
జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కీలక నిర్ణయాలను తీసుకుంటూ.. మిత్ర దేశాలను, శత్రుదేశాలను భయానికి గురిచేస్తున్నారు. పన్నుల విషయంలో తగ్గేదే లే అన్నట్లు.. సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్ల మీద మాత్రమేనా.. ఆటోమొబైల్ ఉత్పత్తుల మీద కూడా సుంకాలను విధిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆదాయాన్ని పెంచడానికి, వాణిజ్య అసమానతలను పరిష్కరించడానికి సుంకాలు విధించడం అవసరమని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 50 శాతం ఆ దేశంలోనే తయారవుతున్నాయి. దిగుమతులలో సగం మెక్సికో.. కెనడా నుంచి వస్తున్నాయి. మిగిలిన సగం జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, బ్రిటన్, ఇటలీ, స్వీడన్ దేశాలు దిగుమతి చేస్తున్నాయి.
ఉక్కు, అల్యూమినియం దిగుమతి మీద 25 శాతం సుంకం ప్రకటించినప్పుడు.. ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫర్లీ విమర్శించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కార్ల ధరలను విపరీతంగా పెంచుతుందని, మా సరఫరా గొలుసులకు కూడా అంతరాయం కలిగిస్తుందని అన్నారు. ట్రంప్ పరిపాలనలోనే చర్చలు జరిపిన యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందానికి (USMCA) కూడా ప్రతికూలత కలుగుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నేనో ఇడియట్‌లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే అన్ని ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలకు సంబంధించిన ప్రణాళికలను అధ్యక్షుడు ఇటీవల నిర్ధారించారు. అయితే డెట్రాయిట్ ఆటోమేకర్లు జనరల్ మోటార్స్, ఫోర్డ్, స్టెల్లాంటిస్ వంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ ఆటోమోటివ్ పాలసీ కౌన్సిల్.. మెక్సికో & కెనడాపై ప్రతిపాదిత సుంకాలను తగ్గించాలని ట్రంప్‌కు పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment