Suryapet
-
మట్టపల్లి ఆలయంలో చలువ పందిర్లు ఏర్పాటు
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణానదీ తీరంలో గల స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు వేసవి తాపం నుంచి బయట పడేందుకు ఆలయ పాలక వర్గం చలువ పందిర్లు ఏర్పాటు చేస్తోంది. ప్రధాన రాజగోపురం నుంచి ఆలయ సింహద్వారం వరకు, క్యూలైన్ల నుంచి ముఖమండపం వరకు మంగళవారం చలువ పందిర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టారు. కృష్ణానదీతీరం నాపరాయితో నిక్షిప్తమై ఉండడంతో ఇక్కడ కాస్త వేడి ఎక్కువగానే ఉంటుంది. నదిలో నీరు తగ్గిపోతుండటంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇందులోకి దిగేందుకు భక్తులు ఆసక్తి చూపడంలేదు. దీంతో పైభాగంలోనే వాటర్షవర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం వేసవిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆల య పరిసరాల్లో చలువ పందిర్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ అనుశంవశిక ధర్మకర్తలు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్ తెలిపారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. ఇందులో భాగంగా సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం ,రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో ఘనంగా నిర్వహించారు. శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. -
సూర్యాపేట
ఇఫ్తార్ 6–31 (బుధవారం సాశ్రీశ్రీ) సహర్ 5–04 (గురువారం ఉశ్రీశ్రీ)ఐదుగురి అరెస్ట్ గంజాయి తరలిస్తున్న ఐదుగురిని కోదాడ శివారులోని దుర్గాపురం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. 7విద్యా ప్రమాణాలు పాటించాలి విద్యాసంస్థలు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించాలని ఎంజీయూ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. - 8లోబుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025 -
బాధితులకు సత్వర న్యాయం జరగాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కమిషన్ సభ్యులతో కలిసి నిర్వహించిన సమీక్షలో చైర్మన్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములపై ఉన్న కేసులను పరిష్కరించాలన్నారు. పీఎం అజయ్ పథకం కింద లబ్ధిదారులను త్వరగా ఎంపిక చేసి వారి బోర్ల ద్వారా సాగునీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల జిల్లాలో పరువు హత్యకు గురైన మాల బంటి అలియాస్ కృష్ణ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ కేసు విషయంలో కలెక్టర్ బాగా పనిచేస్తున్నట్లు తెలిపారు. దళిత బంధు రాని అర్హులైన ఎనిమిది కుటుంబాలకు వెంటనే అందేలా చూడాలన్నారు. ప్రతినెలా పౌరహక్కుల దినోత్సవం జరపాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతినెలా చివరి రోజున కచ్చితంగా పౌర హక్కుల దినోత్సవం జరిగేలా చూడాలన్నారు. అంతకుముందు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లాలో అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్ చైర్మన్‌కు వివరించారు. మాల బంటి కేసును వివరిస్తూ భార్గవి విద్యార్హత మేరకు సర్టిఫికెట్ పరిశీలించి ఉద్యోగం కల్పిస్తామని, కేసారంలో డబుల్బెడ్రూం ఇల్లు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే పోలీస్ భద్రతతో పాటు వారి ఇంటి వద్ద 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కె.నరసింహ, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, శంకర్, నీలాదేవి, లక్ష్మీనారాయణ, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, ఎస్టీ అభివృద్ధి అధికారి శంకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్‌నాయక్, ఎల్డీఎం బాపూజీ, జీఎం సీతారాం నాయక్, డీఎస్పీలు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పెన్‌పహాడ్: రబీలో రైతులు నీటి కొరతను అధిగమించేందుకు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన బొబ్బెర్లు, ఉలవలు వేసుకోవాలని, ఈ దిశగా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. పెన్‌పహాడ్ మండల పరిధిలోని ధర్మాపురం, మేగ్యాతండా, భక్తాళాపురం గ్రామాల్లో ఎస్సార్ఎసీ కాల్వ ద్వారా సాగు చేస్తున్న వరి పొలాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. సాగునీటి లభ్యత, బోరు, బావుల ద్వారా ఎంత మేర సాగు అవుతుందో క్షేత్రస్థాయిలో తిరిగిచూశారు. బోరుబావుల్లో నీరు సరిపోతుందా, ఇంకా ఎన్ని రోజులు నీరు సరఫరా చేస్తే పంటలు చేతికి వస్తుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. 20రోజులు కాల్వల ద్వారా సాగునీరు వచ్చేలా చూస్తే బోరుబావుల్లో నీరు ఉంటుందని పంటలు కూడా చేతికి వస్తాయని రైతులు తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ లాలు, ఇరిగేషన్ ఏఈ లింగయ్య, ఏఓ అనిల్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌కు పేరు వస్తుందని నీళ్లు ఇవ్వడం లేదు
సూర్యాపేటటౌన్ : ‘కాళేశ్వరం ఒక పిల్లర్ కూలితే దాన్ని రిపేరు చేయించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. కానీ బాగు చేయిస్తే కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందోనని దుర్బుద్ధతితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వకుండా రైతుల పంట పొలాలను ఎండబెడుతున్నాడు’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు కుదేలయ్యాయని, ముఖ్యంగా వ్యవసాయం పూర్తిగా నష్టాల్లో ఉందన్నారు. రాష్ట్రంలో నీళ్లు లేక లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయని, జిల్లాలో ఎస్సారెస్పీ కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో పంటలు పండక పశువులను మేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు నీళ్లు ఇవ్వాలని, లేకుంటే పంట నష్టం అంచనా వేసి పరిహారం ఎకరానికి రూ.30,000 అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఆకుల లవకుశ, జీడి భిక్షం, తూడి నరసింహారావు పాల్గొన్నారు. -
గోదావరి జలాలు నిలిపివేత
అర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు వారబందీ విధానంలో విడుదల చేస్తున్న గోదావరి జలాలను మంగళవారం నిలిపివేశారు. అయితే వారబందీ విధానంలో ఈనెల 1న విడుదల చేయాల్సి ఉండగా రెండు రోజులు ఆలస్యంగా వదిలారు. అయితే వారం రోజులు కావడంతో నీటిని నిలిపివేశారు. కాగా వారబందీ విధానంలో నీటిపారుదలశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ వారం గడిచాక వచ్చేవారం నీటిని జిల్లాకు పునరుద్ధరించనున్నారు. రైతులు మాత్రం పంటలు చేతికొచ్చే వరకు నీటిని నిరంతరాయంగా ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏప్రిల్ 11 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలునల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 11 నుంచి నిర్వహించనున్నట్లు ఎంజీయూ సీఓఈ డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11న నుంచి డిగ్రీ ఒకటవ సెమిస్టర్, మూడవ సెమిస్టర్ పరీక్షలు ఉంటాయని, 16 నుంచి ఐదవ సెమిస్టర్, 15 నుంచి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంజీయూ పరిధిలోని సీబీఎస్సీ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని వారికి చివరి అవకాశం కల్పిస్తూ.. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి టైం టేబుల్, వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించాలిచివ్వెంల : పదోతరగతిలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మహిళా సాధికారత కేంద్ర జిల్లా కో ఆర్టినేటర్ చైతన్య సూచించారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో బేటి పడావో–బేటి బచావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. బ్యాడ్ టచ్– గుడ్ టచ్ పై విద్యార్థినులకు వివరించారు. బాల్య వివాహాలు, 18సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, అక్రమ రవాణా వంటి సమస్యలపై 1098 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. అదే విధంగా మహిళలకు ఇబ్బందులు ఎదురైతే 181 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయవచ్చని, సఖీ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వయోవృద్ధులకు ఇబ్బందులు ఎదురైతే 104567నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అందిస్తున్న పథకాలను, అదే విధంగా పని ప్రదేశాల్లో, ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులపై వివరించారు. ఈ సందర్భంగా 9,10 విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించారు. కార్యక్రమంలో రేవతి, వినోద్, ఎం.క్రాంతికుమార్, హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆరుగురు సీఐల బదిలీ నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మల్టీ జోన్–2లో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కె.ఆదిరెడ్డిని నాంపల్లి సీఐగా, నల్లగొండ ట్రాఫిక్ పీఎస్‌లో పనిచేసే రాజును చండూరు సీఐగా, పీసీఆర్ నల్లగొండలో పనిచేసే కె.శివశంకర్‌ను సూర్యాపేట జిల్లా కోదాడ సీఐగా, నాంపల్లి సీఐగా పనిచేస్తున్న అనంతుల నవీన్‌కుమార్‌ను హైదరాబాద్ సిటీ కమిషరేట్‌కు, చండూరు సీఐగా పని చేస్తున్న ఎ.వెంకటయ్యను, కోదాడ టౌన్ సీఐగా పని చేస్తున్న రాములును హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. నేటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి మంగళవారం వరకు నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, బ్రహ్మోత్సవం వంటి పూజలు ఆలయాధికారులు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో బుధవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు, బ్రహ్మోత్సవం వంటి పూజలు ఆగమశాస్త్రానుసారం ప్రారంభిస్తామని అర్చకులు వెల్లడించారు. -
నీడలేదు.. నీళ్లు లేవు!
ఉపాధి హామీ పనిప్రదేశంలో కనీస వసతులు కరువు నాగారం : ఉపాధి పనుల నిర్వహణకు పెద్ద పీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పనిప్రదేశంలో సరైన వసతులు లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండలోనే సేదదీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీరు అందుబాటులోలేక ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. కూలీల వలసలు నిరోధించి ఉన్న ఊరిలోనే పనులు కల్పించాలన్న ఉద్దేశంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిని విజయవంతంగా చేపట్టేందుకు నూతన సాంకేతికతను సైతం వినియోగిస్తోంది. కూలీల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్)ను ప్రవేశపెట్టింది. వచ్చిన వారి ఫొటోను ఉదయం పని ప్రదేశం నుంచే తీసి పోర్టల్‌లో నమోదు చేయడం, పనులు పూర్తయిన తరువాత మళ్లీ ఫొటో తీసి నిక్షిప్తం చేయడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చేపడుతున్న పనులు ఇవీ.. జిల్లాలో 23 మండలాల్లో ఉపాధిహామీ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇంకుడు గుంతలు, పశువుల షెడ్ల నిర్మాణం, కోళ్ల షెడ్లు, నీటి తొట్లు, నీటి నిల్వ వసతులు, నర్సరీల ఏర్పాటు, చెక్ డ్యామ్‌లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పంట పొలాలకు రోడ్ల అనుసంధానం, నీటి కుంటల నిర్మాణం, వనమహోత్సవంలో పండ్ల తోటల పెంపకం, మొక్కల సంరక్షణకు తదితర పనులను చేపడుతున్నారు. పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు జిల్లాలో పని ప్రదేశాల్లో వడదెబ్బ తగిలి ఏటా ఆరెడు గురు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. అప్పుడు కూలీల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుంది. ఉపాధి కూలీలు భోజనం చేయడానికి, అలసటగా ఉన్నప్పుడు సేద దీరడానికి ప్రభుత్వం గతంలో షామియానాలు (టెంట్లు) పంపిణీ చేసేది. కానీ కొన్నేళ్లుగా టెంట్లు అందించడం లేదు. సరఫరా కాని మెడికల్ కిట్లు పనులు చేసే సమయంలో కూలీలకు గాయాలైన సందర్భంలో ప్రాథమిక చికిత్స కిట్లు సమకూర్చాలి. కిట్‌లో అయోడిన్, బ్యాండేజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కొన్ని రకాల మాత్రలు అందుబాటులో ఉంచాలి. కొన్నేళ్లుగా వీటి సరఫరా నిలిచిపోయింది. సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నాం పని ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బందులు కలగకుండా దృష్టి సారిస్తున్నాం. పని చేసేచోట సౌకర్యాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించాం. వేసవిలో ఉపాఽధి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. –వి.వి అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట. ఇంటి నుంచే తాగునీరు.. పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం లేదు. కూలీలు ఇళ్లనుంచే నీటిని డబ్బాలు, బాటిళ్లలో తెచ్చుకుంటున్నారు. గతంలో కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక కూలీని నియమించేవారు. ఈ విధానాన్ని తొలగించి గ్రామ పంచాయతీ వారే ఉపాధి కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని నిబంధనలు విధించారు. కానీ ఎక్కడ కూడా నీటి వసతి కల్పించిన దాఖలాలు కన్పించడంలేదు. గ్రామ పంచాయతీలు 475మొత్తం జాబ్ కార్డులు 2.62 లక్షలు నమోదైన కూలీల సంఖ్య 5.71లక్షలు ఉపాధి పనులకు వెళ్లేవారు 1.47లక్షలుప్రస్తుతం పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య 18,775100 రోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబాలు 596ఫ అందుబాటులో లేని టెంట్లు, మెడికల్ కిట్లు, తాగునీరు ఫ ఎండలకు ఇబ్బందులు పడుతున్న కూలీలు చెట్లను ఆశ్రయిస్తున్న కూలీలు రోజు రోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉపాధి పనులు చేసేచోట కనీస వసతులు లేక కూలీలు ఎండలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీడ కోసం గతంలో సమకూర్చిన టెంట్లు పనికిరాకుండా పోయాయి. మళ్లీ వాటి మంజూరుపై మూడేళ్లుగా ఎలాంటి స్పష్టత లేదు. పనిచేసే చోట నీడ లేక ఎండలకు కాస్త సేదదీరడానికి చెట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. -
అష్టోత్తర శతఘటాభిషేకం.. శృంగార డోలోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. 11 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు శ్రీస్వామి అమ్మవార్ల శృంగార డోలోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. అర్చకులు ఆలయంలో ఉదయం శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, ఆలయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 108 కలశాలతో.. ఈ నెల 1న స్వస్తి వాచనంతో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం ఆలయ ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలను ఒకే చోటుకు చేర్చి పూజించారు. అంతకు ముందు ముఖ మండపంలో హోమం నిర్వహించి, పూర్ణాహుతి జరిపించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యజ్ఞాచార్యులకు, పారాయణీకులకు, అధికారులకు, సిబ్బందికి సన్మానించారు. నిత్యారాధనల అనంతరం రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి లాలి పాటలు, భక్తి గీతాల సంకీర్తన గావించారు. ఫ యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ముగింపు పలికిన అర్చకులు -
రవాణా చార్జీలు వచ్చేశాయ్..
హుజూర్నగర్: దూరప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి రవాణా చార్జీలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ముందు వరకు విద్యార్థులకు రవాణా చార్జీలు అందించిన ప్రభుత్వం నాలుగు ఏళ్ల నుంచి నిలిపివేసింది. దీంతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు ఆటోలు, బస్సుల్లో, కొందరు నడుచుకుంటూ పాఠశాలలకు వస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని పేదబాలికలు బడి మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొందరు కిరాయిలు భారంగా మారి సక్రమంగా పాఠశాలలకు రాలేక పోతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం గతంలో మాదిరిగా రవాణా చార్జీలను నాలుగేళ్ల తర్వాత పునరుద్ధరించింది. జిల్లాకు రూ.67.56 లక్షలు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా చార్జీల కింద ప్రభుత్వం మొత్తం రూ.67.56 లక్షలు విడుదల చేసింది. వాటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సంబంధించి 1,042 మంది విద్యార్థులకు రూ.6 వేల చొప్పున రూ 62.52 లక్షలు మంజూరు చేసింది. అంతే కాకుండా పీఎంశ్రీ పేజ్ –1 కింద 22 పాఠశాలల్లో ఎంపికై న 77 మంది విద్యార్థులకు రవాణా చార్జీలు రూ.4.20 లక్షలు మంజూరు చేసింది. పీఎంశ్రీ పేజ్–2 కింద ఎంపికై న 9 పాఠశాలల్లోని 14 మంది విద్యార్థులకు రవాణా చార్జీలు కింద రూ.84 వేలు విడుదల చేసింది. తప్పనున్న ఆర్థికభారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కిలోమీటరుకు పైగా, ప్రాథమికోన్నత పాఠశాలకు 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలకు 5 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వస్తున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఏడాదికి ఒక విద్యార్థికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లిస్తుంది. ఇందుకు విద్యార్థి హాజరు ప్రతినెలా 80 శాతం ఉండాలి. ప్రస్తుతం రవాణా చార్జీలు విడుదల కావడంతో తమకు ఆర్థికభారం తప్పనుందని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రభుత్వనిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తీపికబురు ఫ ఒక్కో విద్యార్థికి రూ.6 వేల చొప్పున రూ.62.52 లక్షలు విడుదల ఫ పీఎం శ్రీ ద్వారా అదనంగా మరో రూ.5.04 లక్షలు ఫ జిల్లాలో 1,133 మందికి ప్రయోజనంనేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తాం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన రవాణా చార్జీలు చెల్లింపుల కోసం సీఆర్పీల ద్వారా విద్యార్థుల బ్యాంకు ఖాతాలు సేకరిస్తాం. ఆయా విద్యార్థుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (డీబీటీ) ద్వారా జిల్లా కార్యాలయం నుంచే రవాణా చార్జీలు జమ చేస్తాం. – కందిబండ శ్రవణ్‌కుమార్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్, సూర్యాపేట -
కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కె.నరసింహ సోమవారం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తు, కేసుల్లో నేరస్తులకు శిక్ష అమలు, అక్రమ రవాణా నిరోధం, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన, పోలీసు సేవలు తదితర అంశాలపై చర్చించారు.దరఖాస్తుల ఆహ్వానంభానుపురి (సూర్యాపేట) : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి బోయినపల్లిలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి కె.శంకర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 2025 ఆగస్టు 31 నాటికి 9 నుంచి 11 ఏళ్ల వయస్సు ఉండి ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న జిల్లాలోని గిరిజన విద్యార్థినీ విద్యార్థులు అర్హులని తెలిపారు. ఈనెల 11వ తేదీ నుంచి దరఖాస్తు ఫారాలను పొంది ఈనెల 17వ తేదీ లోగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ఇతర వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటనభానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య పర్యటించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో సమావేశం ఉంటుందని తెలిపారు. ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు 7,424 మంది హాజరుసూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షను 32 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 7,704 మంది విద్యార్థులకు 280 మంది గైర్హాజరు కాగా 7,424 మంది హాజరైనట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్టు చెప్పారు. ప్రణయ్ హత్యకేసు తీర్పు చెంపపెట్టు లాంటిదిభానుపురి (సూర్యాపేట) : పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు తీర్పు కుల దురహంకారులకు చెంపపెట్టు లాంటిదని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు అన్నారు. ప్రణయ్ హత్యకేసు తీర్పుపై సోమవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని సీపీఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కోట గోపి అధ్యక్షతన చర్చాగోష్ఠి నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడారు. కోర్టులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ప్రణయ్ కేసు తీర్పు ఉందన్నారు. రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగాయన్నారు. ఇటీవల సూర్యాపేటలో వడ్లకొండ కృష్ణను అతి కిరాతకంగా హత్య చేశారని, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమళ్ల హస్సన్, సీనియర్ జర్నలిస్ట్ బంటు కృష్ణ, పల్లె మనిబాబు, శిరంషెట్టి ఆనంద్, వెంకన్న, జె.నరసింహారావు, వెంకట్ రెడ్డి, నాగయ్య, దేవయ్య, వెంకటనరసయ్య, బోయిల్ల అఖిల్ , సుధాకర్, సతీష్ పాల్గొన్నారు. -
అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగినందున ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని పాఠశాలు, హాస్టల్స్‌లో ఫ్యాన్లు వాడుకోనేలా సిద్ధం చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి ఎద్దడి రాకుండా చిన్నచిన్న మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా శాఖ సభ్యులు తల్లిదండ్రుల వయోధికుల పోషణ, సంక్షేమ చట్టం 2007 నియమావళి – 2011 తెలిపే పోస్టర్‌ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, సీపీఓ ఎల్.కిషన్, డీఎంహెచ్ఓ కోటాచలం, డీఈఓ అశోక్, డీటీడీఓ శంకర్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మైనార్టీ అధికారి జగదీశ్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ పీడీ శ్రీనివాస్‌నాయక్, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం నాయక్, డీఎస్ఓ రాజేశ్వరరావు, డీసీఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి, మెప్మా పీడీ రేణుక పాల్గొన్నారు. సాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలుభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పాల్గొని మాట్లాడారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరందేలా చూస్తామన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం
సూర్యాపేటటౌన్ : జిల్లాల్లో శాంతిభద్రతల రక్షణకు అధికప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నూతన ఎస్పీ కె.నర్సింహ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతన ఎస్పీగా ఆయన సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గత ఎస్పీ, డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్పీకి అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పేకాట, గంజాయి తరలింపు, ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. వేగంగా పోలీస్ సేవలుఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి విలువైన సేవలు వేగంగా అందిస్తామన్నారు. మహిళల పట్ల, పిల్లల పట్ల వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈవ్‌టీజింగ్ చేసే వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. సైబర్ మోసాల పై ప్రణాళికతో పని చేస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నర్సింహ -
నేత్రపర్వంగా మహాపూర్ణాహుతి, పుష్పయాగం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. సోమవారం మహాపూర్ణాహుతి, శ్రీచక్రతీర్థం, పుష్పయాగం, దేవతలకు వీడ్కోలు పర్వాలు చేపట్టారు. ఉదయం యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతి వేడుక సందర్భంగా.. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దేవతలను సుగంధద్రవ్యాలతో ఆరాధించి, పట్టు వస్త్రాలతో ఆవాహన చేసి నెయ్యితో అగ్ని భగవానుడికి సమర్పించారు. విశ్వశాంతి కోసం మహా పూర్ణాహుతి వేడుక నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని పూజలు నిర్వహించారు. శ్రీచక్రతీర్థం.. మహావిష్ణువు ఆయుధమైన శ్రీచక్ర ఆళ్వారుడికి మధ్యాహ్నం ఒంటి గంటకు పూజలు చేసిన అనంతరం విష్ణు పుష్కరిణిలో శ్రీచక్రతీర్థం వేడుక వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను.. శ్రీచక్ర ఆళ్వారునికి అలంకరించి ప్రత్యేక పల్లకిపై అధిష్టింపజేసి పూజలు చేశారు. ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తూ విష్ణు పుష్కరిణికి వేంచేసి శ్రీచక్రస్నానం వేడుక పూర్తి చేశారు. దేవతలకు వీడ్కోలు నిత్యరాధనల అనంతరం దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, దోపు ఉత్సవంనిర్వహించారు. మహోత్సవంలో దోఽషములు తొలగించేందుకు పుష్పయాగం చేపట్టారు. ఇక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన దేవతలను తిరిగి స్వస్థలానికి పంపించే వేడుక దేవతోద్వాసన అని అర్చకులు పేర్కొన్నారు. -
ఒకరి ప్రేమ.. మరొకరి అహం..
ప్రణయ్ హత్యతో రెండు కుటుంబాల్లోనూ విషాదం సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఒకరి ప్రేమ.. మరొకరి అహం.. ఆ కుటుంబాలను చెల్లాచదురు చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చేసుకున్న ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఓ ప్రాణాన్ని బలితీసుకోగా, చివరకు ఆ తండ్రే తనకు తానే తనువు చాలించాడు. అదే ప్రణయ్, అమృత వర్షిణి ప్రేమ వ్యవహారంలో చివరి మజిలీగా మిగిలింది. మిర్యాలగూడ పట్టణంలో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ప్రేమించుకున్న వారిద్దరు 2018 జనవరి 30న ఒక్కటయ్యారు. కొద్దిరోజులకే ఆమె కడుపులో మరో జీవి ప్రాణం పోసుకుంది. అయినా ఆమె తండ్రి తిరునగరు మారుతీరావు పరువు.. ప్రతిష్ట అంటూ అల్లుడు ప్రణయ్‌ని హత్య చేయించి కూతురు జీవితాన్ని చీకటిమయం చేశారు. చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించుకుని ఎన్నో ఆశలతో ఒక్కటైన ప్రణయ్ అమృతవర్షిణి కలల ప్రపంచం చెదిరిపోయింది. వృద్ధాప్యంలో అండగా ఉంటాడని అనుకున్న ప్రణయ్ తల్లిదండ్రులు పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతులకు ప్రణయ్ హత్య తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్యతో ఆ రెండు కుటుంబాలు అగాథంలో పడ్డాయి. కడుపుతో ఉన్నా కరుగని మనస్సు.. కూతురు గర్భతిగా ఉన్నా ఆ తండ్రి మనస్సు కరుగలేదు. అల్లుడిగా ప్రణయ్‌ని అంగీకరించకపోయినా, పట్టించుకోకుండా వదిలేసినా సరిపోయేది. కానీ పరువు పేరుతో ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావుతోపాటు హత్యలో భాగస్వాములైన ఏడుగురిని అరెస్టు చేశారు. ఆ తరువాత అమృత మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండేళ్లు కాలం గడిచింది. తన భర్త మరణానికి న్యాయం కావాలని, తండ్రికి మరణ శిక్ష పడాలని కన్న కూతురే డిమాండ్ చేయడంతో మారుతీరావు మనోవేదనలో పడ్డారు. 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ కలలు చెదిరిపోయి, ఊరు విడిచి వెళ్లిపోయిన అమృత ఫ కొడుకు లేక విలపిస్తున్న ప్రణయ్ తల్లిదండ్రులు -
ఖాళీలతో అవస్థలు..!
ఈ ఫొటోలో చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం ఇస్తున్నది ఆత్మకూర్ (ఎస్) మండలం మక్తాకొత్తగూడెంలోని అంగన్వాడీ సెంటర్‌లోనిది. ఈ సెంటర్ అంగన్వాడీ టీచర్ నాలుగేళ్ల క్రితం సూపర్వైజర్గా పదోన్నతి పొందారు. ఇక ఆయాకు 65 ఏళ్లు నిండడంతో పది నెలల క్రితం రిటైర్డ్ అయ్యారు. దీంతో సెంటర్లో 15 మందికి పైగా పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇలా మొత్తం 40 మంది వరకు పౌష్టికాహారం ఇచ్చేందుకు బొప్పారం, శెట్టిగూడెం తండాకు చెందిన అంగన్వాడీ టీచర్లకు బాధ్యతలు అప్పగించాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతినెలా ఒకరోజున లబ్ధిదారులకు పౌష్టికాహారం ఇస్తున్నారు. ఇదీ జిల్లాలో చాలా సెంటర్లలో అదనపు బాధ్యతలతో టీచర్లు, ఆయాలు, సమయానికి పౌష్టికాహారం అందక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఏళ్లు తరబడి టీచర్, ఆయా పోస్టులు భర్తీకి నోచుకోవడంలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఇద్దరి పనిని ఒక్కరే చేయడం, సెలవు దొరకకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి పలుమార్లు ప్రయత్నాలు జరిగినా ముందుకు సాగలేదు. దీంతో కొన్నేళ్లుగా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వివిధ కారణాలతో ఖాళీ..సూర్యాపేట జిల్లాలో ఐదు ప్రాజెక్టుల కింద 1,209 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో 30వేల మంది దాకా చిన్నారులు, మరో 20వేల మంది దాకా గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం పొందుతున్నారు. అయితే అంగన్వాడీ టీచర్లు పనిచేస్తున్న కొందరు వివిధ ఉద్యోగాలు పొందడం, అంగన్వాడీల్లోనే సూపర్వైజర్లుగా పదోన్నతి పొందడంతో టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 65 ఏళ్లు నిండిన ఆయాలకు పదవీ విరమణ కల్పించడంతో ఆ పోస్టులు సైతం భారీగా ఖాళీ అయ్యాయి. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 61 అంగన్వాటీ టీచర్, 200 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు గతంలోనే గుర్తించారు. భర్తీకి నోచుకోకపోవడంతో..ఎన్నో సంవత్సరాలుగా అంగన్వాడీల పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయాలు ఉన్నచోట టీచర్ లేకపోవడంతో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందడం లేదు. ఇక టీచర్ ఉండి ఆయా లేనిచోట పిల్లలను తీసుకురావడం, తీసుకెళ్లడం, ఆలనాపాలనా చూడడం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మీ పథకం భోజనం వండిపెట్టడం వంటివి అందడం లేదు. ఇందులోనే ఇటీవల ఆయాలకు రిటైర్మెంట్ ఇవ్వడంతో కొన్నిచోట్ల టీచర్‌తో పాటు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఆయాలు, టీచర్లపైనా పనిభారం అధికమైంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయా, టీచర్ పోస్టులను భర్తీ చేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు.ఏళ్లుగా భర్తీకాని అంగన్వాడీ పోస్టులు ఆయా ఉంటే టీచర్ లేక.. టీచర్ ఉంటే ఆయా లేక ఇబ్బందులు ఉన్న టీచర్లు, ఆయాలపైనా పనిభారం లబ్ధిదారులకు సక్రమంగా అందని పౌష్టికాహారంత్వరలోనే భర్తీ కానున్నాయి జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలోనే ఈ ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అప్పటి వరకు సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – నరసింహారావు, సంక్షేమాధికారి -
కాంగ్రెస్ కక్షసాధింపు వల్లే రైతులకు నీటికష్టాలు
నూతనకల్: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల కారణంగానే రైతులకు సాగునీటి కష్టాలు వచ్చాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. నూతనకల్ మండల కేంద్రంలో ఎండిపోయిన పంట పొలాలను, శ్రీరాంసాగర్ కాల్వలను శనివారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్.. గోదావరి జలాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే ప్రాజెక్టులో లోపాలున్నాయని నీటిని లిప్టు చేయకుండా రైతులను అరిగోస పెట్టిస్తున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాళేశ్వరం పంప్‌లను నడిపి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పంటలు ఎండిపోయిన రైతులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నూతనకల్, మద్దిరాల బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్య, ఎస్ఏ రజాక్, గుజ్జ యుగేంధర్‌రావు, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్‌నాయక్, బత్తుల సాయిలుగౌడ్, బిక్కి బుచ్చయ్య, బత్తుల విద్యాసాగర్, బత్తుల విజయ్, ఇమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, బాణాల సత్యనారాయణరెడ్డి, కనకటి మహేష్, పంతం యాకయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి -
నయన మనోహరం.. నృసింహుడి కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణోత్సవం శనివారం రాత్రి వైభవంగా సాగింది. పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలతో పెళ్లికొడుకుగా ముస్తాబైన శ్రీస్వామివారు గజవాహనంపై, నవ వధువుగా శ్రీలక్ష్మీదేవి దివ్య అలంకార శోభితమై ప్రత్యేక పల్లకిలో రాత్రి 8.30 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి 9 గంటలకు ఉత్తర మాడవీఽఽధిలో ఏర్పాటు చేసిన కల్యాణవేదికపైకి చేరుకున్నారు. కల్యాణ వేదికపై శ్రీస్వామి, అమ్మవారిని ఎదురెదురుగా అధిష్టింజేసిన అర్చకులు.. కల్యాణానికి శ్రీకారం చుట్టారు. అర్చకబృందం, వేదపండితులు, పారాయణీకులు వేదమంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా ప్రధానార్చకులు శ్రీస్వామివారికి జంజరాధారణ (యజ్ఞోపవితం) గావించారు. ఆ వెంటనే నృసింహుడు అమ్మవారికి, అమ్మవారు నృసింహుడికి జీలకర్ర బెల్లం పెట్టే తంతు పూర్తి చేశారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, సన్నాయిమేళాలు మోగుతుండగా, భక్తులు జయజయద్వానాల మధ్య మాంగల్యధారణ గావించి ముత్యాల తలంబ్రాల వేడుక నిర్వహించారు. పట్టువస్త్రాల సమర్పణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, టీటీడీ తరఫున, భూదాన్‌పోచంపల్లి తరపున, భక్తుల తరపున తీసుకువచ్చిన పట్టు వస్త్రాలతో అలంకార సేవలో ప్రజాప్రతినిధులు, ఆలయాధికారులు, భక్తులు నడిచారు. ఉదయం శ్రీరాముడిగా దర్శనం శనివారం ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధనలు పూర్తయిన అనంతరం స్వామివారిని శ్రీరాముడిగా అలంకరించి హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటచార్యులు తదితరులు పాల్గొన్నారు.ఫ యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణమహోత్సవం బ్రహ్మోత్సవాల్లో నేడు ఆదివారం ఉదయం శ్రీస్వామి వారు శ్రీమహావిష్ణు అలంకారంతో గరుడవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు. -
లో వోల్టేజీ సమస్యల పరిష్కరించాలి : మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉన్నాయని.. ఎకరం పొలం కూడా ఎండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ లోడ్ పెరిగి లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోందని.. ఆ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. కలెక్టర్లు తాగునీటిపై దృష్టి సారించాలని, ప్రతి పంచాయతీకి రూ.15 వేల వరకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నంద్లాల్ పవార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ హరిలాల్, సీఈ అజయ్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ సీఈ వెంకటేశ్వర్లు, నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి: మట్టపల్లిలోని శ్రీలక్ష్మినరసింహస్వామి మహాక్షేత్రంలో శనివారం నిత్యారాధనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రాతఃకాలా ర్చన, సుప్రభాతసేవ, నిత్యాగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చలు గావించారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని నూతన పట్టు వస్త్రాలతో వధువరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం నిత్య, శాశ్వత కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహా నివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక దర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. మహిళలపై దాడులను వ్యతిరేకించాలి భానుపురి: మహిళలపై మనువాద ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ)రాష్ట్ర అధ్యక్షురాలు డి.స్వరూప, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. శనివారం అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ నుంచి గాంధీ పార్కు వరకు మహిళల భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ పార్కులో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారాసాని చంద్రకళ అధ్యక్షతన నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దివాలా కోరు రాజకీయ విధానాల వల్ల మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. కార్యక్రమంలో కారింగుల వెంకన్న, కొత్తపల్లి రేణుక, శిరీష, జయమ్మ, పద్మ, లక్ష్మి, పావని, రేష్మ, శ్యామల, మరియమ్మ, సత్తెమ్మ, మాలంబి, పద్మ, పేర్ల మల్లమ్మ, గౌనమ్మ, లక్ష్మి, కల్పన, రేణుక, చిట్టి తదితరులు పాల్గొన్నారు. ఫార్మసీ విద్యకు డిమాండ్సూర్యాపేట: ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మసీ విద్యకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ ఎ.రామకిషన్ అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణ పరిధిలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్‌స్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ డేకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా తర్వాత ఫార్మసీ విద్యార్థులకు అనేక అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ముందుగా బీ ఫార్మసీ, ఫార్మాడీ విద్యార్థులకు బంగారు పతకాలు, యూనివర్సిటీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెయిన్ బో ఆసపత్రుల ఉపాధ్యక్షులు డాక్టర్ నీరజ్‌భాయ్, ఎస్బీ లైఫ్ సైన్స్స్ సీఈఓ హరీష్‌రెడ్డి, కిష్ట్రాన్ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ జె. క్రిష్ణప్రసాద్, రాష్ట్ర ఫార్మసీ కళాశాలలో సంఘం అధ్యక్షుడు కె.రాందాస్, కళాశాల కరస్పాండెంట్ సాధినేని శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ ఆడెపు రమేష్, పరిపాలన అధికారి దేవులపల్లి వినయ్, కిషోర్, నీలమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు. గురుకుల విద్యార్థికి బంగారు పతకంచివ్వెంల: తెలగాంణ స్టేట్ 11వ యూత్ అఽథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో చివ్వెంల బీసీ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి జి.విశాల్ ప్రతిభ కనబర్చాడు. ఇటీవల హైదరాబాలోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన అండర్–14 (60 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, హైజంప్) విభాగాల్లో విశాల్ సత్తాచాటి బంగారు పతకం సాధించాడు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విశాల్‌ను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, పీడీ కృష్ణారెడ్డి, పీఈటీ రహీమ్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య రావొద్దు
ఫ అధికారులు మనసు పెట్టి పనిచేయాలి ఫ నీటి సమస్య తలెత్తితే తక్షణమే పరిష్కరించాలి ఫ అందుకు కలెక్టర్ వద్ద నిధులు ఉంచుతాం ఫ రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఫ మంత్రి కోమటిరెడ్డితో కలిసి నల్లగొండలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నల్లగొండ : వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా అధికారులు మనసు పెట్టి పనిచేయాలని ఉమ్మడిజిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో సాగు, తాగునీరు, విద్యుత్‌పై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ వేసవిలో తాగు, సాగు నీరు, విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఫిబ్రవరిలో సమావేశం నిర్వహించుకోవాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందన్నారు. ఈ మూడు శాఖలకు చెందిన పైస్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందులో పోలీస్, రెవెన్యూ అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. వేసవిలో ఏర్పడే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్ల వద్ద కొంత నిధి ఏర్పాటు చేస్తామన్నా రు. ఎమ్మెల్యేల వద్ద కూడా నిధులు అందుబాటులో ఉంచేలా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టు నుంచి గోదా వరి జలాలను కృష్ణాతో అనుసంధానం చేసే ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. డీఆర్సీ సమావేశాలు నిర్వహించుకునే విషయంలో కూడా అధికారులు దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై అధి కారులు క్షేత్ర స్థాయికి వెళ్లి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లు వీటిపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. కాల్వల నిర్వహణ సరిగాలేదు : గుత్తా శాసనమండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల నిర్వహణ సరిగా లేదన్నారు. ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ చేపట్టాలన్నారు. కాల్వల్లో రైతులు పెద్ద మోటార్లు వేసి నీటిని లాగడం వల్ల చివరి భూములకు నీరు అందడం లేదన్నారు. విద్యుత్ కనెక్షన్ల మంజూరులో అధికారులు ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. నీరు వదిలి పంటను కాపాడాలి ఎస్సారెస్పీ నీరు సరిగా అందక పంట పొలాలు ఎండిపోయి. మా ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నీటిసి సక్రమంగా విడుదల చేసి ఆ పంటలను కాపాడాలి. అడ్డగూడూర్‌లో అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ చేయడం లేదు. మోత్కూర్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలి. – తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ అధికారుల మధ్య సమన్వయం లేదు వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల నీటి విడుదల విషయంలో స్పష్టత లేదు. అధికారులు ఒకరికొకరు సహకరించుకుని సమస్యలు పరిష్కరించాలి. – కోదాడ ఎమ్మెల్యే పద్మావతి -
సత్వర న్యాయానికే లోక్ అదాలత్
చివ్వెంల: పెండింగ్ కేసులను పరిష్కరించి కక్షిదా రులకు సత్వర న్యాయం అందించేందుకే మెగాలోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్శ్రీ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగాలోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గొడవలు జరిగినప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్‌లో రాజీ పడటం వల్ల పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా వీడిగా ఉంటున్న భార్యభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టు హాల్లో ఒక్కటి చేశారు. ఈ సందర్భంగా క్రిమినల్, సివిల్, వెహికల్ యాక్టు, విద్యుత్, బ్యాంకు, గృహహింస, ఎకై ్సజ్ వంటి 5,708 కేసులను పరిష్కరించారు. కోర్టులో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి సూర్యాపేట జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, పిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వి.వెంకటరమణ, బార్అసోసియేషన్ అధ్యక్షుడు నూ కల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, సీనియర్, జూని యర్ న్యాయవాదులు పాల్గొన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్ శ్రీ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జ్యూడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జడ్జీలతోపాటు జ్యుడిషియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి మధు, ప్రధాన కార్యదర్శి బ్రహ్మారెడ్డి, ఏపూరి సంజయ్, ఎల్గూరి మహేశ్వర్, జునైద్, శ్రీకాంత్, నాగంజనేయులు, శ్రీకాంత్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.ఫ జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి శ్యామ్శ్రీ ఫ లోక్ అదాలత్‌లో 5,708 కేసులు పరిష్కారం -
అక్కడ.. ఇక్కడ కాదు.. ఎక్కడైనా వివక్షే!
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025 సమాజంలో సగభాగమైన మహిళలు మాత్రం ఇంటా బయట ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారు. ఆధునిక సమాజంలో కూడా పురాతన పోకడలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సాక్షి’ ఉమ్మడి జిల్లాలోని ఏడు ముఖ్య పట్టణాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెలుగుచూశాయి. 7 పట్టణాల్లో 18 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న 200 మంది మహిళలపై నిర్వహించగా.. ఇప్పటికీ ఇంట్లో ఆడ మగ వివక్షను ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉంది లేదు45ఫ ఆడ మగ వివక్ష ఇంట్లో కూడా ఉంది ఫ బయట ప్రదేశాలకన్నా ఆఫీస్, కళాశాలల్లోనే ఎక్కువ ఇబ్బంది చెప్పలేము– సాక్షి, నెట్వర్క్ -
నేడు జాతీయ మెగా లోక్ అదాలత్
చివ్వెంల(సూర్యాపేట): జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి శ్యామ్శ్రీ అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సంవత్సరాల తరబడి పరిష్కారం కాని సివిల్, క్రిమినల్, బ్యాంకు, మోటార్ వెహికల్ యాక్టు, విద్యుత్ వంటి కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా కేంద్రంతోపాటు తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి పాల్గొన్నారు. -
మద్యంపై.. మహిళల సమరం
బెల్టు షాపులు బంద్ చేయించిన అతివలు ఎక్కడమ్మా నువ్వు లేనిది.. ఏమిటీ నువ్వు చెయ్యలేనిదీ. మహిళలు ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదు. గ్రామాల్లో మద్యం మహమ్మారికి యువత బానిస కావడం, కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవడంతో ఆ ఊళ్లలో మహిళలు కొంగు నడుముకు చుట్టారు. మద్యం మహమ్మారిని పారదోలాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో నిర్వహించే బెల్టు దుకాణాలపై సమరం సాగించారు. మద్యం అమ్మకాలను అడ్డుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంట మహిళలు. – చిట్యాల, రాజాపేటనెలరోజులుగా మద్యం అమ్మడం లేదు మా గ్రామంలో పదిహేనుకు పైగా బెల్ట్ దుకాణాల్లో మద్యం అమ్మేవారు. గ్రామంలోని యువతతో పాటు పెద్దవారు సైతం మద్యానికి బానిసై ఆర్థికంగా.. ఆరోగ్య పరంగా నష్టపోతున్నారు. ఇటీవల మద్యం మత్తులో ఓ యువకుడు మృతిచెందాడు. వెంటనే గ్రామంలో బెల్ట్ దుకాణాలను అరికట్టాలని మహిళలమంతా కలిసి ర్యాలీ నిర్వహించాం. మద్యం అమ్మితే జరిమానా విధించాలని తీర్మాణించాం. నెల రోజులుగా గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. – బొంగు శ్రీలత, మహిళా సంఘం ప్రధానకార్యదర్శి, ఏపూరు ఫ మద్యం అమ్మకాలు జరిపితే జరిమానా విధించాలని నిర్ణయించారు ఫ ఆదర్శంగా నిలుస్తున్న చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంటచిట్యాల మండలం ఏపూరు గ్రామం జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 1950 మందికిపైగా జనాభా ఉంది. ఈ గ్రామానికి చెందిన పురుషులు ఎక్కువగా డ్రైవర్లుగా, కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో పదిహేనుకుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల బ్రాండ్లకు చెందిన మద్యం లభిస్తుంది. దీంతో ఆ గ్రామంలోని యువకులతో పాటు చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేసే వందలాది మంది కార్మికులు సైతం ఇక్కడ విచ్చలవిడిగా మద్యం సేవిస్తుంటారు. ఆ గ్రామానికి చెందిన పలువురు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొందరు చేసిన పనిచేసిన డబ్బులను మద్యానికి ఖర్చు చేస్తూ కుటుంబాలను పట్టించుకోవటం లేదు. దీంతో ఆ గ్రామ మహిళలంతా ఏకమై మద్యం మహమ్మారిని పారదోలాలని నడుం బిగించారు. బెల్టు దుకాణాలు మూసివేయాలని హెచ్చరిక.. ఏపూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు (20) ఫిబ్రవరి 12న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ యువకుడి మృతికి మద్యం మహమ్మారే కారణమని భావించారు. ఆ యువకుడు మృతి చెందిన రోజే గ్రామంలో మద్యపాన నిషేధానికి నడుం బిగించారు. ఆ గ్రామంలోని మహిళ సంఘం అధ్యక్షురాలు వలిగొండ సునీత, ప్రధానకార్యదర్శి బొంగు శ్రీలత, వీబీకే బండ అనురాధ ఆధ్వర్యంలో మహిళలంతా ఏకమై బెల్టు దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద సమావేశమై నిరసన తెలిపారు. గ్రామంలో బెల్టు దుకాణాల వద్దకు వెళ్లి మద్యం అమ్మొదని హెచ్చరించారు. గ్రామంలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే రూ.లక్ష, మద్యం తాగిన వారికి రూ.20 వేలు జరిమానా.. మద్యం అమ్మినవారి సమాచారం అందిస్తే రూ.10 వేల ప్రోత్సాహకం అందజేస్తామని తీర్మానించారు. ఆ రోజు నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. -
వేలంపాటను అడ్డుకొని
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో మూకుమ్మడిగా మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా బెల్టుషాపులు నడుస్తుండటంతో వృద్ధులు, యువకులు, పేదలు మద్యానికి బానిసై.. సంపాదించిందల్లా మద్యానికి ఖర్చు చేస్తునారు. అంతే కాకుండా గ్రామంలో బెల్టుషాపుల నిర్వహణ కోసం ఇటీవల వేలం పాట నిర్వహించారు. వేలంపాట వద్దని.. గ్రామంలోని కొంతమంది మహిళలు గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎలాంటి బెల్టుషాపులు నిర్వహించొద్దని, మద్యం విక్రయించొద్దని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. అప్పట్లో సారాపై పోరాటం పాముకుంట గ్రామంలో 2010–11 సమయంలో సారా ఏరులైపారేది. కూలినాలి చేసి వచ్చిన డబ్బంతా తాగుడుకే పోయేది. ఆ సమయంలో కుటుంబ పెద్దలను కోల్పోయి చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో గ్రామానికి చెందిన మహిళలు ఏకమై సారా విక్రయ కేంద్రాలపై దాడిచేసి సామగ్రిని గ్రామం నడిబొడ్డున దహనం చేశారు. నా తర్వాత ప్రభుత్వం సారా విక్రయాన్ని నియంత్రించడంతో ఏడాదిపాటు గ్రామంలో సారా, మద్యం విక్రయాలు జరగలేదు. -
జగన్మోహినిగా వెలిగి.. ఎదుర్కోలుకు కదిలి
స్వామి, అమ్మవారిని ఊరేగింపుగా ఎదుర్కోలు మండపానికి తోడ్కొని వెళ్తున్న అర్చకులు, అధికారులు.. చిత్రంలో పట్టువస్త్రాలతో కలెక్టర్ దంపతులు, ఈఓ యాదగిరిగుట్ట: యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా కొనసాగుతున్నాయి. కల్యాణోత్సవానికి ముందస్తుగా పెళ్లిచూపుల పర్వం జరుపుకున్న శ్రీస్వామివారు శుక్రవారం ఉదయం జగన్మోహిని రూపం దాల్చారు. రాత్రి అశ్వవాహనంపై ఎదుర్కోలు జరుపుకున్నారు. ఎదుర్కోలు మహోత్సవం సాగిందిలా.. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఎదుర్కోలు మహోత్సవం శుక్రవారం రాత్రి వేదపండితుల మంత్రోచ్ఛరణలతో సాగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణలతో అలంకరించిన శ్రీస్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని ముత్యాల పల్లకిపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకుముందు ఉదయం శ్రీలక్ష్మీనరసింహుడు జగన్మోహిని అలంకారంలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో నేడు లక్ష్మీసమేత నారసింహుడు శనివారం ఉదయం రామాలంకారంలో హనుమంత సేవపై దర్శనమిస్తారు. రాత్రి 8.30 గంటలకు నుంచి గజవాహన సేవపై ఊరేగింపుగా కల్యాణమండపానికి బయలుదేరి వెళ్లారు. అనంతరం స్వామి, అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. -
అసమానతలు అంతరించాలి
మహిళా చైతన్యంలో పత్రికల పాత్ర కీలకంకథనాలు పరిశీలిస్తూ.. సూచనలు చేస్తూ.. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక పేజీలు, కథనాలను జడ్జి బి.దీప్తి పరిశీలించారు. మహిళలపై ప్రత్యేకంగా రూపొందించిన కథనాలను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం కోసం మహిళలు పోరాడిన కథనాలను ప్రశంసించారు. పత్రికలు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేలా.. చైతన్యం కలిగించే కథనాలు అందించాలన్నారు. బాధిత మహిళలకు అండగా ఉండాలని సూచించారు. న్యాయ సహాయం అందిస్తాం.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బాధితులకు న్యాయ సహాయం అందిస్తున్నామని జడ్జి దీప్తి తెలిపారు. అందరికీ సమాన న్యాయం దక్కాలనేది తమ సంస్థ లక్ష్యమన్నారు. న్యాయపరంగా వెనుకబడిన వారికి అండగా న్యాయ సేవాధికార సంస్థ చేయూతనిస్తోందని.. ఇప్పటికే అనేక న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చామన్నారు. ఇరువర్గాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించి సత్వర న్యాయం అందేలా సహకరిస్తామన్నారు. న్యాయ సహాయం పొందాలనుకునే వారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాని సూచించారు. నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.దీప్తివివక్షను రూపుమాపితేనే అద్భుత సమాజం బాధిత మహిళలకు అండగా ఉండాలి మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా విధులు రామగిరి(నల్లగొండ) : సమాజంలో కొన్నిచోట్ల ఇంకా లింగ వివక్ష కనిపిస్తోందని అది అంతరించాలని నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి పేర్కొన్నారు. మహిళా చైతన్యంలో పత్రికల పాత్ర కీలకమ న్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ యూని ట్ కార్యాలయంలో ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ ప్రత్యేక కథనాలపై చర్చించి పలు సూచనలు చేశారు. సమాన అవకాశాలు ఉండాలి మహిళలు సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడాలని జడ్జి దీప్తి సూచించారు. మహిళా సాధికారత జరిగినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగిపోతాయన్నారు. మహిళలను తక్కువ చేసి చూడకుండా సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో భాగస్వామ్యం కల్పిస్తే వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలగుతారని పేర్కొన్నారు. బాధ్యతల విషయంలో మహిళలను వేరు చేసి చూడొద్దన్నారు. ఉద్యోగం చేసే మహిళలను కొందరు కుటుంబాన్ని, ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావని అడుగుతారని.. అదే ప్రశ్న మగవారిని మాత్రం అడగరని ఇది సరి కాదన్నారు. సమాజంలో వివక్షను రూపుమాపితేనే మహిళలు స్వేచ్ఛాయుత ప్రయాణానికి అడుగులు పడతాయన్నారు. సమాజంలో అంతరాలు రూపుమాపితేనే అద్భుత సమాజం ఆవిష్కృతమవుతుందన్నారు. -
బీడు భూములు సేద్యానికి అనువుగా మార్చుకోవాలి
అర్వపల్లి: రైతులు తమ బీడు భూములను ఉపాధి హామీ పథకం ద్వారా సేద్యానికి అనువుగా మార్చుకోవాలని అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టిన బీడు భూముల అభివృద్ధి (ఎల్డీపీ) పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ టి. గోపి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ తేలు పరుశురాములు ఉన్నారు. ఉపాధి పనులు పారదర్శకంగా నిర్వహించాలినాగారం: ఉపాఽధిహామీ పనులు పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచుతూ, పనిలో నాణ్యత పాటించాలని సూచించారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ మారయ్య, ఏపీఓ రవి, ఆర్ఐ అల్లావుద్దీన్, పంచాయతీ కార్యదర్శి సురేష్, ఈసీ ముక్కంటి ఉన్నారు. ఫ అదనపు కలెక్టర్ రాంబాబు -
మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి
భానుపురి (సూర్యాపేట): మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయం, వృత్తి నైపుణ్యం, పారిశ్రామిక, వ్యాపార రంగాలు, కళల్లో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్నారు. అనంతరం మహిళా అధికారులను సన్మానించారు. ఆటలపోటీల్లో గెలిచిన సిబ్బందికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి నరసింహారావు, షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి కే.లత, మెప్మా పీడీ అధికారిణి రేణుకాదేవి, టౌన్ ప్లానింగ్ అధికారిణి మాధవి, జిల్లా లీగల్ కౌన్సిల్ అడ్వకేట్ వాణి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ మాధవి పాల్గొన్నారు. పూర్తి నివేదికలతో రావాలి ఈనెల 11వ తేదీన ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన ఉన్నందున అధికారులు పూర్తి నివేదికలతో కమిషన్ నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు తమ శాఖ పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన సౌకర్యాలు, అభివృద్ధి నివేదికలు సోమవారంలోగా అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఏ పీడీ అప్పారావు, డీఎస్ఓ రాజేశ్వరరావు, డీఈఓ అశోక్, డీఎంహెచ్ఓ కోటాచలం, ఎస్సీ అభివృద్ధి అధికారి లత పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
జిల్లాలో రెండు టీమ్స్
మహిళల రక్షణకు షీ టీమ్ నిఘాసూర్యాపేటటౌన్ : మహిళల రక్షణకు షీటీమ్స్ పని చేస్తున్నాయి.. రద్దీ ప్రాంతాల్లో నిరంతం వీటి నిఘా ఉంటుంది.. అమ్మాయిలను ఎవరైనా ఈవ్‌టీజింగ్ చేసినా.. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినా కేసులు నమోదు చేస్తామని షీ టీమ్ ఎస్ఐ నీలిమ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో షీటీమ్స్ పనితీరు, మహిళలకు సంబంధించి ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులు తదితర అంశాలపై ఆమె సాక్షితో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 45 రద్దీ ప్రదేశాలను గుర్తించి సిబ్బందిని ఏర్పాటు చేశాం. వారు నిత్యం ఆ ప్రాంతంలో గస్తీ చేస్తుంటారు. అమ్మాయిల పట్ల ఎవరైనా అబ్బాయిలు అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తాం. వరుసగా మూడు సార్లు కౌన్సిలింగ్ ఇస్తాం. అయినా మారకపోతే వారిపై కేసులు నమోదు చేస్తాం. జిల్లాలో సూర్యాపేట, కోదాడ డివిజన్ పరిధిలో రెండు టీమ్‌లు పని చేస్తున్నాయి. మహిళలు, అమ్మాయిలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీటీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. డయల్ 100కు కాల్ చేయవచ్చు. లేదా సెల్ నంబర్ 8712686056కు ఫోన్‌చేయవచ్చు. ముఖ్యంగా విద్యార్థినులు ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటివి చేయకుండా మాకు ఫిర్యాదు చేస్తే వారి భరతం పడతాం. షీటీమ్‌కు జిల్లాలో 2024లో మొత్తం 79 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల్లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో 176 అవగాహన సదస్సులు నిర్వహించాం. ఆకతాయిలపై 102 కేసులు బుక్ చేశాం. అందులో 21 కేసులు ఎఫ్ఐఆర్ చేశాం. 145మంది ఫ్యామిలీ మెంబర్లకు కౌన్సిలింగ్ ఇచ్చాం. 2025లో ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల్లో 42 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. మొత్తం 10 పిట్టీ కేసులు బుక్ చేయగా అందులో ఒకటి ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 16 మంది కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాం.జిల్లాలో కేసులు ఇలా.. ధైర్యంగా షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలి షీ టీమ్ నంబర్ : 87126 86056 ఫ జిల్లా వ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిరంతరం గస్తీ ఫ ‘సాక్షి’ తో షీ టీమ్ ఎస్ఐ నీలిమ -
వేలంపాటను అడ్డుకొని
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో మూకుమ్మడిగా మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా బెల్టుషాపులు నడుస్తుండటంతో వృద్ధులు, యువకులు, పేదలు మద్యానికి బానిసై.. సంపాదించిందల్లా మద్యానికి ఖర్చు చేస్తునారు. అంతే కాకుండా గ్రామంలో బెల్టుషాపుల నిర్వహణ కోసం ఇటీవల వేలం పాట నిర్వహించారు. వేలంపాట వద్దని.. గ్రామంలోని కొంతమంది మహిళలు గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎలాంటి బెల్టుషాపులు నిర్వహించొద్దని, మద్యం విక్రయించొద్దని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. అప్పట్లో సారాపై పోరాటం పాముకుంట గ్రామంలో 2010–11 సమయంలో సారా ఏరులైపారేది. కూలినాలి చేసి వచ్చిన డబ్బంతా తాగుడుకే పోయేది. ఆ సమయంలో కుటుంబ పెద్దలను కోల్పోయి చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో గ్రామానికి చెందిన మహిళలు ఏకమై సారా విక్రయ కేంద్రాలపై దాడిచేసి సామగ్రిని గ్రామం నడిబొడ్డున దహనం చేశారు. నా తర్వాత ప్రభుత్వం సారా విక్రయాన్ని నియంత్రించడంతో ఏడాదిపాటు గ్రామంలో సారా, మద్యం విక్రయాలు జరగలేదు. -
నేడు మంత్రుల రాక
నల్లగొండ : జిల్లా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు శనివారం నల్లగొండకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రులు కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖలపై సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. నూతన ఎస్పీగా నరసింహసూర్యాపేటటౌన్: సూర్యాపేట నూతన ఎస్పీగా కె.నరసింహ నియామకమయ్యారు. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సన్‌ప్రీత్ సింగ్‌కు డీఐజీగా ప్రమోషన్ రావడంతో వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ ఎస్పీగా, గవర్నర్ ఏజీసీగా పనిచేసిన నరసింహ కొంతకాలంగా డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడి ఎస్పీ బదిలీ కావడంతో సూర్యాపేట జిల్లాకు ఈయన బదిలీపై రానున్నారు. -
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
నల్లగొండ, నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం కిడ్నాపైన మూడేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. నకిరేకల్‌లో కిడ్నాపర్‌ని పట్టుకొని అతడి చెర నుంచి బాలుడిని విడిపించి గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని లైన్‌వాడకు చెందిన షమీమున్సీసా, హైమద్ దంపతులకు ఇద్దరు సంతానం. వీరు గత మూడేళ్లుగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వాటర్ ట్యాంక్ కింద నివాసముంటూ అక్కడే ఏర్పాటు చేసిన రూ.5 భోజనం తింటూ జీవనం సాగిస్తున్నారు. నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన సీతారాములు చెల్లెలికి ముగ్గురు కుమార్తెలు కాగా.. మగ పిల్లలు లేరని ఆమె బాధపడుతుండడంతో చూడలేక సీతారాములు వారం క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ ఏ ఆధారం లేకుండా జీవనం సాగిస్తున్న హైమద్ కుటుంబాన్ని చూశాడు. వారితో పరిచయం పెంచుకొని వారి కుమారుడిని మంగళవారం రాత్రి కిడ్నాప్ చేసి నకరేకల్‌లో ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాడు. తమ కుమారుడు కనిపించకపోవడంతో హైమద్ దంపతులు నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసు బృందాలు రెండు రోజులుగా గాలించి సీతారాములు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు నకరేకల్‌లో ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. గురువారం అతడిని అరెస్ట్ చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.ఫ రెండు రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాపైన బాలుడు ఫ మూడు ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు ఫ నకిరేకల్‌లో కిడ్నాపర్‌ని పట్టుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
యాదగిరిగుట్ట క్షేత్రంలో యూపీ సీఎం సురక్ష టీం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం సురక్ష టీంకు చెందిన పోలీసు బృందం గురువారం సందర్శించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో శిక్షణ తీసుకుంటున్న యూపీ సురక్ష టీంకు చెందిన 51 మంది పోలీసు బృందం.. ఆలయాల్లో భద్రత, సీఎంతో పాటు ప్రముఖులు ఆలయాలను సందర్శించిన సమయాల్లో ఎలా వ్యవహరించాలనే అంశాలపై శిక్షణలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చి పరిశీలించారు. ప్రముఖులు వచ్చిన సమయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాలకు ఎలా పంపించాలి, ఆలయ పరిసరాల్లో ప్రముఖులు పర్యటిస్తున్న సందర్భంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, బందోబస్తు విషయంలో ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం సురక్ష టీంకు వివరించినట్లు సీనియర్ ఆర్ఎస్ఐ శివలాల్ తెలిపారు. వీరి వెంట అధికారులు సాయికుమార్, గణేష్, శంకర్‌రెడ్డి ఉన్నారు. -
విశ్వ ఉనికి రహస్యం భౌతికమే
ఫ ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కవి కిషోర్ నల్లగొండ టూటౌన్: విశ్వ ఉనికి రహస్యం భౌతికమే అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కవి కిషోర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సైన్స్ విభాగం ప్రిన్సిపాల్ ప్రేమ్‌సాగర్ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి వైజ్ఞానిక దృష్టిని అలవర్చుకొని జీవన విధానములో అన్వయించుకోవాలన్నారు. సమాజంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు సైన్స్ ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనాలన్నారు. విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు ఇప్పటికీ కేవలం 30 శాతం మాత్రమే విశ్లేషించగలిగారని అన్నారు. మానవుల్లో కొంత శాతం మేర జంతువుల జన్యులతో పోలిన జన్యువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని వివరించారు. మానవ స్వభావాలు అనేకం జన్యు ప్రేరేపితంగా ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్‌రెడ్డి, అన్నపూర్ణ, దోమల రమేష్, కళ్యాణి, రూప, రామచందర్‌గౌడ్, జ్యోతి, శివరాం పాల్గొన్నారు. లేఖా రచనలో కోదాడ వాసికి ప్రథమ బహుమతికోదాడ: భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో ‘లేఖా రచనలో ఆనందం–డిజిటల్ యుగంలో లేఖా రచన ఆవశ్యకత’ అనే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన లేఖా రచన పోటీల్లో కోదాడ పట్టణానికి చెందిన ఉస్తేల సోమిరెడ్డి ప్రథమ బహుమతి(రూ.25 వేలు) సాధించారు. సోమిరెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ డివిజన్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. గతంలో తన కుమారుడికి రాసిన ఉత్తరాలను ‘ఇట్లు నాన్న’ పేరుతో సంకలనాన్ని ప్రచురించారు. తన భార్య రమకు రాసిన ఉత్తరాలతో ‘రమణీయం’ పేరుతో మరో సంకలాన్ని ప్రచురించారు. లేఖా రచనలో తనకు ఉన్న అభిరుచికి బహుమతి రావడం ఆనందంగా ఉందన్నారు. -
రూ.2వేల కోట్లకు చేరువలో రుణాల పంపిణీ
నల్లగొండ టౌన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రుణాల పంపిణీ రూ.2వేల కోట్లకు చేరుకుందని బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.580కోట్ల బంగారు రుణాలు, రూ.571 కోట్ల పంట రుణాలు, రూ.405 కోట్ల మార్టిగేజ్ రుణాలు, రూ.379 కోట్ల దీర్ఘకాలిక రుణాలు అందించినట్లు తెలిపారు. బ్యాంకు వ్యాపారం రూ.3వేల కోట్లకు చేరువలో ఉండగా, రూ.50 కోట్ల లాభాల దిశలో డీసీసీబీ పయనిస్తుందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలను సులభతరం చేశామని, పౌల్ట్రీ రుణాల చెల్లింపు కాల పరిమితిని పెంచామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద అదనపు రుణాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో సీఈఓ శంకర్రావు, డైరెక్టర్లు లింగం యాదవ్, పాశం సంపత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సైదయ్య, కోడి సుష్మ తదితరులు పాలొగన్నారు. ఫ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి -
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ పిల్లి లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం వాడపల్లి గ్రామానికి చెందిన గంధం అరుణ్‌కుమార్(26) దామరచర్ల మండల కేంద్రంలోని నాగకృష్ణ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. ఆ రోజు బంక్‌లో డబుల్ డ్యూటీ చేసిన అరుణ్‌కుమార్ ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. రెండు రోజుల పాటు డ్యూటీకి రాకపోవడంతో బంక్ నిర్వాహకులు అరుణ్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అంతేకాకుండా పెట్రోల్ బంక్‌లో డబ్బుల లెక్కల్లో తేడా రావడంతో వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద యువకుడు ఉరేసుకుని మృతిచెందినట్లు గురువారం ఉదయం పోలీసులు వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు షేర్ చేయడంతో.. ఆ మృతదేహం అరుణ్కుమార్దిగా గుర్తించిన అతడి స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు గంధం వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునప్నట్లు ఎస్ఐ తెలిపాడు. అరుణ్‌కుమార్ ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులు అధికమవ్వడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంతో ఆందోళన.. అరుణ్‌కుమార్ ఆత్మహత్యకు పెట్రోల్ బంక్ యాజమానే కారణమంటూ అతడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో గురువారం దామరచర్ల మండల కేంద్రంలోని నాగకృష్ణ ెపెట్రోల్ బంక్ వద్ద అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బంక్ యాజమాని తమ కుమారుడిని ఇబ్బందులకు గురిచేయడం వలనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆదోళనను విరమింపజేశారు. -
వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు అరెస్ట్
వేములపల్లి(మాడ్గులపల్లి): వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన అతడి భార్యతో పాటు మరో ఇద్దరిని గురువారం మాడ్గులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన నక్క వెంకన్న, సరిత భార్యాభర్తలు. వీరికి 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో మనస్పర్ధలు రావడంతో సరిత భర్త వెంకన్నకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో వెంకన్న పలుమార్లు సరితను కాపురానికి రావాలని అడిగగా ఆమె రాకపోవడమే కాకుండా కుక్కడం గ్రామానికి చెందిన ఊరుబిండు మల్లయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్త వెంకన్నను ఇబ్బందులకు గురిచేశారు. సరిత మేనమామ మన్నెం శ్రీను సైతం ఆమెకు సహకరించడంతో మనస్తాపానికి గురైన వెంకన్న గత నెల 22న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య సరిత, ఊరుబిండు మల్లయ్య, మన్నెం శ్రీను వేధింపుల కారణంగానే తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెంకన్న సూసైడ్ లెటర్ సైతం రాశాడు. మృతుడి తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వెంకన్న భార్య సరితతో పాటు మల్లయ్య, శ్రీనును అరెస్ట్ చేసి మిర్యాలగూడ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు వారికి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. -
గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనారసింహుడు
సింహ వాహనంపై ఊరేగుతున్న నృసింహుడుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతున్నాయి. ఆలయంలో గురువారం ఉదయం నిత్య పూజలు చేపట్టారు. అనంతరం అలంకార సేవను ఆలయ తిరు మాడ వీధిలో ఊరేగించారు. అదేవిధంగా ఉదయం శ్రీనృసింహస్వామి వారిని గోవర్ధనగిరిధారి అలంకర సేవలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో ఆచార్యులు, రుత్వికులు, పారాయణీకులు ప్రబంధ పారాయణం, మూలమంత్ర జపములు, నిత్యారాధనలు కొనసాగించారు. అనంతరం శ్రీస్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు. వేడుకల్లో ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అధికారులు, పారాయణీకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారిని జగన్మోహిని అలంకార సేవలో ఊరేగిస్తారు. రాత్రికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్ష
ఫ బాలికపై అత్యాచారం కేసులో తీర్పు వెలువరించిన సూర్యాపేట జిల్లా కోర్టు చివ్వెంల(సూర్యాపేట): బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి ఎం. శ్యామ్శ్రీ గురువారం తీర్పు వెలువరించారు. ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గుంజ వెంకన్న అప్పుడప్పుడు సదరు మహిళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆమె చిన్న కుమార్తైపె అతడి కన్నుపడింది. బాలికపై పలుమార్లు వెంకన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021 మార్చి 31న బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి ఆమెకు గర్భస్రావ మాత్రలు ఇచ్చాడు. అదే రోజు మళ్లీ అత్యాచారం చేశాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో హాస్పిటల్‌కు తీకెళ్తుండగా మార్గమధ్యలో కడుపునొప్పి ఎక్కువై కడుపులోంచి పిండం బయటపడింది. బాలికను తల్లి నిలదీయగా.. గుంజ వెంకన్న తనపై అత్యాచారం చేస్తున్నాడని విషయం చెప్పింది. బాలికకు చికిత్స చేయించిన అనంతరం 2021 ఏప్రిల్ 2న ఆమె తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి డీఎస్పీ మోహన్‌కుమార్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకి రాంరెడ్డి వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదేవిధంగా బాలికకు రూ.5లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు లైజన్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సహకరించారు. -
అగ్నివీర్ ఇండియన్ నేవీ ఉద్యోగాలకు ఎంపిక
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామయ్య డిఫెన్స్ అకాడమీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అగ్నివీర్ ఇండియన్ నేవీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అకాడమీలో మొదటి సంవత్సరం డిఫెన్స్ కోర్సు చదువుతున్న మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎన్. అభిషేక్, సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన కె. ప్రదీప్ జూలై నెలలో నిర్వహించిన ఇండియన్ నేవీ అగ్నివీర్ సీనియర్ సెకండరీ జాతీయస్థాయి పరీక్షలో ప్రతిభ చాటి ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం సాధించిన విద్యార్థులను అకాడమీ డైరెక్టర్ రామయ్య, శ్రీనివాస్, అధ్యాపకులు నగేష్, బొమ్ము శంకర్ అభినందించారు. పాడి ఆవులు విక్రయిస్తామని టోకరాఫ వాట్సాప్‌లో ఆవుల ఫొటోలు పెట్టి రూ.85,500 కొట్టేసిన దుండగుడు భువనగిరి: వాట్సాప్‌లో ఫొటో పెట్టిన ఆవులను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి రూ.85వేలు పంపి మోసపోయాడు. ఈ ఘటన భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు ఈ నెల 5వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి పాడి ఆవుల ఫొటోలు పెట్టి వాటిని అమ్ముతామని చెప్పాడు. వాట్సాప్‌లో పెట్టిన ఆవులలో మూడు మాత్రమే ఎంపిక చేసుకుని ఫోన్‌పే ద్వారా రూ.1,05,000 పంపాలని సూచించాడు. గుర్తుతెలియని వ్యక్తి చెప్పిన మాటలు నమ్మిన ముత్తిరెడ్డిగూడెం వాసి మూడు ఆవులను ఎంపిక చేసుకుని ఫోన్ పే ద్వారా రూ.85,500 పంపాడు. డబ్బులు పూర్తిగా పంపితేనే ఆవులను పంపిస్తామని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించి 1930 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తులు గేదెలు, ఆవులను అమ్ముతామని ఫోన్ చేస్తే నమ్మవద్దని ఎస్ఐ సంతోష్‌కుమార్ సూచించారు. ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్‌పై విచారణ వేగవంతం ఫ నిందితులను పట్టుకునేందుకు మధ్యప్రదేశ్‌కు వెళ్లిన నకిరేకల్ పోలీసులు నకిరేకల్: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్ నంబర్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి విమానంలో నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి తమ సిబ్బందితో కలిసి మధ్యప్రదేశ్‌కు పయనయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారు ఢీకొని యువకుడు మృతిబీబీనగర్: బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి బీబీనగర్ మండలం నాగిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో జరిగింది. సీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన పెరుమాండ్ల సూర్యప్రసాద్(24) బుధవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో బీబీనగర్ నుంచి బైక్‌పై బ్రహ్మణపల్లికి వెళ్తుండగా.. నాగిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో హిందుస్థాన్ శానిటరీ వేర్ పరిశ్రమ గోడౌన్ సమీపంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యప్రసాద్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు భానుచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అమ్మ భాష తప్పనిసరి
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం విద్యార్థులు మాతృభాషపై పట్టు కోల్పోతున్నారు. కొంత మంది విద్యార్థులు తెలుగు వ్యాక్యాలు రాయలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మాతృ భాష అయిన తెలుగును కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. – రాజు, తెలుగు ఉపాధ్యాయుడు, తిరుమలగిరి తిరుమలగిరి (తుంగతుర్తి): అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృభాష (తెలుగు) సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో సీబీఎస్ఈతో పాటు ఇతర సిలబస్‌ను అమలు చేస్తూ మాతృభాషను పక్కన పెడుతున్నారు. దీంతో విద్యార్థులు మాతృభాషపై పట్టు కోల్పోవడమే కాదు కనీసం చదవడం కూడా రావడం లేదని గ్రహించిన ఎన్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా బోధించేలా చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. అధిక మార్కుల కోసం..ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మినహా చాలా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును బోధించడం లేదు. సీబీఎస్ఈ, ఐబీహెచ్ఈ తదితర సిలబస్‌ను అమలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు భాష ఎంపిక స్థానంలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా సంస్కృతం, అరబిక్ బోధిస్తున్నారు. దీంతో తెలుగులో భావ వ్యక్తీకరణ, సృజనాత్మకతను కోల్పోతున్నట్లు భాషాభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ముందు తొమ్మిదవ తరగతికి.. ఇప్పటి వరకు ఉన్నత తరగతులకు తెలుగు పాఠ్యాంశాలు అమలు చేయని పాఠశాలలకు తప్పనిసరిగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2026–27 నుంచి 10వ తరగతికి అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధించాల్సిందే.. ఎన్సీఈఆర్టీ ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయం -
అగ్గితెగులు నివారణకు చర్యలు తీసుకోవాలి
అర్వపల్లి: వరిలో అగ్గితెగులు నివారణకు రైతులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి కోరారు. అర్వపల్లి, రామన్నగూడెం, వేల్పుచర్ల తదితర గ్రామాల్లో వరి పొలాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి పొలాల్లో ప్రస్తుతం అగ్గితెగులు, కాండం తొలుచు పురుగును గుర్తించినట్లు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరగడం వల్ల అగ్గితెగులు వృద్ధి ఎక్కువ అయినట్లు తెలిపారు. అగ్గితెగులు నివారణకు టైప్లోక్సీ ట్రోబిన్, టేబ్యు కొనజోల్ లేదా ట్రైసైక్లోజోల్, కాండం తొలుచుపురుగు నివారణకు కార్టైఫెడ్రాక్రై ్లడ్ ను పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పెందోట గణేష్, ఏఈఓ శోభారాణి, ఖమ్మంపాటి నరేష్ పాల్గొన్నారు. -
రాష్ట్రపతి భవన్లో చండూరు చేనేత వస్త్రాల ప్రదర్శన
చండూరు: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చండూరుకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. బుధవారం రాత్రి తాము తయారుచేసిన చేనేత వస్త్రాలను ప్రదర్శించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు వివరించారు. అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ఎంపికై న 20 మందిలో తాము ఉండడం, రాష్ట్రపతి భవనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని గంజి యాదగిరి, చిలుకూరి శ్రీనివాసులు పేర్కొన్నారు. -
ఉండ్రుగొండ గుట్టల్లో చెలరేగిన మంటలు
ఫ భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం ఉండ్రుగొండ శివారులోని గుట్టల్లో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో గుట్టలకు సమీపంలో ఉన్న ఉండ్రుగొండ, దురాజ్‌పల్లి, వల్లభాపురం, మహ్మదాపురం, ఇమాంపేట తదితర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన స్థలం పక్కనే హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఉండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. స్థానిక గ్రామాల ప్రజలు అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి వెళ్లిన ఫైర్ సిబ్బంది మంటలు తీవ్రంగా ఉండడంతో రాత్రివేళ చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. పశువుల కాపరులు చుట్ట లేదా బీడీలు తాగి పడేయడంతో ఎండిన ఆకులకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగి ఉండవచ్చని పేర్కొన్నారు. అగ్నిమాక సిబ్బంది మంటలు వచ్చే ప్రదేశానికి వెళ్లేందుకు వీలుకావడం లేదన్నారు. -
ఇళ్ల మార్కింగ్ వేగవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని ఎంపిక చేసిన 23 గ్రామ పంచాయతీల్లో 3,103 ఇళ్ల మార్కింగ్ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్లపై సంబంధిత మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన అన్ని గ్రామపంచాయతీలో వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. సూర్యాపేట మండలంలోని 26 మంది మేసీ్త్రలకు ఈ నెల 10న టెక్నాలజీతో ఇంటి నిర్మాణంపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ లో 20 మంది మేసీ్త్రలకు మాస్టర్ ట్రైనీలతో శిక్షణ ఇప్పించనున్నట్లు చెప్పారు. గ్రామపంచాయతీలో ఉపాధి పనులకు వందమంది కూలీలు వచ్చేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే ఉత్తమ గ్రామపంచాయతీల అవార్డుల కోసం 9 కేటగిరీల్లో ఇప్పటి నుంచే ఆ దిశగా పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం ఈజీఎస్ ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీడీఓలు, ఎంపీఓ, హౌసింగ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పదిరోజుల్లో సుమారుగా 30 ఇళ్లను గ్రౌండ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మండలాల్లో ఎంపిక చేసిన మోడల్ హౌస్‌ల పనులు 15 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ, డీఆర్డీఓ అప్పారావు, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి, డీపీఓ నారాయణరెడ్డి, డీఎల్పీఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పరీక్షలు సరిగా రాయలేకపోతున్నానని..
కోదాడ రూరల్: పరీక్షలు సరిగా రాయలేకపోతున్నాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండకు చెందిన బచ్చలకూర శంకర్ కుమార్తె నవ్య పెన్‌పహాడ్ మండలం అనాజిపురంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నవ్య.. ఇంటి వద్ద నుంచే బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ మొదటి పరీక్షకు హాజరై తిరిగి వచ్చింది. జ్వరంతో పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నాని మనస్తాపం చెందిన నవ్య గురువారం ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి చూసేసరికి మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్‌రెడ్డి తెలిపారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య -
ఇంటర్ సెకండ్ ఇయర్‌కు 7,416 మంది హాజరు
సూర్యాపేటటౌన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. జనరల్ విభాగంలో 6,306 మందికి 172 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 6,134 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,389 మంది విద్యార్థులకు 107 మంది గైర్హాజరు కాగా 1,282 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం మీద సెకండ్ ఇయర్ తొలి రోజు పరీక్షకు 7,416 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష కేంద్రాలను అధికారులు తనిఖీలు చేశారు. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను గురువారం సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్‌పవార్ తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి, విద్యార్థుల హాజరు శాతం గురించి చీఫ్ సూపరింటెండెంట్ యాదయ్య ను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి, అత్యవసర వైద్య సేవల కేంద్రం ఏర్పాటు, మరుగుదొడ్లు, కళాశాలలో ఎలాంటి వ్యర్థ్యాలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య క్లోజ్డ్ వాహనంలో నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని సూచించారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సెల్ ఫోన్‌న్లు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు వంటి ఉపకరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించకూడదన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
కోదాడకు నవోదయ స్కూల్ !
కోదాడ: కోదాడలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే విద్యాసంవత్సరమే ఈ విద్యాసంస్థ ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఇది ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లాకు నవోదయ స్కూల్‌ను మంజూరు చేసింది. దీన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం సరైన స్థలం కోసం అన్వేషణ చేస్తోంది. ఈ క్రమంలో కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి దాదాపు 40 ఎకరాల ఖాళీ స్థలం అధికారుల దృష్టికి వెళ్లింది. వారం రోజుల క్రితం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ ఈ స్థలాన్ని పరిశీలించారు. గురువారం కోదాడకు వచ్చిన జాయింట్ కలెక్టర్ రాంబాబు డిగ్రీ కళాశాల వద్దకు వెళ్లి ఖాళీగా ఉన్న స్ధలాన్ని పరిశీలించారు. కోదాడ ఆర్డీఓ, తహసీల్దార్ సర్వేయర్‌తో కలిసి ఆయన ఈ స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలను అందించాలని ఆదేశించినట్లు సమాచారం. స్వాగతిస్తున్న విద్యా వేత్తలు.. కోదాడలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయడానికి కొండపల్లి రాఘవమ్మ, రంగారావులు ఇచ్చిన విరాళంతో బాలాజీనగర్ వద్ద దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో కేఆర్ఆర్ డిగ్రీ, జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డిగ్రీ, జూనియర్ కళాశాలలు కలిపి 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా మరో 35 ఎకరాల స్థలం ఖాళీగా ఉంటుంది. దీని చుట్టూ ప్రహరీ లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కళాశాలకు చెందిన ఖాళీ స్థలంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో మేలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. విద్యాసంస్థల కోసం దాతలు భూమిని ఇచ్చారని దీని ఏర్పాటు వల్ల వారి ఆశయం కూడ నెరవేరుతుందని కళాశాల పూర్వ విద్యార్థులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ ప్రాంతంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే కోదాడ ప్రాంతం విద్యాహబ్‌గా మారుతుందని వారు అంటున్నారు. ఫ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసే అవకాశం ఫ స్ధలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ ఫ స్వాగతిస్తున్న విద్యావేత్తలు స్థలాన్ని పరిశీలించాం జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సరైన స్థలం కోసం చూస్తున్నాం. కేఆర్ఆర్ కళాశాల వద్ద ఖాళీ స్థలం ఉందనే సమాచారంతో పరిశీలించాం. అదనపు కలెక్టర్ కూడా ఈ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని పరిస్థితులు బాగున్నాయి. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలి. – సీహెచ్. సూర్యనారాయణ, ఆర్డీఓ కోదాడ. -
రెండు నూతన జాగిలాలు వచ్చాయ్
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు ట్రాకర్ డాగ్ లూసీ , ఎక్స్–ప్లోజివ్ డాగ్ బ్రూనో అనే రెండు నూతన జాగిలాలను కేటాయించారు. ఈ సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్మించిన డాగ్ షెల్టర్ రూంలను ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గురువారం ప్రారంభించారు. ముందుగా ఎస్పీకి ట్రాకర్ డాగ్ లూసీ పూలబొకే తో స్వాగతం పలికింది. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధుల నిర్వహణ, కేసుల ఛేదనలో జాగిలాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చాలా కేసుల్లో నేరస్తులను పసిగట్టడంలో డాగ్స్ బాగా పని చేశాయని, హంటర్, ట్రాకర్, నార్కోటిక్, ఎక్స్ ప్లోజివ్ ఇలా 6 విభాగాల్లో శిక్షణ పొందిన డాగ్స్ మనకు ఉన్నాయన్నారు. ఇప్పుడు కొత్తగా ట్రాకర్ డాగ్ (పేరు లూసీ) ఇది నేర స్థలంలో లభించే ఆధారాలతో నేరస్తులను గుర్తిస్తుందని, మరో డాగ్ ఎక్స్ ప్లోజివ్ (పేరు బ్రూనో) ఇది పేలుడు సామగ్రిని గుర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, ఆర్ఐలు నారాయణ రాజు, నరసింహ, డాగ్ స్క్వాడ్ ఆర్ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు. ఫ డాగ్ షెల్టర్ రూమ్‌లను ప్రారంభించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ -
గోదావరి జలాలు పెంపు
అర్వపల్లి: జిల్లాకు ఎస్సారెస్పీ రెండో దశకు గోదావరి జలాలను గురువారం 1700 క్యూసెక్కులకు పెంచినట్లు నీటి పారుదల శాఖ బయ్యన్నవాగు డీఈఈ ఎం. సత్యనారాయణ తెలిపారు. ఇందులో 69,70,71 డీబీఎంలకు గోదావరి జలాలను వదులుతున్నట్లు చెప్పారు. అర్హులకు పనులు కల్పించాలి నడిగూడెం : అర్హులైన కూలీలందరికీ ఉపాధి పనులు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. గురువారం నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం – మునగాల మండలం కలకోవ గ్రామాల కొనసాగుతున్న లింక్ రోడ్డు పనులను ఆయన పరిశీలించిన అనంతరం సంబందిత అధికారులతో మాట్లాడారు. కూలీల హాజరు, జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వేణుగోపాలపురం వద్ద హరితహారం నర్సరీని పరిశీలించారు. ఆయన వెంట కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, ఎంపీడీఓ సంజీవయ్య, ఎంపీఓ విజయకుమారి, కార్యదర్శులు నారాయణరెడ్డి, విజయలక్ష్మి, ఈసీ శ్రీను ఉన్నారు. అభివృద్ధి పనులకు రూ.49.59కోట్లుహుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అభివృద్ధిలో తనదైన మార్కు చూపుతున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఇటీవల అభివృద్ధి పనులకు రూ 49.59 కోట్లు మంజూరు చేయించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో ఏర్పాటుచేసే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు వెళ్లేందుకు డబుల్‌రోడ్డు నిర్మాణానికి రూ. 20 కోట్లు , హుజూర్నగర్ – చిలుకూరు మార్గ మధ్యలో నిర్మించతల పెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు చేయించారు. హుజూర్నగర్ పట్టణంలోనీ రాజీవ్ గాంధీ జంక్షన్ నుంచి పట్టణ శివారులోని హౌసింగ్ కాలనీ వరకు రహదారి విస్తరణ, అభివృద్ధికి రూ 6.50 కోట్లు, పట్టణంలో నిర్మించ తలపెట్టిన నీటిపారుదల డివిజనల్ కార్యాలయానికి రూ 7.99 కోట్లు, కోదాడలో నీటిపారుదల సూపరింటెండెంట్ ఇంజనీర్ సర్కిల్ కార్యాలయానికి రూ 5.10 కోట్లు మంజూరు చేయించారు. ఖైదీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలిచివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆమె సందర్శించారు. ఖైదీల ఆరోగ్య సమస్యలు, ఆహారం, వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ సుధాకర్‌రెడ్డి, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ గౌడ్, పెండెం వాణి పాల్గొన్నారు. చైర్‌పర్సన్‌గా చామంతి బాధ్యతల స్వీకరణ తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎల్సోజు చామంతిరమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్‌గా చింతరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డైరెక్టర్లుగా దేశగాని రాములు, ఆంగోతు రాములు, ఉప్పలయ్య, బైరబోయిన సైదులు, అంజయ్య, వేణుగోపాల్‌రావు, ఎం.డి.హఫీజ్, జలేందర్, వాసుదేవరెడ్డి, రాపాక సోమేష్, దొడ్డ రమేష్, పీఏసీఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేలు, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న మార్కెట్ కార్యదర్శి అనిల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కష్టాలకు చెక్
సర్వే ఇలా.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల పరిధిలో 141 వార్డుల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా తాగు నీటి పైపుల లీకేజీలు, పగుళ్లు, ట్యాంకుల నుంచి పట్టణానికి సరఫరా చేసే ప్రధాన పైపు లైన్ పరిస్థితి, కాలనీలో ఉన్న నీటి ట్యాంకులు, బోర్లు, చేతి పంపులు, నల్లాలకు బిరడాలు లేక పోవడం తదితర వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యామ్నాయ నీటి వివరాలను సేకరిస్తున్నారు. ముందుగా సమస్య ఎక్కువగా ఉండే శివారు కాలనీలకు ప్రాధాన్యమిస్తున్నారు. సమస్య ఉన్న చోట క్షేత్ర స్థాయిలో లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ప్రజలతో చర్చించి పరిష్కారానికి మార్గాలు నమోదు చేస్తున్నారు. సమస్యతో పాటు దాని పరిష్కార మార్గాన్ని చూపుతూ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరుమలగిరి (తుంగతుర్తి) : వేసవి కాలంలో మున్సిపాలిటీల్లో తాగు నీటి ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. నీటి సరఫరా కోసం ఏ ఏ మరమ్మతులు అవసరమో గుర్తించాల్సిందిగా సూచించింది. ఈ నేపథ్యంలో అధికారులు బృందాలుగా ఏర్పడి మున్సిపాలిటీల్లో వివరాలు సేకరిస్తున్నారు. సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తేనే సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని భావించి ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. బృందాలుగా ఏర్పడి.. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను బట్టి అధికారులు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. ఒక్కో బృందంలో ఏఈ స్థాయి అధికారి, ముగ్గురు వార్డు అధికారులు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యకు గల కారణాలు తెలుసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో తాత్కాలిక చర్యలు మాత్రమే చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. అలా కాకుండా సమస్యను సరిగ్గా గుర్తించగలిగితేనే ప్రయోజనం ఉంటుంది. గత వేసవిలో మున్సిపాలిటీలకు పాలక వర్గాలు ఉండేవి. వాటి గడువు తీరడంతో అధికారులే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫ మున్సిపాలిటీల్లో మంచి నీటి సమస్యలపై సర్వే ఫ బృందాలుగా ఏర్పడి వివరాల సేకరణ ఫ సమస్యలు.. పరిష్కారమార్గాలతో ప్రభుత్వానికి నివేదికమున్సిపాలిటీ వార్డులు సూర్యాపేట 48కోదాడ 35హుజూర్నగర్ 28తిరుమలగిరి 15నేరేడుచర్ల 15 -
సూర్యాపేట
ఇఫ్తార్ 6–30 (శుక్రవారం సాశ్రీశ్రీ) సహర్ 5–08 (శనివారం ఉశ్రీశ్రీ)అమ్మభాష తప్పనిసరి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృభాష సబ్జెక్టు (తెలుగు) తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7రూ.2వేల కోట్లకు చేరువలో.. డీసీసీబీ ద్వారా రైతులకు రుణాల పంపిణీ రూ.2వేల కోట్లకు చేరిందని చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025- 8లో -
తొలిరోజు 8,254 మంది హాజరు
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం జిల్లాలో ప్రారంభమయ్యాయి. మొత్తం 32 సెంటర్లలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. జనరల్ విభాగంలో 7,217 మంది విద్యార్థులకు 307 మంది గైర్హాజరు కాగా 6,910 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,562 మందికి 218 మంది గైర్హాజరు కాగా 1,344 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లను అదనపు కలెక్టర్ రాంబాబు తనిఖీ చేశారు. సూర్యాపేట పట్టణపోలీస్ స్టేషన్ నుంచి 13 సెంటర్లకు ప్రశ్నాపత్రాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌లోగల స్ట్రాంగ్ రూమ్ నుంచి 13 సెంటర్లకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రశ్నపత్రాలను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టమెంటల్ అధికారులు, పేపర్ కస్టోడియన్ల నుంచి తీసుకెళ్లారు. ఈ ప్రశ్నాపత్రాలను క్లోజ్డ్ వెహికిల్ ద్వారా పరీక్ష కేంద్రాలకు తరలించారు. డీఐఈఓ భానునాయక్ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లోని స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈసీ సభ్యులు కృష్ణయ్య, లక్ష్మయ్య, 13 పరీక్షా కేంద్రాల సీఎస్‌లు, డీఓలు తదితరులు పాల్గొన్నారు. ఫ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం ఫ 525 మంది గైర్హాజరు -
ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచవద్దు
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో కేసులు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా పని చేయాలని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి ఆయన పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మెడికల్ సర్టిఫికెట్, పోస్టుమార్టం నివేదిక, వైద్యులతో సమన్వయంతో పని చేయడం, మెడికల్ సర్టిఫికెట్స్ పొందడంలో మెళకువలు, సమస్యలు తదితర అంశాలపై స్థానిక వైద్య కళాశాల డాక్టర్ కిషోర్, క్రాంతి కిరణ్ లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాణ్యమైన దర్యాప్తు చేయాలన్నారు. మహిళా సంబంధిత ఫిర్యాదులపై త్వరగా, కేసులపై వేగంగా స్పందించాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు. నేరాల నివారణకు జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ లు, తనిఖీలు, పటిష్టమైన పెట్రోలింగ్, పోలీస్ బీట్స్ నిర్వహించాలన్నారు. అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. కోర్టుల్లో అధికారులతో సమన్వయంగా పని చేయాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు నూతన కంప్యూటర్స్, ట్యాబ్ లు ఇతర సాంకేతికత సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు రవి, శ్రీధర్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మట్టయ్య, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఫ ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ -
పిల్లలతో కలిసి మహిళ అదృశ్యం
కనగల్: వైవాహిక జీవితంలో గొడవల కారణంగా మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ ఆచూకీని అర్ధగంటలో కనగల్ పోలీసులు కనిపెట్టారు. నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగజ్యోతి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. జ్యోతి భర్త, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సాయంత్రం కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి పోలీసులను రెండు టీంలుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగజ్యోతి అన్న మొబైల్‌కు కొత్త నంబర్ నుంచి నాగజ్యోతి ఫోన్ చేసి ‘నేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు, నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నాను’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఈ విషయం ఆమె అన్న వెంటనే కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నంబర్‌ను ట్రేస్ చేసి నాగజ్యోతి హైదరాబాద్‌లో ఉందని నిర్ధారించుకొని హయత్‌నగర్ పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని అరగంటలో కనిపెట్టి ఆమెను క్షేమంగా వారి బంధువులకు హయత్‌నగర్‌లో అప్పగించారు. నాగజ్యోతి బంధువులు కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అర్ధగంటలో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు -
సైబర్ నేరాలను ఎదుర్కోవడంపై అవగాహన
నల్లగొండ: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. సైబర్ నేరాలపై నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూంటారని, కొన్నిసార్లు భయభ్రాంతులకు గురిచేస్తూ మన నుంచి డబ్బులు కాజేస్తారని అన్నారు. సైబర్ క్రైంలో డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే సైబర్ 1930కి నంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. సోషల్ మీడియా వాడకం సరైన పద్ధతిలో ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోవద్దన్నారు. ఇంటర్నెట్ అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం మంచిదని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాలు, మోసాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి , నల్లగొండ వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ సైదులు, రియాజ్, మోక్షిత్, ఫారూక్, మెడికల్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ -
‘పెద్దగట్టు’ హుండీ ఆదాయం లెక్కింపు
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి(పెద్దగట్టు) ఆలయ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించారు. పెద్దగట్టు జాతర ఫిభ్రవరి 20వ తేదీన ముగియగా.. ఫిభ్రవరి 21 నుంచి మార్చి 5 వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 13 రోజులకు గాను రూ.5.24 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. భాస్కర్, ఇన్స్పెక్టర్ బి. సుమతి, ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్యయాదవ్, ఈఓ కుశలయ్య, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో వింత జంతువు ప్రత్యక్షంహుజూర్నగర్: హుజూర్‌నగర్‌లో బుధవారం వింత జంతువు ప్రత్యక్షమైంది. పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో నివాసముంటున్న రఫీ ఇంట్లో మామిడి చెట్టుపై నల్లని వింత జంతువు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహారావు వచ్చి ఆ జంతువును పరిశీలించి దానిని సీవీఎట్ క్యాట్‌గా పిలుస్తారని చెప్పారు. ఇది మనుషులకు హాని చేయదని, అడవుల్లోనే రాత్రివేళ ఎక్కువగా సంచరిస్తుందని పేర్కొన్నారు. 200 టేకు చెట్లు దగ్ధంఆత్మకూరు(ఎం): గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో టేకు చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం రాయిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రాయిపల్లి గ్రామానికి చెందిన జెట్ట శ్రీనివాస్ వ్యవసాయ భూమిలో సుమారు 350 టేకు చెట్ల ఉన్నాయి. ఈ టేకు చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 200 చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మోత్కూరు నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. సుమారు రూ.2.50లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు పేర్కొన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఇద్దరు ఆర్ఐలు సస్పెన్షన్
భానుపురి, మోతె : మోతె తహసీల్దారు కార్యాలయంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసినందుకు గాను ఇద్దరు ఆర్ఐలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోతె మండల ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలాదేవి, అదనపు ఆర్ఐ షేక్ మన్సూర్అలీలు పాత పహాణీ రికార్డుల్లో పేర్లు లేకపోయినా పేర్లు ఉన్నట్లు సృష్టించి ధరణిలో మిస్సింగ్ సర్వే నంబర్ల కింద 11 దరఖాస్తులు చేయించి భూమి ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ చేసి పంపించారు. ఈ విషయమై మోతె తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం రాత్రి రికార్డులను కలెక్టర్ పరిశీలించి ట్యాంపరింగ్ జరిగినట్లు నిర్ధారించారు. పలు రికార్డులను ట్యాంపరింగ్ చేసి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన మోతె మండల ఆర్ఐ నిర్మలాదేవి, అదనపు ఆర్ఐ షేక్ మన్సూర్అలీలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత విచారణలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోనట్లు ఆయన పేర్కొన్నారు. గోదావరి జలాలు పునరుద్ధరణఅర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు వారబందీ విధానంలో ఇవ్వాల్సిన గోదావరి జలాలను ఈసారి మూడు రోజులు ఆలస్యంగా వదిలారు. అయితే మంగళవారం 500 క్యూసెక్కులు వదలగా బుధవారం 1,002 క్యూసెక్కులకు పెంచారు. కాగా 1500క్యూసెక్కులకు పెంచితేనే చివరి భూములకు చేరడంతోపాటు తూములకు సాఫీగా వెళ్తాయని రైతులు చెబుతున్నారు. నీటిని పెంచి, వారబందీ విధానం కాకుండా పంటలు చేతికొచ్చే వరకు వదలాలని అన్నదాతలు నీటి పారుదలశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలిచివ్వెంల(సూర్యాపేట) : చిన్నారుల ఆహారం, ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని బాల సదన్‌ను సందర్శించారు. విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఆహారం సమయానికి పెడుతున్నారా అని తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, బియ్యం పరిశీలించారు. విద్యార్థులు బయటి తిను బండారాలు ఎక్కువగా తినకూడదని, వేసవి కాలం దృష్ట్యా నీరు ఎక్కువగా తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పి.వాణి పాల్గొన్నారు. పొన్నవాహనంపై నృసింహుడి విహారం యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనిమిచ్చారు. ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధలు నిర్వహించిన అనంతరం నిత్యకల్యాణ మండపంలో స్వామివారిని మురళీకృష్ణుడిగా తీర్చిదిద్ది ప్రత్యేక పల్లకిపై అధిష్టింపజేశారు. అనంతరం అలంకార సేవకు అర్చకులు హారతినిచ్చి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత మురళీకృష్ణుడికి రాగాలాపన చేశారు. సాయంత్రం ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు పూర్తిచేసిన అనంతరం శ్రీస్వామి వారిని పొన్న వాహనసేవపై ఊరేగించారు. ఆచార్యులు, యజ్ఞాచార్యలు, అర్చక బృందం వేద మంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా శ్రీస్వామివారు పొన్నవాహనంపై విహరించారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్‌రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, డీఈఓ దోర్భల భాస్కర్‌శర్మ పాల్గొన్నారు. -
విత్తనాలు మార్చకుండా అవగాహన కల్పించాలి
త్రిపురారం: వరి విత్తనాలను ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదని, రైతులు తమ పొలంలోనే పండించిన వరి ధాన్యాన్ని విత్తనాలుగా వినియోగించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించాలని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్(ఈఈఐ) ప్రొఫెసర్ డాక్టర్ మధుబాబు అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో శాసీ్త్రయ సలహా మండలి, జిల్లా స్థాయి సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024–25 సంవత్సరంలో శాస్త్రవేత్తలు వ్యసాయంలో రైతులకు అందించిన సలహాలు సూచనలు, అదేవిధంగా 2025–26వ సంవత్సరంలో అందించే సేవలపై శాస్త్రవేత్తలు సమీక్ష చేశారు. కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు గాను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్థిరమైన వరి ఉత్పత్తికి నేరుగా విత్తే పద్ధతి, ప్రకృతి వ్యవసాయం, బేకరీ ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్, కూరగాయల సాగు, కోళ్లు, గొర్రెల పెంపకం, వాటర్ మేనేజ్మెంట్, మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ వంటి వాటిపై శిక్షణ ఇచ్చామన్నారు. చీడపీడల నివారణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించి రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేసినట్లు పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ మధుబాబు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుకు అవసరమయ్యే వాటిపై నూతన ప్రయోగాలు చేయాలన్నారు. అనుభవం ఉన్న రైతుల ద్వారా సమాచారాన్ని సేకరించి ఇతర రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడులు సాధించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుండాలన్నారు. ఈ ఏడాది రైతులకు అందించాల్సిన సేవలపై ముందస్తుగా ప్రణాళిక ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం హెడ్ అనిల్, ఏడీఆర్ సుధాకర్, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ చంద్రశేఖర్, రాములమ్మ, హాహలియా ఏడీఏ రవీందర్, ఉద్యానవన అధికారి మురళి, పలువురు మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ మధుబాబు -
భానుడు భగభగ
భానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయ్. వేసవి కాలం ప్రారంభమైన కొద్దికాలానికే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. మరో రెండునెలల పాటు వేసవి కాలం ఉండగా.. ప్రస్తుత ఉష్ణోగ్రతలను చూస్తే జనం బిత్తరపోతున్నారు. మూడు రోజులుగా జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలకు మించి ఎండల తీవ్రత అధికంగా ఉంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలను దాటాయి. ఈ ఎండలు గతేడాదితో పోల్చితే ఎక్కువగానే ఉన్నాయి. బుధవారం జిల్లాలోని పది ప్రాంతాల్లో 37 డిగ్రీలకు పైగా, మరో 4 ప్రాంతాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లతో పాటు ఆఫీసుల్లో వేసవి నేస్తాలను సమకూర్చుకుంటున్నారు. ఎండలు ముదరడం.. వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావులులో జలాలు తగ్గిపోయి చాలావరకు పొలాలు ఎండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సాధారణానికి మించి.. జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. ఏప్రిల్, మే మాసాల్లో ఈ ఎండల తీవ్రత అధికంగా నమోదవుతూ ఉంటుంది. మార్చి రెండోవారం నుంచి 35 డిగ్రీలకు చేరుకుని ఆ తర్వాత 40లకు అటుఇటుగా నమోదవుతుంది. ఈనెల 4న ఏకంగా 39.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. అంతకు ముందు వారం రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలకు మించి ఎండలు ఉన్నాయి. ఈ నెల 1వ తేదీన 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2వ తేదీన రెండు డిగ్రీలు పెరిగి 35 డిగ్రీలు, 3న మరో రెండు డిగ్రీలు పెరిగి 37కు చేరింది. 4వ తేదీన ఏకంగా 40 డిగ్రీలకు చేరువై 39.9 డిగ్రీలుగా నమోదైంది. బుధవారం నాలుగు మండలాల్లో 38.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ఎండలను చూసిన జనం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనన్న భయంతో ఉన్నారు. ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో..)ఫ మూడురోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఫ బుధవారం నాలుగు ప్రాంతాల్లో 38 డిగ్రీలకుపైగా నమోదు ఫ గతేడాదితో పోల్చితే ముందుగానే మండుతున్న ఎండలు -
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాబాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు. -
అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో రైతులు పండించిన అన్నిరకాల పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జిల్లా కన్వీనర్లు మల్లు నాగార్జున్‌రెడ్డి, మండారి డేవిడ్ కుమార్, షేక్ నజీర్, నల్లడ మాధవరెడ్డి, నారాబోయిన వెంకట యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాత రుణాలు రద్దుచేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ అమలు చేసి రైతుభరోసా అందించాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించి నూతనకల్, మద్దిరాల, ఆత్మకూరు, చివ్వెంల, మోతె, పెన్ పహాడ్, మునగాల, నడిగూడెం మండలాల రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరికుప్పల వెంకన్న, బొడ్డు శంకర్, దండ వెంకటరెడ్డి, మట్టిపల్లి సైదులు, ములకలపల్లి రాములు, పోటు లక్ష్మయ్య, పల్లె వెంకటరెడ్డి, కరీం, కందాల శంకర్ రెడ్డి, మేకల కనకారావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
క్షణం మత్తుకోసం జీవితాలు కోల్పోవద్దు
సూర్యాపేట : యువత క్షణం మత్తు కోసం జీవితాలు కోల్పోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. బుధవారం జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల – వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ మీటింగ్ హాల్ లో నషా ముక్త్ భారత్ అభియాన్ (మిషన్ పరివర్తన్) లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం, సమాజం అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మాదకద్రవ్యాలనుంచి దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు గుర్తిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, డీఎంహెచ్ఓ కోటాచలం, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జయలత, సూపరింటెండెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
బైక్‌పై డొంకదారిలో వెళ్లి.. ఉపాధి పనులు పరిశీలించి..
నూతనకల్: నూతనకల్ మండలం కేంద్రంలో ఉపాధి పథకం కింద రైతుల పంటపొలాలకు ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులను పరిశీలించేందుకు బుధవారం సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ బైక్‌పై వెనుక కూర్చొని రెండు కిలోమీటర్ల మేర డొంకదారిలో వెళ్లారు. అక్కడ కూలీలతో మాట్లాడారు. రోజూ పని కల్పిస్తున్నారా.. చేసిన పనికి వేతనం సమయానికి చెల్లిస్తున్నారా.. తాగడానికి మంచినీరు.. అలసట తీర్చుకోవడానికి తగిన ఏర్పాటు చేశారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వన నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి వేసవిలో వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా షేడ్నెట్లు ఏర్పాటు చేసి సమయానుకూలంగా నీటిని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న స్వపరిపాలన దినోత్సవంలో పాల్గొని విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించడం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు శ్రద్ధతో చదివి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునిత, ఎంఈఓ రాములు నాయక్, ఏపీఓ శ్రీరాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఫ నూతనకల్‌లో కూలీలతో మాట్లాడిన కలెక్టర్ ఫ పనులు, వసతుల కల్పనపై ఆరా -
హనీ ట్రాప్ దోపిడీ!
వీడియో కాల్స్ లిఫ్ట్ చేస్తే ఇక అంతే.. అనేక రకాలుగా దోపిడీ.. తక్కువ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని ఓవైపు దోచుకుంటున్న సంఘటనలు అనేకం రిపోర్టు అవుతున్నాయి. వాటిపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ పంపించి వాటిని క్లిక్ చేయగానే ఫోన్‌ను హ్యాక్ చేసి, ఖాతాల్లోని డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. వీటికి తోడుగా న్యూడ్‌గా ఉండి వీడియో కాల్స్ చేసి, స్క్రీన్ షాట్లు తీసి, వాటినే బాధితులకు పంపించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి.సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో పలువురు హనీ ట్రాప్(వలపు వల)లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఏటా వందల మంది హనీ ట్రాప్ బారిన పడుతున్నారు. బ్లాక్‌మెయిలింగ్‌తో డబ్బుల వసూళ్లకు అలవాటుపడిన సైబర్ మోసగాళ్లు అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ చేయిస్తూ బాధితులను బెదిరిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. వీడియో కాల్ రాగానే అనుకోకుండా లిఫ్ట్ చేస్తే, స్క్రీన్ షాట్లు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మంగళవారం రాత్రి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్‌గా ఉన్న అమ్మాయితో వీడియో కాల్ చేయించి నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. ఆయన వెంటనే ఆ వీడియో కాల్ కట్ చేయడంతో అప్పటికే నేరగాళ్లు తీసిన స్క్రీన్‌షాట్‌ను ఎమ్మెల్యేకే పంపించి బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకపోతే పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆ వీడియో పంపిస్తామని బెదిరించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పరువు పోతుందనే భయంతో..తెలియని ఫోన్ నెంబర్ల నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు అనుకోకుండా లిఫ్ట్ చేసి అనేక మంది తంటాలు పడుతున్నారు. నేరగాళ్లు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, బంధువులు, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించి బాధితుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఈ సంఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేయడం లేదు. ఫిర్యాదు చేస్తే తమ పేరు బయటికి వస్తుందేమోనని, పరువుపోతుందని భయపడి ఫిర్యాదుకు వెనుకాడుతున్నారు. అడిగిన మేరకు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఇలాంటి సంఘటనలు 100 వరకు తమ దృష్టికి వచ్చాయని, అయితే ఫిర్యాదు చేసేందుకు మాత్రం వెనుకాడుతున్నారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. వీడియో ఫోన్ కాల్ రావడంతో అనుకోకుండా లిఫ్ట్ చేసి, అడిగినంత నేరగాళ్లకు ముట్టజెప్పి ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారు ఉన్నారని వెల్లడించారు. ఫ బాధితులు ఎక్కువ.. ఫిర్యాదులు జీరో ఫ పరువుపోతుందని ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు ఫ ఎమ్మెల్యే వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన మోసగాళ్లు ఫ కాల్ కట్ చేయడంతో బెదిరింపులు ఫ పోలీసులకు ఫిర్యాదు చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే ప్రజల్లో అవగాహన పెరగాలనే ఫిర్యాదు.. సైబర్ నేరాలు, హనీ ట్రాప్, వీడియో కాల్స్ విషయంలో అమాయక ప్రజలు ఇబ్బందుల పాలు కావద్దనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేరస్తుల బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే ఇలాంటి సమస్యలు దూరమవుతాయి. – ఎమ్మెల్యే వీరేశం అప్రమత్తంగా ఉండాలి వీడియో కాల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దు. సోషల్ మీడియా అకౌంట్లకు టూ స్టెప్ సెక్యూరిటీ, ప్రొపైల్, అకౌంట్ లాక్ వంటివి పెట్టుకోవాలి. అప్పుడు మీ ఫ్రెండ్స్ లిస్ట్ నేరగాళ్లకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. –సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ -
కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని కార్వాన్కు చెందిన శ్రీవిశ్వాంజనేయ భక్త సమాజం, యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహిళా భజన మండలి, వేల్పుపల్లి శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన మసన చెన్నప్ప ఆధ్వర్యంలో ఉపనిషత్ వైభవంపై ఉపన్యాసం చేశారు. హాలియాకు చెందిన చేబ్రోలు నారాయణదాసు సమక్షంలో సుభద్రా పరిణయం హరికథ గానం చేశారు. స్వరరాగ ఆర్ట్స్ ఆకాడమీ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, మెరుగు రాఘవేంద్రచే తబలా వాయిద్యం చేపట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రముఖ జానపద, సినీ నేపథ్య గాయని తేలు విజయ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమం కొనసాగింది. ఇక పలువులు కళాకారులు కూచిపూడి, భరత నాట్యం, సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. -
బస్సులో పోగొట్టుకున్న పర్సు అప్పగింత
దేవరకొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న పర్సును డ్రైవర్, కండక్టర్ గుర్తించి తిరిగి అతడికి అప్పగించారు. దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హైదరాబాద్ నుంచి దేవరకొండకు వస్తుంది. ఈ బస్సులోని ప్రయాణికుడు ఒకరు పర్సు బస్సులోనే మర్చిపోయి కొండమల్లేపల్లిలో దిగిపోయాడు. బస్సులో పర్సును గుర్తించిన కండక్టర్ బుచ్చిరెడ్డి, డ్రైవర్ భోజ్య దేవరకొండ డిపో అధికారులకు అందజేశారు. పర్సులోని వివరాల ఆధారంగా పర్సు పోగొట్టుకున్న ప్రయాణికుడిని గుర్తించి అతడికి తిరిగి పర్సు అప్పగించారు. ఆ పర్సులో రూ.14,500 నగదు ఉన్నట్లు తెలిపారు. నిజాయితీ చాటుకున్న బస్సు డ్రైవర్, కండక్టర్‌ను ఆరీస్టీ అధికారులు అభినందించారు. -
వైద్యానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత
కనగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం కనగల్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి మీడియాతో మంత్రి మాట్లాడారు. కనగల్ పీహెచ్సీలో కంటి పరీక్షలు చేసే గ్లూకోమా సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన వారికి గడచిన 15 నెలల్లోనే రూ.1600 కోట్ల ఎల్ఓసీలను అందించామని, పేద ప్రజలు వైద్యం కోసం వస్తే 24 గంటలు ఎల్ఓసీలను అందజేస్తున్నామని అన్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రులకు ఎల్ఓసీ ఇచ్చే బదులుగా ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అన్నిరకాల సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. హైదరాబాదులో 4 టిమ్స్ హాస్పిటళ్లను ఆర్అండ్బీ ద్వారా నిర్మిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.2600 కోట్లతో హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, పాత భవనం అలాగే కొనసాగుతుందని తెలిపారు. వచ్చేవారం దేవరకొండ నియోజకవర్గంలో గ్లూకోమా కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. నల్లగొండ ఆస్పత్రిలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇతర ప్రాంతాలలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న 59 మంది డాక్టర్లను వెనక్కి పిలిపిస్తున్నామన్నారు. పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారానే వైద్య సేవలు అందిస్తామన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. పైలెట్ పద్ధతిన కనగల్ పీహెచ్సీలో గ్లూకోమా సెంటర్‌ను ప్రారంభించామని తెలిపారు. కనగల్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గ్లూకోమా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక మోడల్ పీహెచ్‌సీని తీర్చిదిద్దుతామని తెలిపారు. తన ప్రసవం కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగిందని ఆమె పేర్కొన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
భువనగిరి: మండలంలోని పగిడిపల్లి గ్రామ పరిధిలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పగిడిపల్లి పరిధిలోని పాత కలెక్టరేట్ భవనం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గత వారం రోజులుగా మృతుడు భిక్షాటన చేస్తూ సంచరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, వివరాలు తెలిసిన వారు 8712662472, 8712662733 నంబర్లను సంప్రదించాలని ఎస్ఐ సంతోష్‌కుమార్ సూచించారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య మోత్కూరు: మానసికస్థితి సరిగ్గా లేని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోత్కూరు పట్టణ శివారులో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణ పరిధిలోని అంగడిబజార్‌కు చెందిన బీసు లింగస్వామి(55) మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడికి మానసికస్థితి సరిగ్గా ఉండటంలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన బుధవారం మోత్కూరు పట్టణ శివారులో మోదుగుచెట్టుకు కేబుల్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బీసు సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. భర్తపై రోకలిబండతో భార్య దాడిచౌటుప్పల్: భర్తపై భార్య రోకలిబండతో దాడి చేసింది. ఈ ఘటన బుధవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్–సునీతలు దంపతుల మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 15రోజుల క్రితం కూడా భర్తతో గొడవ జరగడంతో సునీత చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలోని తన తల్లిగారింటికి వెళ్లింది. ఈ సమస్యపై మాట్లాడేందుకు గాను చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నివాసముంటున్న సునీత సోదరుడు వీరేశం ఇంటి వద్దకు రావాలని శ్రీనివాస్‌కు సూచించారు. ఈ క్రమంలో బుధవారం శ్రీనివాస్ చౌటుప్పల్‌కు వచ్చాడు. మాట్లాడుకునే క్రమంలో మాటామాట పెరగడంతో ఇంట్లో ఉన్న రోకలిబండతో సునీత తన భర్త శ్రీనివాస్‌పై దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ పేర్కొన్నారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతినాంపల్లి: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం శివారులో జరిగింది. నాంపల్లి మండల కేంద్రానికి చెందిన పూల రవి(33) మర్రిగూడ మండలం వట్టిపల్లి లో నిమ్మ తోట కౌలుకు తీసుకున్నాడు. బుధవారం రాత్రి తోటలో పని ముగించుకొని తన భార్యతో కలిసి బైక్‌పై నాంపల్లికి వస్తుండగా.. స్వాములవారి లింగోటం శివారులో మూలమలుపు వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు. రవి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం మాల్‌కు తరలించారు. రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండకు తరలించారు. మృతుడికి ఒక కుమారుడు, కుమారై ఉన్నారు. -
బీజేపీపై రాజకీయ పోరాటం చేయాలి
మిర్యాలగూడ అర్బన్: రాష్ట్రానికి ప్రమాదకరంగా మారబోతున్న బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాయమాటలతో, మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందాలని బీజేపీ చూస్తోందని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేక పోతోందని విమర్శించారు. భవిష్యత్తులో బీజేపీపై రాజకీయ యుద్ధం జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్తాన్‌లో ఓ చిన్న కేసు విషంలో పోలీసులు అర్ధరాత్రి ఇంట్లో చొరబడి ఆరునెలల చిన్నారి చావుకు కారణం అయ్యారని, ముస్లిం వ్యతిరేకంగా పాలన చేయడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేడం లేదని విమర్శించారు. కేవలం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పైనే ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 50శాతం రిజర్వేషన్ దాటవద్దని సుప్రీంకోర్టు చెపుతున్నా.. పార్లమెంట్లో బీసీ కులగణన ఆమోదం పొందదనే దృష్టితోనే బీసీ కులగణన చేసినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ నాటకమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం, నల్లగొండ జిల్లాల కార్యదర్శులు నూనె నాగేశ్వర్రావు, తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేష్, సయ్యద్ హశం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, ఎండీ సలీం, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, మల్లయ్య, అరుణ, పల్లా భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని, సొరంగమార్గం తవ్వేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సొరంగం పనులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రశాంతత కోసం బుద్ధవనాన్ని సందర్శించాలి ఫ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఆర్కే మిశ్రా నాగార్జునసాగర్: జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ బుద్ధవనాన్ని సందర్శించాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఆర్కే మిశ్రా అన్నారు. నల్లగొండ జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చిన ఆయన బుధవారం నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధుడి పాదాల చెంత పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరిత వనం, ధ్యానవనం, స్థూపవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. మహాస్థూపంలోని అష్టబుద్ధుల వద్ద ధ్యానం చేశారు. అనంతరం సాగర్ డ్యాంను సందర్శించారు. ఆయనకు బుద్ధవనం చరిత్ర గురించి గైడ్ సత్యనారాయణ వివరించారు. వారి వెంట డీఆర్డీఏ ఏపీడీ శేఖర్‌రెడ్డి, పెద్దవూర మండల తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి, ఆపద మిత్ర ప్రోగ్రాం శిక్షకులు తదితరులు ఉన్నారు. బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
20 కిలో మీటర్ల పరిధిలో టోల్ రద్దు చేయాలి
నేరేడుచర్ల: జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై ఇటీవల ఏర్పాటు చేసిన టోల్ గేటు రుసుము వసూళ్లు 20 కి లో మీటర్ల మేరకు రద్దు చేయాలని తెలంగాణ మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు కోరారు. మంగళవారం నేరేడుచర్లలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగులేన్ల పేరుతో ఽఅధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఈ జాతీయ రహదారి నాలుగులేన్ల పనులు ఇంకా పూర్తికాలేదన్నారు. 20 కిలో మీటర్ల పరిధిలో టోల్ యాజమాన్యం ఉచితంగా ఇవ్వకుండా దోపిడీకి తెగబడ్డారని ఆరోపించారు. ఈ రహదారి నిర్మాణ పనులను పూర్తి చేసి జాతీకి అంతం చేసిన తరువాతనే టోల్ వసూలు చేయాల్సి ఉండగా పనులు పూర్తి కాకుండా వసూళ్లకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ టోల్ వసూళ్లపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నుంచి కోదాడ వరకు అనేక సమస్యలు రహదారి వెంట ఉన్నాయని, వీటిని ఉమ్మడి జిల్లా ఇద్దరు మంత్రులు ఉత్తమ్‌కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోదాడ, సూర్యాపేట, నకిరేకల్ ఎమ్మెల్యేలు నలమాద పద్మావతి, జగదీష్‌రెడ్డి, వేముల వీరేశంలు అఖిల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రణాళికను రూపొందించాలన్నారు. ఆయన వెంట చవ్వ బుచ్చిరెడ్డి, కొత్తూరు అమృత, లోడంగి లింగయ్య తదితరులున్నారు. -
ఓటరునాడి పట్టలే..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ– టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందగా, టీఎస్ యూటీఎఫ్ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. సంఘం పోరాట పటిమ తమ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నా.. అనుకూల ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇక పీఆర్టీయూ–టీఎస్ గతంలో కోల్పోయిన తమ స్థానాన్ని ఈసారి దక్కించుకోగలిగింది. ఉపాధ్యాయుల్లో పెద్ద సంఘంగా పేర్కొనే పీఆర్టీయూ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డిని గెలిపించుకొని తమ పాత స్థానాన్ని పదిలం చేసుకోగలిగింది. సొంత నియోజకవర్గం కాకపోయినా ఈ ఎన్నికల్లో బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి గట్టిగా పోరాడి ఓడారు. బీసీ నినాదంతో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన పూల రవీందర్ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయారు. ఇక, బీజేపీ అనుకున్నంత స్థాయిలో తమ బలాన్ని టీచర్లలో పెంచుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో దిగిన పులి సరోత్తంరెడ్డికి ఆశాభంగం తప్పలేదు. ఎక్కడ పొరపాటు జరిగింది.. ఈ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ రెండో స్థానానికి పడిపోవడంపై ఆ యూనియన్ ఆలోచనల్లో పడింది. గెలుస్తామని ధీమాతో ఉన్నా అంచనాలు ఎక్కడ తారుమారయ్యాయి.. ఓటమికి కారణాలేంటనే విశ్లేషణ చేసుకుంటోంది. 2019 ఎన్నికలో గెలుపొందిన తాము ఈసారి ఎందుకు ఓడిపోయామనే చర్చ యూటీఎఫ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. యూనియన్‌కు ఉన్న సంప్రదాయ ఓట్లు అలాగే ఉన్నాయని, అవి తమ అభ్యర్థికే పడ్డాయని, అయితే తటస్థంగా ఉండే టీచర్ల ఓట్లు మాత్రం హర్షవర్దన్‌రెడ్డికి వేశారని అంచనా వేస్తోంది. హర్షవర్ధన్ పోటీలో ఉండటం వల్లే తమకు రావాల్సిన ఓట్లకు గండిపడి, రెండోస్థానానికి పడిపోవాల్సి వచ్చిందని భావిస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో పని చేసిందన్న విశ్లేషణ యూటీఎఫ్ వర్గాల్లో సాగుతోంది. గట్టి పోటీ ఇచ్చిన హర్షవర్ధన్‌రెడ్డి.. ఉపాధ్యాయ ఎన్నికల్లో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి టీచర్స్ జేఏసీలోని సంఘాల మద్దతులో బరిలో దిగి చివరి వరకు పోరాడారు. ఓడిపోయినా.. గణనీయమైన ఓట్ల సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్ల పండిట్, పీఈటీ పదోన్నతులు, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇప్పించడం వంటి విధాన నిర్ణయాల్లో హర్షవర్ధన్‌రెడ్డి కీలక ప్రాత పోషించిన అంశం టీచర్లలోకి బలంగానే వెళ్లింది. హర్షవర్ధన్ స్థానికేతరుడనే ప్రత్యర్థుల ప్రచారం కూడా ఆయనకు ప్రతికూలంగా మారింది. అయినప్పటికీ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి, హర్షవర్ధన్ మధ్య వ్యత్యాసం 500లోపు ఓట్లు మాత్రమే ఉండడం గమనార్హం. పూల రవీందర్ ఎలిమినేట్ కావడానికి ముందు 16వ రౌండ్ ముగిసే వరకు నర్సిరెడ్డికి 5,660 ఓట్లు ఉండగా, హర్షవర్ధన్‌రెడ్డికి 5,309, శ్రీపాల్‌రెడ్డికి 7,673 ఓట్లు ఉన్నాయి. నర్సిరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి మధ్య వ్యత్యాసం 351 ఓట్లే. రవీందర్ ఎలిమినేషన్ తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో హర్షవర్ధన్‌రెడ్డి మూడో స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరికి ప్రచారం చేయడమే దెబ్బకొట్టిందా? ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అనుకున్న మేర ప్రభావం చూపలేకపోయారు. బీసీ వాదంతో, బీసీ సంఘాల మద్దతులో బరిలోకి దిగినా, అది పూర్తిగా ఫలించ లేదు. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒకే ఎన్నికలో ఇద్దరు బీసీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పడం మైనస్‌గా మారిందనే చర్చ సాగుతోంది. ఎవరో ఒకరిని గెలిపించాలని కోరితే ఆ ఒక్కరికి ఓట్లు పడేవని, రవీందర్‌తోపాటు సుందర్రాజుకు ఓట్లు వేయాలని సూచించడంతో బీసీ ఓట్లు చీలిపోయాయన్న చర్చ సాగుతోంది. ఫ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఎస్ యూటీఎఫ్ ఫ పాత స్థానాన్ని దక్కించుకున్న పీఆర్టీయూ–టీఎస్ ఫ సొంత నియోజకవర్గం కాకున్నా గట్టి పోటీ ఇచ్చిన హర్షవర్ధన్ రెడ్డి ఫ టీచర్లలో బలాన్ని పెంచుకోలేకపోయిన బీజేపీ -
ఈఈ కార్యాలయ నూతన భవనానికి రూ 7.99 కోట్లు
హుజూర్నగర్ : నీటిపారుదల శాఖ హుజూర్నగర్ డివిజన్ ఈఈ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. హుజూర్నగర్ పట్టణంలో ఈ భవన నిర్మాణానికి రూ 7.99 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం జీఓ నంబర్ 42 జారీ చేసింది. సాంకేతిక అనుమతుల తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. 12న అరుణాచలంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుభానుపురి (సూర్యాపేట) : పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలంగిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ఈనెల 12వ తేదీన సూర్యాపేట ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ సురేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12న రాత్రి 8 గంటలకు డిపో నుంచి బయలుదేరి 13న ఉదయం కాణిపాకం, సాయంత్రం వేలూరు గోల్డెన్ టెంపుల్, రాత్రి 12 గంటలకు అరుణాచలం చేరుకుంటుందని వివరించారు. 14న అరుణాచలం గిరిప్రదక్షిణ, స్వామి దర్శనం అనంతరం సాయంత్రం 5గంటలకు బయలుదేరి 15న శనివారం సూర్యాపేటకు చేరుకుంటుందని పేర్కొన్నారు. యాత్రకు వెళ్లేందుకు భక్తులు ఒక్కరికి రూ.4వేలు చార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాల కోసం బుకింగ్ ఇన్చార్జ్ ఏకాంబరం సెల్ నంబర్లు 9951613278, 7382836177లను సంప్రదించాలన్నారు. 17లోపు సీఎంఆర్ బకాయిలు ఇవ్వాలిభానుపురి (సూర్యాపేట) : సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిలు ఈనెల 17లోపు ఇవ్వాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ 2022–23కి సంబంధించి సీఎంఆర్ బకాయి పడిన మిల్లర్లు నిర్దేశించిన గడువు లోపు ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖకు పంపించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువు పెంచే అవకాశం లేదన్నారు. ఏ ఒక్కరికీ మినహాయింపు లేదన్నారు. అధికారులు రోజూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మిల్లు వారీగా ఎంత బకాయి పంపిస్తున్నారో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, డీఎం ప్రసాద్, ఏసీఎస్ఓ శ్రీనివాసరెడ్డి, సివిల్ సప్లయ్ డీటీలు, ఆర్ఐలు, మిల్లర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానంసూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె.లత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు తమ కళాశాల లాగిన్‌లో ఈ నెల 7వ తేదీ లోపు డిజిటల్ కీ రిజిస్టర్ చేసుకొని ఉపకార వేతనాల దరఖాస్తులను పరిశీలించి జిల్లా అధికారులకు ఆన్లైన్లో పంపించాలని సూచించారు. అర్హతలేని వైద్యం చేస్తే కఠినచర్యలుకోదాడ రూరల్: అర్హత లేకుండా వైద్యం చేసే వారిపై కఠినచర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం హెచ్చరించారు. కోదాడ మండలంలోని రామాపురం క్రాస్‌రోడ్డులో గత కొంత కాలంగా శౌకత్‌అలీ అనే వ్యక్తి ఎలాంటి అర్హతలు లేకున్నా, అనుమతి లేని బోర్డుతో ఆసుపత్రి నిర్వహిస్తూ వైద్యం చేస్తుండగా జిల్లా వైద్యాధికారి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం తన బృందంతో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడుతున్నట్లు గుర్తించి నిర్ధారించి క్లినిక్‌ను మూసివేశారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎక్కడైనా అర్హత లేకుండా వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని వారిపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా, స్టాటిస్టికల్ అధికారి వీరయ్య, డాక్టర్ మౌనిక, ఏఎస్ఐ జ్యోతి , సభి కన్సల్టెంట్ ఎలిశమ్మ, కార్తీక్ పాల్గొన్నారు. -
వటపత్రశాయికి వరహాల లాలీ..
ఫ రాత్రి హంస వాహనంపై ఊరేగిన శ్రీస్వామి వారు ఫ నాల్గవ రోజుకు చేరిన యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాల్గవ రోజైన మంగళవారం ఉదయం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు తిరు, మాడ వీధుల్లో వటపత్రశాయి అలంకార సేవలో ఊరేగించారు. వేకువజామున నిత్యారాధనలు చేపట్టిన తరువాత, పారాయణీకులు వేద పారాయణం పఠించారు. అనంతరం శ్రీస్వామి వారిని వటపత్రశాయి అలంకరణలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించి ఆలయ తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంఽశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సాయంకాలం వేళ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీనృసింహస్వామి వారిని హంస వాహన సేవలో అలంకరించి ఊరేగించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకారం నుంచి ప్రారంభమైన అలంకార సేవ పడమటి రాజగోపురం నుంచి ఉత్తరం, తూర్పు, దక్షిణ రాజగోపురాల ముందు నుంచి సాగింది. ఆలయంలో నేడు.. ఆలయంలో శ్రీస్వామి వారిని బుధవారం ఉదయం శ్రీకృష్ణాలంకారణ (మురళీ కృష్ణుడు) సేవ చేపట్టనున్నారు. అదేవిధంగా సాయంత్రం పొన్నవాహన సేవ నిర్వహించనున్నారు. -
ముఖం చూపిస్తేనే సరుకులు
అంగన్వాడీల్లో సరుకులు పక్కదారి పట్టకుండా కొత్తవిధానం పారదర్శకత కోసమే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్‌తో లబ్ధిదారులకు పారదర్శంగా సరుకులు అందుతాయి. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా 7నెలల నుంచి 3ఏళ్లలోపు చిన్నారులకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్‌ను నిర్ధారణ పూర్వకంగా లబ్ధిదారులకు అందుతుంది. ప్రతి నెలా లబ్ధిదారులకు అందజేసే సరుకులను ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేస్తాం. దీని ద్వారా పారదర్శకంగా సరుకులు అందటంతో పాటు, ఇతరులు సరుకులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. – నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట. నాగారం : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు పారదర్శకంగా సరుకులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్ ) తీసుకొచ్చింది. గతంలో అంగన్వాడీ లబ్ధిదారులకు అందించే సరుకుల విషయంలో జాబితాలో పేర్లు ఒకరివి ఉంటే మరొకరికి ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొత్తవిధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై లబ్ధిదారుడి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) హాజరు ఆధారంగా సరకులు ఇవ్వనున్నారు. ఈ మేరకు చిన్నారులు లేదా తల్లి ఫొటోలతో పాటు ఆధార్ వివరాలు పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. వివరాల నమోదు.. అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు బాలామృతం, గుడ్లు అందిస్తారు. రెండున్నర కిలోల బాలామృతం, 16 గుడ్లు, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న చిన్నారులకు నెలకు 30 గుడ్లు, బాలామృతం అదనంగా ఒక ప్యాకెట్‌ను రెండు విడతల్లో అందిస్తారు. సరుకులు అసలైన లబ్ధిదారుడికి అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్‌ఎస్‌టీఎస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. చిన్నారి లేదా తల్లి ఫొటో తీస్తారు. ఆధార్ కార్డులో ఉన్న వివరాలను పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా గత నెల 10వ తేదీన ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లాలో మూడేళ్లలోపు చిన్నారులు 25,139 ఉండగా వీరిలో ఇప్పటి వరకు 11,569 మంది చిన్నారుల ఫొటోలను యాప్‌లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ వంద శాతం పూర్తికాగానే ప్రతి నెలా పోర్టల్‌లో ఫొటో తీసి సరకులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం గర్భిణులు, బాలింతలు, చిన్నారులు కేంద్రాల్లో భోజనం చేసే సమయంలో సిబ్బంది ఫొటోలు తీసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా పంపిణీ ఫ చిన్నారి లేదా తల్లి ఫొటోతో పాటు ఆధార్ వివరాలు పోర్టల్‌లో నిక్షిప్తం ఫ ఇప్పటి వరకు జిల్లాలో45శాతం ప్రక్రియ పూర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05అంగన్వాడీ కేంద్రాలు 1206మూడేళ్లలోపు చిన్నారులు 25,1393 నుంచి 6 ఏళ్లలోపు వారు 14,819 -
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు ప్రణాళికతో చదివి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం చివ్వెంల మండలంఐలాపురం గ్రామ శివారులో గల గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులను మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా బాగా రాయాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. ఆయన వెంట పాఠశాల ప్రిన్సిపల్ దుర్గభవాని, వైస్ ప్రిన్సిపల్ షబానా, వార్డెన్ లలిత తదితరులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి గ్రామాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్‌ను తనిఖీ చేశారు. నీటి సరఫరా వివరాలను ఈఈ కరుణాకర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. 18 ఎంఎల్డీ(మిలియన్ లీటర్ డిమాండ్) సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రం ద్వారా ఆత్మకూర్(ఎస్) మండలంలో 58 ఆవాసాలకు, చివ్వెంల మండలంలో 68 ఆవాసాలకు, మోతె మండలంలో 4 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులు కలగవద్దని, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఇంట్రా ఈఈ శ్రీనివాస్‌రావు, డీపీఓ నారయణ రెడ్డి, డీఈ రాజేందర్, డీఈ పాండు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
సూర్యాపేటటౌన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ అధికారులు సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 22తో పరీక్షలు ముగియనున్నాయి. ఈ సారి నిర్దేశిత పరీక్ష సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించనున్నారు. జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలు జిల్లాలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 12 ప్రభుత్వ కళాశాలల్లో , 20 ప్రైవేటు కళాశాలల్లో ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 16,948 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో జనరల్ ఫస్ట్ ఇయర్లో 6,688 మంది, జనరల్ సెకండియర్‌లో 6,666 మంది, ఒకేషనల్ ఫస్ట్ ఇయర్లో 1,952, ఒకేషనల్ సెకండ్ ఇయర్లో 1,642 మంది విద్యార్థులు ఉన్నారు. పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, 32 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 32 మంది డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు 850 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్(భారతీయ నాగరిక్ సురక్ష సంహిత) సెక్షన్ 163 అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసి వేయాలని సూచించారు. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఫ సీసీ కెమెరాల నిఘాలో నిర్వహణ ఫ పరీక్ష రాయనున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 16,948 మంది ఫ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇలా.. ఫస్టియర్ 8,640సెకండియర్ 8,308మొత్తం 16,948పరీక్ష కేంద్రాలు 32ప్రశాంతమైన వాతావరణలో పరీక్షలు రాసుకోవాలి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసుకోవాలి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సెంటర్లలో ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు హడావుడిగా రాకుండా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. – భానునాయక్, డీఐఈఓ -
పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లావ్యాప్తంగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి వెబెక్స్ ద్వారా ఇంటర్మీడియట్ పరీక్షలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ఉదయం 7.30గంటల కల్లా పరీక్ష కేంద్రాలకు రావాలని, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించకూడదని సూచించారు. సమావేశంలో ఇంటర్మీడియట్ అధికారి బాలునాయక్, డీఎంహెచ్ఓ కోటాచలం, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. -
ఓడినా విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం
ఫ అలుగుబెల్లి నర్సిరెడ్డి నల్లగొండ: ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఉపాధ్యాయులు రెండోసారి వద్దనుకున్నారు.. కాబట్టి ఓడిపోయాను.. అయినా విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తాను’ అని సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత కౌంటింగ్ సెంటర్ నుంచి ఆయన బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఓటమి అనేది సహజమని గతంలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు ఇప్పుడు శ్రీపాల్‌రెడ్డికి ఇచ్చారని చెప్పారు. మరోసారి తనకు ఓట్లు వేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో విద్య, వైద్యం వ్యాపారీకరణ కావద్దన్న డిమాండ్‌తో పోరాటం చేస్తానన్నారు. తాను గెలుస్తాననే నమ్మకం ఉన్నప్పటికీ ఓటర్లు శ్రీపాల్‌రెడ్డికి అవకాశం ఇచ్చారని దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. -
ఇంటర్ వార్షిక పరీక్షలకు 32 కేంద్రాలు
జిల్లాలో ఈనెల 5వ తేదీ నుంచి 25 వరకు జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 32కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సూర్యాపేటలో 13 పరీక్ష కేంద్రాలు, కోదాడలో 8, నడిగూడెంలో 2, హుజూర్‌నగర్‌లో 2, మఠంపల్లిలో 1, నేరేడుచర్లలో 1, తిరుమలగిరిలో 2, తుంగతుర్తిలో 2, ఆత్మకూరు (ఎస్) మండలంలో 1 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఒక్క రోజు ముందుగానే చూసుకోవాలని, అలాగే రోజూ పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. -
బైక్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి
● అతడి భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలుమంచాల, మర్రిగూడ: నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన మైలారం జంగయ్య(27) మృతిచెందాడు. అతడి భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగయ్య కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జంగయ్యకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత పని నిమిత్తం భార్య పార్వతమ్మ, కుమార్తె అశ్వితతో కలిసి స్వగ్రామం యరగండ్లపల్లికి వచ్చిన జంగయ్య సోమవారం తిరిగి బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి సమీపంలోని జేబీ వెంచర్ వద్ద వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. పార్వతమ్మ, అశ్వితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జంగయ్య మృతితో యరగండ్లపల్లి విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఓడినా విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం
ఫ అలుగుబెల్లి నర్సిరెడ్డి నల్లగొండ: ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఉపాధ్యాయులు రెండోసారి వద్దనుకున్నారు.. కాబట్టి ఓడిపోయాను.. అయినా విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తాను’ అని సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత కౌంటింగ్ సెంటర్ నుంచి ఆయన బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఓటమి అనేది సహజమని గతంలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు ఇప్పుడు శ్రీపాల్‌రెడ్డికి ఇచ్చారని చెప్పారు. మరోసారి తనకు ఓట్లు వేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో విద్య, వైద్యం వ్యాపారీకరణ కావద్దన్న డిమాండ్‌తో పోరాటం చేస్తానన్నారు. తాను గెలుస్తాననే నమ్మకం ఉన్నప్పటికీ ఓటర్లు శ్రీపాల్‌రెడ్డికి అవకాశం ఇచ్చారని దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. -
హాలియాలో దొంగల బీభత్సం
హాలియా: హాలియా పట్టణంలోని వీరయ్యనగర్ కాలనీలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరయ్యనగర్ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ వెటర్నరీ ఉద్యోగి తుమ్మరుగొట్టి రామలింగయ్య, అతడి భార్య కళావతి ఇంటికి తాళం వేసి సోమవారం ఉదయం నల్లగొండకు వెళ్లారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 4.75 తులాల బంగారు గొలుసు, బంగారు ఉంగరాలు అపహరించారు. అదే ఇంటిపైన నివాసముంటున్న శాగం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంట్లోకి కూడా చొరబడి బీరువాలో దాచిన 15తులాల వెండి పట్టా గొలుసులు, రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. అదే ఇంటి పక్కన నివాసముంటున్న అలుగుబెల్లి ఇంద్రారెడ్డి ఇంట్లోనూ చోరీకి యత్నించి విఫలమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సతీష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్‌రెడ్డి తెలిపారు. మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, నగదు చోరీ -
సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి
భానుపురి: జిల్లాలో సాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. పంటలకు సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాల పరిశీలన, సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు పై సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా జిల్లా నుంచి కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎండకాలంలో పంటలను రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ సీఈ రమేష్, విద్యుత్‌శాఖ సీఈ ఫ్రాక్లిన్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి నాగయ్య, ఇరిగేషన్ ఈఈలు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ -
వారబందీ.. ఇబ్బంది
అర్వపల్లి: యాసంగి సీజన్‌కు గాను జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలకు సంబంధించి వారబందీ విధానం సక్రమంగా అమలు కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. వారబందీ విధానంలో వారం రోజులకోసారి నీటిని జిల్లాకు వదులుతున్నారు. వారం తప్పి వారం నీటిని వదలాల్సి ఉంది. ఈ విధానంలో ఆదివారం గోదావరి జలాలను జిల్లాకు పునరుద్ధరించాల్సి ఉంది. కానీ రెండు రోజులవున్నా నీటిని పునరుద్ధరించలేదు. ఈ సీజన్లో ఇప్పటికే రెండోదశ పరిధిలోని పంటలు నీళ్లు చాలక ఎండిపోతున్నాయి. దీనికి తోడు వారబందీ విధానం అమలు షెడ్యూల్ ప్రకారం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారబందీ విధానంలో ఈ నెల 9వరకు నీటిని జిల్లాకు విడుదల చేయాల్సి ఉంది. ఈ విధానం మొదలై రెండు రోజులు గడుస్తున్నా అధికారులు నీటిని వదలలేదు. కరీంనగర్ జిల్లా లోయర్‌మానేరు డ్యాం నుంచి నీటిని రెండోదశకు విడుదల చేయకపోవడంతో ఇక్కడ నీటిని ఇవ్వలేకపోతున్నామని నీటి పారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండిపోతున్న పంటలు జిల్లా వ్యాప్తంగా ఎస్సారెస్పీ రెండోదశ కింద 2.20లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు 69, 70,71 డీబీఎంల ద్వారా నీళ్లు అందుతున్నాయి. అయితే ఈ సారి లక్ష్యానికి మించి రైతులు వరి సాగు చేశారు. పై నుంచి నీళ్లు తక్కువగా వస్తుండటం, వరి సాగు పెరగడానికి తోడు గతనెల నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీంతో నీళ్లు ఎక్కడికక్కడ ఆవిరై చివరి భూములకు వెళ్లని పరిస్థితి నెలకొంది. దీంతో వరి పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఎక్కడికక్కడ గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా నీటిపారుదలశాఖ అధికారులు జోక్యం చేసుకొని గోదావరి జలాలను పునరుద్ధరించి వారబందీ విధానానికి స్వస్తి పలికి పంటలు చేతికొచ్చే వరకు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఫ సరిగా అమలుకాని వారబందీ విధానం ఫ షెడ్యూల్ ప్రకారం రెం డురోజులైనా రాని గోదావరి జలాలు ఫ ఎండిపోతున్న పంటలు ఎనిమిది ఎకరాల పంట ఎండిపోయిందియాసంగిలో 8ఎకరాల వరి సాగు చేశాను. దీని కోసం రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. వారబందీ విధానంలో నీళ్లు సరిగా రాక పంట ఎండిపోతోంది. పెట్టుబడి కూడా వెళ్లేలా లేదు. అప్పులపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా నిరంతరాయంగా నీటిని వదిలితే పంట చేతికి వస్తుంది. –బచ్చు శ్రీనివాస్, నర్సింహులగూడెం, నాగారం మండలం -
ఇంటర్ వార్షిక పరీక్షలకు 32 కేంద్రాలు
జిల్లాలో ఈనెల 5వ తేదీ నుంచి 25 వరకు జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 32కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సూర్యాపేటలో 13 పరీక్ష కేంద్రాలు, కోదాడలో 8, నడిగూడెంలో 2, హుజూర్‌నగర్‌లో 2, మఠంపల్లిలో 1, నేరేడుచర్లలో 1, తిరుమలగిరిలో 2, తుంగతుర్తిలో 2, ఆత్మకూరు (ఎస్) మండలంలో 1 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఒక్క రోజు ముందుగానే చూసుకోవాలని, అలాగే రోజూ పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. -
అరుణాచలానికి ప్రత్యేక బస్సు
కోదాడ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం కోదాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న సాయంత్రం ఏడు గంటలకు కోదాడ నుంచి బయలుదేరే ఈ బస్సు 12న కాణిపాకం వినాయకుడు, వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకున్న అనంతరం రాత్రికి అరుణాచలం చేరుకుంటుందని వివరించారు. 13న పౌర్ణమినాడు గిరిప్రదక్షిణ అనంతరం సాయంత్రం అక్కడి నుంచి బయలు దేరి 14న ఉదయం కోదాడకు బస్సు చేరుకుంటుందని పేర్కొన్నారు. దీని కోసం పెద్దలు రూ. 4,400 , పిల్లలు రూ.2,200 చార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. భోజన, వసతి సదుపాయాలను భక్తులు చూసుకోవాల్సి ఉంటుందని వివరాలకు 77804 33533, 95739 53143 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటాంసూర్యాపేటటౌన్: ఎవరైనా చట్ట విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసినా, అబార్షన్ చేసినా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ కోటాచలం హెచ్చరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ టీం సోమవారం జిల్లాలోని 46 స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నాజియా, డాక్టర్ మౌనిక, ఏఎస్ఐ జ్యోతి, ఎలిశమ్మ, కార్తీక్ పాల్గొన్నారు. 18మందికి షోకాజ్ నోటీసులు భానుపురి (సూర్యాపేట) : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 18మందికి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో ప్రిన్సిపాల్‌తో పాటు 15మంది టీచర్లు, ఇద్దరు వంటమనుషులు ఉన్నారు. వివరాలిలా.. తుంగతుర్తిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సోమవారం ఉదయం ప్రార్థన వేళ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తనిఖీ చేశారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్‌తో పాటు 15 మంది టీచర్లు, ఇద్దరు వంట మనుషులు విధుల్లో లేరు. ఎమ్మెల్యే ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులతో పాటు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంటనే స్పంచింది జిల్లా అధికారులను విచారణకు పంపారు. విచారణ అనంతరం అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఓటరు జాబితాలో అవకతవకలపై ఆరామఠంపల్లి: మఠంపల్లి మండలంలోని కిందితండా గ్రామ పంచాయతీ పరిధిలో ఓటరు జాబితాలో అవకతవకలపై డీపీఓ నారాయణరెడ్డి సోమవారం ఆరా తీశారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించారు. కిందితండా గ్రామ పరిధిలో ఓటరు జాబితాలో అవకతవకలపై ఇటీవల మఠంపల్లి ఎంపీడీఓ, ఎంపీఓ ,స్థానిక పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి వివరాలు ఆరా తీశారు. ఆయన వెంట ఎంపీడీఓ జగదీష్‌కుమార్, ఇన్చార్జి కార్యదర్శి నాగరాజు , గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేయాలిభానుపురి : ఈనెల 10న హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ నుంచి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వరకు 10వేల మంది తెలంగాణ ఉద్యమకారులతో జరిగే గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డే ను జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల మహిళా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాధవ్‌రెడ్డి, మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి లింగయ్య కోరారు. మిలియన్ మార్చ్డేకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆవిష్కరించి మాట్లాడారు. 2011 మార్చి 10న సీమాంధ్ర దోపిడీ పాలన పై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు జెండా ఎత్తి దండెత్తిన రోజు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొడి సైదులు యాదవ్, ఎస్.కె.యూసుఫ్ షరీఫ్, మేడబోయిన గంగయ్య, లింగంపల్లి మురళి, అమృనాయక్, అంజయ్య, బారిఖాన్ పాల్గొన్నారు. -
నృసింహుడికి అలంకార వైభవం
ఉదయం మత్స్యరూపుడై, సాయంత్రం స్వర్ణ శేషవాహనంపై దివ్యదర్శనం యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచనారసింహుడి అలంకార, వాహనా సేవలకు అర్చకులు సోమవారం ఆగమశాస్త్రం ప్రకారం శ్రీకారం చుట్టారు. తొలిరోజు ఉదయం స్వామివారు మత్య్సవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానాలయంలో నిత్యారాధనలు పూర్తయిన అనంతరం దక్షిణ ప్రాకార మండపంలోని నిత్యకల్యాణ మండపంలో స్వామివారిని అధిష్టింపజేసి పట్టువస్త్రాలు, బంగారు, వజ్రాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ముగ్ధమనోహరంగా అలంకరించారు. పూజలు చేసి, హారతి నివేదించారు. అనంతరం వేదపండితులు, అర్చక బృందం, రుత్వికులు, పారాయణీకుల వేదమంత్రోచ్ఛరణ, మూలమంత్ర జపస్తోత్రాలతో మంగళవాయిద్యాలు మోగుతుండగా, భక్తజనులు గోవిందనామస్మరణ చేస్తుండగా ప్రధానాలయ తిరు, మాఢ వీధుల్లో అలంకార సేవను ఊరేగించారు. ఆలయంలో సాయంత్రం సాయంత్రం నిత్యారాధనలు నిర్వహించిన అనంతరం శ్రీస్వామివారిని స్వర్ణ శేష వాహనంపై ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు లక్ష్మీనరసింహచార్యులు, వెంకటచార్యులు పాల్గొన్నారు. -
శ్రీపాల్‌కే గురువుల పట్టం
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి గెలుపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్‌రెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. అయితే నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేకపోవడంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. దీంతో శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటా ఓటుగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోల్ కాగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు. చివరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత కోటా రాకున్నా శ్రీపాల్‌రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289 , సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటి వరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థుల నుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి కూడా ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్‌రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్‌రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్‌రెడ్డి 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 1348 ఓట్లు పెరిగి, 9021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. . ● హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. ఫ రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం ఫ సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ ఫ ప్రధాన అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ కౌంటింగ్ సాగింది ఇలా..నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రకియ నల్లగొండలోని ఆర్జాలబావి గోదాముల్లో సోమవారం పూర్తయింది. ఉదయం 7 గంటలకు పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్‌కు తీసుకొచ్చారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి 25 చొప్పున బ్యాలెట్ బాక్సులను 8 రౌండ్లలో కౌంటింగ్ హాల్‌కు తీసుకొచ్చారు. 25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ హాల్లో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి 25 బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టారు. ఈ ప్రక్రియ ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత కట్టలన్నింటినీ డ్రమ్ములో వేసి కలిపారు. ఉదయం 11.30 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై.. సాయంత్రం 3 గంటలకు పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కూడా గెలుపు కోటా రాలేదు. శ్రీపాల్‌రెడ్డి అధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలువగా అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండవస్థానంలో, హర్షవర్ధన్‌రెడ్డి మూడవ స్థానంలో నిలిచారు. సాయంత్రం 4 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రాత్రి 9 గంటలకు 17వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. శ్రీపాల్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి మిగిలారు. హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేషన్ చేసి 18వ రౌండ్ ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత ఓటమిని అంగీకరిస్తూ అలుగుబెల్లి నర్సిరెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. శ్రీపాల్‌రెడ్డి విజయ సంకేతం చూపించి మీడియా పాయింట్‌కు వచ్చారు. శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించినట్లు రిట ర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు. -
ఎస్ఎల్బీసీ ఘటనపై న్యాయవిచారణ చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై నిపుణులతో న్యాయవిచారణ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన సీపీఎం జిల్లావిస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదానికి గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సరైన జాగ్రత్తలు పాటించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు చేస్తున్న కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి బతుకుతెరువు కోసం వచ్చి వారు ఇలా ప్రమాదాలకు గురి కావడం బాధాకరమన్నారు. కేంద్రప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వర్గాలకు నిధుల కేటాయింపులో మొండి చేయి చూపిందన్నారు. ప్రధానంగా దళితులు, బలహీన వర్గాలు, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయించలేదన్నారు. రైల్వే కోచ్ లకు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కేటాయింపులు లేవన్నారు. రైతులకు రూ.10వేల కోట్లు, ఎరువులకు రూ.11 వేల కోట్లు సబ్సిడీ తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిధులు కేటాయింపు కోసం బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా పార్టీ పతాకాన్ని సీపీఎం సీనియర్ నాయకుడు బాబు సాబ్ ఆవిష్కరించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కొలిశెట్టి యాదగిరిరావు, నాగారపు పాండు, రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.ఫ ప్రమాదానికి గత ప్రభుత్వ విధానాలే కారణం ఫ సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
అనుమానంతో భార్యను కొట్టిన భర్త
● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతితిప్పర్తి: భార్యపై అనుమానంతో భర్త ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన తిప్పర్తి మండలం సర్వా రం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్వారం గ్రామానికి చెందిన బండారి మహేశ్వరీ(23) కేతేపల్లి మండలం బండకిందిగూడెం గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌ను ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం నుంచి మహేశ్వరీపై అనుమానం పెంచుకున్న శ్రీకాంత్ ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్దిచెప్పడంతో ఏడాది క్రితం వారి కాపురాన్ని సర్వారం గ్రామానికి మార్చారు. అయినప్పటికీ శ్రీకాంత్‌లో ఎలాంటి మార్పురాలేదు. శనివారం శ్రీకాంత్ మహేశ్వరీతో గొడవపడి ఆమె తీవ్రంగా కొట్టాడు. ఇరుగుపొరుగు వారు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలి తల్లి మైనం లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్యచింతపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర్‌నగర్‌లో సోమవారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన బాణాల స్వాతి(38) కుటుంబంతో కలిసి చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వాతి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి మాల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు ఆత్మకూర్(ఎస్): తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు బత్తుల రమేష్ రోజుమాదిరిగా సోమవారం సాయంత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రమేష్‌ను గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు తదితరులు ఆస్పత్రిలో పరామర్శించారు. -
మొదటి ప్రాధాన్యతలో తేలని ఫలితం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా గెలుపు కోటా సాధించలేకపోయారు. 25,797 ఓట్లకుగాను 24,135 ఓట్లు పోలయ్యాయి. అందులో 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అందులో సగానికంటే ఒక ఓటు ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని 11,821 ఓట్లను గెలుపు కోటా ఓటుగా నిర్ణయించారు. పోటీలో ఉన్న19 అభ్యర్థుల్లో ఎవరూ మొదటి ప్రాధాన్యతలో గెలుపు కోటా ఓట్లను సాధించలేకపోయారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ప్రధాన అభ్యర్థులైన పింగిళి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు రాగా, బీసీ సంఘాలు, ఎస్టీయూ బలపరిచిన పూల రవీందర్‌కు 3,115 ఓట్లు, టీపీయూఎస్ బలపరిచిన బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి 2,289 ఓట్లు, ప్రైవేట్ విద్యా సంస్థల యజమాని ఎస్.సుందర్రాజు 2,040 ఓట్లు లభించాయి. మిగిలిన అభ్యర్థులకు ఒక్క ఓటు మొదలుకొని వేయిలోపే ఓట్లు రావడం గమనార్హం. మధ్యాహ్నం తరువాత ఎలిమినేషన్ ప్రక్రియ మొదటి ప్రాధాన్యతలో ఎవరికి గెలుపు కోటా ఓట్లు రాకపోవడంతో సోమవారం మధ్యాహ్నం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 3.30 గంటల సమయంలో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. 19 మందిలో అతి తక్కువగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రాత్రి 7 గంటల వరకు 14 మంది ఎలిమినేషన్ తరువాత 15వ రౌండ్ ఫలితాలను అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ఎవరికీ కోటా ఓట్లు రాలేదు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియతో కౌంటింగ్ కొనసాగించారు. ఇలా రాత్రి 11 గంటల వరకు కౌంటింగ్ కొనసాగింది. చివరకు పీఆర్టీయూటీ–టీఎస్ బలపరచిన అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలుపు కోటాగా 11,821 ఓట్లు మధ్యాహ్నం తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 5,521 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన శ్రీపాల్‌రెడ్డి -
అభ్యర్థులకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు ఇవీ..
అందరికీ రెండో ‘సారీ’● ఒకసారి గెలిపించిన వారిని తిరిగి గెలిపించని ఓటర్లు ● విలక్షణ తీర్పు ఇస్తున్న ఉపాధ్యాయులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. అంతేకాదు గత నాలుగు పర్యాయాయలుగా ఒకసారి గెలిచిన అభ్యర్థిని/సంఘాన్ని వరుసగా రెండోసారి ఉపాధ్యాయులు గెలిపించడం లేదు. 2007 నుంచి నలుగురుదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో శాసనమండలిని పునరుద్ధరించారు. అప్పుడు మొదటిసారి నిర్వహించిన వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య యూటీఎఫ్ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత 2013లో రెండోసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు పీఆర్టీయూ–టీఎస్ తరఫున పోటీ చేసిన పూల రవీందర్ గెలుపొందారు. 2019లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరిగింది. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఇలా నాలుగుసార్లు వేర్వేరు అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. ఉపాధ్యాయులకు ఓటేయడంతెలియలే ! ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 494 చెల్లని ఓట్లు నల్లగొండ: కొంతమంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు వేయడం తెలియలేదు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గత నెల 27న జరిగింది. బ్యాలెట్ పద్ధతిన నిర్వహించిన ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. 19 మంది పోటీలో ఉంటే 19 మందికి కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు వేయడం తెలియక వారు వేసిన ఓట్లు చెల్లలేదు. మొత్తం 24,135 ఓట్లు పోలైతే 494 మంది ఓట్లు చెల్లకపోవడం గమనార్హం. విద్యార్థులకు విద్యాబోధన చేసి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయులు.. వారి సమస్యల పరిష్కారం ఎమ్మెల్సీకి వేసే ఓటు ఏవిధంగా వేయాలో కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో కవిత్వంనల్లగొండ: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కొందరు బ్యాలెట్ పేపర్‌పై కవితలు రాయగా.. మరి కొందరు ఓటు వేసి పేపర్ మొత్తాన్ని కోట్టేశారు. బ్యాలెట్ పేపర్‌తోపాటు కవిత్వాన్ని కూడా బాక్సులో వేశారు. మరికొందరైతే అభ్యర్థుల ఫొటోలకు రౌండ్లు పెట్టారు. ఇలా బ్యాలెట్ బాక్సులో చిత్ర విచిత్రాలు వెలుగు చూశాయి. ‘ఏక్’ నిరంజన్! ● ఆ అభ్యర్థికి కేవలం ఒక్కటే ఓటు పడిందినల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఒక్కటే ఓటు సాధించాడు. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ముగ్గురు సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితం కాగా.. మరో ఆరుగురు డబుల్ డిజిట్లతో సరిపెట్టుకున్నారు. ఆ సింగిల్ డిజిట్ ఓట్లలో ఒక అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు వచ్చింది. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థిని పది మంది ఉపాధ్యాయులు బలపరచాలి. అయితే, బలపర్చిన వారు సైతం ఆ అభ్యర్థికి ఓటు వేయకపోవడం గమనార్హం.పీఆర్టీయూలో శ్రీపాల్‌రెడ్డి ప్రస్థానం ఇదీ..విద్యారణ్యపురి(వరంగల్) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన పింగిలి శ్రీపాల్రెడ్డిది ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామం. శ్రీపాల్‌రెడ్డి 1996లో ఎస్జీటీగా నెక్కొండ మండలం గొల్లిపెల్లి యూపీఎస్‌లో పనిచేశారు. 2003 సంవత్సరంలో స్కూల్‌అసిస్టెంట్ (మ్యాథ్స్)గా నెక్కొండ మండలం అప్పల్‌రావుపేటలో యూపీఎస్‌లో చేరారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పీఆర్టీయూలో సభ్యుడిగా చేరిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి 2000 సంవత్సరంలో నెక్కొండ మండల జనరల్ సెక్రటరీగా ఆ తరువాత 2002లో నెక్కొండ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008 నుంచి 2012వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా, 2015లో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2016, 2017లో వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికయ్యాక ఇప్పటివరకు కొనసాగుతున్నారు. తొమ్మిది సంవత్సరాల సర్వీస్ ఉండగానే.. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీపాల్‌రెడ్డి కొంతకాలం క్రితమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికల బరిలో ఉండేందుకు పావులు కదిపారు. తొమ్మిది సంవత్సరాల సర్వీస్‌ను వదులుకొని చివరికి పీఆర్టీయూ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచి ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. ఆరేళ్ల తరువాత మళ్లీ పీఆర్టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది. పేరు ఓట్లు పులి సరోత్తంరెడ్డి 2,289 లింగిడి వెంకటేశ్వర్లు 15 అర్వ స్వాతి 19 అలుగుబెల్లి నర్సిరెడ్డి 4,820 కంటె సాయన్న 4 కొలిపాక వెంకటస్వామి 421 గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి 4,437 గోపాల్‌రెడ్డి పన్నాల 24 చంద్రమోహన్ ఏలె 100 చాలిక చంద్రశేఖర్ 1 జంగిటి కై లాసం 26 జె.శంకర్ 113 పురుషోత్తంరెడ్డి తలకోల 11 తాటికొండ వెంకటరాజయ్య 36 దామెర బాబురావు 128 శ్రీపాల్‌రెడ్డి పింగిలి 6,035 పూల రవీందర్ 3,115 బంకరాజు 7 ఎస్.సుందర్రాజు 2,040 -
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..
నకిరేకల్: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు, యువతి మృతిచెందారు. ఈ ఘటన నకిరేకల్ పట్టణ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి బైపాస్ ఫ్లైఓవర్ సమీపంలో సోమవారం తెల్ల వారుజామున జరిగింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి నల్గొండ ప్రభు(27) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుకు వివాహం కాగా.. భార్యాభర్తల మధ్య తగాదాలతో విడిపోయారు. తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికే చెందిన పూలుగుజ్జు నరేష్ సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన వైష్ణవి(25)ని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నరేష్, వైష్ణవిల మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో గత రెండేళ్ల నుంచి వైష్ణవి తన తల్లిగారి ఊరైన టేకుమట్లలో పిల్లలతో కలిసి ఉంటుంది. చెర్వుగట్టుకు వెళ్లి వస్తూ.. వైష్ణవితో ఉన్న పరిచయం మేరకు టేకుమట్ల నుంచి ఆమెను తీసుకుని ప్రభు ఆదివారం రాత్రి నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవాలయానికి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున వారు చెర్వుగట్టు నుంచి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. వయా నల్ల గొండ, తాటికల్ మీదుగా నకిరేకల్‌కు చేరుకున్నారు. అనంతరం వీరు నకిరేకల్ పట్టణ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి బైపాస్ మీదకు రాంగ్ రూట్లో ఎక్కి సూర్యాపేట వైపు కొద్దిదూరం వెళ్లగానే ఎదురుగా గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభు, వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ప్రభు సోదరుడు ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానం వచ్చి పోస్టుమార్టం.. నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి ఆస్పత్రి వద్దకు చేరకుని మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అనుమానంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ఫోన్సిక్ నిపుణులచే పోస్టుమార్టం చేయించాలని డాక్టర్లు తెలిపారు. దీంతో ప్రభు, వైష్ణవి మృతదేహాలను నల్లగొండ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్టులో రోడ్డు ప్రమాదంలో చనిపోయారని నిర్ధారణ కావడంతో పోలీసులు వారిద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు, యువతి దుర్మరణం నకిరేకల్ పట్టణ శివారులో భైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం -
వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
మోత్కూరు: ప్రేమించిన యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మోత్కూరు మండల కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన బాలిక ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా మోత్కూరుకు చెందిన కందుకూరి మున్నాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. డిసెంబర్ 30వ తేదీన సదరు కాలేజీకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి మోత్కూరుకు చేరుకుంది. అప్పటి నుంచి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సదరు బాలిక, మున్నా సహజీవనం చేస్తున్నారు. బాలిక ఫోన్లో తన తల్లితో అప్పుడప్పుడు మాట్లాడుతూ తాను బాగానే ఉన్నానని, తాను మున్నా అనే యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడిని వివాహం చేసుకునేందుకు వచ్చానని తెలియజేసేది. కానీ తాను ఉంటున్న చిరునామాను మాత్రం తల్లిదండ్రులకు వెల్లడించలేదు. ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సదరు బాలిక తన తల్లికి వీడియో కాల్ చేసి రూ.15వేలు కావాలని ఏడుస్తూ అడిగింది. ఎందుకమ్మా అని కూతురుని తల్లి ప్రశ్నించగా.. ‘మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకురావాలని మున్నా తనను కొట్టాడని తల్లికి వివరించింది’. ఈ క్రమంలో అదే రోజు రాత్రి 8గంటల సమయంలో తాము అద్దెకు ఉంటున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకుంది. తనను మున్నా వేధిస్తున్న విషయాలన్నీ బాలిక సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. మున్నా అనే యువకుడు తన కుమార్తెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని, ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బుల కోసం తీవ్రంగా కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు చౌటుప్పల్: విజయవాడ–హైదరాబాద్ హైవేపై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం శివారులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామానికి చెందిన చీకూరు అనిల్‌కుమార్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భద్రాచలం నుంచి పేపర్ లోడ్‌తో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో ఆదివారం అర్ధరాత్రి చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ శివారులో గల వంశీ రబ్బర్ కంపెనీ వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనిల్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బైక్‌ను కారు ఢీకొట్టడంతో.. చివ్వెంల(సూర్యాపేట): కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అదే మార్గంలో ఖమ్మం పట్టణానికి వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. రైలు కింద పడి వ్యక్తి మృతిబీబీనగర్: బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. భువనగిరి రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ రైల్వే స్టేషన్ నుంచి పగిడిపల్లి వెళ్లే రైల్వే మార్గంలో సోమవారం తెల్లవారుజామున రైలు కింద పడి సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుడు నలుపు రంగు టీషర్టు, తెలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ పేర్కొన్నారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9848222169, 8712568454 నంబర్లను సంప్రదించాల ని సూచించారు. అనారోగ్యంతో వ్యక్తి బలవన్మరణంఆత్మకూరు(ఎం): అనారోగ్యంతో బాధపడుతూ గడ్డి మందు తాగిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటన ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్‌లో సోమవారం జరిగింది. కొరటికల్‌కు చెందిన పల్ల్లపు విజయేందర్(38) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న విజయేందర్ సోమవారం మధ్యాహ్నం ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య సౌందర్యతో పాటు ఒక కుమారుడు రాకేష్, కుమార్తె శృతి ఉన్నారు. -
దేవతలకు ఆహ్వానం
ఫ రెండో రోజూ వైభవంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఆదివారం ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు.లోకకల్యాణం, విశ్వశాంతి కోసం ముక్కోటి దేవతలు ఆహుతులుగా సాగే బ్రహ్మోత్సవానికి యాదగిరి క్షేత్రం సిద్ధమైంది. ఆదివారం ఉదయం అగ్నిదేవుడికి ఆరాధన, హవనం, గరుడ ఆళ్వారుడికి ఇష్ట నైవేద్యం, ధ్వజపూజ, రాత్రి దేవతాహ్వాన వేడుకలు నిర్వహించారు. ధ్వజపటం ఊరేగింపు ప్రధానాలయంలో ఆదివారం ఉదయం నిత్యారాధనలు పూర్తయిన అనంతరం ఉత్తరమాడ వీధిలో ఏర్పాటు చేసిన యాగశాలలో యాజ్ఞికులు హోమాధి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వస్త్రంపై తీర్చిదిద్దిన గరుడ ఆళ్వారుడి పటాన్ని ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా ఉత్తరద్వారం నుంచి ప్రధానాలయ ముఖమండపంలోని ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు ధ్వజస్తంభం వద్ద గరుడ ఆళ్వారుడి పటానికి ప్రత్యేక పూజలు చేశారు. రామానుజ కూటము నుంచి భాజాభజంత్రీలు, మేళ తాళాలతో గరుడ ముద్దలు తీసుకుచ్చి మొదటగా స్వయంభూలు, ఉత్సవమూర్తుల వద్ద, ఆ తరువాత గరుడ్మంతుడి వద్ద పూజలు చేశారు. అనంతరం ధ్వజపటానికి హారతినిచ్చి, గరుడ ముద్దలను ధ్వజ స్తంభంపైకి ఎగురవేశారు. భేరీ మోగించి.. సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజ నిర్వహించారు. భేరీ మోగించి ముప్పై మూడు కోట్ల దేవతలను భువికి ఆహ్వానించే వేడుక వైభవంగా చేపట్టారు.ఆలయంలో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి అలంకార సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అలంకార సేవలకు ఆచార్యులు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం మత్స్య అలంకరా, వేద పారాయణం, రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ నిర్వహిస్తారు. -
ఆన్లైన్ ఫిర్యాదులకు చాన్స్
తిరుమలగిరి (తుంగతుర్తి): ఇందిరమ్మ ఇళ్ల పథకానికి చేసుకున్న దరఖాస్తులు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోవడంతోపాటు ఎలాంటి ఆటంకాలు ఉన్నా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం తాజాగా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించింది. ఇందిరమ్మ పథకానికి లబ్ధిదారులుగా ఎంపికై న వారితోపాటు పథకానికి సంబంధించి ప్రజలు వివిధ ఫిర్యాదులు చేసుకునేందుకు వీలుంది. అయితే పేద, మధ్యతరగతి వర్గాల్లో అర్హులైన కుటుంబాలకు సొంతిల్లు నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రామాల్లో సభలు నిర్వహించి జాబితాలోని అర్హుల పేర్లను సైతం చదివి వినిపించారు. పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం తమ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక చాలామంది గ్రామ పంచాయతీ, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల అనుమానాలు నివృత్తి చేసేలా దరఖాస్తుల స్థితిని తెలుసుకునేలా ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ప్రకారం ఆన్లైన్లో ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఫిర్యాదులు చేయాల్సింది ఇలా..ఇందిరమ్మ ఇళ్లు.తెలంగాణ.జీవో.గవ్ట్.ఇన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. దీంతో స్క్రీన్‌పై దరఖాస్తు స్థితి కనిపిస్తుంది. సెల్‌ఫోన్ నంబర్‌ను నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. అనంతరం పేరు, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఫిర్యాదుల కేటగిరీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్జీల స్థితి తెలుసుకునేందుకు.. ప్రత్యేక వెబ్సైట్ రూపొందించిన ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిఆప్షన్ క్లిక్ చేయగానే..సర్వేయర్ సందర్శించలేదు. సంతృప్తి చెందలేదు. సర్వే సక్రమంగా జరగలేదు. సర్వే సమయంలో గైర్హాజరయ్యారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేయలేదు. మధ్యవర్తితో సమస్య ఉంది. డబ్బు డిమాండ్ చేస్తున్న సర్వేయర్ అనే ఐచ్చికాలు కనిపిస్తాయి వీటిలో దరఖాస్తుదారులు ఎదుర్కొన్న సమస్యను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత కింద ఉన్న బాక్సులో ఫిర్యాదు వివరాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం స్థలం, ఇతర ధ్రువీకరణ పత్రాలు టు ఎంబీ పరిమాణం వరకు పీడీఎఫ్, బీఎన్‌జీ, జేపీజీ అప్లోడ్ చేయాలి. అనంతరం ఫిర్యాదు నంబర్ వస్తుంది. దానిని జాగ్రత్తగా భద్రపరిస్తే కొద్దిరోజుల తర్వాత ఫిర్యాదు స్థితిని కూడా తెలుసుకోవచ్చు. -
స్వేరో కుటుంబాలకు అండగా ఉంటా
పెన్‌పహాడ్: స్వేరో నెట్‌వర్క్‌లో భాగమైన గురుకుల తల్లిదండ్రుల కుటుంబాలకు అండగా ఉంటానని స్వేరో నెట్వర్క్ వ్యవస్థాపకుడు, సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన గురుకుల తల్లిదండ్రుల కమిటీ రాష్ట్ర నాయకురాలు పల్లెపంగు రాణి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా స్వేరో అనుబంధ సంఘమైన గురుకుల విద్యార్థుల తల్లిదండ్రుల జిల్లా కమిటీ అధ్యక్షుడు బొల్లికొండ వీరస్వామి ఆధ్వర్యంలో ఆదివారం అనంతారం గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ పలకరింపు (కడుపు చల్ల) కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరై రాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో స్వేరో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మామిడాల ప్రవీణ్‌కుమార్, చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య, స్వేరో రాష్ట్ర అధ్యక్షులు వీరన్న, తల్లిదండ్రుల కమిటీ జిల్లా అధ్యక్షుడు మచ్చ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ -
క్రీడోత్సవాలను విజయవంతం చేయండి
భానుపురి (సూర్యాపేట): ఈనెల 16 నుంచి 18 వరకు సూర్యాపేట జిల్లా కోదాడలో జరగనున్న రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక ఉత్సవాలబ్రోచర్ను మంత్రి తుమ్మల ఖమ్మంలోని తన నివాసంలో ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి శరత్‌బాబు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కళ్యాణం కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి మేదరమెట్ల సుబ్బయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలుఅర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారా యణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజ లను వైభవంగా నిర్వహించారు. తెల్ల వారుజామున ఉషాపద్మిని ఛాయసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం ఆదిత్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకుడు జనార్దన్‌స్వామి, గణపురం నరేష్, కర్నాటి నాగేశ్వర్రావు, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, శ్రీరాంపాండే, అంకిత్‌పాండే పాల్గొన్నారు. వారబందీ.. రైతుల్లో రందీఅర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు వారబందీ విధానంలో వదులుతున్న గోదావరి జలాలను ఆదివారం పునరుద్ధరించాల్సి ఉన్నా రాత్రి వరకు విడుదల చేయలేదు. ఇప్పటికే వరిపొలాలు ఎండుతున్నాయని, అధికారులు ప్రకటించిన వారబందీ షెడ్యూల్ ప్రకారం నీటిని ఎందుకు పునరుద్ధరించలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే నీటిని పునరుద్ధరించి పంటలు చేతికొచ్చే వరకు నిరంతరాయంగా అందించాలని కోరుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం నీటిని పునరుద్ధరిస్తే ఈ నెల 9 వరకు జిల్లాకు వదలనున్నారు. మద్దతు ధరల చట్టం తేవాలిభానుపురి (సూర్యాపేట): పంటలకు మద్దతు ధర, ఉత్పత్తి ఖర్చుల నియంత్రణకు చట్టం తేవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జిల్లా కన్వీనర్లు మల్లు నాగార్జున్‌రెడ్డి, మండారి డేవిడ్ కుమార్, వరికుప్పల వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో వారు మాట్లాడారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5న సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్లు నల్లెడ మాధవరెడ్డి, మట్టిపల్లి సైదులు, దండ వెంకట్‌రెడ్డి, కె.సైదులు పాల్గొన్నారు. -
దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివి
భానుపురి (సూర్యాపేట) : ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకర్‌గా దుద్దిళ్ల శ్రీపాదరావు అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ఆదివారం సూర్యాపేట కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డీఎం శర్మ, డీపీఓ నారాయణరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస నాయక్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఫలితం తేలేది నేడే..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం సాక్షి ప్రతినిది, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం సోమవారం తేలనుంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయింది. రిహార్సల్స్ కూడా నిర్వహించారు. సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. మొత్తం చెల్లిన ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు. 25 టేబుళ్లపై లెక్కింపు.. 3వ తేదీ ఉదయం 7 గంటలకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ హాల్‌కు తీసుకురానున్నారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు.. 25 బ్యాలెట్లను ఒక బండిల్ చొప్పున కట్టలు కట్టి డ్రమ్ములో వేస్తారు. 8 గంటలు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపు కూడా 25 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్‌కు వేయి బ్యాలెట్ పేపర్ల చొప్పున లెక్కించనున్నారు. దీంతో మొదటి రౌండ్లోనే మొత్తం పోలైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. పోలైన ఓట్లు 24,139 నియోజవర్గం పరిధిలో మొత్తం 25,797 ఓట్లు ఉండగా.. అందులో 24,139 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 93.57 శాతం పోలింగ్ నమోదైంది. చెల్లిన ఓట్లలో సగం ఓట్ల కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు. మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ.. అభ్యర్థులు ఎవరూ మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయం సాధించలేకపోతే.. అప్పుడు ఎన్నికల అధికారులు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటించి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించనున్నారు. పోటీ చేసిన 19 మంది అభ్యర్థుల్లో ఎవరికై తే అతి తక్కువగా ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసారో చూసి ఆ అభ్యర్థులకు కలుపుతారు. అలా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక ఓటును ఎవరు సాధిస్తారో.. అప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే మాత్రం చివరి ఫలితం అర్ధరాత్రి వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫ చెల్లిన ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా.. వారే విజేత ఫ మధ్యాహ్నం వరకు పూర్తి కానున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.. ఫ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలువకపోతే ఎలిమినేషన్.. ఫ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సిబ్బంది కేటాయింపు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 25 టేబుళ్లపై నిర్వహిస్తారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం 150 మంది టేబుళ్లపై కౌంటింగ్ కోసం ఉండగా, 20 శాతం రిజర్వు సిబ్బంది ఉంటారు. మరో 200 మంది కౌంటింగ్ సమయంలో సహకరించనున్నారు. 250 మంది పోలీస్ సిబ్బంది కౌంటింగ్ బందోబస్తులో పాల్గొననున్నారు. -
మేళ్లచెరువులో ముగిసిన ఎద్దుల పందేలు
మేళ్లచెరువు:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మేళ్లచెరువు మండలకేంద్రంలో ఐదు రోజు లుగా కొనసాగుతున్న ఎద్దుల పందేలు ఆదివారం రాత్రి ముగిశాయి. సీనియర్స్ విభాగంలో 12 జతలు పాల్గొనగా హుజూర్‌నగర్‌కు చెందిన సుంకి సురేందర్‌రెడ్డి గిత్తలు 25 నిమిషాల వ్యవధిలో 3,046 అడుగుల దూరం బండలాగి మొదటి బహుమతి గెలుపొందాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా యాదిరెడ్డిపల్లెకు చెందిన లక్కిరెడ్డి నిక్షేత్రెడ్డి, అకిలేష్రెడ్డి గిత్తలు రెండవ బహుమతి సాధించాయి. పల్నాడు జిల్లా ఇనిమెట్లకు చెందిన కటకం వెంకటేశ్వర్లు గిత్తలు మూడవ బహుమతి సాధించాయి. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి చేతులమీదుగా మొదటి బహుమతిగా మహీంద్రా 405 యువో టెక్ ట్రాక్టర్, రెండవ బహుమతిగా రూ.1.50లక్షలు, మూడవ బహుమతిగా రూ.1.10లక్షలను ఎద్దుల పోషకులకు అందిచారు. ఈ కార్యక్రమంలో పోశం నర్సిరెడ్డి, వంగవీటి రామారావు దేవాలయ కమిటీ చైర్మన్ శంభిరెడ్డి, కాకునూరి భాస్కరెడ్డి, లక్ష్మీనారాయనణరెడి, సైదేశ్వరరావు, ముడెం వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.బండ లాగుతున్న ఎద్దులు -
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
హుజూర్నగర్: ‘ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగుతాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కేంద్రాలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోం. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి’ అని డీఐఈఓ వడ్త్యా భానునాయక్ సూచించారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రశ్న : ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు.? డీఐఈఓ : జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 32 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో ప్రభుత్వ కళాశాలల్లో 12, ప్రైవేట్ కళాశాలల్లో 20 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రశ్న : పరీక్షలకు ఎంత మంది విద్యార్థులు హాజరవుతున్నారు.? డీఐఈఓ : జిల్లా వ్యాప్తంగా 74 కళాశాలలకు సంబంధించి మొత్తం 16,948 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వారిలో జనరల్ విభాగంలో ఫస్టియర్ 6,677 మంది, సెకండియర్ 6,666 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఒకేషనల్ ఫస్టియర్ 1,952 మంది, సెకండియర్ విద్యార్థులు 1,642 మంది ఉన్నారు. ప్రశ్న : పర్యవేక్షణకు తీసుకున్న చర్యలు లేమిటీ? డీఐఈఓ : పరీక్షల పర్యవేక్షణకు మూడు రూట్లు ఏర్పాటు చేశాం. ప్రశ్న పత్రాలను పోలీస్ స్టేషన్లలో భద్రపరిచాం. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు టీముల సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశాం. ప్రశ్న : పరీక్ష కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లేమిటీ? డీఐఈఓ : ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షనన్ అమలులో ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోనికి అనుమతిస్తాం. పరీక్ష సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : పరీక్ష కేంద్రాల్లో ఏయే వసతులు కల్పిస్తున్నారు.? డీఐఈఓ : అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మూత్రశాలలు, తాగునీటి వసతి, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఉండేలా చూస్తున్నాం. అన్ని కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని పట్టణాల్లో మున్సిపల్, మండలాల్లో పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చాం. ప్రతి కేంద్రంలో ప్రథమ చికిత్స కేంద్రాలు, ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు. ప్రశ్న : హాల్ టికెట్లు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చా? డీఐఈఓ : విద్యార్థులు హాల్‌టికెట్లు ఇంటర్నెట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆవిధంగా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనకు గురి కాకుండా పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ఫ ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం ఫ జిల్లా వ్యాప్తంగా 32 కేంద్రాలు ఫ ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల నిఘా ఫ పరీక్షలు రాయనున్న విద్యార్థులు 16,948 మంది ‘సాక్షి’తో డీఐఈఓ భానునాయక్ ప్రశ్న : మాస్ కాపీయింగ్ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.? డీఐఈఓ : ఇంటర్ బోర్డు హైదరాబాద్ నుంచి ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించింది. ఇది విజయవంతం కావడంతో వార్షిక పరీక్షల నిర్వహణకు వాటిని వినియోగించనున్నాం. ప్రతి కేంద్రంలో ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి ఆస్కారం ఉండదు. ప్రశ్నపత్రాలు తెరవడం నుంచి పరీక్ష పూర్తయిన తర్వాత తిరిగి సీల్ వేసే వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతుంది. -
లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవం
విశ్వక్సేనుడికి తొలిపూజ, స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం ఉత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణ వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజలు ఉంటాయి.యాదగిరిగుట్ట : భక్తజనబాంధవుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలకు మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వేదపండితులు శనివారం వైభవంగా శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు ప్రధానాలయంలోని మూలవర్యుల ఆజ్ఞ (అనుమతి)తో పూజలు ప్రారంభించి 10.15కు విశ్వక్సేన ఆరాధన, 10.50గంటలకు స్వస్తివాచన పూజలు చేసి ఉత్సవాలకు తెరలేపారు. విశ్వశాంతి, లోకకల్యాణార్థం నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను పాంచరాత్రాగమ శాస్త్రానుసారం ప్రధానాలయంలో ఈనెల 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. విశ్వక్సేనుడికి తొలిపూజ దేవతల సర్వసేనానాయకుడు విశ్వక్సేనుడికి తొలి పూజతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో దివ్య మనోహరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను గర్భాలయం ఎదుట ప్రత్యేకపీఠంపై అధిష్ఠింపజేశారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగడానికి నిర్దేశించిన మంత్రోచ్ఛరణలతో తొలిపూజా పర్వాలను నిర్వహించారు. ముల్లోకాలకు శుభం కలగాలని వేదమంత్రాలు పఠిస్తూ విశ్వక్సేనుడిని ఆరాధించారు. స్వస్తిపుణ్యాహవాచనం, రక్షాబంధనం విశ్వశాంతిని, లోకకల్యాణం కోసం, ప్రాణికోటి, ఇతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని భగవంతుడిని వేడుకొనుట స్వస్తిపుణ్యాహవాచనం పూజ విశిష్టత. స్వస్తివాచన మంత్ర జలాన్ని గర్భాలయం, ఉప ఆలయాలు, ముఖమండపం, ధ్వజస్తంభానికి, ఆలయ తిరుమాడ వీధులు, ఆలయ పరిసరాల్లో, భక్తులపై సంప్రోక్షణ గావించారు. అనంతరం లోకకల్యాణార్థం సమర్పించబడిన రక్షాబంధనాన్ని స్వీకరించే వేడుక నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్టా బంగారు కవచమూర్తులు, ఉప ఆలయాల్లోని ఆండాళ్ అమ్మవారికి, ఆళ్వారులకు, విశ్వక్సేనుడికి, ముఖడపంలోని ఉత్సవమూర్తులకు రక్షాబంధనం చేశారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు, భక్తులకు రక్షాబంధనం కట్టారు. శాస్త్రోక్తంగా మృత్సంగ్రహణం సాయంత్రం నిత్య పూజల అనంతరం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, ధర్మకర్త నర్సింహమూర్తి, అర్చకులు, యజ్ఞాచార్యులు, పారాయణికులు పాల్గొన్నారు. -
నేడు గోదావరి జలాల పునరుద్ధరణ
అర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాకు వారబందీ విధానంలో ఆదివారం గోదావరి జలాలను పునరుద్ధరించనున్నారు. ఈనెల 9వ తేదీ వరకు గోదావరి జలాలు రానున్నాయని నీటి పారుదల శాఖ డీఈఈ ఎం.సత్యనారాయణ తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు. పోలీస్ స్టేషన్లకు చేరిన ఇంటర్ ప్రశ్నపత్రాలుసూర్యాపేట టౌన్: ఈనెల 5వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఏ, బీ రెండు సెట్ల ప్రశ్నపత్రాలు శనివారం సూర్యాపేటలోని జిల్లా బల్క్ కేంద్రం నుంచి వివిధ పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రశ్న పత్రాలను కస్టోడియన్లు బాల్తు శ్రీనివాస్, మేడ నిరంజన్‌రెడ్డి, కర్నాటి శ్రీనివాసులు స్వాధీనం చేసుకొని పట్టణంలోని 13 సెంటర్లకు సంబంధించిన సీఎస్, డీఓల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లో తేదీల వారీగా భద్రపరిచారు. వీటి పర్యవేక్షణకు వచ్చిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) భానునాయక్ మాట్లాడుతూ ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య, డాక్టర్ మద్దిమడుగు సైదులు, కేఎల్ నరసింహారావు, కృష్ణ, యాదగిరి, పుల్లయ్య, నరసింహారావు, ప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత లేదుహుజూర్నగర్ రూరల్: జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏఓ) శ్రీధర్‌రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ పట్టణంతోపాటు మండలంలోని వేపలసింగారం, అమరవరం గ్రామాల్లో పీఏసీఎస్ గోదాం, ప్రైవేట్ ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,682 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ తెప్పించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అందుబాటు ఉంచామన్నారు. అంతేకాకుండా రైతులు చివరగా వేసే యూరియాతో పాటు పొటాష్ కలిపి పిచికారీ చేయడం వల్ల మంచి దిగుబడులు వస్తాయన్నారు. ఆయన వెంట ఏఓ రావిరాల స్వర్ణ, సిబ్బంది ఉన్నారు. మట్టపల్లిలో నిత్యారాధనలు మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యారాధనలు కొనసాగాయి. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణ తంతు పూర్తి చేసి ఉత్సవమూర్తులను ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. నీరాజన మంత్ర పుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు. -
రంజాన్ దీక్షలు ప్రశాంతంగా కొనసాగించాలి
భానుపురి (సూర్యాపేట): పవిత్ర రంజాన్ మాస దీక్షలను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో కొనసాగించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. రంజాన్ మాసం ఏర్పాట్లపై శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో అధికారులు, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుల్లో మసీదు, ఈద్గాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ కోటాచలం, ఆర్డీఓలు వేణుమాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, డీఎస్పీ రవి, మున్సిపల్ కమిషనర్లు, ముస్లిం మతపెద్దలు, ఇమామ్‌లు పాల్గొన్నారు. -
కూలీలకు పని కల్పించాలి
జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో పనికోరిన కూలీలందరికీ పనిదినాలు కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి ఉపాధిహామీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, నర్సరీలు, తాగునీరు, శ్రీనిధి, బ్యాంక్ లింకేజీ తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, టీఏలు, ఎఫ్ఏలతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు విషయాలపై చర్చించారు. అనంతరం సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ, జెడ్పీ సీఈఓ వీవీ.అప్పారావు, డీపీఓ నారాయణరెడ్డి, డీఎంహెచ్ఓ కోటాచలం, డీసీహెచ్ఓ వెంకటేశ్వర్లుతో కలిసి హాజరయ్యారు. -
చేతులెత్తి మొక్కుతున్న.. పంటలకు నీరివ్వండి
పెన్‌పహాడ్: ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్న.. రైతులకు సాగునీరిచ్చి వరి పంటను కాపాడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జదీష్రెడ్డి అన్నారు. పెన్‌పహాడ్ మండలం గాజులమల్కాపురం, చినగారకుంట తండాలో ఎండిన పంట పొ లాలను శనివారం ఆయన పరిశీలించి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కృష్ణా, గోదావరి ఆయకట్టులో పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపమేనని అన్నారు. గోదావరిలో 10వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్నా ఇసుక వ్యాపారం కోసం రైతుల పంట పొలాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు. ఒక్క కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ ఆన్ చేస్తే పంటలన్నీ పండుతాయన్నారు. కాళేశ్వరం మా చేతికి ఇస్తే కేవలం మూడు రోజుల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు పారిస్తామని సవాల్ విసిరారు. ఎక్కడ కేసీఆర్‌కి పేరొస్తుందోనని రైతుల ఉసురు తీస్తున్నారన్నారు. ఇప్పటికై నా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కళ్లు తెరిచి నీటిని అందించి ఉన్న పంటలనైనా కాపాడాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండి గత్యంతరం లేక గొర్లు, పశువులకు మేతకు అమ్ముంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి ఆశగా వరి పంటకు ట్యాంకర్ ద్వారా నీళ్లు అందిస్తున్నామని, మీరే ఏమైనా చేసి తమను గట్టెక్కించాలని పలువురు రైతులు జగదీష్‌రెడ్డిని వేడుకున్నారు. జగదీష్‌రెడ్డి వెంట పెన్‌పహాడ్ మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బీఆర్ఎస్ నాయకులు దొంగరి యుగేంధర్, వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, జూలకంటి వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఫ రైతుల కష్టాలకు చలించి కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి -
పోషకాహార లోపం.. శాపం
బలహీనంగా జన్మిస్తున్న శిశువులు ఫ గర్భిణులు పౌష్టికాహారం తీసుకోకపోవడమే కారణం ఫ చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ఫ జిల్లా వ్యాప్తంగా పోషణ లోపమున్న పిల్లలు 1,026 మంది పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం పోషకాహార లోపం కలిగిన పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అంగనన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం స్థానంలో మరిన్ని ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారం (బాలామృతం ప్లస్)ను అందిస్తున్నాం. అంతేకాకుండా పోషకాహార లోపం కలిగిన పిల్లల తల్లిదండ్రులకూ అవగాహన కల్పించి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం. – నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట హుజూర్నగర్: పోషకాహార లోపం చిన్నారుల ఎదుగుదలకు శాపంగా మారుతోంది. ఈ లోపం చిన్నారుల శారీరక, మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గర్భిణిగా ఉన్న సమయంలో తల్లులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల పుట్టే పిల్లలు తక్కువ బరువు, బలహీనంగా ఉంటున్నారు. జిల్లాలో తీవ్ర, అతితీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలు మొత్తం 1,026 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో పోషణలోపం ఉన్నవారు 900 మంది కాగా అతితీవ్ర పోషణ లోపం ఉన్నవారు 126 మంది ఉన్నారు. గర్భిణులు సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో ప్రతి 100 మందిలో 20 మంది శిశువులు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు పోషకాహారంపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు ఏం చేయాలంటే.. చిన్నారులు భోజనం సరిగ్గా చేయకున్నా.. పౌష్టికాహారం తీసుకోకున్నా ఇంటి వద్ద వారికి ఇష్టమైన పదార్థాలు వండి తినిపించే ప్రయత్నం తల్లిదండ్రులు చేయాలి. చిరు ధాన్యాలతో వండిన భోజనం, బెల్లం, పల్లీలు, నువ్వుల పట్టీలు తినిపించాలి. పోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు, కాయగూరలతో ఆహారం వండి తినిపించడం ద్వారా పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చని ఐసీడీఎస్ అధికారులు అంటున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05అంగన్వాడీ కేంద్రాలు 1,209మూడేళ్లలోపు చిన్నారులు 25,1393 నుంచి 6 ఏళ్లలోపు వారు 14,819 ఆకలి పరీక్షతో గుర్తింపు.. ఇంటి వద్ద సరిగ్గా ఆహారం తీసుకోని చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆకలి పరీక్షలు నిర్వహిస్తారు. కేంద్రానికి వచ్చిన చిన్నారులు 200 గ్రాముల బాలామృతం 45 నిమిషాల్లో తినాలి. తినని వారిని రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)కు తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయా, ఆహారం ఎందుకు తీసుకోవడం లేదో వైద్యుల పర్యవేక్షణలో గుర్తిస్తారు. అలాంటి చిన్నారులను 15 రోజుల పాటు వారి పర్యవేక్షణలోనే ఉంచుకుని పౌష్టికాహారం అందిస్తారు. వీరందరికీ ఆటాపాటలతో కూడిన విద్యతోపాటు ఒకపూట సంపూర్ణ భోజనం, ఉడికించిన కోడి గుడ్డు అందజేస్తారు. -
రేపే ఎమ్మెల్సీ కౌంటింగ్
ఓట్ల లెక్కింపునకు సహకరించాలిఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ : వరంగల్– ఖమ్మం –నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సవ్యంగా జరిగేందుకు సహకరించాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం ఆమె కలెక్టరేట్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏర్పాటు చేయనున్న టేబుళ్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లు, కానీ ఓట్ల గుర్తింపు తదితర అంశాలను వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పోటీ చేసే అభ్యర్థులు, ఏజెంట్లు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ 3వ తేదీన (సోమవారం) జరుగనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను నల్లగొండకు తరలించి ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. 3వ తేదీన ఉదయం వాటికి బయటకు తీసి అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో 25,797 ఓట్లకు గాను 24,139 ఓట్లు (93.57శాతం) పోల్ అయ్యాయి. 25 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు 25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్వైజర్తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రోఅబ్జర్వర్ ఉంటారు. మొత్తంగా 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది మైక్రోఅబ్జర్వర్లను నియమించారు. మరో 250 మంది సిబ్బందిని స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకురావడానికి, కౌంటింగ్‌లో ఇతర పనులకు వినియోగించేందుకు నియమించారు. 250 మంది పోలీసులు అక్కడ భద్రతలో పాలుపంచుకోనున్నారు. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ల ఓపెన్ లెక్కింపు ప్రక్రియలో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు ఆయా అభ్యర్థులు లేదా వారి తరఫున వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, అబ్జర్వర్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను ఓపెన్ చేస్తారు. మొదటి రౌండ్లో 25 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి బాక్సులు ఓపెన్ చేస్తారు. వాటిలో ప్రతి 25 ఓట్లను బండిల్ కట్టి డ్రమ్ములో వేస్తారు. ఆ తర్వాత మళ్లీ స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి మరో 25 పోలింగ్ బూత్‌లకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి ఇస్తారు. అలా ఎనిమిదిసార్లు 200 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెచ్చి బండిల్స్‌గా కడతారు. ఈ ప్రక్రియ అంతా గంటలో పూర్తవుతుంది. చెల్లిన ఓట్లలో సగానికి పైగా వస్తేనే.. పోలైన ఓట్లలో ఎన్ని ఓట్లు చెల్లుబాటు అవుతాయో, ఆ చెల్లిన ఓట్లలో సగం ఓట్లకు మించి ఒక ఓటును కలిపి గెలుపు కోటాగా నిర్ణయిస్తారు. మొదటి రౌండ్లో పోలైన ఓట్లలో ఎవరికై తే సగానికి మించి ఒక ఓటు అధికంగా వస్తుందో వారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఒక వేళ మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా గెలుపు కోటా రాకపోతే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 24,139 పోల్ అయ్యాయి. అందులో సగానికి మించి 12,070 ఓట్లు సాధించిన అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుస్తారు. ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడ కోటా ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఎలిమినేషన్ ప్రక్రియ షురూ Ððl¬§ýlsìæ {´ë«§é-¯]lÅ™èl KrÏ™ø H A¿ýæÅ-Ǧ MýS*yé VðSË$Ð]l-MýS-´ù™ól GÍÑ$¯ól-çÙ¯ŒS {ç³{MìSĶæ$ §éÓÆ> Æð‡…yø {´ë«§é-¯]lÅ™èl Krϯ]l$ ÌñæMìSP-Ýë¢Æý‡$. 19 Ð]l$…¨ A¿ýæÅ-Æý‡$¦-ÌZÏ H A¿ýæÅ-ǦMìS A† ™èlMýS$PÐ]l Kr$Ï Ð]lÝë¢Äñæ*, B A¿ýæÅ-Ǧ° GÍÑ$¯ólsŒæ ^ólíÜ, BĶæ$-¯]lMýS$ Ð]l_a¯]l KrÏÌZ Æð‡…yø {´ë«§é-¯]lÅ™èl Kr$Ï HÄôæ$ A¿ýæÅ-Æý‡$¦-ÌSMýS$ ÐólÔ>-Æø, Ðésìæ° BĶæ* A¿ýæÅ-Æý‡$¦-ÌSMýS$ MýSË$ç³#-™éÆý‡$. Aç³µ-sìæMìS MýS*yé VðSË$ç³#MýS$ Møsê Æ>MýS-´ù™ól B ™èlÆ>Ó™èl ™èlMýS$PÐ]l Kr$Ï Ð]l_a¯]l A¿ýæÅ-Ǧ° GÍÑ$¯ólsŒæ ^ólíÜ, BĶæ$-¯]lMýS$ Ð]l_a¯]l Ððl¬§ýlsìæ {´ë«§é-¯]lÅ™èl KrÏÌZ Æð‡…yø {´ë«§é-¯]lÅ™èl Kr$Ï GÐ]l-Æð‡-Ð]l-ÇMìS ÐólÔ>-Æø BĶæ* A¿ýæÅ-Æý‡$¦-ÌSMýS$ K Krϯ]l$ MýSË$ç³#-™éÆý‡$. A糚yýl$ Ð]l$äÏ Møsê Ð]l_a…§é Æ>Ìôæ-§é ^èl*Ýë¢Æý‡$. GÐ]l-ÇOMð ¯é VðSË$ç³# Møsê Ð]lõÜ¢ §é…™ø VðSÍ_¯]l-r$Ï-V> ¿êÑÝë¢Æý‡$. JMýS Ðólâýæ Møsê Æ>MýS-´ù™ól A§ól ™èlÆý‡-àÌZ _Ð]lÇ A¿ýæÅ-Ǧ Ð]lÆý‡MýS$ ™èlMýS$PÐ]l Kr$Ï Ð]l_a¯]l ÐéÇ° JMöP-MýSP-ÇV> GÍÑ$¯ólsŒæ ^ólçÜ*¢ Ð]lÝë¢Æý‡$. AÌê VðSË$ç³# Møsê Ð]l^óla…™èl Ð]lÆý‡MýS$ ÌñæMìSP-çÜ$¢…sêÆý‡$. JMýS Ðólâýæ _Ð]l-ÇMìS 19 Ð]l$…¨ÌZ 17 Ð]l$…¨ GÍÑ$sŒæ AƇ$$-¯]l-ç³µ-sìæMîS VðSË$ç³# Møsê Æ>MýS-´ù™ól _Ð]l-ÇÌZ E¯]l² C§ýlªÆý‡$ A¿ýæÅ-Æý‡$¦-ÌZÏ GÐ]l-ÇMìS ™èlMýS$PÐ]l Kr$Ï Ð]lÝë¢Äñæ* B A¿ýæÅ-Æý‡-Šి£ýl®° GÍÑ$¯ólsŒæ ^ólíÜ BĶæ$-¯]lMýS$ Ð]l_a¯]l KrÏÌZ Æð‡…yø {´ë«§é-¯]lÅ™èl KrÏÌZ 19Ð]l A¿ýæÅ-ǦMìS MýSË$ç³#-™éÆý‡$. Aç³µ-sìæMìS Møsê Ð]lõÜ¢ çÜÇ. Møsê Æ>MýS-´ù-Ƈ$$-¯é GÐ]l-OÆð‡™ól GÍÑ$¯ólsŒæ M>MýS$…yé _Ð]lÇ Ð]lÆý‡MýS$ E…sêÆø B A¿ýæÅ-Ǧ¯ól Ñgôæ-™èl-V> G°²MýSÌS A«¨M>Ç {ç³MýS-sìæ-Ýë¢Æý‡$. Ððl¬§ýlsìæ {´ë«§é-¯]lÅ™èl KrÏ™ø H A¿ýæÅ-ǦMîS VðSË$ç³# Møsê Æ>MýS-´ù™ól GÍÑ$¯ól-çÙ¯ŒS {ç³{MìSĶæ$ ^ólç³sìæt Æð‡…yø {´ë«§é-¯]lÅ™èl Kr$Ï ÌñæMìSPõÜ¢ Ð]l*{™èl… Mú…sìæ…VŠæ {ç³{MìSĶæ$ BÌS-çÜÅ… AÐ]l#-™èl$…¨. BÆý‡¦-Æ>{†-Ð]l-Æý‡MýS$ çÜ Ð]l$Ķæ$… ç³rtÐ]l-^èla° A«¨M>Æý‡$-Ë$ ^ðlº$™èl$-¯é²Æý‡$. VóS AÐ]l-M>Ôèæ… E…§ýl° A«¨M>Æý‡$-Ë$ õ³ÆöP…r$-¯é²Æý‡$.25 టేబుళ్లపై ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ఫ మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఫ గెలుపునకు సరిపడా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ షురూ ఫ ఆ తరువాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఫ సోమవారం అర్ధరాత్రి తర్వాత తేలనున్న ఫలితం8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 25 టేబుళ్లలో ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థులు చూసుకునేలా 19 గడీలు కలిగిన ర్యాక్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లకు చూపిసూ్త్ ఆ బ్యాలెట్ పేపర్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసారో ఆ అభ్యర్థికి సంబంధించిన గడిలో ఆ బ్యాలెట్ పేపర్‌ను వేస్తూ వెయ్యి ఓట్లను ఒక్కో టేబుల్‌పై లెక్కిస్తారు. ఒక వేళ ఓటు చెల్లకపోతే దాన్ని ఏజెంట్లందరికి చూపి పక్కన పెడతారు. అలా మొదటి రౌండ్ కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. -
సాగునీరు అందించాలని నూతనకల్ రైతుల ధర్నా
భానుపురి (సూర్యాపేట): ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ నూతనకల్ మండలానికి చెందిన రైతులు సూర్యాపేట ఇరిగేషన్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని మాయమాటలు చెప్పారని, ప్రస్తుతం పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన రైతులు తీగల మల్లారెడ్డి, పన్నాల మల్లారెడ్డి, జక్కుల మల్లయ్య, అనిల్‌రెడ్డి, మల్లారెడ్డి, మధుసూదన్, రవీందర్‌రెడ్డి, రవి, సురేందర్, ఆకుల సత్తయ్య, ఉపేందర్‌రెడ్డి, బయ్య ముత్యాలి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి లెక్కలు వారివే!
స్ట్రాంగ్ రూమ్‌కు ీసీల్ నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. అనంతరం 12 జిల్లాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను ఆర్జాలబావి సమీపంలోని గోదాం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో శుక్రవారం భద్రపరిచారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ దగ్గరుండి.. పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌కు సీల్ వేయించారు. ఫ అంచనాలు వేసుకుంటున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫ తామంటే.. తామే గెలుస్తామని ధీమా ఫ ఒక్కో జిల్లాలో ఒక్కో అభ్యర్థికి ఓట్లు పడ్డాయని చెబుతున్న సంఘాలు ఫ ఐదుగురి మధ్యే గట్టి పోటీ ఉంటుందని చెబుతున్న నేతలుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న అంచనాల్లో అభ్యర్థులు తనమునకలయ్యారు. జిల్లాలు, మండలాల వారీగా తమ సంఘాల సభ్యులు, తమ మద్దతుదారులు ఓట్లు వేసిన తీరును బట్టి గెలుపు తమదంటే.. తమదేనంటూ ధీమాలో ఉన్నారు. బరిలో 19 మంది.. ఈ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ఐదుగురి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు అంచనా వేస్తున్నా యి. పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, యూటీఎఫ్ బలపరిచిన, ప్రస్తుత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీచర్స్ జేఏసీ, కాంగ్రెస్ మద్దతుతో పోటీలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి, బీసీ వాదంతో బరిలో ఉన్న పూల రవీందర్, టీపీయూఎస్ బలపరిచిన, బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేసుతన్నారు. జిల్లాల వారీగా మారుతున్న బలాలు! ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఒక్కో జిల్లాలో ఒక్కో అభ్యర్థి తమకు అనుకూలంగా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో తమకు మొదటి ప్రాధాన్య ఓట్లు అధికంగా వస్తాయని పీఆర్టీయూ, బీజేపీ, టీచర్స్ జేఏసీ అభ్యర్థులతోపాటు వారి అనుచరులు చెబుతుండగా, ఖమ్మం జిల్లాలో తమ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వస్తాయని యూటీఎఫ్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, వ్యాయామ, భాషా పండితులు, ఆదర్శ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కాలేజీల ఉపాధ్యాయ ఓట్లలో తమకే గణనీయంగా వచ్చాయని టీచర్స్ జేఏసీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి అనుచరులు చెబుతున్నారు. వరంగల్‌తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండలో తనకు ఎక్కువ ఓట్లు వస్తాయని టీచర్స్ జేఏసీ అభ్యర్థి అంచనా వేసుకుంటున్నారు. అయితే బహుజన, బీసీ వాదంతో పాటు అంసతృప్తి ఓట్లు తమకే వచ్చాయని, మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలువబోతున్నామని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అనుచరులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న సంఘాలపై వ్యతిరేక ఓట్లతోపాటు జాతీయవాద భావజాలమున్న ఉపాధ్యాయులంతా తమకే ఓటేశారని, గెలుపు తమదేనని బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి అనుచరులు పేర్కొంటున్నారు. గెలుపోటములు నిర్ణయించేది ద్వితీయ ప్రాధాన్య ఓట్లే? హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో మొదటి ప్రాధా న్య ఓట్లతో కోటా ఓటు సాధ్యం కాదని, ద్వితీయ ప్రాధాన్య ఓట్లే గెలుపును నిర్ణయిస్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దాదాపుగా మొదటి ప్రాధాన్య ఓట్లు ఆయా సంఘాలు బలపరిచిన అభ్యర్థులకే పడతాయని చెబుతున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలుస్తామని, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ నేతలు చెబుతున్నారు. మిగితా అభ్యర్థులను బలపరిచిన టీచర్స్ జేఏసీ, టీ పీయూఎస్, బీజేపీ మాత్రం రెండో ప్రాధాన్య ఓట్లతోనే తుది ఫలితాలు వస్తాయని పేర్కొంటున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లను ప్రధాన అభ్యర్థులు కొద్దిపాటి తేడాలతో పంచుకునే అవకాశమే ఉంటుందని, రెండో ప్రాధాన్య ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయన్న చర్చ సాగుతోంది. -
ఇంటింటా సౌరకాంతులు
హుజూర్నగర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంతో ఇంటింటా సౌర విద్యుత్కాంతులు వెదజల్లుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న ఇళ్ల యజమానుల్లో 96.27 శాతం మంది తమ ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకున్నారు. వీటిని విద్యుత్ అధికారులు పరిశీలించి వినియోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మిగతా వారు ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ సబ్సిడీ ఇలా ఒక్కో కుటుంబం 1 నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కిలోవాట్ సామర్థ్యం గల సౌరవిద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.80 వేలు ఖర్చు వస్తుండగా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూ.30 వేలు లభిస్తుంది. 2 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.1.60 లక్షల ఖర్చు వస్తుండగా కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూ.60 వేలు లభిస్తుంది. 3 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.2.10 లక్షల ఖర్చు వస్తుండగా కేంద్రం నుంచి సబ్సిడీ రూ.78 వేలు లభిస్తుంది. 3కిలోవాట్ల సామర్థ్యం ప్యానల్ ద్వారా నెలకు 400 నుంచి 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 5 కిలోవాట్ల ప్యానల్ ఏర్పాటు చేసుకుంటే రూ.3.20 లక్షలు ఖర్చు అవుతుంది. రూ.78 వేలు రాయితీ లభిస్తుంది. నెలకు 600యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వినియోగదారులువాడుకోగా మిగిలిన ఆ కరెంట్‌ను విద్యుత్ శాఖ కొనుగోలు చేసి యూనిట్‌కు రూ.3.25ల చొప్పున ఆరు నెలలకు ఒకసారి నగదు చెల్లిస్తుంది. ఇలా.. దరఖాస్తు చేసుకోండి.. సౌర విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటు చేసుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగత వివరాలు, సెల్ నంబర్స్ తర్వాత ఓటీపీ, ఆ తర్వాత ఇంటి విద్యుత్ సర్వీస్ కనెక్షన్ వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తులను విద్యుత్ శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఆ శాఖ సిబ్బంది దరఖాస్తుదారుల ఇంటికీ వెళ్లి పరిశీలించి సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు సాంకేతిక అనుమతులు జారీ చేస్తారు. నచ్చిన కంపెనీని ఎంపిక చేసుకుంటే వారి సిబ్బంది వచ్చి ప్యానల్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాలో రాయితీ సొమ్ము జమ అవుతుంది. పర్యావరణానికి మేలు కలుగుతుంది సోలార్ విద్యుత్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవడం వల్ల సూర్యరశ్మితో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల కరెంట్ బిల్లుల ఖర్చు తప్పుతుంది. వినియోగదారులు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. సోలార్ విద్యుత్ విని యోగం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎంతో విలువైన భూగర్భ ఖనిజాలను మనం పరిరక్షించుకోచ్చు. – వెంకటకిష్టయ్య, విద్యుత్ డీఈ, హుజూర్నగర్ పీఎం సూర్యఘర్ పథకం కింద సబ్సిడీపై సోలార్ యూనిట్లు ఫ 1 నుంచి 6 కిలోవాట్ల సామర్థ్యం వరకు ప్యానళ్లు ఫ అర్జీదారుల్లో ఇప్పటికే 96శాతం మంది ఇళ్లపై ఏర్పాటు ఫ పరిశీలించి వినియోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్న విద్యుత్ శాఖ అర్జీలు ఇలా.. దరఖాస్తు చేసుకున్న వారు 537ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంది 517పురోగతిలో ఉన్న ప్యానళ్లు 20జాతీయ బ్యాకుల నుంచి రుణసదుపాయం సౌర విద్యుత్ ప్యానల్స్ కావాలనుకునే వినియోగదారులకు ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోతే అటువంటి వారికి జాతీయ బ్యాంకుల నుంచి రుణం ఇస్తారు. ఆర్థిక సహాయం కావాలనుకునే వారు సదరు ప్యానల్ ఏర్పా చేసే కంపెనీ వారు జాతీయ బ్యాంకుల అధికారులతో మాట్లాడి ఆయా బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తారు. తర్వాత వినియోగదారుడు తీసుకున్న సదరు రుణాన్ని బ్యాంకుకు వాయిదాల రూపంలో సక్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. -
వైభవంగా రథోత్సవం
మేళ్లచెరువు: మేళ్లచెరువు మండలకేంద్రంలోని ఇష్టకామేశ్వరి సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన శుక్రవారం వివిధ రకాల పూలతో అలంకరించిన రథంపై ఉత్సవమూర్తులను వైభవంగా ఊరేగించారు. ముందుగా వేదమూర్తులు గణపతి పూజ, హోమం, రథాంగపూజ, అష్టదిక్పాలకులకు శాంతి నిర్వహించి ఓం నమఃశివాలయ అంటూ భక్తులు స్వామివారిని స్మరిస్తూ మంగళవాయిద్యాలు, నృత్య ప్రదర్శనల నడుమ పురవీధుల్లో రథాన్ని లాగి భక్తిభావం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.భాస్కర్, ఆలయ కార్యనిర్వాహణాధికారి కొండారెడ్డి, రెనివేషన్ కమిటీ చైర్మన్ శాగంరెడ్డి శంభిరెడ్డి, కాకునూరి భాస్కరరెడ్డి, శాగంరెడ్డి గోవిందరెడ్డి, కమిటీ సభ్యులు నర్సింహరావు, శ్రీను, శంభయ్య, గోవిందరెడ్డి, చందర్రావు, గణేష్, అర్చకులు రాధాకృష్ణమూర్తిశర్మ, విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగొద్దు
సూర్యాపేట టౌన్: ఈనెల 5వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలను ఎలాంటి అవకతవకలు, అక్రమాలకు తావు లేకుండా బోర్డు నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ చకిలం హేమచందర్, డీఐఈఓ భానునాయక్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో డీఓలు, సీఎస్‌లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. పేపర్ లీకేజీలు, ప్రశ్న పత్రాలు జారీలో ఎలాంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 12 ప్రభుత్వ, 20 ప్రైవేట్ కళాశాలల్లో సూర్యాపేటలో 13, కోదాడలో 8, హుజూర్‌నగర్‌లో 2, తుంగతుర్తిలో 2, నెమ్మికల్‌లో 1, మఠంపల్లిలో 1, నడిగూడెంలో 2, తిరుమలగిరిలో 2, నేరేడుచర్లలో 1 చొప్పున మొత్తం 32 కేంద్రాల్లో పరీక్షలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిల్లో జనరల్ ఫస్టియర్ 6,688 మంది, జనరల్ సెకండియర్ 6,666 మంది, ఒకేషనల్ ఫస్టియర్ 1,952, ఒకేషనల్ సెకండియర్ 1,642 మందితో కలిపి మొత్తం 16,948 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, 32 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 32 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతోపాటు 850 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. బోర్డు నిబంధనల మేరకు ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబడదన్నారు. ఈ కార్యక్రమంలో డీఈసీ సభ్యులు జానపాటి కృష్ణయ్య, గుడిపాటి లక్ష్మయ్య, జిల్లా బల్క్ అధికారి విజయనాయక్, ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ హేమచందర్, డీఐఈఓ భానునాయక్ -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కేంద్రంలోనూ పరీక్షల నిర్వహణ తీరును చీఫ్ సూపరింటెండెంట్లు నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని, కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఏవైనా సమస్యలు, సందేహాలుంటే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఐఈఓను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, అదనపు ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఐఈఓ అశోక్ కుమార్, ఆర్డీఓలు వేణుమాధవ్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్, రమాదేవి, శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రకుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడికి బ్రహ్మోత్సవ శోభ
యాదగిరిగుట్ట : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట పంచనారసింహుడి దివ్యక్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. మంగళవారం విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనంతో మొదలై శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారంగా, సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, తోరణాలు, పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 11 రోజులు జరిగే కార్యక్రమాలు ● 1వ తేదీన ఉదయం 10గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ ఉంటుంది. ● 2న ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజ. ● 3న ఉదయం 9 గంటలకు మత్స్యవతార అలంకార సేవ, రాత్రి 7గంటలకు శేష వాహన సేవ. ● 4న ఉదయం 9గంటలకు వటపత్రశాయి అలంకారం, రాత్రి 7గంటలకు హంసవాహన సేవ. ● 5న ఉదయం 9గంటలకు మురళీకృష్ణుడి అలంకారం, రాత్రి 7గంటలకు పొన్న వాహన సేవ. ● 6న ఉదయం 9గంటలకు గోవర్థనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహవాహన సేవ. ● 7న ఉదయం 9గంటలకు జగన్మోహిని అలంకారం, రాత్రి అశ్వవాహన సేవ, ఆ తరువాత శ్రీస్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం. ● 8న ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి గజవాహన సేవ, 8.45 గంటలకు శ్రీస్వామి,అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం. ● 9న ఉదయం 9గంటలకు శ్రీమహావిష్ణు అలంకార సేవలో గరుఢ వాహనం సేవపై శ్రీస్వామివారి ఊరేగింపు, రాత్రి 8గంటలకు ఆలయ తిరు, మాఢ వీధుల్లో దివ్యవిమాన రథోత్సవం. ● 10న ఉదయం 10.30గంటలకు చక్రతీర్థస్నానం వేడు, రాత్రి శ్రీపుష్పయాగం, దోపోత్సవం. ● 11న ఉదయం 10గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం, దోపు ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ప్రథమ ప్రాకార మండపంలో.. ప్రథమ ప్రాకార మండపంలో స్వామి వారిని అలంకరించి సేవలను తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అలంకారసేవలను భక్తులకు దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫ విశ్వక్సేన ఆరాధనతో శ్రీకారం ఫ 7న ఎదుర్కోలు, 8న తిరుకల్యాణంరూ.3.15 కోట్లు కేటాయించాం బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం రూ.3.15 కోట్ల బడ్జెట్ కేటాయించాం. రోజూ 2,500 మంది భక్తులకు అన్న ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, బస్సులు, టాయిలెట్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులకు ఆహ్వానపత్రికలు అందజేశాం. –భాస్కర్‌రావు, యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓఉత్తర మాడవీధిలో కల్యాణం శ్రీస్వామి, అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానాలయ ఉత్తర మాడవీధిలో కల్యాణవేడుక నిర్వహించనున్నారు. కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు రూ.3,000 టికెట్ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. -
8న జాతీయ లోక్ అదాలత్
చివ్వెంల: సూర్యాపేట జిల్లా కోర్టులో ఈనెల 8న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్శ్రీ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. చిన్న చిన్న ఘర్షణలతో కోర్టుల వరకు వెళ్లకుండా లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్‌పై పారాలీగల్ వలంటీర్లు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆమె వెంట జిల్లా న్యాయసేవాధికార సంస్థకార్యదర్శి శ్రీవాణి తదితరులు ఉన్నారు. రైతు సమస్యలు పరిష్కరించాలిహుజూర్నగర్: తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వారి సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ సంఘం ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి పంటకు మద్దతు ధర అందించాలన్నారు. రైతుల రుణమాఫీ, సన్నరకం వడ్లకు బోనస్, రైతు భరోసా పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, నాయకులు యల్లావుల రమేష్, జడ వెంకన్న, జక్కుల రమేష్, సుందరి పద్మ, జక్కుల శ్రీనివాస్, యల్లావుల ఉమ, చెన్నబోయిన సైదులు, చక్రాల స్టాలిన్, యల్లావుల సురేందర్, కుడితొట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు. వైద్యసేవల్లో లోపాలు ఉండొద్దు హుజూర్నగర్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పక్కాగా అందించాలని, లోపాలుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోటాచలం హెచ్చరించారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలని చెప్పారు. ఈ సమావేశంలో హుజూర్నగర్, కోదాడ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యాదవులకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలి సూర్యాపేట టౌన్: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 30 వేల నుంచి 40 వేల ఓట్లు కలిగిన అతిపెద్ద సామాజిక వర్గం యాదవులు అన్నారు. జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌కు ఎమ్మెల్సీ సీటు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తూము వెంకన్న యాదవ్, గొడ్డేటి సైదులు యాదవ్, కోడి లింగయ్య యాదవ్, రమేష్ యాదవ్, కంచుగట్ల జానయ్య, నాగరాజు, భిక్షపతి యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కాసం రాము యాదవ్, మల్లేష్, వెంకటేష్, సైదులు, వేల్పుల లింగయ్య యాదవ్, కంచుగట్ల యాదగిరి యాదవ్, రాజు యాదవ్, కుర్ర సైదులు యాదవ్, నర్సయ్య, రమణ పాల్గొన్నారు. -
ఇంకా.. కొత్త సంఘాలు
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సభలు, సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటిస్తున్నారు. దీంతో తమకు ఆర్థిక భరోసా లభిస్తుందని గ్రామీణ ప్రాంత మహిళలు ఆశతో ఎదురు చూస్తున్నారు. మహిళలను ఆర్థికంగా స్థితిమంతులను చేయాలనే లక్ష్యంతో దశాబ్దాల క్రితం మహిళా పొదుపు స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వాలు దశల వారీగా కృషి చేశాయి. దీంతో గ్రామాల్లో 80 శాతం ఇళ్లలో కనీసం ఒక్కరైన మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరి బ్యాంకుల నుంచి వస్తున్న రుణాలతో పాటు ప్రభుత్వం నుంచి లభించే వివిధ రాయితీ పథకాలను మహిళా సభ్యులు అందిపుచ్చుకున్నారు. తక్కువ వడ్డీ, ఒక్కోసారి వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందారు. ప్రస్తుతం ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా మరికొన్ని సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 5,280 మంది సభ్యులతో 165 కొత్త సంఘాలను నెలకొల్పారు. దీంతో జిల్లాలో మొత్తం 17,579 సంఘాలు అయ్యాయి. వీటిలో 1,83,782 మంది మహిళా సభ్యులు ఉన్నారు. నిర్వహణపై శిక్షణ కనీసం పది మంది సభ్యులతో ఏర్పాటైన కొత్త సంఘాల సభ్యులకు ఆయా సంఘాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా డబ్బులు పొదుపు చేయడంతో పాటు అందుకు సంబంధించిన రికార్డుల నిర్వహణ, బ్యాంకుల ద్వారా వచ్చే రుణాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. సభ్యులు తీసుకున్న ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని, తిరిగి చెల్లింపు అంశాలపై కూడా ఆర్పీలు, సీఏలు సంఘాల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఫ జిల్లాలో నూతనంగా 165 స్వయం సహాయక సంఘాల ఏర్పాటు ఫ 5,280 మంది మహిళలకు సభ్యులుగా అవకాశం ఫ వనితల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం -
మేళ్లచెరువులో శివపార్వతుల కల్యాణం
మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి కల్యాణం గురువారం తెల్లవారు జామున మంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం నుంచి కల్యాణ మంటపం వరకు స్వామి వారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనం, విష్వక్సేన పూజ చేసి వేదమంత్రాల సాక్షిగా స్వామి వారు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కొంకపాక కృష్ణమూర్తి శర్మ, విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయశర్మ , పోశం నర్సిరెడ్డి, ఆలయ మేనేజర్ కొండారెడ్డి పాల్గొన్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు స్వామి వారి సన్నిధిలో ఉన్న గంగమ్మ అమ్మవారికి యాదవులు ప్రత్యేక పూజలు చేశారు. బోనాలతో వచ్చి అమ్మవారికి మేకపోతులు బలిఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రెండో రోజు అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. రెండో రోజూ సాగిన మహా శివరాత్రి జాతర మేళ్లచెరువు మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజైన గురువారం కూడా జాతర కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి రుద్రాభిషేకాలు, బలిహరణ, పుష్పాలంకరణ, మహానివేదన, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయంలో కోలాటమాడారు. భజనలు చేశారు. గిరిజన మహిళలు నృత్యాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. -
సరిపడా రాని యూరియా
భానుపురి (సూర్యాపేట) : అన్నదాతలకు పంటలు వేసిన నాటినుంచి డబ్బులు చేతికి అందేదాకా తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతం జిల్లాలోని పలు మండలాల్లో యూరియా కొరత నెలకొంది. అది కూడా ఆలస్యంగా సాగు చేసిన వరి పొలాలకు వేయడానికి రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొలాలు సైతం పొట్టదశలో ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో వేయాల్సిన యూరియాను వారం, పదిరోజులు ఆలస్యంగా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోయిన బోర్లతో నెట్టుకొస్తున్న రైతులకు ఈ సమస్య మరింత వెనక్కి నెట్టుతోంది. అంతంత మాత్రంగానే పారుతున్న పొలాలు.. యూరియా లేకపోవడంతో ఏపుగా పెరగకుండా దిగుబడి తగ్గుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. యూరియా తిప్పలు అంతటా లేకపోగా.. ఉన్నచోట రైతుకు కేవలం రెండు నుంచి మూడు బస్తాలను మాత్రమే ఇస్తున్నారు. 4.30 లక్షల ఎకరాల్లో వరి సాగు సూర్యాపేట జిల్లాలో కొన్నేళ్లుగా వరి సాగే అత్యధికంగా ఉంటోంది. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలకు ఓ వైపు సాగర్, మూసీ, ఎస్సారెస్సీ నీళ్లు అందుతుండడంతో ఇతర పంటల సాగును రైతులు వదిలేశారు. ఈ యాసంగి సీజన్లో 4.78 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ లెక్కన జిల్లా రైతాంగానికి 68,280 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని భావించగా.. సీజన్ ప్రారంభానికే జిల్లాలో 19,037 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంది. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి జిల్లాలో 56వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వాడారు. నాటినుంచి మరో 10వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినా.. కొన్ని మండలాల్లో కొరత ఉంది. ఆలస్యంగా సాగు చేయడంతో.. జిల్లాలోని సాగర్, మూసీ ఆయకట్టు ప్రాంతాలకు సరైన సమయానికే నీటిని విడుదల చేశారు. కానీ ఎస్సారెస్సీ ఆయకట్టుకు జనవరి 1వ తేదీన ఇవ్వడంతో చాలామంది రైతులు ఆలస్యంగా నాట్లు వేశారు. ముందుగా బోరుబావులతో పాటు సాగర్, మూసీ ఆయకట్టు కింద పడిన నాట్లకు రైతులు రెండోదఫా కూడా యూరియాను చల్చారు. ఇక తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో ఆలస్యంగా సాగైన వరి పొలాలకు రెండోదఫా అందించాల్సిన యూరియా సమయానికి అందడం లేదు. వాతావరణ పరిస్థితులు, చాలీచాలని నీళ్లు తదితర సమస్యలతో అంతంత మాత్రమే ఉన్న పొలాలు పొట్టదశకు వచ్చే సమయానికి రెండోదఫా యూరియా లేకపోవడంతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో ఉన్న రైతాంగానికి ఇబ్బందులు ఎదరవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వచ్చిన యూరియా వచ్చినట్లుగా అయిపోతుండగా.. ఒక్కో రైతుకు రెండు, మూడు బస్తాల చొప్పున మాత్రమే ఇస్తున్నారు.ఫ రైతులకు అందని యూరియా బస్తాలు ఫ పలు మండలాల్లో వచ్చిన యూరియా వచ్చినట్లే ఖాళీ ఫ సమయానికి వేయకపోవడంతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన -
నేడు భానుపురి సైన్స్ సంబరాలు
సూర్యాపేటటౌన్ : సైన్స్ డే సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం భానుపురి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు గోళ్ళమూడి రమేష్ బాబు తెలిపారు. సూర్యాపేటలో సైన్స్ సంబరాల పోస్టర్లను గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. మిరాకిల్ స్ట్రీట్ సైన్స్ షో, విజ్ఞాన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాజెక్టుల ప్రదర్శన, సైన్స్ స్కిట్స్, ముఖాభినయాలు తదితర విజ్ఞానాత్మక కార్యక్రమాలు ఉంటాయన్నారు. జనవిజ్ఞాన వేదిక, సూర్యాపేట సైన్స్‌ఫోరం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సైన్ సంబరాల్లో అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు ఉచితంగా పాల్గొనవచ్చని సూచించారు. గత ఆదివారం ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నట్లు కన్వీనర్ తల్లాడ రామచంద్ర తెలిపారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు షేక్ జాఫర్, సీనియర్ నేతలు నారాయణరెడ్డి, డి.నాగరాజు, ఉపేందర్, సోమ సురేష్ కుమార్, క్రాంతి కుమార్ పాల్గొన్నారు. -
పెన్షనర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా
హుజూర్నగర్ : ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం హుజూర్‌నగర్‌లోని మంత్రి నివాసంలో ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతికోత్సవాల పోస్టర్‌ను ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కోదాడలో వచ్చేనెల 16, 17, 18 తేదీల్లో ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతికోత్సవాలు నిర్వహించాలనుకోవడం సాహసోపేతమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, సంఘం నాయకులు దేవదానం, ఎంఎస్ఎన్ రాజు, వీరబాబు, చంద్రశేఖర్, తాటి ప్రభాకర్ రెడ్డి, చంద్రయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
పోలింగ్ సరళి పరిశీలన
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఏవీఎం స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ పోలింగ్ కేంద్రంలో 991 ఓట్లకు గాను 935 ఓట్లు పోలయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,664 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే చివ్వెంల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ రవి, తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి ఉన్నారు. -
ఓటెత్తిన ఉపాధ్యాయులు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉమ్మడి జిల్లాలో 94.98 శాతం పోలింగ్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయ ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 10 గంటల వరకు మందకొడిగా వచ్చిన ఓటర్లు ఆ తరువాత అధిక సంఖ్యలో వచ్చారు. గంట గంటకు ఓటర్ల రాక పెరిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ భారీగా నమోదైంది. మొత్తానికి నిర్దిష్ట సమయానికే సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 94.98 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద సంఘాల హడావుడి పోలింగ్ కేంద్రాల వద్ద ఆయా అభ్యర్థులకు సంఘాలు, అనుచరులంతా టెంట్లు వేసుకుని పోల్‌చిట్టీలు అందించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు.. వారి ఓటు ఏ బూత్‌లో ఉందనేది జాబితాలో చూసి పోల్ చిట్టీలు అందజేశారు. ఆయా అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు, సంఘాల నాయకులు టెంట్లు ఏర్పాటు చేసుకుని కూర్చున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు, ఆర్ముడ్ రిజర్వు పోలీసులతో ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా అదనపు కలెక్టర్ పరిశీలన జిల్లాలో 23 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబు వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలుసుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, ఈడీఎం గఫార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు ఫ మధ్యాహ్నం 2 గంటల వరకే 76 శాతం నమోదు ఫ 4 గంటల వరకు ముగిసిన పోలింగ్ ఫ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ ఫ నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులుఉమ్మడి జిల్లాలో పోలింగ్ శాతం ఇలా.. జిల్లా మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు శాతం యాదాద్రి 984 950 96.54సూర్యాపేట 2664 2530 94.97 నల్లగొండ 4683 4433 94.66 -
మెనూ అమలు చేయని వారిపై కఠిన చర్యలు
సూర్యాపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన మెనూ అమలు చేయని హాస్టల్ వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి లత హెచ్చరించారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహం ( ఏ ) లో రాత్రి బస చేశారు. హాస్టల్ లో అమలవుతున్న నూతన మెనూ వివరాలను విద్యార్థిను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అత్యధికంగా ఖర్చు చేసి విద్యార్థులకు నూతన మెనూ అమలు చేస్తుందన్నారు. హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అధికారులకు చేరే విధంగా ప్రతి హాస్టల్ లో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబోయే పరీక్షలకు విద్యార్థులంతా సిద్ధం కావాలని కోరారు. ప్రణాళికా బద్ధంగా సిలబస్ పూర్తి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ హెచ్‌డబ్ల్యూఓ మహబూబా పాల్గొన్నారు. మట్టపల్లి క్షేత్రంలో కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో గురువారం విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. దానిలో భాగంగా సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం ,రక్షాబంధనం ,రుత్విగ్వరణం ,మధుఫర్కపూజ, మాంగళ్యధా4రణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాబాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి , ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా నిర్వహించారు. వేవకుజామున సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులు, ప్రతిష్టామూర్తులను అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. అనంతరం ప్రధానాలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం చేశారు. ఆతరువాత స్వామి, అమ్మవారిని గజవాహన సేవలో ఊరేగించి నిత్య తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ముగిసిన రాచకొండ పర్యాటక ఉత్సవాలు సంస్థాన్ నారాయణపురం : రాచప్ప సమితి ఆధ్వర్యంలో రాచకొండలో నిర్వహిస్తున్న పర్యాటక ఉత్సవాలు గురువారం ముగిశాయి. భక్తులు, పర్యాటకులు ఉత్సవాల్లో పాల్గొని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. రాచకొండ చరిత్రను తెలియజేసే ఫొటో గ్యాలరీతో పాటు పర్యాటక ప్రదేశాలను వీక్షించారు. రాచప్ప సమితి అధ్యక్షుడు మాట్లాడుతూ రాచకొండను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఎయిడ్స్ అవగాహన సదస్సుకు నిధులు విడుదల
నల్లగొండ టూటౌన్ : జాతీయ సేవా పథకం, ఎంజీ యూనివర్సిటీ ఇటీవల రెండు రోజుల పాటు రెడ్ రిబ్బన్ క్లబ్, పీర్ లీడర్స్ కన్వెన్షన్ ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతమైంది. దీంతో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి నిధులు విడుదలైనట్లు యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా నిధుల విడుదల ఉత్తర్వులను డాక్టర్ మద్దిలేటికి అందజేశారు. ఒక రోజు ఉమ్మడి జిల్లాలోని రెడ్‌రిబ్బన్ కాలేజీల్లో ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించాలని వీసీ సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, ప్రొఫెసర్ ఆకుల రవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి, హరికిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
మేళ్లచెర్వులో వైభవంగా మహాశివరాత్రి జాతర
మేళ్లచెరువు: మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలను రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దంపతులు బుధవారం తెల్లవారుజామున ప్రారంభించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూలమాల, శాలవాలతో ఘనంగా సత్కరించారు. కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆలయంలో సుప్రభాతం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, ఔపాసన, బలిహరణ, రాత్రి లింగోద్భావకాల మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, విశేష పుష్పాలంకరణ, మహనివేదన, తీర్ధప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు అందించడంతో పాటు అన్నదానం చేశారు. వారి వెంట కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్రావు, కృషి ఫౌండేషన్ చైర్మన్ పోశం నర్సిరెడ్డి, నాయకులు భాస్కరరెడ్డి, సైదేశ్వరరావు, గోవిందరెడ్డి, రామకృష్ణారెడ్డి, దేవాలయ చైర్మన్ శంభిరెడ్డి, పాలకవర్గం సభ్యులు ఉన్నారు. ఎద్దుల పందేలు ప్రారంభం ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద జాతీయ స్థాయి ఎద్దుల పందేలు నిర్వహించారు. పాలపండ్ల విభాగం ఎద్దుల పోటీలను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రారంభించారు. కార్యక్రమంలో ఐరా రియాల్టీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి, దేవాలయ చైర్మన్ శాగంరెడ్డి శంభిరెడ్డి పాల్గొన్నారు. ఫ ప్రారంభించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు -
వాటర్ ట్యాంకర్ టైరు పగిలి వృద్ధురాలికి గాయాలు
భువనగిరి టౌన్: వాటర్ ట్యాంకర్ టైరు పగిలి దాని నుంచి వేరుపడిన ఇనుప వస్తువు ఇంట్లో కూర్చొని ఉన్న వృద్ధురాలి కాలికి తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం భువనగిరి పట్టణంలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన సత్యనారాయణరెడ్డి ఇటీవల మృతిచెందాడు. సత్యనారాయణరెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు అతడి సోదరి రామలక్ష్మి ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామం నుంచి భువనగిరికి వచ్చింది. బుధవారం రామలక్ష్మి ఇంట్లో కూర్చొని ఉండగా.. నీటిని సరఫరా చేసే ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ అటుగా వెళ్తుండగా దాని వెనుక టైరు పగిలింది. దీంతో టైరు నుంచి వేరుపడిన ఇనుప వస్తువు ఇంటి దర్వాజాను చీల్చుకొని లోపల మంచంపై కూర్చొని ఉన్న రామలక్ష్మికి వేగంగా తాకింది. దీంతో ఆమె కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. వాటర్ ట్యాంకర్ ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నిర్వాసితులకు పరిహారం చెల్లించేదెన్నడు?
భువనగిరి : బస్వాపూర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఏడుళ్లు కావస్తున్నా నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్‌లో భాగంగా భువనగిరి మండలం వడపర్తి పరిధిలో వాగు చెరువు, చోక్లతండా వద్ద నిర్మిస్తున్న కాల్వలను బుధవారం ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. నిర్వాసితుల కోసం తక్షణమే రూ.300 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే బస్వాపూర్ ప్రాజెక్టు నుంచి వడపర్తి కత్వ వరకు కాల్వను పూర్తి చేసేందుకు రూ. 6 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఇందుకోసం జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. వడపర్తి కత్వ నింపితే భువనగిరి, బీబీనగర్ మండలాల పరిధిలోని చెరువుల్లోకి నీరు చేరి వందలాది ఎకరాలు సాగవుతుందన్నారు. నిధులు విడుదల చేయని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో అందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, నాయకులు ఏదునూరి మల్లేశం, మైసయ్య,అంజనేయులు, మాణిక్యం, రైతులు పాల్గొన్నారు. -
స్వర్ణగిరిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
భువనగిరి : పట్టణంలోని స్వర్ణగిరి ఆలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం కూడా కొనసాగాయి. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆయనకు ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. అంతకు ముందు ఆలయంలో చతుస్థానార్చన మూర్తి కుంభం హోమం, హయాగ్రీవ ఇష్టి హవనం, అనంతరం అశ్వవాహన సేవ, ఆలయ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మానేపల్లి రామారావు, ధర్మకర్తలు మురళీకృష్ణ, గోపి కృష్ణ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. -
అఖండజ్యోతి యాత్ర ప్రారంభం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదగిరిభవన్ నుంచి అఖండజ్యోతి యాత్ర బుధవారం ప్రారంభమైంది. యాత్రను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి ప్రారంభించారు. అఖండజ్యోతి యాత్ర ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి మీదుగా మార్చి 1వ తేదీన యాదగిరిగుట్టకు చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈఓ దోర్భల భాస్కర్‌శర్మ, అఖండ జ్యోతి యాత్ర చైర్మన్ ఎస్.వెంకట్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్య సమస్యలతో రైతు బలవన్మరణం
కేతేపల్లి: అనారోగ్య సమస్యలతో మనోవేదనకు గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన కేతేపల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు గుండిగ బాలరాజు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాలరాజు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన అతడు బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నకిరేకల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దకు కుమారులు ఉన్నారు. మతుడి భార్య జోస్పిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్ఐ శివతేజ తెలిపారు. వివాహిత అదృశ్యం చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన వివాహిత అదృశ్యమైనట్లు ఆమె భర్త బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన దేశగోని మల్లేష్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసస్తున్నాడు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో గల హెచ్ఎండీఏ వెంచర్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అతడికి 16ఏళ్ల క్రితం లింగోజిగూడేనికి చెందిన యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం పని నిమిత్తం మల్లేష్ నల్లగొండకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో అతడు తన భార్యకు ఫోన్ చేయగా కుమారుడు అర్జున్ మాట్లాడాడు. అమ్మ తనను లింగోజిగూడెం గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్ద దింపి బ్యాంక్‌కు వెళ్లిందని తండ్రికి చెప్పాడు. సాయంత్రం మల్లేష్ ఇంటికి చేరుకున్నాక కూడా భార్య తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వంతెన పైనుంచి పడి వ్యక్తి మృతి రామన్నపేట: బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వంతెన పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామ సమీపంలోని వంతెన వద్ద జరగగా.. బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన కొలగాని వెంకటేష్(58) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పని నిమిత్తం రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అతడి భార్య ఫోన్ చేయగా వస్తున్నానని చెప్పాడు. కానీ ఇంటికి చేరుకోలేదు. బుధవారం ఉదయం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన లక్ష్మాపురం గ్రామానికి చెందిన జోగుల నర్సింహ వంతెన కింద వ్యక్తి మృతదేహాన్ని గమనించాడు. బైక్‌పై ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా మృతుడి కుమారుడికి సమాచారం అందించాడు. వెంకటేష్ ప్రమాదవశాత్తు వంతెన పైనుంచి పడైనా లేదా ఏదైనా వాహనం ఢీకొట్టడం వల్ల గాని మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి. మల్లయ్య తెలిపారు. -
ఎన్నికలకు అంతా సిద్ధం చేశాం
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీకి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ తీరు తెన్నులు, సదుపాయాలు పరిశీలించారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యాయా లేదా అని ఆరా తీశారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా చేపట్టాల్సిన పోలింగ్ ప్రక్రియను , పోలింగ్ సామగ్రి గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఆర్టీసీ బస్సులను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి పీఎస్‌లకు తీసుకెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. కాగా జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాల్లో 2,664 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కోనున్నారని, గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోసం 139మందిపోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. ఏడు రూట్లు ఏర్పాటు చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి. రాంబాబు , ఆర్డీఓ వేణుమాధవ్, పోలింగ్ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
ఆలేరు రూరల్: ఆలేరు మండలం టంగుటూరు గ్రామ శివారులో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండాకు చెందిన బానోతు వెంకన్న(24) ఆలేరు మండలం టుంగుటూరు గ్రామ శివారులో తుమ్మ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం టంగుటూరు గ్రామానికి చెందిన వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న బైక్ నంబర్ ఆధారంగా మృతుడు వెంకన్నగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంకన్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రజనీకాంత్ తెలిపారు. కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు చివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టిఅదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామ శివారులో హైదరాబాద్–విజయవాడ హైవేపై బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన షేక్ మక్సూద్, షేక్ రసూల్, షేక్ రఫీక్ కారులో విజయవాడకు వెళ్తుండగా.. మార్గమధ్యలో చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామ శివారులో హైవేపై చెట్లకు నీరు పోస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా యూటర్న్ వద్ద అడ్డురావడంతో దానిని కారు ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు సూర్యాపేటకు తరలించారు. అతివేగమే ప్రమదానికి కారణమని తెలుస్తోంది. -
సాగర్ మధ్యన
శివ నామస్మరణనాగార్జునసాగర్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగార్జునసాగర్ జలాశయం మధ్యన గల సింహపురి కొండపై శివ నామస్మరణ మార్మోగింది. బుధవారం సింహపురి కొండపై గల జరిగిన ఏలేశ్వరస్వామి జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, ప్రకాశం, ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. భక్తులు ఏలేశ్వరం చేరుకునేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీ నుంచి లాంచీలను నడిపారు. చందంపేట, నేరెడుగొమ్ము, దేవరకొండతో పాటు వైజాగ్ కాలనీ నుంచి మరబోట్లలో చాలామంది భక్తులు సింహపురి కొండకు చేరుకున్నారు. చందంపేట, దేవరకొండ, నేరెడుగొమ్ము పోలీసులు కొండపై బందోబస్తు నిర్వహించారు. హిల్‌కాలనీ నుంచి లాంచీల్లో వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా సాగర్ ఎస్ఐ సంపత్‌గౌడ్, పోలీసులు పలు సూచనలు చేశారు. సాగర్ జలాశయం తీరాన్ని ఆనుకొని ఉన్న గ్రామాలు, తండాలవాసులు మరబోట్లు, పుట్టీలలో జాతరకు వచ్చారు. జాతరకు వచ్చిన పెద్దలు పలువురికి స్థల పురాణం గురించి వివరించారు. సంతానం లేనివారు కొండ దిగువన సాగర్ జలాశయంలో స్నానమాచరించి నోట్లో నువ్వులు వేసుకుని కొండ పైకి ఎక్కి అక్కడ బండపై ఉమ్మివేస్తే.. అందులో ఎన్ని మొలకలు వస్తే అంతమంది సంతానం కల్గుతారని శివసత్తులు చెప్పడంతో పలువురు భక్తులు వారు చెప్పిన విధంగా చేశారు. సంతానం కల్గిన వారు మొక్కులు చెల్లించుకున్నారు. సాగర్ జలాశయంలో ముంపునకు గురైన గ్రామాలకు చెందిన వారు తమ బంధువులను ఏలేశ్వరం గుట్టపై కలుసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన వారు మహాశివరాత్రి రోజున ఈ జాతర నిర్వహిస్తున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత భోజన సౌకర్యంతో పాటు తాగునీరు అందుబాటులో ఉంచారు. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే..
నల్లగొండ: ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19మంది పోటీలో నిలిచారు. వీరిలో కొందరు వివిధ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో బరిలోకి దిగుతుండగా.. మరికొందరు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. పోటీలో 19మంది.. అలుగుబెల్లి నర్సిరెడ్డి – స్వతంత్ర (యూటీఎఫ్ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), శ్రీపాల్‌రెడ్డి పింగిళి – స్వతంత్ర (పీఆర్టీయూ–టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీయూ, బీసీసంఘాల మద్దతు), ఎస్. సుందర్రాజు – స్వతంత్ర, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి – స్వతంత్ర, లింగిడి వెంకటేశ్వర్లు – ప్రజావాణి పార్టీ, అర్వ స్వాతి – స్వతంత్ర, కంటె సాయన్న – స్వతంత్ర, పన్నాల గోపాల్‌రెడ్డి – స్వతంత్ర, ఏలె చంద్రమోహన్ – స్వతంత్ర, చాలిక చంద్రశేఖర్ – స్వతంత్ర, జంకిటి కై లాసం – స్వతంత్ర, జి. శంకర్ – స్వతంత్ర, తలకోల పురుషోత్తంరెడ్డి – స్వతంత్ర, తాటికొండ వెంకట రాజయ్య – స్వతంత్ర, దామెర బాబురావు – స్వతంత్ర, బంక రాజు – స్వతంత్ర -
మహాశివుడికి శత రుద్రాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని గర్భాలయంలోని మహాశివుడికి, ముఖ మండపంలోని స్పటిక లింగానికి అభిషేకాలు జరిపించారు. రాత్రి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిపించారు. మంగళవారం రాత్రి స్వామివారి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నిత్య హవనములు, శివ పంచాక్షరీ జపములు, నందీశ్వర పారాయణములు, పంచసూక్త పఠనములు, మూలమంత్ర జపములు, వివిధ పారాయణములు గావించారు. రాత్రి స్వామికి మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం నిర్వహించారు. ఆయా పూజల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. శివాలయంలో గురువారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లక్ష బిల్వార్చన జరిపిస్తారు. రాత్రి ఆలయ మాడ వీధిలో శ్రీరామలింగేశ్వరస్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఫ యాదగిరిగుట్టలో కొనసాగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు -
వరంగల్‌లో నల్లగొండ విద్యార్థిని ఆత్మహత్య
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని వరంగల్ జిల్లా అరేపల్లి సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆవరణలోని వరంగల్ వ్యవసాయ కళాశాలలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ పట్టణానికి చెందిన గుంటోజు సత్యనారాయణ, రమ్య దంపతులు రాక్హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ పెద్దకాపర్తిలో బ్రాంచి పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. మూడవ సంతానం రేష్మిత(19)కు ఇటీవల వరంగల్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీలో సీటు వచ్చింది. నెల రోజుల క్రితం అడ్మిషన్ తీసుకుని హాస్టల్ ఉంటోంది. హాస్టల్లో చేరినప్పటి నుంచి చదువుతో ఒత్తిడికి గురవుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెబుతోంది. దీంతో ఇటీవల ఇంటికి తీసుకొచ్చి నచ్చజెప్పి మళ్లీ వరంగల్ కాలేజీకి పంపించారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో రేష్మిత ఫోన్లో మాట్లాడింది. మంగళవారం హాస్టల్ గదిలో రేష్మిత్ మాత్రమే ఉంది. బుధవారం ఉదయం రేష్మిత ఉన్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానంతో తలుపులు పగులగొట్టి చూడగా.. రేష్మిత గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇంటి నుంచి వెళ్లిన వారంలోనే కుమార్తె హఠాన్మరణం చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నల్లగొండకు తరలించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హాస్టల్ సిబ్బంది, మేనేజ్మెంట్ పర్యవేక్షణ లోపం వల్లే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి సత్యనారాయణ ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న రేష్మిత ఫ నల్లగొండలోని రాక్హిల్స్ కాలనీలో విషాదఛాయలు -
పాముకాటుతో గీత కార్మికుడు మృతి
నార్కట్‌పల్లి: పాముకాటుతో గీత కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం తొండల్వాయి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండల్వాయి గ్రామానికి చెందిన గీత కార్మికుడు దంతూరి ఽశంకర్(30) బుధవారం సాయంత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా పాము కాటు వేసింది. వెటనే చెట్టు పైనుంచి కిందకు దిగిన శంకర్ తోటి గీత కార్మికుడికి విషయం తెలియజేసి స్పృహతప్పి పడిపోయాడు. గ్రామస్తుల సహకారంతో కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. -
చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్
నల్లగొండ: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితులను బుధవారం నార్కట్‌పల్లిలో అరెస్ట్ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నార్కట్‌పల్లిలో నల్లగొండ ఎక్స్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిట్యాల వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులపై అనుమానం రావడంతో వారిని పోలీసులు ఆపి విచారించగా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల్ల రఘు ప్రస్తుతం నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో ఉంటున్నాడని, మరొకరు మైనర్ అని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 1.5 తులాల బంగారు నల్లపూసల గొలుసు, బైక్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామన్నారు. నిందితులను పట్టుకున్న సీసీఎస్ సీఐ సోమ నర్సయ్య, నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు, నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్, సీసీఎస్ ఏఎస్ఐ యాదగిరిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్, గిరి, రాంప్రసాద్, వాహిద్, అఖిల్, సాయికుమార్, హరిప్రసాద్‌ను ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిసూర్యాపేటటౌన్: గుర్తుతెలియని వాహనం ఢీకొని గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజుగారి రుచులు హోటల్ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ నెల 13వ తేదనీ గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, మృతుడి వివరాలు తెలిసిన వారు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో లేదా 8712686005 నంబర్‌ను సంప్రదించాలని సీఐ వీరరాఘవులు తెలిపారు. నకిలీ సర్టిఫికెట్ల కేసులో మిర్యాలగూడ వాసి అరెస్ట్ఫ రిమాండ్‌కు తరలించిన గద్వాల పోలీసులు మిర్యాలగూడ అర్బన్: నకిలీ సర్టిఫికెట్ల కేసులో మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన మాజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణను గద్వాల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గద్వాలకు చెందిన వ్యక్తి అగ్రికల్చర్ చదవకుండా చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు చూపించి వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందగా.. అతడితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని గతంలోనే పోలీసులను అరెస్టు చేయగా.. వారికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించిన బాలకృష్ణను కూడా బుధవారం మిర్యాలగూడ నుంచి తీసుకెళ్లిన గద్వాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై గద్వాల పోలీసులు బాలకృష్ణను పోలీస్ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేనున్నట్లు తెలిసింది. శివాలయంలో బయల్పడిన శివలింగం, వెండి కన్నుచండూరు: చండూరు మండలం చామలపల్లిలో గల పురాతన శివాలయం పునర్నిర్మాణంలో భాగంగా బుధవారం గ్రామస్తులు పనులు చేస్తుండగా శివలింగంతో పాటు వెండి కన్ను బయల్పడ్డాయి. దీంతో గ్రామస్తులు ప్రముఖ చరిత్రకారుడు ఎస్. లింగమూర్తికి సమాచారం అందించగా.. ఆయన వచ్చి పురాతన శివాలయాన్ని పరిశీలించారు. 9వ శతాబ్దం ప్రారంభంలో దేవాలయం నిర్మించారని, ఆనాడు మత ఘర్షణల కారణంగా గర్భగుడిలోని విగ్రహాలపై కప్పును తీసి వేశారని లింగమూర్తి వివరించారు. అప్పటి వస్తువులే ఇప్పుడు లభించాయన్నారు. -
నేడే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 77 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. 4 గంటల్లోపు పోలింగ్ కేంద్రం గేటు లోపల ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. నాలుగు గంటల తరువాత వచ్చే వారిని అనుమతించరు. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది పోటీలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరిన పోలింగ్ సిబ్బంది నల్లగొండ జిల్లా కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను రెండు రోజులుగా ముందుగానే అధికారులు ఆయా జిల్లాలకు తీసుకెళ్లారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బుధవారం పోలింగ్ బ్యాలెట్ బాక్సులతోపాటు బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామగ్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో పోలీసుల భద్రత నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించారు. బాక్సులన్నీ నల్లగొండకే.... పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులన్నీ నల్లగొండలోని ఆర్జాలబావి రిసెప్షన్ సెంటర్‌కు వస్తాయి. 27వ తేదీన రాత్రి 8 గంటల నుంచి పోలింగ్ బాక్సులు రిసెప్షన్ సెంటర్‌కు చేరుకుంటాయి. మరుసటి రోజు (28వ తేదీ) ఉదయం వరకు వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి కొన్ని పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌కు చేరే అవకాశం ఉంది. గట్టి బందోబస్తు మధ్య పోలింగ్ బాక్సులను నల్లగొండకు తెప్పించనున్నారు. ఆర్జాలబావి గోదాములోని స్ట్రాంగ్ రూమ్‌ల్లో రాజకీయ ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచనున్నారు. వచ్చే నెల 3వ తేదీన నల్లగొండలోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మూడు జిల్లాల్లో ఓటర్లు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 8,331 మంది ఉన్నారు. వీరిలో నల్లగొండ జిల్లాలో 4,683 మంది , సూర్యాపేట జిల్లాలో 2664 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 984 మంది ఓటర్లు ఉన్నారు. ఫ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు ఫ 72 సాధారణ, 5 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఫ ఉమ్మడి జిల్లాలో ఓటర్లు 8,331 మంది -
పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉంటుందని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ పి. రాంబాబు సూచించారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్లు తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. దానిలో భాగంగా సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం , రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. అదేవిధంగా శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతోమహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాబాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు. రాచకొండ పర్యాటక ఉత్సవాలు ప్రారంభంసంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ పర్యాటక ఉత్సవాలు బుధవారం రాచప్ప కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యాయి. ఎస్ఐ జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. రాచకొండ చరిత్రను తెలియజేసే ఫొటో గ్యాలరీ ఆకట్టుకుంది. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
ఎల్ఆర్ఎస్కు రాయితీ
ఫ క్రమబద్ధీకరణ ఫీజు, ఖాళీ స్థలాల చార్జీల్లో 25 శాతం రాయితీ కల్పించిన ప్రభుత్వం ఫ మార్చి31వరకు ప్రక్రియ పూర్తి చేసుకుంటేనే ప్రయోజనం ఫ ఐదు మున్సిపాలిటీల పరిధిలో 52,394 దరఖాస్తులు పెండింగ్ తిరుమలగిరి (తుంగతుర్తి): జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (ఎల్ఆర్ఎస్) పరిష్కార ప్రక్రియ వేగవంతం కానుంది. నాలుగు సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా క్షేత్ర స్థాయిలో ఆశించిన స్థాయిలో స్పందన లేక పోవడంతో ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరణ ఫీజు, ఖాళీ స్థలాల చార్జీలకు 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు స్పందన అంతంతే.. 2020లో అప్పటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఆ తరువాత వాటిని పరిష్కరించకుండా వదిలేయడంతో గత ఏడాది నుంచి మళ్లీ చర్యలు ప్రారంభించారు. అయినా దరఖాస్తుదారుల్లో ఆసక్తి కనిపించకుండా పోయింది. మున్సిపాలిటీ అధికారులు ఫోన్లు చేసి స్థలాలు చూపించాలని కోరుతున్నా దరఖాస్తుదారులు పట్టించుకోలేదు. ఫీజు చెల్లించే వారే రాక పోవడంతో ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ఆలోచన చేసి ఎలాగైనా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ఆలోచించి వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. రాయితీ అవకాశం రావడంతో ఇప్పుడిప్పుడే వారు ముందుకు వస్తున్నారు. దృష్టి సారిస్తే ఆదాయం మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఆర్ఎస్పై దృష్టి సారిస్తే భారీ ఆదాయం సమకూరనుంది. ఫీజుతో పాటు ఎల్ఆర్ఎస్ కటాఫ్ తేదీ నాటికి మార్కెట్ విలువలో 14 శాతం ఖాళీ స్థలాల చార్జీలపై ఈ రాయితీ లభించనుంది. ప్రభుత్వ ప్రకటనతో దరఖాస్తుదారులు చెల్లించాల్సిన మొత్తంలో 4వ వంతు మినహాయింపు వచ్చినట్లేనని చెబుతున్నారు. మార్చి 31 లోపు చెల్లించే వారికే 25 శాతం రాయితీ వర్తించనుంది. ఆ తరువాత వారికి రాయితీ రాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 32 రోజులే సమయం..జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల పరిధిలో 65,209 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 12,815 దరఖాస్తులు పరిష్కారం అయ్యాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు సరైన ఆధారాలు చూపి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డబ్బులు చెల్లించి స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చు. 25 శాతం రాయితీని పొందవచ్చు. మున్సిపాలిటీలు ఐదు వచ్చిన దరఖాస్తులు 65,209 పరిష్కారం అయినవి 12,815 పెండింగ్‌లో ఉన్నవి 52,394 -
ట్యాబ్‌లతో బోధన
చిలుకూరు: విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలలకు కంప్యూటర్ల సరఫరాను ప్రారంభించగా , జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులను సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి శ్రీ యోజన (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా పథకం)లో భాగంగా విద్యార్థులకు సరి కొత్తగా ట్యాబ్‌ల ద్వారా బోధన చేయనున్నారు. బోర్డుపై బోధించే అంశాలను నేరుగా చూసేలా ఈ అవకాశం కల్పించనున్నారు. ఇందుకు కోసం ఎంపికై న ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్‌లు త్వరలో పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 550 ట్యాబ్‌లు.. పీఎంశ్రీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రారభించింది. ఈ పథకం కింద ఎంపికై న పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. 2026–27 నాటికి ఎంపికై న పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి హంగులు సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ పథకం కింద నిధులు మంజూరు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 950 ప్రభుత్వ పాఠశాలలు, 9 మోడల్ స్కూళ్లు, 18 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో మొదటి విడతలో ఈ పథకం కింద 22 పాఠశాలలు, రెండో విడతలో తొమ్మిది పాఠశాలలు ఇలా మొత్తం 31 పాఠశాలలు ఎంపికయ్యాయి. ప్రస్తుతం మొదటి విడతలో ఎంపికై న 22 పాఠశాలలకు ఒక్కో బడికి 25 ట్యాబ్‌ల చొప్పున 550 ట్యాబ్‌లు సరఫరా చేయనున్నారు. వీటిని 8,9,10 తరగతుల విద్యార్థులకు అందించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటి ద్వారా పాఠాలు బోధించనున్నారు. పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలను ఈ ట్యాబ్‌లలో విద్యార్థులకు చూపించనున్నారు. ఫ పీఎంశ్రీ కింద మొదటి విడత ఎంపికై న 22 స్కూళ్లకు త్వరలో ట్యాబ్‌లు ఫ ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్‌లు ఫ వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు -
ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు
ఫోన్ పే, గూగుల్ పే ద్వారా టికెట్లు తీసుకునే సౌకర్యం ఐదు డిపోలకు ఐ–టిమ్స్ వచ్చాయి నల్లగొండ రీజియన్ పరిధిలోని దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ, కోదాడ డిపోలకు మొదటి విడతలో 310 ఐ– టిమ్స్ వచ్చాయి. సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి డిపోలకు రెండవ విడతలో వస్తాయి. ఐ– టిమ్స్‌ను వచ్చే నెలలో అమలులోకి తెస్తాం. దూర ప్రాంతాలతో పాటు ప్రధాన కేంద్రాలకు ముందుగా అమలు చేస్తాం. ఆ తరువాత అన్ని బస్సుల్లో పూర్తిస్థాయిలో ఐ– టిమ్స్‌ను అందుబాటులోకి తెస్తాం. – కొణతం జాన్‌రెడ్డి, ఆర్ఎం నల్లగొండ మొదటి విడతలో వచ్చిన ఐ – టిమ్స్ డిపో ఐ – టిమ్స్ దేవరకొండ 80 మిర్యాలగూడ 50 నల్లగొండ 100 కోదాడ 80 మొత్తం 310 ●మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ) బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తేనుంది. ఆర్టీసీ బస్సుల్లో ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ (ఐ– టిమ్స్)ను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. బస్సుల్లో నగదు చెల్లించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బస్సు పాస్ కౌంటర్లల్లో మాత్రమే డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి బస్సులతో పాటు టికెట్ రిజర్వేషన్ కేంద్రాలు, అదీకృత టికెట్ బుకింగ్ ఏజన్సీల్లోనూ డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించాలని సంస్థ భావిస్తోంది. ఫ ఆన్లైన్ రిజర్వేషన్, స్వైపింగ్ సౌకర్యం కూడా.. ఫ తొలి విడతలో 310 ఐ – టిమ్స్ కొనుగోలు చేసిన సంస్థ ఫ మార్చి మూడవ వారం నుంచి ప్రవేశపెట్టే అవకాశం 15 నిమిషాల ముందు వరకు ఆన్లైన్ రిజర్వేషన్ ప్రస్తుతం దూర ప్రాంతాలకు బయలుదేరే సర్వీసులకు బస్సులు బయలుదేరే గంట ముందు ఆన్లైన్ రిజర్వేషన్లు నిలిపివేస్తున్నారు. ఈ ఐ–టిమ్స్‌తో ఇక ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. బస్సు మొదటి స్టేజి నుంచి ప్రారంభమయ్యాక ఆ మార్గంలో తరువాత వచ్చే స్టాప్‌లో బస్సులు ఎక్కదలుచుకున్న ప్రయాణికులు ఆన్లైన్లో 15 నిమిషాల ముందు వరకు టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఎంత సమయంలో బస్సు వారి స్టాప్‌కు వస్తుందనే సమాచారం కూడా ఈ ఐ–టిమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఐ – టీమ్స్‌లోని సాంకేతికత ఆధారంగా ఎప్పటికప్పుడు లోకేషన్ నిర్ధారణ అవుతుంది. ప్రయాణికులు బస్సెక్కిన వెంటనే రానున్న లోకేషన్‌కు అనుగుణంగా టికెట్ ఇష్యూ అవుతుంది. ఐ–టీమ్స్ (ఇది స్వైపింగ్ మిషన్లా కూడా పని చేస్తుంది) ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డులతో కూడా చార్జి చెల్లించవచ్చు.పరిశీలనలో ఐ–టిమ్స్ నల్లగొండ రీజియన్ పరిధిలో యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండలో డిపోలు ఉండగా.. మొదటి విడతలో 310 వరకు ఐ–టిమ్స్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం వాటి పరిశీలన తుది దశలో ఉంది. కొద్దిపాటి మార్పుల అనంతరం మార్చి మూడవ వారం నుంచి బస్సుల్లో వీటిని అందుబాటులోకి తేనున్నారు. -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రోజువారీ పూజా కార్యక్రమంలో ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలను అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ముఖమండపంలోని ఉత్సవమూర్తులకు మూర్తులకు అష్టోత్తర పూజలు, ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
పోలింగ్‌కు 300మంది పోలీసులతో బందోబస్తు
ఫ ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ సూర్యాపేటటౌన్ : జిల్లాలో ఈ నెల 27న జరిగే ఖమ్మం– వరంగల్–నల్లగొండ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 23 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సామగ్రికి రక్షణ, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రణాళిక ప్రకారం విధులు నిర్వర్తించాలని పోలీసు సిబ్బందికి, అధికారులకు సూచించారు. పోలీస్ పహారా నడుమ పోలింగ్ సామగ్రి తరలిస్తామని ఏమైనా ఇబ్బందులు వస్తే అధికారులతో పాటు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులకు సమాచార ఇవ్వాలని కోరారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు క్యూ లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు పోలింగ్ బూత్ అధికారి అనుమతి లేకుండా బూత్ లోకి వెళ్లవద్దని కోరారు. ఇతరులను పోలింగ్ బూత్ లోకి అనుమతించవద్దని సూచించారు. ఏడు రూట్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, 23 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, 8 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేనినట్లు తెలిపారు. పోలింగ్ బూత్ ల వద్ద స్టాటిస్టికల్ సిబ్బంది ఉంటారని, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఓటర్లు నిబంధనలు పాటించాలని కోరారు. ఓటరు గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని, క్యూ లైన్లో నిల్చొని ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. సెల్ ఫోన్‌న్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు పోలింగ్ బూత్ లోకి అనుమతి లేదని తెలిపారు. 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ (144సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పోలింగ్ బూత్ వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. -
భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను తరలిస్తాం
పోలింగ్ పూర్తయిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి పోలీస్ భద్రత నడుమ నల్లగొండలోని రిసెప్షన్ సెంటర్‌కు బ్యాలెట్ బాక్స్‌లను తరలిస్తాం. పోలింగ్ కేంద్రాల ఎన్నికల సిబ్బంది 27వ తేదీ రాత్రి వరకు రిసెప్షన్ సెంటర్‌కు బ్యాలెట్ బాక్సులను తెస్తారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాజేడు తదితర దూర ప్రాంతాల నుంచి వాహనాలు వచ్చేందుకు 28వ తేదీ ఉదయం వరకు సమయం పట్టవచ్చు. ఏ వాహనం కూడా పోలింగ్ స్టేషన్ నుంచి బయల్దేరిన తర్వాత మధ్యలో ఆపడానికి వీల్లేదు. వాహనాల రాకను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశాం.