రతన్ టాటా డిసెంబర్‌ 28, 1937లో అప్పటికే దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు.

పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో నానమ్మ దగ్గర పెరిగారు.

అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది.

జేఆర్‌డీ టాటా రతన్ టాటాను ఇండియాకు వచ్చి టాటా స్టీల్‌లో చేరమని సలహా ఇచ్చారు.

అమెరికా నుంచి ఇండియాకు వచ్చి జంషెడ్‌పూర్‌ టాటా స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

1991లో జేఆర్‌డీ టాటా రతన్ టాటాను టాటా గ్రూప్ ఛైర్మన్‌గా నియమించారు.

అనుభవంలేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని ఇతరులు వ్యతిరేకించారు.

రూ.10 వేలకోట్లుగా ఉండే వ్యాపారాన్ని దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేర్చారు.

అయినా ప్రపంచంలో, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో ఏనాడూ ఆయన స్థానం సంపాదించలేదు.

కంపెనీకి వచ్చిన లాభాల్లో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలో టాటా గ్రూప్ ఒక్కటే.

టాటా ట్రస్ట్ ద్వారా దేశంలోని పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తోంది.