ఉత్సాహంతో పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నీలం, నేరేడు రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.
ఊహించని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలను కుటుంబసభ్యుల సలహాల మేరకు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. మీ ప్రతిపాదనలకు బంధువులు ఆమోదం తెలియజేస్తారు. వాహనయోగం. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు పొందుతారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపార లావాదేవీలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఉపశమనం పొందుతారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆస్తి తగాదాలు. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం ఎదురైన ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి వచ్చిన సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తుల వివాదాల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో వివాహాలు జరిపిస్తారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో నెలకొన్న ఇబ్పందులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. గులాబీ, పసుపు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.
మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చిక్కులు ఎదురైనా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. దూరపు బంధువులను కలుసుకుంటారు. . సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలు మొత్తంమీద లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారు ఆశనిరాశల మధ్య గడుపుతారు. వారం మధ్యలో ధనలాభం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. బంధువులు, మిత్రులతో కలహాలు. శ్రమ మీది ఫలితం వేరొకరిది అన్నట్లుంటుంది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు. మీ అభిప్రాయాలతో కుటుంబసభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. . శ్రీరామస్తోత్రాలు పఠించండి.
రుణవిముక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానించినా సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం. విద్యావకాశాలు దక్కి విద్యార్థులు ఉత్సాహంగా సాగుతారు. కొందరికి విదేశీ విద్యావకాశాలు సైతం దక్కవచ్చు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గతం నుంచి నెలకొన్న సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు.హృదయం పఠించండి.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు పరిష్కారం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. మీ ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సా«ధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. బంధువులు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సహచరులతో ఉత్సాహంగా గడుపుతారు. పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి ఆశించిన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. ఆత్మీయులతో తగాదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
మొదట్లో కొంత వరకూ ఇబ్బందులు ఎదురవుతాయి. పనులపై శ్రద్ధ చూపరు. బంధువులతో విభేదిస్తారు. అయితే క్రమేపీ ఊరట లభిస్తుంది. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత అనుకూలత. భాగస్వాములు పెరుగుతారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. తెలుపు, నేరేడు రంగులు.గణేశాష్టకం పఠించండి.
చేపట్టిన వ్యవహారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. విద్యార్థులకు లక్ష్యాలు నెరవేరతాయి. కుటుంబసమస్యలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త పోస్టులు రావచ్చు. కళారంగం వారు అవార్డులు కైవసం చేసుకుంటారు. విశేష గుర్తింపు పొందుతారు. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఎరుపు, పసుపు రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది, ఉద్యోగయోగం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు తథ్యం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆంజనేయ దండకం పఠించండి.
క్రమేపీ అనుకున్న విధంగా అభివృద్ధి కనిపిస్తుంది. మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. పనులు విజయవంతంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరి^è యాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులకు అవకాశం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, లేత పసుపు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.