
హైదరాబాద్, సాక్షి: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఓ కార్గో విమానానికి ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే పైలట్ అప్రమత్తతో విమానం సేఫ్‌గా దిగగా.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ విమానాలకు అనుమతులు కాసేపు నిలిపివేశారు.
చెన్నై నుండి హైదరాబాద్‌కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్(Landing Gear) సమస్య తలెత్తింది. పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల అనుమతి కోరాడు. వెంటనే అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్(Landing Take Off)ను నిలిపివేశారు.
దీంతో.. ఎటువంటి అవాంతరాలు లేకుండా, పైలట్ విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేయగలిగారు. ఆ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad Airport) కాసేపు భయాందోళన కలిగించింది. విమానం ల్యాండింగ్ గేర్ సమస్యను సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారు.
విదేశీ కరెన్సీ పట్టివేత
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని నిఘా వర్గాలు పట్టుకున్నాయి. నగరం నుంచి దుబాయ్ వెళ్తున్న అమీర్ అహ్మద్ అనే ప్రయాణికుడి వద్ద అనుమానాస్పద రీతిలో 22.75 లక్షల విలువైన విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ప్రకటించారు. అతనిని అదుపులోకి తీసుని విచారిస్తుట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment