ఉద్యోగంలో చేరిన కొన్ని నెలల్లోనే బ్యాంకులు క్రెడిట్‌ కార్డు ఇస్తామంటూ ఫోన్లు చేస్తుంటాయి. చాలామంది అధికంగా ఖర్చు చేయడానికి క్రెడిట్‌కార్డు ఒక కారణం.

అత్యవసర పరిస్థితుల్లో కార్డు వాడినా ఒకేసారి బిల్లు చెల్లించేలా ప్రణాళికలు వేసుకోవాలి.

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేసినా ఆదాయంలో 30 శాతం వరకు ఈఎంఐలు మించకూడదు.

నెలవారీ ఆదాయం, ఖర్చులకు సంబంధించి పక్కా బడ్జెట్‌ ఏర్పాటు చేసుకోవాలి.

ఆదాయానికి తగిన బడ్జెట్‌ను తయారు చేసుకుని తప్పకుండా దాన్ని పాటించాలి.

ముందు పొదుపు..తర్వాతే ఖర్చు అనే విధానాన్ని పాటించాలి.

ఏదైనా పరిస్థితుల్లో చేస్తున్న ఉద్యోగం కోల్పోయినా ఖర్చులు తట్టుకోవాలంటే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.

దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే మ్యుచువల్‌ ఫండ్‌లను ఎంచుకుని వాటిలో పొదుపు చేయడం ప్రారంభించాలి.

ఉద్యోగంలో చేరిన వెంటనే ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు తప్పకుండా తీసుకోవాలి. వయసు తక్కువగా ఉన్నప్పుడు ప్రీమియం తక్కువగా ఉంటుంది.