
వాషింగ్టన్: అమెరికా వాణిజ్య విధానం ఇచ్చిపుచ్చుకునే విధంగా న్యాయంగా ఉంటుందని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కొత్త టారిఫ్ విధానంపై సోమవారం(ఫిబ్రవరి 17) ఆయన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. తమ వాణిజ్య విధానంలో ఎక్కువ, తక్కువలకు చోటుండదన్నారు. అందరూ సమానమేనన్నారు.
ఆయా దేశాలు తమ వస్తువులపై ఎంత సుంకాలు విధిస్తాయో తామూ అంతే విధిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా ఎక్కువ సుంకాలు విధిస్తోందని ఏ దేశమైనా భావిస్తే ముందు ఆ దేశం అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించుకోవాలి లేదా పూర్తిగా తీసేయాలని ట్రంప్ సూచించారు. అమెరికాలో ఉత్పత్తి, వస్తువుల తయారీ చేపడితే సుంకాలు ఉండవని తెలిపారు.
సుంకాల విషయంలో అమెరికా మిత్ర,శత్రు దేశాలు చాలా కాలంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ అధ్యకక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాతో వాణిజ్యం నిర్వహించే దేశాలకు చెందిన వస్తువులపై దిగుమతి సుంకాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment