ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, గులాబీ రంగులు, నారాయణ అష్టాక్షరి మంత్రం పఠించండి.