టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు.

నాయక్ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన భామ స్టార్‌ హీరోల సరసన మెప్పించింది.

ఇటీవలే పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఆడుజీవితం(గోట్ లైఫ్) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అయితే గతేడాది ప్రియుడు జగత్‌ దేశాయ్‌ను అమలాపాల్ పెళ్లి చేసుకుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఇటీవలే ఓ బిడ్డను తన జీవితంలో ఆహ్వానించింది.

ప్రస్తుతం మాతృత్వం ఆస్వాదిస్తోన్న బ్యూటీ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసింది.

తన భర్త జగత్ దేశాయ్‌తో ఫ‍స్ట్‌ మీట్‌ ఎప్పుడు జరిగిందన్న విషయాన్ని పంచుకుంది.

ఆగస్టు 11న మీట్‌ అయ్యానని.. అందుకే ఫస్ట్ యానివర్సరీ మీట్‌ జరుపుకుంటున్నట్లు వెల్లడించింది.