల్కండ (ఓఆర్ఆర్ ఎగ్జిట్) నుంచి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ వరకు డబుల్ బీటీ రోడ్డు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. పెద్దగోల్కొండ నుంచి కల్వకోలు వరకు రోడ్డు నిర్మాణం పూర్తయిందని, దానికి అనుసంధానంగా కల్వకోలు నుంచి మిడ్జిల్ వరకు డబుల్ బీటీ రోడ్డును నిర్మించాలని కోరారు. ఈ రోడ్డు నిర్మాణంపూర్తయితే శ్రీశైలం, బెంగుళూరు హైవేలకు సమాంతరంగా ప్రత్యామ్నాయ రోడ్డు అవుతుందన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 130 కిలో మీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుందని ఆయన కేంద్రమంత్రికి వివరించారు. రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఇందుకు స్పందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు నర్సింహారెడ్డి తెలిపారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడుబొక్క నర్సింహారెడ్డి -
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
చేవెళ్ల: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం వారు చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సమీర్, చరణ్‌గౌడ్, చందు, చారి, వినీత్, ఆదిత్య, విష్ణుగుప్తా, ఇర్ఫాన్, వివేకానంద, శశి, ఆకాశ్, షోఫాయాన్, విష్ణు, శివ, నవీన్, కార్తీక్, మైపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ -
రికవరీ.. ఏమైందో మరి!
ఫార్మాసిటీలో బినామీల పేరుతో ప్రజాధనం లూటీ ● ఇప్పటికే నకిలీలను తేల్చిన అధికారులు ● రికవరీతోపాటు చర్యలు తేసుకోవడంలో సర్కార్ తాత్సారం ● అక్రమార్కులను కాపాడుతున్నదెవరు? యాచారం: ఫార్మాసిటీలో బినామీల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిన ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లూటీ చేసిన రూ.కోట్లాది ప్రజాధనాన్ని రికవరీ చేసే విషయంలో ఫైలును ముందుకు కదలనీయకుండా సర్కార్‌లోని పెద్దలు కొందరు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీకి 19,333 ఎకరాలను సేకరించడానికి నిర్ణయించడం తెలిసిందే. అందులో భాగంగా యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పది వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములను సేకరించడానికి నిర్ణయించగా 7,640 ఎకరాలు సేకరించి రైతులకు పరిహారం అందజేశారు. మొదట్లో జరిగిన భూసేకరణలో అసైన్డ్ పట్టా భూముల్లో సాగు (పట్టాదారు, పాసుపుస్తకాల్లో 5 ఎకరాలుంటే గుట్టలు, రాళ్లు, రప్పలు తీసేసి) యోగ్యమైన భూములకే పరిహారం ఇచ్చారు. తర్వాత అధికారులతో కుమ్మకై ్కన కొందరు నకిలీలు, బినామీల పేర్లతో గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములపై పరిహారం పొందారు. గ్రామాలకు సంబంధం లేనివారు సైతం.. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాటం చేస్తున్న వారిలో అత్యధికులు బినామీల పేర్లతో పరిహారం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సర్కార్‌లోని ఓ కీలక నేత ఫిర్యాదుతో ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీలు, బినామీల జాబితాను ప్రభుత్వం తెప్పించుకుంది. 2020 నుంచి 2023 వరకు నకిలీలు, బినామీలకు ఫార్మా పరిహారం పేరుతో రూ.కోట్లాది నిధులు మంజూరైనట్లు అధికారులు గుర్తించారు. 250 మందికిపైగా రూ.500 కోట్ల వరకు పరిహారం పొందారని తేల్చారు. పరిహారం పొందిన వారిలో స్థానికులే కాకుండా నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలతో పాటు ఈ గ్రామాలకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు సైతం ఉన్నట్లు తేలింది. నకిలీలు, బినామీల పేర్లతో పరిహారం పొందిన వారే ఇప్పుడు మళ్లీ ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నట్లు జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నకిలీలు, బినామీల లిస్టు ఫైనల్ చేసిన అధికారులు నోటీసులు ఇచ్చి, రికవరీ చేసేలా ఫైలు కదిపినా ఏమైందో కానీ దాన్ని కప్పిపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నోటీసులిస్తే తమ బండారం బయటపడుతుందనే భయంతో ఉన్నతాధికారులు జిల్లా అధికారులను వారిస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫార్మా ప్లాట్ల లాటరీ అందుకే ఆలస్యం..ఫార్మాసిటీ నకిలీలు, బినామీలు రూ.కోట్లాది పరిహారంతో పాటు మీరాఖాన్‌పేటలోని టీజీఐఐసీ మెగా వెంచర్లో ప్లాట్ల సర్టిఫికెట్లు సైతం పొందారు. దాదాపు 500 ఎకరాలకుపైగా పరిహారం పొందిన బినామీలు 121 గజాలు, 242 గజాల చొప్పున ప్లాట్ల సర్టిఫికెట్లు దక్కించుకున్నారు. ముందు జాగ్రత్తగా ప్లాట్లను అమ్మేసుకుంటున్నారు. 121 గజాల ప్లాటును రూ.8 లక్షలు, 242 గజాల ప్లాటును రూ.15 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. నెల క్రితమే లాటరీ ద్వారా ఫార్మా ప్లాట్లను రైతులకు రిజిస్ట్రేషన్లు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లాటరీ ద్వారా ఎంపిక చేసి కబ్జాలిస్తే భవిష్యత్తులో చిక్కులొస్తాయనే భయం వారిలో నెలకొంది. నకిలీల ఏరివేత, డబ్బుల రికవరీ తర్వాతే ఎంపిక ప్రక్రియ, రిజిస్ట్రేషన్లు చేసి కబ్జాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. -
జనం నెత్తిన కాలుష్య భూతం!
● సాయంత్రం సీజ్..ఉదయం కాంక్రీట్ తయారీ ● పీసీబీ ఆదేశాలను లెక్కచేయనిరెడీమిక్స్ ప్లాంట్లు ● శంషాబాద్, కొత్వాల్‌గూడ, నార్సింగి, కోకాపేట్లో ఇష్టారాజ్యం ● అనుమతుల్లేని ప్లాంట్లకు అడ్డగోలుగా విద్యుత్ కనెక్షన్లు ● తరచూ ఆందోళనకు దిగుతున్న స్థానికులు.. ● పట్టించుకోని అధికారులు సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగర శివారు ప్రాంతాలను రెడీమిక్స్ కాంక్రీట్ రూపంలో కాలుష్యభూతం పట్టి పీడిస్తోంది. ఇళ్ల పక్కనే ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంట్లు వెదజల్లుతున్న కాలుష్యం స్థానికుల పాలిట శాపంగా మారుతోంది. వాతావరణంలో చేరిన ధుమ్ము, ధూళీ కణాలు, ఘాటు వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆస్తమా బాధితులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రెడీమిక్స్ ప్లాంట్లను జనావాసాలకు దూరంగా తరలించాలని స్థానికులు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మున్సిపాలిటీలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నా బుట్టదాఖలవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థలు జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించి, వాటి మూసివేతకు ఆదేశాలు జారీ చేయించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. హిమాయత్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో వెలిసిన 21 రెడీమిక్స్ ప్లాంట్లను పీసీబీ అధికారులు ఇటీవల సీజ్ చేశారు. అయితే ఇలా సీజ్ చేసి... అధికారులు అలా ఇంటికి చేరుకునే లోపే మళ్లీ అవి తెరుచుకోవడం గమనార్హం. 111జీఓ పరిధిలోనూ ఆర్ఎంసీ ప్లాంట్లు సైబరాబాద్ పరిధిలోని నార్సింగి, మణికొండ, వట్టినాగులపల్లి, ఖానాపూర్, కోకాపేట్, శంషాబాద్, కొత్వాల్‌గూడలో, గండిపేట, హిమాయత్‌సాగర్ పరిసరాలతోపాటు రాచకొండ పొలీస్ కమిషనరేట్ పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటుగా ఉన్న తారామతిపేట్, పెద్ద అంబర్పేట్, కోహెడ,, ఆదిభట్ల, కొంగర, తుక్కుగూడలోనూ పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, గెటేడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. వీటికి సిమెంట్, కంకర, ఇసుక, స్టీలు పెద్ద మొత్తంలో అవసరమవుతోంది. నిజానికి ఏదైనా నిర్మాణ ప్రదేశంలో కానీ, ఇతర ప్రాంతంలో కానీ ఒక ఆర్ఎంసీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే ముందు పరిశ్రమల శాఖ అనుమతి పొందాలి. ఆ తర్వాత రెవెన్యూ శాఖ, మున్సిపాలిటీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించాలి. శంషాబాద్, కొత్వాల్‌గూడ, గండిపేట్, హిమాయత్‌సాగర్ పరిసరాలన్నీ 111 జీఓ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కానీ, పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయవద్దనే ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ పలు నిర్మాణసంస్థలు తమకున్న రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని ఆయా శాఖల నుంచి అనుమతులు పొందకుండానే ఇష్టారాజ్యంగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. అడిగినంత ముట్టజెప్పితే చాలు కరెంటోళ్లు కళ్లు మూసుకుని వాటికి కనెక్షన్లు ఇస్తున్నారు. వీటిని సాకుగా చూపించి... ఏదైనా బహుళ అంతస్థుల నిర్మాణాల ముడిసరుకును ఇతర ప్రాంతాల నుంచి లారీలు, టిప్పర్లలో తరలించాల్సి వస్తుంది. అధికలోడు వాహనాల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయి. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని సాకుగా చూపించి, నిర్మాణ సంస్థలు తమ స్థలంలోనే రెడీమిక్స్ పాంట్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. చాలా రెడీమిక్స్ వాహనాలు నిర్మాణ ప్రాంగణం దాటి బయటికి వచ్చి ఇతర ప్రాంతాల్లోని నిర్మాణాలకు ముడిసరుకును చేరవేస్తున్నాయి. ఈ సమయంలో రోడ్లపై కంకర, సిమెంట్ జారిపడుతున్నాయి. దీంతో ఇతర వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మచ్చుకు కొన్ని ప్లాంట్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి కొంగర కలెక్టరేట్ మార్గమధ్యలో ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంట్‌కు వచ్చి వెళ్లే వాహనాల నుంచి కాంక్రీక్ రోడ్డుపై పడుతోంది. నిత్యం ఇదే రోడ్డు నుంచి జిల్లా ఉన్నతాధికారులంతా రాకపోకలు సాగిస్తుంటారు. అయినా పట్టించుకోకపోవడం గమనార్హం. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ వెంట వెలసిన కాంకీట్ యూనిట్‌కు వచ్చి పోయే వాహనాలతో సర్వీసు రోడ్డు దెబ్బతింటోంది. ● మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మైహోం అవతార్, హాల్‌మార్క్ విసినియా అపార్ట్మెంట్ల మధ్య వెలసిన ఆర్ఎంసీ నుంచి వెలువడే కాలుష్యంతో వాతావరణం పూర్తిగా కాలుష్యమవుతోందని, అపార్ట్మెంట్ల పరిసరాలు ధుమ్ము, ధూళితో నిండిపోతున్నాయని, ప్రజారోగ్యానికి హానికరంగా మారిన ఈ ప్లాంట్‌ను తక్షణమే మూసివేయించాలని ఇటీవల స్థానికులు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. ● ఓఆర్ఆర్కు సమీపంలోని కోహెడ–బ్రాహ్మణపల్లి సరిహద్దులో ఏర్పాటు చేసిన రెడీమిక్స్ ప్లాంట్‌తో ఆ పరిసర ప్రాంతాలన్నీ దెబ్బతిన్నాయి. చుట్టు పక్కన ఉన్న పంటలు, ఖాళీ ప్లాట్ల నిండా సిమెంట్, డస్ట్ పేరుకుపోయాయి. తారమతిపేట, బాకారం, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లోనూ ఈ ప్లాంట్లతోపాటు క్రషర్ మిషన్లు భారీగాఏర్పాటయ్యాయి. -
పోలీస్ స్టేషన్లోనే రక్షణ కరువు.. గుట్టు చప్పుడు కాకుండా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ కరువైంది. స్టేషన్లోనే అందరూ చూస్తుండగానే గొంతు కోసిన వైనం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిస్సింగ్ కేస్ క్లోజింగ్ కోసం వెళ్లిన ప్రేమికులకు ప్రాణహాని జరిగింది.పోలీస్ స్టేషన్ రిసెప్షన్లోనే అమ్మాయి తరపు బంధువు.. యువకుడి గొంతు కోసేశాడు. దీంతో గొంతుకు నాలుగు కుట్లు పడ్డాయి. గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన పోలీసులు.. ఇంటికి పంపేశారు. పోలీస్ స్టేషన్లోనే తమకు రక్షణ లేకపోతే ఇంకా బయట మా పరిస్థితి ఎలా ఉంటుందంటూ ఆ ప్రేమ జంట వాపోతున్నారు. -
మహిళల్ని ఎదగనిద్దాం.. గౌరవిద్దాం
ఖైరతాబాద్: మహిళల్ని ఎదగనిద్దాం.. గౌరవిద్దాం.. ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరగనిద్దామని మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఉదయం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా ఉమెన్ సేఫ్టీ వింగ్, హైదరాబాద్ సిటీ పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌ను ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ‘మహిళలు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాన్నారు. మహిళల రక్షణకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. మత్తు నుంచి మన సమాజాన్ని కాపాడుకుని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకునేలా ముందడుగు వేయాలని సూచించారు. అనంతరం పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన 5కే రన్ సచివాలయం మీదుగా తిరిగి పీపుల్స్ ప్లాజా వరకు సాగింది. రన్లో పోలీసు ఉన్నతాధికారులు, హైదరాబాద్ సిటీ సెక్యురిటీ సర్వీసెస్, ఉమెన్‌సేఫ్టీ వింగ్ అధికారులు, మహిళలు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి సీతక్క ఉత్సాహంగా 5కే రన్ -
అమరుల ఆశయాలు సాధించాలి
మంచాల: బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల ఆశయాలు సాధించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య అన్నారు. మండలంలోని జాపాల గ్రామంలో శనివారం కర్రె కోటప్ప స్మారక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి సాయుధ తెలంగాణ భూ పోరాటంలో కోటప్ప పాత్ర మరువలేనిదని తెలిపారు. దున్నే వాడికి భూమి కావాలని గ్రామాల్లో ఎర్ర జెండాలు పాతి భూ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. రైతు, కూలీల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్య పర్చిన ఘనత సీపీఎంకే దక్కుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం కావాలంటే పోరాటాలే శరణ్యమన్నారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకొని మార్పు దిశగా ఉద్యమాలు నిర్వహించాలన్నారు. ఉద్యమాల్లో ప్రజలందరినీ భాగస్వాములు చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రావుల జంగయ్య, జిల్లా నాయకుడు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు. -
రాజీపడండి.. కేసులు పరిష్కరించుకోండి
ఆమనగల్లు: ఇరువర్గాలు రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలని, రాజీమార్గం రాజమార్గమని ఆమనగల్లు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కాటం స్వరూప అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని ప్రథమశ్రేణి న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు సంబంధించి 126 కేసులు పరిష్కారమయ్యాయి. అంతకుముందు న్యాయమూర్తి కాటం స్వరూప మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్‌లో ఇరువర్గాలు రాజీపడి చిన్నచిన్న కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు ప్రమోద్‌కుమార్, శివప్రసాద్, ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్, ఎస్ఐలు వెంకటేశ్, వరప్రసాద్, శ్రీకాంత్, ఏపీపీ కార్తీక్, లోక్ అదాలత్ సభ్యులు ఆంజనేయులు యాదవ్, రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపల్లి జగన్ తదితరులు ఉన్నారు. లోక్ అదాలత్‌లతో సత్వర పరిష్కారం చేవెళ్ల: లోక్ అదాలత్‌లతో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని చేవెళ్ల కోర్టు సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య అన్నారు. కోర్టు ఆవరణలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 970 కేసులు పరిష్కరించారు. వీటికి సంబంధించి రూ.14,28,280 జరిమానాలు రికవరీ చేశారు. అనంతరం దశరథ రామయ్య మాట్లాడుతూ.. ఇరువరా్ుగ్ల రాజీకి వచ్చి పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌లు దోహదం చేస్తాయని అన్నారు. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న కేసు లను సైతం పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ పోలీస్ కేసులకు సంబంధించి మొత్తం 446 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ సీనియర్ సివిల్ జడ్జి సాంబశివరావు, చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకేటశం, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు. మంత్రి దామోదరను కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహను శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తూ రూ.45.50 కోట్లు మంజూరు చేయడంపై నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. నేడు ఇండియాకు ప్రవీణ్‌కుమార్ మృతదేహం కేశంపేట: అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన గంప ప్రవీణ్‌కుమార్ మృతదేహం ఆదివారం ఇండియాకు రానుంది. మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్‌కుమార్ బుధవారం అమెరికాలోని మిల్వాకీ పట్టణంలో దుండగుల కాల్పులో మృతి చెందిన సంగతి తెలిసిందే. అమెరికాలో పోస్టుమార్టంతో పాటు లాంచనాలు పూర్తికావడంతో మృతదేహాన్ని తానా సభ్యులు, బంధువుల సహకారంతో ఇండియాకు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నట్టు బంధువులు, గ్రామస్తులు తెలిపారు. అక్కడి నుంచి కేశంపేటకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఆలయంలో విగ్రహాలు మాయం
మొయినాబాద్: ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఆలయంలోని మైసమ్మ, కనకదుర్గ అమ్మవార్ల విగ్రహాలు మాయమయ్యాయి. ఈ ఘటన మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో చోటుచేసుకుంది. మొయినాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ఓ పురాతన ఆలయం ఉంది. అందులో మైసమ్మ, కనకదుర్గ అమ్మవార్ల విగ్రహాలున్నాయి. శనివారం ఉదయం ఆస్పత్రికి వచ్చినవారికి ఆలయంలో విగ్రహాలు కనిపించకపోవడంతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనకు చేపట్టారు. ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రిలో పనిచేసే ఓ ఏఎన్ఎం కొత కాలంగా మతిస్థిమితం సరిగాలేక పూనకంతో ఊగిపోతోందని.. ఆలయానికి ఉన్న టైల్స్‌ను కొంత కాలంగా తానే తొలగించిందని.. విగ్రహాన్ని సైతం ఆమె మాయం చేసి ఉండవచ్చని సిబ్బంది చెప్పారు. ఈ విషయంపై బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని సర్ధి చెప్పారు. బీజేపీ, హిందూ సంఘాల ఆందోళన పోలీసులకు ఫిర్యాదు మతిస్థిమితం సరిగా లేని ఏఎన్ఎం తీసినట్లు చెబుతున్న వైద్య సిబ్బంది మానసిక రోగంతోనే.. పీహెచ్సీలో పనిచేసే గంగా అనే ఏఎన్ఎం మానసిక పరిస్థితి కొంత కాలంగా సరిగా లేదు. ఆలయం వద్ద పూజలు చేస్తూ పూనకంతో ఊగిపోతుంది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెల్లాం. మెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ తెప్పిస్తే సిబ్బందిని బూతులు తిడుతూ కర్రలతో దాడి చేసింది. ఎవరైనా దగ్గరకు వస్తే చనిపోతానని బెదిరిస్తుంది. మతిస్థిమితం సరిగా లేని గంగా విగ్రహాలను తొలగించి ఉంటుందని భావిస్తున్నాం. – అన్నపూర్ణ, వైద్యాధికారి, మొయినాబాద్ -
విద్యార్థులు అన్నిరంగాల్లో ప్రావీణ్యం సాధించాలి
మొయినాబాద్ రూరల్: విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని జాతీయ వాలీబాల్ ప్లేయర్ బి.జంపన్నగౌడ్ అన్నారు. జేబీ ఇంజనీరింగ్ నిర్వహిస్తున్ను రాష్ట్ర స్థాయి క్రీడలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కార్యదర్శి కృష్ణారావు, ప్రిన్సిపాల్ కృష్ణమాచారి, డైరెక్టర్ సంజయ్, విజయ్ రాఘవ్, పీడీ విఘ్నేష్, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ వాలీబాల్ ప్లేయర్ జంపన్నగౌడ్ -
అడ్డాపై కూలీ మృతి
తుర్కయంజాల్: కూలి పనికి వెళ్లిన వ్యక్తి లేబర్ అడ్డాపై మృతి చెందాడు. ఈఘటన తుర్కయంజాల్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మిర్యాలగూడకు చెందిన వెంకటయ్య(50) దంపతులు తుర్కయంజాల్‌లో నివాసం ఉంటూ రోజువారి కూలీపనుల కోసం అడ్డామీదకు వెళ్తారు. శనివారం ఉదయం కూలీకోసం దంపతులు అడ్డామీదకు వెళ్లారు. అక్కడ చేరుకున్న కాసేపటికే వెంకటయ్య ఒక్కసారిగా కుప్పకూలాడు. గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు డబ్బు లేకపోవడంతో దాతలు స్పందించి రూ.7వేలు పోగు చేసి ఆటో వారి స్వగ్రామానికి తరలించారు. -
సినిమా షూటింగ్లో అపశ్రుతి
శంకర్పల్లి: ఓ సినిమా షూటింగ్లో అపశ్రుతి చో టు చేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి మండల పరిధిలోని టంగుటూరు శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకా రం.. టంగుటూరుకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీజేపీ నేత బద్ధం శంభారెడ్డి(47) సిని ఇండసీ్ట్ర వారికి సుపరిచితుడు. మండల పరిధిలో చేసే షూటింగ్‌లకు అనుమతులు ఇప్పిస్తుంటాడు. కాగా శుక్రవారం గ్రామ శివారు పంట పొలాల్లో ‘ఓదేల.. ది రైల్వేస్టేషన్’ సినిమా షూటింగ్ ఉంది. షూటింగ్ బృందానికి చెందిన ఓ భారీ క్రేన్ రావడంతో విద్యుత్ వైర్లకు తగులుతుందేమోనని శంభారెడ్డి ట్రాన్స్ఫార్మర్(జంపర్)ను ఆఫ్ చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. షూటింగ్ బృందం వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రాత్రి విధుల్లో ఉన్న పెట్రోలింగ్ వాహనంలో సిబ్బంది, నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి మార్చురికీ తరలించారు. మృతుడికి భార్య లావణ్య, ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే మణివర్ధన్‌రెడ్డి, శిరీష ఉన్నారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మోకిల ఠాణాలో మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు. రెండు గంటల పాటు ధర్నా కాగా పోలీసులు సినీ ఇండసీ్ట్ర వారితో కుమ్మకై ్క ఆధారాలు లభించకుండా మృతదేహాన్ని మార్చురికీ తరలించారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతు ఘటనా స్థలికి వెళ్లగా.. ఎవరికీ చెప్పొద్దంటూ వెనక్కి పంపించారని వాపోతున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా తరలిస్తారంటూ శనివారం మోకిల చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనాల దారి మళ్లించారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం ధర్నాకు మద్దతు తెలిపారు. అనంతరం నార్సింగి ఏసీపీ రమణగౌడ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఎమ్మెల్యే పరామర్శ శంభారెడ్డి మరణవార్త తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మృతుడి ఇంటికి వెళ్లా రు. వారికి కుటుంబ సభ్యులను పరామర్శించా రు. అనంతరం ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. విద్యుదాఘాతంతో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మృతి మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు సమాచారం ఇవ్వలేదని మృతుడి కుటుంబీకుల ధర్నా ఏసీపీ రమణగౌడ్ జోక్యంతో ఆందోళన విరమణ -
మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేయాలని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ.. సృష్టికి మూలం మహిళలే అని అన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర చాలా గొప్పదన్నారు. వారి రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పని చేస్తోందన్నారు. మహిళల భద్రత కోసం పటిష్ట చట్టాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. షీటీం ఆకతాయిలపై కొరడా జులిపిస్తోందని తెలిపారు. మహిళలను చైతన్యం చేయడం ద్వారానే హత్యలు, అత్యాచారాలు తగ్గుముఖం పడతాయన్నారు. కార్యక్రమంలో గురునానక్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్ఎస్ సైనీ, అధ్యాపకులు, పాల్గొన్నారు. ‘స్మయిల్ ఆల్వేస్’కు ఉత్తమ అవార్డు ఇబ్రహీంపట్నం రూరల్: ఆడబిడ్డల చదువుకు అండగా నిలుస్తున్న స్మయిల్ ఆల్వేస్ ఫౌండేషన్ సంస్థ సేవలను ప్రభుత్వం గుర్తించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవా అవార్డును ప్రకటించింది. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్లో స్మయిల్ ఆల్వేస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు కోడి సుధామనుడుకు అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అవార్డు అందజేశారు. శాలువతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సుధామనుడు మాట్లాడుతూ.. 500 మంది ఆడబిడ్డలను చదివించడమే కాకుండా దాదాపు 100 మందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యమే లక్ష్యం మీర్‌పేట: సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఔషధ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు శుక్రవారం మీర్‌పేట రైతుబజార్ వద్ద ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ (జనరిక్ మెడికల్) కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్యం ఎంతో ఖరీదుతో కూడుకున్నదని, తక్కువ ధరకే పేదలకు మందులు అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ కేంద్రాల్లో 80 నుంచి 90 శాతం వరకు తగ్గింపుతో మందులు లభిస్తాయని తెలిపారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన జనరిక్ మాత్రలను కొనుగోలు చేసి గూగుల్‌పే ద్వారా బిల్లు చెల్లించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, కొలన్ శంకర్‌రెడ్డి, మీర్‌పేట–1,2 అధ్యక్షులు భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఇండియాకు ప్రవీణ్ మృతదేహం కేశంపేట: అమెరికాలో మృతిచెందిన విద్యార్థి ప్రవీణ్‌కుమార్ మృతదేహం ఆదివారం ఇండియాకు రానుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అనంతరం స్వగ్రామం కేశంపేటకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ప్రవీణ్ తల్లిదండ్రులు గంప రాఘవులు, రామాదేవి దంపతులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య వేర్వేరుగా పరామర్శించారు. ఫోన్‌ద్వారా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. -
వైకల్యాన్ని జయించి..
శంకర్పల్లి: పుట్టుకతో అంగవైకల్యం ఉన్నప్పటికీ డాక్టర్ కావాలనుకునే లక్ష్యాన్ని సాధించానని అంటున్నారు శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ రేవతిరెడ్డి. అమ్మానాన్నలు రేయింబవళ్లు కష్టపడ్డారని.. తాను, తన అక్క కలలు కన్న లక్ష్యాల కోసం నిరంతరం తాపత్రయ పడ్డారని చెబుతున్నారు. చదువులో చురుగ్గా.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి, సరళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు మాధవి రెడ్డి, చిన్న కూతురు రేవతి రెడ్డి. వెంకట్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. చిన్న కూతురు రేవతిరెడ్డికి చిన్నతనం నుంచే అంగవైకల్యం ఉన్నప్పటికీ చదువులో చురుగ్గా ఉండేది. గమనించిన తండ్రి ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించాడు. శంకర్ పల్లి పట్టణంలోని శ్రీ వివేకానంద పాఠశాలలో 7వ తరగతి వరకు, 10వ తరగతి వరకు వికారాబాద్ ఎన్నేపల్లిలోని సంఘం లక్ష్మీబాయి రెసిడెన్షియల్ పాఠశాలలో, ఇంటర్ వరంగల్ హసన్‌పర్తిలోని ఏపీఆర్జేసీలో చదువుకుంది. ఎంబీబీఎస్‌లో దివ్యాంగుల కోటాలో సీటు రాకపోవడంతో ఓపేన్ ఎ కేటగిరీలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. పొలం అమ్మేసి .. కూతురికి ఎంబీబీఎస్‌లో సీటు రావడంతో తండ్రి ఎంతో సంతోషించాడు. ఎంత కష్టమైనా చదవించాలనుకున్నాడు. పెద్ద కూతురు ఎంఎస్సీ, చిన్న కూతురు ఎంబీబీఎస్ కోసం సంవత్సరానికి రూ.లక్షల్లో ఖర్చవుతుండడంతో ఊర్లోని ఆరు ఎకరాల పొలం అమ్మి చదివించాడు. 2008లో పెద్ద కూతురు మాధవిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించగా.. 2014లో రేవతిరెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. 2014 నుంచి 15 వరకు కోస్గి, 2015–18 నవాబ్‌పేట్, ప్రస్తుతం శంకర్పల్లి పీహెచ్‌సీల్లో వైద్యురాలిగా సేవలందిస్తోంది. ప్రభుత్వం నుంచి అవార్డులు రేవతిరెడ్డి ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు బాసటగా నిలుస్తోంది. ఆమె వైద్య సేవలను గుర్తించి 2023లో కలెక్టర్ ఉత్తమ వైద్యురాలి అవార్డుకి ఎంపిక చేశారు. జిల్లా వైద్యా, ఆరోగ్య శాఖ వారు సాధారణ ప్రసవాలు, ఉత్తమ సేవలకుగాను రెండు సార్లు అవార్డులు అందించారు. డాక్టర్ రేవతిరెడ్డికి 2017లో పాండురంగారెడ్డి తో వివాహం జరిగింది. ఆరేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నాడు. తండ్రి వెంకట్‌రెడ్డి 2020లో గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి సంరక్షణ అక్కాచెల్లెళ్లు చూసుకుంటున్నారు. -
No Headline
విభాగం అధికారి అధనపు కలెక్టర్ (రెవెన్యూ, స్థానిక సంస్థలు) ప్రతిమాసింగ్ జిల్లా రెవెన్యూ అధికారి సంగీత గ్రామీణాభివృద్ధి సంస్థ ఎల్.శ్రీలత జిల్లా సీ్త్ర,శిశు సంక్షేమ విభాగం సంధ్యారాణి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ రామేశ్వరి పరిశ్రమలశాఖ జీఎం శ్రీలక్ష్మి మెప్మా, పీడీ మల్లేశ్వరి అడల్ట్ ఎడ్యుకేషన్ అనిత చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పి.సౌమ్య డీటీసీపీఓ పి.సువర్ణదేవి ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సరూర్‌నగర్ ఉజ్వలారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డీటీఓ బి.పద్మావతి ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఎస్.రాజేశ్వరి జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.జయశ్రీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఇందిరాదేవి మార్కెఫెడ్, డీఎం ఎండీ తమినా -
వందనం.. ‘కందివనం’
షాబాద్: ఒకవైపు బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు ఇద్దరు ఆడపిల్లలను చదివించి ప్రయోజకులను చేసి వివాహాలు జరిపించారు మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి కందివనం పద్మ. భర్త కై లాస్‌గౌడ్ 15 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం ఆమైపె పడింది. భర్త చేస్తున్న ఉద్యోగాన్ని చేపట్టింది. తండ్రి లేని లోటు తెలియకుండా ఇద్దరు ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా పెంచింది. డిగ్రీ వరకు చదివించి పెళ్లిళ్లు చేసింది. ఇప్పటికీ ఇల్లిల్లూ తిరుగుతూ ఉత్తరాలు బట్వాడా చేస్తూ.. పింఛన్లు అందిస్తూ.. ఊరివాళ్లతో కలుపుగోలుగా మెలుగుతూ జీవనం సాగిస్తోంది. ‘ఎన్ని సమస్యలు ఎదురైనా మహిళలు సహనాన్ని కోల్పోవద్దని.. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని.. సహనం, పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యమైన చేరుకోగలం’ అని చెబుతోంది. -
No Headline
పహాడీషరీఫ్: ఆడ, మగ తేడా లేకుండా ఆ దంపతులు ఇద్దరు కుమార్తెలను పెంచి పెద్ద చేశారు. ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇప్పించారు. ఉన్నత చదువులు చదివిస్తూనే.. బుల్లెట్ బండి, కార్ల డ్రైవింగ్ సైతం నేర్పించి అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. బాలాపూర్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన మద్ది సబిత, రాజశేఖర్ రెడ్డి దంపతులకు మణిదీపా రెడ్డి, సహస్రారెడ్డి ఇద్దరు ఆడ పిల్లలు. వారిని ప్రత్యేకంగా పెంచాలనుకున్నారు. పెద్ద కుమార్తె మణిదీపా రెడ్డికి కరాటేతో పాటు బాస్కెట్ బాల్ నేర్పించారు. ఈమె ఇప్పటికే ఎన్నో టోర్నమెంట్‌ల్లో ప్రదర్శనలు ఇచ్చి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంది. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేరవుతోంది. చిన్న కుమార్తె సహస్రారెడ్డి వైద్య విద్యను అభ్యసిస్తోంది. సబిత 2020–25 మధ్య కాలంలో మీర్పేట్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా పని చేశారు. రాజశేఖర్ రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నారు. వాహనాలు నడుపుతున్న మణిదీపా రెడ్డి, సహస్రా రెడ్డి -
జై
ఆమెకుతల్లిగా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతోంది.. మమతానురాగాలకు చిరునామాగా నిలుస్తోంది.. తోబుట్టువుగా ప్రేమను పంచుతోంది.. ఆలిగా మగవాడి బతుకులో సగపాలు తనదిగా కష్టసుఖాల్లో తోడూనీడగా ఉంటోంది.. ప్రతి పురుషుడి విజయం వెనుక ‘ఆమె’ కీలకపాత్ర పోషిస్తోంది.. ఇంటికి దీపం ఇల్లాలుగా కుటుంబానికి వెలుగులు పంచుతోంది.. సేవకు ప్రతిరూపంగా నిలుస్తోంది.. ఒకవైపు వంటింట్లో గరిటె తిప్పుతూనే మరోవైపు రాజకీయాలు, పాలనలోనూ ‘చక్రం’ తిప్పుతోంది.. ఒకప్పుడు గృహిణులుగానే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ‘రాణి’స్తున్నారు.. ఆకాశంలో సగం కాదు అన్నింట్లోనూ ముందే అని నిరూపిస్తున్నారు.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. ● గొప్పశక్తిగా మహిళ ఒకప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతను.. మరోవైపు అధికారిక కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోవడం లేదు. పాలనాపరమైన అంశాల్లో అమెరికా కంటే భారతీయ మహిళలలే ముందున్నారు. 40 ఏళ్ల క్రితమే ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా పని చేయడమే ఇందుకు ఉదాహరణ. ఉన్నత చదువులు చదువుకుంటూ.. ఉన్నతంగా రాణిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా గొప్ప శక్తిగా ఎదుగుతున్నారు – ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలని అన్నారు. కుటుంబానికి మూలం మహిళ అని గుర్తు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా పెంచాలన్నారు. మహిళా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. మహిళలకు ఆర్థికంగా, విద్యాపరంగా సమాన హక్కులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారంతా మహిళా అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్ఓ సంగీత, జిల్లా టీజీఓ అధ్యక్షుడు డాక్టర్ రామారావు, టీజీఓ కార్యదర్శి శ్రీనేష్‌కుమార్ నోరి, జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి, సీడీపీఓ శాంతిశ్రీ, రేవతి, అలివేలు, అనిత, సుజాత, సైదమ్మ, గంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లలే అనుకోకుండా కరాటేలో శిక్షణ
చేవెళ్ల: నలుగురూ ఆడపిల్లలే.. అయినా ఎందులోనూ తీసిపోకూడదనే ఉద్దేశంతో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నాడు ఆ తండ్రి. మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన కావలి కృష్ణ, దివ్య దంప తులు. వారికి నలుగురు ఆడపిల్లలు. కృష్ణ చిన్నతనంలో నేర్చు కున్న కరాటే తన కుటుంబానికి జీవనాధారంగా మారింది. కరాటేలో 5వ డాన్ బ్లాక్‌బెల్టు సాధించిన అతడు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నలుగురు ఆడపిల్లలు అన్న బాధ లేకుండా వారిలో ఆత్మవిశ్వాసం నింపితే సమాజంలో అందరితో సమానంగా రాణిస్తారని నమ్మాడు. దీంతో కూతుళ్లకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. పెద్ద కూతురు జేమిమ్మ ఎనిమిదేళ్ల వయస్సులోనే కరాటేలో వైట్, ఎల్లో, ఆరెంజ్ బెల్టులు సాధించింది. రెండో కూతురు రూతు ఆరేళ్ల వయసులో వైట్, ఎల్లో బెల్టులు సాధించింది. మూడో కూతురు జేరుషా సైతం నాలుగేళ్లకే అక్కలతోపాటు కరాటేలో శిక్షణ తీసుకుంటోంది. ‘నాకున్న అస్తి, ధైర్యం నా నలుగురు అమ్మాయిలే. ఎక్కడా వారు తక్కువ కాకుండా ఉండాలనే కరాటేలో శిక్షణ ఇస్తున్నాను. వారికి ఇష్టమైన ఏ రంగంలో అయినా రాణించేందుకు పూర్తి సహకారం అందిస్తాను’ అంటున్నాడు. -
విద్యతో పరిశోధనలను జోడించాలి
మొయినాబాద్: విద్యావ్యవస్థలో బహుముక పరిశోధనలను జోడించడంలో విద్యార్థులు, విద్యావేత్తలు, సామాజికవేత్తల పాత్ర కీలకమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి.బాలకృష్ణారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అంగీకృత పరిశోధన, సుస్థిరాభివృద్ధిపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో దీర్ఘకాలిక సవాళ్లను అధిగమించేందుకు పర్యావరణ సుస్థిరత, వనరుల నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి రంగాల్లో సృజనాత్మకత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వర్సిటీ ప్రొఫెసర్ ఉపద్రస్తా రామమూర్తి, గ్రిట్ కళాశాల డీన్ స్వదేశ్ కుమార్ సింగ్, కేజీరెడ్డి కళాశాల చైర్మన్ కె.కృష్ణారెడ్డి, డైరెక్టర్ రోహిత్ కందకట్ల, ప్రిన్సిపాల్ సాయిసత్యనారాయణరెడ్డి, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి -
చిన్నచూపు వద్దు
మాది పూర్వ నల్లగొండజిల్లా హుజూర్నగర్. నాన్నకు నలుగురం సంతానం. పేద, మధ్య తరగతి కుటుంబం. ముగ్గురు అమ్మాయిలే అయినామా నాన్న మమ్మల్ని చదువు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదివించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా సొంతూరిలోనే. విజయవాడలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. కోఠి ఉమెన్స్ కాలేజీలో ఎకనామిక్స్‌లో పీజీ చేశాను. బీఈడీ పూర్తి చేసి, స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాను. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ రిక్రూట్మెంట్లో భాగంగా డైరెక్ట్ సెలక్షన్ ద్వారా వచ్చాను. మిర్యాలగూడలో తొలి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డిలో ఏడీ చైల్డ్ వెల్ఫేర్‌గా పని చేశాను. ఆ తర్వాత ఇక్కడికి బదిలీపై వచ్చా. నా భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఆయన రెవెన్యూ విభాగంలో పని చేస్తారు. మాకు ఇద్దరు పిల్లలు. ఇటు ఆఫీసు, అటు ఇంటికి సమప్రాధా న్యత ఇస్తాను. మహిళలను చిన్నచూపు చూడొద్దు. ప్రోత్సహిస్తే.. మగవాళ్లుకు దీటుగా రాణిస్తారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే ముందు చదువుకోవాలి. ఇందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ హాస్టళ్లను కూడా ఏర్పాటు చేసింది. – సంధ్యారాణి, సీ్త్ర, శిశు సంక్షేమ సంఘం అధికారి -
లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుని..
నాన్న టీఎస్ నరసింహన్ సహా ఇంట్లో అంతా ఉన్నత చదువులు చదివిన వారే. నాకు ముగ్గురు బ్రదర్స్. వివిధ రంగాల్లో స్థిరపడ్డా రు. నాన్న స్ఫూర్తితో చదువుకున్నా. స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా అయినప్పటికీ పుట్టిపెరిగింది మొదలు.. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే. సెంట్రల్ వర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేశా. గ్రూప్స్ రాశాను. తొలి ప్రయత్నంలో రాకపోవడంతో ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పని చేశాను. గ్రూప్–1కు ప్రిపేరయ్యాను. గ్రూప్–2 పరీక్ష రాసి, విదేశాలకు వెళ్లాలని భావిస్తున్న సమయంలో ఫలితం వచ్చింది. హైదరాబాద్‌లో ట్రైనింగ్.. వరంగల్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటి కలెక్టర్ సుమితా దావ్రా డీఆర్డీఏ పీడీగా నియమించారు. గ్రూప్–2 కేడర్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగిని, గ్రూప్–1 కేడర్ పోస్టులో ఎలా కూర్చొబెడతారని జాయినింగ్ రోజే పురుష ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నా. వారి సవాల్‌ను చాలెంజ్‌గా తీసుకున్నా. సమర్థవంతంగా పని చేశా. తర్వాత వివిధ జిల్లాల్లో, ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించా. ఒక వైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు ప్రభుత్వ అధికారిగా విధులు.. లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగుతున్నా. – టీఎల్ సంగీత, జిల్లా రెవెన్యూ అధికారి -
పాలనలో ‘కీ’లకం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా పరిపాలనా భవనంలో మొత్తం 192 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సహా పలు కీలక విభాగాలకు ఉన్నతాధికారులుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ విభాగంలో 27 మంది, డీఆర్డీఏలో 32 మంది, జిల్లా విద్యాశాఖలో 16 మంది, సివిల్ సప్లయ్‌లో 13 మంది, పంచాయతీరాజ్ విభాగంలో 12 మంది, కో ఆపరేటివ్ విభాగంలో తొమ్మిది మంది, ఉద్యాన వన శాఖలో ఆరుగురు, ట్రెజరీలో 8 మంది, సీపీఓలో ఆరుగురు, అర్బన్ సీలింగ్ లాండ్స్లో ఆరుగురు, డీ సెక్షన్లో ఐదుగురు, సీ సెక్షన్లో ముగ్గురు, లాండ్ ప్రొటెక్షన్స్లో నలుగురు, భూసేకరణ విభాగంలో ముగ్గురు, హౌసింగ్ కార్పొరేషన్లో ముగ్గురు, మత్స్యశాఖలో నలుగురు చొప్పున పని చేస్తున్నారు. పరిశ్రమల శాఖలో నలుగురు, గిరిజన, మైనార్టీ విభాగాల్లో ఆరుగురు, లాండ్స్ రికార్డ్స్ విభాగంలో నలుగురు, బీసీ సంక్షేమశాఖలో నలుగురు, మెప్మాలో ఒకరు చొప్పున మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక వైద్య ఆరో గ్యశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమశాఖల్లో పూర్తిగా వారిదే ఆధిపత్యం. అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల్లో మెజార్టీ మహిళలే. -
వహ్వా.. వాకా లక్ష్మీశైలజ
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025‘మద్ది’ సిస్టర్స్.. అదుర్స్ మీర్‌పేట: తల్లి వృద్ధాప్యం.. సోదరుడు అనారోగ్యంతో జీవితకాలం మంచానికే పరిమితం.. అన్నీ తానై అటు ఇంటి బాధ్యతను చూస్తూ.. ఇటు ఉద్యోగం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది వాకా లక్ష్మీశైలజ. మీర్‌పేట జిల్లెలగూడకు చెందిన వాకా లక్ష్మీశైలజ సౌత్‌సెంట్రల్ రైల్వే విభాగం సికింద్రాబాద్ డివిజన్ లాలాగూడలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. సాధారణంగా ఈ విభాగంలో పురుషులే ఎక్కువగా పనిచేస్తుంటారు. శైలజ గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినప్పటికీ మానేసి రైల్వేలో ఉద్యోగం సాధించింది. విధి నిర్వహణలో కఠినమైన మెకానికల్ పనుల్లో భాగంగా మగవారికి దీటుగా రైల్వే వీల్స్‌కు సంబంధించిన పనులు చేస్తోంది. ఉద్యోగంతో పాటు కుటుంబ పోషణ భారమంతా తనపైనే వేసుకుని తల్లి, సోదరుడి ఆలనా, పాలనా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉద్యోగంతో పాటు రైల్వే అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక, ప్రజా అవగాహన కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటోంది. రైల్వే ఉన్నతాధికారుల నుంచి పలుమార్లు ప్రశంసా పత్రాలు అందుకుంది. ‘మహిళలు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. అన్ని రంగాల్లో రాణించాలని’ అంటోంది. ఇబ్రహీంపట్నం రూరల్: నిరుపేద కుటుంబానికి చెందిన వారికి నలుగురు కూతుళ్లు.. అంతా ఆడ పిల్లలే అని ఏనాడూ బాధపడలేదు. బాగా చదివిస్తే వారే కుటుంబానికి వెలుగవుతారని నిర్ణయించుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడ అనుబంధ గ్రామం ఎర్రగుంటకు చెందిన కత్తుల అండాలు దేవదాసు దంపతులకు శ్వేత, నిఖిత, మేఘన, దీక్షిత నలుగురు సంతానం. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చేర్పించారు. అనంతరం పెద్ద కూమార్తె శ్వేత తమిళనాడులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. రెండో కుమార్తె నిఖిత బీటెక్ చదివి, బెంగళూర్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. మూడో కూతురు మేఘన కరీంనగర్‌లోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చిన్న కుమార్తె దీక్షిత చిన్నప్పటి నుంచి ఆటల్లో మేటి. అథ్లెటిక్స్, ఖోఖోలో రాష్ట్ర స్థాయిలో అనేక పతకాలు సాధించింది. ప్రస్తుతం బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నలుగురూ ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదురైనా చదువును కొనసాగిస్తున్నా రు. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఉన్నత చదువులు చదువుతూ న లుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. న్యూస్‌రీల్ -
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
శంకర్పల్లి: హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు గంజాయికి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మోకిల ఠాణా పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం.. గురువారం సా యంత్రం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు మోకిల పోలీసులు శంకర్పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు స్విఫ్ట్ కారులో వెళ్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్ మత్రు(35), నేనావత్ తేజ(29), మహారాష్ట్రకు చెందిన నీలేశ్ బాబన్ కాలే(22)ను అదుపులోకి తీసుకున్నారు. కారులో తనిఖీ చేయగా 52 కిలోల గంజాయి పాకెట్లు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోతుగూడెం(ఆంధ్రా–ఒడిశా బార్డర్) నుంచి గంజాయి తీసుకు వచ్చామని.. పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ వద్దకు చేరుకున్నాక కొంత కారులో.. మిగిలినది సెప్టిక్ ట్యాంక్ వాహనంలో ఉంచి తరలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా పోలీసులు సెప్టిక్ ట్యాంకు వాహనం కోసం గాలింపు చేపట్టారు. నిందితుల వద్ద 52 కిలోల గంజాయి, కారు, నాలుగు ఫోన్లు సీజ్ చేశారు. శుక్రవారం నిందితులను చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జైలుకు తరలించారు. ముగ్గురికి రిమాండ్ -
అతివలే అధికారులు
ఆమనగల్లు: సమాజంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందిస్తున్నారు. వ్యాపారం, క్రీడా రంగాల్లోనూ తమ ప్రతిభ చాటుతునర్నారు. ప్రజాప్రతినిధులుగా తామేమీ తీసిపోలేదంటూ ప్రజా మన్ననలు పొందుతున్నారు. మండల పరిధిలో ప్రభుత్వ శాఖల అధికారులంతా మహిళలే. ఆమనగల్లు ప్రధమశ్రేణి న్యాయమూర్తిగా కాటం స్వరూప, ఎంపీడీఓగా కుసుమమాధురి, తహసీల్దార్‌గా లలిత, వ్యవసాయ శాఖ ఏడీగా శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు. -
లింగసమానత్వ సాధనకు..
అనంతగిరి: బాలికలు ఉన్నత విద్యనభ్యసించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ఆడపిల్లల సమానత్వ సమాఖ్య పనిచేస్తోంది. ఉన్నత విద్యతోనే లింగసమానత్వం సాధ్యమనే ఉద్దేశంతో ఎంవీఎఫ్ ఆధ్వర్యంలో ఈ సమాఖ్య పోరాడుతోంది. గతేడాది మే లో ఏర్పడిన ఈ సంఘం కన్వీనర్‌గా కృప, జిల్లా కన్వీనర్‌గా జ్యోతి ఉన్నారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. ఆరు జిల్లాల్లో ఆక్టివ్‌గా పనిచేస్తోంది. జిల్లా కమిటీలో 30మంది బాలికలున్నారు. బాలికలను విద్యాలక్ష్మిని చేయడమే సంఘం ఆశయం. -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
ఇబ్రహీంపట్నం రూరల్: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి వెంటనే గ్రౌండింగ్ చేయడంలో వేగం పెంచాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నా రు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మార్చి 15 వరకు మిషన్ భగీరథ, గ్రిడ్ ఇంట్రా పనులకు గ్రౌండింగ్ చేపట్టి 20 వరకు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరకాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు పరిశీలించి గడువులోపు పూర్తి చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రామాణాభివృద్ధి అధికారి శ్రీలత, పంచాయతీ అధికారి సురేష్ మోహన్, మిషన్ భగీరథ ఈఈ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీపైఅవగాహన కల్పించండి గ్రామాల్లో తాగునీటిఎద్దడి తలెత్తకుండా చూడాలి కలెక్టర్ నారాయణరెడ్డి -
డీజేతో ఇబ్బందిపెట్టిన వారికి రూ.18 వేలు జరిమానా
చేవెళ్ల: డీజే సౌండ్లతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చేవెళ్ల ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 4న చేవెళ్లకు చెందిన నాయక్ తన ఇంట్లో చిన్న విందు ఉండగా డీజే పెట్టించాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా సౌండ్లతో హోరెత్తించడంతో భరించలేని చుట్టుపక్కల వారు 100 డయల్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో నాయక్‌తో పాటు డీజే అపరేటర్ హరీశ్వర్, డీజే ఓనర్ శివపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం వారిని న్యామూర్తి డి.ధీరజ్‌కుమార్ ఎదుట హాజరుపర్చగా ముగ్గురికీ కలిపి రూ.18 వేలు జరిమానా విధించారు. ఒక్కొక్కరు రూ.6 చొప్పున ఫైన్ చెల్లించాలని లేదంటే ఏడు రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు. చిన్నారిపై వీధికుక్కల దాడి అంబర్‌పేట: ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి గోల్నాక కమలనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే లక్ష్మణ్, మమతల కుమార్తె శ్రీలక్ష్మి (19 నెలలు) శుక్రవారం ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే సమయంలో అటుగా వచ్చిన వీధికుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. -
తెలిసిన వారితోనే ఇబ్బంది
సాక్షి, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్: సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షపై రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సాక్షి ప్రత్యేక సర్వే నిర్వహించింది. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు, 18నుంచి 25 ఏళ్ల వయసున్న యువతులు, 25 నుంచి 35 సంవత్సరాలున్న అతివలు, 35 నుంచి 50 ఏళ్ల వయసున్న వంద మంది మహిళలను (25 మంది చొప్పున) నాలుగు విభాగాలుగా చేసి సర్వే నిర్వహించగా.. వారి నుంచి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నప్పటికీ పలు చోట్ల వివక్ష కొనసాగుతోందని, స్కూళ్లు, కాలేజీలు, పని ప్రదేశాల్లో ఇతరుల నుంచి కొంత ఇబ్బంది ఎదురవుతోందని, బస్టాప్‌లు, ఆఫీసుల్లో పురుషాధిక్యం ఉందని, సెల్ఫోన్లలో వచ్చే మెసేజ్‌లు తమను ఎక్కువగా బాధ పెడుతున్నాయని, వీరిలో తెలియని వారికన్నా తెలిసిన వారే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారని సర్వే వెల్లడిస్తోంది. మహిళలపై పలుచోట్ల కొనసాగుతున్న వివక్ష బస్టాప్‌లు, కాలేజీల్లో పురుషాధిక్యం ఇబ్బంది పెడుతున్న సెల్‌ఫోన్ మెసేజ్‌లు -
యువకుడి అదృశ్యం
చేవెళ్ల: ఫ్లైవుడ్ షాపులో పనిచేసే ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలో రాజస్థాన్‌కు చెందిన హీర్ సింగ్మాసింగ్ రాందేవ్ ఫ్లైవుడ్ దుకాణం నడిపిస్తున్నాడు. ఆయన వద్ద వారి దూరపుబంధువైన జస్వంత్‌సింగ్ (18) మూడు నెలలుగా పనిచేస్తున్నాడు. గురువారం పనికి వచ్చిన యువకుడు సాయంత్రం 4గంటల ప్రాంతంలో రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. దుకాణం బంద్ చేసిన హీర్ సింగ్మాసింగ్ జస్వంత్సింగ్కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో షాప్ యజమాని ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పెండింగ్ వేతనాలు చెల్లించండి
కేశంపేట: పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంఘం నాయకులతో కలిసి పంచాయతీ రాజ్ డిప్యూటీ డైరెక్టర్ రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన రామారావు వచ్చే బడ్జెట్ నుంచి గ్రీన్ చానల్ ద్వారా ప్రతీ నెల 1న వేతనాలు అందేలా చూస్తామన్నారు. టీస్బీఎస్ ద్వారా ఫిబ్రవరి వరకు ఉన్న వేతనాలను మంగళవారం వరకు చెల్లిస్తామన్నారు జనరల్ ఫండ్స్‌లో జనరేట్ చేసిన వేతనాల చెక్కులను క్లియర్ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజ్యం, మల్లయ్య, జిల్లా నాయకులు రాంచంద్రయ్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
అంగన్వాడీల్లో అక్రమాలకు చెక్!
హుడాకాంప్లెక్స్: అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకులు, లబ్ధిదారుల జాబితాను మరింత పారదర్శకంగా అమలు చేయాలని భావిస్తోంది. ప్రత్యేక ఆన్లైన్ యాప్‌ను తయారు చేసి, అర్హుల ముఖ చిత్రాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో బాలామృతం, కోడిగుడ్లను సరఫరా చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు నేరుగా వీటిని అందించాలని ప్రత్యే యాప్‌ను రూపొందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి ముఖ చిత్రాలను తీసి రికార్డు చేస్తున్నాం. – శోభాలత, అంగన్వాడీ టీచర్, సరూర్‌నగర్ సరుకులు పక్కదారి పట్టకుండా చర్యలు పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక యాప్ అర్హుల ముఖ చిత్రాల నమోదు ఈనెల నుంచే అమలులోకిఅందించేవి ఇవే.. జిల్లాలో 1,600 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, మరో ఏడు ఐసీడీఎస్ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో 1,16,142 మంది చిన్నారులు సహా 24,432 మంది గర్భిణులు, బాలింతలు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయా కేంద్రాలకు వచ్చే నిరుపేద పిల్లలు, తల్లులకు పౌష్టికాహారం అందజేస్తున్న విషయం తెలిసిందే. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రాథమిక విద్యతో పాటు నెలకు 2.50 కిలోల బాలామృతం సహా రోజుకు ఒక గుడ్డును అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పుతో భోజనం వడ్డిస్తున్నారు. ఆరేళ్ల లోపు పిల్లలకు 50 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పుతో భోజనం వడ్డిస్తున్నారు. తొలి దశలో టీహెచ్ఆర్ లబ్ధిదారులకు.. అంగన్వాడీ కేంద్రాలకు రాని వాళ్లకు టీహెచ్ఆర్ (టేక్ హోం రేషన్) అందిస్తున్నారు. మెజార్టీ అంగన్వాడీల్లో ఈ సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపపణలు ఉన్నాయి. వీటికి చెక్ పెట్టి, పారదర్శకతకు పెద్దపీట వేయడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో టీహెచ్ఆర్ లబ్ధిదారుల ముఖ చిత్రాలు నమోదు చేయాలని నిర్ణయించి, ఈ మేరకు ఈనెల నుంచి అమలు చేస్తోంది. చిన్నారుల తల్లుల ముఖ చిత్రం సహా ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. సరుకులు తీసుకున్న వెంటనే ఫోన్‌కు మెసేజ్ వస్తోంది. -
జీహెచ్ఎంసీ టార్గెట్ 68,478 గ్రూపులు
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే వివిధ బాధ్యతలతో సతమతమవుతున్న జీహెచ్ఎంసీ యూసీడీ విభాగానికి మున్సిపల్ పరిపాలన శాఖ మరో పెద్ద బాధ్యత అప్పగించింది. కాగా.. ఇప్పటికే తమ విభాగం చేయాల్సిన పనులు సజావుగా ముందుకు సాగకుండా.. కుటుంబ సర్వే, రేషన్ కార్డుల సర్వేతో సహా స్ట్రీట్ వెండర్ల ఇబ్బందుల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాలకు జనసమీకరణ.. ఇలా ఎన్నో పనులను అప్పజెప్పుతుండటంతో.. వాటిని పూర్తి చేయలేక ఆ విభాగం సతమతవుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మహిళాశక్తి క్యాంటీన్ ఏర్పాటుతో పాటు ఇతరత్రా బాధ్యతలను అప్పగించారు. కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తుండటంతో మహిళా దినోత్సవం నుంచి వారికి సంబంధించిన కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేయాలని బల్దియా భావిస్తోంది. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులనూ భారీ సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు లక్ష్యాలను నిర్దేశించుకుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం దాదాపు 50 వేల సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల్లో దాదాపు 5 లక్షల మంది సభ్యులున్నారు. బీపీఎల్ పరిధిలోకొచ్చే పేద మహిళల్లో ఇంకా గ్రూపు సభ్యులు కాని వారిని గుర్తించి 68,478 గ్రూపులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంటే.. ప్రస్తుతమున్న గ్రూపుల కంటే ఇంకా ఎక్కువ గ్రూపుల్ని ఏర్పాటు చేయాలన్న మాట. ● మహిళా ఓటర్ల లెక్కలు, గ్రూపుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు తదితరాలను పరిగణనలోకి తీసుకొని జీహెచ్ఎంసీలో ఇన్ని గ్రూపుల ఏర్పాటు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో సగం గ్రూపుల్ని ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేసి మిగతా సగం గ్రూపుల్ని జూన్ వరకు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. ఇందుకుగాను ప్రతి మంగళవారం వార్డుల్లోని బస్తీల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ బోర్డు, శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని పురపాలికల్లోనూ కొత్త గ్రూపుల్ని ఏర్పాటు చేయాల్సిందిగా టార్గెట్లను విధించింది. మేడ్చల్ జిల్లా పరిధిలో.. గుండ్ల పోచంపల్లి (36), పోచారం (68), తూంకుంట (4), జవహర్‌నగర్(301), ఘట్కేసర్ (60), కొంపల్లి (121), దమ్మాయిగూడ(255), నిజాంపేట (1214), బోడుప్పల్ (254), దుండిగల్ (38), నాగారం(155), మేడ్చల్ (96), పీర్జాదిగూడ (314). రంగారెడ్డి జిల్లా పరిధిలో.. బండ్లగూడ జాగీర్ (528), మీర్‌పేట (583), మణికొండ(493), శంషాబాద్ (130), నార్సింగి (61), తుర్కయాంజాల్ (123), బడంగ్‌పేట (502), పెద్దఅంబర్‌పేట (162), ఆదిభట్ల (11), తుక్కుగూడ (14), జల్పల్లి (511), ఇబ్రహీం పట్నం (20), కొత్తూరు (7). కొత్తగా ‘సెల్ఫ్‌హెల్ప్’ కోసం.. మహిళా దినోత్సవం నేపథ్యంలో.. ఏర్పాటు చేయాల్సిన గ్రూపుల లక్ష్యం ఇలా.. జీహెచ్ఎంసీ: 68,478 కంటోన్మెంట్ బోర్డు: 1845 -
నిరుపేద కుటుంబానికి తీరని కష్టం
కొందుర్గు: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి తీరని కష్టమొచ్చింది. రోజంతా కూలి పనులు చేస్తేనే పూట గడిచే పరిస్థితిలో విధి చిన్నచూపు చూసింది. ఇందుకు సంబంధించి బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం ఆగిర్యాలకు చెందిన బేగరి నవనీత, ఆంజనేయులు దంపతులకు ఐదేళ్లలోపున్న లక్కీ, చింటూ ఇద్దరు కుమారులు సంతానం. వ్యవసాయ భూమి లేకపోవడంతో భార్యాలిద్దరూ నిత్యం కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. రోజూమాదిరిగానే ఆంజనేయులు గత ఫిబ్రవరి 18న వికారాబాద్ జిల్లా చౌడాపూర్‌లో ఓ ఇంటికి రంగులు వేయడానికి కూలికి వెళ్లాడు. పని చేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులు రెండు చేతులకు తీవ్రమైన కాలిన గాయాలు కావడంతో ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో మరుసటి రోజైన 19న అతని రెంతు చేతులను మోచేతి వరకూ తొలగించారు. మరో మూడు రోజుల తర్వాత కాళ్లకు కూడా ఇన్ఫెక్షన్ సోకడంతో కుడి కాలును తొలగించారు. ఎడమ కాలి వేళ్లు తీసేశారు. రెండు రోజుల క్రితం కుడి చేయిని భుజం వరకు తొలగించారు. ప్రస్తుతం ఎడమ కాలికి ఇన్ఫెక్షన్ ఎక్కువైందని, కాలును తీసేయకపోతే శరీరం మొత్తం విషం పాకుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. నవనీత ఆస్పత్రిలోనే ఉంటూ అతనికి సపర్యలు చేస్తోంది. అక్కడే ఉన్న ఇద్దరు చిన్నారులు సైతం తండ్రి పరిస్థితిని చూసి రోదిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఆస్పత్రిలో పెడుతున్న ఆహారంతో పాటు ఇతర పేషెంట్లను చూసేందుకు వచ్చిన వారు ఇస్తున్న ఆహార పదార్థాలు తింటూ కాలం వెల్లదీస్తున్నారు. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక నవనీత గుండెలు బాదుకుంటోంది. ప్రభుత్వ చేయూతతో పాటు దాతల సాయం కోసం అర్థిస్తోంది. కూలి పనులకు వెళ్లి విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తి ఇన్ఫెక్షన్ సోకడంతో రెండు చేతులూ, కుడి కాలు తొలగింపు ఎడమ కాలిని సైతం తీసేయాలని చెబుతున్న వైద్యులు దిక్కుతోచని స్థితిలో కుటుంబసభ్యలు ప్రభుత్వం, దాతల సాయం కోసం ఎదురుచూపు -
ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం
కేశంపేట: అమెరికాలో మృతి చెందిన విద్యార్థి ప్రవీణ్‌కుమార్ మృతదేహానికి భారతకాలమానం ప్రకారం గురువారం అక్కడి అధికారులు పోస్టుమార్టం పూర్తిచేశారు. మృతుడి తలలోని బుల్లెట్‌ను తొలగించి, మృతదేహాన్ని తానా సభ్యులకు అప్పగించగా, వారు ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తానా సభ్యులకు అప్పగించినట్లు సమాచారం ఇండియా పంపేందుకు ఏర్పాట్లు మృతుడి తల్లిదండ్రులకు పలువురి పరామర్శసెక్రటేరియట్ నుంచి వివరాల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్ నుంచి ఫోన్ చేసిన అధికారులు రాఘవులుతో మాట్లాడారు. మృతదేహాన్ని తెప్పించేందుకు ప్రవీణ్ వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని కోరారు. దీంతో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆన్లైన్లో వివరాలు పంపించారు. కేటీఆర్ పరామర్శ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ప్రవీణ్ తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించారు. కేశంపేటలో మృతుడి తల్లిదండ్రులు రాఘవులు, రమాదేవిని కలిసిన ఆ పార్టీ నేతలు ఎల్గనమోని రవీందర్‌యాదవ్, మురళీధర్‌రెడ్డి, నర్సింగ్‌రావు తదితరులు కేటీఆర్‌తో ఫోన్ మాట్లాడించారు. బాధితులను ఓదార్చిన ఆయన ప్రవీణ్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
చెరువుల అభివృద్ధికి నిధులు అందించాలి
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో చెరువుల అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని, వాటికి పునరుజ్జీవం కల్పించడంతో పాటు సుందరీకరణకు కార్పొరేట్ సంస్థలు సీఎస్సార్ నిధులు అందించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. గురువారం నానక్‌రామ్‌గూడలోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు నెక్నాంపూర్లో ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువును ఆయన పరిశీలించారు. ఖాజాగూడ చెరువు అభివృద్ధికి ఆటంకంగా మారిన అంశాలను ఆ పనులు చేపట్టిన ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రా, దివ్యశ్రీ ఇన్ఫ్రా సంస్థల ప్రతినిధులు రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణం స్పందించిన ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఆయా చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా కాలువల మళ్లింపు పనులు చేపట్టాలని సూచించారు. పర్యాటకుల్ని ఆకర్షించేలా చెరువుల పరిసరాలను సుందరీకరించాలని, ఈ క్రతువులో పర్యాటకాభివృద్ధి సంస్థ కూడా భాగస్వామ్యం కావాలని తన వెంట ఉన్న ఈ శాఖ ఏజీఎం వరప్రసాద్‌కు రంగనాథ్ సూచించారు. నెక్నాంపూర్‌లోని ఇబ్రహీంబాగ్ చెరువు ఆక్రమణల్ని ఇటీవలే తొలగించామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఒకప్పుడు దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు, మల్కం చెరువు, ఫిలింనగర్ చెరువుల నుంచి వరద నీరు ఇబ్రహీంబాగ్ చెరువుకు చేరేదని స్థానికులు అఽధికారులకు తెలిపారు. నివాస ప్రాంతాలు పెరిగిపోవడంతో చెరువులు, మురుగుతో నిండిపోయాయన్నారు. 88 ఎకరాలకు పైగా ఉన్న ఇబ్రహీంబాగ్ చెరువు చుట్టూ తిరిగిన రంగనాథ్ స్థానికులతో మాట్లాడారు. -
మహా నగర విస్తరణకు ఓకే
సాక్షి, సిటీబ్యూరో: మహా నగర పరిధి విస్తరణకు గురువారం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు పెరగనుంది. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చ.కి.మీ వరకు పెరగనుంది. ఇప్పుడు 70 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, మరో 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, సుమారు 1400కు పైగా గ్రామాలతో హెచ్ఎండీఏ పరిధి భారీగా పెరగనుంది. ● హెచ్ఎండీఏ పరిధి పెరగడంతో ట్రిపుల్ ఆర్ పరిధిలో శాటిలైట్ టౌన్‌షిప్పుల నిర్మాణం జరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా స్తబ్ధత నెలకొన్న రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు సైతం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చని అంచనా. ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీ అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 11 జిల్లాలకు పరిధిని పెంచడం ద్వారా నల్లగొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి. ఇక ట్రిపుల్ ఆర్ వరకూ హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిని పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం -
యాసంగి సీజన్‌కు యూరియా కొరత లేదు
కందుకూరు: యాసంగి సీజన్‌కు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరంలేదని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం, ఇతర ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం ఆయన ఏఓ లావణ్యతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఎంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలాఖరు వరకు యూరియా డిమాండ్ ఉన్నందున దానికి అనుగుణంగా నిల్వలను తెప్పించుకోవాలని ఏఓకు సూచించాచారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు నిల్వలను చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు కృషి చేయాలి ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అప్పుడే వారిలో సృజనాత్మకత పెంపొందుతుందని ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్‌పల్లి సమీపంలో ఉన్న ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జాతీయ స్థాయి సాంకేతిక, క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోటీ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం, ఆవిష్కరణలు వెలికితీయటానికి అవకాశం ఉంటుందన్నారు. యువత క్రమశిక్షణతో కూడిన విలువైన విద్యను అభ్యసించాలని తెలిపారు. వివిధ కళాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ఆవిష్కరణలు, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, సెక్రెటరీ నవీన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్దుల్ నబి, ఏఓ డాక్టర్ సుధీర్‌రెడ్డి, కన్వీనర్ సురేష్, కో కన్వీనర్లు డాక్టర్ జయరాం, డాక్టర్ రమేష్‌బాబు, డాక్టర్ మధు, డాక్టర్ హరిబాబు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి మీర్‌పేట: సమస్యాత్మక ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనం వద్ద గురువారం చేపట్టిన విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో కమిషనర్ స్వయంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి స్పందన అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రల ద్వారా నేరస్తులను గుర్తించేందుకు ఉపయోగించే సాంకేతిక పరికరం పాప్లాన్‌ను ఆయన పరీక్షించారు. అనంతరం నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలు, రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ పనితీరుపై ఆరా తీశారు. సీసీటీవీల నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, శాంతి భద్రతల నిర్వహణకు చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐలకు సూచించారు. సీపీ వెంట వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి ఉన్నారు. రేపు ఉచిత వైద్య శిబిరం చేవెళ్ల: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో ఉచిత రొమ్ము, సైర్వెకల్ కేన్సర్ స్క్రీనింగ్ ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో మమ్మోగ్రామ్, పాప్ స్మియర్ టెస్టులు ఉచితంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉచిత వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం
మైలార్‌దేవ్‌పల్లి: ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ పైడి నాయుడు సమాచారం మేరకు... బాగ్‌లింగంపల్లి ప్రాంతానికి చెందిన సోను(21) డిగ్రీ చదువుతున్నాడు. లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీ, బృందావన్ కాలనీకి చెందిన అంబిక(21) ఎల్ఎల్బీ చదువుతుంది. ఇద్దరు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు ప్రియడిని కాదనండంతో మనస్థాపానికి గురై గురువారం ప్రియురాలు ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తు పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. ఈ సమయంలో తన వెంట తెచ్చుకున్న బ్లెడ్‌తో కోసుకొని ఫ్లోర్ క్లీనర్‌ను తాగాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే 108కి ఫోన్ చేసి అంబులెన్స్‌లో అతనికి ప్రథమ చికిత్స చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. బిల్డింగ్ మొదటి అంతస్తు ఎక్కి దూకుతానని హల్చల్ -
ఆమోదం
అగ్నికి ఆహుతైన కంది ఓ రైతు వేసిన కంది పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన ఫరూఖ్‌నగర్ మండలం కొండన్నగూడలో చోటు చేసుకుంది.అద్భుత నగరికి శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 20258లోuఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుసాక్షి, రంగారెడ్డిజిల్లా: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు దీటుగా నాలుగో నగరం ఆవిష్కృతం కాబోతోంది. ఇటు శ్రీశైలం, అటు నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఉన్న ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలతో సుమారు 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ పేరుతో మరో అద్భుత నగరం ఆవిష్కరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపిపంది. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను కూడా కొత్త గా ఏర్పాటు చేసే ఎఫ్డీసీఏలో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది. ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి కోసం కొత్తగా 90 పోస్టులను సృష్టించడమే కాకుండా, వాటి భర్తీకి ఆమోదం కూడా తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపనతో ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట మీదుగా ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించతలపెట్టిన 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ (రతన్‌టాటా) రోడ్డుకు భూసేకరణ చేపట్టింది. తొలి దశలో 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు కేటాయించింది. అదే విధంగా రెండో విడతలో 22.30 కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు రూ.2,365 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఫ్యూచర్ సిటీ స్వరూపం ఇలా..న్యూస్‌రీల్ ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలు కొత్తగా 90 పోస్టులు సృష్టి మంత్రిమండలి ఆమోదం -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
జగద్గిరిగుట్ట: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ కు చెందిన రాజు (40) ఆస్ బెస్టాస్ కాలనీలో ఉంటూ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసైన రాజు నెల రోజులుగా పనికి వెళ్లడం లేదు. గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న అతను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాండూరు ఇన్చార్జ్ డీఎల్పీఓగా రతన్‌సింగ్ తాండూరు రూరల్: తాండూరు డివిజన్ ఇన్చార్జ్ డీఎల్పీఓగా రతన్‌సింగ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన శంకర్‌నాయక్ నల్లొండ జిల్లా దేవరకొండకు బదిలీపై వెళ్లారు. దీంతో పెద్దేముల్ ఎంపీఓగా పని చేస్తున్న రతన్‌సింగ్ తాండూరులోని డీఎల్పీఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను ఎంపీడీఓ విశ్వప్రసాద్ సన్మానించారు. -
అగ్నికి ఆహుతైన కంది పంట
షాద్‌నగర్: ఓ రైతు వేసిన కంది పంట అగ్నికి ఆహుతయింది. ఈ ఘటన గురువారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కొండన్నగూడలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పాపయ్య యాదవ్ తన వ్యవసాయ పొలంలో నాలుగు ఎకరాల్లో కంది పంట వేశాడు. పక్క పొలంలో రైతు పొలాన్ని చదును చేసి వ్యర్థాలకు నిప్పటించాడు. అగ్గి రవ్వలు ఎగిసి పడి కందిపంటకు నిప్పంటుకుంది. గమనించిన రైతులు మంటలార్పేందుకు యత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పంటమొత్తం అగ్నికి ఆహుతయింది. దీంతో సుమారు రూ.1.50లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. -
దాహార్తిని తీర్చేవి చలివేంద్రాలు
కొడంగల్ రూరల్: బాటసారుల దాహార్తిని తీర్చేవి చలివేంద్రాలని తహసీల్దార్ విజయకుమార్ పేర్కొన్నారు. పెరుగుతున్న ఎండలకు బాటసారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ విజయకుమార్ తెలిపారు. గురువారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సిబ్బందితో కలిసి చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. బాటసారులకు చలివేంద్రాలు కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు. వడ దెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవె న్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.తహసీల్దార్ విజయకుమార్ -
హీరో నాగార్జున పరువునష్టం కేసు వాయిదా
సిటీ కోర్టులు: రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. ఈ విచారణకు పిటిషనర్ నాగార్జునతోపాటు ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడంతో వారి తరుఫున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. సినీ అగ్రహీరో నాగార్జున కుమారుడైన హీరో నాగాచైతన్య–సమంత విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె చేసిన వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుపోయిందని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుటుంబంపై అసాధారణమైన వ్యాఖ్యలు చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేయగా గత విచారణలో ఆమె వ్యక్తిగతంగా హాజరయ్యారు. దీంతో కొండా సురేఖ వ్యక్తిగత బాండ్‌తోపాటు రూ.10 వేలు పూచీకత్తు కోర్టులో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అయితే గురువారం జరిగిన విచారణకు ఆమె హాజరుకాకపోవడమే కాకుండా పూచీకత్తులు కూడా దాఖలు చేయలేదు. వచ్చే వాయిదా లోపు పూచీకత్తులు దాఖలు చేసుకోవాలని కొండ సురేఖ తరుఫు న్యాయవాదికి కోర్టు సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జున గైర్హాజరు విచారణ మార్చి 12కు వాయిదా -
క్రీడలతో శారీరక దారుఢ్యం
మొయినాబాద్‌రూరల్: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు స్నేహ బంధాలు పెంపొందుతాయని ఇండియన్ కబడ్డీ ప్లేయర్ గంగాధరి మల్లేశ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని జేబీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యాసంస్థల కార్యదర్శి కృష్ణారావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణామాచారి, డైరెక్టర్ సంజయ్, డీన్ క్రటిజ్ఞాన్, స్టూడెంట్ ఎంపైర్స్ డాక్టర్ సలావుద్దీన్, ఫిజికల్ డైరెక్టర్ విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ కబడ్డీ ప్లేయర్ మల్లేశ్ -
ఔటర్‌పై ఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. రావిర్యాల వండర్లా సమీపంలోని ఎగ్జిట్ నంబరు 13 దాటిన అనంతరం 200 మీటర్ల దూరంలో డివైడర్‌పై ఉన్న మొక్కలకు హెచ్ఏండీఏ ట్యాంకర్ ద్వారా కొంగరకలాన్‌కు చెందిన చెనమోని రాములు (55) నీళ్లు పోస్తున్నాడు. ఉప్పల్‌లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఘట్కేసర్ వద్ద ఔటర్ ఎక్కిన నాగర్‌కర్నూల్ జిల్లా, చిన్నాంబాయి మండలం బెక్కం గ్రామానికి చెందిన కోషిక రవీందర్‌రెడ్డి, బత్తిని కృష్ణారెడ్డి (టీఎస్07జెఎం 1210) కారులో అతివేగంగా వెనుక నుంచి వచ్చి ట్యాంకర్‌తో నీరు పోస్తున్న రాములును ఢీకొట్టారు. దీంతో అతడు గాల్లో ఎగిరి డివైడర్‌పై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. కారు.. ట్యాంకర్ వెనుకభాగం కిందికి దూసుకెళ్లింది. దీంతో ముందు సీట్లో కూర్చున్న కోషిక రవీందర్‌రెడ్డి (50) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కారు నడుపుతున్న బత్తిని కృష్ణారెడ్డి (45) పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120– 140 స్పీడ్‌లో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ట్యాంకర్ కిందికి దూసుకెళ్లడంతో రవీందర్‌రెడ్డి మృతదేహంతో పాటు కృష్ణారెడ్డిని బయటకు తీసేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. సీఐ రాఘవేందర్‌రెడ్డితో పాటు ఎస్ఐ వెంకటేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంగా వచ్చి ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు అక్కడికక్కడే ఇద్దరి దుర్మరణం మరొకరి పరిస్థితి విషమంఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదానికి గురైన కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు. కృష్ణారెడ్డి కొండాపూర్‌లో ఉంటూ స్వీట్ షాప్ నిర్వహిస్తుండగా, రవీందర్‌రెడ్డి బోరబండలో ఉండేవాడు. వీరి మృతితో బెక్కంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూలి కోసం వెళితే.. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌కు చెందిన రాములు ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు . -
‘చెత్తవేస్తే ఈ–చలాన్’పై అధికారులకు శిక్షణ
సాక్షి,సిటీబ్యూరో: ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ.. కూల్చివేతల(సీఅండ్‌డీ) వ్యర్థాలు వేసేవారిని గుర్తించి ఈ–చలాన్ ద్వారా పెనాల్టీలు విధించి, యూపీఐ ద్వారా వసూలు చేసేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ సంబంధిత ఏఎంఓహెచ్‌లు, డీఈఈలు, ఏసీపీలకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్, ఐటీ విభాగం అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ వారికి శిక్షణ ఇచ్చారు. ఈ–చలాన్ విధించేందుకు టీసీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన విధానాన్ని, యాప్‌ను కాంప్రహెన్సివ్ చలాన్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీసీఎంఎస్) యాప్‌గా వ్యవహరిస్తున్నారు. వారితోపాటు యాప్‌ను నిర్వహించే టీజీ ఆన్లైన్ ప్రతినిధులు యాప్ ఎలా పనిచేస్తుందో, ఎలా వాడాలో వివరించారు. తొలుత పైలట్‌గా చెత్త డబ్బాల్లో కాకుండా బయట చెత్తవేసే వాణిజ్య ప్రాంతాల్లోని వ్యాపారులు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నవారు, సీఅండ్‌డీ వేస్ట్ వేస్తున్న వారికి పెనాల్టీలు విధించాలని సూచించారు. సంబంధిత అధికారులు జారీ అయిన చలాన్లు, చెల్లింపులు జరిగినవి, పెండింగ్‌లో ఉన్నవి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చునన్నారు. చెత్త వేసేవారికి ఎస్ఎంఎస్ వెళ్తుందని, స్వచ్ఛ నిబంధనలు ఉల్లంఘించి వేసిన వ్యర్థాల ఫొటో అక్షాంక్ష, రేఖాంశలతో వస్తుందన్నారు. దేనికి ఎంత పెనాల్టీయో సాఫ్ట్‌వేర్‌లోనే పొందుపరిచి ఉంటుందని వారు వివరించారు. -
ముద్ర లోన్ పేరిట మోసం
యాచారం: ఇటీవల అపరచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్, మెసేజ్‌లకు స్పందిస్తూ మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.5లక్షల ముద్రలోన్ మంజూరైందని చెప్పిన వెంటనే బాధితుడు అపరిచిత వ్యక్తిన చెప్పిన విధంగా విడతల వారీగా రూ.45,490 పంపించాడు. ఆతరువాత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి గురువారం యాచారం పోలీసులను ఆశ్రయించాడు. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గునుగల్ గ్రామానికి చెందిన రామన్నకు ఈ నెల 4న అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. నీకు రూ.5 లక్షల ముద్రలోన్ మంజూరైందని తాను పంపే స్కానర్‌కు రూ.50వేలు పంపించాలని రామన్న వాట్సాప్‌కు స్కానర్ పంపించాడు. దీంతో విడతల వారీగా రూ.45,490 పంపాడు. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. సివిల్సప్లై అధికారుల ఆకస్మిక దాడులు రేషన్ దుకాణం సీజ్ శంకర్పల్లి: మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ రేషన్ దుకాణంపై గురువారం సివిల్సప్లై అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. యాదయ్యగౌడ్ నిర్వహిస్తున్న రేషన్ దుకాణంలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలున్నాయని.. వీటిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడని పలువురు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన సివిల్సప్లై అధికారులు ఆకస్మికంగా దాడి చేసి దుకాణం సీజ్ చేశారు. ఎన్ని క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉంచారో శుక్రవారం లెక్కించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయమై తహసీల్దార్ సురేందర్‌ను వివరణ కోరగా సివిల్ సప్లై అధికారుల ఆదేశాల మేరకు రేషన్ దుకాణం వద్దకు ఆర్ఐను పంపామన్నారు. బిర్యానీ సెంటర్లో మంటలు షాబాద్: ప్రమాదవశాత్తు ఓ హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని, చుట్టు పక్కల వారు నీరు పోసి మంటలార్పారు. అప్పటికే హోటల్లోని సామగ్రి కాలిబూడిదైంది. దూరదర్శన్ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కన్నుమూత లక్డీకాపూల్: దూరదర్శన్ మాజీ డైరెక్టర్ దేవళ్ల.బాలకృష్ణ ( 92) గురువారం కన్నుమూశారు. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం సంచాలకుడిగా పని చేయక ముందు ఆయన హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ఆకాశవాణి , దూరదర్శన్ కార్యక్రమ సిబ్బంది సంతాపం తెలిపారు. ఆకాశవాణి, దూరదర్శన్ అభివృద్ధికి బాలకృష్ణ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. శుక్రవారం ఉదయం అంబర్‌పేట శ్మశానవాటికలో బాలకృష్ణ అంత్యక్రియులు నిర్వహించనున్నట్లు ఆయన బంధువు సాయి ప్రసాద్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఊరట మూడు కేసులను కొట్టివేసిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సిటీ కోర్టు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదైన మూడు కేసులను కొట్టివేస్తున్నట్లు నాంపల్లి లోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీరామనవమి ర్యాలీ, గత ఎన్నికల్లో చేపట్టిన ప్రచార ర్యాలీల సందర్భంగా సిటీలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని, దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సోషల్ మీడియాలో తప్పుడు స్పీచ్‌లు ఇచ్చారని ఆయనపై పలువురు సిటీలోని ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా రాజాసింగ్ తరుఫు న్యాయవాది కరుణసాగర్ గతవారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు వినిపించారు. పోలీసుల తరుఫున అదనపు పబ్లిక్ ప్రాసీక్యూటర్ ఆర్.శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది. దీంతో గురువారం చేపట్టిన విచారణలో రాజాసింగ్ తరుఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆయనపై నమోదైన మూడు కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎలుకల సమస్య ఉండొద్దు
ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట: పాఠశాలలో ఎలుకల సమస్య ఉండరాదని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య సిబ్బందికి సూచించారు. మూడు రోజుల క్రితం మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థులను ఎలుకలు కరిచిన విషయమై గురువారం ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. పిల్లల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, వార్డన్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ఎలుకలు ఉండడానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటే సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, నాయకులు, పాఠశాల సిబ్బంది నాగిరెడ్డి, ప్రశాంత్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, రాజ్‌శేఖర్‌రెడ్డి, ఖదీర్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అదుపు తప్పి కారు బోల్తా
కొడంగల్ రూరల్: మండల పరిధిలోని పర్సాపూర్ గ్రామ సమీపంలో ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలైన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన ఆరుగురు వ్యక్తులు మహబూబ్‌నగర్‌లో జరిగే పెళ్లి కోసం గురువారం మధ్యాహ్నం బయలుదేరారు. పర్సాపూర్ సమీపంలో ఓ మలుపు దగ్గర ఇన్నోవా కారు అదుపుతప్పి రోడ్డు కింది భాగంలోకి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు సలహా మేరకు తాండూర్ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఇద్దరికి గాయాలు -
మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ
చిలకలగూడ: మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అనుదీప్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ మహ్మద్‌గూడ, శ్రీనివాసనగర్ ప్రాంతాలకు చెందిన పాస్టం నగేష్ (25), నర్సింగ్, శబరి, సాయికిరణ్ స్నేహితులు. నగేష్ శుభకార్యాల్లో బ్యాండ్ వాయించేవాడు. ఈనెల 5న కుటుంబ సభ్యులతో కలిసి మహ్మద్‌గూడలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లిన అతను రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చాడు. అదే సమయంలో స్నేహితుల నుంచి ఫోన్ రావడంతో పది నిమిషాల్లో వస్తానని చెప్పి బయటికి వెళ్లిన అతను తన స్నేహితులు నగేష్, నర్సింగ్, శబరి, సాయికిరణ్‌తో కలిసి పార్శిగుట్టలోని ఓ వైన్‌షాపు వద్ద మద్యం తాగారు. వైన్‌షాపు మూసివేసే సమయంలో మరికొంత మద్యాన్ని కొనుగోలు చేసి మహ్మద్‌గూడలోని ముత్యాలమ్మ ఆలయం వద్దకు వచ్చిన వారు మద్యంతో పాటు గంజాయి సేవించారు. ఈ క్రమంలో పచ్చబొట్టు విషయమై నగేష్, శబరి మధ్య గొడవ జరగడంతో నర్సింగ్ కలుగజేసుకున్నాడు. దీంతో వారు ఒకరినొకరు దూషించుకుంటు గల్లాలు పట్టుకుని ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో నర్సింగ్ చేతికి అందిన కర్రతో నగేష్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో శబరి, సాయికిరణ్ అపస్మారకస్థితిలో పడి ఉన్న నగేష్‌ను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నిందితుడు నర్సింగ్, మృతుడు నగేష్ బంధువులు కావడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నర్సింగ్‌తోపాటు మిత్రులు శబరి, సాయికిరణ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఒకరి మృతి పది నిమిషాల్లో వస్తానని చెప్పి..తిరిగిరాని లోకాలకు.. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
మణికొండ: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. అందుకు అనుగుణంగానే నేరాలు, కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏకంగా సంవత్సరానికి దాదాపు 2 వేల కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందులో ఎక్కువగా భార్యాభర్తల తగాదాలతో పాటు ఆర్థిక, సెలబ్రిటీలు, ఐటీ ఉద్యోగుల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. జనాభాకు అనుగుణంగా ఇప్పటికే నార్సింగి కేంద్రంగా ఏసీపీ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న జన్వాడ, మిర్జాగూడలను కొత్తగా వచ్చిన మోకిల స్టేషన్ పరిధిలోకి మార్చారు. ప్రస్తుత నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోకాపేటలో ఒకటి, పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలోని కొంత భాగంతో ఐటీ జోన్ కేంద్రంగా మరో కొత్త పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ● కోకాపేట నియోపోలీస్లో శరవేగంగా నిర్మాణాలు, ఐటీ సంస్థలు వస్తుండటంతో జనాభా పెరిగిపోతుంది. అనేక రాష్ట్రాల వారే కాకుండ ఇతర దేశాల వారు సైతం వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో కొత్తగా కోకాపేట పేరుతో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ● పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలో ఔటర్ రింగ్ అవతలి ఐటీ జోన్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని ఓ పోలీస్ స్టేషన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటితో పాటు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న బండ్లగూడ పోలీస్‌స్టేషన్, అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సులేమాన్‌నగర్ కేంద్రంగా మరో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. ● దాంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కొత్తగా మరో నాలుగు పోలీస్స్టేషన్లు రాబోయే బడ్జెట్లో మంజూరు అయ్యే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ● ఇప్పటికే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ఉన్న ఔట్‌పోస్టును పూర్తి స్థాయి పోలీస్‌స్టేషన్‌గా ప్రకటించి ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి త్వరలోనే మరిన్ని పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. మారనున్న పరిధి ● నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న కోకాపేట, గండిపేట, ఖానాపూర్ గ్రామాలు కొత్తగా వచ్చే కోకాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోకి తేనున్నట్టు సమాచారం. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న వట్టినాగులపల్లి, నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడ ఐటీ జోన్ ప్రాంతంతో కలిపి గౌలిదొడ్డి, సైబరాబాద్ ఐటీ జోన్ పోలీస్‌స్టేషన్ పేరుతో కొత్త స్టేషన్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. ఇక నార్సింగి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న కిస్మత్పూర్, బండ్లగూడ, హిమాయత్‌సాగర్‌లతో బండ్లగూడ కేంద్రంగా మరో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కానుంది. ● అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సులేమాన్‌నగర్, శాస్త్రీపురం డివిజన్లను కలిపి కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. త్వరలోనే కొత్తగా పోలీస్ సిబ్బంది నియామకం చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుందని, అందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మరో నాలుగు పోలీస్స్టేషన్లఏర్పాటుకు సన్నద్ధం ప్రభుత్వానికి ప్రతిపాదించినపోలీసు ఉన్నతాధికారులు వచ్చే బడ్జెట్లో మంజూరుకు సన్నాహాలు జూన్ వరకు ఏర్పాటుకు రంగం సిద్ధం? -
ఊడ్చిన నిధులెన్నో ?
రెండు నెలల్లోనే రూ.6 లక్షల పెనాల్టీలుసాక్షి, సిటీబ్యూరో: ప్రజల నుంచి వివిధ పన్నుల రూపాల్లో వసూలు చేస్తున్న సొమ్మును జీహెచ్ఎంసీ కొందరు బడా కాంట్రాక్టర్ల పాల్జేస్తున్న వైనమిది. ఏళ్ల తరబడి ఎన్ని కోట్లు వారికి ధారాదత్తం చేశారో కానీ.. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో సదరు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్న స్వీపింగ్ మెషీన్ల పనితీరు బట్టబయలవుతోంది. ప్రధాన రహదారులను శుభ్రపరిచేందుకు జీహెచ్ఎంసీ అద్దె ప్రాతిపదిక స్వీపింగ్ మెషీన్లను నిర్వహిస్తోంది. వాటి కాంట్రాక్టర్లు ఒప్పందం మేరకు ఊడ్చాల్సినంత దూరం ఊడ్చకుండానే, శుభ్రం చేయాల్సిన మేర రోడ్లను శుభ్రం చేయకుండానే ఏడెనిమిదేళ్ల క్రితం రూ.30 కోట్ల నుంచి మొదలు పెట్టి ప్రస్తుతం ఏటా దాదాపు రూ. 47 కోట్లు జీహెచ్ఎంసీ నుంచి పొందుతున్నారు. కానీ.. ఒప్పందం మేరకు పనులు చేయకుండా పైకి కనిపించేందుకు మాత్రమే రోడ్లపై స్వీపింగ్ మెషీన్ల వాహనాలను తిప్పుతూ తూతూమంత్రంగా పనులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాటి పని తీరుపై అనుమానం వచ్చిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సైతం తనిఖీలు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించిన నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీలతో వాటి పనితీరు బట్టబయలవుతోంది. 2 నెలలు.. రూ.6 లక్షల పెనాల్టీలు ఈ సంవత్సరం జనవరి నుంచి నిర్వహించిన తనిఖీల్లో రెండు నెలల్లోనే స్వీపింగ్ మెషీన్లు సరిగ్గా పని చేయకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.6 లక్షల పెనాల్టీలు విధించారు. పలుమార్లు హెచ్చరికల తర్వాత సైతం ఇంతటి ఉల్లంఘనలు జరిగాయంటే.. అంతకుముందు ఎలాంటి పట్టింపు లేని సమయంలో అసలు పనిచేశాయో, లేదో అంచనా వేసుకోవచ్చు. ఆ లెక్కన ఎన్ని కోట్లు కాంట్రాక్టర్ల పరమయ్యాయో ఊహించుకోవచ్చు. గత పాలక మండళ్లలోని కీలకస్థానాల్లో ఉన్న వారి వల్లే.. సదరు కాంట్రాక్టర్లకు ఆ పనుల దక్కాయనే ఆరోపణలు గుప్పుమన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. వాటి పనితీరునూ పట్టించుకోలేదు. తిలాపాపం.. తలా పిడికెడు స్వీపింగ్ మెషీన్ల పని తీరు, తనిఖీలు, వాటి బిల్లుల చెల్లింపులు జోన్ల స్థాయిలో జరుగుతున్నాయి. సంబంధిత సర్కిళ్ల డీసీలు, ఏఎంఓహెచ్‌ల పాత్ర కూడా చెల్లింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సరైన తనిఖీలు చేయకుండా, నిబంధనల ఉల్లంఘనలకు పెనాల్టీలు విధించకుండా కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క నిధులు చెల్లించారనే ఆరోపణలున్నాయి. కొన్ని సర్కిళ్లలో గత రెండునెలల్లోనూ ఎలాంటి పెనాల్టీలు లేకపోవడం విశేషం. అంటే.. ఆ సర్కిళ్లలో స్వీపింగ్ మెషీన్లు కచ్చితంగా పని చేస్తున్నాయో, లేక సంబంధిత తనిఖీల అధికారులు మిలాఖాత్ అయ్యారో వారికే తెలియాలి. 38 మెషీన్లు.. రూ.47 కోట్లు ప్రస్తుతం 38 స్వీపింగ్ మెషీన్లకు ఏటా దాదాపు రూ.47 కోట్లు చెల్లిస్తున్నారు. అయినా రోడ్లపై చెత్త ఉంటోంది. స్వీపింగ్ మెషీన్లతో ఊడిస్తే రోడ్లపై ఎలాంటి చెత్త కనిపించరాదు. కానీ.. పని చేయని చీపుర్లతో ఊడ్చాల్సినంత దూరం ఊడ్చకుండా మమ అనిపిస్తున్నారు. పేరుకు జీపీఎస్ ట్రాకింగ్ అయినా సిస్టమ్ సరిగ్గా లేదని భావించిన కమిషనర్ వాహనాలకు ముందు, వెనుక సీసీ కెమెరాలు అమర్చి పరిశీలించాల్సిందిగా ఆదేశించడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ చర్యలు ప్రారంభించినట్లు సంబంధిత విభాగం పేర్కొంది. రెండు నెలల్లో ఆయా సర్కిళ్లలో విధించిన పెనాల్టీలు సర్కిల్ పెనాల్టీ (రూపాయలు) శేరిలింగంపల్లి 3,80,000 మల్కాజిగిరి 64,000 రాజేంద్రనగర్ 85,000 ఉప్పల్ 25,000 కాప్రా 10,000 హయత్‌నగర్ 10,000 ఫలక్‌నుమా 10,000 కార్వాన్ 15,000 గోషామహల్ 11,000 అల్వాల్ 10,000 బట్టబయలవుతున్న స్వీపింగ్ యంత్రాల పని తీరు ఏళ్ల తరబడి దోచుకున్న ప్రజా ధనమెంతో? -
చెరువుల మరమ్మతులు చేపట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: చెరువులు, కుంటల్లో నీరు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వాటి మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర మత్స్యకారుల, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొరెంకల నర్సింహ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మండల పరిధిలోని రాయపోల్‌లో ముదిరాజ్ సంఘం కార్యాలయం వద్ద మత్స్యకారుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ.. చెరువు నిండినా.. లీకేజీల వల్ల నీరు బయటకు పోతోందన్నారు. దీంతో మత్స్యకారు వృత్తి దారులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.10 లక్షలు బడ్జెట్ కేటాయించి చెరువుల్లో కంప చెట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యం వల్ల మత్స్య సంపద చనిపోతే ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్, రాయపోల్ సొసైటీ అధ్యక్షుడు మైలారం యాదయ్య, కార్యదర్శి రమేష్, పుల్లయ్య, మండల నాయకులు సురేందర్ పాల్గొన్నారు. టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహ -
సద్దుమణిగిన గోశాల వివాదం
మీర్‌పేట: జిల్లెలగూడలోని మత్స్యావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలోని గోశాల వివాదం సద్దుమణిగింది. గోపాలకృష్ణ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఆలయంలో గోశాల నిర్వహిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాలు ఆలయ అధికారులకు తెలపకపోవడంతో గోశాలను తిరిగి అప్పగించాలని అధికారులు, మాజీ ధర్మకర్తలు పలుమార్లు కోరినా ఆయన నిరాకరించాడు. దీంతో బుధవారం గోపాలకృష్ణ, అతనికి మద్దతుగా స్థానిక బీజేపీ నాయకులు ఆలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోశాలను తిరిగి అప్పగిస్తున్నట్లు గోపాలకృష్ణ ఒప్పంద పత్రం ఇవ్వడంతో వివాదం సమసింది. -
ఎల్ఆర్ఎస్ రాయితీపై ప్రచారం చేయండి
ఆస్తిపన్ను వసూలు టార్గెట్ చేరుకోవాలి ● అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పహాడీషరీఫ్: ఎల్ఆర్ఎస్ రాయితీ విషయంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. బుధవారం ఆమె జల్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్, టీపీఓ హబీబున్నీసాలతో పలువిషయాలపై చర్చించారు. ఎల్ఆర్ఎస్కు ఎన్నిదరఖాస్తులు వచ్చాయని ప్రశ్నించారు. ఈ నెల 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వస్తుందనే విషయాన్ని అవగాహన కల్పించాలని చెప్పారు. ఆస్తిపన్ను వసూలుకు 25 రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో లక్ష్యాలను చేరుకునేలా బిల్కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సూచించారు. అనంతరం 2025–26 సంవత్సరానికి గాను రూ.36 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ జ్యోతి, అకౌంటెంట్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిశీలన జల్పల్లి మున్సిపాలిటీలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను బుధవారం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సందర్శించారు. షాహిన్‌నగర్‌లోని ఓ.ఎస్.జూనియర్ కళాశాల, గ్లోరీ జూనియర్ కళాశాలలకు విచ్చేసిన ఆమె ఆయా కేంద్రాల్లో వసతులను పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా చూడాలని ఇన్విజిరేటర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాల వద్ద వసతులు పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్కు సూచించారు. ట్రాఫిక్, ఇతర సమస్యలు లేకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
కార్పొరేటర్లకు స్పోర్ట్స్ మీట్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పాలకమండలి కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ‘స్పోర్ట్స్ మీట్’ నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో కొందరు సభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు జీహెచ్ఎంసీ ఇందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 7 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీల్లో విజేతలకు రూ.10 వేలు, రూ,6 వేలు, రూ.3 వేల నగదు ప్రోత్సాహక బహుమతులతో పాటు ఫైనల్స్‌లో గెలిచిన జట్లకు ఎక్సలెన్స్ అవార్డులు అందజేయనున్నారు. పది అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రస్తుత పాలకమండలికి చివరి సంవత్సరం కావడంతో కార్పొరేటర్ల వినతి మేరకు జీహెచ్ఎంసీ ఇందుకు సిద్ధమైంది. -
● అపురూప వేడుక
చరికొండ వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. రుక్మిణీసత్యభామా సమేత గోవిందుడి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను బ్యాండు మేళాలతో గ్రామంలో ఊరేగించారు. వేదపండితులు చక్రవర్తి శ్రీనివాసచార్యులు, రామచార్యులు, కృష్ణమాచార్యుల బృందం వేదమంత్రోచ్ఛారణ మధ్య కల్యాణం జరిపించారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు మహిళలు, భక్తులు భారీగా తరలివచ్చారు. డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మాజీ సర్పంచ్ నర్సింహ్మగౌడ్, మాజీ ఎంపీటీసీ పాలకూర్ల రాములుగౌడ్, మాజీ ఉప సర్పంచ్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. – కడ్తాల్ -
దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బడంగ్పేట్: కార్యకర్తల శ్రమతో బీజేపీకి దేశవ్యాప్తంగా అనుకూల వాతావరణం నెలకొందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. పార్టీ బడంగ్‌పేట కార్పొరేషన్ అధ్యక్షులు 1, 2 రామకృష్ణారెడ్డి, వీరకర్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా దిమ్మె నిర్మాణానికి భూమి పూజ చేశారు. మహేశ్వరం ఇన్చార్జ్ అందెల శ్రీరాములుయాదవ్తో కలిసి పార పట్టి మట్టి తీశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ మరింత పుంజుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. అనంతరం 23వ డివిజన్లోని శివసాయినగర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్య పరిశీలించారు. కమిషనర్ సరస్వతితో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ యాదగిరి, సామ సంజీవరెడ్డి, వెంకట్‌రెడ్డి, చిత్రం శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, మహిళలు పాల్గొన్నారు. నాగరాజుకు డాక్టరేట్ మంచాల: మంచాలకు చెందిన జాంగళ్ల నాగరాజు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. జాంగళ్ల శివయ్య, జయమ్మ దంపతుల కుమారుడైన ఆయన యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ చదివారు. ప్రొఫెసర్ కె.రమేశ్‌బాబు పర్యవేక్షణలో చేసిన పరిశోధనలకు గానూ ఆయనను అవార్డు వరించింది. నిరుపేద కుటుంబానికి చెందిన నాగరాజు గణిత శాస్త్రంలో డాక్టరేట్ సాధించడంపై మంచాలవాసులు హర్షం వ్యక్తంచేశారు. రోడ్డు దాటుతుండగా.. కంటైనర్ ఢీకొని వ్యక్తి మృతి షాద్‌నగర్ రూరల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కంటైనర్(లారీ) ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కేశంపేట బైపాస్ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుశీల తెలిపిన ప్రకారం.. ఫరూఖ్‌నగర్ మండలం కడియాలకుంట తండాకు పంచాయతీ అనుబంధ గ్రామం తిమ్మాజిపల్లి తండాకు చెందిన శంకర్‌నాయక్(58) పని నిమిత్తం పట్టణానికి వచ్చాడు. సాయంత్రం ఆయన కేశంపేట బైపాస్ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వైపు ప్రయాణిస్తున్న కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్‌నాయక్ తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులున్నారు. మృతుడి కుమారుడు చందు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మట్టి తరలిస్తున్న వాహనాల సీజ్ కేశంపేట: అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బైర్కాన్‌పల్లిలో గురువారం తెల్లవారుజామున కావలి రాఘవేందర్ అనే వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పెట్రోలింగ్‌లో పోలీసులు అక్కడి చేరుకున్నారు. అప్పటికే మట్టి నింపిన టిప్పర్లను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పెట్రోలింగ్ డ్యూటీ కానిస్టేబుల్ అశోక్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు. -
పరీక్ష కేంద్రం చూసేందుకు వెళ్తూ..
రోడ్డు ప్రమాదానికి గురైన ఇంటర్ విద్యార్థి తాండూరు టౌన్: తెల్లారితే పరీక్ష ఉండటంతో సెంటర్ ఎక్కడ ఉందో చూసేందుకు బైకుపై వెళ్తున్న ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. తాండూరు మండలం సిరిగిరిపేట్‌కు చెందిన శ్రీకాంత్ అనే విద్యార్థి తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో చూసేందుకు బైకుపై ఇందిరాచౌక్ నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. రాయల్కాంటా వద్ద టర్నింగ్ తీసుకుంటున్న జనగాం గ్రామానికి చెందిన పట్నం సుధాకర్ బైకు ఢీకొన్నాయి. దీంతో కిందపడిన శ్రీకాంత్ తలకు తీవ్ర గాయమైంది. సమాచారం మేరకు 108లో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ ఘటనపై ఇంకా ఫిర్యా దు అందలేదని పట్టణ పోలీసులు తెలిపారు. -
ఎయిర్‌పోర్టులో ముంబై పోలీస్ మృతి
శంషాబాద్: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన చెందిన పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఆర్జీఐఏ పోలీస్ ఔట్‌పోస్టు సీఐ జె.బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై కమిషనరేట్ కాలాచౌకి పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్ఐ అశోక్ శీతల్, హెడ్ కానిస్టేబుల్ మహేష్ రామారావు (49)తో పాటు మరో కానిస్టేబుల్ అశ్విని ఓ కేసు దర్యాప్తు కోసం ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌కు విమానంలో వెళ్తున్నారు. ట్రాన్సిట్ విమానం కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఆగిన సమయంలో గేట్ 4 వద్దకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ మహేష్ రామారావుకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఎయిర్‌పోర్టులో అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పెడ్లర్ అరెస్ట్: 10 కిలోల గంజాయి స్వాధీనం
అడ్డగుట్ట: ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి నగరంలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఓ పెడ్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ తెల్పిన మేరకు...ఒడిశా రాష్ట్రం గంజమ్ జిల్లాకు చెందిన భూషణ్ పళాయి అలియాస్ రాజు 2007లో నగరానికి వచ్చి ఇక్కడ వివిధ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవలి కాలంలో జేసీబీ డ్రైవర్‌గా కూడా పని చేసిన భూషణ్‌కు కన్స్ట్రక్షన్ సైట్లో కొందరు కూలీలు గంజాయి తీసుకోవడం గమనించాడు. ఈ క్రమంలో తన ఊరు నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడి కూలీలకు విక్రయించాలని అనుకున్నాడు. అందులో భాగంగా ఒడిశాలో తనకు పరిచయస్థుడైన రాహుల్ అనే సప్లయర్ నుంచి రూ.5 వేలకు కిలో గంజాయి చొప్పున కొనుగోలు చేసి హైద్రాబాద్‌లో అధిక డబ్బులకు విక్రయించేవాడు. చిన్న చిన్న శాచెట్ల నుంచి 100 గ్రాములు, 250 గ్రాముల వరకు గంజాయి విక్రయాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదించేవాడు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న హైద్రాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, తుకారాంగేట్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఈ నెల 3న ఆర్ఆర్సీ గ్రౌండ్ సమీపంలోని రైలుపట్టాల పక్కన ఖాళీ స్థలం వద్ద భూషణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద దొరికిన 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, దర్యాప్తులో భాగంగా భూషణ్ నివసించే కోకాపేటలోని ఇంటికి వెళ్లి అక్కడ నిలువ ఉంచిన సుమారు పది కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా నిందితుడి నుంచి 10 కిలోల గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనం, వెయిట్ మెషిన్, సెల్‌ఫోన్, రూ.1,210 నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో హెచ్ఎన్ఈడబ్ల్యూ ఇన్స్పెక్టర్ జీఎస్ డేనియల్, ఎస్ఐ వెంకటరాములు, ఎస్ఐ కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
చెల్లెలి స్నేహితురాలిపై వేధింపులు
యువకుడిపై కేసు యాచారం: చెల్లెలి స్నేహితురాలిని వేధిస్తున్న ఓ యువకుడిపై యాచారం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గడ్డమల్లయ్యగూడ గ్రామానికి చెందిన ఓ యువతి, మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మరో యువతి ఇబ్రహీంపట్నంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. ఆరుట్లకు చెందిన యువతి అన్న రావుల శ్రీకాంత్ గడ్డమల్లయ్యగూడకు చెందిన యువతికి తరచూ ఫోన్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. సదరు యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా శ్రీకాంత్‌లో మార్పు రాకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యాచారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బావిలో దూకి వృద్ధుడి బలవన్మరణం మంచాల: అనారోగ్యం కారణంగా ఓ వృద్ధుడు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంచాల ఎస్ఐ సతీశ్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన నలర్ల అంజయ్య(75) కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి ఆయనకు కడుపునొప్పి వచ్చింది. అది భరించలేని ఆయన ఇంట్లో చెప్పకుండా వెళ్లి గ్రామంలోని తుంబావిలోకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన గ్రామస్తులు మృతుడి కుమారుడు లింగస్వామికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేపు దర్యాప్తు చేస్తున్నారు. స్కూటీ అదుపుతప్పి.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ జగదీశ్వర్ తెలిపిన ప్రకారం.. కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి గ్రామానికి చెందిన భువనగిరి శివకుమార్(55), జమ్మడ రాములుతో కలిసి స్కూటీపై ఉదయం ఇబ్రహీంపట్నం నుంచి కర్ణంగూడ మీదుగా చర్లపటేల్‌గూడకు వెళ్తున్నారు. శ్మశాన వాటిక వద్దకు రాగానే దిచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కన చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్‌కు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా రాములు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య శంషాబాద్ రూరల్: ఔటర్ రింగు రోడ్డు ఫెన్సింగ్ రాడ్‌కు ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి సమాచారం మేరకు... తొండుపల్లి శివారులో ఔటర్ రింగు రోడ్డు కింద రైల్వే ట్రాక్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకున్నట్లు ఈ నెల 3న రాత్రి స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి(25)కి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. మృతుడి ఒంటిపై నీలిరంగు టీ షర్టు, నలుపు రంగు ప్యాంటు ఉన్నాయి. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వివరించారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం పీఅండ్‌టీ కాలనీలో అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత బండ్లగూడ: అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని నేలమట్టం చేస్తామని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర హెచ్చరించారు. కార్పొరేషన్ పరిధిలోని పీఅండ్‌టీ కాలనీలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను బుధవారం మున్సిపల్, టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా సెట్ బాక్స్‌లు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామన్నాని కమిషనర్ శరత్చంద్ర స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని వాటిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలందరూ నిబంధనలకు అనుగుణంగా తమ నిర్మాణాలను చేపట్టుకోవాలని సూచించారు. నిర్మాణాలు చేపట్టే సమయంలో పూర్తి అనుమతులు తీసుకోవాలని... ఆ తర్వాతే నిర్మాణాలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సోషల్ మీడియాలో పోస్టింగ్‌లపై వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు
చైతన్యపురి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తులపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు బండారు వెంకటరమణ, నాయకులు మానుకొండ రవీందర్‌రెడ్డి, అక్కోలు శివకుమార్, భరత్‌లు బుధవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ స్టార్ మానియా అనే ఇన్‌స్ట్రాగామ్ ఐడీ ద్వారా పెట్టిన పోస్టు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని వారు ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇన్స్పెక్టర్ సైదిరెడ్డిని వారు కోరారు. ఫిర్యాదు స్వీకరించామని, లీగల్ ఒపీనియన్ తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
శంషాబాద్ రూరల్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన ఎంస్ఎంఈ ఔట్రీచ్ క్యాంపులతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు నూతన శక్తిని ఇస్తుందని జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ఎం.శ్రీలక్ష్మీ అన్నారు. బ్యాంకు సైఫాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మండలంలోని ముచ్చింతల్‌లో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టు ఆవరణలో బుధవారం మెగా ఎంఎస్ఎంఈ ఔట్రీచ్ క్యాంపు నిర్వహించారు. ఎంస్ఎంఈ ఉత్పాదనలపై బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించారు. సుమారు రూ. వంద కోట్లకు సంబంధించిన రుణ మంజూరు పత్రాలను 50 మంది ఖాతాదారులకు అందజేశారు. ఎంఎస్ఎంఈ సెక్టార్ రుణాలు దేశంలో 30 శాతం జీడీపీతో దేశానికి వెన్నుముకంగా ఉన్నామని ఎంఎస్ఎంఈ వెర్టికల్ సీఓ ముంబయి జనరల్ మేనేజర్ జి.కె.సుధాకర్‌రావు అన్నారు. వివిధ రకాల ఉత్పత్తుల తయారీ రంగంలో 45 శాతం వాటాతో పాటు దేశంలో 65 శాతంపైగా యువతకు జీవనోపాధి కల్పిస్తుందన్నారు. ఇలాంటి మెగా క్యాంపులను దేశంలోని 157 కేంద్రాల్లో మార్చి 3 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంకు హైదరాబాద్ జనరల్ మేనేజర్ ఆర్.ఎల్.పట్నాయక్, డీజీఎం సోనాలిక, ఏజీఎంలు రవి, జగదీశ్, లేపాక్షి తదితరులు పాల్గొన్నారు.మెగా ఎంఎస్ఎఈ క్యాంపులో రుణాల అందజేత -
ఇక కొత్త కొత్తగా..
సిటీ ఆర్టీసీ..ఆర్టీసీయే కొనుగోలు చేయాలి... ఇలా ఉండగా, కేవలం ప్రైవేట్ సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ఆర్టీసీని ప్రభుత్వం బలిపశువును చేస్తోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ రూట్లలో ప్రైవేట్ బస్సులను నడిపి భారీ మొత్తంలో వాటికి అద్దెలు చెల్లించడం చాలా కష్టమని, ఆర్టీసీయే సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసుకునేవిధంగా నిధులను అందజేయాలని వివిధ సంఘాలకు చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్లో దశలవారీగా 2800 ఎలక్ట్రిక్ బస్సులు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇప్పుడు ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రానున్న మూడేళ్లలో 2800 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకనుగుణంగా నగరంలో డిపోల విస్తరణకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ప్రస్తుతం 28 డిపోలు ఉన్నాయి. ఒక్కో డిపోలో కనిష్టంగా 100 నుంచి 150 వరకు బస్సులు ఉన్నాయి. కొన్ని చోట్ల బస్సులను నిలిపేందుకు తగిన స్థలం లేకపోవడంతో డిపోల బయట పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల కోసం కొత్తగా మరో 10 డిపోలను ఏర్పాటు చేయాల్సి ఉంది. బస్సుల నిర్వహణ, చార్జింగ్ స్టేషన్ల కోసం అదనపు డిపోలు అవసరమని అధికారులు గుర్తించారు. చార్జింగ్ సామర్ధ్యం పెంచేలా... కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం అద్దె ప్రాతిపదికన ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. పీఎం ఈ డ్రైవ్ (పధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్) పథకంలో భాగంగా ఇవి రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ చాలావరకు ప్రైవేట్ సంస్థల చేతుల్లోనే ఉంటుంది. కానీ వాటికి పార్కింగ్, విద్యుత్ చార్జింగ్ సదుపా యం కల్పించవలసిన బాధ్యత ఆర్టీసీపైన ఉంది. ప్రస్తుతం ఒక్కో డిపోలో సామర్థ్యానికి మించిన బస్సులు ఉన్నాయి. వాటిని జిల్లాలకు తరలించి ఎలక్ట్రిక్ బస్సులతో డిపోలను భర్తీచేస్తారు. డీజి ల్ బస్సుల తరహాలో ఎలక్ట్రిక్ బస్సులను పార్కింగ్ చేయడం సాధ్యం కాదు. వాటికి తగినంత స్థలం ఉండాలి. అలాగే ఇప్పుడు ఒక బంక్ వద్ద అన్ని బస్సులకు కొద్ది గంటల్లోనే డీజి ల్ నింపే అవకాశం ఉంది. కానీ ఎలక్ట్రిక్ బస్సులకు విద్యుత్ చార్జింగ్కు ఎక్కువ సమయం పడుతుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఒకే సారి ఎక్కువ బస్సులకు చా ర్జింగ్ చేసే సదుపా యం ఉండాలి. ఇందుకోసం ప్రతి డిపోలో కనీసం 20 చార్జింగ్ స్టేషన్లను ఏర్పా టు చేసి ఆ తరువాత అవసరానికనుగుణంగా విస్తరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఒక్కో డిపోలో 75 నుంచి 80 బస్సులకు మాత్రమే పా ర్కింగ్, చార్జింగ్ సదుపాయం ఉండేవిధంగా కొత్త డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం ఆర్టీసీకి ఉన్న సొంత స్థలాలతో పాటు ఓఆర్ఆర్ చుట్టుపక్కల డిపోల కోసం ప్రభు త్వం నుంచి స్థలాలను కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం కొత్తగా రానున్న ఎలక్ట్రిక్ బస్సులకు ఆయా సంస్థలే డ్రైవర్లను ఏర్పాటు చేస్తాయి. దీంతో ఆర్టీసీకి ప్రత్యేకంగా డ్రైవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న డ్రైవర్ల స్థానంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో కొత్తవాళ్లను నియమించుకొనేందుకు సన్నాహాలు చేపట్టారు. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరిగిన కొద్దీ ఆర్టీసీ డ్రైవర్ల అవసరం తగ్గుముఖం పడుతుంది. దీంతో ఇంకా సర్వీసు ఉన్నవాళ్లను జిల్లాల్లోని డిపోలకు బదిలీ చేస్తారు. అదే సమయంలో పదవీకాలం ముగిసిన వాళ్ల స్థానంలో మాత్రం డీజిల్ బస్సుల కోసం తాత్కాలిక పద్ధతిపైన నియమిస్తారు. రానున్న రోజుల్లో ఆ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టినప్పుడు ఈ తాత్కాలిక డ్రైవర్ల అవసరం కూడా ఉండదు. అలాగే ఆర్టీసీ డిపోల్లో మెకానిక్‌లు, శ్రామిక్‌ల నియామకాలు సైతం నిలిచిపోనున్నాయి. ‘ఎలక్ట్రిక్ బస్సులను పెంచే క్రమంలో ఆర్టీసీ డ్రైవర్లను స్వచ్ఛంద పదవీ విరమణకు సైతం ప్రోత్సహించనున్నట్లు ఒక అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలోని వివిధ మార్గాల్లో 254 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో ఆర్టీసీ కండక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆయా సంస్థలకు చెందిన డ్రైవర్లే బస్సులు నడుపుతున్నారు. హైదరాబాద్ సెంట్రోల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) డిపోలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో అక్కడ పని చేసే డ్రైవర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు తదితర సిబ్బందిని ఇతర డిపోల్లో సర్ధుబాటు చేయవలసి వచ్చింది. తాజాగా హయత్‌నగర్–2 డిపోలో కొత్తగా 45 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. దశలవారీగా మరిన్ని బస్సులు రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం కొత్తగా 10 డిపోలు ఒక్కో డిపోలో కనీసం 20 చార్జింగ్ స్టేషన్లు ఔట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియామకానికి సన్నాహాలు క్రమంగా డీజిల్ బస్సుల ఉపసంహరణ -
హాల్ టికెట్ అందజేతలో ఆలస్యం
పరిగి: కళాశాల ఫీజు కట్టకట్టలేదనే కారణంతో సకాలంలో తనకు హాల్ టికెట్ ఇవ్వలేదని, దీంతో పరీక్ష రాయలేకపోయానని ఇంటర్ ఓ విద్యార్థి వాపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీసాయి ఒకేషనల్ జూనియర్ కాలేజీలో నాగేశ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్టియర్ బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసేందుకు మంగళవారం హాల్ టికెట్ కోసం కళాశాలకు వెళ్లాడు. ఫీజు చెల్లించని వారు తర్వాత రావాలని సిబ్బంది సూచించడంతో సాయంత్రం వేళ ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ తీసుకుని, సెంటర్‌కు చేరుకునే సరికి సమయం 9:20 కావచ్చింది. దీంతో నిర్వాహకులు అతన్ని పరీక్షకు అనుమతించలేదు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తాను పరీక్ష మిస్సయ్యానని బాధితుడు ఆరోపించాడు. ఆ విషయంపై ప్రిన్సిపల్ శ్రీశైలంను వివరణ కోరగా.. విద్యార్థి ఉదయం 8:55 నిమిషాలకు హాల్‌టికెట్ కోసం వచ్చాడని, దీంతోనే ఆలస్యం జరిగిందని తెలిపారు. పరీక్ష మిస్సయిన ఇంటర్ విద్యార్థి -
కులగణన చరిత్రాత్మకం
శంషాబాద్: కులగణన చేయడం చరిత్రాత్మక విషయమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ముదిరాజ్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని ఎమ్మెఎస్ గార్డెన్లో బుధవారం ముదిరాజ్ కృతజ్ఞత మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కులగణతో ముదిరాజ్‌ల సంఖ్య స్పష్టమైందన్నారు. భవిష్యత్తులో రాజకీయ రంగంలో ముదిరాజ్‌లకు అపారమైన అవకాశాలు దక్కుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేపట్టిన కులగణన ముదిరాజ్‌ల సంఖ్యను బహిర్గత పరిచిందని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్‌లకు విస్తృత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రివర్గంలో కూడా ముదిరాజ్‌ల ప్రాధాన్యం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
హుండీ చోరీకి విఫలయత్నం
కొందుర్గు: ఆలయంలో చోరీకి యత్నించిన ఓ దుండగుడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామం సోమలింగేశ్వర స్వామి వారి ఆలయంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి సాయికుమార్ బుధవారం ఉదయం ఆలయ పరిసరాల్లో ఎవరూ లేని సమయంలో హుండీలోని డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ వీరన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అమెరికాలో కాల్పులు.. కేశంపేట యువకుడి మృతి
కేశంపేట: ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన ఓ విద్యార్థి.. అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. ఈ ఘటన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన వ్యాపారి గంప రాఘవులు, రమాదేవి దంపతులకు ప్రవీణ్‌కుమార్ (27), గాయత్రి సంతానం. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రవీణ్.. అనంతరం 2023 ఆగస్టులో అమెరికాలోని మిల్వాకీ పట్టణంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో ఎంఎస్ చదివేందుకు వెళ్లాడు. అదే పట్టణంలోని ఓ మాల్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 18న ఇంటికి వచ్చిన ప్రవీణ్ జనవరి 20న తిరిగి అమెరికా వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.50 నిమిషాలకు ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. అయితే కుటుంబ సభ్యులు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తిరిగి ఉదయాన్నే వాట్సాప్ కాల్ చేయమని మెసేజ్ పెట్టినా ప్రవీణ్ నుంచి రిప్లయ్ రాలేదు. దీంతో ఉదయం 7 గంటలకు కుమారుడి ఫోన్‌కు కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన అవతలి వ్యక్తులు ప్రవీణ్ వివరాలను అడగటంతో సైబర్ నేరగాళ్లు అనుకుని ఫోన్ కట్ చేశారు. మరోసారి ప్రవీణ్‌తో కలిసి రూంలో ఉండే అతని మిత్రులకు ఫోన్ చేశారు. కొద్దిసేపటి తర్వాత వివరాలు తెలుసుకున్న వారు గుర్తుతెలియని వ్యక్తులు మాల్లో ప్రవీణ్‌ను గన్‌తో కాల్చారని, బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు కుప్పకూలారు. ప్రవీణ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అండగా ఉంటాం: డీకే అరుణ అమెరికాలో మృతిచెందిన ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి బుధవారం ప్రవీణ్ తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. అనంతరం ఎంపీతో ఫోన్లో మాట్లాడించారు. వివరాలను అందిస్తే మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తెచ్చేందుకు కృషి చేస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు. -
తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలు
షాద్‌నగర్: పల్లెల్లో ప్రజలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి అన్నారు. షాద్‌నగర్ పరిధిలోని హాజిపల్లి గ్రామంలో టీ ఫైబర్ ద్వారా అందిస్తున్న ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలను ఆయన ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. పల్లెల్లో ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ కీలకంగా మారిందన్నారు. ప్రతి పని, సేవలకు తోడు టీవీ, సెల్ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం ఇంటర్నెట్తోనే ముడిపడి ఉన్నాయన్నారు. ప్రభుత్వం తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటితోపాటు కార్యాలయాల్లో ఆన్లైన్ సేవలు టీ ఫైబర్ నెట్ ద్వారా సులభం అవుతాయన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా హాజిపల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, త్వరలో అన్ని గ్రామాల్లో సేవలను విస్తరించనున్నట్లు వివరించారు. అనంతరం గ్రామంలోని ఇంటర్నెట్ ఉన్న ఇళ్లకు, పూరి గుడిసెల్లోకి వెళ్లి వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఫైబర్ ఎండీ ప్రవీణ్, డీపీఓ సురేష్‌మోహన్, ఆర్డీఓ సరిత, తహసీల్దార్ పార్థసారధి, ఎంఈఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ● సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి -
స్థానిక సమస్యలపై పోరుబాట
యాచారం: స్థానిక సమస్యలపై సీపీఎం పోరుబాటకు సిద్ధమైందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే మొదటిసారి యాచారం మండలం నక్కర్తమేడిపల్లిలో మంగళవారం పర్యటించారు. పలు కాలనీల్లో తిరుగుతూ.. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గ్రామాల్లో పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని, పరిష్కారం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని తెలిపారు. ఫార్మాసిటీ పేరుతో గత బీఆర్ఎస్ సర్కార్ ఆయా గ్రామాల్లో 9 వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములు సేకరించిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేసి రైతులకు అండగా ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తామని చెప్పడం న్యాయం కాదన్నారు. గత ప్రభుత్వం లానే రేవంత్‌రెడ్డి సర్కార్ కూడా రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన పట్టా భూముల రికార్డులను తిరిగి రైతుల పేర్లపై మార్చాలని హైకోర్టు ఆదేశించినా అధికారుల్లో చలనం లేదని విమర్శించారు. ఫార్మాసిటీని రద్దు చేశారా.. ఫ్యూచర్‌సిటీని ఏ విధంగా నిర్మిస్తున్నారో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా భూ బాధితులకు అండగా ఉంటామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు పి.అంజయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫార్మా భూ బాధితులకు అండగా ఉంటాం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
నిఘా నీడలో..
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● జిల్లాలో పరీక్ష కేంద్రాలు : 185 ● మొదటి సంవత్సరం విద్యార్థులు : 80,409 ● ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్ : 78,395 ● మొత్తం హాజరయ్యేవారు : 1,58,804 ● సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలుషాద్నగర్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కీలకమైన ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా ప్రత్యేక స్క్వాడ్ బృందాలను నియమించారు. ద్వితీయ సంవత్సరం గురువారం నుంచి.. ఈ నెల 22 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి, ద్వితీయ సంవత్సరం గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 185 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి సంవత్సరం 80,409 మంది, ద్వితీయ సంవత్సరం 78,395 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించడంతో పాటు, అన్ని గదుల్లో లైట్లు, ఫ్యాన్లు ఉండేలా, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పటిష్టమైన పర్యవేక్షణ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 185 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 185 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 45 మంది కస్టోడియన్ అధికారులు, 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 10 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. లీకేజీకి ఆస్కారం లేకుండా ఈసారి కొత్తగా ప్రతి ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించినట్లు అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేస్తే అది ఏ కేంద్రానికి సంబంధించిందో వివరాలు తెలుస్తాయి. హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ చాలా మంది విద్యార్థులు పరీక్ష కేంద్రం ఎక్కుడుందో తెలుసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుంటారు.దీన్ని గుర్తించిన ఇంటర్ బోర్డు హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించింది. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామాతో పాటు ఫొ టోలు కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్‌తో అనుసంధానమై ఉండటంతో ఉన్నచోట నుంచే ఎంతసమయంలో పరీక్ష కేంద్రానికి చేరుకోగలరో తెలుస్తుంది. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ప్రశ్నపత్రాల పంపిణీ నుంచి విద్యార్థుల దగ్గర సమాధాన పత్రాలు తీసుకునే వరకు ప్రతి అంశాన్ని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. కమాండ్ కంట్రోల్ సిస్టం ద్వారా ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయానికి అనుసంధానించే ఈ కెమెరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు. మౌలిక సదుపాయాలువేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. తాగునీటి వసతితో పాటు అత్యవసర వైద్య సాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎండల నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. పకడ్బందీ చర్యలు ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. చేతి గడియారాలకు అనుమతి ఉండదు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాం. – వెంక్యా నాయక్, డీఐఈవో -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
● ఏసీపీ రంగస్వామిషాద్నగర్రూరల్: సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని ఏసీపీ రంగస్వామి అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని చించోడ్లో గ్రామస్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు. ఏదైనా ఘటన చోటు చేసుకుంటే నేరస్తులను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. గ్రామస్తులు ఐక్యంగా ఉండి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని, గ్రామంలో మద్యపాన నిషేధం కొనసాగడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలని మత్స్యకారుల, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొరెంకల నర్సింహ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మండల కమిటీ సమావేశం మంగళవారం సంఘం మండల అధ్యక్షుడు రవణమోని రాజు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరెంకల నర్సింహ మాట్లాడుతూ.. మత్స్యకారుల, మత్స్యకార్మిక సంఘం సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరారు. జల వనరుల్లో ఉన్న మత్స్య సంపదప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యంతో చనిపోతే ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం బోర్లు వేయించి మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చెనమోని శంకర్ మాట్లాడుతూ.. మత్స్యకార సొసైటీల బాగోగులు చూడడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాని విమర్శించారు. కార్యక్రమంలో రాయపోల్ సొసైటీ అధ్యక్షుడు మైలారం యాదయ్య, అంకర్ల రమేష్, శేరిగూడ సొసైటీ కార్యదర్శి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
భారతదేశం ఔషధ మొక్కలకు పుట్టినిల్లు
కడ్తాల్: అనాది నుంచి భారతదేశం ఔషధ మొక్కలకు పుట్టినిల్లు అని బెంగళూరుకు చెందిన ఆయుర్వేద చికిత్స నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్ శర్మ పేర్కొన్నారు. అన్మాస్‌పల్లి పంచాయతీ పరిధిలోని ఎర్త్ సెంటర్లో కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ప్రకృతి ఒడిలో ఒక రోజు పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రావిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు పర్యావరణవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ.. ఔషధ మొక్కల ఔన్నత్యాన్ని, ప్రాముఖ్యతను గుర్తించి జీవన గమనంలో భాగం చేసుకోవాలని సూచించారు. సీజీఆర్ చైర్పర్సన్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో ఔషధ మొక్కలు పెంచుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ నిర్వాహకుడు మాధవరెడ్డి, ఉపాధ్యాయులు శేఖర్, జగదీశ్, సీజీఆర్ ప్రతినిధులు జ్ఞానేశ్వర్, నాగేశ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
విజన్ లేని ముఖ్యమంత్రి పాలన
హుడాకాంప్లెక్స్: రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్ లేకుండా పాలిస్తున్నారని, పది రూపాయల పనికి వందసార్లు ప్రభుత్వాన్ని అడగాల్సిన దుస్థితి ఏర్పడిందని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. సరూర్‌నగర్ డివిజన్ హుడాకాంప్లెక్స్‌లో మంగళవారం ఆమె పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అధికారులను బాధ్యతగా పనిచేయించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలని.. తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎన్నికలప్పుడు మాట్లాడినట్లే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలపై దృష్టి పడితే బాగుంటుందని హితవు పలికారు. వేసవి సమీపిస్తున్నందున తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు లోకసాని కొండల్‌రెడ్డి, దర్పల్లి అశోక్, సుశీలరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహ్మద్ ఇస్మాయిల్, సాలమ్మ, శృతి, సునీల్‌యాదవ్, ఆకుల అరుణ్, రాజు యాదవ్, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
హాల్‌టికెట్ కోసం విద్యార్థి ఆందోళన
● పూర్తి ఫీజు చెల్లించకపోవడంతో యాజమాన్యం నిరాకరణ ● విషయం వైరల్ కావడంతో ఇచ్చేసిన వైనంమీర్పేట: ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అవుతుండగా పరీక్షకు సిద్ధం కావాల్సిన ఓ విద్యార్థి హాల్‌టికెట్ ఇవ్వాలని కళాశాల ఎదుట బైఠాయించాడు. ఈ సంఘటన మీర్‌పేట పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. మీర్‌పేట జిల్లెలగూడకు చెందిన వెంకట పవన్ బాలాపూర్ చౌరస్తాలోని శ్రీ వాగ్ధేవి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పూర్తి ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో కళాశాల యాజమాన్యం హాల్‌టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో వెంకట పవన్ మంగళవారం రూ.5వేలు చెల్లించాడు. పూర్తి ఫీజు చెల్లిస్తే గానీ హాల్‌టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో పవన్ కళాశాల ఎదుటే కూర్చొని హాల్‌టికెట్ ఇవ్వాలని వేడుకున్నాడు. విషయం కాస్తా స్థానికంగా వైరల్ కావడంతో యాజమాన్యం రూ.5వేలు తిరిగిచ్చేయడంతో పాటు హాల్‌టికెట్ అందజేసింది. -
పసికందును ఇవ్వాలంటే పైసలివ్వాల్సిందే ..
● ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ ● బాధితుడి ఫిర్యాదుతో అప్పగింత షాద్‌నగర్: అప్పుడే పుట్టిన పసికందును కుటుంబ స భ్యులకు అందజేసేందుకు ఆ స్పత్రి సిబ్బంది డబ్బులు ఇవ్వా లని డిమాండ్ చేసిన ఘటన షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన బోడ అశోక్ తన భార్య స్రవంతికి పురిటి నొప్పులు రావడంతో మంగళవారం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయడంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అంతలోనే ప్రసూతి నిమిత్తం ఆపరేషన్ చేసినందుకు, పసికందును ఇచ్చేందుకు రూ.1,500 ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేశా రు. తన వద్ద రూ.వెయ్యి మాత్రమే ఉన్నాయని చెప్పినా వదల్లేదు. చేసేదిలేక న్యాయం చేయాలని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అశోక్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశాడు. సూపరింటెండెంట్ సిబ్బందిపై సీరియస్ అవడంతో బిడ్డను అందజేశారు. కీసరగుట్ట హుండీ లెక్కింపు కీసర: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి రూ.92,49,961 ఆదాయం సమకూరింది. ప్రసాదాలు, వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా రూ.63,51,060 ఆదాయం రాగా, హుండీ ఆదాయం రూ.28,98,901 వచ్చిందని, ఆలయ చైర్మన్ తటాకం నారాయణ, ఈవో సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం దేవాలయం మహామండపంలో హుండీని లెక్కించారు. -
పోగొట్టుకున్న సెల్ఫోన్ల అప్పగింత
కడ్తాల్: నూతన సాంకేతిక పరిజ్ఞానం(సీఈఐఆర్)తో పోగొట్టుకున్న సెల్ఫోన్లను వెతికి పట్టుకుని సీఐ శివప్రసాద్ బాధితులకు అందజేశారు. మండల పరిధిలోని గోవిందాయిపల్లికి చెందిన జంగయ్య, ఎక్వాయిపల్లికి చెందిన నర్సింహగౌడ్, తలకొండపల్లి మండలం పడకల్‌కు చెందిన హరికృష్ణ, కందుకూర్కు చెందిన సాయికుమార్లు ఇటీవల వేర్వేరు చోట్ల తమ సెల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈ మేరకు వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఈఐఆర్ అప్లికేషన్ ఉపయోగించి సెల్ఫోన్లను వెతికి పట్టుకున్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు అప్పగించారు. ఎవరైనా సెల్ఫోన్లను పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఫోన్ వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడంతో తిరిగి పొందే అవకాశం ఉంటుందని సీఐ తెలిపారు. -
గూగుల్‌ను వాడి.. గుడులలో దోపిడీ!
శివారు ప్రాంతాల్లోని ఆలయాలే టార్గెట్ అబ్దుల్లాపూర్‌మెట్: చోరీలు పాల్పడేందుకు సాంకేతికతను ఎంచుకున్నారీ దుండగులు. గ్రామ శివారుల్లో ఉండే దేవాలయాలనే లక్ష్యంగా చేసుకున్నారు. గూగుల్మ్యాప్లో అప్లోడ్ చేసే దేవతామూర్తులకు అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలను అపహరించేందుకు పక్కా ప్రణాళికతో తెగబడ్డారు. నగర శివారులోని ఘట్కేసర్, దుండిగల్, బీబీనగర్, ఇబ్రహీంపట్నం, జవహర్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధుల్లోని దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దుండగులు ఎట్టకేలకు వాహన తనిఖీ చేపడుతున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు చిక్కారు. సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వాహన తనిఖీ చేపడుతున్న పోలీసులకు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తుల తీరు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని బ్యాగును తనిఖీ చేయగా అందులో బిస్కెట్ల రూపంలో ఉన్న 20 కిలోల వెండి కనిపించింది. దుండగులిద్దరినీ స్టేషన్‌కు తీసుకుని విచారించగా మేడ్చల్‌లోని పోలీస్ క్వార్టర్స్ వెనకాల నివసించే మహ్మద్ ఇంతియాజ్ షరీఫ్, మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాబ్‌పేట గ్రామానికి చెందిన రంగా వేణులుగా గుర్తించారు. ఇద్దరు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దేవాలయల్లో దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. అందుకు గూగుల్‌మ్యాప్‌ను వినియోగించుకున్నారు. విజయవాడలో విక్రయించి నివాస గృహాలకు దూరంగా, గ్రామ శివారుల్లో ఉండే ఆలయాలను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతూ బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకు పోయారు. వాటిని కరిగించి బిస్కెట్ల రూపంలో విజయవాడలో విక్రయించి సొమ్ము చేసుకుంటూ జల్సాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల మండలంలోని పిగ్లీపూర్ గ్రామంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో దొంగతనం చేసిన వెండి ఆభరణాలను కరిగించి బిస్కెట్లుగా మార్చి విజయవాడలో విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. పిగ్లీపూర్తో పాటు ఘట్కేసర్, దుండిగల్, బీబీనగర్, ఇబ్రహీంపట్నం, జవహర్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధుల్లోని దేవాలయాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు దుండగుల నుంచి 20 కిలోల వెండి, ద్విచక్ర వాహనాన్ని స్వాఽఽధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. బంగారు, వెండి ఆభరణాల అపహరణ దొంగిలించిన సొత్తుతో జల్సాలు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు చిక్కిన దుండగులు 20 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం -
పుష్కరిణిలో మునిగి వ్యక్తి మృతి
చేవెళ్ల: మండల కేంద్రంలోని శ్రీబాలాజీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ జాతరకు వచ్చిన ఓ భక్తుడు స్నానం చేసేందుకు పుష్కరిణిలో దిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోనూరుకు చెందిన కురువ బిచ్చప్ప(45) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బతుకుదెరువు కోసం నాలుగేళ్ల కిత్రం భార్య శివలీల, కూతురుతో కలిసి అత్తగారి గ్రామమైన చేవెళ్ల మండలం కిష్టాపూర్ వచ్చాడు. ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మంగళవారం చేవెళ్లలో జరుగుతున్న జాతరకు వెళ్దామని భార్యతో అన్నాడు. సాయంత్రం వెళ్దామని చెప్పిన ఆమె.. కూలీ పనికి వెళ్లింది. దీంతో బిచ్చప్ప ఒక్కడే చేవెళ్లకు చేరుకున్నాడు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని పుష్కరిణిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారడంతో ఈత రాక నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న పలువురు భక్తులు ఇది గమనించి బయటకు తీయగా, అప్పటికే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శివలీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. స్నానం చేసే క్రమంలో ప్రమాదం మృతుడు గోనూరువాసి -
గోడకు కన్నం వేసి వైన్స్‌లో చోరీ
షాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు ఓ వైన్ షాపు గోడను పగలగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మూడేళ్లుగా మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన కప్ప హరిబాబు నాగర్‌గూడ దుర్గా వైన్స్‌లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి వైన్ షాపు బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం 10:30కి వచ్చి షాపు తెరిచి చూసే సరికి చిందరవందరగా ఉంది. కౌంటర్లో ఉన్న రూ.50 వేల నగదు, సీసీ కెమెరా డివైజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. షాపు వెనుక నుంచి వెళ్లి రెండు ఫీట్ల గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. హరిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రూ.50 వేల అపహరణ నాగర్‌గూడలో ఘటన -
రైతు సమస్యలపై నిరంతర పోరు
మొయినాబాద్: రైతు సమస్యలపై భారతీయ కిసాన్ సంఘ్ నిరంతర పోరాటం చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సామ మాధవరెడ్డి అన్నారు. సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో మంగళవారం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నలభై ఏళ్లుగా భారతీయ కిసాన్ సంఘ్ రైతుల సమస్యలపై పోరాటం చేస్తూ అనేక సమస్యలు పరిష్కరించిందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తుందన్నారు. అరకొరగా కొంత మంది రైతులకే రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిందన్నారు. అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు శంకర్, సుధాకర్‌రెడ్డి, నాయకులు భూపాల్‌రెడ్డి, బసవరాజు, వెంకట్‌రెడ్డి, నారాయణ, ఆగిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రంగారెడ్డి, కాంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి -
‘మల్టీలెవెల్ పార్కింగ్’ పనులు చకచకా
● కేబీఆర్ పార్క్ వద్ద ఆరు అంతస్తుల్లో నిర్మాణం ● 72 కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు సమీపంలో పార్కింగ్ సమస్యను నివారించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పార్కు పక్కనే ఉన్న జీహెచ్ఎంసి స్థలంలో ఈ నిర్మాణం గత రెండు వారాల నుంచి ముమ్మరంగా జరుగుతున్నది. ఆరు అంతస్తులలో నిర్మాణం జరుగుతున్న ఈ మల్టీ లెవెల్ పార్కింగ్‌లో ఒక్కో ఫ్లోర్లో 12 కార్లు పార్కింగ్ చేయవచ్చు. ఇలా మొత్తం ఆరు ఫ్లోర్లలో 72 కార్లు పార్కు చేసుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన నవనిర్మాణ ఏజెన్సీ ఈ పనులు చేస్తున్నది. రూ.రెండున్నర కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పార్కింగ్ నిర్మాణంలో హైడ్రాలిక్ పద్ధతిలో లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది. పార్కింగ్ కోసం కారు రాగానే ఈ హైడ్రాలిక్ లిఫ్ట్‌లో ఏ ఫ్లోర్లో ఖాళీగా ఉంటే ఆ ఫ్లోర్ లోకి కారు తీసుకెళ్లి పార్కింగ్ చేస్తారు. కారు పార్కింగ్ చేసిన తర్వాత ఒక చిప్‌ను కారు యజమానికి ఇస్తారు. వాకర్లు, ఇతర పనుల కోసం వచ్చిన వారు తమ కార్లు పార్క్ చేసిన తర్వాత..పని పూర్తికాగానే వెళ్తే డ్రైవర్ కారును కిందికి తెప్పిస్తాడు. ప్రస్తుతం ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ బెంగళూరు, చైన్నెలో మాత్రమే ఉంది. హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా కేబీఆర్ పార్కు పక్కన నిర్మిస్తున్నారు. దీని చుట్టూ కేఫెలు, ఇతర దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రాంతం అంతా సుందరంగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే ఫుట్‌పాత్‌పై ఉన్న బస్సు షెల్టర్లను నోటీసులు అందజేసి తొలగించారు. ఇక్కడ కొనసాగుతున్న కడక్ చాయ్‌తో పాటు 1980 మిలిటరీ హోటల్ కూడా తొలగించనున్నారు. ఈ రెండు దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ నిర్మాణం పూర్తయిన తర్వాత పరిసరాలన్నీ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. -
నేపాల్‌లో ఆ ఇద్దరు నేరగాళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయినట్లు నగర పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 16 ఈ రెండు నేరాలకు పాల్పడిన బీహారీ ద్వయం పశ్చిమ బెంగాల్ మీదుగా నేపాల్ వెళ్లినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నేరచరితులైన వీళ్లు గతంలోనూ ఇలా దేశం దాటి, పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చారని అధికారులు చెప్తున్నారు. మీర్జాపూర్ నుంచి మారణకాండ... బిహార్‌లోని వైశాలి జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్, చందన్ కుమార్, రాజీవ్ సాహ్నిలతో ఈ ముఠా ఏర్పడింది. వాహనాలపై తిరుగుతూ, పట్టణ శివార్లలో రెక్కీ చేసి, ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకోవడం వీరి నైజం. అలోక్ కుమార్ నేతృత్వంలో సాగే ఈ ముఠా 2023 సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో పంజా విసిరింది. సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. యూపీ పోలీసులు దాదాపు ఏడాది పాటు గాలించి గత ఏడాది సెప్టెంబర్‌లో చందన్ కుమార్‌ను ముంబైలో, రాజీవ్ సాహ్నిని వైశాలిలో పట్టుకున్నారు. అప్పట్లో అమన్, అలోక్‌లు వైశాలి జిల్లాలోని మహిసౌర్ జనధన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. బిహార్‌లోనూ అనేక నేరాలు చేసి... యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత ఈ ద్వయం నేపాల్ నుంచి బీహార్ చేరుకుంది. అప్పటికే తమ వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో మళ్లీ నేరాలు మొదలెట్టింది. ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చి, షెల్డర్ తీసుకుంది. అదే నెల 16న బీదర్‌లో పంజా విసిరింది. ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ ఉద్యోగిని గిరి వెంకటేష్‌ను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలతో ఉడాయించింది. నగరంలో షెల్టర్ తీసుకున్న అమన్, అలోక్ నగదుతో తిరిగి ఇక్కడికే వచ్చి నేరానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకుంది. అక్కడ మేనేజర్ జహంగీర్‌ను కాల్చడం, పారిపోవడం జరిగిపోయాయి. ఆధారాలు దొరక్కుండా ప్రయాణాలు... అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఆర్టీసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చైన్నె వెళ్లారు. చైన్నె నుంచి రైలులో కోల్‌కతా చేరుకొని సిలిగురి నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై ఇప్పటికే యూపీ పోలీసులు రూ.2 లక్షలు, కర్ణాటక పోలీసులు రూ.5 లక్షలు రివార్డు ప్రకటించారు. జనవరిలో బీదర్, అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు చైన్నె మీదుగా పశ్చిమ బెంగాల్‌కు బిహారీలు -
లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
చేవెళ్ల: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం కొనసాగుతున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రిటైర్డ్ జడ్జి సాంబశివరావు సూచించారు. మండల కేంద్రంలోని కోర్టు ఆవరణలో మంగళవారం ట్రాఫిక్ పోలీసులు కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ జడ్జి సాంబశివరావు పలు కేసులను పరిష్కరించి వాటికి జరిమానాలు విధించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదీ నుంచి 8 వరకు ప్రత్యేక లోక్ అదాలత్ కొనసాగుతుందన్నారు. చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ కేసులలో మద్యం తాగి వాహనాలు నడపడం, లైసెన్స్‌లు లేకుండా నడపడం తదితర వాటిని పరిష్కరించుకోవచ్చని తెలిపారు. చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో మద్యం తాగి వాహనాలు నడిపించిన 71 కేసులు పరిష్కరించి రూ.1,86,500 జరిమానాలు విధించినట్లు చెప్పారు. డ్రైవింగ్‌లైసెన్స్‌లు లేకుండా నమోదైన 63 కేసులను పరిష్కరించి రూ.83,500 జరిమానాల రూపంలో వచ్చాయన్నారు. శనివారం వరకు ఈ లోక్‌అదాలత్ కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రిటైర్డ్ జడ్జి సాంబశివరావు -
మత్తుతో జీవితాలు చిత్తు
● యువత వ్యసనాలకు బానిస కావద్దు ● యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్సందీప్ శాండిల్య నందిగామ: యువత, విద్యార్థులు మత్తు పదార్థాల కు దూరంగా ఉండాలని యాంటి నార్కోటిక్స్ డైరెక్ట ర్ సందీప్ శాండిల్య అన్నారు. మండల పరిధిలోని మొదళ్లగూడ శివారులోని సింబయాసిస్ అంతర్జాతీ య విశ్వవిద్యాలయంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు మత్తు పదార్థాలతో తలెత్తే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసైతే అనేక సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని, ఇది సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశ భవిష్యత్తు యువత చేతులోనే ఉందని, చెడు వ్యసనాలకు బానిసలుగా మారొద్దని సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి లాంటివి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మత్తుకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సుబ్బరామిరెడ్డి, హరిశ్చంద్రరెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు, యూనివర్సీటీ డైరెక్టర్ డాక్టర్ కె.పి వేణుగోపాల్ రావు, రజనీకాంత్, లీగల్ ఎయిడ్ సెంటర్ ఫ్యాకల్టీ ఇన్చార్జ్ డాక్టర్ కె.శాంతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయంలో సగం రవాణాకే
యాచారం: ఆదాయంలో సగం రవాణాకే ఖర్చువుతోందని, కూరగాయలు, ఆకుకూరలను విక్రయించేందుకు స్థానికంగా మార్కెట్ సదుపాయం కల్పించాలని మండలంలోని రైతులు అధికారులను కోరా రు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి ఆదేశం మేరకు హార్టికల్చర్, సెరీకల్చర్ శాఖ జిల్లా అధికారి కె.సురేశ్ ఆధ్వర్యంలో వ్యవసాయాధికారుల బృందం సోమవా రం మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్పల్లిలో పర్యటించింది. రైతులు సాగు చేసిన పలు కూరగాయలు, ఆకుకూర తోటలను అధికారులు పరిశీలించారు. పెట్టుబడులు, దిగుబడులు, మార్కెటింగ్ అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సబ్సిడీపై ఉద్యాన పరికరాలు, నార్లు అందించాలని తెలిపారు. ఆతర్వాత రాయితీలు నిలిపేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పంట ఉత్పత్తులను నగరంలోని వివిధ మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నామని, దీంతో రవాణాకే అధికంగా ఖర్చువుతోందని తెలిపారు. పుదీనా పంటకు బీమా వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ నుంచి అధికారి శ్రీహరి, ఉద్యాన, పట్టు పరిశ్రమ డివిజన్ అధికారి నవీన, ఏఓ రవినాథ్, ఆయా గ్రామాల రైతులు సురేందర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, నర్సింహారెడ్డి, సందీప్‌రెడ్డి, రాములు, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూరగాయలు, ఆకుకూర రైతుల ఆవేదన మార్కెట్ సదుపాయం కల్పించాలని వినతి పుదీనా పంటకు బీమా వర్తింపజేయాలని వేడుకోలు -
మో‘డల్’ హౌస్!
గుంతలకే పరిమితమైన ఇందిరమ్మ నమూనా గృహం షాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలకమైన మో డల్ హౌస్ నిర్మాణానికి ఆదిలోనే అడుగు కదల డం లేదు. షాబాద్ మండల కేంద్రంలో నిర్మి స్తున్న నమూనా ఇల్లు గుంతలకే పరిమితమైంది. 15 రోజులు గడుస్తున్నా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నా రు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాల్సినా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో మోడల్ హౌస్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనని పథకం లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు సహకరించండి కడ్తాల్: ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీని కలుపుతూ ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి రైతులు సహకరించాలని తహసీల్దార్ ముంతాజ్ కోరారు. సోమవారం మండలంలోని ముద్వీన్, ఎక్వాయిపల్లి, మర్రిపల్లికి చెందిన భూ బాధితులతో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా అవసరాల దృష్ట్యా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. భూ సేకరణకు సహకరించాలని, సమస్యలుంటే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి చర్చిస్తామని తెలిపారు. రైతుల నుంచి వినతులు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఐ శివప్రసాద్, ఆర్ఐ రాజురెడ్డి, భూసేకరణ కార్యాలయ సిబ్బంది సురేశ్, బుచ్చయ్య, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. నారీ సాధికారతకు బీసీ సేన పోరాటం సంఘం జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ షాద్‌నగర్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అన్నారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలన్నారు. కుటుంబ, దేశం ప్రగతి పథంలో నడవడంలో అతివల పాత్ర ఎంతో కీలకమన్నారు. నారీ సాధికారత కోసం బీసీ సేన పోరాటం చేస్తుందని తెలిపారు. అనంతరం షాద్‌నగర్ నియోజకవర్గ బీసీ సేన మహిళా అధ్యక్షురాలిగా బాస వరలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు చంద్రశేఖర్, సత్యం, శంకర్, చందులాల్, రవి, శివ, వెంకటేష్, జె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ ఇబ్రహీంపట్నం రూరల్: స్వర్ణ భారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో మగ్గం వర్క్‌పై మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ డైరెక్టర్ జీఎస్ఆర్ కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణ భారత్ ట్రస్ట్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సహకారంతో శంషాబాద్‌లో మార్చి 4నుంచి 30 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తామని పేర్కొన్నారు. 19నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డుతో మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన గ్రామీణ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 7893121143, 9391487797, 9177141712 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
రైతులకు విశ్రాంతి భవనాలు
● మామిడి సీజన్లో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం ● గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్: మామిడి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం మామిడి సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై మండల పరిధిలోని బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, వ్యాపారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. అధిక కమీషన్ వసూలుపై నజర్ ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్లో మౌలిక వసతులు కల్పిస్తామని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు విశ్రాంతి భవనం, వెద్య సేవలు అఽందిస్తామన్నారు. దీంతో పాటు వాహనాల రద్దీ కారణంగా ఏర్పడే ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ట్రాఫిక్ పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా స్థానిక పోలీసులతో నిరంతర నిఘా ఉంటుందన్నారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఫైర్ ఇంజన్‌ను అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్కెట్లో అధిక కమీషన్లు వసూలు చేసే వారిని గుర్తించి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అంజిరెడ్డి, వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు, ఫైర్‌స్టేషన్ సీఐ యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, పాలకవర్గం సభ్యులు మధుసూదన్‌రావు, రఘుపతిరెడ్డి, జైపాల్‌రెడ్డి, అంజయ్య, లక్ష్మి, నరసింహ, గోవర్ధన్‌రెడ్డి, నవరాజ్, గణేశ్‌నాయక్, మచ్చెందర్రెడ్డి, వెంకటేశ్వర్లుగుప్తా, ఇబ్రహీం, అధికారులు, వ్యాపారు లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెరుగుతున్న ఎండలు
● మార్చి మొదటివారంలోనే భానుడి భగభగలు ● నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు ● ఊపందుకున్నశీతల పానీయాల విక్రయాలు ఆమనగల్లు: పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే భానుడి భగభగలు సుర్రు మంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయని మదన పడుతున్నారు. ఈ క్రమంలోనే సీజనల్ వ్యాపారా లు మొదలయ్యాయి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ప్రజలు చల్లని పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు. ఆందోళనకరంగా ఎండలు ఈ ఏడాది ఎండలు ఆందోళనకరంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆమనగల్లు పట్టణంలో గత మూడు రోజులలో దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రస్తుతం 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 గంటలు దాటితే చాలు ఎండవేడిని తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారి మధ్యాహ్నం వేళలో నిర్మానుష్యంగా మారుతుంది. ప్రజలు ఉదయం వేళల్లో పనులు చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రారంభమైన సీజనల్ వ్యాపారాలు వేసవిలో ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాపారాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కొబ్బరిబోండాలు, పండ్ల రసాలు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు జోరందుకున్నాయి. ప్రజలు దాహం తీర్చుకునేందుకు శీతల పానీయాలు, వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కొబ్బరిబోండాలు, పండ్ల రసాలకు డిమాండ్ పెరిగింది. బెంగళూరు, కోనసీమ నుంచి తీసుకు వస్తుండటంతో కాయ నాణ్యతను బట్టి ఒక బోండాను రూ.50 నుంచి 60 వరకు విక్రయిస్తున్నారు. పండ్ల రసాలు, చెరుకు రసాలను రూ.20 నుంచి 40 వరకు విక్రయిస్తున్నారు. దీనితో పాటు పండ్లు, పుచ్చకాయలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మట్టి కుండల విక్రయాలు మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. ఎండలకు ఉపశమనం పొందడానికి చాలా మంది మట్టి కుండలోని నీటిని సేవిస్తారు. దీంతో పట్టణంలో కూరగాయల మార్కెట్లో వివిధ సైజులలో మట్టికుండల విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే ఫ్యాన్లు, కూలర్ల విక్రయాలు కూడా మొదలయ్యాయి. సీజనల్ వ్యాపారాలతో చాలామంది ఉపాధి పొందుతున్నారు. -
31లోపు చెల్లిస్తే.. 25 శాతం రాయితీ
● ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు శుభవార్త ● వెల్లడించిన కలెక్టర్ నారాయణరెడ్డి ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్ఆర్ఎస్కు దరఖాస్తుదారులకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుభవార్త చెప్పారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ రుసుం ఈ నెల 31లోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ వస్తుందని ఆయన ప్రకటించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఎల్ఆర్ఎస్పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకున్న ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. మండల, మున్సిపాలిటీ స్థాయి లో ఎంపీడీఓలు, కమిషనర్లు అక్రమ లే అవుట్లు చేసిన యజమానులతో సమావేశం నిర్వహించి ప్లాటు విక్రయదారులు ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆడియో రికార్డింగ్ చేసి ఆటోల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారు రుసుం ఈ నెల 31 లోపు చెల్లించినట్లయితే 25 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తుల లే అవుట్లకు సంబంధించి మండల స్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణిలో 57 ఫిర్యాదులు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. రెవెన్యూ శాఖలో 34, ఇతర శాఖలకు 23 మొత్తం కలిపి 57 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, మున్సిపాలిటీ కమిషనర్లు, సూపరిండెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
కబ్జా స్థలాలను స్వాధీనం చేసుకుంటాం
● సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జగన్ ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలిం సిటీ ఆధీనంలో ఉన్న పేదల ఇళ్ల స్థలాలను స్వాధీనం చేసుకునేంత వరకు పోరు ఆగదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి.జగన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా మండలంలోని ముకునూర్ గ్రామంలో రామోజీ ఫిలిం సిటీ ఇళ్ల స్థలాల పోరాట కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిలిం సిటీలోని ఇళ్ల స్థలాలను సాధించేందుకు ఉరూరా పోరాట కమిటీలను వేసి ఉద్యమిస్తామన్నారు. 670 మంది పేదలకు ఇంటి స్థలాలను 2007లో ఇచ్చినా రామోజీ ఫిలిం సిటీ కబ్జాలోనే మగ్గుతున్నాయన్నారు. ఇన్నేళ్లుగా పోరాడుతున్నామని.. ప్రజల ఓపికను పరీక్షించవద్దని హెచ్చరించారు. ముకునూర్‌లో పది మంది సభ్యులతో కూడిన ఇళ్ల స్థలాల పోరాట కమిటీని ఎన్నుకున్నారు. కృష్ణ, సువర్ణ, సంతోష, సత్తమ్మ, పద్మ, యాదమ్మ, ఇందిరమ్మ, హబీబా, స్వరూప, అండాలును కమిటీ సభ్యులుగా నియమించారు. -
హర్యానా గ్యాంగ్ పనేనా!
రావిర్యాల్ ఏటీఎం చోరీ ఘటనపై అంచనా ● దొంగిలించిన సొమ్ముతోముంబైకి పరార్ ● కారు నంబర్లు మార్చి పక్కదారి పట్టిస్తున్న దుండగులు ● ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు ఇబ్రహీంపట్నం రూరల్: రావిర్యాల్లో చాకచక్యంగా ఏటీఎంలోకి ప్రవేశించి నాలుగు నిమిషాల్లోనే ఏకంగా రూ.29.69 లక్షలు ఊడ్చుకెళ్లిన దుండగులను హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఫక్కీ మాదిరి తక్కువ సమయంలో అంత పెద్ద దోపిడీ చేయడమంటే ఎంతో నేర్పరిలకే సాధ్వమవుతుందనే అంచనాకు వచ్చారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటనలో ఆదిబట్ల పోలీసులతో పాటు రాచకొండ కమిషనరేట్‌లో ఉన్న పోలీసు బృందాలు కూపీ లాగుతున్నాయి. ఇప్పటికే బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. 24 గంటలుగా నిద్రహారాలు మాని దొంగలను పట్టుకునే పనిలో తలమునకలయ్యారు. ఇదే తరహాలో రాగన్నగూడలో.. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఏటీఎంలో కూడా 2019లో ఇలాంటి తరహాలోనే అర్ధరాత్రి ఇనుపరాడ్లు, గ్యాస్ కట్టర్లతో దోపిడీకి యత్నించారు. పెట్రోలింగ్ వాహనం నిరంతరం గస్తీ కాయడంతో గమనించి టాటా సుమోలో వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్లు, ఇనుప రాడ్లు అక్కడే వదిలేసి పారిపోయారు. వేలి ముద్రలు గుర్తించిన పోలీసు అధికారులు దొంగలను పట్టుకోవడానికి అప్పట్లో తీవ్రంగా శ్రమించారు. కానీ నేరస్తులను పట్టుకోలేకపోయారు. హర్యానా గ్యాంగ్ పనేనని గుర్తించారు. మళ్లీ అదే తరహాలో రావిర్యాల్లో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ చాకచక్యంగా నగదు దొంగిలించి తప్పించుకొని పారిపోయారు. అదే రోజు మైలార్‌దేవరపల్లిలో.. రావిర్యాల్కు రాక ముందు పహడీషరీఫ్ నుంచి వచ్చిన స్విఫ్టు కారులో దుండగులు మైలార్దేవరపల్లిలోని ఏటీఏంపై దాడి చేశారు. అక్కడ వారికి అనుకూలంగా లేకపోవడంతో ఎలాంటి దోపిడీకి పాల్పడలేదని పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి నేరుగా రావిర్యాల్కు వచ్చి దోచుకెళ్లారు. ప్రత్యేకంగా 20 బృందాలు రావిర్యాల్ ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనానికి పాల్పడిన దుండగులు దొంగిలించిన సొత్తుతో అదే కారులో పహాడీషరీఫ్ నుంచి ముంబై రహదారి వైపు వెళ్లారు. ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా ముంబైకి వెళ్లినట్లు సీసీ ఫూటేజీల ఆధారంగా గుర్తించారు. దుండగులు నేరానికి పాల్పడిన సమయంలో ఉపయోగించిన తెలుపు రంగు కారు నంబరు ప్లేట్లు కూడా మార్పిడి చేసినట్లు నిర్ధారించారు. ఫేక్ నంబరు ప్లేట్లు ఉపయోగించి పోలీసులను తప్పుదోవ పట్టించారు. అలాగే ఎక్కడా వేలి ముద్రలు లభించకుండా, మోకాలు కనిపించకుండా మాస్కులను వాడారంటే పేరు మోసిన దొంగలుగా నిర్ధారణకు వచ్చారు. సెల్‌ఫోన్ లోకేషన్లు, టవర్ లోకేషన్ల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే 20కి పైగా బృందాలు దుండగులను పట్టుకోవడానికి గాలింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. -
9 కిలోల గంజాయి పట్టివేత
ఇద్దరి నిందితుల అరెస్టు చేవెళ్ల: గంజాయి రవాణా చేస్తున్న ముఠాను చేవెళ్ల పోలీసులు చాకచక్యంగా అదుపులోని తీసుకున్నారు. చేవెళ్ల సీఐ భూపాల్‌శ్రీధర్, డిటెక్టివ్ సీఐ సీహెచ్ ఉపేందర్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేసారం గ్రామ సమీపంలో బైపాస్ రోడ్డు పక్కన నలుగురు అనుమానిత వ్యక్తులు ఆదివారం రాత్రి ఓ వ్యాగనర్ కారు, స్కూటీపై ఆగి ఉండటం కనిపించారు. అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఎస్ఐ వనం శిరీష టీమ్‌తో వారి వద్దకు వెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించటంతో వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. వాహనాలను తనిఖీ చేయగా రెండు బ్యాగులలో 9 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమైంది. దీంతో వారికి అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు ఏపీలోని రాజమండ్రికి చెందిన గోబెరు వెంకట చైతన్య అలియాస్ షేక్ రిజ్వాన్‌గా గుర్తించారు. మరో వ్యక్తి కూరెళ్ల సాయిఅరుణ్ నగరంలోని ఉప్పల్‌లో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పారిపోయిన నిందితులు సూర్యాపేటకు చెందిన షేక్ అబ్బాస్, గణేశ్‌లుగా గుర్తించినట్లు విచారణలో చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పాత లేఔట్లలోనే కబ్జాల జోరు
హైడ్రా ప్రజావాణిలో 49 ఫిర్యాదులు సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పాత లేఔట్లలోనే కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ ప్లాట్లతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, రహదారులను కబ్జా చేసేస్తున్నారంటూ ఆయా లేఔట్లకు చెందిన పలువురు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా) ఫిర్యాదు చేస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 49 ఫిర్యాదులు రాగా... అత్యధికం వీటికి సంబంధించినవే ఉన్నాయి. 1980–90 దశకాల్లో వేసిన లేఔట్లను మాయం చేసి, ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్న కబ్జారాయుళ్లు మళ్లీ విక్రయాలకు యత్నిస్తున్నారంటూ బాధితులు రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. భూములకు ధరలు అమాంతం పెరగడంతో గతంలో తమకు అమ్మిన వాళ్లే కబ్జాలకు పాల్పడుతున్నారని వాపోయారు. పంచాయతీ లేఔట్లను వ్యవసాయ భూములుగా మార్చేసి సాగు చేసుకుంటున్నారనీ హైడ్రాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. వీటిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ ఫిర్యాదుదారుల సమక్షంలోనే గూగుల్ మ్యాప్‌లు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను పరిశీలించారు. వాటిలో లభించిన సమాచారం ఆధారంగా సమగ్ర విచారణకు అధికారులను ఆదేశించారు. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ● రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలో 1980 దశకంలో 2684 ప్లాట్లతో చాణక్యపురి లేఔట్ వేశారు. గత ఏడాది అందులోని 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు పలువురు ఫిర్యాదు చేశారు. అందులోని పార్కులు, రహదారులు కూడా కనుమరుగయ్యాయని ఆరోపించారు. ● మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నం.58, 59లో ఉన్న ఎన్ఎంఆర్–దివ్యానగర్ లేఔట్లో తాము ప్లాట్లు కొన్నామని, ఇప్పుడవి కనిపించట్లేదని యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇలా 66 ప్లాట్లు గల్లంతయ్యాయని, ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేస్తున్నారని వాపోయారు. ● గచ్చిబౌలిలోని గోపన్నపల్లిలోని టీఎన్జీవో కాలనీలో ఉద్యోగులకు కేటాయించిన భూములు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ఎకరాలను కొందరు కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు. దీనిపై టీఎన్జీవో కాలనీ సంక్షేమ సంఘం (గచ్చిబౌలి) ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ● మేడ్చల్ జిల్లా చెంగిచర్ల గ్రామంలోని సర్వే నం.7, 10లో వేసిన శ్రీపురం కాలనీలో పార్కులు, రహదారులు కబ్జాకు గురయ్యాయని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మాడ్గుల: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాడ్గుల సీఐ వేణుగోపాల్ రావు తెలిపారు. సోమవారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా అందుగుల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్లు, యాజమనులపై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. ముసుగులు ధరించిసైకిల్ చైన్లతో బెదిరింపులు బంజారాహిల్స్: ముసుగులు ధరించి సైకిల్ చైన్లు ఊపుకుంటూ హోటలోకి ప్రవేశించిన ఆగంతకులు కస్టమర్లను బెదరింపులకు గురిచేస్తూ గదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన ఘటనలో నిందితులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌కు చెందిన సుజాహత్ హుస్సేన్ (38) 2015లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్–4లోని బగ్గా హోటల్స్‌ను లీజుకు తీసుకున్నాడు. 2030 వరకు ఈ లీజు గడువు ఉండగా బగ్గా హోటల్స్ యజమానులు సత్పాల్సింగ్ బగ్గా, బల్వీందర్ బగ్గా మధ్య అద్దె విషయంలో గొడవలు వచ్చాయి. ఈ విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 10 మంది ఆగంతకులు ముఖాలకు ముసుగులు ధరించి హో టల్లోకి ప్రవేశించి రిసెప్షనిస్ట్ సుభాన్‌ను బెదిరించి అక్కడి ను ంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. అలాగే కస్టమర్లు ఉన్న గదుల వద్దకు వెళ్లి సైకిల్ చైన్లు ఊపుకుంటూ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు గురిచేశారు. రిసెప్షనిస్ట్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న సుజాహత్ డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే ముసుగులు ధరించిన వ్యక్తులంతా అక్కడి నుంచి పరారయ్యారు. సత్ఫాల్సింగ్ బగ్గా, బల్వీందర్‌సింగ్ బగ్గా ఇద్ద రూ హోటల్లోకి రౌడీలను పంపించారని, భయభ్రాంతులకు గురిచేశారని, విధ్వంసం సృష్టించారని, మెటీరియల్ ధ్వంసం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడల్లోనూ రాణించాలి
ఓఎన్జీసీ అధికారి శంకర్‌నాయక్ కొత్తూర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో రాణించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అంతర్జాతీయ అథ్లెట్, ఓఎన్జీసీ అధికారి శంకర్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం యూత్ క్లబ్ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. క్రీడలపై అభిరుచి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంగూర్‌నాయక్, ఉపాధ్యాయులు రవికుమార్, రాజు, బాలప్రసాద్, పీఈటీ నవనీత తదితరులు పాల్గొన్నారు. అనుమానమే.. పెనుభూతమై కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీలోని ఎంపీపటేల్‌గూడకు చెందిన పట్నం నరేశ్‌కి పన్నెండేళ్ల క్రితం ఉమాతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాఫీగా సాగుతున్న కాపురంలో అనుమానం పెనుభూతంగా మారింది. దీంతో భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతుండేవారు. ఐదు నెలల క్రితం నరేశ్(36) మద్యం తాగి భార్యను కొడుతున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమ్మగారింటికి వెళ్లిపోవడంతో రెండు నెలల క్రితం పెద్దలు ఒప్పించి కాపురం చేయించారు. ఆదివారం రాత్రి 10 గంటలకు మళ్లీ భార్యాభర్తలు గొడవ పడడంతో 100 ఫోన్ చేశారు. పోలీసులు ఇంటికి చేరుకొని నచ్చజెప్పి గొడవ లేకుండా ఉండాలని సముదాయించారు. భార్య ఇద్దరు పిల్లలను పడక గదిలోంచి బయటకు పంపించి నరేశ్ తలుపు వేసుకున్నాడు. సోమవారం ఉదయం గది నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో భార్యకు అనుమానం వచ్చి డోర్ కొట్టడంతో తలుపు తీయలేదు. దీంతో పక్కింటివారు తలుపు పగలగొట్టి చూడగా నరేశ్ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతుంది. దీంతో భార్య ఉమా బోరున విలపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్‌రాజ్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య గచ్చిబౌలి: ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిరువురు గత ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్‌హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది. ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వర కట్నం కోసం శరత్చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులకు గాయాలు
కేశంపేట: బైక్ పైన వెళ్తున్న తండ్రీకొడుకులను బొలెరో వాహనం ఢీకొన్న సంఘటన మండలపరిధిలోని ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... అల్వాల గ్రామ పరిధిలోని తులవానిగడ్డకు చెందిన రంగయ్య, తన కుమారుడు ఉజ్వల్‌తో ఆదివారం ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి హెర్ కటింగ్ కోసం వెళ్లాడు. తిరిగి వస్తుండగా బీఎస్ఆర్ పెట్రోల్ పంపు దగ్గర బొలెరో వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం రంగయ్య పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. -
నిర్లక్ష్యానికి ప్రాణం బలి
మంచాల: ఓ వ్యక్తి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన నాగార్జునసాగర్– హైదరాబాద్ మార్గంలో సోమవారం ఆగాపల్లి వద్ద చోటుచేసుకుంది. మంచాల ఎస్ఐ సతీష్‌కుమార్ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరగండ్లపల్లికి చెందిన మైలారం జంగయ్య(27) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి నగరంలో నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో సోమవారం భార్య పార్వతమ్మ, కూతురు అశ్వితతో కలిసి స్వగ్రామం నుంచి బైక్‌పై హైదరాబాద్ వెళ్తున్నాడు. ఆగాపల్లి సమీపంలోని జేబీ వెంచర్ వద్దకు రాగానే నిర్లక్ష్యంగా కారు నడిపిన కోవూరి నర్సింగ్‌రావు ఎదురుగా వస్తున్న వీరి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా పార్వతమ్మ, అశ్వితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన జంగయ్య ఆకస్మిక మృతితో బాధిత కుటుంబం రోడ్డున పడింది. బైక్‌ను ఢీకొట్టిన కారు అక్కడికక్కడే వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించండి
మీర్‌పేట: తమకు ఈఎస్ఐ సౌకర్యంతో పాటు పీ ఎఫ్ అందేలా చొరవ తీసుకోవాలని మీర్‌పేట కార్పొరేషన్ వాటర్మెన్లు, ఎలక్ట్రీషియన్లు సోమ వారం మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లుగా పీఎఫ్ అందక ఇబ్బందులు పడుతున్నామని, ఈఎస్ఐ కార్డులు సైతం జారీ చేయడం లేదని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు ఐదేళ్లుగా యూనిఫారంలు, మున్సిపాలిటీ నుంచి రావాల్సిన సరుకులు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నా రని, ఎన్నోసార్లు వినతిపత్రాలు సమర్పించినా న్యాయం జరగడం లేదని మొర పెట్టుకున్నారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ పది రోజుల్లోగా సిబ్బంది సమ ్డస్యలను పరిష్కరించాలని కమిషనర్ జ్ఞానేశ్వర్‌ను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది లాగే వా టర్మెన్లు, ఎలక్ట్రీషియన్లకు అన్ని సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. సిబ్బంది సురేందర్‌యాదవ్, యాదగిరి, భిక్షపతి, జంగ య్య, దశరథ, రమేశ్‌రెడ్డి, వెంకటేశ్, మాజీ కార్పొ రేటర్ అనిల్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డికి మీర్‌పేట కార్పొరేషన్ సిబ్బంది వినతి -
మద్యం మత్తులో పురుగు మందు తాగి
వ్యక్తి ఆత్మహత్య కొందుర్గు: తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తంగెళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి రమేశ్(38) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు మందలించినా వినేవాడు కాదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పాడి పశువులకు పాలు తీయడానికి పొలానికి వెళ్లాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో అతడి తండ్రి చెన్నయ్య వెళ్లి చూసేసరికే పాక వద్దనే నురుగులు కక్కి అక్కడే పడి ఉన్నాడు. వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రమేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకారు బీభత్సం రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఫుట్‌పాత్ పైకి ఎక్కిన కారు.. లక్డీకాపూల్ : నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు డివైడర్‌ను ఢీ కొని ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. సోమవారం ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సెక్రటేరియేట్ వైపు వెళుతున్న ఓ కారు అతివేగం కారణంగా ఎన్టీఆర్ ఘాట్ మలుపు వద్ద అదుపు తప్పింది. కారు డివైడర్‌పైకి దూసుకెళ్లి కరెంట్ పోల్‌ను ఢీకొనడంతో పోల్ రోడ్డపై అడ్డంగా విరిగిపడింది. ఈ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంస మయ్యాయి. కాగా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం. ఏసీబీ వలలో డీఈఈ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ క్వాలిటీకంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఎ.దశరథ్ ముదిరాజ్ ఫైల్స్ క్లియర్ చేయడానికి, వాటిని ఈఈకి పంపించేందుకు ఒక వ్యక్తిని రూ.20వేలు డిమాండ్ చేసి,తీసు కుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకొని నాంపల్లి ఏసీబీ కేసుల కోర్టులో హా జరు పరిచారు. అడ్వాన్స్‌గా అంతకు ముందే రూ. 10వేలు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. -
మండి హోటళ్లలో తనిఖీలు
పహాడీషరీఫ్: జల్పల్లి మున్సిపాలిటీ పరిధి ఎర్రకుంటలోని మండి హోటళ్లలో కమిషనర్ వెంకట్రామ్ సోమవారం తనిఖీలు చేపట్టారు. బాలాపూర్ ఎస్ఐ షేక్ యూసుఫ్ జానీతో కలిసి ఆయన అల్–సవూద్ బైతల్ మండి, అబూద్ మండి హోటళ్లలో కిచెన్ రూమ్‌లో పరిశీలించగా అపరిశుభ్రమైన వాతావరణం కనిపించాయి. ఈ రెండింటిలో ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన చికెన్, మటన్, చేపలను చూసి కమిషనర్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి హెచ్చరిక చేస్తున్నామని, మరోసారి తనిఖీ చేపడుతామని, పరిస్థితిలో మార్పు లేకుండా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కొందరు హోటల్ నిర్వాహకులు వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకొని, నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదన్నారు. ముఖ్యంగా ప్రతి హోటల్ నిర్వాహకుడు శుచి శుభ్రత పాటించడంతో పాటు వ్యర్థ నీటిని రోడ్లపై విడవరాదని సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ జ్యోతి, పర్యావరణ అధికారి ఎం.శ్రీను, బిల్ కలెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఫ్రిజ్‌లలో మాంసం నిల్వలపై అధికారుల ఆగ్రహం -
దైవ చింతనతో మానసిక ప్రశాంతత
కేశంపేట: దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే షాద్‌నగర్ వీర్లపల్లి శంకర్ అన్నారు. మండల పరిఽధిలోని కాకునూర్ మహాలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడాతూ.. గ్రామీణ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు ఇలాంటి పోటీలు అద్దం పడుతాయని తెలిపారు. ఆలయానికి త్వరలోనే రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోటీల్లో తెలంగాణతో పాటు అంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పోటీదారులు తలపడ్డారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూడ వీరేశ్, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాల, నాయకులు శ్రావణ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పల్లె అనంద్‌కుమార్, గిరియాదవ్, తైధ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాకునూర్‌లో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు -
4 నిమిషాలు.. రూ.29.69 లక్షలు!
ఇబ్రహీంపట్నం రూరల్: ముఖాలకు మాస్క్‌లు.. చేతులకు గ్లౌస్లు.. వెంట ఇనుప రాడ్లు, గ్యాస్ కట్టర్లు.. దర్జాగా స్విఫ్ట్ కారులో వచ్చి ఏటీఎంలోకి చొరబాటు.. కట్ చేస్తే సినీ ఫక్కీలో నాలుగంటే నాలుగే నిమిషాల్లో రూ.29,69,900 కొట్టేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ చోరీ ఘటన జరిగింది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాలలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తెల్లని కారులో ఎస్బీఐ ఏటీఎం వద్దకు చేరుకున్నారు.ముందుగా ఒక వ్యక్తి కారులోంచి దిగి ఏటీఎంలోకి ప్రవేశించాడు. అలారం మోగకుండా వైర్లు కత్తిరించాడు. తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. మరో ఇద్దరు వెంటనే కారు దిగి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లు, గ్యాస్ కట్టర్లతో రాత్రి 1:55 గంటలకు ఏటీఎం లోపలికి ప్రవేశించారు. ఒక వ్యక్తి సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టాడు. దీంతో సీసీ కెమెరాలు బ్లర్ అయిపోయి రికార్డింగ్ ఆగిపోయింది. వెంటనే గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి, అందులో ఉన్న రూ.29.69 లక్షల నగదు అపహరించుకుపోయారు. ముందే రెక్కీ? ఈ చోరీకి ఒకటి రెండు రోజుల ముందే దుండగులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం నాలుగు నిమిషాల్లో పని పూర్తి చేయడంతో దొంగలను ప్రొఫెషనల్స్‌గా భావిస్తున్నారు. కాగా, దుండగుల కారు పహాడీషరీఫ్ వైపు నుంచి వచ్చి మళ్లీ అటే వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ చోరీ జరిగిన పది నిమిషాల్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదిభట్ల పోలీసులకు సమాచారం వచి్చంది. వెంటనే అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు పరారయ్యారు. ఆదిబట్ల ఎస్ఐ వెంకటేశ్, సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి, క్రైం డీసీపీ అరవింద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు . ఐదు బృందాలతో గాలింపు రావిర్యాలలో జరిగిన ఈ చోరీ ఘటనను రాచకొండ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆదిభట్ల పోలీసులు, క్రైమ్ సిబ్బంది, ఎస్ఓటీ, సైబర్ క్రైమ్ సిబ్బందిని కలిపి మొత్తం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు వెళ్లిన స్థలాలను, వారి కారు నంబర్‌ను గుర్తించే పనిలో పడ్డారు. -
ప్రేమ పేరుతో వంచన..యువకుడిపై కేసు
బంజారాహిల్స్: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి..ఆమెను గర్భవతిని చేసి..ఆపై ముఖం చాటేసిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఓ యువతి (25)కి అదే ప్రాంతానికి చెందిన ఎన్.శివాచారితో 2020 ఆగస్టులో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని శివాచారి నమ్మించడంతో ఆమె సన్నిహితంగా మెలిగింది. ఇటీవలే శివాచారి కేపీహెచ్‌బీకి మకాం మార్చగా యువతి కూడా బంజారాహిల్స్‌కు వచ్చి ఓ ఆస్పత్రిలో పనిచేస్తూ హాస్టల్లో ఉంటుంది. ఇక్కడ కూడా తరచూ కలుసుకునేవారు. ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, బలవంతంగా మాయమాటలు చెప్పి గర్భస్రావం చేయించాడు. గత నెల నుంచి శివాచారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు గమనించింది. లోతుగా ఆరా తీయగా శివాచారికి ఆరు నెలల క్రితమే మరో యువతితో నిశ్చితార్ధం జరిగినట్లుగా తెలిసింది. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. నాలుగు నెలల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు పెళ్లి చేసుకోగా మరో యువతితో నిశ్చితార్ధం చేసుకోవడమే కాకుండా తమ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని, వాట్సప్ బ్లాక్ చేశాడని, తనను మోసం చేశాడని బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివాచారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాచర్ల పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. -
వైభవోపేతం.. ప్రతిష్ఠాపనోత్సవం
మర్పల్లి: మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో మూడు రోజులుగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా గ్రామస్తులు చేపట్టారు. చివరి రోజైన ఆదివారం ప్రత్యేకంగా వేదపండితుల సమక్షంలో హోమం కార్యక్రమం నిర్వహించి గర్భ గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
నిర్మాణం పూర్తయినా.. కేటాయించరే?
వికారాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను అర్హులకు కేటాయించడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. ఇటీవల జిల్లా కలెక్టర్ నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అయినా ఈ దిశగా చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో రెండు పడకల ఇళ్లను ఎప్పుడు కేటాయిస్తారనే విషయంలో స్పష్టత కొరవడింది. గతంలో స్వీకరించిన దరఖాస్తుల ప్రకారమే ఇళ్లు కేటాయిస్తారా..? లేక కొత్తగా అర్జీలు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారా..? అనే అనుమానాలు స్థానికుల్లో తలెత్తుతున్నాయి. జిల్లాలో మొత్తం 1031 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో కొన్ని పూర్తయ్యి రెండేళ్లు కాగా.. మరికొన్ని నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు సైతం దాటింది. కొన్ని చోట్ల తుది మెరుగులు, చిన్న చిన్న పనులు మినహా పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావొచ్చిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పేదల నుంచి దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించాయి. రెండుసార్లు విచారణ సైతం పూర్తి చేసి వాటిని పంపిణీ చేయటంలో తీవ్ర జాప్యం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత సర్కారు కూడా ఏ నిర్ణయం తీసుకోవటంలేదు. పూర్తయిన ఇళ్లు పాడవకముందే లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని పేదలు కోరుతున్నారు. దరఖాస్తుల విచారణ పూర్తి అర్హులను గుర్తించేందుకు ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో ముగ్గురు చొప్పున టీమ్‌లను ఏర్పాటు చేశారు. దరఖాస్తులు చేసుకున్న వారి జాబితా పట్టుకుని ఈ టీమ్‌లు వార్డుల వారీగా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. వచ్చిన దరఖాస్తులకు అందుబాటులోకి వచ్చిన ఇళ్లకు తీవ్ర వ్యత్యాసం ఉంది. లబ్ధిదారుల ఎంపిక కోసం జరిపిన విచారణలో వచ్చిన దరఖాస్తుల్లో 50 శాతం అర్హులు ఉన్నట్టు తేలింది. అర్హుల జాబితాను తగ్గించేందుకు మరోమారు విచారణ కూడా పూర్తి చేసిన అధికారులు ఏడాదిన్నర దాటినా వాటిని పేదలకు పంపిణీ చేసే దిశగా చర్యలు చేపట్టడంలేదు. జిల్లాలో 1031 ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకోగా చిన్నచిన్న పనులు మినహా పూర్తి కావొచ్చాయి. 2016లోనే బీజం జిల్లాకు మొదట్లో 5,740 డబుల్ బెడ్రూం ఇళ్లు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి సంబంధించి 2016 సంవత్సరంలో భూమి పూజ సైతం చేశారు. తరువాత వాటా సంఖ్యను 3,800కు కుదించారు. ప్రస్తుతం ఇందులో 2,257 ఇళ్లు నిర్మాణ దశశలో ఉన్నాయి. వీటిలో 1031 గృహాలు చిన్న చిన్న పనులు మినహా పూర్తి కావొచ్చాయి. 1,543 ఇళ్లు ఇంకా ప్రారంభించలేదు. పూర్తి కావొచ్చిన వాటిలో ధారూరులో 120, మర్పల్లి 120, యాలాల్ 180, తాండూరు పట్టణం 401, పరిగి 180, చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో 30 ఇళ్లను పేదలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇళ్లు పూర్తయిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అందుబాటులో ఉన్న ఇళ్లకు పదింతలు ఎక్కువగా 12,205 అర్జీలు వచ్చాయి. దరఖాస్తుల వడపోత ప్రక్రియ పూర్తయి ఏడాదిన్నర అవుతున్నా.. ఇళ్లు కేటాయించడంతో మీనమేషాలు లెక్కిస్తున్నారు. సిద్ధంగా 1031 డబుల్ బెడ్రూం ఇళ్లు దరఖాస్తుల విచారణపూర్తయి ఏడాదిన్నర ఎదురు చూస్తున్న లబ్ధిదారులు -
అత్తాపూర్‌లో విజిబుల్ పోలీసింగ్
అత్తాపూర్: అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులతో కలిసి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముష్క్ మహల్, నెక్లెస్ రోడ్, బారా ఇమార్ దర్గా , సెట్విన్ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. ముష్క్ మహల్ ప్రాంతంలో మురాఠి ప్రభాకర్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి మద్యం సేవిస్తుండటంతో కేసులు నమోదు చేశారు. పేకాట ఆడుతున్నకిషన్బాగ్కు చెందిన సయ్యద్ ఫక్రుద్దీన్, మొహమ్మద్ ఇమ్రాన్, అజీయుద్దీన్, మీర్ ఆజామ్ ఆలీ, సయ్యద్ మెరాజ్, మొహమ్మద్ వాజీద్, మొహమ్మద్ అజీమ్‌ల పై కేసులు నమోదు చేసి వారి నుంచినుంచి రూ.60,520 నగదు, రెండు సోలార్ లైట్లు, ఆరు సెట్ల గేమింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో నేపాల్ దేశస్తుడి ఆత్మహత్య
కేపీహెచ్‌బీకాలనీ: కుటుంబ తగాదాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేపాల్ దేశానికి చెందిన ప్రేమ్ రావెల్ (34) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కేపీహెచ్‌బీకాలనీలోని నాల్గో ఫేజ్‌లో నివాసం ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాలు భరించలేక శనివారం రాత్రి ఇంటి సీలింగ్ ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘనంగా ముగిసిన ‘వర్వ్–2025’
గోల్కొండ: ఇంజినీరింగ్ కాలేజీ స్పోర్ట్స్ మీట్‌కు తమ కళాశాల వేదిక కావడం ఆనందంగా ఉందని షేక్‌పేట్ జి.నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాల వైస్ చైర్పర్సన్ జి.శ్రీవిద్యారెడ్డి అన్నారు. 11వ జాతీయ ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజీ స్పోర్ట్స్ మీట్ ఫర్ ఉమెన్ ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెబుల్ టెన్నీస్ క్రీడాకారిణి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ నికత్భాను హాజరై మాట్లాడుతూ.. తాను కూడా మహిళా విభాగంలో ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. డిలైట్ కంపెనీ డెలివరీ మెనేజర్ ఎం.అఖిల మాట్లాడుతూ..జీఎన్ఐటీఎస్ అలూమీనిగా తాను మరోసారి ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జీఎన్ఐటీఎస్ చైర్మన్ జి.రాఘవరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ డాక్టర్ అపర్ణ పల్లె, వర్వ్–2025 కన్వీనర్ డాక్టర్ ఎం.వీ.ఎల్.సూర్యకుమారి పాల్గొన్నారు. -
దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు
అత్తాపూర్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చంద్రాయణగుట్టకు చెందిన మీర్ ముస్తఫా అలీ, ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఖయ్యూమ్‌లు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడమే వత్తిగా మలుచుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు దాదాపు 80 కేసులు నమోదై ఉన్నాయి. వీరు తరచు దొంగతనాలు చేస్తూ పట్టుబడిన ప్రతిసారి బైయిల్‌పై బయటకు వస్తు తిరిగి అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 25వ తేదీన టీఎస్12ఈఏ 4398 నెంబర్ గల వారి యాక్టివా స్కూటీకి డూప్లికేట్ టీఎస్09ఈవై 0733 నంబర్ ప్లేట్‌ను అతికించారు. అనంతరం సర్వారెడ్డి కాలనీకి చేరుకున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు పుస్తెల తాడును తెంచుకుని పారిపోయి డూప్లికేట్ నెంబర్‌ప్లేట్, వారు ధరించిన బట్టలు, మాస్క్‌లను తొలగించి ఏమీ తెలియనట్లు ప్రయాణించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగలించిన బంగారు గొలుసును జకియా సుల్తానా అనే మహిళకు ఇవ్వడంతో ఆమె విక్రయించిందన్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 17.5 గ్రాముల బంగారం, యాక్టివా స్కూటీ, రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి
షాబాద్: రెండు బైకులు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ కాంతారెడ్డితెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు మండల పరిధి మల్లాపూర్తండాకు చెందిన మెగావత్నైందు(27) మద్దూరు బాలాజీ ఫంక్షన్హాల్లో జరిగిన వివాహ వేడుకకు వెళ్లాడు. షాబాద్మండలం లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన కావలి రంజిత్‌కుమార్.. మూడు సంవత్సరాల కుమారుడు కాంత్రికుమార్తో కలిసి శంషాబాద్మండలం వెంకటాపూర్‌లో జరిగిన పెళ్లికి వెళ్లారు. వీరువురు తిరుగు ప్రయాణంలో బాలాజీ ఫంక్షన్‌హాల్ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మెగావత్ మృతి చెందగా.. రంజిత్ అతని కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తంఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రంజిత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నైందు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరొకరి పరిస్థితి విషమం -
మద్యం తాగివాంతులు చేసుకుని..
వలస కూలీ మృతిమొయినాబాద్: మద్యం తాగి వాంతులు చేసుకుని ఓ వలస కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి అజీజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నీలాంచల్ బెహెర(33) బతుకు దెరువుకోసం 3 ఏళ్ల క్రితం అజీజ్‌నగర్‌కు వలస వచ్చాడు. సోడా కంపెనీలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో మద్యం తాగి పడుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో అక్కడే పనిచేసే అతని బంధువు ఈశ్వర్ మహకుల్ భోజనం చేయడానికి నీలాంచల్‌ను నిద్ర లేపాడు. ఆ సమయంలో వాంతులు చేసుకుని మళ్లీ పడుకున్నాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నిద్రలేపే ప్రయత్నం చేయగా.. అతను లేవలేదు. వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచిగాంధీకి తీసుకెళ్లగా.. బెహెర చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నెలరోజుల క్రితం ఆత్మహత్య? గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం గచ్చిబౌలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఆలస్యంగా లభ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గంలోని మహాప్రస్థానం ఎదురుగా ఉండే గుట్టవైపు వేపచెట్టుకు 35–40 ఏళ్ళ వయసున్న ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం స్థానికులు అటువైపు వెళ్లగా దుర్వాసన రావడంతో గమనించి మొబైల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఉండగా..మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లుగా గుర్తించారు. కింద ఒక బ్యాగు అందులో షర్టులు, ప్యాంట్లు, ఒక కంటి అద్దాలు పెట్టుకొనే బాక్సు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా దాదాపు నెల క్రితం ఈ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. -
రియాల్టీ.. పల్టీ!
స్థిరాస్తి వ్యాపారం మందగించింది. దీంతో రియల్టర్లు కష్టాల్లో కూరుకుపోయారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టుకున్నారు. కనీసం తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. షాబాద్: దశాబ్ద కాలానికి పైగా ఊపుఊపిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏడాది కాలంగా నెమ్మదించింది. క్రమంగా జోరు తగ్గి చతికిలబడిపోయింది. దీంతో రియల్టర్లు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. మహా నగరానికి కూతవేటు దూరంలో ఉన్న షాబాద్మండలంలో 2014లో అనేక పరిశ్రమలు కొలువుదీరాయి. దీంతో మండల రూపురేఖలు మారిపోయాయి. వెల్స్పన్, అమెజాన్, కుందన్, మెగా, కటేరా తదితర పరిశ్రమల ఆగమనంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పెట్టుబడి దారులు భూముల కొనుగోలుకు ఉత్సాహం చూపారు. తొలుత లాభాలను గడించారు. అయితే 2023 ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం వ్యాపారం తగ్గిపోయింది. దీనికి ఆర్థిక మాంద్యం తోడవడంతో పరిస్థితులు మారిపోయి.. రియాల్టీ రంగం కళతప్పింది. కుదేలు.. కుంగదీత ఏడాది క్రితం వరకు ఎగిసిపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆర్థిక మాంద్యం ప్రభావంతో కుదేలైంది. తదనంతర పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపాయి. మండల పరిధి హైతాబాద్, చందనవెళ్లి, రుద్రారం, నాగర్‌గూడ, మాచన్‌పల్లి, నాగర్‌కుంట, నాంధార్ఖాన్పేట్, పేద్దవేడు, అంతిరెడ్డిగూడ గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే టీఎస్ఐఐసీలో పరిశ్రమల స్థాపన జరుగుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా మంది ఇక్కడి ప్రాంతాలపై ఆసక్తి చూపారు. అధిక లాభాలను ఆర్జించే ఉద్దేశంతో రూ. కోట్లు, లక్షలు పోసి, భూములను కొనుగోలు చేశారు. తీరా స్థిరాస్తి వ్యాపారం తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌పై బెంగ రియల్భూంతో తొలుత చాలామంది అప్పులు చేసి భూములను కొనుగోలు చేశారు. తీరా వ్యాపారం తగ్గడంతో దిక్కులు చూస్తున్నారు. కొనేవారు లేక అప్పులు ఊబిలో కూరుకుపోయారు. కనీసం వడ్డీలు కట్టలేని దుస్థితి చేరుకున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. వ్యాపారం జోరుమీదున్నప్పుడు నిరుద్యోగులు సైతం భూముల క్రయవిక్రయదారులకు మధ్యవర్తులుగా వ్యవహరించారు. రూ.లక్షల్లో ఆర్జించారు. ప్రస్తుతం దళారిగా వ్యవహరించిన వారిని మినహా ఇస్తే క్రయవిక్రయదారుల్లో చాలామంది నష్టాలను మూటగట్టుకున్నారు. భవిష్యత్‌పై బెంగపెట్టుకున్నారు. భూముల ధరలు పెరగకపోతాయా, దశ తిరగపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో వ్యాపారులు అప్పుల్లో కూరుకుపోయిన వైనం నష్టాలను మూటగట్టుకున్నక్రయవిక్రయదారులు కొనుగోలు చేసిన భూములు కౌలుకు.. సాగు చేస్తున్న రైతులు పొలాలతో కళకళ గడిచిన నాలుగేళ్లుగా చాలా వరకు భూములు సాగుకు నోచుకోలేదు. వ్యాపారం కోసం కొన్న భూములను.. వ్యాపారం పడిపోవడంతో.. రియల్టర్లు కొన్నిచోట్ల కౌలుకు ఇచ్చారు. కౌలుకు తీసుకున్న రైతులు ఎడారిగా మారిన భూములను సాగుకు అనుకూలంగా మార్చుకుని, పంటలు వేశారు. చాలా మంది రియల్ వ్యాపారానికి స్వస్తి పలికి వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. కానీ.. కూలీలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా యూపీ, మహారాష్ట్ర నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. ఈ ఏడాది గ్రామస్తులే వ్యవసాయ పనులు చేసుకునేందుకు మొగ్గు చూపుతుండటంతో కొంత ఊరట లభించింది. ఏది ఏమైనా రియల్భూంతో ఎడారిగా మారిన సాగు భూములు.. రియల్ ఢమాల్తో నేడు పచ్చగా కనిపిస్తున్నాయి. -
తక్కువ ధరకు బంగారమంటూ టోకరా
సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ ద్వారా కాల్స్ చేసి, తక్కువ ధరకు బంగారం విక్రయిస్తానంటూ వల వేసి, అందినకాడికి దండుకుని మోసం చేస్తున్న నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన జాలె చంద్రశేఖర్‌రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్‌లకు బానిసగా మారాడు. ఇతర వ్యసనాలకూ ఉన్న ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. స్నేహితులు, పరిచయస్తుల ద్వారా నగరానికి చెందిన అనేక మంది ఫోన్ నెంబర్లు సేకరించిన ఇతగాడు వారికి వాట్సాప్ కాల్ చేసి తానో బంగారం వ్యాపారిగా పరిచయం చేసుకుంటాడు. ముంబైలో తక్కువ ధరలకు బంగారాన్ని ఖరీదు చేస్తుంటానని, దాన్ని మార్కెట్ రేటు కంటే తక్కువగా విక్రయిస్తానని నమ్మబలుకుతాడు. ఎదుటి వారిని పూర్తిగా నమ్మించడం కోసం వారికి తెలిసిన కొందరి పేర్లు చెప్తాడు. ఇలా కోఠిలో నివసిస్తున్న ఓ వృద్ధుడికి (75) గత ఏడాది డిసెంబర్లో కాల్ చేశాడు. ఆరు తులాల బంగారం రూ.5 లక్షలకు విక్రయిస్తానని నమ్మించాడు. ఆయన నుంచి అడ్వాన్స్‌గా ఆ మొత్తం తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ఆపై బాధితుడు తన బంగారం విషయంపై చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి అడుగుతుండగా... క్రిస్మస్ పండుగతో పాటు ఇతర సాకులు చెప్పి తప్పించుకున్నాడు. తీవ్రంగా ఒత్తిడి చేయగా... ఈ ఏడాది జనవరి 15న నేరుగా వచ్చి బంగారం ఇస్తానని చెప్పాడు. అలా చేయకపోవడంతో బాధితుడు పదేపదే ఫోన్లు చేసినా స్పందించడం మానేశాడు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ కె.ప్రసాదరావు నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేసింది. నగరవాసి నుంచి రూ.5 లక్షలు స్వాహా నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ కాప్స్ -
ప్రతి ఇంట్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండి
శంకర్పల్లి: పిల్లల తల్లిదండ్రులందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రతి ఇంట్లో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మండలంలోని దొంతాన్పల్లిలో ఆదివారం సక్సెస్ షోటోకాన్ కరాటే ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరాటే నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, దానిని నిత్యం సాధన చేయడం అంత కన్నా ముఖ్యమని తెలిపారు. ఫోన్లలో సోషల్ మీడియా, టీవీలు చూడడం తగ్గించి పుస్తక పఠనంపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సక్సెస్ షోటోకాన్ కరాటే ప్రతినిధులు రవీందర్ కుమార్, అనిల్, రాజు, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్‌నాయక్, సుధాకర్ పాల్గొన్నారు. పరీక్షల వేళ భయాందోళన వద్దు మొయినాబాద్‌రూరల్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ ప్రైవేట్ కళాశాలల చైర్మన్ గౌరీ సతీష్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈనెల 5 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇంటర్‌బోర్డు నియమావళిని తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఉదయం 8.45 గంటలలోపు వచ్చిన వారినే పరీక్షలకు అనుమతించనున్నారని, ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని చెప్పారు. సమయాన్ని పాటి స్తూ విద్యార్థులు 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని బోర్డు తొలిసారి నిబంధనలు అమలులోకి తెచ్చిందన్నారు. తల్లిదండ్రు లు విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. పరీక్ష కేంద్రాలకు తగిన సమయానికి తీసుకెళ్లాలన్నారు. ఏవైనా సందేహాలుంటే 92402 05555 టో ల్‌ఫ్రీ నంబర్‌తో పాటు జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి కడ్తాల్: పర్యావరణ పరిరక్షణలో యువకులు కీలక పాత్ర వహించాలని పర్యావరణవేత్త డాక్టర్ సాయిభాస్కర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని ఎర్త్ సెంటర్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, అయిస్టర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సస్టెయినబుల్ ఈకో అడ్వెంచర్ క్యాంపు ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయిస్టర్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సింగాడే సునీల్, పర్యావరణ వేత్త సాయిభాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. మానవళి మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. జంతువులు, అడవుల సంరక్షణ, జీవ వైవిధ్య ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం క్యాంపు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, ప్రతినిధులు జ్ఞానేశ్వర్, రజనీకాంత్, అయిస్టర్ సంస్థ ప్రతినిధులు అనంతశర్మ, అరవింద్, వెంకటేశ్, కృష్ణవేణి, శివ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిజమైన భక్తి ఉండాలి పరిగి: ప్రతి ఒక్కరూ నిజమైన భక్తిప్రపత్తులు కలిగి ఉండాలని ప్రముఖ కవి, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం పరిగి పట్టణంలో ప్రముఖ వక్త డాక్టర్ భాస్కరయోగిచే నిర్వహిస్తున్న పాల్గున సత్సంగంలో పాల్గొని మాట్లాడారు. శరణాగతి.. భక్తి ద్వారా కలుగుతుందని తెలిపారు. భాగవతంలో శుకమహార్షి, ప్రహ్లాదుడు, ఆంజనేయస్వామి భక్తికి మార్గదర్శకులని పేర్కొన్నారు. పరమాత్మ వైపు అడుగులు వేయాలంటే భక్తి ప్రాథఽమికంగా హృదయంలో నిలబడాలని.. అది ఆరిపోని జ్యోతిలా వెలగాలని అన్నారు. కార్యక్రమంలో ప్రహ్లాద్‌రావు, మాధవరెడ్డి, నరేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, పాండుచారి పాల్గొన్నారు. -
పడమట పర్యాటక రాగం!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసే సరికొత్త ప్రాజెక్టు నిర్మాణానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకొనేలా ప్రత్యేక టూరిస్ట్ సర్క్యూట్లకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ట్యాంక్‌బండ్, నెకె్ల్స్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా వలయంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా వలయ రహదారి ఉన్నట్లుగానే పడమట వైపున సుమారు 31 కిలోమీటర్ల పరిధిలో ఒక సర్క్యూట్‌ను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 180 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన ఎకో పార్కు, గాంధీజీ భారీ విగ్రహంతో పాటు పర్యాటకులు సందర్శించేలా అభివృద్ధి చేయనున్న బాపూఘాట్‌తో పాటు వివిధ ప్రాంతాలను ఈ వలయంలో రూపొందించనున్నారు. ఇందుకోసం మౌలిక వసతులు, రహదారుల విస్తరణ, ప్రత్యేక రవాణా సదుపాయాలను విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. ఎకో పార్కు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. చారిత్రక తారామతి బారాదరితో పాటు, హిమాయత్‌సాగర్ ఫారెస్ట్ ట్రెక్ పార్కు తదితర ప్రాంతాలను ఈ వలయం అనుసంధానం చేయనుంది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ)పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. డిజైన్, నిర్మాణం, నిధుల కేటాయింపు, నిర్వహణ, బదిలీ (డీబీఎఫ్ఓటీ) మోడల్ గా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందుకోసం త్వరలోనే ఆసక్తుల వ్యక్తీకరణకు ఆన్లైన్ బిడ్డింగ్ నోటిఫికేషన్ వెలువడనుందని పేర్కొన్నారు. సర్క్యూట్‌లోని ప్రధాన ప్రాంతాలు.. ● ఈ కొత్త టూరిజం సర్క్యూట్లో ఎకోపార్క్ (కొత్వాల్‌గూడ, హిమాయత్ సాగర్ సమీపంలో), బాపూ ఘాట్, తారామతి బారాదరి, ఫారెస్ట్ ట్రెక్ పార్క్ (చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్) వంటి నాలుగు ప్రధాన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఈ సర్క్యూట్ విస్తరించనుంది. ● తారామతి బారాదరి నుంచి బాపూఘాట్‌కు 3.8 కిలో మీటర్లు, బాపూఘాట్ నుంచి ఎకోపార్కు (హిమాయత్‌సాగర్) 13.50 కి.మీ, హిమాయత్‌సాగర్ నుంచి ఫారెస్ట్ ట్రెక్ పార్కు (నార్సింగి) వరకు 7.5 కి.మీ, అక్కడి నుంచి తిరిగి తారామతి బారాదరి వరకు 6 కి.మీ చొప్పున ఈ సర్క్యూట్ విస్తరించి ఉంటుంది. పర్యాటకులను ఆకట్టుకునేలా.. ఈ సర్క్యూట్‌ను ఆధునిక పర్యాటక హంగులతో అభివృద్ధి చేయనున్నారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేలా రవాణా సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. భాగ్య నగర చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించేలా సర్క్యూట్‌ను అందంగా తీర్చిదిద్దుతారు. రెస్టరెంట్లు, షాపింగ్ సెంటర్లు తదితర అన్ని సదుపాయాలూ ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించేవిధంగా ఏర్పాట్లు చేస్తారు. పర్యాటక రంగం అభివృద్ధిని ప్రభుత్వం ప్రత్యేకంగా భావిస్తోంది. ఇప్పటికే మూసీ ప్రక్షాళనతో పాటు బాపూఘాట్‌ను సువిశాలమైన చారిత్రక సందర్శన స్థలంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో నగరాన్ని అన్ని రంగాలతో పాటు పర్యాటక రంగంలోనూ అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ఇలాంటి సర్క్యూట్లు దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేకమైన పర్యాటక ప్యాకేజీలతో వెస్ట్ హైదరాబాద్ టూరిజం సర్క్యూట్‌ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సందర్శించే విధంగా ప్రోత్సహిస్తారు. ‘ఈ సర్క్యూట్ పూర్తయితే నగర పర్యాటక రంగం కొత్త శోభను సంతరించుకుంటుంది. అందుకే దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం’ అని హెచ్ఎండీఏ అధికారి ఒకరు వివరించారు. టూరిస్ట్ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటుకు హెచ్ఎండీఏ సన్నాహాలు తారామతి బారాదరి, బాపూఘాట్, ఎకోపార్కు తదితర ప్రాంతాల అనుసంధానం దేశ, విదేశీ సందర్శకులను ఆకట్టుకునేలా సదుపాయాలు -
క్రీడలను ప్రోత్సహించాలి
హుడాకాంప్లెక్స్: బీసీసీఐ వద్ద ఉన్న నిధులను ఇతర క్రీడలకు మళ్లించి క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ అభిప్రాయపడ్డారు. హీరో సుమన్ 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ‘సుమన్ తల్వార్ లెజెండరీ కప్–2025’ పేరిట రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, మద్యం ఇతర వ్యసనాల బారిన పడుతూ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా వారి జీవితాలను క్రమశిక్షణగా తీర్చిదిద్దుకోవచ్చని సూచించారు. -
ఫ్రెష్.. ఫిష్
పహాడీషరీఫ్: జల్పల్లి పెద్ద చెరువు చేపలకు గిరాకీ పెరిగింది. నెల రోజులుగా బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో జనం చికెన్, గుడ్లు తినడాన్ని కొంత తగ్గించారు. ఈ నేపథ్యంలో మటన్, చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. చికెన్ విక్రయాలు పడిపోవడంతో మటన్ వ్యాపారులు కిలోకు వెయ్యి రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇంత డబ్బు వెచ్చించలేని పేద, మధ్య తరగతి ప్రజలు ప్రత్యామ్నాయంగా చేపలు తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే స్వచ్ఛమైన నీటితో కూడిన జల్పల్లి చెరువులో కళ్ల ముందే పట్టుకొచ్చిన చేపలను విక్రయిస్తుండటంతో శని, ఆదివారాల్లో నగర శివారు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. రుచికరమైన చేపలకు పెట్టింది పేరు పుష్కలమైన నీటితో నిండుకుండలా తొణికిసలాడుతున్న జల్పల్లి చెరువులో ప్రతీ శని, ఆదివారాల్లో తాజా చేపలను విక్రయిస్తుంటారు. 150 ఎకరాల మేర విస్తరించిన ఈ చెరువులోని చేపలు ఎంతో రుచికరంగా ఉంటాయి. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున చేపల విక్రయాలు కొనసాగుతుంటాయి. ప్రస్తుతం వీరి సంఖ్య రెట్టింపైంది. పాతబస్తీ, కాటేదాన్, శంషాబాద్ తదితర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. పాంప్లెట్స్ రకం కిలో రూ.120 ఉండగా.. సాధారణ చేపలు కిలో రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు. రవ్వ, బొచ్చ, కట్ల, గ్యాస్కిట్, కొర్రమీను తదితర రకాల చేపలు ఈ చెరువులో లభ్యమవుతున్నాయి. రెండు సంఘాల ఆధ్వర్యంలో. జల్పల్లి శ్రీరామ ఫిష్ సొసైటీ, పాతబస్తీ కందికల్ గేట్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో రెండు గ్రూపుల పెంపకందారులు ఈ చెరువులో చేపలను పెంచి విక్రయిస్తుంటారు. ఈసారి తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో 55 వేల చేప పిల్లలను ఉచితంగా అందజేశారు. వీటికి అదనంగా రెండు సంఘాల వారు ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి నుంచి 11 లక్షల చేప పిల్లలను తీసుకొచ్చి వదిలారు. నీరు సమృద్ధిగా ఉండడంతో చేపల తూకం కూడా గణనీయంగా పెరిగింది. ఒక్కో చేప ఒక కిలో నుంచి నాలుగు కిలోల వరకు తూగుతోంది. దీంతో పెంపకందారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. జల్పల్లి చెరువు చేపలకు భలే గిరాకీ పెద్ద ఎత్తున తరలివస్తున్న కొనుగోలుదారులు స్వచ్ఛమైన, తాజా చేపలను విక్రయిస్తున్న పెంపకందారులు చికెన్, మటన్‌కు ప్రత్యామ్నాయంగా మాంసాహార వంటకాలు గిరాకీ పెరిగింది ఇటీవల చేపల కోసం జల్పల్లి చెరువుకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. డిమాండ్ ఉన్నప్పటికీ సాధారణ ధరకే విక్రయిస్తున్నాం. చెరువు నీరు కలుషితం కాకుండా కలిసికట్టుగా చూసుకుంటున్నాం. కులమతాలకతీతంగా ఫిష్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం. చేప పిల్లలను వదిలినప్పటి నుంచి అవి పెరిగేంత వరకు అసోసియేషన్ సభ్యులందరు పర్యవేక్షిస్తుంటారు. – నర్సింహ, ఫిష్ సొసైటీ సభ్యుడు ఎంతో రుచికరం చికెన్, గుడ్లు తినడం తగ్గించాం. బయట మార్కెట్లలో లభించే చేపలతో పోలిస్తే జల్పల్లి చెరువు చేపలు రుచికరంగా ఉంటాయి. కళ్ల ముందే చేపలను పట్టుకొచ్చి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. కటింగ్ చేసేవారు కూడా ఇక్కడే అందు బాటులో ఉన్నారు. స్వచ్ఛమైన నీటిలో పెరిగిన చేపలు తినడమే ఆరోగ్యానికి మంచిదని ఈ చేపలకు ప్రాధాన్యమిస్తున్నాం. – రాజు, శ్రీరాంకాలనీ