పనులలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన ఆదాయం సమకూర్చుకుంటారు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తుల సహాయసహకారాలు తీసుకుంటారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని మిత్రులను ఆశ్చర్యపరుస్తారు. పారిశ్రామికవర్గాలకు భాగస్వాముల నుంచి సమస్యలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి కొంత బయటపడతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు,భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఏ మాత్రం అలసత్వం చూపక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

అనుకున్న పనులు తక్షణం పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత మేరకు తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. ఎరుపు, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

ఏ పని ప్రారంభించినా వెనుకడుగు వేయకుండా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం, నమ్మకమే మీ ఆయుధాలుగా నిలుస్తాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. గతంలో చేజారిన కొన్ని డాక్యుమెంట్లు అనుకోని విధంగా లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాలకు లక్ష్యాలు నెరవేరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. నీలం, నేరేడు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.స్థిరాస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగాలలో ప్రశాంతత చేకూరుతుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.

పనుల్లో అవాంతరాలు అధిగమించి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.

నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. కొన్ని వివాదాలు సోదరుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

అనుకున్న పనులు కొంత నిదానంగా సాగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు ఆశించిరీతిలో కొనసాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం.ఆరోగ్యం మందగిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే ఏదోవిధంగా కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. బంధువులు, మిత్రులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. నిర్ణయాలు సైతం మార్చుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.

కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు కొంత నిదానించినా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త వ్యక్తుల పరి^è యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.