దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలను మీ అంచనాలకు తగినంతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో చివరిలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి