
అక్రమ సంబంధాలు ఎంతటి దారుణమైన పరిస్థితులకైనా దారితీస్తాయనడానికి పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన ఒక ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పదిమందికీ ఆదర్శంగా నిలవాల్సిన ఒక నేత స్వయంగా అకృత్యానికి పాల్పడటం మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని లుథియానాలో భార్యను హత్య చేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అనోఖ్ మిట్టల్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని స్నేహితురాలు, మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తొలుత అనోఖ్ మిట్టల్ తన భార్య లిప్సీ మిట్టల్‌ను ఒక గ్రామం దగ్గర దుండగులు హత్య చేశారని చెప్పాడు. తాను, తన భార్య లుథియానా-మలెర్‌కోట్లా రోడ్డులో ఒక హోటల్లో భోజనం చేసి, తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని అనోఖ్ మిట్టల్ పోలీసులకు తెలిపాడు. ఆ దుండగులు మారణాయుధాలతో దాడి చేసి, తమ కారు తీసుకుని పారిపోయాడని పేర్కొన్నాడు.
పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ మీడియాతో మాట్లాడుతూ తమ విచారణలో లిప్సీ మిట్టల్‌ను ఆమె భర్త అనోఖ్ మిట్టల్ హత్య చేశాడని విచారణలో వెల్లడయ్యిందన్నారు. అనోఖ్ మిట్టల్‌తో పాటు ఈ హత్యకు సహకరించిన అతని స్నేహితురాలు, మరో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. తన భర్తకు వివాహేతర సంబంధం ఉన్నదని లిప్సీ మిట్టల్‌కు తెలిసిపోయందని, దీంతో భయపడిన అనోఖ్ మిట్టల్ తన స్నేహితురాలి సాయంతో భార్యను హత్య చేశాడన్నారు. ఈ ఘటనలో అనోఖ్‌కు సహకరించిన అమృత్‌పాల్‌సింగ్, గురుదీప్ సింగ్, సోనూ సింగ్, సాగర్‌దీప్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: ‘మహాకుంభ్’ ఖర్చెంత? లాభమెంత?
Comments
Please login to add a commentAdd a comment