
సాక్షి,మహబూబ్‌నగర్‌జిల్లా: సీఎం రేవంత్ ఏ ఒక్క హామీనైనా అమలు చేశారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం(ఫిబ్రవరి 18) అమన్‌గల్‌ల్‌లో జరిగిన రైతుదీక్షలో కేటీఆర్ మాట్లాడారు.‘సీఎం రేవంత్ 420 హామీలు ఇచ్చారు. రైతుబంధు, రుణమాఫీ ఎవరికైనా వచ్చాయా. తులం బంగారం వచ్చిందా. ఏదీ రాలేదు.
దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ కొడంగల్‌కు, తల్లి గారి ఊరికి, అత్తగారి ఊరికి ఎవరికీ ఏమీ చేయలేదు. 42 శాతం రిజర్వేషన్లని చెప్పి బీసీలను మోసం చేసిండు. రైతులను మోసం చేసిండు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాడు. సన్యాసి రేవంత్‌కు పాలన చేతనైతలేదు ’అని కేటీఆర్ ఫైరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment