బ్యాంకు ఖాతా లేకపోయినా డిజిటల్‌ లావాదేవీలు

బ్యాంకు ఖాతా లేనివారు డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు వీలుగా ‘యూపీఐ సర్కిల్‌’ను ఎన్‌పీసీఐ ప్రారంభించింది.

బ్యాంకు ఖాతా కలిగిన ప్రైమరీ యూజర్‌ తనకు నమ్మకంగా ఉండే వ్యక్తులను యూపీఐ సర్కిల్‌లో యాడ్‌ చేసుకోవచ్చు.

యూపీఐ సర్కిల్‌లో యాడ్‌ అవుతున్న వారిని సెకండరీ యూజర్‌గా పరిగణిస్తారు.

సెకండరీ యూజర్లకు బ్యాంకు ఖాతా ఉండాల్సిన అవసరం లేదు.

యూపీఐ సర్కిల్‌ ద్వారా బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా సెకండరీ యూజర్‌కు నగదు బదిలీ చేయవచ్చు.

ఈమేరకు యూపీఐ సర్కిల్‌లో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. వారికి చేసే చెల్లింపులపై పరిమితులు విధించవచ్చు.

ఇతర ప్రాంతాల్లో చదివే పిల్లల చేతి ఖర్చులకు యూపీఐ సర్కిల్‌ ద్వారా నగదు బదిలీ ఇవ్వొచ్చు.

ఇంట్లో పనివారిని, డ్రైవర్లనూ ఈ సర్కిల్‌లో చేర్చడం ద్వారా ఇంటి ఖర్చులకు సంబంధించి కచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు.

మీరు ఉపయోగిస్తున్న యూపీఐ యాప్‌లు ఈ సర్వీసు అందిస్తున్నాయో చూసుకోవాలి.