
ఈ ఏడాది అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో రూ. 21.27 కోట్లు రాబట్టింది. విడుదలైన వారం రోజులైనా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అలరిస్తోంది. వందకోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. దీంతో ఇటీవలే ఈ మూవీ సక్సెస్ కావడంతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా మెప్పించింది.

తాజాగా తండేల్ టీమ్ శ్రీకాకుళంలో సందడి చేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో చిత్రబృంద సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మరోసారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ చిత్రంలోనే హైలెస్సా.. హైలెస్సా అంటూ సాగే పాటకు స్టెప్పులు వేశారు. హీరోయిన్ సాయిపల్లవితో కలిసి వేదికపై డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాత బన్నీవాసు తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

కాగా.. ఈ చిత్రాన్ని మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. శ్రీకాకుళంకు చెందిన కొందరు మత్స్యకారులు పాకిస్తాన్ జలాల్లోకి పొరపాటున ప్రవేశించారు. దీంతో వారిని పాక్ కోస్ట్‌గార్డు బంధించి జైల్లో వేశారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Sweetest moments of Success 💗💗#Thandel @chay_akkineni @Sai_Pallavi92 #AlluAravind pic.twitter.com/HGnQ4tDlS0
— Bunny Vas (@TheBunnyVas) February 13, 2025
Comments
Please login to add a commentAdd a comment