పాలసీ నచ్చకపోతే... రద్దు చేసుకోవచ్చా?

బీమా పాలసీ తీసుకునేటప్పుడు సలహాదారులు, బీమా సంస్థలు కొన్ని అంశాలను దాచి పెట్టే అవకాశం ఉంది.

కొందరు ఏజెంట్లు తమ టార్గెట్ల కోసం వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం లేని పాలసీలను అంటగడుతుంటారు.

పాలసీ తీసుకున్న తర్వాత నిబంధనలు నచ్చకపోతే దాన్ని రద్దు చేసుకునే అవకాశాన్ని ఐఆర్‌డీఏఐ కల్పించింది.

బీమా పాలసీ తీసుకున్న తర్వాత 30 రోజుల్లోపు అందులో షరతులు నచ్చకపోతే దాన్ని రద్దు చేసుకుని పూర్తి ప్రీమియం పొందవచ్చు.

ఈ వ్యవధిని ‘ఫ్రీ-లుక్‌ పీరియడ్‌’ అంటారు.

ఫ్రీ-లుక్‌ పీరియడ్‌లో పాలసీకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని సొంతంగా నిర్ణయం తీసుకునే వీలుంటుంది.

ఈ వ్యవధిలో పాలసీని రద్దు చేయాలనుకుంటే, పాలసీదారు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి.

పాలసీ పత్రాలు, రద్దుకు కారణం, ప్రీమియం చెల్లించిన రశీదులవంటివి బీమా సంస్థకు అందించాలి.

ప్రీమియం వెనక్కి ఇచ్చేందుకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి.

ప్రస్తుతం అనేక బీమా సంస్థలు తమ వెబ్‌సైట్లలోనూ పాలసీని రద్దు చేసేందుకు అనుమతిస్తున్నాయి.

రద్దు అభ్యర్థనను ధ్రువీకరించుకొని, బీమా సంస్థ పాలసీని రద్దు చేస్తుంది. పాలసీదారులకు ప్రీమియం తిరిగి చెల్లిస్తుంది.