
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ మీద కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపణలు ఎక్కుపెట్టారు. బొగ్గు దిగుమతులను విపరీతంగా పెంచి చూపడం ద్వారా ప్రజల నుంచి అదానీ గ్రూప్ ఏకంగా రూ.12 వేల కోట్లు దోచుకుందని బుధవారం ఆరోపించారు. ఈ మేరకు పలు మీడియా రిపోర్టులను విలేకరుల ముందు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై తక్షణం విచారణకు ఆదేశించి తన నిర్దోíÙత్వాన్ని రుజువు చేసుకోవాలని సవాల్ విసిరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి కాంగ్రెస్ అధికారంలోకి ఈ ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశిస్తుందని ప్రకటించారు.
దీనిపై మోదీకి మౌనమెందుకని ప్రశ్నించారు. విచారణకు ఆదేశించి తన విశ్వసనీయతను నిరూపించుకోవచ్చు కదా అని నిలదీశారు. ‘అదానీ ఇండొనేసియాలో కొనుగోలుచేసిన బొగ్గు ధర భారత్‌కు వచ్చేసరికి రెట్టింపు అవుతోంది! ఈ అడ్డగోలు పెంపు కారణంగా భారత్‌లో కరెంట్ చార్జీలు పెరిగాయి. వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై సబ్సిడీ భారం పెరిగింది’ అని రాహుల్ ఆరోపించారు. ఇలాంటివి ఇంకే దేశంలో జరిగినా ప్రభుత్వాలే పడిపోయేవని ఆయన వ్యాఖ్యానించారు. కానీ మన దగ్గర ఇంత జరిగినా కనీస చర్యలు లేదని ఆరోపించారు. ‘ఒకే ఒక్క వ్యక్తి చేస్తున్న ఈ దారుణ దోపిడీని ప్రధాని చూసీచూడనట్టు పోతున్నారు. ఆయనను పదేపదే కాపాడుతున్నారు’ అని రాహుల్ మండిపడ్డారు.
గాందీలది అవినీతి కుటుంబం: బీజేపీ
గాం«దీల కుటుంబమే అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ విమర్శించింది. వారిపై అవినీతి కేసులున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ అన్నారు. అదానీ అంశం సుప్రీంకోర్టులో ఉన్నా రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయనకు కోర్టు మీద గౌరవం లేదని స్పష్టమవుతోందన్నారు. ‘రాహులే నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద ఉన్నారు. వారిది ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతిమయమైన కుటుంబం’ అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment