Siddipet
-
చక్రం తిప్పిన కింగ్
కింగ్ బుక్‌స్టాల్‌కు చెందిన యజమానిని ఏజెంట్‌గా సదరు మాజీ అధికారి నియమించుకున్నారు. ఆ బుక్ స్టాల్‌కు చెందిన కుటుంబ సభ్యుల ద్వారా వివిధ ఎంటర్ప్రైజెస్ల పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేశారు. మే, 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు థర్డ్ పార్టీ పేరుతో రూ.1.2కోట్లన సబ్సిడీని విడుదల చేశారు. ఎంటర్ప్రైజెస్ పేరు మీద ఆరుగురి సబ్సిడీలను రూ.26.80లక్షలు, కింగ్ బుక్ స్టాల్ పేరు మీద ముగ్గురికి రూ.14.40లక్షలు, కింగ్ భవాని ఎంటర్ప్రైజెస్ పేరు మీద మరో ముగ్గురికి రూ.10.80లక్షలు, అలాగే కింగ్‌కు సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్ల మీద, వాహనాలు కొనుగోలు చేసేందుకు నేరుగా లబ్ధిదారులకే చెక్‌లను విడుదల చేశారు. ఇలా మొత్తంగా థర్డ్ పార్టీ పేరుతో 34 మందికి సంబంధించి సబ్సిడీ రూ.1.20కోట్లను విడుదల చేశారు. ఒక్కో లబ్ధిదారుని దగ్గర రూ.80వేల నుంచి రూ.2లక్షల వరకు డబ్బులను కింగ్, మాజీ అధికారి తీసుకుని అందజేసినట్లు తెలుస్తోంది. పాడి పశువుల పంపిణీలో ఆక్రమాలను గతంలో ‘సాక్షి’ వెలికితీయగా, అలాగే ఇతర అక్రమాలు పాల్పడినట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో విచారణ చేసి ఎస్సీ కార్పొరేషన్‌కు సరెండర్ చేశారు. గతంలో పనిచేసిన అధికారి పాల్పడిన ఆక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యూనిట్లను ఏర్పాటు చేయకుండానే సబ్సిడీలను విడుదల చేసిన అధికారి, సహకరించిన ఏజెంట్ కింగ్‌కు సంబంధించిన ఎంటర్ప్రైజెస్లపై పూర్తి స్థాయిలో విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. -
ఉత్తమ ప్రాజెక్టులు రూపొందించండి
● ఓయూ కామర్స్ డీన్ కృష్ణచైతన్య ● కామర్స్ విద్యార్థులకు ఒకరోజు వర్క్షాప్సిద్దిపేటఎడ్యుకేషన్: నిపుణులైన అధ్యాకుల పర్యవేక్షణలో ఉత్తమ ప్రాజెక్టులను రూపొందిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందుతాయని ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ కృష్ణచైతన్య అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ప్రాజెక్టుల తయారీ, పరిశోధనా మెలకువలపై మంగళవారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో పీజీ ఫైనలియర్ విద్యార్థులకు ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో సామాజిక సమస్యలపై అవగాహన, సూక్ష్మపరిశీలన, పరిశోధనపై జిజ్ఞాస పెంపొందుతుందన్నారు. ప్రాజెక్టుల రూపకల్పనలో పాటించాల్సిన మెలకువలు, నివేదికలు తయారుచేసి సమర్పించాల్సిన విధానాలను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ విద్యార్థులు సానుకూల దృక్పధాన్ని అలవర్చుకుని పరిశోధన మెలకువలతో ఉత్తమ ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు. వర్క్‌షాప్ కన్వీనర్ డాక్టర్ గోపాల సుదర్శనం మాట్లాడుతూ పరిశోధనా సమస్యల గుర్తింపు, పరిష్కార మార్గాలు, ఫలితాల విశ్లేషణ సాధనాలను అర్థం చేసుకోవాలన్నారు. -
మల్లన్న ఎనిమిదో వారం ఆదాయం రూ.58.39 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో ఆదివారం రూ.58,39,513 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. మొత్తం మూడు రోజులలో ఈ ఆదాయం సమకూరిందన్నారు. భక్తుల వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, లడ్డూ ప్రసాదం, పట్నాలు, బోనాలు, టికెట్ల అమ్మకాల ద్వారా ఈ ఆదాయం వచ్చిందని తెలిపారు. గత ఏడా ది కంటే ఈసారి రూ.11,52,263 అధికంగా వచ్చిందని ఈఓ రామాంజనేయులు తెలిపారు. దుబ్బాక మున్సిపల్ బడ్జెట్ రూ.22.22 కోట్లు అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సమక్షంలో ఆమోదం దుబ్బాక: మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.22.22 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించినట్లు కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి గరిమా అగర్వాల్ సమక్షంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సాధారణ నిధులు, వివిధ గ్రాంట్లు కలుపుకొని ఆదాయం రూ.22.22 కోట్లుగా అంచనా కాగా, వ్యయం రూ.22.19 కోట్లుగా కేటాయించామన్నారు. ఆదాయం, వ్యయానికి సంబంధించి మొత్తంగా మిగులు బడ్జెట్ రూ.2.82 లక్షలు ఉందన్నారు. మున్సిపల్ సాధారణ ఆదాయం రూ.5.85 కోట్లు, వ్యయం రూ.5.82 కోట్లు ఉందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు రూ.80 లక్షలు, సిబ్బంది వేతనాలకు రూ.1.6 కోట్లు, విద్యుత్ చార్జీలకు రూ.62.5 లక్షలు అలాగే రుణాల చెల్లింపులకు రూ.40 లక్షలు కేటాయించామన్నారు. వర్గల్ ఎంపీడీఓ బదిలీవర్గల్(గజ్వేల్): మండల పరిషత్ అధికారి విజయలక్ష్మి బదిలీ అయ్యారు. మంగళవారం ఎంపీఓ ఖలీమ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. యేడాదిపాటు సేవలందించి అందరి మన్ననలు పొందిన విజయలక్ష్మి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ద్వారా సొంత జిల్లా మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆదర్శలో ప్రవేశానికి గడువు పెంపు చిన్నకోడూరు(సిద్దిపేట): ఆదర్శ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 20వరకు పొడిగించినట్లు ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సతీష్ తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులతో పాటు 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలలో సంప్రదించాలన్నారు. గ్రూప్ 2లో 103వ ర్యాంక్ హుస్నాబాద్: పట్టణానికి చెందిన అయిలేని మణికంఠేశ్వర్‌రెడ్డి గ్రూప్ –2లో 103 ర్యాంక్ సాధించారు. గ్రూప్ 2 పరీక్షలో 392.5 మార్కులు వచ్చాయి. గతంలో గ్రూప్ –4లో 600 ర్యాంక్ సాధించిన మణికంఠేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఎండోమెంట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
సబ్సిడీ గోల్మాల్
ఎస్సీ కార్పొరేషన్లో అక్రమాలు ● నేరుగా థర్డ్ పార్టీ పేరుతో చెల్లింపులుఎస్సీ కార్పొరేషన్లో అక్రమాలు వెలుగుచూశాయి. సబ్సిడీ పేరుతో రూ.కోట్లు స్వాహా చేశారు. అధికారి, కింగ్ బుక్‌స్టాల్ యజమాని, లబ్ధిదారుడు కుమ్మకై ్క బ్యాంకర్‌కు సంబంధం లేకుండానే సబ్సిడీ గోల్మాల్ చేశారు. థర్డ్ పార్టీ పేరుతో 34 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.1.20కోట్ల సబ్సిడీని విడుదల చేశారు. యూనిట్లను ఏర్పాటు చేయకుండానే సబ్సిడీ డబ్బులను ఆ ముగ్గురు పంచుకున్నారు. కాసులకు ఆశపడి సదరు ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి మే, 2023 నుంచి సెప్టెంబర్ 2024 వరకు పనిచేసిన సమయంలో ఇష్టారాజ్యంగా సబ్సిడీలను విడుదల చేయడం గమనార్హం. థర్డ్ పార్టీ పేరుతో విడుదల చేసిన సబ్సిడీలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశోధన చేసింది. అనేక విషయాలు వెలుగు చూశాయి. సాక్షి, సిద్దిపేట: జిల్లాలో 2020–21లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో 60శాతం సబ్సిడీతో ఎకానామిక్ సపోర్ట్ స్కీం కింద దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో 1,576 మంది దరఖాస్తు చేశారు. ఏప్రిల్ 2023లో 1,408 మందికి రూ 33.29కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో రూ.21.18కోట్లతో 781 గ్రౌండింగ్ అయ్యాయని, మరో 627 మంది లబ్ధిదారులకు సంబంధించి సబ్సిడీ రూ.12.11కోట్లు బ్యాంక్‌లో ఉన్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నేరుగా సబ్సిడీ విడుదల గతంలో పని చేసిన ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి.. కింగ్ బుక్‌స్టాల్ యజమాని, లబ్ధిదారులు కలిసి సబ్సిడీ డబ్బులు పంచుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో రుణం కోసం దరఖాస్తు దారుడు ఏర్పాటు చేసే యూనిట్‌కు సంబంధించి వివరాలతో బ్యాంక్‌ను సంప్రదించాలి. అప్పుడు బ్యాంక్ అధికారులు దరఖాస్తు దారుని వివరాలు పరిశీలించి రుణం మంజూరు చేయాలనుకుంటే బ్యాంక్ కాన్సెంట్ ఇస్తారు. ఆ పత్రాన్ని ఎస్సీ కార్పొరేషన్లో అందజేయాలి. అప్పుడు యూనిట్‌కు సంబంధించి సబ్సిడీని బ్యాంక్‌కు విడుదల చేస్తారు. అలా నిబంధనలు ఏమీ పాటించకుండానే ఇష్టారాజ్యంగా సబ్సిడీని నేరుగా అందించారు. 34 మందికి రూ.1.2కోట్లు విడుదల గతంలో పనిచేసిన అధికారి చేతివాటం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటున్న దళిత సంఘాలు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశోధనలో వెలుగు చూసిన నిజాలు ఉన్నతాధికారులకు నివేదికయూనిట్ ఏర్పాటు చేస్తున్న వారికే సబ్సిడీని విడుదల చేయాలి. కానీ థర్డ్ పార్టీ పేరుతో సబ్సిడీని విడుదల చేయవద్దు. వివిధ యూనిట్లకు సంబంధించి నేరుగా గతంలో పని చేసిన అధికారి సబ్సిడీ విడుదల చేశారని తెలియడంతో ఉన్నత అధికారులు రిపోర్ట్ తెప్పించుకున్నారు. – రామాచార్య, ఇన్చార్జ్ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ -
కోళ్లకు ఏమైంది..?
● అంతుచిక్కని వ్యాధితో వేలాదిగా మృత్యువాత ● తాజాగా మజీద్‌పల్లిలో 15 వేల కోళ్లు మృతి ● ఫారాలన్నీ ఖాళీ.. పౌల్ట్రీ రైతుల గగ్గోలు ● వివరాలు సేకరించిన పశువైద్యాధికారి వర్గల్(గజ్వేల్): అంతుచిక్కని వ్యాధితో జిల్లా వ్యాప్తంగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లతో కళకళలాడే పౌల్ట్రీ ఫారాలన్నీ వెలవెలపోతున్నాయి. తీవ్ర నష్టాలతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా వర్గల్ మండలం మజీద్‌పల్లిలోని రెండు పౌల్ట్రీఫారాలలో 15వేలపై చిలుకు కోళ్లు మృత్యువాత పడ్డాయి. మజీద్‌పల్లి గ్రామానికి చెందిన ఎస్కే అలీ కోళ్లఫారం లీజుకు తీసుకుని అందులో 10వేల కోడి పిల్లలు పెంచుతున్నాడు. అదే విధంగా సయ్యద్ బాసిత్ తన సొంత ఫారంలో 7,500 కోళ్లు వేశాడు. ఈ ఫారాలలో కోళ్లను అంతుచిక్కని వ్యాధి చుట్టుముట్టింది. వ్యాధి బారినపడి ఈ రెండు ఫారాలలో వారం రోజులుగా కుప్పలకొద్ది కోళ్లు చనిపోయాయి. కోళ్లు చనిపోయి ఫారాలు ఖాళీ అవుతుండడంతో నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడిన సమాచారం తెలిసి మంగళవారం వర్గల్ మండలం వేలూరు పశువైద్యాధికారి డాక్టర్ ఎన్ సర్వోత్తమ్ మజీద్‌పల్లి సందర్శించారు. బాధిత పౌల్ట్రీరైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎస్కే అలీ ఫారంలో 8,000 కోళ్లు, సయ్యద్ బాసిత్ ఫారంలో 7,000 కోళ్లు మృతిచెందినట్లు పేర్కొన్నారు. కోళ్లు మృతిచెందిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు. నష్టాలే మిగిలాయి కోళ్లఫారం లీజుకు తీసుకుని 10 వేల కోడి పిల్లలు వేశాను. చక్కగా ఎదిగి రూ.లక్షకు పైగా ఆదాయం వస్తదనుకున్నా. అనూహ్యంగా వారం రోజుల నుంచి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఇప్పటికే 8,500 కోళ్లు చనిపోయాయి. మిగతావి బతికే అవకాశం లేదు. రూ.1.20 లక్షల దాకా నష్టం. ప్రభుత్వం ఆదుకోవాలి. – ఎస్కే అలీ, పౌల్ట్రీ నిర్వాహకుడు -
అలసత్వం.. సమన్వయ లోపం..
నరేందర్‌రెడ్డి ఓటమికి కారణాలివే.. ● ఉమ్మడి మెదక్‌లోనే అతి తక్కువ ఓట్లు ● ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై సుదీర్ఘ చర్చ ● ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన జిల్లా మంత్రులుసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఓటమికి గల కారణాలపై ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. గెలిచే అవకాశాలున్న ఎమ్మెల్సీ సీటు చేజారి పోవడానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించారు. ఈ ఓటమికి అభ్యర్థి నరేందర్‌రెడ్డి అలసత్వమే కారణమని పలువురు జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు, కీలక నాయకులతో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు మంగళవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అభ్యర్థి నరేందర్‌రెడ్డి అలసత్వం కారణంగానే జిల్లాలో ఆశించిన ఓట్లు పడలేదని పలు నియోజకవర్గాల నేతలు ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే అభ్యర్థి ఎంపిక కూడా మరోకారణమని, హరికృష్ణకు టికెట్ ఇస్తే ప్రయోజనం ఉండేదని, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని నిలపకపోవడం కూడా కారణమని పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి చివరలో హాజరైన పీసీసీ చీఫ్ బి.మహేష్‌కుమార్‌గౌడ్‌తో కూడా ఈ అంశంపై జిల్లా నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. పాత బిల్లులు క్లియర్ చేయండి త్వరలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్)లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. అయితే గతంలో మంజూరైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయని, ఒకరిద్దరు నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఎందుకంత వ్యతిరేకత వస్తోందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. -
సత్వర న్యాయం అందాలి
● శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● హుస్నాబాద్‌లో ఏసీపీ కార్యాలయ భవనం ప్రారంభం హుస్నాబాద్: పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన బాధితులకు సత్వర న్యాయం అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో రూ.2.84 కోట్ల వ్యయంతో ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయ భవనాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించడానికి పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలో ఫ్రెండ్లీ పోలీస్ ఒకటని, నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించి బాఽధితులకు న్యాయం చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. పోలీసులు నూతన టెక్నాలజీని ఉపయోగించి విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత సేవలు అందించాలన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రమేశ్, కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు సతీష్, మధు, పురుషోత్తం రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్లు, సీఐలు పాల్గొన్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కారం
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● అధికారులకు దిశానిర్దేశం ● ప్రజావాణికి వచ్చిన అర్జీలు 54సిద్దిపేటరూరల్: ప్రజవాణి కార్యక్రమంలో అందించిన అర్జీలను సత్వరం పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించడం ద్వారా ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందన్నారు. పలు సమస్యలపై 54 దరఖాస్తులు వచ్చాయి. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించండికొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని తపాస్‌పల్లి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గ్రామపంచాయతీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హల్, బస్ షెల్టర్ ,పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధుల కేటాయించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో పుట్ట నర్సింహులు, ఈగ కనకయ్య, రమేష్ తదితరులు ఉన్నారు.చెరువులను నింపండి కొండపాక(గజ్వేల్): చెరువులు నింపి సాగునీటిని అందించాలని రైతులు కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీరు వెళ్లేందుకు ఆగిపోయిన కాలువ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ను కోరారు. మేదినీపూర్, లకుడారం గ్రామాల రైతులు కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోతున్నారని అన్నారు. వారికి పరిహారం అందకపోవడంతో కాలువ తవ్వకం పనులను నిలిపివేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. మర్పడ్గ, రాంపల్లి శివారుల్లో ఆగిపోయిన కాలువ పనుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో కోవర్టులను ఏరేస్తాం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు కోవర్టులుగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి, ఏరివేస్తామని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మైనంపల్లి మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీకంటే వ్యక్తులు గొప్పకాదన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను అమలుచేయలేని పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం, మాసాయిపేట స్కూల్ బస్సు ప్రమాదాలు జరిగినపుడు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడూ బాధితులను పరామర్శించలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారినపుడే ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం కార్యకర్తలు సమష్టిగా కష్టపడి పని చేయడం హర్షించదగిన విషయమన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి తప్పకుండా గుర్తింపు వస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయానికి అందరం కృషి చేద్దామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. అధిక శాతం రైతులకు రుణమాఫీ అయ్యిందన్నారు. ఈవిషయంలో కావాలనే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బద్నాం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని, జరిగినట్లు నిరూపిస్తే నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని హనుమంతరావు సవాల్ చేశారు. ఎట్ల దోచుకోవాలో, ఎలా దాచుకోవాలో, ఎట్ల పబ్లిసీటీ చేసుకోవాలో బీఆర్ఎస్ నాయకులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఆరోపించారు. కార్యక్రమంలో సిద్దిపేట, మెదక్ జిల్లాల పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి, ఆంజనేయులు గౌడ్, నాయకులు హరికృష్ణ, అత్తు ఇమామ్, యాదగిరి, లక్ష్మి, శ్రీనివాస్, మహేందర్, సతీష్, ఎల్లం యాదవ్, శివప్ప, బుచ్చిరెడ్డి, ఆనంద్, దాస అంజయ్య, రియాజ్, గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత హనుమంతరావు స్పష్టీకరణ జిల్లా కేంద్రంలో నాయకులు,కార్యకర్తలతో సమావేశం -
ఎవరికీ పట్టని ప్రజావాణి!
డిజిటల్ జమానా.. జేబులో ఫోన్ ఉంటే చాలు వివిధ రకాల చెల్లింపులకు నగదు బదిలీ సాధారణమైంది. తాజాగా ఈ ట్రెండ్ వివాహ వేడుకలకూ పాకింది. వివాహ వేడుకకు హాజరైన వారు డిజిటల్ పద్ధతిలో కూడా కట్నాలు చదివించుకోవచ్చు అన్నట్లు సంబంధీకులు ‘క్యూఆర్’ కోడ్ స్కానర్‌ను అందుబాటులో పెట్టారు. పెళ్లికి వచ్చిన వారు దీనిని చూసి నయా ట్రెండ్ భళే ఐడియా అంటూ ఆశ్చర్యపోయారు. డిజిటల్ కట్నాలు చదివించడం వర్గల్ మండలం గౌరారంలో చోటుచేసుకుంది. – వర్గల్(గజ్వేల్)మండుతున్న ఎండలకు మనుషులే తట్టుకోలేక పోతున్నారు. ఇక మూగ జీవాల సంగతి సరేసరి. కోతులు ఎండ వేడిమిని భరించలేక చెట్ల నీడను ఆశ్రయిస్తున్నాయి. మిరుదొడ్డిలో మిట్ట మధ్యాహ్నం వేళ వానరాలు స్థానిక పెద్దచెరువు కట్టపై ఉన్న చెట్ల నీడన చేరి ఉపశమనం పొందుతున్న ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక)న్యూస్‌రీల్ -
సమీకృత గురుకులానికి రూ.200 కోట్లు
● నిర్మాణానికి నిధులు మంజూరు ● ఇప్పటికే తంగళపల్లిలో భూమిపూజ చేసిన మంత్రి పొన్నం ● సుమారు 25 ఎకరాల్లో నిర్మాణానికి చర్యలు ● అంతర్జాతీయ స్థాయిలో అందనున్న విద్య కోహెడరూరల్(హుస్నాబాద్): అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్యను అందించే లక్ష్యంతో కోహెడ మండలంలోని తంగళపల్లిలో సమీకృత గురుకుల పాఠశాలను నిర్మించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఇటీవలే గ్రామ శివారులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంగ్లిష్ మీడియంలో 5 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు బోధన అందనుంది. అంతర్జాతీయ స్థాయి బోధన సమారు 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి పిల్లలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో అంతర్జాతీయ స్థాయిలో విద్య అందించనున్నారు. ఈ సమీకృత గురుకులంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయి. 5 నుంచి 12వ తరగతి వరకు నిర్వహిస్తారు. విద్యార్థులకు లైబ్రరీలతో పాటు కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అన్ని తరగతులు డిజిటల్ బోర్డుల ద్వారా బోధించనున్నారు. కార్పొరేట్‌కు దీటుగా విద్య పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థులకు అన్ని తరగతుల్లో కంప్యూటర్, డిజిటల్ బోర్డుల ద్వారా బోధన జరగనుంది. చదవుల పేరిట ఒత్తిడి స్పష్టించే వాతావరణం కాకుండా క్రీడలు, వినోదం వంటిని విద్యార్థులకు అందుతాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుకు ప్రత్యేక కృతజ్ఞలు. – పొన్నం ప్రభాకర్, బీసీ, రవాణా శాఖ మంత్రి -
నా భూమిని నాకు ఇప్పించండి సారూ..
నాపేరు కౌసల్య. గౌరాయపల్లి. కొమురవెల్లి మండలం. నాభర్త రాంరెడ్డి 2019లో మరణించాడు. గ్రామశివారులో సర్వే నంబర్ 107/ఎ/4 లో 33 గుంటల భూమి నాభర్త పేరుపై ఉంది. ఆ భూమిని 2024లో నాపేరుపై మార్చుకున్నాను. మా గ్రామానికి చెందిన వ్యక్తి వేలిముద్రలు సరిగ్గా పడలేదని నమ్మించి. మళ్లీ వేలి ముద్రలు పెట్టించి తనపేరుపై మార్చుకోవడమేకాక, వేరే గ్రామానికి చెందిన వ్యక్తికి విక్రయించాడు. నాకు అన్యాయం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని నాభూమి నాకు ఇప్పించాలి. బాధిత వృద్ధురాలు కౌసల్య -
కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం
గజ్వేల్: కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేద, బడుగువర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడాలేనివిధంగా కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. వర్గీకరణ ద్వారా ఎస్సీల్లో అట్టడుగున నిలిచిన వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సముచిత న్యాయం చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, కాంగ్రెస్ నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, గజ్వేల్ నియెజకవర్గ శాఖ అధ్యక్షుడు అజహర్ తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి -
సమయపాలన పాటించని అధికారులు
● ఉదయం 11 గంటలవుతున్నా అరకొరగా హాజరు ● నిరీక్షణలో అర్జీదారులు ● పెండింగ్‌లో వందలాది వినతులుప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమం అపహాస్యమవుతోంది. సమస్యలపై వినతులను స్వీకరించేందుకు అధికారులు సరైన సమయానికి రాకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వినతుల స్వీకరణను కలెక్టర్ మనుచౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్‌లు సోమవారం ఉదయం 10:30గంటలకు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు సైతం ఆ సమయంలోగా హాజరుకావాలి. సుమారు 11 గంటలవుతున్నా 49 మంది అధికారులకు 12 మందే హాజరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వారి కోసం అర్జీదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. –సాక్షి, సిద్దిపేట జిల్లా ఉన్నతాధికారులే సమయ పాలన పాటించడంలేదు. ప్రజావాణి 10:30 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 10:45గంటల వరకు డీఎస్ఓ తనూజ, డీపీఓ దేవకీ దేవి, జిల్లా మత్స్య శాఖ అధికారి మధుసూదన్, డీఐసీ జనరల్ మేనేజర్ గణేశ్ రామ్, ఎల్డీఎం హరిబాబు, జీజీహెచ్ఆర్ఎంఓ డాక్టర్ శ్రావణి, ఏడీ మైన్స్ లింగస్వామి, ఎస్సీ వేల్ఫేర్ అధికారి హైమద్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అశోక్ కుమార్, డీడబ్ల్యూఓ లక్ష్మీకాంత్, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏడీ ల్యాండ్స్ సర్వే వినయ్ కుమార్‌లు ప్రజావాణికి హాజరయ్యారు.ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరుగా 11:20గంటల వరకు చేరుకున్నారు. సమయపాలన పాటించాలని రిజిస్ట్రర్ సైతం కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పలువురు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పలువురు చర్చించుకోవడం కనిపించింది. ఉన్నతాధికారులు డుమ్మా.. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఆయా శాఖల ఉన్నతాధికారులు విధిగా హాజరుకావాలి. కొందరు జిల్లా అధికారులు డుమ్మా కొట్టి.. కింది స్థాయి సిబ్బందిని ప్రజావాణికి పంపిస్తుండటం గమనార్హం. కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఉన్న శ్రద్ధ జిల్లా అధికారులకు ఉండటం లేదని పలువురు దరఖాస్తు దారులు ఆరోపిస్తున్నారు. పలువురు ఫోన్లలో బిజీ ప్రజావాణికి వచ్చిన అధికారులు పలువురు ఫోన్లలో మాట్లాడటమే సరిపోతోంది. కలెక్టర్‌కు వినతి ఇవ్వగానే వెంటనే ఆయా శాఖ జిల్లా అధికారిని పిలిచి అప్పగించి పరిష్కారించాలని ఆదేశిస్తున్నారు. దీంతో ఆ శాఖ అధికారికి సమస్య వివరించేందుకు దరఖాస్తు దారులు వెళ్తున్నారు. సదరు అధికారులు గంటల తరబడి ఫోన్లలో బిజీగా ఉండటంతో దరఖాస్తుదారులు ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు ఉన్నతాధికారులే ఇలా వ్యవహరించడం చర్చకు దారితీస్తోంది.కలెక్టరేట్ గోడలపై పెట్టుకుని రాస్తున్న వినతులుపెండింగ్లో 411 వినతులు ప్రజావాణికి వివిధ సమస్యలపై ప్రతి సోమవారం సుమారు 50 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. గతేడాది మార్చి 1 నుంచి ఈ ఏడాది మార్చి 10వ తేదీ వరకు 1,262 వినతులు రాగా వీటిలో 851 పరిష్కారమైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 411 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా భూ సమస్యలకు సంబంధించినవి ఎక్కువగా వస్తున్నాయి. తమ భూములు ఆక్రమించారని, సర్వే చేయించాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఇలా పలు సమస్యలపై వినతులు వస్తున్నాయి. సమస్యలను త్వరగా పరిష్కరించాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు. దరఖాస్తులు రాసేందుకు కనీసం టేబుళ్లు లేకపోవడంతో గోడలపై పెట్టుకుని వినతులను రాస్తున్నారు. వినతులు రాసుకునేలా టేబుళ్లను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. -
పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని సర్కార్
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాకరూరల్: పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో సోమవారం సాగునీటి కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సరం గడస్తున్నా కాలువలు పూర్తి కాలేదన్నారు. కాలువ నిర్మాణం పూర్తయితే మల్లన్న సాగర్ ద్వారా వచ్చే నీరు 30 గ్రామాలకు అందుతాయన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెడితే పంటలు ఎండి పోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణతోనే అందరికీ న్యాయం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు పరశురాములు చిన్నకోడూరు(సిద్దిపేట): వర్గీకరణతోనే మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని మహాజన్ సోషలిస్ట్ పార్టీ(ఎంఎస్పీ) జిల్లా అధ్యక్షుడు పరశురాములు అన్నారు. సోమ వారం ఎమ్మార్పీఎస్ లక్ష డప్పులు కార్యక్రమం చిన్నకోడూరులో నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ నాయకత్వంలో 30 ఏళ్ల పోరాట ఫలితం తుది దశకు చేరిందన్నారు. వర్గీకరణ అమలయ్యేంత వరకు గ్రూప్ ఫలితాలు, ఉద్యోగాల నోటిఫికేషన్లు నిలిపివేయాలన్నారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్, నాయకులు రంజిత్, రాజు, రమేష్, మురళీ, రవి, బాబు, కళాకారులు పాల్గొన్నారు. సమాజంలో మహిళల పాత్ర కీలకం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సమాజంలో మహిళల పాత్ర కీలకమని జిల్లా లీగల్ సెల్ అఽథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయిపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతిరెడ్డి మాట్లాడుతూ మహిళల హక్కులపై వివరించారు. అనంతరం స్వాతిరెడ్డిని, మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు పన్యాల భూపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిడి పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా స్థాయి కమిటీ నియామకం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బీజేపీ జిల్లా స్థాయి కమిటీని సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరిశంకర్ ముదిరాజ్ నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్‌గా నలగామ శ్రీనివాస్, కో కన్వీనర్లుగా తొడుపునూరి వెంకటేశం, భూరెడ్డి విభిషన్ రెడ్డిలను నియమిస్తున్నట్లు తెలిపారు. -
ఎవరికీ పట్టని ప్రజావాణి!
డిజిటల్ జమానా.. జేబులో ఫోన్ ఉంటే చాలు వివిధ రకాల చెల్లింపులకు నగదు బదిలీ సాధారణమైంది. తాజాగా ఈ ట్రెండ్ వివాహ వేడుకలకూ పాకింది. వివాహ వేడుకకు హాజరైన వారు డిజిటల్ పద్ధతిలో కూడా కట్నాలు చదివించుకోవచ్చు అన్నట్లు సంబంధీకులు ‘క్యూఆర్’ కోడ్ స్కానర్‌ను అందుబాటులో పెట్టారు. పెళ్లికి వచ్చిన వారు దీనిని చూసి నయా ట్రెండ్ భళే ఐడియా అంటూ ఆశ్చర్యపోయారు. డిజిటల్ కట్నాలు చదివించడం వర్గల్ మండలం గౌరారంలో చోటుచేసుకుంది. – వర్గల్(గజ్వేల్)మండుతున్న ఎండలకు మనుషులే తట్టుకోలేక పోతున్నారు. ఇక మూగ జీవాల సంగతి సరేసరి. కోతులు ఎండ వేడిమిని భరించలేక చెట్ల నీడను ఆశ్రయిస్తున్నాయి. మిరుదొడ్డిలో మిట్ట మధ్యాహ్నం వేళ వానరాలు స్థానిక పెద్దచెరువు కట్టపై ఉన్న చెట్ల నీడన చేరి ఉపశమనం పొందుతున్న ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక)న్యూస్‌రీల్ -
పెద్ద మాసాన్‌పల్లి అడవికి నిప్పు
తొగుట(దుబ్బాక): మండలంలోని పెద్ద మాసాన్‌పల్లి అడవికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. అడవి సమీపంలోని వ్యవసాయ బావుల వైపునకు మంటలు వ్యాపించాయి. దీంతో పరిస్థితిని గమనించిన గ్రామస్తులు జిల్లా ఫారెస్ట్ ఇన్చార్జి అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మంటలు ఆర్పేందుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకున్నారు. తమ వ్యవసాయ బావుల వద్ద పశువుల పాకలు, పాడిగేదెలు, గడ్డి వాములు ఉన్నాయని సదరు అధికారికి సమస్య విన్న వించారు. ఆలస్యంచేస్తే తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని విన్నవించారు. అయినా సదరు అధికారి స్పందించకుండా ఫోన్ చేసిన గ్రామస్తులపై రుసరుసలాడారు. తనకు ఎందుకు పోన్చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారంటూ గ్రామస్తులు తెలిపారు. రేపు ఉదయం చూద్దాంలే అంటూ ఫోన్కట్చేశాడని వారు తెలిపారు. ఇక ఆలస్యంచేస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదముందంటూ యువకులు మంటలు ఆర్పేందుకు తరలివెళ్లారు. ఈదురు గాలులు వ్యాపించడంతో మంటలు అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో గ్రామస్తులకు సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున అడవికి తరలివచ్చారు. వ్యవసాయ బావుల నుంచి పైపుల ద్వారా ఎంతో శ్రమించి మంటలు ఆర్పివేశారు. అడవికి నిప్పంటుకుందని సమాచారం ఇచ్చినా స్పందించని జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్పందించని ఫారెస్ట్ ఉన్నతాధికారి గ్రామస్తులే మంటలు ఆర్పిన వైనం -
సుందరంగా తీర్చిదిద్దుతాం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామి క్షేత్రాన్ని అన్ని విధాల సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లికార్జున స్వామి మా కుటుంబానికి ఇలవేల్పు అని, ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కట్టుబడి ఉందని, భక్తులకు కావల్సిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, ధర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, జయప్రకాశ్ రెడ్డి, తురాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయి..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయని మంత్రి పొన్నం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఆరోగ్యశ్రీని రూ.5 లక్షలనుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా నిధుల విడుదల చేశామని అన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను సైతం ఇస్తామని, మహిళను కోటీశ్వరులను చేసేందుకు ప్రభత్వం అనేక పథకాలను తీసుకురానుందని తెలిపారు. వేసవిలో గ్రామాలలో తాగునీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొమురవెల్లిలో వసతులు కల్పిస్తాం మల్లన్న స్వామి మా ఇంటి ఇలవేల్పు మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ స్వామి సన్నిధిలో కుటుంబసమేతంగా పూజలు -
సుడా.. ఇంకెప్పుడు బడా?
సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)ని విస్తరించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నేటికీ అమలు కావడంలేదు. సిద్దిపేట మున్సిపాలిటీ , 26 గ్రామాలే కాకుండా జిల్లా అంతటా విస్తరించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు విస్తరణకు అడుగు ముందుకు పడటంలేదు. దీంతో విస్తరణ ఉంటుందా? ఉండదా? అని పలువురు చర్చించుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు వెళ్లే మార్గం నుంచి రెండు కిలోమీటర్ల వరకు (మహానగరాభివృద్ధి సంస్థ) హెచ్ఎండీఏను విస్తరించాలని, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణించాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఉత్తర్వులిచ్చారు.. విస్తరణ మరిచారు ● ఆదేశాలిచ్చి నేటికి నాలుగు నెలలు ● ఇష్టారాజ్యంగా వెలుస్తున్న వెంచర్లు ● పట్టించుకోని అధికారులు ● డీటీసీపీ విలీనం జరిగేనా? సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) అక్టోబర్ 30, 2017న ఏర్పాటుచేశారు. సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 26 గ్రామాలతో సుడా పురుడు పోసుకుంది. సుడా విస్తరణ కోసం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న వర్గల్, ములుగు, మర్కూక్ మండలాలు కాకుండా మిగతా మండలాలను కలిపేందుకు కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. వాటిని పరిశీలించి గతేడాది అక్టోబర్ 15న పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. నేటికీ నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలు కావడం లేదు. నాలుగు మున్సిపాలిటీలు.. 286 గ్రామాలు డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) పరిధిలో గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలతో పాటు 22 మండలాల పరిధిలోని 286 గ్రామాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు డీటీసీపీని సుడాలో కలపలేదు. కొత్తగా ఉత్తర్వులు జారీ చేసిన దానిలో సిద్దిపేట అర్బన్, రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగనూరు, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్, అక్బర్పేట–భూంపల్లి, రాయపోలు, గజ్వేల్, కొండపాక, కుకునూరుపల్లి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, మద్దూరు, చేర్యాల, కొమురవెల్లి, బెజ్జంకి, దూల్మిట్ట మండలాలు రానున్నాయి. సుడా పరిధిలోకి వెళ్లాయని గ్రామ పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులు ఆక్రమ లేఔట్ల పై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. సుడా విస్తరణ జరిగితే ఆక్రమ లేఔట్లకు చెక్ పడనుంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి విస్తరణ చేయాలని పలువురు కోరుతున్నారు.ఇంకా క్లారిటీ రాలేదు.. సుడా విస్తరణపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. సుడాతో పాటు మిగతా పట్టణాభివృద్ధి సంస్థలకు సైతం వచ్చాయి. వాటిని ఇంకా ఏర్పాటు చేయలేదు. సుడా విస్తరణపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే డీటీసీపీ విలీనం అవుతుంది. – అశ్రిత్ కుమార్, వీసీ, సుడా -
రాజుల కోటలో రత్నాల వేట
కొల్చారం(నర్సాపూర్): రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఆనాటి చరిత్రను తెలిపే కోటలు మాత్రం ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అందులో వందల ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం కలిగిన రంగంపేట కోట ఒకటి. హైదరాబాద్ రాజ్యంలో ఉన్న 14 సంస్థానాల్లో ఒకటైన పాపన్నపేట సంస్థానం కింద నిజాం నవాబులచే రాయ్భాగన్గా బిరుదు పొందిన రాణి శంకరమ్మ దత్తపుత్రుడైన రాజా సదాశివరెడ్డి 1,700 సంవత్సర మధ్యకాలంలో ఈ కోటను నిర్మించారు. నిజాం పరిపాలనలో ఈ కోట ఆర్థిక భాండాగారంగా కొనసాగిందని చరిత్ర చెబుతుంది. అయితే ప్రస్తుతం ఆ కోట గుప్తనిధుల వేటగాళ్ల ధ్వంస రచనతో బీటలు వారింది. శిథిలావస్థకు చేరి అధ్వానంగా మారింది. ఎంతో చరిత్ర కలిగిన రంగంపేట కోట గురించి భావితరాలు తెలుసుకునేలా పురావస్తు శాఖ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే నిర్మాణానికి నాంది పాపన్నపేట, ఆందోల్ సంస్థానాల మధ్య రాణి శంకరమ్మ పరిపాలన సాగిస్తూ తిరుగులేని రాణిగా కొనసాగింది. వృద్ధాప్యం వచ్చే క్రమంలో రాజ్యాన్ని కాపాడాలన్న లక్ష్యంతో బాలుడైన రాజా సదాశివరెడ్డిని దత్తత తీసుకొని రాజుగా ప్రకటించింది. ఆయన ఆందోల్ నుంచి రంగంపేట మీదుగా ఎడ్ల బండిలో పాపన్నపేటకు మంది మార్బలంతో ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కోట నిర్మించిన రంగంపేట శివారులోకి రాగానే వేట కుక్కలను తరుముతున్న కుందేలు కనిపించింది. ఈ విషయమై రాజ పురోహితులతో చర్చించారని, ఇక్కడి స్థల ప్రాముఖ్యతను గుర్తించి కోట నిర్మాణానికి నాంది పలికారన్నది చరిత్ర చెబుతోంది. దాదాపు పదెకరాల విస్తీర్ణంలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించారు. అయితే కోటను కొంతమేరకైనా రక్షించాలన్న లక్ష్యంతో అధికారులు కోట చుట్టూ ఫెన్సింగ్, పల్లె ప్రకృతి వనం నిర్మించారు. గుప్త నిధుల తవ్వకాలతో.. ఆనవాళ్లు కోల్పోతున్న రంగంపేట కోట పట్టించుకోని ప్రభుత్వాలు పరిరక్షించాలంటున్న ప్రజలు -
3,500 నాటు కోళ్లు మృతి
నర్సాపూర్ రూరల్: అంతుచిక్కని వ్యాధితో నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్‌లో చోటు చేసుకుంది. లింగాపూర్ తండాకు చెందిన పాతులోత్ ప్రసాద్‌కు చెందిన 3,500 నాటు కోళ్లు అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడ్డాయి. కొన్ని రోజులుగా నాటు కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. అప్పులు చేసి రూ. 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నాటు కోళ్లను పెంచుతున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇటీవల నా షెడ్డు దగ్గరలో ఉన్న బాయిలర్ పౌల్ట్రీ షెడ్డులో కోళ్లు చనిపోయాయని, అదే వ్యాధి నాటు కోళ్లకు వ్యాపించి చనిపోయని ఆరోపించాడు. ప్రైవేట్ బాయిలర్ కోళ్ల కంపెనీ, లేదా ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ విషయమై పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి సౌమిత్‌ను వివరణ కోరగా.. అతి ఉష్ణోగ్రత కారణంగా కోళ్లు చనిపోయి ఉంటాయని, లేదా ఇంకా ఏదైనా వ్యాధితో మృతి చెంది ఉంటాయన్నారు. బర్డ్‌ప్లూ అని మాత్రం నిర్ధారించలేమన్నారు. మృతి చెందిన కోళ్లను ల్యాబ్‌కు పంపుదామంటే బాధితుడు కోళ్లను గోతిలో పాతి పెట్టడంతో ల్యాబ్‌కు పంపలేకపోయినట్లు చెప్పారు. పౌల్ట్రీ షెడ్డులు నిర్వహించే రైతులు కోళ్లకు ఏదైనా సమస్య వచి్చనట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖ వైద్య అధికారులను సంప్రదించాలని సూచించారు. -
సీసీఐ అక్రమాల్లో మరొకరు సస్పెన్షన్
హుస్నాబాద్‌రూరల్: పత్తి కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాల్లో హుస్నాబాద్ మార్కెట్ కార్యదర్శి ప్రభాకర్ సస్పెండ్ అయినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు శనివారం తెలిపారు. గతంలో మండల వ్యవసాయ అధికారితో పాటు జిల్లా మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయగా ఇప్పుడు హుస్నాబాద్ మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేశారు. జిల్లాలోని 23 సీసీఐ కేంద్రాల్లో బోగస్ టీఆర్‌లపై పత్తి విక్రయించిన వ్యాపారులు, పత్తి మిల్లులపై చర్యలు తీసుకొనేందుకు ప్రక్రియ కొనసాగుతున్నట్లు జిల్లా అధికారి ఒకరు తెలిపారు. హుస్నాబాద్ సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించిన వ్యాపారులపైనా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మహిళా శక్తి చాటాలివర్గల్(గజ్వేల్): వర్గల్ పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం మహిళాదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా అధ్యాపకులను ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిరంగాలలో మహిళలు పురోగమిస్తూ మహిళాశక్తి చాటాలన్నారు. మహిళలు సాధించిన విజయగాథలు స్ఫూర్తిగా విద్యార్థినులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైస్‌ప్రిన్సిపాల్ గోవిందరావు అన్నారు. ఏటీపీ ఉమామహేశ్వరి మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలోనూ ముందువరుసలో ఉంటారని, అదేవిధంగా విద్యార్థినులు పురోగమించాలన్నారు. అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు. ముగిసిన సదస్సు గురుకులంలో రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సదస్సు శనివారం ముగిసింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రసాయన శాస్త్ర సంబంధ మార్పులపై వక్తలు ప్రసంగించారు. గురుకుల ప్రిన్సిపాల్ డాక్టర్ గడ్డం భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీ. రాజారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్. గిరిబాబు, రిటైర్డ్ ప్రొఫెసర్ విటల్, డాక్టర్ రాధ, జానకి, విద్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లోనూ మహిళల రాణింపు
సిద్దిపేటకమాన్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు భవనంలో న్యాయమూర్తులు శనివారం కేక్ కట్ చేసి మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. మగ, ఆడ అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చదివించాలని తెలిపారు. మహిళ సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన, కుకింగ్ పోటీల్లో విజేతలకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, మిలింద్‌కాంబ్లి, శ్రావణి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ నిర్లక్ష్యమే కారణం
● వంటేరువి తప్పుడు ఆరోపణలు ● గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి గజ్వేల్: మల్లన్నసాగర్ నిర్వాసితులు ఇప్పటికీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ నరేందర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో సర్వం కోల్పోయిన త్యాగ ధనులను బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న తీరును అంతా గమనిస్తున్నారని చెప్పారు. సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నర్సింహారెడ్డి, సుఖేందర్‌రెడ్డి, కర్ణాకర్‌రెడ్డి, యాదయ్య, మాజీ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులపై చర్యలు తీసుకోండి
సిద్దిపేటకమాన్: హైకోర్టు ఆర్డర్‌ను ధిక్కరించిన పురపాలిక టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటీజన్ రైట్స్ సంస్థ రాష్ట్ర కార్యదర్శి శివచంద్రం అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి పట్టించుకోవడంలేదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సభ్యులు రాజు, రవితేజ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వీడాలి
నిర్వాసితుల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రభుత్వం దృష్టికి ఇబ్బందులను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలి. – కొమ్ము నరేష్, మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామం పల్లెపహాడ్ చివరి మజిలీకి కష్టాలు మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం సర్వం త్యాగం చేసిన మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శ్మశానవాటికలకు స్థలాల కేటాయింపు జరగకపోవడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికై నా సమస్య తీర్చాలి. – హైదర్‌పటేల్, మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామం సింగారం -
సాగేనా?
ఎల్ఆర్ఎస్ ముందుకుసాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఇప్పటికై నా ముందుకు సాగుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) కింద ప్లాట్ క్రమబద్ధీకరణ చేసుకునే వారికి ప్రభుత్వం రాయితీని కల్పించింది. 2020లో చేసిన దరఖాస్తు దారులు పలువురు ఇంటి నిర్మాణం, మరికొందరు ప్లాట్లను విక్రయించారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన రాయితీకి ముందుకు రావడం కొంత అనుమానంగానే ఉంది. అలాగే సర్వర్ చాలా నెమ్మదిగా ఉండటంతో దరఖాస్తు దారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,00,632 మంది దరఖాస్తు చేయగా 79,220 ప్లాట్లకు ఆటోమెటిక్ ఫీజు చెల్లింపు సమాచారాన్ని ఆయా ఫోన్ నెంబర్లకు పంపించారు. ఇంకా 21,412 ప్లాట్ల యజమానులకు ఫీజు చెల్లింపు సమాచారం వెళ్లలేదు. ఇప్పటి వరకు 27 మందే ఎల్ఆర్ఎస్ ఫీజు ఒకేసారి చెల్లిస్తే ప్రభుత్వం 25శాతం రాయితీని ప్రకటించింది. ఈ ఆఫర్‌ను ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభించింది. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటి వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీకి స్పందించి 27 ప్లాట్లకు ఫీజును చెల్లించారు. ఈ నెలాఖరులోగా చెల్లించిన వారికి ఈ ఆఫర్‌ను వర్తింపజేయనుంది. అలాగే 2020 ఆగస్టు 26 నాటికి లే అవుట్లలోని 10శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగితే మిగతా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో విక్రయ దస్తావేజుతో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. మరో మారు పరిశీలన నిషేధిత జాబితాల్లో లేని భూములు, చెరువులు, కుంటలకు 200మీటర్ల పరిధిలో లేని ప్లాట్ల దరఖాస్తులకు ఆటోమెటిక్‌గా ఫీజు సమాచారం పంపిస్తున్నారు. ఫీజు చెల్లించిన తర్వాత వాటిని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మరోసారి ఆ ప్లాట్‌ను పరిశీలించి అన్ని సరిగా ఉంటేనే అమోదం తెలపనున్నారు. వివిధ కారణాలతో దరఖాస్తు తిరస్కరణకు గురైతే ప్రాసెసింగ్ చార్జీల కింద 10శాతం మినహాయించుకుని మిగిలిన 90శాతం డబ్బులను వెనక్కి ఇస్తామని పురపాలక శాఖ ప్రకటించింది. అమోదం తెలిపిన వాటికి ల్ఆర్ఎస్ పే చేసినట్లు ధ్రువపత్రం జారీ చేయనున్నారు.ఈ నెలాఖరు వరకు 25శాతం రాయితీ జిల్లా వ్యాప్తంగా 1,00,632 దరఖాస్తులు ఫీజు చెల్లింపు సమాచారం 79,220 మందికే.. ఇప్పటికే చాలా వరకు చేతులు మారిన ప్లాట్లు మున్సిపాలిటీ దరఖాస్తులు ఫీజు చెల్లింపు చేర్యాల 6,069 2,575 దుబ్బాక 1,884 1,594 గజ్వేల్ 11,548 10,138 హుస్నాబాద్ 6,054 3,982 సిద్దిపేట 32,354 24,258 సుడా 21,380 20,688 గ్రామాలు 21,343 15,985 చేతులు మారాయి.. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసి ఇప్పటికీ ఐదేళ్లు కావస్తుండటంతో ప్లాట్లు చేతులు మారాయి. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ పలువురు ప్లాట్లను అర్థిక అవసరాల నిమిత్తం విక్రయించుకున్నారు. ఇలా కొన్ని ప్లాట్లు ఐదుగురు నుంచి ఆరుగురికి చేతులు మారాయి. దీంతో దరఖాస్తు చేసిన వ్యక్తి ప్రస్తుతం ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తి తెలియదు. దీంతో ఎల్ఆర్ఎస్ సమాచారం అందరికీ చేరడం లేదు. దరఖాస్తు చేసే సమయంలో సెల్ నెంబర్లను సైతం అప్లోడ్ చేశారు. అలాగే కొందరి ఫోన్ నంబర్లు పని చేయకపోవడంతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు సమాచారం చేరడం లేదు. సమాచారంసద్వినియోగం చేసుకోవాలి ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీని సద్వినియోగించుకోవాలి. ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. స్థలాలు కొనుగోలు చేసిన వారు, ఫోన్ నంబర్ మారిన వారు వారి వివరాలను అప్డేట్ చేయించుకోవాలి. స్థలం అమ్మిన వారు దరఖాస్తు చేస్తే వివరాలు అప్డేట్ చేసుకుంటే కొనుగోలు చేసిన వారి పేరు మీదనే ఎల్ఆర్ఎస్ ధ్రువపత్రం జారీ చేయనున్నాం. – వందనం, సీపీఓ, సుడా -
రాజీమార్గం.. సత్వర న్యాయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ● లోక్ అదాలత్‌లో 3,622 కేసుల పరిష్కారం సిద్దిపేటకమాన్: క్షణికావేశంలో చేసిన తప్పులను, పెండింగ్ కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ సరైన వేదిక అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో 3,557 క్రిమినల్, 50 సివిల్, 15 మోటారు ప్రమాద కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద కేసుల్లో రూ.1,01,65,000 బాధితులకు ఇప్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, మిలింద్‌కాంబ్లి, శ్రావణి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమయం వృథా చేసుకోవద్దుహుస్నాబాద్: లోక్ అదాలత్‌లో రాజీ మార్గంతో వివిధ కేసులు పరిష్కరించుకుంటే ఇరువురికి న్యాయం జరుగుతుందని ప్రిన్సిపాల్ సివిల్ కోర్టు అదనపు జడ్జి కృష్ణతేజ్ అన్నారు. శనివారం కోర్టు హాలులో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణతేజ్ మాట్లాడుతూ క్షణికావేశంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లకు కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునే గొడవలను కోర్టుల దాకా తెస్తున్నారన్నారు. రాజీ మార్గంతో కేసులను పరిష్కరించుకోవాలని జడ్జి సూచించారు. -
‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా వల్లూరు క్రాంతి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా వచ్చిన వార్తలను పరిశీలించి.. వాటిని క్షుణ్ణంగా చదివి.. ఆ వార్తల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేశారు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి. పాలన పరమైన విధుల్లో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలోని సంగారెడ్డి జిల్లా ఎడిషన్‌కు గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, ప్రతిభ చూపుతున్న మహిళలకు సంబంధించి విలేకరులు రాసిన ప్రత్యేక కథనాలు ఆమె చదివారు. వాటి ప్రాధాన్యతను కూడా గుర్తించి సబ్ ఎడిటర్లతో చర్చించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా పేజీల డిజైన్లను పరిశీలించారు. అలాగే వివిధ మండలాలు, పట్టణాల నుంచి వచి్చన వార్తలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఈ కథనాలు మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కితాబిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా వారిని ప్రోత్సహిస్తూ.. స్ఫూర్తిదాయక కథనాలు మరిన్ని రావాలని ఆకాక్షించారు. దినపత్రికకు గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించడం తనకు ఎంతో మంచి అనుభూతిని ఇచి్చందన్నారు. పత్రిక నిత్యం ప్రజాసమ స్యలను వెలికి తీస్తుండటంతో.. ఆ సమస్యలు అధికార యంత్రాంగం దృష్టికి వస్తాయని.. తద్వారా అధికార యంత్రాంగం వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. అధికారుల దినచర్య న్యూస్పేపర్లతోనే ప్రారంభమవుతందని చెప్పారు. పత్రిక పాఠకునికి చేరడం వెనుక ఆయా విభాగాలు ఎలా పనిచేస్తాయో తెలిసిందని అన్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.69.11లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామికి రూ.69.11లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ సిబ్బంది వెల్లడించారు. స్వామి వారి ఆలయంలో 15రోజుల హుండీ ఆదాయాన్ని మెదక్ దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు శుక్రవారం లెక్కించారు. నగదు రూ 69,11,633, విదేశి కరెన్సీ నోట్లు 14, మిశ్రమ బంగారం 46 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోల 200 గ్రాములు, పసుపు బియ్యం15 క్వింటాళ్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం నగదును స్థానిక తెలంగాణ గ్రామీణావికాస్ బ్యాంక్‌లో జమ చేశారు. రాజీపడేట్లు చూడాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ అయ్యేట్లు చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, మోటారు రోడ్డు ప్రమాద కేసుల్లో రాజీ కుదిర్చి అధిక మొత్తంలో కేసులు రాజీ అయ్యేట్లు చూడాలన్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా న్యాయవాదులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, మిలింద్‌కాంబ్లి, శ్రావణి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి, సెక్రటరీ మంతూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
పేదల పాలిట పెళ్లి పెద్ద
నర్సాపూర్: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతుగా సహాయం చేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి. తన మిత్రుడు హకీం ఇచ్చిన సూచన మేరకు నియోజకవర్గంలో జరిగే ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందజేయాలని నిర్ణయించారు. సుమారు 12 ఏళ్ల క్రితం అమలులో పెట్టారు. అయితే వాటిని అందజేసే సమయంలో ప్రచారం కోసం ఆరాటపడటం లేదు. ఇప్పటివరకు సుమారు 2,500 మంది ఆడపిల్లలకు రఘువీరారెడ్డి పుస్తె మెట్టెలు అందజేశారు. శక్తి ఉన్నంత వరకు పేద కుటుంబాలకు అండగా నిలుస్తానని అన్నారు. గతంలో ఒక ఆడ కూతురుకు పుస్తె మెట్టెలు ఇవ్వడానికి రూ. 8 వేల వరకు ఖర్చు కాగా, ప్రస్తుతం రూ. పది వేలు అవుతున్నాయని చెప్పారు. కులమతాలకు అతీతంగా పేద వారికి సహాయం చేయడమే తన లక్ష్యమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. -
వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి
ములుగు(గజ్వేల్): ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.ఎస్ శ్రీనిధి సూచించారు. ములుగు మండలం అచ్చాయిపల్లిలో వారంరోజుల పాటు కొనసాగనున్న ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా శుక్రవారం విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ నియంత్రణ, స్వచ్ఛభారత్, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం లయన్స్‌క్లబ్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసి గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరూ పాత్రధారులు కావాలన్నారు. ప్లాస్టిక్ రహిత వస్తువులను వినియోగించాలన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని పరిసరాలు శుభ్రం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ములుగు అటవీకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనిధి -
ముందు మీ తప్పులను సరిదిద్దుకోండి
గజ్వేల్‌రూరల్: బీఆర్ఎస్కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని, ఇప్పటికై నా ఆ పార్టీ నాయకులు బీజేపీని విమర్శించే ముందు తమ తప్పులను సరిచేసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో గల త్రిశక్తి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జన ఔషది దివాస్ సందర్భంగా గజ్వేల్‌లోని జనరిక్ మెడికల్ దుకాణంను సందర్శించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ.. బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, కేసీఆర్‌కు చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీసీకి కేటాయించేలా చూడాలని కవితకు సూచించారు. గతంలో ఈటెల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒకటి ఓసీలకు, మరొకటి బీసీలకు కేటాయించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, నాయకులు ఎల్లు రాంరెడ్డి, నలగామ శ్రీనివాస్, జశ్వంత్‌రెడ్డి, వెంకటరమణ, రాంరెడ్డి, కుడిక్యాల రాములు, శివకుమార్, శశిధర్‌రెడ్డి, సురేష్, మహేష్, మనోహర్‌యాదవ్, అశోక్‌గౌడ్, జన ఔషధి దుకాణం నిర్వాహకులు రమణాచారి, వినోద్‌తోపాటు ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్‌రావు -
రాష్ట్రంలోనే తొలి స్క్రాపింగ్ కేంద్రం
జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి కొండల్రావువర్గల్(గజ్వేల్): కాలుష్య నియంత్రణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను స్క్రాపింగ్ చేసేందుకు రాష్ట్రంలోనే తొలి కేంద్రం ఏర్పాటైంది. వర్గల్ మండలం చందాపూర్‌లో పాతవాహనాలను రీసైక్లింగ్ చేసేందుకు అంబర్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహన స్క్రాపింగ్కేంద్రాన్ని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి కొండల్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలోనే ఇది తొలి స్క్రాపింగ్ కేంద్రమన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరు పదిహేనేళ్లు ముగిసిన కాలం చెల్లిన వాహనాలను స్క్రాపింగ్ కేంద్రాలలో అప్పగించి సహకరించాలని సూచించారు. కాలుష్యకారక, కాలం చెల్లిన వాహనాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీతో స్క్రాపింగ్ విధానాన్ని అమలుచేస్తున్నాయని తెలిపారు. కాలం చెల్లిన వాహనాల వాహనాల స్క్రాపింగ్ కోసం వాటి యజమానులకు ప్రభుత్వం వివిధ రకాల రాయితీలతో ప్రోత్సహిస్తుందని వివరించారు. -
చిన్న వయసులో.. ‘నిర్మల’మైన మనసు
● కష్టాలు ఓరుస్తూ.. కుటుంబ భారం మోస్తూ ● కూరగాయలు అమ్ముతున్న విద్యార్థిని నారాయణఖేడ్: ఆ కుటుంబానికి కష్టాలు చుట్టముట్టాయి.. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు.. ఇంటినిండా ఆడపిల్లలు.. పెద్దల నుంచి వచ్చిన అర ఎకరం పొలం.. తండాలో చిన్నపాటి ఇల్లు.. ఆ దంపతులు పడరాన్ని పాట్లు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. ముగ్గురు ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసి పంపేసరికి రూ.12 లక్షల అప్పు. ఆ కుటుంబం మరింత కష్టాల్లోకి నెట్టి వేయబడింది. ఈ కష్టాలను చూసిన నాలుగో కూతురు ఓ రాణి రుద్రమలాధైర్యాన్నిస్తూ తల్ల్లిదండ్రుల వెన్ను తట్టింది.. నారాయణఖేడ్ మండలం చందర్‌నాయక్ తండాకు చెందిన చందర్, చాందీబాయికి ఆరుగురు సంతానంలో ఐదుగురు కూతుళ్లే. లత, బూలి, బుజ్జి, నిర్మల, వైశాలి తర్వాత పవన్ పుట్టాడు. లత, బూలి, బుజ్జిబాయిల వివాహమైంది. రూ.12 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అర ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ ఖేడ్ పట్టణంలో విక్రయిస్తున్నారు. నాలుగో కూతురు నిర్మల సిద్దిపేటలో హాస్టల్లో ఉంటూ 10వ తరగతిలో 9.8 జీపీఓ ఉత్తీర్ణత సాధించింది. ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినా తండ్రి అనారోగ్యానికి గురవ్వడం కుటుంబ భారం వల్ల వెళ్లలేదు. ఖేడ్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో అడ్మిషన్ అయ్యింది. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఓ కానిస్టేబుల్ కొనిచ్చిన నీట్ ప్రిపరేషన్‌కు సంబంధించిన పుస్తకాలను పఠనం చేస్తుంది. తమ అర ఎకరం పొలంలో నిత్యం పండిన కూరగాయలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తెల్లవారు 3 గంటలకు వచ్చిన నిర్మల బీట్‌లో కూరగాయలు కొని దుకాణంలో సర్ది 8 గంటల వరకు వ్యాపారం.. అనంతరం తండాకు వెళ్లి 9 గంటలకు కళాశాలకు వెళ్తుంది. ఇలా కష్టపడుతున్న నిర్మల ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తూ తన లక్ష్యం డాక్టర్ కావాలని.. మరో సోదరి, సోదరుణ్ణి జీవితంలో వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలని చెబుతుంది. చదువులో నిర్మల మంచి ప్రతిభ కనబరుస్తుందని ఉపాధ్యాయులూ చెబుతున్నారు. -
ఆకాశవాణి.. మహిళా కేంద్రం
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘం రేడియో స్టేషన్లో కార్యక్రమాలన్నింటినీ మహిళలే నిర్వహిస్తున్నారు. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ ప్రతి నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారంచేస్తున్నారు. జహీరాబాద్: గ్రామాలకు వెళ్లి సమాచారం సేకరణ ఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో 1998 సంవత్సరంలో సంఘం రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రసారాలు అందుతున్నాయి. 90.4 ఫ్రీక్వెన్సీలో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలను అందిస్తున్నారు. మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన అల్గోల్ నర్సమ్మ, పస్తాపూర్ గ్రామానికి చెందిన జనరల్ నర్సమ్మ 1999 నుంచి రేడియో స్టేషన్ నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ప్రసారాలకు కావాల్సిన సమాచారాన్ని ఆడియో రికార్డింగ్ చేసుకుంటారు. డీడీఎస్‌కు సంబంధించి పలు కార్యక్రమాలను చూస్తున్న ఏడుగురు మహిళలు రేడియో ప్రసారాలకు సంబంధించిన కార్యక్రమాలను గ్రామాలకు వెళ్లినప్పుడు ఆడియో రికార్డింగ్ చేసుకొని స్టేషన్ నిర్వాహకులకు అందిస్తున్నారు. వాటిని ఎడిట్ చేసుకొని ప్రసారం చేస్తారు. ముఖ్యమైన ప్రసారాలు మన ఊరి పంటలు, ఆరోగ్యం, సంఘాలు, చావిడికట్ట, భాష, మన రుచులు, పండుగలు, పాటలు, పర్యావరణం, బాలానందం, యారండ్ల ముచ్చట్లు తదితర కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నారు. భాషకు సంబంధించి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ భాషల్లో పెద్ద మనుషులతో వినిపిస్తారు. పొలంలో పనిచేసే సమయంలో, పెళ్లి సందర్భంలో, పుట్టినరోజు వేడుకలు, యువతులు పుష్పవతి అయిన సమయంలో పాడే పాటలను పరిచయం చేస్తారు. చిన్న పిల్లలకు సంబంధించి బాలానందం కార్యక్రమం నిర్వహించి పాటలు, కథలు వినిపిస్తారు. సీజన్ వ్యాధులు, చిన్న పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ముచ్చటిస్తారు. వ్యవసాయ విషయానికి వస్తే పంట వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు, ఏయే పంటలు వేయాలి, ఎరువులు, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం గురించి సూచనలు చేస్తారు.వారే మిక్సింగ్, కంపోజింగ్.. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ రేడియో స్టేషన్లో మిక్సింగ్, కంపోజింగ్, ట్రాన్స్మిషన్ నిర్వహణ, రికార్డు చేసిన కార్యక్రమాల ఎడిటింగ్ పనులను చూస్తారు. ప్రతీ నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారం చేసేంత వరకు వారే చూసుకుంటారు. ఇద్దరూ డీడీఎస్ డైరెక్టర్ దివంగత పీవీ సతీష్ వద్ద శిక్షణ పొందారు. అప్పటి నుంచి వారు ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మహిళల సంఘం రేడియో స్టేషన్ ప్రతీ నిత్యం రెండు గంటలపాటుకార్యక్రమాలు స్థానిక అంశాలే ప్రసారం -
విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి
ములుగు(గజ్వేల్): విద్యార్థులు వినూత్న ఆలోచనలను అన్వేషించాలని ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చ ర్ రీసెర్చ్(ఐసీఎఆర్)డిప్యూటీ డైరెక్టర్ జనరల్(విద్య) డాక్టర్.ఆర్.సి అగర్వాల్ సూచించారు. ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం సెంట్రల్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ గదిని వైస్ చాన్స్‌లర్ డాక్టర్.డి.రాజిరెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు వ్యవసాయ పురోగతికి చురుకుగా దోహదపడాలన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ గదులు అభ్యాస అనుభవాన్ని మెరుగుపరుస్తాయని, పరిశోధన, విద్యానైపుణ్యం కోసం విద్యార్థులకు అత్యాధునిక వనరులను అందిస్తాయని తెలిపారు. విశ్వవిద్యాలయ అధికారులు భగవాన్, లక్ష్మీనారాయణ, రాజశేఖర్, విజయ, శ్రీనివాసన్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
భూసేకరణ పూర్తి చేయాలి
కలెక్టర్ మనుచౌదరి హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ ప్రాంతంలోని గౌరవెల్లి ప్రాజెక్టు కెనాల్ కాల్వలు, రంగనాయకసాగర్ నుంచి కోహెడ మండలంలోకి వచ్చే కెనాల్ కాల్వల భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయలంలో భూసేకరణపై తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గం గుండా జాతీయ రహదారి వెళ్తోందని, రోడ్డు పనులు ఆగిన చోట భూసేకరణ సమస్య పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం భూములను గుర్తించాలనని అదేశించారు. సమావేశంలో ఆర్డీఓ రాంమూర్తి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి ఉన్నారు. ఎఫ్బీఓ రోల్ మోడల్‌గా నిలవాలి అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రసిద్ధ ఎఫ్బీఓ అందరికీ ఒక రోల్ మోడల్‌గా నిలవాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రసిద్ధ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సీఈవో, డైరెక్టర్లు,అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ఏం పంటలు పండిస్తున్నారనే విషయాలను తెలుసుకొని రాష్ట్రంలో వివిధ మార్కెట్లో ధరలను గురించి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు గుర్తించి మనం ఎలాంటి పంటలను ఎగుమతి చేయాలనే విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. అలాగే మండలంలోని అంతకపేట జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలల్లో నిర్మాణ్ సంస్థ సౌజన్యంతో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న కంప్యూటర్ ల్యాబ్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పదోవ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీవో బానోతు జయరామ్, వ్యవసాయ అధికారి సుల్తానా, ఎంఈవో గుగులోతు రంగనాయక్ పాల్గొన్నారు. పరీక్షలంటే భయం వద్దు డీఐఈఓ రవీందర్‌రెడ్డి దుబ్బాకటౌన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వసతులను పరిశీలించారు. అనంతరం దుబ్బాక మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల వేళ తమ విలువైన సమయాన్ని వృథా చేయవద్ధని సూచించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన మైనార్టీ కళాశాలకు చెందిన భానుప్రసాద్, సుభాష్‌ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యుడు దేవయ్య, కస్టోడియన్ శివకుమార్, మైనారిటీ కళాశాల ఉపాధ్యాయులు, వార్డెన్ హమీద్, తదితరులు పాల్గొన్నారు. మహిళల సాధికారతలేనిదే అభివృద్ధి లేదు: రంగనాథ్కొమురవెల్లి(సిద్దిపేట): మహిళల స్థితి గతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదని జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి రంగనాథ్ అభిప్రాయపడ్డారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మహిళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏంఈవో రమేశ్‌తో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...సమాజ నిర్మాణంలో సగభాగమైన మహిళ సమానత్వమే మన ప్రగతికి మూలాధారమన్నారు. అనంతరం పాఠశాలోని మహిళ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్, మధ్యాహ్న భోజన కార్మికులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లావణ్య, ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయులు కరుణశ్రీ,, సత్యానారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
దుబ్బాకటౌన్: మేలైన యాజమాన్య పద్ధతులతో పొద్దు తిరుగుడు సాగులో అధిక దిగుబడులు పొందవచ్చని తోర్నాల వ్యవసాయ పరిశోధన క్షేత్రం ప్రధాన శాస్త్రవేత్త శ్రీదేవి అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం మంతూర్‌లో పొద్దుతిరుగుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పొద్దుతిరుగుడు పంటను పరిశీలించారు. కార్యక్రమానికి భారతీయ నూనె గింజల పరిశోధన ప్రధాన శాస్త్రవేత శ్రీనివాస్, రాజేంద్రనగర్, కోయంబత్తూర్ శాస్త్రవేత్తలు శశికళ, సెంథిల్, రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారి కవిత, మంతూర్ రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు మానవాళికి దిక్సూచి
సిద్దిపేట ఎడ్యుకేషన్: మహిళలు మానవాళికి దిక్సూచి అని, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళలు అన్ని రకాలుగా స్వేచ్ఛగా ఉండాలన్నారు. ఎన్సీసీ ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. అనంతరం గరిమా అగర్వాల్‌ను సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, ఎన్సీసీ కేర్ టేకర్ కృష్ణయ్య, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ గోపాల సుదర్శనం, డాక్టర్ మామిద్యాల శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలి హుస్నాబాద్‌రూరల్: పట్టణ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో సుందరీకరణ పనులకు సంబంధించి శుక్రవారం అధికారుల చేత కొలతలు చేయించారు. అభివృద్ధి పనులు ఎక్కడా అసంపూర్తిగా లేకుండా కమిషనర్ చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయం పాఠశాలను తనిఖీ చేశారు. హాస్టల్లోని సరుకులను పరిశీలించారు. నాణ్యత లేని వంట సరుకులను ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయరాదన్నారు. ఇంటర్ విద్యార్థులు పరీక్షలు బాగా రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలయ అభివృద్ధి పై ఈఓ కిషన్‌రావును అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, కమిషనర్ మల్లికార్జున్, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, డీఎల్పీఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ మనీల ఉన్నారు.జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ -
బీఆర్ఎస్ నేతలతో భేటీ.. కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. ఎమ్మెల్సీగా ఎవర్ని నిలపాలన్న విషయంపై అభిప్రాయాలను కేసీఆర్ తీసుకున్నారు. యాసంగి పంటకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిర్ణయించారు. హామీల అమలుకై పోరాటాలకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు.బహిరంగ సభపై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్‌ను నిలదీయాలని కేసీఆర్ సూచించారు. -
సాగునీటిని అందించండి
మంత్రి ఉత్తమ్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు చేర్యాల(సిద్దిపేట): తపాసుపల్లి రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపి చేర్యాల ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈమేరకు గురువారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి పలువురు కాంగ్రెస్ నాయకులు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల ప్రాంత రైతన్నలు సాగు నీటి కోసం పడుతున్న కష్టాలను మంత్రికి వివరించామన్నారు. స్పందించిన మంత్రి రంగనాయకసాగర్ డీ10 కెనాల్‌ద్వారా కమలాయపల్లి, అర్జునపట్ల, అకునూరు, జాలపల్లి, లింగాపూర్, దూల్మిట్టకు సాగునీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్–3 మోటార్లు ప్రారంభించి గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాసుపల్లి రిజర్వాయర్లను నింపి రైతులకు సాగు నీరు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారని వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మద్దూరు, చేర్యాల మాజీ జెడ్పీటీసీలు గిరి కొండల్‌రెడ్డి, కొమ్ము నర్సింగరావు, నాయకులు, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు. -
పీఎఫ్ కార్యాలయ తరలింపు నిలిపివేత
మెదక్ ఎంపీ రఽఘునందన్‌రావు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని పీఎఫ్ కార్యాలయాన్ని తరలించవద్దని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరగా, వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. గురువారం నగరంలో జరిగిన తెలంగాణ జోనల్, రీజినల్ పీఎఫ్ కార్యాలయ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మన్సుఖ్ మాండవీయాలు హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న పీఎఫ్ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించకుండా చొరవ చూపాలని ఎంపీ కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. అందుకు గాను కార్యక్రమంలోనే పీఎఫ్ కమిషనర్ రమేష్‌కృష్ణమూర్తికి ఆదేశాలు జారీ చేశారన్నారు. సిద్దిపేట పీఎఫ్ కార్యాలయ తరలింపును నిలిపివేయడంతో ఎంపీ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. -
రెండో రోజూ ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్లు తెలుగు, హిందీ, సంస్కృతం తదితర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జనరల్, ఒకేషనల్ మొత్తం కలిపి 9,452 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 335 మంది గైర్హాజరు అయ్యారు. 9117 మందితో 97శాతం హాజరు నమోదైంది. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి పట్టణంలోని ప్రభుత్వ కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంతో పాటు పలు ప్రైవేట్ కళాశాలల పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈసీ సభ్యులు గంగాధర్, జ్యోతి ఉదయం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లోని కస్టోడియన్ సెంటర్‌ను సందర్శించి ప్రశ్నపత్రాల బెండల్స్‌ను సీఎస్, డీఓలకు పంపిణీ చేసే విధానాన్ని పర్యవేక్షించారు. హైపవర్ కమిటీ సభ్యులు హిమబింధు చేర్యాల, ముస్త్యాల కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు తొగుట, మిరుదొడ్డి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి సీఎస్, డీఓలను వివరాలు అడిగి తెలుసుకుని, రికార్డులను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. 97 శాతం హాజరు పరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీలు -
అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
ఈ చెట్ల నుంచి వెలువడే పుప్పొడి వల్ల ఆస్తమా వ్యాధి గ్రస్తులు నరక యాతన అనుభవించాల్సి వస్తుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే పుప్పొడి రేణువులను పీల్చడం వల్ల ఊపిరి తిత్తుల్లో సమస్యలు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. చర్మ ఎలర్జీలు సంభవిస్తాయి. శ్వాస కోశ సంబంధ వ్యాధి గ్రస్తులు ఈ చెట్టు పరిసరాల్లో ఉండక పోవడం మంచిది. చెట్లు పుష్పించక ముందే శాఖలను ఎప్పటికప్పుడు తొలగించాలి. – లింగమూర్తి, సీహెచ్ఓ, పీహెచ్సీ, మిరుదొడ్డి -
చెంతనే ప్రాణాంతక చెట్లు
‘కోనోకార్పస్’తో ముప్పు! ● జిల్లా వ్యాప్తంగా విస్తరింపు ● పేరు వింటేనే హడలిపోతున్న జనం ● వెంటాడుతున్న శ్వాసకోశ వ్యాధులు ● గాలి పీల్చినా ప్రమాదమే ● జీవ వైవిధ్యానికి.. పర్యావరణానికి హాని ● తొలగించాలని సర్వత్రా డిమాండ్ ● అయినా స్పందించని అధికారగణంమిరుదొడ్డి(దుబ్బాక): పచ్చదనం, అందం, ఆకర్శణీయంగా కనిపించే కోనోకార్పస్ చెట్టు పేరు వింటేనే గ్రామీణ, పట్టణ ప్రజలు హడలి పోతున్నారు. ఈ చెట్టు ఉన్న ప్రాంతాల్లో అన్నీ సమస్యలే అంటూ జనం బెంబేలెత్తుతున్నారు. నీటి తడి లేకున్నా సరే మండుటెండలో సైతం పచ్చగా చిగురిస్తూ సకల సమస్యలను తెచ్చిపెడుతోంది. పచ్చదనం పరిశుభ్రత పేరుతో గత హరితహారం కార్యక్రమాల్లో నాటిన ఈ కోనోకార్పస్ చెట్లు జనాలకు రోగాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ చెట్లు పుష్పించి వెదజల్లే పుప్పొడి వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు ఆజ్యం పోస్తాయని డాక్టర్లు సైతం హెచ్చరిస్తున్నారు. వెంటనే ఈ చెట్లను తొలగించాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తున్నా అధికార యంత్రాంగం ముందుకు రావడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి ఉపయోగం చేని చెట్టు హరితగ్రామాలుగా తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా అధికారులు లక్షల్లో కోనోకార్పస్ చెట్లను నాటారు. నీటి ఎద్దడిని తట్టుకునే ఈ చెట్లు తక్కువ కాలంలోనే పచ్చగా ఎదుగుతూ ఆకర్శిణీయంగా మారాయి. ముఖ్యంగా ఈ చెట్ల ఆకులును పశువులుగానీ తినలేవు. కనీసం పక్షులు కూడా వాలలేవు. గూళ్ళు సైతం కట్టలేవు. ఇక రాత్రయిందంటే చాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దుష్ప్రరిణామాలను చూపించే ఈ చెట్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అనారోగ్య సమస్యలు ఉత్పన్నం మండుతున్న ఎండల్లో సైతం ఈ చెట్లు పచ్చగా కళకళలాడే ఈ కోనోకార్పస్ చెట్లు సకల రోగాలను అంటగడుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ చెట్లు పుష్పించి గాలిద్వారా వెదజల్లే పుప్పొడి వల్ల శరీరంపై అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధ వ్యాధులకు ఆజ్యం పోస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు ఈ చెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చెట్ల వేళ్లతో సతమతం అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ఈ కోనోకార్పస్ చెట్ల వేళ్లు సైతం సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా తాగు నీటి సమస్యను అస్తవ్యస్తం చేస్తూ వేళ్లు పాతుకు పోతున్నాయి. మిషన్ భగీరథ పైపుల్లోకి వెళ్ళు చొచ్చుకెళుతుండటంతో నీటి పరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయి గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి పరఫరాను పున:రుద్ధరించడం కోసం మిషన్ భగీరథ సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వస్తుంది.నిషేధం ఉన్నా.. దేశంలోని తెలంగాణ రాష్ట్రంతో పాటు, ఆంధ్ర, గుజరాత్, అసోం, కర్ణాటక వంటి రాష్ట్రాలు నిషేధించినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం హరితహారంలో విరివిగా కోనోకార్పస్ చెట్లను నాటుతున్నారు. చెట్ల చరిత్ర ఇదీ.. కోనోకార్పస్ చెట్లు నాటిన నాటి నుంచి తక్కువ కాలంలోనే వేరు వ్యవస్థ వేగంగా పాతుకుపోవడం వల్ల చెట్లు నిండుగా పచ్చదనంతో ఆకర్శణీయకంగా పెరుగుతాయి. పాశ్చాత్య దేశాల్లో రోడ్లు, పార్కులు, ఉద్యానవనాల్లో సుందరీకరణ కోసం పెంచితే, ఊష్ణ దేశాల్లో సంభవించే ఇసుక తుపాన్లను అడ్డుకోవడానికి తీర ప్రాంతాలల్లో కోనోకార్పస్ చెట్లను విరివిగా పెంచుకుంటారు. అయినప్పటికీ ఎక్కువగా దుష్ఫ్రరిణామాలు కలిగించే ఈ చెట్లను చాలా దేశాలు నిషేధించాయి కూడా. -
ఎమ్మెల్సీ రేసులో సీపీఐ
చాడాకు చాన్స్ దక్కేనా? ● అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ● హుస్నాబాద్‌లో కాంగ్రెస్ గెలుపునకు కృషి ● ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి షెడ్యూల్ విడుదలసాక్షి, సిద్దిపేట: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్సీ స్థానాల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. అందులో రెండు ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీలు హసన్ మీర్జా, ఎగ్గె మల్లేఽశం, శేరి సుభాష్‌రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగయనుంది. దీంతో రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ లు ఖాళీ అవుతున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ గత నెల 28న షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 13న నామినేషన్ల పరిశీలన, 20న పోలింగ్ ఉండనుంది. మొదట హుస్నాబాద్ సీటుపై.. అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్, సీపీఐ పార్టీల పొత్తులో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సీటును సీపీఐకి కేటాయించాలని పట్టు పట్టారు. హుస్నాబాద్, కొత్తగూడెంలలో సీపీఐకి పట్టు ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ రెండు స్థానాలను అడిగారు. చివరకు హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌కు కేటాయించారు. పొత్తులలో కొత్తగూడెం సీటును కూనంనేని సాంబశివరావు కు కేటాయించారు. సీపీఐ అధిష్టానం సూచించిన ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చినట్లు ప్రచారం. పొన్నం గెలుపు కోసం.. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ గెలుపొందేందుకు సీపీఐ నేతలు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారంలో నిత్యం పాల్గొని విజయానికి కృషి చేశారు. చాడాకు అవకాశం వచ్చేనా? 2004లో ఇందుర్తి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా చాడ వెంకట్ రెడ్డి గెలుపొందారు. రేకొండ సర్పంచ్‌గా, చిగురుమామిడి ఎంపీపీ, జెడ్పీటీసీగా చాడ వెంకట్‌రెడ్డి పని చేశారు. దీనితో తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించినట్లు తెలిసింది. చాడ కే అవకాశం దక్కుతుందని అంతా ఎదురు చూస్తున్నారు.కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్‌లను కలిసిన సీపీఐ నేతలు ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్‌కు 4, బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు దక్కే వాటిలో సీపీఐకి ఒకటి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే సీపీఐ నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిశారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, తక్కల్లపల్లి శ్రీనివాస్ రావులు కలిసిన వారిలో ఉన్నారు. -
ఇక్కడి పాలు ఇక్కడే విక్రయం
సేకరించిన రోజే సరఫరా ● స్వచ్ఛమైన, నాణ్యమైన పాలే లక్ష్యం ● రైతు, వినియోగదారుడు రెండు కళ్లు ● విజయ డెయిరీ ప్రభుత్వ రంగ సంస్థకు చెందినది ● ‘సాక్షి’తో విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని పాడి రైతుల నుంచి సేకరించిన పాలను ఇక్కడే విక్రయిస్తున్నామని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) శ్రీనివాస్ తెలిపారు. వినియోగదారులకు కల్తీ లేకుండా, స్వచ్ఛమైన, నాణ్యమైన పాలను అందించడమే లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా 295 పాల సేకరణ కేంద్రాలున్నాయన్నారు. రోజుకు దాదాపు 30వేల లీటర్ల పాలను 7,400 మంది రైతుల నుంచి సేకరిస్తున్నామని చెప్పారు. ‘సాక్షి’తో డీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ అదే రోజూ పాలను ప్యాకింగ్ చేసి ఫ్రెష్‌గా అందిస్తున్నామన్నారు. ఇతర ప్రైవేట్ డెయిరీలైతే.. సేకరించిన తర్వాత రెండు రోజుల తరువాత మార్కెట్లో పాలను విక్రస్తుంటాయన్నారు. విజయ పాల పేరుతో పలువురు ఇతర ప్రైవేట్ డెయిరీలలో ప్యాకింగ్ చేసి విక్రస్తున్నారని మా దృష్టికి వచ్చిందని, ఆ పాలతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన తెలంగాణ విజయ పాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వినియోగదారులు అందరూ విజయ తెలంగాణ లోగో ఉందో లేదో చూసి కొనుగోలు చేయాలని కోరారు. సన్న, చిన్నకారు రైతుల నుంచే.. విజయ డెయిరీకి రైతు, వినియోగదారుడు రెండు కళ్లు లాంటి వారన్నారు. దేశంలో ఎక్కడా కొనుగోలు చేయని ధరకు రైతుల దగ్గరి నుంచి పాలను విజయ డెయిరీ కొనుగోలు చేస్తోందన్నారు. సన్న, చిన్నకారు రైతుల నుంచే మా సంస్థ పాలను ఎక్కువగా కొనుగోలు చేస్తోందని శ్రీనివాస్ వివరించారు. విజయ తెలంగాణ పాలలో కృత్రిమ పదార్థాలు కలపబోమని, రైతు నుంచి సేకరించిన పాలనే అందిస్తున్నామన్నారు. వినియోగదారులకు ఎలాంటి కల్తీ లేకుండా, స్వచ్ఛమైన నాణ్యమైన పాలను అందించడంలో రాజీపడబోమన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విజయ తెలంగాణ పాలనే అందజేస్తున్నామని, అలాగే కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి సైతం విజయ నెయ్యినే సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. -
చేనేతలకు మరింత భరోసా
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025సిద్దిపేటజోన్: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, వారికి మరింత భరోసా ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని పీసీసీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ తెలిపారు. సీఎంను నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చేనేత పరిశ్రమకు కొత్త సంక్షేమ పథకాలను అమలు చేసి కార్మికులను ఆదుకుంటామని, అన్ని సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని సీఎం చెప్పారన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు అర్హులైన చేనేత కార్మికులకు అందేలా పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.న్యూస్‌రీల్ -
మహిళలకు ఉచిత న్యాయ సలహాలు
న్యాయమూర్తి స్వాతిరెడ్డి హుస్నాబాద్: మహిళలకు ఏ సమస్య తలెత్తినా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం మహిళ సంఘా ల సభ్యులకు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశా రు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయన్నారు. గెలిచేది ఆడ, మగ అని కాదని, నైపు ణ్యం, సమర్థత ఎవరికి ఉంటుందో వారే ఉన్నతమైన హోదాలో ఉంటారన్నారు. ఆలోచనలో మార్పు రావాలని, ఆ మార్పుకు మహిళలే తొలి అడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సీడీపీఓ జయమ్మ, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్, న్యాయవాదులు పాల్గొన్నారు. దరఖాస్తులు తక్షణం పరిష్కరించండి సీపీ అనురాధసిద్దిపేటకమాన్: ఫిర్యాదు బాక్సులలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీపీ అనురాధ సిబ్బందికి సూచించారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో షీటీమ్, భరోసా, స్నేహిత మహిళా సెంటర్ సిబ్బందితో సీపీ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు, మహిళల రక్షణకు మేమున్నామని పూర్తి నమ్మకం, భరోసా కల్పించాలన్నారు. హాట్ స్పాట్లపై మరింత నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. హాట్‌స్పాట్ పరిసర ప్రాంతాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని సీఐ దుర్గకు సూచించారు. బాలికలు, అబ్బాయిలు కనబడితే వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఏవరైనా వేధిస్తే డయల్ 100 లేదా షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ సీఐ దుర్గ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్‌గౌడ్, షీటీమ్, భరోసా సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తైబజార్ డబ్బుల రికవరీలో అవినీతి రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీలో తైబజార్ వేలం పాటకు సంబంధించి డబ్బుల రికవరీలో అవినీతి చోటు చేసుకుందని సీఐటీయూ, కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీధర్‌రెడ్డి, రమేశ్ గురువారం మన్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2018 నుంచి తాము తైబజార్ వేలానికి సంబంధించి వివరాల కోసం ఆర్టీఐ ద్వారా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. తైబజార్ వేలం పాటలో తీర్మాణించిన మేరకే సంబంధిత కాంట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేయాల్సి ఉండగా, రికార్డుల్లో మాత్రం తప్పుడు వివరాలు నమోదు చేశారని తెలిపారు. ఈవిషయమై మున్సిపల్ అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్యారానగర్లో సర్వేయర్ల బృందం పర్యటన జిన్నారం(పటాన్చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి సమీపంలోని ప్యారానగర్ గ్రామంలో సంగారెడ్డి ఏడీ ఆధ్వర్యంలో సర్వేయర్ల బృందం గురువారం పర్యటించింది. డంప్‌యార్డ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు వారు పర్యటించారు. అటవీ రెవెన్యూశాఖ అధికారుల సమక్షంలో సర్వే చేసి హద్దులు గుర్తించారు. సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు అధికారుల బృందం వెల్లడించింది. కాగా ప్యారానగర్లో డంప్‌యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు గురువారం 30వ రోజుకు చేరుకున్నాయి. -
అడవిలోనే ప్రతిఫలం దక్కేలా!
సాక్షి, సిద్దిపేట: అమ్మలాంటి అడవి మనిషి అత్యాశకు అంతరించిపోయే దుస్థితికి చేరుకుంది. దీంతో అడవినే ఆవాసంగా చేసుకొని బ్రతికే జంతువులు జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. ముఖ్యంగా వానరాలు అడవుల్లో ఆహారం దొరక్క గ్రామాలపై దండెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ వినూత్న ప్రయత్నం చేస్తోంది. అంతరించిపోతున్న అటవీ పండ్ల మొక్కలకు ప్రాణం పోసి కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో వైల్డ్ ఫ్రూట్ గార్డెన్‌ను పెంచుతున్నారు. 70 రకాల అరుదైన పండ్ల మొక్కలతో ఈ గార్డెన్ అలరారుతోంది. మామిడి, జామ, ద్రాక్ష, సంత్ర, దానిమ్మ లాంటి అందరికీ తెలిసిన చెట్లతోపాటు దట్టమైన అడవుల్లో పెరిగే ఫాల్–సా, లక్ష్మణ ఫలం, నారపండు, బొట్కు, కలిమి పండు, చిన్న కలింగ, నల్ల జీడి, నార మామిడి, బుడ్డ ధరణి, గార్సినియా, తెల్ల నేరడు వంటి చెట్లను కూడా ఈ గార్డెన్లో పెంచుతున్నారు. ఒక్కో పండ్ల రకం 5 మొక్కల చొప్పున మొత్తం 350 మొక్కలు ఈ గార్డెన్లో ఉన్నాయి. ప్రతి మొక్క వద్ద దాని పేరు, శాస్త్రీయ నామం, నాటినవారి పేరుతో నేమ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఫాల్–సాఈ చెట్లు ఎక్కువగా శ్రీలంకలోనూ, మన అమ్రాబాద్ అడవుల్లోనూ పెరుగుతాయి. ఇవి అచ్చం పరికి పండ్ల మాదిరిగా ఉంటాయి. ఈ చెట్టు సుమారు 6 ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ పండ్లను ఆయుర్వేద మందులలో సైతం వినియోగిస్తారు. బొట్కు.. ఈ పండును కోతులు ఇష్టంగా తింటాయి. మధ్యప్రదేశ్ అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది ఇప్పకాయ మాదిరిగా ఉంటుంది. నొప్పులకు, వాపులకు ఈ చెట్టు ఆకుల రసాన్ని వినియోగిస్తారు. కలిమి పండు..ఇది చెర్రీ పండు మాదిరిగా ఉంటుంది. వికారాబాద్ అడవుల్లో అధికంగా పెరుగుతుంది. దీనిని వికారాబాద్ నుంచి తీసుకువచ్చారు. ఈ పండును ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారు. కోతులు, పక్షులు ఇష్టంగా తింటాయి. గార్సినియా కర్ణాటక, మహారాష్ట్ర అడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఆ ప్రాంతాల్లో చింతపండుగా వినియోగిస్తారు. ఈ మొక్కలను కర్ణాటక అడవుల్లో నుంచి తీసుకువచ్చారు. వీటిని కోతులు, పక్షులు, మనుషులు ఇష్టంగా తింటారు. వివిధ అడవుల్లో సేకరించాం అడవుల్లో పలు రకాల అటవీ పండ్ల చెట్లు అంతరించి పోవడంతో కోతులకు తిండి లభించడం లేదు. దీంతో అవి జనావాసాల్లోకి వస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ అడవుల్లో వివిధ పండ్ల గింజలను సేకరించి వాటి ద్వారా మొక్కలను పెంచుతున్నాం. ఇప్పటివరకు 70 రకాల అడవి పండ్ల మొక్కలను నాటాం. ఇంకా 30 రకాల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇలా ఉత్పత్తి అయిన తర్వాత అడవుల్లో మొక్కలను నాటుతాం. దీంతో కోతులు మళ్లీ అడవుల బాట పట్టే అవకాశం ఉంది. అలాగే కొత్త తరానికి సైతం ఆ పండ్లు తెలుస్తాయి. – డాక్టర్ హరీశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అటవీ కళాశాల, పరిశోధన సంస్థ, ములుగు -
పెండింగ్ పనులు పూర్తి చేయించండి
మంత్రి దామోదరకు వినతి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించేలా చొరవ చూపాలంటూ మంత్రి దామోదర రాజనర్సింహను కోరినట్లు పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి రాజనర్సింహ నివాసంలో మర్యదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి తెలిపారన్నారు. జిల్లా అభివృద్ధికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసిమెలసి ముందుకు సాగాలని మంత్రి తెలిపారన్నారు. బాధిత కుటుంబాలకు అండగజ్వేల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు గజ్వేల్ ప్రాంతంలోని ఉపాధ్యాయులు అండగా నిలిచారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్‌పేట స్కూల్ కాంప్లెక్స్‌లో సీఆర్పీలుగా విధులు నిర్వహిస్తున్న రమేశ్‌నాయక్, శ్రీనివాస్‌ల ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మృతిచెందారు. ఉపాధ్యాయులు రూ.1.90లక్షలు సేకరించి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో బాధిత కుటుంబాలకు బుధవారం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు శశిధర్‌శర్మ, మల్లికార్జున్, నరేందర్, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, అమర్నాథరావు, రమణరావు, నరసింహ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులను ప్రోత్సహిద్దాంమున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సిద్దిపేటజోన్: సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించడానికి మున్సిపల్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మంగమ్మతోటలో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారం, సిల్ట్ తొలగించే పనులను పరిశీలించారు. ఆయా వార్డుల్లో వేసవిలో రాలుతున్న ఎండు ఆకులను చూసి వీటిని సేంద్రియ ఎరువుల తయారీకి వాడాలని, కంపోస్టు యార్డుకు తరలించాలని సిబ్బందికి సూచించారు. 27 వార్డులో యూజీడి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కమిషనర్‌కు వివరించారు. ఆయన వెంట కౌన్సిలర్లు నాగరాజురెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. నీట్ పరీక్ష కోసం కసరత్తు పలు పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నీట్ పరీక్షల నిర్వహణకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే 4న పరీక్ష నిర్వహించనున్న దృష్ట్యా కేంద్రాల కోసం పట్టణంలోని పలు పాఠశాలల్లో మౌలిక వసతులను కలెక్టర్ మనుచౌదరి బుధవారం పరిశీలించారు. నేషనల్ టెస్టింగ్ కమిటీ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలలో గదుల సంఖ్య, పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్లు ఉన్నాయా? లేదా? అని ఆరా తీశారు. నీట్ పరీక్ష నిర్వహణకు పట్టణంలో మూడు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయనున్నారు. కలెక్టర్ వెంట డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రంగనాయకసాగర్, తపాస్‌పల్లి కాలువలను కలపండి
మద్దూరు(హుస్నాబాద్): భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం చేర్యాల మండల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్‌పట్ల గ్రామాలను సందర్శించారు. రంగనాయకసాగర్ ఎల్డీ–10, తపాస్‌పల్లి డీ–3 కాలువలను పరిశీలించారు. రంగనాయకసాగర్ కాలువలో సాగునీరు ఉండగా, తపాస్‌పల్లి కాలువలో మాత్రం సాగునీరు లేకపోవడాన్ని గుర్తించారు. ఇదేవిఽషయాన్ని తపాస్‌పల్లి కాలువ నీటితో సాగు చేసే రైతులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే రంగనాయకసాగర్ కాలువ, తపాస్‌పల్లి కాలువలను కలిపే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఫోన్ ద్వారా నీటిపారుదలశాఖ అధికారులకు సూచించారు. కాలువలకు ఇరువైపుల ఉన్న రైతులు ఇదేవిఽషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఐదు గ్రామాల పరిధిలో 12వేల సాగు ఉంటుందని, ఈ కాలువలతో సాగు స్థిరీకరణ అయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. -
పకడ్బందీ వ్యూహం
పక్కా ప్రణాళిక..● కలిసొచ్చిన బీజేపీ క్యాడర్ ● ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయానికి కారణాలివే.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పక్కా ప్రణాళిక.. పకడ్బందీ వ్యూహం. ఇవి శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలుపు తీరాలకు చేర్చాయి. ఉమ్మడి కరీంనగర్–మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామచంద్రాపురానికి చెందిన చిన్నమైల్ అంజిరెడ్డి విజయానికి ఈ రెండు కారణాలని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రసన్న కూడా గట్టి పోటీని ఇచ్చారు. ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీగా మండలి పోరు సాగింది. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపు తేల్చలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. అండగా నిలిచిన కమలం క్యాడర్ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి క్యాడర్ ఉంది. ఉమ్మడి మెదక్‌తో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంతో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎంపీలుగా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం విదితమే. అలాగే ఆయా జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలుగా కూడా ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఈ ఎన్నికలను ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్, బండిసంజయ్, గొడాం నగేష్‌లకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలా ఆయా ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి పట్టు అంజిరెడ్డిని గెలుపు తీరాలకు చేర్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ అనుబంధ సంఘాలు కీలకం.. బీజేపీ అనుబంధ సంఘాలు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీనే కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు పట్టభద్రుల స్థానాన్ని కూడా కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపులో ఆ పార్టీ క్యాడర్‌తో పాటు, దాని అనుబంధ సంస్థల కృషి ఎంతగానో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరు పకడ్బందీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని రాజకీయ నిఫుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఎన్నికల నగారా మోగక ముందు నుంచే అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పట్టభద్రులను పెద్ద ఎత్తున ఓటర్లు నమోదు చేయించారు. ఇలా ఓటరు నమోదు చేయించడం ఆయనకు కొంత కలిసొచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి.. పారిశ్రామిక వేత్త అయిన డా.చిన్నమైల్ అంజిరెడ్డి 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పటాన్చెరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎస్ఆర్.ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంజిరెడ్డి సతీమణి గోదావరి బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం విదితమే. సామాజిక సేవ.. 2002 ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ స్థాపన. పెద్ద ఎత్తున తాగునీరు, మినరల్ వాటర్, విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్‌షిప్‌లతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాల నిర్వహణ.అంజిరెడ్డి బయోడేటా.. పేరు: డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి పుట్టిన తేదీ: 18.06.1966 తల్లిదండ్రులు : సి.రాజిరెడ్డి, లక్ష్మీనరసమ్మ భార్యపేరు: సి.గోదావరి (బీజేపీ జిల్లా అధ్యక్షురాలు) సంతానం : అనీష్‌రెడ్డి, ఆశ్విత రెడ్డి స్వస్థలం : రామచంద్రాపురంరాజకీయ ప్రస్థానం ఇలా.. 2009ÌZ {ç³gêÆ>fÅ…ÌZ ^ólÇMýS. OÐðlG-ÝëÞÆŠḥæïÜ-ï³ÌZ ç³°^ól-Ô>Æý‡$. 2014ÌZ fÇ-W¯]l AòÜ…½Ï G°²-MýSÌZÏ ç³sꯌS^ðlÆý‡$ ¯]l$…_ çÜÓ™èl…{™èl A¿ýæÅ-ǦV> ´ùsîæ ^ólíÜ.. KrÑ$ ´ëÌSĶæ*ÅÆý‡$. ™èlÆ>Ó™èl M>…{VðS-‹ÜÌZ ^ólÇ-MýS.. iòßæ-^ŒlG…ïÜ G°²-MýSÌS çÜ…§ýl-Æý‡Â…V> ½gôæï³ÌZ ^ólÆ>Æý‡$. ´ëÆý‡ÏÐðl$…sŒæ G°²-MýSÌZÏ Ððl$§ýlMŠS G…ï³ sìæMðSPsŒæ¯]l$ BÕ…_ ¿ýæ…VýS-ç³-yézÆý‡$. Ð]l$…yýlÍ G°²-MýSÌZÏ GÐðl$Ã-ÎÞV> ÑfĶæ$…. -
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
గజ్వేల్‌రూరల్: విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యత పాటించాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. ప్రజ్ఞాపూర్‌లోగల మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. పాఠశాలలోని వంట గదిని, వినియోగించే నిత్యావసర సరుకులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మెనూ తప్పక పాటించాలన్నారు. అనంతరం టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల పట్ల భయం పెట్టుకోవద్దని, ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్, ఎంఈఓ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ -
కాళేశ్వరంపై నిర్లక్ష్యం తగదు
చిన్నకోడూరు(సిద్దిపేట): బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరంపై నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని రంగనాయక సాగర్‌లోకి నీటి పంపింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం పిల్లర్ కుంగిపోయి 14 నెలలు అవుతున్నా ఇప్పటికీ బాగు చేయలేదన్నారు. ఎస్సారెస్పీ స్టేజీ 2 ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. గతంలో ఎస్సారెస్పీ నీరు తగ్గినప్పటికీ కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందించామన్నారు. అన్ని వర్గాలకు మంచి చేసే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు -
తొలిరోజు 95శాతం హాజరు
హాల్‌టికెట్లను తనిఖీ చేస్తున్న అధ్యాపకులు● ఇంటర్ పరీక్షలు షురూ.. ● పర్యవేక్షించిన అధికారులు సిద్దిపేటఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్సు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 43 పరీక్షా కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో 10,542 మంది విద్యార్థులకు 9,976 మంది హాజరయ్యారు. 95శాతం హాజరు నమోదు అయింది. కలెక్టర్ మనుచౌదరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలతో పాటు పలు ప్రైవేట్ కళాశాలల పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. అదనపు కలెక్టర్లు అబ్దుల్‌హమీద్ చేర్యాల, ముస్త్యాల పరీక్షా కేంద్రాలను, కొండపాక పరీక్షా కేంద్రాలను గరిమాఅగర్వాల్ తనిఖీ చేశారు. ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ యాదగిరి సిద్దిపేట ప్రభుత్వ కోఎడ్యుకేషన్, బాలికల కళాశాలలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు డీఈసీ సభ్యులతో పాటు రెండు ఫ్లైయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయన్నారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ కస్టోడియన్ పాయింట్‌ను ఇంటర్ బోర్డు అధికారులు సందర్శించారు. -
కాలువ తీరు.. కన్నీరే పారు
అచ్చుమాయపల్లి సమీపంలో కాలువ దుస్థితితలాపునే రిజర్వాయర్ ఉన్నా.. నీరు అందని చందంగా తయారైంది చాలా గ్రామాల పరిస్థితి. కాళేశ్వరం పథకంలో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను తొగుట మండలంలో నిర్మించారు. ప్రాజెక్టు పూర్తయి నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా కాలువల నిర్మాణాలు పూర్తికాలేదు. దీంతో పంటపొలాలకు నీరందని దుస్థితి నెలకొంది. దుబ్బాక నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో చెరువులు, కుంటలను నింపే పరిస్థితి లేక పోవడంతో రైతులకు, ప్రజలకు నీటి తిప్పలు తప్పడంలేదు.ఎవరికీ పట్టని మల్లన్నసాగర్ కాలువలు●● నాలుగేళ్లుగా అసంపూర్తిగానే నిర్మాణాలు ● చెంతనే ప్రాజెక్టున్నా పారని దుస్థితి ● ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించిన ఎమ్మెల్యేలు కాల్వలపై అశ్రద్ధ తగదు మల్లన్నసాగర్ కాలువల నిర్మాణాలపై అశ్రద్ధ తగదు. త్వరగా పూర్తి చేసి చెరువులు, కుంటలకు నీరందించి పంటలను కాపాడాలి. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి కోరాం. అసెంబ్లీ సమావేశాల్లోనూ దృష్టికి తీసుకువచ్చాం. యాసంగిలో నీళ్లు లేక చాలాచోట్ల పంటలు ఎండిపోతున్నాయి. –కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే పంటలను కాపాడండి కాలువ పూర్తయి తమ పొలాలకు నీరందుతుందనే ఆశతో వరినాట్లు వేసుకున్నాం. ఇప్పటికీ పూర్తికాకపోవడం.. ఎండాకాలం కావడం.. బోర్ల నుంచికొద్దిపాటి మాత్రమే నీరు వస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయి. పెద్దచెరువులోకి నీళ్లు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. –గోపాల్‌రెడ్డి, రైతు దుబ్బాక ఇప్పటికే సగం ఎండిపోయింది వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. 4 ఎకరాలు వరి వేస్తే ఇప్పటికే సగం ఎండిపోయింది. కాలువల నీరు వస్తదనకుంటే ఇంత వరకు కాలువ పూర్తి చేస్తలేరు. అంతా అయోమయంగా ఉంది. కాలువ నిర్మాణం పూర్తి పంటలను కాపాడాలి. –రేపాక రాజిరెడ్డి,రైతుదుబ్బాక: మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తయినా చాలా చోట్ల కాలువల నిర్మాణాలు పూర్తి కాలేదు. కాలువల నిర్మాణాలు నాలుగేళ్లుగా సాగుతునే ఉన్నాయి. దుబ్బాక పట్టణంలోని ముస్తాబాద్ రోడ్డులో కాలువ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో దుబ్బాక పెద్ద చెరువు, పెద్దగుండవెల్లి, దుంపలపల్లి, అచ్చుమాయపల్లి, జోడిచెర్ల, ఆరపల్లి, పోతారం, గంభీర్పూర్, శిలాజీనగర్ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు నీరందడంలేదు. ఈ సారైనా కాలువ పూర్తి అవుతుందనే ఆశతో పంటలు వేసుకోగా తీరా కాలువ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో వేసిన పంటలు చేతికొస్తాయోలేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కాలువ నిర్మాణం పూర్తి చేసి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వానికి విన్నపాలు.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు అనుసంధానంగా నీరందించే కాలువల నిర్మాణాలు చాలా చోట్ల పెండింగ్‌లో ఉన్నాయంటూ పలుమార్లు ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్తప్రభాకర్రెడ్డిలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చించారు. త్వరగా కాలువలు పూర్తి చేయాలని విన్నవించారు.గ్రామాలకు నీరందని దుస్థితి మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు కేవలం 10–15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మిరుదొడ్డి మండలంతో పాటు అక్బర్పేట–భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని చాలా గ్రామాలకు కాలువల నీరు అందని పరిస్థితి నెలకొంది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కేవలం ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా తొగుట మండలంలోని గుడికందుల, గోవర్ధనగిరి, వర్ధరాజుపల్లి గ్రామాల్లో కాలువల నీరు రాక వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాల్లో సైతం కాలువ నిర్మాణానికి అటవీశాఖ అధికారుల అనుమతి నిరాకరించడంతో మధ్యలోనే నిర్మాణం ఆగిపోయింది. -
రైతులు అధైర్యపడొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): ‘తపాస్‌పల్లి రిజర్వాయర్ కింద వరి పంట వేసిన రైతులు అధైర్యపడొద్దు. పది రోజుల్లో రిజర్వాయర్‌కు నీటి పంపింగ్ చేస్తా’మని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈసందర్భంగా రిజర్వాయర్ లోకి నీళ్లు వచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరులతో ఎంపీ మాట్లాడారు. పంటలు ఎండి పోకుండా పొలాలకు నీరు అందిస్తామని హామీ చెప్పారు. పొలాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే రిజర్వాయర్‌ను సందర్శించినట్లు తెలిపారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీళ్లు రావాలంటే ముందున్న ధర్మసాగర్, బొమ్మకూరు రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువగా ఉందన్నారు. ముందు వాటిని నింపిన తర్వాతే తపాస్‌పల్లికి నీరు వస్తుందని తెలిపారు. వెంటనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో మాట్లాడి త్వరగా నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మద్దూరు మాజీ జెడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, చేర్యాల మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, నాగపురి కిరణ్‌కుమార్, కొమురవెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్తలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తపాస్‌పల్లికి పదిరోజుల్లో నీళ్లు రిజర్వాయర్ నింపాలని అధికారులను ఆదేశించాం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి -
బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు: హరీష్
సాక్షి, సిద్ధిపేట: బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అన్న చంద్రబాబు.. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్రానికి డజన్ల కొద్దీ లేఖలు రాశారని హరీష్ గుర్తు చేశారు.‘‘నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇదేనా మీ రెండు కళ్ల సిద్ధాంతం. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారు. తెలంగాణకి సాగునీరు, తాగునీరు అందక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేఆర్ఎంబీ నీటి వాటాలో.. సమ న్యాయం అనేది మాటల్లో తప్ప చేతల్లో లేదు. చంద్రబాబుది పక్షపాత ధోరణే తప్ప సమన్యాయం కాదు...చంద్రబాబు సీఎం కాగానే ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు రిటర్న్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి బీజేపీ ప్రశ్నించే తెగువ, తెలివి లేదు. చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఆపే ప్రయత్నం చేయలేదా... గతంలో ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా’’ అంటూ హరీష్‌రావు నిలదీశారు. -
కొండపోచమ్మ సన్నిధిలో దత్తాత్రేయ
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం కుటుంబ సమేతంగా కొండపోచమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బీజేపీ నేతలు జిలేబితో దత్తాత్రేయను తులాభారం వేశారు. – జగదేవ్‌పూర్(గజ్వేల్)స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న దత్తాత్రేయ కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. ప్రత్యేక పూజల అనంతరం పెద్ద పట్నం వేసిమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు ఎంపీ రఘనంధన్రావు తదితరులు ఉన్నారు. అంతకుముందు కలెక్టర్ మనుచౌదరి, పోలీస్‌కమిషనర్ అనురాధ, ఆర్డీఓ చంద్రకళ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలుకగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ధర్మం కోసం పనిచేయండి.. జగదేవ్‌పూర్(గజ్వేల్): హిందూ ధర్మం కోసం పార్టీలకతీతంగా పనిచేయాలని, విద్యార్థులు విద్యనే లక్ష్యంగా ముందుకు సాగాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం మండలంలోని తిగుల్‌నర్సాపూర్ సమీపంలోని కొండపోచమ్మ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ సిబ్బంది, అర్చకులు శాలువాలు కప్పి ప్రసాదం అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందు ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటు పాడాలని సూచించారు. ఆలయాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు. జిలేబితో తులాభారం.. కొండపోచమ్మ ఆలయం వద్ద బండారు దత్తాత్రేయను బీజేపీ నేతలు జిలేబితో తులాభారం వేశారు. జిలేబి ఓ వైపు పెట్టి తూకం వేయగా 65 కేజీల బరువు తూగారు. అలాగే గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజును గవర్నర్ శాలువా కప్పి సన్మానించారు. ఫంక్షన్‌హాల్ ఏర్పాటుకు కృషి.. కొండపోచమ్మ ఆలయం వద్ద ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి తన ఎంపీ నిధులను కేటాయిస్తామని ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యకార్థం ఫంక్షన్‌హాల్ నిర్మించాలని మాజీ సర్పంచ్ రజిత వినతిపత్రం అందించగా ఎంపీ స్పందించారు. 04జీజేడబ్ల్యూ73ఏః బండారు దత్తాత్రేయను జిలేబితో తులాభారం వేస్తున్న నాయకులు -
ఇంటర్ పరీక్షలకు వేళాయె..
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషన్, ప్రథమ, ద్వితీయ సంవత్సరం మొత్తం కలిపి 20,595 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లా లో 43 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీ స్, రెవెన్యూ, ఆర్టీసీ తదితర శాఖల అధికారు లతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సీఎస్, డీఓల నియామకం ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్, ప్రతీ పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూరింటెండెంట్ (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారుల(డీఓ)ను, 14 మంది అదనపు చీఫ్ సూపరింటెండెంట్(ఏసీఎస్)లను నియమించారు. మాస్‌కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు పరీక్షల కన్వీనర్‌తో పాటు హైపవర్ కమిటీ, ఇద్దరు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, రెండు ఫ్లైయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రాల వద్ద పోలీస్ అధికారులు 144 సెక్షన్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గాని ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకునేందుకు జిల్లా కమాండ్ కంట్రోల్ నంబర్ 9949330191 నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. గంట ముందే చేరుకోవాలిఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులను కల్పించాం. వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికాలకు పరీక్షా హాల్లోకి అనుమతి లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలి. –రవీందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారిఉచిత ఆటో ఏర్పాటు ఎమ్మెల్యే పల్లా వెల్లడి నేటి నుంచి షురూ.. సర్వం సిద్ధం జిల్లాలో 43 పరీక్షా కేంద్రాలు 20,595 మంది విద్యార్థులుకొమురవెల్లి(సిద్దిపేట): ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత ఆటో సౌకర్యం కల్పిస్తున్నట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఇంటర్ పరీక్ష.. దూరమే పెద్ద శిక్ష’ అనే కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. చేర్యాల, ముస్త్యాలలో ఉన్న పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్లేందుకు బుధవారం నుంచి తన సొంత ఖర్చుతో ఉచితంగా ఆటో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అభివృద్ధి రయ్రయ్!
● గజ్వేల్‌కు కొత్త శోభ ● హెచ్ఎండీఏ పరిధిలోకి మరిన్ని కొత్త మండలాలు ● కారిడార్‌తో ప్రయాణం మరింత సులువు ● ప్రగతిలో మరో ముందడుగు ఇటు ఎలివేటెడ్ కారిడార్.. అటు మెగా హెచ్ఎండీఏశామీర్పేట ఎలివేటెడ్ కారిడార్, మెగా హెచ్ఎండీఏ పరిధి పెంపు అంశాలు గజ్వేల్ ప్రాంతానికి కొత్త కళను తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ట్రిపుల్ఆర్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న వేళ తాజాగా ఈ రెండు అంశాలతో మరింత కలిసి రానున్నది. ఎలివేటెడ్ కారిడార్‌తో ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి ప్రయాణం సులువుగా మారుతుండగా, మెగా హెచ్ఎండీఏ పరిధి పెంపుతో గజ్వేల్‌తోపాటు నియోజకవర్గంలోని కొత్తగా మరిన్ని మండలాలు చేరే అవకాశం కనిపిస్తున్నది. ఈ పరిణామం అభివృద్ధితో మరో ముందడుగుగా మారనున్నది. గజ్వేల్: నగరానికి సమీపంలో ఉన్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో శరవేగంగా ముందుకెళ్తోంది. హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధితో పరిశీలిస్తే ఒక రకంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మండలాలు నగరంతో అతి సమీపంగా మారాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్, మనోహారాబాద్, మర్కూక్ మండలంలోని కొంత భాగం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. దీని పరిధి పెంపు ప్రతిపాదన తెరపైకి వస్తుండగా.. గజ్వేల్, మర్కూక్ మండలం పూర్తిస్థాయిలో, అదేవిధంగా జగదేవ్‌పూర్‌తోపాటు సమీప నియోజకవర్గం దుబ్బాకలోని రాయపోల్ మండలాలు కొత్తగా చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఎలివేటెడ్ కారిడార్‌తో.. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట నుంచి రామగుండం వరకు 206 కిలోమీటర్ల మేర రాజీవ్‌రహదారి విస్తరించి ఉంది. ఈ రహదారి ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధాన మార్గం. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గానికి కీలకమైన రోడ్డు. గజ్వేల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వారికి శామీర్‌పేట వరకు వెళ్లడం ఒక ఎత్తయితే.. అక్కడి నుంచి ట్రాఫిక్‌లో నగరంలోకి వెళ్లడం గగనంగా మారుతోంది. దీనివల్ల ప్రయాణం నరకప్రాయమవుతోంది. ఇలాంటి తరుణంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతుండటం గజ్వేల్ ప్రాంతానికి కలిసి రానున్నది. ప్రస్తుతం ఇక్కడినుంచి ప్రయాణానికి సుమారు గంటన్నర సమయం తీసుకుంటుండగా ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే కేవలం 45 నిమిషాల్లోనే సికింద్రాబాద్‌కు చేరుకునే అవకాశముంది. ప్రస్తుత ఎలివేటెడ్ కారిడార్ సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి శామీర్‌పేట వరకు సుమారుగా 18కిలోమీటర్లకుపైగా నిర్మాణం జరగనున్నది. ట్రాఫిక్ చిక్కుల్లేకుండా ఈ కారిడార్ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. అత్యాధునిక ప్రమాణాలతో ఈ కారిడార్ రూపుదిద్దుకోనున్నది. ఇది అందుబాటులోకి వస్తే ఇప్పటివరకు పడ్డ ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడనున్నది.ట్రిపుల్ఆర్ పనులు ప్రారంభమవుతున్న వేళ..ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం పనుల ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఉత్తర భాగం నిడివి 161.518 కిలోమీటర్లు. ఈ రోడ్డు చౌటుప్పల్, యాదాద్రి–భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్‌ల మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించనున్నది. ఇందులో గజ్వేల్ ప్రాంతంలోనే అత్యధికంగా 31.71కిలోమీర్లు ఉన్నది. ఇలాంటి తరుణంలోనే ఈ ప్రాంతానికి మెగా హెచ్ఎండీఏ పరిధి పెంపు ప్రతిపాదన, ఎలివేటెడ్ కారిడార్ పనులు మరింత కలిసి రానున్నది. అభివృద్దిలో మరో ముందడుగు పడనున్నది. ప్రత్యేకించి చతికిల పడిన రియల్ ఎస్టేట్‌కు ఈ అంశాలు కలిసి రానున్నాయి. -
వరికి సస్యరక్షణ చర్యలు చేపట్టండి
కొమురవెల్లి(సిద్దిపేట): వరిలో కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు అధికంగా ఉందని, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాల గ్రామంలో వరి పంటలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్గి తెగులు సోకిన వరి ఆకులపై కండె ఆకారంలో ఎర్రటి మచ్చ ఏర్పడి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారుతుందని, ఆకులు ఎండిపోతాయని అన్నారు. నివారణకు రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి ట్రైసైక్లోజోన్ అనే మందును 0.6గ్రా. లేదా కసుగామైసిన్ మందును1.5మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. కాండం తొలిచే పురుగు నివారణకు పొట్టదశలో ఎకరానికి కార్టఫ్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీమందుని పిచికారీ చేయాలని రైతుకుల సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ, ఏఈఓ రమ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాండంతొలిచే పురుగు, అగ్గి తెగులు అధికం జిల్లా వ్యవసాయ అధికారి రాధిక -
కోడ్ తర్వాత కొత్త రేషన్ కార్డులు
హుస్నాబాద్: ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్‌లో మంత్రి వినతులు స్వీకరించారు. చదువుకున్న యువకులు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి బుధవారం క్యాంప్ కార్యాలయంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టు కాలువల భూ సేకరణ వేగంగా జరుగుతోందని, త్వరలోనే ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో నేతలందరూ సమన్వయం చేసుకొని పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతోందని, ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంత్రికి సమస్యల వినతిచిన్నకోడూరు(సిద్దిపేట): మండలంలోని పలు సమస్యలను పరిష్కరించాలని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అజ్జు యాదవ్ మంగళవారం మంత్రి పొన్నం ప్రనభాకర్కు వినతి పత్రం అందజేశారు. మంత్రి స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీ బలోపేతంపై యువత ముందుకు రావాలని సూచించినట్లు తెలిపారు. నేతలందరూ సమన్వయంతో పని చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు క్యాంప్ కార్యాలయంలో జాబ్ మేళా -
కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు
హుస్నాబాద్‌రూరల్: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరగడం ఇష్టంలేదని, అందుకే నిధులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులకు ప్రతిపాదనలు ఇచ్చి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడంలేదని పొన్నం ప్రశ్నించారు. వరంగల్ ఎయిర్ పోర్టు తన వల్లనే వచ్చిందని పక్క రాష్ట్రం కేంద్ర మంత్రితో చెప్పించుకోనే దుస్థితి కిషన్‌రెడ్డికే దక్కిందన్నారు. వరంగల్ ఎయిర్ పోర్టు కోసం ఏనాడైనా కిషన్‌రెడ్డి ప్రయత్నం చేశారా? అని మంత్రి ప్రశ్నించారు. మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కేసీఆర్‌కు బీనామీగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీకు బాధ్యత లేదా? నిధులు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తమిళనాడు వంటి రాష్ట్రాలు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తాయని, మన కేంద్ర మంత్రులు అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదన్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు తేవడం కిషన్‌రెడ్డికి ఇష్టం లేదన్నారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను సహించబోమని, అభివృద్ధి నిరోధకులుగా కేంద్ర మంత్రులు ఎందుకు వ్యవహర్తిస్తున్నారో చెప్పాలన్నారు. మీకు అభివృద్ధి చేయాలనే అలోచనే ఉంటే హైదరాబాద్ నుంచి రామగుండం వరకు రాజీవ్ రహదారిని 8 వరుసలకు విస్తరించాలని డిమాండ్ చేశారు. కుల గణన సర్వే పై బీఆర్ఎస్కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సర్వేలో పాల్గొనని వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు అవకాశం ఇచ్చామని, కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులకు స్వయంగా నేను సర్వే పత్రాలను పంపించిన సర్వేలో వారి వివరాలను ఇవ్వలేదన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ బినామీగా బండి సంజయ్ వ్యవహరిస్తుండు తెలంగాణలో అభివృద్ధి జరగడం వారికి ఇష్టం లేదు మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ -
ఇంటర్ పరీక్ష.. దూరమే పెద్ద శిక్ష
చాలా దూరంలో పలు ఎగ్జామ్ సెంటర్లువెళ్లి రాయాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కు ● సమయానికి చేరుకోవాలంటే తప్పని తిప్పలు రేపటి నుంచే పరీక్షలు ప్రారంభం ● జిల్లాలో 43 కేంద్రాలు.. 20,595 మంది విద్యార్థులు సాక్షి, సిద్దిపేట: ఇంటర్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. జిల్లాలో 20,595 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 43 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మొదటి సంవత్సరం 9,770 మంది ఉండగా జనరల్ 7,161 మంది, ఒకేషనల్ 2,619 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం10,815 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో జనరల్ 8,243, ఒకేషనల్ 2,572 మంది పరీక్ష రాయనున్నారు. మూడు కిలోమీటర్ల దూరం గజ్వేల్‌రూరల్: పట్టణంలో మొత్తం ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని బస్టాండ్ నుంచి సంగాపూర్ రోడ్డులోగల బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకునేందుకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాలికల, బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లకు ప్రతినిత్యం మూడు ఆర్టీసీ బస్సులు ఉదయం, సాయంత్రం వేళల్లో నడుస్తున్నాయి. అయితే పరీక్షా కేంద్రానికి ఉదయం 8:45గంటలకే చేరుకోవాలనే నిబంధన ఉంది. ఈ మార్గంలో ఎడ్యుకేషన్ హబ్ వరకు ఎలాంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఈ పరీక్షా కేంద్రంలో నిత్యం సుమారు 400 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు అధ్యాపకులు పేర్కొన్నారు.ఇంటర్ పరీక్షా కేంద్రాలు దూరంగా ఉండటంతో విద్యార్థులకు అసలు ‘పరీక్ష’ ఎదురుకానుంది. అసలే ఎండలు.. ఆపై బస్సు సౌకర్యం లేకపోవడం.. సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటే పెద్ద పరీక్షనే ఎదుర్కోనున్నారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనున్నాయి. ఉదయం 8:45 వరకే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తారు. 5 నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. వివిధ గ్రామాల నుంచి పలు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలంటే తిప్పలు తప్పని పరిస్థితి నెలకొంది. పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
జిల్లాలో సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అధికారులు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో పొద్దు తిరుగుడు సాగు చేసిన రైతులకు ఉపయోగపడనుంది. బహిరంగ మార్కెట్లలో ప్రయివేటు వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పత్తి మార్కెట్ యార్డులో ప్రభుత్వం కేంద్రాన్ని అందుబాటులోకి తేవడంతో రైతులకు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.7,280 లభించనుంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. పత్తి మార్కెట్ యార్డులో పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా11,193 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంట సాగు అయినట్లు పేర్కొన్నారు. దిగుబడి అంచనా మేరకు జిల్లాలో సిద్దిపేట, హుస్నాబాద్, బెజ్జంకి, గజ్వేల్, తొగుట, చిన్నకోడూరు, అక్కన్నపేట ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ జరగనుందని, రైతులు నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర పొందాలని సూచించారు. నూనె గింజలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించాలని, దళారులకు అమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డీఎం క్రాంతి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా సహకార శాఖ అధికారి నాగమణి, తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉంటే.. మాజీమంత్రి హరీశ్‌రావు సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలంటూ సీఎంకు లేఖ రాసిన విషయం విదితమే. సిద్దిపేట మార్కెట్లో ప్రారంభం రైతులు సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్ -
లింగాకర్షణ బుట్టలతో పురుగుల నివారణ
తొగుట(దుబ్బాక): వంగసాగులో కాయ, కాండం తొలుచు పురుగు నియంత్రణకు లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ఏఈఓ నాగార్జున రైతులకు సూచించారు. మండలంలోని పెద్ద మాసాన్‌పల్లి మదిర ఇందిరానగర్ రైతు అనిల్‌రెడ్డి సాగుచేసిన వంకాయ తోటలో లింగాకర్షణ బుట్టల ఏర్పాటుపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగసాగులో రైతులు అధిక మొత్తంలో పురుగు నివారణకు ఖర్చు చేస్తారని, సమగ్రసస్య రక్షణ చర్యలు చేపడితే ఖర్చు తగ్గే అవకాశముందన్నారు. ఈ పురుగు ఆశించినప్పుడు మొక్క తలవాల్చినట్టుగా కనిపిస్తుందని, అది తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈ పురుగును నియంత్రించడానికి మొక్క నాటిన 15 రోజుల నుంచిఎకరాకు 18 లిగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బుట్టలో పడిపోయిన మగ పురుగుల సంఖ్యను బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, బుట్టల ఏర్పాటుతో సుమారు 30 శాతం వరకు రసాయన మందుల వాడకం తగ్గించవచ్చునని ఏఈఓ నాగార్జున చెప్పారు.ఏఈఓ నాగార్జున -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి దుబ్బాకటౌన్: విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం రాయపోల్ మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదిలో పిల్లల సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. వినియోగించే కూరగాయలు, వంట పాత్రలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని భోజన కార్మికులకు సూచించారు. పాఠ్యాంశాల్లో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. -
నేడు హర్యానా గవర్నర్ రాక
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి దర్శనానికి మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రానున్నారు. గవర్నర్‌తోపాటు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఉదయం ఆలయానికి చేరుకుంటారని పార్టీ మండల అధ్యక్షుడు బూర్గోజు నాగరాజు సోమవారం తెలిపారు. ఈసందర్బంగా అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపు నిచ్చారు. కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ నాయకులు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పార్టీ జిల్లా నాయకులు కలిశారు. సోమవారం నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు జిల్లా అధ్యక్షుడు శంకర్ తెలిపారు. తనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్ వెంకట్, సీనియర్ నాయకులు ఉన్నారన్నారు. 8న జాతీయ లోక్‌అదాలత్ జిల్లా న్యాయమూర్తి స్వాతిరెడ్డి సిద్దిపేటకమాన్: జాతీయ లోక్‌అదాలత్ ఈనెల 8న నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి తెలిపారు. సిద్దిపేట కోర్టు భవనంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజీపడదగిన కేసుల్లో కక్షిదారులు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. గత లోక్‌అదాలత్‌లో 5వేల కేసుల వరకు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుగ్గరాజేశ్వరుడి ఆలయ ఆదాయం రూ.5.21లక్షలు సిద్దిపేటరూరల్: మహాశివరాత్రి సందర్భంగా స్వయంభూ బుగ్గరాజేశ్వరస్వామి ఆలయ ఆదాయం రూ.5.21లక్షలు వచ్చినట్లు చైర్మన్ కరుణాకర్ తెలిపారు. భక్తులు సమర్పించిన కానులకలను సోమవారం లెక్కించారు. హుండీ ద్వారా రూ.2,43,748, టిక్కెట్ల రూపంలో రూ.2,77,732 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సీతారామశర్మ తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించండి చిన్నకోడూరు(సిద్దిపేట): ఉపాధి హామీ కూలీలకు పని జరిగే చోట వసతులు కల్పించాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అనంతసాగర్‌లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో కూలీలకు పని ప్రదేశంలో నీడ వసతి, తాగు నీటి సౌకర్యం, ప్రాథమిక చికిత్స వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న కూలి డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. ఆయన వెంట డీబీఎఫ్ నాయకులు ఉన్నారు. కిష్టయ్యకి ఉగాది పురస్కారంసిద్దిపేటఅర్బన్: పిల్లిట్ల కిష్టయ్యకి జాతీయ స్థాయి ఉగాది విశ్వశాంతి పురస్కారం దక్కింది. చిందు యక్షగాన కళా రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి అవార్డు ఇచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లికి చెందిన పిల్లిట్ల కిష్టయ్య నగరంలో జరిగిన కార్యక్రమంలో పురస్కారం దుడపాక శ్రీధర్ చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని కిష్టయ్య అన్నారు. -
వేసవిలో లోవోల్టేజీ రానివ్వం
దుబ్బాక: వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కమర్షియల్, జిల్లా నోడల్ ఆఫీసర్ సాయిబాబ అన్నారు. సోమవారం దుబ్బాక మండలం అప్పనపల్లి, సిద్దిపేట మండలంలోని చిన్నగుండవెల్లి విద్యుత్ సబ్స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా లోడ్ మానటరింగ్ తో పాటు రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడంపై విద్యుత్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కడా లోవోల్టేజీ సమస్య రానివ్వబోమన్నారు. కరెంట్ సమస్య లేకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ చంద్రమోహన్, డీఈఈ టెక్నికల్ శ్రీనాథ్, డివిజనల్ ఇంజనీర్ రామచంద్రయ్య, ఏడీఈ కృష్ణమోహన్, దుబ్బాక సబ్‌డివిజన్ ఏడీఈ గంగాధర్, దుబ్బాక రూరల్ ఏఈ జయకృష్ణ ఉన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా జిల్లా నోడల్ ఆఫీసర్ సాయిబాబ -
సాగునీరు విడుదల చేయండి
రోడ్డుపై బైఠాయించిన రైతులు సిద్దిపేటరూరల్: అంకంపేట చెరువులోకి నీటిని విడుదల చేసి, పంటలను రక్షించాలని అంకంపేట గ్రామస్తులు సోమవారం లక్ష్మీదేవిపల్లి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్నసాగర్ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసి నెల రోజులు గడుస్తున్నా అంకంపేటకు నీళ్ళు వదలడం లేదన్నారు. అంకంపేట చెరువు కింద 350 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే నీటిని వదిలి రైతులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం ధర్నా వద్దకు చేరుకున్న రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ అపూర్వరెడ్డి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు, గ్రామప్రజలు పాల్గొన్నారు. అంకంపేట రైతుల నిరసన -
ప్రయివేటు వాహనాలే దిక్కు
23కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే కొమురవెల్లి: మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థులకు ముస్త్యాల మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. దీంతో విద్యార్థులకు దాదాపు 23 కిలో మీటర్లు దూరం ప్రయాణ భారం కానుంది. రెండు బస్సులు మారితేనే పరీక్ష కేంద్రానికి చేరుకుంటారు. ● కుకునూరుపల్లిలో ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఆ కళాశాల విద్యార్థులకు కొండపాక, గజ్వేల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు సుమారు 15 కిలోమీటర్లు వెళ్లాలి.గురువన్నపేట వరకు నడిచి రావాలి మాది కొమురవెల్లి మండలం గురువన్నపేట. ముస్త్యాల మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అయినాపూర్ వరకు నడిచి వచ్చి చేర్యాలకు బస్సు ద్వారా చేరుకుంటాం. కానీ పరీక్ష టైమ్‌కు బస్సులు లేవు. ప్రైవేటు వాహనాలే దిక్కు. ప్రత్యేక బస్సుల ఏర్పాటకు అధికారులు చొరవ చూపాలి – అనురూప్, గురువన్నపేట బస్సు సౌకర్యం కల్పించాలని కోరాం ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు సమయానికి చేరుకునేలా బస్సుల సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డీఎంలను కోరాం. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశాం. సీసీ కెమెరా నిఘాలో పరీక్షల నిర్వహణ ఉంటుంది. – రవీందర్ రెడ్డి, డీఐఈఓ పకడ్బందీగా నిబంధనలు అమలు: సీపీ సిద్దిపేటకమాన్: జిల్లాలోని ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ నిబంధనలు అమలులో ఉంటాయని సీపీ అనురాధ తెలిపారు. ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పరీక్షలు జరుగు సమయంలో సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేసివేయాలని, కేంద్రం నుంచి 500మీటర్ల వరకు ప్రజలు గుమికూడి ఉండకూడదన్నారు. పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటుచేశామన్నారు.జగదేవపూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు సెంటర్లలో సుమారు 838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అయితే మండల కేంద్రానికి ప్రభుత్వ కళాశాల సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పరీక్ష రాసే విద్యార్థులకు రవాణా కష్టాలు తప్పడం లేదు. రెండు కేంద్రాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు తిప్పలు తప్పని పరిస్థితి. జగదేవపూర్ నుంచి భువనగిరి వెళ్లే ప్రతి బస్సు కళాశాల వద్ద ఆపేలా అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు
కొండపాక(గజ్వేల్): మండలంలోని ఖమ్మంపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వ్యవసాయ బావుల వద్ద ఉన్న రైతులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. వ్యవసాయ బావి వద్ద ఉంచిన వల్లంగల్ల రాములుకు చెందిన ట్రాక్టర్, టైర్లు కాలిపోగా ఇతర రైతుల వ్యవసాయ పరికరాలు, పండ్ల తోటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఖమ్మంపల్లి ఉండటంతో స్థానికులు వెంటనే ఫారెస్టు అధికారులకు, పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రాత్రి వేళ అయితే మంటలు గ్రామంలోకి వ్యాపించి తీవ్ర నష్టం జరిగేదంటూ ఆవేదనకు గురయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ చూపిన చొరవకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. భయాందోళనతో పరుగులు తీసిన రైతులు మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది -
నాణ్యమైన భోజనం అందించాలి
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ హుస్నాబాద్: ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల విద్యాలలయాన్ని (అక్కన్నపేట) ఆమె సందర్శించారు. స్టోర్ రూంలోని నిత్యావసర వస్తువులను పరిశీలించారు. విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్బంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ విద్యార్థినులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. విద్యపై ప్రత్యేక దృష్టి సారించి రానున్న పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. -
సీసీ రోడ్లతో గ్రామాలు పరిశుభ్రం
కొండపాక(గజ్వేల్): సీసీ రోడ్లతో గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. మండలంలోని మర్పడ్గ, లకుడారం, మా త్పల్లి, మేదినీపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మా ణాలకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల కిచ్చిన హామీల మేరకు గ్రామాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూ రు చేసిందన్నారు. పనులు పారదర్శకంగా జరిగేలా చూసుకోవాలని సూచించారు. మర్పడ్గలోని హై స్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు అదనంగా రూ.2 లక్షలు మంజూరు అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు లింగారావు, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మల్లేశంగౌడ్, తిరుపతిరెడ్డి, రుషి, రాజలింగం, కనకయ్య, కిష్టారెడ్డి, కరుణాకర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. సంక్షేమమే ధ్యేయం.. గజ్వేల్‌రూరల్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నర్సారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బెజుగామ గ్రామంలో మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు గంగాధర్ ఆధ్వర్యంలో తయారు చేయించిన 50 డప్పులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌చైర్మన్ సర్దార్‌ఖాన్, మాజీ సర్పంచ్ పోచయ్య, కాంగ్రెస్ నాయకులు శివారెడ్డి, బాబురావు, సాయిలు, నాగరాజు, నర్సయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి -
చెరువులు నింపాలని నాయకుల వినతి
కొండపాక(గజ్వేల్): తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి చెరువులకు సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ అధికార పార్టీ నేతలు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి రైతులతో కలిసి సోమవారం అదనపు కలెక్టరు అబ్దుల్ హమీద్‌కు వినతిపతరం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా తిమ్మారెడ్డిపల్లి, కొండపాక, దమ్మక్కపల్లి, సిర్సనగండ్ల, జప్తినాచారం, ఖమ్మంపల్లి, మర్పడ్గ గ్రామాల్లోని చెరువులను నింపుతూ పంట పొలాలు ఎండిపోకుండా కాపాడారన్నారు. అలాగే దుద్దెడ, బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గా గ్రామా ల్లోని చెరువులకు సైతం నీరువెళ్లేలా కాలువ తవ్వ కం పనులు చేపట్టాలని కోరారు. ఎండలు ముదరడంతో చెరువుల్లో నీటి నిల్వలు ఘణనీయంగా పడిపోయాయని, ప్రస్తుతం పంటలు పొట్ట దశకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించక పోవడంతో మేదినీపూర్, లకుడారం శివారులో పనులు ఆగిపోయాయని, రైతులకు నష్ట పరిహారం చెల్లించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు అభినందనలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అలయన్స్ క్లబ్ ఆన్లైన్లో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి సైన్స్ క్విజ్ పోటీలలో జిల్లాకు చెందిన విద్యార్థులు రాణించారని ఆ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ ఆత్మరాములు తెలిపారు. ఆయన మాట్లాడుతూ జూనియర్స్ విభాగంలో దీకొండ అభివర్ధన్, శిరిస్తా ప్రథమ స్థానంలోను, సీనియర్ విభాగంలో విశ్వేశ్వర్, సుభిక్ష తృతీయ స్థానంలోను నిలిచారన్నారు. విజేతలకు రూ.25వేల నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు. సుజాత, బాలచంద్రం, సుజన, వెంకట్‌లక్ష్మి తదితరులు విద్యార్థులను అభినందించారు. సైన్స్‌పై అవగాహన అవసరం హుస్నాబాద్: విద్యార్థులు స్కూల్ స్థాయి నుంచే సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలని మండల విద్యాధికారి బండారి మనీల అన్నా రు. స్థానిక సెయింట్ జోసఫ్ హైస్కూల్లో సోమవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. వివిధ అంశాల పై 400లకు పైగా ప్రయోగాల నమోనాలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆవిష్కరణపై ఆసక్తిని పెంచుతుందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ప్రిన్సిపాల్ విజయ్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని కొండాపూర్‌లోని గట్టు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. గత 26 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగాయి. అర్చకులు, కమిటీ సభ్యులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి కల్యాణ మహోత్సవం, పెద్దపట్నం, భద్రకాళి అమ్మవారి పూజ, అగ్నిగుండ ప్రవేశంతో బ్రహ్మోత్సవాలను సోమవారం ముగించారు. సిద్దిపేట, జనగాం, హన్మకొండ, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్థిక సాయం అందజేత గజ్వేల్‌రూరల్: చికిత్స పొందుతున్న పలువురికి ఆపన్న హస్త మిత్రబృందం సోమవారం చేయూతనందించింది. పట్టణానికి చెందిన నితిన్, చేర్యాల మండలం కడవెరుగు గ్రామానికి చెందిన శ్రీరాములు ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితిని తెలుసుకున్న ఆపన్నహస్త మిత్రబృందం సభ్యులు ఆర్వీఎం ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. నితన్ కుటుంబ సభ్యులకు రూ.20 వేలు, శ్రీరాములు కుటుంబ సభ్యులకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో బాల్‌చంద్రం, శ్రీనివాస్, శ్యామ్‌ప్రసాద్, స్వామి, సాయి, రాజు, రాజేశం, కనకయ్య, బాల్నర్సు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలుసిద్దిపేట రూరల్: మండల పరిధిలోని పెద్ద లింగారెడ్డి పల్లిలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలు, పోతురాజుల నృత్యాల నడుమ బోనాల ఊరేగింపు కొనసాగింది. పెద్దమ్మ తల్లి నామస్మరణతో పల్లెలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఊరేగింపులో సంఘం సభ్యులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల వాకథాన్
సిద్దిపేటకమాన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్ బ్యాంకు బ్యాంకు ఉద్యోగులు సోమవారం వాకథాన్ నిర్వహించినట్లు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ కార్యాలయం నుంచి ప్రశాంత్‌నగర్ బ్రాంచ్ వరకు వాకథాన్ నిర్వహించామన్నారు. బ్యాంకు సేవింగ్ ఖాతా వివరాలు, ప్రయోజనాలు, మైక్రో సేవింగ్స్, ఎస్‌హెచ్‌జీ లింకేజీలు, బీమా సౌకర్యాలు, ముద్ర, పీఎంఈజీపీ రుణ పథకాల గురించి అవగాహన కల్పించామని, అలాగే మంగళవారం విపంచి కళానిలయంలో అవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 5న ఇర్కోడ్ గ్రామంలో మహిళలు, వృద్ధుల కోసం హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బ్యాంకు మేనేజర్లు వికాస్, రాఘవ, సంజయ్, సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు -
వైజ్ఞానిక పరిజ్ఞానం అవసరం
దుబ్బాకటౌన్: విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే వైజ్ఞానిక పరిజ్ఞానం ఎంతో అవసరమని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠ శాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న, రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు అన్నారు. దౌల్తాబాద్ మండలం లింగరాజుపల్లి ఎంజేపీ గురుకుల పాఠశాలలో రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సైన్సు ప్రదర్శనలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రదర్శనలు సందర్శించి విద్యార్థులు వివిధ వైజ్ఞానిక అంశాలపై పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నారన్నారు. అనంతరం కిచెన్ గార్డెన్ పరిశీలించి వివిధ రకాల మొక్కల జీవన విధానాల గురించి తెలుసుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలకుమార్, చంద్రకాంత్, వెంకటలక్ష్మి, వెంకట్, సంజయ్, నర్సింగరావు, రాము, హరీశ్, స్వాతి, గోవర్ధన్ పాల్గొన్నారు. -
నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయాలి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి పుష్కరిణిలో(కోనేరు) నీటిని శుద్ధిచేసే యంత్రాలను అమర్చాలని బీఆర్ఎస్ నాయకుడు ముత్యం నర్సింహులు డిమాండ్ చేశారు. సోమవారం ఇతర నాయకులతో కలిసి స్వామి వారి పుష్కరిణిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటే తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం అని, అలాంటి పుష్కరిణిలో మురుగు చేరినా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్, చెత్తాచెదారం ఉండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు స్పందించి శుద్ధి యంత్రాలతో పాటు మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేయాలని కో రారు. కార్యక్రమంలో మహేశ్, శ్రీధర్, ఆంజనేయులు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నాయకుడు నర్సింహులు -
కౌటింగ్ హాలు పరిశీలన
హుస్నాబాద్‌రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పోలింగ్ బాక్స్‌లను భద్రపరిచే కౌటింగ్ హాల్‌ను జెడ్పీ సీఈఓ రమేశ్ సోమ వారం పరిశీలించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ లో గతంలో ఎన్నికల కౌటింగ్ నిర్వహించారని, ఇప్పుడు ఆ భవనాలు అనుకూలంగా ఉంటాయని ధ్రువీకరించినట్లు ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. వారి వెంట పీఆర్ డీఈ మహేశ్ ఉన్నారు. సద్వినియోగం చేసుకోండి సిద్దిపేటజోన్/దుబ్బాకటౌన్: స్థల క్రమబద్ధీకరణ రుసుముపై రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు ఆశ్రిత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి సోమ వారం వేరువేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఈ అవకాశం మార్చి ఆఖరు వరకే ఉందిని తెలిపారు. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న స్థలాల యజమానులు ఈ నెల 31లోగా రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సందేహాలు ఉంటే 95055 07248 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. మందుబాబులకు జరిమానా సిద్దిపేటకమాన్/సిద్దిపేటఅర్బన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా, జైలుశిక్ష విధించింది టూటౌన్ సీఐ ఉపేందర్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్, త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాలలో వారం రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 24 మంది పట్టుబడ్డారు. వారిని సోమ వారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.36 వేల జరిమానా, ఒకరికి 11 రోజులు, మరొక వ్యక్తికి మూడు రోజుల జైలుశిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని జాలపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను రెవెన్యూ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మధుసూదన్ మా ట్లాడుతూ నంగునూరు మండలంలోని ఖాత కు చెందిన చందు ట్రాక్టర్ ద్వారా వాగులో నుంచి ఇసుకను తరలిస్తుండగా పట్టుకొని కార్యాలయానికి తరలించామన్నారు. -
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పూజలు
మద్దూరు(హుస్నాబాద్): రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండి, రైతులు, ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. మద్దూరు మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలోని శివాలయంలో సోమవారం నిర్వహించిన ఏడో వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆల య నిర్వాహకులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. కార్య క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంతోష్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం, మాజీ సర్పంచ్ కృష్ణవేణి, చంద్ర మౌళి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ తీరుతో ఎండుతున్న పంటలు
● మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ కాలువలు వెలవెల ● నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డిగజ్వేల్: మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ కాలువల నుంచి సాగునీటిని వదలకపోవడంతో రైతుల పంటలు ఎండిపోయే దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని శ్రీగిరిపల్లి వద్ద మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్ వెళ్లే కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఎండాకాలంలోను కాల్వలు జలకళను సంతరించుకొని ఉండేవన్నారు. సాగునీరు విడుదల కాకపోవడంతో శ్రీగిరిపల్లి, అంగడికిష్టాపూర్, గణేష్‌పల్లి, చేబర్తి, అక్కారం, పరిసర గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. సంబంధిత అధికారులకు ఫోన్‌చేసి విషయం చెప్పినా స్పందించడం లేదని, సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిలో ఇప్పటికై నా మార్పురాకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు చంద్రమెహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
కొండంత లక్ష్యంపై కదలిక
సిద్దిపేటజోన్: జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలకు మార్చి 31 నాటికి తుది గడువుపై సాక్షిలో సోమవారం ప్రచురించిన ‘కొండంత లక్ష్యం.. వసూలు అంతంత..’ కథనం జిల్లాలోని బల్దియా అధికారుల్లో కదలిక తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం అధిగమించేందుకు ఈ నెలాఖరులోగా గడువు ఉండడంతో రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్ట డానికి ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఆస్తిపన్ను వసూలు ప్రక్రియ చేపడుతున్నారు. ప్రధానంగా మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు. మార్చి 31 నాటికి బల్దియా పరిధిలోని అన్ని అస్సె స్మెంట్ పన్నులు సంపూర్ణంగా వసూలు చేసి శతశాతం లక్ష్యం అధిగమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కమిషనర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది గ్రూపుల వారీగా వెళ్లి ఇంటి యజమానులకు అవగాహన కల్పించి పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ ప్రగతికి దోహదపడాలని సూచిస్తున్నారు. -
సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి
హుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డులో సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్చార్జి కవ్వ వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పంట చేతికి వస్తున్నా కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయలేదన్నారు. సన్ ఫ్లవర్ క్వింటాలుకు రూ.6వేలు మద్దతు ధర నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో దళారులు క్వింటాలుకు రూ.5వేలకే కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు నష్టపోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం చొరవ తీసుకొని వెంటనే కొనుగొలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. -
నూతన కమిటీ ఎన్నిక
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మాల జంగం మహేశ్వర సంక్షేమ సంఘం జిల్లా కమిటీని ఆదివారం సిద్దిపేటలో ఎంపిక చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రుద్ర రాజలింగం అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎర్పుల నాగరాజు, ఉపాధ్యక్షుడిగా సదానందం, గురుమూర్తి, గౌరవ అధ్యక్షుడిగా ఎన్నం రాజు, ప్రధాన కార్యదర్శిగా అల్లం పరమేశ్, కోశాధికారిగా లింగం, కార్యదర్శి, సహాయ కార్యదర్శులుగా రాజు, రాజేశ్వర్, శివకుమార్, దేవరాజు, పరమేశ్వర్ కార్యవర్గ సభ్యులుగా శంకర్, శివలింగం, సత్యం, ఈశ్వరయ్య, ప్రవీణ్, కాశిలింగం, సోమలింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
ఠారెత్తిస్తున్న ఎండలు
వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం పది దాటిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మిట్టమధ్యాహ్నం అనూహ్యంగా ఎండలు దంచి కొడుతుండటంతో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇళ్లలో ఉన్న జనాలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇక మూలన పడి ఉన్న కూలర్లకు, ఫ్యాన్లకు పని చెబుతున్నారు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు చల్లటి మట్టికుండల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.మిరుదొడ్డి(దుబ్బాక): రోజురోజుకు ముదురుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. మండుతున్న ఎండలతో చెరువులు, కుంటలు, వాగులు వంకల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోరుబావులు సైతం వట్టి పోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే భూ గర్భ జలాలు అడుగుంటిపోతుండటంతో ఇక మున్ముందు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలతో అనారోగ్య సమస్యలు ఎండలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరగడం, పనులు చేయడం వల్ల చర్మం పొడిబారిపోయి పూర్తిగా డీ హైడ్రేషన్‌కు గురై కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. సకాలంలో వైద్యం చేయించకపోతే సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందనీ, తద్వారా చనిపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. మున్ముందు ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తేలికపాటి దుస్తులు ధరించాలి ఎండాకాలంలో ఎక్కువ ముదురు రంగులు కాకుండా, తేలికపాటి లైట్ కలర్ దుస్తులను ధరించాలి. ముఖ్యంగా నలుపు రంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. నలుపు రంగు దుస్తులు ఎక్కువ ఎండవేడిని గ్రహించి అసౌకర్యానికి గురి చేసే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తప్పని సరి వేసవిలో ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులు ఎక్కువగా ఎండలో తిరగకుండా, ఆడకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలి. చిన్నపాటి ఎండలకు చిన్నారులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక వృద్ధులు ఇంట్లో నుంచి బయట రాకుండా జాగ్రత్తలు పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాళ్లు, కరీ్చఫ్లు, టోపీలు, గొడుగులు ధరించాలి. ద్రవపదార్థాలు తీసుకోవాలి ఎండాకాలంలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలనే ఎక్కువ తీసుకోవాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. ఎండలో తిరిగివచ్చిన వారు షర్భత్, మజ్జిగ, కొబ్బరి నీళ్లను తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. మార్కెట్లో విరివిగా లభించే, పుచ్చ, తర్బూజ, నిమ్మ, ద్రాక్ష ఫలాలతోపాటు, చల్లటి పండ్ల రసాలను తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించక పోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.బోరుబావిలో నీటి మట్టం తగ్గింది ఆరుతడి కింద సాగు చేస్తున్న పంటలకు నీరు అందించే బోరు బావిలో నీటి మట్టం తగ్గుతోంది. ఇదివరకు వచ్చిన నీటి ధారలు రావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. – ఎల్లయ్య, రైతు, అందెపనులు ఉదయం వేళే చేస్తున్నం మధ్యాహ్నం ఎండలు దంచి కొడుతుండటంతో కూలీ పనులు చేసుకోలేక పోతున్నాం. ఉదయం పది అయ్యిందంటే చాలు మంట పుట్టిస్తున్నాయి. పొద్దున్నే ఉపాధి పనులకు పోయి 10 గంటల వరకు పనులు ముగించుకుంటున్నాం. – లక్ష్మి, ఉపాధి కూలీ, లక్ష్మీనగర్జాగ్రత్తలు పాటించాలి ఎండల పట్ల జాగ్రత్తలు పాటించాలి. రైతులు, వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే పనులు చేసుకోవాలి. ఎండలో ఎక్కువగా పని చేయడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. – డాక్టర్ సమీనా సుల్తానా, పీహెచ్సీ, మిరుదొడ్డిచెట్లు మోడుబారె.. అడవి ఎడారె!|దట్టమైన మల్లన్నసాగర్ అడవి ఎడారిని తలపిస్తోంది. అడవిలో ఉన్న పెద్దపెద్ద చెట్లన్నీ ఆకురాల్చడంతో ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఒకవైపు భగ్గుమంటున్న ఎండలు.. మరోవైపు చెట్లు ఆకురాల్చడంతో అడవిలో కొలువైన రేకులకుంట మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు నీడ లేక ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దట్టమైన మల్లన్నగుట్టల అడవి బోసిపోయి కనిపిస్తున్న దృశ్యాలను సాక్షి క్లిక్ మనిపించింది. – దుబ్బాక -
శ్రీపాదరావుకు నివాళి
నారాయణఖేడ్: ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభాపతి శ్రీపాదరావు జయంతిని ఆదివారం హైదరాబాద్‌లోని శాసనసభ లాంజ్‌లో నిర్వహించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేడు కిసాన్ సంఘ్ ఆవిర్భావ వేడుకలు సంగారెడ్డి టౌన్: భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ వేడుకలను సంగారెడ్డి జిల్లా కార్యా లయంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. అనంతరం రైతులతో సమావేశం ఉంటుందని, కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. దైవభక్తిని అలవర్చుకోవాలి పటాన్చెరు టౌన్: ప్రతీ ఒక్కరు దైవభక్తిని అలవర్చుకోవాలని న్యాయవాది నాగరాజు యాదవ్ అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి పోచారంలోని హనుమాన్ దేవస్థానం వద్ద భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల్లో భక్తిభావంతో పాటు దేశభక్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో వివేకానంద సేవ సమితి అధ్యక్షుడు శేషాద్రి, బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరా
మంత్రి దామోదర రాజనర్సింహ మునిపల్లి(అందోల్): ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరాను తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బుదేరా శివారులో గల హనుమాన్ దేవాలయం వద్ద వైదిక పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బర్ధిపూర్ దత్తాత్రేయ పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్ మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం బుదేరా శివారులో వైదిక పాఠశాలను ఏర్పాటు చేసి కులమతాలకతీతంగా పిల్లలకు వేదాలు నేర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిద్ధేశ్వర్ మహరాజ్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మనోహర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీశ్‌కుమార్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సహించం గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి గజ్వేల్: రాజకీయ భిక్ష పెట్టిన డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు నాయిని యాదగిరి అనుచితవ్యాఖ్యలు చేయడం సహించేదిలేదని మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం గజ్వేల్‌లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, టీపీసీసీ నేత సాజిద్ బేగ్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, తమ్మిలి శ్రీనివాస్, రవీందర్‌రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నామినేటెడ్ పదవుల కోసం పాకులాడుతూ నర్సారెడ్డిపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం తన సొంత ఆస్తులను అమ్ముకుంటున్న చరిత్ర నర్సారెడ్డిదని చెప్పారు. నాయిని యాదగిరితోపాటు మల్లారెడ్డి, గోపాల్‌రావు, అనిల్‌రెడ్డి, మనోహరాబాద్ మల్లారెడ్డిలు పార్టీలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న వీరి వైఖరిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్రాష్ట్రస్థాయి ఆర్చరీ విజేత లక్ష్మీఅభయా రెడ్డి రామచంద్రాపురం(పటాన్చెరు):క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుందని ఆర్చరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజు అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన రాష్ట్ర ఆర్చరీ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ పోటీలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. రాజు మాట్లాడుతూ ఆర్చరీ చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. క్రీడలలో రాణించే వారికి విద్య, ఉపాధి, ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు. అందులో ఎంపికై న వారు ఈనెల 22న విజయవాడలో జరిగే జాతీయస్థాయి ఆర్చరీ క్రీడల్లో పాల్గొంటారని చెప్పారు. అండర్–10 బాలికల విభాగంలో మొదటి బహుమతి సాధించిన ఉప్పల్ మెరీడియన్ పాఠశాల విద్యార్థిని లక్ష్మీఅభయారెడ్డిని ఆయన అభినందించారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
● ఐఐటీ హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి ధన్‌ఖఢ్ పర్యటన ● స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్పీ, ఎంపీ ● ఐఐటీ ఆవరణలో నాటిన మొక్కలుసంగారెడ్డి జోన్: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖఢ్ కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో పర్యటించారు. ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో కలిసి క్యాంపస్‌ను సందర్శిచారు. మధ్యాహ్నం సుమారు 3:15 నిమిషాలకు మూడు ప్రత్యేక హెలిక్యాప్టర్ల ద్వారా క్యాంపస్‌కు చేరుకున్నారు. క్యాంపస్‌కు వచ్చిన వారికి గవర్నర్, ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ బీఆర్ మొహన్రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేష్, ఎంపీ రఘునందన్‌రావు, ఐఐటీ హెచ్ డైరెక్టరు బీఎస్ మూర్తి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి పుష్ఫగుచ్ఛాలు అందించి, మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. క్యాంపస్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధికి ప్రోత్సహించే సంకేతంగా ఉప రాష్ట్రపతి భార్య డా.సుదేశ్ ధన్ఖఢ్తో కలిసి ఏక్ పేడ్ మా కె నామ్ పేరుతో మొక్క నాటి నీరు పోశారు. అనంతరం క్యాంపస్ సభాస్థలి వెళ్లారు. జాతీయ గీతాలాపన చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఐటీ డైరెక్టరు బీఎస్.మూర్తి ఉప రాష్ట్రపతితో పాటు గవర్నర్‌కు శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను బహూకరించారు. ఐఐటీ డైరెక్టరు ఐఐటీ సాధించిన ముఖ్యమైన విజయాలను వివరించారు. ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించి, విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ప్రత్యేక హెలిక్యాప్టర్లలో సుమారు 4:30 నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. సుమారు గంటన్నర పాటు క్యాంపస్ సందర్శించి, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో క్యాంపస్ ఆవరణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు నాకు అతిథులు ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు తనకు అతిథులని, పార్లమెంట్‌ను సందర్శించాలని ఉపరాష్ట్రపతి కోరారు. భారత దేశం వివిధ భాషల నిలయమని చెప్పారు. పార్లమెంట్లో అన్ని భాషలు ట్రాన్స్‌లేట్ అవుతున్నాయని చెప్పారు. కాగా, పర్యటన విజయవంతం చేసిన అధికారులకు, పోలీస్ సిబ్బందికి, అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ అభినందించారు.రిజర్వేషన్ల ప్రాతిపదికనే నామినేటెడ్ పదవులువర్గల్(గజ్వేల్): వివిధ నామినేటెడ్ పదవులను రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలం గౌరారం ఎస్సీవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ఇక్కడి సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, సీఎం రేవంత్‌రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారన్నారు. కార్యకర్తలు ప్రతిఒక్కరూ పార్టీకి విధేయులై పనిచేయాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని, ప్రజాయుత సమస్యలను పార్టీ శ్రేణులు తన దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి -
లక్ష్యం కొండంత.. వసూలు అంతంత!
సిద్దిపేటజోన్: మున్సిపాలిటీల్లో పన్ను వసూలు అంతంగానే సాగుతోంది. గడువు ముంచుకొస్తున్నా.. మొండి బకాయిలు గుదిబండలా మారాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని అందుకునేందుకు మార్చి 31 చివరి గడువు ఉంటుంది. మరోవైపు మున్సిపాలిటీల్లో కొండంత వసూలు లక్ష్యం అధికార యంత్రాంగానికి సవాల్‌గా నిలిచింది. నెల ముందు నుంచే ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా వంద శాతం వసూలు లక్ష్యం చేరుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో రానున్న 30 రోజుల్లో రూ.10కోట్లకుపైగా ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, మున్సిపాలిటీల్లో ప్రతి ఏటా ఆస్తిపన్ను వసూలు ప్రక్రియ సాగుతోంది. ఈ లెక్కన 2024–25 ఆర్థిక సంవత్సరం లక్ష్యం మార్చి31లోగా పూర్తి చేయాలి. వంద శాతం పన్నుల వసూలు చేసిన మున్సిపాలిటీకి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని రెవెన్యూ యంత్రాంగం ముందస్తు ప్రణాళికల మేరకు ఆస్తిపన్ను చెల్లింపుదారుల పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అవసరమైతే ఒకేసారి చెల్లించే వారికి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాయితీలు అందిస్తోంది. బకాయిలు ఇలా.. సిద్దిపేట మున్సిపల్ పరిధిలో రూ.17.42కోట్లకు గాను రూ.12.20కోట్లు వసూలు చేశారు. మిగతా రూ.5.23 కోట్లు ఈ నెలాఖరులోగా వసూలు చేయాలి. హుస్నాబాద్ మున్సిపాలిటీలో రూ.1.72కోట్లకు గాను కోటి వసూలు చేశారు. మిగతా 72 లక్షల బకాయిలున్నాయి. దుబ్బాక మున్సిపాలిటీలో రూ.2 03కోట్లకు రూ.1.23 కోట్లు వసూలు అయ్యాయి. ఇక్కడ మరో 80 లక్షలు రావాల్సి ఉంది. గజ్వేల్ మున్సిపాలిటీలో రూ. 4.75 కోట్లకు రూ.3.05 కోట్లు వసూలు చేశారు. మరో కోటి 70 లక్షల బకాయిలున్నాయి. చేర్యాల మున్సిపాలిటీలో రూ.3.14 కోట్లకు రూ.1.60కోట్లు వసూలు చేశారు. మరో 30 రోజుల్లో రూ.1.54కోట్లు వసూలు చేయాలి రంగంలోకి కమిషనర్లు.. ప్రభుత్వ నిర్దేశించిన వంద శాతం పన్నుల వసూలు లక్ష్యం ఛేదించడానికి మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ అధికారులతో కలిసి బకాయిలు పేరుకుపోయిన వారి వద్దకు వెళ్లి అవగాహన కల్పించి వసూలు చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వ రాయితీ గూర్చి వివరించి వారిలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పన్ను బకాయిలు రూ.10కోట్ల పైనే ముంచుకొస్తున్న గడువు గుదిబండగా మొండి బకాయిలు లక్ష్య సాధనకు చర్యలు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి31లోగా నిర్దేశించిన లక్ష్యం సాధించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులు సిబ్బంది వెళ్తున్నారు. మిగిలిన బకాయిలు త్వరితగతిన వసూలు చేస్తాం –ఆశ్రిత్, మున్సిపల్ కమిషనర్, సిద్దిపేట -
ఆరోగ్యంగా ఉంటేనే సామాజికాభివృద్ధి
గజ్వేల్‌రూరల్: ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఆకుల నరేశ్‌బాబు అన్నారు. పట్టణంలోని సంగాపూర్ రోడ్డులోని సంతోషిమాత దేవాలయం సమీపంలో ఆదివారం ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్‌బాబు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ప్రజలు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. తక్కువ ధరలకే నాణ్య మైన మందులను అందించాలనే ఉద్దేశ్యంతో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జన ఔషధి కేంద్రం నిర్వాహకులు భావన, రమణాచారి, వినోద్, గోపాల్, వెంకటేశ్, విజయ్‌కుమార్, హరీశ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
గుండె ఆపరేషన్ల రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం
కొండపాక(గజ్వేల్): కొండపాకలో నూతనంగా స్థాపించిన సత్యసాయి సంజీవనీ సెంటర్ ఫర్ హార్ట్ కేర్ రీసెర్చ్ సెంటర్లో చిన్న పిల్లలకు గుండె సంబంధిత చికిత్సల కోసం సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించినట్లు చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన పిల్లవాడి నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు ఉచితంగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేస్తార న్నారు. పేషేంట్‌ను వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి పరిశీలిస్తారని, వారితో తల్లిదండ్రులు కూడా ఉండటానికి వసతి కల్పిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే ఆపరేషన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని శ్రీనివాస్ తెలిపారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం 98495 55560 నంబరును సంప్రదించవచ్చని చెప్పారు. -
ఎల్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత లచ్చపేట
దుబ్బాకటౌన్: మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో తెలంగాణ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల సహకారంతో నిర్వహించిన లచ్చపేట ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఉత్కంఠగా సాగింది. దుబ్బాక మార్నింగ్ క్రికెట్ ఫ్రెండ్స్(ఎంసీఎఫ్), లచ్చపేట జట్లకు ఫైనల్ మ్యాచ్ జరగ్గా పది పరుగుల తేడాతో లచ్చపేట జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లచ్చపేట జట్టు నిర్ణిత 16 ఓవర్లలో 159 పరుగులు చేసింది. ఎంసీఎఫ్ టీం పది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నెల రోజులుగా సాగుతున్న ఈ టోర్నీలో దాదాపు 35 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల డాక్టర్ అరవింద్ కుమార్ రూ.12,100 నగదు బహుమతితోపాటు ట్రోఫీ, రన్నర్ జట్టుకు రూ.7,100 నగదు బహు మతి అందించారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపనాల్ బుచ్చిబాబు, నాయకులు శ్రీకాంత్, సంతోష్, శ్రీనివాస్, సతీశ్‌గౌడ్, కిషన్, అరుణ్ తదితరులున్నారు. -
రోడ్డుకు మరమ్మతులు చేయాలని నిరసన
రామచంద్రాపురం(పటాన్చెరు): ఓఆర్ఆర్ 30 ఎక్స్టెన్షన్ రేడియల్ రోడ్డు ధ్వంసమై గుంతలమయంగా మారింది. సంబంధిత అధికారులు రోడ్డుకు ఎందుకు మరమ్మతులు చేపట్టడం లేదని ఆదివారం తెల్లాపూర్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు శ్రమదానం చేసి గుంతలను పూడ్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనేక ఏళ్లుగా ఈ రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. రోడ్డుపై పెద్ద ఎత్తున మట్టి చేరి, గుంతలు ఏర్పడినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీంతో స్వయంగా తామే శ్రమదానం చేసి రోడ్డుకు మరమ్మతు పనులు చేశామని చెప్పారు. ఈ మార్గంలో ఉన్న ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
కార్మిక వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర నేత మల్లికార్జున్ గజ్వేల్‌రూరల్: కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తయారు చేసిన కోడ్లను వెంటనే రద్దుచేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజలపై 30 శాతం పన్నుల భారం వేసి నడ్డి విరుస్తుండగా, కార్పొరేట్ సంపన్నులపై 32 శాతంగా ఉండగా, కేంద్ర ప్రభుత్వం దానిని 22 శాతానికి కుదించిందని విమర్శించారు. ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేసిందని, కార్మిక రంగానికి రూ.3,500 కోట్లు, ఉపాధి హామీ కార్మికులకు రూ.80 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని వాపోయారు. కార్పొరేట్ సంస్థలకు వేలకోట్ల రాయితీలు ఇచ్చారని మండిపడ్డారు. కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ ఉద్యమంలో కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆర్బీఎల్ యూనియన్–సీఐటీయూ ఉప ప్రధాన కార్యదర్శి బండ్ల స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, నాయకులు వేణుగోపాల్, చంద్రశేఖర్‌రెడ్డి, రంగారెడ్డి, స్వామి, శ్రీనివాస్, వెంకట్రావ్, రవికుమార్, నర్సింహులు, సాజిద్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ముక్కు మూసుకోవాల్సిందే..
అధికారులు పట్టించుకోకపోవడంతో మిరుదొడ్డిలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. మురుగు కాలువల్లో ఎక్కడికక్కడ చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. రోజుల తరబడి వాటిని తొలగించక పోవడంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. మురుగు కాలువల వల్ల దోమలు విజృంభించి రాత్రిపూట కంటికి కునుకు లేకుండా పోతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేయించా లని కోరుతున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
అపూర్వ సమ్మేళనం
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని లద్నూర్ పాఠశాలలో 2004–05లో పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 యేళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో కలుసుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకొన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. దుబ్బాక: దౌల్తాబాద్ మండలం దొమ్మాట పాఠశాలలో 24యేళ్ల క్రితం చదువుకున్న(2001–02)టెన్త్ విద్యార్థులు సందడి చేశారు. ఆ నాటి స్మృతులను గుర్తుచేసుకొని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన గురువులు కృష్ణమచారి, గణపతి, రామకృష్ణ, రాజగోపాలచారి, రాంప్రభాకర్, ప్రవీణ్‌బాబు, గౌరీ మోహన్, జూహెద్ అలీని ఘనంగా సన్మానించారు. -
అధ్యాపకులూ నిత్య విద్యార్థులే
● పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన ● ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ మదన్మోహన్సిద్దిపేటఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు, అధ్యాప కులు, ఆచార్యులు కేవలం విద్యార్థులకు విద్యను అందించడంతోనే సరిపెట్టుకోకూడదు. వారికి నిత్యం ఉత్సాహాన్ని అందిస్తూ నిత్యనూతన అంశాలను తెలుసు కోవాలనే ఆసక్తిని రేకెత్తించాలి. దాంతో పాటు వాటిని పరిశోధించి అవి సమాజానికి ఏవిధంగా ఉపయోగపడుతాయో చేసి చూపించేలా వారిని తయారు చేయాలి. అందుకు అధ్యాపకుడు సైతం నిత్యనూతన విద్యార్థిగా మారి పరిశోధలను చేస్తూ విద్యార్థులను పరిశోధనలవైపు ఆసక్తిని పెంపొందించుకునేలా చేయాలి. సరిగ్గా అదే కోవకు చెందుతారు సిద్దిపేట ప్రభుత్వ అటానమస్ కళాశాలలో సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ మదన్మోహన్. ఇటీవల ఆయన రాసిన పరిశోధనా పత్రం నేపాల్‌లో ఈ నెల 24, 25వ తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ బయోటెక్నాలజీ సదస్సుకు ఎంపికయింది. సిరిసిల్ల జిల్లా మల్కాపూర్ అనే చిన్న గ్రామంలో స్వరూప– సత్తయ్య దంపతులకు జన్మించిన ఆయన ప్రాథమిక విద్య అంతా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేశారు. అలాగే కరీంగనగర్ ప్రభుత్వ డిగ్రీ ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ, జేఎన్టీయూలో పీహెచ్‌డీని పూర్తి చేశారు. తాను చదివిన ఎస్ఆర్ ఆర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకుడిగా చేరి 16 ఏళ్లుగా డిగ్రీ విద్యార్థులకు, ఆరేళ్లుగా పీజీ విద్యార్థులకు సేవలను అందించారు. బదిలీల్లో భాగంగా కరీంనగర్ నుంచి సిద్దిపేట డిగ్రీ కళాశాలకు వచ్చిన ఆయన రెగ్యులర్ సహాయాచార్యుడిగా నియామక మయ్యారు. యంగ్ సైంటిస్ట్, లయన్స్‌క్లబ్ ఉత్తమ ఉపాధ్యాయ, బెస్ట్ రీసెర్చ్ సూపర్వైజర్, బెస్ట్ రివైవర్ తదితర అవార్డులను అందుకున్నారు. మెథడాలజీ టెక్నిక్స్ తదితర అంశాలపై మూడు జాతీయ సదస్సులను నిర్వహించారు. వీటితో పాటు 10 అంతర్జాతీయ సదస్సులు, 30 జాతీయ సదస్సులకు హాజరై 24 పరిశోధనా పత్రాలు, 12 పుస్తకాలను ప్రచురించి సమర్పించారు. మంచినీళ్లలో బ్యాక్టీరియాలను కనుగొని పేటెంట్ హక్కులను సైతం సొంతం చేసుకున్నారు. చెరువులు, సాగు భూములు, పుష్కరఘాట్ల నీరు, పానీపూరి, మరుగుదొడ్లలో బ్యాక్టిరీయా వ్యాప్తి, పరిణామాలపై పరిశోధనలు చేశారు. బయో మెట్రిక్, కరచాలనం, జ్యూస్‌లలో కలిపై ఐస్, వేడి పదార్థాల పార్సిల్స్, కండ్లకలక తదితరాల ద్వారా వ్యాప్తి చెందే వైరస్‌లపై విద్యార్థులతో కలిసి పలు పరిశోధనలు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. -
సీసీ రోడ్ల నిర్మాణ పనులు పరిశీలన
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూంల కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వడ్ల ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి, నాయకులు బాలాగౌడ్, ఉల్లెంగెల నరేశ్, బైరి నర్సింహులు, డక్కలి శ్రీను, కొరిమి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మడప యాదవరెడ్డిని కూచనపెల్లి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షుడు మంద సత్యనారాయరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులకు సేవచేసే అవకాశం కల్పించినందఅన్నారు. గ్రామాభి వృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిధులు తీసుకురావాలని కోరారు. రైతు సంక్షేమానికి ఉపయోగపడే పథకాలను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గాలిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద కుటుంబానికి సాయం చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరుకు చెంది న నిరుపేద రాళ్లబండి లింగం కూతురు వివా హం నిమిత్తం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మీసం మహేందర్ ఆదివారం ఆర్థిక సాయం అందించారు. అలాగే ఆ కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ పేదలకు సేవచేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పరశురామ్, కనకరాజు, గణేశ్ తదితరులు ఉన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం ములుగు(గజ్వేల్): రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఆ శాఖ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు. మండలంలోని క్షీరసాగర్ 33 కేవీ, తున్కిబొల్లారం 133 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న వేసవి ని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు ఎలాంటి అవాంతారాలు లేకుండా విద్యుత్‌ను అందించాలని ఇప్పటికే అధికారులకు సూచించామని, విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండా లని ఆదేశించారు. ఆయన వెంట విద్యుత్‌శాఖ డీఈ భానుప్రకాశ్, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్‌కు అభినందన కొండపాక(గజ్వేల్): ఉస్మానియా విశ్వ విద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియామకమైన ప్రొఫెసర్ ఖాసింను ఆదివారం దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాకి చంద్రభాను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రభాను మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌గా దళిత వర్గానికి కేటాయించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. యూనివర్సిటీ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపుతూ విద్యార్థులకు దిక్సూచిగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. స్నేహితుడి కుటుంబానికి పూర్వవిద్యార్థుల సాయం దుబ్బాకటౌన్: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రాయపోల్ గ్రామస్తుడు బ్యాగరి రమేశ్ కుటుంబానికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. 2007– 2008లో పదో తరగతి చదువుకున్న స్నేహితులు ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.41 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో స్నేహితులు వెంకటేశ్, స్వామి, కరుణాకర్, ఆంజనేయులు, మధుసూదన్ రెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. రేపు అష్టావధానం నారాయణఖేడ్: మండలంలోని చాష్టా(కె) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సాహితీ కళాప్రవీణ స్వర్ణకంకణ సత్కార గ్రహీత పద్యశిల్పి యువ అవధానిచే అష్టావధానం నిర్వహించనున్నట్లు పాఠశాల హెచ్ఎం నర్సింహులు తెలిపారు. పద్యకవి సీహెచ్. భూమయ్య రచించిన శ్రీరామశతకం ఆవిష్కరణోత్సవం సైతం ఉంటుందన్నారు. అష్టవధానులు కసిరెడ్డి వెంకటరెడ్డి, కంది శంకరయ్య, చక్రవర్తి హాజరవుతున్నారని చెప్పారు. -
పత్తి.. దళారుల కత్తి .. !
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం రైతులకు కల్పించిన వెసులుబాటును ఆసరాగా చేసుకొని కొంతమంది అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై అక్రమ దందాకు తెరలేపారు. వ్యవసాయ, మార్కెటింగ్, వ్యాపారులు కలిసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)(CCI)ని బురిడీ కొట్టించారు. దళారులు రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు సీసీఐకి విక్రయించారు. అధికారులు, దళారులు కుమ్మక్కైనట్లు తెలియడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దీంతో తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 4,072 టీఆర్‌లు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఓ మార్కెట్ కార్యదర్శి, మండల వ్యవసాయ అధికారిపై శాఖారమైన చర్యలు తీసుకున్నారు. 1.20లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు రైతుకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో సీసీఐ ప్రతి సంవత్సరం పత్తిని కొనుగోలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 23 సీసీఐ నోటిఫైడ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12శాతం కంటే లోపు తేమ ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.7,521 ధరను ప్రకటించారు. వ్యవసాయ అధికారులు క్రాప్ బుకింగ్ సమయంలో నమోదు చేయించుకున్న రైతుల వారీగా కొనుగోలు చేశారు. రైతుల ఫొటోను ఆన్లైన్లో నమోదు చేశారు. బ్యాంక్ ఖాతాలలో డబ్బులను జమ చేశారు. ఇప్పటి వరకు సీసీఐ వారు 1,20,766 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. దిగుబడికి మించి కొనుగోలు జిల్లా వ్యాప్తంగా 1,08,050 ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారని వ్యవసాయ అధికారులు నిర్థారించారు. ఒక్కో ఎకరానికి సుమారుగా 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు నేల స్వాభవాన్ని బట్టి దిగుబడి వస్తుంది. పత్తి దిగుబడి సగటున 11 క్వింటాళ్లు వస్తే.. 1,18,855 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. సీసీఐ 1,20,766 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ వ్యాపారులు 15,766 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. మొత్తం 1,36,532 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఈ లెక్కన 16,941 మెట్రిక్ టన్నులు దిగుబడికి మించి సీసీఐ కేంద్రాలకు వచ్చిందన్నమాట. ప్రైవేట్‌లో తక్కువగా ధర బయట మార్కెట్లో పత్తి క్వింటాల్‌కు దళారులు రూ5 నుంచి 6వేలకు మాత్రమే కొనుగోలు చేశారు. సీసీఐ రూ7,521 పెట్టి కొనుగోలు చేసింది. రైతుల వద్ద తక్కువ ధరకు పత్తిని కొని.. దళారులు ఎక్కువ రేటుకు కొని రైతుల పేరిట సీసీఐకి విక్రయించారు. ఒక్కో క్వింటాల్‌కు రూ1,500 నుంచి రూ2,500 వరకు గోల్మాల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా రూ.లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది. భద్రాచలం, మహారాష్ట్ర నుంచి పత్తిని ఎక్కువగా ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి సీసీఐకి విక్రయించినట్లు తెలుస్తోంది.పత్తి విక్రయించగా వచ్చిన డబ్బులకు సంబంధించి ముందుగానే ఆయా రైతుల దగ్గరి నుంచి చెక్కులు, పాస్ బుక్‌లను తీసుకున్నారు. ఇలా సహకరించిన రైతులకు ఒక్కో క్వింటాల్ పత్తి రూ100 చొప్పున కమీషన్ సైతం ఇచ్చినట్లు సమాచారం. అలాగే వ్యవసాయ అధికారికి ఒక్కో టీఆర్‌కు దాదాపు రూ10వేలు ముట్టచెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని రైతులు డిమాండ్ చేస్తున్నారు.విచారణ నివేదిక అందజేశాం|టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్) పత్రాలపై విచారణ చేసి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. ఫోర్జరీ సంతకాలతో టీఆర్‌లు జారీ అయినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – నాగరాజు, మార్కెటింగ్ అధికారిపత్తి దళారులపై చర్యలేవి...?విజిలెన్స్ విచారణ జరిపించాలి హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ కాటన్ మిల్లుల్లో ఏర్పాటు చేసిన నాలుగు సీసీఐ కేంద్రాల్లో బోగస్ రైతుల పేరున పత్తి విక్రయించిన దళారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుస్నాబాద్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ...బోగస్ టీఆర్‌లను జారీచేసిన మండల వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేసిన ప్రభుత్వాధికారులు, వ్యవసాయాధికారితో చేతులు కలిపి రైతుల పేరున సీసీఐలో పత్తి అమ్మిన వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బోగస్ రైతుల పేరున సీసీఐలో విక్రయించి లాభాలు పొందిన వ్యాపారులను గుర్తించి వారి లైసెన్స్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. - అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడుఇది కనిపిస్తున్నది టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్)పత్రం. ఓ మహిళా రైతు పేరు మీద హుస్నాబాద్ మండల మీర్జాపూర్ ఏఈవో సంతకం ఫోర్జరీ చేసి పత్రం జారీ చేశారు. సదరు మహిళా రైతుది ఉమ్మాపూర్. అయితే ఈ గ్రామం మహ్మదాపూర్ క్లస్టర్ పరిధిలోకి వస్తుంది. సర్వే నంబర్ ఒకటి.. గ్రామం మరొకటి రాసి టీఆర్ను జారీ చేశారు. ఈ రైతు గత వానాకాలంలో ఎక్కువగా వరినే సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఫోర్జరీ సంతకాలతో పాటు, పత్తి సాగు చేయని వారి పేరు మీద తప్పుడు టీఆర్‌ల ద్వారా సీసీఐకి దళారులు పత్తిని విక్రయించారు. -
మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్
హుస్నాబాద్‌రూరల్: మండల వ్యవసాయ అధికారి నాగరాజు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ గోపి శుక్రవారం ఉత్తర్వులు జారి చేసినట్లు ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు. సీసీఐ కేంద్రాల్లో వ్యాపారులు పత్తి విక్రయించడానికి బోగస్ రైతుల పేరున ఏఈఓల సంతకాలు ఫోర్జరీ చేసి టీఆర్‌లను ఇచ్చినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. మీర్జాపూర్, హుస్నాబాద్, మహ్మదాపూర్ క్లస్టర్ల పరిధిలో 18 మంది బోగస్ రైతులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో వ్యాపారులు 946 క్వింటాళ్ల పత్తిని సీసీఐలో అమ్ముకున్నారు. ఫోర్జరీ సంతకాలను గుర్తించిన ఏఈఓలు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి, మార్కెటింగ్ అధికారి సంయుక్తంగా విచారణ చేసి కలెక్టర్‌కు నివేదికను అందించారు. విచారణ నివేదికను పరిశీలించి వ్యవసాయ కమిషనర్ గోపి సస్పెండ్ చేసినట్లు ఏడీఏ పేర్కొన్నారు. చట్టాలపై అవగాహన అవసరం హుస్నాబాద్ కోర్టు జడ్జి కృష్ణతేజ్ హుస్నాబాద్: విద్యార్థులు చదువుతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని హుస్నాబాద్ కోర్టు జడ్జి కృష్ణతేజ్ అన్నారు. మండలంలోని పొతారం(ఎస్) సోషల్ వెల్ఫేర్ బాలుర రెసిడెన్సియల్ హాస్టల్లో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అ సందర్భంగా కృష్ణతేజ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువు పైనే దృష్టి పెట్టాలని, చెడు వ్యవసానాల వైపు వెళ్లొద్దని సూచించారు. నేషనల్ సైన్స్ డే పురస్కిరంచుకుని సీవీ రామన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్ధులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. కార్యక్రమంలో లీగల్ ప్యానెల్ అడ్వకేట్ కొంకట శ్రీనివాస్, పారా లీగల్ వలంటీర్ శ్రావణి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పుస్తక పఠనం ద్వారానే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మొబైల్ లైబ్రరీని గరిమా అగర్వాల్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలలు పుస్తకాలు చదవాలన్నారు. పుస్తక పఠనంతో జ్ఞానంతో పాటుగా మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. సంచార పుస్తక ప్రదర్శనలు విద్యావంతులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఎన్బీటీ రీజినల్ మేనేజర్ డాక్టర్ పత్తిపాక మోహన్, సెక్టోరియల్ ఆఫీసర్ భాస్కర్, మండల విద్యాధికారి రాజ ప్రభాకర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సుందరీకరణ పనులు వేగిరం చేయండి హుస్నాబాద్: పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను శుక్రవారం అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలించారు. పనుల ప్రగతిపై అడిగి తెలుసుకున్నారు. పర్యాటక శాఖ అధికారులు చెరువు సుందరీకరణ ఫొటోలను అదనపు కలెక్టర్‌కు చూపించారు. చిత్రాలను చూసి పనులు తొందరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రపతి నిలయంలో సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శన ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని రాష్ట్రపతి నిలయంలో జిల్లాకు చెందిన రెండు ఎగ్జిబిట్లను ప్రదర్శించినట్లు సైన్స్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 ప్రదర్శనలు ఎంపిక కాగా, ఇందులో 2 ప్రదర్శనలు సిద్దిపేట జిల్లావి ఉన్నాయన్నారు. దామరకుంట భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మ య్య ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థి అశ్వంత్ రూపొందించిన ప్రాజెక్టుతో పాటుగా, లచ్చపేట ఉపాధ్యాయురాలు జ్యోతి పర్యవేక్షణలో 9వ తరగతి విద్యార్థి హర్ష వర్ధన్ రూపొందించిన రా కెట్ లాంచింగ్ విధానాన్ని ప్రదర్శించారని తెలిపారు. సృజనాత్మకత పెంపొందించుకోవాలి జిల్లాలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులు వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించారు. అనంతరం మంచి ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో స్కూల్లో నిర్వహించిన సైన్స్ దినోత్సవంలో బీఎస్ఎంఏఆర్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు శాసీ్త్రయ సృజనాత్మకతను పెంపొందించుకోవాలనిసూచించారు. అవగాహన కల్పించండి సిద్దిపేటకమాన్: లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. సిద్దిపేట కోర్టు భవనంలో న్యాయవాదులు, ప్యారా లీగల్ వలంటీర్స్‌తో శుక్రవారం న్యాయమూర్తి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. -
నీరు విడుదలకు నోచుకోక ఎండుతున్న పంటలు
తసాస్పల్లి రిజర్వాయర్‌లో తగ్గుతున్న నీటి నిల్వలుతపాస్పల్లి రిజర్వాయర్‌లో నీరు లేక వెలవెలబోతోంది. సిద్దిపేట, జనగామ జిల్లాలకు ఆధారమైన ఈ రిజర్వాయర్‌కు 82,542 ఎకరాల ఆయకట్టు ఉండగా, 330ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్లు)నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. కానీ ప్రస్తుతం 95ఎంసీఎఫ్‌టీ మాత్రమే నీరు నిల్వ ఉంది. నీరు లేని కారణంగా ప్రస్తుత యాసంగిలో సాగునీరు విడుదల చేయడంలేదు. ఫలితంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. శుక్రవారం క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలించగా ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. గజ్వేల్/కొండపాక....●కొమురవెల్లి మండలంలో ఉన్న తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల్లో భాగంగా నిర్మించారు. సుమారు 300కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరునాగారం సమీపంలోని సమ్మక్క బ్యారేజీ నుంచి ఇక్కడికి సాగునీరు వస్తుంది. ఈ క్రమంలో చివరగా జనగామ జిల్లా బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి ఇక్కడికి నీళ్లు వస్తాయి. రిజర్వాయర్ నీటి సామర్థ్యం 330 ఎంసీఎఫ్‌టీ అంటే 0.33టీఎంసీలు. ఆయకట్టు 82,542 ఎకరాలకుపైనే. ఈ జలాశయం సిద్దిపేట, జనగామ జిల్లాలకు ప్రధాన ఆధారం. ఎడమ కాల్వ ద్వారా.. రిజర్వాయర్ ఎడమ కాల్వ ఆధారంగా జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, కొండపాక, మద్దూరు మండలాలకు సాగునీరు అందుతున్నది. కుడి కాల్వ ద్వారా కొమురవెల్లి, చేర్యాలతోపాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలాలకు సాగునీరు అందుతుంది. ఎడమ కాల్వ పరిధిలో 4 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, కుడి కాల్వ పరిధిలో మరో 8 డిస్ట్రిబ్యూటరీ కాల్వలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం రిజర్వాయర్‌లో కేవలం 95ఎంసీఎఫ్‌టీ మాత్రమే నీరు ఉంది. ఫలితంగా చాలా రోజులుగా ఈ రిజర్వాయర్ నుంచి కాల్వలకు సాగునీటిని వదలకపోవడంతో వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ కాల్వల ద్వారా వచ్చే నీటితో నింపాల్సిన ఆయా జిల్లాల్లోని వందలాది చెరువుల, కుంటలు వెలవెలబోతున్నాయి. ఎడమ కాల్వ కొండపాక, దమ్మక్కపల్లి, సిరిసినగండ్ల, మర్పడగ, ఖమ్మంపల్లి, తిమ్మారెడ్డిపల్లి, గిరాయిపల్లి, జప్తినాచారం, దుద్దెడ గ్రామాల గుండా 30కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నది. చాలా రోజులుగా ఈ కాల్వ గుండా సాగునీటి విడుదల లేక, కాల్వ పూర్తిగా వట్టివోయింది. అంతేకాకుండా ఈ కాల్వ ఆధారంగా నీటిని నింపే అవకాశమున్న 33 చెరువులు, కుంటలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఒక్క కొండపాక మండలంలోనే ఈ కాల్వ ఆధారంగా 15,542ఎకరాల ఆయకట్టు ఉన్నది. కానీ చాలా రోజులుగా సాగునీరు విడుదలకు నోచుకోక వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆందోళనలో రైతులు.. ఎండిన వరి చేను.. పశువులకు మేతగాచేర్యాల(సిద్దిపేట): ఎండిన వరి చేను పశువుల మేతగా మారింది. పట్టణ కేంద్రానికి చెందిన ఖాత ఆంజనేయులు 2 ఎకరాల్లో వరి పొలం వేశారు. చేనుకు సరిపడా నీరు అందక ఎండిపోయింది. ఎండిన వరి చేనులో పశువులను మేపుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరుబావి నుంచి నీరురాక పంట చేను ఎండిపోయిందని వాపోయాడు. రిజర్వాయర్‌లో భారీగా తగ్గిన నీరు 82,542 ఎకరాల ఆయకట్టు రెండు ప్రధాన కాల్వలు, మరో 12డిస్ట్రిబ్యూటరీ కాల్వలు సిద్దిపేట, జనగామ జిల్లాలకు ఆధారం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన ఈ సందర్భంగా రైతులను పలకరిస్తే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నీటిపై ఆధారపడి వరి సాగు చేస్తే.. నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. మరోవైపు భూగర్భజలమట్టం సైతం గణనీయంగా పడిపోయిందని ఆందోళన చెందుతున్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి నీరు వచ్చినా కొండపాక కాల్వకు సక్రమంగా నీటిని వదలడం లేదని చెబుతున్నారు. రిజర్వాయర్‌లో నీళ్లు ఉండే విధంగా చూస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నదని రైతులు చెబుతున్నారు. -
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం ● అధికారులకు దిశానిర్దేశం సిద్దిపేటరూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. శుక్రవారం కలెక్టరెట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే టెన్త్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 79 పరీక్షా కేంద్రాల్లో 14,138 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందుకు చీఫ్ సూపరింటెండెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి నిఘా పెట్టాలన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రానికి చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు చూడాలన్నారు. పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుని, మౌలిక వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, ఆర్డీఓలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేయండి సిద్దిపేటరూరల్: పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలించి మార్చిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎల్ఆర్ఎస్పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీఓలు, డీపీఓ, డీటీసీపీఓ, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. -
విధుల్లో అలసత్వం తగదు
● ఇంటర్ పరీక్షలు బాధ్యతగా చేపట్టాలి ● డీఐఈఓ రవీందర్‌రెడ్డి సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని డీఐఈఓ, పరీక్షల కమిటీ కన్వీనర్ రవీందర్‌రెడ్డి అన్నారు. పరీక్షల విధుల్లో పాల్గొననున్న చీఫ్‌సూపరింటెండెంట్ (సీఎస్), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ (డీఓ), కస్టోడియన్లు, స్క్వాడ్స్ సభ్యులకు శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, అపరిచితులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలకు అనుమతించకూడదని చెప్పారు. సమావేశానికి అబ్జర్వర్‌గా విచ్చేసిన ఇంటర్‌బోర్డు జాయింట్ సెక్రటరీ(అకౌంట్స్) భీమ్‌సింగ్ మాట్లాడుతూ ప్రత్యేకమైన శ్రద్ధతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షల నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, ప్రశ్నాపత్రాల బల్క్ సెంటర్ ఇంచార్జి దేవస్వామి తదితరులు పాల్గొన్నారు. -
బండ్ల జోరు.. జాతర హోరు
ఏడుపాయల్లో భక్తుల సందడిపాపన్నపేట(మెదక్): జోడెడ్ల బండ్ల జోరు.. బోనాల హోరు.. శివసత్తుల శిగాలు.. పోతరాజుల గావు కేకలు.. డప్పు చప్పుళ్లు.. యువకుల నృత్యాలతో ఏడుపాయల్లోని కొండా కోన ప్రతి ధ్వనించాయి. జాతర రెండో రోజు గురువారం ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు కనుల పండువగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా.. ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండికి నాగ్సాన్పల్లి వద్ద పనిబాటల వారు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. యువకుల నృత్యాల మధ్య బండ్ల ఊరేగింపు కొనసాగింది. రాజగోపురం వద్దకు చేరుకోగానే.. ఆలయ అధికారులు ప్రతి బండి ఎదుట కొబ్బరికాయ కొట్టి దుర్గమ్మ చిత్రపటాలను బహూకరించారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు గురువారం తెల్లవారుజాము నుంచే ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు. మంజీర నదిలో స్నానాలు చేసి, బారులు తీరి దుర్గమ్మను దర్శించుకున్నారు. సాయంత్రం బండ్ల ఊరేగింపును తిలకించారు. జాతరలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో చాలా మంది తప్పిపోయి, తమ వారిని చేరడానికి పోలీస్ కంట్రోల్ రూంకు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ రమాదేవి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కృష్ణ, ఈఓ చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
మల్లన్న పట్నం.. పోటెత్తిన జనం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న క్షేత్రంలో పెద్దపట్నం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివ రాత్రి పర్వదినం పురస్కరించుకుని తోటబావి వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు పెద్ద పట్నం వేడుకలు కనులపండువగా జరిగాయి. అదే సమయంలో గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ రామాంజనేయులు, ధర్మకర్తలు, అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. పెద్దపట్నం నిర్వహించే తోట బావి ప్రాంగణానికి చేర్చారు. వేడుకలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. 41 వరుసలతో పెద్దపట్నం బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన పెద్ద పట్నాన్ని 41 వరుసలతో వేశారు. ఇందుకు సుమారు 150 మంది ఒగ్గుపూజారులు పొల్గొన్నారు. ఊరేగింపుగా బోనాలు తీసుకువచ్చి పట్నంపై పెట్టి స్వామికి నైవేద్యం సమర్పించారు. అర్చకులు యాదవ సంప్రదాయం ప్రకారం స్వామివారి కల్యాణం నిర్వహించారు. వెంటనే ఉత్సవ విగ్రహాలతో పట్నం దాటారు. స్వామి వారి పట్నంను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తోటబావి ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. బండారిమయమైన కొమురవెల్లి శిమనామస్మరణతో మారుమోగిన తోటబావి ప్రాంగణం -
ఓటెత్తారు
మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రాడ్యుయేట్స్ 72.83శాతం.. టీచర్స్ 94.83శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించారు. 32,589 మంది పట్టభద్రులకు 40 పోలింగ్ కేంద్రాలు, 3,212 మంది ఉపాధ్యాయ ఓటర్లకు 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, ఎన్నికల పరిశీలకులు జ్యోతి బుద్ధి ప్రకాష్, అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్‌లు పోలింగ్ సరళిని పరిశీలించారు. సాక్షి, సిద్దిపేట: ఉదయం పది గంటల వరకు నత్తనడకన సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల తరువాత పుంజుకుంది. మధ్యాహ్నం 2గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం 49.59శాతం, పట్టభద్రుల పోలింగ్ 44.6శాతమే నమోదైంది. తర్వాత ఒక్కసారిగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2గంటల వర కు ఎంత పోలింగ్ అయిందో సుమారుగా 2గంటల నుంచి 4గంటల వరకు అంత మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మూడు పోలింగ్ కేంద్రాలలో వంద శాతం.. జిల్లాలో గ్రాడ్యుయేట్‌కు 40, టీచర్స్‌కు 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో టీచర్స్ కోసం కేటాయించిన మూడు పోలింగ్ కేంద్రాలు రాయపోలు జెడ్పీ హైస్కూల్ (256 పోలింగ్ కేంద్రం నంబర్), మర్కూక్ మండల పరిషత్ స్కూల్ (264), కుకునూరుపల్లి జెడ్పీహైస్కూల్(265)లలో వంద శాతం పోలింగ్ నమోదైంది. 93.97శాతం పోలింగ్ వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీకి పూర్వపు వరంగల్ జిల్లా పరిధిలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూళ్మిట్టలు రానున్నాయి. నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 166 మంది ఓటర్లకు గాను 156 (93.97 శాతం) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు పట్టభద్రుల, ఉపాధ్యాయల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లను కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియానికి తరలించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లను నల్గొండకు తరలించారు. ఓటింగ్ సరళి ఇలా.. ఎమ్మెల్సీ ఉ. 10గంటలు మధ్యాహ్నం 12 2గంటలు పోలింగ్ ముగిసేసరికి ఉపాధ్యాయ 8.8శాతం 16.51 49.59 94.83 పట్టభద్రులు 8.2శాతం 15 44.6 72.83 ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్ పట్టభద్రులు 72.83..ఉపాధ్యాయులు 94.83శాతం నమోదు ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్, సీపీ -
ప్రాజెక్టుల బాధ్యత కిషన్‌రెడ్డిదే
హుస్నాబాద్: తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకువచ్చే బాధ్యత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిదేనని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తీసుకురాకపోయినా కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మద్య ఉన్న సంబంధాల దృష్ట్యా సీఎం, మంత్రులు, ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు మెట్రో మలిదశ, మూసీ, ట్రిపుల్ ఆర్, హైదరాబాద్ తాగునీటి సమస్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించి అనేక ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించామన్నారు. మేము కాలికి బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుతున్నామన్నారు. ఇవి రాకపోతే మా బాధ్యత అంటూ బీజేపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర మంత్రులు నిధులు తేవాల్సిందేనన్నారు. నిధులు తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వంగా ప్రతి రూపాయి జీఎస్టీ పన్ను రూపంలో ఎక్కడా తేడా రానివ్వడం లేదన్నారు. పాకిస్తాన్, ఇండియా జట్టు అంటూ రెచ్చగొడుతున్నారన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోతే, పంటలు ఎండిపోతే ట్వీట్ చేసున్న కేటీఆర్ తీరును చూసి ప్రజలు నవ్వుతున్నారన్నారు. నిధులు తేలేకపోతే అసమర్థ నాయకులే.. మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఫ్రీ చికెన్
దుబ్బాకటౌన్: పట్టణంలో గురువారం చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. చికెన్, గుడ్ల వినియోగంపై వస్తున్న అపోహలను పోగొట్టేందుకు వెన్‌కాబ్ చికెన్ ఆధ్వర్యంలో ఉచిత చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. సుమారు 2వేల ఉడకబెట్టిన కోడిగుడ్లు, 3వేల కిలోల చికెన్కర్రి, ఫ్రై జనాలకు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వెన్‌కాబ్ మార్కెటింగ్ మేనేజర్ జయ రాంరెడ్డి, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్ స్వామి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం, గుడ్లు బాగా ఉడికించి తినడం వల్ల ఎలాంటి అనారోగ్యం సంభవించదన్నారు. కనుక ఆపోహలు వీడాలన్నారు. చికెన్ మేళాలో జనాలు ఎగబడి ఆరగించడం విశేషం. దుబ్బాకలో చికెన్ కోసం ఎగబడిన జనందుబ్బాకలో చికెన్, ఎగ్ మేళా ఎగబడిన జనం -
మేధావుల మౌనం దేశానికి నష్టం
ఎంపీ రఘునందన్రావుదుబ్బాక: మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరమని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. గురువారం అక్భర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో తన సతీమణితో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశాభివృద్ధికి మేధావుల ఆలోచన విధానాలు చాలా అవసరమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఉన్నత చదువులు అభ్యసించి రాజ్యాంగం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న మేధావులు ఓటుకు దూరంగా ఉండడం ఎంత మాత్రం దేశానికి మంచిది కాదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. -
వనం.. అంతాజనం
● ఏడుపాయల జాతర ప్రారంభం ● దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దామోదర ● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీపాపన్నపేట(మెదక్): మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏడుపాయల జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద బ్రాహ్మణులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంజీర నదిలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు ఉచిత సేవలు అందిస్తున్న ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. ఇబ్బందులు తలెత్తొద్దు ఏడుపాయల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన వన దుర్గమ్మను దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్యంపె ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గురువారం బండ్లు తిరిగే కార్యక్రమం ఉన్నందున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, వారికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ సైతం దుర్గమ్మను దర్శించుకొని పూజలు చేశారు. జాతరలో ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. నిలిచిన నీటి సరఫరా జాతరలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాత్రూంలలో నీరు లేకపోవడంతో నిర్వాహకులు వాటికి తాళాలు వేశారు. తాగునీటి కోసం అవస్థలు తప్పలేదు. తర్వాత అధికారులు పొడిచన్ పల్లి తాగునీటి పథకం నుంచి నీటి సరఫరాను పునరుద్ధరించారు. మంజీరనదిలో షవర్ బాత్‌ల కింద వేలాది మంది భక్తులు స్నానాలు చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. -
ఓటెత్తాలి
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందు కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మనుచౌదరి పర్యవేక్షించారు. సాక్షి, సిద్దిపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం 15 మంది బరిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటర్లు 32,589, ఉపాధ్యాయ ఓటర్లు 3,212 మంది ఉన్నారు. పట్టభద్రుల కోసం 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని పాత వరంగల్ జిల్లాకు చెందిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూళ్మిట్ట మండలాలు రానున్నాయి. వీటిలో 166 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 327 మంది నియామకం పోలింగ్ నిర్వహణకు మొత్తంగా 327 మంది సిబ్బందిని నియమించారు. అందులో ప్రిసైడింగ్ అధికారులు 87, అసిస్టెంట్ ప్రిసైడింగ్ 204, మైక్రో అబ్జర్వర్లు 36 మందిని నియమించారు. ఇందులో 20శాతం సిబ్బందిని రిజర్వ్‌లో పెట్టారు. ప్రత్యేక బస్సుల ద్వారా పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.నేడే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది -
వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
● ఆలయాలకు పోటెత్తిన భక్తజనం ● ఘనంగా శివపార్వతుల కల్యాణాలు హర హర మహాదేవ.. అంటూ భక్తులు ముక్కంటి సేవలో తరించారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మారేడు పత్రితో పూజించారు. మహాశివరాత్రి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాల వద్దకు భక్తులు బారులు తీరారు. జిల్లా కేంద్రంలోని ఉమాపార్థీశ్వర కోటిలింగాల, శరభేశ్వర, భోగేశ్వర, మార్కండేయ తదితర ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శైవక్షేత్రాలలో ఆదిదేవుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పర్వదినం పురస్కరించుకుని శివపార్వతుల కల్యాణాలను వైభవంగా నిర్వహించారు. దీంతో ఆలయాల పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట) -
వరిపంటకు ట్యాంకర్ నీరే దిక్కు
● అడుగంటుతున్న భూగర్భ జలాలు ● రైతులకు తప్పని తిప్పలు పంటలను కాపాడుకునేందుకు రైతుల తిప్పలు అన్నీఇన్నీకావు. ఎండలు ముదిరి భూగర్భజలాలు అడుగంటడంతో నీరు అందక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన వెంకటేశ్, రాజయ్య అనే రైతులు వరి సాగుచేశారు. తలాపున తపాస్‌పల్లి రిజర్వాయర్ ఉన్నా పంటలు ఎండుతున్నాయి. చేసేదిలేక బుధ వారం ట్యాంకర్‌తో నీటిని తీసుకువచ్చి పంటను తడిపారు. ట్యాంకర్‌కు రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
కోరమీసాల మల్లన్నకు కోటి దండాలు
శివ నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి కోరమీసాల మల్లన్న స్వామీ.. కోటిదండాలు అంటూ భక్తులు ప్రణమిల్లారు. బుధవారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పరమశివుడి ప్రతి రూపమైన మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగాయి. ఉపవాస దీక్షలతో జాగరణ చేసేందుకు భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి లింగోద్భవ వేళ ఒగ్గుపూజారులు పెద్ద పట్నం వైభవంగా నిర్వహించారు. రాత్రంతా కనులపండువగా కార్యక్రమం చేపట్టారు. పెద్దపట్నంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. రాజగోపురం నుంచి ప్రధాన రహదారి, గంగరేణి చెట్టు వద్ద సందడి నెలకొంది. భక్తులు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ రామాంజనేయులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
పోస్టుకార్డుల ద్వారా సీఎంకు వినతి హుస్నాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పోస్టుకార్డుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు గడిపె మల్లేశ్ ఆధ్వర్యంలో సీఎం పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల ఇంటి స్ధలంతో పాటు ప్రతి నెల రూ.25వేల పెన్షన్, ఆర్టీసీ బస్సు, రైలులో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు. ప్రతి ఉద్యమకారుడిని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గుర్తించి రూ.10వేల కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో ఐదెకరాల విస్తీర్ణంలో సంక్షేమ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ కన్వీనర్ మాదాసు శ్రీనివాస్, నాయకులు అయిలేని సంజీవరెడ్డి, అంకుషా వలీ, సదానందం, జగదీశ్వరాచారి, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రాబిన్సన్ కన్నుమూత మెదక్‌జోన్: మెదక్ సీఎస్ఐ చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రాబిన్సన్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 2010 నుంచి 2019 వరకు చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు చర్చి అధ్యక్ష మండలంలో వైస్ చైర్మన్‌గా, మినిస్ట్రీయల్ కన్వీనర్‌గా పనిచేశారు. -
హర హర మహాదేవ..
నేడే ‘మహా’ ఉత్సవం.. అంతా సిద్ధంప్రశాంత్నగర్(సిద్దిపేట): మహా శివరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఆలయాలన్నీ విద్యుద్దీపాలతో అలంకరించారు. శైవభక్తులకు అతి ముఖ్యమైన పండుగ శివరాత్రి. జిల్లా కేంద్రంలోని ఉమాపార్థీవకోటిలింగాల ఆలయంతోపాటు అన్ని దేవాలయాలలో ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు సిద్ధం చేశారు. అభిషేక ప్రియుడు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసేందుకు భక్తులు సిద్ధమయ్యారు. భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెరిగిన పండ్ల ధరలు శివరాత్రి పర్వదినం వేళ పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది కంటే ఈసారి ధరలు అధికంగా పెరిగాయి. అరటి పండ్లు డజన్(12) రూ. 60, దానిమ్మ కిలో రూ.200, ఆపిల్ కిలో రూ.220, కమల (సంత్ర) రూ.100, ద్రాక్ష రూ.100, ఖర్జూర కిలో రూ.250, వాటర్మిలాన్ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ముస్తాబైన శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగనున్న ఆలయాలు -
పట్టభద్రులు కాంగ్రెస్ వైపే
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టభద్రులు కాంగ్రెస్ వైపే ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తథ్యమని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తూ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సిద్దిపేట పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం, రావిచెట్టు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. నిరుద్యోగులకు, పట్టభద్రులకు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పట్టభద్రులు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తుంకుంటా నర్సారెడ్డి, హరికృష్ణ , చెరుకు శ్రీనివాస్ రెడ్డి, అత్తు ఇమామ్, తదితరులు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మంత్రితో కలిసి సిద్దిపేటలోప్రత్యేక పూజలు -
రాజీ మార్గంతోనే కేసుల పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సిద్దిపేటకమాన్: రాజీ మార్గంతోనే కేసులు పరిష్కరించుకునేలా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. మార్చి 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని సిద్దిపేట కోర్టు ఆవరణలో పోలీసు, ఎకై ్సజ్ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజీపడదగిన కేసులు పరిష్కరించుకునేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం స్థానిక కొండ భూదేవి గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీగా గెలిచిన వారు ప్రజా గొంతుకగా ఉండాలన్నారు. అంతకుముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వ్యవసాయ శాఖ అధికారి రాధిక సిద్దిపేటజోన్: నానో యూరియా, డీఏపీ వినియోగించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాధిక అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నానో యూరియా, డీఏపీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎరువులు అధికంగా వాడటం వల్ల భూసారం దెబ్బ తింటుందన్నారు. అలాగే అనేక అనారోగ్యాలకు కారణంగా మారుతుందన్నారు. నానో యూరియా. డీఏపీలను పిచికారీ చేయడం వల్ల మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రైతులు జీడిపల్లి రాంరెడ్డి, అశోక్ రెడ్డి, ఎల్లాగౌడ్, రంగయ్యలను సన్మానించారు. కార్యక్రమంలో మార్క్ ఫెడ్ జిల్లా అధికారి క్రాంతి, మండల వ్యవసాయ అధికారి శ్రీనాథ్, రైతులు పాల్గొన్నారు. మల్లన్న పెద్ద పట్నానికి పటిష్ట బందోబస్తు కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే పెద్దపట్నానికి పట్టిష్ట బందోబస్తు చేపట్టినట్లు సీపీ అనురాధ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు చేపట్టామన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కింగ్ ప్రదేశాలతో పాటు ఆలయ ఆవరణలో 80 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ పాలనలో దేశం అధోగతి ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ దుబ్బాక: దేశాన్ని అన్ని రంగాల్లో బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ అన్నారు. మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోని 6 పథకాలు అమలు చేశామన్నారు. ఏడాదిలోనే 56 వేల మందికి ఉద్యోగాలు అందించామన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా కాంగ్రెస్ బలపర్చిన నరేందర్‌రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. -
భవిష్యత్తుకు క్రమశిక్షణే తొలి మెట్టు
గజ్వేల్‌రూరల్: ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు క్రమ శిక్షణే తొలి మెట్టుగా నిలుస్తుందని డీఐఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫేర్వెల్ పార్టీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకుంటారన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్క ృతిక కార్యక్రమాలు అలరించాయి. మండల పరిధిలోని ముట్రాజ్‌పల్లి మోడల్ స్కూల్లో మంగళవారం స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి కోహెడ(హుస్నాబాద్): విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈఓ రవీందర్‌రెడ్డి సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి హాజరై మాట్లాడారు. వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ప్రిపరేషన్‌పై దిశానిర్దేశం చేశారు. వార్షికోత్సవం వేళ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో యాదగిరి, రాజమౌళి, అశోక్, రజిత, నీరజ, సీతారామయ్య, నరేష్, వెంకటరెడ్డి, పాల్గొన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లోనూరాణించాలి డీఐఈఓ రవీందర్‌రెడ్డి -
రహదారి పనులు వేగిరం చేయండి
ఏకరూప దుస్తులకు చర్యలు చేపట్టండి ● కలెక్టర్ మనుచౌదరి ● నేషనల్ హైవే అఽథారిటీ అధికారులకు దిశానిర్దేశం హుస్నాబాద్: మెదక్–ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని నేషనల్ హైవే అఽథారిటీ అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణం మీదుగా నిర్మిస్తున్న రహదారి, ఇరువైపులా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి నిర్మిస్తున్న తాగునీటి పైపు లైన్ పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు, మహిళా శక్తి భవనం నిర్మాణానికి జిల్లెల్లగడ్డ, ఉమ్మాపూర్లలో స్థలాలను పరిశీలించారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్ధలాలను చూపించి వివరాలను కలెక్టర్‌కు అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి ఉన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి నంగునూరు(సిద్దిపేట): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ వార్డెన్లను ఆదేశించారు. మంగళవారం పాలమాకుల ఎస్సీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంట్రాక్టర్ నాణ్యమైన సరుకులు అందజేయకుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. హాస్టల్ భవనం పెచ్చులూడుతున్నందున మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆయన వెంట ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్ తహసీల్దార్, ఆర్ఐ తదితరులు ఉన్నారు.సిద్దిపేటరూరల్: వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాల, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు యూనిఫాంలను అందించేందుకు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గరిమా అగర్వాల్ మాట్లాడుతూ యూనిఫాంలు అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. యూనిఫాం తయారీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ అధికారులకు సూచించారు. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి దౌల్తాబాద్ (దుబ్బాక): పాఠశాలలోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. శేరిపల్లి బందారంలోని జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను, కళాశాలను సందర్శించారు. అనంతరం పదో తరగతి, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడారు. వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ విద్యాశాఖ అధికారులతో సమావేశం -
ప్రలోభాలకు ఎర
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ● పట్టభద్రుల స్థానానికి 56 మంది.. ఉపాధ్యాయకు 15 మంది పోటీ ● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ● జిల్లాలో 32 వేల మంది పట్టభద్రులు సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాగింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసన మండలి స్థానాల ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండటంతో ఓటర్ల ప్రలోభాలకు తెరలేపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 15 మంది, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది బరిలో ఉన్నారు. సాక్షి, సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా 32,589 మంది పట్టభద్రులు, 3,212 మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ మద్దతుతో వంగ మహేందర్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ పోటీ పడుతున్నారు. బీసీ నినాదాన్నే నమ్ముకుని ప్రసన్న హరికృష్ణ ప్రచారంలో ముందుకు సాగారు. సోషల్ మీడియాలో హోరెత్తిన ప్రచారం నాలుగు ఉమ్మడి జిల్లాలు 42 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సోషల్ మీడియానే ఎక్కువగా అభ్యర్థులు ఎంచుకున్నారు. వాట్సప్ గ్రూప్‌లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా తమ గళంను వినిపించారు. తమకు ఓటేస్తే నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలపై తాము చేసిన ఉద్యమాలతో పాటు విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గెలుపే లక్ష్యంగా పార్టీలు ఈ ఎన్నికల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆయా నియోజకవర్గాల వారీగా వివిధ జిల్లాలకు చెందిన నాయకులను ఇన్చార్జిలు గా నియమించారు. వీరు ఉదయం నుంచి రాత్రి వరకు పలువురు ఓటర్లను కలుస్తూ తమ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావులు వారి వారి అభ్యర్థులకు మద్దతుగా సమావేశాలు నిర్వహించారు. ఉపాధ్యాయ ఓటర్లను కలుస్తూ.. ఉపాధ్యాయుల సమ్మేళనాలు, సమావేశాలతో పాటు నేరుగా ఓటర్లతో అనుసంధానంమవుతూ తమకు ఓటేయాల్సిన అవశ్యకతను వివరించారు. ఉపాధ్యాయ సంఘాలతో.. సమావేశాలతో ఓటర్ల్లను అభ్యర్థిస్తూ మరో వైపు రాత్రి వేళ డిన్నర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా పార్టీలు, సంఘాలు 25 నుంచి 50 ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. పలువురు ఓటర్లు ఒక టీంగా ఏర్పడి వివిధ పార్టీల తరుపున బరిలో ఉన్న అభ్యర్థులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు స్థానిక లీడర్ల ద్వారా చర్చలు జరుపుతున్నారు. పోలింగ్‌కు ఒక్క రోజే ఉండటంతో అభ్యర్థులు పంపకాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఓటర్లకు ఒక్కొక్కరికి దాదాపు రూ2వేల వరకు, ఉపాధ్యాయ ఓటర్లకు దాదాపు 5వేల వరకు ఇచ్చి తమవైపునకు తిప్పుకునే అవకాశం కనిపిస్తోంది. 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల చుట్టూ163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నారు. పార్టీ జెండాలు, ప్ల కార్డులు ప్రదర్శించవద్దని, ఊరేగింపులు చేయవద్దని పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్ని పార్టీలకు సూచించారు. -
జన జాతరకు రారండి
● నేటి నుంచే ఏడుపాయల జాతర ● పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి దామోదర ● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జన జాతరకు వన దుర్గమ్మ ముస్తాబైంది. మహాశిరాత్రి పురస్కరించుకొని బుధవారం ప్రారంభం కానున్న జాతరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వం తరపున హాజరై దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు విడుదల చేసింది. ఏర్పాట్లలో ఎక్కడా రాజీలేకుండా కలెక్టర్ రాహుల్‌రాజ్ చర్యలు చేపట్టారు. సన్నాహక సమావేశశం ఏర్పాటు చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ ఏర్పాట్లు తెలంగాణలోనే అతి పెద్దదైన ఏడుపాయల జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింగూరు నుంచి 0.35 టీఎంసీల నీటిని మంగళవారం విడుదల చేశారు. స్నానాల కోసం షవర్ బాత్‌లు, బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. నీటి ప్రమాదాలు జరగకుండా 150 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ప్రత్యేక వైద్య క్యాంపులను ఏర్పాటు చేశారు. తాగు నీటి కోసం 144 కుళాయిలు, 27 ట్యాంకర్లు, 476 శౌచాలయాలు ఏర్పాటు చేశారు. 598 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. 400 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి జాతర వరకు ఉచిత బస్సు సౌకర్యాం కల్పించనున్నారు. జాతరలో మద్య నిషేధం కోసం మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందించనున్నారు. ఆలయం ముందు షామియానాలు, క్యూలైన్లు, మంజీరా నదిలో శివుని విగ్రహం ఏర్నాటు చేశారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగొద్దు: కలెక్టర్ ఏడుపాయల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఆర్డీఓ రమాదేవితో కలసి ఏడుపాయల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరలో తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, రవాణ విషయాలలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నోడల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. మూడు షిఫ్ట్‌లలో పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేయాలని ఆదేశించారు. హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి, సమన్వయ పరుచుకోవాలని అధికారులకు సూచించారు. -
గజ్వేల్ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు
వర్గల్(గజ్వేల్): గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశారని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి తెలిపారు. వర్గల్ మండలం తున్కిఖాల్సాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నా మన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వివిధశాఖలకు చెందిన పనుల ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్లు వివరించారు. స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ నియోజకవర్గాన్ని, ప్రజలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వాపోయారు. తన హయాంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు ఆయన ఫాంహౌజ్ వీడాలని, ప్రజల బాగోగుల కోసం బయటకు రావాలని సలహా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్, నాయకులు సందీప్‌రెడ్డి, విద్యాకుమార్, శ్రీరాం నర్సింహులు, శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి తున్కిఖల్సాలో సీసీ రోడ్డు పనులు షురూ.. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ జియో ట్యాగింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించడానికి ఏసీపీలు ముగ్గురు, సీఐలు పదిమంది, ఎస్ఐలు 27మంది, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు 67, కానిస్టేబుళ్లు 312 మందితో మొత్తం 419మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా అధికారుల సమన్వయంతో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు.ముందస్తు అడ్మిషన్లను నివారించాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జనార్దన్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కార్పొరేట్ కళాశాలల్లో ముందస్తు అడ్మిషన్లను నివారించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జనార్దన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు కార్పొరేట్ కళాశాలల్లో ముందస్తు అడ్మిషన్లు చేపడితే నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా గ్రామాలలో కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రచారం నిర్వహిస్తున్నాయన్నారు. ముందస్తు అడ్మిషన్లకు యత్నిస్తున్న కార్పొరేట్ కళాశాలల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్నారు. నిర్భంద విద్యతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సంగెం మధు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసన్న కుమార్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సత్కారం దుబ్బాకరూరల్: ఇటీవల చండీగఢ్‌లో జాతీయ స్థాయి 400 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. మండలంలోని రామక్కపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నర్సింహులు పోటీల్లో పాల్గొని మన రాష్ట్రం నుంచి అవార్డు సాధించారు. దీంతో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నర్సింలును శాలువతో సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు. ప్రేమ జంటపై దాడికి యత్నం అడ్డుకున్న పోలీసులు చేర్యాల(సిద్దిపేట): ప్రేమ జంటపై అమ్మాయి తరుపువారు దాడికి యత్నించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి, అబ్బాయి ఇద్దరు మేజర్లు ప్రేమించుకున్నారు. ఆదివారం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అమ్మాయి తరుపు బంధువులు కొందరు వారిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. రాష్ట్రస్థాయి పోటీలకు సిద్దిపేట ప్రాజెక్టు సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో పరిశోధన చేస్తున్న వరకవి సిద్ధప్ప ప్రాజెక్టు రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత సోమవారం తెలిపారు. తెలుగు విభాగాధిపతి డాక్టర్ మట్టా సంపత్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థులు సిద్ధప్ప రచనలపై తాత్విక భజనమండళ్ల సేవ అనే ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. భజనమండళ్లతో ఆధ్యాత్మిక, నైతిక విలువలు, సంఘ సంస్కరణలపై సిద్ధప్ప చేసిన కృషి వర్తమాన సమాజానికి ఏవిధంగా ఉపయోగపడుందనే అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నట్లు తెలిపారు. తెలుగు విభాగాధిపతి, విద్యార్థులను ఆమె అభినందించారు. -
బాలలతో పని చేయిస్తే చర్యలు
● కార్మిక చట్టాల ప్రకారం నడుచుకోవాలి ● అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు ● మిట్టపల్లిలో పౌల్ట్రీఫాంలను తనిఖీ చేసిన అధికారులుసిద్దిపేటఅర్బన్: బాలలతో పనిచేయించినా.. పనిలో పెట్టుకున్నా కఠిన చర్యలు తప్పవని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. కార్మిక చట్టాలకు లోబడి కార్మికులను నియమించుకోవాలన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని పలు పౌల్ట్రీ ఫాంలను వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేట పరిసర ప్రాంతంలోని పౌల్ట్రీ వ్యాపారస్తులు వివిధ రాష్ట్రాల నుంచి లేబర్‌ను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నారని తెలిపారు. వారికి ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ ఉండడం లేదన్నారు. పౌల్ట్రీ ఫాంలో బాలలను గుర్తించి యజమానులపై గతంలో కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. లేబర్ పనిచేసే చోట చదువుకునే వయస్సు పిల్లలు అధికంగా ఉంటే వారికి అక్కడే పాఠశాల ఏర్పాటు చేసి ఉపాధ్యాయుడిని నియమిస్తామన్నారు. సంబంధిత పౌల్ట్రీ యజమాని అందుబాటులో లేకపోగా ఉన్న సూపర్వైజర్ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట పరిధిలోని అన్ని పౌల్ట్రీ ఫాంలలో ఆకస్మిక తనిఖీ చేస్తామన్నారు. చైల్డ్ లేబర్ ఉన్నా.. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపార సంస్థలలో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన లేబర్ కు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ సరిగ్గా ఉండాలని సూచించారు. వేతన చట్టాల ప్రకారం కార్మికులకు సరైన జీతాలు చెల్లించాలని యాజమాన్యానికి సూచించారు.అధికారులు వస్తున్నారని.. పిల్లలను దాచి.. పౌల్ట్రీ ఫాంలను తనిఖీ చేయడానికి అధికారులు వస్తున్నారని తెలుసుకున్న యాజమాన్యం పిల్లలను దాచిపెట్టే ప్రయత్నం చేసింది. అక్కడికి చేరుకున్న అధికారులకు ఒక్క పిల్లవాడు కూడా కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. కాసేపు అక్కడే ఉండి పోలీసుల సహకారంతో అక్కడ ఉన్న గదులలో వెతకగా పిల్లలను దాచిపెట్టినట్టు గుర్తించారు. ఇటువంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతూ పిల్లలను దాచిపెట్టి మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వారం రోజులలో నిబంధనల ప్రకారం వలస కార్మికుల కోసం లైసెన్స్ తీసుకోవాలని, సైట్ స్కూల్ ఏర్పాటు చేయాలని సూచించారు. లేని పక్షంలో కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపించి యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎల్ఓ వికార్ బాబా, బాలల సంరక్షణ సిబ్బంది రేష్మ, రమేష్, ఆర్ఐ నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి విజయ్, పోలీస్ సిబ్బంది కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు. -
నాడు సరే.. నేడు ససేమిరా
బ్యాంక్ గ్యారంటీకి మిల్లర్లు వెనుకంజ ● సీఎంఆర్ ఆలస్యమయ్యే అవకాశం ● అక్రమాలకు చెక్ పెట్టేందుకే ‘గ్యారంటీ’ అంటున్న ప్రభుత్వం ● 129 మిల్లులకు 2.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయింపు ● ఇప్పటి వరకు గ్యారంటీ ఇచ్చింది 10 మిల్లులే వారం రోజుల్లో అందజేయాలి కేటాయించిన ధాన్యంలో మిల్లర్లు 10 శాతం బ్యాంక్ గ్యారంటీ అందజేయాలని ముందే చెప్పాం. వారం రోజుల్లో మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలను అందజేయకపోతే వారిపై ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. –ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌బ్యాంక్ గ్యారంటీకి మొదట్లో సరే అన్న రైస్ మిల్లర్లు.. ఇప్పుడు ససేమిరా అంటున్నాయి. అక్రమాలకు చెక్ పెట్టేందుకు, మరోవైపు సీఎంఆర్ ఆలస్యం చేస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. వానాకాలంసీజన్లో 417 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. వాటిని 129 రైస్ మిల్లులకు కేటాయించారు. గతేడాది నవంబర్ 15 వరకే ధాన్యానికి 10శాతం బ్యాంక్ గ్యారంటీ ఇస్తామన్న మిల్లర్లు నేటి వరకు అందించకపోవడంతో సీఎంఆర్ ఆలస్యం జరిగే అవకాశం ఉంది. సాక్షి, సిద్దిపేట: నిర్దేశించిన సమయంలో సీఎంఆర్ ఇవ్వకపోవడం, ధాన్యం మాయం కావడం వంటివి రాష్ట్ర వ్యాప్తంగా పలు మార్లు జరిగాయి. దీంతో ప్రభుత్వం మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని నిర్ణయించింది. గతంలో హుస్నాబాద్ ఏఆర్ఎం ఆగ్రో ఇండ్రస్టీస్ మిల్లులో రూ.27.76 కోట్ల విలువ చేసే 9,522 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆక్రమంగా మిల్లు యజమాని విక్రయించారని తేలింది. ఇలా జరిగినప్పుడు ధాన్యం రికవరీ కష్టంగా మారింది. బకాయిల్లేని మిల్లర్లు.. కేటాయించిన ధాన్యంలో 10శాతం, బకాయిపడి తీర్చని వారు 20శాతం, బకాయి తీర్చి పెనాల్టీ చెల్లించని వారు 25శాతం బ్యాంక్ గ్యారంటీ చెల్లించాలని నిర్ణయించారు.129 మిల్లులకు 10 మిల్లులే బ్యాంక్ గ్యారంటీ అందించాయి. మరో 47 మిల్లులకు సంబంధించి ప్రాసెస్‌లో ఉన్నాయి. మిగతా 72 మిల్లుల వారు ఇప్పటికీ బ్యాంక్‌లో ప్రాసెస్ సైతం ప్రారంభించలేదు. బ్యాంకర్లతో సమావేశాలు రైస్ మిల్లులకు బ్యాంక్ గ్యారంటీలు త్వరగా అందించాలని అదనపు కలెక్టర్ సమావేశం సైతం నిర్వహించారు. డాక్యుమెంట్లు అందజేస్తే బ్యాంక్ గ్యారంటీలు అందజేస్తామని చెప్పారు. బ్యాంక్ గ్యారంటీల కోసం మిల్లర్లు బ్యాంకులకు వెళ్లలేదని తెలుస్తోంది. 20 రోజుల సమయం కావాలని పలువురు మిల్లు యజమానులు గతంలో అండర్ టేకింగ్ రాసి ఇచ్చారు. మూడు నెలలు దాటినా గ్యారంటీలను అందించలేదు. ధాన్యం కేటాయించే సమయంలో గ్యారంటీలను అందజేస్తామని చెప్పి ఇప్పుడు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇవ్వని మిల్లర్ల పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మిల్లులను డీఫాల్ట్‌లో పెడతారా? లేదా కేటాయించిన ధాన్యాన్ని వెనక్కి తీసుకుంటారా? అనేది వేచిచూడాలి. -
364 ప్రత్యేక బస్సులు
● శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ఏర్పాట్లు ● సద్వినియోగం చేసుకోవాలి: ఆర్ఎం సంగారెడ్డి జోన్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 364 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈనెల 26 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు నడపనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆరు డిపోల నుంచి ఏడుపాయల వనదుర్గ భవానీ క్షేత్రం, ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయం, వట్పల్లి, కొప్పోల్ జాతరలు, టేకులగడ్డ ఆలయ క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ప్రభులత తెలిపారు. ఏడుపాయల దుర్గ భవానీ క్షేత్రానికి మెదక్ నుంచి 40, జేబీఎస్, బాలానగర్ నుంచి 30, నర్సాపూర్ నుంచి 30, శంకరంపేట నుంచి 25, బొడ్మట్ పల్లి నుంచి 30, హైదరాబాద్ నుంచి 20, సంగారెడ్డి నుంచి 30, సదాశివపేట నుంచి 25, జోగిపేట నుంచి 20, జహీరాబాద్ నుంచి 30, ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర ఆలయానికి జహీరాబాద్ నుంచి 32, వట్పల్లిలో జరిగే జాతరకు జోగిపేట నుంచి 20, శంకర్ పల్లి నుంచి ఏడుపాయల జాతరకు 10, శంకరంపేట నుంచి కొప్పోల్ జాతరకు 13, టేకుల గడ్డ నుంచి ఆలయం వరకు 9, మొత్తం 364 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం వివరించారు. వీటితో పాటు జహీరాబాద్ నుంచి ఝరాసంగానికి 6, శంకరంపేట నుంచి కొప్పోల్‌కు 4, జోగిపేట నుంచి వట్‌పల్లికి 5, సిద్దిపేట నుంచి వేములవాడకు సాధారణ బస్సులతో పాటు అదనంగా మూడు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఆయా క్షేత్రాలకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రత్యేక బస్సులలో 26నుంచి 28వరకు చార్జీ అదనంగా ఉన్నట్లు వెల్లడించారు. మహాశివరాత్రి జాతర కోసం ఉమ్మడి జిల్లాలోని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎం కోరారు. -
పనుల్లో నాణ్యత తప్పనిసరి
కోహెడరూరల్(హుస్నాబాద్): ఇన్నోవేషన్ పార్క్ పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ మునూచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని సముద్రాల గ్రామంలో నిర్మిస్తున్న ఇన్నోవేషన్ పార్క్ పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్ సురేఖ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మనుచౌదరి ఇన్నోవేషన్ పార్క్ సందర్శన -
ఎన్నిక ఏదైనా నామినేషన్ వేయాల్సిందే
యువతకు స్ఫూర్తినివ్వడమే లక్ష్యమంటున్న ఇంద్రాగౌడ్ గజ్వేల్: రాజకీయాలు మాకేందుకు? అనుకునే యువత ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన యువకుడు సిలివేరి ఇంద్రాగౌడ్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం చట్టసభలకు జరిగే ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. 36 ఏళ్ల వయసున్న ఇతను 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి మాజీ సీఎం కేసీఆర్‌పై పోటీ చేశారు. ఈ సందర్భంగా కేవలం 400ఓట్లు మాత్రమే పొందారు. నేషనల్ నవ క్రాంతి అభ్యర్థిగా పోటీ చేశారు. అదేవిధంగా 2024 ఏప్రీల్‌లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి అదే పార్టీ బీఫారంపై పోటీచేశారు. ఈ సందర్భంలోనూ 1,920 ఓట్లకే పరిమితమయ్యారు. అయినా నిరాశ చెందకుండా, తాజాగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నేషనల్ నవ క్రాంతి అభ్యర్థిగానే పోటీచేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని చెబుతున్న ఇంద్రాగౌడ్...యువత రాజకీయాలపై మక్కువ పెంచుకొని ముందుకువచ్చేలా చేయడమే తన లక్ష్యమన్నారు. -
కరాటేలో విద్యార్థుల సత్తా
దుబ్బాకటౌన్: అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో దుబ్బాక, మిరుదొడ్డి విద్యార్థులు సత్తా చాటారు. ఈ మేరకు యువ స్పోర్ట్స్ కరా టే అకాడమి వ్యవస్థాపకుడు, కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ మాట్లాడుతూ మాట్లాడారు. సరూర్‌నగర్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారన్నారు. పోటీలకు ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, అమెరికాతో పాటు సుమారు 4, 5 దేశాలకు చెందిన 2వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. పోటీల్లో దుబ్బాక, మిరుదొడ్డికి చెందిన 24 మంది విద్యార్థులు 11 బంగారు, 9 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించారన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను స్కూల్స్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు అభినందించారు. -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
దుబ్బాకటౌన్: సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలు నియంత్రించవచ్చని తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. రాయపోల్ మండలం రామారంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ఎస్ఐ రఘుపతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలలో దొంగతనాలు జరుగుతున్నాయని, సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టమవుతుందన్నారు. కార్యక్రమంలో రామారం గౌడ సంఘం అధ్యక్షుడు శంకర్ గౌడ్, మాజీ సర్పంచ్ మహేశ్ గౌడ్, గౌడ సంఘ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.సీఐ షేక్ లతీఫ్ -
నిత్య వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం
హుస్నాబాద్: నిత్యం వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. పట్టణానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య తన 55వ జన్మదినం సందర్భంగా శనివారం 10 కిమీ. పరుగు పందెం పూర్తి చేశాడు. అనంతనం గాంధీ చౌరస్తాలో ఆయనను శాలువాతో అభినందించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ వయస్సుతో నిమిత్తం లేకుండా మంచి ఆరోగ్యపు అలవాట్లతో నిత్యం శారీరక దారుఢ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ హుస్సేన్, మిత్రమండలి–87 స్వచ్ఛంధ సంస్థ నాయకులు శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, మోహన్, వర ప్రసాద్, రవీందర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ -
ఫర్నీచర్ అందజేసిన పూర్వవిద్యార్థిని
గజ్వేల్‌రూరల్: తాను చదువుకున్న పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్‌ను అందించిన పూర్వ విద్యార్థిని అందరి మన్ననలు పొందింది. ఆర్అండ్ఆర్ కాలనీ(పల్లెపహాడ్)కు చెందిన అనంతోజు లాస్య (భార్గవి) 6వ తరగతి వరకు గ్రామంలోని ఎంపీపీఎస్‌లో చదువుకుంది. ప్రస్తుతం ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. తాను చదువుకున్న పాఠశాలకు సాయం చేయాలని నిర్ణయించుకొని, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలకు ఒక బీరువా, 7 కుర్చీలు, 7 టేబుళ్లు శనివారం అందజేసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు భార్గవి దంపతులను అభినందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు మంజుల, రేణుక, ప్రభావతి, గీతామాధురి, శ్వేత, శ్రీకరి, సీఆర్పీ చంద్రశేఖర్, అశోక్ తదితరులున్నారు. -
ఎంపీకి ఆహ్వానం
గజ్వేల్‌రూరల్: ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ మెదక్ ఎంపీ రఘునందన్‌రావును ప్రజ్ఞాపూర్ గ్రామస్తులు కోరారు. బీజేపీ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్యాదవ్తో కలిసి శనివారం హైదరాబాద్‌లో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. వెంకట్‌రెడ్డి, శ్రీను, రాజు, దేవేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన విద్య మద్దూరు(హుస్నాబాద్): అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీడీఓ రామ్మోహన్ అన్నారు. శనివారం దూల్మిట్ట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సీఆర్పీ నారదాసు ఉమాదేవి అధ్యక్షతన నిర్వహించిన ఈసీసీఈ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సద్దేశ్వర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య సిద్దిపేటఅర్బన్: మానసిక పరిస్థితి సరిగాలేని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మండలంలోని పొన్నాల గ్రామంలో చోటుచేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్కంటి పోచయ్య (61)కు యేడాది నుంచి మానసిక పరిస్థితి సరిగాలేదు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంటి స్లాబ్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ మృతిసిద్దిపేటఅర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొండపాక మండలం మర్పడగ గ్రామానికి చెందిన ఉడెం మల్లారెడ్డి(55) శుక్రవారం రాత్రి సిద్దిపేటకు వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్తుండగా పొన్నాల శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వాహనదారుడు గమనించి 108కి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి కొడుకు రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఉత్సాహంగా వీడ్కోలు సమావేశాలు
మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ సురేశ్‌రెడ్డి ఆకాంక్షించారు. కళాశాలలో శనివారం ఉత్సాహంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ గ్రామాల్లో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కళాశాలలో చేర్పించాలన్నారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంఠరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనువాస్, బాలసిద్దులు తదితరులు పాల్గొన్నారు. చక్కగా చదువుకోవాలి నంగునూరు(సిద్దిపేట): పరీక్షలకు భయపడకుండా విద్యార్థులు చక్కగా చదివి మంచి మార్కులు సాధించాలని అక్కేనపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జానయ్య కోరారు. పదోతరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం రామస్వామి, శ్రీనివాస్, రజిత, పవన్‌కుమార్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు విద్యుత్‌కు అంతరాయం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టణంలోని 33/11కేవీ రంగదాంపల్లి సబ్‌స్టేషన్ మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పట్టణ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్సాన్పల్లి, మిట్టపల్లి, ఎల్లుపల్లి, బొగ్గులోనిబండ, మైత్రివనం, కాకతీయనగర్, రాజేంద్రనగర్, బీజేఆర్ చౌరస్తా, మహాశక్తినగర్ తదితర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.ఘనంగా చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ డేచేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ డే వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు ఉపేంద్ర, అండాలు మాట్లాడుతూ 4వ శనివారం సందర్భంగా పిల్లల తల్లులకు సృజనాత్మకతపై అవగాహన కల్పించామన్నారు. అనంతరం చిన్నపిల్లలు ఆడుకునే వివిధ రకాల బొమ్మలు తయారుచేసే విధానంపై తల్లులకు శిక్షణ ఇచ్చారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు గాను పలు రకాల ఆకులు, పువ్వు లు, పెన్సిల్ పొట్టు, స్కెచ్‌లు, మట్టితో తయా రు చేసిన బొమ్మలను ప్రదర్శించారు. కార్యక్రమంలో తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడికి సన్మానంనంగునూరు(సిద్దిపేట): బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న బైరి శంకర్‌ను శనివారం ఆ పార్టీ మండల నాయకులు అభినందించారు. మాజీ మండలాధ్యక్షుడు బెదురు కుమారస్వామి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమాచారి, శ్రీనివాస్, సత్యం, స్వామి, కిష్టయ్యగౌడ్, ప్రసాద్, రమేశ్, అనిల్ పాల్గొన్నారు.నేడు ‘నీరాజనం’ పుస్తకావిష్కరణప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రముఖ పద్యకవి షరీఫ్ రచించిన నీరాజనం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. సిద్దిపేటలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్బన్ మండల పరిధిలోని తడకపల్లి ఆవాస విద్యాలయంలో మధ్యాహ్నం జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో పద్య సాహిత్య శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన కవులు, రచయితలు, సాహితీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యి విజయవంతం చేయాలని కోరారు. జాతీయ సాహిత్య పరిషత్ సభ్యుడు అశోక్, ఎల్లమ్మ పాల్గొన్నారు.ఇసుక డంపుల స్వాధీనంమద్దూరు(హుస్నాబాద్): మండలంలోని జాలపల్లిలో అక్రమంగా డంపు చేసిన ఇసుకను శనివారం టాస్క్‌ఫోర్స్, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ షేక్ మహబూబ్ మాట్లాడుతూ గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద తుపాకుల శ్రీనివాస్, పోతన యాదగిరి ఎలాంటి అనుమతి లేకుండా 20 టన్నుల ఇసుకను డంపు చేశారన్నారు. విశ్వనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఆ డంపును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చికెన్‌పై అపోహలు వద్దు
గజ్వేల్: తెలంగాణలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకలేదని, నిరభ్యరంతరంగా చికెన్, కోడిగుడ్లను వినియోగించవచ్చని డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్‌లో వెన్‌కాబ్ ఆధ్వర్యంలో శనివారం చికెన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా చికెన్, ఉడికిన కోడిగుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సారెడ్డి మాట్లాడుతూ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చికెన్ ఉడికితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. చక్కని పోషక విలువలు కలిగిన చికెన్‌కు ప్రజలు దూరంగా ఉండొద్దని, అపోహలను పట్టించుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సర్దార్‌ఖాన్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి -
కంప్యూటర్ శిక్షణతో ఉజ్వల భవిష్యత్
● ఎన్ఆర్ఐ ప్రతాప్‌రెడ్డి ● రూ.4.62లక్షలతో ల్యాబ్ ఏర్పాటుచేర్యాల(సిద్దిపేట): విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు కంప్యూటర్ శిక్షణ ఎంతో దోహదపడుతుందని మండల పరిధిలోని ముస్త్యాలకు చెందిన ఎన్ఆర్ఐ, రిటైర్డ్ కంప్యూటర్ సైన్స్ ప్రొపెసర్ పెడతల ప్రతాప్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సొంత నిధులు రూ.4లక్షల 62వేలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ఈ ప్రాంత విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్ ఉండాలన్న ఉద్దేశ్యంతోనే కళాశాలలో 10 కొత్త మోడల్ కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రిన్సిపాల్ ప్రణీత మాట్లాడుతూ విద్యార్థులు అధునాతన కోర్సులు నేర్చుకోవడానికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కంప్యూటర్ విభాగాధిపతి నరేశ్‌కుమార్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో కళాశాల విద్యార్థులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ఇంటర్ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. అలాగే కళాశాలలో గ్రంథాలయ ఏర్పాటుకు రూ.లక్ష విరాళం అందించేందుకు ప్రతాప్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డికి అధ్యాపకులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శిఖం.. ఖతం
● యథేచ్ఛగా చెరువు భూములు కబ్జా ● వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు ● అధికారుల పర్యవేక్షణ కరువుబోరగుండు చెరువులో భూమిలో చేసిన సాగుప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యతను అధికారులు తుంగలో తొక్కేస్తున్నారు. దీంతో అక్రమార్కులు దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు.కొండపాక(గజ్వేల్): మండలంలోని చెరువు శిఖం భూములు కబ్జాకు గురవుతున్నాయి. కుకునూరుపల్లి మండలంలోని మేదినిపూర్ గ్రామ శివారులో ఎన్నో యేళ్ళ నాటి బోరగుండు కుంట సర్వే నంబరు 133లోని 1.27 ఎకరాల శిఖం భూమి కబ్జాకు గురవ్వడంతో చెరువు ఆనవాళ్లు లేకుండా పోయా యి. మిగతా చెరువులది కూడా ఇదే దుస్థితి. ఇదీ చెరువుల పరిస్థితి.. పోసానికుంట, చింతల చెరువు భూములను కొంత వరకు కబ్జాచేసి వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటున్నారు. లకుడారం గ్రామంలోని ఇసుక చెరువు, బొబ్బాయిపల్లిలో ధర్మ చెరువు, కుకుకునూరుపల్లి శివారులోని కలకలమ్మ చెరువు భూములదీ అదే దుస్థితి. కలకలమ్మ శిఖం భూమి విస్తీర్ణం 143.9 ఎకరాలు. ఈ భూమి బొబ్బాయిపల్లికి ఆనుకొని ఉండటంతో చాలా మంది చాలా యేళ్లుగా ఇళ్లు నిర్మించుకొన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే.. కొత్తపల్లి మనోహరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్లేందుకు రైలు మార్గాన్ని కలకలమ్మ చెరువు భూమిలో నుంచే వేశారు. ఇది వరకు కబ్జాచేసి ఇళ్ల నిర్మాణాలు చేయగా మిగిలిన చెరువు శిఖం భూమిని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇదంతా రెవెన్యూ అధికారుల మామూళ్ల మత్తులో జరుగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. చెరువు శిఖం భూమిలో చేపడుతున్న నిర్మాణాలను రెండు నెలల కిందట రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు సజావుగా సాగాలంటే అధికారులకు ముడుపులు చెల్లించాలని కొందరు నాయకులు డబ్బులు వసూళ్లకు పాల్పడినట్టు ప్రచారం సాగింది. దీంతో మళ్లీ ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయన్న విమర్శలు ఉన్నాయి.నిర్లక్ష్యం వహిస్తే కూల్చివేస్తాం ఈ విషయమై తహసీల్దార్ సుజాతను వివరణ కోరగా అక్కడక్కడా చెరువు శిఖం భూములు కబ్జాకు గురయ్యాయన్న మాట వాస్తవమేనన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగకుండా చూస్తామని, జరిగిన చోట ఎంక్వయిరీ రిపోర్టు ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించామన్నారు. ఖాతరు చేయకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని హెచ్చరించారు. -
అగ్గితెగులు నివారణకు చర్యలు
తొగుట(దుబ్బాక): వరికి సోకే అగ్గితెగులు నివారణకు చర్యలు తీసుకోవాలని ఎఈఓ నాగార్జున రైతులకు సూచించారు. మండలంలోని పెద్ద మాసాన్‌పల్లిలో శనివారం వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరిపంట చిరుపొట్ట దశ నుంచి కంకి పాలుపోసుకునే దశలో ఉందన్నారు. అక్కడక్కడా వరికి అగ్గితెగులు సోకినట్టు గమనించామని తెలిపారు. ఈ తెగులు వల్ల ఆకులపై ముదురు రంగు అంచుతో మధ్యలో బూడిదరంగుగల నూలుకండె ఆకారం మచ్చలు ఏర్పడతాయని చెప్పారు. ఉధృతి పెరిగినప్పుడు మచ్చలు కలసిపోయి ఆకులు ఎండిపోయి పొలం తగలబడినట్టు కనిపిస్తుందని తెలిపారు. ఆకుమచ్చ దశలోనే నివారించకపోతే అధికంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ తెగులు నివారణ కోసం ఎకరాకు ఐసోప్రోధయోలెన్ 300 మిల్లీ లీటర్లు, లేదా ట్రైసైక్లోజోల్, మ్యాంకోజెబ్ 500 గ్రాములు లేదా కాసుగామైసిన్ 500 మిల్లీ లీటర్లు స్ప్రే చేయాలని రైతులకు సూచించారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. నివారణ చర్యలతో తగ్గుముఖం సిద్దిపేటఅర్బన్: నివారణ చర్యలతో వరిలోకి సోకుతున్న ఎండు తెగులును తగ్గించుకోవచ్చని అర్బన్ మండల ఏఓ బి.శ్రీనాథ్ చెప్పారు. శనివారం రంగధాంపల్లిలో రైతు వంగ నాగిరెడ్డికి చెందిన వరి పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉష్ణోగ్రతల్లో ఉండే అధిక వ్యత్యాసం వల్ల కానీ నత్రజనిని అధికంగా వాడటం వల్ల కానీ ఈ తెగులు సోకుతుందన్నారు. దీని నివారణకు కోసైడ్ (కాపర్ హైడ్రాకై ్సడ్) మందును ఎకరాకు 400 గ్రాములు వాడాలని సూచించారు. ఆయన వెంట ఏఈఓ పవన్ ఉన్నారు.ఎఈఓ నాగార్జున -
టెన్త్‌లో శతశాతంఉత్తీర్ణత సాధించాలి
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి దుబ్బాక: పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక మున్సిపల్ పరధిలోని దుంపలపల్లి, లచ్చపేటలోని పీఎస్‌తో పాటు చీకోడ్, గంభీర్పూర్, రామక్కపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులతో మాట్లాడి పాటు పలు సూచనలు ఇచ్చారు.విద్యార్థి జీవితంలో పదవతరగతి తొలిమెట్టు అన్నారు. బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని బాగా చదివించాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందకు ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. స్లిప్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాసు తదితరులు ఉన్నారు. -
గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనడం అదృష్టం
గజ్వేల్‌రూరల్: భద్రాచల సీతారాముల కల్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమంలో భాగస్వాములవడం తమ అదృష్టమని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. భద్రాచలం నుంచి గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు వడ్లు శుక్రవారం గజ్వేల్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని మురళీకృష్ణాలయంలో రామకోటి భక్తసమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతానికి 3వ సారి గోటి తలంబ్రాల కోసం వడ్లు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు సేవలను కొనియాడుతూ అభినందించారు. కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరేష్‌బాబు, ఏఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ వైస్‌చైర్మన్ సర్ధార్‌ఖాన్, దేవాలయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పోస్టాఫీస్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేసిన డీసీసీ అధ్యక్షుడుని పోస్టల్ అధికారులు శాలువ కప్పి సన్మానించారు.డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి -
శనివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
పర్యవేక్షణ కరువు.. అక్రమార్కుల దరువు ● ఉమ్మడి మెదక్ జిల్లాకుఒక్కరే అధికారి ● అక్రమాల నియంత్రణ వట్టిమాటే ● ఏటా రూ.కోట్లల్లోవక్ఫ్భూముల ‘దందా’ ● లీజుల నెపంతో శాశ్వత నిర్మాణాలు ● పట్టణాల్లో పరిస్థితి మరీ అధ్వానంవక్ఫ్బోర్డు నామమాత్రంగా మారడంతో అక్రమార్కులకు వరంలా మారింది. ఇష్టారాజ్యంగా వక్ఫ్ భూములను ఆక్రమిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు కేవలం ఒక్క అధికారి మాత్రమే ఉండటం అక్రమాల నియంత్రణ వట్టిమాటగానే మిగిలిపోయింది. ఏటా రూ.కోట్లల్లో వక్ఫ్‌భూముల ‘దందా’ యథేచ్ఛగా సాగుతోంది. ప్రత్యేకించి సిద్దిపేట జిల్లాలో పరిస్థితి మరీ అధ్వానం. జిల్లాలో సుమారు 4వేల ఎకరాల వక్ఫ్భూములున్నాయి. ఇందులో లీజుల పేరుతో 25శాతంలోపే వక్ఫ్‌బోర్డు ఆధీనంలో ఉన్నాయి.మిగిలిన భూముల్లో అధిక శాతం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.న్యూస్‌రీల్ -
బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యమివ్వండి
మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కను దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి లింగుపల్లి శంకర్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎంను శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 2024–25 బడ్జెట్లో కేవలం 7శాతం నిధులు కేటాయించి తమ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అంతర్జాతీయ మోడల్ స్కూళ్లను అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించాలని అన్నారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం పరిరక్షించాలని కోరారు. బడ్జెట్ల 15శాతం విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ డీబీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. పాఠశాలల్లో కనీస వసతులు కరువుగజ్వేల్రూరల్: బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి కోరారు. ఈ మేరకు శుక్రవారం గజ్వేల్‌లో డీబీఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏగొండస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కరువయ్యాయని, అసద్ నివేదిక ప్రకారం 5.4శాతం పాఠశాలల్లో బాత్రూమ్లు లేవని, 19శాతం బడులు పాడుబడ్డాయని పేర్కొన్నారు గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలతో పాటు పాఠశాలల్లో పౌష్టికరమైన మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎంకు దళిత బహుజన ఫ్రంట్ వినతి