అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. సమాజసేవలో భాగస్వామువులతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి, ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు సంభవం. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, నీలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

పరిచయాలు మరింత పెరుగుతాయి. మిత్రులు, బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. సోదరులతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కొత్తగా తీసుకున్న నిర్ణయాలను కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన విద్యలు, ఉద్యోగాలు దక్కుతాయి. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా గడ్డుస్థితి నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యతిరేకులు కూడా మీపై ప్రశంసలు కురిస్తారు. వ్యాపారాలు ఆశించినదాని కంటే మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతిబం«ధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఎరుపు, గులాబీ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వ్యవహారాలు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి అప్రయత్న కార్యసిద్ధి. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారస్తులకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఉద్యోగులకు హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, తెలుపు రంగులు. శివాష్టకం పఠించండి.

కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించి ఉద్యోగాలు దక్కించుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనయోగం. వివాహాది వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు కూడా అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవులు లభించే అవకాశం. వారం చివరిలో సోదరులతో విభేదాలు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలతో కుటుంబసభ్యులు ఏకీభవిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరిగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, పసుపు రంగులు. . దేవీస్తోత్రాలు పఠించండి.

ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన సమాచారం అంది సంతోషంగా గడుపుతారు. సోదరులు చేయూతనందిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరతాయి. ఇతరుల నుంచి బాకీలు కూడా అందుతాయి. దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరతారు. మీ ఆలోచనలను క్రమేపీ అమలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. నీలం, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ఆదాయానికి మించి ఖర్చులు ఎదురై ఇబ్బందిపడతారు. ఆలోచనలు కలసిరావు.. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులను కలిసి ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన విద్యావకాశాల కోసం శ్రమిస్తారు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. మిత్రులేæ శత్రువులుగా మారతారు. వ్యాపారాలలో కొంత నిదానం అవసరం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలు అగ్రిమెంట్లు కొన్ని రద్దు చేసుకుంటారు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధనలాభాలు. ఎరుపు, నేరేడు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.

దూరపు బం«ధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ఆస్తి విషయంలో కొన్ని చిక్కులు వీడతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. పనుల్లో విజయం. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. శత్రువులు మిత్రులుగా మారతారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆప్తులతో విభేదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చేయండి.