
మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త కార్ల కొనుగోలు కోసం వినియోగదారులు ఆసక్తి కనబరిచారు. కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు రికార్డు స్థాయి బుకింగ్‌లు అందినట్లు పేర్కొంది. సంస్థ ఇటీవల ఆవిష్కరించిన ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6ల మొదటి రోజు బుకింగ్ విలువ రూ.8,472 కోట్లుగా నమోదైంది. సుస్థిర, పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ బుకింగ్‌లు హైలైట్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మహీంద్రా సంస్థ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ముంచుకొస్తున్న జనాభా సంక్షోభం
మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృత శ్రేణి వినియోగదారులు ఆదరిస్తున్నారని మొదటి రోజు బుకింగ్ డేటా సూచిస్తుంది. మొత్తం బుకింగ్స్‌లో ఎక్స్ ఈవీ 9ఈ 56 శాతం, బీఈ 6 44 శాతం వాటాను దక్కించుకున్నాయి. రెండు మోడళ్లు విభిన్న కస్టమర్ అవసరాలను ఆకట్టుకునే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, అధునాతన ఫీచర్లు, లగ్జరీల సదుపాయాలను కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. బుకింగ్‌లను పరిశీలిస్తే 79 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉన్న టాప్ ఎండ్ వేరియంట్ ప్యాక్ త్రీకి డిమాండ్ అధికంగా ఉన్నట్లు తెలిసింది. మొత్తం బుకింగ్‌లలో ప్యాక్ త్రీ వేరియంట్ 73% వాటాను కలిగి ఉంది. ఇది లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ సామర్థ్యాన్ని అందించే వాహనం అని కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment