Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: దెందులూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలో ఉంది. నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్‌ నాలుగు మండలాలున్నాయి. దెందులూరు నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఒక ఉప ఎన్నిక మినహా ఇక్కడ 15 సార్లు ఎన్నికలు నిర్వహించారు. ఒకే కుటుంబానికి చెందిన మాగంటి రవీంద్రనాధ్చౌదరి, మాగంటి వరలక్ష్మి, మాగంటి బాబు ఎమ్మెల్యేలుగా, క్యాబినేట్మంత్రులుగా కాంగ్రెస్పార్టీ తరపున ఎన్నికై దేశంలోనే రికార్డును సష్టించారు.

 

విస్తీర్ణం: 2,15,000 చ.కి.మీ

ఓటర్లు: మొత్తం ఓట్లు 222880.

 

భౌగోళిక పరిస్థితులు: తూర్పున ఉంగుటూరు నియోజకవర్గం, పడమర గన్నవరం నియోజకవర్గం, ఉత్తరం చింతలపూడి నియోజకవర్గం, దక్షిణం కైకలూరు నియోజకవర్గం ఉన్నాయి. దెందులూరు నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాల సాగు జరుగుతుంది. ఆయిల్ఫామ్, వరి, కొబ్బరి, కోకో, అరటి, మొక్కజొన్న. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్మండలంలో విస్తరించి ఉంది.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు దెందులూరు
జిల్లా పశ్చిమ గోదావరి
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 222,880
పురుషులు 108,565
మహిళలు 114,308
గత ఎన్నికల ఫలితాలు
Advertisement