పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆశ్చర్యకరమైన రీతిలో బంధువులు సహకరిస్తారు. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై కొంత లాభపడతారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వాహనయోగం. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముఖ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. గణేశాష్టకం పఠించండి.

ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కొత్తగా రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపిం^è దు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు నెలకొంటాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉధ్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖుల పరిచయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో సంతోషకరంగా గడుపుతారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఆశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

ఆర్థిక విషయాలలో గందరగోళం తొలగుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. మీపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడతారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

అంచనాలు నిజం చేసుకుంటారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. గతం సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.

ముఖ్య పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టండి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగప్రాప్తి. గులాబీ, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. బంధువులు, మిత్రులతో విభే దాలు సర్దుబాటు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, పసుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు మరింత ఉత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు.శివపంచాక్షరి పఠించండి.

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి తెస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో కొన్ని వివాదాలు నెలకొంటాయి. మానసిక ఆందోళన చెందుతారు. గులాబీ, పసుపు రంగులు.దేవీస్తోత్రాలు పఠించండి.

ఆస్తి వివాదాలు పరిష్కారానికి చేరుకుంటాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్థుల నుంచి సైతం సానుకూలత వ్యక్తమవుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిల4 అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఎరుపు రంగులు.విష్ణుధ్యానం చేయండి.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సేవాకార్యక్రమాలను చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సందేశం అందుతుంది. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మీ నిర్ణయాలకు సర్వత్రా ప్రశంసలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణాలు చేపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకర్షిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు పదవులు వరించవచ్చు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. గణేశాష్టకం పఠించండి.