అనుకుంటాం గానీ కొన్నిసార్లు స్టార్ హీరోయిన్ల లెక్కలు కూడా తప్పుతుంటాయి.

'కేజీఎఫ్' వల్ల హీరో-డైరెక్టర్‌కి బోలెడంత క్రేజ్. హీరోయిన్‌కి అంతంత మాత్రమే గుర్తింపు.

ఒకవేళ ఈమెకే గనక క్రేజ్ వచ్చుంటే ఈ పాటికే బోలెడన్ని అవకాశాలు రావాలి కదా!

లేదంటే ఈమెనే ఆచితూచి సినిమాలని ఎంపిక చేసుకుంటుందా అనేది తెలియాలి.

మంగళూరులో పుట్టి పెరిగిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ రోజు ఈమె బర్త్ డే (అక్టోబర్ 21)

ఇంజినీరింగ్ జాబ్ మధ్యలో వదిలిపెట్టి మోడలింగ్‌లోకి వచ్చింది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ కంట్లో పడి 'కేజీఎఫ్' ఫ్రాంచైజీలో ఛాన్స్ కొట్టేసింది.

సినిమా అద్భుతమైన సక్సెస్ అందుకున్నా సరే ఈమెకు ఛాన్సులు పెద్దగా రాలేదు.

ప్రస్తుతం తెలుగులో 'హిట్ 3', 'తెలుసు కదా' సినిమాల్లో నటిస్తోంది.

ఈ రెండు చిత్రాలైనా సరే శ్రీనిధి అదృష్టాన్ని మార్చేస్తాయేమో చూడాలి.

ఒకవేళ ఇవి హిట్ అయితే మాత్రం తెలుగు హీరోలకు మరో హీరోయిన్ దొరికేసినట్లే.