Warangal
-
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
ఆత్మకూరు: మండలంలోని గుడెప్పాడ్ గ్రామంలో గల సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం దొంగలు హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా.. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులిద్దరినీ మంగళవారం అరెస్ట్ చేశారు. హసన్‌పర్తి మండలం ముచ్చెర్ల గ్రామానికి చెందిన ఖాజా పాషా, మహమ్మద్ అంజద్ ఇద్దరు కలిసి (ఏపీ 36 ఏకే 2352) మోటారు సైకిల్‌పై వచ్చి హుండీని పగులగొట్టి అందులోని రూ.6 వేలు దొంగలించినట్లు సమాచారం మేరకు ముచ్చర్ల గ్రామానికి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైక్, హుండీ పగులగొట్టడానికి ఉపయోగించిన పనిముట్లు, చోరీ చేసిన నగదు రికవరీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ సంతోశ్ తెలిపారు. -
పూడిక మట్టి వేగంగా తరలించండి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపు ప్రక్రియ వేగంగా జరగాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం భద్రకాళి చెరువు పూడికతీత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్వినితానాజీ వాకడేతో కలిసి పరిశీలించారు. మట్టి తరలింపు కోసంవేస్తున్న ఫార్మేషన్ రోడ్టు పనులు, వాహనాల కూపన్లను పరిశీలించారు. పూడికతీత మట్టిని ఎంత తరలించారనే వివరాలను నీటి పారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ పూడికతీత మట్టిని బుధవారం నుంచి ప్రారంభించాలని, పనులు జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్‌లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. మట్టి తరలింపు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పనులు సజావుగా సాగేలా అధికారులు సమస్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సాగు నీటి పారుదలశాఖ ఈఈ శంకర్, డీఈ హర్షవర్ధన్, ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద భద్రకాళి చెరువు పూడికతీత పనుల పురోగతి పరిశీలన -
ఎస్సైకి గ్రూప్–1 ఉద్యోగం
హసన్‌పర్తి: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మాధవ్‌గౌడ్ గ్రూప్–1కు ఎంపికయ్యారు. ఇటు ఎస్సైగా విధులు నిర్వహిస్తూనే.. అటు గ్రూప్స్‌కు సిద్ధమయ్యారు. సోమవారం విడుదలైన గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో మాధవ్‌గౌడ్ 505 మార్కులు సాధించారు. మెరిట్ మేరకు ఆయనకు డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మాధవ్‌గౌడ్ స్వస్థలం కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్పూర్. తండ్రి మొగిలి పోస్టల్ ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. 2019 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆయన వరంగల్ కమిషనరేట్ పరిధి జఫర్గడ్తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు. ఇటీవల బదిలీపై కేయూ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ప్రస్తుతం భీమారంలోని సత్యసాయికాలనీ–5లో భార్యాపిల్లలతో ఉంటున్నారు. -
దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి..
హన్మకొండ చౌరస్తా: ‘పదేళ్లలో మీరు చేయలేని అభివృద్ధిని ఏడాదిలో మా ప్రభుత్వం చేసింది.. ఉట్టి మాటలు కాదు.. దమ్ముంటే వరంగల్ అభివృద్ధిపై చర్చకు రావాలి’ అని మాజీ మంత్రి హరీశ్‌రావుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులపై ఆయన మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలు హరీశ్‌రావుకు కనిపించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువులాంటి వరంగల్‌ను పదేళ్ల పాలనలో విస్మరించింది బీఆర్ఎస్ సర్కార్ కాదా? అని ప్రశ్నించారు. వరంగల్‌ను ఆరు ముక్కలుగా చేసి అస్తవ్యస్తం చేశారన్నారు. పదేళ్లలో ఒక్క ఇల్లు ఇవ్వలేని వీళ్లు.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడేందుకు సిగ్గుండాలన్నారు. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సభ పేరుతో జిల్లాలో అడుగుపెడుతున్నారని ప్రశ్నించారు. కబ్జాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని హెచ్చరించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, మాస్టర్‌ప్లాన్ వంటి అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని అడిగేందుకు 15 ప్రశ్నలసు సిద్ధం చేశానని, ఆ ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఎవరు సమాధానం చెప్పినా ఫర్వాలేదన్నారు. సమావేశంలో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, టీపీసీ సభ్యుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా ప్రెసిడెంట్ పెరుమాండ్ల రామకృష్ణ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. హరీశ్‌రావుకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సవాల్ -
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
ఆత్మకూరు: వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా.. మార్చి 31లోపు 30 ఏళ్లకుపైబడిన వారందరికీ స్క్రీనింగ్ చేయాలన్నారు. మహిళలకు ఆరోగ్య మహిళా క్లినిక్‌లో అందిస్తున్న ఎనిమిది రకాల సేవలపై అవగాహన కల్పించాలన్నారు. ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌లో 3744 బీపీ, 2266 డయాబెటిస్,16 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, వీరందరికీ ఫాలో అప్ సేవలు మెరుగ్గా అందించాలన్నారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి చైతన్య, కమ్యునిటీ హెల్త్ అధికారి జునేది సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని వైద్యాధికారులు, ఏఎన్ఎంలతో ఎన్సీడీ స్క్రీనింగ్‌పై జూమ్ సమావేశం నిర్వహించారు. మార్చి 31లోగా వందశాతం పూర్తి చేయాలన్నారు. హనుమకొండ జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారికి ఈనెల 31లోగా రీ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
మామిడి చెట్ల నరికివేత
కమలాపూర్: మండల కేంద్రానికి చెందిన రైతు బండి సారయ్య పొలం గట్ల వెంట నాటుకున్న సుమారు 31 మామిడి మొక్కలను గుర్తు తెలయిన వ్యక్తులు నరికేశారు. బాధిత రైతు బండి సారయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం ఒక్కో చెట్టుకు రూ.500 వెచ్చించి సుమారు 55 మామిడి మొక్కలు కొన్నాడు. కమలాపూర్ సమ్మక్క గుట్ట సమీపంలో తనకున్న వ్యవసాయ పొలం గట్ల వెంట వాటిని నాటాడు. మూడేళ్లుగా వాటికి నీరుపడుతూ పెంచుకుంటుండగా.. మరో రెండేళ్లయితే అవి కాతకొచ్చే దశకు చేరుకుంటాయి. ఈక్రమంలో సుమారు 31 మామిడి మొక్కలను ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు మొదళ్ల వద్ద నరికేశారు. ప్రాణప్రదంగా పెంచుకుంటున్న మామిడి చెట్ల నరికివేతతో తనకు సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, చెట్లను నరికేసిన దుండగుల్ని గుర్తించి వారిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని బాధిత రైతు సారయ్య వేడుకుంటున్నాడు. -
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuముల్కలపల్లి యువకుడు ఉపేందర్.. డోర్నకల్: గ్రూప్–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబర్చారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్‌ను గ్రామస్తులు అభినందించారు. కొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షల్లో రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు. – సాక్షి నెట్వర్క్ గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్ గ్రూప్–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్ వైస్ ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్ తెలిపారు. గతంలో గ్రూప్–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్‌ను మాజీ సర్పంచ్ అరుణమంగీలాల్‌నాయక్, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్‌రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు. మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని డోలి వెంకటేశ్వర్లు–పద్మ దంపతుల కుమార్తె డోలి సంధ్య గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 205 ర్యాంకు సాధించారు. 600 మార్కులకు 382.4 మార్కులు వచ్చాయి. అత్యధిక మార్కులు సాధించడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు. కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు. ఈసందర్భంగా ప్రణీత్‌కు స్థానిక పద్మశాలి సంఘం నాయకులతోపాటు మిత్రులు అభినందనలు తెలిపారు. భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి కాసీంపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో పనిచేశారు. అదే సంవత్సరంలో గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబర్చి హైదరాబాద్‌లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అదేశాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్లో జరిగిన గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. రేగొండ: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మూలగుండ్ల భాగ్యమ్మ, సాంబరెడ్డి కుమారుడు ఉపేందర్ రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభావంతుడు. గ్రూప్–2లో రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంకు సాధించాడు. ఉపేందర్ ప్రస్తుతం పలిమెల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ పంచాయతీ కార్యదర్శిగా నాలుగేళ్లపాటు సేవలందించాడు. ప్రస్తుతం గ్రూప్–2లో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులతోపాటు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. చిమ్ముల అరుణ– మల్లారెడ్డి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. కుమారుడు చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాఽధించి రాష్ట్రస్థాయిలో 8 వ ర్యాంకు సాధించాడు. గతంలో రాజశేఖర్‌రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు కూడా ఎంపికయ్యాడు. మహబూబాబాద్ రూరల్ : ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కూటికంటి శివ గ్రూప్ –2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 25వ ర్యాంకు సాధించారు. 2020 బ్యాచ్ ఎస్సైగా ఉద్యోగం సాధించిన శివ 2022 జనవరి నుంచి మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం మహబూబాబాద్ టౌన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. గిరిజన ఆణిముత్యం శ్రీకాంత్ న్యూస్రీల్మెరిసిన సంధ్యగ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ పలువురికి మెరుగైన ర్యాంకులు ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు ప్రణీత్ ప్రతిభ..రాజశేఖర్‌రెడ్డికి 8వ ర్యాంకురాణించిన రైతు బిడ్డకాసీంపల్లి వాసిఎస్సై శివకు 25వ ర్యాంకు -
పులకించిన కొండపర్తి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలో దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఆయన కూడా ఆదివాసీలతో మేమకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీల నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతోపాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్‌ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్‌దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కొండపర్తిని దత్తత తీసుకోవడం గొప్ప విషయం: మంత్రి సీతక్క దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆ గ్రామాన్ని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అనుసంధానం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అందించడం ద్వారా మహిళలు వ్యాపారవేతలుగా ఎదగాలన్నారు. 40 కంపెనీలు ‘దిశ’ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని వంద పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి : దాన కిశోర్, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి కొండపర్తిని అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ అన్నా రు. ప్రతీ కుటుంబానికి ఆదాయం చేకూరేలా ఐకమత్యంతో ముందుకుసాగాలని సూచించారు. మిర్చి, పసుపు, మసాలా యూనిట్లకు మార్కెటింగ్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా సౌకర్యం కల్పిస్తామన్నారు. అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు కొండపర్తికి వచ్చిన గవర్నర్ మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్ల మొక్కుగా సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత పాల్గొన్నారు.ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు గ్రామస్తుల ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం పోలీసుల భద్రత నడుమ సాగిన పర్యటన -
నర్సంపేటలో భూవివాదం
నర్సంపేట: భూవివాదంలో ఇరువర్గాలు రాళ్లతో దా డి చేసుకున్న ఘటన మంగళవారం నర్సంపేటలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట మాదన్నపేట రోడ్డులోని 111 సర్వే నంబర్లో మా జీ మిలిటరీ అధికారికి భూమి ఉంది. అందులోని నాలుగు ఎకరాల భూమిని బీఆర్ఎస్ నాయకుడు, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామితో పాటు అతడి స్నేహితులు కొనుగోలు చేశారు. అగ్రి మెంట్ ప్రకారం అనుకున్న సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో యజమాని రామచంద్రమోహన్ తిరిగి పెండెం రామానంద్, ఓర్సు తిరుపతితోపాటు మరికొందరికి విక్రయించాడు. వారు ఆ స్థలంలో పనులు చేపట్టారు. దీంతో ఇరువర్గాలు కో ర్టును ఆశ్రయించాయి. కోర్టులో కేసు నడుస్తుండగా రామస్వామినాయక్ వాహనాల ద్వారా కొంత మందిని భూమి వద్దకు తరలించి ఘర్షణకు దిగాడు. ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. బాలకిషన్ అనే వ్యక్తి తలకు గాయం కాగా సీఐ రమణమూర్తి, ఎస్సై రవితోపాటు మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. వరంగల్ డీసీపీ అంకిత్కుమార్తోపాటు నర్సంపే ట ఆర్డీఓ ఉమాదేవి సంఘటనా స్థలానికి చేరుకొని భూమి పత్రాలను తీసుకురావాలని ఇరువర్గాలకు సూచించి సమస్య సద్దుమణిగింపజేశారు. ఓడీసీ ఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్‌కు ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదని, సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో పెండెం రామానంద్, ఓర్సు తిరుపతికి విక్రయించానని, ఈ భూమిపై వారికే హక్కు ఉందని యజమాని రామచంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, భూమి కొనుగోలు చేసిన ఇరువర్గాల వారు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావడం గమనార్హం. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన ట్లయ్యింది. రామస్వామిపై కేసు నమోదు ఉద్దేశపూర్వకంగా భూమి వద్దకు వచ్చి కొంత మందితో ఘర్షణకు దిగిన ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. రెవెన్యూ అధికారులు కూడా హక్కు పత్రాలు చూపించాలని ఆయనను అడిగారు. – రమణమూర్తి, సీఐ ఇరువర్గాల రాళ్ల దాడితో ఉద్రిక్తత పలువురికి గాయాలు.. పోలీసుల లాఠీచార్జ్ -
ఆయకట్టుకు నీరందించేందుకు కృషి
పర్వతగిరి: మండల కేంద్రంలోని రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు నీరందించేందుకు కృషిచేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఎమ్మెల్యే మంగళవారం అధికారులతో కలిసి రిజర్వాయర్‌ను సందర్శించారు. పంట పొలాలకు నీరందించకుండా జాప్యం చేస్తున్న అధికారులను మందలించారు. సంబంధిత ఉన్నతాధికారులు, కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి నీళ్లందించేలా కృషి చేయాలని కోరారు. టీపీసీసీ లీగల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్‌రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు -
మూల్యాంకన కేంద్రం పరిశీలన
కాళోజీ సెంటర్: వరంగల్ ఎల్బీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ మూల్యాంకన కేంద్రాన్ని ఇంటర్ బోర్డు అధికారులు మంగళవారం సందర్శించారు. ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రంలో ఏర్పాట్లు, స్ట్రాంగ్‌రూంలు తదితర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్యాంపు అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాతోపాటు మహబూబాబాద్, ములుగు జిల్లాల మూల్యాంకన సిబ్బందికి శిక్షణ ఇచ్చి సోమవారం స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించినట్లు వివరించారు. ఎన్హెచ్ఆర్సీ జిల్లా చైర్మన్‌గా అశోక్గీసుకొండ: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) జిల్లా చైర్మన్‌గా గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన గంగుల అశోక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ కమిటీ స్టేట్ చైర్మన్ బద్దిపడిగ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు పాటుపడతానని అన్నారు. తనపై నమ్మకంతో నియమించిన స్టేట్ చైర్మన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 298 మంది గైర్హాజరుకాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా మంగళవారం 26 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. 5,836 మంది జనరల్ విద్యార్థులకు 5,611 మంది, 910 మంది ఒకేషనల్ విద్యార్థులకు 837 మంది హాజరైనట్లు డీఐఈఓ శ్రీధర్‌సుమన్ తెలిపారు. మొత్తం 298 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. పాకాలను సందర్శించిన ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్యఖానాపురం: మండలంలోని పాకాల సరస్సును ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాకాల కట్ట, తూములను పరిశీలించారు. పాకాల నీటి సామర్థ్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాకాల సరస్సు నీటిని ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాల సాగు, తాగునీటి అవసరాలకు తరలించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఇక కోతుల బెడద లేనట్టే!సంగెం: మండలంలోని కాపులకనిపర్తి గ్రామంలో ఇక వానరాల బెడద తప్పినట్లేనని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కోతులు ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవి. దీంతో వాటిని పట్టించి అడవిలో వదిలేయాలని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి గోపాల్‌రావు తన సొంత నిధులు వెచ్చించి గ్రామంలోని 170 వానరాలను పట్టించి అడవిలో వదిలివేయించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గోపాల్‌రావు, సహకరించిన రైస్ మిల్లు యజమానులకు గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీఓ కొమురయ్య కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు రశీదులు ఇవ్వాలిరాయపర్తి: పురుగు మందులను కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వలని జిల్లా వ్యవసాయాధికారి కె.అనురాధ సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో పురుగు మందుల డీలర్లకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుగు మందుల స్టాక్ వివరాలను వెంటవెంటనే ఆన్లైన్ చేసేలా డీలర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ లేకుండా ఈపాస్ మిషన్‌లో స్టాక్క్లియర్ చేసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభద్రం, ఏఈఓలు, డీలర్లు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గీసుకొండ: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వఽ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 15,16 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కొనాయమాకుల రైతువేదికలో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీఓ ఆడెపు ప్రభాకర్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి -
పంటలకు సమృద్ధిగా నీరందించాలి
రాయపర్తి: ఎస్సారెస్పీ డీబీఎం–54, 57 కాల్వల ద్వారా యాసంగి పంటలకు సమృద్ధిగా నీరందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్, ఊకల్, గట్టికల్, జగన్నాథపల్లి గ్రామాల్లో మంగళవారం అధికారులతో కలిసి పంటలకు సాగునీరందుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సందర్శించి నీటి నిల్వ సామర్థ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంట చేతికి వచ్చేవరకు నీరందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, ఇరిగేషన్ ఈఈ రమేశ్‌బాబు, డీఈ కిరణ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
వరంగల్
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం చలిగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండతోపాటు ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. జీనోమ్ ప్రాజెక్ట్‌తో వ్యాధుల గుర్తింపు జీనోమ్ ప్రాజెక్ట్‌తో మానవుడి వ్యాధులకు కారణమైన జన్యువులను గుర్తించవచ్చని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు.– 8లోuముల్కలపల్లి యువకుడు ఉపేందర్.. డోర్నకల్: గ్రూప్–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్‌ను గ్రామస్తులు అభినందించారు. కొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షల్లో రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు. – సాక్షి నెట్వర్క్ గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్ గ్రూప్–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్ వైస్ ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్ తెలిపారు. గతంలో గ్రూప్–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్‌ను మాజీ సర్పంచ్ అరుణమంగీలాల్‌నాయక్, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్‌రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు.మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని డోలి వెంకటేశ్వర్లు–పద్మ దంపతుల కుమార్తె డోలి సంధ్య గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 205 ర్యాంకు సాధించారు. 600 మార్కులకు 382.4 మార్కులు వచ్చాయి. అత్యధిక మార్కులు సాధించడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు.కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్షలో 380 మార్కులు సాధించగా.. గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా ప్రణీత్‌కు స్థానిక పద్మశాలి సంఘం నాయకులతోపాటు మిత్రులు అభినందనలు తెలిపారు.రేగొండ: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మూలగుండ్ల భాగ్యమ్మ, సాంబరెడ్డిల కుమారుడు ఉపేందర్ రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభావంతుడు. గ్రూప్–2లో రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంకు సాధించాడు. ఉపేందర్ ప్రస్తుతం పలిమెల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోనూ పంచాయతీ కార్యదర్శిగా నాలుగేళ్లపాటు సేవలందించాడు. ప్రస్తుతం గ్రూప్–2లో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులతోపాటు, స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వర్తించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లిలో పనిచేశారు. అదే సంవత్సరంలో గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. అదేశాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్లో జరిగిన గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. చిమ్ముల అరుణ– మల్లారెడ్డి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. కుమారుడు చిమ్ముల రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాఽధించి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. గతంలో రాజశేఖర్‌రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి పదవులకు కూడా ఎంపికయ్యాడు.మహబూబాబాద్ రూరల్ : ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కూటికంటి శివ గ్రూప్ –2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 25వ ర్యాంకు సాధించారు. 2020 బ్యాచ్ ఎస్సైగా ఉద్యోగం సాధించిన శివ 2022 జనవరి నుంచి మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం మహబూబాబాద్ టౌన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు.గిరిజన ఆణిముత్యం శ్రీకాంత్ న్యూస్రీల్మెరిసిన సంధ్యగ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ పలువురికి మెరుగైన ర్యాంకులు ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షకు సన్నద్ధం హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు ప్రణీత్ ప్రతిభ..ఉద్యోగం చేస్తూ..రాజశేఖర్‌రెడ్డికి 8వ ర్యాంకురాణించిన రైతు బిడ్డఎస్సై శివకు 25వ ర్యాంకు -
పులకించిన కొండపర్తి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఆయన కూడా ఆదివాసీలతో మేమకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీల నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతో పాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్‌ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్‌దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కొండపర్తిని దత్తత తీసుకోవడం గొప్ప విషయం: మంత్రి సీతక్క దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. ఆ గ్రామాన్ని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అనుసంధానం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అందించడం ద్వారా మహిళలు వ్యాపారవేతలుగా ఎదగాలన్నారు. 40 కంపెనీలు దిశ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని వంద పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు ఆమె వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి : దాన కిశోర్, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి కొండపర్తిని అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఆదాయం చేకూరేలా ఐకమత్యంతో ముందుకుసాగాలని ఆయన సూచించారు. మిర్చి, పసుపు, మసాలా యూనిట్లకు మార్కెటింగ్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా సౌకర్యం కల్పిస్తామన్నారు. అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు కొండపర్తికి వచ్చిన గవర్నర్ మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందరాజు, పగిడిద్దరాజును దర్శించుకున్నారు. గవర్నర్ 74 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్ల మొక్కుగా సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, మేడారం ఈఓ రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు. ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం భారీ పోలీసు భద్రత నడుమ సాగిన పర్యటన -
కొండపర్తి దేశానికి రోల్‌మోడల్ కావాలి
సాక్షిప్రతినిధి, వరంగల్/ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: మారుమూలన ఉన్న ములుగు జిల్లాలోని కొండపర్తి గ్రామం అభివృద్ధిలో దేశానికి రోల్‌మోడల్ కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆకాంక్షించారు. కొండపర్తిలో 70 గృహాలు 285 మంది ప్రజలు ఉన్నారని, చిన్న గ్రామమైన అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని చెప్పారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో డిజిటల్ తరగతులు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, విద్యార్థులు ఇంగ్లిష్ బాగా మాట్లాడుతున్నారంటూ, వారిని అభినందించారు. మంగళవారం ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కొండపర్తిలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన కొండపర్తికి చేరుకున్న ఆయన.. తొలుత కొమురంభీం, బిర్సాముండ విగ్రహాలను, పాఠశాలలో డిజిటల్ తరగతులు, అంగన్వాడీ కేంద్రం, మసాలా, కుట్టు మెషీన్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం రిమోట్‌తో వ్యవసాయ మోటార్లు ప్రారంభించి కొండపర్తి గ్రామస్తులతో మాట్లాడారు.అక్కడి నుంచి నేరుగా మేడారం చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మక్క–సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకుముందు కొండపర్తి, మేడారం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నానని అందులో, కొండపర్తి కూడా ఉందని చెప్పారు. కొండపర్తిలో మహిళల ఆర్థికాభివృద్ధికి ఇంకా చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్ల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధన జరుగుతుందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో అమూల్ ఏవిధంగా ప్రసిద్ధిగాంచిందో, అదే తరహాలో కొండపర్తి కారం, పసుపు, మసాలా యూనిట్లకు అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఆకాంక్షించారు. ములుగు ప్రాంతంలో మిర్చి సాగు బాగుందని.. ఇక్కడి మిర్చి పౌడర్‌కు మంచి ఇమేజ్ రావాలని, తెలంగాణ వ్యాప్తంగా మిర్చి పౌడర్ బాగా ఫేమస్ కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ సంకల్పానికి ఈ గ్రామం ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. తాను, రాష్ట్రపతి, రాష్ట్రమంత్రి సీతక్క అందరూ ఆదివాసీ బిడ్డలమని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన గవర్నర్‌కు రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ పి.శబరిశ్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దానకిషోర్, సంయుక్త కార్యదర్శి భవానిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట జిల్లానుంచి బదిలీపై వచ్చిన ఆయన.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సాయుధ పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. డీసీపీలు, అదనపు డీసీపీలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్‌గా పూర్వ సీపీ అంబర్ కిషోర్ ఝానుంచి బాధ్యతలు స్వీకరించారు. అంబర్ కిషోర్ ఝా.. నూతన సీపీకి పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వందశాతం శాంతి భద్రతలను కాపాడుతామని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ప్రధానంగా నేరాల నియంత్రణతోపాటు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు అయిన సైబర్ క్రైం, మత్తు పదార్థాల కట్టడితోపాటు మత్తు పదార్థాలను వినియోగించేవారు, విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులను మరింత బలోపేతం చేస్తామన్నారు. అభినందనలు తెలిపిన వారిలో డీసీపీలు షేక్ సలీ మా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేశ్ కుమార్‌తోపాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, అధికారులు ఉన్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటా.. నూతన సీపీ సన్‌ప్రీత్‌సింగ్ బాధ్యతల స్వీకరణ -
ఎల్ఆర్ఎస్ రాయితీకి గడువు నెలాఖరు
వరంగల్ అర్బన్: ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం కల్పిస్తున్న 25 శాతం రాయితీ సదుపాయాన్ని లేఔట్, నాన్ లేఔట్ పాట్ల యజమానులు, డెవలపర్లు, ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సంబంధిత అధికారులతో కలిసి ఎల్ఆర్ఎస్పై లేఔట్ డెవలపర్లు, సర్వేయర్లు, యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ.. 26 ఆగస్టు 2020 కు ముందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కచ్చా లే ఔట్ చేసిన వారు, వాటిలో ప్లాట్లు తీసుకున్న ఎల్ఆర్ఎస్కు వచ్చిన దరఖాస్తుదారులు క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. ఈ నెలాఖరు (మార్చి 31) వరకే ప్రభుత్వం గడువు కల్పించినట్లు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. ఎల్ఆర్ ఎస్‌కు సంబంధించి ఏ సమస్యలున్నా.. బల్దియా అధికారుల దృష్టికి తీసుకొస్తే సహకరిస్తారనన్నారు. ఎల్ఆర్ఎస్ డెవలపర్లు, ప్లాట్ల యజమానులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి, సంబంధిత శాఖల అధికారులతో పాటు లేఔట్, నాన్ లేఔట్ యజమానులు డెవలపర్లు, టౌన్ ప్లానర్లు, లే ఔట్ రైటర్లు, బిల్డర్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. -
స్క్రాప్ దుకాణంలో కొండచిలువ కలకలం
కమలాపూర్: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో గల రాయల్ పాత ఇనుప సామగ్రి దుకాణంలో ఓ భారీ కొండచిలువ ఆదివారం రాత్రి కలకలం సృష్టించింది. స్క్రాప్ దుకాణా యజమాని తాహిర్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి సమయంలో పాత ఇనుప సామగ్రి కింద తాము ఇటీవల కొనుగోలు చేసిన ఓ పాత బీరువాను కట్ చేయడానికి వెళ్లగా.. అందులో ఓ కొండచిలువ కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి ఆ కొండచిలువను బీరువాలోంచి ఓ డ్రమ్ములో బంధించినట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం అటవీ శాఖ ఉన్నతాధికారులు ఎఫ్ఆర్ఓ శిరీష, డిప్యూటీ ఆర్ఓ ప్రిసిల్ల ఆదేశాల మేరకు ఎఫ్బీఓ అశోక్, జూపార్క్ సిబ్బంది కొమురయ్య, కృష్ణ, మల్లారెడ్డి వచ్చి సుమారు 12 ఫీట్లకు పైగా ఉన్న కొండచిలువను ఓ గోనె సంచిలో బంధించి జన సంచారం లేని ఓ గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలిపెట్టినట్లు చెప్పారు. కాగా.. గూడూరు మద్యంతోట శివారు నుంచి వంగపల్లి శివారు వరకు ఉన్న ఎస్సారెస్పీ కాలువ పరిసర ప్రాంతాల్లో తరచూ కొండచిలువలు సంచరిస్తుండడంతో తాము తీవ్ర భాయందోళనలకు గురవుతున్నామని, కొండచిలువలను ఇక్కడి నుంచి జన సంచారం లేని ప్రాంతాలకు తరలించి తమను వాటి బారినుంచి కాపాడాలని స్థానిక రైతులు, ప్రజలు కోరుతున్నారు. -
ఎటు చూసినా ఎర్ర బంగారమే
మార్కెట్‌కు వచ్చిన 80 వేల మిర్చి బస్తాలుయార్డుల్లో పోటెత్తిన మిర్చి బస్తాలు పక్క జిల్లాల నుంచి.. వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతి పెద్దది కావడంతో పక్క జిల్లాలో పండిన మిర్చి సైతం వస్తోంది. పక్క జిల్లాల్లోని మార్కెట్లు చి న్నవి కావడం, కొన్ని రకాలు మాత్రమే కొనుగోళ్లు చేస్తుండడంతో ఇక్కడికి బాట పడుతున్నారు. వరంగల్ మార్కెట్లో సుమారు 20 రకాల మిర్చిని వ్యా పారులు కొంటున్నారు. ధరలు తక్కువగా ఉంటే ఇ క్కడ మిర్చిని నిల్వ చేసే సామర్థ్యం కూడా ఉండడంతో రైతులు ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు. వరంగల్: మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్లో విక్రయించేందుకు రైతులు భారీ మొత్తంలో మిర్చిని యార్డులకు తీసుకొస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం సుమారు 80 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. దీంతో ఏ యార్డు చూసినా ఎర్ర బంగారమే కనిపించింది. వేలాది బస్తాలు రావడం, ఎండలు పెరిగిపోవడంతో మార్కెట్లోని హమాలీ కార్మికులు కాంటాలు పెట్టడంలో జాప్యం జరుగుతోంది. అన్ని రకాల మిర్చి రావడంతో ఘాటు పెరిగి కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఎల్ఆర్ఎస్ను వినియోగించుకోవాలి
కాజీపేట అర్బన్: భూక్రయవిక్రయదారులు ఎ ల్ఆర్ఎస్ను వినియోగించుకోవాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ వరంగల్ జిల్లా రి జిస్ట్రార్ ఫణీందర్ తెలిపారు. కాజీపేట ఫాతిమానగర్ వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో సోమవారం ఎల్ఆర్ఎస్ విధివిధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ హాజరై మాట్లాడుతూ.. మార్చి 31 వరకు.. 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎడిట్ ఆప్షన్ లేనందున మాడ్యూల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాకే పూర్తి చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్లకు రావాలని సూచించారు. డాక్యుమెంట్ రైటర్లు ఎల్ఆర్ఎస్–20 మాడ్యూల్‌పై భూక్రయవిక్రయదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 444 మంది గైర్హాజరువిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ ప రీక్షల్లో 444 మంది విద్యార్దులు గైర్హాజరయ్యా రు. జిల్లాలో మొత్తం 18,560 మంది పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా.. అందులో 18,116 మంది మాత్రమే హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. సుబేదారిలోని కాకతీయ బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. పరీక్షల తీరును పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. పెన్సిల్ మొనపై ఐసీసీ ట్రోఫీహన్మకొండ: హనుమకొండ గోపాలపూర్‌కు చెందిన కళాకారుడు తాటికొండ శ్రీజిత్ పెన్సిల్ మొనపై ఐసీసీ చాంపియన్ షిప్ ట్రోఫీని రూపొందించాడు. ఐసీసీ చాంపియన్‌గా భారత్ నిలిచిన క్రమంలో శ్రీజిత్ 1.8 మిల్లీ మీటర్ల ఎత్తులో ఈ ట్రోఫీని తయారు చేశాడు. దీన్ని చెక్కడానికి 1.30 గంటల సమయం పట్టిందని కళాకారుడు చెబుతున్నాడు. తాను కెప్టెన్ రోహిత్ శర్మ వీరాభిమానినని, ఆయన కెప్టెన్సీలో టీమ్ స్పిరిట్‌తో బాగా ఆడి భారత్ ఐసీసీ చాంపియన్‌షిప్ కప్ దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేయూలో నేటి నుంచి జాతీయ సదస్సుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ అనిమల్ బయోటెక్నాలజీ, ఇమ్యునాలజీ ఫర్ డిసీస్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్’ అంశంపై ఈనెల 11, 12 తేదీల్లో రెండ్రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. సదస్సుకు ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి హాజరవుతున్నారు. హైదరాబాద్‌లోని బయోఫార్మా సంస్థ శాస్త్రవేత్త గీతా శర్మ కీలకోపన్యాసం చేయనున్నట్లు తాయన తెలిపారు. ఈసదస్సులో సైన్స్ డీన్ ఆచార్య జి.హనుమంతు, వివిధ సంస్థల శాస్త్రవేత్తలు పాల్గొంటారు. ఈనెల 12న ముగింపు సదస్సుకు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త రాజేందర్ యూజీసీ కో–ఆర్డినేటర్ ఆచార్య మల్లికార్జున్రెడి తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. సదస్సులో 80 పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు. కామర్స్ విభాగంలో రెండ్రోజులపాటు..కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఈనెల 12, 13 తేదీల్లో రెండ్రోజులపాటు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు సెమినార్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ పి.అమరవేణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘న్యూ హారిజన్స్ ఇన్ కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ అండ్ ఆపర్చునిటీస్’ అంశంపై సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. -
బతకడం కష్టంగా ఉంది..
హన్మకొండ అర్బన్: ‘ భర్త మరణం తర్వాత నన్ను పోషిస్తారనే ఆశతో నాకున్న 26 గుంటల వ్యవసాయ భూమిని మనుమలు దాట్ల ప్రవీణ్, రాజ్‌కుమార్ పేరు మీద పట్టా చేయించాను. ప్రవీణ్ చనిపోవడంతో అతడి భార్య నా బాగోగులు చూడట్లేదు. దీంతో నాకు బతకడం కష్టంగా మారింది. ఆస్తి లేనందున నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు. ప్రవీణ్ భార్య భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తం 26 గుంటల భూమిని మళ్లీ నా పేరు మీదికి చేయిస్తే శేషజీవితం ప్రశాంతంగా గడుపుతా. నన్ను సాకిన వారికి ఆస్తి ఇస్తా.. అధికారులు చర్యలు తీసుకో వాలి’ అని కలెక్టర్‌కు మొర పెట్టుకుంది భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన వృద్ధురాలు దాట్ల దుర్గమ్మ. ఇలా.. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో కలెక్టర్ ప్రావీణ్యకు మొర పెట్టుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోండి.. ప్రజావాణి వినతుల పరిష్కారానికి జిల్లా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, వినతులు పెండింగ్‌లో ఉంచవద్దని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వారి సమ్యలపై వినతులు స్వీకరించారు. మొత్తం 114 వినతులు అధికారులకు అందగా.. వాటిని పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించారు. గ్రీవెన్స్‌లో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్ఓ వైవీ గణేశ్, ఆర్డీఓలు కన్నం నారాయణ, రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆస్తి లేదని నన్నెవరూ పోషించట్లేదు.. నా భూమి నాకు ఇప్పించండి.. ప్రజావాణిలో కలెక్టర్ ప్రావీణ్యకు వృద్ధురాలి వినతి.. గ్రీవెన్స్‌కు 114 అర్జీలురోడ్డు కబ్జా చేస్తున్నారు..హనుమకొండ 49వ డివిజన్లో కొందరు వ్యక్తులు రోడ్డు కబ్జా చేసి నిర్మాణం చేపట్టారు. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి పనులు చేస్తున్నారు. ఈవిషయంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. – జనార్దన్, పోస్టల్ కాలనీ కాలు తీసేశారు.. సర్టిఫికెట్ ఇవ్వండిఇన్ఫెక్షన్ కారణంగా నా ఎడమ కాలిని తొలగించారు. ప్రభుత్వ ఆసరా పింఛన్ తీసుకోవడానికి అధికారులు సదరం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. గతంలో ఒకసారి దరఖాస్తు చేస్తే రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదంటున్నారు. ఉన్నతాధికారులు నాకు న్యాయం చేయాలి. – రాచర్ల ముత్తయ్య, వంగర -
‘వెల్నెస్’.. సేవల్లో డల్‌నెస్
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని వెల్నెస్ సెంటర్లో కనీస వసతులు కరువయ్యాయి. అధికారులు, పాలకుల చిన్నచూపుతో నిత్యం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వెల్నెస్ సెంటర్‌కు వయస్సు పైబడిన వారే అత్యధికంగా వస్తుంటారు. ఇక్కడ వీరికి మౌలిక వసతులు కూడా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సెంటర్లోని టాయిలెట్లకు తాళం వేసి ఉన్న ఘటన మరవకముందే.. సోమవారం అంతర్గత సమస్యతో సెంటర్లో విద్యుత్ సరఫరా నిలిచింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఓపీ ప్రారంభమైన 10 నిమిషాలకే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అప్పటికే కొంతమందికి ఆన్లైన్లో ఓపీ చిట్టీలు ఇవ్వగా .. మరికొందరికి మాత్రం ఆఫ్‌లైన్‌లో చిట్టీలు ఇచ్చారు. కానీ.. విద్యుత్ సరఫరా లేక మందుల సరఫరా నిలిచిపోయింది. వైద్యులు సైతం అందుబాటులో లేక రోగులకు ఎదురు చూపులు తప్పలేదు. సమస్య పరిష్కరించాల్సిన సెంటర్ నిర్వాహకులు ఒంటి గంట వరకు నిధానంగా పని కానిచ్చారు. ఇదే సాకుగా భావించిన కొందరు డాక్టర్లు వెళ్లిపోయారు. అనంతరం 1 గంటకు సమస్య పరిష్కారమైంది. కానీ చాలామంది అప్పటికే ఇళ్లకు వెళ్లిపోయారు. ఈవిషయంపై వైద్య సిబ్బందిని ఆరా తీయగా.. బ్రేకర్లు పడిపోవడంతో వి ద్యుత్ సరఫరా నిలిచిందని, ఇన్వర్టర్ సైతం పాడైందని తెలిపారు. వెల్నెస్ సెంటర్లో అంతర్గత సమస్యతో నిలిచిన విద్యుత్ గంటల తరబడి రోగుల ఎదురుచూపులు.. డాక్టర్ల డుమ్మా -
పీఆర్లో కారుణ్య నియామకాలు
హన్మకొండ:పంచాయతీరాజ్ శాఖలో ఎట్టకేలకు కారుణ్య నియామకాలు చేపడుతున్నారు. 2016 నుంచి ఎదురుచూస్తున్న కు టుంబాలకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం 2024 మే నెలలోపు నమోదు చేసుకున్న వారికి ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. ఈక్రమంలో అటెండర్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసింది. జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో ఉద్యోగం చేస్తూ విధుల్లో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తుంది. జిల్లా ప్రజాపరిషత్‌లలో కేవలం అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో చేరేందుకు బీటెక్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత చదువులు చదివిన కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ లేకపోవడం, ఉన్న పోస్టుల్లో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులను జిల్లా ప్రజాపరిషత్‌లో సర్దుబాటు చేయడంతో అవి భర్తీ అయ్యాయి. దీంతో కారుణ్య నియామకాల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు. అటెండర్ టు జూనియర్ అసిస్టెంట్‌గా అప్‌గ్రేడ్ ఈక్రమంలో ప్రభుత్వం అటెండర్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్‌లోని 58, వరంగల్‌లో 26 పోస్టులు అప్‌గ్రేడ్ కోసం ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వంనుంచి అమోదం లభించింది. వరంగల్ జిల్లా ప్రజాపరిషత్‌లో మరో 9 సూపర్ న్యూమరీ పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారులు అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. హనుమకొండకు సంబంధించి 46 మంది, వరంగల్‌కు 28 మంది హాజరయ్యారు. మిగతా వారు ఎప్పుడు వచ్చినా అవకాశం కల్పిస్తామని ఆయా జిల్లాల ప్రజాపరిషత్ అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థుల జాబితాను కలెక్టర్ల ఆమోదం కోసం పంపారు. కలెక్టర్ నుంచి ఆమోదం లభించిన వెంటనే ఒకటి రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. హనుమకొండ జిల్లాలో 58, వరంగల్ జిల్లాలో 35 పోస్టులు 2016 నుంచి ఎదురుచూపులు సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి రెండు రోజుల్లో ఉత్తర్వులు -
పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట జిల్లానుంచి బదిలీపై వచ్చిన ఆయన.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సాయుధ పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. డీసీపీలు, అదనపు డీసీపీలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్‌గా పూర్వ సీపీ అంబర్ కిషోర్ ఝానుంచి బాధ్యతలు స్వీకరించారు. అంబర్ కిషోర్ ఝా.. నూతన సీపీకి పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వందశాతం శాంతి భద్రతలను కాపాడుతామని, ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ప్రధానంగా నేరాల నియంత్రణతోపాటు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు అయిన సైబర్ క్రైం, మత్తు పదార్థాల కట్టడితోపాటు మత్తు పదార్థాలను వినియోగించేవారు, విక్రయించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులను మరింత బలోపేతం చేస్తామన్నారు. అభినందనలు తెలిపిన వారిలో డీసీపీలు షేక్ సలీ మా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేశ్ కుమార్‌తోపాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, అధికారులు ఉన్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటా.. నూతన సీపీ సన్‌ప్రీత్‌సింగ్ బాధ్యతల స్వీకరణ -
ఎటు చూసినా ఎర్ర బంగారమే
వరంగల్: మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్లో విక్రయించేందుకు రైతులు భారీ మొత్తంలో మిర్చిని యార్డులకు తీసుకొస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం సుమారు 80 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. దీంతో ఏ యార్డు చూసినా ఎర్ర బంగారమే కనిపించింది. వేలాది బస్తాలు రావడం, ఎండలు పెరిగిపోవడంతో మార్కెట్లోని హమాలీ కార్మికులు కాంటాలు పెట్టడంలో జాప్యం జరుగుతోంది. అన్ని రకాల మిర్చి రావడంతో ఘాటు పెరిగి కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. పక్క జిల్లాల నుంచి.. వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతి పెద్దది కావడంతో పక్క జిల్లాలో పండిన మిర్చి సైతం వస్తోంది.పక్క జిల్లాల్లోని మార్కెట్లు చిన్నవి కావడం, కొన్ని రకాలు మాత్రమే కొనుగోళ్లు చేస్తుండడంతో ఇక్కడికి బాట పడుతున్నారు. వరంగల్ మార్కెట్లో సుమారు 20 రకాల మిర్చిని వ్యాపారులు కొంటున్నారు. ధరలు తక్కువగా ఉంటే ఇక్కడ మిర్చిని నిల్వ చేసే సామర్థ్యం కూడా ఉండడంతో రైతులు ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌కు వచ్చిన 80 వేల మిర్చి బస్తాలు -
వినడం.. తీసుకోవడమే
వరంగల్: ప్రతీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల గోడు వినడం.. ఇచ్చిన దరఖాస్తులు తీసుకోవడమే తప్ప సమస్యలు పరిష్కారం కావడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్‌కు మళ్లీ మళ్లీ వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నట్లు వాపోతున్నారు. ఇచ్చిన వినతులు అధికారులు తీసుకుని ఆన్లైన్ చేసి సంబంధిత శాఖ అధికారులకు పంపించడంతో కలెక్టరేట్ అధికారుల పని పూర్తవుతోంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు క్షేత్రస్థాయిలో పరిష్కారం అయిందా.. లేదా అన్న విషయంపై సమీక్ష లేకపోవడంతో గ్రీవెన్స్ కార్యక్రమం ఒక అనవాయితీగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో చేసిన ఫిర్యాదు మూడు నెలలు అయినా మళ్లీ అదే సమస్యపై వినతి ఇవ్వడంతో సమస్యలు ఏ మేరకు పరిష్కారం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బాధితులు చేసిన ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులతో ప్రత్యేకంగా కలెక్టర్ నేతృత్వంలో సమీక్ష జరిగితే న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పెండింగ్ లేకుండా చూడాలి: కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో అందిస్తున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతిలతో కలిసి ప్రజల సమస్యల పైన వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌లో మొత్తం 103 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపై 53 దరఖాస్తులు వచ్చాయన్నారు. పరిష్కారం కాని ప్రజావాణి దరఖాస్తులు కలెక్టరేట్‌కు తిరుగుతున్న బాధితులు సమస్యలు పరిష్కరించాలని అర్జీదారుల వేడుకోలు గ్రీవెన్స్‌లో 103 వినతులు పెండింగ్ లేకుండా చూడాలి: కలెక్టర్ సత్యశారదమూడు చక్రాల స్కూటర్ ఇప్పించాలి పుట్టుకతో పోలియో రావడంతో కుడికాలు పడిపోయింది. పేద కుటుంబానికి చెందడం, వృద్ధురాలైన తల్లిని పోషించుకునేందుకు పనులకు వెళ్లి నడిచి రావాలంటే ఇబ్బంది పడుతున్న. వందశాతం సబ్సిడీతో మూడు చక్రాల స్కూటర్ మంజూరు చేయిస్తే కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉపయోగంగా ఉంటుంది. – గుగులోతు భూలక్ష్మి, పల్లారుగూడ, సంగెం -
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
గీసుకొండ: గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. గోవిందా.. కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి గోవిందా.. అంటూ రాత్రి 10 గంటలకు నిర్వహించిన అశ్వవాహన సేవలో భక్తులు పారవశ్యంతో మునిగితేలారు. అనంతరం గుట్ట కిందికి స్వామివారిని ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా తోడ్కొని వెళ్లారు. ఒక వైపు స్వామివారు ...మరో వైపు అమ్మవార్లు భూదేవి, నీలాదేవీల ఎరుర్కోళ్లు జరిగాయి. రాత్రి 11 గంటలకు దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపానికి తీసుకుని వెళ్లి వైభవంగా కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచారి, ఫణి, శేషు, మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, కాంగ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపెల్లి శ్రీనివాస్, వీరాటి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు . -
చివరి ఆయకట్టు వరకు సాగునీరు
వరంగల్: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగు నీటి నిర్వహణ, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ డాక్టర్ సత్యశార ద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్ కుమార్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి వేసవికాలంలో తాగునీటి సమస్య, కరెంట్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లు ఫేస్ 1గ్రామాల్లో మంజూరైన వాటి కి మార్కింగ్ ఇవ్వాలని, మిగిలిన గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 కేటగి రీల్లో ఎంపిక చేసిన దరఖాస్తులను పరిశీలించేందుకు చర్య తీసుకోవాలని పీడీ హౌసింగ్ గణపతిని ఆదేశించారు. భూగర్భ జలాలు పడిపోయిన ప్రాంతాలను గుర్తించి నీటిసమస్య లేకుండా ప్రత్యామ్నయ చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్, మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులు వేసవికాలం యాక్షన్ ప్లాన్ తయారుచేసి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నా రు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, అగ్రికల్చర్, మిషన్‌భగీరథ,ఎలక్ట్రిసిటీ అధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, డీసీఓ నీరజ, డీపీఓ కల్పన, తహసీల్దార్ ఇక్బాల్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. ఆకేరు వాగులో ఇసుక తీస్తే చర్యలు వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగులో ఇసుక తీస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు చెందిన ట్రాక్టర్ యాజమానులు లోకల్ అవసరాలకు ఆకేరు వాగులో ఇసుక తీ సుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ నిబంధనల ప్రకారం గోదావరి ఇసుక తప్ప.. వాగుల్లో ఇసుక తీస్తే చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఆలోచన విరమించుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
డీజే సౌండ్స్ నిషేధం
గీసుకొండ: హోలీ పండుగ నుంచి ప్రారంభమయ్యే కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో డీజే సౌండ్స్, రికార్డింగ్ డ్యాన్స్‌లను నిషేధించామని, ఎవరైన జాతరలో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మామునూరు, నర్సంపేట ఏసీపీలు తిరుపతి, కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం కొమ్మాల ఆలయం సమీపంలోని విష్ణుప్రియ గార్డెన్లో పలు రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ సమావేశంలో వారు మాట్లాడారు. కొన్ని షరతుల మేరకు జాతరలో రాజకీయ ప్రభలకు అనుమతి ఇస్తున్నామని, ఎవరి ప్రభలకు ఆయా పార్టీల నాయకులే బాధ్యత వహించాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 400 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని, డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. గత జాతరలో వరంగల్–నర్సంపేట రహదారిపై ఐదు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడంతో ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇబ్బంది పడ్డారన్నారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కొమ్మాల, గిర్నిబావి వద్ద తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసి బస్సులను నిలుపుతామన్నారు. ఈ సమావేశంలో ఈఓ నాగేశ్వర్రావు, అర్చకులు రామాచారి, సీఐలు మహేందర్, రమణమూర్తి, శ్రీనివాస్, సాయిరాం, ఎస్ఐలు కె. కుమార్, ప్రశాంత్‌బాబు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంసీపీఐ(యు) నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపెల్లి శ్రీనివాస్, వీరగోని రాజ్‌కుమార్, రడం భరత్, గట్టికొప్పుల రాంబాబు, కక్కెర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. కొమ్మాల జాతరలో షరతులతో రాజకీయ ప్రభలకు అనుమతి 400 మంది పోలీసులతో బందోబస్తు మామునూరు, నర్సంపేట ఏసీపీలు తిరుపతి, కిరణ్‌కుమార్ -
SRSP Canal: కడసారి చూపుకోసం కదిలొచ్చిన గ్రామస్తులు
సాక్షిప్రతినిధి, వరంగల్: తన కళ్లెదుటే కుటుంబం మొత్తం నీటిలో పడి మృత్యుఒడికి చేరి అంత్యక్రియలకు వెళ్తుంటే ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. భర్త, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఇక తనకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిళ్లేలా రోదించింది. తన ముద్దుల చిన్న కొడుకు, మనమడు, మనుమరాలు ఇక లేరని తెలిసి.. వారి మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే వృద్ధ దంపతులు బోరున విలపించారు.తాము ఇక ఎవరి కోసం బతకాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలోని ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో మృతి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్, తన పిల్లలు చైత్ర, ఆర్యవర్ధన్ అంత్యక్రియలు ఆదివారం వారి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ‘నాకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకు నేనే తలకొరివి పెట్టాల్సిన దుస్థితిని తీసుకొచ్చావా దేవుడా’ అంటూ మృతుడి తండ్రి సారంగపాణి రోదనలు మిన్నంటాయి. అంతిమ యాత్రలో చివరగా ముగ్గురికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు గ్రామం మొత్తం కదిలొచ్చింది.‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో....అంటూ’ప్రవీణ్‌కుమార్‌తో చదువుకున్న అతడి స్నేహితులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కడసారి చూపుకోసం మేచరాజుపలి్లకి తరలిచ్చారు. కేరళ నుంచి యుగేంధర్, హైదరాబాద్ నుంచి బెల్లు శ్రీను, నాళ్లం హరికిషన్ ప్రసాద్ తదితరులు వచ్చారు. అంతిమయాత్రలో ముగ్గురిని ఒకేసారి శ్మశాన వాటికకు తీసుకెళ్తుంటే గ్రామం మొత్తం బోరుమంది. తండ్రి, పిల్లల మృతదేహాలకు పలువురు నాయకులు పూలమాల ఝవేసి నివాళులరి్పంచారు. -
ప్రాణం తీసిన పల్లిగింజ
సాక్షిప్రతినిధి, వరంగల్: పల్లిగింజ తిన్న చిన్నారికి అదే యమపాశమైంది.. గొంతులో గింజ ఇరుక్కుని శ్వాస ఆడక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండెల వీరన్న–కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు అక్షయ్ (18 నెలలు) ఉన్నాడు. గురువారం ఇంటి ఎదుట పల్లీలు ఆరబెట్టగా ఆడుకుంటున్న అక్షయ్ గింజ తిన్నాడు. దీంతో గింజ గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. చిన్నారి మృతదేహంమీద పడి తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయ బిడ్డా అంటూ బోరున విలపించారు. -
‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో....అంటూ’
వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్ జిల్లా (Warangal District) పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం(Saturday) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్‌కుమార్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి (Heart Attack) అధికం కావడం.. స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది.12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటుప్పల్‌కి చెందిన నవీన్, సందీప్, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు. 1.10 గంటలకు : ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు.4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్ సీట్లో ప్రవీణ్‌కుమార్, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు.నాన్నా..పిల్లలతో వస్తున్నా..మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందినసోమారపు సారంగపాణి, పద్మకు ఇద్దరు కొడుకులు. వీరిలో చిన్న కొడుకు ప్రవీణ్‌కుమార్ (పప్పి) కష్టపడి చదువుకుని హనుమకొండ ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు. భార్య కృష్ణవేణి, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. పదేళ్లుగా హనుమకొండలోని రాంనగర్లో నివాసం ఉంటున్నారు. సెలవు రోజుల్లో ఊరులో ఉన్న అమ్మానాన్న వద్దకు వచ్చివెళ్లేవాడు. ‘రెండు రోజులు సెలవులు ఉన్నాయి. పిల్లలతో సహా ఇంటికి వస్తున్నాం. అర్ధగంటలో చేరుకుంటాం’ అని ప్రవీణ్‌కుమార్ శనివారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అదే అర్ధగంటలో కారు కాల్వలో పడిందని సమాచారం అందడంతో ‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో... అంటూ’ ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. ఇంటికి వచ్చినప్పుడు అందరితో సరదాగా ఉండే ప్రవీణ్ కుమార్ చనిపోయాడని తెలియడంతో అయ్యో.. దేవుడు మంచి మనిషిని తీసుకెళ్లాడు’ అంటూ స్నేహితులు, గ్రామస్తులు కంటతడిపెట్టారు.నా భర్త, పిల్లలను బతికించండి..స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి తన పిల్లలను, భర్తను బతికించండని అక్కడున్న వారిని ప్రాధేయపడింది. రెండేళ్ల కుమారుడిని బయటికి తీసుకువచ్చాక ‘లే నాన్నా.. లే’ అంటూ తట్టిలేపుతున్న కృష్ణవేణిని చూసి ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు.నువ్వు వస్తావా.. నన్నే రమ్మంటావా..‘నా మనుమరాలు చైత్ర ఉదయం ఫోన్లో మాట్లాడింది. హనుమకొండకు నువ్వు వస్తావా.. లేదా నన్నే రమ్మంటావా..’ అని ముద్దుగా చెప్పిందని తాత సారంగపాణి అక్కడున్న వారికి చెబుతూ రోదించారు. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లి అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రవీణ్ అంటే దయగల గుణం అని, అందరూ తనవాళ్లేనని అంటుండేవాడని, ఆస్పత్రుల్లో బంధువులుంటే వారికి అన్నం పెట్టేవాడని, అందరితో మంచివాడని పేరు తెచ్చుకున్న నా కొడుకుకు అప్పుడే నూరేళ్లు నిండి దేవుడి వద్దకు వెళ్లాడా. చైత్రకు నాన్న ప్రవీణ్ అంటే అమితమైన ప్రేమ అని, చివరికి తండ్రితో కలిసే పరలోకాలకు చేరింది’ అంటూ అని పద్మ గుండెలవిసేలా రోదించింది.రెయిలింగ్ లేకనే ప్రమాదాలురెయిలింగ్ లేకపోవడంతో కొంకపాక గ్రామ శివారులోని ఎస్సారెస్పీ డీబీఎం–48 కాల్వ వద్ద తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేళ్ల క్రితం కారు వేగంగా కాల్వలోకి వెళ్లి ఒక ప్రభుత్వ టీచర్, మరో ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా ట్రాక్టర్ బోల్తాపడి మరొకరు మృత్యువాతపడ్డారు. శనివారం ఎస్సారెస్పీ కాల్వలో కారు పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాల్వ చుట్టూ రెయిలింగ్, ప్రమాద సూచికలు లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. -
అన్ని రంగాల్లో మహిళల ముందంజ
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హన్మకొండ అర్బన్: అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉంటున్నారని, పురుషులతో సమానంగా పోటీపడడం శుభపరిణామమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షత్రంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్య అఽథిగా హాజరై మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో సమానంగా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో పొటీ పడాలన్నారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. సోలార్ శక్తి కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు మహిళా సంఘాలకు కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయించడం శుభ పరిణామమన్నారు. పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సత్కరించారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి, సీడబ్ల్యూసీ కమిటీ ప్రతినిధులు హైమావతి తదితరులు ఉన్నారు. -
కమిషనరేట్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రపంచ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా పోలీస్ అధికారులు పరిపాలనా విభాగం మహిళా అధికారులు పాల్గొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీకి ప్రత్యేక రైలుకాజీపేట రూరల్: హోలీ పండుగను పురస్కరించుకుని చర్లపల్లి–గోరఖ్‌పూర్ మధ్య కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈనెల 10న చర్లపల్లి–గోరఖ్‌పూర్ (07715) వెళ్లే ఎక్స్‌ప్రెస్ బుధవారం సాయత్రం 4:00 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. 12న గోరఖ్‌పూర్–చర్లపల్లి (07716) వెళ్లే ఎక్స్‌ప్రెస్ గురువారం రాత్రి 9:00 గంటలకు చేరుతుంది. ఈఎక్స్ప్రెస్కు అప్ అండ్ డౌన్లో కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, చంద్రాపూర్, నాగపూర్, ఇటార్సీ, రాణి కమలాపథ్, బీనా, ఝాన్సీ, ఖాన్పూర్ సెంట్రల్, లక్నో, బరబంకి, గోండా, బాస్టీ స్టేషన్లో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్ఓ తెలిపారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషివిద్యారణ్యపురి: ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శాసన మండలిలో గొంతెత్తుతానని వరంగల్, నల్ల గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సురేందర్‌రెడ్డి, ఇతర బాధ్యులు శుక్రవారం రాత్రి హనుమకొండలోని పీఆర్టీయూ భవన్లో శ్రీపాల్‌రెడ్డిని సన్మానించారు. ఈసందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దుతోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఐదు డీఏలు సాధించేలా కృషి చేస్తానన్నారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. ఈసందర్భంగా అధ్యాపకుల పలు సమస్యల్ని శ్రీపాల్‌రెడ్డి దృష్టికి ఆసంఘం బాధ్యులు తీసుకెళ్లారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, టీజీసీజీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న, కేయూ కో–ఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి, డి.వెంకన్న జిల్లాల బాధ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అట్టహాసంగా ఇన్నోవేషన్ సమ్మిట్–25 ప్రారంభంకాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని ఇన్నోవేషన్ గ్యారేజీలో శనివారం రెండు రోజుల స్టూడెంట్ ఇన్నోవేషన్ సమ్మిట్–25ను నిట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసాచార్య ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలకు నాంది పలికేందుకు సమ్మిట్–25ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు నిట్ క్యాంపస్‌లోని ‘వాస్తవ సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు’ అంశంపై పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఇన్నోవేషన్ గ్యారేజీ హెడ్ రవికుమార్, ఫ్యాకల్టీ అడ్వైజర్ సతీశ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రుద్రేశ్వరాలయంలో విదేశీ జర్నలిస్టులుహన్మకొండ కల్చరల్: తెలంగాణలోని టూరిజం, చారిత్రక ప్రదేశాలను విశ్వవ్యాప్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు శనివారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని కెన్యా, శ్రీలంక, నైజీరియా, నేపాల్, టాన్జానియా దేశాలకు చెందిన జర్నలిస్టులు సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్ వారిని స్వాగతించారు. రుద్రేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం వారికి అర్చకులు స్వామివారి ప్రసాదాలు, మహదాశీర్వచనం అందించారు. జిల్లా టూరిజంశాఖ సిబ్బంది వారికి ఆలయ ప్రాశస్త్యన్ని, చరిత్రను వివరించారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి శివాజీ, దేవాలయ సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
పరకాల: చట్టాలపై అవగాహనతో ప్రతి ఒక్కరూ పట్టణాలు, గ్రామాల్లో శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని పరకాల తాలుకా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జడ్జి శాలిని లింగం కోరారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెగా లోక్ అదాలత్‌లో భాగంగా పరకాల కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 481 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా విధించిన జరిమానాలను రూ.1.17 లక్షలను బ్యాంకులకు చెల్లించారు. మెగా లోక్ అదాలత్‌లో జడ్జి శాలిని లింగం, రెండో తరగతి మెజిస్ట్రేట్ కొప్పుల శంకర్ 196 క్రిమినల్, సివిల్, బ్యాంకు కేసులను పరిష్కరించి ఆయా కేసులను కొట్టేశారు. కార్యక్రమంలో పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండెల భద్రయ్య, ఏజీపీ లక్కం శంకర్, లోక్ అదాలత్ సభ్యులు ఓంటేరు రాజమౌళి, వెంకటరమణ, రవికుమార్, ఏపీపీలు కుమార్, రుధిర, ఏసీపీ సతీశ్‌బాబు, పరకాల సీఐ క్రాంతికుమార్‌తో పాటు పరకాల కోర్టు పరిధి వివిధ మండలాలకు చెందిన ఎస్ఐలు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పరకాల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జడ్జి శాలిని లింగం మెగా లోక్ అదాలత్‌లో 481 కేసుల పరిష్కారం -
ఆమోద రీతిలో వివాదాలు పరిష్కారం
హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, అతిథిగా న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. – హన్మకొండ అర్బన్– వివరాలు 8లోuహైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ హనుమకొండలో జాతీయ లోక్ అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ప్రారంభం అక్కడికక్కడే పలు కేసులు పరిష్కారం -
ఓరుగల్లుకు ప్రథమ ప్రాధాన్యమివ్వండి
కేంద్ర రైల్వే మంత్రికి మంత్రులు, ఎంపీల వినతి సాక్షిప్రతినిధి, వరంగల్: కొత్తలైన్లు, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ తదితర పనుల కోసం నిధులు కేటాయించే విషయంలో ఉమ్మడి వరంగల్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా మంత్రులు, ఎంపీలు కోరారు. తెలంగాణ పర్యటనలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను శనివారం మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని విన్నవించారు. నష్కల్ నుంచి హసన్‌పర్తి, నష్కల్ నుంచి చింతలపల్లి నూతన బైపాస్ లైన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ నూతన బైపాస్ అలైన్మెంట్ మార్చాలని కేంద్ర మంత్రిని వరంగల్ ఎంపీ కావ్య కోరారు. సికింద్రాబాద్ టు వరంగల్ మధ్య నడిచే పుష్పుల్ రైలును తిరిగి నడిపించాలని కోరారు. ఈవిషయంపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బైపాస్‌ను ఓఆర్ఆర్ చుట్టూ అలైన్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా కావ్య కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతుందంటే.. అందుకు వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల టీం వర్కే కారణమని అన్నారు. కాజీపేట డివిజన్ అప్‌గ్రేడ్‌పై త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని మరోసారి కలుస్తామని ఎంపీ కావ్య తెలిపారు. -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారద అన్నారు. వెంకట్రావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శనివారం వారు భూమిపూజ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ సత్యశారదను ఎమ్మెల్యే నాగరాజు శాలువాతో ఘనంగా సన్మానించారు. అదనపు కలెక్టర్ సంద్యారాణి, తహసీల్దార్ విజయసాగర్, డిప్యూటీ తహసీల్దార్ వినయేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
పీఈటీల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
వరంగల్ స్పోర్ట్స్/విద్యారణ్యపురి: వ్యాయామ విద్య ఉపాధ్యాయుల (పీఈటీ) సంఘం హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం హనుమకొండ లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలకు పరిశీలకులుగా ఎ.ప్రవీణ్, పి.శ్రీనివాస్, ఎం.వెంకటేశ్వర్లు, రఘువీర్‌లు వ్యవహరించారు. రెండేళ్ల పాటు కొనసాగే ఈకమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఎర్రబెల్లి ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దరిగె కుమారస్వామి, కోశాధికారిగా ఎన్.శ్రీధర్, గౌరవ అధ్యక్షుడిగా ఎం.దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తెలిపారు. ఉపాధ్యక్షురాలిగా పావని, సంయుక్త కార్యదర్శులుగా రేబిక, కవిత, సహాయ కార్యదర్శులుగా జి.కిషన్, మైసయ్య, కార్యవర్గ సభ్యులుగా కిరణ్, ఎం.కుమార్, ఎస్.అనిత, లక్ష్మీనారాయణ, ధనలక్ష్మి, తరంగిణి ఎన్నికై నట్లు తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయినులను సత్కరించారు. -
ఆమోద రీతిలో వివాదాలు పరిష్కారం
హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, అతిథిగా న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ ● హనుమకొండలో జాతీయ లోక్ అదాలత్, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ప్రారంభం ● అక్కడికక్కడే పలు కేసులు పరిష్కారం– హన్మకొండ అర్బన్– వివరాలు 8లోu -
12నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
దుగ్గొండి: మండలంలోని కేశవాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 12 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది జితేందర్‌రెడ్డి శనివారం తెలిపారు. ఈనెల 12న సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, 13న శేషవాహనోత్సవం, 14న శ్రీదేవి–భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి కల్యాణం, సాయంత్రం గరుడ వాహనోత్సవం, 15న హనుమద్వాహన సేవ, 16న అలంకారసేవ, 17న మహా పూర్ణాహుతి, చక్రస్నానం, శ్రీపుష్పయాగం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన సూచించారు. రైతులకు పరిహారం చెల్లించాలినెక్కొండ: గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తోపనపల్లి గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన 15 మంది రైతులు సుమారు 15 ఎకరాల భూములు హైవేలో కోల్పోయారని తెలిపారు. కాంట్రాక్టర్లు, రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించకపోవడంతో ఆందోళన చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం పరిహారం అందిస్తామని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. త్వరగా పరిహారం చెల్లించకుంటే పనులు మళ్లీ అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. యువకుల నుంచి డబ్బుల వసూలు!వర్ధన్నపేట: బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు వెంబడించి డబ్బులు వసూలు చేశారనే ఘటన శనివారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కట్య్రాల నుంచి కొత్తపల్లి బైపాస్ రోడ్డు వద్ద ఇద్దరు యువకులు మద్యం సేవిస్తున్నారని కానిస్టేబుళ్లు గమనించారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు కానిస్టేబుళ్లు యువకుల వద్దకు వెళ్లి మీపై కేసులు నమోదు చేసి న్యాయస్థానానికి పంపించాలా అని బెదిరించారని, వారి నుంచి రూ.1500 చొప్పున ఇతర నంబర్ల ఫోన్‌పేకు బదిలీ చేయించుకున్నారని చర్చ జరుగుతోంది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వర్ధన్నపేటలో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొత్తూరులో చైన్స్నాచింగ్రాయపర్తి: మండలంలోని కొత్తూరులో శనివారం చైన్‌స్నాచింగ్ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొంపెల్లి ప్రమీల ఇంట్లో ఉండగా తెల్లవారుజామున 4:30 గంటలకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు కొట్టగా తలుపులు తీసింది. ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడిన ఆగంతకులు ప్రమీలను బెదిరించి మెడలోని బంగారు గొలుసు, చేతులకు ఉన్న నాలుగు బంగారు గాజులను తీసుకొని పారిపోయారు. బాధితురాలు అరవడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని 100కు డయల్ చేశారు. ఎస్సై శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. -
మహిళ ఎదుగుదలతోనే దేశాభివృద్ధి
ఖిలా వరంగల్: ఇంటిని అందంగా తీర్చిదిద్దుతూ, పిల్లలను ప్రయోజకులను చేసే మాతృమూర్తి ఒక గొప్ప వాస్తుశిల్పి అని నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద అన్నారు. పురుషుడితో సమానంగా మహిళ అన్ని రంగాల్లో ఎదిగినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నా రు. వరంగల్ ఫోర్ట్‌రోడ్డులోని అన్నపూర్ణ కల్యాణ మండపంలో జిల్లా సంక్షేమ, వయోవృద్ధుల శాఖ ఆ ధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినో త్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వా రు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మ హిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులతో సమానంగా ఎదగాలని సూచించారు. మహిళ ఎదగుదలలో విద్య ప్రధానమైందని, విద్య ఉన్నత ల క్ష్యానికి చేరుస్తుందని పేర్కొన్నారు. అనంతరం మ హిళా ఉద్యోగులు,క్రీడాకారులు,గాయకులను శాలు వాతో ఘనంగా సన్మానించారు. విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కా ర్పొరేటర్లు బి.ఉమ, దామోదర్, పల్లం పద్మ, ము స్కమల్ల పద్మ, గుండు చందన, పద్మ పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద -
మహిళలు సాధికారత సాధించాలి
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం వంగరలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైద్యులు రహమాన్, రుబీనా ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సన్మాన సమావేశంలో డీఎమ్హెచ్ఓ అప్పయ్య ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు పౌష్టికాహరం తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించే దిశగా రాణించాలన్నారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ రాజశేఖర్, రవీందర్‌రెడ్డి, వాణి తదితరులు పాల్గొన్నారు. ముల్కనూరు స్వకృషి డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ రాష్ట్ర స్థాయిలో పాలు సరఫరా చేసిన మహిళా సభ్యులకు శాలువాతో ఘనంగా సన్మానించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డెయిరీ జీఎం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య వంగర పీహెచ్సీలో మహిళా దినోత్సవం -
మహిళా సాధికారతకు పెద్దపీట
సంగెం: మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయిన రైతు కుటుంబాల మహిళలకు కుట్టు శిక్షణ శిబిరాన్ని మండల కేంద్రంలోని శాంతి మండల సమాఖ్యలో కలెక్టర్ సత్యశారదతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్‌చేసి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. సంగెం, గీసుకొండ మండలాల పరిధిలోని భూ నిర్వాసిత మహిళలతోపాటు 18 నుంచి 35 ఏళ్ల మహిళలు కుట్టు శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న యంగ్వన్ కంపెనీలో 23 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, డీపీఎం అనిత, మండల సమాఖ్య అధ్యక్షులు కల్యాణి, కవిత తదితరులు పాల్గొన్నారు. కొమ్మాల జాతరకు డీజేలను రానివ్వొద్దు..గీసుకొండ: హోలీ నుంచి ప్రారంభమయ్యే కొమ్మా ల లక్ష్మీనర్సింహస్వామి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కొమ్మాల ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు డీజేలను రానివ్వొద్దని, ఒకవేళ వస్తే పోలీసుల వైఫల్యంగానే భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ చాడ కొమురారెడ్డి, గోదాసి చిన్న, నాగరాజు, గోపాల్ పాల్గొన్నారు. ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, అర్చకులు చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, రామాచారి, ఫణి, విష్ణు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి -
మెరుగైన వైద్యం అందించాలి
చెన్నారావుపేట: ట్రాలీ బోల్తాపడి తీవ్రగాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. జీడిగడ్డ తండా నుంచి మిర్చి ఏరడానికి వెళ్తున్న బొలెరో వాహనం ఇటీవల బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఆర్ఎంఓ అంబి శ్రీనివాస్, ప్రమోద్‌కుమార్, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, చెన్నారావుపేట వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పెట రమేశ్, జీడిగడ్డ తండా గ్రామ అధ్యక్షుడు బొంద్యాలు, సీనియర్ నాయకులు అందె వెంకటేశ్వర్లు, లచ్చిరామ్, శ్రీను తదితరులు ఉన్నారు. -
నీటి సమస్య పరిష్కరించాలి
నర్సంపేట: పట్టణంలోని పలు ప్రాంతాల్లో నీటి సమస్య ఉంటే త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. ఈ మేరకు నర్సంపేటలోని 24 వార్డుల్లో నీటి సరఫరా పనితీరు, ఫిల్టర్‌బెడ్, నర్సరీలను మున్సిపల్ కమిషనర్‌తో కలిసి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని పైపులైన్, చేతిపంపు, మంచినీటి బావులను తనిఖీ చేసినట్లు తెలిపారు. నల్లాల ద్వారా రోజు వి డిచి రోజు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జోనా అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్స వం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో సరైన భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. ఒక మహిళను బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. అనంతరం మహిళా పారిశుధ్ధ్య కార్మికులు, మ హిళా ఉద్యోగులు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ఆర్పీలను సన్మానించారు. డీఎంసీ రేణుక, ఏడీఎం వహీదా, ముఖ్య అధికారులు, వార్డు ఆఫీసర్లు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి -
ఎస్సార్ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. కుమారుడి మృతి.. తండ్రి, కుమార్తె గల్లంతు
సాక్షి, వరంగల్ జిల్లా: ఎస్సార్ఎస్పీ కెనాల్లోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో కుమారుడు మృతి చెందగా, తండ్రి కూతురు గల్లంతయ్యారు. తల్లిని స్థానిక రైతులు కాపాడారు. సంగెం మండలం తీగరాజు పల్లి వద్ద ఘటన జరిగింది. మేత రాజు పల్లి నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ కుమార్ తన భార్య కృష్ణవేణి, కుమార్తె సాయి చరిత, కుమారుడు హర్షవర్ధన్‌తో కలిసి హన్మకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యలో కారు డ్రైవ్ చేస్తున్న ప్రవీణ్‌కు గుండెపోటు రాగా, చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నించారు.గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. స్థానిక రైతుల సాయంతో కృష్ణవేణి బయటపడ్డగా.. కుమారుడు మృతి చెందాడు. కారుతో సహా ప్రవీణ్, సాయి చరిత నీటిలో గల్లంతయ్యారు. ప్రవీణ్, చైత్రసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 17 నెలలకే అంబర్ కిషోర్ ఝా బదిలీ 2023 అక్టోబర్ 13న అంబర్ కిషోర్ ఝా వరంగల్ సీపీగా నియమితులయ్యారు. 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంబర్ కిషోర్ ఝా ఇక్కడ 17నెలలు పనిచేశారు. 2023 అసెంబ్లీతోపాటు పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 17 నెలల్లోనే ఆయనకు బదిలీ కాగా.. అంతే ప్రాధాన్యత గల మరో కమిషనరేట్ సీపీగా నియమితులయ్యారు. ఈస్ట్ జోన్ డీసీపీగా అంకిత్ కుమార్.. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న రవీందర్‌ను సీఐడీకి బదిలీ చేసిన ప్రభుత్వం... ఆయన స్థానంలో డీసీపీగా అంకిత్ కుమార్‌ను నియమించింది. 2020 బ్యాచ్‌కు చెందిన అంకిత్ కుమార్ గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ట్రైనీ ఐపీఎస్‌గా పనిచేశారు. క్రైం డీసీపీగా జనార్దన్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం డీసీపీగా బెదరకోట జనార్దన్ నియమితులయ్యారు. ప్రస్తుతం టీజీ ఎన్పీడీసీఎల్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా ఉన్న ఆయన 1989 ఎస్ఐ బ్యాచ్‌కి చెందిన వారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వివిధ పోస్టుల్లో పోలీసు అధికారిగా పనిచేశారు. సుమారు మూడేళ్లుగా ఎన్పీడీసీఎల్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా బదిలీ సూర్యాపేట ఎస్పీగా పనిచేస్తున్న సన్‌ప్రీత్ డీసీపీ రవీందర్ కూడా ట్రాన్స్ఫర్.. ఆయన స్థానంలో ఐపీఎస్ అంకిత్ క్రైం డీసీపీగా బెదరకోట జనార్దన్సూర్యాపేట ఎస్పీ నుంచి వరంగల్ కమిషనర్‌గా సన్‌ప్రీత్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్‌సింగ్ ప్రస్తు తం సూర్యాపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన 2012లో ములుగు ఏఎస్పీగా, వరంగల్ రూరల్ ఓఎస్డీగా పనిచేశారు. అనంతరం ఎల్బీ నగర్ డీసీపీగా, జగిత్యాల ఎస్పీగా కూడా విధులు నిర్వర్తించారు. -
10 నుంచి ఎఫ్ఎల్ఎన్ సర్వే నిర్వహించాలి
కాళోజీ సెంటర్: ఎంపిక చేసిన 50 పాఠశాలల్లో రెండో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరీక్షించడానికి ఈనెల 10, 11, 12 తేదీల్లో ఎఫ్ఎల్ఎన్ సర్వే చేయాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ సూచించారు. సర్వే నిర్వహించేందుకు డైట్ విద్యార్థులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా ఎంపిక చేసి రెండు రోజుల శిక్షణను కరీమాబాద్ పాఠశాలలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించి టాంజరీన్ యాప్‌లో నమోదు చేయాలని చెప్పారు. మొదటి రోజు తెలుగు, రెండో రోజు గణితం, మూడో రోజు ఆంగ్లంలో పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. రిస్సోర్స్పర్సన్స్ బి.కుమారస్వామి, ఎం రఘుపతి, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పాల్గొన్నారు. శోభారాణికి పురస్కారం నర్సంపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో నర్సంపేట లీడ్ గ్రంథాలయ నిర్వాహకురాలు కాసుల శోభారాణి శుక్రవారం ధాత్రిరత్న సేవా పురస్కారాన్ని అందుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నందుకు ఆమెకు రెడ్‌క్రాస్ సొసైటీ బాధ్యులు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ హైదరాబాద్ చైర్మన్ మామిడి భీంరెడ్డి, జిల్లా వైస్ చైర్పర్సన్ విజయకుమారి ఆమెను అభినందించారు. ఇంటర్ పరీక్షలకు 245 మంది గైర్హాజరు కాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 26 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. 5,152 మంది జనరల్ విద్యార్థులకు 4,979 మంది, 885 మంది ఒకేషనల్ విద్యార్థులకు 813 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మొత్తం 245 మంది గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. సరిపడా ఎరువులు, పురుగు మందులు ● ఎఫ్సీఓ మార్గదర్శకాల మేరకు నిల్వచేయాలి ● జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ● గొర్రెకుంటలో గోదాంల తనిఖీ గీసుకొండ: ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సీఓ) మార్గదర్శకాల ప్రకారం ఎరువులు, పురుగు మందులను నిల్వచేయాలని, లేదంటే వారికి నోటీసులు ఇచ్చి లైసెన్స్‌లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట పరిధిలోని ఎరువులు, పురుగుల మందుల గోదాములను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్లు, కోరమండల్ నిల్వగోదాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ మార్చి, ఏప్రిల్‌కు సరిపడా ఎరువులు, క్రిమిసంహారక మందులు రైతులకు అందుబాటులో ఉన్నాయని, మోతాదును మించి పంటలకు వేయవద్దని, వ్యవసాయ అధికారులు సూచనలను పాటించాలని కోరారు. గోదాంలలో గడువు ముగిసిన పురుగుల మందులను వేరుగా భద్రపరిచి లేబ్లింగ్ చేయాలని పేర్కొన్నారు. కంపెనీలు సంబంధిత పురుగుల మందుల ప్యాకింగ్‌పై తయారీదారు, అమ్మకందారు, ఉత్పత్తికి సంబంధించిన వివరాలను స్పష్టంగా ముద్రించాలని ఆదేశించారు. తనిఖీల్లో ఆమె వెంట మార్క్‌ఫెడ్ డీఎం వై.రజినీకాంత్‌రెడ్డి, ఏఓ హరిప్రసాద్‌బాబు, గోదాంల ఇన్చార్జ్ అశ్వక్‌అహ్మద్ ఉన్నారు. -
వివక్ష తగ్గినా వేధింపులున్నాయి..
కుటుంబాన్ని నడిపిస్తున్న మహిళామణులు104133Aమహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు కొనసాగుతున్నాయి. పనులు చేస్తున్న మహిళలకు కార్యాలయాల్లో వేధింపులు కొంతమేర కొనసాగుతు న్నా.. సెల్ఫోన్లలో కొందరు అసభ్యపదజాలంతో పంపిస్తున్న మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక సతమతమవుతున్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న వారిలో తెలిసిన వారితోపాటు తెలియని వారు ఉన్న ట్లు పలువురు మహిళలు చెబుతున్నారు. నాడు వంటింటికే పరిమితమైన మహిళ.. నేడు విద్య, ఉద్యోగం, నచ్చిన రంగంలో ఎదుగుతూ పురుషులతో సమానంగా పనిచేస్తోంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వేధింపులు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ 2) మీ కాలేజీ – పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..? ఎ) లేదు బి) ఉంది సి) చెప్పలేను 73B1701) మీ ఇంట్లో ఆడ – మగ వివక్ష ఏమైనా ఉందా..? ఎ) ఉంది బి) లేదు సి) చెప్పలేనుC7837623) మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశం? (ఎ) సెల్ఫోన్లో వచ్చే మెసేజ్‌లతో.. బి) బస్టాప్‌లో సి) కాలేజీ లేదా ఆఫీస్‌లో2001104) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిలో అత్యధికులు ఎవరు? ఎ) తెలియని వారు బి) తెలిసిన వారేషాంపిల్స్: 310 (గ్రేటర్వరంగల్ 60మంది, మిగతా ఐదు జిల్లాలు (వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు 50మంది చొప్పున) అన్ని వర్గాల మహిళలను పరిగణనలోకి తీసుకుని వారి అభిప్రాయాల సేకరణ. వారి సంకల్పం గొప్పది. ఆశయం ఉన్నతమైనది. హేళనలు, అవమానాలేమీ వారు చేసే పనులకు అడ్డంకి కాలేదు. ప్రతికూల పరిస్థితులెదురైనా, పురుషాధిక్య రంగమైనా వారు పట్టు వీడలేదు. అన్ని రంగాల్లోనూ మాదే పై చేయి అంటూ ముందుకు సాగుతున్నారు. చిన్నతనంలో వివాహమై భర్తను కోల్పోయిన ఒకరు కుటుంబానికి అండగా నిలబడితే.. మరొకరు పేదరికాన్ని పారదోలేందుకు నడుంకట్టారు. ఇంకొకరు విశ్వవేదికపైన జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశారు. నేడు(శనివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంకల్ప శక్తులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. హోటల్ నడుపుతూ.. పిల్లలను చదివిస్తూ.. చిట్యాల: మండల కేంద్రానికి చెందిన భీమారపు ఓదెలు హోటల్ నడుపుతూ జీవనం సాగించేవాడు. కట్టెల పొయ్యి కారణంగా అతడి చూపు దెబ్బతిన్నది. భార్య ప్రమీల 20 ఏళ్లుగా హోటల్ నడుపుతూ పిల్ల లను చదివిస్తోంది. గతేడాది పెద్దమ్మాయికి పెళ్లి చేసింది. మిగతా ఇద్దరు పీజీ, ఎంటెక్ చదువుతున్నారు. ఓదెలు కూరగాయలు కట్ చేసి వ్వడం, పిండి కలపడం వంటి పనుల్లో ఆమెకు సాయం చేస్తుంటాడు. తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.● విభిన్న రంగాల్లో రాణిస్తూ ఆదర్శం ● పురుషులకు దీటుగా బాధ్యతలు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంసంగెం: వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించింది సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దామెరుప్పుల రమాదేవి. ఆమెకు ఆర్నెళ్ల వయసులోనే జ్వరం వచ్చింది. కాళ్లు చచ్చుబడిపోయాయి. వైకల్యాన్ని జయించాలంటే చదువు ఒక్కటే మార్గమని.. నమ్మింది. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో కాంబోడియా దేశంలో ఇంటర్నేషనల్ త్రోబాల్ పోటీలకు మన దేశం తరఫున పాల్గొని మొదటి స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించింది. చీకట్లో ‘వెన్నెల’ సాక్షి, మహబూబాబాద్: దంతాలపల్లి మండలం పెద్దముప్పారానికి చెందిన గొడిశాల మల్లయ్య సుగుణమ్మల కుమార్తె వెన్నెల. పుట్టిన ఎనిమిదేళ్లకే తండ్రి మరణించాడు. ఆతర్వాత వెన్నెలను నర్సింహులపేట మండల కేంద్రంలోని అక్కా, బావ తీగల వెంకన్న, సుజాత చేరదీసి చదివించా రు. పదోతరగతి చదివిన వెన్నెలకు మహబూబా బాద్ మండలం పర్వతగిరికి చెందిన నారమళ్ల సంపత్తో వివాహం జరిపించారు. చిన్నతనంలో నే ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. మిర్చి పంట కు తామర పురుగు సోకడంతో కుటుంబం అప్పు ల పాలయ్యింది. అప్పుల బాధతో భర్త సంపత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో 19 ఏళ్లకే వెన్నెల వితంతువుగా మారింది. ఆరేళ్ల సాన్విక, మూడేళ్ల తన్వికతో పాటు తల్లి సుగుణమ్మ, అత్త, మామ పోషణ ఆమైపె పడింది. మహబూ బా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. మూగజీవాల నేస్తం.. డాక్టర్ అనిత లింగాలఘణపురం: మండల కేంద్రంలో పశువైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఆడెపు అనిత పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన అనిత 2019లో లింగాలఘణపురం పశువైద్యాధికారిగా విధుల్లో చేరారు. పశువైద్యశాల కు వచ్చే మూగ జీవాలకు వైద్యం చేస్తూనే.. వ్యవసాయబావులు దూరంగా ఉండి ఆస్పత్రికి రాలేని పశువుల వద్దకు స్వయంగా ద్విచక్రవాహనంపై వెళ్లి వైద్యం చేస్తున్నారు. పశువులకు కృత్రిమ గర్భధారణలో ప్రత్యేకత చాటుకున్నారు. 63 శాతం సక్సెస్ సాధించారు. పశువులు, గొర్రెలకు వ్యాక్సినేషన్‌ను నూటికి నూరు శాతం అమలు చేస్తూ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులకు నేస్తంగా మారిపోయారు. చేయి చేయి కలిపి.. పేదరికాన్ని తరిమి ఏటూరునాగారం: మండలంలోని శివాపురంలో ట్రైకార్ సాయంతో ఐటీడీఏ ద్వారా పది మంది మహిళలు సమ్మక్క–సారలమ్మ డిటర్జెంట్ సబ్బుల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ట్రైకార్ నుంచి 60 శాతం సబ్సిడీ, బ్యాంకు నుంచి 30 శాతం రుణం తీసుకుని పరిశ్రమ నడుపు తున్నారు. తయారు చేసిన సబ్బులకు ఒక్కోదానికి రూ.10గా ధర నిర్ణయించి గిరిజన సహకార సంఘానికి(జీసీసీ) విక్రయిస్తున్నారు. రోజుకు సుమారు 4 వేల సబ్బులు తయారు చేస్తున్నారు. ఐదేళ్లుగా కోటిన్నర రూపాయల వ్యాపారం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సబ్బుల తయారీలో ఆదర్శంగా నిలుస్తున్నారు. కట్టె కోత.. బాధ్యతల మోతకట్టెకోత మిల్లులో మగవారితో సమానంగా పని చేస్తోంది వరంగల్ నగరం నాగేంద్రనగర్‌కు చెందిన ఎండీ రజియా. భర్త అనారోగ్యం కారణంగా కుటుంబ భారం ఆమైపె పడింది. 15 ఏళ్లుగా నగరంలోని జగన్నాథం సామిల్లులో కట్టర్‌గా పనిచేస్తోంది. ముగ్గురు పిల్లల పెళ్లి చేయగా.. కూతురు కుటుంబంలో కలహాలు రావడంతో ఆమె తల్లివద్దే ఉంటోంది. వీరందరికీ రజియా పని చేస్తేనే భోజనం. సొంతిల్లు ఉంటే కొంత భారం తగ్గుతుందని రజియా అంటోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, వరంగల్ సమాచార వారధిగా పత్రికల సేవలు భేష్‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం వరంగల్ లీగల్ : ప్రజలకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సమాచార వారధిగా వార్తా పత్రిక లు నిలవాలని సాక్షి గెస్ట్ ఎడిటర్, వరంగల్ జిల్లా రెండో అదనపు జడ్జి (పోక్సో కోర్టు) మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయానికి శుక్రవారం ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వచ్చారు. ముందుగా జడ్జికి సాక్షి ఎడిషన్, బ్యూరో ఇన్చార్జులు వర్ధెల్లి లింగయ్య, గడ్డం రాజిరెడ్డి, లీగల్ రిపోర్టర్ జీవన్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మొదట ఎడిటోరియల్ విభాగానికి చేరుకున్నారు. ఫీల్డ్ నుంచి రిపోర్టర్లు పంపిన కాపీలు డెస్క్‌కు ఎలా చేరుతాయో పరిశీలించారు. ఎడిటోరియల్ విభాగాన్ని పరిశీలించి సబ్ ఎడిటర్లు వార్తలు దిద్దుతున్న తీరును గమనించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కాపీలను చూసి కావాల్సిన అదనపు అంశాలు, సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్‌ను పరిశీలించి పేజీ లేఔట్‌పై తగిన సూచనలిచ్చారు. సర్వే అంశాలు బాగున్నాయని, వాటిని ఎలా నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళలపై తెప్పించిన కథనాలను చూసి తగిన ఫొటోలు ఉన్నాయా.. లేవా? అని సరిచూసుకోవాలని, అక్షరదోషాలు లేకుండా దిద్దాలని సూచించారు. అనంతరం ఐటీ, ఏడీవీటీ, స్కానింగ్, సీటీపీ, ప్రొడక్షన్ విభాగాలను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. నూతన టెక్నాలజీతో అన్ని రంగుల్లో పత్రిక వెలువడుతున్న తీరును చూసి బాగుందని కితాబిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలివ్వాలి.. పత్రికలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే వార్తలు ఇవ్వాలని మనీషా శ్రవణ్ ఉన్నవ్ అన్నారు. న్యాయసంబంధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచురించాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలను జర్నలిజంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఆధారాలతో పరిశోధనాత్మక వార్తలు రాయాలని సూచించారు. మహిళా చైతన్యంలో పత్రికలు కీలకమని పేర్కొన్నారు. సాక్షి గెస్ట్ ఎడిటర్‌గా తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సాక్షి సిబ్బంది ఆమెకు శాలువా అందించి సన్మానించారు. మహిళల ‘సౌర’ సాగు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆమెకు అండగా.. పోకిరీల ఆట కట్టిస్తున్న ‘షీ’టీమ్ – 8లోuకూతుళ్లే మహారాణులు కొందరు ఒక్కరితో సరి.. ‘సాక్షి’ సర్వేలో మహిళల మనోగతం వార్తకు అనుగుణంగా శీర్షికలు ఉండాలి.. కచ్చితమైన సమాచారం ఉండేలా చూసుకోవాలి.. మహిళా దినోత్సవ కథనాలు బాగున్నాయని కితాబు -
అన్ని రంగాల్లో మహిళలకు గుర్తింపు
● కలెక్టర్ సత్యశారద వరంగల్: మహిళలకు అన్ని రంగాల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని కలెక్టర్ సత్యశారద అన్నారు. టీఎన్జీఓ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో కలెక్టర్ మాట్లాడారు. గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. తల్లిదండ్రుల పెంపకంలో కుమార్తెలు సెన్సిటివ్‌గా మారుతున్నారని పేర్కొన్నారు. మహిళలు అనగానే సానుభూతి, త్యాగాలకు ప్రతీక ఒకప్పటి మాట అని, ప్రస్తుతం కొన్ని సమయాల్లో కఠినత్వాన్ని ప్రదర్శించక తప్పదని కలెక్టర్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు. జ్యూట్ ఉత్పత్తులపై అవగాహన అవసరం జ్యూట్ ఉత్పత్తులపై అవగాహన అవసరమని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్‌లోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. జనపనార ఉత్పత్తులు ప్రజ ల దినచర్యలో భాగం కావాలని పేర్కొన్నారు. జనపనార ఉత్పత్తులు, మార్కెటింగ్ తదితర అంశాలతో కూడిన జూట్ మార్క్ ఇండియా పథకంపై భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, టెక్స్టైల్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ జె.నిశాంత్ మేత్రాస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ మహిళలకు వివరించారు. సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పొదుపు సంఘాల మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నాన్న.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు..
కాజీపేట రూరల్: పెళ్లి (marriage)చేసుకోవడం ఇష్టం లేదని ఓ విద్యార్థిని కాజీపేట జంక్షన్ రైల్వే(Kazipet Junction Railway) యార్డులో గురువారం తెల్లవారు జామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అదుపులోకి తీసుకోని ఆమె తండ్రికి అప్పగించిన సంఘటన కాజీపేటలో జరిగింది. జీఆర్పీ కానిస్టేబుల్ ఆర్.కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్ జిల్లాకు చెందిన నందిని హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఇంటికి వచ్చిన నందినికి పెళ్లి చేస్తానని చెప్పడంతో తల్లి కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నందిని బుధవారం ఇంటి నుంచి వచ్చి కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అదే రోజు రాత్రి నందిని కాజీపేటలో ప్రయాణికుడి సెల్‌ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నానని, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అప్రమత్తమై తండ్రి మహబూబాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సమాచారంతో కాజీపేట జీఆర్పీ పోలీసులు రైల్వే యార్డు ఆర్ఆర్ఐ సమీపంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నందినిని గుర్తించి అదుపులోకి తీసుకోని జీఆర్పీ స్టేషన్‌కు తరలించారు. తండ్రిని పిలిపించి జీఆర్పీ అధికారుల ఆదేశాలనుసారం నందినిని తండ్రి అప్పగించినట్లు ఆయన తెలిపారు.మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు, జరిమానామడికొండ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన మీరాల రాజు 2017, జూలై 22న సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటి ఎస్సై మధుప్రసాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, విచారణలో భాగంగా గురువారం కానిస్టేబుల్ వి.రాజేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాడు. ప్రాసిక్యూషన్ తరఫున ఎస్.దుర్గబాయ్ వాదించగా నిందితుడిపై నేరం రుజువైంది. దీంతో హనుమకొండ మొదటి అదనపు న్యాయమూర్తి చింతాడ శ్రావణ స్వాతి నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6,000ల జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపారు. -
ఖండాంతరాలు దాటిన ప్రేమ
కేసముద్రం : కొలంబియా(Colombian) యువతి, కేసముద్రం యువకుడు ప్రేమించుకుని(love marriage) పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం(Kesamudram) స్టేషన్‌కి చెందిన సాయిచైతన్య ఆస్ట్రేలియాలో(Australia) ఓ కంపెనీలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొలంబియా దేశానికి చెందిన రియా అదే కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించారు. వారి అంగీకారంతో గురువారం కేసముద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. -
Beer Bottle: బీర్ బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్..
వరంగల్: బీరు బాటిళ్లలో స్పూన్లు కనిపించడంతో మందుబాబులు కంగుతున్న సంఘటన గిర్నిబావిలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా జరిగిన ఓ శుభకార్యానికి వచ్చిన బంధుమిత్రులు కలిసి మద్యం సేవిస్తున్నారు. ఓ బాటిల్లో స్పూన్ మొత్తం ఉండగా.. మరో బాటిల్లో సగం విరిగిన స్పూన్ కనిపించింది. దీంతో ఆందోళన చెందిన మందుబాబులు స్థానికంగా తాము కొనుగోలు చేసిన మద్యం షాపు వద్దకు వెళ్లి యజమానిని నిలదీశారు. అయితే బాటిల్లో ఉన్న స్పూన్ బయటికి రావడం లేదు. ఖాళీ బాటిల్ తయారు చేసే క్రమంలోనే అందులో చేరి ఉంటుందని, అది గమనించకుండా మద్యం నింపారని గుర్తించారు. కేఎఫ్ లైట్ కంపెనీకి చెందిన బీర్లు కావడంతో షాపు యజమాని వాటిని వాపస్ తీసుకుని రెండు బాటిళ్లు మళ్లీ ఇచ్చాడు. ఈ ఘటనను సదరు కంపెనీ దృష్టికి తీసుకెళ్తామని షాపు నిర్వాహకులు తెలిపారు. -
అస్తిత్వానికి ఆయువు పట్టు ఆంగ్ల భాష
విద్యారణ్యపురి: ఆంగ్ల భాష మన ఆస్తిత్వానికి ఆయువు పట్టువంటిదని విభిన్న భాషా సంస్కృతులను గౌరవించేదిగా ఇంగ్లిష్ విలసిల్లాలని కెన్యా మసింది ములురో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కుప్పు రామ్ అన్నారు. గురువారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో ‘ట్రాన్స్ఫర్మేషన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఇన్ మల్టీ డిసిప్లీనరీ కాంటెక్ట్స్ ఇన్‌ది ఎరా’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కెన్యా యూనివర్సిటీ ప్రొఫెసర్ కీలకోపన్యాసం చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అధ్యాపకులు మెళకువలతో బోధించాలన్నారు. సదస్సులో 150 పరిశోధన పత్రాలు వచ్చాయి. ఓ జర్నల్ను ఆవిష్కరించారు. కేడీసీ ప్రిన్సిపాల్ జి.రాజారెడ్డి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంఈ.వేదశరణ్, కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాంభాస్కర్‌రాజు, పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి డాక్టర్ కె.సోమిరెడ్డి, స్టాఫ్ సెక్రటరీ రవీందర్, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, యూజీసీ గుర్తింపు పొందిన జర్నల్ ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ ప్రశాంత్ మోతె పాల్గొన్నారు. కెన్యా ప్రొఫెసర్ కుప్పు రామ్ కేడీసీలో అంతర్జాతీయ సదస్సు -
పొలం పశువుల పాలు
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన జడ రమేశ్‌కు గ్రామ శివారులో ఎకరం వ్యవసాయ భూమి, పొత్తుల బావి ఉంది. మరో ఎకరం పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. అప్పులు చేసి దాదాపు రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఎండల తీవ్రతకు బావిలో భూగర్భ జలాలు అడుగంటిపోయి బావిలో నీళ్లు తగ్గి వరికి సరిపడా సాగునీరు అందడం లేదు. దీంతో పంటంతా ఎండిపోతోంది. రెండెకరాల్లో ఎకరమైనా కాపాడుకుందామని మిగతా ఎకరాన్ని ఎండబెట్టి మూగజీవాలను మేపుతున్నాడు. గతంలో వేలేరు చెరువు నుంచి వచ్చే వాగు ద్వారా తమ బావిలోకి నీటి జల ఉండేదని, ప్రస్తుతం ఆ వాగు ద్వారా నీరు రాకపోవడంతో బావులు ఎండి పోతున్నాయని రమేశ్ తెలిపాడు. అధికారులు స్పందించి వేలేరు చెరువు నుంచి వాగు ద్వారా నీటిని విడుదల చేయాలని వేడుకుంటున్నారు. – ధర్మసాగర్న్యూస్రీల్ -
ఇంటర్ పరీక్షల్లో 480 మంది గైర్హాజరు
విద్యారణ్యపురి: ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లాలో 55 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో సందడిగా మారాయి. సెకండియర్ జనరల్ విభాగంలో 18,100 మంది విద్యార్థులకుగాను 17,659 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 441 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 869 మందికి గాను 830 మంది హాజరు కాగా.. వారిలో 39 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. మొత్తం 480 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కాగా.. హనుమకొండలోని వడ్డేపల్లి ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని, రెజోనెన్స్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి తనిఖీ చేశారు. వరంగల్ జిల్లాలో.. కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం 26 కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మొదటి రోజు 4,838 మంది జనరల్ విద్యార్థులకు 4,718 మంది హాజరు కాగా.. 120 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 668 మంది ఒకేషనల్ విద్యార్థులకు 635 మంది హాజరుకాగా.. 33 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. -
శివాలయ పునఃనిర్మాణానికి రూ. 50 లక్షల విరాళం
శాయంపేట: మండలంలోని కొప్పుల గ్రామంలో పునఃనిర్మించనున్న శ్రీ సాంబశివ దేవాలయానికి రూ.50 లక్షలు విరాళం ఇవ్వనున్నట్లు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త సామల పోతరాజు వెల్లడించారు. ఈసందర్భంగా పోతరాజు మాట్లాడుతూ.. తమ నానమ్మ, తాత, తల్లిదండ్రుల జ్ఙాపకార్థం గ్రామంలో నిర్మించే శివాలయానికి రూ. 50 లక్షలు విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. శివాలయానికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన పోతరాజును క్లాస్‌మెట్స్ అభినందించారు. అనంతరం గ్రామంలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న అడిదెల రాజిరెడ్డి, దేవుపైడి, మునుకుంట్ల రమేశ్‌ను మాజీ కార్పొరేటర్ ఎలగం లీలావతి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వల్లాల వెంకటరమణ, ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి, పోతుల వెంకటేశ్వర్లు, గోలి రఘోత్తంరెడ్డి, రాఘవ రెడ్డి, చిన్నాల సునిత, రమ, పద్మ, శ్రీహరి పాల్గొన్నారు. -
‘పొలంబాట’తో సత్ఫలితాలు
హన్మకొండ: విద్యుత్ అధికారులు చేపట్టిన పొలంబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రైతులకు ఉత్తమ సేవలు అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టింది. డీఈ, ఏడీఈ, ఏఈ, ఇతర అధికారులతోపాటు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి నేరుగా సమస్యలు తెలుసుకుంటున్నారు. రైతులు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈసందర్భంగా విద్యుత్ ప్రమాదాల పట్ల అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, కెపాసిటర్లు అమర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. వంగిన స్తంభాల, లూజ్ లైన్లు సరిచేయడం, మధ్య స్తంభాలు ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు పెంచడం వంటి అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. పొలాల్లో లూజ్ లైన్లు, ఎత్తు తక్కువగా విద్యుత్ లైన్లు ఉండడంతో వరి కోతల సమయంలో హార్వెస్టర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లూజ్ లైన్లు, కిందకు ఉన్న లైన్ల ఎత్తును పెంచుతున్నారు. ఎత్తు పెంచేందుకు 9.1 మీటర్ ఎత్తున్న విద్యుత్ స్తంభాలు నాటుతున్నారు. పరిష్కారమవుతున్న విద్యుత్ సమస్యలు క్షేత్రస్థాయికి వెళ్తున్న ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ వినియోగంపై రైతులకు అవగాహన హనుమకొండ జిల్లాలో 277, వరంగల్ జిల్లాలో 40 ‘పొలంబాట’ కార్యక్రమాలుహనుమకొండ జిల్లా (సర్కిల్)లో.. ఇప్పటివరకు 277 పొలంబాట కార్యక్రమాలు చేపట్టారు. 238 వంగిన స్తంభాలు, 703 లూజ్ లైన్లు సరి చేశారు. 1,179 మధ్యస్తంభాలు ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్యూర్ కాకుండా ఎర్తింగ్ సరిగ్గా ఉండేలా ఏర్పాట్లు చేశారు. తక్కువ ఎత్తులో ఉన్న 128 ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచారు. ప్రమాదకరంగా ఉన్న డబుల్ ఫీడింగ్, లో లెవెల్ లైన్ క్రాసింగ్లను తనిఖీ చేసి సరిచేస్తున్నారు. ఇప్పటివరకు 144 డబుల్ ఫీడింగ్, లో లెవెల్ లైన్ క్రాసింగ్లను మార్చారు. లైన్లు తక్కువ ఎత్తులో ఉన్న వాటి స్థానాల్లో 9.1 మీటర్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జిల్లా (సర్కిల్) పరిధిలో.. ఇప్పటివరకు 40 పొలంబాట కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో 236 వంగిన స్తంభాలు, 739 లూజ్లైన్లు సరిచేశారు. 659 మధ్యస్తంభాలు ఏర్పాటు చేశారు. తక్కువ ఎత్తులోఉన్న 98 ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచారు. ఇప్పటివరకు 76 డబుల్ ఫీడింగ్, 134 లో లెవెల్లైన్ క్రాసింగ్లను మార్చారు. హార్వెస్టర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలతోపాటు తక్కువ ఎత్తులో లైన్ల స్థానాల్లో 9.1 మీటర్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. -
ఉద్యోగుల ఆటా... పాట
హన్మకొండ అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు క్రీడా సాంస్కృతిక పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గురువారం కలెక్టరేట్లోని టీజీఓ కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంఘం రాష్ట్ర నాయకులు ఎన్నమనేని జగన్మోహన్రావు తెలిపారు. కార్యక్రమానికి వరంగల్ జిల్లా ప్రధాన జడ్జి నిర్మలా గీతాంబ, హనుమకొండ వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, మున్సిపల్ కమిషనర్ అశ్వినితానాజీ పాల్గొంటారని పేర్కొన్నారు. -
ప్రజలకు పోలీసులు ఉన్నారనే ధైర్యం కలిగించాలి
సీపీ అంబర్ కిషోర్ ఝా వరంగల్‌క్రైం : పోలీసులు ఉన్నారు.. మనకు సహాయం చేస్తారనే దైర్యాన్ని ప్రజలకు ఇవ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో ఇంటర్ సెప్టర్, పెట్రోకార్, హైవే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో సీపీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదు వచ్చిన వెంటనే ఫిర్యాదుదారు వద్దకు చేరుకొని సమస్యను తెలుసుకొని, అక్కడే పరిష్కరించడం లేదా పోలీస్ స్టేషన్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. రాత్రి సమయంలో ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి ఎక్కువగా పెట్రోలింగ్ విధులు నిర్వహించాలని, ఏదైనా సమస్య వచ్చిన వెంటనే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ తెలంగాణ పోలీస్ కీర్తీ ప్రతిష్టలు పెంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గంజాయి సిగరేట్!
కాజీపేట: దర్గాకాజీపేట శివారులోని రైల్వే ట్రాక్ సమీపంలో గురువారం సాయంత్రం ముగ్గురు యువకులు కూర్చుని సిగరేట్ పీల్చుతున్నారు. అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన రైల్వే పోలీసులు ఆ యువకులను గుర్తించి ఏం చేస్తున్నారంటూ మందలించారు. ఆ యువకులు తాగుతున్న సిగరేట్లను అక్కడే పడేసి పారిపోయారు. తీరా ఆ సిగరేట్లను పరిశీలించిన పోలీసులు ఆశ్యర్యపోయారు. గంజాయి సిగరేట్లు అని తెలుసుకుని అవాక్కయ్యారు. సిగరేట్ మాదిరే తయారు చేసుకుని పీల్చు తుండడం బట్టి చూస్తే నగరంలో ఈ గంజాయి పొడి లభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి ఘటనలు వరంగల్, మడికొండ, కాజీపేట శివారులోని బహిరంగ ప్రదేశాలు, కళాశాలల మైదానాల్లో వెలుగుచూస్తున్నాయి. ఈగంజాయి సిగరే ట్లను అరికట్టకపోతే విద్యార్థులు, యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పోలీసులతో పాటు ఎకై ్సజ్ అధికారులు తీవ్రంగా పరిగణించి వరంగల్ నగర వ్యాప్తంగా తనిఖీలను చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
విద్యతోనే మహిళా సాధికారత
కేయూ క్యాంపస్: విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ రైన వీసీ మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. వివిధ పదవుల నిర్వహణలో నూ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయంలో పరిపాలనా పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. మహిళలు మల్టీటాస్కర్స్ అన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారదను సన్మానించారు. మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ బి.రమ, అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.స్వప్న, పలువురు బోధన బేధనేతర సిబ్బంది పరిశోధకులు విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి ఘనంగా మహిళా దినోత్సవం -
పంపులను వినియోగంలోకి తేవాలి..
మేయర్ గుండు సుధారాణి వరంగల్: మోటారు పంపులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకతీయ ఫిల్టర్ బెడ్ (కేయూసీ)ని మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిల్టర్ బెడ్లో ఇటీవల దెబ్బతిన్న నీటి సరఫరా మోటారు పంపులను పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. వేసవి వచ్చినందున నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ఫిల్టర్‌బెడ్‌లో 3 రోజు లుగా పని చేయకుండా ఉన్న మోటారును పరిశీలించి కాంట్రాక్టర్‌తో మాట్లాడి ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఫిల్టర్‌బెడ్‌లో పురాతన నీటి పంపింగ్ స్టేషన్‌ను మేయర్ పరిశీలించారు. ఫిల్టర్‌బెడ్ ఆవరణలోని రాణి రుద్రమ విగ్రహం ఉన్న ప్రాంతంలో గులక రాళ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్ది హార్టికల్చర్ వారి సహకారంతో ఆ ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈలు మహేందర్, మాధవీలత, సంతోశ్‌బాబు, డీఈఈ రాజ్‌కుమార్, ఏఈలు హరికుమార్, సరిత పాల్గొన్నారు. -
ఏజే మిల్లు కార్మిక భవన స్థలం సర్వే
వరంగల్: వరంగల్ లక్ష్మీపురంలో ఉన్న ఏజే మిల్లు కార్మిక భవనం మ్యూటేషన్, రిజిస్త్రేషన్తో పాటు నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని ఏజే మిల్లు భూముల పరిరక్షణ సమితి జేఏసీ, పలు సంఘాల నాయకులు ఆందోళనలు చేశారు. పలుమార్లు కలెక్టర్ సత్యశారద, కమిషనర్ వాకడేకు వినతిపత్రాలు సమర్పించి ల్యాండ్ సర్వే విభాగంతో సర్వే చేయించాలని కోరారు. ఈనేపథ్యంలో గురువారం ల్యాండ్ సర్వే శాఖ ఏడీ దేవరాజ్, డీఏ భుజంగరావు, సర్వేయర్ సందీప్ కార్మిక భవనం స్థలాన్ని రీ సర్వే చేశారు. జేఏసీ నాయకులు స్థలం వద్దకు వచ్చి ఏడీతో కాకుండా డీడీ నేతృత్వంలో సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాలతోనే వచ్చామని అధికారులు తెలపడంతో నాయకులు సర్వేలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు గంగుల దయాకర్, ఆకెన వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల లక్ష్మణ్, డాక్టర్ కొనతం కృష్ణ, ఇనుముల శ్రీనివాస్, ఆరెళ్లి కష్ణ, జన్ను రమేశ్, కోమాకుల నాగరాజు, భాస్కర్, కార్మికులు పాల్గొన్నారు. -
కార్మికుల ఆరోగ్యానికి ప్రాధాన్యం
ఖిలా వరంగల్: హమాలీ కార్మికులు, వారి కుటుంబాల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అన్నారు. వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్డులో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, వరంగల్ ఎన్ఎస్ఆర్, అపోలో, ఎలైట్ హాస్పిటల్స్, కాకతీయ నేత్ర వైద్యశాల సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైల్వే గూడ్స్షెడ్డులో ఎరువులను అన్లోడ్, లోడింగ్ చేసే హమాలీ కార్మికులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వీరికి వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మండలాల వారీగా ఏర్పాటు చేయనున్న ఉచిత వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఏఓ సూచించారు. వైద్య పరీక్షలు చేయించుకున్న హమాలీ కార్మికులకు ఆమె మందులు అందజేశారు. వైద్యులు, సిబ్బంది, కోరమండల్ డివిజనల్ హెచ్ఆర్ సుధాకర్, సీనియర్ మేనేజర్ సజన్‌కుమార్, ఆర్ఎల్ఎం శేషుకుమార్, గాయత్రి, సుమన్, శ్రీధర్, నరేశ్, కార్మిక నేత సారయ్య, అవంతి మేనేజర్ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ -
విద్యతోనే మహిళా సాధికారత : కేయూ వీసీ
కేయూ క్యాంపస్: విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. వివిధ పదవుల నిర్వహణలోనూ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయంలో పరిపాలనా పదవుల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. మహిళలు మల్టీటాస్కర్స్ అన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారదను సన్మానించారు. మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ బి.రమ, అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.స్వప్న, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
11న జిల్లాస్థాయి యువజనోత్సవాలు
వరంగల్: బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 11న నిర్వహించనున్న జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. యంగ్ రైటర్స్, యంగ్ ఆర్టిస్ట్, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, సాంస్కృతిక జానపద నృత్యం (గ్రూప్), సైన్‌న్స్ ఎగ్జిబిషన్ (గ్రూప్, వ్యక్తిగత) అంశాల్లో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచ ప్రాణ్ అంశంపై పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. గ్రూప్, ఫోక్‌డ్యాన్స్, ఫొటోగ్రఫీ కాంపిటీషన్లో పంచ్ ప్రాణ్ అంశం వర్తించదని వివరించారు. ఉత్సాహవంతులైన ఫొటోగ్రాఫర్లు తమ సెల్ఫోన్లు, తెచ్చుకున్న కెమెరాలతో పోటీ ప్రదేశంలో ఇచ్చిన థీమ్స్‌ను ఫొటోలు తీసి చూపిస్తారని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతితోపాటు ప్రశంసపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. జిల్లాలోని యువజన సంఘాలు, కళాశాల విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 76758 24707/95733 93831 నంబర్లలో సంప్రదించాలని అన్వేష్ సూచించారు. -
11న వరంగల్ జిల్లాస్థాయి యువజనోత్సవాలు
వరంగల్: బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 11న నిర్వహించనున్న వరంగల్ జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. యంగ్ రైటర్స్, యంగ్ ఆర్టిస్ట్, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, సాంస్కృతిక జానపద నృత్యం (గ్రూప్), సైన్స్ ఎగ్జిబిషన్ (గ్రూప్, వ్యక్తిగత) అంశాల్లో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచ ప్రాణ్ అంశంపై పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. గ్రూప్, ఫోక్‌డ్యాన్స్, ఫొటోగ్రఫీ కాంపిటీషన్లో పంచ్ ప్రాణ్ అంశం వర్తించదని వివరించారు. ఉత్సాహవంతులైన ఫొటోగ్రాఫర్లు తమ సెల్ఫోన్లు, తెచ్చుకున్న కెమెరాలతో పోటీ ప్రదేశంలో ఇచ్చిన థీమ్స్‌ను ఫొటోలు తీసి చూపిస్తారని పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతితోపాటు ప్రశంసపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. జిల్లాలోని యువజన సంఘాలు, కళాశాల విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 76758 24707/95733 93831 నంబర్లలో సంప్రదించాలని అన్వేశ్ సూచించారు. -
ఇళ్ల పనులు షురూ..
సాక్షి, వరంగల్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పనులను గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరి 21న నారాయణపేటలో ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్ ఉండడంతో ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోసే కార్యక్రమం ఆగింది. తమకు శుభ ముహూర్తం ఉందని కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొనకుండానే కొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులు ముగ్గు పోసుకున్నారు. ఎన్నికల కోడ్ ఎత్తేయడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసే కార్యక్రమానికి గురువారం నుంచి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న 13 మోడల్ విలేజ్‌ల్లో గుర్తించిన 1,162 మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ముగ్గు పోసే సమయంలో తప్పకుండా పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారికి సమాచారం ఇవ్వాల్సి ఉంది. లబ్ధిదారులు వారికి సమాచారం ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో నిర్మాణాల అనంతరం మున్సిపాలిటీలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీకారం చుడతారు. అక్కడ లబ్ధిదారుల సర్వే సైతం పూర్తయ్యింది. ‘పునాది పనులు పూర్తయిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మొదటి విడత రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు. 400 చదరపు అడుగుల కంటే తక్కువ కాకుండా ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కూపన్లను తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందాలి’ అని గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారి గణపతి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 2,33,779 దరఖాస్తులు వస్తే 2,32,029 సర్వే పూర్తి చేశాం. తొలుత మోడల్ విలేజ్‌లో ఈ పథకానికి శ్రీకారం చుట్టి ఆ తర్వాత విడతల వారీగా మిగిలిన గ్రామాల్లో చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక ఇలా.. ● సొంత స్థలం ఉండి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్–1 కింద విభజించారు. వారు చూపిన స్థలాన్ని జియో ఫెన్సింగ్ చేశారు. ● సొంత భూమి లేని వారిని ఎల్–2 జాబితాలో చేర్చారు. వారికి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.ఐదు లక్షలు కేటాయిస్తారు. ● అద్దెకున్నవారు, సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నవారిని ఎల్–3 జాబితాలో చేర్చారు. ఎన్నికల కోడ్ ఎత్తేయడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం 13 మోడల్ విలేజ్‌ల్లో 1,162 మంది అర్హులు పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేతల కార్యక్రమాలుగ్రామాల వారీగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాల వివరాలు మండలం గ్రామం ఎల్ 1 ఎల్ 2 ఎల్ 3 చెన్నారావుపేట అమీనాబాద్ 171 29 300 దుగ్గొండి రేకంపల్లి 81 18 225 ఖానాపురం రంగంపేట 129 5 180 నల్లబెల్లి రామతీర్థం 46 13 103 నర్సంపేట పర్శనాయక్ తండా 98 24 79 నెక్కొండ బొల్లికొండ 183 5 300 రాయపర్తి మహబూబ్‌నగర్ 102 9 186 గీసుకొండ కోనాయమాకుల 34 12 338 సంగెం షాపూర్ 134 1 211 పర్వతగిరి జమలాపురం 74 6 126 వర్ధన్నపేట వెంకట్రావుపల్లి 110 14 103 మొత్తం 1,162 136 2,151 -
శ్రీరంగానికి ఉగాది పురస్కారం
పర్వతగిరి: మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గజవెల్లి శ్రీరంగం విశ్వశాంతి జాతీయస్థాయి ఉగాది పురస్కారం అందుకున్నారు. 30 సంవత్సరాలుగా జిల్లాలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదే రాష్ట్రాలతోపాటు రేడియో, టీవీ, రవీంద్రభారతిలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. అతడి ప్రతిభను గుర్తించిన శ్రీఆర్యాని సకల కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ దూడపాక శ్రీధర్ జాతీయస్థాయి ఉగాది పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఈనెల 5న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీరంగానికి అవార్డు అందజేసి సత్కరించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభంకాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా గురువారం 26 కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయని ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. మొదటి రోజు 4,838 మంది జనరల్ విద్యార్థులకు 4,718 మంది హాజరు కాగా.. 120 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 668 మంది ఒకేషనల్ విద్యార్థులకు 635 మంది హాజరుకాగా.. 33 మంది గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ లేకుండా ప్రశాంతంగా పరీక్షలు ప్రారంభమయ్యాయని డీఐఈఓ వివరించారు. శివలింగాన్ని తాకిన సూర్య కిరణాలుచెన్నారావుపేట : మండల కేంద్రంలోని శ్రీసిద్ధేశ్వరాలయంలోని శివలింగాన్ని గురువా రం ఉదయం సూర్య కిరణాలు తాకా యి. ఈ సమయంలో అర్చకులు బీఎం శాస్త్రి, సాయిశాస్త్రి, గణేశ్శాస్త్రి మాట్లాడుతూ సూర్యకిరణాలు శివుడిని తాకడం శుభపరిణామమని, ప్రతి సంవత్సరం వసంత రుతువులో సూర్యకిరణాలు ఒకసారి తప్పనిసరిగా సిద్ధేశ్వరుడిని తాకుతాయని చెప్పారు. భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఆటో బోల్తా.. ఒకరి మృతినర్సంపేట రూరల్: ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడిన సంఘటన నర్సంపేట శివారులోని కమలాపురం క్రాస్‌రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట గ్రామానికి చెందిన పోశాల పూలమ్మ, కాకి స్వామి (55) ముత్తోజిపేట నుంచి ఆటోలో నర్సంపేట వైపు వెళ్తున్నారు. కమలాపురం క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా కారు రావడంతో ఆటో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో కిందపడిపోయింది. ఆటోలో నలుగురు ఉండగా పోశాల పూలమ్మ, కాకి స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. కాకి స్వామి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య కోమల, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి గీసుకొండ/సంగెం: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గీసుకొండ మండలం కోనాయమాకుల, సంగెం మండలం షాపూర్లో అల్లం అనురాధ, రేష్మా, మదీన, కొయ్యల శ్రీలత లబ్ధిదారుల ఇళ్లకు గురువారం ఆయన ముగ్గుపోసి, భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని నాలుగు విడతల్లో అందజేస్తుందని తెలిపారు. కోనాయమాకులలో జరిగిన కార్యక్రమంలో హౌసింగ్ డీఈ జ్ఞానేశ్వర్, గీసుకొండ ఎంపీడీఓ వి.కష్ణవేణి, తహసీల్దార్ ఎండీ.రియాజుద్దీన్, ఎంపీఓ ఆడెపు ప్రభాకర్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి్, పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అదేవిధంగా షాపూర్లో జరిగిన కార్యక్రమంలో హౌసింగ్ పీడీ గణపతి, డీఈ లాల్‌కృష్ణ, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీఓ కొమురయ్య, సొసైటీ చైర్మన్ సంపత్‌గౌడ్, మాజీ సర్పంచ్ పేరాల రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘పొలంబాట’తో సత్ఫలితాలు
హన్మకొండ: విద్యుత్ అధికారులు చేపట్టిన పొలంబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రైతులకు ఉత్తమమైన సేవలు అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టింది. డీఈ, ఏడీఈ, ఏఈ, ఇతర అధికారులతోపాటు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి నేరుగా సమస్యలు తెలుసుకుంటున్నారు. రైతులు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ప్రమాదాల పట్ల అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, కెపాసిటర్లు అమర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. వంగిన స్తంభాలు, లూజ్ లైన్లు సరిచేయడం, మధ్య స్తంభాలు ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు పెంచడం వంటి అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. పొలాల్లో లూజ్ లైన్లు, ఎత్తుగా తక్కువగా విద్యుత్ లైన్లు ఉండడంతో వరి కోతల సమయంలో హార్వెస్టర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లూజ్ లైన్లు, కిందకు ఉన్న లైన్ల ఎత్తును పెంచుతున్నారు. ఎత్తు పెంచేందుకు 9.1 మీటరు ఎత్తున్న విద్యుత్ స్తంభాలు నాటుతున్నారు.పరిష్కారమవుతున్న విద్యుత్ సమస్యలు క్షేత్రస్థాయికి వెళ్తున్న ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ వినియోగంపై రైతులకు అవగాహన హనుమకొండ జిల్లాలో 277, వరంగల్ జిల్లాలో 40 పొలంబాట కార్యక్రమాలువరంగల్ జిల్లా (సర్కిల్) పరిధిలో.. ఇప్పటివరకు 40 పొలంబాట కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో 236 వంగిన స్తంభాలు, 739 లూజ్లైన్లు సరిచేశారు. 659 మధ్యస్తంభాలు ఏర్పాటు చేశారు. తక్కువ ఎత్తులోఉన్న 98 ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచారు. ఇప్పటివరకు 76 డబుల్ ఫీడింగ్, 134 లో లెవెల్లైన్ క్రాసింగ్లను మార్చారు. హార్వెస్టర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలతోపాటు తక్కువ ఎత్తులో లైన్ల స్థానాల్లో 9.1 మీటరు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల ముంగిట్లో విద్యుత్ అధికారులు.. పొలంబాట ద్వారా రైతుల ముంగిటికి విద్యుత్ అధికారులు వెళ్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. రైతులకు సేవలు అందించేందుకు అధికారులందరం కంకణబద్ధులై ఉన్నాం. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రైతులు జాగ్రత్తగా ఉండాలి. – కె.గౌతంరెడ్డి, వరంగల్ సర్కిల్ ఎస్ఈ -
పెంపుడు కుక్క హఠాన్మరణం.. మంత్రి కొండా సురేఖ కన్నీరుమున్నీరు
సాక్షి, వరంగల్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ పెంపుడు కుక్క గుండెపోటుతో మృతి చెందడంతో భావోద్వేగానికి లోనైనా మంత్రి.. కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటుతో చనిపోయిన హ్యాపీకి మంత్రి కొండా కుటుంబం.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హ్యాపీ హఠాన్మరణంతో సురేఖ కుటుంబీకులు, సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.గత కొన్నాళ్లుగా హ్యాపీతో మధుర అనుభూతులను మంత్రి సురేఖ, స్టాఫ్ పంచుకున్నారు. 2021లో కూడా కొండా సురేఖకు చెందిన ఓ పెంపుడు కుక్క మృతి చెందితే ఆ సమయంలోనూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Minister Konda Surekha breaks down in tears over sudden death of pet dog ‘Happy’pic.twitter.com/f87jhedaPA— Naveena (@TheNaveena) March 6, 2025 -
పెళ్లింట తీవ్ర విషాదం..
సాక్షిప్రతినిధి, వరంగల్: బంధువులు, అతిథుల మధ్య అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి జరిపించాడు. పెళ్లింటి నుంచి సొంతింటికి వచ్చి వ్రతం చేసుకుంటున్నారు. అంతలోనే బంధువులతో కళకళలాడుతున్న ఆ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్‌తో పెళ్లి కొడుకు తండ్రి మృతి చెందాడు. ఈ ఘటనతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని సుందరయ్య కాలనీ గ్రామానికి చెందిన అక్కిసెట్టి ఏసుబాబు(48)కి భార్య కుమారి, ఇద్దరు కుమారులు హరికృష్ణ, శివ కృష్ణ ఉన్నారు. పెద్ద కొడుకు హరికృష్ణకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన యువతితో సోమవారం(మార్చి 3) పెళ్లి జరిపించాడు. అనంతరం వధూవరులను తీసుకుని తమ ఇంటికి వచ్చాడు. మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తున్నాడు. అదే సమయంలో తనకు అలసటగా ఉందని, వ్రతంలో కూర్చో లేనని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కొత్త జంటతో పాటు వరుడి తల్లి వ్రతంలో కూర్చున్నారు. ఈ క్రమంలో ఏసుబాబు కాళ్లు, చేతులు లాక్కురావడం చూసిన బంధువులు వెంటనే ఆర్ఎంపీతో పరీక్షించగా బీపీ పెరిగినట్లు తెలిపి వెంటనే మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని చెప్పాడు. దీంతో ఏటూరు నాగారం తీసుకు వెళ్లగా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వరంగల్ తీసుకెళ్లాలని అక్కడి ప్రైవేట్ వైద్యుడు తెలుపగా వెంటనే వరంగల్ ఎంజీఎం తరలించారు. వైద్యం చేస్తుండగా బుధవారం మృతి చెందాడు. దీంతో కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. -
జోరుగా.. హుషారుగా..
సాక్షి ప్రతినిధి, వరంగల్: పదేళ్ల కిందటే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చినా 2019 వరకు అవి మెట్రో నగరాలను దాటి రాలేదు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు పలు కంపెనీలు మంచి ఫీచర్ బైక్‌లతో షోరూంలు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ బైక్స్, ఆటోలు, కార్ల అమ్మకాలు పరుగులు పెడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల బాటలో వరంగల్ పయనిస్తోంది వరంగల్ మహా నగరం రోడ్ల మీద ఎలక్ట్రిక్ వాహనాల సంచారం పుంజుకుంటోంది. ఇవి స్మార్ట్ వాహనాలు కూడా కావడంతో టెక్నాలజీ ప్రియులను మరింతగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సీసీ, తారు రోడ్ల సౌకర్యం పెరిగి వాహనాలు, ఈవీ వాహనాల సంఖ్య పెరిగినట్లు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ర్‌స్టాక్ట్ (అట్లాస్)–2024 గణాంకాలు చెబుతున్నాయి. మెరుగైన రవాణా సౌకర్యం.. పెరుగుతున్న వాహనాలు తెలంగాణలో జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులు మెరుగయ్యాయి. ఇదే సమయంలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ తదితర ద్వితీయశ్రేణి నగరాల్లోనూ తారు, సీసీ రోడ్లు పెరిగాయి. మొత్తంగా తెలంగాణలో మొత్తం రోడ్ల పొడ వు 1,10,756.39 కిలోమీటర్లు కాగా, ఇందులో సి మెంట్ రోడ్లు 11,438.06 కి.మీ.లు, తారు రోడ్లు (బ్లాక్ టాప్) 59,499.25 కి.మీ.లు, మెటల్ రోడ్లు 8,291.77 కి.మీ.లుగా ఉన్నాయి.ఇందులో 28,707.43 కి.మీ.లు రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షణలో ఉండగా, 68,539.27 కి.మీ.లు పంచాయతీరాజ్ (పీఆర్ఈడీ), 4,497.0 కి.మీ.ల పొడవు గల 30 రోడ్లు జాతీయ రహదారుల పరిధిలో ఉన్నాయి. జీహెచ్ఎంసీలో 9,013 కి.మీ.ల పొడవు రహదారులు ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో మూడేళ్లలో బైక్‌లు, కార్లు, జీపులు, లారీలు తదితర వాహనాల రిజి్రస్టేషన్లు కూడా పెరిగినట్లు వెల్లడించారు. 2020–21లో 8,79,826 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, 2022–23లో 9,51,780, 2023–24లో 9,76,073 వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుండగా.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తర్వాత వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో కూడా ఈవీ వాహనాల సందడి పెరిగింది. స్మార్ట్ సిటీస్.. ‘ఇ–స్మార్ట్’ వెహికిల్స్ మోడల్, బ్రాండ్, బ్యాటరీ కెపాసిటీ, ఇంజన్ సామర్థ్యం బట్టి రూ.44,900ల నుంచి రూ.3.10 లక్షల ధరతో ఎలక్ట్రిక్ బైక్స్ లభిస్తున్నాయి. రూ.12 లక్షల నుంచి రూ.23.49 లక్షల వరకు కార్లు ప్రస్తుత మార్కెట్లో ఉన్నాయి. హీరో ఎలక్ట్రిక్ ఆఫ్టిమా ఎల్ఏ, ప్యూర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్, ఓలా, ఒకినవా, ఆంపియర్ తదితర కంపెనీలు షోరూంలను ఏర్పాటు చేశాయి. ఈ–కార్ల విషయానికొస్తే టాటా నెక్సాస్ ఈవీ, మహీంద్రా ఈ2వో ప్లస్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, టాటా టిగోర్ తదితర ఈవీలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర కంపెనీని బట్టి రూ.8.98 లక్షల నుంచి రూ.26.27 లక్షల వరకు పలుకుతోంది. గంటన్నర నుంచి 9 గంటల వరకు చార్జింగ్ చేస్తే గంటకు 80 నుంచి 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 110 నుంచి 471 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నారు. ఈవీలో వినియోగం పెంచేందుకు తెలంగాణ వ్యాప్తంగా విరివిగా విద్యుత్ కంపెనీల ఆధ్వర్యంలో చార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) మేనేజర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ తర్వాత.. గ్రేటర్ వరంగల్‌లోనే మెట్రో, స్మార్ట్‌సిటీల్లో ఎలక్ట్రిక్ వాహనాలు పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల తర్వాత వరంగల్ ట్రైసిటీస్లోనే ఎ క్కువగా ఈవీ బైక్‌లు, కార్లు తిరుగుతున్నట్లు చెబుతున్నారు. రవాణాశాఖ గణాంకాల ప్రకారం 2022, మార్చి వరకు గ్రేటర్ వరంగల్‌లో మొత్తం 853 ఎలక్ట్రిక్ వాహనాలు రిజి్రస్టేషన్ కాగా, 2023 మార్చి నాటికి 3,289 ఈవీ వాహనాలు నమోదు కాగా.. 2024 డిసెంబర్ వరకు 4,309 ఎలక్ట్రిక్ బైకులు, ఆటోలు, కార్ల విక్రయాలు జరిగాయి. 2023–24 అట్లాస్ రిపోర్టు ప్రకారం హైదరాబాద్‌లో 15,290, మేడ్చల్ మల్కాజిగిరిలో 14,860, రంగారెడ్డిలో 11,882, సంగారెడ్డిలో 2,224 ఈవీ బైక్‌లు, కార్లు, ఇతర వాహనాలు రిజి్రస్టేషన్ అయ్యాయి. మిగతా జిల్లాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం ప్రోత్సాహం పర్యావరణానికి మేలు చేసే (ఈవీలు)ఎలక్ట్రిక్ వాహనాల ను కొనుగోలు చేసేలా ప్రభు త్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాహనాలకు రిజి్రస్టేషన్ ఫీజు ఉండదు. రూ.లక్షకు 14 శాతం వరకు ఉండే జీవితకాల పన్ను మినహాయింపు కూడా లభిస్తోంది. నిర్వహణ వ్యయం పూర్తిగా తగ్గింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా విద్యుత్ వాహనాలు 2024–2025లో రెట్టింపుస్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. – జైపాల్‌రెడ్డి ఎంవీఐ, వరంగల్ ఈవీతో ఖర్చులు తగ్గించుకున్నా గతేడాది ఎలక్ట్రిక్ ఈవీ బైక్ కొనుగోలు చేశా. గతంకంటే రోడ్లు బాగున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేవు. పెట్రోల్ వాహనం ఉన్నప్పుడు నెలకు పెట్రోలుకు రూ.2 వేలు, మరమ్మతులకు రూ.600లు ఖర్చయ్యేవి. ఈవీ బైక్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఖర్చులు తగ్గించుకున్నా. రెండు రోజులకోసారి చార్జింగ్ పెడితే 90 కిలో మీటర్లు ప్రయాణిస్తున్నా. మెయింటెనెన్స్ ఖర్చులు లేవు. చాలా ఆదా అవుతోంది. – నీర్ల శశికుమార్ వరంగల్, ఈవీ బైక్ యజమాని హ్యపీగా ప్రయాణం చేస్తున్నాం ఇటీవల మా బంధువులకు లాంగ్ వేరియంట్ విద్యుత్ కారును కొనుగోలు చేశా. వాహనంతో పాటు 35 కిలోవాట్ల బ్యాటరీ వచి్చంది. 8 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ బ్యాటరీ చార్జింగ్ పెడితే హ్యాపీగా 300 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ట్రాఫిక్ సమస్యలతో మరింత ఎక్కువ ఇంధనం ఖర్చు కావటం వల్ల కార్ల వినియోగం భారమైంది. ఈవీ కారుతో ఖర్చును వేల రూపాయల్లో తగ్గించుకున్నాం. – గోనెల రాంప్రసాద్, వరంగల్ -
నాణ్యతా ప్రమాణాల పరిశీలన
కమలాపూర్: కమలాపూర్ పీహెచ్సీ పరిధి గూడూరు, ఉప్పల్ పీహెచ్సీ పరిధి గుండేడు, ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (ఏఏఎం)లను జాతీయ నాణ్యతా ప్రమాణాల కోసం ఎన్‌క్వాస్ రాష్ట్ర కన్సల్టెంట్ వినయ్ మంగళవారం పరిశీలించారు. ఇందులో భాగంగా.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల భవన నిర్మాణం, హెర్బల్ గార్డెన్, బయో మెడికల్ వేస్టేజీ, రోగులకు అందుతున్న సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసి వాటి బలోపేతానికి నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమాల్లో ఎన్హెచ్ఎం ప్రోగ్రాం అధికారి ఎండీ.రుక్మోద్దీన్, జిల్లా నాణ్యతా ప్రమాణాల ఇన్చార్జ్ మేనేజర్ సాగర్, వైద్యాధికారి డాక్టర్ పద్మజ, ఏఏఎం వైద్యులు సంయుక్త, మాధవి, సిబ్బంది పాల్గొన్నారు. -
రెవెన్యూ అధికారుల సర్వే
కమలాపూర్: మండలంలోని శ్రీరాములపల్లిలో రెవెన్యూ అధికారులు మంగళవారం సర్వే నిర్వహించారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిలువేరు శ్రీనివాస్‌పై కలెక్టర్‌కు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే చేశారు. గ్రామంలోని 286/సీ/2లో 9 గుంటలు, 287/ఏ/2లో 1.11 ఎకరాలు, 287/ఈ/2లో 26 గుంటల చొప్పున మూడు సర్వే నంబర్లలో మొత్తం 2.06 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని శ్రీనివాస్ గతేడాది సెప్టెంబర్‌లో తన పేరిట విరాసత్ పట్టా చేయించుకున్నాడని, తాము అదే భూములను 30, 40 ఏళ్ల క్రితం కొని ఇళ్లు నిర్మించుకున్నట్లు, పట్టా రద్దు చేసి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కలెక్టర్, ఆర్డీఓ ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు ఇన్చార్జ్ తహసీల్దార్ శోభారాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సర్వేయర్ గోపీకృష్ణ గ్రామానికి వెళ్లారు. ఆభూములను సర్వే చేసి భూముల్లో ఉన్న ఇళ్లు ఎన్ని, ఖాళీ స్థలం ఎంత? అనే వివరాలతో లొకేషన్ మ్యాప్ రూపొందించారు. సర్వే నివేదికను ఆర్డీఓకు అందజేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా.. భూములకు ఇంటినంబర్లు ఎలా కేటాయించారు? శ్రీనివాస్ పాస్‌బుక్ ఎందుకు రద్దు చేయకూడదో పూర్తి ఆధారాలతో పంచాయతీ కార్యదర్శి ఈనెల 7న హనుమకొండ ఆర్డీఓ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. -
జిల్లాను అగ్రభాగాన నిలపాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పని చేసి జిల్లాను అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో అగ్రభాగాన నిలపాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొని డైరీని ఆవిష్కరించారు. అనంతరం టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములై కలెక్టర్ మార్గదర్శకంలో సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం హనుమకొండ సిటీ ఉద్యోగుల క్యాలెండర్, పంచాయతీ కార్యదర్శుల క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ నాయకులు బైరి సోమయ్య, వేణుగోపాల్, పనికెల రాజేశ్, శ్యాంసుందర్, రామునాయక్, మోయిజ్, ల క్ష్మీప్రసాద్, ప్రణయ్, పృధ్వీ, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, నరేశ్, నాయకులు రాజమౌళి, సురేశ్, రాజేశ్‌ఖన్నా, రాజ్యలక్ష్మి, సింధురాణి, పావని, శ్రీలత ఉన్నారు. విస్తృత అవగాహన కల్పించాలి దివ్యాంగులకు ఇస్తున్న సదరం ధ్రువీకరణ పత్రానికి బదులు ప్రత్యేక యూనిక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ కార్డు (యూడీఐడీ) జారీ నేపథ్యంలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో యూడీఐడీ మార్గదర్శకాలపై అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ అంబి శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి జయంతి పాల్గొన్నారు. అర్హుల జాబితాను సిద్ధం చేయండి జిల్లాలో ‘మిషన్ వాత్సల్య’ పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మిషన్ వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులు లేని బాలబాలికలకు మొదటి ప్రాముఖ్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, బాల రక్షాభవన్ జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ అవంతి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్చార్జ్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, సీడబ్ల్యూజీ మెంబర్ సుధాకర్, ఎఫ్ఎంఎంఎస్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక, శిశుగృహ ఇన్చార్జ్ మేనేజర్ మాధవి, సోషల్ వర్కర్లు శ్రీనివాసులు, సునీత, చైతన్య పాల్గొన్నారు. -
5
నిమిషాలు ఆలస్యమైనా అనుమతివిద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు నిర్ధేశించిన సమయం ఉదయం 9గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చినవారిని అనుమతించబోరు. ఈసారి పరీక్ష కేంద్రాన్ని గుర్తించేలా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించారు. ఈ మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారంనుంచి ఇంటర్ ఫస్టియర్, 6వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. మంగళవారం అన్ని పరీక్ష కేంద్రాల్లో సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. హనుమకొండ జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తంగా 39,980మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికోసం 55 సెంటర్లు ఏర్పాటు చేశారు. 55 మంది చీఫ్‌సూపరింటెండెంట్లను, 55 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను 1050మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల కేంద్రాలకు 42మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. వరంగల్ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 12,321 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. వీరికి 26 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. అన్నిచోట్లా నిఘా అన్ని సెంటర్లలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుచేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన ద్వారం వద్ద, ప్రిన్సిపాల్ గది, వరండా, ఒకవేళ పరీక్ష పూర్తయ్యాక వేరే గదిలోజవాబు పత్రాల ప్యాకింగ్ చేస్తే అక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని హై దరాబాద్‌లోని ఇంటర్‌బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. సంబంధిత ఉన్నతాధికారులు అక్కడి నుంచే ప్రతీ పరీక్ష కేంద్రంలోకి వచ్చి వెళ్లేవారు ఎవరనేది పరిశీలించే అవకాశం ఉంది. సెంటర్ సమీపంలో 144 సెక్షన్, జిరాక్స్ సెంటర్ల మూసివేత ఉంటుంది. కేంద్రాల్లో వసతుల కల్పన పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీటి సదుపాయం కల్పించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారు. పరీక్షల సమయానికనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8–15 గంటలనుంచే లోనికి అనుమతిస్తారు. ఫోన్లు అనుమతించరు. ఫీజుల పేరుతో కళాశాల యాజమాన్యం హాల్‌టికెట్ ఇవ్వకుంటే.. టీజీబీఐఈ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం క ల్పించారు. ఆ హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని, అలా ఎవరైనా హాల్‌టికెట్‌తో వచ్చినా అనుమతించాలని ఇప్పటికే డీఐఈఓ సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. నేటినుంచి ఇంటర్ పరీక్షలు కేంద్రాల్లో అన్ని వసతులు పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 చట్టం అమలు వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల పరిఽధిలో 163 బీఎన్ఎస్ చట్టం అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండడం, ర్యాలీలు, సభలు, ధర్నాలు, సమావేశాలు, ఊరేగింపులు చేయడం నిషేధమని పేర్కొన్నారు. పరీక్ష సమయాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, ఎవరైనా ఉత్తర్వులు అత్రికమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వైభవంగా శివపార్వతుల రథోత్సవం
మడికొండ: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక రథంపై ప్రతిష్టించి వైభవంగా రథోత్సవం నిర్వహించారు. మడికొండలోని ప్రధాన వీధుల్లో ఉరేగించారు. రథానికి భక్తులు ఎదురేగి నీళ్లు ఆరబోసి మంగళ హారతులతో స్వాగతం పలికారు. రథోత్సవంలో భాగంగా కోలాటం, గొల్లడప్పులు, భజన బృందాలు, చిరుతల రామాయణం, నృత్యాల మధ్య రథోత్సవం సాగింది. వేడుకల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి కే.శేషుభారతి, అర్చకులు రాగిచేడు అభిలాష్శర్మ, పరశురాం విష్ణువర్ధనచార్యులు, సత్యనారాయణ శర్మ, మణిశర్మ, చైర్మన్ పైడిపాల రఘుచందర్, ధర్మకర్తలు బైరి రాజుగౌడ్, దండిగం శ్రీనివాస్, బోగి కేదారి, వస్కుల ఉమ, రోడ్డ దయాకర్, మాడిశెట్టి జ్ఞానేశ్వరి, కుర్ల మోహన్, తొట్ల రాజుయాదవ్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఐలోని మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు
ఐనవోలు: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కించారు. ఈఏడాది జనవరి 2025 నుంచి 44 రోజులకుగాను.. హుండీల్లో రూ.42,64,669, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా.. రూ.1,35,94,297లు రాగా.. మొత్తం రూ.1,78,58,966ల నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేసినట్లు తెలిపారు. లెక్కింపులో కానిస్టేబుళ్లు పి.రమేశ్, శ్రీనివాస్, ప్రశాంత్, ఒగ్గు పూజారులు మజ్జిగ అశోక్, రాములు, మహబూబాబాద్ శ్రీలక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి సభ్యులు, దేవాలయ అర్చక, సిబ్బంది తదితరులున్నారు. -
శిల్పకళ అద్భుతం..
ఖిలా వరంగల్: కాకతీయుల నిర్మాణ శైలి, నల్ల రాతితో రూపొందించిన శిల్ప కళ వెరీ అద్భుతం అని స్టేట్ ఆర్కియాలజీ ఆఫ్ మైసూర్ ఎ.దేవరాజ్, హైదరాబాద్ సర్కిల్ కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ హెచ్.దేశాయ్ అన్నారు. ఖిలా వరంగల్ కోటను వారు మంగళవారం సాయంత్రం సందర్శించారు. కాకతీయుల ఖ్యాతిని కొనియాడారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ కోట ఇన్చార్జ్ శ్రీకాంత్, టీజీ టీడీసీ కోట ఇన్చార్జ్ గట్టికొప్పుల అజయ్, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ జాగిలాల పాత్ర కీలకం: సీపీవరంగల్ క్రైం: నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత నెలలో మొయినాబాద్‌లోని పోలీస్ జాగిలాల శిక్షణా కేంద్రంలో శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన ఐదు పోలీస్ జాగిలాలు వరంగల్ కమిషనరేట్ పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో చేరి విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. పేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్ మాలినోస్, రెండు గోల్డెన్ రీట్రీవర్ జాతులకు చెందినవి ఉన్నాయి. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీకి హ్యాండ్లర్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్‌కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, హ్యాండ్లర్లు రాజేశ్‌కుమార్, వెంకన్న, సురేశ్, దిలీప్ పాల్గొన్నారు. కెరీర్ కౌన్సెలింగ్ సెల్ డైరెక్టర్‌గా చిర్ర రాజు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెల్ నూతన డైరెక్టర్‌గా తెలుగు విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిర్ర రాజు నియమితులయ్యారు. ఈమేరకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదవిలో రాజు ఏడాదిపాటు కొనసాగుతారు. ఆయన కేయూ పాలకమండలి సభ్యుడిగా కూడా ఉన్నారు. 30 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలిహసన్పర్తి: 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లుగా నిర్ధారణ అయితే చికిత్స ప్రారంభించాలని సూచించారు. హసన్‌పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా డేను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి డీఎంహెచ్ఓ అప్పయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాలను వందశాతం విజయవంతం చేయాలన్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, కుష్ఠు వ్యాధిగ్రస్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి తగిన సేవలందించాలని సూచించారు. అసంక్రమిత వ్యాధులపై అవగాహన నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి భార్గవ్, వైద్యులు కృతిక, సురేశ్, హెల్త్ సూపర్వైజర్ లచ్చు, మేరీ, రుతమ్మ, ఫార్మసిస్ట్ అజిత, స్టాఫ్‌నర్స్ విజయకుమారి, హెల్త్ అసిస్టెంట్ సంతోశ్, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuహన్మకొండ: విద్యుత్ లైన్లకు నేరుగా కొక్కాలు తగిలించి, దొంగచాటుగా విద్యుత్ లైన్ల నుంచి వైరులాగి విద్యుత్ చౌర్యానికి పాల్పడడం చూశాం. గతంలో మీటర్ ఉత్పత్తిలో సాంకేతిక లోపంతో టీవీ రిమోట్ ద్వారా మీటర్ రీడింగ్‌ను నిలిపివేసిన ఘటనలూ చూశాం. ప్రస్తుతం వరంగల్ మహానగరంలో గతానికి భిన్నంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఘటనలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్ ఇంజనీర్లకు సవాల్ విసిరినట్లుగా సాగుతున్న విద్యుత్ చౌర్యం సాగుతున్న తీరు విద్యుత్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రధానంగా గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న త్రీ ఫేజ్ మీటర్ల ద్వారా కొందరు వినియోగదారులు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఘటనలు విస్తుగొలుపుతున్నాయి. చౌర్యం ఇలా.. విద్యుత్ లైన్ ద్వారా మీటర్లకు సర్వీస్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. అదే మీటర్ నుంచి విద్యుత్ బయటకు వస్తుంది. మీటర్ లోపలకు వెళ్లి, బయటకు విద్యుత్ సరఫరా జరిగినప్పుడు మీటర్లో యూనిట్లు నమోదు అవుతాయి. విద్యుత్ మీటర్లో ఉండే ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ మీటర్లోకి వెళ్లడం, మీటర్ నుంచి వినియోగానికి బయటకు రావడం జరుగుతుంది. ఇదే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మీటర్‌లోని మదర్ బోర్డుకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా జరుగుతోంది. దీంతో విద్యుత్ రీడింగ్ నమోదవుతుంది. త్రీ ఫేజ్‌లో ఏ ఫేజ్‌లో విద్యుత్ అధికంగా వినియోగమవుతుందో మదర్ బోర్డుకు వెళ్లే ఆ ఫేజ్ వైర్‌ను కట్ చేస్తున్నారు. దీంతో మీటర్లో యూనిట్లు తక్కువగా నమోదు అవుతున్నాయి. మదర్ బోర్డుకు వెళ్లే ఫేజ్వైర్ను కట్ చేయడం వల్ల కరెంట్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదు. దీన్ని గుర్తించాలంటే మీటర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తేనే సాధ్యమవుతుంది. గుర్తించారిలా.. ఎన్పీడీసీఎల్లోని విద్యుత్ సర్వీస్‌ల ప్రత్యేక విభాగం నిరంతరం తనిఖీలు చేస్తుంటుంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం హనుమకొండ నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌ను తనిఖీ చేయగా ఈవిద్యుత్ చౌర్యం సంఘటన వెలుగు చూసింది. టాంగ్ టెస్టర్ ద్వారా మూడు ఫేజ్‌లు పరీక్షించగా.. ఒక ఫేజ్‌లో విద్యుత్ మదర్ బోర్డుకు చేరడం లేదని గుర్తించారు. ఈ క్రమంలో ఎన్పీడీసీఎల్ ఆపరేషన్, డీపీఏ విభాగం వారు గ్రూపులుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో హనుమకొండ అడ్వొకేట్స్ కాలనీలోని ప్రముఖ విద్యాసంస్థతోపాటు, హనుమకొండ చౌరస్తాలో బట్టల షాపు, అశోక హోటల్ సమీపంలోని బిర్యానీ సెంటర్‌తో పాటు మొత్తం 12 విద్యుత్ సర్వీసులు ఇదే విధంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు వరంగల్‌లో ఒక్కరికే చెందిన రెండు బేకరీల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్యాంపరింగ్ చేస్తామని తిరుగుతున్న బృందాలు.. విద్యుత్ మీటర్ రీడింగ్ తగ్గిస్తామని ప్రత్యేకమైన నిపుణులు నగరం, పట్టణాల్లో తిరుగుతున్నారని విద్యుత్ అధికారులు తెలిపారు. రూ.10 వేలు ఇస్తే మీటర్ రీడింగ్ నమోదు కాకుండా చేస్తామని చెబుతున్నారని, ఇప్పటి వరకు విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారంతా డబ్బులు చెల్లించి ఆ ప్రత్యేక నిపుణులచే విద్యుత్ మీటర్ల టాంపరింగ్‌కు పాల్ప డినట్లు తెలుస్తోంది. విద్యుత్ విజిలెన్స్ విభాగం అధికారులు మీటర్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్న వారి కోసం శోధిస్తున్నారు. తనిఖీలు విస్తృతం చేశాం... అత్యంత చాకచక్యంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇది నేరం. రూ.10 వేలు ఇస్తే యూనిట్లు తక్కువగా నమోదయ్యేలా మీటర్లో మార్పులు చేస్తామని కొందరు తిరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వారిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి విద్యుత్ చౌర్యానికి పాల్పడినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం – జి.సాంబరెడ్డి, డీఈ, హనుమకొండ టౌన్ మీటర్‌ను పరిశీలిస్తున్న విద్యుత్ అధికారులు నాలుగు రోజుల్లో హనుమకొండ నగరంలో 1119 సర్వీస్‌లు తనిఖీ చేశారు. ఇందులో 12 సర్వీస్‌లు విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్లు గుర్తించారు. ఆపరేషన్ విభాగానికి చెందిన 57, డీపీఈకి చెందిన 15 ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి.నగరంలో ఆధునిక సాంకేతికతతో విద్యుత్ చౌర్యంన్యూస్రీల్ తనిఖీల్లో గుర్తించి విస్తుపోతున్న ఎన్పీడీసీఎల్ అధికారులు ఇప్పటివరకు 12 కేసులు నమోదు దొంగతనం చేసేది త్రీ ఫేజ్ మీటర్ల వినియోగదారులే.. -
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
వరంగల్: మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీఓ) అసోసియేషన్ బాధ్యులు మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారం సెలవు ఉంటుందని.. కానీ, మహిళలకు సెలవు అనేది ఉండదన్నారు. కుటుంబ సభ్యుల క్షేమం, శాఖాపరమైన అభివృద్ధిలో భాగంగా మహిళ నిరంతరం శ్రమిస్తుందని పేర్కొన్నారు. ఒత్తిడి అనేది మహిళలకే కాదు పురుషుల్లో కూడా ఉంటుందని, వారికి కూడా వైద్యశిబిరం అవసరమని గుర్తు చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని, మనకోసం మనం ఆలోచించినప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతామని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. వాటిని అధిగమించాలంటే ప్రేరణ తరగతులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్ మోహ న్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంరెడ్డి, ఫణికుమార్, అనురాధ, నీరజ, డీఆర్ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీర్డీఓ కౌసల్య, డీపీఓ కల్పన, ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ ప్రవీణ్‌కుమార్, రాజేశ్‌కుమార్, రాజకుమార్, రామ్‌కిషన్, వేణుగోపాల్, డాక్టర్ మౌనికరాజ్, డాక్టర్ షఫీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద కలెక్టరేట్లో వైద్య శిబిరం ప్రారంభం -
ధాన్యం డబ్బులు ఇవ్వాలని ఆందోళన
నల్లబెల్లి: మండల కేంద్రంలో ఐకేపీ కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను ఇవ్వాలని ఓ రైతు కుటుంబ సభ్యులు మదర్ థెరిస్సా మండల సమాఖ్య కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. వారి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గాజుల రాజేందర్ సన్నధాన్యం పండించాడు. 309 బస్తాలను కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టాడు. నిర్వాహకులు అడిగిన పత్రాలను అందించాడు. అయితే నిర్వాహకులు రైతు ఖాతాలో డబ్బులు జమ చేయకుండా తమ ఖాతాలో జమ చేసుకున్నారు. ధాన్యం డబ్బులు ఇవ్వాలని కోరడంతో నిర్వాహకులు కాలయాపన చేస్తూ దాటవేస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతు కుటుంబ సభ్యులు సమాఖ్య కార్యాలయం గేటుకు తాళం వేసి ట్రాక్టర్ అడ్డుపెట్టి ఆందోళన చేశారు. డబ్బులు ఇచ్చే వరకు ఆందోళన విరమించేంది లేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ, దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు రైతు కుటుంబ సభ్యులతో చర్చించారు. నిర్వాహకులతో మాట్లాడి రూ.1.38 లక్షలు ఇప్పించారు. దీంతో వారు ఆందోళన విరమించారు. -
ఇళ్ల జాబితాలో అవకతవకలుంటే చర్యలు
● పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హన్మకొండ చౌరస్తా: ‘ఇది ప్రజా ప్రభుత్వం. పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ కమిటీభ్యులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ పథకం అమలులో లీడర్ అయినా.. కేడర్ అయినా పైసలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. -
రేపటి నుంచి పదో తరగతి ప్రీఫైనల్స్
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టెన్త్ విద్యార్థులకు గురువారం నుంచి 15వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు టైంటేబుల్ విడుదల చేశారు. జిల్లాలోని డీసీఈబీ (డిస్ట్రిక్ట్ పరీక్ష బోర్డు) నుంచి ఎంఈఓ కార్యాలయాలకు ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. అక్కడి నుంచి హెచ్ఎంలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాగా.. హనుమకొండ జిల్లాలో టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షల్ని 12,010 మంది విద్యార్థులు రాయనున్నట్లు డీఈఓ వాసంతి, డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ సోమవారం తెలిపారు. -
రేపటి నుంచి టెన్త్ ప్రీఫైనల్స్
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టెన్త్ విద్యార్థులకు గురువారం నుంచి 15వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు టైంటేబుల్ విడుదల చేశారు. జిల్లాలోని డీసీఈబీ (డిస్ట్రిక్ట్ పరీక్ష బోర్డు) నుంచి ఎంఈఓ కార్యాలయాలకు ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. అక్కడి నుంచి హెచ్ఎంలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాగా.. జిల్లాలో 287 పాఠశాలల నుంచి 4,803 మంది బాలురు, 4,434 మంది బాలికలు పరీక్షలకు హాజరుకానున్నారు. ఐలోని మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు ఐనవోలు: ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కించారు. ఈఏడాది జనవరి 2025 నుంచి 44 రోజులకు గాను.. హుండీల్లో రూ. 42,64,669, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా.. రూ.1,35,94,297లు రాగా.. మొత్తం రూ.1,78,58,966 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యథావిధిగా హుండీలోనే వేసి సీల్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. లెక్కింపులో కానిస్టేబుళ్లు పి.రమేశ్, శ్రీనివాస్, ప్రశాంత్, ఒగ్గు పూజారులు మజ్జిగ అశోక్, రాములు, మహబూబాబాద్ శ్రీలక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి సభ్యులు, దేవాలయ అర్చక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 26 కేంద్రాలు
కాళోజీ సెంటర్: జిల్లాలో బుధవారం నుంచి నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పా ట్లు చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఉదయం 9 నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ప్రథమ సంవత్సరం పరీక్షకు 4,967 మంది జనరల్ విద్యార్థులు, 848 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 26 కేంద్రాలను ఏర్పాటు చేసి, 26 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 8 మంది అదనపు సూపరింటెండెంట్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్, 260 మంది ఇన్విజిలేటర్లు, 52 మంది ఏఎన్ఎంలు, పోలీస్ సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. సందేహాలు ఉంటే విద్యార్థులు 897708164 హెల్ప్ డెస్క్ నంబర్‌కు ఫోన్‌చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 చట్టం అమలు వరంగల్ క్రైం: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల పరిఽధిలో 163 బీఎన్ఎస్ చట్టం అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండడం, ర్యాలీలు, సభలు, ధర్నాలు, సమావేశాలు, ఊరేగింపులు చేయడం నిషేధమని పేర్కొన్నారు. పరీక్ష సమయాల్లో జిరా క్స్ సెంటర్లను మూసివేయాలని, ఎవరైనా ఉత్తర్వులు అత్రికమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ -
పైసలు రాలే!
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuదుగ్గొండి: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గత సంవత్సరం నవంబర్ 6 నుంచి జిల్లాలోని 315 గ్రామాలు, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1.79 లక్షల కుటుంబాలను 1,200 మంది ఎన్యుమరేటర్లను, 119 మంది సూపర్వైజర్లు సర్వే చేశారు. ఒక్కో ఎన్యుమరేటర్ 150 ఇళ్లు సర్వే చేశారు. నవంబర్ 28 వరకు ఇంటింటి సర్వే పూర్తిచేసి డిసెంబర్ 10 వరకు 600 మంది ఆపరేటర్లు డేటా ఎంట్రీ పూర్తి చేశారు. మూడు నెలలుగా ఎదురుచూపులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా పనిచేసిన ఎన్యుమరేటర్లకు రూ.10 వేలు, సూపర్వైజర్లకు రూ.12 వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే చేసిన అనంతరం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే డాటా ఎంట్రీ ఆపరేటర్లర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.30 చొప్పున చెల్లించాల్సి ఉంది. సర్వే పూర్తి మూడు నెలలు దాటినా ఒక్కపైసా రాలేదని, తాము నిద్రాహారాలు మాని పనిచేశామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేసిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, ఆపరేటర్లకు మొత్తం రూ.1,79,98,000 చెల్లించాల్సి ఉంది. సర్వే కోసం రూ.168 కోట్లు విడుదల చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్పి రెండు నెలలు దాటినా నేటికి అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సర్వే వేతనాలు విడుదల చేయాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కోరుతున్నారు. న్యూస్రీల్ఈఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు జటబోయిన శివ. దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన ఇతడు సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులను ఆన్లైన్ చేయడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా నియమితులయ్యాడు. దరఖాస్తుకు రూ.30 చొప్పున వస్తాయని 10 రోజులపాటు నిద్రాహారాలు లేకుండా పనిచేశాడు. 692 దరఖాస్తుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశాడు. ఇందుకు రూ.20,760 రావాల్సి ఉంది. డబ్బుల కోసం పలుమార్లు మండల కేంద్రానికి వెళ్లి ఎంపీడీఓను కలిశాడు. డబ్బులు రాలేదు.. వచ్చాక ఇస్తాం అని చెప్పడంతో ఇక లాభం లేదని అడగడం మానేశాడు. ఇది ఒక్క శివ పరిస్థితి కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా అందని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే వేతనాలు మూడు నెలలు గడిచినా విడుదల కాని నిధులు ఆందోళనలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుజిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు.. కుటుంబాలు 1.79 లక్షలు సర్వే చేసింది 1,200 మంది ఎన్యుమరేటర్లు, 119 మంది సూపర్వైజర్లు డేటా ఎంట్రీ చేసింది 600 మంది ఆపరేటర్లు రావాల్సిన వేతనాలు రూ.1,79,98,000 -
6 నుంచి కొమ్మాల బ్రహ్మోత్సవాలు
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6 నుంచి 20 వరకు వైభవంగా జరుగనున్నాయి. జిల్లాలోనే ప్రత్యేకత సంతరించుకున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8 గంటలకు అధ్యయనోత్సవంతో ప్రారంభం కానున్నాయి. 7న ఉదయం 5 గంటలకు సుప్రభాతం, బిందె తీర్థం పూజలు, 8న నిత్యనిధి, పరమపదోత్సవం, 9న ఉదయం 10 గంటలకు సూత్తందాది, శాత్తుమర, అంకురారోహణం, రక్షాబంధనం, దీక్షా వస్త్రాధారణ, అగ్నిప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచారి తెలిపారు. 10న రాత్రి భూదేవి, నీలాదేవితో స్వామి వారి కల్యాణం వైభవంగా జరుగనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎదుర్కోళ్లు, అశ్వవాహన సేవ ఉంటాయని తెలిపారు. 11 నుంచి 13 వరకు పలు పూజా కార్యక్రమాల అనంతరం 14న హోలీ పండుగ నుంచి జాతర ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 18న స్వామివారి రథోత్సవం ఉంటుందని చెప్పారు. అమ్మవార్లతోపాటు స్వామి వారిని గుట్ట దిగువకు తీసుకెళ్లి ప్రత్యేక పూజల అనంతరం వారిని రథంపై కూర్చుండబెట్టి గుట్టచుట్టూ తిప్పే కార్యక్రమం ఉంటుందన్నారు. 19న స్వామివారిని విశ్వనాథపురానికి తీసుకెళ్లి పారువేట, శ్రీపుష్పయాగం, నాగవెల్లి నిర్వహిస్తామని వివరించారు. 20వ తేదీన స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, జాతర ఉగాది పర్వదినం వరకు కొనసాగుతుందన్నారు. 10న లక్ష్మీనర్సింహస్వామివారి కల్యాణం 14న జాతర ప్రారంభం 20న ముగియనున్న ఉత్సవాలు -
పోలీస్ జాగిలాల పాత్ర కీలకం: సీపీ
వరంగల్ క్రైం: నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత నెలలో మొయినాబాద్‌లోని పోలీస్ జాగిలాల శిక్షణ కేంద్రంలో శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన ఐదు పోలీస్ జాగిలాలు వరంగల్ కమిషనరేట్ పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో చేరి విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాయి. పేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్ మాలినోస్, రెండు గోల్డెన్ రీట్రీవర్ జాతులకు చెందినవి ఉన్నాయి. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలను సంబంధించిన పూర్తి వివరాలను సీపీకి హ్యాండ్లర్లు వివరించారు. జాగిలాలకు మెరుగైన వసతి కల్పించాలని సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్‌కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జ్, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, హ్యాండ్లర్లు రాజేశ్‌కుమార్, వెంకన్న, సురేశ్, దిలీప్ పాల్గొన్నారు. -
‘నీట్’కు కేంద్రాలను గుర్తించాలి
వరంగల్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)–2025 నిర్వహణకు జిల్లాలో పరీక్ష కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మే 4న జరిగే నీట్‌కు, కేంద్రాల ఎంపిక, కనీస సౌకర్యాల కల్పనపై మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని సుమారు 6,300 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 20 గదుల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు/కళాశాలలను గుర్తించాలని సూచించారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనువుగా ఉండే ఫర్నిచర్, వెంటిలేషన్, తాగునీరు, సీసీ టీవీల పర్యవేక్షణ, దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండే వాటిని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీ రవీందర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, పరీక్షల కోఆర్డినేటర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
ఎండలకు జాగ్రత్త
● జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను ఐనవోలు: ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం 8 గంటల్లోపే పనిలోకి రావాలని, జాగ్రత్తగా పనులు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) మేన శ్రీను సూచించారు. సోమవారం మండలంలోని పంథిని, పున్నేలు, ఐనవోలు గ్రామాల్లో ఉపాధి పనులను డీఆర్డీఓ పర్యవేక్షించారు. పంథినిలో రోడ్డు పని, పున్నేలు, ఐనవోలులో జరుగుతున్న ఫారం పాండ్, నర్సరీ పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో మాట్లాడుతూ.. ప్రతీరోజు రూ.300 వేతనం వచ్చేలా కొలతల ప్రకారం పని చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో కనీసం 50 మంది కూలీలతో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. టార్గెట్ ప్రకారం కాకుండా తక్కువ లేబర్‌తో పని చేయించే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీఓ నక్క కుమారస్వామి, ఈసీ ప్రదీప్, టీఏలు నీరజ, రమేశ్, కార్యదర్శులు అశోక్, మాలతి, ఎఫ్‌ఏలు రాజు, ఎలేంద్ర, జ్యోతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సీఐ రంజిత్రావుకు నగదు పురస్కారం
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి గెలుపుసాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేవు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. చివరికి శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందిఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటాగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోలవగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డికి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిలను ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత శ్రీపాల్‌రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగిలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటివరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులనుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్‌రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్‌రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్ 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 1,348 ఓట్లు పెరిగి, 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. ● హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు.న్యూస్‌రీల్ రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ 19మంది బరిలో ఉన్నా ఐదుగురి మధ్యనే సాగిన పోటీ అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
విద్యారణ్యపురి: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈనెల 5 నుంచి ఫస్టియర్, 6వ తేదీ నుంచి సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్, జనరల్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 39,980 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 7, టీఎస్ రెసిడెన్షియల్ జూనియర్‌కళాశాల 1, టీఎస్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు 2, మోడల్ స్కూళ్లు 3, ప్రైవేట్ అండ్ అన్ ఎయిడెడ్ కళాశాలలు 42 మొత్తం 55 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 55 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 55 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల పరీక్ష కేంద్రాలకు 42 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఇన్విజిలేటర్లను 1,050 మందిని నియమించారు. సెల్ఫ్ సెంటర్లు లేవు. సమస్యాత్మక కేంద్రాలు కూడా లేవు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. పకడ్బందీగా నిర్వహించేందుకు.. పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్రాన్ని బట్టి 3 నుంచి 5 వరకు సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఆయా కెమెరాలు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లుంటే పరీక్షల సమయంలో వాటిని మూసేస్తారు. పోలీస్‌బందోబస్తు కొనసాగనుంది. ముందుగానే చేరుకోవాలి.. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం లేటయినా.. అనుమతించరు. ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్ని అనుమతించరు. విద్యార్థులు ఆన్లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నా.. ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తారు. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవి.. హనుమకొండ జిల్లాలో పరీక్షలకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా.. విద్యార్థులు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. చంద్రమౌళి, సూపరింటిండెంట్ 9491559360, పి.సుచిరిత, సీనియర్ అసిస్టెంట్ 9966440775, వికాస్, జూనియర్ అసిస్టెంట్ 9502743435లో సంప్రదించవచ్చు. వరంగల్ జిల్లాలో.. కాళోజీ సెంటర్: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ వరంగల్ జిల్లా అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి 12,321 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు, వీరికి 26 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేసినట్లు వివరించారు. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాల్లో 26 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు, 26 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 8 మంది అదనపు సూపరింటెండెంట్లు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, నలుగురు సిట్టింగ్ స్క్వాడ్లు, 260 మంది ఇన్విజిలేటర్లు, 52 మంది ఏన్‌ఎంలు, పోలీస్ శాఖ సిబ్బందిని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఏవైనా సందేహాలున్నా.. 92402 05555 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. పకడ్బందీగా ఏర్పాట్లు.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. మూడు టీంలు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు బృందాల సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాం. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ ఉంటుంది. డీఐఈఓ కన్వీనర్‌గా, ఇద్దరు ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉంటారు. హైపవర్ కమిటీ కూడా ఉంటుంది. కలెక్టర్ చైర్మన్‌గానూ, పోలీస్ కమిషనర్, ఇంటర్ విద్య ఆర్జేడీ డెక్, డీఐఈఓ, సీనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. విద్యార్థులు ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా చర్యలు తప్పవు. – ఎ.గోపాల్, డీఐఈఓ రేపటి నుంచి ఎగ్జామ్స్ షురూ హనుమకొండ జిల్లాలో 39,980 మంది వరంగల్ జిల్లాలో 12,321 విద్యార్థులు కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా నిమిషం నిబంధన, 144 సెక్షన్ అమలుహనుమకొండ జిల్లాలో ఇలా.. ఫస్టియర్ జనరల్ : 18,397 ఒకేషనల్ : 1,146 సెకండియర్ జనరల్: 19,480 ఒకేషనల్ : 957 మొత్తం విద్యార్థులు : 20,437 వరంగల్ జిల్లాలో..ఫస్టియర్ జనరల్ : 4,967 ఒకేషనల్ : 848 సెకండియర్ జనరల్: 5,739 ఒకేషనల్ : 767 మొత్తం : 12,321 -
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్ విద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచాలని హనుమకొండ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్ కోరారు. జిల్లాలో 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా నియమితులైన ఎస్జీటీలకు హనుమకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూడురోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం సోమవారం సాయంత్రం ముగిసింది. ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాఠ్యపుస్తకాల వినియోగం, తరగతి గదిలో బోధనకు సంబంధించి అభ్యసన సామర్థ్యాల, పాఠ్య ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక సమ్మెటివ్ మూల్యాంకనం, డిజిటల్ కంటెంట్‌ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. సమావేశంలో రిసోర్స్ ఉపాధ్యాయులు పి.చంద్రయ్య, శ్రీపాల్‌రెడ్డి, శ్యాంసుందర్, పున్నం చందర్, డీఎల్‌ఎంటీ రఘు తదితరులు పాల్గొన్నారు. -
మరింత చేరువగా ఆరోగ్య సేవలు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: కలెక్టరేట్ ఐడీఓసీ భవనంలోకి వైద్య ఆరోగ్య కార్యాలయం ఉండడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా వైద్య ఆరోగ్య శాఖ సేవలు అందనున్నాయని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లోకి మార్చిన వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సోమవారం కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీ లించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహనరావు, పీఓడీటీసీ కె.లలితాదేవి, హిమబిందు పాల్గొన్నారు. ఈజీఎస్ పనులు త్వరగా పూర్తి చేయండి జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా మండలాల్లో చేపట్టిన నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఈజీఎస్, పంచాయతీరాజ్ శాఖ అధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతి, నిర్దేశిత లక్ష్యాల గడువుపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజీఎస్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ శంకరయ్య, డీఈ శ్రీనివాసరావు, ఎంపీడీఓలు, పీఆర్ ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. -
9న జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 9న హనుమకొండ జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమల్‌కింగ్ చెస్ అకాడమీ చైర్మన్ జి.రాంప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–7, 9, 11, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని తెలిపారు. విజేతలకు నగదు పురస్కారం, ట్రోఫీలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్‌లోని న్యూసైన్స్ డిగ్రీ కళాశాల ఆవరణలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకునేందుకు 96760 56744 మొబైల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భవిత కేంద్రం తనిఖీ..విద్యారణ్యపురి: హనుమకొండ మండలంలోని ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు సంబంధించిన భవిత కేంద్రాన్ని సోమవారం డీఈఓ డి.వాసంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లల సర్వేను పూర్తి చేసి విద్యార్థుల అవసరాలను గుర్తించి నమోదు చేయాలని సమ్మిళిత ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డీఈఓ వెంట సమ్మిళిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ఎంఈఓ నెహ్రూ, సమ్మిళిత ఉపాధ్యాయురాలు రజనీ తదితరులు పాల్గొన్నారు. పంచేంద్రియాల్లో ముఖ్యమైనవి చెవులు హన్మకొండ: పంచేంద్రియాల్లో చెవులు ముఖ్య మైనవని హనుమకొండ వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య అన్నారు. సోమవారం హనుమకొండ సమ్మయ్యనగర్‌లోని లష్కర్‌సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. చెవి, వినికిడి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. చెవి ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు అశ్రద్ధ వహించకుండా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. సమావేశంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి అహ్మద్, లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, సోషల్ వర్కర్ నరేశ్, హెచ్ఈఓ శ్రీనివాస్‌రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు బాబు, శ్రీనివాస్, ఏఎన్ఎంలు ఆశవర్కర్లు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో ఉచిత వైద్యశిబిరం వరంగల్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసో సియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా నేడు (మంగళవారం) ఉదయం 10గంటలకు ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి ఫణికుమార్, మహిళా విభాగం ప్రతినిధులు అనురాధ, నీరజ సోమవారం తెలిపారు. ఈ ఉచిత వైద్యశిబిరంలో వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన మహిళా అధికారులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే మహిళా దినోత్సవ వేడుకలు ఈనెల 7న నిర్వహించనున్నట్లు తెలిపారు. టెండర్ల గడువు పొడిగింపు వరంగల్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పత్రాల ముద్రణకు నిర్వహిస్తున్న టెండర్ గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు జెడ్పీ సీఈఓ జి.రాంరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో స్టేషనరీ, పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఆధీకృత డీలర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. -
ఆర్ఆర్ఆర్ సదస్సులో మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్: రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బల్దియా వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్ (ఆర్ఆర్ఆర్) విధానాల్ని నిర్వహిస్తున్న తీరుపై మేయర్ వివరించారు. ‘యూఎల్ బీ లో 3–ఆర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్క్యూలర్ ఎకానమీ’ అంశంపై కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
ప్రీ ఫైనల్ పరీక్షలు ఉదయం వేళల్లో నిర్వహించాలి
నర్సంపేట: టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలను ఉదయం వేళల్లోనే నిర్వహించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడారు. వేసవి నేపథ్యంలో మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 వరకు పరీక్ష సమయం నిర్ణయిస్తూ విద్యాశాఖ సర్క్యూలర్ విడుదల చేయడాన్ని ఖండించారు. రంజాన్ మాసానికి పరీక్షలతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తా రు.తక్షణమే పరీక్షల వేళలు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి రాకం రాకేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బో ల్ల అజయ్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సరఫరాలో ఆటంకం కలగొద్దు
వరంగల్: యాసంగి పంటల సంరక్షణకు రాబోయే 10రోజులు అప్రమత్తంగా ఉండి ఎత్తిపోతల పథకా లకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సో మవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో సీఎస్ వివిధ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, గురుకులాల్లో రెగ్యూలర్‌గా తనిఖీలు తదితర అంశాలపై మాట్లాడారు. యాసంగి పంటలకు రిజర్వాయర్ల నుంచి విడుదల చేసిన ప్రతీచుక్కను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గురుకులాల్లో తనిఖీ చేసి విద్యార్థులకు నా ణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే 10 రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ నీటి సరఫరా పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, హార్టికల్చర్ అధికారి సంగీతలక్ష్మి, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు -
వరంగల్
మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 202550 రోజులు..48 బ్రేక్ డౌన్లు సాంకేతిక సమస్యలు, డ్రైవర్ల అనుభవ రాహిత్యంతో ఎలక్ట్రిక్ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. సుమారు 50 రోజుల్లో 48 బ్రేక్ డౌన్లు అయ్యాయి. – 8లోuసాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన పింగిలి శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి కూడా లేవు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్‌రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. చివరికి శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న సిబ్బందిఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండ ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటాగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోలవగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్‌రెడ్డికి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరికి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్‌తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డిలను ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత శ్రీపాల్‌రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగిలి శ్రీపాల్‌రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్‌కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్‌రెడ్డికి అప్పటివరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్‌వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులనుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్‌రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్‌రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్‌రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్ 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 1,348 ఓట్లు పెరిగి, 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. ● హర్షవర్ధన్‌రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్‌రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్‌రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు.న్యూస్రీల్ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి గెలుపు రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ 19మంది బరిలో ఉన్నా ఐదుగురి మధ్యనే సాగిన పోటీ అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ -
ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా?
పర్వతగిరి: రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని రావూరు గ్రామంలో ఎండిన వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆకేరు వాగు చెక్‌డ్యాం ఎప్పటికీ నీటితో కళకళలాడుతుండేదన్నారు. ఈ చెక్‌డ్యాం మీద కొత్తపల్లి, ల్యాబర్తి, బంధనపల్లి, కొత్తూరు, రోళ్లకల్, రావూరు, పర్వతగిరి, కల్లెడ, అన్నారం, సోమారం, జామస్థాన్పురం, మడిపల్లి, గుర్తూరు గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయం చేస్తూ సుమారు వెయ్యి ఎకరాల పైచిలుకు పంట సాగు చేసుకునేవారన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ కమలాపంతులు, మాజీ సర్పంచ్‌లు బండి సంతోష్, ఆమడగాని రాజుయాదవ్, విజయ్, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, ఆమ్లానాయక్, నరేష్, లక్ష్మినారాయణ, గడ్డి యాకయ్య, చింతల శ్రీనివాస్, బూర శ్యామ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు -
పీఏసీఎస్‌లకు ప్రత్యేక అధికారులు
నర్సంపేట: జిల్లాలోని నర్సంపేట డివిజన్లోని పలు సొసైటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కోఆపరేటివ్ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నర్సంపేట డివిజన్లో 13 సొసైటీలు ఉండగా ఇందులో చెన్నారావుపేట సొసైటీకి ప్రత్యేక అధి కారిగా వెంకటేశ్వర్లు, నెక్కొండ పీఏసీఎస్‌కు కీర్యానాయక్, ఖానాపురం పీఏసీఎస్‌కు రవికిరణ్, దుగ్గొండి మండలం నాచినపల్లికి విజయ్‌భాస్కర్‌రెడ్డి, నల్లబెల్లి పీఏసీఎస్‌కు రాజును ప్రత్యేక అధికారులుగా నియమించారు. అయితే డివిజన్లో ఆరు మండలాల్లో 13 పీఏసీఎస్ సొసైటీలు ఉండగా కేవలం ఐదు సొసైటీలకు మాత్రమే ప్రత్యేక అధికారులను నియమించడంతో పలువురు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు, రైతుల పేరిట అక్రమ రుణాలు పొందారని ఆరోపణలు రావడంతోనే ప్రత్యేక అధికారులను నియమించారని పలువులు చర్చించుకుంటున్నారు. ఈ సొసైటీలకు ప్రత్యేక అధికారులను కేటాయిస్తే మిగతా ఎనిమిది సొసైటీల పరిస్థితి ఎలా ఉంటుందోనని అంటున్నారు. మరో ఆరు నెలలు పాలకవర్గాలు పాలించేనా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా? అని డివిజన్ రైతులు వాపోతున్నారు. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
● జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ● హాజరు కానున్న 12,321 మంది విద్యార్థులు ● ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకాళోజీ సెంటర్: ఈనెల 5 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని, ఏమైన సందేశాల నివృత్తికి 9240205555 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 12,321 మంది పరీక్షలకు హాజరుకానున్నారని, వీరికి 26 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,967 మంది, ఒకేషనల్ 848 మంది మొత్తం 5,815 విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,739 మంది, ఒకేషనల్ 767 మంది మొత్తం 6,506 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. వార్షిక పరీక్షల దృష్ట్యా ప్రతీ సెంటర్లో సీసీ కెమెరాలు అమర్చినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు 26 పరీక్ష కేంద్రాలకు 26 సీఎస్‌లు, 26 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, 8 మంది అదనపు సూపరింటెండెంట్స్, 3 ఫ్లైయింగ్ స్వ్కాడ్, 4 సిట్టింగ్ స్వ్కాడ్, 260 మంది ఇన్విజిలేటర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్నిశాఖల అధికారులు సహకరించాలన్నారు. -
ఆర్ఆర్ఆర్ సదస్సులో మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్: రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాక డే, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నా రు. గ్రేటర్ నగర మేయర్ గుండు సుధారాణి బల్ది యా వ్యాప్తంగా నిర్వహిస్తున్న విధానాలైన రెడ్యూస్, రీయూస్, రీసైక్లింగ్ (ఆర్ఆర్ఆర్) విధానాల్ని నిర్వహిస్తున్న తీరు ఇప్పటి వరకు అమలు చేసిన పద్ధతుల్ని వివరించారు. ‘యూఎల్ బీ లో 3–ఆర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్క్యూలర్ ఎకానమీ’ అంశంపై జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
వరంగల్: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అ న్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలు ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరి ష్కరించాలని, పరిష్కరించలేని దరఖాస్తులను ఎందుకు పరిష్కరించలేదో దరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. గ్రీవెన్స్‌లో భూ సంబంధిత సమస్యలు 23, కలెక్టరేట్ సూపరింటెండెంట్ 15, జిల్లా వ్యవసాయశాఖ 11,జీడబ్ల్యూఎం 2,డీసీఎస్ఓ 5 (మొత్తం 88) దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి,ఉమారాణి,డీ ఆ ర్డీఓ కౌసల్యదేవి,జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి,జిల్లా వ్య వసాయశాఖ అధికారి అనురాధ,డీసీఓ నీరజ, డీపీ ఓ కల్పన,డీఎంఓ సురేఖ,అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రజావాణిలో 88 వినతులు -
‘రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో’
నల్లగొండ జిల్లా : వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీ గా ఉన్న ఆయన.. ఈసారి ఓటమి పాలయ్యారు. నర్సిరెడ్డిపై పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.ఓటమి అనంతరం నర్సిరెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ ఈ ఓటమి నన్ను బాధించటం లేదు. గెలుపు ఓటములు సహజం. ఓటమిని అంగీకరిస్తున్నా. గెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నాను. ఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో. ప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని తెలిపారు.ఇది ఉపాధ్యాయుల విజయంఇక నర్సిరెడ్డిపై విజయం సాధించిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి సైతం అదే కౌంటింగ్ కేంద్ర వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు విలువైనది. . ఉపాధ్యాయుల విజయం మండలి సభ్యుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తా. విద్యారంగాన్ని పటిష్టం చేసేలా అవసరం అయితే ఉద్యమాలు సైతం చేస్తా. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తాను. ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తాను. నా గెలుపు ముందుగా ఊహించిందే’ అని పేర్కొన్నారు పింగళి శ్రీపాల్ రెడ్డి. -
6 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు
కాళోజీ సెంటర్: జిల్లాలో ఈనెల 6 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 287 పాఠశాలల నుంచి 4,803 మంది బాలురు, 4,434 మంది బాలికలు పరీక్షలకు హాజరుకానున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 3.15 గంటల వరకు ఫస్ట్ లాంగ్వేజ్, 7న సెకండ్ లాంగ్వేజ్, 10న థర్డ్ లాంగ్వేజ్, 11న మ్యాథమెటిక్స్, 12న ఫిజికల్ సైన్స్, 13న బయాలాజికల్ సైన్స్, 15న సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుందని విద్యాశాఖాధికారులు తెలిపారు. పబ్లిక్ పరీక్షలకు 49 కేంద్రాలు టెన్త్ వార్షిక పరీక్షలు ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు. జిల్లాలోని 287 పాఠశాలల నుంచి 9,237 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షల కోసం 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 550 మంది ఇన్విజిలేటర్లు, 50 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి.. ఈనెల 21 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 6 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎంఈఓలు, పాఠశాలల హెచ్ఎంలకు గైడ్ చేశాం. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాం. – మామిడి జ్ఞానేశ్వర్, డీఈఓ4న కలెక్టరేట్లో మహిళా దినోత్సవం వరంగల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులు నిర్ణయించారు. వేడుకల్లో రెండు జిల్లాల మహిళా గెజిటెడ్ అధికారులు పాల్గొంటారు. వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య అనుమతితో ఈనెల 4, 5 తేదీల్లో వేడుకలు నిర్వహించనున్నారు. 4న వరంగల్ కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మెడికవర్ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. అదేరోజు మధాహ్నం 2 గంటలకు హనుమకొండ ఐడీఓసీలోని టీజీఓ భవన్లో మహిళా గెజిటెడ్ అధికారులకు క్రీడాపోటీలు, 5న హనుమకొండ కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ● -
అర్ధ శతాబ్దపు జ్ఞాపకాలు
నల్లబెల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు దశాబ్దాల తర్వాత పూర్వ విద్యార్థులు సందడి చేశారు. 1974–75 సంవత్సరంలో ఏడో తరగతి చదివిన వారంతా ఒక్కచోట కలిశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మొత్తం 32 మంది విద్యార్థులకు 22 మంది విద్యార్థులు హాజరుకాగా నలుగురు అనారోగ్యంతో రాలేకపోయారు. మిగిలిన ఆరుగురు మరణించారు. సమావేశమైన విద్యార్థులు మొదట సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాలలో అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువు జమ్ములపుడి రంగారెడ్డికి విద్యార్థులు పాదపూజ చేసి సన్మానించారు. చిరునామాలు, ఫోన్ నంబర్లను తీసుకున్నారు. పూర్వ విద్యార్థిని మంతెన ప్రమీద స్నేహితులకు పుష్పగుచ్ఛాలు, బహుమతులు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. నల్లబెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు సందడి చేసిన 1974–75 సంవత్సరం బ్యాచ్ ఏడో తరగతి విద్యార్థులు -
గ్రీవెన్స్‌లో 873 వినతులు పెండింగ్
మొక్కల రక్షణ బాధ్యత అధికారులదే..వరంగల్: కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో కలెక్టర్, అధికారులకు ప్రజలు వినతులు సమర్పిస్తున్నారు. వినతులను కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తారు. అధికారులు వినతులపై దృష్టిసారిస్తే క్షేత్రస్థాయిలోని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మండల కేంద్రాల్లో వినతులు సమర్పిస్తున్నారు. జిల్లాలో ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది.. మళ్లీ మావద్దకే వచ్చారంటూ మండలస్థాయి అధికారులు ఎగతాళి చేస్తున్నట్లు పలువురు బాధితులు వాపోతున్నారు. ప్రతివారం గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి, సాధ్యం కాని వాటిపై ఫిర్యాదుదారులకు వివరంగా చెబితే మరోసారి వచ్చే అవకాశాలు ఉండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 17 వరకు గ్రీవెన్స్‌లో 11,915 వినతులు సమర్పించారు. ఇందులో 11,042 వినతులను వివిధ శాఖల అధికారులు పరిష్కరించారు. వివిధ కారణాల వల్ల మరో 873 ఫిర్యాదులు అపరిష్కృతంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయో చెప్పరు? అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వినతులపై స్పందిస్తున్నా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా), పోలీసుశాఖలు పెద్దగా స్పందించకపోవడం విశేషం. ‘కుడా’కు 105 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లోనే ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్‌జోన్ డీసీపీకి 96 వినతులు వచ్చాయి. 53 పరిష్కారం కాగా 43 పెండింగ్‌లో ఉన్నాయి. నర్సంపేట ఏసీపీ పరిధిలో వచ్చిన 50 ఫిర్యాదుల్లో 7 మాత్రమే పరిష్కారం కాగా మామునూరు ఏసీపీ పరిధిలో 34 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బాధితులు మళ్లీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీవెన్స్‌లో వచ్చిన వినతులు, పరిష్కారమైనవి, పెండింగ్‌లో ఉన్న అర్జీల వివరాలు..నేడు కలెక్టరేట్లో ప్రజావాణి వరంగల్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావాలని కలెక్టర్ సూచించారు. వచ్చిన అర్జీలు 11,915.. పరిష్కారమైనవి 11,042 ‘కుడా’, పోలీస్ శాఖల నో రెస్పాన్స్శాఖ వినతులు పరిష్కారం పెండింగ్ జీడబ్ల్యూఎంసీ 471 349 122 జెడ్పీ సీఈఓ 141 30 111 కుడా 105 00 105 డీసీపీ ఈస్ట్‌జోన్ 96 53 43 ఏసీపీ నర్సంపేట 50 7 43 ఏసీపీ మామునూరు 34 00 34 ఎంజీఎం 4,694 4,669 25 ఆర్సీఓ(బాలుర గురుకులం) 93 60 33 జిల్లా రిజిస్ట్రార్ 57 25 32 డీఆర్డీఓ 922 916 6 అంగన్వాడీ 357 353 4 ఆరోగ్యశ్రీ 7 4 3 డీపీఓ 463 460 3 -
నేడు కంఠమహేశ్వర స్వామి కల్యాణోత్సవం
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలి గ్రామంలో కంఠమహేశ్వరస్వామి–సురమాంబాదేవి కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రెండో రోజు ఆదివారం గౌడకుల దీక్షాస్వాములు, మహిళలు బిందెలతో నీటిని తీసుకుని ఆలయానికి చేరుకుని జలాభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, నవగ్రహ, వాస్తు పూజ, గండుదీపం, గణపతి హోమం అనంతరం సురమాంబాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాత్రి భక్తి సురమాంబాదేవి నాటకాన్ని ప్రదర్శించారు. సోమవారం బోనాలతో తరలివెళ్లి ఆలయం వద్ద స్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామని పూజారులు ఏరుకొండ శ్రీనివాస్, యెలగంగూరి రఘువర్మ తెలిపారు. మంగళవారం ఎల్లమ్మ, మైసమ్మ తల్లులు, మోకు ముస్తాదు, కులవృక్ష పూజలు, గావుపట్టి బలిహరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, కుల సంఘం పెద్దలు బొడిగె శోభన్, సదానందం, భీమగాని రాంచందర్, యాదగిరి, గోసుగొండ జంగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు ఘన నివాళి వరంగల్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆదివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. మాజీ స్పీకర్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంట్లో సామగ్రి ధ్వంసం ● ఐదుగురిపై కేసు నమోదు ● ప్రేమ వివాహంతో దాడులు, ప్రతిదాడులు సంగెం: ప్రేమ వివాహం విషయంలో దాడులు, ప్రతిదాడులతో కేసులు నమోదవుతున్నాయి. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ భవానీనగర్‌లో ఉండే వల్లెపు సాంబమూర్తి పెద్ద కూతురు సుష్మితను సంగెం మండలం కాట్రపల్లి శివారు వడ్డెరగూడేనికి చెందిన ఆలకుంట ఎల్లయ్య చిన్న కుమారుడు అరుణ్ గత నెల 27న ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన కూతురును అరుణ్ కిడ్నాప్ చేశాడని సాంబమూర్తి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అరుణ్ తండ్రి ఎల్లయ్య, తల్లి కోమల, అన్న రాజ్‌కుమార్ భయపడి చింతలపల్లిలోని ఎల్లయ్య అక్క కమలమ్మ ఇంటికి వెళ్లి ఉన్నారు. శనివారం అరుణ్, సుష్మిత ప్రేమ వివాహం చేసుకుని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు తెలుసుకుని ఆదివారం ఎల్లయ్య కుటుంబంతో వడ్డెరగూడెంలోని ఇంటికి వెళ్లాడు. ఇంటి పైకప్పు పెంకులు, ముందు రేకులు, ఇంట్లోని ద్విచక్రవాహనం, టీవీ, ఫ్రిజ్, కూలర్ సుమారు రూ.65 వేల విలువైన సామగ్రిని సుష్మిత తల్లిదండ్రులు వల్లెపు సాంబమూర్తి, రజిత, బంధువులు పూలమ్మ, భవాని, చంద్రమ్మ ధ్వంసం చేశారని ఆలకుంట ఎల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అరుణాచలానికి బస్సు హన్మకొండ: అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్‌రావు తెలిపారు. ఈనెల 12న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి రాజధాని ఏసీ బస్సు బయలుదేరి 14న అరుణాచలం చేరుకుంటుందన్నా రు. 15న హనుమకొండకు చేరుకుంటుందని పేర్కొన్నారు. 99592 26047, 7382855793 నంబర్లలో సంప్రదించాలన్నారు -
ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
సాక్షిప్రతినిధి, వరంగల్: ...ఏడాదిలో 300 రోజులు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని తొమ్మిది జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు నీరందించే జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం.. ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ఉంది. మూడో దశలో భూసేకరణ చేపట్టని కారణంగా సుమారు ఆరేళ్లుగా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు 91 శాతం వరకు పూర్తయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతుండగా.. కీలకమైన 9 శాతం పనులు పూర్తి చేయడానికి భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఉన్నతాధికారులు 2024 ఆగస్టులో ప్రాజెక్టును పరిశీలించారు. సమీక్ష నిర్వహించి వెంటనే భూసేకరణ చేపట్టి పూర్తి చేస్తామని ప్రకటించినా.. ఆదిశగా అడుగులు పడలేదు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2004లో శ్రీకారం చుట్టింది. తొమ్మిది జిల్లాల్లో సుమారు 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ఎక్సర్సైజ్ మూడోదశను దాటించలేకపోతున్నది. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతోపాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధి 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 3,16,634 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో 2,40,088 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. భూసేకరణే సమస్య.. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రైతులు ఎక్కువ పరిహారం డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి అడ్డంకిగా మారాయి. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం విపరీతంగా పెరుగుతోంది. మొత్తం 33,224 ఎకరాలకు 30,268 ఎకరాలు సేకరించగా.. జనగామ నియోజకవర్గంలో 945 ఎకరాలు, పాలకుర్తిలో 826, గజ్వేల్‌లో 230, నర్సంపేటలో 131, వర్ధన్నపేటలో 168 ఎకరాలు.. ఇలా 2,957 ఎకరాల సేకరణ జరగాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయం 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. మూడు దశల్లో 16 ప్యాకేజీల్లో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.14,188 కోట్లు ఖర్చయినట్లు అధికారులు వెల్లడించారు. 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత భూసేకరణతో పాటు ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరోసారి అంచనాలు పెంచి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. అయితే ఈమేరకు అధికారులు రూ.17,500 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచడం.. లేదంటే రైతులను ఒప్పించడం.. ఏదో ఒకటి జరిగితేనే భూసేకరణ ముందుకు సాగి.. ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. ‘దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం.’ – 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలివి.●ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి.. దేవాదుల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. ఇరవయ్యేళ్లవుతున్నా అసంపూర్తి ప్రాజెక్టుగానే ఉంటున్నది. అలాగే రెండువేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే నక్కలతూముకు కాల్వలు నిర్మించి నీటిని సరఫరా చేయాలి. – బొడ్డు ప్రతాప్, రైతు, ధర్మసాగర్ భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది.. ప్రభుత్వ మార్గదర్శకాలు, కలెక్టర్ ఆదేశాల మేరకు భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. జనగామ జిల్లాలో 200 మంది రైతులకు టోకెన్లు ఇచ్చాం. మిగతా ప్రాంతాలు, గ్రామాల్లోనూ మాట్లాడుతున్నాం. 2026 మార్చి నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా రైతులను సంప్రదించి భూసేకరణ చేస్తున్నారు. – సుధాకర్, ఎస్ఈ, దేవాదుల ప్రాజెక్టుదేవాదుల మూడో దశకు భూసేకరణే అసలు సమస్య ఇరవయ్యేళ్లయినా అసంపూర్తిగానే ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రుల పర్యటన హామీలు, ఆదేశాలు.. అయినా పూర్తికాని భూసేకరణ రూ.6వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు.. పెరిగిన అంచనా వ్యయం -
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu ‘దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం’. ధర్మసాగర్లో దేవాదుల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ న్యూస్‌రీల్ 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలివి. -
పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి
● బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ అర్బన్ : పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. నగర పరిధిలో కొనసాగుతున్న శానిటేషన్ నిర్వహణ పనులను ఆమె ఆదివారం ఉదయం 5 గంటలకు 3వ డివిజన్, హనుమకొండ అశోకా జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్ ప్రధాన రహదారి ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త తరలించే ట్రాక్టర్ డ్రైవర్ లాగ్ బుక్, రహదారిని శుభ్రం చేసే స్వీపింగ్ మిషన్ల లాగ్ బుక్ పరిశీలించారు. -
గ్రీవెన్స్‌లో 873 వినతులు పెండింగ్
వరంగల్: కలెక్టరేట్లో ప్రతీ సోమవారం ని ర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో కలెక్టర్, అధికారులకు ప్రజలు వినతులు సమర్పిస్తున్నారు. వినతులను కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తారు. అధికారులు వినతులపై దృష్టిసారిస్తే క్షేత్రస్థాయిలోని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ సమస్యలు పరి ష్కారం కాకపోవడంతో మండల కేంద్రాల్లో వినతులు సమర్పిస్తున్నారు. జిల్లాలో ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది.. మళ్లీ మావద్దకే వచ్చారంటూ మండలస్థాయి అధికారులు ఎగతాళి చేస్తున్నట్లు పలువురు బాధితులు వాపోతున్నారు. ప్రతీ వారం గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి, సాధ్యం కాని వాటిపై ఫిర్యాదుదారులకు వివరంగా చెబితే మరో సారి వచ్చే అవకాశాలు ఉండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 17 వరకు గ్రీవెన్స్‌లో 11,915 వినతులు సమర్పించారు. ఇందులో 11,042 వినతులను అధికారులు పరిష్కరించారు. వివిధ కారణాల వల్ల మరో 873 ఫిర్యాదులు అపరిష్కృతంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయో చెప్పరు? అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వినతులపై స్పందిస్తున్నా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా), పోలీసుశాఖలు పెద్దగా స్పందించకపోవడం విశేషం. ‘కుడా’కు 105 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లోనే ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్‌జోన్ డీసీపీకి 96 వినతులు వచ్చాయి. 53 పరిష్కారం కాగా 43 పెండింగ్‌లో ఉన్నాయి. నర్సంపేట ఏసీపీ పరిధిలో వచ్చిన 50 ఫిర్యాదుల్లో 7 మాత్రమే పరిష్కారం కాగా మామునూరు ఏసీపీ పరిధిలో 34 వినతులు రాగా మొత్తం పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బాధితులు మళ్లీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీవెన్స్‌లో వచ్చిన వినతులు, పరిష్కారమైనవి, పెండింగ్‌లో ఉన్న అర్జీల వివరాలు.. శాఖ వినతులు పరిష్కారం పెండింగ్ జీడబ్ల్యూఎంసీ 471 349 122 జెడ్పీ సీఈఓ 141 30 111 కుడా 105 00 105 డీసీపీ ఈస్ట్‌జోన్ 96 53 43 ఏసీపీ నర్సంపేట 50 7 43 ఏసీపీ మామునూరు 34 00 34 ఎంజీఎం 4,694 4,669 25 ఆర్సీఓ(బాలుర గురుకులం) 93 60 33 జిల్లా రిజిస్ట్రార్ 57 25 32 డీఆర్డీఓ 922 916 6 అంగన్వాడీ 357 353 4 ఆరోగ్యశ్రీ 7 4 3 డీపీఓ 463 460 3 వచ్చిన అర్జీలు 11,915.. పరిష్కారమైనవి 11,042 ‘కుడా’, పోలీస్ శాఖల నో రెస్పాన్స్ -
టీజీఓస్ ఆధ్వర్యాన మహిళా దినోత్సవం
వరంగల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీఓస్) వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యులు ఆదివారం నిర్ణయించారు. రెండు జిల్లా ల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య అనుమతి తో ఈనెల 4, 5 తేదీల్లో వేడుకలు నిర్వహించనున్నారు. 4న వరంగల్ కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మెడికవర్ ఆస్ప త్రి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. అదేరోజు మధాహ్నం 2 గంటలకు హనుమకొండ ఐడీఓసీ లోని టీజీఓ భవన్లో మహిళా గెజిటెడ్ అధికారుల కు క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. 5వ తేదీన హనుమకొండ సమీకృత కలెక్టరేట్లో అంతర్జాతీ య మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. -
జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వివరాలు
లిఫ్టు చేయాల్సిన నీరు : 60.00 టీఎంసీలు వ్యవసాయానికి నీరు : 56.71 టీఎంసీలు తాగునీటి వినియోగం : 2.97 టీఎంసీలు పారిశ్రామిక నీటి సరఫరా : 0.32 టీఎంసీలు ఇందుకు అవసరమైన విద్యుత్ : 495.55 మెగావాట్లు స్థిరీకరించిన ఆయకట్టు : 5,56,722 ఎకరాలు సాగులోకి వచ్చిన ఆయకట్టు : 3,16,634 ఎకరాలు 2005–06లో ప్రాజెక్టు అంచనా వ్యయం : రూ.6016 కోట్లు 2008–09లో సవరించిన అంచనా వ్యయం : రూ.9427.73 కోట్లు 2016–17లో సవరించిన వ్యయం : రూ.13445.44 కోట్లు సవరించిన వ్యయ ప్రతిపాదనలు : రూ.14729.98 కోట్లు అయిన మొత్తం ఖర్చు : రూ.14,188 కోట్లు ప్రతిపాదనల్లో తాజా అంచనా వ్యయం : రూ.17,500 కోట్లు -
ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి
● నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ శ్రీనివాసరావు హన్మకొండ: ప్రభుత్వం వెంటనే మానవహక్కుల కమిషన్, లోకాయుక్త చైర్మన్లను నియమించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ అయిలినేని శ్రీనివాసరావు కోరారు. ఆదివారం హనుమకొండ నయీంనగర్‌లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్(ఎన్జీఓ) రాష్ట్ర స్థాయి సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్, వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ మానవ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా తమ సంస్థ వెంటనే స్పందిస్తుందన్నారు. హక్కులకు భంగం కలిగించినా, సమాజానికి, పర్యావరణానికి, మానవ హక్కులకు ఎలాంటి నష్టం చేకూర్చినా అండగా నిలుస్తామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజ్ చౌహాన్, సోషల్ మీడియా ఇన్చార్జ్ పరకాల సమ్మయ్య గౌడ్, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు ప్రశాంత్‌రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ మాటూరి రవీందర్‌గౌడ్, ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్
వరంగల్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేడు(సోమవారం) ఉదయం 11 గంటలకు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు సమర్పించేందుకు కలెక్టరేట్ కు రావాలని కలెక్టర్ సూచించారు. హనుమకొండ ప్రజావాణి రద్దు హన్మకొండ అర్బన్ : నేడు(సోమవారం) హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. శ్రీపాదరావుకు ఘన నివాళిహన్మకొండ అర్బన్/వరంగల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని ఆదివారం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, రెండు జిల్లాల డీఆర్ఓలు వైవీ.గణేష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బీఎస్ఎల్.సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మొదటి పేపర్, 5న రెండోపేపర్, 7న మూడో పేపర్, 10న నాలుగో పేపర్, 12న ఐదో పేపర్, 15న ఆరో పేపర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 4,914 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 25 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేడు కలెక్టరేట్‌లోకి డీఎంహెచ్ఓ కార్యాలయంహన్మకొండ అర్బన్: ఊరు చివరనున్న హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎట్టకేలకు కలెక్టరేట్ ఐడీఓసీ భవనంలోకి మారనుంది. ఇంతకాలం ఉన్న అడ్డంకులు తొలగించుకుని కలెక్టరేట్ రెండో అంతస్తులో కేటాయించిన ఎస్ 14, 16, 17 గదుల్లోకి రానుంది. అధికారికంగా సోమవారం కలెక్టర్ ప్రావీణ్య కార్యాలయాన్ని ప్రారంభించనుండగా.. ఇప్పటికే పాత డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి సామగ్రి తరలించారు. అలాగే ఈనెల 4న క్షేత్రస్థాయిలో వైద్యాధికారులతో నిర్వహించే సమాశాన్ని కూడా కలెక్టరేట్ చేపట్టనున్నట్లు డీఎంహెచ్ఓ వైద్యాధికారులకు సమాచారం పంపించారు. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సుహన్మకొండ: అరుణాచలం గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్‌రావు ఆదివారం తెలిపారు. ఈనెల 12న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి రాజధాని ఏసీ బస్సు బయల్దేరి 14న అరుణాచలం చేరుకుంటుందన్నారు. 15న జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం దర్శనం అనంతరం హనుమకొండకు చేరుకుంటుందని పేర్కొన్నారు. చార్జీ పెద్దలకు రూ.6వేలు, పిల్లలకు రూ.4,500గా నిర్ణయించినట్లు వివరించారు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం 99592 26047, 94941 07944 నంబర్లలో సంప్రదించాలని ఒక ప్రకటనలో కోరారు. -
భూసేకరణే సమస్య..
ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రైతులు ఎక్కువ పరిహారం డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి అడ్డంకిగా మారాయి. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం విపరీతంగా పెరుగుతోంది. మొత్తం 33,224 ఎకరాలకు 30,268 ఎకరాలు సేకరించగా.. జనగామ నియోజకవర్గంలో 945 ఎకరాలు, పాలకుర్తిలో 826, గజ్వేల్‌లో 230, నర్సంపేటలో 131, వర్ధన్నపేటలో 168 ఎకరాలు.. ఇలా 2,957 ఎకరాల సేకరణ జరగాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయం 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. మూడు దశల్లో 16 ప్యాకేజీల్లో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ.14,188 కోట్లు ఖర్చయినట్లు అధికారులు వెల్లడించారు. 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత భూసేకరణతో పాటు ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరోసారి అంచనాలు పెంచి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. అయితే ఈమేరకు అధికారులు రూ.17,500 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచడం.. లేదంటే రైతులను ఒప్పించడం.. ఏదో ఒకటి జరిగితేనే భూసేకరణ ముందుకు సాగి.. ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. -
ఎయిర్పోర్ట్ క్రెడిట్ రేవంత్‌కు దక్కదు
హన్మకొండ: వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ వీసమెత్తు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి దక్కద ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. విమానాశ్రయాన్ని తాను తీసుకొచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపర్చడమేనన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎయిర్ స్ట్రిప్డ్గా ఏర్పాటు చేశారని, తాను స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు 1976, 1978 కాలంలో వాయుదూత్ సర్వీస్ నడిచేదన్నారు. 1980లో మూతపడిందని, అప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటే మామునూ రు ఎయిర్పోర్ట్ మరోలా ఉండేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర మంత్రి ప్రపుల్ పటేల్‌కు లేఖ రాస్తే శంషాబాద్‌కు 150 కిలోమీటర్ల వరకు విమానాశ్రయం పెట్టొద్దని జీఎంఆర్‌తో 25 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నట్లు జవాబు ఇచ్చారన్నా రు. తెలంగాణ ఆవిర్భావం కాగానే కేసీఆర్ విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేశారని, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ కొట్లాట చూస్తుంటే నవ్వొస్తున్నద ని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, పులి రజనీకాంత్, నయీముద్దీన్ పాల్గొన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ -
ఆర్ఆర్ఆర్ సదస్సుకు మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్: ‘చెత్త రెడ్యూస్, రీ యూజ్, రీసైక్లింగ్(ఆర్ఆర్ఆర్) సిటీస్–2.0’పై రాజస్తాన్ రాజధాని పింక్ సిటీ జైపూర్‌లో ఈనెల 2 నుంచి 12వ రీజినల్ సదస్సు జరగనుంది. ఈ మేరకు వరంగల్ నగర మేయర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సీఎంహెచ్ఓ రాజారెడ్డికి ఆహ్వానం అందింది. జీడబ్ల్యూఎంసీ పరిధి 66 డివిజన్ల వ్యాప్తంగా అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, చెత్త శుద్ధీకరణ, స్వచ్ఛ వరంగల్ కార్యక్రమాలపై సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ జేడీగా సాంబశివరావుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివేకానంద రీసెర్చ్‌స్కాలర్స్ హాస్టల్ జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ అంకశాల సాంబశివరావు నియమితులయ్యారు. ఈమేరకు శనివారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను సాంబశివరావు అందుకున్నారు. -
మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత
● పోటాపోటీగా ప్రధాని మోదీ, రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు ● బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్యతోపులాటఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల చేసిన నేపథ్యంలో శనివారం ఎయిర్పోర్ట్ వద్దకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు పీఎం మోదీ ఫ్లెక్సీకి, కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఒకరి వేదికపైకి ఒకరు చొచ్చుకురావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి తమ వల్లే అని ఇరు పార్టీల నేతలు పరస్పరం దూషణలతో తోపులాడుకున్నారు. పోలీ సులు చేరుకుని ఇరువర్గాలను పంపించి ఎయిర్పోర్ట్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. -
క్యాన్సర్‌పై జాగ్రత్త అవసరం
వరంగల్ లీగల్: క్యాన్సర్‌పై జాగ్రత్త అవసరమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ సూచించారు. వరంగల్ కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ సహకారంతో అవగాహన, వ్యాధి స్క్రీనింగ్ టెస్ట్‌లను నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిర్మలా గీతాంబ హాజ రై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం వాకింగ్, మద్యపానం, పొగాకుకు దూరంగా ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చని సూచించారు. అనంతరం వైద్యులు న్యాయవాదులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు మనీష శ్రావణ్ ఉన్నమ్, న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు సాయికుమార్, క్షమాదేశ్‌పాండే, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్, మాతంగి రమేశ్‌బాబు, ప్రతిమ హాస్పిటల్ డాక్టర్ సుమిత్ర తిప్పాని, చౌకత్, ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మహిళా న్యాయమూర్తులకు క్రీడా పోటీలు ఈనెల 8న జరిగే మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో శనివారం మహిళా న్యాయమూర్తులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబతోపాటు న్యాయమూర్తులు మనీష శ్రావణ్ ఉన్నమ్, క్షమా దేశ్‌పాండే, శ్రావణ స్వాతి ఉల్లాసంగా పాల్గొని చెస్, షటిల్ ఆడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ ఉచిత వైద్య శిబిరం ప్రారంభం -
ఉద్యోగుల సమస్యలకు త్వరలో పరిష్కారం
హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓస్ భవన్లో శనివారం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కేంద్ర సంఘం నేతలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. సీఎం దృష్టికి ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారని, సీఎంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఆకుల రాజేందర్ నాయకత్వంలో హనుమకొండ జిల్లా యూనియన్ బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర సంఘం సహకారంతో జిల్లా స్థాయి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌లను ఘనంగా సన్మానించారు. జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి ఫనికెల రాజేశ్, గౌరవ అధ్యక్షులు శ్యాంసుందర్, రామునాయక్, రాజీవ్ ఇతర నాయకులు ఉన్నారు. -
భద్రకాళి చెరువు పనులపై బడా నాయకుల కన్ను?
క్యూబిక్ మీటర్‌కు రూ.162.56 నుంచి రూ.71.83కు తగ్గింపు● పట్టుబట్టి రేట్లు తగ్గించినట్లు ప్రచారం ● అనుకూల కాంట్రాక్టర్‌కు కట్టబెట్టే యత్నం ● అందుకే.. టెండర్ల దశలోనే బాలారిష్టాలు ● మరోసారి 5వ తేదీ వరకు టెండర్ల తేదీ పొడిగింపు సాక్షిప్రతినిధి, వరంగల్: భద్రకాళి చెరువులో పూడికతీత, మట్టి తరలింపు పనులకు మహూర్తం కుదరడం లేదు. యాభై ఏళ్ల తర్వాత పూడిక తీసేందుకు సుమారు మూడున్నర నెలల క్రితం చెరువు నుంచి నీళ్లు ఖాళీ చేశారు. వెంటనే టెండర్ ద్వారా చెరువు నుంచి పూడిక మట్టి తవ్వకం, లోడింగ్, తరలింపు పనులు చేపట్టేందుకు నిర్ణయం జరిగింది. ఈమేరకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో సమీక్ష కూడా నిర్వహించారు. నీటి పారుదల శాఖ ద్వారా మొత్తం రూ.13,00,09,046 వ్యయంతో రెండు పనులకు రెండు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినా పనులు ఖరారు కాలేదు. అయితే ఇతర కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వెనుక అసలు మతలబు.. కొందరు ప్రజాప్రతినిధులు తమ అనుచరులు, అనుకూలురైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించే క్రమంలో ప్రయత్నాలు చేస్తుండడమేనన్న ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో మొదట మట్టి తవ్వకం, తరలింపు పనులకు క్యూబిక్ మీటర్ ధర రూ.162.56 ప్రకటించిన అధికారులు.. సవరణ, సాంకేతిక కారణాల పేరిట క్యూబిక్ మీటరుకు రూ.71.83లుగా ఖరారు చేశారన్న చర్చ జరుగుతోంది. రేట్ల తగ్గింపుపై అనుమానాలు.. భద్రకాళి చెరువు పూడిక పనుల ఖరారులో ఆలస్యం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా అధికారులు.. మొదట ఇద్దరు టెండర్లు వేస్తే తక్కువ కోట్ చేశారని రద్దు చేశారు. ఆతర్వాత క్యూబిక్ మీటర్‌కు రూ.162.56 ఉన్న ఽరేటును రూ.71.83లు తగ్గించి.. నాన్ యూజ్ ఫుల్ సాయిల్‌గా గుర్తించి జీఎస్టీ, మెటీరియల్ కాస్ట్ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్టర్లు తక్కువ కోట్ చేశారని మొదట టెండర్లు రద్దు చేసిన అధికారులు.. క్యూబిక్ మీటర్‌కు రూ.90.73 (సగానికి పైగా) తగ్గించడం పథకం ప్రకారమేనన్న చర్చ జరుగుతోంది. ఓ వైపు కొందరు ప్రజాప్రతినిధులు ఈ పనులపై కన్నేసి అనుకూలురకు ఇప్పించే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతోందనే ప్రచారం ఉండగా.. మరోవైపు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి బంధువుకు కావాలని పట్టుపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. వేసవి ఎండలు ముదురుతున్న నేపథ్యంలో.. ఖాళీ అయిన భద్రకాళి చెరువు కారణంగా నగరంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు హైదరాబాద్ నుంచి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేస్తుండగా.. కలెక్టర్లు సైతం ఇరిగేషన్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పనుల చేజిక్కించుకునేందుకు కొందరు ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు, ఒత్తిళ్ల కారణంగా టెండర్ల ఖరారులో ఆలస్యం జరుగుతోందన్న ప్రచారం బాగా జరుగుతోంది. సెలవుల వల్ల గడువు పొడిగింపు.. పూడికతీతలో వచ్చే నల్లమట్టి కొనుగోలుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 5 వరకు పొడిగించాం. మొదట ఫిబ్రవరి 17 నుంచి 28 వరకు సమయం ఇచ్చాం. అయితే వరుస సెలవులు రావడంతో డీడీలు తీసుకునే చివరి తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఈనెల 5 వరకు పొడిగించాం. మట్టి కావాల్సిన వ్యక్తులు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. – ఎం.శంకర్, ఈఈ, నీటిపారుదలశాఖ నక్కలగుట్ట డివిజన్వాయిదాల టెండర్లు.. భద్రకాళి చెరువులో పూడికతీత, మట్టి తరలింపు పనులకు జనవరి 5, 10 తేదీల్లో టెండర్లు పిలిచారు. పూడిక తవ్వడం, లోడింగ్ పనులకు రూ.3,49,11,446 కేటాయించారు. అలాగే పూడిక మట్టిని తరలించేందుకు క్యూబిక్ మీట రుకు రూ.162.56 చొప్పున 5.85 లక్షల క్యూబి క్ మీటర్లకు రూ.9,50,97,600 చెల్లించేలా.. మరో టెండర్ పిలిచారు. ఈపనుల కోసం కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగానే ముందుకు రాలేద న్న చర్చ జరుగుతోంది. ఈసమయంలో మట్టి తవ్వకం, లోడింగ్ పని కంటే.. పూడిక మట్టి తరలించే పనికి సంబంధించిన టెండర్ నోటిఫికేష న్లో నిబంధనలు కఠినంగా ఉన్నాయని కాంట్రాక్టర్లు ఆసక్తి చూపట్లేదని అధికారులు చెప్పుకొచ్చారు. పూడికతీత, లోడింగ్, తరలింపు పనులను అత్యవసరంగా భావించిన అధికారులు రెండోసారి టెండర్లు పిలిచినా ఫలితం లేదు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఫిబ్రవరి 28న టెండర్ల దాఖలుకు చివరి తేదీగా మరోసారి టెండర్లు పిలిచారు. తాజాగా మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించారు. -
భూతగాదాల్లో తలదూర్చొద్దు..
పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వరంగల్ క్రైం: భూతగాదాల్లో తలదూర్చొదని పోలీస్ కమిషనర్ అంబర్కిశోర్ ఝా పోలీసులకు సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా శనివారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న చైన్ స్నాచింగ్ కేసులను త్వరగా పరిష్కరించి నేరస్తులను పట్టుకోవాలని చెప్పారు. బెయిల్‌పై బయటకు వచ్చి వాయిదాలకు రాని నేరస్తులను కనిపెట్టి వారిని కోర్టులో హాజరు పర్చాలన్నారు. నిందితుల అరెస్ట్‌లో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. రాత్రి వేళ్లల్లో నిరంతరం పెట్రోలింగ్ చేపట్టాలని ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులు సరైన సమయంలో సెంటర్లకు చేరేలా ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ల వారీగా సమీక్షించిన సీపీ.. ఆస్తి, ఫోక్సో, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాద కేసుల స్థితిగతులపై తెలుసుకున్నారు. డీసీపీ షేక్ సలీమా, రవీందర్, రాజమహేందర్‌నాయక్, ఏఎస్పీ చైతన్, మనన్భట్తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
– వివరాలు 8లోu
సింగర్ గీతామాధురి పాటకు కేరింతలు కొడుతున్న విద్యార్థులురంగులద్దుతున్న విద్యార్థులునిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న ‘స్ప్రింగ్‌స్ప్రీ–25’ వేడుకలు రెండోరోజు శనివారం కలర్ఫుల్గా సాగాయి. దేశవ్యాప్త వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ సంస్కృతీ సంప్రదాయాల ప్రదర్శనలతో పోటీ పడ్డారు. గీతామాధురి, మ్యాడ్–2 రాకతో ప్రోషో అదిరిపోయింది. కొరియో నైట్‌లో విద్యార్థులు స్టెప్పులతో సందడి చేశారు. ఈ వేడుకలు ఆదివారం ముగియనున్నాయి. – కాజీపేట అర్బన్ -
పడిపోతున్న భూగర్భ జలం
హన్మకొండ: హనుమకొండ జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పెరిగిన భూగర్భ జలాలు నవంబర్ నుంచి క్రమేపీ తగ్గుతున్నాయి. సెప్టెంబర్ చివరన 2.94 మీటర్ల లోతులో ఉండగా నవంబర్ 4.16, డిసెంబర్ 4.81, జనవరి 5.93, ఫిబ్రవరి చివరన 6.30 మీటర్ల దిగువకు పడిపోయాయి. అక్టోబర్ తర్వాత వర్షాలు లేవు. నవంబర్ నుంచి యాసంగి వ్యవసాయ పనులు మొదలయ్యాయి. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,77,437 ఎకరాల్లో సాగు చేయగా.. ఇందులో వరి 1,19,270 ఎకరాలు, మొక్కజొన్న 57,498, వేరుశనగ 473, పొగాకు 62, కంది 35, మినుము 24, మిగతా పంటలు సింగిల్ డిజిట్లో సాగయ్యాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న సాగుకు నీటి వినియోగం పెరిగింది. దీనికితోడు జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు లేవు. దీంతో భూగర్భ జలమట్టం పడిపోతున్నది. గత ఏడాది ఫిబ్రవరి చివరన జిల్లా సగటు భూగర్భ జలమట్టం 6.17 మీటర్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 6.30 మీటర్లకు పడిపోయింది. అత్యధికంగా ఐనవోలులో 21.76 మీటర్లకు, నడికూడ మండలం చర్లపల్లిలో 12.50 మీటర్లకు పడిపోయింది. మండలాల వారీగా.. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌లో 5.51 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. జగన్నాథపూర్ 9.54, కొత్తపల్లి 8.56, వంగర 9.45, ధర్మసాగర్ మండలం ధర్మాపూర్ 3.53, ధర్మసాగర్ 2.89, పెద్ద పెండ్యాల 8.43. నారాయణగిరి 3.53, ఎల్కతుర్తి 7.51, హనుమకొండ 6.04, హసన్‌పర్తి మండలం నాగారం 7.89, సీతంపేట 3.42, ఎల్లాపూర్ 2.94, ఐనవోలు మండలం పున్నేలు 3.86, పంథిని 4.69, ఐనవోలు 21.76, కమలాపూర్ మండలం శనిగరం 6.11, వేలేరు మండలం పీచర 9.42, వేలేరు 2.76, ఆత్మకూరు 2.76, దామెర 3.49, నడికూడ మండలం చర్లపల్లి 12.42, నడికూడ 2.84, పరకాల 3.48, శాయంపేట మండలం పత్తిపాకలో 4.78 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి. గత నెలలో సగటు 5.93 మీటర్లు ప్రస్తుతం 6.30 మీటర్లు దిగువన నీరు -
ఎంజీఎంలో కార్మికుల ఆందోళన
ఎంజీఎం: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంజీఎంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో సెక్యురిటీ కాంట్రాక్ట్ టెండర్ దక్కించుకున్న సంస్థకు బిల్లులు నాలుగు నెలలుగా రావడంలేదని.. ప్రస్తుతం ఆ సంస్థ తమకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని కార్మికులు వాపోయారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు వరంగల్ కలెక్టర్ సత్యశారదను కలిసి సమస్యను వివరించారు. స్పందించిన ఆమె.. నాలుగు రోజుల్లో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించి విధుల్లో చేరారు. -
క్యాన్సర్‌పై జాగ్రత్త అవసరం
వరంగల్ లీగల్: క్యాన్సర్‌పై జాగ్రత్త ఎంతో అవసరమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ సూచించారు. వరంగల్ కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ సహకారంతో క్యాన్సర్‌పై అవగాహన, స్క్రీనింగ్ టెస్ట్‌లను నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిర్మలా గీతాంబ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మంచి ఆహారపు ఆలవాట్లు, నిత్యం వాకింగ్, మద్యపానం, పొగాకుకు దూరంగా ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చని సూచించారు. అనంతరం వైద్యులు న్యాయవాదులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు మనీష శ్రావణ్ ఉన్నమ్, న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు సాయికుమార్, క్షమాదేశ్‌పాండే, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్, మాతంగి రమేశ్‌బాబు, ప్రతిమ హాస్పిటల్ డాక్టర్ సుమిత్ర తిప్పాని, చౌకత్, ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ ఉచిత వైద్య శిబిరం ప్రారంభం -
ఐకమత్యంగా ఉంటేనే ప్రయోజనం
వరంగల్ చౌరస్తా: పద్మశాలి కులస్తులంతా ఐకమత్యంగా ఉంటేనే కులానికి ప్రయోజనం చేకూరుతుందని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, నగర మేయర్ సుధారాణి అన్నారు. ఈనెల 9న హైదరాబాద్ నాంపల్లి జింఖానా గ్రౌండ్లో నిర్వహించే 17వ అఖిల భారత పద్మశాలి సంఘం, 8వ తెలంగాణ ప్రాంతీయ మహా సభ నేపథ్యంలో శనివారం వరంగల్ చౌర్బౌళిలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో సంఘం వరంగల్, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు లయన్ ఆడెపు రవీందర్, బచ్చు ఆనంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహా సభ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుల బలం చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్‌రావు దంపతులను సత్కరించారు. సమావేశంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి, ప్రధాన కార్యదర్శి రాంచందర్‌రావు, నాయకులు వడ్నాల నరేందర్, గుండేటి నరేందర్, ఈగ వెంకటేశ్వర్లు, వైద్యం రాజగోపాల్, తవుటం రవీందర్, పోరండ్ల కష్ణ ప్రసాద్, కందికట్ల ప్రశాంత్, కేదాశి వెంకటేశ్వర్లు, గడ్డం భాస్కర్, డీఎస్.మూర్తి, కుసుమ సతీశ్, వంగ సూర్యనారాయణ, గడ్డం కేశవమూర్తి, పులికంటి రాజేందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి -
‘యూడీఐడీ’పై అవగాహన కల్పించాలి
వరంగల్: ఆన్లైన్లో యూడీఐడీ కార్డుల దరఖా స్తుపై దివ్యాంగులకు అవగాహన కల్పించాలని సెర్ప్ సీఈఓ దివ్యదేవ రాజన్ సూచించారు. యూడీఐడీ, సోలార్ విద్యుత్ ప్లాంట్ల డీపీఆర్‌పై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, ప్రభుత్వ ప్రధా న ఆస్పత్రుల పర్యవేక్షకులు, సంక్షేమ శాఖ అధికా రులతో శనివారం ఆమె హైదరాబాద్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ మాట్లాడుతూ యూడీఐడీ పోర్టల్, ఆన్లైన్, మీసేవ కేంద్రాల్లో యూనిక్ డిజబిలిటీ ఐడీ(యూడీఐడీ) కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గతంలో జారీ చేసిన సదరం సర్టిపికెట్లకు యూడీఐడీ కార్డులు మంజూరు చేసినట్లు వివరించారు. దివ్యాంగులు కచ్చితమైన చిరునామాతో www. swaralambanacard.gov. inలో దరఖాస్తు చేసుకుంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్ లాగిన్లోకి వెళ్తుందని తెలిపారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులు ఇచ్చిన సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుందని వివరించారు. షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం దివ్యాంగులు మెడికల్ క్యాంపునకు హాజరైతే ప్రత్యేక వైద్యులు పరిశీలించి వైకల్య శాతాన్ని నిర్ణయిస్తారని తెలిపారు. అనంతరం సర్టిఫికెట్ మంజూరు చేస్తారని చెప్పారు. సర్టిఫికెట్ ఎలాంటి ట్యాంపరింగ్ జరగకుండా వెబ్సైట్లో అప్లోడ్ చేసి సంతకం చేసిన ధ్రువీకరణ ప్రతులను హాస్పిటల్, డీఆర్డీఓ కార్యాలయాల్లో భద్రపరచాల ని తెలిపారు. దరఖాస్తులో నింపిన చిరునామాకు యూడీఐడీ కార్డు స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపిస్తారని పేర్కొన్నారు. సర్టిఫికెట్‌ను యూడీఐడీ పోర్టల్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సర్టిఫికెట్ల జారీకి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ప్రధాన ఆస్పత్రుల సూపరింటెండెంట్, అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సెర్ప్ సీఈఓ దివ్యదేవ రాజన్ -
రాష్ట్రస్థాయి పోటీల్లో నిషిత ప్రతిభ
దుగ్గొండి: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శర్మ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫిక్షన్ కథల పోటీల్లో నాచినపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నిషిత ప్రతిభకనబరిచిందని ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో ఆమె మాట్లాడుతూ కౌమార బాలికల కోసం శర్మ సంస్థ నిర్వహించిన పోటీల్లో 8వ తరగతి విద్యార్థిని నిషిత రాసిన ‘మనభవిష్యత్.. మనచేతిలోనే’ అంశానికి ప్రథమ బహుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు శర్మ సంస్థ నుంచి అందిన నగదు బహుమతిని ఎంఈఓ వెంకటేశ్వర్లు శనివారం నిషితకు అందించారు. విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయులు వెలిదండి సుమలత, సుధీర్‌కుమార్, మధుసూదన్, శ్రీనివాస్, గీత, మాధవరావు, కమల అభినందించారు. 6 నుంచి ‘కొమ్మాల’ బ్రహ్మోత్సవాలుగీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తర్వాత 10వ తేదీ రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం, 14న హోలీ పండుగ నుంచి జాతర ప్రారంభం అవుతుందని, 18న స్వామివారి రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. జాతర ఉగాది వరకు కొనసాగుతుందని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన ఎస్ఈలుహన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పి.మధుసూదన్‌రావు, వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా గౌతమ్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హనుమకొండ ఎస్ఈగా పని చేసిన వెంకటరమణ చీఫ్ ఇంజనీర్ పదోన్నతిపై కార్పొరేట్ కార్యాలయానికి వెళ్లగా ఆ స్థానంలో వరంగల్ ఎస్ఈగా పని చేస్తున్న పి.మధుసూదన్‌రావును బదిలీ చేశారు. అలాగే కార్పొరేటర్ కార్యాలయం ఆపరేషన్ విభాగం–1 జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న గౌతమ్ రెడ్డిని వరంగల్ ఎస్ఈగా నియమితులయ్యారు. విద్యార్థుల్లో విలువలను పెంపొందించాలి : డీఈఓనర్సంపేట రూరల్: విద్యార్థుల్లో విలువలను పెంపొందించాలని డీఈఓ జ్ఞానేశ్వర్ అన్నారు. లక్నెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన స్ఫూర్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే మంచి అలవాట్లను అవర్చుకోవాలని, చదువులో రాణించాలని సూచించారు. అదేవిధంగా గురిజాల జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సదానందం ప్రసంగించారు. బెదిరించిన వారిపై కేసుసంగెం: చంపుతామని బెదిరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమ వివాహం చేసుకోవడానికి గత నెల 27న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కాట్రపల్లి శివారు వడ్డెరగూడేనికి చెందిన ఆలకుంట రంజిత్‌కు సదరు యువతి మేనత్త కూతురు. రంజిత్‌తోపాటు అదేగ్రామానికి చెందిన రాకేశ్, రజినీకాంత్, వల్లేపు రాజేశ్ ఆమెను వెతికేందుకు శనివారం చింతలపల్లికి వెళ్లారు. రైల్వేగేట్ వద్దకు వెళ్లేసరికి చింతలపల్లికి చెందిన అల్లెపు శ్యాం, కార్తీక్, మల్లేశ్ వారిని అడ్డుకుని దూషించి దాడి చేశారు. మళ్లీ ఇటువైపు వస్తే చంపుతామని బెదిరించారని రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్యాం, కార్తీక్, మల్లేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
చెన్నారావుపేట: విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన సంఘటన గొల్లభామతండాలో శని వారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన గుగులోత్ మంగ్యా భార్య సునీత (38) రోజు వారీగా వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంటిలో ఉన్న తీగను ప్రమాదవశాత్తు తాకడంతో విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త మంగ్యా, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సునీత మృతితో గొల్లభామతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇల్లు కట్టుకుంటే బతికేది.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాలో మంగ్యా, సునీత దంపతులకు ఇల్లు మంజూరుకాగా పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. గ్రామ పెద్దలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇంటి స్థలంలోనే తాత్కాలికంగా తడకలతో రేకులషెడ్డు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటిలో పేలిపోయి ఉన్న విద్యుత్ తీగలు గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై సునీత మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇల్లు నిర్మించుకుంటే బతికేది అని తండావాసులు పేర్కొన్నారు. గొల్లభామతండాలో విషాదఛాయలు -
నమూనా ఇందిరమ్మ ఇంటి పనుల పరిశీలన
సంగెం: మండల కేంద్రంలోని చేపట్టిన నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను జిల్లా హౌసింగ్ పీడీ గణపతి, డీఈలు లాల్‌కిషన్, విష్ణువర్ధన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని పీడీ అధికారులను ఆదేశించారు. చంద్రుగొండలో చోరీనెక్కొండ: మండలంలోని చంద్రుగొండలో చోరీ జరిగింది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాంకాల రేణుక గత నెల 27న గొర్రెకుంటలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్లింది. తిరిగి శనివారం ఉదయం ఇంటికి చేరుకోగా చోరీ జరిగిందని గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్స్ నిపుణులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. బీరువాలోని సుమారు 7.5 గ్రాముల బంగారు, 12 తులాల వెండి నగలు, రూ.29 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారని రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కలర్‌ఫుల్.. ఫెస్ట్
నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న స్ప్రింగ్ స్ప్రీ–25 వేడుకలు రెండోరోజు శనివారం కలర్ఫుల్గా సాగాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ సంస్కృతీ సంప్రదాయాల ప్రదర్శనలతో పోటీ పడ్డారు. గీతామాధురి, మ్యాడ్–2 రాకతో ప్రోషో అదిరిపోయింది. కొరియో నైట్‌లో విద్యార్థులు స్టెప్పులతో సందడి చేశారు. ఈ వేడుకలు ఆదివారం ముగియనున్నాయి. – కాజీపేట అర్బన్– వివరాలు 8లోu -
మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత
ఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల చేసిన నేపథ్యంలో శనివారం ఎయిర్పోర్ట్ వద్దకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు పీఎం మోదీ ఫ్లెక్సీకి, కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఒకరి వేదికపైకి ఒకరు చొచ్చుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి తమ వల్లే అంటే.. ఇరు పార్టీల నేతలు పరస్పరం దూషణలతో తోపులాడుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. ఎయిర్ పోర్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోటాపోటీగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట -
చిన్నారుల హాజరు శాతాన్ని పెంచాలి
నల్లబెల్లి: అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతాన్ని పంపిణీ చేస్తూ చిన్నారుల్లో రక్తహీనత, పోషణ లోపాలను నివారించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అన్నారు. నర్సంపేట సీడీపీఓ మధుమరిమతో కలిసి అర్వయ్యపల్లిలో నల్లబెల్లి, రుద్రగూడెం సెక్టార్ల సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని వారిని సున్నితంగా మందలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్ధిదారులకు క్రమం తప్పకుండా పోషకాహారాన్ని అందించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఆటాపాటలతో విద్యనందిస్తూ ప్రీస్కూల్ పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను ప్రజలకు వివరించాలని టీచర్లను కోరారు. బాలామృతం ప్రయోజనాలపై తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో సూపర్వైజర్ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి రాజమణి -
లక్ష్యం.. వంద శాతం
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuనల్లబెల్లి: గ్రామాల్లో ఆస్తి పన్ను వసూళ్లను పంచాయతీ అధికారులు వేగవంతం చేశారు. ఈ నెల 31 వరకు వందశాతం పన్నులు వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు జిల్లా అధికారులు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 71 శాతం పూర్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి పన్నులే ప్రధాన ఆదాయ వనరు. ఈ నేపథ్యంలో ఇంటి, నల్లా పన్నుల వసూళ్లపై పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇవి సకాలంలో వసూలైతే ప్రగతి సాధ్యమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులు అరకొరగా విడుదల చేయడంతో ఇంటి, నల్లా పన్నుల వసూలు కీలకంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 30 రోజుల గడువు మాత్రమే ఉంది. ఎలాగైనా ఈ నెలాఖరు వరకు వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకుపోతున్నారు. ప్రజాపాలన, ఆర్థిక, సామాజిక సర్వే, ఇందిరమ్మ ఇళ్ల సర్వే, స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్ల విధులు నిర్వర్తించిన పంచాయతీ సిబ్బంది పన్ను వసూళ్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించారు. ఇంకా వసూలు చేయాల్సింది రూ.1,40,02,198 జిల్లాలోని 11 గ్రామీణ మండలాల్లో 315 గ్రామ పంచాయతీలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు రూ.51,67,650 బకాయిలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,33,25,942 కాగా.. గత ఆర్థిక సంవత్సరం కలిపి మొత్తం రూ.4,84,93,592 పన్నుల వసూలు లక్ష్యంగా ఉంది. ఇప్పటి వరకు రూ.3,44,91,394 పన్నులు వసూలు చేశారు. ఇంకా రూ.1,40,02,198 వసూలు పూర్తి చేస్తామని పంచాయతీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.న్యూస్రీల్గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై సిబ్బంది ప్రత్యేక దృష్టి టార్గెట్ రూ.4,84,93,592.. వసూలైంది రూ.3,44,91,394 మరో 30 రోజుల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం జిల్లాలో 11 గ్రామీణ మండలాలు.. 315 గ్రామ పంచాయతీలుమండలాల వారీగా గ్రామపంచాయతీలు, పన్నుల వసూళ్ల వివరాలు (రూ.ల్లో)..మండలం గ్రామపంచాయతీలు లక్ష్యం వసూలైంది వసూలు కావాల్సిందిచెన్నారావుపేట 30 34,07,013 23,34,018 10,72,995 దుగ్గొండి 34 45,86,374 31,76,118 14,10,256 గీసుకొండ 21 40,64,628 33,50,679 7,13,949 ఖానాపురం 20 43,50,036 32,21,544 11,28,492 నల్లబెల్లి 29 38,29,273 23,32,474 14,96,799 నర్సంపేట 19 45,20,719 35,98,614 9,22,105 నెక్కొండ 39 55,58,602 41,25,115 14,33,487 పర్వతగిరి 33 47,61,995 34,44,269 13,17,726 రాయపర్తి 39 54,12,419 27,46,405 26,66,014 సంగెం 33 43,72,240 34,93,779 8,78,461 వర్ధన్నపేట 18 36,30293 26,68,379 9,61,914 -
వరంగల్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
సాక్షి, మామునూర్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాలో మామునూరు విమానాశ్రయం వద్ద ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో జై మోదీ అని బీజేపీ కార్యకర్తలు.. జై కాంగ్రెస్ అంటూ హస్తం పార్టీ నినాదాలు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాల నేతలు అడ్డుకున్నారు.మామునూర్ ఎయిర్‌పోర్టు విషయమై వరంగల్‌లో ఉద్రిక్తత నెలకొంది. మామునూర్ విమానాశ్రయానికి ఇటీవల కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విమానాశ్రయానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రధాని మోదీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు శనివారం ఉదయం అక్కడికి చేరుకున్నాయి. విమానాశ్రయం వద్ద మోదీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు.కాగా, బీజేపీ నేతలు అక్కడికి వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ శ్రేణులు సైతం విమానాశ్రయం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే విమానాశ్రయం రెడీ అవుతోందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఇరు వర్గాలు మధ్య ఘర్షణ తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాల నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించడం గమనార్హం. -
ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడని..
రామన్నపేట: నగరంలోని ములుగు రోడ్డు సమీపంలోని లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ అదే కళాశాలలోని మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ శుక్రవారం కళాశాల భవనం ఎదుట నిరసన తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కళాశాలలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి హర్షవర్ధన్‌రెడ్డిని టీచర్ల సమస్యలపై ప్రశ్నించినందుకు కళాశాల యాజమాన్యం తనను వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల సమస్యలు తీర్చాలని అడిగినందుకు తనకు కళాశాల యాజమాన్యం నోటీసులు ఇవ్వగా తీసుకోకపోవడంతో, కళాశాల నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ హుకుం జారీ చేశారని తెలిపారు. ఏడు సంవత్సరాలుగా కళాశాలలో ఫిలాసఫీ సబ్జెక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ కింద నడుస్తున్న కళాశాలలో ప్రిన్సిపాల్ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రిన్సిపాల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, కళాశాలలో అధ్యాపకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రిన్సిపాల్‌కి భయపడి ఎవరూ బయటికి చెప్పుకోవడంలేదని వివరించారు. కళాశాలలో జరుగుతున్న అన్యాయాలపై ఉస్మానియా గ్యాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. -
డాక్టర్ మృతి.. భార్య, ప్రియుడు స్కెచ్?
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ వైద్యుడు సుమంత్ రెడ్డి మృతిచెందారు. ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి శుక్రవారం అర్థరాత్రి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. సుమంత్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సుమంత్ రెడ్డి భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రెండు రోజుల క్రితం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా, దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, సామ్యూల్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది.దీంతో, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు. అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే తన చేతికి మట్టి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది. -
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
సాక్షిప్రతినిధి, వరంగల్/విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కొనసాగింది. టీచర్లు, అధ్యాపకులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తంగా 92.95శాతం పోలింగ్ నమోదైంది. హనుమకొండ జిల్లాలోని 15 పోలింగ్ కేంద్రాల్లో కలిపి 5,215 మంది ఓటర్లు ఉండగా.. 4,780 మంది (91.66శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రంలో మార్చి 3న జరగనుంది. హనుమకొండలోని యూనివర్సిటీ లా కాలేజీ, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య పోలింగ్ సరళని పరిశీలించారు. వివిధ పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. హనుమకొండలోని యూనివర్సిటీ లా క ళాశాల పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. కేడీసీలో నాలుగు పోలింగ్ కేంద్రాలు హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అశోక్ సెంటర్ నుంచి బస్టాండ్ రోడ్డులో ఈ కళాశాల ఉంది. కళాశాల సమీపంలో రహదారికి ఇరువైపులా కొంత దూరం వరకు అభ్యర్థుల మద్దతుదారులు టెంట్లు వేసుకొని పోలింగ్ చిట్టీలు రాసిచ్చారు. ఈ మార్గం సాధారణంగానే నిత్యం రద్దీగా ఉంటుంది. అభ్యర్థుల మద్దతుదారులు, ఓటర్లతో మరింత రద్దీగా కనిపించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. వివిధ పోలింగ్ కేంద్రాలను టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, పూల రవీందర్, పులి సరోత్తంరెడ్డి, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, సుందర్రాజు యాదవ్, యోల చంద్రమోహన్ వేర్వేరుగా సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పట్టభద్రుల్లో కొరవడిన చైతన్యం పట్టభద్రుల్లో చైతన్యం కొరవడడంతో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. హనుమకొండ జిల్లాలోని నాలుగు మండలాలైన భీమదేవరపెల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, వేలేరు మండలాల్లో 4,585 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా.. 1,780 మంది ఓటర్లు (38.82శాతం) ఓటు వేశారు. పరిశీలించిన సీపీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను సీపీ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. హసన్‌పర్తి, ఎల్కతుర్తి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఏసీపీలు, ఇన్స్పెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ జిల్లాలో.. సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 2,352 మంది ఓటర్లకు గానూ 2,214 మంది (94.13 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. సెంట్రల్ డీసీపీ షేక్ సలీమాతో కలిసి వరంగల్ పట్టణంలోని ఇస్లామియా కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. శాయంపేటలో పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేస్తున్న సిబ్బంది హనుమకొండ, వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా ఓటేసిన ఉపాధ్యాయులు నల్లగొండలోని స్ట్రాంగ్‌రూమ్‌కు బ్యాలెట్ బాక్సుల తరలింపు పలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారులు, సీపీ ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు.. జిల్లా ఓటర్లు పోలైనఓట్లు శాతం జనగామ 1,002 945 94.31 హనుమకొండ 5,215 4,780 91.66 వరంగల్ 2,352 2,214 94.13 మహబూబాబాద్ 1,663 1,571 94.47 జేఎస్ భూపాలపల్లి 329 308 93.62 ములుగు 628 583 92.83 -
సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకోవాలి
● అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనంలో కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ: రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలతో పాటు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ–కేరళ అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనం జరిగింది. ఈకార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పి.ప్రావీణ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. కేరళ యువత తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, కేరళ సంస్కృతీ సంప్రదాయాలను ఇక్కడి యువత తెలుసుకోవాలని సూచించారు. తాను కూడా కేరళ రాష్ట్రాన్ని పలుమార్లు సందర్శించానని కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన కేరళ యువతకు డ్రెస్, టోపీలతో కూడిన కిట్లను ఆమె అందించారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
యువతలోని ప్రతిభ వెలికితీసేందుకు
యువతలోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు వేదికగా స్ప్రింగ్ స్ప్రీ–25 నిలువనుంది. సంగీతం, నృత్యం, కళలు, వినోదం పలు రంగాల్లోని ప్రతిభను వెలికితీసేందుకు కల్చరల్ ఫెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు సినీనటుడు బ్రహ్మానందం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. – డి.శ్రీనివాసాచార్య, నిట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కలర్ఫుల్గా కల్చరల్ ఫెస్ట్నాటి ఆర్ఈసీ 1978లో ప్రారంభమైన స్ప్రింగ్‌స్ప్రీ నేడు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద కల్చరల్ఫెస్ట్గా పేరుగాంచింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీసంప్రదాయాలను పంచుకునే వేదికగా ఏర్పాటు చేసిందే ఈ వేడుక. నిట్‌లో 41 వసంతోత్సవ వేడుకలను స్ప్రింగ్‌స్ప్రీ–25గా జరుపుకుంటున్నాం. మూడు రోజుల పాటు కల్చరల్ఫెస్ట్ను కలర్ఫుల్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. – బిద్యాధర్ సుబుదీ, నిట్ డైరెక్టర్ ●