ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

ఇబ్బందులు, సమస్యలు చాకచక్యంగా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. పర పతి కలిగిన వారితో పరిచయాలు. కుటుంబసభ్యులు మీ ప్రతిపాదనలు అంగీకరిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శివాష్టకం పఠించండి.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త రుణాల అన్వేషణ. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండక సతమతమవుతారు. విద్యార్థుల కృషి వృథాగా మారుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలాభం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. కళారంగం వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

చేపట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపారాలు గతంతో పోలిస్తే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో మీహోదాలు కొంత పెరుగుతాయి. కళారంగం వారికి యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో «లేనిపోని ఖర్చులు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు. పసుపు, తెలుపు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురైనా అధిగమిస్తారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాకచక్యంగా కొన్ని వివాదాల పరిష్కారం. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారించండి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఉంటాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో కొన్ని వివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆకుపచ్చ, నీలం రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. ముఖ్యమైన పనుల్లో విజయం సాదిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత వరకూ పరిష్కారం. విద్యార్థుల యత్నాలు సఫలం. మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనుకోని సంఘటనలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు రాగలవు. రాజకీయవర్గాలకు పదవులు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, నీలం రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ముఖ్యమైన పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో వృథా ధనవ్యయం. బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో సోదరులతో వివాదాలు. విలువైన పత్రాలు జాగ్రత్త. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. ఆరోగ్యసమస్యలు తీరతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. సన్నిహితులతో మాటపట్టింపులు. గులాబీ, లేత ఎరుపు రంగులు. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.