
ఎక్స్(గతంలో ట్విటర్) సీఈఓ ఎలాన్ మస్క్ వికీపీడియా పేరు మార్చుకుంటే ఏకంగా ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.8,600 కోట్లు) ఇస్తానని ఆఫర్ చేశారు. గతంలో ఈమేరకు వికీపీడియా పేరు మార్పునకు సంబంధించి ఒక బిలియన్ డాలర్లు చెల్లిస్తానని చెప్పారు. తాజాగా ఓ నెటిజన్ మస్క్‌ను ‘ఈ ఆఫర్ ఇంకా ఉందా’ అని ప్రశ్నించారు. దాంతో మస్క్ తన ట్విటర్లో స్పందిస్తూ ‘ఆఫర్ ఉంది. రండి.. పేరు మార్చండి’ అంటూ అదే విషయాన్ని మళ్లీ ధ్రువీకరించారు.
వివాదం నేపథ్యం
వికీపీడియాతో కొనసాగుతున్న వైరంలో భాగంగా మస్క్ ఈ ఆఫర్ ప్రకటించారు. వికీపీడియా ఆర్థిక పద్ధతులు, రాజకీయ పక్షపాతం కారణంగా మస్క్ ఈ విమర్శలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వికీపీడియాను ‘వేక్పీడియా’ అని సంబోధించిన ఆయన, తన అనుచరులు ఈ వేదికకు విరాళాలు ఇవ్వడం మానేయాలని కోరారు. వికీమీడియా ఫౌండేషన్ తన నిధులను ముఖ్యంగా డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్ క్లూజన్ (డీఈఐ) కార్యక్రమాలకు కేటాయిస్తున్న నేపథ్యంలో మస్క్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.
Offer still stands. Come on, do it … https://t.co/RtRfd8wOI5
— Elon Musk (@elonmusk) February 17, 2025
మస్క్ వికీపీడియాపై గతంలో చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నారా అని నెటిజన్లు వేసిన ప్రశ్నలకు మస్క్ సూటిగా స్పందించారు. వికీపీడియా పేరు మార్పునకు సంబంధించి ‘ఈ ఆఫర్ ఇప్పటికీ ఉందా?’ అని మస్క్‌ను ట్విటర్లో కోట్ చేస్తూ జాన్స్ మీమ్స్ అనే యూజర్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా మస్క్ స్పందించారు. ‘ఆఫర్ ఇంకా ఉంది. రండి, పేరు మార్చండి..’ అని తెలిపారు. వికీపీడియాకు ‘డికిపీడియా’గా పేరు మార్పును ప్రతిపాదించారు.
నెటిజన్ల స్పందన
మస్క్ ఆఫర్‌కు సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది వికీపీడియా నిధుల నిర్వహణపై మస్క్‌కు ఏం సంబంధం? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు లాభాపేక్ష లేని సంస్థలు తమ వద్ద ఉన్న వనరులను ఎలా నిర్వహిస్తున్నాయనే దానిపై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లు చెబుతున్నారు. మస్క్ విమర్శలు కొనసాగుతున్నప్పటికీ వికీపీడియా నమ్మదగిన, పారదర్శక ప్లాట్‌ఫామ్ అని పేర్కొంటూ సంస్థ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ తెలిపారు. అయితే మస్క్ ప్రతిపాదనపై మాత్రం ఏవిధంగానూ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment