Vikarabad
-
‘యూడీఐడీ’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
అనంతగిరి: ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం)కార్డు కోసం యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సదరం క్యాంపుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యూడీఐడీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు. క్యాంపుల వివరాలను మెసేజ్‌ల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి వెంకటరవణ, డీసీఎచ్ఎస్ ప్రదీప్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, సూపరింటెండెంట్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
చట్టాలపై అవగాహన అవసరం
అనంతగిరి: చట్టాలపై యువతీ యువకులకు అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని తక్షశిల డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత సన్మార్గంలో పయనించాలన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధనకు నిరంతరం శ్రమించాలన్నారు. కష్టపడితే ఏదైన సాధ్యమన్నారు. ర్యాష్ డ్రైవ్ చేసి ప్రమాదాలకు గురికావొద్దని సూచించారు. సమాజ సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బాల్యవివాహాలు చేయడం నేరమన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేష్, శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ భూమయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ -
మిగిలింది
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 202510లోuవికారాబాద్: జిల్లాలో ఉపాధి హామీ పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా కనిపించడం లేదు. 2024 – 25 ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో పూర్తి కావస్తున్నా మంజూరైన పనుల్లో సగం కూడా పూర్తి చేయలేకపోయారు. జిల్లాకు 811 పనులు.. రూ.54.28 కోట్లు మంజూరయ్యాయి. సకాలంలో నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది. గతేడాది కూడా వందశాతం లక్ష్యం చేరుకోలేకపోయారు. ఈ నెల చివరి నాటికి పనులన్నీ ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్లకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. 492 పనులు పూర్తి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ శాతం సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 75 శాతం మేర పనులను ప్రారంభించారు. ఇందులో 50 శాతం అంటే 492 పనులను పూర్తి చేశారు. మరో 50 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. వారం రోజుల్లో మిగిలిన పనులన్నింటినీ ప్రారంభించి 20 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో పనుల బాధ్యత అధికారులపైనే పడింది. కార్యకర్తలకే పనుల బాధ్యతలు ఉపాధి హామీ పథకం పనులు వందల్లో.. సమయం రోజుల్లో ఉండటంతో వాటిని ఎలా పూర్తి చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తుండటంతో క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేల సూచనల మేరకు అధికారులు పార్టీ కార్యకర్తలకు పనులు అప్పగిస్తున్నారు. వీరికి అధికారికంగా ఏ బాధ్యతలు లేకపోవటంతో ఒత్తిడి చేయలేకపోతున్నారు. ఒకవేళ పనులు పూర్తి చేయాలని తొందరపెడితే నాణ్యత పాటిస్తారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. గతేడాది కూడా ఇదే తరహాలో హడావుడి చేసినా చాలా వరకు పనులు మిగిలి పోయాయి. ప్రత్యేక అనుమతులు తీసుకొని పనులను పూర్తి చేయాల్సి వచ్చింది. న్యూస్‌రీల్ రోజులే.. ఈ నెల చివరి నాటికి ముగియనున్న ఉపాధి హామీ పనుల గడువు జిల్లాకు మంజూరైన పనులు 811 ఖర్చు చేయాల్సిన నిధులు రూ.54.28 కోట్లు ఇప్పటి వరకు పూర్తి చేసింది 50శాతమే నాణ్యత విషయంలో రాజీ పడం ఉపాధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సకాలంలో పూర్తయ్యేలా చూస్తాం. ఇప్పటికే చాలా పనులు పూర్తయ్యాయి. నాణ్యత విషయంలో రాజీ పడం. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. – ఉమేశ్, పీఆర్ ఈఈ, వికారాబాద్ -
అసమానతలు లేని ఆర్థిక వ్యవస్థ కావాలి
తుక్కుగూడ: దేశంలో ఆర్థిక లేని వ్యవస్థ కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆపార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం తుక్కుగూడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సెమినార్ నిర్వహించారు. అంతకు ముందు కార్మికులు, కర్షకులతో కలిసి ఔటర్ రింగు రోడ్డు హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుపేదల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందన్నారు. ఇదే సమయంలో కార్పొరేట్ శక్తుల ఆదాయం వంద రెట్లు పెరిగిందని ఆరోపించారు. దేశంలో జీఎస్టీ వసూలు పేరుతో పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖనిజ సంపదను పూర్తిగా బడా కంపెనీలకు దోచి పెడుతున్నారన్నారు. మతతత్వ బీజేపీపై పోరాడేందుకే తాము కాంగ్రెస్ పార్టీతో జత కట్టామని స్పష్టంచేశారు. దేశంలోని నిరుపేదలు, కార్మికులు, కర్షకుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని వెల్లడించారు. ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులపై దాడులు, హత్యలు జరుగుతునయన్నారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకులు జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, నాయకులు పుస్తకాల నర్సింగ్‌రావు, పానుగంటి పర్వతాలు, యాదిరెడ్డి, దత్తునాయక్, నర్సింహ్మ, యాదయ్య, పార్టీ శ్రేణులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
మైసమ్మ సన్నిధిలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు కడ్తాల్ మండల కేంద్రంలో హుస్సేన్‌నాయక్‌కు బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు దోనాదుల మహేశ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో లయన్స్‌క్లబ్ ఆఫ్ ఆమనగల్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాగి అంబలి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కల్యాన్నాయక్, జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు సాయిలాల్‌నాయక్, జిల్లా నాయకులు రాందాస్‌నాయక్, భగీరథ్, శ్రీశైలంగౌడ్, కుమార్, మునేశ్, రెడ్యానాయక్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘యూడీఐడీ’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
అనంతగిరి: ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం)కార్డు కోసం యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సదరం క్యాంపుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యూడీఐడీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు. క్యాంపుల వివరాలను మెసేజ్‌ల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి వెంకటరవణ, డీసీఎచ్ఎస్ ప్రదీప్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, సూపరింటెండెంట్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ -
కాగితాల్లోనే కళాశాల
వికారాబాద్: పై ఫొటోలో కనిపిస్తున్న భవనం యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామ శివారులోని డైట్ కళాశాల. రికార్డుల్లో మాత్రం ఇక్కడ డైట్ మొదటి, రెండో సంవత్సరం తరగతులు కొనసాగుతున్నట్లు లెక్క. గత ఏడాది ఈ కళాశాలలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు ప్రస్తుతం సెకెండ్ ఇయర్లో ఉండగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 50 మంది ఛాత్రోపాధ్యాయులు అడ్మిషన్ తీసుకున్నట్టు రికార్డుల్లో ఉంది. మూడు నెలలుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఒక్క రోజు కూడా క్లాసులు జరిగిన దాఖలాలు లేవు. ఇంకా చెప్పాలంటే కళాశాల గేటుకు తాళం తీసింది కూడా లేదు. ప్రస్తుతం బెల్డింగ్ మొత్తం బూజు, దుమ్ము, ధూళి, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డైట్ కళాశాలకు అనుమతులు పొందాలంటే నిర్వాహకులు రూ.12 లక్షల ఎఫ్డీలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ లేకుండానే పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఓ సామాజిక కార్యకర్త ఎస్ఈఆర్టీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణకు ఆదేశించారు. విషయం డైట్ కళాశాల నిర్వాహకులకు తెలియడంతో శుక్రవారం వారు కాలేజీకి చేరుకొని పిచ్చి మొక్కలను తొలగించారు. తరగతి గదులను శుభ్రం చేశారు. రెండు మూడు రోజుల్లో అధికారులు విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో విద్యార్థులను కూడా తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. శిక్షణ పొందకుండానే సర్టిఫికెట్లు జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ రికార్డులకే పరిమితమైంది. ఎలాంటి తరగతులు నిర్వహించకుండానే ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేస్తున్నారు. ఎప్పటికప్పడు పర్యవేక్షించాల్సిన అధికారులు డైట్ కళాశాలల నిర్వాహకులతో కుమ్మకై ్క విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు రిపోర్టులు ఇస్తున్నారు. అంతేకాకుండా పాడుబడిన భవనంలో కళాశాలను నిర్వహిస్తున్నారు. భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కళాశాల ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలతో నిండి విష సర్పాలకు నిలియంగా మారింది. ఇక తరగతి గదుల విషయానికి వస్తే గోడలకు పగుళ్లు.. బూజు పట్టి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 8 డైట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రభుత్వ కళాశాల కాగా ఏడు ప్రైవేట్‌వి. వీటిలో సమారు వెయ్యి మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న వికారాబాద్ డైట్ కళాశాల నిర్వహణ కాస్త మెరుగ్గా ఉండగా ప్రైవేట్ కళాశాలల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. మూడు నెలల క్రితమే ఉపాధ్యాయ శిక్షణ తరగతులు ప్రారంభం బోధన చేయకుండానే శిక్షణ ఇస్తున్నట్లు ప్రచారం ఇదీ యాలాల మండలంలో డైట్ కళాశాల పరిస్థితి ప్రిన్సిపాల్ సూచనల మేరకే రిపోర్టు ఇచ్చాం ఈ విషయమై వికారాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. జిల్లాలో ప్రైవేటు డైట్ కళాశాలల ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యుడు రామ్‌రెడ్డిని వివరణ కోరగా.. తాను యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామ శివారులోని డైట్ కళాశాలను తనిఖీ చేసి రిపోర్టు ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ కళాశాల ప్రిన్సిపాల్ రామాచారి సూచనల మేరకే రిపోర్టు ఇచ్చాం అని తెలిపారు.కఠిన చర్యలు తీసుకోవాలి అడ్మిషన్లు తీసుకొని తరగతులు నిర్వహించని యాలాల మండలంలోని డైట్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు లేకున్నా ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చిన అధికారులపై వేటు వేయాలి. కళాశాల నిర్వహించడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. విద్యార్థులు నష్టపోకుండా వారిని వేరే కళాశాలకు షిఫ్ట్ చేయాలి. – దిడ్డికాడి గోపాల్, సామాజిక కార్యకర్త -
ఆరోగ్యమే మహాభాగ్యం
తాండూరు టౌన్: ఆరోగ్యమే మహాభాగ్యమని, వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఆర్టీ ప్రతినిధి డాక్టర్ సమీవుల్లా అన్నారు. మంగళవారం సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో తాండూరు పరిధిలోని ఐకేపీ, మెప్మా, డ్వాక్రా సహాయ సంఘాల మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 80 మందికి బీపీ, షుగర్, టీబీ వంటి వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఏడాదిలో రెండు సార్లయినా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఏదైనా వ్యాధి బారిన పడితే వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఆనంద్‌గోపాల్, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సమీవుల్లా, మెప్మా అధికారి రాజేంద్రప్రసాద్, ఐసీఎన్ కృష్ణవేణి, కౌన్సిలర్ పర్వతాలు, ఓఆర్డబ్ల్యూ ప్రకాష్, అనంతప్ప, నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరులు పాల్గొన్నారు. ఏఆర్టీ ప్రతినిధి డాక్టర్ సమీవుల్లా -
ఇసుక పర్మిట్లు రద్దు
తాండూరు రూరల్: తాండూరు మండలంలో ఇసుక అక్రమ రవాణాపై మంగళవారం సాక్షి దినపత్రికలో అంగట్లో పర్మిట్లు అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఖాంజాపూర్ వాగు నుంచి ఇసుక పర్మిట్లను రెవెన్యూ అధికారులు రద్దు చేశారు. అలాగే పాత ప్రొసీడింగ్ కాపీలు చూపి ఇసుక అనుమతులు పొందిన ట్రాక్టర్ల యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇసుక అక్రమ దందాపై స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీశారు. రెవెన్యూ కార్యాలయానికి వచ్చి వివరాలు సేకరించారు. ఈ విషయమై మంగళవారం తహసీల్దార్ తారాసింగ్ మీడియాతో మాట్లాడారు. పాత ప్రొసీడింగ్ కాపీలతో ఇసుక పర్మిషన్ పొందిన ట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతామని తెలిపారు. ఇకపై అభివృద్ధి పనులకు సంబంధించి ఇసుక పర్మిషన్లు ఇచ్చే సమయంలో తమ కార్యాలయ సిబ్బందితో విచారణ చేసిన తర్వాలే అనుమతులు ఇస్తామని తెలిపారు. అక్రమంగా ఇ సుక రవాణా చేసిన ట్రాక్టర్ల (ఏపీ 07 టీహెచ్ 359 4,ఏపీ 28 డీడీ 6985,టీజీ 34 టీఆర్ 1913, టీఎస్ 15 యూఏ 8203,టీఎస్ 15 యూఏ 1435) యజమానులపై పోలీసులకు ఫి ర్యాదు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా కొందరు చేసే పనుల కారణంగా పార్టీ, ప్రభుత్వం బద్నాం అవుతోందని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ల యజమానులు వారిపై కేసులు పెట్టకుండా రాజకీయ నాయకుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. -
17న ఆలయ భూములకు కౌలు వేలం
ఈఓ నరేందర్ మోమిన్‌పేట: మండలంలోని ఆలయ భూములను కౌలుకు ఇచ్చేందుకు ఈ నెల 17న వేలం నిర్వహించనున్నట్లు ఈఓ నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోమిన్‌పేటలోని బాలజీ, మాణిక్ ప్రభు, విఠలేశ్వర స్వామి ఆలయ భూములను మూడు సంవత్సరాలపాటు సాగు చేసుకునేందుకు కౌలుకు ఇస్తామని తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలనుకునే రైతులు రూ.3 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11గంటలకు మాణిక్ ప్రభు ఆలయంలో వేలం పాట నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రూప్ –2 ఫలితాల్లో మెరిసిన తిర్మలాపూర్ వాసి 26వ ర్యాంక్ సాధించిన రాఘవేందర్ గౌడ్ కుల్కచర్ల: తెలంగాణ గ్రూప్ –2 పరీక్ష ఫలితాల్లో కుల్కచర్ల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రాఘవేందర్ గౌడ్ 26వ ర్యాంక్ సాధించారు. మంగళవారం మధ్యాహ్నం టీజీపీఎస్సీ గ్రూప్–2 ఫలితాలను విడుదల చేసింది. తిర్మలాపూర్‌కు చెందిన బల్ల రవీందర్ కుమారుడు రాఘవేందర్ ఉత్తమ ర్యాంక్ సాధించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందనలు తెలిపారు. హామీలు అమలు చేయాలి హామీలు అమలు చేయాలి దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ పరిగి: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా హామీలను అమలు చేయడం లేదన్నారు. పింఛను మొత్తాన్ని వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులకు రూ.4వేలు ఇవ్వాలని కోరారు. కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం రూ.1.10 లక్షల నగదు అందజేసిన సబ్ డివిజన్ పోలీసులు తాండూరు టౌన్: గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి సబ్ డివిజన్ పోలీసులు ఆర్థిక సాయం అందజేశారు. మంగళవారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు రూ.1.10 లక్షల నగదు అందజేశారు. పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే కావలి రవీందర్ ఆరు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఎదురైనా తోడుగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో తాండూరు రూరల్ సీఐ నగేష్, ఎస్సైలు గిరి, విఠల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పెద్దేముల్ పోలీసులు మాసయ్య, ముంతాజ్, పర్వీన్ పాల్గొన్నారు. దరఖాస్తుల గడువు పొడిగింపు ఉస్మానియాయూనివర్సిటీ: ఓయూ కేటగిరి–2 పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. రూ.2000 అపరాధ రుసుముతో ఈ నెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.పాండురంగా రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఈ నెల 11తో గడువు ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తేదీ పొడిగించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్–2025కు ఇంత వరకు 9500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. -
ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు
బంజారా హిల్స్: పంజాగుట్ట చౌరస్తా నుంచి అమీర్‌పేట వరకు రోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలు, డబ్బాలను పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్లో భాగంగా మంగళవారం తొలగించారు. వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ పర్యవేక్షణలో పంజగుట్ట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా..ట్రాఫిక్ పోలీసులు సుమారు 70 ఆక్రమణలను ఈ సందర్భంగా తొలగించారు. దీంతో పాదచారులు, వాహనదారులు తేలికగా ముందుకు సాగడానికి అవకాశం ఏర్పడింది. గత కొన్నాళ్లుగా పంజగుట్ట– అమీర్‌పేట రోడ్డుకు రెండు వైపులా ఫుట్‌పాతల ఆక్రమణలతో రోడ్డు కుదించుకుపోయింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఫిర్యాదులు అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వీటిని తొలగించారు. -
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
నవాబుపేట: మండలంలోని చించల్ పేట గ్రామంలో ఊరడమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, నాయకులు అశోక్, శంకరయ్య, అనంతరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడవికి నిప్పు దుద్యాల్: మండల పరిధిలోని రోటిబండ తండా సమీపంలోని అడవికి గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం నిప్పు పెట్టారు. లగచర్ల నుంచి రోటిబండ తండాకు వెళ్తున్న మార్గంలో పల్లె ప్రకృతివనం దగ్గరలోని పొలాలను అనుకుని సాధారణ అడవి ఉంది. పంటల కాలం పూర్తవ్వడంతో పంటల వ్యర్థాలు, పిచ్చిగడ్డి పూర్తిగా ఎండిపోయింది. దీంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అగ్గి రాజుకుంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ప్రజలు నిస్తూరంగా చూస్తున్నారే తప్పా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సంబంధిత అధికారులు అడవులపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ కుల్కచర్ల: తాళం వేసిన ఇంట్లో చోరీ చేసిన ఘటన కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల గ్రామానికి చెందిన అమీనా బేగం నగరంలోని ఉప్పల్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గ్రామానికి వచ్చిన ఆమె ఈ నెల 10న ఉప్పల్‌లో రంజాన్ కానుకగా కుట్టు మిషన్లు ఇస్తున్నారని తెలిసి ఈ నెల 9న కూతురు ఆసియాను తీసుకొని నగరానికి వెళ్లింది. అయితే కుట్టు మిషన్ల పంపిణీ వాయిదా పడటంతో కూతుర్ని 10వ తేదీ కుల్కచర్లకు పంపింది. ఆసియా గ్రామానికి వచ్చి చూడగా ఇంటి, బీరువా తాళాలు పగు లగొట్టినట్లు గుర్తించి తల్లికి ఫోన్ ద్వారా తెలియజేసింది. మంగళవారం అమీనా బేగం గ్రా మానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటిలో ఉన్న తులం బంగారం, 20 తులా ల వెండి చోరీకి గురైనట్లు ఫిర్యాదు పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న కలప లారీ సీజ్ దోమ: అక్రమంగా తరలిస్తున్న కలప లారీని ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. మంగళవారం దోమ మండల పరిధిలోని గుండాల గ్రామ సమీపంలో కొందరు వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కలప తరలిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ఘటన స్థలానికి వెళ్లిన ఫారెస్ట్ అఽధికారులు లారీకి సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరారు. ఈ క్రమంలో వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో లారీని సీజ్ చేసి ఫారెస్ట్ కార్యాలయానికితరలించారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల సెక్షన్ ఆఫీసర్ మైనోద్దీన్, బీట్ ఆఫిసర్ భీమ్లా, సిబ్బంది బాబు తదితరులు పాల్గొన్నారు. -
పాత్రికేయులు క్రమశిక్షణతో మెలగాలి
శంకర్పల్లి: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు సైతం క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉందని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ఐజేయూ ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం శంకర్పల్లి మండలం ప్రొద్దటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో టీయూడబ్ల్యూజే జిల్లా ద్వితీయ మహాసభలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. ఈ జర్నలిస్ట్ యూనియన్ 1957లో ప్రారంభించారని, ప్రస్తుతం ఎన్ని కొత్త యూనియన్లు వచ్చినా.. పద్ధతి ప్రకారం నడిచేది టీయూడబ్ల్యూజే మాత్రమేనని స్పష్టం చేశారు. నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కల్గిస్తోందని, యూనియన్ల ప్రతిష్టను దిగజార్చుతుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు హామీలు ఇవ్వడం తప్ప.. అమలు చేసింది లేదన్నారు. బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులతో తనకు అనుబంధముందని, ఇదే ధోరణిని మున్ముందు కొనసాగిస్తానని తెలిపారు. అనంతరం వివిధ ప్రతికల్లో 25 ఏళ్లకు పైగా సేవలందించిన పాత్రికేయులందరికీ టీయూడబ్ల్యూజే తరఫున సన్మానించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు సలీం పాషా పాల్గొన్నారు. ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ టీయూడబ్ల్యూజే జిల్లా ద్వితీయ మహాసభలు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా సలీం పాషా టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా శంకర్పల్లి పట్టణానికి చెందిన ఎండీ.సలీం పాషా, ప్రధాన కార్యదర్శిగా మేకల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ద్వితీయ మహాసభల్లో ప్రకటించారు. జర్నలిస్టు నాయకులు సలీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది వరకు అధ్యక్షుడిగా పని చేసిన శ్రీకాంత్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. -
పరిగిని రెవెన్యూ డివిజన్ చేయాలి
పరిగి: పరిగి నియోజవర్గాన్ని నూతన రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని టీజేఏసీ జిల్లా చైర్మన్ ముకుందనాగేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ఆయా మండలాల టీజేఏసీ, నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పరిపాలన సౌలభ్యం కోసం అవకాశం ఉన్న గ్రామాలను కలిపి నూతన మండలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూడూర్ మండలంలో కంకల్, దోమలో దాదాపూర్, దిర్సంపల్లి, గండ్వీడ్ మండలంలో వెన్నచేడ్, చౌడాపూర్‌లో మరికల్ గ్రామాలను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాక నియోజకవర్గంలోని చాలా గ్రామాలు అనుబంధ గ్రామాలుగా ఉండి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో పరిగి అభివృద్ధికి ఇచ్చిన హామీలను వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ, ప్రజా సంఘాల నాయకులు గోపాల్‌రెడ్డి, గోవింద్‌నాయక్, భానుప్రకాశ్, రవీందర్, వెంకట్రాములు, కృష్ణయ్య, రమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. టీ జేఏసీ జిల్లా చైర్మన్ ముకుందనాగేశ్వర్ -
బంధువుల ఇంటికి వెళ్లి దారితప్పిన మహిళ
తాండూరు రూరల్: బంధువుల ఇంటికి వెళ్లిన ఓ మహిళ దారి తప్పిపోయింది. అటవీ ప్రాంతాంలో చిక్కుకోవడంతో ఉపాధి కూలీలు గుర్తించారు. ఆమె వివరాలు తెలుసుకుని గ్రామస్తులకు తెలపడంతో క్షేమంగా ఇంటికి చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..తాండూరు మండలం చెన్‌గేస్‌పూర్ అనుబంధ గ్రామం కోనాపూర్‌కు చెందిన మాల ఇందిరమ్మ చెంగోల్లోని బంధువుల ఇంటికి సోమవారం వెళ్లింది. తిరిగి బైపాస్‌రోడ్డు నుంచి గౌతపూర్ చౌరస్తాకు వెళ్లి అక్కడి నుంచి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒంటరిగా వెళ్తున్న ఇందిరమ్మ దారి తప్పింది. గోట్లపల్లి అటవీప్రాంతంలో చిక్కుకుంది. అంతారం గ్రామ ఉపాధి కూలీలు ఆమెను గుర్తించి వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం కోనాపూర్ గ్రామస్తులకు సమాచారం చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు వచ్చి ఇందిరమ్మను కోనాపూర్‌కు తీసుకెళ్లారు. ఉపాధి కూలీల సమాచారంతో ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు -
విద్యార్థుల సామర్థ్యం పరిశీలన
కొడంగల్ రూరల్: జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. మంగళవారం మండల పరిధిలోని హుస్సేన్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ టీమ్ జైన్ డైట్ ఫీల్డ్ ఇన్వెస్ట్రిగేటర్ మమత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎన్సీఈఆర్టీ చేపట్టిన అధ్యయనం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 50 ప్రభుత్వ పాఠశాలల్లో మూడు రోజులపాటు సర్వే కొనసాగుతుందన్నారు. లోపాలను గుర్తిస్తూ ప్రణాళికల రూపకల్పనకు సర్వే వేదికవుతుందన్నారు. ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా ఫీల్డ్ ఇన్వెస్ట్రిగేటర్స్ విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తూ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలను చదవడం, రాయడం, అక్షరాలు, అంకెలు గుర్తించడం, అవగాహన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారన్నారు. 10వ తేదీన తెలుగు, 11న ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించిన సర్వే పూర్తయ్యిందని తెలి పారు. 12వ తేదీన గణితం సబ్జెక్టుకు సంబంధించి సర్వే నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం క్రాంతికుమార్ పాల్గొన్నారు. -
నియోజకవర్గానికి 3,500 ఇళ్లు
పరిగి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో నియోజవకర్గంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి అర్హుల జాబితాను కమిటీ సభ్యులు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎవరికి ఇల్లు అవసరం అనేది గ్రామ స్థాయి నాయకులకు, కమిటీ సభ్యులకే తెలుస్తుందన్నారు. కాబట్టి అట్టడుగు వర్గాల పేదలకు ఇళ్లను మంజూరు చేయాలని సూచించారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. కాని సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారన్నారు. త్వరలోనే రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. నియోజకవర్గంలో రూ.340 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. పరిగి నుంచి వికారాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.120 కోట్లు, పరిగి షాద్‌నగర్ వరకు నాలుగు లైన్లకు రూ.120 కోట్లు, గడిసింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు డబుల్ రోడ్డుకు రూ.100 కోట్లు మంజూరయ్యాయని, ఆయా పనులకు శంకుస్థాపన చేశామన్నారు. పరిగి పట్టణ కేంద్రంలో కొత్తచెరువు పుననిర్మాణానికి రూ. 29లక్షలతో పనులను ప్రారంభించామన్నారు. కొత్త చెరువు పనులు పూర్తవగానే పరిగికి మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. పరిగిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తను అహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పరిగి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు పరశురాంరెడ్డి, ఆంజనేయులు, దోమ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి ఆయ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ మంజూరు చేస్తాం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
తెలియని లింక్‌లు ఓపెన్ చేయొద్దు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆఫర్ల పేరుతో ఆన్లైన్లో వచ్చే తెలియని లింక్‌లని ఓపెన్ చేసి మోసపోవద్దని భారతీయ రిజర్వు బ్యాంకు అధికారులు ఎ.సావిత్రి, ఎ.రెహమాన్ సూచించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని తులేకలాన్ గ్రామంలో డిజిటల్ లావాదేవిలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజర్వు బ్యాంకు అధికారులు హాజరై మాట్లాడుతూ.. అపరిచిత లింక్‌లు కలిగి ఉన్న ఎస్ఎంఎస్, ఈమెయిల్ని వెంటనే డిలిట్ చేయాలన్నారు. ఆర్థిక వివరాల ధ్రువీకరణ కోరే వెబ్‌సైట్‌ను నిర్ధారించుకోవాలన్నారు. వ్యక్తిగత వివరాలని లేదా బ్యాంకు సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని సూచించారు. తెలియని లింక్‌లను క్లిక్ చేయడంతో మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందన్నారు. డబ్బులు అడిగే అపరిచత వ్యక్తుల కాల్స్, ఈమెయిల్స్లకి సమాధానం ఇవ్వొద్దన్నారు. పెద్ద మొత్తంలో రాబడుల ఆశ చూపేవారి వెబ్‌సైట్స్ యాప్‌ల వివరాలని తనిఖీ చేసుకోవాలన్నారు. క్యూఆర్ కోడ్ ఉపయోగించి చెల్లింపులు చేసే సమయంలో స్క్రీన్‌పై పేరు సరి చూసుకోలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీనియర్ మేనేజర్(ఆపరేషన్స్) మురళికృష్ణ, అధికారులు సుధాకర్, బాలవెంకటేశ్వర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రిజర్వు బ్యాంకు అధికారులు సావిత్రి, రెహమాన్ తులేకలాన్‌లో డిజిటల్ చెల్లింపులపై అవగాహన సదస్సు -
గ్రూప్ ఫలితాల విడుదల సరికాదు
షాద్‌నగర్: ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు గ్రూప్ పరీక్షల ఫలితాలను నిలుపుదల చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్య ంలో షాద్‌నగర్ పట్టణంలో నిరాహార దీక్ష చేపట్టారు. రెండో రోజు మంగళవారం దీక్షా శిబిరానికి విచ్చేసిన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాట ను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండానే ప్రభుత్వం గ్రూప్ ఫలితాలను విడుదల చేయడం సరికాదన్నారు. లోపాలను సవరించకుండా ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం తగదన్నారు. దీంతో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు ఆపాలని డిమాండ్ చేశారు. నాయకులు శ్రావణ్, నాగభూషణ్, సురేష్, పాండు, మహేందర్, సుదర్శన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ -
హెడ్‌కానిస్టేబుల్ మృతి
తాండూరు రూరల్: గుండెపోటుతో ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందాడు. యాలాల మండలం జక్కెపల్లికి చెందిన రాంచందర్‌రావు(55) హెడ్ కానిస్టేబుల్. ఆయన మండలంలోని గౌతపూర్ సమీపంలోని రూరల్ సీఐ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భార్యాపిల్లలతో కలిసి పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో నివాసముంటున్నారు. నెల రోజుల క్రితం రాంచందర్‌రావుకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సోమవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి మృతి చెందారు. 1990 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రాంచందర్‌రావు అందరితో కలివిడిగా ఉండేవాడని పోలీసులు గుర్తు చేసుకున్నారు. రాంచందర్‌రావు మృతిపై డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు సంతోష్, నగేష్, ఎస్ఐ, కానిస్టేబుళ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.అధికార లాంఛనాలతో అంత్యక్రియలు -
వసతి‘గ్రహాలు’
సంక్షేమ హాస్టళ్లలో వేధింపులు, ఎలుకల బెడదవికారాబాద్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు సమస్యలు, వేధింపులకు కేంద్రాలుగా మారుతున్నాయి. హాస్టళ్లను ఉన్నతాధికారులు పర్యవేక్షించకపోవడంతో కొంత మంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయుల వేధింపులు, ఫుడ్ పాయిజన్, ఎలుకలు కొరకడం వంటి వాటి కారణంగా విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తే తప్ప ఇలాంటి విషయాలు బయటకు రావడం లేదు. జిల్లాస్థాయి అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమయ్యింది మొదలు ఏదో ఒక హాస్టల్లో, గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేసి ఆ తర్వాత వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటుడంతో మూడు నెలల క్రితం కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారులకు హాస్టళ్లు, స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖల హెచ్ఓడీలు మండలాల ప్రత్యేకాధికారులుగా నియమించి వారంలో రెండు స్కూళ్లు, హాస్టళ్లను సందర్శించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. వారంలో రెండు ఘటనలు నవాబుపేట కేజీబీవీలో 15 రోజుల క్రితం నలుగురు విద్యార్థులను ఎలుకలు కరిచాయి. మరో మూడు రోజుల వ్యవధిలో మరో నలుగురు ఎలుకలు బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. హాస్టల్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించి చేతులుదులుపుకొన్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు కేజీబీవీ సిబ్బందిని నిలదీశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, అధికారులు పాఠశాలను సందర్శించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ● 15రోజుల క్రితం వికారాబాద్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. బాలికలకు కాలు విరిగింది. మెట్ల పైనుంచి జారి పడటంతో కాలు విరిగిందని అపద్దం చెప్పి బాలికను తల్లిదండ్రుల వెంట ఇంటికి పంపారు. విద్యార్థిని తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో వారు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత మిన్నకుండి పోయారు. ● ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని అధికారులు పదేపదే చెబుతున్నా అమలు కావడం లేదు. నాణ్యమైన సరుకులు, కూరగాయలు వాడకపోవడంతో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ ఏడాది ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ● ఇటీవల చౌడాపూర్ మండలంలోని ఓ హాస్టల్ విద్యార్థులు మంచి భోజనం పెట్టాలని అడిగితే వార్డెన్ దుర్భాషలాడాలంటూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ● కుల్కచర్ల మండలంలోని ఓ హాస్టల్లో ఫుడ్‌పాయిజన్‌కు గురై పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ● ఆ కొద్ది రోజులకే నస్కల్ కస్తూర్బా బాలికల పాఠశాలలో 26 మంది.. ఆ తర్వాత కొత్తగడి వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బూర్గుపల్లి గురకుల పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ● ఆ వెంటనే అనంతగిరిపల్లి బాలుర వసతి గృహంలో విద్యార్థులు జాండీస్ బారిన పడ్డారు. ● తాండూరు బాలికల వసతి గృహంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు ఆస్పత్రుల పాలయ్యారు. ఇలా నిత్యం ఏదో ఒక హాస్టల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.పర్యవేక్షణ గాలికి..జిల్లాలో సోషల్, బీసీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటితో పాటు సీ్త్ర శిశుసంక్షేమం, గురుకుల, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లు కలిపి ఒక్కో శాఖలో 20 నుంచి 25 వరకు ఉన్నాయి. మొత్తం వంద పైచిలుకు హాస్టళ్లు ఉన్నాయి. ఈ శాఖలకు సంబంధించి జిల్లా అధికారులు కూడా ఉన్నారు. అయితే మైనార్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి ఉద్యోగ విరమణ పొందగా ఆ బాధ్యతలు యువజన విభాగం మరియు క్రీడల శాఖ జిల్లా అధికారికి అప్పగించారు. ఇక గురుకులాల బాధ్యతలు ఆర్‌సీఓలకు అప్పగించారు. హాస్టళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సమస్యలు లేకుండా చూడాల్సిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం విద్యార్థులపై జరుగుతున్న వేధిపులను, ఇతర సమస్యలను పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తరచూ ఆస్పత్రుల పాలవుతున్న విద్యార్థులు పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆందోళన -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
ఇబ్రహీంపట్నం రూరల్: శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించుకుని బ్యాంకు లావాదేవీలను కొనసాగించాలని రిజర్వ్ బ్యాంకు అధికారి రెహమాన్ అన్నారు. మార్చి 10 నుంచి 16 వరకు డిజిటల్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని ఎల్మినేడు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పేమెంట్స్‌పై అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రిజ ర్వు బ్యాంకు అధికారులు ఎ.సావిత్రి, ఎ.రెహమాన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీని సురక్షితంగా వినియోగించుకోవాలని సూచించారు. థర్డ్ పార్టీ యాప్‌ల జోలికి పోకుండా నేరుగా బ్యాంకులు సూ చించిన యాప్‌ల సహకారంతోనే లావాదేవిలు కొనసాగించాలని చెప్పారు. ఆర్థిక అక్షరాస్యతపై అందరికి అవగహన అవసరమన్నారు. నగదు రహిత లావాదేవిలు చేసే సమయంలో సైబర్ మోసాల బారీన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు డిజిటల్ పేమెంట్స్‌పై ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీనియర్ బిజినెస్ మేనేజర్ ఎం.మురళీకృష్ణ, కె.సుధాకర్, బ్యాంక్ మేనేజర్ శిరీష్‌చంద్ర, ఎస్.నవీన్‌కుమార్, అనిత, విద్యార్థులు పాల్గొన్నారు. డిజిటల్ లావాదేవీలే సురక్షితం రిజర్వ్ బ్యాంకు అధికారి రెహమాన్ -
అంగట్లో పర్మిట్లు!
సీఎం సొంత జిల్లాలో జోరుగా ఇసుక దందా ● పూర్తయిన రోడ్డుకు ఇసుక పర్మిషన్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు ● 5 ట్రాక్టర్లతో 30 ట్రిప్పులకు అనుమతి ● మంబాపూర్ సమీపంలో డంపింగ్ చేసిన అక్రమార్కులు ● తప్పుడు ప్రొసీడింగ్‌లతో అనుమతులు పొందారు: తహసీల్దార్ ● పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడి ● బషీర్మియా తండాలోనూ ఇదే పరిస్థితి తాండూరు రూరల్: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కొంత మంది అక్రమార్కులు తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది రెవెన్యూ అధికారులను బురిడీ కొట్టించారు. ఆరు ట్రాక్టర్లతో 40 ట్రిప్పుల ఇసుక రవాణాకు పర్మిషన్ తీసుకొని పెద్దేముల్ మండలం మంబాపూర్ సమీపంలో డంపింగ్ చేశారు. తప్పుడు ప్రొసీడింగ్ కాపీలు చూపి పర్మిషన్ పొందారని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తాండూరు తహసీల్దార్ చెప్పడం గమనార్హం. ఇసుక, మైనింగ్ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నా తాండూరులో మాత్రం ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. పూర్తయిన సీసీ రోడ్డు పేరిట.. పెద్దేముల్ మండలం ఖానాపూర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎన్ఆర్ ఈజీఎస్ కింద రూ.4 లక్షలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులకు పంచాయతీ రాజ్ అధికారులు అనుమతులు కూడా ఇచ్చారు. 15 రోజుల క్రితం రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. నాలుగు రోజుల క్రితం మంబాపూర్ గ్రామానికి చెందిన ద్యావరి గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి (తప్పుడు ప్రొసీడింగ్ కాపీలతో) ఖానాపూర్‌లో సీసీ రోడ్డు పనులకు ఇసుక కావాలని తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్ తారాసింగ్.. గోపాల్‌రెడ్డి తోపాటు గ్రామానికి చెందిన శివ, రమేష్, మహేష్, వెంకట్రాజు ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చారు. వీటి ద్వారా రెండు రోజుల్లో (సోమ, మంగళవారాల్లో) 30 ట్రిప్పుల ఇసుకకు అనుమతులు ఇచ్చారు. ఐదు ట్రాక్టర్ల ద్వారా మంబాపూర్లో ఇసుకను డంపింగ్ చేస్తున్నట్లు తెలిసింది. పాఠశాల కోసం.. ఇదిలా ఉండగా యాలాల మండలం బషీర్మియా తండాలోని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం ఇసుక అవసరం అని ఖాంజాపూర్‌కు చెందిన వెంకటయ్య దరఖాస్తు చేసుకున్నాడు. సోమ, మంగళవారాల్లో 10 ట్రాక్టర్ల ఇసుకకు తహసీల్దార్ పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆ పాఠశాలలో ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదని ఉపాధ్యాయులు తెలిపారు. అక్రమంగా అనుమతులు పొంది తండాలోని ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయమై తహసీల్దార్‌కు ఫిర్యాదులు అందాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తా పెద్దేముల్ మండలం ఖానాపూర్‌లో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయని ఇసుక అవసరం అని మంబాపూర్కు చెందిన గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి తప్పుడు ప్రొసీడింగ్‌లతో దరఖాస్తు చేసుకున్నాడు. రోడ్డు పనులు పూర్తయిన విషయం తెలియక ఇసుక రవాణాకు పర్మిషన్ ఇచ్చా. స్థానికుల ద్వారా అసలు విషయం తెలిసింది. మంబాపూర్లో ఇసుక డంపింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా. – తారాసింగ్, తహసీల్దార్, తాండూరు మండలం -
వెలుగులోకి వచ్చింది ఇలా..
తాండూరు మండలం ఖాంజాపూర్ వాగు నుంచి పెద్దేము ల్ మండలం ఖానాపూర్‌లో సీసీ రోడ్డు పను లకు వెళ్లాల్సిన ఇసుక ట్రాక్టర్లు మంబాపూర్ వైపు వెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. దీంతో అసలు విషయం బయట పడింది. నంబరు ప్లేట్లు లేని ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బషీర్మియా తండాలో కూడా ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. పాత ప్రొసీడింగ్ కాపీలకు ఇసుక పర్మిషన్లు ఇచ్చారనే విషయం తాండూరులో చర్చనీయంశంగా మారింది. -
‘పీఎం విశ్వకర్మ’ను పక్కాగా అమలు చేయాలి
● పథకంపై అవగాహన కల్పించండి ● అడిషనల్ కలెక్టర్ సుధీర్ అనంతగిరి: సంప్రదాయ చేతివృత్తుల వారి ఆర్థిక పురోగతికి పీఎం విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు. సోమవా రం కలెక్టరేట్లోని తన చాంబర్లో పథకం అమలు, పురోగతిపై వివిధ శాఖల అధికారు లు, కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వకర్మ వృత్తులపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు తోడ్పాటునందించాలన్నారు. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, మంగలి, ఉప్పరి తదితర 18 రకాల చేతి వృత్తుల వారికి లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పథకంపై అవగాహన కల్పించాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వివిధ వృత్తుల్లో శిక్షణ పొందేలా ప్రోత్సహించాలని అన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శ్రీనివాస్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ మహేశ్వర్, జిల్లా పంచాయతీ అధి కారి జయసుధ, డీబీసీడీఓ ఉపేందర్, మెప్మా పీడీ రవికుమార్, మున్సిపల్ కమిషనర్లు జాకీర్ అహ్మద్, వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
చేవెళ్ల: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం వారు చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సమీర్, చరణ్‌గౌడ్, చందు, చారి, వినీత్, ఆదిత్య, విష్ణుగుప్తా, ఇర్ఫాన్, వివేకానంద, శశి, ఆకాశ్, షోఫాయాన్, విష్ణు, శివ, నవీన్, కార్తీక్, మైపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ -
మహిళా సంఘాల ఎన్నికల సందడి
కోలాహలంగా గ్రామ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ● ఆమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ల బాధ్యత నేపథ్యంలో పెరిగిన పోటీ ● బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్త్ను సెర్ప్ అధికారులు కుల్కచర్ల: పొదుపు సంఘాల పర్యవేక్షణకు బాధ్యత వహించే గ్రామ పొదుపు సంఘాల ఎన్నికలతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. మండల పరిధిలో 37 పంచాయతీలుండగా 30 గ్రామ సంఘాలున్నాయి. చౌడాపూర్ మండల పరిధిలో 24 గ్రామాలకుగాను 17 గ్రామ సంఘాలున్నాయి. ఒక్కో గ్రామానికి ఒక మహిళా అధ్యక్షురాలు ఉంటారు. వీరు గ్రామ సంఘం పరిధిలోని పొదుపు సంఘాలకు బాధ్యత వహిస్తారు. పెరిగిన పోటీ గతంలో గ్రామ కమిటీ అధ్యక్షులుగా పోటీ చేసేందుకు మహిళలు పెద్దగా ఆసక్తిచూపేవారు కాదు. ప్రస్తుతం గ్రామ సంఘం అధ్యక్షులకు అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్లుగా అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో అవగాహన ఉన్న స్థానిక నాయకులు తమ భార్యలను గ్రామ సంఘం అధ్యక్షులుగా ఎంపికయ్యేలా చూసుకుంటున్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలు సైతం చైర్పర్సన్లుగా ఎంపికయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు వీరికే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అధ్యక్ష ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా ఉన్నాయి. ఎన్నిక ప్రక్రియ పొదుపు సంఘాలలో ఉన్న సభ్యులు తమ గ్రామ సంఘానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఎన్నికల విధానంలో ముందుకువెళ్లాల్సి ఉంటుంది. ఒక గ్రామంలో ఉన్న పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు తమ పొదుపు సంఘం నుంచి ఎన్నికవ్వాలి. అనంతరం తమ పరిధిలో ఉన్న పొదుపు సంఘాలతో పోటీ పడి 30మంది రిప్రజెంటివ్ జనరల్ బాడీ కమిటీ సభ్యులుగా ఎంపికవ్వాలి. అనంతరం 15 మంది ఎగ్జిగ్యూటీవ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరికి ఓటింగ్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించి గ్రామ సంఘం అధ్యక్షులుగా, కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, సహాయకార్యదర్శిగా, కోశాధికారిగా ఐదుగురి కమిటీని ఎంపిక చేసి ప్రక్రియను పూర్తిచేస్తారు చురుకుగా ఉన్న సంఘం సభ్యులకు, సంఘం వాటధనం, రీపేమెంట్ యాక్టీవ్‌గా చేసే సంఘం సభ్యులకు తదితర కొన్ని నిబంధనలతో సంఘం ఎన్నికలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 14 వరకు గ్రామ సంఘం అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. 14 లోగా పూర్తి గ్రామాల్లో సీసీల ఆధ్దర్యంలో గ్రామ సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. కొత్త నిబంధనలను అనుసరించి ఓటింగ్ పద్ధతిని అవలంబిస్తూ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటగా గ్రామ సంఘాల ఎన్నికలు నిర్వహించి అనంతరం మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 14లోపు గ్రామ సంఘాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేస్తాం. – శోభ, ఏపీఎం, కుల్కచర్ల -
రోడ్డు మంజూరుకు నిధులు కేటాయించండి
కేశంపేట: మహేశ్వరం మండల పరిధిలోని పెద్ద గోల్కండ (ఓఆర్ఆర్ ఎగ్జిట్) నుంచి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ వరకు డబుల్ బీటీ రోడ్డు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోగిరెడ్డి లచ్చిరెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. పెద్దగోల్కొండ నుంచి కల్వకోలు వరకు రోడ్డు నిర్మాణం పూర్తయిందని, దానికి అనుసంధానంగా కల్వకోలు నుంచి మిడ్జిల్ వరకు డబుల్ బీటీ రోడ్డును నిర్మించాలని కోరారు. ఈ రోడ్డు నిర్మాణంపూర్తయితే శ్రీశైలం, బెంగుళూరు హైవేలకు సమాంతరంగా ప్రత్యామ్నాయ రోడ్డు అవుతుందన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే తిరుపతి వెళ్లే ప్రయాణికులకు 130 కిలో మీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుందని ఆయన కేంద్రమంత్రికి వివరించారు. రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఇందుకు స్పందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు నర్సింహారెడ్డి తెలిపారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడుబొక్క నర్సింహారెడ్డి -
నియోజకవర్గ అభివృద్ధికి రూ.340 కోట్లు
పరిగి: నియోజకవర్గ పరిధిలో రూ.340 కోట్ల నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరిగి పట్టణ కేంద్రం నుంచి అన్ని ప్రాంతాలకు నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. మొదట పరిగి నుంచి వికారాబాద్ నాలుగులేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.120 కోట్లు, పరిగి–షాద్‌నగర్‌కు రూ.120 కోట్లు, గడిసింగాపూర్ –రంగారెడ్డిపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.వంద కోట్లు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం పట్టణ కేంద్రంలోని నంబర్–1 ఉన్నత పాఠశాల ఆవరణలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ఇందిరమ్మ కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని సూచించారు. అనంతరం రూ.29 లక్షలతో పట్టణ కేంద్రంలోని కొత్తకుంట చెరువు పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ అయూబ్, నాయకులు రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీవేంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు పట్టణంలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ వార్షి క బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన లక్ష తులసీ అర్చన, చండీహోమం, మహా పూర్ణాహుతిలో ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పరిగి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు పరుశురాంరెడ్డి, ఆంజనేయులు ముదిరాజ్ పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి -
తెలంగాణ పోలీస్ జట్టులో ఇప్పాయిపల్లివాసి
కుల్కచర్ల: మండల పరిధిలోని ఇప్పాయిపల్లికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వేణుగోపాల్ ఆల్ ఇండియా పోలీస్ వాలీబాల్ క్లస్టర్ పోటీల్లో సత్తాచాటుతున్నాడు. ప్రస్తుతం హర్యానాలో జరుగుతున్న పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా వేణుగోపాల్ సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. అంగన్వాడీ టీచర్ మృతి కేశంపేట: అనారోగ్యంతో ఓ అంగన్వాడీ టీచర్ మృతి చెందింది. ఈ ఘటన అల్వాల అనుబంధ గ్రామం తులవానిగడ్డలో సోమవారం చోటు చేసుకుంది. ఆమె మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎంపీపీ ఎల్గమోని రవీందర్‌యాదవ్, ఐసీడీఎస్ సీడీపీఓ షబనాహుస్సేన్, ఐసీడీఎస్ మాజీ సీడీపీఓ నాగమణి, సూపర్వైజర్లు విజయలక్ష్మి, శమంతకమణి , పలువురు అంగన్వాడీ టీచర్లు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం అంత్యక్రియలకు ప్రభుత్వం అందించే ఆర్థికసాయం చెక్కును మృతురాలి కుటుంబ సభ్యులకు సీడీపీఓ అందజేశారు. రికవరీ ఫోన్ల అప్పగింత ధారూరు: మండల పరిధిలోని వివిధ గ్రామాలు, తండాల్లో పోగొట్టుకున్న సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బాధితులకు తొమ్మిది సెల్ఫోన్లను అప్పగించినట్లు ఎస్ఐ అనిత తెలిపారు. నాలుగు టిప్పర్లు, జేసీబీ సీజ్ కడ్తాల్: నిబంధనలకు విరుద్ధంగా మట్టితరలిస్తుండగా పోలీసులు దాడులు చేపట్టి వాహనాలను సీజ్ చేశారు. ఎస్ఐ వరప్రసాద్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలోని సర్వేనంబర్ 321/1లో ఉన్న ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేసి నాలుగు టిప్పర్లు, ఓ జేసీబీని స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు జేసీబీ, టిప్పర్ డ్రైవర్లతో పాటు ఆయా వాహనాల యజమానులు మునావత్ శ్రీను (గానుగుమార్లతండా), నేనావత్ శ్రీను(పుల్లేరుబోడ్ తండా)పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. వరద కాల్వను పూడుస్తున్న వారిపై చర్యలు తీసుకోండి మొయినాబాద్: మున్సిపల్ పరిధిలోని సురంగల్ పెద్ద చెరువులోకి వచ్చే వరద కాల్వను పూడుస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని సురంగల్‌కు చెందిన గడ్డం వెంకట్‌రెడ్డి తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సురంగల్‌లోని పెద్ద చెరువులోకి కనకమామిడి వైపు నుంచి వరదకాల్వ వస్తుందని.. నజీబ్‌నగర్ రెవెన్యూలోని సర్వే నెంబర్ 73, 74 వద్ద న్యాయవాది వలీ వరదకాల్వను పూర్తిగా పూడ్చివేసి తన పొలంలో కలుపుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకుని కాలువ పూడ్చివేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. ప్రియుడితో వెళ్లిపోయిన నవవధువు! మణికొండ: వివాహం అయిన ఏడు రోజులకే ఓ నవవధువు మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన ఉదంతం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాలీమందిర్ వద్ద మూడు రోజుల క్రితం జరిగింది. అతని చర్యను తను నివసిస్తున్న బస్తీవాసులే వ్యతిరేకించి, అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించిన సంఘటన సోమవారం లంగర్‌హౌస్‌లో కలకలం సృష్టించింది. వివరాలివీ... నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాలీ మందిర్ వద్ద నివసిస్తున్న ఓ యువతి గతంలో లంగర్‌హౌస్‌లో నివసించే అరవింద్ అనే యువకుడిని ప్రేమించింది. తల్లితండ్రులు ఏడు రోజుల క్రితం ఆమెకు అత్తాపూర్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం చేశారు. ప్రియుడితో కొనసాగిన ప్రేమాయణంతో ఆమె మూడు రోజుల క్రితం అతని వెంట వెళ్లిపోయింది. దాంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో తమ కూతురు కనిపించటం లేదని ఫిర్యాదు చేశారు. అది విచారణ కొనసాగుతున్న క్రమంలోనే సోమవారం విషయం లంగర్‌హౌస్‌లోని అతని బస్తీలో తెలిసింది. దాంతో స్థానికులు అతను చేసిన చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. బస్తీలో అతని ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. -
నిజాయతీ చాటిన ఆర్టీసీ ఉద్యోగులు
పరిగి: బస్సులో మరచిపోయిన బ్యాగును తిరిగి అప్పగించి నిజాయతీ చాటుకున్నారు పరిగి ఆర్టీసీ ఉద్యోగులు. ఈనెల 7వ తేదీన రాత్రి పరిగి నుంచి హైదారాబాద్‌కు ఆర్టీసీ బస్సు బయలు దేరింది. అందులో దినేష్ జైన్ అనే ప్రయాణికుడు తన బ్యాగును మరిచి మొయినాబాద్‌లో దిగిపోయాడు. దీంతో కండక్టర్ వెంకటయ్య, డ్రైవర్ సుధాకర్‌లు బ్యాగును గమనించగా.. అందులో రూ.లక్ష నగదు ఇతర పేపర్లు ఉండటంతో ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ అధికారులకు అందజేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు విచారించిన అధికారులు పోలీసుల సమక్షంలో బాధితుడికి నగదుతో ఉన్న బ్యాగును సోమవారం అందజేశారు. విధుల్లో నిజాయతీని చాటుకున్న ఉద్యోగులను డీఎం కరుణశ్రీ అభినందించారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
ఇబ్రహీంపట్నం రూరల్: శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించుకుని బ్యాంకు లావాదేవీలను కొనసాగించాలని రిజర్వ్ బ్యాంకు అధికారి రెహమాన్ అన్నారు. మార్చి 10 నుంచి 16 వరకు డిజిటల్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని ఎల్మినేడు ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పేమెంట్స్‌పై అవగహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రిజ ర్వు బ్యాంకు అధికారులు ఎ.సావిత్రి, ఎ.రెహమాన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. డిజిటల్ టెక్నాలజీని సురక్షితంగా వినియోగించుకోవాలని సూచించారు. థర్డ్ పార్టీ యాప్‌ల జోలికి పోకుండా నేరుగా బ్యాంకులు సూ చించిన యాప్‌ల సహకారంతోనే లావాదేవిలు కొనసాగించాలని చెప్పారు. ఆర్థిక అక్షరాస్యతపై అందరికి అవగహన అవసరమన్నారు. నగదు రహిత లావాదేవిలు చేసే సమయంలో సైబర్ మోసాల బారీన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు డిజిటల్ పేమెంట్స్‌పై ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీనియర్ బిజినెస్ మేనేజర్ ఎం.మురళీకృష్ణ, కె.సుధాకర్, బ్యాంక్ మేనేజర్ శిరీష్‌చంద్ర, ఎస్.నవీన్‌కుమార్, అనిత, విద్యార్థులు పాల్గొన్నారు. డిజిటల్ లావాదేవీలే సురక్షితం రిజర్వ్ బ్యాంకు అధికారి రెహమాన్ -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
షాద్‌నగర్ రూరల్: పట్టణ శివారు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో సోమవారం పట్టణంలోని తిరుమల మెగా టౌన్షిప్ కాలనీలో రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన ప్రకారం.. తిరుమల మెగాటౌన్‌షిప్ కాలనీలో నివాసముండే రాజేష్, ఝాన్సీ దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు, కనకయ్య దంపతులు ప్రైవేటు ఉద్యోగస్తులు. ఉదయం వారు ఇళ్లకు తాళం వేసి తమతమ విధులకు వెళ్లిపోయారు. గమనించిన దుండగులు రాజేశ్ ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని వస్తువులు చిందరవందర చేశాడు. ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న కనకయ్య ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నింగా శబ్ధంరావడంతో చుట్టుపక్కల ఇళ్లవారు అక్కడకు వెళ్లే వరకే దుండగుడు పరారయ్యాడు. విధుల నుంచి వచ్చిన రాజేశ్ దంపతులు తాళం పగులగొట్టి ఉండడంతో డయల్ 100 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని సీసీ పుటేజీలు పరిశీలించారు. రాజేశ్, కనకయ్య ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడు ఒకడే అని గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది. రెండు ఇళ్లలో చోరీకి విఫలయత్నం -
మహిళా శక్తి సృష్టిలోనే గొప్పది
తాండూరు టౌన్: సృష్టిలోనే మహిళా శక్తి గొప్పదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎస్వీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పలు రంగాల్లో సేవలందిస్తున్న మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు అవకాశం కల్పిస్తే అద్భుతాలను సృష్టిస్తారన్నారు. మహిళలు గౌరవ మర్యాదలు అందుకునే చోట దేవతలు కొలువై ఉంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల నిర్వహణ, ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వయం సహాయక సంఘాలకు 150 అద్దె బస్సుల నిర్వహణ వంటి పథకాలు అమలు చేసిందన్నారు. ‘317 జీఓ బాధితులకు న్యాయం చేయండి’ 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కోరారు. సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా వారు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 317 జీఓ పేరిట పలు విభాగాల్లో ఉద్యోగులు రాత్రికిరాత్రే ఇళ్లు, పిల్లలను వదిలి ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జీఓ రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి -
కుక్కల దాడిలో జింక మృతి
అనంతగిరి: వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరి అడవుల్లో సోమవారం వీధి కుక్కల దాడిలో ఓ జింక(దుప్పి) మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. ఉదయం అడవిలో సంచరిస్తున్న జింక(దుప్పి)పై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. గమనించిన పలువురు వాటిని చెదరగొట్టారు. అనంతరం అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. వారు వచ్చేలోపు జింక మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు పరిగి: ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని తొండుపల్లి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివశంకర్, రాము తొండుపల్లి నుంచి లాల్‌పహాడ్‌కు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలించారు. ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. యువకుడి అదృశ్యం కేశంపేట: కుటుంబ సభ్యులతో గొడవపడిన యువకుడు అదృశ్యమైన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దిని మధు(25) చదువుకుంటూ గ్రామంలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. జనవరి 3న డబ్బు కోసం కుటుంబ సభ్యులతో గొడవపడిన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గతంలోనూ పలుమార్లు గొడవ పెట్టుకుని వెళ్లి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని వెళ్లిన మధు కోసం కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం తల్లి పద్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి వెళ్లిన నాడు జీన్స్ ప్యాంట్, బ్లూ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ ధరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మహాసభను విజయవంతం చేయండి
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడుశ్రీకాంత్రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ సాక్షి, రంగారెడ్డిజిల్లా: టీ యూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా రెండో మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 11(మంగళవారం)న శంకర్ పల్లి మండల పరిధిలోని పొద్దటూరు శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో నిర్వహిస్తున్న జిల్లా రెండో మహాసభకు మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు మాజీద్, సత్యనారాయణ, నగునూరి శేఖర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీ, కార్యదర్శి రాం నారాయణలతో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని వారు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులు అందరూ మహాసభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల నిర్వహించిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. జిల్లాలో 25 సంవత్సరాలకు పైగా విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టులకు ఈ మహాసభల సందర్భంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జర్నలిస్టులు హాజరు కావాలని కోరారు. బైక్, ఆటో ఢీకొని వ్యక్తి మృతి కుల్కచర్ల: ఎదురెదురుగా వస్తున్న బైక్, ట్రాలీ ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... కొత్తపల్లి తండాకు చెందిన రమేశ్(30) కూలీ పనులు చేసేవాడు. శనివారం రాత్రి ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై చౌడాపూర్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కిష్టంపల్లి నుంచి వస్తున్న ట్రాలీ ఆటో మక్తవెంకటాపూర్ గేటు గ్రామశివారులో ఎదురెదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను 108లో మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు. సెల్ఫోన్ల అప్పగింత యాలాల: సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ సహకారంతో తిరిగి అప్పగించారు. ఇటీవల బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన గాజుల రాములు మాతాశిశు ఆస్పత్రి వద్ద, యాలాల మంలడల పరిధి పగిడిపల్లికి చెందిన లొంకాల గోవింద్ జుంటుపల్లిలో మొబైల్ పోగొట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోన్లను గుర్తించారు. ఈ మేరకు ఎస్ఐ గిరి ఆదివారం బాధితులకు అందజేశారు. ఆరు ట్రాక్టర్లు సీజ్ యాలాల: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ గిరి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని యాలాల, సంగెంకుర్దు, కోకట్ గ్రామాల పరిధిలో ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు చేపట్టి ఆరు ట్రాక్టర్లను యాలాల ఠాణాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కార్ల ఢీ.. నలుగురికి గాయాలు పరిగి: ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొని నలుగురికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని తుంకల్గడ్డ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిట్టకోడూర్ గ్రామానికి చెందిన కొందరు కారులో పరిగి నుంచి స్వగ్రామానికి వవెళ్తున్నారు. ఈ క్రమంలో చిగురాల్‌పల్లి నుంచి పరిగికి కొందరు కారులో వస్తుండగా తుంకల్గడ్డ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు కార్లల్లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
పిల్లలు లేక.. హాస్టళ్లు నడవక
ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉన్న వసతి గృహాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. విద్యార్థులు రాకపోవడం, ప్రభుత్వం సైతం వీటి అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడంతో చాలా చోట్ల హాస్టళ్లు మూతబడుతున్నాయి. బంట్వారం: పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతి గృహం చాలా కాలం కిందట మండల పరిధిలోని తొర్మామిడిలో మూతపడింది. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. తొర్మామిడి గ్రామంలో 2009లో ఎస్సీ హాస్టల్ భవనం ప్రారంభించారు. ఇందుకు గాను అప్పట్లో బీఆర్జీఎఫ్, జెడ్పీ నిధులు అవసరమైన మేరకు వెచ్చించారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ వసతిగృహం ప్రారంభించిన ఏడాది కాలంలోనే హాస్టల్ మూతపడింది. ఊరికి కిలో మీటరు దూరంలో భవనం కట్టించడంతో విద్యార్థులు అందులో ఉండేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో చేసేదేమీ లేక అధికారులు కూడా ఏడాదిలోనే హాస్టల్‌ను మూసి వేశారు. భవనం ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండడంతో ప్రస్తుతం బూత్ బంగ్లాను తలపిస్తుంది. బంట్వారంలోనూ అదే పరిస్థితి మండల కేంద్రం బంట్వారంలోని బీసీ వసతి గృహం పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. విద్యార్థులు లేరనే సాకుతో సంబంధిత అధికారులు ఆరేళ్ల కిందట బీసీ హాస్టల్‌ను మూసి వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005 సంవత్సరంలో మత్స్యశాఖ ఈ భవనాన్ని కట్టించింది. అది ఏడాదిలోనే కూలే స్థితికి చేరింది. దీంతో అప్పట్లో వెంటనే అద్దె భవనంలోకి హాస్టల్‌ను మార్చారు. అందులో చుట్టు పక్కల గ్రామాల విద్యార్థులు ఉంటూ చదువుకునే వారు. ఉన్నట్టుండి బీసీ వెల్ఫేర్ అధికారులు 2017లో వసతి గృహాన్ని ఎత్తివేశారు. పిల్లలు లేరనే కారణంతో కోట్‌పల్లి ఎస్సీ హాస్టల్‌ను కూడా గతంలోనే ఎత్తి వేశారు. కోట్‌పల్లి కొత్త మండలముగా ఏర్పడడంతో హాస్టల్ భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా వాడుకుంటున్నారు. హాస్టళ్లకు తగ్గిన ఆదరణ గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో సీటు దొరకాలంటేనే పెద్ద కష్టంగా ఉండేది. రాను రాను హాస్టళ్లకు ఆదరణ పడిపోయింది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో మూతపడే స్థాయికి చేరుకున్నాయి. గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు వచ్చిన నాటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉండే వారు కరువయ్యారు. నానాటికి మూతపడే దశకు చేరుకుంటున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ల పరిస్థితి కూడా అలాగే తయారైంది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. చిన్నారులు గురుకులాలు, మోడల్, కేజీబీవీల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. మూతపడిన వసతి గృహాలు వృథాగా మారుతున్న భవనాలు -
కాజేసే కుట్ర!
పేదల ఇళ్లు..మంచాల: పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలనే సదుద్దేశంతో 1985లో మండల పరిధిలోని లోయపల్లిలో ప్రభుత్వం 34, 35 సర్వే నంబర్లలో భూమి కొనుగోలు చేసింది. గ్రామానికి చెందిన నర్సింగ్‌రావుకు సంబంధించి 5.19 ఎకరాలను కొని, ఒక్కోగుంట(121 గజాలు) చొప్పున 150 మంది నిరుపేదలకు పంపిణీ చేసింది. కొందరికి అప్పట్లోనే సర్కారు ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం సైతం చేయించింది. ప్రస్తుతం ఆ స్థలాల్లో అందరూ ఇళ్లు నిర్మించుకున్నారు. లబ్ధిదారులు అన్ని రకాల రుసుము చెల్లించి గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నిర్మాణ అనుమతితో పాటు నల్లా కనెక్షన్లు సైతం తీసుకున్నారు. కరెంట్ సరఫరా సైతం వచ్చింది. రోడ్లతో పాటు అండర్ డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. ఏటా ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. అక్కడ పూర్తిగా జనాలతో ఇళ్లు నిండిపోయాయి. కానీ సదరు భూమిపై తమకు హక్కులున్నాయని అప్పటి భూ యజమాని వారసులు లబ్ధిదారులను వేధిస్తున్నారు. బ్రోకర్లతో బెదిరింపులు 2020లో ధరణి పోర్టల్‌లో సదరు భూమికి సంబంధించి అప్పటి పట్టాదారు నర్సింగ్‌రావు పేరు తిరిగి రికార్డులోకి వచ్చింది. అక్కడ గ్రామస్తులు ఇళ్లు నిర్మించుకున్నా తిరిగి పాత పట్టాదారు పేరునే అధికారులు నమోదు చేశారు. ప్రస్తుతం సదరు భూమిని నర్సింగ్‌రావు కుమారుడైన ఆనందరావు కొంత మంది బ్రోకర్ల పేరు మీద 3 నుంచి 5 గుంటల చొప్పున కొనుగోలు చేసినట్లు అక్రమ పట్టా పాసు పుస్తకాలు సృష్టించారు. ఆ పత్రాలు బాంకుల్లో తనఖా పెట్టి రుణాలు సైతం తీసుకున్నారు. అంతటితో ఆగకుండా అనాడు ప్రభుత్వం ఇచ్చిన లబ్ధిదారులను భయపెడుతున్నారు. ‘మీ ఇళ్ల స్థలాలు మా పేర్ల మీద ఉన్నాయి. నయానో, భయానో ఇవ్వండి.’ లేకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారని బెదిరిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవస్థాగత నిర్ణయంలో లోపం... దాన్ని సరి చేయాల్సిన అధికారుల అలసత్వంకారణంగా 150 మంది పేదలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నలభై ఏళ్ల క్రితం సర్కారు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ధరణి పోర్టల్ పేరుతో ఆక్రమించే ఉదంతం మంచాల మండలం లోయపల్లిలో వెలుగు చూసింది. నలభై ఏళ్ల క్రితం పేదలకుఇచ్చిన భూములు అధికారుల అండతో పాత పట్టాదారుకు బదలాయింపు తీవ్ర ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు -
హుస్సేన్ సాగర్ నీళ్లలో పడి సెక్యూరిటీ గార్డు మృతి
రాంగోపాల్‌పేట్: లుంబినీ పార్కులో బోటును శుభ్రం చేస్తూ ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మరణించాడు. ఈ ఘటన లేక్ సెక్రటరియేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ నల్లకుంట గాంధీనగర్‌కు చెందిన సురారం యాదగిరి (56) గత ఐదేళ్ల నుంచి లుంబినీ పార్కులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం బోటును శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్ నీళ్లలో పడిపోయాడు. అటు తర్వాత పార్కు సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించగా నీళ్లలో పడిపోయినట్లు గుర్తించారు. ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్ జలాల్లో మృతదేహం తేలియాడుతుండగా లేక్ పోలీసులు వెలికితీశారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసికున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. -
పవిత్రమాసం.. ప్రత్యేకం
పహాడీషరీఫ్: పవిత్రమైన రంజాన్ మాసాన్ని జల్పల్లి మున్సిపాలిటీలోని ముస్లిం ప్రజలు నియమ నిష్టలతో జరుపుకొంటున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షలో ఉంటున్న ముస్లింలు రాత్రంతా మెళకువతో ఉంటున్నారు. సాయంత్రానికి ఎర్రకుంట, షాయిన్‌నగర్, పహాడీషరీఫ్, కొత్తపేట రహదారులు సందడిగా మారుతున్నాయి. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అంతా రంజాన్ పండగలో నిమగ్నమయ్యారు. ప్రతిరోజు ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌ల చొప్పున ఐదుసార్లు నమాజ్ చేసి అల్లాహ్‌ను స్మరిస్తున్నారు. ఇఫ్తార్ విందుల ఆరగింపు రంజాన్ మాసం ప్రారంభం కావడంతో తొలి రోజు నుంచే ఇఫ్తార్ విందులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ పవిత్రమైన మాసంలో కాస్త ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేసి పరిచయస్తులను ఆహ్వానిస్తుంటారు. ఉపవాస దీక్ష విరమించిన ప్రజలు ఇఫ్తార్ విందులలో ఏర్పాటు చేసే పండ్లను ఆరగించడం ఆనవాయితీ. ఇందులో అన్ని రకాల పండ్లతో ఖర్జూరం వంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తారు. ఇఫ్తార్ విందులలో హిందూ, ముస్లింలు పాల్గొని మత సామరస్యాన్ని చాటి చెబుతున్నారు. హలీం దుకాణాల వద్ద సందడి ఈ మాసంలో ప్రధానంగా గుర్తుకొచ్చేది హలీం. రోజంతా ఉపవాస దీక్షలో ఉండే వారు సాయంత్రం దీక్ష విరమించిన అనంతరం పోషక విలువలున్న హలీంను ఆరగిస్తారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలయ్యిందంటే స్థానికంగా ఉన్న హలీం సెంటర్లు రద్దీగా మారుతున్నాయి. పహాడీషరీఫ్ పరిసరాలలో ఏర్పాటు చేసిన హలీం కేంద్రాలే కాకుండా పాత నగరంలో ఉన్న షా గౌస్, పిస్తాహౌజ్, షాదాబ్ వంటి హోటళ్ల నుంచి హలీం పార్సల్‌ను తెప్పించుకొని భుజిస్తున్నారు. పెద్ద ఎత్తున జకాత్ రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం తమకున్న ఆస్తిలో కొంత శాతాన్ని పేద ప్రజలకు వెచ్చించాలి. ఇందులో భాగంగానే జల్పల్లి మున్సిపాలిటీలోని ముస్లింలు పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తున్నారు. పేద ప్రజలకు చీరలు, గృహావసర వస్తువులు ఇలాంటి వాటిని దానం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో ఈ దాన ధర్మాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అంతటా రంజాన్ సందడి కఠోర ఉపవాస దీక్షలో ముస్లింలు -
తల, మొండెం వేరుగా..
కేశంపేట: తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన సంఘటన మండల పరిధిలోని వేములనర్వ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శవం కుళ్లిపోయి ఉండటంతో, సుమారు 15 రోజల క్రితం మృతి చెంది ఉండొచ్చని గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీఐ నరహరి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించగా ఆధార్‌కార్డు లభ్యమయ్యింది. దాని ఆధారంగా మృతి చెందిన వ్యక్తి ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వెల్జర్ల గ్రామానికి చెందిన బేరి జంగయ్య(60)గా గుర్తించారు. ఆయన బీరు సీసాలను సేకరించి అమ్ముకొని జీవించేవాడని గ్రామస్తులు తెలిపారు. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుందని చెప్పారు. జంగయ్య వేములనర్వ గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్లగా ఫిట్స్ వచ్చి మృతి చెందాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే తల, మొండెం వేరు కావడంపై సందేహాలు కొనసాగుతున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. కుళ్లినస్థితిలో మృతదేహం లభ్యం -
రేపు మహిళా జాబ్ మేళా
పూడూరు: ఈ నెల 11న పరిగిలో నిర్వహించనున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీ కార్యదర్శి పెంటయ్య సూచించారు. మంగళవారం ఉదయం 10గంటలకు పరిగి జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో ఈ మేళా ఉంటుందని చెప్పారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్/ఫెయిల్ అయిన మహిళలు సర్టిఫికెట్లతో హాజరవ్వాలని సూచించారు. ఎంపికై న వారికి ఎమ్ఎస్ఎన్ కంపెనీలో వసతితో కూడిన ఉద్యోగం ఉంటుందని చెప్పారు. మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం తాండూరు రూరల్: మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో వంద సీట్లు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీసీ విద్యార్థులకు రూ.125, ఓసీలకు రూ.200 దరఖాస్తు రుసుము ఉంటుందని చెప్పారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని ఏప్రిల్ 20న పరీక్ష ఉంటుందని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి ధారూరు ఎస్ఐ అనిత ధారూరు: వ్యాపారస్తులు సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేసుకోవాలని ధారూరు ఎస్ఐ అనిత సూచించారు. ఆదివారం ఆమె పీఎస్‌లో వ్యాపారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేరాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా జాగ్రత్త పడాలని సూచించారు. సీసీ కెమెరాల డీవీఆర్‌ను నేరస్తుల కంటబడకుండా అమర్చుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో వ్యాపారులు సాయికుమార్, షకీల్బాబా, శేఖర్, రఘు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి కేశంపేట: అమెరికాలోని మిల్వాకీ పట్టణంలో దుండగుల కాల్పలో మృతి చెందిన కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్‌కుమార్ మృతదేహం ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శంషాబాద్ నుంచి కేశంపేటకు తరలించి అశ్రునయనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి వేర్వేరుగా నివాళి అర్పించారు. సమన్వయ కమిటీలో ‘చల్లా’కు చోటు ఆమనగల్లు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడిగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే జైబాపు, జై బీమ్, జై సంవిదాన్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరుగురు సభ్యులతో రాష్ట్ర సమన్వయ కమిటీని నియమించారు. ఇందులో సమన్వయకమిటీ సభ్యుడిగా చల్లా వంశీచంద్‌రెడ్డికి అవకాశం కల్పించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం తేవాలి శంకర్పల్లి: దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం తేవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు భుజంగరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ప్రాతినిధ్యం కోసం లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం మండలంలోని జన్వాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో దివ్యాంగులు 12 శాతం ఉన్నారని, అన్ని ప్రభుత్వ కార్యాల యాల్లో రెండు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో ఇద్దరు నామినేటెడ్ పోస్టుల కోసం ప్రత్యేక చట్టం అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అదే తరహా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మన రాష్ట్రంలో ప్రవేశపెట్టాలన్నారు. -
వేలకోళ్లు మృత్యువాత
యాచారం: మండల పరిధిలోని నానక్‌నగర్ గ్రామంలో రెండు రోజుల వ్యవధిలోనే 12 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన చల్లా కృష్ణారెడ్డి రూ.5 లక్షలు ఖర్చు చేసి తన పౌల్ట్రీ షెడ్లలో కోడిపిల్లల పెంపకం చేపట్టాడు. బర్డ్ ప్లూ భయంతో చికెన్ అమ్మకాలు పడిపోవడంతో షెడ్లలో ఉన్న కోళ్లను 40 రోజుల దాటినా ఇంటిగ్రేషన్ కంపెనీలు తరలించడం లేదు. దాదాపు రెండున్నర కిలోల బరువు పెరిగిన 12 వేల కోళ్లు శని, ఆదివారాల్లో అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన కోళ్లను చల్లా కృష్ణారెడ్డి తన వ్యవసాయ పొలంలోనే గోతులు తీసి పూడ్చిపెట్టాడు. ఇదే గ్రామానికి చెందిన ముత్యాల వెంకట్‌రెడ్డి అనే రైతుకు చెందిన రెండు షెడ్లలో ఉన్న ఏడు వేల కోళ్లు సైతం నాలుగైదు రోజుల క్రితం మృతి చెందాయి. దీంతో రూ.లక్షల్లో ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని ఆ రైతులు బోరుమంటున్నారు. కంపెనీల వై ద్యులు వచ్చి బర్డ్ ప్లూ వైరస్‌తోనే కోళ్లు చనిపోయాయని చెప్పినట్టు వారు తెలిపారు. ఒకేసారి వే లాది కోళ్లు మృత్యువాత పడుతుండడంతో మిగతా రైతులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. కోళ్లు పూడ్చేశారు.. నిర్ధారించలేం.. నానక్‌నగర్‌లో నాలుగైదు రోజుల్లోనే 19 వేల కోళ్లు మృతి చెందాయని ఆలస్యంగా సమాచారం తెలిసిందని నక్కర్తమేడిపల్లి పశువైద్యాధికారి డాక్టర్ కిరణ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన గ్రామానికి చేరుకుని బాధిత రైతులు ముత్యాల వెంకట్‌రెడ్డి, చల్లా కృష్ణారెడ్డి షెడ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే రైతులు మృతి చెందిన కోళ్లను పూడ్చేశారు. కోళ్లు లేనందున బర్డ్‌ఫ్లూతోనే మృతి చెందాయని నిర్ధారణ చేయలేమని తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తానని చెప్పారు. రెండు రోజుల వ్యధిలో 12 వేలు.. నాలుగు రోజుల క్రితం 7 వేలు.. రూ.లక్షల్లో నష్టపోయిన రైతులు -
సోమవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2025
సుదర్శన యాగంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి దంపతులుపూర్ణాహుతి పూజలో స్పీకర్ ప్రసాద్ కుమార్ తదితరులుపట్టణ కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొలిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సుదర్శన యాగంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. – పరిగివికారాబాద్ పట్టణం ఎన్నేపల్లి సమీపంలో వెలిసిన తోట్ల ఎల్లమ్మ తల్లి సహిత పరుశరామ నాగప్రతిష్ఠ ఆలయ పునఃనిర్మాణ ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిసాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూర్ణాహుతి పూజలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఆలయ పునఃనిర్మాణ కర్త రత్నారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు సత్యనారాయణ, మంజుల తదితరులు పాల్గొన్నారు. – అనంతగిరిన్యూస్రీల్ముగిసిన మహోత్సవంవైభవంగా బ్రహ్మోత్సవాలు -
చెరువుల చెంత గస్తీ
మాసబ్ చెరువు వద్ద గస్తీ కాస్తున్న టీం సభ్యులుతుర్కయంజాల్: చెరువులు, కుంటలు, కాలువలను కబ్జా చేయలనుకునే వారు తస్మాత్ జాగ్రత్త. నిత్యం జలవనరుల వద్ద షిప్టుల వారీగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)కు చెందిన ఫోర్స్ గస్తీ కాస్తోంది. ఇటీవల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఇక మీదట వీటి పరిరక్షణకు నడుం బిగించింది. కొన్ని రోజులుగా పలు చెరువుల వద్ద రాత్రి, పగలు తేడా లేకుండా సిబ్బంది పహారా కాస్తున్నారు. దీంతో ఆక్రమణదారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటానికి సాహసించడం లేదు. ఇరిగేషన్ సిబ్బంది సైతం.. హైడ్రాతో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా రాత్రి వేళల్లో చెరువుల వద్దకు వచ్చి పరిశీలిస్తున్నారు. ఇటీవల తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువు, ఇంజాపూర్‌లోని జిలావర్ ఖాన్ చెరువు, పెద్ద అంబర్‌పేటలోని ఈదులకుంట వద్ద హైడ్రా సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహించారు. హైడ్రా, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ పెరగడంతో చెరువుల్లో మట్టి పోయడానికి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. నెల రోజుల క్రితం మాసబ్ చెరువు వద్ద గస్తీ ప్రారంభించకముందు ఓ వ్యక్తి చెరువులో పెద్ద ఎత్తున మట్టిని డంప్ చేసిన విషయం తెలిసిందే. అతడిపై కేసు నమోదు చేయడంతో పాటు, చెరువులో పోసిన మొత్తం మట్టిని అధికారులు దగ్గరుండి తొలగించారు. అన్యాక్రాంతం కాకుండా.. జిల్లాలో మొత్తం 1,075 చెరువులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ప్రభావం అధికంగా ఉండే అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, గండిపేట, శేరిలింగంపల్లి, హయత్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, మండలాల్లో ఆక్రమణలు ఎక్కువగా జరిగినట్లు గతంలోనే తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ సర్వేలో వెల్లడైంది. వీరి సర్వే ప్రకారం 225 చెరువులు పూర్తిగా, 196 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురైనట్లు వెల్లడించారు. ఇలా కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుని అన్యాక్రాంతం అవుతున్న వాటిని కాపాడడమే లక్ష్యంగా హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలపై హైడ్రా నజర్ పరిరక్షణకు పహారా షిఫ్టుల వారీగా సిబ్బంది విధులు అన్యాక్రాంతం కాకుండా చూడడమే పని హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు -
నిర్మాణానికి టెండర్లు
సమీకృత గురుకులాల కొడంగల్: మున్సిపల్ పరిధి పాత కొడంగల్ శివారులో సమీకృత గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టెండర్లను ఆహ్వానించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. కుల మతాలకు అతీతంగా అన్ని గురుకుల పాఠశాలలను ఒకే చోట నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలుండగా తొలి విడతలో 55 నియోజకవర్గాల్లో గురుకుల భవనాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు ప్రభుత్వం రూ.11 వేల కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే కొడంగల్, మధిర, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో గురుకులాల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పాత కొడంగల్ శివారులోని 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అధునాతనమైన భవనాలను నిర్మించడానికి అధికారులు టెండర్లను పిలిచారు. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకులాలను నిర్మించనున్నారు. తరగతి గదుల్లో డిజిటల్ స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ సెంటర్లు, లైబ్రరీలను ఏర్పాటు చేస్తారు. కుల మత వర్గ అంతరాలు లేని విద్యా సౌధంలో క్రీడలను ప్రోత్సహించేలా క్రికెట్, పుట్‌బాల్ గ్రౌండ్స్‌తో పాటు బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టులను ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్‌లో ప్రత్యేక చొరవతో పనులు చేయనున్నారు. విద్యకు తొలి ప్రాధాన్యం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంజూరు చేశారు. రూ.11 వేల కోట్ల నిధులను వెచ్చించి ఏడాది లోపు పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కషి చేస్తోంది. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎడ్యూకేషన్ హబ్‌గా మార్చడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, వెటర్నరీ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, పారా మెడికల్ కళాశాల, స్కిల్ యూనివర్సిటీ, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, జూనియర్ కళాశాలలను మంజూరు చేశారు. ఒకే ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్స్ నాలుగు నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య పాత కొడంగల్ శివారులో 20 ఎకరాలు కేటాయింపు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పరిగి జూనియర్ సివిల్ కోర్డు జడ్జి నాగుల శిల్ప పరిగి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పరిగి జూనియర్ సివిల్ కోర్డు జడ్జి నాగుల శిల్ప అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, పథకాలు అర్హులకు అందేలా చూడాలని కోరారు. మహిళల సంక్షేమానికి తమ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరిగి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ఏజీపీ బాలముకుందం, డీఎస్పీ శ్రీని వాస్, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్రాములు, గౌస్‌పాషా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులకు ఎంసెట్‌లో ఉచిత శిక్షణ తాండూరు టౌన్: హిందూ ధార్మిక పరిషత్, సేవా భారతి ఆధ్వర్యంలో బాలికలకు ఉచితంగా ఎప్‌సెట్(ఎంసెట్) శిక్షణ ఇవ్వనున్నట్లు పరిషత్ తాండూరు కన్వీనర్ గాజుల బస్వరాజ్ తెలిపారు. శనివారం ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న బాలికలకు ఈనెల 23వ తేదీ నుంచి స్థానిక భాష్యం జూనియర్ కళాశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయన్నా రు. ఇందుకు ఈనెల 22వ తేదీ లోపు రూ.500 చెల్లించి అడ్మిషన్ పొందాలన్నారు. శిక్షణకు హాజరయ్యే బాలికలకు ఉచితంగా ఎప్‌సెట్ స్టడీ మెటీరియన్ అందివ్వనున్నట్లు తెలిపారు. ప్రవేశాల కోసం సెల్ నంబర్ 9290082155, 9030056755లలో సంప్రదించాలన్నారు. కావున బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో నరేందర్, వేణుగోపాల్ రెడ్డి, పటేల్ విజయ్, పర్యాద రామకృష్ణ, రాము, రమేష్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ధారూరు మార్కెట్‌కు 560 బస్తాల కందులు ధారూరు: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌కు శనివారం 560 బస్తాల కందులు వచ్చాయని ఏఎంసీ కార్యదర్శి సిద్దమ్మ తెలిపారు. కందులు తక్కువగా క్వింటాలుకు రూ.7,100, మధ్యస్తంగా రూ.7,250, అధికంగా రూ.7,340 వరకు అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు. వేరుశెనగ 218 బస్తాలు వచ్చాయని, క్వింటాలుకు తక్కువగా రూ.5,650, మధ్యస్తంగా రూ.6,240, ఎక్కువగా రూ.6,370 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అలాగే మొక్కజొన్న 90 బస్తాలు వచ్చాయని క్వింటాలు రూ.2,200 నుంచి రూ.2,400 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారని కార్యదర్శి సిద్దమ్మ తెలిపారు. నేడు ఇండియాకు ప్రవీణ్‌కుమార్ మృతదేహం కేశంపేట: అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన గంప ప్రవీణ్‌కుమార్ మృతదేహం ఆదివారం ఇండియాకు రానుంది. మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్‌కుమార్ బుధవారం అమెరికాలోని మిల్వాకీ పట్టణంలో దుండగుల కాల్పులో మృతి చెందిన సంగతి తెలిసిందే. అమెరికాలో పోస్టుమార్టంతో పాటు లాంచనాలు పూర్తికావడంతో మృతదేహాన్ని తానా సభ్యులు, బంధువుల సహకారంతో ఇండియాకు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నట్టు బంధువులు, గ్రామస్తులు తెలిపారు. -
రాజీమార్గమే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి ● లోక్ అదాలత్‌లో1,631 కేసుల పరిష్కారం అనంతగిరి: లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ కోర్టుల పరిధిలో మొత్తం 1,631 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లు అన్ని కోర్టుల్లో కొనసాగుతాయన్నారు. ఇరువర్గాలు విశాల ధృక్ఫథంతో ఆలోచిస్తే కేసుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని తెలిపారు. ప్రతి వ్యక్తీ చట్టాలపై కనీస అవగాహన ఉండాలని సూచించారు. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, ఎస్పీ నారాయణరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌కుమార్, పీపీలు అన్వేషింగ్, సమీనాబేగం, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
మంచిపేరు తెండి
బాధ్యతగా పనిచేసి ఎస్పీ నారాయణరెడ్డిఅనంతగిరి: విధి నిర్వహణలో సిబ్బంది, అధికారులు బాధ్యతగా పనిచేసి పోలీసు శాఖకు మంచిపేరు తేవాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో ఏఆర్ పోలీసులతో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖ అనేది క్రమశిక్షణకు మారుపేరన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. ముఖ్యమైన విధుల్లో సమయపాలన పాటించడంతో పాటు నీట్ టర్న్ ఔట్ అనుసరించాలన్నారు. సిబ్బంది సమస్యలు తెలుసుకునేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని మహిళా అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఎస్ఐలు, హెచ్‌సీలు, పీసీలు, డబ్ల్యూ పీసీలు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి తాండూరు రూరల్: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ గాజీపూర్ నారా యణరెడ్డి అన్నారు. ఎల్ఎన్ఆర్ యువసేన, హైదరాబాద్‌లోని శంకర్ కంటి ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో పెద్దేముల్ మండలం గాజీపూర్‌లో శనివారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలకు సేవ చేయడం సంతోషకరమైన విషయమన్నారు. కంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతున్న సందర్భంలో ఎల్ఎన్ఆర్ యువసేన, శంకర్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా ఆపరేషన్లు చేయడం అభినందనీయమన్నారు. 300మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 50 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించి హైదరాబాద్ తరలించారు. కార్యక్రమంలో ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షుడు లొంక నర్సింలు, కో ఆప్షన్ మాజీ సభ్యుడు నసీర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేష్, నాయకులు లాల్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, సంగమేశ్వర్, బిచ్చన్న, బీ నర్సింలు, నాగభూషణం, రవి, రామకృష్ణ, రాములు, ప్రవీణ్, రాము జాదవ్ పాల్గొన్నారు. -
బలవంతపు భూసేకరణ చేస్తే..
మరో పోరాటం తప్పదు ● మండలంలో ఉపాధి హామీపనులను ప్రారంభించాలి ● వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ దుద్యాల్: పరిశ్రమల పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవాలని ప్రయత్నిస్తే మరో పోరాటం తప్పదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు అన్నారు. శనివారం మండలంలోని లగచర్ల గ్రామంలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లగచర్ల, హకీంపేట్, రోటిబండ తండా, పులిచర్ల కుంట తండా, పోలేపల్లి గ్రామాల రైతులు అంగీకరిస్తేనే పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాకాకుండా బలవంతంగా, బెదిరించి భూములు తీసుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. అలాగే మండలంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, జిల్లా నాయకులు సత్తయ్య, సీ సత్యయ్య, రైతు బసప్ప తదితరులు పాల్గొన్నారు. -
80 కేసులకు పరిష్కారం
కొడంగల్ రూరల్: కేసుల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తోందని మున్సిఫ్ కోర్టు ప్రథమశ్రేణి న్యాయమూర్తి శ్రీరామ్ అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిఫ్ కోర్టులో జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారులకు పలు సూచనలు ఇచ్చారు. పేదలకు కోర్టు ఖర్చుల భారం లేకుండా లోక్ అదాలత్‌ల ద్వారా కేసులు పరిష్కారం అయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాజీ మార్గమే రాజ మార్గం అన్నారు. కోర్టు సమయాన్ని వృథా చేయకుండా అవగాహనతో రాజీతో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం ఎకై ్సజ్‌కు సంబంధించి 40, డ్రంకెన్‌డ్రైవ్ 32, నేరం అంగీరించినవి నాలుగు, మరో నాలుగు క్రిమినల్ కేసులతో మొత్తం 80 కేసులను పరిష్కరించినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు బస్వరాజు, బాగ్యలత, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటయ్య, సీనియర్ న్యాయవాదులు వెంకట్‌రెడ్డి, కృష్ణ, మొహీద్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా షూటింగ్లో అపశ్రుతి
శంకర్పల్లి: ఓ సినిమా షూటింగ్లో అపశ్రుతి చో టు చేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి మండల పరిధిలోని టంగుటూరు శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. టంగుటూరుకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీజేపీ నేత బద్ధం శంభారెడ్డి(47) సిని ఇండసీ్ట్ర వారికి సుపరిచితుడు. మండల పరిధిలో చేసే షూటింగ్‌లకు అనుమతులు ఇప్పిస్తుంటాడు. కాగా శుక్రవారం గ్రామ శివారు పంట పొలాల్లో ‘ఓదేల.. ది రైల్వేస్టేషన్’ సినిమా షూటింగ్ ఉంది. షూటింగ్ బృందానికి చెందిన ఓ భారీ క్రేన్ రావడంతో విద్యుత్ వైర్లకు తగులుతుందేమోనని శంభారెడ్డి ట్రాన్స్ఫార్మర్(జంపర్)ను ఆఫ్ చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. షూటింగ్ బృందం వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రాత్రి విధుల్లో ఉన్న పెట్రోలింగ్ వాహనంలో సిబ్బంది, నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి మార్చురికీ తరలించారు. మృతుడికి భార్య లావణ్య, ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే మణివర్ధన్‌రెడ్డి, శిరీష ఉన్నారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మోకిల ఠాణాలో మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు. రెండు గంటల పాటు ధర్నా కాగా పోలీసులు సినీ ఇండసీ్ట్ర వారితో కుమ్మకై ్క ఆధారాలు లభించకుండా మృతదేహాన్ని మార్చురికీ తరలించారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతు ఘటనా స్థలికి వెళ్లగా.. ఎవరికీ చెప్పొద్దంటూ వెనక్కి పంపించారని వాపోతున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా తరలిస్తారంటూ శనివారం మోకిల చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనాల దారి మళ్లించారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం ధర్నాకు మద్దతు తెలిపారు. అనంతరం నార్సింగి ఏసీపీ రమణగౌడ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఎమ్మెల్యే పరామర్శ శంభారెడ్డి మరణవార్త తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మృతుడి ఇంటికి వెళ్లా రు. వారికి కుటుంబ సభ్యులను పరామర్శించా రు. అనంతరం ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. విద్యుదాఘాతంతో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మృతి మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు సమాచారం ఇవ్వలేదని మృతుడి కుటుంబీకుల ధర్నా ఏసీపీ రమణగౌడ్ జోక్యంతో ఆందోళన విరమణ -
సీపీఎస్ రద్దుకు డిమాండ్
కొడంగల్: సీపీఎస్‌ను రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లూరి క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పలు పాఠశాలల్లో ఉద్యోగులతో కలిసి సీపీఎస్ రద్దు చే యాలనే డిమాండ్‌తో పోస్టర్లను ఆవిష్కరించారు. ఫ్యామిలీ పెన్షన్ లోపాలు, ప్రభుత్వం చెల్లించే మ్యా చింగ్ గ్రాంట్స్ జమ కాకపోవడం తదితర అంశా లను పరిష్కరించాలని కోరారు. సీపీఎస్‌ను అంత రం చేసి పాత పెన్షన్ అమలయ్యే వరకు నిరంతరం పోరాడుతామని హెచ్చరించారు. ఉద్యోగులంతా సంఘటితమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉపాధ్యక్షుడు అశోక్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నగేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘మిలియన్ మార్చ్’డే ను విజయవంతం చేయండి
కొడంగల్ రూరల్: మిలియన్ మార్చ్ డే ను విజయవంతం చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్(టీజేఎఫ్) రాష్ట్ర కో కన్వీనర్ కన్నోజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ప్రతీ నెల రూ.30వేల గౌరవ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్వతంత్ర సమరయోధుల సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని కోరారు. మార్చి 10న హైదరాబాద్‌లో జరగనున్న మిలియన్ మార్చి డేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరేశం, నవీన్, సిద్దు, వినయ్, విజయ్‌కుమార్, తేజ తదితరులు పాల్గొన్నారు. షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం మోమిన్‌పేట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన మండల పరిధిలోని చంద్రయాన్పల్లిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన బషీర్ కుటుంబ సభ్యులు ఉదయం పొలం పనులకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానిక యువకులు మంటలార్పేందుకు యత్నించారు. ఇంట్లోని నిత్యావసర సరుకులు, దుస్తులు, రూ.లక్ష నగదు దగ్ధమైనట్లు బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. చోరీ కేసులో నిందితుడికి రిమాండ్ తాండూరు రూరల్: చోరీ కేసులో నిందితుడి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. పెద్దేముల్ మండలం జనగాం గ్రామంలో జినిగే వెంకట్‌రెడ్డి ఇంట్లో ఫిబ్రవరి 28న గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన గోపాల్ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మూడు టిప్పర్లు సీజ్ కేశంపేట: అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్లను శనివారం పోలీసులు సీజ్ చేశారు. సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. పోతుల ప్రసాద్ ఫరూఖ్‌నగర్ మండలం బుచ్చిగూడ నుంచి నిబంధనలకు విరుద్ధంగా మహేశ్వరం మండలం దుబ్బచర్లకు మట్టి తరలిస్తున్నాడు. పోలీసులు పెట్రోల్ నిర్వహిస్తుండగా మంగళిగూడ వద్ద మూడు టిప్పర్లలో మట్టి తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాలు ఆపారు. ఇద్దరు డ్రైవర్లు పరారవగా ఓ డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. డ్రైవర్ సూర్యను విచారించి టిప్పర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కానిస్టేబుల్ శ్రీశైలం ఫిర్యాదు మేరకు ప్రసాద్, టిప్పర్ డ్రైవర్ సూర్య, పారిపోయిన డ్రైవర్లు సంతోష్, ప్రతాప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాలుగు ట్రాక్టర్లు మాడ్గుల: మండల పరిధిలోని అప్పారెడ్డి పల్లి, నర్సాయిపల్లి శివారులో కెఎల్–183 కాలువ నుంచి శనివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీఐ వేణుగోపాల్ రావు తెలిపారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి ప్రశ్నించగా ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో వాటిని సీజ్ చెసినట్లు చెప్పారు. డ్రైవర్లు, వాహన యాజమనులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యతోనే ఏదైనా సాధ్యం
అనంతగిరి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వికారాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా న్యాయవాదులతో కలిసి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డీబీ శీతల్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రతీ ఒక్కరు అమ్మాయిలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. విద్యతోనే అన్నీ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్‌కుమార్, కార్యదర్శి వెంకటేశ్, న్యాయవాదులు వసుంధర, పద్మలత, జయలతారెడ్డి, శ్రీలత, సుమలత, పూజ, ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డీబీ శీతల్ -
ఆలయంలో విగ్రహాలు మాయం
మొయినాబాద్: ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఆలయంలోని మైసమ్మ, కనకదుర్గ అమ్మవార్ల విగ్రహాలు మాయమయ్యాయి. ఈ ఘటన మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో చోటుచేసుకుంది. మొయినాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ఓ పురాతన ఆలయం ఉంది. అందులో మైసమ్మ, కనకదుర్గ అమ్మవార్ల విగ్రహాలున్నాయి. శనివారం ఉదయం ఆస్పత్రికి వచ్చినవారికి ఆలయంలో విగ్రహాలు కనిపించకపోవడంతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనకు చేపట్టారు. ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రిలో పనిచేసే ఓ ఏఎన్ఎం కొత కాలంగా మతిస్థిమితం సరిగాలేక పూనకంతో ఊగిపోతోందని.. ఆలయానికి ఉన్న టైల్స్‌ను కొంత కాలంగా తానే తొలగించిందని.. విగ్రహాన్ని సైతం ఆమె మాయం చేసి ఉండవచ్చని సిబ్బంది చెప్పారు. ఈ విషయంపై బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని సర్ధి చెప్పారు. బీజేపీ, హిందూ సంఘాల ఆందోళన పోలీసులకు ఫిర్యాదు మతిస్థిమితం సరిగా లేని ఏఎన్ఎం తీసినట్లు చెబుతున్న వైద్య సిబ్బంది మానసిక రోగంతోనే.. పీహెచ్సీలో పనిచేసే గంగా అనే ఏఎన్ఎం మానసిక పరిస్థితి కొంత కాలంగా సరిగా లేదు. ఆలయం వద్ద పూజలు చేస్తూ పూనకంతో ఊగిపోతుంది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెల్లాం. మెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ తెప్పిస్తే సిబ్బందిని బూతులు తిడుతూ కర్రలతో దాడి చేసింది. ఎవరైనా దగ్గరకు వస్తే చనిపోతానని బెదిరిస్తుంది. మతిస్థిమితం సరిగా లేని గంగా విగ్రహాలను తొలగించి ఉంటుందని భావిస్తున్నాం. – అన్నపూర్ణ, వైద్యాధికారి, మొయినాబాద్ -
వనితా.. వందనం
తల్లిగా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతోంది.. మమతానురాగాలకు చిరునామాగా నిలుస్తోంది.. తోబుట్టువుగా ప్రేమను పంచుతోంది.. ఆలిగా మగవాడి బతుకులో సగపాలు తనదిగా కష్టసుఖాల్లో తోడూనీడగా ఉంటోంది.. ప్రతి పురుషుడి విజయం వెనుక ‘ఆమె’ కీలకపాత్ర పోషిస్తోంది.. ఇంటికి దీపం ఇల్లాలుగా కుటుంబానికి వెలుగులు పంచుతోంది.. సేవకు ప్రతిరూపంగా నిలుస్తోంది.. ఒకవైపు వంటింట్లో గరిటెతిప్పుతూనే మరోవైపు రాజకీయాలు, పాలనలోనూ ‘చక్రం’ తిప్పుతోంది.. ఒకప్పుడు గృహిణులుగానే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ‘రాణి’స్తున్నారు.. ఆకాశంలో సగం కాదు అన్నింట్లోనూ ముందే అని నిరూపిస్తున్నారు.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. శంకర్పల్లి: పుట్టుకతో అంగవైకల్యం ఉన్నప్పటికీ డాక్టర్ కావాలనుకునే లక్ష్యాన్ని సాధించానని అంటున్నారు శంకర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ రేవతిరెడ్డి. అమ్మానాన్నలు రేయింబవళ్లు కష్టపడ్డారని.. తాను, తన అక్క కలలు కన్న లక్ష్యాల కోసం నిరంతరం తాపత్రయ పడ్డారని చెబుతున్నారు. ఫీజు కట్టడానికి డబ్బుల్లేక నమ్ముకున్న పొలం సైతం అమ్మేసి చదివించారని తెలిపారు. చదువులో చురుగ్గా.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి, సరళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు మాధవి రెడ్డి, చిన్న కూతురు రేవతి రెడ్డి. వెంకట్‌రెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. చిన్న కూతురు రేవతిరెడ్డికి చిన్నతనం నుంచే అంగవైకల్యం ఉన్నప్పటికీ చదువులో చురుగ్గా ఉండేది. గమనించిన తండ్రి ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించాడు. శంకర్పల్లి పట్టణంలోని శ్రీ వివేకానంద పాఠశాలలో 7వ తరగతి వరకు తర్వాత 10వ తరగతి వరకు వికారాబాద్ ఎన్నేపల్లిలోని సంఘం లక్ష్మీబాయి రెసిడెన్షియల్ పాఠశాలలో, తర్వాత ఇంటర్ వరంగల్ హసన్‌పర్తిలోని ఏపీఆర్జేసీలో చదువుకుంది. ఎంబీబీఎస్‌లో దివ్యాంగుల కోటాలో సీటు రాకపోవడంతో ఓపేన్ ఎ క్యాటగిరీలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. ఖర్చుల కోసం పొలం అమ్మేసి కూతురికి ఎంబీబీఎస్‌లో సీటు రావడంతో తండ్రి ఎంతో సంతోషించాడు. ఎంత కష్టమైనా చదవించాలనుకున్నాడు. పెద్ద కూతురు ఎంఎస్సీ, చిన్న కూతురు ఎంబీబీఎస్ కోసం సంవత్సరానికి రూ.లక్షల్లో ఖర్చవుతుండడంతో ఊర్లోని ఆరు ఎకరాల పొలం అమ్మి చదివించాడు. 2008లో పెద్ద కూతురు మాధవిరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించగా.. 2014లో రేవతిరెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. 2014 నుంచి 15 వరకు కోస్గి, 2015–18 నవాబ్‌పేట్, ప్రస్తుతం శంకర్పల్లి పీహెచ్‌సీల్లో వైద్యురాలిగా సేవలందిస్తోంది. ప్రభుత్వం నుంచి అవార్డులురేవతిరెడ్డి ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు బాసటగా నిలుస్తోంది. అనేకమందికి ప్రాథమిక దశలోనే రుగ్మతలను గుర్తించి మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, నిరంతరం పర్యవేక్షిస్తోంది. నిత్యం ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు సాధారణ ప్రసవం గురించి, ఇంట్లో చేయాల్సిన వ్యాయామాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. రేవతిరెడ్డి చేస్తున్న వైద్య సేవలను గుర్తించి 2023లో కలెక్టర్ ఉత్తమ వైద్యురాలి అవార్డుకి ఎంపిక చేశారు. జిల్లా వైద్యా, ఆరోగ్య శాఖ వారు సాధారణ ప్రసవాలు, ఉత్తమ సేవలకు గాను రెండు సార్లు అవార్డులు అందించారు. డాక్టర్ రేవతిరెడ్డికి 2017లో పాండురంగారెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆరేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నాడు. తండ్రి వెంకట్‌రెడ్డి 2020లో గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి సంరక్షణను అక్కాచెల్లెళ్లు చూసుకుంటున్నారు. ● తగ్గేదేలె తాండూరు టౌన్: తాండూరు పట్టణానికి చెందిన సంతోషి కుమారి గృహిణి. నవనీత ఓ ప్రైవేటు స్కూల్లో పీఈటీగా పనిచేస్తోంది. వీరు చిన్నతనంలో నేర్చుకున్న ఆటల్ని, ఇష్టాన్ని వదులుకోలేక పో యారు. ఈ ఏడాది జనవరి నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 45 – 50 ఏళ్ల విభాగంలో 48 ఏళ్ల వయసున్న సంతోషి లాంగ్‌జంప్, ట్రిపుల్ జంప్‌లలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. నవనీత 35–40 ఏళ్ల విభాగంలో హైజంప్‌లో గోల్డ్ మెడల్, లాంగ్ జంప్‌లో సిల్వర్ మెడల్, ట్రిపుల్ జంప్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కేరళ రాష్ట్రం త్రిశూర్‌లో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో సంతోషి ట్రిపుల్ జంప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించగా, నవనీత హైజంప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. త్వరలో ఇండోనేషియాలో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో నవనీత పాల్గొననున్నారు. ● వైద్య వృత్తిలో.. దోమ: పేద ప్రజలకు వైద్యం అందించాలనే డాక్టర్ వృత్తిని ఎంచుకున్నా. నాన్న గోపాల్, అమ్మ సామ్రాజ్యం. వారికి ముగ్గురు సంతానం. తనను ఉన్నత ఉద్యోగంలో చూడాలన్నదే తల్లిదండ్రుల ఆకాంక్ష. సొంత జిల్లా నల్లగొండలో విద్యాభ్యాసం పూర్తి చేశా. మేడ్చల్‌లోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉద్యోగం సాధించా. మొదటి దోమ పీఎచ్సీకి పోస్టింగ్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ● బతుకుదెరువు కోసం వెళ్లి.. ఎస్ఐ పోస్టు సాధించి కుల్కచర్ల: మండలంలోని సక్య్రానాయక్ తండాకు చెందిన పాత్లావత్ అనూషాది పేద కుటుంబం. బండవెల్కిచర్ల గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి.. షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. తల్లిదండ్రులకు చదివించే స్తోమత లేక మండలంలోని జీతుల తండాకు చెందిన పాత్లావత్ వెంకటేష్‌తో వివాహం చేసి పంపారు. వివాహ అనంతరం కూడా ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. దీంతో బతుకుదెరువు కోసం కుటుంబంతో హైదరాబాద్‌కు వెళ్లారు. తమ జీవితాలు బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించింది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది. 2023 పోలీసు శాఖ రిక్రూట్మెంట్లో ఎస్ఐగా ఎంపికై ంది. ప్రస్తుతం నగరంలోని సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ట్రైనీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తోంది. కష్టాలకు భయపడకుండా ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుందని నేటి యువతకు సందేశమిస్తోంది. ● ఆరుగురూ ప్రభుత్వ ఉద్యోగులే.. యాలాల: మండల కేంద్రానికి చెందిన సీహెచ్ హన్మయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు. హన్మయ్య, సూర్యకళ దంపతులకు ఆరుగురు కూతుళ్లు. అందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించారు. సమాజంలో మహిళలకు ఎదురయ్యే అవాంతరాలు.. చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ పెంచారు. ప్రస్తుతం ఆరుగురూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సంధ్యారాణి(స్కూల్ అసిస్టెంట్), స్వరూపారాణి(గురుకుల ఉపాధ్యాయురాలు), భార్గవి(పీఆర్ ఏఈ, మహబూబ్‌నగర్ జిల్లా), అర్చన(పంచాయతీ కార్యదర్శి), అశ్విని(ఎస్జీటీ ఉపాధ్యాయురాలు), హారిక ఎస్జీటీ ఉపాధ్యాయురాలుగా స్థిరపడ్డారు. వైకల్యాన్ని జయించి.. వైద్యురాలిగా చట్టాల గురించి తెలుసుకోవాలి మహిళలు దేశ అత్యున్నత పదవులను సైతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మహిళా ప్రజాప్రతి నిధులు భర్తల సాయం లేకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆఫీసులకు స్వేచ్ఛగా, నిర్భయంగా వెళ్లిన నాడే నిజమైన హక్కులు సాధించుకున్నట్లు లెక్క. చట్టాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే హక్కులు సాధించుకోగలుగుతారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – డీబీ శీతల్, న్యాయమూర్తి, వికారాబాద్ కోర్టు కుటుంబం నుంచే స్వేచ్ఛ ప్రారంభం కావాలి మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, స్వేచ్ఛగా వ్యవహరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు నా భావన. మహిళలకు స్వేచ్ఛ కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. తల్లిదండ్రులు ఆడపిల్లలను మగపిల్లలను వేర్వేరుగా చూడటం మానేయాలి. ఆడపిల్లలను భారంగా భావించి చిన్నతనంలోనే పెళ్లి చేపి పంపుతున్నారు. ఇది చట్టవిరుద్ధం. బాలికలు బాగా చదివి ఉన్నత శిఖరాలు చేరాలి. ఆర్థికంగా స్థిరపడాలి. – జయసుధ, డీపీఓ మహిళల్లో అక్షరాస్యత పెరగాలి మహిళల్లో అక్షరాస్యతా శాతం పెరగాలి. తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆరోగ్యం కాపాడుకోవాలి. మానసికంగా ధృడంగా ఉండాలి. జిల్లాలో మహిళా అక్షరాస్యత తక్కువే. బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం ఉంది. వాటిని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆడపిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రోత్సహించాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. – రేణుకాదేవి, డీఈఓ ఓడిపోయిన వైకల్యం అనంతగిరి: వికారాబాద్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా విధులు నిర్వహిస్తున్న గోవిందమ్మ దివ్యాంగురాలు.. పుట్టినిల్లు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్‌పల్లి గ్రామం. అత్తారిల్లు కుల్కచర్ల మండలం ఘనాపూర్. చిన్నప్పుడే పోలియో బారిన పడింది. కానీ అధైర్య పడలేదు. హైదరాబాద్‌లోని వికలాంగుల స్కూల్లో చదువుకుంది. 2002లో జూనియర్ అసిస్టెంట్‌గా రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ కార్యాలయంలో టైపిస్టుగా జాయిన్ అయ్యింది. ప్రమోషన్‌పై పరిగి గిర్దావర్‌గా, దోమలో డీటీగా, తహసీల్దార్‌గా యాలాలలో పనిచేసి ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా బాధ్యతలు నిర్వహిస్తోంది. చదువుకు పేదరికం, అంగవైకల్యం అడ్డుకాదని చెబుతోంది. మనం కష్టపడి ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుందని అంటోంది. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని యువతకు సూచిస్తోంది. అధికారులను నిర్భందించి.. రోడ్డు సాధించి బొంరాస్‌పేట: మహిళా సంఘాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఎన్కేపల్లి గ్రామం. 2002కు ముందు గ్రామానికి మట్టి రోడ్డు కూడా లేదు.. అప్పట్లో ఓ ముస్లిం మహిళ చనిపోతే శవాన్ని మంచం మీద మోసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన చూసిన గ్రామ మహిళా సంఘాలు చెలించిపోయాయి. ఆ సమయంలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన అధికారులను మహిళా సంఘాల సభ్యులు నిర్భందించారు. రోడ్డు సౌకర్యం కల్పించేదాకా అధికారులను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. సాయంత్రం ఆర్డీఓ అనితారాంచంద్రన్ (ప్రస్తుత టీఎస్పీఎస్సీ కార్యదర్శి) గ్రామానికి వచ్చి ప్రజలకు రోడ్డు హామీ ఇచ్చి అధికారులను తీసుకెళ్లారు. అనంతరం గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం ఏర్పడింది. అప్పట్లో తాము ఉద్యమించడం వల్లే గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం వచ్చిందని మహిళా సంఘం అధ్యక్షురాలు బోయిని మాణెమ్మ తెలిపారు. తనకంటూ ఓ పేజీ.. దుద్యాల్: మండలంలోని హస్నాబాద్‌కు చెందిన కంతి లక్ష్మి గతంలో మహిళా సంఘాల్లో పని చేసేది. భర్త కంతి సైదప్ప. గ్రామ పంచాయతీ కార్మికుడిగా పని చేసేవాడు. ప్రమాదంలో సైదప్ప కాలు విరిగిపోవడంతో భార్య లక్ష్మి 2020లో ఆయన విధుల్లో చేరింది. నాటి నుంచే పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలకు తడి పొడి చెత్త గురించి వివరించడం మొదలు పెట్టింది. జనంలో కూడా మార్పు తెచ్చింది. ఆమె సేవలను అధికారులు గుర్తించారు. 2023లో జాతీయ స్థాయి ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపిక చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. 2024లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛత శక్తి పుస్తకంలో (61వ పేజీలో) చోటు దక్కించుకుంది. -
వెయిట్‌లిఫ్టర్ అంజలికి సన్మానం
కుల్కచర్ల: వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తున్న అంతారం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నీరటి అంజలిని శుక్రవారం కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల అంజలికి ప్రశంసా పత్రం అందజేసి, సన్మానించారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో అంజలి రాష్ట్రస్థాయి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. భూ నిర్వాసితులకు చెక్కులు అనంతగిరి: ప్రభుత్వం అందజేసిన నష్ట పరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులకు సూచించారు. దుద్యాల మండలం హకీంపేటకు చెందిన భూ నిర్వాసితులకు మంజూరైన చెక్కులను అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, దుద్యాల తహసీల్దార్ కిషన్‌తో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో బాధితులకు అందజేశారు. సీఎమ్మార్ అప్పగింతలో నిర్లక్ష్యం తగదు పరిగి: సీఎమ్మార్ బియ్యం అప్పగించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ హెచ్చరించారు. పరిగిలోని న్యూ ఇండియన్ రైస్ మిల్లు శ్రీశివకృష్ణ రైస్ మిల్లులను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. సకాలంలో బియ్యం అందించి సహకరించాలని సూచించారు. ఆయన వెంట డీఎస్ఓ మోహన్‌బాబు, డీఎస్సీఎం వెంకటేశ్వర్లు, సంతోష్, విజయ్ తదితరులు ఉన్నారు. పత్తి దిగుబడి పెంచాలి జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రెడ్డి తాండూరు టౌన్: పత్తి అధిక సాంద్రతతో సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఏఓ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కొన్ని ఏళ్లుగా పత్తి దిగుబడి నిలకడగా ఉందని.. ఇది పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అధిక సాంద్రతలో పత్తిని సాగుచేయడం వల్ల పంట కాలం తగ్గించుకోవచ్చన్నారు. రెండో పంటగా పెసర, మినుములు వేసుకుని రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఏరువాక కో–ఆర్డినేటర్ టి.లక్ష్మణ్, ప్రధాన శాస్త్రవేత్త కె.పరిమళ, శాస్త్రవేత్తలు సునీత, సుజాత, శేఖర్ మాట్లాడుతూ.. వివిధ పంటల్లో కొత్తగా విడుదలైన వంగడాలపై రైతులు అవగాహన ఉండాలన్నారు. తేనెటీగల పెంపకాన్ని చేపట్టి అధిక లాభాలను పొందవచ్చన్నారు. జొన్న పంటలో యాజమా న్య పద్ధతులను పాటించాలన్నారు. పంటల్లో కలుపు మొక్కల యాజమాన్యం, వాటిని తొలగించుటలో కలుపు మందు పిచికారీపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఆర్సీ విస్తరణ సలహా మండలి సభ్యులు ద్యావరి నారాయణ, వ్యవసాయాధికారులు కిషోర్, రత్నమాల, కేశ వ కృష్ణ పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేయాలని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ.. సృష్టికి మూలం మహిళలే అని అన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర చాలా గొప్పదన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పని చేస్తోందన్నారు. షీటీం ఆకతాయిలపై కొరడా జులిపిస్తోందని తెలిపారు. మహిళల భద్రత కోసం పటిష్టమైన చట్టాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలను చైతన్యం చేయడం ద్వారానే హత్యలు, అత్యచారాలు తగ్గుముఖం పడతాయన్నారు. కార్యక్రమంలో గురునానక్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్ఎస్ సైనీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తెలిసిన వారితోనే ఇబ్బంది
సాక్షి, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్: సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షపై రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సాక్షి ప్రత్యేక సర్వే నిర్వహించింది. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు, 18నుంచి 25 ఏళ్ల వయసున్న యువతులు, 25 నుంచి 35 సంవత్సరాలున్న అతివలు, 35 నుంచి 50 ఏళ్ల వయసున్న వంద మంది మహిళలను (25 మంది చొప్పున) నాలుగు విభాగాలుగా చేసి సర్వే నిర్వహించగా.. వారి నుంచి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నప్పటికీ పలు చోట్ల వివక్ష కొనసాగుతోందని, స్కూళ్లు, కాలేజీలు, పని ప్రదేశాల్లో ఇతరుల నుంచి కొంత ఇబ్బంది ఎదురవుతోందని, బస్టాప్‌లు, ఆఫీసుల్లో పురుషాధిక్యం ఉందని, సెల్ఫోన్లలో వచ్చే మెసేజ్‌లు తమను ఎక్కువగా బాధ పెడుతున్నాయని, వీరిలో తెలియని వారికన్నా తెలిసిన వారే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారని సర్వే వెల్లడిస్తోంది. మహిళలపై పలుచోట్ల కొనసాగుతున్న వివక్ష బస్టాప్‌లు, కాలేజీల్లో పురుషాధిక్యం ఇబ్బంది పెడుతున్న సెల్‌ఫోన్ మెసేజ్‌లు -
అతివలే అధికారులు
ఆమనగల్లు: సమాజంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందిస్తున్నారు. వ్యాపారం, క్రీడా రంగాల్లోనూ తమ ప్రతిభ చాటుతునర్నారు. ప్రజాప్రతినిధులుగా తామేమీ తీసిపోలేదంటూ ప్రజా మన్ననలు పొందుతున్నారు. మండల పరిధిలో ప్రభుత్వ శాఖల అధికారులంతా మహిళలే. ఆమనగల్లు ప్రధమశ్రేణి న్యాయమూర్తిగా కాటం స్వరూప, ఎంపీడీఓగా కుసుమమాధురి, తహసీల్దార్‌గా లలిత, వ్యవసాయ శాఖ ఏడీగా శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు. -
గొప్పశక్తిగా మహిళ
ఒకప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతను.. మరోవైపు అధికారిక కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకుంటూ.. ఉన్నతంగా రాణిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా గొప్ప శక్తిగా ఎదుగుతున్నారు – ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్ చిన్నచూపు వద్దు మాది పూర్వ నల్లగొండజిల్లా హుజూర్నగర్. నాన్నకు నలుగురం సంతానం. పేద, మధ్య తరగతి కుటుంబం. ముగ్గురు అమ్మాయిలే అయినామా నాన్న మమ్మల్ని చదువు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదివించారు. ఎకనామిక్స్‌లో పీజీ, బీఈడీ పూర్తి చేసి, స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాను. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ రిక్రూట్మెంట్లో భాగంగా డైరెక్ట్ సెలక్షన్ ద్వారా వచ్చాను. మిర్యాలగూడలో తొలి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డిలో ఏడీ చైల్డ్ వెల్ఫేర్‌గా పని చేశాను. ఆ తర్వాత ఇక్కడికి బదిలీపై వచ్చా. – సంధ్యారాణి, సీ్త్ర, శిశు సంక్షేమ సంఘం అధికారి -
తాండూరు నుంచే బీసీ ఉద్యమం
తాండూరు టౌన్: యాభై ఏళ్ల క్రితం తాండూరు నుంచే బీసీ ఉద్యమం ప్రారంభమైందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. శుక్రవారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను సంఘం తాండూరు శ్రేణులు, బీసీ మహిళా సంఘం నాయకులు నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ హక్కుల సాధనకు పోరాడుతూనే విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. త్వరలో ఢిల్లీ స్థాయిలో నిర్వహించనున ఉద్యమానికి బీసీలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, బీసీ మహిళా సంఘం నాయకులు మధులత, అనిత, మంజుల, నర్సమ్మ, జగదీశ్వరి, నాయకులు లక్ష్మణాచారి, శ్రీనివాస్, అరుణ్‌రాజ్, విజయ్, ఫయాజ్, రాములు తదితరులు ఉన్నారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్ -
లింగసమానత్వ సాధనకు..
అనంతగిరి: బాలికలు ఉన్నత విద్యనభ్యసించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ఆడపిల్లల సమానత్వ సమాఖ్య పనిచేస్తోంది. ఉన్నత విద్యతోనే లింగసమానత్వం సాధ్యమనే ఉద్దేశంతో ఎంవీఎఫ్ ఆధ్వర్యంలో ఈ సమాఖ్య పోరాడుతోంది. గతేడాది మే లో ఏర్పడిన ఈ సంఘం కన్వీనర్‌గా కృప, జిల్లా కన్వీనర్‌గా జ్యోతి ఉన్నారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. ఆరు జిల్లాల్లో ఆక్టివ్‌గా పనిచేస్తోంది. జిల్లా కమిటీలో 30మంది బాలికలున్నారు. బాలికలను విద్యాలక్ష్మిని చేయడమే సంఘం ఆశయం. -
పెండింగ్ వేతనాలు చెల్లించండి
కేశంపేట: పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని జీపీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంఘం నాయకులతో కలిసి పంచాయతీ రాజ్ డిప్యూటీ డైరెక్టర్ రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన రామారావు వచ్చే బడ్జెట్ నుంచి గ్రీన్ చానల్ ద్వారా ప్రతీ నెల 1న వేతనాలు అందేలా చూస్తామన్నారు. టీస్బీఎస్ ద్వారా ఫిబ్రవరి వరకు ఉన్న వేతనాలను మంగళవారం వరకు చెల్లిస్తామన్నారు జనరల్ ఫండ్స్‌లో జనరేట్ చేసిన వేతనాల చెక్కులను క్లియర్ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాజ్యం, మల్లయ్య, జిల్లా నాయకులు రాంచంద్రయ్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళలను ప్రోత్సహిస్తే.. ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు
అనంతగిరి: మహిళలను ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని, అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో టీజీఓ జిల్లా కమిటీ, మహిళా శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా చిన్ననాటి నుంచి ఆడపిల్లలను ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. నా జీవితంలో మొదటి గురువు తన తల్లి అన్నారు. మహిళలను సమాన దృష్టితో చూడాలన్నారు. మగవారి విజయం వెనుక మహిళల సహకారం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగంలో మహిళా ఉద్యోగులు వారికి అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. విధుల పట్ల వారికున్న అంకితభావానికి గర్విస్తున్నానని పేర్కొన్నారు. బొంరాస్‌పేట ఆశ్రమ పాఠశాల మహిళా ఉపాధ్యాయులు చేసిన బంజార నృత్యం, భరత నాట్యం ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, డీపీఓ జయసుధ, డీపీఆర్ఓ చెన్నమ్మ, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటేష్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి, వైస్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టరేట్, డీపీఆర్ఓ ఉద్యోగులు రక్తదానం చేశారు. క్రీడా పోటీలు మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా క్రీడాకారులకు, కలెక్టరేట్, మున్సిపల్, రెవెన్యూ, విద్య, వైద్య, పోలీస్ మహిళా సిబ్బంది, అంగన్వాడీ, మహిళా సంఘాల సభ్యులకు బహుమతులు అందజేశారు. కలెక్టరేట్లో రంగోలి, మ్యూజికల్ చైర్, చెస్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు, రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిని గుత్తా జ్వాల కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
ఇబ్రహీంపట్నం రూరల్: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి వెంటనే గ్రౌండింగ్ చేయడంలో వేగం పెంచాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మార్చి 15 వరకు మిషన్ భగీరథ, గ్రిడ్ ఇంట్రా పనులకు గ్రౌండింగ్ చేపట్టి 20 వరకు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరకాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు పరిశీలించి గడువులోపు పూర్తి చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రామాణాభివృద్ధి అధికారి శ్రీలత, పంచాయతీ అధికారి సురేష్ మోహన్, మిషన్ భగీరథ ఈఈ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీపైఅవగాహన కల్పించండి గ్రామాల్లో తాగునీటిఎద్దడి తలెత్తకుండా చూడాలి కలెక్టర్ నారాయణరెడ్డి -
సామాజిక తనిఖీ బృందానికి సహకరించండి
ఎంపీడీఓ ఉషశ్రీ కొడంగల్ రూరల్: ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించి శనివారం నుంచి సామాజిక తనిఖీ బృందం పరిశీలిచనుందని.. ఈ పరిశీలనకు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది సహకరించాలని ఎంపీడీఓ ఉషశ్రీ సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 14వ విడత సామాజిక తనిఖీ బృందం, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకంలో ఏడాదిగా మొత్తం 8,08,22,055లకు సబంధించి నిర్వహించిన పనులకు సామాజిక బృందం పర్యటిస్తూ తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జయపాల్‌రెడ్డి, ఎస్ఆర్పీ జీవన్, ఏపీఓ రాములు, డీఆర్పీలు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఉపాధి పనుల్లో అక్రమాలు బషీరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు వెలుగు చూశాయి. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సామాజిక ప్రజావేదికలో ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి ఎఫ్‌ఏలు, ఉపాధి అధికారుల నుంచి రూ.2.53 లక్షల నిధులు రికవరీ చేసినట్లు డీఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. అలాగే రూ.41 వేలు జరిమానా విధించామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సరళ, ఎంపీడీఓ విజయ్‌కుమార్, ఏపీఓ శారద, తనిఖీ అధికారులు పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ ముగ్గురికి రిమాండ్ శంకర్పల్లి: హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు గంజాయికి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మోకిల ఠాణా పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం.. గురువారం సాయంత్రం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు మోకిల పోలీసులు శంకర్పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు స్విఫ్ట్ కారులో వెళ్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్ మత్రు(35), నేనావత్ తేజ(29), మహారాష్ట్రకు చెందిన నీలేశ్ బాబన్ కాలే(22)ను అదుపులోకి తీసుకున్నారు. కారులో తనిఖీ చేయగా 52 కిలోల గంజాయి పాకెట్లు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోతుగూడెం(ఆంధ్రా–ఒడిశా బార్డర్) నుంచి గంజాయి తీసుకు వచ్చామని.. పెద్ద అంబర్‌పేట ఓఆర్ఆర్ వద్దకు చేరుకున్నాక కొంత కారులో.. మిగిలినది సెప్టిక్ ట్యాంక్ వాహనంలో ఉంచి తరలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా పోలీసులు సెప్టిక్ ట్యాంకు వాహనం కోసం గాలింపు చేపట్టారు. ముగ్గురు నిందితుల వద్ద 52 కిలోల గంజాయితో పాటు కారు, నాలుగు ఫోన్లు సీజ్ చేశారు. శుక్రవారం నిందితులను చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జైలుకు తరలించారు. -
ప్రభుత్వ బడుల మనుగడ ప్రజల చేతుల్లోనే
● యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లేశం ● ఘనంగా స్వయం పరిపాలన, పాఠశాల వార్షికోత్సవం బొంరాస్‌పేట: ప్రభుత్వ పాఠశాలలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంచి సౌకర్యాలు ఉన్నాయని, పాఠశాల స్థాయిని పోగొట్టుకోరాదని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. గురువారం మండలంలోని ఎన్కేపల్లి ఎంపీ యూపీఎస్‌లో స్వయం పరిపాలన, వార్షికోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వ బడుల మనుగడ ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఎనిమిదో తరగతి వరకు పదేళ్ల క్రితం స్థాయి పెరిగిన పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను, పదో తరగతి వరకు తరగతులను పెంచుకొని ఉన్నత పాఠశాల నిలబెట్టుకోవాలన్నారు. అందుకు రేగడిమైలారం ఆరద్శంగా భావించాలన్నారు. విద్యార్థుల సందేశాత్మక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వయం పరిపాలనలో ప్రతిభ స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా వి ద్యార్థులే ఉపాధ్యాలయ్యారు. 16మంది విద్యార్థులు అధికారులు, ఉపాధ్యాయులుగా ఒక్క రోజు విధులు నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. కలెక్టర్‌గా నరేశ్, డీఈఓగా పుష్పలత, ఎంఈఓగా మహేశ్, సీహెచ్ఎంగా మోహన్, హెచ్ఎంగా భవాని, ఉపాధ్యాయులుగా మాధవి, ముబీన, స్నేహశ్రీ, నిశిత్, విరాట్, నందిని, శిరీష, సింధూజ, డ్రాయింగ్ నాని, పీఈటీగా శివసాయి, అటెండర్‌గా శివానంద్ విధులు నిర్వహించారు. వీరికి బహుమతులు అందజేశారు. వడిచర్ల హెచ్ఎం నరేందర్‌గౌడ్, హెచ్ఎం జ్యోతి పరమేశ్వరి, నాయకులు శేఖర్, నర్సింలు, మాణెమ్మ, చంద్రమ్మ, ఉపాధ్యాయులు మహేశ్‌కుమార్, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు శివనీల, సంతోష, అంజిలప్ప పాల్గొన్నారు. -
ఎలుకల సమస్య ఉండొద్దు
● ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట: పాఠశాలలో ఎలుకల సమస్య ఉండరాదని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య సిబ్బందికి సూచించారు. మూడు రోజుల క్రితం మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థులను ఎలుకలు కరిచిన విషయమై గురువారం ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరో గ్యం గురించి ఆరా తీశారు. పిల్లల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, వార్డన్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ఎలుకలు ఉండడానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటే సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, నాయకులు, పాఠశాల సిబ్బంది నాగిరెడ్డి, ప్రశాంత్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, రాజ్‌శేఖర్‌రెడ్డి, ఖదీర్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
మహా నగర విస్తరణకు ఓకే
సాక్షి, సిటీబ్యూరో: మహా నగర పరిధి విస్తరణకు గురువారం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు పెరగనుంది. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చ.కి.మీ వరకు పెరగనుంది. ఇప్పుడు 70 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, మరో 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, సుమారు 1400కు పైగా గ్రామాలతో హెచ్ఎండీఏ పరిధి భారీగా పెరగనుంది. ● హెచ్ఎండీఏ పరిధి పెరగడంతో ట్రిపుల్ ఆర్ పరిధిలో శాటిలైట్ టౌన్‌షిప్పుల నిర్మాణం జరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా స్తబ్ధత నెలకొన్న రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు సైతం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చని అంచనా. ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీ అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 11 జిల్లాలకు పరిధిని పెంచడం ద్వారా నల్లగొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి. ఇక ట్రిపుల్ ఆర్ వరకూ హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిని పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం -
ప్రవీణ్ మృతదేహం అప్పగింత
కేశంపేట: అమెరికాలో మృతి చెందిన విద్యార్థి ప్రవీణ్‌కుమార్ మృతదేహానికి భారతకాలమానం ప్రకారం గురువారం అక్కడి అధికారులు పోస్టుమార్టం పూర్తిచేశారు. మృతుడి తలలోని బుల్లెట్‌ను తొలగించి, మృతదేహాన్ని తానా సభ్యులకు అప్పగించగా, వారు ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ పరామర్శ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ప్రవీణ్ తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించారు. కేశంపేటలో మృతుడి తల్లిదండ్రులు రాఘవులు, రమాదేవిని కలిసిన ఆ పార్టీ నేతలు ఎల్గనమోని రవీందర్‌యాదవ్, మురళీధర్‌రెడ్డి, నర్సింగ్‌రావు తదితరులు కేటీఆర్‌తో ఫోన్ మాట్లాడించారు. బాధితులను ఓదార్చిన ఆయన ప్రవీణ్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సెక్రటేరియట్ నుంచి వివరాల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్ నుంచి ఫోన్ చేసిన అధికారులు రాఘవులుతో మాట్లాడారు. మృతదేహాన్ని తెప్పించేందుకు ప్రవీణ్ వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని కోరారు. దీంతో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆన్లైన్లో వివరాలు పంపించారు. పోస్టుమార్టం అనంతరం తానా సభ్యులకు ఇచ్చినట్లు సమాచారం ఇండియా పంపేందుకు ఏర్పాట్లు మృతుడి తల్లిదండ్రులకు పలువురి పరామర్శ -
నేడు రైతు అవగాహన సదస్సు
తాండూరు టౌన్: తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం పలు పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఏఆర్సీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు పంటలు పండించే విధి విధానాలపై సరైన అవగాహన లేకపోవడంతో దిగుబడి తగ్గి నష్టపోతున్నారని తెలిపారు. పత్తి, వరి, కంది, కుసుమ, మొక్కజొన్న, వేరుశనగ పంటల సాగుపై శాస్త్రవేత్తలు రైతులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. ఈ సదస్సుకు వ్యవసా య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి, నాగ్‌పూర్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్, ప్రధాన శాస్త్రవేత్త గుల్జార్భాను హాజరవుతారని తెలిపారు. -
మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ
చిలకలగూడ: మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అనుదీప్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ మహ్మద్‌గూడ, శ్రీనివాసనగర్ ప్రాంతాలకు చెందిన పాస్టం నగేష్ (25), నర్సింగ్, శబరి, సాయికిరణ్ స్నేహితులు. నగేష్ శుభకార్యాల్లో బ్యాండ్ వాయించేవాడు. ఈనెల 5న కుటుంబ సభ్యులతో కలిసి మహ్మద్‌గూడలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లిన అతను రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చాడు. అదే సమయంలో స్నేహితుల నుంచి ఫోన్ రావడంతో పది నిమిషాల్లో వస్తానని చెప్పి బయటికి వెళ్లిన అతను తన స్నేహితులు నగేష్, నర్సింగ్, శబరి, సాయికిరణ్‌తో కలిసి పార్శిగుట్టలోని ఓ వైన్‌షాపు వద్ద మద్యం తాగారు. వైన్‌షాపు మూసివేసే సమయంలో మరికొంత మద్యాన్ని కొనుగోలు చేసి మహ్మద్‌గూడలోని ముత్యాలమ్మ ఆలయం వద్దకు వచ్చిన వారు మద్యంతో పాటు గంజాయి సేవించారు. ఈ క్రమంలో పచ్చబొట్టు విషయమై నగేష్, శబరి మధ్య గొడవ జరగడంతో నర్సింగ్ కలుగజేసుకున్నాడు. దీంతో వారు ఒకరినొకరు దూషించుకుంటు గల్లాలు పట్టుకుని ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో నర్సింగ్ చేతికి అందిన కర్రతో నగేష్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో శబరి, సాయికిరణ్ అపస్మారకస్థితిలో పడి ఉన్న నగేష్‌ను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నిందితుడు నర్సింగ్, మృతుడు నగేష్ బంధువులు కావడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నర్సింగ్‌తోపాటు మిత్రులు శబరి, సాయికిరణ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఒకరి మృతి పది నిమిషాల్లో వస్తానని చెప్పి.. తిరిగిరాని లోకాలకు -
కంది పంట అగ్నికి ఆహుతి
షాద్‌నగర్: ఓ రైతు వేసిన కంది పంట అగ్నికి ఆహుతయింది. ఈ ఘటన గురువారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కొండన్నగూడలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పాపయ్య యాదవ్ తన వ్యవసాయ పొలంలో నాలుగు ఎకరాల్లో కంది పంట వేశాడు. పక్క పొలంలో రైతు పొలాన్ని చదును చేసి వ్యర్థాలకు నిప్పటించాడు. అగ్గి రవ్వలు ఎగిసి పడి కందిపంటకు నిప్పంటుకుంది. గమనించిన రైతులు మంటలార్పేందుకు యత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పంటమొత్తం అగ్నికి ఆహుతయింది. దీంతో సుమారు రూ.1.50లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. -
● పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక యాప్ ● అర్హుల ముఖ చిత్రాల నమోదు ● ఈ నెల నుంచే అమలులోకి..
వికారాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకులు, లబ్ధిదారుల జాబితాను మరింత పారదర్శకంగా అమలు చేయాలని భావిస్తోంది. ప్రత్యేక ఆన్లైన్ యాప్‌ను తయారు చేసి, అర్హుల ముఖ చిత్రాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. అందించేవి ఇవే.. జిల్లాలో 1,106 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 5 ఐసీడీఎస్ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో 56,900 మంది చిన్నారులు, 6,313 గర్భిణులు, 5683 బాలింతలు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయా కేంద్రాలకు వచ్చే నిరుపేద పిల్లలు, తల్లులకు పౌష్టికాహారం అందజేస్తున్న విషయం తెలిసిందే. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రాథమిక విద్యతో పాటు నెలకు 2.50 కిలోల బాలామృతం సహా రోజుకు ఒక గుడ్డును అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పుతో భోజనం వడ్డిస్తున్నారు. ఆరేళ్ల లోపు పిల్లలకు 50 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పుతో భోజనం వడ్డిస్తున్నారు. తొలి దశలో టీహెచ్ఆర్ లబ్ధిదారులకు.. అంగన్వాడీ కేంద్రాలకు రాని వాళ్లకు టీహెచ్ఆర్ (టేక్ హోం రేషన్) అందిస్తున్నారు. మెజార్టీ అంగన్వాడీల్లో ఈ సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపపణలు ఉన్నాయి. వీటికి చెక్ పెట్టి, పారదర్శకతకు పెద్దపీట వేయడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో టీహెచ్ఆర్ లబ్ధిదారుల ముఖ చిత్రాలు నమోదు చేయాలని నిర్ణయించి, ఈ మేరకు ఈనెల నుంచి అమలు చేస్తోంది. చిన్నారుల తల్లుల ముఖ చిత్రం సహా ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. సరుకులు తీసుకున్న వెంటనే ఫోన్‌కు మెసేజ్ వస్తోంది. -
నేడు ఎల్లమ్మ జాతర
దుద్యాల్: మండలంలోని హస్నాబాద్ శివారులో వెలిసిన రాంపురం ఎల్లమ్మ జాతర శుక్రవారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సురేశ్ గౌడ్ గురువారం తెలిపారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు, సాయంత్రం పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం అన్నదానం చేస్తారు. జాతరకు హస్నాబాద్, ఆలేడ్, కుదురుమల్ల, పెద్ద నందిగామ, సంగాయిపల్లి తండా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. హెల్త్ అసిస్టెంట్‌కు గౌరవ డాక్టరేట్ కుల్కచర్ల: చౌడాపూర్ మండలం మరికల్ క్లస్టర్ హెల్త్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శరభలింగంకు పర్యావరణ పరిరక్షణ కమిషన్ న్యూఢీల్లీ వారు బుధవారం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. కరోనా సమయంలో ప్రజలను చైతన్య పరచడంలో ఆయన చేసిన కృషికి గాను అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సామాజిక కార్యక్రమాలను గుర్తించి డాక్టరేట్ పట్టా బహూకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే తన బాధ్యతలు మరింత పెరిగాయని పేర్కొన్నారు. వ్యక్తిగత ఆరోగ్యం పట్ల యువత ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపవాస దీక్షల కార్డు విడుదల అనంతగిరి: రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస దీక్షల సమయ సారిణి పట్టిక కార్డును గురువారం వికారాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ విడుదల చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త తస్వర్ అలీ, హాషం, సయ్యద్ మతీన్, రజాక్ తదితరులు పాల్గొన్నారు. యాసంగి సీజన్‌కు యూరియా కొరత లేదు కందుకూరు: యాసంగి సీజన్‌కు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరంలేదని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం, ఇతర ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం ఆయన ఏఓ లావణ్యతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఎంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలాఖరు వరకు యూరియా డిమాండ్ ఉన్నందున దాని కి అనుగుణంగా నిల్వలను తెప్పించుకోవాలని ఏఓకు సూచించాచారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు నిల్వలను చూసుకోవాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు కృషి చేయాలి ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అప్పుడే వారిలో సృజనాత్మకత పెంపొందుతుందని ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్‌పల్లి సమీపంలో ఉన్న ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జాతీయ స్థాయి సాంకేతిక, క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోటీ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం, ఆవిష్కరణలు వెలికితీయటానికి అవకాశం ఉంటుందన్నారు. యువత క్రమశిక్షణతో కూడిన విలువైన విద్యను అభ్యసించాలని తెలిపారు. వివిధ కళాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ఆవిష్కరణలు, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, సెక్రెటరీ నవీన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్దుల్ నబి పాల్గొన్నారు. -
ఎలుకల సమస్య ఉండొద్దు
● ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట: పాఠశాలలో ఎలుకల సమస్య ఉండరాదని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య సిబ్బందికి సూచించారు. మూడు రోజుల క్రితం మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థులను ఎలుకలు కరిచిన విషయమై గురువారం ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరో గ్యం గురించి ఆరా తీశారు. పిల్లల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, వార్డన్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, ఎలుకలు ఉండడానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటే సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, నాయకులు, పాఠశాల సిబ్బంది నాగిరెడ్డి, ప్రశాంత్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి, రాజ్‌శేఖర్‌రెడ్డి, ఖదీర్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు...ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం
మైలార్‌దేవ్‌పల్లి: ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ పైడి నాయుడు సమాచారం మేరకు... బాగ్‌లింగంపల్లి ప్రాంతానికి చెందిన సోను(21) డిగ్రీ చదువుతున్నాడు. లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీ, బృందావన్ కాలనీకి చెందిన అంబిక(21) ఎల్ఎల్బీ చదువుతుంది. ఇద్దరు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు ప్రియడిని కాదనండంతో మనస్తాపానికి గురై గురువారం ప్రియురాలు ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తు పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. ఈ సమయంలో తన వెంట తెచ్చుకున్న బ్లెడ్‌తో కోసుకొని ఫ్లోర్ క్లీనర్ తాగాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే 108కి ఫోన్ చేసి అంబులెన్స్‌లో అతనికి ప్రథమ చికిత్స చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. బిల్డింగ్ మొదటి అంతస్తు ఎక్కి దూకుతానని హల్చల్ -
ప్రభుత్వ బడుల మనుగడ ప్రజల చేతుల్లోనే
● యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లేశం ● ఘనంగా స్వయం పరిపాలన, పాఠశాల వార్షికోత్సవం బొంరాస్‌పేట: ప్రభుత్వ పాఠశాలలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంచి సౌకర్యాలు ఉన్నాయని, పాఠశాల స్థాయిని పోగొట్టుకోరాదని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. గురువారం మండలంలోని ఎన్కేపల్లి ఎంపీ యూపీఎస్‌లో స్వయం పరిపాలన, వార్షికోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వ బడుల మనుగడ ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఎనిమిదో తరగతి వరకు పదేళ్ల క్రితం స్థాయి పెరిగిన పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను, పదో తరగతి వరకు తరగతులను పెంచుకొని ఉన్నత పాఠశాల నిలబెట్టుకోవాలన్నారు. అందుకు రేగడిమైలారం ఆరద్శంగా భావించాలన్నారు. విద్యార్థుల సందేశాత్మక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వయం పరిపాలనలో ప్రతిభ స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా వి ద్యార్థులే ఉపాధ్యాలయ్యారు. 16మంది విద్యార్థులు అధికారులు, ఉపాధ్యాయులుగా ఒక్క రోజు విధులు నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. కలెక్టర్‌గా నరేశ్, డీఈఓగా పుష్పలత, ఎంఈఓగా మహేశ్, సీహెచ్ఎంగా మోహన్, హెచ్ఎంగా భవాని, ఉపాధ్యాయులుగా మాధవి, ముబీన, స్నేహశ్రీ, నిశిత్, విరాట్, నందిని, శిరీష, సింధూజ, డ్రాయింగ్ నాని, పీఈటీగా శివసాయి, అటెండర్‌గా శివానంద్ విధులు నిర్వహించారు. వీరికి బహుమతులు అందజేశారు. వడిచర్ల హెచ్ఎం నరేందర్‌గౌడ్, హెచ్ఎం జ్యోతి పరమేశ్వరి, నాయకులు శేఖర్, నర్సింలు, మాణెమ్మ, చంద్రమ్మ, ఉపాధ్యాయులు మహేశ్‌కుమార్, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు శివనీల, సంతోష, అంజిలప్ప పాల్గొన్నారు. -
సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి
మీర్‌పేట: సమస్యాత్మక ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనం వద్ద గురువారం చేపట్టిన విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో కమిషనర్ స్వయంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి స్పందన అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రల ద్వారా నేరస్తులను గుర్తించేందుకు ఉపయోగించే సాంకేతిక పరికరం పాప్లాన్‌ను ఆయన పరీక్షించారు. అనంతరం నేరు గా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలు, రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ పనితీరుపై ఆరా తీశారు. సీసీటీవీల నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, శాంతిభద్రతల నిర్వహణకు చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్స్పెక్టర్ నాగరాజుకు సూచించారు. రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు -
ఔటర్‌పై ఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. రావిర్యాల వండర్లా సమీపంలోని ఎగ్జిట్ నంబరు 13 దాటిన అనంతరం 200 మీటర్ల దూరంలో డివైడర్‌పై ఉన్న మొక్కలకు హెచ్ఏండీఏ ట్యాంకర్ ద్వారా కొంగరకలాన్‌కు చెందిన చెనమోని రాములు (55) నీళ్లు పోస్తున్నాడు. ఉప్పల్‌లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఘట్కేసర్ వద్ద ఔటర్ ఎక్కిన నాగర్‌కర్నూల్ జిల్లా, చిన్నాంబాయి మండలం బెక్కం గ్రామానికి చెందిన కోషిక రవీందర్‌రెడ్డి, బత్తిని కృష్ణారెడ్డి (టీఎస్07జెఎం 1210) కారులో అతివేగంగా వెనుక నుంచి వచ్చి ట్యాంకర్‌తో నీరు పోస్తున్న రాములును ఢీకొట్టారు. దీంతో అతడు గాల్లో ఎగిరి డివైడర్‌పై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. కారు.. ట్యాంకర్ వెనుకభాగం కిందికి దూసుకెళ్లింది. దీంతో ముందు సీట్లో కూర్చున్న కోషిక రవీందర్‌రెడ్డి (50) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కారు నడుపుతున్న బత్తిని కృష్ణారెడ్డి (45) పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120– 140 స్పీడ్‌లో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ట్యాంకర్ కిందికి దూసుకెళ్లడంతో రవీందర్‌రెడ్డి మృతదేహంతో పాటు కృష్ణారెడ్డిని బయటకు తీసేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. సీఐ రాఘవేందర్‌రెడ్డితో పాటు ఎస్ఐ వెంకటేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితులు.. రోడ్డు ప్రమాదానికి గురైన కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు. కృష్ణారెడ్డి కొండాపూర్‌లో ఉంటూ స్వీట్ షాప్ నిర్వహిస్తుండగా, రవీందర్‌రెడ్డి బోరబండలో ఉండేవాడు. వీరి మృతితో బెక్కంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూలి కోసం వెళితే.. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌కు చెందిన రాములు ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. అతివేగంగా వచ్చి ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు అక్కడికక్కడే ఇద్దరి దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం -
ఆమోదం
అద్భుత నగరికి ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుసాక్షి, రంగారెడ్డిజిల్లా: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు దీటుగా నాలుగో నగరం ఆవిష్కృతం కాబోతోంది. ఇటు శ్రీశైలం, అటు నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఉన్న ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలతో సుమారు 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ పేరుతో మరో అద్భుత నగరం ఆవిష్కరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపిపంది. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను కూడా కొత్త గా ఏర్పాటు చేసే ఎఫ్డీసీఏలో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది. ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి కోసం కొత్తగా 90 పోస్టులను సృష్టించడమే కాకుండా, వాటి భర్తీకి ఆమోదం కూడా తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపనతో ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట మీదుగా ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించతలపెట్టిన 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ (రతన్‌టాటా) రోడ్డుకు భూసేకరణ చేపట్టింది. తొలి దశలో 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు కేటాయించింది. అదే విధంగా రెండో విడతలో 22.30 కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు రూ.2,365 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఫోర్త్‌సిటీ స్వరూపం ఇలా.. ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలు కొత్తగా 90 పోస్టులు సృష్టి మంత్రిమండలి ఆమోదం -
మహా నగర విస్తరణకు ఓకే
సాక్షి, సిటీబ్యూరో: మహా నగర పరిధి విస్తరణకు గురువారం మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు పెరగనుంది. ఈ మేరకు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 7 జిల్లాలు, 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ పరిధి తాజా నిర్ణయంతో సుమారు 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చ.కి.మీ వరకు పెరగనుంది. ఇప్పుడు 70 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, మరో 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించడంతో మరో 4 జిల్లాల పరిధిలోని 32 మండలాలు చేరనున్నాయి. దీంతో 11 జిల్లాలు, 106 మండలాలు, సుమారు 1400కు పైగా గ్రామాలతో హెచ్ఎండీఏ పరిధి భారీగా పెరగనుంది. ● హెచ్ఎండీఏ పరిధి పెరగడంతో ట్రిపుల్ ఆర్ పరిధిలో శాటిలైట్ టౌన్‌షిప్పుల నిర్మాణం జరిగే అవకాశం ఉంది. కొంతకాలంగా స్తబ్ధత నెలకొన్న రియల్ ఎస్టేట్ రంగంలో కదలిక వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు సైతం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చని అంచనా. ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు ఉన్న నగరాన్ని కోర్ అర్బన్‌గా, ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్‌గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీ అర్బన్ వరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 11 జిల్లాలకు పరిధిని పెంచడం ద్వారా నల్లగొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలు కొత్తగా చేరనున్నాయి. ఇక ట్రిపుల్ ఆర్ వరకూ హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిని పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
జగద్గిరిగుట్ట: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ కు చెందిన రాజు (40) ఆస్ బెస్టాస్ కాలనీలో ఉంటూ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసైన రాజు నెల రోజులుగా పనికి వెళ్లడం లేదు. గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న అతను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బిర్యానీ సెంటర్లో మంటలు షాబాద్: ప్రమాదవశాత్తు ఓ హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని, చుట్టు పక్కల వారు నీరు పోసి మంటలార్పారు. అప్పటికే హోటల్లోని సామగ్రి కాలిబూడిదైంది. హీరో నాగార్జున పరువునష్టం కేసు వాయిదా ● మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జున గైర్హాజరు ● విచారణ మార్చి 12కు వాయిదా సిటీ కోర్టులు: రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు (స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్)లో విచారణ జరిగింది. ఈ విచారణకు పిటిషనర్ నాగార్జునతోపాటు ప్రతివాది మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడంతో వారి తరుఫున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను మార్చి 12కు వాయిదా వేసింది. సినీ అగ్రహీరో నాగార్జున కుమారుడైన హీరో నాగాచైతన్య–సమంత విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని, ఆమె చేసిన వ్యాఖ్యలతో తన కుటుంబ పరువుపోయిందని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుటుంబంపై అసాధారణమైన వ్యాఖ్యలు చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేయగా గత విచారణలో ఆమె వ్యక్తిగతంగా హాజరయ్యారు. దీంతో కొండా సురేఖ వ్యక్తిగత బాండ్‌తోపాటు రూ.10 వేలు పూచీకత్తు కోర్టులో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అయితే గురువారం జరిగిన విచారణకు ఆమె హాజరుకాకపోవడమే కాకుండా పూచీకత్తులు కూడా దాఖలు చేయలేదు. వచ్చే వాయిదా లోపు పూచీకత్తులు దాఖలు చేసుకోవాలని కొండ సురేఖ తరుఫు న్యాయవాదికి కోర్టు సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. దూరదర్శన్ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కన్నుమూత లక్డీకాపూల్ : దూరదర్శన్ మాజీ డైరెక్టర్ దేవళ్ల.బాలకృష్ణ ( 92) గురువారం కన్నుమూశారు. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం సంచాలకుడిగా పని చేయక ముందు ఆయన హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ఆకాశవాణి , దూరదర్శన్ కార్యక్రమ సిబ్బంది సంతాపం తెలిపారు. ఆకాశవాణి, దూరదర్శన్ అభివృద్ధికి బాలకృష్ణ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. శుక్రవారం ఉదయం అంబర్‌పేట శ్మశానవాటికలో బాలకృష్ణ అంత్యక్రియులు నిర్వహించనున్నట్లు ఆయన బంధువు సాయి ప్రసాద్ పేర్కొన్నారు. నేటి నుంచి ఓపెన్ టెన్నిస్ టోర్నీ బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేఐసీ)–హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హోటా) ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఈ పోటీలకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు జేఐసీ సెక్రెటరీ కిలారు రాజేశ్వర రావు తెలిపారు. జాతీయ స్థాయి హోటా, జేఐసీ నేషనల్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ నగరంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 366 మంది టెన్నీస్ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. 10 కేటగీరిల్లో సింగిల్స్, డబుల్స్ పోటీలకు 425 ఎంట్రీలు వచ్చాయన్నారు. -
పల్లె ప్రకృతివనం భూమిపై వివాదం
గోపన్‌పల్లిలో ఘటన తాండూరు రూరల్: మండల పరిఽధిలోని గౌతపూర్ అను బంధ గ్రామం గోపన్‌పల్లిలో పల్లె ప్రకృతికి కేటాయించిన భూమిపై వివాదం నెలకొంది. గోపన్‌పల్లిలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 6లో అరఎకరాను గతంలో ప్రకృతి వనానికి కేటాయించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత నీటి సౌకర్యం లేకపోవడంతో వదిలేశారు. పల్లె ప్రకృతికి కేటాయించిన భూమిలో షబ్బిర్ అనే వ్యక్తి జేసీబీతో చదును చేయిస్తున్నారు. ఈ విషయమై అతన్ని వివరాలు అడగగా తన సొదరి షాహేదబేగానికి సంబంధించిన భూమి అని, గతంలో అధికారులు అడిగితే ఇచ్చారన్నారు. ప్రస్తుతం వాడుకలో లేకపోవడంతో సాగు చేసుకుంటున్నామని షబ్బిర్ బదులిచ్చారు. ఈ విషయంలో గ్రామస్తులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శి సెలవుల్లో ఉన్నారని, సోమవారం క్షేత్రస్థాయిలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుంటానన్నారు. -
మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ
చిలకలగూడ: మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అనుదీప్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ మహ్మద్‌గూడ, శ్రీనివాసనగర్ ప్రాంతాలకు చెందిన పాస్టం నగేష్ (25), నర్సింగ్, శబరి, సాయికిరణ్ స్నేహితులు. నగేష్ శుభకార్యాల్లో బ్యాండ్ వాయించేవాడు. ఈనెల 5న కుటుంబ సభ్యులతో కలిసి మహ్మద్‌గూడలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లిన అతను రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చాడు. అదే సమయంలో స్నేహితుల నుంచి ఫోన్ రావడంతో పది నిమిషాల్లో వస్తానని చెప్పి బయటికి వెళ్లిన అతను తన స్నేహితులు నగేష్, నర్సింగ్, శబరి, సాయికిరణ్‌తో కలిసి పార్శిగుట్టలోని ఓ వైన్‌షాపు వద్ద మద్యం తాగారు. వైన్‌షాపు మూసివేసే సమయంలో మరికొంత మద్యాన్ని కొనుగోలు చేసి మహ్మద్‌గూడలోని ముత్యాలమ్మ ఆలయం వద్దకు వచ్చిన వారు మద్యంతో పాటు గంజాయి సేవించారు. ఈ క్రమంలో పచ్చబొట్టు విషయమై నగేష్, శబరి మధ్య గొడవ జరగడంతో నర్సింగ్ కలుగజేసుకున్నాడు. దీంతో వారు ఒకరినొకరు దూషించుకుంటు గల్లాలు పట్టుకుని ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో నర్సింగ్ చేతికి అందిన కర్రతో నగేష్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో శబరి, సాయికిరణ్ అపస్మారకస్థితిలో పడి ఉన్న నగేష్‌ను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నిందితుడు నర్సింగ్, మృతుడు నగేష్ బంధువులు కావడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నర్సింగ్‌తోపాటు మిత్రులు శబరి, సాయికిరణ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఒకరి మృతి పది నిమిషాల్లో వస్తానని చెప్పి.. తిరిగిరాని లోకాలకు -
అదుపు తప్పి ఇన్నోవా కారు బోల్తా
ఇద్దరికి గాయాలు కొడంగల్ రూరల్: మండల పరిధిలోని పర్సాపూర్ గ్రామ సమీపంలో ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలైన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన ఆరుగురు వ్యక్తులు మహబూబ్‌నగర్‌లో జరిగే పెళ్లి కోసం గురువారం మధ్యాహ్నం బయలుదేరారు. పర్సాపూర్ సమీపంలో ఓ మలుపు దగ్గర ఇన్నోవా కారు అదుపుతప్పి రోడ్డు కింది భాగంలోకి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు సలహా మేరకు తాండూర్ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
మణికొండ: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రోజురోజుకూ జనాభా పెరిగిపోతోంది. అందుకు అనుగుణంగానే నేరాలు, కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏకంగా సంవత్సరానికి దాదాపు 2 వేల కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందులో ఎక్కువగా భార్యాభర్తల తగాదాలతో పాటు ఆర్థిక, సెలబ్రిటీలు, ఐటీ ఉద్యోగుల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. జనాభాకు అనుగుణంగా ఇప్పటికే నార్సింగి కేంద్రంగా ఏసీపీ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న జన్వాడ, మిర్జాగూడలను కొత్తగా వచ్చిన మోకిల స్టేషన్ పరిధిలోకి మార్చారు. ప్రస్తుత నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోకాపేటలో ఒకటి, పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలోని కొంత భాగంతో ఐటీ జోన్ కేంద్రంగా మరో కొత్త పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ● కోకాపేట నియోపోలీస్లో శరవేగంగా నిర్మాణాలు, ఐటీ సంస్థలు వస్తుండటంతో జనాభా పెరిగిపోతుంది. అనేక రాష్ట్రాల వారే కాకుండ ఇతర దేశాల వారు సైతం వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో కొత్తగా కోకాపేట పేరుతో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ● పుప్పాలగూడ రెవెన్యూ పరిధిలో ఔటర్ రింగ్ అవతలి ఐటీ జోన్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని ఓ పోలీస్ స్టేషన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటితో పాటు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న బండ్లగూడ పోలీస్‌స్టేషన్, అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సులేమాన్‌నగర్ కేంద్రంగా మరో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. ● దాంతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కొత్తగా మరో నాలుగు పోలీస్స్టేషన్లు రాబోయే బడ్జెట్లో మంజూరు అయ్యే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ● ఇప్పటికే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ఉన్న ఔట్‌పోస్టును పూర్తి స్థాయి పోలీస్‌స్టేషన్‌గా ప్రకటించి ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి త్వరలోనే మరిన్ని పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. మారనున్న పరిధి... ● నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న కోకాపేట, గండిపేట, ఖానాపూర్ గ్రామాలు కొత్తగా వచ్చే కోకాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోకి తేనున్నట్టు సమాచారం. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న వట్టినాగులపల్లి, నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడ ఐటీ జోన్ ప్రాంతంతో కలిపి గౌలిదొడ్డి, సైబరాబాద్ ఐటీ జోన్ పోలీస్‌స్టేషన్ పేరుతో కొత్త స్టేషన్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. ఇక నార్సింగి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న కిస్మత్పూర్, బండ్లగూడ, హిమాయత్‌సాగర్‌లతో బండ్లగూడ కేంద్రంగా మరో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కానుంది. ● అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సులేమాన్‌నగర్, శాస్త్రీపురం డివిజన్లను కలిపి కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. త్వరలోనే కొత్తగా పోలీస్ సిబ్బంది నియామకం చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుందని, అందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మరో నాలుగు పోలీస్స్టేషన్లఏర్పాటుకు సన్నద్ధం ప్రభుత్వానికి ప్రతిపాదించినపోలీసు ఉన్నతాధికారులు వచ్చే బడ్జెట్లో మంజూరుకు సన్నాహాలు జూన్ వరకు ఏర్పాటుకు రంగం సిద్ధం? -
కంది పంట అగ్నికి ఆహుతి
షాద్‌నగర్: ఓ రైతు వేసిన కంది పంట అగ్నికి ఆహుతయింది. ఈ ఘటన గురువారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కొండన్నగూడలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పాపయ్య యాదవ్ తన వ్యవసాయ పొలంలో నాలుగు ఎకరాల్లో కంది పంట వేశాడు. పక్క పొలంలో రైతు పొలాన్ని చదును చేసి వ్యర్థాలకు నిప్పటించాడు. అగ్గి రవ్వలు ఎగిసి పడి కందిపంటకు నిప్పంటుకుంది. గమనించిన రైతులు మంటలార్పేందుకు యత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో పంటమొత్తం అగ్నికి ఆహుతయింది. దీంతో సుమారు రూ.1.50లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకున్నాడు. -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
తాండూరు టౌన్: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తాండూరు పట్టణంలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2,084 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 18 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 1,554 మంది విద్యార్థులకు గాను 1,541 మంది, ఒకేషనల్ల్లో 530 మంది విద్యార్థులకు గాను 525 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి మాస్ కాపీయింగ్ జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అనంతగిరిలో.. అనంతగిరి: ఉదయం నిర్ణీత సమయానికి విద్యార్థులు వారివారి సెంటర్లకు చేరుకున్నారు. అక్కడ అధ్యాపకులు చెక్ చేసి పరీక్ష హాల్లోకి పంపించారు. మొత్తం 6,931మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 6,818మంది హాజరయ్యారు. 113మంది గైర్హాజరయ్యారు. వికారాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ భీంకుమార్ తదితరులు ఉన్నారు. కొడంగల్ రూరల్‌లో.. కొడంగల్ రూరల్: పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని రెండు సెంటర్లలో ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. గురువారం ద్వితీయ సంవత్సరం తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం, అరబిక్ పరీక్షలు నిర్వహించారు. సెంటర్–ఏలో 243మంది విద్యార్థులకుగాను 239మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. సెంటర్–బీలో 302మంది విద్యార్థులకుగాను 301మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పరీక్షల కేంద్రాలను తహసీల్దార్ విజయకుమార్ పరిశీలించారు. కుల్కచర్లలో.. కుల్కచర్ల: కుల్కచర్ల మండల కేంద్రంలోని వివేకనంద కళశాల, రామలింగేశ్వర కళశాలలో ద్వితియ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. వివేకనంద కళశాలలో 180మందికిగాను 10మంది గైర్హాజరుకాగా, రామలింగేశ్వర కళశాలలో 183మందికిగాను ఒకరు గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు...ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం
మైలార్‌దేవ్‌పల్లి: ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ పైడి నాయుడు సమాచారం మేరకు... బాగ్‌లింగంపల్లి ప్రాంతానికి చెందిన సోను(21) డిగ్రీ చదువుతున్నాడు. లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీ, బృందావన్ కాలనీకి చెందిన అంబిక(21) ఎల్ఎల్బీ చదువుతుంది. ఇద్దరు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు ప్రియడిని కాదనండంతో మనస్తాపానికి గురై గురువారం ప్రియురాలు ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తు పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. ఈ సమయంలో తన వెంట తెచ్చుకున్న బ్లెడ్‌తో కోసుకొని ఫ్లోర్ క్లీనర్ తాగాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే 108కి ఫోన్ చేసి అంబులెన్స్‌లో అతనికి ప్రథమ చికిత్స చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. బిల్డింగ్ మొదటి అంతస్తు ఎక్కి దూకుతానని హల్చల్ -
ముద్ర లోన్ పేరిట మోసం
యాచారం: ఇటీవల అపరచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్, మెసేజ్‌లకు స్పందిస్తూ మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.5లక్షల ముద్రలోన్ మంజూరైందని చెప్పిన వెంటనే బాధితుడు అపరిచిత వ్యక్తిన చెప్పిన విధంగా విడతల వారీగా రూ.45,490 పంపించాడు. ఆతరువాత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి గురువారం యాచారం పోలీసులను ఆశ్రయించాడు. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని గునుగల్ గ్రామానికి చెందిన రామన్నకు ఈ నెల 4న అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. నీకు రూ.5 లక్షల ముద్రలోన్ మంజూరైందని తాను పంపే స్కానర్‌కు రూ.50వేలు పంపించాలని రామన్న వాట్సాప్‌కు స్కానర్ పంపించాడు. దీంతో విడతల వారీగా రూ.45,490 పంపాడు. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. ‘చెత్తవేస్తే ఈ–చలాన్’పై అధికారులకు శిక్షణ సాక్షి,సిటీబ్యూరో: ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ.. కూల్చివేతల(సీఅండ్‌డీ) వ్యర్థాలు వేసేవారిని గుర్తించి ఈ–చలాన్ ద్వారా పెనాల్టీలు విధించి, యూపీఐ ద్వారా వసూలు చేసేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ సంబంధిత ఏఎంఓహెచ్‌లు, డీఈఈలు, ఏసీపీలకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్, ఐటీ విభాగం అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ వారికి శిక్షణ ఇచ్చారు. ఈ–చలాన్ విధించేందుకు టీసీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన విధానాన్ని, యాప్‌ను కాంప్రహెన్సివ్ చలాన్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీసీఎంఎస్) యాప్‌గా వ్యవహరిస్తున్నారు. వారితోపాటు యాప్‌ను నిర్వహించే టీజీ ఆన్లైన్ ప్రతినిధులు యాప్ ఎలా పనిచేస్తుందో, ఎలా వాడాలో వివరించారు. తొలుత పైలట్‌గా చెత్త డబ్బాల్లో కాకుండా బయట చెత్తవేసే వాణిజ్య ప్రాంతాల్లోని వ్యాపారులు, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నవారు, సీఅండ్‌డీ వేస్ట్ వేస్తున్న వారికి పెనాల్టీలు విధించాలని సూచించారు. సంబంధిత అధికారులు జారీ అయిన చలాన్లు, చెల్లింపులు జరిగినవి, పెండింగ్‌లో ఉన్నవి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చునన్నారు. చెత్త వేసేవారికి ఎస్ఎంఎస్ వెళ్తుందని, స్వచ్ఛ నిబంధనలు ఉల్లంఘించి వేసిన వ్యర్థాల ఫొటో అక్షాంక్ష, రేఖాంశలతో వస్తుందన్నారు. దేనికి ఎంత పెనాల్టీయో సాఫ్ట్‌వేర్‌లోనే పొందుపరిచి ఉంటుందని వారు వివరించారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
అనంతగిరి: వినియోగదారులు నిత్య జీవితంలో తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యంపై తప్పకుండా శ్రద్ధ వహించాలని ఎస్బీఐ వికారాబాద్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ విఠల్ ఓరుగంటి, ఆర్బీఓ (రీజినల్ బిజెనెస్ ఆఫీస్) వికారాబాద్ చీఫ్ మేనేజర్ బరుణ్సింగ్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్‌లోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఆవరణలో మహావీర్ జనరల్ ఆస్పత్రి వైద్యులచే బ్యాంకు వినియోగదారులు సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్షంగా వ్యవహరించొదన్నారు. నిత్యం ఉదయం యోగా, వాకింగ్ చేయాలని సూచించారు. నిత్య జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఉదయం ఒక గంట ఆరోగ్యం కోసం కేటాయించాలని సూచించారు. ఎస్బీఐ దేశవ్యాప్తంగా తన సేవలను క్షేత్రస్థాయిలో సైతం అందిస్తుందన్నారు. బ్యాంకు సేవలను వినియోగదారులు ఆదరిస్తున్నందునా అతిపెద్ద బ్యాంకుగా సాగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురికి వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ మేనేజర్ స్వాతి, ఫీల్డ్ ఆఫీసర్లు సంధ్య, జయవర్దన్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్బీఐ వినియోగదారులకు ఉచిత వైద్య శిబిరం -
సివిల్సప్లై అధికారుల ఆకస్మిక దాడులు
రేషన్ దుకాణం సీజ్ శంకర్పల్లి: మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ రేషన్ దుకాణంపై గురువారం సివిల్సప్లై అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. యాదయ్యగౌడ్ నిర్వహిస్తున్న రేషన్ దుకాణంలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలున్నాయని.. వీటిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడని పలువురు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన సివిల్సప్లై అధికారులు ఆకస్మికంగా దాడి చేసి దుకాణం సీజ్ చేశారు. ఎన్ని క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉంచారో శుక్రవారం లెక్కించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయమై తహసీల్దార్ సురేందర్‌ను వివరణ కోరగా సివిల్ సప్లై అధికారుల ఆదేశాల మేరకు రేషన్ దుకాణం వద్దకు ఆర్ఐను పంపామన్నారు. -
గౌతపూర్‌లో గొర్రెల దొంగతనం
తాండూరు రూరల్: గొర్రెలను ఎత్తుకెళ్లిన సంఘటన కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌతపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..గౌతపూర్ గ్రామానికి చెందిన జెన్నె పెద్ద రాములు గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తుంటాడు. రాత్రి సమయంలో వాటిని ఇంటి పక్కనే ఉన్న దొడ్డిలో ఉంచి గేటుకు తాళం వేసి ఇంట్లో పడుకోవడానికి వెళ్లేవాడు. బుధవారం అర్ధరాత్రి 1 గంటకు గుర్తు తెలియని దుండగులు నల్లా స్కార్పియోలో వచ్చి ఇంటి సమీపంలోని దొడ్డి వద్దకు వెళ్లి గేటు తాళం పగుల గొట్టి 6 గొర్రెలను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఇందులో ఓ పొటేలు కూడా ఉందన్నారు. వీటి విలువ రూ.60 వేలలోపు ఉంటుందన్నారు. స్కార్పియోలో వచ్చి గొర్రెలను దొంగిలించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. స్కార్పియో వాహనంలో వచ్చి అపహరించిన దుండగులు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు -
క్రీడలతో శారీరక దారుఢ్యం
మొయినాబాద్‌రూరల్: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు స్నేహ బంధాలు పెంపొందుతాయని ఇండియన్ కబడ్డీ ప్లేయర్ గంగాధరి మల్లేశ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని జేబీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యాసంస్థల కార్యదర్శి కృష్ణారావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణామాచారి, డైరెక్టర్ సంజయ్, డీన్ క్రటిజ్ఞాన్, స్టూడెంట్ ఎంపైర్స్ డాక్టర్ సలావుద్దీన్, ఫిజికల్ డైరెక్టర్ విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ కబడ్డీ ప్లేయర్ మల్లేశ్ -
దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిబడంగ్పేట్: కార్యకర్తల శ్రమతో బీజేపీకి దేశవ్యాప్తంగా అనుకూల వాతావరణం నెలకొందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. పార్టీ బడంగ్‌పేట కార్పొరేషన్ అధ్యక్షులు 1, 2 రామకృష్ణారెడ్డి, వీరకర్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా దిమ్మె నిర్మాణానికి భూమి పూజ చేశారు. మహేశ్వరం ఇన్చార్జ్ అందెల శ్రీరాములుయాదవ్తో కలిసి పార పట్టి మట్టి తీశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ మరింత పుంజుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. అనంతరం 23వ డివిజన్లోని శివసాయినగర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్య పరిశీలించారు. కమిషనర్ సరస్వతితో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ యాదగిరి, సామ సంజీవరెడ్డి, వెంకట్‌రెడ్డి, చిత్రం శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల మరమ్మతులు చేపట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: చెరవులు, కుంటల్లో నీరు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వాటి మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర మత్స్యకారుల, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొరెంకల నర్సింహ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మండల పరిధిలోని రాయపోల్‌లో ముదిరాజ్ సంఘం కార్యాలయం వద్ద మత్స్యకారుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ.. చెరువు నిండినా.. లీకేజీల వల్ల నీరు బయటకు పోతోందన్నారు. దీంతో మత్స్యకారు వృత్తి దారులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.10 లక్షలు బడ్జెట్ కేటాయించి చెరువుల్లో కంప చెట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యం వల్ల మత్స్య సంపద చనిపోతే ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా మత్స్యకారులకు 50 సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్, రాయపోల్ సొసైటీ అధ్యక్షుడు మైలారం యాదయ్య, కార్యదర్శి రమేష్, పుల్లయ్య, మండల నాయకులు సురేందర్ పాల్గొన్నారు. టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహ -
60
5సెమీ అర్బన్ పరిధిలోకి..● పూడూరు, నవాబుపేట మండలాల్లో ఎక్కువ భాగం ● ఇప్పటికే ‘వుడా’ పేరుతో 190 జీఓను విడుదల చేసిన ప్రభుత్వం ● ఊపందుకోనున్న అభివృద్ధి మండలాలుగ్రామాలువికారాబాద్: ెసమీ అర్బన్ పరిధిలోకి మన జిల్లా కూడా రావడం చర్చకు దారితీసింది. గతంలో ఏడు జిల్లాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉండగా.. ప్రభు త్వం తీసుకున్న తాజా నిర్ణయంతో హెచ్ఎండీఏ 11 జిల్లాలకు విస్తరించింది. ఇందులో వికారాబాద్ జిల్లా పరిధిలోని ఐదు మండలాలు ఉండనున్నాయి. ట్రిపుల్ ఆర్కు ఐదు కిలోమీటర్ల అవతలి వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పరిధిలోకి మన జిల్లా కూడా వచ్చేసింది. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లా అభివృద్ధిలో మాత్రం అట్టడుగున నిలిచిపోయింది. హైదరాబాద్‌కు రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలతో కూడా మన జిల్లా పోటీ పడలేని స్థితిలో ఉండిపోయింది. నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతూ వస్తున్న జిల్లా నుంచి ఒకే సారి సీఎం, స్పీకర్ రూపంలో ప్రభుత్వంలో ఇద్దరు నేతలు కీలకంగా ఉండటం కూడా జిల్లాకు కలిసొచ్చింది. జిల్లా నుంచి సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి ముందుగా కడా (కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు చేశారు. ఇటీవల జిల్లా సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక జీఓను విడుదల చేసింది. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల 190 జీఓను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో అభివృద్ధి మరింత ఊపందుకోనుంది. వుడా పరిధిలోకి నాలుగు మున్సిపాలిటీలు (వికారాబాద్,తాండూ రు, పరిగి, కొడంగల్) తోపాటు 493 రెవెన్యూ గ్రామాలు రానున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే గ్రామాలివే..!హెచ్ఎండీఏ పరిధిలోకి జిల్లాలోని ఐదు మండలాలు 50నుంచి 60 గ్రామాలు వచ్చే అవకాశం ఉంది. ఏఏ మండలాలు, ఏయే గ్రామాలు దీని పరిధిలోకి వస్తాయనే దానిపై చర్చ మొదలైంది. రీజనల్ రింగ్‌రోడ్డు మొదటి అలైన్మెంటే ఖరారైతే 10 నుంచి 20 గ్రామాలు మాత్రమే హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రతిపాదించిన రెండో అలైన్మెంట్ ఖరారైతే 50నుంచి 55 గ్రామాల వరకు ఈ పరిధిలోకి రానున్నాయి. జిల్లా పరిధిలోని నాలుగు మండలాలను కలుపుతూ ట్రిపుల్ ఆర్ వెళ్తుంది. ఐదు కిలోమీటర్లు వెలుపలి వరకు హెచ్ఎండీఏ విస్తరించాలనే ప్రతిపాదన నేపథ్యంలో మరో మండలం పరిగికి చెందిన కొన్ని గ్రామాలు కూడా దీని పరిధిలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. మన జిల్లాకు చెందిన పూడూరు, నవాబుపేట మండలాల పరిధిలోని పది గ్రామాలపైగా ఈ పరిధిలోకి వస్తుండగా వికారాబాద్, మోమిన్‌పేట మండలాల పరిధిలోని నాలుగు నుంచి ఐదు గ్రామాలు రానున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం పూడూరు మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్, కంకల్, ఖుద్భుల్లాపూర్, మన్నెగూడ, చింతల్‌పల్లి, పుడుగుర్తి, తుర్క యెన్కెపల్లి, రేగడిమామిడిపల్లి, అంగడిచిట్టెంపల్లి, కండ్లపల్లి, చన్గొముల్, నిజాంపేట్‌మేడిపల్లి, పోతిరెడ్డిగూడ, మరియాపూర్, చీలాపూర్, కొత్తపల్లి, తిమ్మాపూర్, మిట్టకంకల్, మేడికొండ, మేడిపల్లి, మిర్జాపూర్, పూడూరు, గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. నవాబుపేట మండల పరిధిలోని అక్నాపూర్, పులిమామిడి , నారెగూడ, గంగ్యాడ, గుబ్బడిఫత్తేపూర్, ముబారక్పూర్, పూలపల్లి, గొల్లగూడ, లింగంపల్లి, ఎల్లకొండ, మైతాప్‌ఖాన్‌గూడ, మాదిరెడ్డిపల్లి, సాయన్నగూడ, వట్టిమీనెపల్లి, రామన్నగూడ, చించల్పేట్, అత్తాపూర్, చిట్టిగిద్ద, నవాబుపేట గ్రామాలు ఈ పరిధిలోకి రానున్నాయి. ఇక వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూర్, కొటాలగూడ, లాల్‌సింగ్‌తండ, పులుసుమామిడి, పీరంపల్లి, మోమిన్‌పేట మండల పరిధిలోని చీమల్‌ధరి, బాల్రెడ్డిగూడ, చక్రంపల్లి గ్రామాలు ఈ పరిధిలోకి రానున్నాయి. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
బండ్లగూడ: అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని నేలమట్టం చేస్తామని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్చంద్ర హెచ్చరించారు. కార్పొరేషన్ పరిధిలోని పీఅండ్‌టీ కాలనీలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను బుధవారం మున్సిపల్, టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా సెట్ బాక్స్‌లు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామన్నాని కమిషనర్ శరత్చంద్ర స్పష్టం చేశారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని వాటిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలందరూ నిబంధనలకు అనుగుణంగా తమ నిర్మాణాలను చేపట్టుకోవాలని సూచించారు. నిర్మాణాలు చేపట్టే సమయంలో పూర్తి అనుమతులు తీసుకోవాలని... ఆ తర్వాతే నిర్మాణాలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పీఅండ్‌టీ కాలనీలో అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
శంషాబాద్ రూరల్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన ఎంస్ఎంఈ ఔట్రీచ్ క్యాంపులతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు నూతన శక్తిని ఇస్తుందని జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ఎం.శ్రీలక్ష్మీ అన్నారు. బ్యాంకు సైఫాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మండలంలోని ముచ్చింతల్‌లో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టు ఆవరణలో బుధవారం మెగా ఎంఎస్ఎంఈ ఔట్రీచ్ క్యాంపు నిర్వహించారు. ఎంస్ఎంఈ ఉత్పాదనలపై బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించారు. సుమారు రూ. వంద కోట్లకు సంబంధించిన రుణ మంజూరు పత్రాలను 50 మంది ఖాతాదారులకు అందజేశారు. ఎంఎస్ఎంఈ సెక్టార్ రుణాలు దేశంలో 30 శాతం జీడీపీతో దేశానికి వెన్నుముకంగా ఉన్నామని ఎంఎస్ఎంఈ వెర్టికల్ సీఓ ముంబయి జనరల్ మేనేజర్ జి.కె.సుధాకర్‌రావు అన్నారు. వివిధ రకాల ఉత్పత్తుల తయారీ రంగంలో 45 శాతం వాటాతో పాటు దేశంలో 65 శాతంపైగా యువతకు జీవనోపాధి కల్పిస్తుందన్నారు. ఇలాంటి మెగా క్యాంపులను దేశంలోని 157 కేంద్రాల్లో మార్చి 3 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంకు హైదరాబాద్ జనరల్ మేనేజర్ ఆర్.ఎల్.పట్నాయక్, డీజీఎం సోనాలిక, ఏజీఎంలు రవి, జగదీశ్, లేపాక్షి తదితరులు పాల్గొన్నారు.మెగా ఎంఎస్ఎఈ క్యాంపులో రుణాల అందజేత -
కృత్రిమ మేధపై అవగాహన పెంచాలి
● బెంగళూరు ఏక్ స్టెప్ ఫౌండేషన్ టీం సభ్యురాలు ఆనంది పరిగి: ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ(ఏఐ) తరగతలు నిర్వహించడం మంచి నిర్ణయమని బెంగళూరుకు చెంది ఏక్ స్టెప్ ఫౌండేషన్ ప్రతినిధులు అన్నారు. బుధవారం మండలంలోని గడిసింగాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న ఏఐ పాఠ్యాంశాలను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే ఏఐ విద్యను అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, మండల విద్యాధికారి గోపాల్, ఏఎంఓ రామ్ మస్తాన్, ప్రధానోపాధ్యాయుడు వెంకట్, అనంతరావు పాల్గొన్నారు. బొంపల్లి ప్రాథమిక పాఠశాలలో.. దోమ: విద్యార్థులకు కృత్రిమ మేధ(ఏఐ)పై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంగళూరుకు చెందిన ఏక్ స్టెప్ ఫౌండేషన్ సభ్యురాలు ఆనంది అన్నారు. బుధవారం దోమ మండలం బొంపల్లి ప్రాథమిక పాఠశాలను డీఈఓ రేణుకాదేవితో కలిసి బృందం సభ్యులు సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న కంప్యూటర్ విద్యను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచే కృత్రిమ మేధపై అవగాహన కల్పించాలనే ప్రభుత్వం నిర్ణయం ఎంతో మంచిదన్నారు. ప్రతి విద్యార్థికీ చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలన్నారు. ఏఐపై అవగాహన పెంచాలంటే ప్రత్యేక సిబ్బంది ఉండాలని పాఠశాల ఉపాధ్యాయురాలు స్వప్న బెంగళూరు టీం సభ్యుల దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు వివరించి సిబ్బందిని నియమించేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఎంఓ రామ్‌మస్త, టెక్నికల్ పర్సన్ శేఖర్, ఎంఈఓ వెంకట్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం షఫీ, ఉపాధ్యాయులు సావిత్రి, స్వప్న, జరీనాబేగం, వెంకటయ్య, ముత్యప్ప, అనంతయ్య, సీఆర్పీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులను పూర్తి చేయండి
● వికారాబాద్, నారాయణపేట కలెక్టర్లు ప్రతీక్ జైన్, సిక్తా పట్నాయక్ కొడంగల్: నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్ జైన్, సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కడా కార్యాలయంలో రెండు జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలన్నారు. బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో మంజూరైన నిర్మాణాలకు టెండర్లు పిలవాలన్నారు. కొడంగల్‌లో ప్రభుత్వ ఆసుపత్రి భవనం, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. రోడ్ల విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, నారాయణపేట ఆర్డీఓ రామచందర్, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ వసంత్ నాయక్, ట్రాన్స్‌కో ఎస్ఈ లీలావతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణాలకు స్థల పరిశీలన దుద్యాల్: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యటించారు. దుద్యాల్‌లో సమీకృత భవన నిర్మాణాలకు స్థల పరిశీలన చేశారు. మండల కేంద్రం నుంచి అల్లిఖాన్‌పల్లి వరకు వేస్తున్న బీటీ రోడ్డు పనులను, గౌరారం గ్రామంలో నిర్మిస్తున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమా ణాలు పాటించించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పంచాయత్‌రాజ్ ఈఈ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులతో సమీక్ష అనంతగిరి: జిల్లాలో నేషనల్ హైవే, వివిధ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ, పరిహారం పంపిణీపై బుధవారం కలెక్టర్ తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల సమ్మతితో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర ప్రసాద్, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయండి కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే వినతి కొడంగల్: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కోరారు. బుధవారం ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కొడంగల్ కడా కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌ను ఆయన కలిశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని కోరారు. పనులు చేసిన ప్రజా ప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ఆయా గ్రామాల సర్పంచులు లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి సీసీ రోడ్లు, ప్రభుత్వ భవనాలు నిర్మించినట్లు చెప్పారు. వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. సదరు బిల్లులను చెల్లించి ప్రజాప్రతినిధులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, నాయకులు మహిపాల్‌రెడ్డి, దేశ్యా నాయక్, శేరి నారాయణరెడ్డి, రమేష్‌బాబు, నరేష్‌గౌడ్ పాల్గొన్నారు. -
సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కుల్కచర్ల: సబ్బండ వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చౌడాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్, పుర్సంపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో బీటీ రోడ్ల ప్రారంభోత్సవం, మరికల్లో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు భూమిపూజ, చౌడాపూర్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలితాలు చేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుందన్నారు. ప్రతి గ్రామంలో రహదారులను ఏర్పాటు చేసి రవాణావ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రత్యేకమైన నిధులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అనుసరించి ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్మోహన్‌శర్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్‌కుమార్, ఉపాధ్యక్షుడు నరసింహనాయక్, తహసీల్దార్ ప్రభులు, ఎంపీడీఓ సోమలింగం ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య రావొద్దు
డీపీఓ జయసుధ నవాబుపేట: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీపీఓ జయసుధ ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే ఎండల తీవ్రత పెరిగినందున గ్రామాల్లో నీటి సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు ముందుస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇలాగే ఇంటి, ఇతర పన్నులు వంద శాతం వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఉపయోగించుకొని ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విధులకు డుమ్మా కొడితే ఊరుకునేది లేదన్నారు. కార్యక్రమలో ఎంపీడీఓ అనురాధ, ఎంపీఓ విజయ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. నీటి సంరక్షణ పనులు భేష్ ప్రొఫెసర్ లతీఫ్ పాషా మోమిన్‌పేట: మండలంలో నీటి సంరక్షణ పనులు బాగున్నాయని, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే అవగాహన కలుగుతుందని ప్రొఫెసర్ లతీఫ్ పాషా అన్నారు. బుధవారం మోమిన్‌పేట మండలం గోవిందాపూర్, వెల్చాల్ గ్రామాల్లో చేపట్టిన నీటి సంరక్షణ పనులను రాజేంద్రనగర్ తెలంగాణ జయశంకర్ విశ్వ విద్యాలయం అగ్రోనమి విభాగ విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వాటర్ షెడ్ పనుల్లో భాగంగా నీటి కుంటలు, చెక్ డ్యాంలు నిర్మించారని తెలిపారు. వర్షం కురిసినప్పుడు వరద నీరు వృథాగా దిగువకు వెళ్లకుండా వాలుకు అడ్డంగా చెక్ డ్యాంలు, నీటి కుంటలు నిర్మించినట్లు తెలిపారు. తద్వార నీరు ఇంకి భూగర్భ జలాలు పైకి వస్తాయన్నారు. వ్యవసాయానికి, పశువులకు నీరు పుష్కలంగా దొరుకుతుందని చెప్పారు. అంతేకాకుండా వాలుకు అడ్డంగా రాతి కట్టలు కట్టడం ద్వారా భూమి కోతకు గురికాదన్నారు. కార్యక్రమంలో ఏఈఓ పెంటయ్య, వాటర్ షెడ్ అధికారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పోచయ్య రైతులు పాల్గొన్నారు. హాల్ టికెట్ అందజేతలో ఆలస్యం పరీక్ష మిస్సయిన ఇంటర్ విద్యార్థి పరిగి: కళాశాల ఫీజు కట్టకట్టలేదనే కారణంతో సకాలంలో తనకు హాల్ టికెట్ ఇవ్వలేదని, దీంతో పరీక్ష రాయలేకపోయానని ఇంటర్ ఓ విద్యార్థి వాపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీసాయి ఒకేషనల్ జూనియర్ కాలేజీలో నాగేశ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్టియర్ బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసేందుకు మంగళవారం హాల్ టికెట్ కోసం కళాశాలకు వెళ్లాడు. ఫీజు చెల్లించని వారు తర్వాత రావాలని సిబ్బంది సూచించడంతో సాయంత్రం వేళ ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ తీసుకుని, సెంటర్‌కు చేరుకునే సరికి సమయం 9:20 కావచ్చింది. దీంతో నిర్వాహకులు అతన్ని పరీక్షకు అనుమతించలేదు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తాను పరీక్ష మిస్సయ్యానని బాధితుడు ఆరోపించాడు. ఆ విషయంపై ప్రిన్సిపల్ శ్రీశైలంను వివరణ కోరగా.. విద్యార్థి ఉదయం 8:55 నిమిషాలకు హాల్‌టికెట్ కోసం వచ్చాడని, దీంతోనే ఆలస్యం జరిగిందని తెలిపారు. -
దైవభక్తి అలవర్చుకోవాలి
● స్పీకర్ ప్రసాద్కుమార్మోమిన్పేట: స్వామివారిని దర్శించుకుంటున్న స్పీకర్ ప్రసాద్‌కుమార్ తదితరులుఅనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ మాధవానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించాలన్నారు. భక్తితోనే ముక్తి లభిస్తుందన్నారు. సమాజ హి తం కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మహిపాల్‌రెడ్డి, ముత్తాహర్ షరీఫ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి,నాయకులు మల్రెడ్డి, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జునస్వామిఆలయంలో.. మోమిన్‌పేట: ప్రతి ఒక్కరూ దైవభక్తి అలవర్చుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం మోమిన్‌పేట మండలం దుర్గంచెర్వు గ్రామంలోని భ్రమారాంబిక మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తితో మానసిక ప్రశాంతత పొందవచ్చని తెలిపారు. ఆయన వెంట మర్పల్లి మార్కెటు కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, నాయకులు నరోత్తంరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశం తదితరులు ఉన్నారు. విద్యార్థినికి న్యాయం జరిగేలా చూస్తాం అనంతగిరి: ఉపాధ్యాయుల తీరు కారణంగా భవనం పైనుంచి దూకి గాయపడిన బాలిక తబితను బుధవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ పరామర్శించారు. ఇటీవల కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మహిళా టీచర్లు విద్యార్థి తబితను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. బుధవారం వికారాబాద్ ఆస్పత్రికి వచ్చిన బాలికను స్పీకర్ పరామర్శించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థినికి ధైర్యం చెప్పారు. -
హెచ్ఐవీపై అప్రమత్తత ముఖ్యం
పూడూరు: ప్రతిఒక్కరూ హెచ్ఐవీ పరీక్షలు చేసుకోవాలని వైఆర్జీకే జోనల్ సూపర్వైజర్ రాములు తెలిపారు. బుధవారం వైఆర్జీ కేర్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని చన్గోముల్ హెల్త్ సబ్ సెంటర్లో 53 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్ఐవీ ఉన్న వారు ఆందోళన చెందరాదని, వారి కోసం ఉచితంగా మందులు అందిస్తున్నామన్నారు. గ్రామాల్లో అనుమానం ఉన్న వారు టీబీతో పాటు సుఖవ్యాధుల కోసం సబ్ సెంటర్లో పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. హెచ్ఐవీ వచ్చిన వ్యక్తి జీవిత కాలం బతకాలంటే సమీపంలోని ఏఆర్టీ కేంద్రంలో అందుబాటులో ఉన్న మందులు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం పద్మ, లింక్ వర్కర్ సుధా, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి గిరిజన సంఘం నాయకులు బుధవారం క్షీరాభిషేకం చేశారు. కొడంగల్ పట్టణ శివారులో నిర్మిస్తున్న బంజారా భవనానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.3.65 కోట్లు మంజూరు చేయడంతో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సేవా లాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శివరామ్ చౌహాన్, సంతోష్ నాయక్, శంకర్ నాయక్, డాక్యా నాయక్, తార్యా నాయక్, పాండు నాయక్ శివ రాథోడ్, రాజు నాయక్ నరేష్ నాయక్ పాల్గొన్నారు. భగీరథ పైపునకు లీకేజీ మోమిన్‌పేట: మొరంగపల్లి నుంచి ఎన్కేపల్లికి వెళ్లే రహదారిలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు రెండు వేర్వేరు ప్రదేశాలలో లీకేజీలు ఏర్పడి నీరంతా వృథాగా పోతుంది. దీంతో ఎన్కేపల్లిలో వారం రోజులుగా తాగు నీరు సరిపడా అందడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని పేర్కొంటున్నారు. ఉన్నాతాధికారులు స్పందించి లీకేజీలకు మరమ్మతులు చేసి నీటి వృథాను అడ్డుకోవాలని కోరుతున్నారు. సేవాలాల్ మహరాజ్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ అనంతగిరి: అలిండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో బుధవారం వికారాబాద్‌లోని మహావీర్ ఆస్పత్రికి వెళ్లే ప్రధాన చౌరస్తా వద్ద సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పరుశురాంనాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు నరేందర్‌నాయక్, పట్టణ అధ్యక్షుడు రమేష్ నాయక్, నాయకులు బాబులాల్ జాదవ్, విజయ్‌కుమార్‌నాయక్, పరుశురాంజాదవ్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కుల్కచర్ల: ముందు వెళ్తున్న బైక్‌ను సడన్‌గా ఆపడంతో వెనుక వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. దోమ మండలం మల్లేపల్లికి చెందిన అంజిలయ్య తన సోదరి నర్సమ్మ, కుమారుడు నవీన్‌తో కలిసి కుల్కచర్ల నుంచి దాదాపూర్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బండవెల్కిచర్ల గ్రామ శివారులో ముందు వెళ్తున్న బైక్ సడెన్‌గా నిలిపివేయడంతో వెనుక వస్తున్న అంజిలయ్య బైక్ అట్టి బైక్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో అంజిలయ్య, నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సడన్‌గా బైక్ ఆపిన వ్యక్తికి కూడా గాయాలైనట్లు తెలిసింది. -
జీవాలను ఎత్తుకెళ్లిన దుండగులు
నవాబుపేట: పశువుల పాకలో ఉన్న మేకలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన సంఘటన మండలంలోని మీనపల్లికలాన్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శీలపురం నర్సింలుకు చెందిన రెండు మేకలు, ఒక గొర్రె పోతును మంగళవారం సాయంత్రం గ్రామ శివారులో ఉన్న పాకలో కట్టేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం పాక దగ్గరకు వెళ్లి చూడగా కనిపించలేదు. సుమారు రూ.35 వేల విలువగల జీవాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్ష కేంద్రం చూసేందుకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన ఇంటర్ విద్యార్థి తాండూరు టౌన్: తెల్లారితే పరీక్ష ఉండటంతో సెంటర్ ఎక్కడ ఉందో చూసేందుకు బైకుపై వెళ్తున్న ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. తాండూరు మండలం సిరిగిరిపేట్‌కు చెందిన శ్రీకాంత్ అనే విద్యార్థి తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో చూసేందుకు బైకుపై ఇందిరాచౌక్ నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. రాయల్కాంటా వద్ద టర్నింగ్ తీసుకుంటున్న జనగాం గ్రామానికి చెందిన పట్నం సుధాకర్ బైకు ఢీకొన్నాయి. దీంతో కిందపడిన శ్రీకాంత్ తలకు తీవ్ర గాయమైంది. సమాచారం మేరకు 108లో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని పట్టణ పోలీసులు తెలిపారు. హుండీ చోరీకి విఫలయత్నం కొందుర్గు: ఆలయంలో చోరీకి యత్నించిన ఓ దుండగుడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామం సోమలింగేశ్వర స్వామి వారి ఆలయంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి సాయికుమార్ బుధవారం ఉదయం ఆలయ పరిసరాల్లో ఎవ రూ లేని సమయంలో హుండీలోని డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. అటుగా వె ళ్తున్న గ్రామస్తులు గమనించి అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ వీరన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వంద శాతం దిశగా..
విఽధిగా పన్నులు చెల్లించాలి కుల్కచర్ల: ప్రతిఒక్కరూ విఽధిగా పన్నులు చెల్లించాలని చౌడాపూర్ మండలంలోని మరికల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దుకాణదారులు తమ అనుమతులను రెన్యూవల్ చేసుకోవడంతో పాటు పన్నులను సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దోమ: గ్రామ పంచాయతీలలో ఇంటి పన్ను వసూలు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పన్ను వసూళ్ల లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఇంటింటికి వెళ్తున్నారు. ఈ నెల 31న ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో అప్రమత్తమయ్యారు. మరో పక్క వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు సైతం ఆయా సమావేశాల్లో పంచాయతీ అధికారులకు సూచిస్తున్నారు. మండలంలో 75 శాతం పూర్తి దోమ మండల వ్యాప్తంగా మొత్తం 36 గ్రామ పంచాయతీలున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.47.91 లక్షలు పన్నులు జీపీలకు సమకూర్చాల్సి ఉండగా, అందులో రూ.36.27 లక్షలు వసూలయ్యాయి. మొత్తంగా 75 శాతం పూర్తి చేసినట్లు పంచాయతీ అధికారులు చెప్పారు. మిగతా పన్ను వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపడుతున్న పన్ను వసూళ్లకు పల్లె వాసులు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. గ్రామాభివృద్ధిలో ఇంటి పన్ను కీలకపాత్ర పోషిస్తుండగా.. మెజార్టీ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, మంచినీరు, మురుగు నాళాలను శుభ్రం చేయడం వంటి పనులకు ఈ పన్నులు ఎంతో ఉపయోగపడతాయి. అయితే వాటిని చెల్లించుకోవడంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటికి తిరుగుతూ వసూలు చేస్తున్నారు. జీపీ పన్నుల వసూలుపై అధికారుల ప్రత్యేక దృష్టి దోమలో రూ.47 లక్షలు లక్ష్యం ఇప్పటివరకు ఖజానాలో రూ.36 లక్షలు జమ -
విద్యార్థులు సాంకేతికతపై పట్టు సాధించాలి
కుల్కచర్ల: విద్యార్థులు సాంకేతిక అంశాలపై పట్టు సాధించాలని చౌడాపూర్ ఎంపీడీఓ సోమలింగం, ఎంఈఓ రాంచందర్ పేర్కొన్నారు. బుధవారం చౌడాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో పీఎం శ్రీ సైన్స్ఫేయిర్, ఫుడ్ ఫెస్టీవల్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠ్యంశాలను చదవడంతో పాటుగా టెక్నికల్ అంశాలపై సైతం నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా 89 రకాలైన సైన్స్ ప్రయోగాలు, 25 రకాల వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కొత్త అలివేలు, కార్యదర్శి రాజిరెడ్డి, సీఆర్పీలు రఘు, విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, గౌస్ నదీమ్, సురేష్‌కుమార్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగిన రోడ్డు.. తప్పని తిప్పలు
త్వరలో పనులు ప్రారంభిస్తాం రోడ్డును కొత్తగా వేయడం లేదు. ఇదే విషయాన్ని జిల్లా ఫారెస్టు అధికారి జ్ఞానేశ్వర్ దృష్టికి తీసుకెళ్లాం. పనులు తీసుకున్న కాంట్రాక్టర్ మోమిన్‌ఖుర్ధు నుంచి రాజాపూర్ వరకు ఉన్న అసంపూర్తి రోడ్డు పనులు చేశారు. త్వరలో ఈ రోడ్డును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తాం. – శ్రీనివాసులు, పంచాయతీరాజ్ డీఈ ధారూరు: పూర్తిగా పాడైన రహదారిని తిరిగి పునర్నిర్మిస్తుండగా అనుమతులు లేవంటూ అటవీ అధికారులు అడ్డుకున్న ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్ట్ నుంచి గడ్డమీది గంగారం, కుక్కింద ఉన్నత పాఠశాల, మున్నూరుసోమారం గ్రామం మీదుగా బుగ్గ శివాలయం దేవాలయం వరకు పాడైన రోడ్డును ఎంఆర్ఆర్ గ్రాంట్ ద్వారా విడులైన రూ.2.82 కోట్లతో పునర్నిర్మించడానికి నిధులు మంజూరు అయ్యాయి. కాంట్రాక్టర్ ముందుగా కుక్కింద ఉన్నత పాఠశాల నుంచి గడ్డమీది గంగారం గ్రామం వరకు కంకర వేశాడు. మధ్యలో ఉన్న కల్వర్టులను కొత్తగా నిర్మించాడు. గడ్డమీది గంగారం నుంచి కోట్‌పల్లి ప్రాజెక్టు వరకు రోడ్డు పనులు చేస్తుండగా ఫారెస్టు అధికారులు తమ భూభాగం అంటూ నిలిపివేశారు. నెల రోజులుగా ముమ్మరంగా పనులు చేయించిన కాంట్రాక్టర్ అటవీశాఖ అభ్యంతరంతో పనులు మధ్యలోనే ఆపేశారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇబ్బంది పడుతున్న తమకు తీవ్ర నిరాశ ఎదురైందని వాహనదారులు వాపోయారు. బస్సును నిలిపేశారు ఈ మార్గంలో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పగటి పూట ఎలాగో వెళుతు న్నా రాత్రిపూట మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయని వాపోతున్నారు. రోడ్డు బాగా లేదంటూ వికారాబాద్ నుంచి గడ్డమీది గంగారం వరకు నడిపే ఆర్టీసీ బస్సును సైతం ఆపేశారు. దీంతో కళాశాల, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థుల బాధ వర్ణనాతీతం. వెంటనే రోడ్డు పూర్తి అయ్యేలా చొరవ చూపాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కోరుతున్నారు. గడ్డమీది గంగారం వద్ద రోడ్డు పనులు అడ్డుకున్న అటవీ అధికారులు -
బోరు మోటారు తీసేందుకు వెళ్లి..
నీటిలో మునిగి వ్యక్తి మృతి పూడూరు: బావిలో చెడిపోయిన బోరు మోటారును తీసేందుకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖుత్బుల్లాపూర్కు చెందిన జోగు తిరుపతయ్య (25)ను ఆదే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ జోగు రామకృష్ణ, వాటర్‌మెన్ రాములు కలిసి చేదరుబావిలో బోరు మోటారు ఉంది తీయాలని తెలపడంతో తిరుపతయ్య బావిలోకి దిగాడు. నీటిలోకి వెళ్లి ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానంతో పంచాయతీ కార్యదర్శి రాజేందర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామస్తులు బావిలోకి దిగి తిరుపతయ్యను బయటికి తీశారు. అప్పటికే తిరుపతయ్య మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి అన్న జోగు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
డీఎల్పీఓ సంధ్యారాణి
నీటి ఎద్దడి రానివొద్దు కుల్కచర్ల: సమస్యల పట్ల ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని డీఎల్పీఓ సంధ్యారాణి, ఎంపీడీఓ రామకృష్ణ అన్నారు. బుధవారం కుల్కచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ మాట్లాడుతూ... ప్రస్తుతం వేసవికాలం వస్తున్న నేపథ్యంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నీటి సౌలభ్యాన్ని బట్టి గ్రామ పరిధిలోని నీటి వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా మార్చి చివరి వారం వరకు టాక్స్ కలెక్షన్లు వందశాతం పూర్తయ్యేలా కార్యదర్శులు పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
సద్దుమణిగిన గోశాల వివాదం
మీర్‌పేట: జిల్లెలగూడలోని మత్స్యావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలోని గోశాల విషయంపై వివాదం చోటు చేసుకుంది. గోపాలకృష్ణ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఆలయంలో గోశాల నిర్వహిస్తున్నాడు. గోశాలకు సంబంధించిన విషయాలు ఆలయ అధికారులకు తెలుపకపోవడంతో గోశాలను తిరిగి అప్పగించాలని అధికారులు, మాజీ ధర్మకర్తలు గోపాలకృష్ణను పలుమార్లు కోరినా ఆయన నిరాకరించాడు. దీంతో బుధవారం గోపాలకృష్ణ, అతనికి మద్దతుగా స్థానిక బీజేపీ నాయకులు ఆలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న మీర్‌పేట ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐ రాజశేఖర్ ఇరువర్గాల వారిని సముదాయించారు. అనంతరం ఆలయ చైర్మన్ సంజయ్ గోపాల్‌సింగ్ సైంచర్, ఈఓ శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు గోశాల నిర్వాహకుడు గోపాలకృష్ణ, స్థానిక నాయకులతో మాట్లాడటంతో వివాదం సద్దుమణిగింది. కాగా గోశాల నిర్వహణ బాధ్యతలను ఆలయానికే అప్పగిస్తున్నట్లు గోపాలకృష్ణ అందరి సమక్షంలో ఒప్పంద పత్రం అందజేశారు. ఆలయానికే అప్పగిస్తున్నట్లు ఒప్పందపత్రం అందజేత -
కొత్త కోటా
కొత్త రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణ ఫలించింది. కొలువుదీరిన నాటి నుంచి నేడు.. రేపు అంటూ ఆశలు రేకిత్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్డులివ్వకున్నా బియ్యం విడుదల చేసింది. కాగా రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చే విషయంలో ఇప్పటి వరకు ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. వికారాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయకుండా ఎన్నికలకు ఏడాదిన్నర ముందు దరఖాస్తు దారుల్లో సగం మందికి కార్డులిచ్చి చేతులు దులుపుకొంది. ఎనిమిదేళ్ల క్రితం ఆహార భద్రతా పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఆ సమయంలో కుటుంబంలో ఉన్నవారి సంఖ్యను చేర్చింది. తదనంతరం కొందరు వివాహం చేసుకుని అత్తగారింటికి వచ్చినవారు, వారి సంతానం వేలల్లో ఉన్నారు. మరికొందరి పేర్లు సాంకేతిక కారణాలతో తొలగించబడ్డాయి. పెళ్లి అయినవారి, జన్మించిన వారి వివరాలను కార్డులో చేర్చేందుకు నాటి నుంచి మళ్లీ అవకాశం కల్పించలేదు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్న నేపథ్యంలో ఆహార భద్రత కార్డుల్లో కొత్తవారిని చేర్చాలని పేదలు కోరుతున్నారు. 35 వేల దరఖాస్తులు పెండింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎనిమిదేళ్ల క్రితం ఆహారభద్రత లబ్ధిదారులను ఎంపిక చేసి ఆన్లైన్లో జాబితాను ఉంచింది. అనంతరం పూర్తిస్థాయి బయోమెట్రిక్ విధానం అమలు చేస్తోంది. కొత్త మెంబర్‌ను జాబితాలో చేర్చే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారికి ఎనిమిదేళ్లుగా ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటికే 35 వేల మంది దరఖాస్తులు చేసుకుని నేటికీ నిరీక్షిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్రం ఇచ్చే రేషన్‌కు దూరమవుతున్నారు. ఈ నెల నుంచి పంపిణీప్రజా పాలనలో రేషన్ కార్డుల కోసం 23,542 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి 22,404 మందిని అర్హులుగా గుర్తించారు. మిగిలిన 1, 138 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్క రించారు. ప్రస్తుతం జిల్లాలో కొత్త వాటితో కలుపుకొని 2,63,573 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈనెల నుంచి జిల్లాలో 5,603 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు ఆహార భద్రత రేషన్ దుకాణాలకు చేరిన 268 మెట్రిక్ టన్నుల బియ్యం 22,404 కుటుంబాలకు లబ్ధి కొత్త పేర్ల నమోదుకు 35 వేల దరఖాస్తులు పెండింగ్ చౌక ధరల దుకాణాలు 588 ఆహారభద్రత కార్డులు 2,41,622 ఎఫ్ఎస్సీ కార్డులు 14,853 అంత్యోదయ కార్డులు 26,730 అన్నపూర్ణ కార్డులు 39 ప్రతీ నెల బియ్యం సరఫరా 5,335 మెట్రిక్ టన్నులు -
తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలు
షాద్‌నగర్: పల్లెల్లో ప్రజలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి అన్నారు. షాద్‌నగర్ పరిధిలోని హాజిపల్లి గ్రామంలో టీ ఫైబర్ ద్వారా అందిస్తున్న ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలను ఆయన ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. పల్లెల్లో ప్రజలకు ఇంటర్నెట్ సేవ లు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రస్తుత కాలంలో ప్రతీ పనికి ఇంటర్నెట్ కీలకంగా మారిందన్నారు. ప్రభుత్వం తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటితోపాటు కార్యాలయాల్లో ఆన్లైన్ సేవలు టీ ఫైబర్ నెట్ ద్వారా సులభతరం అవుతాయన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా హాజిపల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని.. త్వరలో అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలను విస్తరించనున్నట్లు వివరించారు. అనంతరం గ్రామంలోని ఇంటర్నెట్ ఉన్న ఇళ్లకు, పూరి గుడిసెల్లోకి వెళ్లి వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఫైబర్ ఎండీ ప్రవీణ్, డీపీఓ సురేష్‌మోహన్, ఆర్డీఓ సరిత, తహసీల్దార్ పార్థసారధి, ఎంఈఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి -
విజన్ లేని ముఖ్యమంత్రి పాలన
హుడాకాంప్లెక్స్: రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్ లేకుండా పాలిస్తున్నారని, పది రూపాయల పనికి వందసార్లు ప్రభుత్వాన్ని అడగాల్సిన దుస్థితి ఏర్పడిందని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. సరూర్‌నగర్ డివిజన్ హుడాకాంప్లెక్స్‌లో మంగళవారం ఆమె పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అధికారులను బాధ్యతగా పనిచేయించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలని.. తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎన్నికలప్పుడు మాట్లాడినట్లే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలపై దృష్టి పడితే బాగుంటుందని హితవు పలికారు. వేసవి సమీపిస్తున్నందున తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు లోకసాని కొండల్‌రెడ్డి, దర్పల్లి అశోక్, సుశీలరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహ్మద్ ఇస్మాయిల్, సాలమ్మ, శృతి, సునీల్‌యాదవ్, ఆకుల అరుణ్, రాజు యాదవ్, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి -
భారతదేశం ఔషధ మొక్కలకు పుట్టినిల్లు
కడ్తాల్: అనాది నుంచి భారతదేశం ఔషధ మొక్కలకు పుట్టినిల్లు అని బెంగళూరుకు చెందిన ఆయుర్వేద చికిత్స నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్ శర్మ పేర్కొన్నారు. అన్మాస్‌పల్లి పంచాయతీ పరిధిలోని ఎర్త్ సెంటర్లో కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ‘ప్రకృతి ఒడిలో ఒక రోజు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రావిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు పర్యావరణవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ.. ఔషధ మొక్కల ఔన్నత్యాన్ని, ప్రాముఖ్యతను గుర్తించి జీవన గమనంలో భాగం చేసుకోవాలని సూచించారు. సీజీఆర్ చైర్పర్సన్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో ఔషధ మొక్కలు పెంచుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ నిర్వాహకుడు మాధవరెడ్డి, ఉపాధ్యాయులు శేఖర్, జగదీశ్, సీజీఆర్ ప్రతినిధులు జ్ఞానేశ్వర్, నాగేశ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
నవాబుపేట: ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి హెచ్చరించారు. విద్యార్థులను ఎలుకలు కరిసిన ఘటన సోమవారం వెలుగులోకి రావడంతో మంగళవారం ఆమె మండల కేద్రంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ప్రశ్నించడంతో రాత్రి వేళ ఎనిమిది మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయని చెప్పారు. వారి ఆరోగ్యవిషయమై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మండల విద్యాధికారి విచ్చేసి వైద్యం చేయించారని.. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల విషయంలో ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎలుకలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఈఓ వెంట తహసీల్దార్ జైరాం, ఎంపీడీఓ అనురాధ, ఎంఈఓ అబ్దుల్ రహమాన్, ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, డైరెక్టర్లు కదీర్, నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు. కంటికి రెప్పలా చూసుకోవాలి: భీంభరత్ పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కరిచిన విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ చేవెళ్ల ఇన్చార్జీ భీంభరత్ పాఠశాలకు విచ్చేశారు. జరిగిన విషయంపై విద్యార్థులు,ఉపాధ్యాయులను అ డిగి తెలుసుకున్నారు.విద్యార్థులను కంటిరెప్ప లా కాపాడుకోవాలని సూచించారు.ఆయన వెంట నాయకులు వెంకటయ్య, వెంకట్‌రెడ్డి, ఎక్బాల్, శేఖర్,ప్రసాద్, రఘు ఉన్నారు. ఏఐ బోధన పకడ్బందీగా నిర్వహించాలి తాండూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన కృతిమ మేధ(ఏఐ) బోధనను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ రేణుకాదేవి అన్నారు. మంగళవారం ఆమె పట్టణంలోని సాయిపూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని ఏఐ ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు ఏవిధంగా బోధిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ బోధనపై ఉపాధ్యాయులకు సలహాలు సూచనలిచ్చారు. జిల్లా విద్యాధికారి రేణుకాదేవి -
ఎల్ఆర్ఎస్ వినియోగించుకోవాలి
అనంతగిరి: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో రుసుము చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని సూచించారు. మార్చి 31వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే 25శాతం రాయతీ వర్తిస్తుందని చెప్పారు. అర్బన్, రూరల్, గ్రామ పంచాయతీ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీంపై అవగాహన కల్పించాలన్నారు. 2020 ఆగస్టు 26 వరకు పదిశాతం ప్లాట్లు విక్రయించిన లేఔట్లకు క్రమబద్ధీకరణ వర్తిస్తుందని చెప్పారు. సబ్ రిజిస్టర్ ద్వారా నిర్ణీత నమూనాలో సేకరించిన దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి, క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. ప్రత్యేకంగా హె ల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. క్రమబద్ధీకరించని భూముల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతి ఉండదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ట్రెయినీ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మున్సిపల్ కమిషరర్లు జాకీర్ అహ్మద్, బలరాంనాయక్, వెంకటయ్య, విక్రంసింహారెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. ఈ నెల 31 వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే 25 శాతం రాయితీ కలెక్టర్ ప్రతీక్‌జైన్ -
పడకేసిన పశు బీమా
● పాడి రైతుకు కరువైన ధీమా ● పశువులు మృత్యువాతపడి నష్టపోతున్న దుస్థితి ● పథకం పునరుద్ధరించాలని వేడుకోలు పరిగి: పాడి పశువులు ఏదైనా ప్రమాదం సంభవించి మృత్యువాత పడితే రైతులకు నష్టం వాటిళ్లకుండా పశుబీమా ఉండేది. ప్రస్తుతం పశుబీమా నిలిచిపోవడంతో పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పశుపెంపకం ఆధారపడిన వారు పశువులు విద్యుదాఘాతంతోనో, ఇతర అనారోగ్య సమస్యలతోనే చనిపోతే ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం మేలు రకం జాతిఆ పశువుల కొనుగోలుకు రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ప్రమాదాలబారిన పడి పాడిపశువులు చనిపోతే రైతులు ఆర్థిక భారంతో కుదేలవుతున్నారు. ఆరేళ్లుగా నిలిచిన పథకం 2017–18 వరకు పాడిపశువులకు బీమా పథకం అమలైంది. తదనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని పట్టించుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వ్యవసాయం, పాడి పరిశ్రమే ప్రధాన ఆధారం. ప్రకృతి వైపరీత్యాలు, కరువు సమయంలో పాడి పశువులు ఎన్నో మృత్యువాత పడ్డాయి. దీంతో రూ.లక్షలు వెచ్చించి పశువులు కొనుగోలు చేసిన పాడి రైతులు బీమా సౌకర్యం లేక ఆర్థికంగా చతికిల పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికై నా పశుబీమా సౌకర్యం పునరుద్దరించాలని పాడి రైతులు కోరుతున్నారు. 40వేల లీటర్ల పాల ఉత్పత్తి వ్యవసాయం చేస్తున్న ప్రతీ రైతు పాడి పశువులు సైతం సాకుతున్నారు. తక్కువ భూమి ఉన్న రైతులు పాడిరంగాన్ని ఎంచుకుని ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,50,000 వేల పశువులుండగా ఆవులు 1,70,000, గేదెలు 80,000 ఉన్నాయి. 20 మండలాల్లో కలిపి సుమారు 40 వేల లీటర్ల పాలను రైతులు అందిస్తున్నారు. కానీ పాడినే నమ్ముకున్న రైతులకు బీమా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం ప్రస్తుతం పాడి పశువులకు ఎలాంటి బీమా సౌకర్యం అందుబాటులో లేదు. ఆరు సంవత్సరాలుగా ఈ ప్రక్రి య నిలిచిపోయింది. బీమా సౌకర్యం కల్పించాల ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించాం. సర్కార్ నుంచి ఆదేశాలు వస్తే సమాచారం ఇస్తాం. – సదానందం, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి, వికారాబాద్ ఆర్థికంగా నష్టం పశువులు మృత్యువాత పడితే తీవ్రంగా నష్టపోతున్నాం. గతంలో బీమా సౌకర్యం ఉండడంతో పశువులు చనిపోయినా కొంత డబ్బు అందేది. ఆ పథకం నిలిచిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పశుబీమా సౌకర్యం కల్పించాలి. – విష్ణువర్ధన్‌రెడ్డి, పాడి రైతు, దోమ మూడు ఆవులు మృత్యువాత నాలుగు ఆవులతో డెయిరీ ప్రారంభించా. మూడు నెలల క్రితం రెండు ఆవులు అనారోగ్యంతో మృత్యువాత పడ్డాయి. నాలుగు రోజుల క్రితం మరో ఆవు చనిపోయింది. దీంతో దాదాపు రూ.3.5 లక్షలు నష్టం వాటిల్లింది. బీమా సౌకర్యం కల్పిస్తే ఇంత ఇబ్బంది పడేవాడిని కాదు. – రవికుమార్, మోత్కూరు, దోమ -
ఉద్యాన పంట.. ఆదరణ కరువంట
మోమిన్‌పేట: కూరగాయలు సాగు చేసే రైతులకు సబ్సిడీలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. విత్తనాలు, మల్చింగ్, పందిరి ఏర్పాటుకు ఇచ్చే రాయితీలను ప్రభుత్వం పూర్తిగా నిలిపి వేసింది. కూరగాయ పంటలకు మద్దతు ధర లేకున్నా సాగుకు అవసరమైన పరికరాలు సబ్సిడీపై అందించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలంటే బిందు సేద్య పరికరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అధికారులు పేర్కొంటుండంతో 90శాతం సబ్సిడీపై ప్రభుత్వం గతంలో అందించేది. ఎకరాకు రూ.10వేల నుంచి రూ.15వేలతో డ్రిప్ పరికరాలు అందేవి. ప్రస్తుతం రూ.60వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు లబోదిబోమంటున్నారు. భగ్గుమంటున్న విత్తనాలు 60 మంది రైతులు వివిధ కూరగాయ పంటల సాగుకు మల్చింగ్ పేపర్‌ను సొంత డబ్బుతో కొనుగోలు చేసి సాగు చేశారు. ప్రభుత్వం ఎకరాకు రూ.6,400లను సబ్సిడీ కింద రైతు ఖాతాలో జమ చేసేది. ఎస్సీ, ఎస్టీ రైతులకు మాత్రమే సబ్సిడీ అందుబాటులో ఉందంటున్నారు. తీగ జాతి కూరగాయల సాగుకు పందిరి ఏర్పాటుకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందించేది. గత ప్రభుత్వం పూర్తిగా రాయితీలను నిలిపి వేసింది. హైబ్రిడ్ రకం కూరగాయ విత్తనాలకు మార్కెట్లో ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇవ్వడంతో రైతులకు కొంత ఊరట లభించేది. ప్రస్తుతం అవి కూడా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలుగడ్డ సాగు మండలంలో గణనీయంగా తగ్గింది. విత్తనాల రేటు ఎక్కువ ఉండడంతో 1200 ఎకరాల నుంచి 500 ఎకరాలకు పడిపోయింది. సబ్సిడీ రాలేదు ఒక ఎకరాలో టమాటా సాగుకు మల్చింగ్ వేశాను. రూ.12,700 వరకు ఖర్చు వచ్చింది. ప్రభుత్వం రూ.6,400 సబ్సిడీ కింద ఇస్తుందన్నారు. ఆరు నెలలు కావొస్తున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి రాలేదు. – ప్రభాకర్‌రెడ్డి, రైతు, ఎన్కేపలి ్ల దరఖాస్తులు చేసుకోవచ్చు పందిరికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎకరాకు రూ.లక్ష సబ్సిడీ వస్తుంది. సిమెంటు, లేక రాయి పిల్లర్లు వేసుకోవాలి. బిందు, తుంపర సేద్య పరికరాల సబ్సిడీకి ప్రస్తుతం నిధులు అందుబాటులో లేవు. వంకాయ, టమాటా, పచ్చిమిర్చి నారు జీడిమెట్లలో ఉచితంగా ఇస్తున్నారు. – అక్షితరెడ్డి, ఇన్చార్జి ఉద్యానశాఖ అధికారి నిలిచిన ప్రభుత్వ సబ్సిడీలు ఆందోళనకు గురవుతున్న రైతులు -
ఒక భవనం..మూడు శాఖలు!
దుద్యాల్: చాలీచాలని వసతులతో ఆ చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నాలుగు అక్షరాలు నేర్చుకొని ప్రయోజకులు అవుతారని ఆశపడ్డ వారి తల్లిదండ్రులకు గదుల సమస్య నీడలా వెంటాడుతోంది. మండలంలోని సంట్రకుంట తండాలో ఒకే భవనంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పంచాయతీ కార్యాలయం నిర్వహించడంతో విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సరిపడా గదులు లేకపోవడమే సమస్యను మరింత జటిలం చేసింది. ఈ భవనంలో ఉన్న గదిలో ఉపాధ్యాయులు 20 చిన్నారులతో పాఠశాల నిర్వహిస్తుండగా, వరండాలో ఒక పక్క అంగన్వాడీ కేంద్రం, మరోపక్క గ్రామ పంచాయతీ కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. అంగన్వాడీలో బాలల అల్లరి మూడు శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు ఒకే భవనంలో జరుగుతుండడంతో చాలా ఇబ్బందిగా ఉందని విద్యార్థులతో పాటు తండావాసులు వాపోతున్నారు. తరగతులు జరిగేటప్పుడు అంగన్వాడీ బాలలు చేసే అల్లరితో ఇబ్బందులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించి ఏవైన పనులు సాగుతున్నప్పుడు గ్రామస్తులు వచ్చి పెద్దగా మాట్లాడుతుంటారు. దీంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నమని విద్యార్థులు మదన పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వేరు వేరుగా కార్యకలాపాలు సాగేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని తండావాసులు కోరుతున్నారు. భూమి పూజకు నోచుకోక... ఒకే భవనంలో మూడు కార్యకలాపాలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించి ప్రభుత్వం రూ.41 లక్షలతో పాఠశాల భవనాన్ని మంజూరు చేసింది. కానీ నెలలు గడుస్తున్నా నేటికీ భూమి పూజకు నోచుకోలేదు. అత్యవసరం ఉన్న చోటే నిర్మాణం త్వరగా చేపడితే అక్కడ పరిస్థితులు మారుతాయని ప్రజలు భావించినా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వచ్చే విద్యా సంవత్సరం వరకు భవనం అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గదిలో పాఠశాల, వరండాలో అంగన్వాడీ, గ్రామ పంచాయతీ నిర్వహణ సంట్రకుంట తండాలో అవస్థలు పడుతున్న విద్యార్థులు పాఠాలు అర్థం కావడం లేదని గగ్గోలు నూతన భవనం నిర్మించాలని విజ్ఞప్తి -
పుష్కరిణిలో మునిగి వ్యక్తి మృతి
● స్నానం చేసే క్రమంలో ప్రమాదం ● మృతుడు గోనూరువాసి చేవెళ్ల: మండల కేంద్రంలోని శ్రీబాలాజీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ జాతరకు వచ్చిన ఓ భక్తుడు స్నానం చేసేందుకు పుష్కరిణిలో దిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోనూరుకు చెందిన కురువ బిచ్చప్ప(45) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బతుకుదెరువు కోసం నాలుగేళ్ల కిత్రం భార్య శివలీల, కూతురుతో కలిసి అత్తగారి గ్రామమైన చేవెళ్ల మండలం కిష్టాపూర్ వచ్చాడు. ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మంగళవారం చేవెళ్లలో జరుగుతున్న జాతరకు వెళ్దామని భార్యతో అన్నాడు. సాయంత్రం వెళ్దామని చెప్పిన ఆమె.. కూలీ పనికి వెళ్లింది. దీంతో బిచ్చప్ప ఒక్కడే చేవెళ్లకు చేరుకున్నాడు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని పుష్కరిణిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారడంతో ఈత రాక నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న పలువురు భక్తులు ఇది గమనించి బయటకు తీయగా, అప్పటికే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శివలీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో సీసీ రోడ్లు
దుద్యాల్: మండల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణానికిగాను రూ.1.20 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి, డీఈ సుదర్శన్‌రావు, ఏఈ సురేందర్‌రెడ్డి, కొడంగల్ ఎంఏసీ వైస్ చైర్మన్ వేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీశైలంగౌడ్, ఉపాధ్యక్షుడు కృష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్‌పాషా, మాజీ సర్పంచ్ ఖాజా, గ్రామస్తులు సాయన్న, సత్యనారాయణ, అశోక్, హాజీ, శాంతు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పోలేపల్లి.. భక్తులు ప్రణమిల్లి
దుద్యాల్: ప్రసిద్ధిగాంచిన పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం జన సందోహంగా మారింది. మంగళవారం అమ్మవారికి మొక్కులు చెల్లించే రోజు కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కోడి పుంజులు, మేకపోతులను బలిచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా క్యూలైన్లు నిండిపోవడంతో దర్శనానికి గంటకు పైగా సమయం పట్టిందని భక్తులు వాపోయారు. అనంతరం బోనాలతో ఊరేగింపుగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో దాదాపు 5 వేలకు పైగా భక్తులు దర్శించుకుంటున్నట్లు ఆలయ ఈఓ రాజేందర్‌రెడ్డి, చైర్మన్ జయరాములు తెలిపారు. -
అలరించిన ఒగ్గు కళా ప్రదర్శన
బొంరాస్‌పేట: మండల పరిధిలోని నాందర్‌పూర్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు నిర్వహించిన శ్రీమల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని ఒగ్గు బీరప్ప డోలు కళాబృందంతో నిర్వహించిన ప్రదర్శన, కథ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో తాలూకా యాదవసంఘం అధ్యక్షుడు మన్నె బస్వరాజ్ యాదవ్, కురుమ సంఘం నాయకులు మహేశ్, అన్నయ్య, పాండు, నర్సింలు, పుర్ర వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల భూమి సర్వే చేయండి
స్థానికంతాండూరు రూరల్: మండల పరిధిలోని అంతారం గుట్ట సమీపంలో జర్నలిస్టులకు సంబంధించిన భూమిలో సర్వే నిర్వహించాలని సీనియర్ జర్నలిస్టులు కోరారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ తారాసింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ.. అంతారంగుట్ట పైన సర్వే నంబరు 116, 117లో ఉన్న తమ భూమిని సర్వే చేసి కేటాయించాలని కోరారు. తహసీల్దార్ స్పందిస్తూ.. సర్వేయర్ మహేశ్ సెలవుల్లో ఉన్నారని, ఆయన వచ్చిన వెంటనే సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శ్రీనివాస్‌చారి, వేణుగోపాల్‌రెడ్డి, లింగేశ్, వెంకట్‌రెడ్డి, శివానంద్, వెంకట్రాంరెడ్డి, శాంతు, సంగమేశ్వర్ ఉన్నారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన మీడియా బృందం -
ప్రదక్షిణలు.. పడిగాపులు
దోమ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ రైతులందరికీ పూర్తిస్థాయిలో ఎప్పుడు అమలవుతుందోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సంపూర్ణంగా రుణమాఫీ కాలేదు. దీంతో నిత్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వారు మొత్తం చెల్లిస్తే మిగతావి మాఫీ చేస్తామని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు అప్పులు తెచ్చి మరీ బ్యాంకుల్లో రుణాలు చెల్లించారు. అయితే ఇప్పటివరకు రూ.2లక్షల మాఫీ సొమ్ము సర్కారు నుంచి విడుదల కాలేదు. తప్పని ఎదురుచూపులు మండలంలో పీఏసీఎస్ సొసైటీలో 1,598 మంది రైతులు ఉండగా రూ.8.94 లక్షల రుణాలను అధికారులు అందజేశారు. అందులో 1,099 మంది రైతులకు ఇప్పటివరకు రూ.6.12 లక్షలు మాఫీ అయ్యాయి. కాగా మిగతా 499 మంది రైతులకు రూ.2.82 లక్షలు నేటికి రుణమాఫీ కాలేదు. దీంతో నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అధికారులతో రుణమాఫీ గురించి పలుమార్లు ఆరా తీసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. మాఫీ కాని రైతుల ఆగ్రహం నాలుగో విడత రుణమాఫీకి సంబంధించి అంతా గోప్యత పాటిస్తుండడంతో రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై ఏ అధికారిని అడిగినా తమకు తెలియదంటూ దాట వేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అట్టహాసంగా ఏడాది ప్రజాపాలన ఉత్సవాల్లో ప్రకటించి ఇప్పుడు ప్రజాప్రతినిధులు సైతం నోరు మెదపకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జాబితా ప్రకారం రుణమాఫీ డబ్బులు విడుదల చేయాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇంకా సాంకేతిక సమస్యలతో రూ.రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులంతా మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. వారందరిలో రుణమాఫీ జరుగుతుందో? లేదోనని ఆందోళన నెలకొంది. ఆందోళన చెందొద్దు రుణమాఫీ కానీ రైతులు కార్యాలయానికి వచ్చి అడుగుతున్నారు. ప్రస్తుతం జాబితాను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాగానే అర్హులకు రుణమాఫీ వర్తించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఆందోళన చెందొద్దు. – ప్రభాకర్‌రావు, వ్యవసాయఅధికారి, దోమ నిత్యం తిరుగుతున్నా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా నేటికీ రుణమాఫీ కాలేదు. నాకు నాలుగు ఎకరాల భూమి ఉండగా, అందు లో పీఏసీఎస్ సొసైటీలో గతంలో రూ.లక్ష రుణం తీసుకున్నా. ఇప్పటివరకు ప్రభుత్వం రుణమాఫీ చేయ లేదు. నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా. – పెద్దమల్లయ్య, రైతు, కొత్తపల్లి ప్రభుత్వం నుంచి లిస్టు రాగానే.. పీఏసీఎస్‌లో 1,598 మంది రైతులు ఉండగా, అందులో 499 మందికి రుణమాఫీ కాలేదు. వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. పలువురు కార్యాల యం చుట్టూ నిత్యం చక్కర్లు కొడుతున్నారు. ప్రభుత్వం నుంచి లిస్టు రాగానే పరిశీలించి మాఫీ చేస్తాం. – యాదగిరి, సీఈఓ, పీఏసీఎస్, మోత్కూర్ పూర్తి రుణమాఫీ అమలయ్యేదెన్నడో? మోత్కూర్ పీఏసీఎస్‌లో 499 మంది రైతులకు మొండిచేయి అయోమయంలో అన్నదాతలు పట్టించుకోని అధికార యంత్రాంగం -
రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి
తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు రూరల్: రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం తాండూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ధరణి సమస్యలు పెండింగ్‌లో ఉంచరాదని అన్నారు. మహబూబ్‌నగర్ – చించోళి నేషనల్ హైవే పనుల్లో భాగంగా పాత తాండూరు మీదగా నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుకు సంబంధించి రైతుల పరిహారం వెంటనే చెల్లించాలన్నారు. రోజువారి భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కెతావత్ తారాసింగ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
బాబోయ్ ఎండలు!
● జిల్లాలో ప్రచండ భానుడి భగభగలు ● 19 మండలాల్లో ఎల్లో అలర్ట్ ● గరిష్ట ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలుగా నమోదు ● ఉదయం 11 గంటల నుంచే వడగాల్పులు బషీరాబాద్: జిల్లాలో ప్రచండ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 10 గంటల నుంచే భానుడు భగభగ మండుతున్నాడు. వారం రోజులుగా 38 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు సోమవారం జిల్లాలోని మర్పల్లి, బంట్వారం మండలాల్లో 39.8 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దోమలో కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా రికార్డయ్యింది. ఈ సీజన్లో మొదటి సారి జిల్లాలోని 19 మండలాల్లోని 29 ప్రాంతాల్లో 35 నుంచి 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా వాతావరణ శాఖ అధికారి అశోక్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉదయం 11 గంటలకే వడగాలులు ప్రారంభం కావడంతో జనం రోడ్లమీదకు రావడానికే భయపడుతున్నారు. మరోవైపు ఎండల తీవ్రతకు జనం శీతల పానీయాలకు ఎగబడుతున్నారు. పుచ్చకాయలకు గిరాకీ పెరిగింది. ఉష్ణోగ్రతలు డిగ్రీలలో..ప్రాంతం గరిష్టం కనిష్టం మర్పల్లి 39.8 29.0 బంట్వారం 39.8 30.7 చౌడాపూర్ 39.3 29.9 వికారాబాద్ 39.0 26.1 యాలాల 38.6 26.5 తాండూరు 38.3 26.1 ధారూరు 38.1 29.3 పెద్దేముల్ 38.0 27.7 మోమిన్‌పేట 37.9 31.8 పూడూరు 37.8 30.6 బషీరాబాద్ 37.8 24.8 దౌల్తాబాద్ 37.3 29.8 కోట్‌పల్లి 37.3 25.2 కుల్కచర్ల 37.1 29.6 కొడంగల్ 37.1 21.8 నవాబుపేట 36.9 28.5 బొంరాస్‌పేట 36.6 24.6 దుద్యాల్ 36.5 22.1 పరిగి 36.4 29.2 దోమ 35.4 27.0 -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాలు ● పరీక్షలు రాయనున్న 16,439 మంది విద్యార్థులు తాండూరు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు ము మ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 5నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 82 ప్రభు త్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు.. 16,439 మంది విద్యార్థులు ఉన్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో 29 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు 10 మంది కస్టోడియన్లు, రెండు ఫ్లయింగ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, 29మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 29మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 12 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 800మంది ఇన్విజిలేటర్లను నియ మించారు. ఫస్ట్ ఇయర్లో 7,914మంది విద్యార్థు లు ఉండగా అందులో 6,418మంది జనరల్ కేటగిరి, 1,496మంది ఒకేషనల్ విభాగంలో పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 8,525 మంది విద్యార్థులున్నారు. జనరల్ విభాగంలో 5,589 మంది, ప్రైవేటు విభాగంలో 1,562 మంది, ఒకేషనల్ విభాగంలో 1,374 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు రావడానికి ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్, మరు గుదొడ్ల సౌకర్యం కల్పించనున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. నిమిషం విధానం రద్దు గతంలో పరీక్ష కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించేవారు కాదు. ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అయితే 15 నిమిషాల ముందు వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆన్లైన్లో హాల్‌టికెట్లు ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్థం అధికారులు ఆన్లైన్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ఫీజు ల కోసం హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పె డుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మీ సేవ కేంద్రాల్లో కూడా హాల్ టికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేశాం ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ప్రభుత్వం ఒక్క నిమిషం ఆలస్యం విధానాన్ని రద్దు చేసింది. పరీక్షకు 15 నిమిషాల ముందు వచ్చినా కేంద్రంలోకి అనుమతిస్తారు. – శంకర్‌నాయక్, ఇంటర్ జిల్లా నోడల్ ఆఫీసర్ -
భార్యను తీసుకురావడానికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో భర్త మృతి ● పెద్దేముల్ మండలంలో ఘటన తాండూరు రూరల్: పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకురావడానికి వెళ్లిన భర్త రో డ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈఘటన సోమవారం మండలంలోని బాయి మీదితండాలో చోటుచేసుకుంది. పెద్దేము ల్ ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. బాయిమీది తండాకు చెందిన శివరాం పవార్, చాందీబాయి దంపతుల కుమారుడు జైసింగ్ పవార్(22).కొన్నేళ్ల క్రితం శివారం పవర్ మృతి చెందాడు. ఏడాది క్రితం జైసింగ్ పవార్‌కు పాషాపూర్ తండాకు చెందిన అనితతో వివాహ జరిగింది. గత నెల అనిత పాషాపూర్‌లో గుడిపూజ ఉన్నందున పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకరావడానికి జైసింగ్ పవార్ బైక్‌పై పాషాపూర్‌కు బయలుదేరాడు.ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అడికిచెర్ల – పాషాపూర్ మధ్య గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో జైసింగ్ పవార్ మృతి చెందాడు. తల్లి చాందీభాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జైసింగ్ పవార్ మృతితో బాయిమీ ది తండా, పాషాపూర్ గ్రామాల్లో విషాదం నెలకొంది. -
బైపాస్‌పై భద్రతేదీ..!
ప్రమాదకరంగా చెంగోల్ రోడ్డు ● ప్రాణాలు గాల్లో కలుస్తున్నాపట్టించుకోని అధికారులు ● వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్తాండూరు రూరల్: బైపాస్ రోడ్డుపై భద్రత కరువైంది. ఈ రోడ్డు పనులు చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్నాయి. నిత్యం ఈ మార్గంలో నాపరాయి రవాణా చేసే లారీలు పెద్ద సంఖ్యలో వెళ్తుంటాయి. కొంత మంది డ్రైవర్లు మద్యం తాగి వాహనాలను అతి వేగంగా నడపడం, వేగ నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వ్యాపార కేంద్రంగా.. తాండూరు మండలం వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ మండలంలో నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్లు, సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. నిత్యం వివిధ ప్రాంతాలకు లారీల్లో నాపరాయి బండలు, సిమెంట్ బస్తాలను తరలిస్తుంటారు. గౌతాపూర్ నుంచి తాండూరు పట్టణంలోకి భారీ వాహనాలు వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి 2016లో అప్పటి ప్రభుత్వం రూ.78 కోట్లు మంజూ రు చేసింది. తాండూరు, యాలాల మండలాలను కలుపుకొని బైపాస్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించా రు. గౌతాపూర్ సమీపంలో కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ వెనుక నుంచి చెంగోల్ శివారు, భూకై లాస్ తండా, అంతారం, బషీర్మియా తండా నుంచి ఖాంజాపూ ర్ గేటు వద్ద తాండూరు– హైదరాబాద్ రోడ్డుకు బైపాస్ రోడ్డు అనుసంధానం అవుతుంది. అలాగే యాలాల మండలం కోకట్ శివారు నుంచి తాండూరు– కొడంగల్ రోడ్డు మార్గంలోని శ్రీనివాస రైస్ మిల్లు వద్ద బైపాస్ రోడ్డు అనుసంధానంగా నిర్మించారు. దీంతో భారీ వాహనాలు పట్టణం లోపల నుంచి కాకుండా బైపాస్ మీదుగా వెళ్లాయి. ప్రస్తు తం రోడ్డు విస్తరణ పనులు 70శాతం పూర్తయ్యా యి.అయితే కొంత మంది రైతులకు భూ పరిహారం చెల్లించక పోవడంతో అక్కడక్కడ పనులు అ సంపూర్తిగా మిగిలిపోయాయి.ప్రస్తుతం ఈ మార్గంలో కేవలం నాపరాతి లారీలు మాత్రమే వెళ్తున్నాయి. చెంగోల్ మార్గం ప్రమాదం బైపాస్ రోడ్డులోని చెంగోల్ రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ గ్రామం మీదుగా నిత్యం ప్రజలు తాండూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. నాపరాయి, ఎర్రమట్టి లారీలు అతివేగంగా వెళ్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే చౌరస్తా వద్ద తండ్రీకొడుకులను లారీ ఢీకొనడంతో వారు మృతి చెందిన విషయం తెలిసిందే. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి చెంగోల్ చౌరస్తా, భూకై లాస్ తండా, అంతారం శివారు మీదుగా తాండూరు – సంగారెడ్డి ప్రధాన చౌరస్తా ఉంది. ఇక్కడ వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. చెంగోల్ – గౌతాపూర్ మార్గంలో సీసీ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే బైపాస్ వద్ద అటు ఇటు బారికేడ్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేయాలి ఓగిపూర్, కరన్‌కోట్, మల్కాపూర్, కోటబాసుపల్లి తోపాటు కర్ణాటక రాష్ట్రంలోని మిర్యాణ్ నుంచి నిత్యం నాపరాతి లోడ్‌తో లారీలు తాండూరు పట్టణానికి వస్తుంటాయి. కొన్ని లారీలు మాత్రం చెంగోల్ బైపాస్ మీదగా వెళ్తుంటాయి. లారీ డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చెంగోల్ బైపాస్ రోడ్డుపొలానికి వెళ్లాలంటే.. చెంగోల్ – అంతారం తండా బైపాస్ రోడ్డు పక్కనే మా పొలం ఉంది. రోజూ పొలానికి వెళ్లాలి. నిత్యం పెద్ద సంఖ్యలో నాపరాతి లోడ్‌తో లారీలు బైపాస్ మీదగా వెళ్తుంటాయి. అతివేగంగా వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయమేస్తోంది. అధికారులు చొరవ తీసుకొని వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి. – మహబూబ్, రైతు, చెంగోల్ గ్రామం -
ప్రతీ వారం తిరగలేకపోతున్నాం
దుద్యాల్: గత ఏడాది నవంబర్ 11న దుద్యాల్ మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి ఘటనలో నిందితులుగా ఉన్న వారు ప్రతి సోమవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీసులు మాపై ఉన్న కేసులకు సంబంధించిన చార్జిషీట్‌ను కోర్టుకు అప్పగిస్తే వారం వారం డీఎస్పీ కార్యాలయానికి తిరిగే ఇబ్బందులు తప్పుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది వయస్సు పైబడిన వారు, మహిళలు ఉన్నారని.. కూలి పనులు చేసుకుంటే తప్ప జీవనం సాగించలేరని పేర్కొన్నారు. ప్రతి వారం డీఎస్పీ కార్యాలయానికి తిరగాలంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్నట్లు మహిళలు వాపోయారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాల ని బాధిత రైతులు కోరారు. డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన వారిలో ఏ–2 నిందితుడి సురేశ్ రాజ్, రాజునాయక్, యాదయ్య, బుగ్గప్ప, శివకుమార్ తోపాటు మరో 13 మంది ఉన్నారు. త్వరగా చార్జిషీట్ వేయండి అధికారులను కోరిన లగచర్ల ఘటన బాధితులు -
ఆలయ అభివృద్ధికి కృషి
● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరిగి: పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆల య అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే టీ రామ్మో హన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆల య కమిటీ చైర్మన్‌గా పార్థసారథి పంతులు, పాలకవర్గ సభ్యులుగా గోపాల్,సురేఖ,ఆలూరి నర్సింహు లు, పాండ్య బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వంఆలయ కమిటీ ఏర్పాటు చేయకుండా అడ్డుకుందని ఆరో పించారు. దేవాలయ అభివృద్ధిలో ప్రతి ఒక్క రూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని అతి పురాతన కిష్టమ్మగుళ్ల దేవాలయాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. కుల్కచర్ల మండలం పాంబండ ఆలయాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ది రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చే లా అభివృద్ధి చేస్తామన్నారు.శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 9,10,11వ తేదీల్లో నిర్వహించనున్నట్లు వివరించా రు.ప్రతి ఒక్కరూ ముందుండి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. పరిగి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ట్రిపుల్ఆర్ పరిగి నియోజకవర్గం మీదుగా వెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేశారన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే వాటి పరిష్కారాని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పార్టీ ప్ర ధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ అయూబ్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, దోమ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మండి హోటళ్లలో తనిఖీలు
పహాడీషరీఫ్: జల్పల్లి మున్సిపాలిటీ పరిధి ఎర్రకుంటలోని మండి హోటళ్లలో కమిషనర్ వెంకట్రామ్ సోమవారం తనిఖీలు చేపట్టారు. బాలాపూర్ ఎస్ఐ షేక్ యూసుఫ్ జానీతో కలిసి ఆయన అల్–సవూద్ బైతల్ మండి, అబూద్ మండి హోటళ్లలో కిచెన్ రూమ్‌లో పరిశీలించగా అపరిశుభ్రమైన వాతావరణం కనిపించాయి. ఈ రెండింటిలో ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన చికెన్, మటన్, చేపలను చూసి కమిషనర్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి హెచ్చరిక చేస్తున్నామని, మరోసారి తనిఖీ చేపడుతామని, పరిస్థితిలో మార్పు లేకుండా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కొందరు హోటల్ నిర్వాహకులు వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకొని, నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదన్నారు. ముఖ్యంగా ప్రతి హోటల్ నిర్వాహకుడు శుచి శుభ్రత పాటించడంతో పాటు వ్యర్థ నీటిని రోడ్లపై విడవరాదని సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ జ్యోతి, పర్యావరణ అధికారి ఎం.శ్రీను, బిల్ కలెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఫ్రిజ్‌లలో మాంసం నిల్వలపై అధికారుల ఆగ్రహం -
యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా పెంటయ్య
దుద్యాల్: యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా దుద్యాల్ మండలం పోలేపల్లికి చెందిన పుర్ర పెంటయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు నియామక పత్రం అందజేశారు. అనంతరం పుర్ర పెంటయ్య మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్ర నాయకులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా యాదవులహక్కుల కోసం పోరాడుతానని అన్నారు. కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ మాజీ కార్పొరేటర్ జంగయ్య యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్, నాయకులు మల్లేశ్, వీరేందర్, అంజి తదితరులు పాల్గొన్నారు. దోర్నాల్లో వ్యవసాయ కళాశాల విద్యార్థుల పర్యటన ధారూరు: మండలంలోని దోర్నాల్ గ్రామంలో సోమవారం పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్, శాస్త్రవేత్త యమున, ఏఈఓ సంజూరాథోడ్ గ్రామంలో వ్యవసాయ కళాశాల విద్యార్థుతులతో కలిసి భాగస్వామ్య విశ్లేషణాత్మక కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వనరులు, నేల రకాలు, వాటి స్వభావం, పండించాల్సిన పంటల గురించి వారు రైతులకు సలహాలు ఇచ్చారు. పంటల సాగు విధానం, పాటిస్తున్న మెళకువల గురించి వారు రైతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు గ్రామంలోని రైతు కుటుంబాలను సర్వే చేసిన అనంతరం సామాజిక చిత్రపటాన్ని వేసి రైతులకు విపులంగా వివరించారు. ‘మోడల్’లో ప్రవేశాలకు గడువు పొడిగింపు కుల్కచర్ల: మండలంలోని ముజాహిద్పూర్ మోడల్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్లో ప్రవేశాలకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు మోడల్ స్కూల్ వెబ్ సైట్నుసందర్శించాలన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు జిల్లా గ్రంథాలయ శాఖ కార్యదర్శి సురేష్ కుల్కచర్ల: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ శాఖ కార్యదర్శి సురేష్ అన్నారు. సోమవారం చౌడాపూర్ మండల కేంద్రంలో గ్రంథాలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్‌కుమార్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని దుద్యాల్, చౌడాపూర్ మండలకేంద్రాల్లో నూతన గ్రంథాలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు రావడం జరిగిందని.. ఇందులో భాగంగా స్థల పరిశీలన చేశామన్నారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు గ్రంథా లయాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో చౌడాపూర్ పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, నాయకులు మాసయ్య, రాము, శరత్‌కుమార్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ
ఇబ్రహీంపట్నం రూరల్: స్వర్ణ భారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో మగ్గం వర్క్‌పై మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ డైరెక్టర్ జీఎస్ఆర్ కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణ భారత్ ట్రస్ట్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సహకారంతో శంషాబాద్‌లో మార్చి 4నుంచి 30 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తామని పేర్కొన్నారు. 19నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డుతోపాటు మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన గ్రామీణ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 7893121143, 9391487797, 9177141712 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
దైవ చింతనతో మానసిక ప్రశాంతత
కేశంపేట: దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే షాద్‌నగర్ వీర్లపల్లి శంకర్ అన్నారు. మండల పరిఽధిలోని కాకునూర్ మహాలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడాతూ.. గ్రామీణ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు ఇలాంటి పోటీలు అద్దం పడుతాయని తెలిపారు. ఆలయానికి త్వరలోనే రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోటీల్లో తెలంగాణతో పాటు అంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పోటీదారులు తలపడ్డారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూడ వీరేశ్, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు తాండ్ర విశాల, నాయకులు శ్రావణ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పల్లె అనంద్‌కుమార్, గిరియాదవ్, తైధ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాకునూర్‌లో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు -
ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించండి
మీర్‌పేట: తమకు ఈఎస్ఐ సౌకర్యంతో పాటు పీ ఎఫ్ అందేలా చొరవ తీసుకోవాలని మీర్‌పేట కార్పొరేషన్ వాటర్మెన్లు, ఎలక్ట్రీషియన్లు సోమ వారం మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లుగా పీఎఫ్ అందక ఇబ్బందులు పడుతున్నామని, ఈఎస్ఐ కార్డులు సైతం జారీ చేయడం లేదని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు ఐదేళ్లుగా యూనిఫారంలు, మున్సిపాలిటీ నుంచి రావాల్సిన సరుకులు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నా రని, ఎన్నోసార్లు వినతిపత్రాలు సమర్పించినా న్యాయం జరగడం లేదని మొర పెట్టుకున్నారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ పది రోజుల్లోగా సిబ్బంది సమ ్డస్యలను పరిష్కరించాలని కమిషనర్ జ్ఞానేశ్వర్‌ను ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది లాగే వా టర్మెన్లు, ఎలక్ట్రీషియన్లకు అన్ని సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. సిబ్బంది సురేందర్‌యాదవ్, యాదగిరి, భిక్షపతి, జంగ య్య, దశరథ, రమేశ్‌రెడ్డి, వెంకటేశ్, మాజీ కార్పొ రేటర్ అనిల్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సబితారెడ్డికి విన్నవించిన మీర్‌పేట కార్పొరేషన్ సిబ్బంది -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మాడ్గుల: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాడ్గుల సీఐ వేణుగోపాల్ రావు తెలిపారు. సోమవారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా అందుగుల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్లు, యాజమనులపై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. 9 కిలోల గంజాయి పట్టివేత ఇద్దరి నిందితుల అరెస్టు చేవెళ్ల: గంజాయి రవాణా చేస్తున్న ముఠాను చేవెళ్ల పోలీసులు చాకచక్యంగా అదుపులోని తీసుకున్నారు. చేవెళ్ల సీఐ భూపాల్‌శ్రీధర్, డిటెక్టివ్ సీఐ సీహెచ్ ఉపేందర్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేసారం గ్రామ సమీపంలో బైపాస్ రోడ్డు పక్కన నలుగురు అనుమానిత వ్యక్తులు ఆదివారం రాత్రి ఓ వ్యాగనర్ కారు, స్కూటీపై ఆగి ఉండటం కనిపించారు. అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఎస్ఐ వనం శిరీష టీమ్‌తో వారి వద్దకు వెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించటంతో వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. వాహనాలను తనిఖీ చేయగా రెండు బ్యాగులలో 9 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమైంది. దీంతో వారికి అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు ఏపీలోని రాజమండ్రికి చెందిన గోబెరు వెంకట చైతన్య అలియాస్ షేక్ రిజ్వాన్‌గా గుర్తించారు. మరో వ్యక్తి కూరెళ్ల సాయిఅరుణ్ నగరంలోని ఉప్పల్‌లో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పారిపోయిన నిందితులు సూర్యాపేటకు చెందిన షేక్ అబ్బాస్, గణేశ్‌లుగా గుర్తించినట్లు విచారణలో చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులకు గాయాలు కేశంపేట: బైక్ పైన వెళ్తున్న తండ్రీకొడుకులను బొలెరో వాహనం ఢీకొన్న సంఘటన మండల పరిధిలోని ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... అల్వాల గ్రామ పరిధిలోని తులవానిగడ్డకు చెందిన రంగయ్య, తన కుమారుడు ఉజ్వల్‌తో ఆదివారం ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి హెర్ కటింగ్ కోసం వెళ్లాడు. తిరిగి వస్తుండగా బీఎస్ఆర్ పెట్రోల్ పంపు దగ్గర బొలెరో వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం రంగయ్య పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు. క్రీడల్లోనూ రాణించాలి ఓఎన్జీసీ అధికారి శంకర్‌నాయక్ కొత్తూర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో రాణించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అంతర్జాతీయ అథ్లెట్, ఓఎన్జీసీ అధికారి శంకర్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం యూత్ క్లబ్ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. క్రీడలపై అభిరుచి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంగూర్‌నాయక్, ఉపాధ్యాయులు రవికుమార్, రాజు, బాలప్రసాద్, పీఈటీ నవనీత తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో డీఈఈ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ క్వాలిటీకంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఎ.దశరథ్ ముదిరాజ్ ఫైల్స్ క్లియర్ చేయడానికి, వాటిని ఈఈకి పంపించేందుకు ఒక వ్యక్తిని రూ.20వేలు డిమాండ్ చేసి,తీసు కుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకొని నాంపల్లి ఏసీబీ కేసుల కోర్టులో హా జరు పరిచారు. అడ్వాన్స్‌గా అంతకు ముందే రూ. 10వేలు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. మద్యం మత్తులో పురుగు మందు తాగి వ్యక్తి మృతి కొందుర్గు: తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తంగెళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి రమేశ్(38) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు మందలించినా వినేవాడు కాదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పాడి పశువులకు పాలు తీయడానికి పొలానికి వెళ్లాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో అతడి తండ్రి చెన్నయ్య వెళ్లి చూసేసరికే పాక వద్దనే నురుగులు కక్కి అక్కడే పడి ఉన్నాడు. వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రమేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఫుట్‌పాత్ పైకి ఎక్కిన వాహనం లక్డీకాపూల్ : నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు డివైడర్‌ను ఢీ కొని ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. సోమవారం ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సెక్రటేరియేట్ వైపు వెళుతున్న ఓ కారు అతివేగం కారణంగా ఎన్టీఆర్ ఘాట్ మలుపు వద్ద అదుపు తప్పింది. కారు డివైడర్‌పైకి దూసుకెళ్లి కరెంట్ పోల్‌ను ఢీకొనడంతో పోల్ రోడ్డపై అడ్డంగా విరిగిపడింది. ఈ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంస మయ్యాయి. కాగా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం. ముసుగులు,సైకిల్ చైన్లతో బెదిరింపులు బంజారాహిల్స్: ముసుగులు ధరించి సైకిల్ చైన్లు ఊపుకుంటూ హోటలోకి ప్రవేశించిన ఆగంతకులు కస్టమర్లను బెదరింపులకు గురిచేస్తూ గదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన ఘటనలో నిందితులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌కు చెందిన సుజాహత్ హుస్సేన్ (38) 2015లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్–4లోని బగ్గా హోటల్స్‌ను లీజుకు తీసుకున్నాడు. 2030 వరకు ఈ లీజు గడువు ఉండగా బగ్గా హోటల్స్ యజమానులు సత్పాల్సింగ్ బగ్గా, బల్వీందర్ బగ్గా మధ్య అద్దె విషయంలో గొడవలు వచ్చాయి. ఈ విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 10 మంది ఆగంతకులు ముఖాలకు ముసుగులు ధరించి హో టల్లోకి ప్రవేశించి రిసెప్షనిస్ట్ సుభాన్‌ను బెదిరించి అక్కడి ను ంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. అలాగే కస్టమర్లు ఉన్న గదుల వద్దకు వెళ్లి సైకిల్ చైన్లు ఊపుకుంటూ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు గురిచేశారు. రిసెప్షనిస్ట్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న సుజాహత్ డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే ముసుగులు ధరించిన వ్యక్తులంతా అక్కడి నుంచి పరారయ్యారు. సత్ఫాల్సింగ్ బగ్గా, బల్వీందర్‌సింగ్ బగ్గా ఇద్ద రూ హోటల్లోకి రౌడీలను పంపించారని, భయభ్రాంతులకు గురిచేశారని, విధ్వంసం సృష్టించారని, మెటీరియల్ ధ్వంసం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్లక్ష్యానికి ప్రాణం బలి
మంచాల: ఓ వ్యక్తి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన నాగార్జునసాగర్– హైదరాబాద్ మార్గంలో సోమవారం ఆగాపల్లి వద్ద చోటుచేసుకుంది. మంచాల ఎస్ఐ సతీష్‌కుమార్ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరగండ్లపల్లికి చెందిన మైలారం జంగయ్య(27) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి నగరంలో నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో సోమవారం భార్య పార్వతమ్మ, కూతురు అశ్వితతో కలిసి స్వగ్రామం నుంచి బైక్‌పై హైదరాబాద్ వెళ్తున్నాడు. ఆగాపల్లి సమీపంలోని జేబీ వెంచర్ వద్దకు రాగానే నిర్లక్ష్యంగా కారు నడిపిన కోవూరి నర్సింగ్‌రావు ఎదురుగా వస్తున్న వీరి బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా పార్వతమ్మ, అశ్వితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన జంగయ్య ఆకస్మిక మృతితో బాధిత కుటుంబం రోడ్డున పడింది. బైక్‌ను ఢీకొట్టిన కారు అక్కడికక్కడే వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
పాత లేఔట్లలోనే కబ్జాల జోరు
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పాత లేఔట్లలోనే కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ ప్లాట్లతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, రహదారులను కబ్జా చేసేస్తున్నారంటూ ఆయా లేఔట్లకు చెందిన పలువురు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా) ఫిర్యాదు చేస్తున్నారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 49 ఫిర్యాదులు రాగా... అత్యధికం వీటికి సంబంధించినవే ఉన్నాయి. 1980–90 దశకాల్లో వేసిన లేఔట్లను మాయం చేసి, ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్న కబ్జారాయుళ్లు మళ్లీ విక్రయాలకు యత్నిస్తున్నారంటూ బాధితులు రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. భూములకు ధరలు అమాంతం పెరగడంతో గతంలో తమకు అమ్మిన వాళ్లే కబ్జాలకు పాల్పడుతున్నారని వాపోయారు. పంచాయతీ లేఔట్లను వ్యవసాయ భూములుగా మార్చేసి సాగు చేసుకుంటున్నారనీ హైడ్రాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. వీటిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ ఫిర్యాదుదారుల సమక్షంలోనే గూగుల్ మ్యాప్‌లు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను పరిశీలించారు. వాటిలో లభించిన సమాచారం ఆధారంగా సమగ్ర విచారణకు అధికారులను ఆదేశించారు. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ● రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలో 1980 దశకంలో 2684 ప్లాట్లతో చాణక్యపురి లేఔట్ వేశారు. గత ఏడాది అందులోని 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు పలువురు ఫిర్యాదు చేశారు. అందులోని పార్కులు, రహదారులు కూడా కనుమరుగయ్యాయని ఆరోపించారు. ● రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నం.58, 59లో ఉన్న ఎన్ఎంఆర్–దివ్యానగర్ లేఔట్లో తాము ప్లాట్లు కొన్నామని, ఇప్పుడవి కనిపించట్లేదని యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇలా 66 ప్లాట్లు గల్లంతయ్యాయని, ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేస్తున్నారని వాపోయారు. ● గచ్చిబౌలిలోని గోపన్నపల్లిలోని టీఎన్జీవో కాలనీలో ఉద్యోగులకు కేటాయించిన భూములు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ఎకరాలను కొందరు కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు. దీనిపై టీఎన్జీవో కాలనీ సంక్షేమ సంఘం (గచ్చిబౌలి) ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ● మేడ్చల్ జిల్లా చెంగిచర్ల గ్రామంలోని సర్వే నం.7, 10లో వేసిన శ్రీపురం కాలనీలో పా ర్కులు, రహదారులు కబ్జాకు గురయ్యాయని కా లనీ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. హైడ్రా ప్రజావాణిలో 49 ఫిర్యాదులు -
అనుమానమే.. పెనుభూతమై
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీలోని ఎంపీపటేల్‌గూడకు చెందిన పట్నం నరేశ్‌కి పన్నెండేళ్ల క్రితం ఉమాతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాఫీగా సాగుతున్న కాపురంలో అనుమానం పెనుభూతంగా మారింది. దీంతో భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతుండేవారు. ఐదు నెలల క్రితం నరేశ్(36) మద్యం తాగి భార్యను కొడుతున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమ్మగారింటికి వెళ్లిపోవడంతో రెండు నెలల క్రితం పెద్దలు ఒప్పించి కాపురం చేయించారు. ఆదివారం రాత్రి 10 గంటలకు మళ్లీ భార్యాభర్తలు గొడవ పడడంతో 100 ఫోన్ చేశారు. పోలీసులు ఇంటికి చేరుకొని నచ్చజెప్పి గొడవ లేకుండా ఉండాలని సముదాయించారు. భార్య ఇద్దరు పిల్లలను పడక గదిలోంచి బయటకు పంపించి నరేశ్ తలుపు వేసుకున్నాడు. సోమ వారం ఉదయం గది నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో భార్యకు అనుమానం వచ్చి డోర్ కొట్టడంతో తలుపు తీయలేదు. దీంతో పక్కింటివారు తలుపు పగలగొట్టి చూడగా నరేశ్ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతుంది. దీంతో భార్య ఉమా బోరున విలపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాల్‌రాజ్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
గచ్చిబౌలి: ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిరువురు గత ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్‌హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది. ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వర కట్నం కోసం శరత్చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.