
ఓ మై కడవులే, లక్కీ మ్యాన్, ఓరి దేవుడా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు. ప్రస్తుతం డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన అశ్వత్ మరిముత్తు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తెలుగులో సినిమా తీస్తే ఫస్ట్ మూవీని ఎవరితో చేస్తారని ప్రశ్నించగా.. దానిపై స్పందించారు. తెలుగులో సూపర్ స్టార్‌తోనే నా మొదటి సినిమా చేస్తానని మనసులో మాటను బయటపెట్టారు.
అశ్వత్ మరిముత్తు మాట్లాడుతూ..'ఆయన వల్లే నాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది. ఓసారి నా చిత్రం ఓహ్ మై కడవులే చిత్రానికి ట్విటర్లో ఊహించని విధంగా వ్యూస్ వచ్చాయి. దానికి కారణం ఏంటో మొదట తెలియలేదు. కానీ ఆ తర్వాత మహేశ్ బాబు మా సినిమాపై మెచ్చుకుంటూ పోస్ట్ చేశాడని తెలిసింది. ఆయన వల్లే మా చిత్రానికి గుర్తింపు వచ్చింది. కేవలం రూ.3 కోట్లతోనే ఆ సినిమాను నిర్మించాం. ఇది చాలా చిన్న సినిమా. తెలుగులో మహేశ్ బాబు ఒక్క ఛాన్స్ ఇస్తే ఆయనతోనే మొదటి సినిమా చేస్తా. ఆయనతో మూవీ చేయాలనేది నా చిరకాల కోరిక' అని వెల్లడించారు.
ఓ మై కడవులే చిత్ర నిర్మాతల నుంచి ఎటువంటి ముందస్తు అభ్యర్థన లేకుండానే మహేష్ బాబు ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారని మరిముత్తు వెల్లడింతారు. ఆయన వల్లే పలువురు తెలుగు దర్శకులు, నటీనటులు ఈ చిత్రాన్ని వీక్షించి అభినందనలు తెలిపారు. ఆ క్షణం నుంచి మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని మరిముత్తు తెలిపారు. మరి దర్శకుడి కోరికను మన మహేష్ బాబు అంగీకరిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ డ్రాగన్ చిత్రానికి దర్శకత్వ వహించారు మరిముత్తు. ఈ చిత్రం ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
#MaheshBabu వల్ల తెలుగు ఇండస్ట్రీ లో పేరు వచ్చింది - Director #AshwathMarimuthu#Dragon #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/fKHaTJiHr8
— Telugu FilmNagar (@telugufilmnagar) February 17, 2025
Comments
Please login to add a commentAdd a comment