రానుంది యూపీఐ, క్రెడిట్‌కార్డుల శకం

యూపీఐ వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతూనే ఉంది.

2028–29 నాటికి యూపీఐ లావాదేవీలు 43,900 కోట్లకు చేరుకుంటాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది.

2023–24లో యూపీఐ లావాదేవీలు 13,100 కోట్లుగా ఉన్నాయి.

గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీల విలువ రూ.265 లక్షల కోట్ల నుంచి రూ.593 లక్షల కోట్లకు పెరిగింది.

రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ వాటా 80 శాతం కంటే ఎక్కువగా ఉంది.

2028–29 నాటికి డిజిటల్‌ పేమెంట్లు 91 శాతానికి చేరుకోవచ్చని అంచనా.

క్రెడిట్‌ కార్డ్‌ విభాగం సైతం 2023–24లో బలమైన వృద్ధిని నమోదు చేసింది.

కొత్తగా 1.6 కోట్ల కార్డులు జారీ చేసినట్లు నివేదిక తెలిపింది.

క్రెడిట్‌ కార్డుల లావాదేవీల పరిమాణం 22 శాతం మేర, వాటి విలువ 28 శాతం చొప్పున పెరిగింది.

2028–29 నాటికి క్రెడిట్‌కార్డులు 20 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.