ఆగస్టు 15న థియేటర్లలో అన్ని భాషల్లో కలిపి ఏడు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ మూడు ఉన్నాయి. మిగిలినవన్నీ డబ్బింగ్ చిత్రాలే.

మిస్టర్ బచ్చన్, ఆయ్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి.

హీరోలకు హిట్ ఎంత ముఖ్యమో.. హీరోయిన్లకు అంతకంటే కీలకమే.

ఎందుకంటే 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేకి ఇది తొలి సినిమా.

'ఆయ్' హీరోయిన్ నయన సారికకు కూడా ఇదే ఫస్ట్ మూవీ.

కావ్య థాపర్‌కి కూడా 'డబుల్ ఇస్మార్ట్' హిట్ అయితేనే మరిన్ని ఛాన్సులు వస్తాయి.

డబ్బింగ్ బొమ్మ 'తంగలాన్' హిట్ కావడం మాళవిక మోహనన్‌కి చాలా ఇంపార్టెంట్.

మరి వీళ్లలో అదృష్టం ఎవరిని వరిస్తుందో.. లక్కీ లేడీ ఎవరవుతారో చూడాలి?

మరి ఈ వీకెండ్‌లో మీరు ఏ సినిమాకు వెళ్లాలని అనుకుంటున్నారు?