
పిల్లలను ఎంతగానో ఆలరించిన యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ది వైల్డ్ రోబోట్' ఓటీటీలోకి వచ్చేసింది. క్రిస్ సాండర్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాలో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. సుమారు రూ. 2800 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'ది వైల్డ్ రోబోట్' చిత్రం తాజాగా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవతుంది. డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ పతాకంపై జెఫ్ హెర్మాన్ ఈ చిత్రాన్ని రూ. 670 కోట్లతో నిర్మించారు. అయితే, సుమారుగా రూ. 2000 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ ఇష్టపడే పెద్దలతో పాటు చిన్నారలను ఈ చిత్రం బాగా మెప్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment