పుష్ప-2 పావని.. ఆ విషయం గుర్తు చేసుకుని స్టేజీపైనే కన్నీళ్లు! | Pushpa 2 Actress Karanam Pavani Emotional Speech At Pushpa 2 The Rule Thank U Meet Event, Watch Video Inside Goes Viral | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: పుష్ప-2 పావని.. ఆ విషయం గుర్తు చేసుకుని స్టేజీపైనే కన్నీళ్లు!

Published Sun, Feb 9 2025 4:59 PM | Last Updated on Mon, Feb 10 2025 6:05 PM

Pushpa 2 Actress Karanam Pavani Emotional At Pushpa Thank U Meet Event

సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప-2 ది రూల్‌ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2021లో వచ్చిన పుష్ప పార్ట్‌-1కు కొనసాగింపుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసింది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు లేని విధంగా రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ ఏకంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి-1, బాహుబలి-1, కేజీఎఫ్ చిత్రాల రికార్డులను అధిగమించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ ‍అవుతోంది. వరల్డ్‌ వైడ్‌గా పలు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

పుష్ప-2లో ఆకట్టుకున్న పావని..

పుష్ప-2లో అజయ్ కూతురిగా నటించిన పావని కరణం అందరి దృష్టిని ఆకట్టుకుంది. పుష్పరాజ్‌ను చిన్నాయన అంటూ కావేరి పాత్రలో అభిమానులను మెప్పించింది పావని. అయితే పుష్ప-2 చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ హైలెట్‌గా నిలిచింది. బన్నీ గాల్లోకి ఎగురుతూ చేసిన ఫైట్ వరల్డ్‌ వైడ్‌ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో చిత్రబృందం థ్యాంక్స్ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన పావని ఎమోషనలైంంది. తనను గుర్తించి అవకాశమిచ్చిన డైరెక్టర్‌ సుకుమార్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

ఈవెంట్‌లో పావని మాట్లాడుతూ..' ఈవెంట్‌కు పెద్దలందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నా క్యారెక్టర్‌తో పాటు టీమ్ మొత్తానికి ఊహించని దానికంటే ఎక్కువ ఆదరణ వచ్చింది. ఎప్పుడైనా నిద్రలోంచి లేస్తే ఏడ్చుకుంటూ లేచేదాన్ని. సుకుమార్‌ గారికి, బన్నీగారికి థ్యాంక్స్ చెప్పలేదనే బాధ ఉండేది. సినిమా రిలీజ్ అయ్యాక సుక్కు సార్‌, బన్నీ సార్‌ను కలవలేదంటూ ఎమోషనలైంది. ‍అల్లు అర్జున్‌ సార్‌కు నేను వీరాభిమానిని. సెట్‌లో మీరు చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటా సార్. అంతేకాదు మీరు నాకు ఆదర్శం కూడా. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తా. సుక్కు సార్ మీరు నన్ను గుర్తించి అవకాశమిచ్చారు. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. సినిమా చూసిన తర్వాత నన్ను బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకు పనిచేసిన చిత్ర బృందానికి థ్యాంక్స్.' ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన సుకుమార్‌ సార్‌కు థ్యాంక్స్ అంటూ స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది పావని కరణం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement