
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో స్పెషల్ షోల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11గం. తర్వాత వేసే షోలకు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను అనుమతించొద్దని ఆంక్షలు విధించింది.
సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ ఈ పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా.. థియేటర్లలో పదహారేళ్లలోపు పిల్లల అనుమతిపై హైకోర్టు ఆంక్షలు విధించింది. రాత్రి 11 నుంచి ఉదయం 11 వరకు చిన్నారులను థియేటర్లలోకి అనుమతించవద్దని పేర్కొంది.
వేళాపాళా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని పిటిషన్ తరపు న్యాయవాది ాదించగా.. ఆ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి మరణించడంతో పాటు ఒక చిన్నారి తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో ఇక చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేసింది. ఈ పిటిషన్పై విచారణ పూర్తయ్యే దాకా పిల్లలను స్పెషల్ షోలకు అనుమతించొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment