ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆప్తుల నుంచి ధనలాభ సూచనలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆస్తుల వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు మధ్యలో కొంత నిరాశ పర్చినా లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు రావచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి విషయాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు విస్తృతం చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించండి.
కొత్త వ్యవహారాలు ప్రారంభం నుంచీ విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలై ఆర్థికంగా బలపడతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడి ఊరట చెందుతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. నలుపు, ఆకుపచ్చ రంగులు. . గణేశారాధన మంచిది.
వ్యవహారాలలో విజయం. అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడతారు. గతానుభవాలు ప్రస్తుతం ఉపయోగిస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు ఫలిస్తాయి. వారం చివరిలో మానసిక అశాంతి. మిత్రులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా కొనసాగుతుంది. సన్నిహితుల సహాయం అందుకుని కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీ సిద్ధాంతాలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిస్థితులను మీకు అనుకూలంగా మలచుకుని లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహం. వారం చివరిలో. కుటుంబంలో కొన్ని చికాకులు. తెలుపు, నీలం రంగులు. . దేవీస్తోత్రాలు పఠించండి.
అనుకున్న వ్యవహారాలు పూర్తికి మరింత ్రÔ¶ మిస్తారు. ఆర్థిక వనరులు సమకూరి అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల సూచనలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపారాలు పుంజుకుని తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా దృఢవిశ్వాసంతో అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాల వారికి అన్ని విధాలా అనుకూల పరిస్థితి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. పసుపు, గులాబీ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
చేపట్టిన పనులు పూర్తి కాగలవు. ఆర్థికంగా బలం పుంజుకుని రుణవిముక్తి పొందుతారు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలపై కుటుంబంలో అనుకూలత వ్యక్తమవుతుంది. స్థిరాస్తులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల కృషి నెరవేరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య, మానసిక సమస్యలు. నీలం, ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి.
ఆదాయవ్యయాలు సమానస్థాయిలో ఉండవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండక నిరాశ చెందుతారు. బంధువులతో కొన్ని వివాదాలు నెలకొని మీకు పరీక్షగా నిలుస్తాయి. నిర్ణయాలలో ఎటూతేల్చుకోలేక సతమతమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా మారతాయి. ఉద్యోగాలలో మరింత సమర్థనీయంగా పనిచేయాల్సి ఉంటుంది. కళారంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. పసుపు, ఆకుపచ్చ రంగులు. . విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ముఖ్యమైన వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఎంతోకాలంగా ఉన్న భూవివాదాలు సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ భావాలు పంచుకుంటారు. జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురుకావచ్చు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుని మీదారికి తెచ్చుకుంటారు. ఊహించని విధంగా వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో సహచరులతో సర్దుబాటు వైఖరి అవలంభిస్తారు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. శివస్తుతి మంచిది.
అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరి ఇతరులకు సైతం సాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి నిర్మాణాలకు సన్నాహాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చాకచక్యం, నేర్పుగా వ్యవహరించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువుల నుంచి సమస్యలు. తెలుపు, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తులు మీకు చేదోడుగా నిలుస్తారు. సమాజసేవలో పాలుపంచుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులు తమ అంచనాలకు తగినట్లుగా అవకాశాలు సాధిస్తారు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ధైర్యం, ఓర్పుతో ముందడుగు వేసి విజయాలతీరం చేరుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాలు మొదట్లో కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు ఉంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చేయండి.
ఏ వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితికి చేరతారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబీ, నేరేడు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.