Sangareddy
-
మహిళల్ని మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌దే
ఎమ్మెల్యే సునీతారెడ్డి పటాన్చెరు టౌన్: అధికారంలోకి వస్తే మహిళలకు రూ. పది లక్షలు, పావలా వడ్డీ రుణం ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి వారిని నిలువును మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీదేనని మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీతారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మహిళల తరపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత, తెలంగాణ రాష్ట్ర మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుమిత్ర ఆనంద్, సంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీ, మాజీ శాసనమండలి చైర్మన్ సతీమణి గీత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం
జహీరాబాద్: మహిళలను అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో నాబార్డు(జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) బ్యాంకు పలు కార్యక్రమాలను చేపట్టిందని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. మండలంలోని దిడిగి గ్రామ శివారులో గల డీడీఎస్–కేవీకేలో మంగళవారం నిర్వహించిన మహిళా వారోత్సవాల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1.20లక్షల మహిళా సంఘాలు, ఐకేపీ, డ్వాక్రా సంఘాలున్నాయని ఈ సంఘాల అభివృద్ధిలో నాబార్డు పాత్ర విస్మరించలేనిదన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు వివిధ బ్యాంకుల ద్వారా రూ.57వేల కోట్లను రుణాల రూపంలో ఇచ్చామని తెలిపారు. నాబార్డు ద్వారా మహిళ, రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్ రంగాల్లో జీవనోపాధి కోసం 30 రోజుల శిక్షణ, ఎల్ఈడీపీ 90 రోజుల శిక్షణ ఇప్పించి యంత్రాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు నాబార్డు పోత్సహిస్తోందని చెప్పారు. సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, నాబార్డు డీజీఎం స్వాతి తివారి, డీడీఎంలు కృష్ణతేజ, నిఖిల్‌రెడ్డి, సఖి అధికారి కల్పన, శాస్త్రవేత్త సి.వరప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల నుంచి నాబార్డు సహకారంతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆయా రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు.నాబార్డు జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ -
చదువుతోనే గుర్తింపు
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి సదాశివపేట(సంగారెడ్డి): చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని విద్యార్థులందరు క్రమశిక్షణ పట్టుదలతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మంగళవారం నిర్వహించిన ముఖముఖి కార్యక్రమంలో అమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డిని విద్యార్థులు వివిధ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. బాల్యం నుంచి రాజకీయ జీవితం, వారి వైవాహిక జీవితం, ఇతర విషయాల గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ భారతి మాట్లాడుతూ ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టుల్లో ఇంటర్వ్యూ స్కిల్స్ ఎట్లా పెంపొందించుకోవాలి వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణనిచ్చినట్లు తెలిపారు. -
గ్రాట్యూటీ ప్రకారం డబ్బులు చెల్లించాలి
సంగారెడ్డి జోన్: కాంట్రాక్టు కార్మికులుగా 10 ఏళ్లకు పైగా పనిచేసిన ట్రైనీ కార్మికులకు గతంలో యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు గ్రాట్యూటీ చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సదాశివపేటలోని ఎంఆర్ఎఫ్ కంపెనీ యాజమాన్యం, ఆ సంస్థలో పనిచేస్తున్న ట్రైనీ కార్మికుల మధ్య వివాదం తలెత్తటంతో సోమవారం కలెక్టర్, పరిశ్రమ యజమాన్యం, కార్మికులు, అధికారులతో చర్చలు జరిపారు. ట్రైనీ కార్మికులు తమ ఇష్టపూర్వకంగా కంపెనీలో పనిచేయదలుచుకుంటే వారిని కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకోవడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. సమాన పనికి సమాన వేతనం చట్టం ప్రకారం తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని పరిశ్రమ కార్మికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల పనితీరు అర్హతలను బట్టి వారికి వేతనం రూ.18 వేల నుంచి రూ.24 వేల వరకు ఇవ్వడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధూరి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, అదనపు ఎస్పీ సంజీవరావు, ఉప కార్మిక కమిషనర్ రవీందర్‌రెడ్డి , కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతీ మండలంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల కొరకు ప్రతీ మండల కార్యాలయాలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేయాలని కలెక్టర్ క్రాంతి టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కార్యాలయాలకు వచ్చి చెల్లించేవారికి సిబ్బంది సహాయసహకారాలు అందించాలన్నారు. ఈ నెల 31 లోపు పూర్తిస్థాయి ఎల్.ఆర్.ఎస్ ఫీజుతో పాటు ప్రో–రాటా ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు వర్తింపజేస్తోందని ప్రచారం చేయాలని చెప్పారు. స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో 76 మంది, రూరల్ ఏరియాలో 116 ఎల్ఆర్ఎస్, ఈ పేమెంట్స్ జరిగాయని వెల్లడించారు. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు రిబేటును మినహాయిస్తూ, వెంటవెంటనే ల్యాండ్ రెగ్యులరైజెషన్కు సంబంధించిన ప్రొసీడింగ్‌లు జారీ చేయడం జరుగుతోందని కలెక్టర్ వివరించారు.మార్చి 31లోగా పెట్రోల్ బంకు ప్రారంభించేలా చర్యలుకలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: జిల్లా మహిళా సమాఖ్య ద్వారా చేపడుతున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకు మార్చి 31లోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా మహిళా సమాఖ్య కమర్షియల్ కాంప్లెక్స్ లో షాపుల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు రుణాలు మార్చి 18వ తేదీ లోగా 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ అదనపు పీడీలు జంగారెడ్డి, బాలరాజ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల అధికారులు, పీడీ హౌసింగ్ రవాణా శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశం ఎంఆర్ఎఫ్ యాజమాన్యం, కార్మికులతో చర్చలు -
జ్యోతిషం పేరుతో మోసం
రూ.లక్ష కాజేసిన దొంగ బాబా మద్దూరు(హుస్నాబాద్): జ్యోతిషం పేరుతో మోసం చేసి రూ.లక్ష కాజేసిన దొంగ బాబాను మద్దూరు పోలీస్‌లు అరెస్టు చేశారు. చేర్యాల సీఐ శ్రీను కథనం మేరకు.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన దక్షిణపు శివయ్య అనే బాబా ఇటీవల చేర్యాల మండలం కమాలయపల్లి గ్రామానికి చెందిన ధర్మోజీ నారాయణచారి జీ టీవీలో జ్యోతిషం చెప్పబడును అని ఒక ఫోన్ నంబర్‌ను చూశాడు. ఆ నంబర్ ద్వారా బాబాకు ఫోన్ చేసి తన ఇంటిలో ఇబ్బందులు ఉన్నాయని, మనశ్శాంతి దొరకడం లేదని చెప్పాడు. పూజ చేస్తే మంచి జరుగుతుందని బాధితుడిని బాబా నమ్మించాడు. రెండు విడుతల్లో రూ.లక్ష తీసుకున్నాడు. మళ్లీ కొద్ది రోజులకు మరిన్ని డబ్బులు కావాలని అడుగడంతో నారాయణచారికి అనుమానం వచ్చి పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. పోలీస్‌లు సాంకేతి పరిజ్ఞానం ఉపయోగించి దొంగ బాబాను పట్టుకున్నారు. అతడి ఫోన్ సీజ్ చేసి లక్ష రూపాయలను బాధితుడికి అందించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట మద్దూరు ఎస్ఐ షేక్ మహబుబ్, పోలీసులు, తదితరులు ఉన్నారు. -
గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటిన రాజ్‌కుమార్
● 385 మార్కులతో 168వ ర్యాంకు ● ప్రస్తుతం వాణిజ్యపన్నుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు.. నారాయణఖేడ్: ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో నారాయణఖేడ్ జంట గ్రామం మంగల్‌పేట్‌కు చెందిన రాజ్‌కుమార్ 600 మార్కులకు 385 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఓపెన్ కేటగిరీలో 168వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. రాజ్‌కుమార్ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి, ప్రాథమికస్థాయి నుంచి నవోదయలో విద్యాభ్యాసం చేశారు. కర్ణాటక సెంట్రల్ యూనివర్సీటీలో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ పూర్తి చేసి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆలోచనతో ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఈ క్రమంలో గత నవంబర్‌లో గ్రూప్–4 ఫలితాలు విడుదల చేయడంతో అందులో సత్తా చాటి వాణిజ్య పన్నుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం దక్కించుకున్నారు. ఇంకా మెరుగైన ఉద్యోగం కోసం గ్రూప్–2 పరీక్షలు రాశారు. గ్రూప్ 2లో రాజ్‌కుమార్ విజయం పట్ల గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందిస్తున్నారు. సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలిసంగారెడ్డి జోన్: మహిళల సమానత్వం ముందు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని జిల్లా పరిషత్తు సీఈఓ జానకిరెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్తు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు సన్మానం చేసి, జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఆడపిల్లలను, మగ పిల్లలను సమానంగా చూస్తూ చదివించాలన్నారు. మహిళలు అన్ని రంగాలలో పురోగమించేలా చేయడమే ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యస్.సూర్యకాంత్, కార్యదర్శి రఘు, ఆర్.స్వప్న మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. డంప్‌యార్డ్‌ను రద్దు చేయాలిరామచంద్రాపురం (పటాన్చెరు): కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు వెంటనే నల్లవల్లి, ప్యారానగర్ డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ కె.రాజయ్య డిమాండ్ చేశారు. రామచంద్రాపురంలోని పీసీబీ జోనల్ కార్యాలయం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డంప్‌యార్డ్ వల్ల కాలుష్యం ఉండదని ప్రజల మధ్యలోకి వచ్చి అధికారులు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో వాయు, జల కాలుష్యం ఉంటుందని ప్రజలు చెప్తుంటే అధికారులు మాత్రం అనుమతులు ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఖేడ్ నుంచి బయల్దేరిన పాదయాత్రనారాయణఖేడ్: దత్తగిరి మహారాజ్ 46వ అమరతిథి సందర్భంగా కొనసాగుతున్న పాదయాత్ర, పల్లకీసేవ (రథయాత్ర) మంగళవారం రాయిపల్లి మార్గంలో బయల్దేరింది. సోమవారం మనూరు మండలం బెల్లాపూర్ దత్తగిరి ఆశ్రమం నుంచి ఈ యాత్ర బయల్దేరి రాత్రి ఖేడ్‌కు చేరుకుంది. రాత్రి పాదయాత్రికులు ఖేడ్‌లోని దత్తగిరి ఆశ్రమంలో బసచేశారు. మంగళవారం తెల్లవారు జామున యాత్ర రాయిపల్లి మార్గంలో బయల్దేరింది. ఈ నెల 15న బర్దీపూర్ ఆశ్రమానికి చేరుకోనుంది. ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఖేడ్ దత్తగిరి ఆశ్రమాన్ని సందర్శించగా నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించారు. -
ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి
జిల్లా వ్యవసాయాధికారి రాధిక కొండపాక(గజ్వేల్): యాసంగిలో నీటి అవసరాలు తక్కువగా ఉండే పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి టీ.రాధిక పేర్కొన్నారు. కొండపాకలో కూరగాయలు, పొద్దు తిరుగుడు, వరి పంటలు సందర్శన చేశారు. భూగర్భజలాలు విపరీతంగా తగ్గిపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయన్న విషయాన్ని రైతులు వ్యవసాయాధికారి దృష్టికి తీసుకొచ్చారు. అక్కడక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతూ ట్యాంకర్ల ద్వారా నీటి తడులను అందించుకుంటూ కాపాడుకుంటున్నామంటూ కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ.. యాసంగిలో తక్కువ పెట్టుబడులతో సాగు చేసే ఆరుతడి పంటలను సాగు చేసుకుంటూ లాభపడాలన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి చెరువులకు నీరు విడుదల చేసేలా వ్వయసాయ శాఖ కృషి చేస్తుందన్నా రు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శివరామకృష్ణ, జిల్లా రైతు కమిటీ కార్యదర్శి దొమ్మాట మహిపాల్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ బూర్గుల సురేందర్‌రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు బైండోవర్ శివ్వంపేట(నర్సాపూర్) : జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని తహసీల్దార్ ఎదుట పోలీసులు మంగళవారం బైండోవర్ చేశారు. మండల పరిధి చండీ గ్రామానికి చెందిన ఆంజనేయులు ట్రాక్టర్‌ను ఇంటి ఎదుట పార్కింగ్ చేశాడు. సోమవారం అర్థరాత్రి గ్రామానికి చెందిన మియ్యడి రాములు, మియ్యడి శేఖర్, సందిగాని వినయ్ ట్రాక్టర్ డాబర్ పట్టీలు చోరీ చేస్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ముగ్గురూ మద్యం మత్తులో చిల్లర దొంగతనాలకు అలవాటు పడటంతో మొదటిసారిగా కౌన్సిలింగ్ ఇచ్చి తహసీల్దార్ కమలాద్రి ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు. తిరుగులేని శక్తిగా భారతి సిమెంట్ టెక్నికల్ మేనేజర్ సునీల్ గజ్వేల్‌రూరల్: సిమెంట్ రంగంలో తిరుగులేని శక్తిగా వికాట్ గ్రూపునకు చెందిన భారతి సిమెంట్ నిలిచిందని, అంతేకాక ఆల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్‌ను తెలంగాణాలో విడుదల చేసినట్టు ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సునీల్ తెలిపారు. శ్రీమాత ట్రేడర్స్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికాట్ గ్రూప్ కంపెనీలు 13 దేశాలలో విస్తరించి ఉన్నాయన్నారు. ఈ గ్రూపునకు చెందిన భారతి సిమెంట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవడంతో పాటు నిర్మాణం ధృడంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలతో పాటు రహదారులకు సరైన ఎంపిక అని, నిపుణులైన ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహకారం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ సతీశ్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి తిరుపతి, టెక్నికల్ అధికారి శ్రీకాంత్, శ్రీమాత ట్రేడర్స్ డీలర్ బాలన్రావు, గణేశ్, రమేశ్‌తో పాటు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
అలసత్వం.. సమన్వయలోపం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఓటమికి గల కారణాలపై ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. గెలిచే అవకాశాలున్న ఎమ్మెల్సీ సీటు చేజారి పోవడానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించారు. ఈ ఓటమికి అభ్యర్థి నరేందర్‌రెడ్డి అలసత్వమే కారణమని పలువురు జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు, కీలక నాయకులతో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు మంగళవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అభ్యర్థి నరేందర్‌రెడ్డి అలసత్వం కారణంగానే జిల్లాలో ఆశించిన ఓట్లు పడలేదని పలు నియోజకవర్గాల నేతలు ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే అభ్యర్థి ఎంపిక కూడా మరోకారణమని, హరికృష్ణకు టికెట్ ఇస్తే ప్రయోజనం ఉండేదని, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని నిలపకపోవడం కూడా కారణమని పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి చివరలో హాజరైన పీసీసీ చీఫ్ బి.మహేష్‌కుమార్‌గౌడ్‌తో కూడా ఈ అంశంపై జిల్లా నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. గూడెం మహిపాల్‌రెడ్డి గైర్హాజరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరు కాగా., ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పార్టీ నేతలు ఆవుల రాజిరెడ్డి, పూజల హరికృష్ణ, తూంకుంట నర్సారెడ్డి, నీలం మధు, కాటాశ్రీనివాస్‌గౌడ్, ఏ.చంద్రశేఖర్, ఎన్.గిరిధర్‌రెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు.పాత బిల్లులు క్లియర్ చేయండి నరేందర్‌రెడ్డి ఓటమిపై సుదీర్ఘ చర్చ స్థానిక నేతలతో సమన్వయం చేసుకోలేదు ఉమ్మడి మెదక్‌లోనే అతి తక్కువ ఓట్లు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన జిల్లా మంత్రులుత్వరలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్)లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. అయితే గతంలో మంజూరైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయని, ఒకరిద్దరు నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఎందుకంత వ్యతిరేకత వస్తోందనే అంశం కూడా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. -
20 రోజులు.. రూ.61కోట్లు
సంగారెడ్డి జోన్: మున్సిపాలిటీల్లో పన్ను వసూలు లక్ష్యం దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పన్ను వసూళ్లపై సమీక్షలు చేపట్టి వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 31 లోపు పన్ను వసూళ్లు చేయాలని లక్ష్యం ఉన్నప్పటికీ, గడువులోపు పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఇప్పటివరకు జిల్లాలో సగానికి మాత్రమే పన్ను వసూళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా ఆయా మున్సిపాలిటీలలో ఆస్తులపై పన్ను వసూలు చేసి నిర్వహణతోపాటు అభివృద్ధికి నిధులు సమకూర్చనున్నారు. పన్ను వసూళ్ల లక్ష్యం రూ.122 కోట్లు జిల్లాలోని ఉన్న పాత మున్సిపాలిటీలలో రూ.122,82,70,230లు పన్ను వసూలు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించారు. ఈనెల 10 వరకు జిల్లావ్యాప్తంగా రూ. 61,72,24,609ల మేర పన్ను వసూలు అయినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలలో అత్యధికంగా నారాయణఖేడ్ పట్టణం మున్సిపాలిటీలో పన్ను వసూలు కాగా అతి తక్కువగా సదాశివపేట మున్సిపాలిటీలో వసూలు అయ్యాయి. ఈ మేర జిల్లావ్యాప్తంగా 50.25% పన్ను వసూలు నమోదు అయింది. సవాలుగా మారిన పన్ను వసూళ్లు 2024–2025ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆయా మున్సిపాలిటీలలో రూ.61,10,45,621లు పన్ను వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలో ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారులకు పన్నువసూలు పెద్ద సవాల్‌గా మారింది. ఇదిలాఉండగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో ఆన్లైన్ విధానంలోకి మార్చకపోవడంతో ఇంకా వసూలు ప్రారంభించలేదు.(ఈ నెల 10 వరకు)(రూ. లలో)ఆన్లైన్ విధానంలో చెల్లింపులు మున్సిపాలిటీలలో పన్ను వసూళ్లు మాన్యువల్ పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్లైన్ పద్ధతిలో వసూలు చేస్తున్నారు. ప్రత్యేక ఆన్లైన్ మిషన్ ద్వారా పన్ను వసూలు చేసి వెంటనే వారికి రసీదును అందిస్తున్నారు. వసూలు అయిన పన్ను పక్కదారి పట్టకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలే... మున్సిపాలిటీలలో పన్ను వసూళ్లపై అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. త్వరిగతిన పూర్తి చేయాలని అధికారుల ఆదేశాలు బేఖతార్ చేస్తున్నారు. వసూళ్లపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల పన్నువసూళ్లపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ 17మంది అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.మున్సిపల్లో వసూలు 50%మాత్రమే వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు గడువులోపు పన్ను లక్ష్యం నెరవేరేనా?జిల్లాలోని మున్సిపాలిటీలలో పన్ను వసూళ్ల వివరాలు మున్సిపాలిటీ వసూలు చేయాల్సింది వసూలు చేసిందిఅమీన్పూర్ 31,93,63,300 19,40,65,553 అందోల్ 1,31,98,056 92,12,905 బొల్లారం 15,97,84,799 11,32,13,985 ఇస్నాపూర్ 2,42,39,557 ––– నారాయణఖేడ్ 2,42,67,285 1,78,06,664 సదాశివపేట 11,17,59,118 3,06,97,841 సంగారెడ్డి 16,30,04,008 7,40,95,113 తెల్లాపూర్ 25,04,61,107 12,81,62,506 జహీరాబాద్ 16,21,93,000 4,99,70,042 -
సర్వీసులు ఫుల్.. సౌకర్యాలు నిల్
సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి చౌరస్తాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లలో కనీస వసతులు కరువయ్యాయి. ప్రయాణికుల సంఖ్య పెరిగినా సౌకర్యాలు మాత్రం మెరుగుపడటం లేదు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం నిత్యం బస్సులు రద్దీతో దర్శనమిస్తూ బస్టాప్ కిటకిటలాడుతుంది. ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలోని అంతర్ సర్వీసులతోపాటు హైదరాబాద్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలుస్తాయి. లింగంపల్లి చౌరస్తా నుంచి జహీరాబాద్ వరకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా, బుదేరా, కంకోల్, సదాశివపేట, కోహీర్ ప్రధానంగా దూర ప్రాంతాల సర్వీసులతోపాటు అంతర్రాష్ట్ర సర్వీసులను బస్టాండ్లలో నిలుపుతారు. వేసవికాలం సమీపించడంతో బస్సుల కోసం ప్రయాణికులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. చౌరస్తా బస్టాండ్‌లో తాగునీరు, నీడలో కూర్చునేందుకు గూడారాల ఏర్పాట్లు, కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌లో వసతుల్లేక ప్రయాణికుల ఇబ్బందులు అవస్థలు పడుతున్నా పట్టించుకోని అధికారులుఇబ్బందులు పడుతున్నాం నిత్యం ఉద్యోగాలు, చదువుల కోసం హైదరాబాదుకు వెళ్తుంటాం. వందలాదిమంది ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉంటున్న పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఏ విధమైన ఏర్పాట్లు లేవు. తాగునీరు, మూత్రశాలలు లేక చాలా కష్టాలు పడుతున్నాం. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. –మాధవి, ప్రయాణికురాలు గుడారాలను ఏర్పాటు చేయాలి ఎండాకాలం సమీపించడంతో బస్టాండ్ వద్ద బస్సుల కోసం ఎక్కువ సేపు ఎండలో ఉండలేకపోతున్నాం. తాత్కాలికంగా గుడారాలను ఏర్పాటు చేయాలి. మహిళలు, వృద్ధులకు, చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. –రామస్వామి, ప్రయాణికుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్తాను.. సంగారెడ్డి చౌరస్తా ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌లో సౌకర్యాల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాను. రోడ్డు పనులు నడవటంతో బస్‌స్టాప్‌కు ఇబ్బందిగా ఉంది. – ఉపేందర్,ఆర్టీసీ డిపో మేనేజర్ -
మద్యం మాన్పించారని ఆత్మహత్య
దుబ్బాకటౌన్: ఉరేసుకొని హమాలీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయపోల్ మండలం కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రఘుపతి కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన బ్యాగరి శ్రీను (45) వ్యవసాయం చేస్తూనే హమాలీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిస కాగా కుటుంబ సభ్యులు మందలించి మద్యం మాన్పించారు. సోమవారం భార్య చంద్రకళతో తనకు డబ్బులు ఇవ్వాలని గొడవపడగా ఆమె ఇవ్వలేదు. మద్యం మా న్పించారని మనస్తాపం చెంది, జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో భర్త చిన్నశంకరంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం మేరకు.. నార్సింగి గ్రామానికి చెందిన వట్టెపు స్వామి(32)కి మూడేళ్ల కిందట వడియారం గ్రామానికి చెందిన శిరీషతో వివాహమైంది. పిల్లలు కావడం లేదని తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో 9 నెలల కిందట శిరీష పుట్టింటికి వెళ్లింది. పెద్దల పంచాయితీ పెట్టగా ఇరువురికి నచ్చజెప్పారు. కాపురానికి వచ్చిన భార్య 20 రోజుల కిందట మళ్లీ గొడవపడి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన స్వామి మంగళవారం ఉదయం సోదరుడు శ్రీకాంత్‌కు ఫోన్ చేసి వల్లూర్ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అక్కడికి చేరుకొని స్వామిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి ఆగమయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసై వ్యక్తి చేగుంట(తూప్రాన్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చేపూరి ప్రశాంత్(31) గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై భార్య సుకన్యను ఇబ్బందులకు గురి చేయడంతో పుట్టింటికి వెళ్లింది. దీంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మాజీ ఉప సర్పంచ్ కల్హేర్(నారాయణఖేడ్): ఉరేసుకొని మాజీ ఉపసర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కృష్ణాపూర్ మాజీ ఉపసర్పంచ్ మల్దోడ్డి ఈశ్వర్(48) వ్యవసాయం చేస్తుండేవాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఈశ్వర్ మంగళవారం గ్రామ శివారులోని పురాతన గడిలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఈశ్వర్ కుటుంబీకులను పరామర్శించారు. ఈశ్వర్ మృతిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ఏసీబీ వలలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్
మెదక్ మున్సిపాలిటీ: ఏసీబీ అధికారులకు ఓ మున్సిపల్ ఆర్ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ పట్టణానికి చెందిన ధర్మగల్ల శివ కుమార్ తన సోదరి శైలజకు సంబంధించిన సర్వే నంబర్ 505/1/1/2 లోని 605 గజాల ఖాళీ స్థలాన్ని మ్యుటేషన్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయమై సదరు అధికారి పని చేయకుండా పలుమార్లు తిప్పుకొని రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.12 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు గత నెల 24న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్స్పెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు బృందం పక్కా ప్రణాళికతో వలపన్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో బాధితుడిద నుంచి మున్సిపల్ ఆర్ఐ జానయ్య రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెదక్ మున్సిపల్ కార్యాలయంతోపాటు సూర్యాపేటలోని ఆర్ఐ ఇంట్లోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 8 గంటల పాటు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరాలు సేకరించారు. అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్యను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈ సోదాలో సీఐలు వెంకటేశ్వర్లు, రమేశ్‌తోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థ్థలం మ్యుటేషన్ కోసం రూ. 20 వేలు డిమాండ్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి ఏకకాలంలో రెండు చోట్ల ఏసీబీ సోదాలు అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలింపు -
ర్యాంక్‌లు కొలమానం కాదు
కోహెడరూరల్(హుస్నాబాద్): విద్యార్థులకు ర్యాంక్‌లు, మార్కులు కొలమానం కాకుండా సబ్జెక్ట్‌ల వారీగా విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్పినేటివ్ విద్యా ఫౌండేషన్ సహకారంతో కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయగా కలెక్టర్ మనుచౌదరితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తుందని గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో తాగునీరు, రెండు తరగతి గదులు, స్పోర్ట్స్ మెటీరియల్ అవసరం ఉందని విద్యార్థులు అడగగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో దే వకీ, ఆర్డీవో రామ్మూర్తి, ఎంఈవో పద్మాయ్య, ఇన్పినేటివ్ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అక్కన్నపేట(హుస్నాబాద్): గతంలో పెద్దవారికే కంటి అద్దాలు వచ్చేవి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉచిత కంటి క్యాంపులో 304 మందికి స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు. 129 మందికి ఆపరేషన్ అవసరం కాగా 72 మంది సెలెక్ట్ అయ్యారన్నారు. 52 మందికి ఈరోజు, వచ్చే వారం మిగిలిన వారిని ఆపరేషన్‌కు తీసుకెళ్తామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, జిల్లా గంథ్రాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, డీఎంహెచ్‌వో పల్వాన్, ఆర్డీఓ రామ్మూర్తి పాల్గొన్నారు. సబ్జెక్ట్‌ల వారీగా పరిజ్ఞానం పెంచుకోవాలి విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన బస్వాపూర్‌లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం -
బొట్టు బొట్టు ఒడిసి పట్టి..
ఆలోచనకు పదును పెట్టి..డ్రిప్ పద్ధతిలో వరి సాగు ● మదిర గ్రామం ఆరెపల్లికి చెందిన రైతు రాజేందర్ వినూత్న ఆలోచన ● 24 గంటలపాటు నీటి తడులు ● మండు వేసవిలోనూ పైరు పచ్చగా.. ● సమయం, పెట్టుబడి ఖర్చులు ఆదా ● తప్పనున్న కూలీల బెడద రోజురోజుకూ ఎండ ప్రచండంగా మారుతున్న పరిస్థితుల్లో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. వరికి సాగుకు నీరందక చేలన్నీ ఎండిపోయి బీటలు వారుతున్నాయి. ఇక చేసేది లేక రైతులు ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయాలని మండల పరిధిలోని లక్ష్మీనగర్ గ్రామ పంచాయతీ మదిర గ్రామం ఆరెపల్లికి చెందిన లకిడి రాజేందర్ తన ఆలోచనకు పదును పెట్టాడు. బొట్టు బొట్టునూ ఒడిసి పట్టి డ్రిప్‌తో ఎకరంలో వరి సాగుకు శ్రీకారం చుట్టాడు. మండు వేసవిలో నీటిని ఒసిడి పడుతూ డ్రిప్ ద్వారా పంటకు నీటి తడిని అందిస్తున్నాడు. దీంతో వరి పచ్చగా ఎదుగుతూ దర్శనమిస్తుంది. – మిరుదొడ్డి(దుబ్బాక) సాఽదారణంగా వరి సాగు చేయాలంటే నీటి అవసరం చాలా ఉంటుంది. వరి సాగుకు పొలం నిండా నీరు ఉంటేనే దిగుబడులు వస్తాయి. డ్రిప్ ద్వారా వరి మొక్కలకు బొట్టు బొట్టుతో నీటిని అందిస్తే సరిపోతుంది. అలాగే ఖర్చులు కూడా తగ్గుతాయి . వరి సాగుకు సంబంధించి బురద పొలాన్ని నాగలితో లేదా ట్రాక్టర్‌తో దున్నడం, గొర్రుతో చదును చేయడం, వరి నారు పోయడం, నారు పీకడం, నాట్లేయడం, కలుపు తీయడం వంటి పనులతో శ్రమ, ఖర్చుతో కూడుకున్న పని. పొలాన్ని దున్ని నాటు వేసే వరకు పెట్టుబడులు తలకు మించిన భారంగా మారుతాయి. అదే డ్రిప్ సాగులో ఒకే సారి దుక్కి దున్ని, పొలాన్ని చదును చేసి సీడర్‌తో విత్తనాలు పెట్టుకొని డ్రిప్ ద్వారా నీటి తడిని అందిస్తే తక్కువ ఖర్చుతో గట్టెక్కవచ్చు. కూలీల కొరత తప్పుతుంది డ్రిప్ సాయంతో సాగు చేస్తున్న వరికి కూలీల కొరత తప్పుతుంది. నేరుగా విత్తుకున్న పొలంలో ఎక్కువగా కలుపు రాదు. దీంతో కూలీల అవసరం కూడా ఉండదు. కలుపు నివారణకు అందుబాటులో ఉన్న గడ్డి నివారణ మందును పిచికారీ చేసుకునే వీలు కలుగుతుంది. అలాగే యూరియా, పొటాష్ వంటి రసాయన ఎరువులను చల్లడం వల్ల ఎక్కువ ఖర్చవుతుంది. అదే డ్రిప్ సాగులో లిక్విడ్ యూరియాను పైపుల ద్వారా వరి దుబ్బలకు నేరుగా అందిస్తే మంచి పోషకాలు అందుతాయి. మోతాదు కంటే ఎక్కువగా వాడే రసాయన ఎరువుల ఖర్చు సైతం తగ్గుతుంది. ఎండను తట్టుకునేలా.. సాగు నీరందక వరి చేలు ఎండుముఖం పడుతున్న నేపథ్యంలో 24 గంటల పాటు డ్రిప్ ద్వారా బొట్టు బొట్టుగా నీటి తడి నిరంతరం అందుతుండటంతో వరి దుబ్బులు పచ్చగా కళకళలాడుతూ ఎండను తట్టుకుంటున్నాయి. డ్రిప్ సాయంతో సాగవుతున్న వరికి పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా సమయాన్ని, సాగు నీటిని ఆదా చేసుకునే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తుంపర సేద్యం మేలు చిన్నకోడూరు(సిద్దిపేట): ఎండలు మొదలు కావడంతో ఉన్న కొద్దిపాటి నీటితో తుంపర పరికరాల ద్వారా రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. తద్వారా రైతుకు శ్రమ తగ్గడంతో పాటు నీరు కూడా తక్కువ అవసరం ఉంటుంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయొచ్చు. దీంతో రైతులు తుంపర సేద్యం ద్వారా ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. -
జొన్న.. లాభాలు మిన్న
జహీరాబాద్ టౌన్: చిరు ధాన్యాల పంటల్లో అత్యధికంగా పండించే పంటల్లో జొన్న ఒకటి. కార్బొహైడ్రేట్లు, ఫైబర్ ఎక్కువగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న ప్రజాధరణ పొందింది. ఒకప్పుడు పల్లెల్లో విరివిగా కాసిన జొన్న పంట కాలక్రమంలో తగ్గిపోయింది. ప్రజలు జొన్న రొట్టెలు తినడం ప్రారంభించడంతో మళ్లీ డిమాండ్ పెరిగింది. (తెల్ల) జొన్న ఆహారపు అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. తెల్ల జొన్నకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. గిట్టుబాటు ధర కూడా లభిస్తుండడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు జొన్న పంట సాగుపై మొగ్గు చూపుతున్నారు. జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గంలో రబీలో జొన్న అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. జిల్లాకు సరిహద్దులో ఉన్న కర్నాటక, మహారాష్ట్రలో కూడా ఈ పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. జొన్న సాగుకు నల్లరేగడి నేలలు లేదా తేలిక పాటి ఎర్ర చల్క నేలలను శ్రేయస్కరం. రబీలో పండించే జొన్న వర్షాధారిత పంట కాదు. గాలిలోని తేమ ద్వారానే పంట పండుతుంది. జొన్నకు తెగుళ్ల బెడద తక్కువే. ఇతర పంటల మాదిరిగా ఆశించినంతగా ఉండదు. నెమళ్లు, అడవి పందుల బెడద ఉంటుంది. వాటి నుంచి రక్షించుకునేందుకు కష్టపడితే చాలు. జిల్లాలో గతేడాది జొన్న పంట సుమారు 35 వేల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది సుమారు 42 వేల ఎకరాల్లో రైతులు పంట పండిస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. క్వింటాల్‌కు రూ. 6 వేల వరకు పలుకుతుంది. ఎకరాలకు సగటున 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది. కొనుగోళ్ల కేంద్రాల ద్వారా ప్రభుత్వం పంటను కొనడం వల్ల రైతులకు పంట అమ్మడానికి ఇబ్బందులు ఉండవు. పెరిగిన సాగు విస్తీర్ణం జిల్లా వ్యాప్తంగా సుమారు 42 వేల ఎకరాల్లో సాగు మార్కెట్లో మంచి డిమాండ్ క్వింటాల్‌కు రూ.6 వేలు -
అధిక దిగుబడులు వస్తాయి
రైతులు జొన్న పంట సాగు ఆసక్తి చూపడం మంచిదే. రెండు, మూడేళ్ల నుంచి పంట సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అనువైన రకాలు ఎంపిక చేసుకొని సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి. జొన్నకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో రైతులకు లాభం కలుగుతుంది. – భిక్షపతి, ఏడీఏ, జహీరాబాద్ ఆశాజనకంగా ఉంది జొన్న పంటకు డిమాండ్ ఉండడంతో ఈసారి ఎకరం పొలంలో జొన్న పంట వేశా. ఇప్పటికై తే పంట చాలా మంచిగానే ఉంది. ప్రస్తుతం కోతకు వచ్చింది. కోసిన తర్వాత దిగుబడి రేటు చూస్తే తెలుస్తుంది. లాభం వస్తే వచ్చే సంవత్సరం కూడా రబీలో జొన్న పంట వేస్తా. –సీ.నాగన్న, రైతు, హద్నూర్ -
వరికి బదులు మొక్కజొన్న వేసుకోవాలి
అక్కన్నపేట(హుస్నాబాద్): వరితో పోల్చుకుంటే మొక్కజొన్న పంట కాలం తక్కువ, నికర ఆదాయం అధికమని వ్యవసాయ పరిశోధన కేంద్రం డాక్టర్ శ్రావణి, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి అన్నారు. అక్కన్నపేట మండలం చౌటకుంట తండాలో మంగళవారం ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధన తోర్నాల ఆధ్వర్యంలో మొక్కజొన్న చిరుసంచులైన కేఎన్ఎంహెచ్–4191 హైబ్రిడ్ రకంను రైతుల పొలంలో క్షేత్ర ప్రదర్శన చేసి అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ రకం మొక్కజొన్న హైబ్రీడ్ నీటి ఎద్దడిని, ఎండు తెగులను తట్టుకోవడమే గాక యాసంగి కాలానికి అనుకూలమైనవని అన్నారు. అదే విధంగా మార్చి ఏప్రిల్ మాసాల్లో పడే వడగండ్ల నుంచి కూడా రైతులు పంటను కాపాడుకోవచ్చని తెలిపారు. చీడపీడలను తట్టుకొని, వర్షాభావ పరిస్థితుల్లో కూడా రైతులకి మంచి దిగుబడులను అందజేస్తాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తాన, వ్యవసాయ విస్తరణాధికారి కరంటోతు శ్రీలత, రైతులు పాల్గొన్నారు. -
సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దు
సంగారెడ్డి జోన్: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యను ఓపిగ్గా విని సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సివిల్ తగాదాలలో తల దూర్చకూడదని, చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురాలన్నారు. సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని,, నిర్ణీత సమయంలో అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని సూచించారు. శాంతి భద్రతల రక్షణలో రాజీపడొద్దని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. బాధ్యతల స్వీకరణ జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమ వారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎస్పీ చెన్నూరి రూపేష్, అదనపు ఎస్పీ సంజీవరావు స్వాగతం పలికారు. అలాగే.. పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ వల్లూరు క్రాంతితో పాటు జడ్జి భవానీ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. గణనాథుని సన్నిధిలో..పటాన్చెరు టౌన్: రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానంలో నూతన ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో ఉన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఎస్పీకి తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఎస్పీ వెంట పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ వినాయక్ రెడ్డి ఉన్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలి కొత్త ఎస్పీ పరితోష్ పంకజ్ -
31 వరకు రాయితీ గడువు
సంగారెడ్డి జోన్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లాలోని వివిధ ఽశాఖల అధికారులు, లేఅవుట్ డెవలపర్లతో ఎల్ఆర్ఎస్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీలోగా ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుందని చెప్పారు. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు కూడా నిర్ణీత కాలంలో డబ్బులు చెల్లిస్తే 25 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తులు చేసిన వారికి రాయితీ గురించి వివరించాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్లాట్లు ,లేఔట్లలో ఉన్న దరఖాస్తుదారులకు నూతన విధానంపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జెడ్పీ సీఈవో జానకి రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మి, డీపీవో సాయిబాబా, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. 102 మంది పిల్లలకు వీల్చైర్ల పంపిణీ పట్టణంలోని సంజీవ్‌నగర్ కాలనీ భవిత సెంటర్లో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష పథకం, అలిమ్కో సంస్థ ఆధ్వర్యంలో 102 మంది ప్రత్యేక అవసరాల పిల్లలకు కలెక్టర్ క్రాంతి ఉచిత సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. సాధారణ పిల్లలతో పాటు విద్యను అభ్యసించేలా అనేక రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సకాలంలో ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లిస్తేనే ఈ అవకాశం కలెక్టర్ వల్లూరు క్రాంతి -
అరకొర సౌకర్యాలతో అవస్థలు
సంగారెడ్డి జోన్: కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరిగా కుర్చీలు లేకపోవడంతో క్యూలైన్లలో గంటల తరబడి నిలవాల్సి వచ్చింది. అసలే వేసవి కాలం.. పైగా దివ్యాంగులు, వృద్ధులు. వారికి సరైన సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. దీంతో వారు తీవ్ర అవస్థలు పడ్డారు. కాగా, ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఇతర అధికారులు అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో 57 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్ ఓ పద్మజరాణి, తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు
పటాన్చెరు టౌన్: నైపుణ్యాభివృద్ధితో ఉద్యోగాలు సాధించవచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎన్ఐఐటీ ఎన్జీఓ మైక్రోసాఫ్ట్ కంపెనీ వారి సౌజన్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్ అనే అంశాలపై మూడు నెలల శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ప్రిన్సిపాల్ సోమవారం సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ... శిక్షణలో 120 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో 116 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. శిక్షణ శిబిరం కళాశాల టాస్క్ సమన్వయకర్తగా వ్యవహరించిన అధ్యాపకురాలు ప్రవీణ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలోనే కాకుండా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సెల్ప్స్టడీ చేసి శిక్షణ నిర్వహించి, విద్యార్థులను పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డాక్టర్ పూణమ్ కుమారి, కరుణ కుమారి, వెంకటేశం, మల్లిక, సంతోష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ -
చెక్ డ్యాం నిర్మాణాల పరిశీలన
నారాయణఖేడ్: యునైటెడ్ వే ఆఫ్ ముంబై సంస్థ ప్రిన్స్పైప్స్ సహకారంతో ‘జలసంజీవని విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’లో భాగంగా ఖేడ్ మండలం గైరాన్‌తండా, సీతారాం తండా శివారులో రెండు చెక్ డ్యాంలు, చాప్టా(కె) శివారులో మరో చెక్ డ్యాంను నిర్మించారు. సోమవారం సంస్థ జిల్లా మేనేజర్ శివరాజ్నాయక్, ఇన్చార్జి అజీజ్ టొంబాలి, ఇంజనీర్ కృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్లు శ్రీకాంత్, ప్రియాంక సందర్శించి పరిశీలించారు. తమ సంస్థ ద్వారా భూగర్భజలాల పెంపు, వాననీటి సంరక్షణ, వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహించడంలో భాగంగా మల్టిలేయర్ ఫార్మింగ్, ఆగ్రో హర్టికల్చర్, నర్సరీలు, ఫాంపాండ్ నిర్మాణం తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే, చాప్టా(కె), అబ్బెంద ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించినట్లు వివరించారు. డంపింగ్ యార్డుపై ఫిర్యాదుజిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు 34వ రోజుకు చేరుకున్నాయి. ఈ సమస్యను జేఏసీ సభ్యులు ప్రాంతవాసులతో కలిసి జిల్లా కలెక్టర్ వద్ద మొర పెట్టుకున్నారు. గతంలో గ్రామపంచాయతీ తీర్మానాల పత్రాలను కలెక్టర్‌కు వివరించారు. శాంతియుతంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలను అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులను రాంకీ పరిశ్రమ తప్పుదోవ పట్టిస్తుందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 2021 నాటి లేఖను కలెక్టర్‌కు జతపరిచి వివరించారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని డంపింగ్‌యార్డ్ ఏర్పాటును రద్దుచేయాలని కలెక్టర్‌కు జేఏసీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. జేఏసీకి విరాళం అందజేత ప్యారానగర్ డంపింగ్‌యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ పిలుపు మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు రోజురోజుకు స్థానికుల నుంచి మద్దతు పెరుగుతతోంది. ఉమ్మడి జిన్నారం మండలాలకు చెందిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు సోమవారం జేఏసీ కమిటీ సభ్యులను కలిసి రూ.10 వేల విరాళాన్ని అందజేశారు. టీచర్లను మానసిక ఒత్తిడికి గురిచేయొద్దుయూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సాయిలు సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేజీబీవీ, యుఆర్ఎస్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురి చేయవద్దని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సాయిలు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయడంలో, టైం యాప్ ద్వారా ఉదయం సాయంత్రం అసెంబ్లీ రికార్డు చేసి పంపమనడంతో ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురవతున్నారని పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల బాగోగులు బోధన పైన ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అరకొర జీతాలతో పనిచేస్తున్న వారికి 28 రోజుల జీతం రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమ్మె కాలపు జీతాన్ని ఇవ్వాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూటీఎఫ్ కేజీబీవీ శాఖ జిల్లా ఇన్చార్జి రాజేశ్వరి, గీత తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఎఫ్ కార్మికుల ఆందోళనసంగారెడ్డి జోన్: ఎంఆర్ఎఫ్ పరిశ్రమ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే.. కలెక్టర్‌ను కలిసేందుకు వారు ప్రయత్నించగా..గేటు వద్ద పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో గంటల తరబడి కలెక్టరేట్ ఎదుట నిలబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమలో పర్మినెంట్ చేయాలని కోరితే మొత్తానికి తీసేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 350 మంది జీవితాలను రోడ్డున పడేశారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
విల్లాసవంతం ఏదీ..?
రామచంద్రాపురం (పటాన్చెరు): గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. హైదరాబాద్ నగరంలో వాయుకాలుష్యం, తాగునీరు, ట్రాఫిక్ తదితర సమస్యలకు దూరంగా.. ప్రశాంత జీవితం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేసిన ఉద్యోగులు, వ్యాపారాస్తులు పడరాని పాట్లు పడుతున్నారు. విల్లాలు కొన్నామన్న సంతృప్తి, సంతోషం లేక విలవిల్లాడి పోతున్నారు. వారికి ప్రశాంత జీవనం కరువైంది. తాము ప్రభుత్వానికి వేల రూపాయల పన్ను చెల్లిస్తున్నా కనీస సదుపాయాలు కల్పించడం లేదని, సమస్య పరిష్కారం కోసం ప్రతిసారి రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వారు వాపోతున్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సుమారు 50పైగా గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు ఉన్నాయి. అందులో అధికారిక లెక్కల ప్రకారం 60 వేలకు పైగా జనాభా ఉండగా.. అనధికార లెక్కల ప్రకారం సుమారు 2లక్షపై జనాభా ఉంది. అయితే.. జనాభాకు సరిపడా మౌలిక సదుపాయలు కల్పించడంలో పాలకులు, అధికారులు పూర్తిగా విఫలం చెందారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు లేక ఇబ్బందులే.. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు రింగ్ రోడ్డు నుంచి తెల్లాపూర్ మీదగా గోపనపల్లి వరకు రేడియల్ నిర్మించి పదేళ్లు పూర్తి కావస్తున్నా.. నేటికి ఆ రోడ్డు అసంపూర్తిగానే ఉంది. దీనితో పాటు అన్ని ఇంటర్నల్ రోడ్లను అభివృద్ధి చేయాలని స్థానికులు పోరాటాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నిధులను కేటాయించామని ఆధికారులు చెబుతున్నారే తప్ప అమలు చేయడం లేదు. నిత్యం రోడ్లపై భారీ వాహనాల రాకపోకలతో రోడ్లపై దుమ్ము, ధూళితో వాయుకాలుష్యానికి దారి తీస్తుంది. అలాగే.. జనాభాకు సరిపడా ప్రభుత్వాస్పత్రి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలు పెరుగుతున్నా వాటికి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారన్న విమర్శలున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చెరువులోకి డ్రైనేజీ నీరు చేరుతుంది. తప్పని తాగునీటి సమస్య కాలనీలకు తాగునీటి అందించడంలో పాలకులు పూర్తిగా విఫలం చెందారు. రిజర్వాయర్ నిర్మించినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు తాగునీరు సరఫరా చేయడం లేదు. తాగునీటి సరఫరా కోసం డెవలప్మెంట్ పేరిట లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన సమస్యలను గాలికొదిలేసిన అధికారులు పార్కులపై దృష్టి సారించారని స్థానికులు విమర్శిస్తున్నారు.పట్టించుకోవడంలేదు ప్రత్యేక అధికారుల పాలనలో సైతం ప్రజాసమస్యలను పట్టించుకోవడంలేదు. అధికారులు వారి సొంత లాభాలపైనే దృష్టి పెడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలు ఉండగా.. కోట్లాది రూపాయలతో పార్కుల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినా సమాధానం ఇవ్వడంలేదు. మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో కనీసం విజిలెన్స్ అధికారులు విచారణ జరపాలి. – ఈశ్వరిగారి రమణ, తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి అధికారులు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి. ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలను పట్టించుకోవడం లేదు. వెంటనే సమస్యలను పరిష్కరించాలి. – కొల్లూరి భరత్, మాజీ కౌన్సిలర్ రూ.కోట్లు వెచ్చించి విల్లాలు కొన్నా.. తప్పని ఇబ్బందులు మౌలిక సదుపాయాలు లేక సతమతం వేల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా అభివృద్ధి పట్టదా..? గేటెడ్ కమ్యూనిటీవాసుల ఆవేదన -
తమ పొలాలకు వెళ్లకుండా..
తమ భూముల్లో పంటలు పండించుకునేందుకు వెళ్లేందుకు వీలులేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డుగోడలు కట్టారని, దీంతో తాము వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కంది మండలం చెర్లగూడెంకు చెందిన సుమారు 35 మంది రైతులు కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం అందజేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూముల్లోకి వెళ్లనీయకుండా ఎక్కడికక్కడ పలకలతో గోడలు కట్టడంతో తమ పంటను ఇంటికి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని గోపాల్‌రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. -
100 మార్కులు సాధించవచ్చు
ప్రతీ అధ్యాయంలో చివర ఇచ్చిన ముఖ్య అంశాల్లోని సూత్రాలను, నిర్వచనాలను అధ్యయనం చేయాలి. సమస్యల సాధన, కారణాలను తెలపడం నిరూపించడం లాంటి నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాలి. నిరూపక రేఖ గణితం, రేఖా గణితం, సంభావ్యత, సంఖ్యాశాస్త్రం, బీజీయా సమాసాలపై సాధన చేయాలి. గ్రాఫ్ ఆధారిత సమస్యలపై సాధన అవసరం. నిర్మాణాత్మక సమస్య సాధనపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఓజీవ్ గ్రాఫ్, త్రికోణమితిలో పటాలను గీయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే పాఠ్యాంశాల్లోని కీలక భావనలపై దృష్టిని సారించాలి. – త్రినాథరావు, గణితశాస్త్రం -
బల్దియా బడ్జెట్ ఢమాల్
● గతేడాదితో పోల్చితే రూ.25 కోట్లు తగ్గుదల ● అంచనా బడ్జెట్ రూ.75.19 కోట్లు ● ఆదాయ, వ్యయ అంచనాల్లో స్వల్ప తేడా ● సిద్దిపేట మున్సిపాలిటీ బడ్జెట్కుఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదం సిద్దిపేటజోన్: జిల్లాలోని ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట పెద్ద పద్దు(బడ్జెట్)ను సోమవారం ప్రవేశపెట్టారు. గతేడాది బడ్జెట్ రూ.104 కోట్లతో పోల్చితే సారి రూ.25 కోట్ల ఆదాయ, వ్యయ అంచనాల్లో తగ్గుదల కనిపించింది. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సమక్షంలో 2025–26 అంచనా బడ్జెట్, 2024–25 సవరణ అంచనా బడ్జెట్లను కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025–26 అంచనా బడ్జెట్లో వివిధ రూపాల్లో మున్సిపాలిటీకి రూ. 75.19 కోట్ల ఆదాయం చూపించగా, వివిధ ఖర్చుల కింద రూ.75.14 కోట్ల అంచనాతో రూపకల్పన చేశారు. 2024–25 సవరణ బడ్జెట్ మిగులు నిల్వతో కలిపి 2025–26కు గాను రూ. 2 కోట్ల 12 లక్షల ముగింపు నిల్వగా బడ్జెట్ పొందుపరిచారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ బడ్జెట్ ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2025–26 ఆదాయ, వ్యయ బడ్జెట్ పరిశీలిస్తే కేవలం రూ.4లక్షల స్వల్ప తేడా కన్పించింది. -
జిల్లాతో అనుబంధం మర్చిపోలేనిది
ఎస్పీని పరేడ్ గ్రౌండ్‌కు తీసుకువస్తున్న పోలీసులు సంగారెడ్డి జోన్: ఎస్పీగా నా మొదటి పోస్టింగ్ సంగారెడ్డి అని.. జిల్లాతో నాకున్న అనుబంధం ఎప్పటికీ మరచిపోలేనని ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో బదిలీ అయిన ఎస్పీ రూపేష్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో విధాయి పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూపేష్ మాట్లాడుతూ.. జిల్లాలో మెరుగైన సేవలు అందించడంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాత్ర ఎంతగానో ఉందన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పుష్పగుచ్ఛంతో అలంకరించిన పోలీసు వాహనంలో ఎస్పీ, వారి కుటుంబ సభ్యులను పరేడ్ గ్రౌండ్ నుంచి కార్యాలయ ఆవరణ వరకు తాడు సహాయంతో తీసుకువచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ చెస్నూరి రూపేష్ -
ఆంగ్లం అంటే భయాన్ని వీడాలి
విద్యార్థులు ఆంగ్లం అంటే భయాన్ని వీడాలి. చదివిన అంశాలనే మననం చేసుకొని సమాధానాలు రాయాలి. సెక్షన్–సీలో క్రియేటివ్ రైటింగ్‌లో వ్యాసం, బయోగ్రఫీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. అందుకోసం వీటిపైన సాధన చేయాలి. పదజాలం వ్యాకరణంలోని నాలుగు రకాల అంశాలపై దృష్టి పెట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు పలు కార్యక్రమాల నిర్వహణ ప్రముఖుల జీవిత చరిత్రలు విభిన్న కార్యక్రమాలపై ప్రశ్నలు అడుగుతారు. వీటిని అధ్యయనం చేయాలి. – అమృత, ఆంగ్లం టీచర్ -
పరీక్షలకు సన్నద్ధం ఇలా..
జోగిపేట(అందోల్): పదవ తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమవుతుంది. 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం పది రోజులు మాత్రమే ఉండటంతో విద్యార్థులు ఒత్తిడి గురికానున్నారు. పరీక్షల్లో విజయవంతం సాధించాలంటే ఆందోళనకు గురి కాకుండా ఒత్తిని జయించాలి. ఈ పది రోజుల్లో ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి? సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి? ఎలా అధ్యయనం చేయాలి? అనే అంశాలపై పదవ తరగతి సబ్జెక్టులు బోధించే జోగిపేటలోని జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థులకు వారు పలు సూచనలు చేశారు. సబ్జెక్ట్ టీచర్ల చిట్కాలు ● ఒత్తిడిని జయించి..ప్రణాళిక ప్రకారం చదవాలి ● ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకొని రాయాలి ● పాఠ్యాంశాల్లోని కీలక భావాలపై దృష్టి సారించండి ● రివిజన్ చాలా ముఖ్యం -
46 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్
ఖేడ్ పట్టణంలో 30 నారాయణఖేడ్: పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఖేడ్ పట్టణంలో నిల్వ ఉంచిన గోదాంపై సోమవారం విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశం ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. డీఎస్పీ వెంకటేశం కథనం మేరకు.. పట్టణంలోని రాయిపల్లి రోడ్డులో శివరామ్ అనే బియ్యం వ్యాపారి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి తన దుకాణం వెనుక గోదాంలో నిల్వ చేసినట్లు సమాచారం అందింది. దీంతో సీఐ పండరి, ఎస్ఐ వెంకటేశం, తహసీల్దార్ ప్రభాకర్‌తో కలిసి దాడి చేశాం. 60 బస్తాల్లో నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల బియ్యంను స్వాధీనం చేసుకొని ఆర్ఐ మాధవరెడ్డి పంచనామా చేసిన అనంతరం పౌరసరఫరాల గోదాముకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. శివ్వంపేటలో 16 శివ్వంపేట(నర్సాపూర్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధి కొత్తపేట చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఆటో ట్రాలీలో రేషన్ బియ్యం తరలిస్తుండగా గుర్తించారు. అనంతరం సివిల్ సప్లయ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సివిల్ సప్లయ్ జూనియర్ అసిస్టెంట్ సాయికుమార్ వచ్చి 16 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. రాయగిరి అనే వ్యక్తి యశ్వంత్రావుపేట్ నుంచి వెల్దుర్తికి బియ్యం తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కంచన్‌పల్లిలో 3,700 కోళ్లు మృత్యువాత
● కోళ్ల ఫారమ్‌ను పరిశీలించిన మండల పశువైద్యాధికారి ● కోడి రక్తం, మలం నమూనాలు ల్యాబ్‌కు.. కౌడిపల్లి(నర్సాపూర్): ఏం రోగమొస్తుందో తెలియదుకాని కోళ్లు వేలల్లో మృత్యువాత పడుతున్నాయి. గతవారం కంచన్‌పల్లిలో 8 వేలు, పాంపల్లిలో మూడు వేలు కోళ్లు మృతి చెందగా, సోమవారం మరోసారి కంచన్పల్లిలోని రైతు రామక్రిష్ణాగౌడ్ కోళ్ల ఫారమ్‌లో 3,700 కోళ్లు చనిపోయాయి. దీంతో మండల వైద్యాధికారి ఫర్విన్ఫాతిమా కోళ్ల ఫారమ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. రైతు అభ్యర్థన మేరకు చనిపోయిన కోడి రక్తం, మలం నమూనాలను సేకరించగా రైతు రామక్రిష్ణాగౌడ్తో సంగారెడ్డిలోని ల్యాబ్‌కు తీసుకువెళ్లాడు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. టెస్ట్ రిపోర్ట్ వస్తేనే ఏ వ్యాధితో చనిపోయింది చెప్పగలమన్నారు. బర్డ్‌ఫ్లూ వ్యాధిని ఇప్పుడే నిర్ధారణ చేయలేమని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చనిపోయిన కోళ్లను గుంతతీసి పూడ్చిపెట్టాలన్నారు. కోళ్ల ఫారమ్‌లో కోళ్లు చనిపోతుండటంతో కంపెనీ యాజమాన్యం దానా పంపడంలేదని దీంతో దాణా లేకపోడం, ఎండ వేడిమికి సైతం కోళ్లు చనిపోయే ఆస్కారం ఉందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. -
కఠినమైందన్న భావన ఉండకూడదు
భౌతిక శాస్త్రం కఠినమైనదన్న భావన నుంచి బయటపడాలి. కీలక భావనలపై లోతైన అధ్యయనం చేయడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. పాఠ్యపుస్తకాల్లోని అంశాలకు నిజ జీవితంలో జరిగే దృగ్విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తరగతి గదిలో చేసిన ప్రయోగాలను ప్రాజెక్టులను మరోసారి సాధన చేయాలి. ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకొని కీలక భావనలను జోడించి సొంతంగా జవాబులు రాయడం కోసం ప్రశ్నలను తయారు చేసుకోవాలి. బొమ్మలు గీయడం, కాంతికి, విద్యుత్ వలయాలకు సంబంధించిన అంశాలపై సాధన చేయాలి. – జంగిటి అనిల్‌కుమార్, భౌతికశాస్త్రం -
గుట్టుచప్పుడుగా కోళ్ల పూడ్చివేత
● నర్సాపూర్ : కోళ్ల ఫారాలలో చనిపోయిన కోళ్లను గుట్టు చప్పుడు కాకుండా పూడ్చి వాటి మరణంతో పాటు వాటికి సోకిన జబ్బు బయటికి తెలియకుండా దాచిపెడ్తున్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో కోళ్ల ఫారమ్‌ల్లోని కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ సోకి చనిపోతుండగా నర్సాపూర్ ఏరియాలో వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లు చనిపోగానే గోతులు తవ్వి వాటిని పూడ్చివేసే విధంగా ఇంటిగ్రేటెడ్ కోళ్ల కంపెనీలు చర్యలు తీసుకోవడంతో ఈ ప్రాంతంలో కోళ్లు మరణంపై స్పష్టత రావడం లేదు. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని లింగాపూర్, పిల్లుట్ల, గూడూరు, లింగోజిగూడ, కంచన్‌పల్లి, చిట్కుల్, నాయిని జలాల్పూర్ తదితర గ్రామాల్లో వేలాది బాయిలర్ కోళ్లు మృత్యువాత పడ్డాయి. లింగాపూర్‌లో నాటు కోళ్లు సైతం చనిపోయాయి. కమిషన్ ఇస్తూ పాతిపెట్టాలని సూచన కోళ్ల ఫారాల షెడ్డు కల్గిన రైతులకు పలు కంపెనీలు కోడి పిల్లల మొదలు వాటికి కావాల్సిన మందులు, దాణా సరఫరా చేస్తున్నాయి. కోళ్లు కోతకు రాగానే తీసుకెళ్లి వాటి బరువును బట్టి రైతుకు కమిషన్ చెల్లిస్తుంటారు. కోళ్లు చనిపోవడంతో ఆయా కంపెనీలకు నష్టం సంభవిస్తున్నా కోళ్లు పెంచిన రైతులకు కంపెనీలు కొంత కమిషన్ ఇస్తూ చనిపోయిన కోళ్లను పాతి పెట్టాలని సూచిస్తున్నారు కోళ్లు చనిపోయిన విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో కోళ్లకు సోకిన వైరస్ తేలడం లేదని విమర్శలు వస్తున్నాయి. షాంపిల్స్ సేకరణ కోళ్లు చనిపోయిన విషయం తెలిస్తే వాటి షాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిస్తున్నామని స్థానిక పశు సంవర్థక శాఖ ఏడీ డాక్టర్ జనార్దన్‌రావు చెప్పారు. కోళ్లు చనిపోయిన విషయం తమకు తెలియడం లేదని చెప్పారు. కోళ్లకు సరిపడా దాణా పెట్టనందున పలు చోట్ల కోళ్లు చనిపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.నర్సాపూర్ డివిజన్ పరిధిలో వేలాదిగా మృతి -
అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి
పాపన్నపేట(మెదక్): అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా తొగర్పల్లి గ్రామానికి చెందిన గౌరెల్లి వినోద్ రెడ్డి(33) అన్నతో కలిసి క్యాటరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 7న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఏడుపాయల్లోని మంజీరా నది రెండో వంతెన సమీపంలో బండ రాళ్లపై మృతదేహామై కనిపించాడు. తలకు బలమైన గాయాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకొని తమ్ముడి మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశాడు. ఆర్థిక సమస్యలతో ఉరేసుకొని ఆత్మహత్య సంగారెడ్డి క్రైమ్: ఆర్థిక సమస్యలతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శీలనైని నాగేశ్వరావు (43) కొన్నేళ్లుగా పాల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. సంగారెడ్డిలోని రాజ్యంపేటకు చెందిన కవితను 2011 ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వ్యాపారంలో నష్టాలు రావడం, దీనికితోడు ఆరోగ్య సమ్యసలు తలెత్తడంతో కుటుంబ పోషణ భారమైంది. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి కిడ్నాప్‌కు యత్నం మనోహరాబాద్(తూప్రాన్): గుర్తు తెలియని వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మండలంలోని కాళ్లకల్ గ్రామ అంగన్వాడీ రెండో సెంటర్ వద్ద చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. గుర్తించిన టీచర్ కృష్ణవేణి అరవడంతో దుండగుడు పరారైయ్యాడు. టీచర్ మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తన నిందితుడికి ఐదేళ్ల జైలు, జరిమానా చేగుంట(తూప్రాన్): బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా విధించినట్లు ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని చిట్టోజిపల్లి గ్రామానికి చెందిన చల్మెడ సురేశ్ అదే గ్రామానికి చెందిన బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి చేయి చేసుకున్నాడు. ఈ ఘటన రెండు పర్యాయాలు జరుగడంతో బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు 2018 జనవరి నెలలో చేగుంట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు కోర్టులో సాక్షాధారాలను అందించారు. సోమవారం కేసు పూర్వపరాలను పరిశీలించిన జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీశారద నిందితుడికి రెండు కేసుల్లో ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కేసులో పీపీగా రాజ్ కుమార్, లైసనింగ్ ఆఫీసర్‌గా విఠల్ ఇన్వెస్టిగేషన్ అధికారులుగా ఎస్ఐ సత్యనారాయణ, సీడీఓగా విఠల్ వ్యవహరించినట్లు ఎస్ఐ తెలిపారు. వ్యక్తి అదృశ్యం రామచంద్రాపురం(పటాన్చెరు): వ్యక్తి అదృశ్యమైన ఘటన కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన దీపక్ సింగ్ వికారాబాద్‌లో ఆయుర్వేదిక్ మందులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో నివాసం ఉండే తన అక్క వద్దకు వచ్చాడు. అదే రోజు రాత్రి తిరిగి వికారాబాద్‌కు బైక్‌పై బయలుదేరి వెళ్లాడు. కానీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు దీపక్ అక్కకు సమాచారం ఇచ్చారు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. క్రేన్ మీద పడి వ్యక్తి మృతి రామచంద్రాపురం(పటాన్చెరు): క్రేన్ మీద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన మంగళ్ కుమార్ (27) జీవనోపాధి నిమిత్తం రెండేళ్ల కిందట తెల్లాపూర్‌కు వలసొచ్చాడు. తెల్లాపూర్‌లోని ఆకృతి నిర్మాణ సంస్థలో కూలీగా పని చేస్తున్నాడు. సోమవారం నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లే క్రేన్ వద్ద పని చేస్తున్నాడు. క్రేన్ సామగ్రిని తీసుకొన వెళ్తే సమయంలో ఒక్కసారిగా క్రేన్ ముందు భాగం మంగళ్కుమార్పై పడింది. దీంతో అక్కడికక్కడే దుర్మణం చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురును చూసేందుకు అత్తారింటికి వెళ్తుండగా..
● బైక్, ఆటో ఢీ.. యువకుడి మృతి ● ఆకారం గ్రామ శివారులో ఘటనదుబ్బాకరూరల్: కూతురు పుట్టిందన్న సంతోషంలో అత్తారింటికి బయలు దేరిన యువకుడికి వేగంగా దూసుకువచ్చిన ఆటో మృత్యుపాశమైంది. బిడ్డ వద్దకు చేరకుండానే ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం కబళించింది. దీంతో ఆ కుటుంబం శోక సద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన మండల పరిధిలోని ఆకారం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోతారం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నరేష్ (28)కు నెల రోజుల క్రితం కూతురు పుటింది. తన భార్య పుట్టింట్లోనే ఉంది. తన భార్యను కూతురును తీసుకురావడానికి తన అత్తగారి ఊరైన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆకారం గ్రామ శివారులోకి రాగానే అతి వేగంగా దూసుకు వచ్చిన ఆటో బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలు కావడంతో నరేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త మృతి
సంతాపం తెలిపిన మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటకమాన్: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణ శివారులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణం పారుపల్లి వీధికి చెందిన వ్యాపారవేత్త గట్టు రవీందర్ (61) తన భార్య అరుణతో కలిసి శనివారం రాత్రి రంగీలా దాబా వద్ద ఉన్న ఓ ఫంక్షన్హాల్లో శుభకార్యానికి వెళ్లారు. ద్విచక్ర వాహనంపై భార్యతో కలిసి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ నగర్‌కు చెందిన ఓంప్రకాశ్ తన ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వస్తూ ఎదురుగా వస్తున్న రవీందర్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రవీందర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్య అరుణకు స్వల్వ గాయాలయ్యాయి. ఓంప్రకాశ్‌కు కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతు డి కుమారుడి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రవీందర్ మృతి పట్ల మాజీ మంత్రి హారీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్య వైశ్య భవన్ అధ్యక్షుడిగా పనిచేశారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
మేడ్చల్‌లో అదృశ్యమై.. వడియారంలో శవమై..
చేగుంట(తూప్రాన్): మేడ్చల్‌లో అదృశ్యమైన వ్యక్తి వడియారం శివారులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన లాల్ బహద్దూర్ (49) మేడ్చల్‌లో స్వీట్ తయారీ కేంద్రంలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈక్రమంలో కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయాడు. ఈనెల 4వ తేదీన అక్కడి పోలీసులకు బంధువుల ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి వడియారం శివారులోని బైపాస్ సమీపంలో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి విచారణ చేపట్టారు. మృతుడు మేడ్చల్‌లో అదృశ్యమైన లాల్బహద్దూర్గా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
చెట్టును ఢీకొన్న కారు..
దంపతులకు తీవ్ర గాయాలు కొండపాక(గజ్వేల్): కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. ఈఘటన కొండపాక గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నుంచి సందీప్, అనిలా దంపతులు కారులో జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయానికి దర్శనం కోసం వెళ్తున్నారు. ఈక్రమంలో కొండపాక శివారులోకి రాగానే కారు అదుపు తప్పి రాజీవ్ రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నది, సమాచారం తెలుసుకున్న 108 అంబులెన్సు సిబ్బంది క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కనులపండువగా సీతారాముల కల్యాణం
మర్కూక్(గజ్వేల్): ఆలయాల అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండలంలోని పాములపర్తి గ్రామంలో ఆదివారం రాములోరి కళ్యాణానికి హజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీతారామాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అంతకు ముందు ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారామచంద్రమూర్తుల కల్యాణ మహోత్సవం భక్తజనావళికి నేత్రపర్వం చేసింది. యజ్ఞం పూర్ణాహుతి అనంతరం ఆలయ వ్యవస్థాపకుడు హన్మంతరావు దంపతులతో కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం పల్లకిసేవ, కోలాటం కార్యాక్రమాలు కొనసాగాయి. నేడు రథోత్సవం ఆలయం వార్షికోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవం, 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం, అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ నిర్వాహకుడు తెలిపారు. -
3,500 నాటు కోళ్లు మృతి
నర్సాపూర్ మండలం లింగాపూర్‌లో ఘటననర్సాపూర్ రూరల్: అంతుచిక్కని వ్యాధితో నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్‌లో చోటు చేసుకుంది. లింగాపూర్ తండాకు చెందిన పాతులోత్ ప్రసాద్‌కు చెందిన 3,500 నాటు కోళ్లు అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడ్డాయి. కొన్ని రోజులుగా నాటు కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. అప్పులు చేసి రూ. 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నాటు కోళ్లను పెంచుతున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇటీవల నా షెడ్డు దగ్గరలో ఉన్న బాయిలర్ పౌల్ట్రీ షెడ్డులో కోళ్లు చనిపోయాయని, అదే వ్యాధి నాటు కోళ్లకు వ్యాపించి చనిపోయని ఆరోపించాడు. ప్రైవేట్ బాయిలర్ కోళ్ల కంపెనీ, లేదా ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ విషయమై పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి సౌమిత్‌ను వివరణ కోరగా.. అతి ఉష్ణోగ్రత కారణంగా కోళ్లు చనిపోయి ఉంటాయని, లేదా ఇంకా ఏదైనా వ్యాధితో మృతి చెంది ఉంటాయన్నారు. బర్డ్‌ప్లూ అని మాత్రం నిర్ధారించలేమన్నారు. మృతి చెందిన కోళ్లను ల్యాబ్‌కు పంపుదామంటే బాధితుడు కోళ్లను గోతిలో పాతి పెట్టడంతో ల్యాబ్‌కు పంపలేకపోయినట్లు చెప్పారు. పౌల్ట్రీ షెడ్డులు నిర్వహించే రైతులు కోళ్లకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖ వైద్య అధికారులను సంప్రదించాలని సూచించారు. -
క్షణికావేశం.. తీసింది ప్రాణం
చేగుంట(తూప్రాన్): క్షణికావేశం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ సంఘటన మండల కేంద్రమైన చేగుంటలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం చేగుంటకు చెందిన దొడ్ల రమేశ్ (35) ఇంటి నిర్మాణం కోసం రామాయంపేటలోని ఓ బ్యాంకులో రుణం తీసుకున్నాడు. రుణం కట్టాల్సిన సమయం రావడంతో ఒత్తిడి పెరిగింది. దీనికి తోడూ కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన రమేశ్ ఆదివారం సాయంత్రం మద్యం సేవించి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లాడు. ఈక్రమంలో వడియారం వెంచర్ సమీపంలోని రైలు పట్టాల వద్ద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. కుటుంబసభ్యులు మెదక్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టాల సమీపంలో పడిపోయినందున రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని స్థానిక పోలీసులు తెలిపారు. ఫిర్యాదు రాకపోవడండంతో ఇంకా కేసు నమోదు చేయలేదని కామారెడ్డి రైల్వే పోలీసులు తెలిపారు. -
భర్త మరణం తట్టుకోలేక భార్య మృతి
చేగుంట(తూప్రాన్): భర్త మరణం తట్టుకోలేక భార్య మృతిచెందిన సంఘటన మండలంలోని కర్నాల్‌పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతాకుల అయ్యెల్ల (65) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. భర్త మృతిని తట్టుకోలేక మనోవేదనకు గురైన భార్య కొమురవ్వ (60) ఆదివారం గుండెపోటుతో మృతి చెందింది. భర్త మృతి చెందిన మూడు రోజులకే భార్య మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. దైవ నామస్మరణతో ముక్తిమార్గంహత్నూర( సంగారెడ్డి): దైవ నామస్మరణతో ముక్తి సులభంగా పొందవచ్చని మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు. ఆదివారం హత్నూరలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యంత్ర ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ నవగ్రహ ప్రతిష్ఠ పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవచింతనతో ఉండాలన్నారు. రామనామం తారక మంత్రం ప్రతి ఒక్కరిని కాపాడుతుందన్నారు. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చికిత్సపొందుతూ మృతి వర్గల్(గజ్వేల్): కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ మనోవేదనతో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం వర్గల్ మండలం సీతారాంపల్లిలో జరిగింది. గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపల్లికి చెందిన ఆటోడ్రైవర్ తూప్రాన్ వెంకటేశం(42)కు భార్య మంజుల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంవత్సరం క్రితం పెద్ద కూతురు పూజ పెండ్లికి రూ. 2 లక్షల వరకు అప్పుచేశాడు. అప్పు ఎలా తీర్చాలంటూ తరచూ బాధపడేవాడు. అదే వేదనతో ఆదివారం ఉదయం ఇంటి వద్ద పురుగుల మందు తాగి పడిపోయాడు. వెంటనే అతనిని కుటుంబీకులు గజ్వే ల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుని భార్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అత్యధికంగా సాగు
మూడు నెలల పంట కావడంతో రైతులు ఆలుగడ్డ పంట సాగువైపు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఈ పంట సాగవుతోంది. సుమారు 8వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాను పరిగణలోకి తీసుకుంటే ఒక్క జహీరాబాద్ ప్రాంతంలోనే 80 శాతం మేర పంటను రైతులు సాగు చేసుకుంటున్నారు. సంగారెడ్డిలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలతో పాటు పక్కనే ఉన్న వికారాబాద్ జిల్లాకు చెందిన రైతాంగానికి ఎంతో సౌలభ్యం అవుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఆలు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. -
నేడు టెంకాయల వేలంపాట
రాయికోడ్(అందోల్): రాయికోడ్‌లోని వీరభద్రేశ్వర ఆలయ టెంకాయల దుకాణం వేలంపాటను సోమవారం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శివరుద్రప్ప ఒక ప్రకటనలో ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉ.11.30 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందన్నారు. వేలంపాటలో రూ.10 వేలను దరావత్తు చెల్లించిన వారు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుందన్నారు. టెంకాయల దుకాణం రెండు సంవత్సరాలు నిర్వహణకు పాట ఉంటుందన్నారు. నార్సింగిలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం చిన్నశంకరంపేట(మెదక్): గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగి ఆగ్నిప్రమాదం జరిగిన సంఘటన నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుంది. ఆదివారం నార్సింగి మండల కేంద్రానికి చెందిన మైలారం సిద్ధిరాములు నివాస గృహంలో ఉదయం వంట నిర్వహణకు గ్యాస్ సిలిండర్ ఆన్‌చేసి ముట్టించగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కుటుంబ సభ్యులు మంటలు అర్పేందుకు ప్రయత్నించగా, అగ్నిప్రమాదానికి గురయ్యారు. దీంతో ఇంటి బయటకు పరుగున రాగా, ఇరుగుపొరుగు వచ్చి మంటలు అర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న రామాయంపేట అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు అర్పారు. ఈ సంఘటనలో సిద్ధిరాములు, యశోద, ఎల్లమ్మ, నరేశ్ అగ్నిప్రమాదంలో గాయపడగా, స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ సంఘటనలో ఇంట్లోని సామగ్రి కాలిపోవడంతో పాటు ఇల్లు పైకప్పు దెబ్బతిన్నది. సుమారు రూ. 2 లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితులు తెలిపారు. బ్యాంకులో చోరీకి విఫలయత్నంశివ్వంపేట(నర్సాపూర్): మద్యం మత్తులో బ్యాంకులో చోరీకి పాల్పడుతుండగా గుర్తించిన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం అర్థరాత్రి మండల పరిధి దొంతి గ్రామ పరిధిలోని తూప్రాన్– నర్సాపూర్ హైవే పక్కన ఉన్న యూనియన్ బ్యాంకులో నలుగరు మద్యం మత్తులో బ్యాంకు లోనికి వెళ్లేందుకు కిటికి వద్ద తవ్వకాలు చేస్తుండగా స్థానికులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ముగ్గురు పారిపోగా ఒకడు చిక్కాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. మండల పరిధిలోని రెడ్యా తండాకు చెందిన ధన్‌రాజ్‌ని అదుపులోకి విచారించగా మిగితా ముగ్గురు పేర్లు చెప్పాడు. దొంతికి చెందిన కటిక బాలేష్, చండీకి చెందిన ఎంచర్ల పోచయ్య, నల్తురి శ్రీశైలంను అదివారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ కునాల్ గౌతమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం మిరుదొడ్డి(దుబ్బాక): మతి స్థిమితంలేని ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని అల్వాలలో చోటు చేసుకుంది. ఎస్ఐ బోయిని పరశురాములు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పుల్ల లచ్చవ్వ, యాదయ్యల కొడుకు మహేశ్‌కు మతిస్థిమితం సరిగా ఉండదు. ఈ క్రమంలో 4వ తేదీ రాత్రి అతడు మూత్ర విసర్జనకని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మహేశ్ తల్లి ఆదివారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కోనేరులో మునిగి వ్యక్తి మృతి శివ్వంపేట(నర్సాపూర్): ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహస్వామి జాతరకు ఆదివారం హైదరాబాదు తిరుమలగిరి జవహర్లాల్ నగర్ చెందిన కుటుంబం వచ్చారు. చిత్తడి కర్ణాకర్(14) తన మేనమామ శివకుమార్‌తో కలిసి కోనేరులో స్నానం చేసేందుకు దిగారు. స్నానం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాస్తు కర్ణాకర్ కొనేరులో పడ్డాడు. గుర్తించిన మేనమామ అరవడంతో గట్టుపైనున్న పలువురు కోనేరులో నుంచి అతన్ని బయటకు తీసుకొచ్చారు. కొనఊపిరితో ఉన్న అతన్ని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. -
● కొత్తగా రైల్వే లైన్ల కోసంజిల్లావాసుల ఎదురు చూపులు ● బోధన్–బీదర్, బోధన్–జోగిపేటలైన్లు సర్వేకే పరిమితం
●రైల్వే లైన్ వస్తే అభివృద్ధి బోధన్ నుంచి కొత్తగా రైల్వే లైన్ ఏర్పాటు ప్రతిపాదనలు సర్వేకే పరిమితమైంది. ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు మంజూరు చేయలేదు. సర్వే చేసి నిధుల మంజూరుపై ఆశలు ఊరిస్తున్నారు. రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ప్రజారవాణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. వివక్ష చూపకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలి. : బాలయ్య, మహదేవుపల్లి, కల్హేర్ మండలం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం రైల్వే లైన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. బోధన్–బీదర్, బోధన్–జోగిపేట్ మీదుగా హైదరాబాద్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు కోసం నిరంతరం కృషి చేస్తాం. గతంలో ఎంపీగా తాను కృషి చేయడంతో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తోటి ఎంపీలతో కలసి రైల్వే లైన్ సాధన కోసం పనిచేస్తాం. ప్రజల ఆశలు నెరవేర్చేందుకు ఎల్లప్పుడు శ్రమిస్తా. సురేశ్ షెట్కార్, ఎంపీ, జహీరాబాద్ కల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల ప్రజలు రైలు కూత కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. తమ ప్రాంతం మీదుగా కొత్త రైల్వే లైన్ల కోసం ఈసారైనా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో మాత్రం ఈ రైల్వే లైన్లకు నిధులు కేటాయించపోతుడటంతో ఈ జిల్లాల ప్రజలు ప్రతీసారి నిరాశే ఎదురవుతోంది. ప్రజారవాణా, అభివృద్ధికి రైల్వే సదుపాయం కీలకం కాగా...ప్రతీసారి కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం అవసరమైన నిధుల కేటాయింపుల్లో మాత్రం మోక్షం లభించడంలేదు. 13 ఏళ్లక్రితమే ప్రతిపాదనలు... బోధన్–బీదర్, బోధన్–జోగిపేట్ కొత్త రైల్వే లైన్ల కోసం దాదాపు 13 ఏళ్ల క్రితం గత యూపీఏ ప్రభుత్వ హాయాంలో ప్రస్తుత జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్ కృషి మేరకు ప్రతిపాదనలు పంపారు. అప్పట్లో బోధన్ నుంచి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ, వడ్డెపల్లి, కల్హేర్ మండలం మహదేవుపల్లి, బాచేపల్లి, నారాయణఖేడ్ మీదుగా రైల్వే లైన్ కోసం సర్వే చేశారు. లైన్ కోసం హద్దులు ఏర్పాటు చేశారు. మరో రైల్వే లైన్ కోసం బోధన్ నుంచి బాన్స్వాడ, పిట్లం, కల్హేర్ మండలం బీబీపేట్, రాక్యల్, నారాయణఖేడ్ మీదుగా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసిన ఏళ్ల తరబడిగా నిధుల కేటాయింపులు జరగలేదు. ఆరు నెలల క్రితం రెండు మార్గాల్లో తిరిగి సర్వే నిర్వహించారు. కొత్తగా హద్దులు ఏర్పాటు చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపు గురించి కేంద్ర ప్రభుత్వం ఊసేత్తలేదు. రైల్వే లైన్ల కోసం నిధులు దక్కకపోవడంతో ప్రజలు నిరాశ చెందారు. కొత్త రైల్వే మార్గంతో అభివృద్ధి.. కొత్తగా రైల్వే మార్గం ఏర్పాటు జరిగితే ప్రజారవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల మీదుగా మహారాష్ట్రలోని దెగ్లూర్ వరకు సంగారెడ్డి–నాందేడ్ 161 నేషనల్ హైవే నిర్మించారు. జాతీయ రహదారి ఏర్పాటు కారణంగా రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. హైవే ప్రాంతంలో ఉన్న భూముల విలువ పెరిగింది. ఏళ్ల తరబడిగా ఊరిస్తున్న రైల్వే లైన్ల ఏర్పాటు జరిగితే బాన్స్వాడ, నారాయణఖేడ్, జోగిపేట్ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కొత్తగా రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఎంపీ సురేశ్‌షెట్కార్ మరింత కృషి చేయాలని కోరుతున్నారు. -
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
కౌడిపల్లి(నర్సాపూర్): కడుపునొప్పి భరించలేక వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఈసంఘటన మండలంలోని మహమ్మద్‌నగర్‌లో ఆదివారం జరిగింది. ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్పెల్లికి చెందిన మహేశ్వరి(27)ని మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన ఎదుల అనిల్‌కుమార్‌కు ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. కొన్ని నెలలుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతుంది. పలుమార్లు చికిత్స చేయించుకున్న తగ్గలేదు. దీంతో ఆదివారం భర్త, మామ పొలం పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహేశ్వరి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదే సమయలో భర్త ఇంటికి రాగా తలుపులు పెట్టి ఉన్నాయి. పిలిచినా పలకకపోవడంతో తలుపులు తొలగించి చూడగా భార్య విగతజీవిగా కనిపించింది. 108లో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి నాగప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కలగానే ఆలు పరిశోధన కేంద్రం
● సంగారెడ్డిలో ఏర్పాటు చేయాలని దశాబ్దం క్రితం ప్రతిపాదన ● రూ.1.57 కోట్లతో అంచనాలు ● ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ప్రతిపాదనలు బుట్టదాఖలు ● విత్తనం కోసం పక్క రాష్ట్రాలకు రైతుల పరుగు ● అధిక శాతం దళారులపైనే ఆధారం ● నాసిరకం విత్తనంతో నష్టాల్లో కూరుకుపోతున్న రైతాంగంజహీరాబాద్: సంగారెడ్డి జిల్లాలో బంగాళదుంప(ఆలుగడ్డ) పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలం క్రితం ప్రతిపాదించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 2012–13 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సంగారెడ్డిలో డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రానికి అనుబంధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి బంగాళదుంప పరిశోధనా కేంద్రం అప్పటి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం పరిశీలించింది. సైంటిస్టులు సైతం అన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే ఆలుగడ్డ పరిశోధన కేంద్రం ఉంది. సంగారెడ్డిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది మొదటి కేంద్రం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆలుగడ్డ పంటను సాగుచేస్తుంటారు. ప్రతి సీజన్లో ఆలుగడ్డ పంటను సాగుచేసే ముందు రైతులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, పంజాబ్‌లోని జలంధర్లతో పాటు గుజరాత్ రాష్ట్రాల నుంచి విత్తనం తెచ్చుకోవాల్సి వస్తోంది. తద్వారా రైతులపై ఆర్థిక భారం పడుతోంది. దీనికి తోడు తమ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులకు అనువైన బంగాళదుంప రకాలు లభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆలుగడ్డ సాగు చేసే రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఆల్ ఇండియా కో–ఆర్డినేటెడ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రాజెక్టు(ఆక్రిప్) ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రానికి అనుబంధంగా ఆలు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అప్పట్లో ప్రతిపాదించారు. ఇందుకు రూ.1.57 కోట్లతో సంగారెడ్డిలో ఆలు పరిశోధన కేంద్రానికి సంబంధించి ఆక్రిప్ సిమ్లాలో ఉన్న సెంట్రల్ పొటాటో రిసెర్చ్(సీపీఆర్ఐ)కు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు సిమ్లాలోని సీపీఆర్ఐ ఆమోదం తెలిపేందుకు సంసిద్ధతను సైతం వ్యక్తం చేసింది. దీంతో సంగారెడ్డిలోని వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రం సైంటిస్టులు ఏడు రకాల బంగాళ దుంపలపై పరిశోధనలు చేసేందుకు సిద్ధపడ్డారు. మీరట్, లక్నో, ఆగ్రా నుంచి కుఫ్రీ పక్రాజ్ (కె166), కుఫ్రీ చంద్రముఖి, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ చిప్సోనా1, కుఫ్రీ చిప్సోనా–3 రకం బంగాళదుంపల సీడ్స్‌ను తెప్పించేందుకు అప్పట్లో అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయినా రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా పరిశోధనా కేంద్రం అంశం మరుగున పడింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఈ అంశం పరిశీలనకు రాలేదు. పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని రైతులకు స్థానికంగా మేలైన ఆలు విత్తనం లభించడంతో పాటు అధిక దిగుబడులనిచ్చే విత్తనం తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. నాసిరకం విత్తనంతో నష్టాలు రైతులు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్న ఆలుగడ్డ విత్తనం నాసిరకంగా ఉండడంతో పంట దిగుబడులు రాకపోవడం, తెగుళ్ల బారిన పడడం వల్ల నష్టాలను చవిచూస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు రైతులు నేరుగా వెళ్లి తెచ్చుకోవడం కష్టతరంగా ఉండడంతో స్థానికంగా దళారులు విక్రయించే విత్తనమే కొనుగోలు చేసుకోక తప్పడం లేదు. విత్తనం ధర ఆకాశాన్నంటడం, చేతికి వచ్చిన పంటను విక్రయించేందుకు వెళితే ధర రాక పోవడం రైతులు నష్టాల బారిన పడుతున్నారు. -
సుందరంగా తీర్చిదిద్దుతాం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామి క్షేత్రాన్ని అన్ని విధాల సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లికార్జున స్వామి మా కుటుంబానికి ఇలవేల్పు అని, ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కట్టుబడి ఉందని, భక్తులకు కావల్సిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయని పొన్నం అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్,ఽ దర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, జయప్రకాశ్ రెడ్డి, తురాయి నవీన్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ -
విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: తమ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. సిర్గాపూర్ మండలం సంగం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రావుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.60 వేలు మంజూరుకాగా అందుకు సంబంధించిన చెక్కును ఆదివారం ఆయన ఖేడ్‌లోని తననివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...వైద్యరంగానికి ప్రాధాన్యతలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచిందన్నారు. కాగా, మనూరు మండలం దన్వార్ గ్రామంలో నిర్వహించిన బీరప్ప జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ఉత్సవాల్లో పాల్గొన్న సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సర్పంచ్ దిగంబర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో గుడిసెలు దగ్ధం
సంగారెడ్డి క్రైమ్: పట్టణంలోని రెవెన్యూ కాలనీలో శనివారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఏకంగా 14 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. పట్టణ పోలీస్ సేష్టన్ ఫరిధిలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మునిపల్లి మండలం కంకోల్కు చెందిన గుజ్జుల జెట్టయ్య గత 12 ఏళ్లుగా రెవెన్యూ కాలనీలోని రాజీవ్‌గృహకల్ప బిల్డింగ్ ఆవరణలో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. ఇతని నివాసం పక్కనే 13 కుటుంబాలు కూడా గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంటి నుంచి చెత్తను సేకరించడం వృత్తి. ఈ నెల 8న శనివారం నాడు కంకోల్ ఉండే తమ బంధువుల ఇంటివద్ద జరిగిన ఓ శుభకార్యానికి అందరూ కలసి వెళ్లారు. అదేరోజు రాత్రి పది గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ గుడిసెల్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు మిగతా గుడిసెలకు కూడా అంటుకోవడంతో మొత్తం 14 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు గమనించి అగ్నిమాపకశాఖకు సమాచారమందించగా...వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలిపోవడంతో 14 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ అగ్నిప్రమాదంలో అదృష్టవశాత్తూ ప్రాణం నష్టమేమీ సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుజ్జుల జెట్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులుకోరుతున్నారు. రోడ్డున పడ్డ 14కుటుంబాలు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి -
రోడ్లు అధ్వానం.. ప్రయాణం నిదానం
ఝరాసంగం(జహీరాబాద్): అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణలోపంతో ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రహదారుల నిర్వహణ అధ్వానంగా మారింది. మరమ్మతులు చేపట్టి రహదారుల నిర్వహణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో మండల అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఫలితంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పలువురు మృత్యువాత పడటంతోపాటు మరికొందరు గాయాల పాలవుతున్నారు. జహీరాబాద్ పట్టణానికి నిత్యం వేలాదిమంది అందోల్ నియోజకవర్గంలోని పలు మండలాలతో ఝరాసంగం మండల ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. బ్రిడ్జిల వద్ద కోతలు, కనిపించని సూచిక బోర్డులు జహీరాబాద్ నియోజకవర్గం పస్తాపూర్ నుంచి ఝరాసంగం మండల పరిధిలోని కప్పాడ్ వరకు సుమారు 20 వరకు బ్రిడ్జిలు ఉంటాయి. కొన్నిచోట్ల బ్రిడ్జి గోడలు కూలిపోయి ఉన్నాయి. మరికొన్నిచోట్ల కోతకు గురయ్యి ప్రమాదకరంగా మారాయి. చాలాచోట్ల బ్రిడ్జిల చుట్టూ పిచ్చి మొక్కలు నిలిచి సూచిక బోర్డులు కనిపించడం లేదు. మండలంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. మరమ్మతులు చేపట్టాలని ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడంలేదు. ఇక రోడ్లకిరువైపులా ఏపుగా పెరిగిన చెట్లవల్ల రాత్రి సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మూలమలుపుల వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు నేలకు ఒరిగి దారిని చూపలేకపోతున్నాయి. నిర్వహణను గాలికొదిలిన అధికారులు ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్ల నిర్వహణ కూడా అధ్వానంగా మారింది. పిచ్చి మొక్కలను తొలగించాలని పలువురు కోరుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.స్థానికులు ఆగ్రహం... ప్రతి సంవత్సరం ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు జరుగుతాయి. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తుంటారు. ఆలయానికి వచ్చే దారులు మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినా బేఖాతరు చేశారని, కనీసం ఒక్క పని కూడా చేపట్టలేకపోయారని అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని, రహదారుల నిర్వహణ చేపట్టాలని కోరుతున్నారు. బ్రిడ్జిల వద్ద కూలిన గోడలు రోడ్డుకిరువైపులా పిచ్చిగడ్డి మరమ్మతులకు నోచుకోని రహదారులు అధికారుల ఆదేశాలు బేఖాతరు ఏళ్లు గడుస్తున్నా అదే తీరు -
విద్యార్థులు కష్టపడితేనే భవిష్యత్తు
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి రూరల్ : విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన శ్రీ వైష్ణవి స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తయారు చేయాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదువుకోవడానికి పంపిస్తారని వారి ఆశలు నెరవేరే విధంగా ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, వైష్ణవి, స్కూల్ చైర్మన్ విజయ్ ,మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్‌రెడ్డి, రామప్ప, జలంధర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూతోనే కార్మికులకు న్యాయం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పటాన్చెరు టౌన్: కార్మికుల కష్ట సుఖాల్లో ఎరజ్రెండా అండగా ఉంటుందని, సీఐటీయూ అంటేనే కార్మికులకు ఒక భరోసా అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కిర్బీ యూనియన్ అధ్యక్షుడు చుక్కా రాములు పేర్కొన్నారు. పటాన్చెరు పట్టణంలోని శ్రామిక భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు సీఐటీయూలో చుక్కా రాములు సమక్షంలో పెద్ద ఎత్తున చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కార్మికులకు అండగా సీఐటీయూ ఉంటుందన్నారు. కిర్బీ పరిశ్రమలో కూడా కార్మికులకు అనేక చట్టపరమైన సౌకర్యాలు సీఐటీయూ సాధించిందని, భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు సాధిస్తామని భరోసానిచ్చారు. కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కె.రాజయ్య, యూనియన్ నాయకులు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిద్దారెడ్డి, రామకృష్ణకు ఎక్సలెన్సీ అవార్డు సంగారెడ్డి ఎడ్యుకేషన్: విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ వారి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్సలెంట్ అవార్డు 2025కు జిల్లా సైన్స్ అధికారి సిద్దారెడ్డి, సదశివపేట మండలం నిజాంపూర్(కె) ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోట్రు రామకృష్ణ ఎంపికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ మహిళా కో ఆపరేటివ్ చైర్ పర్సన్ బండారు శోభారాణి, దైవజ్ఞ శర్మ ఈ పురస్కారాలను వీరికి అందజేశారు. విద్యా, సామాజిక రంగాల్లో, మహిళా సాధికారిత అంశంలో విశేష కృషికిగాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ వ్యవస్థాపక చైర్మన్ భానుచందర్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల, వల్లూరి ఫౌండేషన్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
3,500 నాటు కోళ్లు మృతి
నర్సాపూర్ రూరల్: అంతుచిక్కని వ్యాధితో నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్‌లో చోటు చేసుకుంది. లింగాపూర్ తండాకు చెందిన పాతులోత్ ప్రసాద్‌కు చెందిన 3,500 నాటు కోళ్లు అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడ్డాయి. కొన్ని రోజులుగా నాటు కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. అప్పులు చేసి రూ. 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నాటు కోళ్లను పెంచుతున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇటీవల నా షెడ్డు దగ్గరలో ఉన్న బాయిలర్ పౌల్ట్రీ షెడ్డులో కోళ్లు చనిపోయాయని, అదే వ్యాధి నాటు కోళ్లకు వ్యాపించి చనిపోయని ఆరోపించాడు. ప్రైవేట్ బాయిలర్ కోళ్ల కంపెనీ, లేదా ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ విషయమై పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి సౌమిత్‌ను వివరణ కోరగా.. అతి ఉష్ణోగ్రత కారణంగా కోళ్లు చనిపోయి ఉంటాయని, లేదా ఇంకా ఏదైనా వ్యాధితో మృతి చెంది ఉంటాయన్నారు. బర్డ్‌ప్లూ అని మాత్రం నిర్ధారించలేమన్నారు. మృతి చెందిన కోళ్లను ల్యాబ్‌కు పంపుదామంటే బాధితుడు కోళ్లను గోతిలో పాతి పెట్టడంతో ల్యాబ్‌కు పంపలేకపోయినట్లు చెప్పారు. పౌల్ట్రీ షెడ్డులు నిర్వహించే రైతులు కోళ్లకు ఏదైనా సమస్య వచి్చనట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖ వైద్య అధికారులను సంప్రదించాలని సూచించారు. -
కార్మికులకు ‘ఎంఆర్ఎఫ్’ షాక్
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ‘2021 మార్చి 29న ఏడాది పాటు శిక్షణ కోసం మిమ్మల్ని తీసుకున్నాం. ఆ కాలంలో మీరు పని నేర్చుకోలేదు. పరిశ్రమలో నెలకొన్న ఆర్థిక మాద్యం నేపథ్యంలో మిమ్మల్ని తొలగిస్తున్నాం. దేశంలోని ఇతర ప్లాంట్లలో అవసరమున్న చోట పని చేయడానికి ఆసక్తి ఉంటే వారం రోజుల్లో అభిప్రాయం తెలపండి’ అని మండలంలోని అంకేనపల్లి శివారులో గల ఎంఆర్ఎఫ్ (ఏపీఎల్) ప్లాంట్‌లో పనిచేస్తున్న 350 మందికిపైగా కార్మికులకు యాజమాన్యం ఈనెల 7న నోటీసులు అందజేసింది. దీంతో వారి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దిక్కుతోచని స్థితిలో కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు. రిక్రూట్మెంట్ సమయంలో చేసుకున్న ఒప్పందం మేరకు పర్మనెంట్ చేయాలని కోరిన పాపానికి ఉద్యోగంలో నుంచి తీసేసి పరిశ్రమ యాజమాన్యం నియంతృత్వం ప్రదర్శిస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కార్మికులు న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
ఏక్తా.. సైకిల్ యాత్ర
అన్నివర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలనే సంకల్పంతో గుజరాత్‌లోని సూరత్ పట్టణానికి చెందిన రవి వతన్ ఆఫ్రే సైకిల్ యాత్ర చేపట్టాడు. శనివారం మండలంలోని మాసాన్‌పల్లి చౌరస్తా మీదుగా సంగారెడ్డి– నాందేడ్ 161 నేషనల్ హైవేపై యాత్ర కొనసాగించాడు. గతేడాది నవంబర్ 17న సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. రోజూ 70 కిలో మీటర్ల మేర యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, ఏపీలో యాత్ర చేసినట్లు తెలిపారు. కల్హేర్(నారాయణఖేడ్): -
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
నారాయణఖేడ్: మహిళలతోనే కుటుంబాల ఎదుగుదల సాధ్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం ఖేడ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలకు ఇండోర్ ఆటలు, సంగీతం, నృత్య పోటీలు నిర్వహించారు. విజేతలకు తన సతీమణి అనుపమారెడ్డితో కలిసి బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లోనూ ముందుండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్ స్వరూప్ షెట్కార్, దారం శంకర్, రమేష్ చౌహాన్, సంగన్న, శివరాథోడ్, శ్రీకాంత్‌రెడ్డి, ఆయా శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖేడ్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను కమిషనర్ జగ్జీవన్, శానిటరీ అధికారి శ్రీనివాస్ సన్మానించారు.నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
సమస్యల పరిష్కారానికి కృషి
పటాన్చెరు: సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నానని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీని కలిసి అమీన్పూర్లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పట్టణంలో అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ... అమీన్పూర్ పరిధిలోని సమస్యలపై తాను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో పీపుల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమలరెడ్డి, కొండ లక్ష్మణ్, మహేశ్వర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వెంకట పుల్లారెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 14,307 కేసుల పరిష్కారం సంగారెడ్డి టౌన్: రాజీమార్గంతోనే కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. శనివారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షణికావేశంలో ఇరువర్గాలు తగాదాలు పడిన కేసులను రాజీమార్గంతో స్నేహభావంతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని వేదిక అన్నారు. జిల్లావ్యాప్తంగా క్రిమినల్ కాంపౌండ్ కేసులు, సివిల్, మోటార్ వాహన ప్రమాద పరిహారం, విద్యుత్ వంటి కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. ఒక్కరోజే మొత్తం 14,307 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జడ్జీలు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత పటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రతతో పాటు ప్రాధాన్యం ఉంటుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహరెడ్డి అన్నారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా పటాన్చెరు బస్టాండ్‌లో మహిళా కండక్టర్లను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల్లో మహిళలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతీన్, పట్టణ ఉపాధ్యక్షుడు యువరాజ్, నాయకులు సాయిలు ముదిరాజ్, రతన్ సింగ్, శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ‘కేజీబీవీ’లో జీసీడీఓ విచారణ కంగ్టి(నారాయణఖేడ్): మండల కేంద్రంలోని కేజీబీవీలో బాలికలను చితకబాదినట్లు తల్లిదండ్రులు చేసిన ఆందోళనతో శనివారం గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధికారి సుప్రియ విచారణ చేపట్టారు. విద్యాలయంలో గణితం టీచర్ సురేఖ బాలికలను పనులు చేయాలని బెదిరిస్తూ చితకబాదుతుందని తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మరికొందరు విద్యార్థినులను సైతం చితకబాదినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న జీసీడీఓ ఎంఈఓ రహీమోద్దీన్‌తో కలిసి విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా మాట్లాడారు. విచారణ నివేదికను డీఈఓతో పాటు కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ మాధవి, ఎస్ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
సొంతింటి కల.. నెరవేరేదిలా
ఇందిరమ్మ ఇళ్లకు వేగంగా అడుగులు ● వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలనికలెక్టర్ ఆదేశం ● ఇటీవల ఇందిరమ్మ పథకంపై సమీక్ష ● క్షేత్రస్థాయిలో మొదలైన కదలిక ● జిల్లాకు మొదటి విడత 17,500 ఇళ్లు ● 1.36 లక్షల మంది అర్హులు ఎంపిక నారాయణఖేడ్: పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు జిల్లాలో అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంది. పారదర్శకత పాటిస్తూ అర్హులు పథకంలో లబ్ధి పొందేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. అధునాతన ఏఐ సహాయాన్ని సైతం పథకంలో వినియోగించుకోనుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇదివరకే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను గుర్తించి వారిని కేటగిరీల వారీగా విభజించారు. జిల్లా మొత్తంలో 3,18,435మంది ఇళ్లకోసం అర్జీలు సమర్పించగా 1,36,821మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. వారిలో మొదటి కేటగిరీలో ఎంపికై న వారి ద్వారా ఇంటి నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇదివరకే అధికారులను ఆదేశించారు. ఇటీవల కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంజూరైన ఇళ్లకు మార్కింగ్ ఇచ్చి నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థిక సహాయం అందనుంది. నియోజకవర్గానికి 3,500 ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున 17,500 ఇళ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులను సొంత స్థలాలు ఉండి ఇళ్లులేనివారిని ఎల్1గా, సొంతస్థలం కానీ, ఇల్లు కానీ లేని వారిని ఎల్ 2గా, ఇతరులను ఎల్ 3గా జాబితాగా విభజించారు. కాగా, నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్ల సంఖ్య మేరకు మొదటి ఎల్ 1కింద ఎంపికై న వారిలో అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. జిల్లాకు 17,500 ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ప్రస్తుతం మాత్రం 3,939మంది జాబితాను మాత్రమే విడుదల చేశారు. మిగతా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. రీ వెరిఫికేషన్.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని చొప్పున ఇదివరకే ప్రభుత్వం గుర్తించి ఆ గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. వారి మినహాయించి ఆయా మండలాల్లోని మిగతా గ్రామాలు, పట్టణాల్లో అర్హుల ఎంపికపై రీ వెరిఫికేషన్‌ను చేపట్టనున్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారు ఇళ్లకు వెళ్లి యాప్ ద్వారా ఇదివరకే నమోదు చేశారు. ఎల్ 1 జాబితాలో ఉండాల్సిన తమ పేర్లు ఎల్ 2, ఎల్ 3లో చేర్చాలని అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు అలాంటి దరఖాస్తులపై రీ వెరిఫికేషన్ చేసి అతి పేదలను గుర్తించనున్నారు. ప్రతీ మండలానికి నాలుగైదు చొప్పున ప్రత్యేక బృందాలను అధికారులు నియమించనున్నారు.పేదలపై భారం పడకుండా... ఇంటినిర్మాణం భారం ఇటు ప్రభుత్వంపై, అటు పేదలపై పడకుండా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.5లక్షలు నిర్మాణానికి కేటాయించగా అందుబాటులో ఉన్న ఇసుక, తక్కువ ధరకు సిమెంట్, స్టీల్ అందజేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. నిర్మాణ సామగ్రి అయిన ఇసుక, సిమెంట్, స్టీల్ ఆకాశాన్నంటాయి. వీటిని తక్కువ ధరలో అందించిన పక్షంలో నిర్మాణాల్లో పెద్ద భారం తగ్గించినట్లవుతుంది. పేదలు సైతం అవసరానికి మించిన విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి నిధులు చాలక అసంపూర్తిగా వదిలేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న భావనతో తక్కువ విస్తీర్ణంలో నిర్మించుకునేలా చూస్తున్నారు. ఇందుకుగాను మండలానికి ఒక మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తున్నారు. పిల్లర్లు, బీములతో కూడిన నిర్మాణ పద్ధతికాకుండా ఖర్చు తక్కువయ్యే ఇతర పద్ధతులను అవలబించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకుగాను కార్మికశాఖ ద్వారా మేసీ్త్రలకు శిక్షణ సైతం ఇస్తున్నారు. -
21 రోజులు.. రూ.39 కోట్లు
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025● మూడు వారాల్లో నిధులుఖర్చు చేయకపోతే వెనక్కే.. ● ఆగమేఘాలపై మెటల్,సీసీ రోడ్ల పనుల మంజూరు ● ఆ వెంటనే నిర్మాణాలు... ● బిల్లులు డ్రా చేసేందుకు హడావుడి ● ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనుల తీరుపంచాయతీల ఖాతాల్లో నిధులు సీసీ రోడ్ల పనులు చేపట్టే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంటుంది. ప్రస్తుతం పంచాయతీలకు పాలవర్గం లేదు. దీంతో స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ కార్యదర్శులు ఈ పనులను పూర్తి చేయించాల్సి వస్తోంది. గతంలో సర్పంచులే ఈ పనులు చేసి నిధులు డ్రా చేసుకునే వారు. ఇప్పుడు వారు లేకపోవడంతో మెటీరియల్ సప్లై చేసే సంస్థల పేరుతో బిల్లులు డ్రా చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే జిల్లాకు వచ్చిన రూ. 60.40 కోట్లను జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కేటాయించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జిలు చెప్పిన వారికి ఈ పనులు దక్కుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అధికార పార్టీ నేతలే ఈ పనులు చేపడుతున్నారు. హడావుడిగా చేస్తున్న ఈ పనుల్లో నాణ్యత ఏ మేరకు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అరుణాచలం సినిమాలో నెల రోజుల్లో రూ. 30 కోట్లు ఖర్చు చేయడం అప్పట్లో పెద్ద టాస్క్‌గా ఉంటుంది. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన ఉపాధి హామీ నిధుల విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కేవలం 21 రోజుల్లో (ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే 31 మార్చి లోపు) సుమారు రూ. 39 కోట్ల వ్యయం కలిగిన సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంది. లేనిపక్షంలో జిల్లాకు వచ్చిన ఈ నిధులు వెనక్కి (ల్యాప్స్ అవుతాయి) వెళ్లిపోతాయి. దీంతో సంబంధిత శాఖల అధికారులు హడావుడి చేస్తున్నారు. పనులకు సంబంధించి ఇప్పుడు మంజూరు ఇస్తున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు తంటాలు పడుతున్నారు. రూ. 60.40 కోట్ల నిధులు ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన పనిదినాలను బట్టి జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు జనరేట్ అవుతాయి. ఇలా జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 60.40 కోట్లు వచ్చాయి. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కొన్నిచోట్ల మెటల్ రోడ్లు వేయనున్నారు. ఈ పనులు పూర్తి చేసేందుకు కేవలం 21 రోజులే సమయం ఉంది. ఈ రోజుల్లోనే పనులు మంజూరు చేయడంతో పాటు ప్రారంభించి పూర్తి చేయాలి. బిల్లులు రికార్డు చేసి నిధులు డ్రా చేయాలి. కానీ ఇప్పటివరకు కేవలం రూ. 21 కోట్ల మేరకు పనులు మాత్రమే మంజూరయ్యాయి. ఈ పనులు ప్రారంభించేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే మిగిలిన రూ. 39.40 కోట్ల పనులను ఆఘమేఘాలపై ప్రారంభించేందుకు కృషి చేస్తున్నారు.న్యూస్రీల్ల్యాప్స్ కాకుండా చర్యలు మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాకు రూ. 60.40 కోట్లు వచ్చాయి. ఇప్పటికే సుమారు 50 శాతం పనులు పూర్తి చేశాం. మార్చి 31 లోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేసి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్నింటికి మంజూరు ఇస్తున్నాం. – జ్యోతి, డీఆర్డీఓ -
ఒకే రోజు మామ, కోడలు మృతి
మక్కరాజీపేటలో విషాదంచేగుంట(తూప్రాన్): ఒకే రోజు మామ, కోడలు మృతి చెందిన విషాదకర ఘటన మండలంలోని మక్కరాజీపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మక్కరాజీపేట గ్రామంలో వారం రోజుల కిందట ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆరెల్ల సుమలత(35) పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం సుమలతను గజ్వేల్ తరలిస్తున్న క్రమంలో దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లి శివారులో అంబులెన్స్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న సుమలత మామ ఆరెల్ల పోచయ్య(65)కు తీవ్ర గాయాలయ్యాయి. కోమాలోకి వెళ్లిన పోచయ్యను లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి, సుమలతను తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న పోచయ్య శనివారం మృతి చెందాడు. మామ మరణ వార్త విన్న సుమలత తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఒకే కుటుంబంలో గంటల వ్యవధిలోనే మామ, కోడలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలు సుమలతకు కుమారుడు, కూతురు ఉన్నారు. -
స్పేస్ సెంటర్‌ను సందర్శించిన విద్యార్థులు
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు, బోధనా సిబ్బంది సతీష్‌ధావన్ స్సేస్ సెంటర్(శ్రీహరికోట)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ విభాగాధిపతి డా. సీహెచ్ మధుసూదన్ మాట్లాడుతూ.. ఇది ఇస్రో నిర్వహణలో ఉన్న ఉపగ్రహ ప్రయోగకేంద్రమని, ఏపీలోని పులికాట్ సరస్సు, బంగాళాఖా తం నడుమ శ్రీహరికోట అనే ద్వీపంలో 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు చెప్పా రు. మొదట్లో షార్గా పిలువబడిన దీనిని 2002 నుంచి మాజీ ఇస్రో చైర్మన్ సతీష్‌ధావన్ పేరుతో పిలుస్తారన్నారు. ఇందులో రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయని వీటి ద్వారా మన దేశం పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ కార్యకలాపాలను నిర్వహిస్తుందని వివరించారు. ఈ క్షేత్ర పర్యటన ద్వారా లాంచ్ ప్యాడ్ల టెక్నాలజీ, రాకెట్ వివిధ దశల ప్రయోగాల టెక్నాలజీ తదితర అంశాలను గురించి విద్యార్థులు చక్కగా తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పర్యటనలతో విద్యార్థుల్లో శాసీ్త్రయదృక్పథం అలవడుతుందన్నారు. ఈ కేంద్రంలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న కళాశాల పూర్వవిద్యార్థి డాక్టర్ వీ. సురేందర్ తమకు ఎంతగానో సహకరించాడని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేందర్ కళాశాల అధ్యాపకులకు జ్ఞాపికను అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత అధ్యాపకులను, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డా.భాస్కర్, సత్యనారాయణరెడ్డి, డా.మహేశ్‌కుమార్, డా.మనోహర్, డా.భైరయ్య, డా.లీలావతి, డా.రాణి, వెంకటరమణ, కృష్ణయ్య, డా.పుణ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య
సంగారెడ్డి: ఆర్థిక ఇబ్బందులతో రిటైర్డ్ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చౌటకూర్ మండలం బొమ్మరెడ్డి గూడెంలో చోటు చేసుకుంది. ఎస్ఐ క్రాంతి కుమార్ కథనం మేరకు.. బొమ్మారెడ్డి గూడెంకు చెందిన మూడ్ తుకారం (65) ఒడీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి. ప్రస్తుతం సంగారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఐదుగురు ఆడపిల్లలు కాగా ముగ్గురికి వివాహం చేశాడు. మిగితా ఇద్దరి వివాహ విషయంలో ఆర్థిక ఇబ్బందులు నెలకొని కుటుంబంలో కలహాలు ఏర్పడ్డా యి. దీంతో మనస్తాపం చెంది శనివారం బొమ్మరెడ్డి గూడెంలో చెట్టుకి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య మంగ్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరేసుకొని కార్మికుడు..హత్నూర( సంగారెడ్డి): ఉరేసుకొని కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హత్నూర మండల పరిధిలోని బోరుపట్ల గ్రామంలో శనివారం వెలుగు చూసింది. హత్నూర ఎస్ఐ సుభాష్ కథనం మేరకు.. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బనేశ్వర్ ము ర్ము (22) రెండుళ్లుగా బోరపట్ల గ్రామ శివారులోని ఆపెటోరియ యూనిట్–1లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా తోటి కార్మికుల తో కలిసి పరిశ్రమకు సమీపంలోని గదిలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి భోజనం అనంత రం కార్మికులు ఎవరి గదిలో వారు నిద్రించారు. శనివారం ఉదయం షిఫ్ట్ డ్యూటీ కి వెళ్లాల్సి ఉండగా బసవేశ్వర్ గదిలో నుంచి బయటికి రాకపోవడంతో తోటి కార్మికులు తలుపు తెరిచి చూడగా ఉరేసుకొని కనిపించాడు. మృతుడి దగ్గరి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాళ్లకల్ గ్రామంలో యువకుడు మనోహరాబాద్(తూప్రాన్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామానికి చెందిన బాలగౌని శ్రీనివాస్‌గౌడ్, జయమ్మ దంపతులకు కుమారుడు వేణు(23), కూతురు ఉంది. కుటుంబ సభ్యులంతా కలిసి కొన్నేళ్లుగా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామంలో నివాసం ఉంటూ సాగర్ ఏషియా పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వేణు స్థానిక ఓ ప్రైవేట్ పరిశ్రమలో డ్యూటీ చేస్తున్నాడు. కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పరిశ్రమకు వెళ్లగా వేణు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పర్యావరణహితుడు.. పక్షి ప్రేమికుడు
రకరకాల పక్షులు పెంచుతున్న మల్లాగౌడ్ రూ.వేలల్లో ఖర్చు చేసి ఇష్టంతో కొనుగోలు కౌడిపల్లి(నర్సాపూర్): అతడి వృతి వ్యవసాయం, ఉద్యోగం లైన్మెన్.. అయినా సరే ఖాళీ సమయం దొరికితే చాలు పక్షులతో కాలక్షేపం చేస్తాడు. పక్షులంటే అతడికి అమితమైన ప్రేమ. ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా కొనేస్తుంటాడు. వాటి దాణా కోసం రూ.వేలల్లో ఖర్చు చేస్తాడు. కంచన్‌పల్లి గ్రామానికి చెందిన మల్లాగౌడ్కు ఇంటి వద్ద చిన్న చిన్న జాలీలతో షెడ్స్ వేసి పక్షులను పెంచుతున్నాడు. ప్రస్తుతం అతడి దగ్గర కాక్‌టెల్ చిలుకలు 4, లవ్‌బర్డ్స్ 10, ఆఫ్రికన్ లవ్‌బర్డ్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ 8, కాసులు 4, పావురాలు 10 జతలు, లక్కిపావురాలు 4 జతలు,, పందెం కోళ్ల పెట్టలు పుంజులతోపాటు కొమోరియన్ జాతి కుక్క, అక్వేరియం ఉన్నాయి. వివిధ రకాల పక్షులకు ఒక్కో జత రూ.1,000 నుంచి రూ.5 వేల వరకు ధర చెల్లించి కొనుగోలు చేశాడు. ఇలా కొన్నేళ్లుగా పక్షులను పెంచుతున్నాడు. పక్షులంటే ప్రాణం అని అందుకే రూ.లక్షలు ఖర్చుచేసి వాటిని కొనుగోలు చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి దాణా పక్షుల కొనుగోలుకు రూ.లక్షలు ఖర్చు చేయగా వాటి పెంపకం, పోషణకు ప్రతి నెలా రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఖర్చు చేస్తుంటాడు. హైదరాబాద్ మక్క మజీద్ పక్కన మినార్ బర్డ్స్ మార్కెట్ నుంచి పక్షులను కొనుగోలు చేసి అక్కడి నుంచే వాటికి దాన సైతం ప్రతి నెలా తెస్తాడు. వీలు కాని సమయంలో సంగారెడ్డి జిల్లా జోగిపేట నుంచి దాణా తీసుకొస్తాడు. పక్షుల దాణాకు గాను కొర్రలు, సజ్జలు, రాగులు, సన్‌ప్లవర్, స్వీట్ కార్న్, కుసుమలు కొనుగోలు చేసి వాటికి పెడతాడు. ప్రత్యేక షెడ్స్ ఏర్పాటు పక్షులు పెంచేందుకు గాను ప్రత్యేకంగా ఇంటి ఆవరణలో కొద్ది స్థలంలోనే వాటికి జాలీలతో షెడ్స్ ఏర్పాటు చేశాడు. వాటిలో పక్షులకు సౌకర్యంగా ఉండేందుకు కుండలు, చెక్కలతో తయారు చేసిన పెట్టెలు ఏర్పాటు చేశాడు. అందులోనే దాణా వేస్తాడు. ప్రతిరోజూ దాణా వేస్తూ నీళ్లు పోస్తాడు. నాలుగు అయిదు రోజులకు ఒకసారి వ్యర్థాలను శుభ్రం చేస్తాడు. పొరపాటున షెడ్ జాలీ డోర్ ఊడిపోతే పక్షులు ఎగిరిపోయి తిరిగి రావని అలా వెల్లినవి బయట ఎక్కువ రోజులు బతకలేవని మల్లా గౌడ్ చెప్పాడు. వేసవి కాలంలో ఎక్కువగా పక్షులు చనిపోతుంటాయి. వాటి రక్షణకు ఎంత చల్లధనం ఏర్పాటు చేసిన కొన్నిసార్లు చనిపోతాయి. దీంతో తిరిగి కొనుగోలు చేస్తానని చెప్పాడు. ఇక పందెం కోళ్లు, కాసులు, పావురాలు బయటకు వదిలితే చెట్ల నీడన ఇంటి ఆవరణ, చుట్టుపక్కల తిరిగి వస్తాయి. కొమోరియన్ కుక్కతోపాటు అక్వేరియం ఉంది. ఇష్టంతో పెంచుతాం పక్షులంటే తనకు ప్రాణం. వ్యవసాయంతోపాటు లైన్మెన్గా విధులు నిర్వహిస్తా. సుమారు ఇరవై ఏళ్లుగా వాటిని పెంచుతున్నా. హైదరాబాద్ మినార్ బర్డ్స్ మార్కెట్ నుంచి పక్షులను కొనుగోలు చేస్తా. ఒక్కో రకం పక్షి జతకు రూ .1,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. ఉదయం, సాయంత్రం వాటితో గడుపుతా. మిగితా సమయంలో కుటుంబ సభ్యులు చూస్తారు. పక్షులంటే ఇష్టం కాబట్టి ఖర్చుకు వెనుకాడను. – మల్లాగౌడ్, కంచన్‌పల్లి -
బేగంపేట విద్యార్థిని ప్రపంచ రికార్డ్
8 సెకండ్ల 85 మిల్లీ సెకన్స్‌లో ఆవర్తన పట్టిక కంఠస్థం దుబ్బాకటౌన్: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్యం దిశగా ముందుకు సాగాలని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజిరెడ్డి అన్నారు. శనివారం చైన్నెలో జరిగిన ప్రపంచ పోటీల్లో పాఠశాలకు చెందిన పంజాల కార్తీక పాల్గొని ప్రపంచ రికార్డ్ కొట్టి గుర్తింపు పత్రం, అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో 8వ తరగతికి చెందిన పంజాల కార్తీక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైన్నెలో నిర్వహించి న పోటీల్లో పాల్గొని ఆవర్తన పట్టికలోని 118 మూలకాలను 8 సెకండ్ల 85 మిల్లీ సెకండ్స్ లలో కంఠస్థం చేసినట్లు తెలిపారు. దీంతో ప్రపంచ రికార్డును సృష్టించిందన్నారు. ఈ విషయాన్ని కలామ్స్ వరల్డ్ రికార్డ్స్ వారు గుర్తించి కార్తీకకు గుర్తింపు ప్రశంసాపత్రంతో పాటు అవార్డు అందజేశారన్నారు. దీనికి కృషి చేసిన ఉపాధ్యాయుడు భాస్కర్ రెడ్డిని, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. చింతకాయలు తెంపుతూ కిందపడ్డ రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి దుబ్బాకటౌన్: చెట్టుపై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు కథనం మేరకు.. దుబ్బాక పట్టణానికి చెందిన ఎంగారి రాజిరెడ్డి (52) వ్యవసాయం చేస్తూ భవన నిర్మాణ కార్మికుడి గా పని చేస్తున్నాడు. భార్య, పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. 3న సొంత వ్యవసాయ పొలంలో చింత చెట్టు ఎక్కి కాయలను తెంపుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రాజిరెడ్డిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి శనివారం రాజిరెడ్డి మృతి చెందాడు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక వాహనం పట్టివేత కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని వింజపల్లి శివారులోని మోయతుమ్మద వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నామని ఎస్ఐ అభిలాష్ తెలిపారు. గ్రామానికి చెందిన ప్రశాంత్ శుక్రవారం రాత్రి వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా దాడిచేసి వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. ఎటువంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. మందుబాబులకు జరిమానా సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాలలో తమ సిబ్బందితో కలిసి వారం రోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో 24 మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో శనివారం హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.24,500 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. కల్హేర్(నారాయణఖేడ్): డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 92 మందికి రూ.1.05 లక్షలు జరిమానా విధిస్తూ నారాయణఖేడ్ మున్సిఫ్ కోర్టు మెజి స్ట్రేట్ శ్రీధర్ మంథని తీర్పు వెల్లడించినట్లు సిర్గాపూర్ ఎస్ఐ డి.వెంకట్‌రెడ్డి శనివారం తెలిపారు. సిర్గాపూర్ మండలంలో ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపిన 92 మందిని కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు. -
నువ్వులు.. లాభాల సిరులు
వేసవిలో ఆరుతడి కింద సాగు ● ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలు ● సాగుకు మొగ్గు చూపుతున్న రైతులు ● రైతులకు ఉద్యానవన శాఖ జిల్లా అధికారి అనిల్‌కుమార్ సూచనలు, సలహాలుమిరుదొడ్డి(దుబ్బాక): వేసవిలో ఆరుతడి కింద సాగు చేసే నువ్వుల పంట సిరులను కురుపిస్తుంది. నువ్వుల సాగు వర్షాధారం కంటే వేసవిలోనే ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలు ఉండటంతో రైతులు సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు. నువ్వుల నూనెకు మార్కెట్‌నూ మంచి డిమాండ్ పలుకుతోంది. నువ్వుల్లో విటమిన్లు, అమైనో ఆమ్లాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేద మందుల్లో నువ్వుల నుంచి లభించే నూనెను వాడుతుండటం విశేషం. తక్కువ సమయంలో, తక్కువ నీటి వనరులతో ప్రస్తుతం వేసవిలో ఏక వార్షిక పంటగా నువ్వులను సాగు చేయడం వల్ల మంచి దిగుబడులు వస్తాయని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి అనిల్ కుమార్ చెబుతున్నారు. నువ్వుల సాగుపై ఆయన రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ● నేలలు: తేమ కలిగిన తేలికై న నేలలు అనుకూలంగా ఉంటాయి. ● నేల తయారు చేసుకునే విధానం: నేలను నాలుగు సార్లు మెత్తగా దున్నుకొని రెండు సార్లు గుంటకతో చదును చేసుకోవాలి. ● విత్తుకునే విధానం: ఎకరానికి రెండున్నర కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తనానికి మూడింతల ఇసుక కలుపుకొని గొర్రు సహాయంతో వచ్చే వరుసల్లో విత్తుకోవాలి. ● విత్తనాల్లో రకాలు: హిమ, చందన, మాధవి, రాజేశ్వరి, శేతాతిల్, ఎలమంచిలి11, 17, 66, గౌరి అనే రకాలు ఉన్నాయి. ● ఎరువులు వేసుకోవడం: ఎకరానికి నాలుగు టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్, 16 కిలోల నత్రజనిని దుక్కిలో వేసుకొని కలియ దున్నుకోవాలి. విత్తిన నెల రోజులకు కలుపు తీసిన తర్వాత 8 కిలోల నత్రజనిని వేసుకోవాలి. ● నీటి తడులు: విత్తనాలను చల్లుకున్న అనంతరం నీటి తడిని ఇవ్వాలి. పూత, కాత, గింజలు కట్టే దశలో నీటి తడులను అందించాలి. విత్తిన తర్వాత 35 నుంచి 40 రోజులు, తర్వాత 65 నుంచి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సస్యరక్షణ చర్యలు ● రసం పీల్చే పురుగులు: ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు దోనే ఆకారంలో వాలిపోతాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● కాయ తొలుచు పురుగులు: లేత ఆకులను గూడు కట్టి పచ్చని పదార్థాన్ని గీకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. పూతతో పాటు, లేత గింజలను తినడం వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వీటి నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీ లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● కోడు ఈగ: మొగ్గలను, పూతను తినడం వల్ల తాలు కలిగిన కాయలు ఏర్పడతాయి. వీటి నివారణకు ఎసిఫేట్ 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● గొంగళి పురుగులు: ఆకుల్లోని పత్రహరితాన్ని తినడం వల్ల ఆకులు జల్లెడలా మారుతాయి. మొగ్గలను, పువ్వులను, తినడంతోపాటు కాయలకు రంధ్రాలు చేసి విత్తనాలను తింటాయి. వీటి నివారణకు ఎండోసల్ఫాన్ 2 మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్ల నివారణ ● వేరు కుళ్లు, కాండం తెగుళ్లు: ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతాయి. దీని నివారణకు పంట మార్పిడి చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రామ్ థైరంతో విత్తన శుద్ధి చేయాలి. మాంకోజెబ్ 3 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ఆకు మచ్చ తెగులు: ఆకులు, కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన అవశేషాలను తొలగించాలి. మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేయాలి. ● కాండం తెగులు: కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా నల్లగా మారుతాయి. దీని నివారణకు కాఫర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలి. ● పంట కోత విధానం: ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోయే సమయంలో కాయలు లేత పసుపు వర్ణానికి మారినప్పుడు కోత కోసుకోవాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలకిందులుగా నిలబెట్టాలి. ఆరు రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. కట్టెలతో కొట్టి నూర్పిడి చేసుకోవాలి. ● నిల్వ చేసుకునే విధానం: గింజల్లోని తేమ 8 శాతం తగ్గే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. నిలువ ఉంచుకున్న గోనె సంచులపై మాలథియాన్ పొడిని చల్లుకోవాలి. విక్రయానికి మంచి ధర పలికినప్పుడు మార్కెట్‌కు తరలించి ఆర్థికాదాయాన్ని పొందాలి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మునిపల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ కథనం మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జాగ్రు మంజి (47) శనివారం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారు 65వ నంబర్ జాతీయ రహదారిపై నడుచు కుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి శరీరంపై నుంచి వాహనం వెళ్లడంతో మాంస పు ముద్దలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీపక్‌కుమార్ సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజేశ్ నాయక్ తెలిపారు. బట్టల వ్యాపారి దుబ్బాకరూరల్: రోడ్డు ప్రమాదంలో బట్టల వ్యాపారి మృతి చెందిన ఘటన మండలంలోని పోతారం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజ్ కథనం మేరకు.. రాజన్నసిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కేదారి ముత్తయ్య(75)గ్రామంలో బట్టలు అమ్ముతూ ఉండేవాడు. శుక్రవారం బట్టలు కొనుగోలు చేసేందుకు దుబ్బాకకు వచ్చి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన అతడిని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా వల్లూరు క్రాంతి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా వచ్చిన వార్తలను పరిశీలించి.. వాటిని క్షుణ్ణంగా చదివి.. ఆ వార్తల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేశారు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి. పాలన పరమైన విధుల్లో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలోని సంగారెడ్డి జిల్లా ఎడిషన్‌కు గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, ప్రతిభ చూపుతున్న మహిళలకు సంబంధించి విలేకరులు రాసిన ప్రత్యేక కథనాలు ఆమె చదివారు. వాటి ప్రాధాన్యతను కూడా గుర్తించి సబ్ ఎడిటర్లతో చర్చించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా పేజీల డిజైన్లను పరిశీలించారు. అలాగే వివిధ మండలాలు, పట్టణాల నుంచి వచి్చన వార్తలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఈ కథనాలు మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కితాబిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా వారిని ప్రోత్సహిస్తూ.. స్ఫూర్తిదాయక కథనాలు మరిన్ని రావాలని ఆకాక్షించారు. దినపత్రికకు గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించడం తనకు ఎంతో మంచి అనుభూతిని ఇచి్చందన్నారు. పత్రిక నిత్యం ప్రజాసమ స్యలను వెలికి తీస్తుండటంతో.. ఆ సమస్యలు అధికార యంత్రాంగం దృష్టికి వస్తాయని.. తద్వారా అధికార యంత్రాంగం వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. అధికారుల దినచర్య న్యూస్పేపర్లతోనే ప్రారంభమవుతందని చెప్పారు. పత్రిక పాఠకునికి చేరడం వెనుక ఆయా విభాగాలు ఎలా పనిచేస్తాయో తెలిసిందని అన్నారు. -
మహానంద
మహిళలకు అండ.. ● మహిళా సంఘాల ఆర్థిక పరిపుష్టికి నిరంతరం కృషి ● దివ్యాంగురాలైనా.. ధీమాతో ముందుకు కంగ్టి(నారాయణఖేడ్): మహిళా సంఘాలకు, ఇతర మహిళలకు తనకు తెలిసిన విషయాలపై అవగాహ న కల్పిస్తూ అండగా నిలుస్తుంది ఆలురే మహానంద. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని భీంరా గ్రామానికి చెందిన మహానంద పోలియో వ్యాధితో దివ్యాంగురాలు. పౌష్టికాహార వారోత్సవాలున్నా.. బడి బాట ఉన్నా.. ముగ్గుల పోటీలన్నా.. కొనుగో లు కేంద్రాల పరిశీలనలున్నా.. హరితహారమన్నా అన్నింటా ముందుగా కన్పించేది మహానందయే. ఇందిరా క్రాంతి పథంలో కంగ్టి మండల సమాఖ్య అధ్యక్షురాలిగా విధులు నిర్వహిస్తూ సేవా దృక్పథంతో మహానందం ఉందని చెప్పారు. మహిళా సంఘాలకు.. మహిళా సంఘం మండల అధ్యక్షురాలిగా తాను అన్ని గ్రామాలు తిరిగి సంఘ సభ్యులకు పొదుపు, శ్రీనిధి తదితర పథకాలపై అవగాహన కల్పిస్తుంది. కంగ్టి మండలంలోని 28 గ్రామాల్లో 747 స్వయం సహాయక సంఘాలు, 7,766 మంది సభ్యులున్నా రు. ఈ ఏడాది 152 సంఘాలకు రూ.13.28 కోట్లు రుణాలు ఇప్పించారు. సామాజిక సేవల్లోనూ.. సేవాతత్పరత గల మహిళగా పేరు తెచ్చుకొన్న మహానందకు మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తుంది. గ్రామంలోని మహిళ సభ్యుల్లో ఏమైనా కుటుంబ గొడవలు, భార్యాభర్తల తగాదాలున్నా వారికి నైతిక అవగాహన కల్పిస్తున్నారు. బాల్యవివాహాలు, బాలికల విద్యపై కూడా సమావేశాల్లో ప్రసంగించి చైతన్యం చేస్తుంది. తాను చేస్తున్న కార్యక్రమాలకు పారితోషికం లేకున్నా అధికారులు, స్థానికుల ప్రశంసలే తనకు ఊపిరి అంటున్నారు. -
చదువుల తల్లులు.. ఆ అక్కాచెల్లెళ్లు
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రమైన కౌడిపల్లికి చెందిన ఉడుత రాజు, నాగరాణి దంపతులకు వర్ష, శ్రేష్ట ఇద్దరు కూతుళ్లు. భార్యాభర్తలు పదవ తరగతి వరకు మాత్రమే చదువగా కూతుళ్లను మాత్రం ఉన్నత చదువులు చదివిస్తున్నారు. పెద్ద కూతురు ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించడంతో హైదరాబాద్ మహాత్మాగాంధీ ఐటీ కళాశాలలో బీటెక్ ఐటీ పూర్తి చేసింది. ఏడాదిన్నరగా హైదరాబాద్ ఏడీపీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. రెండో కూతురు శ్రేష్ట బీవీఆర్ఐటీ సీఎస్ఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇద్దరు ఆడపిల్లలకు స్కూటీ నడపడం నేర్పించారు. -
ఆ ఇంటా నలుగురు అమ్మాయిలూ డాక్టర్లే
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఈ రోజుల్లో ఒక అమ్మాయిని పెంచడమే భారంగా భావిస్తున్న తరుణంలో నలుగురు అమ్మాయిలను పెంచి ఎంబీబీఎస్ చదివించడం అంటే ఆశ్చర్యం కలుగక మానదు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ కాలనీకి చెందిన కొంక రామచంద్రం, శారద దంపతులు దర్జీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మమత, మాధురి, రోహిణి, రోషిణి నలుగురు సంతానం. ఈ దంపతులు అధైర్యపడకుండా పిల్లలని కష్టపడి చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం నలుగురూ ఎంబీబీఎస్ చదువుతున్నారు. తమ పిల్లలు పెద్ద అయ్యి, ఎంబీబీఎస్ సీట్లు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆ దంపతులు. గ్రామీణ ‘నారీ’మణులు ‘అహిల్య నారీశక్తి అవార్డు’కు యువతులు ఎంపిక చిన్నశంకరంపేట(మెదక్): విద్య, వైద్యం పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామీణ ప్రాంతంలో సేవలు అందిస్తున్న చిన్నశంకరంపేట మండలంలోని ఇద్దరు యువతులు అహిల్య నారీ శక్తి అవార్డుకు ఎంపికయ్యారు. ఖాజాపూర్ తండా కు చెందిన ధనావత్ స్వరూప, చందాపూర్ గ్రామానికి చెందిన తలారి స్వాతి అహిల్య నారీ శక్తిగా గుర్తించి అవార్డును అందిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన అహిల్య ఉమెన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పూనమ్ నోముల్వార్ తెలిపారు. మహిళ దినోత్సవం రోజున నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ..తాను తల్లితండ్రులు లేని లోటును బాల్యం నుంచే అనుభవిస్తున్నాను. అందుకే గ్రామీణ చిన్నారులకు, నిరుపేదలకు విద్య, వైద్యం కోసం తనకు తోచిన తీరులో సేవ చేస్తు న్నా. చందాపూర్ గ్రామానికి చెందిన స్వాతి మా ట్లాడుతూ.. ఎంబీఏ చదువుతూనే సెలవు రోజు ల్లో గ్రామీణ విద్యార్థులకు సాయం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సానీ క్ష ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నందునకుగాను వీరు అవార్డుకు ఎంపికై నట్లు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివ పేర్కొన్నారు. -
ఫోన్ మెసేజ్‌లతోనే ఎక్కువ ఇబ్బంది
బస్టాప్, కాలేజీ, ఆఫీసుల కంటే మొబైల్ మెసేజ్‌లతోనే మహిళల ఇక్కట్లు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నెట్వర్క్: మొబైల్ ఫోన్లలో వస్తున్న మెసేజ్‌లతో మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. బస్టాప్‌లు, కాలేజీలు, ఆఫీసుల్లో కంటే ఈ మొబైల్లలోని సందేశాలతోనే అధికంగా ఇక్కట్లకు గురవుతున్నట్లు తేలింది. బస్టాపులు, ఆఫీసుల్లో ఇబ్బందులు పడుతున్న వారు సుమారు 29 శాతం చొప్పున ఉంటే.. సెల్ఫోన్లతో వచ్చే మెసేజ్‌లతో 51 శాతం పరేషాన్ అవుతున్నట్లు మహిళలు అభిప్రాయ పడ్డారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలో ‘సాక్షి’ ప్రత్యేక సర్వే నిర్వహించింది. 140 మంది మహిళల అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించింది. ఇందులో వివిధ ఏజ్గ్రూపులకు చెందిన వారి అభిప్రాయలను తీసుకుంది. ఈ సర్వేలో తేలిన ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే.. ఇంట్లో వివక్ష లేదు ఇంట్లో తల్లిదండ్రులు గతంలో ఆడ–మగ వివక్ష చూపేవారు. కాలం మారుతున్న కొద్దీ ఈ వివక్ష తగ్గుతోంది. మగ పిల్లాడితో సమానంగా ఆడ పిల్లలను కూడా చదివిస్తున్నారు. సర్వేలో కూడా ఇదే అంశం తేలింది. 71 శాతం మంది మహిళలు ఇంట్లో వివక్షను ఎదుర్కొనడం లేదని తేల్చి చెప్పారు. కేవలం 12 శాతం మాత్రమే ఇంకా వివక్ష ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. మరో 17 శాతం మంది చెప్పలేమని సమాధానమిచ్చారు. కళాశాల, పని ప్రదేశాల్లో స్వల్పంగా.. కళాశాలలో, పనిచేసే ప్రదేశాల్లో మహిళలు స్వల్ప వివక్ష ఎదుర్కొంటున్నారు. 28 శాతం మంది మహిళలు ఇప్పటికీ కళాశాల, పని ప్రదేశంలో వివక్ష ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు చోట్ల వివక్ష లేదని 52 శాతం మంది చెప్పారు. 20 శాతం మంది చెప్పలేమని సమాధానమిచ్చారు. మహిళలు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిలో తెలియని వారితో పాటు, తెలిసిన వారు కూడా దాదాపు సమానంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మీ కళాశాల – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా? ఎ) ఉంది – 39 బి) లేదు – 73 సి) చెప్పలేను – 28 మీ ఇంట్లో ఆడ –మగ వివక్ష ఏమైనా ఉందా.. ఎ) ఉంది – 17 బి) లేదు – 99 సి) చెప్పలేను – 24 మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం ఎ) బస్టాప్‌లో–41 బి) కాలేజీ లేదా ఆఫీసులో – 41 సి) సెల్ఫోన్లో వచ్చే మెసేజ్‌లతో –58 మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు ఎ) తెలియని వారు–71 బి) తెలిసిన వారే–69 41%58% కాలేజీ, పనిప్రదేశంలో వివక్ష లేదన్న 52 శాతం వనితలు ఉందన్నవారు కేవలం 28 శాతం మంది ఇంట్లో ఆడ –మగ వివక్ష ఉందన్న వారు స్వల్పమే ‘సాక్షి’ సర్వేలో ఆసక్తికర అంశాలు వివిధ ఏజ్గ్రూపుల్లో 140 మంది అభిప్రాయాల సేకరణ -
‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా వల్లూరు క్రాంతి
● మహిళల్లో స్ఫూర్తి నింపే మరిన్ని కథనాలు రావాలని ఆకాంక్ష సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా వచ్చిన వార్తలను పరిశీలించి.. వాటిని క్షుణ్ణంగా చదివి.. ఆ వార్తల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేశారు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి. పాలన పరమైన విధుల్లో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలోని సంగారెడ్డి జిల్లా ఎడిషన్‌కు గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, ప్రతిభ చూపుతున్న మహిళలకు సంబంధించి విలేకరులు రాసిన ప్రత్యేక కథనాలు ఆమె చదివారు. వాటి ప్రాధాన్యతను కూడా గుర్తించి సబ్ ఎడిటర్లతో చర్చించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా పేజీల డిజైన్లను పరిశీలించారు. అలాగే వివిధ మండలాలు, పట్టణాల నుంచి వచ్చిన వార్తలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఈ కథనాలు మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కితాబిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా వారిని ప్రోత్సహిస్తూ.. స్ఫూర్తిదాయక కథనాలు మరిన్ని రావాలని ఆకాక్షించారు. దినపత్రికకు గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించడం తనకు ఎంతో మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. పత్రిక నిత్యం ప్రజాసమ స్యలను వెలికి తీస్తుండటంతో.. ఆ సమస్యలు అధికార యంత్రాంగం దృష్టికి వస్తాయని.. తద్వారా అధికార యంత్రాంగం వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. అధికారుల దినచర్య న్యూస్పేపర్లతోనే ప్రారంభమవుతందని చెప్పారు. పత్రిక పాఠకునికి చేరడం వెనుక ఆయా విభాగాలు ఎలా పనిచేస్తాయో తెలిసిందని అన్నారు.వార్తలు చదువుతూ.. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
జహీరాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిలాల్లో ఆశవర్కర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం జహీరాబాద్‌లో నిరసన తెలిపి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ...మహిళా కార్మికులకు రక్షణలేకుండా పోతుందన్నారు. విధులు ముగించుకుని వెళ్తున్న ఆశవర్కర్ను హత్య చేసినా...అక్కడి పోలీసులు దుండగులను పట్టుకునేందుకు కాలయాపన చేస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు యశోదమ్మ,శ్యామల, పూజ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ -
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఆమె ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య.. వీటన్నింటికి మించి ఓ పోరాట యోధురాలు. శక్తి యుక్తులు కలిగిన పోరాట నారీమణి. ఇప్పుడు ఆమె ఆకాశంలో సగం కాదు.. అన్నింటా ఆమె. అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. నేటి సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్నింట్లోనూ ఆదర్శంగా ముందుకు సాగుతున్నారు. నేటి ఆమె అడుగు మోపని రంగం లేదు.. చేయని పని లేదు.. సాధికారితే లక్ష్యంగా సాగుతూ.. చదువులోనూ, సేవా కార్యక్రమాల్లోనూ, ఉపాధి రంగంలోనూ, రాజకీయాల్లోనూ పెను మార్పులు తెస్తోంది. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు రంగాల్లోనూ, చదువుల్లోనూ రాణిస్తున్న మహిళలు, విద్యార్థినులపై సాక్షి ప్రత్యేకం కథనం.. -
కోటి కాంతుల కనకతార
హుస్నాబాద్‌రూరల్: అమ్మ చూపిన కిరాణా షాపు ఆలోచన ఆమె బతుకుకు బాటలు వేసింది. బడిలో నేర్చుకున్న కుట్టు పని వ్యాపారంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. ఒకప్పుడు కూటి కోసం తిప్పలు పడిన మహిళ.. ప్రస్తుతం ఏడాదికి రూ.కోటి వరకు వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. మూడు పరిశ్రమలు ఏర్పాటు చేసి 60 మంది స్వశక్తి మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. 2024 అక్టోబర్ 17న ఢిల్లీ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ వ్యాపార సెమినార్‌కు రాష్ట్రం నుంచి ప్రతినిధిగా హాజరై ప్రసంగించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘కనకతార’విజయగాథపై ప్రత్యేక కథనం.. స్వశక్తిలో చేరి.. మార్గదర్శిగా మారి హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామానికి చెందిన బోయిన కనకతార 2005లో స్వశక్తి సంఘంలో చేరింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన రాజీవ్ యువశక్తి పథకంలో రూ. 2 లక్షల రుణం తీసుకొని జనరల్ స్టోర్ ఏర్పా టు చేసింది. మహిళలతో స్నేహం 2014లో సీ్త్ర శక్తి టైలరింగ్ యూనిట్‌కు పునాదులు పడేలా చేశాయి. బ్యాంకు లింకేజీల ద్వారా రూ. 4.50 లక్షలతో కుట్టు మిషన్లను కొనుగోలు చేసి 14 మందితో టైలరింగ్ ప్రారంభించింది. మరో రూ. 22 లక్షల వ్యయంతో అధునాతన కుట్టు మిషన్లను కొనుగోలు చేసి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ పిల్లల యూనిఫాం కుట్టి ఇస్తుంది. సొంత షెడ్డు నిర్మించి సంఘంలో 30 మందిని చేర్చుకొని ఒక్కొక్కరికి నెలకు రూ. 10 వేల చొప్పున ఉపాధి కల్పిస్తుంది. మూడు పరిశ్రమల్లో మొత్తం 60 మందికి పని కల్పించి ఆదర్శంగా నిలిచింది. కుట్టు పనికి తోడు పేపర్ ప్లేట్లు తయారు చేసి ఉపాధి పొందవచ్చని అధికారులు సూచించడంతో ఆ దిశగా అడుగులు వేసింది. తన కూతురు బెస్లీతో పేపర్ ప్లేట్ల పరి శ్రమను ఏర్పాటు చేయించి ప్రోత్సహించింది. రూ. 60 లక్షలతో మిషన్లు కొనుగోలు చేసింది. పరిశ్రమ కోసం రూ. 30 లక్షల వ్యయంతో భవనం నిర్మించి మహిళా శక్తిని చాటింది. 2020లో క్లాత్ బ్యాగ్స్ పరిశ్రమను సైతం నెలకొల్పింది. పీఎంఈజీపీ కింద రూ.25 లక్షలు, మరో రూ. 55 లక్షల బ్యాంకు రుణం తీసుకొని షెడ్డు నిర్మాణంతో పాటు మిషన్లను కొనుగోలు చేసి పరిశ్రమను నడుపుతోంది. రూ. 2 కోట్ల అస్తులను సృష్టించి ఏడాదికి రూ. కోటికి పైగా వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. -
జాతీయ సమైక్యత శిబిరంలో మెరిసిన తెలంగాణ
తొలిస్థానంలో నిలిచిన రాష్ట్ర ఎన్ఎస్ఎస్ వలంటీర్ల బృందం సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర మానవ వనరుల,యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒడిశాలోని బరంపూర్‌లో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో సాంస్కృతిక విభాగంలో తెలంగాణ ఎన్ఎస్ఎస్ వలంటీర్ బృందం ప్రతిభ కనబరచి మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జగదీశ్వర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 3 నుంచి బరంపూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో రాష్ట్రం నుంచి ఆరుగురు ఎన్ఎస్ఎస్ వలంటీర్ల బృందం చిత్రకళ, రంగోలీ, శాసీ్త్రయనృత్యాలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ బోనాలు ప్రదర్శించారు. ఈ శిబిరంలో 15 రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 210 మంది వలంటీర్లు పాల్గొన్నారు. -
No Headline
సంగారెడ్డి జిల్లా షీ టీమ్: 87126 56772 సఖీ సెంటర్: 084552 77066 మెదక్ జిల్లా షీ టీమ్: 63039 23823 భరోసా కేంద్రం: 87126 57964 సిద్దిపేట జిల్లా షీ టీమ్: 87126 67434 భరోసా సెంటర్: 94403 11933 స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్: 94946 39498 -
ఆడ పిల్లలకు అండగా.. ఆర్థిక భరోసా
బెజ్జంకి(సిద్దిపేట): ఆడపిల్లలకు అండగా ఉంటూ ఆర్థిక చేయూతనందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బెజ్జంకి మండల కేంద్రంలో లింగాల లక్ష్మణ్ యువసేన సభ్యులు. జూలై 13, 2022లో లింగాల లక్ష్మణ్ యువసేన అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. గ్రామంలో పుట్టిన పేదింటి ఆడ పిల్లలకు రూ.5,016 చొప్పున ఇప్పటి వరకు 25 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మెగా కార్యక్రమాన్ని నిర్వహించి 11 మంది చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు అధ్యక్షుడు వెంకటేశ్ తెలిపారు. ఇదే కాకుండా ప్రభుత్వాస్పత్రి మహిళా సిబ్బంది, ఆశ కార్యకర్తలకు చీరలను పంపిణీ చేశామన్నారు.● 25 కుటుంబాలకు రూ.5,016 చొప్పునసాయం ● లింగాల లక్ష్మణ్ యువసేన సభ్యులు -
పేదల పాలిట పెళ్లి పెద్ద
నర్సాపూర్: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతుగా సహాయం చేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి. తన మిత్రుడు హకీం ఇచ్చిన సూచన మేరకు నియోజకవర్గంలో జరిగే ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందజేయాలని నిర్ణయించారు. సుమారు 12 ఏళ్ల క్రితం అమలులో పెట్టారు. అయితే వాటిని అందజేసే సమయంలో ప్రచారం కోసం ఆరాటపడటం లేదు. ఇప్పటివరకు సుమారు 2,500 మంది ఆడపిల్లలకు రఘువీరారెడ్డి పుస్తె మెట్టెలు అందజేశారు. శక్తి ఉన్నంత వరకు పేద కుటుంబాలకు అండగా నిలుస్తానని అన్నారు. గతంలో ఒక ఆడ కూతురుకు పుస్తె మెట్టెలు ఇవ్వడానికి రూ. 8 వేల వరకు ఖర్చు కాగా, ప్రస్తుతం రూ. పది వేలు అవుతున్నాయని చెప్పారు. కులమతాలకు అతీతంగా పేద వారికి సహాయం చేయడమే తన లక్ష్యమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. -
ప్రతీ ఒక్కరు సేవాభావం కలిగి ఉండాలి
ఎంపీ సురేశ్ షెట్కార్ నారాయణఖేడ్: ప్రతీ ఒక్కరు సేవాభావాన్ని కలిగి ఉండాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. ఖేడ్ శ్రీసత్యసాయి నిలయంలో సత్యసాయిబాబా 100వ జయంతిలో భాగంగా సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆయన వృద్ధులకు చేతికర్రలు, హాస్టళ్లలో ఉంటూ పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. సమితి సేవలనుకొనియాడారు. వారిపై చర్యలు తీసుకుంటాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పటాన్చెరు: నకిలీ వీడియోలతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్యారానగర్ డంప్‌యార్డ్ విషయంలో స్థానిక జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో తాను కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ ఒక వీడియో వైరల్ కావడంపై ఆయన స్పందించారు. డంప్‌యార్డ్ విషయంలో జేఏసీ నాయకులతో మాట్లాడుతూ... పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ గుమ్మడిదల ప్రజలకు సంపూర్ణ మద్దతు అందిస్తున్నారని వారికి సూచించానని తెలిపారు. ఈ క్రమంలో తాను కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ నకిలీ వీడియోను సృష్టించి కొన్ని యూట్యూబ్ చానల్స్ ప్రచారం చేయడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలుసంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీషు పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు 18,594 మంది విద్యార్థులకు గానూ 18,071 మంది విద్యార్థులు హాజరు కాగా 523 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విభాగంలో 16,949 మందికి గానూ 16,530 మంది విద్యార్ధులు హాజరు కాగా 419 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 1,645మంది విద్యార్థులకు గానూ 1,541 మంది హాజరు కాగా 104 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నేడు ఖేడ్‌లో మహిళాదినోత్సవంనారాయణఖేడ్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్హాల్లో వేడుకలు నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉదయం 9గంటల నుంచి మహిళలకు వివిధ ఆటలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పనులు కల్పించాలి అదనపు డీఆర్డీవో బాల్‌రాజ్ జహీరాబాద్ టౌన్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతీ గ్రామంలో కూలీలకు పనులు కల్పించాలని అదనపు డీఆర్డీవో బాలరాజ్ సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో డివిజన్ స్థాయి ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో కూలీల మొబిలైజేషన్, పనుల గుర్తింపు, నర్సరీల్లో మొక్కల పెంపకం, పశువుల షెడ్ల నిర్మాణం తదితర పనులపై ఆయన సమీక్షించారు. -
ఆకాశవాణి.. మహిళా కేంద్రం
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘం రేడియో స్టేషన్లో కార్యక్రమాలన్నింటినీ మహిళలే నిర్వహిస్తున్నారు. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ ప్రతి నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారంచేస్తున్నారు. జహీరాబాద్: గ్రామాలకు వెళ్లి సమాచారం సేకరణ ఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో 1998 సంవత్సరంలో సంఘం రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రసారాలు అందుతున్నాయి. 90.4 ఫ్రీక్వెన్సీలో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలను అందిస్తున్నారు. మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన అల్గోల్ నర్సమ్మ, పస్తాపూర్ గ్రామానికి చెందిన జనరల్ నర్సమ్మ 1999 నుంచి రేడియో స్టేషన్ నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ప్రసారాలకు కావాల్సిన సమాచారాన్ని ఆడియో రికార్డింగ్ చేసుకుంటారు. డీడీఎస్‌కు సంబంధించి పలు కార్యక్రమాలను చూస్తున్న ఏడుగురు మహిళలు రేడియో ప్రసారాలకు సంబంధించిన కార్యక్రమాలను గ్రామాలకు వెళ్లినప్పుడు ఆడియో రికార్డింగ్ చేసుకొని స్టేషన్ నిర్వాహకులకు అందిస్తున్నారు. వాటిని ఎడిట్ చేసుకొని ప్రసారం చేస్తారు. ముఖ్యమైన ప్రసారాలు మన ఊరి పంటలు, ఆరోగ్యం, సంఘాలు, చావిడికట్ట, భాష, మన రుచులు, పండుగలు, పాటలు, పర్యావరణం, బాలానందం, యారండ్ల ముచ్చట్లు తదితర కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నారు. భాషకు సంబంధించి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ భాషల్లో పెద్ద మనుషులతో వినిపిస్తారు. పొలంలో పనిచేసే సమయంలో, పెళ్లి సందర్భంలో, పుట్టినరోజు వేడుకలు, యువతులు పుష్పవతి అయిన సమయంలో పాడే పాటలను పరిచయం చేస్తారు. చిన్న పిల్లలకు సంబంధించి బాలానందం కార్యక్రమం నిర్వహించి పాటలు, కథలు వినిపిస్తారు. సీజన్ వ్యాధులు, చిన్న పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ముచ్చటిస్తారు. వ్యవసాయ విషయానికి వస్తే పంట వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు, ఏయే పంటలు వేయాలి, ఎరువులు, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం గురించి సూచనలు చేస్తారు.వారే మిక్సింగ్, కంపోజింగ్.. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ రేడియో స్టేషన్లో మిక్సింగ్, కంపోజింగ్, ట్రాన్స్మిషన్ నిర్వహణ, రికార్డు చేసిన కార్యక్రమాల ఎడిటింగ్ పనులను చూస్తారు. ప్రతీ నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారం చేసేంత వరకు వారే చూసుకుంటారు. ఇద్దరూ డీడీఎస్ డైరెక్టర్ దివంగత పీవీ సతీష్ వద్ద శిక్షణ పొందారు. అప్పటి నుంచి వారు ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మహిళల సంఘం రేడియో స్టేషన్ ప్రతీ నిత్యం రెండు గంటలపాటుకార్యక్రమాలు స్థానిక అంశాలే ప్రసారం -
చిన్న వయసులో.. ‘నిర్మల’మైన మనసు
● కష్టాలు ఓరుస్తూ.. కుటుంబ భారం మోస్తూ ● కూరగాయలు అమ్ముతున్న విద్యార్థిని నారాయణఖేడ్: ఆ కుటుంబానికి కష్టాలు చుట్టముట్టాయి.. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు.. ఇంటినిండా ఆడపిల్లలు.. పెద్దల నుంచి వచ్చిన అర ఎకరం పొలం.. తండాలో చిన్నపాటి ఇల్లు.. ఆ దంపతులు పడరాన్ని పాట్లు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. ముగ్గురు ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసి పంపేసరికి రూ.12 లక్షల అప్పు. ఆ కుటుంబం మరింత కష్టాల్లోకి నెట్టి వేయబడింది. ఈ కష్టాలను చూసిన నాలుగో కూతురు ఓ రాణి రుద్రమలాధైర్యాన్నిస్తూ తల్ల్లిదండ్రుల వెన్ను తట్టింది.. నారాయణఖేడ్ మండలం చందర్‌నాయక్ తండాకు చెందిన చందర్, చాందీబాయికి ఆరుగురు సంతానంలో ఐదుగురు కూతుళ్లే. లత, బూలి, బుజ్జి, నిర్మల, వైశాలి తర్వాత పవన్ పుట్టాడు. లత, బూలి, బుజ్జిబాయిల వివాహమైంది. రూ.12 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అర ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ ఖేడ్ పట్టణంలో విక్రయిస్తున్నారు. నాలుగో కూతురు నిర్మల సిద్దిపేటలో హాస్టల్లో ఉంటూ 10వ తరగతిలో 9.8 జీపీఓ ఉత్తీర్ణత సాధించింది. ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినా తండ్రి అనారోగ్యానికి గురవ్వడం కుటుంబ భారం వల్ల వెళ్లలేదు. ఖేడ్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో అడ్మిషన్ అయ్యింది. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఓ కానిస్టేబుల్ కొనిచ్చిన నీట్ ప్రిపరేషన్‌కు సంబంధించిన పుస్తకాలను పఠనం చేస్తుంది. తమ అర ఎకరం పొలంలో నిత్యం పండిన కూరగాయలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తెల్లవారు 3 గంటలకు వచ్చిన నిర్మల బీట్‌లో కూరగాయలు కొని దుకాణంలో సర్ది 8 గంటల వరకు వ్యాపారం.. అనంతరం తండాకు వెళ్లి 9 గంటలకు కళాశాలకు వెళ్తుంది. ఇలా కష్టపడుతున్న నిర్మల ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తూ తన లక్ష్యం డాక్టర్ కావాలని.. మరో సోదరి, సోదరుణ్ణి జీవితంలో వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలని చెబుతుంది. చదువులో నిర్మల మంచి ప్రతిభ కనబరుస్తుందని ఉపాధ్యాయులూ చెబుతున్నారు. -
జిల్లా ఎస్పీగా పంకజ్ పరితోష్
చెన్నూరి రూపేశ్ నార్కోటిక్ బ్యూరోకు బదిలీసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా ఎస్పీగా పంకజ్ పరితోష్ నియమితులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్డీగా పనిచేస్తున్న పంకజ్‌ను జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఎస్పీగా పనిచేస్తున్న చెన్నూరి రూపేశ్‌ను యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీకి బదిలీ అయింది. 2020 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.. పంకజ్ 2020 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. భద్రాచలం అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్డీగా బదిలీ అయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో పంకజ్‌కు మంచి పట్టుంది. జిల్లా ఎస్పీగా పనిచేయడం ఆయనకు ఇదే తొలిసారి. దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ విద్యార్థి. పాలనపై చెన్నూరి రూపేశ్ తనదైన ముద్ర జిల్లా పోలీసు పాలనపై రూపేశ్ తనదైన ముద్ర వేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన బదిలీల్లో భాగంగా 2023 అక్టోబర్ 13 ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఏడాదిపైన ఐదు నెలల పాటు జిల్లాలో పనిచేశారు. రూపేశ్ నార్కోటిక్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఎస్–నాబ్ విభాగాన్ని బలోపేతం చేసి గంజాయి అక్రమ రవాణాపై ప్రధానంగా దృష్టిపెట్టారు. అలాగే నిషేధిత మత్తు పదార్థం అల్ఫ్రాజోలం తయారీ ముఠాల గుట్టు రట్టు చేశారు. ఆల్ఫ్రాజోలం తయారీ ముఠాలకు సంబంధించిన రూ.కోట్లు విలువ చేసే ఆస్తులను జప్తు చేయించారు. అక్రమ మద్యం, నిషేధిత సిగరెట్ల దందాకు చెక్పెట్టగలిగారు. మరోవైపు పోలీసు ఉద్యోగుల సంక్షేమంపై కూడా ఆయన దృష్టి సారించారు. సీఎస్ఆర్ నిధులతో సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యురిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామిక వాడల్లో మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. మై ఆటో సేఫ్, ట్రాఫిక్ బైక్‌లు వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.బయోడేటా : పేరు: పంకజ్ పరితోష్స్వస్థలం : బిహార్ రాష్ట్రం భోజ్‌పూర్ జిల్లా ఆరానగర్. తల్లిదండ్రులు : పంకజ్ తండ్రి డా.నరేంద్రనారాయణసింగ్ రిటైర్డ్ ప్రొఫెసర్.తల్లి డా.కృతిసింగ్ కూడా పీహెచ్డీ చేశారు. పుట్టిన తేదీ : 1989 అక్టోబర్ 19. సివిల్ సర్వీసెస్ ర్యాంక్ : 142(2019 సంవత్సరం) ఉద్యోగం : జర్మనీలోని మర్చంట్ నేవీ ఉద్యోగం (2015 వరకు) ఐపీఎస్‌గా ఎంపిక : 2020 డిసెంబర్ 28 పోలీసుశాఖలో : వరంగల్ జిల్లా రఘునాథపల్లి ఎస్హెచ్ఓగా 2022లో పనిచేశారు. ఆ తర్వాత గ్రేహౌండ్స్ విభాగం హైదరాబాద్‌లో విధులు నిర్వహణ. 2023 జనవరి 29న భద్రాచలం ఎఎస్పీగా బాధ్యతల స్వీకరణ. 2024 జూలై నుంచి ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్డీగా నియామకం. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం సంగారెడ్డి జోన్: అమ్మాయిల చదువు ఇంటికి ఎంతో వెలుగని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...మహిళల సమానత్వం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ఇంట్లో ఆడపిల్లలను, మగ పిల్లలను సమానంగా చూసి, చదివించాలని సూచించారు. మహిళలు అన్ని రంగాలలో పురోగమించడమే అసలైన అభివృద్ధి అని తెలిపారు. ప్రభుత్వ ,ప్రైవేటు రంగాలలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ మహిళల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగం చేయాలంటే కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం చాలా అవసరం అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మజారాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, పీడీ డీఆర్డీఏ జ్యోతి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వసంతకుమారి, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాలు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మహిళలకు ప్రత్యేక చట్టాలు
సంగారెడ్డి టౌన్ : సమాజంలో మహిళల పాత్ర గొప్పదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర పేర్కొన్నారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. సమాజంలో లైంగిక దాడులు, హత్యాచారాలు, లైంగిక దోపిడీ, వరకట్నం వంటి సమస్యలు వెంటాడుతుంటాయని, వీటిని పరిష్కరించేందుకు మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహల నిర్మూలపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు ఎటువంటి న్యాయం కావాలన్నా కోర్టులో ఉచితంగా న్యాయం పొందవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర -
లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, సంగారెడ్డి జిల్లా: కిష్టారెడ్డి పేట మైత్రి విల్లాస్ లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. బండారు మహేశ్వర్ అనే వ్యక్తి నడుపుతున్న హాస్టల్లో స్పై కెమెరాలను విద్యార్థినులు గుర్తించారు. విల్లా నంబర్ 75లోని హాస్టల్లో కెమెరాను గుర్తించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమీన్ పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీసులు విచారిస్తున్నారు. స్పై కెమెరాలోని పలు చిప్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.కాగా, లేడీస్ హాస్టల్లో స్పై కెమెరా ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లో భార్య, తల్లి గొడవ పడుతున్నారనే కారణంగా మహేశ్వరరావు అనే వ్యక్తి మొదట ఇంట్లో స్పై కెమెరా పెట్టినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు అమెజాన్‌లో ఓ కెమెరాను కొనుగోలు చేసిన మహేశ్వరరావు.. ఆ తర్వాత హాస్టల్ కిచెన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. ఎవరికి తెలియకుండా అమ్మాయిల రూమ్‌లో కూడా కెమెరా పెట్టాడు. ఓ యువతి కెమెరా చూసి పసిగట్టడంతో ఈ బాగోతం బయటపడింది. -
వ్యక్తి అదృశ్యం
జహీరాబాద్ టౌన్: వ్యక్తి అదృశ్యమైన ఘటన మండలంలోని అల్గోల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కాశీనాథ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుపుల రాజు(40)కి భార్య కూతురు ఉన్నారు. వ్యవసాయం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2న పనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నాడు. అతడి భార్య పద్మ చర్చికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి భర్త రాజు కనిపించలేదు. బంధువులు, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. దొంగతనం కేసులో జైలు వర్గల్(గజ్వేల్): వర్గల్ మండలం అనంతగిరిపల్లిలో దొంగతనానికి పాల్పడిన నిందితుడికి గురువారం గజ్వేల్ కోర్టు న్యాయమూర్తి ప్రియాంక ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించారని గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. చాంద్ఖాన్మక్తకు చెందిన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ చెఫ్ పొయినమైన సుధాకర్(30) అక్టోబర్ నెలలో అనంతగిరిపల్లిలో దొంగతనానికి పాల్పడగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారించిన గజ్వేల్ కోర్టు న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలు శిక్షతోపాటు జరిమానా విధించారని ఎస్ఐ వివరించారు. -
52 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
చిన్నకోడూరు(సిద్దిపేట): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ కథనం మేరకు.. నమ్మదగ్గ సమాచారం మేరకు గురువారం మండల పరిధిలోని మల్లారం చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా సిద్దిపేట పట్టణానికి చెందిన వానరాశి రాజు ఆటోలో ఎలాంటి అనుమతులు లేకుండా 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆటోను పోలీస్ స్టేషన్‌కు తరలించాం. నిందితుడు రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే, మండల పరిధిలోని సికింద్లాపూర్‌లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన ముక్కెర కనకయ్య, సంపత్‌ల ఇంట్లో బియ్యాన్ని నిల్వ చేయడంతో ఇరువురిపై కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని మహిళ మృతి పటాన్చెరు టౌన్: గు ర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఆసిఫ్ అలీ కథనం మేరకు.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ సమీపంలో పంచర్ షాపు డబ్బా వెనుకాల గుర్తు తెలియని పడిపోయి ఉంది. మహిళకు చీమలు పట్టి ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి వయస్సు 50 ఏళ్ల వరకు ఉంటుందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి కౌడిపల్లి(నర్సాపూర్): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఆస్ప త్రిలో చికిత్స పొందు తూ మృతి చెందాడు. గురువారం కౌడిపల్లి ఎస్ఐ రంజిత్‌రెడ్డి కథ నం మేరకు.. మండల ంలోని కంచన్‌పల్లి గ్రామానికి చెందిన బోయిని కుమార్(38) కొత్తగా ఇల్లు కట్టాడు. ఇంటి నిర్మాణం కోసం కొంత భూమి అమ్మగా మిగితా డబ్బులు అప్పులు చేశాడు. అప్పులు తీర్చమా ర్గం లేకపోడంతో 3న ఇంటి డాబా పైకి ఎక్కి పురుగుల మందుతాగాడు. గమనించిన భార్య జ్యోతి మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురు వారం మృతి చెందినట్లు తెలిపారు. జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా వాకర్స్‌ను ఢీకొట్టిన బైక్ ముగ్గురికి గాయాలు రామాయంపేట(మెదక్): వాకింగ్‌కు వెళ్తున్న మహిళలను వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం సాయంత్రం రామాయంపేట పట్ణణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన సౌమ్య, లావణ్య, శ్రీలత, మరో ముగ్గురు మహిళలు సాయంత్రం వేళ కామారెడ్డి రోడ్డు వైపు వాకింగ్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మద్యం సేవించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్ఐ బాల్‌రాజ్ పేర్కొన్నారు. కుంటలో పడి శవమై తేలి గజ్వేల్‌రూరల్: ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లిలో చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసుల కథనం మేరకు.. సంగుపల్లికి చెందిన బడె యాదగిరి(43), నిర్మల దంపతులకు నలుగురు ఆడ పిల్లలున్నారు. యాదగిరి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. 3న ఇంట్లో కుటుంబ సభ్యులకు బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. కుటుంబీకులు చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం నిర్మల తమ బంధువులతో కలిసి గ్రామ శివారులోని పాతకుంట వద్ద వెతుకుతుండగా యాదగిరి మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపగా వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్య
రామంచలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి చిన్నకోడూరు(సిద్దిపేట): ఉరేసుకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల పరిధిలోని రామంచలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి(40) గతంలో ఆర్మీలో పని చేసి రిటైర్మెంట్ అయ్యాడు. ఇతడికి భార్య శ్రీలక్ష్మితోపాటు కూతురు, తల్లి లక్ష్మి ఉన్నారు. తండ్రి తిరుపతిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీకాంత్ రెడ్డి దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వ్యాపారాల నిమిత్తం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టగా నష్టం రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో మనస్తాపం చెంది రెండు రోజుల కిందట రామంచ గ్రామంలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రెడ్డిపల్లిలో అసిస్టెంట్ రేషన్ డీలర్ చేగుంట(తూప్రాన్): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రెడ్డిపల్లి కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డిపల్లి కాలనీకి చెందిన మద్దూరి ప్రభాకర్ (37) అసిస్టెంట్ రేషన్ డీలర్‌గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల కిందట భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. రేషన్ పంపిణీ కోసమని ఇంటికొచ్చిన ప్రభాకర్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. ముత్తన్నపేట గ్రామంలో... బెజ్జంకి(సిద్దిపేట): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. బెజ్జంకి ఎస్ఐ క్రిష్ణారెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన గాజె రవి(45)కి తల్లిదండ్రులు, భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలను బీటెక్ చదివిస్తున్నాడు. తమకున్న వ్యవసాయ భూమితోపాటు కొంత కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తున్నాడు. పంటల పెట్టుబడితో పాటు చదువులకు అప్పుల చేశాడు. కొద్ది రోజులుగా అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందుతున్నాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగాడు. ఇది గమనించిన భార్య రేణుక చుట్టుపక్కల వారి సాయంతో భర్త రవిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించింది. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రతిభ పరీక్షలో రాణించిన విద్యార్థులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థుల ప్రతిభను వెలికితీసే భాగంలో కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ పరీక్షల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ విద్యార్థులు రాణించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రతిభ పరీక్షలో పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు. వీరికి కాగ్రిజెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థ ఉచితంగా ల్యాప్‌టాప్ అందజేయడంతోపాటు, అన్ని రకాల పోటీ పరీక్షలకు ఆన్లైన్లో తరగతులు అందించనున్నట్లు తెలిపారు. -
పురోహితుడు బలవన్మరణం
సిద్దిపేటకమాన్: పురోహితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట పట్టణంలోని గాడిచర్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. సిద్దిపేట వన్‌టౌన్ ఎస్ఐ కనకయ్య కథనం మేరకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లాకు చెందిన కృష్ణ అనూజ్ త్రిపాఠి(24) గతేడాది బతుకు దెరువు నిమిత్తం సిద్దిపేటకు వచ్చి పట్టణంలోని ఓ పురోహితుడి వద్ద పౌరోహిత్యం చేసుకుంటూ గాడిచర్లపల్లిలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కృష్ణ సోదరుడు రామ్దినశర్మ గురువారం ఇంటికి వచ్చి చూసేసరికి లోపల ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. ఆందోళనకు గురైన అతడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రేపు జాతీయ లోక్ అదాలత్
జిల్లావ్యాప్తంగా ఏడు బెంచీలు ఏర్పాటు ● 21,310 పెండింగ్ కేసులు ● కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలంటున్న న్యాయనిపుణులుసంగారెడ్డి టౌన్: కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా, జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కక్షిదారులను ఒప్పించి సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులను పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. ఒకప్పుడు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్న న్యాయసేవలు క్రమంగా కక్షిదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. సత్వరం, సమన్యాయం అందించడానికి న్యాయ సేవధికార సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇందుకోసం 1987లో జాతీయ లోక్‌అదాలత్ సేవలు ప్రారంభించారు. ‘రాజీయే రాజమార్గం’అనే నినాదంతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలు లోక్‌అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కరిస్తున్నాయి. కక్షిదారులను ఒప్పించి సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులను పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా కోర్టు పరిధిలో న్యాయవాదులు, పోలీసు అధికారులు, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ అధికారులకు అవగాహన కల్పించారు. రాజీయే రాజమార్గమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జీలు సూచిస్తున్నారు. ఈనెల 8న నిర్వహించే జాతీ య లోక్ అదాలత్ ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పెండింగ్ కేసులు ఎక్కువగానే... జిల్లా వ్యాప్తంగా 21,310 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లోక్ అదాలత్‌కు విద్యుత్, టెలిఫోన్ రికవరీ తదితర కేసులు కూడా వస్తాయి. జాతీయ లోక్ అదాలత్ లో సివిల్, కుటుంబ, ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, మోటార్ వెహికల్ కేసులు, బ్యాంకుల రికవరీ కేసులు, ఇన్సూరెన్స్, చెక్ బౌన్స్ కేసులు, క్రిమినల్ కాంపౌండ్ కేసుల వంటివి రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డిలో 3.. జహీరాబాద్‌లో 2 బెంచీలు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా 7 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. సంగారెడ్డిలో మూడు, నారాయణఖేడ్, జోగిపేటలో ఒక్కొక్కటి, జహీరాబాద్‌లో రెండు బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. పెండింగ్ కేసులను తొందరగా పరిష్కరించేందుకు న్యాయవాదులు, పోలీస్ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పెండింగ్ కేసులు ఉన్నవారు కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాదులు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్ అధికారులు ప్రతీ ఒక్కరు సహకరించాలి. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరంఉండదు. భవానీ చంద్ర, జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
కడుపులోంచి క్యాన్సర్ కణతి తొలగింపు
ఆర్వీఎంలో అరుదైన శస్త్రచికిత్సములుగు(గజ్వేల్): ములుగు ఆర్వీఎం ఆస్పత్రిలో కడుపునొప్పితో బాధపడుతున్న రోగికి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ కథనం మేరకు.. హన్మకొండ జిల్లా నడికుడ మండలం రామక్రిష్ణపురం గ్రామానికి చెందిన ఎరుకల సాంబయ్య(65) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ నయం కాలేదు. పది రోజుల కిందట సాంబయ్య ఆర్వీఎం ఆస్పత్రిలో చేరారు. వైద్యులు జనరల్ సర్జన్ శ్రీనివాస్, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎంఎస్ కీర్తి, సర్కిల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సుబ్రహ్మణేశ్వర బాబు, అనెస్థీసియా వైద్యుడు వంశీకిరణ్ పరీక్షలు నిర్వహించి రోగి కడుపులో ప్యాంక్రియాటిస్ క్యాన్సర్‌తో కూడిన భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు. సుమారు 10 గంటల పాటు శస్త్ర చికిత్స చేసి కణతిని విజయవంతంగా తొలగించారు. సాంబయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రుల్లో జబ్బు నయం కావడానికి రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారన్నారు. అంత ఖరీదైన చికిత్సను ఆర్వీఎం ఆస్పత్రి వైద్యులు ఆరోగ్యశ్రీ ద్వారా చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. -
మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు
● వన్ టౌన్ సీఐ వాసుదేవరావు ● సిద్దిపేటలో నార్కోటిక్ డాగ్స్‌తో తనిఖీలు సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు నిల్వ ఉంచినా, విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని పలు దుకాణాలు, పాన్‌షాపులు, బస్టాండ్ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి నార్కోటిక్ డాగ్స్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నివారణ గురించి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పిల్లలు, యువత గంజాయి, మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. మత్తు పదార్థాలు కలి గిన చాక్లెట్ విక్రయించినా వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల గురించి ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 లేదా యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ సిబ్బంది, వన్ టౌన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్‌తో మహిళలకు ఉపాధి
సంగారెడ్డి జోన్: మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందడంతోపాటు వారికి ఉపాధి కూడా లభిస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ మెట్రో నగరానికి హైటెక్ సిటీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల మహిళా డ్రైవర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. మహిళలు డ్రైవింగ్ నైపుణ్యం సాధించడం వల్ల ప్రతీ నెల రూ.15 నుంచి రూ.20వేల వరకు ఆదాయం పొందే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. మహిళలు క్యాబ్ డ్రైవర్లుగా ఉంటే అందులో ప్రయాణించే మహిళలకు భద్రత ఉంటుందని తెలిపారు. డ్రైవింగ్ శిక్షణలో నైపుణ్యం సాధించిన వారికి వివిధ క్యాబ్ సర్వీసెస్ సంస్థలతో, ఇతర ప్రైవేట్ సంస్థలు, పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలతో మాట్లాడి వారికి అందులో ఉపాధి లభించేలా చూస్తామని చెప్పారు. ఈ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అదనపు డీఆర్డీవోలు, డీపీఎంలు,ఎస్‌హెచ్‌జీ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ వల్లూరు క్రాంతి -
జాతీయ స్థాయికి నాలుగు ప్రాజెక్టులు ఎంపిక
గజ్వేల్‌రూరల్: జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డ్‌కు సెయింట్ మేరీస్ విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు ఎంపిక కావడం అభినందనీయమని ఆ పాఠశాల కరస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోగల సెయింట్ మేరీస్ విద్యానికేతన్‌కు చెందిన ఎస్ఎస్సీ, సీబీఎస్ఈ విద్యార్థులు రూపొందించిన 4 ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో నిర్వహించే ఇన్స్పైర్ అవార్డ్స్‌కు ఎంపికయ్యాయి. 8వ తరగతి చదువుతు న్న దాసరి అనిల్, 7వ తరగతి విద్యార్థులు బొమ్మల్ల స్నిగ్ద, తాళ్ల శ్రీహాస్, మార్ద నందన్ వ్యవ సాయ రంగం, ప్రమాదాల రక్షణ కోసం రూపొందించిన ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ప్రిన్సిపాల్ లు కాట రాయప్ప, విజయపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఇన్స్పెయిర్ అవార్డుకు నలుగురు విద్యార్థులు ఎంపిక చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండలంలోని సూరారం జెడ్పీపాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికై నట్లు హెచ్ఎం సాయిరెడ్డి తెలిపారు. 9వ తరగతి విద్యార్థులు నవనీత, సంధ్య, 7వ తరగతి విద్యార్థి సంపత్ కుమార్ ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, సైన్స్ ఉపాధ్యాయులు మనీష్‌రెడ్డి, రవి, హెచ్ఎం సాయిరెడ్డిని గ్రామస్తులు అభినందించారు. అలాగే నార్సింగి మండలంలోని శేరిపల్లి జెడ్పీపాఠశాల 8వ తరగతి విద్యార్థిని కట్ట ప్రవళిక ఇన్స్పైర్అవార్డుకు ఎంపికై నట్లు హెచ్ఎం తిరుపతి తెలిపారు. విద్యార్థినితోపాటు సైన్స్ ఉపాధ్యాయుడు తిరుపతిని గ్రామ ప్రజాప్రతినిధులు అభినందించారు. -
వ్యక్తిని బెదిరించి డబ్బులు చోరీ
పోలీసుల అదుపులో నిందితులుజోగిపేట(అందోల్): పట్టపగలే ఓ వ్యక్తిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బెదిరించి నగదు దోచుకెళ్లారు. ఎస్ఐ పాండు కథనం మేరకు.. పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల అనుకిషోర్ బుధవారం జోగిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో దిగి పట్టణంలోని తమ బంధువుల వద్దకు వెళ్తున్నాడు. మార్కెట్ రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బెదిరించి అనుకిషోర్ వద్ద ఉన్న రూ.13 వేలు దొంగిలిచుకుపోయారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కెట్లో అనుమానంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా మరొకరి వ్యక్తితో కలిసి డబ్బులు దొంగిలించినట్లుగా ఒప్పుకున్నాడు. కర్ణాటకలోని భీమా నగర్ బాల్కీకి చెంది న శివకుమార్, జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఐ లాష్ పూర్ ఆకాశ్‌పై కేసు నమోదు చేసి గురువారం కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. -
విద్యుదాఘాతంతో అన్నాదమ్ముళ్లు మృతి
జహీరాబాద్ మండలంలోని గోవింద్పూర్ గ్రామంలో ఘటనజహీరాబాద్ టౌన్: తండ్రి చనిపోవడంతో కొత్తగా వ్యవసాయం పనులు ప్రారంభించిన ఇద్దరు అన్నాదమ్ముళ్లను కరెంట్ కాటేసింది. పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌కు కరెంట్ సరఫరా కావడంతో అన్నాదమ్ముళ్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జహీరాబాద్ మండలంలోని గోవింద్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిరాగ్పల్లి పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గోవింద్పూర్ గ్రామానికి చెందిన ఎరుకల నాగన్నకు జగన్(48), మల్లేశం(42) ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి పొలం పనులు చేస్తుండగా అన్నాదమ్ముళ్లు ఇద్దరు వంటలు చేసేవారు. ఏడాది కిందట నాగన్న పాముకాటుతో మృతి చెందడంతో అన్నాదమ్ముళ్లు ఇద్దరూ వ్యవసాయం పనులు ప్రారంభించారు. ఇటీవల మూడు ఎకరాల్లో చెరకు తోట వేశారు. అడవి పందులు పంటను ధ్వంసం చేస్తున్నాయని, రక్షణగా పొలం చుట్టూ ఫెన్సింగ్ తీగలు చుట్టారు. ఫెన్సింగ్ తీగకు కనెక్షన్ ఇవ్వడానికని 11 కేవీ లైన్‌కు తీగలు తగిలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లు మృత్యువాత
శివ్వంపేట(నర్సాపూర్): కోళ్లు మృత్యువాత పడిన ఘటన మండల పరిధి గూడూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లపల్లి తండాకు చెందిన లోకేశ్ గూడూర్లో పౌల్ట్రీ ఫామ్‌ని లీజుకు తీసుకొని ప్రీమియం కంపెనీ ద్వారా కోళ్లను పెంచుతున్నాడు. మూడు రోజుల నుంచి కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటి వరకు 4 వేల కోళ్లు మృతి చెందినట్లు లోకేశ్ తెలిపాడు. మృతి చెందిన కోళ్లను జేసీబీ గుంతలో పూడ్చి వేయించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పశు వైద్యాధికారి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లగా కోళ్లు మృత్యువాత పడిన సమాచారం లేదని ఫామ్‌లలో కోళ్లు మృతి చెందితే గుంత తీసి పూడ్చివేయాలని మండల వ్యాప్తంగా ఉన్న కోళ్ల ఫామ్ యజమానులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. -
పాడి రైతుకు ప్రోత్సాహం
నారాయణఖేడ్: తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంపునకు చర్యలు తీసుకుంటుండటంతో జిల్లాలోని పాడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. తద్వారా పాడి ఉత్పత్తి సైతం పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. విజయ డెయిరీ ద్వారా సేకరిస్తున్న గేదె పాల ధరలను సవరించి లీటరకు రూ.3 చొప్పున పెంచేందుకు యాజమాన్యం యోచిస్తుంది. ఇతర రాష్ట్రాల్లోని పాల దిగుమతిని తగ్గించడంతోపాటు విజయడెయిరీ పాల సేకరణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు రాష్ట్రంలోని పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా విజయ డెయిరీ ధర పెంపుపై చర్యలు తీసుకుంటుంది. లీటరుకు రూ.51 ప్రస్తుతం లీటరుకు విజయ డెయిరీ ద్వారా రైతుకు రూ.48 చెల్లిస్తున్నారు. దీన్ని రూ.3 పెంచి లీటరుకు రూ.51 చేయాలని ప్రతిపాదించారు. ఆవు పాలకు గేదె పాలతో సమానంగా చెల్లిస్తుండడం, ఆవు పాల ధర అధికంగా ఉండటంతో దాని ధరను తగ్గించాలని ఆలోచిస్తున్నారు. అత్యధికంగా గేదె పాల సేకరణ జరుగుతోంది. 2,500 మంది రైతులకు మేలు.. జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, పుల్కల్, జోగిపేట, తడ్కల్, కోహీర్, సదాశివపేట, మామిడిపల్లిల్లో మినీ పాలశీథరలీకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటికి తోడు 160 పాల సేకరణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. 2,500 మంది రైతుల ద్వారా నిత్యం 11 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుంది. ధర పెంపు కారణంగా బయటి వ్యక్తులు, సంస్థలకు వెళ్లే పాలు నేరుగా విజయడెయిరీకి చేరుకోనున్నాయి. తద్వారా విజయ డెయిరీకి పాల సేకరణ పెరగడంతోపాటు రైతులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో 70 వేల వరకు గేదెలు గతంలో 15 వేల లీటర్ల పాల సేరణ జిల్లాలో జరుగుతుండగా ప్రస్తుతం 11 వేల లీటర్లు సేకరిస్తున్నారు. వేసవి ప్రారంభంతో ఎండలు ముదిరిన పక్షంలో పచ్చిక బయళ్లు తగ్గడం, గ్రాసం, తాగునీటి సమస్యల కారణంగా పాల ఉత్పత్తి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 70 వేల వరకు గేదెలు ఉండగా, 30 వేల వరకు ఆవులు ఉన్నాయి. ఆవు పాల సేకరణ వెయ్యి లీటర్ల వరకే ఉండగా గేదె పాల సేకరణ 10 వేల వరకు ఉంది. సేకరిస్తున్న పాలలో గతంలో 5 శాతం ఫ్యాట్ (వెన్నశాతం) వస్తుండగా ప్రస్తుతం ఆ ఫ్యాట్ 6 శాతంకు పెరిగింది. పాల ధర పెంపువల్ల రైతులకు జిల్లాలో రూ.10 లక్షల వరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. గేదె పాల సేకరణలో రూ.3 పెంపు! విజయ డెయిరీ ప్రతిపాదనలు జిల్లా నిత్యం 11 వేల లీటర్లు సేకరణ పాడి రైతులకు రూ.10 లక్షల వరకు ఆదాయం పాడి గేదెలు ఇప్పించేందుకు కృషి విజయ డెయిరీ పాల సేకరణ ధర పెంచాలన్న ఆలోచన వల్ల జిల్లాలోని పాడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇంకా పెంపు అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. ధర పెంపువల్ల గేదె పాలసేకరణ పెరుగనుంది. వ్యవసాయంతోపాటు అనుబంధంగా ఉన్న పాడి ఉత్పత్తులు పెరిగేందుకు అవకాశం ఉంది. మిత్రాలోన్, పీఎంఈజీపీ తదితర పథకాల ద్వారా బ్యాంకు రుణాలు పాడి గేదెలు ఇప్పించేందుకు కృషి చేస్తాం. పాడి సంపద పెంచి రైతులకు ప్రయోజనం జరిగేలా కృషి చేస్తాం. – గోపాల్ సింగ్, డిప్యూటీ డైరెక్టర్, విజయడెయిరీ, సంగారెడ్డి -
చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి
జిన్నారం (పటాన్చెరు): చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి కథనం మేరకు.. గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన పంచలింగాల ఆనంద్ రెడ్డికి 6న ఉదయం గ్రామస్తుడు పెబ్బేడి సాయిరామ్ ఫోన్ చేసి ఎర్రచెరువు వద్దకు రావాలని అన్నారు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. రెండు రోజుల కిందటే చనిపోయాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని, చెరువులో స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందినట్లు భావించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నైపుణ్యం ప్రదర్శించేందుకు ఈ బాహ వేదిక
నర్సాపూర్: విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ బాహ సే ఇండియా వేదిక లాంటిదని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బాల్‌రాజ్ సుబ్రమణ్యం సూచించారు. ఇటీవల నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇంజనీరింగు కాలేజీలో ఈ బాహ సే ఇండియా పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నిర్వహణలో భాగస్వామ్య కంపెనీలు గురువారం బీవీ రాజు ఇంజనీరింగు కాలేజీలో క్యాంపస్ సెలెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్‌రాజ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. యువ ఇంజనీరింగు విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించడానికి, అడ్డంకులు, సవాళ్లను అధిగమించి నిజ జీవిత అనుభవాన్ని పొందడానికి ఈ బాహ పోటీలు దోహదపడుతాయని వివరించారు. కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె మాట్లాడుతూ.. క్యాంపస్ సెలక్షన్లో 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు పలు రకాల పరీక్షలు నిర్వహించారని తెలిపారు. సెలెక్షన్స్‌లో కాలేజీకి చెందిన సుమారు 600 మంది విద్యార్థులు రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల ప్యాకెజీతో ఉద్యోగాలు పొందారని వివరించారు. -
సద్దుమణిగిన సాగునీటి వివాదం
కాలువలకు అడ్డుకట్ట వేసినసంగుపేట రైతులు ● కొద్దిరోజులుగా సాగు నీరందక అల్మాయిపేట గ్రామస్తుల ఇబ్బందులు ● సంగుపేట గ్రామాన్ని సందర్శించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ● నాలుగు గ్రామాలకు సాగునీరుఅందేలా పైపుల ఏర్పాటువట్పల్లి(అందోల్): యాసంగి సీజన్లో సింగూరు ప్రాజెక్టు కాలువల ద్వారా సేద్యానికి నీటిని నిలిపివేయడంతో పంటలకు సాగునీరందక గ్రామాల్లోని రైతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అందోలు మండల పరిధిలోని సంగుపేటలోని సుమారుగా 800 ఎకరాల ఆయాకట్ట కలిగిన పెద్ద చెరువు నుండి సంగుపేట, సాయిబాన్‌పేట, చందంపేట, అల్మాయిపేట గ్రామాల్లోని పంటలకు గతంలో తైబందీ చేసి కాలువల ద్వారా సేద్యానికి నీరందించేవారు. అటు తర్వాత సింగూరు కాలువల ద్వారా చాలాకాలం పాటు అల్మాయిపేట, చందంపేట, సాయిబాన్‌పేట గ్రామాలకు నీరందించడం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో.. ప్రస్తుతం సింగూరు కాలువల సీసీ లైనింగ్ పనులు జరుగుతుండడంతో యాసంగి సీజన్‌కు సాగునీటి వదలకపోవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటి బోరు బావులు కూడా సరిగ్గా పోయకపోవడంతో సాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో పెద్ద చెరువు నీటిని ఇతర గ్రామాలకు తరలిపోకుండా ఉండేలా సంగుపేట ప్రాంత రైతులు కాలువలకు అడ్డుకట్ట వేసి వారి గ్రామానికి మాత్రమే తరలిస్తుండటంతో వివాదం ఏర్పడింది. ఈ విషయమై అల్మాయిపేట గ్రామ రైతులు రెవెన్యూ అధికారులకు తెలియజేస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. దీంతో అల్మాయిపేట గ్రామ రైతులను అక్కడికి రానివ్వకుండా గురువారం రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్‌శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి సంగుపేట గ్రామస్తులకు నచ్చజెప్పారు. చాలాకాలంగా సంగుపేట చెరువు నుంచి అల్మాయిపేట మీదుగా బయటికుంట, దేవుని చెరువు, కుడి చెరువు మీదుగా చందంపేట, సాయిబాన్‌పేట గ్రామాలకు సాగునీరు అందేదని అధికారులు రైతులకు నచ్చజెప్పారు. కాలువలకు అడ్డుకట్టలు వేసి సాగునీటిని అడ్డుకోవడం సరికాదని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. అనంతరం సంగుపేట పెద్ద చెరువు నుంచి అల్మాయిపేటతోపాటు మూడు గ్రామాలకు నీరు తరలివెళ్లే విధంగా పైపులను ఏర్పాటు చేశారు. దీంతో రైతుల మధ్య ఏర్పడిన సాగునీటి వివాదం సద్దుమణిగింది. గ్రామాన్ని సందర్శించిన వారిలో డిప్యూటీ తహసీల్దారు మధుకర్‌రెడ్డి, ఎస్సై పాండు, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఉన్నారు. -
సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా...
సంగారెడ్డి జోన్: దేశ వ్యాప్తంగా అమలవుతున్న స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్బీఎం)లో భాగంగా గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఆరుబయట మల మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, చర్చిలు, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలు, ఆసుపత్రులతోపాటు నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రదేశాలను గుర్తించి సామూహిక మరుగుదొడ్లను నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నూతన టెక్నాలజీతో మరుగుదొడ్లు, టాయిలెట్స్, స్నానాల గదితో కూడిన నిర్మాణపు పనులు చేపట్టనున్నారు. మండలానికి ఒక గ్రామం ఎంపిక జిల్లాలో ప్రస్తుతం 10 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఈ సామూహిక మరుగుదొడ్లను నిర్మించనున్నారు. ఆయా గ్రామాల్లో ప్రముఖ దేవాలయాలు, మార్కెట్ స్థలాలతోపాటు మంజీరా డ్యామ్ ఆవరణలో నిర్మించనున్నారు. పనులు చేపట్టేందుకు అనువైన స్థలాలను గుర్తించి, ప్రతిపాదనలను సైతం అధికారులు సిద్ధం చేశారు. రూ.3లక్షల వ్యయంతో సామూహిక మరుగుదొడ్డి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఒక్కో మరుగుదొడ్డి నిర్మించేందుకు రూ.3లక్షలు వ్యయం చేయనున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 70% గ్రామపంచాయతీ (జీపీ) ద్వారా 30% నిధులు చెల్లించి పనులు చేపట్టనున్నారు. అంటే రూ.3లక్షల్లో ఎస్బీఎం రూ.2.10లక్షలు, జీ.పీ నుంచి రూ.90 వేలు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 10 మండలాలు ఎంపిక చేసి రూ.21లక్షలు స్వచ్ఛ భారత్ మిషన్ మంజూరు చేసింది. ఈ నిధులతోనే పనులు ప్రారంభించినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు.జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలు, ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రదేశాలు మండలం గ్రామం ప్రదేశం కొండాపూర్ మారెపల్లి దేవాలయం సమీపంలో ఝరాసంగం బర్దీపూర్ ఆశ్రమ సమీపంలో మునిపల్లి కంకోల్ మార్కెట్ సమీపంలో అందోల్ కన్సాన్పల్లి మార్కెట్ సమీపంలో సంగారెడ్డి కలబ్గూర్ మంజీర డ్యామ్ దగ్గర మనూర్ బోరంచ దేవాలయం సమీపంలో జిన్నారం గడ్డపోతారం టూరిస్ట్ ప్రదేశం కంగ్టి కంగ్టి మార్కెట్ సమీపంలో మొగుడంపల్లి ఖాంజమల్పూర్ ఆలయ సమీపంలో వట్పల్లి వట్పల్లి మార్కెట్ సమీపంలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం ఒక్కో శౌచాలయానికి రూ.3లక్షల వ్యయం మండలానికి ఒక గ్రామం చొప్పున రద్దీగా ఉండే ప్రాంతాలు ఎంపిక ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు సమర్థవంతమైన నిర్వహణతోనే ప్రయోజనం గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్లు లేకపోవడంతో నిత్యం రద్దీగా ఉండే చోట్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణ సరైన విధంగా చేపట్టితే ప్రయోజనం ఉంటుందని పలువురు తమ అభిప్రాయపడుతున్నారు. -
మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి
సంగారెడ్డి డిప్యూటీ లేబర్ కమిషనర్ నీరజ సదాశివపేట(సంగారెడ్డి): మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సంగారెడ్డి డిప్యూటీ లేబర్ కమిషనర్ నీరజ ఆకాంక్షించారు. పట్టణంలోని భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లోనూ వివక్షనెదుర్కొన్న మహిళలు ఐక్యంగా ఉద్యమించడం వల్లే నేడు అంతర్జాతీయంగా పురుషులతో పోటీ పడి పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద,శ్రామిక మహిళ కార్యదర్శి అనసూజ, బీకేఎంయూ మహిళా విభాగం అధ్యక్షురాలు బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభంసంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలిరోజు ప్రశాంతంగా పరీక్షలు ముగిశాయని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారులు వెల్లడించారు. తొలిరోజు ద్వితీయ భాష తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 15,989 మంది విద్యార్థులకు గానూ 15,687 మంది విద్యార్థులు హాజరు కాగా 302 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 14,418 మంది విద్యార్థులకు గానూ 14,196 మంది విద్యార్థులు హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 1,571 మంది విద్యార్థులకు గానూ 1,491 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి 03, డీఈసీ సభ్యులు 05,హెచ్పీసీ సభ్యులు 05,ఫ్లయింగ్‌స్క్వాడ్ 13, సిట్టింగ్ స్క్వాడ్ 08 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ప్యారానగర్లో సర్వేయర్లబృందం పర్యటనజిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి సమీపంలోని ప్యారానగర్ గ్రామంలో డంప్‌యార్డ్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సంగారెడ్డి ఏడీ ఆధ్వర్యంలో సర్వేయర్ల బృందం గురువారం అక్కడ పర్యటించింది. అటవీ రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో సర్వే చేసి హద్దులు గుర్తించారు. సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు అధికారుల బృందం వెల్లడించింది. కాగా ప్యారానగర్లో డంప్‌యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు గురువారం 30వ రోజుకు చేరుకున్నాయి. రాచన్నస్వామినిదర్శించుకున్న సెట్విన్ చైర్మన్జహీరాబాద్ టౌన్: రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి కోహీర్ మండలంలోని బడంపేట రాచన్నస్వామిని గురువారం దర్శించుకున్నారు. రాచన్నస్వామి జాతర మహోత్సవాలకు హాజరైన ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అర్చకులు ఆయనను ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలిసీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పటాన్‌చెరుటౌన్: కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పటాన్చెరు డివిజన్ సీఐటీయూ కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ....రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్లలో కనీస వేతనాల డ్రాఫ్ట్ జీవోలను విడుదల చేసిందని, ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ జీవోలను సవరించాలన్నారు. -
15 నుంచి ఒంటిపూట బడులు!
నారాయణఖేడ్: వేసవి ప్రారంభం నుంచే ఎండలు ముదురుతున్నాయి. మున్ముందు పరిస్థితి మరీ తీవ్రంగా ఉండే ప్రమాదం ఉండటంతో ఈ నెల 15 నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. ప్రతీ ఏడాది మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఒంటిపూట బడుల కారణంగా జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,17,184 మంది విద్యార్థులకు ఉక్కపోతల నుంచి ఉపశమనం కలగనుంది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పాఠశాలల కొనసాగిస్తారు. ఈనెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం పూట తరగతులు నిర్వహిస్తారు. అన్ని తరగతుల పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంగన్వాడీలకు ఆలస్యమే.. అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారులు వస్తుంటారు. వీరికి వేసవి ప్రారంభంలోనే ఒంటిపూట బడులు నిర్వహించాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఆలస్యంగా ఎండలు ముదిరాక ఒంటిపూట బడుల నిర్వహణ ఉత్తర్వులిస్తుంటారు. జిల్లాలో నారాయణఖేడ్, జోగిపేట, పటాన్చెరు, సదాశివపేట్, జహీరాబాద్ ప్రాజెక్టుల పరిధిలో 1,504అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఐదేళ్లలోపు చిన్నారులు 1,04,106మంది కేంద్రాలకు వస్తున్నారు. వీరికి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కేంద్రాన్ని నిర్వహిస్తారు. కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు విద్యాబోధన చేస్తారు. ప్రతీ ఏడాది మే మొదటి వారం తర్వాత ఒంటిపూట బడుల నిర్వహణ ఉత్తర్వులిస్తారు. అంగన్వాడీలకు వచ్చేది చిన్నారులే కావడంతో ప్రభుత్వ పాఠశాలలతోపాటుగానే ఒంటిపూట బడుల నిర్వహణ ఉత్తర్వులు ఇవ్వాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వస్తుంది.ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ఎండలు ముదురుతున్న నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో 1.17లక్షలమంది విద్యార్థులకు ఉపశమనం అంగన్వాడీ చిన్నారులకు ఆలస్యమే.. ఉత్తర్వులు అందాల్సి ఉంది.. ఒంటిపూట బడుల నిర్వహణను ప్రతీ ఏడాది మార్చి 15 నుంచి కొనసాగిస్తారు. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ఏడాది ఇంకా ఉత్తర్వులు అందాల్సి ఉంది. ఉత్తర్వులు రాగానే ఒంటిపూట బడులు నిర్వహిస్తాం. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి సంగారెడ్డి -
శాశ్వత పనులకే ప్రాధాన్యం
ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: తాగునీటి పరంగా ఇబ్బందులను తీర్చేందుకు చేపట్టనున్న పనుల్లో శాశ్వత పనులకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాగునీటి పథకాల పునరుద్ధరణ, ఇతర పనులకోసం ఇటీవల రూ.6.50కోట్లతో ప్రతిపాదనలు పంపగా స్థానిక అధికారులు అవసరమైన పనులను గుర్తించినట్లు చెప్పారు. మిషన్ భగీథ పథకం ద్వారా నిరంతరం నీటిసరఫరా జరిగేలా గొర్రెకల్ వద్ద డెడికేటెడ్ విద్యుత్ లైన్ పనులు చేయిస్తున్నామన్నారు. బోరంచ, శాపూర్ పథకాలను పునరుద్ధరించి బోరంచ నుంచి మార్గమధ్యలోని గ్రామాలతోపాటు ఖేడ్ మున్సిపాలిటీ అవసరాల మేర నీటిసరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యదర్శులు భగీరథ ద్వారా నీరు సక్రమంగా సరఫరా అయితేనే రిజిస్టర్లో సంతకాలు చేయాలని లేని పక్షంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీవోలకు సమాచారం అందించాలన్నారు. వేసవి ముగిసేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో నాయకులు దారంశంకర్, అశోక్‌రెడ్డి, సంగన్న, రాజేందర్పాటిల్, రాజు, విఠల్‌రావు, పరశురాం పాల్గొన్నారు. -
ప్రవేశాలకు ప్రత్యేక ప్రణాళిక
కలెక్టర్ వల్లూరు క్రాంతి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిను కలిసిన అస్మ తబస్సుం సంగారెడ్డి జోన్: మోడల్ స్కూల్లో విద్యార్థుల ప్రవేశాలను గరిష్టస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉన్నతాధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో ఆమె విద్యా శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులు, భవిష్యత్ ప్రణాళికలు, మోడల్ స్కూల్స్ అభివృద్ధి, నిర్మాణ పనులు, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు తీసుకోవలసిన చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...మోడల్ స్కూల్ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై ఆన్లైన్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. క్రీడా పోటీలకు హాజరైన కలెక్టర్మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన క్రీడా పోటీలకు కలెక్టర్ క్రాంతి హాజరై ఆటలు ప్రారంభించారు. మహిళలతో కలసి పోటీలో పాల్గొని చెస్, క్యారమ్స్ ఆడారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మజారాణి, సెంట్రల్ యూనియన్ కార్యదర్శిలు నిర్మల, టీఎన్జీవో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీ, కార్యదర్శి రవి, అసో సియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్, వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గౌస్,సెంట్రల్ యూనియన్ ఆఫీస్, జిల్లా టీఎన్జీవో కార్యవర్గ సభ్యులు, జిల్లా అధికారులు ,మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ నియోజవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మ తబస్సుం బుధవారం పార్టీ ఇన్చార్జి, మాజీమంత్రి చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ నియోజకవర్గం అధ్యక్షురాలిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా చంద్రశేఖర్ సూచించారు. -
అడ్డంగా దొరికి
అక్రమంగా తరలిస్తూ..● 1.02 కోట్ల విలువైన గంజాయి పట్టివేత ● ఇద్దరు అరెస్టు..రిమాండ్‌కు తరలింపు ● సెప్టిక్ ట్యాంకర్లో తరలిస్తుండగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ● ఫైనాన్షియర్‌ను పట్టుకున్న స్పెషల్ ఆపరేషన్ బృందం ● ఏఓబీ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న వైనం ● మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హరికిషన్ మీడియాకు వెల్లడి పటాన్చెరు: ఎవరికీ అనుమానం రాకుండా సెప్టిక్ ట్యాంకర్లో భారీ ఎత్తున రవాణా చేస్తున్న గంజాయిని బుధవారం సంగారెడ్డి జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ గంజాయి అక్రమ రవాణాకు కీలకంగా వ్యవహరించిన ఫైనాన్షియర్‌ను స్పెషల్ ఆపరేషన్ టీమ్ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి వివరాలను మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్) హరికిషన్ పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో బుధవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు ప్రాంతంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్–2 వద్ద జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులోభాగంగా సెప్టిక్ ట్యాంకర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా అందులో గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి ప్యాకెట్లను చెత్త, ప్లాస్టిక్ కవర్ల కింద కప్పి ఉంచి రవాణా చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వెంటనే వాహనాన్ని సీజ్ చేసి అందులోంచి సుమారు 205 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మహారాష్ట్రకు చేరవేసేందుకు... ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు చిత్రకొండ ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన దీపక్ నాగ్నాథ్ గోయ్, నారాయణఖేడ్ ప్రాంతవాసి భీమ్‌సింగ్ మాధవ్‌కు సెప్టిక్ ట్యాంక్ ద్వారా చేరవేసేందుకు ప్రణాళిక వేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతోపాటుగా ఈ అక్రమ రవాణాకు ఫైనాన్షియర్‌గా వ్యవహరిస్తున్న మరో వ్యక్తిని ప్రత్యేక ఆపరేషన్ టీమ్ రంగంలోకి దిగి కామారెడ్డి జిల్లా పిట్లం సమీపంలో పట్టుకుంది. కాగా, పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో సుమారు 1.02కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులిద్దరినీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగాా వ్యవహరించిన డీటీఎఫ్ సీఐ దుబ్బాక శంకర్‌తోపాటు ఎస్సైలు సతీశ్, శ్రీనివాసరెడ్డి,హన్మంత్, కానిస్టేబుల్లను ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్్రెడ్డి, మెదక్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎకై ్సజ్ సూపరిండెంట్ ఎస్.నవీన్‌చంద్ర అభినందించారు. -
మా బతుకుల్ని రోడ్డు పాలు చేయొద్దు
సిద్దిపేటరూరల్: జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు తీసుకుని మమ్మల్ని రోడ్డున పడేయొద్దని చిన్నగుండవెల్లి రైతులు అధికారులను వేడుకున్నారు. బుధవారం మండల పరిధిలోని చిన్నగుండవెల్లి గుండా నిర్మించనున్న జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధింయి ఎమ్మార్వో వెంకట్‌రెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు జాతీయ రహదారి కోసం అధికారులు చేస్తున్న సర్వే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న చిన్నగుండవెళ్లి గ్రామ భూములు విలువ ఎకరానికి రూ.కోటికి పైగా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి మంజూరు చేసి రైతుల భూములు లాక్కుంటుందని వారు ఆరోపించారు. గ్రామం చుట్టూ ఇప్పటికే అండర్‌గ్రౌండ్ టన్నెల్, ఓపెన్ కాలువల పేరుతో సగం భూమిని కోల్పోయామని వారు వాపోయారు. మళ్లీ ఇప్పుడు ఉన్న భూమిని కూడా జాతీయ రహదారి పేరిట లాక్కుంటే తమ జీవితాలు రోడ్డున పడతాయన్నారు. అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గ్రామసభలు ద్వారా చర్చించకుండా వారికి నచ్చిన విధంగా సర్వే చేయడం సరికాదన్నారు. విలువైన భూముల్లో పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు మా భూములు తీసుకుంటున్న క్రమంలో తమకు ఎకరానికి రెండు ఎకరాల చొప్పున భూములు అందించి ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. చిన్నగుండవెల్లి రైతులు వేడుకోలు -
పకడ్బందీ వ్యూహం
పక్కా ప్రణాళిక..● కలిసొచ్చిన బీజేపీ క్యాడర్ ● ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయానికి కారణాలివే.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పక్కా ప్రణాళిక.. పకడ్బందీ వ్యూహం. ఇవి శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలుపు తీరాలకు చేర్చాయి. ఉమ్మడి కరీంనగర్–మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామచంద్రాపురానికి చెందిన చిన్నమైల్ అంజిరెడ్డి విజయానికి ఈ రెండు కారణాలని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రసన్న కూడా గట్టి పోటీని ఇచ్చారు. ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీగా మండలి పోరు సాగింది. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపు తేల్చలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. అండగా నిలిచిన కమలం క్యాడర్ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి క్యాడర్ ఉంది. ఉమ్మడి మెదక్‌తో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంతో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎంపీలుగా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం విదితమే. అలాగే ఆయా జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలుగా కూడా ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఈ ఎన్నికలను ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్, బండిసంజయ్, గొడాం నగేష్‌లకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలా ఆయా ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి పట్టు అంజిరెడ్డిని గెలుపు తీరాలకు చేర్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ అనుబంధ సంఘాలు కీలకం బీజేపీ అనుబంధ సంఘాలు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీనే కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు పట్టభద్రుల స్థానాన్ని కూడా కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపులో ఆ పార్టీ క్యాడర్‌తో పాటు, దాని అనుబంధ సంస్థల కృషి ఎంతగానో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరు పకడ్బందీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని రాజకీయ నిఫుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఎన్నికల నగారా మోగక ముందు నుంచే అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పట్టభద్రులను పెద్ద ఎత్తున ఓటర్లు నమోదు చేయించారు. ఇలా ఓటరు నమోదు చేయించడం ఆయనకు కొంత కలిసొచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి.. పారిశ్రామిక వేత్త అయిన డా.చిన్నమైల్ అంజిరెడ్డి 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పటాన్చెరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎస్ఆర్.ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంజిరెడ్డి సతీమణి గోదావరి బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం విదితమే. సామాజిక సేవ.. 2002 ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ స్థాపన. పెద్ద ఎత్తున తాగునీరు, మినరల్ వాటర్, విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్‌షిప్‌లతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాల నిర్వహణ.అంజిరెడ్డి బయోడేటా.. పేరు: డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి పుట్టిన తేదీ: 18.06.1966 తల్లిదండ్రులు : సి.రాజిరెడ్డి, ల క్ష్మీనరసమ్మ భార్యపేరు: సి.గోదావరి (బీజేపీ జిల్లా అధ్యక్షురాలు) సంతానం : అనీష్‌రెడ్డి, ఆశ్విత రెడ్డి స్వస్థలం : రామచంద్రాపురంరాజకీయ ప్రస్థానం ఇలా.. 2009లో ప్రజారాజ్యంలో చేరిక. వైఎస్సాసీపీలో పనిచేశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ టిక్కెట్‌ను ఆశించి భంగపడ్డారు. మండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలియక గతంలో విద్యార్థులు కొంత ఇబ్బందులకు గురయ్యే వారు కానీ ప్రస్తుతం హాల్‌టికెట్ వెనుక ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సెంటర్ లొకేషన్ రావడంతో విద్యార్థులు నేరుగా ఉదయం 8 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. గతంలో నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు కొంత ఇబ్బందులు పడేవారు కానీ గత పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం 5 నిమిషాల అదనపు సమయం ఇవ్వడంతో విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. 8 గంటలనుంచే లోపలికి... పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించారు. పరీక్షల్లో భాగంగా బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 18,852 మంది విద్యార్థులకు గానూ 18,296 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 17,907 మంది విద్యార్థులకు గానూ 17,415 మంది విద్యార్థులు హాజరు కాగా 492 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 945 మంది విద్యార్థులకు 881 మంది విద్యార్థులు హాజరు కాగా 64 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో 97.5 హాజరు శాతం నమోదైంది. ఇదిలా ఉండగా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర కళాశాల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి 02, డీఈసీ సభ్యులు 04, హెచ్పీసీ సభ్యులు 04, ఫ్లయింగ్ స్క్వాడ్ 12, సిట్టింగ్ స్క్వాడ్ 08 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. నేటి నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేటి నుంచి ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగా గురువారం విద్యార్థులకు ద్వితీయ భాష పరీక్ష జరగనుంది. విద్యార్థులు ఉదయం 8 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, చేతికి సైతం ఎలాంటి వాచీలను కూడా ధరించరాదని సూచించారు. -
సీఎంకు సమస్యను వివరిస్తాం
ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ రాజయ్య జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు 29వ రోజుకు చేరాయి. బుధవారం నిరసనలో భాగంగా ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ రాజయ్య నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన ప్రజలతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు రద్దు చేయాలని సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో చేస్తున్నామని రాంకీ సంస్థ అబద్ధాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తుందన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యలు వివరిస్తామన్నారు. అప్పటికీ సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని తెలిపారు. డంపింగ్‌యార్డ్ ఏర్పాట్లు విరమించే వరకు ప్రజల పక్షాన సీపీఎం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. వర్క్‌లోడ్ ఇప్పించాలికేంద్రమంత్రి బండి సంజయ్‌కు బీఎంఎస్ నేతల విజ్ఞప్తి కంది(సంగారెడ్డి): కంది మండలంలోని ఎద్దు మైలారం ఆయుధ కర్మాగారం(ఓడియఫ్)కు వర్క్ లోడ్ ఇప్పించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ బీఎంఎస్, ఓఎఫ్‌ఎంఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరయ్య,ప్రభు,నాయకులు బల నర్సయ్య, వెంకట్ రెడ్డి తదితరులున్నారు. చెడ్డీగ్యాంగ్ దొంగల సంచారంజహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలో దొంగతనం చేసేందుకు చెడ్డీగ్యాంగ్ దొంగలు సంచరించడం పట్టణ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. సోమవారం రాత్రి రెండుగంటల సమయంలో సాయినగర్ కాలనీలో చెడ్డీగ్యాంగ్ మారణాయుధాలతో సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డైంది. సాయినగర్ కాలనీలో మెడికల్ అసోసియేషన్ భవనానికి తాళం వేసి ఉండటంతో భవనం వద్దకు నలుగురు చెడ్డీ గ్యాంగ్ దొంగలు చేరుకున్నారు. ఇద్దరు చెడ్డీలపై ఉండి, ముఖాలకు ముసుగువేసుకున్నారు. దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కుక్కలు మొరగడంతో ఎదురింట్లో నివాసం ఉండే వ్యక్తి పైకి ఎక్కి పరిశీలించాడు. దొంగలు వచ్చిన విషయాన్ని గమనించి గట్టిగా కేకవేసి దొంగలకు కనిపించకుండా దాక్కున్నాడు. దీంతో దొంగలు తమరిని ఎవరో చూశారనే కంగారుతో భవనం తాళం పగులగొట్టకుండానే వెనుదిరిది వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్.ఐ కాశీనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పోలీసు పెట్రోలింగ్ సక్రమంగా లేకపోవడం వల్లే దొంగలు సంచరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనాల కోసం ఉద్యమం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు జహీరాబాద్ టౌన్: కార్మికులకు కనీస వేతనం రూ.26 వేల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పేర్కొన్నారు. పట్టణ సమీపంలోని మహీంద్ర అండ్ మహీంద్ర ట్రాక్టర్ ప్లాంట్‌లో బుధవారం కార్మికులు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత 15 ఏళ్ల నుంచి కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని అనేకమార్లు వినతి పత్రాలు సమర్పించి నిరసన కార్యక్రమాలు చేపట్టినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
గీతా స్కూల్‌కు జాతీయ స్థాయి అవార్డు
పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయులుకు గౌరవ డాక్టరేట్తూప్రాన్: విద్యా వ్యవస్థలో 31 ఏళ్లుగా విద్యాసంస్థ అందిస్తున్న సేవలకు పట్టణంలోని గీతా స్కూల్‌కి జాతీయ స్థాయి అవార్డు లభించినట్లు పాఠశాల కరస్పాండెంట్ పిన్నక రామాంజనేయులు పేర్కొన్నారు. డబ్ల్యూసీఈపీసీ సంస్థ బుధవారం ఢిల్లీ తీన్ మూర్తి భవన్‌లోని ప్రధాన మంత్రి సంగ్రహాలయంలో ఈ అవార్డును అందజేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ, నాణ్యమైన విద్య, ప్రతీ సంవత్సరం 120 మంది విద్యార్థులకు తగ్గకుండా ఉచిత విద్యాబోధన, 2016లో దేశవ్యాప్తంగా మంజూరైన ఆరు ఏటీఎల్ ల్యాబ్‌లలో దక్షిణ భారత దేశంలో మొదటిగా పొందిన విద్యాసంస్థగా గుర్తింపు పొందడంతో వీటిని పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డును అందజేసినట్లు పేర్కొన్నారు. అలాగే విద్యావ్యవస్థలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు రామాంజనేయులును సంస్థ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్పర్సన్ పీ.ఉష, డైరెక్టర్లు బీ.రాఘవేంద్ర గౌడ్, నారాయణ గుప్త, ప్రిన్సిపాల్ సీహెచ్.వెంకటకృష్ణరావు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
మతి స్థిమితంలేని యువతిపై అత్యాచారం
● మద్యం మత్తులో దాష్ఠీకానికి ఒడిగట్టిన యువకుడు ● అందోల్ మండలంలో వెలుగులోకి..వట్పల్లి(అందోల్): మతి స్థిమితం సరిగ్గాలేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా అందోల మండల పరిధిలోని నేరడిగుంట గ్రామంలో నాలుగు రోజుల ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన యువతి(24)కి చిన్ననాటి నుంచి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కుటుంబీకులు ఆమెకు పెళ్లి చేయలేదు. యువతి ప్రతిరోజూ గ్రామంలో ఉదయం నుంచి రాత్రి వరకు అటు ఇటూ తిరిగి ఇంటికి చేరుకునేది. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన మన్నె శంకర్ అనే యువకుడు మద్యం మత్తులో ఆ యువతిని పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై యువతి తల్లి నాగమణి మంగళవారం జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయగా, సీఐ అనిల్‌కుమార్ బుధవారం నేరడిగుంట గ్రామానికి చేరుకొని ఘటనపై విచారణ జరిపారు. బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
● రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందుతున్న జక్కాపూర్ పాఠశాల ● వార్షికోత్సవ వేడుకల్లో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి సిద్దిపేటరూరల్: జక్కాపూర్ ఉన్నత పాఠశాల రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను బుధవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, దానికోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు షౌకత్‌అలీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ బృందం సమిష్టిగా పనిచేస్తూ పదవ తరగతిలో ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 13 మంది విద్యార్థులు ఉపకార వేతనానికి అర్హత సాధించారని, అదే విధంగా గణిత, సైన్స్ ఫోరమ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించే టాలెంట్ టెస్టుల్లో కూడా పాఠశాల విద్యార్థులు ప్రతిభ సాధిస్తున్నారన్నారు. అనంతరం సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రామస్వామి, ఎంఈఓ గౌరిమోహన్, కాంప్లెక్స్ ప్రిన్సిపాల్ శోభారాణి పాల్గొన్నారు. సైన్స్ అంటేనే వాస్తవికతకు నిదర్శనం దుబ్బాకటౌన్: సైన్స్ అంటేనే వాస్తవికతకు నిదర్శనమని, ఎల్లప్పుడూ మన జీవితంలో శాసీ్త్రయ దృక్పథంతో ఆలోచించి మూఢ నమ్మకాలను విడనాడి వాస్తవాలను మాత్రమే ఆచరించాలని జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు చేసిన ప్రయోగ నమూనాలను పరిశీలించి అవి పని చేసే తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు సాదత్ అలీ, ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు అంజిరెడ్డి పాల్గొన్నారు. -
నిధుల్లేక నిలిచిపోయాయి
హత్నూర (సంగారెడ్డి): గ్రామీణ ప్రాంత ప్రజల అనారోగ్య సమస్యలపై వైద్యం అందించేందుకు ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు (హెల్త్ సబ్ సెంటర్లు) నిధుల లేమితో కునారిల్లుతు న్నాయి. భవన నిర్మాణాలకు గత ప్రభుత్వం నిధులిచ్చినా అవి చాలక అసంపూర్తిగా మిగిలిపోయాయి. జిల్లాలో మంజూరైన ఆరోగ్య ఉపకేంద్రాల్లో కేవలం ఎనిమిది సెంటర్లకు మాత్రమే భవననిర్మాణ పనులు పూర్తికాగా మిగిలిన వాటికి నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షలు చొప్పున జిల్లాలో గత ప్రభుత్వం 124 హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణాల కోసం ఒక్కొక్క దానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఇందులో 25 ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. రూ.20 లక్షలతో పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తికాదని కాంట్రాక్టర్లు మొండికేసి పనులను నిలిపివేశారు. హత్నూర మండలంలోని పలు గ్రామాలకు మంజూరైన 8 ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ల భవనాల నిర్మాణాల్లో కొన్నింటికి మాత్రమే టెండర్లు పిలువగా కొంతమేర పనులు జరిగాయి. కొన్ని భవన నిర్మాణాలకు కనీసం పనులు కూడా ప్రారంభించలేకపోవడంతో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఈ ప్రభుత్వం విడుదల చేస్తుందా లేదోనని ఆందోళన మొదలైంది. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన హత్నూరలో భవన నిర్మాణం ప్రారంభించినప్పటికీ నేటికీ పనులు పూర్తి కాలేకపోయాయి. హత్నూర ఐటీఐ కాలనీకి మంజూరైన భవన నిర్మాణం పనులు కనీసం ప్రారంభించలేదు. మండలంలోని చింతల్చెరు,బోరపట్ల, దౌల్తాబాద్, సిరిపుర, గ్రామాలకు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవనాలను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి భవన నిర్మాణాలను పూర్తి చేసి గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలకు వైద్యం అందించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రెండేళ్లు కావొస్తున్నా పూర్తికాని హెల్త్ సబ్ సెంటర్ల భవనాలు జిల్లాలో 124 నిర్మాణాలు ప్రారంభం పూర్తయిన భవనాలు 25 మాత్రమే -
మా అమ్మ మృతికి తమ్ముడే కారణం?
మృతురాలి కుమార్తె పోలీసులకు ఫిర్యాదుతూప్రాన్: మా అమ్మ మృతికి తమ్ముడే కారణమని, ఓ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఎస్ఐ శివానందం కథనం మేరకు.. మండలంలోని గుండ్రెడ్డిపల్లికి చెందిన చింతల పోచమ్మ(74)కు కుమారుడు రాజు, కూతురు నాగరాణి ఉన్నారు. రాజు భార్యతో కాలంగా రంగారెడ్డి జిల్లా సురారంలో నివాసం ఉంటున్నాడు. కూతురికి సిద్దిపేట జిల్లా మామిడాల వ్యక్తితో వివాహం జరిపించారు. పోచమ్మ గ్రామంలో ఒంటరిగా నివసిస్తూ కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతుంది. రాజు గతనెల 21న గ్రామానికి వచ్చి తల్లితో నిత్యం కుటుంబ విషయంలో గొడవపడుతున్నాడు. ఈనెల 4న ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పోచమ్మ మృతి చెందింది. తన తల్లి మృతికి తమ్ముడు రాజు కారణమని నాగరాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
అందరికీ సమాన హక్కులు
న్యాయమూర్తి స్వాతిరెడ్డి సిద్దిపేటకమాన్: రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ద్వారా అందరికీ సమాన హక్కులు ఉన్నాయని న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బుధవారం లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆడపిల్లలు, మగపిల్లల మధ్య వ్యత్యాసం చూపకూడదన్నారు. ఎవరైనా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తే తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యానికి చెప్పాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్‌లో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా లీగల్ సర్వీసెస్ అథారిటీ లేదా 15100కు ఫోన్ చేయాలని తెలిపారు. సిద్దిపేట కోర్టు భవనంలో కోర్టు మహిళా సిబ్బంది, మహిళ న్యాయవాదులకు ఫుడ్ కాంపిటీషన్ నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు మిలింద్కాంబ్లీ, తరణి, తదితరులు పాల్గొన్నారు. పంటలకు నీరందించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి కొమురవెల్లి(సిద్దిపేట): ప్రభుత్వం తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నింపి ఈ ప్రాంతంలో ఉన్న యాసంగి పంటలకు నీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలకు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం కార్యకర్తలతో కలసి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వేణుగోపాల్ రావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీసీఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి, దాసరి ప్రశాంత్, తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం, బక్కెల్లి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు. గడ్డి మోపులు దగ్ధం కొల్చారం(నర్సాపూర్): మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం గడ్డిమోపులను లోడ్ చేసుకొని వెళ్తున్న డీసీఎం వ్యాన్‌కు విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన వ్యాన్ డ్రైవర్ సమీపంలోని నీటి కాల్వలోకి వ్యాన్ తీసుకెళ్లి మోపులను కూలీల సహాయంతో తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే గడ్డి మోపులు దగ్ధమయ్యాయి. దొంగతనం కేసులో జైలు శిక్ష మిరుదొడ్డి(దుబ్బాక): లోక్ అదాలత్‌లో దొంగకు జైలు శిక్ష పడినట్లు మిరుదొడ్డి ఎస్ఐ బోయిని పరశురాములు తెలిపారు. బుధవా రం ఆయన కథనం మేరకు.. మిరుదొడ్డి పీఎస్ పరిధిలోని అక్బర్పేట–భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన కొంపల్లి భాను ప్రకాశ్‌పై 2024 ఏప్రిల్ 23న దొంగతనం కేసు నమోదైంది. ఈ కేసుపై లోక్ అదాలత్‌లో భాగంగా దుబ్బాక మెజిస్ట్రీట్ కోర్టులో విచారణ జరిగిందని తెలిపారు. కేసు విచారణ అనంతరం భాను ప్రకాశ్‌కు 35 రోజుల జైలు శిక్షతోపాటు, రూ. వెయ్యి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. -
సీ్త్రల అక్షరాస్యత పెరిగింది
మేము బేటీ బచావో బేటీ పడావో అనే అంశం పై పరిశోధన చేశాం. బాలికల విద్యను ప్రోత్సహించడానికి, లింగ అసమానతలు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. పది ఏళ్ల కాలంలో ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని మా పరిశోధన ద్వారా తెలుసుకున్నాం. విద్యతోనే అన్ని సమస్యలకు పరిష్కారం. దీని ద్వారా సీ్త్రల అక్షరాస్యత పెరిగి, భ్రూణ హత్యలు తగ్గాయి. – దుండ్ర హర్షవర్ధిని, బీఏ, ద్వితీయ సంవత్సరం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుస్నాబాద్ ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ జిజ్ఞాస అనే ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రతీ సంవత్సరం విద్యార్థులం అందరం వివిధ ప్రాజెక్టులు రూపొందిస్తాం. అజోల్ల పెంపకం సులవైన విధానం. రైతులు వారి పొలాల్లో సులువుగా పెంచుకోవచ్చు. అజోల్ల అనేది ఒక చౌకై న బయో ఫర్టిలైజర్. దీని వాడకం ద్వారా నేల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. తక్కువ ఖర్చుతో రైతులు అధిక దిగుబడి పొందవచ్చు. రసాయన ఎరువులు వాడనవసరం లేదు. – విష్ణువర్ధన్, బీఎస్సీ, ద్వితీయ సంవత్సరం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుస్నాబాద్ రైతులకు ఉపకరిస్తుంది జీవ ఎరువు అజోల్ల వాడకం వల్ల నేత ఉత్పాదకత పెరుగుతుంది. అజోల్ల పెంప కం అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇది రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చని విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. మా విద్యార్ధుల పరిశోధన రైతులకు ఉపకరిస్తుంది. విద్యార్థులను పరిశోధనల వైపు మళ్లించేందుకు ప్రోత్సహిస్తున్నాం. ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. – డాక్టర్ బాలరాజు, వృక్షశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుస్నాబాద్ -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
చిన్నకోడూరు(సిద్దిపేట): చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చౌడారంలో బుధవారం వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కడారి లింగం(50)కు భార్య పద్మ, కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. లింగం భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం పని లేకపోవండతో ఎల్లమ్మజాలు శివారులోని చెరువుకు చేపలు పట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం చెరువు గట్టు వద్ద చెప్పులు, గాలం వైరు ఉన్నాయి. గాలం వైరు లాగడంతో లింగం మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరకొని పరిశీలించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి చేగుంట(తూప్రాన్): రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బుధవారం మాసాయిపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కామారెడ్డి రైల్వే హెడ్ కానిస్టేబుల్ రవి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కామారెడ్డి రైల్వే ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. సంబంధీ కులు ఎవరైనా ఉంటే కామారెడ్డి రైల్వే పోలీస్‌లను సంప్రదించాలని తెలిపారు. బావిలో పడి రైతు మద్దూరు(హుస్నాబాద్): ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బైరాన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భూషణమైన సాయిలు(71) వ్యవసాయ బావిలోని మోటార్ పంపు పాడైపోవడంతో బావిలోకి దిగి మోటార్ పంపును సరి చేశాడు. అనంతరం పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయి మృతి చెందాడు. -
చెరువులో దూకి ఆత్మహత్య
కౌడిపల్లి(నర్సాపూర్): చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని శేరితండా పంచాయతీ వసురాంతండాలో చోటు చేసుకుంది. బుధవారం ఎస్ఐ రంజిత్‌రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరితండా పంచాయతీ వసురాం తండాకు చెందిన లంబాడీ శ్రీనివాస్(32)కి భార్య అనిత, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ ఏ పని చేయకుండా మద్యానికి బానిసై రోజు భార్యతో గొడవపడేవాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి రావడంతో రోజు మద్యం తాగితే ఆడపిల్లల పరిస్థితి ఏంటని భార్య ప్రశ్నించింది. దీంతో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయి తండా సమీపంలోని కన్నారం చెరువులో దూకాడు. గ్రామ స్తులు, కుటుంబీకులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గదరాజు చందుకు కేసీఆర్ అభినందనలు
చేర్యాల(సిద్దిపేట): ఇటీవల డాక్టరేట్ పట్టా పొందిన మండలంలోని కడవేర్గు గ్రామానికి చెందిన గదరాజు చందును మాజీ సీఎం కేసీఆర్ అభినందించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి కేసీఆర్‌ను కలిశారు. చందు ఇటీవల ఓయూ ప్రొఫెసర్ ఎం.గోనానాయక్ పర్యవేక్షణలో రాష్ట్రంలో దొమ్మర కులస్తుల సంస్కృతీ, సాహిత్య పరిశీలన అంశంపై పరిశోధన చేసి పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని కేసీఆర్‌కు అందజేసి పరిశోధన విషయాలన్నీ వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ తెలంగాణ ఆదిహిందూ జాతికులాల సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డలపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంత బిడ్డగా అరుదైన పరిశోధన జరిపిన చందును అభినందించారు. ఆయన వెంట రాళ్లబండి చందు, బొంగురం జితేందర్‌రెడ్డి ఉన్నారు. -
కొత్త ఆలోచనలు.. నూతన ఆవిష్కరణలు
● పరిశోధనల వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులు ● రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపికై న ప్రాజెక్టులు ● హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభహుస్నాబాద్: కళాశాల స్థాయి నుంచి విద్యార్థులు పరిశోధనల వైపు అడుగులు వేస్తున్నారు. వినూత్న ఆలోచనలకు తగ్గట్లుగా కొత్త ఆవిష్కరణలకు పదును పెడుతున్నారు. కళాశాల అధ్యాపకులు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేలా ప్రోత్సహిస్తూ, శాసీ్త్రయ ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచుతున్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రూపొందించిన రెండు ప్రాజెక్టులు జిజ్ఞాస స్టేట్ లెవల్ స్టడీ ప్రాజెక్టుకు ఎంపికయ్యాయి. వృక్షశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ పర్శనేని బాలరాజు ఆధ్వర్యంలో నేత ఉత్పాదకతను పెంచడంలో జీవ ఎరువు అజోల్ల వాడకం అనే అంశం. అలాగే రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు గుగులోతు విజయ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో అనే అంశంపై చేసిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపికయ్యాయి. నేల సారాన్ని పెంచడానికి రసాయనాల ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవ ఎరువు వాడకం పైన పరిశోధనలు చేశారు. అలాగే లింగ వివక్షతను తొలగించి ఆడపిల్లలకు ఉన్నత చదువులు అందించాలనే ఆడపిల్లల ప్రాముఖ్యతను తెలియజేస్తూ సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేస్తున్నారు. అజోల్ల జీవ ఎరువు వరి సాగు చేసే పంట పొలాలకు నేలను సారవంతం చేసి ఎంతో దిగుబడి పొందడానికి అజోల్ల మొక్క ఉపయోగపడుతుంది. చేపల దానగా, పౌల్ట్రీ ఫామ్‌ల్లో కోళ్లకు దానగా ఉపయోగపడుతుంది. టూ బై సిక్స్ ఫీట్ గుంతలో సారవంతమైన మట్టిని పొరగా పొందుపర్చాలి. సగం వరకు నీటితో నింపి అజోల్ల విత్తనాన్ని ప్రవేశపెట్టాలి. మూడు నుంచి నాలుగు వారాల సమయంలో అజోల్ల పెరుగుతుంది. దీనిని పచ్చిరొట్టగా పొలంలో వేసి దున్నుతారు. అజోల్ల జీవ ఎరువుగా పని చేస్తుంది. ఇక హెక్టార్ భూమిలో అజోల్లాను జీవ ఎరువుగా వాడినప్పుడు సుమారుగా 25 కేజీల నత్రజని మొక్కలకు అందుతుంది. దీంతో రసాయన ఎరువులు వాడనవసరం లేదు. పాజెక్టులో బీజెడ్సీ విద్యార్థులు జ్యోతి, సంగీత, అంకిత, విష్ణువర్ధన్, యామిని పాల్గొన్నారు. ఆడపిల్లల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంచాలి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాలికలను రక్షించడం కోసం రూపొందించిన బేటీ బచావో బేటీ పడావో సత్ఫలితాలు ఇచ్చిందని విద్యార్థులు తమ పరిశోధనల్లో తేలిందని చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సీ్త్ర విద్య పెరగడానికి తోడ్పడుతుంది. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ 2015లో ప్రారంభించారు. లింగ వివక్షతను తొలగించి ఆడపిల్లలకు ఉన్నత విద్యను అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల్లో, ప్రజల్లో ఆడపిల్లల ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మరక్షణకు చర్యలు తీసుకుంటూ వారికి స్వీయ శిక్షణను అందించాలి. ఆడపిల్లల స్వేచ్చా స్వతంత్రాలను కాపాడే విధంగా ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాజెక్టు తయారీలో హర్షవర్ధిని, మానస, శ్రీవాణి, సమీనా, రషీద, నిక్షిప్త పాల్గొన్నారు. -
ఉపాధిహామీ.. సౌకర్యాలు లేవేమి
కంది(సంగారెడ్డి): వలసలను నివారించేందుకు ఏర్పాటైన ఉపాధి హామీపథకంలో పని చేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని ప్రదేశంలో కూలీలకు నిలువనీడ కల్పించడంతోపాటు తాగు నీరు, ప్రథమ చికిత్స కిట్లు అందజేయాల్సి ఉన్నా అవి అమలుకు నోచు కోవడంలేదు. దీంతో కూలీలు ఎండలో అవస్థలు పడుతున్నారు. వేసవిలో కూలీలకు పని ప్రదేశంలో సేద తీరేందుకు నీడ కల్పించాల్సి ఉండగా, ఏ గ్రామంలోనూ ఈ ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో అక్కడక్కడా ఉన్న చెట్ల కిందే కూలీలు సేద తీరుతున్నారు. చెట్లు లేనిచోట ఎండలోనే కూర్చుని సేద తీర్చుకుంటున్నారు. ఇక పని ప్రదేశాల్లో కూలీలు గాయపడితే వారికి ప్రథమచికిత్స చేసేందుకు మెడికల్ కిట్లను గతంలో అందుబాటులో ఉంచే వారు. ప్రస్తుతం వాటి జాడ కూడా లేదు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం రైతుల పొలాల్లో పాండ్లు, కందకాల తవ్వకాలు కొనసాగుతున్నాయి. మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో సుమారు మూడు వేల మంది ఉపాధి కూలీలున్నారు. చాలా రోజుల నుంచి పనిముట్లు కూడ ఇవ్వడం లేదని కూలీలు చెబుతున్నారు. అధికారులు స్పందించి ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు. పంచాయతీలే సమకూర్చాలి కూలీలకు పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు అందించడం వంటి సౌకర్యాలను గ్రామపంచాయతీలే కల్పించాలి. గతమూడేళ్ల నుంచి పనిముట్లు రాలేదు. కూలీలకు పనిముట్ల డబ్బులు అదనంగా వస్తాయి. గ్రామపంచాయతీల సహకారంతో సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాం. –గురుపాదం, ఏపీవో, కంది. పని ప్రదేశంలో కానరాని కనీస సౌకర్యాలు ఎండలో ఇబ్బంది పడుతున్న కూలీలు -
ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి
సంగారెడ్డి జోన్: జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా మార్కింగ్ చేసి ఇవ్వాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 1,36,821మంది అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్ డబ్బుల బ్యాలన్స్ త్వరగా వసూలు చేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని గ్రామాలలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఉపాధిహామీ పథకం ఆధ్వర్యంలో గ్రామాలలో ప్రతీరోజు కనీసం 60 మందికి కొత్త పనులు ఉపాధి కల్పించేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జెడ్పీసీఈవో జానకీరెడ్డి, డీపీవో సాయిబాబా, పీడీ హౌజింగ్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులతో సమీక్ష -
సమాజసేవే లక్ష్యంగా పనిచేయాలి
సదాశివపేట(సంగారెడ్డి): విద్య, వైద్యం, పర్యావరణం వంటి అంశాలలో సమాజసేవే లక్ష్యంగా రోటరీ క్లబ్‌లు పనిచేయాలని రోటరీ క్లబ్‌ల డిస్ట్రిక్ గవర్నర్ శరత్‌చంద్రచౌదరి పేర్కొన్నారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో రూ. 3లక్షలతో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నూతన తరగతి గదుల నిర్మాణానికి సుమారు రూ.50 లక్షలతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మిస్తామన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక.. అనంతరం సదాశివపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా ప్రభు, ప్రధాన కార్యదర్శిగా అశోక్‌కుమార్, జాయింట్ సెక్రటరీగా ప్రవీణ్‌కుమార్, మెంబర్షిప్ చైర్మన్‌గా చీలమల్లన్న ఎన్నికయ్యారు. ఫౌండేషన్ చైర్మన్‌గా డి.వినోద్‌కుమార్, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా డా.చంద్రశేఖర్, సభ్యులుగా రాజాకుమారి, పురం రజనీ, శరత్చంద్ర, అన్నపూర్ణ, రాజు,నరేందర్, నాగరాజు, డాక్టర్ మాలతీలత, రామకృష్ణ, కృపాకర్, రామకృష్ణారెడ్డి, రాచన్నలు ఎన్నికై ప్రమాణస్వీకారం చేశారు. రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక డిస్ట్రిక్ గవర్నర్ శరత్‌చంద్రచౌదరి -
కుటుంబాన్నే మట్టుబెట్టలనే..
రామచంద్రాపురం(పటాన్చెరు): ఆస్తి కోసం కన్న తల్లినే కిరాతకంగా హత్య చేసి అమ్మబంధాన్నే ప్రశ్నార్థకం చేశాడో తనయుడు. ఆస్తి పంచివ్వడంలేదని కక్ష పెంచుకుని కుటుంబ సభ్యులనే హతమార్చేందుకు కుట్రపన్నాడు సదరు ప్రబుద్ధుడు. డబ్బు వ్యామోహం, మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ సైతం కోల్పోయి కొడుకు బంధానికే మచ్చతెచ్చాడు కార్తీక్‌రెడ్డి. ఈ కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. తల్లిని హత్య చేసిన కార్తీక్‌రెడ్డిని పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారించగా పలు విషయాలు వెల్లడయ్యాయి. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక్‌రెడ్డి ఏడాదిన్నర కాలంగా తనకు రావాల్సిన ఆస్తి ఇవ్వాలని వ్యాపారం చేసుకుంటానని కుటుంబ సభ్యులతో నిత్యం గొడవపడుతుండేవాడు. మద్యానికి బానిసైన కార్తీక్‌రెడ్డి గోవా వెళ్లిన సమయంలో డ్రగ్స్ తీసుకునేవాడు. కుటుంబ సభ్యులు ఆస్తిని పంచడం లేదని వారిపై కక్ష పెంచుకున్నాడు. నెల రోజుల కిందట ఆన్లైన్లో 5 కత్తులను కొనుగోలు చేసి తన గదిలో భద్రపరుచుకున్నాడు. కొద్దిరోజులకు తనకు రావాల్సిన ఆస్తిను ఇవ్వాలని కుటుంబ సభ్యులను కత్తితో బెదిరించాడు. ఆ సమయంలో పెద్దలతో పంచాయితీ పెట్టి నచ్చజెప్పారు. అప్పటి నుంచి కార్తీక్‌రెడ్డి అదును కోసం వేచి చూస్తూ ఉన్నాడు. ఆదివారం రాత్రి శేరిలింగంపల్లి గోపనపల్లిలో నివాసం ఉండే స్నేహితుడికి ఫోన్ చేసి మద్యం తాగుదామని పిలిచాడు. స్నేహితుడితో కలిసి బీర్లు తీసుకొని తెల్లాపూర్‌లోని జీబ్లాక్ వద్దకు వెళ్లి మద్యం సేవించారు. ఆ సమయంలో తనకు త్వరలో డబ్బులు వస్తున్నాయని ఏ వ్యాపారం చేస్తే బాగుటుందని స్నేహితుడిని సలహా అడిగాడు. హాస్టల్ వ్యాపారం బాగుంటుందని సలహా ఇచ్చాడు. అదే సమయంలో అతడి స్నేహితుడికి ఫోన్ రావడంతో వెళ్లిపోయాడు. మిగిలిన బీర్లను తీసుకుని కార్తీక్‌రెడ్డి ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న బీర్లతోపాటు ఇంట్లో తండ్రి తెచ్చుకుని పెట్టుకున్న మద్యం సైతం తాగాడు. తల్లి రాధిక, తండ్రి మల్లారెడ్డి కింద హాల్ పడుకోగా, కార్తీక్‌రెడ్డి తన గదిలోకి వెళ్లాడు. అన్న సందీప్ రెడ్డి దంపతులు మొదటి అంతస్తులో పడుకున్నారు. తెల్లవారుజాము 4.30గంటల సమయంలో తల్లి రాధిక నిద్ర నుంచి లేచి సోఫాలో కూర్చుంది. గదిలో నుంచి బయటకు వచ్చిన కార్తీక్‌రెడ్డి తల్లిపై కత్తితో దాడి చేశాడు. అది చూసిన తండ్రి మల్లారెడ్డి కత్తిని గుంజుకునే ప్రయత్నం చేయగా అతడిపై కూడా దాడి చేశాడు. కొడుకు చేతులోని కత్తిని గుంజుకుని మల్లారెడ్డి సెక్యూరిటీ వద్దకు పరుగులు తీశాడు. అదే సమయంలో గదిలో దాచుకున్న మరో కత్తిని తీసుకొని వచ్చి దాడి చేయబోయాడు. కత్తి పోట్లకు గురైన రాధిక ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డుపై పడిపోయింది. బయటకు వచ్చిన కార్తీక్‌రెడ్డి అమ్మను ఆసుపత్రి తీసుకొని పోదాం రమ్మంటూ కేకలు వేశాడు. అక్కడికి తండ్రి వస్తే అతడిపై కూడా దాడి చేయడానికి సిద్ధం కావడంతో తండ్రి రాలేదు. పై గదిలో నుంచి కిందకు వచ్చిన అన్న వదినలు ఇది పద్ధతి కాదంటూ చెప్పడంతో వదిన మీరు మధ్యలోకి రావొద్దు ఇది మా సమస్య అంటూ బెదిరించాడు. భయంతో సందీప్‌రెడ్డి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అక్కడి నుంచి కార్తీక్‌రెడ్డి పరారయ్యాడు. సోమవారం సాయంత్రం తెల్లాపూర్ మేళ్ల చెరువు వద్ద ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితుడి వద్ద నుంచి 5 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కార్తీక్‌రెడ్డిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆస్తి ఇవ్వడంలేదని కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్న కార్తీక్‌రెడ్డి ఆన్లైన్లో ఐదు కత్తులు కొనుగోలు హత్య కేసును 12 గంటలలో ఛేదించిన కొల్లూరు పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలింపు -
గప్‌చుప్‌గా పూడ్చివేత!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హత్నూర మండలంలో ఓ పౌల్ట్రీ ఫామ్‌లో రోజూ వందల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన కోళ్ల నమూనాలను సేకరించేందుకు పశుసంవర్థకశాఖ అధికారులు అక్కడికి వెళ్లేలోపే ఫామ్ యాజమాన్యం చనిపోయిన వాటిని గప్‌చుప్‌గా పూడ్చేసి.. ఫామ్ మొత్తాన్ని శుభ్రం చేసి పెట్టేశారు. దీంతో శాంపిళ్లు సేకరించకుండానే అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. ఇలా జిల్లాలో పలుచోట్ల ఉన్న ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతుంటే తమకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని పశుసంవర్థకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వ్యాపించకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. పశుసంవర్థకశాఖ అధికారులు తమ విధుల్లో భాగంగా వివిధ కోళ్ల ఫారాలను పరిశీలించేందుకు వెళ్తుంటారు. అయితే ఆ అధికారులు, సిబ్బంది తమ ఫారాలకు వస్తే ఏదైనా వైరస్ అంటుకుంటుందనే భయంతో అధికారులకు సమాచారం ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసాధారణ మరణాలుంటే.... కోళ్ల ఫారాల్లో అసాధారణ స్థాయిలో కోళ్ల మరణాలుంటే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే జిల్లాలో పలు కోళ్ల ఫారాలను ఆయా పౌల్ట్రీ కంపెనీలే ఎక్కువగా లీజుకు తీసుకున్నాయి. ఆయా కంపెనీలే కోడి పిల్లలను సరఫరా చేస్తున్నాయి. వాటికి అవసరమైన దాణా, మందులు సరఫరా చేస్తున్నాయి. వాటి పెరుగుదలపై ఆయా కంపెనీల ప్రతినిధులే పర్యవేక్షిస్తున్నారు. ఇలా కోళ్లను పెంచినందుకుగాను రైతుకు నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. అయితే కోళ్లు చనిపోయినప్పుడు రైతులు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనల మేరకే నడుచుకుంటున్నారని పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, చౌటకూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామంలోని కోళ్ల ఫారంలోనూ వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. అక్కడికి వెళ్లిన అధికారులు శాంపిళ్లను సేకరించి వీబీఆర్ఐ (వెటర్నరీ బయలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)కి పంపారు. వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యలు.. మండలానికి ఒకటి చొప్పున పశుసంవర్థశాఖ అధికారులు రెస్క్యూ టీంలను నియమించారు. సరిహద్దుల్లో కర్ణాటక, మహారాష్ట్రలనుంచి కోళ్లు తెలంగాణకు రాకుండా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కూడా చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఉన్న కోళ్ల ఫారాల యజమానులకు అవగాహన కూడా కల్పించారు. అసాధారణ స్థాయిలో మరణాలుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. కానీ చాలావరకు ఈ సమాచారం అధికారులకు చేరడం లేదు. కోళ్ల ఫారాన్ని పరిశీలిస్తున్న అధికారులు. చనిపోయిన కోళ్లను పూడ్చిపెడుతున్న దృశ్యం (ఫైల్) సమాచారం ఇవ్వడం లేదంటున్న అధికారులు చనిపోయిన వాటి నమూనాల సేకరణలో ఇబ్బందులు కచ్చితంగా సమాచారం ఇవ్వాలి నాలుగైదు శాతం కోళ్లు మరణించడం సాధారణమే. కానీ, పది నుంచి 20 శాతం కోళ్లు ఒక్కసారిగా మరణిస్తే తప్పకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అసాధారణ మరణాలుంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరినప్పటికీ కొన్ని ఫారాల యాజమాన్యాలు సమాచారం ఇవ్వడం లేదు. –డాక్టర్.హేమలత, పశుసంవర్థకశాఖ, హత్నూర మండలం -
‘సృజన’ రాష్ట్రస్థాయి పోటీలకు రెండు ప్రాజెక్టులు
జహీరాబాద్: జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన సృజన జిల్లా స్థాయి ‘టెక్ ఫెస్ట్’లో రెండు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. జిల్లాలోని జహీరాబాద్, చేగుంట, జోగిపేట, గజ్వేల్, నర్సాపూర్లలోని పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ఆటోమొబైల్ అంశంపై టెక్ ఫెస్ట్ నిర్వహించారు. ప్రతీ కళాశాల నుంచి ఒక్కో అంశాన్ని ఎంపిక చేసి ప్రదర్శించారు. చేగుంట కళాశాలకు చెందిన విద్యార్థులు సోలార్ పవర్డ్–స్మార్ట్ బ్లూటూత్ ఆపరేటెడ్ మల్టీ పర్పస్ అగ్రికల్చర్ యంత్రాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు ప్రథమ బహుమతి లభించింది. దీన్ని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. సోలార్‌తో నడుస్తూ దున్నడం, విత్తనాలు వేయడం, భూమిని చదును చేయడంతోపాటు రసాయన మందులను పిచికారీ చేయడం వంటి పనులను ఏకకాలంలో చేసే విధంగా రూపొందించారు. ఈ యంత్రంతో ఏ పని అవసరముంటే దాన్ని చేసుకునే విధంగా తయారు చేశారు. పూర్తిగా సౌరశక్తితో పనిచేసే ఈ యంత్రం వర్షాకాలంలో బ్యాటరీ సహాయంతో కూడా నడిచే విధంగా రూపొందించారు. దీంతో ఎలాంటి కాలుష్యం వెలువడదు. గైడ్ శోభ పర్యవేక్షణలో విద్యార్థులు ఎం.డి.ఫౌజన్, మనోజ్వర్ధన్, తాత్విక్, హేమంత్, నిఖిల్‌లు ప్రాజెక్టును రూపొందించారు. ఫైర్ ఫైటర్ రోబోట్... అగ్నిప్రమాదంలో మంటలు అదుపుచేసేందుకు వీలుగా రిమోట్ సహాయంతో పనిచేసే ఫైర్ ఇంజన్‌ను గజ్వేల్‌లోని జీఎంఆర్‌పీ కళాశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ప్రదర్శించారు. ఈ ప్రాజెక్టుకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ ప్రాజెక్టును కూడా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. మనిషి అవసరం లేకుండానే రిమోట్ సహాయంతో 360 డిగ్రీ ఫైర్ ఫైటర్ రోబో వాహనాన్ని దట్టమైన పొగలోకి పంపించి నీటిద్వారా అగ్నికీలల్ని అదుపు చేస్తుంది. దీపికారెడ్డి, నళిని గైడ్‌గా వ్యవహరించిన ఈ ప్రాజెక్టును విద్యార్థులు సూర్యప్రకాష్, అనిల్, అవినాష్, సంజయ్, నాగరాజు, జగదీష్ రూపొందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సువర్ణలతతోపాటు జీవీ రమేశ్‌కుమార్, చైతన్య, నర్సింహకుమార్, మధుకిరణ్, రాంరెడ్డిలు పాల్గొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లోఐదు ప్రాజెక్టులు ప్రదర్శన మల్టీపర్పస్ అగ్రికల్చర్ మెషీన్‌కు ప్రథమ బహుమతి ఫైర్ ఫైటర్ రోబోట్‌కు ద్వితీయ బహుమతి -
ఖాళీ బిందెలతో నిరసన
మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళల నిరసనసంగారెడ్డి: తమ కాలనీకి మంచినీళ్లు రావడంలేదని పట్టణంలోని మార్క్స్‌నగర్‌కు చెందిన మహిళలు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులుగా కాలనీలో తాగడానికి, నిత్యావసరాలకు నీరు రాకపోవడంతో ఇతరుల ఇళ్లకు వెళ్లి రోజు నీటిని అడుక్కొని తీసుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్‌కు మాజీ కౌన్సిలర్ గోవర్ధన్ నాయక్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
లోక్‌అదాలత్‌పై అవగాహన
సంగారెడ్డి జోన్: పెండింగ్‌లో ఉన్న కేసులలో ఇరువర్గాలు రాజీపడేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్హెచ్ఓలకు ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశించారు. సోమవారం పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని వివిధ పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ నుంచి అధికారుల వరకు వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలన్నారు. ఈ నెల 8వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు కోల్పోయిన/ హోల్డ్ చేయబడిన డబ్బు తిరిగి బాధితులకు చేరే విధంగా సంబంధిత బ్యాంక్ అధికారులకు కోర్టు ద్వారా ఉత్తర్వులు అందించాలని సూచించారు. ఇ–పెట్టి కేసులు, మద్యం తాగి పట్టుబడిన కేసులలో విధించిన జరిమానా డబ్బులు చెల్లించే విధంగా చూడాలని అన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్–అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని సూచించారు. అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.ఎస్పీ చెన్నూరి రూపేశ్ -
పిల్లలకు వినికిడి పరీక్షలు నిర్వహించాలి
సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతిసిద్దిపేటకమాన్: మూడేళ్ల వరకు ఉన్న చిన్న పిల్లలకు తప్పకుండా వినికిడి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శాంతి, ఈఎన్టీ విభాగ హెచ్ఓడీ కే.నాగరాజు తెలిపారు. జాతీయ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం ఈఎన్టీ విభాగ వైద్యుడు డాక్టర్ కడవేర్గు ప్రణీత్‌తో కలిసి డాక్టర్ శాంతి, డాక్టర్ నాగరాజు మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయిన బాలింతలకు, పిల్లల తల్లిదండ్రులకు వినికిడి సమస్యలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతీ బేబీకి డిశ్చార్జీకి ముందు తప్పకుండా ఈఎన్టీ విభాగ వైద్యులతో వినికిడి పరీక్షలు నిర్వహించాలన్నారు. పిల్లలకు వినికిడి సమస్య ఉంటే భవిష్యత్‌లో వారికి మాటలు కూడా సరిగా రాకపోవడానికి అవకాశం ఉంటుందన్నారు. నెలలు నిండకుండా, బరువు తక్కువగా జన్మించిన పిల్లలకు తప్పకుండా వినికిడి పరీక్షలు చేయించి, ఏదైనా సమస్య ఉంటే చికిత్స తీసుకోవాలని తెలిపారు. ఫ్లకార్డులతో వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్, ఆర్ఎంలు డాక్టర్ జ్యోతి, డాక్టర్ శ్రావణి, డాక్టర్ మాధవి, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా స్వయం పాలన దినోత్సవం
వట్పల్లి(అందోల్): అందోల్ మండలంలోని తాడ్మన్నూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులు వ్యవహరించి అలరించారు. ప్రధానోపాధ్యాయులుగా అక్షిత, డీఈఓగా దుర్గారాజ్, ఎంఈఓగా శ్రీహరి, కలెక్టర్‌గా చరణ్, ఉపాధ్యాయులుగా భవాని, వైష్ణవి, భానుప్రియ, భార్గవి, రేణుక, రఘువర్ధన్, వినయ్, రఘు, దీక్షిత్, అశ్రిన్, శ్రీహితలు వ్యవహరించారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె.నవీన్న్కుమార్, ఉపాధ్యాయులు గీత, మల్లేశ్వరి, వినోద, క్రిష్ణారెడ్డి, అఖిల పాల్గొన్నారు. పిచరాగడి ప్రభుత్వ పాఠశాలలో.. జహీరాబాద్: కోహీర్ మండలంలోని పిచరాగడి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సోమవారం స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు పాఠాలు బోధించి ప్రశంసలు అందుకున్నారు. హెచ్ఎంగా తేజేష్, ఎంఈఓగా రాజేష్, డీఈఓగా నగేష్, ఉపాధ్యాయులుగా స్వాతి అక్షయ, స్నేహ, సుప్రియ, రోహిత్, ఇస్మాయిల్, కార్తీక్, పవన్, అభిషేక్, షైబాజ్ విధులు నిర్వహించి పాఠాలు బోధించారు. -
భావి శాస్త్రవేత్తలుగా తయారు కావాలి
● శాస్త్రవేత్త డాక్టర్ రఘు వర్మ న్యాల్కల్(జహీరాబాద్): విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా తయారు కావాలని ఎన్ఆర్ఎస్సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) రిటైడ్ జూనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రఘు వర్మ సూచించారు. సోమవారం మండల పరిధిలోని మిర్జాపూర్(బి)లోని జెడ్పీహెచ్ఎస్లో రాకెట్ సైన్స్, టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు వర్మ మాట్లాడుతూ.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. విద్యార్థులు చేసే కృషికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఇస్రో చేసిన సేవలను గుర్తు చేస్తూ చంద్రయాన్–3 సాధించిన విజయంను దృశ్య రూపంలో విద్యార్థులకు చూపించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాజ్‌కుమార్‌తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రహదారుల మరమ్మతులు చేపట్టాలి● మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంతోపాటు సంబంధిత రూట్లలో ఎన్‌హెచ్ 161బీ జాతీయ రహదారి మరమ్మతులు చేయకుంటే ఆందోళన చేపడుతామని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా నిజాంపేట్–ఖేడ్– బీదర్ జాతీయ రహదారికి రూ.353 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నిధులతోనే ఖేడ్ పట్టణంతోపాటు అనుబంధ రోడ్లను కాంట్రాక్టర్ మరమ్మతులు చేయాల్సి ఉన్నా, పనుల్లో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అధ్వానంగా మారిన రహదారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. వెంటనే మర్మతులు చేపట్టాలని. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ నర్సింహ్మా రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురాం, మాజీ కౌన్సిలర్లు అభిషేక్ షెట్కార్, విఠల్, నగేశ్, ముజామ్మిల్, అంజాగౌడ్, సంగప్ప, మల్గొండ, మశ్చందర్ పాల్గొన్నారు. కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలి● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పటాన్చెరు టౌన్/సంగారెడ్డి ఎడ్యుకేషన్: కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ త్వరలో ఉద్యమం చేయబోతున్నట్లు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కిర్బీ యూనియన్ అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. సోమవారం కిర్బీ కార్మికుల సమావేశంలో, అలాగే.. సంగారెడ్డి కలెక్టరేట్లో డిప్యూటీ లేబర్ కమీషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీస వేతనాలు పెంచలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెంచకుండా మీనమేషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. పెట్టుబడుదారులకు అనుకూలంగా మాత్రమే పాలకుల నిర్ణయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ నెలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కేతకి ఆదాయం రూ.11.10 లక్షలుఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయ ఆదాయాన్ని లెక్కించారు. సోమవారం ఆలయ ఆవరణలో శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, లెక్కింపు ప్రారంభించారు. 13 రోజులలో రూ.11 లక్షల 70 వేల 698 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శివరుద్రప్ప, నాయకులు చంద్రశేఖర్, మల్లయ్య స్వామి, సంగారెడ్డి, ఆలయ అర్చకులు, అధికారులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
నేడు డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
నారాయణఖేడ్: ఖేడ్ మండలం జూకల్ శివారులోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో మంగళవారం న్యూల్యాండ్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జి.నారాయణ తెలిపారు. ఇంటర్మీడియెట్ పూర్తయిన, డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మేళాలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పదోతరగతి, ఇంటర్మీడియెట్ మెమోలు, ఆధార్ కార్డు, నాలుగు పాస్ పోర్టుసైజు ఫోటోలు తీసుకుని రావాలని సూచించారు. ప్రజావాణిలో 37 అర్జీలు సంగారెడ్డి జోన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలొని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. ఈ మేరకు 37 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ జానకి రెడ్డి, సివిల్ సప్లై అధికారి రాజేశ్వర్, డీపీఓ సాయిబాబా, కలెక్టరేట్ ఏవో పరమేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన కొడుకు
● మద్యం మత్తులో కత్తితో దాడి ● మృతురాలి శరీరంపై ఆరు కత్తిపోట్లు ● సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘటనరామచంద్రాపురం(పటాన్చెరు): ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. మద్యం మత్తులో కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినో విలాస్స్లో నివాసముండే నవారి రాధిక(52), భర్త మాల్లారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సందీప్ రెడ్డికి గతేడాది వివాహం జరిగింది. రెండో కుమారుడు కార్తీక్ రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. కొంత కాలంగా తనకు రావాల్సిన ఆస్తిని పంచితే తాను వ్యాపారం చేసుకుంటానని నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. మద్యానికి బానిస కావడంతో కార్తీక్ రెడ్డిని గతేడాది రెండు సార్లు రియబ్టేషన్ సెంటర్‌కు పంపించారు. జనవరి నెలలో తిరిగి ఇంటికొచ్చాడు. మళ్లీ ఆస్తి విషయంపై గొడవపడుతూ వస్తున్నాడు. కార్తీక్ రెడ్డి ఆదివారం రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చాడు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంట్లో తనకు ఆస్తి పంచాలని పెద్దపెద్దగా అరవడం మొదలుపెట్టాడు. తల్లి రాధిక నిద్రలేచి ఏమైందంటూ అనడంతో ఆమైపె కత్తితో దాడి చేశాడు. తండ్రి మల్లారెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతడిపై దాడి చేశాడు. వెంటనే అతడు బయటకు పరిగెత్తి కాపాడాలంటూ గట్టిగా కేకలేశాడు. సందీప్ రెడ్డి సైతం భయంతో బయటకు వచ్చి తల్లిని కాపాడాలంటూ కేకలేశాడు. అందరూ కలిసి లోనికి వెళ్లి చూడగా రాధిక రక్తం మడుగులో పడి ఉంది. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందింది. సమాచారం అందుకున్న కొల్లూరు ఎస్ఐ రవీందర్, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి శరీరంపై ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కార్తీక్ రెడ్డిని సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నీటి సమస్య తలెత్తకుండా చర్యలు
సంగారెడ్డి జోన్: గ్రామాలలో సాగు, తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగు, తాగు నీరు ఇబ్బందులు ఏర్పడే జిల్లాలలో మండలాల వారీగా తహసీల్దార్, నీటిపారుదల శాఖ ఇంజనీర్, వ్యవసాయ అధికారితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటించాలన్నారు. గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను రెగ్యులర్‌గా చెక్ చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసేందుకు టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రాబోయే 10 రోజులపాటు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టరు మాధూరి, ట్రైనీ కలెక్టరు మనోజ్, ఎలక్ట్రిసిటీ, వ్యవసాయ, ఇరిగేషన్, సంబంధిత అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ క్రాంతి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి -
పోక్సో కేసులో జీవితఖైదు
రామచంద్రాపురం(పటాన్చెరు): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించిన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కొల్లూరు పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది మే నెలలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో ఉంటున్న మీర్జా అక్బర్ బేగ్ అదే ప్రాంతంలో ఉండే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ రవీందర్, కోర్టు కానిస్టేళ్లు నర్సింహులు, శ్రీకాంత్, ఏఎస్ఐ రవీందర్ రెడ్డి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టు ముందు ఉంచారు. సోమవారం కేసును విచారించిన ఫస్ట్ అదనపు డిస్ట్రిక్ సెషన్స్ న్యాయమూర్తి కె.జయంతి నిందితుడు మీర్జా అక్బర్ బేగ్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధించారు. నిందితుడికి శిక్ష పడేలా చేసినరవీందర్ను, పోలీస్ సిబ్బందిని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ డాక్టర్. జీ.వినీత్, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ రావు అభినందించారు. -
మిత్రుడి వివాహానికి వచ్చి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మరో యువకుడికి తీవ్ర గాయాలునర్సాపూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ లింగం కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాయి నిఖిల్(21), అతడి మిత్రుడు మనీశ్ ఆదివారం మెదక్‌లో జరిగిన వారి మిత్రుడి వివాహానికి హాజరయ్యారు. రాత్రి ఇంటికి తిరిగి ప్రయణమయ్యారు. నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా నర్సాపూర్ శివారులోని అయ్యప్ప దేవాలయం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌కు బైక్ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న మనీశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలించారు. బైక్‌ను అతి వేగంగా అజాగ్రత్తగా నడిపినందునే అదుపుతప్పి ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. బైక్ ఢీకొని వృద్ధుడు కొండపాక(గజ్వేల్): బైక్ ఢీకొట్టడంతో వృద్ధుడు మృతి చెందిన ఘటన కొండపాకలో చోటు చేసుకుంది. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు.. కుకునూరుపల్లి మండలంలోని మంగోల్ గ్రామానికి చెందిన తోడేటి పెంటయ్య(60) సమీప గ్రామమైన మేదినీపూర్‌లో జరిగిన వివాహానికి హాజరయ్యాడు. సాయంత్రం వేళ కొండపాకలోని అత్తారింటికి నడుచుకుంటూ వెళ్తుండగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపునకు వెళ్తున్న బైక్ తిమ్మారెడ్డిపల్లి శివారులో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కోరుట్లకు చెందిన వినోద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పోలీసులతో దురుసు ప్రవర్తన
వ్యక్తి కేసు నమోదు నర్సాపూర్: విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మూసాపేట గ్రామానికి చెందిన ప్రవీన్ 100 నబంర్కు ఫోన్ చేసి తన అక్క రేణుకను బావ సురేశ్ కొడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు మోహన్, భిక్షపతి గ్రామానికి వెళ్లి సురేశ్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా అతడు పోలీసులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ వారి చొక్కాలు పట్టుకొని కొట్లాటకు దిగాడు. తమ కుటుంబం జోలికి వస్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని తెలుసుకొని పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న ఏఎస్ఐ క్రిష్ణ గ్రామానికి వెళ్లగా సురేశ్ ఏఎస్ఐని సైతం తిట్టాడని ఎస్ఐ పేర్కొన్నారు. తమ విధులకు ఆటంకం కలిగించి దురుసు గా ప్రవర్తించినందుకు కానిస్టేబుళ్లు మోహన్, భిక్షపతిల ఫిర్యాదు మేరకు సురేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లింగం వివరించారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి పటాన్చెరు టౌన్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీన్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సీతారామపురం గ్రామాని కి చెందిన నీలకంఠేశ్వర రావు(30) ఏడాది కిందట బతుకుదెరువు కోసం వచ్చి అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఉంటున్నాడు. ఇక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. 2న రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. సుల్తాన్పూర్ గ్రామ సమీపంలోని కల్యాణ్ వెంచర్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం తరలించగా సోమవారం మృతి చెందాడు. మృతుడి పెద్దనాన్న కుమారుడు సోమేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గయ్య తెలిపారు. -
సర్వం సిద్ధం
● రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ● సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. ● ఉదయం 9 నుంచి 12 గంటల వరకు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తామని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవింద్రాం తెలిపారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా విద్యుత్, రవాణా, వైద్య అధికారులతో సమీక్షించామని తెలిపారు. జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలు జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 34,614 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం 16,513. ద్వితీయ సంవత్సరం 18,101 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు హాల్‌టికెట్ ఇవ్వకుంటే tgbie.cgg.gov.in అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, హాల్ టికెట్‌పై సంబంధిత ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. నిమిషం నిబంధన లేదు, కానీ.. గతంలో ఉన్న నిమిషం నిబంధన ఎత్తివేసినప్పటికీ ప్రస్తుతం ప్రతి విద్యార్థి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రాన్ని తెలుసుకోవడానికి ఇబ్బందులు ఉంటే హాల్ టికెట్ వెనుక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సెంటర్ లొకేషన్ చూపిస్తుంది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రతి పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు తమ వెంట ఎటువంటి చేతి వాచీలు, ఎలక్ట్రిక్ పరికరాలను అనుమతించేది లేదని ఇంటర్మీడియెట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశాం విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాసేలా జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాన్ని ఓపెన్ చేస్తాం. ప్రతి సీసీ కెమెరా కూడా ఇంటర్మీడియెట్ రాష్ట్ర శాఖకు అనుసంధానంగా ఉంటుంది. 8:45 గంటలు దాటితే పరీక్ష కేంద్రంలోకి అనుమతించం. : గోవింద్రాం, ఇంటర్మీడియెట్ అధికారి పరీక్ష కేంద్రాలు 54 ప్రథమ సంవత్సరం విద్యార్థులు 16,513 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,101 స్టోరేజీ పాయింట్లు 19 ఇన్విజిలేటర్లు 926 డీఈఓ మెంబర్లు 03 ప్రశ్నపత్రం బల్క్ ఇన్చార్జి 01 సీఎస్‌లు 54 డీఎస్‌లు 54 ప్లయింగ్ స్క్వాడ్ 03 బృందాలు సిట్టింగ్ స్క్వాడ్ 04 బృందాలువివరాలు.. -
ప్రైవేట్ హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకోండి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డిలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయిస్తూ ప్రాణాలు కోల్పోతున్నా జిల్లా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపంచారు. వారం రోజుల వ్యవధిలో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ ఇద్దరు మృత్యువాత పడటం చాలా బాధాకరమన్నారు. విచ్చలవిడిగా పెరుగుతున్న ప్రైవేటు హాస్పిటల్స్ కనీస సౌకర్యాలు లేకుండా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో చాలా ఆస్పత్రిల్లో అర్హత లేని డాక్టర్లు, సిబ్బందితో పని చేయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, తక్షణమే అధికారులు స్పందించి ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకొని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యాదగిరి,కృష్ణ, నాయకులు రమేష్ మల్లేశం, అర్జున్ పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పనుల్లో అవకతవకలు
● సామాజిక తనిఖీ బృందంపరిశీలనలో వెలుగులోకి.. ● ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిమానహత్నూర (సంగారెడ్డి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సామాజిక తనిఖీ బృందం పరిశీలించింది. పనుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. సోమవారం హత్నూర రైతువేదికలో బహిరంగ విచారణ చేపట్టారు. 2023–24 సంవత్సరంలో మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలలో చేపట్టిన ఎన్ఆర్ఈజీఎస్ పనులపై వారం రోజులుగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టింది. అక్కడ సోషల్ ఆడిట్ బృందం గుర్తించిన లోటుపాట్లు, అక్రమాలను బహిరంగ ప్రజావేదిక దృష్టికి తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మొక్కల పెంపకం లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించింది. అనేక గ్రామాలలో పెట్టిన మొక్కలు సంరక్షించడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు విఫలమైనట్లు వివరించింది. అంతేకాకుండా, మెజార్టీ గ్రామాలలో మస్టర్ల నిర్వహణ సక్రమంగా లేదని పేర్కొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తప్పవని బృందం సభ్యులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయి పరిశీలన చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమాన వేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొసీడింగ్ ఆఫీసర్ బాలరాజ్, డీవీవో నాగేశ్వరరావు. ఎంపీడీవో శంకర్, ఎస్ఆర్పీ కవిత, ఏపీవో ప్రవీణ్ కుమార్ ,గ్రామ పంచాయతీ కార్యదర్శులు ,ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
బాబోయ్.. భగీరథ
● రంగు మారిన తాగునీరు ● కలుషిత నీటి సరఫరాతో జనం బెంబేలుసదాశివపేట రూరల్(సంగారెడ్డి): మిషన్ భగీరథ కింద కలుషిత నీరు సరఫరా అవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదాశివపేట పట్టణం, మండల పరిధిలో వారం రోజులుగా ఈ పరిస్థితి నెలకొంది. మునిపల్లి మండలం బూసరెడ్డిపేట వాటర్ ప్లాంట్ నుంచి ఈ గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తారు. సదాశివపేట సహా మండల పరిధిలోని 20 గ్రామాలకు కలుషిత నీరు సరఫరా అవుతోంది. నల్లాల్లో పచ్చని, ఎర్రటి రంగుల్లో తాగునీరు సరఫరా అవుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బిందెలు, బకెట్ అడుగున ఎర్రటి బురద పేరుకుపోతుంది. కలుషిత నీరు తాగితే ఎలాంటి వ్యాధులు సోకుతాయోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై వివరణ కోరేందుకు మిషన్ భగీరథ ఏఈని పలుమార్లు ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
అదృశ్యమైన యువకుడు శవమై లభ్యం
మరో 20 రోజుల్లో మృతుడి వివాహంన్యాల్కల్(జహీరాబాద్): అదృశ్యమైన యువకుడు శవమై కనిపించిన ఘటన మండల పరిధిలోని హుమ్నాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ కథనం మేరకు.. నాగుల్‌గిద్ద మండలం గంగారం తండాకు చెందిన సునీల్ చౌహన్ హైదరాబాద్‌లో ఉంటూ కొంతకాలంగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం పిట్లంలోని ఆస్పత్రికి వస్తున్నానని, అనంతరం ఇంటికొస్తానని 1వ తేదీన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఇంటికొస్తానన్న కుమారుడు రాకపోయే సరికి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆదివారం సునీల్ వాహనం పుల్కుర్తి బ్రిడ్జిపై పోలీసులకు లభించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టగా సోమవారం ఉదయం మంజీరా నదిలో శవమై కనిపించాడు. కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025
పైన పేర్కొన్న ఒక్క ఉదాహరణ చాలు జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అని చెప్పడానికి. ఇలా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దుగ్యానాయక్ తండా లాంటి నివాసిత ప్రాంతాలు జిల్లాలో సుమారు 45 వరకు ఉన్నాయి. ఇవన్నీ టెయిల్ ఎండ్ (తాగునీటి పథకాలకు చివర) ఉన్న గ్రామాలు. నివాసిత ప్రాంతాలు ఉన్నట్లు తేలింది. అయితే ఈ గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి సమస్య లేదని, వేసవిలో ఈ సమస్య తలెత్తే అవకాశాలు మాత్రమే ఉన్నాయని మిషన్‌భగీరథ అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని చెబుతున్నారు. తాగునీటికి సరఫరా వ్యవస్థ సరిగ్గాలేక.. మిషన్‌భగీరథ అధికారికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 633 గ్రామ పంచాయతీల పరిధిలో 915 నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2.33 లక్షల ఇళ్లకు మిషన్‌భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. సింగూరు జలాశయం నుంచే జిల్లా అంతటికి తాగునీటి సరఫరా అవుతోంది. ఈ జలాశయంలో సమృద్ధిగా నీరుంది. కానీ తాగునీటి సరఫరా వ్యవస్థ ఇంకా పటిష్టం కాకపోవడంతో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతోంది. భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తాగునీటి కోసం గ్రామాల్లోని బోర్ల నీటిని వాడకం తప్పనిసరిగా మారింది. ఆయా గ్రామ పంచాయతీల్లో బోరు మోటారు కాలిపోతే ఆ ప్రాంతమంతా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న మండలాలివి.. జిల్లాలో కల్హేర్, సిర్గాపూర్, కంగ్టి, నాగల్గిద్ద, మానూరు, మొగుడంపల్లి, ఝరాసంఘం వంటి మారుమాల మండలాలతో పాటు, కొండాపూర్, కంది, అమీన్పూర్, ఆందోల్, హత్నూర, గుమ్మడిదల, జిన్నారం మండలాల్లోని టెయిల్ ఎండ్ గ్రామాల్లో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎండలు మరింత ముదిరితే ఈ గ్రామాల వాసుల నీటి కష్టాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం వేసవిలో తాగునీటి సమస్యల తలెత్తే అవకాశాలున్న గ్రామాలను గుర్తించాం. ఒకవేళ అక్కడ తాగునీటికి ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతానికి జిల్లాలో తాగునీటి సమస్య లేదు. ఎక్కడైనా ఈ సమస్య ఎదురైతే టోల్‌ఫీ నెం.1800 5994007కు ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేసిన వెంటనే క్షేత్ర స్థాయికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తాం. : పాష, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ న్యూస్రీల్నీటి ఎద్దడి@ 45 ఆవాసాలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన‘భగీరథ’ అధికారులు రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య మరింత పెరిగే అవకాశం సింగూరులో నీళ్లున్నా..సరఫరా వ్యవస్థలో లోపాలు తక్షణం స్పందించకుంటే సమస్యమరింత జటిలమయ్యే అవకాశం గుక్కెడు తాగునీటి కోసం ఇలా గుట్టలు ఎక్కుతున్న ఈ గిరిజన మహిళలది సిర్గాపూర్ మండలం దుగ్యానాయక్తండా. సుమారు వంద వరకు కుటుంబాలు నివసించే ఈ తండాకు మిషన్‌భగీరథ పైప్‌లైన్ పనులు అసంపూర్తిగా వదిలేశారు. దీంతో ఈ తండావాసులే స్వయంగా సమీపంలో ఉన్న బావిలోంచి మోటార్ల ద్వారా తరలించు కుంటున్నారు. ఈ మోటార్లు కాలిపోనప్పుడు ఇలా బిందెలతో సుమారు 200 మీటర్లు గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి
శివ్వంపేట(నర్సాపూర్): చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బిజ్లిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్‌రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన నెల్లూరి సాయికుమార్(35) శనివారం రాత్రి మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం గ్రామ పరిసరాల్లోని చెరువులు, కుంటల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. సోమ వారం గ్రామ శివారులోని వీరప్ప చెరువు లో సాయికుమార్ మృతదేహం తేలడంతో గుర్తించా రు. చేపల వేటకు వెళ్లి నీట మునిగి మృతి చెందినట్లు మృతుడి చెల్లి శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు. -
అప్పుల బాధతో సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
అమీన్పూర్ మున్సిపాలిటీలో ఘటనపటాన్చెరు టౌన్: అప్పుల బాధతో సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి (34) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య గర్భిణి కావడంతో పుట్టింటి వద్ద ఉంటుంది. కొంతకాలంగా శ్రీనివాస్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పుల బాధ తాళలేక సోమ వారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వాసవి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి సమీపంలో ఉన్న ఆమె చెల్లెలు సాయి చందనకు ఫోన్ చేసి చెప్పింది. వెంట నే ఆమె ఇంటికి వెళ్లి కిటికీలోంచి చూడగా బావ శ్రీనివాస్ రెడ్డి ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి మరదలు సాయి చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ దుర్గయ్య కేసు నమోదు చేశారు.