సింహం తాలూకూ గర్జన సౌండ్‌ కనీసం 8 కిలోమీటర్ల దూరం వరకూ వినిపిస్తుందట!

సింహాలు గుంపులుగా జీవిస్తాయి. ఒక్కో గుంపు పేరేంటో తెలుసా?

‘ప్రైడ్‌’! ఒక్కో ప్రైడ్‌లో ఆడ, మగ సింహాలతోపాటు పిల్ల సింహాలు దాదాపు 15 వరకూ ఉంటాయి!

వేటాడటం మొత్తం ఆడ సింహం బాధ్యత. చాలాసార్లు ప్రైడ్‌లోని మిగిలిన సింహాలు ఈ వేటలో సహకరిస్తాయి.

చూసేందుకు మొద్దు నిద్దర పోతున్నట్లు కనిపిస్తాయి కానీ.. ఊపొచ్చిందంటే.. సింహం వేగం గంటకు 80 కిలోమీటర్ల వరకూ ఉండగలదు.

ఒక్కో గెంతు 36 అడుగుల దూరం వేయగలదు! సాధారణంగా సింహం ఆయుష్షు 10-14 ఏళ్లు

బంధించి ఉంచినవి అయితే ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ బతికేస్తాయి. సింహానికి ఆకలెక్కువ.. నిజంగానే! ఒకపూట భోజనంలో 40 కిలోల మాంసం లాగించేస్తాయి

అడవిలోనైతే.. గడ్డి తిని బతికే జీబ్రా, దున్న వంటి పశువులు దీనికి ఆహరం

మగ సింహం జూలు.. దాని ఆరోగ్యానికి, సంతానోత్పత్తి సామర్థ్యానికి ప్రతీక. జూలు ఎంత నిండుగా, నల్లగా ఉంటే.. ఆడ సింహాలను అంతగా ఆకట్టుకోగలవు

సింహాల పిల్లలు పుట్టుకతోనే శరీరం మొత్తమ్మీద మచ్చలు, వెంటుక్రలతో పుడతాయి. వయసు పెరిగే కొద్దీ శరీరంపైని వెంట్రుకలు తగ్గిపోతాయి.

ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ లెక్కల ప్రకారం ప్రపంచంలో సింహాలు ఇప్పుడు అంతరించి పోయే ప్రమాదంలో ఉన్నాయి.

వేట, నివాస ప్రాంతాలను కోల్పోవడం వంటి కారణాలతో ఏటికేడాదీ వీటి సంఖ్య తగ్గిపోతోంది.

ప్రపంచ చరిత్ర మొత్తమ్మీద దాదాపు అన్ని సంస్కృతుల్లోనూ శక్తి, ధైర్యం, రాజసాలకు ప్రతీకగా సింహాలను ప్రతీకలుగా భావిస్తారు